జీనబాడు: అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి ముగ్గురు మృతి చెందిన ఘటన అనంతగిరి మండలం జీనబాడు వద్ద జరిగింది. ఈ ఘటన రైవాడ జలాశయం వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మృతదేహం లభించగా, మిగతా రెండు మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా విషాదం చోటు చేసుకుంది. కొమరం మండలం రబ్బర్ డ్యాం వద్ద పిక్నిక్ లో విషాదం సంభవించింది. జంఝావతి రబ్బర్ డ్యాంలో ఈత కోసం దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన వారు కొమరాడ మండలం సివిని గ్రామానికి చెందిన వ్యక్తులు గుర్తించారు.


