ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలి దుర్మరణం | Elderly woman dies after falling under RTC bus | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలి దుర్మరణం

Mar 9 2026 5:41 AM | Updated on Mar 9 2026 5:41 AM

Elderly woman dies after falling under RTC bus

ప్రయాణికుల మధ్య తోపులాట 

సత్యసాయి జిల్లాలో విషాదం 

బత్తలపల్లి: బస్సు రాగానే ఎక్కేందుకు ప్రయాణికుల నడుమ తోపులాట జరగడంతో ఓ వృద్ధురాలు అదే బస్సు కింద పడి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఆదివారం జరిగింది. కదిరికి చెందిన భాగ్యమ్మ(80) తన కోడలు మాధవితో కలిసి ఆదివారం ధర్మవరంలో సమీప బంధువుల ఇంట్లో శుభకార్యం చూసు­కుని బత్తలపల్లికి చేరుకున్నారు. 

నాలుగు రోడ్ల కూడలిలో కదిరి వెళ్లే బస్సు కోసం వేచి ఉండగా బస్సు రావడంతో ఎక్కే సమయంలో ప్రయాణికుల రద్దీ కారణంగా తోపులాట జరిగింది. భాగ్యమ్మ ప్రమాదవశాత్తు బస్సు వెనుక టైరు కింద పడింది. బస్సు ముందుకు కదలగానే ఆమె తలపై నుండి వెనుక చక్రాలు వెళ్లాయి. తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు కేకలు వేయడంతో బస్సు నిలిపివేశారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

ఆర్టీసీ బస్సులో మహిళ మృతి
జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సు­లో ప్రయాణిస్తున్న ఓ మహిళ శ్వాస ఆడక మృతి చెందింది. తూర్పు­గోదావరి జిల్లా గోపాల­పు­రానికి చెందిన ముప్పిడి జ్యోతిరెడ్డి (50) ఆదివారం జంగారెడ్డి­గూ­డెంకు వెళ్లేందుకు గోపాలపు­రంలో కొ­వ్వూరు ఆర్టీసీ డిపో బస్సు ఎ­క్కింది. బస్సు ప్రయాణికుల­తో రద్దీగా ఉండగా జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్‌కు వచ్చేసరికి జ్యోతి­రెడ్డి స్పృహ తప్పి పోయిఉంది. 

తోటి ప్రయాణికులు గమనించి 108­కు సమాచా­రమివ్వగా స్థానిక ఏరి­యా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందిన­ట్టు చెప్పారు. జ్యోతిరెడ్డి కుమారుడు తన తల్లి అనారోగ్యంతో ఉన్నారని, ఆమె మృతిపై అనుమా­నాలూ లేవని చెప్పి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. 

Advertisement
 
Advertisement
Advertisement