‘దీపావళి వ్యాపారాన్నికాపాడండి’.. రాహుల్‌కు వ్యాపారుల విజ్ఞప్తి! | Delhi Traders Urge Rahul Gandhi To Postpone November 1 Vote Chori Rally, Citing Rs 25,000 Crore Diwali Business Concerns, Check Details | Sakshi
Sakshi News home page

‘దీపావళి వ్యాపారాన్నికాపాడండి’.. రాహుల్‌కు వ్యాపారుల విజ్ఞప్తి!

Oct 24 2026 1:19 PM | Updated on Oct 24 2026 1:59 PM

Delhi Traders Ask Rahul Gandhi To Postpone November 1 Vote Chori Rally

న్యూఢిల్లీ: ఢిల్లీలో దీపావళి పండుగ సీజన్ వ్యాపారానికి ఆటంకం కలుగుతుందనే ఆందోళనతో, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి నవంబర్ 1న తలపెట్టిన ‘ఓట్ చోరీ’ ర్యాలీని వాయిదా వేయాలని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ)లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కోరింది.

అక్టోబర్ 24న రాసిన లేఖలో, ఈ ర్యాలీ కారణంగా రామ్‌లీలా మైదాన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, బారికేడ్లు, మెట్రో స్టేషన్ల మూసివేత వంటి చర్యలు ఉంటాయని, ఇది ప్రధాన మార్కెట్లలోని వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని ట్రేడ్ బాడీ ఆవేదన వ్యక్తం చేసింది. ‘దీపావళి షాపింగ్ సీజన్ పీక్స్‌లో ఉన్నందున, భాయ్ దూజ్ (నవంబర్ 10) తర్వాత ఈ ర్యాలీని నిర్వహించాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాము’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

ధనతేరస్, దీపావళి పండుగల్లో ఢిల్లీలో భారీ వ్యాపార కార్యకలాపాలు జరుగుతాయని సీటీఐ తెలిపింది. ఈ ఏడాది ధనతేరస్ నవంబర్ 6న, దీపావళి నవంబర్ 8న, భాయ్ దూజ్ నవంబర్ 10న వస్తున్నాయి. పండుగకు వారం రోజుల ముందే ప్రజలు షాపింగ్ ప్రారంభిస్తారు.  బంగారం, వెండి నుంచి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, బట్టలు, డ్రై ఫ్రూట్స్, మిఠాయిలు, ఆటోమొబైల్స్, ఫర్నిచర్, స్టేషనరీ, గిఫ్ట్ ఐటమ్స్ మొదలైనవి ఈ కాలంలో దాదాపు రూ. 25,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది.

అలాగే అక్టోబరు నెలలో కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్, సెంట్రల్ ఢిల్లీలో జరిగిన నిరసనలు, ర్యాలీల వల్ల వ్యాపారులు ఇప్పటికే సుమారు రూ. 3,000 కోట్ల నష్టాన్ని చవిచూశారని ట్రేడ్ బాడీ పేర్కొంది. బయటి ప్రాంతాల నుంచి హోల్‌సేల్ మార్కెట్లకు సరుకులు రాకపోవడం, కస్టమర్లు రిటైల్ మార్కెట్లకు చేరుకోలేకపోవడం ఇందుకు కారణమని వివరించింది.

రామ్‌లీలా మైదాన్‌కు 5 కిలోమీటర్ల పరిధిలో చాందినీ చౌక్, సదర్ బజార్, భగీరథ్ ప్యాలేస్, కాశ్మీరే గేట్, నై సడక్, దరిబా కలాన్, అజ్మేరీ గేట్, జామా మస్జిద్, కరాల్ బాగ్, లాజపత్ రాయ్ మార్కెట్ వంటి 20 చారిత్రక హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లు ఉన్నాయి. ఈ మార్కెట్ల నుంచి భారతదేశం అంతటికీ సరుకులు సరఫరా అవుతుంటాయి.

ర్యాలీ కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు, మెట్రో స్టేషన్ల మూసివేత ఈ మార్కెట్ల వ్యాపారాన్ని పూర్తిగా స్థంభింపజేస్తాయని హెచ్చరించారు. అంతేకాకుండా, రామ్‌లీలా మైదాన్‌కు సమీపంలో ఉన్న పాత ఢిల్లీ, కొత్త ఢిల్లీ రైల్వే స్టేషన్ల ద్వారా నిత్యం వేలాది మంది వ్యాపారులు, కొనుగోలుదారులు రాకపోకలు సాగిస్తుంటారని, రోడ్ల మూసివేత వల్ల వెలుపలి ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇక్కడకు రాకండా  ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఎన్నికల అవకతవకలు, బీజేపీపై ‘ఓట్ చోరీ’ ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీని నిర్వహిస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ తదితరులు ఉత్తరప్రదేశ్, హర్యానా నాయకులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ 'ఢిల్లీ చలో మార్చ్' నవంబర్ 1న జాతీయ రాజధానిని చేరుకుంటుందని, కనీసం 1 మిలియన్ (కోటి మంది) పౌరులు ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రత్యేక సవరణ (సర్‌) ఓటర్ల జాబితా ప్రక్రయలో అవకతవకలపై ప్రభుత్వపై ఒత్తిడి తెచ్చేందుకు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేయడానికి ఈ నిరసన చేపడుతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: Rajasthan: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement