వైద్య చరిత్రలో అద్భుతం : పంది కిడ్నీతో 365 రోజులు! | Pig kidney keeps US woman alive for a year sets record for longest xenotransplant yet | Sakshi
Sakshi News home page

వైద్య చరిత్రలో అద్భుతం : పంది కిడ్నీతో 365 రోజులు!

Nov 25 2026 12:34 PM | Updated on Nov 25 2026 12:34 PM

Pig kidney keeps US woman alive for a year sets record for longest xenotransplant yet

ఇక జీవించడం కష్టం అన్న క్షణాలనుంచి 365 రోజులు హాయిగా, ఆనందంగా జీవిస్తే.. ఎలా ఉంటుంది? మాటల్లో చెప్పలేని ఆనందం కదా. వైద్య చరిత్రలో అద్భుతమైన  రికార్డును నమోదు చేసి మరీ అంటే ఇక ఆనందానికి అవధులేముంటాయి చెప్పండి. సరిగ్గా ఇలాంటి అనుభూతికే లోనవుతోంది పంది మూత్ర పిండాన్ని అమర్చుకున్న మహిళ.  జన్యుపరంగా మార్పులు చేసిన పంది మూత్రపిండాన్ని (Kidney) అమర్చుకున్న 58 ఏళ్ల అమెరికా మహిళ ఏడాది పాటు విజయవంతంగా జీవించడం విశేషంగా నిలుస్తోంది. 

అమెరికాకు చెందిన మొల్లీ ఫాల్కో ఈ తరహా అవయవ మార్పిడి తర్వాత అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా సరికొత్త రికార్డు సృష్టించారు. జన్యుపరంగా మార్పులు చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చడం ద్వారా, ఆమె ఏడాది కాలంగా డయాలసిస్ అవసరం లేకుండా జీవించగలుగుతున్నారు.

మొల్లీ ఫాల్కో చిన్నతనంలోనే గుర్తించిన ఒక అనారోగ్య సమస్య కారణంగా మూత్రపిండాల వైఫల్యంతో బాధపడేవారు.  'ఎండ్-స్టేజ్ కిడ్నీ డిసీజ్' (ESKD)తో బాధపడుతూ, 2024లో డయాలసిస్ తీసుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత, 2025 నవంబర్ 22న, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) 'ఎక్స్‌పాండెడ్ యాక్సెస్' (Expanded Access) మార్గం ద్వారా, 'మాస్ జనరల్ బ్రిగమ్ హెల్త్ సిస్టమ్' (MGB)లో భాగమైన మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో ఆమెకు మూత్రపిండ మార్పిడి జరిగింది. ఈ శస్త్రచికిత్స జరిగి ఏడాది గడిచినప్పటికీ, ఫాల్కో శరీరంలో అమర్చిన 'EGEN-2784' అనే జన్యుపరంగా మార్పు చెందిన పంది మూత్రపిండం  సక్రమంగా పనిచేస్తోంది. దీనివల్ల ఆమెకు డయాలసిస్ అవసరం కూడా రాలేదు.

‘‘ఏడాది క్రితం, నా భవిష్యత్తు ఏంటో తెలియదు మూత్రపిండ వ్యాధితో జీవితంలో చాలా కోల్పోయాను, అందుకే నా జీవితాన్ని తిరిగి పొందాలనుకున్నా. ఒకప్పుడు అసాధ్యమని భావించిన విషయాన్ని, నేడు నేను సాధించాను" అని ఫాల్కో  సంతోషాన్ని ప్రకటించారు.

ఇప్పటివరకు, FDA  'ఎక్స్‌పాండెడ్ యాక్సెస్' మార్గం ద్వారా ఆరుగురికి  'EGEN-2784' మూత్రపిండాలను అమర్చారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, జీవించి ఉన్న మానవునికి పంది మూత్రపిండ మార్పిడి 2024లో మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో జరిగింది. ఆ రోగి 52 రోజులు జీవించి, ఆ తర్వాత గుండె సంబంధిత కారణాలతో మరణించారు. అయితే, ఆ మరణానికి మార్పిడితో సంబంధం లేదు. రెండు నెలల క్రితం వరకు, 66 ఏళ్ల టిమ్ ఆండ్రూస్ అనే మరో రోగి పంది మూత్రపిండంతో అత్యధిక కాలం జీవించిన రోగిగా ఉన్నారు; ఆ మూత్రపిండం అతడిని 271 రోజులు, అంటే దాదాపు తొమ్మిది నెలల పాటు బ్రతికించింది.

అవయవమార్పిడిలో ఇదొక విప్లవం
అవయవ మార్పిడి కోసం మానవులకు అనుకూలమైన అవయవాలను అభివృద్ధి చేస్తున్న బయోటెక్నాలజీ సంస్థ అయిన ఇజెనెసిస్ (eGenesis) అధ్యక్షుడు,  సీఈవో మైఖేల్ కర్టిస్ దీనిని ఒక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. "మొట్టమొదటిసారి, జన్యుపరంగా మార్పు చేసిన పంది మూత్రపిండం రోగిని ఏడాది పొడవునా డయాలసిస్ లేకుండా ఉండేలా చేసింది." ఇది ప్రపంచవ్యాప్తంగా అవయవ మార్పిడికి ఉన్న ప్రధాన అడ్డంకిగా ఉన్న సమస్యకు,అవయవ వైఫల్య చికిత్సను మార్చగల జన్యుపరంగా మార్పు చేసిన అవయవాల సామర్థ్యంపై విశ్వాసాన్ని బలపరుస్తుందన్నారు.

ఇదీ చదవండి: అమానుషం : కుమార్తెకు విషమిచ్చి, గొంతు నులిమి పరువు హత్య

డిమాండ్‌కు సరిపడా దొరకడం లేదు
ప్రపంచవ్యాప్తంగా అవయవ మార్పిడికి డిమాండ్ వేగంగా పెరిగింది. అయితే దానికనుగుణంగా తగిన ఆర్గాన్స్‌ అందుబాటులో ఉండటం లేదు. 2026లో ప్రచురితమైన గ్లోబల్ అబ్జర్వేటరీ ఆన్ డొనేషన్ అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ 2024 నివేదిక ప్రకారం, 2024లో ప్రపంచవ్యాప్తంగా 1,73,727 అవయవ మార్పిడులు జరిగాయి, ఇది 2023తో పోలిస్తే రెండు శాతం పెరుగుదల. అయినప్పటికీ, అవయవాల కొరత ఒక ప్రధాన సవాలుగా కొనసాగుతోందని, దీనివల్ల దాదాపు 90 శాతం ప్రజల అవసరాలు తీరడం లేదని ఈ నివేదిక అంగీకరిస్తుంది.అవయవ దాతల కొరత కారణంగా చాలా మంది ఏళ్ల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది; అటువంటి వారికి, జన్యుపరంగా మార్పు చెందిన పంది మూత్రపిండాలు దీర్ఘకాలం పనిచేయగలవని ఈ ఉదంతం నిరూపించడం కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది.

ఇదీ చదవండి: టీసీఎస్‌ ఉద్యోగం వదిలి రూ. 11వేలతో మొదలై రూ. 40 లక్షలు దాకా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement