రిష‌బ్ పంత్ ప్ర‌పంచ రికార్డు | Rishabh Pant Breaks World Record-Most Runs By-WK-Batter-Away Tests | Sakshi
Sakshi News home page

రిష‌బ్ పంత్ ప్ర‌పంచ రికార్డు

Nov 21 2026 9:25 PM | Updated on Nov 21 2026 9:26 PM

Rishabh Pant Breaks World Record-Most Runs By-WK-Batter-Away Tests

Photo Credit: Twitter

టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు. వెల్లింగ్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో 62 బంతుల్లో 55 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచిన పంత్ మెరుపు అర్థ‌శ‌త‌కం సాధించాడు. పంత్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు ఉన్నాయి.ఈ నేప‌థ్యంలో విదేశాల్లో వికెట్ కీప‌ర్‌గా అత్య‌ధిక ప‌రుగులు చేసిన పంత్ అగ్ర‌స్థానంలో నిలిచాడు ఇప్ప‌టివ‌ర‌కు 36 మ్యాచ్‌ల్లో 2,544 ప‌రుగులు సాధించగా, ఇందులో ఆరు శ‌త‌కాలు ఉన్నాయి. 

పంత్ దెబ్బ‌కు ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్ రెండో స్థానానికి ప‌డిపోయాడు. ఆసీస్ దిగ్గ‌జ వికెట్ కీప‌ర్ 38 టెస్టుల్లో 2,512 ప‌రుగులు సాధించాడు. ఇందులో 10 శ‌త‌కాలు ఉన్నాయి. ఇక మూడో స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 48 మ్యాచ్‌ల్లో 2,496 ప‌రుగుల‌తో ఉన్నాడు. నాలుగో స్థానంలో సౌతాఫ్రికా దిగ్గ‌జం మార్క్ బౌచ‌ర్ (70 మ్యాచ్‌ల్లో 2,445 ప‌రుగులు) కొన‌సాగుతుండ‌గా, ఐదో స్థానంలో అల‌న్ నాట్ (39 టెస్టుల్లో 2,198 ప‌రుగులు) ఉన్నాడు.

ఇక ఓవ‌రాల్‌గా విదేశీ టెస్టుల్లో (ప్రత్యర్థి గ‌డ్డ‌తో పాటు తటస్థ వేదికల్లో ఆడిన మ్యాచ్‌లతో సహా) అత్యధిక పరుగులు చేసిన మొత్తం రికార్డు పాకిస్థాన్‌కు చెందిన సర్ఫరాజ్ అహ్మద్ పేరిట ఉంది. సర్ఫరాజ్ పాకిస్థాన్ వెలుపల వికెట్ కీపర్-బ్యాటర్‌గా 52 టెస్టులు ఆడి, 91 ఇన్నింగ్స్‌లలో 2,696 పరుగులు సాధించాడు.

అతని తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ 41 మ్యాచ్‌లలో 62 ఇన్నింగ్స్‌లలో 2,634 పరుగులు చేసి రెండో స్థానంలో ఉండగా, పంత్ మూడవ స్థానంలో ఉన్నాడు. అయితే, నాలుగో రోజు ఆటలో గిల్‌క్రిస్ట్‌, స‌ర్ఫరాజ్ ఇద్దరినీ అధిగమించి జాబితాలో అగ్రస్థానంలో నిలిచేందుకు పంత్‌కు అవ‌కాశ‌ముంది.

ఇదీ చదవండి: ‘ఒక్క సెంచరీ నీపై ప్రేమను డబుల్ చేసింది’

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌.. భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement