ది బార్కరీ బుక్‌ : పెట్స్‌ కోసం ఒక బేకరీ, ఒక పుస్తకం! | The BARKERY BOOK Delicious DIY Treats for Your Dogs by Gaargi Prehar | Sakshi
Sakshi News home page

ది బార్కరీ బుక్‌ : పెట్స్‌ కోసం ఒక బేకరీ, ఒక పుస్తకం!

May 2 2026 2:50 PM | Updated on May 2 2026 2:57 PM

The BARKERY BOOK Delicious DIY Treats for Your Dogs by Gaargi Prehar

 ప్రేమతో వండి పెట్‌దాం!

‘ది బార్కరీ బుక్‌’..

ఇంట్లో పెంచుకునే కుక్కలను చాలా మంది పెంపుడు జంతువుల్లాగ కాకుండా కుటుంబ సభ్యులతో సమానంగా ట్రీట్‌ చేస్తుంటారు. అయితే, వాటికి ఆహారం అందించే విషయంలో ఇప్పటికీ చాలా మంది యజమానులు గందరగోళానికి గురవుతుంటారు. మార్కెట్లో దొరికే  ప్యాక్‌ చేసిన తినుబండారాలు మంచివో కాదో తెలియక ఆందోళన చెందుతుంటారు. అందుకే ఈ సమస్యకు ఓ అద్భుతమైన పరిష్కారాన్ని కనిపెట్టారు వ్యాపారవేత్త గార్గి ప్రేహర్‌. వాటికోసం ఒక బార్కరీ (బేకరీ)ని స్థాపించారు. అంతేకాదు వంటగదిలో లభించే పదార్థాలతో వాటికి సురక్షిత ఆహారం ఎలా అందించాలి అనే అంశాలపై ‘ది బార్కరీ’ (The BARKERY BOOK) అనే పేరుతో బుక్‌ను కూడా రాశారు. 

గార్గి ప్రేహర్‌ ( Gaargi Prehar) ముంబైకి చెందిన మహిళా వ్యాపారవేత్తపారిస్‌లో ఎంబీఏ పూర్తిచేసింది. భారతదేశానికి తిరిగి రావడానికి ముందు ఆమె పలు దేశాల్లో ఉన్నతస్థాయిలో పనిచేసింది. అంతలోనే ఆమెకు వచ్చిన ఆలోచన ఆమె జీవితాన్నే మలుపు తిరిగేలా చేసింది. పెంపుడు జంతువుల కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే ఆమెకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. అందుకోసం ప్రత్యేకంగా పర్సనలైజ్డ్, గ్లూటెన్‌–ఫ్రీ కేకులు, తీపి పదార్థాలను తయారు చేయడం ప్రారంభించింది. 

ఇదీ చదవండి: పెరుగన్నం, మామిడి పండు కలిపి తింటే ఇన్ని కష్టాలా?

పప్‌–లార్డ్స్‌ బార్కరీ
2019లో ముంబైలో పప్‌–లార్డ్స్‌ బార్కరీ అనే తన పాటిస్సేరీని ఆమె స్థాపించారు. ప్రతి వేడుకలోనూ మూగజీవాలను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ఆమె దీన్ని ప్రారంభించారు. ఇక్కడ పెంపుడు జంతువులకు సురక్షితమైనవి మాత్రమే కాకుండా, వాటి ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను తయారు చేస్తారు. వాటిల్లో కేకులు, స్నాక్స్, బేక్‌ చేసిన కుక్కీలు, సేవరి జెర్కీలు అన్నీ లభిస్తాయి. కుక్కల కోసం ప్రత్యేకంగా తయారు చేయగల బీర్, వైన్, గ్లూటెన్‌–ఫ్రీ  జైలిటోల్‌–ఫ్రీ వంటి ప్రత్యేకమైన వంటకాలు కూడా ఈ బేకరీలో తయారు చేస్తారు. ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి బాలీవుడ్‌ సెలబ్రిటీల వరకు ఈ బేకరీ నుంచి కేకులను తీసుకువెళ్తుంటారు. 

ది బార్కరీ బుక్‌
పెంపుడు జంతువులకు అందించే ఆహారం తయారీపై ఆమె ఒక పుస్తకాన్ని కూడా రాశారు. అదే ‘ది బార్కరీ బుక్‌’. వంటగదిలో ప్రతిరోజూ లభించే పదార్థాలతో పెంపుడు జంతువుల కోసం పోషకమైన ఆహారాన్ని ఎలా తయారు చేయాలో ఈ పుస్తకం నేర్పిస్తుంది. మనుషులు తినే ఏ ఆహార పదార్థాలు కుక్కలకు హాని చేస్తాయి? వాటికి ప్రత్యామ్నాయంగా ఏవి వాడాలి? అనే విషయాలను గార్గి ఇందులో స్పష్టంగా వివరించింది. భారతదేశంలో పెంపుడు జంతువుల ఆహారం కోసం రూ΄÷ందించిన మొదటి పుస్తకం ఈ ది బార్కరీ బుక్‌.

ఇదీ చదవండి: రూ. 2 వేల నుంచి కోటి టర్నోవర్‌ దాకా : హోంమేకర్‌ సక్సెస్‌ స్టోరీ

భారతదేశపు మొదటి డాగ్‌ కుక్‌బుక్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డాగ్‌ లవర్స్‌కు పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెరుగుతున్న ఈ తరుణంలో, ఈ పుస్తకం ఒక విప్లవాత్మక మార్పుగా నిలుస్తుంది. అలాగే విజయం అంటే కేవలం సంపాదన మాత్రమే కాదు, సమాజంలో మనం తీసుకువచ్చే ఒక మార్పు. ఎవరినీ కించపరచకుండా, నొప్పించకుండా సున్నితంగా వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం. అదే నేను చేశాను. సాధించాను. అదే నా గెలుపు.  –   గార్గి ప్రేహర్‌ 

ఇదీ చదవండి : షాకింగ్‌ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్‌ సూసైడ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement