సిజేరియన్ అన్నారు..కానీ ఆవేళ..! | Samantha Mother In Law Padma Shri Shobha Raju Exclusive Interview | Sakshi
Sakshi News home page

సిజేరియన్ అన్నారు..కానీ ఆవేళ..! సమంత ప్రసవంపై శోభరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

Nov 26 2026 2:45 PM | Updated on Nov 26 2026 2:55 PM

Samantha Mother In Law Padma Shri Shobha Raju Exclusive Interview

అన్నమయ్య పదకోకిల, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభరాజు ఇటీవల 'సాక్షి ఫ్యామిలీ'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన, భావోద్వేగపూరితమైన విషయాలను పంచుకున్నారు. తన అక్క కొడుకు రాజ్ నిడిమోరు, కోడలు సమంతలకు పండంటి మగబిడ్డ జన్మించిన సందర్భంగా ఆ కుటుంబంలో నెలకొన్న ఆనందాన్ని, ఆ సమయంలో జరిగిన అద్భుతాలను సాక్షితో పంచుకున్నారు ఇలా..!. 

నవంబర్ 19న సమంతకు డెలివరీ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను శోభరాజు గుర్తు చేసుకున్నారు. ముందుగా బాబు మెడకు పేగు (Umbilical cord) చుట్టుకోవడంతో లోపల కదలికలు తగ్గాయని చెప్పారు. 

దాంతో తామంతా కలిసి ప్రార్థనలు చేశామన్నారు. ఆ తర్వాత డెలివరీ సమయంలో సమంతను సి-సెక్షన్ (సిజేరియన్) కోసం తీసుకెళ్తున్నారని తెలిసి, తామంతా ఇంట్లో కూర్చుని 25-30 నిమిషాల పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లు తెలిపారు. కొద్దిసేపటికే సమంతకు నార్మల్‌ డెలివరీ అయిందని ఫోన్‌ వచ్చింది. అప్పుడే మరోసారి ప్రత్యక్షంగా చూశాను ప్రార్థనల గొప్పతనం అని ఆనందంగా చెప్పుకొచ్చారు శోభరాజు. 

అయితే తాను బాబును ఎత్తుకోలేదని చెప్పారు. రాజ్‌ బాబుని చేతికి ఇవ్వబోతే..తాను సున్నితంగా వద్దన్నారు. బయట నుంచి వచ్చాను అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఎత్తుకుంటే ఇన్ఫెక్షన్లు వస్తాయన్న భయంతోనే అలా చేసినట్లు తెలిపారు. అయితే దూరం నుంచే ఆ తల్లి కొడుకులను ఆశ్వీరదించి తన బాధ్యతను చాటుకున్నట్లు తెలిపారు.

సమంత ప్రసవ సమయంలో పెను ప్రమాదం.. బిడ్డ కోసం ఆమె ఏం చేసిందంటే?

ఇదీ చదవండి: గులాబీ రంగు మ్యాక్సీ డ్రెస్‌లో కాబోయే అమ్మ సమంత..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement