ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు అరుదైన ఘనత నమోదు చేసింది. ఈ చారిత్రాత్మక మైదానంలో అత్యధిక టీ20 అంతర్జాతీయ స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డులకెక్కింది. తద్వారా నాలుగేళ్లుగా టీమిండియా పేరిట ఉన్న అత్యధిక స్కోరు రికార్డును అధిగమించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఎంసీజీ మైదానంలో ఇదే అత్యధిక టీ20 స్కోరు. ఇప్పటివరకు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అత్యధిక టీ20 స్కోరు రికార్డు భారత్ పేరిట ఉండేది.
2022 టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌లో 187 పరుగులు చేసిన ఇంగ్లండ్ జట్టు.. భారత్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. కాగా, ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్‌కు ఇది మూడో అత్యధిక టీ20 స్కోరు కావడం విశేషం.
ఇంగ్లండ్ ఓటమి
అయితే, రికార్డు స్థాయి స్కోరు సాధించినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది. ఆస్ట్రేలియా విజయంలో నిఖిల్ చౌదరి (66), సామ్ హార్పర్ (32), జాక్ ఎడ్వర్డ్స్ (25) కీలక పాత్ర పోషించారు.


