వెండికి కొత్త ‘వెలుగు’.. 6,500 టన్నులకు ఓకే! | Silver Imports 6500 Tonnes Diwali 2026 India | Sakshi
Sakshi News home page

వెండికి కొత్త ‘వెలుగు’.. 6,500 టన్నులకు ఓకే!

Oct 22 2026 6:51 PM | Updated on Oct 22 2026 7:13 PM

Silver Imports 6500 Tonnes Diwali 2026 India

దేశంలో వెండి దిగుమతులపై ఆంక్షల కారణంగా ఏర్పడిన సరఫరా కొరతకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. పండుగల సీజన్‌లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో వెండి దిగుమతులకు అనుమతులు జారీ చేసింది. దీంతో దేశీయ మార్కెట్లో వెండి లభ్యత పెరగడంతో పాటు, అంతర్జాతీయ ధరలకు అదనంగా చెల్లించాల్సిన ప్రీమియం కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతో కొనుగోళ్లు సైతం పెరుగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు.

ఆరు నెలల్లో 6,500 టన్నుల దిగుమతులు

వెండి దిగుమతులకు సంబంధించి తాజాగా రాయిటర్స్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం.. వచ్చే ఆరు నెలల కాలానికి సుమారు 6,500 మెట్రిక్‌ టన్నుల వెండి దిగుమతులకు అనుమతులు జారీ అయ్యాయి. బులియన్‌ వ్యాపారులు, దిగుమతిదారుల నుంచి ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది మే నెలలో కేంద్ర ప్రభుత్వం వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది. జూన్‌లో వెండి పొడి, వెండి బీడ్స్‌ దిగుమతులపైనా నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో దిగుమతుల ప్రక్రియ నెమ్మదించి, దేశీయ మార్కెట్లో సరఫరా తగ్గింది. ఫలితంగా అంతర్జాతీయ ధరలతో పోలిస్తే భారత మార్కెట్లో వెండికి అదనపు ధర చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రీమియం భారీగా తగ్గుముఖం

తాజా అనుమతుల ప్రభావం ఇప్పటికే మార్కెట్లో కనిపిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణ ధరతో పోలిస్తే దేశీయ మార్కెట్లో వెండిపై చెల్లిస్తున్న ప్రీమియం అక్టోబర్‌ 22న ఔన్సుకు 45 సెంట్లకు తగ్గింది. అంతకుముందు వారంలో ఇది 2.50 డాలర్ల వరకు ఉన్నట్లు వ్యాపారులు వెల్లడించారు. దిగుమతులకు మార్గం సుగమం కావడంతో సరఫరా ఒత్తిడి తగ్గుతుందనే అంచనాలు దీనికి కారణం.

కొనుగోలుదారులకు ఏమిటి ప్రయోజనం?

దీపావళి నవంబర్‌ 8న జరగనున్న నేపథ్యంలో వెండి ఆభరణాలు, నాణేలు, ఇతర వస్తువుల కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. దిగుమతుల పెరుగుదలతో మార్కెట్లో వెండి అందుబాటు మెరుగుపడితే, సరఫరా కొరత వల్ల ఏర్పడిన అదనపు ధర తగ్గవచ్చు. అయితే, వినియోగదారులు చెల్లించే తుది ధర అంతర్జాతీయ వెండి ధర, రూపాయి మారకం విలువ, దిగుమతి సుంకాలు, వస్తు తయారీ ఖర్చులు, స్థానిక వ్యాపారుల మార్జిన్లపై ఆధారపడి ఉంటుంది.

నేటి వెండి ధరలు ఇలా..

Gold Silver Rates today1
1/2

Silver Rate Today2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement