హైదరాబాద్ : డ్రగ్స్‌కు స్వస్తి పలికి..‘మత్తు’ వదిలిద్దాం అంటూ యువత నినదించింది. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషాముక్త్ భారత్’ పేరిట ప్రారంభించిన పాదయాత్రకు తొలిరోజు బుధవారం భారీ స్పందన లభించింది.
సినీ నటుడు వెంకటేశ్ హాజరై తనదైన స్టైల్‌లో యువతను ఉత్సాహ పరిచారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ..ఇతరులనూ దూరంగా ఉంచేలా అవగాహన కల్పించాలని కోరారు.
ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సినీ నటుడు నిఖిల్ హాజరయ్యారు.
అంబర్‌పేట్ మహంకాళి దేవాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఇఫ్లూ, గాంధీ ఆస్పత్రి మీదుగా ముషీరాబాద్ చేరుకుంది.
సాయంత్రం ఓ ఫంక్షన్ హాల్‌లో నేతలు సమావేశమై, అక్కడే రాత్రి బస చేశారు. కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


