Politics

‘నేను పేర్లు చెప్పలేను...కాళేశ్వరం కంటే పెద్ద స్కాం’
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఊరు మన బడి పథకంలో పెద్ద స్కాం జరిగిందని ఎంఐఎం ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. అది కాళేశ్వరం కంటే పెద్ద స్కామ్ అని పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) అసెంబ్లీ వేదికగా మన ఊరు మన బడి అంశానికి సంబంధించి మాట్లాడారు. ‘ మన ఊరు మన బడి పథకంలో పెద్ద స్కాం జరిగింది. మన ఊరు మన బడి లో ఏమి పని జరగలేదు...జరిగిన దానికి నిదులు విడుదల కాలేదు. మన ఊరు మన బడి పథకంలో బెంచీల కొనుగోళ్లలో స్కాం జరిగింది. ఈ స్కాం పై ప్రశ్న వేద్దాం అనుకుంటే ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారు. రూ. 14, రూ. 18, రూ. 20వేల ఒక్కో బెంచ్ కొన్నారు. రూ. 5వేలకు ఒక బెంచ్ వస్తది...20వేల పెట్టీ కొన్నారు. బెంచీల కొనుగోళ్ల పై ఈ ప్రభుత్వం విచారణ చేయించాలి.నేను పేర్లు చెప్పలేని...కాళేశ్వరం కంటే పెద్ద స్కాం. నిధులను లూటీ చేశారు.. 32లక్షల బెంచీలను కొనుగోలు చేశారు. పెద్ద స్కాం చేశారు. దానికి సంబంధించి ఒకరు అప్పుడు BRS తో ఉన్నారు...ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు’ అని అక్బరుద్దీన్ విమర్శించారు.

టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చీప్ పాలిటిక్స్
సాక్షి, కృష్ణాజిల్లా: పెనమలూరులో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దిగజారుడు రాజకీయాలకు తెర లేపారు. వేసవిలో ప్రజలకు దాహం తీర్చేందుకు చలివేంద్రం పెట్టిన వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. నాలుగు రోజుల క్రితం యనమలకుదురులో అభయ హస్త సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు చలివేంద్రం ఏర్పాటు చేశారు.చలివేంద్రాన్ని పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ప్రారంభించారు. వైఎస్సార్‌షీపీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడంతో బోడే ప్రసాద్ కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఎమ్మెల్యే బోడే ఆదేశాలతో చలివేంద్రం తీసేవేయించాలని మున్సిపల్ కమిషనర్‌కు టీడీపీ నాయకుడు వీరంకి కుటుంబరావు ఫిర్యాదు చేశారు.కమిషనర్ సమక్షంలోనే అక్రమంగా క్రేన్‌తో చలివేంద్రం తొలగించారు. చలివేంద్రం నిర్వాహకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. చలివేంద్రం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఆరేపల్లి ఈశ్వర్ రావును కాలర్ పట్టుకుని మరీ బయటికి లాగి పడేసిన పోలీసులు ఆయనను బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ప్రశాంత్‌రెడ్డి Vs కోమటిరెడ్డి.. అసెంబ్లీలో RRRపై రచ్చ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. ట్రీపుల్ఆర్పై కాంగ్రెస్‌ది అసత్య ప్రచారమంటూ ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ట్రిపుల్ ఆర్ కోసం కష్టపడింది బీఆర్ఎస్సే. 15 నెల్లలో మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. 2017లో అనుమతి వస్తే అప్పుడే ఆగిపోయిందని ప్రచారమా? అంటూ ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడుతూ.. ట్రిపుల్ ఆర్‌పై మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు. ‘‘మేం ఓఆర్ఆర్ కడితే మీరు అమ్ముకున్నారు. ఎన్నికల ముందు రోడ్లు అమ్ముకునే పరిస్థితికి తెచ్చారు. 2014 నుంచి మీరు వేసిన రోడ్లకు డబ్బుకు మేం కడుతున్నామని కోమటిరెడ్డి అన్నారు.మన ఊరు-మన బడి పథకంలో భారీ స్కాం: అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. మన ఊరు-మన బడి పథకంలో పెద్ద స్కాం జరిగిందన్నారు. ‘మన ఊరు మన బడిలో ఏ పని జరగలేదు. జరిగిన దానికి నిధులు విడుదల కాలేదు. మన ఊరు-మన బడి పథకంలో బెంచీల కొనుగోళ్లలో స్కాం జరిగింది. ఈ స్కాం పై ప్రశ్న వేద్దాం అనుకుంటే ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారు. 14, 18, 20 వేల ఒక్కో బెంచ్ కొన్నారు. బెంచీల కొనుగోళ్ల పై ఈ ప్రభుత్వం విచారణ చేయించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.నేను పేర్లు చెప్పలేని...కాళేశ్వరం కంటే పెద్ద స్కాం. నిధులను లూటీ చేశారు.. 32లక్షల బెంచీలను కొనుగోలు చేశారు. ఐదు వేలకు ఒక బెంచ్ వస్తది. 20 వేల పెట్టీ కొన్నారు. పెద్ద స్కాం చేశారు...అప్పుడు బీఆర్ఎస్తో ఉన్నారు.. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు.’’ అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.

మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు.. లావుకు పేర్ని స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,గుంటూరు: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరని మాజీ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు మెప్పు కోసం ఎంపీ లావు లోక్‌సభలో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్నినాని మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరు. పార్లమెంటును అడ్డు పెట్టుకుని కక్షసాధింపు రాజకీయాలు చేయటం మానుకోవాలి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీగా లిక్కర్ స్కాం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు లిక్కర్ షాపులను చెరపట్టారు. ప్రతిచోటా బెదిరించి కమీషన్లు, లంచాలు తీసుకుంటున్నారు. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వీటిపై పార్లమెంటులో మాట్లాడాలివైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేలకోట్లు దేశం దాటి వెళ్లినట్టు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపణలు చేశారు. అప్పుడు ఆయన మా పార్టీలోనే ఉన్నారు కదా? మరెందుకు మాట్లాడలేదు?.లావు శ్రీకృష్ణ దేవరాయలు ఫ్లెమింగో పక్షిలాంటివాడు.టీడీపీ గూటిలో చేరి చంద్రబాబు మాటలను చిలక పలుకులుగా మాట్లాడుతున్నారు. పల్నాడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని శ్రీకృష్ణ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడితే ఉపయోగ పడుతుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను ఆపటానికి, పోలవరానికి నిధులు తేవటానికి తన అధికారాన్ని వాడుకుంటే మంచిది. రాయలసీమ లిఫ్టు ఎత్తిపోతల పథకం కోసం వాడితే మంచిది.దక్షినాది రాష్ట్రాల్లో తగ్గబోతున్న సీట్ల గురించి మాట్లాడాలి.కనీసం పల్నాడులో నీటి ఎద్దడి గురించి కూడా మాట్లాడటం లేదు.కేవలం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవటమే లావు శ్రీకృష్ణ దేవరాయలు పనిగా పెట్టుకున్నారు.ఇప్పుడు లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని టీడీపీ నేతలే చెరబట్టారు.కమీషన్లు, వాటాల కోసం వ్యాపారుల గొంతు మీద కత్తి పెట్టారు.చంద్రబాబు, లోకేష్ తో సహా అందరూ దోపిడీ చేస్తున్నారు. ఇదికదా అసలైన లిక్కర్ స్కాం అంటే? ఇవేమీ కనపడటం లేదా శ్రీకృష్ణ దేవరాయలూ? అవినీతి, అక్రమాలు చేసిన చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది.దానిపై ఐటీ శాఖ పూర్తి విచారణ ఎందుకు చేయటంలేదో శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నించాలి.పాపపు సొమ్ము చంద్రబాబుకి చేరిందని ఈడీ చెప్పింది.దానిపై శిక్షలు వేయమని శ్రీకృష్ణ దేవరాయలు గట్టిగా అడగాలి.స్కిల్ స్కాం విచారణ మొదలవగానే చంద్రబాబు పిఏ శ్రీనివాస్ దుబాయ్ ఎందుకు పారిపోయాడో ప్రశ్నించాలి. శ్రీనివాస్ పదేపదే దుబాయ్ ఎందుకు వెళ్తున్నాడో? ఆయన వెనుకే లోకేష్ ఎందుకు వెళ్తున్నాడో ప్రశ్నించాలి.బేవరేజ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో తప్పుడు వాంగ్మూలం తీసుకుని వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేయాలని చూస్తున్నారు.ఏదోలా వైఎస్ జగన్ మీద అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేదే లేదని’ స్పష్టం చేశారు.
Sports

ముల్లాన్‌పూర్‌లో మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్!
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్ వేదికల వివరాలు బహిర్గతమయ్యాయి. ముల్లాన్‌పూర్ (పంజాబ్)లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియం ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుందని సమాచారం. 34 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంగల ఈ స్టేడియం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు రెండో హోంగ్రౌండ్‌గా ఉంది.ముల్లాన్పూర్తోపాటు విశాఖపట్నం, తిరువనంతపురం, ఇండోర్, రాయ్‌పూర్‌లలో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ముల్లాన్‌పూర్, తిరువనంతపురం, రాయ్‌పూర్‌లలో ఇప్పటి వరకు మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగలేదు. » అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ ఈ ఏడాది సెపె్టంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు జరగనుంది. అయితే ఈ తేదీలను ఐసీసీ, బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. » ఎనిమిది దేశాల మధ్య వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆతిథ్య దేశం భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఇప్పటికే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించాయి. » ఏప్రిల్ 9 నుంచి 19 వరకు లాహోర్‌లో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా చివరి రెండు జట్లు ఖరారవుతాయి. క్వాలిఫయింగ్ టోర్నీలో పాకిస్తాన్, వెస్టిండీస్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, థాయ్‌లాండ్ జట్లు పోటీపడనున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తే మెగా టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తారు. పాకిస్తాన్ జట్టు ఆడే మ్యాచ్‌లను శ్రీలంక లేదా యూఏఈలలో నిర్వహిస్తారు. » భారత్ నాలుగోసారి మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. గతంలో భారత్ 1978, 1997, 2013లలో ఈ మెగా టోర్నీని నిర్వహించింది. ఇప్పటి వరకు వన్డే వరల్డ్‌కప్ 12 సార్లు జరగ్గా... భారత్ రెండుసార్లు (2005, 2017) రన్నరప్‌గా నిలిచింది.

పంజాబ్ తొలి పంచ్
కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ తొలి విజయం నమోదు చేసుకుంది. బ్యాటర్ల జోరుకు బౌలర్ల సహకారం తోడవడంతో... ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ పంజా విసిరింది. ఆరంభంలో ప్రియాంశ్ ఆర్య మెరుపులు... చివర్లో శశాంక్ సింగ్ ఫినిషింగ్ టచ్... ఇన్నింగ్స్ ఆసాంతం శ్రేయస్ అయ్యర్ దూకుడు... వెరసి పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేయగా... ఛేదనలో తగ్గేదేలే అన్నట్లు బాదిన గుజరాత్ చివరకు 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పోరులో పంజాబ్ 11 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై గెలిచింది. మొదట పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 97 నాటౌట్; 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోగా... ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 47; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ సిక్సర్లతో రెచ్చిపోగా... శశాంక్, ప్రియాంశ్ ఆర్య బౌండరీల మోత మోగించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయికిషోర్ 3 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 232 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించగా... కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ ఇన్నింగ్స్... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో 28 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే మరో ఎండ్‌లో ప్రియాంశ్ దూకుడు కనబర్చడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇన్నింగ్స్ రెండో బంతికి ఫోర్‌తో ఖాతా తెరిచిన ప్రియాంశ్... సిరాజ్ వేసిన మూడో ఓవర్లో 6, 4 బాదాడు. అయ్యర్ వచ్చిరాగానే 4, 6తో చాంపియన్స్ ట్రోఫీ ఫామ్ కొనసాగించగా... ఐదో ఓవర్లో ప్రియాంశ్ 4, 4, 6, 4 కొట్టాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ 73/1తో నిలిచింది. ఆ తర్వాత గుజరాత్ బౌలర్లు కాస్త ఒత్తిడి పెంచడంతో పరుగుల రాక మందగించగా... సాయికిషోర్ వరుస బంతుల్లో అజ్మతుల్లా (16), మ్యాక్స్‌వెల్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. ఎదుర్కొన్న తొలి బంతికే మ్యాక్స్‌వెల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే రివ్యూలో బంతి వికెట్ల మీద నుంచి వెళ్తున్నట్లు తేలింది. 2 రివ్యూలు ఉన్నా పంజాబ్ సరైన సమయంలో వినియోగించుకోలేక స్టార్ బ్యాటర్ వికెట్ కోల్పోయింది. అవన్నీ మరిపించేలా అయ్యర్, శశాంక్ ఆఖర్లో బౌండరీలతో రెచ్చిపోయారు. సాయికిషోర్ ఓవర్లో 2 సిక్సర్లు బాదిన శ్రేయస్... రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనూ రెండు సిక్స్‌లు కొట్టాడు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన స్టొయినిస్ (20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా సాయికిషోర్‌కు వికెట్ సమర్పించుకోగా... ప్రసిధ్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో శ్రేయస్ 6, 4, 6, 6 కొట్టి 90 పరుగుల మీదకు చేరాడు. మరో 3 ఓవర్ల ఆట మిగిలి ఉండటంతో ఐపీఎల్లో అయ్యర్ తొలి సెంచరీ ఖాయమే అనుకుంటే... ఆఖర్లో అతడికి ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 18వ ఓవర్లో 6, 4, 6 కొట్టిన శశాంక్ సింగ్.. చివరి ఓవర్లో 5 ఫోర్లు బాది జట్టుకు భారీ స్కోరు అందించాడు. చివర్లో చిత్తు... భారీ లక్ష్యం కళ్లెదురుగా ఉన్నా... గుజరాత్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. నాలుగో ఓవర్లో గిల్ 6, 6, 4తో మోత ప్రారంభించగా... సుదర్శన్ దాన్ని కొనసాగించాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా బంతి తన పరిధిలో ఉంటే దానిపై విరుచుకుపడ్డాడు. వేగంగా ఆడే క్రమంలో గిల్ వెనుదిరగగా... బట్లర్ చక్కటి షాట్లతో అలరించాడు. ఫలితంగా 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 104/1తో నిలిచింది. ఈ క్రమంలో సుదర్శన్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 11వ ఓవర్లో బట్లర్ 2 సిక్స్‌లు కొట్టగా... తదుపరి ఓవర్లో సుదర్శన్ 4, 6, 4 బాదాడు. సుదర్శన్ ఔటయ్యాక ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన రూథర్‌ఫర్డ్ కూడా అలరించాడు. చివర్లో వైశాఖ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో... లక్ష్యంవైపు సజావుగా సాగుతున్న గుజరాత్ ఒక్కసారిగా వెనుకబడింది. చివరి ఓవర్లో టైటాన్స్ విజయానికి 27 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు 15 పరుగులే చేసింది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాంశ్ ఆర్య (సి) సాయి సుదర్శన్ (బి) రషీద్ 47; ప్రభ్‌సిమ్రన్ (సి) అర్షద్ (బి) రబడ 5; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 97; అజ్మతుల్లా (సి) అర్షద్ (బి) సాయికిషోర్ 16; మ్యాక్స్‌వెల్ (ఎల్బీ) (బి) సాయికిషోర్ 0; స్టొయినిస్ (సి) అర్షద్ (బి) సాయికిషోర్ 20; శశాంక్ సింగ్ (నాటౌట్) 44; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 243. వికెట్ల పతనం: 1–28, 2–79, 3–105, 4–105, 5–162. బౌలింగ్: సిరాజ్ 4–0– 54–0; రబడ 4–0–41–1; అర్షద్ 1–0–21 –0; రషీద్ 4–0–48–1; ప్రసిధ్ కృష్ణ 3–0–41–0; సాయికిషోర్ 4–0–30–3.గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 74; గిల్ (సి) ప్రియాంశ్ (బి) మ్యాక్స్‌వెల్ 33; బట్లర్ (బి) యాన్సెన్ 54; రూథర్‌ఫర్డ్ (బి) అర్ష్ దీప్ 46; తెవాటియా (రనౌట్) 6; షారుక్ (నాటౌట్) 6; అర్షద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 232. వికెట్ల పతనం: 1–61, 2–145, 3–199, 4–217, 5–225, బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–36–2; అజ్మతుల్లా 2–0–29–0; యాన్సెన్ 4–0–44–1; మ్యాక్స్‌వెల్ 2–0–26–1; స్టొయినిస్ 2–0–31–0; చహల్ 3–0–34–0; వైశాఖ్ 3–0–28–0. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X కోల్‌కతావేదిక: గువాహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

పంజాబ్‌తో మ్యాచ్.. పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో 11 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(74), జోస్ బట్లర్(54) రూథర్ ఫర్డ్(46) పోరాడినప్పటకి తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్(33) తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ కొండంత లక్ష్యాన్ని కరిగించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు, జానెసన్, మాక్స్వెల్ తలా వికెట్ సాధించారు.శ్రేయస్ అయ్యర్ విధ్వంసం..అంతకుముందు బ్యాటింగ్ చేసిన బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్( 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్‌తో పాటు శశాంక్ సింగ్(16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), ప్రియాన్ష్ ఆర్య(47) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, రబాడ తలా వికెట్ సాధించారు. శ్రేయస్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.

మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2025 సీజన్‌ను పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ పేలవంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాక్స్వెల్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. స్పిన్నర్ సాయి కిషోర్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ప్రయత్నించి వికెట్ల ముందు మాక్స్వెల్ దొరికిపోయాడు. ఒకవేళ మాక్సీ రివ్యూ తీసుకుని ఉండి ఉంటే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునేవాడు. ఎందుకంటే బంతి రిప్లేలో వికెట్స్‌ను మిస్ అవుతున్నట్లు తేలింది. తర్వాత డగౌట్ నుంచి రిప్లే చూసిన మాక్సీ షాకయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో డకౌటైన మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక డకౌట్లు అయిన ఆటగాడిగా మాక్స్వెల్ నిలిచాడు. ఈ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఐపీఎల్లో ఇప్పటివరకు 19 సార్లు డకౌటయ్యాడు. ఇంతకుముందు ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో రోహిత్ శర్మ(18), దినేష్ కార్తీక్(18)లో కలిసి మాక్సీ సంయుక్తంగా ఉన్నాడు. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో ఈ చెత్త రికార్డును తన ఒక్కడి ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్( 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ మూడు, రబాడ, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: 'సెల్ఫ్‌లెస్ శ్రేయస్ అయ్యర్' .. జట్టు కోసం సెంచరీ త్యాగం
National

నువ్వు కూర్చో.. పార్టీ మీ ఆయనది
పట్నా: బిహార్ శాసన మండలిలో మంగళవారం సీఎం నితీశ్ కుమార్, మాజీ సీఎం రబ్డీదేవి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఆర్జేడీ ఎమ్మెల్సీలు పచ్చ రంగు బ్యాడ్జీలు ధరించి సభలోకి రావడం, ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో సీఎం నితీశ్ కోపంతో ఊగిపోయారు. ఎమ్మెల్సీల బ్యాడ్జీలను మీడియాకు చూపుతూ ఆయన..ఇలాంటివి ఆర్జేడీలోనే సాధ్యమంటూ ఎద్దేవా చేశారు.ఆ పార్టీ నేత, మాజీ సీఎం రబ్డీదేవి జోక్యం చేసుకునేందుకు యత్నించగా నితీశ్ బిహారీ యాసలో..‘నువ్వు కూర్చో..నీకేమీ తెలియదు. ఆర్జేడీ నీదికాదు, నీ భర్తది. ఈ విషయంలో నీ జోక్యం వద్దు’అంటూ అడ్డుకున్నారు. అంతటితో ఆగక.. ‘ఈమెకు ఏమీ తెలియదు. కష్టాల్లో చిక్కుకు న్నప్పుడు భర్త(లాలూ)ఈమెను సీఎంను చేశాడు’అని పేర్కొన్నారు. 1997లో సీఎంగా ఉన్న లాలు ప్రసాద్ దాణా కుంభకోణంలో ఇరుక్కుని, సీఎం కుర్చీపై భార్య రబ్డీని కూర్చోబెట్టడం తెల్సిందే.ఇటీవలి కాలంలో రబ్డీదేవి, నితీశ్ మధ్య తరచూ మాటల యుద్ధం జరుగుతోంది. గంజాయి మత్తులో సభకు వచ్చిన సీఎం నితీశ్, నాతోపాటు మహిళలను సైతం అవమానిస్తూ మాట్లాడారు’అంటూ రబ్డీదేవి ఆరో పించారు. ఓ కార్యక్రమానికి వెళ్లిన నితీశ్ జాతీయ గీతాలాపనను పట్టించుకోకుండా పక్కనున్న వారి తో సరదాగా మాట్లాడుతూ కన్పించడంతో ‘మానసికంగా అనర్హుడు’ అంటూ రబ్డీదేవి వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.

‘ఇది పార్లమెంట్ సాక్షిగా జరిగిన అన్యాయం’
ఢిల్లీ పార్లమెంట్లో అరకు కాఫీస్టాల్ ప్రారంభోత్సవానికి స్థానిక పార్లమెంట్ సభ్యురాలిగా తనపట్ల వివక్ష చూపడం, కనీసం ఆహ్వానం లేకపోవడం అత్యంత బాధాకరమని అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, గొల్ల బాబూరావులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్‌లోనే అణగారిన, వెనుకబడినవర్గాలకు అవమానం జరగడం దారుణమని అన్నారు. గిరిజన ఎంపీనైనందుకే అవమనించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదా అని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. అటువంటి కాఫీస్టాల్‌ను పార్లమెంట్లో ప్రారంభించే సందర్బంగా కనీసం అరకు ఎంపీగా ఉన్న నాకు ఆహ్వానం వస్తుందని ఆశించాను. అలాగే కనీసం కాఫీగింజలను పండించే పదిమంది గిరిజన రైతులను ఈ కార్యక్రమానికి పిలిస్తే, అద్భుతమైన ఈ కాఫీ రుచుల వెనుక వారి శ్రమ ప్రపంచానికి తెలిసేది. అరకుకే ప్రత్యేకమైన గిరిజన థింసా నృత్యాన్ని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించి వుంటే జాతీయ స్థాయిలో గిరిజన సంస్కృతికి ఒక పరిచయ వేదికగా మారేది. అరకు అంటే కేవలం కాఫీ మాత్రమే కాదు సహజసిద్దమైన ఔషదగుణాలు ఉన్న పసుపు, అరుదైన సుగంధద్రవ్యాలు కూడా. ఇవ్వన్నీ పార్లమెంటేరియన్లకు పరిచయం చేసే సందర్భంగా ఆ కాఫీస్టాల్ ప్రారంభోత్సవం ఉండేది. కానీ దీనికి భిన్నంగా కేవలం ఎంపిక చేసుకున్న వారితోనే ఈ స్టాల్‌ను ప్రారంభించారు. కావాలనే స్థానిక ఎంపీగా ఉన్న నాకు ఆహ్వానం లేకుండా చేశారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్నాము. అలాగే ప్రధానమంత్రికి లేఖ రాస్తున్నాము. ఈ వివక్షపై పార్లమెంట్ నుంచి సమాధానం వస్తుందని ఆశిస్తున్నాను.రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ..పార్లమెంట్లో అరకు కాఫీస్టాల్ ప్రారంభోత్సవంకు ఏపీ నుంచి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, ఏపీకి చెందిన కొందరు ఎంపీలను ఆహ్వానించారు. స్టాల్ ప్రారంభించిన తరువాత స్పీకర్ సహా ఎంపీలు కాఫీని సేవించి, దాని రుచిని గురించి ప్రశంసించారు. ఈ సందర్బంలో స్థానిక అరకు ఎంపీని ఎందుకు ఆహ్వానించలేదని ఎవరూ ప్రశ్నించకపోవడం దారుణం. గిరిజన మహిళ కావడం వల్లే ఆమెను అవమానించేందుకు ఆహ్వానించలేదా? వైయస్ఆర్సీపీ నుంచి గెలవడం వల్లే పిలవలేదా? పార్లమెంట్‌లోనే ఇటువంటి పరిణామాలు బాధాకరం’ అని అన్నారు గొల్ల బాబూరావు

ఓలా సీఈవోపై కునాల్ కమ్రా సూపర్ పంచ్‌లు
ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా (Kunal Kamra) ఇటీవల ముంబైలో నిర్వహించిన షో వివాదాస్పదమైంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను అవమానించారంటూ ఆయన మద్దతుదారులు కునాల్‌పై విరుచుకుపడుతున్నారు. కునాల్ షో నిర్వహించిన ముంబైలోని యూనికాంటినెంటల్ హోటల్ హాబిటాట్ స్టూడియోపై షిండే వర్గీయులు దాడికి పాల్పడ్డారు. కునాల్ కమ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. షిండేపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు కునాల్ క్షమాపణ చెప్పాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. తాను క్షమాపణ చెప్పబోనని, తనపై పెట్టిన కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానని కునాల్ స్పష్టం చేశారు.ఇదిలావుంటే తన షోలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, అజిత్ పవార్ (Ajit Pawar) సహా పలువురు ప్రముఖులపై కునాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. వ్యాపార ప్రముఖులను కూడా ఆయన వదల్లేదు. ముఖ్యంగా ఓలా సీఈవో భవిశ్ అగర్వాల్‌పై వేసిన సెటైర్లు బాగా పేలాయి. గతంలో వీరిద్దరి మధ్య ట్విటర్లో మాటల యుద్ధం నడిచింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు సరైన సర్వీసు అందించడం లేదని వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను భవిశ్ దృష్టికి తీసుకురాగా, ఆయన వెటకారంగా స్పందించారు. తమ సర్వీసు సెంటర్‌కు వచ్చి పనిచేస్తే, ఫ్లాప్ షోకు వచ్చిన దానికంటే ఎక్కువ డబ్బు ఇస్తానని కునాల్‌ను భవిశ్ అగర్వాల్ వెటకరించాడు. ఈ నేపథ్యంలో కునాల్ తాజా షోలో భవిశ్పై సెటైర్లు వేశాడు.‘భారత వ్యాపారవేత్తలు తాము తప్పు చేసినప్పుడు కూడా ఒప్పుకోరు. ఉదాహరణకు, ఓలా వ్యక్తిని తీసుకోండి. నేను ఏమి చెప్పినా అతడికి ఎందుకు కోపం వచ్చేస్తుంది? వారు ద్విచక్ర వాహనాలను తయారు చేస్తారు, కానీ వారి చక్రాలు రెండూ పనిచేయవు. అయినప్పటికీ, 'మాతో కలిసి పని చేయండి, మనమంతా కలిసి భారతదేశాన్ని నిర్మిద్దాం' అని అతడు నాతో అంటాడు. ఈ వ్యాపారవేత్తలందరికీ ఈ కోరిక ఎందుకు కలిగిందో? మీరు మంచి బైక్‌ను తయారు చేయలేరు కానీ, మొత్తం దేశాన్ని నిర్మించాలనుకుంటున్నారా? మీ ఆకాంక్షలను అదుపులో ఉంచుకోండి. సమస్యను పరిష్కరించడానికి బదులుగా, అతను కొత్త బైక్ రంగులను ప్రారంభించాడు. బహుశా వేరే రంగు సమస్యను అద్భుతంగా పరిష్కరిస్తుంది కాబోలు. డీటాక్స్ అవసరమైన చోట, వారు బోటాక్స్ అందిస్తున్నారు. నాకు డబ్బు ఇస్తానని అతడు అన్నాడు. అదేదో మీ కంపెనీ నుంచి రిఫండ్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇవ్వొచ్చుగా.ఓలా (Ola) గురించి ట్వీట్ చేయడం మానేశాను. ఎందుకంటే నా కారణంగానే ఓలా షేర్లు పతనమవుతున్నాయని జనాలు నిందిస్తున్నారు. నేను నా ట్వీట్లు రాశాను, అతడు తన ట్వీట్లు రాశాడు. నేను ఎప్పుడూ ఓలాలో ఉద్యోగాన్ని అంగీకరించలేదు. ఓలా సీఈఓతో గొడవ తర్వాత కస్టమర్లు నాకు ట్యాగ్ చేయడంతో పాటు నేరుగా మెసేజ్‌లు కూడా పంపించారు. వినియోగదారుల రక్షణ కోసం ఉద్దేశించిన ప్రభుత్వం సంస్థలు శక్తిహీనంగా మారాయి. బాధితులు ఓలా యజమాని దగ్గరకు వెళతారు, అతడు మోదీ జీతో ఫోటో చూపిస్తాడు, వారు వెనక్కి తిరిగి వెళ్లిపోతారు! నేనేం చేయాలి?” అని కునాల్ కమ్రా చమత్కరించారు. కాగా, ఇన్ఫోసిస్ సుధామూర్తి, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాపైనా కునాల్ సెటైర్లు వేశారు. చదవండి: చట్టం అందరికీ సమానమేనా?.. స్టూడియో విధ్వంసంపై కునాల్ కమ్రా

శివసేన టార్గెట్‌గా కునాల్ కమ్రా వీడియో
ముంబై: నగరంలోని హబిటాట్ స్టూడియోను శివసేనకు చెందిన కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా(Kunal Kamra).. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. తన స్టూడియోను శివసేన సేనకు చెందిన కొంతమంది ఎలా ధ్వంసం చేశారో చూపిస్తూ తన యూట్యూబ్ చానల్ లో వీడియోను పోస్ట్ చేశారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యానించిన తర్వాత కునాల్ కమ్రా.. ఈ వీడియోను ప్రజల్లోకి తీసుకొచ్చాడు.కునాల్ కమ్రాకు షోలు చేసే ముంబైలోని హాబిటాట్ స్టూడియోను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి ఒక వర్గానికి చెందిన వ్యక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్టూడియోపై విరుచుకుపడ్డారు.మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై కమ్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జరిగిన పరిణామాల నేపధ్యంలో శివసేన కార్యకర్తలు స్టూడియోపై దాడిచేయడం, ఆ తరువాత ముందస్తు నోటీసు లేకుండా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేతలకు పాల్పడింది. ఇదిలా ఉండగా, షిండేపై చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎమ్మెల్యే ముర్జి పటేల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కునాల్ కమ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
International
NRI

అమెరికాలో గుడివాడ యువకుడి బలవన్మరణం
హైదరాబాద్, సాక్షి: అమెరికాలో ఆంక్షలు ఓ భారతీయుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేశాయి. ఉద్యోగం పొగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులకు తాళలేక చివరకు ఓ తెలుగు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి.. అంత్యక్రియల విరాళాలు చేపట్టిన సోదరుడి పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.అభిషేక్ కొల్లి(Abhishek Kolli) స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ దొండపాడు. పదేళ్ల కిందట అభిషేక్ సోదరుడు అరవింద్‌తో కలిసి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. ఏడాది కిందట వివాహం జరగ్గా భార్యతో పాటు అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌లో ఉంటున్నాడు. అయితే ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అవి తాళలేక డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అభిషేక్ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన అతని భార్య.. చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్లకు సమాచారం అందించింది. వాళ్లంతా చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు, వలంటీర్లు అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల అంతా గాలించారు. అయితే చివరకు మరణాన్ని సోదరుడు అరవింద్ ఆదివారం ధృవీకరించారు. మృతదేహాన్ని సొంత ప్రాంతానికి తరలించడానికి దాతలు సాయానికి ముందుకు రావాలని గోఫండ్‌మీ ద్వారా ఆయన ప్రయత్నిస్తున్నారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని నాట్స్ టీం దర్శించుకుంది. ఆ తిరుమలేశుడి హుండీలో నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను సమర్పించి ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంది. తెలుగు వారి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆ శుభకార్య ఆహ్వాన పత్రికను ఆ తిరుమలేశునికి సమర్పించడం ఓ సంప్రదాయంలా వస్తుంది. అమెరికాలో ప్రతి రెండేళ్లకు జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ శుభకార్యంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమలను నాట్స్ టీం దర్శించుకుని ఆహ్వాన పత్రికను వేంకటేశ్వరునికి సమర్పించింది. జులై4,5,6 తేదీల్లో టంపా వేదికగా అమెరికా తెలుగు సంబరాలను జరగనున్నాయి. ఇందులో మన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడుకి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి పాల్గొన్నారు.అమెరికా తెలుగు సంబరాలకు రండి తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానంఅమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరుతూ నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించింది. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాట్స్ బృందం కలిసింది. అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసి తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరింది. తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది.ముఖ్యమంత్రులను కలిసిన నాట్స్ బృందంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు, తదితరులు పాల్గొన్నారు.

ఏయూ హాస్టల్‌కి నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత మంచాలు
ఆంధ్ర యూనివర్సీటీలో విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో, ఆంధ్ర యూనివర్సీటీ పూర్వ విద్యార్థి తాళ్లూరి పూర్ణ చంద్రరావుల ఆర్ధిక సహకారంతో మంచాలను విరాళంగా ఇచ్చారు. ఆంధ్ర యూనివర్సీటీలో కొత్తగా నిర్మించిన విశ్వేశ్వరయ్య వసతి గృహానికి కూడా ఆర్థిక చేయూతను అందించారు. మరిన్ని NRI వార్తలకోం ఇక్కడ క్లిక్ చేయండి!విద్యార్ధులకు నిద్రకు ఇబ్బంది లేకుండా అల్యూమినియంతో తయారుచేసిన 432 మంచాలను తయారు చేయించి ఏయూ హాస్టల్‌కి బహుకరించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ బోర్డు మాజీ ఈసీ సభ్యులు, శ్రీనివాస్ బొల్లు, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ బోర్డ్ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ అరసడ,నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, గ్లో సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

నాట్స్ తెలుగు సంబరాలు సినీ ప్రముఖులకు ఆహ్వానం
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ బృందం పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించింది. హైదరాబాద్‌లో తొలుత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావును కలిసి నాట్స్ 8 వ అమెరికా తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది.నాట్స్ సంబరాలకు ముఖ్య అతిధిగా రాఘవేంద్రరావును కోరింది. ఆ తర్వాత వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్‌ను కలిసి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ని కూడా నాట్స్ బృందం కలిసి సంబరాలకు ఆహ్వానించింది. జూలై 4, 5, 6 తేదీల్లో టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని కోరింది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు థమన్‌ను కూడా నాట్స్ బృందం కలిసింది. నాట్స్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా థమన్ కూడా గుర్తు చేసుకున్నారు. అమెరికా తెలుగు సంబరాలకు థమన్ తప్పనిసరిగా రావాలని నాట్స్ ఆహ్వానించింది.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!సినీ దర్శకులు హరీశ్ శంకర్, మోహర్ రమేశ్‌లను కూడా కలిసి నాట్స్ ఆహ్వాన పత్రికలు అందించింది. సినీ ప్రముఖుల ఆహ్వానాలు అందించే కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమీటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు తదితరులు పాల్గొన్నారు.
Sakshi Originals

ఏఐ ఉందా జాబ్ ఇంద..
సాక్షి, స్పెషల్ డెస్క్: ‘ఒకప్పుడు ఐటీలో ఉద్యోగం చేయాలంటే ఆఫీసుకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనం లేదా కారు ఉంటే సరిపోయేది. ఇప్పుడలా కాదు. అభ్యర్థికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానం తప్పనిసరి..’ఇవి ఒక ప్రముఖ కంపెనీ హెచ్ఆర్ హెడ్ చేసిన వ్యాఖ్యలు. ఆయన మాటలు ప్రస్తుత జాబ్ మార్కెట్లో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. సంప్రదాయ విద్యార్హతలకు మించి మార్కెట్‌కు తగ్గట్టుగా ఉద్యోగులూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటేనే విజయం సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏఐ రెడీ వర్క్‌ఫోర్స్ ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఒక్క భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు ఉంది. సాంకేతిక పురోగతి వైపు ప్రపంచ జాబ్ మార్కెట్ పయనిస్తోంది. కంపెనీల లేఆఫ్‌లకు కారణాల్లో ఒకటైన ఏఐ.. కొత్త ఉద్యోగ అవకాశాలకూ వేదిక అవుతోంది. భారత్‌లో 2027 నాటికి ఏఐలో 23 లక్షల ఉద్యోగావకాశాలు వెల్లువెత్తుతాయని బెయిన్ అండ్ కంపెనీ ఇటీవలి నివేదికలో వెల్లడించింది. నిపుణుల సంఖ్య మూడేళ్లలో 12 లక్షలకు చేరుకుంటుందని, కొరత 10 లక్షలకు పైమాటే అని వివరించింది. బడా కంపెనీల్లో లేఆఫ్స్..ఏఐ సృష్టిస్తున్న ప్రభంజనం ప్రభావం లేఆఫ్స్ రూపంలో కనిపిస్తోంది. కంపెనీల ఆదాయాల్లో వృద్ధి లేకపోవడం, ఉత్పాదకత పడిపోవడం, వ్యయాలు అధికం కావడం, లాభాల కోసం ఇన్వెస్టర్ల ఒత్తిడి.. ఉద్యోగుల తీసివేతలకు కారణమవుతున్నాయి. టెక్నాలజీ కంపెనీలకు అగ్రరాజ్యంగా చెప్పుకునే యూఎస్‌లో ఉద్యోగుల తీసివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. 2025లో ఇప్పటివరకు 89 టెక్ కంపెనీలు అంతర్జాతీయంగా సుమారు 23,400 మందిని ఇంటికి పంపించాయి. వీటిలో గూగుల్, మెటా, డిస్నీ, సిటీ గ్రూప్, హెచ్‌పీ, వాల్‌మార్ట్, ఫోర్డ్, స్టార్‌బక్స్ వంటి దిగ్గజాలు ఉన్నాయి. అమెజాన్ 18 వేల మందికి, ఐబీఎం 9 వేల మందికి, బోయింగ్ 10% మందికి ఉద్వాసన పలుకుతున్నాయని సమాచారం. సేల్స్‌ఫోర్స్ 30% మందిని ఇంటికి పంపనున్నట్టు తెలుస్తోంది. 2024లో 549 కంపెనీలు 1.52 లక్షల మందికి గుడ్‌బై చెబితే.. 2023లో ఏకంగా దాదాపు 1,200 కంపెనీలు 2.64 లక్షల మంది టెకీలను సాగనంపాయి. యూఎస్‌లో టెక్, సంబంధిత రంగాల్లో నిరుద్యోగిత రేటు 2022తో పోలిస్తే 2024లో 2.9 నుంచి 4.4 శాతానికి చేరుకుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సర్వే ప్రకారం 41 శాతం అంతర్జాతీయ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వచ్చే ఐదేళ్లలో శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. భారత్‌లో అంత లేదు.. భారత్‌లో ఐటీ కంపెనీలు నిశ్శబ్దంగా లేఆఫ్‌లు చేపడుతున్నాయి. ఒక్క బెంగళూరులోనే ఏడాదిలో 50,000 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని సమాచారం. అయితే తీసివేతలు ఆందోళన కలిగించే స్థాయిలో లేవన్నది నిపుణుల మాట. హైదరాబాద్‌లో మాత్రం కంపెనీలు గతంలో మాదిరి ఇబ్బడిముబ్బడిగా కాకుండా ఆచితూచి నియామకాలు చేపడుతున్నాయి. టీసీఎస్ 1,80,000 నియామ కాలకు శ్రీకారం చుట్టింది. ఇక మొత్తం లేఆఫ్‌లలో ఏఐ ప్రభావానికి గురైనవి 10% మాత్రమేనట. కరోనా కాలంలో కంన్జ్యూమర్ టెక్‌పై వ్యయాలు పెరగడంతో అందుకు తగ్గట్టుగా కంపెనీలు నియామకాలు చేపట్టాయి. నాటి రిక్రూట్మెంట్లో పరిమిత నైపుణ్యం గల వారు సైతం ఉన్నారు. వీరి వల్ల ఉత్పాదకతలో అసమతుల్యత ఏర్పడి కంపెనీలు క్లయింట్ల ఆగ్రహానికి లోనయ్యాయి. ఇటువంటి వారిపైనే ఇప్పుడు కత్తి వేలాడుతోంది. మరోవైపు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) భారత్‌కు వెల్లువెత్తుతున్నా యి. ఈ కేంద్రాల్లో రిక్రూట్మెంట్ కొనసాగుతోంది. ప్రతి ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండాలి ప్రీమియం, క్వాలిటీ స్కిల్స్ ఉన్నవారికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఏఐ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ కొరత ఉంది. డిమాండ్‌కు తగ్గ నైపుణ్యం పెంచుకోవడమే ఇప్పుడున్న మార్గం. కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగానైనా నైపుణ్యం అందిపుచ్చుకోవాలి. టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే. – వెంకారెడ్డి, హెచ్ఆర్ రంగ నిపుణులు క్యాంపస్‌లోనే కొట్టాలి.. విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే జాబ్ కొట్టాలి. విఫలం అయితే కాస్త కష్టపడాల్సిందే. దొరికినా రూ.2.5 లక్షల లోపు వార్షిక ప్యాకేజీతోనే. నైపుణ్యం ఉన్నవారికి జీసీసీలు అధిక వేతనాలు ఆఫర్ చేస్తున్నా యి. నియామకాల్లో జీసీసీల హవా కొనసాగుతోంది. – నానబాల లావణ్య కుమార్, కో–ఫౌండర్, స్మార్ట్‌స్టెప్స్

వెల్లువలా ఫిర్యాదులు
సాక్షి నెట్వర్క్:⇒ పింఛన్ ఇప్పించాలంటూ వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల వేడుకోలు..!⇒ తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ కాళ్లరిగేలా తిరుగుతున్న గిరిజనులు..!⇒ రేషన్ కార్డులు, ఇళ్ల కోసం నెలల తరబడి ఆరాటంతో ఎదురు చూస్తున్న పేదలు..! ⇒ అడుగు ముందుకు పడని భూముల మ్యుటేషన్లు.. పాస్‌బుక్‌లు అందక రైతన్నల గగ్గోలు..! ⇒ స్థలాలు ఆక్రమణలకు గురై తీవ్ర ఆందోళనలో సామాన్యులు..! ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ అందక చదువులు మధ్యలో ఆగిపోయిన పిల్లలు..!ఇంతమంది ఇన్ని సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నా పరిష్కారం లభిస్తుందనే భరోసా ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఓ ప్రహసనంగా.. సమస్యల నిలయంగా మారింది! కలెక్టర్ నుంచి జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటున్న ఈ వేదిక ప్రజలకు ఏమాత్రం భరోసా కల్పించలేకపోతోంది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు తరలి వస్తున్న వారితోపాటు కార్యాలయాలను కుప్పలు తెప్పలుగా ముంచెత్తుతున్న అర్జీలే ఇందుకు సాక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కడ చూసినా సమస్యలతో సతమతమవుతూ నెలల తరబడి తిరుగుతున్నవారే కనిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిష్కార వేదికల వద్దకు వచ్చిన వారిని ‘సాక్షి’ ప్రతినిధుల బృందం పలుకరించగా ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపించాయి. గత ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం కల్పిస్తూ అడుగులు ముందుకు వేసిందని, గ్రామ స్థాయిలో ఇంటి వద్దకే పౌర సేవలను అందచేసిందని గుర్తు చేసుకున్నారు. ఏ కారణం చేతనైనా సరే.. అర్హుల్లో ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా లబ్ధి చేకూరేలా ఏటా రెండుసార్లు జాబితాను సిద్ధం చేసి సచివాలయాల్లో పారదర్శకంగా ప్రదర్శించి వలంటీర్ల ద్వారా ఇంటికే పథకాలను చేరవేసిందని చర్చించుకోవడం కనిపించింది.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రామలింగం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురానికి చెందిన ఆయన కుమారుడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 32లో 89 సెంట్లను రామచంద్రుడు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. ఇందులో 44 సెంట్ల భూమిని ఈశ్వరయ్య అనే వ్యక్తికి విక్రయించాడు. మిగిలిన 45 సెంట్ల భూమికి పాస్‌బుక్ కోసం వెళితే మూడు సార్లు సర్వే కోసం చలానా కట్టించుకున్నారు. సర్వేయర్ ఒక్కసారి కూడా వచ్చి సర్వే చేయలేదు. కోర్టు పరిధిలో భూమి ఉందంటూ దాట వేస్తున్నారు. దీంతో బాధితుడు నాలుగైదుసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నమ్మలు తన కుమారుడిని పాలిటెక్నిక్ చదివిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యం వారిపై ఒత్తిడి తెస్తోంది. దీంతో అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడ నుంచి దివ్యాంగుడైన తండ్రి సాయంతో కలెక్టరేట్‌కు వచ్చింది. కాలేజీకి ఫీజు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందించింది. నిరుపేదనైన తాను ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చే ఫీజుల డబ్బులతోనే కుమారుడిని చదివిస్తున్నానని, ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని చిన్నమ్మలు వాపోయింది.⇒ చిత్రంలో కనిపిస్తున్న గిరిజనులు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుణదతీలేసు పంచాయతీ పరిధిలోని లాబేసు గ్రామం వాసులు. వీరంతా నిరుపేదలు. గ్రామానికి చెందిన18 మంది గిరిజన రైతులు సర్వే నంబర్ 16, 11లోని కొంత ప్రభుత్వ భూమిలో తుప్పలు తొలగించి 1995 నుంచి పంటలు పండిస్తున్నారు. సాగు హక్కు పట్టాలు మంజూరు చేయాలంటూ తొమ్మిది నెలలుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు.నేను చచ్చిన తరువాత పింఛన్ ఇస్తారా? పెన్షన్ కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. కలెక్టరేట్‌కు వస్తే సచివాలయానికి వెళ్లమంటారు. అక్కడికి వెళితే మళ్లీ ఇక్కడికే పొమ్మంటారు. అసలు పెన్షన్ ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వబోమంటే మా పని ఏదో చేసుకొని బతుకుతాం. పేదలను ఇలా తిప్పుకోవడం మంచిది కాదు. నేను చచ్చిన తరువాత పెన్షన్ ఇస్తామంటే ఏం లాభం? గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల మంజూరు చాలా చక్కగా ఉండేది. – మద్దయ్య, బి.తాండ్రపాడు, కర్నూలు మండలం, కర్నూలు జిల్లాఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు బండిపై బాదంపాలు విక్రయిస్తూ జీవిస్తున్నా. ఒంటరి మహిళను. ఈ ఏడాది జనవరి 22వ తేదీన చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కారు ఢీకొనడంతో కాలు, చేయి విరిగాయి. ఆపరేషన్‌కు రూ.లక్ష ఖర్చు అయింది. ఇప్పటికీ నడవలేకపోతున్నా. నిందితుడిని గుర్తించి, పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. ప్రమాదానికి కారకుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. –షేక్ సైదాబీ, కావూరు లింగంగుంట్ల, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లాముళ్ల పొదల్లో మృతదేహాలను మోసుకుంటూ..మా గ్రామం నుంచి నంద్యాల వెళ్లే రహదారిలో మాంటిస్సోరి స్కూల్ వెనుక భాగంలో 70 సెంట్ల హిందూ శ్మశాన వాటిక స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అక్కడకు వెళ్లాలంటే రహదారి లేదు. పొలం గట్లపై, ముళ్ల పొదల్లో భయంభయంగా మృతదేహాలను మోసుకుంటూ తీసుకెళ్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే నాథుడే లేరు. – చాపిరేవుల గ్రామస్తులు, నంద్యాల జిల్లా

పడిపోతే.. ఫట్
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. ముఖ్యంగా శరీర నిర్మాణానికి ఆధారంగా నిలిచే ఎముకలు చాలా త్వరగా పటుత్వాన్ని కోల్పోతున్నాయి. చిన్నగా కాలు తడబడి కింద పడితే చాలు.. ఫట్‌మంటూ విరిగిపోతున్నాయి. ఇక ద్విచక్ర వాహనాల పైనుంచి పడితే మల్టిపుల్ ఫ్రాక్చర్లు అవడం అనేది సర్వసాధారంగా మారిపోతోంది. చిన్నారుల నుంచి మూడు పదుల వయస్సు కూడా నిండని యువతలో సైతం ఎముకలు పటుత్వం తగ్గుతోంది.ఎముకలు గుల్లబారడం, బలహీనపడటం, తేలికగా విరిగిపోయే స్థితిని వైద్య పరిభాషలో (ఆస్టియోపొరోసిస్) అంటారు. పౌష్టికాహార లోపం, వయోభారం, కాల్షియం, డి–విటమిన్ లోపం దీనికి ప్రధాన కారణాలని ఆర్థోపెడిక్ సర్జన్లు (ఎముకల శస్త్రచికిత్స నిపుణులు) చెబుతున్నారు. వీటికి తోడు హార్మోన్ల అసమతుల్యత, వారసత్వ (జెనిటిక్) ప్రభావం, మద్యపానం, ధూమపానం, శారీరక వ్యాయామం లేకపోవడం కూడా ఎముకల ఆరోగ్యంపై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, కాకినాడయువతలో సైతం.. ఒకప్పుడు ఆరు పదుల వయస్సు మీద పడినా చాలా మందిలో ఎముకలు బలహీన పడటమనే సమస్య ఉండేది కాదు. మారిన జీవన విధానంతో ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఆహార విధానంలో వస్తున్న మార్పులు ఎముకల పటుత్వాన్ని దెబ్బ తీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్లనే ఈ సమస్య ఇప్పుడు అన్ని వయస్సుల వారిలోనూ కనిపిస్తోందని అంటున్నారు. యువతలో ఈ సమస్య ఉంటే జువైనల్ ఆస్టియోపొరోసిస్ అని వైద్య పరిభాషలో పిలుస్తారు.ఆహారంలో పోషకాల లోపం ఉండటం, రోడ్డు పక్కన ఆహారం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, హార్మోన్లు అవసరమైన స్థాయిలో ఉత్పత్తి కాకపోవడం, స్టెరాయిడ్ల వంటి మందులు అధికంగా వినియోగించడం, రుమటాయిడ్ ఆర్ర్థరైటిస్, లూపస్ వంటి వ్యాధుల బారిన పడిన యువతీయువకులు ఎముకల పటుత్వం కోల్పోతున్నారని వైద్యులు నిర్ధారించారు. కాల్షియం లోపంతో పుట్టడం వలన కూడా ఎముకలు గుల్లబారుతుండటం ఇటీవల ఎక్కువైందని ఇటీవల కాకినాడ జీజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగ వైద్యుల పరిశీలనలో తేలింది. మహిళల్లో సైతం.. యువత తరువాత ఈ సమస్య మహిళల్లో తీవ్రంగా కనిపిస్తోందని వైద్యులు నిర్ధారించారు. ప్రతి ఐదుగురు మహిళల్లో కనీసం ఇద్దరు ఆస్టియోపొరోసిస్‌తో బాధ పడుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన మహిళల్లో రుతుచక్రం ఆగిపోయే (మెనోపాజ్) దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతూంటుంది. దీనివలన ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. అదే పురుషుల్లో అయితే 60 సంవత్సరాలు దాటిన వారిలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. మహిళల్లోనే ఎక్కువగా ఎముకలు గుల్లబారడానికి హార్మోన్ల లోపం, శారీరక నిర్మాణం, జీవనశైలి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు.పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎముకలు సన్నగా, సున్నితంగా ఉండటం కూడా మరో కారణమని అంటున్నారు. గర్భిణుల్లో ఉండే కొద్దిపాటి కాల్షియాన్ని గర్భంలో ఉండే బిడ్డకు కూడా అందుతుంటుంది. దీనివల్ల కూడా వారిలో ఎముకల పటుత్వం తగ్గుతుంది. అలాగే, పిల్లలకు పాలిచ్చే సమయంలో పోషకాహారం లేకపోవడంతో శరీరంలో కాల్షియం నిల్వలు తగ్గిపోయి, ఎముకలు గుల్లబారుతుంటాయి. పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్ (పీసీఓడీ), థైరాయిడ్, గర్భాశయ తొలగింపు (హిస్టరెక్టమీ) వంటి వాటి వలన హార్మోన్లలో విపరీతమైన అసమతుల్యత ఏర్పడి, మహిళల్లో ఎముకలు గుల్లబారుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.అప్రమత్తతే ఆయుధంచిన్నచిన్న గాయాలైనప్పుడు తక్కువ ఒత్తిడితో కూడా ఎముకలు విరిగిపోతుంటాయి. నడుము, వెన్నెముక, కాళ్లలో దీర్ఘకాలిక నొప్పులు, వెన్నెముక దెబ్బతినడం, ఎముకలు కుచించికుపోయి ఎత్తు, పొడవు తగ్గడం, నడుము, మోకాళ్లు, భుజాల జాయింట్లలో నొప్పి, నిస్సత్తువ వంటి లక్షణాలున్న వారు వైద్యుల సూచనల మేరకు తప్పనిసరిగా తగిన పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా బోన్ మినరల్ డెన్సిటీ (బీఎండీ), ఎముకల క్షీణతను గుర్తించే ఎక్స్‌రే, ఎంఆర్ఐ స్కాన్, కాల్షియం, విటమిన్–డి స్థాయి అంచనా వేసేందుకు రక్త, మూత్ర పరీక్షల వంటివి తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.50 ఏళ్ల వయస్సు దాటిన మహిళలు, 65 ఏళ్లు పైబడిన పురుషులు ఆరు నెలలకోసారి వైద్యులను సంప్రదించి, ఈ పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా ఆస్టియోపొరాసిస్ ఉన్నా, నీడ పట్టున, ఏసీలలో ఎక్కువ సమయం గడిపే ఉద్యోగులు, ఇతర వర్గాలు, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న వారు, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపంతో వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు కచ్చితంగా తగిన పరీక్షలు చేయించుకుకోవాలి.నిర్లక్ష్యం చేయకండి ఎముకల బలహీనత ఉందనే అనుమానం ఎవరికైనా ఉంటే తక్షణం కాకినాడ జీజీహెచ్‌కు రావాలి. బీఎండీ పరీక్షలు జీజీహెచ్‌లో ఉచితంగా చేస్తున్నాం. మందులు ఉచితంగా అందిస్తున్నాం. బీఎండీ పరీక్షల కోసం ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాం. ఆస్టియోపొరాసిస్ చిన్న సమస్య అని నిర్లక్ష్యం చేయకండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల జీవిత కాలాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. కాల్షియం, విటమిన్–డి ఉన్న పోషకాహారం తీసుకోవాలి. అధిక ప్రొటీన్ ఉండే ఆహారంతో పాటు సూర్యరశ్మిలో గడపడం, తగినంత నిద్ర మేలు చేస్తాయి. వయస్సును బట్టి కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి. వయస్సుతో సంబంధం లేకుండా వ్యాయామాలు కచ్చితంగా చేయాలి. – డాక్టర్ ఎం,పాండురంగ విఠల్, ఆర్థోపెడిక్ విభాగాధిపతి, జీజీహెచ్, కాకినాడప్రతి నెలా 3 వేల మంది పైనే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్) ఎంతో ప్రధానమైనది. ఇక్కడకు కోనసీమ, రాజమహేంద్రవరం ప్రాంతాల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం అనేక మంది చికిత్స కోసం వçస్తుంటారు. కేవలం ఈ ఒక్క ఆసుపత్రికే ప్రతి నెలా 3 వేల మందికి పైగానే రోగులు ఎముకల సంబంధిత సమస్యలతో వస్తున్నారు. ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కూడా కలిపితే ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. దీనినిబట్టి సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

‘స్టార్’ లయన్
‘అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవికి రాజు సింహం’.. ఎన్నో తరాలుగా పిల్లలకు చెప్పే కథే ఇది! ఇక్కడ కూడా అడవిలో రారాజుగా వెలుగొందిన ఓ మృగరాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎన్నో యుద్ధాలు చేసి రాజ్యాన్ని, బలగాన్ని విస్తరించి, తన రాజ్యాన్ని 14 ఏళ్ల పాటు ఆఫ్రికా ఖండంలోనే ఓ పెద్ద అడవిని ఏక ఛత్రాధిపత్యంతో ఏలింది ఈ సింహం. కుడి కంటిపై గాటుతో భయంకరంగా కనిపించే ఈ సింహం 2021 జూన్ 11న వృద్ధాప్యంతో ప్రాణాలు విడిచింది. ఈ గాటు వల్లనే దానికి ‘స్కార్ ఫేస్ లయన్’గా పేరుపొందింది. ఐదేళ్ల క్రితం ఓ సింహం గడ్డిలో పొర్లాడుతూ భయంకరమైన గర్జన చేస్తూ చనిపోయిన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అది ఎక్కడ జరిగిందో అని చాలా మంది ఆరా తీయగా.. కెన్యాలోని మసాయి మారా నేషనల్ పార్కులోదిగా తేల్చారు. అప్పుడే ఈ లయన్ కింగ్ ప్రత్యేకత తెలిసింది. అడవుల్లో సింహాలు గరిష్టంగా 12 ఏళ్లు బతికితే.. ఇది మాత్రం 14 సంవత్సరాలు జీవించింది. ఇదేం పెద్ద గొప్పకాకున్నా..బతికినంత కాలం రారాజుగానే ఉండి, సహజ మరణం పొందడమే విశేషం. ఈ లయన్ కింగ్ జీవితం, పోరాటాలు, సాహసాలపై కెన్యా ప్రభుత్వం పలు సందర్భాల్లో వీడియోలు తీసి, ఓ డాక్యుమెంటరీగా రూపొందించింది. అందులోని కొన్ని భాగాలు ఇప్పుడు మనదాకా వచ్చాయి. ఈ ‘స్టార్ లయన్ కింగ్’ ప్రత్యేకత ఏంటంటే.. – సాక్షి, అమరావతిపుట్టింది - 2007మరణం - 2021 జూన్ 11 వేట - 130 మగ సింహాల మరణం 400 హైనాలు ఒక హిప్పోపోటమస్లెక్కలేనన్ని అలిగేటర్స్ (మొసళ్లు)సొంత కుటుంబం - 120 సింహాలుజీవించిన కాలం - 14 సంవత్సరాలుఆఫ్రికాలోనే అత్యంత సెలబ్రిటీ లయన్గాగుర్తింపుమరో సింహానికి అవకాశం ఇవ్వకుండా..ఆఫ్రికా ఖండంలో అతి పెద్ద నేషనల్ పార్కుల్లో ఒకటి కెన్యాలోని మసాయి మారా నేషనల్ పార్కు. 400 చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఈ అరణ్యంలో 2007లో పుట్టిందీ సింహం. మూడేళ్లకే అరివీర భయంకరిగా మారింది. అడవుల్లో సహజంగా మగ సింహాల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. ఈ పోరులో గెలిచిన సింహం శత్రు గుంపులోని ఆడ సింహాలను, ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకుంటుంది. ఇంత పెద్ద అడవిలో ఈ లయన్ మరో మగ సింహానికి అలాంటి అవకాశమే ఇవ్వలేదు. ప్రతి యుద్ధంలో గెలిచింది. ఆడ సింహాలన్నింటినీ సొంతం చేసుకుంది. 14 ఏళ్ల జీవిత కాలంలో 130 మగ సింహాలను హతమార్చింది. 400కు పైగా హైనాలను హతమార్చింది. ఖడ్గమృగాలు, బలీయమైన మొసళ్లను చంపేసింది. సాధారణంగా సింహాలు హిప్పో (నీటి ఏనుగు)ల జోలికి పోవు. కానీ ఈ స్కార్ ఫేస్ లయన్ ఓ మగ హిప్పోతో ఒంటరిగా పోరాడి గెలిచింది. ఇవి అధికారికంగా అటవీ సంరక్షకులు గుర్తించిన సంఖ్య మాత్రమే.120 సింహాల గుంపునకు నాయకత్వంకంటిపై గాటుతో కనిపించే ఈ మృగరాజు జీవితాంతం సవాళ్లతో పోరాడింది. స్థానిక సింహాలనే కాదు.. వేటగాళ్ల దాడులను సైతం దీటుగా ఎదుర్కొంది.ఎదురే లేని రారాజుగా నిలిచిందని అటవీ పరిరక్షకులు చెబుతుంటారు. పోరాటాల్లో తగిలిన తీవ్రమైన గాయాల నుంచి త్వరగా కోలుకోవడంతో పాటు ప్రతికూల పరిస్థితుల్లోనూ గర్వంగా నిలబడింది. అడవిలో ఓర్పుకు చిహ్నంగా మారింది. సాధారణంగా సింహాల గుంపులో 5 నుంచి 20 వరకు ఉంటాయి. కానీ ఈ మృగరాజు మాత్రం 120 సింహాలతో కూడిన పెద్ద గుంపుతో తిరిగేది. అందుకే మసాయి మారాలోని ఇతర జీవులకు ఈ కింగ్ అంటే హడల్. ‘స్కార్ ఫేస్ లయన్’గా మారింది ఇలా..2012లో ఓ గుంపులోని ఆల్ఫా లయన్‌తో జరిగిన పోరాటంలో కుడి కంటికి, దాని పైభాగంలో లోతైన గాయమైంది. అదే పెద్ద గాటుగా మారిపోయింది. దాంతో దానికి‘స్కార్ ఫేస్ లయన్’గా సందర్శకులు పేరు పెట్టారు. ఈ సింహం 2021 జూన్ 11న వృద్ధాప్యంతో మరణించింది. మసాయి మారా రిజర్వ్ ఫారెస్ట్ సందర్శనకు వచ్చే వారికి ఈ స్కార్ ఫేస్ లయన్ డాక్యుమెంటరీని చూపిస్తారంటే దాని ప్రత్యేకతను అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మృగరాజు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
విభజన కుట్ర
దంతెవాడ–బీజాపూర్‌లో ఎన్కౌంటర్
సాయం పేరుతో స్వాహా!
సొరంగంలో మరో మృతదేహం లభ్యం
అన్నదాతకు సర్కారే శాపం
మామిడి గుజ్జు.. ఎగుమతులు నుజ్జు
సీఐడీ నమోదుచేసిన కేసు కొట్టేయండి
బీమా ధీమా లేదు
నాటి స్టార్టప్ వెలుగులకు కితాబు
ఆరు కేటగిరీల్లో యువ వికాసం
‘లిప్‌లాక్’ కి ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని
'6 నెలల సమయమివ్వండి.. అర్జున్ వరల్డ్‌లోనే బెస్ట్ బ్యాటర్ అవుతాడు'
అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్‌కు అంతా తెలుసు: సిరాజ్
టికెట్లివ్వగానే పని చేయడం మానేస్తున్నార్సార్!
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
మన ఆస్కార్ అవార్డ్స్‌ను లాక్కున్నారు.. దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు
64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లి
విఘ్నేశ్‌ను సత్కరించిన నీతా అంబానీ.. పాదాలకు నమస్కరించిన స్పిన్నర్
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
క్రైమ్

ఖాకీచకుడు.. కాటేయజూస్తున్నాడు
ఒంగోలు టౌన్: భర్త మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతూ తనను పట్టించుకోవడం లేదని న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అక్కడ కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సోమవారం ఓ మహిళ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. ఒంగోలు నగరం కమ్మపాలేనికి చెందిన జి.హర్ష వర్థిని జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన నవీన్‌తో 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నవీన్ భార్యాబిడ్డలను పట్టించుకోవడం మానేశాడు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే అక్కడి కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట హర్షవర్థిని తన పిల్లలతో సహా బైఠాయించింది. టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావుతోపాటు మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా మొండికేయడంతో కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. జనాలు గుమిగూడడంతో ట్రాఫిక్ స్తంభించింది. కలెక్టర్‌ను కలిసి సమస్య తెలియజేయాలని సీఐ సూచించగా.. అక్కడకు వెళ్లినా పోలీసుల దగ్గరకే పంపిస్తారని, తనకు న్యాయం జరగదని పేర్కొనడం గమనార్హం. న్యాయం జరిగేలా చూస్తామని సీఐ చాలా సేపు బతిమాలడంతో ఎట్టకేలకు ఆమె ఆందోళన విరమించింది.

వెంటాడి వేటాడి..తండ్రిని చంపించిన కన్న కూతురు
సూర్యాపేటటౌన్: గ్రామంలో ఆధిపత్యం కోసం మామను అతికిరాతంగా హత్య చేయించాడు సొంత అల్లుడు. నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యగౌడ్ హత్య కేసులో 13 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ విలేకరులకు వెల్ల డించారు. చక్రయ్యగౌడ్ ఆధిపత్యం సహించలేక..మెంచు చక్రయ్యగౌడ్ గ్రామంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్‌గా కూడా పనిచేశాడు. అతడికి ఐదుగురు కుమార్తెలు సంతానం. తన మూడో కుమార్తె కనకటి సునీతను కూడా సర్పంచ్‌గా, మూడో అల్లుడు కనకటి వెంకన్నను పీఏఏసీఎస్ చైర్మన్‌గా చేశాడు. అల్లుడు కనకటి వెంకన్న పీఏసీఎస్ చైర్మన్ అయిన్నప్పటి నుంచి నూతనకల్ మండలంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం ఉండటం వెంకన్న వర్గీయులు సహించలేకపోయారు. చక్రయ్యగౌడ్కు వ్యతిరేకంగా వెంకన్న వర్గీయులు ఒక గ్రూపుగా ఏర్పడడంతో వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2023లో చక్రయ్యగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో కనకటి వెంకన్న కూడా కాంగ్రెస్‌లోకి వచ్చాడు. అయినప్పటికీ గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో ఎలాగైనా మామ చక్రయ్యగౌడ్ను అడ్డు తొలగించుకోవాలని కనకటి వెంకన్న నిర్ణయించుకున్నాడు.బొడ్రాయి మహోత్సవంలో హత్యకు పథకం.. ఈ నెల 13న మిర్యాల గ్రామంలో బొడ్రాయి మహోత్సవం జరిగింది. గతంలో కనకటి వెంకన్న ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగేవి, చక్రయ్యగౌడ్ ఈసారి ఉత్సవాలను తన ఆధ్వర్యంలో జరపాలని బహిరంగంగా ప్రకటించడంతో వెంకన్న తట్టుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా చక్రయ్యగౌడ్ను హత్య చేయాలని తన వర్గీయులను కొంతమందిని వెంకన్న పురమాయించాడు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం చక్రయ్యగౌడ్ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తుండగా.. అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్య, ఐదో అల్లుడు కనకటి లింగయ్యతో పాటు వెంకన్న అనుచరులైన కనకటి శ్రవణ్, కనకటి శ్రీకాంత్, గంధసిరి వెంకటేష్, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్ అడ్డగించి మారణాయుధాలు, వెదురు కరల్రతో చక్రయ్యగౌడ్పై దాడి చేసి హత్య చేశారు. ఇదంతా దూరంగా నుంచి గమనిస్తున్న వెంకన్న చక్రయ్యగౌడ్పై దాడి జరిగగానే అతడు చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి అందరూ పారిపోయారు. ఈ హత్యపై నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం ఉదయం తుంగతుర్తి పరిధిలో వాహనాల తనిఖీల్లో భాగంగా.. చక్రయ్యగౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్యతో పాటు హత్యకు కుట్ర పన్నిన మూడో అల్లుడు కనకటి వెంకన్న, వెంకన్న భార్య సునీత, మొదటి కుమార్తె కనకటి స్వరూప, ఐదో కుమార్తె కనకటి కల్యాణితో పాటు దిండిగల నగేశ్, జక్కి పరమేష్, మన్నెం రమేశ్, కనకటి వెంకన్న అలియాస్ మొండి వెంకన్న, కనకటి శ్రావ్య, కనకటి/వర్దెల్లి అనూష, జక్కి స్వప్న, భారీ సతీష్ రెండు కార్లలో వెళ్తుండగా పోలీసులు అదపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. చక్రయ్యగౌడ్ను హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఒక కర్ర, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 42 మందిపై కేసు నమోదైందని, దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న ఏడుగురు నిందితుల్లో కనకటి ఉప్పలయ్య మినహా మిగతా ఆరుగురు గతంలోనే కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం.కస్టడీ పిటీషన్ వేసి దర్యాప్తు చేస్తాంఈ హత్య కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ఎవరినీ వదిలిపెట్టకుండా కచ్చితమైన ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు పారదర్శకంగా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కస్టడీ పిటిషన్ వేసి నిందితులను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రివార్డు అందజేశారు. ఈ కేసు ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ డి. శ్రీను, ఎస్ఐలు మహేంద్రనాథ్, ఎం. వీరయ్య, ఆర్. క్రాంతికుమార్‌ను ఎస్పీ అభినందించారు.

Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్: అతి వేగం ఇద్దరు విద్యార్థుల నిండు ప్రాణాలను తీసుకుంది. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం దుమ్ముగూడెం ప్రగలపల్లి గ్రామానికి చెందిన బంటు రాజ్‌కుమార్(20), పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన అటికెటి సిద్దార్ధ(21) ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఆదివారం రాత్రి వీరు ఓయూ హాస్టల్ నుంచి బైక్‌పై విద్యానగర్ వెళుతుండగా అడిక్‌మెట్ ఫ్లైఓవర్‌పై వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

గృహిణికి అండగా ఉన్నందుకు...అంతమొందించాడు
హైదరాబాద్: లైంగిక వేధింపులకు గురవుతున్న ఓ మహిళకు అండగా ఉన్న లాయర్‌ను కక్షగట్టి దారుణంగా హత్య చేశాడు. చంపాపేటలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలి్పన వివరాల ప్రకారం..మహేశ్వరం మండల కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది ఎర్రబాబు ఇజ్రాయిల్ (56) నగరంలోని చంపాపేట డివిజన్ న్యూమారుతీనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. తన ఇంటి సమీపంలోనే ఓ అపార్ట్మెంట్లో ఇటీవల ఫ్లాట్‌ను కొనుగోలు చేసి..ఓ గృహిణి కుటుంబ సభ్యులకు అద్దెకు ఇచ్చాడు. అదే కాలనీ సమీపంలోని సుల్తానా అల్వా కాలనీ శ్మశాన వాటిక కాపలాదారుడుగా పని చేస్తున్న గులాం దస్తగిరి ఖాళీ సమయంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా కూడా పనిచేస్తున్నాడు.ఇజ్రాయిల్ కొనుగోలు చేసిన ఫ్లాట్‌లో దస్తగిరి విద్యుత్ మరమ్మతు పనులకు వెళ్తుండే వాడు. ఈ క్రమంలోనే ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్న గృహిణితో పరిచయం ఏర్పడింది. దీన్ని అలుసుగా తీసుకున్న దస్తగిరి తనను ప్రేమించాలని, అండగా ఉంటానని ఆమెను వేధించసాగాడు. వేధింపులు భరించలేని ఆ గృహిణి ఫ్లాట్ యజమాని ఇజ్రాయిల్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఆయన దస్తగిరిని మందలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయించి.. దస్తగిరి వేధింపులు ఎక్కువ అవడంతో 25 రోజుల క్రితం ఇజ్రాయిల్ ఐఎస్‌సదన్ పోలీసులకు గృహిణితో ఫిర్యాదు చేయించాడు. ఆమెకు దస్తగిరి నుంచి ప్రాణహాని ఉందని హెచ్చరించాడు. ఆమెను బంధువుల ఇంటికి పంపించి వేశాడు. ఈ క్రమంలో పోలీసులు దస్తగిరిని స్టేషన్‌కు పిలిపించి..నామమాత్రంగా మందలించి, కౌన్సిలింగ్ చేసి పంపించేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దస్తగిరి..ఇజ్రాయిల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని అంతం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. గత మూడు రోజులుగా ఇజ్రాయిల్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించిన దస్తగిరి సోమవారం ఉదయం 9 గంటలకు ఇజ్రాయిల్ తన స్కూటీపై ఒంటరిగా రావటాన్ని పసిగట్టి..ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.విషయం తెలసుకున్న స్థానికులు రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇజ్రాయిల్‌ను సమీపంలోని డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చేరి్పంచారు. పరీక్షించిన వైద్యులు ఇజ్రాయిల్ అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా పోలీసులు గృహిణి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోలేదని, తీసుకుని ఉంటే ఈ హత్య జరిగేది కాదని స్థానికులు విమర్శిస్తున్నారు. కాగా ఇజ్రాయిల్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర మాజీ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు.
వీడియోలు


SLBC టన్నెల్ లో మరో మృతదేహం గుర్తింపు


హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వివాహిత ఆత్మహత్య


వీళ్లు ఏ పార్టీలో ఉన్నారు.. బీఆర్ఎస్? కాంగ్రెస్?


ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్, మంత్రులు భట్టి, ఉత్తమ్


విచారణపై శ్యామల ఫస్ట్ రియాక్షన్


ఫిరాయింపు ఎమ్మెల్యేపై రేపు సుప్రీం కోర్టులో విచారణ


పెట్టుబడులపై మాటల యుద్ధం


అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసన


హైదరాబాద్ ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో వ్యక్తి దారుణహత్య


హైదరాబాద్ MMTS ట్రైన్ లో యువతిపై అత్యాచారయత్నం