breaking news
YSR District News
-
ఏసీబీ డీఎస్పీగా సీతారామారావు
కడప అర్బన్: అవినీతి నిరోధక శాఖ కడప డీఎస్పీగా సీతారామారావును నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది అక్టోబర్ నుంచి కడప ఏసీబీ డీఎస్పీ స్థానం ఖాళీగానే ఉంది. ప్రస్తుతం సీతారామారావును నియమించారు. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కడప సెవెన్‌రోడ్స్: జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ పీఆర్డీ అండ్ ఇంజినీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు ఎంవీ రంగాచార్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసోసియేషన్ కడప యూనిట్ ఉపాధ్యక్షులు జి.కేశవులు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, ఎస్ఈ పీఆర్ మద్దన్న, ఎస్ఈ ఆర్డబ్ల్యూఎస్ ఏడుకొండలు, డీపీఓ రాజ్యలక్ష్మి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం, డీడీఓ మైథిలి తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప నగరంలోని సాయిబాబా హైస్కూల్లో 8వ తరగతి చదు వుతున్న సుజన్‌కుమార్ కర్రసాము పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. నగరంలోని చెమ్ముమియ్యాపేటకు చెందిన గడ్డం శ్రీనివాసులు కుమారుడు సుజన్ కుమార్ గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కర్రసాము పోటీల్లో ప్రతిభ కనపరిచి మెమెంటో అందుకున్నారు. తద్వారా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. గోపవరం : అర్హులందరికీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలని డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల అభివృద్ధి కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. అందరికీ ఉపయోగపడేలా పనులు గుర్తించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ పీడీ రామలింగేశ్వర్‌రెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి జుబేద, బద్వేలు డివిజన్ ఏపీడీ మైథిలి, ఎంపీడీఓ సురేష్‌బాబు, ఏపీఓ విజయమ్మ, ఈసీ జగన్, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. -
కూచ్‌బెహర్ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్ ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్ మంగళవారం కడప వేదికగా వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. తొలిరోజు ఆంధ్రా–ఉత్తరాఖండ్ రాష్ట్రాల జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఉత్తరాఖండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ జట్లు నిర్ణీత 69.5 ఓవర్లకు 202 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఆదిత్య నాధని 57 పరుగులు, లక్ష్యనాధని 47 పరుగులు చేశారు. ఆంధ్రా జట్టులోని సిద్దు కార్తీక్ రెడ్డి 3 వికెట్లు, ఏఎన్‌వి లోహిత్ 3 వికెట్లు, భార్గవ్ మహేష్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆంధ్రా జట్టు 7 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీ నారాయణ 18 పరుగులు, హానీష్ వీరారెడ్డి 17 పరుగులు చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. మ్యాచ్ మధ్యలో స్టేడియంలో వెలుతురు సరిగా లేకపోవడంతో గంట పాటు మ్యాచ్ నిలిపి వేశారు. వెలుతురు లేక గంట పాటు మ్యాచ్ నిలిపివేత -
హ్యాకథాన్‌లో ఆర్కేవ్యాలీ విద్యార్థుల ప్రతిభ
వేంపల్లె : జాతీయ మైండ్ స్పీట్ 2కె25 హ్యాకథాన్‌లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపినట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా తెలిపారు. మంగళవారం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన అభినందించారు. విజయవాడలోని పీఎస్సీఎంఆర్ కళాశాలలో బ్రైనోవర్శన్ సొల్యూషనన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో జాతీయ స్థాయిలో మైండ్ స్పీట్ 2కె25 హ్యాకథాన్ జరిగిందన్నారు. ప్రతిష్టాత్మక జాతీయ హ్యాకథాన్న్లో ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ విద్యార్థులు చురుకుగా పాల్గొని విశ్వవిద్యాలయం నవీనత, పరిశోధన, పరిశ్రమ– ఆధారిత విద్యపై పెట్టే ప్రత్యేక దృష్టికి నిదర్శనంగా కళాశాల ప్రతిష్టను జాతీయ స్థాయిల్లో మరింతగా పెంచారన్నారు. ఆర్జీయూకేటీ పరిధిలోని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులైన అబ్దుల్ సమద్, సుఫ్ఫియన్, సుహైల్, పఠాన్ ముక్రం ఖాన్‌లను ట్రిపుల్ ఐటీ అధికారులు అభినందించారు. -
మహిమాన్వితం.. మహాప్రసాదం
బ్రహ్మంగారిమఠం : ‘జగన్మాతా.. దీవించు తల్లీ’ అంటూ భక్తులు వేడుకున్నారు. మహాదేవి ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ‘అమ్మవారి ప్రసాదం.. మహిమాన్వితం’ అంటూ భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. శ్రీఈశ్వరీదేవి మఠంలో ఆరు రోజుల పాటు కనుల పండువగా నిర్వహించిన ఆరాధన గురుపూజ మహోత్సవాలు మంగళవారం ముగిశాయి. అమ్మవారికి మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి, రాజేశ్వరిదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేసి, విశేషంగా అలంకరించారు. అనంతరం మహాప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మంగారిమఠం, శ్రీఈశ్వరీదేవి మఠం సంప్రదాయాల ప్రకారం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో ద్వార పూజ చేశారు. బ్రహ్మంగారిమఠంలో ప్రసాదం తయారు చేసి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి, సంకటితిమ్మాయపల్లెకు చెందిన పోలు ఎరికలరెడ్డి, సుబ్బారెడ్డి, ముక్కమల్ల భాస్కర్‌రెడ్డి, వీరపు ఉమాపతి, సుంకు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఈశ్వరీదేవి ఆరాధన మహోత్సవాలు -
ప్రొద్దుటూరులో ‘కేవీ’ ఏర్పాటు చేయాలి
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్‌రోడ్స్: ప్రొద్దుటూరు పట్టణంలో కేంద్రీయ విద్యాలయం (కేవీ) ఏర్పాటు చేయాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆయన వినతిపత్రం సమర్పించారు. ప్రొద్దుటూరులో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన ఎంతో మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు కేంద్రీయ విద్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నచిన్న పట్టణాలకు మంజూరు చేసిందని తెలిపారు. వీటితో పోల్చుకుంటే ప్రొద్దుటూరు జనాభా పరంగా పెద్దదని, పాలనా పరమైన ప్రాధాన్యత, విద్యా పరమైన అవసరాలు ఉన్నాయన్నారు. ప్రొద్దుటూరు పట్టణానికి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేస్తే అందుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్య క్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. రైళ్ల పొడిగింపు, స్టాపింగ్‌పై వినతి ముద్దనూరు: కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖామంత్రి అశ్వనీ వైష్ణవ్‌ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మైసూరు–రేణిగుంట ఽమధ్య నడిచే వీక్లీ స్పెషల్ ట్రైన్(22135–22136)ను కడప నగరం వరకు పొడిగించాలని కోరారు. ఈ వీక్లీ రైలు రేణిగుంటలో దాదాపు 10 గంటలు పాటు నిరుపయోగంగా నిలిచివుంటుందని, ఈ సమయంలో కడప వరకు రైలు ప్రయాణాన్ని పొడిగిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా వుంటుందని కోరారు. కడప ప్రజలు ఎంతో కాలం నుంచి కడప నుంచి బెంగుళూరుకు రైలు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారని, మైసూరు–రేణిగుంట మధ్య నడిచే ఈ రైలును కడప వరకు నడిపితే బెంగుళూరుకు వెళ్లడానికి ప్రయాణికులకు సౌకర్యవంతంగా వుంటుందని తెలిపారు. ముద్దనూరులో.. ముద్దనూరు–మచిలీపట్నం (ట్రైన్ నం.17215– 17216)ల మధ్య నడిచే రైలుకు ముద్దనూరులో స్టాపింగ్ సౌకర్యం కల్పంచాలని కోరారు. జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాలకు ముద్దనూరు ప్రధాన రైల్వేస్టేషన్ అని, ఈ రైలు స్టాపింగ్ వల్ల ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. రాజంపేట: కడప–రేణిగుంట హైవే.. డేంజర్ జోన్‌గా మారిందనే అంశం పార్లమెంట్లో కూడా చర్చకు వచ్చింది. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కడప–రేణిగుంట జాతీయ రహదారి దుస్థితిపై గళం విప్పారు. సరైన అలైన్మెంట్ లేదని, నైట్ జర్నీ యమడేంజర్‌గా ఉందని తెలియజేశారు. వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకురావడంతో ఈ అంశం కేంద్ర రవాణాశాఖను తాకింది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదం సంభవిస్తోంది. హైవే దారంతా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. నిత్యం ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రెండు దశాబ్దాల కిందట సింగిల్ రోడ్డుగా ఉన్న రహదారిని వెడల్పు చేసి స్టేట్ హైవే డబుల్ రోడ్డుగా మార్చారు. ఉభయ వైఎస్సార్ జిల్లాలో ఈ రోడ్డు కొనసాగుతోంది. ప్రయాణం.. భయానకం ప్రస్తుత హైవే వెంట ప్రయాణం భయానకంగా మారింది. ఎటువైపు నుంచి ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి. కడప శివార్లలోని జేఎంజే కళాశాల నుంచి భాకరాపేట సర్కిల్, మాధవరం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లె, మంగంపేట, రైల్వేకోడూరు, శెట్టిగుంట, కుక్కులదొడ్డి వరకు హైవేలో రహదారి ప్రయాణం కత్తి మీద సాములా మారింది. మార్గంలో అనేక ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఒంటిమిట్ట, నందలూరు, రెడ్డిపల్లె చెరువుకట్టలపై రహదారి ఉంది. అనేక మార్లు వాహనాలు అదుపు తప్పి చెరువుల్లో పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. దక్షిణ భారతదేశం నుంచి తిరుమలకు కడప–రేణిగుంట మార్గం మీదుగా వేలాది మంది యాత్రికులు వాహనాల్లో ప్రయాణం చేస్తుంటారు. తెలంగాణా, మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు రాజస్తాన్, యూపీ తదితర రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు ఈ రోడు మార్గాన్నే వెళుతుంటారు. తుపాన్‌తోపాటు రకరకాల ఫోర్‌వీల్ వాహనాల్లో యాత్ర కొనసాగించడం అధికంగా ఉంటుంది. పలుమార్లు వాహనాలు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ కడప–రేణిగుంట హైవేలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ మార్గం మీదుగా తిరుపతి, చైన్నె, ముంబయి, హైదరాబాద్‌కు రాకపోకలు కొనసాగుతున్నాయి. నిత్యం 17 వేలకు పైగా వాహనాలు హైవేపై పరుగులు తీస్తున్నాయి. ఈ ట్రాఫిక్‌కు ప్రస్తుతం ఉన్న హైవే కెపాసిటీ సరిపోవడం లేదు. ఫలితంగా ప్రమాదాలు, ట్రాఫిక్ స్తంభించడం తరుచూ జరుగుతున్నాయి. అంతే గాకుండా కడప–రేణిగుంట రోడ్డు ప్రయాణం రెండు నుంచి మూడు గంటలకు పైగా పడుతోంది. సకాలంలో గమ్యాలకు చేరలేని పరిస్థితి ఉంది. కడప–రేణిగుంట హైవేలో ప్రతి మండల పరిధిలో బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. రాజంపేట అర్బన్‌లో 3, నందలూరు 2, , రైల్వేకోడూరు 3, పుల్లంపేట 3 ఓబలవారిపల్లె 6, మన్నూరు 3 ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలు సర్వే చేసి కడప–రేణిగుంట ప్రస్తుత హైవేలో ప్రమాదాలు జరుగుతున్నాయని నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పెద్దాసుపత్రిలో ట్రామా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందుబాటులో లేదనే సంగతి విదితమే. అధ్వానస్థితిలో కడప–రేణిగుంట హైవే ప్రమాదకర మలుపులు ప్రాణాలు పోతున్న వైనం పార్లమెంట్లో గళం విప్పినమేడా రఘునాథరెడ్డి కడప–రేణిగుంట హైవేకు సరైన అలైన్మెంటట్ లేదని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి పార్లమెంట్ సాక్షిగా గళం విప్పారు. ప్రమాదాలకు నిలయంగా మారిందన్నారు. మలుపులు ఉన్నాయని, రాత్రి పూట ప్రయాణం భయంకరంగా ఉంటుందన్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రమాదరహిత రహదారిగా మార్చాలని కోరారు. కడప –రేణిగుంట నేషనల్ హైవేలోని నందలూరు చెయ్యేరు నదిపై నిర్మించి వంతెన(బ్రిడ్జి) ప్రమాదాలకు నిలయంగా నిలిచిపోయింది. వంతెనపై ప్రమాద నివారణ చర్యలేవి కనిపించడం లేదు. వంతెన మధ్యలో ఉన్న బీటి (తారు)రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్డు మధ్యలో గుంతలు పడ్డాయి. బ్రిడ్జిపై వేగాన్ని నిరోధించే విధంగా బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు కూడా వేయలేదు. రాత్రి వేళలో వంతెనపై చీకటిగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవడమే కాకుండా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ బ్రిడ్జి సగం మన్నూరు, మరో సగం నందలూరు పోలీసు స్టేషన్ల పరిధిలోకి వస్తాయి. కిలోమీటర్లకు పైగా పొడవు కలిగిన ఈ వంతెన మృత్యుకుహరంగా మారింది. -
గోడౌన్లో అగ్నిప్రమాదం
– రూ.9 లక్షల మేర నష్టం ప్రొద్దుటూరు క్రైం : స్థానిక మున్సిపల్ ఆఫీసు రోడ్డులోని పాత సామాన్ల గోడౌన్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షేక్షావలీ కొన్నేళ్లుగా పాత సామాన్ల (గుజరీ) షాపు నిర్వహిస్తున్నాడు. స్థానికంగా ఉన్న వ్యాపారులతో పాటు పరిసర ప్రాంత వ్యాపారులు ప్లాస్టిక్, పాత ఇనుప వస్తువులను సేకరించి ఇక్కడ విక్రయిస్తుంటారు. వీటిని అతను మున్సిపల్ ఆఫీసు రోడ్డులోని గోడౌన్లో నిల్వ చేసేవాడు. ఈ క్రమంలో మంగళవారం షార్ట్ సర్క్యూట్ వల్ల గోడౌన్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గోడౌన్లో ప్లాస్టిక్ సామాన్లు అధికంగా ఉండి మంటల్లో కాలడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. చుట్టుపక్కల ఉన్న నివాస గృహాల్లోకి పొగ వెళ్లడంతో వారు భయాందోళన చెందారు. జేసీబీ సాయంతో గోడౌన్ గోడను పగులకొట్టి మంటలను ఆర్పారు. ప్రొద్దుటూరుతో పాటు మైదుకూరు, జమ్మలమడుగు అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 9 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. -
అందరికీ కృతజ్ఞతలు
కడప కార్పొరేషన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలన్న చంద్రబాబు కుట్రకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కోటి సంతకాల ఉద్యమం విజయవంతంపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, కార్పొరేషన్, మున్సిపాలిటీలు, అన్ని గ్రామాలలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు పర్యటించి సభలు నిర్వహించారని, ప్రతి ప్రాంతంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఈ ఉద్యమంలో అహర్నిశలు శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి అమోఘమని ప్రశంసించారు. కోటి సంతకాల ఉద్యమం విజయవంతంపై హర్షం -
ప్రశ్నలు సంధించండి.. ప్రధానితో మాట్లాడండి
● విద్యార్థులకు పరీక్షా పే చర్చలో పాల్గొనే అవకాశం ● ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భాగస్వామ్యం ● ఇప్పటి వరకు 1500 మంది ఆన్లైన్లో నమోదు ● జనవరి 11 తుది గడువు కడప ఎడ్యుకేషన్ : భారత ప్రధానితో నేరుగా మాట్లాడాలనుకుంటున్నారా.. ఇప్పుడు ఆ అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మీరు చేయాల్సిందల్లా ప్రధానమంత్రి ‘పరీక్షా పే చర్చ’ యాప్‌లో ఆన్లైన్లో నమోదు కావాలి. ఏటా పరీక్షల ముందు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనిని కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. ఇప్పుడు 9వ ఎడిషన్‌కు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధాని మోదీ నేరుగా సంభాషించనున్నారు. పరీక్షలను సమర్థవంతంగా, ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడం, చిరునవ్వుతో ప్రశ్నలకు సమాధానాలు రాయడం ద్వారా విద్యార్థులకు పరీక్షలంటే భయాన్ని తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 1500 మంది విద్యార్థులు ఆన్లైన్లో నమోదు అయ్యారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకునేందుకు జనవరి 11వ తేదీ వరకు గడువు ఉంది. త్వరపడాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. త్వరలో పరీక్షల సీజన్.. పరీక్షల సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఆ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలి. విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలి? విద్యార్థుల ఆకాంక్ష ఏంటి? వాటిని చేరుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలు ఏంటి.. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఎలా ఉండాలి.. తదితర అంశాలపై పరీక్షా పే చర్చ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు 6 నుంచి 12 తరగతుల విద్యార్థులు అర్హులు. దీని ద్వారా ప్రధానమంత్రి శక్తివంతమైన యువతతో కనెక్ట్ అవుతారు. యువతతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. యువత ఎదుర్కోనే సవాళ్లు, ఆకాంక్షలను మరింతగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం కూడా కలుగుతుంది. పరీక్షా పే చర్చ మొదటి ఎడిషన్ 2018 ఫిబ్రవరి 16న ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించారు. ఇప్పుడు కూడా విద్యార్థులు తమ ప్రశ్నను ప్రధానమంత్రిని నేరుగా అడగవచ్చు. ప్రశ్న గరిష్టంగా 500 అక్షరాలలోపు ఉండాలి. ఇందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు. వారి ఎంట్రీలను కూడా ఆన్లైన్లో పంపే అవకాశం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కల్పించింది. వీటిలో మంచి ప్రశ్నలను ఎంపిక చేసి అర్హులను నిర్ణయిస్తారు. విజేతలుగా నిలిస్తే.. పరీక్షా పే చర్చలో విజేతలు నేరుగా ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశాన్ని పొందుతారు. ప్రతి విజేతకు ప్రత్యేక కిట్ అందజేస్తారు. విజేతలకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. విజేతలు ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి ఆటోగ్రాఫ్‌ను, ఫొటోతో కూడిన డిజిటల్ సావనీర్ పొందే అవకాశం ఉంటుంది. లాగిన్ అవ్వాలి ఇలా... విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హెచ్‌టీటీపీఎస్;//ఇన్నోవేట్ ఇండియా.మై జీవోవీ.ఇన్ అని క్లిక్ చేయాలి. ఎంటర్‌కాగానే క్లిక్ ఏజ్ స్టూడెంట్,టీచర్, పేరెంట్స్ అనే లాగిన్స్ కనిపిస్తాయి. వాటిలోకి ఎంటర్ కాగానే మీ మొబైల్ నంబరు లేదా జీమెయిల్ ఖాతాను పూర్తి చేయాలి. ఓటీపీతో లాగిన్ అయి క్లిక్ చేయాలి. ఓటీపీ రాగానే మళ్లీ లాగిన్ చేయాలి. స్టూడెంట్స్‌కు నేరుగా ఫోన్ నంబరు, జీమెయిల్ లేని సందర్భంలో టీచర్స్ లాగిన్ ద్వారా ఎంటర్ అయ్యే అవకాశం కల్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రాథమిక సమాచారం వివరాలను పూర్తి చేయాలి. కార్యాచరణ వివరాలను పూర్తి చేసిన తర్వాత థీమ్‌ను ఎంచుకుని 500 అక్షరాలలోపు వివరించాలి. అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరీక్షా పే చర్చలో పాల్గొనేలా ఉప, మండల విద్యాశాఖ అధికారులు కృషి చేయాలి. పరీక్షా పే చర్చకు ఎంపికై న సుమారు 2,000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా పీపీసీ కిట్లను బహుమతిగా అందజేయనున్నారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. 6–12 తరగతులకు చెందిన విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఇది చక్కని అవకాశం. అధిక సంఖ్యలో పాల్గొనేలా ఎవరి స్థాయిలో వారు కృషి చేయాలి. జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకురావాలి. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల ఎంఈఓలు స్పందించి విద్యార్థులు ఆన్లైన్లో నమోదు అయ్యే విధంగా అవగాహన కల్పించాలి. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి. -
20న ఎస్‌హెచ్‌జీ కుటుంబాలకు జాబ్‌మేళా
కడప సెవెన్‌రోడ్స్: ఎస్‌హెచ్‌జీ కుటుంబాలలోని నిరుద్యోగ యువత కోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) వారి ఆధ్వర్యంలో ఈ నెల 20న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిర్దేశించిన ఒక కుటుంబం– ఒక వ్యాపారవేత్త లక్ష్యానికి అనుగుణంగా మెప్మా సంస్థ ఎస్‌హెచ్‌జీ సభ్యుల కుటుంబ సభ్యులకు వారికున్న ఆసక్తి, అనుభవం, నైపుణ్యం ఆధారంగా రుణ ఆధారిత స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం జాబ్ మేళాల నిర్వహణలో విశిష్ట అనుభవం ఉన్న ‘నిపుణ– హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ’తో మెప్మా సంస్థ ఒప్పందం కుదుర్చుకుని జాబ్ మేళాలను నిర్వహించి ఉద్యోగ అవకాశాలను సంఘ సభ్యుల కుటుంబాలలోని నిరుద్యోగ యువతీ యువకులకు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థుల అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. ఈ నెల 20న కడప మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ మునిసిపల్ హైస్కూల్లో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ పలు అంశాలను తెలియజేశారు. 5జీ ఫోన్లతో సమర్థంగా సేవలు మహిళా శిశు సంక్షేమ శాఖలో సమర్థవంతంగా సేవలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 5జీ మొబైల్ ఫోన్లు ఎంతో ఉపయుక్తం అవుతాయని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీలకు సరఫరా చేసిన ‘శాంసంగ్ 5జీ‘ మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి 2494 మందికి 5ఎ మొబైల్స్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ పి.రమాదేవి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో దొంగతనం
కొండాపురం : మండల పరిధిలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకీ పాల్పడిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఎస్ఐ డి. అనిల్‌కుమార్ వివరాల మేరకు తాళ్లప్రొద్దుటూరులోని పెద్దమ్మ ఆలయం సమీపంలోని రేకుల షెడ్డులో నివాసం ఉంటున్న అచ్చమ్మ ఇంట్లో బీరువాలోని రూ.40 వేలు నగదు, రూ.12 వేలు విలువ చేసే బంగారు ఉంగరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. బాధితురాలికి అనారోగ్యంగా ఉండటంతో అదే గ్రామంలో నివాసం ఉండే ఆమె కుమారుడు లక్ష్మినారాయణ ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనం జరిగిందని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పచ్చని పైరుకు గడ్డి మందు పిచికారీ – ఆవేదనతో పురుగుల మందు తాగిన బాధితురాలు బ్రహ్మంగారిమఠం : మండలంలోని సోమిరెడ్డిపల్లె పంచాయతీ నరసన్నపల్లెలో సంగాని రత్నాలు అనే మహిళకు చెందిన పచ్చని పైరుపై అదే గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వీరారెడ్డి తండ్రి నాగిరెడ్డి మంగళవారం గడ్డి మందు పిచికారీ చేశాడు. దీంతో మొక్క జొన్న, చీనీ చెట్లు మాడి పోయాయని బాధితురాలి కుమారుడు తెలిపాడు. అతని కథనం మేరకు.. నరసన్నపల్లె పొలం సర్వే నంబర్ 268–2లో 1.56 ఎకరాలలో మొక్కజొన్న, నిమ్మ సాగులో ఉందన్నారు. నాగిరెడ్డికి, తమకు భూ సమస్య ఉండంతో ప్రస్తుతం బద్వేలు కోర్టులో కేసు నడుస్తోందన్నారు. కుమారుడు పోలీస్ అనే భావనతో నాగిరెడ్డి తమపై కక్ష సాధిస్తున్నాడని చెప్పాడు. భూ సమస్య కోర్టులో ఉండగానే తమపై దాడులు చేస్తున్నారని వాపోయాడు. తాము అన్ని రకాలుగా నష్టపోవాలనే ఉద్దేశంతో పచ్చని పైరుపై గడ్డి మందు పిచికారీ చేయడంతో పంట నిలువునా వాడి పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఆవేదనతో పురుగుల మందు తాగిన రత్నాలు.. ఉన్న కొద్దిపాటి పైరు నిలువునా మాడిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన భూ యజమాని సంగాని రత్నాలు పంట చేలోనే పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
జిల్లా స్థాయి ఖోఖో జట్ల ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్/చింతకొమ్మదిన్నె : ఉమ్మడి కడప జిల్లాలో జూనియర్స్, సీనియర్స్ బాల బాలికల ఖోఖో జట్ల జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగాయని ఖోఖో సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి, జిల్లా కార్యదర్శి జె. నరేంద్ర తెలిపారు. మంగళవారం చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురంలోని నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఖోఖో జూనియర్, సీనియర్స్ బాల బాలికల జట్ల ఎంపికలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్స్ జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19 నుంచి 21 తేదీలలో ప్రకాశం జిల్లా పంగులూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. సీనియర్స్ జిల్లా జట్టు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 24 నుంచి 26 వ తేదీ వరకు కృష్ణా జిల్లా గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాల ఏజీఎం హరి బసవ రాజు, ఖోఖో సంఘం సభ్యులు సుధీర్, లక్ష్మి, రవి, పవన్ కుమార్, కృష్ణయ్య,లక్ష్మణ్, రెడ్డయ్య పాల్గొన్నారు. -
మరోసారి విభేదాలు బహిర్గతం
సాక్షి టాస్క్‌ఫోర్స్: పులివెందుల నియోజకవర్గంలో టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బట్టబయలు అయ్యాయి. ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, బీటెక్ రవి వర్గాల మధ్య కొంత కాలం నుంచి దూరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం పులివెందులలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించింది. అన్ని శాఖల నుంచి ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. అయితే ఇందులో కొసమెరుపు ఏమిటంటే స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డికి ఆహ్వానం అందనట్లు సమాచారం. ఈ సమావేశం కేవలం బీటెక్ రవి కుటుంబ సభ్యుల అధ్యక్షతన జరిగినట్లుగా ఉంది. బీటెక్ రవి, ఆయన తమ్ముడు, చిన్నాన్నలు సమీక్ష చేశారు. దీనిపై అధికారులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అభివృద్ధి సమావేశమా లేక కుటుంబ సమావేశమా అని వారు మథన పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై న ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ఈ మీటింగ్‌కు హాజరు కాకపోవడంపై తెలుగుదేశం పార్టీలోనే పలువురు నాయకులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు అనేక సార్లు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు కూడా రాజ్యాంగ పరిధిలో ఉన్న ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డికి సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. ● బీటెక్ రవి అధ్యక్షతన సమావేశం ● హాజరు కాని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి -
బజారుకు వెళ్లొచ్చేసరికి చోరీ
బద్వేలు అర్బన్ : పట్టణంలోని మార్తోమానగర్లో గల పునరావాస కాలనీ సమీపంలో మంగళవారం ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోని వారు బజారుకు వెళ్లొచ్చేసరికి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగులకొట్టి 10 గ్రాముల బంగారు వస్తువులు అపహరించారు. పట్టణంలోని పునరావాస కాలనీలో నివసించే దిరసంత చెన్నయ్య గత కొద్ది రోజులుగా అయ్యప్పమాల ధరించి ఉన్నా డు. బుధవారం శబరిమలకు ప్రయాణం ఉండటంతో అందుకు సంబంధించిన సామగ్రిని కొనుగోలు చేసేందుకు భార్యతో కలిసి బజారుకు వెళ్లాడు. బజారు నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు పగులకొట్టి ఉండటంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో చోరీ జరిగినట్లు గ్రహించి వెంటనే అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. అర్బన్ సీఐ లింగప్ప, ఎస్ఐ జయరాము లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే క్లూస్ టీం బృందాన్ని పిలిపించి వేలిముద్రలు సేకరించారు. చెన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్ఐ జయరాములు కేసు నమోదు చేశారు. కాగా బీరువాలోని మరొక అల్మారాలో ఉన్న మరికొన్ని బంగారు ఆభరణాలు, వెండి సామగ్రి దుండగులు వదిలేసి వెళ్లడం గమనార్హం. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు అట్లూరు : మండల పరిధిలోని కడప–బద్వేలు ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వాసం హరి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల మేరకు రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వాసం హరి తన ద్విచక్రవాహనంపై సొంత పనుల మీద కొండూరు గ్రామానికి వెళ్లి తిరిగి రెడ్డిపల్లికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉన్నట్లుండి గేదెలు అడ్డు రావడంతో ఢీకొని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతన్ని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. తంబళ్లపల్లె : రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం తంబళ్లపల్లె మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పెద్దమండ్యం మండలం ముసలికుంట పంచాయతీ బాలచెరువుపల్లెకు చెందిన ఎం.సహదేవ కుమారుడు రాము (15) తంబళ్లపల్లె మండలం బోయపల్లెలోని మేనేత్త ఇంటిలో ఉంటూ తంబళ్లపల్లెలో ఐటీఐలో చదువుతున్నాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం బోయపల్లె వద్ద నుంచి ద్విచక్రవాహనంలో వస్తుండగా మార్గమధ్యంలో గోళ్లపల్లికి సమీపంలో ముందు వరిగడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్టేక్ చేయబోయి ప్రమాదశాత్తు కిందపడ్డాడు. అతడిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన తంబళ్లపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్.ఐ ఉమామహేశ్వరరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరిలించారు. -
సహకార ఉద్యోగుల ధర్నా
కడప సెవెన్‌రోడ్స్ : తమ సమస్యలను పరిష్కరించాల ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సహకార సంఘాల ఉద్యోగులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా ని ర్వహించారు. జిల్లా సహకార సంఘ ఉద్యోగుల యూ నియన్ అధ్యక్షుడు కొండయ్య, ప్రధాన కార్యదర్శి ర త్నం మాట్లాడుతూ తమకు హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన జీఓ నెం. 36ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు జీఓ లు జారీ చేసినప్పటికీ అధికారులు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 తర్వాత ఉద్యో గంలో చేరిన వారిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. సహకార ఉద్యోగులకు గ్రాట్యూటీ అమలు చేయాలన్నారు. 2019–24 వేతన సవరణ ఇవ్వాలన్నారు. కెపాసిటీ టు పే నిబంధనలకు సంబంధం లేకుండా జీతభత్యాలు చెల్లించాలని కోరారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. రాజుపాళెం : తనకు ఇష్టం లేని పెళ్లి వద్దని అటు తల్లిదండ్రులకు, ఇటు బంధువులకు, స్నేహితులకు చెప్పుకోలేక షేక్ పెద్ద మీరావలీ (24) అనే యువకుడు విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాజుపాళెం మండలంలోని వెల్లాల గ్రామ పొలాల్లో జరిగింది. రాజుపాళెం ఎస్ఐ కత్తి వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని గొట్లూరు గ్రామానికి చెందిన షేక్ చిన్న మీరావలీ కుమారుడు పెద్ద మీరావలీకి కొద్ది రోజుల్లో వివాహం జరగనుంది. అయితే ఈ వివాహం ఇష్టం లేకపోవడంతో ఎవరికి చెప్పుకోలేక మంగళవారం ప్రొద్దుటూరులో బ్యాంకులో పని ఉందని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో పెద్ద మీరావలీ వెల్లాల గ్రామ పొలాల్లో మామిడి జ్యూస్‌లో విషపు గుళికలు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రాజుపాళెం ఎస్ఐ వెంకటరమణ సంఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే పెద్ద మీరావలీ మృతి చెంది ఉన్నాడు. మృతుడి తండ్రి చిన్న మీరావలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. చైల్డ్ కేర్ లీవ్‌పై ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన చైల్డ్ కేర్ లీవ్‌కు గరిష్ట వయస్సు పరిమితిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హ ర్షణీయమని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ఒక ప్ర కటనలో పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులకు గతంలో పిల్లల సంరక్షణ సెలవుల వినియోగానికి సంబంధించి పిల్లల గరిష్ట పరిమితి ఉండేదని, అయితే ప్రస్తుతం కూ టమి ప్రభుత్వం ఈ పరిమితిని తొలగించి ఉద్యోగులు తమ మొత్తం సేవా కాలంలో, రిటైర్మెంట్కు ముందు వరకు చైల్డ్ కేర్ లీవ్‌ను వినియోగించుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఉద్యోగులు ఈ సెలవులను పిల్లల సంరక్షణ, పరీక్షల సమయంలో, అనారోగ్య సందర్భాల్లో వినియోగించుకోవచ్చన్నారు. -
● ఓ వైపు పోరాటం.. మరోవైపు నిరీక్షణ
మహానాడు నిర్వహణకు సహకరించిన ఉపాధ్యాయులకు అండగా తెలుగుతమ్ముళ్లు నిలవాలి. అలాంటి చిత్తశుద్ధి వారిలో కన్పించడం లేదు. ప్రధానంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డిలు బాధ్యతగా వ్యవహరించి టీచర్ల ప్లాట్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీకీ యథావిధిగా అప్పగించాల్సి ఉంది. మహానాడు నిర్వహణకు సహకరించిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపి, యథావిధిగా అప్పగించాల్సి ఉండగా, ఆరు నెలలు అవుతున్నా నాన్చుడు ధోరణి వ్యక్తమౌతోంది. ఇకనైనా తెలుగుతమ్ముళ్లు టీచర్లకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: అయ్యవార్లు ఊహించిందే అయింది. గ(పె)ద్దలు బెదిరించి స్వాహా చేయాలని చూస్తున్న భూమిలో మహానాడు కోసం హద్దులు చెరిపేశారు. తిరిగి యథావిధిగా ప్లాట్స్ దక్కుతాయా? అనే సందిగ్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. హౌస్ బిల్డింగ్ సొసైటీ భూమి సక్రమంగా అప్పగిస్తారా? ముప్పుతిప్పలు పెడుతారా? అనుమానాలు నిజమవుతోన్నాయి. ఆరు నెలలు అవుతున్నా టీడీపీ నేతలు సమస్యలకు పరిష్కారం చూపలేదు. నాడు సీఎం చంద్రబాబు ద్వారా ప్రశంసలు, సన్మానాలు సరే.. ‘యూజ్ అండ్ త్రో పాలసీ’ హౌస్ బిల్డింగ్ సొసైటీకి కూడా వర్తింపజేశారని అయ్యవార్లలో ఆవేదన వ్యక్తమవుతోంది. ● 1989లో టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ 88 ఎకరాలు కడప రూరల్ పబ్బాపురం గ్రామ పరిధిలో కొనుగోలు చేసింది. అందులో 1430 మంది ఉపాధ్యాయులకు ఇంటి స్థలాలు కేటాయించారు. అప్పట్లో ఆ భూమి వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. కాలక్రమేణా రింగ్‌రోడ్డు అందుబాటులోకి రావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దాదాపు 17 ఏళ్ల తర్వాత 2006లో ‘మా సమ్మతి లేకుండా కొనుగోలు చేశారు’ అని శోత్రియందారులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు 6.66 ఎకరాలు మాత్రమే శోత్రియం దారులకు అప్పగించాల్సి ఉంది. రికార్డు లేకున్నా రిజిస్ట్రేషన్: పబ్బాపురం టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ పరిధిలో 20 ఎకరాలకు రైత్వారీ పట్టా ఒకటికి వెలుగులోకి తెచ్చారు. ఆ రైత్వారీ పట్టాకు చెందిన భూమి వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో లేదు. అయినప్పటికీ రూరల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం శుభకీర్తి డెవెలపర్స్ పేరిటి రిజిస్ట్రేషన్ చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని హౌస్ బిల్డింగ్ సొసైటీ వెలుగులోకి తెచ్చింది. అప్పటి జాయింట్ కలెక్టర్ గణేష్‌కుమార్ జిల్లా రిజిస్ట్రార్, చింతకొమ్మదిన్నె తహసీల్దార్, టీచర్లతో కలిపి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తే.. 2021లో రైత్వారీ పట్టా కేటాయింపునకు చెందిన ఎలాంటి రికార్డులు అందుబాటులో లేవని స్పష్టమైంది. నకిలీ రైత్వారీ పట్టా పుట్టించినట్లు తేటతెల్లమైంది. అయితే వెబ్‌ల్యాండ్‌లో లేకపోయినా శుభకీర్తి డెవెలపర్స్‌కు రిజిస్ట్రేషన్ కావడం వెనుక ఓ బడా టీడీపీ నేత ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల క్రితం టీచర్స్ లేఔట్లో మహానాడు నిర్వహణ చదును చేసి హద్దులు చెరిపేసిన టీడీపీ పెద్దలు ఇదివరకే ఆక్రమణకు సిద్ధమైన అక్రమార్కులు 35 ఏళ్లుగా ఎదుగుబొదుగు లేకుండా ఉండిపోయిన ప్లాట్స్ యథావిధిగా స్థలాలు దక్కుతాయా?నాడు అయ్యవార్లు హైరానా సమస్యలు పరిష్కరించిప్లాట్స్ కేటాయిస్తామని హామీ తర్వాత పట్టించుకోని నాయకులు టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కొనుగోలు చేసిన భూమిని చేజిక్కించుకోవాలని కొందరు అక్రమార్కులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లుతో దౌర్జన్యం చేస్తున్నారు. ఇది వరకూ అనేక పర్యాయాలు ఉన్నతాధికారుల దృష్టికి అయ్యవార్లు తీసుకెళ్లారు. అధికారులు సానుకూలంగా స్పందించినా టీచర్లుకు దశాబ్దాల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. అవే స్థలాలపై తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తుండటంతో వ్యవహారం మరింత జఠిలమైంది. అప్పటి వరకూ ఉన్న టీచర్స్ ప్లాట్స్ రాళ్లు, హద్దులు చెరిపేశారు. యథావిధిగా టీచర్స్ ప్లాట్స్ అప్పగిస్తామని టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు జిల్లా కలెక్టర్ వరకూ అందరూ హామీ ఇచ్చారు. టీచర్లు సొంత డబ్బుతో కొనుగోలు చేసిన స్థలాన్ని ఇప్పటికీ దక్కించుకోలేని దుస్థితి నెలకొంది. అయ్యవార్లకు ఓ వైపు పోరాటం, మరోవైపు సమస్యలు పరిష్కారం కాక నిరీక్షణ తప్పడం లేదు. -
చలి చంపేస్తోంది.!
కడప అగ్రికల్చర్ : మొన్నమొన్నటి వరకు వర్షాలతో ఇబ్బంది పడిన ప్రజలు తాజాగా చలితో వణికిపో తున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయా యి. రాత్రి 8 గంటల నుంచి చలి మొదలై ఉదయం 9 గంటల వరకు చలి తీవ్రత అధికంగా ఉంటోంది. ఈ పరిస్థితి జిల్లాలో గత పది రోజుల నుంచి నెలకొంది. దీంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. మును పెన్నడూ లేని విధంగా చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్నారులతో పాటు ఉదయం పూట పనుల మీద వెళ్లే ప్రజలు చలికి గజగజలాడుతున్నారు. ఈ పరిస్థితి ఇంకెనాళ్లు కొనసాగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కమ్ముకుంటున్న పొగమంచు.. ఒక పక్క చలి చంపుతుంటే మరో పక్క పొగమంచు కమ్మేస్తోంది. క్రమంగా పొగమంచు తగ్గినా చలి మాత్రం పంజా విసురుతోంది. దీంతో పనుల మీద బయటకు వెళ్లే రైతులు, రైతు కూలీలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. వీరితోపాటు చిన్నపిల్లలు, వృద్ధులు కూడా అవస్థలు పడుతున్నారు. గతేడాది డిసెంబర్ మొదటి వారం వరకు వాతావరణం సాధారణంగానే ఉండేది. అలాంటిది ఈ ఏడాది డిసెంబర్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని చలి ప్రారంభమైంది. సంక్రాంతికి మరింత పెరిగే అవకాశం.. ఈ చలి తీవ్రత జనవరి నెలలో మరింత పెరగనుంది. సాధారణంగా సంక్రాంతి సీజన్లో చలి అధికంగా ఉంటుంది. సంక్రాంతి పండుగకు చలి సంకలెత్తకుండా చంపుతుందని సామెత కూడా ఉంది. ఈ సామెత ఈ ఏడాది నిజమయ్యేలా కనిపిస్తోంది. జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు.. జిల్లా వ్యాప్తంగా నవంబర్ నెల 10వ తేదీ కనిష్ట ఉష్ణోగ్రత 25.3 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు ఉండేది. అలాంటిది డిసెంబర్ 15వ తేదీ నాటికి కనిష్ట ఉష్ణోగ్రత 15.4 చేరగా గరిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీలకు చేరింది. ఒక్కసారిగా ఉష్ణోగత్రల్లో మార్పు రావడంతో చాలా మంది జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. చలి దుస్తులకు పెరిగిన గిరాకీ.. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు కడప నగరంతోపాటు పలు ప్రాంతాలలోని రోడ్ల పక్క స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకుని జోరుగా చలి దుస్తుల విక్రయాలను సాగిస్తున్నారు. ఈ స్టాల్స్‌లో చలికి సంబంధించిన స్వెట్టర్లు, రెయిన్కోట్లు, శాలువాలు, మంకీ క్యాపులు, గ్లౌజులు, రగ్గులు విక్రయిస్తున్నారు. పెంపుడు జంతువులకు దూరంగా.. ఈ సీజన్లో పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. వైరస్ల వ్యాప్తికి పెంపుడు జంతువులు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో వాటిని బెడ్రూమ్, వంటగదిలోకి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు పెంపుడు జంతువులను దగ్గరలో లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వేడి వస్తువులకు ప్రధాన్యం.. ఈ చలికాలంలో చల్లని వస్తువులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీములకు మరింత దూరంగా ఉండాలి. గోరు వెచ్చని నీరు తాగితే కాసింత ఉపశమనం లభిస్తుంది. వీటికితోడు తాజా ఆహారం తీసుకుంటే మంచింది. ముఖ్యంగా ఈ చలికి చంటి బిడ్డలను బయటకు తీసుకెళ్లకూడదు. చలితో గజగజ వణుకుతున్న జిల్లా వాసులు గత పది రోజుల నుంచి పెరిగిన చలి తీవ్రత సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ప్రభావం 15 డిగ్రీలకు చేరిన రాత్రి ఉష్ణోగ్రతలు తెల్లవారుజాము నుంచి రోడ్లను కమ్ముకుంటున్న పొగమంచు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు మారిన వాతావరణంలో వివిధ అనారోగ్య సమస్యలు జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులుదీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్త.. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పడిపోతున్నాయి. గుండె జబ్బులు, బీపీ, ఆస్తమా, మధుమేహం వ్యాధిగ్రస్తులు ఈ చలికి జాగ్రత్తగా ఉండాలి. వీరు ముఖ్యంగా చలి తీవ్రంగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకూడదు. సాధారణ ప్రజలకు కూడా జలుబు, దగ్గు, సీజనల్ జ్వరాలు పచ్చే అవకాశం ఉటుంది. ఒక వేళ బయటకు రావాల్సిన అవసరం ఏర్పడితే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ అవ్వారు అర్జున్‌కుమార్, రిమ్స్ వైద్యులు, కడప -
సీఐపై బదిలీ వేటు.. కూటమిలో విభేదాలే కారణం?
ముద్దనూరు : స్థానిక అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరిని వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడానికి కూటమి నేతల విభేదాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత కొంతకాలంగా మండలంలో స్థానిక పోలీసుశాఖ వ్యవహారశైలి వల్ల కూటమిలోని ప్రధాన నేతల మధ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటులో ఘర్షణ మొదలుకొని ఇటీవల స్మార్ట్ కిచెన్ షెడ్ నిర్మాణంలో ఘర్షణ, ఇతర చిన్నచిన్న సమస్యల్లో కూడా స్థానిక పోలీసులు కూటమిలోని ఒక వర్గం వారికే వత్తాసు పలుకుతూ తమ వర్గీయులను చిన్నచూపు చూస్తున్నారనే భావనతో మరో వర్గం నేత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలుసార్లు నియోజకవర్గస్థాయి కూటమి నేత ఒకరు పోలీసు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల కూటమి వర్గీయుల మధ్య జరిగిన ఓ ఘర్షణ కేసు అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో సీఐపై వేటు పడినట్లు తెలుస్తోంది. కూటమినేతల మధ్య సమన్వయ లోపం తమకు శాపమైందని పోలీసు అధికారులు వాపోతున్నారు. -
కువైట్‌ను తాకిన రాజంపేట జిల్లా ఉద్యమ సెగ
రాజంపేట : రాజంపేట,రైల్వేకోడూరుకు చెందిన వేలాది మంది జీవనోపాధి కోసం కువైట్‌లో దేశంలో ఉన్న నేపథ్యంలో వారు కూడా జిల్లా కేంద్రంగా రాజంపేట ఉండాలనే డిమాండ్ లేవనెత్తారు. మాలియాలోని పవన్ రెస్టారెంట్లో ప్రవాసాంధ్రులు రాజంపేట మున్సిపల్ వైస్‌చైర్మన్, కాపు నేత మర్రి రవికుమార్ పదిరోజులుగా చేస్తున్న అన్నమయ్య జాయింట్ యాక్షన్ కమిటీ రిలే నిరాహారదీక్షలకు కువైట్ వైఎస్సార్సీపీ తరపున మద్దతు పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఇప్పుడు రాజంపేటకు అర్హత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కువైట్ నేతలుు గోవిందు నాగరాజు పాల్గొన్నారు.మాలియాలో రాజంపేట, రైల్వేకోడూరు వాసుల నిరసన -
● వరదాయిని.. జగజ్జనని
ఘనంగా అమ్మవారి ఆరాధనోత్సవాలు బ్రహ్మంగారిమఠం : ‘వర ప్రదాయిని.. జగజ్జనని’ అంటూ భక్తులు శరణు వేడారు. ‘కొలిచే వారి కొంగు బంగారమై నిలిచే తల్లీ.. మమ్మల్ని చల్లంగా చూడు’ అంటూ భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. ఈశ్వరీదేవి మఠం జగన్మాత నామస్మరణతో మార్మోగింది. బ్రహ్మంగారిమఠంలోని శ్రీఈశ్వరీదేవి మఠంలో అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఐదో రోజైన సోమవారం పూర్వపు మఠాధిపతి వీరబ్రహ్మయ్యాచార్య స్వాముల వారి ఆరాధన నిర్వహించారు. ఉదయం ప్రభాత సేవ, అభిషేషకం, బిల్వదళార్చన, గురుపూజ విధులు చేపట్టారు. మఠాధిపతి వీరశివకుమారస్వామి, రాజేశ్వరిదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ద్వార పూజ, నైవేద్యం, మంత్ర పుష్పం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి గ్రామోత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. బ్రహ్మంగారిమఠానికి చెందిన చిన్మయామిషన్ వారి గీతాపారాయణం భక్తులను అలరించింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జగన్మాత ఈశ్వరీదేవిని దర్శించుకున్నారు. వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి, దాతలు తమిదల కోటిరెడ్డి, శిల్పా శ్రీకాంత్, కల్లూరు కేశవాచారి, కోడూరి సుబ్రహ్మణ్యాచారి, పోలు పోలేటమ్మగారి సుబ్బారెడ్డి, బాల హుస్సేన్‌రెడ్డి, యాకశిరి జయలక్షుమ్మ, నొస్సం సుబ్రహ్మణ్యాచారి, మహేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. -
కళ్లెదుటే వైకుంఠము.. కల్యాణ వైభోగము..
● వైభవంగా శ్రీ వేంకటేశ్వరుని కల్యాణం ● పోటెత్తిన భక్తజనంకడప సెవెన్‌రోడ్స్ : ‘ఒళ్లంతా కళ్లు చేసుకున్నా ఆ వైభవాన్ని తనివితీరా చూడలేము. ఆ కమనీయ దృశ్యాన్ని తిలకించిన జీవితమే ధన్యము. ఇదిగిదిగో కళ్లెదుటే వైకుంఠము’ అంటూ భక్తులు పరవశించారు. విశాలమైన పందిట్లో మనోహరంగా అలంకరించిన వేదికపై అభయముద్రతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణ ఘట్టాన్ని చూసేందుకు గోవిందమాల దీక్షధారులైన భక్తులు బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమేతంగా తరలివచ్చారు. కల్యాణాన్ని తన్మయత్వంతో భక్తిపూర్వకంగా తిలకించారు. సోమవారం కడప నగరం మున్సిపల్ మైదానంలో శ్రీ గోవిందమాల భక్తబృంద సేవా సమితి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, అనంతరం తోమాల సేవ, అర్చనలు నిర్వహించారు. 9 గంటల నుంచి కల్యాణోత్సవం ప్రారంభమైంది. కనుల పండువగా.. కల్యాణ ఘట్టంలో భాగంగా కుడివైపున నూతన వరుడిగా శ్రీవారిని, ఎడమవైపు ఉభయదేవేరులైన శ్రీదేవి, భూదేవి మాతలను వధువులుగా అలంకరించి కనుల పండువగా తీర్చిదిద్దారు. వేద పండితుల బృందం కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించింది. పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్ఠ, గణపతిపూజ, ప్రవరలు, యజ్ఞోపవీత ధారణల అనంతరం సంప్రదాయంగా కన్యాదానం చేశారు. మహామంగళ సూత్రాలను భక్తులందరికీ దర్శింపజేశారు. అనంతరం మంగళ వాయిద్యాల సుస్వరాలు, వేదమంత్రోచ్ఛాటనల మధ్య స్వామి పక్షాన వేద పండితులు అమ్మవార్ల గళసీమల్లో మంగళ సూత్రాలను అలంకరించారు. ఈ సందర్భంగా వేద పండితుల బృందాలు తలంబ్రాల కార్యక్రమాన్ని ఉత్సాహ భరితంగా నిర్వహించారు. పూల చెండులాట ఆడారు. భక్తులందరికీ మంగళాక్షతలను కల్యాణ ప్రసాదంగా అందజేశారు. ప్రారంభం నుంచి కార్యక్రమం ముగిసేంతవరకు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. భక్తులు అడుగడుగునా చేసిన గోవిందనామ స్మరణలు ఆ ప్రాంగణంలో ప్రతిధ్వనించాయి. హాజరైన వారందరికీ వివాహ భోజనం ఏర్పాటు చేశారు. సందడిగా గ్రామోత్సవం సాయంత్రం ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో కోలాటాలు, చెక్కభజనలు, బ్యాండు మేళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
క్షయవ్యాధి నిర్మూలనకు సమష్టి కృషి
ఎర్రగుంట్ల : క్షయ వ్యాధికి అత్యాధునిక వైద్య చికిత్స అందుబాటులో ఉందని, ఽధైర్యంగా ముందుకు వచ్చి అవసరమైన చికిత్సను ఉచితంగా పొందవచ్చని ఎర్రగుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి.శ్రీనాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని సుంకేసుల గ్రామంలో భారతి సిమెంట్ ఫ్యాక్టరీ సీఎస్ఆర్ సహకారంతో పెయిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి భయంకరమైన అంటువ్యాధి అన్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వారు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పుత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. భారతి సిమెంట్ ఫ్యాక్టరీ సీఎస్ఆర్ వింగ్ డి. మదన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం క్షయవ్యాధి సోకిందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యాధి నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెయిడ్ సంస్థ అధ్యక్షుడు కె.నాగేశ్వరరెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
తప్పుడు రికార్డులతో పరిహారం కాజేశారు
మా గ్రామ పొలం సర్వే నంబరు 102లో నాకు 52 సెంట్ల భూమి యురేనియం కార్పొరేషన్ సేకరించింది. సర్వే నంబరు 742లో రెండు ఎకరాల 85 సెంట్ల భూమి నా పేరిట ఉంది. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. అయితే రెవెన్యూ అధికారులు మాయాజాలం చేసి సదరు రెండు సర్వే నంబర్లలోని భూమిని కొప్పుల వెంకటేశ్ పేరిట చూపెట్టి రూ. 4.37 లక్షలు పరిహారం పొందారు. వెంకటేశ్‌కు ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా రెవెన్యూ అధికారులు కుమ్మకై ్క పరిహారం కాజేశారు. – ఉదయగిరి మస్తాన్, రాచగుంటపల్లె, వేముల మండలం -
మ్యూటేషన్ నిర్వహించాలి
మా గ్రామ పొలం ఎల్పీఎం నంబరు 2042లో ముప్పై ఆరున్నర సెంట్ల భూమిని 2015లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను. 1బీ, అడంగల్, పాసు పుస్తకాలు కూడా మంజూరు చేశారు. కానీ రీ సర్వే నిర్వహించిన తర్వాత అధికారుల తప్పిదం వల్ల సదరు ఎల్పీఎం నంబరులో ఇతరుల పేర్లు నమోదయ్యాయి. కనుక మళ్లీ మ్యూటేషన్ నిర్వహించి కొత్త 1బీ, అడంగల్, పాసు పుస్తకాలు జారీ చేయాలి. – పి.రాఘవేంద్రకుమార్రెడ్డి, మల్లేపల్లె, బి.మఠం మండలం ఖాతా నంబరు 54, సర్వే నంబరు 923/2బిలో 40 సెంట్ల భూమి మా అనుభవంలో ఉంది. అయితే సదరు భూమి ఆన్లైన్లో కనిపించడం లేదు. ఆ భూమిని ఆన్లైన్ చేయించాలని పలుమార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే కలెక్టర్‌కు చెప్పుకుంటే సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో వచ్చాను. – వెన్నపూస వెంకటరెడ్డి, పాత గిరిగెలపల్లె, పెండ్లిమర్రి మండలం చిన్నచౌకు గ్రామ పొలం సర్వే నంబరు 908–1ఏలో మా అబ్బ పేరిట 70 సెంట్ల భూమి ఉంది. ఆ భూమికి రెవెన్యూ అధికారులు 2015 నవంబరు 30న నా పేరిట 1బీని జారీ చేశారు. అయితే ఈ మధ్య ఆన్లైన్లో సదరు భూమికి సంబంధించిన 1బీ రిజిష్టర్ కనిపించడం లేదు. కొందరు తప్పుడు పత్రాలు తయారు చేసి విక్రయిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక దీనిపై విచారణ నిర్వహించి నా పేరిట 1బీ డాక్యుమెంటును ఆన్లైన్లో నమోదుకు చర్యలు తీసుకోవాలి. – సానపురెడ్డి కొండారెడ్డి, హౌసింగ్‌బోర్డు కాలనీ, కడప -
డబుల్ ఇంజిన్‌తో రాష్ట్రానికి ట్రబుల్
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రానికి ట్రబుల్ ఏర్పడింది.రాష్ట్రానికి వెయ్యికోట్లు నిధులు తేలేని స్థితిలో కూటమి నేతలు ఉన్నారు. ప్రజల ఆరోగ్యం, విద్య పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ లేదు.కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలా వద్దా అనే విషయంపై ప్రభుత్వం ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అభిప్రాయాలు తెలుసుకోవాలి. – నరేన్ రామాంజులరెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండదు. ప్రైవేట్ వ్యక్తులు సేవాభావంతో వ్యవహరించరు. లాభార్జన కోసమే పనిచేస్తారు వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, చంద్రబాబు సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీని, ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. – రఘురామిరెడ్డి, వైఎస్సార్సీపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గొప్ప ఆశయంతో మంజూరు చేయించిన 17 మెడికల్ కాలేజీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రైవేటు పరం చేయొద్దు అని నెల రోజులుగా కోటి సంతకాల సేకరణ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. – కొండూరు అజయ్‌రెడ్డి, కడప పార్లమెంట్ పరిశీలకులు -
ఇంధన పొదుపుతో ఉత్తమ భవిష్యత్తు
కడప సెవెన్‌రోడ్స్ : ఇంధన పొదుపుతో ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని, విద్యుత్ పొదుపు అందరి బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సభా భవన్లో ఈనెల 14వ తేదీ నుంచి 20 వ తేది వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలు,కరపత్రాలను కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,జిల్లా జాయింట్ కలెక్టర్ అధితి సింగ్ తో కలిసి విడుదలచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధనాన్ని పొదుపు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇంధన సామర్థ్యం,పరిరక్షణ ప్రాముఖ్యత,విద్యుత్ ఆదా గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రసంగాలు,ర్యాలీలు, విద్యార్థులలో అవగాహన కల్పించుటకు వ్యాసరచన పెయింటింగ్ పోటీలు, వర్క్ షాప్, వెబినార్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భూతాపం, వాతావరణ మార్పులనుఎదుర్కోవడానికి సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.కార్యక్రమము లో విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్ రమణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమగ్రంగా న్యూట్రిషనల్ కన్వర్జెన్స్ పైలెట్ ప్రాజెక్టు సర్వే సాంకేతిక మద్దతు ద్వారా పోషకాహారం–వ్యవసాయ కన్వర్జెన్స్‌ను ప్రారంభించడం(ఇనాక్ట్స్)్ఙ అనే పైలెట్ ప్రాజెక్టు కార్యక్రమ సర్వే జిల్లాలో సమగ్రంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ శ్రీదర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లాలో అమలవుతున్న ఇనాక్ట్స్ పైలెట్ ప్రాజెక్ట్ సర్వే కార్యక్రమంపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాజెక్ట్ అసోసియేట్ స్మతితో పాటు సంబందిత జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడి రాజ్యలక్ష్మి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రా నాయక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ మహేశ్వర కుమార్, సీఎన్ఎఫ్ డిపిఎం ప్రవీణ్ కుమార్, ఐసీడీఎస్ పీడీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ప్రజా ప్రదక్షిణ వేదిక
● వ్యయ ప్రయాసాలతో కలెక్టరేట్‌కు తరలివస్తున్న ప్రజలు ● సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూపులు కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కారవేదిక ‘ప్రదక్షిణ’వేదికగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్‌సెల్‌లో ప్రజలు సమస్యలు విన్నవిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. భూమికి సంబంధించిన సమస్యలే అత్యధికంగా వస్తున్నాయి. రీ సర్వేలో దొర్లిన తప్పిదాల కారణంగా తమ భూమి విసీ్త్రర్ణం తగ్గిందని, ఆన్లైన్లో తమ పేర్లను నమోదుచేయాలని, పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయాలని, ఇతరులు తమ భూములను ఆక్రమించారని తదితర అనేక సమస్యలు వస్తున్నాయి. -
నూతన కార్యవర్గం
కడప ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. ఇందులో జిల్లా అధ్యక్షుడిగా ఎస్. అమర్నాథ్రెడ్డి. ప్రధాన కార్యదర్శిగా వి. కిరణ్‌కుమార్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడిగా కె. ప్రభాకర్‌రెడ్డి, కోశాధికారిగా దామోదర్‌రెడ్డి, మహిళా కార్యదర్శిగా షరీదాభాను, కార్య నిర్వాహక అధ్యక్షులుగా శివశంకరెడ్డి, కర్నాటి రాజశేఖర్‌రెడ్డి, ఖాదర్ మొహిద్దీన్, అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా మల్లికార్జునరెడ్డి, పవన్, జయప్రకాస్రెడ్డి, కార్య నిర్వాహక కార్యదర్శిగా సతీష్, ఓబుల్‌రెడ్డి, విజయమ్మ, గౌరవ సలహాదారులుగా రమేష్‌బాబు, మైనార్టీ వింగ్ కన్వీనర్‌గా బాబా రజాక్, సోషల్ మీడియా కన్వీనర్‌గా జాన్ సుందర్రాజు, ఉపాధ్యక్షులుగా మదార్‌వలి, వెంకటరామిరెడ్డి, బాలశివారెడ్డి, గంగాధర్‌రెడ్డి, రాఘవేంద్రమ్మ, భాస్కర్‌రెడ్డి, సహాయ కార్యదర్శులుగా కరుణాకర్‌రెడ్డి, రఘనాథరెడ్డి, లక్ష్మినారాయణ, వెంకటేశ్వరరెడ్డి,జేసునాథరెడ్డి, అడిట్ కమిటీ కన్వీనర్‌గా రమణ, సభ్యులుగా శ్రీనాథరెడ్డి, సూరి, నాగార్జున, రాష్ట్ర కౌన్సిలర్లుగా రమణారెడ్డి, సీకే వెంకటనాథరెడ్డి, జగన్మోహన్రెడ్డి, సురేష్‌రెడ్డిలను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ వైఎస్సార్ టీచర్ అసోసియేషన్ బలోపేతానికి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి అమర్నాథరెడ్డి -
మేం అధికారంలోకి వస్తే మెడపట్టి గెంటేస్తాం
మెడికల్ కాలేజీ టెండర్లలో పాల్గొని ఎవరైనా వాటిని సొంతం చేసుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఽధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మెడపట్టి గెంటేస్తాం. విద్య, వైద్యం విషయంలో పేదలు దోపిడీకి గురికాకూడదనే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. రూ.8500కోట్లతో వాటిని పూర్తి చేసేందుకు సంకల్పించారన్నారు. రూ.5వేల కోట్లు అయితే అన్ని కాలేజీలు పూర్తవుతాయి. చంద్రబాబు చేసే ప్రతి కార్యక్రమం కమీషన్ల కోసమే.. దౌర్జన్యంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే ఒప్పకునే ప్రసక్తేలేదు. – ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాయలసీమ ఇన్చార్జి -
లాభాల మునగ.!
కడప సిటీ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రకరకాల పండ్ల తోటల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తోంది. 300 రకాల వ్యాధులకు ఉపయోగపడే మునగ (మోరింగా) సాగుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మునగ సాగుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలోని ఆరు మండలాల్లో మునగ సాగును చేపట్టారు. ప్రారంభంలో కేవలం 23 మంది రైతులు మాత్రమే 17.43 ఎకరాల్లో 710 మొక్కలు మాత్రమే నాటారు. పూర్తిగా రైతుకు ఎలాంటి భారం లేకుండా గుంతలు తీసే పని నుంచి మొక్కల పంపిణీ రెండు సంవత్సరాలపాటు నిర్వహణ కూడా పూర్తి ఉచితంగానే కేంద్ర ప్రభుత్వం రైతులకు అవకాశం కల్పిస్తోంది. అఽధిక పోషక విలువలతోపాటు ఔషధ గుణాలు కూడా మునగ మొక్కల్లో ఎక్కువగా ఉన్నాయి. హోస్టెడ్ ప్లాంటేషన్ ద్వారా నర్సరీల్లో పెంచిన మునగ మొక్కలను రైతులకు అందజేస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా నాటించి విద్యార్థులకు మునగతో ఏ విధంగా ఉపయోగం ఉందో తెలియజేసే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 31.61 ఎకరాల గుర్తింపు.. జిల్లా వ్యాప్తంగా ఆరు మండలాల్లో ఈ మునగసాగు చేపట్టారు. ఇందులో భాగంగా 31మంది రైతులకు 31.61 ఎకరాలు గుర్తించారు. 14,190 గుంతలు తీయగా, ఇందులో 29.7 ఎకరాల్లో సాగై 11,850 మొక్కలు నాటారు. రెండు సంవత్సరాలపాటు ఈ పంట ఉంటోంది. తర్వాత సాగు చేసిన రైతులకు రెండవ దఫా ఇచ్చేందుకు అవకాశం ఉండదు. 0.5 ఎకరా నుంచి ఎకరా వరకు నాటేందుకు అనుమతి ఉంది. రెండింతలకుపైగా ఆదాయం.. కొత్తగా రైతులు ప్రారంభంలో మొగ్గు చూపకపోయినా తర్వాత అధికారులు ఆదాయం రెండింతలు వస్తుందని చెప్పగా రైతులు ముందుకు వచ్చారు. సున్నా పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వం వీటికి అయ్యే ఖర్చు ఉచితంగానే నిధులు ఇస్తోంది. రైతు చేతి నుంచి ఒక్క రూపాయి కూడా వెచ్చించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఒక రైతు ఎకరాకు కేంద్ర ప్రభుత్వం మొక్కలు, మెటీరియల్‌కు కలిపి రూ. 80 వేలు ఉచితంగా ఇవ్వగా, ఆ రైతుకు రెండు సంవత్సరాల కాలంలో రూ.3.50 లక్షల ఆదాయం అందుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మునగ ఆకుతో 300 వ్యాధులు దూరం.. మునగ ఆకు, మునక్కాయలు మనం నిత్యం తినే ఆహారమేగానీ, దాని గురించి ప్రజల్లో పూర్తిగా అవగాహన లేదు. అయితే మునక్కాయలే కాకుండా మునగ ఆకులో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వివిధ పరిశోధనల్లో వెల్లడైంది. మునగ ఆకులో ఏ, సీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో అయితే 300 వ్యాఽ ధులు నయం చేసేందుకు మునగ ఆకును ఉపయోగిస్తారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ తింటే వచ్చే విటమిన్లు 8–10 రెట్లు అధికంగా మునగ ఆకు ద్వారా పొందవచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించి మందుల్లో కూడా వాడతారు. మహిళలు రోజుకు ఏడు గ్రాముల మునగ ఆకు పొడిని మూడు నెలలపాటు వరుసగా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయని పరిశోధనలో కూడా తేల్చారు. థైరాయిడ్‌కు మంచి మందుగా పనిచేస్తుంది. మునగాకు రసాన్ని పిల్లలకు అందిస్తే ఎముకలు బలిష్టంగా ఉంటాయి. పాలిచ్చే తల్లులకు పాలు పెరిగేందుకు మునగాకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు 100 గ్రాముల మునగాకులో నీరు 75.9 శాతం, పిండి పదార్థాలు 13.4 గ్రాములు, కొవ్వు పదార్థాలు 17 గ్రాములు, మాంసకృత్తులు 6.7 గ్రాములు, క్యాల్షియం 440 మిల్లీ గ్రాములు, పాస్పరస్ 70 మి.గ్రా. ఐరన్ 7 మి.గ్రా, సి–విటమిన్ 200 మిల్లీ గ్రాములు, ఖనిజ లవణాలు 2.3 శాతం, పీచు పదార్థం 0.9 మిల్లీ గ్రాములు, ఎనర్జీ 97 క్యాలరీల పోషక పదార్థాలు కలిగి ఉంటుంది. మునగ సాగుతో ఆరోగ్యం.. ఆదాయం సాగు చేసుకునేందుకు ముందుకొస్తున్న రైతులు ఉపాధి హామీలో పూర్తిగా ఉచితంగా గుంతలు, మొక్కలు అందజేత -
అంగరంగ వైభవం.. పుష్ప రథోత్సవం
● కనుల పండువగా ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలు ● భారీగా పాల్గొన్న భక్తజనంబ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలోని శ్రీ ఈశ్వరీదేవిమఠంలో అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన ఆదివారం పుష్పరథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోకమాత పుష్పరథంపై ఆశీనులై భక్తులను ఆశీర్వదించారు. జగజ్జననికి మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి, రాజేశ్వరిదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి, ఊరేగింపు చేపట్టారు. ఉదయం గుడి ఉత్సవం కమనీయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా అనుమసముద్రం మండలం కొలను గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న, భువనేశ్వర్‌రెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ప్రగతి నృత్యాలయ కళాట్రస్ట్ బృందం ప్రదర్శించిన నృత్యం అలరించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి పాదరేణువులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆకట్టుకున్న కోలాటం ఇటుకలపాడుకు చెందిన శివపార్వతుల మహిళా కోలాట బృందం ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మఠం సిబ్బంది, అమ్మవారి శిష్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో విజయవాడకు చెందిన గుంటముక్కల వెంకటేశ్వరరావు, వైజాగ్‌కు చెందిన గోపిశెట్టి సురేంద్రనాథ్, కడపకు చెందిన మునగా బద్రినాథ్ శ్రేష్టి, ప్రకాశం జిల్లా కంభంకు చెందిన తిరువీధి లక్ష్మీరంగయ్యశ్రేష్టి, బ్రహ్మంగారిమఠం ముక్కమల్ల భాస్కర్‌రెడ్డి, వీరపు ఉమాపతి, సుంకు సురేష్‌బాబు, చెరువుపల్లి ఓంకారస్వామి, నొస్సం చంద్రశేఖరాచారి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి సన్నిధిలో.. శ్రీ ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధిని దర్శించుకుని తరించారు. అలాగే మాత గోవిందమాంబ, శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం, పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ, పోలేరమ్మ గుడి, తదితర ప్రాంతాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఆదీ.. నీ బతుకంతా అబద్ధాలే!
జమ్మలమడుగు : ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డీ.. నీ బతుకంతా అబద్ధాలతోనే సాగుతోంది.. అని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆదివారం జమ్మలమడుగులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆది బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవ్వరూ లేరన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు నిజాయితీగా జరిగాయని, రాబోయే ఎన్నికల్లో పులివెందుల మున్సిపాలిటీని ముఖ్యమంత్రికి గిఫ్టుగా ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఎంత సజావుగా జరిగాయో రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వేలాది మంది అక్కడ దొంగ ఓట్లు వేసి వచ్చారన్నారు. సాక్షాత్తు కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేసిన చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఆది అంటే అవినీతి, అబద్ధం అని ఎద్దేవా చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి గాని అర్హత గాని ఆదినారాయణరెడ్డికి లేవన్నారు. ఆదిలాంటి అవినీతి, దగాకోరు రాజకీయ నాయకులు ఎవరూ లేరన్నారు. అధికారం ఎక్కడ ఉంటే అటువైపు పరుగులు తీసే మనస్తత్వం కలిగిన నీచ చరిత్ర అందరికీ తెలుసన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చిత్రావతి, పెన్నానది, ఫ్యాక్టరీల వద్ద కమీషన్లు దండుకుంటూ, ఫ్లైయాష్‌ను దోచుకుంటూ నెలకు మూడు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడని ఆరోపించారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా వైఎస్సార్సీపీ తరపున అభ్యర్థులను పోటీలో నిలిపి తీరుతామని, ఎలాంటి బెదిరింపులు, దౌర్జన్యాలనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులకు రాబోయే ఎన్నికల్లో సూదులతో గుచ్చుతా అని ఆదినారాయణరెడ్డి అంటున్నాడని, అయితే ప్రజలు 2029 ఎన్నికల్లో నీకు సూది వేసి శాశ్వతంగా రాజకీయ సమాధి చేస్తారన్నారు. ఇప్పటికై నా ఆదినారాయణరెడ్డి తన స్థాయి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి హితవు పలికారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, పొన్నపురెడ్డి గిరిధర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సింగరయ్య, కౌన్సిలర్ ముల్లాజానీ, విష్ణువర్దన్‌రెడ్డి, వద్దిరాల రామాంజనేయులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి -
కేసీ కాలువలో మృతదేహం
మైదుకూరు : మైదుకూరు వద్ద కడప – కర్నూలు (కేసీ)కాలువలో ఆదివారం మృతదేహం కనిపించింది. ఉదయం అటుగా వెళ్లిన కొందరికి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆ మేరకు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి మృతదేహం ఆచూకీపై వివరించారు. మృతుడు చాపాడు మండలం నాగాయపల్లెకు చెందిన పిచ్చపాటి వీరప్రభాకర్రెడ్డి (38)గా గుర్తించారు. ఆయన ఈనెల 11వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపినట్టు సీఐ పేర్కొన్నారు. ప్రొద్దుటూరు రోడ్డులో ఉన్న కేసీ కెనాల్ నీటిలో ప్రమాదవశాత్తు పడి చనిపోయినట్టు తెలిపారు. మృతుని భార్య సుభద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. నిలకడగా విద్యార్థుల ఆరోగ్యంతొండూరు : తొండూరు మండలం అగడూరు పంచాయతీ పరిధిలో గల యాదవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగిన ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆదివారం పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి విలేకరుల బృందంగా వెళ్లి.. అక్కడి వైద్యులు, విద్యార్థుల తల్లిదండ్రులతో వివరాలు తెలుసుకోగా, ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారన్నారు. సోమవారం విద్యార్థులను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. బైక్‌లు ఢీ ముద్దనూరు : స్థానిక పోలీసు స్టేషన్ ముందు ఆదివారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న మోటార్ బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరికి కాలువిరగగా, మరొకరికి తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిద్దవటం మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలి కడప కార్పొరేషన్ : సిద్దవటం మండలాన్ని వైఎస్సార్ కడప జిల్లాలోనే కొనసాగించాలని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మధుసూదన్, లక్ష్మినారాయణ, దిలీప్‌రెడ్డి కోరారు. ఆదివారం వారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించి మద్దతు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడపకు కూతవేటు దూరంలోనే సిద్దవటం ఉందని, దీన్ని అన్నమయ్య జిల్లాకు మారిస్తే 80.కి.మీ చుట్టూ తిరిగి జిల్లా కేంద్రమైన రాయచోటికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. 2009లో కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజంపేట నియోజకవర్గంలో కలిసి చాలా కోల్పోయామని, ఎంతో చరిత్ర కలిగిన ఒక నాటి జిల్లా కేంద్రాన్ని మరింత దిగజార్చవద్దని కోరారు. ఒంటిమిట్ట వద్ద చెరువులోకి దూసుకెళ్లిన కారు ఒంటిమిట్ట : ఒంటిమిట్ట మండలంలోని సాలాబాదు క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం ఒంటిమిట్ట చెరువులోకి కారు దూసుకెళ్లింది. పోలీసుల వివరాల మేరకు.. కర్నూలులోని నిర్మల్ నగర్‌కు చెందిన శ్రావణ్‌కుమార్ కుటుంబ సభ్యులు మరో ముగ్గురు కారులో తిరుమలకు వెళ్లి వస్తున్నారు. ఒంటిమిట్ట చెరువు కట్టపైకి రాగానే కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ కారుకు తుమ్మచెట్లు అడ్డుపడటంతో చెరువులో మునగలేదు. ప్రమాదం తప్పింది. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చిట్వేలి : ఆరుగాలం కష్టించి పండించిన పంటలు పండక, పెట్టిన పెట్టుబడులు రాక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్వేలి మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని జట్టువారిపల్లికి చెందిన ఏదోటి సుబ్బరాయుడు (48) కౌలుకు 15 ఎకరాలలో బొప్పాయి,అరటి సాగు చేస్తున్నాడు. పండించిన పంటలు పండక, పెట్టుబడి రాక అప్పుల బాధతో శనివారం విషపు గుళికలు మింగాడు. రేణిగుంట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. -
ఉద్యోగ,ఉపాధ్యాయుల పెండింగ్ డీఏలు చెల్లించాలి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలను కూటమి ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కడపలోని సాయిబాబా స్కూల్లో ఆదివారం వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ కడప జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి ఆధ్యర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పశ్చిమ రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందన్నారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలు చాలా ఉన్నాయన్నారు. వాటిని వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం కొత్త పీఆర్సీ కమిషన్ వేసి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిట్మెంట్ ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సీకే వెంకటనాథరెడ్డి, సజ్జల వెంకట రమణారెడ్డి, జిల్లా నాయకులు రమేష్‌బాబు, సురేష్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, ఫరీదాబాను, మాజీ ఎంఈఓలు వీరారెడ్డి, జాపర్సాదిక్లతోపాటు పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.వైఎస్సార్‌టీఎఫ్ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి -
ఉపాధ్యాయుల సమస్యలు మంత్రి లోకేష్ దృష్టికి
● ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ● ఎస్టీయూ ఆధ్వర్యంలో మహా ర్యాలీర్యాలీలో పాల్గొన్న ఎస్టీయూ నాయకులుమాట్లాడుతున్న ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డికడప ఎడ్యుకేషన్ : పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాల వలన ఉపాధ్యాయులు బోధనకు దూరం అవుతున్నారనే విమర్శ ఎక్కువగా ఉందని ఈ విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం కడప నగరంలో ఆర్ట్స్ కాలేజ్ నుంచి జిల్లా పరిషత్తు వరకు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేలాది మంది ఉపాధ్యాయులు మహా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యారంగం, ఉపాధ్యాయల అభ్యున్నతికి ఎస్టీయూ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ అర్హత పరీక్ష పై ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేసి 2011 కంటే ముందు ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వారికి టెట్ నుంచి మినహాయింపు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకుని సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని తెలిపారు. ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యా సంవత్సరం మధ్యలో తీసుకొస్తున్న సంస్కరణల వల్ల విద్యా సంవత్సరం కుంటుపడుతోందని చెప్పారు. ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు చూస్తుంటే ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి ఉచిత విద్య నుంచి ప్రభుత్వం తప్పుకునేలా పావులు కదుపుతోందన్నారు. జీఓ 117కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన 21 జీఓను సవరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొర్రా సురేష్ బాబు, గాజుల నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం రాజు, జోసెఫ్ సుధీర్ బాబు, తిమ్మన్న, జనవిజ్ఞాన వేదిక నాయకులు విశ్వనాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నాయకుడు వలరాజు, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగమేశ్వరరెడ్డి, పాలకొండయ్య, రాష్ట్ర నాయకులు కంఘం బాలగంగిరెడ్డి, పిల్లి రమణారెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కొత్తపల్లి శీను, బండి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మృత్యువులోనూ వీడని స్నేహ బంధం
దువ్వూరు : స్థానిక నల్లవంక దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గోపులాపురం గ్రామానికి చెందిన చిట్టిబోయిన పెద్ద ఎల్లయ్య (60), నేలటూరు గ్రామానికి చెందిన చాగలేటి వీరప్రతాప్‌రెడ్డి (62) ఇద్దరు స్నేహితులు. ఆదివారం వీరిద్దరు దువ్వూరుకు ఇంటి సరుకుల కోసం టీవీఎస్ ఎక్సెల్ స్కూటర్‌పై వచ్చి తిరిగి సొంత ఊర్లకు బయలుదేరారు. దువ్వూరు సమీపంలోని నల్లవంక దగ్గర ఉన్న సురేష్ గోడౌన్ వద్ద వాహనాన్ని ఆపి రోడ్డు దాటుతుండగా ప్రొద్దుటూరుకు వెళుతున్న బొలెరో వాహనం వేగంగా వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిరువురు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. చాలా ఏళ్ల నుంచి ఇద్దరు స్నేహితులుగా ఉన్నారు. పెద్ద ఎల్లయ్యకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరప్రతాప్రెడ్డికి కోవిడ్ సమయంలో భార్య చనిపోయింది. కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వీరు మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధు మిత్రులు, ఇరుగ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు.రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం -
ధర్నాను విజయవంతం చేయాలి
సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జనవరి 5వ తేదీ విజయవాడ ధర్నా చౌక్ వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలి. ఉద్యోగులకిచ్చిన హామీలు అమలు చేయాల్సి ఉండగా ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు. – ఎన్.సుధీర్‌రెడ్డి, ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్బ్యాంకు జిల్లా అధ్యక్షుడుసమస్యలు పరిష్కరించాలి రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు.చంద్రబాబు ప్రభుత్వం వీరి గరించి పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా స్పందించాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. – జి. నారాయణరెడ్డి, ఏపీ కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు. -
ఉత్సాహంగా గ్రీన్ హార్ట్ ఫుల్నెస్ 2కే రన్
ప్రొద్దుటూరు కల్చరల్: ఫిట్ ఇండియాలో భాగంగా శ్రీరామచంద్రమిషన్, రోటరీ క్లబ్, రోటరీ కంటి ఆస్పత్రి, మిడ్ టౌన్ రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రీన్ హార్ట్ఫుల్నెస్ 2కే రన్ ఉత్సాహంగా సాగింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గ్రీన్ హార్ట్‌ఫుల్ నెస్ 2కే రన్‌ను డీఎస్పీ భావన, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ హార్ట్ఫుల్నెస్ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పెంపకం, నిషేధిత ప్లాస్టిక్ వస్తువులపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలను నాటి పరిరక్షించాలని తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. డాక్టర్ వైవీ స్వరూప్ కుమార్ఱెడ్డి, శ్రీరామచంద్రమిషన్ జోనల్ కోఆర్డినేటర్ ఎన్.బాబు రామచంద్ర, రోటరీక్లబ్ ప్రెసిడెంట్ గజ్జల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని కాపాడి భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అన్నారు. ధ్యానం ద్వారా మనిషి మానసిక వికాసం పొందుతారన్నారు. అనంతరం వికసిత్ భారత్ ప్రతిజ్ఞ చేశారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన 2కే రన్ పుట్టపర్తి సర్కిల్‌కు చేరుకుని అక్కడ మానవ హారంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణ నినాదాలు చేశారు. శ్రీకృష్ణాలయం ఆవరణలో అల్పాహారం, 250 జామ, నేరేడు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. ఆప్కాబ్ మాజీ చైర్పర్సన్ ఝాన్సీరాణి,సుధాకర్‌రెడ్డి, రవిశంకర్, సత్య ప్రవీణ్, రాజశేఖర్, లక్ష్మీకాంతమ్మ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. -
● ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10గంటలకు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ మీదుగా హెడ్ పోస్టాఫీసు చేరుకొని అక్కడున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నివాళులు అర్పించి, జిల్లా కేంద్రం నుంచి సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో పాల్గొననున్నారు. -
ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ప్రొద్దుటూరు కల్చరల్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.శ్యాంసుందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తయినా ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంబిస్తోందన్నారు. 2023 జూలై నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నప్పటికీ కనీసం 12వ పీఆర్సీ కమిషన్ కూడా నియమించలేదన్నారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. జూలై 2024 నుంచి ఇప్పటి వరకు మూడు విడతల బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. సరెండర్ లీవుల బిల్లులను ట్రెజరీలకు సమర్పించి మూడేళ్లయినా ఇంత వరకు డబ్బు చెల్లించలేదన్నారు. 11వ ీపీఆర్సీ బకాయిలు, డీఏల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. టీచర్ల ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బారెడ్డి, సయ్యద్ బాషా, జిల్లా కౌన్సిలర్లు సుబ్బయ్య, ప్రభాకర్‌రెడ్డి, దామోదర్, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, గురివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
16 నుంచి కూచ్‌బెహర్ క్రికెట్ టోర్నీ
కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప వేదికగా ఈ నెల 16 నుంచి 19 వరకు వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో బీసీసీఐ అండర్–19 కూచ్‌బెహర్ ట్రోఫీ 2025–26 టోర్నమెంట్ జరగనుంది. ఈ విషయాన్ని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్‌రెడ్డి, కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఆంధ్ర–ఉత్తరఖండ్ రాష్ట్రాల జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15వతేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండి దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ సదవకాశాన్ని విద్యుత్తు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ అనంతపురం గంగమ్మ ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. గంగమ్మా..కాపాడవమ్మా అని వేడుకున్నారు. బోనాలు సమర్పించి తలనీలాలు అర్పించారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: చింతకొమ్మదిన్నె మండలం నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా ఖోఖో సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16న జిల్లా స్థాయి జూనియర్స్, సీనియర్స్ విభాగంలో ఎంపికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రామ సుబ్బారెడ్డి, నరేంద్ర ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్స్ విభాగానికి సంబంధించి 2008 జనవరి 1 తర్వాత పుట్టి 18 సంవత్సరాల లోపు వయస్సు వారు అర్హులు అన్నారు. 18 సంవత్సరాల పైబడి వయసున్న వారు సీనియర్ విభాగానికి అర్హులు అని తెలిపారు. ఈనెల 19, 20 ,21వ తేదీల్లో ప్రకాశం జిల్లా జే. పంగులూరులో జరిగే పోటీల్లో జూనియర్ జట్టు క్రీడాకారులు , ఈనెల 24 నుంచి 26 వరకు కృష్ణాజిల్లా గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో సీనియర్స్ జట్టుకు ఎంపికై న వారు పాల్గొనాల్సి ఉంటుందన్నారు. కడప సెవెన్‌రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించు కోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్ కు కాల్ చేయవచ్చని డీఆర్వో తెలిపారు. సభాభవన్‌లో పీజీఆర్ఎస్ నిర్వహణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమవారం సభాభవన్ లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు. -
నియోజకవర్గం సేకరించిన సంతకాలు
సాక్షి ప్రతినిధి, కడప: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజలు నీరాజనం పలికారు. ఊరు–వాడ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కన్పించింది. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలల్లో మారుమూల గ్రామాలకు సైతం ఆ పార్టీ శ్రేణులు వెళ్లి నిరసన గళాన్ని కలం ద్వారా వ్యక్త పర్చేలా వ్యవహరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో రగిల్చింది. సంతకాల పత్రులను వాహనాల్లో ఎక్కించి పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయానికి చేరవేశారు. అన్ని నియోజవకర్గాలకు చెందిన 4,80,101 మంది ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన ప్రతులతో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేశారు. మెడికల్ కళాశాలలు ప్రైవేట్‌పరమైతే పేదలకు వైద్య విద్య కలగానే మిగిలిపోతుందనే ఆవేదనే కోటి సంతకాల్లో భాగస్వామ్యం అయ్యేలా చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పేదలు వైద్య విద్యకు దూరం కాకుడదని..... మెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యపై ఆశలు గల్లంతవుతాయనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఆమేరకు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 4,80,101 మంది నుంచి సంతకాలు సేకరించారు. పులివెందులలో అన్ని వసతులతో రాజసం ఉట్టి పడుతున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం కానుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ స్పందన లభించినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా సంతకాలు చేసిన ఆ ప్రతులతో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టి, జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఇదివరకే చేర్చారు. పార్టీ అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డికి అందజేశారు. నేడు జిల్లా కేంద్రంలోభారీ ర్యాలీకి సన్నాహాలు ఊరు–వాడల్లో ఉద్యమ వేడి రగిల్చిన వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన ప్రతులను జిల్లా కేంద్రానికి చేర్చిన శ్రేణులు బద్వేల్ 60,000 కడప 70,000 కమలాపురం 60,000 మైదుకూరు 50,000 ప్రొద్దుటూరు 1,00,200 జమ్మలమడుగు 49,700 పులివెందుల 90,201 మొత్తం 4,80,101 -
సేవలకు అంతరాయం
కడప అగ్రికల్చర్: చంద్రబాబు సర్కార్ సహకార ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. వారి సమస్యల పరిష్కారానికి హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చకపోవడంతో సహకార సంఘం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో రూ.లక్షల్లో లావాదేవీలు జరుగుతుంటాయి. ఉద్యోగుల ఆందోళన కారణంగా ఆయా రోజుల్లో లావాదేవీలు నిలిచిపోతుండంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 77 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 400 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముగియడంతో పలువురు రైతులు ధాన్యం డబ్బులు చేతికి రావడంతో వాటిని చెల్లించేందుకు సహకార సంఘాలకు వస్తున్నారు. ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతుంటంతో ఉసూరుమంటూ వెనుతిరిగి వెళ్లాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారంపై రుణాలు తీసుకునే రైతులకు అవస్థలు చాలా మంది రైతులు రబీ పంటల పెట్టుబడి కోసం బంగారు నగల తాకట్టుపై అధికంగా రుణాలు తీసుకుంటారు. రూ. 88 పైసల వడ్డికే సహకారం సంఘాల్లో రుణాలు ఇస్తారు.దీంతో రైతులు బంగారు తాకట్టుెపెట్టి రుణాలు పొందుతారు. కానీ ఉద్యోగులు అందుబాటులో లేకపోడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలి. 2019, 2024 పెండింగ్‌లో ఉన్న వేతన సవవరణలు చేయాలి. ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సీలింగ్ 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు.చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి. ప్రభుత్వోద్యోగుల మాదిరిగా పదవీ విరమ ణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలి. ఉద్యోగులకు రూ. 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించాలి. ప్రతి ఉద్యోగికి రూ. 20 లక్షల టర్మ్ ఇన్యూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి డీసీఈబీ ద్వారా నేరుగా రైతులకు రుణాలు ఇవ్వకుండా సహకారం సంఘాల ద్వారా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం సహకార సంఘాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్లను సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలో ఖాళీగా ఉన్న సంఘాల సీఈఓలుగా నియమించాలి. ఆందోళన కార్యక్రమాల వివరాలు.. డిసెంబర్ 16వ తేదీ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా, వినతిపత్రం సమర్పించడం. డిసెంబర్ 22 రాష్ట్రంలో ఉన్న అన్ని డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నా, వినతిపత్రం అందజేయడం. 29వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలు ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా, ఉన్నతాధికార్లకు వినతిపత్రం అందించడం. 2026 జనవరి ఽ5వ తేదీ నుంచి 26 జిల్లాలు పూర్తి అయ్యేవరకు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహాల దీక్షలు. కొనసాగుతున్న సహకార సంఘ ఉద్యోగుల ఆందోళన నిలిచిపోతున్న లావాదేవీలు అవస్థలు పడుతున్న అన్నదాతలు -
రాయచోటి వద్దు.. కడప ముద్దు
సిద్దవటం : మండలంలోని భాకరాపేట చెక్‌పోస్ట్ వద్ద జేఏసీ నాయకులు శనివారం రాయచోటి వద్దు.. కడప ముద్దు అంటూ వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రజాభీష్టం మేరకే ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంగా సిద్దవటం మండలాన్ని కలపడం సహేతుకంగా లేదన్నారు. సిద్దవటం మండలం కడపలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే మాధవరం–1 గ్రామంలో మహిళా నాయకురాలు ఏకుల రాజేశ్వరిరెడ్డి, కేవీ సుబ్బయ్య, నరసింహారెడ్డి, తుర్రా ప్రతాప్, రెడ్డెయ్య రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు మహిళలు, జేఏసీ నాయకులు కడప–చైన్నె జాతీయ రహదారిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి రాజంపేట జనసేన నాయకుడు అతికారి కృష్ణ సంఘీభావం తెలిపారు. కాగా ఇదే సమయంలో తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న ఇన్చార్జి మంత్రి సవితమ్మ కారును ఆపి సిద్దవటం మండలాన్ని కడపలోనే కొనసాగించాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అనిల్‌కుమార్‌రెడ్డి, చలపాటి చంద్ర, వినోద్, నాయబ్ రసూల్, శివయ్య, వెంకట్, రవిశంకర్, డాక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కడప జిల్లానే ఆమోదయోగ్యం ఒంటిమిట్ట : సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలోనే కొనసాగించడమే అన్ని విధాలా ఆమోదయోగ్యం అని వైఎస్సార్సీపీ రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం కోదండ రామాలయం వెనుక వైపు 8వ రోజు కొనసాగిన జేఏసీ రిలే నిరాహార దీక్షలో ఆయనతో పాటు మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. పిడుగు వెంకట శేషారెడ్డి, సుంకేసుల సుబ్బరాయుడు, కో–ఆప్షన్ మెంబర్ షేక్ మహ్మద్ రఫీ, బత్తల సుబ్బనరసయ్య, పందేటి చంద్రశేఖర్ రాజు దీక్షలో కూర్చున్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మండల జేఏసీ అధ్యక్షుడు భవనాసి రామదాసు, ఉపాధ్యక్షుడు పాటూరి గంగిరెడ్డి, జేఏసీ నాయకుడు బాలరాజు శివరాజు, చంద్రసుధాకర్ రెడ్డి, గురుమోహన్ రాజు, సిరిపిరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో కొరవడిన స్పష్టత
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వంలో స్పష్టత కొరవడిందని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్ ఆరోపించారు. శనివారం కడపలోని యూటీఎఫ్ భవన్లో జరిగిన ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు కూటమి పెద్దలు ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు తమకు రావాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించడంతోపాటు 12వ పీఆర్సీని అమలు చేసి తమ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తారని ఆశించారన్నారు. అయితే పీఆర్సీ అమలు సంగతి అటుంచితే, పీఆర్సీ చైర్మన్‌ను నియమించడంలో సైతం కాలయాపన చేస్తున్నారన్నారు. పీఆర్సీ గడువు ముగిసి రెండున్నరేళ్లు కావస్తున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం తగదన్నారు. ఉద్యోగుల ఆర్థిక బకాయిలను ఆరు మాసాలలోగా రోడ్ మ్యాప్ ప్రకటించి చెల్లిస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 8500 కోట్ల రూపాయల బకాయిలను మాత్రమే చెల్లించిందని, మిగతా 25 వేల కోట్ల బకాయిల చెల్లింపునకు చర్యలు చేపట్టాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షను నిర్వహించడం తగదన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మి రాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు, జిల్లా సహాధ్యక్షుడు వై.రవికుమార్, ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు ఎస్.ఎజాస్ అహ్మద్, ఎ.శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డి.క్రిష్ణారెడ్డి, ఐక్య ఉపాధ్యాయ జిల్లా కన్వీనర్ జి.గోపీనాథ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్ -
విద్యారంగంలో వికటిస్తున్న ప్రయోగాలు
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలోని పాఠశాల విద్యా రంగంలో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రయోగాలు వికటిస్తున్నాయని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. కడప నగరంలోని జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో శనివారం ఎస్టీయూ 79వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో నూతన పోకడలకు పోకుండా పాఠశాలల్లో గుణాత్మక విద్య సాధనకు తగిన తోడ్పాటును ఉపాధ్యాయులకు అందిస్తుందని ఆశించామన్నారు. కానీ 2025 జూన్ నుంచి పాఠశాల విద్యారంగం ప్రయోగాలకు లోనవుతోందన్నారు. ఉపాధ్యాయుడికి బోధనా సమయాన్ని ఇవ్వకుండా పాఠశాల నిర్వహణకే పరిమితం చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు సగటు ఉపాధ్యాయులను ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్ పేరుతో కేవలం ఒక తరగతి పైనే సగం విద్యా సంవత్సరం దృష్టి పెట్టి మిగతా తరగతులను నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి మాట్లాడుతూ సిలబస్‌కు సంబంధం లేని పద్ధతిలో ప్రశ్నాపత్రాలను రూపొందించి ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రశ్నాపత్రాలను పక్కనపెట్టి ప్రధమ్ అనే ఎన్జీఓ సంస్థ ద్వారా ప్రశ్నా పత్రాలు తయారు చేయించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదన్నారు. ఆ ప్రశ్నల ద్వారా మూల్యాంకనం చేపట్టడం అనేది అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు గందరగోళంగా మారిందన్నారు. జూన్ నెలలో బదిలీలు పూర్తి చేసినప్పటికీ ఇప్పటికీ పది నుంచి పదిహేను శాతం మంది రిలీవర్లు లేక అదే స్థానాల్లో కొనసాగుతున్నారన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం కోసం ప్రతిపాదనలు పంపితే కేవలం 30 శాతం మాత్రమే అనుమతిస్తూ కమిషనర్ నిర్ణయించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు, ఉపాధ్యాయ చీఫ్ ఎడిటర్ గాజుల నాగేశ్వరరావు, సంయుక్త అధ్యక్షులు సురేష్‌బాబు, నాగిరెడ్డి, శివప్రసాద్, రాష్ట్ర నాయకులు బాల గంగిరెడ్డి, ఇలియాస్ బాషా, రమణారెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగమేశ్వర్ రెడ్డి, పాలకొండయ్య, నాయకుడు సుబ్రహ్మణ్యంతోపాటు రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ -
లోకపావనీ.. పాహిమాం
● అంగరంగ వైభవంగా ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలు ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ● పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనంబ్రహ్మంగారిమఠం : దేవీ శరణం.. లోకమాతా పాహిమాం.. జగజ్జననీ రక్షమాం అంటూ భక్తులు వేడుకున్నారు. బ్రహ్మంగారిమఠం భక్తజన సంద్రంగా మారింది. శ్రీఈశ్వరీదేవి ఆరాధన గురుపూజ మహోత్సవాలు మూడు రోజులుగా కనుల పండువగా జరుగుతున్నాయి. అమ్మవారు సజీవ సమాధి నిష్ట వహించిన రోజైన శనివారం కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి మాలధారులు ఇరుముడి సమర్పించారు. పట్టు వస్త్రాలు సమర్పణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా భక్తులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. శ్రీ విశ్వకర్మ విరాట్ భవన్ నుంచి వారు ఊరేగింపుగా అమ్మ సన్నిధానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ధ్వజ స్తంభం వద్ద 108 దీపాలను వెలిగించి, 108 కొబ్బరి కాయలు కొట్టి త్వరితగతిన లోకపావని ఆలయ పునః నిర్మాణం జరగాలని ప్రార్థించారు. అలాగే శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, మాతా గోవిందమాంబకు పట్టువస్త్రాలు సమర్పించారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అంగలకుదుటి సుశీల నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షురాలు తాళబత్తుల వాసవి, ప్రధాన కార్యదర్శి లక్కోజు సుజాత, బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు భారతి తదితరులు పాల్గొన్నారు. మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి, రాజరాజేశ్వరిదేవి దంపతులు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయ ట్రస్టు బోర్డు మెంబర్ వడ్ల రాజ్యలక్ష్మి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి దువ్వూరి నరసింహాచారి, న్యాయ సలహా కమిటీ చైర్మన్ గురుప్రసాద్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పెద్దబాబు, కోనసీమ జిల్లా వైస్ ప్రెసిడెంట్ వరదసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కమనీయంగా దీక్షా బంధన అలంకరణ మధ్యాహ్నం లోకపావని దీక్షా బంధన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. అల్పాహారం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాత్రి పండ్లతో తులాభారం నిర్వహించి, వాటిని భక్తులకు పంపిణీ చేశారు. సింహ వాహనోత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. సహస్ర దీపాలంకరణ వెలుగుతో దేవస్థానం కాంతులీనింది. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ప్రగతి నృత్యాలయ కళాట్రస్ట్ బృందం ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది. గుంటూరుకు చెందిన కుమారి తిరువళ్లూరి దివ్యశరణి భాగవతారిణి హరికథా గానం అలరించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మఠం నిర్వాహకులు, అన్నదాన సత్రాల వారు వసతి సౌకర్యాలు కల్పించారు. ఆలయ ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి పర్యవేక్షణలో మఠం సిబ్బంది, అమ్మవారి శిష్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో దాతలు వొమ్మిన చిన్న ఈశ్వరయ్యశ్రేష్టి, మారంరెడ్డి రామనారాయణరెడ్డి, కడారు విశ్వనాథాచార్యులు, అంకిరెడ్డిపల్లె ఓబుల్‌రెడ్డి, కోడూరు శ్రీనివాస రావు, చెరువుపల్లి వీరయ్యస్వామి, చేవూరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాల్లో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డిని సత్కరించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రత్నకుమార్ యాదవ్, ఎంపీటీసీ మనోహరాచారి, నాయకులు భాస్కరరెడ్డి, ఉమాపతి, సుబ్బారెడ్డి, చంద్రఓబుల్‌రెడ్డి, జోగయ్య పాల్గొన్నారు. -
కడప– బెంగళూరు రైల్వేలైన్ ప్రతిపాదనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఇటీవల జరిగిన రైల్వే అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముద్దనూరు– ముదిగుబ్బ మీదుగా బెంగళూరుకు రైల్వే లైను నిర్మాణం జరపాలని చేసిన ప్రతిపాదనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కడప– బెంగళూరు రైలు మార్గంపై ఇదివరకే పెండ్లిమర్రి, రాయచోటి, మదనపల్లి మీదుగా ఒక ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. జిల్లాలో విస్తారంగా పండించే అరటి, మామిడి, చీనీ, బొప్పాయి, చామంతి పంటల ఎగుమతికి పెండ్లిమర్రి మీదుగా కడప– బెంగళూరు రైల్వే లైను నిర్మాణానికి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రణాళిక రూపొందించారన్నారు. రూ.2వేల కోట్ల అంచనా వ్యయంతో 157 కిలో మీటర్ల మేర చేపట్టాల్సిన పనులను వైఎస్సార్ మరణానంతరం అటకెక్కించారన్నారు. అనుమతులున్న పాత ప్రాజెక్టుకు రూ. 2వేల కోట్లు కేటాయిస్తే రైల్వే పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉన్నదన్నారు. కానీ ఆ దిశగా ఆలోచించకుండా కొత్త ప్రాజెక్టు ప్రతిపాదన తీసుకురావడంలోని ఆంతర్యమేమిటన్నారు. పాత ప్రాజెక్టుకు కేటాయించిన వందల కోట్ల నిధులు నిరుపయోగం కావాల్సిందేనా అని ప్రశ్నించారు. ఇలాంటి సందర్భాలలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..చెన్నూరు : శబరిమలకు వెళ్లి వస్తుండగా శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయాల పాలయ్యారు. చెన్నూరుకు చెందిన నలుగురు కేరళ రాష్ట్రం శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డులో వర్షం వల్ల ట్రాక్టర్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వారు నలుగురూ గాయపడ్డారు. వారిని అక్కడి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సునీతకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ముగ్గురికి ప్రాథమిక చికిత్స అందించి, డిశ్చార్జ్ చేశారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. నాకౌట్ దశకు సాఫ్ట్‌బాల్ పోటీలు వీరవాసరం : వీరవాసరం ఎంఆర్కే జడ్పీహెచ్ఎస్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 సాఫ్ట్ బాల్ పోటీలు నాకౌట్ దశకు చేరుకున్నాయని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత తెలిపారు. రెండవ రోజు బాలికల పోటీలో వైఎస్సార్ కడప జట్టు శ్రీకాకుళం జట్టుపై 08:04 తేడాతో గెలుపొందింది. బాలికల క్వార్టర్ ఫైనల్ పోటీలో కడప జట్టు గుంటూరు జట్టుపై విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బాలుర పోటీలో కడప జట్టు కృష్ణా జిల్లా జట్టుపై 01–00 తేడాతో విజయం సాధించింది. బాలుర క్వార్టర్ ఫైనల్ పోటీలో గుంటూరు జట్టు కడప జట్టుపై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.చికిత్స పొందుతున్న మహిళచికిత్స పొందుతున్న బాలుడురోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు -
యువతి అదృశ్యం
ముద్దనూరు : మండలంలోని యామవరం గ్రామానికి చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ రమేష్ సమాచారం మేరకు యామవరానికి చెందిన యువతి ఇంటర్మీడియట్ చదువుతోంది. శుక్రవారం రాత్రి ఆమె ఇంటిలో ఉంది. శనివారం తెల్లవారుజాము నుంచి కనిపించలేదు. చుట్టుపక్కల విచారించినా ఫలితం లేకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. అదనపు కట్నం కోసం వేధింపులపై కేసుముద్దనూరు : భర్తతో పాటు బంధువులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని భార్య ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ మైనుద్దీన్ సమాచారం మేరకు మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన గంగాకృష్ణవేణికి ఓబుళాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తితో సమారు 6నెలల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో 13 తులాల బంగారు కట్నం కింద గణేష్‌కు ఇచ్చారు. అయితే గత కొంత కాలంనుంచి అదనపు కట్నం తేవాలని భర్త గణేష్, అతని బంధువులు తనను వేధిస్తున్నారని గంగాకృష్ణవేణి ఫిర్యాదు చేసింది. దీంతో గణేష్‌తో పాటు మరో నలుగురిపై అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కుక్కల బారినపడి పొడదుప్పి మృతిఅట్లూరు : మండల పరిధిలోని కళావాండ్లపల్లి గ్రామం కుక్కల బారిన పడి పొడదుప్పి మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు శనివారం ఉదయం లంకమల అభయారణ్యం నుంచి కళావాండ్లపల్లి గ్రామం వైపు కొన్ని పొడదుప్పిలు గుంపుగా రావడంతో కుక్కలు వెంబడించాయి. ఓ పొడదుప్పి స్కూల్ ఆవరణలోకి ఎగిరి దూకింది. కుక్కలు దుప్పిని వెంబడించి గాయపరిచాయి. స్థానికులు గుర్తించి ఎస్ఐ నాగకీర్తనకు సమాచారం ఇవ్వడంతో ఆమె సిద్ధవటం ఫారెస్టు రేంజ్ అధికారి కళావతికి సమాచారం ఇచ్చారు. రేంజ్ అధికారి ఆదేశాల మేరకు సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించగా అప్పటికే దుప్పి మృతి చెంది ఉంది. దీంతో పోస్టుమార్టం చేసి అడవిలో ఖననం చేశారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలికడప వైఎస్ఆర్ సర్కిల్ : గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు పోరాటాలు నిర్వహిస్తామని ఏపీ వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ నల్లిపోగు నాగేశం, జేఏసీ స్టేట్ సెక్రటరీ కొమ్మద్ది ఈశ్వరయ్య పేర్కొన్నారు. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలపై ఈనెల 16న సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి వీఆర్ఏల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర తరహాలో వీఆర్ఏలకు పే స్కేలు ఇవ్వాలని, కనీస వేతనం రూ. 26 వేలు బేసిక్ స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా జేఏసీ అధ్యక్షుడు కె.పుల్లయ్య ఉపాధ్యక్షుడు షేక్ బాషా పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థిపై దాడి మదనపల్లె రూరల్ : ఇంటర్ విద్యార్థిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శనివారం రాత్రి మదనపల్లెలో జరిగింది. చిత్తూరుజిల్లా పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురానికి చెందిన రాజబాబు, కళావతి దంపతుల కుమారుడు రెడ్డిప్రసాద్(18) స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం కాలేజీ వదిలిన తర్వాత రెడ్డిప్రసాద్ గ్రామానికి చెందిన విద్యార్థినిని మదనపల్లెకు చెందిన ఓ యువకుడు టీజీంగ్ చేశాడు. ఈ విషయమై రెడ్డిప్రసాద్ అతడిని నిలదీశాడు. దీంతో యువకుడు మరి కొందరితో కలిసి గుంపుగా వచ్చి రెడ్డిప్రసాద్ కోమటివానిచెరువు కట్టపై నడిచి వస్తుండగా, విచక్షణారహితంగా దాడిచేసి కొట్టారు. చంపేస్తామంటూ బెదిరించారు. దాడిలో రెడ్డిప్రసాద్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకోగా గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. టూటౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
● కల్యాణ వైభోగమే..
● కనుల పండువగా శ్రీనివాస కల్యాణం ● మార్మోగిన గోవింద నామస్మరణప్రొద్దుటూరు కల్చరల్ : తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షణలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శనివారం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సప్తశైల వాసుడైన శ్రీనివాసుని కల్యాణం వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా ఆలయం నమూనాతో రూపొందించి రంగురంగుల పూలతో అలంకరించిన కల్యాణ వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన వేదపండితులు దేవతా మూర్తులకు విశేష పూజాకార్యక్రమాలను నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. రుత్వికుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య స్వామివారి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. గోవింద నామ స్మరణలతో ఆ ప్రాంతం మార్మోగింది. 23 కౌంటర్లను ఏర్పాటు చేసి దాదాపు 10 వేల మందిపైగా భక్తులకు అన్నప్రసాద వినియోగం చేశారు. టీటీడీ కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు టంగుటూరు మారుతిప్రసాద్, కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
అటల్ ఆశయం మోదీతో సాధ్యం
కడప (కోటిరెడ్డి సర్కిల్) : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు భారతదేశ దశను మార్చిందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. అటల్–మోదీ సుపరిపాలన యాత్ర కడప నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎర్రముక్కపల్లి కూడలిలో శనివారం కూటమి నేతలు కలిసి వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, సవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. దేశంలో సుపరిపాలనకు వాజ్‌పేయి నాంది పలికారని, ఆయన తీసుకొచ్చిన విధానాలు దేశాభివృద్ధికి మంచి పునాది వేశాయని గుర్తు చేశారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాజ్‌పేయి స్వశక్తితో ఎదిగి దేశానికి నాయకత్వం వహించారన్నారు. ఆయన బాటలోనే ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాన్ని 2047 నాటికి నంబర్ 1గా చేసేందుకు పని చేస్తున్నారన్నారు. అంతకుముందు వినాయక నగర్ నుంచి ఎర్రముక్కపల్లి సర్కిల్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వంగలి శశిభూషణ్‌రెడ్డి, బాలకృష్ణ యాదవ్, నాగోతు రమేష్ నాయుడు, ఆదూరి శాదరమ్మ, వేణువర్ధన్ రెడ్డి, దయాకర్‌రెడ్డి, ప్రవీణ్ నాయుడు, చలపతి, బొమ్మన విజయ్, భాను ప్రకాష్, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, సుంకర శ్రీనివాస్, శ్రీనివాసులరెడ్డి, హరిప్రసాద్, కూటమి నేతలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీని బలీయమైన శక్తిగా మార్చాలి
● రాష్ట్రానికి ఆదర్శంగా కడప పార్లమెంట్‌ను తయారు చేయాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి వెల్లడి కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలీయమైన శక్తిగా తయారు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ అధికారం కోల్పోయినా ప్రజల్లోనే ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి పోరాడే ఏకై క పార్టీ వైఎస్సార్‌సీపీయేనన్నారు. ఎంతో దూరదృష్టితో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో అమ్మేయాలని చూస్తోందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నెల రోజులుగా పోరాటం చేస్తున్నామని, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. లక్ష్యానికి మించి సంతకాలు సేకరించామని, ఈనెల 10వ తేది 4.80 లక్షలకు పైగా సంతకాల పత్రాలు జిల్లా కేంద్రానికి చేరాయన్నారు. 18వ తేదీలోపు అన్ని గ్రామ, మండల, జిల్లా కమిటీలను పూర్తి చేయాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామ స్థాయిలో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వ పాలన జరుగుతుందన్నారు. జగనన్న 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. 7 నియోజకవర్గాల్లో 95 వేల మందితో కమిటీలు కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి మాట్లాడుతూ కడప పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 902 యూనిట్లకు కమిటీలు వేస్తే 95 వేల మంది కమిటీ సభ్యులు తయారవుతారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందితో కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీన అన్ని గ్రామాలు, వార్డులు, డివిజన్లలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందులో ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, స్థానిక సమస్యలపై మూడు తీర్మానాలు చేయాలన్నారు. ఆ రోజు 10 గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభించేలా నియోజకవర్గ సమన్వయకర్తలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ రఘురామిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, మేయర్ పాకా సురేష్ కుమార్, సీఈసీ మెంబర్ ఏ.మల్లికార్జునరెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక కృషి
పదో తరగతి పరీక్షలో ఉత్త మ ఫలితాల సాధనకు ప్ర త్యేక కృషి చేస్తున్నాం. విద్యార్థుల స్టడీ తరువాత నిర్వహించే పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉపాధ్యాయు లందరూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్ర ద్ధ తీసుకుంటున్నారు. మా పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం. – వెంకట సుబ్బారెడ్డి, జెడ్పీ హైస్కూల్, బద్వేల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద రోజుల ప్రణాళిక పకడ్బందీగా అమలు చేస్తున్నాం. తరచూ పాఠశాలలను సందర్శిస్తున్నాం. ఉపాధ్యాయులు విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో పరిశీలిస్తున్నారు. ఉపాధ్యాయులకు మేము తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాం. అందరి సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి -
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 15న భారీ ర్యాలీ
● అదే రోజు సంతకాల పత్రాలు కేంద్ర కార్యాలయానికి తరలింపు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపు కడప కార్పొరేషన్ : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 15వ తేదీన జిల్లా కేంద్రమైన కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష్యానికి మించి 4,80, 201 సంతకాలు సేకరించారని, దీన్ని విజయవంతం చేసిన నియోజకవర్గ ఇన్చార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా సంతకాలు సేకరించిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సంతకాల పత్రాలను 15వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఏడురోడ్ల కూడలి, పాత కలెక్టరేట్ మీదుగా తీసుకెళ్లి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. పండుగ వాతావరణంలో ఈ సంతకాలను పంపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ రఘురామిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్ పాకా సురేష్ కుమార్, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి, సీఈసీ మెంబర్ ఏ.మల్లికార్జునరెడ్డి, ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, యానాదయ్య, డా. సొహైల్, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేదీప్యమానం.. దేవీ వైభవం
● వైభవంగా శ్రీ ఈశ్వరీమాత ఆరాధనోత్సవాలు ● భారీగా తరలి వస్తున్న భక్తులు ● ఘనంగా ఏర్పాట్లు బ్రహ్మంగారిమఠం : దేవీ వైభవం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. బ్రహ్మంగారిమఠంలోని జగన్మాత శ్రీఈశ్వరీదేవి మఠంలో ఆరాధన గురుపూజోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మఠం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో ధగధగలాడుతోంది. ఆలయానికి రంగులతో మెరుగులద్దారు. దేవాలయంతోపాటు పరిసరాలను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. ప్రాంగణంలో శోభాయమానంగా రంగవళ్లులు వేశారు. ఆకట్టుకునేలా ముఖద్వారాన్ని తీర్చిదిద్దారు. వెరసి ఉత్సవాలను పురస్కరించుకుని నూతన శోభ సంతరించుకుంది. కమనీయంగా అశ్వవాహనోత్సవం ఉత్సవాల్లో రెండో రెండో రోజైన శుక్రవారం ఈశ్వరీదేవికి ప్రత్యేక అలంకరణ చేసి, విశేష పూజలు చేపట్టారు. బ్రహ్మంగారిమఠం మండలం నరసన్నపల్లెకు చెందిన శ్రీ అభయ సీతారామా భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన చెక్క భజన భక్తులను అలరించింది. మధ్యాహ్నం కమనీయంగా అశ్వవాహనోత్సవం జరిగింది. అమ్మవారు అశ్వవాహనంపై ఆశీనులై భక్తులను ఆశీర్వదించారు. సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు సంగీత విభావరి ప్రదర్శించారు. రాత్రి హంస వాహనోత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. ఉభయ దాతలుగా బద్వేలు మండలం కుమ్మరకొట్టాలుకు చెందిన గోవిందిన్నె సుబ్బరాయుడు ఆచారి, విజయలక్ష్మి, విజయవాడకు చెందిన గుంటముక్కల ఉమామహేశ్వరరావు, నిర్మల, బ్రహ్మంగారిమఠం మండలం బొగ్గులవారిపల్లెకు చెందిన బొగ్గుల ఈశ్వరనారాయణరెడ్డి, శారదాంబ, గోవిందరెడ్డి, నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన వంక వేణుగోపాల్, సుగుణమ్మ, బ్రహ్మానందరెడ్డి, సునీత దంపతులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి పాదరేణువులు వారు అల్పాహారం పంపిణీ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి ఆశీస్సులతో ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి పర్యవేక్షణలో దేవదాయ శాఖ, మఠం సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు, కాణిపాక వరిసిద్ధి వినాయక దేవాలయం ట్రస్టు బోర్డు డైరెక్టర్ తూర్పునాటి వడ్ల రాజ్యలక్ష్మి, రాష్ట్ర మహిళా కమిటీ గౌరవ అధ్యక్షురాలు తాళబత్తుల వాసవి, అధ్యక్షురాలు అంగల కుదుటి సుశీల, ప్రధాన కార్యదర్శి లక్కోజు సుజాత, బాపట్ల జిల్లా అధ్యక్షురాలు కొలకలూరు భారతీదేవి తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రధాన వేడుక శ్రీఈశ్వరీదేవి 1789లో మార్గశిర బహుళ నవమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. అప్పటి నుంచి ఏటా అమ్మవారి ఆరాధన గురుపూజోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది శనివారం ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఇప్పటికే అధిక సంఖ్యలో చేరుకున్నారు. మహిళా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సమర్పిస్తారు. అనంతరం సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఇందులో మఠాధిపతి దంపతులు పాల్గొంటారు. మధ్యాహ్నం జగన్మాతకు దీక్షా బంధన అలంకరణ ఉంటుంది. రాత్రి సింహవాహన గ్రామోత్సవం, తులాభారం, సహస్ర దీపాలంకరణ తదితర కార్యక్రమాలు ఉంటాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. కోలాటం ఆడుతున్న కళాకారులు హంస వాహనంపై అమ్మవారి ఊరేగింపు -
లైన్ తప్పిన రైల్వే
కడప–బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణం పనులు ఆగిపోయాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో ఈ రైల్వేలైన్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాను సక్రమంగా కేటాయించారు. ఆయన మరణాంతరం పనులు మందగించాయి. గత టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర నిధులు కేటాయించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బడ్జెట్లో ఈ రైల్వేలైన్‌కు రూ.185 కోట్లు కేటాయిందిచి. ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ అధికారంలో ఉంది. నిధుల కేటాయింపు లేకపోవడంతో పనులకు బ్రేక్ పడింది. రైలుమార్గం: కడప–బెంగళూరు దూరం: 257 కి.మీ వ్యయం: రూ.2వేల కోట్లు ప్రారంభం: 2014 రాజంపేట: కడప–బెంగళూరు రైలుమార్గం నిర్మాణానికి నిధుల గ్రహణం పట్టుకుంది. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం వాటా నిధులను విడుదల చేయలేదు. నిధులిస్తే నిర్మాణానికి ముందుకొస్తామన్న అభిప్రాయం రైల్వేమంత్రి అశ్విని వైష్ణవి నుంచి వెలువడినట్లు తెలిసింది. ముచ్చటగా మూడో సారి అధికారంలో కొనసాగుతున్న ఎన్డీఏ పాలనలో ప్రతి బడ్జెట్లో అరకొరనిధులు కేటాయిస్తూ వచ్చింది. దీంతో రైలుమార్గం పనులు ముందుకుసాగలేదన్న అపవాదును కేంద్రం మూటకట్టుకుంది. అందుబాటులోకి ఎప్పుడో.. గతంలో రైల్ నెట్వర్క్ విస్తరణలో భాగంగా కేంద్రరైల్వేశాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఎంపిక చేసిన రైల్వే ప్రాజెక్ట్ జాబితాలోకి కడప–బెంగళూరు రైల్వేలైన్‌ను చేర్చారు. రాష్ట్రంలో ఏడురైల్వే ప్రాజెక్టుల్లో కడప–బెంగళూరు రైల్వేలైన్ ఒకటి కావడం గమనార్హం. రైలుమార్గం నిర్మాణం ప్రారంఽభమై 15 ఏళ్లు అవుతున్న పురోగతి లేదు. అయితే పెండ్లిమర్రి వరకు రైలుమార్గం పూర్తికావడంతో అక్కడి వరకు నంద్యాల–కడప డెమో రైలును కొంతకాలం నడిపించారు. నాలుగుదశల్లో... కడప–బెంగళూరు రైలుమార్గాన్ని నాలుగు దశల్లో నిర్మాణం చేపట్టేలా రైల్వేశాఖ నిర్ణయించింది. మొదటిదశలో రూ.153కోట్ల కేటాయింపులు జరిగాయి. భూసేకరణకు సంబంధించి రూ.89కోట్లలో రూ.20కోట్లు వ్యయం చేసింది. కడప నుంచి గంగనపల్లె, పెండ్లిమర్రి వరకు నిర్మాణం చేపట్టారు. 311.84 ఎకరాల భూమిని సేకరించారు. 54 చిన్నబ్రిడ్జిలు, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. 199.2కోట్లు భూసేకరణ కోసం వ్యయంచేశారు. ముందుకుసాగని పనులు: రెండో దశలో పెండ్లిమర్రి–రాయచోటి, రాయచోటి టు ఊయ్యలపాడు (చిత్తూరు), మూడో దశలో మదనపల్లెరోడ్డు టు మదగట్ట (ఆంధ్రప్రదేశ్సరిహద్దు) మదగట్ట టు ముల్భాగల్ (కర్ణాటకరాష్ట్ర సరిహద్దు) నాలుగదశలో ముల్బాగల్ టు కోలార్ వరకు నిర్మాణం చేపట్టేలా కడప–బెంగళూరు రైల్వేలైన్ రూపుదిద్దుకుంది. అయితే పనులు ముందుకు సాగడం లేదు. నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం రాష్ట్రం వాటా మాట తుస్సు నిధులిస్తేనే లైన్ నిర్మాణానికికేంద్రం మొగ్గు ముందుకుసాగని పనులు త్వరితగతిన పూర్తి చేయాలి కడప–బెంగళూరు రైలుమార్గం పూర్తయితే ఉభయవైఎస్సార్జిల్లా వాసులకు కర్ణాటకతో కనెక్టివిటీ పెరుగుతుంది. అంతేగాకుండా అన్నమయ్య జిల్లాకేంద్రం రాయచోటికి రైలు వచ్చినట్లవుతుంది. బడ్జెట్లో అధికనిధులు కేటాయించి త్వరతిగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ సర్కారుపై ఉంది. –మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడుకడప–బెంగళూరు మధ్య రైలు నిర్మాణానికి 2010 సెప్టెంబరులో అప్పటి రైల్వేశాఖ మంత్రి మునియప్ప శ్రీకారం చుట్టారు. దీనికి 2008–2009 బడ్జెట్లో ఆమోదం లభించింది. రూ.1000కోట్ల అంచనా వ్యయంతో రైలుమార్గం నిర్మాణపనులు కదిలాయి. 258కిలోమీటర్ల మేర నిర్మాణానికి 1, 531 భూసేకరణతో ఐదేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే పనుల్లో కదలికలేదు. భూసేకరణకు రూ.199.2కోట్లు కేటాయించారు. -
వ్యక్తిగత కక్షతోనే ఆ ఫ్లెక్సీ వేశారు
● ఏడీపీ సర్వే ద్వారా ఇష్టం వచ్చినట్లు పన్నులు పెంచారు ● అందులో భాగంగానే మా ఇంటి పన్ను కూడా పెరిగింది ● దీనిపై రివిజన్ పిటిషన్ వేసినా... ఫైనల్ డిమాండ్ నోటీసు ఇవ్వలేదు ● అందుకే పన్ను చెల్లించలేదు ● నూతన మేయర్ పాకా సురేష్ కుమార్ వెల్లడి కడప కార్పొరేషన్ : తనపై ఉన్న వ్యక్తిగత కక్షతో, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఫ్లెక్సీలు వేశారని నూతన మేయర్ పాకా సురేష్ కుమార్ అన్నారు. శుక్రవారం కార్పొరేన్ కార్యాలయంలోని తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు కూడా కాకమునుపే కొందరు సర్కిళ్లలో ఫ్లెక్సీలు వేయడం దారుణమన్నారు. తానంటే గిట్టనివారు వారి ఆక్రోషాన్ని ఎలా చూపాలో తెలియక ఈ విధంగా వెళ్లగక్కారన్నారు. ఇంటి పన్ను అనేది ఎప్పటికై నా కట్టాల్సిందేనని, దాన్ని ఎవరూ మాఫీ చేయలేరన్నారు. ఇప్పుడు కట్టకపోతే ఎన్ని సంవత్సరాలకై నా వడ్డీతో సహా చెల్లించక తప్పదన్నారు. తన తల్లి పేరుతో ఉన్న ఆ ఇంటికి గతంలో రూ.12229 పన్ను వస్తుండగా, ఏడీపీ సర్వేలో భాగంగా దాన్ని పదింతలు పెంచారన్నారు. ఇలా తనకు మాత్రమే జరగలేదని, కడప నగరంలోని 20 వేల మందికి ఈ సర్వే ద్వారా పన్నులు పెంచారన్నారు. జీహెచ్ఎంసీ యాక్టు ప్రకారం ఇంటి యజమానులకు నోటీసు ఇచ్చిన తర్వాతే పన్ను పెంచాలని స్పష్టంగా ఉందన్నారు. సర్వే పేరిట అసంబద్ధంగా పెంచిన పన్నులను వైఎస్సార్సీపీ కార్పొరేటర్లమంతా తీవ్రంగా వ్యతిరేకించామని గుర్తు చేశారు. పలు సర్వసభ్య సమావేశాల్లో ప్రజలందరి తరఫున తాము ఈ అంశాన్ని లేవనెత్తి పోరాటం చేస్తే, చివరకు ఏడీపీ సర్వేను నిలిపేశామని అధికారులు చెప్పారన్నారు. ప్లాన్ తీసుకొని ఇల్లు నిర్మించినప్పటికీ, లేనట్లుగా చూపి చాలా మందికి 100 శాతం ఫెనాల్టీ విధించారన్నారు. తమ ఇంటికి పెరిగిన పన్నుపై రివిజన్ పిటిషన్ సమర్పించామని, అధికారులు దానిపై విచారణ చేసి ఇప్పటికీ ఫైనల్ డిమాండ్ నోటీసు ఇవ్వనందునే పన్ను కట్టలేదని వివరించారు. కార్పొరేషన్ పరిధిలో ఇంకా 976 రివిజన్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఊరు, పేరు లేకుండా వేసే ఫ్లెక్సీలను ముద్రించవద్దని ప్రింటర్ల యజమానులకు సూచించారు. కార్పొరేషన్ అనుమతి పొందిన తర్వాతే ఫ్లెక్సీలు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తామన్నారు. సాదారణ కుటుంబం నుంచి వచ్చిన అత్యున్నతమైన మేయర్ పదవి అధిరోహించాననే అక్కసుతో ఇలా చేసినట్లు కనిపిస్తోందని, ఫ్లెక్సీలు వేసి సమయం వృథా చేసుకోవద్దని, నగరాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి వీలైతే సలహాలు ఇవ్వాలని కోరారు. -
ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు
కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన డీఐజీ కోయప్రవీణ్ ప్రొద్దుటూరు క్రైం: కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో ప్రజలు మరింత మెరుగైన పోలీసు సేవలు పొందుతారని కర్నూల్ డీఐజీ కోయప్రవీణ్ తెలిపారు. ప్రొద్దుటూరులోని టూ టౌన్ పోలీస్‌స్టేషన్ కాంపౌండ్‌లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను శుక్రవారం డీఐజీ పునఃప్రారంభించారు. గతంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో చాలా వరకు సీసీ కెమెరాలతో పాటు ఇతర విభాగాలు పని చేయలేదు. పట్టణంలోని ప్రధాన సర్కిళ్లలో కూడా సీసీ కెమెరాలు లేవు. బ్లూ కోల్ట్స్ సిబ్బంది మాత్రమే పట్టణంలో బైక్‌లతో గస్తీ నిర్వహించేవారు. దీంతో డీఎస్పీ భావన, సీఐ సదాశివయ్యల ప్రత్యేక చొరవతో దాతల సహకారంతో కొత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే 8 బ్లూకోల్ట్స్ కొత్త బైక్‌లను సమకూర్చారు. వీటిని డీఐజీ చేతుల మీదుగా ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ కోసం కృషి చేసిన టూ టౌన్ సీఐ, సిబ్బందికి డీఐజీ ప్రశంసా పత్రాలను అందచేశారు. సహకరించిన దాతలను డీఐజీ సన్మానం చేశారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ రాయలసీమలోనే ప్రొద్దుటూరు వాణిజ్య కేంద్రమని చెప్పారు. అలాంటి పట్టణంలో మెరుగైన, సురక్షితమైన పోలీసు సేవలు అందించాలనే ఉద్దేశంతో దాతల సహకారంతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మరింత అభివృద్ధి చేసి ప్రారంభించామని తెలిపారు. కొత్తగా 123 సీసీ కెమెరాలు, వీడియోవాల్, ఆటోమేటిక్ నంబర్‌ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలు, జీపీఎస్‌తో అనుసంధానం చేసిన 8 బ్లూకోల్ట్ బైక్‌లు, ఎల్‌హెచ్‌ఎంఎస్ కెమెరాలను నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, అడిషనల్ ఎస్పీ ప్రకాష్‌బాబు, ప్రొద్దుటూరు డీఎస్పీ భావన, సీఐలు సదాశివయ్య, నాగభూషణం, రాజగోపాల్, వేణుగోపాల్ ఎస్ఐలు రాఘవేంద్రారెడ్డి, సంజీవరెడ్డి, భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. -
రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం
పులివెందుల : రాబోయే రోజుల్లో జరిగే అన్ని ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పులివెందులలోని తన నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ గురువారం జరిగిన కడప మేయర్, ముద్దనూరు మండలం ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ రెండు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని ప్రలోభాలు, భయభ్రాంతులకు గురి చేసినా వైఎస్ఆర్సీపీ నాయకులు గట్టిగా న్యాయం వైపు నిలబడడం జరిగిందన్నారు. వారు చేసిన మేలును గుర్తుపెట్టుకుని పార్టీ వారికి తగిన విధంగా అన్ని రకాలుగా మేలు చేయడం జరుగుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు సాధించడం జరిగిందన్నారు. అనంతరం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యల పరష్కారానికి చర్యలు తీసుకున్నారు. యాత్రికుల మరణం బాధాకరం అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యాత్రికులు మరణించడం బాధాకరమని వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. యాత్రికుల మరణం తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించి వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. జీతాలు ఇప్పించండి పులివెందుల రాణి తోపులో పని చేస్తున్న కార్మికులు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కలిశారు. తమకు కొద్ది నెలలుగా జీతాలు అందలేదని, దీంతో కుటుంబ పోషణ భారమైందని వారు ఎంపీతో వాపోయారు. దీనికి ఎంపీ వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ వారి జీతాలు సీడీఎంఏ ద్వారా మున్సిపాలిటీకి బదలాయించి పది రోజుల లోపు చెల్లిస్తామని ఎంపీకి వివరించారు. ఎంపీకి సన్మానం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఇటీవల వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో సంయుక్త కార్యదర్శిగా ఎన్నికై న కొంగనపల్లి విజయ్, ఇతర నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా తనకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తానని ఎంపీకి తెలిపారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి -
వేతనాల పెంపుకోసం అంగన్వాడీల ధర్నా
కడప సెవెన్‌రోడ్స్ : తమకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వందలాదిగా తరలివచ్చారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా, సీఐటీయూ జిల్లా కార్యదర్శి మనోహర్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శులు మంజుల, లక్ష్మిదేవిలు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరారు. హెల్పర్ల పదోన్నతులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. అన్ని యాప్‌లు కలిపి ఒక యాప్‌గా మార్చాలని, సె ంటర్ నిర్వహణకు 5జీ ఫోన్లు ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని కోరారు. గ్రాట్యూటీ అమలుకు మార్గదర్శకాలు రూపొందించాలని, వేతనంతోకూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ప్రీ స్కూలు బలోపేతం చేయాలని, పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి (35) మృతదేహం వుంది. అతను ఈనెల 10వ తేదీన తీవ్ర అనారోగ్యంతో కడపలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల కోసం చేరాడు. చికిత్స పొందుతూ ఈనెల 11న మృతి చెందడంతో మృతదేహాన్ని మార్చురీలో వుంచారు. తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ఆస్పత్రి సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి మెయిన్ గేట్ ఎదురుగా చనిపోయిన అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అతను ఉదయం నుంచి ఆస్పత్రి పరిసరాల్లోనే ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా ఉంటే ఔట్‌పోస్టులో సంప్రదించాలని ఔట్‌పోస్టు ఇన్చార్జి షబ్బీర్‌బాషా తెలిపారు. కాలువలో పడి వ్యక్తి మృతి కలసపాడు : కలసపాడులోని పోరుమామిళ్ళ– గిద్దలూరు రోడ్డు కలసపాడు ఆర్సీఎం చర్చి వద్ద ఉన్న తెలుగుగంగ డిస్ట్రిబ్యూటరీ కాలువలో కలసపాడుకు చెందిన షేక్దస్తగిరి (63) మద్యం మ త్తులో పడి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉ న్నాయి. కలసపాడుకు చెందిన దస్తగిరి తన భా ర్య 10 సంవత్సరాల క్రితం మృతి చెందడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కు మారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈయన కలసపాడులోని ఆంజనేయస్వామి ఆలయంలో ఉంటుండే వాడు. ఇటీవల ఆర్సీఎం చర్చి వద్ద ఓ ఇంటిని బాడుగకు తీసుకుని ఉంటున్నాడు. ఈయన గతంలో హమాలీ పని చేసేవాడు. వయసు పైబ డటంతో పని చేయలేక ఒంటరిగా ఉంటున్నాడు. శుక్రవారం కాలువలో దస్తగిరి మృతదేహాన్ని స్థా నికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. ఎస్ఐ సు భాన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతు డి కుమార్తె షేక్మాబున్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడి ఆత్మహత్య కొండాపురం : మండల పరిధి కె.సుగుమంచిపల్లె పునరావాస కేంద్రంలోని సీ బ్లాక్‌లో బుక్కుపట్నం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు కడపు నొప్పి తాళ లేక విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లనాగన్న గారి సుబ్బరాయుడు(67) గురువారం రాత్రి కడపు ఆత్మహత్యకు ప్రయత్నించడంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డి.అనిల్‌కుమార్ తెలిపారు. ప్రొద్దుటూరు కల్చరల్ : బెంగాల్ ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేందర మోదీ వందేమాతరం గేయాన్ని వివాదాస్పదం చేయడం విచారకరమని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. సీపీఐ పార్టీ శత వార్షికోత్సవాల్లో భాగంగా ‘వర్తమాన రాజకీయాలు – కమ్యూనిస్టుల కర్తవ్యం’ అన్న అంశంపై ప్రొద్దుటూరులో ఓ ఫంక్షన్ హాల్లో సదస్సు నిర్వహించారు. మొదట పార్టీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సదస్సులో ఈశ్వరయ్య మాట్లాడుతూ కేరళలో ఎన్నికలు జరిగితే అయ్యప్పస్వామిని, కర్ణాటకలో జరిగితే హిజాబ్ అంశాలను తెరపైకి తెచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మోదీ ప్రయత్నించారని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సి.కాసీం మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సమానత్వం, సమాన హక్కుల కోసం పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదే అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాథరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యుడు రామయ్య, పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు, మద్దిలేటి, హరి, పల్లవోలు రమణ, ఇమాన్యుయేల్, బాదుల్లా, గంగా సురేష్, పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది
● నిజాయితీగా వ్యవహరించిన అధికారులకు అభినందనలు ● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిప్రొద్దుటూరు : జిల్లాలో జరిగిన కడప కార్పొరేషన్, ముద్దనూరు ఎంపీపీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని, వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఉన్న ప్రేమ, అభిమానాలతో ఏ ఒక్కరూ ప్రలోభాలకు లొంగలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఎస్పీతోపాటు పోలీసు సిబ్బంది, జేసీ అదితి సింగ్‌తోపాటు రెవెన్యూ అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారని తెలిపారు. ఈ కారణంగానే టీడీపీ నేతల అంచనాలు తలకిందులయ్యాయన్నారు. కడప కార్పొరేషన్ మేయర్‌గా ఉన్న కె.సురేష్‌బాబును, ముద్దనూరు ఎంపీపీగా ఉన్న ప్రదీప్కుమార్రెడ్డిలను సాంకేతిక కారణాలు చూపి తొలగించారన్నారు. కేవలం కూటమి నేతల కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేశారని విమర్శించారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి నాయకత్వంలో 39 మంది కార్పొరేటర్లు కలసి పాకా సురేష్‌ను మేయర్‌గా ఎన్నుకున్నారన్నారు. గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికల్లో ఒక రోజు అధికారులు సహకరించారన్నారు. నిజాయితీగా ఎన్నికలు జరిపినందుకు అధికారులకు రాచమల్లు అభినందనలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు ఇలాగే వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం మరింత ద్విగిణీకృతం అవుతుందన్నారు. రూ.50 లక్షలు ఆఫర్ చేశారు ముద్దనూరు ఎంపీపీ ఎన్నికల్లో ఒక్కొక్క ఎంపీటీసీకి కూటమి నేతలు రూ.50 లక్షలు ఆఫర్ చేశారని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. మొత్తం 9 మంది ఎంపీటీసీల్లో కూటమి పార్టీకి ఒక ఎంపీటీసీ మాత్రమే ఉండగా తర్వాత ఆ సంఖ్యను మూడుకు పెంచుకున్నారన్నారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు ఎంపీటీసీలను లాగడానికి కూటమి నేతలు శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు గుర్రం లావణ్య, రాగుల శాంతి, నూకా నాగేంద్రారెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షురాలు గజ్జల కళావతి, నాయకులు చౌడం రవీంద్ర, ఎద్దుల రాయపురెడ్డి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలకు ఎంపిక
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక రామేశ్వరంలోని ఎస్‌పీసీఎన్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి యంజర్ల ప్రణీత్‌రెడ్డి రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలకు ఎంపికయ్యాడు. జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జమ్మలమడుగు, కడప, రాజంపేట డివిజన్ల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు కడప సైన్స్ సెంటర్లో గురువారం ఎనర్జీ కన్సర్వేషన్ (ఇంధన పరిరక్షణ)పై క్విజ్ పోటీ నిర్వహించారు. ప్రణీత్ రెడ్డి 60 మార్కులకు 58 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కడప ఉపవిద్యాశాఖాధికారి రాజగోపాల్‌రెడ్డి చేతుల మీదుగా ప్రణీత్‌రెడ్డి ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు. ఈనెల 16న జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించే రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలో అతను పాల్గొననున్నాడు. ఈ విద్యార్థిని ప్రధానోపాధ్యాయుడు సత్యబాబు, ఉపాధ్యాయులు అభినందించారు. -
నీటి భద్రతతోనే దేశ భవిష్యత్తు
కడప సెవెన్‌రోడ్స్: నీటి భద్రతతోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఇందుకు జిల్లాలో సమర్థ వంతమైన నీటి భద్రత, సంరక్షణ, నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం ఢిల్లీ లో ఐఐటి ఢిల్లీ, నీతి ఆయోగ్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ లో జిల్లా రివర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఫ్రేమ్‌వర్క్ కింద జిల్లా స్థాయి నీటి నిర్వహణపై ప్యానలిస్ట్‌గా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సదస్సులో మాట్లాడుతూ జిల్లాలో దీర్ఘకాలిక నీటి భద్రత కోసం నాలుగు పద్ధతులను వివరించారు. వర్షపు నీటిని సంరక్షించడం, నదుల ప్రవాహ నిర్వహణను మెరుగుపరచడం, భూగర్భజలాల నీటి మట్టాన్ని పెంచడం, ప్రణాళిక బద్ధంగా జలాశయాల నీటి నిర్వహణ, సమర్థవంతమైన నదీ పరీవాహక నిర్వహణ కోసం పంటలు పర్యావరణ వ్యవస్థ లకు తేమ నిలుపుదల శాతాన్ని పెంచడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో నీటిపారుదల, తాగునీరు, ఆరోగ్యం మరియు పర్యావరణ నిర్వహణలోని అంతరాల నిర్మూలన, వికేంద్రీకృత మురుగునీటి శుద్ధి వ్యవస్థ, చిత్తడి నేలల పునరుద్ధరణ, చెక్–డ్యామ్‌లు, బిందు సేద్యం మరియు ఖచ్చితమైన వ్యవసాయ పద్ధతులు మరియు భూగర్భ జలాల పునరుద్ధరణ వంటి అంశాల అమలు, వ్యవసాయం లో సమర్థవంతమైన నీటి వినియోగం వంటి కేంద్రీకత మార్గాల ద్వారా పరిష్కరించ వచ్చునని వివరించారు. నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, అడవులు మరియు పట్టణ స్థానిక సంస్థలలో శాఖా పరంగా బలోపేతం చేయడం, సమర్థవంతమైన వినియోగంపై నీటి నిర్వహణ ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇది సాధ్యమవ్వడానికి ఒక డిస్ట్రిక్ట్ వాటర్ గవర్నెన్స్ కమిటీని మరియు డిస్ట్రిక్ట్ పిఎమ్యు(ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్)ని ఏర్పాటు చేయాలని ఈ సదస్సులో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రతిపాదించారు. ఈ ఇంటిగ్రేటెడ్ ఫోర్ వాటర్ విధానం జిల్లాల లో సమర్థ వంతంగా అమలు ద్వారా సంపూర్ణ, సుస్థిరాభివృద్ధి ఆధారిత నీటి నిర్వహణ కు మార్గదర్శకంగా నిలుస్తుందని వివరించారు. జిల్లాలో సమర్థవంతమైన నీటి భద్రతకు ప్రణాళికలు ఢిల్లీ లో 10వ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్లోకలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వైఎస్సార్సీపీని బలపరిచారు
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు/ముద్దనూరు: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ముద్దనూరు నాయకులు తమకు బలం లేకున్నా ముద్దనూరు ఎంపీపీని కై వసం చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేసినా అవి లెక్కచేయకుండా వైఎస్సార్సీపీ పార్టీనే బలపరచారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక పూర్తి అయిన తర్వాత నూతన ఎంపీపీగా ఎంపికై న కొర్రపాడు ఎంపీటీసీ వెన్నపూస పుష్పలతతోపాటు ఎంపీటీసీలందరినీ ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విజయం వైఎస్సార్సీపీకి మరింత బలం చేకూర్చుతుందని తెలిపారు. ● ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ కూట మి నాయకులు మెజార్టీలేకపోయినా తమ ఎంపీటీసీలను లాగే ప్రయత్నం చేశారని.. ఎంపీటీసీల ఇండ్ల వద్దకు వెళ్లి డబ్బులు ఆశ చూపారని.. అయితే వైఎస్ కుటుంబంపై ఉన్న విశ్వాసంతో ఎవరూ పార్టీని వదలలేదన్నారు. దీంతో కూటమి నాయకుల ప్రలోభాలు ఫలించలేదన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహుమతిగా ఇస్తామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా.. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ముందస్తు ప్రణాళికలతో ఎంపీటీసీలను ప్రత్యేక వాహనంలో ముద్దనూరు ఎంపీడీఓ కార్యా లయానికి తీసుకునివచ్చారు. ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవంతో కార్యకర్తలలో ఉత్సాహం నెలకొంది. పుష్పలత -
నిర్ణీత సమయానికే విమానాలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఈనెల మొదటి వారంలో జరిగిన ఇండిగో సంక్షోభం తర్వాత కడప విమానాశ్రయంలో ప్రస్తుతం విమానాల రాకపోకలు సాధారణంగా సాగుతున్నాయని కడప విమానాశ్రయం డైరెక్టర్ సుజిత్‌కుమార్ పొదార్ తెలిపారు. గురువారం కడప విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సగటున ప్రతిరోజు 200 మంది ప్రయాణికులు కడప విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఈనెల 4వ తేదీ విమానాల రాకపోకల్లో రెండు గంటలకు పైగా ఆలస్యం జరిగిందని, అయితే డిసెంబరు 5వ తేదీ మినహా కడప విమానాశ్రయంలో ఎలాంటి విమానాల రద్దు జరగలేదన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఇండిగో సంస్థ ముందుగానే సమాచారం అందించిందని, అయితే ప్రస్తుతం కడప విమానాశ్రయంలో ప్రయాణికులకు సంబంధించి డెలివరీ చేయాల్సిన బ్యాగులు పెండింగ్‌లో లేవన్నారు. ప్రస్తుతం ఇండిగో హైదరాబాదుకు ప్రతిరోజు, చైన్నె, విజయవాడలకు రోజుమార్చి రోజు విమానాలను నడుపుతోందన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం మే ఐ హెల్ప్‌యూ డెస్క్ కూడా త్వరలో ప్రారంభించనున్నామన్నారు. కడప విమానాశ్రయంలో 2023 నుంచి నైట్ ల్యాండింగ్ విమానాలు దిగే సౌకర్యం ఉందన్నారు. ఎయిర్‌బస్, ఏ320 వంటి పెద్దవిమానాలకు అనుకూలంగా ఉండేలా 2022లో రన్‌వేను 2515 మీటర్లకు విస్తరించారన్నారు. కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇవి మార్చి, ఏప్రిల్–2026 నాటికి పూర్తవుతాయన్నారు. కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక కడప విమానాశ్రయం ఒకేసారి ఏడు ఎయిర్‌బస్సు, ఏ320 విమానాలను హ్యాండిల్ చేయగలదన్నారు. కారు పార్కింగ్ ప్రాంతంలో 375 కార్లు, 100 స్టాఫ్ కార్లను పార్కింగ్ చేసే సామర్థ్యం ఉంటుందన్నారు. అలాగే ఫ్లైట్ ట్రైనింగ్ స్కూలు త్వరలో ప్రారంభం కానుందని, ఇది కడప యువతకు భవిష్యత్తులో పైలెట్లుగా మారేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాసో (ఎస్ఎఫ్ఎస్) కె.ఆర్ముగం, ఆపరేషన్ మేనేజర్ (ఏఏ1) దామోదర్, ప్రొటోకాల్ ఆఫీసర్ షీరిన్ తదితరులు పాల్గొన్నారు. కడప విమానాశ్రయం డైరెక్టర్ సుజిత్‌కుమార్ పొదార్ -
లింగాపురం సొసైటీ స్థలంపై వివాదం
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని లింగాపురం గ్రామంలో ఉన్న ఆంధ్రప్రగతి రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్‌కు సంబంధించిన స్థలంపై వివాదం నెలకొంది. మూలవారిపల్లె గ్రామానికి చెందిన ఎస్సీ ప్రజలు సొసైటీ స్థలంలో తమకు శ్మశానానికి రస్తా కావాలని గత ఆరు నెలలుగా డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. అయితే సొసైటీ అధికారులు తమ సొసైటీకి సంబంధించిన స్థలం నుంచి రహదారి హక్కులు లేవని చెబుతుండగా గురువారం ఇటు ప్రజలు, అటు సొసైటీ అధికారుల అర్జీల మేరకు తహసీల్దార్ గంగయ్య, మండల సర్వేయర్ వెంకటలక్ష్మిలు వచ్చి సొసైటీ స్థలాన్ని పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించారు. సర్వే నంబర్ 80/1ఏలో సొసైటీకి 51 సెంట్లు స్థలం ఉన్నట్లు తహసీల్దార్ నిర్ధారించారు. అక్కడి ఎస్సీ ప్రజలు సొసైటీకి అంత స్థలం లేదని, ఇందులో ఎన్నో ఏళ్లుగా తామంతా శ్మశానానికి రహదారిగా వినియోగించుకుని వెళుతున్నామని వాగ్వాదం చేశారు. సొసైటీ స్థలానికి ప్రహరీని నిర్మిస్తే తమకు రాకపోకలు ఇబ్బందని, నిర్మాణాలను అడ్డుకుంటామని ప్రజలు అధికారులతో వాదనకు దిగారు. సొసైటీ స్థలంలో ప్రహరీ కట్టుకునే హక్కు సొసైటీ అధికారులకు ఉందని, ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా వాడుకుంటే దానికి హక్కు రాదని ప్రజలకు తహసీల్దార్ తెలిపారు. శ్మశానానికి ముందు ఉన్న రహదారిని వినియోగించుకోవచ్చని ఎవరైనా అభ్యంతరం తెలిపితే తనకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ రాజశేఖర్, చైర్మన్ సిద్ధారెడ్డిగారి నాగమునిరెడ్డి, వీఆర్ఓ రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాగ్రహానికి నిదర్శనం ‘కోటి సంతకాలు’
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారనేందుకు కోటి సంతకాలే నిదర్శనమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీపీపీ పేరు చెప్పి మెడికల్ కాలేజీలను అమ్మేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎకరా లీజు రూ.99లకు 60 ఏళ్లు అంటే అమ్మేయడం కాక మరేమిటని ప్రశ్నించారు. కరోనాలో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, అలాంటి పరిస్థితి మళ్లీ ఉత్పన్నం కాకూడదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి 7 కాలేజీలను పూర్తి చేసి, అడ్మిషన్లు కూడా తీసుకున్నారన్నారు. ఆ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయుటకు నాబార్డు ద్వారా రూ.8500కోట్లు రుణం కూడా మంజూరు చేయించారన్నారు. పాడేరు, పులివెందుల కాలేజీలకు ఎన్ఎంసీ మెడికల్ సీట్లు ఇస్తే, ప్రభుత్వం పులివెందుల కాలేజీకి ఇచ్చిన సీట్లను వద్దని చెప్పడం దుర్మార్గమన్నారు. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టిందని, ప్రజలందరినీ ఇందులో భాగస్వాములను చేసి ప్రైవేటీకరణ వల్ల కలిగే అనర్థాలను వివరించి వారి సంతకాలు సేకరించడం జరిగిందన్నారు. నెల రోజుల పాటు జరిగిన ఈ మహోద్యమంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 4,80,101 సంతకాలు సేకరించామన్నారు. సంతకాల సేకరణలో కష్టపడిన నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంతకాలను ఈనెల 15న కేంద్ర కార్యాలయానికి తరలించి, ఈనెల 18న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ముఖ్య నేతల ద్వారా గవర్నర్‌కు అందజేస్తామన్నారు. ● కడప మేయర్, ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక ద్వారా లబ్ధిపొందాలని అధికార టీడీపీ ప్రయత్నించిందని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల వల్ల వైఎస్సార్సీపీలో వైషమ్యాలు వస్తాయని వారు భావించారని, కానీ వారి పాచిక పారలేదన్నారు. కడప మేయర్ పదవికి మూడు నెలలు, ముద్దనూరు ఎంపీపీ పదవికి ఐదు నెలలు మాత్ర మే గడువు ఉందన్నారు. తమ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు ప్రలోభాలకు తలొగ్గకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద ఉన్న అభిమానంతో వైఎస్సార్సీపీ వెంట ఉండటం గర్వంగా ఉందన్నారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మేయర్‌గా ఎన్నికై న పాకా సురేష్‌కు, ముద్దనూరు ఎంపీపీ పుష్పలతకు అభినందనలు తెలిపారు. ● వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులు, రౌడీలు, గూండాలను ఉపయోగించి అధికార పార్టీ గెలుచుకుందన్నారు. ఇప్పుడు జరిగిన మేయర్, ఎంపీపీ ఎన్నికల ఫలితాలు టీడీపీకి చెంపపెట్టు అన్నారు. ఈ జిల్లా వైఎస్సార్సీపీకి కంచుకోట అని ఎవరూ దీన్ని బద్దలు కొట్టలేరన్నారు. ఈ సమావేశంలో మేయర్ పాకా సురేష్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, కార్పొరేటర్ బాలస్వామిరెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, ఫయాజ్ పాల్గొన్నారు. పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు ఈనెల 18న ఈ సంతకాలను గవర్నర్‌కు అందించనున్న వైఎస్ జగన్ మేయర్, ఎంపీపీ ఎన్నిక ద్వారా టీడీపీ లబ్ధి పొందాలని ప్రయత్నించింది వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి -
ఈశ్వరీదేవి మఠం.. ఉత్సవ శోభితం
కలశోత్సవం నిర్వహిస్తున్న మహిళా భక్తులు విద్యుత్ దీప కాంతులీనుతున్న ఈశ్వరీదేవి మఠం బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలోని శ్రీ ఈశ్వరీదేవిమఠం ఉత్సవ శోభను సంతరించుకుంది. విద్యుత్ దీప కాంతులతో ధగధగలాడుతోంది. భక్తజన సందడితో కళకళలాడుతోంది. అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రభాత సేవ, పంచామృతాభిషేకం, కుంకుమార్చన తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జగన్మాత శ్రీ ఈశ్వరీదేవిని ప్రత్యేకంగా అలంకరించారు. మధ్యాహ్నం నివేదన, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం చేపట్టారు. సాయంత్రం సూక్తపారాయణం, అభిషేషకం, కుంకుమార్చన చేశారు. రాత్రి కలశోత్సవం, నైవేద్యం, కలశస్థాపన తదితర కార్యక్రమాలను కమనీయంగా నిర్వహించారు. ఉభయదాతలుగా గుంటూరుకు చెందిన కోడూరు శివరామ శాస్త్రి, కోడూరు ఫణీంద్ర వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి ఆధ్వర్యంలో ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి పర్యవేక్షణలో దేవదాయ శాఖ, మఠం సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ముత్తలూరు ఆంజనేయశర్మ, రఘువు వెంకటసుబ్రమణ్యాచార్యులు, అమ్మవారి శిష్యులు తదితరులు పాల్గొన్నారు. -
మృతుడి గుర్తింపు
ఎర్రగుంట్ల : ఇటీవల కాలంలో ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ పరిధిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న మృతుల వివరాలతో స్టేషన్ ఆవరణంలోని జీఆర్పీ స్టేషన్ వద్ద సూచిక బోర్డును ఏర్పాటు చేసినట్లు ఎర్రగుంట్ల రైల్వే ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం బోర్డులో ఉన్న తండ్రి ఫొటో చూసి గుర్తించి మృతుడి కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులను సంప్రదించారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెల 8వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. సూచిక బోర్డును చూసి ఏప్రిల్ 8వ తేదీన మృతి చెందిన వ్యక్తి అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉంటున్న హాజీపీరా కుమారుడు షేక్ మహబూబ్ బాషాగా కుటుంబ సభ్యులు గుర్తించారన్నారు. మృతుడు మహబూబ్ బాషా ఆరోగ్య సమస్యల కారణంగా మృతి చెందాడని మృతుడి భార్య , కుమారులు వాంగ్మూలం ఇచ్చారని ఎస్ఐ తెలిపారు. కారు ఢీకొని యువకుడి మృతి చిన్నమండెం : ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసుల కథనం మేరకు.. చిన్నమండెంకు చెందిన పఠాన్ సాహుల్ (22), పఠాన్ రిజ్వాల్(16)లు తమ సొంత పనుల నిమిత్తం బుధవారం రాత్రి రాయచోటికి వచ్చారు. మదనపల్లి బైపాస్ వద్దకు రాగానే వారి ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పఠాన్ సాహుల్ మృతి చెందగా తీవ్రంగా గాయపడిన పఠాన్ రిజ్వాల్ను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. చేతికి అంది వచ్చిన కొడుకులకు ఇలా జరగడంపై రెండు కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బొలెరో వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలు కలకడ : ఆగి ఉన్న ద్విచక్రవాహనాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం ఉదయం కలకడ మండలం, బాలయ్యగారిపల్లె పంచాయతీ బావికానివడ్డిపల్లెకు చెందిన అంజి తన ద్విచక్రవాహనంలో సంబేపల్లె మండలం, మోటకట్ల ముదినేనిపల్లెకు చెందిన సి.రమణతో కలిసి బాకివానివడ్డిపల్లెకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బాకివానివడ్డిపల్లె సమీపంలో ద్విచక్రవాహనంపై నిలబడి ఉండగా బాలయ్యగారిపల్లె నుంచి అతివేగంగా వచ్చిన బొలెరో పికప్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన అంజి, రమణలను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
విద్యుత్ చట్టం సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం
కడప కార్పొరేషన్ : విద్యుత్ సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సవరణల పేరుతో ఈ ఏడాది అక్టోబర్ 9న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు బి. రామలింగారెడ్డి అన్నారు. గురువారం విశ్వేశ్వరయ్య భవన్లో యూనియన్ జిల్లా అధ్యక్షుడు యు. లక్ష్మినారాయణ అధ్యక్షతన జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ 57 పేజీల ముసాయిదా బిల్లులో డిస్కంలను పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించేందుకు పథక రచన చేశారన్నారు. జిల్లా నాయకుడు ఎం. బాలకాశి మాట్లాడుతూ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్–ఔట్ సోర్సింగ్ కార్మికులకు డిస్కంల ద్వారానే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ. శివయ్య, ఎనర్జీ అసిస్టెంట్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె. మల్లికార్జున్ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో డిస్కం అధ్యక్షుడు పి. సురేష్ బాబు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎల్. నాగసుబ్బారెడ్డి, జిల్లా కార్యదర్శి కె. బ్రహ్మానందరెడ్డి, జిల్లా నాయకులు ప్రతాప్ రెడ్డి, రవీంద్రారెడ్డి, రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వామ్మో.. స్క్రబ్ టైఫస్!
● తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులుంటే నిర్లక్ష్యం చేయొద్దు ● అనుమానిత లక్షణాలున్న వారికి ఆస్పత్రిలోనే నిర్ధారణ పరీక్షలు ● ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉంటే చాలు ప్రొద్దుటూరు క్రైం : స్క్రబ్ టైఫస్ అనే జ్వరం ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొన్ని చోట్ల ఈ వ్యాధి లక్షణాలతో కొంత మంది మృత్యువాత పడ్డారు. జిల్లాలో కూడా స్క్రబ్ టైఫస్ లక్షణాలతో పలువురు ఆస్పత్రి పాలయ్యారు. కడప రిమ్స్‌లో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. క్రమేణా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లాలో 51 పీహెచ్‌సీలు, 30 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బద్వేలు, పోరుమామిళ్ల, మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం, పులివెందుల, చెన్నూరులలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, కడపలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అండ్ మెడికల్ కాలేజీ (రిమ్స్) ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి ఉన్నాయి. అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ స్క్రబ్ టైఫస్ జ్వరాలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజల్లో భయాందోళనలు పోగొట్టడంతో పాటు వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఓపీ విభాగంలో ఉన్న టీవీల ద్వారా స్క్రబ్ టైఫస్ జ్వరం గురించి వివరిస్తున్నారు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు, దద్దుర్లు తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎలీసా టెస్ట్ నిర్వహించాలని సంబంధిత వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర విభాగంలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక స్క్రబ్ టైఫస్ విభాగం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఆరు బెడ్లతో స్క్రబ్ టైఫస్ ఐసోలేషన్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యాధితో అడ్మిట్ అయిన వారికి కావాల్సిన మందులను కూడా ఐసోలేషన్ వార్డులోనే సిద్ధంగా ఉంచారు. ఐసోలేషన్ విభాగాన్ని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత, ఆర్ఎంఓ డాక్టర్ శివరాంలు పరిశీలించారు. స్క్రబ్ టైఫస్ కేసులొస్తే పూర్తి స్థాయిలో చికిత్సను అందించేలా వైద్యాధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. రెండు రోజుల క్రితం జిల్లా ఆస్పత్రికి తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులతో ఒక వ్యక్తి రాగా అనుమానంతో వైద్యులు ఎలీసా టెస్ట్ చేశారు. అతనికి డెంగీ జ్వరమని నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో ప్రతి రోజు 800–900 వరకు ఓపీ నమోదు అవుతుంది. జ్వరం సోకి ఆస్పత్రికి వచ్చిన వృద్ధులు, చిన్న పిల్లలను వైద్యులు జాగ్రత్తగా పరీక్షలు చేస్తున్నారు. స్క్రబ్ టైఫస్ లక్షణాలు స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటియా సుట్సుగముషి అనే సూక్ష్మక్రిమి ద్వారా వస్తుంది. ఇది చిగ్గర్స్ అనే చిన్న కీటకాల లాంటి పురుగుల ద్వారా వ్యాప్తి చెందే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా ఎలుకలు, కుందేళ్లు, ఉడతల శరీరంపై కనిపిస్తుంది. ఈ చిగ్గర్స్ కీటకాలు పొదలు, గడ్డి, వ్యవసాయ భూముల్లో నివసిస్తాయి. ఇవి కుట్టినప్పుడు ఇన్ఫెక్షన్ సోకుతుంది. స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకిన తర్వాత 5–15 రోజుల్లోపు తీవ్రమైన జ్వరం, చలి, ఒంటినొప్పులు, తలనొప్పి, అలసట, బలహీనత, మెడ, చంకల్లో వాపు గడ్డలు, శరీరంపై దద్దుర్లు వస్తాయి. అలాగే పురుగు కుట్టిన చోట ముదురు రంగుతో కూడిన పుండు ఏర్పడుతుంది. ఇలాంటి లక్షణాలుంటే స్క్రబ్ టైఫస్‌గా భావించాలని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స చేయించకపోతే శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో పాటు అవయవాల వైఫల్యం కూడా జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని, సకాలంలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే నాలుగైదు రోజుల్లోనే పూర్తిగా నయం అవుతుందని వైద్యులు తెలిపారు. స్క్రబ్ టైఫస్ నివారణ మార్గాలు ఏంటంటే.. స్క్రబ్ టైఫస్ రాకుండా ఉండాలంటే చేతులు, కాళ్లను బాగా కప్పి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టూ గడ్డి, పొదలు పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. గోరు వెచ్చని నీరు తాగడంతో పాటు సమతుల ఆహారం తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో రద్దీగా ఉన్న ఓపీ రిజిస్ట్రేషన్ విభాగం జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రబ్ టైఫస్ ఐసోలేషన్ విభాగం స్క్రబ్ టైఫస్ జ్వరం పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే జిల్లా ప్రభుత్వాసుపత్రికి రావాలి. అనుమానిత లక్షణాలు ఉన్న వారికి రక్తపరీక్షలు చేస్తున్నాం. ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో ప్రత్యేక స్క్రబ్ టైఫస్ ఐసోలేషన్ విభాగాన్ని ఏర్పాటు చేశాం. చికిత్సకు కావాల్సిన మందులన్నీ ఉన్నాయి. 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటారు. ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ సుజాత, జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్, ప్రొద్దుటూరు. -
మేయర్ పీఠం ఎప్పటికీ వైఎస్సార్సీపీదే
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థ మేయర్ పీఠం ఎప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేనని నూతన మేయర్ పాకా సురేష్ కుమార్ అన్నారు. గురువారం ఎన్నిక పూర్తయ్యాక కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కడపలో సమస్యలు సృష్టించాలని అధికార పార్టీ ప్రయత్నించిందని, తప్పుడు ఫిర్యాదు చేసి అప్పుడు మేయర్‌గా ఉన్న సురేష్ బాబుపై అనర్హత వేటు వేశారన్నారు. ఈ ఎన్నిక రావడం చాలా బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లంతా ఏకగ్రీవంగా తనను ఎన్నిక చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నిక ద్వారా వైఎస్సార్సీపీలో చీలిక తేవాలని అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయన్నారు. టీడీపీ నాయకులు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలకు గురి చేసినా తామంతా వైఎస్సార్సీపీ వెంటే ఉంటామని కార్పొరేటర్లు మరోసారి నిరూపించారన్నారు. ఇది చాలా శుభపరిణామమన్నారు. మేయర్‌గా తనకు తక్కువ సమయం ఉన్నా... ప్రజా సమస్యల పరిష్కారానికి, నగరాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూడా గెలుపు మాదే: మాజీ మేయర్ సురేష్ బాబు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలుపు తమ పార్టీదేనని మాజీ మేయర్ కె. సురేష్ బాబు అన్నారు. ఎన్నిక అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేయర్‌గా పాకా సురేష్‌ను తామంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, ఈ విషయంలో తమ కార్పొరేటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఓటేశారన్నారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ తొలుత వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష, మేయర్ అభ్యర్థి పాకా సురేష్ తదితరులు దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం మీదుగా కార్పొరేషన్ ఆఫీసుకు ర్యాలీగా వెళ్లారు. ● కార్పొరేషన్ కార్యాలయం వద్ద పోలీసులు కార్పొరేటర్ల ఐడీ కార్డులు, పాసులు తనిఖీ చేసి లోపలికి పంపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు ముంతాజ్ బేగం, నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నూతన మేయర్‌గా ఎన్నికైన పాకా సురేష్‌ను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష ఘనంగా సన్మానించారు. ఆయనకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, షఫీ తదితరులు పాల్గొన్నారు. నూతన మేయర్ పాకా సురేష్ -
రెండో రోజు ‘టెట్’కు 82 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా రెండో రోజు గురువారం నిర్వహించిన టెట్(టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు 82 మంది గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్లో కడపలోని ఐదు, ప్రొద్దుటూరులోని పరీక్ష కేంద్రంలో నిర్వహించిన టెట్ పరీక్ష కు సంబంధించి 710 మంది విద్యార్థులకు 674 మంది హాజరుకాగా, 36 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం సెషన్లో 710 మంది అభ్యర్థులకు 664 మంది హాజరుకాగా, 46 మంది గైర్హాజరయ్యారు. కడపలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ షేక్ షంషుద్దీన్ పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు దిగువ పేర్కొన్న వారిని రాష్ర పార్టీ కమిటీలో వివిధ హోదాలలో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఆవుల విష్ణువర్థన్‌రెడ్డిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా నియమించారు. రాష్ట్ర కార్యదర్శులు(పార్లమెంటు)గా అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన పోలు సుబ్బారెడ్డి, ఉపేంద్రారెడ్డి, మదనపల్లెకు చెందిన డి. ఉదయ్ కుమార్, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన రఘునాథ్‌రెడ్డి, కమలాపురం నియోజకవర్గానికి చెందిన సంబటూరు ప్రసాద్‌రెడ్డిలను నియమించారు. పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలోని వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమి క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ విజేతగా కడప జట్టు నిలిచింది. గురువారం కడప, విశాఖపట్టణం జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో కడప జట్టు విజేతగా నిలవగా, విశాఖపట్టణం జట్టు రన్నర్‌గా నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా జట్టు మూడవ స్థానంలో నిలిచింది. అనంతరం విన్నర్, రన్నర్ జట్లకు ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్స్ శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్, కిరణ్, రాకేష్ బాబు, విక్టరీ పాల్గొన్నారు. కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి నివేదికలను సిద్ధం చేయా లని జేసీ అదితి సింగ్ అన్ని శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి సానుకూల ప్రజా దృక్పథం, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్లోడ్, ఎన్టీఆర్ భరో సా, దీపం గ్యాస్, రేషన్ సరఫరా, వరి ధాన్యం కొనుగోలు, ప్రజా రవాణా సేవలు, రిజిస్ట్రేషన్ సర్వీసులు తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి విజయానంద్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి జేసీ అదితి సింగ్ హాజరయ్యారు. వీసీ ముగిసిన అనంతరం అధి కారులకు జేసీ పలు సూచనలు ఇచ్చారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం దర్శనం కోసం వస్తున్న భక్తుల ఆకలి మూడు పూటల తీర్చడానికి టీటీడీ ప్రారంభించాలనుకున్న నిత్యాన్నదానం కేంద్రానికి కేంద్ర పురావస్తు శాఖ తాత్కాలిక ఏర్పాట్లకు అనుమతులు జారీ చేసింది. ఇందులో భాగంగా గురువారం రామాలయ ఆవరణలోని నామాల వనం పక్కనే ఉన్న పచ్చని వనంలో 60 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు వైశాల్యం గల ప్రమాద రహిత జర్మన్ షెడ్డుతో టీటీడీ సివిల్ విభాగం అధికారులు నిత్యాన్నదానం కేంద్రం తాత్కాలిక ఏర్పాట్లు ప్రారంభించారు. ఇక్కడ ఒకే సారి 200–250 మంది భక్తులు కూర్చుని భోజనం చేసేలా సౌకర్యాలు కల్పించనున్నారు. శాశ్వత నిత్యాన్నదాన కేంద్రానికి కేంద్ర పురావస్తూ శాఖ అనుమతలు ఇచ్చేంత వరకు ఈ ప్రాంతంలోనే నిత్యాన్నదానం జరుగుతుందని టీటీడీ సివిల్ విభాగం ఏఈ అమర్ నాథ్ రెడ్డి తెలిపారు. అతి త్వరలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తాత్కాలిక నిత్యఅన్నదాన కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఆయన వివరించారు. -
కోటి సంతకాలకు జన నీరాజనం
జమ్మలమడుగులో కోటి సంతకాల ప్రతులను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి అందజేస్తున్న నాయకులు కోటి సంతకాల సేకరణ పూర్తయిన సందర్భంగా మాట్లాడుతున్న మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా కమలాపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న నరేన్ రామాంజుల రెడ్డి, పార్టీ నేతలు మైదుకూరులో ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, నాయకులు బద్వేలులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ పులివెందులలో కోటి సంతకాల ప్రతుల వాహనాన్ని ప్రారంభిస్తున్న వైఎస్ మనోహర్‌రెడ్డి ప్రొద్దుటూరులో వైఎస్ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు , పార్టీ శ్రేణులు కడప కార్పొరేషన్: ెుడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు జన ం నీరాజనం పలికారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాల పత్రాలను పండుగ వాతావరణంలో వాహనాలలో ఎక్కించి జిల్లా కార్యాలయానికి పంపించారు. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ర్యాలీలు నిర్వహించి సంఘీభావం ప్రకటించారు. జిల్లా కేంద్రమైన కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనంలో సుమారు 70 వేల సంతకాలతో కూడిన పత్రాలను పార్టీ జిల్లా కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ వాహనానికి మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష, అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె. సురేష్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల పత్రాలను జిల్లా కార్యాలయానికి తరలించారు. తొలుత ఈ పత్రాల బండిళ్లను వైఎస్సార్ విగ్రహం వద్ద ఉంచి, దివంగత వైఎస్సార్‌కు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా లక్షా 200 సంతకాలు సేకరించారు. వాటిని ప్రత్యేక వాహనంలో కడపకు తరలించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 90,200 సంతకాలు సేకరించారు. సంతకాలు చేసిన పత్రాలను తరలించే వాహనాన్ని మున్సిపల్ ఇన్‌ఛార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం పండుగ వాతారణంలో కొనసాగింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 50 వేల సంతకాలు సేకరించారు. బుధవారం ఈ సంతకాలు చేసిన పత్రాలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనం ద్వారా జిల్లా కార్యాలయానికి తరలించారు. ఈ వాహనాలను రామసుబ్బారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమలాపురం నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో 60,240 సంతకాలు సేకరించారు. ఈ సంతకాలతో కూడిన బండిళ్లను బుధవారం జిల్లా కార్యాలయానికి తరలించారు. అంతకుముందు పార్టీ కార్యాలయం వద్దగల వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. సుమారు 30 బాక్సుల్లో వీటిని వాహనంలో ఎక్కించి పంపారు. అంతకుముందు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి అప్పాయపల్లె వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. మైదుకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 70 వేల సంతకాలను సేకరించారు. తొలుత పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరులోని పార్టీ కార్యాలయం నుంచి ఖాజీపేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంతకాలు చేసిన పత్రాలను బాక్సు ల్లో భద్రపరిచి కడపలోని పార్టీ కార్యాలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బద్వేలు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డా. దాసరి సుధ ఆధ్వర్యంలో 60 వేల సంతకాలు సేకరించారు. తొలుత ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో పార్టీనేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి సిద్దవటం రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. తొలుత దివంగత వైఎస్సార్‌కు నివాళులర్పించారు. అనంతరం సంతకాల పత్రాలు తరలించే వాహనానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జెండా ఊపి జిల్లా కార్యాలయానికి సాగనంపారు. పండుగ వాతావరణంలో జిల్లా కార్యాలయానికి తరలింపు పలుచోట్ల ర్యాలీలు -
మదనపల్లెలో మిస్సింగ్.. మంగాపురంలో మర్డర్.?
● హత్యచేసి పూడ్చిపెట్టినట్లు అనుమానాలు ● దర్యాప్తు చేస్తున్న తాలూకా పోలీసులు ● భర్త ఆచూకీ కోసం స్టేషన్ వద్ద భార్య పడిగాపులుమదనపల్లె రూరల్ : మదనపల్లెలో అదృశ్యమైన వ్యక్తి తిరుపతి సమీపంలోని మంగాపురం వద్ద హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తిని స్నేహితులు చంపి తోటలో పూడ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదృశ్యమైన భర్త కోసం తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట పిల్లలతో కలిసి భార్య పడిగాపులు కాస్తోంది. మండలంలోని మాలేపాడు పంచాయతీ రామాపురానికి చెందిన చంద్రప్ప కుమారుడు ఆవులపల్లె నరసింహులు(35) నవంబర్ 27న ఇంటి నుంచి తన ద్విచక్రవాహనంలో వెళ్లాడు. అదేరోజు మధ్యాహ్నం భార్య విజయలక్ష్మి అతడికి ఫోన్ చేస్తే...సీటీఎం పంచాయతీ దిన్నెమీదపల్లెకు చెందిన స్నేహితుడు నాగరాజుతో కలిసి తిరుపతికి వెళ్లినట్లు చెప్పాడు. వెంటనే ఫోన్ కట్ చేశాడు. తిరిగి ఆమె సాయంత్రం మరోసారి భర్తకు ఫోన్ చేయగా, స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పటి నుంచి భర్త ఆచూకీ కోసం బంధువులతో కలిసి మదనపల్లె, తిరుపతి తదితర ప్రాంతాల్లో వెతికింది. అయినా ఫలితం లేకపోవడంతో ఈనెల 3న మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భర్త నరసింహులు వ్యవసాయం చేస్తుంటాడని, అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళితే మూడు నుంచి పదిరోజుల వరకు బయటి ప్రాంతాల్లో ఉండి ఇంటికి తిరిగి వచ్చేవాడని ఫిర్యాదులో పేర్కొంది. నవంబర్ 27న వెళ్లిన భర్త ఇప్పటివరకు తిరిగి రాలేదని, ఆచూకీ తెలపాల్సిందిగా పోలీసులను కోరింది. అదేరోజు తాలూకా పోలీసులు వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా నరసింహులు స్నేహితుడైన నాగరాజుతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో స్నేహితుల మధ్య మనస్పర్థల కారణంగా నరసింహులును హత్యచేసి తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం బ్రిడ్జి వద్ద ఓ తోటలో పూడ్చిపెట్టినట్లుగా నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, హత్య ఎప్పుడు జరిగిందనేది స్పష్టత లేకపోవడంతో నిందితులతో కలిసి ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీస్తేనే మృతికి గల కారణాలను చెప్పగలమని సీఐ కళావెంకటరమణ అన్నారు. కాగా, నరసింహులు వ్యవసాయంతో పాటు బ్లాక్ మ్యాజిక్, గుప్తనిధుల వేట తదితర పనులకు స్నేహితులతో కలిసి వెళ్లేవాడని స్థానికులు చెప్పారు. ఈ వ్యవహారంలో స్నేహితుల మధ్య వాటాల పంపకం లేదా ఇతర కారణాలు హత్యకు దారితీసి ఉంటాయని భావిస్తున్నారు. గురువారం తాలూకా పోలీసులు కుటుంబ సభ్యులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహం వెలికితీసి నిర్ధారించనున్నారు. -
వసంతపేట మున్సిపల్ హైస్కూల్ ఘటనపై విచారణ
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక వసంతపేట మున్సిపల్ హైస్కూల్లో గత నెల మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజనింగ్ విషయమై హైకోర్టు ఉత్తర్వుల మేరకు బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి డాక్టర్ సి.యామిని విచారణ చేశారు. ఫుడ్ పాయిజనింగ్ ఎలా జరిగింది అనే విషయమై ప్రధానోపాధ్యాయుడు గురప్ప, అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన 11 మంది విద్యార్థులు, జిల్లా ఆస్పత్రి వైద్యుడు ఆనంద్‌బాబు, విద్యాశాఖాధికారి షంషుద్దీన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, తహసీల్దార్ గంగయ్య, ఎంఈఓలు సావిత్రమ్మ, శోభారాణి, చౌడేశ్వరి వంట ఏజెన్సీ నిర్వాహకులు జయలక్ష్మీ తదితరులను విచారించారు. ముందుగా పాఠశాలకు చేరుకున్న లీగల్ సెల్ అథారిటీ జిల్లా కార్యదర్శి బాబాఫకృద్దీన్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం తింటున్న విద్యార్థులతో మాట్లాడారు. అలాగే జడ్జి యామిని మధ్యాహ్న భోజనం రుచి చూశారు. ప్రధానోపాధ్యాయుని గదిలో జడ్జి ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీవారు, వైద్యశాఖ, పోలీసు, విద్యాశాఖ, తహసీల్దార్ తదితరులను ఒక్కొక్కరిగా విచారించి వారి నుంచి వివరాలు సేకరించారు. వంట ఏజెన్సీ నిర్వాహకురాలు మోతుకూరు జయలక్ష్మిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. -
మున్సిపల్ పెట్రోలు బంకు డబ్బుపై విచారణ జరిపించండి
ప్రొద్దుటూరు : మున్సిపల్ పెట్రోలు బంకులో రూ.కోటి 30లక్షలు మాయమైందని టీడీపీ పట్టణాధ్యక్షుడు చల్లా రాజగోపాల్ క్యాసినో నిర్వాహకులతో కలిసి చేసిన విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదని మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ ఛాంబర్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి విచారణ చేయించి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. ఈ డబ్బు వసూలుకు సంబంధించి తాము కూడా మద్దతు ఇస్తామన్నారు. మున్సిపాలిటీ ఉద్యోగి ప్రవీణ్ పెట్రోలు బంకును నిర్వహిస్తున్నాడని, అనేక మంది ట్రాన్స్‌పోర్టర్లకు డీజిల్ అప్పు ఇచ్చాడన్నారు. ఈ ప్రకారం సుమారు రూ.80లక్షలు బకాయిలు ఉందని సమాచారం తెలిసిందన్నారు. ఇందులో తన ప్రమేయం ఉందని నిరూపించినా, తాను డీజిల్ అప్పు ఇవ్వాలని చెప్పి ఉన్నా బాధ్యత తనదేనన్నారు. అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం ఉందో మీ సోదరుడు రమణతో చెప్పించాలని చల్లా రాజగోపాల్‌ను కోరారు. సిరిపురి కాంప్లెక్స్‌కు సంబంధించిన షిరిడీ సాయి స్వీట్స్ కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి కోడలి పేరుతో ఉందని, ప్రతినెలా ఆయన రూ.లక్షా 8వేలు, వెనక ఉన్న ఐస్‌క్రీం పార్లర్ బద్వేలి శ్రీనివాసులరెడ్డి అల్లుడు నిర్వహిస్తున్నారని, ఇందుకు గాను రూ.85వేలు అద్దె చెల్లిస్తున్నారన్నారు. రాయలసీమలోనే మున్సిపల్ భవనాలకు సంబంధించి అత్యధికంగా ఇక్కడే బాడుగ చెల్లిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు ఉస్మాన్, మేకల ప్రకాష్, శివప్రసాద్ యాదవ్, గుర్రం ప్రకాష్ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడికి విప్ జారీ చేసే అధికారం
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున విప్ జారీ చేసే అఽధికారం ఆ పార్టీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డికి లభించింది. బుధవారం కేంద్ర కార్యాల యం నుంచి వచ్చిన ఉత్తర్వులను రవీంద్రనాథ్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అఽధికారి, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌కు అందజేశారు. ఈ నెల 11వ తేదీ గురువారం వైఎస్సార్సీపీ తరుపున మేయర్‌గా పోటీ చేయబోయే అభ్యర్థికి ఆయన బి. ఫారం ఇవ్వనున్నారు. అలాగే వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచిన కార్పొరేటర్లందరికీ విప్ జారీ చేయనున్నారు. -
యురేనియం ప్రభావిత గ్రామస్తులకు న్యాయం చేస్తాం
కడప సెవెన్‌రోడ్స్: యురేనియం ప్రభావిత గ్రామస్తులకు నష్టం జరగకుండా న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యుసీఐఎల్) సమస్యలపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ప్రాజెక్టు అధికారులు, పులివెందుల డివిజన్ రెవెన్యూ అధికారి, కేకే కొట్టాల గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన యూసీఐఎల్ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి కేంద్ర స్థాయి పర్యవేక్షణ లో నిర్వహించడం జరుగుతోందన్నారు. యురేనియం ప్రభావిత గ్రామస్తుల సమస్యలు, వారి ప్రతిపాదనలను పరిశీలించి కేంద్రానికి నివేదిస్తామన్నారు. స్థానిక సమస్యలను పరిగణన లోకి తీసుకుని, ప్రాజెక్టు అవసరాలు, నిర్వహణ సామర్థ్యం దృష్ట్యా.. కొత్త టెయిలింగ్ పాండ్ నిర్మాణం చేపట్టడానికి ముందే ల్యాండ్ కమిటీని ఏర్పాటు చేసి కేకే కొట్టాల గ్రామాన్ని భూసేకరణ చేపట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. దీనిపై పబ్లిక్ నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నామన్నారు. ఇందుకు దాదాపు 6 నెలల సమయం పడుతుందన్నారు. అంతేకాకుండా నిర్వహణలో ఉన్న పాత టెయిలింగ్ పాండ్ ఎత్తును పెంచుకునేందుకు కానీ, ఏదైనా మరమ్మతులు చేపట్టేందుకు కానీ ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. కేకే కొట్టాల గ్రామస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పరిహారం, ఉపాధి అవకాశాలను న్యాయబద్ధంగా కల్పిస్తామన్నారు. గతంలో పరిహారంతో పాటు ఇంకా కొంతమందికి పెండింగ్ లో వున్న ఉద్యోగ కల్పన కూడా త్వరలో క్లియర్ చేయాలని యూసీఐఎల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సుమన్ సర్కార్, యుసీఐఎల్ సూపరింటెండెంట్ ల్యాండ్ అక్విజేషన్ ఆఫీసర్ నవీన్ కుమార్ రెడ్డి, విజయ్ కుమార్, పీకే నాయర్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
వనిపెంట ఇత్తడి పరిశ్రమ అభివృద్ధికి కృషి
మైదుకూరు : వనిపెంటలోని ఇత్తడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. జాతీయ హస్తకళా వారోత్సవాల్లో భాగంగా వనిపెంటలోని ఇత్తడి కళాకారుల మౌలిక వసతుల కేంద్రంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం హరిప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రంలో హస్త కళాకారులు తయారు చేసిన ఇత్తడి, రాగి కళాకృతులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ హస్త కళాకారులను కాపాడుకోవాలని, వారికి అండగా నిలవాలని తెలిపారు. కళాకారులు తయారు చేసే కళాకృతుల విలువను పెంచాలన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 36 హస్తకళల ఉత్పత్తులు ఉన్నాయని పేర్కొన్నారు. వనిపెంటలోని ఇత్తడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని, రెండు నెలల శిక్షణలో కళాకారులు మంచి నైపుణ్యాన్ని పొందాలని సూచించారు. తర్వాత ఇక్కడి కళాకారులు తయారు చేసే కళాకృతులకు మార్కెటింగ్ కల్పించే బాధ్యత హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాయితీతో ముడి సరుకును అందించేందుకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకుపోతానని తెలిపారు. కార్యక్రమంలో హస్తకళల కార్పొరేషన్ ఓఎస్డీ లక్ష్మీనాథ్, అధికారులు హుస్సేన్, శివారెడ్డి, ఢిల్లేశ్వరరావు, శ్రీకాంత్, వనిపెంట ఇత్తడి కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ -
తుపాను ప్రభావిత రైతాంగాన్ని ఆదుకోవాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : వరుస తుపానుల కారణంగా కుదేలైన రైతాంగాన్ని ఆదుకోకపోతే కూటమి ప్రభుత్వ పతనం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా బుధవారం కడప ఆర్డీఓ కార్యాలయం వద్ద సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం పేరుతోనూ, ధాన్యం రంగు మారిందని, తాలు, తప్పలు ఉన్నాయని ధాన్యం కొనుగోలు చేయకుండా అనేక కొర్రీలు పెడుతున్నారన్నారు. కొనుగోలు కేంద్రం, రైతు సేవా కేంద్రం, రవాణా ఇన్చార్జిలు, కస్టోడియన్ ఆఫీసర్లు రైస్ మిల్లర్లతో కుమ్మకై ్క ధాన్యం దళారులకు అమ్ముకునే విధంగా వ్యవహరిస్తున్నరన్నారు. దీంతో 75 కేజీల బస్తాను రూ.1200కు అమ్ముకొని బస్తాకు రూ.400 నుంచి 500 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ, ఉద్యానవన పంటలతోపాటు ఆక్వా రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందన్నారు. అరటి రైతులకు న్యాయం చేస్తామని, ఉల్లి పంట రైతులకు హెక్టారుకు రూ.50వేలు ఇస్తామని, భూమిలేని ప్రతి కౌలురైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇందులో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఆందోళన అనంతరం ఆర్డీఓ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి శంకర్ రావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంవీ సుబ్బారెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్.నాగ సుబ్బారెడ్డి, సి.సుబ్రహ్మణ్యం, ఎన్ విజయలక్ష్మి, జి.వేణుగోపాల్, బి శంకర్ నాయక్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు, కౌలు రైతు సంఘం నాయకులు సుదర్శన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రైతు సంఘం నాయకుడు సావంత్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర -
ఎర్రగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణం ముద్దనూరు రోడ్డులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానం ఎదురుగా బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సును ఎదురుగా బైక్‌పై వచ్చి యువకులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వచ్చిన యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్ఐ నాగ మురళి తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన వినాయక్ శర్వాన్ చౌద్రి (34), కరణ్ విలాస్ తెలంగే (24) అనే యువకులు ఎర్రగుంట్ల మండలంలోని జువారి సిమెంట్ ఫ్యాక్టరీలో తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ బాబయ్య వద్ద కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు సుమారు పది రోజుల క్రితమే మహారాష్ట్ర నుంచి వచ్చి పనిలో చేరారు. అయితే గత నాలుగు రోజుల నుంచి వీరు పనికి రాకుండా బయట తిరుగుతున్నట్లు కాంట్రాక్టర్ తెలిపాడని ఎస్ఐ అన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సింహాద్రిపురం నుంచి ప్రొద్దుటూరుకు వెళుతుండగా, అదే సమయంలో ఇద్దరు యువకులు ఎర్రగుంట్ల నుంచి ముద్దనూరు వైపు బైక్‌పై బయలు దేరారు. కానీ ఇద్దరు యువకులు రాంగ్ రూట్లో వెళ్లి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వున్న యువకులు అక్కడికక్కడే రక్తగాయాలతో మృతి చెందారు. ఈ సంఘటన స్థానికుల మనుసులను కలచి వేసింది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ నాగమురళి పరిశీలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం మృతదేహాలను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పరదేశీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రాంగ్ రూట్లో వెళ్లి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన యువకులు అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం మృతులిద్దరూ మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు -
మోసం చంద్రబాబు నైజం
పులివెందుల : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైజమే మోసం చేయటమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడుతూ ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చూపడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. ఆయనకు మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎల్లో మీడియా వంతపాడుతోందన్నారు. చంద్రబాబు జీవితమంతా వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ప్రజలను మోసగించడం అలవాటుగా మారిందన్నారు. రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి పథంలోకి తీసుకెళుతున్నట్లుగా తప్పుడు అంకెల గారడీతో రాష్ట్రాన్ని మభ్యపెడుతున్నారన్నారు. ఇండిగో సంక్షోభంపై టీడీపీ కేంద్ర మంత్రి వ్యవహరించిన తీరుపై జాతీయ మీడియాతోపాటు దేశంలోని అన్ని మీడియాలు దుమ్మెత్తి పోస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని విభాగాలు దారుణంగా వెనుకబడిపోయాయన్నారు. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవని, అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందక కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదన్నారు. పేద ప్రజలకు సంజీవని అయిన ఆరోగ్య శ్రీ పథకానికి ఈ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు అప్పులను మాత్రం బాగా సృష్టిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18నెలల కాలంలోనే రూ.2.30లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాదా అని ఆయన ప్రశ్నించారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. రాష్ట్రంలో జగనన్న హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రైవేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున సంతకాల కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిందన్నారు. కోటి సంతకాల కార్యక్రమంలో పాలు పంచుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా మేధావులు, విద్యార్థులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు, ప్రజలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేస్తున్న ఉద్యమం ఇంతటితో ఆగదని, ప్రజల కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి -
ఎంపీపీ ఎన్నికకు పటిష్ట చర్యలు
ముద్దనూరు : మండల ప్రజాపరిషత్ అధ్యక్ష పదవి ఎన్నికకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ సాయిశ్రీ, జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఓబుళమ్మ, డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వారు ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ గురువారం ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఓటు హక్కు కలిగిన ఎంపీటీసీ సభ్యులు 9మంది, ఒక కో–ఆప్షన్ సభ్యుడికి మాత్రమే సభాభవనంలోకి అనుమతి ఉంటుందన్నారు. వీరితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలను తప్ప ఇతరులు ఎవరినీ లోపలికి అనుమతించమని తెలిపారు. ఇప్పటికే అందరికీ ఎంట్రీ పాసులు అందజేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీతో ఎన్నికను చిత్రీకరించనున్నట్లు, ఎంపీడీఓ కార్యాలయం పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అలీఖాన్, ఎంపీడీఓ రాధాకృష్ణాదేవి, సీఐ దస్తగిరి, ఎస్ఐ మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా జిల్లా బాక్సింగ్ ఎంపికలుకడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలు ఉత్సాహంగా నిర్వహించినట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్, కార్యదర్శి విజయ్ భాస్కర్ తెలిపారు. బుధవారం నగరంలోని మున్సిపల్ మైదానంలో జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలను నిర్వహించారు. 50–55 కేజీల విభాగంలో ఆంజనేయులు, 55–60 కేజీల విభాగంలో మహ్మద్ ఆలీ, 60–65 కేజీల విభాగంలో తలారి శ్రీనివాసులు, 70–75 కేజీల విభాగంలో చిత్తా రవికాంత్ ఎంపికయ్యారన్నారు. వీరు ఈ నెల 13, 14 తేదీల్లో విజయవాడ లయోలా కళాశాలలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు సన్నాహాలుకడప అర్బన్ : ఇటీవల ఎంపికై న స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల(ఎస్.సి.టి.పి.సి)కు త్వరలో శిక్షణ ప్రారంభం కానున్న నేపథ్యంలో నగర శివార్లలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని (డి.టి.సి) బుధవారం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణా కేంద్రంలోని వసతి ఏర్పాట్లను, కిచెన్ రూమ్, తరగతి గదులను, కార్యాలయ గదులను, మైదానం, అంతర్గత రహదారులను, బాటిల్ అబ్స్టాకల్స్ను పరిశీలించారు. ఏర్పాట్లను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా ఎస్పీ వెంట డి.టి.సి. డీఎస్పీ అబ్దుల్ కరీం, డి.టి.సి. ఇన్స్పెక్టర్ ఎస్.వినయ్ కుమార్ రెడ్డి, ఆర్.ఎస్.ఐ అప్పలనాయుడు, సిబ్బంది ఉన్నారు. -
సిద్ధారెడ్డిపల్లెలో దొంగతనం
చాపాడు : మండల పరిధిలోని సిద్ధారెడ్డిపల్లె గ్రామంలో మంగళవారం సాయంత్రం దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన గౌరీ సుబ్బిరెడ్డి అనే వ్యక్తి ఇంటిలో రెండు తులాల బంగారు, రూ.50వేలు నగదు గుర్తు తెలియని దొంగలు అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గౌరీ సుబ్బిరెడ్డి భార్య కూలి పనికి, కుమారుడు బేల్దారి పనికి వెళ్లడంతో ఇంటి వద్దనే ఉన్న సుబ్బిరెడ్డి తోటి వ్యక్తులతో కలిసి గ్రామ సమీపంలోకి వెళ్లాడు. ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో దొంగ ఇంటిలోకి వెళ్లి బీరువా పగలగొట్టి రెండు తులాల బంగారు. రూ.50వేలు నగదు ఎత్తుకెళ్లినట్టు పోలీసులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ సిబ్బందితో కలసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నట్టు ఏఎస్ఐ తెలిపారు. జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎస్పీ మహబూబ్ బాషా జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యాడు. నవంబర్ 15, 16వ తేదీల్లో కాకినాడలో జరిగిన 14వ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. మహబూబ్ బాషాను మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూరు డీఎస్పీ భావన, ట్రాఫిక్ సీఐ రాజగోపాల్ అభినందించారు. రాష్ట్రస్థాయి హాకీ పోటీలు ప్రారంభంపులివెందుల రూరల్ : స్థానిక వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మంగళవారం 69వ స్కూలు ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–17 బాలుర హాకీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర స్కూల్ గేమ్స్ సెక్రటరీ భానుమూర్తి, టోర్నమెంట్ అబ్జర్వర్ రాకేష్ బాబు, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రెటరీలు శ్రీకాంత్ రెడ్డి, చంద్రావతి, డీఎస్డీఓ బాషా మొహిద్దీన్, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రవీణ్ కిరణ్ తదితరులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు శివశంకర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి విక్టర్, హాకీ అసోసియేషన్ కార్యదర్శి శేఖర్, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు కొండారెడ్డి, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ విజయ ప్రసాద్‌రెడ్డి, సాయిబాబా పాఠశాల కరస్పాండెంట్ ఓబుల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మోదీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి
ప్రొద్దుటూరు : ప్రస్తుతం భారత దేశంలో దేశీయ విమానాల పరిస్థితిని చూసి మోదీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంతటి ఘోర తప్పిదానికి కారణమైన విమానయాన శాఖమంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సంఘటనతో దేశానికి సంబంఽధించి మర్యాద, పరువు ప్రపంచ వ్యాప్తంగా పోయాయన్నారు. కేవలం ఇండిగో సంస్థకు 60 నుంచి 70 శాతం విమానాలను అప్పగించడం, మిగతా 30 నుంచి 40 శాతం మాత్రమే ఇతర సంస్థలకు అప్పగించడం వల్ల ఈ సంఘటన జరిగిందన్నారు. ప్రభుత్వమే విమానాలను నడిపితే ఏ సమస్య లేదని, ప్రభుత్వం నడపకుండా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం, అది కూడా ఒకే సంస్థకు ఎక్కువ శాతం అప్పగించడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తే భవిష్యత్తులో పరిస్థితి ఇండిగో సంస్థలాగే ఉంటుందని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంఽధించి ఇప్పటి వరకు లక్షా 400 సంతకాలను పూర్తి చేశామని, బుధవారం ఈ పుస్తకాలను ర్యాలీగా వెళ్లి జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేస్తామన్నారు. సమావేశంలో మాజీ సర్పంచ్ కె.దేవీప్రసాదరెడ్డి, మాజీ కౌన్సిలర్ పిట్టా భద్రమ్మ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మార్తల ఓబుళరెడ్డి, కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షురాలు గజ్జల కళావతి, మాజీ వార్డు మెంబర్ గోకుల మేరి పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
న్యాయమూర్తులతో ముందస్తు జాతీయ లోక్ అదాలత్ సమావేశం
కడప అర్బన్ : ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ జరగనున్న నేపథ్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని ఆధ్వర్యంలో మంగళవారం ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి, పోక్సో కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఎస్.ప్రవీణ్ కుమార్, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.దీన బాబు, ఏడవ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.రమేష్ కుమార్, కడప ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రత్యూష కుమారి, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్. బాబా ఫకృద్దీన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.భార్గవి, మొబైల్ కోర్టు జడ్జి ఆశ ప్రియ, మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.విజయలక్ష్మి, కడప ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.రేష్మ పాల్గొన్నారు. -
అభివృద్ధికి విశేష కృషి
ఏకశిలానగరాభివృద్ధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మార్క్ బాగా కనిపిస్తుందని రామభక్తుల మనోగతం. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం అధికారిక రామాలయంగా ప్రకటించారు. టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్ తొలినాళ్లలో రూ.100 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌తో రామాలయం అభివృద్ధికి టీటీడీ తరఫున అడుగులు వేశారు. ఆనాటి మాస్టర్‌ప్లాన్‌తో ఇప్పటి రామాలయం శోభ సాక్షాత్కరిస్తుంది. మళ్లీ ఆయనే టీటీడీ ఈవోగా రావడంతో 50 ఏళ్లను ముందుగానే దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసేలా పాలకమండలి సహకారంతో నిర్ణయాలు టీటీడీ తీసుకునేలా, అధికారులను సమాయత్తం చేశారు. ఇప్పుడు ఒంటిమిట్ట చెరువులో 108 అడుగుల జాంబవంతుడివిగ్రహం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవడానికి ఈవో కారకులయ్యారని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక సజావుగా నిర్వహించాలి
కడప అర్బన్ : ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ నాయకులు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిలు ఆరుగురు ఎంపీటీసీలతో జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిశారు. పది ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఆరుగురు వైఎస్సార్సీపీ మద్దతు దారులన్నారు. వీరందరిని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అతని అనుచరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. శాంతియుతంగా తాము ఓటు హక్కును వినియోగించుకునేందుకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోవైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు పులి సునీల్‌కుమార్, పొన్నపురెడ్డి గిరిధర్‌రెడ్డి, అగటూరు రమేష్, చలమారెడ్డి, తదితర వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరగాలని విజ్ఞప్తి చేశాం ముద్దనూరు ఎంపీపీ ఎన్నికను సజావుగా జరిగేలా పోలీసులు సహకరించాలని, ఎంపీటీసీలకు రక్షణ కల్పించాలని ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేశాం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో జమ్మలమడుగు ప్రాంతానికి సంబంధించిన వారిని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీసుకెళ్లి దొంగ ఓట్లు వేయించారు. ఆ తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో పులివెందుల ప్రాంతంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అలాగే ముద్దనూరులో ఆరుగురు ఎంపీటీసీలు ఓటు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పటికే వారిని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అతని అనుచరులు వ్యక్తిగతంగా వారి ఇళ్లకు వెళ్లి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. – పి రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడుఎంపీటీసీలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు ముద్దనూరు ఎంపీపీ స్థానానికి ఈనెల 11వ తేదీన ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అతను అనుచరులు ఎంపీటీసీలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురు ఎంపీటీసీలలో ఐదుగురు మహిళలు, ఒక వృద్ధుడు ఉన్నారు. ఎంతమంది ప్రలోభ పెట్టినా, భయభ్రాంతులకు గురిచేసిన ధైర్యంగా ఎదుర్కొంటాం. –ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిజిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి -
జగన్మాతా.. నమోస్తుతే!
బ్రహ్మంగారిమఠంలో కొలువుదీరిన శ్రీ ఈశ్వరీదేవి.. జగన్మాతగా విరాజిల్లుతున్నారు. భక్తుల కొంగుబంగారంగా నిలిచి.. విశేష పూజలందుకుంటున్నారు. శక్తిస్వరూపిణి, సర్వమంగళకారిణిగా ప్రసిద్ధి చెందారు. ఈశ్వరీదేవిమఠంలో ఈ నెల 11 నుంచి అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలో వెలసిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామిమఠం పక్కనే ఈశ్వరీదేవి మఠం ఉంది. పరాశక్తి స్వరూపిణి పార్వతిదేవి, లక్ష్మీదేవి అంశ నుంచి ఈశ్వరీదేవి అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మనవరాలు శ్రీ ఈశ్వరీదేవి. బ్రహ్మంగారి రెండో కుమారుడైన గోవిందస్వామి, గిరియమ్మ దంపతుల పెద్ద కుమార్తె. ఆమె చిన్నప్పటి నుంచే సంస్కృతం, తెలుగు భాషలపై పాండిత్యం సంపాదించారు. 14 ఏళ్లు తపస్సు చేసి.. బ్రహ్మంగారిమఠానికి సమీపాన ఉన్న నల్లమల కొండ గుహలో 14 ఏళ్లు కఠోర తపస్సు చేసి.. అష్టాంగయోగాది, జ్ఞానవాక్సిద్ధి పొందారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి స్వప్న సాక్షాత్కార దర్శనం పొంది.. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మతత్వాన్ని బహుళ ప్రచారం చేసేందుకు సంకల్పించారు. తల్లిదండ్రులు వివాహ ప్రయత్నం చేయగా.. నిరాకరించారు. స్వీయ కల్యాణాన్ని త్యజించి లోక కల్యాణార్థం బ్రహ్మచర్య దీక్ష బూని ఆత్మతత్వ బోధనలు రచించారు. జేజినాయన వలే తత్త్వాలు, కీర్తనలు, కాలజ్ఞానం రాసి విశేష కీర్తి పొందారు. మఠాధీశులై.. తండ్రి గోవిందయ్యస్వామి యోగ సమాధి నిష్ట వహించిన దివ్య సన్నిధానానికి గర్భగుడి, అంతరాలయం, ముఖ మండపం నిర్మించి ప్రత్యేక(చిన్న) మఠం ఏర్పాటు చేశారు. ఆ మఠానికి మఠాధీశులై నిత్య పూజ కార్యక్రమాలు, ఆరాధన గురుపూజోత్సవాలు నిర్వహిస్తుండే వారు. అమ్మవారి బోధనలు విని ఆకర్షితులై.. ఎంతో మంది శిష్యులుగా మారారు. వారిలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రూపెనగుంట్ల గ్రామానికి చెందిన లంకెనపల్లి సుబ్బయ్యాచారి, స్థానికుడు చాటకొండ చంగయ్య శ్రేష్టి ప్రధాన శిష్యులు. ఈశ్వరిదేవి రాజయోగినిగా మారి.. శిష్యసమేతంగా దేశ పర్యటన చేసి భక్తితత్వాన్ని ప్రచారం చేశారు. ఆమె అనేక మహిమలు చూపారని భక్తులు పలు ఉదాహరణలు పేర్కొంటారు. సజీవ సమాధి.. 1789లో శ్రీ సౌమ్యనామ సంవత్సర మార్గశిర బహుళ నవమినాడు ఈశ్వరీదేవి సజీవ సమాధి నిష్ట వహించారు. నాటి నుంచి లోకకల్యాణార్థం యోగ నిద్రముద్రితురాలై భక్తజనుల నిత్య నీరాజనాలు స్వీకరిస్తున్నారు. ఆ ప్రాంతం శ్రీ ఈశ్వరీదేవిమఠంగా పేరొందింది. ఆరాధనోత్సవాలు.. ఈ నెల 11 నుంచి 16 వరకు అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహించనున్నారు. 13న మార్గశిర బహుళ నవమిన సజీవ సమాధి నిష్ట వహించిన రోజు కనుక ప్రధాన వేడుకలు నిర్వహిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తారు. వైభవోపేతంగా ఉత్సవాలు.. అమ్మవారి ఆశీస్సులతో ఏటా ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శిష్యులు, భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారి బి.వి.జగన్మోహన్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను. – శ్రీ వీరశివకుమారస్వామి, మఠాధిపతి, ఈశ్వరీదేవిమఠం భక్తుల కొంగు బంగారంగా ఈశ్వరీదేవి అమ్మవారు రేపటి నుంచి ఆరాధన గురుపూజ మహోత్సవాలు తరలిరానున్న ఐదు రాష్ట్రాల భక్తులు -
మురి‘పాల’కోసం తల్లడిల్లిన దూడ
వేంపల్లె : మూగ జీవమైన దూడకు తన తల్లి మృతి చెందిందని తెలియక రోడ్డుపై పడి ఉన్న తల్లి పాలు తాగేందు కోసం వెంపర్లాడింది.ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ చలించి పోయారు. పల్లెలో చింతలమడుగుపల్లె సహకార సొసైటీ కార్యాలయం ఎదుట మంగళవారం ఒక ఆవు బిడ్డకు జన్మనిచ్చింది. పశు వైద్య శాఖ వైద్యులు ప్రసవించిన ఆవుకు చిక్సిత చేసి వెళ్లారు. అయితే ఆవు కడుపులో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు ఉండటం వలన ఆవు మృతి చెంది రోడ్డుపైనే పడిపోయింది. లేగదూడ మాత్రం తన తల్లి పాల కోసం వెంపర్లాడుతూ.. తల్లి పక్కనే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూర్చుంది. ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా డ్రైనేజీ కాలువల్లో, రోడ్లపై వేస్తుండడంతో అందులోని ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించి ఆవులు ప్లాస్టిక్ కవర్లను మింగేస్తున్నాయి. ఫలితంగా మృత్యువాత పడుతున్నాయని పలువురు వాపోతున్నారు. పంచాయతీ అధికారులతోపాటు మండల స్థాయి అధికారులు స్పందించి రోడ్లపై ఆవులను విడిచి పెడుతున్న యాజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రాజీమానా చేయాలి
కడప కార్పొరేషన్ : విమాన సర్వీసులు సక్రమంగా నడపడంలో విఫలమైన కేంద్ర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్నాయుడు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎస్. వెంకటేశ్వర్లు, వైఎస్సార్టీయూసీ నగర అధ్యక్షుడు ఏ1 నాగరాజులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేలకు పైగా విమానాలు రద్దు అయితే కేంద్ర ప్రభుత్వం, సంబంధిత శాఖామంత్రి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రతిదీ ప్రైవేటు పరం చేస్తే ఏం జరుగుతుందే ఈ తాజా పరిణామమే ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. ఇలాంటి పరిణామాలను ముందే గ్రహించి ప్రధాని నరేంద్రమోడీ పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పినా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ రంగంలోనే వాటిని నిర్మించారని గుర్తు చేశారు. -
జిల్లాలో స్మార్ట్ కిచెన్ షెడ్స్ పూర్తి చేయాలి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలైన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్మాణ పనులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో యూనిక్ గా ఏర్పాటు కానున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ భవన నిర్మాణాల పురోగతిపై.. జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు చేపట్టామని, ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల స్మార్ట్ కిచెన్ లద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. జిల్లాలో నూతనంగా 33 స్మార్ట్ కిచెన్ షెడ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు.. ఇప్పటికే ఆయా మండలాల్లో నిర్మాణ పనులు ప్రారంభం అయి వివిధ దశల్లో పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఇందులో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. స్మార్ట్ కిచెన్ లో ఏర్పాటు చేసే పరికరాల కోసం టెండర్, కొనుగోలు, ఆయా పాఠశాలలకు ఫుడ్ ట్రాన్స్ పోర్టేషన్ కు అవసరమైన వాహనాలు మొదలైన అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో సీపీఓ హజరతయ్య, డీఈఓ షంషుద్దిన్, స్మార్ట్ కిచెన్ల పపర్యవేక్షకులు జోయల్ విజయకుమార్, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, పీఆర్ ఎస్ఈ మద్దన్న, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏడుకొండలు, సమగ్ర శిక్ష ఏపీసీ ప్రేమంత్ కుమార్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణ, డీఏఓ చంద్రా నాయక్, డీహెచ్ ఓ సతీష్ కుమార్, డీసీఓ వెంకట సుబ్బయ్య, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
మేయర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ
కడప కార్పొరేషన్: కడప మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈనెల 11వ తేది మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వాటిని మాజీ మేయర్ కె. సురేష్ బాబు హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. తాను వేసిన పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకమునుపే మేయర్ ఎన్నిక నిర్వహించడం సరికాదంటూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. దానిపై ఈనెల 9వ తేది విచారణ జరుపుతామని ప్రకటించిన న్యాయస్థానం...ఆ మేరకు విచారణ జరిపింది. ఈనెల 10వతేది ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పును బట్టే 11వ తేది మేయర్ ఎన్నిక ఉంటుందా ...లేదా అన్నది ఆధారపడి ఉంది.కడప వైఎస్ఆర్ సర్కిల్: నగరంలోని మున్సిపల్ మైదానంలో బుధవారం జిల్లా స్థాయి సీనియర్ పురుషులు, మహిళలకు జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్, విజయ్ భాస్కర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు వారి ఽఆధార్ కార్డు, ఆటకు సంబంధించిన పరికరాలు తీసుకొని రావాలన్నారు. అభ్యర్థుల వయస్సు సీనియర్ పురుషులు 19 సంవత్సరాలు, యూత్ మహిళలు 17 సంవత్సరాలు , సీనియర్ మహిళలు 19 సంవత్సరాల వయస్సు ఉండాలన్నారు. రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు పురుషులకు ఈ నెల 13 నుంచి 14 వరకు విజయవాడలో, 20 నుంచి 21 వరకు యూత్ మహిళలకు, సీనియర్ మహిళలకు పిఠాపురంలో ఉంటాయన్నారు.కడప అగ్రికల్చర్: ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు జిల్లా మేనేజర్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. కడపలోని జిల్లా సమాఖ్యలో మంగళవారం కడప జిల్లా ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి రబీ సాగుపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి రైతు సాధికార సంస్థ అధికారి విజయకుమార్ మాట్లాడుతూ ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు వేసుకోవాలని సూచించారు. రైతులకు ఆదాయంతో పాటు ఆరోగ్యం, భూమి సారవంతం అయి సాగు ఖర్చు తగ్గి దిగుబడి బాగా వస్తుందన్నారు. ఈ శిక్షణలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అన్ని విషయాలను బాగా నేర్చుకొని అందరూ మార్కెటింగ్ కూడా చేసుకోవాలని తెలియజేసారు. ఈ శిక్షణలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ట్రైనర్స్ పాల్గొన్నారు. -
ప్రార్థన సమయానికి ముందే ఉపాధ్యాయులు హాజరు కావాలి
డీఈఓ షేక్ షంషుద్దీన్ కడప ఎడ్యుకేషన్: ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాల ప్రార్థన సమయాని కంటే ముందే పాఠశాలలో ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం కడప నగరం జయనగర్‌కాలనీలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, నగర పాలక ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాల, నగరపాలక ఉర్దూ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రార్థన సమయానికి హాజరై పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పనిసరిగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ముఖ హాజరు వేయాలని ఆదేశించారు. సమయపాలన లేని ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు అందజేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు. అనంతరం పది 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను జిల్లాలోని ప్రతి పాఠశాల తప్పనిసరిగా అమలు చేయాలసి సూచించారు. సబ్జెక్టుల వారిగా కేటాయించిన ఉపాధ్యాయులు తమ సబ్జెక్టు వారి యాక్షన్ ప్లాన్‌లో పాల్గొనాలని తెలిపారు. 100 రోజులు యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి పాఠశాల వందశాతం రిజల్ట్ వచ్చే విధంగా ప్రతి ఉపాధ్యాయులు పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సీఎంఓ విజయ భాస్కర్, ప్రధానోపాధ్యాయులు భాగ్యవతి, విజయలక్ష్మి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మునీర, సీఆర్ఎంటి ఆదిమూలం శంకర్, కృష్ణ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
జాంబవంతుడి శోభ.. అజరామరం
రాజంపేట: ఆంధ్రా అయోధ్యగా వెలుగొందుతున్న ఏకశిలానగరం(ఒంటిమిట్ట)లో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. రామాలయం అత్యంత సమీపంలో ఉన్న ఒంటిమిట్ట చెరువులో ఏర్పాటు చేసేందుకు టీటీడీ తన మాస్టర్‌ప్లాన్‌లో తీసుకువచ్చింది. పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలిలో 600 జయంత్యుత్సవాల సందర్భంగా 108 అడుగుల అన్నమయ్య విగ్రహం రాజంపేటకే ల్యాండ్‌మార్క్‌గా మారింది. అదే తరహాలో ఏకశిలానగరంలోని చెరువులో జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు చేస్తే.. అదే భవిష్యత్తులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారనున్నది. ఇప్పటికే దాశరథి కల్యాణ మండపం సమీపంలో నామమాత్రంగా జాంబవుంతుడి విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చెరువులోనే ఎందుకు? పురాణ, ఇతిహాసాల చరిత్ర ఆధారంగా ఒంటమిట్ట వద్ద జాంబవంతుడి విగ్రహం ఏర్పాటుకు టీటీడీ సన్నాహాలు ప్రారంభించింది. రామాయణం, భాగవతం కథనాల ప్రకారం జాంబవంతుడు.. బ్రహ్మదేవుడి ఆవలింత నుంచి పుట్టిన యోధుడు భల్లూకరాజుగా గుర్తింపు ఉంది. రామాయణంలో కూడా శ్రీరాముడితో కలిసి లంక యుద్ధంలో పోరాడిన జాంబవంతుడు శక్తియుక్తులు చాటారు. హనుమంతుడి శక్తిని గుర్తు చేసి, సీతాదేవిని వెతకడానికి ప్రేరేపించిన మహాబలశాలి మాత్రమే కాకుండా, వివేకవంతుడని ప్రస్తావించారు. శ్రీ కృష్ణుడికి శమంతకమణి ఇవ్వడంతోపాటు తన కుమార్తె జాంబవంతిని కూడా ఇచ్చి వివాహం చేశాడట. కృతయుగం నుంచి ద్వాపరయుగం వరకు జీవించినట్లు చరిత్ర చెబుతోంది. పురాణాల ప్రకారం ఈ ఏకశిల విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్టించారని ఒక కథనం. అందుకే ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి కోవెలకు ల్యాడ్మార్క్గా జాంబవంతుడి 108 అడుగుల విగ్రహం నిలవనున్నదనే భక్తుల మనోగతం. 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని... రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమిని అధికారిక పండుగగా నిర్వహించే ఏకశిలానగరం ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధిపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి కేంద్రీకృతం చేసింది. 50 ఏళ్లను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆ దిశగా మాస్టర్‌ప్లాన్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మ్యూజియం: భక్తుల కోసం కల్యాణ కట్ట, పుష్కరిణి, నక్షత్రవనాలు, గార్డెనింగ్, పచ్చదనం, ఆధ్యాత్మిక చిహ్నాలు, శ్రీ కోదండరామస్వామి ప్రాశస్త్యం నవతరానికి అందించేలా మ్యూజియం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యానవనాలు, సాంకేతికతను జోడించి డిజిటల్ స్క్రీన్స్, హనుమంతుడి సేవానిరతి, సాంస్కృతిక కళామందిరం, లైటింగ్, తోరణాలు లాంటివి ఏర్పాటు చేయనున్నారు. ఏకశిలానగరంలోని ఒంటిమిట్ట చెరువు (ఇన్సెట్) జాంబవంతుడు ప్రతిష్టించిన ఏకశిల విగ్రహామూర్తులు పెరిగే యాత్రికుల సంఖ్యను అంచనా వేసి, ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి, భక్తులకు సరిపడేలా సదుపాయాలు, వసతి రవాణా, చారిత్రక నేపథ్యం ఉట్టిపడేలా, ఆధ్యాత్మిక, మరింతగా భక్తులు వచ్చేలా ముందస్తు ప్రణాళిక ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచనలు అందాయి. నిత్యఅన్నదాన పథకం అమలు చేయడానికి వీలుగా అన్నదానసత్రం, వసతుల కోసం రూ.4.35 కోట్లు ఇప్పటికే మంజూరు చేశారు. మాడవీధులు, రథశాల, పుష్కరిణి, సంజీవరాయస్వామి ఆలయం, మాలఓబన్న స్థూపం, శృంగిశైలం, సత్రపాళెం, కొండ, రామలక్ష్మణ తీర్థాలు, కల్యాణ వేదిక ప్రాంతాల అభివృద్ధి, సుందరీకరణకు ప్రణాళిక రూపొందించారు. ఆగస్టు 23న ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అనిల్‌కుమార్ బృందం ఒంటిమిట్టను పరిశీలించిన సంగతి విదితమే. ఒంటమిట్ట చెరువులో 108 అడుగుల విగ్రహం ఏకశిలానగరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ 50 ఏళ్ల లక్ష్యంగాఅభివృద్ధి దిశగా టీటీడీ అడుగులు ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లనున్నది. కడప–తిరుపతి మార్గంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనున్నది. ఒంటిమిట్ట చెరువు జాతీయ రహదారి పక్కనే రామాలయం ఉంది. రహదారి మరో పక్క జిల్లాలోనే అతిపెద్ద చెరువు ఉంది. 2014లో రాష్ట్ర విభజనం అనంతరం శ్రీ కోదండరామాలయం ప్రభుత్వ అధికారిక రామాలయంగా మారింది. శ్రీరామనవమి ఉత్సవాలలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకురావడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. -
మోటార్ సైకిళ్ల చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
కడప అర్బన్ : కడప నగరంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరిని ఒన్‌టౌన్ పోలీసులు మోచంపేట సర్కిల్ వద్ద అరెస్టు చేశారు. మరొక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, అదనపు ఎస్పీ ప్రకాష్ బాబుతో కలిసి మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. అరెస్టయిన ఇద్దరు నిందితులలో కడప నగరం రవీంద్ర నగర్‌కు చెందిన సయ్యద్ గౌస్ బాషా, అదే ప్రాంతంలోని లా కాలేజ్ వెనుక ఉన్న షేక్ మహబూబ్ బాషా, మరో మైనర్ బాలుడితో కలిసి చోరీచేసిన ద్విచక్ర వాహనాలను తీసుకెళ్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. కడప ఒన్‌టౌన్ సీఐ చిన్న పెద్దయ్యతో పాటు, ఎస్ఐలు అమరనాథ్ రెడ్డి. ప్రదీప్ కుమార్ సిబ్బందితో నిఘా ఉంచి అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు వేల్పుల నరేంద్ర అలియాస్ మహేంద్ర పరారీలో ఉన్నాడని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వీరంతా ఒక బ్యాచ్ గా తయారై వన్ టౌన్, తాలూకా, రిమ్స్, సీకేదిన్నె ప్రాంతాలలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు చోరీ చేసి వాటిని విక్రయించేందుకు తీసుకెళుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి పది లక్షల రూపాయలు విలువ చేసి 18 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.రూ. 10 లక్షల విలువైన 18 మోటార్ సైకిళ్లు స్వాధీనం -
ప్రతిభను వెలికి తీసేందుకే కౌశల్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు కౌశల్ పరీక్షలు ఎంతో ఉపయుక్తం అని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ అన్నారు. కడప డీఈఓ కార్యాలయంలో సోమవారం కౌశల్ జిల్లా స్థాయి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో శాసీ్త్రయ ప్రతిభను పెంపొందించడానికి కౌశల్ టాలెంట్ పరీక్షలు దోహదపడుతున్నాయన్నారు. కౌశల్ జిల్లా కోఆర్డినేటర్ విజయమోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 980 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొన్నారని తెలిపారు. వారి నుంచి 12 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. జిల్లా స్థాయి విజేతలకు మొదటి బహుమతిగా రూ.1500, రెండో బహుమతి కింద రూ.1000 నగదుతో పాటు మెమెంటో, ప్రశంసాపత్రాలను డీఈఓ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌశల్ జాయింట్ కోఆర్డినేటర్ సత్యమూర్తి, సైన్స్ మ్యూజియం క్యూరేటర్ రెహ్మాన్, సర్ సీవీ రామన్ సైన్సు క్లబ్ కడప గౌరవాధ్యక్షుడు డాక్టర్ గునిశెట్టి శ్రీనివాసులు, సైన్సు టీచర్లు నిత్యానంద రెడ్డి, గంగాధర్, బోగా వెంకటసుబ్బయ్య, శ్రీనివాస్ రెడ్డి, కిషోర్, స్కూల్ కోఆర్డినేటర్లు కృష్ణారెడ్డి, గోవర్దన్ రెడ్డి, చెన్నయ్య, చంద్రశేఖర్, రామసుబ్బమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు విజేతలు వీరే.. క్విజ్ ప్రథమ బహుమతి.. 1. అందె వంశిక, జెడ్పీ హైస్కూల్, దువ్వూరు 2. కె. మమత, జెడ్పీ గర్ల్స్’ హైస్కూల్, చెమ్ముమియాపేట, కడప 3. ఎల్. తనిష్కా, జెడ్పీ గర్ల్స్’ హైస్కూల్, చెమ్ముమియాపేట, కడప క్విజ్ ద్వితీయ బహుమతి.. 1. సింధు, జెడ్పీ హైస్కూల్, చిలమకూరు 2. వై. ప్రవీణ్ రెడ్డి మునిసిపల్ హైస్కూల్ రామేశ్వరం, ప్రొద్దుటూరు 3. ఎస్. తబస్సుమ్, జెడ్పీ హైస్కూల్, మిటాయిగిరి, జమ్మలమడుగు రీల్స్ ప్రథమ బహుమతి.. జి. తిరుపతమ్మ, జెడ్పీ హైస్కూల్, కల్లూరు రీల్స్ ద్వితీయ బహుమతి.. దీపిక, జెడ్పీ హైస్కూల్, చిలమకూరు పోస్టర్ 1 ప్రథమ బహుమతి.. ఎస్. బిందు, గర్ల్స్హైస్కూల్, చెమ్ముమియాపేట కడప పోస్టర్ 1 ద్వితీయబహుమతి.. ఎన్. రీమా, జెడ్పీ హైస్కూల్, కల్లూరు పోస్టర్ 2 ప్రథమ బహుమతి.. పి. వెంకట తెజేశ్వర్, జెడ్పీ హైస్కూల్, కల్లూరు పోస్టర్ 2 ద్వితీయబహుమతి.. షేక్ సహెరా బాను, జెడ్పీ గర్ల్స్ హైస్కూల్, పులివెందుల రాష్ట్ర స్థాయికి ఎంపికై న ఈ విద్యార్థులు ఈ నెల 27వ తేదీ తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్సిటీలో జరిగే పోటీలలో పాల్గొంటారని కౌశల్ జిల్లా కోఆర్డినేటర్ విజయ మోహన్‌రెడ్డి తెలిపారు.డీఈఓ డాక్టర్.షేక్ షంషుద్దీన్ -
అండర్–14 జోనల్ మ్యాచ్ విజేత రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టు
● డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–14 జోనల్ మ్యాచ్‌లు ● చెలరేగిన బౌలర్లు, చతికిలపడ్డ బ్యాట్స్మన్లుకడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–14 జోనల్ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. రెండవ రోజు కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్–నార్త్‌జోన్ విన్నర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండవ రోజు 30 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నార్త్‌జోన్ విన్నర్స్ జట్టు 64.1 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు లోని కేవీ శ్రీరామ్ 35 పరుగులు చేశాడు. రెస్ట్ ఆఫ్ సెంట్రల్‌జోన్ జట్టులోని లోకేష్ రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. యూనైస్ 2 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టు 41 ఓవర్లకు 7 వికెట్లు కోల్సోయి 113 పరుగులు చేసింది. ఆ జట్టులోని కుషల్ 33 పరుగులు, ఏవీ చరణ్ 32 పరుగులు చేశారు. నార్త్‌జోన్ విన్నర్స్ జట్టులోని రుత్విక్ చక్కటి లైనప్‌తో బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టు 179 పరుగులు చేసింది. వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన సెంట్రల్ జోన్ విన్నర్స్–రెస్ట్ ఆఫ్ నార్త్‌జోన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండవ రోజు 12 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ నార్త్‌జోన్ జట్టు 74.1 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ధన్విన్ 59 పరుగులు, ప్రజ్ఞాన్ పండిత్ 47 పరుగులు చేశారు. సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టులోని సిహెచ్ జయవర్దన్ నాధ్ 5 వికెట్లు, రామ్ కిరణ్ విన్నీ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టు 26 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. ఆ జట్టులోని రిషిత్ 32 పరుగులు చేశాడు. రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్టులోని సాత్విక్ 3 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది. కాగా సెంట్రల్‌జోన్ విన్నర్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేసింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. అదే విధంగా కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో సౌత్‌జోన్ విన్నర్స్–రెస్ట్ ఆఫ్ సౌత్ జోన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండవ రోజు 39 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్ జట్టు 60 ఓవర్లకు 184 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి కృష్ణ చైతన్య 48 పరుగులు, తాహీర్ 45 పరుగులు చేశారు. సౌత్‌జోన్ విన్నర్స్ జట్టులోని రక్షణ్ సాయి చక్కటి లైనప్‌తో బ్యాటింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. తరుణ్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌత్‌జోన్ విన్నర్స్ జట్టు 44 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఆ జట్టులోని కేవీఎస్ మణిదీప్ 54 పరుగులు, రక్షణ్ సాయి 48 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్ జట్టులోని రోహిత్ 2 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో సౌత్‌జోన్ విన్నర్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది. -
● 11 వేల జాబ్‌కార్డుల తొలగింపు
కడప సిటీ: చంద్రబాబు సర్కారు రోజుకో రూల్‌తో ఉపాధి కూలీలను ఇబ్బంది పెడుతోంది. మొన్న కుంటి సాకులు చెబుతూ నిర్దాక్షిణంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించింది. నిన్నేమో ప్రత్యర్థి పార్టీ సానుభూతిపరులంటూ ఏకంగా జాబ్ కార్డుల్నే తీసేసింది. తాజాగా ఫొటో క్యాప్చర్ అంటూ కూలీల్లో గుబులు పుట్టిస్తోంది. నిజానికి ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులను అందిస్తుంది. కేవలం పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. అయినా బాబు సర్కారు పెత్తనం చెలాయిస్తోంది. రోజుకో కొర్రీలు పెడుతూ పేద కూలీల మీద కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. వారికి నిరాశే.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు సంబంధించి అక్రమాలు జరగకూడదనే ఉద్దేశ్యంతో ఈకేవైసీ చేస్తోంది. అంటే ప్రతి ఉపాధి హామీ కూలీని ఫొటో క్యాప్చర్ (ఫేస్ రీడింగ్) చేస్తోంది. ఈ విధానం వల్ల ఒకరికి బదులు మరొకరు పనికి వెళ్లేందుకు వీలుండదు. ఉద్దేశం మంచిదే అయినా ఈ ఫోటో క్యాప్చర్ విధానం వల్ల కొంతమందికి ఫేస్ రీడింగ్ కావడం లేదు. ప్రధానంగా కంట్లో శుక్లం ఉన్నవారికి, ఆపరేషన్ చేయించుకున్న వారికి, ఆధార్ అప్డేట్ చేయని వారికి ప్రధాన సమస్యగా మారింది. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆప్షన్ లేదు ఫోటో క్యాప్చర్ కాని వారు ప్రస్తుతానికి పనులు వెళుతున్నారుగానీ, భవిష్యత్తులో జాబ్‌కార్డు ఉంటుందా? లేదా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. వీరికి మాత్రం ఆప్షన్ ఇవ్వకుండా ఉండడంతో మరింత భయాందోళనలో ఉన్నారు. ప్రభుత్వం ఏదో ఒక ఆప్షన్ ఇచ్చి వీరిని కూడా ఈకేవైసీ చేయిస్తే వారి ఆందోళన తగ్గే అవకాశం ఉంది. జిల్లాలో ఉపాధి హామీ పథకంలో 308387 మంది యాక్టివ్ కూలీలుగా ఉన్నారు. ఇందులో ఈకేవైసీ పూర్తయిన వారు 2,53,792 మంది ఉన్నారు. దీంతో 82.31 శాతం ఈకేవైసీ అయింది. అక్టోబరు 7 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే ఏప్రిల్ 26లోపు ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వ్యక్తుల జాబ్‌కార్డులు కావాలని తొలగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతవరకు జిల్లాలో 11 వేల జాబ్‌కార్డులు తొలగించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకంపై కూడా తమ ప్రతాపాన్ని చూపుతూ పేద కూలీలపై తన కక్షసాధింపు ధోరణిని కొనసాగిస్తోంది. -
విన్నపాలు..బుట్టదాఖలు
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందజేసిన అర్జీలు పరిష్కారం కావడం లేదు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి.. కలెక్టరేట్ ముంగిటకొచ్చి కాగితాలు చేతబట్టి.. అధికారులకు దండాలు పెట్టి మరీ చేస్తున్న విన్నపాలు మరుక్షణంలోనే బుట్టదాఖలవుతున్నా యి. మళ్లీ మళ్లీ వస్తున్న వారి సంఖ్యే ఇందుకు నిదర్శనం. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి జనం పోటెత్తారు. ప్రధానంగా భూమి సమస్య, పెన్షన్లు, ఇంటి స్థలాలు వంటి సమస్యలతో వస్తున్న వారు అధికంగా ఉన్నారు. అందులో కొన్ని... నేను ఆటో డ్రైవర్‌ను. రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో కుడికాలు పూర్తిగా తొలగించారు. దీంతో ఏ పని చేయలేకపోతున్నాను. వైద్యులు కూడా 80 శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. వికలాంగ పెన్షన్ మంజూరు చేయాలని కోరితే, కొత్త పెన్షన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినపుడు అర్జీ చేసుకోమని అంటున్నారు. – సుబ్బరాయుడు, దువ్వూరు మాకు సర్వే నెంబరు 310/2బీలో 1.68 ఎకరాల పట్టా భూమి ఉంది. ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చ డం వల్ల అమ్ముకునేందుకు అవకాశం లేకుండా పోయింది. కుటుంబ అవసరాల నిమిత్తం ఇతరులకు విక్రయించేందుకు వీలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం 22ఏ నుంచి భూమిని మినహాయించాలి. – వడ్ల వీరమ్మ, వేల్పుచర్ల, ముద్దనూరు మండలం -
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుదాం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : గంజాయి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు కోరారు. గంజాయి, మాదక దవ్య్రాలకు దూరంగా ఉండాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను సోమవారం నగరంలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్ నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా విశ్వవిద్యాలయాలు మొదలుకొని పాఠశాలల వరకు రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోందన్నారు. ఇటీవల నెల్లూరు నగరంలో పెంచలయ్య అనే యువకుడిని పట్టపగలే హత్య చేసిన ఘటన చూస్తే గంజాయి మాఫియా ఎంతకు బరితెగించిందో అర్థమవుతోందన్నారు. గంజాయి మాఫియాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు అరుణ్, అశోక్, అకిరానంద్, నాగేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సీనియర్ అసిస్టెంట్ దుర్మరణం
తొండూరు : మండలంలోని మడూరు గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో తొండూరు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.కుమారి దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో కుమారి విధులు ముగించుకున్నారు. పులివెందుల వచ్చేందుకు తొండూరు సాయిబాబా ఆలయం వద్ద బస్సు కోసం వేచి ఉండగా, బూచుపల్లెకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ కనిపించాడు. ఆమె చేయి ఎత్తడంతో తన ద్విచక్రవాహనాన్ని ఆపి ఆమెను ఎక్కించుకుని పులివెందులకు బయలుదేరాడు. మడూరు గ్రామ సమీపంలోకి రాగానే నాలుగు లేన్ల రోడ్డు పనులలో భాగంగా బ్రిడ్జి పనులు జరుగుతున్న ప్రదేశంలో లారీ వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమారి లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే స్థానికులు, రెవెన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఘన మద్దిలేటి, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. మృతురాలు కుమారికి భర్త విశ్వనాథ్(చిన్నా)తోపాటు ఇద్దరు కుమారులు విశ్వనాథ్, నందు, కుమార్తె సిరిచందన ఉన్నారు. కుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీడీఓ రామచంద్రుడు, రెవెన్యూ సిబ్బంది కోరారు. -
82.31 శాతం ఈకేవైసీ
జిల్లాలో ఇప్పటివరకు 82.31 శాతం ఈకేవైసీ పూర్తయింది. అక్టోబరు 7 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. జిల్లాలో కొంతమంది జాబ్‌కార్డులను తొలగించిన విషయం వాస్తవమే. వివాహమై ఊరు విడిచి వెళ్లిన వారివి మాత్రమే తొలగించాం..అంతేగానీ మిగతా వారిని తొలగించలేదు. – ఆదిశేషారెడ్డి, పీడీ, డ్వామా, కడప ఫేస్ రీడింగ్ కారణంగా ఇబ్బందులు ఉపాధి పనులకు సంబంధించి ఫేస్ రీడింగ్ విధానం అమలు చేస్తున్న కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. సాంకేతిక సమస్యల కారణంగా ఫేస్ రీడింగ్ కాకపోతే పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కంటి సమస్యలున్న వారికి సమస్య మరింత అధికంగా ఉంది. ఈ విషయంగా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – వెంకట సుబ్బయ్య, లింగారెడ్డిపల్లె, సీకే దిన్నె జాబ్ కార్డుల తొలగింపు సరికాదు సరైన కారణాలు లేకుండా కూలీల జాబ్‌కార్డులను తొలగిస్తున్నారు. రోజువారి కూలీ సంపాదనతో జీవించే వారికి రాజకీయాలు అంటూ తెలియవు. కొన్ని ప్రాంతాల్లో కక్షసాధింపు ధోరణి కొనసాగుతోంది. జాబ్ కార్డులు ఇలా ఏకపక్షంగా కొనసాగితే పనుల కోసం వలసలు తప్పవు. పేదల ఇబ్బందులు గుర్తించి ఉపాధి పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. –బాబయ్య, కొలుములపల్లె, సీకే దిన్నె మండలం -
ప్రకృతి సేద్యం అలవాటు చేసుకోవాలి
కడప అగ్రికల్చర్ : రైతులు ప్రకృతి సేద్యం ద్వారా పంటలు పండించడం అలవాటు చేసుకోవాలని ఏపీ షీప్ అండ్ గోట్ డెవెలెమ్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్రకుమార్ అన్నారు. పంటల తెగుళ్లు, సత్తువుల కోసం ఘన, జీవామృతాలను వాడాలని సూచించారు. కడపలోని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం షీప్ అండ్ గోట్ ఏడీ రమణారెడ్డి అధ్వర్యంలో పురుగు మందులపై వాడకంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుగుమందులు, ఎరువులు మోతాదుకు మించి వాడితే పశువులు, మేకలు, గొర్రెలకు ప్రమాదమేనన్నారు. పులివెందుల సూపర్‌స్పెషాలిటీ పశువైద్యశాల జేడీ డాక్టర్ శారదమ్మ, జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసులు, వ్యవసాయశాఖ ఏడీ నాగరాజు , ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్ ఫార్ములేషన్ టెక్నాలజీ దీపక్‌కుమార్ జాశ్వల్, మంగేష్ ఆశోక్‌రావు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థశాఖ, షీఫ్ అండ్ గోట్ ఏడీలు, వైద్యులు, రైతులు పాల్గొన్నారు. -
జోరుగా కోటిసంతకాల సేకరణ
ముద్దనూరు : వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముమ్మరంగా కొనసాగుతోంది. సోమవారం మండలంలోని పలుగ్రామాల్లో వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు కోటిసంతకాల సేకరణలో పాల్గొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి,పార్టీ ఐటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి ఆకుల రవికుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలి – వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక నాయకులు పులివెందుల : రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే ఆలోచనను కూటమి ప్రభు త్వం విరమించాలని.. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రజా వైద్య వనరులను కార్పొరేట్లకు అప్పగించడం అనేది ప్రజా ఆరోగ్యాన్ని రాబందులకు అప్పగించినట్లేనని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్యాంప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు బి.నారాయణ పేర్కొన్నారు. సోమవా రం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట వారు ఐక్యవేదిక నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ వైద్య సేవలపై ఆధారపడి ఉన్నారని, మెడికల్ విద్యను ప్రైవేటు వ్యాపారంగా మార్చే ప్రయత్నం సామాన్యుల భవిష్యత్‌ను పూర్తిగా దెబ్బతీస్తుందన్నారు.వెనుకబడిన ప్రాంతాలను అన్యాయం చేయడమేనని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక జిల్లా అధ్యక్షుడు కేసీ సుబ్బరాయుడు, జిల్లా నాయకులు సగిలి రాజేంద్ర, మల్లేల జగదీష్, జాల జయవర్ధన్, తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని యువకుడి మృతి
కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో టి.చదిపిరాళ్ల వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగంపల్లెకు చెందిన పాలెం ప్రభు కుమార్ (22) మృతి చెందినట్లు ఎస్ఐ విద్యాసాగర్ తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జంగంపల్లెకు చెందిన ప్రభుకుమార్ పందిళ్లపల్లె వద్ద ఎలక్ట్రీషన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం పందిళ్లపల్లె నుంచి బైక్‌లో ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఎదురుగా వస్తున్న ఆల్వీన్ లారీ ఢీ కొంది. దీంతో ప్రభుకుమార్ కింద పడ్డాడు. ఆల్వీన్ వెనకాలే వస్తున్న కంటైనర్ సైతం ప్రభుకుమార్‌ను తొక్కి వెళ్లింది. దీంతో కాలు విరిగి తీవ్ర రక్తస్రావం అయింది. చికిత్స నిమిత్తం 108 వాహనంలో రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. కాగా పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి తల్లిదండ్రులు కాంతమ్మ, చెండ్రాయుడు ఉన్నారు. -
క్షయవ్యాధి నిర్మూలనకు సమష్టి కృషి
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని తిప్పలూరు గ్రామంలో క్షయ వ్యాధి నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. భారతి సిమెంట్ ఫ్యాక్టరీ సీఎస్ఆర్ సహకారంతో పెయిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని సోమవారం భారతి సిమెంట్స్ చీఫ్ మేనేజర్ పి. భార్గవర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి భయంకరమైన అంటువ్యాధి అన్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పుత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. ఎర్రగుంట్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాధి వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందన్నారు. 192 మంది స్క్రీనింగ్ పరీక్షలకు హాజరుకాగా వారిలో 85 మందికి గళ్ల, రక్త పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో పెయిడ్ సంస్థ అధ్యక్షుడు కె.నాగేశ్వరరెడ్డి, భారతి సిమెంట్ సీఎస్ఆర్ ఇన్చార్జి డి.మదన్‌రెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు ఓబులేసు, సునీల్‌తో పాటు వైద్య సిబ్బంది, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చాపాడు : మండల కేంద్రమైన చాపాడులోని ఎరువుల దుకాణాలలో సోమవారం వ్యవసాయ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కమలాపురం ఏడీఏ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ పాస్ యంత్రాల్లో ఉన్న నిల్వలు, భౌతికంగా అందుబాటులో ఉండే ఎరువుల నిల్వలను పోల్చిచూస్తూ లెక్కించారు. ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డుల నిర్వహణ కచ్చితత్వంగా ఉండాలని సూచించారు. ఎరువుల దుకాణాలలో తప్పనిసరిగా ధరల పట్టిక ఉండాలని, రైతులకు ఎరువులు పంపిణీ చేయగానే ఈ పాస్ యంత్రంలో ఆధార్ కార్డు ద్వారా నమోదు చేయాలని ఏడీఏ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ దేవి పద్మలత, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోట్లదుర్తికి వచ్చిన రాష్ట్ర మంత్రులుఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామాన్ని సోమవారం రాష్ట్ర మంత్రులు సందర్శించి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు తల్లి రత్నమ్మకు ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల సీఎం రమేష్ నాయుడు తల్లి రత్నమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏ.సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి జి. రవికుమార్, హోం శాఖ మంత్రి వి.అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిలు సీఎం రమేష్‌ను పరామర్శించారు. చీటీల పేరుతో ఘరానా మోసంకడప రూరల్ : ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరానికి చెందిన మునగపాటి మల్లికార్జున చీటీల పేరుతో తమను నిలువునా ముంచాడంటూ పలువురు బాధితులు వాపోయారు. సోమవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్త మాధవరం గ్రామానికి చెందిన కోట్ల వెంకట శివ ప్రసాద్ మాట్లాడుతూ మునగపాటి మల్లికార్జున స్థానికంగా నమ్మకంగా ఉండటంతో అతని వద్ద రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు చీటీలు వేశారన్నారు. తనకు చీటీల ద్వారా రూ.20 లక్షలకు పైగా డబ్బులు రావాల్సి ఉందన్నారు. తనలాగే చాలామందికి డబ్బులు రావాలన్నారు. ఈ తరుణంలో నవంబర్ 25వ తేదీ నుంచి మల్లికార్జున కనిపించకుండా పోయాడని తెలిపారు. దాదాపు 200 మంది మోసపోయారని అన్నారు. చీటీ డబ్బులుతోపాటు పలువురి వద్ద వడ్డీకి తీసుకున్న మొత్తం దాదాపు రూ.6–7 కోట్లు ఎగ్గొట్టాడని ఆరోపించారు. దీంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కార్యక్రమంలో బాధితులు రమణమ్మ, అవ్వారు విజయలక్ష్మి, వెంకటసుబ్బయ్య, గోపవరం సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అన్నమయ్య కాలిబాట పునరుద్ధరించాలి
కడప సెవెన్‌రోడ్స్ : అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సోమవారం శ్రీ సప్తగిరి గోవిందమాల సేవా సమితి భక్తబృందం కడప నగరంలోని శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద నుంచి కలెక్టరేట్‌కు ప్రదర్శన నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షుడు మల్లెల రామాంజులు, ప్రతినిధులు శ్రీనివాసులురెడ్డి, కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గోవిందమాల భక్తులకు వైకుంఠ ఏకాదశి రోజున లేదా ద్వాదశి రోజున ద్వార దర్శనం కల్పించాలని కోరారు. 25 ఏళ్లుగా గోవిందమాల ధరించి కడప నుంచి పాదయాత్రగా అన్నమయ్య కాలిబాట ద్వారా తిరుమలకు వెళుతుంటామన్నారు. ఈ సాంప్రదాయం వందల సంవత్సరాల నుంచి వస్తోందని తెలిపారు. ఈ యేడు అటవీ అధికారులు అన్నమయ్య కాలిబాట ద్వారా వెళ్లకుండా అడ్డుకోవడం తగదన్నారు. అటవీ అధికారులు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాలిబాట మూసివేయడం సమంజసం కాదన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి కోశాధికారి ఎం.నాగరాజు, మల్లికార్జున, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన వైఖరి
కడప అర్బన్ : గ్యాంబ్లింగ్, మట్కా, క్రికెట్ బెట్టింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాల అణచివేతకు కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రొద్దుటూరు సబ్–డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు కారణాన్ని గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్, అధిక వేగంతో వెళ్లే వాహనాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. గ్రామ సభ లు, పల్లె నిద్ర, గ్రామాల సందర్శన తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. మహిళలు, బాలికలు వేధింపులకు గురయ్యే ప్రాంతాలలో మ్యాపింగ్ చేయించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బీట్లు నిర్వహించాలన్నారు. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ప్రొద్దుటూరు డీఎస్పీ భావన, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 130 ఫిర్యాదులు పీజీఆర్ఎస్కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజల ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్‌న్‌లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ ఈ.బాలస్వామి రెడ్డి , డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
పెరిగిన చలి..
కశ్మీరీ అందాలు కడప ముంగిట వాలినట్లు.. నగరాన్ని మంచు దుప్పటి చుట్టినట్లు.. ప్రభాతవేళ..మంచు ఇలా కప్పేసింది. రవి కిరణాలకు చోటు లేదంటూ.. జనానికి చలిమంట దారి చూపింది.. రోజురోజుకు తీవ్రమవుతున్న చలికి.. పిల్లలు..వృద్ధులు వణుకుతుంటే.. ప్రకృతి ప్రేమికులేమో మంచుకౌగిట్లో మునిగి పరవశమవుతున్నారు. కడప నగరంలో కనిపించిన ఈ దృశ్యాలు కనువిందు చేశాయి. – ఫొటోలు.. మహమ్మద్ రఫీ, సాక్షి ఫొటో గ్రాఫర్, కడపనలుగురికీ పట్టెడన్నం పెట్టే అన్నదాతకే పుట్టెడు కష్టమొచ్చింది. చేతికొచ్చిన పంట చేలోనే నేలకొరిగింది. మాయదారి తుపాను పచ్చని పంటను నిలువునా గాయం చేసింది. మోసులెత్తిన వరి కంకులు రైతు ఆశల్ని మట్టిలో కలిపింది. వల్లూరు, చెన్నూరు మండలాల్లో ఏ పొలం చూసినా ఇలా నేలవాలిన వరి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన మోంథా, తుపాన్లు కలిగించిన నష్టం తాలూకు ఛాయలే అన్నదాతలను వెంటాడుతున్నాయి. – ఫొటోలు: రమేష్ తీట్ల, సాక్షి ఫొటోగ్రాఫర్,కడపఒరిగిన వరి.. -
పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలు
కమలాపురం : ఏ పార్టీకై నా కార్యకర్తలే మూల స్తంభాలని, కార్యకర్తలను విస్మరిస్తే ఏ పార్టీకై నా అథోగతి తప్పదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని టి.చదిపిరాళ్లలో జరిగిన వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ నియామక కార్యక్రమం, రచ్చబండకు ఆయన నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డితో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల భాగస్వామ్యం, ఆమోదంతో గ్రామ కమిటీ, అనుబంధ కమిటీ ఛైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ పార్టీ కై నా కార్యకర్తలే మూల స్తంభాలని గ్రహించిన జగనన్న 2.0లో కార్యకర్తలకు పెద్ద పీట వేస్తానని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారన్నారు. అందులో భాగంగానే గ్రామ కమిటీ, అనుబంధ కమిటీల నియామకాలు ప్రజల సమక్షంలోనే చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారన్నారు. జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు చేయలేదని, ఇది ప్రజలందరికి తెలుసన్నారు. ప్రతి ఒక్కరూ కలసి కట్టుగా సమిష్టిగా పని చేసి జగనన్నను తిరిగి సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అలాగే ప్రతి నెల 3వ ఆదివారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత కమిటీ సభ్యులపై ఉందన్నారు. కార్యకర్తలకు అన్ని విధాలా అందుబాటులో ఉంటామన్నారు. మరింత బాధ్యత పెంచింది పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేయడానికి జగనన్న చేపట్టిన నూతన కమిటీల నియామకం మరింత బాధ్యత పెంచిందని నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కమిటీ సభ్యులకే పెద్దపీట వేస్తామన్నారు. పెద్దరికం పెత్తనం కోసం కాదని, ఉత్తమ సేవకులంగా పని చేసేందుకేనన్నారు. గతంలో కూడా కమిటీలు ఉండేవని, అయితే అవన్నీ కార్యాలయాల్లో కూర్చొని కమిటీలు వేసేవారని, అయితే ప్రస్తుతం తాము నియమిస్తున్న కమిటీలు ప్రజల భాగస్వామ్యంతో వారి అభిప్రాయం మేరకు నియమిస్తున్నామని వివరించారు. రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికై న కమిటీ సభ్యులకు సంక్రాంతి తర్వాత ఐడీ కార్డులు ఇస్తారని, అవి విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం, శివుని చేతిలో త్రిశూలం, అర్జునుడి చేతిలో పాశు పతాస్త్రం అని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని, చంద్రబాబు ఉంటే రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్‌రెడ్డి, మునీంద్రారెడ్డి, జయసుబ్బారెడ్డి, నాగరత్నమ్మ, చిన్ని, ప్రభాకర్ రెడ్డి, రాజుపాళెం జగన్మోహన్ రెడ్డి, గండి భాస్కర్, మైసూరారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, జనార్ధన్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. కమలాపురంలో.. కమలాపురం మునిసిపాలిటీ పరిధిలోని 1,2,3,4,5వ వార్డు కౌన్సిల్ పరిధికి చెందిన గ్రామ కమిటీల ప్రక్రియ స్థానిక పకీర్ వీధిలోని కొలిమి సెంటర్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ రెడ్డి, మహ్మద్ సాదిక్, గఫార్ బాషా, ఇర్ఫాన్, ఆర్‌వీఎన్‌ఆర్, దేవదానం, కొండారెడ్డి పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి -
బధిర ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ బధిర ఉద్యోగుల సంఘం వైఎస్సార్ కడప జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఆదివారం కడపలోని డాక్టర్ వై.ఎస్.ఆర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో ఏపీ బధిర ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎం. శివ నాగ సంతోష్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎం.కొండయ్య రాజు, ఉపాధ్యక్షుడిగా పి. రాజశేఖర్ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా డి.నరేంద్ర రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా టి. భూ ప్రకాష్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా డి.జైహింద్ రెడ్డి, ట్రెజరర్‌గా ఎస్.మహేష్, మహిళా కార్యదర్శిగా ఎ.రెడ్డమ్మ, ఈసీ మెంబర్లుగా ఎస్.షబానా, కె.వి.సుబ్బారెడ్డి, ఎస్.గయాసు ద్దీన్లు ఎన్నికయ్యారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు బి. శ్రీనివాసులు, ఎన్జీఓ ఎలక్షన్ ఆఫీసర్ సి. సిద్ధయ్య, అసోసియేట్ ఎలక్షన్ ఆఫీసర్ వి.కుమార్, ఎన్నికల పరిశీలకుడిగా పి. నిత్యపూజయ్య పాల్గొన్నారు. -
జిల్లా కేంద్రం అన్ని ప్రాంతాల వారికి సౌకర్యంగా ఉండాలి
రాజంపేట టౌన్: జిల్లా కేంద్రం అన్ని ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి తెలిపారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్, అన్నమయ్య జేఏసీ నాయకులు మర్రి రవికుమార్ పట్టణంలోని ఆర్అండ్బీ బంగ్లా వద్ద రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా చేయాలని చేపడుతున్న రిలే నిరాహార దీక్షలో ఆదివారం ఎమ్మెల్యే పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం ఆకేపాటి మాట్లాడుతూ ఆరు నియోజకవర్గాలుగా అన్నమయ్యజిల్లా ఉంటే అన్ని ప్రాంతాల వారికి రాయచోటి మధ్యలో ఉంటుందని, అందువల్ల గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాయచోటిని జిల్లా కేంద్రం చేసిందన్నారు. అయితే చంద్రబాబుప్రభుత్వం మదనపల్లెను జిల్లా చేస్తుండటంతో మూడు నియోజకవర్గాలతోనే అన్నమయ్య జిల్లా ఉంటుందన్నారు. అందువల్ల రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాలకు రాజంపేట మధ్యలో ఉంటుందన్నారు. రాయచోటి జిల్లా కేంద్రం అయితే రైల్వేకోడూరులోని అన్ని మండలాల ప్రజలు రెండు బస్సులు మారి 80 నుంచి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుందనిఆవేదన వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలు తమ పనుల నిమిత్తం రాయచోటికి వెళ్లి రావాలంటే చార్జీలకే 250 రూపాయిలు ఖర్చవుతుందన్నారు. ఇక వైఎస్సార్‌జిల్లాలో ఉండే ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలకు రాయచోటి కేంద్రంగా అన్నమయ్యజిల్లా ఉంటే వారి పరిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉంటుందన్నారు. ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల ప్రజలకు కడప కేవలం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. రాయచోటి జిల్లా కేంద్రం అయితే ఆ రెండు మండలాల ప్రజలు కూడా రెండు బస్సులు మారి 80 నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందన్నారు. ఆ మండలాల ప్రజలు కూడా తమ మండలాలను వైఎస్సార్ జిల్లాలోనే కొనసాగించాలని కోరుతున్నారని, అలా కాని పక్షణలో రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాచేసి అన్నమయ్యజిల్లాలో కలపాలని కోరుతున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్
ముద్దనూరు : ముద్దనూరు–జమ్మలమడుగు రహదారిలో స్థానిక శివాలయం వద్ద ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సును జిప్సంలోడుతో ప్రయాణిస్తున్న టిప్పర్ ఢీకొంది. స్థానికుల సమాచారం మేరకు ముద్దనూరు నుంచి 20 మంది ప్రయాణికులతో బస్సు జమ్మలమడుగుకు బయలుదేరింది. శివాలయం వద్దకు రాగానే ఘాట్రోడ్డునుంచి ఎదురుగా వస్తున్న టిప్పర్ బస్సు ముందు భాగంలో ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగంలోని అద్దం ధ్వంసమైంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. టిప్పర్ బ్రేక్ ఫెయిలవడంతోనే బస్సును ఢీకొన్నట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సును ఢీకొని అదుపుతప్పి టిప్పర్ రహదారి పక్కలో బోల్తా పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు ’విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతూ, నేరాలను నియంత్రించడం, రహదారి భద్రతపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా నిషేధిత వస్తువులు, గంజాయి వంటి వాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నారు. విశ్వవ్యాప్తమైన వేమన కీర్తి కడప ఎడ్యుకేషన్ : ఆనాటి ప్రజల్లో సమతను, మమతను పెంచాలని విశ్వసందేశ విహారియై తనదైన శైలిలో బోధ చేసిన వేమన విశ్వవ్యాప్తమైన కీర్తిని సంపాదించుకున్నారని రెడ్డి సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి లెక్కల కొండారెడ్డి అన్నారు. జనవరిలో నిర్వహించబోయే వేమన జయంతి సందర్భంగా కడప రెడ్డి సేవా సమితి వారు ఆదివారం సేవాసమితి ప్రాంగణంలో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు వేమన పద్య పఠన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్కల కొండారెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజానీకానికి సైతం అర్థమయ్యేందుకు వేమన పద్యాలను సరళంగా చెప్పారన్నారు. వైయస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండే ఉపమానాలే వేమన పద్యాల్లో ఉపయోగించారన్నారు. సమితి అధ్యక్షుడు కుప్పిరెడ్డి నాగిరెడ్డి, కోశాధికారి గుడ్ల ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 150 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా వీరిలో 32మందిని ఎంపిక చేశారు. తరువాత ఈనెల 21వ తేదీన జరిగే పోటీల్లో వీరిలో ముగ్గురిని మాత్రమే విజేతలుగా ప్రకటించి ప్రథమ ,ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా 10 వేలు, 8 వేలు, 6 వేల రూపాయలను అందజేస్తామన్నారు. ్యాయ నిర్ణయతలుగా డాక్టర్ పొదిలి నాగరాజు, డాక్టర్ జి.వి.సాయి ప్రసాద్, డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచారి, గంగనపల్లి వెంకటరమణ, వై.దామోదరమ్మ, బి.శ్రీదేవి వ్యవహరించారు. -
ఆగని వేధింపులు!
● మదనపల్లె ఆర్డీవో కార్యాలయ దగ్ధం కేసులో అక్రమ అరెస్ట్‌లకు కుట్రలు ● ఒక ఘటన..దారి మళ్లిన దర్యాప్తు మదనపల్లె ఆర్డీవో కేసులో సీఎం చంద్రబాబు స్వయంగా స్పందించారు. ఒక ఘటనపై సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు పదేపదే అబద్ధాలు.. ఘటన జరిగిన మరుసటిరోజు 2024 జూలై 22న డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్లను హెలికాప్టర్లో మదనపల్లెకు పంపారు. తర్వాత అగ్నిప్రమాదంగా నమోదైన కేసు మారిపోయింది. దర్యాప్తు తీరే మారిపోయింది. వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇళ్లలో సోదాలు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీలు వెబ్సైట్లో కనిపించకుండా కట్టడి చేశారు. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి సీసోదియా మదనపల్లెలో మకాంపెట్టి హడావుడి చేశారు. ఘటన జరిగి ఇంతకాలమైనప్పటికీ ప్రభుత్వం ఆరోపించినట్టుగా 22ఏ భూముల వ్యవహరంకాని, ఇతర ఆరోపణలపై ఒక్క ఆధారాన్ని బయటపెట్టలేకపోయింది. మదనపల్లె: మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో 2024 జూలై 21న జరిగిన ప్రమాద ఘటన, తర్వాత వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే లక్ష్యంగా సాగిన వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. రాజకీయ కారణాలతో ప్రజల్లో బలమైన మద్దతు కలిగిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా బలహీనం చేయాలన్న చంద్రబాబు వ్యూహాలు ప్రతి అంశంలోనూ బెడిసికొడుతూనే ఉన్నాయి. ఆర్డీవో కార్యాలయ ఘటన వెనుక వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఆరోపణలు చేసినా..ఆ ఆరోపణ లను రుజువు చేయలేక..ప్రభుత్వం మళ్లీ వేధింపులకు పాల్పడుతోంది. దీనికి శనివారం తెల్లవారుజాము మదనపల్లె వైఎస్సార్సీపీ నేత మాధవరెడ్డి ఇంటివద్ద సీఐడి అధికారుల బృందం ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రావడమే నిదర్శనం. న్యాయస్థానం నుంచి ఆయనకు రక్షణ ఉన్నప్పటికీ, చట్టనిబంధనలు పాటించాలన్న సూచనను పెడచెవిన పెట్టారు. ఉన్నాడనే వచ్చారు మాధవరెడ్డిని అరెస్ట్ చేయడం కోసం తిరుపతినుంచి సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ బృందం శనివారం తెల్లవారుజామునే మదనపల్లె చేరుకుంది. మాధవరెడ్డి ఇంటికి వచ్చాక తాళం వేసి ఉండటంతో ఎక్కడున్నాడంటూ ఆరా తీశారు. రెండుగంటల దాకా ఇంటి ఆవరణలోనే వేచి చూశాక వెనుదిరగాల్సి వచ్చింది. ఇదే ఇంటిపైన అద్దెకు ఉంటున్న వారితో మాధవరెడ్డి సమాచారం కోసం ప్రయత్నించినా లభ్యం కాకపోవడంతో వెనుదిరిగా వెళ్లారు. కాగా ఆయన ఇంటిలో ఉంటాడన్న సమాచారంతో అరెస్ట్ చేసేందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆర్డీవో కార్యాలయ ఘటన కేసులో బబెయిల్ కోసం వేసిన పిటిషన్‌పై వచ్చే మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ పరిస్థితుల్లో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారంటే వైఎస్సార్సీపీ నేతలపై వేధింపులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో స్పష్టం అవుతోంది. మదనపల్లె ఆర్డీవో కార్యాలయ ఘటనతో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అనుచరులను వేధించాలన్న లక్ష్యంతో పోలీసు అధికారులు ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఈ ఘటనతో సంబంధం, ప్రమేయం లేని వాళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఆర్డీవో కార్యాలయ ఘటన తర్వాత మొదటగా మదనపల్లెలో ఉంటున్న మాధవరెడ్డి ఇంటిపై దాడులతో తనిఖీలు మొదలు పెట్టారు. ఆయనింటిలో లభించిన జిరాక్స్ కాపీలను వదలకుండా తీసుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేశారు. తర్వాత మున్సిపల్ వైస్‌చైర్మన్ జింకా వెంకటా చలపతి, బాబ్జాన్, మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా, హైదరాబాద్‌లో ఉంటున్న శశికాంత్, తుకారాం తిరుపతి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎవరి ఇళ్లలో సోదాలు చేశారో వారందరిపైనా కేసులు నమోదు చేశారు. తద్వారా వేధింపులు తీవ్రం చేశారు. -
నిరుద్యోగ యువతకు అండగా వైఎస్ జగన్
వైఎస్సార్ సీపీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగ యువతకు అండగా నిలబడ్డారు. చదువుకున్న నిరుద్యోగ యువతకు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. జిల్లాలోని వైవీయూ, వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న అనేక పోస్టులను భర్తీ చేశారు. అంతేకాకుండా వైఎస్సార్ జిల్లా బద్వేలులో సెంచురీ ఫ్లైవుడ్ పరిశ్రమతోపాటు కొప్పర్తి పారిశ్రామికవాడలో ఏర్పాటుచేసిన వివిధ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకున్నారు. – నన్నయ్య,ప్రకాశ్‌నగర్, కడప నిరుద్యోగులను పట్టించుకోని కూటమి సర్కార్ రాష్ట్రంలోని కూటమి సర్కార్ నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. గత ఎన్నికల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతితోపాటు లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి మాటే లేకపోగా, అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఉద్యోగాలు అందుబాటులో లేకుండా పోయాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకు వస్తున్నామని చెబుతున్నారేగానీ క్షేత్రస్థాయిలో అలాంటి చర్యలు కనుచూపు మేరలో కానరావడం లేదు. మొత్తం మీద చంద్రబాబు హయాంలో నిరుద్యోగ యువతకు ఇబ్బందులు తప్పేలా లేవు. – షేక్ మన్సూర్, లక్కిరెడ్డిపల్లె, సీకే దిన్నె మండలం -
‘సంతకమే’ సమరశంఖం
కొండాపురం/ముద్దనూరు: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను జిల్లా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు సంతకంతో చెక్ పెట్టేందుకు ముందుకొస్తున్నారు. భవిష్యత్తు తరాల బాగు కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమానికి ఆదివారం కొండాపురం మండలం, మద్దనూరులో సంతకంతో మద్దతు తెలిపారు. ఈకార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. కొండాపురం మండలంలోని చామలూరు, కోడూరు, గ్రామాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆదివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ మార్కెట్‌యార్డ్ ఛేర్మెన్ కోడూరు శివారెడ్డి, జి. రామాంజనేయులురెడ్డి, నారాయణరెడ్డి, జి. శివారెడ్డి, వెంకటరెడ్డి, మళిఖార్జునరెడ్డి, పవన్ కుమార్‌రెడ్డి, చంద్ర ఓబుల్‌రెడ్డి, సంపంగి గోపాల్, నాగేంద్ర కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ముద్దనూరు మండలంలోని చిన్నదుద్యాల గ్రామంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలమేరకు పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి కోటి సంతకల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయడం దారుణమని పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. కొండాపురం: కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నాయకులు, ముద్దనూరు: కోటిసంతకాల సేకరణలో పార్టీ అభిమానులు కోటి సంతకాలకు విశేష స్పందన -
బాధితులకు సత్వర న్యాయాన్ని అందించాలి
ప్రొద్దుటూరు క్రైం: బాధితులకు సత్వర న్యాయాన్ని అందిండచమే కోర్టుల కర్తవ్యమని హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ కే శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ దిశగా న్యాయమూర్తులందరూ కృషి చేయాలన్నారు. న్యాయవాద వృత్తిలో సుదీర్ఘకాలం విశిష్ట సేవలను అందించి ఇటీవల మృతి చెందిన ఎస్.కృష్ణారెడ్డి, ఎల్.తులసిరెడ్డి చిత్రపటాల ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ప్రొద్దుటూరు కోర్టు ఆవరణలో నిర్వహించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి, న్యాయవాది అన్నపూర్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కోర్టు ఆవరణలో జస్టిస్ శ్రీనివాసరెడ్డి దంపతులకు వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. బార్ అసోసియేషన్ కార్యాలయం, న్యాయవాదుల గుమాస్తాల అసోసియేషన్ కార్యాలయాన్ని వారు సందర్శించారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. సీనియర్ న్యాయవాదులు కృష్ణారెడ్డి, తులసిరెడ్డిల చిత్రపటాలను వారి కుటుంబ సభ్యులతో కలసి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి దంపతులు ఆవిష్కరించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కృష్ణారెడ్డి సుదీర్ఘకాలం పాటు న్యాయవాదిగా సేవలు అందించడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. తులసిరెడ్డి ఎస్కే యూనివర్సిటీలో చదివారని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. సీనియర్ న్యాయవాది మెట్టుపల్లి సుధాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి మనవడు డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కృష్ణారెడ్డి, తులసిరెడ్డి సేవలు, వారితో తమ అనుభవాల గురించి పలువురు సీనియర్ న్యాయవాదులు వివరించారు. జిల్లాలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రొద్దుటూరు, కడప, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు బార్ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రొద్దుటూరు న్యాయవాదులు, కృష్ణారెడ్డి, తులసిరెడ్డి కుటుంబసభ్యులు జస్టిస్ శ్రీనివాసరెడ్డి దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సీ యామిని, న్యాయవాదులు శ్యాంసుందర్‌రెడ్డి, దాదాహయ్యత్, ముడిమేల కొండారెడ్డి, గొర్రెశ్రీనివాసులరెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి, ఎల్ గంగిరెడ్డి, జింకా విజయలక్ష్మి, లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. హాజరైన జిల్లాలోని న్యాయమూర్తులు... న్యాయవాది కృష్ణారెడ్డి చిత్రపటాన్ని ఆవిష్కరిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి దంపతులు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి -
ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష(ఎన్ఎంఎంఎస్) ప్రశాంతంగా జరిగిందని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా కడప, బద్వేల్, జమ్మలమడుగు, పులివెందుల మండలాల్లో 14 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన ఈ ఎన్ఎంఎంఎస్ పరీక్షకు 2519 మంది విద్యార్థులకుగాను 2459 మంది హాజరయ్యారని డీఈఓ తెలిపారు. కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 8 వతేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు మొబైల్ నంబరు 89777 16661కు కాల్ చేసి పెండింగ్‌లో ఉన్న తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ సదవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. కడప సెవెన్‌రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించు కోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు తమ అర్జీల సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్ కు కాల్ చేయవచ్చునన్నారు. సభాభవన్‌లో పీజీఆర్ఎస్ నిర్వహణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను ఈ సోమవారం సభాభవన్‌లో నిర్వహించనున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు. లక్కిరెడ్డిపల్లి: మండలంలోని శ్రీ అనంతపురం గంగమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. తలనీలాలు అర్పించారు. గంగమ్మా..కాపావడమ్మా అంటూ వేడుకున్నారు. ఆలయ పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కడప కార్పొరేషన్: ఏపీ ఫార్మా కౌన్సిల్ ఎన్నికలకు జిల్లాలో ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భా గంగా కడప డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఏపీజీఏ జిల్లా అధ్యక్షుడు సిద్దయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు, ఏపీపీఎస్ఎస్ ఫౌండర్ ఎం. సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరుకాగా, ఏపీపీసీకి యునై టెడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అసోసియేన్ నుంచి నామినేషన్ చేసిన లుక్కా. నరేష్, క్రిష్ణమరాజు, రాధాక్రిష్ణ, ప్రభుత్వ ఫార్మసిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడారు. ఏపీ ఫార్మసీ సంక్షేమ సంఘం నుంచి లుక్కా. నరేష్,నాగక్రిష్ణమరాజు, రాధాక్రిష్ణ, ఐపీఏ నుండి కోలా శ్రావణ్,నల్లిమిల్లి ఆదిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ నుంచి మాలతి నామినేషన్ వేశారని..ఈ ప్యానల్‌ను గెలిపించాలని కోరారు. ఏపీజీఏ జిల్లా అధ్యక్షులు డా.సిద్దయ్య మాట్లాడారు. జిల్లా అధ్యక్షులు ఉమామహేశ్వర్ రావు, చలపతి పాల్గొన్నారు. -
పేదల కడుపు కొడుతున్న డీలర్
ప్రొద్దుటూరు : అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అండతో డీలర్ పేదల కడుపు కొడుతున్నాడు.. ఆయన అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. పెద్దాయన బంధువు కావడంతో అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి బంధువు గురివిరెడ్డి రేషన్ డీలర్‌గా ఉన్నాడు. 81వ రేషన్ షాప్‌నకు సంబంధించి 883 రేషన్ కార్డులు ఉన్నాయి. అధికారం వచ్చిన వెంటనే గురివిరెడ్డి ఇతరులకు చెందిన రేషన్ షాప్‌ను స్వాధీనం చేసుకున్నాడు. అయితే సరుకుల తూకాల్లో కోతలు పెట్టడంతోపాటు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అదనంగా డబ్బు వసూలు చేస్తున్నాడు. ప్రతి కార్డుదారునికి కిలో నుంచి రెండు కిలోల వరకు బియ్యం తక్కువగా ఇస్తున్నాడు. అలాగే చక్కెర అర కిలోకు రూ.17.50 వసూలు చేయాల్సి ఉండగా రూ.20 వసూలు చేస్తున్నాడు. చాలా రోజులుగా ఈ తతంగం నడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఎమ్మెల్యేకు ఇలాంటివి కనిపించవా.. మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారుమునిరెడ్డి శనివారం వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా అడుగడుగునా ప్రజలు డీలర్ అవినీతిపై ఫిర్యాదు చేశారు. ఎలాంటి ఫిర్యాదులు లేని డీలర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి ఆయన బంధువు డీలర్ చేస్తున్న అవినీతి కనిపించలేదా అని బంగారు మునిరెడ్డి ప్రశ్నించారు. ఆర్డీఓ ఇలాంటి సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. -
పోట్లదుర్తి గ్రామంలో ఎంపీలు, కేంద్ర మంత్రులు
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి గ్రామాన్ని ఆదివారం వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలతోపాటు కేంద్ర మంత్రులు సందర్శించి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు తల్లి రత్నమ్మకు ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల సీఎం రమేష్ నాయుడు తల్లి రత్నమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రులు కమలేష్ పాశ్వాన్, పర్వేష్ వర్మ, ఎంపీలు నిషికాంత్ దూబే, అనుకాంత్ దూబే, రాహుల్ కస్వాన్, భోలా సింగ్, సంజయ్ జైస్వాల్, నీరజ్ శేఖర్, మహేష్ యాదవ్, సతీష్ గౌతమ్, సుప్రియా సూలే, శ్రీకాంత్ షిండే, మాజీ ఎంపీ సంజీవ్ బల్యాన్లు సీఎం రమేష్‌ను పరామర్శించారు. వీరు రత్నమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆర్డీఓ సాయిశ్రీ, ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథ్ రెడ్డి, ఎర్రగుంట్ల తహసీల్దార్ శోభన్‌బాబు, ఇతర అధికారులు ప్రొటోకాల్ మేరకు బందోబస్తు చర్యలు చేపట్టారు.ఎంపీ రమేష్ నాయుడు తల్లి చిత్రపటానికి నివాళులు -
ప్రారంభమైన ఏసీఏ అండర్–14 జోనల్ మ్యాచ్‌లు
70 పరుగులు చేసిన సెంట్రల్ జోన్ విన్నర్స్ బ్యాట్స్‌మన్ చరణ్ తేజ 5 వికెట్లు తీసిన నార్త్‌జోన్ విన్నర్స్ బౌలర్ చాణిక్య సాయి 3 వికెట్లు నార్త్‌జోన్ విన్నర్స్ బౌలర్ తీసిన షణ్ముఖ గణేష్ 3 వికెట్లు తీసిన రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ బౌలర్ లోకేష్ 65 పరుగులు చేసిన సౌత్‌జోన్ విన్నర్స్ బ్యాట్స్‌మన్ ప్రణవ్ గోవర్దన్కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–14 ఐదవ రౌండ్ జోనల్ మ్యాచ్‌లు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ విన్నర్స్– రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సెంట్రల్ జోన్ విన్నర్స్ 90 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. ఆ జట్టులోని చరణ్ తేజ్ 70 పరుగులు, యాసిన్ సిద్దిఖ్ 53 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్టులోని చరణ్ 3 వికెట్లు, నందన్ కృష్ణ సాయి, హితేష్, సంతోష్, సాత్విక్, రతన్ తలా ఓ వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్టు 5 ఓవర్లకు 12 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్–నార్త్ జోన్ విన్నర్స్ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ 67 ఓవర్లకు 179 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఏవీ చరణ్ 53 పరుగులు, కుశల్ 27 పరుగులు చేశారు. నార్త్ జోన్ విన్నర్స్ జట్టులోని చాణిక్య సాయి చక్కటి లైనప్‌తో బ్యాటింగ్ చేసి 5, షణ్ము గణేష్ 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నార్త్‌జోన్ విన్నర్స్ జట్టు 23 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టులోని లోకేష్ రెడ్డి 3 వికెట్లు, యూనైస్ 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సౌత్ జోన్ విన్నర్స్–రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన సౌత్‌జోన్ విన్నర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌత్‌జోన్ విన్నర్స్ జట్టు 90 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని లిఖిల్ ఇరగంరెడ్డి 96 పరుగులు, ప్రణవ్ గోవర్దన్ 65 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్ జట్టులోని తాహీర్ 2, కెస్కె సమీర్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్ జట్టు 10 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 39 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
అసాంఘిక చర్యలపై విస్తృత దాడులు
కడప కోటిరెడ్డిసర్కిల్ : చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. జిల్లాలో నవంబర్ నెలలో అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ జరిపిన దాడుల వివరాలను జిల్లా ఎస్పీ వివరించారు. గంజాయి విక్రయాలపై విస్తృత దాడులు నిర్వహించి 23.5 కిలోల గంజాయి, 1620 మత్తు కలిగించే మాత్రలు స్వాధీనం చేసుకుని 9 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో పహారా కడప నగరంతో పాటు జిల్లాలోని అన్ని పట్టణాల్లోని పాడుబడిన భవనాలు, బహిరంగ ప్రదేశాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించేందుకు అవకాశం ఉన్న 180 ప్రదేశాలను (హాట్ స్పాట్స్) గుర్తించి అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా ఈగల్, నార్కోటిక్ కంట్రోల్ సెల్, పోలీసు అధికారులు సంయుక్తంగా నిఘా ఉంచుతూ దాడులు చేస్తున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాలు లేదా గంజాయి గురించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు తెలియ జేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్‌పై.. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 8 మందిని అరెస్ట్ చేసి రూ.16,84,000 స్వాధీనం చేసుకున్నామన్నారు. జూదమాడుతున్న మొత్తం 222 మందిని అరెస్టు చేసి రూ. 5,93,150 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మట్కా నిర్వాహకులపై దాడులు చేసి మొత్తం 19 మందిని అరెస్టు చేసి రూ. 64,520 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కోడిపందేలు ఆడుతున్న 10 మందిని అరెస్ట్ చేసి రూ. 6,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, అనుమానితులు, పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. జిల్లాలోని 5 పోలీస్ సబ్ డివిజన్లలో 580 మందికి కౌన్సిలింగ్ నిర్వహించారు. డ్రైవింగ్ చేస్తున్న 200 మంది మైనర్లను గుర్తించి, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి హెల్మెట్ ధారణపై అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 81 మందిపై కేసులు నమోదు చేసి రూ.93,585 జరిమానా విధించారు. కంపెనీ ఫిట్టెడ్ సైలెన్సర్లను తీసివేసి అధిక శబ్దాలు చేస్తూ తిరుగుతున్న ద్విచక్ర వాహనాలకు చెందిన 100కు పైగా సైలెన్సర్లను రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేశామని తెలిపారు. బహిరంగ మద్యపానంపై దాడులు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవిస్తున్న 354 మందిపై, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 149 మందిపై కేసులు నమోదు చేశారు. మోటారు వాహన చట్టం (ఎం.వి యాక్ట్) ఉల్లంఘించిన వాహనదారులకు 6527 కేసులు నమోదు చేసి రూ.16,16,515 జరిమానా విధించారు. జిల్లాలో ఎక్కడైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగినట్లు గుర్తిస్తే ప్రజలు వెంటనే డయల్ 112 కు సమాచారమివ్వాలని జిల్లా ఎస్పీ కోరారు.షెల్కే సచికేత్ విశ్వనాథ్, జిల్లా ఎస్పీ -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని బొల్లవరంలో ఆదివారం గౌరు సుజాత (42) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తలకు గాయమై ఆమె రక్తపు మడుగులో పడి ఉండటంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని శంకరాపురం గ్రామానికి చెందిన గౌరు రవిశంకర్‌రెడ్డికి 2010లో చాపాడు మండలంలోని రాజువారిపేట గ్రామానికి చెందిన సుజాతతో వివాహం అయింది. పెళ్లై 16 ఏళ్లు దాటినా వారికి సంతానం లేదు. వారు కొన్నేళ్ల నుంచి మైదుకూరు రోడ్డులోని టీచర్స్‌కాలనీలో నివాసం ఉండేవారు. మూడు నెలల క్రితం బొల్లవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని కాలనీలోకి సంసారాన్ని మార్చారు. రవిశంకర్‌రెడ్డికి పొలాలు ఉండటంతో గతంలో వ్యవసాయం చేసేవాడు. తర్వాత కొంత కాలం ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ వచ్చాడు. ఇటీవల అతని ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. అతను ఎక్కువగా మద్యం తాగేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అతని ఆరోగ్యం క్షీణించినట్లు తెలిపారు.భార్య చనిపోయిందని ఫోన్ చేశాడు..ఆదివారం మధ్యాహ్నం సమయంలో తన భార్య సుజాత చనిపోయిందని రవిశంకర్‌రెడ్డి బంధువులకు ఫోన్ చేశాడు. సుజాత అక్కతో పాటు కొంత మంది బంధువులు వెంటనే అక్కడికి వచ్చి చూడగా ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సీఐలు వేణుగోపాల్, సదాశివయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వెంటనే క్లూస్‌టీం అధికారులకు సమాచారం అందించడంతో వారొచ్చి ఘటనా స్థలంలో వేలి ముద్రలను సేకరించారు. సుజాతను భర్తే చంపాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని ఆదివారం రాత్రి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సుజాత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్ల్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. -
శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగండి
● వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ పిలుపు ● ఉచిత టైలరింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్రం ప్రారంభంకడప (వైఎస్సార్ సర్కిల్)/పులివెందుల : ఉచిత శిక్షణ కోర్సులను పేద మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదిగి.. కుటుంబానికి అండగా నిలబడాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ పిలుపునిచ్చారు. ఆదివారం వైఎస్ జార్జిరెడ్డి 26వ వర్థంతిని పురస్కరించుకుని కడపలో ఇందిరా మహిళా మండలి ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. పేదలకు సేవ చేయాలన్న ఆలోచనతో వైఎస్ భారతమ్మ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తనకు కేటాయించిన మూడు ఎకరాల స్థలాన్ని ప్రజలకు సేవ చేసేందుకు వినియోగించడం సంతోషదాయకంగా ఉందన్నారు. పులివెందుల, చెన్నూరు మండలాల్లో టైలరింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇచ్చామన్నారు. చెన్నూరు మండలంలో ఉచిత కోర్సుల శిక్షణతోపాటు పేద మహిళలకు కుట్టుమెషిన్లు, పాడి పశువులు ఇచ్చామని తెలిపారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన చెల్లెలు వైఎస్ విజయమ్మ అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. అనంతరం దివ్యాంగులకు దుస్తులను పంపిణీ చేసి అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు. వైఎస్ జార్జిరెడ్డికి నివాళి అంతకుముందు పులివెందులలోని సమాధుల తోటలో జార్జిరెడ్డి ఘాట్‌వద్ద వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ సుధీకర్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో పీపుల్స్ యాక్షన్ ఇన్ డెవలప్మెంట్ అధ్యక్షుడు కె.నాగేశ్వరరెడ్డి, సరస్వతమ్మ, రాజేశ్వరమ్మ, సుధ సుశీలమ్మ, రాజమ్మ, పీరమ్మ, రెడ్డి సేవా సమితి ఆర్గనైజింగ్ సెక్రటరీ పద్మప్రియ చంద్రారెడ్డి, వైఎస్సార్ ఫౌండేషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, వెంగ మునిరెడ్డి, పార్నపల్లె నాయుడు పాల్గొన్నారు. ఆ తరువాత విజయమ్మ, వైఎస్ భారతమ్మ, వైఎస్ సుధీకర్‌రెడ్డి భాకరాపురంలోని వైఎస్ జార్జిరెడ్డి ఐటీఐ కళాశాలకు చేరుకుని కళాశాల ఆవరణలోని జార్జిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. -
8 నుంచి స్పాట్ అడ్మిషన్లు
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎంకామ్ ,ఎమ్మెస్సీ) కోర్సులలో నేరుగా ప్రవేశాలను ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ అఫ్ అడ్మిషన్స్ టి.లక్ష్మిప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్స్, 2 సెట్ల జిరాక్స్ కాపీలను, నిర్ణీత ఫీజుతో విశ్వవిద్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం ప్రాంగణంలో ఉన్న డైరెక్ట్ రేట్ అఫ్ అడ్మిషన్స్ కా ర్యాలయంలో హాజరు కా వాలని సూచించారు. వివరాలకు yvu.edu.inను సంప్రదించాలని సూచించారు. కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఈ నెలకుగానూ జొన్నలు, రాగులు పంపిణీకి అందుబాటులో ఉన్నాయని, కార్డుదారులకు బియ్యానికి బదులుగా జొన్నలు లేదా రాగులు కార్డుకు మూడు కిలోల చొప్పున ఉచితంగా అందజేస్తున్నామని జేసీ అదితిసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త (స్మార్ట్) రేషన్‌కార్డులను సెప్టెంబరు 1వ తేది నుంచి సచివా లయ సిబ్బంది, రేషన్‌షాపు డీలర్ల ద్వారా పంపిణీ చేస్తున్నామని, ఇప్పటివరకు 5,21,604 కార్డుదారులకు అందజేశామని పేర్కొన్నారు. వివిధ కారణాలతో ఇంకా 52,071 కార్డులు పంపిణీ కాలేదన్నారు. ఇప్పటివరకు కార్డులు తీసుకోని వారు తమ సమీప సచివాలయం వద్దకు వెళ్లి ఏ కార్డు ఏ షాపు పరిధిలో ఉందో తెలుసుకుని కార్డులోని సభ్యుల్లో ఒకరు స్మార్ట్‌కార్డు తీసుకోవాలని సూచించారు. కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలో 10వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు ఈ నెల 8వ తేది నుంచి ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించనున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. అన్ని సబ్జెక్టులకు వారి వారి డివిజన్లలో 8 నుంచి 10వ తేదీ వరకు ఓరియంటేషన్ క్లాసులు ఉంటాయని.. ఉపాధ్యాయులు హాజరుకావాలని డీఈఓ తెలిపారు. ఇందులో కడప డివిజన్ ఉపాధ్యాయులకు కడప నగరంలోని జయనగర్ కాలనీ బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాలలో, బద్వేల్ డివిజన్ వారికి బద్వేల్ జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో, ప్రొద్దుటూరు డివిజన్ వారికి ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్, పులివెందుల డివిజన్ వారికి పులివెందుల జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో ఓరియంటేషన్ క్లాసులు ఉంటాయని తెలిపారు. 8వ తేదీ ఉదయం తెలుగు, మధ్యాహ్నం గణితం, 9వ తేదీ ఉదయం ఫిజికల్ సైన్సు, బయలాజికల్ సైన్సు, మధ్యాహ్నం హిందీ, 10వ తేదీ ఉద యం ఇంగ్లిష్, మధ్యాహ్నం సోసియల్ స్టడీస్‌పై ఓరియంటేషన్ క్లాసులు ఉంటాయని తెలిపారు. కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలోకి అనుమతించబోమని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎంఎంఎస్ పరీక్షను జిల్లాలో నాలుగు కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. విద్యార్థులు తప్పని సరిగా హాల్‌టికెట్‌తో తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి ఉదయం 9కి చేరుకోవాలని సూచించారు. ● మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు,కాలిక్యులేటర్ ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని, అలాగే మధ్యా హ్నం 1 గంట ముందు పరీక్షా కేంద్రం నుంచి బయటకు అనుమతించరని వివరించారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా పరీక్షను విజయవంతంగా పూర్తి చేయాలని డీఈఓ సూచించారు. ప్రొద్దుటూరు: స్థానిక వైఎస్సార్ ఇంజనీరింగ్ ఆఫ్ యోగివేమన యూనివర్సిటీలో శనివారం సెక్యూరిటీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మిషన్ లెర్నింగ్ మోడల్స్ అనే అంశంపై పీఎం ఉషా ఫండ్స్ సహకారంతో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ సురేష్‌బాబు, వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ పాల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, కంప్యూటర్ విజన్, ఐఓటీ, సెక్యూరిటీ అంశాలపై విద్యార్థులకు, రీసెర్చ్ స్కాలర్స్‌కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జి.జయచంద్రారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఆచార్య రమణయ్య, సదస్సు కన్వీనర్ నాగరాజు మాట్లాడుతూ ఏఐ, మిషన్ లెర్నింగ్ సదస్సు వల్ల విద్యార్థులకు సరికొత్త ఆవిష్కరణలకు అవకాశం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లు సంయుక్త ఆచార్యులు ఆర్.ప్రదీప్‌కుమార్‌రెడ్డి, ఎస్.కిరణ్ వ్యవహరించారు. -
కనీస మద్దతు ధరలు కల్పించాలి: జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి
అరటి, ఉల్లి, శనగ పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించాలని జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను వైఎస్సార్ కడప జిల్లాలోనే కొనసాగించాలని లేదా రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నారు. వీటిని తీర్మానాలుగా ఆమోదించి ప్రభుత్వానికి పంపుతున్నట్లు ఆయన ప్రకటించారు. సభ్యులు లేవనెత్తే సమస్యలను అధికారులు రాసుకుని వాటి పరిష్కారం కోసం ఏయే చర్యలు తీసుకున్నారో వచ్చే సమావేశంలో చెప్పాలని ఆదేశించారు. జెడ్పీటీసీలు ఫోన్ చేసినా డీఎంఅండ్‌హెచ్‌ఓ నాగరాజు స్పందించకపోతే ఎలా? అంటూ నిలదీశారు. -
శ్మశానం కోసం ఇరు వర్గాల మధ్య వివాదం
మైదుకూరు : శ్మశానం విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తి పోలీసు, రెవెన్యూ అధికారుల రంగ ప్రవేశం చేసిన సంఘటన మైదుకూరు మండలంలో శనివారం జరిగింది. మండలంలోని నాగిరెడ్డిపల్లెకు చెందిన శివపురం పోలయ్య అనే 60 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఆయనకు ఇద్దరూ కుమార్తెలే కావడంతో శనివారం ఉదయం బంధువులు అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామానికి దగ్గరలో ఉన్న వంక వద్ద గొయ్యి తవ్వించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని తీసుకుని గుంత వద్దకు వచ్చే సరికి పరిసర గ్రామమైన సోమయాజులపల్లెకు చెందిన వారు తమ పట్టా భూమిలో శవాన్ని ఎలా పూడుస్తారంటూ గుంతను పూడ్చి వేశారు. ఇన్నాళ్లు అదే పొలాల గుండా వంక వద్దకు మృతదేహాలను తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించే వారమని, కొద్ది రోజుల కిందట తమ పొలాల గుండా వెళ్లనివ్వమని వారు చెప్పడం వల్లే గతంలో శ్మశానంగా వాడుకుంటున్న ఆ పొలాల్లోనే పోలయ్య మృతదేహాన్ని పూడ్చాలని తాము అక్కడే గుంత తీయించినట్టు నాగిరెడ్డిపల్లె వాసులు తెలిపారు. అయితే సర్వే నంబర్ 3లోని 12.72 ఎకరాల్లో 2.45 ఎకరాలు, 2.46 ఎకరాల వంతున ప్రభుత్వం తమకు 2010లో పట్టాలిచ్చిందని సోమయాజులపల్లెకు చెందిన పెరుగు బాలనాగమ్మ, పెరుగు సుబ్బమ్మ, వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయాలపై ఇరువర్గాలు పట్టు విడవకుండా వాగ్వాదాలు చేసుకుంటుండటంతో ఉదయం అర్బన్ ఎస్ఐ చిరంజీవి అక్కడికి చేరుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. తర్వాత సీఐ రమణారెడ్డి సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి ఇరువర్గాల వాదనలు విన్నారు. పోలీసు అధికారులు, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వం పట్టాలిచ్చిన భూమిలో 40 సెంట్లు మేరకు శ్మశానానికి ఇచ్చేందుకు సోమయాజులపల్లెకు చెందిన వారిని ఒప్పించారు. పోలయ్య మృతదేహాన్ని 40 సెంట్లను గుర్తించిన చోట పూడ్చేందుకు గుంత తీస్తుండగా నాగిరెడ్డిపల్లెకు చెందిన కొందరు ససేమిరా అన్నారు. పాత శ్మశానంగా వాడుకుంటున్న చోటనే శవాన్ని పూడుస్తామని పట్టుపట్టారు. సాయంత్రం అక్కడికి చేరుకున్న తహసీల్దార్ రాజసింహ నరేంద్ర నాగిరెడ్డిపల్లె వాసులకు మరొక చోట 2.50 ఎకరాల శ్మశానం ఏర్పాటు చేయిస్తామని ఇటీవలనే చెప్పినట్టు గుర్తు చేశారు. ప్రస్తుతానికి 40 సెంట్లు గుర్తించిన చోట పోలయ్య మృతదేహాన్ని పూడ్చాలని మృతుని బంధువులకు చెప్పారు. మరోచోట శ్మశాన వాటిక ఏర్పాటు చేసే వరకు నాగిరెడ్డిపల్లె వారిని పొలాల గుండా వెళ్లనివ్వాలని అలా చేయకపోతే పట్టాలను రద్దు చేస్తామని సోమయాజులపల్లె వారిని తహసీల్దార్ హెచ్చరించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఉదయం తీసుకొచ్చిన పోలయ్య మృతదేహాన్ని బంధువులు సాయంత్రం ఖననం చేశారు. మృతదేహాన్ని ఉదయం తరలించినా వాగ్వాదాలతో సాయంత్రం అంత్యక్రియలు -
కడప ఉక్కుపై ప్రభుత్వ నిర్లక్ష్యం
జమ్మలమడుగు : కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్లక్ష్యం చేసి, విశాఖ ఉక్కును మూసేసి, మిట్టల్ ఉక్కు ఫ్యాక్టరీకోసం గనులు ఇవ్వాలంటూ ఎంపీలు సిఫార్సులు చేస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ సంస్థలు నడపకుండా ప్రైవేట్ పరం చేయడం కోసం తాపత్రయ పడుతున్నారు.. అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసులు విమర్శించారు. శనివారం ఆయన మండల పరిధిలోని కన్యతీర్థం సమీపంలో ఏర్పాటు చేసిన స్టీల్‌ప్లాంట్ శిలా ఫలకాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప మహానాడులో కడప స్టీల్ ప్లాంట్‌ను జిందాల్ కంపెనీ పదిరోజుల్లో పనులు ప్రారంభిస్తుందని చెప్పారన్నారు. కానీ ఆరునెలలు దాటినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. రాజకీయ లబ్ధికోసం ఎన్నికల సమయంలో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపనులు చేస్తున్నారే తప్ప పనులు చేపట్టడంలేదని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు మనోహార్, రామమోహన్, అన్వేష్, సత్యం, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, చేనేత సంఘం జిల్లా అధ్యక్షుడు శివనారాయణ, ముంతాజ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసులు -
హోంమంత్రి కోరల్లేని పాము
– మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా కడప కార్పొరేషన్ : రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కోరల్లేని పాము అని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా విమర్శించారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా కడపలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంజద్‌బాషా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులు, బహుజనులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక దళిత మహిళ హోంశాఖామంత్రిగా ఉన్నప్పటికీ అణగారిన వర్గాల ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని విమర్శించారు. ఆమె హోంమంత్రి అయినా అధికారాలేవీ లేవని తెలిపారు. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రమాదపుటంచుల్లో ఉందని, దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యం కొండాపురం : కొండాపురం గ్రామ సమీపంలోని గండికోట వెనుక జలాల్లో గుర్తు తెలియని యువకుడి మృతదేహం(19 లభ్యమైనట్లు ఎస్ఐ తెలిపారు. ఎస్ఐ ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపురం గ్రామంలోని గండికోట జలాల్లో యువకుడి మృతదేహం ఉన్నాట్లు సమాచారం రావడంతో వెంటనే సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9121100612, 9121100611 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఎంఎస్పీతో కొనుగోలు చేయాలి: ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
కూలీ ఖర్చులు కూడా రావన్న ఉద్దేశంతో రైతులు ఉల్లి పంటను పొలాల్లోనే వదిలేశారని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇంతవరకు అందలేదని విమర్శించారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు పర్యటించగా, సమస్యలు బోగస్ అంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. కేపీ ఉల్లికే కాకుండా ఖరీఫ్‌లో సాగు చేసిన మిగతా రకాల ఉల్లికి కూడా హెక్టారుకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరను కల్పించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. రాజోలు రిజర్వాయర్ కింద 4 వేల ఎకరాల రైతుల భూములకు అవార్డు పాస్ చేశారని పేర్కొ న్నారు. దీంతో పొలాలు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకవేళ రిజర్వాయర్ నిర్మించకపోతే వెంటనే ఆ భూములను డీనోటిఫై చేయాలన్నారు. గిట్టుబాటు ధరలు కల్పించాలి: ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి జిల్లా రైతులు సాగు చేస్తున్న ఉల్లి, మినుము, శనగ, అరటి పంటలకు ప్రభుత్వం తక్షణమే గిట్టుబాటు ధరలు ప్రకటించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కోరారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలతో ఆదుకోవాలన్నారు. ఈ మేరకు తీర్మానం ఆమోదించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న చిన్నచిన్న పనులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. -
ఎస్సీ,ఎస్టీలపై చంద్రబాబు కపట ప్రేమ
● ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి ● వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు ఘన నివాళి కడప కార్పొరేషన్ : ఎస్సీ, ఎస్టీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి విమర్శించారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 69వ వర్థంతి సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లారని, అమరావతి నడిబొడ్డున 18 ఎకరాల్లో రూ.400 కోట్లు ఖర్చు చేసి 225 అడుగుల దేశంలోనే అతిపెద్దదైన అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారని గుర్తు చేశారు. అంబేడ్కర్ స్మృతి వనాన్ని కూటమి ప్రభుత్వం సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ దేశంలో విభిన్న మతాలు, జాతులు, భాషలు ఉన్నా ప్రజలంతా కలిసి కట్టుగా ఉన్నారంటే అది రాజ్యాంగం గొప్పదనమేనన్నారు. అంబేడ్కర్‌ను ఒక వర్గానికి, కులానికి పరిమతం చేయకూడదని, ఆయన విశ్వవ్యాప్తమైన నాయకుడని కొనియాడారు. వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు దళిత వ్యతిరేకి అని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్, లోకేష్‌లు ఆయన విగ్రహానికి దండ కూడా వేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శులు త్యాగరాజు, కె. బాబు, సుబ్బరాయుడు, మాజీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్ కుమార్, నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, పార్టీ నాయకులు దాసరి శివప్రసాద్, రమేష్‌రెడ్డి, షఫీవుల్లా, ఏ1 నాగరాజు, తౌహిద్, సింధేరవి, ఎస్. బాదుల్లా, మహిళా నేతలు రత్నకుమారి, బి. మరియలు, ఎంవీ సుజిత, శ్రీదేవి పాల్గొన్నారు. -
3 టిప్పర్లు సీజ్
ముద్దనూరు : కడప– తాడిపత్రి జాతీయ రహదారిలో శనివారం అధిక లోడ్, సరైన పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్న 3 టిప్పర్లను విజిలెన్స్ ఽఅధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇందులో అధిక లోడుతో వెళుతున్న ఇసుక టిప్పర్లు కూడా ఉన్నాయి. శ్మశాన స్థలంలో మురుగునీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు – పార్టీలకతీతంగా పనులను అడ్డుకున్న నాయకులు, ప్రజలు బద్వేలు అర్బన్ : మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం రోడ్డు చివరలో గల శ్మశాన స్థలంలో చేపట్టిన మురుగునీటి శుద్ధి కర్మాగారం పనులను శనివారం పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు అడ్డుకున్నారు. తమకు వేరేచోట శ్మశానస్థలం చూపించిన తర్వాతనే పనులు చేపట్టాలని తెగేసి చెప్పారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్, అర్బన్ ఎస్ఐ ఘటన స్థలానికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. దీంతో ఆర్డీఓతో మాట్లాడాలని చెప్పి అధికారులు వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే మున్సిపాలిటీ పరిధిలోని 12, 15, 18 వార్డులకు సంబంధించిన ప్రజలు గత 30 ఏళ్లుగా శివాలయం సమీపంలోని 812 సర్వేనెంబరులో గల సుమారు 50 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని శ్మశానంగా వినియోగించుకుంటున్నారు. సదరు స్థలంలో గత ప్రభుత్వ హయాంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ శ్మశానం అభివృద్ధికి రూ.20 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో ప్రజల అవసరాల కోసం బోరు కూడా వేశారు. అయితే ఇటీవల కాలంలో బద్వేలు మున్సిపాలిటీకి మంజూరైన మురుగునీటి శుద్ధి కర్మాగారానికి రెవెన్యూ అధికారులు సదరు శ్మశాన స్థలాన్ని కేటాయించారు. రెండు నెలల క్రితం సంబంధిత కాంట్రాక్టర్ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోగా స్థానికులు అడ్డుకున్నారు. తిరిగి రెండు రోజులుగా సుమారు 5 అడుగుల మేర శ్మశాన స్థలంలో గుంత తీసి పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. దాదాపు మూడు నెలలుగా తమ కాలనీలకు చెందిన ఆరుగురు మృతదేహాలను శ్మశానస్థలంలో పూడ్చిపెట్టామని, వాటి ఆనవాళ్లు కూడా లేకుండా చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. పనులను అడ్డుకున్న విషయాన్ని కాంట్రాక్టర్ ద్వారా తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ వి.వి.నరసింహారెడ్డి, అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ ఘటన స్థలానికి చేరుకుని స్థానికులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే తమకు ప్రత్యామ్నాయంగా శ్మశానస్థలం చూపించేంత వరకు పనులు జరగనివ్వమని తేల్చి చెప్పారు. ఏదైనా ఉంటే రెవెన్యూ డివిజన్ అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇచ్చి అధికారులు అక్కడి నుండి వెనుదిరిగారు. అయితే స్థలం కేటాయించి బాధ్యతగా ఉండాల్సిన రెవెన్యూ అధికారులు ఒక్కరు కూడా ఘటన స్థలం వద్దకు రాకపోవడం గమనార్హం. -
చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్‌పరం చేస్తారు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్యకడప రూరల్ : టీడీపీ కూటమి ఏలుబడిలో చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు.. పీపీపీ అంటూ ప్రైవేటు వ్యక్తులకు కీలక వ్యవస్థలను కట్టబెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నడపలేక పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారేమోనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. శనివారం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు భరోసా, అన్నదాత సుఖీభవ ఇస్తామని హామీలు గుప్పించి నాలుగు విడతలు రూ. 40 వేలకుగాను రూ. 12 వేలు మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. రూ. 25 వేలు పలికిన అరటి టన్ను ధర నేడు రూ. వెయ్యి కూడా పలకకపోవడంతో రైతులు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైద్య విద్యను పీపీపీ విధానమంటూ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై ఈనెల 10వ తేదీన అన్ని జిల్లాల్లో మార్కెట్‌యార్డులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇంటి వద్ద ఆందోళన చేపడతామన్నారు. అదేవిధంగా 18వ తేదీన ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జి.చంద్ర, కార్యవర్గ సభ్యులు ఎన్.వెంకట శివ, జి.వేణుగోపాల్, కేసీ బాదుల్లా, సి.సుబ్రమణ్యం, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కోటి సంతకాలకు అద్భుత స్పందన
కడప కార్పొరేషన్: మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని వారు బలంగా కోరుకుంటున్నారు. ఈ మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అద్భుత స్పందన లభిస్తోంది. జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉండగా ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 60వేల సంతకాలు సేకరిచాలని పార్టీ నిర్దేశించింది. అన్ని చోట్లా లక్షలాదిగా..లక్ష్యానికి మించి ప్రజలు సంతకాలు చేశారు. పులివెందుల, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో లక్ష చొప్పున సంతకాలు సేకరించారు. కడపనియోజకవర్గంలో 70వేలు, మైదుకూరు నియోజకవర్గంలో 50వేలు, బద్వేల్ నియోజకవర్గంలో 60వేలు, కమలాపురం నియోజకవర్గంలో 61వేలు సంతకాలు సేకరించారు. జమ్మలమడుగు నియోజకవర్గానికి 60వేల సంతకాలు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకూ జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం మండలాల్లోనే 26వేల సంతకాలు సేకరించారు. మిగిలిన మండలాల్లో సంతకాల సేకరణ ముమ్మరంగా కొనసాగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చిన సంతకాలను ఈనెల 10న జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి, ఇక్కడి నుంచి ఈనెల 13న పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. అదే రోజు పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. 16వ తేది సాయంత్రం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతర ముఖ్య నేతలు గవర్నర్‌ను కలిసి కోటి సంతకాలను ఆయనకు అందజేయనున్నారు. జిల్లాలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలను ఒకసారి పరిశీలిస్తే...ఇదొక పెద్ద ఉద్యమంలా కొనసాగిందని చెప్పవచ్చు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలు సంతకాల ఉద్యమానికి మద్దతు తెలిపారు. గ్రామాల్లో, వార్డుల్లో, పట్టణాల్లో డివిజన్లలో ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు సంతకాలు చేసి తమ వ్యతిరేకతను ప్రభుత్వానికి చాటి చెప్పారు. ఇంతకుమించి ముందుకెళితే ప్రజా ఉద్యమం ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన చేస్తున్న ఈ యజ్ఞంలో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు పూర్తిస్థాయిలో భాగస్వామ్యమయ్యారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులను సమన్వయం చేసుకుంటూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తే కలిగే నష్టాలను ప్రజలకు వివరించి వారి మద్దతు కూడగట్టడంలో సఫలీకృతమయ్యారు. పులివెందుల, ప్రొద్దుటూరులో లక్ష దాటిన సంతకాలు ఈనెల 10న జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాలు 13న కేంద్ర కార్యాలయానికి...అదేరోజు భారీ ర్యాలీలు 16న గవర్నర్‌కు అందజేయనున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, ముఖ్య నేతలు -
రామయ్య ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తిచేయాలి
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చెందేలా చేయాలని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. శనివారం ఆకేపాడు నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వరకు మహా పాదయాత్రను ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. పలువురు ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. అందులో రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి శ్యామల, జెడ్పీ చైర్మన్ గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా , కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప నగర మాజీ మేయర్ సురేష్ బాబు, కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ రాజంపేట ఇన్చార్జి ఆకేపాటి అనిల్ కుమార్ వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.పాదయాత్ర ఒంటిమిట్టకు చేరుకోగానే ముందుగా ఆకేపాటి, ఆయన కుటుంబ సభ్యులు స్వామి వారికి తలలీలాలు సమర్పించారు.గర్భాలయంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ పూర్తయిన తర్వాత గోవింద దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ ప్రతి ఏటా అన్నమయ్య కాలిబాటలో వేలాది మంది భక్తులతో వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకునే వాడినన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అన్నమయ్య కాలిబాటలో వెళ్లరాదని నోటీసులు జారీ చేసిందన్నారు. తాను వెళ్లదలచుకుంటే ఎవరెన్ని ఆంక్షలు విధించినా వెళ్లే వాడినని, కానీ అలా చేయకూడదనే ఉద్దేశంతో తిరుమల పాదయాత్ర విరమించుకున్నానని తెలిపారు. తాను అధికారంలోకి వస్తే అ న్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయం గురించి ఎందుకు పట్టించుకోలేదని ఆకేపాటి ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కా ర్యదర్శి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన జిల్లా ఎస్పీ
కడప అర్బన్ : కడప స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కడప జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డిని శనివారం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. న్యాయమూర్తి వెంట జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఉన్నారు.దొంగ నోట్ల చలామణిపై పోలీసుల విచారణ– పోలీసుల అదపులోఇద్దరు అనుమానితులు ?ప్రొద్దుటూరు క్రైం : ఇరువురు వ్యక్తులు దొంగనోట్లు చలామణి చేశారన్న సంఘటనపై రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. మండలంలోని శంకరాపురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దొంగనోట్లను చలామణి చేశారని సమాచారం రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఒక మహిళ వద్ద తీసుకున్న డబ్బులో దొంగనోట్లు వచ్చాయని, వాటితో తమకు సంబంధం లేదని వారు పోలీసుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఇరువురు వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ మహిళ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన మహిళ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి స్థిరపడింది. ఆమె ఎక్కడుందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వారి వద్ద నుంచి పోలీసులు కూపీ లాగే పనిలో ఉన్నారు. మహిళ దొరికితే పూర్తి విషయాలు బయటపడతాయి. -
హోమ్ గార్డుల సేవలు అభినందనీయం
కడప అర్బన్ : పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తూ అందరి మన్ననలు చూరగొంటున్న హోమ్ గార్డుల సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కొనియాడారు. 63 వ హోమ్ గార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శనివారం నిర్వహించిన వేడుకలకు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోమ్ గార్డుల పెరేడ్‌ను పరిశీలించి, గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్, నేర దర్యాప్తు, కంప్యూటర్ విధుల్లో ఇలా అన్ని చోట్లా హోమ్‌గార్డులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. హోమ్‌గార్డుల వల్ల పోలీస్ వ్యవస్థకు మరింత బలం వచ్చిందన్నారు. హోమ్‌గార్డుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, సమస్యలేమైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదనపు ఎస్పీ (పరిపాలన) కె.ప్రకాష్ బాబు మాట్లాడుతూ ఒకప్పుడు వలంటరీ ఆర్గనైజేషన్‌గా ప్రారంభమై ప్రస్తుతం హోమ్ గార్డ్స్ సేవలందించని విభాగం లేదంటే అతిశయోక్తి లేదన్నారు. హోమ్ గార్డ్ సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎ.ఆర్. అదనపు ఎస్పీ బి.రమణయ్య మాట్లాడుతూ హోంగార్డులు పోలీసులకు, ప్రజలకు మధ్య వారధిలా విధులు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం విధుల్లో అత్యుత్తమ పనితీరు కనబరచిన హోమ్ గార్డులకు, క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందచేశారు. నవంబర్ నెలలో పదవీ విరమణ పొందిన హోమ్ గార్డ్ (ఏఎ 89) ఎన్.వెంకట సుబ్బయ్య కు జిల్లాలోని హోమ్ గార్డులు స్వచ్ఛందంగా ఒక రోజు వేతనాన్ని అందజేశారు. మొత్తం రూ. 4,12,510 చెక్కును జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వెంకట సుబ్బయ్యకు అందజేశారు. పెరేడ్ అనంతరం పెరేడ్ గ్రౌండ్ నుంచి హోమ్ గార్డుల ర్యాలీని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. డీఎస్పీ నాగేశ్వర రావు, కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు, డీపీఓ ఏ.ఓ. కె.వి. రమణ, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ రేష్మ, ఆర్.ఐ లు శివరాముడు, శ్రీశైల రెడ్డి, టైటస్, సోమశేఖర్ నాయక్, నగరంలోని సి.ఐ లు, ఆర్.ఎస్.ఐ.లు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, హోమ్‌గార్డులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
అన్నదమ్ముల మధ్య ఘర్షణ
బి.కోడూరు : మండలంలోని పెద్దుళ్ళపల్లె గ్రామంలో అన్నదమ్ములు ఇరువురి పొలాల మధ్య ఉన్న గట్టు విషయమై ఘర్షణ పడగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తెరంగాని సుబ్బయ్య కుమారులైన సుబ్రమణ్యం, నాగసుబ్బరాయుడు శుక్రవారం తగదా పడ్డారు. సుబ్రమణ్యం పారతో దాడి చేయడంతో నాగసుబ్బరాయుడు తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడికి బద్వేలు ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బి.కోడూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామంలో విచారణ చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్ కడప అర్బన్ : కడప నగరంలో ఐదు చోరీ కేసుల్లో నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధి మృత్యుంజయకుంటలో నివాసం వుంటున్న ఉదయగిరి పెద్ద కుళ్లాయప్ప అలియాస్ లడ్డు అనే యువకుడికి ఐదు దొంగతనాల కేసుల్లో ప్రమేయముంది. ఇతను గతంలో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు దొంగతనాల కేసులు, ఒక గలాటా కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతను, ఇద్దరు మైనర్లతో కలిసి కడప నగరంలోని శంకరాపురం, ఎర్రముక్కపల్లి, ఎన్జీఓ కాలనీ ప్రాంతాలలో ఐదు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా వున్నాడు. ఈ క్రమంలో అతన్ని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇతని వద్ద నుంచి 4.5 గ్రాముల బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన స్కూటీ, సెల్ఫోన్లను రికవరీ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయడానికి కృషి చేసిన చిన్నచౌక్ ఇన్స్పెక్టర్ ఎ.ఓబులేసు గారు, చిన్నచౌక్ సబ్ ఇన్స్పెక్టర్లు ఎన్. రాజరాజేశ్వరరెడ్డి, పి.రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్, శివకుమార్, కానిస్టేబుళ్లు ఖాదర్ హుస్సేన్, ప్రదీప్ కుమార్, ఓబులేసు, మాధవరెడ్డి, నాగరాజు, సుధాకర్ యాదవ్‌లను కడప సబ్ డివిజినల్ పోలీస్ అధికారి ఏ.వెంకటేశ్వర్లు ప్రశంసించి రివార్డుల కోసం ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌కు సిఫార్సు చేశారు. కడప అగ్రికల్చర్: తుపాను కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కడప, బద్వేల్, జమ్మలమడుగు డివిజన్లలో వర్షం కురిసింది. రాజుపాలెంలో 24.4 మి.మీ, చాపాడు 16.6, దువ్వూరు 16.4, పెద్దముడియం 14.2, ప్రొద్దుటూరు 13, కడప 12.4, గోవపరం 10, కమలాపురం, బద్వేలు 9.6, ఒంటిమిట్ట 9.4, జమ్మలమడుగు 7.4, మైలవరం, మైదుకూరు7.2, సిద్దవటం, పెండ్లిమర్రి 5.2, బిమఠంలో 4.2, చెన్నూరు 3.8, సికెదిన్నె 2.4, కొండాపురం, ముద్దనూరు 2.2, పోరుమామిళ్ల 2, ఖాజీపేట 1.8, వల్లూరు 1.2, ఎర్రగుంట్లలో 1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. – గుండెపోటుతో అయ్యప్ప భక్తుడి మృతి మైదుకూరు : పట్టణంలోని నంద్యాల రోడ్డుకు చెందిన కశెట్టి సాయిచంద్ర(27) అనే అయ్యప్ప స్వామి భక్తుడు శబరిమల నుంచి తిరిగి వస్తూ గుండెపోటుతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో మార్గం మధ్యలో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే సమీపంలోని తిరువన్నమలై మెడికల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయిందని వారు వివరించారు. చిన్న వయసులోనే తమ కుమారుడు మృతి చెందడంతో యువకుని తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. -
● నియోజకవర్గాల తలసరి ఆదాయం
కడప సెవెన్‌రోడ్స్: 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి సవరించిన అంచనాల (ఎఫ్‌ఆర్‌ఈ) ప్రకారం స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో పులివెందుల నియోజకవర్గం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువను జీవీఏ కొలుస్తుంది. ఒక నిర్దిష్ట కాలంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల ఉత్పత్తి విలువను జీవీఏగా పేర్కొంటారు. ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనా వేసేందుకు ఇదొక కీలక సూచిక. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన ఉద్యాన పంటలు, లైవ్‌స్టాక్, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, ఫిషింగ్లలో పులివెందుల నియోజకవర్గం మొత్తం జీవీఏ 6,53,169 లక్షల రూపాయలుగా నమోదై మొదటిస్థానంలో ఉంది. పారిశ్రామిక రంగానికి సంబంధించిన మైనింగ్ అండ్ క్వారీయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, విద్యుత్, గ్యాస్, నిర్మాణ అంశాల్లో 3,43,205 లక్షల రూపాయలతో జమ్మలమడుగు మొదటి ర్యాంకు సాధించగా, 2,19,433 లక్షలతో పులివెందుల రెండవ స్థానంలో ఉంది. ఇక సర్వీసు సెక్టారుకు సంబంధించి ట్రేడ్, రిఫైర్, హోటల్ అండ్రెస్టారెంట్స్, రైల్వేలు, రవాణా, కమ్యూనికేషన్లు, రియల్ ఎస్టేట్, వృత్తి సేవలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిఫెన్స్ వంటి అంశాల్లో కడప నియోజకవర్గం 4,73,042 లక్షలతో మొదటి ర్యాంకులో ఉండగా, 3,09,120 లక్షలతో జమ్మలమడుగు రెండవ ర్యాంకులో నిలిచింది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల మొత్తం సీజీవీఏలో చూస్తే 11,43,074 లక్షలతో పులివెందుల ప్రథమ స్థానంలో ఉంది. జమ్మలమడుగు, కమలాపురం, కడప, మైదుకూరు, బద్వేలు ప్రొద్దుటూరు నియోజకవర్గాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇకపోతే జిల్లాలోని ఏడు నియోజకవర్గాల స్థూల దేశీయోత్పత్తి (సీడీపీ) 53,53,144 లక్షలు. మొత్తం జీవీఏ 49,52,231 లక్షలుగా నమోదైంది. ఇందులో వ్యవసాయ–అనుబంధ రంగాల వాటా 16,18,639 లక్షలు, పారిశ్రామిక రంగ వాటా 12,70,603 లక్షలు, సేవా రంగం వాటా 20,62,989 లక్షలుగా ఉన్నాయి. 2023–24 ప్రస్తుత ధరల ప్రకారం పులివెందుల రూ. 3,55,706లతో తలసరి ఆదాయంలో మొదటిస్థానంలో ఉంది. జమ్మలమడుగు రూ. 2,53,207, కమలాపురం రూ.2,44,911, మైదుకూరు రూ.2,00,644,, బద్వేలు రూ.1,86,786, కడప రూ.1,81,397, ప్రొద్దుటూరు రూ.1,38, 177లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తలసరి ఆదాయంలో లింగాలకు మొదటి ర్యాంకు అట్టడుగు స్థానంలో గోపవరం మండలం జిల్లాలో ఐదు అగ్రశ్రేణి, ఐదు దిగువ శ్రేణి మండలాల గుర్తింపు 2023–24 మొదటి సవరించినఅంచనాల వెల్లడి ఐదు దిగువ శ్రేణి మండలాల్లో 1,34,404 రూపాయలతో 36వ ర్యాంకులో గోపవరం మండలం అట్టడుగు స్థానంలో ఉంది. ఆ తర్వాత 1,35,760 రూపాయలతో 35వ ర్యాంకులో ప్రొద్దుటూరు, 1,41,305 రూపాయలతో 34వ ర్యాంకులో అట్లూరు మండలం, 1,57,237 రూపాయలతో 33వ ర్యాంకులో రాజుపాలెం మండలం, 1,61,309 రూపాయలతో 32వ ర్యాంకులో వీరపునాయునిపల్లె మండలాలు ఉన్నాయి. జిల్లాలో 36 మండలాలు ఉండగా, తలసరి ఆదాయంలో ఐదు అగ్రశ్రేణి మండలాలు, ఐదు దిగువ శ్రేణి మండలాలుగా గుర్తించారు. అగ్రశ్రేణి మండ లాలను పరిశీలిస్తే.. రూ.7,38,828ల తలసరి ఆదా యంతో లింగాల మండలం అగ్రస్థానంలో నిలిచింది. అరటి తదితర ఉద్యాన పంటల సాగు విస్తృతంగా ఉండడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నా రు. ఆ తర్వాత రూ.4,95,955 వేముల మండలం రెండవ స్థానంలోనూ, ఆ తర్వాత 4,08,167 రూపాయలతో సింహద్రిపురం మండలం మూడవస్థానంలో ఉన్నాయి. ఇక 4,07,661 రూపాయలతో పెండ్లిమర్రి మండలం నాల్గవస్థానంలో, 3,96,892 రూపాయలతో ముద్దనూరు మండలం ఐదవ స్థానంలో ఉన్నాయి. -
తెలుగు తమ్ముళ్ల బరితెగింపు
● రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఒక రోడ్డు పని కోసం తెలుగు తమ్ముళ్లు బరి తెగించారు. తాను మంజూరు చేయించుకున్న పని తానే చేయాలని ఒక వర్గం భీష్మించుకోగా.. ఆధిపత్యం కోసం మరో వర్గం అడ్డు పడింది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరు వర్గాలు మోహరించడంతో ఉత్కంఠ నెలకొంది. పోలీసులు సర్ది చెబుతున్నా.. ఓ దశలో ఇరు వర్గాలు రెచ్చి పోయి రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంఘటన శుక్రవారం చక్రాయపేట మండలం కె.రాజుపల్లెలో చోటు చేసుకొంది. చక్రాయపేటకు చెందిన కర్నాటి భరత్‌రెడ్డి కె.రాజుపల్లె వద్ద గ్రావెల్ రోడ్డును మంజూరు చేయించుకున్నారు. రోడ్డు పనులను మొదలుపెట్టేందుకు ఆయన జేసీబీ తీసుకొని రాజుపల్లె వద్దకు వెళ్లాడు. అయితే ఈ రోడ్డు విషయంలో మండల ఇన్చార్జి తాళ్లపల్లె మహేశ్వరరెడ్డి జోక్యం చేసుకొని రాజుపల్లెకు చెందిన శ్రీరామిరెడ్డిని ఎగదోశారు. దీనికి తోడు మండలంలోని టీడీపీ వర్గీయులకు శ్రీరామిరెడ్డికి సహకరించాలని ఫోన్ ద్వారా మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో మండలంలోని పలు ప్రాంతాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు అక్కడికి చేరుకొని పనులను అడ్డుకున్నారు. వేరే ఊరి నుంచి మా వూరికి వచ్చి పనులు చేయొద్దని గొడవకు దిగారు. రాళ్లు రువ్వుకున్నది రెండూ టీడీపీ వర్గాలే అయినప్పటికీ.. ఒక వర్గానికి పోలీసులు మద్దతుగా నిలుస్తున్నారని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా ఇరు వర్గాలు పరస్పరం వాదులాడుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని తరిమి వేశారు. అయితే ఈ విషయంపై ఇరువర్గాలు ఆధిపత్యం దెబ్బతింటుందని భావించి బయటి ప్రాంతాల నుంచి మనుషులను రప్పించుకొన్నారు. మళ్లీ గొడవకు దిగి రాళ్లు రువ్వుకున్నారు. ఈ సంఘటనలో తెలుగు తమ్ముళ్లకు చెందిన వాహనానికి అద్దాలు కూడా పగిలినట్లు సమాచారం. ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్య, ఎస్సై చంద్రశేఖర్ సిబ్బందితో వెళ్లి ఇరువర్గాలను చెదర గొట్టారు. గొడవ సర్దుబాటు అయ్యే పరిస్థితి కనిపించక పోవడంతో రాజుపల్లె వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. -
పేటీఎం మీటింగ్‌కు పేరెంట్స్ కరువు
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, కళాశాలలలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని (పేరెంట్ టీచర్స్ మీటింగ్) నిర్వహించారు. అయితే ఈ సమావేశాలకు చాలా చోట్ల తల్లిదండ్రులు కరువయ్యారు. చాలా పాఠశాలలు, కళాశాలలలో నిర్వహించిన పేరెంట్, టీచర్స్ మీటింగ్‌కు పాఠశాలలు, కళాశాలల్లో పిల్లల సంఖ్య అధికంగా ఉన్నా తల్లిదండ్రులు 20 శాతం కూడా హాజరుకాలేదు. ఈ సమావేశాలకు హాజరైన కూటమి నేతలు తమ ప్రభుత్వ గొప్పలు చెప్పడం తప్ప పిల్లలకు పనికొచ్చే ఏ అంశాలను చెప్పలేదని పలువురు తల్లిదండ్రులు గుసగుసలాడుకున్నారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే కదా ఈ పాఠశాలలన్నీ నాడు– నేడు ద్వారా ఇంతగా అభివృద్ధి చెందాయని మాట్లాడుకోవడం కనిపించింది. జిల్లా వ్యాప్తంగా.. జిల్లావ్యాప్తంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2026 ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో నిర్వహించారు. ఇందులో 1966 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలతోపాటు 24 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, 17 కేజీబీవీలలో, 17 సోసియల్ వెల్ఫేర్ స్కూళ్లలో మరో 4 బీసీ వెల్ఫేర్ స్కూళ్లల్లో సమావేశాలను నిర్వహించారు. స్పందన కరువు... శుక్రవారం కడపలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన పేటీఎం సమావేశానికి తల్లిదండ్రుల నుంచి స్పందన కరువైంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవీ రెడ్డి హాజరయ్యారు. కాగా.. ఈ పాఠశాలలో 800 మందికిపైగా పిల్లలుంటే కేవలం వందలోపే తల్లిదండ్రులు హాజరయ్యారు. కడప ఎడ్యుకేషన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే విద్యా విధానంలో పెను మార్పులు తీసుకొచ్చారని.. నాడు–నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత ఆయనదేనని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడప మున్సిపల్ హైస్కూల్ మెయిన్‌లో నిర్వహించిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు–నేడు ద్వారా పాఠశాలల్లో 90 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. అక్కడక్కడ 10 శాతం మేర పనులు పెడింగ్‌లో ఉన్నాయని ఆ పెండింగ్ పనులను కూటమి ప్రభుత్వం పూర్తిచేసి ఆ భవనాలను పిల్లలకు అందుబాటులోకి తేవాలన్నారు. తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ మీత్యాగం, మీశ్రమ పిల్లల విజయానికి పునాది లాంటిదన్నారు. ప్రతి రోజు పిల్లలను పాఠశాలకు పంపడం, సెల్ఫోన్లకు దూరంగా పెట్టడం, చదువుపై సంపూర్ణ దృష్టి పెట్టేలా చూడాలన్నారు. నేడు దేశానికి సేవలందిస్తున్న వేలాది మంది అధికారులు, డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారేనని అన్నారు. బాగా చదువుకుని పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచిపేరును తేవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. పలుచోట్ల అంతంత మాత్రంగానే హాజరైన తల్లిదండ్రులు జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సమావేశాల నిర్వహణ -
ఉన్నత స్థాయికి ఎదగాలి
మైదుకూరు: ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. మైదుకూరు మండలం వనిపెంటలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో ఆయన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. వారికి ప్రిన్సిపాల్ వి.నిర్మల, ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వాగతం పలికారు. అనంతరం పాఠశాలలో నిర్మించనున్న కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ శిలాఫలకాన్ని కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే పుట్టా ఆవిష్కరించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, సోలార్ సిస్టంతో నిర్మించిన నీటి పథకాన్ని, ఇంటర్మీడియట్ నిర్వహణకు నిర్మించిన నూతన భవన సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని... గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకున్నా ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తూ విద్యాసంస్థలను నిర్వహిస్తుంటే కొన్ని అసాంఘిక శక్తులు వీటిని వాళ్ల చెప్పు చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయని కలెక్టర్ అన్నారు. ఇక్కడ ఉన్న మంచి వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తున్నాయని.. ఇటీవల వనిపెంట గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటనలపై తాను, ఎస్పీ ప్రిన్సిపాల్‌కు భరోసా ఇచ్చినట్టు గుర్తు చేశారు. పాఠశాలలో పిల్లలతోపాటు టీచర్లు కూడా క్రమశిక్షణతో ఉండాలని, తప్పితే అలాంటి వారిపై చర్యలకు వెనుకాడవద్దని చెప్పామన్నారు. ఈ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ కోర్సును ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలల్లో కేవలం ర్యాంకులు మాత్రమే చూస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతోపాటు క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యాన్ని కూడా పెంచేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలను అరికట్టేందుకు తమ వంతు కృషి చేస్తామని కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఈఓ షంషుద్దీన్, బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్, సోషల్ వెల్ఫేర్ అధికారి సరస్వతి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, ఎంపీపీ థామస్, తహసీల్దార్ రాజసింహ నరేంద్ర, ఎంపీడీఓ శ్రీధర్ నాయుడు, ఎంఈఓ పద్మలత తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ -
ఒంటిమిట్ట రామాలయాభివృద్ధికి మాస్టర్ ప్లాన్
ఒంటిమిట్ట/తిరుపతి అన్నమయ్యసర్కిల్: పురాతన ప్రాశస్థ్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. శుక్రవారం స్ధానిక పరిపాలనా భవనంలో అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వచ్చే ఐదు దశాబ్దాల కాలంలో భక్తులు రోజుకు ఎంత మంది రావచ్చు, ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి, భక్తులకు సరిపడేలా మౌళిక సదుపాయాలు, వసతి, రవాణా, చారిత్రక నేపథ్యం ఉట్టిపడేలా, ఆధ్యాత్మికతను పెంపొందించేలా ముందస్తు ప్రణాళికలతో మాస్టర్ ప్లాన్ ఉండాలన్నారు. భక్తుల సౌకర్యార్థం కల్యాణకట్ట, పుష్కరిణి, నక్షత్ర వనాలు, గార్డెనింగ్, పచ్చదనం, ఆధ్యాత్మిక చిహ్నాలు, శ్రీ కోదండరామ స్వామి ప్రాశస్థ్యం నవతరానికి అందించేలా మ్యూజియమ్ సిధ్దం చేయాలన్నారు. ఉద్యానవనాలు, సాంకేతికతను జోడించి డిజిటల్ స్క్రీన్స్, హనుమంతుడి సేవా నిరతి, సాంస్కృతిక కళామందిరం, లైటింగ్, తోరణాలు, చెరువులో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహాం, నాలుగు మాడ వీధుల అభివృద్ధి, సిసి కెమెరాల ఏర్పాటు వంటి అంశాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలన్నారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ, అన్నదానం, గార్డెనింగ్, ఎలక్ట్రికల్ తదితర శాఖల అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన స్కూల్ ఆప్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డాక్టర్ అనిల్ కుమార్ మాస్టర్ ప్లాన్ కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో టిటిడి సీఈ టివి సత్యనారాయణ, ఎస్.ఈ–1 మనోహరం అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ -
అనారోగ్యంతో డీఎస్పీ మృతి
సిద్దవటం/కలసపాడు : సిద్దవటం మండలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న 11వ ఏపీఎస్పీ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ కందుల వెంకటరెడ్డి (60) అనారోగ్యంతో కడప నగరంలోని శ్రీకర ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు బెటా లియన్ పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కలసపాడు మండలం అ క్కివారిపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి 1991 మా ర్చి 18న ఆర్ఎస్ఐగా హైదరాబాద్‌లోని కొండాపూర్ బెటాలియన్‌లో విధుల్లో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 11వ ఏపీఎస్పీ బెటాలియన్‌కు 2020 డిసెంబర్ 23వ తేదీన పదోన్నతిపై డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2024 ఫిబ్రవరి 5న 14వ ఏపీఎస్పీ బెటాలియన్‌కు బదిలీపై వెళ్లి మళ్లీ 11వ బెటాలియన్‌లో 2024 అక్టోబర్ 30న డీఎస్పీగా విధుల్లో చేరారు. బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తూ మండలంలోని మలినేనిపట్నం కాలనీలో నివాసం ఉంటున్నారు. ఊపిరి పీల్చడం కష్టంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయనన్ను గురువారం ఉదయం కడప నగరంలోని శ్రీకర ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 7.55 గంటలకు గుండెపోటు తో మృతి చెందినట్లు ఆయన కుమారుడు రాంసంతోష్‌రెడ్డి తెలిపారు. ఈయన భార్య సుజాత గృహిణి కాగా కుమారుడు రాంసంతోష్‌రెడ్డి ఎంబీఏ పూర్తి చేశారు. కుమార్తె డాక్టర్ భవ్యకు డాక్టర్ సహాన్‌తో ఇటీవల వివాహం చేశారు. ఆయన మృతదేహాన్ని బెటాలియన్ పోలీసులు కుటుంబ సభ్యులతో కలిసి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు స్వగ్రామానికి తీసుకెళ్లారు. విషయాన్ని తెలుసుకున్న బెటాలియన్ కమాండెంట్ ఆనంద్‌రెడ్డి ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మంచి అధికారిని కోల్పోవడం బాధాకర విషయమన్నారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
డ్రాగా ముగిసిన ఏసీఏ జోనల్ మ్యాచ్‌లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–14 జోనల్ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. రెండో రోజు వైఎస్‌ఆర్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ నార్త్‌జోన్–నార్త్‌జోన్ విన్నర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. శుక్రవారం 27 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్‌జోన్ విన్నర్స్ జట్టు 84.3 ఓవర్లకు 203 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. కేపీ శ్రీరామ్ 103, సాయి అర్జున్ 40 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ నార్త్‌జోన్ జట్టులోని రతన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. చరణ్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ నార్త్‌జోన్ 12 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. సాత్విక్ 14 పరుగులు చేశాడు. నార్త్‌జోన్ విన్నర్స్ జట్టులోని చాణక్య సాయి 3 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా రెస్ట్ ఆఫ్ నార్త్‌జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 111, రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసింది. నార్త్‌జోన్ విన్నర్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అధిక్యత సాధించింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్–రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో రోజు 165 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్ జట్టు 77 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. రిషి 69, తాహీర్ 56 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టులోని యూనైస్ 3, నిఖిల్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ సెంట్రల్‌జోన్ జట్టు 76 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. రాజ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 143 బంతుల్లో 26 ఫోర్లతో 139 పరుగులు చేశాడు. లిఖిత్ 50, ఏవీ చరణ్ 61 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్ జట్టులోని తాహీర్ 4 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డాగ్రా ముగిసింది. సెంట్రల్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో సెంట్రల్ జోన్ విన్నర్స్–సౌత్‌జోన్ విన్నర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో రోజు 88 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్‌జోన్ విన్నర్స్ జట్టు 22.5 ఓవర్లకు 91 పరుగులకు ఆలౌట్ అయింది. సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టులోని వికేష్ 5 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టు 58 ఓవర్లకు 210 పరుగులకు ఆలౌట్ అయింది. యాసిన్ సిద్దిఖ్ 76, సీహెచ్ జయవర్దన్నాథ్ 48 పరుగులు చేశారు. సౌత్‌జోన్ విన్నర్స్ జట్టులోని రక్షణ్ సాయి 3, తరుణ్‌కుమార్‌రెడ్డి 3, సంతోష్ 2, హాఫీజ్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్‌జోన్ విన్నర్స్ జట్టు 28 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. రక్షణ్ సాయి 75, కేవీఎస్ మణిదీప్ 36 పరుగులు చేశారు. సెంట్రల్‌జోన్ విన్నర్స్ జట్టులోని రామ్‌కిరణ్ విన్నీ 3, సీహెచ్ జయవర్దన్ 3 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అధిక్యత సాధించింది. శ్రీరామ్, (103 పరుగులు) రాజ్ మోహన్ (139 పరుగులు)రతన్ మనిష్ (5 వికెట్లు) -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సింహాద్రిపురం : పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామంలో అప్పుల బాధ తాళలేక రైతు రుతునూరు నాగేశ్వరరెడ్డి(63) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు నాగవర్ధన్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రైతు నాగేశ్వరరెడ్డికి 2 ఎకరాల పొలం ఉంది. ఇద్దరు కుమారులు, కుమార్తెలను చదివించి పెద్ద చేశారు. మూడు నెలల క్రితం నాగేశ్వరరెడ్డి భార్యకు క్యాన్సర్ వ్యాధి రాగా, వివిధ ఆసుపత్రులలో చికిత్స చేయించి వేలాది రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆమె బెంగుళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులో కంతులు కట్టకపోవడంతో నోటీసులు ఇచ్చారు. పిల్లలను చదివించడానికి అప్పులు చేశాడు. పంటలు పండక అప్పులకు వడ్డీలు తోడై లక్షలాది రూపాయలు బాకీ పడ్డాడు. భార్య ఆరోగ్యం సరిగా లేకపోవడంతో.. బ్యాంక్ అప్పు తీర్చేందుకు డబ్బు సర్దుబాటు కాలేదు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై గురువారం రాత్రి నుంచి కనిపించలేదు. ఆయన కోసం కుటుంబ సభ్యులు గాలించారు. చివరికి ఊరి చివర ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద వేప చెట్టుకు ఉరి వేసుకుని శుక్రవారం కనిపించాడు. ఈ విషయాన్ని ఎస్ఐ రవికుమార్‌కు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నాగేశ్వరరెడ్డి మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురుకులానికి నిధులుబి.కోడూరు : మండలంలోని సగిలేరు వద్ద గల డాక్టర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.75 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఎంపీడీఓ భాస్కర్‌రావు తెలిపారు. శుక్రవారం అందుకు సంబంధించి పాఠశాలలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీడీపీ నాయకుడు రామచంద్రారెడ్డి, పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
దీనీ ఇస్తేమా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలి
కడప సెవెన్‌రోడ్స్/ కడప కోటిరెడ్డి సర్కిల్: జనవరి 23, 24, 25 తేదీల్లో జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి దీనీ ఇస్తేమా కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పక్కాగా చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులు, ఇస్తేమా కమిటీ సభ్యులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డితో కలిసి కొప్పర్తి పారిశ్రామిక వాడ సమీపంలో 350 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్న ఇస్తేమా కార్యక్రమ నిర్వహణా ఏర్పాట్లను పరిశీలించారు. ఇస్తేమా కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈసారి కడప జిల్లాలో నిర్వహిస్తున్న ఇస్తేమా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. కమిటీ సభ్యులు, అధికారులు విధులను బాధ్యతగా నిర్వహించాలన్నారు. కార్యక్రమానికి సంబంధించి రోడ్ మ్యాపు, తాగునీరు, విద్యుత్, మెడికల్, ట్రాఫిక్, బందోబస్తు, ఫైర్ సేఫ్టీ, బ్యారికెట్స్ తదితర మౌలిక అంశాలపై జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ, దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీ పెద్దలు హాజరు కానున్నారని, కార్యవర్గ కమిటీలు సమన్వయ సహకారాలతో ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో జాన్ ఐర్విన్, ఏపీ ఐఐసి జెడ్ఎం శ్రీనివాస మూర్తి, డీపీఓ రాజ్యలక్ష్మి, ఏపీఎస్పీడీసీఎల్ ఎన్ఈ రమణ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ ఏడుకొండలు, ఆర్ అండ్ బి ఎస్ఈ భాస్కర్ రెడ్డి, అధికారులు, కమిటీ కార్యవర్గ సభ్యులు నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త మోసం
● సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుతున్న బాధితులు ● డబ్బు పోగొట్టుకుంటున్న వైనం ● రెండు కేసుల్లో పలువురిని అరెస్టు చేసిన పోలీసులు ● అప్రమత్తంగా వ్యవహరించాలంటున్న నిపుణులు కడప అర్బన్ : సమాజంలో దురలవాట్లకు బానిసలుగా మారి సులభంగా డబ్బులను కాజేయాలనుకునే వారిలో ‘సైబర్ నేరగాళ్లు’ ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు. తాము ఎంచుకున్న మనిషిని దెబ్బతీయాలనుకునే ‘సైబర్ నేరగాళ్లు’ కేవలం సెల్ఫోన్ల ద్వారా.. తమ చాకచక్యంతో కోట్లాది రూపాయలు వివిధ దఫాలుగా కాజేస్తున్నారు. ఇందుకోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి కోవకు చెందినదే డిజిటల్ అరెస్ట్. జిల్లాలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో అనేక సంఘటనలు జరిగినా.. వెలుగులోకి వచ్చిన రెండు కేసుల్లో జిల్లా పోలీసులు పురోగతి సాధించారు. ‘డిజిటల్ అరెస్ట్’కు పాల్పడే విధానం ప్రధానంగా సైబర్ క్రైమ్ బాధితులకు ముఖ్యంగా వృద్ధులకు ఫోన్ చేసి లేక వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా ఫోన్ చేసి వారి ఆధార్ కార్డు చూపించి, మీ మీద ఎక్కువ సిమ్ కార్డ్స్ తీసుకుని కొంత మంది నిందితులు ఢిల్లీ కేంద్రంగా చేసుకుని హ్యూమన్ ట్రాఫిక్, మనీ ల్యాండరింగ్ మీద మీపై కేసు నమోదు అయినట్లు భయపెడతారు. బాధితులు నమ్మే విధంగా వారికి నకిలీ వాట్సాప్ ద్వారా నకిలీ ఎఫ్ఐఆర్ పంపి నిజమైనదిగా నమ్మిస్తారు. ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్లు, అతను మీ పేర్లు చెప్పారని, అందువల్ల మేము మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలియజేస్తారు. నకిలీ పోలీసులైనా.. యూనిఫాం ధరించి.. మీపై ఎఫ్ఐఆర్ నమోదైనందున ఒక రూమ్‌లోకి వెళ్లి ఎవరూ లేకుండా వుండే విధంగా చూసుకుని, గది గడియ పెట్టాలని చెప్పి వాట్సా్ప్ ద్వారా వీడియో కాల్లో విచారణకు హాజరుగా వుండాలని, లేకపోతే వెంటనే ఢిల్లీ పోలీసులు/సీబీఐ అరెస్టు చేస్తారని భయపెడతారు. డిజిటల్ అరెస్టులో వున్నారు కావున మీరు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని, ఒక వేళ చెబితే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్– 1923 కింద 5 ఏళ్లు జైలు శిక్ష అని భయపెడతారు. బాధితులను భయపెట్టాలని కొన్ని నకిలీ సుప్రీంకోర్టు కాపీలను కూడా వాట్సా్ప్ ద్వారా పంపుతారు. బాధితులపై నమోదు అయిన కేసును ఢిల్లీ పోలీసు/సీబీఐ(ముంబై) అని లేక ఢిల్లీ అని చెప్పి అందరూ కూడా నకిలీ పోలీసులు అయినా.. నిజమైన పోలీసులు అని నమ్మించే విధంగా యూనిఫాంలో వుంటారు. అరెస్టు అయిన వ్యక్తిని ఢిల్లీ కోర్టులో హాజరు పెట్టినట్లు, అందుకు బాధితులను కూడా అరెస్టు చేసే విధంగా అరెస్టు వారెంట్ ఇచ్చినట్లు, నకిలీ జడ్జి కూడా వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడి భయపెడతారు. తమను 24 గంటల్లో అరెస్టు చేసి విచారణ చేయాలని జడ్జి, సీబీఐ ఎస్పీ చెప్పినట్లు నమ్మిస్తారు. లేని పక్షంలో 24 గంటలలో సీబీఐ వారితో అరెస్టు చేయిస్తామని పేర్కొంటారు. మొదట ఒక నెల రోజుల పాటు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయరు. తరువాత ఎఫ్ఐఆర్ అయినట్లు అరెస్టు చేస్తారని నమ్మిస్తారు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి.. అరెస్టు నుంచి తప్పించుకోవాలి అంటే మీరు కొంత మొత్తం డిపాజిట్ చేయాలని, ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, వాటి వివరాలు చెప్పాలని అడుగుతారు. విచారణలో మీరు నిర్దోషి అవునో కాదో తేలుతుంది, అంత వరకు అరెస్టు చేయకుండా వుండాలంటే కొంత మొత్తం ఫిక్స్ డిపాజిట్ చేయాలని చెబుతారు. నిర్దోషిగా తేలితే అమౌంట్ తిరిగి మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందంటారు. డబ్బులు ఫిక్స్ డిపాజిట్ చేస్తే వెంటనే చర్యలు తీసుకోరు, అరెస్టు చేయరు, కొన్ని రోజులు వాట్సా్ప్, వీడియో కాల్ ద్వారా విచారణ చేయరు, ఇంకా ఎక్కువ విచారణ కోసం ఈ కేసు దర్యాప్తు చేస్తామని చెప్పి నమ్మిస్తారు. కొన్ని అకౌంట్స్ వివరాలు తెలిపి, వాటికి డబ్బులు ఆర్టీజీఎస్/యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని చెబుతారు. వారి మాటలకు భయపడి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత.. నేరగాళ్లు సెల్‌ఫోన్స్/వాట్సాప్ కాల్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. రెండు కేసులు ఛేదన ● పులివెందుల సబ్ డివిజన్లోని వేంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ రిటైర్డ్ ఎంఈఓను సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మోసం చేశారు. ఈ సంఘటనలో అంతర్ రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాలోని 12 మంది నిందితులను జిల్లా పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 12.58 లక్షల నగదు, 17 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ● పులివెందుల అర్బన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో ప్రశాంతినగర్‌కు చెందిన రిటైర్డ్ టీచర్ ప్రకాశంరెడ్డిని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. ఆయన భయపడి సైబర్‌నేరగాళ్లు తెలిపిన బ్యాంక్ ఖాతాలకు రూ.1కోటి 62లక్షల 83 వేలను పంపించారు. ఈ సంఘటనలో బాధితుడు ప్రకాశంరెడ్డి భయపడి జూన్ 6న గుండెపోటు రావడంతో హఠాత్తుగా మరణించాడు. అతని కుమారుడు హితేష్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితులైన ‘అంతర్ రాష్ట్ర సైబర్ నేరగాళ్ల’ ముఠాలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,05,300 నగదు, 4 సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసు వ్యవస్థలో డిజిటల్ అరెస్టు అనేది లేదు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు ఎప్పుడూ వాట్సాప్ కాల్ చేయరు. కేసులో నిందితులైతే నేరుగా ఇంటికి వచ్చి అరెస్టు చేస్తారు. అనుమానాస్పద కాల్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేనిపక్షంలో వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ ఫిర్యాదుల వాట్సాప్ నంబర్ 9121100686 లేదా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 కు ఫిర్యాదు చేయాలి. – షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఎస్పీ


