-
AP: ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృత్యువాత
పన్నెడ: అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెదబయలు మండలం పన్నెడ గ్రామంలో ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి మృత్యవాత పడిన ఘటన ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. వాగులో ఈతకు వెళ్లడంతో ముగ్గురు బాలురు మృతిచెందారు. మొత్తం ఐదుగురు బాలురు బ్యాచ్‌గా ఈతకు వెళ్లగా, ఇద్దర్ని స్థానికులు రక్షించారు. ఇటీవలే ల ఏజెన్సీలోని వాగులో స్నానానికి దిగి ముగ్గురు బాలికలు మృతి చెందారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మి జలపాతంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో దుర్ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది. -
Karmastalam: యోధుడిలా అరవింద్ కృష్ణ
అరవింద్ కృష్ణ, చుంకీ పాండే, అర్చనా శాస్త్రి, ప్రిన్స్, దివి ప్రధాన పాత్రల్లో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర్మస్థలం’. రాయ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సాయి కార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి అరవింద్ కృష్ణ పాత్రకు సంబంధించిన లుక్‌ను, మేకింగ్ వీడియోని షేర్ చేశారు.అరవింద్ కృష్ణ ప్రస్తుతం సూపర్ హీరో పాత్రలతో ఆడియెన్స్‌ను ఆకట్టునేందుకు రెడీ అవుతన్నారు. ఇలాంటి టైంలో ఓ యోధుడిలా ‘కర్మస్థలం’లో కనిపించబోతోన్నారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్, మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఇక సెట్లోనే అరవింద్ కృష్ణ చేస్తున్న వర్కౌట్స్, రిహార్సల్స్ అన్నీ కూడా ఎంతో నేచురల్‌గా ఉన్నాయి. గుర్రపు స్వారీ కూడా ఈ చిత్రంలో హైలెట్ అయ్యేలా కనిపిస్తుంది. విజువల్స్, బీజీఎం ఈ సినిమాను అదనపు ఆకర్షణ అయ్యేలా ఉంది. -
టీసీఎస్‌లో కొత్త ఉద్యోగాలు: ఈ ఏడాది ఎన్నంటే?
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్స్ నియామకాలపై స్పష్టత ఇచ్చింది. FY27లో ఇప్పటికే 25,000 ఫ్రెషర్స్‌కు ఆఫర్లు ఇచ్చామని, మార్కెట్ డిమాండ్ పరిస్థితిని బట్టి మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశముందని సంస్థ సీఈఓ కే కృథివాసన్ తెలిపారు.2026 ఆర్ధిక సంవత్సరంలో 44,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించి, ప్రైవేట్ రంగంలో అత్యధిక నియామకాలు చేపట్టిన కంపెనీల జాబితాలో ఒకటిగా నిలిచిన టీసీఎస్.. ఈ ఏడాది నియామకాలను తగ్గించే అవకాశం ఉందని సమాచారం.FY26లో సంస్థ 12,000 మంది ఉద్యోగులను తొలగించినప్పటికీ, అది ఏఐ ప్రభావం వల్ల కాదని, ప్రాజెక్టుల అమలు విధానంలో మార్పులు రావడం వల్ల ముఖ్యంగా సీనియర్ స్థాయి ఉద్యోగుల అవసరం తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కృతి వాసన్ తెలిపారు. అయితే.. సంస్థ భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తుందని, ప్రస్తుత వ్యాపార పరిస్థితి స్థిరంగా ఉందని, కొత్త ప్రాజెక్టులు విభిన్న రంగాలు, ప్రాంతాల్లో పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: వెండి రేటు జోరు: కేజీ రూ.2.65 లక్షలు! -
IPL 2026: కేకేఆర్‌కు బిగ్ న్యూస్
ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న కేకేఆర్‌కు బిగ్ న్యూస్ అందింది. రూ. 18 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న శ్రీలంక పేసర్ మతిష పతిరణ త్వరలో జట్టులో చేరబోతున్నాడు. సొంత దేశ క్రికెట్ బోర్డు (SLC) నుంచి అతనికి NOC లభించింది. గాయం కారణంగా పతిరణ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా అతను ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేసి, SLC అనుమతితో ఐపీఎల్ 2026లో అడుగుపెట్టబోతున్నాడు.ఏప్రిల్ 14న సీఎస్కేతో జరుగబోయే మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండనున్నాడు. పతిరణ రాక కేకేఆర్ బౌలింగ్ విభాగానికే కాకుండా జట్టు యావత్తుకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ సీజన్లో ఆ జట్టు హర్షిత్ రాణా, ఆకాశ్‌దీప్ సేవలు కోల్పోయి పేలవ ప్రదర్శనలు చేస్తుంది. ఇప్పుడు పతిరణ రాక కేకేఆర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.కాగా, ఈ సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆ జట్టుకు అదృష్టం కూడా కలిసి రావడం లేదు. గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలవడంతో పాటు ఓ మ్యాచ్ అన్యాయంగా వర్షార్పణం అయ్యింది.ఇదిలా ఉంటే, పతిరణ గైర్హాజరీలో విదేశీ పేసర్‌గా జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ పలు మ్యాచ్‌లు ఆడాడు. అయితే అతని నుంచి ఆశించి ఫలితాలు రాకపోవడంతో కేకేఆర్‌కు చేదు అనుభవాలు మిగిలాయి. చివరికి గాయంతో బాధపడుతున్న గ్రీన్‌తో బౌలింగ్ చేయించినా సానుకూల ఫలితాలు రాలేదు. సీజన్ ప్రారంభానికి ముందే ముస్తాఫిజుర్ రూపంలో కేకేఆర్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. -
అమర్నాథ్ యాత్ర... షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం
హిందువులందరికీ ఎంతో ప్రత్యేకమైన అమర్నాథ్ యాత్ర షెడ్యుల్‌ను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. జులై 3 నుంచి ప్రారంభమై 57 రోజుల పాటు యాత్ర సాగనున్నట్లు తెలిపింది. ఆగస్టు 28 రక్షా బంధనం పర్వదినం రోజున యాత్ర ముగుస్తుంది.2026కు సంబంధించి అమర్నాథ్ యాత్ర వివరాలను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటించారు. జులై 3న యాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపారు. జూన్ 29న జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా పరమేశ్వరునికి ప్రథమ పూజ నిర్వహించనున్నారు. ఈ యాత్రకోసం ఏప్రిల్ 15 నుంచి రిజిష్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. దీనికి భక్తులు ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్దతులలో రిజిష్ట్రేషన్లు చేసుకోవచ్చని పేర్కొన్నారు.అమర్నాథ్ గుహలో పరమేశ్వరుడు మంచు లింగం రూపంలో దర్శనమిస్తాడు. ఇది ప్రకృతి సహజంగా ఏర్పడుతుంది. చంద్రుని కళలకు అనుగుణంగా ఈ లింగం పరిమాణం పెరగడం, తగ్గడం ఇక్కడి గొప్ప విశేషం. సౌత్ కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న హిమాలయ గుహలో ఏర్పడుతుంది. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని శివుని స్వరూపంగా భక్తులు విశ్వసిస్తుంటారు. ఎన్నోరకాల సవాళ్లు, వ్యయప్రయాసాలను తట్టుకుని , తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరీ భక్తుల అమర్ నాథ్ యాత్రను నిర్వహిస్తారు. 70 ఏళ్ల పై బడిన వారిని అమర్ నాథ్ యాత్రకు అనుమతించరు. భక్తులు రెండు మార్గాల ద్వారా ఈ యాత్రను పూర్తి చేసుకోవచ్చు. ఒకటి పహల్గామ్ మార్గం కాగా, మరొకటి బల్తాల్ మార్గం. పహల్గామ్ మార్గంలో 34 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది. ఈ రెండు మార్గాల నుంచి హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. -
ఆశా భోంస్లే మృతి: ఛాతీ ఇన్ఫెక్షన్లు ఎందుకంత ప్రమాదకరం..
ప్రముఖ గాయని ఆశా భోంస్లే 92 ఏళ్ల వయసులో ఛాతీ ఇన్ఫెక్షన్తో కన్నుమూశారు. వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులు ఎంత తీవ్రతరంగా ఉంటాయి, అలాగే సత్వరమే చికిత్స అందించడం ఎంత కీలకం అని చెప్పే ఘటన ఇది. నిజానికి గాయని ఆశా ఛాతీ ఇన్ఫెక్షన్ దాని సంబంధిత సమస్యలతో చేరి..చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో ఈ ఛాతీ ఇన్ఫెక్షన్ అంత ప్రమాదకరమైనదా..?, వయసు పైబడని వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.ఆశా భోంస్లేని తీవ్రమైన అలసట, శ్వాసకోశ సమస్యలతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ సమస్యలకు ఛాతీ ఇన్ఫెక్షన్ కారణమని వైద్యులు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించినా..వయసు పైబడటంతో ఆ ఇన్ఫెక్షన్ శరీరంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించి చివరికి ఆశా భోంస్లే మరణానికి దారితీసిందని వెల్లడించారు వైద్యులు.ఛాతీ ఇన్ఫెక్షన్ అంటే..ఛాతీ ఇన్ఫెక్షన్ అనేది ఊపిరితిత్తులు లేదా శ్వాసనాళాలకు సోకే ఇన్ఫెక్షన్. వీటిలో సర్వసాధారణమైన రకాలు శ్వాసనాళాల ఇన్ఫెక్షన్ అయిన బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల కణజాల ఇన్ఫెక్షన్ అయిన న్యుమోనియా. ఈ పరిస్థితులు శరీరంలో వాపు, శ్లేష్మం పేరుకుపోవడం, దగ్గు, ఆయాసం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడానికి కారణమవుతాయి. 90 ఏళ్లు పైబడిన వారిలో, ఒక 'సాధారణ' ఛాతీ ఇన్ఫెక్షన్ సైతం కూడా ప్రాణాంతకం కావచ్చు.ప్రభావం ఎలా ఉంటుందంటే..ఊపిరితిత్తుల పనితీరు తగ్గడం వల్ల శరీరానికి ఆక్సిజన్ అందించడం కష్టమవుతుందిబలహీనమైన కండరాలు దగ్గడం, యు శ్లేష్మాన్ని తొలగించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయితక్కువ రోగనిరోధక శక్తి కోలుకోవడాన్ని నెమ్మదింపజేస్తుందిశరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో గుండెపై భారం పెరుగుతుందిఈ పరిస్థితుల్లో, శరీరం తరచుగా తన శక్తిలో ఎక్కువ భాగాన్ని కేవలం శ్వాస తీసుకోవడానికి, ఇన్ఫెక్షన్తో పోరాడటానికి మాత్రమే ఉపయోగించే స్థితిలోకి వెళుతుంది. దీనివల్ల ఇతర అవయవాలకు శక్తి నిల్వలు చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా బహుళ అవయవాల ఫెయిల్యూర్‌కి దారితీస్తుంది. అందుకే తీవ్రమైన అలసట (నీరసం) వంటి లక్షణాలు కేవలం దుష్ప్రభావాలు మాత్రమే కావు, అవి శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందని చెప్పే సూచన అని అంటున్నారు ఆరోగ్య నిపుణలు.ఇక్కడ ఆశా భోంస్లే విషయంలో ఇన్ఫెక్షన్తో పాటు అప్పటికే తీవ్రమైన అలసటతో బాధపడుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రెండిటి కలయిక రోగి పరిస్థితిని క్రిటికల్ చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ ఛాతీ ఇన్ఫెక్షన్లు రాత్రికి రాత్రే తీవ్రం కావడం చాలా అరుదు. అవి తరచుగా తేలికపాటి, సులభంగా గుర్తించలేని లక్షణాలతో ప్రారంభమవుతాయి. వృద్ధులలో, దీర్ఘకాలిక దగ్గు, స్వల్ప శ్వాస ఇబ్బంది, తక్కువ స్థాయి జ్వరం, గందరగోళం లేదా అసాధారణమైన నిద్రమత్తు వంటి అనారోగ్య సంకేతాలను అందిస్తుంది. యువకులతో పోలిస్తే, వృద్ధుల్లో ఎల్లప్పుడూ వ్యాధికి సంబంధించిన సాధారణ, స్పష్టమైన లక్షణాలను చూపించకపోవచ్చని అందువల్లే దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం కష్టమవుతుందని చెబుతున్నారు వైద్యులు. సాధారణంగా అయితే ఆకలి తగ్గడం, నీరసం లేదా ఆకస్మిక అలసట వంటివి కొన్నిసార్లు వ్యాధికి సంబంధించిన తొలి హెచ్చరిక సంకేతాలుగా (red flags) ఉంటాయని వైద్యులు నొక్కి చెబుతున్నారు. అయితే చాలా సందర్భాల్లో, కుటుంబ సభ్యులు ఈ మార్పులను వృద్ధాప్య సహజ లక్షణాలుగా పొరబడి, వైద్య సహాయం తీసుకోవడంలో జాప్యం చేస్తుంటారని అన్నారు.నివారణ..ఫ్లూ, న్యుమోనియా టీకాలు వేయించుకోవడం, తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం, సరైన సమయంలో చికిత్స పొందడం ద్వారా అనారోగ్య ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెబతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాక శ్వాసకోశ సంబంధిత లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని ఆశా భోంస్లే గారి ఉదంతం స్పష్టంగా తెలియజేస్తోంది. ముఖ్యంగా వృద్ధాప్యం కారణంగా శరీరం ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తిని కోల్పోతున్నప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం అని అంటున్నారు. అలాగే అరుదుగా మాత్రమే ఈ ఛాతీ ఇన్ఫెక్షన్లు తీవ్రరూపం దాల్చుతాయని, పైగా తేలికపాటి లక్షణాలతో కొట్టిపారేసే విధంగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: రెండేళ్లుగా వ్యాన్లోనే బందీ..! పాపం చివరికి..) -
కీర్తన తల్లిదండ్రులను ఓదార్చిన ఎంపీ అవినాష్ రెడ్డి
వైఎస్సార్‌జిల్లా: ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇంటర్ విద్యార్థిని కీర్తన తల్లిదండ్రులను ఎంపీ అవినాష్ రెడ్డి ఓదార్చారు. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఉన్నారు.అనంతరం,ఎంపీ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓ దుర్మార్గుడి చేతిలో కీర్తన మరణించడం అత్యంత బాధాకరం. తల్లిదండ్రుల బాధ మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో ఆడబిడ్డలపై ఇటువంటి దాడులు మితిమీరిపోతున్నాయి.తీవ్రమైన, కఠినమైన చర్యలకు ప్రభుత్వం వెనుకాడకూడదు.ఎవరికైనా ఇటువంటి ఆలోచన రావాలంటేనే భయపడేలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. రెండేళ్లుగా ఇలా ఆడబిడ్డలపై, చివరికి చిన్నారులపై దాడులు పెరిగిపోయాయి. చివరికి ఇంటికి వచ్చి గొంతు కోసే పరిస్థితులు నెలకొన్నాయి.ముఖ్యంగా పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు, మెరుగైన బుద్దులు కూడా నేర్పాలి. గంజాయి, బెల్టు షాపులు కూడా మితిమీరి ఉండటం వల్ల ఇలాంటి సంఘటాలు పెరిగిపోతున్నాయి. గంజాయి ఎక్కడంటే అక్కడ దొరుకుతోంది...గ్రామానికి రెండు మూడు బెల్టుషాపులు ఉన్నాయి.ఇలాంటి మత్తు పదార్థాల వల్ల మనుషులు కూడా మృగాలుగా మారుతున్నారు. గంజాయి, బెల్టు షాపులను తక్షణమే అరికట్టాలి’ అని డిమాండ్ చేశారు. -
'అందుకే నాపై దుష్ప్రచారం'.. పోలీసులకు మంగ్లీ ఫిర్యాదు
టాలీవుడ్ సింగర్ మంగ్లీ పోలీసులను ఆశ్రయించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది సుబ్బారావుపై కంప్లైంట్ ఇచ్చారు. తన న్యాయవాదితో కలిసి పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సింగర్ మంగ్లీ తన ఫిర్యాదును పోలీసులకు అందజేశారు. ఇటీవల న్యాయవాది సుబ్బారావు తన కార్యాలయం వద్దకు వచ్చి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని ఫిర్యాదులో ప్రస్తావించారు.ఆ డబ్బులు ఇవ్వనందుకే తనపై మీడియాలో దుష్ప్రచారం చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుబ్బారావు డబ్బులు డిమాండ్ చేసిన వీడియోలు నా దగ్గర ఉన్నాయని మంగ్లీ పోలీసులకు తెలిపారు. తనపై పెట్టిన కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటానని సింగర్ అన్నారు. కాగా.. మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ రూ.10 కోట్లు మోసం చేశారని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! ఒకవేళ అదే జరిగితే?
ఐపీఎల్-2026లో శుక్రవారం(ఏప్రిల్ 10) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ గెలుపొందినప్పటికి.. ఆ జట్టు మేనేజర్ రోమీ భిందర్ చేసిన ఒక చిన్న పొరాటు ఇప్పుడు వివాదానికి దారితీసింది.మ్యాచ్ జరుగుతుండగా రోమీ భిందర్ డగౌట్లో, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి మొబైల్ ఫోన్ వాడుతూ టీవీ కెమెరాలకు చిక్కాడు. ఇందుకు సబంధించిన వీడియోను తొలుత ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు డగౌట్లో మొబైల్ ఫోన్లు వాడటం పూర్తిగా నిషేధం. ఈ ఘటనపై ఐపీఎల్ ఫౌండర్, మాజీ చైర్మెన్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించాడు. అవినీతి నిరోధక, భద్రతా విభాగం అధికారులు అప్పుడు ఏం చేస్తున్నారని అతడు ఎక్స్‌లో రాసుకొచ్చాడు. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు.రోమీ భిందర్ 'ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా' నిబంధనలను ఉల్లంఘించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్లో సెల్ ఫోన్ వాడకం నిషేధం. ఇది పొరపాటున జరిగి ఉండవచ్చు. కానీ అతడు నిబంధనలు ఉల్లంఘించనందున చర్యలు తప్పవు. మ్యాచ్ రిఫరీ, అవినీతి నిరోధక విభాగం నివేదిక ఆధారంగా జరిమానా ఉంటుందా లేదా మ్యాచ్ నిషేధం ఉంటుందా అనేది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐ పేర్కొన్నారు. కాగా మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ తన "లోకల్ గార్డియన్" అని రోమీ భిందర్‌ను పేర్కొనడంతో, ఈ ఘటనపై మరింత లోతైన విచారణ జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ యాంటి కరప్షన్ యూనిట్ నివేదిక ప్రకారం ఐపీఎల్ గవర్నింగ్ అతడిపై చర్యలు తీసుకోనుంది. నివేదిక ఆధారంగా భారీ జరిమానా లేదా కొన్ని మ్యాచ్‌ల పాటు డగౌట్, డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాకుండా నిషేధం విధించే ఛాన్స్ ఉంది.మరోవైపు రుమీ బిందర్ పక్కన ఉండి ఫోన్ చూసిన 15 వైభవ్ సూర్యవంశీపై కూడా బీసీసీఐ స్వల్ప జరిమానాను విధించే అవకాశం ఉందని టైమ్స్ ఇండియా తమ కథనంలో పేర్కొంది.చదవండి: Sanju Samson: చరిత్ర సృష్టించిన శాంసన్.. ధోని కూడా సాధ్యం కాలేదు -
వీటి వల్లే చర్చలు విఫలం.. ఇకపై ఏం జరుగుతుంది?
పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ మధ్య ఏకంగా 21 గంటలు చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసే ప్రయత్నాన్ని ఆపాలని హామీ ఇవ్వలేదని అమెరికా తెలిపింది. చర్చల విఫలం కారణంగా 14 రోజుల కాల్పుల విరమణ అనిశ్చితిలో పడింది. ఎందుకు ఎందుకు విఫలమయ్యాయి? ఒప్పందం కుదరకపోతే.. గతంలో ఎవరూ చూడని విధంగా మరింత పెద్దగా, మెరుగ్గా, శక్తిమంతంగా సైనిక చర్య ఉంటుందని ట్రంప్ చెప్పినట్లే చేస్తారా?డిమాండ్లు విఫలం కావడానికి ప్రధాన కారణంఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయదన్న హామీ కావాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన లక్ష్యం. చర్చల సమయంలో డొనాల్డ్ ట్రంప్‌తో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నిరంతరతరం సంప్రదింపులు జరిపారు. అమెరికా డిమాండ్లను అసంబద్ధం అంటూ ఇరాన్ తిరస్కరించింది. అణు పరిమితులు, ప్రాంతీయ అంశాలపై వాషింగ్టన్ వైఖరి చర్చల పురోగతిని అడ్డుకుందని ఇరాన్ మీడియా తెలిపింది.ఇటీవల కొన్ని వారాల యుద్ధం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య నమ్మకం బాగా తగ్గిపోయింది. ఒకేసారి జరిగిన చర్చల్లోనే పరిష్కారం రావాలని ఆశించడం సరికాదని ఇరాన్ అభిప్రాయపడ్డారు. పలు అంశాలపై ఇరాన్ ఏ మాత్రం తగ్గలేదు. ఇరాన్ “రెడ్ లైన్లు”గా ఆంక్షల ఉపశమనం, యుద్ధ పరిహారం, లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై పరిమితులను ప్రస్తావించింది. హార్మూజ్ జలసంధి అంశం ఇరు దేశాలపై ఒత్తిడి పెంచింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు, హిజ్బుల్లాపై ఆపరేషన్లు చర్చలను మరింత క్లిష్టం చేశాయి.యుద్ధం ప్రారంభం నుంచి 2,000 మందికి పైగా మరణించారని లెబనాన్ అధికారులు తెలిపారు. హిజ్బుల్లాతో కాల్పుల విరమణను ఇజ్రాయెల్ తిరస్కరించింది. తాము నిజాయితీతో చర్చించామని అమెరికా, ఇరాన్ రెండు దేశాలూ చెప్పుకుంటున్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన 14 రోజుల కాల్పుల విరమణ ఏమవుతుందన్న విషయంపై, తదుపరి చర్యలపై చర్చలు విఫలమయ్యాక వాన్స్ స్పష్టత ఇవ్వలేదు. రెండు పక్షాలు కాల్పుల విరమణ పాటించాలని పాకిస్థాన్ కోరింది.అమెరికా చెప్పినట్లు చేస్తే భారీ విధ్వంసంఒప్పందం కుదరకపోవడంతో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దౌత్య ప్రయత్నాలు తిరిగి మొదలవుతాయా? కాల్పుల విరమణ ముగుస్తుందా? అన్న ప్రశ్నలు మొదట వస్తున్నాయి. చర్చలు కుదరకపోవడంతో పశ్చిమాసియాలో అస్థిరత పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతమైతే కాల్పుల విరమణ కొనసాగుతోంది.తదుపరి చర్యలపై స్పష్టత లేదు. చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్‌పై మళ్లీ దాడులు జరిగే ప్రమాదం పెరిగింది. హార్మూజ్ జలసంధి వివాదం పరిష్కారం కాలేదు. చర్చల ద్వారా తిరిగి తెరవడంపై అనిశ్చితి నెలకొంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ నౌకల మోహరింపుతో ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా ఇప్పటికీ సిద్ధంగానే ఉంది. ఒప్పందం కుదరకపోతే భీకర దాడులు చేస్తామని ఇప్పటికే ట్రంప్ ప్రకటించడంతో చెప్పినట్లే చేస్తారా? అన్న ఆందోళన నెలకొంది. అమెరికా తన సైన్యాన్ని ఇరాన్ సరిహద్దులకు సమీపంలోకి తరలించింది. ఒప్పందం కుదిరే వరకు ఈ బలగాలు అక్కడే ఉంటాయని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ భూభాగంలోకి సైన్యం ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇటు ఇరాన్ కూడా హెచ్చరించింది. గతంలో అఫ్గానిస్థాన్, ఇరాక్‌లో అమెరికా చేసిన ఆపరేషన్లు గుర్తుకు వస్తున్నాయి. అయితే, అమెరికా భూతలదాడులు చేస్తే కొన్నేళ్లపాటు యుద్ధం జరిగే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు, మొదట ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలను కుప్పకూల్చుతామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. గతంలో ఎవరూ చూడని విధంగా మరింత పెద్దగా, మెరుగ్గా, శక్తిమంతంగా సైనిక చర్య ఉంటుందని, ఈ నిర్ణయాన్ని ముందే తీసుకున్నామని ట్రంప్ చెప్పారు. అమెరికా చెప్పినట్లు చేస్తే భారీ విధ్వంసమే జరుగుతుంది. -
బెంజ్ కీలక నిర్ణయం: నాలుగు మోడల్స్‌కు గుడ్‌బై!
ప్రముఖ వాహన తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. ఇండియన్ మార్కెట్ నుంచి A-క్లాస్ సెడాన్, EQA, EQB, EQE SUVలను నిలిపివేసింది. కంపెనీ ఈ నాలుగు మోడళ్లను తన అధికారిక వెబ్సైట్ నుంచి కూడా తొలగించింది.మెర్సిడెస్ బెంజ్.. కొత్త ప్రీమియం కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న నాలుగు మోడల్స్ నిలిపివేసింది. కాగా సంస్థ ఏప్రిల్ 24న మూడవతరం సీఎల్ఏ కారును లాంచ్ చేయనుంది.మార్చి 2021లో ప్రారంభమైన ఏ-క్లాస్ లిమౌసిన్, గతంలో భారతదేశంలో అత్యంత సరసమైన మెర్సిడెస్-బెంజ్‌గా ఉండేది, దీని ధరలు రూ. 44.46 లక్షల నుంచి రూ. 45.92 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండేవి. దాని ఉత్పత్తి నిలిపివేయడంతో, ఇప్పుడు GLA SUV ఈ స్థానంలోకి చేరనుంది. ఈ కారు ధరలు సుమారు రూ. 51.80 లక్షల నుంచి రూ. 55 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. దీన్నిబట్టి చూస్తే బెంజ్ కారు ప్రారంభ ధర పెరిగినట్లు స్పష్టమవుతోంది.జీఎల్ఏ కారుకు ఎలక్ట్రిక్ ప్రతిరూపంగా నిలిచిన EQA, భారతదేశంలో మెర్సిడెస్-బెంజ్ యొక్క అత్యంత సరసమైన బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం, దీని ప్రారంభ ధర సుమారు రూ. 66 లక్షలు.మెర్సిడెస్ బెంజ్ లాంచ్ చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ కారు CLA EV 800-వోల్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది భారతదేశంలో లాంచ్ కానున్న దీని ఎంట్రీ-లెవల్ 85kWh 250+ వెర్షన్, WLTP సైకిల్ ప్రకారం.. సుమారుగా 792 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 272 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల సీఎల్ఏ A 250+ కేవలం 6.7 సెకన్లలో పూర్తిగా ఆగి ఉన్న స్థితి నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. -
నెంబర్‌వన్.. అల్లు అర్జున్ ఆలోచన అదేనా?
స్టార్స్ జీవితంలో ఒక భారీ విజయం దక్కడం సులభమే కావచ్చు... కానీ దానిని నిలబెట్టుకోవడం కొనసాగించడం మాత్రం అంత సులభం కాదు. టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ డమ్ అనేది చాలా అస్థిమితంగా మారింది. ఖచ్చితంగా నెంబర్ వన్ హీరో ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రేక్షకులు ఒక్కో ఏడాది ఒక్కో హీరో చిత్రానికి పట్టం కడుతుండడంతో నెంబర్లాట దోబూచులాటగా మారుతోంది.ఈ పరిస్థితిలో ప్రస్తుతానికి మాత్రం ఇటు కలెక్షన్స్ పరంగా చూసినా అటు రెమ్యునరేషన్ పరంగా చూసినా, అల్లు అర్జున్ నెం1గా నిలుస్తున్నాడనేది నిర్వివాదం. తాజాగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన చిత్రం ’రాకా’ కోసం ఏకంగా రూ.300 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుని సమకాలీన హీరోల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు బన్నీ. ఎవరూ ఊహించని విధంగా అప్పటి వరకూ 5, 6 స్థానంలో ఉన్న స్టైలిష్ స్టార్ కాస్తా ఒక్క ఉదుటున నెం1 ఐకాన్ స్టార్‌గా చేసింది పుష్పరాజ్ పాత్ర. ప్రస్తుతం అల్లు అర్జున్ హవా నడుస్తున్నప్పటికీ ఇది వన్ సినిమా వండర్ అనీ త్వరలోనే మరో టాప్ హీరో నెం1 ఛెయిర్‌ని ఆక్రమిస్తాడని సినీ పండితుల్లో పలువురు భావిస్తున్నారు. మరోవైపు బన్నీ మాత్రం ఈ ఊహాగానాలను పటాపంచలు చేయాలని, తన స్టార్ డమ్‌ని మరింత పెంచే విధంగా పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. కనీసం 2030 వరకూ తన ప్లేస్‌ని శాశ్వతం చేసుకునేలా తదుపరి ప్రాజెక్టులను ఆయన జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు.పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఎంపికలు చూస్తే ఆ విషయం సులభంగా అర్ధమవుతుంది. జవాన్ లాంటి భారీ హిట్ ఇచ్చిన అట్లీని తన తదుపరి సినిమాకు ఎంపిక చేసుకోవడం ద్వారా తన భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత దక్షిణాదిలో భారీ హిట్స్‌కి కేరాఫ్‌గా నిలిచిన లోకేష్ కనగరాజ్, అదే విధంగా మళయాళ పరిశ్రమకు చెందిన బాసిల్ జోసెఫ్‌లను ఐకాన్ స్టార్ జోడీ కట్టడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖ దర్శకులతో సైతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం, అతని రాబోయే ప్రాజెక్ట్‌లతో ముడిపడి ఉన్న ఇతర పేర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే విభిన్నమైన జానర్ల మిశ్రమాన్ని అందించడం ద్వారా భారతీయ చిత్రసీమలో తనదైన హవాను ఆయన కొనసాగించాలని ఆలోచిస్తున్నట్టు అర్ధం అవుతుంది.ఉత్కంఠభరితమైన కథనాలకు చిరునామా లాంటి సందీప్ రెడ్డి వంగా , విభిన్న తరహా యాక్షన్ విన్యాసాలకు కేరాఫ్ లాంటి ప్రశాంత్ నీల్ , జనరంజక చిత్రాలకు పేరొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ విలక్షణమైన శైలికి మరోపేరు లాంటి బాసిల్ జోసెఫ్, వైవిధ్యభరిత హీరోచిత కధలను తెరకెక్కించే లోకేష్ కనగరాజ్ ల వరకు ఆయన ఎంపిక వెనుక ఆలోచనల గాఢతను మనకు తెలియజెబుతాయి. ఈ దర్శకుల చిత్రాలు కమర్షియల్ సక్సెస్‌కు గ్యారెంటీతో పాటు అవకాశాన్ని బట్టి సెన్సేషన్‌ను కూడా సృష్టించగలవు. అయితే రానున్న రోజుల్లో ఇప్పటికే నెం1 కుర్చీకి అత్యంత సమీపంలో ఉంటూ, స్పిరిట్ వంటి సినిమాలతో దూసుకొస్తున్న ప్రభాస్ , రాజమౌళి సినిమా ద్వారా మహేష్ బాబు...లతో పాటు పలువురు టాప్ హీరోలు బన్నీ దక్కించుకున్న స్థానానికి గట్టి పోటీని ఇవ్వడం ఖాయం. వీటిని తిప్పికొట్టేలా బన్నీ ఎంపికలు ఉంటాయా లేదా అనేది త్వరలోనే తేలుతుంది. -
ఆశా భోస్లే మరణం.. ఆమె ఆస్తులు ఎన్ని కోట్లంటే?
లెజెండరి సింగర్ ఆశా భోస్లే(92) తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆమె ఇవాళ కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఆమె మరణం వేళ ఆశా సింగర్‌గా ఎంత సంపాందించారన్న విషయంపై బాలీవుడ్లో చర్చ నడుస్తోంది. 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన దిగ్గజ గాయని ఆశా భోస్లే ఆస్తులు దాదాపు రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపై తన గాత్రాన్ని వినిపించిన ఆమె బాగానే సంపాదించారు. అంతే కాకుండా ఆమె సొంత రెస్టారెంట్‌ను ఆశాస్ పేరుతో ప్రారంభించారు. ఇది దుబాయ్, కువైట్, బహ్రెయిన్ దేశాలతో పాటు యూకేలోని బర్మింగ్‌హామ్, మాంచెస్టర్ వంటి నగరాల్లో విస్తరించింది. ఆశా భోస్లే తన డబ్బును రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెట్టారు. తాజా నివేదికల ప్రకారం కేవలం ముంబై, పూణేలలోని విలాసవంతమైన గృహాలతో పాటు ఆమె ఆస్తుల విలువ రూ.80 -రూ.100 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం. -
బిల్లుకు మద్దతితివ్వకుంటే చరిత్రహీనులు: బండి సంజయ్
కేంద్రప్రభుత్వం తీసుకవచ్చిన మహిళా బిల్లును అడ్డుకంటే చరిత్ర హీనులవుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పార్లమెంటులో మహిళా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మకమని.. మహిళల ప్రాతినిథ్యం పెరగాల్సిందేనన్నారు.అయితే అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లకు లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వాలని కోరారు. కాగా ఈ నెల 16,17,18 తేదీలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో బీజేపీ తమ పార్టీ ఎంపీలకు త్రీ-లైన్-విఫ్ జారీ చేసింది. ప్రభుత్వం కొన్ని కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకునే అవకాశం ఉన్నందున సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపింది. -
రాష్ట్రంలో దోచుకో.. దాచుకో స్కీమ్ : కేటీఆర్
సాక్షి, మంచిర్యాల: రాష్ట్రంలో దోచుకో..దాచుకో లాంటి కొత్త స్కీమ్ నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. క్యాతనపల్లిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్ నీచమైన రాజకీయాలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. కౌన్సిలర్లను కోట్ల రూపాయలు ఇస్తానని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వకుంటే కౌన్సిలర్ భూమాగౌడ్ ఇల్లు కూలగొట్టారని అన్నారు. అయినప్పటీకి బీఆర్ఎస్ కార్యకర్తలు తలొగ్గలేదని క్యాతనపల్లిలో చూపెట్టిన స్ఫూర్తిని పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా చూపాలన్నారు.మాజీ ఎమ్మెల్యే సుమన్‌ను అక్రమ కేసులు పెట్టి ఆదిలాబాద్ జైల్లో పెట్టించి సదుపాయాలు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేశారని మున్సిపల్ ఎన్నిక సమయంలో మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించినా మంత్రి వివేక్ చూసుకుంటూ కూర్చున్నారని అన్నారు. సింగరేణిలో సైట్ విజిటేషన్ కార్యక్రమం పెట్టి కాంట్రాక్టర్లను సీఎం బంధువులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లో మెడికల్ బోర్డు పెట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 16 వేల ఉద్యోగాలపై ఏసీబీతో విచారణ జరిపిస్తామని సీఎం అనడం శోచనీయమని, కాంగ్రెస్ నాయకులను సింగరేణి కార్మికులు అడ్డుకొని నిలదీయాలని పిలుపునిచ్చారు.ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందని, కాంగ్రెస్ చేసే దోపిడిపై బీజేపీని సీబీఐచే విచారణ జరిపించాలని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణాలో లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు 52 కోట్లు కేటాయించి, ప్రాజెక్ట్ కడతామని మాయమాటలు చెప్తోందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాబోయే సింగరేణి ఎన్నికల్లో TBGKSను గెలిపించాలని కేటీఆర్ సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు. -
వెండి రేటు జోరు: కేజీ రూ.2.65 లక్షలు!
భారతదేశంలో బంగారం ధరల మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా వేడెక్కుతున్నాయి. లేటెస్ట్ సిల్వర్ రేటు.. గత ఆదివారం రోజుతో పోలిస్తే చాలా ఎక్కువ. అయితే ఈ కథనంలో ఏడు రోజుల్లో వెండి ధరల ప్రవాహం ఎలా సాగింది. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయి. రేట్లు పెరగడానికి కారణం ఏమిటనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.వెండి ధరలుఏప్రిల్ 5న.. అంటే గత ఆదివారం రోజు 2.55 లక్షల రూపాయల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు శనివారం నాటికి రూ.2.65 లక్షలకు చేరింది. ఈ రోజు (ఆదివారం) వెండి రేటు స్థిరంగా రూ.2.65 లక్షల వద్దనే నిలిచింది. హైదరాబాద్, విజయవాడ మొదలైన నగరాల్లో ఈ ధరలు ఉన్నాయి. ఢిల్లీలో మాత్రం వెండి రేటు వారం రోజుల్లో రూ.2.50 లక్షల నుంచి రూ.2.60 లక్షలకు చేరింది.వెండి రేటు పెరగడానికి కారణాలుపారిశ్రామిక వినియోగం: వెండిని ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ పరికరాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రంగాల్లో డిమాండ్ పెరిగితే వెండి ధర కూడా పెరుగుతుంది.పెట్టుబడిదారుల డిమాండ్: ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు, ప్రజలు సురక్షిత పెట్టుబడిగా వెండిని కొనుగోలు చేస్తారు. ఇది ధరను అమాంతం పెంచుతుంది.బంగారం ధరల ప్రభావం: బంగారం ధరలు కూడా వెండి రేటును ప్రభావితం చేస్తాయి. పసిడి ధరలు పెరిగితే, కొంతమంది వెండిలో పెట్టుబడి పెడతారు. అందువల్ల వెండి ధర కూడా పెరుగుతుంది.డాలర్ విలువ మార్పులు: అమెరికన్ డాలర్ బలహీనమైతే, వెండి వంటి లోహాల ధరలు సాధారణంగా పెరుగుతాయి.సరఫరా లోపం: ఖనిజ ఉత్పత్తి తగ్గినా లేదా మైనింగ్‌లో సమస్యలు వచ్చినా, వెండి సరఫరా తగ్గి ధర పెరుగుతుంది.ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, వెండి వంటి విలువైన లోహాలను నిజమైన ఆస్తులుగా భావిస్తారు. కాబట్టి చాలామంది సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. తద్వారా రేటు పెరుగుతుంది.ప్రభుత్వ విధానాలు, దిగుమతులు: పన్నులు, దిగుమతి సుంకాలు పెరిగితే దేశీయంగా వెండి ధరలు పెరగవచ్చు.ఇదీ చదవండి: IRCTC కొత్త రూల్.. ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు! -
రెండేళ్లుగా వ్యాన్లోనే బందీ..! పాపం చివరికి..
కొన్ని ఘటనలు ఎంత అమానుషంగా ఉంటాయంటే మనిషన్నవాడే కనుమరుగైపోతున్నట్లుగా ఉంటుంది. కన్నతండ్రే ఘోరంగా ప్రవర్తించడం చూస్తుంటే..చిన్నచిన్న జంతువులే తమ పిల్లలను కంటికిరెప్పలా కాచుకుంటాయే మరి విచక్షణ జ్ఞానం ఉన్న మనకేమవుతోందో అర్థమవడం లేదు. స్వలాభం, స్వప్రయోజనం ఇంతేనా జీవితం. ఒక మనిషిని బాధపెడితేనే మనం సుఖంగా ఉంటాం. ఈ ప్రకృతి నినాదం జంతువులు అర్థ చేసుక్నుట్లు స్వార్థపూరిత మనుషులకు అర్థం కాదేమో కాబోలు. ఇంతకీ ఇదంతా ఎందుకంటే పాపం ఆ పసివాడికి కన్నతండ్రే దారుణంగా విధించిన శిక్ష తెలిస్తే..ఏ మనిషివిరా నువ్వు అన్నంత కోపం కట్టలు తెంచుకుంటుంది. అసలేం జరిగిందంటే..ఫ్రాన్స్‌లోని హాగెన్బాచ్ గ్రామంలో, నవంబర్ 2024 నుంచి తొమ్మిదేళ్ల బాలుడు యుటిలిటీ వ్యాన్‌లో బంధించబడ్డాడు. ఆ సమీపంలోనొ ఒక వ్యక్తి ఆ వ్యాన్ నుంచి బాలుడి అరుపుల్లా వినిపిస్తున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి రాగానే అక్కడే నిరుపయోగంలోని ఓ వ్యాన్ కనిపించింది. అందులో బాలుడి అరుపులేంటి అన్నట్లుగా నమ్మశక్యంగా చూశారు. చివరకి ఆ వ్యాన్ చుట్టూ ఉన్న చెత్తను తొలగించి బలవంతంగా డోర్ తెరవగా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అక్కడ ఆ బాలుడు నగ్నంగా తీవ్ర పోషకాహార లోపంతో కనపించాడు. అలా కూర్చొనే ఉండటంతో నడవలేని స్థితికి వచ్చేసి ఉన్న పసివాడిని చూసి పోలీసులే దిగ్బ్రాంతి చెందారు. కదలికలు లేకుండా అన్నేళ్లు అలా నిర్బందించి ఉండటం వల్ల అతడిలో కలికలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ వ్యాను స్విట్జర్లాండ్, జర్మనీ సరిహద్దులకు సమీపంలో హాగెన్బాక్లో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తుండగా..భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. తండ్రే దీనంతటికి కారణమని తేలింది. ఏడేళ్ల వయసున్న బాలుడిని తన భార్య మెంటల్ ఆస్పత్రిలో చేర్చించాలి ఫోర్స్ చేసిందని, గత్యంతరం లేక ఇలా వ్యాన్‌లో దాచినట్లుగా తండ్రి చెప్పాడు. తీరా అతడి భార్యను విచారిస్తే..తనకసలు ఆ బాలుడి గురించి ఏమి తెలియదని బుకాయించింది. అనుమానంతో పోలీసులు ఆ దపంతులపై పూర్తి స్థాయిలో విచారణ చేయగా ఆ బాలుడికి 12 ఏళ్ల సోదరి కూడా ఉందని తెలిసింది. అంతేగాదు స్కూల్లో మంచిప్రతిభ కనబర్చేవాడని, అలాగే అతడికి ఎటువంటి మానసిక సమస్యలు లేవని వెల్లడించారు పోలీసులుఆమెను కూడా రెండేళ్లక్రితం అంటే పదేళ్ల వయసులో సామాజిక సేవల సంరక్షణలో ఉంచినట్లు వెల్లడైంది. అయితే ఆ బాలుడు విచారణలో తన తండ్రి తన భార్యతో సమస్యలున్నాయని, అందువల్ల తానిలా బంధింపబడక తప్పలేదని చెప్పుకొచ్చాడు. అతడికి తండ్రే స్వయంగా రెండుసార్లు ఆహారం, వాటిర్ బాటిల్స్ విండో గుండా విసిరేవాడని చెప్పుకొచ్చాడు. ఆ బాలుడు వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లలోనే మలమూత్రాదులు వెళ్లేవాడినని చెబుతుంటే..మరి ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా అని ఆశ్చర్యపోయారు పోలీసులు. 2024లో చేసిన చివరి స్నానం..ఇక అక్కడ నుచి అలానే వ్యాన్‌లో మగ్గిపోయాడు ఆ పసివాడు. దీంతో పోలీసులు ఆ బాలుడి తండ్రిపై అపహరణ, మైనర్ సంరక్షణలో విఫలమవ్వడం తదిరత కేసులన్నిటిని నమోదు చేసి అరెస్టు చేశారు. అంతేగాదు ఇందుకు సహకరించిన ఆమె భాగస్వామిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కానీ ఆ పసివాడికి ఇది జీవితాంత ఓ పీడకలలా వెంటాడుతుంది. అంతతొందరగా బయటపడి..అందరి పిల్లల్లా హాయిగా జీవితాన్ని గపడానికి చాలా ఏళ్లే పట్టొచ్చు. (చదవండి: స్లాబ్‌లో.. మట్టికుండ సగానికి తగ్గుతుంది ఎండ...) -
'అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయాం'.. మెగాస్టార్, ఎన్టీఆర్ నివాళి
ప్రముఖ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మరణంపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె గాత్ర తరతరాలుగా ఎన్నో రకాల భావోద్వేగాలను మోసుకొస్తూ.. భారతీయ సినిమాకు ఓ శాశ్వతమైన తోడుగా నిలిచిందని ట్వీట్ చేశారు. ఆమె ప్రతి పాటకు తీసుకొచ్చిన అప్రయత్నమైన సౌందర్యాన్ని.. బహుముఖ ప్రజ్ఞను నేను ఎల్లప్పుడూ ఆరాధిస్తానని మెగాస్టార్ రాసుకొచ్చారు. భారతీయ సినిమా అత్యంత అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయిందన్నారు. ఈ సమయంలో ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చిరు పోస్ట్ చేశారు.జూనియర్ ఎన్టీఆర్ నివాళి..లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గారి మరణ వార్త విని తీవ్ర బాధపడ్డానని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఆమె మధురమైన గాత్రం దశాబ్దాల పాటు భారతీయ సినిమాకు ప్రాణనాడిగా నిలిచిందన్నారు. ఆమె స్వరం లక్షలాది హృదయాలను తాకిందని.. ఆమె తరతరాలుగా నిలిచిపోయే వారసత్వాన్ని వదిలివెళ్లారని సంతాపం వ్యక్తం చేశారు. అది ఎల్లప్పుడూ గౌరవంతో, ప్రేమతో గుర్తుంచుకోవాలని.. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సైతం ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆశా భోంస్లే సేవలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.లెజండరి సింగర్, క్వీన్ ఆఫ్ వెర్సటిలిటీ ఆశా భోంస్లే(92) ఇవాళ కన్నుమూశారు. ఏప్రిల్ 11, శనివారం నాడు ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఇదే విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. Growing up meant waking up to melodies that felt like home, and so many of them carried the voice of Asha Bhosle ji.From old radios in the morning to late-night songs playing softly in the background, she was always there, without us even realizing how deeply she shaped our… pic.twitter.com/OV8Ythx6ms— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) April 12, 2026 Asha Bhosle ji’s voice has been a timeless companion to Indian cinema, carrying a spectrum of emotions across generations. I have always admired the effortless grace and versatility she brought to every song.Indian cinema has lost one of its most irreplaceable voices. My… pic.twitter.com/3zpUS7MqNj— Chiranjeevi Konidela (@KChiruTweets) April 12, 2026 Deeply saddened by the news of Asha Bhosle ji’s passing. Her magical voice was the heartbeat of Indian cinema for decades and touched millions of hearts. She leaves behind a legacy that will live on for generations and will always be remembered with respect and love. My deepest… pic.twitter.com/U81F2NBBeD— Jr NTR (@tarak9999) April 12, 2026 -
మృణాల్.. టాలీవుడ్ హీరోనే పెళ్లి చేసుకో : అల్లు అరవింద్
స్టేజ్‌పై సరదాగా మాట్లాడే టాలీవుడ్ ప్రముఖుల్లో నిర్మాత అల్లు అరవింద్ ఒకరు. సినిమాకు సంబంధించిన ఈవెంట్లలో ఆయన స్పీచ్ ఎప్పుడూ నవ్వించేలా ఉంటుంది. అలాగే టాలెంట్ ఉన్న యువ నటీనటులను ప్రోత్సహించేలా ఆయన మాటలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో వాళ్ల ప్రేమ విషయాలను కూడా బయటపెడుతుంటాడు. అయితే ఆయనకు తెలిసి అంటాడో తెలియక అంటాడో తెలియదు కానీ.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు కొన్నిసార్లు నిజమవుతుంటాయి. ఓ సినిమా ఈవెంట్లో లావణ్య త్రిపాఠిని ఉద్దేశిస్తూ..‘తెలుగు చక్కగా మాట్లాడుతున్నావు.కాబట్టి ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది’ అని దీవించగా..ఆయన మాటలే నిజమై.. వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకుంది. ఇక తాజాగా ఆయన మరో నటిపై కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు. సీతారామం ఫేం మృణాల్ ఠాకుర్‌ని కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు.తాజాగా ఆయన అడివి శేష్-మృణాల్ జంటగా నటించిన ‘డెకాయిట్’ మూవీ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మృణాల్ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. లావణ్య మాదిరే నువ్వు కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. ‘ఇంతకు ముందు ఒక అమ్మాయిని(లావణ్య త్రిపాఠి) దీవించాను. ఆమె మా వరుణ్ తేజ్ భార్య అయిపోయింది. అలాగే నువ్వు(మృణాల్) కూడా ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మాకు(టాలీవుడ్) కావాలి. అందుకే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని అరవింద్ నవ్వుతూ అన్నాడు. #AlluAravind to #MrunalThakur,"You should marry somebody from here (Tfi ) and settle."We all know what happened when #AlluAravind said this on stage last time🤫😙 pic.twitter.com/3F9KQxvYft— MovieMind (@_MovieMind) April 12, 2026 -
గుజరాత్ టార్గెట్ 165
గుజరాత్ టార్గెట్ 165టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు తీసి లక్నోను దెబ్బ తీశాడు. ఏడో వికెట్ కోల్పోయిన లక్నో18.1వ ఓవర్- 131 పరుగుల వద్ద లక్నో ఏడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ముకుల్ చౌదరి (18) ఔటయ్యాడు.ఐదో వికెట్ కోల్పోయిన లక్నో14.3వ ఓవర్-109 పరుగుల వద్ద లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి పూరన్ (19) ఔటయ్యాడు.నాలుగు వికెట్లు కోల్పోయిన లక్నోలక్నో 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 13 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 96 పరుగులుగా ఉంది. పూరన్ (6), సమద్ (17) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో4.1వ ఓవర్- 45 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో తెవాతియాకు క్యాచ్ ఇచ్చి పంత్ (18) ఔటయ్యాడు. మార్ష్ (11) ఔట్1.3వ ఓవర్- 14 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్‌ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(సి), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిధ్ కృష్ణ ఇంపాక్ట్ సబ్స్: షారుక్ ఖాన్, మానవ్ సుతార్, జాసన్ హోల్డర్, కుల్వంత్ ఖేజ్రోలియా, అనుజ్ రావత్లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్ఇంపాక్ట్ సబ్స్: మణిమారన్ సిద్ధార్థ్, జార్జ్ లిండే, మాథ్యూ బ్రీట్జ్కే, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్ -
దిగ్గజ ‘స్వరరాణి’ ఆశా భోంస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,తాడేపల్లి: దిగ్గజ ‘స్వరరాణి’ ఆశా భోంస్లే మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆశా భోంస్లే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆశా అద్భుతమైన కంఠం ప్రతి ఇంటిలోనూ ప్రతిధ్వనించాయి. ఆశా భోంస్లే కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ‘ఓం శాంతి!’ అని పేర్కొన్నారు. ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) ఆదివారం కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. Deeply saddened by the loss of the legendary ‘Queen of Melody,’ Asha Bhosle Ji. Her unparalleled voice and versatility have resonated in every household and will live on forever. My heartfelt condolences to her family.Om Shanthi! pic.twitter.com/g0SVX93b7b— YS Jagan Mohan Reddy (@ysjagan) April 12, 2026 -
ఆమె స్వరంలో ప్రకాశం .. జ్ఞాపకాలను గుర్తుంచుకుంటా: మోదీ
లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మరణం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా ఆమెకు నివాళులర్పించారు. "భారతదేశం ఇప్పటివరకు చూసిన అత్యంత ప్రసిద్ధ, బహుముఖ స్వరాలలో ఒకటైన ఆశా భోంస్లే గారి మరణం పట్ల తీవ్రంగా విచారిస్తున్నాను. దశాబ్దాల పాటు సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రస్థానం దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసింది, ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని హృదయాలను తాకింది." అని రాసుకొచ్చారు.ఆశా భోంస్లే రాగాలైనా, స్వరకల్పనలైనా, ఆమె స్వరంలో కాలాతీతమైన ప్రకాశం ఉండేది. ఆమెతో తనకు కలిగిన అనుభవాలను నేను ఎప్పటికీ మదిలో పదిలపరుచుకుంటాను అని మోదీ అన్నారు. ఆమె సేవలు తరతరాలకు స్పూర్తినిస్తునే ఉంటారని ఆశా భోంస్లే పాటలు ఎప్పటికీ ప్రజల మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. ఆమె కుటుంబంతో పాటు అభిమానులకు సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కాగా క్వీన్ ఆఫ్ వెర్సటాలిటీ ఆశా భోంస్లే ఏప్రిల్ 11 నిన్న శనివారం ఛాతీ ఇన్ఫెక్షన్ సమస్యతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం చికిత్సపొందుతూ మృతిచెందారు. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆశా భోంస్లే తన ఎనిమిది దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్లో దాదాపుగా 20 భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ పాటలు పాడారు. దాదా సాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు. -
రోహిత్, విరాట్ సరసన సంజూ
ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్ 11) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే సింగం సంజూ శాంసన్ చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సంజూ జూలు విదిల్చి సూపర్ సెంచరీ చేశాడు. కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 115 పరుగులు చేశాడు. సంజూతో పాటు బౌలింగ్‌లో జేమీ ఓవర్టన్ (4-0-18-4), అన్షుల్ కంబోజ్ (4-0-35-3) సత్తా చాటడంతో ఢిల్లీపై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో అద్భుత శతకంతో చెలరేగిన సంజూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడంతో పాటు పలు రికార్డులు సాధించాడు. ఇందులో ఓ భారీ సిక్సర్ల రికార్డు సైతం ఉంది. అదేంటంటే.. ఈ మ్యాచ్‌లో 4 సిక్సర్లు బాదిన అనంతరం టీ20ల్లో సంజూ సిక్సర్ల సంఖ్య క్వాడ్రపుల్ సెంచరీకి (400) చేరింది.పొట్టి క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత అరుదైన మైలురాయి. ఇప్పటివరకు ఈ మైలురాయిని కేవలం 29 మంది మాత్రమే (సంజూతో కలుపుకొని) తాకారు. భారత్ తరఫున సంజూకు ముందు కేవలం ముగ్గురు మాత్రమే ఈ మైలురాయిని అధిగమించారు. వీరిలో రోహిత్ శర్మ (554), విరాట్ కోహ్లి (440), సూర్యకుమార్ యాదవ్ (421) వంటి సిక్స్ హిట్టింగ్ మిషన్లు ఉన్నారు. ఇప్పుడు సంజూ బాబా వీరి సరసన చేరాడు. ఓవరాల్‌గా పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా క్రిస్ గేల్ (1056) చలామణి అవుతున్నాడు. అతనికి చాలా దూరంలో కీరన్ పోలార్డ్ (982), ఆండ్రీ రసెల్ (784) తదితర విండీస్ యోధులు ఉన్నారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 9, విరాట్ కోహ్లి 21, సూర్యకుమార్ యాదవ్ 23, సంజూ శాంసన్ 29 స్థానాల్లో ఉన్నారు. -
వెనుదిరిగే ప్రసక్తేలేదు: అంబటి రాంబాబు
సాక్షి, పుత్తూరు: పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోందని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజాసమస్యలపై నిరసనలు తెలిపితే అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని తంబిరెడ్డిని కిడ్నాప్ చేసి, మూడు రోజుల తర్వాత పోలీసులు కేసు పెట్టారని తెలిపారు. పుత్తూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంటికి అంబటి రాంబాబు వెళ్లారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలీసులతో అణచివేయాలని చూస్తే వెనుదిరిగే ప్రసక్తేలేదని అన్నారు. బలిజలు, కాపులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. పవన్ కల్యాణ్ స్పందించకుంటే కాపులను మోసం చేసినట్లేనని చెప్పారు.కాగా, కొన్ని రోజుల క్రితం పోలీసులు తిరుపతి మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నేత సర్పంజరి తంబిరెడ్డిని గుంటూరుకు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు అజ్ఞాతంలో ఉంచి, చిత్రహింసలు పెట్టారు. కుటుంబ సభ్యులు తిరుపతిలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. తంబిరెడ్డి జాడకోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు కావడం.. ఈ వ్యవహారాన్ని న్యాయమూర్తి సీరియస్‌గా పరిగణించడంతో ఎట్టకేలకు గుంటూరు లాలాపేట పోలీసుల అదుపులో ఉన్నట్టు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు.మరోవైపు, బాపట్లలో ఆదివారం (ఏప్రిల్ 12) చెరుకుపల్లి ఎస్సై అనిల్‌కుమార్ ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్త కృష్ణార్జునరెడ్డిని చితకబాదారు. వైఎస్సార్సీపీ నేతల పోస్టులను స్టేటస్ పెట్టుకున్నందుకు దాడి చేశారు. ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. -
చంద్రబాబు సర్కారుకు అమరావతి రైతుల అల్టిమేటం
సాక్షి,అమరావతి: చంద్రబాబు సర్కారుకు అమరావతి రైతులు అల్టిమేటం జారీ చేశారు. తమ భూములకు సరైన పరిహారం చెల్లించకపోతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని తెలిపారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంపై రైతులు ఆందోళన బాట పట్టారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండల రైతులు పుల్లడిగుంట హైవే వద్ద భూములు కోల్పోతున్నామని ఆందోళన చేపట్టారు. సజావుగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్ 2017లో సరిగా ఉండగా.. 2025-26 మ్యాప్ అలైన్మెంట్లో మార్పులు జరిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు మలుపు తిప్పడం వల్ల తమ భూములు ప్రభావితమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా 140 మీటర్ల వెడల్పు రోడ్లు లేవని రైతులు వాదిస్తున్నారు. తమ భూములకు సరైన పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. -
ఇల్లు ఈజీగా కొనండి.. ధనవంతులు అవ్వండి!!
రాబర్ట్ కియోసాకి రాసిన ప్రపంచ ప్రసిద్ధ పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, అది ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదించే ఒక మార్గదర్శి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి సంపదను ఎలా సృష్టించాలో ఈ పుస్తకం అద్భుతంగా వివరిస్తుంది. అసలు తక్కువ పెట్టుబడితో రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎలా అడుగుపెట్టాలి? సొంత ఇంటి కల ఎలా నెరవేర్చుకోవాలి? ఆ వివరాలు మీకోసం..ఆస్తి అంటే..కియోసాకి చెప్పే ప్రాథమిక సూత్రం ఒకటే: మీ జేబులోకి డబ్బును తీసుకొచ్చేది 'ఆస్తి' (Asset), మీ జేబులో నుండి డబ్బును బయటకు పంపేది 'అప్పు' (Liability). చాలా మంది తాము నివసించే ఇంటిని అతిపెద్ద ఆస్తిగా భావిస్తారు. కానీ, కియోసాకి దృష్టిలో అది ఒక లయబిలిటీ. ఎందుకంటే దాని వల్ల ప్రతి నెలా మెయింటెనెన్స్, ట్యాక్సుల రూపంలో డబ్బు బయటకు వెళ్తుంది. అదే మీరు ఒక ఇంటిని కొని అద్దెకు ఇస్తే, అది మీకు ప్రతి నెలా ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అప్పుడు మాత్రమే అది నిజమైన 'ఆస్తి' అవుతుంది.తక్కువ పెట్టుబడితో రియల్ ఎస్టేట్ శ్రీకారంరియల్ ఎస్టేట్ అంటే కోట్ల రూపాయలు ఉండాలని భయపడక్కర్లేదు. తక్కువ మొత్తంతో ప్రారంభించడానికి ఈ మార్గాలు చూడండి..ఓపెన్ ప్లాట్లు: నగరం శివార్లలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో చిన్న ప్లాట్లను కొనుగోలు చేయడం ఉత్తమం. వీటి ధర తక్కువగా ఉంటుంది, భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి.రీట్స్: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (REITs)తో స్టాక్ మార్కెట్ లాగే, మీరు రియల్ ఎస్టేట్‌లో నేరుగా ఆస్తి కొనకుండానే తక్కువ మొత్తంతో (కొన్ని వేల రూపాయలతో) షేర్ల రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు.క్రౌడ్ ఫండింగ్: గ్రూపుగా ఏర్పడి నమ్మకమైన స్నేహితులు లేదా బంధువులతో కలిసి ఉమ్మడిగా ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా రిస్క్, పెట్టుబడి భారం తగ్గుతాయి.సొంతిల్లు సాకారమయ్యే టిప్స్సొంత ఇంటి కల నెరవేరాలంటే కియోసాకి స్టైల్లో ఈ వ్యూహాలు అనుసరించండి..ముందుగా ఆదాయ వనరుల సృష్టి: నేరుగా హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనడం కంటే, మొదట చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయం (Passive Income) మీ ఇంటి EMI చెల్లించేలా ప్లాన్ చేయండి.లోకేషన్ ముఖ్యం: అభివృద్ధి చెందుతున్న హైవేలు, ఐటీ కారిడార్లు లేదా మెట్రో ప్రాజెక్టులు వచ్చే ప్రాంతాలను గుర్తించి ముందే పెట్టుబడి పెట్టండి.పన్ను ప్రయోజనాలు: రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై లభించే పన్ను మినహాయింపుల గురించి అవగాహన పెంచుకోండి. ఇది మీ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది.కియోసాకి గోల్డెన్ రూల్: 'డబ్బు కోసం పని చేయకండి'ధనవంతులు డబ్బు కోసం పని చేయరు, వారి డబ్బు వారి కోసం పని చేసేలా చూసుకుంటారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన మార్గం."పెద్ద ఇల్లు కొనడం తప్పు కాదు, కానీ ఆ ఇంటి ఖర్చులను మీ జేబులో నుండి కాకుండా, మీరు పెట్టిన ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలతో చెల్లించడమే అసలైన ఆర్థిక తెలివితేటలు." -
చెల్లెలు ఆశా భోంస్లేను దూరం పెట్టిన లతా మంగేష్కర్
లెజెండరి సింగర్ ఆశా భోంస్లే ఆదివారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆమె అభిమానులు తన జీవిత ప్రయాణాన్ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో తన అక్క లతా మంగేష్కర్తో ఉన్న విభేదాన్ని షేర్ చేస్తున్నారు. ఒక కుటుంబంలో రెండు గానకోకిలలు గొంతెత్తి పాటలు పాడుతుంటే సంబరిపడిపోయిన ప్రేక్షకులు వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలిసి ఆందోళన చెందారు.అక్కాచెల్లెళ్ళ మధ్య గొడవలు నిజమేనా..?లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలు ఇద్దరూ భారతీయ సంగీతంలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశారు. అయితే వారి మధ్య గొడవలు అన్నది కొంతవరకు నిజం, కొంతవరకు అపోహలతో కూడిన విషయమని చెబుతారు. ఆశా భోంస్లే చిన్న వయసులోనే కుటుంబానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో లతా మంగేష్కర్ దూరం పెట్టారని కథనాలు వచ్చాయి. ఆపై ఇద్దరూ ఒకే రంగంలో (ప్లేబ్యాక్ సింగింగ్) ఉండటం వల్ల సహజంగానే పోటీ ఉండేది.లతా మంగేస్కర్ ఎక్కువగా ప్రధాన హీరోయిన్లకు పాటలు పాడితే.., ఆశా భోస్లే భిన్నమైన, వెరైటీ పాటలతో గుర్తింపు పొందారు. ఈ క్రమంలో కొంతమంది సంగీత దర్శకులు ఒక్కరికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కూడా ఇద్దరి మధ్య సమస్య వచ్చేది. అయితే, కొంతకాలం దూరం ఉన్న తర్వాత ఇద్దరూ మళ్లీ కలిశారు. కుటుంబ కార్యక్రమాలు, ఇంటర్వ్యూల్లో ఒకరిపై ఒకరు గౌరవం వ్యక్తం చేశారు.1984లో ‘ఉత్సవ్’ సినిమాలో ‘మన్ క్యోం బెహ్కా రీ బెహ్కా...’ పాట తరువాత లత, ఆశా కలసి పాడలేదు. కానీ, సుమారు పన్నేండేళ్ల క్రితం లతా మంగేష్కర్ సొంత సంగీత సంస్థ ‘ఎల్.ఎం. మ్యూజిక్’లో ఆశా భోంస్లే ఒక పాటను పాడారు. ఏ హవా...’ అనే ఆ పాటను ఆశా భోంస్లే, షాన్లు కలిసి 2014లో గానం చేశారు. ఆ సమయంలో తన సోదరి గురించి లతా మంగేష్కర్ ఇలా అన్నారు ‘‘మళ్ళీ మా చెల్లెలితో ఇలా కలవడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘మా చెల్లెలు బహుముఖ ప్రతిభ ఉన్న గాయని. ఆమెతో కలసి చాలా పాటలు పాడాను. ఆమెతో కలసి పాడడం ఎప్పుడూ ఓ సవాలే’’ అని వ్యాఖ్యానించారు. లతా మంగేష్కర్ 2022లో కోవిడ్-19, న్యుమోనియా సమస్యల కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోనే మరణించారు. -
స్లాబ్‌లో.. మట్టికుండ సగానికి తగ్గుతుంది ఎండ...
వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఇల్లు కొలిమిలా అనిపించడం మనకు చిరపరిచితమే. ఫ్యాన్లు పూర్తి వేగంతో తిరుగుతున్నా గాలి సరిపోనట్టుగా ఉక్కపోతగా అనిపిస్తుంది. దానికి కారణం... ఇంటి పైకప్పు నుంచి వెలువడే వేడి , ఇంటి పైకప్పు రోజంతా వేడిని పీల్చుకుని, దానిని నెమ్మదిగా మన నివాస స్థలంలోకి విడుదల చేస్తూ ఉంటుంది. అదే మనకు తీవ్రమైన తాపాన్ని కలిగిస్తుంది. తత్ఫలితంగా పుట్టే భరించలేని ఉక్కపోత నుంచి ఎయిర్ కండిషనర్లు ఉపశమనం కలిగిస్తాయి, కానీ అవి జేబుకు మాత్రమే కాదు పర్యావరణానికి కూడా చిల్లులు పెడతాయి. ఏటా అంతకంతకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్న పరిస్థితుల్లో.. విద్యుత్ పై ఎక్కువ ఆధారపడకుండానే మన ఇల్లు చల్లగా మార్చగలిగితే ఎంత బాగుంటుందో కదా... ఊహకే ఆనందాన్ని ఇచ్చే ఈ భావన వాస్తవంలో సాధ్యమేనా? అంటే ఒక సులభమైన, కాలపరీక్షకు నిలిచిన శీతలీకరణ చిట్కా ద్వారా దీన్ని సాధ్యం చేయవచ్చునని సంప్రదాయ పద్ధతిలో నిర్మాణాలు సాగించేవారు చెబుతున్నారు.వంటికి... ఇంటికీ కూడా... ఫిల్లర్ స్లాబ్ఈ సమస్యకు సమాధానం సాదాసీదా మట్టి కుండల రూపంలోనే ఉంది. వంటిని చల్లబరిచే చల్లని నీటి కోసం ఫ్రిజ్ కు బదులు మట్టి కుండను ఎలా నమ్ముతున్నామో అలాగే ఇంటి చల్లదనానికి కూడా అవే ఉపకరిస్తాయి అని అంటోంది ఫిల్లర్ స్లాబ్ అనే నిర్మాణ శైలి. ఫిల్లర్ స్లాబ్ అనే పేరున్న ఈ పురాతన నిర్మాణ పద్ధతి ఓ సాంప్రదాయ జ్ఞానాన్ని తిరిగి వెలుగులోకి తీసుకువస్తోంది. ఈ పద్ధతిలో, కాంక్రీటు పోయడానికి ముందు మట్టి కుండలను పైకప్పు లోపల తలక్రిందులుగా ఉంచుతారు. నిర్మాణం గట్టిపడిన తర్వాత, ఈ కుండలు స్లాబ్ లోపల చిన్న గాలి గదులను సృష్టిస్తాయి. ఈ గదులు సహజమైన ఇన్సులేషన్‌గా పనిచేస్తాయి, పైకప్పు నుంచి ఇంటిలోకి వేడి బదిలీని నెమ్మదింపజేస్తాయి. తక్కువ కాంక్రీటు వాడకంతో, పైకప్పు మొదటి నుంచే తక్కువ వేడిని గ్రహించి నిల్వ చేసుకుంటుంది దాని స్వభావ రీత్యా, వేడి చొచ్చుకుపోవడాన్ని మట్టి, నిరోధిస్తుంది. ఫలితం? ఎలాంటి యాంత్రిక జోక్యం లేకుండానే, ఇళ్లు చెప్పుకోదగిన రీతిలో చల్లగా ఉంటాయి, కొన్నిసార్లు ఇతర సాధారణ నిర్మాణ శైలి ఇళ్లతో పోలిస్తే 50 శాతం ఎక్కువ కూడా చల్లగా ఉంటాయి. అంతేకాకుండా మట్టి కుండలు అందుబాటు ధర్లోనే లభిస్తాయి. ఇవి పర్యావరణ అనుకూలమైనవి కూడా. ఇందులో ఎలాంటి సంక్లిష్టమైన సాంకేతికత లేదు ఇది కేవలం సాంప్రదాయ జ్ఞానంలో పాతుకుపోయిన ఆలోచనాత్మకమైన రూపకల్పన మాత్రమే. దీనివల్ల కలిగే ప్రయోజనాలు సౌకర్యానికి మించి ఉంటాయి. ఇళ్లలో వేడి తగ్గడం అంటే ఎయిర్ కండిషనర్లపై ఆధారపడటం తగ్గడం, దీనివల్ల విద్యుత్ బిల్లులు తక్కువ రావడంతో పాటు కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతాయి. కాలక్రమేణా, ఇది నివాస గృహాలకు మాత్రమే కాక భూగ్రహానికి కూడా గణనీయమైన రీతిలో మంచి మార్పును తీసుకురాగలదు. ఆసక్తికరంగా, వేసవిలో ఇళ్లను చల్లగా ఉంచే అవే గాలి బుడగలు శీతాకాలంలో వెచ్చదనాన్ని నిలుపుకోవడానికి కూడా సహాయపడతాయి, తద్వారా నివాసాలు ఏడాది పొడవునా మరింత సౌకర్యవంతంగా మారతాయి. ఆధునిక నిర్మాణం తరచుగా వాతావరణానికి అనుగుణమైన రూపకల్పనను విస్మరిస్తుంది. మరోవైపు ఎయిర్ కండిషనర్ల వాడకం సర్వసాధారణం కాకముందే, దేశవ్యాప్తంగా సాంప్రదాయ వాస్తుశిల్పం అప్పటికే తెలివైన, సుస్థిరమైన మార్గాలలో పర్యావరణానికి అనుగుణంగా మారుతోంది.ఆధునిక సమస్యలకు పరిష్కారాలు ఎల్లప్పుడూ కొత్తవిగానే ఉండాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఫిల్లర్ స్లాబ్ వంటి పద్ధతుల పునరుజ్జీవనం మనకు గుర్తు చేస్తుంది. నగరాలు వేడెక్కుతూ, ఇంధన అవసరాలు పెరుగుతున్న కొద్దీ, మనం నిర్మించే విధానంలో చేసే చిన్న మార్పులు, మనం జీవించే విధానంలో పెద్ద మార్పులకు దారితీయగలవు. ఒక మట్టి కుండ వంటి అత్యంత సాధారణ చవకైన వస్తువు చల్లదనాన్ని సౌకర్యాన్ని అందిస్తూనే పర్యావరణ నష్టాన్ని కూడా నివారించే శక్తి కలిగి ఉంది అని మనం గుర్తిస్తే...మన నివాసాలు బాగుంటాయి..భవిష్యత్తు భధ్రంగా ఉంటుంది.(చదవండి: స్నేహితుడి కోసం ఏకంగా రూ. 37 లక్షల లగ్జరీ కారులో..!) -
పిల్లలను ఎలా పెంచాలి?..ఆలియాకు సద్గురు సలహా ఇదే
ఆమె ఒక అగ్రగామి బాలీవుడ్ ప్రముఖుడి కుమార్తె..ఆ తర్వాత అందాల బాలీవుడ్ నటి బోలెడన్ని విజయాలు చవిచూసింది. బోలెడు మంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే మాత్రమేం... నిన్నటి బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆలియా భట్ గత కొన్ని వారాలుగా అయోమయానికి గురవుతోంది. తన నాలుగేళ్ల చిన్నారిని ఎలా పెంచాలో తెలీక సతమతమవుతోంది. గత నవంబర్ 6, 2022న మాతృత్వంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి, ఆమె తాను చదువుతున్న పిల్లల పెంపకానికి సంబంధించిన పుస్తకాలను ఇన్ స్ట్రాగామ్ వేదికగా తరచు పంచుకుంటూ ఉండడం దీనికో నిదర్శనం. ఈ నేపధ్యంలోనే ఆమె తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జగ్గీ వాసుదేవ్ (సద్గురు)తో సంభాషణలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సద్గురు ముందు తాను ఎదుర్కుంటున్న సమస్య... పిల్లల పెంపకంపై సలహా ఇవ్వమని కోరడం పెద్ద విశేషమేమీ కాకపోవచ్చు. అయితే దానికి సద్గురు ఇచ్చిన సలహా ఇంటర్నెట్ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెఐటిఓ) చెన్నైప్లస్ ఆధ్వర్యంలో ఇన్ కన్సర్వేషన్ విత్ మిస్టిక్ అనే థీమ్‌తో నిర్వహించిన ఈకార్యక్రమానికి హాజరైన ఆలియా భట్, సద్గురువుతో ఒక వ్యక్తి ఎంత సమయం నిద్రపోవాలి అనే అంశం మొదలుకుని ప్రధానంగా పిల్లల పెంపకం, ఇంటర్నెట్ యుగం, ట్రోల్స్, వైఫల్యం పట్ల భయం, అనే విషయాలపై చర్చించారు.ఈ సందర్భంగా ‘మంచి తల్లిదండ్రులుగా ఉంటున్నామో లేదో అని ఆందోళన చెందుతున్న తమ లాంటి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే ఒకే ఒక్క సలహా ఏమిటి?‘ అని ఆలియా భట్ సద్గురువును అడిగారు. దీనికి సమాధానమిస్తూ.. ‘ఆందోళన చెందే తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు కారు.‘ ఆందోళన చెందే తల్లిదండ్రుల వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా వారు అంతగా ఆందోళన చెందడం ద్వారా తమకు తామే హాని చేసుకుంటారు’’ అంటూ సద్గురు అలియాకు స్పష్టం చేశారు. దీనికి స్పందిస్తూ, ఆలియా భట్, ‘పిల్లల పెంపకం అనే ఆందోళనను తల్లిదండ్రుల్లో తొలగించగలమని నేను అనుకోను. మీరు కూడా దీనిని అంగీకరిస్తారని భావిస్తున్నాను,‘ అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమార్తె రాహాకు ఏం నేర్పించాలనే అంశంపై కూడా తాను మధనపడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దాంతో సద్గురు స్పందిస్తూ పిల్లలకు సంతోషంగా ఉండడం సహజంగానే వస్తుందని వారికి మీరు నేర్పించేంది ఏముంటుంది? అంటూ ఎదురు ప్రశ్నించారు. మీ కుమార్తె రాహాకు కష్టపడి ఏదేదో నేర్పించే బదులు సంతోషంగా ఎలా జీవించాలో తన కుమార్తె రాహా నుంచి నేర్చుకోమని సద్గురు ఆలియా భట్‌కు ఎదురు సలహా ఇచ్చారు. అనవసరమైన హడావిడి లేని తల్లిగా ఉండమని,జీవితంలోని ఆనందాలు ఎలా ఆస్వాదించాలో తన కుమార్తె నుంచి నేర్చుకోమని ఆలియా భట్‌కు సద్గురు సూచించారు. ఆ సంభాషణలో భాగంగా అలా నేర్చుకోవడం ఎలా అనేది కూడా సద్గురు ఆమెకు వివరించారని ఆయన అధికారిక యూట్యూబ్ ఛానెల్ వెల్లడించింది. ఏది ఏమైనా పిల్లల పెంపకంపై నిత్యం ఆందోళన చెందే తల్లిదండ్రుల ఆలోచనలకు అద్దం పడుతూ అలియాభట్ వేసిన ప్రశ్నకు సద్గురు ఇచ్చిన సమాధానం ఓ పెద్ద చర్చనే లేవనెత్తిందని చెప్పాలి. -
ట్రాఫిక్ చలాన్ల ఎఫెక్ట్.. కేటుగాడి మాయ వైరల్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొందరు కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ట్రాఫిక్ చలనాలను తప్పించుకునేందుకు అడ్డదారులను ఎంచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో కారు నంబర్ ప్లేట్ విషయంలో వెలుగు చూసిన మోసం చూసి పోలీసులే ఖంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల మేరకు.. జూబ్లీహిల్స్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారు నడుపుతూ ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. దీంతో, కారును పరిశీలించే క్రమంలో కొత్త విషయం తెలుసుకుని పోలీసులే ఖంగుతిన్నారు. సదరు కారుకు నెంబర్ ప్లేటు మార్చే ప్రత్యేక సిస్టమ్ ఉండటంతో పోలీసులు ఒకింత ఆశ్చర్యపోయారు. కొన్ని సెకన్ల వ్యవధిలో కారుకు ఉన్న నెంబర్ ప్లేట్ మారుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తెలంగాణ, ఢిల్లీలో రిజిస్ట్రేషన్లతో ఉన్న నంబర్ ప్లేట్లు మారడం జరుగుతుండటం విశేషం. దీంతో, జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
బీఎండబ్ల్యూ కారు ప్రమాదం.. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నందిగామ నందిగామ సీఐ చావన్ అన్నారు. కీసర టోల్గేట్ ప్రమాదంపై ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్ అతివేగంగా లారీ నడపటం వల్లే డివైడర్ ఎక్కి ట్యాంకర్ కారుపై పడిందన్నారు. లారీ టాంకర్ ఒక్కసారిగా కారుపై పడటంతో లాయర్ శ్రీనివాస్ మృతి చెందారు. లారీ ఫిట్నెస్ను అధికారులు పరిశీలిస్తున్నారు. టోల్గేట్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా? లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.కాగా, అతి వేగంగా వస్తోన్న ఫ్లైయాష్ ట్యాంకర్ అదుపు తప్పి కారుపై పడిన ఘటనలో హైకోర్టు సీనియర్ న్యాయవాది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర టోల్ ప్లాజా వద్ద జరిగింది. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన బొద్దులూరి శ్రీనివాసరావు (55) ఏపీ హైకోర్టులో సీనియర్ న్యాయవాది. ఈయన శనివారం కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. కీసర టోల్‌ప్లాజా వద్దకు కారు రాగానే..వెనుక నుంచి ఫ్లైయాష్ లోడుతో వస్తోన్న ట్యాంకర్ అతి వేగంగా వచ్చి ప్లాజా దిమ్మెను ఢీకొంది. అనంతరం అదుపు తప్పి శ్రీనివాసరావు కారుపై పడిపోయింది.దీంతో కారు నుజ్జునుజ్జయింది. ట్యాంకర్ కారుపై పడిన 3 నిమిషాల పాటు అందులో ఉన్న శ్రీనివాసరావు హారన్ మోగించినట్లు స్థానికులు చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. భారీ ప్రొక్లెయిన్లు, గొలుసుల సాయంతో ట్యాంకర్‌ను పక్కకు తీశారు. ఆ తర్వాత ట్యాంకర్ కింద ఉన్న కారును మరో పొక్లెయిన్‌తో బయటకు తీయగా అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. కాగా, ట్యాంకర్‌ను అతివేగంగా నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేక మద్యం మత్తులో ఉన్నాడా అనే దానిపై విచారణ చేస్తున్నామని సీపీ చెప్పారు. -
ఎవరికీ సాధ్యంకాని ఘనతను సాధించిన సంజూ
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 11) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ (115 నాటౌట్) సూపర్ సెంచరీ సాధించి సీఎస్కేకు తొలి విజయాన్ని అందించాడు. సంజూ రాజస్థాన్ నుంచి సీఎస్కేకు మారిన తర్వాత ఇది తొలి సెంచరీ. ఈ సెంచరీతో అతను చాలా రికార్డులు సాధించాడు.ఇందులో ముఖ్యమైనది..సంజూ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు నాలుగు సెంచరీలు (ప్రస్తుత సెంచరీతో కలుపుకొని) చేయగా.. అందులో ప్రతి సెంచరీ సీజన్లో మొట్టమొదటిదిగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఈ ఘనత సాధించలేదు. తాను చేసిన నాలుగు సెంచరీలు సీజన్లో మొదటివి కావడం సంజూకు మాత్రమే సాధ్యమైంది. 2017, 2019, 2021, 2026 సీజన్లలో మొదటి సెంచరీలను సంజూనే చేశాడు. తద్వారా సీజన్లో తొలి సెంచరీలను ఎక్కువ సార్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డుకు సంబంధించి సంజూ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ ఉన్నాడు. మెక్కల్లమ్ 2008, 2015 సీజన్లలో తొలి సెంచరీలు చేసి, సీజన్లో తొలి సెంచరీలు అత్యధిక సార్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజూ తర్వాతి స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత చాలామంది ఆటగాళ్లు సీజన్లో తొలి సెంచరీలు చేశారు.ప్రతి ఐపీఎల్ సీజన్లో తొలి సెంచరీ చేసిన ఆటగాళ్లు.. 2008- బ్రెండన్ మెక్కల్లమ్2009- ఏబీ డివిలియర్స్2010- యూసఫ్ పఠాన్2011- పాల్ వాల్తాటి2012- అజింక్య రహానే2013- షేన్ వాట్సన్2014- లెండిల్ సిమన్స్2015- బ్రెండన్ మెక్కల్లమ్2016- క్వింటన్ డికాక్2017- సంజూ శాంసన్2018- క్రిస్ గేల్2019- సంజూ శాంసన్2020- కేఎల్ రాహుల్2021- సంజూ శాంసన్2022- జోస్ బట్లర్2023- హ్యారీ బ్రూక్2024- విరాట్ కోహ్లి2025- ఇషాన్ కిషన్2026- సంజూ శాంసన్‌పై రికార్డు కాకుండా ఈ సెంచరీతో సంజూ మరో భారీ రికార్డు కూడా సాధించాడు. ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్ల తరఫున సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. సంజూ ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్ (2), సీఎస్కే ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేశాడు. సంజూకు ముందు కేఎల్ రాహుల్ ఈ ఘనతను సాధించాడు. రాహుల్ పంజాబ్, లక్నో, ఢిల్లీ ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేశాడు. -
ఓటీటీలో సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. కొత్త సీజన్ ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో సినిమాలతో పాటు డిఫరెంట్ స్టోరీలతో తీసిన బోలెడన్ని వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లలో అలా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న వాటిలో 'ఫ్రమ్' సిరీస్ ఒకటి. హీరో విశ్వక్ సేన్ చెప్పడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరికొందరికి తెలిసింది. ఇప్పుడీ సిరీస్ నుంచి నాలుగో సీజన్ వచ్చేస్తోంది. రీసెంట్గా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించగా ఇప్పుడు అధికారిక ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)'ఫ్రమ్' సిరీస్ విషయానికొస్తే.. అమెరికాలోని ఓ రహస్య గ్రామం. ఇక్కడికి ఒకసారి వచ్చినవాళ్లు తిరిగి బయటపడలేరు. పొద్దున్న అంతా ప్రశాంతంగా ఉన్నప్పటికీ రాత్రయితే ఈ ఊరిలో నరరూప రాక్షసుల్లాంటి మనుషులు తిరుగుతారు. వాళ్ల నుంచి ఇక్కడ ఉండే కొందరు ఎలా తమని తాము రక్షించుకున్నారు? ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? అక్కడి నుంచి బయటపడ్డారా అనేదే కాన్సెప్ట్. ఈ నెల 20వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 4వ సీజన్ స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా) -
ఆర్చరీలో సురేఖ బృందానికి స్వర్ణం
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్ మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత జట్టుకు స్వర్ణ పతకం లభించింది. సీనియర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ, మధుర, ప్రగతిలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 233–232 (59–58, 55–59, 59–57, 60–58) పాయింట్ల తేడాతో అలెక్సిస్ రుయిజ్, పియర్స్, ఒలివియా డీన్లతో కూడిన అమెరికా జట్టును ఓడించింది. ఓవరాల్‌గా సురేఖ కెరీర్లో ఇది 12వ ప్రపంచకప్ పసిడి పతకం కావడం విశేషం. తొలి రౌండ్ నుంచే భారత్, అమెరికా ఢీ అంటే ఢీ అన్నట్ల పోటీపడ్డాయి. తొలి రౌండ్లో భారత్ 59-58తో అమెరికాపై స్వల్ప ఆధిక్యం ప్రదర్శించగా, రెండో రౌండ్లో ఆధిక్యం 114-117 తగ్గింది. అయితే మూడో రౌండ్ ముగిసే సరికి 173-174తో స్వల్ప వెనుకంజలో ఉన్న భారత్ చివర్లో ఆరు పది పాయింట్లు ఖాతాలో వేసుకోవడంతో పసిడి ఖాతాలో చేరింది.చదవండి: అథ్లెటిక్స్‌లో సంచలనం.. బోల్ట్ రికార్డు బద్దలు! -
అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం
వాషింగ్టన్: భారతీయ సనాతన ధర్మం గొప్పదనాన్ని, హిందూ తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన స్వామి వివేకానందుదునికి అమెరికాలో అత్యంత అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన సియాటెల్ నడిబొడ్డున స్వామి వివేకానందుని నిలువెత్తు కాంస్య విగ్రహం ఘనంగా కొలువుదీరింది.అమెరికా చరిత్రలో ఒక నగరపాలక సంస్థ (సిటీ గవర్నమెంట్) ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన తొలి స్వామి వివేకానంద విగ్రహం ఇదే కావడం విశేషం. ఈ చారిత్రక ఘట్టం అమెరికాలో స్థిరపడిన ప్రతి భారతీయుడి మనసు ఉప్పొంగేలా చేస్తోంది. నిత్యం లక్షలాది మంది సందర్శకులతో రద్దీగా ఉండే సియాటెల్ డౌన్ టౌన్ లోని ప్రముఖ ‘వెస్ట్ లేక్ స్క్వేర్’ వద్ద ఈ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. ప్రపంచ ప్రఖ్యాత అమెజాన్ స్పియర్స్, సియాటెల్ కన్వెన్షన్ సెంటర్, సియాటెల్ సెంటర్ మోనోరైల్ లాంటి కీలకమైన ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.శనివారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సియాటెల్ మేయర్ కేటీ విల్సన్, భారత కాన్సుల్ జనరల్ ప్రకాష్ గుప్తా ఈ విగ్రహాన్ని సంయుక్తంగా ఆవిష్కరించారు. ప్రముఖ భారతీయ శిల్పి నరేష్ కుమార్ కుమావత్ అత్యంత ఆకర్షణీయంగా, జీవకళ ఉట్టిపడేలా ఈ కాంస్య విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఐసీసీఆర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమం, అమెరికాతో భారత సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు. 1893లో జరిగిన చికాగో ప్రపంచ మత సమ్మేళనంలో వివేకానందుడు చేసిన చారిత్రాత్మక ప్రసంగం నాటి నుంచి.. నేటి అత్యాధునిక గ్లోబల్ టెక్ హబ్ సియాటెల్ వరకు అమెరికాతో మనకున్న అనుబంధానికి ఈ విగ్రహం ఒక సజీవ ప్రతీకగా నిలుస్తుందని కాన్సులేట్ జనరల్ అభివర్ణించారు. స్థానిక పౌర ప్రముఖులు, ఎన్నారైలు, భారతీయ అమెరికన్ కమ్యూనిటీ ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
‘అనుక్షణం అవమానమే’.. బీడీఎస్ విద్యార్థి ఆఖరి ఆడియో
కన్నూర్: తమ కుమారుడు చక్కగా చదువుకుని, డాక్టర్ అవుతాడని ఆశపడిన ఆ పేద తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. విద్య బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఓ విద్యార్థి పాలిట శాపంగా మారారు. కేరళలోని కన్నూర్ డెంటల్ కాలేజీలో మొదటి సంవత్సరం బీడీఎస్ చదువుతున్న తిరువనంతపురానికి చెందిన నితిన్ రాజ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.కుల వివక్ష, అధ్యాపకుల వేధింపులే తన కొడుకును బలి తీసుకున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, ప్రాణాలు తీసుకునే ముందు నితిన్ రికార్డ్ చేసినట్టుగా భావిస్తున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, కంటతడి పెట్టిస్తోంది. నితిన్ తండ్రి వైఎల్ రాజన్ పెయింటింగ్ కార్మికుడు. ఎన్నో కష్టాలకోర్చి కొడుకును డెంటల్ కాలేజీలో చదివిస్తున్నాడు. అయితే క్యాంపస్ లోపల, బయట నితిన్ తీవ్రమైన కులపరమైన వివక్షను ఎదుర్కొన్నాడని, సీనియర్ల ర్యాగింగ్‌కు గురయ్యాడని ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తల్లిదండ్రులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కాలేజ్ లైబ్రరీ భవనం పైనుంచి కింద పడి నితిన్ రక్తపు మడుగులో కనిపించాడు. ఎమర్జెన్సీ వార్డుకు తరలించే లోపే అతడు ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యాజమాన్యం ఓరల్ పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ కె. రామ్, డాక్టర్ సంగీతలను సస్పెండ్ చేసి విచారణ ప్రారంభించింది. తాజాగా లీకైన ఆడియోలో నితిన్ చెప్పిన విషయాలు కలవర పెట్టేలా ఉన్నాయి.‘క్లాసులో అందరి ముందూ నన్ను ఇడియట్ అని అవమానించారు. ఇటీవల సర్జరీ అయిన మా అమ్మను కూడా చులకన చేస్తూ మాట్లాడారు. మూడు మార్కులు కట్ చేసి.. ‘వెళ్లి మీ అమ్మానాన్నలకు ఈ సర్ ప్రైజ్ ఇవ్వు’ అని హేళన చేశారు. ఎంత భరించాలో అంతా భరించాను, చివరికి కోపంతో ఎదురుతిరిగాను’ అని నితిన్ ఆ ఆడియోలో వాపోయాడు. క్యాంపస్ గేటు దాటితే కాళ్లు, చేతులు నరికేస్తామని టీచర్లు బెదిరించారని, డాక్టర్ సంగీత లాంటి వారు ఇదంతా చూస్తూ నిలబడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: న్యూజెర్సీలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి -
అథ్లెటిక్స్‌లో సంచలనం.. బోల్ట్ రికార్డు బద్దలు!
ఉసేన్ బోల్ట్.. ఈ పేరు చెప్పగానే రేసింగ్ ట్రాక్ మీద చిరుతలా పరుగులు పెట్టిన స్ప్రింటర్ గుర్తుకువస్తాడు. పరుగుపందెంలో మిగిలిన వారికీ, ఉసేన్ బోల్ట్కి మధ్య ఉన్న దూరం చూసి, ప్రపంచం విస్తుపోయింది. 100, 200, 400 మీటర్ల ఈవెంట్స్‌లో బోల్ట్ ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. తాజాగా 200 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్లో బోల్ట్ నెలకొల్పిన రికార్డును ఆస్ట్రేలియాకు చెందిన 18 ఏళ్ల కుర్రాడు గౌట్ బద్దలుకొట్టడం విశేషం. ఆస్ట్రేలియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆదివారం ఈ అద్భుతం చోటుచేసుకుంది. 200 మీటర్ల ఫైనల్ రేసులో గౌట్ 19.67 సెకన్లలో గమ్యాన్ని చేరి సరికొత్త సృష్టించాడు. ఇంతకముందు ఉసేన్ బోల్ట్ 200 మీటర్ల రేసును 19.93 సెకన్లలో పూర్తి చేశాడు. గతంలో గౌట్ ఇదే 200 మీటర్ల రేసును 20.02 సెకన్లలో పూర్తి చేశాడు. తాజాగా తన రికార్డును మరింత సవరించడమే గాకుండా ఏకంగా జమైకా చిరుత బోల్ట్ రికార్డుకు ఎసరు పెట్టి నయా చిరుతగా ఆవిర్భవించాడు. ఇక ఫైనల్లో తన ప్రత్యర్థుల నుంచి గౌట్‌కు పోటీ ఎదురైంది. ఐడాన్ మర్ఫీ 19.88 సెకన్లతో రెండో స్థానంలో, కాలబ్ లా 20.21 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే ఫైనల్‌కు ముందే లాచ్లెన్ కెన్నెడీ వైదొలగడం కూడా గౌట్‌కు కలిసొచ్చింది.ఎవరీ గౌట్?గౌట్ పేరెంట్స్ అతడు పుట్టకముందే దక్షిణ సుడాన్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చారు. క్వీన్స్‌లాండ్‌లో నివాసం ఏర్పరచుకున్న మోనికా, బోనా దంపతులకు ఏడుగురు సంతానం. అయితే గౌట్ పూర్వీకులది ఈజిప్ట్ కావడంతో అతడికి ఆ పేరు పెట్టారు. సౌత్ఈస్ట్ క్వీన్స్‌లాండ్‌లోని ఇప్స్విచ్ గ్రామర్ స్కూల్లో చదువుకున్న గౌట్ చిన్నప్పటి నుంచి సాకర్ ఆడడం నేర్చుకున్నాడు. అలా అథ్లెటిక్స్‌పై ఇష్టం పెంచుకున్నాడు. ఆ తర్వాత పూర్తి అథ్లెటిక్స్‌లోకి మారిన గౌట్ అండర్ 16 విభాగంలో 100, 200 మీటర్ల పలు రికార్డులు నెలకొల్పాడు. 14 ఏళ్ల వయసులో గౌట్ 100 మీటర్ల రేసును 10.57 సెకన్లలో పూర్తి చేసిస సరికొత్త చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల వయసులో గౌట్ అండర్-18 విభాగంలో 200 మీటర్ల రేసును 20.87 సెకన్లలో పూర్తి చేసి దేశవాలీలో రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ అథ్లెటిక్స్ టోర్నీల్లోనూ సత్త చాటిన గౌట్ ఓషినియా అండర్ 18 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో 200 మీటర్లు, 4x400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. ఇక ఉసేన్ బోల్ట్, 2009లో 100 మీటర్ల పరుగు పందెన్ని 9.58 సెకన్లలో పూర్తి చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే 150 మీటర్లను 14.35 సెకన్లు, 200 మీటర్లను 19.19 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 2, 2012 లండన్ ఒలింపిక్స్‌లో 3, 2016 రియో ఒలింపిక్స్‌లో 3 స్వర్ణాలు సాధించిన ఉసేన్ బోల్ట్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 11 స్వర్ణాలు సాధించాడు. 18-year-old GOUT GOUT 🇦🇺 19.67s (1.7) over 200m at Australian Championships in Sydney!!🤯🤯A new U20 World Record ☑️National Record ☑️ First Australian man under 20 seconds ☑️A star is born!pic.twitter.com/1GTfFJ4gst— Track & Field Gazette (@TrackGazette) April 12, 2026 చదవండి: దేశ ప్రజలను అవమానించిన పాక్ క్రికెటర్! -
తమిళనాడు ఎన్నికల వేళ ట్విస్ట్.. కాంగ్రెస్‌కు బిగ్ షాక్!
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో మహిళలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, పార్టీ సీనియర్ నాయకురాలు హసీనా సయ్యద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధిష్టానంపై, ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర అధ్యక్షుడు సెల్వపెరుంతొగైపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయమై హసీనా సయ్యద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వేదికలపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గొప్పగా చెబుతుందని, కానీ ఆచరణలో తమిళనాడులో పోటీ చేస్తున్న 28 స్థానాల్లో కేవలం ఇద్దరు మహిళలకు (సుమారు 7%) మాత్రమే అవకాశం ఇచ్చిందని హసీనా మండిపడ్డారు. తనకు పట్టున్న కృష్ణగిరి నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరగా, స్క్రీనింగ్ కమిటీలో తన పేరు మొదటి స్థానంలో ఉందని ఆమె తెలిపారు. అయితే, ఎంపీ చెల్లకుమార్ తన పలుకుబడిని ఉపయోగించి ఆ సీటును దక్కించుకున్నారని, దీని వెనుక నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహాలే కారణమని ఆరోపించారు.నాయకత్వంపై ధ్వజం..ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తనకు మైలాడుతురై సీటు ఇస్తామని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో పార్టీతో సంబంధం లేని వ్యక్తికి కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే, సెల్వపెరుంతొగై కుమ్మక్కై అభ్యర్థుల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ ఐదుగురు మహిళలకు అవకాశం ఇచ్చిందని, అయితే, మహిళా సాధికారత గురించి మాట్లాడే కాంగ్రెస్ మాత్రం అర్హత ఉన్న మహిళలను విస్మరించిందని విమర్శించారు. రాజకీయంగా అణచివేతకు గురవుతున్న మహిళల గొంతుకను వినిపించేందుకు తాను ’రివల్యూషనరీ పిజియన్స్’ అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు హసీనా ప్రకటించారు. కాగా, ఎన్నికల సమయంలో కీలక మహిళా నేత ఇలా ఆరోపణలు చేస్తూ పార్టీని వీడటం తమిళనాడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. -
IPL 2026: నితీశ్ రాణా, రుతురాజ్‌పై చర్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 11) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. సంజూ శాంసన్ (115 నాటౌట్) శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (59 రిటైర్డ్ ఔట్) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో శివమ్ దూబే (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ.. జేమీ ఓవర్టన్ (4-0-18-4), అన్షుల్ కంబోజ్ (4-0-35-3) ధాటికి 20 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. ట్రిస్టన్ స్టబ్స్ (60) ఢిల్లీని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ గెలుపు సీఎస్కేకు ఈ సీజన్లో మొదటిది కాగా.. ఢిల్లీ నాలుగు మ్యాచ్‌ల్లో రెండో పరాజయాన్ని ఎదుర్కొంది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ అనంతరం బీసీసీఐ ఇద్దరు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఢిల్లీ ఆటగాడు నితీశ్ రాణాకు జరిమానా విధించింది.సీఎస్కే కెప్టెన్‌గా రుతురాజ్ స్లో ఓవర్‌రేట్ మెయిన్టైన్ చేసినందుకు గానూ మ్యాచ్ ఫీజ్‌లో రూ. 12 లక్షలు కోల్పోగా.. నితీశ్‌కు మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత, అదనంగా ఓ డీమెరిట్ పాయింట్ శిక్షగా విధించబడింది. సీఎస్కేకు ఈ సీజన్లో ఇది మొదటి తప్పిదం కావడంతో జరిమానాతో సరిపెట్టారు.నితీశ్ విషయానికొస్తే.. అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు గానూ ఈ శిక్షను ఎదుర్కొన్నాడు. ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో (19వ ఓవర్లో) ట్రిస్టన్ స్టబ్స్ గ్లవ్స్ మార్చుకోవాలని అంపైర్లను కోరగా, వారు నిరాకరించారు. దీంతో నితీశ్ మధ్యలో కల్పించుకొని స్టబ్స్‌కు వత్తాసుగా ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అసభ్య పదజాలం కూడా వాడాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.3 నిబంధన ప్రకారం ఇది లెవెల్ 1 నేరం కిందికి వస్తుంది. ఇందుకు మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించారు. -
లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత
లెజండరి సింగర్, క్వీన్ ఆఫ్ వెర్సటిలిటీ ఆశా భోంస్లే(92) కన్నుమూశారు. ఏప్రిల్ 11, శనివారం నాడు ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఇదే విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు.ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఆశా భోంస్లే.. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో సుమారు 20 భారతీయ, విదేశీ భాషలలో పాటలు పాడారు. 2006లో ఆమె స్వయంగా ఇచ్చిన ప్రకటన ప్రకారం, దాదాపు 12,000 పాటలను రికార్డ్ చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1950వ దశకంలో బాలీవుడ్లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆశా భోంస్లే 1952లో సంగ్దిల్ చిత్రంతో గుర్తింపుపొందారు.1970 దశకంలో పియా తు అబ్ తో ఆజా , దమ్ మారో దమ్ , చురా లియా హై తుమ్నే పాటలు బాగా పాపులర్ అయ్యాయి. మహమ్మద్ రఫీతో కలిసి ఆమె పాడిన “మాంగ్ కే సాథ్ తుమ్హారా,” “సాథీ హాత్ బధానా”, “ఉదేన్ జబ్ జబ్ జుల్ఫెన్ తేరీ” వంటి పాటలు నేటికీ ఎవర్గ్రీన్ హిట్స్‌గా నిలిచాయి. ఆపై ఆర్.డి. బర్మన్ సంగీత దర్శకత్వంలో ఆశా భోంస్లే పాడిన పాటలు ఒక ట్రెండ్ సెట్ చేశాయి. “ఆజా ఆజా,” “పియా తూ అబ్ తో ఆజా,” “యే మేరా దిల్” వంటి డ్యాన్స్ నంబర్లతో అప్పట్లోనే సంచలనం సృష్టించిన ఆశా భోస్లే కమర్షియల్ పాటలకే పరిమితం కాకుండా గజల్స్ పాడి జాతీయ అవార్డులను సైతం అందుకున్నారు. 90వ దశకంలో ‘రంగీలా’ చిత్రంతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఆశా భోంస్లే.. సంగీత సామ్రాజ్ఞిగా కీర్తి పొందారు. -
వజ్రాలకు పెరుగుతున్న డిమాండ్
ముంబై: దేశీయంగా సహజసిద్ధమైన వజ్రాభరణాల మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. 2030 నాటికి ఇది రూ. 1.50 లక్షల కోట్లకు చేరనుంది. పటిష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, మారుతున్న వినియోగదారుల అభిరుచులు ఇందుకు దోహదపడనున్నాయి. డిబీర్స్ గ్రూప్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.భారత్‌లో నేచురల్ డైమండ్ జ్యుయలరీ మార్కెట్ భారీ వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని రిపోర్ట్ పేర్కొంది. డైమండ్స్ అనేవి వివాహంలాంటి సంప్రదాయ సందర్భాలకే పరిమితం కాకుండా రోజువారీ ధరించేందుకు కొనుగోలు చేసే ఉత్పత్తుల కేటగిరీలోకి చేరుతున్నాయని వివరించింది. మహిళల్లో ఆర్థిక స్వాతంత్రం పెరుగుతుండటం, జనరేషన్ జెడ్, మిలీనియల్స్ ఆకాంక్షలు ఇందుకు తోడ్పడుతున్నాయి.ఈ వర్గం వాటా మొత్తం మార్కెట్ విలువలో 86 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. వజ్రాలకు డిమాండ్ కేవలం మెట్రోల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు కూడా గణనీయంగా కనిపిస్తోంది. వ్యక్తిగత ఆదాయాలు పెరిగే కొద్దీ కొత్త తరం వినియోగదారులు సిసలైన, అరుదైన, సహజసిద్ధమైన వజ్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని డిబీర్స్ గ్రూప్ గ్లోబల్ ఎస్వీపీ శ్వేతా హరిత్ తెలిపారు. -
నా కూతురి రూపంలో ఆమె తిరిగొచ్చింది.. పూర్ణ ఎమోషనల్
హీరోయిన్, సహాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ.. గత నెలలో మరోసారి తల్లయింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ చిన్నారి నూలేకెట్టి వేడుకని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ విషయాన్ని చెప్పిన పూర్ణ.. తన కూతురు ఫొటోలని తొలిసారి పంచుకుని, ఆమెకు పెట్టిన పేరు గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఇన్ స్టాలో అసభ్యకర కంటెంట్.. యాంకర్ విష్ణుప్రియపై కేసు)'జమీలా అనేది నా అమ్మమ్మ పేరు. చిన్నప్పుడే కోల్పోయిన ఆమె జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు గనక కూతురు పుడితే ఆమె పేరే పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. నా కుమార్తెని ఒడిలోకి తీసుకున్న ఆ క్షణం.. అమ్మమ్మ నా దగ్గరకు తిరిగి వచ్చినట్లుగా అనిపించింది. పాప పుట్టడం మా కుటంబానికి అపారమైన ఆనందాన్ని తీసుకొచ్చింది' అని పూర్ణ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది.పాప పుట్టన తర్వాత 28వ రోజున నూలేకెట్టి వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారమని.. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొని చిన్నారికి ఆశీర్వాదాలు అందించారని.. హమ్దాన్ పెద్ద అన్నయ్యగా మారి కుటుంబంలో కొత్త బాధ్యతను స్వీకరించాడని పూర్ణ చెప్పుకొచ్చింది. 'దువా జమీలా'కి కుటుంబం ప్రేమ, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని రాసుకొచ్చింది.కేరళకు చెందిన ఈమె.. సీమటపాకాయ్, అవును తదితర సినిమాలతో తెలుగులో గుర్తింపు సాధించింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ మూవీస్ చేసింది. ప్రస్తుతం సహాయ పాత్రలు చేస్తూ, టీవీ షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది. చివరగా 'అఖండ 2'లో కనిపించింది. వ్యక్తిగత విషయానికొస్తే 2022లో దుబాయికి చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్‌ని పెళ్లి చేసుకుంది. 2023లో ఈ దంపతులకు బాబు పుట్టగా, ఇప్పుడు పాప జన్మించింది.(ఇదీ చదవండి: 'వారణాసి'లో ఆ సాధువులంతా క్రిమినల్స్: తమిళ హీరో) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
ఖాజీపేట ప్రేమ్మోనాది ఘటనలో బిగ్ ట్విస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఖాజీపేట ఇంటర్ బాలిక హత్య కేసులో బిగ్‌ట్విస్ట్ చోటుచేసుకుంది. నిందితుడు వెంకటేష్ తల్లి సుజాత.. మీడియా ముందుకొచ్చారు. తన కుమారుడు, కీర్తనకు మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తనకు తెలియదన్నారు. తన కొడుకు జేబులో ఒక లెటర్ దొరికింది. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోందని ఆమె తెలిపారు.‘‘నా కుమారుడు కీర్తన వెంట తిరుగుతున్నట్టు ఆమె తల్లిదండ్రులకు తెలిసినా.. నాకెప్పుడూ చెప్పలేదు. హత్య జరిగిన రోజు బయటకు వెళ్లి కొద్దిసేపటికే నా కొడుకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చాక నన్ను గుండెలకు హత్తుకొని ఏడ్చాడు. నా ప్రేమ విషయంలో కీర్తన మోసం చేసిందని ఆడగటానికి వెళ్తే కత్తి తీసుకొని గొంతు కోసుకుంటానని బెదిరించిందని చెప్పాడు. ఈ పెనుగులాటలో కీర్తన గొంతు తెగిందని ఏమైందో తర్వాత తనకు తెలియదని భయంతో వచ్చానని చెప్పాడు. నా కొడుకు అమాయకుడు. ఇంతటి ఘోరం చేసుంటాడని అనుకోవడం లేదు. చట్టపరంగా నా కొడుకుని శిక్షించండి. మరో రకంగా వద్దు. మరో రకంగా శిక్షించేటట్లయితే... నా కుమారుడితో పాటు నన్నూ శిక్షించండి’’ అంటూ సుజాత పేర్కొంది.తన కొడుకు చంపాలని వెళ్లి ఉంటే కత్తి తీసుకువెళ్ళేవాడు కదా అంటూ తల్లి ప్రశ్నిస్తోంది. పెనుగులాటలో పొరపాటున ప్రమాదం జరిగిందని కొడుకు తనకు చెప్పాడన్న తల్లి.. ముందే బాలికను పెళ్లి చేసుకుంటానని తన కొడుకు ఆమె తండ్రిని అడిగాడని సుజాత అంటోంది. ‘‘ప్రేమించుకున్నాం కదా పారిపోయి పెళ్లి చేసుకుందామని నా కుమారుడు అడిగాడు. బాలిక రానని చెప్పింది. ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తన కుమారుడిని ఎన్కౌంటర్ చేస్తారని పుకార్లు ఉన్నాయి. చట్టప్రకారం తప్పుచేసి ఉంటే శిక్షించండి. ఎన్కౌంటర్ చేస్తే.. నన్ను కూడా చంపేయండి’’ అంటూ వెంకటేష్ తల్లి వ్యాఖ్యానించారు. -
'డెకాయిట్' రెండురోజుల కలెక్షన్స్
టాలీవుడ్ హీరో అడివి శేష్ నటించిన చిత్రం డెకాయిట్.. ఏప్రిల్ 10న విడుదలైన ఈ మూవీని దర్శకులు షానియల్ డియో తెరకెక్కించారు. తాజాగా రెండురోజుల కలెక్షన్స్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొదటిరోజు అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. రెండోరోజు కూడా అదే రేంజ్లో సత్తా చాటింది. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించిన ఈ మూవీలో ,మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల తదితరులు నటించారు.డెకాయిట్ చిత్రం రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ చిత్రం విదేశాలలో కూడా బాగా రాణిస్తోంది, ఉత్తర అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ మార్కును దాటింది. రాబోయే రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరగవచ్చని ఆశిస్తున్నారు. డెకాయిట్ చిత్రం బాగుందని ఇప్పటికే చాలామంది ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మిస్ కావద్దని పోస్టులు షేర్ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. దీంతో చాలా థియేటర్స్ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సత్తా చాటుతుంది. #Dacoit pulls off a massive heist at the box office, stealing audience love ❤️Collects ₹28+ CRORES GROSS worldwide in just 2 days 💥Don’t miss it in theatres near you 🤩Book your tickets now!🎟️ https://t.co/jOhNHoshAS#AudienceBlockbusterDacoit pic.twitter.com/9NSGeIyELD— Annapurna Studios (@AnnapurnaStdios) April 12, 2026 -
ఇరాన్‌కు కొత్త టెన్షన్..
వాషింగ్టన్ : అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌కు కొత్త టెన్షన్ మొదలైంది. శత్రువును భయపెట్టేందుకు ఉయోగపడిన సముద్ర మందుపాతరలు(సీమైన్స్) ఇప్పుడు ఇరాన్‌కూ కొత్త భయాందోళనలు పెంచేస్తున్నాయి. సీమైన్స్ కచ్చితంగా ఎక్కడ ఉన్నాయనే స్పష్టత ఇరాన్‌కు లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. బహ్రెయిన్, ఖతర్, యూఏఈ, సౌదీల వంటి గల్ఫ్ దేశాల నుంచి ముడిచమురు, పెట్రో సరకులతో బయల్దేరే నౌకలు హార్మూజ్‌ను దాటకూడదనే లక్ష్యంతో ఆ మార్గంలో సీమైన్స్ ఏర్పాటుచేసిన ఇరాన్ ఇప్పుడు వాటి జాడ వెతికేందుకు తిప్పలు పడుతోంది. వాటిని అమర్చేటప్పుడు లేదా నీటిలోకి వదిలేటప్పుడు వాటి పొజిషన్‌ను ఒక క్రమపద్దతిలో నమోదుచేయలేదని తెలుస్తోంది. సముద్ర జలాల ప్రవాహంతో అవి అటూ ఇటూ కొట్టుకుపోయే ప్రమాదముంది.దీంతో ఇప్పుడు అవి కచ్చితంగా ఎక్కడ ఉన్నాయనే స్పష్టత ఇరాన్‌కు కూడా లేదు. దీంతో యుద్ధం పూర్వపు సాధారణ స్థితికి నౌకల రాకపోకలను అనుమతించే పరిస్థితి ఇప్పుడు లేదని తెలుస్తోంది. ఇరాన్ నావికాదళం రంగంలోకి దిగి సీమైన్స్ జాడ కనిపెట్టి వాటిని తొలగించడం లేదా నిర్వీర్యం చేయాల్సి ఉంది. అప్పటిదాకా నౌకల పూర్తిస్థాయి రాకపోకలకు అనుమతి అసాధ్యమనే వార్తలు వినవస్తున్నాయి. కాగా, దీనిపై ఇరాన్ ఇంతవరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. సీమైన్స్‌ను జాగ్రత్తగా తొలగించే సాంకేతికత ఇరాన్ వద్ద లేదు అనే పుకార్లు సైతం ఎక్కువయ్యాయి. దీంతో కాల్పుల విరమణ ఇప్పటికే మొదలైనా నౌకల సాఫీ ప్రయాణంపై ఇంకా సందిగ్ధత రాజ్యమేలుతోంది. -
రేంజ్ మారినా.. మారిపోని ఫ్రెండే ఇతడు..!
స్నేహానికి ఉన్న శక్తి మరొకటి లేదు. ట్రెండ్ మారినా..స్టేటస్ మారినా..ఫ్రెండ్ మారడు అనేందుకు ఈ వ్యక్తే నిదర్శనం. ఎంత పెద్ద హోదాలో చక్కటి లైఫ్ లీడ్ చేస్తున్నా.. కేవలం తన స్నేహితుడి కోసం నిస్వార్థంగా చేస్తున్న అతడి సాయం చూస్తే..కళ్లల్లో నీళ్లు తిరుగతాయ్..!. ఇంతకీ అతడేం చేశాడంటే..గురుగ్రామ్‌లో ఒక విలాసవంతమైన కారు డిక్కీలో బేకరీ ఉత్పత్తులు అమ్ముతున్న వ్యక్తికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది. ఇంతకీ అందులో అంత ఆసక్తికరమైనది ఏం ఉందంటే.. హర్ష్ చౌహన్ అనే అకౌంట్ నుంచి షేర్ అయిన ఆ వీడియోలో ఆ వ్యక్తి తన ఖరీదైన కారు డిక్కీని తెరిచి, అమ్మకానికి ఉంచిన బేకరీ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ కనిపిస్తాడు. నీద్గగర రూ. 37 లక్షల ఖరీదు చేసే కారు ఉంది మరి ఇదేంటన్ యూజర్ చౌహన్ అడగ్గా..తాను జర్మనీలో మెడికల్ రీసెర్చ్ సైంటిస్టునని బాంబు పేలుస్తాడు. ఇదంతా కేవలం తన స్నేహితుడికి మద్దతు ఇచ్చేందుకని కూల్‌గా చెబుతాడు. వైరల్ అవుతున్న వీడియోలోని కథ నిజమేనా కాదా అని పలువురు మీడియా ఔత్సాహికులు ఆరా తీయగా..అతడు జర్మనీ నుంచి తిరిగి వచ్చిన రీసెర్చ్ సైంటిస్ట్ అవధేష్ అని తేలింది. అతడితో మాట్లాడగా..తాను జర్మనీలో మూడేళ్లుగా మెడికల్ రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తున్నాని, ప్రస్తుతం ఉద్యోగానికి బ్రేక్ తీసుకున్నట్లు అవధేష్ పేర్కొన్నాడు.ఆ నేపథ్యంలోనే తన కారుని తాత్కాలిక చట్కారా ఆన్ వీల్స్' అనే స్టాల్‌గా ఉపయోగించి బేకర్ ఉత్పత్తులు అమ్ముతూ.. స్నేహితుడికి ఫుడ్ వ్యాపారంలో సాయం చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇక్కడ భారత్‌లో తన స్నేహితుడు పూర్తి స్థాయిలో స్థిరపడ్డాక..తాను తిరిగి జర్మనీకి వెళ్లిపోతానని చెబుతుండటం విశేషం. అందుకు సుమారు ఐదు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని తెలిపాడు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా..మారిపోని ఫ్రెండ్ ఇతడే అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. స్నేహం కోసం కొందరు ఎంత దూరమైన వెళ్తారు. అలాంటి వ్యక్తులను పొందడం అనేది కొన్ని కోట్ల కన్నా విలువైన సంపద అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరు అతడి నిస్వార్థ సేవకు మాటల్లేవ్ బ్రో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Harsh Chauhan • Raw Life (@otherharsh) (చదవండి: ఫేస్ పౌడర్' వెనుక ఇంత స్టోరీ ఉందా..!) -
డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై ఆయిల్ కంపెనీలకు వచ్చే అసాధారణ లాభాల మీద పన్నులను (విండ్‌ఫాల్ ట్యాక్స్) కేంద్రం పెంచింది. దీనితో ఇది డీజిల్‌పై లీటరుకు రూ. 21.50 నుంచి రూ. 55.5కి, విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 29.5 నుంచి రూ. 42కి పెరిగింది. ప్రస్తుతం పెట్రోల్ ఎగుమతులపై ఎలాంటి సుంకాలు లేవు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ విండ్‌ఫాల్ పన్నులను క్రమపద్ధతిలో సవరిస్తూ వస్తోంది. దేశీయ చమురు ఉత్పత్తిదారులు అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల పొందే అదనపు ప్రయోజనాలను నియంత్రించడమే ఈ పన్ను ప్రధాన ఉద్దేశం. ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూరడమే కాకుండా, దేశీయ రిఫైనరీలు తమ ఉత్పత్తులను విదేశాలకు తరలించకుండా స్థానిక మార్కెట్ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేలా చేస్తుంది. -
బీజేపీ ఎంపీలకు ‘త్రీ-లైన్’ విప్ జారీ
ఢిల్లీ: ఏప్రిల్ 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో బీజేపి (BJP) తన ఎంపీలకు 'త్రీ-లైన్ విప్' జారీ చేసింది. ఈ సమావేశాల సమయంలో పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా పార్లమెంట్‌కు హాజరుకావాలని ఆదేశించింది. ప్రభుత్వం కొన్ని కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకునే అవకాశం ఉన్నందున, సభ్యులందరూ సభకు హాజరై ప్రభుత్వానికి మద్దతు తెలపాలని పార్టీ చీఫ్ విప్ స్పష్టం చేశారు.కేంద్ర మంత్రులతో సహా ఎంపీలందరూ ఈ మూడు రోజుల పాటు సభలోనే ఉండాలని.. ఈ సమయంలో ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవని, హాజరు కచ్చితంగా ఉండాలని విప్ స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించనుంది. ముఖ్యంగా, రిజర్వేషన్ల అమలు కాలపరిమితికి సంబంధించి కీలక సవరణలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.2023 నాటి 'నారీ శక్తి వందన్ అధినియం' ప్రకారం.. మహిళా రిజర్వేషన్లు తదుపరి జనాభా గణన మరియు నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్) తర్వాతే అమలు కావాల్సి ఉంది. అయితే, జనాభా గణనలో జాప్యం జరుగుతున్నందున 2011 జనాభా లెక్కల ఆధారంగానే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.మరోవైపు, ప్రధాని మోదీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బిల్లు తీసుకొస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపై స్పష్టత లేకుండా, ఈ చారిత్రాత్మక చట్టంపై అర్థవంతమైన చర్చ జరపడం అసాధ్యమని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు. -
'వారణాసి'లో ఆ సాధువులంతా క్రిమినల్స్: తమిళ హీరో
తమిళ హీరో ఆర్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. వారణాసిలోని కొందరు సాధువులు నకిలీ అని, వాళ్లంతా తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ తాను ఓ మూవీ షూటింగ్ సందర్భంగా తెలుసుకున్నానని చెప్పాడు. ఇతడు హీరోగా నటించిన 'మిస్టర్ ఎక్స్' మూవీ విడుదలకు సిద్ధమైంది. దీని ప్రమోషన్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్)'నాన్ కడవులే(నేనే దేవుడిని) షూటింగ్ కోసం వారణాసి వెళ్లాం. అయితే అక్కడ కనిపించేవారిలో చాలామంది నకిలీ సాధువులే. అలాంటి వాళ్లు 40 శాతం మంది ఉంటారు. వీరిలో కొందరు తీవ్రమైన నేరాలు చేసినవాళ్లు. ఇక్కడికి వచ్చి వేషం మార్చి దాక్కుంటారు. నా వరకు నిజమైన సాధువులు 60 శాతమే ఉంటారు. ఈ నకిలీ స్వాములందరూ తమ అసలు పేర్లు చెప్పారు. స్వామి అని మాత్రమే చెప్పుకొంటారు. వారిలో చాలామందికి రేషన్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటి గుర్తింపు పత్రాలు ఉండవు. కొంతకాలం అక్కడ దాక్కుని తర్వాత వెళ్లిపోతారు' అని ఆర్య తన అభిప్రాయాన్ని చెప్పాడు.కుంభమేళా జరుగుతున్నప్పుడు కూడా షూటింగ్ వెళ్తే, పోలీసులు తమని ప్రత్యేకంగా హెచ్చరించిన విషయాన్ని ఆర్య బయటపెట్టాడు. పోలీసులు ఇక్కడ పరిమిత సంఖ్యలో మాత్రమే ఉన్నారు. తమ వద్ద సాధారణ తుపాకీలు మాత్రమే ఉన్నాయని, కానీ జనసమూహంలోని కొందరి దగ్గర ఏకే-47 లాంటి ప్రమాదకర ఆయుధాలు ఉన్నాయని తమని పోలీసులు హెచ్చరించిన విషయాన్ని కూడా బయటపెట్టాడు.ఆర్య వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇతడి మతాన్ని బయటకు తీస్తున్నారు, ఆర్య అసలు పేరు జంషద్ షీర్ అలీ అని, ఇతడో ముస్లిం కావడం వల్లే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో ఏంటో?(ఇదీ చదవండి: ఇన్ స్టాలో అసభ్యకర కంటెంట్.. యాంకర్ విష్ణుప్రియపై కేసు) -
న్యూజెర్సీలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి
న్యూజెర్సీ: అమెరికాలో మరోసారి తుపాకీల మోత మోగింది. న్యూజెర్సీలోని ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ‘చికెన్-ఫిల్-ఏ’లో జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. శనివారం రాత్రి 8:40 గంటల సమయంలో ఈ రెస్టారెంట్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం, ఈ రెస్టారెంట్ లో ఘటన జరిగిన సమయంలో పలువురు వినియోగదారులు ఉన్నారు. కాల్పులు జరిగిన వెంటనే భయాందోళనలు చెలరేగాయి. కొందరు ప్రాణాల కోసం పరుగులు తీశారు. ఘటనా స్థలానికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. కాల్పుల్లో ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు మరణించగా, మిగిలిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనపై యూనియన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం విచారణ చేపట్టింది. కాల్పులు జరిపిన నిందితుడి వివరాలను, ఈ దారుణానికి కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ సంఘటన అమెరికాలో మరోసారి తుపాకీల చట్టాలపై చర్చకు దారితీసింది. -
ఇరాన్ యుద్ధం.. నెతన్యాహు కీలక ప్రకటన
జెరూసలేం: ఇరాన్‌తో యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యలు ఇంకా పూర్తికాలేదని బాంబు పేల్చారు. కాగా, ఇరాన్‌పై ఇప్పటికే విజయం సాధించినట్టు నెతన్యాహు చెప్పుకొచ్చారు. మరోవైపు లెబనాన్‌తో శాశ్వత శాంతి కోసం ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ..‘ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించే నాటికి ఇరాన్ అణ్వస్త్రాలకు అత్యంత సమీపంలో ఉంది. రోజుకు వందల క్షిపణులు తయారు చేసే సామర్థ్యం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు అస్తిత్వ ముప్పులను ఎదుర్కోవడమే మా లక్ష్యమని అన్నారు. అలాగే, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని భూగర్భంలో అణు, క్షిపణి కార్యక్రమాలను దాచిపెట్టాలని ప్రయత్నించారని ఆరోపించారు. అలాంటి స్థితిలో ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకోలేకపోయిందని చెప్పారు. ఈ ప్రాంతంలో అస్థిరతకు కారణం ఇరాన్ విధానాలేనని ఆరోపించారు.ఇరాన్ బలహీనమే.. ఇరాన్ వద్ద ఉన్న 400 కిలోల సమృద్ధ యురేనియం విషయంలో కూడా నెతన్యాహు స్పందించారు. దానిని దౌత్యపరంగా లేదా అవసరమైతే బలప్రయోగంతో తొలగిస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియా మ్యాప్ చూపిస్తూ వాళ్లు మమ్మల్ని అణగదొక్కాలని చూశారని, ఇప్పుడు తామే వారిని బలహీనపరుస్తున్నామని చెప్పారు. ఇజ్రాయెల్ చర్యల వల్ల ఇరాన్ బలహీనపడిందని, కాల్పుల విరమణ కోరుతున్నదని నెతన్యాహు అన్నారు. దేశంలో అంతర్గత సమస్యలు పెరిగాయని కూడా పేర్కొన్నారు. మమ్మల్ని నాశనం చేస్తామని బెదిరించినవాళ్లు ఇప్పుడు తమకే బతుకుబండిపై పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు.శాంతి కోసం సిద్ధం..లెబనాన్‌తో శాశ్వత శాంతి కోసం సిద్ధమని, అయితే ఈ ఒప్పందం తరాల పాటు నిలిచేలా ఉండాలని నెతన్యాహు స్పష్టం చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ తన భద్రతకు హాని కలిగించే శక్తులపై చర్యలు కొనసాగిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. లెబనాన్ గత నెలలో పలుమార్లు శాంతి చర్చలకు ముందుకొచ్చిందని చెప్పారు. కాగా, లెబనాన్‌తో వచ్చే వారం నుంచే అధికారిక చర్చలు ప్రారంభించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ రెండు ప్రధాన షరతులు విధించింది. మొదటిగా, సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలి. రెండోది, భద్రతకు హామీ ఇచ్చేలా దీర్ఘకాలిక శాంతి ఒప్పందం ఉండాలి. -
వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఇలా..
దేశంలో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వరుసగా రెండు రోజులు తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
చంద్రునిపైకి మనోడు: ‘ఆర్టెమిస్’ సారథిగా అమిత్ క్షత్రియ
న్యూఢిల్లీ: ఒకప్పుడు హ్యూస్టన్(అమెరికా)లో ఆకాశంలోకి దూసుకెళ్లే రాకెట్లను చూసి ఆశ్చర్యపోయిన ఒక భారతీయ సంతతి కుర్రాడు ఇప్పుడు ఏకంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సారధ్యం వహిస్తున్నాడు. మానవుడిని మళ్లీ చంద్రుడిపైకి పంపేందుకు నాసా చేపడుతున్న ఆర్టెమిస్ మిషన్‌ను అమిత్ క్షత్రియ అనే ప్రవాస భారతీయుడు పర్యవేక్షిస్తున్నాడు. ఆయన నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, మన దేశ ఖ్యాతిని ఖండాంతరాలు దాటిస్తున్నారు.అమిత్ తల్లిదండ్రులు ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు. విస్కాన్సిన్ లోని బ్రూక్ ఫీల్డ్ లో జన్మించిన అమిత్.. నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ ఉన్న టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరంలో పెరిగాడు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మ్యాథ్‌మెటిక్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. పెట్రోలియం, మెడికల్ రంగాల్లో పనిచేసిన ఆయన 2008లో యునైటెడ్ స్పేస్ అలయన్స్ ద్వారా నాసా ప్రయాణాన్ని ప్రారంభించాడు.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పని చేసిన విశేష అనుభవంతో పాటు, ఆర్టెమిస్-1 మిషన్ లో కూడా అమిత్ కీలక పాత్ర పోషించారు. గత ఏడాది సెప్టెంబర్ లో నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ గా నియమితులయ్యారు. 1972 నాటి ‘అపోలో 17’ తర్వాత, 2028 నాటికి మనిషిని చంద్రుడిపైకి పంపాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ‘ఆర్టెమిస్ 2’ మిషన్ విజయవంతంగా తిరిగి వచ్చిన తర్వాత అమిత్ మాట్లాడుతూ చంద్రుడిపైకి వెళ్లే మార్గం సుగమమైంది. కానీ మనం చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది అని అన్నారు. సురక్షితమైన అంతరిక్ష ప్రయాణాలకు ఆయన చేసిన కృషికి గాను నాసా అవుట్ స్టాండింగ్ లీడర్ షిప్ మెడల్‌తో పాటు, వ్యోమగాములు బహూకరించే ప్రతిష్టాత్మక సిల్వర్ స్నూపీ అవార్డును కూడా అమిత్ దక్కించుకున్నారు.ఇది కూడా చదవండి: ఇంటర్నెట్ను ఊపేసిన ‘90-డిగ్రీల’ బ్రిడ్జి ఇక హిస్టరీ! -
అటకెక్కిన ‘రింగు’.. ఎన్హెచ్ఏఐ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: గేమ్ ఛేంజర్ అంటూ ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగురోడ్డు) విషయంలో అదిగో ఇదిగో అంటూ ఊరించి ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టును కేంద్రం అటకెక్కించింది. దాదాపు ఏడాది క్రితమే ప్రాజెక్టు కోసం టెండర్లు పిలిచిన కేంద్ర ప్రభుత్వం, 2025–26 ఆర్థిక సంవత్సరంలో దానికి ఆమోదం తెలపలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసిపోవటంతో ఏకంగా ఆ టెండర్లనే రద్దు చేసుకునే దిశగా యోచిస్తోంది.కొత్త ఆర్థిక సంవత్సరం ఇప్పుడు మొదలైనందున, ఈ ఏడాది కాలం సమయం ఉంది. దీంతో ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్టుగానే తెలుస్తోంది. ప్రస్తుతానికి టెండర్లు తెరిచే గడువును మరో రెండు నెలలకు పొడిగించింది. ఆ తర్వాత రద్దు చేసి నవంబరు నాటికి కొత్త టెండర్లు పిలుస్తారన్న మాట వినిపిస్తోంది. వెరసి, రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం పనులు ఇప్పట్లో మొదలు కావు. ప్రయారిటీ జాబితాలో లేకపోవటమే... ట్రిపుల్ ఆర్ రెండు భాగాలు పూర్తి చేసేందుకు దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చు కానున్నాయి. అందులో ప్రస్తుతానికి ఉత్తర భాగాన్ని మాత్రమే కొలిక్కి తెస్తున్నందున, దానికి రూ.18 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్ వేలు, జాతీయ రహదారుల విస్తరణపై ఫోకస్ చేస్తున్న కేంద్రం వాటిని ప్రయారిటీ లిస్టులో చేర్చుకొని పనులు మొదలుపెడుతోంది. ట్రిపుల్ ఆర్ ప్రయారిటీ జాబితాలో లేదు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, రాజకీయంగా లాబీయింగ్ చేస్తున్న రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వీలు చిక్కుతోంది. గతంలో భారత్‌మాల పరియోజనలో ట్రిపుల్ ఆర్‌ను చేర్చి వేగంగా టెండర్ల ప్రక్రియ వరకు తెచ్చినా, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి–కేంద్రానికి మధ్య ఆ ప్రాజెక్టు భూసేకరణ డబ్బు డిపాజిట్ చేసే విషయంలో పేచీ నెలకొని మాటల యుద్ధానికి దారి తీసింది.దీంతో ట్రిపుల్ ఆర్‌ను అప్పట్లో ప్రయారిటీ జాబితా నుంచి కేంద్రం తొలగించింది. ఇప్పటికీ దాదాపు అదే పరిస్థితి కొనసాగుతోంది. టెండర్లు పిలిచినా, కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆధ్వర్యంలోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్íÙప్ అప్రైజల్ కమిటీ ఆమోద ముద్ర వేయలేదు.కేంద్ర ఆర్థిక శాఖ పర్యవేక్షణలో ఉండే ఈ కమిటీ ఆమోద ముద్ర వేస్తేనే ఆ ప్రాజెక్టుకు బడ్జెట్ విడుదలవుతుంది. ఆ ఆమోదం లేకుంటే టెండర్లను ఖరారు చేయటం కుదరదు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి ఇప్పుడు ఆ కమిటీ ఆమోదం లభించాల్సి ఉంది. బడ్జెట్ విడుదల కాకపోయేసరికి టెండర్లను ఖరారు చేయలేక అరడజను మార్లు గడువు పొడిగిస్తూ ఎన్హెచ్ఏఐ కాలయాపన చేయాల్సి వస్తోంది. ఖర్చు తగ్గించాలని.... రింగురోడ్డుకు భారీగా ఖర్చు చేయాల్సి రావటాన్ని కూడా ఇటీవల సమీక్షించిన కేంద్ర ఆర్థిక శాఖ, ఖర్చును తగ్గించాల్సిందిగా కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు సూచించింది. ఆమేరకు ఆ శాఖ కార్యదర్శి పలు దఫాలు సమావేశమై, చాలా ప్రత్యేకతల్లో కోత విధించారు. ఏకంగా ఎనిమిది వరుసల రోడ్డును ఆరు వరుసలకే కుదించారు. సర్వీసు రోడ్డు ఆప్షన్ తొలగించారు. రోడ్డు ఎత్తు, అండర్‌పాస్‌ల సంఖ్య తగ్గించారు. చివరకు దానిమీద సెంట్రల్ లైటింగ్ సిస్టంను కూడా తొలగించారు. చివరకు దాన్ని ఎక్స్‌ప్రెస్ వేగా కాకుండా సాధారణ జాతీయ రహదారిగానే నిర్మించాలని తేల్చారు.దాదాపు రూ.4 వేల కోట్ల ఖర్చును తగ్గించటంతో ఇక అనుమతి వస్తుందని అంతా భావించారు. కానీ, ఉత్తర ప్రదేశ్‌లోని ఓ కీలక రోడ్డుకు అనుమతి ఇచ్చి కమిటీ చేతులు దులుపుకొంది. ఇంతలో ఆర్థిక సంవత్సరం ముగిసిపోవటంతో బడ్జెట్ ఖరారుకు వీలుచిక్కదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో, మళ్లీ రోడ్ల ప్రయారిటీ జాబితా రూపొందించాల్సి ఉంది. అందులో ప్రాధాన్య రహదారిగా ట్రిపుల్ ఆర్ గుర్తింపు దక్కించుకుంటే జూన్ నాటికి దానికి అనుమతి వచ్చే అవకాశముంది. కాదంటే, ఏడాది చివరి వరకు ఎదురు చూడాల్సిందేనని తెలుస్తోంది. -
దేశ ప్రజలను అవమానించిన పాక్ క్రికెటర్!
పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్ సూపర్‌లీగ్ (పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్న హసన్ అలీ అసభ్యకరమైన సంజ్ఞతో సైగలు చేయడం వివాదానికి దారి తీసింది. విషయంలోకి వెళితే.. శనివారం కరాచీ కింగ్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్ మధ్య మ్యాచ్ జరిగింది.కింగ్స్‌మెన్ ఇన్నింగ్స్ సమయంలో అబ్బాస్ అఫ్రిది వేసిన 8వ ఓవర్లో ఉస్మాన్‌ఖాన్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే నిల్చున్న హసన్ అలీ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ తీసుకున్నాడు. అయితే క్యాచ్ తీసుకున్న వెంటనే పెవిలియ్ స్టాండ్ వైపు తిరిగి ‘నోరు మూయండి’ అన్నట్లు సైగ చేసి ఆ తర్వాత గాల్లోకి పంచ్ విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ప్రస్తుతం పీఎస్ఎల్ ఖాళీ స్టేడియాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. కరాచీ కింగ్స్ తమ సొంత గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతుండడంతో స్టేడియం మొత్తం నిశ్శబ్ధంగా ఉండడం ప్రేక్షకులు లేకుండానే మాకు హాయిగా ఉంది అన్నట్లుగా అర్థం వచ్చేలా సైగలు ఉండడం వివాదంగా మారింది. ఇక పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన వ్యయం పెరుగుతుందన్న ఉద్దేశంతో పీఎస్ఎల్ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు. అయితే అంతకముందు ఇన్నింగ్స్ 7.3 ఓవర్లో ఉస్మాన్ ఖాన్ ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ జారవిడిచాడు. మళ్లీ హసన్ అలీనే ఉస్మాన్ ఖాన్ క్యాచ్ తీసుకున్నాడు. చేసిన తప్పుకు ప్రాయచిత్తం చేసుకునేందుకే హసన్ అలీ ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ కింగ్స్‌మెన్ 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకొని విజయం సాధించింది.- @RealHa55an signalling this to whom? 🤔 pic.twitter.com/FGOJ1TaWIP— HAMAS 🇵🇰 (@HamasulGhani) April 11, 2026చదవండి: ట్విస్ట్ అదుర్స్.. అరుదైన జాబితాలో ఆయుశ్ మాత్రే! -
ఇన్ స్టాలో అసభ్యకర కంటెంట్.. యాంకర్ విష్ణుప్రియపై కేసు
తెలుగు యాంకర్ విష్ణుప్రియపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె పోస్ట్ చేస్తున్న అసభ్యకర ఫొటోలు, అర్థనగ్న వీడియోలపై ఫిర్యాదు రావడంతోనే ఈ కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)అసలేం జరిగిందంటే?ఇన్‌స్టాలో సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ని కొన్నేళ్ల క్రితం తీసుకొచ్చారు. అయితే పలువురు హీరోయిన్లు, చాలామంది మహిళా ఇన్ఫ్లూయెన్సర్స్.. అందరూ చూసే ఫొటోలు, వీడియోలు కాకుండా ప్రత్యేకమైనవి చూడాలనుకుంటే రూ.399 లేదా అంతకంటే కాస్త తక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. రీసెంట్గా విష్ణుప్రియ మరీ మితిమీరిపోయేలా ఫొటోలు, వీడియోలు సదరు సబ్‌స్కైబర్స్ పోస్ట్ చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే యాంకర్ విష్ణుప్రియపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. పలు షోలతో అలరించే విష్ణుప్రియ, కాసులకు కక్కుర్తి పడి అర్ధనగ్న వీడియోలు చేస్తున్నారని విమర్శించారు. వెంటనే విష్ణుప్రియ ఇన్‌స్టా అకౌంట్ బ్లాక్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు కేసు నమోదైంది. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు పోలీసు స్టేషన్ మెట్లెక్కింది.(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్) -
వేల కి.మీ దూరం నుంచి క్షిపణులను గుర్తించగలిగే..
సాక్షి, విశాఖపట్నం: వేల కిలోమీటర్ల దూరం నుంచి బాలిస్టిక్ క్షిపణులను గుర్తించగలిగే ఓ యుద్ధ నౌక శనివారం విశాఖ తీరంలో కనువిందు చేసింది. రక్షణ శాఖకు చెందిన ఈ నౌకను నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సిబ్బంది నిర్వహిస్తారు. అణు క్షిపణితో పాటు ఉపగ్రహాలను సైతం ట్రాకింగ్ చేసే సామర్థ్యం దీని సొంతం.హార్మూజ్‌ను దాటిన జగ్ విక్రమ్భారతీయ జెండా కలిగిన ఎల్పీజీ ట్యాంకర్ జగ్ విక్రమ్ హార్మూజ్‌ను విజయవంతంగా దాటేసింది. అమెరికా–ఇరాన్‌ల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక హార్మూజ్‌ను దాటిన మొదటి భారతీయ ట్యాంకర్ ఇది. శనివారం మధ్యాహా్ననికి గల్ఫ్ ఆఫ్ ఒమన్‌ను దాటి భారత్ దిశగా సాగుతోంది. ముంబైలోని గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీకి చెందిన జగ్ విక్రమ్ సుమారు 20 వేల టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది.కాగా, మార్చి మొదటి వారం నుంచి హార్మూజ్‌ను వీడిన 9వ భారతీయ ట్యాంకర్ ఇది. మరో 15 భారతీయ నౌకలు ఇప్పటికీ అక్కడే వేచి ఉన్నాయి. వీటితోపాటు వివిధ దేశాలకు చేరుకోవాల్సిన మొత్తం 426 ట్యాంకర్లు, 34 ఎల్పీజీ, 19 ఎల్ఎన్జీ క్యారియర్లు ఆ ప్రాంతంలో ఉన్నట్లు మెరైన్ ట్రాఫిక్ డేటా చెబుతోంది. -
కోలీవుడ్‌లో సీక్వెల్స్ జోరు.. లైన్లో పది హిట్ సినిమాలు
‘ముదల్ పగుది’ (ఫస్ట్ పార్ట్) అదిరింది. అయితే ఆ కథ అక్కడితో ఆగలేదు. కొనసాగించే స్కోప్ ఉంది. అంతే... ‘ఇరండామ్ పగుది ఇరుక్కు’ (సెకండ్ పార్ట్ ఉంది) అంటూ సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ ఇరండామ్ పగుది రెండింతల మజానివ్వాలని ప్రేక్షకులకు, ఆయా చిత్రాల హీరోల అభిమానులకు ఉంటుంది కదా. అది దృష్టిలో పెట్టుకునే మరింత జాగ్రత్తగా సీక్వెల్ కథలను సిద్ధం చేసుకున్నారు దర్శకులు. 2026–2027లో తమిళ ‘వెండి తిరై’ (వెండి తెర) బోలెడన్ని సీక్వెల్స్ చూడబోతోంది. చెప్పాలంటే... కొన్ని సినిమాలకు సంబంధించిన ఫస్ట్ పార్ట్ తెలుగులోనూ విడుదలైంది. సో... ఇరండామ్ పగుది కూడా ఇక్కడ విడుదల కాకుండా ఉండదు. మరి... ఏయే సినిమాకి సీక్వెల్ రానుందో పడిక్కలాం (చదువుదాం) వాంగ (రండి). మరింత యాక్షన్ డోస్‌తో...టైగర్ ముత్తువేల్ పాండియన్ రాక కోసం అతని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముత్తువేల్ పాత్రను రజనీకాంత్ అంత స్టైలిష్‌గా చేశారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్’ (2023)లో రజనీ పాత్ర పేరు ముత్తువేల్ పాండియన్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. జాకీ ష్రాఫ్, మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ వంటి స్టార్స్ అతిథులుగా నటించడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అయింది. ఇక జైలర్‌గా రజనీ తనదైన స్టైల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగం కన్నా మలి భాగంలో ముత్తువేల్ పాండియన్ పాత్రకు మరింత యాక్షన్ డోస్ పెంచి, రజనీని మరింత స్టైలిష్‌గా చూపించనున్నారు నెల్సన్. ఈ సీక్వెల్ కథ అంతర్జాతీయ క్రైమ్ నెట్ వర్క్ నేపథ్యంలో సాగుతుందని, ముత్తువేల్ పాండియన్ గతాన్ని కూడా చూపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ‘జైలర్ 2’లోనూ మోహనల్ లాల్, శివ రాజ్‌కుమార్ కనిపించనున్నారు. విజయ్ సేతుపతి కూడా అతిథి పాత్ర చేశారు. అదనపు ఆకర్షణగా షారుక్ ఖాన్ కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. విద్యా బాలన్, మిథుర్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించారు. సీక్వెల్‌ని మరింత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది సన్ పిక్చర్స్. జూన్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారన్నది ప్రస్తుత సమాచారం. తొలి భాగంలానే మలి భాగం కూడా అదే టైటిల్‌తో తెలుగులో విడుదల కానుంది. త్వరలో సెట్స్‌కి కంగువ 2గతం, వర్తమానం... ఇలా రెండు టైమ్‌లైన్స్‌లో సాగే చిత్రంగా ‘కంగువ’ (2024) ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో ఈ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో కంగువాగా, ఫ్రాన్సిస్ థియోడోర్గా డ్యుయల్ రోల్లో కనిపించి, ఆకట్టుకున్నారు సూర్య. ‘కంగువ’ విడుదల సమయంలోనే సెకండ్ పార్ట్ ఉంటుందని చిత్రనిర్మాత జ్ఞానవేల్ రాజా స్పష్టం చేశారు. సీక్వెల్ కథ కూడా సిద్ధమైంది. గత ఏడాది చివర్లోనే క్లాప్ కొట్టి, చిత్రాన్ని ఆరంభిస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం జరగలేదు. త్వరలో చిత్రీకరణ ఆరంభిస్తారని సమాచారం. వచ్చే ఏడాది విడుదల చేయాలన్నది టీమ్ ప్లాన్. ఇదిలా ఉంటే... తొలి భాగం చివర్లో కార్తీ పాత్ర పరిచయం అవుతుంది. దాంతో ఈ సీక్వెల్ సూర్య, కార్తీ మధ్య సాగే భారీ యాక్షన్ మూవీగా ఉంటుందనే ఊహాగానాలు నెలకొన్నాయి. తమిళ, తెలుగులో భాషల్లో తొలి భాగం విడుదలైనట్లుగానే ‘కంగువ 2’గా ఈ రెండు భాషల్లో విడుదలవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలో సర్దార్ 2... 2027లో సెట్స్‌కి డిల్లీ ఒకటి కాదు... రెండు సీక్వెల్స్‌లో కనిపించనున్నారు కార్తీ. ఒకటి ఆల్రెడీ విడుదలకు సిద్ధంగా ఉంది అదే ‘సర్దార్ 2’. మరొకటి ‘ఖైదీ 2’. ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. సర్దార్ ఎప్పుడు వస్తాడు? కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్దార్’ (2022) సూపర్ హిట్ అయింది. ఈ స్పై థ్రిల్లర్ మూవీకి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్లో ‘సర్దార్ 2’ రూపొందిన. నిజానికి ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది జూన్‌లో పూర్తయింది. డిసెంబరులో విడుదలవుతుందని చాలామంది ఊహించారు. కానీ, అది జరగలేదు. చివరికి ఈ ‘సర్దార్’ సమ్మర్‌కి వస్తాడనే టాక్ ప్రచారంలో ఉంది. అయితే ఏ తేదీకి వస్తాడు? అనే విషయం గురించి చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. తొలి బాగంలో ఏజెంట్ సర్దార్, ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాశ్‌గా డ్యుయల్ రోల్ చేసిన కార్తీ మలి భాగంలోనూ ఈ రెండు పాత్రల్లో కనిపిస్తారు. కాగా ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్‌లో యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుందని సమాచారం. తొలి భాగం మంచి టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో మలి భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి. కార్తీ ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది.రెండింతల యాక్షన్... ఎమోషన్ డిల్లీ అంటే ఎవరో ‘ఖైదీ’ (2019) సినిమా చూసినవాళ్లకి తెలుసు. ఆ సినిమాలో హీరో కార్తీ పాత్ర పేరు డిల్లీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీక్వెల్ చేసే ఆలోచన ఉందని లోకేశ్ గతంలో పేర్కొన్నారు. అయితే ఇంకా పట్టాలెక్కకపోవడంతో ‘ఖైదీ 2’ లేదని చాలామంది ఫిక్స్ అయిపోయారు. మఖ్యంగా డిల్లీ పాత్రను చాలా ఇష్టపడిన కార్తీ అభిమానులను ఈ సీక్వెల్ ఆగిందనే వార్తలు నిరాశకు గురి చేశాయి. నిజానికి ఈ సినిమా ఆగిందని ప్రచారం జరగడానికి కారణం అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయడానికి లోకేశ్ కనగరాజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. అయితే ‘ఖైదీ 2’ ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లోకేశ్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది డిల్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ‘ఖైదీ’ సినిమా చివర్లో డిల్లీ తన కూతురు అముదిని కలుసుకోవడానికి బయలుదేరుతాడు. తన కూతురితో కొత్త జీవితం ్ర΄ారంభించాలనుకుంటాడు. కానీ అతను జైలులో ఉన్నప్పుడు పని చేసిన డ్రగ్ మాఫియా గ్యాంగ్ పూర్తిగా నాశనం కాదు. ఆ గ్యాంగ్‌లో మిగిలిన సభ్యులు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయిస్తారు. ‘ఖైదీ 2’ కథ అక్కడి నుంచే ప్రారంభమవుతుందని సమాచారం. ఫస్ట్ పార్ట్‌తో పోల్చితే సీక్వెల్ రెండింతల యాక్షన్, ఎమోషన్‌తో ఉండేలా లోకేశ్ ΄ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ అంటోంది. కార్తీ అన్ని సినిమాలూ తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతాయి కాబట్టి ‘ఖైదీ 2’ కూడా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుంది. మరోసారి అమ్మవారిగా...నయనతార కథానాయికగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఫ్యాంటసీ కామెడీ మూవీ ‘మూకుత్తి అమ్మన్’ (2020). దర్శకుడిగా బాలాజీకి ఇది తొలి చిత్రం. ఈ చిత్రంలో నయనతార అమ్మవారి పాత్ర పోషించారు. తాజాగా ‘మూకుత్తి అమ్మన్ 2’ రూపొందింది. రెండో భాగంలోనూ నయనతార కథానాయికగా నటించారు. అయితే దర్శకుడు మారారు. రెండో భాగాన్ని దర్శకుడు సుందర్. సి తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఖుష్బూ, స్నేహ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఊర్వశి, రెజీనా కసాండ్రా, సునీల్, యోగిబాబు, అభినయ తదితరులు నటించారు. ఇటీవలే ‘మూకుత్తి అమ్మన్ 2’ షూటింగ్ పూర్తయింది. తొలి భాగం ‘అమ్మోరు తల్లి’ టైటిల్‌తో తెలుగులో విడుదలైంది. రెండో భాగం కూడా విడుదల కానుంది. ఈ ఏడాదే ఈ సీక్వెల్ సిల్వర్ స్క్రీన్‌కి వస్తుంది. అయితే ఇంకా విడుదల తేదీ ఫిక్స్ కాలేదు. మళ్లీ బాక్సింగ్ రెడీబాక్సింగ్ నేపథ్యంలో ఆర్య హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సార్పట్ట పరంపర’ (2021). ఈ చిత్రం అదే పేరుతో తెలుగులోనూ విడుదలైంది. తమిళనాడులోని అట్టడుగు వర్గాలు నివాసం ఉండే ప్రాంతం నేపథ్యంలో ఈ స్పోర్ట్స్ డ్రామాని రూపొందించారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడే సీక్వెల్ ప్రకటించారు. ఈ జూన్‌లో సీక్వెల్ షూటింగ్‌ని ప్రారంభిస్తామని తాజాగా ఆర్య స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే... పా.రంజిత్ దర్శకత్వంలోనే ఆర్య హీరోగా ఆరంభమైన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘వెట్టువమ్’ షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ్ల ఓ లీడ్ రోల్లో కనిపిస్తారు. ఈ ఏడాదే ‘వెట్టువమ్’ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమా పనులు ఒక కొలిక్కి రావడంతో ‘సార్పట్ట పరంపర 2’ షూటింగ్‌ని జూన్‌లో ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘తని ఒరువన్ 2’ ఆగదు‘జయం’ రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘తని ఒరువన్’ (2015). ఈ చిత్రకథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, ‘జయం’ రవి పర్ఫార్మెన్స్... ఇలా అన్నింటికీ ప్రశంసలు దక్కాయి. వసూళ్ల పరంగా కూడా భేష్ అనిపించుకుంది. ఈ చిత్రం తెలుగులో రామ్‌చరణ్ హీరోగా ‘ధ్రువ’ పేరుతో రీమేక్ అయింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘తని ఒరువన్’కి సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. అయితే పదేళ్లయినా సీక్వెల్ ఇంకా పట్టాలెక్కక΄ోవడంతో రెండో భాగం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమా ఆగలేదని, గత ఏడాది సెప్టెంబర్‌లో త్వరలో ఈ సినిమా గురించి అప్డేట్ ఇస్తామని మోహన్ రాజా పేర్కొన్నారు. ఆ తర్వాత వేరే న్యూస్ ఏదీ రాలేదు. నిర్మాణంలో జాప్యం జరుగుతుందే కానీ సీక్వెల్ నిర్మించాలనే ఆలోచనను యూనిట్ విరమించుకోలేదని కోలీవుడ్ టాక్. కుస్తీకి రెడీవిష్ణు విశాల్ హీరోగా రెజ్లింగ్ నేపథ్యంలో చెల్లా అయ్యవు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గట్ట కుస్తీ’ (2022). ‘మట్టి కుస్తీ’గా తెలుగులో విడుదలైంది. మరోసారి ఈ హీరో–దర్శకుడు వెండితెరపై కుస్తీ చూపించడానికి రెడీ అయ్యారు. ‘గట్ట కుస్తీ 2’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది. నీలాంబరి రిటర్న్స్రజనీకాంత్ హీరోగా నటించిన ‘పడయప్పా’ (1999 – తెలుగులో ‘నరసింహా’) లో నీలాంబరిగా రమ్యకృష్ణ కనబర్చిన నటనను అంత సులువుగా మరచిపోలేం. ఈ సినిమా విడుదలై పాతికేళ్లు అవుతోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. కాగా, ఈ చిత్రానికి సీక్వెల్ వచ్చే అవకాశం ఉంది. రెండో భాగానికి రజనీకాంత్ కథ రాస్తున్నారని ఆయన రెండో కుమార్తె సౌందర్య పేర్కొన్నారు. కానీ ఎవరు నటిస్తారు? దర్శకత్వం వహిస్తారు వంటి విషయాలు తెలియజేయడానికి ఇది ‘టూ ఎర్లీ’ అవుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. కథ పూర్తయ్యాక ఆ వివరాలను తెలియజేస్తారు. అయితే టైటిల్ మాత్రం ‘నీలాంబరి’ అనుకుంటున్నారట. మరగద నాణ్యం 2‘మరకతమణి’గా విడుదలైంది. ఈ ఫ్యాంటసీ కామెడీ మూవీకి సీక్వెల్‌గా ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మరగద నాణ్యం 2’ని ఆరంభించారు. ఆది పినిశెట్టి హీరోగా, నిక్కీ గల్రానీ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా ఏఆర్కే శరవణన్ దర్శకత్వంలోనే రెండో భాగం రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ లానే సీక్వెల్ కూడా ఫ్యాంటసీ కామెడీ నేపథ్యంలోనే సాగుతుంది. కాగా పెళ్లి చేసుకున్న తర్వాత ఆది, నిక్కీ జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ ఇద్దరూ 2022లో పెద్దల సమ్మతంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగులోనూ విడుదలవుతుంది. -
ఇంటర్ అయిపోయింది... నెక్స్ట్ ఏంటి?
పరీక్షలు ముగిశాయి. అసలైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది . మీకు వచ్చిన మార్కులు, ర్యాంకు కంటే మీరు తీసుకోబోయే ఈ నిర్ణయమే చాలా ముఖ్యం.- రాహుల్ అత్తులూరి (సిఈఓ & కో-ఫౌండర్, నెక్స్ట్ వేవ్)ఇంటర్ పూర్తయిన సందర్భంగా ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేయండి. ఈ రెండేళ్లు మీరు పడ్డ కష్టం, నిద్రలేని రాత్రులు, ఒత్తిడి.. వీటన్నిటికీ తగిన ఫలితం మీరు పొందారు.కానీ, రిజల్ట్స్ వచ్చిన మరుక్షణమే సెలబ్రేషన్స్‌తో పాటు ఒక కొత్త రకమైన టెన్షన్ మొదలవుతుంది. చుట్టాల ప్రశ్నలు, పక్కింటోళ్ల పోలికలు, పేరెంట్స్ ఆందోళన.. ఈ గందరగోళం మధ్యలో మీ లైఫ్ మొత్తాన్ని ప్రభావితం చేసే ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.ఒక విషయం క్లియర్‌గా చెప్తాను వినండి. మీ ఇంటర్ మార్కులు గానీ, పర్సంటేజీ గానీ, జేఈఈ ర్యాంకు గానీ.. ఇవేవి కూడా మీరేంటో నిర్ణయించలేవు. ఉదాహరణకి ప్రతి ఏటా సుమారు 14.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ రాస్తారు, కానీ అందులో కేవలం 18 వేలు మాత్రమే ఐఐటీ సీట్లు పొందుతున్నారు. అంటే ప్రతి వంద మందిలో 99 మందికి ఐఐటీ సీటు రాట్లేదు. దానికి కారణం వాళ్లకు టాలెంట్ లేకపోవడం కాదు, అక్కడ సీట్లు లేకపోవడమే. జేఈఈ అనేది సీట్ల కోసం పెట్టే ఒక ఫిల్టర్ మాత్రమే, అంతే తప్ప అది మీ టాలెంట్నో లేదా మీ ఫ్యూచర్ సక్సెస్నో నిర్ణయించేది కాదు.ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రాకపోయినా, ఐఐటీ లేదా ఎన్ఐటీల్లో సీటు రాకపోయినప్పటికీ, లైఫ్ లో అద్భుతంగా రాణిస్తున్న వాళ్లు వేలల్లో ఉన్నారు. వాళ్లు పెద్ద పెద్ద కంపెనీలకు సీటీఓ లుగా, స్టార్టప్ ఫౌండర్లుగా, గ్లోబల్ టెక్ కంపెనీల్లో ఏఐ టీమ్స్ లీడర్లుగా ఉంటూ.. ఏటా 30 నుంచి 40 లక్షల ప్యాకేజీలు సంపాదిస్తున్నారు. వాళ్లు సక్సెస్ అవ్వడానికి కారణం 18 ఏళ్ల వయసులో వాళ్లకు వచ్చిన ర్యాంకు కాదు, ఆ తర్వాత నాలుగేళ్ల వాళ్లు గడిపిన విధానం.మీ జీవితంలో ఒక కొత్త మలుపు చాలామంది స్టూడెంట్స్ ఏదో హడావిడిగా, పక్కవాళ్లను చూసి తమ కెరీర్ నిర్ణయాన్ని తీసుకుంటారు. సరిగ్గా అక్కడే సరిదిద్దుకోలేని పొరపాటు జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు తీసుకోబోయే నిర్ణయమే మీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది.ఇక నుంచి కేవలం మీ చదువులోనే కాదు, మీ సక్సెస్‌ను కొలిచే పద్ధతిలో కూడా ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. గత 18 ఏళ్లుగా, టెన్త్ క్లాస్ పర్సంటేజీ, ఇంటర్ పర్సంటేజీ, జేఈఈ ర్యాంకు ఇలా అంతా అంకెల చుట్టూనే తిరిగింది…ఒకటే ఎగ్జామ్, ఒకటే రోజు, ఒక్కటే ఛాన్స్. కానీ, ఆ ఆట ఇక్కడితో అయిపోయింది.ఇప్పుడు మొదలయ్యే కొత్త ఆటలో నియమాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. మీరు ఏం తయారు చేయగలరు? ఎలాంటి సమస్యలను పరిష్కరించగలరు? మీరు ఎంత విలువను సృష్టించగలరు? అనేదే ఇక్కడ ముఖ్యం. నిజానికి ఇది మీకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చే విషయం. ఎందుకంటే, ఇప్పటి వరకు మీకు ఒక్కటే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు, ప్రతి రోజూ మీకు ఒక కొత్త అవకాశమే. ఏదో ఒకటి నేర్చుకోవడానికి, ఏదైనా నిర్మించడానికి, మీ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ప్రతి రోజూ ఛాన్స్ ఉంటుంది. ఈ మార్పును ఎవరైతే ముందుగా గుర్తిస్తారో, వాళ్లు రాబోయే నాలుగేళ్లు కేవలం అందరిలా గడపడమే కాదు, ఆ కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని చరిత్ర సృష్టిస్తారు.రాబోయే నాలుగేళ్లు అసలు ఏం నిర్ణయిస్తాయి?ఈ ఏడాది మొదట్లో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు వెళ్ళినప్పుడు… అక్కడ ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ఎడ్యుకేషన్ మినిస్టర్లు, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు, ప్రపంచ స్థాయి ఏఐ రీసెర్చర్లతో కలిసి చర్చిస్తుంటే, వాళ్లందరూ ఒకే మాట చెప్పారు. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలు విద్యార్థులను భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం లేదు. యూనివర్సిటీల్లో ఇంకా 15-20 ఏళ్ల క్రితం నాటి టెక్నాలజీలనే బోధిస్తున్నారు. కేవలం డిగ్రీ ఉంటే సరిపోదని రిక్రూటర్లు స్పష్టంగా చెప్తున్నారు. అభ్యర్థులు సొంతంగా ఏం బిల్డ్ చేయగలరో చూడాలనుకుంటున్నారు.అన్‌స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2025 ప్రకారం ఈ రోజుల్లో 73 శాతం మంది రిక్రూటర్లు కాలేజీ పేరు కంటే, మీకు ఉన్న స్కిల్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ గిట్‌హబ్ ప్రొఫైల్, మీరు చేసిన ప్రాజెక్టులే మీ కాలేజీ పేరు కంటే ముఖ్యం కాబోతున్నాయి. రాబోయే నాలుగేళ్లు కేవలం డిగ్రీ అనే ఓక పేపర్ సంపాదించడం గురించి మాత్రమే కాదు, భవిష్యత్ కి తగిన స్కిల్ బిల్డ్ చేసుకోవడం గురించి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న విద్యార్థులు 2030 నాటికి అందరికంటే ముందుంటారు.మరి మీరు ఏం చేయాలి?మీరు ఏదైనా కాలేజీని లేదా ప్రోగ్రామ్‌ను ఎంచుకునేటప్పుడు కేవలం బ్రోచర్లు, క్యాంపస్ ఫోటోలు చూసి నిర్ణయం తీసుకోకండి. వాటికి బదులు ఈ మూడు ప్రశ్నలు అడగండి:1. పదేళ్ల క్రితం నాటిది కాకుండా, ప్రస్తుతం ఇండస్ట్రీకి ఏం కావాలో దానికి తగ్గట్టుగా సిలబస్ ఎప్పటికప్పుడు మారుస్తున్నారా? లేదా?2. నేర్చుకునే టైమ్ లో 60 నుంచి 70 శాతం కేవలం థియరీ చదవడం మాత్రమే కాకుండా, ప్రాజెక్టులు చేయడానికి కేటాయిస్తున్నారా? లేదా?3. లాస్ట్ ఇయర్ వరకు ఆగకుండా, ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్ చేసేలా ప్రోత్సహిస్తున్నారా? లేదా?ఆ తర్వాత, ప్రపంచం ఏ దిశగా వెళ్తుందో గమనించండి. ఏజెంటిక్ ఏఐ వచ్చేసింది. ఫిజికల్ ఏఐ ప్రపంచాన్ని మార్చేస్తోంది. క్వాంటం కంప్యూటింగ్ మన కళ్లముందే ఉంది. వ్యవసాయం, ఆరోగ్యం, మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇలా ప్రతి రంగం ఐదేళ్లలో ఈ టెక్నాలజీల వల్ల పూర్తిగా మారిపోబోతున్నాయి. ఎవరైతే విద్యార్థులు ఇప్పుడే ఈ కొత్త టెక్నాలజీలతో ప్రాజెక్టులు చేయడం మొదలుపెడతారో, వాళ్లకు 2030 నాటికి అసలు పోటీ అనేదే ఉండదు.మార్పు ఎంత వేగంగా ఉందో చూడండి. ఇప్పుడు థర్డ్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ 2022లో కాలేజీలో చేరినప్పుడు అసలు చాట్ జీపీటీ, క్లాడ్, లేదా జెమిని లేనే లేవు. ఈ నాలుగేళ్లలోనే ప్రపంచం మొత్తం మారిపోయింది. రాబోయే నాలుగేళ్లలో ఇది ఇంకా వేగంగా మారుతుంది. మీ బాధ్యత ఏంటంటే.. రాబోయే మార్పుకు సిద్ధంగా ఉండటం, అంతే తప్ప జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం కాదు.సరైన మార్గాన్ని ఎంచుకోవడంసరైన కాలేజీ లేదా ప్రోగ్రామ్ ఏది అంటే.. స్కిల్స్ బిల్డింగ్ కి పెద్దపీట వేసేవే. అంతే తప్ప అది ఎప్పుడో ఫైనల్ ఇయర్ లో చూసుకోవచ్చులే అనేలా ఉండకూడదు. మొదటి సెమిస్టర్ నుంచే స్టూడెంట్స్ రియల్ ఏఐ ప్రాజెక్టులు, రోబోటిక్స్ మరియు కొత్త టెక్నాలజీలపై పనిచేసేలా వీలు కల్పిస్తున్న చోట చేరండి. ఎక్కడైతే ఇండస్ట్రీ నిపుణులు నేరుగా క్లాస్‌రూమ్‌లోకి వచ్చి, వాస్తవ ప్రపంచంలోని సమస్యలను, టూల్స్‌ను మరియు వారి అనుభవాన్ని పంచుకుంటారో అలాంటి వాటిని వెతకండి.ఇప్పుడు మీతో కొంత మంది మీలాంటి స్టూడెంట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను, వాళ్లు ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళ మార్కుల గురించి గానీ, ర్యాంకుల గురించి గానీ దిగులుపడలేదు. స్కిల్స్ బిల్డ్ చేసుకోవడమే ముఖ్యం అని తెలుసుకొని దానికి అనుగుణంగా దారిని ఎంచుకున్నారు.ఉదాహరణకు విశ్వకసేన అనే ఒక స్టూడెంట్ ఇంటర్ తరువాత స్కిల్స్ ముఖ్యమని గ్రహించి ఎన్ఐఏటి అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్ లో చేరి జెనెరేటివ్ ఏఐ పై పట్టు సాధించాడు. తన ఫస్ట్ ఇయర్ లోనే ఏఐ ని వాడుతు ఇన్ఫిల్ అనే ఒక స్టార్టప్ స్టార్ట్ చేశాడు.అలానే సాయి నవతేజ్ అనే స్టూడెంట్ సరిగ్గా కంపెనీలకు ఏ స్కిల్స్ కావాలో అవి నేర్చుకుంటూ ఫస్ట్ ఇయర్ లోనే స్టైపెండ్ తో కూడిన ఇంటర్న్‌షిప్ సాధించాడు. ఇలా సాధించడం చాలా అరుదు. అది స్కిల్స్ కి ఉన్న పవర్.ముంబైలోని 'లెన్‌డెన్‌క్లబ్' కార్పొరేట్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘ది మేట్రిక్స్ ప్రోటోకాల్ ఏఐ హ్యాకథాన్'లో కొందరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తాము నేర్చుకున్న స్కిల్స్ ద్వారా ఎంతో అనుభవం ఉన్న సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్‌తో, దేశంలోని టాప్ యూనివర్సిటీల విద్యార్థులతో పోటీపడి మరీ తమ సత్తా చాటారు.అంతే కాదు అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ ఇండియా లో తక్కువగా జరుగుతాయి అదీ ఐఐటీల వంటి టాప్ ఇన్స్టిట్యూట్ లలో ఉన్న లాబ్ లలో మాత్రమే జరుగుతాయి అని చాలా మంది అనుకుంటారు. కానీ… పురుజిత్, నయీమ్, అఖిల మరియు కౌశిక్ కలిసి ‘ఎన్ఐఏటి 5.0 లాబ్స్’ ని ఉపయోగించుకొని ఏఐ ద్వారా కోమా పేషెంట్స్ మనసులోని భావాలను తెలియజేసే గొప్ప ఏఐ ఇన్నోవేషన్ తయారు చేశారు. అంతే కాదు…ఇంకొంత మంది స్టూడెంట్స్ మనుషులు వెళ్లలేని ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి వెళ్లగలిగేలా హ్యూమనాయిడ్ రోబోట్ ని ప్రోగ్రామ్ చేశారు, ఏఐ డ్రోన్స్ నిర్మిస్తున్నారు.ఇలా రాస్తూ వెళ్తే సక్సెస్ స్టోరీస్ వందల్లో ఉంటాయి. వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఒకటే... స్కిల్స్ ముఖ్యం అని గ్రహించారు. ఇంటర్ తర్వాత ఎన్ఐఏటి ని ఎంచుకున్నారు.ఎన్ఐఏటి వంటి అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ నేర్చుకునేలా డిజైన్ చేయబడ్డాయి. ఇవి విద్యార్థులకు కావాల్సిన ప్లాట్‌ఫామ్స్ మరియు వాతావరణాన్ని అందిస్తూ, మొదటి రోజు నుండే వారిని 'టెక్ బిల్డర్స్'గా మారుస్తున్నాయి.చివరగా ఒక మాటమీ ఇంటర్ రిజల్ట్ అనేది ఒక మైలురాయి మాత్రమే, అది మీ జీవితానికి ఇచ్చే తీర్పు కాదు. ఇది మీ లైఫ్ లో ఎంతో ఉత్సాహంగా ఉండాల్సిన సమయం. దీన్ని ఒత్తిడిగా మార్చుకోవద్దు. మీ ముందు ఎన్నో దారులు ఉన్నాయి. మీరు ఎంచుకునే వాతావరణం, మీరు నేర్చుకునే స్కిల్స్, మీరు పరిష్కరించే సమస్యలే మీ కెరీర్‌ను నిర్ణయిస్తాయి.భారతదేశపు తర్వాతి తరం 'టెక్ బిల్డర్స్' ఇప్పుడే మొదలవుతున్నారు. ఆ లిస్టులో మీరు కూడా ఒకరు. అల్ ది బెస్ట్!For more details: https://rebrand.ly/be7c36 -
అదరగొట్టిన భారత రెజ్లర్లు..
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో శనివారం భారత రెజ్లర్లు రెండు స్వర్ణ పతకాలు, ఒక రజతం, ఒక కాంస్యం సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సుజీత్ కల్కాల్ (65 కేజీలు), అభిమన్యు (70 కేజీలు) పసిడి పతకాలతో మెరిపించగా... సందీప్ సింగ్ మాన్ (79 కేజీలు) రజతం... అంకుశ్ (57 కేజీలు) కాంస్యం దక్కించుకున్నారు. ఈ ఏడాది అజేయంగా ఉన్న సుజీత్ ఫైనల్లో 8–1 పాయింట్ల తేడాతో ఉమిద్‌జాన్ జలోలోవ్ (ఉజ్బెకిస్తాన్)ను అలవోకగా ఓడించాడు. ఈ విజయంతో సుజీత్ 2019లో బజరంగ్ పూనియా తర్వాత 65 కేజీల విభాగంలో ఆసియా చాంపియన్‌గా అవతరించిన భారత రెండో రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. మరోవైపు అభిమన్యు 5–3తో తుల్గా తుముర్ ఒచిర్ (మంగోలియా)పై గెలుపొందాడు. 79 కేజీల ఫైనల్లో సందీప్ సింగ్ 1–2తో కీవన్ ఘరెదాగి (జపాన్) చేతిలో ఓడిపోయాడు. 57 కేజీల కాంస్య పతక బౌట్లో అంకుశ్ 8–2తో ఫుగా ససాకి (జపాన్)పై విజయం సాధించాడు. 97 కేజీల కాంస్య పతక బౌట్లో విక్కీ 5–7తో షెర్జాద్ పొయోనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో అమన్, ముకుల్ టోర్నీ చివరిరోజు ఆదివారం భారత్‌కు మరో రెండు స్వర్ణ పతకాలు లభించే అవకాశం ఉంది. 61 కేజీల విభాగంలో అమన్ సెహ్రావత్, 86 కేజీల విభాగంలో ముకుల్ దహియా ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్‌లో అమన్ 11–9తో అహ్మద్ (ఇరాన్)పై, ముకుల్ 12–6తో బొలాత్ సకాయెవ్ (కజకిస్తాన్)పై గెలిచారు. 125 కేజీల విభాగం సెమీఫైనల్లో దినేశ్ 0–2తో షరిపోవ్ (బహ్రెయిన్) చేతిలో ఓడిపోయి నేడు కాంస్య పతకం కోసం పోటీపడతాడు. -
'ఫేస్ పౌడర్' వెనుక ఇంత స్టోరీ ఉందా..!
పొద్దున్నే స్కూల్‌కి లేదా ఉద్యోగాలకో, ఫంక్షన్లకో వెళ్ళేముందు ముఖానికి పౌడర్ రాసుకుంటారా? ఇలా రాసుకోవడం ఎలా మొదలైంది? అసలు ఫేస్ పౌడర్ కథేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పౌడర్ ప్రాచీన ఈజిప్ట్ నుండి వచ్చింది. పురావస్తు అవశేషాలు, రసాయన విశ్లేషణల ప్రకారం క్రీ.పూ.2000–1200 మధ్య కాలంలో అప్పటి ప్రజలు ముఖానికి పౌడర్ రాసుకున్నట్లు చరిత్రకారులు గుర్తించారు. ప్రాచీన ఈజిప్షియన్ల సమాధుల్లో దొరికిన సౌందర్య సాధనాల్లో పౌడర్ కూడా ఉండటం విశేషం. ఆ రోజుల్లో పురుషులు, మహిళలు తమ చెంపల కోసం ఎర్ర గైరిక్ నుండి తయారు చేసిన పౌడర్ బ్లష్‌ను ఉపయోగించేవారు. ముఖానికి వేసుకునే పౌడర్‌కు ఔషధ ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆ రోజుల్లో భావించేవారు. ఆధునిక కాలంలో మేకప్‌ను స్థిరపరచడానికి, చర్మాన్ని మెరిచేలా చేయడానికి పౌడర్‌ను ఉపయోగిస్తారు. 1980లు మరియు 90లలో పౌడర్ చివరకు మేకప్‌ను సెట్ చేయడానికి ఒక ముఖ్యమైన వస్తువుగా మారింది. ఈ రోజుల్లో చాలామంది పౌడర్ కచ్చితంగా వాడుతున్నారు. ఫేస్ పౌడర్లు రెండు ప్రధాన రకాలుగా ఉంటుంది. ఒకటి లూజ్ పౌడర్. ఇది జిడ్డు చర్మంలోని అదనపు తేమను పీల్చుకోవడానికి సహాయపడుతుంది. మరొకటి ప్రెస్డ్ పౌడర్. ఇది మచ్చలను కప్పిపుచ్చడానికి పనికొస్తుంది. (చదవండి: అసలు పరీక్షలెవరు కనిపెట్టారో తెలుసా..!?) -
పెళ్లయిన మూడోరోజే భార్య వదిలేస్తే.. ఫన్నీగా ట్రైలర్
అడపాదడపా హీరోగా సినిమాలు చేసే తిరువీర్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'పాపం ప్రతాప్'. గతేడాది డిసెంబరులో 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో హిట్ కొట్టిన ఇతడు.. ఇప్పుడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్)1998లో గోదావరిలో జరిగే కథగా దీన్ని చూపించారు. ప్రతాప్, బుజ్జమ్మని పెళ్లి చేసుకుంటాడు. కానీ మూడో రోజే ఆమె.. ప్రతాప్‌ని వదిలి వెళ్లిపోతుంది. తర్వాతరోజు పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెడుతుంది. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? ప్రతాప్ ఏమైనా చేశాడా? ప్రతాప్‌కే ఏమైనా జరిగిందా అనేదే కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. 'ఒకమ్మాయి ఇల్లు వదిలి వెళ్లిందంటే అబ్బాయి ఏం చేశాడని అడుగుతారు. కానీ ఆ అబ్బాయికి ఏం జరిగిందని ఎవరూ అడగరు' అనే డైలాగ్ ఆసక్తికరంగా అనిపించింది. నవ్వుని నటిస్తూ బతుకుతున్న ప్రతి మగాడి కథ అని చివరో ఓ లైన్ వేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా) -
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఇంటర్ విద్యా బోర్డు ఆవరణలో ఈ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విడుదల చేశారు. https://tgbie.cgg.gov.in, https:// results.cgg.gov.in వెబ్సైట్లలో ఈ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఫలితాలను https://education.sakshi.com/ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈసారి ఇంటర్ పరీక్షలకు 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 66.20 శాతం ఉత్తీర్ణత రాగా, బాలికల-74.4 శాతం, బాలురు-57.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్లో 70.58 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. వాట్సాప్‌లో కూడా.. ఇంటర్మిడియట్ ఫలితాలను మీ సేవ వాట్సాప్ ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ సర్వీసును శనివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సచివాలయంలో ఆవిష్కరించారు. ఇప్పటికే ఇంటర్మీడియట్, టెన్త్ హాల్‌టికెట్లను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మిడియట్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఏప్రిల్ 12, 2026 నుంచి పరీక్షా ఫలితాలను కూడా నేరుగా వాట్సాప్‌లో అందించనుంది. విద్యార్థులు 8096958096 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పంపి మీ సేవ చాట్‌బోట్ ద్వారా తమ రోల్ నంబర్, ఇయర్, స్ట్రీమ్ వివరాలు నమోదు చేసి ఫలితాలను వెంటనే పొందవచ్చు. -
అసలు పరీక్షలెవరు కనిపెట్టారో తెలుసా..!?
ఇది పరీక్షల కాలం. పిల్లలతోపాటు పెద్దలూ హడావిడి పడుతుంటారు. అసలీ పరీక్షలు ఎవరు కనిపెట్టారంటూ కొందరు పిల్లలు విసుక్కుంటుంటారు. లిఖిత పూర్వక పరీక్షలు కనిపెట్టిన దేశం ఏదో తెలుసా? చైనా. అవును! ప్రామాణికతో కూడిన లిఖిత పరీక్షలను మొదట చైనాలో అమలు చేశారు. వీటిని ‘కేజు’ అని పిలిచేవారు. సుయి రాజవంశం క్రీ.శ. 605లో ఉద్భవించింది. దాని వారసురాలైన టాంగ్ రాజవంశం, వు జెటియాన్ పాలనలో పరీక్షా విధానం మొదలైంది. సాంగ్ రాజవంశం కాలంలో కేవలం గొప్ప ఇళ్ల వాళ్లే కీలక అధికారుల స్థానాలు తీసుకోకుండా సామాన్యులు కూడా అధికారులు అయ్యేందుకు వీలుగా పరీక్షలు నిర్వహించేవారు. కన్ఫ్యూషియస్ క్లాసిక్స్‌ను సిలబస్‌గా చదువుకుని పరీక్షలకు కూచునేవారు. అలా పాసైన వారికి ఉద్యోగాలు దక్కేవి. 13వ శతాబ్దంలో మంగోల్ యువాన్ రాజవంశం ప్రారంభంలో ఈ పరీక్షలకు ఒక చిన్న అంతరాయం ఏర్పడింది. ఆ తరువాత మంగోలులకు అనుకూలంగా, దక్షిణ చైనీయులకు ప్రతికూలంగా ఉండే ప్రాతీయ కోటాలతో వీటిని తిరిగి ప్రవేశపెట్టారు. కాలక్రమంలో ఆధునిక పరీక్షలు చైనాతో పాటు అన్నీ దేశాలలోకి వచ్చాయి. -
అన్ని పార్టీల పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోదీ లేఖ
ఢిల్లీ: అన్ని పార్టీల పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నారీ శక్తి వందన్ అదినియమ్ ద్వారా మహిళా శక్తిని మరింత బలోపేతం చేయాలన్న ప్రధాని.. వీలైనంత తొందరగా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలన్న అంశంపై విస్తృత ఏకాభిప్రాయం ఉందని పేర్కొన్నారు.ఈ బిల్లుపై రాజకీయ పార్టీలతో సంప్రదింపులు పూర్తి చేశాం. 2029 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి. మహిళలకు రిజర్వేషన్ వల్ల ప్రజాస్వామ్యం మరింత బలోపేతం. పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాలి’’ అని ప్రధాని లేఖలో పేర్కొన్నారు.Congress president and Rajya Sabha LoP Mallikarjun Kharge writes to PM Narendra Modi, "I have just received your letter on the special session of Parliament for a discussion on the Nari Shakti Vandan Adhiniyam from the 16th of April...This special sitting has been called without… pic.twitter.com/SqkvavZmPs— ANI (@ANI) April 12, 2026 -
ఇరానియన్లకు ట్రంప్ ఝలక్
వాషింగ్టన్: అమెరికాలో దీర్ఘకాలంగా నివాసముంటున్న ఇరాన్ ప్రస్తుత, మాజీ సీనియర్ అధికారుల సంబంధీకుల గ్రీన్‌కార్డులను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. తాజాగా, లాస్‌ఏంజెలెస్‌కు చెందిన సైకాలజీ ఉపాధ్యాయుడు సయ్యద్ ఈసా హషేమీ, ఆయన భార్య, కుమారుడి గ్రీన్‌కార్డులను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.అయితే, వీరంతా ఇరాన్లో జన్మించి, అమెరికాలో చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా కలిగిన వారని వివరించింది. వీరిని నిర్బంధంలోకి తీసుకున్న అధికారులు త్వరలోనే స్వదేశానికి పంపనున్నారని తెలిపింది. 1979లో టెహ్రాన్‌లోని అమెరికా ఎంబసీపై దాడి చేసిన వారికి ప్రతినిధిగా వ్యవహరించిన మసౌమె ఎబ్తెకర్ కుమారుడే హషేమీ. అనంతరం మసౌమె ఇరాన్ మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలయ్యారు.కాగా, 2020లో బాగ్దాద్‌పై అమెరికా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ మాజీ చీఫ్ కసెమ్ సొలెమానీ కుటుంబీకుల గ్రీన్ కార్డులను గత వారం విదేశాంగ శాఖ రద్దు చేయడం తెల్సిందే. పాకిస్తాన్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
మంచి రక్తప్రసరణ కోసం..!
మంచి రక్త ప్రసరణకు, మానిసిక ప్రశాంతతకు యోగాలో చాలామంచి ఆసనాలు ఉన్నాయి. అవి క్రమం తప్పకుండా వేస్తుండటం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే కాకుండా మానసికంగానూ బలోపేతం అవుతారని చెబుతున్నారు యోగా నిపుణులు. మరి అవేంటో చూద్దామా..!మరీచాసనం..చేయు విధానం.. మ్యాట్‌పై కూర్చొని రెండు కాళ్లను నిటారుగా చాచి దండాసనంలో ఉండాలి. ఎడమ కాలిని మడిచి, ఎడమపాదాన్ని కుడితొడపై ఉంచాలి. ∙ఎడమ మోకాలిని ఎడమచేతితో చుట్టి పట్టుకుని, రెండు చేతులను వెనుకకు తీసుకెళ్లి లాక్ చేయాలి. శ్వాస తీసుకుంటూ వెన్నెముకను నిటారుగా ఉంచాలి. శ్వాస వదులుతూ మెల్లగా కుడి వైపుకు తిరగాలి. ఈ స్థితిలో 10–15 సెకన్లు ఉండాలి. తర్వాత మామూలు స్థితికి వచ్చి, మరోవైపు చేయాలి.ఉపయోగాలు.. రక్త ప్రసరణ మెరుగవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వెన్నెముక, నడుము బలపడతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.జాగ్రత్తలు.. 1. వెన్ను నొప్పి లేదా డిస్క్ సమస్యలున్నవారు ఈ ఆసనం చేయకూడదు. 2. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఈ ఆసనం చేయకూడదు.– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ ఒత్తిడి పరార్నిత్యం ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి పరారవుతుంది. ద్యానం ఒత్తిడిని తగ్గించి.. ఆలోచన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా క్షణాల్లో దానికి పరిష్కారాన్ని వెతకగలిగే సామర్థ్యం మెరుగుపడుతుంది. కనుక ప్రతి రోజూ 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ధ్యానం చేయాలన్నది నిపుణుల సూచన.(చదవండి: పుష్-అప్స్లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్ 12 వారాల్లో..) -
దివాలా తీసిన జేఏఎల్ కొనుగోలు.. అదానీకే ‘జై’!
న్యూఢిల్లీ: దివాలా తీసిన తమ సంస్థ జేఏఎల్ కొనుగోలుకి సంబంధించి అదానీ గ్రూప్ వైపై జేపీ గ్రూప్ వ్యవస్థాపకుడు జైప్రకాశ్ గౌర్ మొగ్గు చూపారు. గౌతమ్ అదానీ సారథ్యంలో గ్రూప్ పురోగమించగలదని విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. రుణదాతల కమిటీ (సీవోసీ), దివాలా పరిష్కార నిపుణుడు పారదర్శకంగా బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహించినట్లు గౌర్ పేర్కొన్నారు.ఇందులో పాల్గొన్నందుకు అదానీ గ్రూప్, వేదాంత గ్రూప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. అదానీ గ్రూప్‌ను సీవోసీ ఎంపిక చేయడాన్ని తాను గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. బిడ్డింగ్‌లో తాము గెల్చినట్లు రాతపూర్వకంగా ధృవీకరించిన తర్వాత, దానికి భిన్నంగా అదానీ గ్రూప్‌ను విజేతగా ప్రకటించారంటూ పోటీ సంస్థ వేదాంత చీఫ్ అనిల్ అగర్వాల్ ఆరోపించిన నేపథ్యంలో గౌర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.రూ. 57,185 కోట్ల రుణాలు బాకీ పడటంతో 2024 జూన్‌లో జేఏఎల్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. రూ. 14,535 కోట్ల అదానీ గ్రూప్ బిడ్‌కు గతేడాది నవంబర్‌లో సీవోసీ ఆమోదించగా, మార్చి 17న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (అలహాబాద్ బెంచ్) కూడా ఆమోదముద్ర వేసింది. అయితే, రూ. 17,926 కోట్లకు బిడ్ చేసిన వేదాంత, దీన్ని సవాలు చేస్తూ అపీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. ప్రస్తుతం దీనిపై ఎన్సీఎల్ఏటీ విచారణ చేపట్టినప్పటికీ, ఎన్సీఎల్టీ నిర్ణయంపై మధ్యంతర స్టే విధించడానికి నిరాకరించింది. -
ఇంటర్నెట్ను ఊపేసిన ‘90-డిగ్రీల’ బ్రిడ్జి ఇక హిస్టరీ!
భోపాల్: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ‘90-డిగ్రీల వంతెన’ గుర్తుంది కదా? ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ వింత డిజైన్ పై అటు స్థానికుల నుంచి, ఇటు నెటిజన్ల వరకూ తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు ఎట్టకేలకు దిగివచ్చారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ), రైల్వే శాఖల కొనసాగుతున్న వివాదానికి ముగింపు దొరికింది. ‘సిమెంట్ తో కట్టిన మృత్యుద్వారం’గా ముద్రపడిన ఈ వంతెన డిజైన్‌ను పూర్తిగా మార్చివేసి, త్వరలోనే సురక్షితంగా తీర్చిదిద్ది, ప్రజల వినియోగానికి తీసుకురావాలని ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు.భోపాల్ లోని ఐష్బాగ్ ప్రాంతంలో సుమారు 18 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి 2025, జూన్ నాటికే పూర్తయినప్పటికీ వాహనాల రాకపోకలకు నోచుకోలేదు. ప్రారంభోత్సవానికి కొద్ది రోజుల ముందు, ఈ వంతెన మలుపు ఏకంగా 90 డిగ్రీల కోణంలో ఉన్న దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఆ మలుపులో వాహనాలు అదుపుతప్పి బోల్తా పడతాయని స్పష్టమైంది. ఈ దారుణమైన ప్లానింగ్ పై దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మీమ్స్, విమర్శలు వెల్లువెత్తాయి.ఈ నేపధ్యంలో ఏడుగురు పీడబ్ల్యూడీ ఇంజనీర్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బృందాలను రంగంలోకి దించింది. పక్కనే ఉన్న మెట్రో లైన్ వల్లే డిజైన్ లో ఈ సమస్య తలెత్తిందని దర్యాప్తులో తేలింది. రైల్వే శాఖ నుండి సాంకేతిక అనుమతులు వచ్చిన వెంటనే మరో నాలుగు, ఐదు రోజుల్లో పాత కాంట్రాక్టర్‌తోనే మార్పుల పనులు ప్రారంభించనున్నారు. కొత్త డిజైన్ ప్రకారం మలుపు వ్యాసార్ధాన్ని 2 మీటర్ల నుండి 2.5 మీటర్లకు, వంతెన వెడల్పును 8.5 మీటర్ల నుండి 10.5 - 11 మీటర్లకు పెంచనున్నారు. దీని ద్వారా కార్లు, మధ్య తరహా, భారీ వాహనాలు సురక్షితంగా ప్రయాణించే వీలుంటుంది.ఇది కూడా చదవండి: ట్రంప్ ‘మ్యాజిక్ పెయింట్’.. మండిపడుతున్న నిపుణులు -
ట్విస్ట్ అదుర్స్.. అరుదైన జాబితాలో ఆయుశ్ మాత్రే!
ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు ఆయుశ్ మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయుశ్ రిటైర్డ్ ఔట్ వెనుక సీఎస్కే మేనేజ్మెంట్ హస్తం ఉంది. మంచి ఈజ్‌తో బ్యాటింగ్ చేస్తున్న ఆయుశ్ మాత్రేను అర్థంతరంగా రిటైర్డ్ ఔట్‌గా వెళ్లిపోవడం వెనుక విమర్శలు వచ్చాయి. కానీ సీఎస్కే నిర్ణయం సరైనదే అని కాసేపటికే తెలిసొచ్చింది. ఆయుశ్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్డ్ హిట్టర్ శివమ్ దూబే తన పాత్రకు న్యాయం చేస్తూ వేగంగా పరుగులు రాబట్టాడు. ఫలితంగా సీఎస్కే భారీ స్కోరు సాధించింది. ఆయుశ్ మాత్రే రిటైర్డ్ ఔట్ వెనుక కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ పాత్ర కీలకం. అందుకే మాత్రే పెవిలియన్ చేరుకున్న సమయంలో అతడికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఈ నేపథ్యంలో ఆయుశ్ మాత్రే ఒక అరుదైన జాబితాలో చేరిపోయాడు. ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్లు చాలా తక్కువగా జరుగుతుంటాయి. గతంలో రవిచంద్రన్ అశ్విన్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, డెవాన్ కాన్వే వంటి క్రికెటర్లు రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగారు. తాజాగా ఈ జాబితాలో ఆయుశ్ మాత్రే కూడా చేరిపోయాడు. కాగా ఐపీఎల్ 2026 సీజన్లో ఆయుశ్ మాత్రేదే తొలి రిటైర్డ్ ఔట్.సాధారణంగా క్రికెట్లో రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ వేర్వేరు. రిటైర్డ్ హర్ట్' అంటే గాయం కారణంగా ఆటగాడు మైదానం విడిచిపెట్టడం. అదే రిటైర్డ్ ఔట్ అనేది జట్టు ప్రయోజనాల కోసం స్వచ్చందంగా మైదానం విడిచిపెట్టడం. రిటైర్డ్ హర్ట్ అయితే సదరు మ్యాచ్‌లో మళ్లీ మైదానంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రిటైర్డ్ ఔట్ అలా కాదు. ఒక్కసారి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగితే మళ్లీ క్రీజులోకి వచ్చేందుకు అవకాశం ఉండదు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. View this post on Instagram A post shared by IPL (@iplt20) చదవండి: అంపైర్‌తో వాదన.. కోపంతో ఊగిపోయిన స్టబ్స్! -
ట్రంప్ ‘మ్యాజిక్ పెయింట్’.. మండిపడుతున్న నిపుణులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విభిన్నమైన నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. రెండోసారి అధికార పీఠం ఎక్కిన తర్వాత తన ప్రత్యేకమైన అభిరుచి మేరకు వైట్‌హౌస్ పరిసరాల రూపురేఖలు మార్చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఆయన ఏకంగా ‘మ్యాజిక్ పెయింట్’ అనే కొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఒక అద్భుత భవనానికి ఈ రంగు వేయాలన్న ఆయన నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.1888లో గ్రానైట్ రాయితో నిర్మించిన ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్ వైట్‌హౌస్‌కు ఆనుకునే ఉంటుంది. జాతీయ భద్రతా మండలి, ఉపాధ్యక్షుడి కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. 553 విశాలమైన గదులు, అద్భుతమైన చెక్క అలంకరణలు, చేతితో చిత్రించిన టైల్స్ ఉన్న ఈ సువిశాల భవనానికి పూర్తి తెలుపు రంగు వేయాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. దీనికోసం సిలికేట్‌తో కూడిన మ్యాజిక్ పెయింట్ వాడాలని ఆయన సూచిస్తున్నారు. ఈ రంగు కారణంగా రాతి గోడలు మరింత దృఢంగా మారుతాయని, మరకలు పడవని, భవిష్యత్తులో మళ్లీ రంగు వేసే పని ఉండదని వైట్‌హౌస్ వర్గాలు చెబుతున్నాయి. 1800ల చివరి నుండి ఈ భవన నిర్వహణను నిర్లక్ష్యం చేశారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫైన్ ఆర్ట్స్ కమిషన్‌కు నివేదికలు సమర్పించారు.అయితే ఈ ప్రతిపాదనను చరిత్రక కట్టడాల పరిరక్షణ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ చెబుతున్న సిలికేట్ మ్యాజిక్ పెయింట్ ఆ గ్రానైట్ భవనానికి ఏమాత్రం సరిపడదు. ఈ పెయింట్ వాడటం వల్ల చరిత్రక భవనానికి ముప్పు వాటిల్లుతుందని, పైగా ఇది చట్టవిరుద్ధమని సాంస్కృతిక వారసత్వ భాగస్వామ్య పక్షాలు కోర్టును ఆశ్రయించాయి. ఎన్ని అడ్డంకులు వస్తున్నా ట్రంప్ ప్రతిపాదన మాత్రం ముందుకు సాగుతుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇది కూడా చదవండి: సిలిండర్ కథ కంచికి.. హైడ్రోజన్ పొయ్యి మన ఇంటికి! -
హైడ్రా భారీ ఆపరేషన్.. 15వేల కోట్ల భూమి స్వాధీనం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కూల్చివేతల భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. జిల్లాలోని అమీన్పూర్, ఐలాపురంలో రెండో రోజు కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 861 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. రూ. 15వేల కోట్లకు పైగా విలువైన భూమిని హైడ్రా కాపాడింది.ఆదివారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను కూల్చి వేసింది. ఆరు అంతస్తుల ముఖీం గెస్ట్ హౌస్‌తో పాటు ఫామ్ హౌస్‌ను అధికారులు కూల్చివేశారు. ఇక, ఇప్పటికే ఇల్లు కట్టుకున్న వారిని మినహాయించి మిగిలిన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ఈ భారీ ఆపరేషన్‌ను నిర్వహించింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా.. నిర్మాణాలు జరిపిన భవనాలను హైడ్రా కూల్చివేసింది.వివరాల మేరకు, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురం గ్రామంలో ఒకటి నుంచి 220 సర్వే నంబర్ల వరకూ మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వెలిశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 861 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. 863 ఎకరాల భూమి విలువ రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. పట్టించుకోకుండా నిర్మించిన గెస్ట్ హౌస్‌ను హైడ్రా తొలగించింది. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది.కాగా, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. 2.20 ఎకరాల్లో ముఖీం సోదరుడు ఎంఏ అజీం ఆరు అంతస్తుల భవనం నిర్మించారు. స్విమ్మింగ్‌పూల్‌తో సహా విలాసవంతంగా ఇంటిని నిర్మించుకున్నారు. అలాగే, ఇంటి చుట్టూ 40 ఎకరాల మేర గడీలు పెట్టి ఫామ్ హౌస్ కట్టారు. గుర్రాల కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టడం విశేషం. -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన అడివి శేష్ 'డెకాయిట్', ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం బోలెడన్ని కొత్త మూవీస్ వచ్చాయి. వీటిలో తాయ్ కిళవి, శబ్దం, డార్క్ నైట్, ఓ రోమియో, తూ యా మై, త్రాష్ తదితర చిత్రాలున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఏంటది? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)ప్రభాస్ 'ఈశ్వర్' సినిమాలో నటించి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హను కోట్ల.. హీరోగా చేసి, దర్శకత్వం వహించిన మూవీ 'ద డీల్'. 2024 అక్టోబరులో థియేటర్లలోకి వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తీసినప్పటికీ పెద్దగా స్టార్స్ లేకపోవడం, సరైన స్టోరీ కూడా లేకపోవడంతో ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇప్పుడీ మూవీ అద్దె విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.'ద డీల్' విషయానికొస్తే.. యాక్సిడెంట్ దెబ్బకు గతం మర్చిపోయిన భైరం(హను కోట్ల) మెలకువ వచ్చిన తర్వాత లక్ష్మి(ధరణి ప్రియా) అనే పేరు కలవరిస్తుంటాడు. ఈమె తన భార్య అని, కలవాలని అంటాడు. మరోవైపు తనని చంపాలని చూస్తున్నారనే విషయం తెలుసుకున్న భైరవ.. తాను అసలు ఎవరో అని కనుగొనే ప్రయత్నంలోనూ ఉంటాడు. మరి భైరవ జీవితంలో ఇందు, మాధవ్ పాత్రేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్) -
బీడు భూమితో లాభాలు.. రైతులకు మాధవన్ చూపిన దారి
ఒకప్పుడు నిరుపయోగంగా, బీడుగా ఉన్న భూమి ఇప్పుడు కొబ్బరి చెట్లతో పచ్చని తోటగా మారింది. నేల సారవంతాన్ని పునరుద్ధరించడం, పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తూ నటుడు మాధవన్ ఈ ప్రాజెక్టును తన వ్యక్తిగత అభిరుచిగా సుమారు ఆరేళ్ల క్రితం చేపట్టారు. ఓర్పు, ప్రణాళిక, సుస్థిర పద్ధతులతో నిరుపయోగంగా ఉన్న భూమిని ఎలా పునరుజ్జీవింపజేయవచ్చో ఆయన కృషి ప్రపంచానికి తెలియజేస్తుంది.'ధురంధర్' చిత్రంలో బలమైన పాత్రతో వెండితెరపై బహుముఖ నటనతో మెప్పించి ప్రశంసలు పొందిన నటుడు ఆర్. మాధవన్.. 2019 సమయంలో తమిళనాడులోని పళనిలో తన సోదరుడు శుభయోగ్యన్తో కలిసి కొబ్బరి సాగు ప్రారంభించారు. నిరూపయోగంగా ఉన్న బీడు భూమిని కౌలుకు తీసుకుని, కేవలం మూడేళ్లలోనే విజయవంతంగా ఫలవంతమైన కొబ్బరి తోటగా మార్చారు. ఈ ఏడాది కొబ్బరికాయల దిగుబడి మరింత పెరగడంతో ఆదాయం కూడా వస్తుంది. ఆయన నిరంతర కృషితో బీడు భూమి ఇప్పుడు కొబ్బరి చెట్లతో ఫలవంతమైన తోటగా రూపాంతరం చెందింది. 2020లో, ఆయన తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా మొదటిసారి ఈ విషయాన్ని వెల్లడించారు. చివరకు, తమిళనాడులోని పళనిలో కొబ్బరి సాగు ప్రాజెక్ట్ పూర్తయిందంటూ రైతులకు పలు సూచనలు ఇచ్చారు. నేల సారవంతాన్ని పునరుద్ధరించడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. బీడుగా ఉన్న భూమిలో హైబ్రిడ్ కాని, స్వచ్ఛమైన పొట్టి రకం కొబ్బరికాయలను పండించవచ్చని ఒక వ్యాసం ద్వారా రైతులకు సూచనలు ఇచ్చారు. రసాయన ఎరువులపై ఆధారపడకుండానే దిగుబడి పెంచుకోవచ్చని రుజువుతో చూపారు. మాధవన్ ముంబైల్నోఇ తన ఇంటి టెర్రస్‌పైన కూడా పలు చెట్లను పెంచుతున్నారు. చెర్రీస్, బొప్పాయ వంటి వాటితో ఆర్గానిక్ ఫలాలు పొందుతున్నారు. తన పడక గది పక్కనే కూరగాయలు పండుతున్నాయంటూ ఒక వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) -
పసిడి, ఫారెక్స్ నిల్వలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: ఇటీవల తగ్గముఖం పట్టిన భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు మళ్లీ పుంజుకున్నాయి. ఏప్రిల్ 3తో ముగిసిన వారంలో 9.063 బిలియన్ డాలర్లు పెరిగి 697.121 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు (మార్చి 27) వారంలో ఇవి 10.288 బిలియన్ డాలర్లు క్షీణించి 688.058 బిలియన్ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక గరిష్టం 728.494 డాలర్లుగా నమోదయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత కొన్ని వారాలు పాటు తగ్గుతూ వచ్చాయి. రూపాయి మారకపు విలువపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని డాలర్లు విక్రయించడమే కాక.. కొన్ని విధానపరమైన జాగ్రత్తలనూ తీసుకుంటోంది.ఏప్రిల్ 3తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.784 బిలియన్ డాలర్లు పెరిగి, 552.856 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల విలువ 7.221 బిలియన్ డాలర్లు పెరిగి 120.742 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. -
అందుకే ఒప్పందం కుదరలేదు: ఇరాన్ కీలక ప్రకటన
ఇస్లామాబాద్: అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఇరాన్ వెల్లడించింది. యూఎస్ మితిమీరిన డిమాండ్ల వల్లే ఒప్పందం కుదరలేదని.. చర్చల అనంతరం వివాదాస్పద అంశాలు లేవనెత్తారని ఇరాన్ పేర్కొంది. హర్మూజ్ జలసంధి, అణు హక్కుల వంటి వివాదస్పద అంశాలు ప్రస్తావించారన్న ఇరాన్.. ఏమీ తేలకుండానే అమెరికాతో చర్చలు ముగిశాయని పేర్కొంది.పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. 14 గంటలపాటు చర్చలు సాగాయి. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. తమ డిమాండ్లకు ఇరాన్ అంగీకరించలేదు. ఇరాన్‌తో డీల్ లేదని ఆయన స్పష్టం చేశారు.ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. తాము విధించిన షరతులను ఇరాన్ ప్రతినిధులు అంగీకరించలేదని వాన్స్ పేర్కొన్నారు. చర్చల్లో తాము చాలా సానుకూలంగా వ్యవహరించామంటూ చెప్పుకున్న వాన్స్.. దురదృష్టవశాత్తు ఎలాంటి పురోగతి సాధించలేకపోయామన్నారు.హార్మూజ్ జలసంధిపై సంపూర్ణ ఆధిపత్యం మాకే ఉండాలని.. అక్కడ నియంత్రణను వదులుకొనే ప్రసక్తే లేదంటూ ఇరాన్ తేల్చి చెబుతోంది. గల్ఫ్ దేశాల నుంచి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలి. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు ఉండడానికి వీల్లేదు. ఇరాన్‌పై అమెరికాతోపాటు యూరప్ దేశాలు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి. యురేనియం శుద్ధి సహా అణు కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. స్తంభింపజేసిన మా ఆస్తులను విడుదల చేయాలి’’ అని ఇరాన్ డిమాండ్ చేస్తూ వస్తోంది.మరోవైపు, ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదని అమెరికా డిమాండ్ చేస్తోంది. యురేనియం శుద్ధి ప్రక్రియను ఇరాన్ వెంటనే ఆపాలి. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించాలి. హార్మూజ్ నుంచి స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలి. విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకోరాదు’’ అని అమెరికా స్పష్టం చేసింది. -
అంపైర్‌తో వాదన.. కోపంతో ఊగిపోయిన స్టబ్స్!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఢిల్లీ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో కోపంతో ఊగిపోతూ హెల్మెట్‌ను నేలకేసి కొట్టడంతో పాటు గ్లోవ్స్‌ను విసిరేయడం కెమెరాలకు చిక్కింది. మరి స్టబ్స్ కోపానికి కారణమేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో స్టబ్స్ తన గ్లోవ్స్‌ను మార్చుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే గ్లోవ్స్ మొత్తం చెమటతో తడిసిపోవడంతో స్టబ్స్ పదే పదే బ్యాట్ గ్రిప్‌ను కోల్పోయాడు. దీంతో గ్లోవ్స్‌ను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని అంపైర్‌ను కోరాడు. కానీ అంపైర్ ససేమీరా అనడంతో చేసేదేం లేక స్టబ్స్ అదే గ్లోవ్స్‌తో కంటిన్యూ అయ్యాడు. అయితే 19వ ఓవర్లో జేమీ ఓవర్టన్ వేసిన మూడో బంతిని భారీ షాట్ ఆడే యత్నంలో మిడాఫ్‌లో నూర్ అహ్మద్ చేతికి చిక్కాడు. దీంతో పెవిలియన్ చేరిన స్టబ్స్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాకా కోపంతో ఊగిపోతూ బ్యాట్‌ను, హెల్మెట్‌ను విసిరేయడంతో పాటు గ్లోవ్స్‌ను నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టబ్స్ ఔటైన తర్వాత డగౌట్లో ఉన్న ఢిల్లీ ఆటగాడు నితీశ్ రానా స్టబ్స్‌ను సమర్థించాడు. తడిగా ఉన్న గ్లోవ్స్‌తో ఆడడం వల్ల బ్యాటింగ్‌కు ఆటంకం కలుగుతుందని, స్టబ్స్‌కు గ్లోవ్స్ మార్చుకునేందుకు అవకాశమెందుకు ఇవ్వలేదంటూ థర్డ్ అంపైర్‌తో వాదనకు దిగాడు. కోచ్ హేమంగ్ బదాని కూడా అంపైర్‌తో ఇదే విషయమై వాదనకు దిగడం కనిపించింది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.Stubbs asked to change his gloves just before the wicket ball and Umpire didn't allow it, now DC management is furious and ofcourse CSK is involved in another spooky decision. pic.twitter.com/jkkImLB5Bq— Avay Sha (@avay_69) April 11, 2026🚨 DC Camp Angry on Umpire Decision 🚨DC coach Hemang Badani and Nitish Rana were angry on umpire after Tristan Stubbs was not allowed to change his gloves during the over.The decision upset the DC camp, and on the very next ball, Stubbs got out. pic.twitter.com/qGHdCe6tQL— Cricket Vaira (@ramgaming242) April 11, 2026Stubs wanted to change his gloves, but the umpire did not allow it, and he got out on the very next ball.#CSKvsDC pic.twitter.com/BAHX9zhURM— Vivek Gupta (@VIVEK1888) April 12, 2026చదవండి: ‘విజయానికి వాళ్లే కారణం.. సంజూ కాదు’ -
ఇరాన్ యుద్ధం.. చైనాకు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు ఓవైపు పాకిస్తాన్లో ఇరాన్, అమెరికా చర్చలు జరుగుతున్న వేళ చైనాకు అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు చైనా ఆయుధ సాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. చైనా ఇరాన్‌కు ఆయుధాలు పంపితే, పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కాగా, ట్రంప్.. మియామీ ప్రయాణానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.అయితే, ఇరాన్‌కు మిత్రదేశం చైనా నుంచి గగనతల రక్షణ వ్యవస్థలను రహస్యంగా తెప్పించుకుంటోందని అమెరికా నిఘా వర్గాలు తాజాగా ఆరోపించాయి. ఈ మేరకు సీఎన్ఎన్ వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది. భుజంపై మోస్తూ సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లగల మ్యాన్‌ప్యాడ్ ఆయుధాలను ఇరాన్‌కు చైనా తరలిస్తోందని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. మ్యాన్‌ప్యాడ్ సాయంతో శత్రువుల హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చేయవచ్చు. హెలికాప్టర్ల ఇంజిన్లు, డ్రోన్ల వేడిమిని గుర్తించే ‘హీట్–సీకింగ్’సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. అమెరికా ఎఫ్–15ఇ యుద్ధ విమానం, బ్లాక్‌హాక్ హెలికాప్టర్లను ఇరాన్ ఇటీవల ఇవే యాంటీ–ఎయిర్–మిస్సైళ్ల వ్యవస్థలతో నేలకూల్చిందని కథనాలు వెలువడ్డాయి.#WATCH | On reports of China shipping weapons to Iran, US President Donald Trump says, "If China does that, China is going to have big problems." (Source: US Network Pool Via Reuters) pic.twitter.com/YiSlLe3TI6— ANI (@ANI) April 12, 2026నేరుగా పంపకుండా వేరే దేశానికి వీటిని విక్రయించి ఆ దేశం నుంచి ఇరాన్ కొనుగోలుచేసేలా వ్యూహం రచించిందని సమాచారం. చైనా అంతర్జాతీయ ఆంక్షల కొరడా దెబ్బల నుంచి తప్పించుకుంటోందని అమెరికా ఆరోపించింది. రష్యా నుంచి సైతం ఇలాగే పనిచేసే వెర్బా అనే యాంటీ–ఎయిర్ మిస్సైళ్ల వ్యవస్థలను ఇరాన్ కొనుగోలుచేస్తోందని వార్తలొచ్చాయి. ఘన రాకెట్ ఇంధనం తయారీవాడే ముడిపదార్థం సోడియం పర్క్లోరేట్తో నిండిన రెండు సరుకు రవాణా నౌకలను ఇప్పటికే ఇరాన్‌కు చైనా పంపిందని తెలుస్తోంది.మరోవైపు.. ట్రంప్ హెచ్చరికలపై చైనా స్పందించింది. ఈ ఆరోపణలను చైనా ఖండించింది. ఈ సందర్బంగా వాషింగ్టన్‌లోని చైనా రాయబారి కార్యాలయం స్పందిస్తూ.. “మేము ఎప్పుడూ యుద్ధంలో ఉన్న ఏ పక్షానికీ ఆయుధాలు ఇవ్వలేదు” అని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్‌కు చైనా, రష్యా ప్రధాన వ్యూహాత్మక భాగస్వాములు. పాశ్చాత్య ఆంక్షల మధ్య వీరి మద్దతు ఇరాన్‌కు కీలకంగా మారింది. అమెరికా మాత్రం ఈ సహకారాన్ని పెద్ద తప్పుగా పరిగణిస్తోంది. -
సిలిండర్ కథ కంచికి.. హైడ్రోజన్ పొయ్యి మన ఇంటికి!
న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్ ధరలు మండిపోతున్న ప్రస్తుత రోజుల్లో, అసలు సిలిండర్‌తోనే పనిలేకుండా వంట చేసుకునే సరికొత్త రోజులు రాబోతున్నాయి. మన దేశంలోనే తయారైన ఓ అధునాతన ‘హైడ్రోజన్ స్టవ్’ ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఎల్పీజీ గ్యాస్ తో ఏమాత్రం సంబంధం లేకుండా, పూర్తిగా గ్రీన్ హైడ్రోజన్ ఇంధనంగా పనిచేసే ఈ పొయ్యి భవిష్యత్తులో మన వంటగదుల రూపురేఖలనే పూర్తిగా మార్చేయబోతోంది.సంప్రదాయ గ్యాస్ పొయ్యిల మాదిరిగా ఇది సిలిండర్‌పై ఆధారపడదు. కేటలిటిక్ హైడ్రోజన్ బర్నర్ టెక్నాలజీతో పనిచేసే ఈ స్టవ్ నూరు శాతం పర్యావరణ హితమైనది. దీనివల్ల వంట చేసేటప్పుడు ఎలాంటి పొగ రాదు. కార్బన్ మోనాక్సైడ్ లాంటి హానికరమైన విషవాయువులు అసలే వెలువడవు. రెండు బర్నర్లు, ఆకర్షణీయమైన స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వచ్చే ఈ టేబుల్-టాప్ స్టవ్ ఎలాంటి శబ్దం, ప్రకంపనలు లేకుండా చాలా ప్రశాంతంగా పనిచేస్తుంది. అతి తక్కువ మంటతోనే ఇది వంటకు కావాల్సిన వేడిని పాత్రకు సమానంగా అందిస్తుంది.హైడ్రోజన్ వాయువును వాడుతున్నందున భద్రత విషయంలో కంపెనీ ఎలాంటి రాజీ పడలేదు. ఫ్లేమ్ అరెస్టర్, ప్రెజర్ రెగ్యులేషన్ సిస్టమ్, హైడ్రోజన్ కు అనువైన వాల్వ్స్ లాంటి కట్టుదిట్టమైన సేఫ్టీ ఫీచర్లు ఇందులో పొందుపరిచారు. అయితే, దీని ధర సుమారు రూ. 1,50,000 ఉండటంతో ప్రస్తుతానికి ఇది సామాన్యులకు అందుబాటులో లేదు. కమ్యూనిటీ కిచెన్లు, ప్రభుత్వ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, డిఫెన్స్ క్యాంటీన్లు, రీసెర్చ్ ల్యాబ్‌లు, పారిశ్రామిక వంటగదులలో దీనిని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ విరివిగా అందుబాటులోకి వచ్చి, ఉత్పత్తి ఖర్చు తగ్గితే ప్రతి ఇంట్లోనూ ఈ అత్యాధునిక పొయ్యిలు దర్శనమివ్వడం ఖాయం.ఇది కూడా చదవండి: ‘దళపతి’కి భారీ షాక్.. బరిలో ఇంతమంది ‘విజయ్’లా? -
జమ్మూకశ్మీర్‌లో అత్యంత అరుదైన దృశ్యం.. వీడియో వైరల్
అఖ్నూర్: జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్లో అరుదైన టోర్నడో 10 నిమిషాల పాటు భీభత్సం సృష్టించింది. కశ్మీర్ వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఈ టోర్నడో జనావాసాలకు దూరంగా ఉండటంతో దీంతో ఎటువంటి నష్టం కలుగలేదు. వందల మీటర్ల ఎత్తు వరకు కనిపించిన టోర్నడ్ను స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఎప్పుడూ చల్లటి వాతావరణం ఉండే ఈ ప్రాంతంలో టోర్నడో సంభవించడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. టోర్నడో వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.టోర్నడో మూడు గంటల తర్వాత వాతావరణ శాఖ విశ్లేషించింది. నార్వెస్టర్ తుపానుల వల్ల ఏర్పడిన ప్రత్యేక వాతావరణ పరిస్థితులే ఈ టోర్నడో-లాంటి ఫార్మేషన్కు కారణమని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో మళ్ళీ టోర్నడోలు వచ్చే అవకాశం లేదని డాప్లర్ వాతావరణ రాడార్ డేటా తెలిపింది. ప్రస్తుతం 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా టోర్నడో ఆనవాళ్లు లేవని పేర్కొంది.Rarest of the rare!A tornado spotted in Akhnoor, Jammu yesterday — an extremely unusual event for the region.Even across Bharat, such fully developed tornadoes are rare. pic.twitter.com/NLXd2DkVJo— Dr. Vineet Kumar (@vineet_mausam) April 12, 2026టోర్నడో అత్యంత శక్తివంతమైన గాలి తుఫాను. భారీ గాలి సుడిగాలి. ఇది తీవ్రంగా తిరిగే గాలి స్తంభం రూపంలో ఉంటుంది. అమెరికాలో ఇటీవల టెక్సాస్, ఒక్లహామా, మిస్సోరి, కాన్సాస్, కెంటకీ రాష్ట్రాల్లో టోర్నడోలు భారీ విధ్వంసం సృష్టించాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. -
ఆశా భోస్లే అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన మనవరాలు
లెజండరి సింగర్ ఆశా భోస్లే (92) ఏప్రిల్ 11, శనివారం నాడు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు గుండెపోటు వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉందని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, తాజాగా ఆమె మనవరాలు జానై భోస్లే సోషల్ మీడియాలో స్పందించారు. ఆశా భోస్లే అనారోగ్యంతో ఉన్నారనే విషయాన్ని ఆమె ధృవీకరిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సమయంలో తమకు గోప్యత కల్పించాలని కోరారు. ఈ క్రమంలో ఆమె ఇలా రాశారు. "మా అమ్మమ్మ, ఆశా భోస్లే(Asha Bhosle) తీవ్రమైన అలసటతో ఉన్నారు. ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. దయచేసి మా గోప్యతకు విలువ ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాము. చికిత్స కొనసాగుతోంది. ఆమె త్వరగా కోలుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందిస్తాము. ఎలాంటి ప్రచారం చేయకండి" అని ఆమె కోరారు.తన కాలంలోని అత్యంత ప్రభావవంతమైన గాయకులలో ఒకరైన ఆశా భోస్లే, 1943లో వచ్చిన 'మాఝా బాల్' అనే మరాఠీ నాటకంతో నేపథ్య గాయనిగా అరంగేట్రం చేసి, ఆ తర్వాత 1948లో వచ్చిన 'చునరియా' చిత్రంలోని 'సావన్ ఆయా' పాటతో బాలీవుడ్‌లోకి ప్రవేశించారు.ఆమె సుమారు 20 భారతీయ, విదేశీ భాషలలో పాటలు పాడారు. 2006లో ఆమె స్వయంగా ఇచ్చిన ప్రకటన ప్రకారం, దాదాపు 12,000 పాటలను రికార్డ్ చేశారు. 'పియా తు అబ్ తో ఆజా', 'దిల్ చీజ్ క్యా హై', 'ఇన్ ఆంఖోం కి మస్తీ కే', 'రంగీలా రే', 'రాధా కైసే నా జలే', 'షరారా షరారా' వంటి చిరస్మరణీయ గీతాలకు ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమె 2000లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మవిభూషణ్ వంటి అనేక పురస్కారాలను అందుకున్నారు. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle) -
‘విజయానికి వాళ్లే కారణం.. సంజూ కాదు’
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ విజయంలో సంజూ శాంసన్, ఆయుశ్ మాత్రేలు కీలకపాత్ర పోషించారు. అయితే సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం బౌలర్ల వల్లే తమ జట్టు విజయం సాధించిదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రుతురాజ్ మాట్లాడుతూ.. ‘ఎట్టకేలకు సీజన్లో తొలి విజయం సాధించడం, సంతోషంతో మాట్లాడేందుకు మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ మేము ఆడిన తీరు చాలా గొప్పగా అనిపించింది. చెపాక్ స్టేడియంలో మేము ఎప్పుడు మొదట బ్యాటింగ్ చేసినా 200 నుంచి 210 స్కోరు చేయాలని అనుకునేవాళ్లం. కానీ స్లో పిచ్ కారణంగా ఆ స్కోరు చేయడం కాస్త కష్టంగా అనిపించేంది. గత మ్యాచ్‌లతో పోలిస్తే అన్ని విషయాల్లో మెరుగయ్యాం. ఈరోజు సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. ఆయుష్ కూడా అద్భుతంగా రాణించాడు. కానీ ఇవాళ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కచ్చితంగా ఈరోజు మ్యాచ్ గెలుపులో బౌలింగ్ పాత్రే కీలకం. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం, ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయడం మా విజయానికి కలిసొచ్చింది. మా బౌలర్ల కృషిని చూసి గర్వపడుతున్నా. నిజానికి మా బౌలింగ్ లైనప్‌లో 'ఎక్స్-ఫ్యాక్టర్' బౌలర్ లేకపోయి ఉండవచ్చు. కానీ ప్రతి మ్యాచ్‌లోనూ ఎంత ప్రభావవంతంగా ఉండాలి, ముందస్తుగా ఎలా ఆలోచించాలి, అదనపు బౌండరీలను ఎలా ఆపాలి అనే విషయాలపై మేం చర్చించుకుంటూనే ఉన్నాం. తొలి మూడు మ్యాచ్‌ల్లో మేము విజయానికి చేరువగా వచ్చినప్పటికీ ఒకటి రెండు ఓవర్లలో 20-25 పరుగులు సమర్పించుకోవడం గెలుపును దూరం చేశాయి. పవర్‌ప్లేలో మేం కొంచెం వెనకంజలో నిలిచినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాం. చెన్నై ఫ్యాన్స్ ఎప్పుడూ మాకు అండగా ఉంటారు. మేం ఎక్కడికి వెళ్లినా వారి మద్దతు, సందేశాలు మమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. దేశంలో ఈ ప్రాంతం ప్రత్యేకం. ఇక్కడి ప్రజలు క్రికెట్‌ను ఆస్వాదిస్తూనే ఫ్రాంచైజీని అమితంగా ప్రేమిస్తుంటారు.’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.చదవండి: ‘నా సెంచరీ వెనుక ఆ 50 సెకన్లు.. అతడికే అంకితం’ -
మన ఆయిల్, గ్యాస్.. ఎంత ఖర్చయినా తెచ్చుకుందాం
న్యూఢిల్లీ: సంప్రదాయ ఇంధన సరఫరాల కోసం పశ్చిమాసియా దేశాలపై అధికంగా ఆధారపడడంపై అప్రమత్తత అవసరమని ఓఎన్జీసీ చైర్మన్, సీఈవో అరుణ్ కుమార్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ తన చమురు దిగుమతుల్లో సగం మేర, గ్యాస్ అవసరాల్లో 30 శాతం, ఎల్పీజీ అవసరాల్లో 85–90 శాతాన్ని మధ్యప్రాచ్య దేశాల నుంచి సమకూర్చుకుంటున్నట్టు చెప్పారు.పశ్చిమాసియాలో సంఘర్షణల కారణంగా దశాబ్దాలలో ఎన్నడూ లేనంతటి ఇంధన సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న తరుణంలో అరుణ్ కుమార్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రాధాన్యం నెలకొంది. పశ్చిమాసియా మనకు సమీపంలో ఉండడంతో అక్కడి వనరులను సులభంగా పొందొచ్చనుకోవడాన్ని కొంత సందేహంగానే చూడాలన్నారు. ఇంధన భద్రతపై పీఎన్జీఆర్బీ నిర్వహించిన సదస్సులో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రపంచ క్రమం మారుతోందని, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఇంధన భద్రతపై దీర్ఘకాలం నుంచి ఉన్న అంచనాలు మారిపోతున్నాయంటూ హెచ్చరించారు. కనుక దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవడం ఎంతో కీలకమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ ఆయిల్, గ్యాస్ ఉన్నా.. ఎంత ఖర్చు అయినా దాన్ని వెలుగులోకి తెచ్చుకోవాలంటూ.. సంక్షోభంలో మనకు ఎవరూ సాయం చేయరన్నారు. అలాగే, దేశంలో ఇంధన నిల్వల సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. -
‘దళపతి’కి భారీ షాక్.. బరిలో ఇంతమంది ‘విజయ్’లా?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం రోజురోజుకూ వేడెక్కుతోంది. 2026, ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలిచేందుకు రాజకీయ పార్టీలు సరికొత్త ఎత్తుగడలకు తెరతీస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు తమిళనాట అత్యంత హాట్ టాపిక్‌గా మారిన అంశం ‘డమ్మీ అభ్యర్థుల వ్యూహం’ ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్, డీఎంకే నేత సెంథిల్ బాలాజీ వంటి ఉద్దండులను టార్గెట్ చేస్తూ పలు పార్టీలు ఒకే పేరుతో పలువురు అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. ఇది ఓటర్లను తీవ్ర గందరగోళానికి గురిచేసి, ఓట్లను చీల్చేందుకు ప్రతిపక్షాలు పన్నుతున్న పక్కా మాస్టర్ ప్లాన్ అని విశ్లేషకులు చెబుతున్నారు.అసలు ఏమిటీ డమ్మీ అభ్యర్థుల వ్యూహం?ఒక ప్రముఖ నేత పేరుతో మరికొంత మంది డమ్మీ అభ్యర్థులను నిలబెట్టడమే ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం. ఉదాహరణకు టీవీకే పార్టీ నుండి ‘విజయ్’ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో.. ఏ విజయ్, కె విజయ్ కుమార్, ఎం విజయ్, విజయ్ రాజ్ వంటి పేర్లతో అభ్యర్థులు దర్శనమిస్తారు. పార్టీ గుర్తులపై పెద్దగా అవగాహన లేని ఓటర్లు, కంగారులో తమ అభిమాన నేత పేరు చూసి వేరే ‘విజయ్’కి ఓటు వేసే అవకాశం ఉంది.ఇప్పుడిది ఎందుకు ట్రెండ్ అవుతోంది?మీడియాకు అందిన నివేదికల ప్రకారం తమిళనాడు వ్యాప్తంగా వందకు పైగా ఇలాంటి ‘ఒకే పేరున్న అభ్యర్థులు’ బరిలో నిలిచారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న నేతలను టార్గెట్ చేస్తూ పట్టణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఈ వ్యూహాన్ని ఎక్కువగా అమలు చేస్తున్నారు. కొత్త పార్టీలు బరిలో ఉండటం, ఈసారి పోటీ హోరాహోరీగా సాగుతుండటంతో ఇది ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశంగా మారింది.‘విజయ్’నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్.. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలనం. యువతలో ఆయనకున్న విపరీతమైన క్రేజ్, సోషల్ మీడియా మద్దతు, ఎన్నికల బరిలో పార్టీ వేగంగా ఎదుగుతున్న తీరు ప్రత్యర్థి వర్గాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. విజయ్‌కి పడే ఓట్లను చీల్చడం ద్వారా ఆయన గెలుపు అవకాశాలను దెబ్బతీయాలనేదే ఈ డమ్మీ కాండిడేట్ల ప్రణాళిక.కొత్త ఓటర్లపై ప్రభావం2026 తమిళనాడు ఎన్నికల్లో దాదాపు 12 లక్షల 50 వేల మంది యువత తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరు పార్టీ గుర్తుల కంటే నాయకుల పేర్లను చూసి ఓటు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన పోటీ ఉన్న నియోజకవర్గాల్లో కేవలం ఒకటి లేదా 2 శాతం ఓట్లు చీలిపోయినా తుది ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇది చట్టబద్ధమేనా?ఒకే పేరున్న వారు పోటీ చేయడం చట్ట ప్రకారం పూర్తిగా సమ్మతమే. ఏ పౌరుడైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. వారి పేర్లు ఒకేలా ఉన్నాయనే కారణంతో నామినేషన్లను తిరస్కరించడానికి వీల్లేదు. అయితే, ఓటర్లలో ఏర్పడే గందరగోళాన్ని తగ్గించడానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈవీఎంల మీద అభ్యర్థుల ఫోటోలు, పార్టీ గుర్తులను స్పష్టంగా ముద్రిస్తుంది. అయినా సరే ఓటర్లు కంగారు పడినప్పుడు కన్ఫ్యూజన్ తప్పదు.ఎక్కడెక్కడ ఈ ప్రభావం ఉంది?చెన్నైలోని పట్టణ నియోజకవర్గాలు, దక్షిణ తమిళనాడులోని ప్రధాన ప్రాంతాలు, ముఖ్యంగా పెరంబూర్, తిరునెల్వేలి, మదురై శివార్లలో, కోయంబత్తూర్ అర్బన్ జోన్లలో ఈ డమ్మీ అభ్యర్థుల బెడద ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో అభ్యర్థుల మధ్య గెలుపు మార్జిన్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు మెజారిటీ రెండు వేల ఓట్లు ఉన్నప్పుడు, డమ్మీ అభ్యర్థికి 1500 ఓట్లు పడితే అసలు అభ్యర్థి ఓడిపోయే ఛాన్స్ స్పష్టంగా ఉంటుంది.ఓటర్లు ఏం చేయాలి?ఈ గందరగోళాన్ని అధిగమించడానికి ఓటర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఓటు వేసేటప్పుడు కంగారు పడకుండా, పార్టీ గుర్తును నిశితంగా పరిశీలించాలి. ఈవీఎంపై ఉన్న అభ్యర్థి ఫోటోను కచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు కేవలం మేనిఫెస్టోలు, పొత్తులకే పరిమితం కాలేదు.. బ్యాలెట్ మీద ఎవరున్నారు, వారిని ఓటర్లు ఎలా గుర్తిస్తున్నారు అనేది కీలకం కాబోతోందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: ‘దీదీ’కి మైండ్ బ్లాంక్.. బెంగాల్ బరిలో బీజేపీ బ్రహ్మాస్త్రం -
హైదరాబాద్‌లో ఒకే రోజు 108 ఈ-విటారా కార్లు డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా 2031 నాటికి మరో 4 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనుంది. అప్పటికి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహన (బీఈవీ) విభాగంలో అగ్రస్థానానికి చేరాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు. హైదరాబాద్‌లో ఒకే రోజున 108 ఈ–విటారా వాహనాలను డెలివరీ చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.కమోడిటీల ధరలు పెరిగిన నేపథ్యంలో తమ కార్ల రేట్లను పెంచే యోచనలో ఉన్నట్లు వివరించారు. అయితే, పెంపు పరిమాణం ఎంత, ఎప్పుడు ఉంటుందనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. 44 దేశాలకు 25,000 పైచిలుకు ఈ–విటారా వాహనాలను ఎగుమతి చేసినట్లు ఆయన తెలిపారు. ఎగుమతులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలను ఇంకా మదింపు చేయాల్సి ఉందన్నారు. దేశీయంగా హైదరాబాద్‌లో అత్యధికంగా 14.5 శాతం స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఉంటోందని ఆయన చెప్పారు.తెలంగాణవ్యాప్తంగా 256 చార్జింగ్ పాయింట్లు ఉన్నాయని, హైదరాబాద్‌లో ప్రతి 5 కి.మీ.కి ఒకటి చొప్పున 119 ఉన్నాయని వివరించారు. కస్టమర్లలో ముందుగా రేంజిపరమైన ఆందోళన తొలగించేలా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాకే విద్యుత్ వాహనాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతోనే ఎలక్ట్రిక్ కార్ ఆవిష్కరణలో కొంత జాప్యం జరిగినట్లు పార్థో బెనర్జీ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,000కు పైగా ఎక్స్‌క్లూజివ్ చార్జింగ్ పాయింట్లు ఉండగా 2030 నాటికి లక్షకు పైగా పబ్లిక్ చార్జింగ్ పాయింట్ల నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నామన్నారు. -
ఇరాన్‌తో చర్చలు విఫలం: జేడీ వాన్స్ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఇరాన్, అమెరికా మధ్య చర్చలు విఫలమయ్యాయి. అర్ధాంతరంగా చర్చలు ముగించి జేడీవాన్స్ బృందం వెళ్లిపోయింది. దాదాపు 21 గంటల పాటు జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్, అమెరికా చర్చల అనంతరం జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడుతూ..‘రెండు దేశాల మధ్య చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇరాన్‌తో చర్చలు విఫలమయ్యాయి. మా డిమాండ్లను ఇరాన్ అంగీకరించలేదు. అందుకే ఇరాన్‌తో డీల్ లేదు. ఇస్లామాబాద్ వేదికగా ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నాం. ఎలాంటి అంగీకారం లేకుండా వెనక్కి వెళ్తున్నాం. మా నిబంధనలు అంగీకరించేందుకు ఇరాన్ సిద్దపడట్లేదు. ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలి. కానీ, అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ పరిణామం ఇరాన్‌కు కచ్చితంగా బ్యాడ్ న్యూస్’ అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. #WATCH | US-Iran peace talks | Islamabad, Pakistan: US Vice President JD Vance says, "...The simple fact is that we need to see an affirmative commitment that they (Iran) will not seek a nuclear weapon and they will not seek the tools that would enable them to quickly achieve a… pic.twitter.com/elS9Q0xPz4— ANI (@ANI) April 12, 2026ఇక, ఈ చర్చలలో పాకిస్తాన్ పాత్రను ఆయన ప్రశంసించారు. ఇరుపక్షాల మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఇస్లామాబాద్ అద్భుతంగా పనిచేసిందన్నారు. చర్చల్లో ఏవైనా లోపాలుంటే పాకిస్తాన్ వల్ల కలిగినవి కావు అంటూ క్లారిటీ ఇచ్చారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఇరాన్ నుండి నిశ్చయాత్మక హామీ రాలేదని జేడీ వాన్స్ అన్నారు. చర్చలు విఫలం కావడం అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టం కలిగిస్తాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతరం, పాకిస్తాన్ నుంచి జేడీ వాన్స్ బృందం.. అమెరికాకు బయలుదేరింది. అయితే, హార్మూజ్ జలసంధిని తెరవాలన్నది అమెరికా డిమాండ్. అలాగే, యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఆపాలని ఇరాన్‌కు అమెరికా కోరింది. ఇందుకు తమ దేశంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేసినట్టు తెలిసింది. విదేశాల్లోని తమ ఆస్తులపై ఉన్న ఫ్రీజ్ను తొలగించాలని ఇరాన్ కోరినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. అంతకుముందు పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతిచర్చలు ముగిశాయి. దాదాపు 14 గంటలపాటు చర్చలు కొనసాగినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరుదేశాలకు చెందిన సాంకేతిక బృందాలు నిపుణుల నివేదికలను పంచుకున్నట్లు తెలిపింది. కొన్ని అంశాలపై విభేదాలు ఉన్నప్పటికీ చర్చలు కొనసాగుతాయని ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం మరో విడత చర్చలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. -
రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. నిద్రలేకుండా రిహార్సల్స్
రీసెంట్ టైంలో దక్షిణాదిలో ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించిన హీరోయిన్ ఎవరంటే చాలామంది కాయదు లోహర్ అని చెబుతారు. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్‌తో చేసిన 'డ్రాగన్' మూవీ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. కానీ అంతకుముందే తెలుగులో ఓ మూవీ చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్'లో హీరోయిన్గా చేస్తోంది. ఈమె నటించిన తొలి మలయాళ మూవీ 'పల్లి చట్టంబి' ఈ వీకెండే థియేటర్లలోకి వచ్చింది. దీని ప్రమోషన్లలో భాగంగానే తాను చేసిన తొలి ఆల్బమ్ సాంగ్ గురించి, అందులో అవకాశం రావడం గురించి కూడా మాట్లాడింది.(ఇదీ చదవండి: శివాజీ సృష్టించిన చీర అంటూ అనసూయ కౌంటర్)'డ్యూడ్' మూవీతో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సాయి అభ్యంకర్.. మరోవైపు ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తున్నాడు. అలా ఇతడి నుంచి 'పవళ మల్లి' పేరుతో గత నెలలో ఓ సాంగ్ వచ్చింది. ఇందులోనే సాయికి జోడీగా కాయదు కనిపించింది. యూట్యూబ్‌లో హిట్ అయిన ఈ పాటకు ఇప్పటివరకు 8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇందులో అవకాశం ఎలా వచ్చిందో కాయదు తాజాగా బయటపెట్టింది.'పవళ మల్లి' పాటలో అనుకోకుండానే నాకు అవకాశమొచ్చింది. ఓ రోజు అర్థరాత్రి 2 గంటలకు సంగీత దర్శకుడు సాయి నుంచి నాకు కాల్ వచ్చింది. ఈ టైంలో ఫోన్ చేసేసరికి కంగారుపడ్డా. ఏమైందని అడిగితే.. తాను ఓ పాట కంపోజ్ చేశానని, చాలా బాగా వచ్చిందని చెప్పాడు. అందులో కచ్చితంగా ఉండాలని నన్ను అడిగాడు. తర్వాత పాట విన్నా, బాగా నచ్చేసరికి వెంటనే ఓకే చెప్పేశా. ఎంజాయ్ చేస్తూనే ఆ పాట పూర్తిచేశాం. ఇందుకోసం 2 రోజులు నిద్రలేకుండా రిహార్సల్స్ చేశాం. ఆడియెన్స్ కూడా పాటని ఎంజాయ్ చేస్తున్నందుకు మాకు సంతోషంగా అనిపించింది' అని కాయదు చెప్పుకొచ్చింది. ఈ పాటని సాయి, శ్రుతి హాసన్ కలిసి పాడారు.(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)#KayaduLohar Recent- #Sai called me at 2 AM and said, #Kayadu, we have a beautiful song, and I really want you to be a part of it.- I think it’s going to be a blast, and you’re the perfect one. When I heard it, I immediately fell for it.pic.twitter.com/UHWoT6824v— Movie Tamil (@_MovieTamil) April 11, 2026 -
‘ఆమె’ తీసుకున్న లోన్లు రూ.76 లక్షల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళా శక్తి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అధికారిక రుణ వ్యవస్థలో వారి భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు చిన్నపాటి అవసరాల కోసం రుణాలు తీసుకోవడానికే పరిమితమైన వనితలు .. ఇప్పుడు వ్యాపార విస్తరణకు భారీ స్థాయిలో రుణాలు తీసుకుంటున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా మహిళల రుణ పోర్ట్‌ఫోలియో అక్షరాలా రూ.76 లక్షల కోట్లకు చేరిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. వ్యవస్థలోని మొత్తం రుణాల్లో మహిళల వాటా ఏకంగా 26 శాతానికి ఎగబాకింది.నీతి ఆయోగ్ సీఈఓ నిధి చిబ్బర్ న్యూఢిల్లీలో విడుదల చేసిన ‘ఫ్రమ్ బారోవర్స్ టు బిల్డర్స్: ఉమెన్ అండ్ ఇండియాస్ ఎవాల్వింగ్ క్రెడిట్ మార్కెట్‘ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ (డబ్ల్యూఈపీ), ట్రాన్స్‌యూనియన్ సిబిల్, మైక్రోసేవ్ కన్సల్టింగ్ (ఎంఎస్సీ) సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. 2017 నుంచి చూస్తే మహిళలకు ఇచి్చన రుణాల పరిమాణం 4.8 రెట్లు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. కేవలం రుణాలు పొందడం మాత్రమే కాకుండా, అధికారిక రుణ వ్యవస్థలో వారి భాగస్వామ్యం గుణాత్మకంగా మారుతోందని వెల్లడించింది.పరుగులు పెడుతున్న వృద్ధి .. 2017 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ మధ్య కాలంలో క్రియాశీలక మహిళా రుణగ్రహీతల సంఖ్య 9 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదు చేసింది. మహిళల్లో రుణ విస్తృతి 19 శాతం నుంచి 36 శాతానికి ఎగబాకింది. ప్రస్తుతం రుణ మార్కెట్లో 16 కోట్ల మంది యాక్టివ్ మహిళా రుణగ్రహీతలు ఉన్నారు. 2017లో రూ.16 లక్షల కోట్లుగా ఉన్న వీరి బకాయిలు, 2025 నాటికి రూ.76 లక్షల కోట్లకు చేరాయి. దేశంలో రుణ అర్హత కలిగిన 45 కోట్ల మంది మహిళలు ఉండగా, భవిష్యత్తులో ఈ మార్కెట్ మరింతగా విస్తరించే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.మైక్రోఫైనాన్స్ నుంచి అప్‌గ్రేడ్ .. చిన్నపాటి మైక్రోఫైనాన్స్ రుణాలతో మొదలుపెట్టిన మహిళలు ఆ తర్వాత మంచి క్రెడిట్ హిస్టరీ సాధించి క్రమంగా రిటైల్, కమర్షియల్ రుణాల వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న మైక్రోఫైనాన్స్ రుణగ్రహీతల్లో 19 శాతం మంది రిటైల్ లేదా కమర్షియల్ లోన్స్ కలిగి ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. ఈ ’కస్టమర్ గ్రాడ్యుయేషన్’లోనూ దక్షిణాది రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. అత్యధికంగా తమిళనాడులో 27 శాతం మంది మహిళలు పెద్ద రుణాల వైపు అప్‌గ్రేడ్ అవ్వగా, కర్ణాటకలో ఈ రేటు 20 శాతంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ఉన్న బలమైన క్రెడిట్ వ్యవస్థకు ఇది నిదర్శనమని నివేదిక స్పష్టం చేసింది.డిజిటల్ అండతో సత్వర రుణాలు: కేరళ కేస్ స్టడీ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), అధికారిక రుణ వ్యవస్థల కలయికతో ఆర్థిక భాగస్వామ్యం సులభతరమైందని నీతి ఆయోగ్ సీఈఓ నిధి చిబ్బర్ పేర్కొన్నారు. గుర్తింపు, చెల్లింపులు, అండర్‌రైటింగ్, లోన్ సరీ్వసింగ్ వంటి అంశాల్లో డిజిటలైజేషన్ పెరగడం వల్ల మహిళలకు రుణాలు త్వరగా మంజూరవుతున్నాయి. ప్రధాన వినియోగ విభాగాల్లో అదే రోజు రుణం మంజూరు (సేమ్–డే అప్రూవల్స్) ఏకంగా 45 శాతానికి చేరింది. గ్రామీణ మహిళా వ్యాపారుల డిజిటల్ ప్రయాణంపై అధ్యయనం చేసిన బృందం.. కేరళలో పలు ఆసక్తికర విషయాలు గుర్తించింది.కేరళలోని గ్రామీణ మహిళా వ్యాపారుల్లో 38 శాతం మంది మహిళలు.. ’సమయాభావం’ తమ వ్యాపార వృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందని వెల్లడించారు. ఇంటి బాధ్యతలు, వ్యాపారం రెండింటినీ చూసుకోవాల్సి రావడం వల్ల డిజిటల్ టూల్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోతున్నామని వారు తెలిపారు. అయినా సరే కొందరు గ్రామీణ వ్యాపారులు వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, పింటెరెస్ట్ వంటి డిజిటల్ టూల్స్ ఉపయోగించి మార్కెటింగ్ చేసుకుంటున్న తీరును నివేదిక కేస్ స్టడీలుగా ప్రచురించింది. భవిష్యత్తులో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా తమ వ్యాపారాలను మరింత వృద్ధి చేసుకోవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.మహిళలు అధికారిక ఫైనాన్షియల్ సిస్టమ్స్ వైపు మళ్లడం, వివిధ రుణ విభాగాల్లో చురుకుగా పాల్గొనడం భారత్ ఆర్థిక ముఖచిత్రంలో ఒక అర్థవంతమైన మార్పని డబ్ల్యూఈపీ మిషన్ డైరెక్టర్ అన్నా రాయ్ తెలిపారు. దాదాపు 16 కోట్ల మంది యాక్టివ్ మహిళా రుణగ్రహీతల డేటాతో పాటు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 161 మంది మహిళా నానో–ఎంటర్ప్రెన్యూర్ల ప్రైమరీ రీసెర్చ్ ఆధారంగా ఈ నివేదికను సమగ్రంగా రూపొందించారు. వ్యాపార రుణాల్లో దక్షిణాది హవా .. వ్యాపార అవసరాల కోసం రుణాలు తీసుకునే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2022–2025 మధ్య కాలంలో మొత్తం కమర్షియల్ క్రెడిట్ వృద్ధి రేటు 17 శాతంగా ఉండగా, మహిళా వ్యాపారుల రుణాల వృద్ధి రేటు ఏకంగా 31 శాతంగా నమోదైంది. 2017 నుంచి చూస్తే వ్యాపార రుణాల బకాయిల పరిమాణం 7.5 రెట్లు పెరిగింది. ఈ విభాగంలో దక్షిణాది రాష్ట్రాలు బలమైన ముద్ర వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ రుణాలు తీసుకున్న మహిళల్లో ఒక్క తమిళనాడు రాష్ట్రం నుంచే 15 శాతం మంది ఉండగా, కర్ణాటక వాటా 9 శాతంగా ఉంది. అయితే వృద్ధి రేటు పరంగా చూస్తే ఉత్తరాది రాష్ట్రాలైన బిహార్ (59%), ఉత్తరప్రదేశ్ (42%) వేగంగా దూసుకెళ్తున్నాయని నివేదిక తెలిపింది. -
‘నా సెంచరీ వెనుక ఆ 50 సెకన్లు.. అతడికే అంకితం’
ఐపీఎల్ 2026 సీజన్లో ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్‌కింగ్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత గెలుపు రుచి చూసింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 23 పరుగుల తేడాతో గెలుపొందింది. సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మూడు వరుస ఓటముల తర్వాత సెంచరీతో జట్టును గెలిపించడం సంతోషంగా ఉందన్నాడు. వరుసగా విఫలమైనప్పటికీ జట్టు మేనేజ్మెంట్ తనపై నమ్మకం ఉంచడం గొప్ప విషయమన్నాడు. తన సెంచరీని సీఎస్కే కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్‌కు అంకితమిస్తున్నట్లు శాంసన్ తెలిపాడు. శాంసన్ మాట్లాడుతూ.. ‘ఈసెంచరీ నాకు ఎంతో ముఖ్యం. నిజాయితీగా చెప్పాలంటే నాపై నమ్మకంతో చెన్నై ఫ్రాంచైజీ ట్రేడింగ్‌లో నన్ను దక్కించుకుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పుడు వారి నమ్మకాన్ని కోల్పోతున్నానేమోననిపించింది. కానీ ఇవాళ బాధ్యతా యుతంగా ఆడి సెంచరీ చేయడంతో పాటు వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాను. ఇంతకాలం ఒక ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించి ఇప్పుడు మరో కొత్త ఫ్రాంచైజీకి ఆడడం కొంత కష్టమే. కానీ నాకు చెన్నై విషయంలో అది ఏనాడు కనిపించలేదు. చెన్నైకి ఆడుతుంటే నేను మరో సొంత ఇంటికి వచ్చానన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. అందరూ ప్రశాంతంగా కనిపిస్తున్నారు. అయితే వరుసగా మూడు ఓటములు చవిచూసినప్పటికీ ఇవాళ మ్యాచ్‌కు ముందు మేమంతా కేవలం 50 సెకన్లు మాత్రమేమీటింగ్ పెట్టుకున్నాం. ఆ యాబై సెకన్లు నేను ఒక టీమ్‌తో ఎంత కనెక్ట్ అయ్యాననేది చూపించింది. నేను గతంలో చాలాసార్లు విఫలమయ్యాను. అలాంటప్పుడు మనసు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. కానీ నా బేసిక్స్ ఏంటో తెలుసుకొని వాటిని పాటించడమే ముఖ్యం. అందుకోసం మా సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి కొన్ని మంచి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నాను. మ్యాచ్‌లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా అవసరం. ఆయుష్ చాలా పరిణతితో ఆడాడు. మా కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కోసమే నా సెంచరీని సెలెబ్రేట్ చేసుకున్నాను. పరిస్థితులు ఎంత సవాలుగా ఉంటాయో నాకు తెలుసు. అందుకే ఈ ఇన్నింగ్స్‌ను ఆయనకు అంకితం చేయాలనుకున్నాను.’ అని తెలిపాడు.🗣️🗣️ 𝙄𝙩 𝙛𝙚𝙚𝙡𝙨 𝙡𝙞𝙠𝙚 𝙘𝙤𝙢𝙞𝙣𝙜 𝙩𝙤 𝙖𝙣𝙤𝙩𝙝𝙚𝙧 𝙝𝙤𝙢𝙚 🏠Sanju Samson reflects on his match-winning knock and the love from the Chennai crowd 💛 Updates ▶️ https://t.co/BzGc6O65jX #TATAIPL | #KhelBindaas | #CSKvDC | @IamSanjuSamson | @ChennaiIPL pic.twitter.com/H4X2sug3sB— IndianPremierLeague (@IPL) April 11, 2026#CSK fans, bring out the whistles 💛A first win of the season for the 5⃣-time #TATAIPL champions 👏Scorecard ▶️ https://t.co/BzGc6O65jX #KhelBindaas | #CSKvDC | @ChennaiIPL pic.twitter.com/tS2xyOWgdj— IndianPremierLeague (@IPL) April 11, 2026చదవండి: చరిత్ర సృష్టించిన శాంసన్.. ధోని కూడా సాధ్యం కాలేదు -
గ్లామర్‌తో ట్రెండ్ మార్చనున్న వైరల్ బ్యూటీ
ఇతర భాషా నటీమణులు ముఖ్యంగా ఉత్తరాది కథానాయకలకు దక్షిణాదిలో మంచి డిమాండ్ ఉంటోంది. అలా చాలా మంది దక్షిణాది చిత్రాలలో నటిస్తూ మకాం వేస్తున్నారు. అలాంటి వారిలో నటి భాగ్యశ్రీ బోర్సే ఒకరు అని చెప్పావచ్చు. ఈ మరాఠి బ్యూటీ మిస్టర్ బచ్చన్ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, భాగ్యశ్రీ బోర్సే మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు మరిన్ని అవకాశాలు వరిస్తున్నాయి. కారణం చూడగానే ఇట్టే ఆకర్షించే అందం, శరీర ఆకృతి కావచ్చు. అయితే స్టార్ హీరోల సరసన నటిస్తున్నా ఇప్పటి వరకూ ఒక్క చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించలేదు. అదే విధంగా తమిళంలోకి కాంత చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే నటనకు మంచి పేరు వచ్చింది. కాగా ఈ అమ్మడు ఇప్పటి వరకూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే నటించారు. అలా నటించడం వల్లే ఈ అమ్మడికి రావలసిన క్రేజ్ రావడం లేదని తెలిసి వచ్చినట్లు సమాచారం. దీంతో ఇకపై తన పాత్రల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు టాక్. అంటే ఇకపై గ్లామర్ విషయంలో కాస్త డోస్ పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు సినీ వర్గాల మాట. అందులో భాగంగానే ఈ బ్యూటీ లేటెస్ట్గా గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇతర కార్యక్రమాల్లోనూ మోడరన్ దుస్తులు ధరించి పాల్గొంటున్నారు. ఇలాగైనా తన ఫేట్‌ను మార్చుకోవాలని భాగ్యశ్రీ యతి్నస్తున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. ఇకపై ఈ అమ్మడిని మరో కోణంలో చూడబోతున్నామన్న మాట. View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) -
ముగిసిన చర్చలు.. ఇరాన్-అమెరికా కీలక వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: ఇరాన్-అమెరికా మధ్య చర్చలు ముగిశాయి. జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మధ్య చర్చలు జరిగాయి. కాల్పుల విరమణను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చలు సాగాయి. సుమారు 14 గంటలపాటు చర్చలు సాగాయి. ఇంకా కొన్ని సాంకేతిక అంశాలు ఖరారు చేయాల్సి ఉందన్న ఇరాన్.. చర్చల్లో ఆర్థిక, సైనిక, న్యాయ, అణు కమిటీలు పాల్గొంటాయని పేర్కొంది. చర్చలు సాధారణ స్థాయి నుంచి నిపుణుల స్థాయికి చేరినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి.తొలిదశ చర్చలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై సైనిక విజయం సాధించినట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘ఎలా చూసినా గెలుపు అమెరికాదే. చర్చల్లో ఏం జరుగుతుందనేది. మాకు అనవసరం. చర్చలు, ఫలించినా ఫలించకపోయినా హర్మూజ్‌లో మైన్స్ తొలగిస్తాం. హర్మూజ్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు’’ అంటూ ట్రంప్ తేల్చి చెప్పారు.ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నాం: జేడీ వాన్స్అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. మా డిమాండ్లకు ఇరాన్ అంగీకరించలేదు. ఇరాన్‌తో డీల్ లేదు. 14 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.. ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలి’’ అంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.పశ్చిమాసియాలో యుద్ధానికి తెరదించి శాంతిని నెలకొల్పడమే ధ్యేయంగా వైరిపక్షాలైన అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలు శనివారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ మంతనాలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ స్టార్ హోటల్ వేదికగా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు జరిగాయి.ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చరిత్రాత్మక చర్చల కోసం ఇస్లామాబాద్‌కు చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ శనివారం ఉదయం వేర్వేరుగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం సాయంత్రం అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. -
హార్మూజ్‌ను దాటిన జగ్ విక్రమ్
న్యూఢిల్లీ: భారతీయ జెండా కలిగిన ఎల్పీజీ ట్యాంకర్ జగ్ విక్రమ్ హార్మూజ్‌ను విజయవంతంగా దాటేసింది. అమెరికా–ఇరాన్‌ల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక హార్మూజ్‌ను దాటిన మొదటి భారతీయ ట్యాంకర్ ఇది. శనివారం మధ్యాహ్నానికి గల్ఫ్ ఆఫ్ ఒమన్‌ను దాటి భారత్ దిశగా సాగుతోంది. ముంబైలోని గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీకి చెందిన జగ్ విక్రమ్ సుమారు 20 వేల టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది. కాగా, మార్చి మొదటి వారం నుంచి హార్మూజ్‌ను వీడిన 9వ భారతీయ ట్యాంకర్ ఇది. మరో 15 భారతీయ నౌకలు ఇప్పటికీ అక్కడే వేచి ఉన్నాయి. వీటితోపాటు వివిధ దేశాలకు చేరుకోవాల్సిన మొత్తం 426 ట్యాంకర్లు, 34 ఎల్పీజీ, 19 ఎల్ఎన్జీ క్యారియర్లు ఆ ప్రాంతంలో ఉన్నట్లు మెరైన్ ట్రాఫిక్ డేటా చెబుతోంది. -
చరిత్ర సృష్టించిన శాంసన్.. ధోని కూడా సాధ్యం కాలేదు
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు తన రిథమ్‌ను అందుకున్నాడు. శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.తొలి మూడు మ్యాచ్‌లలో విఫలమైన సంజూ.. ఢిల్లీపై మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. శాంసన్ కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున సెంచరీ బాదిన మొట్టమొదటి వికెట్ కీపర్-బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.2008 నుండి సీఎస్కే పూర్తిస్థాయి కీపర్‌గా ఉన్న ఎంఎస్ ధోనికి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. ధోనీ అత్యధిక స్కోరు 84 పరుగులుగా ఉంది. అయితే ధోని దాదాపుగా లోయార్డర్‌లోనే బ్యాటింగ్‌కు రావడంతో ఒక్కసారి మూడంకెల స్కోర్‌ను అందుకోలేకపోయాడు. కానీ సంజూ మాత్రం సీఎస్కే తరపున తొలి ఎడిషన్‌లో సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు.చదవండి: ఆ తప్పే మా కొంపముంచింది: సన్‌రైజర్స్ కెప్టెన్🚨 SANJU SAMSON SCORED THE FIRST HUNDRED IN IPL 2026 🚨Chetta at Chepauk. 🔥 pic.twitter.com/XXWiX1P3nP— Johns. (@CricCrazyJohns) April 11, 2026 -
భవానీపూర్‌లో నా అభ్యర్థిత్వం చెల్లకుండా కుట్ర
కోల్‌కతా: భవానీపూర్‌లో తన అభ్యర్థిత్వం చెల్లకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇందులో భాగంగా రెండు తప్పుడు కేసుల్లో తనను ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు, టీఎంసీ కార్యకర్తలు వమ్ము చేశారన్నారు. ఆమె శనివారం పశ్చిమ్ మేదినీపూర్ జిల్లాలో జరిగిన టీఎంసీ ప్రచార ర్యాలీల్లో ప్రసంగించారు. ‘ఈసీ సాయంతో భవానీపూర్‌లో నా అభ్యర్థిత్వాన్ని చెల్లకుండా చేసేందుకు శుక్రవారం బీజేపీ నాకు వ్యతిరేకంగా రెండు తప్పుడు అఫిడవిట్లు సమర్పించేందుకు కుట్ర పన్నింది. వారి ప్రయత్నాలను మేం భగ్నం చేశాం’అని ఆమె ప్రకటించారు. భవానీపూర్‌లో మమతకు ప్రధాన ప్రత్యర్థిగా ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి బరిలో ఉండటం తెల్సిందే. సర్ ప్రక్రియ సందర్భంగా బీజేపీ బలవంతంగా ఓటరు జాబితాల్లోని 90 లక్షల ఓటర్ల పేర్లను తొలగించిందని మమత విమర్శించారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసి నెగ్గే సత్తా లేకనే బీజేపీ దొడ్డిదారిన ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలను అనుకూలంగా మార్చుకునేందుకు ఈవీఎంలను ట్యాంపర్ చేసేందుకూ బీజేపీ పథకం వేస్తోందన్నారు. -
సానుభూతి కోసం బాధిత కార్డు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమి త్ షా నిప్పులు చెరిగారు. ప్రజల సానుభూతి కోసం సీఎం మమత బాధితురా లినంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరో పించారు. టీఎంసీ 15 ఏళ్ల పాలనతో రాష్ట్రం ఆర్థికంగా, శాంతిభద్రతల విషయంలో పూర్తిగా దిగజారిపోయిందని విమర్శించారు. అమిత్ షా శనివారం బంకురా, పురూలియా జిల్లాల్లో శనివారం బీజేపీ ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. బీజేపీకి అధికారమిస్తే టీఎంసీ సిండికేట్ పాలనకు ముగింపు తప్పదన్నారు. మహిళలకు అన్ని వేళలా రక్షణ కల్పిస్తామని తెలిపారు. అన్యాయానికి గురవుతున్న మహిళలకు న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ‘సీఎం మమత బాధితురాలినంటూ చెప్పుకుంటున్నారు. కాలికో తలకో బ్యాండేజీ కట్టుకుని కనిపిస్తుంటారు. ఈసారి అలా జరగదు. కాలికి, చేతికి, తలకు బ్యాండేజీతో కనిపించినా బెంగాల్ ప్రజలు ఆమెకు ఓటేయరు’అని ఆయన స్పష్టం చేశారు. -
Telangana: నేడు ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. తెలంగాణ ఇంటర్ విద్యా బోర్డు ఆవరణలో ఈ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విడుదల చేస్తారు. https://tgbie.cgg.gov.in, https:// results.cgg.gov.in వెబ్సైట్లలో ఈ ఫలితాలు అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ సేవ వాట్సాప్‌లో కూడా.. ఇంటర్మిడియట్ ఫలితాలను మీ సేవ వాట్సాప్ ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ సర్వీసును శనివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సచివాలయంలో ఆవిష్కరించారు. ఇప్పటికే ఇంటర్మీడియట్, టెన్త్ హాల్‌టికెట్లను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మిడియట్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఏప్రిల్ 12, 2026 నుంచి పరీక్షా ఫలితాలను కూడా నేరుగా వాట్సాప్‌లో అందించనుంది. విద్యార్థులు 8096958096 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పంపి మీ సేవ చాట్‌బోట్ ద్వారా తమ రోల్ నంబర్, ఇయర్, స్ట్రీమ్ వివరాలు నమోదు చేసి ఫలితాలను వెంటనే పొందవచ్చు. -
పంజాబ్ ప్రతాపం
న్యూ చండీగఢ్: ఐపీఎల్ 19వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో పరాజయం మూట గట్టుకుంది. బ్యాటింగ్‌లో ఆశించిన స్కోరు చేయలేకపోయిన రైజర్స్... పేలవ బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. శనివారం ‘డబుల్ హెడర్’లో భాగంగా జరిగిన తొలి పోరులో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడింది. మొదట హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 74; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) దంచికొట్టగా... ట్రావిస్ హెడ్ (23 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్), క్లాసెన్ (33 బంతుల్లో 39; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (20 బంతుల్లో 57; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్ (25 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు హాఫ్ సెంచరీలు సాధించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించాడు. పవర్‌ప్లేలో 105 పరుగులు రైజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభమైన తీరు చూస్తే ఈ మ్యాచ్‌లో 300 పరుగుల రికార్డు స్కోరు ఖాయనిపించింది. తొలి రెండు ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టిన అభిషేక్.. అర్ష్ దీప్ వేసిన మూడో ఓవర్లో 4, 4, 6, 6తో మొత్తం 24 పరుగులు రాబట్టాడు. యాన్సెన్ వేసిన తదుపరి ఓవర్లో హెడ్ 4, 6, 4 కొట్టగా... వైశాక్ వేసిన ఐదో ఓవర్లో అభిషేక్ నాలుగు సిక్స్‌లతో విజృంభించాడు. ఈ క్రమంలో అభిషేక్ 18 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తదుపరి ఓవర్లో హెడ్ ‘హ్యాట్రిక్’ ఫోర్లు బాదగా... అభిషేక్ ఓ సిక్స్ కొట్టాడు. దీంతో ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి రైజర్స్ వికెట్ కోల్పోకుండా 105 పరుగులతో నిలిచింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ గాడితప్పింది. శశాంక్ ఒకే ఓవర్లో హెడ్, అభిషేక్‌లను పెవిలియన్‌కు చేర్చగా... కెప్టెన్ ఇషాన్ కిషన్ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) ఓ మాదిరిగా ఆడినా... మరో ఎండ్‌లో క్లాసెన్ ధాటి కనబర్చలేకపోయాడు. అనికేత్ (18) అనూహ్యంగా రనౌట్ కాగా... నితీశ్ రెడ్డికి (0 నాటౌట్)ఒక్క బంతి మాత్రమే ఆడే అవకాశం దక్కింది. పవర్‌ప్లే తర్వాత 14 ఓవర్లలో హైదరాబాద్ 114 పరుగులే చేసి 6 వికెట్లు కోల్పోయింది. ధనాధన్ ఆరంభం సన్‌రైజర్స్ ఓపెనర్లను మరిపించే స్థాయిలో పంజాబ్ ఇన్నింగ్స్ ఆరంభమైంది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ ప్రతి బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపించారు. ఆర్య తొలి ఓవర్లో 4, 6, 4 కొట్టగా... తర్వాతి రెండు ఓవర్లలో ప్రభ్‌సిమ్రన్ రెండేసి ఫోర్లు, రెండేసి సిక్స్‌లు బాదాడు. ఈ జంట ఏ బౌలర్‌ను వదలకుండా విరుచుకుపడటంతో... పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ వికెట్ కోల్పోకుండా 93 పరుగులు చేసింది. ఈ క్రమంలో హర్షల్ పటేల్ ఓవర్లో వరుసగా 6, 6, 4, 4 కొట్టిన ఆర్య 16 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికి ప్రభ్‌సిమ్రన్ 24 బంతుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. వీరిద్దరు అవుటయ్యాక ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత శ్రేయస్ తీసుకున్నాడు. ఆచితూచి ఆడుతూ ముందుకు సాగిన అయ్యర్ 24 బంతుల్లో ‘ఫిఫ్టీ’ కొట్టడంతో పాటు జట్టును విజయతీరాలకు చేర్చాడు.స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) అర్ష్ దీప్ (బి) శశాంక్ 74; హెడ్ (సి) బార్ట్లెట్ (బి) శశాంక్ 38; ఇషాన్ (సి) యాన్సెన్ (బి) అర్ష్ దీప్ 27; క్లాసెన్ (సి) కూపర్ (బి) బార్ట్లెట్ 39; అనికేత్ (రనౌట్) 18; సలీల్ (సి) బార్ట్లెట్ (బి) అర్ష్ దీప్ 9; నితీశ్ రెడ్డి (నాటౌట్) 0; హర్ష్ దూబే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–120, 2–122, 3–169, 4–195, 5–214, 6–218. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–50–2; బార్ట్లెట్ 4–0–42–1; యాన్సెన్ 4–0–40–0; వైశాక్ 2–0–33–0; శశాంక్ 3–0–20–2; చాహల్ 3–0–33–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ఆర్య (సి) నితీశ్ రెడ్డి (బి) శివాంగ్ 57; ప్రభ్‌సిమ్రన్ (సి) క్లాసెన్ (బి) శివాంగ్ 51; కూపర్ (సి) అభిషేక్ (బి) శివాంగ్ 11; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 69; నేహల్ వధేరా (బి) హర్ష్ 14; శశాంక్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–99, 2–117, 3–128, 4–197. బౌలింగ్: హర్ష్ దూబే 4–0– 38–1; జైదేవ్ ఉనాద్కట్ 3–0–40–0; ఇషాన్ మలింగ 3–0–46–0; హర్షల్ 2–0–39–0; శివాంగ్ కుమార్ 4–0–33–3; నితీశ్ రెడ్డి 2–0–20–0; అభిషేక్ 0.5–0–7–0. -
కూటమి నేతలే రింగ్ మాస్టర్లు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఐపీఎల్ సీజన్ క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపుతుంటే.. ఇదే సమయంలో బెట్టింగ్ భూతం వీరవిహారం చేస్తోంది. ఈ ఏడాది మార్చి 28న మొదలైన ఐపీఎల్ 2026 సీజన్ మే 31తో ముగియనుంది. దేశంలోని 13 వేదికల్లో నిర్వహించనున్న 74 క్రికెట్ మ్యాచుల ద్వారా భారీ స్థాయిలో బెట్టింగ్‌కు తెరలేచింది. ఇందుకోసం బెట్టింగ్ మాఫియా పకడ్బందీగా రంగంలోకి దిగింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో దేశంలో రూ.1.25 లక్షల కోట్ల బెట్టింగ్ దందా సాగనుందని ‘డిజిటల్ ఇండియా ఫౌండేషన్’ అంచనా వేయడం గమనార్హం. కాగా ఏపీలో కూడా బెట్టింగ్ మాఫియా చెలరేగిపోతోంది. అధికార కూటమి నేతలే రింగ్ మాస్టర్లు అవతారం ఎత్తి బెట్టింగ్ దందాకు పాల్పడుతున్నారు. రూ.5 వేల కోట్లకు పైగా దందా సాగించి కమీషన్ రూపంలోనే రూ.1,250 కోట్లు వరకు కొల్లగొట్టేందుకు పకడ్బందీగా సన్నద్ధమయ్యారు. చోద్యం చూస్తున్న పోలీసు శాఖ.. అధికార కూటమి నేతల అండతో బెట్టింగ్ సాగుతుండడంతో పోలీసు శాఖ చోద్యం చూస్తుండిపోవాల్సి వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వ్యాపారస్తుల దగ్గర నుంచి మెకానిక్‌లు, హోటళ్లలో పనిచేసుకునే వారు, చిన్నాచితకా పనులు చేసుకునే వారి వరకు కూడా బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. విద్యార్థులు సైతం బెట్టింగ్ మహమ్మరి బారిన పడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ కోసం కాల్ మనీ రాకెట్ నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేసి.. డబ్బు పోగొట్టుకుని.. వాటిని తీర్చే దారి లేక ఆస్తులు అమ్ముకుంటున్న వారు, తీవ్ర అవమానాలు, ఇబ్బందులు పడుతున్నవారు ఎందరో. చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.నిర్వాహకుల కమీషనే రూ.27,500 కోట్లు ఆటలో బాల్ బాల్‌కు డబ్బు అన్నట్లు బెట్టింగ్ మాఫియా ఆకర్షిస్తోంది. ఐపీఎల్లో బెట్టింగ్‌లో డబ్బులు సంపాదించిన వారి దాఖలాలు చాలా తక్కువ. కాకపోతే బెట్టింగ్ నిర్వాహకులు మాత్రం భారీగా కమీషన్ రూపంలో రాబట్టుకుంటున్నారు. ఐపీఎల్–2025 సీజన్లో బెట్టింగ్ మాఫియా కమీషన్ రూపంలోనే రూ.25 వేల కోట్లు కొల్లగొట్టినట్టు డిజిటల్ ఇండియా సంస్థ పేర్కొంది. ప్రస్తుత సీజన్లో అది రూ.27,500 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. విస్మయం కలిగిస్తున్న గణాంకాలు.. దేశంలో క్రికెట్ బెట్టింగుల్లో పాల్గొంటున్న వారి గణాంకాలు మరింత విస్మయం కలిగిస్తున్నాయి. ఐపీఎల్ 2025లో 34 కోట్ల మంది బెట్టింగ్‌లో పాల్గొన్నారని ఇండియా ఛేంజ్ ఫోరం అనే సంస్థ వెల్లడించింది. గత ఏడాది ఐపీఎల్లో మూడు నెలల కాలంలో ప్రధాన బెట్టింగ్ యాప్‌లకు ఏకంగా 160 కోట్ల విజిట్స్ రావడం గమనార్హం. ఐపీఎల్ సీజన్లోనే బెట్టింగ్‌లో పాల్గొంటున్న వారి సంఖ్య ఏటా 15 శాతం మేర పెరుగుతోందని కూడా పేర్కొంది. ఆ ప్రకారం ఐపీఎల్ 2026 సీజన్లో 40 కోట్ల మంది వరకు బెట్టింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం దాదాపు 4 వేల బెట్టింగ్ యాప్‌లను బ్లాక్ చేసింది. అయినా 5 వేలకు పైగా ప్రస్తుతం యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.ఆల్‌టైం హైకి బెట్టింగ్ దందా! ఐపీఎల్–2026 సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో డిజిటల్ ఇండియా ఫౌండేషన్ నివేదిక ప్రకారం దేశంలో బెట్టింగ్ దందా ఏటా 30 శాతం చొప్పున పెరుగుతోంది. ఐపీఎల్ 2025లో దేశంలో రూ.లక్ష కోట్ల మేర బెట్టింగ్ దందా సాగిందని ఆ సంస్థ నివేదిక వెల్లడించింది. తాజాగా మొదలైన ఐపీఎల్ 2026 సీజన్లో ఏకంగా రూ.1.25 లక్షల కోట్ల మేర బెట్టింగ్ సాగుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం జరుగుతున్న 19వ సీజన్ ఐపీఎల్లో బెట్టింగ్ దందా ‘ఆల్‌టైమ్ హై’కి చేరుతుందని కూడా అంచనా వేసింది. ఇదంతా కూడా అక్రమ దందాయేనని స్పష్టం చేసింది. కార్యాలయాలు తెరిచి మరీ బెట్టింగ్ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ మాఫియా మరింత విస్తరిస్తోంది. అధికార టీడీపీ కూటమి నేతలే రింగ్ మాస్టర్ల అవతారమెత్తారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో వారి ప్రధాన అనుచరులే ప్రత్యేకంగా కార్యాలయాలు తెరిచి మరీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఓ ప్రజాప్రతినిధి కుటుంబం బెట్టింగ్ నిర్వహణకు రాజరాజేశ్వరిపేట, అజిత్‌సింగ్‌నగర్‌లో ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అలాగే భీమవరం, కాకినాడ, దెందులూరు, ఏలూరులో బెట్టింగ్ అనేది బహిరంగ రహస్యంగా మారింది. విశాఖలో మద్యం సిండికేట్ నిర్వహిస్తున్న ఓ టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన బార్లు బెట్టింగ్ దందాకు వేదికలుగా మారాయి. మ్యాచ్‌లో టాస్ ఎవరు గెలుస్తారనే దగ్గర మొదలు నుంచి.. బంతి బంతికి బెట్టింగ్ కాస్తున్నారు. ఒక్కో పందెం రూ.500 నుంచి ఏకంగా రూ.10వేల వరకు ఉంటోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాష్ట్రంలో రూ.5వేల కోట్ల మేర బెట్టింగ్ దందా సాగుతుందని అంచనా. అందులో బెట్టింగ్ నిర్వాహకులు కమీషన్ రూపంలో రూ.1,250 కోట్లు కొల్లగొడతారని భావిస్తున్నారు. -
క్విక్–కామర్స్‌లో భారత్ హవా!
న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్లైన్ రిటైల్ మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. 2025లో ఈ మాధ్యమం ద్వారా అమ్ముడైన ఉత్పత్తుల స్థూల విలువ (జీఎంవీ) దాదాపు 65–66 బిలియన్ డాలర్లుగా ఉంటుందని బెయిన్ అండ్ కంపెనీ, ఫ్లిప్‌కార్ట్ నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. విలువపరంగా 19–21 శాతం వృద్ధి నమోదైందని రిపోర్టు పేర్కొంది. ఈ క్రమంలో క్విక్–కామర్స్ విభాగానికి సంబంధించి ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా ఎదిగినట్లు వివరించింది. ఈ–కామర్స్ జీఎంవీలో దాదాపు 16–17 శాతం ఈ క్విక్ కామర్స్ ద్వారానే వచి్చనట్లు తెలిపింది. ఇది చైనా సహా చాలా మార్కెట్లలో నమోదైన దానికంటే అధికమని వివరించింది. ఆన్లైన్ షాపింగ్, అందుకోసం చేసే వ్యయం పెరుగుతుండటంతో ఏటా 20 శాతం వృద్ధితో 2030 నాటికి భారత ఈ–రిటైల్ మార్కెట్ 170–180 బిలియన్ డాలర్లకు చేరవచ్చని నివేదిక అంచనా వేసింది. రిపోర్టులోని మరిన్ని విశేషాలు.. → స్థూల ఆర్థిక పరిస్థితులు, వినియోగదారుల సెంటిమెంటు మెరుగుపడుతుండటంతో గతేడాది పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందింది. జీఎస్టీ కోతలు, ఆదాయ పన్నుపరమైన ఊరట, నెమ్మదిస్తున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల తగ్గింపు తదితర సానుకూలాంశాలతో ప్రైవేట్ వినియోగం పెరిగింది. 2022–24 మధ్య 8 శాతంగా ఉన్న ప్రైవేట్ వినియోగం 2025లో 10.5 శాతానికి చేరింది. 2026 తొలి త్రైమాసికంలోనూ ఇదే ఊపు కొనసాగడంతో 23–25 శాతం వృద్ధి చెందింది. → గత రెండేళ్లుగా క్విక్ కామర్స్ విభాగం రెట్టింపయ్యింది. 2025లో ఈ సెగ్మెంట్ జీఎంవీ 10–11 బిలియన్ డాలర్లకు చేరింది. రాబోయే రోజుల్లో 2030 నాటికి ఇది 65–70 బిలియన్ డాలర్లకు చేరనుంది. అదనంగా నమోదయ్యే ఈ–రిటైల్ జీఎంవీలో దీని వాటా 45–50 శాతానికి చేరొచ్చు. అప్పటికి మొత్తం ఆన్లైన్ షాపింగ్‌లో సంప్రదాయ ఈ–రిటైల్ విభాగం వాటా 60–65 శాతంగా ఉండవచ్చు. → అంతర్జాతీయంగా వినియోగానికి భారత్ కీలక చోదకంగా నిలుస్తోంది. వచ్చే అయిదేళ్లలో వినియోగంపై అదనంగా వెచి్చంచే ప్రతి 8 డాలర్లలో భారత్ వాటా 1 డాలరుగా ఉండనుంది. → గతేడాది ఈ–రిటైల్ మార్కెట్ భారీగా వృద్ధి చెందినా, ఆఫ్‌లైన్ మాధ్యమాన్ని ప్రాధాన్యతను కొట్టిపారేసేందుకు వీలు లేదు. మెజారిటీ వినియోగదారులకు చేరువయ్యేందుకు ఇప్పటికీ ఇది కీలకంగా ఉంటోంది. దీని దన్నుతోనే 2030 నాటికి మొత్తం రిటైల్ పరిశ్రమ 1.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోనుంది. → గడిచిన అయిదేళ్లలో భారత్‌లో ఆన్లైన్ షాపింగ్ మార్కెట్ రెట్టింపయ్యింది. షాపింగ్ చేసే వారి సంఖ్య 2025లో రెట్టింపయ్యి 29–30 కోట్లకు చేరింది. విక్రేతల వ్యవస్థ విస్తరించడం (గత అయిదేళ్లలో మూడు రెట్లు), భౌగోళికంగా మరిన్ని ప్రాంతాల్లోకి సేవలు అందుబాటులోకి రావడం ఇందుకు దోహదపడుతోంది. → జెన్ జెడ్ తరం కీలకంగా మారింది. ఈ–రిటైల్ షాపర్స్‌లో వీరి వాటా 40–45 శాతంగా ఉంటోంది. 2025లో అదనంగా వచ్చి ఈ–రిటైల్ ఆర్డర్లలో 50 శాతం ఈ వర్గం నుంచే వచ్చింది. లైఫ్‌స్టయిల్, బ్యూటీ, ఎల్రక్టానిక్స్ తదితర కేటగిరీలవ్యాప్తంగా ఈ విభాగం కస్టమర్ల షాపింగ్ ప్రాధాన్యతలు చాలా ప్రత్యేకంగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, వీడియోలు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం, సత్వర రుణ సదుపాయం వినియోగించుకోవడం ఎక్కువగా ఉంటోంది. → ఇంటర్నెట్ యూజర్లలో షాపింగ్ చేసే వారి సంఖ్య 25–30 శాతంగానే ఉన్నప్పటికీ (మెట్రోలు/ప్రథమ శ్రేణి నగరాల్లో ఇది 45–50 శాతంగా ఉంది), గతేడాది అదనంగా నమోదైన ఆన్లైన్ ఆర్డర్లలో ద్వితీయ శ్రేణి నగరాల వాటా దాదాపు 50 శాతంగా ఉంది. → పరిశ్రమ గణనీయంగా ఎదుగుతున్నప్పటికీ భారత్‌లో ఇప్పటికీ ఈ–రిటైల్ విస్తరణ చాలా తక్కువగానే జీడీపీలో 1.6 శాతం మాత్రమే ఉంది. అదే చైనాలో 13–14 శాతంగా, ఇండొనేషియాలో 4–4.5 శాతంగా ఉంది. ఇంటర్నెట్ యూజర్లలో 30 శాతం మంది మాత్రమే ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. చైనాలో ఇది 92 శాతంగా, అమెరికాలో 74 శాతంగా ఉంది. ఇవన్నీ భారత్‌లో ఈ రంగం మరింత వృద్ధి చెందడానికి గల అవకాశాలను సూచిస్తున్నాయి. → వచ్చే అయిదేళ్లలో ఈ–రిటైల్ మార్కెట్ తదుపరి వృద్ధి దశలోకి అడుగుపెట్టనుంది. క్యూ–కామర్స్ ఇందుకు దన్నుగా నిలవనుంది. నిత్యావసరాలు, అలాగే డిస్క్రెషనరీ ఉత్పత్తులకు సంబంధించి సౌకర్యవంతమైన మాధ్యమంగా క్యూ–కామర్స్ నిలుస్తోంది. ప్రస్తుతం 200 పైగా నగరాల్లో 7,000 పైగా మైక్రో–ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ పని చేస్తున్నాయి. భారీ స్థాయిలో కార్యకలాపాల నిర్వహణ వల్ల లాభదాయకత మెరుగుపడింది. అయితే, టాప్ మెట్రోలు, ప్రథమ శ్రేణి నగరాల పరిధిని దాటి ఇతర ప్రాంతాల్లో దీని వినియోగం ఎలా ఉంటుందనే దానిపై ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు. -
‘ఉపాధి’కి పచ్చ చెదలు!
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో 2017–19 మధ్య వందకు పైగా పండ్ల తోటల పెంపకం పనుల పేరిట 2025 ఆగస్టులో ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తమ్ముడు ధర్మవరపు మురళి ఒక్కరే లక్షల రూపాయలకు బిల్లులు పెట్టుకొని ఉపాధి హామీ పథకం నుంచి నిధులు దండుకు న్నారు. బండమీదపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో 60 పనులకు రూ.7,28,276, చెర్లోపల్లెలో 18 పనులకు రూ.2,64,909, మండల కేంద్రమైన రాప్తాడులో 17 పనులకు రూ.1,20,807, హంసాపురంలో 21 పనులకు రూ.83,847.. ఇలా పలు గ్రామాల్లో పనులకు ఆయన పేరిట బిల్లుల చెల్లింపు కూడా పూర్తయింది. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ నేతలు ‘ఉపాధి’ని అడ్డుపెట్టుకుని రూ.వందల కోట్లలో దోపిడీ పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగించారు. కూలీలతో చేయించే పనులే కాకుండా, రోడ్ల నిర్మాణం తదితర మెటీరియల్ కేటగిరీ పనుల్లో సైతం కాంట్రాక్టర్ల వ్యవస్థకు ఈ పథకంలో తావుండదు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో లేదా వివిధ ప్రభుత్వ విభాగాల ప్రత్యేక పర్యవేక్షణలో ఆ పనులు చేపట్టాల్సి ఉంటుంది. అయితే 2014–19 మధ్య జరిగిన మొత్తం 4,47,344 పనులకు సంబంధించి రూ.331.66 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వం 2024 నవంబర్ 6న మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు అదే నెల 15న ఆదేశాలు జారీ చేసింది. వాటికి సంబంధించి 2025 ఆగస్టులో దాదాపు రూ.300 కోట్ల దాకా చెల్లింపులు పూర్తయ్యాయి. అప్పట్లో వివిధ గ్రామ పంచాయతీల పేరుతో జరిగిన పనులకు సంబంధించి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి టీడీపీ నాయకులు పలువురు పెద్ద సంఖ్యలో నేరుగా ‘వెండార్’ పేరిట బిల్లులు పెట్టుకొని డబ్బులు దండుకున్నారు. కొన్ని చోట్ల ఎంపీడీవోలు లేదా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పేరిట ఆన్లైన్లో నమోదు చేసి టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలు డ్రా చేసుకున్నారు. 90 శాతం వెండార్లకు జీఎస్టీనే లేదు2014–19 మధ్య కాలానికి ఉపాధి హామీ పథకం నిధుల చెల్లింపులకు ఉన్న నిబంధనల్లో 2021 తర్వాత మార్పులు చోటు చేసుకున్నాయి. మారిన నిబంధనల ప్రకారం ఈ పథకంలో ఏ పనికి సంబంధించిన బిల్లులైనా నేరుగా ఆ పనికి అవసరమైన వస్తువులు సరఫరా చేసే వెండార్ (సరఫరాదారుడు లేదా వ్యాపారి)కు లేదంటే పని చేసే కూలీలకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆ పనుల బిల్లుల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం వెండార్ల పేర్లు, బ్యాంకు అకౌంట్ల వివరాలను మాత్రమే నమోదు చేయాల్సి ఉంది.ఈ నేపథ్యంలో పాత బకాయిల పేరిట వందల కోట్ల రూపాయలు టీడీపీ నేతలకు దోచిపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం గ్రామాల్లో టీడీపీ నేతలకు వెండార్ల ముసుగు వేసింది. ఆయా టీడీపీ నేతల పేర్లనే సిమెంట్ తదితర వస్తువులు సరఫరా చేసే, సేవలు అందించే వ్యాపారవేత్తలంటూ నమోదు చేయించింది. ఈ పథకం కింద వెండర్ల పేర్లను నమోదు చేసే అధికారం మండలాల్లో ఎంపీడీవోలకే ఉండటంతో అధికార పార్టీ పెద్దలు ఇష్టమొచ్చినట్టు వ్యవహరించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులకు వివిధ రకాల వస్తువులు, సామగ్రి తదితర వస్తువులు సరఫరా చేసే వెండార్లుగా దాదాపు 14 లక్షల మంది పేర్లు నమోదయ్యాయి. ఇందులో ఏకంగా 13.94 లక్షల మంది వెండార్లకు కనీసం జీఎస్టీ నంబరు కూడా లేదని అధికార గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ లెక్కన దోపిడీ ఎలా సాగిందో ఇట్టే స్పష్టమవుతోంది. మూసిన రికార్డులు తెరిపించి మరీ బిల్లులు ఉపాధి పనుల మంజూరు, పురోగతి, బిల్లుల నమోదు, చెల్లింపుల ప్రక్రియ అంతా ఆన్లైన్ విధానంలో కొనసాగుతుంది. 2014–19 మధ్య జరిగిన పనులకు బిల్లుల చెల్లింపులు జరిగి ఆ పనుల నిర్వహణ అన్ని దశల్లో పూర్తయినట్టు కేంద్రం వెబ్సైట్లో సైతం నమోదు చేసింది. అయినప్పటికీ బకాయిల పేరిట టీడీపీ నేతలకు నిధులను దోచి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖ రాసి పనుల రికార్డులను తిరిగి ఓపెన్ చేయించింది. -
వచ్చేది ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వమే
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లకు గాను డీఎంకే కూటమి 200కుపైగా స్థానాలు గెల్చుకోవడం తథ్యమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తంచేశారు. అన్నా డీఎంకే–బీజేపీ కూటమికి సిద్ధాంతం గానీ, ఒక విధానం గానీ లేవని విమర్శించారు. బీజేపీ స్వరాలకు అనుగుణంగా అన్నాడీఎంకే నర్తిస్తోందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ఢిల్లీ బీజేపీయే ప్రధాన కార్యాలయంగా మారిపోయిందని అన్నారు. స్టాలిన్ తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. గత ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో ప్రజల కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. కళైంజర్ మహిళా పథకం కింద నెలకు రూ.1,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, రెండు లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్ల జారీ వంటి పథకాలను ప్రస్తావించారు. ప్రజల ప్రేమాభిమానాలు, అండదండలతో లౌకిక ప్రజాస్వామ్య కూటమి(ఎస్పీఏ) 200కుపైగా సీట్లు గెల్చుకొని ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఉద్ఘాటించారు. అన్నాడీఎంకే నాయకులు ఢిల్లీ పెద్దలకు బానిసలుగా మారిపోయారని మండిపడ్డారు. తమిళనాడు హక్కులను తాకట్టుపెట్టాలని చూస్తున్నవారు ముమ్మాటికీ బానిసలేనని తేల్చిచెప్పారు. స్టాలిన్ ఇంకా ఏం చెప్పారంటే.. మహిళల భద్రత మా బాధ్యత ‘‘మా కూటమిలో సీట్ల పంపకం విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. సానుకూలంగా చర్చించుకొని సీట్లు ఖరారు చేసుకున్నాం. కూటమి అభ్యర్థుల విజయం కోసం మిత్రపక్షాలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. కొత్త పార్టీల చేరికతో ఎస్పీఏ మరింత బలంగా మారింది. తమిళనాడుతోపాటు పుదుచ్చేరిలోనూ అద్భుత విజయం సాధించబోతున్నాం. ద్రావిడ విప్లవ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు మా పార్టీలో చేరారు. అందుకే మాజీ సీఎం పన్నీర్‌సెల్వం డీఎంకేను ఎంచుకున్నారు. జాతీయ స్థాయిలో విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి లేదు. నా పరిధి ఏమిటో నాకు తెలుసు. స్టాలిన్ కుటుంబం పవర్ సెంటర్‌గా మారిందన్న విపక్షాల ఆరోపణల్లో నిజం లేదు. ద్రావిడ మోడల్ సుపరిపాలన, గత ఐదేళ్లలో మేము సాధించిన విజయాలను జీర్ణించుకోలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మహిళల భద్రతకు మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. వారి రక్షణ కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాం. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి శిక్షలను కఠినతరం చేశాం. మహిళా ఉద్యోగులు, కార్మికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. వారి భద్రత మా బాధ్యత’’ అన్నారు. మనసుకు దగ్గరైన పథకాలు ‘‘మహిళలకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం, స్కూల్ విద్యార్థులకు అల్పహారం పథకాలు నా మనసుకు చాలా దగ్గరయ్యాయి. మహిళలకు ఆర్థిక సాయం పథకం దేశంలో అత్యుత్తమంగా అమలవుతున్న పథకం కావడం గర్వకారణం. ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. విమర్శించినవారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే ఈ సాయాన్ని రూ.2,000కు పెంచుతాం. అలాగే అల్పాహారం పథకాన్ని ఎనిమిదో తరగతి విద్యార్థుల దాకా విస్తరింపజేస్తాం. ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో పాఠశాలకు రాకూడదు. అదే మా లక్ష్యం. పిల్లల కడుపు నిండుతోంది, చక్కగా చదువుకుంటున్నారు. అది నాకు చాలా సంతృప్తినిస్తోంది’’ అని ఆయన అన్నారు. తమిళనాడు పోరాడుతుంది.. గెలుస్తుంది‘‘మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాజకీయ లబ్ధి కోసం ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. మహిళలకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టకూడదు. ఈ పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదు. జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించాలనుకోవడం సరైంది కాదు. తమిళనాడు పోరాడుతుంది, తమిళనాడు గెలుస్తుంది. ఇదే మా నినాదం. మైనార్టీలను భయపెట్టాలన్నదే బీజేపీ అసలు ఎజెండా. మోదీ పాలనలో ముస్లింలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. క్రిస్టమస్ పండుగ కూడా ప్రశాంతంగా నిర్వహించుకోలేని దుస్థితి ఏర్పడింది. క్రైస్తవులను కూడా టార్గెట్ చేశారు. భారత్ ఎప్పటికీ లౌకిక దేశంగానే ఉండాలి. మైనార్టీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాలి. మైనార్టీల హక్కుల కోసం మొదట మేమే గొంతు వినిపిస్తాం’’ అని స్టాలిన్ స్పష్టం చేశారు. -
బెంగాలీలను మైనార్టీలు కానివ్వం
జాంగీపూర్/కత్వా/కుష్మాండీ: పశ్చిమ బెంగాల్లో బుజ్జగింపు రాజకీయాలను అంతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని, బెంగాల్ ప్రజలను సొంత రాష్ట్రంలో మైనార్టీలు కానివ్వబోమని తేల్చిచెప్పారు. శనివారం బెంగాల్‌లోని జాంగీపూర్, కత్వా, కుష్మాండీలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలను బెంగాల్ గుర్తింపు, భవిష్యత్తు పరిరక్షణ కోసం జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, చొరబాటుదార్లకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే చొరబాటుదార్లను బయటకు పంపిస్తామని పునరుద్ఘాటించారు. జాతీయ భద్రతే తమకు ముఖ్యమని తేల్చిచెప్పారు. అక్రమ వలసల కారణంగా బెంగాల్లో చాలా ప్రాంతాల్లో జనాభా నిష్పత్తి మారిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘మా, మాటీ, మనుష్’నినాదాన్ని తృణమూల్ కాంగ్రెస్ వదిలేసిందని, అధికారం నిలబెట్టుకోవడానికి చొరబాటుదార్లపై ఆధారపడుతోందని ధ్వజమెత్తారు. వారి ఓట్లతో వారి కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే తృణమూల్ కాంగ్రెస్ ఉద్దేశమని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలను ఇకపై సహించే ప్రసక్తే లేదన్నారు. ప్రజలంతా ఏకమై ప్రభుత్వాన్ని మార్చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు వేసే ప్రతి ఓటు బీజేపీకి ఆశీర్వాదంగా మారాలని చెప్పారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. కమ్యూనిస్టులకు కార్బన్ కాపీగా తృణమూల్ ‘‘బెంగాల్లో మార్పు తీసుకొస్తాం. రాష్ట్రాన్ని కాపాడుతాం. మార్పును ఎవరూ అడ్డుకోలేరు. బెంగాల్లో అహంకారం ప్రదర్శించిన ఎంతోమంది అడ్రస్ లేకుండాపోయారు. బ్రిటిష్ పాలకులతోపాటు కాంగ్రెస్, వామపక్షాలు గతంలో ఏమైందో చూశాం. ఇప్పుడు అదే పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్‌కు ఎదురవుతుంది. బెంగాల్లో శ్రీరామనవమి వేడుకల్లో హింస జరిగితే మమతా బెనర్జీ ప్రభుత్వం నిందితులను కాపాడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలడంతో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అది సహించలేక తప్పుడు వీడియోలు, అబద్ధాలను పోస్టు చేస్తున్నారు. అస్సాం, పుదుచ్చేరిలోనూ ఇలాంటి కుతంత్రాలు సాగించారు. అబద్ధాలను నమ్మొద్దని ప్రజలను కోరుతున్నా. ఎన్నికల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలి. బీజేపీని గెలిపించుకోవాలి. మా, మాటీ, మనుష్ నినాదంతో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టు పార్టీలకు కార్బన్ కాపీగా మారిపోయింది. కమ్యూనిస్టు శక్తులు, సిండికేట్లు తృణమూల్ కాంగ్రెస్‌తో చేతులు కలిపాయి. కమ్యూనిస్టుల పాలనలో జరిగినట్లుగానే వేధింపులు, అరాచకాలు, అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయి. వామపక్ష కార్యకర్తలు ఓట్ల కోసం ప్రజలను బెదిరించేవారు. నేడు టీఎంసీ రౌడీలు సైతం అదే పని చేస్తున్నారు. అక్రమ ఆయుధా లు, డ్రగ్స్, పశువుల అక్రమ రవాణా, కట్ మనీ, కమీషన్లు.. ఇలా అన్నింటినీ తృణమూల్ కాంగ్రెస్ కాంట్రాక్టు తీసుకుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతిపరులను కచ్చితంగా శిక్షిస్తాం. ప్రజలను వేధించినవారి కోసం జైలు తలుపులు తెరుచుకుంటాయి’’ అని అన్నారు. శరణార్థులకు భారత పౌరసత్వం ‘‘బీజేపీ అధికారంలోకి రాగానే మతువా, నామశూద్ర వర్గాలతోపాటు ఇతర శరణార్థులకు సీఏఏ కింద భారత పౌరసత్వం కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తాం. చొరబాటుదార్లు తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోవాల్సిందే. వారు వెనక్కి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది. చొరబాటుదార్లను కాపాడేవారికి కూడా శిక్ష తప్పదు. బెంగాల్లో మా నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్ ఒక్కటే కాదు. మరొకటి కూడా ఉంది. అదే సబ్కా హిసాబ్. ప్రతి అరాచకవాదిని, అవినీతిపరుడిని శిక్షిస్తాం. శరణార్థులకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది. అలాగే బీజేపీ పాలనలో బెంగాల్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తాం. ఓటింగ్‌లో మహిళల భాగస్వామ్యం అధికంగా ఉన్నచోట బీజేపీ విజయం సాధిస్తోంది. బెంగాల్లోనూ మహిళల ఓట్లతో అధికారంలోకి రాబోతున్నాం. ప్రజలంతా కలిసి తృణమూల్ కాంగ్రెస్ పాలనను అంతం చేయాలి. బీజేపీ పాలన వచ్చాక.. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, సిండికేట్ల అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. బెంగాల్లో అమలవుతున్న పథకాలను కొనసాగిస్తాం. వాటిని ఆపబోం’’అని మోదీ స్పష్టం చేశారు.మహిళల భద్రతే మా ధ్యేయం ‘‘మహిళల భద్రతకు బీజేపీ సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మహిళలపై లెక్కలేనన్ని నేరాలు జరిగాయి. వారిని దారుణంగా వేధించారు. మా ప్రభుత్వం వచ్చాక నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తాం. పాత కేసులను మళ్లీ తెరుస్తాం. ఇది మోదీ గ్యారంటీ. మహిళల భద్రతే మా ధ్యేయం. తృణమూల్ ప్రభుత్వం ఫుట్‌బాల్ ఆటను కూడా సిండికేట్లకు అప్పగించింది. గత డిసెంబర్లో అర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన సందర్భంగా గందరగోళం జరిగింది. ఆ సిగ్గుచేటైన చిత్రాలను ప్రపంచమంతా చూసింది. బెంగాల్లో ప్రభుత్వం అంటే సిండికేట్, సిండికేట్ అంటే ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. చట్టవిరుద్ధమైన పాలనకు పర్యాయపదం తృణమూల్ సర్కార్. మమతా బెనర్జీ పార్టీకి సిద్ధాంతాలు, విలువులు లేవు. అందుకే అది ఇతర రాష్ట్రాల్లో అడుగుపెట్టలేకపోయింది’’అని మోదీ అన్నారు. -
ఖాకీ ముసుగేసుకున్న కీచకుడు
సాక్షి, నరసరావుపేట: మహిళలకు అండగా నిలవాల్సిన రక్షకభటులే వారి పాలిట కీచకులుగా మారిన ఉదంతం రాష్ట్ర ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఏకాంతంగా ఉండే జంటల వీడియోలు తీసి.. వారిని బెదిరించి నగదు గుంజుకోవడంతోపాటు లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డబ్బులు తీసుకుని పరువు హత్యకు కారణమైన సీఐ వెంకటరమణ వ్యవహారం మరువక ముందే మాచర్లలో మరో ప్రబుద్ధుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. టౌన్ పోలీసుస్టేషన్ ఏఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాసరావు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు గస్తీ పేరుతో పర్యాటక, నిర్మానుష్య ప్రాంతాల్లో తిరుగుతుంటారు. ఏకాంతంగా గడపటానికి వచ్చిన ప్రేమజంటలతోపాటు భార్యాభర్తల వీడియోలు తీసి వారిని బెదిరిస్తుంటాడు.‘స్టేషన్‌కు పదండి’ అని గద్దిస్తూ బాధితులను భయపెట్టి నగదు గుంజుకునే ప్రయత్నం చేస్తాడు. అతడి మాటల్ని ఖాతరు చేయని వారి వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించి వారినుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నాడు. కొందరు మహిళలను లైంగికంగా కూడా వేధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాగిన మత్తులో ఏఎస్ఐ శ్రీనివాసరావు అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించిన వీడియోలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఓ నవజంట సరదాగా రోడ్డు పక్కన బండిమీద కూర్చుని మాట్లాడుతుండగా ఏఎస్ఐ వారిని బెదిరించిన తీరును చూస్తుంటే అతడు ఎంతటి దుర్మార్గుడో అర్థమవుతోంది. ఆటోడ్రైవర్ సాయంతో.. ఏఎస్ఐ శ్రీనివాసరావు ప్రేమ జంటల వీడియోలు తీసి, ఆ తరువాత విచారణ పేరుతో వారి నుంచి డబ్బు గుంజేవాడు. యువతులకు ఫోన్‌చేసి తన కోరిక తీర్చకపోతే వీడియోలు బయటపెడతానని బెదిరించి పలువురి మహిళలను ఇబ్బందులకు గురిచేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో వీడియోలు తీయడానికి, డబ్బులు వసూలు చేయడానికి మాచర్ల మండలం జమ్మలమడకకు చెందిన ఆటో డ్రైవర్ సైదులును సహాయకుడిగా నియమించుకున్నాడు. ఏఎస్ఐ చేసిన దుర్మార్గాలను సైతం ఆటో డ్రైవర్ వీడియోలు తీయడంతో ఈ వ్యవహారం బయటపడింది.నిత్యం రాత్రివేళ ఆటోలో కానిస్టేబుళ్లు, హోంగార్డులతో ఏఎస్ఐ హైవేలపై సంచరించేవాడు. ఎవరు కనిపించినా బెదిరించి దౌర్జన్యం చేసేవాడు. అతిగా మద్యం సేవించడమే కాకుండా వాహనాలు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు రాస్తానని డబ్బులు గుంజేవాడు. వ్యభిచార గృహాలపై దాడులు చేసి వారినుంచి డబ్బులు వసూలు చేయడంతోపాటు అక్కడి మహిళలపైనా లైంగికంగా వేధింపులకు దిగాడు. పోక్సో కేసు ఉన్నా పోస్టింగ్‌లోనే.. గతంలోనూ ఏఎస్ఐ శ్రీనివాసరావుపై లైంగిక ఆరోపణలున్నాయి. ఇప్పటికే అతనిపై మేడికొండూరు పోలీసుస్టేషన్లో పోక్సో కేసు నమోదు కాగా.. వాయిదాల నిమిత్తం కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అయిఆ అధికారులు అతనికి పోస్టింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ప్రవర్తన మార్చుకోకుండా స్టేషన్‌కు వచ్చే బా«ధిత మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడని తోటి ఉద్యోగులు చెబుతున్నారు.ఫిర్యాదుదారులకు ఫోన్లుచేసి సమస్య పరిష్కరిస్తానని.. తన కోరిక తీర్చాలని వేధింపులకు గురిచేసేవాడని బా«ధిత మహిళల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. అయితే, చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏఎస్ఐ ఆగడాలు పెచ్చుమీరాయి. ఎక్కడ పనిచేస్తే అక్కడ మహిళలతో వివాహేతర సంబంధాలు నెరపడం ఏఎస్ఐ అలవాటుగా మార్చుకున్నాడు. ఇతనిపై గతంలో భార్య సైతం ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సస్పెన్షన్ వేటు కాగా.. మాచర్ల టౌన్ ఏఎస్ఐ శ్రీనివాసరావు వీడియోలు శనివారం సోషల్ మీడియాలో వైరలై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసుశాఖ స్పందించింది. ఏఎస్ఐ శ్రీనివాసరావుపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సస్పెన్షన్ వేటు వేశారు. అతనిపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. మరోవైపు ఏఎస్ఐతో పాటు ఇదే స్టేషన్లో పనిచేసే మరో అధికారి, మరికొందరు సిబ్బంది సైతం ఇదే తరహా వ్యవహారాలు చేస్తున్నారని, వారిపైనా విచారణ జరపాలని మాచర్ల వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
నా చావుతోనైనా చిరుద్యోగులకు న్యాయం జరగాలి
రావులపాలెం: ‘‘చాలీచాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాలాంటి ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం జీతాలు పెంచి న్యాయం చేయాలి. నాకు ఇటీవలే వివాహమైంది.. నాకు ఒక అన్న, చెల్లెలు ఉన్నారు. నా కుటుంబాన్ని ఆదుకోండి. నా చావుతోనైనా మాలాంటి చిన్నపాటి ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి’’ అంటూ విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో షిఫ్ట్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు ఆత్మహత్యకు యతి్నంచాడు. వివరాలు ఇలా.. కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన బండారు ప్రశాంత్ కుమార్ రావులపాలెం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం ఉదయం డ్యూటీ ముగించుకుని అమలాపురానికి తిరిగి వెళ్లే సమయంలో వాడపాలెం లాకుల వద్ద ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఒక సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పెట్టి పురుగు మందు తాగాడు. అంతకుముందు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కూడా తాను చనిపోతానని, తన చావుతోనైనా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేశ్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరాడు. వీడియో చూసిన సహచరులు, బంధువులు వెంటనే ప్రశాంత్ కోసం గాలించగా కొత్తపేట మండలం వాడపాలెం లాకుల వద్ద అపస్మారక స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రావులపాలెంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. -
తీర ప్రజలకు 'కారిడార్' ముప్పు
ఒక పని తలపెట్టినప్పుడు దాని పర్యవసానాలు చూడాలి. మంచీచెడూ ఆలోచించాలి. విచక్షణ ఉండాలి. మరికాస్త సంయమనం పాటించాలి. వ్యక్తులకైనా, ప్రభుత్వాలకైనా, సంస్థకైనా ఇది లోపించినప్పుడు ఆ వ్యవస్థలోని సమూ హాలు అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. కార్పొరేట్ల దోపిడీకి చట్టబద్ధత కల్పించే విధాన నిర్ణయాలు తీసుకోవడంతో నివారించ వీల్లేని ప్రమాదాన్ని విజనరీ ప్రభుత్వాలు తెచ్చిపెడుతున్నాయి. బీచ్ శాండ్ మినరల్స్ తవ్వకాలకు ఏపీ ‘డబుల్ ఇంజన్ సర్కార్’ అనుసరించే విధానం రాబోయే కాలంలో పెను ముప్పు కాబోతుందని పర్యావరణ నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రం లోపల ఖనిజాలు, లోహాలు; సముద్ర తీర ఇసుకలో ఉన్న ఖనిజ తవ్వకాలకు ప్రయత్నాలు జరుగు తున్నాయి. అడవిలోని ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆటంకంగా ఉన్న ఆదివాసీ చట్టాలను బలహీనం చేస్తున్న ప్రభుత్వాల వ్యవహారం తెలిసిందే. ఇప్పుడు అదేవిధంగా విలువైన ఖనిజం ఎక్కడున్నా కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో ‘డబుల్ ఇంజన్లు’ వెళ్తున్నాయి. సముద్ర గర్భంలోని అపార ఖనిజ, లోహాలను వెలికితీసే ప్రణాళిక రూపొందించి, సముద్రంలో ఖనిజాలు గుర్తించడానికి ‘డీప్ ఓషన్ మిషన్’ కింద 4వేల కోట్లు పైగా కేంద్రం కేటాయించింది. జాతీయ భద్రతా మండలి సచివాలయం... సర్వే ఆఫ్ ఇండియా తాజా లెక్కల ప్రకారం 11,098 కిలోమీటర్ల భారత సముద్రతీరంలో ఖనిజ తవ్వకాలకు ప్రణాళిక తయారు చేసింది. భారత సముద్ర తీరంలో అత్యధిక పరిమాణంలో మైనింగ్ ప్రాసెసింగ్, పరిశోధన, తయారీలకు ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను ప్రత్యేక ‘రేర్ ఎర్త్ కారిడార్’గా ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఖనిజ తవ్వకాలకు ముందుకొచ్చే కార్పొరేట్లకు పెట్టుబడి ప్రోత్సాహం, భారీ రాయితీలు ఇచ్చేందుకు 2026–27 బడ్జెట్లో రూ. 7,280 కోట్లు కేటాయించింది. ఖనిజ దిగుమతిపై చైనాపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలు వెతకడం అమెరికా ప్రారంభించింది. సొంత ఉత్పత్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, భారత్ నుంచి ఎగుమతి చేసుకోవడం సురక్షితమని అమెరికా భావిస్తోంది. అమెరికా మాట కాదని చెప్పలేని కేంద్ర పాలకులు, వారికి అంగుదారునిగా తయారైన ఏపీలోని కూటమి ప్రభుత్వం అమెరికాకు ప్రయోజనం చేకూర్చేలా ఖనిజ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తున్నాయి. అందుకనే రేర్ ఎర్త్ కారిడార్ పల్లవిని డబుల్ ఇంజన్ సర్కార్ ఎత్తుకుంది.రాష్ట్ర పరిధిలోని హక్కులను బలహీనం చేసి, ఆధిపత్యం పెంచుకునే కేంద్ర దుశ్చర్యలపై చంద్రబాబు ప్రభుత్వం మాట్లాడడం లేదు. శాంతిభద్రతలు, సహజ వనరులు, ఖనిజాలు, మారిటైమ్, పట్టణ విధానం, భూ చట్టాలు, వ్యవసాయం వంటివి రాష్ట్ర పరిధిలో ఉన్నప్ప టికీ, నేరుగా కేంద్రం జోక్యం చేసుకొని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల దోపిడీకి అనుకూలమైన చట్టాలను కేంద్రం చేస్తోంది.బీచ్‌శాండ్ అపారంసర్వే ఆఫ్ ఇండియా తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని తీర ప్రాంతంలో బీచ్‌శాండ్ నిల్వలు 241 మిలియన్ టన్నులకు పైగా ఉన్నాయి. దేశంలోని బీచ్‌శాండ్ నిల్వలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రపంచంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగ వృద్ధికి ప్రాధాన్యం పెరుగుతుందన్న నేపథ్యంలో 2030 నాటికి రేర్ ఎర్త్ పర్మినెంట్ మ్యాగ్నెట్ల వినియోగం రెట్టింపు అవుతుందని అంచనా. రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సముద్రతీరంలో మోనజైట్ నిల్వలు 35 శాతం ఉన్నాయి. సాంద్రత కల్గిన సముద్ర ఇసుకలో లభ్యమైన ఇల్మనైట్, జిర్కాన్, మోనజైట్, గార్నెట్, రూటైల్ వంటి ఖనిజం నుంచి వచ్చే థోరియం, యురేనియం, టైటానియం వంటి వాటిని విమానయాన, రక్షణ, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రికల్ వాహనాలు, విండ్ టర్బైన్లలో వినియోగించడంతో ప్రపంచంలో ఈ ఖనిజాలకు డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో అత్యంత నాణ్యమైన ఖనిజం 40 వేల ఎకరాలలో ఉన్నట్లు ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎమ్డీసీ) గుర్తించింది. సెమీ కండక్టర్ల పరిశ్రమల కోసం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం, శ్రీకాకుళం జిల్లా గార మండలాల తీరంలోని 2,500 ఎకరాల్లో ఖనిజ తవ్వకాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బీచ్‌శాండ్ ఖనిజ తవ్వకాలు, ప్రాసెసింగ్‌ను ఓ కార్పొరేట్ కంపెనీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సముద్రతీర ఇసుకలోని ఖనిజం ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వకూడదన్న కోర్టు తీర్పులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. సముద్ర ఇసుకలో దొరికే అరుదైన ఖనిజాలు కార్పొరేట్ సంస్థలకు అప్పగించే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. పొంచి ఉన్న ప్రమాదాలుబీచ్శాండ్ ప్రాసెసింగ్ క్రమంలో వచ్చే శబ్దాలు, ప్రకంపనలు, సముద్రంలో విడిచిపెట్టే ఇంధనాలు, రసాయ నాలతో మత్స్య సంపద భారీగా దెబ్బతినడంతో పాటు జీవ, మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇసుక దిబ్బలు కోతకు గురైతే సమీప నివాసిత ప్రాంతాల్లోకి ఉప్పునీరు ప్రవేశించి తాగునీటి సమస్య రానుంది. నిర్మాణాలు తొందరగా దెబ్బతింటాయి. సముద్ర తీరంలో ఔషధ, రసాయన పరిశ్రమలు విడిచిపెడుతున్న వ్యర్థాలతో చేపల ఉత్పత్తి తగ్గడంతో మత్స్యకారుల జీవనోపాధి తగ్గింది. ఇసుక తవ్వకాలతో ఉన్న కొద్దిపాటి ఉపాధి కూడా మత్స్యకారులకు లేకుండాపోతుంది. మోనజైట్ ఖనిజం నుంచి వెలువడే థోరియంతో చర్మ, క్యాన్సర్, ఊపిరి తిత్తుల వ్యాధులకు గురయ్యేవారి సంఖ్య పెరుగుతుంది. ఇన్ని అనర్థాలు, నష్టాలు, దుష్ప్రభావాలున్నా, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఇవన్నీ సాధారణ ప్రజలు అనుభవించాలన్నట్లు ప్రభుత్వాల తీరుంది. బీచ్‌శాండ్ మైనింగ్ ముప్పును ముందుగా గుర్తించి నిలువరించకపోతే జీవా వరణానికి ముప్పు తప్పదు.– గుల్ల కాంతారావు ‘ సీనియర్ జర్నలిస్టు -
ఇరాన్‌కు చైనా ఆయుధాలు
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు ఓవైపు పాకిస్తాన్లో అమెరికాతో చర్చలు జరిపేందుకు ప్రతినిధి బృందాన్ని పంపిన ఇరాన్ మరోవైపు ఆయుధాల సమీకరణలో బిజీగా మారిందన్న వార్త చర్చనీయాంశమైంది. మిత్రదేశం చైనా నుంచి గగనతల రక్షణ వ్యవస్థలను రహస్యంగా తెప్పించుకుంటోందని అమెరికా నిఘా వర్గాలు తాజాగా ఆరోపించాయి. ఈ మేరకు సీఎన్ఎన్ వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది. భుజంపై మోస్తూ సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లగల మ్యాన్‌ప్యాడ్ ఆయుధాలను ఇరాన్‌కు చైనా తరలిస్తోందని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. మ్యాన్‌ప్యాడ్ సాయంతో శత్రువుల హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చేయవచ్చు. హెలికాప్టర్ల ఇంజిన్లు, డ్రోన్ల వేడిమిని గుర్తించే ‘హీట్–సీకింగ్’సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. అమెరికా ఎఫ్–15ఇ యుద్ధ విమానం, బ్లాక్‌హాక్ హెలికాప్టర్లను ఇరాన్ ఇటీవల ఇవే యాంటీ–ఎయిర్–మిస్సైళ్ల వ్యవస్థలతో నేలకూల్చిందని కథనాలు వెలువడ్డాయి. నేరుగా పంపకుండా వేరే దేశానికి వీటిని విక్రయించి ఆ దేశం నుంచి ఇరాన్ కొనుగోలుచేసేలా వ్యూహం రచించిందని సమాచారం. ఇ చైనా అంతర్జాతీయ ఆంక్షల కొరడా దెబ్బల నుంచి తప్పించుకుంటోందని అమెరికా ఆరోపించింది. రష్యా నుంచి సైతం ఇలాగే పనిచేసే వెర్బా అనే యాంటీ–ఎయిర్ మిస్సైళ్ల వ్యవస్థలను ఇరాన్ కొనుగోలుచేస్తోందని వార్తలొచ్చాయి. ఘన రాకెట్ ఇంధనం తయారీవాడే ముడిపదార్థం సోడియం పర్క్లోరేట్తో నిండిన రెండు సరుకు రవాణా నౌకలను ఇప్పటికే ఇరాన్‌కు చైనా పంపిందని తెలుస్తోంది. -
కాకాణిపై ఆగని కక్షసాధింపు
సాక్షి ప్రతినిధి నెల్లూరు: మాజీమంత్రి, వైఎస్సార్సీపీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు ఆగడంలేదు. టీడీపీ కూటమి వైఫల్యాలను నిలదీసినా, వారి అనుకూల మీడియాను విమర్శించినా సహించేదిలేదన్నట్లుగా అక్రమ కేసులు బనాయిస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రజ్యోతి మురికిరాతలపై నిరసన వ్యక్తంచేసిన కాకాణిపై వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో రెండ్రోజుల వ్యవధిలో రెండు అక్రమ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ పెద్దల అసహనం.. చంద్రబాబు సర్కారు వైఫల్యాలు, అసమర్థత, ప్రజా వ్యతిరేక విధానాలను కాకాణి నిత్యం ప్రశ్నిస్తుండడాన్ని ప్రభుత్వ పెద్దలు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే అనేక అక్రమ కేసులు నమోదుచేసి 86 రోజుల పాటు జైల్లో నిర్బంధించి పైశాచికానందాన్ని పొందారు. అయితే కాకాణి జైలు నుంచి బయటకొచి్చనప్పటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుండడంతో జీర్ణించుకోలేని కూటమి నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి అక్రమ కేసులతో వేధింపులు కొనసాగిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న దు్రష్పచారంలో నిజమే గెలిచిందని.. అసత్య ప్రచారాలు, అర్థరహిత ఆరోపణలన్నీ అబద్ధాలని సీబీఐ నివేదిక ద్వారా తేటతెల్లమైందంటూ వైఎస్సార్సీపీ నేతలతో కలిసి మాగుంట లేఅవుట్లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో కాకాణి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో.. ⇒ కులమతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా కాకాణి వ్యాఖ్యలు చేశారంటూ దర్గామిట్ట పోలీసులకు టీడీపీ నేత ఒకరు తప్పుడు ఫిర్యాదు చేశారు. ⇒ అలాగే.. కోవూరు మండలంలో బాలిక మృతిచెందిన ఘటనలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారు. ఫలితంగా ఆయనపై కోవూరు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ⇒ హైదరాబాద్‌లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన తెలిపినందుకు అక్కడి పోలీసులూ కేసు నమోదుచేశారు. ⇒ తాజాగా.. వేదాయపాళెం పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. మరోవైపు.. కాకాణి కుటుంబ సభ్యులపైనా ప్రభుత్వ పెద్దలు కక్షసాధింపు చర్యలకు ఒడిగట్టారు. కోవూరు మండలంలో బాలిక మృతి విషయమై ఎక్స్ వేదికగా కాకాణి పూజిత స్పందించారు. మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలు, పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడంతో తట్టుకోలేకపోయారు. అంతే.. కోవూరు పోలీసులపై ఒత్తిడి తెచ్చి నోటీసులు పంపారు. ఇప్పుడు ఏబీఎన్ దుర్మార్గ రాతలను నిరసిస్తూ చేపట్టిన నిరసనలో పాల్గొన్న ఆమెపైనా వేదాయపాళెం పోలీసులు నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. ఈనెల 8న నెల్లూరు ఆంధ్రజ్యోతి ఎడిషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో నిరసన వ్యక్తంచేసిన కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై మర్నాడే ఆ పత్రికా సిబ్బంది ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. తాజాగా పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడితో ఓ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదుచేయడం గమనార్హం. అయితే, నిరసనలో వైఎస్సార్సీపీ నేతలు తమను తాకరాని చోట తాకారంటూ ఫిర్యాదు ఇవ్వాలని మహిళా పోలీసులపై ఒత్తిడి చేసినా.. అందుకు తాము సిద్ధంగాలేమని వారు ఖరాఖండిగా చెప్పినట్లు తెలిసింది. మిగతా పోలీసు సిబ్బంది సైతం ఇందుకు వెనక్కి తగ్గినా.. వేదాయపాళెం సర్కిల్ ఇన్స్పెక్టర్తో బలవంతంగా ఫిర్యాదు చేయించి కేసు నమోదుచేసినట్లు సమాచారం. -
సానుకూలంగా చర్చలు షురూ!
ఇస్లామాబాద్/లాహోర్/దుబాయ్: పశ్చిమాసియా లో యుద్ధానికి తెరదించి శాంతిని నెలకొల్పడమే ధ్యేయంగా వైరిపక్షాలైన అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలు శనివారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ మంతనాలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ స్టార్ హోటల్ వేదికగా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు ఆరంభమైనట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చరిత్రాత్మక చర్చల కోసం ఇస్లామాబాద్‌కు చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ శనివారం ఉదయం వేర్వేరుగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం సాయంత్రం అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. రెండు రౌండ్లు చర్చలు జరిగాయి. మరో దఫా చర్చలు జరగాల్సి ఉన్నట్లు సమాచారం. ఇప్పటిదాకా చర్చల్లో సాధించిన పురోగతి ఏమిటన్నది ఇరుపక్షాలు ఇంకా బయటపెట్టలేదు. ఆదివారం కల్లా స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. 1979 తర్వాత తొలి ప్రత్యక్ష చర్చలు అమెరికా, ఇరాన్ బృందాలు ఒకే బల్ల వద్ద కూర్చున్నాయని, చారిత్రాత్మక శాంతి చర్చలు ప్రారంభమయ్యాయని, తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుపక్షాలు ముఖాముఖిగా కలుసుకోవడం ఇదే మొదటిసారి అని పాకిస్తాన్ టీవీ తెలియజేసింది. అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, పశ్చిమాసియాలో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఉన్నారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్ నేతృత్వంలోని ఇరాన్ బృందంలో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతోపాటు ఇతర నాయకులు ఉన్నారు. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా, ఇరాన్‌ల మధ్య ఇవే తొలి ఉన్నతస్థాయి ప్రత్యక్ష చర్చలు కావడం గమనార్హం. అంతకుముందు ఇస్లామాబాద్‌కు చేరుకున్న అమెరికా, ఇరాన్ బృందాలకు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ఉప ప్రధాని ఇషాఖ్ దార్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, మంత్రి మొహిసిన్ రజా నఖ్వీ స్వయంగా స్వాగతం పలికారు. ఇరాన్ బృందానికి సైనిక దుస్తులు ధరించి, అమెరికా బృందానికి సూటు బూటు ధరించి అసిమ్ మునీర్ స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా, ఇరాన్ బృందాలతో షరీఫ్ భేటీ పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనాలని పాక్ ప్రధాని షెహబాజ్ ఆకాంక్షించారు. శాంతి సాధనకు తమ సహకారం ఉంటుందని పునరుద్ఘాటించారు. అమెరికా–ఇరాన్‌ల మధ్య సయోధ్యకు తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. అమెరికాతో చర్చల్లో పాల్గొనడానికి ఇస్లామాబాద్‌కు చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో శనివారం షెహబాజ్ వేర్వేరుగా సమావేశమయ్యారు. శాంతి యత్నాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాఖ్ దార్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహిసిన్ రజా నఖ్వీ తదితరులు పాల్గొన్నారు. శాంతి చర్చలకు ముందుకొచి్చన ఇరాన్ బృందాన్ని షెహబాజ్ షరీఫ్ అభినందించారు. ప్రాంతీయ ప్రయోజనాలు, ప్రపంచ శాంతి, సుస్థిరతల కోసం ఈ చర్చల్లో అర్థవంతమైన ఫలితాలను సాధించే దిశగా మధ్యవర్తిగా తమ పాత్రను చిత్తశుద్ధితో పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పాక్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగైతేనే ఒప్పందం కుదురుతుంది: రెజా అరెఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘అమెరికా ఫస్ట్’ సిద్ధాంతానికి అనుగుణంగా అమెరికా అధికారులు స్వదేశ ప్రయోజనాల కోసం కృషి చేస్తే అమెరికా–ఇరాన్ శాంతి చర్చల ద్వారా ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఇరాన్ ప్రథమ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రెజా అరెఫ్ పేర్కొన్నారు. అలా కాకుండా ‘ఇజ్రాయెల్ ఫస్ట్’ సిద్ధాంతానికి మద్దతిచ్చే ప్రతినిధులతో చర్చలు జరిగితే మాత్రం ఎలాంటి ఒప్పందం కుదరదని తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇస్లామాబాద్ చర్చలు విఫలమైతే ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగుతాయని, ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ డిమాండ్లు → హార్మూజ్ జలసంధిపై సంపూర్ణ ఆధిపత్యం మాకే ఉండాలి. అక్కడ నియంత్రణను వదులుకొనే ప్రసక్తే లేదు. → గల్ఫ్ దేశాల నుంచి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలి. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు ఉండడానికి వీల్లేదు. → ఇరాన్‌పై అమెరికాతోపాటు యూరప్ దేశాలు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి. యురేనియం శుద్ధి సహా అణు కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. → స్తంభింపజేసిన మా ఆస్తులను విడుదల చేయాలి. అమెరికా డిమాండ్లు → ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదు. → యురేనియం శుద్ధి ప్రక్రియను ఇరాన్ వెంటనే ఆపాలి. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించాలి. → హార్మూజ్ నుంచి స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలి. విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకోరాదు. చర్చలు విఫలమైతే కఠినంగా ప్రతిస్పందిస్తాం: ట్రంప్ అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు షెడ్యూల్ కంటే ఐదు గంటలు ఆలస్యంగా ఆరంభమయ్యాయి. కొన్ని అంశాలపై ఇరుపక్షాలు పట్టు వీడకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇస్లామాబాద్ చర్చలు ఎలా సాగుతాయో తనకు ఏమాత్రం అవగాహన లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చాలా తక్కువ సమయంలోనే ఇరాన్ చిత్తశుద్ధిని అంచనా వేస్తామని చెప్పారు. హార్మూజ్ జలసంధి త్వరలోనే తిరిగి తెరుచుకుంటుందని పునరుద్ఘాటించారు. ప్రత్యామ్నాయ చమురు రవాణా మార్గాలు కూడా అందుబాటులోకి వస్తాయని సంకేతాలిచ్చారు. ఇరాన్‌ను విఫలమవుతున్న దేశంగా అభివరి్ణంచారు. ఒకవేళ శాంతి చర్చలు ఫలించకపోతే తమ వైఖరిని పునఃసమీక్షించుకుంటామని చెప్పారు. అవసరమైతే మరింత కఠినమైన ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. -
ఇది పుచ్చుకో.. అది ఇచ్చుకో!.. రాజధాని పనుల్లో క్విడ్ ప్రో కో
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి కాంట్రాక్టు పనుల్లో మరో కోణం వెలుగుచూసింది. శాశ్వత సచివాలయంలో భాగంగా నిర్మిస్తున్న జీఏడీ టవర్ పనులను టెండర్లలో ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. కానీ.. ఆ టవర్‌ను డయాగ్రిడ్ స్ట్రక్చరల్ స్టీల్ విధానంలో తామే నిర్మిస్తున్నట్టు భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ సంస్థ వెల్లడించింది. టెండర్ నిబంధనల ప్రకారం 50 శాతం పనులను సీఆర్డీఏ అనుమతి తీసుకుని అధికారికంగా సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించవచ్చు. జీఏడీ టవర్ నిర్మాణంలో డిజైన్, స్ట్రక్చరల్ కనెక్షన్ ఇంజినీరింగ్, ప్రిసిసిన్ స్టీల్ ఫ్యాబ్రికేషన్, డయాగ్రిడ్ స్ట్రక్చరల్ పద్ధతిలో నిర్మించే పనులను తాము చేస్తున్నట్లు భీమా సంస్థ పేర్కొంది.అయితే.. ఇదే సంస్థ హైదరాబాద్‌కు సమీపంలో శామీర్‌పేట వద్ద సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్స్‌కు 6,205 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్(పీఈబీ) విధానంలో ఐస్‌క్రీమ్ ప్లాంట్ కోసం భవనాన్ని నిర్మించినట్టు తన వెబ్సైట్లో పేర్కొంది. ‘నీకిది.. నాకిది’లో భాగంగానే హెరిటేజ్ పుడ్స్‌కు ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీ ప్లాంట్‌ను సీహెచ్ సీతారాం మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న భీమా సంస్థ నిర్మించిందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.హెరిటేజ్‌కు ఐస్‌క్రీమ్ ప్లాంట్‌ను నిర్మించిన భీమాటెండర్లలో అధికారికంగా పనులు దక్కించుకున్న ఎన్సీసీ సంస్థకు వాటిని అప్పగించడానికి గతేడాది జూన్ 26న ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ నిబంధనల ప్రకారం సీఆర్డీఏ ఈఎన్సీ, సీఈలకు సమాచారం ఇచ్చి.. వారినుంచి అధికారిక అనుమతి తీసుకున్నాక 50 శాతం పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించవచ్చు. జీఏడీ టవర్ నిర్మాణ పనుల్లో భీమా సంస్థకు ఎంత పరిమాణంలో సబ్ కాంట్రాక్టు కింద అప్పగించామన్నది ఎన్సీసీ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. సీఆర్డీఏ ఈఎన్సీ, సీఈలు కూడా వెల్లడించలేదు.కానీ.. భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ సంస్థ మాత్రం తన అధికారిక వెబ్సైట్లో ఆ పనులు చేస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం. ఇదే సంస్థ సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్‌కు హైదరాబాద్‌కు సమీపంలోని శామీర్‌పేట్ వద్ద 98.5 మీటర్ల పొడవు, 63 మీటర్ల వెడల్పు, 18.2 మీటర్ల ఎత్తుతో పీఈబీ విధానంలో ఐస్‌క్రీమ్ ప్లాంట్ కోసం భవనాన్ని నిర్మించినట్టు భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. ఆ ప్లాంట్‌ను ఇటీవల సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి ప్రారంభించారు.నాడూ నేడూ ఒకే సంస్థ.. అంచనా వ్యయం భారీగా పెంపుముఖ్యమంత్రి, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో 1,04,815 చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతంతో చేపట్టే పనులకు 2018లో నిర్వహించిన టెండర్లలో రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. 2019 నాటికే రూ.32.90 కోట్ల విలువైన పనిని ఆ సంస్థ పూర్తి చేసిందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) 2023లో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అంటే.. జీఏడీ టవర్‌లో మిగిలిన పనుల విలువ రూ.521.16 కోట్లు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ కాంట్రాక్టును రద్దు చేసింది. ఆ పనుల కాంట్రాక్ట్ విలువ రూ.884.22 కోట్లుగా నిర్ణయించి.. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో 163.60 కోట్లను రీయింబర్స్ చేస్తామని పేర్కొంటూ గతేడాది టెండర్లు పిలిచింది.ఈ పనులను 4.53 శాతం అధిక ధర అంటే రూ.882.47 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచి ఎన్సీసీ సంస్థే తిరిగి దక్కించుకుంది. దానికి పన్నులు కలిపితే.. జీఏడీ టవర్ కాంట్రాక్టు విలువ రూ.1,046.07 కోట్లకు చేరుతుంది. అంటే.. నాటికీ నేటీకీ అంచనా వ్యయం రూ.524.91 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. అప్పుడూ ఇప్పుడూ ఒకే సంస్థ టెండర్లో పనులు దక్కించుకోవడాన్ని బట్టి చూస్తే గూడుపుఠాణీ కాకపోతే మరేమిటని ఇంజినీరింగ్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దీనిద్వారా కాంట్రాక్టర్‌కు భారీఎత్తున ప్రయోజనం చేకూర్చారని ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇవే అంశాలను వైఎస్సార్సీపీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. -
రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు
తమిళ సినిమా: సినీనటులు రజనీకాంత్, ధనుష్ ఇళ్లల్లో బాంబులు పెట్టినట్లు వచి్చన ఫోన్ కాల్ అలజడి రేపింది. పోలీసులను పరుగులు పెట్టించింది. చివరికి ఎలాంటి అనుమానిత వస్తువులు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆగంతకుడి నుంచి వచి్చన ఫోన్ కాల్ బెదిరింపేనా.. కుట్ర ఏమైనా దాగి ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. రజనీకాంత్, ధనుష్ ఇళ్లల్లో బాంబులు పెట్టినట్టు శనివారం ఉదయం చెన్నై కమిషనర్ కార్యాలయం సమీపంలోని పోలీస్బూత్కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో తేనాంపేట పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోయెస్ గార్డెన్‌లోని నటులు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో తనిఖీలు చేశారు. వారి ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో అనుమానించదగ్గ వస్తువులు ఏమీ లభించలేదు. బెదిరింపు కాల్ చేసిన అగంతుకుడి గురించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నటులు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో ఒకేసారి బాంబు బెదిరింపులు రావడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. -
నీరు-మీరు కిడ్నీ-డీ–హైడ్రేషన్...బ్లడ్ రిలేషన్
ఇటీవల వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటున్నాయి. ఉష్ణోగ్రతలను కొలిచే మెర్క్యూరీ స్కేలుపై ఎండ తీవ్రత పైపైకి ఎగబాకుతోంది. ఎండ తీవ్రత ఎక్కువవుతున్న కొద్దీ దేహంలోని కొన్ని కీలక అవయవాల మీద ‘డీ–హైడ్రేషన్ స్ట్రెస్’ కూడా పెరుగుతూ పోతుంది. అందులో మరింత కీలకమైనవి మన మూత్రపిండాలు. అందుకే మిగతా సీజన్లతో పోలిస్తే వేసవిలో కిడ్నీ సమస్యలతో హాస్పిటల్స్‌కు వచ్చే వారి సంఖ్య మరింత పెరుగుతుంటుంది. ఈ ఏడాది కూడా అందుకు మినహాయింపు కాదు. అయితే ఇక్కడ కాస్త సమస్య ఏమిటంటే... వేసవి తీవ్రతవల్ల... దాంతో కలిగే డీ–హైడ్రేషన్ కారణంగా కిడ్నీపై పడే ఒత్తిడి అంత త్వరగా గుర్తించడానికి కుదరదు. అందుకే ఎండ్ ఆర్గాన్ అయిన మూత్రపిండాలపై పడే దుష్ప్రభావాల గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరూ వేసవిలో కిడ్నీ ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే చేయాల్సినవీ, తెలుసుకోవాల్సినవి ఏమిటో చూద్దాం.కిడ్నీలు దేహంలోని నీరు, అందులోని అనవసర లవణాలూ, విషాలూ (టాక్సిన్స్) వంటి వాటిని వడబోసి, వ్యర్థాలను బయటకు పంపుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వాటితో ఖనిజ లవణాలను తిరిగి దేహానికే పంపించడం ద్వారా ఎలక్ట్రొలైట్ బ్యాలెన్స్ అనే కీలకమైన బాధ్యతలను నెరవేరుస్తుంటాయి. ప్రతికూల ప్రభావం చూపే ఎండ తీవ్రత... ఎవరైనా వ్యక్తి ఎండ తీవ్రత తాలూకు అధిక ఉష్ణోగ్రతలకు అదేపనిగా చాలాసేపు ఎక్స్పోజ్ అవుతూ ఉన్నప్పుడు అతడి దేహం నుంచి చెమట రూపంలో చాలా ఎక్కువ ద్రవాలను కోల్పోతుంటాడు. అలా అతడు కోల్పోయిన ద్రవాలను తిరిగి భర్తీ చేయకపోతే రక్తం కొంత చిక్కబడిపోవడంతో రక్తప్రవాహం అంత సాఫీగా ప్రవహించకపోవచ్చు. దాంతో కిడ్నీలకు తగినంత రక్తం అందక వాటిపై కొంత ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కిడ్నీ పనితీరు కాస్తంత కుంటుపడే అవకాశముంటుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ (ఏకేఐ) అంటారు.ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ... పెరిగే ఏకేఐ, కిడ్నీ స్టోన్స్ల ముప్పు... ఎండతీవ్రతకు ఎంతగా ఎక్స్పోజ్ అవుతుంటే... అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ ముప్పు అంతగా పెరుగుతుంది. వాతావరణంలో వేడిమి పెరుగుతున్న కొద్దీ కిడ్నీపై దాని దుష్ప్రభావాలు కనీసం 20% నుంచి 30% వరకు పెరుగుతుంటుంది. అంతేకాదు... కిడ్నీలో రాళ్లు, మూత్రంలో ఇన్ఫెక్షన్లు (యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ – యూటీఐ)ల ముప్పు కూడా పెరుగుతుంది. అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ సమస్య చాలాకాలం పాటు కొనసాగితే అది క్రానిక్ కిడ్నీ డిసీజ్–సీకేడీ వంటి తీవ్రమైన సమస్యకు దారితీసే ముప్పూ ఉంటుంది.రాళ్లు ఎందుకు పెరుగుతాయంటే... దేహంలో నీటి మోతాదులు తగ్గగానే లవణాల గాఢత పెరుగుతుంది. దాంతో లవణాలు రాళ్లలా మారతాయి. అందుకే దేహంలో నీటి మోతాదులు తగ్గుతున్న కొద్దీ కిడ్నీలో రాళ్లు వచ్చే ముప్పు పెరుగుతుంది.యూటీఐలు మహిళల్లో ఎక్కువ... కిడ్నీ ఇంజ్యూరీ కేసులు పురుషుల్లో ఎక్కువ... దేహ నిర్మాణపరంగా (అనటామికల్గా) చూసినప్పుడు పురుషులతో పోలిస్తే మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ పొడవు కాస్త తక్కువగా ఉండటం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు (యూటీఐలు) మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే కిడ్నీ ఇంజ్యూరీ కేసులు మాత్రం పురుషుల్లోనే ఎక్కువ. (మొత్తం కేసుల్లో దాదాపు 65% నుంచి 75%వరకు పురుషులవే).ఈ లక్షణాలను గమనిస్తూ ఉండాలి... మునపటి కంటే మూత్రం తక్కువగా వస్తుండటం, మూత్రం చాలా చిక్కటి రంగు (డార్క్ కలర్)తో రావడం, ముఖం/కాళ్లలో వాపు, తీవ్రమైన అలసట (ఫెటీగ్), ఏదీ తినలేకపోవడం, మూత్రవిసర్జనలో నొప్పి / ఇబ్బంది వంటి లక్షణాలు తగ్గకుండా అదేపనిగా కొనసాగుతూ ఉన్నప్పుడు డాక్టర్‌ను కలవడం మంచిది.నివారణ కోసం... అది అక్యూట్ కిడ్నీ ఇంజ్యురీ (ఏకేఐ) సమస్య అయినా, కిడ్నీలో రాళ్లు లేదా మూత్రంలో ఇన్ఫెక్షన్ల సమస్య అయినా... దేహం కోల్పోయిన నీటి మోతాదును ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండటమే నివారణ. ఇందుకోసం తగినన్ని నీళ్లు తాగుతూ ఉండటంతో పాటు వీలును బట్టి కొబ్బరినీళ్లు, పండ్లరసాలు, కొద్దిగాఉప్పుతో నిమ్మరసాలు వంటి ద్రవాహారాలు తీసుకుంటూ ఉండాలి. డాక్టర్ సలహా లేకుండా నొప్పినివారణ మాత్రలు (పెయిన్ కిల్లర్స్) వాడకూడదు. ఇక కిడ్నీ సమస్య ఉన్నవారైతే ఎట్టిపరిస్థితుల్లో వాటిని వాడకపోవడమే మంచిది. తప్పనిసరిగా వాడాల్సివస్తే డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి. డా‘‘ రవికుమార్ ఎ.వి.సీనియర్ కన్సల్టెంట్యూరాలజిస్ట్ –కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్∙తెలుసుకుందాం55% ప్లాస్మా... ఇందులో లవణాలు, ప్రోటీన్లు, ఇమ్యూనోగ్లోబ్యులిన్లు ఉండి ప్రాణాలను రక్షించే వ్యాధి నిరోధక వ్యవస్థ తాలూకు కణాలను కలిగి ఉంటాయి.కాంపోనెంట్లు... వాటి ఉపయోగాలు... 90% రక్తంలోని 90 శాతంలో నీరే ఉంటుంది.45% ఫార్మ్డ్ ఎలిమెంట్లు ఇందులో ఎర్రరక్తకణాలు (ఆర్బీసీ), తెల్లరక్తకణాలు (డబ్ల్యూబీసీ), ప్లేట్లెట్స్ ఉంటాయి. ఆ వేర్వేరు కాంపోనెంట్‌లలోని పదార్థాలూ విధులవి...1,50,000 నుంచి 4,00,000ప్లేట్లెట్లు శరీరానికి ఏదైనా గాయం తగిలి, రక్తస్రావం జరుగుతుంటే రక్తాన్ని గడ్డకట్టించడం ద్వారా ప్రాణరక్షణ కలిగించే కీలకమైన కణాలు. వీటి సంఖ్య ప్రతి క్యూబిక్ మిల్లీమీటర్‌కు (ఎమ్ఎమ్ క్యూబ్‌కు 1,50,000 నుంచి 4,00,000 ఉండాలి. వీటి సంఖ్య తగ్గుతున్న కొద్దీ అంతర్గత రక్తస్రావం జరగవచ్చు. లేదా గాయం తగిలినప్పుడు ఎంతకీ రక్తం గడ్డకట్టక అలా రక్తస్రావం జరుగుతూ పోయి ప్రాణాపాయం కలగవచ్చు.8% సాల్ట్స్, హార్మోన్లు, ప్రోటీన్లు, బైకార్బొనేట్ అయాన్లు ఉంటాయి. ఇందులో లవణాల అయాన్లతోనే మెదడునుంచి వచ్చే ఆదేశాలు వివిధ అవయవాలకు చేరుతుంటాయి. హార్మోన్లు కీలకమైన జీవక్రియలు నిర్వహిస్తుంటాయి. ఇక బైకార్బొనేట్ అయాన్లు వివిధ రకాల ఆమ్ల, క్షార పదార్థాలను విరిచేసి, మామూలుగా చేస్తాయి. (న్యూట్రలైజ్ చేస్తాయి).4.3 నుంచి 5.9 మిలియన్లు పురుషుల్లో ఉండాల్సిన నార్మల్ ఎర్రరక్తకణాలు 4.3 నుంచి 5.9 మిలియన్స్ పర్ ఎమ్ఎమ్ క్యూబ్... అలాగే మహిళల్లోనైతే 3.5 నుంచి 5.5 మిలియన్స్ పర్ ఎమ్ఎమ్ క్యూబ్ ఉండాలి. దీని కంటే ఎర్రరక్తకణాల్లో హీమోగ్లోబిన్ మోతాదులను తెలుసుకోవడం అవసరం అది పురుషుల్లో ప్రతి డెసీలీటర్‌కు 13.5 నుంచి 17.5 గ్రాములూ, ప్రతి డెసిలీటర్కు మహిళల్లో 12.0 నుంచి 16.0 గ్రాములు ఉండాలి. ఇదే రక్తాన్ని ఎర్రగా కనిపించేలా చేస్తూ, జీవకణాలన్నింటికీ ఆక్సిజన్‌ను చేరవేస్తుంటుంది. అలాగే వెలువడే వ్యర్థాలు, కాలుష్యాలను బయటకు చేరవేసేవి కూడా ఆర్బీసీనే.4,500 నుంచి 11,000తెల్లరక్తకణాలు ప్రతి క్యూబిక్ మిల్లీమీటర్ (ఎమ్ఎమ్)లో 4,500 నుంచి 11,000 ఉండాలి. మన శరీరాన్ని బయటి నుంచి దాడి చేసే సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్ల నుంచి కాపాడే రక్షణ కణాలు ఈ తెల్లరక్తకణాలే. ఇందులో మళ్లీ ఐదు రకాల కణాలుంటాయి. అవి... ∙న్యూట్రోఫిల్స్ : ఇవి శరీరాన్ని బ్యాక్టీరియా, ఫంగైలనుంచి రక్షిస్తాయి. ∙లింఫోసైట్స్ : ఇవి కొన్ని రకాల వైరస్ల నుంచి, క్యాన్సర్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ∙మోనోసైట్స్ : చెడిపోయిన కణాలను నిర్మూలించి, ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులనుంచి ఇవి మన శరీరాన్ని కాపాడతాయి. ∙ఇజినోఫిల్స్ : ఇవి కొన్ని రకాల పరాన్న జీవుల నుంచి, కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ∙బేసోఫిల్స్ : ఇవి అలర్జీల నుంచి రక్షణ కలిగిస్తాయి.రక్తం నిర్వహించే విధులివి...→ ఆహారం జీర్ణమై అది గ్లూకోజ్‌గా మారాక అన్ని కణాలకూ దాన్ని అందించడానికి రక్తం తోడ్పడుతుంది. గ్లూకోజ్‌తో పాటు అమైనోయాసిడ్స్, ఫాటీయాసిడ్స్నూ కణాలన్నింటికీ అందజేస్తుంది. → రక్తంలోని గ్లూకోజ్ వల్ల శరీరంలో శక్తిని ఇచ్చే జీవక్రియలు జరుగుతాయి. దీన్నే మెటబాలిజమ్ అంటారు. ఈ క్రమంలో కార్బన్–డై–ఆక్సైడ్, యూరియా, లాక్టిక్ యాసిడ్ వంటి కొన్ని కాలుష్యాలు, వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని శుభ్రపరిచేందుకు ఉద్దేశించిన మూత్రపిండాల వంటి అవయవాల వద్దకు ఆ వ్యర్థాలను చేరవేసేది కూడా రక్తమే. రక్తంలోని తెల్లరక్తకణాలు బయటి నుంచి శరీరంలోకి ప్రవేశించే రోగకారక క్రిములతో పోరాడి, మనకు వ్యాధినిరోధకతను కల్పిస్తాయి. ఈæ కీలకమైన కార్యకలాపాలన్నీ నిత్యం జరగాల్సి ఉంటుంది కాబట్టే... ఏదైనా ప్రమాదం జరిగి రక్తస్రావం అవుతుంటే, దాన్ని కట్టడి చేయడానికి మన శరీరం కృషి చేస్తుంది. రక్తస్రావం మొదలుకాగానే రక్తం చుట్టూ ఒక వల లాంటిది ఏర్పడి రక్తం గడ్డకట్టి, స్రావాన్ని ఆపేందుకు ప్లేట్లెట్స్ తోడ్పడతాయి.డాక్టర్ బోయెళ్ల పవన్ కుమార్సీనియర్ హెమటాలజిస్ట్ – మెడికల్ ఆంకాలజిస్ట్నిర్వహణ: యాసీన్ -
అమరావతి x మావిగన్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ ఆలోచననుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం చంద్రబాబు అండ్ కో ఎన్ని డైవర్షన్ కుట్రలు చేసినా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది. ఆచరణ సాధ్యం కాని అమరావతి గురించి, మావిగన్ ప్రయోజనాల గురించి జనం బేరీజు వేసుకుంటున్నారు. ప్రజా రాజధానిగా అభివృద్ధి చేసుకునేందుకు మావిగన్ అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతమని వ్యాఖ్యానిస్తున్నారు. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు పట్టణాలను కలిపి మహానగరంలా మార్చుకునేందుకు, మంచి రాజధానిగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశముందని అంటున్నారు.. తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతోనే ఇది సాధ్యమవుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. మావిగన్‌తో వచ్చే అవకాశాలు, ఉద్యోగాల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. 10 రోజులుగా రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. మావిగన్‌తో వచ్చే ప్రయోజనాల గురించి స్పష్టంగా వివరించిన వైఎస్ జగన్ అమరావతిపై అనేక ప్రశ్నలనూ సంధించారు. జగన్ అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన చేశారని జనం అంటున్నారు. మావిగన్‌కు ప్రజల నుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతుండడంతో సీఎం చంద్రబాబు కంటికి కునుకు కరువయ్యింది. ఎల్లో మీడియా సహకారంతో, మందీ మార్బలం ప్రోద్బలంతో మావిగన్ నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎల్లో మీడియాలో మరణ మృదంగం కథనాలు వస్తున్నాయి. వైఎస్ మరణానికి జగనే కారణమనే దిగజారుడు రాతలకు ఎల్లో పత్రికలు దిగజారాయి. చంద్రబాబు ఉసిగొల్పడంతోనే ఆయన మెప్పుకోసం చుట్టూ ఉన్న వందిమాగధ బృందాలు గార్దభాల్లా గొంతు విప్పుకుని ఓండ్రపెడుతున్నాయి. అసలు నరహంతక చరిత్ర చంద్రబాబుదే కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్, వంగవీటి రంగా, చివరకు పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్, తమ్ముడు రామ్మూర్తినాయుడి వరకు ఏ మరణాన్ని చూసినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చంద్రబాబువైపే వేళ్లన్నీ చూపిస్తాయన్న సంగతి తెల్సిందే.. అవేవీ ప్రజలకు తెలియవన్నట్లుగా ఉంది ఈ ఎల్లో సిండికేట్ వీరంగం చూస్తుంటే.. మావిగన్ అంటే వీళ్లెంత భయపడుతున్నారో ఈ డైవర్షన్ రాజకీయాలను చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు. మొదట మావిగన్ అంటే జోక్ అన్నారు.. ప్రజల్లో మద్దతు పెరుగుతుండడంతో ఆ తర్వాత అది సీఆర్డీఏ పరిధిలోనే ఉంది అంటున్నారు.. ఎవరేమన్నా ప్రజలు మాత్రం మావిగన్ ప్రజా రాజధాని అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అమరావతి ప్రచారం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవన్న విషయం అందరికీ అర్థమవుతోంది.. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణాత్మకమైన మావిగన్.. చంద్రబాబు ఆచరణసాధ్యం కాని ఊహాజనితమైన అమరావతిని పోల్చుకుంటూ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తొలి రోజు నుంచే పరుగులుఇప్పటికే అన్ని మౌలికవసతులు ఉండి 110 కి.మీ జాతీయ రహదారులు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి–తాడేపల్లి వంటి నాలుగు కార్పొరేషన్లతో పాటు ఉయ్యూరు, తాడిగడప వంటి మరో రెండు మున్సిపాల్టీలు కలిగి ఉన్న మావిగన్ ప్రాంతానికి రాజధానిగా తొలి రోజునుంచే పరుగులు పెట్టే శక్తి ఉందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 60 లక్షలకుపైగా జనాభా ఉండటం, వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతుండడం వల్ల ఈ ప్రాంతం వేగవంతమైన గ్రోత్ ఇంజన్‌గా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అదే అమరావతి రాజధాని అయితే జనాభా లేని ఈ ప్రాంతంలో విద్యుత్ లైన్లు, రహదారులు, మురికి కాలవలు దగ్గర నుంచి కొత్తగా నిర్మించుకోవాల్సి వస్తుందని, లక్ష ఎకరాల్లో వీటి నిర్మాణం పూర్తి చేయడానికి చాలా సుదీర్ఘ సమయం పడుతుందంటున్నారు. మావిగన్‌లో అన్ని మౌలికవసతులు ఉండటంలో తొలిరోజు నుంచే రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అదే అమరావతి విషయానికి వస్తే ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదంటున్నారు. ఆచరణసాధ్యం కాని అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్రానికి అసలు రాజధానే లేకుండా చేస్తున్నాడని విమర్శకులంటున్నారు.అమరావతికి ఎన్ని లక్షల కోట్లు అవసరమవుతాయో?అమరావతిలో రోడ్లు వేయడానికి, కరెంట్ ఇవ్వడానికి, డ్రైనేజీ వ్యవస్థ, నీళ్లు వంటి బేసిక్ వసతులు కల్పించడానికి ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు ప్రభుత్వమే సెంట్రల్ గవర్నమెంట్‌కు, బ్యాంకులకు ఇచ్చిన డీపీఆర్‌లలో స్పష్టంగా పేర్కొంది. ఈ లెక్కన చూసుకుంటే తొలి దశలో 50 వేల ఎకరాలకే లక్ష కోట్లు, ఇప్పుడు రెండో దశ కింద సేకరిస్తున్న మరో 50 వేల ఎకరాలు కలుపుకుంటే మొత్తం లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు కేవలం రోడ్లు వేయడం, కరెంట్, డ్రైనేజీ పనులకే అవసరం అవుతాయి. వీటన్నింటినీ పూర్తి చేయడానికి చాలా దశాబ్దాలు పట్టే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఉన్న రూ. 2లక్షల కోట్ల అంచనా వ్యయం విలువ ఏళ్లు గడిచేకొద్దీ రూ.4 లక్షల కోట్లు అవుతుందో, రూ. 10 లక్షల కోట్లు అవుతుందో తెలియదు. అదే మావిగన్‌లో అయితే ఇందులో కేవలం పదోవంతు అంటే సుమారు రూ.20,000 కోట్లు ఖర్చు చేస్తే చాలు ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేసుకుని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడగలమని నిపుణులంటున్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ కాదని, రానున్న కాలంలో రాష్ట్రానికి ఆర్థిక గుదిబండగా తయారయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.అందుబాటులో అన్ని మౌలిక వసతులుమావిగన్ పూర్తిగా జాతీయ రహదారులు, రైల్వేలైన్లతో అనుసంధానించి ఉండటం వేగంగా వృద్ధి చెందడానికి ప్రధానంగా కలిసివచ్చే అంశం. 110 కి.మీ పైగా ఆరులైన్ల జాతీయ రహదారులు ఉండటమే కాకుండా, దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే విజయవాడలోని అతిపెద్ద రైల్వే జంక్షన్‌తో పాటు గుంటూరు రైల్వే జంక్షన్ ఉన్నాయి. అదే అమరావతి పూర్తిగా ఒక మారుమూల ప్రాంతంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ప్రధాన రహదారులకు అనుసంధానించడానికి ప్రత్యేకంగా రహదారులు, రైల్వే లైన్లు నిర్మించాలి. ఇందుకోసం వేల కోట్లు వ్యయం చేయాల్సి రావడం లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి పెద్ద గుదిబండగా మారుతుందని ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. పోర్టు, ఎయిర్‌పోర్టు, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు వంటి అన్ని కీలక మౌలికవసతులు మావిగన్‌లో ఉండటంతో ఎటువంటి అదనపు వ్యయాలు లేకుండా తొలి రోజు నుంచే పెద్ద నగరాలతో పోటీపడ వచ్చంటున్నారు.పోర్టు నగరాల్లో శరవేగంగా అభివృద్ధిచెన్నై సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం.. ముంబైకి సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం వల్లే భారీ ఎత్తున పెట్టుబడులు తరలిరావడంతో ఆ నగరాలు స్వల్ప కాలంలోనే మహానగరాలుగా రూపాంతరం చెందాయని.. వాటితరహాలోనే మావిగన్ కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు రాజధాని ప్రాంతానికి మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తే లాజిస్టిక్స్ వ్యయం తగ్గడమే కాకుండా ఇది ఎగుమతులు దిగుమతులతో ప్రధాన ఆర్థిక వాణిజ్య కేంద్రంగా వేగంగా ఎదుగుతుందంటున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సాగరమాల పథకం కింద మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారులు, రైల్వేలైన్లతో అనుసంధానించే విధంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది.. నౌకాశ్రయం, విమానాశ్రయం సమీపంలోనే ఉండటం వల్ల ఎగుమతులు, దిగుమతులకు అత్యంత అనువైన ప్రాంతం ఇది. ఐటీ వంటి స్మార్ట్ ఇండస్ట్రీస్‌తోపాటు భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాలు అత్యంత అనుకూలమైనవని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్‌ను రాజధానిగా ప్రకటించి.. అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి పోటీలుపడటం ఖాయమంటున్నారు. అదే అమరావతి విషయానికి వస్తే మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 5,000 ఎకరాలు కేటాయించడంతోపాటు వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు. -
జైలుకెళ్లడానికైనా సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను జైలుకెళ్లడానికైనా సిద్ధమని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. శనివారం మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ సాధన కోసం తాను చేసిన ప్రజా పోరాటంలో 6 నెలల జైలు శిక్ష పడటం ఉత్తరాంధ్ర ప్రజల పట్ల తనకున్న నిబద్ధతకు నిదర్శనమని.. దీనిని తాను గర్వకారణంగా భావిస్తున్నానని చెప్పారు. తాను చేసిన ఆమరణ నిరాహార దీక్షపై కోర్టు తీర్పును గౌరవిస్తూనే.. ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు.ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తానని.. కానీ విశాఖ హక్కుల కోసం పోరాటం మాత్రం ఆపేది లేదన్నారు. వాల్తేరు డివిజన్లో అత్యధిక ఆదాయాన్నిచ్చే కేకే లైన్‌ను ఒడిశాలోని రాయగడ డివిజన్లో కలుపుతుంటే.. కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న కూటమి మంత్రులు, ఎంపీలు నోరు మెదపకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. చంద్రబాబుకు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఉన్న శ్రద్ధ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మీద, భోగాపురం ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ రోడ్డు మీద ఎందుకు లేదని నిలదీశారు. ఓర్వలేకే డైవర్షన్ పాలిటిక్స్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అమర్నాథ్ మండిపడ్డారు. చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ.. మిగిలిన ప్రాంతాలపై కక్ష ఉన్నాయన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన మావిగన్‌ను ప్రజలు స్వాగతిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నారు. షర్మిల తీరు చూస్తుంటే కాంగ్రెస్ భావజాలం కంటే.. బాబు సారూప్యత భావజాలంతోనే పనిచేస్తున్నట్టు కనిపిస్తోందని చెప్పారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఆమె మాట్లాడుతున్నారన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య ఉన్నారు. -
వైఎస్సార్సీపీ శ్రేణులపై లాఠీచార్జ్
ఆమదాలవలస: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో శనివారం శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ నిరసనకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమదాలవలసలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.అక్కడి నుంచి పట్టణంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు బయలుదేరగా, ఆమదాలవలస సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో 50 మందికి పైగా పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కదలడానికి వీల్లేదని హెచ్చరించారు. తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తామంటూ ముందుకు కదలిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు రెచ్చిపోయి లాఠీచార్జ్ చేశారు.ఇష్టారీతిన లాఠీలతో బాదారు. దీంతో పొందూరు మండలానికి చెందిన వైఎస్సార్సీపీ చేనేత విభాగం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఆమదాలవలస మున్సిపాలిటీ బొడ్డేపల్లిపేటకు చెందిన సింగూరు రమేష్, బొడ్డేపల్లి రమణమూర్తి తదితరులు గాయపడ్డారు. వీరితోపాటు మరికొందరికి కూడా గాయాలయ్యాయి. చింతాడ రవికుమార్, మరికొందరు నాయకులను లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించి సరుబుజ్జిలి స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు ప్రయత్నించినా పోలీసులు అడ్డుకుని దాడి చేయడం దుర్మార్గమని చింతాడ రవికుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
గ్యాస్ సిలిండర్‌తో భర్తపై దాడి.. ప్రియుడితో కలిసి కుట్ర
కర్ణాటక: తప్పటడుగులతో భార్యాభర్తల సంబంధాలు అవహేళనకు గురవుతున్నాయి. ఎవరో ఒకరు పరుల వ్యామోహంలో చిక్కుకుని రక్తపాతానికీ వెనుకాడడం లేదు. ఇదే మాదిరిగా తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆగ్రహించిన భార్య తన ప్రియునితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన బెళగావి నగరంలో తిళకవాడి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఆయుర్వేద వైద్యుడు అవినాశ్ సుప్పన్న (40) హత్యకు గురైన వ్యక్తి. ఈ కేసులో ఇతని భార్య లక్ష్మి (29), ఆమె ప్రియుడు కైలాస బాలక్రిష్ణ (43) అరెస్టయ్యారు. గ్యాస్ సిలిండర్‌తో బాది.. వివరాలు.. అవినాశ్ 5న తన ఆయుర్వేదిక్ కేర్ సెంటర్లో తలకు తీవ్ర గాయమై చనిపోయాడు. మృతిపై అనుమానాలున్నాయని అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య మాత్రం అధిక బీపీ వల్ల కిందపడి చనిపోయి ఉంటాడని నమ్మబలికింది. కేసు నమోదు చేసుకున్న తిళకవాడి పోలీసులు సీసీ కెమెరాల చిత్రాలు, ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేసి కనిపెట్టారు. లక్షి్మ, బాలక్రిష్ణ మధ్య అక్రమ సంబంధం ఉండగా, ఇది తెలిసి అవినాశ్ భార్యను మందలించాడు. బాలక్రిష్ణ వీరి ఇంటికి దగ్గరిలోనే ఓ మొబైల్ఫోన్ల షాప్ నడిపేవాడు. తమ సంతోషానికి అడ్డుగా ఉన్న అతన్ని తొలగించుకోవాలని భార్య, ప్రియుడు నిర్ణయించారు. అవినాశ్ తన క్లినిక్‌లో ఉండగా, పథకం ప్రకారం బాలక్రిష్ణ చొరబడి అక్కడి గ్యాస్ సిలిండర్‌తో తలపై, గుండెల మీద బలంగా కొట్టి హత్య చేసి వెళ్లిపోయాడని పోలీస్ కమిషనర్ భూషణ్ బోర్సే తెలిపారు. లక్ష్మి తనకు ఏం తెలీదని బుకాయించినా పొంతనలేని సమాధానాలు ఇస్తుండడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నిజం బయటకు వచ్చింది. నిందితులను అరెస్టు చేశారు. ఈ సంఘటన బెళగావిలో తీవ్ర సంచలనం కలిగిస్తోంది. -
మొక్కల పేరుతోనూ మంత్రి నారాయణ మేత
నెల్లూరు రూరల్: నెల్లూరు నగరపాలక సంస్థలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని.. మొక్కుబడిగా మొక్కలు నాటి ఏకంగా రూ.60 కోట్ల ప్రజాధనం కొల్లగొడుతున్నారని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. 48 వేల మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డులు, నీరుపోసే పేరుతో మంత్రి నారాయణ ఒక్కో మొక్కకు ఏకంగా రూ.12,500 ఖర్చు చేస్తూ.. రూ.60 కోట్ల నిధులు మేసేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్కో మొక్కకు చేసిన ఖర్చు కేవలం రూ.750 మాత్రమేన్నారు. శనివారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నెల్లూరులో మొక్కల నాటే కార్యక్రమం పేరుతో భారీ దోపిడీకి మంత్రి నారాయణ వ్యూహరచన చేశారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఉపయోగపడని పనులతో యథేచ్ఛగా ప్రజాధనాన్ని దోచేస్తున్నారని మండిపడ్డారు.టీడీపీ నేతలకే కాంట్రాక్టులిచ్చి .. నగరంలో తొలి విడతలో 14,741 మొక్కలకు సంబంధించి టీడీపీకి చెందిన 25 మంది కాంట్రాక్టర్లకు అనుమతులిచ్చారని, మొదటి విడతలో నాటిన చెట్లకు రూ.8.03 కోట్లు చెల్లించారని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఒక్కో మొక్క నాటి దానికి ట్రీగార్డు ఏర్పాటు చేసేందుకు రూ.5,500 ఖర్చుచేస్తే.. ఒక డివిజన్లో 1,800 మొక్కలకు నీళ్లు పోయడానికి రూ.1.24 కోట్ల కేటాయించారన్నారు. ఈ లెక్కన ఒక్కో మొక్కకు నీరు పోసేందుకే రూ.6,888 ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విధంగా ఒక్కొక్క మొక్కకు దాదాపు రూ.12,500 పైగా ఖర్చు చేస్తున్నట్టు అర్థమవుతోందన్నారు.మంత్రి నారాయణ కేవలం 12 అడుగుల రోడ్డులో ఇరువైపులా మొక్కలు నాటిస్తున్నారని, ఈ మొక్కలకు రెండు నెలలే ఆకులు, పూలు ఉంటాయని, ఆక్సిజన్, నీడను ఇవ్వని ఇలాంటి చెట్ల వల్ల ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. సిమెంట్ రోడ్డును కట్‌చేసి మొక్కలు నాటుతున్నట్టు టెండర్లలో పేర్కొంటూ గ్రావెల్ రోడ్డులో నాటుతున్నారన్నారు. బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా ప్రైవేట్ స్థలాల్లో నాటిన మొక్కలకు మెష్ ఏర్పాటు చేసి బిల్లులు పెట్టుకున్నారని చెప్పారు. ఎవరైనా వర్షాకాలం సమీపిస్తున్నప్పుడు మొక్కలు నాటుతారని.. నారాయణ మాత్రం బిల్లులు వస్తే చాలన్నట్టు మండే ఎండల్లో నాటిస్తున్నారని ధ్వజమెత్తారు.మరో వైపు పన్నుల పేరుతో నగర వాసులను వేధిస్తున్నారని, టేబుల్‌పై కోడి గుడ్లు అమ్మకుంటున్న చిరు వ్యాపారిని ఆక్రమణ పేరుతో పెనాల్టీ వేశారని, ఒక దగ్గర నేమ్ బోర్డు ఒక అడుగు ముందుకొస్తే పెనాల్టీ వేశారని, ఇంకా పేదలు నివసించే ఏరియాలో నీటిబిల్లు రూ.350 కట్టలేదని పైప్‌లైన్ కట్ చేసి డమ్మీలు పెట్టారని వివరించారు. ‘ఎన్’ టీమ్‌తో దోపిడీకి మాస్టర్ ప్లాన్ అవినీతి, దోపిడీ విషయాల్లో నారాయణ ‘మాస్టార్’ ప్లాన్ సక్సెస్‌గా కొనసాగుతోందని చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి నారాయణ ఏర్పాటు చేసుకున్న ‘ఎన్’ టీమ్ దోచుకుతింటోందన్నారు. స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే.. పెయింటింగ్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, బయోటాయ్‌లెట్, చెత్తను తరలించే ట్రాక్టర్లు, సిల్ట్ క్లీనింగ్, దోమల నివారణ, ఎండ్ టు ఎండ్ రోడ్, ప్యాచ్‌వర్కులు ఇలా అన్నింట్లోనూ రూ.వందల కోట్ల పనులు నామినేటెడ్ కింద తన వారికి ఇప్పించి దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికే జాఫర్ సాహెబ్ కెనాల్, వీఆర్ కాలేజీ అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకుకొచ్చామని చెప్పారు. -
రాజా విజిల్ వేస్తే అది పాటైపోవులేరా!
‘ఈ కాలపు కుర్రవాళ్లు అన్నింటికీ విజిల్స్ వేస్తున్నారు. ఎదుటివాళ్ల గొప్పతనాన్ని విజిల్ వేసి చెబుతున్నారు. కాని ఎదుటి వారు మీ గురించి విజిల్ వేసేలా మీరు ఎదగాలి. నేనొకసారి విజిల్ వేశాను. అది నన్నే గొప్పగా నిలబెట్టింది’ అన్నారు ఇళయరాజా ఇటీవలి హైదరాబాద్ ప్రదర్శనలో! ఆయన విజిల్ ఎప్పుడు వేశారు? అది ఎలా ఆయనను గొప్పగా నిలబెట్టింది? చదవండి...ఇళయరాజా ఇటీవల జరిగిన హైదరాబాద్ మ్యూజికల్ నైట్‌లో కుర్రకారును ఉద్దేశిస్తూ ఒక అనుభవం పంచుకున్నారు. కచ్చేరి జరుగుతుండగా ప్రేక్షకుల్లోని కొందరు యువకులు అదేపనిగా విజిల్స్ వేస్తుంటే విని ‘మీ విజిల్స్ని వేస్ట్ చేయకండి. మీరు విజిల్ వేస్తే అదొక గొప్ప సందర్భం కాగలగాలి’ అంటూ తన జీవితంలో జరిగిన ఒక ఘటన చెప్పారు.‘1984లో నాకు ఆపరేషన్ (హెర్నియా) జరిగింది. నెల రోజుల పాటు ఏమీ పాడొద్దన్నాడు డాక్టర్. నేను పాడి కదా పాటను సింగర్స్‌కు నేర్పించాలి. అది చేయకూడదన్న మాట. సరేనని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాను. కాని ఒకరోజు నిర్మాత పంజు అరుణాచలం వచ్చారు. ఆయన నన్ను సంగీత దర్శకుణ్ణి చేసిన ఆత్మీయుడు. ఆయన తీసిన ‘అన్నాక్కిళ్లి’తో నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. ‘ఏంటన్నయ్యా... ఇలా వచ్చారు’ అనంటే ‘ఏం చెప్పమంటావు. నువ్వు రెస్ట్‌లో ఉన్నావు. నా సినిమా (రజనీకాంత్‌ను పెట్టి తీస్తున్న ‘తంబిక్కు ఎంద ఊరు’) షూటింగ్ ఆగిపోయింది. రజనీకాంత్ ఊటీలో వెయిట్ చేస్తున్నాడు. ఒక పాటను షూట్ చేసి అతను వేరే షూటింగ్‌కు వెళ్లాలి. నాకు మళ్లీ అతని డేట్స్ దొరకవు. నువ్వు పాట చేయాలి ఎలాగైనా’ అన్నాడాయన. నేను పెద్ద ధర్మసంకటంలో పడ్డాను. ఒకవైపు ఆరోగ్యం. మరోవైపు నా గాడ్‌ఫాదర్. సరే... డాక్టర్ పాడొద్దని కదా అన్నాడు అని... నేను మెల్లగా మంచం మీద సర్దుకు కూచుని విజిల్ వేస్తూ పాట ట్యూన్ ఇచ్చాను. పంజు గారు (ఆయన గీత రచయిత కూడా) వెంటనే పల్లవి రాశారు. విజిల్లోనే చరణాలు ఇచ్చాను. వాటినీ రాసేశారు. ‘ఇక రికార్డింగ్ ఎలా చేస్తావు?’ అనడిగారాయన. నా కండక్టర్ని ఇంటికి పిలిచి నోట్స్ ఇచ్చాను. వెంటనే రికార్డింగ్ అరేంజ్ చేసి బాలూ చేత పాడించమని చెప్పాను. నేను ఇంటి దగ్గర ల్యాండ్‌లైన్ రిసీవర్ ఆన్‌లో పెట్టి దాని గుండా అక్కడ ఏం జరుగుతోందో వింటూ, పాట మొదట్లో ఆలాపన ఉంటే అది కూడా విజిల్లోనే చెప్పి రికార్డు చేయించాను. ఆ పాటే ‘కాదలిన్ దీపం ఒండ్రు’. ఆ పాట రజనీకాంత్‌కూ నాకూ ఎంత హిట్ అంటే రేడియోలో ఇప్పటికీ ఎక్కువసార్లు రిక్వెస్ట్ వచ్చే పాట అది. నేను ఒకసారి విజిల్ వేస్తే ఏమయ్యిందో చూడండి. మీరు విజిల్ వేస్తే అంత ఘనంగా ఉండాలి’ అన్నారాయన ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య.మనం ఉద్యోగం చేస్తున్నా, ఉపాధిలో ఉన్నా, చదువుకుంటున్నా, కళారంగంలో ఉన్నా మనం ఎదుగుతూ ఎదుటివారి గొప్పదనాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.. మనం అలాగే ఉండి ఎదుటివారి గొప్పదనానికి మురిసిపోతూ, అయోగ్యుల వెంట మూక స్వభావంతో తిరుగుతూ ఉండరాదని ఇళయరాజా భావం. ఇది గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠం. -
చేయించేది.. నిందలు వేసేది నారా బాబే!
సాక్షి, అమరావతి: హత్యా రాజకీయాలపై చంద్రబాబు, టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతుండటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హత్యా రాజకీయాలకు తెరతీసిందే చంద్రబాబు అని, ఇది చరిత్ర చెబుతున్న పచ్చి నిజం అని వక్కాణిస్తున్నారు. గతంలో రౌడీలు, అసాంఘిక శక్తుల పరస్పర ఘర్షణల్లో అప్పుడప్పుడు హత్యలు జరుగుతుండేవి. కానీ రాజకీయ ఆధిపత్యం కోసం, ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడం కోసం హత్యలకు తెగబడే ఒరవడిని తీసుకువచ్చింది మాత్రం కచ్చితంగా చంద్రబాబేనని రాజకీయ విశ్లేషకులు గతంలోనే కుండబద్దలు కొట్టారు.అధికారంలో ఉంటే పోలీసుల సహకారంతో హత్యలకు బరితెగించడం.. ప్రతిపక్షంలో ఉంటే అరాచక శక్తులతో హత్యలకు తెగబడే విధానాన్ని టీడీపీ అధికారిక విధానంగా చేసిందీ చంద్రబాబే అంటున్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన చంద్రబాబు.. ఇక తన ప్రభుత్వ హయాంలో ఇంకెతంగా బరితెగించి ఉంటారన్నది ఊహకే అందని దారుణం అని పలు ఘటనలను ప్రస్తావిస్తున్నారు. నాడు విజయవాడలో మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి నుంచి.. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగుతున్న హత్యాకాండ వరకు అన్ని దారుణాల్లో అన్ని వేళ్లూ చంద్రబాబు వైపే చూపిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చర్చకొచ్చిన కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్‌పై హత్యాయత్నం కుట్ర కప్పిపుచ్చి.. 1982లో ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరని చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే మామగారిపైనే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. అలాంటి చంద్రబాబు 1983లో టీడీపీ అధికారంలోకి రాగానే నిస్సిగ్గుగా ప్లేటు ఫిరాయించి ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలో 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై మల్లెల బాబ్జీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో హత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. అతను ఎన్టీరామారావుపై ఎందుకు హత్యాయత్యానికి పాల్పడ్డారన్నది పోలీసుల విచారణలో వెల్లడవుతుందని అందరూ ఆశించారు.కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే మల్లెల బాబ్జీ విజయవాడలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించడం గమనార్హం. కాగా అతని జేబు నుంచి పోలీసులు ఓ లేఖను స్వా«దీనం చేసుకున్నారు. తనకు రూ.3 లక్షలు ఇస్తానని చెప్పి కేవలం రూ.30 వేలే ఇచ్చారని ఆ లేఖలో ఉండటం గమనార్హం. కాగా, ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయకుండా అప్పటి రాజ్యాంగేతర శక్తి చంద్రబాబే అడ్డుకున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఏకంగా ముఖ్యమంత్రిపైనే హత్యాయత్నం చేసిన నిందితుడు అనుమానాస్పద మృతి.. అతను రాసిన లేఖపై పోలీసుల మౌనం.. అంతా పక్కా పన్నాగంతోనే సాగాయన్నది స్పష్టమైంది. ఎన్టీ రామారావు హత్యకు గురైతే రాజకీయ అధికారం ఎవరికి దక్కుతుందన్నది కీలకంగా మారింది. దాంతో సహజంగానే చంద్రబాబుపైనే అందరికీ సందేహం కలిగింది. ఆ వాస్తవాన్ని శాశ్వతంగా కప్పిపుచ్చే కుట్ర నేపథ్యంలోనే మల్లెల బాబ్జీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై చంద్రబాబే సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు, పరిశీలకులు ఎన్నోసార్లు డిమాండ్ చేసినా ఆయన మౌనంగా ఉండిపోవడం సందేహాలను మరింత బలపరుస్తోంది. పాత్రికేయుడు పింగళి దశరథ రామ్ పాశవిక హత్య టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న విజయవాడకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథ రామ్ పాశవిక హత్యను రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో చంద్రబాబు రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోతున్న సమయంలోనే దశరథ రామ్‌పై ఎన్నోసార్లు హత్యాయత్నాలు జరగడం గమనార్హం. విజయవాడలో జరిగిన టీడీపీ మహానాడులోనే హత్య చేసేందుకు యత్నించారు. ఆయన హైదరాబాద్ నుంచి వస్తుంటే మారణాయుధాలతో వెంటబడ్డారు. 1985 అక్టోబర్ 20న రాత్రి విజయవాడలో రిక్షాలో వెళుతున్న దశరథ రామ్‌ను దారి కాచి మరీ దారుణంగా హత్య చేశారు.కొన ప్రాణాలతో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పినా సరే పోలీసులు ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేశారు. అంటే అప్పటి ప్రభుత్వ పెద్దల దన్నుతోనే దశరథ రామ్‌ను హత్య చేశారన్నది స్పష్టమైంది. దశరథ రామ్ హత్య ఉదంతంలో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపణలున్నాయి. ఆ హత్య వెనుక సూత్రధారులు ఎవరన్నది బయటకు రాకుండా ప్రభుత్వం మేనేజ్ చేసింది. రంగా హత్య కుట్రదారు చంద్రబాబే చంద్రబాబు హత్యా రాజకీయాలకు పరాకాష్ట వంగవీటి మోహన రంగా దారుణ హత్యే అని పలువురు నేతలు నొక్కి చెప్పారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో చెలరేగిపోయిన చంద్రబాబుకు విజయవాడలో ప్రజా నాయకుడు, అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వంగవీటి రంగా అడ్డుగా నిలిచారు. దాంతో రంగా హత్యకు టీడీపీ కుట్ర పన్నింది. చంద్రబాబు ఆదేశాలతోనే ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన అప్పటి హామ్ మంత్రి కోడెల శివప్రసాదరావు ఈ కుతంత్రానికి తెర తీశారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనే డిమాండ్‌తో నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను 1988 డిసెంబర్ 25 అర్ధరాత్రి తర్వాత టీడీపీ రౌడీ మూకలు నరికి చంపాయి.ఆ రోజు రంగా హత్యలో స్వయంగా పాల్గొన్నారని నిందితుల జాబితాలో ఉన్న వెలగపూడి రామకృష్ణకు చంద్రబాబు 2009లో విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం గమనార్హం. తద్వారా వంగవీటి రంగా హంతకులకు చంద్రబాబు అండదండలు ఉన్నాయనే విషయం మరోసారి నిరూపితమైంది. వెలగపూడి రామకృష్ణ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా విశాఖపట్నంలో కీలక నేతగా ఉన్నారు. చంద్రబాబు అండతో టీడీపీ మద్యం సిండికేట్‌కు రింగ్ మాస్టర్‌గా దందా కొనసాగిస్తున్నారు. చంద్రబాబు అండతోనే వైఎస్ రాజారెడ్డి దారుణ హత్య రాజకీయ ప్రత్యర్థులను అడ్డం తొలగించుకునేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగబడతారనడానికి వైఎస్ రాజారెడ్డి దారుణ హత్యే నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 1998లో వైఎస్ రాజారెడ్డిని కడప జిల్లాలో పాశవికంగా హత్య చేశారు. టీడీపీ నేతలు చంద్రబాబు అండతోనే ఈ హత్యకు పాల్పడ్డారన్నది బహిరంగ రహస్యం. అందువల్లే హంతకులకు 30 రోజులపాటు చంద్రబాబే హైదరాబాద్‌లో ఆశ్రయం ఇప్పించారని అప్పట్లోనే వెల్లడైంది.ఈ హత్యపై పోలీసులు నమోదు చేసిన కేసులో ఆధారాలు లేవని మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానం నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిపై కోర్టులో కౌంటర్ కూడా వేయలేదు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసులో 11 మంది నిందితులకు న్యాయస్థానం 2006లో యావజ్జీవ ఖైదు విధించింది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులో దోషిగా జైలు శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకర్ రెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించడం గమనార్హం. ప్రతిపక్షంలో ఉంటే బాబు అరాచక శక్తే టీడీపీ ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు అరాచక శక్తిగా చెలరేగిపోయేవారన్నది బహిరంగ రహస్యం. 1989–94లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా ఆందోళన పేరిట బస్సులను దహనం చేయాలని చంద్రబాబు ఆదేశించేవారని అప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ టీవీ చానళ్ల ఇంటర్వ్యూల్లో వెల్లడించడం గమనార్హం. కొన్ని బస్సులు తగలబడాలి.. కొందరు సామాన్యులు చనిపోవాలి.. అప్పుడే ఆందోళన విజయవంతమైనట్టని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని ఆయన చెప్పడం గమనార్హం.బాబు ఘాతుకాలకు ఆయన తోడల్లుడే సాక్షిపిల్లనిచ్చిన సొంత మామ అయిన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కోవడంతో పాటు చంద్రబాబు సీఎం కావడం వెనుక సత్యాలను ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావే స్వయంగా చెప్పారు. ఒక చరిత్ర కొన్ని నిజాలు – సత్యానికి మరో కోణం పుస్తకాల్లో బాబు ఘాతుకాలను సవివరంగా పేర్కొన్నారు. ఆగస్టు తిరుగుబాటులో చంద్రబాబు పోషించిన పాత్రను దగ్గుబాటి బట్టబయలు చేశారు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య సైతం చంద్రబాబు దారుణాలను తాను రాసిన ‘60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకంలో వివరించారు. -
రూ.3,500 ఒప్పందం… చివరికి రూ.1.5 లక్షల దోపిడి!
హైదరాబాద్: లైంగిక సేవల కోసం ట్రాన్స్‌జెండర్‌ను ఇంటికి తీసుకువెళ్తే బెదిరింపులకు పాల్పడి రూ.1.50 లక్షలు వసూలు చేసిన సంఘటన జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. జూబ్లీహిల్స్ పరిధిలో నివసించే ఒక వ్యక్తి (44) మార్చి 28న టాస్ పబ్ సమీపంలో గాయత్రీ అనే ట్రాన్స్‌జెండర్‌ను కలిశాడు. లైంగిక సేవలు అందించేందుకు రూ.3,500కు ఒప్పందం చేసుకుని అతని ఇంటికి తీసుకువెళ్లాడు. డబ్బు తీసుకుని తిరిగి వచ్చే సమయంలో ట్రాన్స్‌జెండర్ బెదిరింపులకు దిగింది. తనకు రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇంటి వద్ద గొడవ వద్దనే ఉద్దేశ్యంతో అతను రూ.1.40 లక్షలతో పాటు బంగారు గాజులు ఇచ్చాడు. ట్రాన్స్‌జెండర్ పలుమార్లు బెదిరింపులకు పాల్పడడటంతో విషయం కుటుంబ సభ్యులకు తెలుస్తుందని భయపడ్డాడు. ఈ క్రమంలోశనివారం ట్రాన్స్‌జెండర్ మరోసారి అపార్ట్మెంట్ వద్దకు రావడంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ కోసం గాలిస్తున్నారు. -
ప్రాణాలు నుజ్జునుజ్జు
రంగారెడ్డి జిల్లా: అతివేగం ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. జనచైతన్య వెంచర్‌కు చెందిన సోహెల్ (18) ఎలక్ట్రీషియన్. ఇదే ప్రాంతానికి చెందిన షేక్ సాహిల్ (19) ఇంటర్ చదువుతున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. శనివారం ఉదయం మొయినాబాద్‌లో ఎలక్ట్రికల్ పని ఉండడంతో ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. హిమాయత్ సాగర్ నుంచి అప్పా జంక్షన్ వైపు వెళ్తుండగా మూలమలుపు వద్ద అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. సోహెల్, షేక్ సాహిల్ ఎగిరి పక్కనే ఉన్న కల్వర్టు వద్ద పడిపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం...మరింత ఉత్సాహంగా కొన్ని∙కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు.∙ఆప్తులు మరింత దగ్గరకు చేరతారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. కళాకారులకు సత్కారాలు. వారం చివరిలో అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, తెలుపు రంగులు, దేవీస్తోత్రాలు పఠించండి.వృషభం....రాబడితో సమానంగా ఖర్చులు ఎదురవుతాయి. కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. కొందరుæ మిత్రులను కలుసుకుంటారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తి వివాదాలు కొంతవరకూ తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమసమస్యలు, నీలం, నేరేడు రంగులు, సుబ్రహ్మణ్యేశ్వరస్తోత్రాలు పఠించండి.మిథునం...మిత్రుల సలహాలు అవసరం కావచ్చు. పనులను చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు కాస్త తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలలోలాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం ఉన్న గుర్తింపు రాగలదు. కళాకారులకు శుభవార్తలు. వారం ప్రారంభంలో విందువినోదాలు. వస్తులాభాలు. నీలం, ఆకుపచ్చ రంగులు, లక్ష్మీస్తోత్రాలు పఠించండి.కర్కాటకం...ఎటువంటి వివాదమైనా సర్దుబాటు కాగలదు.. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనయోగం. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. నేరేడు, నీలం రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.సింహం....కొన్ని క్లిష్ట సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఇంటాబయటా అనుకూలత ఉంటుంది. మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఎటువంటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. క్రీడాకారులు, పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో మరిన్ని ఖర్చులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఎరుపు, లేత గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.కన్య....ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.. ముఖ్య వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టర్లకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పసుపు, లేత నీలం రంగులు, గణేశాష్టకం పఠించండి.తుల.....ఉన్నతస్థాయి వారితో పరిచయాలు. రాబడి అవసరాలకు తగినంతగా ఉంటుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబసమస్యలు తీరి ఊరట లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. భూవివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులు, వ్యవసాయదారులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. గులాబీ, లేత పసుపు రంగులు, గణేశ్‌స్తోత్రాలు పఠించండి.వృశ్చికం...అనుకున్న వ్యవహారాలను నేర్పుగా చక్కబెడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని బాధ్యతల నుంచి విముక్తి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాహన, గృహయోగాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. క్రీడాకారులు, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తగ్గుతాయి. వారం మధ్యలో వివాదాలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.ధనుస్సు...ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరోవైపు ఖర్చులను తట్టుకునేందుకు యత్నిస్తారు.. ఆలోచనలు కలసిరావు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో మాటపట్టింపులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయటా ఒత్తిడులు ఎదుర్కొంటారు. ధైర్యంగా ముందుకు సాగడం మంచిది. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలు, కళాకారులకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. ధనలాభం. గులాబీ, లేత ఎరుపు రంగులు, హనుమాన్ ఛాలీసా పఠించండి.మకరం....మీ అభిప్రాయాలను బంధువులు గౌరవిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట లభిస్తుంది. వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధులు మరింత తేలికపడతాయి. క్రీడాకారులు, కళాకారులకు ఊహించని అవకాశఆలు రావచ్చు. వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. బంధువులతో వివాదాలు. నీలం, తెలుపు రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.కుంభం...వ్యవహారాలు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగుల చిరకాల ఆశ ఫలించే సమయం. కళాకారులు, రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు, కనకదుర్గాస్తోత్రాలు పఠించండి.మీనం....కొత్త కార్యక్రమాలు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరుల ఆదరణ లభిస్తుంది.. కొన్ని నిర్ణయాలకు కుటుంబసభ్యుల నుండి ఆమోదం లభిస్తుంది. వస్తు, వాహన లాభాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కీలక పోస్టులు దక్కే అవకాశం. పారిశ్రామికవర్గాలు, కళాకారులకు పురస్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, తెలుపు రంగులు, శివాష్టకం పఠించండి. -
యముడితో కీర్తిమంతుడి యుద్ధం
పూర్వం కాశీక్షేత్రాన్ని రాజధానిగా చేసుకుని, ఇక్ష్వాకు వంశానికి చెందిన కీర్తిమంతుడు పాలించేవాడు. ఒకనాడు కీర్తిమంతుడికి వేట మీద కోరిక పుట్టి, అడవిలో వసిష్ఠాశ్రమ పరిసరాలకు వెళ్లాడు. అప్పుడది వైశాఖమాసం. వసిష్ఠ మహర్షి శిష్యులందరూ వైశాఖమాస ధర్మాలను ఆచరిస్తూ సందడిగా కనిపించారు. వైశాఖమాస ధర్మకార్యాలను అప్రతిహితంగా కొనసాగించడానికి వసిష్ఠ మహర్షి అప్పటికే ఆశ్రమానికి చేరువలో బాటసారుల దప్పిక తీర్చడానికి చలివేంద్రం, వారు సేదదీరడానికి అనువుగా చలువ పందిరితో ఒక విడిది మంటపం ఏర్పాటు చేశాడు. వసిష్ఠుడి శిష్యుల్లో కొందరు చలివేంద్రం వద్ద నిలబడి బాటసారుల దప్పిక తీరుస్తున్నారు. ఇంకొందరు విడిది మంటపంలో ఉన్నవారికి రసభరితమైన పండ్లు అందిస్తున్నారు. మరికొందరు సేదదీరుతున్న బాటసారులకు విసనకర్రలతో గాలి విసురుతూ సపర్యలు చేస్తున్నారు. ఇదంతా చూసిన కీర్తిమంతుడు ఆశ్చర్యపోయాడు. వసిష్ఠుడి శిష్యులను సమీపించి, ‘మునికుమారులారా! మీరంతా ఎవరు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు?’ అని ప్రశ్నించాడు.‘రాజా! మేమంతా వసిష్ఠ మహర్షి శిష్యులం. ఆయన ఆదేశం మేరకు వైశాఖ ధర్మాలను నెరవేరుస్తున్నాం’ అని బదులిచ్చారు.‘ఏదైనా క్రతువులో భాగంగా ఈ పనులన్నీ చేస్తున్నారా? ఏ దేవత ప్రీతి కోసం ఇదంతా చేస్తున్నారు? దీనివల్ల ఫలితమేమిటి?’ అడిగాడు కీర్తిమంతుడు.‘రాజా! గురువు ఆజ్ఞ మేరకు ఈ పనులన్నీ చేస్తున్నాం. వివరాలేవీ మాకు తెలియవు. ఆయనను కలుసుకుని, నేరుగా అడిగితే, ఆయనే చెప్పగలరు’ అని చెప్పారు శిష్యులు.కీర్తిమంతుడు వసిష్ఠాశ్రమంలోకి ప్రవేశించి, వసిష్ఠ మహర్షికి నమస్కరించాడు. ‘మహర్షీ! నేను ఇటువైపుగా వస్తుంటే, మీ శిష్యులందరూ బాటసారులకు కని విని ఎరుగని సపర్యలు చేస్తూ కనిపించారు. ఇది ఏమైనా ప్రత్యేకమైన క్రతువా? దీని వల్ల ఫలితమేమిటి? మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది’ అని అభ్యర్థించాడు.వసిష్ఠుడు కీర్తిమంతుడి జిజ్ఞాసకు సంతోషించాడు.‘రాజా! నా శిష్యులు చేస్తున్నవన్నీ వైశాఖమాస ధర్మాలు. వైశాఖమాసంలో మానవులందరూ తప్పనిసరిగా ఆచరించాల్సినవి– స్నానం, దానం. ఎన్ని ధర్మాలను ఆచరించినా, స్నాన దానాలను ఆచరించని మానవులు శ్రీహరికి ప్రీతిపాత్రులు కాలేరు. వైశాఖధర్మాలు సులభసాధ్యాలు. దప్పిగొన్న వారికి నీరు ఇవ్వడం, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, అలసిన వారికి విశ్రాంతి పొందడానికి ఏర్పాట్లు చేయడం వంటి సామాన్య చర్యలే వైశాఖధర్మాలు. వీటిని ఆచరించిన మానవులకు శ్రీహరి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది’ అని చెప్పాడు.కీర్తిమంతుడు సంతోషంతో వసిష్ఠుడికి కృతజ్ఞతలు తెలుపుకొని, తన రాజధానికి చేరుకున్నాడు. మరునాడే తన భటులతో రాజ్యమంతటా ఇలా చాటింపు వేయించాడు: ‘నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎనిమిదేళ్ల పైబడిన బాలలు మొదలుకొని వృద్ధుల వరకు వైశాఖమాసంలో అనుదినం స్నానం చేయాలి. సంపన్నులు చలివేంద్రాలను, బాటసారులకు భోజనశాలలను, విడిది మందిరాలను ఏర్పాటు చేయాలి. స్నాన దానాలు చేయనివారికి కఠిన శిక్షలు తప్పవు’. కీర్తిమంతుడి రాజ్యంలో ప్రజలందరూ రాజాజ్ఞను తు.చ. తప్పకుండా పాటించసాగారు. రాజ్యంలో ఎవరూ ధర్మం తప్పనందున కాలంతీరి ఎవరు మరణించినా, వారందరూ నేరుగా విష్ణులోకానికి పోతున్నారు. యమలోకానికి వెళ్లేవారు ఎవరూ లేకపోయారు.ఇదే పరిస్థితి కొనసాగితే తన ఉనికికే ముప్పు వస్తుందని తలచిన యముడు తన పరివారంతో బయలుదేరి, కీర్తమంతుడి రాజ్యాన్ని ముట్టడించాడు. యుద్ధానికి పిలుపుగా భీకర శంఖారావం చేశాడు.కీర్తిమంతుడు సైన్య సమేతంగా యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడు. ఉభయ సైన్యాలకు భీకర పోరు సాగింది. కీర్తిమంతుడు తన శక్తిమంతమైన బాణాలతో యమదూతలను రణరంగం నుంచి తరిమికొట్టాడు. యముడు నేరుగా కీర్తిమంతుడితో తలపడ్డాడు. తీక్షణమైన బాణాలతో కీర్తిమంతుడిని నొప్పించి, సింహనాదం చేశాడు. కీర్తిమంతుడు మూడు బాణాలతో యముడి ధనుస్సును విరిచేశాడు.ఆగ్రహించిన యముడు కాలదండాన్ని తీసుకుని, కీర్తిమంతుడిపైకి విసిరాడు.తన భక్తుడైన కీర్తిమంతుడి రక్షణ కోసం శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని సంధించాడు. ఆ చక్రం శరవేగంతో దూసుకొచ్చి, కాలదండాన్ని విసిరికొట్టింది. అది యముడి మీదకొచ్చింది. ఈ పరిణామానికి దేవతలంతా హాహాకారాలు చేసి, యముడిని క్షమించమని ప్రార్థించడంతో విష్ణువు తన చక్రాన్ని ఉపసంహరించుకున్నాడు. కీర్తిమంతుడి చేతిలో ఎదురైన ఓటమికి తలవంచుకుని, యముడు తిరిగి తన లోకానికి బయలుదేరాడు. ∙సాంఖ్యాయన -
గర్భం దాలుస్తున్నాను... కానీ...
నాకు 30 సంవత్సరాలు. మా పెళ్లై ఐదు సంవత్సరాలు అయ్యింది. ప్రతిసారి నేను గర్భం దాల్చుతున్నాను, కానీ రెండు నుంచి మూడు నెలల్లోనే మిస్క్యారేజ్ అవుతోంది. ఇది మూడుసార్లకు పైగా జరిగింది. మాకు ఒక హెల్దీ బేబీ కావాలి. దీనికి కారణం ఏమిటి? ఎలా ట్రీట్ చేయాలి?– సుజాత, విజయవాడ.మూడుసార్లకు పైగా రిపీటెడ్‌గా మిస్క్యారేజ్ అవుతుంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. అంటే ప్రతిసారి ఎందుకు మిస్క్యారేజ్ అవుతోంది అన్నది తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేసి కారణాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ పరిశీలనలో ముందుగా డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోవాలి. అసలు స్కాన్ చేయించారా లేదా, ఎన్ని రోజులకు లేదా ఎన్ని వారాలకు మిస్క్యారేజ్ అవుతోంది అన్నది తెలుసుకోవాలి. రెండు నెలలు పూరై్తన తర్వాత జరుగుతుందా, లేక ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయిన వెంటనే జరుగుతుందా అన్నది కూడా అడగాలి. అలాగే స్కాన్ లో బేబీ హార్ట్‌బీట్ ఫార్మేషన్ ఉందా లేదా, ఒకసారి హార్ట్‌బీట్ వచ్చి పోయాక మిస్క్యారేజ్ అవుతోందా అన్నది కూడా డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలి. ఇలా ఎందుకు జరుగుతోంది అన్నది పూర్తిగా పరిశీలించాలి. సాధారణంగా మొదటి మూడు నెలల్లో, అంటే 12 వారాల లోపల రిపీటెడ్‌గా మిస్క్యారేజ్ కావడానికి కారణాలు; అలాగే మూడు నెలల తర్వాత మిస్క్యారేజ్ కావడానికి కారణాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ పేషెంట్‌కు మొదటి మూడు నెలల్లోనే జరుగుతోంది కాబట్టి ముఖ్యమైన కారణాలు ఏమిటంటే, ముందుగా తల్లికి, తండ్రికి జెనెటిక్ పరీక్షలు చేసి, జెనెటిక్ సమస్యలు ఉన్నాయా అని చెక్ చేయాలి. అలాగే మిస్క్యారేజ్ అయినప్పుడు బయటికి వచ్చిన టిష్యూ ఉంటే దానికి కూడా జెనెటిక్ పరీక్షలు చేసి, ఏదైనా జెనెటిక్ సమస్య ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అలా ఉంటే జెనెటిక్ కౌన్సెలింగ్ ద్వారా సరైన మార్గదర్శకాలు తీసుకోవచ్చు. వయస్సు కూడా చాలా ముఖ్యమైన అంశం. సాధారణంగా తల్లి వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటం లేదా తండ్రి వయస్సు 40 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటం వల్ల మిస్క్యారేజ్ వచ్చే ప్రమాదం కొంచెం పెరుగుతుంది. అలాగే మధుమేహం ఉందా, థైరాయిడ్ సమస్య ఉందా, లేదా ఇతర వ్యాధులు ఉన్నాయా అన్నది కూడా పరిశీలించాలి. ముఖ్యంగా రక్త సంబంధిత లేదా ఇతర శరీర వ్యవస్థల సమస్యలు ఉన్నా కూడా మిస్క్యారేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఒక స్కాన్ ద్వారా గర్భసంచి ఆకారం ఎలా ఉంది అన్నది చూడాలి. గర్భసంచిలో ఏదైనా నిర్మాణ లోపం ఉందా లేదా గర్భసంచి ఆకారం సాధారణంగా ఉందా అన్నది చెక్ చేయాలి. మంచి స్కాన్ ద్వారా గర్భసంచిలో ఏదైనా పొర లాంటిది ఉండి, దాని వల్ల బ్లడ్ సప్లై సరిగ్గా అందకపోతుందా అన్నది తెలుసుకోవచ్చు. ఇలాంటి సమస్య ఉంటే కొన్ని సందర్భాల్లో చిన్న ప్రొసీజర్ ద్వారా దాన్ని సరిచేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన కారణం రక్తం గడ్డకట్టే సమస్యలు. వీటిని థ్రాంబోఫీలియాస్ అని అంటారు. అంటే రక్తంలో ఉండే గడ్డకట్టే లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల గర్భానికి సరైన రక్తప్రసరణ జరగక మిస్క్యారేజ్ కావచ్చు. ఇందులో కొన్ని ప్రత్యేక పరీక్షలు చేసి, ఏదైనా తేడా ఉంటే దానికి సరైన మందులు ఇవ్వవచ్చు. కొన్నిసార్లు అన్ని పరీక్షలు చేసినా కూడా కారణం స్పష్టంగా కనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాలను అనెక్స్ప్లెయిన్ మిస్క్యారేజ్ అంటారు. అయినప్పటికీ, చిన్న చిన్న కారణాలు గుర్తించినా వాటిని ట్రీట్ చేయడానికి ప్రయత్నించి, భవిష్యత్తులో ఒక హెల్దీ బేబీ కోసం తల్లిదండ్రులు డాక్టర్ కలిసి ప్రయత్నించవచ్చు. ∙మేని మాటశరీరం ‘తనను తానే శుభ్రం’ చేసుకుంటుంది!రోజూ స్నానం చేస్తూ శరీరాన్ని మీరు శుభ్రంగా ఉంచుకుంటున్నారని అనుకుంటున్నారా? కానీ, అసలు క్లీనింగ్ మాత్రం లోపలే జరుగుతోంది! మన శరీరంలో ‘అటో ఫాగీ’ ప్రక్రియ నిరంతరాయంగా పనిచేస్తూ, పాడైన కణాలను తొలగించి కొత్త కణాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా మనం నిద్రపోతున్నప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ ‘ఇన్నర్ క్లీనింగ్’ స్పీడ్ మరింత పెరుగుతుంది. డా. కె. అపర్ణ సీనియర్ గైనకాలజిస్ట్, అబ్‌స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ -
సింహం దిద్దుబాటు
సుమధుర వనానికి రాజు సింహం. అది జీవులను కన్న బిడ్డల్లా చూసుకునేది. ఏ జంతువో, పక్షో ఆపదలో ఉంటే ఆదుకునేది. కాని, సరైన సమయంలో చేయకపోవటం దాని బలహీనత. ఈ తీరు మార్చుకోమని మంత్రి ఎలుగుబంటి సింహానికి సలహా ఇస్తుండేది. కాని, ఎలుగుబంటి సలహాను సింహం పట్టించుకునేది కాదు. ప్రతిఏటా సింహం పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతుండేవి. సింహం అభిమాని ఏనుగు పొరుగు అడవి నుంచి ఆ వేడుకలకు తప్పక వచ్చేది. ఎప్పటిలా ఆ ఏడాది కూడా సింహం పుట్టినరోజుకు ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. పొరుగు అడవి నుంచి వేడుకలకు ఏనుగు బయలుదేరింది. సుమధుర వనానికి చేరగానే ఒంటికి ఉన్న బురద, దుమ్ము, ధూళి శుభ్రం చేసుకోవాలని దారిలో కనిపించిన చెరువులోకి దిగి స్నానం చేసింది. ఆ చెరువులో ఒక చెడ్డ మొసలి ఉండేది. స్నానం చేసి తిరిగి వెళుతున్న ఏనుగుపై మొసలి కన్ను పడింది. అది ఏనుగు కాలిని నోటకరిచి నీటిలోకి గుంజింది. మొసలితో పోరాడిన ఏనుగు తప్పించుకుని, ఒడ్డుకు చేరుకుంది. రంపంలాంటి మొసలి దంతాలు గుచ్చుకుని, గాయమై రక్తం కారింది. కాలి నొప్పితో ముందుకు అడుగులు వేయలేకపోయింది. కుంటుకుంటూ కొద్ది దూరం నడిచి, ఒక మర్రిచెట్టు కింద కూర్చుంది. ఏనుగు పరిస్థితి గమనించిన దారిన పోయే జంతువులు వైద్యుడు కోతికి సమాచారం అందించాయి. కోతి వెంటనే మందుల సంచి భుజాన వేసుకొని, తన సహాయకుడైన మరో కోతితో ఏనుగు వద్దకు వెళ్లింది. కాలి నుంచి కారుతున్న రక్తాన్ని శుభ్రం చేసి, పసరు మందు పూసి, కట్టు కట్టింది. ప్రతి ఏటా మృగరాజు సింహం పుట్టినరోజు వేడుకలకు వచ్చే ఏనుగు సుమధుర వనంలోని జంతువులు, పక్షులకు పరిచయమే!కాకి వచ్చి మృగరాజుకు ఏనుగు మర్రిచెట్టు కింద గాయంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం అందించింది. సింహం స్పందించలేదు.విషయం తెలిసిన మంత్రి ఎలుగుబంటి, నక్క, ఒంటె వెంటనే ఏనుగు వద్దకు వెళ్లాయి. ఏనుగును పరామర్శించి వేడుకకు వెనుతిరిగాయి. ఏనుగు పరిస్థితిని సింహానికి వివరించింది ఎలుగుబంటి.సింహం మౌనంగా ఉండిపోయింది.సింహం మర్నాడు వెళ్లి ఏనుగును చూస్తుందని భావించింది ఎలుగుబంటి.రెండు రోజులు గడిచినా ఏనుగుని చూడటానికి సింహం కదల్లేదు.సింహం వెళ్లి అభిమాని ఏనుగును పలకరించలేదని చెడుగా గుసగుసలు ప్రారంభించాయి అడవి జీవులు.ఆ సంగతి సింహం చెవిలో పడింది. మరునాడు ఉదయాన్నే సింహం ఒంటరిగా వెళ్లి, ఏనుగుని కలిసింది.‘‘మిత్రమా! ధైర్యంగా ఉండు. నీకు మేమున్నాం!’’ అంది సింహం.ఏనుగు తినటానికి అరటి గెలలు, చెరుకు గడలు తెప్పించింది.వైద్యుడు కోతిని దగ్గరికి తీసుకుని, ‘‘మిత్రమా! నీకు ఎలాంటి మూలికలు కావాలన్నా, సహకారం కావాలన్నా ఏర్పాటు చేస్తాను! ఏనుగుకు నాణ్యమైన చికిత్స అందించు’’ అంది సింహం. ‘‘రాజా! ఇప్పుడు ఏనుగు గాయం మానిపోయింది. రేపటి నుంచి మునపటిలా నడుస్తుంది!’’ అంది కోతి.ఆలస్యంగా ఏనుగు వద్దకు పోయినందుకు అప్పటికే సింహానికి చెడ్డపేరు రానే వచ్చింది.‘‘ప్రభూ! చేయాల్సిన పని అవసరం లేని సమయంలో చేస్తే, అది ఎంత గొప్ప పనైనా ఎవరినీ ఆకట్టుకోదు. ఆ పనికి విలువ, గుర్తింపు కూడా ఉండదు. చేసిన పనికి ప్రయోజనం ఉండదు. కొన్నిసార్లు నష్టం కూడా జరగొచ్చు!’’ అంది ఎలుగుబంటి.గాయం మాని నడుస్తున్న ఏనుగును సింహం తన ఇంటికి తీసుకువెళ్లింది. ప్రేమతో గొప్ప విందు ఇచ్చింది. ఖరీదైన కానుకలిచ్చి తన పరివారంతో అడవి చివరి వరకు వెంటవెళ్లి సాగనంపింది. ఆభిమానిని ఆదరించిన సింహాన్ని మెచ్చుకున్నాయి అడవి జీవులు. ఈ పని ముందుగానే చేసుంటే తన విలువ మరింత పెరిగేదని తెలుసుకుంది సింహం.తన తప్పు దిద్దుకుంటూ, ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయడం మొదలుపెట్టింది. తీరు మార్చుకున్న సింహం త్వరలోనే గొప్ప రాజుగా పేరు తెచ్చుకుంది. -
క్లూషియల్: బిలియనీర్ అనుమానాస్పద మృతి
‘శ్రీవాత్సవ బిజినెస్ ఎంపైర్ టవర్స్..‘ప్రముఖ వ్యాపారవేత్త శ్రీవాత్సవ అనుమానాస్పదంగా మరణించాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన వందమందిలో ఒకరైన అతని మరణం సంచలనమైంది. పరిశోధన మొదలైంది.ఢిల్లీ నుంచి వచ్చిన వైద్యబృందం తీవ్రమైన ఒత్తిడి వల్ల మరణించి ఉండవచ్చని అభిప్రాయపడింది. ఎన్ఐఏ– స్పెషల్ ఏజెంట్ అభిమన్యుని రంగంలోకి దించింది. హైదరాబాద్ చేరుకున్నాడు అభిమన్యు. టైమ్ అర్ధరాత్రి రెండు గంటలు. ఆ చాంబర్లో కమిషనర్ ప్రద్యుమ్న, శ్రీవాత్సవ భార్య, అభిమన్యు ఉన్నారు.‘‘సారీ మిసెస్ శ్రీవాత్సవ గారు! ఈ టైమ్‌లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు. శ్రీవాత్సవగారు ఏ విషయంలోనైనా టెన్షన్ ఫీలవ్వడం గమనించారా?’’ అడిగాడు అభిమన్యు.‘‘లేదు, తను స్ట్రెస్ ఫీలవ్వడం ఎప్పుడూ చూడలేదు. కోవిడ్ టైమ్‌లో అయిదు వందల కోట్ల నష్టం ఎదురైనప్పుడే తేలిగ్గా తీసుకున్నారు’’ చెప్పింది మిసెస్ శ్రీవాత్సవ. తనకు బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా? ‘‘బెదిరింపులకు భయపడడు. చాలా మొండి మనిషి.’’ మిసెస్ శ్రీవాత్సవ చెప్పింది.అభిమన్యు ఆలోచనలో పడ్డాడు. ‘శ్రీవాత్సవను ఒత్తిడికి గురిచేసిన విషయం ఏమై ఉంటుంది?’శ్రీవాత్సవ ఫోన్‌ను అన్‌లాక్ చేసి; ఫోన్ డేటాను పరిశీలించాడు. అనుమానించదగినది ఏదీ కనిపించలేదు. చాంబర్లో అనుమానం కలిగించేవేవీ కనిపించలేదు. స్టాఫ్‌ను విచారించాడు. అభిమన్యు దృష్టి ‘కీ చైన్’ మీద పడింది. శ్రీవాత్సవ పిడికిట్లో వుంది. సిక్స్ నైన్ అనే అంకెలు ఉన్న కీ చైన్. ఎలాంటి కీ లేదు.ఆ కీ చైన్ మిసెస్ శ్రీవాత్సవకి చూపించి, ‘‘దీని గురించి చెప్పగలరా?’’ అని అడిగాడు.‘‘లాస్ట్ వీక్ స్విట్జర్లండ్ వెళ్లినప్పుడు తెచ్చుకున్నాడు. అంతకు మించి విశేషమేమీ లేదు’’ చెప్పింది మిసెస్ శ్రీవాత్సవ.‘‘కేసు క్లోజ్ చేయాల్సిందేనా?’’ కమిషనర్ అడిగాడు.‘‘కేసు ఇప్పుడే మొదలైంది’’ అంటూ అభిమన్యు కీ ఎక్కడ కొన్నదో చెక్ చేశాడు. ఆ చైన్ శ్రీవాత్సవ క్యాష్ పే చేసి కొన్నట్టు తేలింది. అవి ప్రత్యేకంగా ఆర్డర్ చేసి, తమ లక్కీ నంబర్లు కలిసొచ్చేలా ఆర్డర్ చేస్తారు. ఈ అంకెల్లో ఏదో ఉంది!అభిమన్యు ఆలోచిస్తూనే నేమ్ ప్లేట్ వైపు చూసి వెంటనే మిసెస్ శ్రీవాత్సవకు ఫోన్‌చేసి, ‘‘క్షమించండి. ఈ టైమ్‌లో డిస్టర్బ్ చేసినందుకు. మీ వారికి న్యూమరాలజీ మీద నమ్మకం ఉందా?’’ అడిగాడు.‘‘ఉంది. తన పేరును శ్రీవాత్సవ్ గా మార్చుకోవడానికి కారణం అదే...’ అని ఇంకేదో చెప్పబోతుండగా, ‘‘థాంక్యూ’’ అని ఫోన్ పెట్టేసి, కమిషనర్ వైపు తిరిగి ‘‘అర్జెంట్ గా స్విట్జర్లాండ్ వెళ్ళాలి... ఈ సిక్స్ నైన్ కీ చైన్‌కు, స్విట్జర్లండ్కు సంబంధం ఉంది.. నైన్ అంకె శ్రీవాత్సవ పేరు.. సిక్స్ అంకె...’’ అని ఆగి, వెంటనే ‘‘గాటిట్...’’ అని కమిషనర్ వైపు తిరిగాడు.‘‘శ్రీవాత్సవ ఒక్కడే స్విట్జర్లండ్ వెళ్లాడు. బిజినెస్ పనిమీద కాదు. స్విస్ బ్యాంకులు శ్రీవాత్సవలాంటి బిలియనీర్లకి కామధేనువులు. శ్రీవాత్సవ తెలివైన వ్యాపారవేత్త. సిక్స్ అంకె ‘లాకర్’ను సూచిస్తుంది. ఏదో క్లూ కీ చైన్‌లో ఉంది.’’ అన్నాడు.స్విట్జర్లండ్...మిసెస్ శ్రీవాస్తవ తరఫున లీగల్ డాక్యమెంట్లు సమర్పించడంతో స్విస్ బ్యాంకు లాకర్‌ను ఓపెన్ చేశారు.లాకర్లో విదేశాల్లో కొన్న ఖరీదైన ఫోన్. అందులో ఒకే కాంటాక్ట్– సెక్రటరీ మాయ నంబర్. శ్రీవాత్సవ రికార్డ్ చేసిన వాయిస్.‘‘మీరు నా వాయిస్ వినేసరికి నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు. నేను నా అంతరాత్మకు తప్ప ఎవరికీ భయపడను. ఒక బలహీన క్షణంలో సెక్రటరీతో నా సంబంధం నన్ను ట్రాప్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్తగా నాకున్న పరిచయాలు వాడుకోవాలని చూసింది. మేము సన్నిహితంగా ఉన్న వీడియోలు పంపి బ్లాక్ మెయిల్ చేసింది. హోంమంత్రిని, రక్షణ శాఖ అధికారులను పరిచయం చేయమంది. లేకపోతే వీడియోలు బహిర్గతం చేస్తానని బెదిరించింది. వీడియోలు బయటకు వస్తే నా కంపెనీ షేర్లు పడిపోతాయి. నా సంస్థల మీద ఆధారపడ్డ వేలాది కుటుంబాలు వీధిన పడతాయి. అలా అని దేశ రక్షణను పణంగా పెట్టను. నా మరణాన్ని పరిశోధించడానికి మీరొస్తారని తెలుసు...’’ ఒకవిధంగా శ్రీవాత్సవ మరణవాంగ్మూలం.శ్రీవాత్సవ స్విట్జర్లండ్కు రావడానికి కారణం తెలిసిపోయింది. అప్పటికే పారిపోయే ప్రయత్నంలో ఉన్న మాయను అరెస్ట్ చేశారు. అభిమన్యు సూచన మేరకు శ్రీవాత్సవ సెక్రటరీ మాయ– అతడు మరణించిన విషయం తెలుసుకుని, అతని కోటు జేబులో ఉన్న డబ్బు దొంగిలించి పారిపోతూ సీసీ కెమెరాలకు చిక్కింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు’’ అన్న వార్త మీడియాలో ఫ్లాష్ అయ్యింది.ఎన్ఐఏ కార్యాలయం..మాయ ఎదురుగా అభిమన్యు.‘‘చాలా సిల్లీ పెట్టీ కేసు కదూ! నువ్వు బయట కనబడితే జనం, పోలీసులు వదలరు. నీ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. రికార్డుల్లో లేని ఖైదీవి. నీ కోసం మీ వాళ్ళు కూడా గాలిస్తారు. లైఫ్‌లో హనీ ట్రాప్ చేయకుండా, శ్రీవాత్సవ ఆత్మ శాంతించేలా నీకు ఈ శిక్ష ...’’అభిమన్యు ఇంటరాగేషన్ సెల్ నుంచి బయటకు నడిచాడు. -
ఈ వారం కథ: పోడుస్తున్న పోద్దు
‘‘నువ్వెప్పుడైనా నిలువుటద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకుంటావా?’’ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పార్కుకి తీసుకువచ్చి, అవీ ఇవీ చెపుతూ వున్నట్టుండి ఇలా వ్యక్తిగతమైన ప్రశ్న వేసిన తులసి కేసి ఆశ్చర్యంగా చూసింది ప్రగతి.‘‘అద్దంలో చూసుకోవడం రోజూ అందరూ చేసే పనే కదా? నా గురించి ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నావ్?’’‘‘నువ్వు ప్రత్యేకం కాబట్టి. నిన్ను చూసుకుని నువ్వే మోహించేటంత, ముట్టుకొంటే డాగు పడేటంత అపురూపమైన అందాన్ని నీకు భగవంతుడిచ్చాడు. సినిమాతారలకు మించిన సహజ సౌందర్యం నీది. కానీ ఏం లాభం? దాన్ని అడవికాసిన వెన్నెల చేస్తున్నావ్. ఈ వయసులో ఓ బాయ్‌ఫ్రెండు, బాడీగార్డు, ప్రేమ – దోమ ఎఫైరూ –ఎంజాయ్‌మెంటూ, థ్రిల్లూ – గిల్లూ... ఇలాంటివేం లేకుండా జీవితాన్ని చప్పగా గడిపేస్తున్న నిన్ను చూస్తుంటే ఆశ్చర్యమే కాదు – జాలేస్తోంది కూడా...’’‘‘తులసీ, ఇలా క్లాస్ పీకడానికా నన్నిక్కడికి తీసుకొచ్చింది?’’ ప్రగతి అసహనంగా చూసింది.‘‘సారీ, నీ మంచి కోరి చెబుతున్న నన్నర్థం చేసుకో. ‘ఓ ప్రేమ లేఖ – ప్రపోజలూ, అచ్చటా – ముచ్చటా దేనికీ నోచుకోని దరిద్రగొట్టు బతుకుల్ని మాకెందుకిచ్చావు దేవుడా!’ అని ఏడ్చే నాలాంటి అమ్మాయిలు ఎందరున్నారో నీకు తెలియదు. ఎందుకంటే కొమ్ములు తిరిగిన కుర్ర హీరోలు వెర్రివాళ్ళలా వెంటపడుతున్న అదృష్ట జాతకురాలివి నువ్వు. కానీ దేవుడు నీకు యిచ్చిన వరానికి ఏమాత్రం గర్వపడక ఇంత రిజర్వ్డ్గా మడిగట్టుకుని ఉండడానికి కారణం తెలుసుకుందామని, ఇలా వసంతంలాంటి వయసును వ్యర్థం చేసుకుంటే, ఆ తర్వాత పోగొట్టుకున్న దానికోసం ఎంత పరితపించినా ప్రయోజనం ఉండదని చెప్పడానికే...’’‘‘చెప్పింది చాలు. నా బుర్ర తినకు. నేనే పొరపాటూ చేయడం లేదు. నా తీరు, నా దారి చాలా తృప్తికరంగానూ. ప్రశాంతంగానూ వున్నాయి.’’ ‘‘కాదు. నువ్వు ఆత్మవంచన చేసుకుంటూ అబద్ధాలు చెబుతున్నావ్. నీ మనస్సాక్షిగా నిజం చెప్పు. నీకు ఎప్పుడూ శృంగారపరమైన ఊహలూ, కవ్వించే కలలూ రావడం లేదూ? ఒంటరిగా ఉన్నప్పుడు వయస్సు పోరుతో మానసికంగా పులకింతలూ, గిలిగింతలూ కలగడం లేదూ? అబ్బాయిలు నీకేసి అదే పనిగా ఆరాధనాపూర్వకంగా చూస్తూంటే నీకే ‘ఫీలింగ్స్’ కలగడం లేదంటే నేను చస్తే నమ్మను...’’‘‘నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా కొచ్చిన నష్టం లేదు. అనవసరమైన విషయాలు ప్రస్తావించి నన్ను విసిగించకు’’‘‘పిచ్చి పిల్లా, నేను చెప్పేవన్నీ వయోధర్మాలు, మర్మాలూ! కాని, సర్వసామాన్యమైన పచ్చినిజాల్ని ఒప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావ్. ఈ కాలంలో హైస్కూల్ దశలోనే ఆడపిల్లలు ప్రేమపిచ్చితో రెచ్చిపోతూ మొబైల్స్‌ని వదలడం లేదంటే – ఇంజనీరింగ్ ఫైనల్కొచ్చి నువ్వింత బుద్ధిగా వుండడం సాధ్యమా? నువ్వు మరోలా అనుకోకపోతే నిన్నో ప్రశ్న సూటిగా అడుగుతున్నాను – ఇంతవరకు ఏ మగధీరుణ్ని చూసినా నీ మనస్సు చలించలేదా? నా మీద ఒట్టేసి చెప్పు’’లేదన్నట్టు ప్రగతి అడ్డంగా తల ఆడించింది.‘‘యూ ఆర్ రియల్లీ గ్రేట్. అయితే నువ్వెంతగా పట్టించుకోకపోయినా నీ లాంటి అందాలరాశికి నిన్ను వెంటాడే మృగాళ్ల వల్ల ముప్పు రావచ్చు. మనం తరచుగా వార్తల్లో చూస్తున్నాం కదా! ప్రేమను అంగీకరించని నేరానికి ఎంతమంది అమాయక యువతులు యాసిడ్ దాడులకు, కత్తిపోట్లకు, అఘాయిత్యాలకు బలి అవుతున్నారో! అందుచేత నీలాంటి బుద్ధిమంతురాలికి భద్రత అవసరం. ప్రేమరొంపిలో దిగమనను కాని, నువ్వంటే పడిచచ్చే బకరాల్లో ఒకణ్ణి ఎంచుకొని ఊరిస్తుంటే చాలు నీ రక్షణ సంగతి వాడు చూసుకుంటాడు...’’‘‘తులసీ, నాకిలాంటి చెత్త సలహాలివ్వకు ఏకపక్షంగా నా జోలికి ఎవరొచ్చినా. ఆ పోకిరీగాళ్లకు బుద్ధి చెప్పగలననే ధైర్యం నాకుంది...’’ ప్రగతి మాటల్లో ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతోంది.‘‘సెభాష్. నువ్వు నాకు నచ్చావ్. అలాగే మా అన్నకూ తెగ నచ్చేశావ్..’’‘‘మీ అన్నెవడు? అతగాడికి నాకూ ఏం సంబంధం?’’ ప్రగతి ప్రశ్నల్లో కరకుదనానికి తులసి తుళ్లిపడింది.‘‘కోప్పడకుండా పూర్తిగా విను. మా అన్నంటే నా కజిన్. పేరు భూపతి. నా కోసం కాలేజీకి వచ్చినప్పుడెప్పుడైనా చూసుంటావ్. అచ్చం సినిమా హీరోలా వుంటాడు. ఆపైన కోటీశ్వరుడు. ఈ నెక్లెస్ మొన్న రాఖీ కట్టిన సందర్భంగా వాడిచ్చిందే...’’‘‘అయితే ఏమిటి? సూటిగా చెప్పు’’ ప్రగతి మొహం ఎర్రబడ్డం తులసి గమనించింది.‘‘కూల్ డౌన్ ప్రగతీ. ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడైన మా అన్న మీద పడుతున్న వాళ్లందరినీ కాదని నువ్వంటే ఇష్టపడుతున్నాడు.వాడెంత మర్యాదస్తుడంటే – నీ ఎదుటపడి ‘ఐ లవ్ యు’ అని చెప్పలేక నిన్ను పరిచయం చేస్తే చాలని నన్ను చంపుకొని తింటున్నాడు...’’‘‘అర్థమైంది. ఇదన్నమాట అసలు సంగతి. ఈ విషయం చెప్పడానికా ఇంత ‘బిల్డప్’ ఇచ్చావ్? మీ అన్నకు నిర్మొహమాటంగా చెప్పు. నా మీద ఎలాంటి పిచ్చి భ్రమలూ పెట్టుకోవద్దని!, అతను అపర కుబేరుడైనా, నలకూబరుడైనా నా మనసు చలించదనీ, ప్రేమ నాకు ఆమడ దూరమనీ! పాపం మీ అన్నకు దూతికగా నువ్వు చాలా శ్రమపడ్డావు చాలు. ఇక పద క్లాసుకు టైమవుతోంది...’’ అంటూ విసుగ్గా విసురుగా పైకి లేచింది ప్రగతి. ఆమె నిగ్రహానికి, మనోబలానికి విస్తుపోయిన తులసి ఇంకేం చెప్పినా వినదని మౌనంగా ప్రగతి వెంట కాలేజ్ వైపు నడిచింది...ఎంత నచ్చజెప్పినా, బతిమాలినా కనీసం భూపతి ఎదుటపడ్డానికి కూడా అంగీకరించని ప్రగతి దృఢవైఖరి తులసి అహాన్ని దెబ్బతీసింది. భూపతి మెప్పు కోసం అతణ్ణి ప్రగతిని నీడలా వెంటాడమని, అందుకు తాను సహకరిస్తానని తులసి అతనికి మాటిచ్చి ప్రోత్సహించింది. తులసి కోసమనే వంకతో తరచుగా కాలేజీకి వస్తూ భూపతి ప్రగతి పెడమొహం పెట్టినా పరిచయం చేసుకున్నాడు. ఎన్నోసార్లు తన కారులో ‘లిఫ్ట్’ ఇచ్చే భాగ్యాన్ని ఇమ్మని ప్రాధేయపడ్డాడు, బలవంతపెట్టాడు కూడా. పిక్నిక్కనీ, కార్తిక వనసమారాధనకనీ, పుట్టిన రోజనీ... ఇలా వివిధ సందర్భాలకు తులసితో కలిసి ఆహ్వానించినా, అన్నిటినీ ప్రగతి తిరస్కరించింది. ప్రగతి సినిమాకో, షాపింగ్ కో, ఏదైనా సభకో... ఎక్కడికెళ్లినా ఆ సమాచారం ముందుగా తెలుసుకొని అక్కడ ప్రత్యక్షమై అతి మర్యాదలు చెయ్యబోయే భూపతిని ఆమె కటువుగా హెచ్చరించింది. తులసి పుట్టినరోజు వేడుకకు మాత్రం స్నేహితురాళ్ల బలవంతం మీద వాళ్లతో కలిసి వెళ్లిన ప్రగతికి అక్కడ కూడా భూపతి పీడ తప్పలేదు. ప్రగతికి అతి ప్రాధాన్యమిచ్చి, పాడడం రాదన్నా పాటలు పాడమని వేధించి, వద్దంటుంటే చనువుగా కేకు తినిపించి, ఆమెకు ప్రత్యేకంగా వీడియో ఏర్పాటు చేసి, అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న భూపతి హింసను భరించలేక – తలనొప్పి సాకుతో మధ్యలోనే ప్రగతి అక్కణ్ణుంచి వెళ్లిపోయింది. కారులో డ్రాప్ చేస్తానని భూపతి వెంటబడితే ఆమె అందరిముందు చీదరించుకోవడంతో ఆ పురుష పుంగవుడికి తల కొట్టేసినట్టయింది. ఆ సంఘటనతో అతను తోక తొక్కిన త్రాచులా రెచ్చిపోయాడు. కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఆమెను ఫ్రెండ్స్ ముందు అసభ్య పదజాలంతో వేధించడమే గాక ఆమె శీలం మీద బురద చల్లే పుకార్లతో పెద్ద ఎత్తున ప్రచారం చేయించాడు.భూపతి ఆవూళ్లో రెండు థియేటర్లు, జిల్లా అంతటా పెట్రోలు బంకులూ, మద్యం దుకాణాలూ వగైరావున్న సంపన్నవ్యాపారి శ్రీపతి ఏకైక పుత్రరత్నమనీ, పోలీసులను కూడా శాసించే యువ రాజకీయవేత్తనీ, అతనికి లేని వ్యసనం లేదనీ తెలిసిన ప్రగతి అతని వల్ల ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడి, అతని సంగతి తనను పెంచి పెద్దచేసిన అమ్మమ్మ అనసూయమ్మ చెవిన వేసింది. ఆవిడ కంగారుపడి ఎప్పటి నుంచో అనుకుంటున్న దగ్గర సంబంధం – సాఫ్ట్ వేర్ ఇంజినీరు, అన్ని విధాలా యోగ్యుడు అయిన వివేక్‌తో పెళ్లి నిశ్చయించి, ముహూర్తం కూడా పెట్టించింది.తులసి ద్వారా ప్రగతి పెళ్లి వార్త తెలిసిన భూపతి తనకు దక్కని ప్రగతిని ఎవరికీ దక్కనివ్వనన్నాడు. దారికాసి ప్రగతిని అటకాయించి మంచిగా తనతో పెళ్లికి అంగీకరిస్తే కళ్లలో పెట్టుకొని చూసుకుంటానని ప్రాధేయపడ్డాడు. ఆమె ‘ఛీ’ కొట్టి తిరస్కరించడంతో ఇరవై నాలుగు గంటలలోగా ఆమె వివేక్‌తో పెళ్లి రద్దు చేసుకొని తనకు ఓకే చెప్పకపోతే ఆమె అంతు చూస్తానని బెదిరించాడు. అతని బెదిరింపులను లెక్కచెయ్యకుండా గడువులోగా ఎటువంటి సమాధానమూ చెప్పని ప్రగతి ముందు అతను ప్రత్యక్షమై కొన్ని ఫోటోలు ఆమె చేతికిచ్చి, ఆ కాపీలు వివేక్కి పంపిస్తానని బ్లాక్ మెయిలింగ్ ఆయుధాన్ని ప్రయోగించాడు. అవి మార్ఫింగ్ చేసిన కొన్ని ప్రగతి అర్ధనగ్న చిత్రాలు, మరికొన్ని ఆమె భూపతి కౌగిలిలో ఉన్నవీ! ఆ ఫోటోలు చూసిన ప్రగతి అగ్నిహోత్రమైంది. ఆమె మనోనేత్రాల ముందు అలాంటి బెదింపులకు బలయిన తల్లి ప్రతిమ దీనగాథ కదలాడింది...ప్రతిమ గోదావరి జిల్లాకు చెందిన సంప్రదాయ కుటుంబం నుంచి పీజీ చెయ్యడానికి వాల్తేరు వెళ్లింది. ఆమె పేరుకు తగ్గ బంగారు బొమ్మ. ఇంట్లో వాళ్లకిచ్చిన హామీకి తలవొగ్గి ఎవరితోనూ ఎటువంటి పరిచయాలు పెంచుకోని ప్రతిమ మంచిగాయని అనే విషయం లేడీస్ హాస్టల్ అంతటికీ తెలిసింది. ఫ్రెండ్స్ బలవంతం మీద యూనివర్సిటీ సాంస్కృతిక కార్యక్రమాల్లో రెండు మూడుసార్లు పాల్గొన్న ఆమె సమ్మోహన గానం ఆమెను అభినందించడానికి వచ్చిన మోహన్ని పరిచయం చేసింది. అతను ఇంజినీరింగ్ విద్యార్థి. పాటలు రాయడమే కాకుండా మధురంగా స్వరకల్పన చేయగల సంగీతజ్ఞుడుగా అప్పటికే అతనికి కేంపస్‌లో మంచిపేరుంది. క్రమంగా అతని పాటల్ని ఆమె పాడ్డం, పరస్పర ప్రశంసలు – వాళ్ల ప్రేమకు దారి తీశాయి. వలపు చిగురించి, ప్రేమలేఖలు పుష్పించి, వాళ్ల అనుబంధం మధుమాసమై పరిమళించింది. ఇటు భీమిలి బీచ్ నుంచి అటు సింహాచలం వరకు ఎందరో ప్రేమికుల్ని చూసిన సంకేత స్థలాలన్నీ వాళ్ల ప్రణయానికి విహారవేదికలయ్యాయి. ‘మరో చరిత్ర’లో బాలు–స్వప్నల్లా రాళ్ల మీద కాకపోయినా ఆ ప్రేమ జంట ఇసుకలో తమ పేర్లను ఎన్నోసార్లు రాసుకొన్నారు...ప్రతిమ మోహన్ల ప్రేమాయణానికి అసూయపడిన ప్రతిమ రూమ్మేట్ రజని ఆ సంగతిని ప్రతిమ తల్లిదండ్రులకు తెలియపరచింది. అప్పటికే గాలివార్తను విన్నా, ప్రతిమ మీద నమ్మకంతో దానిని పట్టించుకోని వాళ్లు రజని ఇచ్చిన సమాచారంతో ఆ పొగ వెనక నిప్పు వుందని నిర్ధారించుకొని ఆగమేఘాల మీద వాల్తేరు వెళ్లి, ఉన్నపళంగా ప్రతిమను ఇంటికి లాక్కెళ్లారు. ఆ తర్వాత ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా కూతురు గోడు వినకుండా ఆమెను ప్రభాకర్ అనే ఇంజినీరుకిచ్చి ఆ మూడు ముళ్లూ వేయించి, ఊపిరి పీల్చుకున్నారు. క్రమంగా ప్రభాకర్ సాహచర్యంలో సంసార పర్వంలో ఏ లోటు లేని ప్రతిమ గతాన్ని, మోహన్ని పూర్తిగా మర్చిపోయింది. ఓ ఆడపిల్లకు తల్లయింది.నాలుగేళ్లు ఆనందంగా గడిచిన తర్వాత అనూహ్యంగా ఆ ఇంటిలో మోహన్ ప్రత్యక్షమయ్యాడు. ప్రభాకర్ పనిచేస్తున్న ఆఫీసుకు కొత్తగా వచ్చిన అతణ్ని ఆయన లంచ్‌కి పిలిచాడట! తనెవరో ఎరగనట్టున్న ప్రతిమను చూసి మోహన్ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ప్రభాకర్ లేని సమయంలో వచ్చి గతాన్ని గుర్తుచేశాడు. ప్రతిమకేమైందో తెలియక ఆమె కోసం ఎదురు చూసి చూసి చివరకు కల్లబొల్లి కబుర్లతో తనకు చేరబడిన రజనినే పెళ్లిచేసుకున్నాననీ, కాని ఆమె నరకాన్ని చూపిస్తోందనీ ఆమెకు విడాకులిచ్చి తిరిగి ప్రతిమను చేసుకుంటాననీ ప్రపోజ్ చేశాడు. చేజారిన పెన్నిధి అదృష్టం కొద్దీ తిరిగి ఇలా కంటపడిందనీ, తను చెయ్యని తప్పును అర్ధం చేసుకొని తమ ప్రేమకు ప్రాణం పొయ్యమనీ అర్థించాడు. అతని రాకకూ కోరికకూ అప్రతిభురాలైన ప్రతిమ అతనికి చేతులెత్తి దణ్ణంపెట్టి పచ్చని తమ సంసారంలో చిచ్చు పెట్టవద్దనీ, తనను మరచిపొమ్మనీ వేడుకొంది. కాని అతను పట్టువిడిచి పెట్టకుండా ఆమె తనతో రావడానికి అంగీకరించకపోతే తను భద్రంగా దాచివుంచిన ఆమె ప్రేమలేఖల్ని ప్రభాకర్‌కి చూపిస్తానని బెదిరించాడు. మోహన్‌తో ఎప్పుడూ హద్దు మీరకపోయినా అతని బ్లాక్ మెయిలింగ్‌కి భయపడిపోయిన ప్రతిమ పసిగుడ్డును తల్లి చేతుల్లో పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది!తనకు యుక్తవయసు వచ్చిన తర్వాత తల్లి మరణ రహస్యాన్ని చెప్పిన అమ్మమ్మ ఆ అనుభవం నేర్పిన పాఠంతో ఎన్నడూ ప్రేమవ్యవహారంలో చిక్కుకోనని తన చేత ఒట్టేయించుకొంది. నాన్న స్పందన తెలుసుకోకుండానే ‘అమ్మ అనవసరంగా ఉద్రేకపడింది. అప్పటి కథ పునరావృతం కాకూడదు. నేను అమ్మలా చేయని తప్పుకు బేలనై బెదిరిపోక, ఈ తరం స్త్రీ అబల కాదనీ చీకటిని చీల్చుకొని వచ్చే పొడుస్తున్న పొద్దు లాంటిదనీ నిరూపిస్తాను. భూపతి ఆట కట్టిస్తాను..’ అని దృఢమైన నిర్ణయాన్ని తీసుకొని ధైర్యంగా నేరుగా కాబోయే భర్త వివేక్ దగ్గరకు వెళ్లింది. భూపతి బ్లాక్ మెయిలింగ్ గురించి చెప్పి ఆ ఫోటోలను సిగ్గుపడకుండా అతనికి చూపించింది. నిజానిజాలను తెలసుకొని తన నిజాయితీ పట్ల నమ్మకముంటే మాత్రమే తనను పెళ్లి చేసుకోమని, నిర్ణయాన్ని అతనికే విడిచి పెడుతున్నాననీ నిర్భయంగా చెప్పింది. ప్రగతి సాహసోపేతమైన చర్యకు ఆశ్చర్యపోయిన వివేక్ ఆమెకేసి ప్రశంసాపూర్వకంగా చూస్తూ – ‘‘డార్లింగ్, నీ ధైర్యాన్నిఅభినందిస్తున్నాను. నీలాంటి సాహసి అయిన ప్రేయసి తోడుంటే జీవితంలో నాకు అసాధ్యాలుండవు. నిన్ను నిస్సందేహంగా నా దానిని చేసుకుంటాను. పద, ఈ ఫొటోలు స్టేషన్లో చూపించి ఈ దారుణానికి కారకుడైన భూపతిని నిర్భయ కేసు కింద అరెష్టు చేయిద్దాం...’’ అంటూ ఆమెకు చేయి అందించాడు. ప్రగతి ఆనందంగా అతని చేతినందుకొని ముందుకు నడిచింది...! -
యాక్షన్ హీరోలా చూపించారు: వెంకట్
‘‘హరుడు’ సినిమాను పూర్తి చేయడానికి యాక్టింగ్‌తో పాటు నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకో వాల్సి వచ్చింది. నన్ను యాక్షన్ హీరోలా చూపించారు. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరో వెంకట్ చెప్పారు. ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, శివ రామరాజు’ వంటి చిత్రాల్లో నటించిన వెంకట్ హీరోగా నటించిన తాజా సినిమా ‘హరుడు’.హెబ్బాపటేల్, సలోని హీరోయిన్లుగా నటించారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో వీఆర్ ఎంటర్టైన్మెంట్స్పై నిర్మించిన ఈ సినిమా మే 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ–‘‘మంచి సినిమాలను మన ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా ‘హరుడు’ మూవీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
కథాకళి: కొత్త పొరుగు
మా పై ఫ్లాట్‌లోకి ఎవరో కొత్తగా అద్దెకి వచ్చారు. పైనుంచి చప్పుళ్ళు వినిపించసాగాయి. ‘‘నిన్న రాత్రి ఆ చప్పుళ్ళకి నాకు నిద్రపడితే ఒట్టు.’’ మర్నాడు మావారికి చెప్పాను.చక్రాల కుర్చీని తోసుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ బల్ల దగ్గరికి వెళ్ళాను. పై ఫ్లాట్ నుంచి వచ్చిన ఆమ్లెట్, చికెన్ సేండ్విచ్లు చూపించి మావారు చెప్పారు. ‘‘అదృష్టం. ఫ్రెండ్లీ పీపుల్.’’రెండు రాత్రుల తర్వాత పై ఫ్లాట్‌లోంచి మళ్ళీ అరుపులు వినిపించాయి.‘‘భార్యాభర్తల పోట్లాట.’’ మావారు చెప్పారు.‘‘వాళ్ళకి ఫర్నిచర్ సర్దిన అలసట తీరినట్లుంది.’’ నవ్వుతూ చెప్పాను.మరో రెండు రోజుల తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక మావారితో కబుర్లు చెప్తూ కాఫీ తాగసాగాను. డోర్ బెల్ మోగడంతో మావారు వెళ్ళి తలుపు తెరిస్తే ఓ ముప్ఫై ఏళ్ళ యువతి బయట నించుని కనిపించింది. ఆమె చేతుల్లో ఓ పసిబిడ్డ ఉంది.‘‘హలో. గుడ్ మార్నింగ్. మేము మీ పై అపార్ట్మెంట్కి అద్దెకి వచ్చాం. ఫ్లోర్‌కి ఒకటే ఫ్లాట్ ఉండటంతో ప్రైవసీ బావుందని దీన్ని తీసుకున్నాం.’’ నవ్వుతూ చెప్పింది.‘‘రండి. పాప పేరేమిటి?’’ నవ్వుతూ ఆహ్వానించాను.ఆమె చెప్పాక మావారు నన్ను పరిచయం చేసి చెప్పారు.‘‘థాంక్స్. సేండ్విచెస్ చాలా రుచిగా ఉన్నాయి.’’‘‘మీకు బాగా శబ్దాలు వినిపించి ఉంటాయి. అపాలజీగా వాటిని పంపాను.’’‘‘మీ పిల్లల్ని మా ఆవిడ దగ్గర వదిలి మీరు షాపింగ్‌కి కాని, ఎక్కడికైనా వెళ్ళచ్చు.’’ మావారు సూచించారు.‘‘ఓ. థాంక్స్. అత్యంత అవసరమైతే తప్ప మీకా శ్రమ ఇవ్వను. మీ కాలికి ఏమైంది?’’ ఆమె నా కాలికి ఉన్న కట్టుని చూసి అడిగింది.‘‘పడ్డాను. సూపర్ బజార్లో పిల్లలు అరటిపళ్ళని నేలమీద పడేశారు. చితికిన అరటిపళ్ళు రోడ్ మీద ఒలికిన ఆయిల్ కన్నా ప్రమాదం. వాటి మీద కాలు వేసి జారిపడడంతో కుడికాలు విరిగింది. ఇంకో మూడు వారాల దాకా అది అతుక్కోదని డాక్టర్ చెప్పాడు.’’ జవాబు చెప్పాను.‘‘అందులో మన అపార్ట్మెంట్కి లిఫ్ట్ కూడా లేదు. ఐయాం సారీ. ప్లీజ్ గెట్వెల్ సూన్.’’ ఆమె చెప్పింది.‘‘తలకి తగలకపోవడం అదృష్టం.’’ మావారు చెప్పారు.∙∙∙ఆ రాత్రి మావారికి పై ఫ్లాట్‌నుంచి వినిపించే ఏడుపుకి మెలకువ వచ్చి నన్ను లేపారు. అది ఆమె ఏడుపుగా గుర్తించాను. ఆమె భర్త అరుపులు వినిపించాయి. ఆ ఏడుపు కొద్దిసేపు విని ఆయన విసుగ్గా అరిచారు.‘‘ఈ కొత్త పొరుగు న్యూసెన్స్ ఏమిటి? మన సెక్రటరీతో చెప్పి వాళ్ళని ఖాళీ చేయించాలి. నాకు రేపు ప్రజంటేషన్ కూడా ఉంది.’’ కోపంగా చెప్పారు.మర్నాడు ఉదయం మావారు వెళ్ళాక ఇంటర్నల్ ఇంటర్‌కమ్ మోగింది. ఆమె నుంచి ఆ కాల్. ఇద్దరం ఒకరినొకరం పలకరించుకున్నాక ఆమె అడిగింది.‘‘నేను ఈ సందు చివర కార్నర్ స్టోర్‌కి వెళ్ళిరావాలి. నేను వచ్చేదాకా మా అమ్మాయిని మీ దగ్గర ఉంచుకుంటారా? సరిగ్గా ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను.’’‘‘తప్పకుండా. తీసుకురండి.’’‘‘నిద్రపోతోంది. లేస్తే ఎవరూ కనపడకపోతే ఏడుస్తుందని.’’వెంటనే చక్రాల కుర్చీలో తలుపు దగ్గరకి వెళ్ళి దాన్ని తెరిచాను. నాలుగైదు నిమిషాల్లో భుజం మీద చిన్నపాపతో ఆమె వచ్చింది. రబ్బర్ షీట్ కూడా తెచ్చింది. గెస్ట్ రూమ్‌లోని మంచాన్ని చూపించాను.‘‘థాంక్స్ ఎలాట్.’’ పాపని పడుకోబెట్టి వెళ్ళిపోయింది.ఆమె చెప్పినట్లుగా ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చింది.‘‘మా అమ్మాయి లేవలేదుగా?’’‘‘లేదు.’’‘‘లేవదని తెలుసు. థాంక్స్ అగైన్.’’ కేరీ బేగ్‌తో పైకి వెళ్తూ చెప్పింది.∙∙∙ఆ రాత్రి పైనుంచి మళ్ళీ మాకు పోట్లాటతో మొదలై కొట్టిన చప్పుళ్ళు, తాగుబోతు మగ గొంతు వినిపించాయి. దాంతోపాటు ఆమె ఏడుపు కూడా.‘‘రేపు ఆ ఇంటాయనకి ఫోన్ చేసి ఈ న్యూసెన్స్ ఏమిటని అడుగుతాను.’’ మావారు కోపంగా అరిచారు.మర్నాడు ఉదయం డోర్ బెల్ మోగింది. చక్రాల కుర్చీని తోసుకుంటూ వెళ్ళి తలుపు తెరిస్తే ఎదురుగా వాచ్‌మేన్. భయంగా మెట్లవైపు చూపించాడు. లుంగీలోని ఓ ముప్ఫై ఐదేళ్ళ వ్యక్తి ఆఖరు మెట్టు మీద పడున్నాడు. అతని మెడ అసహజ రీతిలో తిరిగి ఉండడంతో అతను జీవించిలేడని గ్రహించాను.‘‘సెక్రటరీని పిలుచుకురా.’’ భయంగా అరిచాను.సెక్రటరీ డాక్టర్‌కి, పోలీసులకి ఫోన్ చేశాడు. వాళ్ళు వచ్చేలోగా కింది మెట్టు మీద పడున్న అతన్ని పరిశీలనగా చూశాను.అతని అరిపాదాలకి చితికిన అరటిపళ్ళ గుజ్జు అంటుకుని కనిపించింది.చూస్తే పై మెట్ల మీద చాలా చోట్ల ఆ గుజ్జు కనిపించింది!క్రితం రోజు ఆమె నా దగ్గర తన కూతుర్ని ఉంచి షాప్‌కి వెళ్ళి తెచ్చిన కేరీ బేగ్లో అరటి పళ్ళు చూశానని గుర్తొచ్చింది! -మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఆ మాట నిలబెట్టుకున్నాం: శర్వానంద్
‘‘నేను మంచి ఫ్యామిలీ సినిమాలు చేస్తాననే తెలుగు ప్రేక్షకుల నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ‘బైకర్’ చిత్రం తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుందని మొదటి నుంచే చెబుతున్నాను. మంచి ఫ్యామిలీ సినిమా తీసి, ఆ మాట నిలబెట్టుకున్నాం. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ మౌత్ టాక్ వల్ల మా చిత్రం అద్భుతంగా ఆడుతోంది’’ అని హీరో శర్వానంద్ తెలిపారు.అభిలాష్ కంకర దర్శకత్వంలో శర్వానంద్, మాళవికా నాయర్ జోడీగా నటించిన చిత్రం ‘బైకర్’. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదల అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో శర్వానంద్ మాట్లాడుతూ–‘‘అభిలాష్ మంచి తండ్రీ కొడుకుల కథ చెప్పాడు. నాకు అద్భుతమైన సినిమా అందించిన యూవీ క్రియేషన్స్‌కు ధన్యవాదాలు. నా వెనుక దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను.ఈ ఏడాది నాకు రెండు హిట్లు వచ్చాయి’’ అని చెప్పారు. అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ–‘‘మా సినిమాలోని రేసింగ్‌తో పాటు తండ్రీ కొడుకు, భార్యాభర్తల భావోద్వేగాలకు కూడా ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. మొదటి రోజు నుంచే థియేటర్లకు వస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్‌కి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ‘‘మా మూవీలోని ఎమోషన్ కు ఆడియన్స్ చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు’’ అన్నారు మాళవిక నాయర్. -
నా పెంపకంలో ఈ స్థాయికి ఎదిగింది
విజయవాడ దుర్గమ్మపై ‘కనకదుర్గా మహా ప్రభావిత మదనజనక సోదరీ..’ అంటూ గాయని శ్రీలలిత పాడిన పాటను ప్రధాని నరేంద్ర మోదీ ట్యాగ్ చేయడంతో వైరల్‌గా మారింది. శ్రీలలిత తల్లి భమిడిపాటి సత్యవాణి ఈ సంతోషాన్ని పంచుకుంటూ, శ్రీలలిత చిన్ననాటి నుంచి తను తీసుకున్న జాగ్రత్తలను వివరించారు.‘‘పాప పుట్టినప్పుడు తను ఏ స్థాయికి వెళ్లాలి అనుకున్నానో, ఆమె ఈ రోజు ఆ స్థాయికి చేరుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఇద్దరు పిల్లలు. బాబు శ్రీనికేత్, తర్వాత శ్రీలలిత. మావారు భమిడిపాటి రాజశేఖర్ బ్యాంకు ఉద్యోగి. ఆయన ఉద్యోగరీత్యా కొన్నాళ్లు బిహార్‌లో ఉన్నాం. నాకు మా పిల్లల నెలల వయసు నుంచే వారిని సంగీతంలో తీర్చిదిద్దాలనే ఆలోచన ఉండేది. మా పుట్టిల్లు, మెట్టిల్లు వైపు పాతికమంది వరకు సంగీత విద్వాంసులు ఉన్నారు. నేనూ సంగీతం క్లాసులు తీసుకుంటాను. పిల్లలు స్టేజీపైన ప్రదర్శన ఇవ్వడానికి వారిలో భయం ఉండకూడదు. అందుకని, చిన్నప్పుడే బేబీ షోలలో పాల్గొనేలా చేసేదాన్ని. లలితకు ఎనిమిది నెలల వయసులో చీరకట్టి, పెళ్లికూతురులా రెడీ చేసి, బేబీ షోలో స్టేజీపైన నిలబెట్టాను. ఆ వయసులోనే తనకు ఫస్ట్ ఫ్రైజ్ వచ్చింది. కూరగాయలతోనూ డ్రెస్సులు కుట్టి, వేసి, షోలకు తీసుకెళ్లేదాన్ని. నాకు మిషన్ కుట్టడం వచ్చు కాబట్టి పాప డ్రెస్సులన్నీ నేనే కుట్టేదాన్ని. బొమ్మలను తయారుచేసి ఇచ్చేదాన్ని. పాప రెండేళ్ల వయసులో తణుకు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఉద్యోగరీత్యా ఎటు మారినా, ఎక్కడ పిల్లల ప్రదర్శన జరిగినా, అక్కడకు శ్రీలలితను తీసుకెళ్లేదాన్ని.ఒడిలో కూర్చోబెట్టుకొని...పాప మూడేళ్ల వయసులో ఓ షోలో పాల్గొనడానికి ఇంగ్లిష్ రైమ్ నేర్పించాను. కాని, అక్కడకు వెళ్లాక లింగాష్టకం పాడింది. ‘మూడేళ్ల వయసులో ఎలా పాడింది’ అంటూ అందరితో సహా నేనూ ఆశ్చర్యపోయాను. అప్పుడు నాకు అనిపించింది. ఉదయాన్నే పూజ చేసేటప్పుడు పాప అటూ ఇటూ వెళ్లకుండా ఒడిలో కూర్చోబెట్టుకొని, శ్లోకాలు, స్తోత్రాలు చదువుతుండేదాన్ని. తను కూడా వాటిని వింటూ, పాడుతూ అమ్మవారికి పూలు పెడుతూ అలాగే కూర్చొనేది. ఒడిలో కూర్చోబెట్టుకొని రోజూ స్తోత్రాలు చదవడం వల్ల, అవన్నీ గుర్తుపెట్టుకుని, అలవోకగా పాడేసిందని అర్థమైంది. ఇక ఆ రోజు నుంచి ‘పాట’ తన చెవిన పడాలి అని తపించేదాన్ని. మూడేళ్ల వయసులోనే...మూడేళ్ల వయసులో నేను తీసుకునే మ్యూజిక్ క్లాస్ తను తీసుకుంటాననేది. నా పని ముగించుకొని, క్లాస్‌కు వచ్చేసరికి పిల్లలందరినీ కూర్చోబెట్టి, పాడుతుండేది. ఒక సిరీస్ అంతా ఘంటసాల పాటలు పాడించాం. ఇంట్లో ఓ మైకు ఏర్పాటు చేసుకున్నాం. సాయంత్రం అయ్యిందంటే మా అందరి ప్రోగ్రామ్ పాటలే! దీక్ష తీసుకునేవాళ్లం..మా బంధువుల్లో చాలా మంది నన్ను కొంచెం విసుక్కునేవారు ‘ఏంటో నువ్వు, పిల్లకు పాత తరంలోలాగా లంగా జాకెట్టు, పెద్ద బొట్టు.. అమ్మాయిని ట్రెండ్‌కు తగినట్టుగా పెంచడం లేదు..’ అనేవారు. వాటిని పట్టించుకునేదాన్ని కాదు. లలిత అంటే నాకు అమ్మవారు. అలాగే ఉండాలనుకునేదాన్ని. బాలసుబ్రహ్మణ్యం, కోటిగారు ‘లలిత పాడుతుంటే అమ్మవారే పాడుతున్నట్టు’ ఉంది అనేవారు. ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నా, అక్కడకు నేను, మావారు వెళ్లిపోయి, ఓ పక్కన కాళ్లు లాగేస్తున్నా నిల్చుండేవాళ్లం. తను ఎక్కడెక్కడ పాడింది, ఎవరితో పాడింది, ఎవరెవరు తనను ప్రోత్సహించారు– అవన్నీ ఫొటో ఆల్బమ్‌గా చేసి, తనతో పాటు తీసుకెళ్లి, అక్కడున్నవారికి చూపించేవాళ్లం. సంగీతంలో లలిత ఉన్నత దశకు చేరుకోవాలనే తపన తప్ప మరింకేమీ లేదు. ఇన్నేళ్లలో మేం ఒక్క సినిమాకి వెళ్లింది లేదు, టీవీ చూసింది లేదు, ఒక యాత్రకు వెళ్లింది లేదు. సాధన మానకూడదు..ఏ రియాల్టి షో అయినా నేను, లలితనే వెళ్లేవాళ్లం. షో ముగించుకొని బయల్దేరేసరికి చాలాసార్లు అర్ధరాత్రి దాటిపోయేది. విదేశాలకు, ఏ ఊరు వెళ్లాలన్నా మా వారు వెంట వెళ్లేవారు. ఇంటి దగ్గరే ఉండి, టెన్త్ క్లాస్ పరీక్షలు రాసి, 90 శాతం మార్కులు తెచ్చుకుంది. సంగీతంలో డిప్లొమా చేసింది. లలిత పుట్టకముందు మా ప్రపంచం సంగీతం. పుట్టాక మా ప్రపంచం అంతా లలితనే అయిపోయింది. తను ఎక్కడా డల్ అవకుండా చూసేవాళ్లం. ఎవరో ప్రోత్సహించడం లేదనో, ప్రైజు రాలేదనో ఆలోచన పెట్టుకోవద్దని, ప్రాక్టీస్ ఎప్పుడూ మానద్దని చెప్పేవాళ్లం. ఆరేళ్లపాటు యూ ట్యూబ్‌లో..దసరా రోజుల్లో అమ్మవారి దీక్ష తీసుకుంటాను. నాతో పాటు శ్రీలలిత కూడా దీక్ష తీసుకుంటుంది. కరోనా సమయంలో మా అబ్బాయి చెల్లెలి కోసం యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేశాడు. ఆరేళ్లపాటు వరుసగా శ్రీలలితతో సాంగ్స్ చేయించాం. దుర్గా నవరాత్రుల సందర్భంగా చేసిన పాటలకు మంచి పేరొచ్చింది. కాంతారా పాటకు అన్నాచెల్లెళ్లిద్దరూ చాలా కష్టపడ్డారు. మా అబ్బాయి మంగళూరులో ధార్మిక పాఠశాలను ప్రారంభించాడు. అమ్మాయి పెళ్లి చేసి, అత్తగారింటికి పంపించాక ఇప్పుడు మా జర్నీని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాం. పిల్లలకు సంగీతం క్లాసులు చెబుతుంటాను. బొమ్మలు చేస్తుంటాను.’’ అని చెప్పారు సత్యవాణి.∙ నిర్మలారెడ్డి -
అప్పులు చేస్తే అధికార హోదాలో సీఎంగా ఉండాలి కానీ.. దేశం విడిచిపోవడం ఏమిటో!!
అప్పులు చేస్తే అధికార హోదాలో సీఎంగా ఉండాలి కానీ.. దేశం విడిచిపోవడం ఏమిటో!! -
హెయిర్ కట్.. 2కోట్లు!
జుట్టు ఉన్న ఆమె ఎన్ని ముడులైనా వేస్తుందట....అలానే ఓ యువతి తన కురులను మరింత అందంగా.. ఆకట్టుకునేలా మార్చుకోవాలనుకుంది..దీనికోసం స్టార్ హోటల్లోని ఓ బ్యూటీ సెలూన్‌కి వెళ్లింది. ఎలా చేయాలో హెయిర్ డ్రెస్సర్‌కు చెప్పింది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది..అందం మాట అటుంచి..ఉన్న జుట్టును కోల్పోయింది. దీంతో తనకు న్యాయం చేయాలని, పరిహారం అందించాలని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. పెద్ద మొత్తంలో పరిహారాన్ని కోరింది..ఏడేళ్ల పాటు ఈ కేసు సాగింది. ఓ హెయిర్ కట్ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చేరింది..చివరకు పరిహారం విషయంలో కీలక తీర్పుతో కేసు ముగిసింది.ఢిల్లీకి చెందిన ఆశ్నా రాయ్ ఓ కార్పొరేట్ ఉద్యోగి. ఓ ప్రముఖ హోటల్లోని బ్యూటీ సెలూన్‌కి వెళ్లి...తన జుట్టును చివరి నుంచి నాలుగు అంగుళాలు కత్తిరించాలని చెప్పింది. అయితే, ఆమె చెప్పిన దానికి భిన్నంగా జరిగింది. పైనుంచి కిందికి నాలుగు అంగు ళాలు మాత్రమే జుట్టు మిగిలింది. దీనిపై నిర్వాహకులను నిలదీసింది..‘సర్లే ఎన్నెన్నో అనుకుంటాం..’ అని ఆమె అంతటితో సరిపెట్టుకోలేదు. న్యాయపోరాటం ప్రారంభంఆశ్నారాయ్ 2018లో జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ని ఆశ్రయించింది. సేవల్లో లోపంపై ఫిర్యాదు చేసింది. మానసికంగా తాను పడిన ఆవేదనను వెళ్లగక్కింది. మోడలింగ్, సినిమా రంగాల్లోకి అడుగు పెట్టాలనుకున్నానని..తన జుట్టు కారణంగా ఉన్న ఉపాధి అవకాశాలు పోయాయని, కొత్తవి చేజారాయని ఫిర్యాదులో పేర్కొంది. విచారణ అనంతరం ఆమెకు రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని ఎన్సీడీఆర్సీ ఆదేశించింది. ‘సుప్రీం’కు చేరిన కేసుఆ తీర్పును సవాల్ చేస్తూ హోటల్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సేవల లోపంపై కమిషన్ నిర్ధారణను ‘సుప్రీం’ సమర్థించింది..కానీ ‘పరిహారాన్ని కేవలం డిమాండ్ ఆధారంగా కాకుండా, సరైన ఆధారాలతో నిర్ణయించాలని స్పష్టం చేసింది. కేసును తిరిగి కమిషన్‌కు పంపింది. మరోసారి విచారించి రూ. 2 కోట్ల పరిహారాన్ని 9 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని కమిషన్ తీర్పు ఇచ్చింది. సాక్ష్యాలపై సందేహాలుబాధితురాలి వాదనతో యాజమాన్యం ఏకీభవించ లేదు. సమర్పించిన పత్రాలన్నీ ఫొటోకాపీలేనని, వాటికి విశ్వసనీయత లేదని వాదించింది. తనకు జరిగిన నష్టం, మానసిక వేదనకు పరిహారం చెల్లింపులో సాంకేతిక అంశాలు అడ్డంకి కాకూడదని బాధితురాలు వేడుకుంది. తన పత్రాల్లో లోపాలు లేవని పేర్కొంది. తుది తీర్పు.. కీలక సందేశంరూ.కోట్లలో నష్ట పరిహారం కోరినా విశ్వసనీయ ఆధారాలు సమర్పించలేదని ఆశ్నా రాయ్‌ను ‘సుప్రీం’ తప్పుబట్టింది. ఆమె సమర్పించిన పత్రాల్లోని లోపాలను ఎత్తి చూపింది. ‘‘కేవలం ఊహాగానాలు లేదా వ్యక్తిగత భావాల ఆధారంగా భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించలేం, నష్టం జరిగినట్టు స్పష్టమైన, నమ్మదగిన సాక్ష్యాలు ఉండాలి’’ అని బెంచ్ స్పష్టం చేసింది. రూ. 2 కోట్ల పరిహారం ఆర్డర్‌ను రద్దు చే సింది. రూ. 25 లక్షలు తుది పరిహారంగా ప్రకటించింది. సేవల్లో లోపం ఉంటే పరిహారం కోరే హక్కు ఉంది..అయితే తగిన, బలమైన సాక్ష్యాలు అవసరమని ఈ తీర్పు స్పష్టం చేసింది. ‘న్యాయం భావోద్వేగాలపై కాదు, ఆధారాలపై నిలబడాలి’ అనే సూత్రాన్ని ఈ కేసు మరోసారి బలంగా తెలియజేసింది. మరోవైపు, ఈ తీర్పు పరిహారం నిర్ణయంలో మార్గదర్శకంగా నిలవనుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అమెరికాకు చెందిన జోనథాన్ లీ రిచెస్ ప్రపంచంలోనే అత్యధిక వ్యాజ్యాలు దాఖలు చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఇతను సుమారుగా 2,600 పై చిలుకు కేసులు వేసినట్టు సమాచారం. ప్రముఖ వ్యక్తులు, సంస్థలపై కూడా కేసులు దాఖలు చేశాడు..అతను బిల్‌గేట్స్, జార్జ్‌బుష్ వంటి ప్రముఖులే కాదు.. ఈఫిల్‌టవర్, చివరికి ఫ్లూటో గ్రహం తనపై ప్రభావం చూపిందని ఆ గ్రహంపై కూడా కేసు వేశాడు. ఇలా నిత్యం ఏదో ఒక కేసు దాఖలు చేసి వార్తల్లో నిలవడంతో గిన్నిస్ బుక్ సైతం ఇతని పేరును రికార్డుల్లోకెక్కించింది.తన ప్రమేయం లేకుండా పేరు నమోదు చేశారంటూ గిన్నిస్ బుక్ నిర్వాహకులపై సైతం రిచెస్ కేసు వేయడం విశేషం. ఎక్కువ కేసులు సరైన ఆధారాలు లేవని, అసంబద్ధంగా ఉన్నాయని కోర్టులు కొట్టేశాయి. అర్థం,పర్థం లేని అంశాలపై కేసులు వేసి కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని తీవ్రమైన హెచ్చరికలు సైతం జారీ చేశాయి. ఓ కేసులో ఇతను శిక్షను సైతం అనుభవించాడు. అతడి మానసిక స్థితి సరిగా లేని కారణంగానే ఈ విధంగా ప్రవరిస్తున్నాడని పలువురు విమర్శించారు. దిలీప్ మాదిరెడ్డి -
పుష్పవిలాసం... ఉద్యాన వినోదం
ప్రకృతి ప్రేమికులకు పండుగ సమయం వచ్చేసింది. టులిప్పూల నేల నెదర్లాండ్స్‌లోని క్యూకెన్ హాఫ్ గార్డెన్ సందర్శకుల కోసం ముస్తాబయింది. మార్చి 19న ప్రారంభమైన ఈ పూలతోట వేడుకను మే 10 వరకు వీక్షించవచ్చు. పెరటితోట స్థాయి నుంచి ప్రపంచ వేదికగా మారిన ఈ అందమైన పూలవనం చరిత్ర చాలా పురాతనమైంది. ఈ తోట 1949లో చిన్నగా మొదలై, నేటికి 34 హెక్టార్లకు చేరుకుని భూతల స్వర్గాన్ని తలపిస్తోంది.డచ్ భాషలో ‘క్యూకెన్ హాఫ్’ అంటే వంటింటి తోట అని అర్థం. పదిహేనో శతాబ్దంలో కౌంటెస్ జాకోబా వాన్ బీరెన్ తన వంటింటి ఉపయోగం కోసం ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలను పండించేవారు. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు స్థిరపడిపోయింది. ఆమె 1417 నుంచి 1433 వరకు బావేరియా–స్ట్రాబింగ్, హాలండ్, జీలండ్ కౌంటెస్, హైనాట్ కౌంటెస్‌గా ఉన్నారు. డచ్ ఈస్టిండియా కంపెనీలో కెప్టెన్‌గా పనిచేసి, 1627లో పదవీ విరమణ చేసిన తర్వాత, ఆడ్రియన్ మార్టెన్ బ్లాక్ క్యూకెన్ హాఫ్ కోటలోకి మారారు. ఆయన విధుల్లో ఉన్నప్పుడే ఈ కోట నిర్మాణానికి పునాది వేశారు. అనంతరం ఎన్నో ఏళ్ల తరువాత 1857లో ప్రసిద్ధ ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్‌లు జాన్ డేవిడ్ జోచర్, అతని కుమారుడు లూయిస్ పాల్ జోచర్ కోట చుట్టూ పార్కును రూపొందించారు. వీరు డిజైన్ చేసిన ఇంగ్లీష్ ల్యాండ్‌స్కేప్ శైలే నేటి ఆధునిక క్యూకెన్‌హాఫ్ తోటలకు పునాది.ఈ ఆధునిక క్యూకెన్ హాఫ్ చరిత్ర 1949లో మొదలైంది. అప్పటి లిస్సే మేయర్ నేతృత్వంలో 20 మంది డచ్ పూల పెంపకందారులు ఏకమై, నెదర్లాండ్స్ పూల ఎగుమతులను ప్రోత్సహించేందుకు దీనిని ఒక ప్రదర్శన కేంద్రంగా మార్చారు. మొదటిసారిగా 1950లో ఈ తోటలోకి పర్యాటకులను అనుమతించగా, తొలి ఏడాదిలోనే 2.36 లక్షల మంది సందర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రతి శరదృతువులో 32 హెక్టార్ల విస్తీర్ణంలో, తోటమాలులు 70 లక్షల టులిప్ పూల మొక్కలను ఒక ప్రత్యేకమైన డిజైన్ లో చేతులతో నాటుతారు. ఇందులో సుమారుగా 800 రకాల విభిన్నమైన టులిప్ మొక్కలు ఉంటాయి. వీటిని నాటడానికి సుమారు మూడు నెలల సమయం పడుతుంది.టులిప్ తోటలతో పాటు క్యూకెన్ హాఫ్‌లో ఇంగ్లీష్ ల్యాండ్‌స్కేప్ గార్డెన్, జాపనీస్ ల్యాండ్‌స్కేప్ గార్డెన్, స్ప్రింగ్ మెడో, నేచురల్ గార్డెన్, చారిత్రక వనాలు, గార్డెన్ మేజ్ వంటి ప్రతి ఏడాది ప్రత్యేకంగా నాటే అనేక అందమైన తోటలు ఉన్నాయి. ప్రకృతి ఒడిలో రంగురంగుల పూల మధ్య ఆహ్లాదంగా గడపాలనుకునే వారికి, చరిత్రను ఆస్వాదించాలనుకునే వారికి క్యూకెన్ హాఫ్ ఒక మరపురాని అనుభూతిని మిగులుస్తుంది. అంతేకాదు నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించే పూల పరిశ్రమకు ఒక సజీవ ప్రదర్శనశాల ఈ ఫ్లవర్ గార్డెన్స్. -
పింఛన్లపై ఫోరెన్సిక్ ఆడిట్
సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ పథకాల్లో అనర్హులు..అక్రమార్కులు లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం చేయించిన పైలట్ సర్వేలో తేలింది. ఈ జాబితాలో పీజీ టీచర్లు, ఎస్జీటీ, టీజీటీలు, పబ్లిక్‌హెల్త్ మేనేజర్లు, లెక్చరర్లు, ఇద్దరు జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్లతోపాటు ఐదుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఇంకా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లు కూడా ఉన్నట్టు వెల్లడైంది. ఇలా దాదాపు 50 వేల మంది ఉద్యోగులు(రెగ్యులర్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది, ఇతరులు) ఉన్నట్లు గుర్తించారు. వీరే కాకుండా చివరకు రెండుమూడేళ్ల క్రితం మరణించిన లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోనూ చేయూత పింఛన్ల మొత్తం ఇప్పటికీ జమ అవుతున్నట్టుగా తాజాగా ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైంది. సంక్షేమ పథకాల నుంచి అక్రమంగా లబ్ధి పొందుతున్న వారిలో సీనియర్ అధికారుల నుంచి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టుగా గుర్తించారు. చేయూత పింఛన్లు మొదలు కల్యాణలక్ష్మి, ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల వరకు అక్రమంగా ప్రభుత్వ సొమ్ముకు గండికొడుతున్నారు. దీంతో వివిధ పేద వర్గాల కోసం ఉదేశించిన పలు ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయని స్పష్టమవుతోంది. వివిధ వర్గాల పేదలు, నిర్దేశిత కేటగిరీలకు చెందిన నిజమైన లబ్ధిదారులకు చెందాల్సిన సంక్షేమ పథకాల ఫలాలు పలువురు ప్రభుత్వ అధికారులు మొదలు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేబుల్లోకి చేరుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా.. వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా చేయూత పింఛన్లు చనిపోయిన వారికి, అనర్హులకు అందుతున్నాయనే ఫిర్యాదులు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ప్రస్తుతం చేయూత కింద దివ్యాంగులకు నెలకు రూ.4 వేలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడి కార్మికులు, ఒంటరి మహిళలు, గీతకార్మీకులు, నేతకార్మీకులు, ఎయిడ్స్ రోగులు, బోదకాల బాధితులు, డయాలిసిస్ పేషెంట్లు, బీడీ టెకేదార్లు రూ.2 వేలు పింఛన్ పొందుతున్న విషయం తెలిసిందే. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టాలని గ్రామీణ దారిద్య్ర నిర్మూలన సంస్థ (సెర్ప్)ను సర్కార్ ఆదేశించింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో సామాజిక తనిఖీ ప్రత్యేక బృందాలతో నిర్వహించిన ‘ఫిజికల్ వెరిఫికేషన్’లో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఆసరా పింఛన్ల పథకం అమలు మొదలుపెట్టాక పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల వ్యక్తిగత హాజరు అవసరం లేకుండా, వారి బ్యాంక్ ఖాతాల్లోకి పింఛన్ మొత్తాన్ని నెలనెలా బదిలీ చేస్తున్నారు. దీంతో ఈ పింఛన్లు ఎవరికి వెళుతున్నాయి? వారెలా ఉంటారు? జీవించి ఉన్నారా లేదా? తదితర విషయాలను ఫిజికల్‌గా వెరిఫై చేసే అవకాశం అధికారులకు లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగా పింఛన్ పంపిణీ కేంద్రాలకు వెళ్లి వేలిముద్రలు, ముఖ గుర్తింపు, ఇతర రూపాల్లో గుర్తింపు చేయడం ఇబ్బందిగా మారింది. ⇒ హైదరాబాద్‌కు దగ్గరలోని ఓ మున్సిపాలిటీలోని నాలుగు వార్డుల్లో 600 మంది లబ్ధిదారులుంటే..350 మందిని ఖాతాలు పరిశీలిస్తే..అందులో 40 మంది చనిపోయినట్టుగా వెలుగులోకి వచి్చంది. వీరు మరణించి రెండేళ్లు అవుతున్నా వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ అవుతోంది. ⇒ చేయూత పింఛన్లు పొందుతున్న వారిలో ఇద్దరు జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్లతో పాటు ఇతరులను అనర్హులని గుర్తించారు. అనర్హులను అరికట్టేందుకు పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్ ఆడిట్లో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డేటాను వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటాతో లింక్ చేసి ఆధార్ సమాచారాన్ని ‘క్రాస్ వెరిఫై’చేసినప్పుడు అక్రమాలు, అనర్హుల వివరాలు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి జీతాలు, అలవెన్స్‌లు పొందుతున్న 478 రెగ్యులర్, 338 గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతన ఉద్యోగులు, పీజీ టీచర్లు 47 మంది, ఎస్జీటీ, టీజీటీలు 71 మంది, పబ్లిక్‌హెల్త్ మేనేజర్లు, లెక్చరర్లతోపాటు ఐదుగురు సివిల్ అసిస్టెంట్సర్జన్లు ఇంకా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు కూడా ఉన్నట్టు తేలింది.అధికారులు, ఉద్యోగులతోపాటు లగ్జరీ కార్లు, మూడంతస్తుల భవనాలు, పెట్రోల్ బంక్‌ల యాజమానులు కూడా ఉండడం ఆశ్చర్యం గొలుపుతోంది. అదికూడా కరీంనగర్ కార్పొరేషన్, సూర్యాపేట మున్సిపాలిటీ, ఆదిలాబాద్ జిల్లాలోని మావల గ్రామం, వనపర్తి జిల్లా ఆత్మకూరులో ప్రభుత్వపరంగా గతంలో నిర్వహించిన ‘పైలెట్ ఆడిట్’లోనే ఇంత మంది అనర్హులు సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్నట్టు తేలింది. ఉల్లంఘనలు ఇలా.. ⇒ నెలకు రూ.లక్షకుపైగా జీతం పొందుతున్న అధికారులు, ఉద్యోగుల తల్లిదండ్రుల్లో కొందరు చేయూత పింఛన్లు పొందుతున్నారు ⇒ కార్లు, ట్రాక్టర్లు, సొంతంగా పెద్ద భవనాలు ఉన్నవారు కూడా ప్రయోజనం పొందారు ⇒ దివ్యాంగులకు మాత్రమే ఇవ్వాల్సిన డిజెబిలిటీ పింఛన్లు, వైకల్యం లేకపోయినా కొందరికి అందుతున్నాయి ⇒ 50 ఏళ్లు కూడా దాటని వారికి కూడా వృద్ధాప్య పింఛన్లు అందుతున్నాయి. చర్యలేమిటి ? 2026 ఏప్రిల్ నాటికి ముఖ గుర్తింపు, ఇతర తనిఖీల ద్వారా వివిధ కేటగిరీల కింద పింఛన్ పొందే వారి మరణాలు, అనర్హతలు ఆధారంగా మొత్తం 3,01,724 పింఛన్లు తొలగించినట్టు సమాచారం. 2026–27లో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం నిర్ణయించింది. ⇒ రెగ్యులర్ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, మినిమమ్ టైమ్ స్కేల్, స్టేట్ స్కేల్ పొందుతున్న వారి సంక్షేమ పథకాల లబ్ధిని వెంటనే నిలిపేయాలని ఈ నివేదికలో ప్రభుత్వానికి అధికారులు సిఫార్సు చేశారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, దినసరి, గౌరవ వేతనం పొందే వారి పట్ల ఎలా చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.. -
మండుటెండల్లో... అనారోగ్య సమస్యల బారిన పడకూడదంటే..!
వేసవి వచ్చేసింది. ఎండలు చండప్రచండంగా నిప్పులు చెరుగుతున్నాయి. భూతాపం పెరుగుతుండటం వల్ల ఇటీవలి ఏడాదుల్లో వేసవులు మరింత దుర్భరంగా మారుతున్నాయి. భూతాపం పెరుగుదల ఫలితంగా సముద్రాలు వేడెక్కుతున్నాయి. ఆ ప్రభావం భూమ్మీద ప్రతిచోటా పడుతోంది. నడి వేసవిలో దేశవ్యాప్తంగా పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తాకిడి పెరుగుతున్నాయి. వేసవిలో ఎండల బాధ ఒకవైపు అయితే, మరోవైపు ఎండలతో పాటు ఇబ్బంది పెట్టే రకరకాల ఆరోగ్య సమస్యలు జనాలను సతమతం చేస్తాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే, వేసవి తాపం నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.ఎండల తీవ్రత పెరుగుతుండటంతో పగటి వేళల్లో ఆరుబయటకు వెళ్లడం క్షేమంకాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎండల ధాటి ఎలా ఉన్నా, అనివార్య పరిస్థితుల్లో ఉద్యోగులు, కార్మికులు సహా రకరకాల వృత్తుల్లోని వారు నడివేసవి మధ్యాహ్న వేళల్లో కూడా ఆరుబయటకు వెళ్లక తప్పని పరిస్థితులు ఉంటున్నాయి. వేసవి తీవ్రత నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వేసవిలో వడదెబ్బ బారినపడటం; దాహార్తి తట్టుకోలేక వీథుల్లో అపరిశుభ్ర పరిసరాల్లో దొరికే చెరకు రసం, పండ్లరసాలు వంటివి తాగడం వల్ల జీర్ణకోశ సమస్యల బారినపడటం; ఎండ ధాటికి చర్మం కమిలిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. వేసవిలో ఎండల ధాటికి తోడు రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా జనాలను బాధిస్తాయి.వేసవిలో ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ సోకడం; శరీరమంతా చెమటకాయలు పుట్టుకొచ్చి చర్మం మంటపెట్టడం; విపరీతమైన చెమటల వల్ల ఒంట్లోని నీరంతా బయటకు పోయి డీహైడ్రేషన్ ఏర్పడటం; వేడి వాతావరణంగా అలసట, నీరసం; చర్మంపై ర్యాష్, దురదలు, ఇన్ఫెక్షన్లు పెరగడం; కళ్లు పొడిబారి ఎర్రబడటం, కళ్లకు ఇన్ఫెక్షన్లు ఏర్పడటం; ఎండ వేడి నుంచి సేదదీరడానికి ఈతకొలనుల్లోకి దిగితే, వాటిలోని నీటి కాలుష్యం వల్ల చెవులకు, ఇన్ఫెక్షన్లు సోకడం; ఉబ్బసం రోగులకు సమస్య తీవ్రం కావడం; రకరకాల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావడం; నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం వల్ల రకరకాల జీర్ణకోశ సమస్యలు కలగడం వంటి సమస్యలు బాధిస్తాయి. తగిన ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యలను చాలా వరకు నివారించుకోవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒకవేళ ఈ సమస్యలు తలెత్తినట్లయితే, వెంటనే ప్రాథమిక చికిత్స చేయడం, అవసరమైతే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.వడదెబ్బ బారిన పడొద్దు...వేసవిలో ఎండ వేడి వల్ల తలెత్తే సమస్యల్లో తీవ్రమైనది వడదెబ్బ. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిన ప్రాంతాల్లో వడదెబ్బ సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, ఒక్కోసారి వడదెబ్బ ప్రాణాంతకంగా మారే పరిస్థితులు కూడా ఉంటాయి. తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు ఉండటం, తగినంత నీరు తాగకపోవడం, ధారాళంగా గాలి సోకని ప్రదేశాల్లో ఉండటం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మితిమీరిన శారీరక శ్రమ చేయడం వల్ల వడదెబ్బ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ సోకినప్పుడు తీవ్రమైన జ్వరం రావచ్చు. తలనొప్పి, తలతిరగడం, విపరీతమైన నిస్సత్తువ, అలసట, చర్మం పొడిబారిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు కావడం లేదా మలబద్ధకం ఏర్పడటం, గందరగోళానికి లోనవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.వడదెబ్బ నుంచి రక్షణ పొందడానికి రోజూ తగినంత నీరు తాగడం, కొబ్బరినీరు, మజ్జిగ, తాజా పండ్లరసాలు తాగడం మంచిది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు లేదా టోపీ ధరించడం, చలవ కళ్లద్దాలు పెట్టుకోవడం, వదులైన కాటన్ దుస్తులు ధరించడం వల్ల కొంత ఉపశమనంగా ఉంటుంది. వడదెబ్బ ముప్పు తగ్గాలంటే, కెఫీన్ పానీయాలు, మద్యపానం బాగా తగ్గించుకోవాలి.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి వడదెబ్బ సోకవచ్చు. అలాంటప్పుడు వడదెబ్బ సోకిన బాధితులను వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకువెళ్లాలి. ఫ్యాన్ లేదా ఏసీ కింద ఉంచాలి. శరీరాన్ని తడిగుడ్డతో తుడవాలి. చల్లని నీళ్లు లేదా ఓఆర్ఎస్ ఇవ్వాలి. పరిస్థితి తీవ్రమై, స్పృహకోల్పోయే పరిస్థితులు ఉంటే, వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలి.జీర్ణకోశ సమస్యలు...వేసవిలోని వేడి వాతావరణంలో వండిన ఆహారం ఎక్కువసేపు నిల్వ ఉండదు. పగలు వండిన ఆహారం సాయంత్రానికే పాడైపోతుంది. అపరిశుభ్ర పరిసరాల్లో ఆహారం వండే టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఆహార పదార్థాలు తినకపోవడమే మంచిది. అలాగే, అపరిశుభ్ర పరిసరాల్లోని పండ్లరసాలు, చెరకురసం బండ్ల వద్ద పానీయాలు తాగకుండా ఉండటం మంచిది. అపరిశుభ్ర పరిసరాల్లో పాడైన ఆహారం తీసుకున్నా, పానీయాలు తీసుకున్నా వేసవిలో జీర్ణకోశ సమస్యల ముప్పు ఎక్కువవుతుంది. కలుషిత ఆహార పానీయాల కారణంగా వేసవిలో టైఫాయిడ్, అతిసార వ్యాధులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో జీర్ణకోశ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే, ఇంట్లో తాజాగా వండిన ఆహారం తీసుకోవాలి. ఇంట్లో వండిన ఆహారమైనా ఎక్కువసేపు నిల్వ ఉన్నది తినకపోవడమే మంచిది. తాగే నీరు, తినే ఆహారం స్వచ్ఛంగా, శుభ్రంగా ఉండేటట్లు చూసుకుంటే వేసవిలో జీర్ణకోశ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఒకవేళ వాంతులు, విరోచనాలు, జ్వరం, తలతిరగడం, నిస్సత్తువ వంటి సమస్యలు తలెత్తితే, డీహైడ్రేషన్ వల్ల నీరసించిపోకుండా ఉండటానికి ఓఆర్ఎస్ తీసుకోవాలి. వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు మందులు వాడుకోవడం తప్పనిసరి.వేసవిలో దోమల బెడదవేసవిలో కూడా కొన్నిచోట్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండే చోట్ల, పరిసరాల్లో మురుగునీటి గుంతలు ఉండే పరిసరాల్లో దోమలు విజృంభిస్తాయి. వేసవి రాత్రుళ్లలో గాలి సోకడం కోసం చాలామంది ఇళ్ల కిటికీలను తెరిచి ఉంచుతారు. ఇవి దోమలకు రాచమార్గంగా ఉంటాయి. కిటికీలు తెరిచినా, దోమల బెడద లేకుండా ఉండాలంటే, కిటికీలకు దోమలు చొరబడని రీతిలో తెరలను అమర్చుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమ తెరలు వాడాలి. దోమలు కుట్టకుండా ఉండటానికి శరీరానికి క్రీమ్స్ రాసుకోవాలి. దోమల బారిన పడితే డెంగీ, మలేరియా, చికున్ గున్యాలాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యా«ధులు సోకితే జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి.వేసవిలో కంటి సమస్యలువేసవిలో ఎండ తీవ్రతకు రకరకాల కంటి సమస్యలు తలెత్తుతాయి. ఎండలోని అతినీలలోహిత కిరణాల ప్రభావంతో పాటు దుమ్ము« దూళి కాలుష్యం వల్ల కళ్లు పొడిబారడం, ఎర్రబడటం, కళ్ల నుంచి నీరు కారడం, తరచుగా పుసులు రావడం, కళ్లు మంటపెట్టడం, కళ్ల వాపు, వెలుతురు చూసినప్పుడు ఇబ్బంది కలగడం, కనుపాపపై పుండుç ఏర్పడం వంటి సమస్యలు కలుగుతాయి. వీటిలో కొన్ని అలెర్జీల వల్ల, ఇంకొన్ని ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు పదేపదే చేతితో కళ్లు రుద్దకుండా ఉండాలి.కళ్లు తుడుచుకోవడానికి శుభ్రమైన పొడి రుమాలు లేదా న్యాప్కిన్ వాడుకోవాలి. కళ్లు బాగా ఎర్రబడటం, పుసులు రావడం, చూపు మసకబారడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే కంటివైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవడం మంచిది. వేసవిలో కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అతినీలలోహిత కిరణాలను వడగట్టగలిగే చలవ కళ్లద్దాలను ధరించడం మంచిది. అలాగే, నేరుగా ఎండ కళ్ల మీద పడకుండా ఉండటానికి గొడుగు లేదా టోపీ వాడుకోవడం మంచిది.ఎండల ధాటిని మనం ఎలాగూ తగ్గించలేం. కాబట్టి, ఎండలు ఎక్కువగా ఉండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే చేయగలం. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికి తగినట్లుగా వారికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి ఇంట్లో ఎవరో ఒకరు వడదెబ్బ బారినపడి, తీవ్ర అనారోగ్యానికి లోను కావచ్చు. అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఎండల తీవ్రత పెరిగే కొద్ది ఎవరికి వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటే, ఎండల వేడి వల్ల వచ్చే ఇబ్బందులను పూర్తిగా అధిగమించి, సురక్షితంగా ఉండవచ్చు. చర్మ సమస్యలువేసవిలో ఎండలోని అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మం కందిపోవడం, చెమటలు ఎక్కువై చెమటకాయలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చెమటకాయలను నివారించుకోవాలంటే రోజుకు రెండు మూడుసార్లు శుభ్రంగా స్నానం చేయాలి. శరీరాన్ని పూర్తిగా పొడిగా తుడుచుకున్న తర్వాత వదులుగా ఉండేలా చెమటను తేలికగా పీల్చుకునే కాటన్ దుస్తులు ధరించాలి. ఉక్కపోత ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలి. ఫ్యాన్, కూలర్ లేదా ఏసీ ఉన్న చోట ఉండటం మంచిది. అప్పటికీ చెమటకాయలు ఉంటే, ఉపశమనానికి ప్రిక్లీహీట్ పౌడర్ లేదా కేలమైన్ లోషన్ వాడటం మంచిది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పనిసరిగా సన్‌స్క్రీన్ వాడాలి. సన్‌స్క్రీన్ వల్ల చర్మం కందిపోకుండా ఉంటుంది.రోజూ తగినంత మంచినీరు, కొబ్బరినీరు, పానకం, తాజా పండ్ల రసాలు వంటివి తీసుకోవడం, తేలికగా జీర్ణమయ్యేలా తాజాగా వండిన ఆహారం తీసుకోవడం మంచిది. వేసవిలో చెమట ఎక్కువగా ఉండటం వల్ల చెమటకాయలే కాకుండా, చర్మానికి రకరకాల ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం కూడా ఉంటుంది. రోజూ శుభ్రంగా స్నానం చేయడం, చర్మం పొడిగా ఉండేట్లు చూసుకోవడం, గాలిసోకి చెమటను పీల్చుకునేలా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా చర్మానికి ఇన్ఫెక్షన్లు సోకినట్లయితే, వారు వాడే తువ్వాళ్లు, దుస్తులు వేరుగా ఉంచి, ఉతకడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి, వారి సూచనలపై తగిన చికిత్స తీసుకోవాలి.వృద్ధులకు జాగ్రత్తలువేసవిలో వృద్ధులు మరింతగా ఇబ్బంది పడతారు. ఎండల ధాటికి వృద్ధులు త్వరగా అలసట చెంది, నీరసించిపోతారు. ఇక డయాబెటిస్, బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారి పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది. వేసవిలో వృద్ధులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇబ్బందుల నుంచి గట్టెక్కగలుగుతారు.⇒ వేసవిలో వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్‌కు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల తరచు మంచినీళ్లు, గ్లూకోజ్, మజ్జిగ, కొబ్బరినీరు, పండ్లరసాలు వంటివి తాగడం మంచిది.⇒ చక్కగా గాలి వచ్చే గదుల్లో ఉండాలి. ఫ్యాన్, కూలర్, ఏసీ ఉన్న చోట ఉండటం మంచిది.⇒ ఎండ తీవ్రత ఉన్న సమయంలో బయటకు వెళ్లడం తగ్గించుకోవాలి.⇒ బీపీ, సుగర్ సమస్యలతో బాధపడేవారు వైద్యుల సూచనపై వేళకు మందులు వేసుకోవాలి.⇒ ఉప్పు, నూనెలు తక్కువగా ఉండే తేలికపాటి ఆహారం తీసుకోవాలి.⇒ తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి.⇒ విపరీతంగా చెమటలు పోయడం, తలతిరగడం, గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి.పిల్లలకు జాగ్రత్తలువేసవి తీవ్రత ఆరోగ్యవంతులైన పెద్దలకే దుర్భరంగా ఉంటుంది. అలాంటప్పుడు వేసవిలో పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే, వేసవి తాపం నుంచి పిల్లలకు రక్షణ కల్పించవచ్చు.⇒ పిల్లలు ఆటల్లో పడితే ఆకలి దప్పులను మరచిపోతారు. వేసవిలో దాహంగా ఉన్నా, లేకపోయినా పిల్లల చేత మంచినీళ్లు, కొబ్బరినీరు, పండ్లరసాలు వంటివి తాగిస్తూ ఉండాలి.⇒ పగటి పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయట ఆటలు ఆడనివ్వకండి.⇒ ఎండ ఉన్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా టోపీ లేదా గొడుగు వాడాలి.⇒ పిల్లలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం పెట్టాలి. ఇంట్లో తాజాగా వండిన ఆహారంతో పాటు పుచ్చకాయలు, కీరదోసకాయలు, పెరుగు వంటివి ఇవ్వడం మంచిది.⇒ పిల్లలకు వేసవిలో తేలికపాటి వదులైన కాటన్ దుస్తులు వేయడం మంచిది.⇒ చెమటకాయల నివారణ కోసం తరచు స్నానం చేయించాలి. స్నానం తర్వాత శరీరం పూర్తిగా పొడిగా ఉండేలా తుడిచాక దుస్తులు తొడగాలి.⇒ పిల్లల్లో అలసట, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలి.ఎండ తీవ్రత ఎప్పుడు ప్రమాదకరం?వేసవిలో ఎండ తీవ్రత 35 డిగ్రీల సెల్సియస్ దాటినప్పటి నుంచి సమస్యలు పెరుగుతాయి. వేసవి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉన్నప్పుడు బయట ఎక్కువసేపు తిరిగే వారిలో డీహైడ్రేషన్, తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఎండల ధాటి 40–45 డిగ్రీలకు చేరుకుంటే, ప్రమాద స్థాయి మరింతగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి చేరినప్పుడు బయట ఎక్కువసేపు ఉంటే త్వరగా అలసట, నీరసం ముంచుకొచ్చి, డీహైడ్రేషన్‌కు లోనవడం, వాంతులు, తలతిరగడం, వడదెబ్బకు లోనవడం వంటి ప్రమాదాలు తలెత్తవచ్చు.ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినట్లయితే, వడదెబ్బ సోకే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. గడచిన పదేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.5–42.5 డిగ్రీల వరకు; తెలంగాణలో 41.5 నుంచి 43.5 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. విజయవాడ, కర్నూలు, రామగుండం, భద్రాచలం వంటి కొన్ని ప్రాంతాల్లో వేసవి సగటు గరిష్ఠ ఉస్ణోగ్రతలు 45–47 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. అందువల్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకినప్పటి నుంచి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. -
ఎనర్జిటిక్ కలర్స్ అవీ!
ట్రెడిషనల్ నుంచి ట్రెండీ మోడ్రన్ లుక్స్ వరకు, ప్రతి స్టయిల్‌ను తన స్మైల్‌తో స్పెషల్‌గా మార్చేసే నటి శ్రీలీల. ఇందుకోసం ఆమె ఫాలో అయ్యే ఆ సింపుల్, స్టయిలింగ్ టిప్స్ ఇప్పుడు మీకోసం!‘డల్ కలర్స్ కంటే వైబ్రెంట్ కలర్స్ నన్ను మరింత ఎనర్జిటిక్‌గా ఉంచుతాయి. ఒకవైపు ట్రెడిషనల్ లంగా ఓణీ, మరోవైపు మోడ్రన్ కోఆర్డ్ సెట్స్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఇష్టం. కాని, నేను వేసుకునేది ఏదైనా, అది నా డ్యాన్స్ కి అడ్డురాకూడదు. అంత కంఫర్టబుల్‌గా ఉండాలి. ఇక షూటింగ్స్ వల్ల ఎంత బిజీగా ఉన్నా నా స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండటానికి విటమిన్–సి సీరమ్స్, ఫ్రూట్ జ్యూసెస్ని అస్సలు మిస్ చేయను. అదే నా గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్! – శ్రీలీలజ్యూలరీ బ్రాండ్: కశ్నీవాచీ ధర రూ. 2,999, హ్యాండ్ పీస్ ధర రూ. 2,299, నెక్ పీస్ ధర రూ. 1,299డ్రెస్.. బ్రాండ్: ఛవీ అగర్వాల్ ధర రూ. 40,500స్టయిల్‌కు సమయం వచ్చింది!చేతిపై ఈ వాచ్ పడితే, అది టైమ్ చెప్పడమే కాదు, స్టయిల్ కూడా చూపిస్తుంది! సాధారణంగా వాచ్ అంటే టైమ్ చూడటానికే అనుకుంటాం, కాని, ఇది ‘ నేను జ్యూలరీ కూడా!’ అని గర్వంగా చెప్తుంది. చిన్న డయల్ చుట్టూ మెరిసే రాళ్లు, నాజూకైన చైన్ డిజైన్ తో చేతికి తొడుక్కున్న క్షణంలోనే లుక్‌కి స్పెషల్ గ్లామ్ టచ్ వచ్చేస్తుంది. టైమ్ చూసే ముందు, అందరూ మీ చేతినే చూసేలా చేసే చిన్న మాయ ఇదే.ట్రెడిషినల్, వెస్ట్రన్ వేర్, ఆఫీస్ వేర్, పార్టీ వేర్‌తో ఇలా ఏ సందర్భానికైనా ఇది ఈజీగా సెట్ అవుతుంది. అయితే, జ్యూలరీ వాచ్ వేసుకున్నప్పుడు చేతికి బ్యాంగిల్స్ వేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే, ఈ వాచే షో స్టాపర్ కదా! అలాగే, స్లీవ్ కొంచెం పైకి ఉండే డ్రెస్సులు లేదా తక్కువ స్లీవ్ ఉంటే, ఇది మరింత హైలైట్ అవుతుంది. అలా మొత్తానికి, ఈ జ్యూలరీ వాచ్ స్టయిల్‌కు టైమ్ స్టార్ట్ అయింది! మార్కెట్లోనూ, ఆన్ లైన్ లోనూ ఆక్సిడైజ్డ్, మోడర్న్, ఫంకీ ఏ డిజైన్స్ కావాలన్నా ఇవి సులభంగా లభిస్తాయి. -
అందమైన సైలెంట్ లైఫ్!
గ్లామర్ కంటే నటనకే పెద్దపీట వేస్తూ, రంగుల ప్రపంచంలో తన ప్రయాణాన్ని ఎంతో హుందాగా కొనసాగిస్తున్న తెలుగమ్మాయి నటి ఆనంది. ఆ విశేషాలన్నీ ఇప్పుడు ఆమె మాటల్లోనే..నా పేరు అది కాదు..నా అసలు పేరు రక్షిత. కానీ ఇండస్ట్రీలోకి వచ్చాక ‘ఆనంది’గా మారాను. నేను పుట్టి పెరిగింది వరంగల్‌లో. పక్కా తెలంగాణ అమ్మాయినే అయినా, చెన్నై వెళ్లాక తమిళ సంస్కృతికి కూడా బాగా కనెక్ట్ అయిపోయాను.బాల్యం ఇచ్చిన బలం!చిన్నప్పుడు స్కూల్ ఫంక్షన్లలో స్టేజ్‌పైకి వెళ్లాలంటే కాళ్లు వణికేవి. అలాంటిది, ఈ రోజు వేలమంది చూసే వెండితెరపై కనిపిస్తున్నానంటే అది కేవలం నాపై నాకు ఉన్న నమ్మకమే. హాస్టల్ లైఫ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి చేసిన అల్లరి, రాత్రిపూట దొంగచాటుగా తినడం వంటి చిన్న చిన్న సాహసాలు కూడా నన్ను మానసికంగాస్ట్రాంగ్గా చేశాయి.నా చాయిస్ సైలెంట్ లైఫ్!సినిమాల్లో నేను ఎంత సైలెంట్‌గా కనిపిస్తానో, నిజ జీవితంలో కూడా అంతే. పార్టీలకు వెళ్లడం కంటే షూటింగ్ అయిపోగానే నా గదిలో ప్రశాంతంగా ఉండటానికే ఇష్టపడతాను. నా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా చిన్నదే. సోక్రటీస్‌తో నా వివాహం 2021లో చాలా సింపుల్‌గా జరిగింది. నా పర్సనల్ లైఫ్ ఎప్పుడూ లో ప్రొఫైల్‌లోనే ఉండాలని నేను కోరుకుంటాను.ఒక్క సినిమా, జీవితాన్ని మార్చింది!‘బస్టాప్’ సినిమాతో నా ప్రయాణం మొదలైంది. కానీ ‘కాయల్’ సినిమా నా కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా తర్వాత అందరూ నన్ను ‘కాయల్ ఆనంది’ అని పిలవడం మొదలుపెట్టారు. అది నాకు లభించిన అతిపెద్ద గుర్తింపు.పుస్తకాలే నా ప్రపంచం!నేను ఒక పక్కా బుక్వర్మ్. నా బ్యాగ్‌లో ఎప్పుడూ ఒక పుస్తకం తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా హారర్, సస్పె¯Œ ్స, థ్రిల్లర్ నవలలంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం.నో డైట్!ఫుడ్‌లో తెలంగాణ వంటకాలు, ముఖ్యంగా పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టం. డైట్ పేరుతో నన్ను నేను కష్టపెట్టుకోను. మితంగా తినడం, సింపుల్‌గా జీవించడం నా స్టైల్.పవర్ఫుల్ పాత్రలు!సినిమాల్లో ‘విలేజ్ గర్ల్’ పాత్రలే ఎక్కువగా వచ్చినా, ‘జాంబీ రెడ్డి’లాంటి సినిమాలతో నాలోని మరో కోణాన్ని చూపించగలిగాను. నటిగా ఏ ఒక్క ఇమేజ్కో పరిమితం కాకుండా, భవిష్యత్తులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు లేదా ఒక పవర్ఫుల్ పీరియడ్ డ్రామాలో నటించాలన్నదే నా ఆశ. -
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం,తిథి: బ.దశమి రా.9.23 వరకు తదుపరి ఏకాదశి, నక్షత్రం: శ్రవణం ఉ.11.49 వరకు తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: ప.3.56 నుండి 5.37 వరకు, దుర్ముహూర్తం: సా.4.32 నుండి 5.21 వరకు, అమృత ఘడియలు: రా.1.57 నుండి 3.36 వరకు.సూర్యోదయం : 5.49సూర్యాస్తమయం: 6.10రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకుయమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు మేషం.. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో అనుకూలం. కొత్త పనులు మరిన్ని చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శనం.వృషభం... ఆర్థిక పరిస్థితి గందరగోళం. మానసిక అశాంతి. ఆరోగ్యభంగం. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగ ఒత్తిడులు.మిథునం.... కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. పనులు నిదానిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కర్కాటకం... కొత్త విషయాలు గ్రహిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. సన్నిహితులతో విభేదాలు నెలకొంటాయి. దైవచింతన.సింహం.... పనుల్లో విజయం. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటుంది. ధనలాభ సూచనలు.కన్య... పరిస్థితులు అనుకూలించవు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు. కొన్ని పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.తుల.. ముఖ్య పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు. కుటుంబంలో చికాకులు. ఆలయాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం.వృశ్చికం... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు నుంచి ధనలబ్ధి. గృహయోగం. నూతన ఉద్యోగాలలో చేరతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అభివృద్ధిపథంలో సాగుతాయి.ధనుస్సు... పనుల్లో ప్రతిబంధకాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.మకరం... పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా మరింత అనుకూలత. వస్తులాభాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.కుంభం.... వ్యయప్రయాసలు. ముఖ్యమైన పనులు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.మీనం.... చేపట్టిన పనులు పూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు. ప్రముఖులతో పరిచయాలు. శుభవర్తమానాలు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. -
బడ్జెట్ లెక్క... ఏంటీ తికమక?
సాక్షి, హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరానికి (2025–26)గాను రాష్ట్ర ప్రభుత్వం సవరించిన బడ్జెట్ అంచనాలు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్కలకు పొంతన కుదరలేదు. రాష్ట్ర ప్రభుత్వ రాబడులతోపాటు ఖర్చులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు తదితర అంశాల్లో ఆర్థిక సంవత్సరం మొత్తానికి ప్రభుత్వం చూపిన అంకెలు, కాగ్ నివేదికలో పేర్కొన్న మొత్తాలను పరిశీలిస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. అయితే అంతర్గత సర్దుబా ట్లు, లెక్కలు తయారు చేసినప్పుడు సమయాభావం తదితర కారణాల వల్ల ఈ వ్యత్యాసం సహజమేనని అంటున్న ఆర్థిక నిపుణులు.. అసహజ వ్య త్యాసం ఉండటం మాత్రం అరుదైన విషయమని అంటున్నారు. దీనికి ఆర్థిక శాఖ అధికారులే సమాధానం చెప్పాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పన్ను ఆదాయం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ వరకు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సవరించిన బడ్జెట్ అంచనాలు, కాగ్ నివేదికలకు మధ్య అనేక అంశాల్లో వ్యత్యాసం కనిపించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తం కలిపి పన్ను రాబడుల కింద రూ. 1.34 లక్షల కోట్లుకుపైగా వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాల్లో పేర్కొంది. కానీ ఆర్థిక సంవత్సరం మరో నెల మిగిలి ఉండగానే ఫిబ్రవరి మాసాంతానికే పన్ను రాబడులు రూ. 1.39 లక్షల కోట్ల మేరకు వచ్చినట్లు ‘కాగ్’నివేదికలో పేర్కొంది. అంటే ఒక నెల మిగిలి ఉండగానే రూ. 5 వేల కోట్లు ఎక్కువగా పన్ను రాబడులు వచ్చాయని ‘కాగ్’వెల్లడించింది. ఇక మార్చిలో పన్ను ఆదాయం మరో రూ. 12 వేల కోట్లకుపైగా వస్తుందని అంచనా వేస్తే ప్రభుత్వ లెక్కలకు, కాగ్ అంకెలకు మధ్య పన్ను రాబడుల విషయంలో సుమారు రూ. 17 వేల కోట్ల మేర వ్యత్యాసం వస్తోంది. అప్పుల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2025–26 సవరించిన అంచనాల ప్రకారం ఏడాది మొత్తం మీద రూ. 77,545.92 కోట్ల మేర అప్పులు తీసుకున్నట్లు ప్రభుత్వం చూపింది. కానీ ‘కాగ్’లెక్కల్లో మాత్రం ఫిబ్రవరి నాటికే రూ. 77,111 కోట్ల మేర ప్రభుత్వం రుణాలు సమీకరించినట్లు వెల్లడించింది. అయితే మార్చిలో తీసుకొనే అప్పుల కంటే చెల్లింపులు ఎక్కువగా ఉంటే ఆ మేరకు అప్పులు తగ్గే అవకాశముంది కానీ.. ఏ మేరకు చెల్లింపులు జరిగి ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ‘కాగ్’లెక్కల్లో వచ్చిన తేడా మేరకు కనీసం రూ. 6 వేల కోట్లయినా అప్పుల కంటే చెల్లింపులు ఒక్క నెలలోనే చేయడం సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏడాది మొత్తం మీద రూ. 29,471 కోట్లు వచ్చాయని ప్రభుత్వం బడ్జెట్ లెక్కల్లో పేర్కొంటే ‘కాగ్’లెక్కల్లో మాత్రం ఫిబ్రవరి నాటికి రూ. 18,788 కోట్లు మాత్రమే రావడం గమనార్హం. అంటే మార్చి నెలలోనే సుమారు రూ. 9 వేల కోట్లు కేంద్రం నుంచి ఉంటాయా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇక గ్రాంట్–ఇన్–ఎయిడ్ విషయానికి వస్తే ఏడాది మొత్తంలో రూ. 11,161 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తే ఫిబ్రవరి నాటికి రూ. 6,140 కోట్లు మాత్రమే వచ్చాయని ‘కాగ్’వెల్లడించింది. ఈ లెక్కన మార్చి నెలలో కేంద్రం నుంచి మరో రూ. 5 వేల కోట్లు రావాలన్నమాట. అయితే ప్రభుత్వ అంచనాలు, ‘కాగ్’లెక్కల్లో తేడాలు సహజమేనని.. లెక్కలు తీసుకొనే నాటికి అందుబాటులో కొన్ని వివరాలు లేకపోవచ్చని.. చెల్లింపులు, సర్దుబాట్ల కారణంగా కూడా కొంత తేడా వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ మేరకు తేడా రావడం మాత్రం పరిశీలించాల్సిన అంశమని అంటున్నారు. అంకెల గారడీ కోసం అంచనాలను రూపొందించకుండా వాస్తవిక దృక్పథంతో వెళ్తేనే ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని వారు సూచిస్తున్నారు. ఏమిటీ నివేదికలు? వాస్తవానికి ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలతోపాటు ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక రూపొందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ పంపే వివరాల ప్రకారమే ఈ నివేదికలు తయారవుతాయి. అలాగే ఏటా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా అంతకుముందు ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదిత అంచనాలు, సవరించిన అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. ఈ సవరించిన అంచనాలను ఏడాది మొత్తానికి (బడ్జెట్ పెట్టే మార్చి నెల రాబడులు, వ్యయాల అంచనాలను లెక్కగట్టి) ప్రతిపాదిస్తుంది. ఇదే తరహాలో గత నెల 20న 2025–26 సవరించిన అంచనాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 28 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను తెలియజేస్తూ శనివారం ‘కాగ్’వెబ్సైట్లో ఓ నివేదిక పెట్టింది. ఈ రెండింటి మధ్య రాబడులు, ఖర్చులు, కేంద్ర నిధుల విషయంలో తేడాలు ఉండటం గమనార్హం. -
వి.కె. శశికళ (‘చిన్నమ్మ’) రాయని డైరీ
తిరుప్పరన్కుణ్రం నుంచి అరప్పాలయం కూడలికి చేరుకోగానే ‘అక్క’ జ్ఞాపకాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అక్క ఆ కూడలిలో ఎన్నోసార్లు ఆగారు. అక్క రాక కోసం అక్కడివాళ్లు చెట్ల నీడల్ని చాపల్లా పరుచుకుని, మిద్దెల పైన ఎర్రటి ఎండల్లో కనురెప్పల్ని గొడుగుల్లా తెరిచి పట్టుకుని ఎదురు చూస్తుండేవారు. కళ్లూ చెవులే కాదు, ఆత్మనూ అప్పగించి అంతా అక్క మాటల్లో కొట్టుకుపోయేవాళ్లు! అక్క గొంతులో అమ్మతనం ఉండేది. కరుణానిధి మాటొస్తే అక్క స్వరం అగ్నిపర్వతం అయ్యేది. అక్క నాతో అంటుండేవారు, ‘‘శశీ! ప్రజల్లోకి వచ్చావంటే, నువ్విక నాయకురాలివి కాదు, ప్రజలే నీ నాయకులు’’ అని! నేనిప్పుడు ప్రజల్లోకి వచ్చాను. ప్రజలు అనే నాయకులు ఇప్పుడు నాకు రెండు ఆదేశాలు ఇచ్చారు. ‘‘చిన్నమ్మా... దుష్ట సంహారం చెయ్’’, ‘‘చిన్నమ్మా... నీ అడుగడుగునా మాకు ‘అమ్మ’ను గుర్తు చెయ్’’ అంటున్నారు. తేనిలోని ఆండిపట్టి దగ్గర కూడా ఇదే విధమైన భావోద్వేగం నన్ను కమ్మేసింది. ‘‘చిన్నమ్మా! మీరు దిగులు పడకండి. మీకు అండగా మేమున్నాం’’ అని ప్రజలు గట్టిగా అరిచి చెప్పారు. ఒక్కసారిగా నా కళ్లలోంచి నీరు ఉబికి వచ్చింది.అక్క కూడా నాతో ఇలాగే అనేవారు. ఇద్దరం వ్యాన్‌లో సభలకు వెళుతున్నప్పుడు, అకస్మాత్తుగా... ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్ శశీ?’’ అని అడిగేవారు! ‘‘ఏమీ ఆలోచించటం లేదక్కా’’ అనేంత లోనే – ‘‘నువ్వు వెనక సీట్లో ఉన్నా, నేను ఉన్నది ముందు సీట్లో కాదు. నీ పక్క సీట్లోనే...’’ అని వెనక్కు తిరిగి, నా వైపు చూసి నవ్వేవారు. ఇప్పుడు వ్యాన్‌లో అక్క నా ముందు సీట్లో లేరు, నా పక్క సీట్లో లేరు. నేనే అక్క సీట్లో ముందు వైపు ఉన్నాను. ప్రజల దగ్గరికి అక్క ఆశీస్సులు మాత్రమే నన్ను నడిపిస్తున్నాయి. తిరుమంగళం, ఉసిలంపట్టి, మేలూరు, శంకరన్ కోయిల్, ముత్తుకుళత్తూరు, పరమకుడి, శివగంగ, మన్నార్గుడి, మైలాడుదురై, తంజావూరు, తూర్పు తిరుచ్చి, మదురై సెంట్రల్... అన్నీ, అమ్మ తన కన్నబిడ్డల్లా చూసుకున్న దక్షిణ ప్రాంతాలే! ఇప్పుడా కన్నబిడ్డలు ఈ చిన్నమ్మను కడుపులో పెట్టుకోకుండా ఉంటారా, చిన్నమ్మ కొత్త పార్టీ ‘ఆలిండియా పురట్చి తలైవర్ మక్కళ్ మున్నేట్ర కజగం’ను చేరదీయకుండా ఉంటారా? ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయటం లేదు. 2027 వరకు నేను ఎన్నికల్లోనే పోటీ చేయటానికి లేదు. కానీ అక్కకు ఎంజీఆర్ ఇచ్చిన అన్నాడీఎంకే పార్టీని, అక్క నాకు వారసత్వంగా ఇచ్చి వెళ్లిన అన్నాడీఎంకే పార్టీని... ఎడప్పాడి పళనిస్వామి లాగేసుకున్నాడు. అతడి నుంచి తిరిగి అన్నాడీఎంకేను దక్కించుకోవాలి. పార్టీ బ్యానర్ల మీద శ్రీ ఎంజీఆర్ పక్కన అక్క; అక్క పక్కన నన్నూ చూసేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ ‘చిన్నమ్మ’ను ‘త్యాగ తలైవి’ అని కొనియాడుతున్నారు!సొంతంగా 80 చోట్ల, ‘పాట్టాళి మక్కళ్ కట్చి’తో కలిసి మొత్తం 234 స్థానాల్లో,ఈ త్యాగ తలైవి నిలబడవలసి వచ్చిందంటే... వచ్చే సీట్ల కోసం కాదు, పళనిస్వామికి పోగొట్టవలసిన సీట్ల కోసం అని ప్రజలందరికీ తెలుసు. కొందరు నన్ను అడుగుతున్నారు... ‘‘పార్టీ మీ దగ్గర లేదు, రెండాకుల గుర్తు మీ దగ్గర లేదు, మీరెలా గెలుస్తారు?’’ అని. నేను నవ్వుతాను. ‘‘పళనిస్వామికి పార్టీ ఆఫీసు తాళాలు దొరికి ఉండవచ్చు, కానీ కోట్లాది మంది కార్యకర్తల గుండెల్లో ఉండే ‘అమ్మ’ గది తాళం నా దగ్గరే ఉంది!’’ అని చెబుతాను. ఈ ఎన్నికల్లో నేను గెలవకపోవచ్చు,కానీ ద్రోహులు గెలవకుండా చూడగలను. రేపటి చరిత్రలో... ద్రోహం అక్రమంగా సింహాసనాన్ని అధిరోహిస్తే, ధర్మం కోసం త్యాగం ఆ సింహాసనాన్నే కూల్చేసిందని ప్రజలు చెప్పుకుంటారు. అదే నా గెలుపు! అదే... అక్కకు నేను పట్టే హారతి! -
అందం పందెంలో పసిపిల్లలు
చిన్నారులు సైతం అందంపై మక్కువ పెంచుకుంటున్నారు. స్కిన్ కేర్ రొటీన్లలో మునిగిపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఆకర్షణీయమైన బ్యూటీ ఇన్ ఫ్లుయెన్సర్ల ప్రభావంతో చిన్నారులు కూడా తమ స్కూల్ బ్యాగ్‌లలో ఖరీదైన కాస్మెటిక్స్‌ని క్యారీ చేస్తున్నారు. వీరినే నిపుణులు ‘సెఫోరా కిడ్స్’గా పిలుస్తున్నారు.స్కిన్ కేర్ అవసరమా?కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల కోసం పిల్లల బాల్యాన్ని పణంగా పెడుతున్నాయంటూ వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జెన్ ఆల్ఫా అంటే 2010–2020 మధ్య జన్మించిన పిల్లలు ఖరీదైన మాయిశ్చరైజర్లు, వృద్ధాప్య ఛాయలను తగ్గించే సీరమ్‌లను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ కొత్త ట్రెండ్‌ని అవకాశంగా మలచుకుంటోంది కాస్మెటిక్స్ రంగం. అసలు ఈ బేబీ–ఫేస్ బ్యూటీ ధోరణి గత ఏడాది ఒక కంపెనీ పసిబిడ్డల కోసం ప్రత్యేకంగా స్కిన్ కేర్ ఉత్పత్తులను తీసుకురావడంతో మొదలైంది. మూడేళ్ల పిల్లల నుంచి వాడవచ్చునంటూ పలు రకాల ఫేస్ మాస్క్‌లను తను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ బ్యూటీ ఉత్పత్తులపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆటపాటలతో గడపాల్సిన చిన్నారులకు స్కిన్ కేర్ అవసరమా అంటూ ప్రపంచ వ్యాప్త చర్చకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా!కంపెనీలు ఇప్పుడు పసిపిల్లల కోసం కూడా మేకప్, స్కిన్ కేర్ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. పెద్ద రిటైల్ స్టోర్లు తమ దుకాణాల మధ్యలో పిల్లలను ఆకర్షించేలా అందమైన బొమ్మలతో కూడిన సౌందర్య ఉత్పత్తులను పెడుతున్నాయి. ముఖ్యంగా మార్కెటింగ్‌కి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నాయి. స్కిన్ ఫ్లుయెన్సర్లు అని పిలిచే చిన్నపిల్లలు ఈ ఉత్పత్తులను ఎలా వాడాలో చూపిస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత పిల్లలు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం దీనికి కారణమైంది. పిల్లలు ఒకసారి శోధించగానే అధునాతన ఆల్గారిథమ్‌లు వారికి మరిన్ని బ్యూటీ టిప్స్, ఇన్ ఫ్లుయెన్సర్ల వీడియోలను చూపిస్తున్నాయి. ఈ వీడియోలు పిల్లలను ఆ అలవాట్లను అనుకరించేలా ప్రోత్సహిస్తున్నాయి. గణాంకాల ప్రకారం, పిల్లల స్కిన్ కేర్ మార్కెట్ 2028 నాటికి రూ. 380 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. కాస్మెటి కోరెక్సియాసౌందర్య ఉత్పత్తులు పిల్లలకు అందం అంటే ఏమిటో తెలియకముందే, రూపానికి ఏదో మెరుగుదల అవసరమనే సందేశాన్ని తెలియకుండానే పంపిస్తాయి. డిజిటల్ ప్రపంచంలో పదేళ్ల వయసున్న అమ్మాయిలు కూడా ఇతర పిల్లలను చూసి ప్రభావితమవుతున్నారు. దీనివల్ల కాస్మెటికోరెక్సియా అనే కొత్త మానసిక సమస్య పుట్టుకొచ్చింది. అంటే సౌందర్య ఉత్పత్తులు, చర్మ సంరక్షణ పట్ల అతిగా, పిచ్చిగా ఆసక్తి చూపడం. ఇలాంటి పద్ధతులకు చిన్నప్పుడే అలవాటు పడటం వల్ల పిల్లల్లో ఒత్తిడి, పోలికలు పెరుగుతాయి. ఈ ధోరణి వల్ల పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతూ, వర్చువల్ ప్రపంచంలో బందీలుగా మారుతున్నారు. గుడ్డిగా నమ్మొద్దుపసిబిడ్డలకు ΄ పౌష్టికాహారం, నిద్ర, ఆటలే ఉత్తమ స్కిన్ కేర్ అని సూచిస్తున్నారు స్కిన్‌కేర్ నిపుణులు. స్కిన్ కేర్ ట్రెండ్లను గుడ్డిగా అనుసరించకూడదంటున్నారు. సౌందర్య సాధనాల పరంగా పసిబిడ్డలకు స్కిన్ కేర్ అవసరం లేదంటున్నారు. ఫేస్ మాస్క్‌లు, స్క్రబ్‌లు, షీట్ మాస్క్‌ల వంటి బ్యూటీ ఉత్పత్తులను పరిచయం చేయడం వారి వయస్సుకి తగినది కాదని చెబుతున్నారు. అనవసరమైన ఉత్పత్తులు వాడటం వల్ల చికాకు, అలర్జీలు, దద్దుర్లు లేదా దీర్ఘకాలిక సమస్యలకు దారితీయవచ్చనంటున్నారు. రంగురంగుల ΄్యాకేజింగ్, సోషల్ మీడియా ఆల్గారిథమ్‌ల వెనుక, పిల్లలు కోలుకోలేని శారీరక చర్మసమస్యలు, కాస్మెటికోరెక్సియా వంటి తీవ్రమైన మానసిక ఆందోళనలు దాగి ఉన్నాయి. అందుకే అత్యంత హానికరమైన మార్కెటింగ్ వ్యూహంలో చిక్కుకోకుండా పిల్లలను కాపాడుకోవాలి. అందంపై ఉండే సామాజిక దృక్పథాన్ని మార్చాలి. కాస్మెటిక్స్‌కి దూరంగా ఉంచాలి.పిల్లలకు కాస్మొటిక్స్ వాడకూడదు...చాలామంది తల్లుల్లో ఒక ఆలోచన ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు మంచి రంగులో ఉన్నారు. తర్వాత కలర్ తగ్గిందేమిటి అనుకుంటారు. దీంతో స్కిన్ కేర్ కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చుండ్రు వస్తుందని, స్మెల్ బాగుంటుందని హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. మేకప్ కోసం ఇతర ప్రొడక్ట్స్ వాడే వారుంటారు. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి సౌందర్య ఉత్పాదనలను ఉపయోగించకూడదు. రంగు తక్కువ ఉన్నారనో, ఇంకా బాగా కనిపిస్తారనో ఆలోచనతో వివిధ రకాల సబ్బులు, కాస్మొటిక్స్ ఉపయోగిస్తే వారి లేత చర్మంపైన దద్దుర్లు రావడం, ఇరిటేషన్ కలగడం.. వంటివి సంభవించవచ్చు. ఆరుబయట బాగా ఆడే పిల్లలకు మినరల్ బేస్డ్ సన్‌స్క్రీన్ మాత్రమే ఉపయోగించాలి.డా. స్వప్నప్రియసీనియర్ డర్మటాలజిస్ట్– జంబుల రమాదేవి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి -
కొత్త ప్రపంచం వైపు అడుగులు?
‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే ట్రంప్ నినాదం ఆచరణలో తల్లకిందులు కాబోయే కాలం తరుముకొస్తున్నదా? ప్రపంచ వ్యాప్తంగా ఈ చర్చ జరుగుతున్నది. ఇప్పటికీ అమెరికా సూపర్ పవర్ హోదాను అనుభవిస్తూనే ఉన్నది. అమెరికా ఆజ్ఞలు ఖండాంతరాల్లో ఇంకా చెల్లుబాటు అవుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మధ్యతరగతి యువతీ యువకులకు అమెరికా ఒక ఆశల పందిరిగా దర్శనమిస్తూనే ఉన్నది. తానా అంటే తందానా అనేందుకు పాకిస్తాన్ వంటి తొత్తు దేశాలు కూడా అమెరికాకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో అమెరికా అతి పెద్ద వాటాదారుగానే కొనసాగుతున్నది. దాని మిలిటరీ బడ్జెట్ ఒక్కటే భారతదేశపు మొత్తం బడ్జెట్‌కు రెట్టింపు.అయినప్పటికీ భవిష్యత్తులో అమెరికాకు దిగే మెట్లు తప్ప ఎక్కే మెట్లు లేవనే వాదన బలంగా వినిపిస్తున్నది. అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా అమెరికా డాలర్ పెత్తనం కారణంగా 39 ట్రిలియన్ డాలర్ల అప్పును అది మేనేజ్ చేయగలుగుతున్నది. కానీ డాలర్ పెత్తనానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. ‘బ్రిక్స్’ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి చేరితే అమెరికాకు గడ్డు కాలమే! ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడి ఫలితాలు ప్రమాదకరమైన ఫలితాలనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్మూజ్‌ను ‘విముక్తం’ చేయకుండా, ఇరాన్ పాలనా వ్యవస్థను మార్చకుండా యుద్ధం నుంచి తప్పుకొంటే డాలర్ పెత్తనానికి పునాది వంటి పెట్రో డాలర్ వ్యవస్థ విచ్ఛిన్నం కావచ్చు. యుద్ధం కొనసాగిస్తే రోజులూ, నెలల్లో అది ముగిసే అవకాశం లేదు. మోయలేని భారంగా మారుతుంది.వాణిజ్య రంగంలో ట్రంప్ స్వీయ రక్షణాత్మక చర్యలు చేపట్టారు. దేశాల వారీగా వాణిజ్య లోటును సవరించుకునే పేరుతో ఎడాపెడా ట్యారిఫ్‌లు విధిస్తూ పోతున్నారు. ఈ చర్యలు అంతిమంగా అమెరికాకు నష్టం చేస్తాయని నిపుణులు చెబు తున్న మాటలను ఆయన చెవికెక్కించుకోవడం లేదు. ట్యారిఫ్ దాడులతో ఆయన అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆర్థిక గమనాన్ని సంపూర్ణంగా మార్చే సామర్థ్యం గల ఏఐ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో చైనా భారీయెత్తున పెట్టుబడులు పెట్టింది. ఈ రేస్‌లో రెండు దేశాల మధ్య దూరం పెద్దగా లేదు. త్వరలో చైనావాళ్లు అమెరికాను ఓవర్టేక్ చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదనే అంచనాలు వెలువడుతున్నాయి.దౌత్యపరంగా కూడా ట్రంప్ దారుణమైన వైఫల్యాలను మూటగట్టుకుంటున్నారు. ఎనిమిది దశాబ్దాలుగా అమెరికాకు కుడిభుజంగా ఉంటున్న ‘నాటో’ కూటమిని ఆయన స్వయంగా విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. గ్రీన్‌ల్యాండ్ రచ్చ, క్యూబాకు బెదిరింపులు, వెనుజువేలా అధ్యక్షుని కిడ్నాప్ వంటివన్నీ అంత ర్జాతీయ సమాజం నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి వచ్చాయి. యుద్ధరంగంలో వస్తున్న సాంకేతికపరమైన మార్పులు అమెరికా భారీ మిలిటరీని కలవరపెడుతున్నాయి. చౌకరకం డ్రోన్లు, సైబర్ తంత్రాలు, ఉపగ్రహ విధ్వంసక దాడులు పైచేయి సాధిస్తున్నాయి. ఇరాన్ ఘర్షణలో ఈ పరి ణామం అనుభవంలోకి వచ్చింది. భారీ బడ్జెట్ సినిమాలను చిన్న సినిమాలు అల్లాడించాయి.ఈ రకమైన పరిణామాలన్నీ అమెరికా ఏకచ్ఛత్రాధిపత్యా నికి క్రమక్రమంగా ఎసరు పెట్టే స్వభావం కలిగినవే! కాకపోతే ఈ క్రమాన్ని ఇరాన్ యుద్ధం వేగిరపరిచిందనే అంచనాలు వెలు వడుతున్నాయి. ఈ సందర్భంగా రెండో ప్రపంచ యుద్ధానంతర అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు నికోలస్ స్పీక్‌మాన్ ప్రతి పాదించిన రిమ్‌ల్యాండ్ థియరీని గుర్తుచేస్తున్నారు. యూరే షియా ప్రధాన భూభాగానికి అంచు మాదిరిగా ఉండే తీర ప్రాంతాన్ని ‘రిమ్‌ల్యాండ్’ అన్నారు. స్పీక్‌మాన్ లెక్క ప్రకారం పశ్చిమ యూరప్ నుంచి మొదలుకుని పశ్చిమాసియా, దక్షిణా సియా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలు ఈ రిమ్‌ల్యాండ్ పరిధిలోకి వస్తాయి. ఇరవయ్యో శతాబ్దం అట్లాంటిక్ దేశాలదైతే, ఇరవై ఒకటో శతాబ్దం మాత్రం ఈ రిమ్ల్యాండ్దేననీ, ఈ ప్రాంతంపై ఎవరు ఆధిపత్యం సాధిస్తే వారిదే ప్రపంచాధిపత్య మని ఆయన ప్రతిపాదించారు.తర్వాత కాలంలోని అమెరికన్ అంతర్జాతీయ నిపుణులు రిమ్‌ల్యాండ్ థియరీ నుంచి పశ్చిమ యూరప్‌ను తొలగించి ఆఫ్రికా కొమ్ము దగ్గర నుంచి అరబ్ ద్వీపకల్పం, పర్షియా పీఠ భూమి, భారత ఉపఖండం మీదుగా తూర్పున చైనా కోస్తా ప్రాంతం దాకా, ఆగ్నేయంగా ఇండోనేషియా ద్వీప సముదాయం దాకా ఈ పరిధిలోకి వస్తుందని చెబుతున్నారు. కైరో నుంచి జకార్తా దాకా అనవచ్చు. లేదా ఎర్ర సముద్రం నుంచి దక్షిణ చైనా సముద్రం (తూర్పు), జావా సముద్రం (ఆగ్నేయం) దాకా అని కూడా చెప్పవచ్చు. హిందూ మహాసముద్ర ప్రాంత మని కూడా పిలవవచ్చు. ‘ఇది ఇండియన్ ఓషన్ సెంచరీ’ అని పిలవడంలో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులకు ఏకాభి ప్రాయం ఉన్నది.యూరప్ దేశాల వలసల వేటలకు ముందు ఈ ప్రాంత వాణిజ్యాన్ని భారత్, చైనాలు శాసించాయి. భూమార్గం ద్వారా యూరేషియా ప్రాంతాలలో చైనా వర్తకం జరిగితే సముద్రమార్గ వాణిజ్యంలో భారత్ ఆధిపత్యం వహించింది. భారత నావికా దళాలు ఆగ్నేయాసియా దేశాల్లో హిందూ సామ్రాజ్యాలను నెల కొల్పిన చరిత్ర మనకు తెలిసిందే. హార్మూజ్ జలసంధి ద్వారా ఇప్పుడు పెట్రోలియం తెచ్చుకుంటున్నాం కానీ, పూర్వకాలంలో ఎక్కువగా అరబ్బీ గుర్రాలను ఇక్కడినుంచే తీసుకొచ్చేవారట! ప్రాచీన తెలుగు సాహిత్యంలో హురుమంజి (హార్మూజ్) ప్రస్తా వన చాలా సందర్భాల్లో వచ్చిందని చెబుతున్నారు.అత్యధిక జనాభా, అందులోనూ యువతరం, వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి జనాభా, విస్తారంగా సహజ వన రులు, ప్రపంచ వాణిజ్యంలో సింహభాగాన్ని ఆక్రమిస్తున్న నేపథ్యం దృష్ట్యా ఇండియన్ ఓషన్ ప్రాంతాన్ని అమెరికా విదేశాంగ నిపుణులు ప్రత్యేక దృష్టితోనే చూస్తూ వచ్చారు. ఇక్కడ ఆధిపత్యాన్ని కోల్పోతే ప్రపంచాధిపత్యానికి కూడా నూకలు చెల్లినట్టే అనే అవగాహన వారికి మొదటి నుంచి ఉన్నది. అందుకే డిగోగార్షియా దీవిలో అతిపెద్ద మిలిటరీ స్థావ రాన్ని అమెరికా ఏర్పాటు చేసుకున్నది. వివిధ దేశాల్లో ఉన్న స్థావరాల కంటే ఇది చాలా పెద్దది. ముఖ్యంగా పశ్చిమాసియా వ్యవహారాలను అదుపు చేయడం దీని బాధ్యత. తూర్పున ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా తన బలిష్ఠమైన సప్తమ నౌకాదళాన్ని (సెవెంత్ ఫ్లీట్) చాలాకాలం నుంచే మోహరించింది. అయినప్పటికీ ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా నుంచి అమెరికాకు గట్టి పోటీనే ఎదురుకానున్నది. ఇరాన్ యుద్ధ ఫలి తంగా పశ్చిమాసియాలో అమెరికా తన పట్టును కోల్పోతే ఒక సరికొత్త నూతన అధ్యాయానికి స్వాగతం పలకడానికి ప్రపంచం సిద్ధంగా ఉంటుంది.ఇరాన్‌పై ‘ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో మహా విధ్వంసకరమైన దాడికి ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఎందుకింత హఠాత్తుగా ఒడిగట్టిందో అమెరికా అధికార వర్గాలే అర్థం చేసుకోలేకపోతు న్నాయి. బిలియన్లకొద్దీ డాలర్లను ఏ ప్రయోజనాన్ని ఆశించి తగ లేస్తున్నారని అమెరికన్లు నిలదీస్తున్నారు. ఆరు వారాల యుద్ధం తర్వాత ఈరోజు (శనివారం) పాకిస్తాన్లో ఇరాన్ – అమెరికాలు చర్చలకు ఉపక్రమించాయి. ఆరు వారాల యుద్ధంలో అమెరికా సాధించిందేముంది? అలీ ఖమేనీని, ఉన్నత స్థానాల్లోని మరి కొందరినీ హతం చేశారు. కానీ పాలనా వ్యవస్థ మారలేదు. ఇరాన్ పాలనా వ్యవస్థను మార్చడమన్నది అమెరికా పెట్టుకున్న ప్రధానమైన మూడు యుద్ధ లక్ష్యాల్లో ఒకటి. అది నెరవేరలేదు.అణుశుద్ధి కార్యక్రమాలను పూర్తిగా నిర్మూలించడం మరో లక్ష్యం. అదీ నెరవేరలేదు. పైగా ఇరాన్ ఇప్పటికే అణ్వస్త్రాలను సమకూర్చుకోగల సామర్థ్యాన్ని సంతరించుకున్నదని ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త థియోడర్ పోస్టల్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా పలు టెలివిజన్లు శనివారం నాడు ఆయన ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి. హార్మూజ్ మార్గాన్ని ఇరాన్ చెర నుంచి విముక్తి చేస్తామని పలికిన బీరాలు కూడా నీరుగారిపోయాయి. ఇరాన్ దర్జాగా తన కరెన్సీలో టోల్ వసూలు చేసుకుంటున్నది. చివరికి చర్చల ప్రారంభానికి ముందు కూడా ట్రంప్ తన హూంకరింపులను ఆపలేదు. ఇరాన్ ఒప్పందానికి రాకపోతే భారీ విధ్వంసం ఉంటుందనీ, నౌకల్లోకి ఆయుధాలను లోడ్ చేస్తున్నామనీ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అదేదో తెలుగు సినిమాలో ‘రమణా లోడెత్తాలిరా, టోల్గేట్ పడుతుందీ’ అనే పాపులర్ డైలాగ్ ఉంటుంది.ఆరు వారాల్లో ట్రంప్ రకరకాల మాటలు విన్నవారికి అదే గుర్తొస్తుంది. నాలుగైదు రోజుల కింద ‘ఈ రాత్రితో ఒక నాగరికత అంతం కాబోతోందం’టూ ట్రంప్ చేసిన హెచ్చరికపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నాగరికతలను అంతం చేసే విప రీత బుద్ధి ఏమిటని ప్రశ్నించారు. పర్షియా (ఇరాన్) చరిత్రలో ప్రసిద్ధుడెన సైరస్ ది గ్రేట్ చక్రవర్తి ఆదర్శాలు తనకు స్ఫూర్తి నిచ్చాయని అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను రూపొందించిన థామస్ జెఫర్సన్ ప్రకటించారు. 2500 సంవత్సరాలకు పూర్వం సైరస్ ది గ్రేట్ బాబిలోన్‌ను జయించినప్పుడు అక్కడి బానిస లందరికీ, అలాగే ఖైదీలకూ విముక్తి ప్రసాదించారు. వీరిలో పెక్కుమంది యూదులు. తన సామ్రాజ్యంలో మత స్వేచ్ఛనూ, జాతి సమానత్వాన్నీ ఆ రోజుల్లోనే ప్రబోధించారు. అటువంటి నాగరికతను ట్రంప్ అంతం చేయడానికి సిద్ధమయ్యాడు.పాక్‌లో ప్రారంభమైన చర్చలు ఒకటి రెండు రోజుల్లో ముగిసే అవకాశం లేదు. అమెరికాకు మెసెంజర్‌గా ప్రారంభ మైన పాకిస్తాన్ పాత్ర చర్చల్లో మధ్యవర్తి స్థాయికి మారింది. ఇరాన్ ఇప్పటికీ పాక్‌ను పూర్తిగా నమ్మడం లేదు. యుద్ధంలో అమెరికాతో పాటు భాగస్వామిగా ఉన్న ఇజ్రాయెల్‌కు చర్చల్లో ఏ పాత్రా లేదు. పాకిస్తాన్ మిలిటరీ అధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్‌పై ట్రంప్‌కు అవ్యాజమైన అనురాగం ఉన్నది. ట్రంప్ శాంతికాముకతకు నోబెల్ బహుమతి ఇవ్వాలని మునీర్ బహిరంగంగా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు ఏజెంట్‌గా పనిచేసే వ్యక్తిని ఇరాన్ మధ్య వర్తిగా అంగీకరించడానికి చైనా సలహానే కారణమనే అభిప్రాయం ఉన్నది.పేరుకు పాకిస్తాన్లో ఎన్నికైన ప్రభుత్వం ఉన్నా అన్ని వ్యవహారాలూ మునీర్ చేతుల మీదుగానే నడిచిపోతున్నాయి. మరో ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ మాదిరిగా పాక్ పాలనా పగ్గాలను అందిపుచ్చుకోవాలని మునీర్ ఉవ్విళ్లూరుతున్నారు. అమెరికా, చైనాల సహకారం ఉన్నది కనుక అతని కోరిక నెరవేరే అవకాశం ఉండవచ్చు. భారత్‌పై విపరీతమైన వ్యతిరేకత ఉన్న వ్యక్తి మునీర్. కశ్మీర్ కోసం వెయ్యేళ్లయినా యుద్ధం చేస్తామన్న భుట్టో మాటల్ని పదేపదే వల్లెవేస్తుంటాడు. ఆయన ఏర్పాట్లతో జరుగుతున్న చర్చల ఫలితంపై ఆయనకే ఆసక్తి లేదు. ప్రజల్లో తన ప్రతిష్ఠ పెరగడం, అమెరికా ఆజ్ఞలు పాటించడమే ఆయనకు కావాల్సింది! పరస్పర విరుద్ధమైన డిమాండ్లపై కాలయాపన కోసమే రెండు దేశాలూ చర్చలకు సిద్ధమయ్యాయన్న అభిప్రాయం ఉన్నది.ఇరాన్‌కు లోపాయకారీ సహాయం చేయడం తప్ప యుద్ధం విషయంలో చైనా బహిరంగంగా మాట్లాడడం లేదు. శత్రువు వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నప్పుడు, అందులో తలదూర్చ వద్దనేది యుద్ధనీతి. తప్పిదం ఫలితాన్ని శత్రువు అనుభవిస్తాడు. ఇంకో నెలరోజుల్లో ట్రంప్ – షీ జిన్‌పింగ్‌ల మధ్య శిఖరాగ్ర సమావేశం జరగనున్నది. ఈ లోపల ఇరాన్ యుద్ధంలో చేతులు కాల్చుకొని బలహీనపడే ట్రంప్ తన ఎదురుగా కూర్చుంటే గట్టిగా బేరమాడే శక్తి షీకి లభిస్తుంది. చైనా వాళ్లకు వ్యాపార కిటుకులు బాగా తెలుసు. ట్రంప్ ఇరాన్ యుద్ధంలో నిజంగానే చేతులు కాల్చుకుంటే ఇరాన్ ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఎదుగుతుంది. ఇప్పటికే రిమ్‌ల్యాండ్ తూర్పున ఉన్న చైనా ఒక బలమైన శక్తి. దృఢమైన నాయకత్వం ఉంటే భారత్ కూడా ప్రభావ శీల శక్తిగా ఎదిగేందుకు చాలా అవకాశాలున్నాయి. రానున్న రోజుల్లో ప్రాంతీయ శక్తుల ఆవిర్భావం జరిగి, బహుముఖీన ఒప్పందాలతో అంతర్జాతీయ సంబంధాలు కొనసాగవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
శతక్కొట్టిన సంజూ.. బోణీ కొట్టిన సీఎస్కే
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫాథుమ్ నిస్సాంక(41), అశుతోష్ శర్మ(19) రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్ మూడు, నూర్ అహ్మద్, ఖలీల్ తలా వికెట్ సాధించారు.సంజూ సూపర్ సెంచరీఅంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ కేవలం 52 బంతుల్లోనే తన నాలుగో ఐపీఎల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా సంజూ 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఆయూశ్ మాత్రే(59) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు.చదవండి: IPL 2026: చెలరేగిన శాంసన్.. చెపాక్‌లో సూపర్ సెంచరీ -
చరణ్ సినిమా.. ఆదిత్య ధర్–భన్సాలీ పేర్ల హడావిడి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లైనప్‌పై బాలీవుడ్ నుంచి వరుసగా లీకులు వస్తున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉందనే క్లారిటీ ఉండగా, తాజాగా ఆదిత్య ధర్ – సంజయ్ లీలా భన్సాలీ పేర్లు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ధురంధర్-2 వంటి సూపర్ హిట్ తర్వాత ఆదిత్య ధర్ ఒక మల్టీస్టారర్ కథను సిద్ధం చేస్తున్నాడని, అందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అయితే ఇప్పుడు చరణ్ పేరు మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ – చరణ్ కాంబోపై కూడా వార్తలు వస్తున్నాయి. అటవీ నేపథ్యంలో హిస్టారికల్ అడ్వెంచర్ కథను భన్సాలీ తెరకెక్కించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. గతంలో ‘మహారాజా సుహేల్ దేవ్’ అనే ప్రాజెక్ట్‌పై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోపై చర్చ మొదలవడంతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే దర్శకుడు సుకుమార్, చరణ్‌తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం వల్లే ఈ గాసిప్పులు ఎక్కువయ్యాయి. చరణ్ బర్త్‌డే సందర్భంగా ఏదైనా ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దాంతో బాలీవుడ్ వైపు నుంచి వరుసగా ఇలాంటి లీకులు వస్తున్నాయి. -
చెలరేగిన శాంసన్.. చెపాక్‌లో సూపర్ సెంచరీ
ఐపీఎల్-2026లో తొలి సెంచరీ నమోదైంది. చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. తొలి మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన సంజూ.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లను తన ట్రేడ్ మార్క్ షాట్లతో సంజూ ఉతికారేశాడు.కేవలం 52 బంతుల్లోనే నాలుగో ఐపీఎల్ సెంచరీ మార్కును సంజూ అందుకున్నాడు. సీఎస్కే జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ త్వరగా కోల్పోయినప్పటికి.. సంజూ మాత్రం యువ ఆటగాడు ఆయూశ్ మాత్రేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వారిద్దరూ రెండో వికెట్‌కు 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగినప్పటికి, సంజూ మాత్రం తన జోరును కొనసాగించాడు.మొత్తంగా 56 బంతుల్లో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. అక్షర్ పటేల్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు.అయూశ్ మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్-2026 వేలానికి ముందు సంజూ శాంసన్‌ను రూ. 18 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ నుంచి సీఎస్కే ట్రేడ్‌చేసుకుంది. అయితే తొలి మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే (6, 7, 9 పరుగులు) అవుట్ అయ్యి విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు తన సూపర్ సెంచరీతోనే విమర్శలకు సమాధనమిచ్చాడు.చదవండి: ఆ తప్పే మా కొంపముంచింది: సన్‌రైజర్స్ కెప్టెన్ -
హర్మూజ్ జలసంధిపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: ఇస్లామాబాద్‌లో జరుగుతున్న అమెరికా–ఇరాన్ శాంతి చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా నౌకాదళానికి చెందిన రెండు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు హర్మూజ్ జలసంధిని ఎటువంటి సమస్యలు లేకుండా దాటినట్లు ఆయన వెల్లడించారు. ఈ చర్యను ‘ప్రపంచానికి మేలు చేసే ప్రయత్నం’గా ఆయన అభివర్ణించారు.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఈ నౌకలు తూర్పు నుండి పశ్చిమ దిశగా గల్ఫ్‌లోకి ప్రవేశించి, తిరిగి అరేబియన్ సముద్రానికి చేరుకున్నాయి. ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో మాట్లాడుతూ.. మేము హర్మూజ్ జలసంధిని శుభ్రం చేసే ప్రక్రియను ప్రారంభించాం. ఇది చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు మేము చేస్తున్న ఉపకారం. వారికి ఈ పని చేయడానికి ధైర్యం లేదు” అని ఎద్దేశించారు.అదే సమయంలో ఆయన ఇరాన్‌కి పెద్దగా సైనిక శక్తి లేకపోయినా, సముద్రంలో ఉంచిన మైన్ల వల్లే అమెరికా నౌకలకు ప్రమాదం కలుగుతుందని సూచించారు. అంటే, ఇరాన్‌కి ప్రత్యక్షంగా అమెరికా నౌకలను ఎదుర్కొనే శక్తి లేదని, కానీ మైన్ల ముప్పు మాత్రం అమెరికా నౌకలకు ఒక పెద్ద సవాలుగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన నాటి నుంచి హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఇటీవల కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో ఈ మార్గాన్ని తిరిగి తెరవడం ఒక ముఖ్యమైన షరతుగా ఉన్నప్పటికీ, ఇరాన్ ఇప్పటికీ పూర్తిగా నియంత్రణలోకి తీసుకోలేకపోయింది. ఈ పరిణామాల మధ్య ఇరాన్–అమెరికా మధ్య శాంతి ఒప్పంద చర్చలు ఇస్లామాబాద్‌లో కొనసాగుతున్నాయి. రెండు గంటలకు పైగా జరిగిన ఈ చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఈ చర్చలు పశ్చిమాసియాలో కాల్పుల విరమణతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట కలిగించాలనే లక్ష్యంతో జరుగుతున్నాయి. -
అమరావతి నిర్మాణాల అక్రమాల్లో మరో కోణం
అమరావతి: ఏపీలోని అమరావతి నిర్మాణాల అక్రమాల్లో మరో కోణం బయడపడింది. హైదరాబాద్‌లో హెరిటేజ్ కొత్త యూనిట్‌ను నిర్మించిన భీమా ఇన్ఫ్రాకే అమరావతి నిర్మాణాలు అప్పచెప్పారు. జీఏడీ టవర్ల పనుల్లో భీమా ఇన్‌ఫ్రాకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది ప్రభుత్వం. హైదరాబాద్‌లో కొత్త హెరిటేజ్ యూనిట్‌ను భువనేశ్వరి, బ్రాహ్మిణి ఇటీవలే ప్రారంభించారు. రామ్ హెరిటేజ్, జీఏడీ టవర్లు చేశామన్న భీమా ఇన్ఫ్రా ప్రకటించింది. హెరిటేజ్ యూనిట్ పూర్తి చేసినట్లు భీమా ఇన్ఫ్రా వెల్లడించింది., అదే భీమా సంస్థకు అమరావతి జీఏడీ టవర్ల పనులు దక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భీమా ఇన్‌ఫ్రాకి అమరావతి పనులు ఇవ్వడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా తప్పుబట్టింది. -
బంగారం ధరల్లో భారీ మార్పు: అంతలోనే ఇంతలా..
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ వారాంతంలో కొంత పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో మార్పు జరిగింది. ఈ కథనంలో వారం రోజుల్లో బంగారం ధరలు పెరిగాయా?, తగ్గాయా?, అనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 5 (ఆదివారం) 1,50,930 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,52,840 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు పెరుగుతూ.. తగ్గుతూ, మొత్తం మీద 1910 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,38,350 రూపాయల నుంచి 1,40,100 రూపాయల (రూ.1750 పెరిగింది) వద్దకు చేరింది.చెన్నైలో గోల్డ్ రేటు వారం రోజుల్లో పెరుగుదల దిశగానే అడుగులు వేసింది. ఏప్రిల్ 5న 1,52,180 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,53,820 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,39,500 రూపాయల నుంచి 1,41,000 రూపాయల (రూ.1500 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా ధరల పెరుగుదల కనిపించింది. ఏప్రిల్ 5న దేశ రాజధాని నగరంలో 1,51,080 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,52,990 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,38,500 రూపాయల నుంచి 1,40,250 రూపాయల (రూ.1750 పెరిగింది) వద్దకు చేరింది. -
గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..
ముంబై: ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) ఆసుపత్రిలో చేరారు. శనివారం సాయింత్రం ఆమెకు గుండెనొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. లోక్మత్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. :ఆమెకు ఐసీయూ అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ ప్రతీత్ సమ్దాని ఆమె కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వెల్లడించారు.సినిమా పాటలతో పాటు గజల్స్, ఖవ్వాలీ, శాస్త్రీయ కచేరీలు తన మధుర గాత్రంతో మెప్పించిన ఆశా భోస్లేకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. వేదిక ఏదైనా సరే తన పాటకు తిరుగులేదని లెజెండరీ సింగర్‌గా నిరూపించుకున్నారు. పదేళ్ల వయసు నుంచే తన పాటలతో మెప్పించిన ఆశ సుమారు 800లకు పైగా చిత్రాల్లో 12 వేల పైచిలుకు పాటలు పాడారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా భోస్లే.. ఎన్నో మరపురాని పాటలు ఆలపించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది మృతి, 25 మందికి గాయాలు
పట్నా: బిహార్‌లో శనివారం (ఏప్రిల్ 11) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కటిహార్ జిల్లా వద్ద బస్సు, ట్రక్, పికప్ వాన్ ఢీకొని పది మంది మృతి చెందగా, మరో 25 మందికి గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు.శనివారం సాయంత్రం ఈ ప్రమాదం కటిహార్‌లో కోఢా బ్లాక్ వద్ద ఎన్‌హెచ్-31పై జరిగిందని ఎస్పీ శిఖర్ చౌధరి మీడియాకు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు."టిహార్ జిల్లా కోఢా పోలీస్ స్టేషన్ పరిధిలో గెరాబారి సమీపంలో బస్సు, పికప్ వాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన సుమారు 25 మందికి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్య సేవల కోసం సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు" అని కటిహార్ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పోలీస్ సూపరింటెండెంట్ శిఖర్ చౌధరి తెలపిఇన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం కటిహార్‌లో కోఢా బ్లాక్ వద్ద ఎన్‌హెచ్-31పై జరిగింది. -
''ఒరాకిల్ ఉద్యోగం పోయింది.. మేకలు పెంచాలనుకుంటున్నా''
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న తరుణంలో.. టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సలహాలు కోరాడు.''ఒరాకిల్‌లో సీనియర్ SDEగా ఉద్యోగం కోల్పోయాను. మా సొంత ఊరిలో ఏదైనా జాబ్ చేద్దామంటే? వచ్చే జీతం నేను ఇంతకుముందు పొందుతున్న దానికి ఏమాత్రం సరిపోదు, ఆ డబ్బుతో ప్రతి నెలా నా కార్ లోన్ కూడా కట్టలేను. నేను సుమారు 15 లక్షల రూపాయలు పొదుపు చేశాను. నేను భారతదేశంలో ఏ వ్యాపారం చేయగలను? నేను మేకల పెంపకం చేయవచ్చా? నేను కష్టపడి పనిచేసే వ్యక్తిని, ఒక చిన్న చవకైన భూమి కొని ఒక చిన్న ఆఫీసు పెట్టుకుని, ఫ్రీలాన్స్‌గా పని వెతుక్కుంటూ, మేకలను పెంచుకుంటూ జీవించగలను. నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు, దయచేసి సహాయం చేయండి'' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీనిపై స్పందించిన కొందరు నెటిజన్లు, అతను టెక్నాలజీ రంగంలోనే కొనసాగాలని సూచించారు. ముఖ్యంగా AIపై నైపుణ్యాలు పెంచుకుని, కొత్త అవకాశాలను వెతకాలని సూచించారు. మరికొందరు గోట్ ఫార్మింగ్ మంచి వ్యాపారమని చెప్పినప్పటికీ, అందులో స్థిరపడడానికి ఒకటి.. రెండు సంవత్సరాలు పట్టవచ్చని హెచ్చరించారు.ఇంకొంత మంది మరింత జాగ్రత్తగా ఆలోచించాలని సూచిస్తూ, ముందుగా ఒక స్థిరమైన ఉద్యోగం సంపాదించి, ఆ తర్వాత మీ పొదుపును అదనంగా ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి. మీ అనుభవంతో, దాన్ని నడపడానికి మీరు వ్యక్తులను నియమించుకోవచ్చు. ఆ వ్యాపారం మీ జీతం కంటే ఎక్కువ స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించిన తర్వాత, మీరు దానిని పూర్తికాల ఉద్యోగంగా పరిగణించవచ్చు'' అని సూచించారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో భారీ మార్పు: ఏడు రోజుల్లో ఇంతలా.. -
సింగర్ మంగ్లీ కేసుతో నాకు సంబంధం లేదు.. ప్రచారం ఆపండి: సినీ దర్శకుడు
మైక్రో ఫైనాన్స్ పేరుతో రూ.10 కోట్లు మోసం చేశారని గాయని మంగ్లీపై నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసులో దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఉన్నారంటూ కొన్ని కథనాలు వచ్చాయి. ఈ అంశంపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. మంగ్లీ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు దర్శకుడు వేణు ఊడుగుల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.వేణు ఊడుగుల స్పందిస్తూ..' గాయని మంగ్లీ వివాదంలో నా పేరును చేర్చుతూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఆ వార్తలు చూసి చాలా బాధపడ్డాను. మంగ్లీ, లాయర్ సుబ్బారావు ఇద్దరూ నాకు తెలిసిన వాళ్లు కావడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలని మాత్రమే నేను సూచించాను. ఇంతవరకే ఈ కేసులో నా పాత్ర. ఈ కేసు ఎఫ్ఐఆర్లో కూడా నిందితుడిగా నా పేరు ఎక్కడా లేదు. అడ్వకేట్ సుబ్బారావు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వేణు ఊడుగులకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. పంజాగుట్ట పోలీసులు కూడా ఈ కేసుతో నాకు సంబంధం లేదని నిర్థారించారు. మీ వార్తల వల్ల ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ట, కుటుంబం ప్రభావితం అవుతాయని మీడియా మిత్రులు గమనించగలరు. మీరు నాపై ఇంతకాలం చూపిన ప్రేమ, ఆదరణ నాకెంతో బలాన్నిచ్చాయి. ఇప్పుడూ అదే ప్రేమను కొనసాగిస్తారని కోరుకుంటున్నా.' అని ఆయన పేర్కొన్నారు.I’m deeply hurt to see my name linked to the Mangli case.I have no involvement in this issue. I only suggested a peaceful resolution as both parties are known to me.Even in the FIR, my name is not listed as an accused. The complainant advocate Subbarao has also clarified… pic.twitter.com/gsffRWTYwi— v e n u u d u g u l a (@venuudugulafilm) April 11, 2026 -
ఆ తప్పే మా కొంపముంచింది: సన్‌రైజర్స్ కెప్టెన్
ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి చవిచూసింది. శనివారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 220 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఈ భారీ టార్గెట్‌ను పంజాబ్ కింగ్స్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఊదిపడేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 69 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు ప్రియాన్ష్ ఆర్య(57), ప్రభ్సిమ్రాన్ సింగ్(51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. సన్‌రైజర్స్ బౌలర్లలో స్పిన్నర్లు శివాంగ్ కుమార్ మూడు, హర్ష్ దూబే ఓ వికెట్ సాధించారు. ఫాస్ట్ బౌలర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే తాము ఓడిపోయామని కిషన్ తెలిపాడు."మేము సాధించిన 219 పరుగుల భారీ స్కోర్ ఈ రోజు సరిపోలేదు. మేము ఆరంభించిన తీరు చూస్తే కనీసం 250 పరుగులు చేస్తామని అనుకున్నాం. కానీ మధ్య ఓవర్లలో తడబడ్డాం. అయినప్పటికి ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని అందించాము.కానీ పంజాబ్ ఓపెనర్లు కూడా అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో భారీగా పరుగులు రాబట్టుకున్నారు. జట్టులో ఆరు నుండి ఏడుగురు బౌలర్లు ఉన్నప్పటికీ, ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. టీ20 క్రికెట్లో సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో వేయడం ముఖ్యం. కానీ ఈ రోజు ఆ విషయంలో విఫలమయ్యారు. ప్రస్తుత క్రికెట్లో మ్యాచ్‌కు ముందే ప్లానింగ్ అంతా పూర్తవుతుంది. ఏ బ్యాటర్ ఎక్కడ హిట్టింగ్ చేస్తాడు? మైదానంలో ఏ వైపు బౌండరీ లాంగ్ ఉంది? వంటి విషయాలన్నీ మాకు తెలుసు. వీటిన్నటి దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ చేశాము. కానీ ప్లానింగ్ సరిగ్గా ఉన్నా, వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యామని" కిషన్ పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో పేర్కొన్నాడు. -
శివాజీ సృష్టించిన చీర అంటూ అనసూయ కౌంటర్
యాంకర్, నటి అనసూయ మరోసారి నటుడు శివాజీపై కౌంటర్ వేసింది. కొద్దిరోజుల క్రితం మహిళల వస్త్రధారణ గురించి నటుడు శివాజీ చేసిన చెత్త వ్యాఖ్యలపై అనసూయ (Anasuya)ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.. అయితే, తాజాగా చీర కట్టుకుని తన కుటుంబంతో పాటుగా అనసూయ గుడికి వెళ్లింది. కొందరు నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేస్తూ.. శివాజీ దెబ్బకు చీర కట్టుకుని తిరుగుతున్న అనసూయ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఆమె కూడా కౌంటర్ ఇచ్చింది.నెటిజన్లు షేర్ చేసిన థంబ్‌నైల్ ఎలా ఉండాలో తనదైన స్టైల్లో అనసూయ ఒక సలహా కూడా ఇచ్చింది 'శివాజీ సృష్టించిన చీర ధరించి తిరుగుతున్న అనసూయ అంటూ థంబ్‌నైల్ పెడుతారనుకున్నాను. సరైన హెడ్లైన్ కూడా ఇదే కదా.. ఎందుకంటే మేము గతంలో ఎప్పుడు చీరలు కట్టుకోలేదు. ఏమైనా పోస్ట్ చేసేముందు చూసుకోవాలి కదా..' అంటూ కౌంటర్ ఇచ్చింది. వాస్తవంగా చాలా ఈవెంట్లలో అనసూయ చీరకట్టులోనే కనిపించిన సందర్భాలు ఉన్నాయి. గుడికి వెళ్తున్న సమయంలో దాదాపు చీరకట్టులోనే వెళ్తారనే విషయం తెలిసిందే. అనసూయ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా షేర్ చేస్తున్నారు. Tappu tappu! “Sivaji srushtinchina cheera ane vastraanni dharinchi tirugutunna Anasuya” Idi kada undali header!! Endukante antaku mundu memanta asalu cheerale kattukoledu 🙄 entamma.. chuskovali kada post chesemundu 🤦🏻♀️ https://t.co/9IiFZ7PQgh— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 11, 2026 -
Instagramతో కోట్లలో డబ్బు సంపాదన.. ఎలా అంటే?
ఫ్రెండ్స్.. మీకో విషయం తెలుసా..? Instagramలో సబ్స్క్రిప్షన్ అనే ఫీచర్‌తో ఒక అమ్మాయి నెలకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? అక్షరాలా కోటి రూపాయలు. అవును.. మీరు విన్నది నిజమే. అక్షరాలా సంవత్సరానికి 12 కోట్లు. ఇది వినగానే మీలో చాలా మందికి.. అబ్బా.. నాకూ అకౌంట్ ఉంది.. నేను కూడా స్టార్ట్ చేస్తా, ఆ టాలెంట్ ఏదో నేర్చేసుకుంటా.. అని అనిపిస్తోంది కదా..? కానీ ఒక్క నిమిషమాగండి. ఆ టాలెంట్ మీరు నేర్చుకోలేరు, నేను నేర్పించలేను. ఎందుకంటే అది ముఠామేస్త్రి సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు.. అదో రకమైన టాలెంట్, అది అందరికీ రాదు, అందరూ చేయకూడదు కూడా.హిందీలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకి కూడా పాకింది. దురదృష్టవశాత్తూ.. మన ఫీమేల్ కంటెంట్ క్రియేటర్స్ ఈ ఫీచర్‌ని చాలా రాంగ్ దారిలో వాడుతున్నారు. అసలేం జరుగుతోంది..? దీనిపై ఎందుకు ఇంత వ్యతిరేకత..? అనేవి వివరంగా మాట్లాడుకుందాం.అసలు ఈ కోటి రూపాయల గోలేంటి..? కేరళకు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. తన పేరు అశ్విని, Instagramలో పర్పుల్ సెలా అని ఉంటుంది.. ఆ అమ్మాయికి ఉన్నది కేవలం 2-3 లక్షల ఫాలోవర్లే. కానీ.. సబ్స్క్రైబర్లు మాత్రం 26 వేల మందే. వీరంతా ఒక్కొక్కరు నెలకు 399 రూపాయలు పే చేస్తున్నారు. ఇలా లెక్కేస్తే నెలకు కోటి రూపాయల పైనే ఈ అమ్మాయి సంపాదిస్తోంది. హిందీ క్రియేటర్లని కూడా దాటి ఈమె ఇండియాలోనే నంబర్ వన్ పొజిషన్‌కి వెళ్ళిపోయింది. మన తెలుగులో కూడా గత 4-5 నెలలుగా విష్ణుప్రియ, సాధన నాయుడు లాంటి వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు. నిన్న మొన్నటి వరకు Twitterలో వీళ్ళ ఫోటోలే ట్రెండింగ్. మరి.. ఏంటా ఫోటోలు? ఏమున్నాయి అందులో? అన్నీ ఆనిముత్యాలే. బాహాటంగా ఎక్స్పోజింగ్ చేస్తూ యూత్ ని ఆకర్షించడమే వీరి పని.అసలు Instagram ఈ సబ్స్క్రిప్షన్ ఫీచర్ ఎందుకొచ్చింది..? అంటే నిజానికి ఇది YouTube మానిటైజేషన్ లాంటిది. క్రియేటర్లకి డైరెక్ట్ ఆదాయం ఉండదు కాబట్టి, వాళ్ళ స్పెషల్ టాలెంట్‌ని క్యాష్ చేసుకోవడానికి ఇచ్చారు. ఉదాహరణకు.. ఒక బిజినెస్ పర్సన్ తన ప్రీమియం డిజైన్లు చూపించడానికి.. ఒక CA లేదా లాయర్ తన క్రిటికల్ లీగల్ టిప్స్ చెప్పడానికి.. ఒక ఫోటోగ్రాఫర్ తన సీక్రెట్ సెట్టింగ్స్ నేర్పించడానికి.. లేదా ఒక డాన్సర్ తన ఎక్స్‌క్లూజివ్ స్టెప్స్ నేర్పించడానికి.. ఈ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చింది. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి..? టాలెంట్‌ని పక్కన పెట్టి, బాడీని చూపిస్తూ మనీ సంపాదిస్తున్నారు. ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు రాత్రింబవళ్లు కష్టపడితే నెలకి లక్ష రావడం కష్టంగా ఉంటే, వీళ్ళు ఇలాంటి కంటెంట్‌తో కోట్లు కొల్లగొడుతున్నారు. ఇది చూసినప్పుడు ఎవరికైనా కోపం, ఆవేదన రావడం సహజం.ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. మన పేరెంట్స్ చిన్నప్పుడు కష్టపడి కాయగూరలమ్మినా, కూలి పని చేసినా మనం గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఎందుకంటే అది కష్టం, అది నీతి. కానీ వీళ్ళు రేపు పొద్దున వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు..? మీ అమ్మ ఏం చేస్తుందిరా అంటే.. Instagramలో సబ్స్క్రిప్షన్ పెట్టి ఇగో ఇలాంటి ఫోటోలు అమ్ముతుంది.. అని గర్వంగా చెప్పుకోగలరా..? మై బాడీ మై విష్ అని కొందరు వాదిస్తారు. లీగల్‌గా ఇది కరెక్టే కావచ్చు.. కానీ ఎథికల్‌గా ఏం సమాధానం చెబుతారు. ఇలాంటివి చూసి కాలేజీ పిల్లలు, హౌస్ వైఫ్స్ కూడా మనీ ఇంత ఈజీగా వస్తుందా అని తప్పుడుదారిలో ఇన్స్పైర్ అవుతున్నారు. దీనివల్ల యూత్ టైం ఎంత వేస్ట్ అవుతుందో తెలుసా..? ఒక ఫోటో చూడటానికెళ్లి గంటల కొద్దీ అందులోనే మునిగిపోతున్నారు. రాబోయే కాలం ఒక యుద్ధభూమి. అక్కడ సర్వైవ్ అవ్వాలంటే స్కిల్ కావాలి కానీ, ఇలాంటి వ్యసనాలు కాదు.మీకు అలాంటి కంటెంట్ చూపించాలనే ఉంటే.. దానికి ఓన్లీ ఫ్యాన్స్ లాంటి డెడికేటెడ్ యాప్స్ ఉన్నాయి, అక్కడికెళ్ళండి. Instagram అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర్నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ ఉంటారు. దీన్ని ఇలాంటి చెత్తతో నింపేయొద్దు. తల్లిదండ్రులకు కూడా ఓ సజిషన్.. మీ పిల్లల ఫోన్లలో Instagram, Telegram యాప్స్ ఎలా వాడుతున్నారో గమనించండి. వాళ్ళు ఎక్కడ మనీ స్పెండ్ చేస్తున్నారో చూడండి. చెడిపోవడానికి వంద దారులున్నాయిక్కడ, జాగ్రత్త పడకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. చివరిగా.. మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది కాదు, ఎలా సంపాదిస్తున్నారు అన్నదే ముఖ్యం. అభిమానుల పేరుతో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు మీ అభిమానానికి అర్హులు కాదా అని. దట్సాల్. -
విజయవాడలో అమానుషం..
విజయవాడ: నగరంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని పసిపిల్లను పబ్లిక్ టాయిలెట్స్ వదిలి వెళ్లిందో మహిళ. పసిపిల్లను తీసుకుని ఆటో ఎక్కిన ఓ మహిళ.. కృష్ణలంక స్టేషన్‌కి ఎదురుగా ఉన్న పబ్లిక్ టాయిలెట్ వద్దకు వచ్చేసరికి ఆటో ఆపింది. బాత్రూమ్కు వెళ్లాలని చెప్పిన సదరు మహిళ.. ఆ పసికందును ఆ టాయిలెట్లోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆ పసిప్రాణానికి బకెట్ అడ్డుగా పెట్టి అక్కడ నుంచి పరారైంది. అయితే బాత్ రూం కడిగేందుకు వెళ్లిన సమయంలో శానిటరీ సిబ్బంది ఆ పసిపిల్లను గుర్తించారు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఆ పసికందును హుటాహుటీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళను తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పసిపాపను బాత్రూమ్లో వదిలేసిన తర్వాత రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు గుర్తించారు. అస్సలు ఆ మహిళ ఎవ్వరు?, ఎక్కడ ప్రసవించింది?...ఇక్కడ ఎందుకు వదిలేసింది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. -
రూ. 158 కోట్ల అప్పు : జో బైడెన్ కొడుకు అమెరికా విడిచి పారిపోయాడా?
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు 56 ఏళ్ల హంటర్ బైడెన్ అప్పుల్లో కూరుకుపోయారా? తాజా వార్తలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. 17 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 158 కోట్లు) అప్పు చూపించి అమెరికానుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. తన మాజీ న్యాయవాదులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిల విషయంలో కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.వాషింగ్టన్ డిసిలో, విన్స్టన్ & స్ట్రాన్ అనే తన మాజీ న్యాయ ప్రతినిధులు దాఖలు చేసిన ఒక వ్యాజ్యం విచారణలో ఏప్రిల్ 6న అతని న్యాయవాది బ్యారీ కోబర్న్ సమర్పించిన పత్రంలో, బైడెన్ దేశంలోని లేరని, విదేశాలలో నివసిస్తున్నారని కోర్టుకు తెలిపారు. అయితే, ఆయన కచ్చితంగా ఎక్కడ ఉన్నారనే సమాచారం తన వద్ద కూడా లేదని వెల్లడించారు.విన్స్టన్ అండ్ స్ట్రాన్ అనే న్యాయవాద సంస్థకు హంటర్ సుమారు 50,000 డాలర్లు (దాదాపు రూ. 43 లక్షలు) బకాయి ఉన్నారని పేర్కొంటూ, ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకే ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. పన్ను ,తుపాకీ నేరాల కేసులతో పాటు ఇతర న్యాయ పోరాటాలలో కూడా హంటర్ తరపున వాదించిన విన్స్టన్ & స్ట్రాన్ న్యాయ సంస్థ, హంటర్ తమ బిల్లులు చెల్లించడంలో విఫలమయ్యాడని ఆరోపిస్తోంది. మరోవైపు బైడెన్ స్వయంగా తన ఆర్థిక ఇబ్బందుల తీవ్రతను బహిరంగంగా అంగీకరించారు. గత సంవత్సరం ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో, తాను సుమారు 17 మిలియన్ డాలర్ల మేర న్యాయపరమైన అప్పును కలిగి ఉన్నానని ఆయన వివరించినట్లు డైలీ మెయిల్ నివేదించింది.అలాగే గత ఏడాది నవంబర్‌లో ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో, బైడెన్ దక్షిణాఫ్రికాలోని ఒక నగరాన్ని ఆప్యాయంగా వర్ణిస్తూ, తాము దక్షిణాఫ్రికా , అమెరికా మధ్య సమయాన్ని గడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపాడు అదే నెలలో, విదేశీ ప్రయాణ ఖర్చులను కారణంగా చూపుతూ అధ్యక్షుడు ట్రంప్ అతని సీక్రెట్ సర్వీస్ రక్షణను రద్దు చేసిన నేపథ్యంలో బైడెన్ కుటుంబం ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో తలదాచుకుంటున్నట్లు అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. కేప్ టౌన్ వాస్తవ్యురాలైన బైడెన్ భార్య మెలిస్సాతో 2025 మే నెలలో దక్షిణాఫ్రికాలో కనిపించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పినప్పటికీ, ఈ నెలలో కాలిఫోర్నియాలోని శాంటా యినెజ్లో జరిగిన ఒక ఈస్టర్ కుటుంబ సమావేశంలో బైడెన్ పాల్గొనడంతో సుమారు 10,000 మైళ్ల రౌండ్ ట్రిప్‌కు ఎవరు నిధులు సమకూర్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హంటర్‌కు ఆర్థికమద్దతు లభించింది ప్రధానంగా హాలీవుడ్ న్యాయవాది కెవిన్ మోరిస్ నుండే. అతను బైడెన్‌కు 6.5 మిలియన్ డాలర్లకు పైగా రుణం ఇచ్చారు. అలాగే, తండ్రి జో బైడెన్ అధ్యక్షపదవిలో ఉన్న సమయంలో కళారంగం ( ఆర్ట్ అండ్ పెయింటింగ్స్) ద్వారా 1.5 మిలియన్ డాలర్ల అమ్మకాలు జరిగాయట.Hunter Biden Flees US, Claims He’s $17 Million in DebtREAD: https://t.co/9sZ9fJOcbv pic.twitter.com/TAENpimLhm— The Gateway Pundit (@gatewaypundit) April 11, 2026 -
అభిషేక్ మెరుపులు వృధా.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన పంజాబ్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 11) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అభిషేక్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ట్రవిస్ హెడ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 27, క్లాసెన్ 33 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేశాడు.మిగతా ఆటగాళ్లలో అనికేత్ వర్మ 18, సలీల్ అరోరా 9 పరుగులు చేయగా.. నితీశ్ 0, హర్ష్ దూబే ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, శాశాంక్ సింగ్ తలో 2, జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ సన్‌రైజర్స్‌కు ధీటుగా జవాబిచ్చింది. తొలి బంతి నుంచి పంజాబ్ ఓపెనర్లు ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ప్రియాంశ్ ఆర్య (20 బంతుల్లో 57; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ (25 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆతర్వాత శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం కొనసాగించారు. ఫలితంగా పంజాబ్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఊదేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో శివాంగ్ కుమార్ (4-0-33-3) రాణించాడు. -
టయోటా కారు.. రెండు లక్షల సేల్స్!
టయోటా కంపెనీకి చెందిన 'ఇన్నోవా హైక్రాస్' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ విషయాన్ని టయోటా కిర్లోస్కర్ మోటార్ సంస్థ 2026 ఏప్రిల్ 9న ప్రకటించింది.నవంబర్ 2022లో లాంచ్ అయిన ఇన్నోవా హైక్రాస్ భారతదేశంలో రెండు లక్షల అమ్మకాలను పొందింది. కొత్త డిజైన్, లేటెస్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వంటివాటితో భారతీయ కొనుగోలుదారులను ఈ కారు చాలా వేగంగా ఆకట్టుకుంది. న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ (TNGA) ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఇన్నోవా హైక్రాస్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేసే స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది 186 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.రూ. 19.53 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద ప్రారంభమయ్యే ఈ కారు.. భారత్ NCAP కింద 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను కూడా పొందింది. కాబట్టి ఇది అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది.ఇన్నోవా హైక్రాస్ రెండవ వరుసలో పవర్డ్ ఒట్టోమాన్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి వాటితో పాటు.. 65కు పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు వంటివి ఉన్నాయి. రహదారిపై భద్రతను, డ్రైవర్ అనుభూతిని మెరుగుపరచడానికి రూపొందించిన అధునాతన డ్రైవర్ సహాయక సూట్ అయిన టయోటా సేఫ్టీ సెన్స్‌ను కూడా ఇది కలిగి ఉంది. -
ఢిల్లీపై సీఎస్కే గ్రాండ్ విక్టరీ
Chennai super kings vs delhi capitals live Updates: ఢిల్లీపై సీఎస్కే గ్రాండ్ విక్టరీఐపీఎల్-2026లో సీఎస్కే తొలి విజయాన్ని నమోదు చేసింది. చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫాథుమ్ నిస్సాంక(41), అశుతోష్ శర్మ(19) రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్ మూడు, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.ఓటమి దిశగా ఢిల్లీఢిల్లీ విజయానికి చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు కావాలి. క్రీజులో స్టబ్స్(60), కుల్దీప్ యాదవ్(3) ఉన్నారు.ఢిల్లీ ఆరో వికెట్ డౌన్అశుతోష్ రూపంలో ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన అశుతోష్.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 60 పరుగులు కావాలి.ఢిల్లీ ఐదో వికెట్ డౌన్డేవిడ్ మిల్లర్ రూపంలో ఢిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన మిల్లర్.. ఓవర్టన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రీజులో స్టబ్స్(34), అశుతోష్ శర్మ(9)ఉన్నారు.10 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 91/410 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో ట్రిస్టన్ స్టబ్స్(11), డేవిడ్ మిల్లర్(6) ఉన్నారు. ఢిల్లీ విజయానికి 57 బంతుల్లో 121 పరుగులు కావాలి.ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన అక్షర్ పటేల్.. గుర్జప్నీత్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు స్కోర్: 73/3ఢిల్లీ రెండో వికెట్ డౌన్పాథుమ్ నిస్సాంక రూపంలో ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన నిస్సాంక.. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్61 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో నిస్సాంక(41), రిజ్వీ ఉన్నారు.సంజూ సూపర్ సెంచరీ.. సీఎస్కే భారీ స్కోర్చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ కేవలం 55 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 పరుగులు చేశాడు. అతడితో పాటు అయూశ్ మాత్రే(59), దూబే(10 బంతుల్లో 20) రాణించారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. అక్షర్ పటేల్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు. అయూశ్ మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు.సంజూ శాంసన్ సెంచరీ17వ ఓవర్లో సంజూ శాంసన్ ఫోర్ బాది సెంచరీ నమోదు చేశాడుఈ సీజన్లో 52 బంతుల్లో తొలిసెంచరీ చేశాడుఢిల్లీపై 3సిక్స్‌లు,14 ఫోర్లతో సంజూ సెంచరీ పూర్తి చేశాడు ఆయూష్ ఔట్ 17వ ఓవర్లో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది17వ ఓవర్ నటరాజన్ బౌలింగ్‌లో సీఎస్కే బ్యాట్స్‌మెన్ ఆయూష్ ఔటయ్యాడు 55 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం సంజు, ఆయుష్ రెండో వికెట్‌కు 55 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు క్రీజులో సంజు 95, ఆయుష్ 55 17 ఓవర్లకు చెన్నై స్కోర్ 174/1 12 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 119-1, క్రీజులో సంజూ శాంసన్(77), ఆయూష్ మాత్రే(25) ఉన్నారు.శాంసన్ హాఫ్ సెంచరీఐపీఎల్-2026 సీజన్లో సీఎస్కే సూపర్ స్టార్ సంజూ శాంసన్ తొలి హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 52 పరుగులతో సంజూ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 8.5 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 77/1సీఎస్కే తొలి వికెట్ డౌన్సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6.2 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 62/. క్రీజులో సంజూ శాంసన్(46), అయూశ్ మాత్రే ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న సంజూసంజూ శాంసన్ ఎట్టకేలకు తన రిథమ్‌ను అందుకున్నాడు. 22 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 3 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 27/1టాస్ గెలిచిన ఢిల్లీ..ఐపీఎల్-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ రెండు మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులోకి అకిబ్ నబీ, అశుతోష్ శర్మ తుది జట్టులోకి వచ్చారు.జమ్మూ కాశ్మీర్ పేసర్ అకిబ్ నబీకి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. సీఎస్కే కూడా రెండు మార్పులు చేసింది. విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ తిరిగి పునరాగమనం చేశాడు. అదేవిధంగా గుర్జప్నీత్ సింగ్ సీఎస్కే తరపున ఐపీఎల్ డెబ్యూ చేశాడు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఔకిబ్ నబీ, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్ -
కొరియన్ కనకరాజు ఫస్ట్ సాంగ్
టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కొరియన్ కనకరాజు’. ఇందులో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి మొదటి పాటను మేకర్స్ విడుదల చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీపై వరుణ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తాజాగా విడుదలైన పాటను కాసర్ల శ్యామ్ రచించగా సిధ్ శ్రీరామ్ ఆలపించారు. సంగీతం తమన్ అందించారు. -
ఇరాన్ చిత్తుగా ఓడిపోతుంది: చర్చల వేళ ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ చిత్తుగా ఓడిపోతుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఇరాన్ గెలుస్తోందని చెప్పడానికే మీడియా మొగ్గుచూపుతోంది. కానీ, వాస్తవానికి అందరికీ ఇరాన్ ఓడిపోతుందనే విషయం తెలుసని తెలిపారు.“వారికి నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు, వారికి యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థ లేదు, రాడార్ వ్యవస్థ పనిచేయడం లేదు, వారి క్షిపణి, డ్రోన్ కర్మాగారాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. క్షిపణులు, డ్రోన్లు కూడా నాశనం అయ్యాయి. ముఖ్యంగా, ఎప్పటి నుంచో ఉన్న నాయకులు ఇక లేరు’ అని తెలిపారు.సముద్రంలో ఇరాన్ మైన్లు వేసిన విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. అమెరికా ఇప్పుడు హార్మూజ్ జలసంధిని బాగు చేస్తోందని, ప్రపంచ దేశాలకు సాయంగా ఈ పని చేస్తున్నామని అన్నారు.మరోవైపు, అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్థాన్‌లో జరుగుతున్న చర్చలు కొన్ని భేదాలు, ముందస్తు షరతుల వల్ల ఆలస్యమయ్యాయయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, చర్చలు 5 గంటలకుపైగా ఆలస్యమయ్యాయని, ఆ తర్వాత అధికారికంగా ప్రారంభమయ్యాయని ట్రంప్ చెప్పారు. ఇరాన్ యుద్ధం వేళ ఎరువుల ధరలను నిశితంగా గమనిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మార్కెట్‌ను నియంత్రిస్తూ ధరలను అధికంగా పెంచడాన్ని అమెరికా అంగీకరించదని చెప్పారు. కాగా, ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ బృందానికి ఆ దేశ స్పీకర్ మహమ్మద్ బేర్ గలీబాఫ్ నేతృత్వం వహిస్తున్నారు.చర్చలలో అమెరికాకు ఇరాన్ ప్రతిపాదనలు ఇవే..ఇరాన్‌పై దురాక్రమణ చేయొద్దుహార్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగించడానికి అంగీకరించడంఅన్ని ప్రాథమిక ఆంక్షలను ఎత్తివేయడంఅన్ని ద్వితీయ ఆంక్షలను ఎత్తివేయడంఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలన్నింటినీ రద్దు చేయడంIAEA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానాలన్నింటినీ రద్దు చేయడంఇరాన్కు నష్టపరిహారం చెల్లించడంఈ ప్రాంతం నుంచి అమెరికా సైనికదళాలను ఉపసంహరించుకోవడంలెబనాన్పై దాడులు విరమించుకోవడం -
‘మహిళలు నాయకులుగా ఎదగాలి’
హైదరాబాద్: మహిళలు నాయకత్వ స్థానాల్లోకి రావడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా అన్నారు. మహిళలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములుగానే కాకుండా నాయకత్వ స్థానాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ‘హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్’.. మేనేజ్మెంట్ గురించి నగరంలోని అన్ని రంగాల వ్యక్తులకు, విద్యార్థులకు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి సామర్థ్యాన్ని పెంచేందుకు రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. 2025-26 సంవత్సరానికి ‘మేనేజ్మెంట్ ఇన్ ఏఐ ఎరా’ అనే థీమ్‌తో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) ఆధ్వర్యంలో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) అనుసంధానంతో నారీ శక్తి గురించి ‘ఎమర్జ్’ పేరిట హైదరాబాద్ బేగంపేట్‌లోని హోటల్ టూరిజం ప్లాజాలో శనివారం భారీ సదస్సు నిర్వహించారు. ‘వుమెన్ డెవలప్మెంట్ నుంచి వుమెన్- లీడ్ డెవలప్మెంట్’ అనే థీమ్‌తో ఈ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్యా మిశ్రా మాట్లాడుతూ.. ‘వుమెన్ డెవలప్మెంట్’ అంటే మహిళల భాగస్వామ్యం మాత్రమే కాదు.. మహిళలు కార్యక్రమాల్లో పాల్గొనేవారుగానే కాకుండా, లీడర్షిప్ పొజీషన్లలోకి వచ్చి కార్పొరేట్ వ్యవస్థలో గానీ, వ్యాపార రంగంలో గానీ ముందుకు రావాలని తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు.అసోసియేషన్ అధ్యక్షుడు ఆల్వాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గతంతో పోలిస్తే ప్రస్తుతం మహిళల ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో పెరుగుతుండగా, కొత్త తరం మరింత ఉత్సాహంతో ముందుకు వస్తోంది. ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, స్టార్టప్‌లలో మహిళలు విశేషంగా రాణిస్తున్నారు. దేశంలో ఈ దిశగా తెలంగాణ ముందంజలో ఉంది. ఇలాంటి సదస్సులు మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయి ’ అని పేర్కొన్నారు. గత తరంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. గత తరం చూస్తే మహిళలు నాయకత్వం లేదా కార్పొరేట్ రంగంలో కొద్దిమంది మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు వారి తదుపరి తరం కూడా ముందుకు వస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలు కేవలం పాల్గొనడం మాత్రమే కాకుండా ఉన్నత విద్యలో రాణించడం, పోటీ పరీక్షలు ఎదుర్కోవడం, అన్ని రంగాల్లో ముందుకు సాగడం జరుగుతోంది. ముఖ్యంగా స్టార్టప్‌లలో కూడా మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ‘కుర్చీయే కాదు.. కుర్చీని షేక్ చేసేలా మహిళలు ముందుకొస్తున్నారు.. దేశంలో ఈ విషయంలో తెలంగాణ ముందంజలో ఉంది. ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి సదస్సులు మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి’ అని చెప్పారు.అనంతరం కామినేని ఆస్పత్రుల సీవోవో గాయత్రి కామినేని మాట్లాడుతూ.. నాయకత్వం అంటే కేవలం పదవిలో ఉండటం కాదని, మార్పును తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఫ్యూచరిస్టిక్ సిటీ డైరెక్టర్ కరుణ గోపాల్ మాట్లాడుతూ.. ఎంట్రప్రెన్యూర్షిప్ వైపు మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ వ్యవస్థలోనూ వ్యాపార రంగంలోనూ తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను గుర్తించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. -
‘ కూటమి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలి’
తాడేపల్లి : అమరావతి పేరుతో బారీ దోపిడీ జరుగుతోందని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలన్నారు సజ్జల. ఈ రోజు(శనివారం, ఏప్రిల్ 11వ తేదీ) తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ఆర్టీఐ విభాగం రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల మాట్లాడుతూ.. ‘ప్రజాసమస్యలపై బలమైన గళం వినిపించాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు సిద్ధంగా ఉండాలి. సిస్టమాటిక్‌గా అవినీతి, దోపిడీ జరుగుతోంది. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జరుగుతున్న అవినీతి దాచిపెడుతున్నారు. జగన్‌పై ఇంకా తప్పుడు ప్రచారం కొనసాగుతోంది. 2047 పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు.రాజధాని పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది. లక్షల కోట్ల రూపాయిల అవినీతికి రంగం సిద్ధమైంది. అమరావతి పేరుతో దోపిడీ కొనసాగుతోంది. ఉద్యమంలా అవినీతిని ఎండగట్టేందుకు సిద్ధం కావాలి’ అని సజ్జల పిలుపునిచ్చారు. -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. ఏకైక ప్లేయర్‌గా
పాకిస్తాన్ సూపర్ స్టార్, పెషావర్ జెల్మీ కెప్టెన్ బాబర్ ఆజం ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో 4000 పరుగుల మార్క్ అందుకున్న తొలి ప్లేయర్‌గా ఆజం చరిత్ర సృష్టించాడు. శనివారం కరాచీ వేదికగా లహోర్ ఖలంధర్స్తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బాబర్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. బాబర్ కేవలం 102 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. అతడి పీఎస్ఎల్ కెరీర్లో 37 ఫిప్టీలతో పాటు రెండు సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుత పీఎస్ఎల్ సీజన్లో బాబర్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో 70.67 సగటుతో 212 పరుగులు చేసి సెకెండ్ లీడింగ్ రనస్కోరర్గా బాబర్ కొనసాగుతున్నాడు.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లహోర్పై 76 పరుగుల తేడాతో కరాచీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్(48 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మైఖల్ బ్రేస్‌వెల్(21), మహ్మద్ హ్యారిస్(18) రాణించారు.లహోర్ బౌలర్లలో కెప్టెన్ షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. ముస్తాఫిజుర్ రెహ్మన్ రెండు, ఉబైడ్ షా, ఉసమా మీర్ తలా వికెట్ సాధించారు. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లహోర్.. పెషావర్ బౌలర్ల ధాటికి 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. పెషావర్ బౌలర్లలో స్పిన్నర్లు మైఖల్ బ్రేస్‌వెల్, సుఫియన్ ముఖియమ్ తలా మూడు వికెట్లతో లహోర్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు షోర్ఫుల్ ఇస్లాం, అమీర్ జమీల్ ఓ వికెట్ సాధించారు.చదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఎప్పుడంటే? -
ఆలుమగల స్ఫూర్తి గాథ.. జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!
జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!.. ఇదొక శీర్షిక మాత్రమే కాదు.. ఆలుమగలకు ఆదర్శమైన ప్రధాన విషయం. ప్రస్తుత రోజుల్లో భార్యా భర్తల సంబంధాల్లో ప్రేమలు ఎంతవరకూ ఉంటున్నాయనే దానికి ఈ తరహా ఘటనలు ప్రేరణగా నిలుస్తాయి. ఒకరికోసం ఒకరు జీవించే క్షణాలు చాలా అల్పమై స్వల్పమైపోయిన ఈ రోజుల్లో నిజంగా ఇదొక స్ఫూర్తిగానే నిలుస్తుంది. ఏదో యాంత్రిక జీవితంలో ముందుకు సాగుతూ.. ఏదో బ్రతికేస్తున్నాం అని కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి కష్టంలో ఒకరు తోడుగా నిలుస్తేనే ఆ దాంపత్యానికి అర్ధం ఉంటుందనేది తాజా ఎపిసోడ్ చెప్పకనే చెప్పేసింది. ఇలా ఒకరికోసం ఒకరు అనే జంట ఉండటమే ఇప్పుడు వార్త అయ్యింది. వార్తా వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన డెంగ్ యుకై అనే మహిళకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. నడవలేని స్థితి. బెడ్‌కే పరిమితమై కృంగిపోయింది. తాను చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని కూడా భర్తను ప్రాధేయ పడింది. భర్తకు తనవల్ల కష్టం రాకూడదని ఆమె చనిపోవాలని అనుకుంది. తాను చనిపోతే భర్త సుఖంగా ఉంటాడని భావించింది. భర్త నో అన్నాడు. ‘నేను ఉండగా నీకేం కాదు’ అన్నాడు,. భార్యకు అండగా నిలబడ్డాడు. విధితో పోరాడాడు. తన సంకల్పం ఎంత గట్టిదో చూపించాడు. భార్యను పూర్వపు స్థితికి తీసుకురావడానికి సుమారు రూ. 2 కోట్ల వరకూ ఖర్చు పెట్టాడు. అదే సమయంలో ప్రతీ రోజూ ప్రతీ క్షణం భార్య అలా బెడ్‌కే పరిమితమైన భార్య ముందు డ్యాన్స్‌లు చేస్తూ నవ్వించే యత్నం చేశాడు. చివరకు ఆమె కోలుకుంది. మళ్లీ తన పాత రోజుల్లోకి వచ్చేసింది. ప్రేమ శక్తితో భార్య తిరిగి జీవం పోసుకుంది.. లౌకిక జీవితాన్ని మళ్లీ చూడసాగింది. View this post on Instagram A post shared by History Facts & Stories (@howhistorylooks) Crazy what having someone who won't give up on you can do for you. This is will forever be a beautiful story https://t.co/UH7Jzd0TEL— Bhuti Olishayayo Ikhekhe (@BantuMthabela_) April 11, 2026 -
గూగుల్ పిక్సెల్ 10 కొనుగోలుపై భారీ తగ్గింపు!
ఖరీదైన స్మార్ట్ఫోన్లు ఎప్పుడెప్పుడు తక్కువ ధరకు లభిస్తాయా?.. అని చాలామంది వేచి చూస్తుంటారు. అలాంటి వారికి ఇప్పుడు పిక్సెల్ 10 మంచి ఎంపిక అవుతుంది. ఎందుకంటే.. ఈ ఫోన్ ఇప్పుడు రూ. 55వేల కంటే తక్కువ ధరకు లభించనుంది.ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 10 ప్రారంభ ధర రూ. 79,999 ఉండగా.. దానిని తగ్గింపుతో రూ. 74,999కు అందుబాటులో ఉంచింది. అంటే ప్రారంభంలోనే రూ.5000 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. ఇది కాకుండా.. HDFC బ్యాంక్ కార్డ్ ఉపయోగిస్తే వెంటనే రూ. 4,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా భారీ తగ్గింపు పొందవచ్చు.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. దీనిద్వారా గరిష్టంగా రూ.52,000 వరకు తగ్గింపు పొందవచ్చు.ఉదాహరణకు మీ దగ్గర ఉన్న పాత పిక్సెల్ 7 ఎక్స్చేంజ్ చేసుకుంటే.. 15,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ లభించవచ్చు. అదనంగా మరో 5000 ఇతర డిస్కౌంట్స్ లభిస్తాయి. కాబట్టి గూగుల్ పిక్సెల్ 10 మొబైల్ రూ. 55,000 కంటే కూడా తక్కువకు లభించే అవకాశం ఉంది.గూగుల్ పిక్సెల్ 10గూగుల్ పిక్సెల్ 10 మొబైల్ 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజిని పొందుతుంది. టెన్సర్ జీ5 ప్రాసెసర్ లభిస్తుంది. ఏఐ బేస్డ్ పనులను నిర్వహించడానికి కూడా చాలా సహాయపడుతుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 10.5MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. డిస్ప్లే 6.3 అంగుళాల OLED స్క్రీన్‌తో వస్తుంది, ఇది మంచి క్లారిటీ ఇస్తుంది. అలాగే 4970 యాంపియర్ బ్యాటరీ ఉండటం వల్ల సాధారణ వినియోగంలో ఒక రోజు మొత్తం సులభంగా పనిచేస్తుంది. -
పాపం హరీష్ శంకర్.. ఎట్టకేలకు ఒప్పుకున్నాడు
పాపం ప్రతాప్ సినిమా ట్రైలర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దర్శకుడు హరీష్ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హరీష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' భారీ డిజాస్టర్ అయినప్పటికీ, సినిమా విడుదలైన తర్వాత కూడా హరీష్ దానిని తీవ్రంగా ప్రచారం చేస్తూనే వచ్చారు. అతను వాస్తవాన్ని అంగీకరించడం లేదని ప్రేక్షకుల నుంచి విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. అయితే, తిరువీర్ నటించిన 'పాపం ప్రతాప్' సినిమా కార్యక్రమంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆశించిన స్థాయిలో ఆడలేదని ఎట్టకేలకు అంగీకరించాడు.దర్శకుడు హరీష్ శంకర్ ఈ వేదికపై ఇలా అన్నాడు. "ఈ కార్యక్రమానికి వస్తుండగా యాంకర స్రవంతి నన్ను ‘పాపం హరీష్’ అని పిలిచింది. నా సినిమా (ఉస్తాద్ భగత్ సింగ్) థియేటర్లలో సరిగ్గా ఆడకపోవడం వల్లే ఆమె అలా పిలిచిందని మొదట అనుకున్నాను. ఆ తర్వాత, ఆమె అందరినీ ‘పాపం’ అనే సంబోధనతో పిలవడం మొదలుపెట్టింది. అందుకే ఫర్వాలేదని అనుకున్నాను," అని హరీష్ శంకర్ అన్నారు. అందుకు సంబంధించిన క్లిప్ వైరల్ అవుతుంది. -
ఏపీపై బట్టబయలైన చంద్రబాబు కపట ప్రేమ
సాక్షి,అమరావతి: ఏపీపై సీఎం చంద్రబాబు కపట ప్రేమ బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేస్తూనే, పెట్టుబడులను మాత్రం తెలంగాణలో పెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.తెలంగాణలో హెరిటేజ్ సంస్థ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. శామీర్‌పేటలో 6,205 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 98.5 మీటర్ల పొడవు, 63 మీటర్ల వెడల్పుతో హెరిటేజ్ ఐస్‌క్రీమ్ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ ప్లాంట్‌లో చంద్రబాబు కుటుంబం రూ.204 కోట్ల పెట్టుబడి పెట్టింది. వచ్చే ఐదేళ్లలో ఈ పెట్టుబడులను రూ.500 నుంచి రూ.700 కోట్ల వరకు పెంచాలని నిర్ణయించింది.అయితే, కొత్త ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయడానికి చంద్రబాబు కుటుంబం ఆసక్తి చూపలేదని విమర్శలు వస్తున్నాయి. సొంత రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోయినా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తనని చూసే ఏపీకి పెట్టుబడులు వస్తాయంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు.. తన కుటుంబ వ్యాపారాన్ని మాత్రం తెలంగాణలో విస్తరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. -
కోడల్ని ఇంట్లోంచి లాక్కొచ్చి, రిటైర్డ్ రైల్వే ఆఫీసర్ దౌర్జన్యం
కాన్పూర్‌లో వరకట్నం కోసం ఒక మహిళపై నడిరోడ్డుపై జరిగిన అమాను దాడి కలకలం రేపింది. మీనాక్షి పాండే అనే మహిళపై ఆమె మామ, రిటైర్డ్ రైల్వే అధికారి దారుణంగా దాడిచేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.భారతీయ రైల్వేలో అధికారిగా పనిచేసిన రమేష్ దూబే, కోడలు మీనాక్షిని వీధిలోకి బలవంతంగా ఈడ్చుకుంటూ వచ్చి, చేయి చేసుకోవడం, తన్నుతూ హింసించాడు. హృదయ విదారంగా ఆమె సాయం కోసం అర్థించిన వైనం వీడియోలో రికార్డైంది. ఈ క్రమంలో ఆమె బట్టలు కూడా చిరిగిపోయాయి. అయినా వదలకుండా వేధింపుల పర్వాన్ని కొనసాగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వెల్లు వెత్తింది. ఈ దారుణం జరుగుతున్న సమయంలో పోలీసు అధికారులున్నప్పటికీ, వారు జోక్యం చేసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.రూ. 20 లక్షల వరకట్నం కోసం రూ. 20 లక్షల కట్నం తేవాలంటూ గత కొన్నాళ్లుగా భర్త , అత్తమామలు వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని మీనాక్షి పాండే అత్తమామలపై సంచలన ఆరోపణలు గుప్పించింది. నిరంతర వేధింపుల పర్వం సాగుతోందని, ఏళ్ల తరబడి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆమె వాపోయారు. అంతేకాదు తనకు విడాకులివ్వకుండానే, హిందూ వివాహ చట్టానికి విరుద్ధంగా తన భర్త మరో పెళ్లి చేసుకున్నాడని కూడా మీనాక్షి ఆరోపించారు.🚨Kanpur Dowry Horror: Retired Railway Official Savagely Beats Meenakshi Pandey - Daughter need help 🙏Incident :A shocking viral video shows retired railway official Ramesh Dubey dragging his daughter-in-law, Meenakshi Pandey, onto the street. He brutally assaulted her,… pic.twitter.com/S5Vd1cdSoN— Ramesh Tiwari (@rameshofficial0) April 11, 2026సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఆగ్రహంఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రజలు తీవ్రంగా స్పందించారు. మహిళల రక్షణ కోసం, వరకట్నం హింసను నిషేధించే అనేక చట్టాలు ఉన్నప్పటికీ, మహిళలపై ఈ హింస ఇంకా కొనసాగుతోందనడానికి ఈ సంఘటన ఒక విషాదకరమైన నిదర్శనం. చట్టాలు ఎన్ని ఉన్నా, వరకట్న వేధింపులు ఇంకా కొనసాగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.పట్టపగలు, నడిరోడ్డుపై ఒక మహిళను ఇలా హింసిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?" అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని, ముఖ్యంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో వైరల్ కావడం, ప్రజల నుండి ఒత్తిడి పెరగడంతో కాన్పూర్ పోలీసులు స్పందించారు.కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మీనాక్షి చేసిన ఆరోపణలపై సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.ఇదీ చదవండి: నో మెన్... ఓన్లీ విమెన్ : 300మంది వీడియో వైరల్ -
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఎప్పుడంటే?
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి ప్రపంచస్ధాయి బౌలర్లను వైభవ్ ఉతికారేశాడు. వైభవ్ కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు.దీంతో వైభవ్ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన సూర్యవంశీ 200 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రశంసల వర్షం కురిపించాడు."వైభవ్ ఒక అద్భుతమైన ఆటగాడు. ఇంత చిన్న వయసులో ఇలాంటి టాలెంట్‌ను చూడడం ఇదే తొలిసారి. అతి పిన్న వయస్కుడిగా టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి వైభవ్ కచ్చితంగా అర్హుడు" అని ధుమాల్ ఎక్స్‌వేదికగా కొనియాడాడు. వైభవ్ సూర్యవంశీ ఇటీవలే తన 15వ ఏటలోకి అడుగుపెట్టాడు. దీంతో అతడు అంతర్జాతీయ అరంగేట్రం చేసేందుకు అర్హత సాధించాడు.ఐపీఎల్-2026 సీజన్ తర్వాత భారత జట్టు రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్‌కు వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే అవకాశముంది. వైభవ్ ప్రదర్శనలను అజిత్ అగార్కర్ అండ్ కో నిశితంగా పరిశీలిస్తోంది.ఒకవేళ త్వరలో జరగనున్న ఐర్లాండ్ సిరీస్‌కు వైభవ్ ఎంపికైతే, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ ఆల్-టైమ్ రికార్డును వైభవ్ తిరగరాసే అవకాశం ఉంది. టీమిండియా తరపున సచిన్ టెండూల్కర్ తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.చదవండి: ఊచకోత.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ -
ఊచకోత.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 11) జరుగుతున్న మ్యాచ్‌లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో ఐపీఎల్ చరిత్రలో 20 లోపు బంతుల్లో 5 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ తన ఐపీఎల్ కెరీర్లో 16 బంతుల్లో ఓసారి.. 18 బంతుల్లో రెండు సార్లు, 19 బంతుల్లో మరో రెండు సార్లు హాఫ్ సెంచరీలు చేశాడు.ఈ విభాగంలో అభిషేక్ తర్వాతి స్థానంలో నికోలస్ పూరన్ ఉన్నాడు. పూరన్ 4 సార్లు ఐపీఎల్లో 20 లోపు బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. అభిషేక్, పూరన్ తర్వాతి స్థానాల్లో జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (3), వైభవ్ సూర్యవంశీ (3) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అభిషేక్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ట్రవిస్ హెడ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 27, క్లాసెన్ 33 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేశాడు.మిగతా ఆటగాళ్లలో అనికేత్ వర్మ 18, సలీల్ అరోరా 9 పరుగులు చేయగా.. నితీశ్ 0, హర్ష్ దూబే ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, శాశాంక్ సింగ్ తలో 2, జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ తీశారు. -
కీసర టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
ఎన్టీఆర్ జిల్లా: కీసర టోల్గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్‌గేటు దాటే సమయంలో బీఎండబ్ల్యూ కారు (టీఎస్09ఎఫ్టీ662)పై ట్యాంకర్ పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి, వారి పరిస్థితి విషమంగా మారింది.కారుపై పడిన ట్యాంకర్‌ను తొలగించేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీ క్రెయిన్ సహాయంతో కారుపై పడిన ట్యాంకర్‌ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ప్రమాదానికి గురైన కారు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. కారు హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడాకు చెందిన శ్రీనివాసరావుదిగా పోలీసులు గుర్తించారు. ట్యాంకర్ ఏపీ రిజిస్ట్రేషన్ పేరుతో తమిళనాడులో ఎక్కువగా తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం తరువాత పరారీలో ఉన్న ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పశ్చిమ బెంగాల్లో వచ్చే మార్పు ఇదే: ప్రధాని మోదీ
ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఏప్రిల్ 11) తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అధికార టీఎంసీ కూడా వామపక్ష పాలనా విధానాన్ని అనుకరించిందని, పశ్చిమ బెంగాల్లో మార్పును తీసుకురావడంలో విఫలమైందని చెప్పారు. ముర్షిదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో టీఎంసీని ప్రజలు అదే విధంగా ఓడిస్తారని అన్నారు. “స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. బెంగాల్‌ను సవాలు చేసిన ప్రతి ఒక్కొక్కరి అహంకారం ఛిద్రమైపోతూ వచ్చింది. మొదట బ్రిటిష్, తరువాత కాంగ్రెస్, చివరికి వామపక్షాలు తమ అహంకారంతో కుప్పకూలిపోయాయి. ఇప్పుడు బెంగాల్ ప్రజలు టీఎంసీ అహంకారాన్ని ఛిద్రం చేస్తారు” అని ప్రధాని చెప్పారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఎంసీ వాగ్దానాలను నెరవేర్చలేకపోయిందని చెప్పారు.అవినీతి వ్యవస్థలను టీఎంసీ ప్రోత్సహించిందని మోదీ ఆరోపించారు. గతంలో ఉన్న ప్రభుత్వాలకు సంబంధించిన వర్గాలు ప్రస్తుత ప్రభుత్వంలో కొనసాగుతున్నాయని అన్నారు. “వామపక్షాలకు చెందిన గూండాలు, సిండికేట్లు అన్నీ తృణమూల్‌లోకి మారాయి. ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, పశువుల అక్రమ రవాణా నుంచి కమిషన్ల వరకు అన్నింటిని ఇప్పుడు టీఎంసీ నియంత్రిస్తోంది” అని అన్నారు.దేశ భద్రత తమకు అత్యంత ముఖ్యమైనదని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో యూసీసీ అమలు చేసి, బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలుకుతామని అన్నారు. టీఎంసీ జంగిల్ రాజ్, సిండికేట్ రాజ్‌కు ముగింపు పలకడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మారుతుందని చెప్పారు. కాగా, ఏప్రిల్ 23, 29 తేదీల్లో పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 4న ప్రకటిస్తారు. -
తొలగించిన కంపెనీ.. మళ్లీ పిలిచింది: చివరికి అవమానమే!
ఇటీవల కాలంలో కార్పొరేట్ కంపెనీల తీరు చాలా మారిపోయింది. సంస్థలు ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరో ఘటన తెరమీదకు వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఒక మహిళ తన ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్న ఒక బాధాకరమైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె కథ ప్రస్తుతం వైరల్ అవుతోంది.రెడ్దిట్ పోస్టు ప్రకారం.. గత సంవత్సరం ఒక కంపెనీలో పనిచేస్తూ ఆమె పనిని ఎంతో నిబద్ధతతో, 100 శాతం కృషితో నిర్వహించారు. అయినప్పటికీ, తనకు మొదటి నుంచే అక్కడ ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. కొత్తగా చేరిన ఉద్యోగులను టీమ్‌లో అధికారికంగా పరిచయం చేసే విధానం ఉన్నప్పటికీ, తనను మాత్రం ఎప్పుడూ సరైన రీతిలో పరిచయం చేయలేదు. ఇది చిన్న విషయంగా అనిపించినప్పటికీ.. తనను ఎవరూ పట్టించుకోవడం లేదనే భావన కలిగించిందని పేర్కొన్నారు.ఇతర ఉద్యోగులను సమావేశాలకు పిలిచినప్పుడు, తనను మాత్రం తరచూ పక్కన పెట్టేవారు. కొంతమంది సహచరులు కూడా “మీరు మీటింగ్‌లో ఎందుకు లేరు?” అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఆమెకు అసౌకర్యంగా మాత్రమే కాకుండా.. అవమానకరంగా అనిపించాయని అన్నారు.కొంతకాలం తర్వాత.. కంపెనీ తనను ఉద్యోగం నుంచి తొలగించింది. సంస్థ నిర్ణయాన్ని ప్రశాంతంగా స్వీకరించింది. కానీ తర్వాత.. అదే పని కోసం ఇద్దరిని కొత్తగా నియమించుకున్నారని తెలుసుకున్నప్పుడు ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అంతే కాకుండా.. కొన్ని నెలల తర్వాత అదే కంపెనీ తనను మళ్లీ సంప్రదించి, తాత్కాలికంగా తిరిగి రావాలని కోరింది. కొత్తగా చేరిన ఉద్యోగులకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. ఉద్యోగ జీవితంలో గ్యాప్ రాకుండా ఉండాలని భావించి, ఆమె తిరిగి ఆ ఆఫర్‌ను అంగీకరించారు.ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే.. ''నా తర్వాత నియమితులైన వారికి నేను సహాయం చేస్తున్నాను, వారే నాకు రోజువారీ పనులు అప్పగిస్తూ ఏమి చేయాలో చెబుతున్నారు''.ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఆమె తనకు తాను నిలబడాల్సిందని, కంపెనీ వద్ద తిరిగి చేరినప్పుడు కఠినమైన షరతులు పెట్టాల్సిందని సూచించారు. కొందరు కన్సల్టింగ్ ఫీజులు తీసుకోవాలని కూడా అభిప్రాయపడ్డారు. మరికొందరు.. తన స్వభావం కారణంగా తాను మృదువుగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని అభిప్రాయపడ్డారు. -
ఇరాన్-అమెరికా శాంతి చర్చల్లో ఆసిమ్ మునీర్ కొత్త పాచిక
ఇస్లామాబాద్: పశ్చిమాసియా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొనసాగుతున్న చర్చల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శాంతి చర్చల కోసం అమెరికా నుంచి పాకిస్థాన్‌కు వచ్చిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరైన సందర్భంలో.. ఇరాన్–అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ధరించిన వేషధారణ ప్రత్యేక చర్చకు దారి తీసింది. అమెరికా-పాక్ శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఆసిమ్ మునీర్ వ్యహరశైలి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై చర్చాంశనీయంగా మారింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ నేతృత్వంలోని 71 మంది సభ్యుల ఇరాన్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికే సమయంలో మునీర్ యుద్ధ దుస్తులు (కామోఫ్లేజ్ కాంబాట్ డ్రెస్)లో కనిపించారు. అయితే, కొన్ని గంటల తర్వాత నూర్ ఖాన్ వైమానిక స్థావరానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేరుకున్నప్పుడు, మునీర్ పూర్తిస్థాయి సూట్ ధరించి హాజరయ్యారుఆశ్చర్యంగా ఆసిమ్ మునీర్ తీరువిదేశీ నాయకులను కలిసేటప్పుడు సైనికాధికారి ఎల్లప్పుడూ యూనిఫాంలో ఉండాలి. కానీ ఆసిమ్ మునీర్ మాత్రం అమెరికన్లతో తాను దౌత్యవేత్తగా.. ఇరాన్‌తో సైనికుడిగా ఉన్నానని చూపిస్తున్నారని, ఆసిమ్ మునీర్ తీరు సరైంది కాదని సీనియర్ ఆర్మీ జనరల్ ప్రవర్తనకు తగనిది’ అని రిటైర్డ్ మేజర్ జనరల్ సంజయ్ మెస్టన్ తెలిపారు. ఇరాన్‌తో సమావేశంలో యుద్ధ దుస్తులు ధరించడం ద్వారా మునీర్ సైనిక శక్తిని ప్రదర్శించాలనే సంకేతం ఇచ్చారని రక్షణ నిపుణులు విశ్లేషించారు. ఇటీవల ఇరాన్–పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతలు, క్షిపణి దాడుల నేపథ్యం ఈ నిర్ణయానికి కారణమని వారు భావిస్తున్నారు. మరోవైపు, అమెరికా ప్రతినిధులతో సమావేశంలో సూట్ ధరించడం ద్వారా తాను కేవలం సైనికాధికారి మాత్రమే కాకుండా దౌత్యవేత్తగానూ ఉన్నానని చూపించుకోవాలనుకున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇది ఆయన రాజకీయ ఆశయాలను ప్రతిబింబిస్తోందని కూడా వ్యాఖ్యానించారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశాల్లో కూడా మునీర్ సూట్ ధరించడమే గమనార్హం. ట్రంప్ ఆయనను తన ‘ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్’ అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి.2024లో ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో పాకిస్థాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌పై దాడి చేసింది. బలూచ్ వేర్పాటువాద సున్నీ మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్–అదల్ లక్ష్యంగా చేసుకుంది. ఇదే గ్రూప్ ఇరాన్‌లోని సిస్తాన్ ప్రావిన్స్ స్వతంత్రత కోసం పోరాడుతోంది. కొన్ని రోజుల్లోనే పాకిస్థాన్ కూడా ప్రతిగా ఇరాన్ సిస్తాన్–బలూచిస్తాన్ ప్రాంతంలో బలూచ్ మిలిటెంట్లపై దాడులు చేసింది. ఈ ఉద్రిక్తతలు చివరికి చైనా జోక్యంతో తగ్గాయి. అయినప్పటికీ, ఇరాన్–పాకిస్థాన్ సంబంధాలు అప్పటి నుంచి స్థిరంగా లేవు. అమెరికా వైపు చూస్తే, ఆసిమ్ మునీర్ సూట్ ధరించడం ద్వారా తాను కేవలం సైనిక నాయకుడే కాకుండా దౌత్యవేత్తగా కూడా ఉన్నానని చూపించుకోవాలనుకున్నాడు. ఇది ఆయన రాజకీయ ఆశయాలను స్పష్టంగా తెలియజేస్తోందని రక్షణ నిపుణుడు సందీప్ ఉన్నితన్ వ్యాఖ్యానించారు.అదే సమయంలో మునీర్ తన శక్తి సామర్ధ్యాలేమిటో ప్రపంచానికి, అలాగే పాకిస్థాన్ ప్రజలకు మరో సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సాధారణంగా ఇరాన్ విదేశాంగ మంత్రి లేదా అమెరికా ఉపాధ్యక్షుడి వంటి ఉన్నతాధికారులను స్వాగతించేది పాకిస్థాన్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి లేదా విదేశాంగ మంత్రి కావాలి. కానీ ఈసారి మునీర్ ముందుకు రావడం అందుకు ఊతంగా నిలుస్తోంది. జేడీ వాన్స్‌తో రెడ్ కార్పెట్‌పై నడుస్తూ, నవ్వుతూ, మాట్లాడుతున్న మునీర్ దృశ్యాలు కేవలం ప్రొజెక్షన్ కోసం అని నిపుణులు చెబుతున్నారు. ‘పాకిస్థాన్‌లో సైన్యం ఆధిపత్యం వహిస్తుంది. అసిమ్ మునీర్ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎక్కడైనా ఆయన కనిపిస్తారు. తానే నిర్ణయాలు తీసుకుంటానని స్వయంగా చెప్పకనే చెబుతున్నారని తెలుస్తోంది. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కోసం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ నుంచి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శాంతి చర్చల్లో పాల్గొంది. -
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్.. సబ్స్క్రైబర్ల నంబర్ ఎంతో తెలుసా?
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారత మార్కెట్లో జోరు పెంచింది. సుమారు మూడేళ్ల క్రితం సబ్స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించి వినియోగదారులను తనవైపు తిప్పుకుంది. భారత్‌లో అమలు చేసిన ఈ ప్లాన్ విజయవంతం కావడంతో పలు దేశాల్లో దీనిని అమలు చేస్తుంది. ఎక్కువ కంటెంట్‌తో భారత ప్రజలను అలరించిన అమెజాన్ ప్రైమ్ వీడియోను దాటి నెట్‌ఫ్లిక్స్ ముందుకు వచ్చేసింది.నివేదికల ప్రకారం, భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సంస్థకు 92 మిలియన్ల (9.2 కోట్లు) నెలవారీ వినియోగదారులు ఉన్నారు. ప్రైమ్ వీడియోకు 67 (6.7కోట్లు) మిలియన్ల నెలవారీ వినియోగదారులతో వెనుకపడింది. దీంతో ఇప్పుడు భారతదేశంలో ప్రైమ్ వీడియోపై నెట్‌ఫ్లిక్స్ పైచేయి సాధించింది. నెట్‌ఫ్లిక్స్ రోజురోజుకు కొత్తవారిని తనవైపు తిప్పుకుంటూ వృద్ధిని సాధిస్తుండగా, ప్రైమ్ వీడియో మాత్రం నిరంతర క్షీణతను చవిచూస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు చిత్రనిర్మాతలకు ప్రధాన వేదికగా మారింది. భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన కథలతో కూడిన ఒరిజినల్స్‌పై దృష్టి సారించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ తన స్థాయిని కూడా పెంచుకుంది. ధరలు కొద్దిగా తగ్గించడం కూడా బాగా కలిసొచ్చింది. అయితే, ప్రైమ్ వీడియోలో ప్రకటనలను ప్రవేశపెట్టడం మేలు కంటే కీడే ఎక్కువ చేసింది, ఆపై సబ్స్క్రిప్షన్ ఖర్చు కూడా పెరిగింది. అయితే, భారత్‌లో జియోహాట్‌స్టార్ టాప్‌లో ఉంది. ఏకంగా 500 మిలియన్ల ( 50 కోట్ల) నెలవారి వినియోగదారులు ఈ సంస్థకు ఉన్నారు. -
అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌తో యుద్ధం, శాంతి చర్చల మధ్య అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2028 అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయడానికి ఆమె రెడీ అవుతున్నారు. గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన కమలా శుక్రవారం న్యూయార్క్‌లో జరిగిన 'నేషనల్ యాక్షన్ నెట్వర్క్' (NAN) సదస్సులో తొలిసారి ఆ విషయంపై స్పందించడం గమనార్హం.2024లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, 2028లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. న్యూయార్క్ నగరంలో రెవరెండ్ అల్ షార్ప్టన్ స్థాపించిన 'నేషనల్ యాక్షన్ నెట్వర్క్' సమావేశంలో పాల్గొన్న కమలా హారిస్ తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2028లో మళ్ళీ పోటీ చేస్తారా అని ప్రశ్నించినపుడు చేయవచ్చు.. దాని గురించి ఆలోచిస్తున్నాను పోటీ చేసే అవకాశం ఉంది అని హారిస్ సమాధానమిచ్చారు. 2028లో "అమెరికా ప్రజల కోసం" అధ్యక్షుడిగా ఎవరు ఉత్తమంగా పని చేయగలరు అనే దానిని బట్టి తాను పోటీ చేసే విషయాన్ని పరిశీలిస్తానని హారిస్ తెలిపారు. ఈ సమాధానంతో అక్కడికి వచ్చిన వారంతా హర్షధ్వానాలు చేశారు. 2028 నాటికి అమెరికా ప్రజల కోసం ఎవరు అత్యుత్తమంగా పనిచేయగలరు అనే కోణంలోనే తన పోటీపై నిర్ణయం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చాలా మంది ప్రజలకు సంతృప్తిని ఇవ్వడం లేదని, మార్పు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. "స్టేటస్ కో" ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని, ప్రజల కోసం చేయాల్సిన పని ఇంకా చాలా ఉందని కమలా హారిస్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.BREAKING - Kamala Harris just now:"So while [Trump] struts around boasting about how he will annihilate a whole people, what he is in fact doing, is making us weaker, unreliable and less influential."BRAVO!! pic.twitter.com/hySsz9ZPr5— Brian Krassenstein (@krassenstein) April 10, 2026 "> ఈ సమావేశానికి కమలా హారిస్‌తో పాటు 2028లో అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశం ఉన్న ఇతర కీలక డెమోక్రాటిక్ నేతలు కూడా హాజరు కావడం విశేషం. వీరిలో పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, మాజీ రవాణా శాఖ కార్యదర్శి పీట్ బుట్టిగీగ్, ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్కర్ తదితరులు సహా పలువురు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులున్నారు. ఇదీ చదవండి: నో మెన్... ఓన్లీ విమెన్ : 300మంది వీడియో వైరల్2024 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన హారిస్, డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయారు. ట్రంప్ ప్రజా ఓటుతో పాటు ఎలక్టోరల్ కాలేజీని కూడా గెలుచుకున్నారు. హారిస్ గతంలో అమెరికా సెనేటర్‌గా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. హారిస్ ఓటమి తర్వాత, డెమోక్రాటిక్ పార్టీలో కొత్త నాయకత్వం రావాలని మెజారిటీ ఓటర్లు కోరుకుంటున్నట్లు పోలింగ్ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు డెమోక్రాటిక్ పార్టీ తరపున పలువురు రేస్‌లో నిలిస్తే, గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై యుద్ధం, ఇజ్రాయెల్‌తో దోస్తీ కారణంగా, రాజకీయపరంగా, పరిపాలనా పరంగా పలు విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కమలా హారిస్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
అమెరికా సంచలన ప్రకటన..ఇరాన్ షరతులకు నో...
ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్తతకర పరిణామం చోటు చేసుకుంది. చర్చలకు ముందు అమెరికా రెండు కండీషన్స్ అంగీకరించిందని ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే తాజాగా దీనిపై వైట్‌హౌస్ స్పందించింది. టెహ్రాన్ పెట్టిన షరతులను అంగీకరించలేదని సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రాయిటర్స్ కథనం ప్రచురించింది.అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌కు సంబంధించి ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయడం పై ఇరాన్ చేసిన ప్రకటన అబద్ధమని తెలిపింది. ఈ నేపథ్యంలో మరోసారి టెన్షన్ నెలకొంది. కాగా అంతకుముందు ఇరాన్ కీలక ప్రకటన చేసింది. లెబనాన్ సీజ్ఫైర్, ఖతార్ ఇతర విదేశీ బ్యాంకులలో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడానికి అమెరికా అంగీకరించిందని ప్రకటన విడుదల చేసింది. కాగా తాజాగా అమెరికా ఈ ప్రకటనను ఖండించింది.అయితే ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో ఇరాన్- అమెరికాల మధ్య చర్చలు జరగనున్నాయి. పాకిస్థాన్ ప్రధాని ఇరు దేశాలతో వ్యక్తిగతంగా చర్చలు జరిపిన అనంతరం రెండు దేశాల ప్రతినిధులు నేరుగా చర్చల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రకటన ఆందోళన రేపుతుంది. -
‘మహిళా పక్షపాతి వైఎస్ జగన్’
విశాఖ: మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధన్యవాదాలు తెలియజేశారు. గత వైఎస్సార్సీపీ పాలనలో మహిళలకు వైఎస్ జగన్ పెద్దపీట వేశారన్నారు వరుదు కళ్యాణి. ఈ రోజు(శనివారం, ఏప్రిల్ 11వ తేదీ) విశాఖ నుంచి ప్రెస్మీట్లో మాట్లాడారు వరుదు కళ్యాణి. ‘ దేశంలో ఏ నాయకుడు ఇవ్వలేనన్ని పదవులు మహిళలకు వైఎస్ జగన్ ఇచ్చారు. దేశం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. నామినేటెడ్ పదవులు పనుల్లో మహిళలకు పెద్ద పీట వేశారు. మహిళకు 50 శాతం పదవులు, నామినేట్ పనులు కట్టబెడుటు అసెంబ్లీలో చట్టం చేశారు. మహిళలు కోసం వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలను రూపొందించారు. చట్ట సభల్లో మహిళలకు కీలకమైన పదవులు అప్పగించారు.జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 50% పైగా మహిళలకు ఇచ్చారు. మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించారు. వైఎస్ జగన్ పాలనలో మహిళలు మహారాణుల్లా బతికారు. మహిళల కోసం దిశ చట్టాన్ని యాప్, పోలీస్ స్టేషన్ తెచ్చారు. కుటమి పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి.. ఎమ్మెల్యేలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మహిళలంతా జగనన్నకు రుణపడి ఉంటారు’ అని తెలిపారు. ఇక చంద్రబాబు పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని వరుదు కళ్యాణి విమర్శించారు. -
విడ్స్లో కొత్త ఫీచర్లు
తమ ‘విడ్స్’ ప్లాట్‌ఫామ్‌ను 2024లో పరిచయం చేసింది గూగుల్. అప్పటి నుంచి ఇది క్రియేటర్లకు ఉపయోగపడుతోంది. ప్రారంభంలో కేవలం సంస్థల కోసమే ఉద్దేశించినప్పటికీ కాలక్రమేణ ఇతర వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తాజా విషయానికి వస్తే....గూగుల్ తన వీడియో క్రియేషన్ యాప్ ‘విడ్స్’లో కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. ఎడిటింగ్‌లో అనుభవం లేని వారిని దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించారు. వీడియో మేకింగ్‌ను సులభతరం, వేగవంతం, మరింత సృజనాత్మకంగా మార్చడానికి కొత్త ఫీచర్లు ఉపయోగపడతాయి.అప్డేట్లో ప్రధానమైనది...సాధారణ టెక్ట్స్ప్రాంప్ట్లను ఉపయోగించి డిజిటల్ అవతార్లను మ్యానేజ్ చేసే కొత్త పద్ధతి. క్యారెక్టర్లను మాన్యువల్‌గా యానిమేట్ చేయడానికి బదులుగా సూచనలు టైప్ చేయడం ద్వారా అవతార్లు స్పందించేలా చూడవచ్చు.టెక్స్ట్ టు యాక్షన్ఈ అప్డేట్తో యూజర్లు సహజమైన భాషను ఉపయోగించి ఒక సన్నివేశంలో అవతార్లు నటించేలా చేయవచ్చు. ఒక ప్రొడక్ట్ గురించి అవతార్ చెప్పడంలాటి వాటి గురించి క్రియేటర్లు చెబితే దానికి అనుగుణంగా యాప్ ఆ సీన్‌ను జనరేట్ చేస్తుంది. వ్యాపారం లేదా బ్రాండెడ్ కంటెంట్ కోసం ఇది ఉపయోగపడుతుంది.ప్రాంప్ట్‌ను బట్టీ అవుట్‌పుట్ మారినప్పటికీ, వీడియో అంతటా అవతార్లు దృశ్యపరంగా స్థిరంగా ఉంటాయి. ప్రొఫెషనల్ లుక్‌తో కనిపించడానికి ఇది ఉపకరిస్తుంది. యూజర్లు క్యారెక్టర్లను మరింత కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్‌లను ఉపయోగించి క్యారెక్టర్ల రూపాన్ని మార్చవచ్చు. వీడియో థీమ్‌కు సరిపోయే కొత్త నేపథ్యాన్ని జోడించవచ్చు. క్రియేటర్లకు మరింత సౌలభ్యాన్ని అందించడమే ఈ ఫీచర్ లక్ష్యం.స్మార్ట్ వీడియో క్రియేషన్ టూల్స్‘అవతార్’ కంట్రోల్‌తో పాటు వీయో 3.1 వీడియో–జనరేషన్ మోడల్ని విడ్స్లో అనుసంధానించింది గూగుల్. ఎడిటర్లోనే నేరుగా షార్ట్, ఎనిమిది సెకన్ల వీడియోలను క్రియేట్ చేయడానికి ఈ ఫీచర్ యూజర్లకు ఉపకరిస్తుంది. సాధారణ యూజర్లు నెలకు పది వీడియోల వరకు ఉచితంగా క్రియేట్ చేసుకోవచ్చు.గత నెలలో విడ్స్ కోసం లైరియా 3, లైరియా 3 ప్రో మ్యూజిక్ మోడల్స్‌ను విడుదల చేసింది గూగుల్. అదనపు సాఫ్ట్వేర్ అవసరం లేకుండానే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్‌లను జోడించి పూర్తి వీడియోలు రూపొందించడానికి యూజర్లకు వీలు కల్పిస్తుంది.చదవండి: ఐఆర్సీటీసీ కొత్త రూల్.. ట్రైన్ మిస్ అయ్యే చాన్స్ లేదు!సులభంగా... షేరింగ్ అండ్ రీకార్డింగ్యూజర్లు తమ స్క్రీన్ రికార్డ్ చేయడానికి క్రోమ్ ఎక్స్ టెన్షన్ డెవలప్ చేసింది గూగుల్. తద్వారా ఆడియో, వీడియో ట్యుటోరియల్స్, డెమోనిస్ట్రేషన్స్ను సులభతరం చేస్తుంది. -
వైభవ్ మరో 'చరిత్ర'
రాజస్థాన్ రాయల్స్ యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026 ఎడిషన్‌లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో (26 బంతుల్లో 78; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) తన జట్టుకు తిరుగులేని విజయాన్నందించిన వైభవ్.. ఈ ఎడిషన్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసులో (15 ఏళ్లు) ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.గతంలో ఈ రికార్డు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ పేరిట ఉండేది. సాయి 23 ఏళ్ల 231 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. వైభవ్, సాయి తర్వాతి స్థానాల్లో శుభ్‌మన్ గిల్ (23 ఏళ్ల 263 రోజులు), రుతురాజ్ గైక్వాడ్ (24) ఉన్నారు.ఈ ఏడిషన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ 266.67 స్ట్రయిక్‌రేట్‌తో 50 సగటున 2 హాఫ్ సెంచరీల సాయంతో 200 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 18 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో వైభవ్ చేసిన రెండు అర్ద సెంచరీలు 15 బంతుల్లోనే (సీఎస్కే, ఆర్సీబీ) చేయడం మరో విశేషం. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో టాప్-3 రన్ స్కోరర్లు రాయల్స్ ఆటగాళ్లే (వైభవ్ (200), జైస్వాల్ (183), జురెల్ (176)) కావడం మరో విశేషం.ఇదిలా ఉంటే, గత ఎడిషన్‌లో (2025) 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న వైభవ్ మరిన్ని రికార్డులపై కన్నేశాడు. వైభవ్ ప్రస్తుతమున్న జోరును కొనసాగిస్తే ఈ సీజన్లో చాలా అల్‌టైమ్ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. అతి చిన్నవయసులో ఐపీఎల్ అరంగేట్రంతో పాటు ఐపీఎల్ చరిత్రలో భారత ఆటగాడిచే అత్యంత వేగవంతమైన సెంచరీ (35) రికార్డులు కలిగిన వైభవ్.. ఈ సీజన్లో ఓవరాల్‌గా (ఐపీఎల్ చరిత్రలో) ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. -
సింగర్ మంగ్లీపై చీటింగ్ కేసులో బిగ్ ట్విస్ట్!
సాక్షి,హైదరాబాద్: సింగర్ మంగ్లీపై చీటింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తనపై ఆరోపణులు చేస్తున్న న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో రూ.10కోట్ల మేర మోసం చేసినట్లు.. నాపై లాయర్ సుబ్బారావు దుష్ప్రచారం చేస్తున్నారు. గతనెల 21న తానే పరిచయం చేసుకుని అమర్యాదగా మాట్లాడారు. తనను కలవాలని ఒత్తిడి చేశారు.. నేను నిరాకరించా. నోట్ల కట్టల వీడియో చూపించి నన్ను బెదిరించారు. సుబ్బారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరా’నని తెలిపారు. మంగ్లీ ఫిర్యాదుతో న్యాయవాది సుబ్బారావుపై బీఎన్ఎస్ సెక్షన్లు 79,351(3)కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు.. మంగ్లీపై ఆరోపణలు చేస్తూ సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. మంగ్లీ పేరుతో మోసం చేశారని రెండు నెలల క్రితం బాధితులు నన్ను కలిశారు. విచారణ చేపట్టగా ఈ మోసంలో మంగ్లీతో పాటు ఆమో సోదరుడు శివ,మధు ఉన్నట్లు తేలింది. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం మంగ్లీని కలిసే ప్రయత్నం చేశా. మంగ్లీతో మాట్లాడిన సమయంలో చాలా యారగెంట్‌గా మాట్లాడారు. ప్రధాన నిందితుడు మధు రూ.200కోట్ల పెట్టుబడి రూపంలో సేకరించారు. భారీ లాభాలు ఇస్తాయని బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. పెట్టుబడి కూడా ఇవ్వకపోవడంతో బాధితులు మమ్మల్ని కలిశారు. కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే పేరు చెప్పి నన్ను బెదిరించారు. ఇప్పటికే బెదిరింపుల మీద కేసు నమోదైంది. సివిల్ కేసు కూడా ఫైల్ చేస్తాం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ బాధితులు ఉన్నారని వ్యాఖ్యానించారు. సింగర్ మంగ్లీపై కేసుసింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్లు మోసం చేశారని.. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. దీంతో మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘తెలంగాణలో రేవంత్ పని అయిపోయింది’
జగిత్యాల: సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలపై కాంగ్రెస్ మాజీ నేత జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇక రేవంత్ పని అయిపోయిందంటూ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో తదుపరి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేని జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక తాను పీసీసీ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకున్నది జానారెడ్డినే అంటూ మండిపడ్డారు. ఈరోజు(శనివారం, ఏప్రిల్ 11వ తేదీ) జగిత్యాల నుంచి మీడియా మాట్లాడిన జీవన్‌రెడ్డి.. ‘ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైంది. ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్రానికి షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ షాడో సీఎం చంద్రబాబు..కాంగ్రెస్‌లో చేరేటప్పుడు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న రేవంత్ శానసమండలి చైర్మన్‌కు రాజీనామా లేఖ పంపకుండా చంద్రబాబుకు పంపినప్పుడే ఆయన విధేయత అర్థమైంది. ఇప్పుడున్నది ఒర్జినల్ కాంగ్రెస్ కాదు. దానికి ప్రధాన కారకుడు సీఎం రేవంత్. మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఏడు శాసనసభ స్థానాల్లో ఎక్కడా గెలిపించుకోలేని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి అయినాక కూడా మహబూబ్ నగర్ లో వంశీచంద్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకోలేని అసమర్థ నాయకుడు రేవంత్. నేను పార్టీ నుంచి వెళ్లిపోవడానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ని ఓ టూల్‌గా వాడారు. నేను పీసీసీ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకున్నది జానారెడ్డి. ఉప ఎన్నిక నేపథ్యాన్ని ముందుపెట్టి జానారెడ్డి నన్ను అడ్డుకున్న కుట్రదారులు. కేసీఆర్ దగ్గరకు వెళ్లితే ఏమవుతుందో తెలుసానని చాలామంది మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎం చేశాడు, తుమ్మలను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశాడు, కేకేను సెక్రటరీ జనరల్ చేశాడు, ఆయన కూతురికి మేయర్ ఇచ్చాడు. ఇంకేం కావాలి..?, ప్రజల్లో బీఆర్ఎస్ రావాలనే చర్చ ఉధృతంగా జరుగుతోందికాంగ్రెస్పై సమరశంఖం పూరిస్తా..రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీపై సమరశంఖం పూరిస్తానని జీవన్‌రెడ్డి తెలిపారు. జీవన్ రెడ్డి ఎవరో సంధించే అస్త్రం కాదు.. జీవన్ రెడ్డే అస్త్రాలు సంధించే నాయకుడన్నారు. ఈనెల ఏప్రిల్ 20వ తేదీన కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకుంటా. భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతారు’ అని పేర్కొన్నారు. చిన్నారెడ్డికి టిక్కెట్ ఇస్తానని మొండిచేయి చూపించారని. రాజ్యసభ ఇస్తానని చెప్పి రేవంత్ అనుచరుడికి కట్టబెట్టారన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ దృష్టికి తీసుకెళ్లానని, లేఖలు రాశానన్నారు. కాంగ్రెస్ వైఖరితో తీవ్రంగా కలత చెందే రాజీనామా చేశాననన్నారు. -
జేడీవాన్స్ విమానానికి స్పెషల్ ఎస్కార్ట్.. వీడియో వైరల్
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. హైలెవల్ డెలిగేషన్ కావడంతో చర్చలు జరిగే ఇస్లామాబాద్ ప్రాంతం మెుత్తం ఆ దేశ ఆర్మీ కంట్రోల్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కీలక భద్రత కలిపించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఇరాన్- అమెరికా మధ్య పాకిస్థాన్‌లో జరిగే చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో ఏం జరగనుందా అనే అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. చర్చలలో పాల్గొనడానికి వచ్చే ప్రతినిధులకు సైతం పాక్ ప్రత్యేక భద్రత కల్పించింది.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ ప్రయాణించిన యుఎస్ ఎయిర్ ఫోర్స్ బోయింగ్ సీ-32ఏ విమానం పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించగానే ఆ దేశానికి చెందన ఎఫ్-16 ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్‌గా ప్రత్యేక భద్రత కల్పించాయి. ఏవైనా అనుకోని ఘటనలు జరగకుండా ఉండే ఉద్దేశంతోనే ఈ రకమైన భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు నిన్న ఇరాన్ ప్రతినిధులకు సైతం పాక్ అత్యంత పటిష్టమైన ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది.ఇజ్రాయెల్‌తో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్ ఫైటర్ జెట్లను ఇరాన్ పంపి ఐరన్ ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది.కాగా ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీప్ ఇరాన్ ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు. వీరితో సమావేశం ముగిసిన అనంతరం అమెరికా ప్రతినిధులతో భేటీ అవనున్నట్లు సమాచారం. రెండు దేశాలతో పరోక్ష చర్చలు ముగిసిన అనంతరం ప్రధాన చర్చలు ప్రారంభం అవనున్నట్లు తెలుస్తోంది.🇺🇸🇮🇷🇵🇰 Footage of Pakistani fighter jets escorting JD Vance to Islamabad.Iran sent 3 planes when their negotiating team flew in, 2 of which were decoys, in case Netanyahu got any ideas about trying to assassinate them.pic.twitter.com/Sr9oJFLgff https://t.co/bsB5dbcuMU— Mario Nawfal (@MarioNawfal) April 11, 2026 -
IRCTC కొత్త రూల్.. ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు!
ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వే ఒక కీలక మార్పు ప్రవేశపెట్టింది. చివరి నిమిషంలో ప్రయాణానికి సంబంధించిన బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కొత్త రూల్ ప్రకారం.. ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను, రైలు బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందు వరకు మార్చుకోవచ్చు. గతంలో బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవాలంటే.. ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల చాలామందికి ఇబ్బందులు కలిగేవి.బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవడంలో IRCTC కొంత స్వేచ్ఛ కల్పించింది. ముఖ్యంగా ట్రాఫిక్, ఆలస్యం వంటి కారణాల వల్ల ఎంపిక చేసుకున్న స్టేషన్‌కు సమయానికి చేరుకోలేని పరిస్థితుల్లో ఈ సదుపాయం సహాయపడుతుంది. ఈ సదుపాయం ప్రధానంగా IRCTC ద్వారా బుక్ చేసిన టికెట్లకు వర్తిస్తుంది. ఒకసారి స్టేషన్ మార్చిన తర్వాత, తప్పనిసరిగా కొత్తగా ఎంచుకున్న స్టేషన్ నుంచే రైలులో ఎక్కాలి.ఈ సౌకర్యాన్ని ఉపయోగించేటప్పుడు.. కొత్తగా ఎంపిక చేసిన స్టేషన్ నుంచి కూడా రైలును మిస్ అయితే, టికెట్ రద్దు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణ ప్రణాళికను జాగ్రత్తగా సిద్ధం చేసుకోవడం అవసరం. ఈ విషయాన్ని వినియోగదారులు తప్పకుండా గమనించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: 'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం' -
గర్భిణీలు చేపలు తినకూడదా?
గర్భం ధరించి మొదలు పండంటి పాపాయిని ప్రసవించే దాకా ఎన్నో అనుమానాలు మరెన్నో సందేహాలు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఆహారం విషయంలో సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలను తెలుసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండవచ్చు. గర్భిణీలు తీసుకోనే ఆహారం, అపోహలపై ఈవిషయాలను తెలుసుకోవాలి.గర్భిణులు ఇద్దరి కోసం తినాలలా? నిజం ఏమిటంటే అవసరం లేదు. మోతాదు కంటే పోషక విలువలపై దృష్టి ముఖ్యం.బొప్పాయి, పైనాపిల్ తింటే గర్భస్రావం అవుతుంది? నిజమేనా? నిజం లేదు. బాగా పండిన బొప్పాయి, పైనాపిల్ తక్కువ మోతాదులో తీసుకోవడం సురక్షితమే.కుంకుమపువ్వు తింటే బిడ్డ తెల్లగా పుడతారు. బిడ్డ చర్మం రంగు తల్లిదండ్రుల జీన్స్‌పైనే ఆధారపడి ఉంటుంది.చేపలు అస్సలు తినకూడదు. చేపలలో ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ బిడ్డ మెదడు అభివృద్ధికి మేలు చేస్తాయి.నెయ్యి ఎక్కువగా తింటే సుఖ ప్రసవం అవుతుంది : ఇందుకు శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు. ఇదీ చదవండి: నో మెన్... ఓన్లీ విమెన్ : 300మంది వీడియో వైరల్ -
పశ్చిమాసియా సంక్షోభానికి మోక్షం లభించేనా?
వేలాది మంది ప్రాణాలను బలిగొని ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తూ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపుకు చేరుకుంది. నెలల తరబడి సాగుతున్న రక్తపాతానికి ముగింపు పలికే దిశగా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నేడు (ఏప్రిల్ 11, 2026) పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో అత్యున్నత స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. యుద్ధ మేఘాల మధ్య ఆశా కిరణంలా కనిపిస్తున్న ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.శాంతి మంతనాలు - పట్టువిడుపులుమధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనే ధ్యేయంగా అమెరికా, ఇరాన్ దేశాల ఉన్నతాధికారులు ఇస్లామాబాద్‌లో ముఖాముఖి భేటీ అవుతున్నారు. అయితే, చర్చల ప్రారంభానికి ముందే ఇరు దేశాలు తమ పంతాలను నెగ్గించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా లెబనాన్‌లో కాల్పుల విరమణ, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలపై ఇరుపక్షాల మధ్య తీవ్ర స్థాయి భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అడ్డంకిగా మారిన హెజ్బుల్లా అంశంమార్చి నెలలో ప్రారంభమైన పోరాటంలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్‌లో దాదాపు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది. అయితే, లెబనాన్ అంశాన్ని ఈ ద్వైపాక్షిక చర్చలతో ముడిపెట్టడానికి అమెరికా, ఇజ్రాయెల్ ససేమిరా అంటున్నాయి.ఆర్థిక ఆంక్షలు.. అణు కార్యక్రమంసంవత్సరాలుగా తమ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆంక్షలను అమెరికా వెంటనే ఎత్తివేయాలని ఇరాన్ పట్టుబడుతోంది. దీనికి ప్రతిగా ఇరాన్ తన అణు, క్షిపణి తయారీ కార్యక్రమాలు నిలిపేస్తేనే ఆంక్షల ఉపశమనం ఉంటుందని వాషింగ్టన్ సంకేతాలిచ్చింది. ముఖ్యంగా యురేనియం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.హార్మూజ్ జలసంధిపై పట్టుప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిపై తన సార్వభౌమత్వాన్ని గుర్తించాలని, అక్కడ రవాణా రుసుములు వసూలు చేసే అధికారం తమకు ఉండాలని ఇరాన్ కోరుతోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా, ఎటువంటి పరిమితులు లేకుండా అంతర్జాతీయ చమురు ట్యాంకర్ల రాకపోకలు సాగాలని డిమాండ్ చేస్తోంది.సైనిక ఉపసంహరణ - పరిహారంగత ఆరు వారాలుగా జరిగిన యుద్ధ నష్టానికి భారీ పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేయనుండగా, అమెరికా దీనిపై మౌనం వహిస్తోంది. అలాగే, మధ్యప్రాచ్యం నుంచి అమెరికా తన దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ కోరుతుండగా, శాంతి ఒప్పందం కుదిరే వరకు సైన్యం కదిలేది లేదని, ఒకవేళ ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధం తీవ్రతరం అవుతుందని ట్రంప్ హెచ్చరించారు.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
పాక్‌లో చర్చలు.. ప్రధానంగా అడ్డొచ్చే అంశాలివే..
టెహ్రాన్: చర్చల కోసం అమెరికా, ఇరాన్ ప్రతినిధులు పాకిస్థాన్ చేరుకున్నారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌ను అమెరికా-ఇరాన్ ప్రతినిధులు మొదట విడివిడిగా కలుస్తున్నారు. ఇరాన్ ప్రతినిధులతో షెహబాజ్ షరీఫ్ సమావేశం ముగిసింది. ఆ తర్వాత షెహబాజ్ షరీఫ్‌ను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలిశారు. జేడీ వాన్స్‌తో ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. ఈ చర్చలు పశ్చిమాసియాలో దీర్ఘకాల శాంతికి దారి తీస్తాయని షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారని పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.పాక్‌లో చర్చలు ఎంతకాలం కొనసాగుతాయి?చర్చలు ఎంతకాలం కొనసాగుతాయన్న విషయంపై స్పష్టత లేదు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో అనుబంధం ఉన్న తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. చర్చలు ఒక రోజు మాత్రమే జరగనున్నాయి. శనివారం సాయంత్రం వరకే జరిగే అవకాశం ఉంది.ప్రధానంగా అడ్డొస్తున్న అంశాలివే..అమెరికా-ఇరాన్ మధ్య చర్చల్లో ప్రధానంగా మూడు అంశాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ సేకరించిన యురేనియం, హార్మూజ్ జలసంధి, లెబనాన్ వంటి అంశాలు అడ్డంకిగా ఉన్నాయి. హార్మూజ్ జలసంధిపై పట్టును నిలపుకోవాలని ఇరాన్ భావిస్తోంది. లెబనాన్‌లో కొనసాగుతున్న దాడులు ఆపాల్సిందేనని మొదటి నుంచి చెబుతోంది. ఇక యురేనియం నిల్వలపై ఇరాన్ వెనక్కి తగ్గుతుందా? అన్న ప్రశ్నలు ఉన్నాయి. చర్చల్లో ఎవరెవరు పాల్గొన్నారు? అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇవాళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, ప్రత్యేక సలహాదారు జారెడ్ కుష్నర్, శాంతి చర్చల ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్తో కలిసి పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. ఇదే సమయంలో, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చర్చల కోసం పాక్ చేరుకున్నారు.పాకిస్థాన్ పాత్ర ఏంటి?రెండు పక్షాలను పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ స్వాగతించారు. యుద్ధం వేళ కాల్పుల విరమణకు పాక్ కీలకంగా వ్యవహరించిందని ప్రచారం జరుగుతోంది. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో పాక్ భాగస్వామ్యం కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పుడు మొదట ఇరు పక్షాల డిమాండ్లను షెహబాజ్ షరీఫ్ వింటున్నారు. ఆ తర్వాత ఆయన సమక్షంలో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు చర్చించుకుంటారు. -
రక్తపు మడుగులో: ఏపీ టెకీ రిషి కేష్ హత్య కలకలం
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, గుడివాడ పట్టణానికి చెందిన ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హర్యానాలోని పంచకుల జిల్లాలో శుక్రవారం ఉదయం హత్యకు గురయ్యాడు. పదిరోజుల క్రితమే కంపెనీలో చేరిన యువ ఇంజనీర్ బండ్ల రిషికేష్ (27) రక్తపు మడుగులో కనిపించిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.రిషికేష్ పంచకులలోని 'వేది టెక్నాలజీస్' అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. అతను సుమారు పది రోజుల క్రితం కంపెనీలో చేరడానికి ఇంటి నుండి బయలుదేరాడు. అయితే అనూహ్యంగా కన్నుమూసిన వైనం కుటుంబంలో తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. కంపెనీ అందించిన వసతి గృహంలో రిషికేష్ రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉండటాన్ని అతని సహోద్యోగులు కనుగొన్నారు. కంపెనీ యాజమాన్యం వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. హర్యానా పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా, గుడివాడ వన్ టౌన్ పోలీసులు బెతవోలులోని రిషికేష్ కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు. విధుల్లో చేరిన పది రోజుల్లోనే తమ కుమారుడు విగతజీవిగా మారిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీర వుతున్నారు. పుట్టెడు దుఃఖంతో హర్యానాకు బయలుదేరారు. ఇదీ చదవండి: నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!హర్యానా పోలీసులు ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రిషికేష్ చాలా సౌమ్యుడని ప్రాథమిక విచారణ ద్వారా తెలుస్తోంది. సహోద్యోగులతో గొడవలా? పాత కక్షలు ఉన్నాయా?. దోపిడీ ఏమైనా జరిగిందా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని, కాల్ డేటా రికార్డులను తనిఖీ చేస్తున్నారు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి బీటెక్ పూర్తి చేసిన రుషికేష్, మెరుగైన అవకాశాల కోసం హర్యానాకు వెళ్లడానికి ముందు మూడేళ్లపాటు హైదరాబాద్‌లో పనిచేసినట్టు లింక్డ్ఇన్ ప్రొఫైల్ వివరాలను బట్టి తెలుస్తోంది. -
ధురంధర్ నటుడికి రూ.1 కోటి? అసలు నిజమిదే!
గత ఐదు నెలలుగా 'ధురంధర్' సినిమా పేరు మారుమోగిపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్ కాగా రెండో భాగం అంతకు మించిన ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారిస్తోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరికీ మంచి గుర్తింపు లభించింది.రూ.1 కోటి రెమ్యునరేషన్ఈ క్రమంలో 'ధురంధర్'లో హైజాకర్ జహూర్ మిస్త్రీగా యాక్ట్ చేసిన నటుడు వివేక్ సిన్హ గురించి ఓ వార్త వైరలవుతోంది. అతడు ఈ చిత్రానికిగానూ ఏకంగా రూ.1 కోటి పారితోషికం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌పై తాజాగా వివేక్ సిన్హ స్పందించాడు. 'తమ్ముళ్లూ.. నాకు రూ.60 లక్షలు, రూ.80 లక్షలు, ఏకంగా రూ.1 కోటి ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఒట్టేసి చెప్తున్నా, నాకంత డబ్బు ఇవ్వలేదు. అనవసరంగా ఏదేదో ప్రచారం చేయకండి.ఎప్పుడో ఖర్చయిందిఅలా అని నాకు మొత్తానికే డబ్బు ఇవ్వలేదని కాదు. నేను అనుకున్నంత పారితోషికం ఇచ్చారు. కానీ మీరనుకునేంత కాదు. నాకు ఇచ్చినదంతా ఎప్పుడో ఖర్చు పెట్టేశాను కూడా! నేను ముంబైలో ఉంటాను కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువే.. కాబట్టి ఎవరికీ సాయం చేసే పరిస్థితిలో నేను లేను. నాకు ఇలాగే మంచి అవకాశాలు రావాలని కోరుకోండి. అప్పుడు నేను బాగా సంపాదించగలను.. మీకు తిరిగి సాయం చేయగలను' అని వివేక్ సిన్హ తెలిపాడు. View this post on Instagram A post shared by vivek sinha (ज़हूर मिस्त्री) (@viveksinhaactor)చదవండి: సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బూతు కంటెంట్? క్లారిటీ ఇచ్చిన నటి -
సతీమణి పేరుతో రిషబ్ శెట్టి బిగ్ ప్లాన్.. మరో సినిమా కష్టమేనా?
కాంతార ఫ్రాంచైజీ సినిమాలతో కన్నడ నటుడు రిషబ్ శెట్టికి పాన్ ఇండియా రేంజ్లో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడని వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ఆయన తన సోషల్‌మీడియాలో పలు ఖాతాలను అన్‌ఫాలో చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంతార సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ను ప్రస్తుతం రిషబ్ ఫాలో కావడం లేదు. దీంతో నిర్మాత విజయ్ కిరగందూర్తో విభేదాలు కలిగాయని వార్తలు వచ్చాయి. ఇకపై కాంతార నుంచి మరో సినిమా రాకపోవచ్చని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. అయితే, ఇందులో తన సతీమణి ప్రగతి శెట్టి పాత్ర ఎక్కువగా ఉందని రూమర్స్ వస్తున్నాయి.కాంతార ఛాప్టర్-1 ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరడంతో రిషబ్ శెట్టి తన రెమ్యునరేషన్ పెంచేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 75 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు తన సతీమణి సహ-నిర్మాతగా ఉండాలని కండీషన్ పెట్టారట. ఈ ఢీల్ హోంబలే ఫిల్మ్స్‌కు నచ్చలేదని టాక్.. డబ్బు విషయం కంటే ఒక సినిమాకు సంబంధించి పూర్తి హక్కులు తమ సంస్థకే చెందాలని నిర్మాత విజయ్ కిరగందూర్ ఉంటారట.. ఇలాంటి కండీషన్‌ను వారు ఎట్టిపరిస్థితిల్లోనూ అంగీకరించరట. ఈ కారణంతోనే ఆ సంస్థకు సంబంధించిన సోషల్‌మీడియా ఖాతాలను రిషబ్ శెట్టి అన్‌ఫాలో కొట్టారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ రిషబ్ శెట్టి కలుగజేసుకుని ముందుకు వస్తేనే కాంతార నుంచి మరో సినిమా వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అసలు విషయం ఏదైనప్పటికీ రిషబ్‌పై సోషల్‌మీడియాలో విమర్శలు వస్తున్నాయి. -
సన్‌రైజర్స్‌పై పంజాబ్ గెలుపు
సన్‌రైజర్స్‌పై పంజాబ్ గెలుపుసన్రైజర్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందిన పంజాబ్ కింగ్స్.మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్10.2వ ఓవర్- 128 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో అనికేత్ వర్మ (11)కు క్యాచ్ ఇచ్చి కూపర్ కన్నోల్లీ (11) ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్6.2వ ఓవర్- 99 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో నితీశ్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్య (57) ఔటయ్యాడు. ధీటుగా బదులిస్తున్న పంజాబ్220 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ ధీటుగా బదులిస్తుంది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (51), ప్రభ్‌సిమ్రన్ (41) చెలరేగి ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 93-0గా ఉంది. ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్20 ఓవర్లలో 218-6 (అభిషేక్ శర్మ (74), ట్రవిస్ హెడ్ (38), ఇషాన్ కిషన్ (27), క్లాసెన్ (39), అనికేత్ వర్మ (18)).మూడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్13.6వ ఓవర్-169 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (27) ఔటయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్అప్పటిదాకా పరుగుల వరద పారించిన ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ఒకే ఓవర్లో ఔటైపోయారు.ఎస్ఆర్హెచ్ ఓపెనర్ల ఊచకోతటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న సన్‌రైజర్స్ తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఏకంగా 84 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (59), ట్రవిస్ హెడ్ (18) శివాలెత్తిపోతున్నారు. ముఖ్యంగా అభిషేక్ పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోతున్నాడు. కేవలం18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హెడ్ కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు రఫ్ఫాడిస్తున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 11) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ రెండు మార్పులు చేయగా.. పంజాబ్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఎస్ఆర్హెచ్ తరఫున లివింగ్‌స్టోన్ స్థానంలో సలీల్ అరోరా బరిలోకి దిగుతున్నాడు. అలాగే ప్రఫుల్ హింజ్ (ఉనద్కత్ స్థానంలో) అరంగేట్రానికి సిద్దమయ్యాడు.తుది జట్లు..పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: నేహాల్ వధేరా, విష్ణు వినోద్, సూర్యాంశ్ షెడ్గే, యష్ ఠాకూర్, హర్‌ప్రీత్ బ్రార్సన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (w/c), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగఇంపాక్ట్ సబ్స్: జయదేవ్ ఉనద్కత్, లియామ్ లివింగ్‌స్టోన్, శివమ్ మావి, ప్రఫుల్ హింగే, కమిందు మెండిస్ -
రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!
దేశ రాజధానిలో కాలుష్యం నుంచి విముక్తి పొందేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేసే దిశగా ఢిల్లీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కొత్తగా రూపొందించిన ‘ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-2030’ ముసాయిదాను రవాణా శాఖ విడుదల చేసింది. పర్యావరణ హితమే లక్ష్యంగా రూపొందించిన ఈ పాలసీలో సామాన్యులకు, మధ్యతరగతి వాహనదారులకు భారీ రాయితీలను ప్రకటించింది.రూ.30 లక్షల లోపు కార్లకు పూర్తి రాయితీకొత్త ముసాయిదా విధానం ప్రకారం, ఢిల్లీలో రిజిస్టర్ చేసుకునే రూ.30 లక్షల లోపు (ఎక్స్-షోరూమ్ ధర) విలువ కలిగిన అన్ని ఎలక్ట్రిక్ కార్లకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి 100 శాతం మినహాయింపు లభించనుంది. ఈ ప్రయోజనం 31 మార్చి 2030 వరకు అమల్లో ఉంటుంది. రూ.30 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లకు ఈ రాయితీలు వర్తించవు. తద్వారా సామాన్య వాహనదారులకు ఈవీలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా ఉంది.హైబ్రిడ్ వాహనాలకూ ప్రోత్సాహంకేవలం పూర్తిస్థాయి ఈవీలకే కాకుండా తక్కువ ఉద్గారాలను విడుదల చేసే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. వీటిపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో 50 శాతం రాయితీని ప్రతిపాదించింది. దీనివల్ల ఇంధన వాహనాల నుంచి విద్యుత్ వాహనాల వైపు మళ్లే క్రమంలో హైబ్రిడ్ కార్లు ఒక వారధిగా మారుతాయని ప్రభుత్వం భావిస్తోంది.గాలి నాణ్యత మెరుగుదలే లక్ష్యంఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు వాహన ఉద్గారాలను తగ్గించడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. రాయితీలతోపాటు నగరం అంతటా ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, ఈవీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇది భారతదేశపు నెట్-జీరో ఉద్గారాల లక్ష్యానికి, జాతీయ క్లీన్ మొబిలిటీ ప్లాన్‌కు అనుగుణంగా ఉంది.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
అందరికీ నచ్చిన జియో రీఛార్జ్ ప్లాన్!
మొబైల్ రీచార్జ్ ధరలు పెరుగుతున్న తరుణంలో.. ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో అందిస్తున్న రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా నిలిచింది తక్కువ ఖర్చుతో.. సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలని భావించే వారికి ఈ ప్లాన్ మంచి ఎంపిక.రూ.189 రీఛార్జ్ ప్లాన్ వివరాలురిలయన్స్ జియో అందిస్తున్న రూ.189 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 300 ఎస్ఎమ్ఎస్లు, ఇంటర్నెట్ వినియోగానికి 2జీబీ డేటా లభిస్తాయి. ఒకసారి ఈ డేటా పూర్తయిన తర్వాత కూడా ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు. కానీ స్పీడ్ తగ్గుతుంది. దీనివల్ల కనీస అవసరాల కోసం అయినా కనెక్టివిటీ కొనసాగించవచ్చు.50జీబీ జియోక్లౌడ్ స్టోరేజ్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. కాలింగ్స్ మాత్రమే కాకుండా జియోటీవీ ద్వారా ఎక్కడైనా టీవీ కార్యక్రమాలను వీక్షించవచ్చు. అంతే కాకుండా.. డిజిటల్ యుగంలో డేటా భద్రతను దృష్టిలో ఉంచుకుని 50జీబీ జియోక్లౌడ్ స్టోరేజ్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఇది ఫోటోలు, వీడియోలు వంటి ఫైల్స్‌ను సురక్షితంగా నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.అయితే.. ఈ ప్లాన్ కొన్ని థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్‌లో కనిపించకపోవచ్చు. అందువల్ల వినియోగదారులు మైజియో యాప్‌ను డౌన్లోడ్ చేసి, అందులోని ‘రీఛార్జ్’ విభాగంలో ఈ ప్లాన్‌ను ఎంపిక చేసుకుని యాక్టివేట్ చేయాలి. -
ఇరాన్‌తో శాంతి చర్చల వేళ అమెరికాకు ఎదురు దెబ్బ?
అంతర్జాతీయ రాజకీయ యవనికపై ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న తలెత్తుతోంది... అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన ఈ యుద్ధ విరమణ నిజంగా శాంతి కోసమా? లేక తన దౌత్య వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వేసుకున్న ముందస్తు వ్యూహమా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలకు సిద్ధమైన తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అమెరికాలోని మేధావి వర్గం ఈ చర్చల ద్వారా ఏదో ఒక అద్భుతం జరుగుతుందని ఆశిస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం భిన్నమైన సంకేతాలను ఇస్తున్నాయి. యుద్ధం అనేది కేవలం క్షిపణుల మోతతో ముగిసిపోయేది కాదు, అది సృష్టించిన ఆర్థిక, రాజకీయ ప్రకంపనలు దశాబ్దాల పాటు ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంటాయి.ఈ క్లిష్ట సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డ్వైట్ డి. ఐసెన్‌హోవర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి: "ప్రజలు శాంతిని ఎంతగా కోరుకుంటారంటే, ఏదో ఒక రోజు ప్రభుత్వాలు పక్కకు తప్పుకొని వారికి ఆ శాంతిని అందజేయక తప్పదు” అని. కానీ నేటి పరిస్థితి చూస్తుంటే, ప్రభుత్వాలు శాంతిని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నాయే తప్ప, నిబద్ధతతో పనిచేయడం లేదనిపిస్తోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వ్యవహారం ఇప్పుడు చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారనుంది. ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి ఈ మార్గంపై ఇరాన్ పట్టు సాధించడం అమెరికా దౌత్య నీతికి తగిలిన అతిపెద్ద దెబ్బ. ఇరాన్ ఇక్కడ టోల్ వసూలు చేయాలని చూడటం లేదా నౌకాయానాన్ని నియంత్రించాలని ప్రయత్నించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని భావించినా, ఆచరణలో వారిని ఆపే శక్తి ఎవరికి ఉందన్నదే అసలు ప్రశ్న. గతాన్ని పరిశీలిస్తే, జాన్ ఎఫ్. కెన్నెడీ క్యూబన్ మిస్సైల్ సంక్షోభం సమయంలో ప్రదర్శించిన సంయమనం, వ్యూహాత్మక ఓర్పు నేటి నాయకత్వంలో లోపించినట్లు కనిపిస్తోంది.మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వైఖరి ఈ చర్చల భవితవ్యాన్ని మరింత క్లిష్టతరం చేస్తోంది. లెబనాన్‌పై దాడులను ఆపే ఉద్దేశం ఇజ్రాయెల్‌కు లేదని స్పష్టమవుతున్న తరుణంలో, అమెరికా చేసే చర్చలు ఎంతవరకు ఫలప్రదమవుతాయి? ఒకవైపు తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ ప్రయోజనాలను కాపాడుకుంటూనే, మరోవైపు ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ట్రంప్‌కు కత్తిమీద సాము లాంటిదే. రిచర్డ్ నిక్సన్ చైనా వైపు అడుగులు వేసినప్పుడు ప్రదర్శించిన రియల్‌పాలిటిక్ వ్యూహాన్ని ట్రంప్ ఇప్పుడు అమలు చేయగలరా? లేక కేవలం తన ఇమేజ్ను కాపాడుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారా? ఈ యుద్ధం వల్ల కేవలం ఇరాన్ మాత్రమే దెబ్బతిందని అనుకుంటే పొరపాటే. అమెరికా తన ఖజానా నుండి దాదాపు ఒక ట్రిలియన్ డాలర్లను ఈ యుద్ధం కోసం తగలేసింది. ఈ భారీ సొమ్మును అమెరికా ప్రజల సంక్షేమం కోసం, విద్య, వైద్య రంగాల కోసం ఖర్చు చేసి ఉంటే అగ్రరాజ్యం మరింత శక్తివంతంగా తయారయ్యేది.అణు ఒప్పందం విషయంలో కూడా అమెరికా ఇప్పుడు రక్షణ స్థితిలో పడిపోయింది. బరాక్ ఒబామా హయాంలో కుదిరిన జేసీపోఏ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల కలిగిన నష్టం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అప్పట్లో ఇరాన్‌ను ఒక క్రమపద్ధతిలో నియంత్రించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇరాన్ అణు సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. ఇప్పుడు వారిని నియంత్రించడం అంటే వారికి కొన్ని భారీ మినహాయింపులు ఇవ్వక తప్పని పరిస్థితి. నమ్మకం అనేది అంతర్జాతీయ సంబంధాల్లో పునాది వంటిది, కానీ ఈ యుద్ధం వల్ల అమెరికా తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయింది. చర్చల మధ్యలో దాడులు చేయడం వల్ల ఇరాన్ ఇప్పుడు అమెరికాను తీవ్రమైన అనుమానంతోనే చూస్తోంది.చివరగా చెప్పాలంటే, ఈ వారాంతపు చర్చలు కేవలం ఒక రాజకీయ ప్రహసనం కాకూడదు. యుద్ధం వల్ల పెరిగిన చమురు ధరలు, ఎరువుల కొరత వల్ల ఆఫ్రికా వంటి దేశాల్లో పేదరికం, ఆకలి చావులు పెరుగుతున్నాయి. అబ్రహం లింకన్ అన్నట్లుగా, "మన శత్రువును మిత్రుడిగా మార్చుకున్నప్పుడు, ఆ శత్రువును నాశనం చేసినట్లే అవుతుంది” అని. ట్రంప్ ఈ సూత్రాన్ని పాటిస్తారా లేక పాత కక్షలతోనే ముందుకు సాగుతారా? చర్చల పేరుతో కాలయాపన చేయడం వల్ల మధ్యప్రాచ్యంలో మంటలు మరింత చెలరేగే ప్రమాదం ఉంది. కేవలం ఆధిపత్య పోరు పక్కన పెట్టి, మానవతా దృక్పథంతో అడుగులు వేసినప్పుడే ఈ చర్చలకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది.::: కంచర్ల యాదగిరిరెడ్డి, మేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ..?
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీని చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ వీరవిహారం చేసి రాయల్స్‌కు తిరుగులేని విజయాన్ని అందించాడు. అయితే మ్యాచ్ మధ్యలో వైభవ్ చేసిన ఓ పని అతన్ని చిక్కుల్లో పడేసేలా ఉంది.మ్యాచ్ జరుగుతున్న సమయంలో వైభవ్ డగౌట్లో కూర్చొని జట్టు మేనేజర్ రోమీ భిందర్‌తో కలిసి మొబైల్ ఫోన్ చూస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. బీసీసీఐ నియమాల ప్రకారం ఆటగాళ్లు మ్యాచ్ జరుగుతుండగా మొబైల్ చూడరాదు, వాడరాదు. మేనేజర్‌కు ఈ విషయంలో వెసులుబాటు ఉన్నా, అతనికి కూడా డగౌట్లో మొబైల్ వాడే పర్మిషన్ లేదు. మేనేజర్‌కు డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రమే ఫోన్ వినియోగించే వెసులుబాటు ఉంది.ఇప్పుడు డగౌట్లో మొబైల్ వాడినందుకు మేనేజర్‌తో పాటు వైభవ్ కూడా చిక్కుల్లో పడినట్లైంది. వైభవ్ స్వతహాగా మొబైల్ వాడనప్పటికీ, దానివైపు చూస్తున్నట్లు సోషల్‌మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ విషయంలో మేనేజర్‌తో పాటు వైభవ్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాడేమో చూడాలి.ఈ అంశానికి సంబంధించి బీసీసీఐ నియమాలు (PMOA – Minimum Standards for Players and Match Officials Areas) ఇలా ఉన్నాయి.- మొబైల్ ఫోన్లు, కమ్యూనికేషన్ డివైజ్‌లు డగౌట్లో అనుమతించబడవు. - టీమ్ మేనేజర్ డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రమే ఫోన్ వాడవచ్చు, డగౌట్లో కాదు. - అనలిస్టులు కంప్యూటర్లు వాడవచ్చు, కానీ కేవలం ప్రత్యేకంగా కేటాయించిన అనలిస్ట్ టేబుల్ వద్ద మాత్రమే. - ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ స్టేడియంలోకి వచ్చిన వెంటనే తమ డివైజ్‌లను ఆఫ్ చేసి సురక్షితంగా భద్రపరచాలి. - అటెండెంట్స్, క్యాటరింగ్ వర్కర్స్ వంటి సిబ్బంది కూడా కమ్యూనికేషన్ డివైజ్‌లు తీసుకురావడానికి అనుమతి లేదు. -
మోజ్తాబా ఆరోగ్యంపై కీలక అప్డేట్
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడనేది ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. ఇరాన్ సుప్రీంగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆయన పెద్దగా బయట కనిపించింది లేదు. కాగా తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితులపై కీలక సమాచారం ప్రచురితమయ్యింది..మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఇదివరకే చాలా సార్లు పలు కథనాలు ప్రచురితమయ్యాయి. అమెరికా జరిపిన దాడిలో ఆయన కోమాలోకి వెళ్లారని తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వెలువడ్డాయి. ఒకానొక సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన అసలు బ్రతికి ఉన్నారా? అని ప్రశ్నించారు. ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా మోజ్తాబా ఎప్పుడు బయిటకి రాలేదు. కేవలం వ్రాతపూర్వక కీలక సమయాల్లో కేవలం వ్రాతపూర్వక సందేశాలు మాత్రమే అందించారు.అయితే ప్రస్తుతం మోజ్తాబా వేగంగా కోలుకుంటున్నారని ఆయన సన్నిహితులు తెలిపినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. మోజ్తాబా భౌతికంగా బయిటకి రానప్పటికీ యుద్ధానికి సంబంధించిన కీలక సమావేశాల్లో ఆయన ఆడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పాల్గొంటున్నారని తెలిపింది. వాషింగ్టన్‌తో చర్చలు వంటి కీలక విషయాలలో వాయిస్ మెసేజ్ ద్వారా ఆదేశాలు ఇస్తున్నారని వెల్లడించింది.ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇంటిపై జరిగిన దాడిలో ఆయన మరణించారు. ఆ దాడిలోనే మోజ్తాబాకు తీవ్ర గాయాలయ్యాయని ఆయన ముఖం తీవ్రంగా దెబ్బతిందని కథనాలు ప్రచురితమయ్యాయి. ఆ రోజు నుంచి నేటి వరకూ మెజ్తాబా ఎన్నడూ మీడియా ముందుకు రాలేదు. అప్పటి నుంచి భిన్న రీతిలో ఆయనపై వార్తలు వచ్చాయి. -
నో మెన్... ఓన్లీ విమెన్ : 300మంది వీడియో వైరల్
అప్పుడప్పుడూ కిట్టీ పార్టీలు, ఏ పార్క్కో, చిన్నపాటి తీర్థయాత్రకో వెళ్లడం తప్ప మహిళలకు పెద్దగా రిక్రియేషన్ ఏమీ ఉండదు. అందుకే మహిళల కోసం, మహిళల ద్వారా నిర్మితమైన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫ్రాన్స్‌లో ఒక మధ్యయుగపు కోటను కొనుగోలు చేయడానికి సుమారు 300 మంది మహిళల ప్రయత్నం, వీడియో ఆన్లైన్లో మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. అదేంటో తెలుసుకుందాం. ఒక చారిత్రక కట్టడాన్ని కొనుగోలు చేసి, దానిని మహిళల కోసం ఒక ప్రత్యేక హేవెన్‌గా మార్చాలనే 300 మంది మహిళల సాహసోపేతమైన ప్రయత్నం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహిళలు విశ్రాంతి తీసుకోవడానికి, తోటి మహిళలతో కలిసి సరదాగా గడపడానికి, కొత్త ఉత్సాహం పొందేలా దాదాపు 300 మంది మహిళలు కలిసి ఫ్రాన్స్‌లోని ఒక పురాతన మధ్యయుగ కోటను (Medieval Chateau) కొనుగోలు చేశారు. దాని పేరే 'క్యాంప్ చాటో' (Camp Chateau).ముఖ్య విశేషాలుమహిళలు దైనందిన ఒత్తిళ్లకు దూరంగా, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి, ఒకరితో ఒకరు అనుబంధాన్ని పంచుకోవడానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది 100 శాతం మహిళల సొంతం. వారి నిధులతోనే నడుస్తుంది. 'ఫౌండర్ మెంబర్' అనే ప్రత్యేక మోడల్ ద్వారా దీనిని కొనుగోలు చేశారు. అంటే ఇక్కడ మగపురుగు కూడా ఉండదన్నట్టు.. ఉండేదంతా సిస్టర్ హుడ్. ఇక్కడ సమ్మర్ క్యాంప్స్, విశ్రాంతి గదులు, ఆన్లైన్ కమ్యూనిటీ ద్వారా మహిళలకు ఒక 'వర్చువల్ స్వర్గాన్ని' అందిస్తున్నారు. ఈ కోట రోజువారీ ఒత్తిళ్ల నుండి దూరంగా,ఒక స్లీప్ అవేలా, రిట్రీట్‌గా పనిచేస్తుంది. ఇక్కడ మహిళలు కలిసి సమయం గడపవచ్చు. అలాగే ఒక చారిత్రక ప్రదేశంలో గడిపిన అనుభూతి పొందవచ్చు.ఈకోటలో ఎలాంటి భయాలు, ఆటంకాలు లేకుండా పచ్చని ప్రకృతి మధ్య, ఇష్టమైన నెచ్చెలులతో ఆడి పాడవచ్చు. నిస్సంకోచంగా నచ్చిన పని చేసుకోవచ్చు. “మీరు మీ ప్రాణస్నేహితురాలు, పెద్ద కుమార్తె , మరో 300 మంది మహిళలతో కలిసి ఒక మధ్యయుగపు కోటను కొనుగోలు చేశారు. ఇప్పుడు మీరంతా ఒకచోట చేరి, ఆలింగనం చేసుకుని, వేడుకలు జరుపుకుని, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఒక స్థలాన్ని సృష్టించారు. స్వేచ్ఛగా. ఆనందంగా. మనస్ఫూర్తిగా.” అనే క్యాప్షన్‌తో దీనికి సంబంధించిన వీడియో షేర్ అయింది. దీనిపై బోలెడు ప్రశంసలు కురుస్తున్నాయి. అంతేకాదు మీ దేశంలో కూడా మీరు ఇలాంటి కోటనొకదాన్ని ఏర్పాటు చేసుకుంటారా అనే ప్రశ్నను సంధించడం విశేషం.నెటిజన్ల స్పందనఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియా భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చాలా మంది మహిళలు దీన్ని "రిటైర్మెంట్ ప్లాన్" అని కొనియాడుతోంటే, "ఇది చాలా అద్భుతమైన ఆలోచన, ఇలాంటి కలయికలు, కమ్యూనిటీలు మనశ్శాంతిని ఇస్తాయి" అని మరికొందరు వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్ట్ నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుంది అని మరి కొంతమంది ఆరా తీశారు.మరోవైపు కొందమంది నెటిజన్లు వ్యంగ్య బాణాలు విసిరారు. "ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులు లేదా పైకప్పు కారితే ఎవరు బాగు చేస్తారు? ఖచ్చితంగా మగవారిని పిలవాల్సిందే కదా" (ఇలాంటి పనులు ఆడవాళ్లు చేయలేరు అన్నట్టు) అంటూ కొందరు ఎద్దేవా చేశారు. మరికొందరు మేల్ చావనిస్ట్లేమో ఇలాంటి ఆడోళ్లు సమాజం నుండి విడిపోవడమే మంచిది అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.A group of 300 women buy a Medieval French Chateau so they can have a place for women to gather. Would you buy a castle with other people in another country? pic.twitter.com/C8VlKKvj3a— Richie Rich (@gofishh77) April 7, 2026ఏది ఏమైనా "మహిళలు ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఉత్సాహంగా, స్వేచ్ఛగా గడిపే ఒక వేదికను సృష్టించడమే మా ఉద్దేశ్యం." అని క్యాంప్ చాటో వెబ్సైట్ చెప్పినట్టు, ఆడవారి దుస్తులు, వేషధారణమీద ఎలాంటి జడ్జ్మెంట్లు, విమర్శలు, విరుపులు లేని ఒక ఉత్సాహపూరిత క్షణాలు నిజంగానే కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఏమంటారు? -
ఇలాంటి బెదిరింపులకు ఆందోళన చెందవద్దు: సజ్జనార్
హైదరాబాద్: నగరంలో వాటర్ బోర్డు బిల్లుల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్ ఖాతాలో తెలిపారు. “మీ నీటి బిల్లు బకాయి ఉంది. వెంటనే డబ్బులు చెల్లించకపోతే వాటర్ కనెక్షన్ కట్ చేస్తామంటూ వాటర్ బోర్డు అధికారుల పేరుతో ఫోన్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.ఆపై HMWSSB WATER BILL UPDATE.apk పేరుతో ఒక ప్రమాదకరమైన లింక్‌ను పంపి, దాన్ని ఇన్స్టాల్ చేయాలని నమ్మిస్తున్నారు. ఒక్కసారి ఆ ఏపీకే ఫైల్‌ను మీ ఫోన్లో డౌన్లోడ్ చేస్తే, మీ మొబైల్ నియంత్రణ మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. మీ కాల్స్‌ను డైవర్ట్ చేయడమే కాకుండా, మీ స్క్రీన్‌ను నిరంతరం గమనిస్తూ బ్యాంక్ లావాదేవీలకు వచ్చే ఓటీపీలను తస్కరించి క్షణాల్లో ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.నగరవాసులు ఇలాంటి బెదిరింపులకు ఆందోళన చెందవద్దు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఎటువంటి ఏపీకే ఫైళ్లను పొరపాటున కూడా ఇన్స్టాల్ చేయకండి. కేవలం అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్‌ల ద్వారానే మీ నీటి బిల్లులు చెల్లించండి. ఎవరైనా అనుమానాస్పదంగా ఫోన్ చేస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి.ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయండి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు’’ అని సూచించారు.
