2018 నాటి కేసులో యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి కోర్టు సమన్లు | Dhruv Rathee Gets Court Summons In 2018 Defamation Case Over BJP IT Cell Part 2 Video, Check Out More Details | Sakshi
Sakshi News home page

2018 నాటి కేసులో యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి కోర్టు సమన్లు

Oct 15 2026 11:03 AM | Updated on Oct 15 2026 11:43 AM

Youtuber dhruv rathee gets summons in 2018 defamation case

న్యూఢిల్లీ: ‘బీజేపీ ఐటీ సెల్ పార్ట్ 2’ పేరుతో యూట్యూబర్ ధ్రువ్ రాఠీ రూపొందించిన వీడియోపై నమోదైన 2018 నాటి క్రిమినల్ పరువు నష్టం కేసులో ఢిల్లీలోని సాకేత్ డిస్ట్రిక్ట్ కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రాహుల్ జైన్ అక్టోబర్ 12న ఈ ఉత్తర్వులు ఇస్తూ, తదుపరి విచారణను అక్టోబర్ 17కి ఖరారు చేశారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రాఠీకి సమన్లను వేగంగా చేరవేయాలని ఫిర్యాదుదారుడి తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

పరువు నష్టం కేసు నేపథ్యం
'ఐ సపోర్ట్ నరేంద్ర మోదీ' సోషల్ మీడియా పేజీ వ్యవస్థాపకుడు వికాస్ పాండే ఈ పరువు నష్టం ఫిర్యాదును దాఖలు చేశారు. ఫేక్ న్యూస్ వ్యాప్తికి సంబంధించిన ఆరోపణలను వెనక్కి తీసుకునేందుకు ఒక మధ్యవర్తి ద్వారా రూ.50 లక్షలు ఆఫర్ చేసినట్లు, తనను బీజేపీ ఐటీ సెల్ సభ్యుడిగా రాఠీ తన వీడియోలో తప్పుగా చిత్రీకరించారని పాండే పేర్కొన్నారు. గతంలో ఇదే వీడియోను రీట్వీట్ చేసినందుకు అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా ఆయన న్యాయపరమైన చర్యలు ప్రారంభించారు.

పోలీసుల ముందస్తు చర్యలు
ఎన్నికల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించతలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు సిద్ధమవుతుండగా రాఠీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధానిలో ప్రదర్శనకు ఎలాంటి అనుమతి లేకపోవడంతో గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో దాదాపు 50 మంది పోలీసు సిబ్బంది చేరుకుని ఆయన్ను ముందస్తుగా అదుపులోకి తీసుకుని, ఆపై శనివారం రాత్రి విడుదల చేశారు.

నిఘాపై రాఠీ ఆరోపణలు
విడుదలైన అనంతరం ఇన్స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో రాఠీ తీవ్ర ఆరోపణలు చేశారు. గురుగ్రామ్‌లోని నివాసం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మఫ్టీలో ఉన్న పోలీసులు గుర్తుతెలియని కార్లలో తనను వెంబడిస్తున్నారని, తన కదలికలపై నిఘా ఉంచారని ఆయన పేర్కొన్నారు. నిరసన వేదిక పరిసరాలకు వెళితే మళ్లీ అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారని తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఎలాంటి అధికారిక స్పందనను తెలియజేయలేదు. 

ఇదీ చదవండి: హక్కుల ఉల్లంఘనపై నోబెల్ విజేత నవీ పిళ్లై తీవ్ర ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement