breaking news
Accident
-
గేదె కొమ్ముకు వేలాడుతూ.. యువకుడి విషాదం!
తెలంగాణ: గేదెను బైక్ ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారంగేట్ సమీపంలో 765డీ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగింది.ఏఎస్ఐ ఆండాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్చారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఆకుల దుర్గాప్రసాద్ (19), రామాయంపేట మండలం కాట్రియాలకు చెందిన మహేశ్ బైక్‌పై నర్సాపూర్ వైపు నుంచి ఇంటికి వెళ్తున్నారు. అంతారంగేట్ సమీపంలో జాతీయ రహదారిపై గేదెలు అడ్డురాగా బైక్ అదుపుతప్పి వాటిని ఢీకొంది. దుర్గాప్రసాద్ తలలో గేదె కొమ్ము చొచ్చుకుపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.గేదె కొమ్ము తలలో గుచ్చుకుపోవడంతో మృతుడి శరీరం గేదె మెడకు వేలాడింది. దీంతో గేదె గంటపాటు అటు ఇటు పరుగులు పెట్టింది. స్థానికులు, ప్రయాణికులతో కలిసి పోలీసులు గంటపాటు శ్రమించి గేదెను కిందపడేసి కొమ్ము నుంచి మృతుని తలను తొలగించారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని 108లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టిప్పర్ బీభత్సం అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి..
-
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. కార్లన్ని బూడిద..
-
చైనా మాంజాతో యువకుడి విషాదం.. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఘటన!
ఉత్తరప్రదేశ్: స్వాతంత్య్ర దినోత్సవం రోజున చైనా మాంజాతో ఓ ప్రయాణికుడు ప్రాణాలను కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో చోటుచేసుకుంది. కౌశాంబి పోలీసుల వివరాల ప్రకారం.. నోయిడాలోని అక్బర్పూర్ బెహ్రాంపూర్కు చెందిన రవి రాజ్ తన స్నేహితుడు నరేశ్‌తో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళ్తున్నాడు.అయితే, కౌశాంబి పోలీస్‌స్టేషన్ ఎన్‌హెచ్-9పై యూపీ గేట్ సమీపంలో వంతెనపై వారు చేరుకోగానే.. గాలిలో వేలాడుతున్న మాంజా అకస్మాత్తుగా అతని మెడకు చుట్టుకుంది. మాంజా పదునుగా ఉండటంతో రవి మెడకు తీవ్ర గాయమై, మెడ ఎముక వరకు తెగింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయాడు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న రవిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన చోటు తీవ్ర గందరగోళం పరిస్థితి ఏర్పడింది. గాయపడిన రవిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా ఇందిరాపురం ఏసీపీ సూర్యబలి మౌర్య తెలిపారు.అయితే, ఈ ప్రమాద ఘటన సుమారు 2 గంటల సమయంలో ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో జరిగినట్లుగా, ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మాంజాతో మెడకు తీవ్ర గాయం కావడంతో రవి రక్తమోడుతూ కనిపించగా, అతడి స్నేహితుడు గాయంపై వస్త్రాన్ని ఉంచి రక్తస్రావాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రవి ఆన్లైన్ డెలివరీ పని చేసేవాడని, అతడి స్వస్థలం బిహార్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో చైనా మాంజా వాడటం నిషేధం ఉన్నప్పటికీ ఈ వినియోగం ఎలా జరుగుతోందనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.ఏసీపీ మాట్లాడుతూ.. పదునైన ఈ మాంజా ద్విచక్ర వాహనదారులు, పాదచారులతో పాటు పక్షులకు కూడా ప్రమాదకరంగా మారుతోందని తెలిపారు. నిషేధిత మాంజాను విక్రయించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ విక్రయాలను అడ్డుకునేలా పర్యవేక్షణ పెంచుతామని వారు తెలిపారు. -
పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం.. లోయలోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, పశ్చిమగోదావరి : ఇరగవరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఐతంపూడి లాకులు వద్ద వేగంగా వస్తున్న కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు కాలువలో చెట్టుకొమ్మ పట్టుకొని కేకలు వేయగా అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి ఆయనను రక్షించారు.పెరవలిలో వివాహానికి వెళ్లి ఓగిడి నుండి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారి వివరాలు .పోతుల లక్ష్మి బాను (18), రాజారామ్ (17), నాగిరెడ్డి దుస్వంత (18), నాగా బత్తుల సాయి సూర్య (19)గా గుర్తించారు. కాలువలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
అరుణాచలం వెళ్తున్న బస్సుకు యాక్సిడెంట్.. నలుగురు సీరియస్
సాక్షి, మహబూబ్‌నగర్: భూత్పుర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి అరుణాచలం వెళ్తున్న ప్రైవేట్ బస్సు డివైడెర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదసమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
UK: రైలు ప్రమాదం.. బోల్తా పడిన మూడు బోగీలు
లండన్ : దక్షిణ ఇంగ్లాండ్‌లో రైలు ప్రమాదం జరిగింది. ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి మూడు భోగీలు బోల్తా పడ్డాయి. లండన్‌లోని విక్టోరియా స్టేషన్ నుండి ఈస్ట్‌బోర్న్ వెళ్తున్న సదరన్ రైలు పర్యాటక ప్రాంతమైన లూయిస్ సమీపంలో ఈ ప్రమాదానికి గురైంది.రైలు వేగం పుంజుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుదుపులకు గురైందని, తాము ప్రయాణిస్తున్న బోగీ పైకి లేచి ఆకస్మికంగా బ్రేకులు పడ్డాయని ప్రయాణికుడు రాబ్ బ్రాడ్లీ తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, లగేజీతోపాటు అందరూ ముందుకు పడిపోయారని, రైలు కొంతదూరం అలాగే జారిన తర్వాత ఆగిపోయిందని వివరించారు.ఆ తర్వాత తాము వెనక్కి తిరిగి చూసేసరికి వెనుక ఉన్న బోగీలు పూర్తిగా తెరుచుకుని, దట్టమైన పొగ, ధూళి కమ్ముకున్నాయని, ఒక బోగీ పక్కకు తిరిగి ఎంబ్యాంక్మెంట్ నుంచి కింది పొలంలోకి పడిపోయిందని ఆయన చెప్పారు.ప్రమాద స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పారామెడిక్స్, ఆంబులెన్స్‌లతో పాటు మూడు హెలికాప్టర్లు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై రవాణా మంత్రి హీడీ అలెగ్జాండర్ ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
టన్నెల్లో ప్రమాదం.. పలువురు కార్మికులు దుర్మరణం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో విషాదం చోటు చేసుకుంది. టెన్నెల్లో ప్రమాదం చోటు చేసుకొని పలువురు కార్మికులు మృత్యువాత పడ్డారు. చమోలీ జిల్లాలో పిపాల్కోటి సమీపంలోని మాయాపూర్‌లో నిర్మిస్తున్న టీహెచ్‌డీసీ టన్నెల్లోకి అకస్మాత్తుగా నీరు, బురద చేరడంతో 19 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన వారి కోసం సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. చమోలీలో సుమారు 2 కిలోమీటర్ల పొడవైన ‘టెయిల్ రేస్ టన్నెల్’లో సుమారు 1.4 కిలోమీటర్ల లోతులో భూమి కుంగి రంధ్రం ఏర్పడింది. దీంతో అకస్మాత్తుగా నీరు, బురద లోపలికి రావడంతో అప్పటికే విధులు నిర్వహిస్తున్న 22 మంది కార్మికులలో 19 మంది చిక్కుకుపోయారు.సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ , ఐటీబీపీ, ఆర్మీ బృందాలు రంగంలోకి దిగాయి. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలతో ఇప్పటికే 16 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మిగిలిన కార్మికులను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నీటిని బయటకు పంపింగ్ చేసేందుకు ప్రత్యేక పంపులను ఏర్పాటు చేశారు.ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని పేర్కొంటూ, సహాయక చర్యలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. -
డెడ్‌బాడీతో ప్రయాణం.. నలుగురు మృతి
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిర్మౌర్ జిల్లాలోని గాట్లాగ్ సమీపంలో గుండె పోటుతో మృతి చెందిన గ్రామస్థుడి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్తున్న వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటన నిన్న (మంగళవారం) రాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు.సిర్మౌర్ జిల్లాలోని సంగ్రాహ్ ఆసుపత్రిలో ఆర్లూ గ్రామానికి చెందిన జగదీశ్ శర్మ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహాన్ని తీసుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో గాట్లాగ్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది.ఈ ప్రమాదంలో ఆర్లూ గ్రామానికి చెందిన రాజేంద్ర (37), దేశ్ రాజ్ (23), చినాడ్ గ్రామానికి చెందిన రిఖీ రామ్ (58), రామ్ గోపాల్ (62) మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన తొమ్మిది మందిని చికిత్స కోసం నహాన్‌లోని మెడికల్ కాలేజీకి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని తీసుకెళ్తున్న సమయంలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. -
నీ పుత్ర ప్రేమ గుట్టు తెలిసింది ‘గోవింద’
ఎప్పుడు: 2024 డిసెంబర్ 21 ఎక్కడ: శ్రీకాకుళం జిల్లా కొరసవాడ వద్ద.. ఏం జరిగింది: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు సాయి గణేష్ డ్రైవ్ చేస్తున్న కారు ఓ ఆటోను ఢీకొట్టింది. పరిస్థితి ఏంటి: ఆటోలోని ఐదుగురికి గాయాలయ్యాయి.. అందులో ఒకరు మృతి చెందారు. పోలీసులు ఏం చేశారు: తెలివితేటలు చూపారు..కారు డ్రైవ్ చేస్తున్న గణేష్ స్థానంలో వేరే వ్యక్తిని ఇరికించి కేసు క్లోజ్ చేశారు. ఎమ్మెల్యే మాటేమిటి: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పుత్ర ప్రేమతో బాధితులకు ఆశల గాలం వేశారు.. ఇదంతా ఇప్పుడెందుకు: ఈ ఘటన అనంతరం జరిగిన ఎమ్మెల్యే రాయ ‘బేరాలు’, టీడీపీ ప్రభుత్వ ఏకపక్ష వైఖరి తెలియాలంటే చదవండిక.... సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు సాయి గణేష్ కారు ఆటోను ఢీకొట్టడంతో, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో భామిని మండలం లివిరి గ్రామానికి చెందిన చెప్పల బోగయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమంగా మారి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదే ఘటనలో ఈయన కోడలు చెప్పల సంతోష్, సవలాపురం నరేష్, గణేష్, ఆటో డ్రైవర్ కూర్మాన సునీల్‌కు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే కుమారుడే ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ పల్లి రాజేష్ అనే వ్యక్తి డ్రైవ్ చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేసి, తేల్చేశారు. ఇప్పుడు తాజాగా ఈ ఘటనలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు కారు ప్రమాదం అనంతరం బాధిత కుటుంబీకులతో జరిపిన చర్చల వీడియోలు, చేసుకున్న ఒప్పంద పత్రాలు బయట పడ్డాయి. వీటిపై టీడీపీ నాయకులు, పోలీసులు ఎలా స్పందిస్తారోనని చర్చ నడుస్తోంది. బాధితులతో ఎమ్మెల్యే మామిడి ప్రత్యేక భేటీ ప్రమాదం జరిగిన తర్వాత మృతుడి కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రత్యేకంగా కూర్చుని పరిహారం చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ‘యాక్సిడెంట్ జరిగింది వాస్తవం. ఎవరు డ్రైవింగ్ చేశారో తెలుసు, దాని కోసం మాట్లాడుకోవడం అనవసరం, ఇప్పుడేం చేయాలన్న దానిపై మాట్లాడుకుందాం. బీమా గురించీ మాట్లాడుకుందాం. దీన్ని ఎలాగోలా క్లోజ్ చేయండి.’ అని మాట్లాడిన వీడియోలు వెలుగు చూశాయి. ఇంకా మామిడి గోవిందరావు పీఏలు బాధిత కుటుంబీకులతో ఒప్పంద పత్రం కూడా రాయించుకున్నారు. అది కూడా బయటపడింది. దీన్నిబట్టి కేసును అప్పట్లో ఎంత మేనేజ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.కేసును పూర్తిగా పక్కదారి పట్టించిన పోలీసులు... పాతపట్నం పోలీసులు ఈ కేసును పూర్తిగా పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. పల్లి రాజేశ్ అనే వ్యక్తి డ్రైవ్ చేశాడని నిర్ధారించి, కేసు క్లోజ్ చేశారు. ఎమ్మెల్యే కుమారుడిని తెలివిగా తప్పించారనేది తేటతెల్లమవుతోంది. ఘటన అనంతరం మృతుడు భోగయ్య కుటుంబ సభ్యులతో సంప్రదింపులు చేయడం, రాజీ చేసుకోవడం, ఒప్పందం కుదుర్చుకోవడం, అంగీకార పత్రాలు రాయించుకోవడం అన్నీ జరిగాయి. రూ.5లక్షలు నగదుతో పాటు బీమా కింద వచ్చే సొమ్మును, గాయపడిన వారికి ప్రత్యేక సాయంగా అందజేస్తామని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం అంటూ ఒప్పందం చేసుకున్నారు. వీటికి సంబంధించి బాధిత కుటుంబీకుల వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏడాది గడిచినా బా«ధితులకు న్యాయం జరగలేదు. ఒప్పందం మేరకు చెల్లింపులు చేయలేదు. అడిగితే బెదిరింపులు.. హైకోర్టు అడ్వకేట్లు తెలుసంటూ భయపెట్టేలా వ్యాఖ్యలు. అధికార పక్షమైతే ఒక రూల్.. ప్రతిపక్షమైతే మరో రూలా ... అధికార పక్ష నాయకులు యాక్సిడెంట్ చేస్తే ఒకలా, ప్రతిపక్షమైతే మరోలా వ్యవహరిస్తున్నారన్నది ఈ ఘటనతో తేటతెల్లమైంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ జరిగితే హత్య కేసు నమోదు చేసి, ఆ పిల్లాడితో పాటు తండ్రిని కూడా జైలుకు పంపించారు. మరి, ఇప్పుడు పాతపట్నం ఎమ్మెల్యే బాధిత కుటుంబీకులతో జరిపిన చర్చల వీడియోలు, ఆయన అనుయాయులు చేసుకున్న ఒప్పంద పత్రాలకు ఏం సమాధానం చెబుతారో చూడాలి. వీరిపై కూడా హత్య కేసు నమోదు చేస్తారా? ఆ దిశగా లోతుగా దర్యాప్తు జరుపుతారా? లేదంటే అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడని చూసీ చూడనట్టు వదిలేస్తారా? అనేవి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ముందున్న ప్రశ్నలు. మృతుడి కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే అనుయాయులు చేసుకున్న ఒప్పంద పత్రం (ఫైల్) ఎమ్మెల్యే ఇస్తానన్న సాయం అందలేదుమేము పాతపట్నంకు పరామర్శ కోసం ఐదుగురు వెళ్లాం. మా మావయ్య, మా అన్నయ్య పిల్లలు ఇద్దరు, నేను, ఆటో డ్రైవర్ ఐదుగురం బయలుదేరాం. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కొడుకు సాయి గణేష్ యాక్సిడెంట్ చేశారు. నాకు ఆ సమయంలో స్పృహ లేదు. తర్వాత ఆస్పత్రికి వెళ్లాం. నా తలకు దెబ్బలు తగిలాయి. మా మామయ్యకు ఎక్కువగా దెబ్బలు తగిలాయి. మామయ్య ఆస్పత్రిలో మూడు రోజులు కోమాలో ఉండి డిసెంబర్ 24న చనిపోయారు. నాకు రెండు ఆపరేషన్లు అయ్యాయి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఎమ్మెల్యే ఇస్తానన్న సాయం ఇంతవరకు అందలేదు. ఉద్యోగం, పింఛను ఏమీ ఇవ్వలేదు. రెండు మూడుసార్లు కలిసినా ఇంతవరకు స్పందించలేదు. – చెప్పల సంతోష్, ప్రమాద బాధితురాలు -
మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ప్రమాదం
రాజమహేంద్రవరం సిటీ: మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ కో–ఆర్డీనేటర్ తలారి వెంకట్రావు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఆయన మంగళవారం ఉదయం పొలం నుంచి ఇంటికి బైక్‌పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంకట్రావు తలకు, చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ని వెంటనే రాజమహేంద్రవరంలోని ఆదర్శ్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న తలారి వెంకట్రావును వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, నేతలు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తోట రామకృష్ణ, డాక్టర్ జక్కంపూడి రాజశ్రీ తదితరులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ, కారునుఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాద్నగర్ పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచక్ వసా సమీపంలో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఒక అధికారులు తెలిపారు. ఉజ్జైన్ వైపు వస్తున్న కంటైనర్ లారీ అకస్మాత్తుగా కార్‌ను ఢీకొనడంతో, అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. మృతి చెందినవారంతా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. -
జమ్మూ.. డిప్యూటీ సీఎం వాహనం ఢీకొని వ్యక్తి మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరికాన్వాయ్లోని ఒక వాహనం ఢీకొని బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహన డ్రైవర్, సెక్యూరిటీ సిబ్బంది కిందకు దిగి తీవ్రంగా గాయపడిన భరత్ కాపర్‌ను ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడు భరత్ కాపర్ , బీహార్‌లోని సమస్తిపూర్ నివాసి అని తెలుస్తోంది. నిన్న శనివారం రాత్రి సుమారు 9గంటల ప్రాంతంలో జమ్మూ శివారు ప్రాంతమైన గంగ్యాల్లో రోడ్డు దాటుతుండగా, వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం ఆయన్ను ఢీకొట్టింది. అయితే జమ్మూకశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరిని ఆయన నివాసంలో దించి వస్తున్న కాన్వాయ్లోనిదే ఆ స్కార్పియో వాహనమని తెలుస్తోంది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి వేళల్లో నగర ప్రాంతాల్లో అధికారిక కాన్వాయ్‌ల రాకపోకలు, రోడ్డు భద్రతపై ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. -
ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు
-
రూ. 20 లక్షల ఖర్చు, ప్రాణాలమీదకు తెచ్చిన ర్యాపిడో రైడ్ : వైరల్ స్టోరీ
సాక్షి, బెంగళూరు : క్యాబ్ సేవల సంస్థ ర్యాపిడోపై ఒక మహిళ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల శని కృష్ణ అనే మహిళకు ర్యాపిడో బైక్ ప్రయాణం పీడకలగా మారింది. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితినుంచి బైటపడింది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాలోపోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. చివరికి దీనిపై కంపెనీ స్పందించింది.జూన్ 17న శని కృష్ణ ఆఫీసుకు వెళ్లడానికి ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నారు. బాగ్మానే టెక్ పార్క్ వద్ద రైడర్ ఒక ట్రాక్టర్‌ను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించడంతో బైక్ నియంత్రణ కోల్పోయింది. రోడ్డుపై పడిపోయిన ఆమెపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి, కాలేయం దెబ్బతింది, 9 పక్కటెముకలు విరిగాయి, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు ప్లీహం (Spleen) తొలగించాల్సి వచ్చింది. మెరుగైన వైద్యం కోసం ఆమెను కేరళలోని ఆసుపత్రికి తరలించారు. ఈ తీవ్ర ప్రమాదంలో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకోగా, ఆసుపత్రి ఖర్చులు రూ. 20 లక్షలు దాటాయని, అయితే రాపిడో సంస్థ తనకు ఎలాంటి సహాయం అందించలేదని ఆమె ఆరోపించారు.రూ. 20 లక్షల ఖర్చుఅత్యవసర శస్త్రచికిత్సలు, వైద్య ఖర్చుల నిమిత్తం ఇప్పటివరకు రూ. 20 లక్షలకు పైగా ఖర్చయిందని, ఇది తమ కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారంగా మారిందని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.ర్యాపిడోపై ఆరోపణలుమహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటనలు ఇచ్చే రాపిడో, ప్రమాదం జరిగాక తనను పట్టించుకోలేదని శని కృష్ణ ఆరోపించారు. న్యాయపరమైన నోటీసులు పంపినప్పటికీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ చూసుకోమంటూ కేవలం ఆటోమేటెడ్ ఇమెయిళ్ళు మాత్రమే పంపారని తెలిపారు. ఈ విషయమై తాను వినియోగదారుల కోర్టును (Consumer Court) ఆశ్రయించనున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్‌గా ఘనత View this post on Instagram A post shared by Sani Krishna (@sani_krishna) ఇదీ చదవండి: అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీర్యాపిడో స్పందన:శని కృష్ణ ఇన్స్టాగ్రామ్ వీడియోపై రాపిడో సంస్థ స్పందిస్తూ, తాము బాధితురాలితో సంప్రదింపుల్లో ఉన్నామని, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపడానికి కొంత సమయం కావాలని కోరింది.ఇదీ చదవండి: 'జెన్ జీ' పై ఎంపీ కంగనా రనౌత్ యూటర్న్: ఆసక్తికర వ్యాఖ్యలు -
కేరళలో బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
-
ప్రమాదం కాదు.. ఉద్దేశపూర్వకంగానే..!
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటనకు సంబంధించి లభ్యమైన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసినదేనని స్పష్టమవుతోంది. ప్రమాదానికి కారణమైన యువకులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్ ఈ నెల మూడో తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాద్ ఆదిత్యమాల్కు సినిమా చూసేందుకు కారులో వచ్చారు. వారు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించిన మాల్ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్‌తో పరిశీలించగా, ఆ యువకులు వారిపై దురుసుగా ప్రవర్తించారు. మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో వారిని థియేటర్ లోపలికి అనుమతించలేదు. దీంతో ఆ యువకులు బయటకు వెళ్లే క్రమంలో నియంత్రణ లేకుండా కారును నడిపినట్టు సీసీ టీవీ ఫుటేజీల్లో నిర్ధారణ అయ్యింది. వారి కారు ఆదిత్య మాల్ గేటు దాటుతున్న సమయంలోనే... వైద్య విద్యార్థిని ప్రియాంక, ఆమె స్నేహితుడు మల్లి వెంకటదుర్గసాయి కూడా బైక్‌పై మాల్ గేటు దాటుతున్నారు. ఈ క్రమంలో యువకుల కారు వారి బైక్‌ని ఢీకొట్టింది. ప్రియాంక వారి వైపు కోపంగా చూడటంతో మరోసారి కారుతో వారి బైక్‌ను ఢీకొట్టారు. అలా మూడుసార్లు వెంటవెంటనే బైక్‌ని ఢీకొట్టారు. దీంతో బైక్ పైనుంచి ప్రియాంక కింద పడిపోయింది. ఇది చూసిన మాల్ సిబ్బంది కేకలు వేయడంతో యువకులు కారును వేగంగా దూసుకువెళ్లారు. ఈ క్రమంలో కిందపడిన ప్రియాంక తల పైనుంచి కారు ఎక్కి వెళ్లడం సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. ప్రియాంకను ఆమె స్నేహితుడు, థియేటర్ సిబ్బంది హుటాహుటిన కంబాలచెరువులోని స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి అత్యంత విషమించడంతో అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడి కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని, మృత్యువుతో పోరాడుతోందని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.విచారణ చేపట్టాలి: రాజమహేంద్రవరం వైద్య విద్యారి్థని ప్రియాంక ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జుడా) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర, పారదర్శక, నిష్పాక్షిక విచారణ జరిపించాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా యువకుల గుర్తింపుప్రమాద ఘటనపై థియేటర్ మేనేజర్ విజయ్ ఫిర్యాదు మేరకు ఒక కేసు, ప్రియాంక తండ్రి కనికే వెంకటేష్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదయ్యాయి. సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైన కారు నంబర్ ఆధారంగా యువకులను పోలీసులు గుర్తించారు. వారిద్దరూ చింతల నామవరానికి చెందినవారుగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయినా ప్రకాశ్‌నగర్ పోలీసులు మాత్రం ఇది మద్యం మత్తులో జరిగిన ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని హడావిడిగా ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
ఇకపై యాక్సిడెంట్లకు ఛాన్సే లేదు!
భారత రహదారులపై ప్రమాదాల నివారణకు రవాణా రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది. వాహనాలు తమలో తాము సమాచారాన్ని మార్పిడి చేసుకునే ‘వెహికల్-టు-వెహికల్’ (వీ2వీ) కమ్యూనికేషన్ వ్యవస్థను తప్పనిసరి చేస్తూ ఇటీవల ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రపంచంలోనే భారత్‌లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్న తరుణంలో ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుంది?సీ-వీ2ఎక్స్ (C-V2X) సాంకేతికతపై ఆధారపడిన ఏఐఎస్-230 ప్రమాణాలతో వీ2వీ వ్యవస్థలు పనిచేస్తాయి. వాహనంలో అమర్చే ఆన్-బోర్డ్ యూనిట్ల ద్వారా వాహనం వేగం, ప్రయాణ దిశ, బ్రేకింగ్ సమాచారం వంటి వివరాలు రేడియో తరంగాల రూపంలో సమీపంలోని ఇతర వాహనాలకు ప్రసారమవుతాయి. దీనికోసం టెలికాం శాఖ 5.875 GHz-5.925 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను కేటాయించింది.ఈ వ్యవస్థలోని ప్రధాన ప్రయోజనం ఏంటంటే.. ఇది డ్రైవర్ కంటికి లేదా కెమెరా/రాడార్ ఆధారిత ఏడీఏఎస్ వ్యవస్థలకు కనిపించని ప్రమాదాలను కూడా ముందుగానే గుర్తిస్తుంది. ఉదాహరణకు, ముందస్తుగా మలుపుల్లో ఎదురొచ్చే వాహనాలు, అకస్మాత్తుగా బ్రేక్ వేసే వాహనాలు, రాంగ్ రూట్లో వచ్చే డ్రైవర్లు లేదా అత్యవసర వాహనాల (అంబులెన్సులు) రాకను కొన్ని మిలీసెకన్ల వ్యవధిలోనే డ్రైవర్‌కు హెచ్చరికల రూపంలో తెలియజేస్తుంది.రెండు దశల్లో అమలు ప్రణాళికఅక్టోబర్ 1, 2027.. వీ2వీ అమర్చిన వాహనాలు కచ్చితంగా ఏఐఎస్-230 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి (ఆప్షనల్).అక్టోబర్ 1, 2028 వరకు L (ద్విచక్ర, త్రిచక్ర), M (కార్లు, బస్సులు), N (లారీలు, ట్రక్కులు) కేటగిరీల కొత్త వాహనాలన్నింటికీ వీ2వీ అమలు చేయాలి.భవిష్యత్తు రవాణాకు పునాదిప్రస్తుతం ఆటోమొబైల్ తయారీదారులు, టెలికాం నిపుణులకు తగినంత సమయం ఇచ్చేలా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని దశలవారీగా చేపట్టింది. రహదారి మౌలిక సదుపాయాలపై ఆధారపడకుండా వాహనాల మధ్య మాత్రమే నేరుగా కమ్యూనికేషన్ జరగడం దీని ప్రత్యేకత. భవిష్యత్తులో వాహనాలు-రోడ్డు మౌలిక వసతుల మధ్య అనుసంధానం ఏర్పరచే 'ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్' (ఐటీఎస్) విస్తరణకు ఇది తొలి అడుగు. తయారీదారులు సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తే 2028 నాటికి భారతీయ రహదారులు అత్యంత సురక్షితంగా మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మళ్లీ నింగినంటుతున్న బంగారం ధరలు -
దుర్మార్గానికి హద్దు లేదా?
అప్పలరాజు కొడుకుపై హత్య కేసు పెట్టడం క్షమించరాని తప్పు. యాక్సిడెంట్ జరిగి నప్పుడు ఈ పిల్లాడు తొలుత ఫోన్ చేసింది 108కే. ఈ అబ్బాయికి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే 108కు ఎందుకు ఫోన్ చేస్తాడు? బాధితుణ్ని కాపాడేందుకు సీపీఆర్ కూడా చేశాడు. ఆ తర్వాత ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చింది కూడా అప్పలరాజే. చంద్రబాబు గారూ.. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఉంటుందా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లు ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే ఇలానే చేస్తారా? వాళ్ల పిల్లలు కానీ, వారి బంధువులు కానీ యాక్సిడెంట్ చేస్తే, వాళ్లు కారులో ఉండగానే యాక్సిడెంట్ జరిగితే.. మొత్తం కుటుంబంపై ఇదే మాదిరిగా కేసులు పెట్టి, అరెస్టులు చేసి, కుట్ర కోణం, హత్య కోణం అని చెబుతారా? ఈ ఘటన జరిగాక యాదవ మంత్రిని ఇక్కడికి పంపించి అంత రాజకీయం చేయడం దారుణం. చంద్రబాబూ.. నీవు అసలు మనిషివా? రాక్షసుడివా? అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనిషి అనే వాడికి మనసు ఉండాలి. ఏ ఇన్సిడెంట్ అయినా సరే వదలకూడదు.. దాన్ని ట్విస్ట్ చేయాలి.. వక్రీకరించాలి.. ఎవరినైనా నాశనం చేయాలి.. అన్న ఆలోచన నీది. నీ రాజకీయ అవసరాల కోసం అలా ఆలోచించడం దుర్మార్గం అనిపించడం లేదా? చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు. చేసేవన్నీ మోసాలు. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రశ్నించే గొంతులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్లని ఇబ్బంది పెట్టడం మామూలైంది. ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం కోసం వాళ్ల మీద తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు. అలా వాళ్ల జీవితాలు నాశనం అవుతాయన్న కనీస జ్ఞానం లేకుండా చెలగాటాలు. ఇవీ చంద్రబాబు ప్రభుత్వంలో మనం చూస్తున్న వాస్తవాలు. – మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అనుకోని పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే, దాన్ని హత్య కేసుగా మార్చడం అత్యంత హేయమని, చంద్రబాబు దిగజారిన దారుణ రాజకీయాలకు నిదర్శనమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఆ కేసులో మాజీ మంత్రి అప్పలరాజును ఇరికించి జైలుకు పంపడం ఆ కుటుంబంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వ కుట్రను తేటతెల్లం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు చేసిన రోడ్డు ప్రమాదాల్లో కూడా ఇలాగే వ్యవహరించారా.. అని సూటిగా ప్రశ్నించారు. అప్పలరాజు కుటుంబానికి పార్టీ పరంగా పూర్తి అండగా ఉంటామని, ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని చెప్పారు. ఈ ప్రభుత్వంపై ఇంకా గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా అంపోలు వద్ద జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు గురువారం ఆయన ఇక్కడకు వచ్చారు. అక్కడే ఉన్న అప్పలరాజు భార్య, ఇద్దరు కుమారులను ఓదార్చారు. అప్పలరాజుకు న్యాయం జరుగుతుందని, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, ఆయన త్వరలోనే బయటకు వస్తారని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. యాక్సిడెంట్‌ను ట్విస్ట్ చేసి.. కుట్ర ‘ఒక ఘటనను ఏ మాదిరిగా ట్విస్ట్ చేస్తున్నారో చూడండి. కనీసం మానవతా విలువలు లేకుండా, మంచితనం అన్నదానికి పూర్తిగా పాతర వేస్తూ, ఈ పిల్లాడిపై కుట్ర చేశారు. తనకు కేవలం 18 ఏళ్లు. ఒక నెల కిందట ‘నీట్’ పరీక్ష రాశాడు. వాళ్ల నాన్న మాదిరిగా తాను కూడా ఒక మంచి డాక్టర్ కావాలని ఆరాట పడుతున్నాడు. పొరపాటున ఓ యాక్సిడెంట్ జరిగితే, దానిని ట్విస్ట్ చేసి.. అందులో కుట్ర కోణం యాడ్ చేసి, హత్య చేశాడని కేసు పెట్టారు. హత్యాయత్నం నుంచి హత్య చేశాడని కేసును ట్విస్ట్ చేశారు. అలా అప్పలరాజు కుటుంబాన్ని వేధించడం ఎంత వరకు ధర్మం? సమాజంలో ప్రతి ఒక్కరు దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. యాక్సిడెంట్ అనేది ఉద్దేశ పూర్వకంగా చేసేది కాదు. 45 ఏళ్ల గొర్రెల కాపరి రోడ్డు మీద గొర్రెలను తోలుకుంటూ పోతుండగా బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో కుట్ర కోణం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది హత్య అవుతుందా? ఈ పిల్లాడికి ఆ మనిషి ఎవరో కనీస పరిచయం కూడా లేదు. అతడు పాదచారి మాత్రమే. దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదాన్ని పట్టుకుని, ఈ పిల్లాడి జీవితం నాశనం చేయాలన్న ఆలోచన చేయడం ఎంత వరకు ధర్మం? ఇది కరెక్టేనా? రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం అప్పలరాజు బీసీల్లో ఒక మంచి నాయకుడు కాబట్టి, ఆయన వైఎస్సార్సీపీకి చెందిన నాయకుడు కాబట్టి ఇలా వేధిస్తున్నారు. నిజంగా, ఒక పిల్లాడు చేసిన యాక్సిడెంట్‌ను ఒక కుట్రగా, హత్యగా చిత్రీకరించి.. అప్పలరాజు కుటుంబాన్ని కేసులో ఇరికించే ప్రయత్నం చేయడం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ ఆలోచించాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే.. ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు. దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్నీ కలిపి, తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. దాన్ని చివరకు పోలీసులు కేసుగా మార్చేస్తారు. ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక చంద్రబాబు, ఓ లోకేశ్, వీళ్లకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్లకి సంబంధించిన పోలీసులు.. ఇదొక మాఫియా సామ్రాజ్యం. అప్పలరాజు బీసీ నాయకుడు కాబట్టే.. అప్పలరాజు 10వ తరగతిలో రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంకర్. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవార్డు కూడా ఇచ్చాడు. చదువుల్లో ఆ స్థాయికి పోయిన వ్యక్తి.. తన సొంత కష్టం మీద డాక్టర్ అయ్యాడు. లోకేశ్ మాదిరి డొనేషన్ కట్టి స్టాన్‌ఫోర్డ్‌లో సీటు తెచ్చుకోలేదు. ఎండీ కూడా చేశాడు. అంటే మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్. ఒక మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వైఎస్సార్సీపీ తరఫున టికెట్ ఇస్తే, ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యే అయ్యాడు. మంత్రిగా కూడా పని చేశాడు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఇంతగా ఎదిగిన ఆయన వ్యక్తిత్వ హననం కోసం, ఒక తప్పుడు కేసు పెట్టారు. ఒక యాక్సిడెంట్‌ను కుట్రగా, హత్యగా వక్రీకరించారు. ఆయన కెరీర్‌ను నాశనం చేయాలన్న దుర్మార్గపు ఆలోచన. ఆ దుర్మార్గపు ఆలోచనల్లో కనీసం ఈ 18 ఏళ్ల పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా చంద్రబాబు ఆలోచించ లేదు. 80 ఏళ్ల వయసు వస్తోన్న ఈ మనిషి అన్నం తింటున్నాడా? లేక గడ్డి తింటున్నాడా? అని అడుగుతున్నా. ఇది రాజకీయాలను ఒక నీచమైన స్థాయికి తీసుకుపోవడం. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా? ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఉంటుందా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లు ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే.. వాళ్ల పిల్లలు కానీ, వారి బంధువులు కానీ యాక్సిడెంట్ చేస్తే, వాళ్లు కారులో ఉండగానే యాక్సిడెంట్ జరిగితే.. మొత్తం కుటుంబంపై ఇదే మాదిరిగా కేసులు పెట్టి, అరెస్టులు చేసి, కుట్ర కోణం, హత్య కోణం అని చెబుతారా? అని చంద్రబాబును అడుగుతున్నా. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే స్వయంగా కారులో ఉండగానే కారు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన ఇదే శ్రీకాకుళం జిల్లాలో 2024 డిసెంబరు 31న జరిగింది. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్ కొడుకు యాక్సిడెంట్ చేస్తే, కేసులో ఆయన్ను తప్పించి డ్రైవర్‌ను పెట్టారు. అది కూడా ఇదే జిల్లాలో జరిగింది. మరి అక్కడ ఎవరిని అరెస్ట్ చేశారు? ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం వర్తింప చేస్తే, నిజంగా వ్యవస్థ అనేది బతకదు. మీరు చెడు విత్తనాలు నాటుతున్నారు. ఆ చెడు విత్తనాలు రేపు వృక్షాలై మొత్తం వ్యవస్థను నాశనం చేస్తాయి. 108కు ఎందుకు ఫోన్ చేశాడు? అప్పలరాజు కొడుకుపై హత్య కేసు పెట్టడం క్షమించరాని తప్పు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ పిల్లాడు తొలుత ఫోన్ చేసింది 108కే. ఈ అబ్బాయికి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే 108కు ఎందుకు ఫోన్ చేస్తాడు? బాధితుణ్ని కాపాడేందుకు సీపీఆర్ కూడా చేశాడు. ఆ తర్వాత ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చింది కూడా అప్పలరాజే. ఇక్కడ ఎవరూ కూడా జరిగిన రోడ్డు ప్రమాదాన్ని కప్పిపెట్టాలనో, ఇంకొకటి చేయాలనో చూడలేదు. ఎవరూ కావాలని ఏ తప్పూ చేయలేదు. యాక్సిడెంట్‌ను రాజకీయం చేసే దుర్మార్గపు ఆలోచన యాక్సిడెంట్‌ను రాజకీయం చేయడం కోసం వీళ్లు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే.. చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఈ యాక్సిడెంట్లో ఒక గొర్రెల కాపరి మరణిస్తే, దాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు ఏం చేశాడు? పార్థసారథి అనే ఒక యాదవ మంత్రిని ఇక్కడికి పంపించాడు. ఆయన ఇక్కడికి వచ్చి ర్యాలీలు చేయించాడు. అంటే కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర. ఇది ధర్మమేనా? దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంపై నిజంగా మనసు ఉన్నోళ్లు ఏం చేస్తారు? ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడతారు. నష్టపరిహారం ఇప్పిస్తామని చెబుతారు. కుటుంబాన్ని అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పి, భరోసా ఇప్పిస్తారు. ఇక్కడ అప్పలరాజు నిజంగా ఆ పని చేయడానికి ముందుకొచ్చాడు. అయితే వీళ్లు రాజకీయం చేసి, చెడగొట్టి, వాళ్లకు జరిగే మంచి కూడా జరగనీయకుండా చేస్తున్నారు. చంద్రబాబూ.. మనిషివా? రాక్షసుడివా? ఒక యాదవ మంత్రిని ఇక్కడికి పంపించి అంత రాజకీయం చేయడం దారుణం. చంద్రబాబూ.. నీవు అసలు మనిíÙవా? రాక్షసుడివా? అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనిషి అనే వాడికి మనసు ఉండాలి. ఏ ఇన్సిడెంట్ అయినా సరే వదలకూడదు.. దాన్ని ట్విస్ట్ చేయాలి.. వక్రీకరించాలి.. ఎవరినైనా నాశనం చేయాలి.. అన్న ఆలోచన నీది. నీ రాజకీయ కోణం, నీ రాజకీయ అవసరాల కోసం అలా ఆలోచించడం దుర్మార్గం అనిపించడం లేదా? ఇది ఏ మాత్రం క్షమార్హం కాదు. యాదవుల మీద ప్రేమ ఉందా? యాదవుల మీద చంద్రబాబునాయుడుకు నిజంగానే ఇంత ప్రేమ ఉందా? ఏ మాత్రం లేదు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో యాదవులు గొర్రెలు కాస్తుంటే, కొన్ని గొర్రెలు పొలాల్లోకి పోతే, చంద్రబాబునాయుడుకి సంబంధించిన వాళ్లు వచ్చి యాదవులను కొట్టారు. కేసు మాత్రం యాదవుల మీద పెట్టారు. విశాఖపట్నం మేయర్‌గా మా పార్టీ నుంచి ఒక యాదవ మహిళ ఎన్నికయ్యారు. మరి చంద్రబాబు ఏం చేశారు? ఆయనకు తగిన సంఖ్యా బలం లేకపోయినా ప్రలోభాలతో ఆమెను పదవి నుంచి దింపేశాడు. విశాఖపట్నంలో యాదవ భవన్ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూమి ఇచ్చింది. అక్కడ భూమి పూజ జరిగి, పనులు కూడా మొదలయ్యాయి. చంద్రబాబు వచ్చాక అన్నీ క్యాన్సిల్ చేశాడు. ఇదీ చంద్రబాబుకు యాదవులపై ఉన్న ప్రేమ. బాబుకు బీసీలంటే చులకన » చంద్రబాబుకు ఒక్క యాదవులే కాదు. అసలు బీసీలు అంటే కూడా లెక్క లేదు. పోనీ మత్స్యకారుల మీద ఏమైనా ప్రేమ ఉందా అంటే అదీ లేదు. మత్స్యకార నాయకులను నాశనం చేయడం, కుట్రలు పన్ని వాళ్లను చరిత్ర హీనులుగా చేయడం అలవాటు. » ఇటీవల విశాఖపట్నం వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల్లో ఆరుగురు చనిపోతే, కనీసం మానవత్వం చూపలేదు. ఒక మంత్రి కూడా ఆ కుటుంబాల వద్దకు పోలేదు. కానీ, జగన్ వెళ్లాడు. కలిశాడు. నిజం చెప్పాలంటే ఈ మనిషి (చంద్రబాబు)కి ఎవరి మీద ప్రేమ లేదు. పేదవాడి మీద అసలు ప్రేమే లేదు. ఈ మనిషి బీసీలను ఓట్ బ్యాంక్ కింద వాడుకుంటాడే తప్ప, వారిపై ఏ మాత్రం ప్రేమ లేదు. » ఆయనకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం ఎందుకు అమలు చేయడం లేదు? దాని వల్ల అందరి కన్నా ఎక్కువగా నష్టపోయేది బీసీలే. ఒక్కసారి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో చూడండి. సున్నా వడ్డీని రూ.మూడు లక్షలు కాదు, రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. రెండేళ్లు అయ్యింది. మూడో సంవత్సరం వచ్చింది. ఇంతకు ముందు ఇస్తా ఉన్న సున్నా వడ్డీ కూడా రద్దు చేశారు. » పొదుపు సంఘాల రుణాలు తగ్గిపోయాయి. రూ.25 వేల కోట్ల నుంచి రూ.49 వేల కోట్ల వరకు మా ప్రభుత్వ హయాంలో తీసుకుపోతే.. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ మొత్తం రూ.39 వేల కోట్లకు తగ్గిపోయింది. చేయూత లేదు. ఆసరా లేదు. సున్నా వడ్డీ లేదు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు రూ.9 వేల కోట్లు, వసతి దీవెన మొత్తం బకాయిలు పెట్టారు. దీంతో పిల్లలు చదువు మానేస్తున్న పరిస్థితి. దీంట్లో అందరికన్నా ఎక్కువ నష్టపోయింది బీసీలే. సూపర్ సిక్స్‌లు లేవు.. సూపర్ సెవెన్లు లేవు ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చాడు. చదువుకున్న పిల్లలకు రూ.36 వేలు అని, అమ్మ కనపడితే నీకు రూ.18 వేలు అని, 50 ఏళ్లు దాటిన వారు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని నమ్మించాడు. ఎంత మంది ఉంటే అంత మందికీ అమ్మ ఒడి కింద రూ.15 వేలు దేవుడెరుగు. ఇచ్చింది రూ.9 వేలు. రూ.8 వేలు. సూపర్ సిక్స్‌లు లేవు, సూపర్ సెవెన్లు లేవు.అన్నీ అమ్మేస్తున్నాడు మత్స్యకారుల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ప్లాన్ చేసి నిర్మాణాలు మొదలుపెట్టాం. ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే మూలపేట పోర్టు ఎవరు మొదలు పెట్టారు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే బుడగట్లపాలెం మంచినీళ్లపేట ఫిషింగ్ హార్బర్ ఎవరు తీసుకొచ్చారు? మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే స్కాములు చేస్తూ దాన్ని అమ్మకానికి పెట్టాడు. ఫిషింగ్ హార్బర్లు అమ్మకానికి పెట్టి మత్స్యకారుల జీవితాలు సర్వనాశనం చేయడానికి ఈ మనిషి సిద్ధంగా ఉన్నాడు.ప్రశ్నించే గొంతు నొక్కుతున్నారు » చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు. చేసేవన్నీ మోసాలు. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రశ్నించే గొంతులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్లని ఇబ్బంది పెట్టడం మామూలైంది. ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం కోసం వాళ్ల మీద తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు. అలా వాళ్ల జీవితాలు నాశనం అవుతాయన్న కనీస జ్ఞానం లేకుండా చెలగాటాలు. ఇది చంద్రబాబు ప్రభుత్వంలో మనం చూస్తున్న వాస్తవాలు. » నేను ఒకటే చెబుతున్నా. అప్పలరాజు కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. తోడుగా ఉంటుంది. నా చెల్లెలైన అప్పలరాజు భార్యకు అన్ని రకాలుగా వైఎస్సార్సీపీ తోడుగా ఉంటుంది. అప్పలరాజు కూడా కచ్చితంగా త్వరలో బయటకు వస్తాడు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా బతికే ఉన్నాయి కాబట్టి. ఆయన బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద జరగబోయే యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలో ఉంటుంది. » విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు భారీగా జనం వచ్చారు. ఆ జన సందోహంలో కాన్వాయ్ కదలడం కష్టంగా మారింది. కాబట్టి జైలు దగ్గరకు చేరుకునే సరికి ములాఖత్ సమయం ముగిసిపోయింది. అందుకే ఇక్కడే ఉన్న అప్పలరాజు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చాను. అప్పలరాజు భార్య, ఇద్దరు కుమారులను పరామర్శించాను. వారికి ధైర్యం చెప్పాను. భరోసా ఇచ్చాను’ అని వైఎస్ జగన్ అన్నారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ కోకోవేన్ విభాగంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అనంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందారు. ఐరన్ పడటంతో తీవ్ర గాయాలతో మృతిచెందారు. స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గత జూన్ నెలలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతిచెందడంతో మరోసారి భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు.కొన్ని దశాబ్దాలుగా ప్లాంట్‌లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ విభాగాల్లో జరిగిన ప్రమాదాల్లో పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రధానంగా గ్యాస్ లీకేజ్, పేలుళ్లు, ద్రవ లోహం లీకేజ్ వంటి ఘటనలు జరుగుతూనే ఉండటంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకరంగా మారింది. -
నార్సింగి పరిధిలో వాటర్ ట్యాంకర్ బీభత్సం...
హైదరాబాద్, మణికొండ: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ కార్పెంటర్‌ను వాటర్ ట్యాంకర్ వెనకనుంచి ఢీకొనడంతో అక్కడికకకడే మృతి చెందాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఎస్ఐ మునీందర్ తెలిపిన మేరకు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సుశీల్‌కుమార్(28), సురేష్‌లు కాటేదాన్‌లోని లక్ష్మీగూడలో నివాసముంటున్నారు.హఫీజ్‌పేట్‌లోని ఓ అపార్ట్మెంట్లో పని ముగించుకుని రాత్రి తమ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా పుప్పాలగూడ టోల్గేట్ వద్ద అతివేగంగా వచ్చిన నీటి ట్యాంకర్ వీరిని ఢీకొట్టింది. వెనుక కూర్చున్న సుశీల్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరో కారు, మరొక స్కూటీలను కూడా ట్యాంకర్‌ఢీకొట్టింది. అయితే వారికి ఎవరికీ గాయాలు కాలేదు. ఖానాపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ రంజిత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
షాకింగ్ జిప్‌లైన్ రైడ్ ప్రమాదం, 40 అడుగుల ఎత్తునుంచి..!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని దాండేలి (Dandeli) రిసార్ట్‌లో జరిగిన ఒక జిప్‌లైన్ ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. అడ్వెంచర్ రైడ్ కోసం వెళ్లిన ఒక పర్యాటకుడు, భద్రతా లోపాల కారణంగా దాదాపు 40 అడుగుల ఎత్తు నుండి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అడ్వెంచర్ టూరిజం కేంద్రాలలో భద్రతా ప్రమాణాలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన వ్యక్తిని కర్ణాటకలోని విజయపురకు చెందిన కుబేర్ సుర్పుర్ గా గుర్తించారు. కుబేర్ గాల్లో జిప్‌లైన్‌పై వెళ్తుండగా, దానికి సంబంధించిన సేఫ్టీ లాక్ (Safety Lock) ఊడిపోవడంతో ఆయన నేరుగా కిందపడిపోయారు. దాదాపు 40 అడుగుల ఎత్తు నుండి పడటంతో కుబేర్ చేతులు, కాళ్లు విరిగిపోయాయి. అలాగే నరాలు కూడా దెబ్బతిన్నాయి.రిసార్ట్ యాజమాన్యంపై ఆరోపణలుఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర ఆందోళన చెలరేగింది. రిసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రైడ్‌కు ఉపయోగించిన పరికరాలు తుప్పు పట్టి పోయాయని, వాటిని సరిగ్గా నిర్వహించలేదని వారు పేర్కొన్నారు.ఇదీ చదవండి: 400 ఏళ్ల నాటి ఆలయంలో బర్త్‌డే ప్రత్యేక పూజలు చేసిన నటి Why you always need to be cautious when it comes to this stuff.Poor guy, if he had just moved forward by a few feet he would have ended up on the grass which would have been better. Incident occurred at Starling River Resort, Dandeli.#accident #karnataka #adventuresports pic.twitter.com/uzNHR6BUH9— Sidharth Shukla (@sidhshuk) July 19, 2026మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడు కుబేర్‌ను మొదట దాండేలి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత విజయపుర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మెరుగైన, నిపుణులైన వైద్యం కోసం ఆయనను మిరాజ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అడ్వెంచర్ స్పోర్ట్స్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: 800 మందికి శాంసంగ్ ఝలక్ : కారణం ఇదే!నెటిజన్ల కామెంట్స్ఇది చాలా ఘోరమైన జిప్‌లైన్ డిజైన్. చేతులు వదిలేసినా కింద పడకుండా బెల్ట్స్ శరీరానికి గట్టిగా అమర్చాలి కదా. ఇలాంటి వాటికి అసలు అనుమతులు ఎలా ఇస్తారు?! అని ఒకరు తీవ్రంగా మండిపడ్డారు. యాజమాన్యానికి ఏదో కొద్దిపాటి జరిమానా విధిస్తారు, కొన్ని రోజులు రిసార్ట్ మూసివేసి మళ్లీ తెరుస్తారు. బాధితులకేమీన్యాయం జరగదు అంతా యథావిధిగా జరిగిపోతుంది అంటూ మరొకరు అసహనం వ్యక్తం చేశారు. -
రెండు ప్రమాదాల్లో ఏడుగురు జల సమాధి
ఎటపాక/ఉయ్యాలవాడ/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శనివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు నీట మునిగి మృత్యువాత పడ్డారు. పోలవరం జిల్లా ఎటపాక మండలంలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో పడి చనిపోగా.. నంద్యాల జిల్లాలో జీవాలు మేపుకునేందుకు వెళ్లి కుందూ నదిలో పడి ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. వివరాలివీ.. పోలవరం జిల్లా ఎటపాక మండలంలోని గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన 11 మంది గిరిజనులు శనివారం ఉదయం గొల్లగూడెం సమీపాన గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లారు. ఊకే రమేష్ (37) నదిలో పడిపోయాడు. ఈత రాకపోవటంతో నీటిలో మునిగిపోతుండడంతో బాసిబోయిన బాలరాజు (40) అతడిని కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో బాలరాజును రమేష్ గట్టిగా పట్టుకోవటంతో ఇద్దరూ మునిగిపోసాగారు. వారితో పాటే వల పట్టుకుని ఉన్న ఊకే లక్ష్మి (37), ఊకే సుశీల (37), తుర్రం భారతి (40) తమ వద్దనున్న చున్నీలు, వలలు విసిరి వారిద్దరినీ కాపాడే ప్రయత్నం చేయగా వీరు కూడా మునిగిపోసాగారు. అది గమనించిన మరికొందరు మహిళలు ఆ ఐదుగురినీ కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ ఐదుగురూ గల్లంతవగా.. ఒడ్డునున్న మహిళలు కేకలు వేయడంతో సమీపంలోని జాలర్లు గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.కొద్దిసేపటికి ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎటపాక పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెలంగాణలోని భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతులందరూ వ్యవసాయ కూలీలు. వీరిలో నలుగురుకి వివాహం కాగా రమేష్ అవివాహితుడు. వారి ఆకస్మిక మృతితో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం అలముకుంది. పశువులు మేపుకునేందుకు వెళ్లి.. నంద్యాల జిల్లా బోడెమ్మనూరు గ్రామంలో చోటుచేసుకున్న మరో ఘటనలో.. జీవాలను మేపేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృత్యువాత పడ్డారు. రోజులానే శనివారం ఉదయం పశువులు మేపుకునేందుకు రసూల్‌బీ (38), బీబీ అలియాస్ దేవి (50)తో పాటు మౌనిక కుందూ నది ఆవల ఇంజేడు గ్రామ పొలాల్లో మేపుకునేందుకు బయల్దేరారు.అయితే, నదిలోని నీటి గుంతలోకి మేకలు వెళ్లడంతో రసూల్‌బీ వాటికోసం ఆ గుంతలోకి దిగింది. ఈమె మునిగిపోతుండడాన్ని గమనించిన బీబీ (దేవి) ఆమెను కాపాడేందుకు నీటిలోకి దిగింది. ఇద్దరూ ఊపిరాడక నదిలో గల్లంతయ్యారు. ఒడ్డునున్న మౌనిక జరిగిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా వారు నదిలో గాలించి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామిరెడ్డి తెలిపారు. మృతులిద్దరూ వరుసకు అత్తాకోడళ్లు. వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి.. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజనులు మృత్యువాత పడిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన బృందం చేపలు పట్టేందుకు గోదావరిలోకి వెళ్లగా వీరిలో ఐదుగురు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండటం హృదయవిదారకమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ జగన్ కోరారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
ఆధార్ అందుకు పనికిరాదు! తేల్చేసిన హైకోర్టు
దేశంలో అన్నింటికీ ఆధార్ కార్డునే ఆధారంగా చాలా మంది పరిగణిస్తుంటారు. అయితే మోటారు ప్రమాద పరిహారం (Motor Accident Compensation) నిర్ణయించే సమయంలో బాధితుడి వయస్సును కేవలం ఆధార్ కార్డు ఆధారంగా నిర్ణయించరాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ ప్రధానంగా గుర్తింపు పత్రం మాత్రమేనని, అది పుట్టిన తేదీకి తుది, నిర్ధారిత ఆధారంగా పరిగణించలేమని పేర్కొంది.వయస్సు నిర్ధారణ కోసం జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాల రికార్డులు, వైద్య పత్రాలు వంటి చట్టబద్ధమైన, విశ్వసనీయ ఆధారాలనే పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈ తీర్పు గతంలో సుప్రీంకోర్టు వెల్లడించిన న్యాయసూత్రాలకు అనుగుణంగానే ఉందని కోర్టు పేర్కొంది.జస్టిస్ సచిన్ సింగ్ రాజ్‌పుత్ విచారించిన మూడు అనుబంధ మోటారు ప్రమాద అప్పీళ్లలో ఈ కీలక తీర్పు వెలువడింది. గాయపడిన రంజిత్ భుంజియా వయస్సును మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) కేవలం ఆధార్ ఆధారంగా 68 ఏళ్లుగా పరిగణించింది. దీంతో భవిష్యత్ ఆదాయ నష్టాన్ని లెక్కించేందుకు తక్కువ మల్టిప్లయర్ వర్తింపజేసి పరిహారాన్ని తగ్గించింది.అయితే హైకోర్టు పిటిషన్, వైద్య రికార్డులు, వైకల్య ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి బాధితుడి వయస్సు 61–65 సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారించింది. దాంతో పరిహారాన్ని రూ.96,400 నుంచి రూ.3.90 లక్షలకు పెంచింది. ఇదే ప్రమాదంలో మరణించిన మరో ఇద్దరు బాధితుల కుటుంబాలకు కూడా పరిహారాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసులో బీమా కంపెనీల బాధ్యతపై కూడా హైకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ప్రీమియం చెల్లించిన సమయం నుంచి కాకుండా, బీమా పాలసీలో పేర్కొన్న తేదీ, సమయం నుంచే బీమా ఒప్పందం అమల్లోకి వస్తుందని తెలిపింది. కాబట్టి ప్రమాదం జరిగిన సమయంలో పాలసీ ఇంకా అమల్లోకి రాకపోతే, ప్రీమియం ముందే చెల్లించినా బీమా సంస్థపై బాధ్యత ఉండదని తీర్పులో పేర్కొంది.మరో ముఖ్యమైన అంశంగా, ఒకే మోటార్‌సైకిల్‌పై ముగ్గురు ప్రయాణించడం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనే అయినప్పటికీ, ఆ కారణం వల్లే ప్రమాదం జరిగిందని నిరూపించకపోతే దానిని "సహకార నిర్లక్ష్యం" (Contributory Negligence)గా పరిగణించి పరిహారం తగ్గించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనకు ప్రమాదంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నప్పుడే పరిహారంపై ప్రభావం చూపుతుందని న్యాయస్థానం పేర్కొంది. -
వియత్నాం బోటు ప్రమాదం.. స్వగ్రామానికి చేరుకున్న మృతదేహాలు
-
కర్నూలులో ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి
ఆంధ్రప్రదేశ్: కర్నూల్ జిల్లాలో ఈరోజు ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నగరంలో లారీ ఢీకొనడంతో ఓ కానిస్టేబుల్ మృతిచెందాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా ఫ్లైఓవర్‌పై ఏపీ స్పెషల్ బెటాలియన్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి వాకింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో వెనుకనుంచి వచ్చిన లారీ అతనిని బలంగా ఢీకొనడంతో ఫ్లైఓవర్ పై నుండి క్రిందపడి కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఏపీ స్పెషల్ బెటాలియన్‌లో పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది. -
5 కోట్ల కారు నుజ్జు నుజ్జు
-
’నా భర్తను ఒక్కసారి తీసుకురండి’
కడప అర్బన్: కుటుంబంతో సంతోషంగా గడపాలన్న కలలు... పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి స్థాయికి తీసుకెళ్లాలన్న ఆశలు...ఎన్నో ఏళ్ల కష్టానికి గుర్తింపుగా వచ్చిన విదేశీ పర్యటన... కానీ ఆ యాత్రే ఆయన జీవితానికి చివరి ప్రయాణంగా మారింది. కడపలోని అరవింద్ నగర్‌కు చెందిన ప్రముఖ మొబైల్ వ్యాపారి, లావా కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ముడియం శ్రీధర్ వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో మృతి చెందాడు. అతని కుటుంబం, బంధువులు, వ్యాపార వర్గాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. గత 20 ఏళ్లుగా లావా మొబైల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్న శ్రీధర్, కంపెనీ నిర్దేశించిన వ్యాపార లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశారు. దీనికి గుర్తింపుగా ‘లావా’సెల్‌ఫోన్ కంపెనీ తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వంద మందికి పైగా డిస్ట్రిబ్యూటర్ కు వియత్నాం పర్యటనను బహుమతిగా ఇచ్చి తీసుకుని వెళ్లారు. అక్కడి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హలాంగ్ బేలో శనివారం మధ్యాహ్నం పర్యాటకులను రెండు బోట్లలో సముద్ర విహారానికి తీసుకెళ్లారు. ఒక్కో బోటులో సుమారు 30 మంది ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా సముద్రంలో అలలు ఉధృతంగా ఎగసిపడటంతో శ్రీధర్ ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర విషాదంలో భార్య, కుటుంబసభ్యులు శ్రీధర్‌కు భార్య ధనలక్ష్మి, కుమారుడు సత్య కౌశిక్, కుమార్తె కిరణ్మయి ఉన్నారు. సత్య కౌశిక్ బెంగళూరులో బీటెక్ రెండో సంవత్సరం, కిరణ్మయి కోయంబత్తూరులో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం రేయింబవళ్లు శ్రమించిన తండ్రి ఇక లేడనే వార్త వారిని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ’నక్షత్ర మొబైల్’యజమాని ఇక లేరు... కడప పాత బస్టాండ్ సమీపంలో ’నక్షత్ర మొబైల్ షాప్’నిర్వహిస్తున్న శ్రీధర్ వ్యాపారంలో నిజాయితీ, సౌమ్య స్వభావంతో ఎంతోమందికి సన్నిహితుడిగా పేరొందారు. ఆయన మృతి వార్త తెలిసి వ్యాపార వర్గాలు, స్నేహితులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ’నా భర్తను ఒక్కసారి తీసుకురండి’ విదేశీ పర్యటనకు ఆనందంగా వెళ్లిన భర్త ఇక శవంగా వస్తున్నాడనే వార్తను జీర్ణించుకోలేక ధనలక్ష్మి కన్నీటిపర్యంతమయ్యారు. తన భర్త మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలమైన కడపకు తరలించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శ్రీధర్ కుటుంబాన్ని పరామర్శించిన ఆర్డీవో..! వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో కడపకు చెందిన ముడియం శ్రీధర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాల మేరకు కడప ఆర్డీవో మురళి శనివారం సాయంత్రం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటన పట్ల జిల్లా యంత్రాంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోందని ఆర్డీవో తెలిపారు. శ్రీధర్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను సమీక్షిస్తున్నామన్నారు. శ్రీధర్ వాణిజ్య భాగస్వామ్య కంపెనీ యాజమాన్య ప్రతినిధితో కూడా మాట్లాడి సమన్వయం చేస్తున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి, న్యాయం జరిగేలా కృషిచేస్తామని తెలుపుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఫిల్మ్‌నగర్‌లో కలకలం.. నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు!
ఫిల్మ్‌నగర్‌లో ఓ కారు ప్రమాదం కలకలం రేపింది. అదుపుతప్పి వాహనం నటుడు ధర్మ మహేష్ ఇంట్లోకి దూసుకెళ్లడం ఘటన చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో.. అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ఫిల్మ్‌నగర్ పరిధిలో నటుడు ధర్మ మహేష్ నివాసం ఉంది. అయితే గత అర్ధరాత్రి దాటాక ఓ కారు అదుపుతప్పి ఆ ఇంటి ప్రాంగణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గేటు, ప్రహారీ గోడ ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం తప్పింది. కారు వేగం ఎక్కువగా ఉండటంతో నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది.మద్యం మత్తులోనా?..ప్రమాద సమయంలో కారులో కొందరు యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. కారు నడిపిన తీరు అనుమానాస్పదంగా ఉందని పేర్కొంటూ ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు నటుడి కుటుంబం సమాచారం అందించింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం వాళ్లను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.ప్రమాదంపై పోలీసుల దర్యాప్తుప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు వేగం, డ్రైవర్ పరిస్థితి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడిపారా? అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, చట్టపరమైన చర్యలపై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ధర్మ మహేష్ (కాకాని ధర్మ) తెలుగు సినీ నటుడు. అసలు పేరు కాకాని ధర్మ సత్య సాయి శ్రీనివాస మహేష్. విజయవాడకు చెందిన మహేష్.. ఇంజినీరింగ్ (బీటెక్) పూర్తి చేసిన తర్వాత నటనపై ఆసక్తితో విశాఖపట్నంలోని సత్యానంద్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత ‘సింధూరం’ (2023), ‘డ్రింకర్ సాయి’ (2024)చిత్రాల్లో నటించాడు. ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు. ఆ మధ్య వ్యక్తిగత వివాదాలతోనూ ధర్మ మహేష్ వార్తల్లోకి ఎక్కాడు. -
ఫౌజీ షూటింగ్లో నటుడికి ప్రమాదం.. పీఏ క్లారిటీ..!
ప్రభాస్ హీరోగా వస్తోన్న పీరియాడిల్ యాక్షన్ లవ్‌స్టోరీ ఫౌజీ. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఈ కథలో బ్రిటిష్ సోల్జర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారని తెలిసింది. ఈ మూవీలో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ కూడా చేస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రభాస్ షూటింగ్లో ప్రముఖ నటుడు రాజేశ్ శర్మకు విషపురుగు కాటేసిందని ప్రచారం జరుగుతోంది. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారని టాక్ వినిపించింది. ఈ వార్తలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫౌజీ నటుడు రాజేశ్ శర్మ పీఎ స్పందించారు. ఈ వార్తలన్నీ అవాస్తమని ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. రాజేశ్ శర్మ పీఏ సుభాశిష్ పాండా మాట్లాడుతూ..' రాజేశ్ శర్మకి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు. ఆయనను ఎలాంటి విషపురుగు కాటేయలేదు. కేవలం ఆయనకు ఉన్న షుగర్ వల్ల కాలు కొద్దిగా వాచింది. అందుకే హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ కూడా అవుతారు. రాజేష్ శర్మకి షూటింగ్ చేస్తుండగా ఏదో అయ్యిందంటూ సోషల్ మీడియాలో, కొన్ని మీడియా ఛానల్స్‌లో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. రాజేష్ శర్మ ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు నేను ఉంటా. కేవలం కొందరు తమ స్వార్థం కోసం ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు' అని అన్నారు. దయచేసి నిజా నిజాలు తెలుసుకోకుండా అసత్య వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేయవద్దని కోరిన పీఏ సుభాశిష్ పాండా కోరారు. Rajesh Sharma Asst saying all social media is fake and that he got admitted due to Diabetes and doctors have said he will be discharged tomorrow#fauji#rakeshsharma#prabhas#prabhasfans #actorrakeshsharma#actorrajeshsharmahealthupdate pic.twitter.com/cmFWtG8Dh7— SATISH @ SAKSHI (@SatishKottangi) July 8, 2026 -
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం
-
షూటింగ్స్ అంటే ప్రాణాలతో చెలగాటమేనా?
వెండితెరపై మనల్ని అలరించేందుకు నటీనటులు చేసే సీన్స్ కొన్నిసార్లు వారి ప్రాణాలకే ముప్పుగా మారుతుంటాయి. సినిమా షూటింగుల్లో డూప్ లేకుండా స్టంట్లు చేయడం, ప్రమాదకరమైన సన్నివేశాల్లో పాల్గొనడం బాలీవుడ్ అగ్ర తారలను చావు అంచుల్లోకి నెట్టేసింది. ‘జాగృతి’, ‘పత్తర్ కే ఫూల్’ తదితర చిత్రాల సమయంలో తాను దాదాపు మరణానికి దగ్గరగా వెళ్లానని ఆమధ్య సల్మాన్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. అయితే కేవలం సల్మాన్ మాత్రమే కాదు.. బాలీవుడ్‌కు చెందిన మరికొందరు స్టార్ హీరో హీరోయిన్లు కూడా షూటింగ్ సెట్స్‌లో ప్రమాదాల నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.రైలు ప్రమాదం నుంచి బయటపడ్డ సల్మాన్ ఖాన్‘తేరే నామ్’ చిత్ర షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్‌కు ఒక పెద్ద ప్రమాదం ఎదురైంది. ఒక సన్నివేశం కోసం ఆయన రైలు పట్టాలపై, రైలుకు ముందు నడుస్తూ వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో సల్మాన్ అదుపు తప్పి కింద పడిపోయారు. రైలు ఆయనకు అత్యంత సమీపంగా దూసుకువెళ్లింది. తృటిలో ప్రాణాపాయం తప్పిన ఈ భయంకరమైన అనుభవాన్ని సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకుంటూ షాక్‌కు గురిచేశారు.సాహసాల వేళ అక్షయ్ కుమార్‌కు ప్రమాదంబాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ తన సినిమాల్లోని చాలా స్టంట్లను స్వయంగా చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆయన ‘ఖిలాడియోం కా ఖిలాడీ’, 'సూర్యవంశీ' తదితర చిత్రాల షూటింగ్ సమయంలో తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొన్నారు. ఒక స్టంట్ చేస్తున్నప్పుడు ఆయనకు తీవ్రమైన గాయాలై, ప్రాణాపాయ పరిస్థితి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.యాభై అడుగుల ఎత్తు నుండి పడ్డ హృతిక్ రోషన్‘క్రిష్’ సినిమా సెట్స్‌లో స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు ఒక ఘోర ప్రమాదం జరిగింది. కేబుల్ వైర్ సహాయంతో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా, ఒక్కసారిగా ఆ కేబుల్ తెగిపోయింది. దాంతో హృతిక్ దాదాపు 50 అడుగుల ఎత్తు నుండి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ఆ గాయాల నుండి కోలుకోవడానికి ఆయనకు చాలా కాలం పట్టింది.అమితాబ్ బచ్చన్ 'కూలీ' ప్రమాదంబాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ‘కూలీ’ చిత్ర షూటింగ్లో జరిగిన ప్రమాదం గురించి తెలియని వారుండరు. ఒక ఫైట్ సీన్లో పునీత్ ఇస్సార్ అమితాబ్‌పై బలమైన పంచ్ విసిరారు. ఈ దెబ్బకు అమితాబ్ అంతర్గత అవయవాలు దెబ్బతిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరిన ఆయన, ఏకంగా 59 రోజుల పాటు మరణంతో పోరాడి, చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డారు.సైఫ్ అలీ ఖాన్ బైక్ బ్యాలెన్స్ తప్పడంతో..‘క్యా కెహనా’ సినిమా సెట్లో సైఫ్ అలీ ఖాన్ ఒక రోడ్డు ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఒక సీన్ కోసం ఆయన బైక్ నడపాల్సి ఉంది. అయితే షూట్ సమయంలో సైఫ్ బైక్‌పై నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా కిందపడి, పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆయన తలకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గాయాల నుంచి కోలుకోవడానికి ఆయనకు కొన్ని నెలల పాటు చికిత్స అవసరమైంది.జీప్ ప్రమాదంలో గాయపడ్డ ఐశ్వర్యా రాయ్బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కూడా ‘ఖాకీ’ చిత్ర షూటింగ్ సమయంలో చావు అంచుల దాకా వెళ్లొచ్చారు. ఒక సీన్ కోసం ఆమె జీపులో ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆ జీపు డ్రైవర్ ఒక్కసారిగా వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో, ఐశ్వర్య జీపులో నుండి బయటకు పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు.ఇది కూడా చదవండి: హీరోయిన్ అందానికి దాసోహమై.. -
నడి సంద్రంలో చిక్కుకుని..
సాక్షి, విశాఖపట్నం/పూసపాటిరేగ: బతుకుదెరువు కోసం నడి సంద్రంలోకి వెళ్లిన మత్స్యకార కుటుంబాల్లో కల్లోలం నెలకొంది. వాతావరణం ప్రతికూలంగా మారడం, సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో విశాఖ నుంచి చేపల వేటకు బయలుదేరిన రెండు మత్స్యకారుల బోట్లు వేర్వేరు ప్రాంతాల్లో గల్లంతయ్యాయి. వీటిల్లో మొత్తం 16 మంది మత్స్యకారులున్నట్లు గుర్తించారు. ఇందులో ఒక బోటు డ్రైవర్ చైనా కార్గో షిప్ సహాయంతో ప్రమాదం నుంచి బయటపడగా.. ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మరో బోటులో ఉన్న 9 మంది మత్స్యకారులు ప్రమాదపుటంచుల వరకూ వెళ్లి అతికష్టంమ్మీద పూరీ తీరానికి ప్రాణాలతో చేరుకున్నారు. గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మొదటి బోటులో ఏం జరిగిందంటే..!విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఐఎన్డీ ఏపీ అండ్ వీఎస్ అండ్ ఎంఎం అండ్ 83 నంబర్ బోటులో ఏడుగురు మత్స్యకారులు జూలై 1న చేపల వేటకు బయలుదేరారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఈ బోటు ఆచూకీ లేకుండా పోయింది. గల్లంతవడానికి ముందు రాత్రి బోటులో ఉన్నవారు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. ‘గంగవరం దగ్గర్లో ఉన్నాం... గంటలో హార్బర్‌కు చేరుకుంటాం’ అని చెప్పారు. గంట తర్వాత వారి ఫోన్లు కలవకపోవడంతో మత్స్యకార కుటుంబాలు ఆందోళనతో అధికారులకు సమాచారం ఇచ్చాయి. మొదటి బోటు డ్రైవర్, ఓనర్ అయిన కారి‡ చిన్నా.. చైనా కార్గో నౌక సహాయంతో సురక్షితంగా బయటపడ్డాడు. తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య చైనాకు చెందిన పనామా (కార్గో) నౌక ఈ బోటును గుర్తించింది. వాణిజ్య నౌక సిబ్బంది లైఫ్ జాకెట్ వేసి సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం ఆయన కోస్ట్‌గార్డ్ సంరక్షణలో ఉన్నారు. మరో ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ తెలియరాలేదు. గంగవరం నుంచి 10 నాటికల్ మైళ్ల దూరంలోకి ఎలా వెళ్లారన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా ఇంజన్ పనిచేయలేదని.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తుండటం.. యాంకర్ తాడు ఒక్కసారిగా తెగిపోవడంతో బోటు దిశ మారి కొట్టుకుపోయిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది. ఈత కొడుతూ షిప్ వద్దకు వెళ్లేందుకు యత్నించి..డ్రైవర్ చిన్నాను రక్షించిన సమయంలో.. మరో ముగ్గురు మత్స్యకారులు ప్రాణాలు దక్కించుకునేందుకు ఈత కొడుతూ ఆ షిప్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అలసిపోయి సముద్రంలో గల్లంతయ్యారు. మిగిలిన వారు మరో పడవను గానీ తీరాన్ని గానీ చేరుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ వారి ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్.. సమాచారం అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్‌గార్డ్, నేవీ, మెరైన్ పోలీసు బృందాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. నేవీకి చెందిన రెండు నౌకలు, కోస్ట్‌గార్డ్‌కు చెందిన రెండు హెలికాప్టర్లతో పాటు కాకినాడ నుంచి మరో కోస్ట్‌గార్డ్ నౌక ముమ్మరంగా గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. బోటు ప్రయాణించిన దిశ, చివరి సిగ్నల్స్ ఆధారంగా సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. సమీపంలోని అన్ని మర్చంట్ నౌకలను కూడా రెస్క్యూ బృందాలు అప్రమత్తం చేశాయి.పరామర్శించిన వైఎస్సార్సీపీ నాయకులుగల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విశాఖ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ ఆదివారం సాయంత్రం పరామర్శించారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా ప్రభుత్వం తగిన చొరవ చూపకపోవడం విచారకరమని కేకే రాజు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యుద్ధప్రాతిపదికన గల్లంతైన వారిని గుర్తించాలని, బాధిత కుటుంబాలకు పూర్తి భరోసాతో పాటు మునిగిపోయిన బోటుకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులు గల్లంతు కావడంపై ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. గల్లంతైన వారిని సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణపై మత్స్యకార కుటుంబాల మండిపాటుమత్స్యకారులను కాపాడాలని రాత్రి పూట బాధిత కుటుంబాలు సమాచారం అందించినా ప్రభుత్వం సరిగా స్పందించలేదని మండిపడుతున్నారు. ఉదయం తర్వాత తాపీగా రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరామర్శకు వచ్చిన జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణను మత్స్యకార కుటుంబాలు నిలదీశాయి. మత్స్యకారులు ప్రమాదకర పరిíస్థితుల్లో ఉంటే ఫోన్లలో కాలక్షేపం చేయడం ఏమిటని మండిపడ్డాయి. విశాఖ ఎంపీ భరత్ మత్స్యకారుల గురించి కనీసం ఆరా తీయలేదు. ఇతర టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు అటువైపు కన్నెత్తి చూడలేదు.అచ్చెన్నా..! నిస్సిగ్గుగా అబద్ధాలా!గల్లంతైన మత్స్యకారుల్లో ఒకరిని ప్రభుత్వం రక్షించిందంటూ మంత్రి అచ్చెన్న ప్రెస్‌నోట్ విడుదల చేయటంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సురక్షితంగా బయటపడిన డ్రైవర్ చిన్నా.. సమీపంలో కనిపించిన చైనాకి చెందిన ఎంవీ యూనివర్స్ వెల్దీ అనే షిప్ వద్దకు ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నానని స్పష్టంగా చెప్పాడు. మంత్రి అచ్చెన్న మాత్రం ప్రభుత్వం కాపాడిందంటూ ప్రకటించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇక పూరీలో గల్లంతైన మెకనైజ్డ్ బోటు గాలుల తీవ్రతకు అతికష్టమ్మీద ఒడ్డుకు వచ్చింది. సమీపంలో ఉన్న ఒడిశాకు చెందిన మెరైన్ పోలీసులు అప్రమత్తమై అందులో ఉన్నవారిని కాపాడారు. వీరిని కూడా తామే రక్షించామంటూ అచ్చెన్న ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పూరీ తీరంలో మరో పడవజూన్ 30న విశాఖ నుంచి చేపల వేటకు వెళ్లిన మరో బోటు పూరీ (ఒడిశా) తీరంలో ప్రమాదానికి గురైంది. ఇందులో మొత్తం 9 మంది మత్స్యకారులు ఉండగా ఎట్టకేలకు అంతా సురక్షితంగా ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. పడవ ఇంజన్ దెబ్బతినడం, యాంకర్ తాడు అకస్మాత్తుగా తెగిపోవడంతో బోటు నియంత్రణ కోల్పోయి వేగంగా ఒడ్డు వైపు కొట్టుకొచ్చింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న జాలర్లు తమను కాపాడాలంటూ వీడియో రూపంలో అధికారులకు సమాచారం అందించారు. వేగంగా కొట్టుకొస్తున్న బోటులో ఉన్న 9 మంది మత్స్యకారులు ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అదృష్టవశాత్తూ బోటు సురక్షితంగా ఆదివారం రాత్రి పూరీ తీరానికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కళ్లెదుటే నా వాళ్లందరినీ కోల్పోయా...!‘వేట ముగించుకుని వలలు కడిగేసి తిరిగి వస్తుండగా ఒడ్డుకు సుమారు 10 మైళ్ల దూరంలో ఊహించని విధంగా మా బోటు ఒక్కసారిగా తిరగబడిపోయింది. బోటులో ఉన్న ఏడుగురిలో ఒకరు లోపలే చిక్కుకుపోగా మిగిలిన ఆరుగురు నీళ్లలో దొరికిన ఆధారాలను పట్టుకుని రాత్రి 9 గంటల వరకు ప్రాణాలతో పోరాడాం. ఆ తర్వాత బోటు పూర్తిగా మునిగిపోయింది. తీవ్ర అలసటతో రాత్రి 11 గంటల సమయంలో ఒకరు కళ్లెదుటే ప్రాణాలు వదలడంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయాం. తెల్లారేసరికి ఐదుగురం మిగిలాం. ఆ సమయంలో దూరంగా ఒక షిప్ కనిపించింది. కండరాలు పట్టేయడంతో మా పెద్దన్న ఇక ఈదలేనని అక్కడే ఉండిపోగా... ప్రాణాలు దక్కించుకోవచ్చన్న ఆశతో మిగిలిన నలుగురం ఆ ఓడ వైపు ఈదుకుంటూ వెళ్లాం. నేను ముందుగా వెళ్లి ఆ ఓడ యాంకర్ని గట్టిగా పట్టుకున్నా. కానీ అది గాలిలో వేలాడుతుండటంతో చేజారి మళ్లీ నీళ్లలో పడిపోయా. ప్రాణభయంతో గట్టిగా కేకలు వేయడంతో ఓడలోని సిబ్బంది లైఫ్ జాకెట్ విసిరి తాడు సాయంతో నన్ను పైకి లాగి కాపాడారు. కానీ నాతో పాటు ఈదుకుంటూ వచ్చిన మిగిలిన ముగ్గురి పరిస్థితి ఏమైందో తెలియదు. నాతోపాటు వేటకు వచ్చిన వాళ్లంతా నా సొంత అన్నలు, వాళ్ల పిల్లలు, దగ్గరి బంధువులే. నా కళ్లెదుటే నా వాళ్లందరినీ కోల్పోయా. నా జీవితం ఇలా ఒంటరిగా మిగిలింది. – కారి చిన్నా, బోటు ఓనర్, డ్రైవర్మత్స్యకారుల గల్లంతుపై వైఎస్ జగన్ ఆందోళనగాలింపు చర్యలు ముమ్మరం చేయాలిబాధిత కుటుంబాలకు ప్రభుత్వం ధైర్యం చెప్పాలిసాక్షి, అమరావతి: విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారులు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు సాంకేతిక కారణాలతో తిరిగి రాకపోవడం, వారితో సంబంధాలు తెగిపోవడం బాధాకరమన్నారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున ప్రభుత్వం మరింత వేగంగా స్పందించి గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టాలని కోరారు.కోస్టుగార్డు, నేవీ, మెరైన్ పోలీసు విభాగాల సమన్వయంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. అవసరమైతే అదనపు నౌకలు, హెలికాప్టర్లు వినియోగించి మత్స్యకారులను గుర్తించి రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ధైర్యం చెప్పాలని, వారికి ఎప్పటికప్పుడు గాలింపు చర్యల వివరాలు తెలియజేయాలని సూచించారు. ఈ కష్ట సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ తెలిపారు. బాధిత మత్స్యకారుల కుటుంబాలను విశాఖ ప్రాంత వైఎస్సార్సీపీ నాయకులు సంప్రదించి అవసరమైన సహాయం అందించాలని, అధికారులతో సమన్వయం చేస్తూ గాలింపు చర్యల పురోగతిని తెలుసుకోవాలని నిర్దేశించారు. గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
మేడారంలో విషాదం.. కారు ఢీకొని బాలుడి మృతి
హైదరాబాద్: వరంగల్ ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి కుటుంబంతో వచ్చిన ఓ బాలుడిని ప్రమాదవశాత్తు కారు ఢీకొనడంతో మృతి చెందాడు. నార్లాపూర్ ఎస్ఐ అచ్చ కమలాకర్ తెలిపిన మేరకు.. అమీర్‌పేటకు చెందిన అలిమేకల పురుషోత్తం కుటుంబంతో కలిసి శుక్రవారం మేడారానికి వెళ్లి ఎంఎస్ఆర్ గదిలో దిగారు.చేవెళ్ల మండలం ఏలూరు గ్రామానికి చెందిన అరకటిక అరుణ్ కుటుంబం కూడా పక్కగదిలో దిగింది. ఈ క్రమంలో అరుణ్ నాలుగేళ్ల కుమారుడు తండ్రి వద్ద ఉన్న కారు తాళాలు తీసుకుని కారు స్టార్ట్ చేయడంతో ముందుకు కదిలింది. ఆ సమయంలో గది ముందు ఆడుకుంటున్న కౌశిక్ (7)పైకి కారు దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం కంటతడి పెట్టించింది. మరోవైపు, ప్రమాదానికి కారణమైన చిన్నారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మృతుడి తండ్రి పురుషోత్తం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు. -
బాత్రూంలో జారి పడ్డా.. 48 కుట్లు పడ్డాయి : అఖిల్ అక్కినేని
‘ఏజెంట్’ సినిమా తర్వాత అఖిల్ అక్కినేని మూడేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘లెనిన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే అంత గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తాజాగా ఆయన వివరించారు. లెనిల్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఏజెంట్ తర్వాత వరసగా సినిమాలు చేయాల్సింది. కానీ ఆ సినిమా విడుదలైన మూడు నెలలకు ప్రమాదవశాత్తు బాత్రూంలో పడ్డాను. నా చేతికి గాజు ముక్కలు బలంగా గుచ్చుకున్నాయి. దీంతో ఎడమ చేతి వేళ్లకు రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. మొత్తం 48 కుట్లు పడ్డాయి. 16 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మూడేళ్ల గ్యాప్ వచ్చింది’ అని అఖిల్ వివరణ ఇచ్చాడు. ఇనేళ్లు గ్యాప్ ఇచ్చినందుకు తన అభిమానులు కోపంగా ఉన్నారని.. మరోసారి అలా జరగదని వాళ్లకు నేను హామీ ఇస్తున్నాను అని అఖిల్ అన్నారు. లెనిన్ విషయానికొస్తే.. మురళీ కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు. జులై 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
స్కూల్ బస్సుపై పడ్డ చెట్టు.. ఓ విద్యార్థి మృతి, 10 మందికి గాయాలు
ముంబైలోని ఓ పాఠశాల బస్సుపై చెట్టు విరిగిపడింది. దీంతో బస్సులోని ఓ విద్యార్థి మృతి చెందగా, మరో 10 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా ముంబైలో భారీ వర్షాలు వస్తున్నాయి. అందుకే చెట్టు కూలినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం చెంబూర్‌లోని రోడ్ నం.11లో జరిగింది. ఆ సమయంలో ఆ స్కూల్ వ్యాన్‌లో మొత్తం 13 మంది చిన్నారులు ఉన్నారు. గాయపడిన విద్యార్థుల్లో కొందరిని జైన్ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో చిక్కుకుపోయిన ఒక చిన్నారిని బయటకు తీసేందుకు అత్యవసర సహాయ బృందాలు కూలిపోయిన చెట్టును కోస్తున్నాయి.ఆ ప్రాంత ప్రజలు, చెట్ల కొమ్మలను కత్తిరించాలని లేదా తొలగించాలని కోరుతూ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు పలుసార్లు లేఖలు రాశామని చెప్పారు. ఇంతకుముందు కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటన జరిగిందని తెలిపారు. పలుసార్లు హెచ్చరించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు.ఇదిలా ఉండగా, ముంబై నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. -
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో వణికిన ప్రాంతం!
-
ఒక్క క్షణం.. ఒక మలుపు.. నలుగురి ప్రాణాలు బలి
-
మలుపు మిస్సైంది.. కళ్లు మూసి తెరిచేలోపే!
గమ్యం చేరాల్సిన కారు... క్షణాల్లో మృత్యువుకు చిరునామాగా మారింది. హైవేపై జరిగిన ఒక్క చిన్న పొరపాటు.. వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన మరో బండి.. వెరసి ఒకే కుటుంబాన్ని విషాదంలో ముంచేశాయి. కళ్లుమూసి తెరిచేలోపే నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ భయానక ప్రమాదం సీసీటీవీలో రికార్డవడంతో ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్ వద్ద జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. హైవేపై మలుపు మిస్సవడంతో కారును రివర్స్ తీస్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో ఎస్యూవీ ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. सहारनपुर में दिल्ली-देहरादून इकोनॉमिक कॉरिडोर पर रामपुर मनिहारान थाना क्षेत्र के गांव हलगोया कट के पास हुए भीषण सड़क हादसे का सीसीटीवी वीडियो..इस दर्दनाक हादसे में हरियाणा के बहादुरगढ़ से हरिद्वार गंगा स्नान और दर्शन के लिए जा रहे एक ही परिवार के चार लोगों की मौत हो गई थी, जबकि… pic.twitter.com/2kSbiJyKH5— Kishor Joshi (@KishorJoshi02) June 28, 2026హర్యానాలోని సోనీపట్ జిల్లా బహదూర్‌గఢ్‌కు చెందిన చరణ్‌సింగ్, ఆయన కుటుంబ సభ్యులు హరిద్వార్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యంలో మలుపు దాటిపోవడంతో వారి టాటా టియాగో కారును హైవేపైనే రివర్స్ తీసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బొలెరో ఎస్యూవీ కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు రోడ్డుపై ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొని మరోవైపు ఎగిరిపడింది. ఎస్యూవీ కూడా అదుపుతప్పి బోల్తా పడింది. శుక్రవారం డెహ్రాడూన్–పంచకులా హైవేపై రాంపూర్ మనిహరన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ భయానక ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.ప్రమాదంలో చరణ్‌సింగ్, ఆయన భార్య సుదేశ్, కోడలు ప్రీతి, మనవడు శివాంశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో పాటు హైవేపై రివర్స్ తీసేందుకు చేసిన ప్రయత్నమే ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది. -
అప్పుడు అన్న... ఇప్పుడు తమ్ముడు.. అదే ప్రమాదం!
నిజామాబాద్ భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గ్రామానికి చెందిన కాసాల రమేశ్ గౌడ్ (50) గ్రామంలో ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం మెదక్ జిల్లా రామాయంపేటకు వెళ్లి అక్కడ పనులు ముగించుకొని తిరిగి బస్వాపూర్ వచ్చేందుకు ఆటో ఎక్కాడు.బస్వాపూర్ శివారులోని జాతీయ రహదారిపై వస్తుండగా ముందు వెళ్తున్న లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపటంతో వెనుక వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న రమేశ్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ప్రయాణికులు లక్ష్మి, శ్వేతలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మృతుడికి భార్య స్వప్న, కుమారుడు ధనుష్, కుమార్తె విదూష ఉన్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై వివరించారు. ప్రమాదం జరిగిన వెంటే లారీ డ్రైవర్ పరారయ్యాడని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.15 ఏళ్ల క్రితం అన్న..గురువారం మృతి చెందిన రమేశ్ గౌడ్ అన్న కూడా గతంలో ఆటో ప్రమాదంలోనే మృతి చెందారు. దాదాపు 15 ఏళ్ల క్రితం బస్వాపూర్ గ్రామానికి చెందిన కాసాల శ్రీనివాస్ గౌడ్, పొందుర్తి శివారులోని జాతీయ రహదారిపై జరిగిన ఆటో ప్రమాదంలో మృతి చెందాడు. ప్రస్తుతం ఆయన సోదరుడు రమేశ్ గౌడ్ కూడా ఆటో ప్రమాదంలో మృతి చెందడం గ్రామస్తులు, బంధువులను తీవ్రంగా కలిచివేసింది. -
పేలిన ముందు టైర్..దగ్ధమైన కారు
-
అనకాపల్లి పరవాడ ఫార్మా సిటీలో ఘోర ప్రమాదం
సాక్షి, అనకాపల్లి: పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ్ ఎనర్జీ పరిశ్రమలో ఈ వేకువ జామున భారీ పేలుడు సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో ఇద్దరు కార్మికులు సజీవ దహనం అయ్యారు. మంటల్లో చిక్కుకున్న మరికొందరిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలువురికి తీవ్రగాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.మృతి చెందినవాళ్లను.. వెంకటేశ్, త్రినాథ్‌లుగా గుర్తించారు. ఈ ఇద్దరూ అచ్యుతాపురం వాసులుగా తెలుస్తోంది. . ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న కార్మికులు తీవ్రంగా గాయపడగా, సహచరులు, అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. రెండు ఫైరింజన్లను మంటల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మంట్లలో మరికొందరు చిక్కుకుని ఉంటారని భావించి.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా? లేదంటే సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. -
లక్ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్ సీసీటీవీ విజువల్స్
కేరళలోని తిరువనంతపురంలోని కిలిమనూర్ వద్ద MC రోడ్డు వద్ద క్షణాల్లో మృత్యుముఖం నుంచి తప్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చిన ఒక ట్రైలర్ ట్రక్బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ తల్లీబిడ్డల తోపాటు, తండ్రి కూడా ఆ భయంకరమైన ప్రమాదం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారురోడ్డు పక్కన నిలిపిన కారు నుండి ఓ మహిళ తన బిడ్డతో దిగిన మరుక్షణమే, వెనుక నుండి వచ్చిన ట్రక్కు ఆ కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు తునాతునాకలైపోయింది. కానీ కారులో ఉన్న వారిద్దరికీ ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు. ఈ భయంకరమైన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.जाको राखे साइयाँ मार सके ना कोईA mother and child had a miraculous narrow escape📍KERALA pic.twitter.com/gYmHVUg1zx— Karan Singh / करन सिंह (@Journo_Karan) June 22, 2026 నిజంగా లక్ అంటే వీరిదే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు గాను ట్రక్ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇదీ చదవండి: ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్‌లో బికినీ కాక..? -
భార్య పరిహారం తీసుకొని వెళ్లిపోయింది.. జవాన్ తండ్రి ఆవేదన
దిస్పూర్: ఇటీవల అస్సాంలో జరిగిన విమాన ప్రమాదంలో లెఫ్టినెంట్ శుభమ్ కుమార్ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణాంతరం అందించిన పరిహారం విషయంలో ఇప్పుడు తీవ్ర వివాదం చెలరేగుతుంది. ఎక్స్‌గ్రేషియాకు సంబంధించిన రూ.21 లక్షల చెక్కును తమకు తెలియకుండా తన భార్య అనే చెప్పబడే మహిళకు ఇచ్చారని ఆమె కనీసం తన కర్మకాండలకు కూడా ఉండకుండా వెళ్లిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.అసోంలోని జోర్హాట్ సమీపంలో జరిగిన భారత వైమానిక దళ (IAF) విమాన ప్రమాదంలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో బీహార్‌లోని జహానాబాద్ జిల్లాకు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభమ్ కుమార్ ఒకరు. బీహార్ ప్రభుత్వం అమర జవాను కుటుంబానికి రూ. 21 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందించింది. ఈ చెక్కును అధికారులు శుభమ్ కుమార్ భార్య అయిన శ్రేయా రాయ్‌కి అందజేశారు. అయితే శుభమ్ కుమార్‌కు పెళ్లి అయిన విషయమే తమకు తెలియదని అతని తల్లిదండ్రులు చెప్పడంతో ఈ వివాదం మొదలైంది.అయితే తన కొడుకుకు పెళ్లైన సంగతే తనకు తెలియదని నవంబర్ నెలలో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేయడానికి ఇంట్లో ఏర్పాట్లుజరుగుతున్నాయని ఆయన తెలిపారు. అయితే శ్రేయాతో శుభమ్ కుమార్ అంతకుముందే రహస్యంగా కోర్టు వివాహం చేసుకున్నాడని అధికారులు తెలిపారని ఆ విషయంతో వారు చెప్పే వరకూ తనకు తెలియదన్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులు ఆ చెక్కును ఆమెకు ఎలా ఇచ్చేస్తారని ఆయన ప్రశ్నించారు. కొడుకు చనిపోయిన తర్వాత శ్రేయా రాయ్ తమ ఇంటికి వచ్చిందని అయితే కర్మకాండలు పూర్తి కాకముందే ఆమె అధికారులతో మాట్లాడి రూ. 21 లక్షల చెక్కును తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయిందని శుభమ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.పరిహారం తీసుకున్నప్పుడు బాధ్యతలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా తనపైనే ఉంటుంది కదా అని ఆయన ప్రశ్నించారు. తమ కుటుంబం అంతా కొడుకు సంపాదన పైనే ఆధారపడి బతుకుతోందని, ఇప్పుడు తమను రోడ్డున పడేశారని వాపోయారు. అయితే వైమానిక దళ నిబంధనల నిబంధనల ప్రకారం అమర జవాన్ల భార్యలకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, ప్రభుత్వం ఆ చెక్కును ఆమెకు అందజేసిందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో పెద్ద చర్చకు దారి తీసింది. చట్టపరమైన హక్కులు ఒకవైపు ఉంటే, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత సైతం మరొకవైపు ఉంటుందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. -
New York: భారతీయుడి ప్రాణాలు తీసిన గుర్రపు బగ్గీ
న్యూయార్క్: భారత్ నుంచి మొదటిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లిన ఒక కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ సెంట్రల్ పార్క్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన గుర్రపు బగ్గీ ప్రమాదంలో 18 ఏళ్ల భారతీయ యువకుడు రోమంచ్ మహాజన్ దుర్మరణం పాలయ్యాడు. డ్రైవర్ అజాగ్రత్త, అదుపుతప్పిన గుర్రం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఫొటో కోసం ఆగిన వేళ.. ఊహించని ప్రమాదంన్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. దీపక్ మహాజన్ తన భార్య ప్రియ, కుమారుడు రోమంచ్, కుటుంబంలోని మరో సభ్యుడితో కలిసి సెంట్రల్ పార్క్‌లో గుర్రపు బగ్గీ షికారుకు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో, వారి కుటుంబీకులకు ఒక ఫొటో తీసేందుకు బగ్గీ డ్రైవర్ కిందికి దిగాడు. నిబంధనల ప్రకారం డ్రైవర్ అలా దిగకూడదు. అదే సమయంలో ఆ గుర్రం అకస్మాత్తుగా బెదిరి, డ్రైవర్ నియంత్రణలో లేకపోవడంతో వేగంగా పరుగెత్తడం ప్రారంభించింది. బగ్గీ అదుపుతప్పి వేగంగా దూసుకుపోవడంతో లోపల ఉన్న కుటుంబ సభ్యులు ప్రాణభయంతో కేకలు వేశారు. Here’s a video of the horse breaking free and the carriage driver chasing after it.A person comes jumping/falling out of the carriage at the end of the clip. pic.twitter.com/BZmEOXqhxC— Gus Saltonstall (@GusSaltonstall) June 17, 2026 తల్లిని రక్షించే క్రమంలో అనంత లోకాలకుగుర్రం వేగంగా పరుగెడుతున్న క్రమంలో బగ్గీ మరో వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రోమంచ్ తల్లి ప్రియ మొదట బగ్గీ నుంచి కిందపడిపోయారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో 18 ఏళ్ల రోమంచ్ కూడా వేగంగా వెళ్తున్న బగ్గీ నుంచి కిందికి దూకాడు. దురదృష్టవశాత్తూ అతను కింద పడేటప్పుడు తల భూమికి బలంగా తగలడంతో తీవ్ర గాయాలపాలై స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ రోమంచ్ మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ హృదయవిదారక సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.నిషేధానికి పెరుగుతున్న డిమాండ్ఈ ఘోర ప్రమాదం న్యూయార్క్ నగరంలో గుర్రపు బగ్గీల భద్రతపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. న్యూయార్క్ స్టేట్ సెనేటర్ ఎరిక్ బాట్చర్ బాధిత కుటుంబానికి సంతాపం ప్రకటిస్తూ, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ఇలాంటి గుర్రపు బగ్గీలు ఉండటం సురక్షితం కాదని అన్నారు. ఈ సంస్కృతిని ముగించేందుకు తక్షణమే ‘రైడర్స్ లా’ బిల్లును ఆమోదించి, నగరంలో గుర్రపు బగ్గీలను పూర్తిగా నిషేధించాలని ఆయన న్యూయార్క్ సిటీ కౌన్సిల్‌ను డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: చాట్‌జీపీటీ గురువు కాదు.. కాలేజీకి డుమ్మా కుదరదు! -
LIVE VISUALS: కుప్పకూలిన బాంబర్ విమానం క్షణాల్లో బూడిద
-
వాట్సాప్ స్టేటస్ విప్పిన గుట్టు!
ఒకరికొకరు జీవితాంతం తోడుంటామని ప్రమాణాలు చేసుకున్నారు. కానీ ఆ బంధం చివరికి ఓ ఊహించని క్రైమ్ కథగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. చిన్న రోడ్డు ప్రమాదం.. ఆసుపత్రిలో చికిత్స.. ఆ తర్వాత ఒక్కసారిగా భర్త గుండెపోటుతో మృతి చెందాడు. కన్నీళ్లతో కుప్పకూలిన ఆమె… ఆ క్షణం అది ముగింపు అనుకుంది. కానీ అదే ముగింపు కాదు. అసలు కథ మొదలు.ఈ కేసులో మలుపు తిప్పింది ఒక వాట్సాప్ స్టేటస్. సాధారణంగా కనిపించిన ఆ ఒక్క మెసేజ్ పోలీసుల అనుమానాన్ని రేకెత్తించింది. అదే ఆధారంగా సాగిన దర్యాప్తు… చివరికి ఇది ప్రమాదం కాదు పక్కా ప్లాన్‌తో చేసిన హత్యగా అని బయటపెట్టింది. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో మాజీ ఆర్మీ జవాన్ శాండీప్ మంజర్గి మృతి కేసు.. సంచలన మలుపు తీసుకుంది. ప్రియుడితో కలిసి భార్యే ఆయన్ని.. అదీ ఆస్పత్రిలోనే హతమార్చినట్లు నిర్ధారణ అయ్యింది. మొదట ఇది గుండెపోటు వల్ల జరిగిన సహజ మరణమని వైద్య నివేదికలు పేర్కొన్నప్పటికీ.. తర్వాతి దర్యాప్తులో ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా పోలీసులు తెలుసుకుని కంగుతిన్నారు. ఈ కేసులో అతని భార్య సుమ మంజర్గి, ఆమె ప్రేమికుడు పుండలిక్ దొంబార్ సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఆస్పత్రి సిబ్బంది కూడా ఉండడం గమనార్హం.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 13న శాండీప్ రోడ్డు మీద యాక్సిడెంట్ కావడంతో స్వల్పంగా గాయపడ్డాడు. మొదట ఆయన్ని హుక్కేరి ప్రభుత్వ ఆసుపత్రిలో, తరువాత జీ.జె. ఆసుపత్రికి తరలించారు. చిన్న గాయమే కావడంతో ఒకట్రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జి అవుతారని కుటుంబ సభ్యులు భావించారు. అయితే రెండ్రోజుల తర్వాత.. హఠాత్తుగా ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో భార్య సుమ గుండెలు పగిలేలా రోదించడం అక్కడున్నవాళ్లను కంటతడి పెట్టించింది. అయితే.. శవ పరీక్షలో అతని శరీరంలో తీవ్రమైన గాయాలు లేకపోవడం.. అప్పటిదాకా సాధారణంగా ఉన్న ఆరోగ్యం హఠాత్తుగా విషమించడంతో వైద్యులు పోలీసుల వద్ద అనుమానాలను వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో.. సుమ మంజర్గి స్నేహితుడిగా చెలామణి అవుతున్న పుండలిక్ దొంబార్ తీరుపై పోలీసులకు అనుమానం మొదలైంది. ఫోన్ కాల్ డాటా ఆధారంగా.. ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకుంటున్నారని గుర్తించారు. అలాగే ‘‘యాక్సిడెంట్ తర్వాత ఇలా ఎలా జరుగుతుంది?’’ అంటూ అతను పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఆ అనుమానాల్ని మరింత బలపరిచింది. వైద్యులు ఏం చెప్పారో తెలియకుండానే.. అతను శాండీప్ మరణంపై అలా ఎలా పూర్తి వివరాలను తెలుసుకోగలిగాడు అని ఆశ్చర్యపోయారు. విచారణకు పిలిచారు. ఈ క్రమంలో తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం ఒప్పుకున్నాడు. సుమ, పుండలిక్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే శాండీప్‌ను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఈ యాక్సిడెంట్‌ను అవకాశంగా మల్చుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే అతడికి సెలైన్ బాటిల్ ద్వారా విషం ఇచ్చారు. తీసుకునే జ్యూస్‌లో నిద్ర మాత్రలు కలిపారు. అలా నిద్రలోనే శాండీప్ కన్నుమూశాడు. ఆ తర్వాత.. మరణాన్ని సహజ గుండెపోటుగా చూపించేందుకు వైద్య రికార్డులు, ఫోరెన్సిక్ రిపోర్టులు డబ్బు ఎర వేసి మార్చేశారు. దర్యాప్తులో బయటపడ్డ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. శాండీప్ పేరు మీద రూ.2 కోట్ల ఇన్సూరెన్స్‌లు ఉండడం, ఆయన చనిపోయాక వాటిని త్వరగా క్లెయిమ్ చేసుకోవాలని సుమ చేసిన ప్రయత్నాలు. ఇక హత్య కుట్రలో ఆసుపత్రి సిబ్బంది, ల్యాబ్ సిబ్బంది, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా భాగస్వాములైనట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ పరీక్షలపై ప్రభావం చూపేందుకు రూ.3 లక్షలకు పైగా లంచాలు ఇచ్చినట్లు కూడా అనుమానం వ్యక్తమవుతోంది. ఆధారాలు చెరిపివేయడం, టాక్సిక్ పదార్థాలు రిపోర్టుల్లో కనిపించకుండా చేయడం కోసం పెద్ద నెట్వర్క్ పనిచేసినట్లు తెలుస్తోంది.ఇన్వెస్టిగేషన్లో పోలీసులు సిరింజ్‌లు, విష పదార్థాల కంటైనర్లు, మొబైల్ ఫోన్లు సహా కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసు కేవలం ఓ భార్య తన పప్రియుడితో కలిసి భర్తకు రాసిన మరణశాసనమే కాదు.. వ్యవస్థలోని లోపాలను బయటపెడుతూ పెద్ద చర్చకు దారి తీసింది. అన్నట్లు తెలంగాణలోని కామారెడ్డిలోనూ ఈ తరహా నేరమే ఒకటి బయటపడడం తెలిసిందే. కామారెడ్డి కేసులో ఓ వ్యక్తి హత్యను మొదట రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. అయితే పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, అది యాక్సిడెంట్ కాదని పక్కా ప్లాన్‌తో చేసిన హత్యగా తేలింది. భార్యకు తన భర్తను తొలగించాలనే ఉద్దేశం ఉండగా, ఆమెకు సహకరించిన ప్రియుడి పాత్ర కూడా బయటపడింది. ఇద్దరూ కలిసి హత్య చేసి, దాన్ని ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఆధారాలు, పోస్టుమార్టం రిపోర్ట్లు అసలు నిజాన్ని బయటపెట్టాయి. చివరికి భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
2026 నుంచి ప్రతి వాహనంలో ఇదే తప్పనిసరి!
-
డేంజరస్ స్టంట్ : యెమెన్ స్పైడర్ మ్యాన్ దుర్మరణం
"యెమెన్ స్పైడర్ మ్యాన్" గా గుర్తింపు పొందిన యువ అక్రోబాట్ అల్-ఖకా బిన్ అన్తార్ (Al-Qa'qa' bin Antar) విషాదకర స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండానే అచ్చం స్పైడర్ మ్యాన్‌లా నిటారైన కొండలను చకచకా ఎక్కేస్తూ అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో భారీ గుర్తింపు తెచ్చుకున్న అల్-ఖాఖా మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. యెమెన్ దేశంలో అత్యంత ప్రమాదకరమైన కొండలు, పర్వతాలను ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఒక అగ్నిపర్వత క్రేటర్ (కుహరం) ఎక్కుతూ, సోషల్ మీడియా కోసం వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలను పణంగా పెట్టి, అద్భుతమైన సాహసాలతో ఆకట్టుకునే స్పైడర్ మ్యాన్ ఇక లేడన్న వార్త అటు యెమెన్‌లోనూ, ఇటు అభిమానుల్లోనూ తీవ్ర విచారాన్ని నింపింది. ధమార్ (Dhamar) ప్రాంతంలోని ప్రసిద్ధ 'హరదత్ దమ్త్' (Haradhat Damt) అగ్నిపర్వత క్రేటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 120 మీటర్ల లోతున్న నిటారైన అగ్నిపర్వత లోయ గోడలను అన్తార్ ఎలాంటి సేఫ్టీ బెల్టులు లేదా రోప్‌లు లేకుండా ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోవడంతో ఆయన నేరుగా వందల అడుగుల లోతున్న క్రేటర్ అడుగుభాగానికి పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నప్పటికీ, అక్కడి పరిస్థితుల కారణంగా సహాయక చర్యలు కష్టం కావడంతో ఫలితం దక్కలేదు. ఆ లోయ అడుగు భాగంలో గంధకపు వేడి నీటిలో పడిపోయాడు. అక్కడికి చేరుకునే మార్గం లేక రెస్క్యూ సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరకు యువ క్లైంబర్ నిర్జీవ దేహాన్ని బయటకు తీశారు.من المواقف الذي تحبس الانفاس لحظة محاول العثور على جثة القعقاع رحمة الله عليه هل الذين كانوا يشجعوه يتحملوا المسؤلية؟ pic.twitter.com/y1ow1fWIPo— نوادر ومواقف (@Nawader_X) June 12, 2026 అన్తార్ యెమెన్‌లోని నిటారైన కొండలు, పురాతన కట్టడాలు,అగ్నిపర్వత శిలలపై రక్షణ లేకుండా ఎక్కుతూ సాహసాలకు నెటిజన్లు ఫిదా అయ్యేవారు. దీనికి సంబంధించిన వీడియోలు చాలా పాపులర్ కావడంతో "యెమెన్ స్పైడర్ మ్యాన్" అనే పేరు వచ్చింది. అంతర్జాతీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆయన చేసిన ప్రమాదకరమైన క్లైంబింగ్ వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ లభించాయి.అన్తార్ అకాల మరణంపై యెమెన్‌లోని సోషల్ మీడియా వినియోగదారులు, ఫాలోవర్లు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ధైర్యాన్ని కొనియాడుతూనే, కేవలం సోషల్ మీడియా లైక్‌లు, వ్యూస్ కోసం ఎలాంటి భద్రత లేకుండా ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం ఎంత ప్రాణాంతకమో ఈ ఘటన మరోసారి నిరూపించిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో.. పదికి చేరిన మృతుల సంఖ్య
సాక్షి,విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరుకుంది. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డి.సూరిబాబు అనే స్టీల్ ప్టాంట్ ఉద్యోగి మృతిచెందారు. కాగా ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉక్కు ద్రవం కార్మికులపై పడి తొమ్మిది మంది మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. తాజాగా మరొకరు మరణించడంతో ఆ సంఖ్య పదికి చేరుకుంది.కాగా (సోమవారం) సాయంత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ప్లాంట్ ఎస్ఎంఎస్ -2లో హాట్‌మెంట్ బకెట్లు కూలి ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం సమయంలో ఎనిమిది మంది కార్మికులు ఘటనా స్థలంలో మృతిచెందారు, చికిత్స పొందుతు మరోకరు, తాజాగా సూరిబాబు అనే కార్మికుడు మృతిచెందారు. ప్లాంట్ లోపల భారీగా మంటలు చెలరేగడంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేశారు. ప్రమాదానికి కారణం మెటల్ లిక్విడ్ పేలడం అని తెలుస్తోంది. 1500 డిగ్రీల వేడితో వెళుతున్న మెటల్ లిక్విడ్ పేలడం వల్ల ప్రమాదం జరిగింది. గతంలోనూ పలుమార్లు స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదాలు జరిగాయి. గతేడాది స్టీల్ మెల్టింగ్ మిషన్‌లో షార్ట్ సర్క్యూట్‌తో హైడ్రాలిక్ ఆయిల్ లీకై మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా ఈ సారి ప్రమాదంలో పదిమంది కార్మికులు మృతిచెందారు. -
అక్కకు స్వీట్ ఇచ్చి.. తిరిగి వెళ్తుండగా..
మూసాపేట: కొత్త ఫోన్ కొన్న తరువాత అక్కకు స్వీట్లు ఇచ్చి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.కూకట్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఒరిస్సాకు చెందిన రాజేష్ (30) ఇందిరానగర్‌లో నివాసముంటూ అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం కొత్త మొబైల్ ఫోన్ కొనడంతో మూసాపేటలో ఉన్న తన అక్కకు స్వీట్ బాక్స్ ఇచ్చి బైక్‌పై అర్ధరాత్రి బయలుదేరాడు. ఐడీఎల్ చెరువు నుంచి జాతీయ రహదారిపైకి వెళుతుండగా వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఫిబ్రవరి నెల నుంచి రాజేష్ శివమాలలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో తప్పిన పెను ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరోసారి ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని ఎస్ఎంఎస్-1 (స్టీల్ మెల్టింగ్ షాప్-1) విభాగంలో ఉన్న ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్లో ద్రవ ఉక్కు (Molten Steel) ల్యాడిల్ నుంచి నేలపైకి పొర్లిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అత్యంత అధిక ఉష్ణోగ్రత వద్ద ఉండే ద్రవ ఉక్కు ఒక్కసారిగా ల్యాడిల్ నుంచి బయటకు రావడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కార్మికులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. లేకపోతే భారీ ప్రాణనష్టం సంభవించేదే.ఘటన అనంతరం ప్లాంట్ భద్రతా సిబ్బంది, సాంకేతిక నిపుణులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ద్రవ ఉక్కు లీకేజీకి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం.ఇటీవల కూడా(సోమవారం) స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎంఎస్-2 నుంచి సలసలా మరిగే ఉక్కు ద్రవం మీద పడి 9 మంది కార్మికులు మరణించారు. మరికొందరికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో.. భద్రతా ప్రమాణాలపై కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనతో మరోసారి ప్లాంట్‌లో భద్రతా వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
జగన్ వద్దకు వెళ్లొద్దు... ఉద్యోగం ఇచ్చేస్తాం..!
విశాఖ: స్టీల్ ప్లాంట్‌లో ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో మరణించిన జూనియర్ టెక్నీషియన్ బలిరెడ్డి పెంటయ్య కుటుంబానికి ఇంతవరకు నష్ట పరిహారం అందకపోవడంపై బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖ కూర్మన్నపాలేనికి చెందిన పెంటయ్య భార్య వెంకటలక్ష్మి, కుమారుడు ప్రసాద్ బుధవారం విశాఖలో సెవెన్ హిల్స్ ఆస్పత్రికి వచ్చిన మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి తమ గోడు చెప్పుకున్నారు. యాజమాన్యం తమను మోసం చేస్తోందని వాపోయారు. పెంటయ్య గతేడాది మార్చి 14న ఎస్ఎంఎస్–2 విభాగంలో జరిగిన ద్రవ ఉక్కు లీకేజీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఏప్రిల్ 1న మృతి చెందినట్లు భార్య తెలిపారు. భద్రతా లోపాలపై ప్రమాదానికి ముందే తన తండ్రి ఉన్నతాధికారులను హెచ్చరించినా పట్టించుకోలేదని ప్రసాద్ చెప్పారు. ఏడాది దాటుతున్నా పరిహారం ఇవ్వకుండా సాకులు చెబుతున్నారన్నారు. తాము వైఎస్ జగన్‌ను కలవడానికి వస్తున్నట్లు తెలిసి స్టీల్‌ప్లాంట్ ప్రతినిధులు, కొందరు స్థానిక నేతలు తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఉద్యోగం ఇస్తామంటూ నమ్మబలికారని తెలిపారు. బాధిత కుటుంబం ఆవేదనను విన్న వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడే సమయంలో ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
మొద్దు నిద్ర వీడిన ‘ఉక్కు’ యాజమాన్యం
ఉక్కునగరం (విశాఖ): ఘోర ప్రమాదం జరిగి, తొమ్మిది మంది అసువులుబాసిన తర్వాత గానీ విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం మొద్దు నిద్ర వీడలేదని, స్టీల్‌ప్లాంట్ యాజమాన్యానికి అకస్మాత్తుగా భద్రతా అంశాలు గుర్తొచ్చాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదిగా భద్రతా లోపాలపై కార్మిక సంఘాలు పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోకపోవడం వల్లే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ ప్రమాదం కారణంగా కోట్ల రూపాయల విలువైన యంత్రాలు దెబ్బతినడంతో పాటు సుమారు రూ.100 కోట్ల మేర ఉత్పత్తి నష్టం సంభవించినట్లు తెలిపారు. స్టీల్‌ప్లాంట్ స్టీల్ మెల్ట్ షాప్–1 (ఎస్ఎంఎస్–1) విభాగం కార్మికులు, కార్మిక సంఘాల నాయకులతో యాజమాన్యం బుధవారం సమావేశం నిర్వహించింది. డైరెక్టర్ (ఆపరేషన్స్) సుభసిస్ సేన్‌గుప్తా, డైరెక్టర్ (పర్సనల్) ఇన్చార్జి ఎ.కె. బాగ్చి, ఇతర హెచ్ఆర్ అధికారుల సమక్షంలో జరిగిన సమావేశంలో కార్మికులు పలు సమస్యలను ప్రస్తావించారు. దిద్దుబాటు చర్యలకు హామీ భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు కావడం లేదని, అందువల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు పేర్కొన్నారు. నాణ్యత లేని ముడి పదార్థాల వినియోగం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఉత్పత్తి లక్ష్యాల ఒత్తిడితో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌వోపీలు) పాటించడంలో నిర్లక్ష్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రకటించిన రూ.25 లక్షల నష్టపరిహారం సరిపోదని, దానిని కనీసం రూ.కోటికి పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన యాజమాన్యం, నష్టపరిహారం అంశం తమ పరిధిలో లేదని, కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. భద్రతా ప్రమాణాలు, ఎస్‌వోపీలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు, ఉల్లంఘనలను నిరంతరం పర్యవేక్షించి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపడతామని యాజమాన్యం హామీ ఇచ్చింది. భద్రత చర్యలను నిర్దిష్ట కాలపరిమితిలో అమలు చేయడంతో పాటు, ప్రమాదంపై విచారణ కమిటీ నివేదికను త్వరగా పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాతపూర్వకంగా అంగీకరించింది. సమావేశంలో జీఎం (హెచ్ఆర్) బినయ్ ప్రసాద్, ప్లాంట్ పర్సనల్ ఇన్చార్జి ఎన్. భాను, ఎస్ఎంఎస్ విభాగాధిపతి ఆచార్యులు, కార్మిక నాయకులు కె.ఎస్.ఎన్.రావు, జె. అయోధ్యరామ్, రమణమూర్తి, రమణ, సంపత్, మనోజ్, శకునాల చంద్రశేఖర్, ఎల్. సత్యనారాయణ, రంగప్రసాద్, రామకృష్ణ, వాసు, సాగర్, నాగరాజు, రాజేష్ పాల్గొన్నారు.ఎస్ఎంఎస్–1లో ఉత్పత్తి పునఃప్రారంభం యాజమాన్యం భద్రతా చర్యలపై రాతపూర్వక హామీ ఇవ్వడంతో కార్మికులు, కార్మిక సంఘాలు శాంతించాయి. అనంతరం ఉత్పత్తి పునఃప్రారంభానికి అంగీకరించగా, బుధవారం మధ్యాహ్నం ‘బి’ షిఫ్ట్ నుంచి ఎస్ఎంఎస్–1లో ఉత్పత్తి కార్యకలాపాలను పునఃప్రారంభించే చర్యలు చేపట్టారు. -
నేడు విశాఖకు వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించి, ధైర్యం చెప్పనున్నారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ నేతలను వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న వైఎస్ జగన్.. బుధవారం విశాఖకు చేరుకొని బాధితులను పరామర్శిస్తారని వైఎస్సార్సీపీ తెలిపింది. -
స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం వెనుక కుట్ర కోణం
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగుందని, సంస్థ ప్రైవేటీకరణ కుట్రలతోనే ఉక్కు కర్మాగారంలో ప్రమాదాలు జరుగుతున్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రీజినల్ కో– ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. కార్మికుల ప్రాణాలతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్ నుంచి సమర్థులైన అధికారులను బదిలీ చేయడం వల్లనే భారీ ప్రమాదం జరిగిందని, ఇకనైనా సంస్థలో ఉద్యోగుల తొలగింపును ఆపాలని కోరారు. విశాఖ కేజీహెచ్‌లో మృతుల కుటుంబ సభ్యులను మంగళవారం వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రమాదంలో దుర్మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ తరహాలో రూ.కోటి చొప్పున పరిహారమివ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగమివ్వాలని డిమాండ్ చేశారు. ఆ పరిహారం కోసం వైఎస్సార్సీపీ రాజీ లేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులను ఓదార్చడానికి, వారికి అండగా నిలబడడానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విశాఖ వస్తున్నారని చెప్పారు.వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ జగన్ పరామర్శించి, అనంతరం ప్లాంట్ యూనియన్ నేతలతో మాట్లాడతారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, కార్మిక నాయకుడు మంత్రి రాజశేఖర్, పార్టీ నేత రవిరెడ్డి పాల్గొన్నారు. ప్రమాదం దురదృష్టకరం : బొత్స సత్యనారాయణ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన భారీ ప్రమాదం అత్యంత దురదృష్టకరం. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 8 మంది కార్మికులు దుర్మరణం చెందగా, సెవెన్¯హిల్స్ ఆస్పత్రిలో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కిమ్స్ ఆస్పత్రిలో 40 శాతం గాయాలతో మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారందరూ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను వారి తాబేదార్లకు కట్టబెట్టాలనే కుట్రతోనే వ్యవహరిస్తోంది. మిషనరీ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. ఇప్పటికే శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులు అంతా కలిపి దాదాపు 10 వేల మందిని అన్యాయంగా తొలగించారు. ఇకనైనా బలవంతపు వీఆర్ఎస్లను ఆపాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్ కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు.. అది ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక. కార్మికుల హక్కుల కోసం వైఎస్సార్సీపీ తరఫున రాజీలేని పోరాటం చేస్తాం.లోకేశ్ తీరు దారుణం: కురసాల కన్నబాబు మృతిచెందిన స్టీల్‌ప్లాంట్ కార్మికుల కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన మంత్రి నారా లోకేశ్... సమస్యలపై ప్రశ్నించిన కార్మిక సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదు. రాజకీయం చేస్తున్నారా మీరు..? మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయారా..?అంటూ మంత్రి మాట్లాడడం దారుణం. తోటి కార్మికులు చనిపోయారనే బాధ, ఆవేదనతో కార్మికుల పక్షాన ప్రశ్నించినందుకు కార్మిక సంఘాల నాయకులతో లోకేశ్ మాట్లాడిన తీరు చాలా దారుణంగా ఉంది. అధికారంలో ఉన్న వారికి ఓపిక, సహనం, బాధ్యత ఉండాలి కదా..? నాడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న మేమంతా, సీఎస్‌తో సహా ఇక్కడే ఉండి బాధితులకు అండగా నిలబడ్డాం. నేడు అధికారంలో ఉన్నవారు కనీస ఓపిక, సహనం లేకుండా కార్మిక సంఘాల నేతలపై నోరు పారేసుకోవడం శోచనీయం. ఇంత పెద్ద ఘటన జరిగితే సీఎం చంద్రబాబు స్పందించకపోవడం, పరిహారం ప్రకటించకపోవడం మరింత బాధాకరం. శోకసంద్రంలోనూ అబద్ధాలే..లోకేశ్, పవన్ దిగజారుడు వ్యాఖ్యలువిశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్న వైఎస్సార్సీపీ ప్లాంట్ పరిరక్షణకు అసెంబ్లీలో తీర్మానం చేసిన అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చాక కార్మికుల తొలగింపు, ఆంక్షలు, వేతన కోతలు సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదం 8 మంది కార్మికులను బలితీసుకుని.. యావత్ దేశాన్ని తీరని విషాదంలోకి నెట్టేసింది. ఇంతటి విషాదంలోనూ టీడీపీ కూటమి నేతలు రాజకీయ లబ్ధి కోసమే పాకులాడారు. పరామర్శల పేరుతో ప్లాంట్ వద్దకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఈ విషాద సమయంలోనూ అబద్ధాలతో రాజకీయం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్‌ప్లాంట్‌ని అమ్మేయాలని చూశారని.. తాము అధికారంలోకి వచ్చాకే విశాఖ ఉక్కును కాపాడామని నోటికొచ్చిన అబద్ధాలు ఆడారు. వారి మాటల్ని విన్న ఉక్కు కార్మికులు ‘చంద్రబాబు తరహాలో కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడం వీళ్లకూ అలవాటైనట్టు ఉంది’ అంటూ చర్చించుకోవడం కనిపించింది. అసెంబ్లీలో తీర్మానం చేసిన వైఎస్సార్సీపీ వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం చేసిన అలుపెరగని పోరాటం విశాఖ ఉక్కు కార్మికులందరికీ తెలిసిందే. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న వెంటనే.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చర్యల్ని వాయిదా వేసుకుంది. ప్లాంట్‌ను లాభాల బాట పట్టించేందుకు, సొంత గనులు (క్యాప్టివ్ మైన్స్) కేటాయిస్తే ప్లాంట్ దానంతట అదే నిలబడుతుందని ప్రధానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే లేఖలు రాశారు. తమ ఐదేళ్ల పాలనలో ప్రైవేటీకరణను ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉక్కు కవచంలా నిలబడింది. ఆ వాస్తవాలను కప్పిపుచ్చి, ఇప్పుడు ఉక్కు పరిరక్షణను తమ ఖాతాలో వేసుకునేందుకు కూటమి నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు వచ్చాకే.. పతనం అంచుకు.. ‘మేం వచ్చి ప్లాంట్‌ను కాపాడాం’ అని గొప్పలు చెబుతున్నా.. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్టీల్ ప్లాంట్ పతనం అంచుకు చేరుకుంది. బ్లాస్ట్ ఫర్నేస్‌లు, ఉత్పత్తి యూనిట్లను ఒక్కొక్కటిగా మూసివేస్తూ ప్లాంట్‌ను నిర్వీర్యం చేసే కుట్రలకు తెరతీశారు. దశాబ్దాలుగా ఉక్కు కర్మాగారాన్నే నమ్ముకుని బతుకుతున్న వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను నిర్దాక్షిణ్యంగా వీధిన పడేశారు. ఉన్న కార్మికులపై తీవ్రమైన ఆంక్షలు విధించారు.నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా.. ఇచ్చినా 50 శాతం కోతలు విధిస్తూ ఉద్యోగులు, కార్మికుల పొట్టగొట్టారు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలంటూ నిపుణులైన ఉద్యోగుల్ని, అధికారుల్ని వేధింపులకు గురిచేశారు. ఇలా.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, కార్మికుల పట్ల ఉన్న చిన్నచూపు కారణంగానే స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు తీవ్ర ఆరి్థక, మానసిక సంఘర్షణ నడుమ విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొంది. శోకసంద్రంలో ఉన్న బాధితుల వద్దకు వెళ్లిన కూటమి నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీపై బురద జల్లడాన్ని కార్మికులు తప్పు పడుతున్నారు.‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తే మేం రోడ్లపైకి వచ్చి కొట్లాడాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ ఆగింది’ – డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ‘విశాఖ ఉక్కు సంక్షోభంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపి కర్మాగారానికి ఊరట కల్పించేలా చర్యలు తీసుకుంది’ – మంత్రి నారా లోకేశ్ -
ఎటుచూసినా విషాదం
అగనంపూడి/గాజువాక/గోపాలపట్నం/అక్కిరెడ్డిపాలెం/ఉక్కునగరం/పెదగంట్యాడ: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన ఎనిమిది మందిలో ఏడుగురి మృతదేహాలకు కుటుంబసభ్యులు, బంధువులు మంగళవారం అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మేనేజర్ గోల్డ్ కుమార్ మృతదేహం కేజీహెచ్ మార్చురీలోనే ఉంది. అతడి కుటుంబసభ్యులు వచ్చిన తర్వాత మృతదేహాన్ని అప్పగించనున్నారు.స్టీల్‌ప్లాంట్ స్టీల్ మెల్ట్ షాప్–1 (ఎస్ఎంఎస్–1)లో సోమవారం 150 టన్నుల ద్రవపు ఉక్కు పేలిపోయి జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిదిమంది మరణించిన విషయం తెలిసిందే. కేజీహెచ్‌లో పోస్టుమార్టం తర్వాత వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆస్పత్రి వద్ద, మృతదేహాలను తీసుకెళ్లిన తరువాత వారి ఇళ్లు, ఆయా ప్రాంతాల్లో తీవ్ర విషాదకర వాతావరణం నెలకొంది. ప్రమాదంలో కాలిపోవడంతో మృతదేహాలను కడసారి చూసేందుకు కూడా అవకాశం లేకపోయిందంటూ వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కన్నీరుమున్నీరైన కృష్ణనాగు కుటుంబం ఈ ప్రమాదంలో ఎం.కృష్ణనాగు మృతిచెందడంతో కనకమహాలక్ష్మీనగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతదేహాన్ని స్వగృహానికి తీసుకువచ్చారు. అతడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రమాదంలో శరీరం తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహానికి కప్పిన కవర్‌ను తొలగించలేదు. దీంతో చివరి చూపునకు కూడా నోచుకోలేదంటూ కుటుంబసభ్యులు విలపించడం అందరినీ కలచివేసింది. కృష్ణనాగు మృతదేహానికి బుచి్చరాజుపాలెం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 30 ఏళ్లు కాంట్రాక్టు కార్మికుడిగా.. ఈ ప్రమాదంలో మృతిచెందిన అప్పన్నకాలనీకి చెందిన గొట్టపు త్రినాథ్ (50) 30 ఏళ్ల కిందట స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా చేరారు. ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో కాలనీలో విషాదం నెలకొంది. మృతదేహం వద్ద కుటుంబసభ్యుల రోదన అందరికంట తడి పెట్టించింది. బొబ్బిలి సమీపంలోని గాదెలవలస గ్రామానికి చెందిన త్రినాథ్ ఉపాధి కోసం విశాఖకు వచ్చి అప్పన్నకాలనీలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య రాధ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు పవన్ ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా, చిన్న కుమారుడు భరత్ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. స్థానిక శ్మశానవాటికలో త్రినాథ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. పెదగంట్యాడ మండలంలో విషాదంఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదం పెదగంట్యాడ మండలానికి చెందిన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 77వ వార్డు పరిధిలోని మదీనాబాగ్ సత్తర్ కాలనీకి చెందిన నక్క వెంకటరమణ (54), 75వ వార్డు పరిధిలోని నీలాపువీధికి చెందిన గొందేశి వెంకట అప్పారావు (41) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న నక్క వెంకటరమణకు భార్య జోగమ్మ, కుమారుడు దుర్గాప్రసాద్, కుమార్తె అప్పలకొండ ఉన్నారు. ప్రగతి మైదానం వద్ద వెంకటరమణ పార్థివదేహానికి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు నివాళులర్పించారు.మాకు దిక్కెవరు? నీలాపువీధికి చెందిన మృతుడు వెంకట అప్పారావుకు తల్లి దాలమ్మ, భార్య భారతి, కుమారులు ధనుష్, లోకేశ్ ఉన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో తపనపడే అప్పారావు మృతి ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఇప్పుడు మాకు దిక్కెవరు అంటూ ఆ కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. మార్చురీలోనే గోల్డ్కుమార్ మృతదేహం స్టీల్‌ప్లాంట్ ఎస్ఎంఎస్–1లో మేనేజర్‌గా పనిచేస్తూ ఈ ప్రమాదంలో మృతిచెందిన గోల్డ్ కుమార్ మృతదేహం కేజీహెచ్ మార్చురీలోనే ఉంది. స్టీల్‌ప్లాంట్ క్వార్టర్స్‌లో నివసిస్తున్న ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వేసవి సెలవులకు సొంత రాష్ట్రం బిహార్ వెళ్లిన వారు ఈ దుర్ఘటన విషయం తెలిసి వెంటనే బయల్దేరారు. వారు వచి్చన అనంతరం మృతదేహాన్ని అధికారులు అప్పగించనున్నారు. కాలిలో రాడ్డుతో మృతదేహం గుర్తింపు ఈ ప్రమాదంలో మరణించిన గాజువాక సీతారామ్‌నగర్ నివాసి కూన ప్రభాకరరావుకు భార్య అరుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు ప్రసాద్ కాకినాడలో డాక్టర్‌గా పనిచేస్తుండగా మరో కుమారుడు లోకేశ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన ప్రభాకరరావు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చారు. రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదానికి గురైన ఆయనకు వైద్యులు ఒక కాలిలో రాడ్డు వేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో మృతులను గుర్తిస్తున్న వైద్యులు...ప్రభాకరరావును ఆ రాడ్డు ఆధారంగానే గుర్తించారు. తన భర్తకు కాలిలో రాడ్డు ఉంటుందని అరుణ చెప్పడంతో దాని ఆధారంగా వైద్యులు ఆయన పార్థివదేహాన్ని నిర్ధారించారు. తనదికాని షిఫ్ట్ డ్యూటీకి వెళ్లి.. ఈ ప్రమాదంలో అగనంపూడి ప్రాంతానికి చెందిన ఇద్దరు కార్మికులు మృత్యువాత పడడంతో స్థానిక నిర్వాసిత కాలనీలు శోకసంద్రంలో మునిగిపోయాయి. అగనంపూడి సెక్టార్–3 పరిధిలోని శనివాడ కాలనీకి చెందిన గొంతిన భానుకుమార్ (33), డొంకాడ కాలనీకి చెందిన నక్కా అప్పలరాజు మృతిచెందారు. ఎస్ఎంఎస్–1 విభాగంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న భానుకుమార్ వాస్తవానికి ‘సీ’ షిఫ్ట్‌కు వెళ్లాల్సి ఉంది. ఒక మిత్రుడి కోరిక మేరకు ‘బీ’ షిఫ్ట్‌కు డ్యూటీకి వెళ్లారు. డ్యూటీకి వెళ్లిన కొద్దిసేపటికే జరిగిన ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. భానుకుమార్‌కు మూడేళ్ల కిందట శ్రీనగర్‌కు చెందిన లావణ్యతో వివాహం జరిగింది. వారికి మూడునెలల కుమారుడు ఉన్నాడు. భానుకుమార్ భౌతికకాయాన్ని అంతిమయాత్రగా తలారివానిపాలెం కైలాసభూమికి తీసుకువెళ్లి అంత్యక్రియలు చేశారు. భర్తను కడసారి చూసేందుకు శ్మశానవాటికకు వచి్చన లావణ్య కుప్పకూలిపోవడం అందరినీకంట తడిపెట్టించింది. ఆధారం కోల్పోయిన కుటుంబంఅగనంపూడి నిర్వాసిత కాలనీ డొంకాడకు చెందిన నక్కా అప్పలరాజు కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నారు. అధికారుల నుంచి సమాచారం రావడంతో ‘బీ’ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య మణి, కుమారుడు వరప్రసాద్ (12), కుమార్తె హేమశ్రీ (10), వృద్ధ తల్లిదండ్రులు అప్పారావు, అప్పలనర్సమ్మ ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన అప్పలరాజు మరణంతో తమకు దిక్కెవరంటూ వృద్ధ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు బోరున విలపిస్తుండటం స్థానికులను కలచివేసింది. అప్పలరాజు మృతదేహానికి అగనంపూడి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. -
ఒక్కోసారి యాక్సిడెంట్లు జరుగుతుంటాయ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌లో నిపుణులను తొలగించడం, సిబ్బందిని తగ్గించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘‘నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. నేనేమి చేయగలను. లోటుపాట్లను అర్థం చేసుకోవడం నాలాంటి వాళ్ల వల్ల కాదు. ప్లాంట్ నిర్వహణ లోపాలపై విచారణ కమిటీ వచ్చాకే చెప్పగలను..’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఒక్కోసారి యాక్సిడెంట్స్ జరుగుతుంటాయన్నారు. స్టీల్ ప్లాంటు ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఇటువంటి సందర్భాల్లో అందరూ ఒకేసారి మీద పడిపోతే పరిష్కారం కాదన్నారు. యాజమాన్యాలు ఒకటికి పది సార్లు చూసుకోవాలని... ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రమాదాలపై నాలుగైదు గంటలు... అవసరమైతే ఒకరోజు తీసుకుని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానన్నారు. గతంలో తాను క్యాప్టివ్ మైన్స్ గురించి మాట్లాడేందుకు ఢిల్లీకి తీసుకెళతానంటే కార్మిక సంఘాల నేతలు ఒక్కరు కూడా రాలేదని వ్యాఖ్యానించారు. -
ఇది సర్కారీ నిర్లక్ష్యం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనం సుదీర్ఘకాలం పోరాడి, ఎన్నో బలిదానాలు చేసి సాధించు కున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసి తీరాలన్న పాలకుల యావ 8 మంది కార్మికుల నిండు ప్రాణాలు తీసింది. సోమవారం సాయంత్రం స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)–1లో ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్‌లో హఠాత్తుగా విస్ఫోటం సంభవించి, అక్కడ పనిచేస్తున్న 8 మంది క్షణాల్లో మాంసపు ముద్దలుగా మిగలగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 1,600 డిగ్రీల సెల్సియస్‌తో సలసలకాగుతున్న ఆ ఉక్కు ద్రవం... సమీపంలోని భారీ క్రేన్‌పై పడి అది పూర్తిగా దగ్ధమైందంటే దాని తీవ్రత ఎంతటిదో గ్రహించవచ్చు. ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యంతో వ్యవహరించిన పర్యవసానంగా చోటుచేసుకున్న ఈ మరణాలు నిజానికి హత్యలు. దీన్ని కప్పిపుచ్చుకోవటానికే మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం పడరాని పాట్లు పడ్డారు. సీఎం చంద్రబాబు పత్తాలేరు. ముందురోజు వెళ్లిన హోంమంత్రి అనిత కార్మిక కుటుంబాలను పలకరించే ధైర్యం లేక అట్నుంచి అటే పలాయనం చిత్తగించారు. లోకేశ్, పవన్ అర్థంపర్థం లేని మాటలు మాట్లాడి కార్మికుల ఆగ్రహాన్ని చవిచూశారు. ‘అకటా వికటపు రాజుకు అవివేకపు మంత్రులు, చాదస్తపు పరివారం...’ అనే నానుడి మనకు ఉండనే ఉంది. అందుకు తగినట్టే కార్మిక నేతలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్ప లేక, రంకెలేస్తూ ‘మీకెందుకు... మీ ఇంట్లో ఎవరైనా పోయారా?’ అంటూ లోకేశ్ మాట్లా డిన తీరు ఆయన కుసంస్కారానికి నిదర్శనం. రెండేళ్లనుంచి మంత్రిగా ఉన్నా పవన్ అపరిపక్వతను వదుల్చుకోలేకపోతున్నారని ఆయన తీరు తేటతెల్లం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కర్మాగారాన్ని అమ్మేయాలని చూస్తే తానే అడ్డుకున్నారట. ఘటన జరిగిన కర్మాగారం ఏమిటో, అది ఎవరి అధీనంలో ఉంటుందో కూడా ఆయనకు తెలియ దన్నమాట! పైగా పోరాడదామంటే కార్మికులు కదల్లేదట!! ఇంత పెద్ద విషాద ఘటన తర్వాత, ఇలా చవకబారు మాటలు మాట్లాడటానికి ఆయనకు సిగ్గనిపించలేదు. పైగా 2021లో దీన్ని ప్రైవేటీకరించాలనుకుంటే అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంఅసెంబ్లీలో తీర్మానం చేయించి అడ్డుకుందని అదే నగరంలో కేంద్ర ఉక్కుగనుల మంత్రి హెచ్డి కుమారస్వామి చెప్పి ఇంకా 24 గంటలు గడవకుండానే అబద్ధాలు చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి!ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం తరఫున వచ్చినవారిపై సహజంగానే ఆగ్రహా వేశాలు పెల్లుబుకుతాయి. పైగా విశాఖ ఉక్కును రక్షిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకొచ్చినవారు గనుక, మీరేం చేశారని ప్రశ్నిస్తారు. ‘అప్రయోజకుడికి అహంకారం ఎక్కువన్న’ట్టు గొంతు చించుకుని దబాయిస్తే కార్మికలోకం నోరుమూసుకుని పడి ఉంటుందని లోకేశ్ అనుకుంటున్నట్టున్నారు. ఒకప్పుడు వేలమంది ఉద్యోగులతో కళకళ్లాడుతూ ఉత్పాదనలో దేశంలోనే నంబర్ వన్‌గా, నవరత్నాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న పరిశ్రమను ఉద్దేశపూర్వకంగా చిదిమేస్తుంటే... ప్రైవేటుపరం చేయడానికి పావులు కదుపుతుంటే నిలదీయటం నేరమా? ఇంతవరకూ కర్మాగారంలో 7,500 మంది కాంట్రాక్టు కార్మికుల్ని తొలగించారు. నిపుణులైన 6,000 మందిని పనిలో నుంచి తీసేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ పేరిట మరో 2,000 మందిని పంపేశారు. మరోపక్క ఉత్పాదకత పెంచాలని కార్మికుల్ని వేధిస్తున్నారు. 30 ఏళ్లనాటి బ్యాటరీలేఇంకా వినియోగిస్తుండగా, కొన్ని విడి భాగాలు పనికి రాకుండా పోయాయని చెప్పినా అరణ్యరోదనైంది. పైగా విశాఖ ఉక్కు ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఉక్కు తయారీలో నాసిరకం రసాయనాలను వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత విషాద ఘటనకు ఇవన్నీ కారణమే. అందుకే ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరగాలి. కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టు మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం, ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి. ఇదే నగరంలో ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెనువెంటనే మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున అంద జేశారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు విశాఖ ఉక్కు విషయంలో డ్రామాలు కట్టిపెట్టి దాని ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. -
స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు బొత్స పరామర్శ
-
స్టీల్ ప్లాంట్ ఘటన.. నారా లోకేశ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మంత్రి నారా లోకేశ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికుల ఆగ్రహం, నిరసనల మధ్య ఆయన వ్యవహరించిన తీరు కాస్త అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది. హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి స్టీల్‌ప్లాంట్ వద్దకు చేరుకున్న లోకేశ్‌కు.. కార్మికుల మృతి, నిర్వహణ లోపంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆయన సహనం కోల్పోయి.. కార్మిక సంఘాల నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్లాంట్‌లో జరిగిన ప్రమాదాలు, కార్మికుల భద్రత అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు.. మంత్రి లోకేశ్ ఎదుటే నిరసనకు దిగాయి. నైపుణ్యం లేని కాంట్రాక్ట్ కార్మికులను ఎలా అనుమతించారన్న ప్రశ్నతో మంత్రిని నిలదీశాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో ఎంపీ భరత్, హోం మంత్రి అనితలు పరిస్థితిని చల్లార్చేందుకు ప్రయత్నించినా, కార్మికుల ఆగ్రహం తగ్గలేదు.ఈ క్రమంలో కార్మికుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయిన లోకేశ్, “స్టీల్‌ప్లాంట్‌ను మేమే కాపాడాము” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందించాయి. “అందుకే ఇంతమంది చనిపోయారా?” అంటూ వారు తిరిగి ప్రశ్నించారు.పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో, కార్మికుల ఆవేదనను అర్థం చేసుకోకుండా మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఎందుకు గొడవ పడుతున్నారు.. రాజకీయం చేయడానికి వచ్చారా?” అంటూ లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కార్మిక సంఘాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో మరోసారి కలుగజేసుకున్న లోకేశ్.. “మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదు కదా?” అంటూ వ్యాఖ్యానించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారాయి. పరామర్శకు వచ్చి అవహేళనగా మాట్లాడారని.. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని లోకేశ్‌ను ఉద్దేశించి కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనూ ఆయన ‘‘మరి మమ్మల్నెందుకు నిలదీశారు?’’ అంటూ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. మొత్తానికి, పరామర్శగా మొదలైన నారా లోకేశ్ స్టీల్‌ప్లాంట్ పర్యటన కార్మికుల ఆగ్రహం, ప్రశ్నలు, ఎదురుదాడులతో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.నియంతలా లోకేశ్ తీరుస్టీల్ ప్లాంట్ వద్ద పరామర్శ పేరుతో నారా లోకేశ్ చేసిన ఓవరాక్షన్‌పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ‘‘కార్మికుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. అందుకే ఈ ఘోరం జరిగింది. పైగా కార్మిక సంఘాలను, కార్మికులను ఇప్పుడు నారా లోకేశ్ అవమానించారు. నియంతలా వ్యవహరిస్తూ.. ఎవరికీ సమాధానం చెప్పను అన్నట్లు ఉంది ఆయన తీరు. కార్మికులను బెదిరించే విధంగా లోకేశ్ మాట్లాడారు. కార్మిక సంఘాలకు, కార్మికులకు ఆయన క్షమాపణలు చెప్పాలి. బాధిత కుటుంబాలకు రూ కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేజీహెచ్ దగ్గరా.. కేజీహెచ్ వద్ద పరామర్శకు వెళ్లిన మంత్రి లోకేశ్‌కు.. అక్కడా చేదు అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులను పరామర్శించబోయే సమయంలో వామపక్ష నేతలు అడ్డుకున్నారు. పరిహారం విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలోనూ లోకేశ్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. డబ్బులిచ్చి చేతులు దులుపుకునేందుకు రాలేదు అనడంతో.. వామపక్ష నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
విశాఖ ఉక్కు విషాదం.. తప్పు ఎవరిది?
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన తాజా విషాదంపై మరోసారి హై లెవల్ కమిటీని ప్రభుత్వం నియమించింది. అయితే ప్రతి ప్రమాదం తర్వాత విచారణలు, కమిటీలు, నివేదికలతో హడావిడి చేయడం.. కొంతకాలానికి అంతా మరచిపోవడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వరుసగా ప్రమాదాలు పునరావృతమవుతుంటే అసలు బాధ్యులెవరు? తప్పంతా యాజమాన్యానిదేనా? లేక పర్యవేక్షణ బాధ్యత ఉన్న ప్రభుత్వాలకు అసలేం సంబంధం లేదా?? అనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.విశాఖ ఉక్కు కర్మాగారంలో.. ద్రవ ఉక్కు ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ఘటనతో మరోసారి ఒక కీలక ప్రశ్న తెరపైకి వచ్చింది. ప్రతి ప్రమాదం తర్వాత యాజమాన్యాన్ని తప్పుబట్టడం, విచారణ కమిటీలు వేయడం, పరిహారాలు ప్రకటించడం జరుగుతోంది. కానీ వరుసగా ప్రమాదాలు ఎందుకు పునరావృతమవుతున్నాయి? అసలు బాధ్యత ఎవరిపై ఉంది?..విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఉత్పత్తి, నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు, యంత్రాల సంరక్షణ, సిబ్బంది నియామకాల బాధ్యత ప్రధానంగా యాజమాన్యానిదే. ఇది కాదనలేని విషయం. కానీ, కార్మిక సంఘాలు చాలా కాలంగా ఒకే విషయాన్ని చెబుతున్నాయి. అనుభవజ్ఞులైన శాశ్వత ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయిందని, వారి స్థానంలో కాంట్రాక్టు సిబ్బందిపై ఆధారపడటం పెరిగిందని. దీంతో భద్రతా ప్రమాణాల అమలుపై ప్రభావం పడుతోందని హెచ్చరిస్తున్నాయి.ఒకప్పుడు 18 వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులు ఉన్న ప్లాంట్‌లో ఇప్పుడు వారి సంఖ్య సగానికి పడిపోయింది. ఉత్పత్తి లక్ష్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరిగిందని, నిర్వహణ వ్యవస్థపై ఒత్తిడి అధికమైందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరిశ్రమల్లో భద్రత అనేది కేవలం యంత్రాల మీద ఆధారపడదు. అనుభవం ఉన్న సిబ్బంది, నిరంతర పర్యవేక్షణ, శిక్షణ, క్రమబద్ధమైన నిర్వహణ కూడా అంతే కీలకం. అయితే ఇక్కడితో కథ ముగియదు. తాజా ప్రమాదం తర్వాత.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మొత్తం బాధ్యతను యాజమాన్యంపైనే నెట్టేసి పక్కకు తప్పుకోవాలని చూస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడం వాస్తవమే. కానీ రాష్ట్రంలో పనిచేస్తున్న అతిపెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన విశాఖ ఉక్కులో పదేపదే ప్రమాదాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత నుంచి తప్పించుకోగలదా? అనే ప్రశ్న కార్మిక వర్గాలు, పరిశ్రమల నిపుణుల నుంచి వస్తోంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా కూటమి నాయకులు పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు విశాఖ ఉక్కు పరిరక్షణపై పలుమార్లు మాట్లాడారు. కానీ ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలు, సిబ్బంది కొరత, యంత్రాల నిర్వహణ, ప్రమాదాల నివారణ చర్యలపై అదే స్థాయిలో పర్యవేక్షణ జరిగిందా? ఫ్యాక్టరీల శాఖ, కార్మిక శాఖ నిర్వహించిన తనిఖీల్లో ఏమి బయటపడింది? గత ప్రమాదాల తర్వాత ఇచ్చిన సూచనల అమలు ఎక్కడిదాకా వచ్చింది? అనే ప్రశ్నలకు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని విమర్శకులు అంటున్నారు.ప్రమాదం జరిగిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వ సంస్థ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కకు తప్పుకోవచ్చా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఫ్యాక్టరీల భద్రతను పర్యవేక్షించే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టరేట్, కార్మిక శాఖ, జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తాయి. ప్రమాదాలకు దారితీసే లోపాలను గుర్తించడం, భద్రతా తనిఖీలు నిర్వహించడం, హెచ్చరికలు జారీ చేయడం వంటి బాధ్యతలు కూడా వాటిపైనే ఉంటాయి.ముఖ్యంగా గత పదిహేనేళ్లలో స్టీల్‌ప్లాంట్‌లో వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2012లో జరిగిన ఘోర పేలుడులో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా పలు ఘటనలు నమోదయ్యాయి. ఇన్ని ప్రమాదాలు జరిగినా భద్రతా వ్యవస్థలపై స్వతంత్ర సమీక్షలు జరిగాయా? గత విచారణల సిఫారసులు అమలయ్యాయా? వాటిని ఎవరు పర్యవేక్షించారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు కనిపించడం లేదు.ఇక మరో కోణం ప్రైవేటీకరణ వివాదం. విశాఖ ఉక్కును కాపాడతామని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయి. కానీ వాస్తవంగా ప్లాంట్ భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితి, సిబ్బంది బలోపేతం, ఆధునీకరణ వంటి అంశాల్లో ఎంత మేర పురోగతి సాధించారన్న ప్రశ్నలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఉక్కు కర్మాగారం గురించి రాజకీయంగా పెద్ద ప్రకటనలు చేసినవారు, కార్మిక భద్రతపై అదే స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారా? అనే ప్రశ్న కూడా కార్మిక వర్గాల నుంచి వినిపిస్తోంది.అందుకే ఈ ప్రమాదాన్ని కేవలం ఒక సాంకేతిక లోపంగా చూడటం సరిపోదని పరిశ్రమల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది యాజమాన్య నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, సిబ్బంది విధానాలు, ప్రభుత్వాల నిరంతర పర్యవేక్షణ వైఫల్యం వంటి అనేక అంశాల కలయికగా చూడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ఈ విషాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవడం అవసరమే. కానీ అంతకంటే ముఖ్యమైనది గత ప్రమాదాల మాదిరిగానే ఈ ఘటన కూడా మరో ఫైల్‌గా మిగిలిపోకుండా చూడటం. స్వతంత్ర విచారణ, భద్రతా ప్రమాణాల సమగ్ర ఆడిట్, సిబ్బంది కొరతపై సమీక్ష, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలపై స్పష్టమైన జవాబుదారీతనం తీసుకొస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రతి కొన్నేళ్లకోసారి ప్రాణాలు కోల్పోయేది కార్మికులే.. సంతాప ప్రకటనలు విడుదల చేసేది వ్యవస్థే. -
ప్రమాదాలతో ప్లాంట్‌కు భారీ ఆర్థిక నష్టాలు
ఉక్కునగరం(విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన నాలుగు గంటల తర్వాత యాజమాన్య ప్రతినిధులు స్పందించారని ధ్వజమెత్తారు. తీరుబడిగా ఆస్పత్రికి వచ్చి ప్రమాదం దురదృష్టకరమని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కార్మీకులపై యాజమాన్యం పెనుపనిభారం మోపుతోందని, కనీస రక్షణ చర్యలు చేపట్టడం లేదని దుయ్యబట్టారు. యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, నష్టపరిహారంపై ఇప్పటికీ పెదవి విప్పడం లేదని, సీఎండీ వచ్చి న తర్వాత ప్రకటిస్తామని, అధికారులు కుంటిసాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం కార్మీకులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేతలు ఏమన్నారంటే.. ఏడాదిగా చెబుతూనే ఉన్నాం ఏడాదిగా ప్లాంట్‌లో ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోవడం లేదు. దీనివల్లే ఈ పెను ప్రమాదం సంభవించింది. 20 మంది ఉండాల్సిన పని ప్రదేశంలో కేవలం 12 మందితో పని చేయించడం దారుణం. పనికిరాని వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఉత్పత్తి చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. – డి.ఆదినారాయణ, ప్రధానకార్యదర్శి, స్టీల్ ఏఐటీయూసీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. భద్రతపై దృష్టి సారించకుండా కేవలం ఉత్పత్తి లక్ష్యంగా కార్మీకులపై ఒత్తిడి పెంచుతోంది. ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తే మాత్రం పోయిన ప్రాణాలు తేగలం. తీవ్రమైన ఒత్తిడితో పని చేయించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. – మంత్రి రాజశేఖర్, జాతీయ కార్యదర్శి, ఐఎన్టీయూసీ నాణ్యత లేని రా మెటీరియల్ వాడడం వల్లే నాణ్యత లేని రా మెటీరియల్ వాడడంతో సరైన రసాయన చర్యలు జరగకపోవడం వల్లే ఈ బ్లాస్ట్ జరిగింది. 20 మంది ఉండాల్సిన ప్రదేశంలో 12 మంది పని చేస్తున్నారు. భద్రతను గాలికి వదిలేశారు. కార్మీకుల గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం గుర్తించలేని పరిస్థితిలో మృతదేహాలు ఉండటం ప్రమాదం తీవ్రతకు అద్దంపడుతోంది. ఇకనైనా యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవాలి. – జె. అయోధ్యరామ్, ప్రధానకార్యదర్శి, స్టీల్ సీఐటీయూ -
ఉక్కులో.. ఉప ‘ద్రవం’!.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెను ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం / ఉక్కునగరం: బతుకుదెరువు కోసం స్వేదం చిందించిన కార్మికుల ప్రాణాలు ఉక్కు కొలిమిలో కాలి బూడిదయ్యాయి. సుమారు 1,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో సలసల కాగే ఉక్కుద్రవం మృత్యువులా వారిపై విరుచుకుపడింది. తప్పించుకునే అవకాశం కూడా లేకుండా ఎనిమిది మందిని సజీవ దహనం చేసింది. నల్లటి ముద్దల్లా మార్చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు ఉద్యోగులతో పాటు ముగ్గురు కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో ఆరుగురు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లాడెల్ నుంచి విరజిమ్మిన ద్రవపు ఉక్కు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)–1లో సాయంత్రం 4.15 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది పైకి ఎగసిపడింది. దీంతో అందులో ఉన్న సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. 8 మందిని బలితీసుకుంది. లాడెల్ నుంచి ద్రవం తుళ్లిన వేగానికి, ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్న భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్ అగ్నిగుండంగా మారింది. స్టీల్ ప్లాంట్ల చరిత్రలో తొలిసారిగా..! దేశంలోని ఏ స్టీల్‌ప్లాంట్‌లోనూ ఈ తరహా ప్రమాదం సంభవించలేదు. లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు లీకయి ప్రమాదాలు జరిగేవి. కానీ.. ఈసారి లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు చిచ్చుబుడ్డిలా ఎగసిపడింది. బ్లాస్ట్ ఫర్నేస్ విభాగంలో తయారైన హాట్‌మెటల్‌ను లాడెల్‌లో ఎస్ఎంఎస్ విభాగానికి తరలించి వివిధ రకాల రసాయన చర్యల ద్వారా ద్రవపు ఉక్కును తయారు చేస్తారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం బీ షిఫ్ట్‌లో సీసీడీ మిషన్–2 పై లాడెల్‌ను సిద్ధం చేశారు. స్టీల్‌ప్లాంట్ ఎస్ఎంఎస్–1 విభాగంలో సుమారు 9 మీటర్ల ఎత్తులో ఉండే సీసీడీ సెక్షన్లో లాడెల్‌ను రొటేట్ చేస్తుండగా అందులో ఉన్న సుమారు 150 టన్నుల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా పెద్ద విస్ఫోటనంతో పైకి ఎగసింది.సుమారు 1,600 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ద్రవం నలువైపులా వేగంగా విరజిమ్మడంతో చుట్టుపక్కల ఉన్న యంత్రాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు దావానలంలా వ్యాపించాయి. వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు ఆ మంటల్లో చిక్కుకు పోయారు. తీవ్ర గాయాలపాలై హాహాకారాలు చేస్తూ మంటల్లో నుంచి ఇద్దరు కార్మికులు అతి కష్టమ్మీద బయటకు వచ్చారు. అతి కష్టమ్మీద అదుపులోకి.. ఎక్కడ చూసినా సలసల కాగుతున్న ద్రవపు ఉక్కుతో ఎస్ఎంఎస్–1లోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. సమాచారం అందుకున్న సీఐఎస్ఎఫ్ ఫైర్ విభాగం మంటలను అతికష్టమ్మీద అదుపు చేయగలిగింది. మంటల్లో ముద్దగా కాలిపోయిన వారిని గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. ప్రమాదం జరిగిన తర్వాత స్టీల్ ప్లాంట్ యాజమాన్యం 32 అంబులెన్స్‌లు ఏర్పాటు చేసింది. క్షతగాత్రులను ఉక్కు జనరల్ ఆస్పత్రికి ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్ప కోసం నగరంలోని పలు హాస్పిటల్స్‌కు తరలించారు.స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ మార్చురీలో ఉంచిన మృతదేహాలను కేజిహెచ్‌కు తరలించకుండా ఉద్యోగులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో వెల్లడించాలని, దుర్ఘటనపై యాజమాన్యం వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. దీంతో మృతదేహాలను జనరల్ హాస్పిటల్ వద్దే ఉంచారు. క్షతగాత్రులను సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించిన అధికారులు ఎమర్జెన్సీ గేట్ నుంచి కాకుండా వెనక వైపు నుంచి తీసుకెళ్లారు. ఫోటోలు, వీడియోలు తీయవద్దని కలెక్టర్ చెప్పారంటూ మీడియా ప్రతినిధులను ఆర్డీవో హెచ్చరించారు. రెండు నెలలుగా 27 సార్లు లీక్..! గత రెండు నెలలుగా లాడెల్స్ నుంచి ద్రవపు ఉక్కు 27 సార్లు లీక్ కాగా పలుమార్లు కార్మికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. సాధారణంగా లాడెల్ నుంచి లీకవుతుందే గానీ పేలుడు ఎక్కడా జరగలేదు. దేశంలోని స్టీల్ ప్లాంట్లలో ఇలా లాడెల్లోని ఉక్కు ఎగసిపడటం ఇదే ప్రథమమని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రాసెసింగ్ కోసం వాడే రసాయనాలు నాణ్యత లేనివి కావడం వల్లే కెమికల్ రియాక్షన్ జరిగి ఈ తరహా దుర్ఘటన జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రాణ నష్టాన్ని తగ్గించిన టీ విరామం.. సాయంత్రం సమయంలో టీ విరామం కోసం చాలా మంది కార్మికులు, ఉద్యోగులు బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల సాధారణంగా 60 నుంచి 70 మంది వరకూ ఉద్యోగులు, కార్మికులు ఉంటారు. కానీ ఆ సమయంలో టీ విరామానికి వెళ్లిపోవడంతో 15 నుంచి 18 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ప్రాణ నష్టం తగ్గిందని చెబుతున్నారు. విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఘటనా స్థలిని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి అనిత, ఎంపీ శ్రీ భరత్ పరిశీలించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆస్పత్రికి చేరుకుని మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన ఉద్యోగులు.. ⇒ గోల్డ్ కుమార్, మెకానిక్ ఇన్చార్జ్–2 ⇒ గొందిన భానుకుమార్, టెక్నీíÙయన్ ⇒ ఎం.కృష్ణ నాగ్, టెక్నీíÙయన్ ⇒ కె. ప్రభాకర్, టెక్నీíÙయన్ ⇒ జీవీ అప్పారావు కాంట్రాక్ట్ కార్మికులు.. ⇒ నక్క వెంకటరమణ ⇒ త్రినాథ్ ⇒ ఎన్.అప్పలరాజుతీవ్రంగా గాయపడిన కాంట్రాక్ట్ కార్మికులు... ⇒ సూరిబాబు(90 శాతం కాలిన గాయాలు), పైడిరాజు(30 శాతం కాలిన గాయాలు), పల్లెల శ్రీనివాసరావు (40 శాతం కాలిన గాయాలు)లను సెవెన్ హిల్స్‌కు తరలించారు. ⇒ రావూరి మల్లికార్జునరావు , జి.అర్జున్ అప్పారావు, సత్యానంద్ బాలువ (10 శాతం కాలిన గాయాలు)లను కిమ్స్‌లో చేర్పించారు. మృతుల కుటుంబాలవైపు కన్నెత్తి చూడని హోంమంత్రి పర్యటన ప్లాంట్‌కే పరిమితం సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌లో జరిగిన విషాదం గురించి తెలుసుకున్న హోం మంత్రి అనిత సోమవారం రాత్రి ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాద స్థలిని పరిశీలించి ఎలా జరిగిందనే వివరాల్ని అడిగి తెలుసుకుని వెళ్లిపోయారు. కానీ సమీపంలో ఉన్న ఉక్కు జనరల్ హాస్పిటల్ వైపు వెళ్లలేదు. అక్కడ మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నా ఓదార్చేందుకు హోంమంత్రి గానీ, ఎంపీ భరత్ గానీ రాకపోవడంపై కార్మిక కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం అత్యంత విషాదకరం: మాజీ సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్ మెల్టింగ్ షాప్–2లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడటం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని వైఎస్ జగన్ పేర్కొన్నారు.భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాద బాధితులు, వారి కుటుంబాలకు అన్నివిధాలా అండగా నిలవాలని విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులను వైఎస్ జగన్ ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా పర్యవేక్షించాలని సూచించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. బాధాకరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరం. మృతులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. మృతుల ఆత్మలకు శాంతి కలగాలి. – ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి తీవ్ర ఆవేదన చెందుతున్నా స్టీల్ ప్లాంట్ ప్రమాదం కలచివేసింది. పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. – సీపీ రాధాకృష్ణన్, ఉప రాష్ట్రపతి అత్యంత దిగ్భ్రాంతికరం విశాఖ స్టీల్‌ప్లాంట్ దుర్ఘటన అత్యంత దిగ్భ్రాంతికరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేíÙయాను ప్రకటించాం. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి మాటలు రావడం లేదు వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతిని తెలిపేందుకు మాటలు రావడం లేదు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అత్యంత బాధాకరం దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. – జి.కిషన్‌రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి విషాదకరం స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత విషాదకరం. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలి. మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. – డాక్టర్ తనూజరాణి, అరకు ఎంపీ ప్రభుత్వం ఆదుకోవాలి స్టీల్ ప్లాంట్ ప్రమాదం విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్స అందించాలి. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. బాధితులను ఆదుకోవాలి. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలి. – కురసాల కన్నబాబు, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ దురదృష్టకరం స్టీల్ ప్లాంట్ ప్రమాదం దురదృష్టకరం. విషాద ఘటన గురించి తెలియగానే ప్లాంట్‌కు చేరుకున్నాం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాం. మృతుల కుటుంబాల వేదన వర్ణనాతీతం. ఆ కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, తిప్పల దేవన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు స్టీల్ ప్లాంట్‌లో విషాద ఘటనలివీ..విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఇప్పటివరకూ జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కార్మికులు మృత్యువాత పడ్డారు. 2012 జూన్‌లో జరిగిన దుర్ఘటన ప్లాంట్ చరిత్రలో అత్యంత విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. ప్లాంట్‌లో విషాద ఘటనల వివరాలివీ... ⇒ 2012 మే 1న కొత్తగా ప్రారంభించిన బ్లాస్ట్ ఫర్నేస్–3 లో పేలుడు కారణంగా ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ⇒ 2012 జూన్ 13న విశాఖ స్టీల్‌ప్లాంట్ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు. స్టీల్ మెల్టింగ్ షాప్–2 వద్ద ఆక్సిజన్ ప్లాంట్‌లో ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా అధిక పీడనం కారణంగా భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ దుర్ఘటనలో డీజీఎం స్థాయి అధికారులతో సహా మొత్తం 19 మంది సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ⇒ 2014 జూన్ 16న ఎస్ఎంఎస్–2 విస్తరణ పనుల్లో భాగంగా కంటైనర్ ల్యాబ్‌ని తనిఖీ చేస్తుండగా కార్బన్ మోనాక్సైడ్ లీకై ఇద్దరు ప్రైవేట్ కాంట్రాక్టు ఇంజనీర్లు మృతి చెందారు. ⇒ 2020 డిసెంబర్ 18న స్టీల్ మెల్టింగ్ షాప్–2(ఎస్ఎంఎస్–2)లో వేడి ద్రవపు ఉక్కుని తీసుకెళ్తున్న ల్యాడిల్ హుక్స్ ఊడిపోవడంతో ద్రవం కింద పడింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పింది. ⇒ 2021 నవంబర్ 16న బ్లాస్ట్ ఫర్నేస్–3లో పేరుకుపోయిన స్లాగ్(వ్యర్థం) తొలగిస్తుండగా వేడి ద్రవరూప లోహం ఒక్కసారిగా ఎర్త్ మూవర్ పైకి దూసుకొచి్చంది. ఈ ప్రమాదంలో ఆపరేటర్, సూపర్వైజర్, ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ⇒ 2026 మే 11న ప్లాంట్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్ ఏరియాలో స్వల్ప స్థాయిలో బ్లాస్ట్ ఫర్నేస్ గ్యాస్ (కార్బన్ మోనాక్సైడ్, ఇతర వాయువులు) లీకై నలుగురు కార్మికులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ⇒ 2025 ఆగస్ట్–సెప్టెంబర్ మధ్య వివిధ ప్రమాదాల్లో దాదాపు ఆరుగురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రమాదాల్లో చనిపోయారని యూనియన్ నాయకులు చెబుతున్నారు. ప్రమాదాలతో ప్లాంట్‌కు భారీ ఆర్థిక నష్టాలుస్టీల్ ప్లాంట్‌లో ద్రవపు ఉక్కు ప్రమాదాలే అత్యధికంగా జరుగుతున్నాయి. మెల్టింగ్ షాపులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఆధునికీకరించడం లేదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. 2011 ఏప్రిల్– జూన్ మధ్య వరుసగా జరిగిన ప్రమాదాలు స్టీల్ ప్లాంట్‌కు భారీ ఆర్థిక నష్టం కలిగించాయి. ⇒ 2011 ఏప్రిల్ 10న ఎస్ఎంఎస్లో ల్యాడిల్ నుంచి సుమారు 140 టన్నుల ద్రవపు ఉక్కు కిందపడి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనివల్ల ప్లాంట్‌కు రూ.60 కోట్ల నష్టం వాటిల్లింది. ⇒ 2011 ఏప్రిల్ 14న ఎస్ఎంఎస్ కంటిన్యుయస్ కాస్టింగ్ విభాగంలో 140 టన్నుల హాట్‌మెటల్ లీకేజీ కావడంతో రూ.60 కోట్లు నష్టం సంభవించింది. రెండు రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది. ⇒ 2011 ఏప్రిల్ 17న రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగి మూడు కన్వేయర్ బెల్ట్‌లు తెగిపోయి 48 గంటల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది. ⇒ 2012 ఫిబ్రవరి 6న ఎస్ఎంఎస్లో భారీ స్థాయిలో హాట్‌మెటల్ స్పిల్లేజ్ కారణంగా రూ.కోటి ఆస్తి నష్టం వాటిల్లింది. ⇒ 2012 మే 22న కొత్త బ్లాస్ట్ ఫర్నేస్‌కు ముడిసరుకు తీసుకెళ్తున్న కన్వేయర్ బెల్ట్ సింటర్ ప్లాంట్ వద్ద పూర్తిగా కాలిపోవడం వల్ల రూ.కోటి నష్టం వాటిల్లింది. -
విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్టీల్ లిక్విడ్ పడి తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. సోమవారం సాయంత్ర సమయంలో ఈ ఘెర ప్రమాదం సంభవించింది. ప్రధానంగా ప్లాంట్ ఎస్ఎంఎస్ -2లో హాట్‌మెంట్ బకెట్లు కూలి ఈ దుర్ఘటన జరిగింది. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరికొందరు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.ప్లాంట్ లోపల భారీగా మంటలు చెలరేగడంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ప్రమాదానికి కారణం మెటల్ లిక్విడ్ పేలడం అని తెలుస్తోంది. 1500 డిగ్రీల వేడితో వెళుతున్న మెటల్ లిక్విడ్ పేలడం వల్ల ప్రమాదం జరిగినట్లు సమాచారం.ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.కాగా గతంలోనూ పలుమార్లు స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదాలు జరిగాయి. గతేడాది స్టీల్ మెల్టింగ్ మిషన్‌లో షార్ట్ సర్క్యూట్‌తో హైడ్రాలిక్ ఆయిల్ లీకై మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా ఈ సారి ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందారు. -
రోబోల విప్లవమా?.. మానవాళి వినాశనమా?
రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాలు ఊహించని వేగంతో దూసుకుపోతున్నాయి. మనుషులలాగే నడిచే, మాట్లాడే, పనులు చేసే ‘హ్యూమనాయిడ్ రోబోలు’ (Humanoid Robots) త్వరలోనే మన జీవితాల్లో భాగం కాబోతున్నాయని సంబరపడాలో.. లేక ఇవే మానవాళి మనుగడకు ముప్పుగా మారుతున్నాయని భయపడాలో తెలియని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఇటీవల చైనాలో జరిగిన ఒక బహిరంగ సాంకేతిక ప్రదర్శనలో అత్యంత ఆధునిక హ్యూమనాయిడ్ రోబో ఒక చిన్నారిపై అనూహ్యంగా దాడి చేసిన ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పరిణామం ఏఐ భద్రతపై అంతర్జాతీయంగా సరికొత్త చర్చకు దారితీసింది.చిన్నారిని తన్నిన 'యూనిట్రీ జీ1' రోబోచైనాలోని క్సిన్జియాంగ్ ప్రాంతంలో నిర్వహించిన ఒక పబ్లిక్ టెక్నాలజీ ఎగ్జిబిషన్లో ఈ భయానక దృశ్యం వెలుగుచూసింది. ప్రముఖ రోబోటిక్స్ సంస్థకు చెందిన ‘యూనిట్రీ జీ1’అనే హ్యూమనాయిడ్ రోబోను ప్రజల మధ్య ప్రదర్శనకు ఉంచారు. నీలి రంగు విగ్ ధరించిన ఈ రోబో, మార్షల్ ఆర్ట్స్‌లోని ‘రౌండ్‌హౌస్ కిక్’ (రౌండ్‌గా తిరుగుతూ తన్నడం) విన్యాసాన్ని ప్రదర్శిస్తోంది. అయితే, ఊహించని విధంగా పక్కనే నిలబడి ఉన్న ఒక చిన్న బాలుడిని ఆ రోబో తన కాలితో బలంగా తన్నింది. ఆ దెబ్బకు ఆ బాలుడు నొప్పితో కుప్పకూలిపోయాడు. అదృష్టవశాత్తూ ఆ చిన్నారికి ఎలాంటి ప్రాణాంతక గాయాలు కాలేదని చైనా మీడియా పేర్కొన్నప్పటికీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ప్రజా సమూహాల మధ్య ఇలాంటి రోబోల భద్రత ఎంతవరకు నమ్మదగినదనే ప్రశ్న ఇప్పడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.ఇది మొదటి ప్రమాదం కాదు.. వరుస లోపాలుయూనిట్రీ రోబోల వల్ల ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇదే ఏడాది ప్రారంభంలో చైనాలో జరిగిన మరో పబ్లిక్ ప్రదర్శనలో సైతం ఇదే రకమైన ‘యూనిట్రీ జీ1’ రోబో ప్రదర్శన ఇస్తూ అదుపు తప్పి కింద పడిపోయింది. ఆ సమయంలో రోబో చేతులు, కాళ్లు అసంకల్పితంగా, నియంత్రణ లేకుండా కదలడంతో పక్కనే ఉన్న ఒక వ్యక్తి ముక్కుకు బలంగా తగిలి తీవ్ర గాయమైంది. ఈ వరుస ఘటనలు హ్యూమనాయిడ్ రోబోల భౌతిక నియంత్రణ, వాటి సమతుల్యతపై సాంకేతిక నిపుణులలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.తుపాకీతో యజమానిపైనే కాల్పులు జరిపిన 'మాక్స్'రోబోల ప్రమాదాలు కేవలం శారీరక విన్యాసాలకే పరిమితం కాలేదు. గత ఏడాది అమెరికాలో జరిగిన ఒక వైరల్ ప్రయోగం మరింత భయాందోళనలను కలిగించింది. ‘మాక్స్’ అనే హ్యూమనాయిడ్ రోబో రోల్-ప్లే (నాటకీయ పాత్ర) చేస్తున్న సమయంలో, భద్రతా నియమాలను ఉల్లంఘించి తన యజమానిపైకే ‘బీబీ గన్’తో కాల్పులు జరిపింది. మొదట కాల్చడానికి నిరాకరించినప్పటికీ, ఒక నిర్దిష్ట పాత్రలో నటిస్తున్నట్లు కమాండ్ ఇవ్వగానే అది తన సేఫ్టీ లాక్‌లను బైపాస్ చేసి కాల్పులు జరిపింది. కేవలం ప్రాంప్ట్ (ఆదేశం) మార్చడం ద్వారా ఏఐ భద్రతా నియమాలను ఎంత సులభంగా హ్యాక్ చేయవచ్చో, వాటిని ఎలా దారి మళ్లించవచ్చో ఈ ఘటన నిరూపించింది.రోబో తప్పు చేస్తే.. అసలు బాధ్యత ఎవరిది?స్వయంప్రతిపత్తి కలిగిన రోబోలు ఇటువంటి ప్రమాదాలకు కారణమైనప్పుడు, ఆ నష్టానికి లేదా గాయాలకు చట్టపరంగా ఎవరిని బాధ్యులను చేయాలనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సవాలుగా మారింది. ఏఐ సాఫ్ట్వేర్ రూపకల్పన చేసిన డెవలపర్లదా?, రోబో హార్డ్‌వేర్‌ను తయారు చేసిన కంపెనీదా?, లేదా ఆ సమయంలో ఆ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న ఆపరేటర్లదా? అనే ప్రశ్నలపై ఇంకా స్పష్టత లేదు. రవాణా, తయారీ రంగం, వైద్యం, ప్రజా ప్రదేశాలలో ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ చట్టపరమైన బాధ్యత అంశం అత్యంత కీలకంగా మారింది.టెస్లా, బోయింగ్ నేర్పిన చేదు పాఠాలుగతంలో కూడా ఇలాంటి ఆటోమేటెడ్ వ్యవస్థల వల్ల తీవ్ర నష్టాలు వాటిల్లాయి. టెస్లా కార్లలోని ‘ఆటోపైలట్’ డ్రైవర్-అసిస్టెన్స్ వ్యవస్థ కారణంగా జరిగిన అనేక రోడ్డు ప్రమాదాలు సాఫ్ట్వేర్ పనిరుపై, మానవ పర్యవేక్షణపై అనేక అనుమానాలను రేకెత్తించాయి. అదేవిధంగా, బోయింగ్ 737 మ్యాక్స్ విమాన ప్రమాదాల దర్యాప్తులో కూడా ఆటోమేటెడ్ సిస్టమ్స్‌లోని లోపాల వల్లే వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని నిపుణులు తేల్చారు. సాంకేతికత ఎంత పెరిగినా, ఆటోమేషన్ వ్యవస్థలలో చిన్న లోపం ఉన్నా అది ప్రాణాంతకంగా మారుతుందని ఈ ఉదాహరణలు హెచ్చరిస్తున్నాయి.చట్టాల రూపకల్పనపై ప్రపంచ దేశాల కసరత్తుప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు రోబోటిక్స్ ప్రమాదాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను రూపొందించే పనిలో పడ్డాయి. అమెరికాలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే పరిస్థితులను అనుసరించి తయారీదారులు లేదా ఆపరేటర్లపై బాధ్యత నెడుతున్నారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ ఏఐ సాంకేతికతలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను కఠినతరం చేస్తోంది. కొంతమంది పరిశోధకులు ఏఐ వ్యవస్థలకు ప్రత్యేక చట్టపరమైన హోదా ఇవ్వాలని సూచిస్తున్నప్పటికీ, మెజారిటీ నిపుణులు మాత్రం జవాబుదారీతనం ఎప్పుడూ మనుషులు, సదరు రోబోటిక్స్ సంస్థల వద్దే ఉండాలని గట్టిగా వాదిస్తున్నారు. సాంకేతికత మనుషుల ప్రాణాల కంటే ముఖ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: నాటి రోజుల్లో కేరళ రుతుపవన సంకేతాలు -
ఆసుపత్రి బెడ్‌పై నుంచే పండు మాస్టర్ వీడియో
తెలుగులో డ్యాన్స్ షోలతో గుర్తింపు తెచ్చుకున్న పండు మాస్టర్.. రీసెంట్గా వైజాగ్‌లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతానికి పండు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆస్పత్రి బెడ్‌పై నుంచే వీడియో రిలీజ్ చేశాడు. యాక్సిడెంట్ ఎలా జరిగింది? తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వెల్లడించాడు.(ఇదీ చదవండి: మొన్న 'దేవర'.. ఇప్పుడు 'పెద్ది'.. జాన్వీ కపూర్ అదే తంతు)'తగరపువలసలో ఈవెంట్ చేసుకుని బయలుదేరాం. కారులో వస్తుండగా నాకు వాంతి వస్తున్నట్లు అనిపించింది. దీంతో ఆనందపురం దాటిన తర్వాత ఓ చోట ఆగాను. బయటకు దిగి కారు ముందుకెళ్లి వాంతి చేస్తుండగా కోళ్ల ఫారమ్ వ్యాన్ వచ్చి మా కారుని బలంగా ఢీ కొట్టింది. అప్పుడు మా కారు నాపై ఎక్కడంతో నా రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. అప్పుడు నేను అపస్మాకర స్థితిలో ఉండటంతో ఏం జరిగిందో తెలీదు' అని ఈ వీడియోలో పండు చెప్పాడు. అయితే ఈ ప్రమాదానికి కోళ్ల వ్యాన్ డ్రైవర్ అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.వైద్యులు చెప్పిన దాని ప్రకారం.. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ నడుము కింది భాగంలో జాయింట్ కదిలిపోయింది. శస్త్రచికిత్స ద్వారా దాన్ని సరిచేశారు. రెండు కాళ్లకు కూడా సర్జరీలు చేసినట్లు తెలుస్తోంది. కనీసం ఆరు నెలల విశ్రాంతి అవసరమని, తర్వాత మళ్లీ యధావిధిగా డ్యాన్స్ చేయవచ్చని వైద్య బృందం స్పష్టం చేశారు.(ఇదీ చదవండి: 'జన నాయగణ్'.. డబ్బులు తిరిగిచ్చేస్తున్న నిర్మాత)యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి స్పందించిన 'ఢీ' ఫేమ్ పండు మాస్టర్.. వీడియో వైరల్! #pandumaster #selfievideo #accident #incident #Anntelugu pic.twitter.com/7JjC9j0Nm6— ANN Telugu (@ANN_Telugu) June 5, 2026 -
హనీమూన్ ట్రిప్.. కుప్పకూలిన హెలికాప్టర్
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివాహమయి ఒకరోజైనా గడవకముందే హెలికాప్టర్ ప్రమాదంలో పెళ్లికొడుకు దుర్మరణం చెందాడు. పెళ్లికూతురుకు తీవ్ర గాయాలయ్యాయి. దంపతులిద్దరూ భారత సంతతికి చెందిన వ్యక్తులుగా తెలుస్తోంది. కేరళకు చెందిన డేవ్ ఫిజీ, జెస్నీలు అట్లాంటాలో స్థిరపడ్డారు. జార్జియాలోని డాసన్ కౌంటీలో వీరి వివాహం వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఆ వేడుక అనంతరం ఈ కొత్త జంట 'రాబిన్సన్ R66' రకం హెలికాప్టర్లో సరదాగా బయలుదేరారు. అయితే, డాసన్విల్లేలోని 24 మౌంట్ వెర్నాన్ డ్రైవ్ సమీపంలోకి రాగానే ఆ హెలికాప్టర్ ఒక్కసారిగా ప్రమాదానికి గురై కుప్పకూలిపోయింది.ఈ ప్రమాదంలో పెళ్లికొడుకుతో పాటు ఫైలట్ అక్కడికక్కడే మృతిచెందగా, పెళ్లికూతురుకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రమాద వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని ఆసుపత్రికి తరలించారు. వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాల్సిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో దంపతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.అయితే ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటన జరిగిన ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడమే దీనికి ప్రధాన కారణం కావచ్చని స్థానిక అధికారులు భావిస్తున్నారు. -
వంతెనపై భయానక ఘటన.. కెమెరాకు చిక్కిన దృశ్యం
భువనేశ్వర్: ఒడిశాలోని భువనేశ్వర్ పలాసుని వంతెనపై జరిగిన ఓ భయంకర ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం అర్ధరాత్రి వేగంగా వచ్చిన ట్రక్కు.. తండ్రీకూతుళ్లు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టి.. ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన నుంచి వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. తండ్రీ కుమార్తె కారులో ప్రయాణిస్తుండగా.. వంతెన దాటుతున్న సమయంలో వెనుక నుంచి ట్రక్కు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కును ఆపకుండా డ్రైవర్.. కారును రోడ్డుపై అలాగే నెట్టుకుంటూ.. ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఇది కారులో తండ్రీకుమార్తెలతో పాటు రోడ్డుపై ఇతర వాహనదారులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాద తీవ్రతకు కారు భారీగా దెబ్బతిన్నప్పటికీ.. తండ్రీకూతుళ్లు ఇద్దరూ స్వల్ప గాయాలతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి వేళల్లో ట్రాఫిక్ నిబంధనల అమలు తీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి.ట్రక్కు.. కారును నెట్టుకుంటూ వెళ్తున్నట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నగర పరిధిలో తిరిగే భారీ వాహనాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని పలువురు నొక్కి చెప్పారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపట్టారు.సదరు ట్రక్కు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన తీరును కచ్చితంగా తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను, అలాగే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ అతివేగంగా నడుపుతున్నాడా? నిర్లక్ష్యంగా వ్యవహరించాడా? ఏదైనా మత్తులో ఉన్నాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 📍Bhubaneswar–Cuttack, Odisha: Chaos erupted on the highway after a dispute over giving side reportedly turned dangerous between a car and a Hyva truck. The truck allegedly dragged the car for nearly 200 meters while trying to flee the spot, creating panic on the road. Police… pic.twitter.com/eN5ubZJ3ps— Deadly Kalesh (@Deadlykalesh) May 30, 2026 -
భారీ పేలుడు.. అగ్నిగోళంగా మారి బూడిదైన రాకెట్
అమెరికాలో మరో భారీ రాకెట్ ప్రయోగం విఫలమైంది. బ్లూ ఆరిజిన్ కంపెనీకి చెందిన న్యూ గ్లెన్ రాకెట్ టెస్టింగ్ సమయంలో ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా అగ్నిగోళంలా భయానక వాతావరణం ఏర్పడింది. అందుకు సంబంధించిన దృశ్యాలు కింద చూడొచ్చు.. బ్లూ ఆరిజిన్ కంపెనీ ప్రముఖ బిలియనీర్ జెఫ్ బెజోస్ స్థాపించిన ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అనే సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం శుక్రవారం వేకువజామున ఫ్లోరిడాలోని లాంచ్ ఫెసిలిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కీలకమైన “హాట్ ఫైర్ టెస్ట్” సందర్భంగా ఇంజిన్లు ఆన్ చేసిన క్షణాల్లోనే అనూహ్యంగా భారీ పేలుడు సంభవించి రాకెట్ ముక్కలు చెక్కలైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.#BREAKINGA Blue Origin rocket exploded into a massive fireball during a hotfire test at Cape Canaveral, FloridaThe company confirmed an “anomaly” during testing and said all personnel have been accounted for safelyAuthorities say no threat to public.Blue Origin founder… pic.twitter.com/8ndAsxCukC— Nabila Jamal (@nabilajamal_) May 29, 2026ఈ ఘటనను కంపెనీ సాంకేతిక లోపంగా పేర్కొంటూ వెంటనే విచారణ ప్రారంభించింది. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని బ్లూ ఆరిజిన్ వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనతో కంపెనీ అధినేత జెఫ్ బెజోస్‌కు పెద్ద షాక్ తగిలినట్లుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ ప్రయోగ విఫలంతో బ్లూ ఆరిజిన్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. రాకెట్ పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు లాంచ్ ప్యాడ్ కూడా దెబ్బతిన్న అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఖర్చు వివరాలు అధికారికంగా వెల్లడించకపోయినా, ఇది అత్యంత ఖరీదైన పరీక్షల్లో ఒకటి కావడంతో భారీ నష్టం వాటిల్లి ఉంటుందని చెబుతున్నారు. హాట్ ఫైర్ టెస్ట్ అనేది రాకెట్ ప్రయోగానికి ముందు అత్యంత కీలక దశ. ఇందులో రాకెట్‌ను నేలపై స్థిరంగా ఉంచి ఇంజిన్ల పనితీరును పూర్తి స్థాయిలో పరీక్షిస్తారు. ఈ దశలోనే జరిగిన వైఫల్యం మొత్తం ప్రాజెక్ట్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.న్యూ గ్లెన్ రాకెట్ ద్వారా భారీ వాణిజ్య మిషన్లు, నాసా సంబంధిత ఉపగ్రహాలు కక్ష్యలోకి పంపాలని బ్లూ ఆరిజిన్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తాజా పేలుడు కారణంగా ప్రాజెక్ట్ టైమ్‌లైన్ ఆలస్యం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.మరోవైపు..ఈ ఫెయిల్యూర్‌తో బ్లూ ఆరిజిన్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్తో గ్యాప్ తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న సంస్థకు ఇది మరో పెద్ద ఎదురు దెబ్బగా మారింది. టెక్నికల్ సమస్యలు, షెడ్యూల్ ఆలస్యాలు కంపెనీ పోటీ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు, ప్రైవేట్ స్పేస్ రేస్ ఎంత ఖరీదైనదో, ఎంత కఠినమో ఈ ఘటన మరోసారి చూపిందని నిపుణులు పేర్కొంటున్నారు. -
పడవ బోల్తా పడి ఇద్దరు మృతి.. ఐదుగురు గల్లంతు
పట్నా: బిహార్‌లోని పట్నాలో గంగా నది ఉగ్రరూపం దాల్చింది. వరద నీటి ప్రవాహానికి 14 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ తప్పి బోల్తా పడటంతో పెను విషాదం నెలకొంది. గురువారం (నేడు) జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు.పట్నా ప్రాంతంలో గంగా నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో పెరగడంతో నదిలో ఉధృతమైన ప్రవాహం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో 14 మందిని ఎక్కించుకుని వెళ్తున్న పడవ నది మధ్యలోకి వెళ్లగానే ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రాణభయంతో ప్రయాణికులు కేకలు వేయగా, సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. VIDEO | Bihar: Several feared dead after a boat capsized in the Ganga river near Umanath Ganga Ghat in Barh sub division of Patna district.An eyewitness says, "There were approximately 14 to 15 people on the boat. Around seven people are feared drowned. Others were rescued… pic.twitter.com/N7SiUfSII2— Press Trust of India (@PTI_News) May 28, 2026సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఎమర్జెన్సీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ఏడుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వరద ఉధృతి, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. ఈ ప్రమాదంలో మరణించిన ఇద్దరి మృతదేహాలను సహాయక సిబ్బంది నది నుంచి వెలికితీశారు. వారి గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. గల్లంతైన ఐదుగురి కోసం నదిలోని వివిధ ప్రాంతాల్లో గాలింపును వేగవంతం చేశారు. -
ఇద్దర్ని చంపి సంబరాలా? వీడియో వైరల్, పెల్లుబుకిన ఆగ్రహం
పూణే పోర్షే (PunePorsche) కారు ప్రమాదం, ఇద్దరు ఐటీ ఉద్యోగులు దుర్మరణం పాలైన కేసు గుర్తుందా? ఈ కేసులో నిందితులకు ఇటీవల సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో నిందితుడైన మైనర్ బాలుడి తండ్రి, వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్ కుటుంబ సభ్యులు ఓ స్థానిక రెస్టారెంట్లో జరుపుకున్న సంబరాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీనిపై బాధిత కుటుంబాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల దండలు, డ్యాన్స్‌లతో సంబరాలుసోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వీడియోలో అగర్వాల్ కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు కలిసి నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ, కేరింతలు కొడుతూ కనిపించారు. మార్చి 10న సుప్రీంకోర్టు విశాల్ అగర్వాల్‌కు బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో 1977 నాటి ప్రసిద్ధ బాలీవుడ్ పాట “బంబాయి సే ఆయా మేరా దోస్త్, దోస్త్ కో సలామ్ కరో” ప్లే అవుతుండగా కుటుంబం మొత్తం డ్యాన్స్ చేసింది.విశాల్ అగర్వాల్ మెడలో గులాబీ రంగు పూల దండతో పాటు కరెన్సీ నోట్లతో చేసిన పెద్ద దండ కూడా ఉంది. అతని భార్య కూడా నోట్ల దండ వేసుకుని డ్యాన్స్ చేస్తూ కనిపించింది. వేడుకల సమయంలో విశాల్ అగర్వాల్‌ను అతని కుమారుడు, మరో వ్యక్తి భుజాలపైకి ఎత్తుకోగా, చుట్టూ ఉన్న అతిథులు చప్పట్లు, కేరింతలు కట్టారు. 2 years after the Pune Porsche incident that killed techies Aneesh & Ashwini, here’s how the family responsible for the deaths is celebrating. ALL accused, including the shameless Agarwal family, out on bail.Zero remorse. Zero guilt.Via @ndtvindia pic.twitter.com/Qv2pndDukw— Shiv Aroor (@ShivAroor) May 27, 2026నెటిజన్ల ఆగ్రహంఈ వీడియో సోషల్ మీడియాలో వ్యాపించడంతో నెటిజన్ల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రాణాలు తీసిన ఇంతటి తీవ్రమైన కేసులో, జైలు నుండి బెయిల్‌పై వస్తూనే ఇలా బాధ్యతారాహిత్యంగా సంబరాలు చేసుకోవడంపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.వీడియో వైరల్ కావడంపై మృతులలో ఒకరైన అశ్విని తండ్రి సురేష్ కోష్టా ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఒకరికి శిక్ష విధిస్తే, సుప్రీంకోర్టు వారిని వదిలేస్తుంది. ఇది నేరాలను ప్రోత్సహిస్తుంది. ముస్లిం దేశాలలో ఉన్నటువంటి 'రక్తానికి రక్తం' అనే చట్టాలు భారతదేశంలోకి తీసుకువచ్చే వరకు పరిస్థితి బాగుపడదు అంటూ మండిపడ్డారు. ఇద్దరిని చంపి, ఆ తర్వాత సంబరాలు చేసుకోవడం వారికి పారిపాటేమోఅన్నారు. చట్టాల పట్ల భయలేదని పెదవి విరిచారు. చట్టం కఠినంగా లేకపోతే ఎలా ప్రశ్నించారు. నిందితుడి బెయిల్‌ను రద్దు చేసి, అతని తల్లిదండ్రులను జైలుకు పంపాలి. ఒకవేళ ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు వస్తే, వారికి బెయిల్ మంజూరు చేయకూడదని వ్యాఖ్యానించారు.#WATCH | 2024 Pune Porsche crash case | Jabalpur, MP: On bail to the juvenile accused and viral video of celebration by his family, Suresh Koshta, father of Ashwini - one of the deceased, says, "It must be a practice in their society to kill two people and then celebrate...They… pic.twitter.com/TP2te8YLja— ANI (@ANI) May 27, 2026కేసు నేపథ్యం ఏమిటి?2024 మే 19న పూణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో లగ్జరీ కారు పోర్షే నడుపుతున్న ఒక మైనర్ బాలుడు మితిమీరిన వేగంగా అనీష్ అవధియా, అశ్విని కోస్టా అనే ఇద్దరు ఐటీ ఉద్యోగులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆధారాల ట్యాంపరింగ్ ఆరోపణలుతో ప్రమాదానికి తానే కారణమని ఈ అలాగే ఈ నేరం ఒప్పుకోవాలని తమ కుటుంబ డ్రైవర్‌పై విశాల్ అగర్వాల్ ఒత్తిడి తెచ్చినట్లు కూడా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ కేసులో విశాల్ అగర్వాల్ దాదాపు 22 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడని సుప్రీంకోర్టు ధర్మాసనం (జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్) పేర్కొంది. అతనికి బెయిల్ పొందే అర్హత ఉందని భావించిన కోర్టు, కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్క సాక్షినీ సంప్రదించడానికి లేదా ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: డీకే ప్రమాణ స్వీకారం ఎపుడు? ఉత్కంఠగా బ్రేక్‌ఫాస్ట్ భేటీ -
లాయర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూత్రధారి కాంగ్రెస్ కీలక నేత
సాక్షి, సిటీబ్యూరో: వక్ఫ్ బోర్డు ప్యానల్ న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసు కొలిక్కి వచ్చింది. ఈ హత్యకు భూవివాదాలే కారణమని, బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత సూత్రధారి అని తేలింది. ఆయనతో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వీళ్లు కూడా చిక్కితే ఈ హత్యోదంతం ఆద్యంతాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. మొహిజుద్దీన్ కొన్నేళ్లుగా వక్ఫ్ భూముల పరిరక్షణకు పోరాడుతున్నారు. ఓ భూమికి సంబంధించి బర్కత్‌పురకు చెందిన కీలక కాంగ్రెస్ నేతతో విభేదాలు వచ్చాయి. తమ ఆధీనంలో ఉన్న ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ ఆ నేతతోపాటు ఆయన కుమారుడు సైతం మొహిజుద్దీన్, ఆయన కుమారుడు ఫర్హాన్పైనా పలుమార్లు ఒత్తిడి తీసుకువచ్చారు. బెదిరింపులు.. ఆఫర్.. తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగడంతోపాటు ఆ భూ వివాదం కేసు నుంచి వైదొలిగితే రూ.2 కోట్లు ఇస్తామంటూ మొహిజుద్దీన్‌కు ఆఫర్ చేశారు. అయితే రాజీ పడబోనని చెప్పడంతో మొయిజుద్దీన్‌ను హత్యను చేయాలని భావించి ఆ పనిని తావూస్, మునీర్‌లకు అప్పగించారు. కాగా, సుపారీ గ్యాంగ్‌తో పనిపూర్తి చేయించాలని నగరానికి చెందిన కిషన్ సింగ్ అలియాస్ పప్పును వీరు కలిసి విషయం చెప్పారు. సుపారీ కింద రూ.15 లక్షలు చెల్లించారు. హత్య బాధ్యతను కవాడిగూడకు చెందిన సింగూరి అభిజీత్ అలియాస్ నాని, వినయ్, మణిదీప్‌లకు అప్పగించి రూ.10 లక్షలు చెల్లించాడు. ఈ ముగ్గురూ పప్పుతో కలిసి పథకం వేసి, కారు కొని, రెక్కీ చేసి, శనివారం మొయిజుద్దీన్‌ను రెడ్‌హిల్స్ శాంతినగర్‌లో హత్య చేశారు.అభిజిత్ గుర్తింపు... స్టంట్స్ చేయడంలో అనుభవం ఉన్న అభిజితే ఆ రోజు కారు నడిపాడు. మణిదీప్, వినయ్ అందులో కూర్చున్నారు. డ్రైవింగ్ నైపుణ్యం కారణంగానే ఇతడు నడిపిన, మొయిజుద్దీన్ ఎక్కబోయిన కార్లలో ఏదీ దెబ్బతినలేదు. ఈ హత్య చేసే సమయంలో కారుకు నెంబర్ ప్లేట్ లేకపోయినా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అధ్యయనం చేశారు. వీటి ఆధారంగా అభిజిత్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇతడిచ్చిన సమాచారంతో మణిదీప్, వినయ్‌లను పట్టుకున్నారు. పరారీలో ఉన్న తావూస్, మునీర్, కిషన్ సింగ్‌ల కోసం మూడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఈ హత్య కేసులో సదరు కాంగ్రెస్ నేత పాత్రపై ఆధారాలు దొరకడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని కార్యాలయానికి పిలిపించారు. మొయిజుద్దీన్‌తో ఉన్న విభేదాలు, హత్య తదితర అంశాలపై పలు ప్రశ్నలు వేశారు. తొలుత తనకు ఏం సంబంధమని, తాను ఎవరో తెలుసా? అంటూ చిందులు తొక్కారు. ఆ తర్వాత నేరం అంగీకరించడంతోపాటు తావూస్, మునీర్ పేర్లు బయటపెట్టారు. దీంతో ఈ నిందితుల కోసం గాలిస్తున్న టాస్క్‌ఫోర్స్ ఒకటిరెండు రోజుల్లో అరెస్టులను ప్రకటించనుంది. ఈ హత్య వెనుక కాంగ్రెస్ నేత కుమారుడి పాత్రపైనా ఆరోపణలు ఉండటంతో ఆ కోణంలోనూ విచారణ సాగుతోంది. -
రోడ్డుపై లారీ సడన్ బ్రేక్ వెనకనుంచి ఢీ కొట్టిన 7 కార్లు
-
Uttar Pradesh: బస్సు బోల్తా.. ఆరుగురు దుర్మరణం
ఉన్నావ్: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డిల్లీ నుంచి బీహార్ వైపు వెళుతున్న ఒక ప్రైవేటు బస్సు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై అదుపు తప్పి బోల్తా పడటంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.బస్సు వేగంగా వెళ్తుండగా..ఈ ప్రమాదం ఉన్నావ్ పరిధిలోని అరస్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో, ఎక్స్‌ప్రెస్‌వేపై 262వ కిలోమీటర్ మైలురాయి వద్ద చోటుచేసుకుంది. బస్సు వేగంగా వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను వేగవంతం చేశాయి. గాయపడిన వారిని తక్షణమే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.బాధితుల్లో పోలీసు అధికారి, ఖైదీఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఒక సబ్ఇన్స్పెక్టర్, ఒక ఖైదీ ఉన్నట్లు అరస్ ఎస్.ఓ సంజీవ్ కుశ్వాహా తెలిపారు. మృతుడైన సబ్-ఇన్స్పెక్టర్ను రామచంద్రగా గుర్తించారు. ఆయన తన విధి నిర్వహణలో భాగంగా ఖైదీ ఛత్రపాల్‌ను సివాన్ నుంచి డిల్లీకి తీసుకెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.మెరుగైన చికిత్స కోసం లక్నోకు తరలింపుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను మెరుగైన వైద్యం కోసం లక్నోలోని ట్రామా సెంటర్‌కు రిఫర్ చేశారు. కాగా మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. -
రోప్‌వే ప్రమాదం.. బిక్కుబిక్కుమన్న 300 మంది
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గొండోలా అని పిలిచే కేబుల్ కార్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో 65 క్యాబిన్లు ఎక్కడితక్కడే ఆగిపోయాయి. దీంతో అందులో ఉన్న టూరిస్టులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అందులో గడిపారు.సోమవారం మధ్యాహ్నం గుల్మార్గ్లో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. గుల్మార్గ్ను కాంగ్డోరికి వెళ్లే కేబుల్ కార వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అందులోని సుమారు 300 మంది ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గాల్లోనే ఉండిపోయారు.వాటిలో కొన్ని క్యాబిన్లు 500 అడుగుల ఎత్తులో ఆగిపోగా పర్యాటకులు భయంతో హాహాకారాలు చేశారు. ఇది చాలదన్నట్లు భారీ వర్షం కురియడంతో అందులోని పర్యాటకులు బెంబేలెత్తిపోయారు.అయితే ఈ వివరాలు తెలుసుకున్న భారత సైన్యం వెంటనే స్పందించిందిదాదాపు ఐదు గంటలపాటు శ్రమించి మొదటి విడతగా క్యాబిన్లలో ఉండిపోయిన 179 మంది పర్యాటకులను సైనికులు సురక్షితంగా కిందికి దించారు. అనంతరం మరో రెండు గంటల అనంతరం వారినీ రక్షించారు. పోలీసులు, ఆర్మీతోపాటు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) సభ్యులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే గతంలోనూ ఓ సారి కేబుల్ కార్ వ్యవస్థలో లోపం తలెత్తింది. జూన్ 25, 2017 న బలమైన ఉరుముల సమయంలో, గోండోలా యొక్క కేబుల్ లైన్లో ఒక చెట్టు పడిపోయింది. క్యాబిన్లో 100 అడుగుల కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. Some visuals from the Gulmarg Gondola rescue operation after a technical snag left tourists stranded mid-air.Hats off to all the brave teams involved in the swift and successful rescue!@adgpi @ChinarcorpsIA @JmuKmrPolice @KashmirPolice @KashmirSdrf @NDRFHQ @GulmargGondola… pic.twitter.com/nOd0eibpws— vishal singh (@jammuvishal) May 25, 2026 -
తెగిన జిప్‌లైన్.. 45 అడుగుల నుంచి పడి బాలుడు మృతి
ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో జరిగిన విషాద ఘటన ఒక కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. తాజ్ మహల్ సందర్శన ముగించుకుని తిరిగి వెళ్లే క్రమంలో ‘ఆగ్రా చౌపటి’ వద్ద సరదాగా జిప్‌లైన్ రైడ్ ఎక్కిన 16 ఏళ్ల కునాల్ అగర్వాల్, కళ్లెదుటే మృత్యుఒడిలోకి చేరాడు. రైడ్ ప్రారంభించిన కొద్ది క్షణాల్లోనే పుల్లీ లాక్ తెగిపోవడంతో, కునాల్ 45 అడుగుల ఎత్తు నుంచి అమాంతం కిందపడిపోయాడు. అది చూసిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.సరదాగా మొదలై విషాదంలో..ఫిరోజాబాద్‌కు చెందిన అగర్వాల్ కుటుంబం ఆదివారం విహారయాత్ర కోసం ఆగ్రా వచ్చారు. తాజ్ మహల్ సందర్శన అనంతరం, సాయంత్రం 5 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ‘ఆగ్రా చౌపటి’కి చేరుకున్నారు. కునాల్ అగర్వాల్ (16) పట్టుబట్టడంతో, రూ. 400 పెట్టి అతనికి జిప్‌లైన్ టికెట్ కొనిచ్చారు. తల్లిదండ్రులు, తమ్ముడు కింద ఉండి చూస్తుండగానే, కునాల్ రైడ్ ప్రారంభించాడు. అయితే, రైడ్ మొదలైన కొన్ని అడుగుల దూరంలోనే పుల్లీ లాక్ విఫలం కావడంతో, అతను కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.నిర్లక్ష్యానికి బలిఈ ఘటనపై కునాల్ తండ్రి పంకజ్ అగర్వాల్ మాట్లాడుతూ, నిర్వాహకుల ఘోర నిర్లక్ష్యం వల్లే తాను కొడుకును కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక దర్యాప్తులో భద్రతా ప్రమాణాలు పాటించలేదని తేలింది. రైడ్ చేస్తున్న సమయంలో కునాల్‌కి హెల్మెట్ లేకపోవడం, కింద ఎలాంటి రక్షణ వలలు లేదా కుషనింగ్ ఏర్పాటు చేయకపోవడం నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. కేవలం లాభాపేక్షతో భద్రతను గాలికి వదిలేయడం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చట్టపరమైన చర్యలుఘటనపై సమాచారం అందుకున్న ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు, బిఎన్ఎస్ సెక్షన్ 105 కింద యజమాని, మేనేజర్‌పై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే సంతోష్ కుమార్ దుబే (58), అభిషేక్ (27) అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పరికరాల లోపాలపై సాంకేతిక నిపుణులతో సమగ్ర విచారణ జరిపి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఆగ్రా డీసీపీ సయ్యద్ అలీ అబ్బాస్ తెలిపారు. ఇది కూడా చదవండి: రహస్య బంకర్లో మొజ్తబా ఖమేనీ.. వీడని దాడుల భయం! -
స్నేహితుడి పెళ్లికి వెళుతూ ప్రమాదం.. 12 మంది మృతి
మహారాష్ట్ర: ఆ మిత్రుల బృందం స్నేహితుడి పెళ్లి వేడుకలో సరదాగా గడుపుదామని బయిలుదేరింది. అనుకున్న విధంగానే ఆడుతూపాడుతూ సాగుతున్న వారి ప్రయాణాన్ని ఒక్కసారిగా మృత్యువు కబలించింది. ముంబై- అహ్మదాబాద్ రహదారిపై జరిగిన ఘెర రోడ్డుప్రమాదంలో పెళ్లి వేడుకకు వెళుతున్న ఐషర్ ట్రక్కు- భారీ కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య మరింతగా పెరిగా అవకాశం ఉంది.మహారాష్ట్రలోని దహను తాలూకాలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ధనివారి సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళుతున్న ఐషర్ వాహనాన్ని భారీ ట్రక్క ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనం కూడా పూర్తిగా ధ్వంసమైంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే ట్రక్కులో ప్రయాణిస్తున్న మరో పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ట్రక్కులో ఉన్న 30 నుంచి 35 మంది వరకు గాయపడినట్లు సమాచారం.అయితే మరికొద్ది సేపట్లో వేడుకకు చేరుకునే వారిమని అంతలోనే ఈ ప్రమాదం జరగడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. Palghar - A horrific road accident occurred on the Mumbai-Ahmedabad National Highway in Palghar district when a truck carrying a baraat collided with a container truck.The accident took place in the Dhaniwari area of Palghar, As of now, 12 people have been confirmed dead. pic.twitter.com/RZNasohlC1— NextMinute News (@nextminutenews7) May 18, 2026 -
మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం.. రోప్ తెగి కిందపడ్డ లిఫ్ట్
కరీంనగర్, సాక్షి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ఆస్పత్రి లిఫ్ట్‌లో దిగుతుండగా దురదృష్టవశాత్తు లిఫ్ట్ రోప్ తెగింది. దీంతో లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడడంతో అందులో ఉన్న మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది ఆయనను వెంటనే అందులో నుంచి బయిటకి తీశారు. అనంతరం గాయాలకు చికిత్స అందించారు. కాగా ఇటీవల లిఫ్ట్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. -
ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్‌కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి
ప్రభాస్ 'ఫౌజీ' సినిమా షూటింగ్ కోసం వెళ్తున్న ప్రొడక్షన్ యూనియన్ సభ్యుల కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపుర్మెట్ దగ్గర డివైడర్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1940ల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్. ఈ ఏడాది దసరాకు థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ చేస్తున్నారు. ఇంతలోనే ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం.(ఇదీ చదవండి: విజయ్ విజయం.. పవన్ కల్యాణ్‌కు కొత్త చిక్కులు..!) -
ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం. AI వీడియో..
-
ORR కారు ప్రమాదానికి కారణాలు..?
-
వాహనాలపైకి దూసుకెళ్లిన కారు.. ఒళ్ళు గగుర్పొడిచే విజువల్స్ ..
-
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. క్రేన్ కింద పడి ముగ్గురు కార్మికులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. శంకర్ పల్లి మండలం, మహాలింగాపురంలో ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఘటన చోటు చేసుకుంది. భారీ ఈదురు గాలులకు క్రేన్ కింద పడింది. క్రేన్ కిందపడి ముగ్గురు కార్మికులు మరణించారు. పదిమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడిన క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
యూపీలో గొలుసుకట్టు వాహన ప్రమాదం...
మిర్జాపూర్: ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గొలుసుకట్టు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అదుపుతప్పిన ఓ లారీ ముందు వెళ్తున్న రెండు కార్లను, ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. మంటలు చెలరేగడంతో ఒక కారులోని నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు సహా 9 మంది సజీవ దహనమయ్యారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో 135వ నంబర్ జాతీయ రహదారిపై ద్రుమ్మొండ్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బర్కామోడ్ సమీపంలో ఈ గొలుసుకట్టు ప్రమాదం చోటుచేసుకుంది. ద్రుమ్మొండ్‌గంజ్ నుంచి లసోదా వైపు సెనగల లోడుతో వేగంగా వస్తున్న లారీ ముందుగా వెళ్తున్న బొలెరోతోపాటు, మరో కారును, ఆపై ఆగి ఉన్న ట్రయిలర్ ట్రక్కును ఢీకొట్టింది. లారీ, ట్రక్కు మధ్య ఇరుక్కుపోయిన కార్లలో మంటలు చెలరేగాయి. బొలెరోలో ఉన్న నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు సహా మొత్తం 9 మంది సజీవ దహనమయ్యారు. మరో కారు, ట్రక్కు, డ్రైవర్లు కూడా చనిపోయారు. -
జమ్మూ కశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి
జమ్మూ కశ్మీర్: ఉదమ్‌పుర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఘోర ప్రమాదం.. పదిమంది మృతి
కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాల్పారైలో వ్యాను బోల్తాపడింది. ఈ ఘటనలో దురదృష్టవశాత్తు 10మంది మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకొనికేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతులంతా కేరళ రాష్ట్రానికి చెందిన వారిగా సమాచారం. -
సామాజిక బాధ్యత అంటే ఇదే..!
రోడ్డుపై అనునిత్యం ఎన్నో ప్రమాదాలు జరుతుంటాయి. ఇది సర్వసాధారణ. కానీ క్షణంలో స్పందించి చేతనైన సాయం అందిస్తే..ప్రాణాలను రక్షించిన వాళ్లం అవుతాం. అయితే అందుకు ఎవ్వరూ ముందుకురారు. పోలీసు కేసులని, రిస్క్ అని భయంతో దూరంగా ఉండిపోతారు. కొందరు ముందుకొచ్చినా..మిగతా వాళ్లు సహకరించకపోవడంతో వెనకడుగువేస్తుంటారు. అందుకే పోలీసులు, ప్రభుత్వం దీనిపై అవగాహన కార్యక్రమాలతో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తుంటుంది కూడా. కానీ ఈ అమ్మాయి దాన్ని అక్షరాల తూచా తప్పకుండా పాటించి ఘెర ప్రమాదాన్ని తప్పించింది.ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. సీసీ కెమెరాలో అందుకు సంబంధించిన ఘటన రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఒక మహిళ రోడ్డు దాటుతూ వచ్చే ఆటోని గమనించకపోవడంతో పెనుప్రమాదం చోటుచేసుకుంది. ఆ మహిళను తప్పించబోయి ఆ ఆటోనే ఆమెపై బోర్లపడింది. స్కూల్ నుంచి వస్తున్న ఆ చిన్నారి రెప్పపాటులో స్పందించి ఒక్కసారిగా ఆ ఆటోని ఎత్తేసింది. అదంతా సీసీటీవి కెమెరాలో రికార్డు అయ్యింది. దాన్ని చూసిన సిటీ కమిషనర్ ఆ విద్యార్థిని పిలిపించి మరి ఆమె సాహసాన్ని మెచ్చుకోవడమే గాక సన్మానం చేసి అభినందించారు. ఇదీ సామాజిక బాధ్యతంటే అని నొక్కి చెప్పారు సిటీ కమిషనర్. *కర్ణాటక::మంగళూరులో ఒక మహిళ రోడ్డు దాటుతూ వచ్చే ఆటోను గమనించకపోవడంతో ఆటో అతను ఆమెను తప్పించబోయి అదుపుతప్పి ఆమె మీదే బోర్ల పడ్డది ఆటో అప్పుడే అదే రోడ్డు పై నుండి స్కూల్ నుండి వస్తున్న ఒక పాప సడెన్ గా ఆటోను ఒక్కసారిగా ఎత్తేసింది ✊ అది సీసీ టీవీ కెమెరాలో రికార్డు అవడంతో అది చూసిన… pic.twitter.com/MqTuaqpGKh— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) April 12, 2026 (చదవండి: Asha Bhosle and Lata Mangeshkar: తెలుపు రంగు దుస్తులే ధరించడానికి రీజన్ ఇదే..!) -
బీఎండబ్ల్యూ కారు ప్రమాదం.. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నందిగామ నందిగామ సీఐ చావన్ అన్నారు. కీసర టోల్గేట్ ప్రమాదంపై ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్ అతివేగంగా లారీ నడపటం వల్లే డివైడర్ ఎక్కి ట్యాంకర్ కారుపై పడిందన్నారు. లారీ టాంకర్ ఒక్కసారిగా కారుపై పడటంతో లాయర్ శ్రీనివాస్ మృతి చెందారు. లారీ ఫిట్నెస్ను అధికారులు పరిశీలిస్తున్నారు. టోల్గేట్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా? లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.కాగా, అతి వేగంగా వస్తోన్న ఫ్లైయాష్ ట్యాంకర్ అదుపు తప్పి కారుపై పడిన ఘటనలో హైకోర్టు సీనియర్ న్యాయవాది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర టోల్ ప్లాజా వద్ద జరిగింది. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన బొద్దులూరి శ్రీనివాసరావు (55) ఏపీ హైకోర్టులో సీనియర్ న్యాయవాది. ఈయన శనివారం కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. కీసర టోల్‌ప్లాజా వద్దకు కారు రాగానే..వెనుక నుంచి ఫ్లైయాష్ లోడుతో వస్తోన్న ట్యాంకర్ అతి వేగంగా వచ్చి ప్లాజా దిమ్మెను ఢీకొంది. అనంతరం అదుపు తప్పి శ్రీనివాసరావు కారుపై పడిపోయింది.దీంతో కారు నుజ్జునుజ్జయింది. ట్యాంకర్ కారుపై పడిన 3 నిమిషాల పాటు అందులో ఉన్న శ్రీనివాసరావు హారన్ మోగించినట్లు స్థానికులు చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. భారీ ప్రొక్లెయిన్లు, గొలుసుల సాయంతో ట్యాంకర్‌ను పక్కకు తీశారు. ఆ తర్వాత ట్యాంకర్ కింద ఉన్న కారును మరో పొక్లెయిన్‌తో బయటకు తీయగా అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. కాగా, ట్యాంకర్‌ను అతివేగంగా నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేక మద్యం మత్తులో ఉన్నాడా అనే దానిపై విచారణ చేస్తున్నామని సీపీ చెప్పారు. -
మధురలో నీట మునిగిన పడవ.. 12 మంది మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. మథుర, బృందావన్ లోని యమునా నది కెశీఘాట్ ఘాట్ సమీపంలో పడవ నీటమునిగి 12 మంది భక్తులు దుర్మరణం చెందారు. 32 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ పాంటూన్ బ్రిడ్జిని ఢీకొట్టి నీట మునిగింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న పర్యాటకులంతా నీటిలో గల్లంతయ్యారు. దీంతో వివరాలు తెలుసుకున్న NDRF సిబ్బంది గజ ఈతగాళ్లతో వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. కాగా బాధితులలో ఇప్పటివరకూ 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే గల్లంతవారయినంతా పంజాబ్‌లోని ముక్త్సర్కు చెందిన భక్తుల బృందంగా సమాచారం. -
రైల్వే బ్రిడ్జిలో ఇరుకున్న కార్మికులు.. పరిస్థితి విషమం
కుమురం భీం ఆసిఫాబాద్ : కాగజ్‌నగర్ పెద్దవాగు రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం చోటు చేసుకుంది. థర్డ్ లైన్ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న బాక్స్ బ్రిడ్జ్ లో పనులు చేస్తుండగా దురదృష్టవశాత్తు ఇద్దరు కార్మికులు బ్రిడ్జిలో ఇరుక్కపోయారు. దీంతో వారిలో ఒకరిని బయిటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మరోకరు మాత్రం అందులోనే చిక్కుకోగా సహాయక చర్యలు అందిస్తున్నారు. వైద్యుల సమక్షంలో అక్కడే ఆక్సిజన్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతనిని తీవ్ర రక్త స్రావమై పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
కాలువలోకి దూసుకెళ్లిన కారు దంపతులు మృతి
-
విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం
వేంపల్లె : వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె మండలంలోని వీరన్నగట్టుపల్లె సమీపంలో 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులతోపాటు డ్రైవర్, కండక్టర్ ప్రాణాలతో బయటపడ్డారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కదిరి డిపోకు చెందిన బస్సు వేంపల్లె నుంచి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కదిరి బయలుదేరింది. వీరన్నగట్టుపల్లె నుంచి కదిలిన బస్సుకి ఎదురుగా టిప్పర్ రావడంతో వేరే రోడ్డు గుండా వెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించడంతో... ఆ ప్రాంతంలో కిందకి ఉన్న విద్యుత్ వైర్లు బస్సుకు తగిలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. కండక్టర్ లక్ష్మీ నారాయణమ్మ, డ్రైవర్ ఎస్ఎం వలిని అప్రమత్తం చేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. బస్సుకు వైర్లు తగలగానే విద్యుత్ లైన్ ట్రిప్ అవడంతో పెను ప్రమాదం తప్పిందని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. రోడ్డు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమా..? ప్రస్తుతం చాగలమర్రి – రాయచోటి రోడ్డు పనులు జరుగుతున్నాయి. వీరన్నగట్టుపల్లె వద్ద కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా పనులు చేపట్టడంతో ఇడుపులపాయ రూరల్ ఫీడర్‌కు చెందిన 11 కేవీ హైటెన్సన్ విద్యుత్ వైర్లు బస్సుకు తగలడంతో దగ్ధమైందని పలువురు అంటున్నారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమే బస్సు దగ్ధమవడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు పనులు జరిగే ప్రాంతంలో అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించిన తర్వాత పనులు చేయాల్సి ఉండగా వాటిని తొలగించకుండానే కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. మరోవైపు ఇక్కడ ఒక్క సూచిక బోర్డూ ఏర్పాటు చేయలేదు. సూచిక బోర్డు పెట్టక పోవడంతోనే ఆర్టీసీ బస్సు డ్రెవర్ వేరే దారిలో వెళ్లేందుకు యత్నించడం వల్ల విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. శనివారం రాత్రి కూడా పనులు చేసే సమయంలో టిప్పర్ తగిలి వైర్లు తెగిపోయాయని విద్యుత్ సిబ్బంది తెలిపారు. రోడ్డు పనులు చేసే సమయంలో ఆయా శాఖల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందనే వాదన వినిపిస్తోంది. -
Hyd: దారుణం.. మహిళను, స్కూటీని ఈడ్చుకెళ్లిన ట్రక్
హైదరాబాద్: నగరంలో మాదాపూర్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక ఓ డీసీఎ వ్యాన్ బీభత్సం సృష్టించింది,. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న దంపతుల్లో భార్య చనిపోగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. మూవీ చూసి స్కూటీపై వెళ్తున్న దంపతుల్ని డీసీఎం ఢీకొట్టింది. ఆ దంపతుల్లో భార్య కూడా స్కూటీతో వ్యాన్‌లో చిక్కుకుపోయింది. అనంతరం ఆ స్కూటీని అలాగే కిలో మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. వ్యాన్ పక్క నుంచి వెళ్తున్న నగర వాసులు ఈ విషయాన్ని గమనించి ఆ డీసీఎం వ్యాన్‌ను అడ్డగించారు. అనంతరం లారీ డ్రైవర్, క్లీనర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. హనియ్యా ఆయేషా (22), అబ్దుల్ బాసిత్(26)లు భార్యభర్తలు. వీరిది కేరళ రాష్ట్రం. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. జ్యూయలరీ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు నిన్న రాత్రి మూవీ చూడటానికి వెళ్లారు. అయితే వీరిని తిరిగి వస్తుండగా డీసీఎం ఢీకొట్టింది. డీసీఎం ఢీకొట్టడంతో వారిలో భర్త రోడ్డు పక్కకు పడిపోగా, భార్య మాత్రం డీసీఎం వ్యాన్‌లో చిక్కుకుపోయింది. ఇలా కిలో మీటర్లు వెళ్లిన తర్వాత ఇది గమనించిన కొంతమంది వ్యాన్ అడ్డగించి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య మృతి చెందగా, తీవ్రగాయాలైన భర్తకు చికిత్స అందిస్తున్నారు. అయితే వారిని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్ డ్రైవర్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలిసినా ఆపకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఆ స్కూటీ ఆ వ్యాన్ కింద చిక్కుకున్నా అలానే వెళ్లిపోయాడు. ఇలా కిలో మీటర్లు దాటి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఒక చోట గమనించిన కొంతమంది ఆ వ్యాన్‌ను అడ్డగించి డ్రైవర్‌ను పట్టుకున్నారు. ఆ మహిళను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్‌ను, క్లీనర్నుపోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేపట్టారు. కర్ణాటకకు చెందిన ఆ వ్యాన్‌ను పోలీసులు సీజ్ చేశారు. -
బైక్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
యలమంచిలి రూరల్: అనకాపల్లి జిల్లా లో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. యలమంచిలి మండలం పోతురెడ్డిపాలెం కూడలి వద్ద జాతీయ రహదారిపై బైక్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నాని (24), ఏటికొప్పాకకు చెందిన ఇల్లపు గోవిందు (25), పోతిరెడ్డిపాలేనికి చెందిన బంగారు దుర్గాప్రసాద్ (16) మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. పురుషోత్తపురంలో గురువారం రాత్రి గొల్లమారెమ్మ తల్లి పండగ జరిగింది. స్నేహితులైన ఇల్లపు గోవింద్, బంగారు నాని, బంగారు దుర్గాప్రసాద్ పండగకు వెళ్లారు. అనంతరం దుర్గాప్రసాద్‌ను పోతురెడ్డిపాలెంలో డ్రాప్ చేసి రావడానికి ముగ్గురూ కలిసి ఒకే బైకుపై పురుషోత్తపురం నుంచి బయలుదేరారు. పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద సర్వీసు రోడ్డులోకి వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను విజయవాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. రోడ్డు దాటే క్రమంలో లారీని గమనించిన యువకులు బస్సును గమనించలేదు. కేవలం రెండు సెకన్లలో రోడ్డు దాటతారనగా.. బస్సు బైకు వెనుక భాగాన్ని ఢీకొంది. బంగారు నాని ఇటీవల ఉగాది పండగకు కొత్త ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. అమ్మవారి పండగలో ఆనందంగా గడిపి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురి కావడం, ముగ్గురు యువకులూ ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రమాద విషయం తెలిసిన గ్రామస్తులు ప్రమాద స్థలంలో బస్సు అద్దాలను కర్రలు, రాళ్లతో ధ్వంసం చేశారు. దీంతో బస్సులో ప్రయాణికులు భయాందోళనతో సమీపంలో పొలాల్లోకి పరుగులు తీశారు. యలమంచిలి సీఐ ధనుంజయరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు యువకుల మృతితో పురుషోత్తపురం, పోతురెడ్డిపాలెం గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. -
తెగిన ‘స్వింగ్ రైడ్’.. ప్రాణభయంతో పరుగులు
కుషీనగర్: ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఖడ్డా ప్రాంతంలో వైభవంగా జరుగుతున్న ‘చైత్ బర్నీ’ మేళాలో విషాదం అలముకుంది. జాతరలో ఏర్పాటు చేసిన ‘స్వింగ్ రైడ్’లో సందర్శకులు ఉత్సాహంగా ఊగుతున్న సమయంలో అది ఒక్కసారిగా తెగిపడింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడున్న సందర్శకులు ప్రాణభయంలో పరుగులు తీశారు.క్షణాల్లో మారిన దృశ్యంరంగురంగుల విద్యుత్ దీపాలతో సందడిగా ఉన్న జాతర ప్రాంగణంలో క్షణాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గాలిలో తిరుగుతున్న ‘స్వింగ్ రైడ్’ అకస్మాత్తుగా విరిగి కిందపడటంతో అందులో ఉన్నవారు చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. #WATCH | Kushinagar, UP: A major accident occurred at Chait Barni Fair in Kushinagar's Khadda area after a swing ride collapsed while in operation, injuring many people. Injured persons are shifted to the nearby hospital. Police and administration on the spot; relief and rescue… pic.twitter.com/6Qe8KHV2jj— ANI (@ANI) April 1, 2026ఎమ్మెల్యే స్పందనఈ ఘటనపై ఖడ్డా నియోజకవర్గ ఎమ్మెల్యే వివేకానంద్ పాండే స్పందించారు. ఆయన ‘ఏఎన్ఐ’వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘ఘటన జరిగిన వెంటనే అధికారులను అప్రమత్తం చేశాం. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా పర్యవేక్షిస్తున్నాం. స్వల్ప గాయాలైన వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాం. పరిస్థితి విషమంగా ఉన్న వారిని జిల్లా ఆస్పత్రికి తరలించాం’ అని తెలిపారు. బాధితులందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.దర్యాప్తు ప్రారంభంఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేక నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సహాయక చర్యలకు ఎవరూ ఆటంకం కలిగించవద్దని, సందర్శకులంతా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జాతర ప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొనకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇది కూడా చదవండి: సురేష్ గోపి నిజంగా గెలవలేదా? -
మంచు దిబ్బల్లో ఘోరం.. ఐదుగురు మృతి
లడఖ్: లడఖ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా విరిగిపడిన భారీ మంచు పెళ్లలు ప్రయాణికుల పాలిట మృత్యుపాశాలయ్యాయి. జోజిలా పాస్ సమీపంలోని ద్రాస్ ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంచు కింద 15 వాహనాలు పూర్తిగా కూరుకుపోగా, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.నిముషాల్లోనే మారిన దృశ్యంద్రాస్ పరిధిలోని ‘క్యాప్టెన్-టర్న్’ వద్ద మధ్యాహ్నం సమయంలో భారీ హిమపాతం కురిసింది. రహదారిపై వాహనాలు వెళ్తుండగానే ఒక్కసారిగా మంచు పెళ్లలు విరిగిపడటంతో, ప్రయాణికులు అప్రమత్తం అయ్యే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ ఘటనలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి మృతి చెందినట్లు ద్రాస్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్డీఎం)విశాల్ అత్రి తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరిందని, మరో ఐదుగురు గాయపడ్డారని పేర్కొన్నారు. మంచు కింద మరికొన్ని వాహనాలు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Heard the unfortunate news of an avalanche at Zoji La. I have directed the DC & SSP of Kargil to visit the spot immediately and mobilise relief and rescue operations. All government agencies including disaster relief forces and BRO have been put on high alert. I am personally…— LG Ladakh (@lg_ladakh) March 27, 2026యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలుప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్మీ, పోలీస్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్ఆర్డీఎఫ్)బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)బృందాలు రంగంలోకి దిగాయి. మేఘా టన్నెల్ సిబ్బంది సహకారంతో సుమారు 100 మందికి పైగా రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. సోనామార్గ్- ద్రాస్.. ఇలా రెండు వైపుల నుండి మంచును తొలగించే పనులు కొనసాగుతున్నాయి. అయితే కశ్మీర్ వైపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోందని సమాచారం.ఇది కూడా చదవండి: Kerala: ప్రచార ఖర్చుతో 100 ఇళ్లు.. ఈ నేత రూటే వేరు! -
EXCLUSIVE VIDEO: మార్కాపురంలో బస్సు ప్రమాదం.. ప్రమాదం ఎలా జరిగిందో చూడండి
-
Bangladesh : నదిలో పడిన బస్సు 23 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్‌బారి జిల్లాలోని దౌలడియా టెర్మినల్ వద్ద 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దురదృష్టవశాత్తు పద్మానదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.ఇటీవల ఈద్ సెలవులు ముగించుకొని ఢాకాకు తిరుగు ప్రయాణమవుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు లోపల 14 మృతదేహాలు లభించాయి. ప్రమాదంలో గల్లంతైన మిగిలిన ప్రయాణికుల కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. -
గమ్యం చేరేలోగా విధి రాసిన మృత్యురాత
కర్నూలు : గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిఇంటికి వెళ్తున్న ద్విచక్రవాహనదారుడికి ప్రమాదం జరిగితే.. అతనికి సాయం చేద్దామని మానవత్వంతో స్పందించిన మరో ఇద్దరిని మృత్యువు వెంటాడింది. ఒకేచోట వెనువెంటనే జరిగిన ప్రమాదాలతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన కర్నూలు నగరంలో బుధవారం జరిగింది. వివరాలు.. కల్లూరు శివప్ప నగర్‌లోని శాంతినికేతన్ స్కూల్ వెనుక నివాసం ఉండే కుమ్మరి శేఖర్(28) మట్టి పెంకుల పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి తలనొప్పి మాత్రలు తీసుకుని కృష్ణానగర్ వైపు నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా హంద్రీ బ్రిడ్జిపై గుర్తు తెలియని వాహనం ఢీకొంది. సమాచారం అందడంతో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రఫీ, మరో కానిస్టేబుల్ సందీప్‌తో పాటు హైవే మొబైల్ సిబ్బంది, రోడ్డు సేఫ్టీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో చెరుకులపాడు గ్రామానికి చెందిన చాకలి అజిత్ కుమార్(26), శరీన్‌నగర్‌కు చెందిన బండారు కన్నా(23) బైక్‌పై వెళ్తున్నారు. ప్రమాదం జరిగిందని తెలిసి పోలీసులకు సహాయ పడుతున్నారు. అదే సమయంలో బెంగళూరు వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న గ్రానైట్ లారీ ముందున్న ట్రావెల్స్ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఘటనా స్థలంలో నిలబడి ఉన్న జనం మీదకు దూసుకెళ్లింది. దీంతో బండారు కన్నా, అజిత్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దిన్ సిబ్బందితో అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బండారు కన్నా, చాకలి అజిత్‌కుమార్ మృతిచెందారు. చాకలి అజిత్ కుమార్ రివైండింగ్ దుకాణంలో పనిచేస్తుండగా, బండారు కన్నా గౌండా పని చేస్తుస్తున్నాడు. మొదటి ప్రమాదంలో మృతిచెందిన కుమ్మరి శేఖర్‌కు భార్యతోపాటు ఇద్దరు పిల్లలు. మృతుడి తండ్రి మద్దిలేటి ఇచి్చన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి అరగంట వ్యవధిలో జరిగిన రెండు ప్రమాద ఘటనలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మొత్తం 7 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ట్రాఫిక్ విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ రఫీతోపాటు మరో ఇద్దరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వా«దీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ మద్యం తాగి మితిమీరిన వేగంతో డ్రైవ్ చేయడమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలినట్టు సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు. -
New York: రన్‌వేపై ఫైర్ ట్రక్కును ఢీకొన్న ‘ఎయిర్ కెనడా’
న్యూయార్క్: అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ లాగార్డియా విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఒక విమానం రన్‌వేపై గ్రౌండ్ వెహికల్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 100 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్ కెనడా సీఆర్జే (CRJ) ఫ్లైట్ ఏసీ 8646 విమానం రన్‌వే 04/22ను దాటేందుకు ప్రయత్నిస్తుండగా, అక్కడ నిలిపి ఉంచిన ‘ట్రక్ 1’ అనే ఫైర్ ఇంజిన్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అప్రమత్తమై, లాగార్డియా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. విమానాల రాకపోకలను నిలిపివేస్తూ ‘గ్రౌండ్ స్టాప్’ ఉత్తర్వులు జారీ చేసింది.ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో విమానం రన్‌వేపై కదులుతూ ఉన్నట్లు స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలను చూస్తే.. విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విజువల్స్‌ను విమానయాన అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. గాయపడిన వారి సంఖ్య, పరిస్థితిపై ఎయిర్పోర్ట్ లేదా ఎయిర్ లైన్స్ వర్గాల నుండి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.ఈ ప్రమాదం కారణంగా లాగార్డియాలో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాప్యం లేదా విమానాల దారి మళ్లింపుపై అధికారులు ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భద్రతా పరమైన చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Reports of a serious incident at LaGuardia Airport in New York City, after Jazz Airlines Flight 646, a Canadair Regional Jet CRJ-900, collided with a firetruck while taxiing to Gate B48. pic.twitter.com/FPTayPzHAt— OSINTdefender (@sentdefender) March 23, 2026 -
సముద్రంలో రేసింగ్ లెజెండ్ గల్లంతు
మాల్దీవులు: భారత మోటార్ స్పోర్ట్స్ రంగంలో విషాదం నెలకొంది. ఐదుసార్లు ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌గా నిలిచిన లెజెండరీ డ్రైవర్ హరిసింగ్ (59), మాల్దీవుల్లో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతయ్యారు. గడచిన 48 గంటలుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఆయన ఆచూకీ లభించకపోవడంతో, ఆయన మృతి చెంది ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.అసలేం జరిగింది?శుక్రవారం ఉదయం వావు అటోల్‌లోని ఫెలిధూ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియాకు చెందిన యాచ్‌తో అనుసంధానమై ఉన్న ఒక హై-స్పీడ్ బోటు అదుపుతప్పి సముద్రంలో బోల్తా పడింది. ఆ సమయంలో బోటులో హరిసింగ్, సింఘానియాతో పాటు మరో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు గౌతమ్ సింఘానియాతో సహా ఐదుగురిని సురక్షితంగా బయటకు తీశాయి. అయితే హరిసింగ్, బోటు కెప్టెన్ మాత్రం సముద్ర అలల ఉధృతికి కొట్టుకుపోయారు.పగడపు దీవుల్లో చిక్కుకున్నారా?మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ (MNDF) కోస్ట్ గార్డ్ బృందాలు మూడవ రోజు కూడా ముమ్మరంగా గాలిస్తున్నాయి. సముద్ర గర్భంలోని పగడపు దీవుల (Coral Reef) మధ్య హరిసింగ్ చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆయన ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ విషాద వార్త తెలియగానే హరిసింగ్ కుమారుడు మివాన్ సింగ్ మాల్దీవులకు చేరుకున్నారు.భారత రేసింగ్ చరిత్రలో..హరిసింగ్ కేవలం ఒక రేసర్ మాత్రమే కాదు.. భారత మోటార్ స్పోర్ట్స్ రంగానికి ఒక మార్గదర్శిగా నిలిచారు.1990లలో వరుసగా ఐదుసార్లు జాతీయ ర్యాలీ ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించారు. ప్రతిష్టాత్మక ఆసియా జోన్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న తొలి భారతీయునిగా నిలిచారు. ప్రస్తుతం జేకే టైర్ మోటార్ స్పోర్ట్ హెడ్‌గా ఉంటూ, పలువురు యువ రేసర్లకు శిక్షణనిస్తున్నారు. హరిసింగ్ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు యుద్ధప్రతిపాదికన కొనసాగుతున్నాయి.ఇది కూడా చదవండి: ఎన్నికల విధుల ఒత్తిడి.. నదిలో దూకిన ఉపాధ్యాయుడు -
ఒక్క యాక్సిడెంట్.. 1.32 లక్షల కార్లు రీకాల్
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పాపులర్ ఎస్యూవీ 'పాలిసేడ్' (2026 మోడల్) విక్రయాలను తక్షణమే నిలిపివేస్తూ (Stop-Sale) ఆదేశాలు జారీ చేసింది. ఒక చిన్నారి ప్రాణం పోవడానికి కారణమైన సాంకేతిక లోపం వెలుగుచూడటంతో, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.32 లక్షల వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.అసలేం జరిగింది?నివేదికల ప్రకారం.. పాలిసేడ్ కారులోని మూడవ వరుస (3rd Row) పవర్ సీటు మధ్యలో చిక్కుకుపోవడంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కార్లలో 'యాంటీ-పించ్' (Anti-Pinch) ఫీచర్ ఉంటుంది. సీటు ఫోల్డ్ అవుతున్నప్పుడు లేదా జరుగుతున్నప్పుడు ఏదైనా అడ్డంకి (వ్యక్తులు లేదా వస్తువులు) తగిలితే ఈ సెన్సార్ వెంటనే గుర్తించి ఆగిపోవాలి. అయితే, ఈ మోడల్లో ఆ సెన్సార్ సరిగ్గా పనిచేయకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.ప్రభావితమైన వాహనాలుహ్యుందాయ్ స్వచ్ఛందంగా చేపట్టిన ఈ రీకాల్ పరిధిలోకి 2026 హ్యుందాయ్ పాలిసేడ్ 'లిమిటెడ్', 'కాలిగ్రఫీ' ట్రిమ్స్ వస్తాయి. ఉత్తర అమెరికా, కెనడాలలో 68,500 వాహనాలు, ప్రపంచవ్యాప్తంగా 1,32,000 వాహనాలను కంపెనీ రీకాల్ చేసింది.లోపం ఎక్కడ ఉంది?నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA)కు సమర్పించిన పత్రాల ప్రకారం.. రెండో, మూడో వరుస సీట్లను పవర్-ఫోల్డ్ చేసేటప్పుడు లేదా వన్-టచ్ టిల్ట్-అండ్-స్లైడ్ ఫీచర్ వాడుతున్నప్పుడు సెన్సార్లు ప్రయాణికులను గుర్తించడంలో విఫలమవుతున్నాయి. దీనివల్ల ప్రయాణికులు సీట్ల మధ్య నలిగిపోయే ప్రమాదం ఉందని కంపెనీ అంగీకరించింది.కంపెనీపై ఆర్థిక ప్రభావంఈ రీకాల్ ప్రక్రియ కోసం హ్యుందాయ్ సుమారు 100 బిలియన్ వాన్లు (66.8 మిలియన్ డాలర్లు) ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. 2026లో హ్యుందాయ్ అంచనా వేసిన వార్షిక లాభం 12.9 ట్రిలియన్ వాన్లు. రీకాల్ ఖర్చు కంపెనీ లాభంలో కేవలం 0.8% మాత్రమే. కాబట్టి, కంపెనీ ఆర్థిక స్థితిపై లేదా షేర్ ధరపై దీని ప్రభావం చాలా స్వల్పంగానే ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.కాగా తమ కారు వల్ల ప్రాణాలు కోల్పోయిన చిన్నారి కుటుంబానికి హ్యుందాయ్ సంస్థ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. కస్టమర్ల భద్రతకే తాము పెద్దపీట వేస్తామని స్పష్టం చేసింది. -
పరీక్ష రోజే తండ్రి మరణం.. శోకాన్ని దిగమింగుతూ
సాక్షి, మెదక్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుమారుడి పరీక్ష రోజే దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు. దీంతో పుట్డెడు దుఃఖాన్ని దిగమింగుతూ. అంతటి శోకంలోనూ ఆ పిల్లాడు పదవ తరగతి పరీక్షకు హాజరయ్యాడు.. ఈ ఘటన పలువురిని కంటతడికి గురిచేసింది. శివంపేట మండలం ఉసిరిలకాపల్లి గ్రామ శివారులో ఈ రోజు ( శనివారం) అర్ధరాత్రి శివాoపేట మండలం పంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు (45) అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కాగా నేడు అతని అంత్యక్రియలు జరగాల్సి ఉంది. అయితే అంతటి దుఃఖంలోనూ అతని కుమారుడు కుమ్మరి ధనుష్ తన బాధను దిగమింగుకుంటూ తూప్రాన్ లోని బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. తన తండ్రి ఎంతో కష్టపడి తమని చదివిస్తున్నాడని అందుకు అతను ఇప్పుడు భౌతికంగా తమవద్ద లేకపోయినటప్పటికీ నాన్న కష్టం వృధా కాకూడదని పరీక్షలకు హాజరవుతున్నానని విలపించాడు. ఈ ఘటన అక్కడి స్థానికులను ఎంతగానో కలిచివేసింది. -
అల్లూరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి ,అల్లూరి : తుమ్మల వలస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు విజయనగరం జిల్లా చింతాడ వాసులుగా సమాచారం. కూలిపనుల కోసం అరకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
టైరు పేలి పెళ్లి వాహనం పల్టీ
నిర్మల్ రూరల్/సిరికొండ: పెళ్లికి వెళుతున్న వాహనం పల్టీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సోన్పల్లి గ్రామానికి చెందిన బోయిన్వాడ్ గణపతి చెల్లి కుమారుడి వివాహం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గురువారం జరిగింది. ఈ పెళ్లికి సోన్పల్లి నుంచి ఐచర్ వాహనంలో 24 మంది బయల్దేరారు. వీరివెంట ఫర్నిచర్ కూడా తీసుకెళ్లారు. నిర్మల్ రూరల్ మండలం కొండపూర్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలడంతో అదుపు తప్పి రోడ్డుపైనే పల్టీ కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న వారంత ఎగిరి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. తీవ్రంగా గాయపడిన బోయిన్వాడ తులసీదాస్(38), బోరడే లక్ష్మణ్(60) అక్కడికక్కడే మృతిచెందారు. మరో 22 మంది గాయపడ్డారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లారు. మిగతా వారు నిర్మల్‌లోనే చికిత్స పొందుతున్నారు. వాహనంలో ఉన్న ఫర్నిచర్ ప్రయాణికులపై పడడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు తెలిపారు. » మృతుడు బోయిన్వాడ్ తులసీదాస్‌కు భార్య, డిగ్రీ చదువుతున్న కూతురు, ఏడో తరగతి చదువుతున్న కొడుకు ఉన్నారు. తులసీదాస్ మరణంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది » మృతుడు బోరడే లక్ష్మణ్ బోయిన్వాడ్ గణపతి ఇంటి పక్కన ఉంటాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు ఉండగా, వారి పెళ్లిళ్లు అయ్యాయి. -
పొద్దున్నే రెండు ఘోరాలు.. గాలిలో 14 నిండు ప్రాణాలు..
గురుగ్రామ్: హర్యానాలో మంగళవారం తెల్లవారుజామున రెండు వేర్వేరు చోట్ల పెను విషాదాలు చోటుచేసుకున్నాయి. గురుగ్రామ్‌లోని ఒక భవన నిర్మాణ ప్రాంతంలో భారీ మట్టి దిబ్బ పడి, ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, జింద్ జిల్లాలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మరో ఏడుగురు మహిళా కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ రెండు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.గురుగ్రామ్‌లోని సిద్ధ్రావలి ప్రాంతంలో ఓ ప్రైవేట్ నిర్మాణ ప్రాంతంలో భారీ ఎత్తున పోగుపోసిన మట్టి ఒక్కసారిగా జారిపోవడంతో అక్కడ పనిచేస్తున్న సుమారు 20 మందికి పైగా కార్మికులు దాని కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను వెలికితీయగా, మరో నలుగురిని కాపాడారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా పది మందికి పైగా కార్మికులు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.జింద్‌లో అగ్నిప్రమాదంజింద్ జిల్లా సఫిడాన్ ప్రాంతంలోని ఒక పెయింట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న ఏడుగురు మహిళా కార్మికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసులు ఫ్యాక్టరీ యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ రెండు దుర్ఘటనలపై హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జింద్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: ఖమేనీ మృతితో రంగంలోకి విధ్వంసక శక్తులు? -
ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలి దుర్మరణం
బత్తలపల్లి: బస్సు రాగానే ఎక్కేందుకు ప్రయాణికుల నడుమ తోపులాట జరగడంతో ఓ వృద్ధురాలు అదే బస్సు కింద పడి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఆదివారం జరిగింది. కదిరికి చెందిన భాగ్యమ్మ(80) తన కోడలు మాధవితో కలిసి ఆదివారం ధర్మవరంలో సమీప బంధువుల ఇంట్లో శుభకార్యం చూసుకుని బత్తలపల్లికి చేరుకున్నారు. నాలుగు రోడ్ల కూడలిలో కదిరి వెళ్లే బస్సు కోసం వేచి ఉండగా బస్సు రావడంతో ఎక్కే సమయంలో ప్రయాణికుల రద్దీ కారణంగా తోపులాట జరిగింది. భాగ్యమ్మ ప్రమాదవశాత్తు బస్సు వెనుక టైరు కింద పడింది. బస్సు ముందుకు కదలగానే ఆమె తలపై నుండి వెనుక చక్రాలు వెళ్లాయి. తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు కేకలు వేయడంతో బస్సు నిలిపివేశారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ బస్సులో మహిళ మృతిజంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ శ్వాస ఆడక మృతి చెందింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన ముప్పిడి జ్యోతిరెడ్డి (50) ఆదివారం జంగారెడ్డిగూడెంకు వెళ్లేందుకు గోపాలపురంలో కొవ్వూరు ఆర్టీసీ డిపో బస్సు ఎక్కింది. బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉండగా జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్‌కు వచ్చేసరికి జ్యోతిరెడ్డి స్పృహ తప్పి పోయిఉంది. తోటి ప్రయాణికులు గమనించి 108కు సమాచారమివ్వగా స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్టు చెప్పారు. జ్యోతిరెడ్డి కుమారుడు తన తల్లి అనారోగ్యంతో ఉన్నారని, ఆమె మృతిపై అనుమానాలూ లేవని చెప్పి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. -
మద్యం మత్తులో యాక్సిడెంట్.. ప్రశ్నించిన స్థానికులపై కర్రలతో దాడి
-
పీఎం రాహత్ స్కీమ్... ఆసుపత్రి బిల్లు ప్రభుత్వం కడుతుంది
-
జల్లికట్టులో విషాదం.. ముగ్గురు మృతి
చైన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. సింగంపువారి పల్లిలో నిర్వహించిన జల్లికట్టు పోటీలలో ఎద్దులు అదుపుతప్పి ప్రేక్షకుల పైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 50 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫెరారీ కారు ప్రమాద ఘటనలో సీసీ ఫుటేజ్ విడుదల
-
హైదరాబాద్ లో ఫెరారీ కారు బీభత్సం.. ఆ కారు ఎవరిదంటే..
-
కుప్పకూలిన ఆశలకు ఏడాది
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్ట్ సొరంగం కుంగిన ఘోర ప్రమాదానికి ఆదివారం నాటికి ఏడాది పూర్తికానుంది. గతేడాది ఫిబ్రవరి 22న నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్దనున్న ఇన్లెట్ వద్ద సొరంగం కుప్పకూలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) ద్వారా సొరంగం తవ్వకం పనులు చేపడుతున్న సమయంలో అకస్మాత్తుగా సొరంగం పైకప్పు కుప్పకూలడంతో శిథిలాల కింద పడి 8 మంది కార్మికులు మరణించారు. వీరిలో ఇద్దరి కార్మికుల మృతదేహాలను మాత్రమే బయటకు తీయగలిగారు. ఘోర ప్రమాదం చోటుచేసుకుని ఏడాది కావస్తున్నా ఇప్పటికీ సొరంగం ఇన్లెట్ వైపు నుంచి తవ్వకాలపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అత్యాధునిక సాంకేతిక..నిపుణులు రంగంలోకి దిగినా.. ఘోర ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను వెలికి తీసేందుకు గంటల వ్యవధిలోనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ, ఇండియన్ ఆర్మీ తదితర బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కేరళ నుంచి కడావర్ డాగ్స్‌తో పాటు ఉత్తరాఖండ్ గనుల్లో నిపుణులుగా ఉన్న ర్యాట్‌హోల్ మైనర్స్(ఇరుకైన ప్రదేశాల్లో చిక్కుకున్నవారిని రక్షంచే కార్మికులు) రోజుల తరబడి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.జాతీయ స్థాయి సంస్థలు ఎన్జీఆర్ఐ, రోబోటిక్స్, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ (భూమి ఉపరితలాన్ని తవ్వకుండానే కింద ఉన్న వస్తువులు, మట్టిపొరలను గుర్తించడానికి రేడియోతరంగాలను ఉపయోగించే ఒక అధునాతన సాంకేతిక..ఈ టెక్నాలజీ కచ్చితంగా మృతదేహాలను మ్యాపింగ్ చేయగలదు), టన్నెల్ నిపుణుల సహాయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇద్దరు కార్మికుల మృతదేహాలు మాత్రమే లభించగా, మిగతా ఆరుగురి మృతదేహాలు శిథిలాల కిందే ఉండిపోయాయి. 50 రోజుల పాటు సహాయక చర్యలను కొనసాగించిన ప్రభుత్వం అనంతరం నిలిపివేసింది. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షలను కలెక్టర్ సంతోష్ అందించారు. అవుట్లెట్ వైపు నుంచి మొదలైన తవ్వకాలు.. దోమలపెంట ఇన్లెట్ వైపు నుంచి పనులు ప్రారంభించే అవకాశం లేకపోవడంతో అవుట్లెట్ వైపు నుంచి పనులను మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అచ్చంపేట మండలం మన్నెవారిపల్లె వద్దనున్న అవుట్లెట్ సొరంగం వద్ద హెలీబోర్న్ మాగ్నటిక్ సర్వే (హెలీకాప్టర్ సహాయంతో భూగర్భజలాలు, ఖనిజాలు, రాతినిర్మాణాలను గుర్తించడానికి ఉపయోగించే అధునాతన సాంకేతికత)ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సర్వే ముగిసిన తర్వాత ఈనెల 17నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెథడ్(ఏటీఎం) పద్ధతిలో బ్లాస్టింగ్ ద్వారా సొరంగం తవ్వకాలను చేపడుతున్నారు. ఇంకా 9.5 కి.మీ మేర సొరంగం పెండింగ్.. మొత్తం 43.931 కి.మీ మేర ఎస్ఎల్బీసీ సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా, ఇరువైపుల నుంచి పనులు మొదలుపెట్టారు. ఇన్లెట్ నుంచి 13.936 కి.మీ వరకు తవ్వకం పూర్తికాగా అక్కడే ప్రమాదం జరిగి టీబీఎం ధ్వంసమైంది. అవుట్లెట్ నుంచి ఇప్పటివరకు 20.435 కి.మీ మేర తవ్వకం పూర్తికాగా ఇంకా 9.533 కి.మీ సొరంగాన్ని తవ్వాల్సి ఉంది. అవుట్లెట్ నుంచి సొరంగం లోపల 20 కి.మీ దూరంలో తవ్వకాలు పూర్తిచేయడం సవాలుగా మారింది. -
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కు ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వెళ్తున్న క్రమంలో ఘటన చోటుచేసుకుంది. సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి వాహనాలు ఢీకొన్నాయి. కాన్వాయ్‌లోని చివరి వాహనం దెబ్బతీంది. -
ఢిల్లీ రోడ్డు ప్రమాదం.. మాది తప్పే
కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో 17 ఏళ్ల టీనేజర్ నిర్లక్ష పూరితంగా కారు నడిపిన ఉదంతంలో 23 ఏళ్ల యువకుడు సాహిల్ ధనేశ్ర ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనలో ‘రీల్స్’ కోణం లోనే అని బహిర్గతమైంది. దీంతో ఆయువకుడి తల్లి తీవ్ర ఆవేదనకు గురైంది. సంపన్నుల పిల్లలు సరదాగా చేసే ‘రీల్స్’కు తన ఒక్కగానొక్క కుమారుడు బలయ్యాడని మృతుని తల్లి ఇనా మాకెన్ కన్నీటిపర్యంతమైంది. అయితే ఈ ఘటనపై నిందితుడి తండ్రి క్షమాపణలు తెలిపాడు.టీనేజర్ తండ్రి మాట్లాడుతూ.. "ఇది చాలా తప్పు ఆరోజు నా భార్యకు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది. నా కుమారుడికి యాక్సిడెంట్ జరిగినట్లు తెలిసింది. దీంతో ఎంతో భయానికి గురయ్యా. నా భార్యను అడిగా ఇది ఎలా జరిగిందని, అప్పుడు తను చెప్పింది. కారుతో ప్రమాదం జరిదిందని చెప్పింది. దీంతో వెంటనే అక్కడికి వెళ్లాను." అని ఆయన అన్నారు.మైనర్ బాలుడికి కారు ఇవ్వడం కరెక్టేనా?ఆ సమయంలో నేను అక్కడ లేను. ఆయనకు కారు ఇవ్వడం తప్పేకారుపై 13 చలాన్లు ఉన్నాయిగా?అది బిజినెస్ కోసం తిరిగే కారు దానిపై చలాన్లు ఉండడం సహజంమీరు మీ మైనర్ కుమారున్ని డ్రైవింగ్ చేయకుండా ఆపలేదా?అసలు అతను డ్రైవ్ చేస్తున్నట్లు నాకు తెలియదు. అతను నన్ను చూసి చాలా భయపడేవారు. ఆ కారులో మీ కూతురు రీల్స్ చేస్తున్నారుగా?లేదు వారు రీల్స్ చేయడం లేదు ఫోటోలతో పాటు వీడియోలు తీసుకుంటున్నారు. అని ఆయన బదులిచ్చారు.అయితే డబ్బున్న వాళ్లు చేేసే సరదాలకు తన కుటుంబం రోడ్డుపాలయిందని ప్రమాదంలో మృతిచెందిన సాహిల్ ధనేశ్ర తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కారుతో ఢీకొట్టాక కనీసం వారు బ్రేకులు కూడా వేయలేదని అంత నిర్లక్షంగా ఉన్నారని తెలిపింది.. ‘‘మాకున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు మా అబ్బాయి ఎంతో కష్టపడుతుంటాడు. చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటాడు. స్పోర్ట్స్‌లో ఎన్నో మెడల్స్ తెచ్చుకున్నాడు. నైనిటాల్లో సెయింట్ జోసెఫ్ కాలేజీలో బీబీఏ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నాడు. మాంచెస్టర్‌లో లగ్జరీ ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసేందుకు త్వరలో బ్రిటన్‌కు వెళ్లాల్సినవాడు ఇలా ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు’’అని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే ప్రస్తుతం ఆ టీనేజర్ బెయిల్ పై ఉన్నాడు. పదో తరగతి బోర్డ్ పరీక్షలు రాయల్సి ఉన్నందున అతనికి జువెనైల్ జస్టిస్ బోర్డ్ మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది.ఇప్పటికే ఒంటరిగా జీవిస్తున్న తల్లి జీవితం కుమారుడి మరణంతో ఏకాకిగా మారిందని పొరుగింటి వాళ్లు చెప్పారు. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి కాలేజ్ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో సమీపంలో కారును పార్క్చేసిన డ్రైవర్ అజిత్ సింగ్ జీవితం సైతం కష్టాల కడలిలో పడింది. టీనేజర్ ఆ యువకుడి బైక్‌ను ఢీకొట్టాక నేరుగా వచ్చి అజిత్‌కు చెందిన క్యాబ్‌నూ ఢీకొట్టాడు. దీంతో అజిత్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిపాలయ్యాడు. ‘‘కాళ్లు, చేతులు, తల, వెన్నుపూసకు గాయాలయ్యాయి. మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలి వైద్యులు సూచించారు. -
తీవ్ర విషాదాన్ని నింపిన మెటర్నిటీ ఫోటోషూట్
మరో బిడ్డ రాబోతోందన్న ఆనందంలో ఉన్న ఒక తల్లి అనూహ్యంగా తీవ్ర విషాదంలో మునిగి పోయింది. రెండోసారి తల్లి కాబోతున్నమహిళ మెటర్నిటీ ఫోటోషూట్ చేయించుకుంటూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొదటి బిడ్డ, మూడేళ్ల చిన్నారి నీటి కొలనులో పడి మరణించిన వైనం తీవ్ర దిగ్భ్రాంతి రేపింది.పోలీసుల సమాచారం ప్రకారం, బెంగళూరుకు చెందిన చరణ్ స్వాతి దంపతులు. వీరికి తొలి సంతానంగా ఒక కుమారుడున్నాడు. ప్రస్తుతం స్వాతి రెండోసారి ఎనిమిది నెలల గర్భవతి. ఈ క్రమంలో ఆమెకు మెటర్నిటీ ఫోటోషూట్ జరుగుతోంది. సమీపంలో ఆడుకుంటున్న లక్ష్మీర్ జారి అక్కడే ఉన్న చిన్ననీటి కొలనులో పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించి ఆ చిన్నారికి సాయం అందేలోపే ప్రాణాలొదిలేశాడు. ఆసుపత్రికి తరలించేటప్పటికి చిన్నారి చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఉద్యోగం నిమిత్తం విదేశాల్లో ఉన్న ఆ చిన్నారి తండ్రి బెంగళూరుకు రానున్నారని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: పాక్ నిఘా'హనీ-ట్రాప్' ముప్పు : పోలీసులకు కేంద్రం హెచ్చరికకస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్ -
ఘోరరోడ్డు ప్రమాదం గాల్లోకి ఎగిరిన బైక్.. ఏడుగురు మృతి
సాక్షి బెంగళూరు : బెంగళూరు రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం దొబ్బాస్‌పేట-హోస్కోట్ శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ పై అతి వేగంతో వస్తున్న SUV, లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.బెంగళూరు అర్బన్ జిల్లా హోస్కోట్ తాలూకాలోని ఎం సత్యవారా గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న రెండు SUVలు, ఒక క్యాంటర్ ట్రక్ , మోటార్ సైకిల్ పరస్పరం ఢీకొన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం ఒక కాలేజ్ కు చెందిన ఆరుగురు యువకులు మహేంద్రా SUVలో అతివేగంగా వస్తున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ తొలుత బైక్ ను ఢీకొట్టి అదే స్పీడుతో అనంతరం ట్రక్కును ఢీకొట్టారు. SUV ఢీకొట్టిన వేగానికి బైకునడుపుతున్న వ్యక్తి గాలిలోకి ఎగిరిపడ్డాడు. అనంతరం అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఆ ట్రక్కు సైతం బోల్తా పడింది.అధిక వేగంతో ఢీకొట్టడంతో SUV గుర్తుపట్టలేకుండా నుజ్జునుజ్జయ్యింది.ఇదిలా ఉండగా వెనుక వస్తున్న మరో కారు వెనక వస్తున్న మరో కారు SUVని ఢీకొట్టింది. మెుత్తంగా ఈ ప్రమాద ఘటనల SUVలో ప్రయాణిస్తున్న ఆరుగురితో పాటు బైక్ పై పయణిస్తున్న వ్యక్తి మెుత్తంగా ఏడుగురు మృతిచెందారు. గాయపడిన వారిని స్థానికంగా గల ఎంవీజే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతిచెందిన వారు ఒకే కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. విపరీతమైన వేగంతో ప్రయాణించడమే రోడ్డు ప్రమాదానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. . Horrific chain #accident in #BengaluruSeven feared dead near Sathyawara on the Hoskote-Dabaspet STRR stretch.The crash involved a truck, 2 SUVs and a bike. The truck’s chassis got cut & the vehicle toppled. @timesofindia (FwD 📹: Part 1) pic.twitter.com/s6hapuFqvd— TOI Bengaluru (@TOIBengaluru) February 13, 2026 -
లంబోర్ఘిని ప్రమాదం : బిజినెస్ టైకూన్ కొడుకు అరెస్ట్, గంటల్లో బెయిల్
లంబోర్గిని కారు ప్రమాదం కేసులో టుబాకో టైకూన్ కుమారుడు శివం మిశ్రా కుమారుడు 26 ఏళ్ల శివం మిశ్రాను కాన్పూర్ పోలీసులు అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని కాన్పూర్ (Kanpur) లో గత ఆదివారం జరిగిన లగ్జరీ లంబోర్ఘిని కారు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా టుబాకో టైకూన్ కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా (Shivam Mishra) ను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో హాజరుపర్చిన కేవలం గంటల వ్యవధిలోనే శివం మిశ్రాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఖరీదైన , హైస్పీడ్ కారు ఢీకొని ముగ్గురు ఆస్పత్రిపాలైన నాలుగు రోజుల తర్వాత ఈ అరెస్ట్ జరిగింది.గత ఆదివారం రింగ్ వాలా చౌరాహా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన లంబోర్ఘిని కారు ఝూలా పార్కు దగ్గర ముందుగా ఆటోరిక్షాను, బుల్లెట్ బైకును ఢీకొని, ఆ తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోరిక్షా డ్రైవర్ తౌసీఫ్ అహ్మద్, ఇద్దరు మోటార్ సైకిల్ రైడర్లు విశాల్, సోను త్రిపాఠి గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది శివమ్ కాదని, డ్రైవర్ మోహన్ యాదవ్ అని శివమ్ తండ్రి కేకే మిశ్రా చెప్పారు. డ్రైవర్ మోహన్ యాదవ్ కూడా తానే డ్రైవ్ చేశానని తొలుత ఒప్పుకున్నాడు.అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారును శివం మిశ్రానే నడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, తమ దర్యాప్తులో తేలిందని , ఆస్పత్రి నుంచే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. శివమ్ మిశ్రా కాన్పూర్‌లో ఉన్నట్లు సమాచారం అందగానే ఐదు బృందాల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కన్పూర్ డీసీపీ తెలిపారు.శివం మిశ్రా అరెస్ట్ అక్రమని న్యాయవాది నరేష్ చంద్ర త్రిపాఠి వాదించారు. అందుకే అతని రిమాండ్‌ను కోర్టు తిరస్కరించిందన్నారు. రూ.20,000 అండర్ టేకింగ్ , మరో రూ.20 వేల వ్యక్తిగత బాండ్‌పై విడుదలైనట్టు తెలిపారు. -
బీభత్సం సృష్టించిన అంబులెన్స్.. మహిళ మృతి
పశ్చిమగోదావరి: అత్యవసర స్థితిలో ఉన్న వా రిని ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు నిలబెట్టే అంబులెన్స్ మృత్యు శకటంగా మారింది. వేగంగా దూసుకొచ్చి అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. బైక్, ఆటోను అంబులెన్స్ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం మండలంలోని సీతారామపురం టోల్‌ప్లాజా సమీపంలో మొగల్తూరు వైపు నుంచి నరసాపురం వస్తున్న ఓ ప్రైవేట్ అంబులెన్స్ ముందు వెళుతున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. అలాగే అదుపు తప్పి పక్కన వెళుతున్న ఆటోను ఢీకొట్టింది. మొగల్తూరు బండి ముత్యాలమ్మ ఆల యానికి వెళ్లి తిరిగి స్వగ్రామం యలమంచిలిలంకలోని వైవిలంకకు బైక్‌పై వెళుతున్న పిప్పళ్ల శ్రీవెంకట మోహన కృష్ణ, అతడి తల్లి, చినమ్మ సత్యలక్ష్మీ పద్మశ్రీ (40)కి తీవ్రగాయాలయ్యాయి. అలాగే ఆటోలోని డ్రైవర్‌తో పాటు ఇద్దరికీ గాయాల య్యాయి. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. తీవ్రగాయాలైన పద్మశ్రీని పాలకొల్లు తరలిస్తుండగా ఆమె మరణించింది. మృతురాలి భర్త నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నరసాపురం రూరల్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. -
కర్ణాటక రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కర్ణాటకలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద ఈ ప్రమాదం జరగ్గా.. ఏపీకి చెందిన నలుగురు కూలీలు మరణించడం విషాదకరమని వైయస్ జగన్ అన్నారు. మృతులంతా అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందినవారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు కూడా. మృతుల కుటుంబాలకు జగన్.. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
పంట పొలాల్లో కూలిన శిక్షణా విమానం
బెంగళూరు:కర్ణాటకలో శిక్షణా విమానం కుప్పకూలింది. కర్ణాటక బాబలేశ్వర్ జిల్లా మంగళూరులో ఓ శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు.. రెడ్ బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన రెండు సీట్ల విమానం ట్రైనింగ్‌లో భాగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే, ప్రయాణంలో ఉండగా అకస్మాత్తుగా ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విమానం పంట పొలాల్లో కూలింది. ఈ ఘటనలో విమానం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, పైలట్, ట్రైనీ పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు.ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారి పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విమానం శిక్షణ ప్రయాణంలో ఉందని, సాంకేతిక లోపమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. విమానం మూడు ముక్కలుగా విరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. అయితే, పైలట్, ట్రైనీ పైలట్ సకాలంలో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
డేంజర్ యాక్సిడెంట్.. స్కూల్ బస్సు నుజ్జు నుజ్జు..
-
కాకినాడ ప్రత్తిపాడులో నడిరోడ్డుపై ఘోరం
సాక్షి, కాకినాడ: ప్రత్తిపాడులోని కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోరం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం నుంచి ఇద్దరూ డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. గురువారం వేకువ జామున ఈ ప్రమాదం జరిగింది. అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు చేపల ఫీడ్‌తో వెళ్తున్న లారీని వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది మరో కంటైనర్ లారీ. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో రెండు వాహనాల క్యాబిన్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇరువురు డ్రైవర్లు బయటకు దూకేయగా.. కంటైనర్ లారీలో ఉన్న క్లీనర్ సజీవ దహనం అయ్యాడు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అన్నవరం పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
యాక్సిడెంట్ కాదు.. డాష్‌బోర్డ్ కెమెరా షాకింగ్ విజువల్స్
కర్ణాటకలోని బెంగళూరులోని హెబ్బగోడి ఠాణా పరిధిలో ఆదివారం సాయంత్రం ఎలక్ట్రానిక్స్ సిటీలోని అనంతనగర్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. హెబ్బగోడి నివాసి ప్రశాంత్ (28), రోషన్ హెగ్డే (27) ఆదివారం క్రికెట్ మ్యాచ్ ముగించుకుని సాయంత్రం మద్యం తాగారు. మద్యం మత్తులో కారును అడ్డదిడ్డంగా నడపడంతో కారు చెట్టుకు ఢీకొంది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇదీ తొలుత అందరూ అనుకున్న స్టోరీ. కానీ ఈ ఘటనకు సంబంధించి మరో ట్విస్ట్ వెలుగులో వచ్చింది. ప్రమాదంగా భావించిన ఈ ఘటన చివరికి ఒళ్లు గగుర్పొడిచే హత్యగా తేలింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ప్రశాంత్, రోషన్ ఇద్దరు స్నేహితులు. ప్రశాంత్ బాడీబిల్డర్‌గా పనిచేస్తుండగా, రోషన్ డొమ్లూరులోని ఒక సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కారులోని డాష్‌క్యామ్‌ను డీసీపీ (ఎలక్ట్రానిక్స్ సిటీ) ఎం నారాయణ గమనించి, ఆ ఫుటేజీని పరిశీలించమని ఆదేశించడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది.ఆదివారం సాయంత్రం కమ్మసంద్రలో కొంతమందితో కలిసి క్రికెట్ ఆడిన వీరు తరువాత మద్యం సేవించారు. మద్యం మత్తులో ప్రశాంత్ లైటర్ కోసం రోషన్ వద్దకు వచ్చి అతనిని దుర్భాషలాడాడని, దీనితో వాగ్వాదం చెలరేగింది. ఇద్దరూ బీర్ బాటిళ్లతో ఒకరినొకరు దాడి చేసుకున్నాడు. పరిస్థితి దిగజారడంతో, రోషన్ తన టాటా సఫారీలోకి ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, ప్రశాంత్ కారును వెంబడించి, కదులుతున్న వాహనం ఎడమవైపు ఫుట్‌బోర్డ్‌పైకి ఎక్కి డోర్‌ను పట్టుకుని వేలాడాడు. కారు ఆపమని ప్రశాంత్ వేడుకుంటున్నా రోషన్ పట్టించుకోలేదు. సుమారు 600 మీటర్ల దూరం వరకు కారును వేగంగా, ప్రమాదకరంగా నడిపాడు. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగానే మొదట ఓ కాంపౌండ్ గోడను, ఆ వెంటనే వెనక్కి తిప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రశాంత్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విజువల్స్ డాష్‌క్యామ్‌లో రికార్డయ్యాయని పోలీసు అధికారి తెలిపారు.ఇది ఉద్దేశపూర్వకమైన హత్య అని తేలడంతో, తీవ్ర గాయాలతో రోషన్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి విచారణకోసం అదుపులోకితీసుకున్నామని అధికారి నారాయణ తెలిపారు. రోషన్‌కు నాలుక దాదాపు తెగిపోయిందని, చిన్న శస్త్రచికిత్స జరిగిందని వైద్యులు మాకు తెలిపారు. సోమవారం అతన్ని డిశ్చార్జ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Drunk Driving Nightmare: Bengaluru Roads Claim Another Life in Shocking Car-Ramming IncidentShocking incident from Bengaluru.A drunken brawl turned deadly when Prashanth M (33), a bodybuilder, was killed after Roshan Hegde (37), a software engineer from Mangaluru, allegedly… pic.twitter.com/sJ2c3zldMM— Karnataka Portfolio (@karnatakaportf) January 26, 2026 -
కర్నూలులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం
-
ట్రావెల్స్ బస్సు బీభత్సం
కొనకనమిట్ల: మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారికట్ల–చినారికట్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ బొలేరో వాహనాన్ని, ఆ వెంటనే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో 20 మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు... శుక్రవారం రాత్రి కనిగిరి నుంచి వెదురుకర్రల లోడుతో గిద్దలూరుకు వెళ్తున్న బొలేరో వాహనం చినారికట్ల సమీపంలో మరమ్మతులకు గురైంది. డ్రైవర్ పీరయ్య బొలేరోను రోడ్డు పక్కన నిలిపి వాహనం లోపల నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వాసవి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు వెళుతూ రోడ్డు పక్కన ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా విజయవాడ నుంచి కనిగిరి వస్తున్న ఆర్టీసీ బస్‌ను కూడా ఢీకొంది. దీంతో బొలేరో వాహనంలో ఉన్న వెదురు కర్రలు ట్రావెల్స్ బస్సు ముందు భాగంలోకి చొచ్చుకుపోయాయి. రెండు బస్సుల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు ముందు సీటులో కూర్చున్న వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్యగారిపల్లెకు చెందిన అన్నపురెడ్డి జనార్ధన్‌రెడ్డి (54) పొట్టలోకి వెదురు కర్ర చొచ్చుకుపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు బస్సుల డ్రైవర్లతోపాటు మరో 18 మందికి గాయాలయ్యాయి. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కొనకనమిట్ల పోలీసులు కనిగిరి వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. జనార్ధన్‌రెడ్డి మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో వచి్చన భారీ శబ్దానికి నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడి లేచి ఏమైందో తెలియక చీకట్లో తీవ్ర భయాందోళనలకు గురై ఆర్తనాదాలు చేశారు. -
ఆర్మీ వాహనం బీభత్సం.. చక్రాల కింద విద్యార్థి నుజ్జు నుజ్జు
-
నలుగురు ప్రాణాలు తీసిన బర్త్‌డే పార్టీ
ఊదయ్‌పూర్ అతివేగంగా కారు నడిపి నిర్లక్షంగా వ్యవహరించినందుకు యువకులు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఆయువకుడు 140 కిలోమీటర్ల వేగంతో సిగరెట్ చేతిలో పట్టుకొని కారు నడిపాడు. దీంతో ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనవివరాలు వీడియోలో రికార్డయ్యాయి.డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్షంగా వ్యవహరించకూడదని ఎన్నిసార్లు చెప్పినా యువత పెడచెవిన పెడుతున్నారు. వాహనాన్ని నడిపేటప్పుడు మనం చేసే తప్పిందం ఖరీదు నిండుప్రాణాలే అన్న సంగతి యువత మర్చిపోతున్నారు. అహ్మదాబాద్‌లో తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి స్నేహితులు కలిశారు. అనంతరం టీకోసం మిత్రులంతా కారులో బయిలుదేరారు. ఆసమయంలో కారు నడుపుతున్న వ్యక్తి చేతిలో సిగరెట్ పట్టుకొని 140 కిలోమీటర్ల వేగంతో కారు నడిపారు.ఆసమయంలో ఎదురుగా కారు రావడంతో వాహనాన్ని కంట్రోల్ చేయలేక ఢీకొట్టారు. ఈప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన అనంతరం కారులోని వ్యక్తులు సహయం కోసం అర్తనాథాలు చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ ప్రమాద ఘటన జరిగిన వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది.स्कूटी गिरवी रखी। किराए पर कार ली। स्पीड 130 से ऊपर, नतीजा; 4 दोस्तों की मौतदोस्त का जन्मदिन मना रहे थे। उदयपुर में पुराने अहमदाबाद बाइपास पर 2 कारों की भिड़ंत हो गई। कार सवार 6 दोस्त 10 मिनट तक जान बचाने की गुहार लगाते रहे। जब तक लोग पहुंचे तब तक 4 दोस्तों की मौत हो चुकी थी। pic.twitter.com/wM5C5MyvwI— Arvind Sharma (@sarviind) January 19, 2026 -
ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి..
-
హైవేపై ప్రమాదాలు..ఒకరు మృతి..
-
విజయవాడ హైవేపై యాక్సిడెంట్.. ఢీకొట్టిన మూడు కార్లు
సాక్షి, నల్గొండ: హైదరాబాద్ -విజయవాడ నేషనల్ హైవేపై సినిమాస్టంట్ను తలపించే యాక్సిడెంట్ జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన కార్లు ఒకదానికొకటి వరుసగా మూడుకార్లు ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ కారు అక్కడ హైవే నెంబర్ 65 వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో దాని వెనుక వచ్చిన రెండు కార్లు వెనువెంటనే ఢీకొన్నాయి. దీంతో అందులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. యాక్సిడెంట్‌తో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.మరోవైపు సంక్రాంతి సెలవులు ముగియడంతో పండగకు హైదరాబాద్ నుంచి ఊరెళ్లిన ప్రజలు తిరుగుప్రయాణమయ్యారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
రోడ్లను కమ్మేసిన పొగమంచు.. ప్రమాదాల్లో ఏడుగురి మృతి
ఉత్తరప్రదేశ్‌ని పొగమంచు అతలాకుతలం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పొగమంచు తీవ్రంగా ఉండడంతో రోడ్డుపై ఏమి కనిపించక వాహనాలు ఎక్కడికక్కడ ఢీకొన్నాయి. దీంతో దాదాపు 7మంది ప్రాణాలు కోల్పోగా పెద్దఎత్తున ప్రజలు గాయపడ్డట్లు తెలుస్తోంది.ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. శీతాకాలం కావడంతో దట్టమైన పొగమంచు రోడ్లపై అలుముకుంది. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని 15 జిల్లాల్లో 40కి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. వాహనాలు ఢీకోనడంతో వేరువేరు ప్రమాద ఘటనల్లో ఏడుగురు మృతిచెందగా 50 మందికి పైగా గాయాలైనట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 100కు పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్‌లో అత్యంత కఠినమైన చలికాలం చిల్లైకలాన్ కొనసాగుతుంది. దీంతో కశ్మీర్ అంతటా ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి వెళ్లాయి. అత్యధికంగా షోపియాన్ ప్రాంతంలో -5.6 డిగ్రీలు, శ్రీనగర్ -4 డిగ్రీలు, గుల్మార్గ్ -4.2 డిగ్రీలు, సోనామార్గ్ -2.9, పహల్గామ్ -2.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు.జమ్మూకశ్మీర్‌లో చలికాలం అత్యంత ఎక్కువగా ఉండే కాలాన్ని చిల్లైకలాన్ అంటారు. ఇది డిసెంబర్ 21న ప్రారంభమై జనవరి 30 వరకూ ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలోకి వెళతాయి. -
విజయవాడ హైవేపై లారీ బోల్తా పల్టీ కొట్టిన కట్టెల లోడ్ లారీ
-
Revanth Reddy: రోడ్డు మీదకొచ్చే ముందు.. యాక్సిడెంట్స్ మర్డర్స్ తో సమానం
-
కార్లు మాట్లాడుకుంటాయి
రోడ్డు ప్రమాదాలు.. నిత్యం మనం వింటున్నవే. అయితే మారేది తీవ్రత మాత్రమే. కొత్త బండ్లు ఏ రీతిన పెరుగుతున్నాయో.. ప్రమాదాలు కూడా అదే స్థాయిలో అధికం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 2023లో 4,80,583 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటి కారణంగా 1,72,890 మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రాణ నష్టం జరిగిన తర్వాత స్పందించే బదులుగా ప్రమాదం జరిగే అవకాశాలను తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అన్ని విభాగాల్లో కలిపి దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో 2,56,07,391 కొత్త వెహికల్స్ రోడ్డెక్కాయి.కొన్నేళ్లుగా ఏటా కోట్లాది వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ఇంకేముంది ప్రమాదాలూ పెరిగి లక్షలాది కుటుంబాలకు తీరని శోకం మిగిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెహికల్–టు–వెహికల్ (వీ2వీ) కమ్యూనికేషన్ టెక్నాలజీని భారత్‌లో ప్రవేశపెట్టాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. 2026 చివరి నాటికి ఈ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రమాదం జరిగే అవకాశాలను తగ్గించేందుకు ఈ సాంకేతికత దోహదం చేస్తుందని ప్రభుత్వం ధీమాగా ఉంది. ఇంటర్నెట్ అవసరం లేకుండా..నెట్వర్క్, ఇంటర్నెట్ అవసరం లేకుండా వాహనాలు ఒకదానితో ఒకటి నేరుగా షార్ట్ రేంజ్ వైర్లెస్ సిగ్నల్స్ ద్వారా సంభాíÙంచుకోవడానికి ఈ సాంకేతికత వీలు కల్పిస్తుంది. రహదారుల మీద పార్క్ చేసిన వాహనాలను అదే మార్గంలో వేగంగా ప్రయాణించే ఇతర వాహనాలు ఢీకొట్టకుండా నివారించడంలో ఈ సాంకేతికత ప్రభావవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. శీతాకాలంలో దట్టమైన పొగమంచు సమయంలో యాక్సిడెంట్లను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ వ్యవస్థ ద్వారా వాహనాలు సిగ్నల్స్‌ను ఒకదానితో మరొకటి ఇచ్చిపుచ్చుకుంటాయి.మరొక వాహనం ప్రమాదకరంగా దగ్గరగా వచ్చినప్పుడు డ్రైవర్లకు హెచ్చరికలను పంపుతాయి. వాహన స్థానం, కదలిక దిశ, వేగంలో మార్పులు, బ్రేకులు వేస్తున్న తీరు ఏవిధంగా ఉందో వంటి సమాచారం ఇతర వాహనాలకు చేరవేస్తుంది. ముందున్న వాహన వేగం నెమ్మదించడం వంటి ప్రమాదకర పరిస్థితిని గుర్తించినప్పుడు డ్రైవర్‌కు హెచ్చరిక పంపుతుంది. స్పందించే సమయం పరిమితంగా ఉన్నా, దారి కనిపించని పరిస్థితుల్లో కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఈ వ్యవస్థకు సాంకేతిక ప్రమాణాలు, కమ్యూనికేషన్ ప్రొటోకాల్స్‌ను ఖరారు చేయడానికి ప్రభుత్వం వాహన తయారీ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా అమలుకోసం రేడియో స్పెక్ట్రమ్ ప్రత్యేకంగా కేటాయిస్తారు. వాహనాల మధ్య అడ్డంకులు లేని సమాచార మారి్పడి కోసం ప్రత్యేకంగా నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలను అందుబాటులో ఉంచడానికి టెలికం శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. రూ.5 వేల కోట్ల బడ్జెట్‌తో.. దేశంలో 36 కోట్లకుపైగా రిజిస్టర్డ్ వెహికల్స్ పరుగు తీస్తున్నాయి. ఈ స్థాయిలో వాహనాలున్న భారత్‌లో వీ2వీ సాంకేతికత అమల్లోకి వస్తే రోడ్డు భద్రత విషయంలో పెద్ద అడుగుపడ్డట్టే. ఇలాంటి సాంకేతికత ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.5,000 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.వీ2వీ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రత్యేకతలివీ.. ⇒ ఈ వ్యవస్థ వాహనాల్లో ఇన్స్టాల్ చేసిన సిమ్ కార్డ్ లాంటి పరికరం ద్వారా షార్ట్ రేంజ్ వైర్లెస్ సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తుంది. ⇒ ఈ పరికరం ట్రాఫిక్ లైట్స్‌తో కమ్యూనికేట్ చేయగలదు. అత్యవసర వాహనాలకు ప్రాధాన్యం ఇస్తుంది. ⇒ వాహనదారులకు రూట్ మ్యాప్ ప్లానింగ్‌లో సహాయపడుతుంది. ⇒ మరొక వాహనం ఏ దిశ నుంచి అయినా చాలా దగ్గరగా వచ్చినప్పుడు.. రియల్ టైమ్‌లో హెచ్చరికలు అందుతాయి. పొగ మంచు అధికంగా కురుస్తున్నప్పుడు దారి ఏమాత్రం కనపడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ⇒ చుట్టూ ఉన్న వెహికల్స్ ఎంత దూరంలో ఉన్నాయో అలర్ట్ చేస్తుంది. వాహనం సమీపిస్తున్నా, రోడ్డు పక్కన నిలిచి ఉన్నా డ్రైవర్లను హెచ్చరిస్తుంది. ⇒ వెహికల్‌కు 360 డిగ్రీల కోణంలో అన్ని వైపుల నుంచి సంకేతాలను అందిస్తుంది. ⇒ ప్రతి వాహనంలో ప్రత్యేక హార్డ్‌వేర్ ఏర్పాటుకు కొన్ని వేలు ఖర్చు అవుతుంది. కానీ ఈ ధరలు ఇంకా వెల్లడి కాలేదు. ⇒ 2026 చివరి నాటికి ఈ సాంకేతికతను నోటిఫై చేయడానికి రవాణా మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. ⇒ తొలుత ఈ పరికరాలను కొత్త వాహనాల్లో (ప్లాంట్లలోనే) ఇన్స్టాల్ చేస్తారు. ⇒ ఇతర అన్ని వాహనాల్లో దశలవారీగా అమలు చేస్తారు. -
ఒడిషాలో కుప్పకూలిన చార్టర్డ్ విమానం
భువనేశ్వర్: ఒడిషాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న చార్టర్డ్ ఫ్లైట్ ఒకటి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా అందులోని ఆరుగురికి గాయలయ్యాయి. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శనివారం మధ్యాహ్నా సమయంలో రూర్కెలా సమీపంలోని రఘనాథ్‌పల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. రూర్కెలా నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా.. టేకాఫ్ అయిన 10 కి.మీ. దూరంలో విమానం ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. పైలట్ సహా ఆరుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనలో చార్టర్డ్ ఫ్లైట్ ముందు భాగం నుజ్జు అయ్యింది. ప్రమాద గురించి తెలిసి చుట్టుపక్కల ప్రజలు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. తమ ఫోన్లలో ప్రమాదం ఫొటోలను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో పోలీసులు వాళ్లను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.ఇంజిన్ ఫెయిల్ కావడంతోనే విమాన ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై ఒడిశా రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా స్పందించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ओडिशा के राउरकेला में चार्टर प्लेन क्रैश, हादसे में 6 लोगों के घायल होने की खबर, इंडिया वन एयर का 9-सीटर चार्टर प्लेन क्रैश#PlaneCrash #Odisha #Rourkela pic.twitter.com/5iGZZf8e8y— Tahir Kamran | طاہرکامران (@TahirBijnori) January 10, 2026 -
జైపూర్‌లో తప్పతాగి కారు యాక్సిడెంట్
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పుల్గా తప్ప తాగిన ఓ వ్యక్తి కారుపై అదుపు కోల్పోయి రోడ్డుపై విచక్షణ రహితంగా కారు నడిపాడు. అతివేగంతో డ్రైవ్ చేస్తూ రోడ్డుపై నడుస్తున్న పాదచారులను ఢీకొట్టి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు వదలగా 15 మంది గాయపడ్డారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలపై ప్రభుత్వాలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినా పెద్దగా ఫలితం ఉండట్లేదు. తాజాగా రాజస్థాన్ జైపూర్‌లో ఫుల్‌గా తప్పతాగిన ఓబ్యాచ్ ఓవర్ స్పీడ్‌తో కారు నడిపారు. వాహనం కంట్రోల్ తప్పి రోడ్డుపై బీభత్సం సృష్టించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మద్యం సేవించిన ఓ వ్యక్తి పుల్గా తాగి ఆడి కారు వేగంతో నడిపారు. అనంతరం అదుపు కోల్పోయి రోడ్డపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టాడు. ఆపై అక్కడే ఉన్న షాపులను గుద్దుకుంటూ పాదచారులపై కారు నడిపాడు. ఈ దుర్ఘటనలో రమేశ్ బైరవ అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 15 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులుండగా అందరూ మద్యం సేవించి ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిలో ముగ్గురు ఘటనా స్థలం నుంచి పరారవ్వగా ఒకరిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. -
హీరో కాబోయి జీరో
అమ్మాయి ప్రేమ కోసం ‘యాక్సిడెంట్’ డ్రామా..ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలి.. తన దృష్టిలో హీరోగా నిలిచిపోవాలి.. ఇదీ ఒక యువకుడి పిచ్చి ఆలోచన. దీనికోసం అతను వేసిన ప్లాన్ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. రోడ్డుపై ఘోర ప్రమాదండిసెంబర్ 23వ తేదీ సాయంత్రం 5.30 గంటలు. కోచింగ్ క్లాస్ ముగించుకుని ఓ యువతి తన స్కూటర్‌పై ఇంటికి వెళ్తోంది. పతనంతిట్ట సమీపంలోని వళ ముట్టం ఈస్ట్ వద్దకు రాగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు ఆమె స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి ఆమె గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయింది. కారు ఆగకుండా మెరుపు వేగంతో వెళ్లిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి స్థానికులు భయబ్రాంతులయ్యారు.‘రక్షకుడు’ ఎంట్రీఏం చేయాలో తెలియక జనం తత్తరపడుతున్న సమయంలో.. అక్కడికి ఒక ఇన్నోవా కారు వచ్చి ఆగింది. అందులో నుంచి రంజిత్ రాజన్ అనే యువకుడు కంగారుగా దిగాడు. ‘నేను ఆమె భర్తను’.. అంటూ అందరినీ నమ్మించాడు. ఎంతో ఆవేదన నటిస్తూ ఆమెను హుటాహుటిన కొన్నీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. అందరూ అతన్ని ‘దేవుడు పంపిన రక్షకుడు’ అని మెచ్చుకున్నారు.విస్తుపోయే నిజం!ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య తనిఖీల్లో.. ఆ యువతికి తీవ్ర గాయాలైనట్లు తేలింది. కుడి చేయి ఎముక పక్కకు జరగడం, వేలు విరగడంతో పాటు ఒళ్లంతా గాయాలయ్యాయి. మొదట ఇది సాధారణ హిట్ అండ్ రన్ కేసు అని పోలీసులు భావించారు. కానీ, విచారణ ముదిరే కొద్దీ పోలీసులకు అనుమానం కలిగింది. రంజిత్ మాటల్లో పొంతన లేకపోవడంతో లోతుగా ఆరా తీశారు. అప్పుడు బయటపడింది అసలు గుట్టు.పక్కా ప్రణాళికతో..ఆ ప్రమాదం అనుకోకుండా జరిగింది కాదు.. రంజిత్ పక్కాగా ప్లాన్ చేసి చేయించాడు.. అదెలా అంటే.. ‘యువతిని తన స్నేహితుడు అజాస్ కారుతో గుద్దిస్తాడు. వెంటనే తనే అక్కడికి చేరుకుని కాపాడినట్టు నటించాలి. యువతికి, ఆమె కుటుంబానికి తనపై విపరీతమైన ప్రేమ, కృతజ్ఞత కలిగేలా చేయాలి. మళ్లీ ఆమెను తన దారిలోకి తెచ్చుకోవాలి..’పారని సైకో ప్రేమికుడి పాచికప్రేమ పేరుతో ప్రాణాల మీదకు తెచ్చిన ఈ ‘సైకో’ ప్రేమికుడి పాచిక పారలేదు. పోలీసులు రంజిత్‌తో పాటు అతడికి సహకరించిన అజాస్ ను అరెస్ట్ చేశారు. సాధారణ యాక్సిడెంట్ కేసు కాస్తా ఇప్పుడు ‘హత్యాయత్నం’ కేసుగా మారింది. నకిలీ ‘ప్రేమల’ వెనుక దాగున్న ఇలాంటి క్రూరత్వాలపై అప్రమత్తంగా ఉండాల్సిందే..– సాక్షి, నేషనల్ డెస్క్ -
దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగాలి
సాక్షి, హైదరాబాద్: సిగాచీ దారుణ ఘటనకు అసలైన బాధ్యులెవరో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత సర్కార్‌దేనని హైకోర్టు స్పష్టం చేసింది. తాము దర్యాప్తును నియంత్రించడం లేదని, విచారణ పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ పిల్ విచారణ ట్రయల్ కోర్టుపై ప్రభావం ఉంటుందని తాము భావించడం లేదని అభిప్రాయపడింది. తమ ముందున్న వాస్తవాల ఆధారంగా ట్రయల్‌కోర్టు నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించింది. అయితే, సర్కార్ నివేదిక, చట్టాలను విశ్లేషించేందుకు సమయం కావాలని అమికస్‌క్యూరీ కోరడంతో ధర్మాసనం విచారణ జనవరి 29కి వాయిదా వేసింది. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో జూన్ 30న సంభవించిన పేలుడు ఘటనలో 54 మంది మృతి చెందగా, 8 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉందని హైదరాబాద్ స్నేహపురి కాలనీకి చెందిన రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబురావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం విదితమే. ఫ్యాక్టరీలో భద్రతా నిబంధనలు లేకపోవడం, బాధిత కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతోందన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘దర్యాప్తు గణనీయంగా పురోగతి సాధించింది. సిగాచీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో (నిందితుడు–2) అమిత్ రాజ్ సిన్హాను అరెస్టు చేశాం. ఇతర నిందితులు (3 నుంచి 7) పరారీలో ఉన్నారు. గల్లంతైన 8 మందిని కూడా మరణించినట్లుగా గుర్తించాం. వారికి కూడా మృతిచెందిన వారిలాగానే పరిహారం అందించే చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు రూ.22.30 కోట్ల పరిహారం పంపిణీ జరిగింది’అని చెప్పారు. దర్యాప్తునకు సహకారం అందిస్తున్నాం.. కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘దురదృష్టకర సంఘటన జరిగిన వెంటనే అధికారులతో చర్చలు జరిపాం. మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ. 42 లక్షలు చెల్లించడానికి అంగీకరించాం. తీవ్రంగా గాయపడిన కార్మికులకు రూ. 2 లక్షలు చెల్లించాం. వారి పూర్తి వైద్య ఖర్చులనూ భరించాం. అరెస్టయిన ఎండీ, పరారీలోని నిందితులకు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయాల్సి వస్తే ట్రయల్ కోర్టుపై ఈ పిల్ ప్రభావం లేకుండా చూడాలి’అని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ.. కంపెనీ రూ.కోటి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి రూ.42 లక్షలు మాత్రమే పంపిణీ చేస్తామని చెప్పడం సరికాదన్నారు. -
తగ్గిన నేరాలు... పెరిగిన ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: గతేడాదితో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల నేరాల్లో కలిపి 2.33 శాతం తగ్గుదల నమోదైనట్టు తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక 2025 వెల్లడించింది. 2024లో నవంబర్ వరకు 2,34,158 కేసులు నమోదు కాగా, 2025లో నవంబర్ వరకు 2,28,695 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2024లో 35.63 శాతం నేరాల్లో శిక్షలు ఖరారు కాగా..ఈ ఏడాది అది స్వల్పంగా పెరిగింది. 2025లో 38.72శాతంగా నమోదైంది. 2025లో మొత్తం నాలుగు కేసుల్లో నిందితులకు మరణశిక్ష పడింది. 216 కేసులలో 320 మంది నిందితులకు జీవిత ఖైదుపడింది. 2024తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 5.68 శాతం పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. 2024లో 23,491 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 2025లో ఆ సంఖ్య 24,826కు చేరింది. అదే సమయంలో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యలో 7.9 శాతం, క్షతగాత్రుల సంఖ్యలో 31.8 శాతం తగ్గుదల నమోదైనట్టు వెల్లడించింది. 2024లో రోడ్డు ప్రమాదాల్లో 7,056 మంది మృతిచెందగా..21,664 మంది గాయాలపాలయ్యారు. 2025లో నమోదైన రోడ్డు ప్రమాదాల్లో 6,499 మంది మృతిచెందగా..14,768 మంది క్షతగాత్రులైనట్టు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 2024లో 53,651 సీసీటీవీ కెమెరాలు..2025లో 45,137 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 12,09,782 సీసీటీవీ కెమెరాలు ఉన్నట్టు వార్షిక నివేదిక తెలిపింది. 98.9 శాతం అత్యాచారం కేసులలో నిందితులు బాధితులకు తెలిసిన వారే అని, వీరిలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రేమికులు, సహ ఉద్యోగులే ఉన్నట్టు తెలిపింది. అత్యాచార కేసులలో 2024లో 8.81 శాతం కేసులలో నిందితులకు శిక్ష ఖరారు కాగా.. 2025లో 11.18 శాతం కేసులలో నిందితులకు శిక్ష ఖరారైంది.సైబర్ నేరాలపై అందిన ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంలోనూ తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్న ట్టు తెలిపింది. 2025లో దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలపై ఎఫ్ఐఆర్ నమోదు 2 శాతం కాగా..తెలంగాణలో 24 శాతం ఉన్నట్టు తెలిపింది. 2025లో మొ త్తం 371 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. -
Garam Garam Varthalu: ఘోర లారీ ప్రమాదం.. బొలెరో నుజ్జునుజ్జు
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..
చెన్నై:తమిళనాడు తిరుచారపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు టైర్లు పేలి అదుపు తప్పింది. అవతలి రోడ్డుపై వస్తున్న రెండు కార్లను బస్సు ఢీకొట్టింది. కడలూరు జిల్లా తిట్టకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కార్లలో ప్రయాణిస్తున్న మరో ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తిరుచ్చి నుండి చైన్నై వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైందని సమాచారం. -
చివరి ఊపిరి… ట్రక్కు కిందే!
చలికాలం.. మిట్ట మధ్యాహ్నాం.. సూర్యుడి వెచ్చని కిరణాల్ని ఆస్వాదిస్తూ తన ఇంటి ముందు ప్రశాంతంగా కూర్చున్నాడు ఆ పెద్దాయన. కానీ, ఒక్క నిమిషంలోనే ఆయన జీవితం తలకిందులైంది. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో 90 ఏళ్ల గిర్రాజ్ శర్మ అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఒక ట్రక్కు కింద నలిగిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నెట్టింటకు చేరాయి. డిసెంబర్ 19వ తేదీన మధ్యాహ్నాం 12-1 గంట మధ్య ఈ ఘటన జరిగింది.గిర్రాజ్ శర్మ తన ఇంటి వరండాలో కూర్చుని ఉన్నారు. ఇంతలో కంకర లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు.. ఆయన ఇంటి ముందు నుంచి మలుపు తిరిగింది. అయితే ఆ టర్నింగ్లో రోడ్డు సరిగ్గా లేక టైర్ పేలిపోయింది. ఈ పరిణామంతో వాహనం కంట్రోల్ కాకపోవడంతో.. పక్కకు ఒరిగి గిర్రాజ్ మీదకు ఒరిగిపోయింది. అలా ఊహించలేని దుర్ఘటన ఆ వృద్ధుడి ప్రాణం తీసింది.ఆరోగ్యంగా ఉన్న గిర్రాజ్ ఇలా అనూహ్యంగా ప్రాణం పొగొట్టకోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు.. రోడ్డు భద్రత, భారీ వాహనాల నిర్వహణపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. 𝑵𝒐 𝒐𝒏𝒆 𝒌𝒏𝒐𝒘𝒔 𝒘𝒉𝒆𝒏 𝒅𝒆𝒂𝒕𝒉 𝒘𝒊𝒍𝒍 𝒂𝒓𝒓𝒊𝒗𝒆…In Gwalior, Madhya Pradesh, 90-year-old Girraj Sharma was simply sitting outside his home, quietly soaking in the winter sun. In a cruel twist of fate, a gravel-laden dumper lost control after a tyre burst and… pic.twitter.com/uAdXECIaxM— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) December 21, 2025 -
ఆత్మహత్యా..? జారి పడ్డారా..?
యాదగిరిగుట్ట రూరల్: నవ దంపతుల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వేస్టేషన్ శివారులో గురువారం అర్ధరాత్రి మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి నవ దంపతులు కోరాడ సింహాచలం (25), కొంగరపు భవాని(19) మృతి చెందారు. చనిపోవడానికి ముందు రైలు లో సింహాచలం, భవాని ఏదో విషయంపై గొడవ పడుతుండగా, తోటి ప్రయాణికులు తీసిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో గొడవ జరిగిన తర్వాతే భార్యాభర్తలిద్దరూ రైలు నుంచి కిందపడిపోయారని తెలుస్తోంది. ముందుగా నిర్ణయించుకొని ఆత్మహత్య చేసుకున్నారా.? లేదా భార్యను సముదాయిస్తున్న క్రమంలో ఇద్దరూ కలిసి జారి పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో ఎవరు చిత్రీకరించారనే దానిపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. -
అందుకే.. పట్టాలపై గజరాజుల మృత్యుఘోష!
అస్సాంలోని రైలు పట్టాలు గజరాజుల పాలిట మృత్యుపాశాలయ్యాయి. వేగంగా దూసుకొచ్చిన రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ తాజా ప్రమాదం భారతదేశంలో ఏనుగుల సంరక్షణపై ఉన్న సవాళ్లను మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చింది. భారతదేశంలో ఏనుగుల అసహజ మరణాలకు విద్యుదాఘాతం మొదటి కారణం కాగా, రైలు ప్రమాదాలు రెండో ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం గత పదేళ్లలో 200 కంటే ఎక్కువ ఏనుగులు రైలు ఢీకొనడం వల్ల ప్రాణాలు కోల్పోయాయని అంతర్జాతీయ మీడియా సంస్థ ‘ది గార్డియన్’ పేర్కొంది.సాంకేతికత ఒక్కటే పరిష్కారంప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం 40,000 నుండి 50,000 ఆసియా ఏనుగులు మాత్రమే అడవుల్లో మిగిలి ఉన్నాయి. ఇందులో సగానికి పైగా ఏనుగులు ప్రమాదాల బారిన పడుతున్నాయని పలు గణాంకాలు చెబుతున్నాయి. రైలు ప్రమాదాల నుండి ఏనుగులను కాపాడేందుకు సాంకేతికత ఒక్కటే మనముందున్న పరిష్కారం. తమిళనాడులో ఇప్పటికే ఏఐ-ఆధారిత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సెన్సార్లు పట్టాల దగ్గర ఏనుగుల కదలికలను గుర్తించి, తక్షణమే లోకో పైలట్లు, స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అమల్లో ఉన్న కొన్ని వ్యవస్థలు రోజుకు 40కి పైగా హెచ్చరికలను పంపుతూ, ప్రమాదాలను నివారిస్తున్నాయి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న 1,30,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్, 150 ఏనుగు కారిడార్లలో ఈ వ్యవస్థలను పూర్తిస్థాయిలో అమలు చేయడం ఒక సవాలుగా మారింది.గ్రీన్ ఫ్లైఓవర్లు కూడా అవసరంకేవలం సాంకేతికత మాత్రమే కాకుండా ఏనుగులు సురక్షితంగా మనుగడ సాగించేందుకు పశ్చిమ బెంగాల్లో నిర్మించిన ‘గ్రీన్ ఫ్లైఓవర్లు’ (ఆకులతో కప్పబడిన వంతెనలు) దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు.. రైల్వే ట్రాక్‌ల వెంబడి అరటి, వెదురు వంటి చెట్లతో కూడిన కారిడార్లను నిర్మించడం వల్ల ఏనుగులు పట్టాలపైకి రాకుండా సురక్షిత మార్గాల్లో వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పట్టాలపై ఏనుగుల మరణాలను నివారించేందుకు ఏఐ ఆధారిత హెచ్చరిక వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయకపోతే, భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పెరుగుతున్న ప్రమాదాలుభారతదేశంలో రైలు ప్రమాదాల కారణంగా ఏనుగులు మృత్యువాత పడుతున్న గణాంకాలను పరిశీలిస్తే, 2009-10 నుండి 2020-21 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 186 ఏనుగులు రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయాయి. వీటిలో అత్యధికంగా అస్సాంలో 62, పశ్చిమ బెంగాల్లో 57, ఒడిశాలో 27 మరణాలు సంభవించాయి. ముఖ్యంగా తమిళనాడు-కేరళ సరిహద్దులోని కోయంబత్తూర్ - పాలక్కాడ్ మార్గంలో గత 19 ఏళ్లలో 29 ఏనుగులు చనిపోగా, అస్సాంలోని సోనిత్‌పూర్‌లో 2017లో ఆరు ఏనుగులు, పశ్చిమ బెంగాల్‌లోని చప్రామారి అభయారణ్యంలో 2013లో ఏడు ఏనుగులు, ఒడిశాలోని కెంజోహర్లో2021లో మూడు ఏనుగులు రైలు ప్రమాదాల్లో మరణించాయి.ఇవి పర్యావరణవేత్తలతో పాటు అందరినీ కలవరపెడుతున్నాయి. ఇది కూడా చదవండి: ఏనుగుల మందను ఢీ కొట్టి.. అస్సాంలో రైలు ప్రమాదం -
ఏనుగుల మందను ఢీ కొట్టి.. అస్సాంలో రైలు ప్రమాదం
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏనుగుల మందను ఢీ కొట్టడంతో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది ఏనుగులు మృతి చెందినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ప్రయాణికులెవరికీ గాయాలు కూడా కాలేదు.సైరాంగ్ నుంచి న్యూఢిల్లీ బయల్దేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్ (Rajdhani Express) అర్ధరాత్రి 2గం. సమయంలో హొజాయ్ జిల్లా పరిధిలో వెళ్తోంది. ఆ సమయంలో పట్టాలు దాటుతున్న ఏనుగుల మందను రైలు ఢీకొట్టింది. రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ఢీకొనడంతో 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏనుగు గాయపడింది. ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని నార్త్ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.రైల్వే, అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలపై ఏనుగుల మందను చూడగానే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడని, అయినప్పటికీ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రైళ్లను దారి మళ్లించారు.ఈశాన్య రాష్ట్రాల్లో ఏనుగుల మందలు ఇలా పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురవుతుంటాయి. అయితే.. తాజాగా ఘటన జరిగిన హోజాయ్ జిల్లా ప్రాంతం ఎలిఫెంట్ కారిడార్ కాదని రైల్వే అధికారులు చెబుతున్నారు. -
హఠాత్తుగా ఆగిన కేబుల్ కార్.. తుళ్లిపడిన ప్రయాణికులు!
శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికాలోని కాలిఫోర్నియాలోగల శాన్ ఫ్రాన్సిస్కోలో కేబుల్ కార్ ప్రమాదం చోటుచేసుకుంది. నోబ్ హిల్‌లో కాలిఫోర్నియా స్ట్రీట్ కేబుల్ కార్ లైన్లో జరిగిన ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లీవెన్‌వర్త్- హైడ్ వీధుల మధ్య 1351 కాలిఫోర్నియా వీధి వద్ద కేబుల్ కారు అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శాన్ ఫ్రాన్సిస్కో అగ్నిమాపక విభాగం (SFFD) వెంటనే స్పందించి, సంఘటనా స్థలంలో 15 మంది బాధితులను రక్షించింది. వీరిలో 13 మంది గాయపడగా, వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. San Francisco fire department is on the scene at 1351 California St. between Leavenworth and Hyde with 14 patients who have been injured from a cable car that came to an abrupt stop. Avoid the area of California between Hyde and Leavenworth. There will be an ongoing… pic.twitter.com/AXsBxMn5DE— SAN FRANCISCO FIRE DEPARTMENT MEDIA (@SFFDPIO) December 15, 2025ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఘటనా స్థలంలో కారు విండ్‌షీల్డ్ పగిలి ఉండటాన్ని అధికారులు గమనించారు. అగ్నిమాపక అధికారులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం కేబుల్ కారుపై ఎవరో ఏదో బలమైన వస్తువు విసిరేసి ఉండవచ్చని, ఫలితంగా డ్రైవర్ అత్యవసరంగా కారును ఆపివేయవలసి వచ్చివుంటుందన్నారు. దీంతో ప్రయాణికులు ముందుకు కుదుపునకు గురయ్యారన్నారు.శాన్ ఫ్రాన్సిస్కో పోలీసు విభాగం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. ఇందుకోసం హైడ్, లీవెన్‌వర్త్ మధ్య కాలిఫోర్నియా వీధిని మూసివేశారు. కాలిఫోర్నియా స్ట్రీట్ కేబుల్ కార్ లైన్ ప్రమాద ఘటన కారణంగా తాత్కాలికంగా ఈ సేవలకు అంతరాయం కలిగించింది. దర్యాప్తులో యాంత్రిక తనిఖీ, సాక్షుల వాంగ్మూలాలు కీలకం కానున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ఇది కూడా చదవండి: Mexico: కూలిన ప్రైవేట్ జెట్.. పదిమంది సజీవ దహనం -
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోరం.. ప్రమాదానికి కారణమిదే!
ఢిల్లీ ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై మంగళవారం తెల్లవారు ఝామన ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనకు పొగమంచు కారణంగా తెలుస్తోంది. భారీ పొగమంచులో తొలుత రెండు వాహనాలు వేగంగా ఢీ కొట్టుకోగా.. ఆ వెంటనే మిగతా వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టి మంటలు చెలరేగాయని అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం వేకువజామున 4గం. ప్రాంతంలో ఆగ్రా-నోయిడా లేన్ 127వ మైలురాయి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత మూడు కార్లు వరుసగా ఢీ కొట్టకున్నాయి. ఆ తర్వాత ఏడు బస్సులు ఢీ కొట్టుకుని ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. బస్సుల్లో ఒకటి ఆర్టీసీ ఉండగా.. మిగతా ఆరు ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సులు. మొత్తం 7 బస్సులు.. నాలుగు కార్లు మంటల్లో చిక్కకుని బూడిదయ్యాయి.ఇప్పటిదాకా నాలుగు మృతదేహాలను అధికారులు గుర్తించారు. ప్రమాదం నుంచి పలువురు సురక్షితంగా బయటపడగా.. నిద్రలో ఉండడం, ఒక్కసారిగా మంటల ఎగసి పడడం, వాహనాలు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగి బయటపడలేని స్థితిలో పలువురు సజీవ దహనం అయ్యి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రంగంలోకి దిగిన 11 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే ఈ ఘోర ప్రమాదంతో ఢిల్లీ ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.#WATCH | Mathura, UP | Rescue operations underway as several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/k8LdYmBOC1— ANI (@ANI) December 16, 2025#WATCH | Mathura, UP | Several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited.#firemishap #buses #DelhiAgraExpresswayANI pic.twitter.com/kKqC31C7MR— Argus News (@ArgusNews_in) December 16, 2025ఇదిలా ఉంటే.. నిన్న ఢిల్లీ-ముంబై రహదారిపైనా ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నుహ్(హర్యానా) వద్ద సోమవారం ఉదయం 5గం. ప్రాంతంలో వాహనాలు భారీ పొగమంచు కారణంగా ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకున్నాయి. రెండు ఓవర్‌లోడెడ్ డంపర్లు యాక్సిడెంట్‌కు గురి కాగా.. ఆ వెనక 20 దాకా వాహనాలు వేగాన్ని అదుపు చేసుకోలేక ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. సుమారు 20 మంది దాకా గాయాలయ్యాయి. పొగ మంచు వరుస ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు వాహనదారులకు సూచిస్తున్నాయి. -
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
ఉత్తర ప్రదేశ్ ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. పొగమంచు కారణంగా.. మంగళవారం వేకువ జామున పలు కార్లు, బస్సులు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకుని మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొలుత నలుగురు మరణించారని ప్రకటించిన అధికారులు.. సహాయక చర్యల అనంతరం ఆ సంఖ్యను 13గా వెల్లడించారు. ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పలు వాహనాలు మంటల్లో చిక్కుకుని 13 మంది మృతి చెందారు. సుమారు 65 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, మథుర ఎస్ఎస్పీ శ్లోక్ కుమార్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘యమునా ఎక్స్‌ప్రెస్‌వే 127వ మైల్ స్టోన్ వద్ద ఏడు బస్సులు, మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. వాహనాల నుంచి మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఫైర్ బృందాలు రెండు గంటలు శ్రమించి మంటల్ని అదుపు చేశాయి’’ అన్నారు. #WATCH | Mathura, UP | SSP Mathura, Shlok Kumar says, "... An accident took place at the Yamuna Expressway Milestone 127. The reason was low visibility... 7 buses and 3 cars collided as a result of which, a fire broke out in all the vehicles... The rescue operation is nearing… https://t.co/fcMTyQjWBk pic.twitter.com/RY8vdxLqVi— ANI (@ANI) December 16, 2025ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. తొలుగ మూడు కార్లు మరొకటి ఢీ కొట్టాయి. అనంతరం ఆ వెనకాలే ఏడు బస్సులు ప్రమాదానికి గురై మంటలు అంటుకున్నాయి. అలా భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో పలువురు ఫోన్లలో తీసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. #WATCH | Mathura, UP | Several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/9J3LVyeR3P— ANI (@ANI) December 16, 2025 #WATCH | Mathura, UP | Rescue operations underway as several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/qvKDqAT5T1— ANI (@ANI) December 16, 2025 👉ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవే (యమునా ఎక్స్‌ప్రెస్‌వే) పొడవు 165.5 కిలోమీటర్లు. 2012 ఆగస్టు 9న ప్రారంభించబడింది. ఇది గ్రేటర్ నోయిడా నుండి ఆగ్రా వరకు విస్తరించి, ఆరు లేన్లతో నిర్మించబడింది. దీని ప్రధాన ఉద్దేశ్యం పాత ఢిల్లీ–ఆగ్రా జాతీయ రహదారి (NH-2)లోని ట్రాఫిక్‌ను తగ్గించడం. 👉ఈ హైవే గ్రేటర్ నోయిడా, జేవర్, వృందావన్, మథుర, హత్రాస్ వంటి పట్టణాలను కలుపుతూ ఆగ్రాకు చేరుస్తుంది. భారతదేశంలో ఆరో పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేగా గుర్తించబడింది. అయితే.. అధిక వేగం, డ్రైవర్లు నిద్రలోకి జారుకోవడం, పొగమంచు కారణంగా తరచూ ఈ హైవేపై ప్రమాదాలు జరుగుతుంటాయి. 👉2012–2023 మధ్య జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ శాతం డ్రైవర్లు నిద్రపోవడం వల్ల జరిగాయి!. ఎక్స్‌ప్రెస్‌వే పొడవుగా, సూటిగా ఉండటం వల్ల డ్రైవర్లు వేగంగా దూసుకెళ్తుండడంతో నియంత్రణ కోల్పోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక.. శీతాకాలంలో దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం జరుగుతుంది. అందుకే ఇటీవలే వేగ పరిమితిని 75 kmphకి తగ్గించారు. తాజా ప్రమాదం పొగమంచు కారణంగానే జరిగి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు.


