టీమిండియా కెప్టెన్‌గా గిల్‌కు ఊహించని షాక్‌! | When-Was-Last Time-Shubman Gill-Dismissed-In-90s-Test Cricket | Sakshi
Sakshi News home page

టీమిండియా కెప్టెన్‌గా గిల్‌కు ఊహించని షాక్‌!

Nov 21 2026 4:43 PM | Updated on Nov 21 2026 4:49 PM

When-Was-Last Time-Shubman Gill-Dismissed-In-90s-Test Cricket

Photo Credit: Twitter

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ రెండు ప‌రుగుల తేడాతో సెంచ‌రీ మిస్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 146 బంతుల్లో 98 ప‌రుగులు చేసిన గిల్.. జాక‌బ్ డ‌ఫీ బౌలింగ్‌లో బౌల్డ్‌గా వెనుదిరిగాడు. కాగా గిల్ టెస్టుల్లో తొంబైల్లో ఔట‌వ్వ‌డం ఇది నాలుగోసారి.

గిల్ 90ల్లో ఔటైన సంద‌ర్భాలు..
👉91 వ‌ర్సెస్‌ ఆస్ట్రేలియా , బ్రిస్బేన్, 2021
👉91 వ‌ర్సెస్‌ ఇంగ్లాండ్, రాజ్‌కోట్, 2024
👉90 వ‌ర్సెస్‌ న్యూజిలాండ్, వాంఖేడే స్టేడియం, 2024
👉98 వ‌ర్సెస్‌ న్యూజిలాండ్, వెల్లింగ్టన్, 2026

ఇక సుదీర్ఘ ఫార్మాట్‌లో స‌చిన్ టెండూల్క‌ర్ (10 సార్లు), శుబ్‌మ‌న్ గిల్ (9 సార్లు) 90ల్లో ఔట‌య్యారు. ఇక న్యూజిలాండ్‌తో టెస్టుల్లో భార‌త కెప్టెన్‌గా తొంబైల్లో ఔటైన రెండో బ్యాట‌ర్‌గా గిల్ నిలిచాడు. 2010లో నాగ్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన టెస్టులో డేనియ‌ల్ వెటోరి బౌలింగ్‌లో 98 ప‌రుగులు చేసి ధోని వెనుదిరిగాడు. 

ఇక టెస్టుల్లో భార‌త కెప్టెన్‌గా అత్య‌ధికసార్లు తొంబైల్లో ఔటైన బ్యాట‌ర్‌గా ఎంఎస్ ధోని (4 సార్లు) తొలి స్థానంలో ఉండ‌గా, స‌చిన్ టెండూల్క‌ర్ (రెండు సార్లు) రెండో స్థానంలో ఉన్నాడు. గంగూలీ, ద్ర‌విడ్‌, కోహ్లి, అజారుద్దీన్‌, అజిత్ వాడేక‌ర్‌, క‌పిల్ దేవ్‌, మ‌న్సూర్ అలీఖాన్ ప‌టౌడీ, నారి కాంట్రాక్ట‌ర్ త‌లా ఒక‌సారి 90ల్లో ఔట‌వ్వ‌గా, తాజాగా గిల్ వీరి స‌ర‌స‌న చేరాడు.

అంతేకాదు, గిల్  మ‌రో ఘ‌నత‌ను కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలో మూడువేల పరుగులు చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా గిల్ రికార్డుల‌కెక్కాడు.

ఇదీ చదవండి: ఇంగ్లండ్ ఓపెన‌ర్ అత్యంత‌ చెత్త రికార్డు

అతడు విధ్వంసం సృష్టించినా.. టీమిండియాలోకి తీసుకునే ప్రసక్తే లేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement