సాక్షి, మహబూబాబాద్: కార్తీక సోమవారం వేళ ఇంటి ఆవరణలో రెండు తలల పాము కనిపించడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పాత డోర్నకల్‌లో ఈ ఆసక్తకర ఘటన చోటుచేసుకుంది.
పాత డోర్నకల్‌కు చెందిన గండి సీతారాంగౌడ్ నివాస ఆవరణలో రెండు తలల పాము (శిఖండి) కనిపించింది. కార్తీక సోమవారం కావడంతో శివాలయాలకు వెళ్తున్న అయ్యప్ప స్వాములు, ఇతర భక్తులు పామును చూసేందుకు ఆసక్తి చూపారు. కొందరు భక్తులు భక్తిభావంతో పామును దర్శించుకుని నమస్కరించారు. సాధారణంగా పాము కనిపిస్తే భయపడే ప్రజలు.. రెండు తలలతో కనిపించడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అనంతరం పామును గోనె సంచిలోకి తీసుకుని శివాలయం సమీపంలోని చెట్టు వద్ద వదిలిపెట్టారు. కార్తీక సోమవారం రోజున ఈ ఘటన చోటుచేసుకోవడంతో పాత డోర్నకల్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఇదీ చదవండి: నష్టాల బస్సుకు ‘సెన్సర్’ ఊరట


