కోడిపిల్లలు పసుపురంగులో ఎందుకు ఉంటాయో తెలుసా? | Interesting Facts: Why are baby chicks yellow | Sakshi
Sakshi News home page

baby chicks: కోడిపిల్లలు పసుపురంగులో ఎందుకు ఉంటాయో తెలుసా?

Nov 14 2026 10:59 AM | Updated on Nov 14 2026 11:01 AM

Interesting Facts: Why are baby chicks yellow

తెల్లటి గుడ్డులోంచి బయటకు వచ్చే బుజ్జి బుజ్జి కోడిపిల్లలు పసుపురంగులో ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? కోడిగుడ్డు లోపల ఉండే పచ్చసొనలో ‘జాంతోఫిల్స్‌’ అనే ప్రత్యేకమైన పసుపు రంగు పిగ్మెంట్స్‌ ఉంటాయి.  గుడ్డు లోపల కోడిపిల్ల ఎదుగుతున్నప్పుడు, ఈ పచ్చసొనలోని పోషకాలను, రంగును అది పూర్తిగా గ్రహిస్తుంది. 

అందుకే గుడ్డు పెంకు నుంచి బయటకు రాగానే కోడిపిల్ల ఈకలు పసుపు కాంతితో మెరిసి΄ోతుంటాయి! కానీ పిల్లలూ... ఈ పసుపు రంగు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కోడిపిల్లలు పెద్దవవుతున్న కొద్దీ ఆ పసుపు ఈకలు రాలిపోయి వాటి తల్లిదండ్రుల లాగే తెల్లగానో, నల్లగానో లేదా గోధుమ రంగులోకో మారిపోతాయి. 

90 కోట్ల గెలాక్సీలు
ఈ ఫొటో ఏంటో తెలుసా? ఒక అందమైన ఉంగరం ఆకారపు గెలాక్సీ ఫోటో ఇది. అంతరిక్షంలో తిరుగుతున్న ‘యూక్లిడ్‌’ అనే శక్తిమంతమైన టెలిస్కోప్‌ ఈ అద్భుతమైన క్లోజప్‌ ఫోటోను తీసింది.ఈ టెలిస్కోప్‌ గత 13 నెలలుగా అంతరిక్షాన్ని పరిశీలిస్తూ, ఏకంగా 90 కోట్ల (900 మిలియన్‌) గెలాక్సీల వివరాలను సేకరించింది. 

విశ్వానికి ఒక పెద్ద 3డీ మ్యాప్‌ గీయడానికి శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నంలో ఇదొక గొప్ప ముందడుగు. రాబోయే రోజుల్లో విశ్వంలోని ఎన్నో రహస్యాలను తెలుసుకోవడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది! .

ది కిడ్‌
పిల్లలూ మీరు తప్పకుండా చూడాల్సిన సినిమా....ది కిడ్‌. చార్లీ చాప్లిన్‌ రచన, నిర్మాణం, దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించారు. చార్లీ చాప్లిన్‌ తీసిన మొదటి పూర్తి నిడివి చిత్రం ఇది. ఈ సినిమా భారీ విజయం సాధించి 1921లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా ఎంతోమందికి హాట్‌ ఫెవరెట్‌.ఈ సినిమాని 2011లో లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌ యునైటెడ్‌ స్టేట్స్‌ నేషనల్‌ ఫిల్మ్‌ రిజిస్ట్రీలో భద్రపరిచారు. 

ఇదీ చదవండి: చరిత్ర పుటల్లో నిలిచిపోయిన అసాధారణ బాలలు వీరే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement