టీమిండియా ప్రపంచ రికార్డు | Team India rewrite record books, post highest-ever Test total in New Zealand | Sakshi
Sakshi News home page

IND vs NZ: టీమిండియా ప్రపంచ రికార్డు

Nov 22 2026 7:51 AM | Updated on Nov 22 2026 8:01 AM

Team India rewrite record books, post highest-ever Test total in New Zealand

వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆదివారం నాలుగో రోజు ఆటలో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను ఏకంగా 720/9 భారీ స్కోర్‌ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 352 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (136), రిషభ్ పంత్ (128) శతకాలతో మెరవగా.. శస్వి జైశ్వాల్‌(85), దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(80), శుబ్‌మన్‌ గిల్‌(98), ధ్రువ్‌ జురెల్‌(78) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. కాగా భారత జట్టు ఈ చారిత్రాత్మక బ్యాటింగ్ ప్రదర్శనతో రికార్డుల మోత మోగించింది.

టీమిండియా సాధించిన రికార్డులు ఇవే

👉న్యూజిలాండ్ గడ్డపై  ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు 2019లో హామిల్టన్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ చేసిన 715/6 (డిక్లేర్డ్) రికార్డును తిరగరాసింది.

👉న్యూజిలాండ్‌పై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. 1995లో ఇదే వేదికపై వెస్టిండీస్ చేసిన 660/5 (డిక్లేర్డ్) రికార్డును భారత్ బ్రేక్ చేసింది. గతంలో కివీస్ గడ్డపై భారత్ ఒక్కసారి మాత్రమే (2009లో హామిల్టన్‌లో 520) 500 పరుగుల మార్కును దాటింది.


👉టెస్టు చరిత్రలో వరుసగా ఆరు ఫిప్టీ ప్లస్‌ భాగస్వామ్యాలు రావడం ఇది నాలుగోసారి మాత్రమే. 2023లో ఆస్ట్రేలియాపై  ఈ ఘనత సాధించిన భారత్.. ఇప్పుడు రెండోసారి ఆ ఫీట్ సాధించింది.


👉టెస్టుల్లో తొలి ఐదుగురు బ్యాటర్లు 80 ప్లస్‌ స్కోర్లు చేయడం ఇది రెండోసారి మాత్రమే.  భారత్ కంటే ముందు 2014లో అబుదాబిలో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్‌ ఈ ఘనత సాధించింది.

👉టెస్టుల్లో భారత్‌కు ఇది మూడో అత్యధిక స్కోరు.  చెన్నైలో ఇంగ్లండ్‌పై సాధించిన 759 పరుగుల స్కోర్ అగ్రస్దానంలో ఉంది.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. టీమిండియా 720 పరుగుల భారీ స్కోర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement