స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన జ్యోతిరాయ్.. 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో జగతి మేడమ్‌గా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కొన్నేళ్ల క్రితం ఉన్నట్లుండి పూర్తిగా సీరియల్స్ చేయడం తగ్గించేసిన ఈమె, సినిమాలు చేస్తూ వచ్చింది.
ఈ క్రమంలోనే 'కిల్లర్' పేరుతో తెరకెక్కుతున్న చిత్రం నుంచి అప్‌డేట్ వచ్చేసింది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
జ్యోతిరాయ్.. ఈ సినిమాలో సూపర్ ఉమన్ తరహా పాత్ర చేసినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది.


