కొన్ని ఆహార దుకాణాలు తరాలకు స్ఫూర్తి..గొప్ప వారసత్వాన్ని అందిస్తాయి. ఎన్నో మార్పులు చేర్పులు వచ్చినా.. అదే చేతి రుచి, అదే..సువాసన ఎక్కడా తగ్గేదేలా అన్నట్లుగా వాళ్ల పాక నైపుణ్యం ఉంటుంది. తరాలు మారినా తరగని రుచి.. ఆ వృద్ధుడి సంకల్పానికి నిదర్శనం లెబనాన్‌లో ఉన్న ఈ దుకాణం. ఇప్పటికీ అతడే స్వయంగా వండుతూ..దుకాణాన్ని నడిపిస్తూ యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు.
Tabbara family serving falafel sandwich: అతడే లెబనాన్‌కి చెందిన మహమ్మద్ తబ్బారా. 82 ఏళ్ల వయసులో కూడా అతడే స్వయంగా తన 112 ఏళ్ల పురాతన దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అతడే కౌంటర్ వద్ద ఆర్డర్లు తీసుకుంటూ..స్వయంగా శాండ్‌విచ్‌లు తయారు చేస్తుంటాడు. లెబనాన్ దేశం ఏర్పడక ముందే చిన్న మధ్యధరా దేశంలో అతడి దుకాణం ఉండేది. ఇది అనేక స్థానిక సంఘర్షణలు తట్టుకుని నిలబడిన దుకాణం. ఇక్కడ నేటికి జస్ట్ రూ.280కే శాండ్ విచ్ దొరుకుతుంది.
బీరుట్‌లోని రద్దీగా ఉండే హమ్రా ప్రాంతంలో అతడి దుకాణం ఉంది. అక్కడ ఫలాఫెల్ అనే శాండ్‌విచ్ బాగా ఫేమస్. అక్కడ స్థానికులకు దాని రుచి సువాసన బాగా తెలుసు. తబ్బారా ఆరేళ్ల వయసులో తన తండ్రి దుకాణంలో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఆయన తాతగారు కామెల్ తబ్బారా 1914లో ఈ దుకాణాన్ని మొదలుపెట్టినప్పుడూ.. బీరుట్ ఇంకా ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.
అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత గ్రేటర్ లెబనాన్ రాజ్యం ఏర్పడటానికి ముందు నుంచే ఈ దుకాణం ఉందన్నమాట. ఆయన ఈ వ్యాపారాన్ని తన కుమారుడు అహ్మద్‌కు అప్పగించారు. 1950 నుంచి ఆయన మనవడు 82 ఏళ్ల మహమ్మద్ తబ్బారా దీన్ని నిర్వహిస్తున్నాడు. ఆ తర్వాత దీన్ని బీరుట్ నుంచి మార్చినట్లు తెలిపారు. అలా తరతరాల వారసత్వంగా సాగిన ఈ దుకాణం తన కస్టమర్లకు నేటికీ.. అదే రుచి, సువాసనతో కూడిన శాండ్‌విచ్‌లను అందించడం విశేషం.
40 యుద్ధాలు జయించిన రుచి..
ఇక తబ్బారా సుమారు 40 యుద్దాలు చూశాడట. రెండు అంతర్యుద్ధాలు, 1982లో ఇజ్రాయెల్ లెబనాన్‌పై చేసిన దాడి, ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య జరిగిన పలు యుద్దాలు, పాలస్తీనా సముహాలు, సిరియా సైతన్యంతో సహా అనేక ఘర్షణలు చూశానన్నారు. ఇన్ని యుద్ధాలను తట్టుకుని నిలచిన దుకాణంగా గర్వంగా చెప్పుకొచ్చాడు తబ్బారా.
ఇక్కడి ప్రజలకు శాండ్‌విచ్ అనేది కడుపు నింపే, సరసమైన భోజనం అని చెప్పుకొచ్చారు. ఇక ఈ వృద్ధుడు తబ్బారా తన కళను తన కుమారుడు జియాద్ తబ్బారాకు అందించాలని అనుకుంటున్నాడు. అతడు గతంలో అకౌంటెంట్‌గా పనిచేసేవాడు, ప్రస్తుతం తనకుచేదుడు వాదుడుగా ఉంటున్నట్లు తెలిపాడు.

ఆ వారసత్వానికి బ్రేక్..
అయితే ఈ 80 ఏళ్ల వృద్ధుడికి తరతరాలుగా చరిత్రను, వారసత్వాన్ని అందించిన ఈ రుచి తన కుమారుడితో ఆగిపోతుందేమోననే బెంగ. ఎందుకంటే అతడి కుమారుడికి ఇంకా పెళ్లి కాలేదు. అంతేకాదండోయ్ ఈ శాండ్‌విచ్ నూటికి నూరు శాతం ఆరోగ్యకరమైనదట. ఎందుకంటే ఈ శాండ్‌విచ్ తయారీ ఉపయోగించే కూరగాయలను వెనిగర్, ఉప్పులో కడిగి మరి తయారు చేస్తారట.
అలాగే ఏ రోజు నూనెని ఆ రోజే మార్చేస్తాడట. నమ్మకం, నిజాయితీ బేషుగ్గా ఉంటే.. ఆ ఆహార దుకాణం తరాలు మారినా..అదే రుచితో కస్టమర్ల మనసుదోచుకుంటూ నిరాటకంగా కొనసాగుతుంది అనడానికి మహ్మద్ తబ్బారా నడుపుతున్న శాండ్‌విచ్ దుకాణమే ఒక ఉదాహరణ కదూ..!.
ఇదీ చదవండి: సైకియాట్రిస్ట్ వెయిట్‌లాస్ స్టోరీ: 103 కేజీల నుంచి 70కేజీలకు..!


