మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆసీస్ బౌలర్లు షాకిచ్చారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఖతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరగా.. అన్యూరిన్ డోనాల్డ్(10)కూడా కాసేపటికే ఔటయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన బ్రూక్.. ప్రత్యర్ధి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన రిలే మెరెడిత్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది, ఆ ఒక్క ఓవర్లోనే 23 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత బెన్ డ్వార్షుయిస్, జాక్ ఎడ్వర్డ్స్ బౌలింగ్‌ను సైతం చీల్చిచెండాడుతూ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆస్ట్రేలియా ఫాస్టెస్ట్ టీ20 హాఫ్ సెంచరీ చేసిన ఇంగ్లీష్ బ్యాటర్‌గా బ్రూక్ చరిత్ర సృష్టించాడు.
గతంలో ఈ రికార్డు జోస్ బట్లర్ (2018లో ఎడ్జ్‌బాస్టన్‌లో 22 బంతుల్లో) పేరిట ఉండేది. తాజా తుపాన్ ఇన్నింగ్స్‌తో బట్లర్‌ను బ్రూక్ అధిగమించాడు. అంతేకాకుండా ఎంసీజీ మైదానంలో నమోదైన రెండో అత్యంత వేగవంతమైన టీ20 అర్ధశతకం ఇదే కావడం గమనార్హం. అంతకముందు డేవిడ్ వార్నర్ ఈ మైదానంలో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.
ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బ్రూక్(28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65) టాప్ స్కోరర్‌గా నిలవగా.. టామ్ బాంటన్(39), జోర్డాన్ కాక్స్(27) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నిఖిల్ చౌదరి, జాక్ ఎడ్వర్డ్స్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 94 ఏళ్లలో ఇదే తొలిసారి
6 6 6 4 🫣 Harry Brook was dropped twice early and made the Aussies pay. #AUSvENG https://t.co/rQ9sufv3A1
— cricket.com.au (@cricketcomau) November 21, 2026


