● వైఎస్సార్‌సీపీ పోరుబాట.. దిగొచ్చిన సర్కారు | - | Sakshi
Sakshi News home page

● వైఎస్సార్‌సీపీ పోరుబాట.. దిగొచ్చిన సర్కారు

Mar 11 2026 7:47 AM | Updated on Mar 11 2026 7:47 AM

● వైఎస్సార్‌సీపీ పోరుబాట.. దిగొచ్చిన సర్కారు

టైగర్‌ జోన్‌ నెపంతో దశాబ్దాల చరిత్ర

కలిగిన కాశినాయన ఆశ్రమ భవనాలను, సత్రాలను అటవీశాఖ జేసీబీలతో నేలమట్టం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. సనాతన ధర్మ రక్షకుడినని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ పర్యవేక్షణలోని అటవీశాఖే ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. నాడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ క్షేత్ర భూములను అటవీ చట్టం నుంచి మినహాయించాలని కేంద్రానికి లేఖ రాసి అండగా నిలిస్తే.. నేటి చంద్రబాబు ప్రభుత్వం మాత్రం విధ్వంసానికి పూనుకుంది. వైఎస్సార్‌సీపీ పోరుతో దిగొచ్చిన మంత్రి లోకేష్‌ ‘ఎక్స్‌’ వేదికగా క్షమాపణలు చెప్పి, పునర్నిర్మిస్తామని మభ్యపెట్టారు. ఏడాది గడిచినా ఒక్క అడుగు ముందుకు పడకపోగా, భక్తుల సౌకర్యాలను గాలికొదిలేసిన పాలకుల తీరుపై భక్తకోటి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

సాక్షి ప్రతినిధి, కడప: అన్నార్తుల పాలిట అక్షయపాత్ర అయిన కాశినాయన జ్యోతిక్షేత్రంపై కూటమి సర్కారు కక్ష సాధింపునకు దిగింది. ఆధ్యాత్మిక సౌరభంతో విరాజిల్లే ఈ క్షేత్రంపై టైగర్‌ ఫారెస్టు జోన్‌ ముసుగులో విరుచుకుపడింది. దశాబ్దాలుగా ఉన్న భవనాలను జేసీబీలతో కూల్చివేసింది. సనాతన ధర్మ రక్షకుడినని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ పర్యవేక్షణలోని అటవీశాఖే ఈ ఘాతుకానికి సూత్రధారి కావడం గమనార్హం.

సిద్ధుడి తపఃఫలం.. భక్తుల నమ్మకం

జ్యోతి క్షేత్రంలో పురాతన శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. కాశిరెడ్డినాయన అనే సిద్ధుడు బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతనతో దేశాటన చేస్తూ పుణ్యక్షేత్రాల్లో గడిపారు. యోగులు, సిద్ధుల వద్ద దీక్షలు తీసుకున్నారు. పాడుబడ్డ దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయమన్న గురువు ఆదేశాల ప్రకారం జ్యోతి క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయాన్ని 1980 దశకంలో కాశిరెడ్డినాయన జ్యోతిక్షేత్రంలోని పురాతన శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు. వందలాది మందికి నిత్య అన్నదానం చేసేలా ఆశ్రమాన్ని నిర్మించి, అన్నార్తుల పాలిట పెన్నిధిగా మార్చారు. 1995లో ఆయన పరమపదించాక ఇది ’కాశినాయన క్షేత్రం’గా భక్తకోటి హృదయాల్లో నిలిచిపోయింది. ఏటా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి పవిత్ర క్షేత్రంలో గత ఏడాది మార్చిలో ప్రధాన దేవాలయం, సమాధి మినహా దశాబ్దాల చరిత్ర కలిగిన నిర్మాణాలను అటవీశాఖ నిర్దాక్షిణ్యంగా కూల్చివేసింది.

నాడు అండగా నిలిచిన జగన్‌ ప్రభుత్వం

శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు పరిధిలో ఈ క్షేత్రం ఉన్నప్పటికీ, గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భక్తుల ప్రయోజనాలే పరమావధిగా అండగా నిలిచింది. అటవీ చట్టం రాకముందు నుంచే ఇక్కడ ఆలయాలు ఉన్న విషయాన్ని గుర్తించిన నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, క్షేత్ర పరిధిలోని 13 హెక్టార్ల భూమిని అటవీ చట్టం నుంచి మినహాయించాలని అప్పటి కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌కు స్వయంగా లేఖ రాశారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పలుమార్లు కేంద్ర పెద్దలను కలిసి భక్తుల వసతి సౌకర్యాల కోసం విశేష కృషి చేశారు. నాటి పాలకులు రక్షణ కవచంలా నిలిస్తే, నేటి చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వెనుకాముందు చూడకుండా విధ్వంసానికి పూనుకుంది.

గోశాల కూలగొట్టడంతో ఎండలో ఉంటున్న ఆవులు

కాశినాయన క్షేత్రంలో ఏడాది క్రితం కూలిగొట్టిన వసతి గృహాల ఫైల్‌ ఫోటో

సత్రాలు: కుమ్మర సత్రం, ఆచారి సత్రం

గెస్ట్‌ హౌస్‌: శివరంగారెడ్డి

అతిథి గృహం

గోశాల: గోసంరక్షణ కేంద్రం,

పశువుల మేత నిల్వ షెడ్లు

ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై వైఎస్సార్‌సీపీ అప్పట్లో సమరశంఖం పూరించింది. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, అధికార ప్రతినిధి శ్యామల కాశినాయన క్షేత్రాన్ని సందర్శించారు. నిర్మాణాలు పునః నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ, లక్షలాది మంది భక్తుల మనోభావాలపై కూటమి సర్కార్‌ దెబ్బ కొట్టడాన్ని ఎలుగెత్తి నినదించారు. వైఎస్సార్‌సీపీ ప్రత్యక్ష పోరాటానికి శ్రీకారం చుట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా హిందు సంఘాలు, పలువురు పీఠాధిపతులు కాశినాయన క్షేత్రంలో కట్టడాలు కూలగొట్టడంపై నిరశన గళమిప్పడంతో కూటమి సర్కార్‌ దిగొచ్చింది.

క్షమాపణలకే పరిమితమైన లోకేష్‌!

తీవ్ర దుమారం రేగడంతో మంత్రి నారా లోకేష్‌ ‘ఎక్స్‌’ వేదికగా క్షమాపణలు చెప్పి, సొంత ఖర్చులతో పునర్నిర్మిస్తామని ప్రకటించి మమ అనిపించారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం క్షేత్రాన్ని తమ శాఖలో విలీనం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ఆర్భాటంగాా ప్రకటించారు.

తీరా ఏడాది గడిచినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కళ్యాణకట్ట రేకుల షెడ్‌ మాత్రమే మంత్రి నారా లోకేష్‌ పీఏ పరిశీలించి నిర్మించారని స్థానికులు వాపోతున్నారు. అటు పునర్నిర్మాణం లేదు, ఇటు విలీనం లేదు.. కూటమి పాలకుల తీరు ‘చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి విధ్వంసక పనులు’ అన్నట్లుగా ఉందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేలమట్టమైన చారిత్రక కట్టడాలివే

జ్యోతిక్షేత్రంలో ఏడాది క్రితం అటవీశాఖ విధ్వంసకాండ

నాడు రక్షణగా నిలిచిన జగన్‌ ప్రభుత్వం.. నేడు జేసీబీలతో నేలమట్టం

టైగర్‌ జోన్‌ నెపంతో దశాబ్దాల నాటి భవనాల ధ్వంసం

పవన్‌ ఇలాఖాలోసనాతన ధర్మానికి తూట్లు!

లోకేష్‌ ‘ఎక్స్‌’ క్షమాపణలు..ఆనం హామీలు నీటిమూటలే!

వైఎస్సార్‌సీపీ పోరుతో దిగొచ్చినా..ఏడాదైనా పునర్నిర్మాణం శూన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement