విజయవాడ సెంటర్‌లో 'కృష్ణ' విగ్రహావిష్కరణ | Bronze statue of Superstar krishna unveiled at Vijayawada Lenin Center | Sakshi
Sakshi News home page

విజయవాడ సెంటర్‌లో 'కృష్ణ' విగ్రహావిష్కరణ

Jan 8 2026 7:40 PM | Updated on Jan 8 2026 10:41 PM

Bronze statue of Superstar krishna unveiled at Vijayawada Lenin Center

సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహాన్ని విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేయనున్నారు. విజయవాడతో ఘట్టమనేని కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అక్కడ అయనకు అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. జనవరి 11న ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆయన కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుతున్నట్లు  కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు తెలిపారు. కృష్ణ మనవుడు  'జై కృష్ణ' విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

అగ్ని పర్వతం సినిమా విడుదలై 45 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా ఆయన అభిమానులు విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటుకు ముందుకు వచ్చారని ఆదిశేషగిరిరావు తెలిపారు.  ఈ విగ్రహాన్ని కృష్ణ వారసుడిగా సినిమా అరంగేట్రం చేస్తున్న ఆయన మనవడు జై కృష్ణ ఆవిష్కరించనున్నారని చెప్పారు. కృష్ణ బర్త్ డే సందర్భంగా మే31వ తేదీన సినిమా విడుదల కోసం ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. మహేష్ బాబు,  కృష్ణ లాగా తను కూడా అభిమానులను సంపాదించుకుంటారని ఆయన అన్నారు. విజయవాడ సినిమా థియేటర్స్‌ యజమానులతో పాటు నగర ప్రజలతో కృష్ణకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు.

సినిమా టికెట్‌ ధరలపై సూచన
టాలీవుడ్‌లో సినిమా టికెట్‌ ధరల పెంపు అనేది ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఈ అంశంపై తాజాగా  ఆదిశేషగిరిరావు స్పందించారు.  నిర్మాతలతో పాటు ప్రేక్షకుల కోణంలో ఆయన మాట్లాడారు. ఒక సినిమాకు బడ్జెట్‌ పెరిగిందనే సాకు చూపించి టికెట్‌ ధరలు పెంచాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్‌ పద్ధతి కాదని అయన అభిప్రాయపడ్డారు. పెద్ద సినిమాలకు టికెట్‌ ధరలు పెంచడంతో చిన్న సినిమాలు భారీగా దెబ్బతింటున్నాయన్నారు. ఆపై టికెట్‌ ధరల వల్ల సామాన్య ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పెద్ద సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు టికెట్‌ భారీ ధరలు ఉంటాయని, ఆ మూడు రోజుల  అయిపోగానే ఎటూ రేట్లు తగ్గుతాయన్నారు. టికెట్‌  ధరలు  అందుబాటులోకి థియేటర్‌కు వెళ్లాలని ప్రేక్షకులకు సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా ధరలు ఉండాలని ఆదిశేషగిరిరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement