breaking news
Politics
-
మా అన్న పవన్ వీరాభిమాని: రజిత
సాక్షి, అనంతపురం: కదిరి ఘటనలో ఇంకో ట్విస్ట్ చేసుకుంది. అజయ్‌కు వైఎస్సార్సీపీతో ఎలాంటి సంబంధం లేదని స్వయంగా అతని సోదరి రజిత స్పష్టత ఇచ్చింది. ఇంతకు ముందు.. ఇదే విషయాన్ని ఎంపీటీసీ అమర్ సైతం ధృవీకరించారు. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్న అజయ్ జనసేన అని ప్రకటించారు. దీంతో ఎల్లో మీడియా ఎలివేషన్లు కాస్త తుస్సుమనిపిస్తున్నాయి. ‘‘మా అన్నకు వైఎస్సార్సీపీతో సంబంధం లేదు. అతను ముందు నుంచే జనసేనలో ఉన్నాడు. మా అన్న మొదటి నుంచి పవన్ అభిమానే. అందుకే చెయ్యిపై పవన్ కల్యాణ్ టాటూ కూడా వేయించుకున్నాడు(పీఎస్ పీకే). ఎంపీటీసీ అమర్‌తో మా అన్నకు పదేళ్ల పరిచయం ఉంది. పక్కా జనసేన. మా అన్నని పాత కక్షలతోనే ఇరికించారు’’ అని రజిత ఓ వీడియో సందేశంలో క్లారిటీ ఇచ్చింది. మరోవైపు అజయ్‌పై ఫిర్యాదు చేసిన గర్భిణీ కుటుంబంతో పాత గొడవలు ఉన్నాయని.. తన తండ్రిని తిట్టిందన్న కోపంతో ఆమెను అజయ్ తోసేశాడని స్థానికులు చెబుతుతుండడం గమనార్హం.వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నంలో పచ్చ మీడియా, పోలీసులు చేసిన ప్రయత్నం ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. కదిరి తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో వైఎస్ జగన్ బర్త్‌డేనాడు పటాకులు పేలుస్తున్న వాళ్లను ఓ గర్భిణిపై మందలించిందని.. అందుకు ఆమెను కాలితో తన్ని దాడి చేశాడని.. దీంతో ఆమె ఆస్పత్రిపాలై కడుపులో బిడ్డ కదలికలు సైతం లేవని.. పోలీసులు అతన్ని తమశైలిలో బుద్ధి చెప్పి(కోటింగ్) నడిపించారంటూ అజయ్ దేవ్ గురించి కూటమి అనుకూల మీడియా.. సోషల్ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. ఏపీలో ఆదిత్యా యోగినాథ్ ట్రీట్మెంట్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ ఇచ్చిన స్టేట్మెంట్.. అజయ్ వైఎస్సార్సీపీ కార్యకర్తే అంటూ ఎల్లో మీడియా కలరింగ్.. అది నమ్మి కదిరి పోలీసులు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అజయ్‌ను అదుపులోకి తీసుకోవడం.. నాటకీయ పరిణామాలను తలపించింది. చివరకు.. అజయ్ దేవ్ తమ పార్టీ కార్యకర్తేనని స్థానిక జనసేన ఎంపీటీసీ అమర్ బహిరంగంగా అంగీకరించడంతో ఈ ఎపిసోడ్ మరో మలుపు తిరిగినట్లైంది.ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు చెప్పినదాని ప్రకారం.. ఈనెల 21వ తేదీన వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ముత్యాలవాండ్లపల్లిలో ఘనంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ నేతలు కేక్ కట్ చేసే సమయంలో అటుగా వెళ్తున్న జనసేన నేత అజయ్ కూడా కేక్ తిన్నాడు. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత సంధ్యారాణితో అజయ్‌కి మాటామాటా పెరిగి గర్భిణి పై చేయి చేసుకున్నారు. ఈ ఘటనను ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ప్రతినిధులు రెచ్చిపోయారు. అజయ్ దేవ్ వైఎస్సార్ సీపీ నేత అని.... గర్భిణి పై దాడి చేశారంటూ అబద్ధాలు ప్రచారం చేశారు. ఆగమేఘాలపై స్పందించిన మంత్రి నారా లోకేష్ వెనుకాముందు ఆలోచించకుండా వైఎస్సార్సీపీపై అభాండాలు వేశారు. విచారణ సందర్భంగా అజయ్ దేవ్ జనసేన నేత అని కదిరి పోలీసులు గుర్తించారు. అయితే... మంత్రి నారా లోకేష్, ఎల్లో మీడియా ఆరోపణలు నిజం చేసే బాధ్యత తీసుకున్న పోలీసులు అజయ్‌ని ఊరేగించారు. ఇప్పుడు.. అజయ్ జనసేన కండువాతో ఉన్న ఫోటోలు, పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అటు జనసేన అమర్ క్లారిటీ ఇవ్వగా.. ఇటు ఫేక్ ప్రచారంపై అజయ్ సోదరి రజిత భగ్గుమంది. -
‘మహా’ సంచలనం.. 20 ఏళ్లకు కలసిన ‘ఠాక్రేలు’
ముంబై: సుమారు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. విభేదాలతో విడిపోయిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ ఒక్కటయ్యారు. నేడు (బుధవారం) జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ఇద్దరూ కలసి పాల్గొన్నారు. జనవరి 15న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో శివసేన (ఠాక్రే వర్గం),మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు.కుటుంబ సభ్యుల సమక్షంలో..ముంబైలోని ఒక వేదికపై ఇద్దరు సోదరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి కనిపించడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం పెల్లుబికింది. ఈ కలయికను ఉద్దేశించి సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, దీనిని ఒక శుభప్రదమైన ప్రారంభంగా అభివర్ణించారు. ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ)తో పాటు ఇతర కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరాలంటే ఈ కలయిక అనివార్యమని ఆయన అన్నారు.వారసత్వ పోరాటమే స్ఫూర్తిఈ సభలో ఉద్ధవ్ ఠాక్రే భావోద్వేగంతో మాట్లాడారు. తమ తాత ప్రబోధన్కర్ ఠాక్రే, తండ్రి బాలాసాహెబ్ ఠాక్రేల ఆశయాల గురించి గుర్తు చేసుకుంటూ, తాము ఇక్కడ కేవలం ఇద్దరు వ్యక్తులుగా కాకుండా ఠాక్రే సోదరులుగా నిలుచున్నామని అన్నారు. శివసేన స్థాపించి 60 ఏళ్లు అవుతున్న తరుణంలో, మరాఠీ ప్రజల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ముంబై రక్షణే పరమావధిమాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. కొందరు నేతలు ముంబైని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము విడిపోయి పోరాడితే అది ఇక్కడి అమరవీరులకు చేసే అవమానమవుతుందన్నారు. రాజ్ ఠాక్రే తన ప్రసంగంలో సంఘీభావం చాటారు. వ్యక్తిగత అపార్థాల కన్నా మహారాష్ట్ర గౌరవమే గొప్పదన్నారు. సీట్ల పంపకాల కంటే ముంబై ప్రయోజనాలే తమకు ముఖ్యమని, నాసిక్ వంటి ఇతర కార్పొరేషన్లలో కూడా ఈ పొత్తు కొనసాగుతుందని అన్నారు. కాగా ఈ పొత్తు ద్వారా ముంబై పీఠాన్ని దక్కించుకుంటామని రాజ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: ‘విజయ్‌తో రాహుల్’.. సీక్రెట్ వెల్లడించిన టీవీకే నేత -
ఎల్లో మీడియా ఎఫెక్ట్.. జనసేన కార్యకర్తకు పోలీసుల కోటింగ్!
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీపై బురదజల్లాలని పచ్చ మీడియా, పోలీసులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కదిరిలో గర్భిణిపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గర్భిణిపై దాడి చేసిన అజయ్ దేవ్ వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్త కాదని.. అతడు జనసేన యాక్టివ్ కార్యకర్త అని ఆ పార్టీ నేత అంగీకరించారు. దీంతో, ఈ కేసులో మరో టర్న్ తీసుకుంది.వివరాల ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణిపై అజయ్ దేవ్ దాడి చేశాడు. దీంతో, నిందితుడు అజయ్.. వైఎస్సార్సీపీ కార్యకర్త అంటూ ఎల్లో మీడియా కలరింగ్ ఇచ్చింది. తప్పుడు కథనాలను ప్రచురించింది. పచ్చ మీడియా ప్రచారాన్ని నమ్మిన కదిరి పోలీసులు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్త అని భావించి.. అతడిపై పోలీసులు తమదైన మార్క్‌తో కోటింగ్ ఇచ్చారు. అనంతరం, పోలీసుల విచారణలో తీవ్రంగా గాయపడిన నిందితుడిని కదిరి పట్టణంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. అంతేకాకుండా.. అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే, నిందితుడు అజయ్ జనసేనకు చెందిన వ్యక్తి అని తాజాగా వెలుగులోకి వచ్చింది. అజయ్ దేవ్ తమ పార్టీ కార్యకర్తేనని స్థానిక జనసేన ఎంపీటీసీ అమర్ బహిరంగంగా అంగీకరించారు. అజయ్‌కి వైఎస్సార్సీపీకి సంబంధం లేదన్నారు. అజయ్ చేతిపై పవన్ కల్యాణ్ పచ్చబొట్టు కూడా ఉందని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ అజయ్ దేవ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఏదైనా ఘటన జరిగిన వెంటనే నిందితులను వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా ఎల్లో మీడియా, పోలీసులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ నేతలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. నిందితుడు జనసేన కార్యకర్త అజయ్‌పై ఫిర్యాదు చేసిన గర్భిణీ.. ఇతనికి దాయాదులని, తన తండ్రిని తిట్టిందన్న కోపంతో ఆమెను అజయ్ తోసేశాడని స్థానికులు చెబుతున్నారు. -
నేను ఏ పార్టీలో ఉంటే వారిదే విజయం: దానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగుతున్న వేళ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు దానం కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా.. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందంటూ జోస్యం చెప్పారు.ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు. నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నాం. ఎంఐఎంతో కలుపుకుని కాంగ్రెస్ 300 డివిజన్లలో గెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా 300 డివిజన్లలో తిరుగుతాను. కాంగ్రెస్ పథకాలను ప్రజలకు వివరిస్తాను. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అయితే, స్పీకర్ విచారణ జరుగుతున్న సమయంలో దానం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇప్పటి వరకు స్పీకర్‌కు వివరణ ఇవ్వని దానం. కాగా, దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇలా వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. దీంతో, తెలంగాణ రాజకీయాల్లో దానం వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
‘విజయ్‌తో రాహుల్’.. సీక్రెట్ వెల్లడించిన టీవీకే నేత
చెన్నై: తమిళనాడు రాజకీయ రంగస్థలంపై సరికొత్త సమీకరణలు మొదలయ్యాయి. దళపతి విజయ్ తన ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీతో ప్రజల్లోకి దూసుకుపోతుంటే, జాతీయ నేత రాహుల్ గాంధీ ఆయనకు సంఘీభావం తెలపడం సంచలనంగా మారింది. ఆమధ్య కరూర్‌లో జరిగిన విషాదకర ఘటన తర్వాత విజయ్ తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో, రాహుల్ ఆయనకు స్వయంగా ఫోన్ చేసి, మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఆ ఫోన్ కాల్ వెనుక అసలు కథ.. తాజాగా కన్యాకుమారిలో జరిగిన ఒక కార్యక్రమంలో టీవీకే నేత ఆధవ్ అర్జున ఒక ఫోన్ కాల్ రహస్యాన్ని బయటపెట్టారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ మానసిక వేదనలో ఉన్నప్పుడు, ఆయనకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆయన తెలిపారు. ‘బ్రదర్.. నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను, దేనికీ చింతించకు’ అంటూ ఫోన్లో రాహుల్ అన్నారని ఆధవ్ అర్జున తెలిపారు. ఈ భరోసా వెనుక ఉన్నది కేవలం వారి వ్యక్తిగత స్నేహం మాత్రమే కాదని, లోతైన రాజకీయ వ్యూహం ఉందనే చర్చ సర్వత్రా మొదలైంది. అయితే ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఇలా నేరుగా విజయ్‌కు మద్దతు పలకడం అధికార పక్షానికి మింగుడు పడటం లేదు.డీఎంకేకు ఇది ‘ప్లాన్ బి’ హెచ్చరికా? తమిళనాడులో దశాబ్దాలుగా డీఎంకే నీడలో జూనియర్ భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు తన వ్యూహాన్ని మారుస్తోందా? అన్న అనుమానాలు ఇప్పుడు విశ్లేషకుల్లో మొదలయ్యాయి. అయితే రాహుల్ గాంధీ, విజయ్ మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. 2009లోనే విజయ్‌కు యూత్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని రాహుల్ భావించారు. ఇప్పుడు విజయ్ సొంత పార్టీ పెట్టడంతో, రాహుల్ ఆయనకు అండగా నిలవడం ద్వారా డీఎంకేపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇది భవిష్యత్తులో డీఎంకేకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.బహిర్గతమైన అసహనం విజయ్ పార్టీ కార్యక్రమాలకు పెరుగుతున్న ఆదరణ చూసి డీఎంకే ఇప్పటికే అప్రమత్తమైంది. అరుమనైలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చివరి నిమిషంలో గైర్హాజరు కావడం వెనుక డీఎంకే ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు సీనియర్ రాజకీయ నేతలు కూడా విజయ్ వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సెంగుట్టయ్యన్ వంటి వారు విజయ్‌కు మద్దతుగా నిలవడం చూస్తుంటే భవిష్యత్తులో టీవీకే ఒక బలమైన శక్తిగా ఎదగబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి.2026 సమరానికి నాంది 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్-విజయ్ దోస్తీ తమిళనాడులో కొత్త కూటములకు బాటలు వేసేలా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ తన మద్దతును విజయ్ వైపు మళ్లిస్తే, రాష్ట్రంలో దశాబ్దాల రాజకీయ చరిత్ర మారిపోతుంది. 1967లో కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించాలనే కాంగ్రెస్ ఆశలకు విజయ్ ఒక వేదికగా మారతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: కెనడాలో భారత యువతి హత్య.. కీలక వివరాలు వెల్లడి -
కల్లలైన బాబు ‘రియల్’ మాటలు!
ఏపీలో 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రచారం చేసిన విషయం ఒకటుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం కొనసాగితే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోదు అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆస్తుల విలువలు పెరగవని ప్రజలు, రైతులను బెదిరించారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను కప్పిపుచ్చి భూముల విలువలు పడిపోయాయంటూ ఎల్లోమీడియా కూడా తన కథనాలలో విషం చిమ్మింది. ఏదైతేనేం.. ఎన్నికల్లో ఈ కూటమి అధికారం దక్కించుకుంది. ఇంకేం.. మా భూములు బంగారమవుతాయని అందరూ ఆశించారు. ఇరవై నెలలు గడిచిపోయింది కానీ.. వీరి ఆశలు మాత్రం పెద్దగా నెరవేరలేదు. పైగా.. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ లావాదేవీలు మెరుగ్గా సాగాయని గణాంకాలు చెబుతున్నాయి.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరింది. 2023-24లో 22.25 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా.. రూ.9546 కోట్ల ఆదాయం సమకూరింది. చంద్రబాబు అధికారంలో ఉన్న 2024-25లో మాత్రం ఈ సంఖ్యలు పడిపోయాయి. ఆదాయం రూ.8843 కోట్లు మాత్రమే. 2025-26లో రూ.10169 కోట్ల లక్ష్యం పెట్టుకున్నా.. అక్టోబర్ నాటికి అయ్యింది రూ.ఏడు వేల కోట్లే. కూటమి ప్రభుత్వం 2024-25లోనూ రూ.11997 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది కానీ.. ఈ ఏడాది దీన్ని రూ.10169 కోట్లకు తగ్గించుకుంది. ఏటా ఆయా పద్దుల కింద ఆదాయం పదిశాతం వరకూ పెరిగేలా ప్రభుత్వాలు లక్ష్యాలు పెట్టుకుని బడ్జెట్ తయారు చేస్తుంటాయి. ఏపీలో మాత్రం లక్ష్యాన్ని తగ్గించుకున్నారన్న మాట.రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువను ఏభై శాతం మేర పెంచినా ఆశించినంత ఆదాయం రాకపోవడం ఆందోళన కలిగించేదే. వేల కోట్లు అప్పు తెచ్చి మరీ రాజధాని అమరావతిలో ఖర్చు చేస్తున్నా ప్రజలలో నమ్మకం కలగడం లేదు. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడి తమ వెంచర్ల భవిష్యత్తు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఉద్యోగులు చాలామందికి నెలలకొద్దీ జీతాలు కూడా అందడం లేదని ఈ రంగంలో పని చేస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పడం గమనార్హం. ఇల్లు కట్టుకుంటున్నాను అంటూ చంద్రబాబు హడావుడి చేసినా ఫలితం లేకపోయింది. ఇవన్నీ చూస్తుంటే.. కూటమి ప్రభుత్వం వస్తే భూముల విలువలు బాగా పెరుగుతాయన్న ప్రచారం రాజకీయ లబ్ది కోసం మాత్రమే చేసిన అబద్ద ప్రచారం అని స్పష్టమవుతుంది.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంతో కొంత సాగేది. విశాఖపట్నం వంటి చోట్ల జోరుమీద ఉండేది కూడా. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పరిశ్రమలకు 99 పైసలకే భూములు ఇచ్చేయడం మొదలుపెట్టడంతో పరిస్థితి మారిపోయింది. ఈ రకమైన చర్యలతో ప్రభుత్వం విశాఖ ఇమేజీని ప్రభుత్వం దెబ్బ తీస్తోందన్న భావన ఏర్పడింది అంటున్నారు. జగన్ ప్రభుత్వం రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణం ప్రారంభించగానే ఆ చుట్టుపక్కల భూముల విలువలు బాగా పెరిగాయని అక్కడి రైతులు తెలిపారు. అయితే, ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్టు వేగం మందగించింది. ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమూ తగ్గిపోయే పరిస్థితి. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జగన్ టైమ్‌లో రోజుకు 150 రిజిస్ట్రేషన్లు జరిగితే, ప్రస్తుతం అవి 80 దాటడం లేదట. తూర్పు గోదావరి జిల్లాలో 2023-24లో సుమారు 129355 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. కూటమి వచ్చాక ఏడాది కాలంలో ఇది 61597 డాక్యుమెంట్లకు పరిమితమైంది. కడపలో గతంలో రోజుకు 300 రిజిస్ట్రేషన్లు జరిగితే ఇప్పుడవి ఏభై - అరవై వరకే ఉంటున్నాయి.రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటే అనేక అనుబంధ పరిశ్రమలు దెబ్బతిని ఉద్యోగవకాశాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. సిమెంట్, ఐరన్, కలప పెయింటింగ్, విద్యుత్, ప్లంబింగ్ తదితర రంగాల వారు ఇబ్బంది పడుతున్నారు. జగన్ టైమ్‌లో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టడం, నాలుగు కొత్త పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, 31 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయించి, సుమారు 21 లక్షల ఇళ్ల నిర్మాణం ఆరంభించడం ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ తదితర భవనాల నిర్మాణాలు చేపట్టారు. ఇవన్ని రియల్ ఎస్టేట్ లావాదేవీలు కొనసాగడానికి ఉపకరించాయి. అయినా అప్పట్లో ఎల్లో మీడియా నెగిటివ్ ప్రచారాన్ని సాగించేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ పనులు ఏవీ సజావుగా సాగడం లేదు. అమరావతి తప్ప మిగలిన రాష్ట్రంలో ఎక్కడా కొత్త నిర్మాణం చేపట్టినట్లు కనిపించదు. ఫలితంగా అనంతపురం సహా వివిధ జిల్లాలలో పేదలు, కూలీలు వలసలు వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గిట్టుబాటు ధరలు లేక రైతుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది.తెలంగాణలో కూడా రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో పెరగలేదు. కానీ, భూముల వేలంపాటల్లో మంచి రేట్లు వస్తుండటంతో ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. కోకాపేట పరిసరాలలో ఇటీవల జరిగిన వేలంపాటలో ప్రభుత్వానికి రూ.మూడు వేల కోట్లు వచ్చాయి. అలాగే కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన 300 ఎకరాల స్థలాల ద్వారా రూ.ఎనిమిది వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నారు. మరోవైపు విశాఖలో ప్రభుత్వ భూములను అణా, బేడాకు చంద్రబాబు ప్రభుత్వం పందారం చేస్తోంది. సత్వా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్‌లో 2020లో రూ.600 కోట్లు ఖర్చు చేసి 20 ఎకరాలు కొనుగోలు చేసింది. వేలం పాట ద్వారా ఎకరాకు రూ.150 కోట్లు పెట్టి మరీ కొనుక్కుంది. కానీ ఏపీకి వచ్చేసరికి సత్వా కంపెనీకి ఏభై కోట్ల విలువైన భూమిని రూ.1.5 కోట్లకే కట్టబెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెబుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితుడన్న పేరు ఉన్న యూసఫ్ అలీకి చెందిన లూలూ గ్రూపు అహ్మదాబాద్ లో సుమారు 16.35 ఎకరాల భూమిని రూ.519 కోట్లకు కొనుగోలు చేస్తే ఏపీ ప్రభుత్వం విజయవాడ, విశాఖల్లో నామమాత్రపు లీజుకు భూములు ఇచ్చేసింది.అందువల్లే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఆదాయ అంచనాలు దారుణంగా బోల్తా పడ్డాయి. వేర్వేరు మార్గాల ద్వారా మొత్తం రూ.2.18 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే.. నవంబర్ నాటికి కేంద్రం ఇచ్చే గ్రాంట్లతో కలిపి రూ.1.05 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. ఇందులో రియల్ ఎస్టేట్ ద్వారా అందిన రూ.7132 కోట్లు ఆశించిన మొత్తంలో 54 శాతమే కాగ్ వెల్లడించింది. రెవెన్యూ లోటు మాత్రం వేగంగా పెరుగుతూ 54వేల కోట్లకు చేరింది. ఈ అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుంటే ఎపిలో రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన రీతిలో పుంజుకోకపోవడానికి తన ప్రభుత్వ అసమర్థతే కారణం అని చంద్రబాబు అంగీకరిస్తారా?.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తాం..
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడిన ప్రతీ సారి లీకులతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. నదీ జలాల్లో అన్యాయంపై కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మాపై కేసులు పెడతామంటూ లీక్‌లు ఇస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీ సులు ఇస్తారట. చట్టబద్ధ్దంగా వ్యవహరించని పోలీసు అధికారులు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది’అని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ‘పోస్టింగుల కోసం అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతున్న పోలీసుల వివరాలు రాసి పెడుతున్నాం. బీఆర్ఎస్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న అధికారులను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయినా, విదేశాలకు వెళ్లినా, సెంట్రల్ సర్వీసులోకి డిప్యూటేషన్‌పై వెళ్లినా వదిలిపెట్టేది లేదు. ఏ బొరియలో దాక్కున్నా లాక్కొస్తాం. రేవంత్ అడుగు లకు మడుగులొత్తుడేనా డీజీపీ శివధర్‌రెడ్డి ఖాకీ బుక్’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియాతో హరీశ్‌రావు ఇష్టాగోష్టి నిర్వహించారు. నేతి బీరలో నెయ్యిలా డీజీపీ ఖాకీ బుక్ ‘ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకు నాపై సుమారు 300 కేసులు పెట్టారు. రేవంత్ పథకాల ఎగవేతను ప్రశ్నిస్తూ ఆయన పాపాలను క్షమించమని దేవుడిని వేడుకున్నందుకు కూడా యాదగిరిగుట్టలో కేసులు పెట్టారు. సిద్దిపేటలో నా ఇంటిపై దాడి చేసినా కేసు నమోదు చేయలేదు. ఫార్ములా ఈ–రేస్ తరహాలోనే నాపై అక్రమ కేసులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓటు వేయలేదని సజ్జాపూర్‌లో దళితుల ఇల్లు కూల్చివేస్తే డీఐజీ ఖాకీబుక్ ఏం చేస్తోంది.రేవంత్ ఫుట్‌బాల్ ఆడితే డీఐజీ మైదానంలో రెండు రోజులు కాపలా ఉన్నారు. కానిస్టేబుళ్లు, హోమ్‌గార్డులు తమకు రావాల్సిన టీఏ, డీఏ, సరెండర్ లీవులు, భద్రత పథకం, అలవెన్సుల కోసం తిరగబడే పరిస్థితిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకుని కేవలం యూసుఫ్‌గూడ బెటాలియన్‌లో పనిచేసే వారికి మాత్రమే పెండింగ్ అలవెన్సులు ఇచ్చారు. నేతి బీరకాయలో నేతి చందంగా డీజీపీ ఖాకీ బుక్ పనిచేస్తోంది’అని హరీశ్‌రావు మండిపడ్డారు. వాస్తు భయంతో సచివాలయానికి దూరం ‘కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో ఆత్మరక్షణలో పడిన రేవంత్ రాత్రి 9.30 గంటలకు మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించాడు. వాస్తు భయంతో సచివాలయానికి వెళ్లకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటున్నాడు. నాలుగు వేలకు పైగా సర్పంచ్ పదవులు మా పార్టీకి దక్కడంతో సహకార సంఘాల ఎన్నికలు పెట్టకుండా కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేయాలని చూస్తున్నాడు. కాంట్రాక్టుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.7వేల కోట్ల కమీషన్లు పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కన్సల్టెన్సీ కంపెనీలా పనిచేస్తూ బాంబే బ్రోకర్‌కు రూ.180 కోట్లు కమీషన్ ఇచ్చి అప్పులు తెచ్చింది. ఇరిగేషన్ అంశాలపై అసెంబ్లీలో మాకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలి. 15 రోజులు అసెంబ్లీ పెట్టి మాకు అవకాశం ఇస్తే ఇరిగేషన్‌తోపాటు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సర్కారు బట్టలు విప్పుతాం. ఉత్తమ్ తన తప్పు ఒప్పుకుని పాలమూరు ప్రాజెక్టుకు 90 టీఎంసీలు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాయాలి’అని హరీశ్‌రావు చెప్పారు. -
అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా ఎలా?
సత్తుపల్లి/తల్లాడ: రెండేళ్లు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి దిగజారుడు భాషతో తమ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రూ. 10.53 కోట్ల వ్యయంతో నిర్మించే మూడు సబ్స్టేషన్లకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే సత్తుపల్లిలో సింగరేణి ఏరియా జీఎం కార్యాలయాన్ని ప్రారంభించి ఆయా కార్యక్రమాల్లో మాట్లాడారు. ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందునే 85 శాతం సర్పంచ్‌లుగా తమ పార్టీ బలపరిచిన వారిని గెలిపించారన్నారు. దిగజారి మాట్లాడటం తమకు రాదని.. ప్రజాసంక్షేమ కార్యక్రమాల ద్వారానే బీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెబుతామన్నారు. ‘రెండేళ్లు ఫాంహౌస్‌లో పడుకున్న ఒకాయన మీడియా ముందుకొచ్చి తోలుతీస్తాం అనడం సరికాదు. తోలు వలుస్తామంటే ఇక్కడ ఖాళీగా ఎవరూ లేరు. ఆయన తోలు వలిచే ఉద్యోగం ఎప్పుడు తీసుకున్నారో చెప్పాలి’అని భట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడమంటే భయమెందుకో కేసీఆర్ చెప్పాలన్న భట్టి.. ప్రతిపక్ష హోదా అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలు వస్తుంటే కనుమరుగవుతాననే భయంతో కేసీఆర్ తమ ప్రభుత్వంపై విషం కక్కి తిరిగి ఫాంహౌస్‌కు వెళ్లారని విమర్శించారు. కాగా, బొగ్గు ఉత్పత్తిలో ప్రైవేట్ సంస్థలతో సింగరేణి పోటీ పడుతూనే బహుముఖంగా ఎదిగేలా చర్యలు చేపట్టామని భట్టి వివరించారు. కాపర్, గోల్డ్ మైనింగ్‌లోనూ సింగరేణి అడుగుపెట్టిందని చెప్పారు. కేంద్రం బొగ్గు బావులకు వేలం నిర్వహిస్తే తెలంగాణ నుంచి ఒక్క బొగ్గు బావి కూడా ఇతరులకు పోకుండా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ రాందాస్ నాయక్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, సీపీ సునీల్‌దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఇది అసలు నిజం.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన అబద్ధాల దుష్ప్రచారాన్ని ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బట్టబయలు చేశారు. టీడీపీ, జనసేన అసత్య ప్రచారాన్ని మరోసారి ఆయన ఎండగట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కూటమి సర్కార్ చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని వైఎస్ జగన్ బయటపెట్టారు. ఆర్బీఐ గణాంకాలను చూపుతూ కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు వేశారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. అదే నిజమైతే ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు భిన్నంగా ఎందుకున్నాయి?. ఆర్బీఐ గణాంకాలు చూస్తే వైఎస్సార్సీపీ పనితీరు ఏంటో తెలుస్తుంది...2019-24 మధ్య ఉత్పత్తి రంగంలో ఏపీ దక్షిణ భారత్‌లో నెం.1. యావత్ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2019-24 మధ్య ఏపీ పారిశ్రామిక రంగంలో పురోగతి. దక్షిణ భారత్‌లో నెం.1, యావత్ దేశంలో 8వ స్థానం. మరి దీన్ని బ్రాండ్ ఏపీ నాశనం అంటారా?. లేక సమర్థవంతమైన నాయకత్వం ద్వారా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటారా? సత్యమేవ జయతే‘‘ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 𝗧𝗗𝗣 – 𝗝𝗦𝗣 𝗹𝗶𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱 TDP and JSP, before and after forming Government persistently made the following allegations-Brand AP was destroyed owing to YSRCP Government-Investors abandoned AP owing to YSRCP Government-No industrial growth was witnessed during… pic.twitter.com/KvB40DJWGL— YS Jagan Mohan Reddy (@ysjagan) December 23, 2025 -
పవన్ కల్యాణ్ భయం అదే: అంబటి
సాక్షి, తాడేపల్లి: పవన్ ప్రసంగాలు పరిశీలిస్తే విచిత్రంగా ఉందని.. ఓపెనింగ్‌లో ఓవరాక్షన్ చేస్తారు.. ఇంటర్వెల్లో ఇరిటేషన్ అవుతారు.. కన్ క్లూజన్లో కన్ఫ్యూజ్ అవుతారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకీ అర్థం కాదని.. వినేవాళ్లకు అంతకన్నా అర్ధం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.‘‘వైఎస్సార్సీపీ పార్టీని, పార్టీ నాయకత్వంపై తీవ్రమైన పదజాలం వాడుతున్నారు. ఎందుకు పవన్ అంతలా ఊగిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎవరినో బెదిరించాలనే భావన పవన్ మాటల్లో కనిపిస్తుంది. పవన్ మిమ్మల్ని ఎవరైనా వైఎస్సార్సీపీ వాళ్లు ఏమైనా అన్నారా.. అంటే చెప్పండి. మిమ్మల్ని తిట్టింది తెలంగాణ వాళ్లు.. వైఎస్సార్సీపీ వాళ్లు కాదు. ఎందుకు వైఎస్సార్సీపీపై తీవ్రమైన పదజాలంతో ఊగిపోతున్నారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘కూటమి అసమర్థత వల్ల అనేకమైన ఇష్యూలు వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. భవిష్యత్‌లో లక్షల కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీలను తన మనుషులకు చంద్రబాబు కట్టబెట్టేస్తున్నాడు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ స్కామ్. కోటి మందికి పైగా ప్రజలు కోటి సంతకాలు చేశారు. మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేయడానికే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల్లో స్కామ్ జరుగుతుంది..ఈ స్కామ్‌లో ఎవరైనా చేరితే.. చంద్రబాబు, లోకేష్‌కు కిక్ బ్యాగ్‌లు ఇస్తే చట్టం ముందు శిక్షిస్తామని చెప్పాం. విచారణ క్రమంలో లోపల కూడా వేస్తామని చెప్పాం. స్కామ్ ఉందని మేం చెబుతున్నాం. మమ్మల్నే లోపల వేస్తారా.. మీ సంగతి తేలుస్తామని పవన్ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మాట్లాడకుండా పవన్‌తో మాట్లాడిస్తున్నాడు. ఎందుకు మీకంత భయం?. 15 ఏళ్లు కలిసే ఉంటామని చెబుతున్నావ్.. కలిసుంటే మంచిదేగా వద్దని ఎవరు చెప్పారు?. 15 ఏళ్లు అగ్రిమెంట్ రాసే పార్టీ దేశంలో ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ తప్ప. 15 ఏళ్లు కలిసి ఉండేది రాష్ట్రానికి మంచి చేయడానికి కాదు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తాడని మీకు భయం..ఏమీ లేకపోయినా మద్యం స్కామ్ పేరుతో ఎంతమందిని లోపలేశారు. విచారణల పేరుతో లడ్డూ వ్యవహారంలో మీరు చేస్తున్నది ఏంటి?. మెడికల్ కాలేజీల స్కామ్‌లో పవన్‌కు వాటా ఉంది కాబట్టే ఊగిపోతున్నాడు. ప్రజలు మెచ్చిన రోజున వైఎస్సార్సీపీని అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు. అవినీతి, లంచాలకు తావులేకుండా పాలన ఉండాలన్నారు. డబ్బులు లేనిదే లోకేష్ ట్రాన్స్ఫర్లు చేస్తున్నారా?. సీజ్ ద షిప్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అమ్మకం ఆగిందా పవన్ సమాధానం చెప్పాలి..కాకినాడ పోర్టు నుంచి బియ్యం బ్రహ్మాండంగా వెళ్లిపోతోంది. మధ్యవర్తులు డబ్బులు సంపాదించుకుంటున్నారు. బియ్యం డబ్బుల్లో మీకు వస్తుందిగా. చక్కగా డబ్బు తీసుకుని సర్దుకుంటున్నారుగా. మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలైనా మీరు చంద్రబాబుకు కాపు కాయండి మాకేం అభ్యంతరం లేదు. ఎన్నికల్లో ఓడినా .. గెలిచినా జగన్ సింగిల్‌గానే వస్తారు. పదవుల కోసం ఎవరి వద్దా దేహీ అని మేం అడుక్కోం. పవన్ మాట్లాడితే బంధు ప్రీతి లేదు.. అవినీతి సహించను అంటారు. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఎందుకు?...కులతత్వానికి వ్యతిరేకమంటారు. జనసేనలో రెండు మంత్రి పదవులు ఓసీలకే ఎలా ఇచ్చారు?. బీసీలు, ఎస్సీలు మీ పార్టీకి అవసరం లేదా?. పవన్ కళ్యాణ్ సోదరుడే ఎమ్మెల్సీ అవ్వాలా?. క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ సోదరుడికి మంత్రి ఇస్తామని చంద్రబాబు రాసిచ్చాడు. చంద్రబాబు ఈ మాట చెప్పి ఏడాదైంది.. ఏమైంది మంత్రి పదవి. దేహీ అని పదవులు అడుక్కునే మీరు మమ్మల్ని దూషించడమా?. ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారని డీఎస్పీ జయసూర్య పై ఫిర్యాదు చేశావ్ ఏమైంది?..నీ ఫిర్యాదు ఎవరైనా పట్టించుకున్నారా...ఆ డీఎస్పీపై చర్యలు తీసుకున్నారా?. రోమాలు తీస్తాం.. అరచేతిలో గీతలు చెరిపేస్తాం లాంటి పిచ్చిమాటలను పవన్ మానుకోవాలి. నా ఇష్టం నేను చేస్తాను అంటే కచ్చితంగా అనుభవిస్తారు. మాట్లాడితే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం అంటాడు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి మీకు చేతనైతే వాటిపై పోరాడండి. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో వాటా లేదని పవన్ ప్రమాణం చేయగలరా?. పవన్ జలధారపై ప్రమాణం చేసి చెప్పండి... నేను క్షమాపణ చెబుతా. జనసేన పార్టీ కార్యాలయం క్రమంగా పెరిగిపోతోంది. పార్టీ కార్యాలయం కోసం 20 ఎకరాలు కొన్నారు. మీ సినిమాలన్నీ ప్లాపులవుతుంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..చంద్రబాబు, లోకేష్ నెలకు ఇంత అని లెక్కగట్టి పవన్ కు ఇస్తున్నారు. పవన్ వాళ్ల దగ్గర మేస్తున్నాడు. మాపై కూస్తున్నాడు. మీ ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ ప్రొఫెసర్‌ను కొట్టాడు అది రౌడీయిజం కాదా? మాట్లాడితే పీకుతాం పీకుతాం అని మాట్లాడుతున్నారు. పవన్ ఏంటీ ఈ పీకుడు లాంగ్వేజ్. నువ్వు మాత్రం చంద్రబాబు, లోకేష్ దగ్గర కమిషన్లను స్ట్రాపెట్టి మరీ పీకేస్తున్నావ్. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిని ఏం పీకలేరు...ఏపీలో అనేక స్కామ్‌లు జరుగుతున్నాయి. అన్ని స్కాములపై వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చట్టప్రకారం లోపలేస్తాం. అన్ని స్కాముల పై విచారణ జరుగుతుంది. మీ రెడ్ బుక్‌ను మా కుక్క కూడా లెక్కచేయదు. రెడ్ బుక్ సాంప్రదాయాన్ని తెచ్చింది మీరే. మీరు తెచ్చిన రెడ్ బుక్ సాంప్రదాయానికి మీరూ బలయ్యే పరిస్థితులు వస్తాయేమో ఆలోచించండి. రెడ్ బుక్ సంప్రదాయాన్ని సమాజానికి ఎక్కిస్తున్నారు. పిల్లకాకి లోకేష్‌కు ఏం తెలుసు ఉండేలు దెబ్బ. ముందుంది మొసళ్ల పండుగ’’ అంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు. -
‘పవన్ అంటే.. ఓవరాక్షన్.. ఇరిటేషన్.. కన్ఫ్యూజన్’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకి రాజకీయంగా ఇబ్బంది వచ్చినప్పుడు పనిచేసే పొలిటికల్ టూల్లా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని.. అందుకోసం ఆయన దగ్గర మేత తిని వైఎస్సార్సీపీ గురించి నోటికొచ్చినట్టు కూతలు కూస్తున్నాడంటూ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకుడు పోతిన మహేష్ మండిపడ్డారు.మంగళవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ చేరిందని, దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే పవన్ కళ్యాణ్ సమయం, సందర్భం లేకుండా మధ్యలో వచ్చి వైఎస్సార్సీపీ నాయకుల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు.ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే స్పష్టత ఉండదని, సినిమా భాషలో ఆయన మైండ్ సెట్ గురించి చెప్పాలంటే ఓపెనింగ్‌లో ఓవరాక్షన్, ఇంటర్వెల్లో ఇరిటేషన్, క్లైమాక్స్‌లో కన్ఫ్యూజన్ అన్నట్టుగా ఉందంటూ పోతిన మహేష్ దుయ్యబట్టారు. సింగపూర్‌లో అమలు చేసే కేనింగ్ పనిష్మెంట్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న జనసేనలో ఎమ్మెల్యేల దగ్గర నుంచే మొదలుపెట్టాలని సూచించారు. చంద్రబాబుకి సపోర్టు చేయడానికి జనసేన పార్టీ పెట్టి ఆ పార్టీ కార్యకర్తలతో టీడీపీ జెండాలు మోయిస్తున్న పవన్ కళ్యాణ్‌కి ఆత్మాభిమానం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు.పిల్లనిచ్చిన మామ నుంచి తెలుగుదేశం పార్టీని లాక్కున్న చంద్రబాబు, చిరంజీవి ద్వారా సినిమాల్లోకి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. సొంతంగా పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ జగన్ పేరెత్తే అర్హత కూడా లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న ఈ 18 నెలల కాలంలో ప్రజల కోసం తాను చేసిన ఒక్క మంచి పని ఉన్నా చూపించాలని పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నా, 18 లక్షల మంది జాబ్ కార్డులు తీసేసినా నోరు మెదపని పవన్ కళ్యాణ్ ప్రజల బాగోగులు అంటూ డ్రామాలాడుతున్నారని, ముందుగా తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పోతిన మహేష్ హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..పాలన చేతకాక వైఎస్సార్సీపీని తిడుతున్నాడు.. వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మాత్రం వైఎస్సార్సీపీ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వారి ప్రవర్తన చూస్తుంటే అధికారంలో ఉన్నది టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వమా లేక వైఎస్సార్సీపీనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ పెట్టి లేదా ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజా సమస్యల గురించి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏనాడూ ఒక్కదానికీ సమాధానం చెప్పకపోగా చంద్రబాబుకి వకాల్తా పుచ్చుకుని మరో 15 ఏళ్లు ఆయనే సీఎంగా ఉండాలని కోరడం చూస్తుంటే ఆయనకు ప్రజా సమస్యలకు పరిష్కారం కావాలా?. చంద్రబాబు అధికారంలో ఉండటం కావాలో అర్థం కావడం లేదు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూల్ లా మారిపోయాడు. ఆయనకు ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు పవన్ బయటకొస్తాడు. ఒకపక్క సొంత పార్టీని, ఇంకోపక్క ప్రజలను మభ్యపెడుతున్నాడు. పాలన చేయడం చేతకాకనే ఇలా వైఎస్సార్సీపీని తిట్టి పబ్బం గడుపుతున్నాడు.చంద్రబాబు ఆదేశాలతో డైవర్షన్ పాలిటిక్స్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. అధికారంలో వస్తే మెడికల్ కాలేజీలు కట్టబెట్టేలా చంద్రబాబు ఎన్నికలకు ముందే ఒక ఒప్పందం చేసుకుని ఆ విధంగా ఇప్పుడు ముందుకుపోతున్నాడు. మళ్లీ అధికారంలోకి రావడం కలలో మాటేనని వారికి అర్థమైంది అందుకే ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా ఆయన వెనక్కి తగ్గకుండా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ నాయకులపై బూతులతో విరుచుకు పడుతున్నాడు.చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దని కోటికి పైగా సంతకాలు చేసిన ప్రజలను అవమానించేలా పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన వ్యక్తి ప్రశ్నించడమే మర్చిపోయాడు. ఆయన డ్రామాలు గుర్తించలేని స్థితిలో ప్రజలున్నారని పవన్ కళ్యాణ్ భ్రమపడుతున్నాడు. -
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసానిస్తూ.. ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.వైఎస్ జగన్‌ను కడప నూతన మేయర్ పాకా సురేష్ కలిశారు. నూతన మేయర్‌ను వైఎస్ జగన్ అభినందించారు. వైఎస్ జగన్‌ను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా కలిశారు.కాగా, రేపు(బుధవారం, డిసెంబర్ 24) ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. గురువారం(డిసెంబర్ 25) ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. -
ఆశ్చర్యపరిచే నిర్ణయాలు!
కేంద్రంలోని నరేంద్ర మోదీ 3.ఓ ప్రభుత్వం మరోసారి ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకోబోతోంది. యువతను ప్రోత్సహించేలా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. యువ నాయకత్వంపై మోదీ సర్కారు ఫోకస్ పెంచింది. ప్రభుత్వంలో వారికి పెద్దపీట వేయడానికి సిద్ధమవుతోంది. కేంద్ర కేబినెట్లో యువ నేతలకు మరిన్ని కొలువులు కట్టబెట్టడానికి కసరత్తు చేస్తోంది. మోదీ 3.ఓ కేబినెట్లో యువతరానికి త్వరలో తగిన ప్రాధాన్యం దక్కబోతోంది. దీనికి కొంత సమయం పడుతుందని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడంతో కమలనాథులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నిల్లోనూ ఇదే జోరు చూపించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని కార్యాచరణలోకి దిగిపోయారు. వచ్చే ఏడాది మార్చి- ఏప్రిల్ మధ్యలో జరగనున్న బెంగాల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దీదీని నాలుగోసారి సీఎం కాకుండా అడ్డుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు బెంగాల్ పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బెంగాల్లో సభలు నిర్వహిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.ఆశ్చర్యపరిచే నిర్ణయాలుపశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత మోదీ సర్కారు ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకోబోతోందని సమాచారం. కేంద్ర కేబినెట్ విస్తరణతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్టు 'ది సండే గార్డియన్స్ నివేదించింది. బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత 45 ఏళ్ల నితిన్ నబీన్‌ను (Nitin Nabin) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించి అందరినీ బీజేపీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదే విధంగా బెంగాల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎవరూ ఊహించని నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.యువతకు పెద్దపీటపార్టీ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యువ నాయకత్వానికి కేంద్ర కేబినెట్లో పెద్దపీట వేయనున్నారని సమాచారం. ఒకవేళ బెంగాల్లో తమకు అనుకూలంగా ఫలితాలు వస్తే ఆ రాష్ట్రం నుంచి మరికొంత మందికి కేబినెట్ బెర్త్‌లు దక్కే చాన్స్ ఉంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు సహాయ మంత్రులు ఉన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన పనితీరు కనబరిస్తే.. ఇద్దరు పూర్తిస్థాయి కేంద్ర మంత్రులను నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమచారం.పనితీరే గీటురాయిజాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్‌ను ఎంపిక చేయడానికి ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారో దాదాపు వాటినే కొత్త మంత్రుల ఎంపికలో పాటిస్తారని తెలుస్తోంది. ఎటువంటి వివాదాలు లేకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయడంతో పాటు ఎక్కువ కాలం బాధ్యతలు చేపట్టగల యువ నాయకులకు అవకాశం ఇస్తారని సమాచారం. పార్టీకి ఎక్కువ కాలం పాటు బాధ్యతలు చేపట్టగల సామర్థ్యంతో పాటు, స్థిరమైన సంస్థాగత పనితీరుతో మంచి ఫలితాలు రాబట్టగలిగే యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సామాజిక, ప్రాంతీయ సమతుల్యత పాటిస్తూనే.. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం దక్కేలా ఎంపికలు ఉంటాయని సమాచారం.చదవండి: కలిసి వస్తున్నాం.. కాస్కోండి!కేబినెట్లో 10 ఖాళీలు!ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 72 మంది మంత్రులు ఉన్నారు. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం గరిష్టంగా 81 మందిని మంత్రులుగా నియమించే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుత కేబినెట్లో 9 ఖాళీలు ఉన్నాయి. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) బీజేపీ ఇటీవల ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. దీంతో కేబినెట్లో ఖాళీల సంఖ్య 10కి చేరుతుంది. ప్రధానిగా తన రెండవ హయాంలో 78 మంత్రులకు కేబినెట్లో చోటు కల్పించారు. దీని ప్రకారం చూసుకున్నా ప్రస్తుత మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. కేబినెట్ విస్తరణలో ఈ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. చూడాలి బెంగాల్ ఎన్నికలు ఎవరిని అందలం ఎక్కిస్తాయో! -
స్కిల్ స్కాం.. కేసు కొట్టివేతకు బాబు మాస్టర్ ప్లాన్!
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తనపై ఉన్న కేసులను మూసివేసే ప్రక్రియలో చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే.. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు చురుకుగా ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీ సీఐడీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతోంది. పూర్తి సహకారం అందిస్తున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులను మూసివేయించుకుంటున్నారు. ఇప్పటికే ఫైబర్ నెట్, రాజధానిలో అసైన్డ్ ల్యాండ్స్, లిక్కర్ కేసు, ఇసుక కేసులను చంద్రబాబు క్లోజ్ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే స్కిల్ స్కాం కేసు మూసివేతకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. అందుకు, చంద్రబాబు అడుగులకు సీఐడీ కూడా మడుగులొత్తుతున్నది. స్కిల్ కేసు మూసివేతకు పూర్తి సహకారం అందిస్తోంది.ఈ క్రమంలో క్లోజర్ రిపోర్టును వ్యతిరేకిస్తే కోర్టుకు వచ్చి చెప్పాలంటూ ఏపీఎస్ఎస్డీసీ ఎండీకి సీఐడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై వారం రోజుల్లోగా వచ్చి సమాధానం చెప్పాలని నోటీసు పంపింది. ఈ నేపథ్యంలో స్కిల్ స్కాం కేసును కూడా చంద్రబాబు త్వరగా మూసివేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు.. 52 రోజులు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ స్కాంలో ఈడీ సైతం కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితుల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. తీవ్రమైన అవినీతి కేసును మూసేసేందుకు ఇప్పుడు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు.. ఫైబర్‌నెట్ కేసు క్లోజ్! -
పాట తెచ్చిన ‘పంచాయితీ’
నర్సంపేట రూరల్ : ప్రమాణ స్వీకారోత్సవంలో డీజే పాట పెద్ద పంచాయితీకి దారి తీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నారావుపేట జీపీ కార్యాలయ ఆవరణలో పాలకవర్గం ప్రమాణస్వీకారం సందర్భంగా డీజే సౌండ్స్ ఏర్పాటు చేశారు. అయితే ప్రమాణస్వీకారోత్సవంలో బీఆర్ఎస్కు సంబం«ధించిన పాట వస్తుండగా కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగింది. దీంతో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారి ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడులు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ వనపర్తి శోభన్‌కు, బీఆర్ఎస్ పార్టీ మూడో వార్డుకు చెందిన మూడు రమేశ్‌కు గాయాలయ్యాయి. ఘటనా స్థలికి ఎస్సై రాజేశ్‌రెడ్డి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. తొలుత కాంగ్రెస్, అనంతరం బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. -
ప్రశ్నిస్తే బెదిరింపులా?.. మీ భాషేంటి?: బొత్స సీరియస్
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు ఏ మాత్రం మెచ్చుకోవడం లేదన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రుల భాష ఏ మాత్రం బాగోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, వైఎస్సార్సీపీ కోటి సంతకాలు సేకరించడంపై కూటమి నేతలు వణికిపోతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతల భాష, ఆలోచన విధానాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలి. వారి ప్రవర్తనను రాష్ట్ర ప్రజలు గమనించాలి. కోటి సంతకాల సేకరణపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రికి రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా?. జనంలోకి వెళ్లి అడిగితే ఎంత మంది మెడికల్ కాలేజీల కోసం సంతకాలు చేశారో అర్ధం అవుతుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తామని ప్రజల్లోకి వెళ్లి చెప్పండి.. అప్పుడు వాళ్ళే సమాధానం చెబుతారు. మెడికల్ కాలేజీల విషయంలో అవినీతికి పాల్పడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం. ప్రజారోగ్యాన్ని స్వలాభం కోసం వాడుకోవాలని చూస్తున్నారో వారిపై మా ప్రభుత్వం వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటాం..20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఉద్యోగాలు ఇస్తారో.. చస్తారో పక్కన పెడితే గ్రామీణ ఉపాధి హామీ పథకం అటక ఎక్కేసింది. రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ వలసలు మొదలవుతాయి. పేదలకు అన్నం దొరకలేని దయనీయ పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఉపాధి హామీ పథకం కోసం కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు. ఉపాధి హామీ పథకం డిప్యూటీ సీఎం శాఖలోకే వస్తుంది కదా కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు. చంద్రబాబుకి పేదలు అవసరం లేదు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి కూడా అవసరం లేదు. చంద్రబాబు ఏనాడూ పేదల కోసం ఆలోచన చేయలేదు.ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అన్నారు కదా పవన్.. మరి ఎందుకు ప్రశ్నించడం లేదు?. అధికారం, గెలుపు ఓటములు సహజం. సిద్దాంతం, ఆలోచన ముఖ్యం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే.. శాంతి భద్రతలు లేవు. హాస్టల్ పిల్లలు మధ్యాహ్నం మంచి భోజనం తినే పరిస్థితి లేదు.. పవన్ వ్యాఖ్యలు విన్నాక ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధం జరిగి ఏపీలో యూరియా కొరత వస్తే.. మిగతా రాష్ట్రాల్లో యూరియా ఎలా వచ్చింది?. ఎన్డీయే పాలిత రాష్ట్రాలు అన్నింటిలో యూరియా కొరత లేదు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు ఆయన టీమ్ కన్ను పడింది. ఇక్కడున్న భూములు దోచుకుందామని ప్రయత్నిస్తున్నారు.రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇవ్వడం ఎక్కడైనా ఉందా?. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవకుండా కేటాయింపులు ఎప్పుడైనా జరిగాయా?. భూ కేటాయింపులు అన్నింటిని తిరగదోడుతాం. గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు. సీ పోర్టుల్లో చూస్తే అక్రమ రవాణా?. రాష్ట్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమా లేక వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉందా అని డిప్యూటీ సీఎంను సూటిగా ప్రశ్నిస్తున్నా?. తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా ఎందుకు వెనకాడుతున్నారు. ప్రతీ రోజూ రాష్ట్రంలో అత్యాచారమో, హత్య, కిడ్నాప్ ఇలా ఏదో ఒక సమస్య చూస్తున్నాం. పెద్ద ఎత్తున అప్పు చేసింది ఈ ప్రభుత్వం ఆ డబ్బు ఏం చేశారంటే సమాధానం లేదు. భూ కేటాయింపులపై న్యాయ పోరాటం చేస్తున్నాం. మీ ఇష్టం వచ్చినట్టు.. కేటాయింపులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా?. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఎలా ఇస్తారు?.ఫీజురియింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వలన రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం చెందింది. రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన ఈ ప్రభుత్వం విద్య, వైద్యానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 15వ ఆర్ధిక నిధులు వినియోగానికి బ్రేకులు పడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్‌కు ఆ విషయం తెలుసా?. ఉన్నప్పుడు ఏం పీకారని పవన్ అడుగుతున్నారు.. ఏంటి ఈ మాటలు. మాటలు ఎక్కువ మాట్లాడే వారికి చేతనైంది తక్కువ. రెండేళ్ల పాలనపై ఈ ప్రభుత్వానికి, మంత్రులపై ప్రజలకు ఉన్న అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి. సంక్రాంతికల్లా గోతులు కప్పేయాలని చంద్రబాబు అంటున్నారు.. కానీ ఏ సంక్రాంతో చెప్పడం లేదు. గోతులు కప్పడానికి నిధులు ఇవ్వండి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి భోజనం పెట్టంది. పిల్లల అవసరాలను తీర్చండి’ అని హితవు పలికారు. -
గురువింద సామెతను గుర్తు చేస్తున్న పవన్!
ఏపీ ఉపముఖ్యమంత్రి నిజజీవితంలోనూ నటించడంలో ఆరితేరుతున్నారు. సినీ అభిమానులు అతడిని పవర్‌స్టార్ అంటూ పిలుచుకుంటూంటారు. ప్రజా జీవితంలో ఆయన నటనను చూసిన తరువాత ‘‘రాజకీయ నట శూర’’ అన్న అవార్డు ఇస్తే బాగుంటుందని అనిపిస్తోంది. పెరవలిలో ఆయన లేని ఆవేశం తెచ్చేసుకుని వైఎస్సార్సీపీపై విరుచుకుపడ్డారు. అనవసరమైన విమర్శలు చేస్తూ పీకుడు భాష వాడారు. ఈ క్రమంలో పవన్ తెలిసో తెలియకుండానో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను పొగిడి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఏపీలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉందని చెప్పకనే చెప్పారు. నెపం వైఎస్సార్సీపీకి నెట్టి టీడీపీ మెప్పుకోసం ప్రయత్నించారు. కానీ టీడీపీ, జనసేనల అరాచకం గురించి రాష్ట్రంలో తెలియందెవరికి? తీరు చూడబోతే పవన్ మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ తో పోటీపడుతున్నట్లుగా ఉంది. సందర్భ శుద్ది లేకుండా, అసలు సమస్యలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడారా? లేక తన ఉనికిని కాపాడుకోవడానికి బెదిరించే రీతిలో ప్రసంగించారా?అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ఎల్లో మీడియా ఆయన ప్రసంగాన్ని ఎడిట్ చేసి ఇబ్బందిలేని రీతిలో ప్రచారం చేసింది. కాని సోషల్ మీడియాలో మాత్రం ఆయన మాట్లాడిన వైనం అర్థమైపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని జనం మెచ్చడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు.అలాగే ఉత్తరాంధ్రలో భూ మాఫియా గురించి పవన్ కళ్యాణే ఫిర్యాదు చేశారు. ఇవన్ని కూటమి ప్రభుత్వం పరువు తీశాయి.దీంతో డామేజీని కవర్ చేసుకోవడానికి చంద్రబాబు సూచన మేరకు ఆయన వైఎస్సార్సీపీపై ఆవేశపడినట్లు నటించారా? అన్న అనుమానం చాలామందికి కలిగింది. వైఎస్సార్సీపీని తిట్టి వారిలో ఎవరైనా పరుష భాష వాడితే దాన్ని రాజేసి పోలీసుల సాయంతో కేసులు పెట్టవచ్చుననా ఇలా వ్యవహరించి ఉండవచ్చని కొందరు విశ్లేషించారు. అయితే వైఎస్సార్సీపీ నేతలు పట్టించుకోకపోవడంతో ఆ వ్యూహం కాస్తా బెడిసికొట్టినట్లు అయ్యింది. ఎందుకంటే ప్రభుత్వంలో పవన్ మాటలను ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోవడం లేదన్న విషయం వీరికి తెలుసు. రాష్ట్రంలో జూద శిబిరాలు పెచ్చుమీరాయని చేసిన ఫిర్యాదులపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. జనసేన శ్రీకాళహస్తి మహిళా నేత ప్రైవేటు వీడియోలు తీయించిన టీడీపీ ఎమ్మెల్యేని ఒక్క మాట అనలేని పవన్ కళ్యాణ్, ఈ మధ్య వైఎస్సార్సీపీపై మాత్రం ఇష్టారీతిన దూషించడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఎక్కువమంది నమ్ముతున్నారు. పవన్ ఈ పదకుండేళ్లలో ఎన్ని విన్యాసాలు చేసింది అందరికి తెలుసు. ఎప్పుడు ఏది మాట్లాడతారో, ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో అంతా అగమ్యగోచరం. 2019లో ఓడిపోగానే బీజేపీని బతిమలాడి వారితో కలిశారు. వాళ్ల కాళ్లు విరగగొడతా..వీళ్ల కీళ్లు తీస్తా.. వేళ్లు అరగగొడతా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. లోకేశ్ రెడ్‌బుక్ మాత్రమే కాదు..తాను కూడా ఆయనతో పోటీ పడి అరాచకాలు చేయించగలనని పవన్ చెబుతున్నట్లు ఉంది. ముందుగా అక్కడక్కడా అరాచకాలకు పాల్పడుతున్న జనసేనకు చెందినవారి కీళ్లు విరగగొడితే, ఆ తర్వాత పవన్ ఏ కబుర్లు చెప్పినా జనం వింటారు. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు జనసేన ఎమ్మెల్యేలే భూదందాలకు పాల్పడుతున్నారని ఈయనకే ఫిర్యాదులు వచ్చాయని అంటారు. ఇదే టైమ్ లో టీడీపీ నేతలు తమపై పెత్తనం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యేలు ఆయనతో మొరపెట్టుకున్నారు.వారికి ఊరట ఇవ్వకపోగా టీడీపీ వారు ఏమి చేసినా భరించాలని అన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. టిపి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తను ఎలా కాంట్రాక్టర్ల నుంచి డబ్బు తీసుకుని పని చేస్తున్నది బాహాటంగానే వెల్లడించారు. పవన్‌కు ఆయన బాహుబలిగా కనిపిస్తున్నారు. దీని అర్థమేమిటో? మచిలీపట్నంలో ఏదో బానర్ గొడవ వస్తే జనసేన నేత యర్రంశెట్టి సాయితో టీడీపీ నేతలు కాళ్లు పట్టించుకున్నారట. వీరి కీళ్లు తీసే ధైర్యం పవన్‌కు లేకపోయిందా? అని జనసేనలో కొందరు ప్రశ్నించుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాల గురించి ఆ పార్టీ మీడియానే చెబుతోంది. కొందరు ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే కూటమి పెద్దలు రాజీ చేశారే తప్ప చర్య తీసుకోలేదు. రాష్ట్రంలో గంజాయి అరికట్టడం సంగతి దేవుడెరుగు..గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడిని హత్య చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం మొత్తం లోకేశ్ పర్యవేక్షణలోనే నడుస్తోందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. పవన్ ఆయనకు విధేయుడిగా ఉండడానికే మొగ్గు చూపుతున్నారన్న భావన అభిమానులది. పవన్‌కు అండగా నిలిచిన ఒక సామాజికవర్గంలో పెరుగుతున్న అసంతృప్తిని దారి మళ్లించి, తనను వైఎస్సార్సీపీ వాళ్లు ఏదో అంటున్నారన్న అభూత కల్పనను సృష్టించి సానుభూతి పొందడానికి యత్నించినట్లుగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చినట్లు కాపు నేస్తం వంటి స్కీముల ద్వారా ఆయా వర్గాల మహిళలను ఆదుకోవడానికి కృషి చేయకుండా ఈ కీళ్ల పంచాయతీ పెడితే ఎవరికి ప్రయోజనం? 'సూపర్ సిక్స్,ఎన్నికల ప్రణాళికలోని హామీలు ఎటూ చేయలేరు కనుక, ఈ డ్రామా ఆడితే సరిపోతుందని అనుకున్నారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ గట్టిగా నిలదీసి కోటి సంతకాల ఉద్యమాన్ని విజయవంతం చేసింది. దీనిపై జనసేనకు ఒక విధానం ఉందో లేదో తెలియదు. 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వాన్ని భుజాన వేసుకున్న పవన్ కేవలం టీడీపీ వారు ఏమి చెబితే దానినే గుడ్డిగా సమర్థిస్తున్నట్లు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలలో పెల్లుబుకిన అసమ్మతిని కప్పిపుచ్చి చంద్రబాబు నుంచి మెప్పు పొందడానికి ఈయన యత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.తాము అధికారంలోకి వస్తే పనిచేసే కాంట్రాక్టర్లను జైలులో వేస్తామని అంటున్నారని జగన్‌పై ఒక అబద్దాన్ని సృష్టించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని, తాము అధికారంలోకి వచ్చాక ఈ స్కామ్‌లో భాగస్వాములయ్యే ప్రైవేటు వారిని కూడా జైళ్లలో పెడతామని జగన్ హెచ్చరించారు తప్ప పనిచేసే కాంట్రాక్టర్లను కాదు. ఒక ఆశయం కోసం ప్రాణాలు పోయినా లెక్క చేయనని, పోయే ముందు తాట తీస్తానని, రోమాలు తీసి కూర్చోబెడతానని పవన్ అనడం హస్యాస్పదంగా ఉంది. ఈయన ప్రాణాలు ఎవరు తీస్తారు?అలాంటి బెదిరింపులు ఎమైనా వచ్చాయా? వాటిపై ఫిర్యాదు చేశారా? ఇవేమి లేకుండా అడ్డంగా మాట్లాడితే జనం నమ్ముతారా? ఇంతటి సాహసవంతుడు పవన్ తన తల్లిని దూషించారటూ ఎవరిపై గతంలో ఆరోపణలు చేశారు? వారిని ఏమి చేశారో చెప్పి ఆ తర్వాత ఇతరుల తాట తీయవచ్చు. లేకుంటే ఈయనవి ఉడుత ఊపులే అవుతాయి. ఎవరు తప్పు చేసినా తప్పే. నిజంగానే వైఎస్సార్సీపీ వారు ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే చర్య తీసుకోవచ్చు.కాని ప్రస్తుతం ఏపీలో ఏమి జరుగుతోందో తెలియదా? పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగితే ఎవరూ చూడడం లేదనుకుంటే సరిపోతుందా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తారట.అది చట్టబద్దమైతే గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడిని హత్య చేసిన వారికి ఇవ్వండి.. వినుకొండలో రషీద్ అనే యువకుడిని నడి వీధిలో నరికి చంపిన టీడీపీ వారికి ఇవ్వండి.. సుగాలి ప్రీతి కేసు నిందితులకు ఇవ్వండి. ఈ కేసులో తాను ఇచ్చిన హామీ ఏమిటో గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది కదా! విజయవాడలో పోలీసులు, టీడీపీ వారు కలిసి 42 ఇళ్లు కూల్చివేశారు.రాష్ట్రం అంతటా బెల్ట్ షాపులు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. టీడీపీ నేతల నకిలీ మద్యం వ్యవహారం తెలియదా? ఇలాంటి వాటిపై నోరు విప్పని పవన్ కళ్యాణ్‌కు వైఎస్సార్సీపీని ప్రశ్నించే నైతిక హక్కు ఉంటుందా? ఆయనకు విసుగు వస్తోందట. అది విసుగు కాదు.తనను అటు ప్రభుత్వం పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇటూ విపక్షం పట్టించుకోవడం లేదన్న ఫ్రస్టేషన్ కావచ్చు. హద్దుమీరి అంటే ఏదో చేస్తారట. నిజమే.. ఎవరూ హద్దులు దాటి మాట్లాడరాదు. కాని తాను అధికారంలో లేని ఐదేళ్లలో ఎన్నిరకాలుగా మాట్లాడింది. ఎన్నిసార్లు హద్దు దాటింది ఆత్మ విమర్శ చేసుకునే ధైర్యం పవన్ కళ్యాణ్ వంటివారికి ఉండకపోవచ్చు. అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని బాధ్యతారాహిత్యంగా ఆరోపించిన చంద్రబాబుకు వంత పాడారు. పైగా ఆ లడ్డూలు అయోధ్యకు వెళ్లాయని చెప్పి సడన్‌గా సనాతని వేషం కట్టడాన్ని మించి హద్దు దాటిన వైనం మరొకటి ఉంటుందా? విపక్షంలో ఉన్నప్పుడు 30 వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని, వలంటీర్లు కిడ్నాప్ చేస్తున్నారని అనుచిత వ్యాఖ్యలు చేసినదానికన్నా ఘోరం ఇంకొకటి ఉంటుందా? ఇంకా ఎన్నో ఉన్నాయి. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని వేమన శతకం చెబుతుంది. పవన్ కళ్యాణ్ తనకు దొరికిన పదవిని ఎంజాయ్ చేస్తున్నారు.అంతవరకు అభ్యంతరం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి హద్దుమీరిన హెచ్చరికలు, బెదిరింపుల వల్ల పవన్ కళ్యాణ్ పరువు తక్కువ అవుతుందన్న సంగతి గ్రహిస్తే మంచిది!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బడిలో.. కిరాణా షాపులో.. చెట్ల కింద..
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: తెలంగాణ వ్యాప్తంగా సోమవారం గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో పల్లెల్లో కొత్త పాలన మొదలైంది. మొత్తంగా 12,702 పంచాయతీలకు సర్పంచులు, ఉప సర్పంచులు, 1,11,803 వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొన్నిచోట్ల పంచాయతీలకు భవనాలు లేకపోవడంతో, కొన్నిచోట్ల భవనాలు నిర్మాణ దశలో ఉండటంతో ఓ చోట కిరాణా షాపులో, మరోచోట ఆరుబయట, ఇంకోచోట చెట్ల కింద సర్పంచులు, వార్డుసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పలుచోట్ల కొలువుదీరిన మొదటి రోజునుంచే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పాలకవర్గాలు తీర్మానాలు చేయడం విశేషం.కిరాణా షాపులో అధ్యక్షా.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో కమ్యూనిటీ హాల్, ఇతర భవనాలు అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్‌గా ఎన్నికైన పావని తన కిరాణా దుకాణంలోని సగభాగంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పాలకవర్గ సభ్యులకు ఇబ్బందికరంగా ఉండటంతో ఆరుబయట ప్రమాణ స్వీకారం చేశారు.చెట్ల నీడలోనే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూ రుపాడు మండలంలోని నల్లబండబోడు, చింతలతండా గ్రామపంచాయతీల భవనాలు నిర్మాణంలో ఉండటంతో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు చెట్ల కిందే టెంట్ నీడలో ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. ఇదే మండలం గురువాగుతండా, శంభునిగూడెం, సాయిరాంతండా, గాం«దీనగర్ల్లో సొంత భవనాలు లేక పాఠశాల భవనాల్లో పాలకవర్గాలు ప్రమాణం చేశాయి. మద్యపాన నిషేధంతో మొదలు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు స్వగ్రామం, సిద్దిపేట జిల్లా భూంపల్లి–అక్బర్పేట మండలం బొప్పాపూర్‌లో పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా మొదటి రోజు సంపూర్ణ మద్య నిషేధంపై తొలి తీర్మానం చేశారు. బెల్ట్‌షాపులపై నిషేధం విధించారు. ఒకవేళ ఎవరైనా మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్మానం చేశారు. తర్వాత స్వచ్ఛ బొప్పాపూర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పని చేసి.. ప్రమాణం చేశారు.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలంలోని కొంపల్లి నూతన సర్పంచ్ జంగాల సాలమ్మ ప్రమాణస్వీకారానికి ముందు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానికులతో కలిసి చీపురుపట్టి వీధులను శుభ్రపరిచారు. ఆ తరువాత పంచాయతీ కార్యాలయానికి చేరుకొని ప్రమాణం చేశారు. అద్దె ఇల్లు తీసుకుని.. సిద్దిపేట జిల్లా గాంధీనగర్, బంజేరుపల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు లేకపోవడంతో సర్పంచ్‌లు అద్దె ఇల్లును తీసుకున్నారు. ఇది అనువుగా లేకపోవడంతో ఆరుబయటే ప్రమాణం చేశారు. మద్దూరు మండలంలోని లద్నూరు గ్రామంతో పాటు వంగపల్లి, హనుమతండా, రెడ్యానాయక్ తండా, దుబ్బతండా గ్రామాల్లో సొంత భవనాలు లేకపోవడంతో ఓ చోట టెంట్ వేసి ప్రమాణం చేశారు. బడిలో ‘పంచాయతీ’ మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలో నడిమితండా, సీతానగర్ పంచాయతీ కార్యాలయాలు ప్రాథమిక పాఠశాలలోని ఓ తరగతి గదిలో కొనసాగుతుండగా, గొల్లకుంట తండా పంచాయతీ కార్యాలయం ఓ ఇంట్లో నిర్వహిస్తున్నారు. అలాగే, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంచాయతీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. గన్నేరువరం మండలం గునుకులకొండాపూర్, పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గొల్లపల్లి గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయాలను స్కూళ్లలోనే నిర్వహిస్తున్నారు. దీంతో పాఠశాల ఆవరణలోనే టెంట్ వేసి ప్రమాణం చేశారు. గుర్రంపై వచ్చిన సర్పంచ్ నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోంద్రట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రవీందర్ పటేల్ ప్రమాణ స్వీకారానికి గుర్రంపై వచ్చాడు. బ్యాండుమేళాలతో పెళ్లి బారాత్ ఊరేగింపు మాదిరిగా పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నాడు. రంగుల ‘పంచాయితీ’ కాంగ్రెస్ కార్యాలయంలా రంగులు వేసిన పంచాయతీ భవనంలో తాము ప్రమాణం చేయబోమని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తంచేయడంతో పోలీసులు, అధికారులు వచ్చి సర్దిచెప్పారు.అంబులెన్స్‌లోనే ప్రమాణం జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గొల్లపల్లి అలేఖ్య సర్పంచ్‌గా గెలుపొందారు. రెండు రోజుల క్రితం అలేఖ్య అనారోగ్యం బారినపడి అస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఉపసర్పంచ్‌గా ఆమె తండ్రి చండి పర్శయ్య, వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆస్పత్రిలో ఉన్న అలేఖ్య అంబులెన్స్‌లో గ్రామానికి రాగా.. అధికారులు అందులోనే అలేఖ్యతో ప్రమాణం చేయించి సంతకాలు తీసుకున్నారు.పురిటి నొప్పులతో వచ్చి.. నారాయణపేట జిల్లా ఊట్కూరు సర్పంచ్‌గా గెలుపొందిన రేణుకకు ఆదివారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు కుటుంబసభ్యులు ఆమెను పంచాయతీ కార్యాలయానికి తీసుకురాగా కార్యదర్శి శ్రీనివాసరావు ఆమెతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. ప్రమాణ స్వీకారం రోజే తండ్రి మృతి నల్లగొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి సర్పంచ్‌గా ఎన్నికైన బోయపల్లి రాజేష్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. ఆయన తండ్రి మాజీ సర్పంచ్ బోయపల్లి సురేందర్ తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో ప్రమాణం వాయిదా పడకూడదని భావించిన రాజేష్ బాధను దిగమింగుతూ బాధ్యతల స్వీకరణ పత్రాలపై సంతకాలు చేశారు.కింద కూర్చునే బాధ్యతల స్వీకరణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం కొత్తపల్లి (కె) కొత్త పంచాయతీ. కార్యాలయానికి పాఠశాల ఆవరణలోని ఓ గదిని కేటాయించారు. కొత్త పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో నిరసనగా సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కింద కూర్చునే పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఒక గ్రామం.. ఇద్దరు సర్పంచ్‌లు! సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ పంచాయ తీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పంచాయతీలో మొత్తం 1,268 ఓట్లు ఉండగా.. 1,141 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసిన సనప సుజాతకు 549 ఓట్లు, బీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న నూనావత్ స్వాతికి 552 ఓట్లు వచ్చినట్లు ఫలితాల సందర్భంగా అధికారులు ప్రకటించారు. దీంతో స్వాతికి గెలుపుపత్రం ఇచ్చారు. సుజాత రీకౌంటింగ్ కోరగా.. తిరిగి ఓట్లను లెక్కించారు. స్వాతికి 549 ఓట్లు, సుజాతకు 550 ఓట్లు వచ్చినట్లు తేల్చారు. ముందుగా స్వాతికి ఇచ్చిన గెలుపు పత్రం వెనక్కి తీసుకోకుండానే... రిటర్నింగ్ అధికారి సుజాతకు మరో గెలుపు పత్రం అందజేశారు. సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం కోసం ఇరువర్గాలకు చెందిన వారు తమ అనుచరులతో పంచాయతీ కార్యాలయానికి రావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. సుజాత గెలిచినట్లు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయంటూ ప్రకటించి ప్రత్యేకాధికారి మంగీలాల్ ఆమెతో ప్రమాణం చేయించారు.95 ఏళ్ల వయస్సులో సర్పంచ్‌గా తిరుమలగిరి (తుంగతుర్తి): 95 ఏళ్ల వయసులో సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్‌గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌తో కలిసి ఆయన ప్రమాణస్వీకారం చేశారు.ర్యాలీలో ఉద్రిక్తత మర్రిగూడ (చింతపల్లి): నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గొడుకొండ్ల సర్పంచ్ కాశగోని వెంకటయ్య తన ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన ర్యాలీలో ప్రత్యర్థి వర్గీయులు రాళ్లు, బీరు సీసాలతో దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వెంబడించడంతో వారు పరారయ్యారు. పలువురికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. -
చంద్రబాబుకు కొత్త టెన్షన్..!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ ఎన్నికల హామీలను అమలు చేయకుండా మోసం చేసిన సీఎం చంద్రబాబు కనీసం ప్రజల ఆర్థికేతర సమస్యలకు పరిష్కారం చూపడంలోనూ దారుణంగా విఫలమయ్యారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులోనే ఈ విషయం వెల్లడైంది. సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. పరిష్కరించామని చెబుతున్న సమస్యలపై ఆర్టీజీఎస్ ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈ డొల్లతనం బయటపడింది. అల్లూరి జిల్లాలో అత్యధికం.. విజ్ఞాపనల పరిష్కారంపై ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఆరీ్టజీఎస్ ద్వారా సర్వే చేయగా 43 శాతం మంది ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిష్కరించినట్లు చెబుతున్న వినతులపై ఆడిట్ నిర్వహించడంతోపాటు అర్జీదారులకు ఐవీఆర్ఎస్ కాల్ చేసి అభిప్రాయం కోరగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 80% మంది, చిత్తూరు జిల్లాలో 60, శ్రీసత్యసాయి జిల్లాలో 62, అన్నమయ్య జిల్లాలో 60, అనంతపురం జిల్లాలో58, ఎన్టీఆర్ జిల్లాలో 53, బాపట్ల జిల్లాలో 50% మంది ప్రజలు విజ్ఞాపనల పరిష్కారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ల సదస్సుల్లో సీఎం సమక్షంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.ఈ ఏడాది జూన్ 15 నుంచి అసంతృప్తి స్థాయి మూడునెలల్లో భారీగా పెరిగినట్లు వెల్లడైంది. ఇక రెవెన్యూ శాఖలో పరిష్కరించినట్లు చెబుతున్న అంకెలన్నీ తప్పేనని కలెక్టర్ల సదస్సుల్లోనే ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం విషయంలో లెక్కలకు, వాస్తవాలకు పొంతనలేదని కలెక్టర్ల సదస్సులో తేలడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. ఎక్కడో ఫెయిల్ అవుతున్నామని వ్యాఖ్యానించారు. -
బీఆర్ఎస్కు తోలు తప్ప కండ లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, ఆ పార్టీకి తోలు తప్ప కండ లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఆ పార్టీ కండ కరిగిపోయిందని గ్రహించిన తర్వాతే కేసీఆర్ తన రాజకీయ మనుగడ కోసం ఇప్పుడు బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి మాట్లాడుతూ బీఆర్ఎస్ పతనానికి కుటుంబ రాజకీయాలే కారణమని చెప్పారు. ‘కొడుకు, అల్లుడు వ్యవహారశైలి వల్లే ప్రజల్లో ఆదరణ తగ్గిందని కేసీఆర్‌కు ఆలస్యంగా అర్ధమైంది.అందుకే పార్టీని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారు. రోజురోజుకూ దిగజారుతున్న పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ ఫామ్ హౌస్‌ను వదిలి బయటకు వచ్చారు తప్ప పాలమూరు ప్రాజెక్టులపై ప్రేమ కాదు. గాడిద గుడ్డు కాదు’అని అన్నారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన గత ప్రభుత్వమే దద్దమ్మ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. బండ కూడా పగలకొట్టలేదు.. సంగంబండ ప్రాజెక్టులో బండ పగలకొడితే 20 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్న ఆలోచన కూడా పదేళ్లలో కేసీఆర్‌కు రాలేదని, కాళేశ్వరంపై ఉన్న తపన ఆయనకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని రాష్ట్ర క్రీడా, పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడతారో అని అందరూ ఆసక్తిగా చూశారని, కానీ ఆయన పాత పురాణమే చెప్పారని ఎద్దేవా చేశారు. అసలు ప్రజలు ఏమనుకుంటారోననే స్పృహ కూడా లేకుండా ఆయన మాట్లాడారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తోలు తీశారని చెప్పారు. సలహాలు సూచనలు ఇవ్వాలని అడిగాం ప్రభుత్వపరంగా ఏదైనా పొరపాటు జరిగితే ప్రతిపక్ష పార్టీగా సూచనలు, సలహాలు ఇవ్వాలని ఇప్పటికే అనేకసార్లు తాము బీఆర్ఎస్ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో తోలు తీసే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుందని, అందుకే అన్ని ఎన్నికల్లో ఎవరి తోలు తీయాలో వారి తోలు తీశారని చెప్పారు. అయినా ప్రభుత్వం తోలు తీసే సమస్యలేవైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని మాజీ సీఎం కేసీఆర్‌కు సూచించారు. -
అత్యాచారప్రదేశ్‌గా ఏపీ
నెల్లూరు రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీని అత్యాచారప్రదేశ్‌గా మార్చారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మండిపడ్డారు. నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. 18 నెలల కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం తనయుడు లోకేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరిలో 13 ఏళ్ల బాలికపై నలుగురు లైంగికదాడికి పాల్పడడం కిరాతకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం చేష్టలుడిగి చోద్యం చూస్తోందని మండిపడ్డారు. పోలీసులను ప్రజల రక్షణకు కాకుండా ప్రతిపక్షాన్ని అణిచివేసేందుకు ఉపయోగించుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాసిన లేఖే నిదర్శనమన్నారు. జగన్ చేతల సీఎం.. బాబు మాటల సీఎం వైఎస్ జగన్ పాలనలో మహిళల భదత్రకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పూజిత గుర్తుచేశారు. దిశ యాప్‌ను పటిష్టంగా అమలు చేశారని, దిశ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేశారని వివరించారు. ఆపదలో అబలలు ఉంటే ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లోపే పోలీసులు ఘటనాస్థలంలో ఉండేవారని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక పోలీసులు శాంతిభద్రతలను గాలికొదిలేశారని విమర్శించారు.నేరస్థులపై కఠినంగా వ్యవహరిస్తామని డైలాగ్‌లు చెప్పే చంద్రబాబు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశి్నంచారు. పోలీసులు అధికారపక్ష సేవలో తరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు మహిళల రక్షణ కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశి్నంచారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని అమిత్‌షా సీఎం చంద్రబాబుకు లేఖరాశారని, దీనిపై ప్రజలకు సర్కారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
బీఆర్ఎస్ను ఎండగట్టాలి
సాక్షి, హైదరాబాద్: జల వివాదాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో విస్తృత చర్చ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాలపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని శాసనసభ వేదికగా ఎండగట్టాలని సహచర మంత్రులకు సూచించారు. బీఆర్ఎస్ అధినేత, విపక్ష నేత కేసీఆర్ తాజాగా విలేకరుల సమావేశం నిర్వహించి రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సాగునీటి రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారని, కృష్ణా జలాలపై హక్కులను రాబట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో జలాల వినియోగానికి సంబంధించి కేసీఆర్ చేసిన ప్రసంగాలు, వారి హయాంలో చేసిన నిర్ణయాలు, కేంద్రానికి రాసిన లేఖలు, కుదుర్చుకున్న ఒప్పందాలు, బీఆర్ఎస్ హ యాంలో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేశారన్న అంశాలను సభకు వివరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సీఎం రేవంత్ సోమవారం రాత్రి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు మూడున్నర గంటలపాటు మంత్రులతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అంశాలపై దిశానిర్దేశం చేశారు. వీటికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాజెక్టులపై సమగ్ర చర్చ తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ, కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న అనుమతులు, ఏపీ అక్రమ నీటి వినియోగం, అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను సభలో చర్చకు పెట్టనున్నారు. సాగునీటి రంగం విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలతో రాష్ట్రానికి జరిగిన నష్టం వి వరించడంతో పాటు బీఆర్ఎస్ చేస్తున్న అసత్యాల ను ఎండగట్టాలని నిర్ణయించారు. అవసరం అ యి తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధం కావాలని కూడా సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.మొత్తం 4 రోజులు అసెంబ్లీ ఈ నెల 29న అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని, ఆ తర్వాత జనవరి రెండో తేదీ నుంచి కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం నాలుగు రోజులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ఇటీవల ముగిసిన పంచాయ తీ ఎన్నికల ఫలితాల సరళి, ఇతర వర్తమాన రాజకీయ అంశాలపై సమావేశంలో విస్తృతంగా చ ర్చించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై సీఎం రేవంత్ సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మరికొంత కష్టపడితే సీట్లు పెరిగేవని, కొన్ని జిల్లాల్లో ఇబ్బంది ఎదుర్కొన్న విషయాన్ని, నియోజకవర్గాల వారీగా గెలుచుకున్న పంచాయతీలను మంత్రులకు ముఖ్యమంత్రి వివరించారు. త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలని సూచించారు. జిల్లాల ఇన్చార్జి మంత్రు లే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు బాధ్య త చేపట్టాలని, మొత్తం జెడ్పీలను కైవసం చేసుకోవాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక జీహెచ్ఎంసీలో శివారు మునిసిపాలిటీల విలీనం అనంతరం చేపట్టిన డివిజన్ల పునర్వ్యవస్థీకరణ తీరుతెన్నులను వివరించినట్లు తెలిసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించే అంశం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయిద్దామని సీఎంచెప్పినట్టు సమాచారం. -
కలిసి వస్తున్నాం.. కాస్కోండి!
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మరాఠా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు దశాబ్దాలుగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఠాక్రే సోదరులు చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. కలిసికట్టుగా ముంబై ఎన్నికల బరిలోనే నిలిచేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ముందడుగు పడిందని, ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మున్ముందు ముంబై రాజకీయాలు మరింత రసవత్తరంగా ఉంటాయి.ముంబై రాజకీయాలు అనగానే ముందుగానే ఠాక్రే కుటుంబం గుర్తుకు వస్తుంది. మరాఠా పులిగా పేరొందిన బాల్ ఠాక్రే (Bal Thackeray) మహారాష్ట్రలో రాజకీయాలను శాసించారు. ఆయన తర్వాత శివసేన పార్టీ చాలా అటుపోట్లు ఎదుర్కొంది. ప్రస్తుతం రెండు పార్టీలుగా కొనసాగుతోంది. శివసేన పార్టీని ఏక్నాథ్ షిండే దక్కించుకోవడంతో బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే.. శివసేన(యూబీటీ) పేరుతో పార్టీని నడుపుతున్నారు. శివసేను చీల్చి బీజేపీతో ఏక్నాథ్ షిండే చేతులు కలపడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఎన్నో మలుపు తిరిగాయి. ఈ క్రమంతో ఉద్ధవ్ ఠాక్రేపై సానుభూతి పెరిగింది. రెండు దశాబ్దాల వైరాన్ని వీడి రాజ్‌ఠాక్రే తన సోదరుడి చెంతకు వచ్చారు. కష్టకాలంలో సోదరుడికి అండగా నిలిచారు.ముంబై సహా 29 కార్పొరేషన్లకు జనవరి 15న జరగనున్న ఎన్నికల్లో కలిసికట్టుగా బరిలోకి దిగాలని ఠాక్రే సోదరులు నిర్ణయించారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా జరిపాయి. చర్చలు ఫలించాయని, సీట్ల పంపిణీపై స్పష్టత వచ్చిందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో.. శరద్‌పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా తమ రెండు పార్టీల అభ్యర్థులనే పోటీకి దించాలని ఉద్ధవ్, రాజ్ ఠాక్రే నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తియిందని, అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది.బీఎంసీలో మొత్తం 227 వార్డులుండగా.. శివసేన (యూబీటీ) 157, మహారాష్ట్ర నవనిర్మాణ సేన 70 స్థానాల్లో పోటీకి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ శరద్ పవార్ (Sharad Pawar) పార్టీకి ఇవ్వాల్సివస్తే ఉద్ధవ్ పార్టీ నుంచి 15 సీట్లు కేటాయిస్తారని చెబుతున్నారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన (యూబీటీ), ఎమ్మెన్నెస్ కలిసి పోటీ చేస్తే.. రెండు దశాబ్దాలలో ఠాక్రే వారసులు ప్రత్యర్థులుగా కాకుండా మిత్రులుగా పోటీ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది.కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?మహా వికాస్ అఘాడీలో శివసేన(యూబీటీ), శరద్ పవార్ ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉంది. అయితే బీఎంసీ ఎన్నికల్లో ఠాక్రే సోదరులు చేతులు కలపడంతో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హస్తం పార్టీని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనట్టుగా శివసేన నాయకులు మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ఆనంద్ దూబే చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ వరుసగా ఓడిపోతూనే ఉందని, అలాంటి పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. తమకు, ఇతర పార్టీలకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నందున ఈమేరకు ఆలోచిస్తున్నామని కాంగ్రెస్ నాయకుడు సచిన్ సావంత్ వెల్లడించారు.చదవండి: కాంగ్రెస్‌లో చీలికలేంటి?కలిసి సాధిస్తారా?గత కొంత కాలంగా ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. 288 మున్సిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి (Mahayuti) ప్రభుత్వం విజయదుందుభి మోగించింది. 207 చోట్ల గెలుపు సాధించి సత్తా చాటింది. విపక్ష మహా వికాస్ అఘాడీ 44 స్థానాలకే పరిమితమైంది. శివసేన(యూబీటీ)కి కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలంటే బీఎంసీ ఎన్నికల్లో నిరూపించుకోవడం చాలా అవసరం. తమ కుటుంబానికి కంచుకోట అయిన మహారాష్ట్ర రాజధానిలో కలిసికట్టుగా బరిలోకి దిగుతున్న ఠాక్రే సోదరులు ఈసారి ఎలాంటి ఫలితాలు రాబడతారో చూడాలి. -
‘కూటమి పాలనలో అడ్డూ అదుపు లేకుండా పేకాట డెన్లు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గంజాయి, మద్యంతో యువత జీవితాలను రోడ్డున పడేశారని.. అనధికార క్లబ్‌లు నిర్వహిస్తూ కోట్ల బిజినెస్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘2014-19లో కాల్ మనీ రాకెట్‌తో మహిళల జీవితాలను నాశనం చేశారు. ఇప్పుడు విచ్చవిడిగా ఏపీలో క్యాసినోలను నిర్వహిస్తున్నారు. మ్యాంగో బే కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ వెనుక కూటమి పెద్దల పాత్ర ఉంది. హైకోర్టు అనుమతి ఉందంటూ బోర్డులు కూడా పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు, మీడియాను కూడా లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. 108 అంబులెన్స్‌ను కూడా పేకాట క్లబ్ దగ్గర ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని శివశంకర్ పేర్కొన్నారు.‘‘ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేకాట కోసం ఏపీకి వస్తున్నారు. ఈ క్లబ్ వెనుక మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరి వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలి. పది వేలు, యాభై వేలు, లక్ష చొప్పున మూడు జోన్లగా విభిజించి మరీ పేకాట ఆడిస్తున్నారు. ఆ పక్కన కుటుంబాల వారు చాలాకాలంగా పేకాట ఆడుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక విమానాల్లో విలాసాలు చేస్తుంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు పేకాట ఆడిస్తూ డబ్బు దోచుకుంటున్నారు. ఈ పేకాట క్లబ్‌లపై విచారణ జరిపించాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు. -
కూటమి పాలనలో డ్రగ్స్ డెన్‌గా ఏపీ: వంగవీటి నరేంద్ర
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్ డెన్‌గా కూటమి సర్కార్ మార్చేసిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లను కూడా నిర్వహిస్తున్నారంటూ దుయ్యబట్టారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం వచ్చి పేకాట ఆడుతున్నారని.. టీడీపీ నేతల కనుసన్నల్లోనే డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ‘‘హోం మంత్రి.. పోలీసులను వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులకే ఉపయోగిస్తున్నారు. డ్రగ్స్ అరికట్టాం అంటున్న చంద్రబాబు, అనిత ఇప్పుడు దొరుకుతున్న డ్రగ్ర్కి ఏం సమాధానం చెప్తారు?. ఢిల్లీ నండి డ్రగ్స్ ఏపీకి వస్తుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు?. జగన్ హయాంలో డ్రగ్స్, గంజయిని అరికట్టడానికి సెబ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ఏం చేస్తుందో ఏమీ అర్థం కావటం లేదు’’ అని నరేంద్ర నిలదీశారు.‘‘ఈ విచ్చలవిడి డ్రగ్ర్ని నిలిపేయకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. విద్యా సంస్థల దగ్గర్లో యథేచ్ఛగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ వాడటం మొదలుపెడితే యువత తీవ్రంగా నాశనం అవుతుంది. ప్రభుత్వ అండదండలతోనే డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తోంది. మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ క్లబ్ వెనుక టీడీపీ నేతలు ఉన్నారు. వారెవరో బయట పెట్టాలి. రాష్ట్రాన్ని దౌర్భాగ్యకర పరిస్థితిలోకి తీసుకెళ్లారు’’ అంటూ వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు. -
పార్టీ నాకు కన్నతల్లిలాంటిది: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌కు ఆయన కుటుంబం నుంచే ప్రమాదం పొంచి ఉందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు స్పందించారు. సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. రేవంత్‌పై ఆయన మండిపడ్డారు. ‘‘పార్టీ అంటే నాకు కన్నతల్లిలాంటిది. మా నాయకుడు ఆదేశిస్తూ పదవుల్ని గడ్డిపోచలా వదిలేశా. రేవంత్‌రెడ్డి పార్టీ మార్చే ఊసరవెల్లి. సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ వచ్చిన చరిత్ర ఆయనది. ఫోర్ట్ సిటీ ఎందుకన్న కేసీఆర్ ప్రశ్నకు రేవంత్ నుంచి సమాధానమే లేదు. ఆయనవన్నీ సొల్లు మాటలు’’ అని హరీష్‌రావు అన్నారు. రేవంత్ ఏమన్నారంటే.. ఆదివారం మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుర్చీ కోసం కుమారుడు కేటీఆర్, అల్లుడు ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు. అల్లుడి చేతిలోకి పార్టీ పోతుందన్న భయంతోనే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారు. కేసీఆర్ ఉన్నంతకాలం హరీశ్‌రావు ఎక్కడికీ పోరు. పార్టీతో పాటు పార్టీ ఆస్తులపై ఆయన కన్నేశారు. కానీ, బీఆర్ఎస్ను కేటీఆర్ చేతిలో పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. నేను కోటి మంది మహిళలకు చీర, సారె ఇచ్చి గౌరవిస్తే కేసీఆర్ కుటుంబం మాత్రం కవితను పార్టీ నుంచి బయటకు పంపింది అని విమర్శించారు. -
‘చంద్రబాబుపై కేసీఆర్ మాట్లాడింది వంద శాతం కరెక్ట్’
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందని.. అందుకే వైఎస్సార్సీపీలోకి చేరికలు జరుగుతున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం వైఎస్సార్సీపీలోకి భారీ చేరికల కార్యక్రమం జరిగింది. అయితే ఆ సమయంలో అనుమతులు నిరాకరణ పేరుతో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినా సిబ్బంది తాళం వేశారు. ఈ పరిణామాలపై స్పందిస్తూ ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలోకి చేరికలు జరుగుతున్నాయి. అనుమతి తీసుకున్న తర్వాత చిల్డ్రన్ ఏరియా థియేటర్ ఇవ్వకపోవడాన్ని ఖండిస్తున్నాం. దళితులు వైఎస్సార్సీపీలో చేరకూడదా?.. దళితులకు చిల్డ్రన్ ఏరినా ధియేటర్లో అడుగుపెట్టే అర్హత లేదా?. దళితులంటే అంత చిన్న చూపా చంద్రబాబు? అని గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అంటే కూటమి నేతల భయపడుతున్నారని.. చంద్రబాబు లోకేష్, టీడీపీ బచ్చాలు ఎందుకు పనికిరారని అన్నారాయన. చంద్రబాబు కోసం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను గుడివాడ అమర్నాథ్ సమర్థించారు. ‘‘కేసీఆర్ ఎన్నడూ అబద్దాలు మాట్లాడలేదు. అందుకే ఆయన అంత పెద్ద నేత అయ్యారు. చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలను నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం ఆలోచించాలి.. కొడుకు, కుటుంబం కోసం కాదు’’ అని అన్నారాయన. అంతకు ముందు.. చేరికల కార్యక్రమం సమయంలో ఆఖరి నిమిషంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినా సిబ్బంది అనుమతి నిరాకరిస్తూ గేటుకు తాళం వేశారు. ఈ క్రమంలో గేటు ముందు వైఎస్సార్సీపీ నేతలు ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తంగా మారింది. కూటమి నేతల ఒత్తిడితోనే అనుమతి నిరాకరించారని.. వైఎస్సార్సీపీ చేరికలను చూసి కూటమి నేతల భయపడుతున్నారని.. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ నేత కేకే రాజు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.కేసీఆర్ ఏమన్నారంటే.. చంద్రబాబు మాటలు విని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. పాలమూరులో చెరువులను బాగు చేయాలని కేంద్రానికి మేం అధికారంలో ఉన్నప్పుడు లేఖలు రాశాం. అయితే.. చంద్రబాబు మాటలు విని కేంద్రం అన్యాయం చేసింది. కనీసం పట్టించుకోలేదు. బీజేపీ పాలకులు శనిలా దాపురించారు. -
వాసు పోస్టింగ్.. ఊస్టింగ్!
సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయ నేతలు అనుక్షణం సేవాభావం కలిగి ఉండాలి. సమాజ శ్రేయస్సుపై అంకితభావంతో మెలగాలి. చెప్పే మాటల్లో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ధి కన్పించాలి. అప్పుడే ప్రజల్లో మెప్పు, ఆయా రాజకీయ పార్టీల్లో పరపతి ఉంటుంది. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే అంతే స్పీడ్‌గా తిరోగమనం చవిచూడాల్సి వస్తుంది. టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డే తీరే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వాసు వ్యవహారశైలితో విసిగిపోయిన టీడీపీ అధిష్టానం తాజాగా జిల్లా బాధ్యతల నుంచి తప్పించింది. జిల్లా తెలుగుదేశం పార్టీలో రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి కింగ్ పిన్... పార్టీ యావత్తు తన చుట్టే తిరిగేది. నియోజకవర్గాల్లో తాను సూచించిందే ఫైనల్. ఇది పదేళ్ల క్రితం మాట. క్రమేపీ తప్పించుకునే ధోరణి అలవాటు చేసుకున్నారు. ఉన్న కేడర్‌లో నమ్మకం సన్నగిల్లింది. కడప పార్లమెంటు పరిధిలో కీలక నేతగా ఉన్న ఆయన, కేవలం కడప అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితం కావాల్సి వచ్చిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. పోనీ కడప నియోజకవర్గంలో కూడా పార్టీ కేడర్‌కు భరోసాగా నిలిచారా?అంటే అదీ లేదు. అంతర్గతంగా పైచేయి సాధించాలనే తపనతో ఎన్నో ఏళ్లుగా టీడీపీ కోసం అంటిపెట్టుకొని వస్తున్నవారిని వ్యూహాత్మకంగా దెబ్బతీశారు. చివరికి కార్పొరేషన్ పాలకమండలిలో టీడీపీ పరువు నిలిపిన ఏకై క కార్పొరేటర్ ఉమాదేవి కుటుంబానికి రాజకీయంగా ముప్పుతిప్పలు పెట్టారు. ఎన్నికలకు ముందు సర్వస్వం టీడీపీనే అనుకున్న వారిని క్రమేపి దూరం చేసుకుంటూ వచ్చారని పరిశీలకులు పేర్కొంటున్నారు.ఒంటెత్తు పోకడలు...దౌర్జన్యకర ఘటనలుటీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలో తాను చెప్పిందే వేదం, తన మాటే శాసనం అన్నట్లు వాసు వ్యవహరించారు. కడప గడపలో వైరిపక్షానికి చెందిన రెండు బార్లు బలవంతంగా లాక్కున్న ఘటన తెరపైకి వచ్చింది. మూడు దశాబ్దాలుగా మద్యం వ్యాపారంలో తలమునకలైనప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని సదరు మద్యం వ్యాపారి వాపోవడం గమనార్హం. టీడీపీ కేడర్‌పై అంతర్గతంగా పైచేయి సాధించాలనే తపనే ఇలాంటి దౌర్జన్యకర ఘటనలను ప్రోత్సహించేలా చేసిందని విశ్లేషకుల మాట. ఇలాంటి చర్యలతో విసిగిపోయిన టీడీపీ కేడర్ పొరుగు నియోజకవర్గానికి చెందిన పుత్తా నరసింహారెడ్డి వద్దకు క్యూ కట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు పాటించడం, కమలాపురానికెళ్లి మరీ పుత్తాకు మొరపెట్టుకుంటూ వచ్చారు. ఈ పరిణామాలను సరిదిద్దుకోవాలనే ఆలోచన లేకపోవడంతో అధిష్టానం వద్ద మరింత చులకన కావాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కడపలో నిర్దిష్ట అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టలేకపోయారు. ఎంతసేపు వైరిపక్షంపై కక్ష సాధింపు రాజకీయాలకు పరిమితం అయ్యారు. ఇలాంటి ఘటన లన్నీ కూడా అధ్యక్ష పదవి తొలగింపునకు ప్రధాన కారణమయ్యాయని పరిశీలకులు వివరిస్తున్నారు.టీడీపీ అధ్యక్షుడిగా భూపేష్కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జమ్మలమడుగు ఇన్‌ఛార్జి చదిపిరాళ్ల సుబ్బరామిరెడ్డి (భూపేష్‌రెడ్డి)ని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ప్రధాన కార్యదర్శిగా జబీబుల్లా (ప్రొద్దుటూరు)ను నియమించారు. కాగా భూపేష్ జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్‌పై ఆశలు పెట్టుకుంటే చిన్నాన్న ఆదినారాయణరెడ్డి పొత్తులో భాగంగా బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవాల్సి వచ్చింది. గ్రూపు రాజకీయాలకు, అంతర్గత విభేదాలకు తావు లేకుండా ఉండేందుకే తాజాగా జిల్లా అధ్యక్ష పదవి అప్పగించి ఉంటుందని రాజకీయ వేత్తలమాట. పైగా అధిష్టానం రిమోట్ కంట్రోల్ ద్వారా పార్టీని చక్కదిద్దేందుకు కట్టబెట్టారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
కాంగ్రెస్‌లో చీలికలేంటి?..
కర్ణాటకలో పవర్ పాలిటిక్స్‌కు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ భేటీలతో హైకమాండ్ పుల్‌స్టాప్ పెట్టిందని భావిస్తున్న వేళ.. ఈసారి కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. సీఎం సిద్ధరామయ్య సన్నిహితులతో డిప్యూటీ సీఎం శివకుమార్ వరస భేటీలు జరపుతుండడం.. వాటిపై అధిష్టానం సీరియస్‌గా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఆ ప్రచారంపై డీకే శివకుమార్ ఓపెన్ అయ్యారు. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయలపై జరుగుతున్న తాజా ప్రచారాలను సోమవారం మీడియా సాక్షిగా డీకే శివకుమార్ తోసిపుచ్చారు. సిద్ధరామయ్య, తాను అన్నదమ్ముల్లా పని చేస్తుంటే ఇంక కాంగ్రెస్‌లో చీలిక ఎందుకు ఉంటుందని అన్నారాయన. ‘‘సిద్ధరామయ్యతో నాకు 16 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఆ బంధం ఇక మీదట కూడా కొనసాగుతుంది. అన్నదమ్ముల్లా మేం మా పని చేసుకుంటూ పోతున్నాం. అలాంటప్పుడు పార్టీలో అంతర్గత విబేధాలు.. చీలికలు ఎందుకు వస్తాయి?. అధిష్టానం ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేస్తుంది??.. ఇది కేవలం.. మీడియా, బీజేపీ సృష్టిస్తున్న ఊహాగానాలే’’ అని అన్నారాయన. సీఎం సిద్ధరామయ్యకు అత్యంత ఆప్తుడిగా పేరున్న మాజీ మంత్రి కేఎన్ రాజన్నతో ప్రత్యేకంగా భేటీ కావడంపై డీకే శివకుమార్ స్పష్టత ఇచ్చారు. ‘‘ఇందులో రాజకీయ కోణం ఏం లేదు. రాజన్న నాకు కూడా ఆప్తుడే. గతంలో ఎస్ఎం కృష్ణ హయాంలో ఆయనకు ఓ కీలక పదవి ఇప్పించా. నేను ఆయన్ని కలిసింది మర్యాదపూర్వకంగానే‘‘‘ అని అన్నారాయన. అలాగే.. కాంగ్రెస్‌లో ఏ నేతతోనూ తనకు విబేధాల్లేవని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.పవర్ షేరింగ్.. సీఎం సీటు కోసం ఢిల్లీలో చేసిన ప్రయత్నాలు.. ఈ ప్రయత్నాలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందన్న కథనాలపైనా డీకే రియాక్ట్ అయ్యారు. ‘‘నా ఢిల్లీ పర్యటనలేవీ రాజకీయ పరమైనవి కావు. ఉన్నత స్థాయి సమావేశాల్లో భాగంగానే జరిగాయి. బెంగళూరు మెట్రో ప్రాజెక్టు నిధుల కోసం, ఇతర అభివృద్ధి కోసమే నేను హస్తినకు వెళ్లా’’ అని అన్నారు. అయితే.. కర్ణాటక అధికార కాంగ్రెస్‌లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని పార్టీ సీనియర్ నేత వీఆర్ సుదర్శన్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఓ లేఖ రాశారు. ఈ విషయాన్నే డీకే వద్ద స్పందించగా.. ఆ లేఖ సారాంశం వేరని.. కాంగ్రెస్‌లో లుకలుకలు నెలకొన్నాయని బీజేపీ సృష్టించిన ప్రయత్నమే ఆ ప్రచారమని కొట్టిపారేశారాయన. -
స్వాతి? సుజాత?.. సర్పంచ్ ఎవరో??
మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర అయోమయం నెలకొంది. ఒకే పదవికి సంబంధించి ఇద్దరు అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గెలుపు పత్రాలు జారీ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. వివరాలు ఇలా.. మొదటగా మూడు ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నూనావత్ స్వాతి గెలిచినట్లు ప్రకటిస్తూ రిటర్నింగ్ అధికారులు ఆమెకు గెలుపు పత్రాలు అందజేశారు. అయితే అనంతరం కాంగ్రెస్ పార్టీ రీకౌంటింగ్‌కు డిమాండ్ చేయడంతో మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టారు. రీకౌంటింగ్ అనంతరం ఒక్క ఓటు ఆధిక్యంతో సానుప సుజాత గెలిచినట్లు ప్రకటిస్తూ రిటర్నింగ్ అధికారులు ఆమెకు కూడా గెలుపు పత్రాలు ఇవ్వడం గమనార్హం. దీంతో ఇద్దరు అభ్యర్థులు తామే విజేతలమని చెప్పుకుంటూ పోటీ పడుతున్నారు.ఇదే సమయంలో దామరవంచ గ్రామంలో మొత్తం 10 మంది వార్డు సభ్యులు ఉండగా, అందులో 5 మంది కాంగ్రెస్ పార్టీకి, 5 మంది బీఆర్ఎస్కు చెందినవారు గెలుపొందారు. ఈ సమబలం పరిస్థితి కూడా గ్రామ రాజకీయాల్లో అయోమయానికి దారి తీసింది. ఒకే ఎన్నికలో ఇద్దరికి గెలుపు పత్రాలు ఇవ్వడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ గ్రామనికి సర్పంచ్ ఎవరని తేల్చాల్సింది అధికారులే -
ప్రజల సొమ్ము పంచడమే బాబు సంస్కరణలా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎకనమిక్ టైమ్స్ దినపత్రిక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందించింది. పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడులు ఆకర్షణలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు ఆ పత్రిక ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రజానీకం, ఆర్థిక నిపుణులు కొందరు అంటున్నది ఏమిటంటే.. ప్రభుత్వ సంపద అంటే ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా కట్టబెడుతున్నందుకే ఈ అవార్డు అని! పైగా మీడియా సంస్థలు అధికారంలో ఉన్న వారికి అవార్డులు ఇస్తున్నాయంటే ప్రజలు సందేహించే పరిస్థితులున్నాయి. వ్యాపార లావాదేవీల్లో భాగంగానే.. సీఎం లేదా ప్రభుత్వంలో బాగా పలుకుబడి ఉన్న నేతలకు ఇలా అవార్డులు ఇస్తూంటారన్న విమర్శ ఉండనే ఉంది. అంతేకాదు.. ఈ మీడియా సంస్థలు ప్రభుత్వాల నుంచి భారీ ఎత్తున ప్రకటనలు తీసుకుని ఆర్థిక ప్రయోజనం కూడా పొందుతూండటం గమనార్హం. ఎకనమిక్ టైమ్స్ అలా ఇచ్చిందా? లేదా? అన్నదానికి జోలికి వెళ్లడం లేదు. కాని ఈ పత్రిక గ్రూపు నిర్వహించిన ఒక సదస్సుకు ఏపీ ప్రభుత్వం రూ.కోటిన్నరతో పాటు రూ.27 లక్షలు జీఎస్టీగా చెల్లించడం విమర్శలకు కారణమవుతోంది. ఈ అవార్డు ఎంపిక కమిటీలో చాలామంది ప్రముఖులే ఉన్నారు. ఆయా సందర్భాల్లో వీరు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసిన విషయం బహిరంగమే. ఓకే కానీ... ఏ కొలమానాల ప్రకారం చంద్రబాబును ఈ అవార్డుకు ఎంపిక చేశారన్నది ప్రశ్న. ఎందుకంటే.. 18 నెలల అధికార అవధిలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా వచ్చిన పరిశ్రమలేవీ లేవు. మంత్రి లోకేశ్ వంటి వారు.. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌తోనే బోలెడన్ని పరిశ్రమలు వచ్చేస్తాయని గొప్పలు చెప్పుకున్నా వాస్తవం దీనికి పూర్తిగా భిన్నంగానే ఉంది. కూటమి సర్కారు విశాఖపట్నంతోపాటు మరికొన్ని చోట్ల కొన్ని కంపెనీలకు ఎకర భూమి రూ.99 పైసలకే లీజు లేదా గంపగుత్తగా ఇస్తున్నా అవే కంపెనీలు హైదరాబాద్‌లో వందల కోట్ల రూపాయలతో భూములు కొంటున్నాయి. రహేజా వంటి సంస్థలకు అంత తక్కువ ధరకు భూములిస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం ఆశ్చర్యపోయింది. సత్వా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ, వేల కోట్ల లాభాలు ఆర్జించే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు.. ఊరు పేరూ లేని ఉర్సా అనే కంపెనీలు ఈ చౌక బేరంతో లబ్ధి పొందాయి. చంద్రబాబు సన్నిహితుడిగా చెప్పే లూలూ మాల్ అధిపతి అహ్మదాబాద్‌లో రూ.519 కోట్లు పెట్టి భూమి కొనుక్కుంటే విశాఖ, విజయవాడలలో కాణీ ఖర్చు లేకుండా పలు రాయితీలతో భూమి పొందారు. విజయవాడలో వందల కోట్ల రూపాలయ విలువైన ఆర్టీసీ స్థలాన్ని కేటాయించేశారు. గూగుల్ డేటా సెంటర్ అని ప్రచారం చేసిన అదాని డేటా సెంటర్‌కు భూములు కేటాయించడమే కాకుండా ఏకంగా రూ.22 వేల కోట్ల విలువైన రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చేసింది. ఈ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు చూస్తే ఆ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయా? లేక చంద్రబాబు ప్రభుత్వమే ఆ సంస్థలలో ప్రజల సొమ్మును ఎదురు పెట్టుబడిగా పెడుతోందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఈ కంపెనీలకు ఇస్తున్న భూములు ఏకంగా 66 ఏళ్ల వరకు వారి అధీనంలోనే ఉంటాయి. అవి కల్పించే ఉద్యోగాల సంఖ్య ఎంత ఉంటుందో చెప్పలేం కాని, ఆ భూములవల్ల వారికి కలిగే ప్రయోజనం మాత్రం జాక్ పాట్ వంటిదే. పరిశ్రమలకు భూమి, రాయితీలు ఇవ్వడం కొత్త కాదు.కాని ప్రభుత్వానికి బొత్తిగా ఆదాయం రాకుండా ప్రైవేటువారికే మేలు కలిగేలా ,వారికే సంపద సమకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ అవే వ్యాపార సంస్కరణలు ఈ మీడియా సంస్థలు డప్పు కొడితే ఏమి చేయగలం? ఇవే కాదు.. జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చి వందల కోట్ల విలువైన భూములు కేటాయించి, నిర్మాణాలు చేపట్టి వేల కోట్ల సంపదను సృష్టిస్తే, వాటిని పీపీపీ పేరుతో ప్రైవేటు వారికి సంపదగా మార్చేస్తున్నారు. అయితే ఇది కూడా వ్యాపార సంస్కరణ అనే ఆ అవార్డు కమిటీ భావించిందేమో.ఆంధ్రప్రదేశ్ ప్రాథమికంగా వ్యవసాయాధార రాష్ట్రం. కాని అక్కడ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఫలితంగా పలుమార్లు రైతులు తమ పంటలను పారబోస్తున్నారు. చాలా సందర్భాల్లో వ్యాపారులకు ఈ పంటలు కారుచౌకగా దొరుకుతున్నాయి.రైతులేమో నష్టాల్లో కూరుకుపోతున్నారు. వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రైతుల సంక్షేమం కాంక్షించి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం నీరు కార్చేయడంతో నష్టం మరింత ఎక్కువగా ఉంటోంది. యూరియా కొరతను అదనుగా చేసుకున్న వ్యాపారులు అందినంత దండుకున్నారు. ఆ రకంగా వారికి చంద్రబాబు అంటే మక్కువ ఏర్పడిందేమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విద్య, వైద్య సామాజిక రంగాలలో జగన్ సంస్కరణలు తేగా, ఇప్పుడు కూటమి సర్కార్ ప్రజలను ప్రైవేటు సంస్థల దోపిడీకి వదలి వేసే విధానాలు తీసుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయకుండా మొత్తం ప్రైవేటు బీమా కంపెనీల చేతిలో పెట్టడానికి ప్రభుత్వం సిద్దం అవుతోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను, వలంటీర్లను ప్రవేశపెట్టి జగన్ పాలన సంస్కరణలు తెచ్చి ప్రజలకు పౌరసేవలను వారి ఇంటివద్దే అందిస్తే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్ని ఏ రకంగా చూసినా పేదల వ్యతిరేక, పెట్టుబడిదారుల అనుకూల విధానాలుగానే కనిపిస్తాయి. జగన్ టైమ్‌లో సెకీ ద్వారా తక్కువ ధరకు విద్యుత్ తీసుకోవాలని ఒప్పందం చేసుకుంటే అది అధిక ధర అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు అదానితో భేటీ అయిన వెంటనే దానికి ఓకే చేశారని వార్తలు వచ్చాయి. అంతేకాక సోలార్ పవర్‌ను యూనిట్‌కు రూ.మూడు కంటే ఎక్కువ ధరకు కొనడానికి సిద్దపడుతున్నారు. ఇక రెడ్ బుక్ అరాచకాలతో పరిశ్రమలను కూడా వదలి పెట్టడం లేదు. ఒక మోసకారి నటిని అడ్డం పెట్టుకుని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ పై కూడా కేసు పెట్టే యత్నం జరిగింది. చిత్రంగా ఆయన కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి వాటా ఉన్న భారతి సిమెంట్తోసహా మరో రెండు సిమెంట్ కంపెనీల లీజును కక్షపూరితంగా రద్దు చేయాలని నోటీసులు ఇచ్చారు. ఇది ఏ రకంగా వ్యాపార సంస్కరణ అవుతుంది? ఏది ఏమైనా చంద్రబాబుకు ఎకనమిక్స్ టైమ్స్ అవార్డు ఇచ్చినందుకు ఏపీ ప్రజలు సంతోషిస్తారా? భయపడతారా? అన్నది చెప్పలేం. ఇలాంటి బిజినెస్ అవార్డుల ఉత్సాహంతో మరింతగా పెట్టుబడిదారులు, వ్యాపారులకు అణాకు, బేడాకు విలువైన రైతుల, ప్రభుత్వ భూములను కట్టబెట్టకుండా ఉంటే అదే పదివేలు అన్నది జనాభిప్రాయంగా ఉంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏం చేద్దాం ఎలా చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇరిగేషన్ విషయంలో చేసిన ఆరోపణల నేపథ్యంలో.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోమవారం మధ్యాహ్నాం మంత్రులతో సీఎం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకోవడంతో పాటు ఎంపీటీసీ, జెట్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే అంశంపైనా వీళ్ల నుంచి సీఎం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారని సమాచారం. అలాగే పెండింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీ , పార్టీ పదవులపై భర్తీ పైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు.. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ పైనా చర్చిస్తారని సమాచారం. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ చేసిన ఆరోపణలపై ఆధారాలతో సహా అసెంబ్లీలో చర్చ చేపట్టే అంశంపై మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ‘‘ఇప్పుడు రాష్ట్రం మొత్తానికే ముప్పు వచ్చింది. గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే.. రాష్ట్ర సర్కారులో చలనం లేదు. కృష్ణాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద ఘోరం జరుగుతుంటే చప్పుడు చేయట్లేదు. అందుకే నేనే రంగంలోకి దిగా. ఇవాళ్టి దాకా వేరు.. రేపట్నుంచి వేరు. మా కళ్ల ముందే ఇంత దుర్మార్గం జరుగుతుంటే.. నేను ఎందుకు మౌనంగా ఉండాలి? ఇది సర్వభ్రష్ట సర్కారు. ఈ నిష్క్రియా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడతాం’’ అని కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్మీట్లో కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే.. ఇరిగేషన్ విషయంలో దమ్ముంటే ఫేస్ టూ ఫేస్‌కు రావాలంటూ సీఎం రేవంత్ ఆ వెంటనే కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి జలాలపై అవసరమైతే రెండేసి రోజుల చొప్పున శాసనసభలో చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చలకు వస్తానని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అంగీకరిస్తే జనవరి 2 నుంచే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో ఓ ప్రకటన చేశారు. -
420 హామీలను మూసీలో కలిపారా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారంటీలను, 420 హామీలను గాలికి వదిలేశారా? లేక మూసీనదిలో కలిపారా? లేదంటే గాం«దీభవన్‌లో పాతరేశారా?’అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాం«దీని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆమెకు ఒక బహిరంగ లేఖ రాశారు. ‘తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ పుస్తకాన్ని ఢిల్లీకి వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీకు అందజేశారు. ఆ విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ మీరు శుభాకాంక్షలు తెలిపారు.కానీ.. 2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో సెపె్టంబర్ 17వ తేదీన హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభకు విచ్చేసిన మీరు, అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించడమే కాకుండా స్వయంగా 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి, అధికారం చేపట్టి 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుంది.ఈ రెండేళ్లలోఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు మీ పార్టీ ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీల అమలు గురించి ఏనాడైనా తెలుసుకోవడానికి ప్రయతి్నంచారా? కనీసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిమ్మల్ని కలిసిన సమయంలోనైనా వాటి అమలు గురించి అడిగి తెలుసుకున్నారా?’అని కిషన్‌రెడ్డి తన లేఖలో ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు మరిచి, తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ పేరుతో కొత్త పల్లవి అందుకొని మీ పార్టీ, మీరు ఒకరినొకరు అభినందించుకుంటున్నారని మండిపడ్డారు.‘ఆనాడు ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన మీరు, మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు ఇస్తున్నారు. మరి ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారంటీలను గాలికొదిలేశారా? ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా? లేక గాం«దీభవన్‌లో పాతరేశారా?. తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి’అని కిషన్‌రెడ్డి నిలదీశారు. ఇచ్చిన మాటమీద నిలబడండి.. ‘కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా కొత్త హామీలు ఇచ్చే ముందు, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి, మీరు ఇచ్చిన మాట మీద నిలబడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. లేదంటే మీరు ప్రకటించిన అభయహస్తమే ప్రజల ఆగ్రహం రూపంలో మీ పాలిట భస్మాసుర హస్తమై అధికారానికి దూరం చేస్తుంది’అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ‘ముఖ్యంగా గ్యారంటీల పేరుతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని మనవి చేస్తున్నాను. మీరు ఇచ్చిన హామీల అమలులో మోసం చేస్తే, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు కూడా మీకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రతిచర్యలకు పాల్పడి, తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నాను’అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
కేసీఆర్‌వి 90% అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై 90 శాతం పచ్చి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సాగునీటి రంగాన్ని దారుణంగా, దుర్మార్గంగా నాశనం చేసింది ఆయనే అని ఆరోపించారు. కమీషన్ల కక్కుర్తి, అవగాహన లోపం, అసమర్థత, చేతకానితనంతో 10 ఏళ్లలో ప్రాజెక్టులపై రూ.లక్షా 81 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు జీరో ప్రయోజనం చేశారని ధ్వజమెత్తారు.కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్‌లు కూలిపోవడానికి.. సీఎంగా, నీటిపారుదల, ఆర్థికశాఖ మంత్రిగా వ్యవహరించిన కేసీఆర్‌దే బాధ్యత అని, కేసీఆరే ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా తేలి్చందని అన్నారు. ఆదివారం రాత్రి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం చేపట్టకుంటే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి.. ‘కాళేశ్వరం అంత పెద్ద కుంభకోణం మరొకటి జరగదేదని ఘోష్ కమిషన్, విజిలెన్స్, కాగ్ ఎన్డీఎస్ఏ తేల్చాయి. ఈ విషయంలో చట్టప్రకారం ముందుకు పోతున్నాం. అంతర్జాతీయ నిపుణులతో కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణను వాటి నిర్మాణ సంస్థలతోనే పూర్తి చేయిస్తాం. రూ.38,500 కోట్లతో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకి రూ.10 వేల కోట్ల పనులు పూర్తయ్యాక అధిక కమీషన్ల కోసం అర్ధాంతరంగా వదిలేసి దాని స్థానంలో రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్.. లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. కాళేశ్వరం చేపట్టకుండా ప్రాణహిత–చేవెళ్లనే నిర్మిస్తే మిగిలిపోయే రూ.65 వేల కోట్లతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి..’ అని ఉత్తమ్ అన్నారు. ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? ‘కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు శంకుస్థాపన చేసిన దేవాదుల ప్రాజెక్టుతో పాటు పెండింగ్‌లో ఉన్న పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదో కేసీఆర్ సమాధానం ఇవ్వాలి. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్‌నగర్‌లో ఎన్నికలకు 2 ఏళ్ల ముందు శంకుస్థాపన చేసిన ఎత్తిపోతల పథకాలను ఏడాదిన్నర కాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఒక్కటైనా పూర్తి చేశారా? మార్పులు చేయకుంటే రూ.4,500 కోట్లతో ఈ ప్రాజెక్టులు పూర్తయి 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేది. పాలమూరు కింద ఎకరా ఆయకట్టు ఇవ్వలేదు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని కేసీఆర్ అంటున్నారు. దాని కింద ఒక్క ఎకరమైనా ఆయకట్టు ఇచ్చారా? ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55 వేల కోట్లకు గత ప్రభుత్వమే సవరించగా, రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదు. ప్రాజెక్టు డీపీఆర్‌ను 2023 ఏప్రిల్ 12న కేంద్రం తిప్పి పంపింది. అప్పుడు సీఎం, ఇరిగేషన్ మంత్రి కేసీఆరే..’ అని ఉత్తమ్ చెప్పారు. 45 టీఎంసీలకు తగ్గింపు అబద్ధం... ‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు తగ్గించేందుకు కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని కేసీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే 90 టీఎంసీలతో ప్రాజెక్టుకు జీవో ఇచ్చాం. తొలి విడత ప్రాజెక్టును మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన 45 టీఎంసీలతో చేపట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతించింది. గోదావరి జలాల మళ్లింపుతో లభ్యతలోకి వచి్చన మరో 45 టీఎంసీలు కలిపి మొత్తం 90 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకి కేటాయించాలని కేంద్రంతో మేము నిరంతరం కొట్లాడుతున్నాం..’ అని మంత్రి పేర్కొన్నారు. ఏపీకి కేసీఆర్ సహకరించారు ‘ఉమ్మడి ఏపీలో 2004–14 మధ్యలో ఏపీ రోజుకి 4.1 టీఎంసీల సామర్థ్యంతో కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకోగా, తెలంగాణ వచ్చాక కేసీఆర్ సహకారంతో రోజుకు 9 టీఎంసీలు అక్రమంగా తరలించుకునేలా సామర్థ్యాన్ని పెంచుకుంది. రాయలసీమ ఎత్తిపోతల టెండర్లకు కేసీఆర్ సహకరిస్తే మేము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులను ఆపివేయించాం. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి ఏపీ 2004–14 మధ్యలో 727 టీఎంసీలను అక్రమంగా తరలించగా, కేసీఆర్ సీఎం అయ్యాక 2014–23 మధ్యలో 1442 టీఎంసీలను అక్రమంగా తరలించుకుంది. పోతిరెడ్డిపాడు విస్తరణకు కేసీఆర్ సహకరించారు. ఆయన కాలంలోనే పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది..’ అని ఉత్తమ్ తెలిపారు. -
ముందు అసెంబ్లీకి రండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల విషయంలో ఎవరేం చేశారో, ఎవరి హయాంలో ఏం జరిగిందో కూలంకశంగా మాట్లాడేందుకు వచ్చే నెల 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుందామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వస్తే అన్ని విషయాలపై చర్చిద్దామని తాను ప్రతిపాదిస్తున్నానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో? తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశానో? అన్ని విషయాలను మాట్లాడుకోవచ్చని చెప్పారు.ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజలకు ఉపయోగపడే సూచనలు చేస్తే ఆమోదించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. శాశ్వతంగా కృష్ణా జలాల హక్కులను ఏపీకి రాసిచ్చేసి పాల మూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణశాసనం రాసింది కేసీఆరేనని ఆరోపించారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే..! ప్రజలు తీర్పు ఇస్తూనే ఉన్నారు ‘కలుగులో ఉన్న ఎలుకకు పొగబెడితే బయటకు వచ్చినట్టు రెండేళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చాడు. సంతోషం. ప్రజలిచి్చన తీర్పు కేసీఆర్‌కు కనువిప్పు కలిగించి స్రత్పవర్తన తెస్తుందని ఆశించాం. కానీ రెట్టించిన ఉత్సాహంతో చెప్పిన అబద్ధం చెప్పకుండా అబద్ధాలే పెట్టుబడిగా ఆయన 75 నిమిషాల ప్రసంగం సాగింది. బీఆర్ఎస్ చేసిన నేరాలు, ఘోరాలు దృష్టిలో పెట్టుకుని 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కరడుగట్టిన నేరగాళ్లకు కూడా కనువిప్పు కలుగుతుంది కానీ కేసీఆర్ మాత్రం ఏ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నాడు. మూతి దగ్గర కాకుండా తోక దగ్గర ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది. 811 టీఎంసీల్లో 512 ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు అని సంతకం పెట్టింది ఎవరు? ఒక్కసారి కాదు పదేపదే సంతకాలు పెట్టి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్. 2021–22లో శాశ్వతంగా కృష్ణా జలాల హక్కులను కేసీఆర్ ఏపీకి రాసిచ్చారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జూరాల దగ్గర ఒడిసిపట్టుకోవాల్సిన నీటిని శ్రీశైలంలో కలిపి ఏపీ జలదోపిడీకి రాజమార్గం ఏర్పాటు చేశాడు.మూతి దగ్గర వదిలేసి తోక దగ్గర పట్టుకోవాలని చూశాడు. లిఫ్టులు, పంపులు, కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే ఇదంతా చేశాడు. అందుకే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క ప్రాజెక్టు కూడా కృష్ణాపై పూర్తికాని పరిస్థితి. బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, నారాయణపేట– కొడంగల్, డిండి, ఎస్సెల్బీసీల్లో ఒక్క ప్రాజెక్టునయినా పదేళ్లలో పూర్తి చేశాడా? మేం వచి్చన తర్వాత రూ.6,800 కోట్ల విలువైన పనులను కృష్ణాపై సాగునీటి ప్రాజెక్టుల కోసం చేశాం. తేలు కుట్టిన దొంగలా.. మేం వచ్చిన తర్వాతే కృష్ణా జలాల్లో 71 శాతం వాటా అడిగాం. ఏపీకి 29 శాతం వాటా ఇవ్వాలని కొట్లాడుతున్నదే మేము. పైగా తానే నీళ్లకు నడక నేరి్పనట్టు ఏపీకి చెందిన సీఎం చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టులు ఎలా కట్టాలో కూడా ఆయనే చెప్పాడు. అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలను ప్రజల ముందు పెడతాం. ట్రిబ్యునల్‌లో స్వయంగా మా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెళ్లి వాదనలు వినిపిస్తున్నాడు.పదేపదే జలశక్తి మంత్రిని కలుస్తున్నారు. కేంద్రం చేయకపోతే అంతా ఎడారిగా మారిపోదు. తెలంగాణకు కృష్ణా జలాల విషయంలో చేసిన ద్రోహానికి కేసీఆర్ సమా«ధానం మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పాలి. ఈ ద్రోహిని నిలదీద్దామని సభకు రమ్మంటే తేలు కుట్టిన దొంగలా తప్పించుకుంటున్నాడు. సంవత్సరంన్నర తర్వాత బయటకు వచ్చి అసలు ఊరుకునేదే లేదంటూ సుయోధనుడిలా ఏకపాత్రాభినయం చేస్తున్నాడు. అందుకే అసెంబ్లీకి రావడంలేదు.. అసెంబ్లీలో కృష్ణాకు ఒకరోజు, గోదావరి ఒకరోజు కేటాయించి చర్చ చేద్దామని నేను ప్రతిపాదిస్తున్నా... ఆయన్ను రమ్మనండి. లేదంటే రెండు రోజుల చొప్పున చర్చిద్దామన్నా ఓకే. ఆయన అబద్ధాలు చెపుతున్నాడు కాబట్టే అసెంబ్లీకి రావడం లేదు. అసెంబ్లీకి రండని అడుగుతున్నా.. రాకుండా కేసీఆర్ పారిపోవడంలో ఉద్దేశమేంటి? ఆయనకు అధికారం కోసం వ్యామోహం తప్ప తెలంగాణ ప్రజలపై అభిమానం లేదు. అందుకే జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. సభలో ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగించబోమని నేను హామీ ఇస్తున్నా. అలా ఎవరైనా భంగం కలిగించినా చర్యలు తీసుకోమని నేనే చెబుతా. ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆయన ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాడో అందరికీ తెలుసు. కొడుకు, అల్లుడి పంచాయతీ తీర్చేందుకు వచ్చాడు. కొడుకు దగ్గరి నుంచి అల్లుడు పార్టీని గుంజుకుంటాడేమోనని, దేనికీ చెల్లనోడు అల్లుడి చేతిలో పార్టీ పెడతాడేమోనని, కోతుల పంచాయతీ పిల్లి తీర్చినట్టు వచ్చాడు. ఆయన చావు మేమెందుకు కోరుకుంటాం. అధికారం ఉన్నప్పుడే కొడుకు కుర్చీ కోసం ప్రయతి్నంచాడు. ప్రమాణ స్వీకారానికి కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నాడు. ఇప్పుడు అల్లుడు సావు కోరుకుంటున్నాడు.ఆయన పోతే అల్లుడికి పార్టీ వస్తదని అనుకుంటున్నాడు. నాకేమి వస్తుంది. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, అసెంబ్లీకి వచ్చి అర్థవంతమైన చర్చ జరగాలని నేను కోరుకుంటున్నా. ఆయన కింద పడి కాలువిరిగితే మొదట పరామర్శించిందే నేను. అర్ధరాత్రి ఆంబులెన్సు పెట్టి ఆసుపత్రికి తీసుకొచ్చిందే నేను. కానీ ఆయన అల్లుడు, కొడుకే పోటీలుపడి ఆయన్ను ఫామ్‌హౌజ్‌లో నిర్బంధిస్తున్నారు. కేసీఆర్‌కు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రజలతో ఇబ్బంది లేదు. కుటుంబసభ్యులతోనే ప్రమాదం ఉంది. నన్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన వయసుకు తగ్గట్టు లేవు. ఆయన తమలపాకుతో కొడితే నేను తలుపుచెక్కతో కొట్టగలను. అల్లుడు కాపలా కాసుకుని ఉన్నాడు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనుకుంటున్నది మేం కాదు. ఆయన కొడుకు, అల్లుడే. కేటీఆర్ ఐరన్‌లెగ్ అని చెప్పి పార్టీని గుంజుకుంటే ఉన్న పళంగా హరీశ్‌రావుకు రూ.5వేల కోట్ల ఆస్తి వస్తుంది. రూ.1,500 కోట్ల పార్టీ బ్యాంక్ బ్యాలెన్సు, రూ.3,500 కోట్ల విలువైన పార్టీ ఆస్తులు రాత్రికి రాత్రి ఆయన హస్తగతమవుతాయి. నేను చెప్పేది కనపడే ఆస్తుల గురించే. కనిపించని వజ్రాలు, వైఢూర్యాల గురించి కాదు. నేను కోటి మంది మహిళలకు సారె పెడితే కేటీఆర్ ఉన్న చెల్లిని ఇంటి నుంచి పంపించేశాడు. ప్రతి దగ్గర బాంబులు పెట్టారనడం ఫ్యాషన్ అయిపోయింది. అప్పులు చేసి గుల్ల చేశారు రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని గుల్ల చేశాడు. 11.9 శాతం వడ్డీకి అప్పులు తెచ్చాడు. సంసారం చేసేటోడెవడైనా అంత వడ్డీకి అప్పులు తెస్తాడా? కేసీఆర్, ఆయన కుమారుడు కలిసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అత్యాచారం చేశారు. కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది. మేం వచ్చిన తర్వాత ఒక్కోక్కటి సరిదిద్దుతున్నాం. ఇప్పటివరకు రూ.26 వేల కోట్లు అప్పులను రీస్ట్రక్చర్ చేశాం. మరో 85వేల కోట్ల కోసం ప్రయతి్నస్తున్నాం. ప్రధాని మోదీ తన ఆరోగ్యం గురించి ఆరా తీయగానే కేసీఆర్ సంతోషపడుతున్నాడు. ఫార్ములా ఈ–రేస్ కేసులో అరవింద్ కుమార్ విచారణకు డీవోపీటీ అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఇదే’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
సర్వభ్రష్ట సర్కారు
గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రజలను ఎంతకాలం వంచిస్తారు? మేము ప్రజల ఆస్తుల విలువ పెంచితే ప్రస్తుతం భూముల ధరలు కుప్పకూలాయి. సాక్షి, హైదరాబాద్: ‘క్రమ పద్ధతిలో ముందుకు సాగుతున్న రాష్ట్రంలో ప్రజలను అబద్ధపు హామీలతో మోసగించి కాంగ్రెస్ అధికారంలోకి వచి్చంది. మాయమాటలతో అర్రాజ్ పాటలు పాడి చాంతాడంత హామీలు ఇవ్వడంతో ప్రజలు టెంప్ట్ అయ్యా రు. వంద శాతం సమ్మిళిత అభివృద్ధితో ముందుకు సాగుతున్న తెలంగాణలో బాండు పేపర్లు, గ్యారంటీ కార్డులు అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలకు శఠగోపం పెట్టారు. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం. నదుల అనుసంధానం పేరిట గోదావరి జలదోపిడీ, పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం జరుగుతున్నా స్పందించడం లేదు. కిరికిరి మాటలతో, కారు కూతలతో ప్రభుత్వం నడుపుతామంటే కుదరదు.మాది తెలంగాణ తెచి్చన పార్టీ. ప్రధాన ప్రతిపక్షంగా మా విధి మేము నిర్వర్తించాలి. సర్కారుకు సరిపడినంత సమయం ఇచ్చాం. ఇవాళ్టి వరకు వేరు, రేపటి నుంచి వేరే.. తోలు తీస్తాం.. అందుకోసం నేను రంగంలోకి దిగుతున్నా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. మూడు నాలుగు రోజుల్లో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమై గ్రామ గ్రామాన డప్పు కొట్టి కార్యాచరణ ప్రకటిస్తాం.ఆయా జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని ఎండగడ™తాం. కవులు, కళాకారులను తట్టి లేపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రశ్నిస్తాం. ఈ సభలకు నేను స్వయంగా హాజరవుతా..’ అని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షులు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం, శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ, ఇతర కీలక నేతలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రెండేళ్లుగా గమనిస్తున్నాం.. ‘పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తట్టెడు మట్టి తీయకుండా రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ని్రష్కియా పరత్వం, కేంద్రం వ్యతిరేకిస్తున్న తీరును రెండేళ్లుగా గమనిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదు. తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన బీఆర్ఎస్..తెలంగాణ హక్కులకు ఒక్క నొక్కు పడినా, ఒక్క చుక్క నష్టం జరిగినా సహించేది లేదు. తెలంగాణకు శనిలా బీజేపీ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఒత్తిడితో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను వెనక్కి పంపారు. పర్యావరణ అనుమతులతో పాటు ఇతర ప్రధాన అనుమతులు సాధించినా బీజేపీ దిగజారి తెలంగాణకు శనిలా మారింది. మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డీపీఆర్‌ను వెనక్కి పంపి ఆగం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందన లేకుండా పెదవులు మూసుకుంది.మైనర్ ఇరిగేషన్ నష్టాలు, ఏపీ పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాల తరలింపుతో కృష్ణాలో తెలంగాణకు దక్కిన 45 టీఎంసీలను కలుపుకొని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90.81 టీఎంసీలు కేటాయించాం. కానీ నీటిపారుదల శాఖ మంత్రి 45 టీఎంసీలు చాలని లేఖ రాశారు. గోదావరి జలాల తరలింపుతో కృష్ణాలో ఏపీ వదులుకున్న జలాలను ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర వాడుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతోంది. రెండేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులో తట్టెడు మట్టెడు తీయకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? ఈ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా, కమీషన్లు కొట్టడం తప్ప వేరే పనిలేదా?..’ అని కేసీఆర్ మండిపడ్డారు. మేం పెండింగు ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం.. ‘సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కోలుకోలేని రీతిలో దెబ్బతింది. నాటి సీఎం చంద్రబాబు జిల్లాను దత్తత తీసుకున్నా జూరాలలో ముంపునకు గురైన కర్ణాటక భూమికి రూ.13 కోట్లు పరిహారం ఇవ్వలేదు. గోదావరి నదిపై దేవునూరు, ఇచ్చంపల్లి తదితర ప్రాజెక్టులకు ఉమ్మడి ఏపీలో అన్యాయం చేసిన రీతిలోనే కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు నష్టం చేశారు. 17 టీఎంసీలతో మంజూరైన జూరాల ప్రాజెక్టు దశాబ్దాల తరబడి కనీసం ఫౌండేషన్‌కు నోచుకోలేదు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత.. చంద్రబాబు మోకాళ్ల మీద పరుగెత్తి పరిహారం చెల్లించడంతో జూరాల ప్రాజెక్టు ఆయకట్టు సాగులోకి వచి్చంది.రాజోలిబండ మళ్లింపు పథకం కోసం ఆలంపూర్, గద్వాల వరకు పాదయాత్ర చేశా. మహబూబ్‌నగర్ జిల్లాలో 308 కిలోమీటర్ల మేర కృష్ణా ప్రవహిస్తున్నా నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి తదితర పథకాలను పెండింగులో పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేసి రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. పాలమూరు ఎత్తిపోతల పథకానికి 170కి పైగా టీఎంసీలు తీసుకోవాలనే వ్యూహంతో తొలుత 90.81 టీఎంసీలు కేటాయించాం. అనేక అవాంతరాలు ఎదురైనా అనుమతులు సాధించాం. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేశాం..’ అని బీఆర్ఎస్ అధినేత వెల్లడించారు. హైప్ క్రియేట్ చేయడంలో గురువు చంద్రబాబు ‘బిజినెస్ మీట్ల పేరిట హైప్ క్రియేట్ చేయడంలో గురువు చంద్రబాబు. ఏపీలో చంద్రబాబు హోటల్లో పనిచేసే వంట మనుషులతో ఎంఓయూలపై సంతకాలు పెట్టించారు. ఆయన చెప్పిన లెక్కలు నిజమైతే ఈ పాటికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేవి. ఒప్పందాలు నిజమైతే కనీసం రూ.10 వేల కోట్లయినా రావాలి కదా. గతంలో నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు భోపాల్‌కు వెళ్లిన సందర్భంలో ప్రధాని మోదీ సమక్షంలో కుదిరిన రూ.14 లక్షల కోట్ల ఎంఓయూలు బోగస్ అని ఆ రాష్ట్ర మంత్రి చెప్పారు. పెట్టుబడులపై అబద్ధపు ప్రకటనలు, ఒప్పందాలతో ప్రజలను మోసం చేయడం ఎందుకు?..’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా ‘ఫార్మా రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని కాలుష్య రహిత ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ముచ్చర్లలో మేం 14 వేల ఎకరాలు సేకరించాం. పర్యావరణ అనుమతులు కూడా సాధించి ముందుకు సాగుతున్న క్రమంలో ప్రభుత్వం మారింది. కానీ ఫ్యూచర్ సిటీ పేరిట భూములను అమ్ముకునేందుకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాకు తెరలేపారు. గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రాణాలను కాపాడలేని ప్రభుత్వం ఫార్మాసిటీ భూములను అమ్ముకునేందుకు ఉత్సాహం చూపుతోంది.వంతారాకు 3 వేల ఎకరాలు, జూపార్కు తరలింపు భూముల అమ్మకం కోసమేనా? గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ప్రజలను ఎంత కాలం వంచిస్తారు? యాప్ ద్వారా యూరియా అంటూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. మేము ప్రజల ఆస్తుల విలువ పెంచితే ప్రస్తుతం భూముల ధరలు కుప్పకూలాయి. అడ్డమైన హామీలు ఇచ్చి రైతులు, పేదలు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులను ఏడిపిస్తున్నారు. సందర్భం ఏదైనా కేసీఆర్ చనిపోవాలి అంటూ మాట్లాడటం కరెక్టేనా?..’ అని కేసీఆర్ నిలదీశారు. -
కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు సిద్ధం: సీఎం రేవంత్
హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని, కృష్ణా జాలాలపై ఒక రోజు, గోదావరి జలాలపై మరో రోజు చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈరోజు( ఆదివారం, డిసంబర్ 21 వ తేదీ) కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆరేనన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయలేదని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఆయనే దెబ్బ తీశారన్నారు. కేసీఆర్ వస్తే ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను చూపిస్తామన్నారు. కృష్ణా జలాల్లో 36 శాతం వాటా అంగీకరించింది కేసీఆర్ మాత్రమేనని, 71 శాతం వాటా కోసం తాము పోరాడుతున్నామన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఉద్ఘాటించారు. ఈరోజు( ఆదివారం, డిసంబర్ 21వ తేదీ) బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం ఇదే విషయాన్ని కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. తాము నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించామన్నారు.ఇందులో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. దాదాపు 8 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ మాట్లాడుతూ.. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడింది. ఈ ప్రభుత్వం 45 టీఎంసీలకే కేంద్రం దగ్గర అంగీకరించింది. దీన్ని నిరసిస్తూ జిల్లా, మండల స్థాయిలో నిరసనలు తెలపాలని నిర్నయించాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైనా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. దీనిపైనే ప్రధానంగా చర్చించాం.రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహం గురించి చర్చించాం. మహబూబ్‌నగర్ జిల్లాలో 308 కి.మీ మేర కృష్ణా నది ప్రవహిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా వివక్షకు గురైంంది. పాలమూరు గురించి గరెటడు నీళ్లు అడిగే వాడే లేడు. ఏపీ ఏర్పాటుతో మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాలప్రతిపాదిత ప్రాజెట్టులు మార్చొద్దని ఎస్ఆర్సీ స్పష్టంగా చెప్పింది.గతంలో చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నారు. ఆయన ఇష్టమొచ్చినట్లు పునాది రాళ్లు వేశారు. పాలమూరు ప్రాజెక్టు అనేది ఎత్తిపోతల ప్రాజెక్టు కాదు. గతంలోనే నీటి కేటాయింపులు జరిగాయి. అయినా పాలమూరు జిల్లాలో విపరీతమైన కరువు. కేంద్రం, రాష్ట్రం కలిసి అన్యాయం చేశాయి’ అని కేసీఆర్ విమర్శించారు -
‘కిషన్‌రెడ్డి తెలంగాణకు తెచ్చింది ఏమైనా ఉందా?’
హైదరాబాద్: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి తెలంగాణకు తెచ్చింది ఏమైనా ఉందా? అని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ 12 ఏళ్ల పాలనపై రాష్ట్రంలోని మా రెండేళ్ల పాలనై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరాఉ. రాష్ట్ర అభివృద్ధికి కిషన్‌రెడ్డి మోకాలు అడ్డుతున్నారని, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణలను కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని మహేష్‌గౌడ్ మండిపడ్డారు. తాము ఇచ్చిన హామీల్లో మెజార్టీ హామీలను నెరవేర్చామన్నారు మహేష్‌గౌడ్.కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమే..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమేనన్నారు మహేష్ గౌడ్. కేసీఆర్, హరీష్ చేసిన తప్పిదాల వల్లే నదీజాలల సమస్యలు వచ్చాయన్నారు. వృథా ప్రాజెక్టుల కోసం కేసీఆర్ అనవరసరప ఖర్చు చేశాడని, తామ కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటన్నామన్నారు. అప్పులపై కేసీఆర్ ఏం సంజాయిషీ ఇస్తారో చూద్దామన్నారు. ప్రతిపక్షాలు ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తాము 70 శాతం సీట్లు గెలిచామని, మరి బీఆర్ఎస్ ఎక్కడుంది?అని ప్రశ్నించారు మహేష్ గౌడ్. -
పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే మన సత్తా ఏమిటో తెలిసేది: కేసీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశంలో అధ్యక్షుడు కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు కేసీఆర్. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానం తనను దూషించడం, అవమానించడమేనని.. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిందన్నారు. పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే మన సత్తా ఏమిటో తేలేదన్నారు కేసీఆర్.‘గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లలో ఒక్క కొత్త పాలసీ తీసుకురాలేదు. ఉన్న పథకాలు కూడా ఆపేశారు. రియల్ ఎస్టేట్ కోసమే ఈ ప్రభుత్వ పాలసీ. ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది. తెలంగాణలో యూరియా దొరకని పరిస్థితి ఏర్పడింది. మా హయాంలో రైతుల ఇంటికే యూరియా వచ్చేది’ అని తెలిపారు కేసీఆర్.ముఖ్యమంత్రిగా నేను అసెంబ్లీలో దివంగత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రశంసించి, దాని వ్యయ పరిమితిని 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచాను,ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేస్తోంది. కేసీఆర్ కిట్ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపివేస్తోంది. బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నారు. రైతుల కోసం నిర్మించిన చెక్‌డ్యామ్‌లను పేల్చివేస్తున్నారు. ఇంత కంటే దారుణం ఏదైనా ఉంటుందా?అని కేసీఆర్ నిలదీశారు. -
తండ్రీ కొడుకులిద్దరిదీ ఓన్లీ పబ్లిసిటీ.. నో యాక్టివిటీ: వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వాటర్ గ్రిడ్ పనులకు మళ్లీ శంకుస్థాపనకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ఈ పథకాన్ని వైఎస్ జగన్ సీఎంగా 50 శాతం పనులు పూర్తి చేశారు. అసలు ఆ వాటర్ గ్రిడ్ పథకాన్ని వీళ్లే కనిపెట్టినట్లు, దాన్ని వీళ్లే మంజూరు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. పులివెందులలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు.‘‘గూగుల్ డేటా సెంటర్ నుంచి అన్నింటిలో క్రెడిట్ చోరీ కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ క్రెడిట్ చోరీలో భాగంగానే పులివెందులలో రూ.450 కోట్లతో జగన్ చేపట్టిన వాటర్ గ్రిడ్‌కు మళ్లీ శంకుస్థాపన చేస్తారట. ఎవరి హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో పులివెందుల ప్రజలందరికీ తెలుసు. గతంలోనూ వైఎస్సార్ పూర్తి చేసిన చిత్రావతి, పైడిపాలెం రిజర్వాయర్లలను చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడు..ఆనాడు చంద్రబాబు చేసిన ప్రారంభోత్సవాలకు నేనే స్వయంగా వెళ్లి వైఎస్సార్ ఏం చేశాడో చెప్పా.. ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. వీళ్లు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా ప్రజలకు అన్నీ తెలుసు.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా ఒక హక్కుగా ప్రతి ఒక్కరికీ వచ్చేది. డిసెంబర్ 15 నాటికి వరి మినహా అన్ని పంటలకు బీమా గడువు పూర్తయ్యింది. ఈ ప్రభుత్వం రైతు బీమా చేసుకునేందుకు ఎటువంటి అవగాహన కార్యక్రమం చేపట్టలేదు...ఫలితంగా రైతులు బీమా ప్రీమియం కట్టుకోలేని పరిస్థితి నెలకొంది. రైతులు ప్రీమియం కట్టుకునేలే జనవరి 15వరకూ గడువును పెంచాలని నా డిమాండ్. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి బీమాపై స్పష్టత ఇవ్వాలి. చంద్రబాబు.. అమరావతి, 99 పైసలకే భూముల పందేరంలో బిజీగా ఉన్నాడు. అదేమన్నా అంటే సంపద సృష్టించాను అంటాడు. తండ్రీ కొడుకులిద్దరిదీ ఓన్లీ పబ్లిసిటీ...నో యాక్టివిటీ...విదేశాలకు వెళ్లి ఓ ఫోటో దిగి పచ్చ పత్రికల్లో వేయించుకుని చెమటోడుస్తున్నట్లు కలరింగ్ ఇస్తారు. ఇండిగో సంక్షోభంలో ఇలా క్రెడిట్ చోరీకి పాల్పడాలని అర్నాబ్ గోస్వామి వద్ద అడ్డంగా దొరికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వీరికి బుద్దిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అని అవినాష్‌రెడ్డి హెచ్చరించారు. -
జగన్‌లా ఒక్కరోజు పాలించినా చాలూ..!
ఉన్న మాటంటే ఉలుకెక్కువ.. చంద్రబాబుకి ఈ విషయంలో మరీనూ. ఆయన ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. 2019-2024 ఈ ఐదేళ్లు ఏపీ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. కరోనా లాంటి కష్ట కాలంలోనూ రాష్ట్రానికి జగన్ ఎంతో సమర్థవంతంగా పాలించడం యావత్ దేశం దృష్టిని ఆకర్షించగలిగింది. మరి విజనరీగా చెప్పుకునే చంద్రబాబు అన్నీ బాగున్నా.. నాలుగుసార్లు సీఎంగా ఉండి చేసింది ఏంటి?. ఆ వివరాలే కాస్త లోతుల్లోకి వెళ్లి చెప్పుకుందాం..‘‘చెప్పిందే చేస్తాం.. చేయగలిగిందే చెప్తాం..’’ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్‌గా, ఓ ఖురాన్‌గా భావించే వైఎస్ జగన్ చెప్పే ముందు మాట ఇది. ఆ మాటను మడమ తిప్పకుండా ఐదేళ్లపాటు ఆచరణలో చేసి చూపించారాయన. ఇచ్చిన హామీలలే కాదు చెప్పని మంచిని చేసి చూపించి ఎన్నికల హామీలకంటూ ఒక నిర్వచనం.. ఓ పరిపూర్ణతను తీసుకొచ్చారు. మరి చంద్రబాబు చేసిందేంటి.. ఇప్పుడు చేస్తోంది ఏంటి?..మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన ఘనత చంద్రబాబుది. పైగా ప్రజలకిచ్చిన హామీల్ని ఎగ్గొట్టిన ట్రాక్ రికార్డ్ కూడా బాబుగారి సొంతం!. వీటికి తోడు ‘‘అమలు చేసేశాం’’ అంటూ హడావిడితో జనాల్ని మభ్య పెడుతూ.. కాకి లెక్కలతో కాలం గడిపేస్తుంటారు. గత ఎన్నికల్లోనూ అప్పులతో ఏపీ శ్రీలంక అయిపోతోందని జగన్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి.. తీరా ఈ ఏడాదిన్నరలో 2 లక్షల 66 వేల కోట్ల అప్పులు చేసి సౌత్ సూడాన్లా మార్చేస్తున్నారు. అందుకే చంద్రబాబులా.. అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, జనాల్ని చీటింగ్ చేయడం తనవల్ల కాదంటూ జగన్ ఏనాడో తేల్చేశారు!.అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధి.. జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ చూసిన నిత్య చిత్రం ఇది. గ్రామస్థాయి పాలన మొదలుకుని రైతులతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు.. సకాలంలో ఆ పథకాల అమలు.. తద్వారా ప్రత్యక్ష లబ్ధిదారులకు నిధుల పంపిణీ.. విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు ఇలా అన్ని రంగాలపై దృష్టి పెట్టి విప్లవాత్మక నిర్ణయాలతో పరిపాలించారు. మరీ ముఖ్యంగా పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. మరి బాబుగారో..ఒకప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. ఎటూ తిరిగి ప్రజలకు తాను ఇచ్చిన వాగ్దానాల్లో చంద్రబాబు ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఆయన పని చేసేది పెత్తందారుల కోసమే. తనకో విజన్ ఉందని చెబుతూ పెట్టుబడుల కోసం పాకులాడడం, పరిశ్రమలు.. కంపెనీలు రాబోతున్నాయంటూ హడావిడి చేయడం.. అమరావతి పేరిట అంతర్జాతీయ రాజధానంటూ ఊహాలోకంతో జనాలను మాయ చేయడం.. ఇదే ఆయనకు తెలిసింది. సీఎంగా ఇన్నేళ్లలో అభివృద్ధి ప్రాజెక్టుల పేరు చెప్పుకుని ఆయన సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫలితంగా.. రైతుల నుంచి మొదలు అన్నివర్గాలు ఆయన చేతుల్లో మోసపోయి అవస్థలు పడ్డాయి.జగన్ పాలనలో ఏపీలో శాంతి భద్రతలు అదుపులో ఉండేవి. దిశ లాంటి చట్టం, యాప్‌తో మహిళలు భద్రంగా ఉండేవాళ్లు. ఆ ఐదేళ్లలో నేరాలు-ఘోరాలు పెద్దగా రికార్డు కాలేదు. సమత్యుల అభివృద్ధి కోసం మూడు రాజధానుల కోసం తీవ్రంగా ప్రయత్నించింది జగన్ ప్రభుత్వం. అయినా కూడా ఐదేళ్లపాటు జగన్ జన సంక్షేమ ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషం చిమ్మని రోజంటూ లేదు. ప్రజల్లో లేని భయాలు.. అపోహలు సృష్టించుకుంటూ వచ్చింది చంద్రబాబుకి బాకా ఊదే మీడియా.. టీడీపీ అనుకూల సోషల్ మీడియా. మరి ఇప్పుడు కూటమి పాలనలో ఏం జరుగుతోంది?..👉నవరత్నాలతో పేద, రైతు, మహిళ, వృద్ధులు, విద్యార్థులు.. ఇలా ప్రతీ వర్గానికి మేలు చేసింది ఎవరు?. అన్ని వర్గాలను మోసం చేసింది.. చేస్తోంది ఎవరు?.. సంక్షేమం పేరిట లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు జమ చేసింది ఎవరు?. తల్లికి వందనం.. నిరుద్యోగ భృతి.. సంక్షేమాన్ని ఎగ్గొడుతోంది ఎవరు?. ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇచ్చి మహిళా సాధికారతకు పెద్ద పునాది వేసింది ఎవరు?. డ్వాక్రా మహిళలను మోసం చేసింది ఎవరు?.. 👉రైతు భరోసా రూపంలో అన్నదాతకు ఆర్థిక సాయం.. ఆర్బీకేలతో అన్నివిధాలుగా ఆదుకుంది ఆదుకుంది ఎవరు?. అన్నదాత సుఖీభవతో మోసం చేస్తోంది ఎవరు?.. గిట్టుబాట ధర అందించడంతో పాటు బీమాలు, సకాలంలో పంట నష్టాలు అందించింది ఎవరు?. వ్యవసాయం దండగ అన్నది ఎవరు?.. గిట్టుబాటుధర లేక అల్లాడుతున్న రైతుల్ని గాలికొదిలేసింది ఎవరు?. 👉నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ బడులు బాగుచేసింది ఎవరు?.. వాటిల్లో ట్యాబులిచ్చి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను పేద పిల్లలకు అందించే ప్రయత్నం చేసింది ఎవరు?. అవే బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తొలగించింది ఎవరు?.. పిల్లలకు నాసిరకం బ్యాగుల్ని అందిస్తోంది ఎవరు?. 👉గ్రామ సచివాలయాల పేరిట ప్రజలకు ఒకే దగ్గర వివిధ సేవల్ని అందించింది ఎవరు?.. వలంటీర్ లాంటి వారధి వ్యవస్థను మోసం చేసి నిర్వీర్యం చేసిందెవరు?. క్యూల అవసరమే లేకుండా ఒకటో తేదీనే ఫించన్లు.. రేషన్‌ను డోర్‌డెలివరీ చేసింది ఎవరు?.. ఫించన్ హామీని నెరవేర్చకుండా.. లబ్ధిదారుల్లో కోతలు విధిస్తోంది ఎవరు?. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు విస్తరించింది ఎవరు?. విలేజ్ క్లినిక్స్.. ఫ్యామిలీ డాక్టర్‌తో ప్రజల వద్దకే వైద్యం చేర్చింది ఎవరు?.. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తోంది ఎవరు?.👉పేద, మధ్యతరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయి వైద్యం.. పిల్లలకు వైద్య విద్య కోసం మెడికల్ కాలేజీల కట్టించింది ఎవరు?.. ఇప్పుడు వాటిని ప్రైవేట్‌పరం చేస్తోంది ఎవరు?.. కరోనా కాలంలోనూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంది ఎవరు?.. కరోనా కాలంలో పొరుగు రాష్ట్రం పారిపోయింది ఎవరు?.. సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది ఎవరు?.. ఆ ప్రజల జీవితాల్ని పట్టించుకోనిది ఎవరు?.👉అసలు అభివృద్ధి చేసిందెవరు?.. ఆ అభివృద్ధిపై తప్పుడు ప్రచారాలు చేస్తూ.. క్రెడిట్ కొట్టేస్తుందెవరు?.. ఏపీని అన్ని రంగాల్లో దూసుకుపోయేలా చేసి.. కేంద్రం నుంచి అవార్డులు, పేరు ప్రఖ్యాతులు తెచ్చింది ఎవరు?.. ఇప్పుడు ఏపీని పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు మారుస్తోంది ఎవరు?. ఎవరిది సంక్షేమం.. ఎవరిది మోసం.. అబద్ధాలతో ఎల్లకాలం పాలించగలరా?.. ఏపీ ప్రజలు ఆ మాత్రం ఆలోచించలేరా?..కాకిలా కలకాలం కాదు.. హంసలా బతకాలంటారు పెద్దలు(చంద్రబాబు లాంటి వాళ్ల కాదు). నిబద్ధత కలిగిన నాయకుడంటే ఎలా ఉండాలో.. ఒక రాష్ట్రాన్ని ఎలా పాలించాలో.. జగన్ చూసైనా నేర్చుకోవయ్యా చంద్రబాబూ. నీ జీవితంలో కనీసం అలా ఒక్కరోజైనా పాలించగలవా?.. -
సోనియా గాంధీకి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రేవంత్ తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌ను అభినందిస్తున్న సోనియాగాంధీ. ఆరు గ్యారంటీల అమలు గురించి తెలుసుకున్నారా? అంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గ్యారెంటీలు, హామీల అమలు వదిలేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారంటూ లేఖలో దుయ్యబట్టారు.‘‘తెలంగాణ అభివృద్ధి పేరిట విజన్ డాక్యుమెంట్‌తో కొత్త పల్లవి అందుకున్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారెంటీలను గాలికి వదిలేశారా? 420 హామీలను మూసినదిలో కలిపేశారా? గతంలో ఇచ్చిన హామీలపై నిలబడాలి. లేదంటే ప్రజల ఆగ్రహం మీ పాలిట భస్మాసుర హస్తమవుతుంది. గ్యారెంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి. మోసానికి పాల్పడితే గుణపాఠం తప్పదు’’ అంటూ కిషన్‌రెడ్డి హెచ్చరించారు.‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికైనా కొత్త ఊహలు, కొత్త ఆశలు, కొత్త హామీలు కల్పించేముందు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఇచ్చిన మాట మీద నిలబడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా గ్యారంటీల పేరుతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి’’ అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తాం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్ధిని జగన్ ఐదేళ్లలోనే చేసి చూపించారని.. ఒక ప్రణాళికా బద్దంగా రూపొందిన విధానాలతోనే అది సాధ్యమైందన్నారు. ‘‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్ష తెలిసిన నేత జగన్. ప్రజల అభివృద్ధి కోసం పని చేసిన నేత. ప్రతి కుటుంబం తనదిగా భావించి వారి మేలు ఆశించారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే జగన్ పోరాటాలు చేస్తున్నారు’’ అని సజ్జల అన్నారు.‘‘2014లో అధికారంలోకి రాలేకపోయాం. నంద్యాల ఉప ఎన్నికలలో చంద్రబాబు చేయాల్సిన కుట్రలన్నీ చేశారు. అన్నీ ఛేదించుకుని 2019లో అధికారంలోకి వచ్చాం. మేనిఫెస్టోని ఖురాన్, బైబిల్, భగవద్గీత గా భావించిన నాయకుడు జగన్. ఐదేళ్ల తర్వాత మేనిస్టోని మళ్ళీ ప్రజల ముందుకు తీసుకెళ్లారు. ఇచ్చిన హామీలన్నీ అమలు వేశామో లేదో చెప్పమనిప్రజల్నే అడిగారు. మళ్ళీ అధికారంలోకి కచ్చితంగా వస్తాం. భారీ సీట్లతో గెలుస్తాం. ప్రజల్లో ఉండే నాయకుడు కాబట్టే జగన్‌కు ఆదరణ ఉంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మళ్లీ యాక్టివ్ అయ్యారు. తెలంగాణ భవన్లో నేడు(ఆదివారం, డిసెంబర్ 21) ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. ఈ భేటీలో పాల్గొనడానికి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్ నుంచి హైదరాబాద్ నందినగర్‌లోని నివాసానికి శనివారమే కేసీఆర్ చేరుకున్నారు. ఇవాళ జరగబోయే పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గాడిలోకి తెచ్చిన వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే కుట్రను చేస్తోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్.. దీనిపై క్షేత్రస్థాయిలో తిప్పికొట్టేందుకు ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించనున్నట్లు చెబుతోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గించడం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తెలంగాణ వ్యవసాయ, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ సాగునీటి కోసం మరో జల సాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నారని.. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించేందుకు కీలక చర్చ ఉంటుందని బీఆర్ఎస్ కీలక నేతల ద్వారా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ డౌన్ అయ్యిందని బీఆర్ఎస్ బలంగా భావిస్తోంది. ఈ క్రమంలో ఈ భేటీని పార్టీ కీలకంగా భావిస్తోందని సమాచారం. -
రేవంత్ హనీమూన్ ముగిసింది
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఆయన పాలన వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజల్లోకి వెళ్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రకటించారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగే బీఆర్ఎస్ కీలక నేతల సమావేశంలో కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలకు సంబంధించిన నిర్ణయం ఉంటుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని చెప్పారు. శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలు సహా పలు అంశాలపై మాట్లాడారు. రేవంత్ ఇంటిని బీజేపీ ఎంపీ రీ మోడల్ చేయించాడు ‘కాంగ్రెస్, బీజేపీ నడుమ లోపాయికారీ ఒప్పందం ఉంది, రేవంత్ ఓ కాలు కాంగ్రెస్‌లో మరో కాలు బీజేపీలో ఉంది. ఢిల్లీ తుగ్లక్ రోడ్డులో రేవంత్ ఇల్లును ఓ బీజేపీ ఎంపీ రీ మోడల్ చేయించాడు. ఢిల్లీలో బీజేపీ ఎంపీ దూబే గృహ ప్రవేశానికి రేవంత్ ఎందుకు వెళ్లాడో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు చెప్పాలి. సీఎం రమేశ్ వంటి వారికి రేవంత్‌రెడ్డి కాంట్రాక్టులు ఇస్తుంటే, బీజేపీ ఆయనకు అండగా నిలుస్తోంది. అఖిలేశ్ యాదవ్‌తో నా దోస్తీపై రామచందర్‌రావుకు బాధ ఎందుకు? పంచాయతీ ఎన్నికల ఫలితాల దెబ్బతో ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించకుండా మున్సిపల్ ఎన్నికలు జరిపే అవకాశాలు ఉన్నాయి.గ్రేటర్లో మున్సిపాలిటీల విలీనం అశాస్త్రీయంగా జరిగింది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లు చేయాలనేది రేవంత్ ఆలోచన. దేశ రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేయడం వంటి ప్రయోగాల జోలికి కేంద్రం వెళ్లకపోవచ్చు. ఉద్యమ ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి ప్రయోగాలు ఫలించవు..’అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్లో ఉన్నామనడం కామెడీ ‘కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టిన కడియం బీఆర్ఎస్లోనే ఉన్నామనడం పెద్ద కామెడీ. అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు ఆ ఎమ్మెల్యేలు చెప్పారు. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రేవంత్ రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేను ఫెయిల్ కాలేదు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఏడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. పార్లమెంటు ఎన్నికల్లో 50 శాతం, అసెంబ్లీ ఎన్నికల్లో 30 శాతం సీట్లు బీసీలకు ఇచ్చాం. ఫార్ములా ఈ, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులు డొల్ల అని రేవంత్‌కు అర్ధమైంది. ఆయన పాలన వైఫల్యాలకు ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలే సూచిక. రేవంత్‌రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటా.. రేవంత్ ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు. నేను మాత్రం రేవంత్‌రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటా. ఆయన మాదిరిగా కుటుంబసభ్యుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయను. ఇంట్లోని పిల్లలు, మహిళలు, మనవడి గురించి మాట్లాడను..’అని కేటీఆర్ స్పష్టం చేశారు.లైన్లు దాచేందుకే యూరియా యాప్బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజంసాక్షి, హైదరాబాద్: యూరియా కోసం రైతులు బారులు తీరే దృశ్యాలను దాచి పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మొబైల్ యాప్ విధానం తెస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనాన్ని బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచి పెట్టేందుకు కొత్తగా రైతు వ్యతిరేక విధానం తెస్తోందన్నారు. తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా ఎన్నికైన బీఆర్ఎస్ మద్దతుదారులను తెలంగాణ భవన్లో శనివారం కేటీఆర్ సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస ప్రణాళిక లేనందునే రాష్ట్రంలో ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల అవసరాల మేరకు వెంటనే యూరియాను సరఫరా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. యాప్‌ల పేరిట రైతులకు కొత్తగా సమస్యలు సృష్టించడం మానుకోవాలని హితవు పలికారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి కీలక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనబెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వ నిధులు ఏ నాయకుడి సొంత ఆస్తి కాదని, ప్రజల సొమ్ముకు నాయకులు ధర్మకర్తలు మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.గ్రామ పంచాయతీకి వచ్చే నిధులపై సర్పంచ్‌లు, పంచాయతీ పాలక మండలికి మాత్రమే సంపూర్ణ అధికారం ఉంటుందన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ప్రజా అవసరాలకు నిధులను ఖర్చు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు బీఆర్ఎస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా జరిగే పార్టీ కీలక నేతల సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, శాసనసభా పక్షంతో పాటు పార్టీ ఎంపీలు, నియోజకవర్గ ఇన్చార్జీలు తదితరులు కలిపి మొత్తంగా సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయానికి కేసీఆర్ వస్తుండటంతో ఆయన ప్రసంగంపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఈ ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్ పార్టీ సమావేశానికి హాజరు కానుండటం ఇదే తొలిసారి. ఆదివారం జరిగే సమావేశంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రమే కేసీఆర్ దంపతులు ఎర్రవల్లి నివాసం నుంచి నందినగర్ ఇంటికి చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరుల స్తూపం, జయశంకర్ విగ్రహానికి నివాళి అరి్పంచిన అనంతరం పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడతారు. ఏపీ జల దోపిడీపై పోరుబాట రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి, ఏపీ జలదోపిడీపై పోరుబాటకు ఆదివారం జరిగే సమావేశంలో కేసీఆర్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పథకంపై రేవంత్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంతో పాటు త్వరలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన తేదీని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన కరివెన రిజర్వాయర్ వద్ద ఈ సభ నిర్వహించే అవకాశముంది. అలాగే నదుల అనుసంధానం పేరిట ఏపీ ప్రభుత్వం జల దోపిడీ కోసం చేస్తున్న కుట్రలపైనా కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలపైనా క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన పోరాట రూపాలపైనా ఈ సమావేశంలో చర్చించి కార్యక్రమాలను ఖరారు చేసే అవకాశముందని అంటున్నారు. కవిత ఎపిసోడ్ సహా ఇతర అంశాలపై? పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘జనం బాట’పేరిట జిల్లా పర్యటనల్లో పార్టీ కీలక నేతలు లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత కుమార్తె కవిత అంశంలో కేసీఆర్ స్పందిస్తారా అనే ఆసక్తి పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ప్రభుత్వ నిర్ణయం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి వంటి అంశాలు ఈ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించే అవకాశముంది.ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడం, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ తదితర అంశాలపై పార్టీ వైఖరి ఎలా ఉండాలనే కోణంలోనూ దిశా నిర్దేశం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేయడంపై కూడా మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్‌పై స్పష్టత ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. -
బీఆర్ఎస్ హయాంలో జల వివాదాలపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరున లేదా జనవరి తొలివారంలో జరగనున్న శాసనసభ సమావేశాల్లో జలవివాదాలు–వాస్తవాలు అనే అంశంపై రోజంతా చర్చ జరిగే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో అధికారులు నివేదికతో సిద్ధంగా ఉండాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్. ఉతమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్లో నీటిపారుదలశాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) మొహమ్మద్ అంజాద్ హుస్సేన్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ కె.ప్రసాద్‌తో సమీక్షించారు.తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదలశాఖలో తీసుకున్న నిర్ణయాలతో కలిగిన నష్టాలపై నివేదిక ఉండాలన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి బరాజ్ కట్టకుండా మేడిగడ్డకు తరలించడం వల్ల కలిగిన నష్టాలను నివేదికలో పొందుపరచాలని ఆదేశించారు. కాళేశ్వరం బరాజ్‌లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చిన అంశాలను నివేదికలో చేర్చాలని సూచించారు.ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో రాష్ట్ర అవతరణ అనంతరం ఏపీకి 512 టీఎంసీలు కేటాయిస్తే తెలంగాణకు 290 టీఎంసీలు చాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించిన విషయాన్ని కూడా చేర్చాలని నిర్దేశించారు. పాలమూరు–రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీతోపాటు కృష్ణా బేసిన్లో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గత ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య వైఖరిని కూడా నివేదికలో పేర్కొనాలని మంత్రి ఉత్తమ్ నిర్దేశించారు. ‘బేసిన్లు లేవు... భేషజాలు లేవు’అంటూ మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించిన అంశాలతోపాటు నాడు ఏపీ సర్కార్‌తో జరిగిన చర్చలన్నీ నివేదికలో రికార్డు కావాలన్నారు. -
YS Jagan Birthday Special: జనం కోసం జగన్.. జగన్ కోసం జనం
హస్తిన దురహంకారం తలవంచమంది. ఆయన ఆత్మాభిమానం అది జరగదంది. ఢిల్లీ గద్దలు అక్రమ కేసుల కుట్రలు పన్నారు. ఆయన ధీరత్వం లొంగేది లేదంది. స్కామ్‌లు, స్కీమ్‌ల్లో మునిగిన చంద్ర బాబు సర్కార్.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఆయన ప్రజలకు ధైర్యం చెప్పడానికి అడుగేశారు. అప్పుడు మొదలైంది ప్రజా సంకల్ప యాత్ర. తమ కష్టాలను చెప్పుకుని ఆదుకోమంది అఖిలాంధ్ర జనసందోహం. ఆయన నేనున్నానని అభయం ఇచ్చారు. అప్పుడు పుట్టింది సరికొత్త చరిత్ర. నాడు బాబు కబంధ హస్తాల్లో గాడి తప్పిన పాలన.. బేలగా స్వాగతం పలికింది. ఆయన తొలి సంతకంతోనే సరిచేయడం మొదలుపెట్టారు.అప్పుడు మొదలైంది రాజన్న తనయుడు జగనన్న జన రంజక పాలన. క్షుద్ర రాజకీయాన్నే నమ్ముకున్న కూటమి మళ్లీ గద్దెనెక్కి గంతులేస్తోంది. ఆయన.. దిక్కుతోచని ఐదున్నర కోట్ల మంది ప్రజలకు అండ దండ అయ్యారు. అప్పుడు మొదలైంది మళ్లీ ఆటవిక పాలనపై జగన్ గర్జన. జనగర్జన. వ్యక్తిగా, పార్టీ అధినేతగా, ప్రభుత్వాధినేతగా, జన హృదయ నేతగా... ఆయన ప్రతి మలుపు లోనూ... ప్రతి గెలుపులోనూ, ప్రతి తలంపులోనూ ఉండేది ప్రజలే.వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కడే. తోడేళ్ల గుంపు చేసే వికృత రాజకీయాలను నిప్పులతో కడుగుతోన్న ఒకే ఒక్కడు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అవతల ఉన్నా.. తలవంచక తెలుగు పౌరుషాన్ని ప్రదర్శించిన ఒకే ఒక్కడు. కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి ప్రజాపాలనకి అర్థం చెప్పిన ఒకే ఒక్కడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించి.. అద్భుత పాలనా దక్షత ప్రదర్శించిన ఒకే ఒక్కడు. చంద్రబాబు ఆటవిక పాలనపై సమర గర్జన చేస్తోన్న ఒకే ఒక్కడు. మనిషికి, మంచికి, మాటకి ఏమాత్రం విలువలేని రాజకీయాల్లో.. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లే ఒకే ఒక్కడు. దేవుడి ఆశీస్సులు, ప్రజల అండ దండ ఉంటే చాలని నమ్మిన.. మాట తప్పని, మడమ తిప్పని ఒకే ఒక్కడు.వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దేశ రాజకీయాల్లో టార్చ్ బేరర్. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే.. ప్రయాణం మొదలు పెట్టాడు. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే.. అలవికాని కష్టాలను అనుభవించాడు. భరించాడు. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే.. అక్రమ కేసుల కుట్రలను ఎదుర్కొన్నాడు. ఎదిరించాడు. మాట తప్పడమే, మాయ చేయడమే పాలిటిక్స్ అయిపోయిన ప్రస్తుత రోజుల్లో... మాట తప్పని రాజకీయాలను దేశానికి పరిచయం చేశాడు. ఆ ఒక్కడే.. వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగాడు. ఆ ఒక్కడే వ్యక్తి నుంచి మహా శక్తిగా ఎదిగాడు. ఆ ఒక్కడే...దేశమంతా అబ్బుర పడేలా జనరంజక పాలన చేశాడు. వైఎస్ జగన్‌కి ఇదంతా ఎలా సాధ్యమైంది? వైఎస్ జగన్.. ఇంతటి ప్రజాకర్షక నాయకుడు ఎలా అయ్యాడు? జగన్మోహన్ రెడ్డి ఇంతటి దార్శనికత కలిగిన పాలకుడుగా ఎలా నిలిచాడు ? ప్రశ్నలు చాలానే ఉన్నాయి. సమాధానం మాత్రం ఒక్కటే. జగన్.. జనమంతా తన వాళ్లు అనుకున్నాడు. జనమంతా.. జగన్ తమ వాడు అనుకున్నారు.మాట తప్పని జగన్‌కి.. జనమే అండా దండా అయ్యారు. బాగోగులు పట్టించుకునే నాథుడు లేని జనానికి.. అన్నీ జగనే అయ్యాడు. నిజమైన నాయకుడు జనం కోసం ఎంత చేయగలడో జగన్ చేసి చూపించాడు. జగన్ గుండెల్లో జనం. జనం గుండెల్లో జగన్. ఇదంతా అంత తేలిగ్గా జరగలేదు. ఈ క్రమంలో ఎదురైన ఎన్నో కష్టాలను, నష్టాలను ప్రజలకిచ్చిన మాట కోసం చిరునవ్వుతో భరించాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. జగన్ ప్రజలనే నమ్ముకున్నాడు. ఆ జనం నువ్వే మా నమ్మకం అని జగన్‌ని అక్కున చేర్చుకున్నారు. ఈ అనుబంధానికి 16 ఏళ్లు దాటిపోయాయి.వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం. మహానేత ఇకలేడన్న నిజాన్ని దేశం జీర్ణించుకోలేకపోయింది. ప్రతి గుండె తల్లడిల్లిపోయింది. ఆ శోకాన్ని భరించలేని వందల గుండెలు ఆగిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి మరణ వార్త విని తట్టుకోలేక గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నేనున్నానన్న భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆయన తనయుడు, ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి. అంతటి దు:ఖంలోనూ ఆయన ఆలోచనంతా ప్రజలతోనే. నల్లకాలువ సాక్షిగా ఓదార్పు యాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు.వైఎస్సార్ మరణంతో తట్టుకోలేక ఆరు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి, అంత బాధలోనూ ఓదార్పు యాత్ర ప్రారంభించార వైఎస్. జగన్ ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చారు. రెండు విడతల యాత్రకు విశేష స్పందన రావడం పార్టీలో కొందరికి అసూయ కలిగించింది. అంతే..కొన్ని కాంగ్రెస్ కండువాలు కుతంత్రాలకు తెర తీశాయి. హస్తినకి లేనిపోనివి నూరి పోశాయి. ఓదార్పు యాత్రని వెంటనే ఆపేయాలని ఢిల్లీ నుంచి ఆదేశం. మాట ఇచ్చాక వెనక్కి తగ్గితే ఆయన వైఎస్సార్ తనయుడు ఎందుకవుతాడు?. పదవుల కన్నా ప్రజలకు ఇచ్చిన మాటే ముఖ్యం. 10 జనపథ్‌కు తేల్చి చెప్పేశారు వైఎస్ జగన్మోహన్రెడ్డి.సుఖాలు, హోదాలు, పదవులు. వీటన్నింటన్ని కన్నా.. ఎన్ని కష్టాలొచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడాలని తన తండ్రి నేర్పిన పాఠాన్ని గుండెల్లో దాచుకున్న తనయుడు.. ప్రజల కిచ్చిన మాటకే కట్టుబడి ఉండాలని నిర్ణయిం చుకున్నారు. ఓదార్పు యాత్రని యాథావిధిగా కొనసాగించారు. అటు కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను చీల్చే రాజకీయాలకు పదును పెట్టింది. అదే సమయంలో జగన్ ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అంతే.. కాంగ్రెస్ అధిష్టానం కుట్రలకు తెర తీసింది. చంద్ర బాబుతో కుమ్మకై అక్రమ కేసులు పెట్టించింది. దీంతో తనను నమ్ముకున్న ప్రజల కోసం, తండ్రి లక్ష్య సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు జగన్మోహన్రెడ్డికడప లోక్‌సభ నుంచి జగన్ వైఎస్సార్సీపీ తరపున అఖండ మెజార్టీతో విజయం సాధించారు. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడిన జగన్మోహన్రెడ్డికి ప్రజలు జేజేలు పలికారు. దీంతో... కాంగ్రెస్ నుంచి వైఎస్సార్సీపీలోకి రావడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే.. పదవులకు రాజీనామా చేసిన వాళ్లకు మాత్రమే వైఎస్సార్సీపీలోకి ఆహ్వానిస్తానని తేల్చి చెప్పారు జగన్. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడే బాధ్యత తీసుకున్నారు.18 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీకి, తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. దీన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేకపోయింది. అవకాశం కోసం కాచుకుని చూసింది. ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో ఉన్న జగన్‌ను విచారణకి అని పిల్చి సీబీఐతో అరెస్ట్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. జగన్‌ని అణగదొక్కితే దారికొస్తారని తప్పుడు లెక్కలేసింది. తలదించేది లేదన్నారు జగన్. ఉప ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని భారీ మెజార్టీతో గెలిపించారు ప్రజలు. తామంతా వైఎస్ జగన్ వెనకే ఉన్నామని ఉప ఎన్ని కల సాక్షిగా తేల్చి చెప్పారు.ఈ దేశంలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నప్పుడు.. దాన్ని భర్తీ చేయడానికి పుట్టిన రాజకీయ పార్టీలున్నాయి. పాలకుల మీద ప్రజావ్యతిరేకత పెరిగినప్పుడు.. దాన్ని క్యాష్ చేసుకోవడానికి పుట్టిన రాజకీయ పార్టీలున్నాయి. కులాల కేంద్రంగా పుట్టుకొచ్చిన పార్టీలున్నాయి. ఒక రాజకీయ పార్టీ తన ప్రయోజనాల కోసం సృష్టిస్తే.. ప్యాకేజీ కోసం బానిసిజం ప్రదర్శించే పార్టీలున్నాయి. కానీ.. ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే.. ప్రజలకిచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలో పుట్టింది. ఇచ్చిన మాటని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకూడదన్న చిత్తశుద్ధి నుంచి పుట్టుకొచ్చింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా...మడమ తిప్పకూడదన్న దృఢ నిశ్చయం లోంచి పుట్టుకొచ్చింది. మాట తప్పితే వచ్చే అధికారం వద్దని.. 2014లో ప్రతిపక్షంలోనే కూర్చున్న వైఎఎస్ జగన్.. దేశంలోని రాజకీయ పార్టీలకు కొత్త పాఠాలు నేర్పారు.2014 ఎన్నికలు.. జగన్‌ని సింగిల్‌గా ఎదుర్కొనే దమ్ము లేక.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా జగన్‌ని ఢీకొట్టే ప్రయత్నం చేశాయి. ప్రజలనే నమ్ముకున్న జగన్ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగారు. ప్రజలను మోసం చేయడంలో మాస్టర్స్ చేసిన చంద్రబాబు.. 6 వందలకు పైగా అలవి కాని హామీలను ప్రకటించి.. భ్రమలు కలిగించారు. గుజరాత్ అభివృద్ధి నమూనా కేంద్రంగా దేశవ్యాప్తంగా మోదీ మ్యానియా హల్చల్ చేస్తోన్న సమయం అది. రైతు రుణ మాఫీ హామీ ఇస్తే.. అధికారంలోకి రావడం ఖాయమని జగన్‌తో ఆయన శ్రేయోభిలాషులు చెప్పారు.కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. రైతు రుణమాఫీ చేసే స్థితిలో రాష్ట్ర ఆదాయం ఉండదు. హామీ ఇస్తే అధికారం వస్తుంది. కానీ.. మాట తప్పడం ఎలాగో, ప్రజలను మోసం చేయడం ఎలాగో జగన్‌కి తెలీదు. అందుకే.. మాట తప్పితే అధికారంలోకి వస్తామని తెలిసినా.. ప్రజలను వంచించి అందుకునే అధికారం వద్దంటూ రైతు రుణ మాఫీ హామీ ఇవ్వలేదు వైఎస్ జగన్. 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది వైఎస్సార్సీపీ. ఒంటరిగా పోటి చేసినా 67 అసెంబ్లీ స్థానాల్లో, 8 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. మాట తప్పడం, ప్రజలను మభ్య పెట్టడం ఇష్టం లేక అధికారాన్ని సైతం వదలుకున్న జగన్.. జన హృదయాలను మాత్రం సంపూర్ణంగా గెలుచుకున్నారు. తొలి రోజు నుంచే ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాటం మొదలుపెట్టారు వై.ఎస్. జగన్. రైతులను, డ్వాక్రా మహిళ లను రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ... ప్రజల పక్షాన ఉద్యమించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమబాట పట్టారు. నాటి సీఎం చంద్రబాబు కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి.. ప్రత్యేక ప్యాకేజీకి జై కొట్టాడు. ఏపీ భవిష్యత్తుని చీకట్లోలోకి నెట్టాడు. దీన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ భారీ ఎత్తున ఉద్యమించారు. జగన్‌ను బలహీనపర్చాలనే కుట్రలో భాగంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చంద్రబాబు తెరతీశారు. ప్రజాస్వా మ్యాన్ని వెక్కిరిస్తూ.. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు.. వారిలో కొందరిని క్యాబినెట్లోకి కూడా తీసుకున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వై.ఎస్.జగన్.. ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.స్కామ్‌లు చేస్తూ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగడం మీద దృష్టి పెట్టిన చంద్రబాబు...పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేశారు. దీంతో...ప్రజలకు ధైర్యం చెప్పడానికి, వాళ్ల కష్టాలు, సమస్యలు తెలుసు కోవడానికి ప్రజాసంకల్ప పాదయాత్ర మొదలుపెట్టారు తమ కష్టాలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తోన్న జగన్‌ని చూసి జనం చలించిపోయారు. జనం కోసం జగన్ కదిలితే.. జగన్ కోసం జనం పోటెత్తారు. తమ కష్టాలను కళ్లారా చూడటానికి, కన్నీళ్లు తుడవడానికి తమ ఊరికొచ్చిన రాజన్న బిడ్డని దీవించడానికి... జనం కెరటాల్లా ఎగసిపడ్డారు. కోట్ల మందికి భరోసా ఇవ్వడానికి ఒక్క జగన్. ఆ ఒక్కడిలో తమ అన్నని, కొడుకుని, మనవడుని, మామయ్యని చూసుకుని మురిసిపోయారు కోట్ల మంది ప్రజలు. రావాలి జగన్. కావాలి జగన్. ఈ పాట తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పాట మాత్రమే కాదు. సోషల్ మీడియా లో భాషలకు అతీతంగా, దేశాలకు అతీతంగా నెటిజన్స్‌ని ఫిదా చేసిన పాట. నిజానికి రావాలి జగన్. కావాలి జగన్ అన్నది ప్రజల గుండెల్లోంచి పుట్టుకొచ్చిన నినాదం. చంద్రబాబు రాక్షస పాలనలో అల్లాడుతోన్న కోట్ల మంది ప్రజల హృదయాంతరాల నుంచి వెల్లువలా ఎగసిపడిన నినాదమే రావాలి జగన్. కావాలి జగన్. తర్వాత కాలంలో ఆ నినాదమే పాటగా మారింది. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం అయిన వెంటనే...నాటి చంద్రబాబు ప్రభుత్వం విషం కక్కింది. ముద్దుల యాత్ర అంటూ చంద్రబాబు తన వంకర బుద్ధిని ప్రదర్శించారు. స్వచ్ఛంధంగా వచ్చిన జనం కాదన్నారు. తమ పాలనలో జరుగుతోన్న అభివృద్ధిని జగన్ చూడలేకపోతున్నారంటూ పైత్యాన్ని ప్రదర్శించారు. కానీ...వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాత్రం తన లక్ష్య సాధన దిశగా దూసుకుపోయారు. నాడు జగన్ మనసులో ఉన్నది ఒక్కటే. ప్రజలకు భరోసా ఇవ్వాలి. చంద్రబాబు అవినీతి పాలనలో, దుష్టపాలనలో నలిగిపోతున్న వారికి అండగా నిలవాలి. భవిష్యత్తు మీద వారికి ఆశ పోనివ్వకూడదు. వాళ్ల కోసం ఏం చేయాలో పూర్తిగా తెలుసుకోవాలి. ఆ దిశగానే ప్రజా సంకల్ప యాత్ర కదిలింది. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2,516 గ్రామాలను తాకుతూ 341 రోజులపాటు 3,648 కి.మీ. మేర కొనసాగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి బరిలోకి దిగిన జనసేన...2019 ఎన్నికల్లో టీడీపీని మళ్లీ గెలిపించడం కోసం కొత్త కుట్రలు పన్నింది. చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే కుతంత్రాలు చేసింది. ఎవరెన్ని వంచనలు చేసినా ఏపీ ప్రజలు మాత్రం తమకు, తమ రాష్ట్రానికి ఎవరు కావాలో ఒక నిర్ణయానికి వచ్చేశారు. 50 శాతానికి పైగా ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపిం చారు. 22 లోక్‌సభ స్థానాలిచ్చారు. టీడీపీకి తన చరిత్రలోనే ఎన్నడూ చూడనంత దారుణమైన ఓటమిని రుచి చూపించారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే పవన్ కళ్యాణ్‌ని రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుంచి సంక్షేమంలో, అభివృద్ధిలో ఏపీని దేశానికి ఆదర్శంగా నిలపెట్టడం మీద దృష్టి పెట్టారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. అప్పటి దాకా జగన్‌లో ప్రజలు ఆదర్శవంతమైన నాయకుడుని చూశారు. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక ఆయనలో అద్భుతమైన పాలకుడుని, దార్శనికుడుని చూశారు దేశ ప్రజలు. ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ఆలంబనగా నిలిచాడు. కరోనా రక్కసి వణికించినా అదరలేదు. సంస్కరణల పేరుతో తమ నడ్డి విరిచిన పాలకులను చూసి చూసి వేసారిన ప్రజల కోసం... సంక్షేమంలోనే సంస్కరణలు తెచ్చాడు. అభివృద్ధి పేరుతో తమ కళ్లకు గ్రాఫిక్స్ గంతలు కట్టిన పాలకులను చూసి బెంబేలెత్తిన ప్రజలకు.. నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాడు. పాల కులకు, ప్రజలకు మధ్య ఏర్పడిన దూరాన్ని చెరిపేశాడు. సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ పరుగులు పెడుతోన్న ఏపీని చూసి దేశమంతా అబ్బురపడి చూసేలా చేశాడు. జనరంజక పాలన అంటే ఎలా ఉంటుందో ఐదున్నర కోట్ల మంది ప్రజలకు అనుభవంలోకి తీసుకొచ్చాడు. 2019 నుంచి 2024 మధ్య వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సాగించిన పాలన...ఏపీకి స్వర్ణయుగం మాత్రమే కాదు. ప్రజల కోసం, భవిష్యత్తు తరాల కోసం, ఏం చేయాలో, ఎలా చేయాలో పాలకులకు పాఠాలు చెప్పింది జగన్ పాలన.దశాబ్దాలుగా విజనరీ ముసుగులో తెలుగు ప్రజలను మోసం చేస్తూ వచ్చిన నయవంచకుడు నారా చంద్రబాబు నాయుడు. అసలు విజన్ అంటే ఏంటో...దార్శనికత అంటే ఏంటో తన పాలనతో చూపిం చారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించే సమయానికి ఏపీ ఖజానా లో ఉన్న సొమ్ము కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే. ఐదేళ్ల పాటు స్కామ్‌ల స్కీమ్‌లతో లక్షల కోట్ల రూపా యల ప్రజాధనాన్ని దిగమింగిన చంద్రబాబు ఘనకార్యాల ప్రతిఫలం అది. అలాంటి అత్యంత క్లిష్టపరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టిన జగన్ పరిస్థితుల చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్న వేళే.. కరోనా దాడి చేసింది.ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వణికిస్తున్నపుడు... దేశం యావత్తూ భయాందోళనలు నిండి, ఆసు పత్రులలో బెడ్లు సైతం దొరక్క విలవిలలాడి నప్పుడు... అందరికీ ఒక దిక్సూచిలా కనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. పక్క రాష్ట్రాల నుంచి కోవిడ్ రోగులు సైతం నిబంధనలను గాలికొదిలేసి...మరీ ఏపీకి వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడకు వస్తే...ఇక భయం లేదని ప్రతి ఒక్కరూ భరోసా ఫీలయ్యారంటే కారణం... జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలు... పాలనను ప్రజలు ముగింటకి తీసుకువెళ్లాయి. పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని వాలంటీర్ వ్యవస్థతో సాకారం చేశారు జగన్.సంక్షేమం మీద దృష్టి పెడితే అభివృద్ధి సాధ్యం కాదు. డవలప్మెంట్ మీద ఫోకస్ పెడితే సంక్షేమ పథకాలు అమలు చేయడం కుదరదు. దశాబ్దాలుగా దేశంలో పాతుకుపోయిన ఇలాంటి సిద్ధాంతాల నడ్డి విరగ్గొట్టిన పాలకుడు జగన్మో హన్ రెడ్డి. సంక్షేమ పథకాలు అనగానే దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గుర్తుకొచ్చేలా చేశారు జగన్ అభివృద్ధి అనగానే దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా చేశారు జగన్. ఐదేళ్ల పాలనలో...జగన్ తీసుకొచ్చిన సంస్కరణల గురించి..., జగన్ ప్రారంభించిన విప్లవాత్మక మార్పుల గురించి..,జగన్ సాధించిన విజయాలు గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పన, సామాజిక న్యాయం, ఇలా చెప్పు కుంటూ పోతే ఆ జాబితాకి అంతే ఉండదు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలు చేరే సమయంలో... లంచాలకు తావు లేకుండా, ప్రజల ఆత్మగౌరవానికి ఇబ్బంది కలగకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా రూ.2 లక్షల 70 వేల కోట్లు జమ చేసిన పాలకుడు వైఎస్ జగన్తన పాలనతో జగన్ గ్రామాల స్వరూపాన్నే మార్చేశారు. 31 లక్షల ఇంటి స్థలాలను పంపిణీ చేశారు. 22 లక్షల ఇళ్లు నిర్మించారు. 73 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారు. డిజిటల్ క్లాస్రూమ్స్ని తీసుకొచ్చారు. నవరత్నాల నుంచి మొదలు పెడితే... అవినీతికి తావులేని స్వచ్ఛ మైన పారదర్శక పాలన వరకు... జగన్ మోహన్ రెడ్డి పాలన...అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. జగన్ పాలనలో ఆంధ్రప్ర దేశ్ ప్రధాన పారిశ్రామిక గమ్యస్థానంగా మారింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని కలిపి పరుగులు పెట్టించడం అంటే ఎలా ఉంటుందో ఇలా చేతల్లో, అంకెల్లో చూపించిన ఏకైక పాలకుడు జగన్మోహన్ రెడ్డి.ఐదేళ్ల పాలనలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా రూ.67,500 అందజేశారు జగన్మోహన్ రెడ్డి. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. సున్నా వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు నెలకొల్పారు. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019-24 మధ్య ఐదేళ్లలో అన్నదాతలకు ఏకంగా రూ.1 లక్షా 88 వేల 541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 1923లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉన్నవి కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే. అయితే వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. జగన్ పాలనలోనే ఏడు మెడికల్ కాలేజీలు సిద్ధమైయ్యాయి. ఐదు మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా మొదలైయ్యాయి. మరో 10 మెడికల్ కాలేజీల నిర్మాణం చాలా వరకు జగన్ పాలనలోనే పూర్తి అయింది. అలానే...వైజాగ్‌ని ఐటీ కారిడార్‌గా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో...ఇన్ఫోసిస్, టెక్ మహేంద్రా, హెచ్‌సీఎల్, రాండ్‌స్టాడ్, అమెజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజర సంస్థలు విశాఖ వైపు అడుగులు వేశాయి. అదానీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి పునాదులు జగన్ పాలనలోనే పడ్డాయి. ఉద్యోగ కల్పనలోనూ జగన్ అద్భుతాలు చేశారు. 2014 నుంచి ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా ? కేవలం 34 వేలు మాత్రమే. మరి...వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల తన పాలనలో కల్పించిన ఉద్యోగాలు ఎన్నో తెలు సా ? 6 లక్షల 31 వేల 906. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు తెలుగు రాష్ట్రాలను 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆ 17 మంది సీఎంలు చేయలేనిది జగన్ చేసి చూపించారు. జగన్ పాలనలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో పేదరికం బాగా తగ్గిందని స్వయంగా నీతి అయోగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. కాలం కఠినమైంది. ఐదున్నర కోట్ల మంది ప్రజలకి విషమ పరీక్ష పెట్టింది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అరాచకత్వానికి సరికొత్త నిర్వచనం చెబుతూ...ఆటవిక పాలన మొదలుపెట్టారు. ప్రజారంజక పాలనకి నిర్వచనం చెబుతూ జగన్ పాలన సాగిస్తే...ప్రజాకంటక పాలనకి సరికొత్త అర్థం చెబుతూ చంద్ర బాబు ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసింది. అటు అభివృద్ధి లేదు. ఇటు సంక్షేమం లేదు. లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏం చేస్తున్నారో తెలీదు. ఎన్నికల హామీల అమలు లేదు. అన్ని వర్గాల ప్రజలు కష్టాలక డలిని ఈదే దుస్థితి ఏర్పడింది. పాలకులే పగ పడితే దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోన్న కోట్ల మంది ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. నేనున్నాన్న భరోసా అందిస్తున్నారు. ప్రజాకంటక పాలన పై సమరశంఖం పూరించారు. -
టీటీడీ ఆస్తులకు రక్షణేది?: భూమన
సాక్షి, తిరుపతి: టీటీడీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. టీటీడీ పవిత్ర స్థలాన్ని 7 స్టార్ హోటళ్లకు ఇవ్వడం సరికాదన్నారు. దేవుడి ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.. ప్రజా సంఘాలు, హిందుత్వ సంఘాలు ఆందోళనలుచేపట్టాలని భూమన పిలుపునిచ్చారు.‘‘ఎర్ర చందనం చెట్లకు కొత్తగా నెంబర్లు వేస్తున్నారు. ఒక్కో చెట్టుకు రెండు నంబర్లు వేస్తూ మోసం చేస్తున్నారు. ఎర్ర చందనం దుంగుల్ని కాపాడతానన్న పవన్ ఎక్కడ?. ఏపీ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలి’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
‘పవన్ తన పార్టీ కార్యకర్తలను టీడీపీకి బానిసలుగా మార్చారు’
సాక్షి, తాడేపల్లి: పవన్ కల్యాణ్ తన పార్టీ కార్యకర్తలను టీడీపీకి బానిసలుగా మార్చారంటూ వైఎస్సార్సీపీ నేత వరికూటి అశోక్‌బాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ చర్యలను సొంత సామాజిక వర్గమే అంగీకరించటం లేదని.. డైవర్షన్ రాజకీయాల కోసమే ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అప్రజాస్వామికమన్నారు.‘‘తనను ఎవరూ పట్టించుకోవటం లేదనే అక్కసుతో ఏదేదో మాట్లాడుతున్నారు. తన గ్రాఫ్ పడిపోయిందని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు. దీన్ని డైవర్ట్ చేసేందుకు పవన్ కష్ట పడుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు?. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తానని జగన్ అంటే పవన్‌కు కోపం ఎందుకు?’’ అంటూ అశోక్‌బాబు నిలదీశారు.‘‘ప్రభుత్వ స్కూళ్లను కూడా చంద్రబాబు ప్రైవేట్ పరం చేయబోతున్నారు. దీనిపై కూడా పవన్ ఎందుకు మాట్లాడటం లేదు?. అదేమంటే దాడులు చేస్తామంటున్నారు. చెప్పులు చూపిస్తూ పవన్ పచ్చి బూతులు మాట్లాడారు. పోలీసు వ్యవస్థను తమ దుర్మార్గాలకు వాడుకుంటున్నారు. జగన్ హయాంలో దౌర్జన్యం, దుర్మార్గాలు జరగలేదు. కూటమి పాలనలోనే సోషల్ మీడియా యాక్టివిస్టులను సైతం అక్రమంగా అరెస్టు చేసి జైలు పాల్జేశారు...సినిమా పోస్టర్లు ప్రదర్శించినా జైల్లో పెట్టారు. దుర్మార్గపు పాలన అంటే ఇదీ. పవన్ చర్యలను చూసి సొంత సామాజిక వర్గమే మదన పడుతోంది. టీడీపీ వారికి బానిసత్వం చేయించటాన్ని వారు సహించలేక పోతున్నారు. ఇకనైనా పవన్ కళ్యాణ్ పద్దతిగా మాట్లాడితే మంచిది’’ అని అశోక్‌బాబు హితవు పలికారు. -
అపర చెగూవేరా.. ఆపవేందిరా..
మేం మళ్లీ వస్తే అంటూ కొందరు బెదిరిస్తున్నారు.. బెదిరించేవారికి ఈ సారు భయపడడు.. మేం నిర్ణయం తీసుకుంటే మీకు మళ్లీ ఆ మాటలు రావు.. ఓ సభలో తమను నమ్మి చక్కని పాలన అందిస్తారని ఓట్లేసిన ప్రజల ముందు మన పవన్ సార్ పెట్టిన ముచ్చట్లు.. ఎన్నికల సమయంలో సీట్లు అమ్ముకున్నట్లు తనను విమర్శించారని, యూపీ సీఎం యోగి తరహాలో ట్రీట్మెంట్ ఇస్తే అంతా సెట్ అవుతారు.. కాలుకు కాలు.. కీలుకు కీలు తీస్తే ఆకు రౌడీలు దారికొస్తారు.. సాక్షాత్తు మన పవన్ సార్ పెట్టిన మరో ముచ్చట.అయితే ఇన్నేసి మాటలంటూ.. కాలుకు కాలు కీలుకు కీలు తీస్తామని బెదిరించేవారిని ఏమంటారంటూ ప్రజల్ని ఆలోచనలో పడేసారు. అయినా ఇంత కరుకుగా ఎలా మాట్లాడగలిగారని నోళ్ళు నొక్కుకోవాల్సిన అవసరం లేదు.. సారంటే ఎవరనుకున్నారు.. నట పవరేశ్వరుడు. ఏమాటకామాట.. అతనో విలక్షణ నటుడు. ఏ పాత్రనైనా అవలీలగా చేసే సామర్థ్యం ఆయన సొంతం. తనది కాని పాత్రలోనూ అంతే సహజంగా ఇమిడిపోవడం అతని స్పెషాలిటీ. మొన్నమొన్నటి దాకా స్పాంటేనియస్ గా ఆవేశం వచ్చేది. ఇప్పుడేమో బూతులూ వస్తున్నాయి. అభిమానుల చప్పట్లకు పరవశించని నటుడుండడు కదా.. వీరూ అందుకు మినహాయింపు కానేకాదు. తనే ఓ సైన్యాన్ని కట్టి పార్టీ పెట్టి జన బాహుళ్యంలో చొచ్చుకుపోవాలని గతంలో విఫలయత్నం చేశారు. అయితే ఒక్కోసారి అదృష్టం కూడా దారితప్పుతుంది కదా.. అలా మన సారు గారికి పవర్ రావడంతో పవరేశ్వరుడి అవతారం ఎత్తారు.అసలే వెండితెర హీరో.. ఒంటి చేత్తో లారీలు లేపి ఆవల పడేసిన ధీరోదాత్తం ప్రదర్శించిన వారాయే. ఓట్ల పండగనాడు వారెంత వీరంగం వేశారని.. అబ్బో చూడ్డానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి. ప్రచారంలో ఆహా ఏం వాగ్దాటి.. ఆ.. ఏవన్నారు చూసి చదివారనా? సర్లేండి పేపర్లు పట్టుకునేవారు.. కళ్ళద్దాల్లోంచి తొంగి చూసి మరీ చదివేవారు.. అది కాదండీ మీరు చూడాల్సింది.. ప్రతి అయిదు నిమిషాలకోసారి పూనకం వచ్చినట్లు ఊగి రేగి చలరేగి పోయేవారు. అస్సలు ఆ కిక్ కోసమే కదా మేం కాళ్ళునొప్పెట్టేలా నిలుచుని మరీ చూసింది. మీరెన్నెన్ని అన్నా ఈసారి మన సారుకు బాగా వర్కవుట్ అయ్యింది. దెబ్బకు పెద్దసీట్లో పడ్డారు.. ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుందనమాట.సారు సినిమా రెండో భాగం ఇంకా సూపరు తెలుసా? అప్పుడే క్యారెక్టర్.. కాస్ట్యూములు మారిపోతాయి. అదెలా అదెలా అంటారేంటి సార్.. నటులకు ఆమాత్రం క్రియేటివ్ లిబర్టీ ఇవ్వరా ఏంటి? సరే మొన్నటి దాకా చెగువేరా అన్నారు. ఎర్రెర్రని జెండా ఎన్నీయల్లో అని స్టెప్పులేశారు.. గొంతుకు ఎర్ర తువాలు చుట్టుకున్నారు. మాటలో ఎరుపు అరువు తెచ్చుకున్నారు. ఇక ఎన్నికల్లో గట్టెక్కి సీట్లో సెటిలయ్యాక.. అడ్రస్ మారిస్తే ఎలా ఉంటుంది అని తెగ ఆలోచించారు. అదేమంటారు.. మేధోమథనం.. అదే అలా మదనపడీ పడీ.. సివరాఖరికి హిందూధర్మ పరిరక్షణోద్యమం అంటూ కాషాయం చుట్టేసుకుని నుదుటిపై పేద్ద బొట్టు పెట్టేసుకుని బొబ్బలు పెట్టడం మొదలెట్టారు. మొదట్లో కొందరు కంగారు పడిన మాట నిజవే. కానీ వెంటనే సర్దుకుని ఓహో క్యారెక్టర్ ఛేంజా అని సరిపెట్టుకున్నారు. ఎంతైనా వారి వెండితెర ప్రయాణంలో మమేకమైన అబిమానులం కదా ఆమాత్రం అడ్జస్టు చేసుకోలేమా ఏంటి? అని వ్యాఖ్యానించారు కూడా.అయినా సారు ఏ వేషం కట్టినా సరే.. ఆవేశం అస్సలు మిస్ చేయరు అదే బాగా నచ్చే విషయం. అపుడు చెగువేరా అని గర్జించారా.. ఇపుడు నా ధర్మం.. నా హిందుత్వ అంటూ గుండెలవిసేలా దిక్కులు పిక్కుటిల్లేలా ఘోషిస్తున్నారు. ఏదైనా అరుపే కదా మనకు కావల్సింది ఆ సౌండింగే కదా అందుకే పోనీలే పవరేశ్వరా ఈసారి ఇలా కానిచ్చేయ్ అంటూ అభిమానులు పచ్చజెండా బరబరా ఊపేసరికి సారువారు పొంగిపోయారు. అప్పట్నుంచి ఇదే బాపతు. అయినా దేశపెద్ద అండదండ తనకుందని.. ఇరు పెద్దల్ని కలిపిన పిల్లకాల్వలా తనకు ఎప్పటికైనా గుర్తింపు ఉండనే ఉంటుందని వారి గొప్ప నమ్మకం. అందుకే తాజాగా వారు తమదైన శైలిలో ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించారు. ఎందుకంటే అవసరం లేని చోట ప్రశ్నించడం వారి పురాప్రాప్త హక్కు కదా. అధికారంలోకి మళ్ళీ మేమొస్తే అని అన్నారో సహించం కాక సహించం అని గుడ్లురిమారు. బెదిరించే వారికి ఈ సారు అస్సలు భయపడడు.. రాజకీయంగా అనుకుంటే జస్ట్ 48 గంటల్లో అంతా క్లియర్ చేసేస్తాం అని హూంకరించారు. ఇక్కడ అర్థం కానిదేంటంటే...సారుకు కోపం ఎందుకొచ్చింది? ఎదుటి పార్టీవారేదో తమను బెదిరిస్తున్నారని.. సరే మరి మీరు బదులిచ్చిన ధోరణి ఎలా ఉంది? అది కూడా ఫక్తు బెదిరింపు ధోరణే కదా. ఈ మాత్రం దానికి మరీ అంతలేసి బిల్డప్పులు అవసురమా సార్. అసలు ఈపాటికే మీరు మీ పెద్దసారు చేయాల్సిందంతా చేస్తున్నారుగా.. ఇంకా తీగ లాగుడు ఎందుకు?పోనీ అలా అంటే వారేమైనా బెదురుతారా అంటే అదీ జరగదని మీక్కూడా తెలుసు. మరెందుకు పవరేశ్వర్ సార్ ఈ అనవసర రౌద్రు బీభత్స భయానక సమ్మిళిత డైలాగులు. దీనికన్నా కాస్త పాలన బెటర్‌గా చేయండి పదుగురు హ్యాపీగా ఫీలవుతారు. అంతేగానీ...రాక రాక వచ్చిందోచ్ నాకూ పవరూ అంటే ..అదేదో మీరన్నారే క్లియర్ చేస్తామని.. అంత రిస్క్ మీకెందుకు సార్.. మన ప్రజలున్నారుగా.. అయిదేళ్లు ఓపిక పట్టండి వారే క్లియర్ సేల్స్ బోర్డు పెట్టేస్తారు.-ఆర్ఎం -
రాజకీయాల్లోకి సినీ నటి ఆమని.. పార్టీలో చేరిక
ప్రముఖ సినీనటి ఆమని భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు మేకప్ ఆర్టిస్ట్ శోభలత పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడ ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆమని తమిళ సినిమా నిర్మాతను పెళ్లి చేసుకుని సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే, రీఎంట్రీలో పలు చిత్రాలతో బిజీగానే ఉన్నారు. ఈ ఏడాదిలో ఏకంగా 5 చిన్న సినిమాల్లో ఆమె నటించారు.తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న ఆమని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. సినీ రంగం నుంచి చాలామంది తమకు నచ్చిన రాజకీయ పార్టీలో చేరడం సహజమే.. కానీ, ఆమని బీజేపీలో చేరడం ప్రాధాన్యత ఉంది. సోషల్‌మీడియా వేదికగా ఇప్పటికే పలు సామాజిక అంశాల గురించి ఆమె మాట్లాడుతూనే ఉన్నారు. ఆమె వాయిస్ బీజేపీకి ఉపయోగపడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.ఆమని తెలుగు, తమిళ సినిమాల్లో రాణించారు. శుభలగ్నం, శుభసంకల్పం, శుభమస్తు, మావిచిగురు, ఘరానా బుల్లోడు, అమ్మ దొంగా వంటి భారీ హిట్ సినిమాల్లో నటించారు. ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ (1993) సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేశారు. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో ఆమెకు ఆఫర్స్ వరించాయి. బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి ఉత్తమ నటిగా నంది బహుమతిని అందుకున్నారు. ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. తమిళ సినీ నిర్మాత ఖాజా మొహియుద్దీన్ను పెళ్ళి చేసుకొని సినిమా రంగానికి దూరమైన ఆమని తిరిగి 2003లో రాంగోపాల్ వర్మ చిత్రం మధ్యాహాన్నం హత్యతో సినీ రంగప్రవేశం చేశారు. ఈమె భర్త నిర్మించిన చిత్రాలు విజయవంతము కాక ఆర్థిక ఇబ్బందులలో పడి 2005 జూలై 14న అత్మహత్యాప్రయత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులే ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కొంత కారణమని భావిస్తారు. -
జగన్ వ్యక్తిత్వంపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: తన ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజలకు ఎంత మేలు చేయాలో అంతా చేశారని.. మళ్ళీ అధికారంలోకి రాగానే చేయాల్సిన కార్యక్రమాలకు కూడా ప్లానింగ్ చేసుకున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం తాడేపల్లి కుంచనపల్లిలో జరిగిన వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సజ్జల.. భారీ కేక్ కట్ చేసి మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారంలో ఉన్నా లేకపోయినా జనం జగన్ వెంటే. ప్రజలకు మేలు చేసేది జగన్ ఒక్కడే. కోట్లాది మంది జగన్‌పై ఆ నమ్మకం పెట్టుకున్నారు. అందుకే తన ఐదేళ్ల పాలనలో అందరికీ మేలు చేశారు. ఎంతవరకు మేలు చేయాలో అంతవరకు చేశారు. రాజకీయాల్లో ఐదేళ్లు అనేది ఎక్కువేం కాదు. .. ఏదో ఆశించి జగన్ సహాయం చేయరు. తన వలన ఎంత మేరకు మేలు చేయాలా అనే నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. ఓదార్పు యాత్ర సమయంలో కూడా ఆయన ఎంతో సహాయం చేశారు. తన తండ్రి కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఆయన యాత్ర చేశారు. .. చాలా గొప్పగా సహాయం చేసినా ఆ విషయం బయటకు చెప్పుకోలేదు. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్. కరోనా సమయంలో కూడా క్వారంటైన్ సెంటర్ లో మంచి భోజనం పెట్టాలనీ, మంచి వైద్యం చేయించాలని తపన పడ్డారు. ప్రతి ఒక్కరినీ జగన్ తన కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కాలనీలే సృష్టించారు. 17 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, పోర్టులు, హార్బర్ లు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినా పబ్లిసిటీ చేసుకోలేదు.. .. చంద్రబాబు 18 నెలల్లోనే రూ.2.70 లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ జనాలకు చంద్రబాబు చేసిన మేలు ఏదీ లేదు. జగన్ మాత్రం తన ఐదేళ్ల పాలనలోనే ఆర్ధికవేత్తలు సైతం ఆశ్చర్యపోయేలా పాలన చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనేది కూడా ఆయన ఈపాటికే ప్లానింగ్ వేసుకున్నారు’’ అని సజ్జల అన్నారు. -
ఈ బుకాయింపు ఆత్మవంచన కాదా?
గజం మిథ్య ,పలాయనం మిథ్య అని అంటారు. అందరూ శ్రీవైష్ణవులే.. రొయ్యల బుట్ట మాయం అని మరో సామెత. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణలకు గురైన ఎమ్మెల్యేలకు సంబంధించి శాసనసభాపతి గడ్డం ప్రసాదకుమార్ ఇచ్చిన తీర్పును గమనిస్తే ఈ సామెతలు గుర్తుకు వస్తాయి. గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పవర్ వైపు నడిచే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారి మళ్లారు. వారిలో పలువురికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పీ మరీ ఆహ్వానించారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకున్నారు. అందరికి తెలిసిన ఈ సత్యం స్పీకర్‌కు తెలియకపోవడమే ఒక ప్రత్యేకత . ఆయనకు మాత్రం వీరు పార్టీ మారిన ఆధారాలు కనిపించలేదు. వారిపై అనర్హత వేటు అవసరం లేదని నిర్ణయించారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరైన దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ పక్షాన లోక్ సభ ఎన్నికలలో పోటీచేశారు. ఆయన స్పీకర్ ఇచ్చిన నోటీసుకు ఇంతవరకు స్పందించలేదు. బహుశా మరికొంతకాలం ఈ విచారణ తంతు సాగుతుందేమో తెలియదు. లేదా మరీ ఓపెన్ అయిపోయినందున కొద్ది కాలం తర్వాత ఆయన రాజీనామా చేస్తారా?లేక తప్పనిస్థితిలో అనర్హత వేటు వేస్తారా?అన్నది చూడాలి. మరో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యకు కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించుకుని ఆ పార్టీ తరపున ప్రచారం చేశారన్నది బహిరంగ రహస్యం. మాజీ స్పీకర్ పొచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన తర్వాత ఏకంగా ప్రభుత్వ సలహాదారు అయ్యారు. ఈయన విషయంలో ఇంకా నిర్ణయం రాలేదు. తెల్లం వెంకట్రావు, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,గూడెం మహీపాల్ రెడ్డి అరికపూడి గాంధీలకు సంబంధించి వారిపై అనర్హత వేటు వేయనవసరం లేదని స్పీకర్ తీర్పు ఇచ్చారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు యాదయ్య,సంజయ్ కుమార్ లపై కూడా నిర్ణయం రావల్సి ఉంది. దానం నాగేందర్ తప్ప మిగిలిన ఎమ్ఎల్యేలంతా తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని వాదించారు. ఈ పదిమంది ఎ మ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని భారత రాష్ట్ర సమితి గత ఏడాదిన్నరగా పోరాడుతోంది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ,జాప్యం చేస్తున్నారని హైకోర్టు ,సుప్రింకోర్టుల చుట్టూ తిరిగింది. చివరికి సుప్రింకోర్టు మూడు నెలలలో దీనిపై తేల్చాలని స్పీకర్ ను ఆదేశించడంతో ఈ నిర్ణయం అయినా వెలువడింది. న్యాయ వ్యవస్త ఈ మాత్రం అయినా పట్టించుకోకపోతే ,ఈ తంతగం ఐదేళ్లపాటు సాగుతుండేది.ఇలా జరగడం మొదటిసారి కాదన్నది వాస్తవమే. బీఆర్ఎస్ కు ఈ విషయంలో అర్హత లేదన్న కాంగ్రెస్ వాదనను తోసిపుచ్చలేం. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ తో సహా వివిధ విపక్షాల ఎమ్మెల్యేలు 38 మందిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అప్పట్లో ఆయన కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కండువాలు కప్పారు. ప్రస్తుత సి.ఎమ్. రేవంత్ కూడా అదే పనిచేశారు. విశేషం ఏమిటంటే ఆ రోజుల్లో ఫిరాయింపులకు వ్యతిరేకంగా రేవంత్ తదితరులు న్యాయ పోరాటం చేశారు.కాని అది కొలిక్కి రాకుండానే ఎన్నికలు వచ్చే శాయి. ఒక చిన్న తేడా ఉంది. అదేమిటంటే కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని,ఇతర పక్షాలను బీఆర్ఎస్ విలీనం చేసినట్లు అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ విడత విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా ఇద్దరు అనారోగ్యంతో మరణించారు.మిగిలినవారిలో పది మందే పార్టీ మారారు. అందువల్ల విలీన ప్రకటనకు అవకాశం లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నెలకు ఐదువేల చొప్పున శాసనసభ పక్షానికి విరాళం ఇస్తుంటే దానిని ఆ పార్టీ అంగీకరించిందని,అందువల్ల వారు బీఆర్ఎస్ వారే అనే చిత్రమైన కొత్త లాజిక్ ను రేవంత్ తీసుకువచ్చారు. దేశ వ్యాప్తంగా ఈ ఫిరాయింపులన్నవి ఒక సమస్యగా మారింది. బీజేపీ కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు వచ్చేలా చేసింది.అదే టైమ్ లో రాజ్యసభలో టీడీపీ ఎమ్.పిలు నలుగురిని బీజేపీలో విలీనం చేసుకుంది. ఇది కూడా అనైతికమే అయినా అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందుకు ఆమోదం తెలిపారు. సీనియర్ నేత, దివంగత శరద్ యాదవ్ ఒక సభలో వేరే పార్టీ సమావేశంలో పాల్గొన్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా ఆయనపై అతి వేగంగా వెంకయ్య అనర్హత వేటు వేశారు. ప్రభుత్వపక్షం నుంచి ఎవరైనా పార్టీ మారితే మాత్రం అధ్యక్ష స్థానంలో ఉన్నారు అలా స్పందిస్తారన్నమాట. ప్రతిపక్షం నుంచి ప్రభుత్వ పక్షంలోకి వస్తే ఇలాంటి విచారణలు,తీర్పులు వస్తుంటాయని అనుకోవాలి. వైఎస్సార్సీపీ ఎమ్.పి రఘురామకీష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓంబిర్లాను పదే,పదే కోరినా, కమిటీల విచారణ పేరుతో కాలయాపన చేశారేకాని అనర్హత వేటు వేయలేదని వైఎస్సార్సీపీ విమర్శిస్తుంటుంది.ఏపీలో చంద్రబాబు నాయుడు గత టరమ్ లో వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మేల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా న లుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయినా ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎవరిపై చర్య తీసుకోలేదు. కెసిఆర్ కూడా తొలి టరమ్ లో తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీలో ఉండగానే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. అయినా వీరిలో ఎవరికి ఏమీ కాలేదు. ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా రాజకీయ పార్టీలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయి. ప్రజలకు నీతి వచనాలు చెప్పవలసిన ప్రజాప్రతినిధులు తామే అబద్దాలు చెబుతూ చట్టవిరుద్దంగా వ్యవహరిస్తూ అప్రతిష్టపాలు అవడానికి సిద్దపడుతున్నారు తప్ప రాజీనామా చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజివ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఫిరాయింపుల నిరోదక చట్టం వచ్చింది.ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరు ఆయన కుమారుడైన లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాందీ తదితరులకు కూడా తెలుసు.అయినా వారు కూడా దీనిని ఆపడం లేదు.దాంతో కాంగ్రెస్ పార్టీ నైతిక హక్కు కోల్పోతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్యమంత్రి రేవంత్ సూచనల మేరకే పనిచేస్తున్నారని,తీర్పు రాజ్యాంగానికి అనుగుణంగా లేదని బిజెపి,బీఆర్ఎస్ లు విమర్శించాయి. కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది తప్ప నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. మన దేశంలో స్పీకర్లు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి ఉండడం లేదు.ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో అయ్యదేవర కాళేశ్వరరావు, బివి సుబ్బారెడ్డి,జి.నారాయణరావు వంటి గట్టి స్పీకర్ లు ఉండేవారు.అవసరమైతే వారు ముఖ్యమంత్రులుగా ఉన్నవారికి కూడా ఆదేశాలు ఇవ్వడానికి వెనుకాడేవారు. చాలావరకు స్వతంత్రంగా నిర్ణయాలు చేసేవారు.కాని ఆ తర్వాత కాలంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది.గతంలో కేఆర్ సురేష్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన కేసులో వారిపై అనర్హత వేటు వేశారు. కాకపోతే విచారణ పేరుతో ఆలస్యం చేశారన్న విమర్శ ఉంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ టైమ్ లో నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా ఉన్నప్పుడు వైఎస్సార్సీపీలో చేరిన ఎమ్మెల్యేలపై సకాలంలో అనర్హత వేటు వేయకుండా ఉప ఎన్నికలు రాకుండా చేశారన్న విమర్శ ఉంది. ఇలా స్పీకర్లు ఆయా పరిస్థితులను బట్టి,పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రులుగా ఉన్నవారి నిర్ణయాలను బట్టి వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. ఈ విషయాలలో వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు మినహాయింపు ఇవ్వాలి. ఆయన కాంగ్రెస్ ను వీడి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్న తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీచేసి మళ్లీ గెలిచారు. అలాగే తన పార్టీలోకి రాదలచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారే తప్ప, అనైతికంగా వ్యవహరించలేదు. ఇప్పుడు ఆ సంప్రదాయం పాటించేవారు అరుదుగానే ఉంటున్నారని చెప్పాలి. ఈ ఫిరాయింపులకు పరిష్కారం వెదకవలసి ఉంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణ రాగానే మూడు నెలలు లేదా ఆరు నెలల్లో నిర్ణయం తీసుకునేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నది ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. లేదా ఎన్నికల కమిషన్ దీనిపై నిర్ణయం తీసుకునేలా అధికారం ఇవ్వాలన్న సూచన ఉన్నప్పటికీ, అది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే వింటోందన్న విమర్శలు ఉన్నాయి.ఏది ఏమైనా ఈ ఫిరాయింపుల సమస్యవల్ల మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలలో పలచన అవుతున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే తన అనర్హత పిటిషన్ ను కొట్టివేశాక ఒక వ్యాఖ్య చేశారు. పాలకు,పాలు, నీళ్ళకు నీళ్లు మాదిరి తేలిందని అన్నారు. కాని వాస్తవం వేరు. పాలల్లో నీళ్లు కలిశాయన్నది వాస్తవం. కండువా కప్పించుకున్నారన్నది బహిరంగ రహస్యం. దానిని ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బుకాయించడం అంటే అది ఆత్మవంచన కాకుండా మరేమవుతుంది? - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సర్పంచ్ ఎన్నికలు.. 18 మంది ఎమ్మెల్యేలపై రేవంత్ సీరియస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు దాదాపు విజయం సాధించారు. అయితే, పంచాయతీ ఎన్నికలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష చేపట్టారు. ఈ క్రమంలో పలు జిల్లాల నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయమై సీఎం రేవంత్ సహా నేతలు సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా వరంగల్, పాలమూరు, నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలకు పీసీసీ క్లాస్ ఇచ్చినట్టు తెలిసింది. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికల సందర్భంగా రెబల్స్‌ను బుజ్జగించకపోవడం.. సొంత బంధువులకు టికెట్ ఇచ్చి పార్టీకి నష్టం చేశారంటూ సీరియస్ అయినట్టు తెలిసింది. కాగా, భవిష్యత్‌లో ఇది రిపీట్ అయితే ఉరుకునేది లేదని సీఎం రవంత్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు.. ఎల్లుండి మధ్యాహ్నం పీసీసీ ఛీఫ్, మంత్రులతో సీఎం లంచ్ మీటింగ్ ఉండనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను నేతలు విశ్లేషించుకోనున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అలాగే, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.హస్తం జోరు.. ఇదిలా ఉండగా.. తెలంగాణలో మూడు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పల్లెల్లోనూ ఘనవిజయాన్ని సాధించి జయకేతనం ఎగురవేసింది. మూడు విడతల ఫలితాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ సుమారు 56 శాతం స్థానాలను కైవసం చేసుకుని తన తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంది. తొలి, రెండో దశ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ.. మూడో విడతలోనూ అదే జోరును ప్రదర్శించింది. మూడో విడతలో 4,159 స్థానాలకు గాను 2,286 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 1,142 స్థానాలతో సరిపెట్టుకోగా.. బీజేపీ 242 స్థానాల్లో, సీపీఐ 24, సీపీఎం 7, ఇతరులు 479 స్థానాల్లో గెలుపొందారు.రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఎన్నికలు జరగగా.. ఒక్క సిద్దిపేట జిల్లా మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,733 పంచాయతీ సర్పంచి పదవులకు గాను.. తుది లెక్కల ప్రకారం కాంగ్రెస్ 7,010 స్థానాల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ మద్దతుదారులు మొత్తం 3,502 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 688 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి కీలక జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్లింది. మూడో విడతలో అత్యధికంగా 85.77 శాతం పోలింగ్ నమోదైంది. మూడు విడతలు కలిపి రాష్ట్ర సగటు పోలింగ్ 85.30 శాతంగా నమోదైంది. -
ఎంత ధైర్యం?.. పుతిన్ ముందే అలా చేస్తావా?
ప్రపంచంలో శక్తివంతమైన నేతల్లో వ్లాదిమిర్ పుతిన్ ఒకరు. ఆయన అలవాట్లు.. మేనరిజం.. ప్రోటోకాల్.. అన్నీ ఎంతో ప్రత్యేకంగానే ఉంటాయి. అలాంటిది ఆయన సమక్షంలో ఓ యువకుడు.. తన ప్రియురాలికి ప్రపోజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి ఆ ప్రపోజల్‌కు ఆ యువతి ఏం చేసింది.. దానికి పుతిన్ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా?.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025 ఏడాది ముగింపు నేపథ్యంతో.. విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రిపోర్టర్లు పలు ప్రశ్నలు అడగ్గా.. దానికి పుతిన్ బదులిస్తూ వచ్చారు. ఈ క్రమంలో కిరిల్ బజానోవ్ అనే 23 ఏళ్ల యువ జర్నలిస్టు వంతు వచ్చింది. ‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని ప్లకార్డును పట్టుకున్న అతను.. పుతిన్ ముందే తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ‘నా స్నేహితురాలు దీన్ని చూస్తోంది. ఓల్గా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో.. నేను నీకు ప్రపోజ్ చేస్తున్నా’ అని అన్నాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వులు చిందించారు. వెంటనే ఆ ప్రాంగణంలోని వారంతా చప్పట్లు కొట్టారు. ‘Vladimir Vladimirovich, Breaking News’ — host interrupted Putin‘She said yes’ — Kirill Bazhenov’s girlfriend accepted the proposalPreviously journalist proposed in the middle of the live Q&A pic.twitter.com/WI1PMftowG— RT (@RT_com) December 19, 2025అనంతరం అతడు.. రష్యాలో జీవన వ్యయం పెరగడంపై ఆందోళన వ్యక్తంచేశాడు. తాను, తన స్నేహితురాలు ఎనిమిదేళ్లుగా కలిసి ఉంటున్నామని అయితే, విస్తృత ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పెళ్లి చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు పుతిన్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇక, సమావేశం కొనసాగుతుండగా.. ప్రోగ్రామ్ హోస్ట్ కీలక ప్రకటన చేశారు. జర్నలిస్టు కిరిల్ బజానోవ్ ప్రపోజల్‌ను అతడి స్నేహితురాలు అంగీకరించినట్లు తెలిపారు. దీంతో పుతిన్‌తో సహా అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తంచేస్తూ చప్పట్లు కొట్టారు. అయితే కిరిల్ లాంటి యువ కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్.. విరాళాల రూపంలో అయినా ఇలాంటి పెళ్లిళ్లకు సాయం అందించాలని పిలుపు ఇచ్చారు. ఈ సమయంలో తమ పెళ్లికి రావాలంటూ కిరిల్ రష్యా అధినేతను ఆహ్వానించగా.. ఆయన నుంచి ఎలాంటి బదులు రాలేదు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. -
విజయ్‌కు డీఎంకే మాస్టర్ స్ట్రోక్!
తమిళనాడు ఎన్నికలకు పట్టుమని ఆరు నెలల సమయం లేదు. దీంతో ప్రధాన పార్టీల నడుమ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా లేదంటే సంక్రాంతి లోపే ఏయే పార్టీలు, ఎవరెవరితో పొత్తులో కొనసాగుతాయో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగానే..కరూర్ ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్.. అధికార డీఎంకేపైనే ఫుల్ ఫోకస్ పెడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మొన్న పుదుచ్చేరి.. నిన్న ఈరోడు బహిరంగ సభల్లో ఆయన చేసిన విమర్శలే అందుకు నిదర్శనం. ఈ క్రమంలో.. గురువారం ఈరోడులో జరిగిన టీవీకే ‘మక్కల్ సందిప్పు’బహిరంగ సభలో విజయ్ మాట్లాడుతూ.. డీఎంకే ఓ దుష్ట శక్తి అని, టీవీకే స్వచ్ఛమైన శక్తి అని వ్యాఖ్యానించారు. 2026 ఎన్నికల్లో ఈ రెండింటి మధ్యే పోటీ అన్నారు. అయితే.. ‘‘ఎంజీఆర్, జయలలిత డీకేంను తీవ్రంగా విమర్శించారని, వారు ఎందుకు అంతగా విమర్శించారో అప్పట్లో నాకు తెలియలేదు. వారు చెప్పిందే నేనిప్పుడు చెబుతున్నా. డీఎంకే దుష్టశక్తి, టీవీకే స్వచ్ఛమైన శక్తి. టీవీకే అంటే డీఎంకేకు భయం పట్టుకుంది. నా గురించి 24 గంటలూ ఆలోచిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. కానీ డీఎంకే ప్రభుత్వం దానిని మూసి పెడుతోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత నేనేంటో తెలుస్తుంది. సెంగోట్టైయ్యన్ మనతో కలిసిపోవడం గొప్ప బలం’’ అని విజయ్ ప్రసంగించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా చెన్నై ఎయిర్‌పోర్టులో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. ‘‘విజయ్‌ని ఏనాడైనా ఇలా అడిగారా?.. ముందు అసలు ఆయన్ని మీ ముందు మాట్లాడించండి’’.. అని మీడియాకే చురక అంటించారాయన. ఈలోపు.. ఆయన మరో దారిలో విజయ్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జోరందుకుంది.ఖాకీ ఫేమ్ వినోద్ డైరెక్షన్లో విజయ్ ‘జన నాయగన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఇది ఆయన చివరి చిత్రంగా ఓ ప్రచారం సాగుతోంది. దీంతో.. అభిమానులు ఈ సినిమాను గ్రాండ్ హిట్ చేసి విజయ్‌కు సెండాఫ్ ఇవ్వాలని భావిస్తున్నారు. పొంగల్ కానుకగా జనవరి 9వ తేదీన ఈ చిత్ర రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది కూడా. అయితే..ఎలాంటి క్లాష్ లేకుండా.. మిగతా చిత్రాలు రిలీజ్ అవుతాయనుకున్న టైంలో కోలీవుడ్‌లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పటికే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న ‘పరాశక్తి’.. జనవరి 14వ తేదీ నుంచి 10వ తేదీకి ముందుకు జరిగింది. ఈ ప్రీపోన్ నిర్ణయం విజయ్ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. ఇది చాలదన్నట్లు.. మరో స్టార్ నటుడు అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మంకత్త (తెలుగు డబ్ మూవీ గ్యాంబ్లర్)ను దాదాపుగా ఆ టైంలోనే రిరీలీజ్ కాబోతోంది. అయితే.. ఈ రెండు నిర్ణయాల వెనుకా ఉదయ్‌నిధి హస్తం ఉందనే ప్రచారం ఇప్పుడు జోరుగా నడుస్తోంది అక్కడ..సుధా కొంగర డైరెక్షన్లో తెరకెక్కిన పరాశక్తిలో శివకార్తీకేయన్, జయం రవి, అధర్వ, శ్రీలీల, రానా దగ్గుబాటి లాంటి స్టార్‌కాస్టింగ్ ఉంది. ఈ చిత్ర నిర్మాత ఆకాశ్ భాస్కరన్ ఉదయ్‌నిధికి అత్యంత సన్నిహితుడు కూడా. ఈ కారణంగానే ఆకాశ్‌పై ఈడీ దాడులు జరిగాయని అప్పట్లో జోరుగా చర్చ నడిచింది. కాబట్టి.. ఉదయ్‌నిధి కోరిక మేరకే పరాశక్తి ప్రీపోన్ జరిగిందనే బలమైన ప్రచారం మొదలైంది. అలాగే.. అజిత్ మంగథాను నిర్మించింది సన్ పిక్చర్స్. అది స్టాలిన్ కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థ అని తెలిసిందే. అలా విజయ్ చివరి సినిమా కలెక్షన్లకు గండికొట్టేందుకు.. ఉధయ్నిధి ఆధ్వర్యంలో డీఎంకే ఇలాంటి మాస్టర్‌స్ట్రోక్ ఇచ్చారని చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంలో వాస్తవమెంత అనేది పక్కన పెడితే.. దానికి విజయ్ అభిమానులు ఇస్తున్న కౌంటర్లతో సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోందక్కడ. -
నేనే సీఎం... అలాగని రాసిచ్చారా?
కర్ణాటక: అసెంబ్లీలో చివరిరోజు శుక్రవారం సీఎం సిద్ధరామయ్య, ప్రతిపక్ష నేత అశోక్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మున్ముందూ తానే సీఎంగా కొనసాగుతానని సీఎం సిద్ధు అనగా..అలాగని రాసిచ్చారా అంటూ అశోక్ కౌంటరిచ్చారు. ఉత్తర కర్ణాటక ప్రాంత అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ రెండున్నరేళ్లకు మాత్రమే ముఖ్యమంత్రి స్థానం అనే నిర్ణయం కాలేదని, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీర్మానిస్తే మున్ముందు కూడా తానే కొనసాగుతానని, హైకమాండ్ తనకు అండగా ఉందని అన్నారు. ఇందుకు ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ జోక్యం చేసుకుంటూ .. ‘మేమంతా బ్రహ్మ వద్ద ఎక్కువ సేపు ఉండకుండా విడిచి వచ్చేశాం. సిద్ధరామయ్య మాత్రం బ్రహ్మ వద్ద కూర్చొని 2013 నుంచి 2018 వరకు ఐదు సంవత్సరాలూ ముఖ్యమంత్రిగా ఖరారు చేసుకుని రాయించుకుని వచ్చారు. ప్రస్తుతం మాత్రం రెండున్నర సంవత్సరాలు రాసిచ్చార’ంటూ ఎద్దేవా చేశారు. ఇది మీకు ఎలా తెలిసిందని సిద్ధు ప్రశ్నించగా... ‘మీరు అధికార మారి్పడి గురించి ఢిల్లీ విమానం ఎక్కి వెళ్లిన నాటి నుంచి తీర్మానం అయ్యే వరకు కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి నాకు ఫోన్ ద్వారా సమాచారం వస్తుండేది. మీకు రెండున్నరేళ్లనని గడువు రాశారు. దానితో సరిపెట్టుకోవాలి’ అని అన్నారు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య తమది హైకమాండ్ ఉన్న పార్టీ అని, తొలిసారి కాలావధికి ఐదేళ్లు అధికారాన్ని పూర్తి చేశానని, ప్రస్తుతం హైకమాండ్ తనకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఇన్ని సమస్యల మధ్య కూడా మీరు సమరి్థంచుకోవటాన్ని మెచ్చుకోవాలని బీజేపీ సభ్యులు అరగ జ్ఞానేంద్ర, వి.సునీల్‌కుమార్ తదితరులు ఎద్దేవా చేశారు. బీజేపీలో యడియూరప్పను అధికారం నుంచి తొలగించింది ఎందుకని సిద్ధు ప్రశ్నించారు. అశోక్‌కు ప్రతిపక్ష నాయకుడిగా ఐదేళ్లు పూర్తి చేసే విశ్వాసముందా అని సవాల్ చేశారు. అశోక్ ఐదేళ్లూ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారని, ఆ విషయంలో తమకు గ్యారెంటీ ఉందని, మీకు ఐదేళ్లూ ముఖ్యమంత్రిగా ఉంటాననే విశ్వాసం ఉందా అని సునీల్‌కుమార్ ప్రశ్నించారు. ‘శాసనసభా పార్టీ సమావేశంలో నన్ను ఎంపిక చేశారు. అదే ప్రకారం ముఖ్యమంత్రి అయ్యా. హైకమాండ్ తీర్మానించినట్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. రెండున్నరేళ్లు అంటూ మాలో ఎలాంటి తీర్మానమూ కాలేద’ని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. మంత్రి కేజే జార్జ్ మాట్లాడుతూ తమ పార్టీ విషయాలు బీజేపీ వారికి ఎందుకని ప్రశ్నించారు. సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్‌పాండే మాట్లాడుతూ రెండున్నరేళ్లలో అధికార మారి్పడి అంటూ తీర్మానం కాలేదు.. అనవసరమైన చర్చ ఎందుకన్నారు. -
మనదేం లేదు.. టీడీపీ నేతలదే పెత్తనం
సాక్షి, అమరావతి: ‘‘మనం గెలిచిన నియోజకవర్గాల్లో సైతం టీడీపీ నేతలే పెత్తనం చేస్తున్నారు.. ఇలాగే కొనసాగితే క్షేత్రస్థాయిలో జనసేన బలోపేతానికి అవసరమయ్యే కమిటీ నిర్మాణం సమర్థవంతంగా చేపట్టే పరిస్థితి లేదు’’ అంటూ జనసేన ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఎదుట వాపోయారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్రం కార్యాలయంలో జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ), దేవ వరప్రసాద్ (రాజోలు), లోకం నాగమాధవి (నెలిమర్ల), గిడ్డి సత్యనారాయణ(పి.గన్నవరం), పంతం నానాజీ(కాకినాడ రూరల్), సీహెచ్ వంశీకృష్ణ (విశాఖ సౌత్), నిమ్మక జయకృష్ణ(పాలకొండ), పంచకర్ల రమేష్ బాబు(పెందుర్తి), సుందరపు విజయ్ కుమార్ (యలమంచిలి)తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో జనసేనపార్టీ పరిస్థితి గురించి పవన్ కళ్యాణ్ ప్రశి్నంచినప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జనసేన ఉనికి సైతం ప్రమాదంలో పడేలా ఉందని వాపోయినట్లు భోగట్టా. టీడీపీ నేతలు పెత్తనం చేస్తుండడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో జనసేన నాయకులు పనులు చేయించేకునేందుకు టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారని అధినేతకు వివరించినట్టు సమాచారం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో కనీసం సగం సీట్లు అయినా జనసేనకు ఇచ్చే పరిస్థితి ఉండడంతో పాటు ఆ మేరకు స్పష్టమైన హామీ ఉంటే గానీ గ్రామస్థాయిలో బలమైన పార్టీ కమిటీలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదని అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వివరించినట్టు సమాచారం. ఈ సందర్భంగా అధినేత పవన్‌కళ్యాణ్ స్పందిస్తూ, అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని, అయితే జనసేన ఎమ్మెల్యేలు సైతం నియోజకవర్గాల్లో కూటమి నేతలతో సఖ్యతతో ఉండాలని సూచించినట్టు సమాచారం. నియోజకవర్గాల్లో టీడీపీ నేతలతో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించుకుంటూ మిగిలిన రెండు కూటమి పార్టీల నేతలతో నిబద్ధతతో కలిసి పని చేయాలని పవన్‌కళ్యాణ్ సూచించినట్టు సమాచారం.ఆ ప్రతిపాదనలు నాకివ్వండి.. మరోవైపు అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిస్థితిపై వాకబు చేశారు. దీనిపై ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పెండింగ్ సమస్యల పరిష్కారంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు అధికారులు నిధులు లేవంటున్నారని తెలిపారు. అలాంటి వాటికి అవసరమైన ప్రతిపాదనలు తనకు నేరుగా అందజేస్తే వాటిని తానే సీఎం చంద్రబాబుకు అందజేసి, ప్రత్యేక నిధులు కోరతానని పవన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అవినీతి కార్యక్రమాల ద్వారా పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించవద్దంటూ అధినేత స్పష్టం చేసినట్లు సమాచారం. -
కాంగ్రెస్ ఉంటే.. ప్రోగ్రెస్ ఉండదు
సిరిసిల్ల: కాంగ్రెస్ ఉంటే.. ప్రోగ్రెస్ ఉండదని.. రెండేళ్లలో ఒక్క పనైనా చేశారా? వచ్చేది మన ప్రభుత్వమే.. మళ్లీ కేసీఆరే సీఎం అని.. ఎగిరేది గులాబీ జెండాయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా ఎన్నికైన బీఆర్ఎస్ మద్దతుదారులకు శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణభవన్‌లో ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నారని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే, నైతికత ఉంటే బీఆర్ఎస్ నుంచి అక్రమంగా చేర్చుకున్న ఆ పది మంది ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.అప్పుడు ప్రజలు ఏవైపు ఉన్నారో నిర్ణయిస్తారని, దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డి మాట మార్చడంలో సిద్ధహస్తుడని విమర్శించారు. ‘హైదరాబాద్ ప్రెస్మీట్లో రేవంత్‌రెడ్డి మొదట కాంగ్రెస్ 66 శాతం గెలిచిందని, ఇది ప్రభుత్వంపై ప్రజల ఆశీర్వాదమని గొప్పలు చెప్పారు. కానీ సరిగ్గా ఐదు నిమిషాలకే మాట మార్చి.. ఇవి స్థానిక అంశాలపై జరిగిన ఎన్నికలని, ప్రభుత్వానికి సంబంధం లేదని తప్పించుకున్నారని వివరించారు.పచ్చి అబద్ధాలు ఆడుతున్నారుఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి వంటి వారు కేవలం గడ్డిపోచ లాంటి పదవుల కోసం ఇంతలా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటని చెప్పారు. ‘బయట కాంగ్రెస్‌లో చేరామని మైకుల్లో ప్రగల్భాలు పలికి, ఢిల్లీలో రాహుల్‌గాంధీ కండువా కప్పారని చెప్పుకున్న ఈ పెద్ద మనుషులు.. ఇప్పుడు స్పీకర్ విచారణలో మాత్రం తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. పదవుల కోసం సూరు పట్టుకొని గబ్బిలాల్లా వేలాడుతున్న వీరి బతుకులు పూర్తిగా ఆగమైపోయాయి’అని మండిపడ్డారు. సీఎం ఒత్తిడితో స్పీకర్ కూడా ఆధారాలను పక్కన పెట్టి అబద్ధాలు చెప్పాల్సిన దుస్థితికి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెప్పారురైతులు, మహిళలు, బీసీలను మోసం చేసినందుకే ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో 117 పంచాయతీలకు 80 చోట్ల బీఆర్ఎస్ గెలవడమే దీనికి నిదర్శనమన్నారు. సీఎం, మంత్రులు జిల్లాలు తిరిగినా, బెదిరించినా ప్రజలు మాత్రం కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు కొత్త కమిటీలు వేస్తాంకాంగ్రెస్ బెదిరింపులు, ఫోన్‌కాల్స్‌కు కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు. గెలిచిన వారు, ఓడిపోయిన వారు కలిసి పనిచేయాలని, వచ్చే సంవత్సరంలో కొత్తగా సభ్యత్వ నమోదు, గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేసుకుంటామని తెలిపారు. రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రభంజనం కొనసాగిస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు. -
పేరులో ‘రామ్’తోనే కాంగ్రెస్ పరేషాన్
నిర్మల్: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆందోళన అర్థరహితమని, కొత్త పేరులో ‘రామ్’ అనే పదం ఉన్నందునే ఆ పార్టీ అభ్యంతరం చెబుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరో పించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులుగా గెలిచిన బీజేపీ మద్దతుదారులను నిర్మల్‌లో శుక్రవారం సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ గతంలో వందరోజులు మాత్రమే ఉన్న ఉపాధిహామీ పథ కాన్ని కేంద్రం 125 రోజులకు పెంచిందన్నారు.ఎంజీఎన్ఆర్ఈజీఎస్ను వికసిత్ భారత్–జీ రామ్‌జీగా మార్చడంతో ఎవరికీ నష్టం లేదని తెలిపారు. రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ ఉపాధి పథకం కొత్తపేరులో ‘రామ్’ అనే పదం ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతోందన్నారు. ఆ పార్టీలో ఉన్నది నిజమైన గాంధీలు కాదని విమర్శించారు. కేవలం పేరుకు మాత్రమే గాంధీ అని పెట్టుకున్నా రని, ప్రేమ ఏమాత్రమూ లేదని ఆరోపించారు.అందుకే.. అఖిలేశ్ వాళ్లని కలిశారుకాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని రాంచందర్‌రావు ఆరోపించారు. అందుకే ఇటీవల సమాజ్ వాదీపార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌ను కలిశారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వి నియోగానికి పాల్పడిందని ఆరోపించారు. బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల గెలుపు స్ఫూర్తితో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నారు. కార్యక్రమంలో బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు రామారావుపటేల్, పాల్వాయి హరీశ్‌బాబు పాల్గొన్నారు. -
రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే..
గజ్వేల్: కేసీఆర్ ప్రాతినిధ్యం వహి స్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని 179 పంచాయతీల్లో 92 సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్సే గెలిచిందని, కాంగ్రెస్ 68 స్థానాలకే పరిమితం కాగా రేవంత్‌రెడ్డి లెక్కలు తారు మారు చేసి చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తో కలిసి విలేకరులతో మాట్లాడారు.అబద్ధాలను ప్రచారం చేయడంలో ముఖ్యమంత్రికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. గజ్వేల్‌ను కేసీఆర్ అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దారని, అందువల్లే అత్యధిక సంఖ్యలో బీఆర్ఎస్ సర్పంచ్ స్థానాలను గెలుచుకుందని తెలిపారు. ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నా, ఎంజీఎం ఆస్పత్రిలో రోగులను ఎలుకలు కొరుకుతున్నా సీఎంకు కనపడక పోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కండువాలను కప్పుకున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడం ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. -
‘రెండున్నర సంవత్సరాలు ఓపిక పట్టండి’
సిరిసిల్ల(రాజన్న సిరిసిల్ల జిల్లా): బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎటువంటి నోరు విప్పకుండానే 33శాతం సీట్లను గెలుచుకున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మద్దతులో గెలిచిన సర్పంచ్‌లను సిరిసిల్లలో కేటీఆర్ సన్మానించారు. దీనిలో భాగంగా మాట్లాడుతూ.. ‘ ఎన్నికలు లేనట్లయితే జనవరి మాసంలో కొత్త సభ్యత్వాలను నమోదు చేసుకుందాం. ప్రతి ఒక్కరూ సభ్యత్వంలో తమ పాత్ర పోషించాలి. రాష్ట్రంలో 66 శాతం గెలిచాం అని ముఖ్యమంత్రి అబద్ధం ఆడుతున్నాడు. 66 శాతం ప్రజలు నీవైపు ఉంటే పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలతోని దమ్ముంటే రాజీనామా చేయించు.పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరామని గతంలో బాహటంగానే చెప్పారు, ఇప్పుడేమో కాంగ్రెస్‌లో చేరలేదంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను మరియు స్పీకర్‌ను చూస్తుంటే జాలి కలుగుతుంది. ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. ఇది కూడా ఒక బతుకేనా?, గడ్డి పోచలాంటి పదవి కోసం సూరు పట్టుకొని గబ్బిలం వేలాడినట్లు వేలాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలలో ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు బిఆర్ఎస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంత బెదిరించినా రాజ్యాంగ బద్ధంగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామాలకు వచ్చే నిధులు ఎవరు ఆపలేరు. రెండున్నర సంవత్సరాలు ఓపిక పట్టండి మల్లీ కేసీఆర్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుపుకుందాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
‘చంద్రబాబు మార్క్ దోపిడీకి ఇదే నిదర్శనం’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు మార్క్ దోపిడీకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే నిదర్శనమని, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు ప్రజారోగ్యాన్ని, వైద్య విద్య అభ్యసించాలన్న పేద విద్యార్థుల కలను పణంగా పెడుతున్నాడని మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరిగితే యూజర్ చార్జీల రూపంలో ప్రజలపై పెనుభారం మోపడం ఖాయమని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా అందిన వైద్య సేవలన్నీ రాబోయే రోజుల్లో డబ్బులు చెల్లించి పొందాల్సిన పరిస్థితి వస్తుందని వివరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని, ఈ ఉద్యమంతో కూటమి నాయకుల్లో వణుకు మొదలైందని చెప్పారు. కాబట్టే దాన్ని తక్కువ చేసి చూపించేలా కూటమి నాయకులతో సంతకాలు చేసిన ప్రజలను సైకోలు అని తిట్టిస్తూ చంద్రబాబు రోజురోజుకీ దిగజారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణపై విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం ఖాయమన్నారు.ఆమె ఇంకా ఏమన్నారంటే...మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి వచ్చిన స్పందన చూసి కూటమి నాయకుల గుండెల్లో వణుకు పుడుతోంది. అందుకే చంద్రబాబు అండ్ కో ప్రజా స్పందనను తక్కువ చేసి చూపించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సైతం మెడికల్ కాలేజీల ఆవశ్యకతను నొక్కి వక్కాణిస్తూ చెప్పినా ఈ ప్రభుత్వం తీరులో మార్పు కనిపించడం లేదు. కమీషన్ల పేరుతో దోచుకోవడమే లక్ష్యంగా ప్రైవేటీకరణ ముద్దు- ప్రభుత్వ కాలేజీలు వద్దు అనేలా ముందుకు సాగుతున్నాడు. కోటికిపైగా సంతకాలు చేసిన విద్యార్థులు, యువత, మేథావులను సైకోలు, దొంగలు అని కూటమి పార్టీ నాయకులతో చంద్రబాబు తిట్టిస్తున్నాడు. మెడికల్ కాలేజీలు వద్దని సంతకాలు చేసిన 1,04,11,136 మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు.ప్రజా పాలన పట్ల బాధ్యత మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు చెంప చెళ్లుమనిపించేలా, కూటమి ప్రభుత్వాన్ని బండకేసి బాదినట్టు ప్రజలు సంతకాలు చేశారు. సంతకాల రూపంలో తమ ఆవేదనను వ్యక్తం చేసిన ప్రజాభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పీపీపీ ముసుగులో జరుగుతున్న ప్రజా దోపిడీని ఆయనకు వివరించారు. గవర్నర్ కూడా ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్నారు. పీపీపీ మోడల్లో చంద్రబాబు తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం కోట్లాదిమంది ప్రజల ఆరోగ్యానినికి గొడ్డలిపెట్టు లాంటిది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని గ్రహించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దీనిపై న్యాయస్థానాల్లో వైఎస్సార్సీపీ పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం. విద్య, వైద్యం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. దాన్ని చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తోంది. మాకొద్దు బాబోయే అని కోటి మందికిపైగా సంతకాలు చేసి చెప్పినా, ఇప్పటికీ పీపీపీ గొప్ప అన్నట్టు చంద్రబాబు ప్రచారం చేసుకోవడం నిరంకుశత్వానికి నిదర్శనం.లా అండ్ ఆర్డర్ కూడా ప్రైవేటుపరం చేస్తారా?రాష్ట్రంలో అతి ముఖ్యమైన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు.. శాంతి భద్రతల విభాగాన్ని ప్రైవేటుపరం చేస్తారేమో చెప్పాలి. పీపీపీ మోడల్లో రోడ్లు నిర్మాణం చేసి టోల్ ట్యాక్స్ వసూలు చేసినట్టుగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తర్వాత హెల్త్ ట్యాక్స్ వసూలు చేయకుండా ఉంటారా? అందులో భాగంగానే ప్రభుత్వ వైద్యారోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. యూజర్ చార్జీల రూపంలో ప్రజల మీద భారం మోపడానికే చంద్రబాబు ఈ పీపీపీ మోడల్ తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించేస్తున్నాడు. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉంది. గత టీడీపీ పాలనలోనూ ప్రైవేటుమయంప్రజల ఆరోగ్య భద్రత విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడలేదు. గతంలో రాష్ట్రంలో 260 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండగా వాటి నిర్వహణకు ప్రతినెలా రూ. 4.50 లక్షల చొప్పున కేటాయించి చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుకి అప్పగించింది. అయినా వాటి ద్వారా ప్రజలకు అందిన వైద్య సేవలు ఏమాత్రం ఉండేవి కాదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూహెచ్‌సీల సంఖ్యను 560కి పెంచడంతోపాటు నాడు- నేడు ద్వారా వాటిని ఆధునికీకరించి ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. 24 బై 7 పనిచేసేలా వైద్యులను అందుబాటులో ఉండటంతోపాటు అన్నిరకాల వైద్యపరికరాలు, మందులను సమకూర్చడం జరిగింది.రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో 10,032 వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లీనిక్‌లను ఏర్పాటు చేశాం. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా నేరుగా డాక్టర్నే ప్రజల ఇంటికి పంపించడం కూడా వైఎస్ జగన్ వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో ఒకటి. నాడు మా ప్రభుత్వ హయాంలో ఉచితంగా రక్త పరీక్షలను నిర్వహిస్తే నేడు చంద్రబాబు వాటిని ప్రైవేటుపరం చేశాడు. ఏడాదికి రూ. 1000 కోట్లు చెప్పున రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తవుతాయని తెలిసినా అందుకు పూనుకోకుండా ప్రైవేటీకరణకే మొగ్గుచూపడానికి ప్రధాన కారణం కూడా కమీషన్ల కోసమే.ఇదేం తెలివితక్కువ విశ్లేషణ చంద్రబాబూ..పీపీపీ మోడల్ ను సమర్థించుకోవడానికి చంద్రబాబు చెబుతున్న మాటలు చూస్తే ఎవరికైనా అనుమానాలు కలగకుండా ఉండవు. ప్రభుత్వ పెత్తనం అని తెలుగులో చెప్పి ప్రైవేట్ మేనేజ్మెంట్ అని ఇంగ్లిష్‌లో చెబుతున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిందని తెలిసినా అడ్డగోలు విశ్లేషణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. 50 ఎకరాల మెడికల్ కాలేజీల భూములను ఎకరం వంద రూపాయలకు 66 ఏళ్లపాటు లీజుకివ్వడాన్ని ప్రజలెవరూ హర్షించడం లేదు. దీంతోపాటు మెడికల్ కాలేజీల పెత్తనం ప్రైవేటుకిచ్చి నిర్వహణకు అయ్యే ఖర్చును మాత్రం ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఇలా స్కాంల మీద స్కాంలు చేస్తూ వైద్యవిద్యార్థుల ఆశలను, పేద ప్రజల ఆరోగ్యాన్ని అందని ద్రాక్షగా మార్చేస్తున్నాడు. చంద్రబాబు మార్క్ ఆస్తుల దోపిడీకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే పెద్ద ఉదాహరణ. ఇవన్నీ చూస్తుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ముసుగులో వేల కోట్లు చేతులు మారుతున్నాయని ఎవరికైనా స్పష్టంగా అర్థమైపోతుంది.అందుకే మా నాయకులు వైఎస్ జగన్ దీన్ని మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దీనిపై విచారణ జరిపి అవినీతికి ఎవరు పాల్పడినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తే ఉండదు. తప్పు చేసిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరుతామని విడదల రజిని హెచ్చరించారు. -
‘వైఎస్సార్సీపీ సంస్ధాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలి’
తాడేపల్లి : 35 రోజుల పాటు వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 19వ తేదీ) ,వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షలు, జిల్లా ప్రధాన కార్యదర్శలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థాగత నిర్మాణం, కమిటీల నియామకాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ‘ రాష్ట్రస్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకూ కమిటీలు పూర్తవ్వాలి. అప్పుడు పార్టీకి 16 నుంచి 18 లక్షల సైన్యం రెడీ అవుతుంది. కమిటీల నిర్మాణం పూర్తికాగానే ఐడీ కార్డులు ఇస్తాం. కమిటీలలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉత్సాహంగా పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలి. కార్యకర్తల కష్టంతోనే కోటి సంతకాల ఉద్యమం సక్సెస్ అయింది’ అని స్పష్టం చేశారు. -
రాజమండ్రి: ‘నన్నయ్య’లో జనసేన కార్యకర్తల వీరంగం
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో నన్నయ్య యూనివర్శిటీలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఫ్లెక్సీలు తొలగించినవారి అంతుచూస్తామంటూ బెదిరింపులకు దిగారు. వీసీ ఆఫీసులో వెళ్లేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. వీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్యను వీసీ పీఏ నెట్టేశారని ఆరోపిస్తున్నారు. -
‘చంద్రబాబు సర్కార్ చేతకానితనం ఇది’
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకుల భూ కబ్జాలతో వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ, అనకాపల్లిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు భయపడే పరిస్థితి ఉందన్నారు. భూ వివాదాలు, సివిల్ సెటిల్మెంట్లలో ఎమ్మెల్యేలను కట్టడి చేయలేకపోవడం ప్రభుత్వం చేతకానితనం అంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.కలెక్టర్లు, ఎస్పీలకు క్లాస్ పీకడం వల్ల ప్రయోజనం ఉండదు. సామంత రాజుల్లా చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలకు క్లాస్ పీకి, యాక్షన్ తీసుకుంటేనే దారికి వస్తారు. ముందు ఎమ్మెల్యేలను కట్టడి చేయడంపై సీఎం, డిప్యూటీ సీఎం దృష్టి సారించాలి’’ అంటూ గుడివాడ అమర్నాథ్ హితవు పలికారు. -
పంచాయతీ ఎన్నికలు.. కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్!
సాక్షి, వనపర్తి: వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఓడిపోయేందుకు పార్టీల్లోని కొందరు నేతలే కారణమని అన్నారు. పరోక్షంగా మాజీ మంత్రి చిన్నారెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమేంటో ఆ వివరాలన్నీ పీసీపీకి, ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తాను. వనపర్తిలో నేను ఒరిజినల్ కాంగ్రెస్ అంటూ కామెంట్స్ చేశారు.వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మెగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘మూడు విడతలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము ఈ రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బాగా ఆదరించారు. వనపర్తి నియోజకవర్గంలోని 140 పంచాయతీల్లో 85 సీట్లు కాంగ్రెస్‌కు వచ్చాయి. 60.66% ఓటు శాతం వచ్చింది. బీఆర్ఎస్కు 51 గ్రామ పంచాయతీ సీట్లు రాగా ఓటు శాతం 36% వచ్చింది. అంటే బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పుంజుకుంది అనేది అందరూ గ్రహించాలి. గ్రామ పంచాయతీ వరకు చూస్తే కాంగ్రెస్‌కు 92407 ఓట్లు వచ్చాయి.. బీఆర్ఎస్కు 59788 ఓట్లు వచ్చాయి. రెండింటిని చూస్తే వారికన్నా కాంగ్రెస్‌కు 35.09% అధికంగా వచ్చాయి. ఎన్నికల ఓటు పర్సంటేజ్ విషయంలో బీఆర్ఎస్కు ఓటు శాతం తగ్గింది. వచ్చే ఎన్నికల్లో ఇంకా వాళ్ళు కిందికి పడిపోవడం ఖాయం.మా కాంగ్రెస్ పెద్ద మనిషి చిన్నారెడ్డి నియోజకవర్గంలోనే 15 గ్రామాలలో కావాలని పార్టీకి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ వాళ్లకు సపోర్ట్ చేశారు. బీఫామ్స్ విషయంలో ఆయనకు కాకుండా నాకు వచ్చిందని కక్ష పెంచుకుంటే నామీద కోపం తీర్చుకోవాలి కానీ ఇలా పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ అభ్యర్థులను ఓడించడం సబబు కాదు. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం వనపర్తి ప్రజలు అందరు గమనిస్తూనే ఉన్నారు. తగిన సమయంలో ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయం. చిన్నారెడ్డి పంచాయతీ ఎన్నికలలో ఓటర్లకు ఫోన్లు చేసి కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దు.. బీఆర్ఎస్కు ఓటు వేయమని చెప్పిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసిందని అభ్యర్థులను ఓడించారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
బాబు ఆర్థిక విధ్వంసం.. ఎల్లో మీడియా మాటల్లో!
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు నానాటికీ మరింత అధ్వాన్నంగా మారిపోతుంది. తప్పుడు లెక్కలతో తీరని ద్రోహం జరుగుతోంది’.. ఈ మాటలు అంటోంది ప్రతిపక్షాలు కాదు.. కూటమి ప్రభుత్వానికి దన్నుగా నిలిచే ఎల్లోమీడియా!. ఒకపక్కమే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అప్పులు పుట్టడం లేదని ఒకసారి.. జీఎస్డీపీ బ్రహ్మాండమని ఇంకోసారి చెబుతూంటే.. ఎల్లోమీడియా ఇలా వాస్తవాలు వెల్లడించి పరువు బజారున పడేసింది.అయితే.. ఈ కథనంలో ఎక్కడా చంద్రబాబును తప్పు పట్టలేదు లెండి. తప్పంతా అధికారులదే అన్నట్టుగా ఈ కథనం సాగింది. జీఎస్డీపీ, తలసరి ఆదాయాలు బాగున్నట్లు చూపించి అసలు కష్టాలను దాచేశారని, కాగితాలపై గొప్పలు చెప్పారని వ్యాఖ్యానించింది. దీనివల్ల కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో ఏపీకి భారీ కోత పడిందని కూడా పేర్కొంది. రెవెన్యూ గ్రాంట్లలోనూ నష్టమే జరుగుతోందని, కేవలం అప్పుల కోసమే జీఎస్డీపీకి రెక్కలు తొడిగారని కూడా వెల్లడించింది.కొంతకాలంగా ఏపీ ఆర్ధిక పరిస్థితి, దొంగ లెక్కల గురించి ఆర్థిక నిపుణులు, అనుభవజ్ఞులైన జర్నలిస్టులు చెబుతున్నది కూడా అదే. అయితే, అప్పుడు పచ్చ మీడియా చంద్రబాబును వెనకేసుకొచ్చింది. ఇప్పుడు కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే ఇలాంటి కథనాలు రాసిందని అంటున్నారు. అందుకే ఇందులో వాస్తవమున్నా నిజాయితీ మాత్రం కనిపించదు. వైఎస్ జగన్ హయాంలో అప్పులే ఆలంబన అని, ఇప్పుడేమో అప్పులతోపాటు ఇమేజీ కోసం ఆరాటం అని ఎల్లో మీడియా వ్యాఖ్యానించింది. అంతే తప్ప జగన్ టైమ్‌లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభంతో వచ్చిన సమస్యలను రాయడానికి వీరికి చేయి రాలేదు. పైగా జగన్ హయాంలో రాష్ట్రం బ్రాండ్ పాతాళానికి చేరిందంటూ తప్పుడు వ్యాఖ్యలతో కథనాన్ని ఆరంభించడమే వీరి కుళ్లుకు దర్పణంగా కనిపిస్తుంది. అప్పుడేమో సంక్షేమమేనట, బటన్ నొక్కడమేనట. ఇప్పుడేమో పరిస్థితి మారిందట. సంక్షేమం, అభివృద్ది కావాలట. పెట్టబడులు రావాలట.ఆ రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారని, అందుకు సుమారు రూ.లక్షన్నర కోట్లు ప్రతి ఏటా ఖర్చు చేయాల్సి ఉంటుందని జగన్ చెబితే ఈ మీడియా అంగీకరించిందా?. లేకపోగా జగన్‌పై చంద్రబాబు శరాలు సంధించారని గొప్పగా రాసింది. జగన్ టైమ్‌లో పోర్టులు, మెడికల్ కాలేజీలు కడితే, అవేవీ ఎల్లో మీడియా కళ్లకు కనిపించలేదు. పోనీ చంద్రబాబు టైమ్‌లో వచ్చిన కొత్త పరిశ్రమలు కనిపించాయా అంటే లేదు. కంపెనీలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు ధారాదత్తం చేస్తుంటే, రాష్ట్ర ప్రజల సంపదను కొంతమంది పెట్టుబడిదారులకు కట్టబెడుతుంటే వీరికి తప్పు అనిపించదు. కానీ, జగన్ అలాంటి పనులు చేయకపోయినా ఆయనపై పడి ఏడుస్తుంటుంది. ఈ మీడియా ఇచ్చిన కథనంలో వృద్దిరేటుపై చంద్రబాబు చెబుతున్న విషయాలు రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయని తెలిపింది. ఈ లెక్కల వల్ల రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లలో గండి పడుతోందని తెలిపింది. చంద్రబాబేమో తనంత ఘనాపాటి లేడని అనిపించుకోవాలని అతిశయోక్తులతో కూడిన అంకెలతో గారడి చేస్తుంటే, ఆర్థిక శాఖకు చెందినవారో, లేక మంత్రి ఎవరో ఈ విషయాలు చెప్పి కథనం రాయించినట్లు అనిపిస్తుంది.ఈ తప్పుడు లెక్కల వల్ల ఏపీకి కేవలం రూ.7500 కోట్ల మేర మాత్రమే కేంద్రం గ్రాంట్ వచ్చిందని, అదే బీహారుకు రూ.17500 కోట్లు వచ్చిందని వివరించారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో కూడా ఇలాగే నష్టపోతున్నదట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెలిగిపోతోందన్న లెక్కలవల్లే ఈ వాటా తగ్గుతోందట. అయితే ఏపీలో జీఎస్టీ వసూళ్లు తగ్గిన అంశాన్ని ఈ మీడియా కప్పిపుచ్చేసింది. జగన్ టైమ్‌లో జీఎస్డీపీ రూ.14 లక్షల కోట్ల ఉంటే, దానిని ఏడాదికి రెండు లక్షల కోట్ల చొప్పున పెంచేశారని, దీనికి తగినట్లుగానే తలసరి ఆదాయం అంచనాలు కూడా పెంచేశారని ఈ పత్రిక తెలిపింది. అప్పుల కోసం, బ్రాండ్ ఇమేజీ కోసం ఇలా చేస్తున్నారట. దేశంలో జీఎస్డీపీ 8.7 శాతం ఉంటే, ఏపీలో మాత్రం అది 11.28 శాతంగా చూపించడాన్ని ఈ మీడియా తప్పుపట్టింది. దేశ సగటు కన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నిధులు ఎక్కువగా వస్తాయని, ఏపీలో చాలా ఎక్కువగా చూపినందున తక్కువ నిధులు వస్తాయని ఈ మీడియా వాపోయింది. అలాగే జాతీయ తలసరి ఆదాయం కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని ప్రభుత్వం గొప్పలు పోయిందట. ఈ పరిస్థితిలో కేంద్రం నుంచి అధిక నిధులు, పన్నులలో ఎక్కువ వాటా ఎలా వస్తుందని అధికారులు అంటున్నారట.చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ లెక్కల్లోని డొల్లతనం కూడా ఈ పత్రిక బహిర్గతం చేసింది. ఏపీకి పన్నేతర ఆదాయం రూ.19,119 కోట్లుగా అంచనా వేశారని, అవన్ని గాలి మేడలే అని చెబుతూ ఈ పద్దు కింద రూ.ఐదు వేల కోట్లు వస్తే గొప్ప అని స్పష్టం చేసింది. ఇప్పటికి వచ్చింది రూ.3671 కోట్లేనట. రాష్ట్ర పన్ను ఆదాయం కింద రూ.1.09 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే నవంబర్ నాటికి వచ్చింది రూ.68 వేల కోట్లేనని తేలింది. ఆదాయం పరిస్థితి ఇలా ఉండగా, ప్రభుత్వ ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. రెవెన్యూలోటు 163 శాతానికి చేరుకుంది. రూ.1.60 లక్షల కోట్లు వ్యయం చేస్తే అందులో కేవలం రూ.17 వేల కోట్లే మూలధన వ్యయంగా ఉంది. ఈ అంకెల విషయంలో ఎక్కడా జగన్ ప్రభుత్వం నాటి లెక్కలతో పోల్చకుండా ఈ ఎల్లో మీడియా జాగ్రత్తపడింది.కేంద్రం నుంచి కూడా అప్పట్లో అధిక నిధులను జగన్ ప్రభుత్వం సాధించింది. ఉదాహరణకు రెవెన్యూ లోటు కిందే సుమారు రూ.పది వేల కోట్లు పొందింది. పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు రాబట్టుకోగలిగింది. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలు అమలు చేసి, అదనపు నిధులు సాధించింది. పైగా ఆ రోజుల్లో జీఎస్టీ వసూళ్లలో కూడా దేశంలోనే మొదటి ఐదు స్థానాలలో ఉండేది. అయినా అప్పుడు బ్రాండ్ పాతాళంలో ఉందని తప్పుడు రాతలు రాసిన ఈ ఎల్లో మీడియా ఇప్పుడు ఈ దారుణ పరిస్థితికి ఎన్ని పాతాళాల లోతున కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిందో మాత్రం చెప్పలేదు.వ్యాపార లావాదేవీలు, ప్రజల కొనుగోలు శక్తి మొదలైనవన్నీ జగన్ టైమ్‌లో మెరుగ్గా ఉన్న విషయాన్ని ఎల్లో మీడియా కప్పిపుచ్చే యత్నం చేసింది. కేవలం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎగవేయడానికి వీలుగా గత కొన్నాళ్లుగా కథనాలు ఇస్తున్న ఈ పచ్చ మీడియా అందులో భాగంగానే తాజా కథనమూ ఇచ్చి ఉండవచ్చు. కానీ, ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధ్వంస పాలనను తనకు తెలియకుండానే ప్రజల ముందు ఉంచింది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్సార్సీపీ కోటి సంతకాల కార్యక్రమం సూపర్ సక్సెస్
సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాల కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. చంద్రబాబు నిర్ణయాన్ని జనం తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారు. ప్రజారోగ్యానికి వైఎస్ జగన్ బాసటగా నిలిచారు. ప్రైవేటీకరణ పేరుతో స్కాం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలుకు పంపుతామంటూ హెచ్చరించారు.గవర్నర్‌ని కలిసి కోటి 4 లక్షల 11,136 సంతకాల ప్రతులు అందజేత చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని వినతించారు. జగన్ రాకతో విజయవాడ రోడ్లు కిటకిటలాడాయి. అన్ని వర్గాల ప్రజల నుంచి వైఎస్ జగన్ పోరాటానికి మద్దతు లభించింది. కార్యక్రమం సక్సెస్ కావడం పార్టీ కేడర్‌కు ఫుల్ జోష్ ఇచ్చింది.రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గవర్నర్‌కు నివేదించామని, ఈ పోరాటం ఇంతటితో ఆగదని.. న్యాయ పోరాటం.. ప్రజల్లోకి వెళ్లి పోరాటం కూడా చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులతో కూడిన 26 వాహనాలను (గురువారం డిసెంబర్ 18)న లోక్‌భవన్‌కు తరలించారు. గవర్నర్ కార్యాలయ అధికారులు కె.రఘు (డిప్యూటీ సెక్రటరీ టు గవర్నర్), ఎన్.వెంకటరామాంజనేయులు (ఏడీసీ) ఆ పత్రాలు పరిశీలించారు. వాటన్నింటినీ వైఎస్ జగన్ తన భేటీలో గవర్నర్‌కు చూపారు. తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలు దేరిన వైఎస్ జగన్ నేరుగా తొలుత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
రేవంత్ టాప్.. ఆ తర్వాత ఉత్తమ్.. వివేక్ లాస్ట్
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రులు తమ పట్టు నిలుపుకున్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీస్థాయిలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోగలిగారని మూడు విడతల్లో వెల్లడైన ఫలితాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో ఎక్కువమంది కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఆ తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్నగర్), సీతక్క (ములుగు) ఉన్నారు. ఈ ముగ్గురి నియోజకవర్గాల్లో 75 శాతం కంటే ఎక్కువ చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలుపొందడం విశేషం. » కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ), శ్రీధర్‌బాబు (మంథని), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం) నియోజకవర్గాల్లో కూడా 70 శాతం కంటే ఎక్కువ చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. » 60 శాతం కంటే ఎక్కువ అధికార పార్టీ గెలుపొందిన నియోజకవర్గాల్లో మధిర, అందోల్, పాలేరు ఉన్నాయి. » మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్‌లో కూడా దాదాపు 60 శాతం స్థానాల్లో హస్తం పార్టీ సహకారంతోనే సర్పంచ్‌లుగా గెలిచారు. వాకిటి శ్రీహరి (మక్తల్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్)లలో 50–60 శాతం మధ్యలో విజయం దక్కించుకోగలిగారు. » అత్యల్పంగా వివేక్ వెంకటస్వామి (చెన్నూరు) నియోజకవర్గంలో 50 శాతం కంటే కొంచెం తక్కువగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. సగం చోట్ల బీజేపీ సున్నా.. రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. హుజూర్నగర్, ములుగు, మధిర, పాలేరు, ఖమ్మం, చెన్నూరు స్థానాల్లో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుచుకోలేకపోయారు. » మంత్రుల నియోజకవర్గాల్లో కొల్లాపూర్, హుస్నాబాద్‌లలో మాత్రమే బీఆర్ఎస్ నుంచి పోటీ ఎదురైందని ఫలితాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. » కొడంగల్‌లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కేవలం 30 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. » స్వతంత్రులు, లెఫ్ట్ పార్టీలు కలిపి మంత్రుల నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలగడం విశేషం. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరులో ఏకంగా 35 మంది స్వతంత్రులు గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ తర్వాత అత్యధికంగా గెలిచింది స్వతంత్రులే. బీఆర్ఎస్ బలపర్చిన వారు స్వతంత్రు లతో పోలిస్తే సగం స్థానాల్లో మాత్రమే గెలవగలిగారు. స్వతంత్రులు ప్ర భావం చూపిన నియోజకవర్గాల్లో మధిర, కొల్లాపూర్, పాలేరు, మంథని, హుస్నాబాద్‌లు కూడా ఉండడం గమనార్హం. -
ఏనాటికైనా సత్యమే గెలుస్తుంది
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో బీజేపీ రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని తాము ఎప్పటినుంచో చెబుతున్న మాటలు నిజమయ్యాయని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ తీవ్రంగా విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జిషీట్‌ను ఢిల్లీ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో గురువారం బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. గాందీభవన్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు కాంగ్రెస్ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు చేసిన యత్నాన్ని పోలీసులు గాంధీభవన్ వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని, నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా అదే జరిగిందన్నారు. న్యాయం గెలవడానికి సమయం పట్టవచ్చు కానీ చివరికి గెలిచేది న్యాయమేనని వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబంపై కావాలనే అక్రమ కేసులు పెట్టి రాజకీయంగా వేధించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. బీజేపీ రాజకీయ వేధింపులు: మహేశ్‌గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ, రాహుల్ గాందీ, సోనియా గాం«దీలపై బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగానే అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ కోర్టులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కొట్టివేయడం ద్వారా నేషనల్ హెరాల్డ్ కేసులో సత్యమేంటో దేశానికి తెలిసిందని అన్నారు.స్వాతంత్య్రకాలం నుంచే ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశానికి సేవ చేసిన పత్రిక అని, అలాంటి పత్రికను, దేశం కోసం ఆస్తులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని భయపెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టారని, కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని స్పష్టం చేశారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత కాగా గాందీభవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించాలని చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ హడావుడిలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్ వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీజేపీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు ప్రయతి్నంచాయి. -
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తిరుగులేని విజయం
సాక్షి, యాదాద్రి: వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించాలని, అధినేత కేసీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని, భవిష్యత్‌లో సాధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా పునాది వేసిందన్నారు. గురువారం భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అభినందన సభలో పాల్గొన్న కేటీఆర్.. వారిని సన్మానించిన అనంతరం మాట్లాడారు. పెద్దలు చెప్పినట్టు ఎక్కడైతే పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలన్న నానుడిని నిజం చేస్తూ ఈరోజు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఆ ఉత్సాహాన్ని ఇస్తున్నాయన్నారు. రెండేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడినా.. నేడు భువనగిరి జిల్లా వ్యాప్తంగా 161 మంది సర్పంచ్‌లను గెలిపించుకున్నామని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన విజయాలు.. పార్టీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ వికృత రాజకీయం కాంగ్రెస్ పార్టీ వికృత రాజకీయాలకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. నూతనకల్ మండలంలో మల్లయ్య యాదవ్‌ను కిరాతకంగా చంపడం, నల్లగొండలో అభ్యర్థిపై దాడిచేసి అమానవీయంగా మూత్రం తాగించడం వంటి ఘటనలు కాంగ్రెస్ నాయకుల వికృత మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అధికార దుర్వినియోగంతో రీకౌంటింగ్ పేరిట మన గెలుపును దొంగిలించిన 150 గ్రామాల్లో కోర్టుల ద్వారా న్యాయపోరాటం చేస్తామన్నారు. మీరు ధైర్యంగా ఉండండి, పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పారు. మూడు ఫీట్లు ఉన్నా.. 30 ఫీట్ల డైలాగులు సీఎం రేవంత్‌రెడ్డి మూడు ఫీట్లు ఉన్నా.. ముప్పై ఫీట్ల డైలాగులు కొడతారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసి మోసపోయామని క్షేత్రస్థాయిలో ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. తినే పళ్లెంలో మన్ను పోసుకున్నామని, పాలిచ్చే బర్రెను వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. తులం బంగారం ఇస్తామని, పింఛన్లు పెంచుతామని లంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలది సిగ్గులేని రాజకీయం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని సిగ్గులేని రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. పోచారం, కడియం వంటివారు 70 ఏళ్ల వయసులో సంపాదించుకున్న గౌరవాన్ని రేవంత్‌రెడ్డి సంకలో చేరి నాశనం చేసుకున్నారని చెప్పారు. స్పీకర్ కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆడుతూ, ఫిరాయింపులు కనపడనట్టు నటిస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ అభినందన సభలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, బూడిద బిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేశ్, గొంగిడి మహేందర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ ఎంపీల డిన్నర్ మీటింగ్
ఢిల్లీ: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నివాసంలో కాసేపటి క్రితం తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్, కొండా విశ్వేశ్వరరెడ్డి, గొడం నగేశ్, ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా మరింత పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, రామచంద్రరావు గారి నేతృత్వంలో తెలంగాణలో పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ, మునిసిపాలిటీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రత్యేకమైన వ్యూహంతో పనిచేయాలని ఎంపీలు నిర్ణయించారు. తెలంగాణ బీజేపీ ఎంపీల పని తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
‘తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగింది’
యాదాద్రి(భువనగిరి జిల్లా): స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన బీజేపీ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. దీనిలోభాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 సర్పంచులు 20 మంది ఉపసర్పంచ్లు 1000 వార్డులు గెలిచాం. రాష్ట్రంలో 900 సర్పంచులు 1200 ఉపసర్పంచ్లు 10,000 మంది వార్డులను గెలిచాం. గతంలో 162 సర్పంచ్ స్థానాలను ఉండేది. గ్రామీణ ప్రాంతాలలో కూడా బీజేపీ బలం పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో, అవినీతి, అరాచకంతో గెలిచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ పథకాల పేరు మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది వారి అవినీతి గురించి వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో మినిస్టర్ పీఏలు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు, రాజ్యాంగం మీద గౌరవం లేని వ్యక్తి రాహుల్ గాంధీ. బీఆర్ఎస్ పార్టీనే ఫిరాయింపుల మొదటి ప్రోత్సహించింది. ప్రభుత్వం ఒత్తిడితో స్పీకర్ రాజ్యాంగం వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. రాహుల్ గాంధీ సోనియాగాంధీ వారి వారి కేసులలో బెయిల్ పై ఉన్నారు. బీజేపీ వారిపై కేసు పెట్టలేదు దర్యప్తు సంస్థలు కేసు పెట్టాయి. మా పార్టీ కార్యాలయంలపై దాడి చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తే కాంగ్రెస్ పార్టీదే పూర్తి బాధ్యత’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి:హైదరాబాద్ పర్యటనలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ -
డీఎంకే ఈవిల్, టీవీకే ప్యూర్.. విజయ్ రాజకీయ పునరాగమనం
తమిళనాడు: నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ గురువారం మధ్యాహ్నం తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన తర్వాత రాష్ట్రంలో ఆయన పెద్ద ఎత్తున జరిపిన మీటింగ్ ఇదే కావడం విశేషం. ఈ ర్యాలీ ద్వారా విజయ్ వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తన ప్రచారానికి స్వరం సిద్ధం చేసుకున్నారు. విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడులో NEET పరీక్ష మినహాయింపు అంశం, శాంతిభద్రతల సమస్యలపై ఆయన డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. డీఎంకే పార్టీకి సమస్యలు ఫెవికాల్తో ముడిపడి ఉన్నాయి, వాటిని వేరు చేయలేం అని వ్యాఖ్యానించారు. అధికార డీఎంకేను దుష్ట శక్తిగా, తన పార్టీ TVK (తమిళగ వెట్రి కజగం)ను స్వచ్ఛమైన శక్తిగా అభివర్ణించారు. పోరాటం స్వచ్ఛమైన శక్తికి, చెడుకు మధ్య అని విజయ్ మండిపడ్డారు. ర్యాలీకి వచ్చిన జనసమూహాన్ని సురక్షితంగా వెళ్లమని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీ మాజీ ఏఐఏడీఎంకే నాయకుడు కేఏ సెంగొట్టయన్ స్వస్థలం విజయమంగళం సమీపంలో జరగడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. సెంగొట్టయన్ గత నెలలో ఏఐఏడీఎంకే నుండి బహిష్కరణకు గురైన తర్వాత విజయ్ పార్టీ టీవీకేలో చేరారు. ఆయనను సీనియర్ రాజకీయ నాయకుడు, అద్భుతమైన ప్రచార వ్యూహకర్తగా పరిగణిస్తారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ నిర్వహించిన రెండవ పెద్ద ఎత్తున బహిరంగ సభ ఇదే కావడం విశేషం. మొదటి సభ గత వారం పుదుచ్చేరిలో జరిగింది, అక్కడ కూడా ఆయన డీఎంకేపై మాటల దాడి చేశారు. ఈరోడ్ ర్యాలీతో విజయ్ తన రాజకీయ యాత్రను మరింత దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఈ ర్యాలీతో డీఎంకేపై ప్రత్యక్ష పోరాటానికి సంకేతాలు ఇచ్చారు. తోపులాటకు ఆస్కారం లేకుండా.. తోపులాట, తొక్కిసలాటలకు ఆస్కారం ఇవ్వకుండా లోనికి కేడర్‌ను నిర్ణీత సమయంలోకి అనుమతించడం, నిర్ణీత సమయంలో విజయ్ అక్కడికి వచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఏర్పాట్లను టీవీకే వర్కింగ్ కమిటీ సమన్వయకర్త సెంగొట్టయ్యన్, ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పర్యవేక్షించారు. గుర్తింపు కార్డులు ఉన్న కేడర్‌ను మాత్రమే లోనికి అనుమతించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా విజయ్ పర్యటనను నిర్వహించారు. గర్భిణిలు, వృద్ధులు, పిల్లలు దయ చేసి ఇక్కడకు రావొద్దని ముందుగానే సూచించారు. రెండున్నర నెలల అనంతరం రాష్ట్రంలో మళ్లీ మీట్ ది పీపుల్ ప్రచార ప్రయాణానికి విజయ్ శ్రీకారం చుట్టనన్నడంతో బయటి వ్యక్తులు ఎవ్వరూ ఈరోడ్‌కు రావొద్దని, విజయ్ వాహనాన్ని వెంబడించ వద్దని టీవీకే కార్యాలయం విన్నవించుకుంది. -
చంద్రబాబు సర్కార్‌కు వైఎస్ జగన్ అల్టిమేటం
ప్రైవేటీకరణ అనేదే పెద్ద స్కామ్ అని.. అలాంటి స్కామ్‌ల ఎన్నైనా చేయడానికి చంద్రబాబు నాయుడు ఏనాడూ వెనకడుగు వేయబోరని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాల సేకరణ ఒక చరిత్ర. ఈ సంతకాలను గవర్నర్‌కు సమర్పించి.. చంద్రబాబు నిర్ణయం పట్ల వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను తెలియజేస్తామని వైఎస్ జగన్ అన్నారు. ‘‘కోటి సంతకాలతో గవర్నర్‌ను కలుస్తాం. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్తాం. అవసరమైతే ఈ పత్రాలతో కోర్టు తలుపులు తడతాం. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం. న్యాయస్థానం ఎప్పుడు కోరినా, ఆ పత్రాలు చూపుతాం. అయినా చంద్రబాబులో చలనం రాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఎన్.జనార్థన్‌రెడ్డి సీఎంగా ఉండి.. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇక్కడ ప్రభుత్వం కట్టిన కాలేజీలను చంద్రబాబు ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్ అయితే.. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇవ్వడం మరో పెద్ద స్కామ్. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాక ఇక ప్రభుత్వం జీతాలు చెల్లించడం ఏంటి?. ఒక మెడికల్ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయి. అంటే రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు. ఇది కదా పెద్ద స్కామ్ అంటే!.కోటి సంతకాల మహోద్యమం చూసైనా చంద్రబాబు సర్కార్ నిర్ణయం మార్చుకోవాలి. లేకుంటే ప్రజా ఉద్యమం కొనసాగిస్తాం. రేపు మనం అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. ఈ స్కామ్‌కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టం. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం. చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతాం’’ అని జగన్ అల్టమేటం జారీ చేశారు. -
పోలవరం.. మళ్లీ అదే తప్పు చేస్తున్న చంద్రబాబు!: ఉండవల్లి
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వంలో పోలవరం పనులు నత్తనడకనే సాగుతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు తరచూ అక్కడ పర్యటిస్తుండడం వల్ల మొత్తం అధికార యంత్రాగం వాళ్ల చుట్టే తిరుగుతోందని.. తద్వారా పనులు త్వరగతిన సాగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ.. పోలవరంలో డయాగ్రమ్ వాల్ మళ్ళీ కడుతున్నారు. పనులు ఎలా జరుగుతున్నాయో మీడియం తీసుకెళ్లి చూపించాలి అనుకున్నాను. కాఫర్ డ్యామ్ ఫెయిల్యూర్‌కు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధమే లేదు. తెలుగు దేశం హయాంలో జరిగిన తప్పు వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని జగన్ స్పష్టం చేశారు. రూ.440 కోట్ల డయాఫ్రమ్ వాల్ ఫెయిల్ అయినా కూడా అదే కంపెనీ మళ్లీ పనులు చేస్తోంది.. ఇప్పుడు రూ.990 కోట్లతో అదే బావర్ కంపెనీ కొత్త డయాఫ్రమ్ వాల్ కడుతోంది. దీనిపై ఎందుకు ఎంక్వయిరీ జరగడం లేదు. పోలవరానికి సంబంధించి ప్యానల్ అఫ్ ఎక్స్పర్ట్స్(POE) ఇచ్చిన రిపోర్ట్ ఎక్కడ ఉంది?. అసలు ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది??.. రైట్ టు ఇన్ఫర్మేషన్ లో ప్రభుత్వాన్ని అడిగితే కాపీ రైట్ వర్తిస్తుందని చెప్పటం దారుణం. వాల్ కొట్టుకుపోవడం మానవ తప్పిదమా?.. ఫ్లడ్ భారీగా రావటం వల్ల జరిగిన సమస్యా? అనే విషయాన్ని స్పష్టం చేయాలి. ఢయాఫ్రం వాల్ మళ్ళీ కడుతున్నారు.. ఇదే ప్రమాదం ఎదురైతే ఏం చేస్తారో స్పష్టం చేయాలి. పోలవరంలో తరచూ చంద్రబాబు, మంత్రులు చేసే విజిట్లు వల్ల పనులు త్వరితగతిన సాగడం లేదనిపిస్తోంది. మొత్తం యంత్రాంగం అంతా వీరి చుట్టూనే తిరుగుతోంది. గత పుష్కరాల్లో జనం చనిపోవటానికి ముహూర్తం మూఢనమ్మకమే కారణమని కమిషన్ చెప్పేసింది. అప్పట్లో టిడిపితో బీజేపీ కలిసి ఉండటం వల్ల ఏం మాట్లాడలేదు. ముహూర్తం మూఢనమ్మకమా?.. అదే అనుకుంటే అన్ని మూఢనమ్మకాలే!’’ అని ఉండవల్లి అన్నారు. -
‘చంద్రబాబు మాటలు వింటే ఏం అనాలో అర్థం కావడం లేదు’
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టడమే పెద్ద స్కాం.. అంటూ చంద్రబాబు సర్కార్‌ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు నిర్ణయాన్ని కోటి 4 లక్షల మంది వ్యతిరేకించారని.. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారన్నారు.ఈ సంతకాలు గవర్నర్‌ను సమర్పిస్తాం.. కోర్టుకు కూడా పంపుతాం. గవర్నర్ దగ్గరకు వెళ్లే ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద కోటి సంతకాల ప్రతులను ఉంచుతాం. కోటి సంతకాలు చూడాలంటూ కోర్టులో అఫిడవిట్ వేస్తాం. స్కామ్‌లు చేయడానికి చంద్రబాబు వెనకడుగు వేయడం లేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్. ప్రైవేట్ వాళ్లకు మెడికల్ కాలేజీలు అప్పజెప్పడమే కాదు.. వాళ్లకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట!. ఒక్కో కాలేజీకి రూ.120 కోట్లు ఎదురు ఇస్తున్నారు(జీతాల కింద).. ఇంత కంటే పెద్ద స్కామ్ ఉంటుందా?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.నింద కలెక్టర్లపై మోపుతున్న చంద్రబాబు:కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాటలు వింటుంటే.. ఆశ్చర్యం కలుగుతోంది. తన గ్రాఫ్ పడిపోవడానికి కలెక్లర్లు కారణం అంటున్నారు. కలెక్టర్ల గ్రాఫ్ కాదు పడిపోతోంది. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ప్రజలకు ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదు. మార్చి వస్తే, మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాడు. ఇప్పటికే రెండు బడ్జెట్లు పెట్టాడు. కానీ, ప్రజలకు ఒక్కటంటే ఒక్క మేలు లేదు. గత పథకాలన్నీ సున్నా. కొత్తగా ఏదీ లేదు. మన ప్రభుత్వ హయాంలో క్యాలెండర్ ప్రకటించి, అన్ని పథకాలు పక్కాగా అమలు చేశాం. వాటితో పాటు, అంత కంటే ఎక్కువగా అమలు చేస్తానన్న చంద్రబాబు, ఏదీ చేయలేదు. గతంలో అమలు చేసిన అన్ని పథకాలు రద్దు చేశారు. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ లేవు. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ఆరోగ్యశ్రీ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. ఇంకా సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్ మోసాలు.విద్య, వైద్యం, రవాణా. ప్రభుత్వ వ్యవస్థలు:అసలు ఎక్కడైనా ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు ఎందుకు నడుపుతుంది? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అది ఎందుకు జరుగుతోంది?. ఎందుకంటే, ఒకవేళ ప్రభుత్వమే కనుక.. స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు (ప్రజా రవాణా వ్యవస్థ) నడపకపోతే.. విద్య, వైద్యం, రవాణా ఎవరికీ అందుబాటులో ఉండవు. ఆయా రంగాల్లో మొత్తం ప్రైవేటు రంగం పెత్తనమే ఉంటుంది.వ్యవస్థలన్నీ తిరోగమనం:కానీ, ఈరోజు అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అసలు ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులు ఎందుకు అంటున్నాడు చంద్రబాబు. మనం గత ఎన్నికల్లో గెల్చిపోయి ఉండకపోతే, ఆర్టీసీ కూడా ఉండేది కాదు. అదే చంద్రబాబు వచ్చి ఉంటే, దాన్ని కచ్చితంగా అమ్మేసేవాడు. ఈరోజు అన్ని వ్యవస్థలు తిరోగమనం. గతంలో అమలైన పథకాలన్నీ రద్దు. అన్ని ఘనకార్యాలు చేసిన నీవు (చంద్రబాబు), కలెక్టర్ల సదస్సులో వారి (కలెక్టర్లు) పనితీరు బాగా లేదనడం దారుణం. చంద్రబాబు బుర్ర పని చేయడం లేదు.న్యాయపోరాటం కూడా చేస్తాం:ఆ తర్వాత ఆ పత్రాలు.. కోర్టు ద్వారాలు తడుతాయి. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం. వారు ఎప్పుడు కోరినా, ఆ పత్రాలు చూపుతాం. అయినా చంద్రబాబులో చలనం రాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఎన్.జనార్థన్‌రెడ్డి సీఎంగా ఉండి, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తే, ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.2 ఏళ్లు జీతాలు మరో పెద్ద స్కామ్:ఇక్కడ ప్రభుత్వం కట్టిన కాలేజీలు ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్ కాగా.. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇస్తుందట!. ఇది మరో పెద్ద స్కామ్. ఒక మెడికల్ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయి. అంటే రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు. ఇది ఒక పెద్ద స్కామ్అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం:రేపు మనం అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. ఈ స్కామ్‌కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టం. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం. అందుకే చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నాం. గవర్నర్ 40 మందికి అనుమతి ఇచ్చారు. లోక్‌భవన్‌కు వెళ్లే ముందు అంబేడ్కర్ విగ్రహం వరకు అందరం వెళ్దాం. అక్కణ్నుంచి 40 మందితో కలిసి గవర్నర్‌ను కలుస్తాం. ఆ తర్వాత కోర్టు తలుపు తడతాం. అయినా చంద్రబాబు నిర్ణయం మార్చుకోకపోతే.. ప్రజా ఉద్యమం కొనసాగిస్తాం’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
కోటి సంతకాల ఉద్యమం.. ఒక చరిత్ర: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఒక గొప్ప ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని.. చర్రితలో ఇంత పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమం జరగలేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామస్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరికీ వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.‘‘మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టడమే పెద్ద స్కాం. మళ్లీ రూ. 120 కోట్ల ప్రజాధనాన్ని జీతాల కింద ఎలా ఇస్తారు?. కాలేజీలు ప్రైవేటుకు ఇచ్చి జీతాలు మీరు ఎలా ఇస్తారు?. ఇంతకంటే పెద్ద స్కాం ఉంటుందా?’’ అంటూ వైఎస్ జగన్.. చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘కోటి సంతకాలు లోక్‌భవన్‌కు చేరుకున్నాయి. కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు ఒక చరిత్ర. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతూ ఉంది. ఈ మాట చంద్రబాబే చెప్పుకున్నారు. కూటమి పాలనలో ప్రజలకు మంచి జరగలేదు. 2 బడ్జెట్లు పెట్టినా ప్రజలను జరిగిన మంచి గుండుసున్నా. మన హయాంలో పథకాల అమలుకు క్యాలెండర్ ఇచ్చాం. బాబు సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ అంటూ మోసం చేశారు. మన హయాంలో పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశాడు’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘కూటమి పాలనలో వ్యవస్థలు కుప్పకూలాయి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. అన్నదాతలకు రైతు భరోసా అందడం లేదు. ప్రైవేటీకరణ అంటేనే దోపీడీ. విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. మన హయాంలో ఆర్టీసీని బతికించాం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. కూటమి పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనం. చంద్రబాబు తప్పులు చేసి కలెక్టర్లపైకి నెట్టేస్తున్నారు. అక్టోబర్ 7న సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించా. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు సంతకాల ఉద్యమం సాగింది’’ అని వైఎస్ జగన్ వివరించారు. -
సొంతూరిలో చంద్రబాబుకి షాక్!
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతూరిలోనే ఆయనకు షాక్ తగిలింది. ఆయన తీసుకున్న పీపీపీ విధానాన్ని ఆ ఊరి ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో ఈ ఊరి ప్రజలూ భాగం కావడం గమనార్హం.వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంకల్పించారు. అందులో ఏడు పూర్తి చేయగా.. మరో 10 నిర్మాణ దశలో ఉన్నాయి. ఈలోపు కూటమి ప్రభుత్వం జగన్‌కు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో వాటిని అలాగే వదిలేసింది. అటుపై.. పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తూ చంద్రబాబు సర్కార్ పీపీపీ విధానంలో వాటి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది.చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తమ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ చేపట్టింది వైఎస్సార్సీపీ. తుపాను, వర్షాల్లోనూ రెండు నెలలపాటు రాష్ట్రమంతటా ఉవ్వెత్తున సాగింది ఈ కార్యక్రమం. ఇందులో భాగంగా.. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలోనూ ప్రజలు సంతకాలు చేశారు. అయితే.. తమ ఊరి నుంచి ఎలాంటి సంతకాలు చేయలేదని నారావారిపల్లె టీడీపీ నేతలు ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటనలు చేశారు. కానీ, వైఎస్సార్సీపీ రచ్చబండలో భాగంగా అక్కడా సంతకాల సేకరణ జరిగింది. ఆ పత్రాలు అక్కడి నుంచి చంద్రగిరి నియోజకవర్గానికి.. అక్కడి నుంచి తిరుపతికి.. అక్కడి నుంచి ఇవాళ తాడేపల్లికి చేరుకున్నాయి. ఈ లెక్కన.. సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్ జగన్ సమర్పించబోయే చంద్రబాబు వ్యతిరేక ప్రజా గళాల్లో ఆయన సొంతూరి ప్రజలది కూడా ఉండబోతుందన్నమాట. -
‘పోయేకాలం వచ్చింది’.. కడియం శ్రీహరిపై రాజయ్య ఫైర్
స్టేషన్ ఘన్పూర్: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దాఖలు చేసిన అఫిడవిట్‌పై తాటికొండ రాజయ్య తీవ్ర స్థాయిలో స్పందించారు. కడియం శ్రీహరి రాజకీయ నైతికతను పూర్తిగా కోల్పోయి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.“రామా.. కృష్ణా అనుకుంటూ జీవించాల్సిన వ్యక్తి రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డాడు. ఘనపూర్ నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకుంటున్నాడు” అంటూ రాజయ్య ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కష్టంతో ఎమ్మెల్యేగా గెలిచి, అదే పార్టీ కార్యకర్తలను నట్టేట ముంచేశారని ఆరోపించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.గతంలో అనేకసార్లు తాను కాంగ్రెస్‌లో చేరానని, కాంగ్రెస్ కండువా కప్పుకున్నానని బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. “నీ నీతిమాలిన మాటలతో సభ్య సమాజమే సిగ్గుపడుతోంది” అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ శ్రేణులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే కాంగ్రెస్ నాయకుల వద్దకే వెళ్లిపోతావా అని ప్రశ్నించారు. ప్రజలకు తన రాజకీయ వైఖరిని ఎలా సమర్థించుకుంటావని నిలదీశారు.అదే సమయంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ కూడా రాజ్యాంగాన్ని పట్టపగలు ఖూనీ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. “సిగ్గు, శరం ఉంటే ఇప్పటికైనా రాజీనామా చేయాలి” అంటూ కడియం శ్రీహరికి హితవు పలికారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో అడుగుపెడితే తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించిన రాజయ్య, ప్రజల్లో ఆగ్రహం రోజురోజుకు పెరుగుతోందని స్పష్టం చేశారు. -
కోటి గళాలను పక్కదోవ పట్టిస్తారా?
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల ప్రైవెటీకరణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమానికి కోటి గొంతుకలు మద్దతిస్తూంటే.. ప్రజల్లో ఏర్పడ్డ ఈ అసంతృప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం నానా తంటాలూ పడుతోంది. ఇదే అదనుగా ఎల్లోమీడియా కూడా విషయాన్ని పక్కదారి పట్టించేందుకు పడుతున్న పాట్లు ప్రజల్లో ఏహ్యభావాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఎల్లోమీడియా కొన్ని వాస్తవాలను తమకు తెలియకుండానే ఒప్పుకుంటూండటం గమనార్హం. ఎల్లోమీడియా ప్రతినిధి ఈనాడు అకస్మాత్తుగా వైద్యకళాశాలల నిర్వహణపై పీపీపీ విధానమే మేలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసిందంటూ ఒక భారీ కథనాన్ని ప్రచురించింది. సహజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పాట అందుకున్నారు. కమిటీ సిఫారసులేమిటన్నది కాసేపు పక్కనబెడదాం. అసలు చంద్రబాబుకు ఇలాంటి కమిటీలపై నమ్మకం ఉందా? మూడు పంటలు పండే అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దు అని కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాన్ని బేఖాతరు చేసింది ఈ చంద్రబాబే కదా? ఈనాడు ఈ రకంగా విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే... ఆంధ్రజ్యోతి వైఎస్సార్ సీపీ కోటి సంతకాల ఉద్యమానికి ప్రజా మద్దతు పెద్దగా లేదని సన్నాయి నొక్కులు నొక్కింది. దీన్ని బట్టి మరోసారి స్పష్టమైన విషయం ఏమిటంటే... చంద్రబాబుకు కష్టం కలిగిన ప్రతి సందర్భంలోనూ కాపు కాసేందుకు ఈ ఎల్లో పత్రికలు రెండూ తమదైన డ్రామాను తెరమీదకు తెస్తాయి అని!వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే 17 వైద్య కళాశాలలకు అనుమతులు సాధించారన్న విషయం అందరికీ తెలిసిందే. దశాబ్దాలుగా సాధించిన కళాశాలలు కేవలం 12 మాత్రమే. కానీ ఎకాఎకిన 17 కాలేజీలకు అనుమతి సాధించిన జగన్‌ను పచ్చ మీడియా, తెలుగుదేశం నేతలు ఎన్నడూ అభినందించిన పాపాన పోలేదు. పైపెచ్చు తప్పుడు ప్రచారాలు ఆరంభించారు. జగన్ ఈ కాలేజీల సమర్థ నిర్వహణ కోసం ఎన్నారై కోటా కింద నిర్దిష్ట ఫీజులు నిర్ణయిస్తే ఇదే టీడీపీ, జనసేనలు తీవ్ర విమర్శలకు దిగాయి. సీట్లు అమ్ముకుంటారా తెగ బాధపడిపోయాయి. బాబు గారి తనయుడు లోకేశ్ యువగళం కార్యక్రమాల్లో మాట్లాడుతూ సీట్లు అన్నింటిని ప్రభుత్వమే కేటాయిస్తుందని, బి కేటగిరి కింద సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉండబోవని హమీ ఇచ్చారు. చంద్రబాబు సైతం అదే చెప్పారు కానీ అధికారం రాగానే మాట మార్చేశారు. ప్రభుత్వ కాలేజీలన్నింటినీ ప్రైవేటుపరం చేయడానికి రెడీ అయ్యారు. అదేమని అడిగితే ఇవి ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి కానీ ప్రైవేటు వారు నడుపుతారంటూ బుకాయించడం ఆరంభించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం ఆరంభించారు. అదే టైమ్‌లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ఖరీదును భారీగా పెంచేశారు. ప్రభుత్వం ప్రతి కాలేజీకి కేటాయించిన ఏభై నుంచి వంద ఎకరాల భూమిని, ఇప్పటికే సాగిన నిర్మాణాలను ప్రైవేటు సంస్థలకు, అవి కూడా వారి తైనాతీలకు కట్టబెట్టడానికి రంగం సిద్దం చేశారు. పైగా జగన్ టైమ్‌లో అసలు కాలేజీలు రానట్లు తప్పుడు ప్రచారం చేయాలని కూడా ఆలోచించి చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు వంటివారు కాలేజీలు ఎక్కడ అంటూ ప్రశ్నించి ఆశ్చర్యం కలిగించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఈ మెడికల్ కాలేజీల అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనంలోకి వెళ్లారు. ఆయా చోట్ల జగన్ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలు, అలాగే వైసీపీ బృందాలు నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లేలా ప్లాన్ చేశారు. తాను స్వయంగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు వెళ్లినప్పుడు వచ్చిన అనూహ్య స్పందన రాష్ట్ర ప్రజలందరిని ఆకట్టుకుంది. అప్పటి నుంచి రకరకాల దశలలో ఈ ఉద్యమాన్ని ఒక క్రమబద్దంగా సాగించారు. ప్రజలలో ఉన్న వ్యతిరేకతను రాష్ట్రం, దేశం దృష్టికి తీసుకురావడానికి ఆయన కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. దీంతో వైసీపీ క్యాడర్‌కు కూడా ఒక ఊపు, ఉత్తేజాన్ని ఇచ్చింది. ప్రతిపక్షంగా ప్రజలలో గట్టిగా పనిచేయడానికి ఇది ఒక అవకాశం కల్పించింది. ప్రభుత్వ పెద్దలకు కంగారు ఏర్పడింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని రక్షించేందుకు, ప్రజలలో ప్రభుత్వ కాలేజీలపై వ్యతిరేకత తీసుకురావడానికి ఎల్లో మీడియా ప్రయత్నాలు ఆరంభించింది.అయినా ప్రజలలో ఈ అంశంపై ఆగ్రహం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈనాడు మీడియా కొద్దిరోజుల క్రితం ‘పీపీపీ విధానమే మేలు’ అన్న శీర్షికతో ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేసింది. వివిధ శాఖలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఉంటాయి. అవి ఆయా అంశాలపై చర్చలు జరిపి కొన్ని సిఫారసులు చేస్తుంటాయి. అవేవి కేంద్ర ప్రభుత్వ అధికార పార్టీ అభిప్రాయాలుగా చూడరు. ఈ స్టాండింగ్ కమిటీ సిఫారసులను కేంద్రం పట్టించుకున్న సందర్భాలు అరుదు. రాష్ట్రాలలో కూడా శాసనసభ కమిటీల సిఫారసుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. అది ఒక కోణం అయితే ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏమైనా ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని సూచించిందా? అంటే లేదు. భవిష్యత్తులో మరిన్ని కాలేజీల అవసరం ఉంటే ప్రైవేటు వారిని కూడా భాగస్వాములు చేయవచ్చని అభిప్రాయపడింది. ప్రత్యేకించి ప్రభుత్వ ఆస్పత్రులను వాడుకోవచ్చని తెలిపింది. అంతే తప్ప ప్రభుత్వ కాలేజీలు వద్దని కాని, ప్రభుత్వ కాలేజీల కోసం కేటాయించిన భూములు, నిర్మించిన భవనాలను ప్రైవేటు వారికి దోచిపెట్టవచ్చని కాని ఎక్కడా సిఫారసు చేయలేదు. ఒక్కో కాలేజీకి కేటాయించిన ఏభై నుంచి వంద ఎకరాల భూములను ఎకరా రూ.వందకు లీజుకు ఇవ్వాలని, అది కూడా 66 ఏళ్లకు లీజుకు ఇవ్వాలని ఎక్కడా పేర్కొనలేదు. ఈనాడు మీడియా ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ అమలు చేస్తున్న విధానానికి స్టాండింగ్ కమిటీ మద్దతు ఇచ్చిందేమో అన్న అభిప్రాయం కలిగించాలని కుట్రపూరితంగా ఈ కథనం ఇచ్చింది. అందుకే వైసీపీ నేతలు టీజేఆర్ సుధాకర్ బాబు, సిదిరి అప్పలరాజు తదితరులు చంద్రబాబు జేబు సంస్థ మాదిరి ఈనాడు మీడియా తప్పుడు కథనాలు ఇస్తోందని మండిపడ్డారు. చిత్తశుద్ది ఉంటే ఈనాడు ఇప్పటికే మంజూరైన ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి ఈ సిఫారసులు చేయలేదని, భవిష్యత్తులో వచ్చేవాటికి అని రాసి ఉండేది. ఆ పని చేయలేదు. ప్రతి దానికి సొంత భాష్యం ఇచ్చి వైసీపీపై విషం కక్కే ఎల్లో మీడియా ఈ కమిటీ సిఫారసులకు ఉన్న విలువ ఏమిటి? కేంద్రం వీటిలో ఎన్నిటిని పట్టించుకుంటుంది? ఇప్పటికే ప్రైవేటు రంగంలో ఉన్న వైద్యకాలేజీలు ఎలా నడుస్తున్నాయి. పేదలకు ఏ మేరకు ఉచిత వైద్యం అందుతున్నది? ప్రభుత్వ కాలేజీలలో ఉండే లాభనష్టాలు మొదలైన వాటిని విశ్లేషించి ఉంటే ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్పినట్లయ్యేది. అవేవి చేయకుండా ప్రజలను మభ్య పెట్టి, కోటి సంతకాల ఉద్యమంపై నీళ్లు చల్లే ఉద్దేశంతో కథనం రాయడంపై వైసీపీ మండిపడింది. దేశంలో కొత్తగా 75 వేల వైద్య విద్య సీట్లు పెంచడం కోసం స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది తప్ప, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ఎక్కడా వ్యాఖ్యానించలేదన్నది వాస్తవం. వైద్య కళాశాలలు లేని జిల్లాలు, వెనుకబడిన ప్రాంతాలలో కొత్త కాలేజీలు ఏర్పాటు కావాలని కమిటీ అభిప్రాయపడింది. జగన్ తన హయాంలో చేసింది కూడా అదే కదా! కేంద్రం కూడా ప్రభుత్వరంగంలోనే వైద్యకాలేజీలు మంజూరు చేసింది తప్ప పీపీపీ విధానంలో కాదు. బహుళజాతి సంస్థలకు, వేల కోట్ల రూపాయల లాభార్జన చేస్తున్న సంస్థలకు ఎకరా 99 పైసలకే భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం, పేదలకు ప్రయోజనం కలిగించే వైద్య కాలేజీలకు ఐదువేల కోట్లు ఖర్చు చేయడానికి ఇష్టపడడం లేదు. ప్రైవేటువారికే సంపదగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనా ఏపీలో ప్రభుత్వ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి మందికి పైగా గళం విప్పడం అభినందనీయం అని చెప్పాలి. ఎల్లో మీడియా ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నట్లు కాకుండా ప్రజల కోసం పనిచేస్తే మంచిది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థాన నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది. శ్రీవారి ఆలయం ముందు ఓ రాజకీయ పోస్టర్ కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు అతి చర్యలకు దిగారు. అన్నాడీఎంకే కార్యకర్తలు ఆలయ పరిసరాల్లో జయలలిత, పళని స్వామి చిత్రాలతో కూడిన పోస్టర్‌ను పెట్టి రీల్స్ తీశారు. పోస్టర్లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మాజీ సీఎం పళని స్వామి చిత్రాలు ఉండటం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఆలయ పరిసరాల్లో రాజకీయ చిహ్నాలు, ప్రసంగాలు, ప్రచారం నిషేధం ఉన్నప్పటికీ, కార్యకర్తలు అత్యుత్సాహంతో ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనను పట్టించుకోని టీటీడీ భద్రతా అధికారులు విమర్శలకు గురవుతున్నారు. ఆలయ పరిసరాల్లో భద్రతా చర్యలు కఠినంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై టీటీడీ అధికారులు స్పందించారు. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. -
నాడు ఒక్క ఓటుతో భర్త ఓటమి.. నేడు భార్య ఘన విజయం
సిద్దిపేట జిల్లా: గత ఎన్నికల్లో మండలంలోని చల్లాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో అతని భార్య రోజా భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో చల్లాపూర్ సర్పంచ్ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. అప్పట్లో రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి చెందారు. ప్రస్తుతం ఈ జీపీని బీసీ మహిళకు కేటాయించారు. దీంతో రమేష్ తన భార్య రోజాను కాంగ్రెస్ మద్దతుతో బరిలో దింపారు. ఆమె సమీప ప్రత్యర్థిపై 558 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గ్రామస్తులు రమేష్ దంపతులను ఘనంగా సన్మానించారు. గోపాల్ ‘తీన్’మార్! దోమ: మండలంలోని పెద్దతండాచిన్నతండా పంచాయతీలో బుధ వారం నిర్వహించిన సర్పంచ్ ఓట్ల కౌంటింగ్ నువ్వా..నేనా.. అన్నట్లగా సాగింది. ఇక్కడ కాంగ్రెస్ బలపర్చిన నేనావత్ లక్ష్మణ్, బీఆర్ఎస్ మద్దతుతో ఆంగోత్ గోపాల్ బరిలో ఉన్నారు. వీరి మధ్య సాగిన ఉత్కంఠ పోరులో ప్రత్యర్థి లక్ష్మణ్‌పై మూడు ఓట్ల స్వల్ప తేడాతో గోపాల్ విజయం సాధించారు. -
రివర్స్ డ్రామా.. వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌పై కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెర తీసింది. మాచవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేయించింది.సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయ్యింది. 2024 జులైలో వంశీ, ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డాడని తాజాగా ఆ వ్యక్తి మాచవరం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో.. వంశీ సహా మరో 20 మందిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఇక్కడ జరిగింది వేరు!. 2024 జూలై 7న విజయవాడలోని వంశీ ఇంటిపై టీడీపీ గూండాలు కత్తులు, కర్రలు, రాడ్లు, రాళ్లతో రెచ్చిపోయారు. అయితే వంశీ ఇంటిపై జరిగిన దాడిని.. తమ పైన దాడిగా రివర్స్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం. పైగా ఫిర్యాదులో తమను ఉద్ధేశపూర్వకంగా రెచ్చగొట్టి.. దూషించి దాడి చేశారంటూ సునీల్ పేర్కొనడం గమనార్హం. ఇంతకు ముందు.. వల్లభనేని వంశీని అక్రమ కేసుల్లో కూటమి ప్రభుత్వం జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో నకిలీ ఇళ్ల పట్టాల కేసుతో వంశీని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఈ కేసులో విజయవాడ జైల్లో ఉన్న ఆయన.. నూజివీడు కోర్టు బెయిల్ ఇవ్వడంతో 137 రోజుల తర్వాత బయటకు వచ్చారు. -
మహా పొలిటికల్ డ్రామా.. ‘రమ్మీ మంత్రి’ రాజీనామా!
మహారాష్ట్రలో రాజకీయాల్లో మరోసారి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్సీపీ సీనియర్ నేత మాణిక్‌రావ్ కోకాటే.. క్రీడా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సభలోనే ఆన్లైన్ రమ్మీ ఆడి.. రమ్మీ మినిస్టర్‌గా ఈయన పేరు పొందిన సంగతి తెలిసే ఉంటుంది. ఆ సమయంలో కోకాటేను వ్యవసాయ శాఖ నుంచి తప్పించి క్రీడా శాఖకు మార్చడమూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. మూడు దశాబ్దాల నాటి హౌసింగ్ స్కాం కేసులో నాసిక్ సెషన్స్ కోర్టు బుధవారం మాణిక్‌రావ్ కొకాటే(Manikrao Kokate)ను దోషిగా తేల్చి.. శిక్షను ఖరారు చేసింది. దీంతో.. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం, మంత్రి పదవి రద్దయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల నడుమ ముందుగానే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. కోకాటే రాజీనామా లేఖ ఇంకా సీఎం పేషీకి చేరలేదు. దీంతో.. ప్రస్తుతానికి ఆయన పోర్ట్‌ఫోలియో లేని మంత్రిగా ఉన్నారు.కేసు ఏంటంటే.. 1995లో హౌజింగ్ సొసైటీలకు సంబంధించి ఆర్థిక బలహీన వర్గాల (EWS) కోసం కేటాయించిన 10% కోటాను దుర్వినియోగం చేశారని మాణిక్‌రావ్, ఆయన సోదరుడు విజయ్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో.. ఛీటింగ్, ఫోర్జరీలకు పాల్పడడ్డారని తేలడంతో ఇద్దరికీ రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది. తీర్పు ఇచ్చిన వెంటనే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రజాప్రతినిధుల చట్టం, 1951 సెక్షన్ 8 ప్రకారం.. క్రిమినల్ కేసుల్లో ప్రజాప్రతినిధులకు(ఎమ్మెల్యే/ఎంపీ) రెండేళ్లు.. అంత కంటే ఎక్కువ శిక్ష పడితే తక్షణమే సభ్యత్వం రద్దు అవుతుంది. ఒకవేళ పైకోర్టులు వాటిపై స్టే విధిస్తే వాళ్లకు ఊరట దక్కుతుంది. దీంతో.. బుధవారం నాడే బాంబే హైకోర్టులో నాసిక్ కోర్టు తీర్పును కోకాటే బ్రదర్స్ సవాల్ చేశారు. అత్యవసర విచారణను శుక్రవారం జరుపుతామని కోర్టు తేల్చి చెప్పింది. ఈలోపు అనారోగ్యం పేరిట ముంబైలోని లీలావతి కొకాటే చేరడంతో అరెస్ట్ తాత్కాలికంగా వాయిదా పడింది. అత్యవసర భేటీ, ఆపై.. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్పీపీ చీఫ్ అజిత్ పవార్.. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ అయ్యారు. శివసేన, బీజేపీ ఒత్తిళ్ల మేరకు కొకాటేను తొలగించాల్సిందేనని ఫడ్నవిస్ పవార్‌కు స్పష్టం చేశారు. దీంతో ఎన్సీపీ అత్యవసర సమావేశం నిర్వహించి కీలక నేతలతో అజిత్ పవార్ చర్చలు జరిపారు. అనంతరం.. కొకాటే తన రాజీనామా ప్రకటన చేశారు. కొకాటే రాజీనామాతో క్రీడా శాఖ బాధ్యతలు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వద్దకు వెళ్లింది.మరోవైపు.. ఈ పరిణామంపై కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ వర్గం భగ్గుమంటోంది. మహారాష్ట్ర మహాయుతి ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆరోపిస్తున్నారు. గతంలో.. రాహుల్ గాంధీ, సునీల్ కేదార్(మహారాష్ట్ర మాజీ మంత్రి) కేసుల్లో తీర్పు వెలువడిన వెంటనే డిస్క్వాలిఫికేషన్ జరిగిందని, కోకాటే విషయంలో ఆలస్యం ఎందుకు? అని ప్రశ్నించారు..అటు హస్తినలో.. కొకాడే రాజీనామా వ్యవహారం అటు ఢిల్లీలోనూ హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత ధనంజయ్ ముండే ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. తనది రాజకీయ భేటీ కాదని ముండే ఆ తర్వాత మీడియాకు స్పష్టత ఇచ్చారు. ఐదుసార్లు ఎమ్మెల్యే..ఈ ఏడాది జులైలో. అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ మాణిక్‌రావ్ కోకాటేపై కెమెరా కంటికి చిక్కారు. దీంతో.. రైతుల ఆత్మహత్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే తాను ఫోన్ ఆపరేట్ చేస్తుండగా పాపప్ నోటిఫికేషన్ వచ్చిందని, ఉద్దేశపూర్వకంగా తాను దానిని తెరవలేదని కోకటే వివరణ ఇచ్చుకున్నారు. అయినప్పటికీ ఆయన్ని వ్యవసాయ శాఖ నుంచి తొలగించి.. క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు యువజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలను కేటాయించింది ఫడ్నవిస్ ప్రభుత్వం. సిన్నార్ ఎమ్మెల్యే అయిన కోకటే.. ఇప్పటి దాకా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. “#जंगली_रमी_पे_आओ_ना_महाराज…!”सत्तेतल्या राष्ट्रवादी गटाला भाजपला विचारल्याशिवाय काहीच करता येत नाही म्हणूनच शेतीचे असंख्य प्रश्न प्रलंबित असताना, राज्यात रोज ८ शेतकरी आत्महत्या करत असताना सुद्धा काही कामच नसल्याने कृषिमंत्र्यांवर रमी खेळण्याची वेळ येत असावी.रस्ता भरकटलेल्या… pic.twitter.com/52jz7eTAtq— Rohit Pawar (@RRPSpeaks) July 20, 2025 -
వైఎస్సార్సీపీ కీలక భేటీ.. సాయంత్రం లోక్ భవన్‌కు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం వైఎస్సార్సీపీ కీలక భేటీ జరగనుంది. కోటి సంతకాల ప్రతులను రాష్ట్ర గవర్నర్‌కు అందజేయనున్న నేపథ్యంలో ఆయన ముందుగా పార్టీ నేతలతో భేటీ నిర్వహించనున్నారు.వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున.. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించాలని ప్రయత్నించారు. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం ద్వారా కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు రాష్ట్రంలో వైద్య విద్యా అవకాశాలను విస్తరించడం ఉద్దేశంతో ఆయన ఈ అడుగు వేశారు.ఇందులో ఏడు పూర్తి కాగా.. వైఎస్సార్సీపీ దిగిపోయేనాటికి మరో పది నిర్మాణంలో ఉన్నాయి. అయితే.. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాటిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. చివరకు పీపీవీ విధానం పేరిట కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ పేరిట ప్రజా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు వైఎస్ జగన్.అక్టోబర్ నెలలో గ్రామాల స్థాయిలో ‘రచ్చబండ’ పేరిట మొదలైన సంతకాల సేకరణ.. ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. రెండు నెలల్లో చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు చేశారు. విద్యార్థులు, మేధావులు.. అన్ని వర్గాల ప్రజలూ వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణలో పాల్గొనడంతో.. దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.కొసమెరుపు ఏంటంటే.. అలాగే చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లెలోనూ ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతూ అక్కడి ప్రజలు సంతకాలు చేయడం..ఇప్పటికే అన్ని జిల్లాల నుండి సంతకాల ప్రతుల బాక్స్‌లు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం పత్రాలతో వచ్చిన వాహనాలకు వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. అవి అక్కడి నుంచి నేరుగా లోక్‌భవన్(పూర్వ రాజ్‌భవన్)కు చేరుకుంటాయి.అనంతరం పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశమై.. ఇప్పటిదాకా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం గురించి చర్చిస్తారు. సాయంత్రం పార్టీ కీలక నేతలతో కలిసి లోక్ భవన్‌కు వైఎస్ జగన్‌కు వెళ్తారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యి.. మెడికల్ కాలేజీల ప్రవేటీకరణపై ప్రజల అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారు. -
బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. డీఎస్పీకి గాయాలు.. జగిత్యాలలో పోలీసు కాల్పులు
సాక్షి,జగిత్యాల: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పరిధిలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్-బీజేపీ అభ్యర్థుల మధ్య పంచాయతీ ముదిరి పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో.. పోలీసు సిబ్బందికీ గాయాలు కావడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. పైడిపల్లి గ్రామం బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల మంగ 32 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి జక్కుల మమత సంతకం చేసి కౌంటింగ్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అయితే కాసేపటికే బీజేపీ శ్రేణులు మళ్లీ అక్కడకు చేరుకుని.. ఒక బ్యాలెట్ బాక్స్ లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనకు దిగాయి. ప్రతిగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు, అధికారులు గాయపడ్డారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కానీ ఉద్రిక్తతలు మరింత పెరగడంతో పోలీసులు గాల్లోకి పది రౌండ్లు కాల్పులు జరిపారు. ఆందోళనకారులు ఎంసీసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడి.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసినందుకు పలువురిపై కేసులు నమోదు చేశారు. పైడిపల్లిలో భయాందోళన వాతావరణం నెలకొనడంతో.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కొనసాగిస్తున్నారు. మరోవైపు.. కట్టుదిట్టమైన పోలీస్ పహారాలో బ్యాలెట్ బాక్సులను తరలించారు. -
రాష్ట్రాలపై భారం మోపి.. ‘ఉపాధి’ని ఎత్తేసే కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ పేదలకు కష్టకాలంలో అండగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని అటకెక్కించేందుకు.. పేదలకు హక్కుగా ఉన్న ఉపాధిని అగమ్యగోచరంగా మార్చేలా, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాల మెడపై కత్తి వేలాడదీసేలా రూపొందించిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ బిల్లు–2025’పై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభలో బుధవారం ఈ బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్రా లపై భరించలేనంత భారం మోపి, పరోక్షంగా ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పొట్టకొట్టే ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ‘ఇన్నాళ్లూ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఒక చట్టబద్ధమైన హక్కుగా ఉండేది. కానీ కేంద్రం తెస్తున్న కొత్త బిల్లులోని అస్పష్టమైన నిబంధనల వల్ల ఆ హక్కును పేదలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ బిల్లు పేదల్లో తీవ్ర అభద్రతాభావాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తోంది. నిధుల కేటాయింపులో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో కేంద్రం 90 శాతం నిధులు ఇస్తుండగా, రాష్ట్రాలు కేవలం 10 శాతం మాత్రమే భరిస్తున్నాయి. కొత్త బిల్లులో కేంద్రం తన వాటాను 60 శాతానికి తగ్గించుకుని, రాష్ట్రాలపై ఏకంగా 40 శాతం భారం మోపడం దారుణం. ఇది సమాఖ్య స్ఫూర్తికే విఘాతం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలను మరింత సంక్షోభంలోకి నెట్టేయడమే. మరీ ముఖ్యంగా.. రాష్ట్రాలు తమ వాటా 40 శాతం నిధులను ముందుగా జమచేస్తేనే, కేంద్రం తన వాటా నిధులను విడుదల చేస్తుందన్న నిబంధన పెట్టడం పూర్తిగా అసంబద్ధం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత పెద్ద మొత్తాన్ని ముందుగా ఎలా సర్దుబాటు చేస్తాయి? ఈ నిబంధన ఆచరణ సాధ్యం కాదు. ఇది పథకాన్ని నిర్వీర్యం చేయడమే. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లలో సగటున రూ.8 వేలకోట్లు ఉపాధి హామీ కోసం ఖర్చు చేశారు. కొత్త నిబంధన అమలైతే రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.3,200 కోట్లు భరించాల్సి వస్తుంది. ఇంతటి భారీ భారాన్ని రాష్ట్రం మోయలేదు. పనిదినాల పెంపు ఆచరణ సాధ్యం కాదు..మరోవైపు పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచామని కేంద్రం గొప్పగా చెప్పుకొంటున్నా.. అది ఆచరణలో సాధ్యం కాదు. రాష్ట్రాలు తమ వాటా నిధులను కట్టలేకపోతే, కేంద్రం నిధులు ఆగిపోతాయి. అప్పుడు ఈ పెంచిన పనిదినాల వల్ల పేదలకు ఒరిగేదేమీ ఉండదు. ఇది కేవలం కంటితుడుపు చర్యగానే మిగిలిపోతుంది..’ అని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను గమనించకుండా, ఏకపక్షంగా రూపొందించిన ఈ బిల్లును వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఇతర వాటాదారులతో విస్తత చర్చలు జరిపిన తర్వాతే, పేదల ప్రయోజనాలు కాపాడేలా మార్పులు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
ఆ అభిప్రాయం తప్పని తేలింది
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తిగా సంతృప్తి కలిగించే ఫలితాలు రాకపోయినా ఒక మోస్తరు మంచి ఫలితాలనే సాధించామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కొంతకాలంగా బీజేపీ పట్ట ణప్రాంతాలకే పరిమితమైన పార్టీ అనే విమర్శ ఉన్నా...దానిని ఈ ఎన్నికల్లో సాధించిన ఫలితాల ద్వారా తప్పు అని నిరూపించగలిగామని అంటున్నారు. బుధవారం జరిగిన మూడోవిడత ఎన్నికల ఫలితాలతో కలిపి మొత్తంగా 700 దాకా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచినట్టుగా వారు అంచనా వేస్తున్నారు. మొదటి విడత కంటే కూడా రెండు, మూడు విడతల్లో మంచి ఫలితాలు వచ్చాయని అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో గణనీయమైన స్థానాలు సాధించామని, ఇతర జిల్లాల్లోనూ కనీస ప్రాతినిధ్యం దక్కడంతో మొత్తంగా గ్రామీణ పాంతాల్లో గట్టి ఉనికిని ప్రదర్శించినట్టయ్యిందని చెబుతున్నారు. 900 మంది వరకు మా వాళ్లే: బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు మూడు విడతల్లో కలిపి మొత్తంగా 800 నుంచి 900 వరకు (ఇండిపెండెంట్లు కలుపుకొని) సర్పంచ్ స్థానాల్లో తమ పార్టీ బలపరిచినవారు విజయం సాధించి ఉంటారని భావిస్తున్నట్టు బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఫలితాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోకి బీజేపీ బలంగా చొచ్చుకు వెళ్లిందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ విధంగా క్షేత్రస్థాయిలో పెరిగిన పార్టీ బలం త్వరలోనే రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మరిన్ని మంచి ఫలితాల సాధనకు దోహదపడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. పెద్దసంఖ్యలో వార్డుసభ్య స్థానాలను, ఉప సర్పంచ్‌లను సైతం గెలుచుకోవడం సంతృప్తిని కలిగించిందన్నారు. మొత్తంగా పార్టీకి బలంగా ఉన్న ప్రాంతాలు..ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు ఇతర జిల్లాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయన్నారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో 163 మంది సర్పంచ్‌లకే బీజేపీ పరిమితం కావడాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం దాదాపు 12 వేల గ్రామ పంచాయతీలల్లో ఎన్నికలు జరిగితే 6 నుంచి 7 వేల గ్రామాల్లోనే అభ్యర్థులను నిలపాగలిగామని రాంచందర్‌రావు తెలిపారు. భద్రాచలం, మహబూబాబాద్, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామటుకు పోటీకి నిలబెట్టలేకపోయామని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల బీజేపీకి పట్టున్న అనేక గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో అక్కడ ఎన్నికలు జరగలేదన్నారు. -
బీఆర్ఎస్లో ఉత్సాహం
సాక్షి, హైదరాబాద్: మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీకి ఊపిరి పోశాయని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో చేదు ఫలితాలను చవి చూసిన పార్టీలో.. తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయని అంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఫలితాలపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నారు. గ్రామాల్లో తమ పట్టు చెక్కు చెదరలేదనే భావన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 12 వేలకు పైగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కనీసం 40 శాతం సర్పంచ్ పదవులు పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నట్లు బీఆర్ఎస్ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. కేడర్ చెక్కు చెదరలేదు! పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కేడర్‌ను స్థానికంగా సమన్వయం చేసుకుని పట్టుదలతో పనిచేయడం వల్లే అధికార కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చామనే అభిప్రాయం బీఆర్ఎస్ నాయకత్వంలో వ్యక్తం అవుతోంది. పార్టీ కార్యకర్తలు చూపిన తెగువ, పట్టుదల నాయకత్వానికి స్ఫూర్తినిచ్చేలా ఉందనే అభిప్రాయం పైస్థాయి నాయకుల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లోపం, గ్రూపు తగాదాలు, పాలన వైఫల్యం, పల్లెల్లో అభివృద్ధి కుంటుపడటం కూడా తమకు కలిసి వచ్చాయని గులాబీ దళం విశ్లేషిస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్ లాంటి చోట్ల మినహా ఎక్కడా పెద్దగా బీజేపీ ప్రభావం కనిపించలేదని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలు..ఆ పార్టీ బలపడిందనడానికి నిదర్శనం కాదని తేలిపోయిందని బీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నూతనోత్సాహంతో ముందుకు.. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల దిశగా సన్నద్ధం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. త్వరలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత కమిటీలు ఏర్పాటు చేయడం, సభ్యత్వ నమోదు, శిక్షణ కార్యక్రమాల సంబంధిత షెడ్యూల్‌ను పార్టీ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 21న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించే అవకాశముంది. అలాగే భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. పార్టీకి అధికార కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై మరింత దూకుడుగా వెళ్లేలా క్షేత్ర స్థాయిలో పోరాటాలకు కార్యాచరణపై గట్టిగా దృష్టి పెట్టే యోచనలో ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను విశ్లేషించి జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ బలహీనతలపైనా పోస్ట్‌మార్టమ్ చేయాలని భావిస్తున్నామన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత.. ఇతర పార్టీల్లోకి నేతల వలసలు, ఫిరాయింపులతో బలహీన పడిన నియోజకవర్గాలపైనా ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. -
మూడో విడతలో 85.77%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తుది విడతలో 85.77 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో 84.28%, రెండో విడతలో 85.86% ఓటింగ్ రికార్డయిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సమయం ముగియగా, ఒంటి గంటలోపు క్యూలైన్లో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతినిచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, అది పూర్తయ్యాక విజేతలను ప్రకటించారు. బుధవారం రాత్రికల్లా దాదాపుగా కొన్నిచోట్ల మినహా ఉపసర్పంచ్ ఎన్నిక కూడా పూర్తయింది.తుది విడతలో ఇలా....182 మండలాల్లో మొత్తం 4,159 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 11 సర్పంచ్‌లు, 116 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. 3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా.. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డులకు 75,725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండు పంచాయతీలు, 18 వార్డులకు ఎన్నికలు జరగలేదు. ఈ దఫాలో మొత్తం 50,56,344 మంది ఓటర్లు ఉండగా.. 43,37,024 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.56% కాగా, ఆ తర్వాతి స్థానాల్లో మెదక్ 90.68%, సూర్యాపేట 89.25%, ఖమ్మం 88.84%, నల్లగొండ జిల్లా 88.72% నిలిచాయి. ఇక మిగిలిన జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో పోలింగ్ శాతం తక్కువైంది. వలసలు ఎక్కువగా ఉండే ఈ జిల్లాల్లో పురుష ఓటర్లు తక్కువగా ఉండటం కొంత వరకు ప్రభావం చూపింది. అత్యల్పంగా నిజామాబాద్ 76.45%, రాజన్న సిరిసిల్ల 79.14%, జగిత్యాల 79.64% నమోదైంది. మూడు విడతలోనూ కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు, అక్కడకక్కడ ఉద్రికత్తలు మినహా మిగిలినచోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విడతలో 3,547 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించారు.వచ్చే ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్‌ను విరివిగా వినియోగిస్తాం : సీఎస్ రామకృష్ణారావు మూడవ విడత పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదినితో కలిసి సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి పరిశీలించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును గమనించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ టెక్నాలజీని మరింత విరివిగా ఉపయోగించి ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్లు, అధికారులు, పోలింగ్ సిబ్బందిని సీఎస్ అభినందించారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ విస్తృత బందోబస్తును ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఈ పరిశీలనలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ డా.జి. సృజన, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, ఎస్ఈసీ కార్యదర్శి మందా మకరందం ఉన్నారు. -
కాంగ్రెస్ పతనం షురూ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పతనం ప్రారంభం అయిందని, రానున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత పతనం కాకతప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరినీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఏనాటికైనా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది భారత్ రాష్ట్ర సమితే అని ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు నిరూపించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగాన్ని, బల ప్రయోగాన్ని, హింసను ఎదుర్కొని భారీగా పంచాయతీలను బీఆర్ఎస్కు కట్టబెట్టారని పేర్కొన్నారు. సీఎంకు ముచ్చెమటలు..పంచాయతీ ఫలితాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘సాధారణంగా పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా అధికార పక్షం వైపు ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకుని తిరిగినా, మంత్రుల్ని మోహరించినా సగం సీట్లు సాధించడానికి కాంగ్రెస్ తంటాలు పడింది. అధికార పార్టీ ఇంత తక్కువ స్థానాలకు పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలు గెలవడం చరిత్రలో లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు, వైఫల్యాలపై తెలంగాణ పల్లె మోగించిన ‘జంగ్ సైరన్’..’ అని కేటీఆర్ అభివర్ణించారు. ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేయడం, రైతుబంధు ఎగ్గొట్టడం, యూరియా కోసం రైతులను లైన్లలో నిలబెట్టడం, పింఛన్ల పెంపులో దగా వంటి అంశాలు అధికార పార్టీపై ప్రజల ఆగ్రహానికి కారణమని చెప్పారు.ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందికాంగ్రెస్ అరాచకాలను, అధికార దుర్వినియోగాన్ని, ప్రలోభాలను వీరోచితంగా తట్టుకుని బీఆర్ఎస్ వెంట నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కేటీఆర్ అన్నారు. ‘ఇది సామాన్య విజయం కాదు.. చరిత్రలో నిలిచిపోయే పోరాటం..’ అని అభివర్ణించారు. ‘యుద్ధంలో సైనికుడిలా పంచాయతీ ఎన్నికల్లో పోరాడిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు శిరస్సువంచి సలాం చేస్తున్నా. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ప్రతి గులాబీ సైనికుడి కళ్లల్లో కనిపించిన పౌరుషం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది. అరాచక కాంగ్రెస్‌ను, రేవంత్‌రెడ్డిని మట్టి కరిపించేందుకు మా శ్రేణులు చేసిన ఈ అలుపెరగని పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది..’ అని ఆయన పేర్కొన్నారు. -
హస్తం.. హ్యాట్రిక్
సాక్షి, హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంలో హుషారు రేకెత్తించేలా గ్రామీణ ఓటరు తీర్పు ఇచ్చాడు. ఇంకోవైపు బీజేపీలోనూ ఈ ఎన్నికలు జోష్ పెంచాయి. మెజారిటీ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుని అధికార పార్టీ అగ్రస్థానంలో నిలవగా, బీఆర్ఎస్, బీజేపీలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.అయితే స్వతంత్ర అభ్యర్థులు సైతం ఈసారి గణనీయ సంఖ్యలో విజయం సాధించడం గమనార్హం. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు తాము బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనార్హం.ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో మూడో వంతు స్థానాల్లో తాము బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా విజయం సాధించడం.. ప్రభుత్వ పనితీరుపై, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి వచ్చిన స్పందనగా అధికార పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని చెబుతున్నారు.అయితే అధికార పార్టీ అరాచకాలు, అధికార దుర్వినియోగాన్ని తట్టుకుని తాము బలపరిచిన అభ్యర్థులు గణనీయమైన స్థానాల్లో విజయం సాధించారని, ఇది ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను తెలియచేస్తోందని విపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మరింత జోరు కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలిసారిగా వందల సంఖ్యలో పంచాయతీల్లో పాగా వేయడంపై బీజేపీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో మరిన్ని స్థానాలు గెలిస్తే బావుండునన్న అభిప్రాయం కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. 1205 పంచాయతీలు ఏకగ్రీవం రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో 12,728 గ్రామపంచాయతీలకు గాను ఏకగ్రీవాలు 1205 పంచాయతీలు, నామినేషన్లు వేయని పంచాయతీలు 21, కోర్టు స్టేలతో ఎన్నికలు జరగని 5 స్థానాలను మినహాయిస్తే 11,497 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతునిచ్చిన అభ్యర్థులు 7135 పంచాయతీల్లో విజయం సాధించారు.ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు 3508 పంచాయతీల్లో గెలుపొందగా, బీజేపీ దాదాపు 674 గ్రామాల్లో పాగా వేసింది. ఇలావుండగా.. ఈ ఎన్నికల్లో స్వతంత్రులు, లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు తమ సత్తా చాటారు. మూడు ప్రధాన రాజకీయ పార్టీలను ధీటుగా ఎదుర్కొని 1385 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేశారు. -
YSRCPలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. PAC సభ్యులుగా వంగా గీత (పిఠాపురం), షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ (కదిరి) నియమితులయ్యారు.కాగా, ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పలువురి నియామకం జరిగిన సంగతి తెలిసిందే. షేక్ గౌస్ మొహిద్దిన్ (విజయవాడ వెస్ట్), మీర్ హుస్సేన్ (విజయవాడ ఈస్ట్), కర్నాటి రాంబాబు (విజయవాడ వెస్ట్), మీర్జా సమీర్ అలీ బేగ్ (మార్కాపురం), ఆర్. శ్రీనివాసులురెడ్డి (పలమనేరు), కె.కృష్ణమూర్తిరెడ్డి (పలమనేరు), పోలు సుబ్బారెడ్డి (రాయచోటి), ఉపేంద్ర రెడ్డి (రాయచోటి), డి. ఉదయ్ కుమార్ (మదనపల్లె), వి.చలపతి (కోవూరు), గువ్వల శ్రీకాంత్ రెడ్డి (సింగనమల), డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి (తాడిపత్రి), సుభాష్ చంద్రబోస్ (కర్నూలు), రఘునాథరెడ్డి (జమ్మలమడుగు), ఎస్. ప్రసాద్ రెడ్డి (కమలాపురం), పార్టీ ఎస్ఈసీ సభ్యునిగా ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి (రాయచోటి) నియమితులయ్యారు. -
ఇది పీపీపీ కాదు.. పెద్ద స్కామ్: సజ్జల
సాక్షి, తాడేపల్లి: జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కోటి సంతకాల ప్రతులను బుధవారం.. ఆ పార్టీ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేట్ పరం అయితే ప్రభుత్వం ఉండి ఏం లాభం? అంటూ ప్రశ్నించారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అతిపెద్ద స్కామ్‌కు పాల్పడుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రజల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. కోటిమందికి పైగా చేసిన సంతకాలే.. ప్రైవేటీకరణ నిర్ణయంపై వెల్లువెత్తిన ప్రజా నిరసనకు నిదర్శనమని, ప్రభుత్వ నిర్ణయంపై ఇది కచ్చితంగా రెఫరెండమే అని ఆయన తేల్చి చెప్పారు. ఏపీని మెడికల్ హబ్ గా మార్చాలని కలగన్నవైఎస్ జగన్ అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.అయితే అధికారంలోకి రాగానే కాలేజీల నిర్మాణాలను నిలిపివేసిన చంద్రబాబు.. కమిషన్ల కక్కుర్తితోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మమ్మాటికీ ముందస్తు కుట్రేనని.. . ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆక్షేపించారు. కాలేజీల ప్రైవేటీకరణతో పాటు అప్పనంగా ఆస్తులు అప్పగిస్తున్న చంద్రబాబు.. అదనంగా 2 ఏళ్ల పాటు రూ.1400 కోట్లు జీతాలు ప్రభుత్వం నుంచి చెల్లించాలన్న నిర్ణయం.. మరో భారీ కుంభకోణమని స్పష్టం చేశారు.చంద్రబాబు తీరుకు నిరసనగా రేపు సాయంత్రం(డిసెంబర్ 18, గురువారం) వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం గౌరవ గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు సమర్పిస్తారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన... లేనిపక్షంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వీటిపై సమీక్షించి, బాధ్యులను బోనెక్కిస్తామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఏపీని మెడికల్ హబ్ చేయడమే వైఎస్ జగన్ లక్ష్యం:ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకుని రావటమే కష్టం, అలాంటి అనుమతులన్నీ వైఎస్ జగన్ సాధించి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కాలేజీలు తెచ్చారు. దేశంలోనే ఉత్తమ మెడికల్ హబ్‌గా ఏపీని మార్చాలని జగన్ కలలు కన్నారు. ఆ మేరకు కింది స్థాయి నుండి పటిష్ఠం చేసుకుంటూ వచ్చారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసింది. అనంతరం ప్రైవేటీకరణకు సిద్ధమైంది. ప్రైవేటు రంగంలోనే అత్యుత్తమ సేవలందుతాయని తాను నమ్ముతున్న సిధ్దాంతాన్ని అమలు చేయడం ప్రారంభించాడు. తాను అధికారంలో లేనప్పుడు ఎప్పుడూ ప్రైవేటు రంగం గురించి నోరెత్తని చంద్రబాబు.. గెలిచిన తర్వాత ప్రైవేటు రంగంలో మంచి సేవలు అందుతాయని చెప్పడం అలవాటు.ఆర్థిక వనరులు లోటు లేకున్నా ప్రైవేటీకరణ మంత్రం:వైఎస్ జగన్ ప్రభుత్వ వైద్య కళాశాలను పూర్తి చేయకుండానే, కేవలం కాలేజీలని నిర్మించాలని లక్ష్యంగా మాత్రమే చెబితే.. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం కష్టమని చెప్పడంలో అర్ధముంది. కానీ ఐదు మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ పూర్తి చేసి, ఆ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగి, విజయవంతంగా కాలేజీలు నడుస్తున్నాయి. మరో రెండు కాలేజీలు పూర్తయ్యాయి.. మరో మూడు కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి.అంటే మొత్తం 10 కాలేజీలు దాదాపు పూర్తైన దశలో ఎందుకు వాటిని ఆపాల్సి వచ్చింది. మరో కీలకమైన అంశం ఏమిటంటే... కాలేజీల నిర్మాణానికి నిధుల కొరత లేకుండా వివిధ ఆర్ధికసంస్ధలతో వైయస్.జగన్ ప్రభుత్వమే టై అప్ అయింది. నీకు కావాల్సిందల్లా కాలేజీల నిర్మించాలన్న మనసు మాత్రమే. అదే చంద్రబాబుకు లేదు. చంద్రబాబు హెరిటేజ్‌తో సహా ఎవరైనా ప్రైవేటు రంగంలో ఉచితంగా సేవలు అందిస్తారా? రూపాయి పెట్టుబడి పెట్టి రూ.10, రూ.20, రూ.50 ఎలా సంపాదించాలనే వస్తారు. చంద్రబాబు ఏం చెప్పినా పీపీపీ అనేది ఓ పెద్ద స్కామ్. ఇంకా జనాల చెవిలో పువ్వులు ఎలా పెట్టగలననుకుంటున్నాడో తెలియడం లేదు? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కోసం వైఎస్ జగన్ అక్టోబరులో పిలుపునిస్తే... ఈ రెండు నెలల్లో వచ్చిన ప్రజాస్పందన చూసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజల అభిప్రాయం చంద్రబాబుకు అర్థం కావడం లేదు. కోటి సంతకాలకు అక్టోబరులో పిలుపునిస్తే.. జనంలో వస్తున్న స్పందన అందరికీ తెలుసు.ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రిఫరెండంలా.. చరిత్రలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పూడూ చూడని విధంగా తొలిసారిగా ఇంత పక్కాగా ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. వైయస్సార్సీపీ ఆధ్యర్యంలో ప్రతిచోటా జనంలోని వెళ్లి సంతకాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పేదలతో పాటు సమసమాజం కావాలనుకునేవాళ్లు, సమాజంలో అసమానతలు తగ్గించాలని కోరుకునేవారు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు.ప్రైవేటీకరణే చంద్రబాబు విజన్:ఇవాల్టికి చంద్రబాబు కొంచెం తగ్గి.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం పేరు పెద్దదిగా ఉంటే.. ప్రైవేటు వాళ్ల పేరు చిన్న అక్షరాల్లో ఉంటుందని చెబుతున్నారు. కాలేజీల భవనాలు, ఆసుపత్రులు, భూమి అంతా ప్రైవేటు వాళ్ల చేతుల్లో పెట్టిన తర్వాత వాళ్లు పేరు పెట్టినా, పెట్టకపోయినా ఏం ప్రయోజనం ఉంటుంది. పైగా వారికి రెండేళ్ల జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించడానికి అంగీకరించడం మరించి ఆశ్చర్యకరం. ఇన్ని ప్రైవేటు వారికి ఇచ్చినప్పుడు... ప్రభుత్వమే ఎందుకు నిర్వహించలేకపోతుంది?మెడిసిన్ చేయాలనుకునే విద్యార్ధులు తొలుత ప్రభుత్వ కాలేజీలనే కోరుకుంటారు. కారణం ఆయా కాలేజీలకు వచ్చే పేషెంట్లు, ఉత్తమ సర్వీసులు, మంచి శిక్షణ అందుతుందన్న ఆలోచనతోనే ఎంచుకుంటారు. మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పెడితే... మేం అధికారంలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అన్నింటినీ రద్దు చేసి ఉచితం చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్నే నిలిపివేశారు.ప్రైవేటీకరణను అవసరం లేకపోయినా సపోర్టు చేసి నెత్తిన పెట్టుకునే ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన మొదటి నుంచి ఇదే తీరు. కేవలం కాసుల కోసం కక్కుర్తి పడి ప్రైవేటీకరణ చేయడం ఒక అంశం అయితే... ప్రజల ప్రాణాలకు సంబంధించిన వైద్యరంగంలో ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నాడు. వైయస్.జగన్ విజయవంతంగా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభిస్తే... దాన్ని కొనసాగించాల్సింది పోయి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు 100 శాతం మెడికల్ సేవలు ఉచితం అని చెప్పాడు. ఇవాళ 100 శాతం అవుట్ పేషెంట్ సేవలు ఉచితంగా వస్తాయని, 70 శాతం ఇన్ పేషెంట్ కేటగిరీలో ఉచితం అని చెబుతున్నాడు. ఇవన్నీ ఎవరికి చెబుతున్నావ్ చంద్రబాబూ?జీతాలు చెల్లింపు మరో కుంభకోణం..వైఎస్ జగన్ ఇప్పటికే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మించి, విజయవంతంగా నిర్వహించవచ్చని, సామర్థ్యం ఉన్న సిబ్బందిని నియమించవచ్చని నిరూపించిన తర్వాత.. ఇవాళ చంద్రబాబు దాన్నుంచి పక్కకు పోవడం అంటే ఇది పెద్ద కుంభకోణం. రెండో కుంభకోణం.. రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తామని చెప్పడం. ఒక వైపు మెడికల్ కాలేజీలను నిర్మించడానికి డబ్బుల్లేవు అని చెబుతూ... మెడికల్ కాలేజీలను, ఇన్ ఫ్రా స్ట్రక్చర్, భూమితో సహా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూనే.. వారికి రెండేళ్ల జీతాలు కూడా ప్రభుత్వం నుంచి చెల్లించడం అంటే ఒక్కో కాలేజీకి ఏడాదికి రూ.8 కోట్లు చొప్పున 10 మెడికల్ కాలేజీలకు రూ.80 కోట్లు ఖర్చువుతుంది. రెండేళ్లకు రూ.1400 కోట్లు ఇవ్వాలి. ఈ డబ్బులతో కాలేజీలు పూర్తి కావా?ఇవాళ కార్పొరేట్ కాలేజీల్లో వైద్యం ఖర్చు ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఇవాళ కొత్త ట్రీట్మెంట్ వచ్చిందంటే అది ఎన్ని లక్షలు కట్టమంటే అంతా కట్టాల్సిందే? ఇక్కడ మొదలుపెట్టి ప్రైమరీ హెల్త్ కేర్‌ను కూడా ప్రైవేటుకు కచ్చితంగా అప్పగిస్తాడు. అంటే మొత్తం వైద్య ఆరోగ్యరంగం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతుంది. మన ఆర్దిక వ్యవస్ధలో ప్రైవేటు ఉండడం మన మార్కెట్ ఎకానమీలో భాగం.ప్రజల పట్ల ప్రేమ - పాప భీతి లేని వ్యక్తి చంద్రబాబులాభం లేకుండా ప్రైవేటు వ్యాపారులు రారని తెలిసి, వాళ్లకు లాభాలిచ్చి, నువ్వు వేల కోట్లు కుమ్మిరించి.. ఇక్కడ అవసరమైన రూ.2-3 వేల కోట్లు పెట్టలేదంటే చంద్రబాబు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాడు. ఆయన సేవలు చేయనవసరం లేదు, కానీ ద్రోహం చేయడం మహాపాపం. నా వల్ల ఇంత నష్టం జరుగుతుందన్న భయం కానీ పాపభీతి కానీ రెండూ చంద్రబాబుకు లేవు. అందుకే నేటికీ ప్రైవేటీకరణ మంచిదని బుకాయిస్తున్నాడు.రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల వెల్లువఈ నేపధ్యంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరనసగా వైఎస్ జగన్ పిలుపు మేరకు అక్టోబర్‌లో సంతకాల సేకరణ ఉద్యమం మొదలుపెట్టి... రెండు నెలల కాలంలో 1 కోటి సంతకాలను లక్ష్యంగా పెడితే... 1,04,11,136 సంతకాలు వచ్చాయి. ఈ సంతకాలన్నీ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను మీరు వ్యతిరేకిస్తే... సంతకం చేయమని అడిగితే..రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో చేసినవే. జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళంలో జిల్లాలో 4,02,833, విజయనగరం జిల్లాలో 3,99,908, పార్వతీపురం మన్యం 2,15,500, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,47,000, విశాఖపట్నం 4,19,200, అనకాపల్లి జిల్లాలో 3,73,000, కాకినాడ జిల్లాలో 4,00,600, బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,20,086, తూర్పుగోదావరి జిల్లాలో 4,06,929, పశ్చిమ గోదావరి జిల్లాలో 4,19,650, ఏలూరు జిల్లాలో 3,60,008, కృష్ణా జిల్లాలో 3,77,336, ఎన్టీఆర్ జిల్లాలో 4,31,217, గుంటూరు జిల్లాలో 4,78,059,..పల్నాడు జిల్లాలో 4,31,802, బాపట్ల జిల్లాలో 3,73,199, ప్రకాశం జిల్లాలో 5,26,168, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 6,30,040, కర్నూలు జిల్లాలో 3,98.277, నంద్యాల జిల్లాలో 4,05,500, అనంతపురం జిల్లాలో 4,55,840, శ్రీసత్యసాయి జిల్లాలో 4,40,358, వైయస్సార్ జిల్లాలో 4,80,101, అన్నమయ్య జిల్లాలో 2,60,500, చిత్తూరు జిల్లాలో 7,22,025 మొత్తం 1 కోటి 3 లక్షల 71వేల 136 సంతకాలు చేరాయి. ఇవి కాకుండా కేంద్ర కార్యాలయానికి చేరిన మరో 40వేలు సంతకాలు కలిపి మొత్తం... 1, 04,11,136 నిఖార్సైన సంతకాలతో ప్రవైటీకరణకు వ్యతిరేకంగా తమ మద్ధతు తెలిపారు.బ్యాలెట్ తీర్పు తరహాలో ప్రజాభిప్రాయం:రాష్ట్రంలో ప్రజాభిప్రాయసేకరణలో ఇంత పక్కాగా బ్యాలెట్ బాక్సులో తీర్పునిచ్చినట్లు.. రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు. 1.04 కోట్ల మంది సంతకాలు అంటే అన్ని కుటుంబాలు సంతకాలు చేశారంటే... రాష్ట్రంలో మొత్తం కుటంబాలు 1.60 కోట్లు పైగా ఉంటే... అందులో 1.04 కోట్ల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు.ఇంతమంది సంతకాలు చేసిన తర్వాత చంద్రబాబు పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు. క్రెడిట్ ఆయనే తీసుకుని... మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి. టిడ్కో ఇళ్ల విషయంలో కూడా గతంలో చంద్రబాబు డబ్బులు వసూలు చేసి పూర్తి చేయకుండా వదిలేస్తే.. వైఎస్ జగన్ హయాంలో క్రెడిట్ కూడా క్లెయిమ్ కూడా చేయకుండా.. ఉచితంగా అందించారు. అది వైఎస్ జగన్‌కు ఉన్న ఆలోచన. రాజకీయం కోసం ప్రజలతో ఆడుకోవడం సరికాదు. వైఎస్ జగన్ హయాంలో కట్టిన ఇళ్లను చంద్రబాబు తన ఖాతాలో చూపించుకున్నాడు. ఏమాత్రం జంకులేకుండా క్లెయిమ్ చేసుకోవడం చంద్రబాబుకు అలవాటు.కాలేజీల నిర్మాణానికి కుంటిసాకులు:ఇవాళ మెడికల్ కాలేజీలను కూడా తానే కట్టానని చంద్రబాబు క్లెయిమ్ చేసుకోవచ్చు.. కానీ ప్రైవేటీకరణ చేసి ప్రజల ఉసురు తీసుకోవద్దు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దు. వైఎస్ జగన్ ప్రారంభించిన వాటి నిర్మాణం కొనసాగిస్తే సరిపోతుంది. ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు చేసిన రూ. 2.60 లక్షల కోట్లకు పైగా అప్పులో .. కొంత మెడికల్ కాలేజీల కోసం వెచ్చిస్తే సరిపోయేది. కానీ కుంటిసాకులు వెదుకుతూ, పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్పిందని తన అనుకూల పత్రికల్లో రాయించుకోవడం మానేసి... చేసి చూపించాలి వైఎస్సార్ ఉచిత కరెంటు ఇవ్వడం అసాధ్యమని అందరూ అన్నారు.. దాన్ని ఆయన చేసి చూపించేసరికి అందరూ దాన్ని అనుసరిస్తున్నారు.నీవు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం సాధ్యం కాదు అనుకున్నావు.. కానీ వైఎస్ జగన్ వాటిని చేసి చూపిస్తే దాన్ని కొనసాగించ లేకపోవడం దారుణం. భవిష్యత్తు తరాలకు 20, 30 ఏళ్లు గడిచిన తర్వాత... మెడిసిన్‌లో గొప్ప సిస్టమ్స్ ఉన్నాయని చెప్పుకునే అవకాశాన్ని చేతులారా చంద్రబాబు చంపేస్తున్నాడు. ఇప్పటికైనా చంద్రబాబుకు మంచి బుద్ధి కలిగి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను నిర్మించాలని కోరుతున్నాం.ఇదే విషయంపై రేపు సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ ఒక ప్రతినిధి బృందంతో... గవర్నర్‌ని కలిసి వినతి పత్రం ఇవ్వడంతో పాటు, సంతకాల ప్రతులను ఆయనకు సమర్పిస్తామని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అప్పటికైనా చంద్రబాబు కుట్రపూరితమైన, తన దుర్మార్గమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మెడికల్ కాలేజీలను ప్రభుత్వరంగంలోనే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిస్తూ..రోడ్లు పీపీపీ విధానంలో నిర్మిస్తే అవి ప్రభుత్వం వద్దే ఉంటాయి కదా అని ప్రశ్నించగా.. అలా చేయడం వల్ల టోల్ గేట్ల ఖర్చు భారీగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఇవేవీ లేవని.. ప్రైవేటు వ్యక్తులు లాభాపేక్ష లేకుండా ఎందుకు వస్తారని నిలదీశారు. మెడికల్ కాలేజీలు ప్రజారోగ్యానికి సంబంధించిన విషయమని... ఏ దేశమైనా ప్రభుత్వ పరిధిలేకుండా వైద్యాన్ని ప్రైవేటుపరం చేయలేదని గుర్తు చేశారు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు.. వాటి ధరలను సమాజం భరించలేదని... అందుకే ప్రభుత్వం వాటిని బేలన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోటి సంతకాలు ఎవరు చేశారన్నది.. తెలుగుదేశం పార్టీ నేతలందరికీ తెలుసు. ప్రైవేటీకరణ విషయంలో మారిన చంద్రబాబు మాట తీరే ఇందుకు నిదర్శనం. అయినా మొండిగా ముందుకు వెళ్తూ చంద్రబాబు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు.వైఎస్ జగన్ హయాంలో మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ప్రవేశపెడితే.. ఇదే కూటమి నేతలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం సీట్లు ఉచితంగా భర్తీ చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా కాలేజీలనే ప్రైవేటీకరణ చేస్తున్నారు. 108 సేవలకు సంబంధించి ప్రతిచోటా మొత్తం ప్రభుత్వం చేయాలనుకోవడం మంచి మార్గం. ఒకవేళ అది కాకపోతే ప్రభుత్వ కంట్రోల్ ఉంచేలా చూడాలి. కానీ కూటమి నేతలు మేం అధికారంలోకి వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేసి మొత్తం ఉచితంగా భర్తీ చేస్తామని చెప్పి... ఇవాళ ప్రైవేటీకరణకు వెళ్లడమే మంచిదని వితండవాదం చేయడం దుర్మార్గం.రాజధాని నిర్మాణం కోసం డిజైన్లు, లైటింగ్ వంటి వాటి కోసం కోట్లాది రూపాయులు ఖర్చుపెడుతున్నారు. కానీ మెడికల్ కాలేజీల నిర్మాణానికి వచ్చేసరికి చేయాలన్న ఉద్దేశం లేకపోవడంతోనే ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో మాత్రం ఇలా చేయడం దుర్మార్గం. ఉచితంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైయస్.జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణం చేసి చూపించిన తర్వాత కూడా ఇలాంటి వాదన చేయడం అర్ధరహితమని తేల్చి చెప్పారు. -
‘కోటి సంతకాలు.. బాబు పతనానికి పునాదులు’
సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాలు కాదు.. చంద్రబాబు పతనానికి పునాదులు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మీద ఉన్న కోపంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం సరికాదన్నారు. విశాఖ ఉక్కును సైతం ప్రైవేటీకరణ చేస్తారా? అంటూ గోరంట్ల మాధవ్ నిలదీశారు.భూమి, బిల్డింగ్లు అన్నీ ప్రభుత్వమే ఇస్తే నీ బినామీలకు దోచి పెడతారా?. వంద రూపాయలకే ఎకరం భూమి ఇస్తారా?. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉంది. కాలేజీలను ప్రైవేట్ వారికి ఇచ్చి జీతాలు మాత్రం ప్రభుత్వమే ఇస్తుందంట.. ఆదాయం మాత్రం ప్రైవేట్ వారే తీసుకుంటారట. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలి’’ అని గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. -
‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ కుంభకోణం’
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ కుంభకోణం ఉందని.. పీపీపీ ముసుగులో అడుగడుగునా అడ్డగోలు దోపిడీకి తెర తీశారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేర్వేరుగా మీడియాతో మాట్లాడిన అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్.. చంద్రబాబు విధానాలను నిలదీశారు.కుడిచేత్తో కాలేజీలిచ్చి.. ఎడమ చేత్తో కమీషన్లు: గుడివాడ అమర్నాథ్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైయస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి విశేష స్పందన వచ్చింది. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి, 7 కాలేజీలను పూర్తి చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని నిర్ణయించడంపై ప్రజలు మండి పడుతున్నారు.కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి దాగి ఉందన్న వైఎస్సార్సీపీ వాదనను ప్రజలు అర్థం చేసుకున్నారు. గత మా ప్రభుత్వం నిర్మించిన కాలేజీలు, ఆస్పత్రులతో పాటు ఆయా ఆస్పత్రుల పరిధిలో ఉన్న వందల కోట్ల విలువ చేసే భూములను కాజేయాలన్న కుట్రతోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఒక వైపు ఏడాదిన్నరలోనే రూ. 2.66 లక్షల కోట్ల అప్పు చేయడమే కాక, మెడికల్ కాలేజీల రూపంలో జగన్ సృష్టించిన వేల కోట్ల విలువైన సంపదను ప్రైవేటుకి అప్పనంగా ధారాదత్తం చేస్తున్నాడు. ఇది చాలదన్నట్టు ఆయా కాలేజీల్లో పనిచేసే స్టాఫ్‌కి రెండేళ్లపాటు జీతాలు చెల్లించే పేరుతో ప్రజా సంపదను దోచిపెడుతున్నాడు. కుడి చేతితో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి రాసిచ్చి, జీతాల రూపంలో ఒక్కో ఏడాది ఇచ్చే దాదాపు రూ.800 కోట్ల సొమ్మును ఎడమ చేత్తో వారి నుంచి లాక్కుంటున్నాడు. తన దోపిడీ కుట్రలను యథేచ్ఛగా అమలు చేయడానికి నిస్సిగ్గుగా పార్లమెంట్ స్థాయీ సంఘం నివేదికను కూడా వక్రీకరించేస్తున్నాడు. కిక్ బ్యాక్‌ల కోసం తాను ఎంతకైనా దిగజారుతానని చెప్పకనే చెబుతున్నాడు.జీతాల చెల్లింపుల పేరుతో రూ.1400 కోట్లు దోపిడీ: గోరంట్ల మాధవ్పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలన్న చంద్రబాబు కుట్రలను రాష్ట్ర యువత, మేథావులు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో కూటమి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. మళ్లీ అధికారంలోకి రాలేమని గ్రహించే దర్జాగా దోపిడీకి బాటలు వేసుకుంటున్నాడు. రేపు వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై లోతైన విచారణ చేసి నిందితులు ఎవరున్నా వదిలి పెట్టబోము. న్యాయస్థానాల్లో నిలబెట్టి కఠినంగా శిక్షించే వరకు వెనకాడబోము.కేవలం దోపిడీ ఆలోచనలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. జగన్‌గారు నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నాడు. ఇది చాలదన్నట్టు కాలేజీలను దక్కించుకున్న 10 మెడికల్ కళాశాలల ఉద్యోగులకు రెండేళ్లపాటు జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించేలా మరో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఖచ్చితంగా ఇదంతా ప్రజల ఆస్తులను అప్పనంగా తన బినామీలకు దోచిపెట్టే కుట్రే. ఒక్కో కాలేజీకి ఏడాదికి రూ.70 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ. 140 కోట్లు.. రెండేళ్లలో 10 మెడికల్ కాలేజీలకు దాదాపు రూ.1400 కోట్లు దోచిపెట్టే కుట్రకు తెర లేపారు. కుడిచేత్తో కాలేజీలను, కాలేజీ భూములను వారి చేతిలో పెట్టి.. ఎడమ చేత్తో జీతాల పేరుతో ఇచ్చిన రూ.1400 కోట్ల డబ్బును వారి నుంచి తీసుకునే దోపిడికి స్కెచ్ వేశాడు. ఇందుకు రాబోయే రోజుల్లో చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు.ప్రైవేటీకరణ వెనుక లక్ష కోట్ల దోపిడీ: :మొండితోక అరుణ్కుమార్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు లక్ష కోట్ల దోపిడీకి పాల్పడుతున్నాడు. ప్రజావైద్య రంగాన్ని బలోపేతం చేసి పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైయస్ జగన్ గారు నాడు 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతోపాటు 7 కాలేజీలను పూర్తి చేసి 5 కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో ఒక్కో మెడికల్ కాలేజీని 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మెడికల్ కాలేజీల రూపంలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల విలువైన సంపద సృష్టిస్తే. ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు దాన్ని తన బినామీలకు ధారాదత్తం చేసే కుట్రలకు తెరలేపాడు.నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు, తన పాలనలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా నిర్మించకపోగా.. వైఎస్ జగన్ నిర్మించిన కాలేజీలను 66 ఏళ్లపాటు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నాడు. మెడికల్ కాలేజీలకున్న 50 ఎకరాలు ప్రభుత్వ భూమి, భవనాలు ప్రభుత్వానివి వాటి విలువ వందల కోట్లలో ఉంటే ఎకరా రూ.100లకు ధారాదత్తం చేశాడు. ఇది కాకుండా రెండేళ్లపాటు జీతాలు చెల్లించే పేరుతో 10 మెడికల్ కాలేజీలకు దాదాపు రూ.1400 కోట్లు ముట్టజెప్పే ప్రయత్నం మొదలుపెట్టాడు. ప్రభుత్వ సంపదపై ప్రైవేటు వ్యక్తులకు పెత్తనం అప్పజెబుతున్నాడు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన వచ్చింది. 1.36 కోట్ల మందికిపైగా సంతకాలు చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని బాహాటంగానే తప్పుబట్టారు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లెలో కూడా సగం మందికిపైగా ప్రైవేటీకరణను నిరసిస్తూ సంతకాలు చేశారంటే ఏ విధంగా చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. మెడికల్ కాలేజీలపై పీపీపీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు మా పార్టీ వెనక్కి తగ్గబోదు. -
పార్లమెంట్లో కడప- రాయచోటి హైవే టన్నెల్ పనుల ప్రస్తావన
న్యూఢిల్లీ: రాజ్యసభ జీరో అవర్‌లో ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి కడప–రాయచోటి హైవేపై ప్రతిపాదిత టన్నెల్ నిర్మాణ అంశాన్ని లేవనెత్తారు. ఈ రహదారిలో పొడవైన, ప్రమాదకరమైన ఘాట్ సెక్షన్ ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిలో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.ఈ ప్రమాదకర ఘాట్ సెక్షన్‌ను బైపాస్ చేయడానికి టన్నెల్ నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారని ఎంపీ తెలిపారు. టన్నెల్ నిర్మాణం పూర్తయితే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్రయాణ సమయం, దూరం కూడా తగ్గుతాయని స్పష్టం చేశారు.కడప–రాయచోటి హైవే రాయలసీమ ప్రాంతానికి అత్యంత కీలకమైన రహదారిగా ఉండటమే కాకుండా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే ప్రధాన మార్గమని మేడ రఘునాథ్ రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా శాఖ వెంటనే ఈ హైవేపై సర్వే నిర్వహించి, టన్నెల్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ టన్నెల్ నిర్మాణం ద్వారా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని, వ్యాపారం, రవాణా, పర్యాటక రంగాలకు కూడా మేలు జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తినట్లు ఆయన స్పష్టం చేశారు. -
అర్హతా.. అనర్హతా.. ఏం చెప్పబోతున్నారు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మొదటి దశ విచారణలో భాగంగా.. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలపై నిర్ణయం ఏంటి?.. ఐదుగురిపై వేటు వేస్తారా? లేదంటే ఫిరాయింపే లేదంటారా? స్పీకర్ ఏం చెప్పబోతున్నారు?.. అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయాన్ని స్పీకర్ వెల్లడించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేల అడ్వొకేట్లకు మధ్యాహ్నాం రావాలని కబురు పంపినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఓపెన్ కోర్టులో తీర్పు వెలువరించనున్నారు. ఆపై శాసనసభ వెబ్సైట్లో తీర్పు ప్రతులను అధికారులు అప్లోడ్ చేయనున్నారు.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ BRS (భారత రాష్ట్ర సమితి) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పలుమార్లు విచారణ జరిగింది. ఈ నెల 18వ తేదీ లోపు ఏదో ఒకటి తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు డెడ్‌లైన్ నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని నేడు ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మిగతా ఐదుగురు ఎమ్మెల్యేల పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉండడంతో.. నిర్ణయం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లు మాత్రం స్పీకర్ నోటీసులకు వివరణలు ఇచ్చుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోందోనని చర్చా నడుస్తోంది. -
రాష్ట్ర భవిష్యత్తుతో బాబు చెలగాటం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి బాగా తెలిసినవారు ఒక సంగతి చెబుతుంటారు. ఏదైనా చేయకూడని, లేదా విమర్శలకు ఆస్కారమిచ్చే కార్యక్రమం చేయదలచుకుంటే ముందుగా దానిని తన ప్రత్యర్దులకు చుడుతుంటారు. తాను తప్పు చేసేందుకు ప్రత్యర్ధి రాజకీయ పార్టీనే కారణమన్న భావన కల్పిస్తారు. ఆ తర్వాత తనకు అనుకూలమైన వాదనను తెరపైకి తీసుకువచ్చి పని ముగించుకుంటారు అని. కొద్ది రోజుల క్రితం నల్లజర్లలో జరిగిన ఒక సభలో అప్పులు పుట్టడం లేదన్న చంద్రబాబు కొద్ది రోజులకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సజావుగా ఉందన్న ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ క్రమంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని, మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనను విధ్వంసమని విమర్శించారు. జగన్ ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టుపెట్టి రుణాలు తీసుకువచ్చిందని అన్నారు. అధిక వడ్డీకి అప్పు చేసిందని ఆరోపించారు. తన ప్రభుత్వం 18 నెలలు కష్టపడి ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసిందని చెప్పుకొచ్చారు. సహజంగానే ఈ వివరాలను ఎల్లో మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతులు భజన చేశాయి. దాంతో ఆయన లక్ష్యం నెరవేరినట్లు అయ్యింది. ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది. కొత్తగా మరో సుమారు రూ.13 వేల కోట్ల అప్పు చేసేశారు. దీనికోసం ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకు గత ప్రభుత్వంపై విమర్శలు చేశారన్నమాట. ఆ క్రమంలో చంద్రబాబు సర్కార్ మద్యంపై వచ్చే భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేసింది. ఎక్సైజ్ బాండ్ల ద్వారా 9.15 శాతం వడ్డీకి సుమారు రూ.5500 కోట్ల అప్పులు చేసినట్లు ‘సాక్షి’ ద్వారా ప్రపంచానికి తెలిసింది. రాజధాని పేరుతో మళ్లీ అప్పులు చేశారని సమాచారం వచ్చింది. ఈ రకంగా వేలకు వేల కోట్ల అధిక వడ్డీకి అప్పులు తెచ్చి ఎక్కడ ఖర్చు పెడుతున్నారో, దానివల్ల సమకూరుతున్న ప్రయోజనం ఏమిటో ప్రజలకు తెలియకుండా కథ నడిపిస్తున్నారు. ఇన్నివేల కోట్ల అప్పులు తెచ్చినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏవో అరకొర తప్ప పూర్తిగా నెరవేర్చడానికి పూనుకోవడం లేదు. ప్రభుత్వం రెగ్యులర్‌గా అమలు చేసే స్కీముల బకాయీలు తీర్చడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలే రూ.35 వేల కోట్ల వరకు ఉంది. ఈ మధ్య చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు కూడా సకాలంలో చెల్లించడం లేదు. గతంలో జగన్ టైమ్ లో మద్యం అమ్మకాల ఆధారంగా రుణాలు తీసుకుంటే చాలా పెద్ద తప్పు చేసినట్లు చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియా విస్తారంగా ప్రచారం చేసింది. ఇప్పుడు మాత్రం కిమ్మనడం లేదు. వారికి ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అయినట్లు అనిపించదు. చంద్రబాబు అప్పు చేస్తే అమెరికా అవుతుందని ప్రచారం చేయడమే ఎల్లోమీడియాకు తరువాయి అన్నమాట. అంతేకాదు.మైనింగ్ కార్పొరేషన్ కు చెందిన సుమారు రూ.రెండు లక్షల కోట్ల విలువైన గనులను తాకట్టుపెట్టి తొమ్మిదివేల కోట్ల అప్పు చేయడమే కాకుండా, ఆ రుణం చెల్లింపులో సమస్య వస్తే, ఏకంగా ఆర్బీఐ నుంచే డ్రా చేసుకునేలా కూటమి సర్కార్ హామీ ఇచ్చిన విషయాన్ని మాత్రం చంద్రబాబు చెప్పినట్లు కనబడదు. ఆర్థిక నిపుణుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తాను ఎక్కువ వడ్డీకి రుణం తీసుకోవడం కోసం ముందుగా గత ప్రభుత్వంపై అవే ఆరోపణలు చేశారన్నమాట. అంటే ఎవరైనా ఏమిటి ఈ వడ్డీలు అని అడిగినా, గతంలో కూడా ఇలాగే జరిగిందని అనుకోవాలన్న మాట. అందులో నిజానిజాల ఎంత అన్నది వేరే విషయం. అప్పులు ఒక సమస్య అయితే, ఏపీ ప్రజలను పచ్చి తాగుబోతులుగా మార్చడానికి వెనుకాడకపోవడం ఇంకో సమస్య. మద్యం ద్వారా 2024-2025లో రూ.24 వేల కోట్ల ఆదాయం వస్తే 2025-2026లో రూ.35 వేల కోట్లకు పెంచాలని ఆదేశించారట. మీడియా కథనం ప్రకారం గతేడాది కన్నా రూ.11 వేల కోట్లు మద్యం ద్వారా ప్రభుత్వం అదనంగా సంపాదిస్తుందని చెప్పి రూ.5500 కోట్లు రుణం తీసుకున్నారన్న మాట. అంతేకాదు. ఆపై ఏడాది ఈ ఆదాయం రూ.50 వేల కోట్లు చేస్తారట. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ఇలా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మించడంలో ఏ హిందూమత ధర్మం, ఏ సనాతన ధర్మం కనిపిస్తుందో ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణే చెప్పాలి. మద్యం మత్తులో మోటారు సైకిల్ నడుపుతూ ఒక బస్ తగలబడిపోయేందుకు కనీసం 19 మంది మరణించేందుకు కారణమైన విషయం జనం మదిలో నుంచి ఇంకా పోలేదు. ఆ అనుభవాన్ని గుణపాఠంగా తీసుకోకపోగా, ఎవరైనా మద్యం బెల్టు షాపుల గురించి, నకిలీ మద్యం గురించి మాడ్లాడితే వారిపై వీర విధేయులైన కొందరు పోలీసు అధికారులతో తప్పుడు కేసులు పెట్టించి భయపెట్టాలని యత్నిస్తున్నారు. స్వర్ణాంధ్ర సాధిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చుతున్నారా అన్న విమర్శలు వస్తున్నాయి. రుణాలపై వడ్డీ గురించి చూస్తే గరిష్టంగా ఏడు శాతం వరకు ఉంటుంది. అలాంటిది 9.5 శాతం వడ్డీ అంటే ఆ మేరకు ప్రజలపై భారం పడినట్లే. అప్పుల మీద అప్పులు చేసుకుంటూ చేస్తూ ఇప్పటికి రూ.2.66 లక్షల కోట్ల రుణం తీసుకుని దేశంలోనే నెంబర్ ఒన్ స్థానంలో నిలిచి అప్రతిష్టను మూటకట్టుకుంది. రాజధాని పేరుతో తీసుకునే అప్పులపై కూడా ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా మరో రూ.7387 కోట్ల అప్పు తీసుకుంటున్నారు. నాబార్డు ద్వారా తీసుకుంటున్న ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. అంటే దీని అర్థం ఏపీ ప్రభుత్వం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చెల్లించాల్సిందని అనేగా! ఈ తాజా అప్పుకూడా కలుపుకుంటే రాజధాని రుణం రూ.47387 కోట్లకు చేరిందన్నమాట. రాజధానిలో ఎన్ని పనులు చేస్తారో తెలియదు కాని రుణాలకు మాత్రం కొదవలేదు. దీనివల్ల రాజధాని చుట్టుపక్కల గ్రామాలకు ఏమైనా కాస్తో, కూస్తో లాభం ఉంటుందేమో కాని ఏపీ ప్రజలందరికి కలిసివచ్చేది ఎంత ఉంటుందన్నది ఎవరికి తెలియదు. అప్పుల భారం మాత్రం అన్ని ప్రాంతాల వారు భరించాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని, ప్రభుత్వం సొంత వనరుల నుంచి రూపాయి ఖర్చు చేయనక్కర్లేదని చంద్రబాబు గతంలో ఒక పాట మాదిరి పాడేవారు. కాని ప్రభుత్వం వచ్చాక అసలు విషయం బయటపడింది.సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అన్నది ప్రజలను మభ్యపెట్టడానికే అని తేలిపోతోంది. పోనీ తెచ్చిన డబ్బును పొదుపుగా ఖర్చు పెడుతున్నారా అంటే అదేమీ కనిపించడం లేదు. దుబారాకు ఆకాశమే హద్దుగా ఉంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి రూ.180 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. అలాగే చదరపు అడుగుకు రూ.తొమ్మిది వేల నుంచి రూ.10 వేల వ్యయం చేయడానికి సిద్ధపడ్డారు. సీఎం నివసించే కరకట్ట రోడ్డుపై మంచి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తారట. అందుకు రూ.ఐదున్నర కోట్లు వ్యయం చేస్తారట. ఇది దుబారా కాదా?మరో వైపు రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎప్పటికి ఇస్తారో తెలియదు. ఈ భూమి చాలదని ఇంకో 44 వేల ఎకరాలకు టెండర్ పెడుతున్నారు. సీఎంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌ల విమాన, హెలికాఫ్టర్ ప్రయాణాలకు తడిసి మోపెడు ఖర్చు అవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే చంద్రబాబు పర్యటనల ఖర్చు రూ.40 కోట్లు దాటిందట. నాలుగు వేల రూపాయల ఫించన్ పంపిణీకి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటేనే ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఏపీ భవిష్యత్తును ఎంతగా విధ్వంసం చేస్తుందో అన్న ఆందోళన కలుగుతుంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇది పరకామణి చోరీ కంటే పెద్ద దోపిడి.. చంద్రబాబుపై భూమన ఆగ్రహం
సాక్షి, తిరుపతి: తిరుమల పవిత్రతను కాపాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలం అవుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏకంగా దేవుడి భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారాయన. బుధవారం తన నివాసంలో భూమన మీడియాతో మాట్లాడారు.. .. టీటీడీకి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు. దేవస్థానం భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. అలిపిరిలో సమీపంలో అత్యంత విలువైన భూముల్ని ఇచ్చేస్తున్నారు. ఎకరా రూ.26 కోట్ల రూ.52 లక్షల ఖరీదైన భూముల్ని కట్టబెట్టారు. రూ.460 కోట్ల విలువైన భూమిని ఒబెరాయ్‌కి ఇచ్చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.3 వేల కోట్ల విలువైన భూమి ఇది. 13వ తేదీన జీవోకూడా కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 13న జీవో.. 5న రిజిస్ట్రేషన్ చేశారు. మరి ఇంకా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ సైట్లో ఎందుకు కనిపించడం లేదు?. ఎవరికి మేలు చేయడానికి రూ. 2 కోట్లు బిల్డింగ్ ఫీజుకు సర్దుబాటు చేశారు, రూ. 26 కోట్ల స్టాంప్ డ్యూటీ మాఫీ చేసేశారు. ఆ భూముల్లో భారీగా చందనపు చెట్ల ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కాకముందే చెట్లు కొట్టడం ప్రారంభించారు. ఒక బ్రాహ్మణుడు స్వామివారికి ఇచ్చిన భూమిని బాబు పందేర వేస్తున్నారు. తిరుమల పవిత్రతతను కాపాడడంలో చంద్రబాబు విఫలం అయ్యారు. వంద గదుల హోటల్‌కు భారీ ఎత్తున భూములు కట్టబెడుతున్నారు. ప్రభుత్వం దగ్గరి భూములు ఇవ్వకుండా(రెవెన్యూ ల్యాండ్).. టీటీడీ భూములు ఎలా ఇస్తారు?. గతంలోనూ హోటల్పేరు మార్చి తతంగం అంతా నడిపించింది చంద్రబాబే. దేవుడిని దోపిడీ చేసి ఒబెరాయ్‌కు ఇప్పుడు భూములు అప్పజెప్తునారు. దేవుడి ఇనాం భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెడతారు?. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారు. వెంకటేశ్వరస్వామికి చంద్రబాబు చేస్తోంది అన్యాయం కాదా?..’’ అని భూమన మండిపడ్డారు. వంద రూమ్‌ల ఒబెరాయ్ హోటల్‌తో 1,500 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రజలకు చెప్తోంది. అదెలా సాధ్యం. ఇది పరకామణి దొంగతనం కంటే అతి పెద్ద దోపిడి. దీని వల్ల టీటీడీకి వచ్చిన లాభం ఏమిటి?. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనాడు తీసుకు వచ్చిన ఏడు కొండలు పరిధిలోనే ఈ భూములు ఉన్నాయి. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఈ భూమి ఉంది. అలిపిరి వద్ద అనుమతులు లేకుండా అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి?.. స్వామీజీలు ఇప్పటికైనా మౌనం వీడాలి. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై పోరాటం చేయాలి. ప్రత్యేక అగ్రిమెంట్ వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి తప్పిదాలు చేశారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి’’ అని భూమన డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: తిరుమలలో మహాపచారం.. మద్యం, బిర్యానీ ప్యాకెట్లు లభ్యం! -
రఘురామను సస్పెండ్ చేయకుండా వదిలేస్తారా?
సాక్షి, విజయవాడ: సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చట్టం ముందు అందరూ సమానమేనని.. అలాంటప్పుడు తన సస్పెన్షన్ విషయంలో జరిగింది అవతలివాళ్లకు కూడా వర్తించాలి కదా? అంటూ ఆయన ఓ సూటి ప్రశ్న సంధిస్తూ పోస్ట్ చేశారు. మాజీ నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కీ. రఘురామకృష్ణరాజు కస్టడీలో హింసకు గురయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అప్పటి సీఐడీ అదనపు డీజీపీగా ఉన్న పీవీ సునీల్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన్ను సస్పెండ్ చేసి.. విచారణకు కూడా పిలిచారు. అయితే.. ‘‘నన్ను సస్పెండ్ చేశారు మంచిదే. కానీ దర్యాప్తు న్యాయంగా జరగాలంటే రఘురామకృష్ణరాజును కూడా అన్ని పదవులనుండి తొలగించాలి కదా. అని ఆయన పోస్ట్ చేశారు. ఒకరిని సస్పెండ్ చేసి, మరొకరిని పదవిలో కొనసాగించడం అన్యాయని.. రఘురామకృష్ణరాజు పదవిలో ఉంటే దర్యాప్తు ప్రభావితం అవుతుందని.. సీబీఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి రఘురామను పదవుల నుండి తొలగించాలని.. తద్వారా చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నట్లు ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ ఉంచారు.ఇదీ చదవండి: ఫ్రాడ్ కేసులో రఘురామకు భారీ షాక్ -
గుప్త నిధుల ఆశతో..
అనంతపురం కల్చరల్: శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గాంజనేయస్వామి సేవలో ఉన్న అర్చక కుటుంబంపై టీడీపీ మూకలు దౌర్జన్యానికి దిగి.. ఆయన్ని గెంటేసి ఆలయానికి, కమ్యూనిటీ హాలుకు తాళాలు వేసి బీభత్సం సృష్టించారు. ఎమ్మెల్యే అరాచకాలపై స్థానిక అధికారులు, పోలీసులు స్పందించకపోవడంతో బాధిత అర్చకుడు బీఈ సిరి రమణ న్యాయం కోసం కలెక్టరేట్ ఎదుట ఫుట్‌పాత్‌పై ఆమరణదీక్షకు పూనుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దుర్గాంజనేయస్వామి ఆలయంలో గుప్తనిధులున్నాయని, రూ.6 కోట్ల ఫండ్ ఉందని ప్రచారం జరుగుతోందని, వీటి కోసమో ఎమ్మెల్యే శ్రావణిశ్రీ కుటుంబం కుట్ర పన్ని.. అర్చక కుటుంబంపై ఆరోపణలు చేస్తూ దాష్టీకానికి పాల్పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్చకుడు ఈ విషయాన్ని కలెక్టర్, ఎస్పీల నుంచి ఎటువంటి స్పందనా లేకపోయింది. అయినా న్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగించాలని ప్రతిన బూనాడు. రాత్రంతా గజగజ వణికించే చలిని సైతం లెక్క చేయకుండా దీక్ష కొనసాగించాడు. అయితే.. అర్ధరాత్రి అనంత పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ దీక్ష చేపట్టిన ఆలయ పూజారి రమణాచారి అరెస్ట్ చేశారు. బలవంతంగా జీజీహెచ్‌కు తరలించారు. శ్రావణి ఆదేశాలతో సీఐ బెదిరింపులుఎమ్మెల్యే శ్రావణి ఆదేశాలతో పోలీసులు ఆలయ కబ్జాకు సహకరిస్తున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో.. కాళ్లు విరగొడతానని పూజారి రమణాచారి ని శింగనమల సీఐ కౌలుట్లయ్య బెదిరించారని తెలుస్తోంది. సీఐ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పూజారి రమణాచారి ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు స్థానికంగా వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. గుప్త నిధుల కోసమే టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి తల్లి లీలావతి ఈ దారుణానికి పాల్పడ్డారని అందులో ఆయన ఆరోపించడం ఉంది. హిందూ సంఘాల మద్దతు.. మంగళవారం అయ్యప్ప మాలధారులు, వీహెచ్‌పీ, హిందూ చైతన్య వేదిక, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు అర్చకునికి సంఘీభావం తెలిపారు. అర్చకుడంటే మరీ అంత అలుసా.. భగవంతుని సేవ తప్ప మరొకటి తెలియని వారిపై ఇంత అరాచకం జరుగుతున్నా పట్టనట్టు ఉంటే ఎలా అని అధికారుల తీరుపై మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మద్ధతు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. మంగళవారం అర్చకుడిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆలయాల పరిరక్షణ, అర్చకుల సంక్షేమం కోసం పాటుపడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో అధికార టీడీపీ నేతల వైఖరితో అర్చకులు, అర్చక సంఘాల వారు బెంబేలెత్తిపోతున్నారని ఆవేదన చెందారు. బ్రాహ్మణుడు బలహీనుడని బాధిస్తే చూస్తూ ఊరుకోబోమని, తామంతా వెంట ఉండి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆలయాలకు భద్రత కరువు రాష్ట్రంలో ఆలయాలకు భద్రత కరువైందని ప్రభుత్వ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. అర్చకుడిని పరామర్శించి, సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. నాలుగు నెలల కిందట సింహాచల దేవస్థానంలో హుండీ చోరీ జరిగిందని, ఆరు నెలల కిందట అహోబిలం దేవస్థానంలో ఎమ్మెల్యే అనుచరులు హుండీ చోరీ చేసినా, వాడపల్లి వెంకటేశ్వరస్వామి వేవస్థానంలో శ్రీనివాసరావు అనే టీడీపీ కార్యకర్త హుండీ కానుకల లెక్కింపులో చేతివాటం ప్రదర్శించినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించిందన్నారు. నిత్యం ఏదో ఒక ఆలయంలో టీడీపీ నాయకులు వివాదం రగిలిస్తూ ప్రజలను భయకంపితులను చేస్తున్నారన్నారు. శింగనమల అర్చక కుటుంబంపై ఎమ్మెల్యే కుటుంబం కుట్ర పన్ని ఇబ్బందులు సృష్టించడం తగదన్నారు. గుప్తనిధుల కోసం సాగుతున్న దాషీ్టకంపై అధికారులకు తెలియజేసినా ఏమీ స్పందించకపోతే ఇక న్యాయం ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. సనాతన ధర్మ పరిరక్షకుడినంటూ గొప్పగా ప్రచారం చేసుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఇదంతా కనిపించడం లేదా అని నిలదీశారు. ఆయన స్పందించాలంటే చంద్రబాబు స్క్రిప్ట్ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. -
వాళ్లు మెంటలోళ్లు..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో చర్చించిన విషయాలు లీక్ కావడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీ వ్రంగా మండిపడ్డారు. ఆ అంశాలు బయటకు చెప్పిన వాళ్లు మెంటలోళ్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో తన నివాసంలో విలేకరులతో సమావేశం అనంతరం కిషన్‌రెడ్డి చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల పార్లమెంట్లో ప్రధాని తెలంగాణ బీజేపీ ఎంపీలతో జరిగిన సమావేశం, అక్కడ చర్చించిన అంశాలు బయటకు రావడం చర్చకు వచ్చింది. దీనిపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. ‘అక్కడ జరిగింది వేరు.. మీడియాలో వచ్చింది వేరు.పార్టీని, సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేయడం తదితర అంశాలపై ప్రధాని పలు సూచనలు చేశారు. అక్కడ చర్చించిన విషయాలు బయటకు చెప్పొద్దని ప్రధాని స్వయంగా ఆదేశించారు. అయినా.. ఎవరో మెంటలోళ్లు అక్కడ జరిగింది వేరైతే మీకు చెప్పింది వేరు. వాళ్లెవరో చెబితే చర్యలు తీసుకుంటాం’ అని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ ఉండటం దురదృష్టకరం: మోదీపై ఏఐసీసీ అగ్రనేత రా హుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఢి ల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ఓట్‌చో ర్–గద్దీ ఛోడ్ మహాధర్నాలో ప్రధానిపై రాహుల్ తీవ్ర వ్యా ఖ్యలు చేయడం సరికాదు. ప్రధాని స్థాయిని తగ్గించేలా రా హుల్ వ్యాఖ్యలున్నాయి. రాహుల్ లాంటి ప్రతిపక్ష నేత మన కు ఉండటం దురదృష్టకరం’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించా...‘తెలంగాణలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులపై మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సోమవారం చర్చించాను. 42 రైల్వేస్టేషన్ల పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయడంపై చర్చించాం. రూ. 400కోట్లతో హైదరాబాద్ నుంచి యాదగి రిగుట్ట వరకు పొడిగించాల్సిన ఎంఎంటీఎస్ రెండో దశపైనా మాట్లాడాం. కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని కోరాను’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే
సాక్షి, హైదరాబాద్: ‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీరు ఐదేళ్ల కోసం గెలిచారు, మిగిలిన సగం కాలం మన ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు చేసుకుంటారు. ఖానాపూర్, షాద్‌నగర్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఐకమత్యంతో కలిసి పనిచేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణభవన్‌లో ఖానాపూర్, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల కోసం సీఎం స్వయంగా జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేయడం చరిత్రలో ఎన్నడూ లేదని విమర్శించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ వంటి నాయకులు ఏనాడూ సర్పంచ్ ఎన్నికల కోసం రోడ్ల మీద పడలేదన్నారు. రేవంత్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే విజయోత్సవాల పేరుతో పరోక్ష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని, ప్రజలు, ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరి తెగించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బెదిరింపులకు సర్పంచ్‌లు లొంగొద్దుఎవరి బెదిరింపులకు సర్పంచ్‌లు లొంగవద్దని కేటీఆర్ సూచించారు. ‘ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడానికి ఈ ఎమ్మెల్యేలు ఎవరు? అవి మీ అబ్బ సొత్తు కాదు.. మీ అత్త సొత్తు కాదు’అన్నారు. రేవంత్‌రెడ్డి ఏమైనా తన భూములు అమ్మి గ్రామాలకు నిధులిస్తు న్నారా అని ప్రశ్నించారు. ప్రజల పైసలతో కడుతున్న ఇళ్లకు అర్హులను ఎంపిక చేసే పూర్తి అధికారం గ్రామ సభలకు, సర్పంచ్‌లకే ఉంటుందన్నారు.ఎవడైనా అడ్డు తగిలితే తాట తీసి లైన్లో పెట్టాలని కార్యకర్తలకు తెలిపారు. రెండేళ్లైనా ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం..ఇప్పుడు ఎలా గ్రామాలకు నిధులు ఇస్తుందని ప్రశ్నించారు. ‘కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావా ల్సిన రూ.3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి, రిజర్వేషన్లను 24% నుంచి 17%కి తగ్గించి హడావుడిగా ఎన్నికలు జరిపిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జాజుల సురేందర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఖానాపూర్ ఇన్చార్జ్ జాన్సన్‌నాయక్ పాల్గొన్నారు. -
తుదివిడత పంచాయతీ నేడే..
సాక్షి, హైదరాబాద్: తుదివిడత పల్లె పోరుకు సర్వం సిద్ధ మైంది. బుధవారం జరగనున్న మూడోవిడత పంచాయతీ ఎన్నికలతో రాష్ట్రంలో పల్లెపోరు ముగియనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులకు సీల్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు. అదేరోజు ఉపసర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. ఏదైనా కారణం వల్ల వాయిదా పడితే మరుసటిరోజు ఆ ఎన్నికను నిర్వహిస్తారు. మూడో దశ ఎన్నికల్లో భాగంగా.. 3,752 సర్పంచ్ పదవులకు 12,652 మంది, 28,410 వార్డులకు 75,725 మంది (నామినేషన్లు దాఖలు కాని, ఏకగ్రీవమైన స్థానాలు మినహాయించి) పోటీపడుతున్నారు. మంగళవారం పోలింగ్‌కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరుకుంది. సాయంత్రంకల్లా పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సుల నుంచి బందోబస్తు వరకు అన్నీ పక్కాగా ఉండేలా ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం ’జీరో ఎర్రర్’ విధానాన్ని అనుసరిస్తోంది. మంగళవారం సాయంత్రంకల్లా మొత్తం పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేసినట్టు ఎస్ఈసీ వెల్లడించింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడ లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీకుముదిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. -
పల్లెల్లో దాడులపర్వం
పంచాయతీ ఎన్నికల వేళ... పచ్చని పల్లెలు భగ్గుమంటున్నాయి. ఓటు వేయలేదనే నెపంతో కొందరు... తమకు సహకరించలేదనే కారణంతో మరికొందరు దాడులకు పాల్పడుతున్నారు.బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణుల దాడినర్సంపేట/దోమ/శంకరపట్నం: వరంగల్ జిల్లా చెన్నారా వుపేట మండలం చెరువుకొమ్ముతండాకు మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సోమవారం అర్ధ రాత్రి తండాలోని దుర్గమ్మ గుడి వద్ద కాంగ్రెస్ బలపరిచిన ఎనిమిదో వార్డు అభ్యర్థి కొర్ర మోహన్, కార్యకర్తలు సుమన్, రమేశ్, బోడ రాందాస్, పవన్, అజయ్, బాలు, రమేశ్, రాజేంద్రప్రసాద్ తదితరులు చలిమంట కాగు తున్నారు. ఈ సమయంలో బోడతండాకు చెందిన బీఆర్ ఎస్ కార్యకర్తలు బోడరెడ్డి, వెంకన్న, శ్రీను, ప్రసాద్, శ్రీనివా స్ అదే దారి గుండా వెళుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించారు. అంతేకాక తీవ్ర పదజాలంతో దూషిస్తూ చలిమంట కాగుతున్న వారిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. తండావాసులు గమనించి గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం కాంగ్రెస్ నాయకులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.సర్పంచ్ అభ్యర్థిపై కత్తితో దాడిమూడోవిడత ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా రాకొండ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా అర్జున్ బరిలో ఉన్నాడు. సోమవారం సాయంత్రం దాటిన తర్వాత ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి, మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ సమయంలో మాస్క్ ధరించిన ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో అర్జున్‌కు గాయాలవ్వగా, స్థానికులు వెంటనే అతడిని పరిగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్పీ స్నేహమెహ్ర ఆరా తీశారు. బాధితుడి తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఓటెయ్యలేదని బాలింతపై...కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్కు చెందిన ఖమురున్నిసా పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది. దీంతో కలత చెందిన ఆమె కుటుంబసభ్యులు యాస్మిన్, హకీంలు.. దాసరి పద్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. పద్మ కూతురు ప్రియాంక బాలింత అయినా, ఆమెపై విచక్షణారహితంగా దాడి చేయగా, తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108లో ఆస్పత్రికి తరలించారు.అక్కడ సర్పంచ్ ఎన్నిక నామమాత్రమే..దేవరుప్పుల: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లకావత్‌తండా(తూర్పు) సర్పంచ్ పదవికి లకావత్ భాగ్యనాయక్ పోటీ చేయగా, ప్రత్యర్థులు ఏకగ్రీవానికి అంగీకరించారు. అయితే స్వతంత్ర అభ్యర్థి లకావత్ శ్రీను తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. మరుసటి రోజు తాను పోటీలో నుంచి తప్పుకుంటానని ప్రకటించి ప్రచారం చేయలేదు. దీంతో అక్కడ సర్పంచ్ ఎన్నికకు పోటీ లేదని స్థానికులు చెబుతున్నారు. పంచాయతీ పరిధిలో 8 వార్డులుండగా, 3 ఏకగ్రీవమయ్యాయి.సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నంరఘునాథపాలెం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హరియాతండా సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గుగులోత్ చింతామణి భర్త రంగా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ గ్రామంలో మొదటి విడతలో ఎన్నికలు జరగ్గా..పంచాయతీ పరిధిలోని సుకినీతండా పోలింగ్‌బూత్‌లో దొంగ ఓట్లు వేశారని ఆరోపిస్తూ మూడు రోజుల క్రితం రాంబాబు సెల్‌టవర్ ఎక్కగా స్థానికులు, అధికారుల చొరవతో దిగొచ్చాడు. అయితే రంగా మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ సందర్భంగా చింతామణి మాట్లాడాడుతూ పలువురు దొంగ ఓట్లు వేశారని, చనిపోయిన వారి పేరిట ఉన్న ఓట్లు కూడా పోల్ అయ్యాయని ఆరోపించారు.సార్లరావులపల్లి సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేయండిహైకోర్టును ఆశ్రయించిన పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థులు కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సార్లరావులపల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ.. బరిలో నుంచి తప్పుకున్న అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సర్పంచ్ పదవికి ఇస్లావత్ శ్రీకాంత్, జర్పుల ప్రవీణ్, ఇస్లావత్ శ్రీను, నేనావత్ గణేశ్, బానావత్ బాలు నామినేషన్లు వేయగా, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఇస్లావత్ శ్రీను ఒక్కరే బరిలో ఉండగా, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. అయితే అధికార పార్టీకి చెందిన పలువురు తమను భయభ్రాంతులకు గురిచేసి, నామినేషన్లు విత్‌డ్రా చేయించారని ఆరోపిస్తూ ప్రవీణ్, గణేశ్, శ్రీకాంత్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.ఇంట్లో కూర్చున్నా 208 ఓట్లు తాండూరు రూరల్: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చంద్రవంచ సర్పంచ్ స్థానానికి పటేల్ సుదర్శన్‌రెడ్డి, పటేల్ విజయ్‌కుమార్‌రెడ్డి నామినేషణ్లు దాఖలు చేశారు. విజయ్‌కుమార్‌రెడ్డిని విత్‌డ్రా చేయించి, సుదర్శన్‌రెడ్డిని ఏకగ్రీవం చేయాలని గ్రాబపెద్దలు నిర్ణయించారు. అప్పటికే వార్డు సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. అయితే విజయ్‌కుమార్‌రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. దీంతో తాండూరులో ఉండే విజయ్‌కుమార్‌రెడ్డిని గ్రామస్తులు ఊర్లోకి రానీయలేదు. దీంతో ఆయన ప్రచారానికి దూరంగా తాండూరులోనే ఉండిపోయారు. 11వ తేదీన తొలివిడత పంచాయతీ ఎన్నిక లు జరగ్గా, విజయ్‌కుమార్‌రెడ్డికి 208, సుదర్శన్‌రెడ్డికి 469 ఓట్లు వచ్చాయి.పైసలిస్తారా.. ప్రమాణం చేస్తారా..! చింతలమానెపల్లి(సిర్పూర్): రెండోవిడత జరిగిన ఎన్నికల్లో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం బాలజీఅనుకోడ సర్పంచ్ పదవికి వగాడి శంకర్ పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. వగాడి శంకర్‌కు 338 ఓట్లు రాగా, విజేతగా నిలిచిన వ్యక్తికి 361 వచ్చాయి. శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల సమయంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని మంగళవారం గ్రామంలోని ఓటర్లను డిమాండ్ చేశారు. పళ్లెంలో పసుపు కలిపిన బియ్యాన్ని వేసి తనకే ఓటేసినట్టు పసుపు బియ్యం పట్టాలంటూ ఓటర్ల వద్దకు వెళ్లారు. ఎన్నికల్లో రూ.8 లక్షలు పంచినా గెలువలేదని, తనను ఓటర్లు మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ 69 ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలుతలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామ పంచాయతీకి 69 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. మొట్టమొదటిసారి ఈ పంచాయతీకి 1956లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నుంచి ప్రతిసారీ గ్రామస్తులు సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈసారి సర్పంచ్ బరిలో ఇద్దరు ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. పంచాయతీ పరిధిలో 10 వార్డులుండగా, రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత గ్రామస్తులు బుధవారం పంచాయతీ ఓట్లను వినియోగించుకోనున్నారు. -
‘రోజ్‌గార్’ బిల్లుపై గరం గరం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 20 ఏళ్లుగా అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో.. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ప్రతిఏటా 125 పనిదినాలకు హామీ ఇస్తూ మరో చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం లోక్‌సభలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్–గ్రామీణ(వీబీ–జీ రామ్ జీ) బిల్లు–2025ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి.చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం పట్ల మండిపడ్డాయి. బిల్లును క్షుణ్నంగా పరిశీలించాలని, అందుకోసం పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశాయి. చరిత్రాత్మకమైన ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడానికి మోదీ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆరోపించాయి. విపక్షాల అభ్యంతరాలను శివరాజ్‌సింగ్ చౌహాన్ కొట్టిపారేశారు. తమ ప్రభుత్వం గాం«దీజీ ఆశయాలు, ఆదర్శాలను విశ్వసించడమే కాకుండా త్రికరణ శుద్ధిగా అమలు చేస్తోందని వివరించారు. ఉపాధి హక్కుపై దెబ్బ: ప్రియాంక మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ముసాయిదా బిల్లు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిరుపేదలకు ఏడాదికి 100 రోజులపాటు పని దొరుకుతోందని అన్నారు. మోదీ ప్రభుత్వం పేదల ఉపాధి హక్కును దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ చట్టం అమలుకు కేంద్రం 90 శాతం నిధులు ఇస్తోందని, ప్రస్తుతం దీన్ని 60 శాతానికి కుదిస్తున్నారని తప్పుపట్టారు. దీనివల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. పథకం నుంచి గాం«దీజీ పేరు తొలగించడం అన్యాయమని అన్నారు. జాతిపితను అపహాస్యం చేస్తున్నారు: బాలు గాం«దీజీ గ్రామాల్లో నివసించారని, పేదల సంక్షేమం కోసం పనిచేశారని డీఎంకే సభ్యుడు టి.ఆర్.బాలు చెప్పారు. పేదలకు ఉపాధి కల్పించడానికి మన్మోహన్సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని నీరుగార్చవద్దని కేంద్రాన్ని కోరారు. జాతిపితను మోదీ ప్రభు త్వం అపహాస్యం చేస్తోందని విమర్శించారు. వీబీ–జీ రామ్ జీ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. గాందీజీ ఫొటోలను ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం ఆందోళనకు దిగారు. గాంధీజీకి జరిగిన అవమానాన్ని దేశం సహించబోదంటూ నినదించారు. రాముడి పేరును బద్నాం చేయొద్దు: థరూర్ వీబీ–జీ రామ్ జీ బిల్లును లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యతిరేకించారు. 1971 నాటి బాలీవుడ్ పాటను ప్రస్తావించారు. ‘ఈ పని చేయొద్దు, రాముడి పేరును బద్నాం చేయొద్దు’ అని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. పేదలకు అండగా నిలస్తున్న పథకాన్ని బలహీనపర్చొద్దని తేల్చిచెప్పారు. అనుమానాలు వద్దు: కేంద్రం బిల్లుపై అనుమానాలు అవసరం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధన దిశగా గ్రామీణ పేదల ఉపాధికి హామీ ఇస్తూ చట్టం తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇది ఆధునిక చట్టబద్ధమైన ఏర్పాటు అని పేర్కొంది. పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం దీని ఉద్దేశమని వివరించింది. విప్ జారీ చేసిన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తమ లోక్‌సభ సభ్యులకు మంగళవారం విప్ జారీ చేసింది. రాబోయే మూడు రోజులపాటు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని ఆదేశించింది. వీబీ–జీ రామ్ జీ సహా కీలకమైన బిల్లులపై చర్చ, ఓటింగ్ జరిగే అవకాశం ఉందని పేర్కొంది. బిల్లులపై జరిగే చర్చల్లో పాల్గొనాలని, ప్రజల గొంతుకను వినిపించాలని సూచించింది. గాందీజీ ఆదర్శాలకు అవమానంమహాత్మా గాంధీ ఆదర్శాలను ప్రభుత్వం అవ మానిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. కేంద్రం తెచ్చిన బిల్లును తప్పుపడుతూ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. గ్రామీణ పేదల జీవనోపాధిని దెబ్బకొట్టాలన్నదే మోదీ ప్రభుత్వ అసలు ఉద్దేశమని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, యువత భవిష్యత్తు నాశనమవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలువీబీ–జీ రామ్ జీ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఈ మేరకు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులకు లేఖ రాశారు. మహాత్మాగాంధీ చిత్రపటాలు చేతబూని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. -
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీరు ఐదేళ్ల కోసం గెలిచారు, మిగిలిన సగం కాలం మన ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు చేసుకుంటారు. ఖానాపూర్, షాద్‌నగర్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఐకమత్యంతో కలిసి పనిచేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణభవన్‌లో ఖానాపూర్, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల కోసం సీఎం స్వయంగా జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేయడం చరిత్రలో ఎన్నడూ లేదని విమర్శించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ వంటి నాయకులు ఏనాడూ సర్పంచ్ ఎన్నికల కోసం రోడ్ల మీద పడలేదన్నారు. రేవంత్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే విజయోత్సవాల పేరుతో పరోక్ష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని, ప్రజలు, ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరి తెగించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.బెదిరింపులకు సర్పంచ్‌లు లొంగొద్దుఎవరి బెదిరింపులకు సర్పంచ్‌లు లొంగవద్దని కేటీఆర్ సూచించారు. ‘ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడానికి ఈ ఎమ్మెల్యేలు ఎవరు? అవి మీ అబ్బ సొత్తు కాదు.. మీ అత్త సొత్తు కాదు’అన్నారు. రేవంత్‌రెడ్డి ఏమైనా తన భూములు అమ్మి గ్రామాలకు నిధులిస్తు న్నారా అని ప్రశ్నించారు. ప్రజల పైసలతో కడుతున్న ఇళ్లకు అర్హులను ఎంపిక చేసే పూర్తి అధికారం గ్రామ సభలకు, సర్పంచ్‌లకే ఉంటుందన్నారు. ఎవడైనా అడ్డు తగిలితే తాట తీసి లైన్లో పెట్టాలని కార్యకర్తలకు తెలిపారు. రెండేళ్లైనా ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం..ఇప్పుడు ఎలా గ్రామాలకు నిధులు ఇస్తుందని ప్రశ్నించారు. ‘కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావా ల్సిన రూ.3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి, రిజర్వేషన్లను 24% నుంచి 17%కి తగ్గించి హడావుడిగా ఎన్నికలు జరిపిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జాజుల సురేందర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఖానాపూర్ ఇన్చార్జ్ జాన్సన్‌నాయక్ పాల్గొన్నారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు స్పీకర్ నిర్ణయం?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది శాసనసభ్యులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 18లోగా ఏదో ఒక నిర్ణయాన్ని తమకు సీల్డ్ కవర్లో సమర్పించాలంటూ సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ గత నెల రోజులుగా ఎమ్మెల్యేల విచారణను వేగవంతం చేశారు. బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులతోపాటు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిందిగా స్పీకర్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో స్పీకర్ కీలక నిర్ణయం ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది. లేదంటే తుది విడతగా మరోసారి న్యాయవాదులతో చర్చించాక నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా తెలియచేసే అవకాశం ఉందని అంటున్నారు. -
‘ ఆ అంశంపై చర్చకు మేము సిద్దం, మీరు సిద్దమా?’
తాడేపల్లి : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదక మీద కూడా ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్మాణం చేయమని ఆ కమిటీ చెప్పలేదన్నారు. కానీ స్టాండింగ్ కమిటీ నివేదిక పైనా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తన్నారన్నారు. ఈరోజు(మంగళవారం, డిసెంబర్ 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి విడదల రజిని మాట్లాడుతూ.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక పై చర్చకు తామె పిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం సిద్ధమా? అని సవాల్ విసిరారు. ‘పేదల ఆరోగ్యంపై చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు. ఎంబీబీఎస్ సీట్లు విషయంలో రాష్ట్రాల వారీగా అసమానతలు ఉన్నాయని స్టాండింగ్ కమిటీ చెప్పింది. కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ, మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువ సీట్లు ఉన్నాయని కమిటీ చెప్పింది. ఇలాంటి అసమానతలు ఉండ కూడదనే వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో పీపీపీ పేరుతో చంద్రబాబు స్కాం కి తెరలేపారు. రాష్ట్రాలు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటే PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయమని చెప్పింది. అంతేకాని ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలలను ఇవ్వమని చెప్పలేదు. చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ppp కి ఇవ్వమని కమిటీ ఎక్కడ చెప్పిందో చూపించాలి. దీనిపై చర్చకు మేము సిద్దం, మీరు సిద్దమా?’ అని సవాల్ చేశారు. -
బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేశారు: వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: న్యాయస్థానంలో ఊరట ఉన్నప్పటికీ.. అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం భవానీపురం జోజి నగర్లో బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘25 ఏళ్లుగా 42 కుటుంబాలు ఇక్కడే ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉంది. అయినా కూడా వీళ్ల ఇళ్లను ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు సుప్రీం కోర్టు వీళ్లకు ఊరట ఇచ్చింది. పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతుగా ఈ కూల్చివేతలు జరిపారు. 200 మంది పోలీసులు ఈ కూల్చివేతలు జరిపారు. ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేసేందుకు ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఈ కూల్చివేతలు జరిగాయి. అధికార దుర్వినియోగం చేస్తూ ఇక్కడి వాళ్లను రోడ్డుపాలు చేశారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. .. 2.17 ఎకరాల ఈ భూమి విలువ రూ.150 కోట్ల దాకా ఉంటుంది. 2016లో ఫేక్ సొసైటీ క్రియేట్ చేశారు. అప్పటి నంచే ఈ భూమిని కాజేసేందుకు స్కెచ్ వేశారు. కూల్చివేతల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పేటర్ సోదరుడి ప్రమేయం కూడా ఉంది. బాధితులు చంద్రబాబును మూడుసార్లు కలిశారు. లోకేష్‌ను రెండు సార్లు కలిశారు. ఆ ఇద్దరికీ వినతి పత్రాలు ఇచ్చారు. అయినా కూడా కుట్రపూరితంగా.. చంద్రబాబు, లోకేష్, చిన్నిలు బాధితులకు అన్యాయం చేశారు. బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాలను విచ్ఛిన్నం చేశారు’’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్లకు అన్నిరకాల అనుమతులు కూడా ఉన్నాయి. బ్యాంకుల నుంచి లోన్లు కూడా వచ్చాయి. ఎన్నో ఏళ్లగా ఈఎంఐలు కూడా కడుతున్నారు. అయినా కూడా కుట్ర పన్ని కూల్చివేతలు జరిపారు. స్థలం వేరొకరిదే అయితే రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు?. ఇళ్లకు ఎలా అనుమతులు ఇచ్చారు?.. బ్యాంకు లోన్లు ఎలా వచ్చాయి?.. క్రయవిక్రయాలపై పేపర్లలలో కూడా ప్రకటనలు ఇచ్చారు. అలాంటప్పుడు ఆ సమయంలో ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు? అని ప్రశ్నించారాయన. ఈ క్రమంలో ఇళ్ల కూల్చివేతలపై సీబీఐ విచారణ జరిపించాలని.. బాధితులకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వమే కేటాయించాలని.. వాళ్ల బ్యాంకు లోన్లు కూడా ప్రభుత్వమే కట్టాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ‘‘బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. అవసరమైన న్యాయ సహకారం కూడా అందిస్తాం. ఒకవేళ మీరు ఎంక్వైరీ వేయకపోతే.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పని చేస్తుంది. దోషులుగా మిమ్మల్ని కోర్టు ముందు నిలబెడుతుంది’’ అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
ఏ బిల్లునూ ఇష్టారాజ్యంగా మార్చకూడదు: ప్రియాంకా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మారుస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకానికి వికసిత్ భారత్ - జీ- రామ్- జీ (గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)) పేరును పెట్టింది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) స్థానంలో కొత్త బిల్లును తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లు చట్టాన్ని బలహీనపరుస్తుందని, వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.ఎవరైనా వ్యక్తిగత అభిలాష, పక్షపాతం, స్వేచ్ఛ ఆధారంగా చట్టాలు చేయకూడదని ప్రియాంకా గాంధీ అన్నారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ ఇచ్చే MGNREGS పథకాన్ని రద్దు చేసి కొత్త బిల్లుతో భర్తీ చేయడం అన్యాయమని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లు రైతులు, కార్మికులు, గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తుందని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా బలమైన నిరసన వ్యక్తం చేస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశంలోని కోట్లాది కుటుంబాలకు రక్షణ కవచం. దానిని బలహీనపరచడం ప్రజల హక్కులను హరించడం అవుతుందని పార్టీ నేతలు పేర్కొన్నారు. కాగా ఈ బిల్లుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.గాంధీ పేరు తొలగించడం అనైతికం: థరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ నిరసనకు మద్దతు తెలిపారు. రాముడి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం అపవిత్రం చేయొద్దు అంటూ కేంద్రాన్ని కోరారు. ప్రజల జీవనోపాధి కోసం రూపొందించిన పథకానికి పేరు మార్చడం అనైతికమని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రజల హక్కులను కాపాడే పథకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని స్పష్టం చేశారు.ఈ మేరకు పార్లమెంటులో మహాత్మా గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పేరును తొలగించి "జిరాంజీ"గా మార్చడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. -
కాంగ్రెస్ గూండాల దాడికి ప్రతిదాడి తప్పదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పోలీసులకు జీతాలు ప్రజల సొమ్ము నుంచి వస్తన్నాయేగానీ.. కాంగ్రెస్ పార్టీ నుంచి కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత బిట్ల బాలరాజు, ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం కేటీఆర్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారాయన. అనంతరం.. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా, అమానవీయంగా ఉంది. డీజీపీ నుండి కింది స్థాయి పోలీసు అధికారుల వరకు అందరికీ గుర్తుచేస్తున్నా. మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతోనే తప్ప, రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతోనో, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతోనో కాదు. ప్రజల ప్రాణాలు పోతుంటే, రౌడీలు దాడులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూడటం పద్ధతి కాదు.. పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తూ, నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. "ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి" అని హెచ్చరించారాయన. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందని కేటీఆర్ ఆరోపించారు. నల్గొండలో మల్లయ్య యాదవ్ హత్య, సూర్యాపేటలో బీసీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ఘటనలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. గాయపడిన భారతి గారి కుటుంబానికి, ఇతర కార్యకర్తలకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను బీఆర్ఎస్ పార్టీనే భరిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, అవసరమైతే డీజీపీ, ఎస్పీ కార్యాలయాల ముట్టడికైనా పిలుపునిస్తామని.. న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాషతో కార్యకర్తలను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. "ఖబడ్దార్ కాంగ్రెస్ గుండాలారా" అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్లు.. భారతి పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెతో పాటు బాలరాజులపై దాడి చేసిన వారిని, ఆ దాడికి ప్రేరేపించిన వారిపై కూడా వెంటనే 'అటెంప్ట్ టు మర్డర్' (హత్యాయత్నం) కేసులు నమోదు చేయాలి. వెంటనే దోషులను అరెస్ట్ చేసి బాధితుల పక్షాన నిలబడాలి. ఆసుపత్రి పాలైన ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి, నష్టపరిహారం చెల్లించాలి. ఈ పరామర్శలో ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, స్థానిక కార్యకర్తలు కేటీఆర్ వెంట ఉన్నారు. -
ప్రధాని మీటింగ్ లీక్స్.. కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఓటు చోరీ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అనైతికమని, ప్రధానమంత్రి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండటం దేశానికి దురదృష్టకరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి సమావేశం జరిగిన విషయాన్ని కిషన్ రెడ్డి వివరించారు. ఆ సమావేశం మర్యాదపూర్వక భేటీ అని, అన్ని రాష్ట్రాల ఎంపీలను పిలిచినట్లే తెలంగాణ ఎంపీలను కూడా పిలిచారని తెలిపారు. పార్టీని బలోపేతం చేయాలని, సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండాలని ప్రధానమంత్రి సూచించారని చెప్పారు.ప్రధానితో జరిగిన సమావేశ వివరాలను బయట పెట్టడం మంచిది కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మీటింగ్ వివరాలు ఎవరైనా లీక్ చేస్తారా? లీక్ చేసినోడు మెంటలోడు. ఎవరో తెలిస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అంతర్గత విషయాలను బయటకు చెప్పడం పార్టీ ఐకమత్యానికి విఘాతం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. -
‘‘బాబుగోరు.. మీరు గుడ్డో గుడ్డూ’’
ఏది ఏమైనా బాబుగోరు మీరన్నా...మీ పాలన అన్నా చెవి కోసుకుంటా. అసలు మీలా పాలించేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? నాకైతే డౌటనుమానమే. గత ఎన్నికల్లో మీరు గొప్ప మనసు చేస్కొని మమ్మల్ని మీతో కలవనివ్వబట్టే కదా ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టా ...సెంటర్ లో మన సర్కారు నిలబెట్టా. మేం కూటమి అంటున్నామే కానీ అదంతా మీ చలవ కాకపోతే మరేందనుకుంటున్నారు. మీరు మాతో జట్టుకట్టబట్టే కదా ఈ పుణ్యం పురుషార్థం మాకు దక్కింది. అయినా బాబుగోరు మీ గొప్పతనం మీకు తెల్వదు... ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడికక్కెడికో తీసుకెళ్లి పోతున్నారంటే నిజం నన్ను నమ్మండి..అసలు మీకున్న విజను...మీకున్న లిజను ఎవరికుంది చెప్పండి? కానీ విజన్ లేని వారికి ఏం తెలిసొస్తుంది చెప్పండి. ఒక్కోసారి వీరంతా ఎందుకొచ్చారా రాజకీయాల్లోకి అనిపించేస్తుందంటే నమ్మండి సుమండీ. అయినా కోటిజన్మల పుణ్యఫలం వల్లే కదా మీ స్నేహం మాకు దక్కింది. మీరాదరి మేమీ దరిని ఉన్నా....చెగువీరాను పూనిన ఆ అద్భుత వ్యక్తే కదా మనల్ని కలిపింది..లేదంటే మేమెంత ఒంటరి పక్షులమైపోయేవాళ్ళమో తలచుకుంటేనే గుండె తరుక్కుపోతుందంటే నమ్మండి సుమండి..అయినా ఎవరెవరో ఏదో అంటుంటారు...మనం అదంతా పట్టించుకోరాదు బాబుగోరు. అలా పట్టించుకుంటే రాజకీయాల్లో ఉండగలమా? అయినా నా చాదస్తం గానీ మీకు ఇవన్నీ కొట్టినపిండేగా. నిజమే అప్పుడెప్పుడో పాత ఎన్నికలప్పుడు మమ్మల్ని మీరు మనసారా దూషించారు. కానీ మీ తిట్లే మాకు దీవెనలని అనుకోలేదూ..అయినా బాబుగోరు మమ్మల్ని మీరు అప్పుడెంత దూషించారో...ఆ క్షణాన కాస్త కోపం వచ్చినా...మళ్ళీ మాతో కలవాలని మీరు పదే పదే కలవరించారు చూడండీ...అదీ మీ గొప్పతనం. మన మధ్య స్నేహబంధం నాగార్జునా సిమెంట్ కన్నా దృఢమైంది. కాకుంటే ఇన్నిసార్లు మీరు ఇన్నేసి మాటలన్నా...మళ్ళీ లటుక్కున వచ్చి మమ్మల్ని అతుక్కుపోయారు చూడండి...అబ్బబ్బా ఏమన్నా పొలిటికల్ విజనా మీది. .ఇక మీ సైనికుని గురించి ఏం చెప్పమంటారు...ఎంతని చెప్పమంటారు? ఇపుడు వారు మాకూ ఆంతరంగికులై పోయారు. అసలు వారిని మీరు బలే తయారు చేశారు బాబుగోరు. ఏ ఇజాలు తెలీకపోయినా...నిజాలు రాకపోయినా పర్వాలేదు పైకి మాత్రం గంభీరంగా ఎస్వీరంగారావులాగా తలూపుకొంటూ తిరుగుతుండాలి. ఆయన అచ్చం అలానే చేస్తున్నారాయే. మమ్మల్ని కలవక ముందు చెగువీరా అన్నారా...ఎర్రెర్రని జెండా ఎన్నీయల్లో... అని పాటలు కూడా పాడేశారా...ఇపుడు చూడండి నుదుటిపై ఇంతేసి బొట్టు పెట్టుకుని , కాషాయం చుట్టుకుని...నా ధర్మం...నేచూస్తా...నే కాస్తా అంటూ ఎర్రజెండా పట్టుకున్నోరిలా రంకెలు వేస్తున్నారు. అసలు మీ ట్రైనింగ్ ఇక్కడే కనిపిస్తోంది. నేను మారాను అని చెప్పకుండానే చేసి చూపిస్తున్నారు. జనాలు ఎలాగూ నమ్మరనుకోండి ...అది మా సిలబస్ కాదు కదా. చూశారా ఇదీ కదా సేవ..సారీ స్నేహధర్మమంటే..గత ఎన్నికల్లో మీతో కలిసి వెళ్ళడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నానని బలే ప్రచారంలో పెట్టారు బాబుగోరు. అయినా అన్నామో లేదో ఆ పెరుమాళ్లకే ఎరుక...దాందేముంది లేండి...ఆ ప్రచారం వల్ల మీరు కుషీ అయితే అదే పదివేలు. గిట్టని వారు అది అబద్దమంటారని పీల్ కాకండి బాబుగోరు. మనం మనం బాగుంటే చాలు కదా...ఏదో మీ తృప్తి కోసం అలా అన్నారే అనుకోండి...మరీ అంత ప్రచారంలో పెడితే ఎలా? వదిలేయండి బాబుగోరు...మీ విజన్ కు అది ఆనదు గాక ఆనదు. అదేదో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మెడికల్ కళాశాలలు ప్రైవేటు వద్దంటూ కోటి సంతకాలు చేయిస్తున్నారటగా... నిరసనలు కూడా చేస్తున్నారటగా...జనాలూ వస్తున్నారటగా...ఆ మీరు బెదరుతారా ఏంది? అయినా ప్రైవేటైజేషన్ అంటే మీకు ఎంత ప్రేమో మాకు తెలీదా ఏంటి? మేం కూడా విశాఖ ఉక్కును ఎవరికైనా అప్పగిద్దామనే కదా అనుకుంటున్నది....కానీ గట్టిగా అనరాదు వేరెవరూ వినరాదు...మన సర్కారుకు ఇంకా బోల్డంత టైముంది ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉంది...ఇదే కదా బాబుగోరు మీ మనసులో మాట....అరే మా మనసులోనూ ఇదే. కానీయండి అలా ముందుకెళదాం..సివారఖరికి మేము చెప్పొచ్చేదేంటంటే.. ప్రతిపక్షాలు కదా కాస్త ఘాటుగానే వ్యవహరిస్తుంటాయి. కానీ మనం కూడా తక్కువేం కాదుగా అంతకంతకు నాటుగానే ఉంటున్నాం. మీరు మాత్రం తగ్గేదేలా అన్నట్లుండండి. విజన్ అంటూ ఊదరగొట్టండి. అసలు జనాలు మీరు ఏం చెబుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేక బిక్కమొగం వేసుకోవాలి. వారు తేరుకునేలోగా మన పుణ్యకాలం ఎలాగూ పూర్తయిపోతుంది. మరి ఆతర్వాతో అంటారా...సినబాబు చూసుకుంటారు లెండి. మన ప్యూచరేంటి అంటారా? నందో రాజో భవిష్యతి అనుకుని గ్లాసు నీళ్లు గటగటా తాగేయడమే. సరే మరి నేనుంటా మీరలాగే ముందుకు వెళ్ళిపోతూనే ఉండండేం.. పొరపాటున కూడా ఆగకండి.::ఆర్ఎం -
ఏపీలో కమీషన్ల కోసమే ప్రైవేటు అప్పులు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. లోక్‌సభలో సోమవారం అనుబంధ పద్దులపై జరిగిన చర్చలో పాల్గొన్న మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వ తీరును, కేంద్రం చూసీచూడనట్లు వ్యవహరించడాన్ని ఎండగట్టారు. బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని ముందుకొస్తున్నా.. కమీషన్ల కక్కుర్తితో అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు తెస్తున్నారని చెప్పారు.ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా తెచ్చే ఈ అప్పులకు ఏకంగా రాష్ట్ర ఖజానా (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచే నేరుగా చెల్లింపులు చేసేలా ఒప్పందాలు చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఈ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని మండిపడ్డారు. గతంలో అప్పుల వృద్ధి రేటు (సీఏజీఆర్) 13.5 శాతంగా ఉంటే, ప్రస్తుతం అది దేశంలోనే అత్యధికంగా 22 శాతానికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.రూ.150 కోట్ల కమీషన్: ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బేవరేజెస్ కార్పొరేషన్ల పేరుతో ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు (9.3 శాతం) నిధులు సమీకరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకులు 6 శాతానికే రుణాలు ఇస్తుంటే.. ప్రైవేటు వ్యక్తుల వద్ద ఎందుకు అప్పులు చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం 1.5 శాతం బ్రోకరేజ్ కమీషన్ కోసమే ఈ దందా నడుస్తోందని, దాదాపు రూ.150 కోట్ల ప్రజాధనాన్ని కమీషన్ల రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్రం పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.అంతేగాక ప్రైవేటు వ్యక్తుల నుంచి తెచ్చే అప్పులకు గ్యారెంటీగా రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్‌ను చూపించడం, ప్రభుత్వ అనుమతి లేకుండానే అందులోంచి డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించడం దుర్మార్గమని చెప్పారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ల అప్పులను కూడా రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని లేఖలు రాసిన కేంద్ర ఆర్థికశాఖ.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు.ఇప్పుడు నిబంధనలు మారాయా? లేక కూటమి ప్రభుత్వానికి ఒక న్యాయం, మాకో న్యాయమా?.. అని ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కూలీలకు గత ఏడు నెలలుగా డబ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సొంత రాష్ట్రం, సొంత నియోజకవర్గంలోనే ఈ దుస్థితి ఉందంటే సిగ్గుచేటని విమర్శించారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను సాగనివ్వబోమని స్పష్టం చేశారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి ప్రభుత్వమే నడపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుపరం చేయడాన్ని మిథున్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కడప–బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. -
బ్యాలెట్ పేపర్లతోనే ప్రజాస్వామ్యం పదిలం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. టెక్నాలజీ పేరుతో వస్తున్న ఈవీఎంల కంటే నమ్మకమైన బ్యాలెట్ పేపర్ విధానాన్నే తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో సోమవారం ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.2024లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అవకతవకలను ఎండగడుతూ, ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరుపై ప్రశ్నలవర్షం కురిపించారు. ఎన్నికల సంఘం 2024 మే 25న విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పోలైన ఓట్ల సంఖ్యకు, కౌంటింగ్ తర్వాత ఫాం–20లో చూపించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోను ఈ తేడాలు స్పష్టంగా కనిపించాయన్నారు. ఈ తప్పులకు బాధ్యులెవరని ప్రశ్నించారు. బాధ్యులపై ఈసీ ఏం చర్యలు తీసుకుందని నిలదీశారు. అసెంబ్లీకి, లోక్‌సభకు ఓట్లలో తేడా ఎలా? ‘ఒకేసారి జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో.. ఒకే ఓటరు జాబితా, ఒకే పోలింగ్ బూత్ ఉన్నప్పుడు ఫాం–17ఏ (ఓటరు రిజిస్టర్), ఫాం–17సీ (ఓట్ల లెక్క) మధ్య తేడాలు ఎలా వస్తాయి? రాజమహేంద్రవరం, రాయచోటి, యలమంచిలి, కడప, పులివెందుల వంటి అనేక నియోజకవర్గాల్లో ఈ వ్యత్యాసాలు వెలుగుచూశాయి. ఇది కచ్చితంగా ఓట్ల డేటాలో మాయాజాలం లేదా అవకతవకలే. ఎంత ఆధునికమైనా ఈవీఎంలను పూర్తిగా నమ్మలేం. అదే బ్యాలెట్ పేపర్ అయితే పాత పద్ధతే అయినా ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. ఆడిట్ చేయడానికి వీలులేని ఏ వ్యవస్థా విశ్వసనీయం కాదు.అందుకే రాబోయే అన్ని ఎన్నికల్లోను ఈవీఎంలను రద్దుచేసి, బ్యాలెట్ పేపర్లను తీసుకురావాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల పారదర్శకత కోసం వైఎస్సార్సీపీ తరఫున ఆయన కేంద్రానికి, ఈసీకి పలు సూచనలు చేశారు. ‘పోలింగ్ రోజు సీసీటీవీ ఫుటేజీ, ఫాం–17ఏ, 17సీ వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంల వెరిఫికేషన్‌ను కచ్చితంగా అమలు చేయాలి. వందశాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉండాలి..’ అని సూచించారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 40 శాతం ఓటింగ్ షేర్ వచ్చిందని చెప్పారు. కానీ జరిగిన అవకతవకలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
సాక్షి, హైదరాబాద్: సామాజిక తెలంగాణయే తన ధ్యేయమని, 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని, ప్రజలు సూచించిన పేరునే పారీ్టకి పెడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం ‘ఆస్క్ కవిత’హ్యాష్ ట్యాగ్‌పై ‘ఎక్స్’లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు రావాలని, నాణ్యమైన, మెరుగైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని కోరారు. తెలంగాణలో తల్లిదండ్రులు పిల్లల చదువుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఉండే పరిస్థితి రావాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, రేవంత్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవటంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల రైతులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. -
‘ప్రజావైద్యం కోసం మా నాయకుడు విశేషంగా పని చేశారు’
తాడేపల్లి :గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజావైద్యం కోసం విశేషంగా పనిచేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి, పార్టీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేసిన ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు. మరి నేటి కూటమి ప్రభుత్వం అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టిందని విమర్శించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనం ఆగ్రహంతో ఉన్నారనే దానికి ఈరోజు(సోమవారం, డిసంబర్ 15) రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ర్యాలీలే ఉదాహరణ అని మాజీ మంత్రి, అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాంటిదన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ప్రజాఉద్యమం చేస్తుందని, గత 18 నెలల కాలంగా వైఎస్సార్సీపీ అనేక ప్రజా ఉద్యమాలు చేస్తుందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. ‘ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, రైతాంగ సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కమీషన్ల కోసమే పీపీపీ మోడల్లోకి తీసకెళ్లారు. ఇది దుర్మార్గమైన మోడల్.కాలేజీలను అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు..రాష్ట్రంలో కోటి సంతకాలకు మంచి స్పందన లభించింది. నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు.. అక్కడ నుంచి కేంద్ర కార్యాలయం వరకు ప్రజల సంతకాలు వచ్చాయి.. ప్రతీ జిల్లాలో వైఎస్సార్సీపీ నిరసనలకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు. జగన్ ప్రజావైద్యం కోసం విశేషంగా పని చేశారు. అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేశారు. ఇవాళ జీరో వెకెన్సీ సిస్టమ్ లేదు.. మందులు లేవు. జగన్ తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈనెల 18న గవర్నర్ ను జగన్ కలుస్తారు. ప్రజాభిప్రాయాన్ని గవర్నర్ కి తెలియజేస్తాం. ప్రైవేట్ వాళ్లకు కాలేజీలను అప్పగించి, సిబ్బందికి మాత్రం ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట. దీని వెనుక పెద్ద స్కాం ఉంది. పేదవారి వైద్యాన్ని తాకట్టు పెట్టీ కిక్ బ్యాగ్స్ తీసుకోవాలని చూస్తున్నారు. మా పోరాటం ఆగదు’ అని హెచ్చరించారు. -
‘మాపై కేసులు.. అప్పులు.. తండ్రీకొడుకుల గొప్పలు ఇవే మిగిలాయి’
విశాఖ : కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గానికి మంచి జరగలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నార్ మరోసారి ధ్వజమెత్తారు. ఐటీ కంపెనీల ముసుగులో ప్రజల ఆస్తులను ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కేసులు బనాయించడం, లప్పులు చేయడం, తండ్రీ కొడుకులు గొప్పలు చెప్పుకోవడం ఇవే మిగిలాయని ఎద్దేవా చేశారు. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 15వ తేదీ) అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘పెద్ద కంపెనీలకు భూములు ఇవ్వడం.. పెట్టుబడులను ప్రోత్సాహించడం సహజం. రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కట్టాబేడుతున్నారు. ఆ కంపెనిల్లో సత్వ ఒకటి. సత్త్వ కంపెనీకి 30 ఎకరాలు రిషికొండలో ఇచ్చారు. మార్కెట్ విలువ రూ. 40 కోట్లు ఎకరా ఉంటుంది.మొత్తం 30 ఎకరాలు రూ. 45 కోట్లకే ప్రభుత్వం కేటాయించింది. సత్త్వ ఉద్యోగాలు ఇవ్వదు. ఇది ఒక అద్దెలకు ఇచ్చుకునే సంస్థ. భూమి కేటాయించిన 90 రోజుల్లో ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి. ఇప్పటి వరకూ డబ్బులు సత్త్వ కంపెనీ కట్టలేదు. డబ్బులు కట్టడానికి గడువు పెంచుతూ జిఓ ఇచ్చారు. వడ్డీ కూడా లేకుండా చేశారు. రూ. 1500 కోట్లు విలువ చేసే భూమి 45 కోట్లకు కొట్టేసి.. ఆ డబ్బులు కూడా కట్టడం లేదు. సత్త్వ వెనక సీఎం చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. ఆ సంస్థ చేసే నిర్మానాలకు 50 శాతం మళ్ళీ ఇన్సెంటివ్ ఇస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఒప్పందం ఉందా..?. 50% భూమిలో గృహ నిర్మానాలు చేసుకోడానికి అనుమతి ఇచ్చారు..ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉందా..?, సత్త్వ అన్ని రాష్ట్రల్లో వేలంలో భూములు కొనుక్కుంది’ అని స్పష్టం చేశారు. -
‘పేదలకు అండ జగన్.. కార్పొరేట్లకు అండ చంద్రబాబు’
సాక్షి, అమరావతి: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమ ర్యాలీలకు భారీ స్పందన లభించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ అనంతపురంలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నుంచి బుక్కరాయసముద్రం వైఎస్సార్ విగ్రహం దాకా ఈ ర్యాలీ జరిగింది. కోటి సంతకాల సేకరణ ప్రతులతో జరిగిన ఈ బైక్ ర్యాలీలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, అనంతపురం పార్లమెంటు పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీకి జనం పోటెత్తారు.ప్రకాశం జిల్లా: రాష్ట్రంలోని వెనకబడి ప్రాంతమైన పశ్చిమ ప్రకాశానికి కూటమి ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసిందని మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ మార్కాపురం ఇన్చార్జి అన్న రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మెడికల్ కాలేజీ మంజూరు చేసి, నిర్మాణం చేపడితే కడుపుమంటతో చంద్రబాబు ప్రైవేటీకరణ చేశారన్నారు. మార్కాపురం గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి ప్రాంతాల నుంచి వైద్యం కోసం ప్రజలు నేటికీ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని, మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి ప్రభుత్వ నిర్వహణల ఉంటే పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్కాపురం నియోజకవర్గంలో 85 వేల మంది సంతకాలు చేశారని అన్నా రాంబాబు తెలిపారు.నంద్యాల జిల్లా: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ ర్యాలీలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి , కాటసాని రామిరెడ్డి , ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ,ఇషాక్ భాషా , డాక్టర్ దారా సుధీర్ పాల్గొన్నారుఅన్నమయ్య జిల్లా: జిల్లాలో కోటి సంతకాల సేకరణ సూపర్ సక్సెస్ అయ్యింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయచోటిలో నినాదాలు హోరెత్తాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ ప్రజానీకం కదం తొక్కింది. ‘‘పేదలకు అండ వైఎస్ జగన్. కార్పోరేట్లకు అండ చంద్రబాబు. సీఎం డౌన్.. డౌన్’’ అంటూ నినాదాలు చేశారు. చిత్తూరు - కర్నూలు జాతీయ రహదారిలో శివాలయం నుంచి నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
‘ఇది కదా ప్రజా ఉద్యమం అంటే..!’
చంద్రబాబు సర్కార్ తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.. ప్రజా పోరాటంగా మారిన తీరు యావత్ దేశాన్నే ఆశ్చర్యపరుస్తోంది. వైఎస్సార్సీపీ ఈ ఉద్యమాన్ని “ప్రజా గళం”గా అభివర్ణించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు. అందుకు కారణం.. విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొనడమే!.. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు కూడా. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్‌ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించింది. స్వతహాగానే పెత్తందారుల సీఎం అయిన చంద్రబాబు.. పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్ జగన్ భావించారు. ఒక పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగానే.. కోటి సంతకాల సేకరణ ఉద్యమం “రచ్చబండ” కార్యక్రమం నుంచి మొదలై.. నియోజకవర్గాలు నుంచి ఇవాళ జిల్లా కేంద్రాలు దాటింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైనే సంతకాలు సేకరించి.. వాటిని ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయానికి తరలించింది. వీటిని రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్‌కు నివేదించి.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలన్నదే వైఎస్ జగన్ అభిమతం. రచ్చబండతో షురూ ..అక్టోబర్‌లో వైఎస్సార్సీపీ “రచ్చబండ” పేరుతో ప్రజల మధ్యకు వెళ్లి సంతకాల సేకరణ ప్రారంభించింది. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొని సంతకాలు చేశారు.తుపాను ఆపలేకపోయింది!లక్ష్యం కోటి సంతకాలు. ఆ సమయంలోనే తుపాను, వర్షాలు వచ్చాయి. దీంతో ఈ కార్యక్రమం ప్లాప్ అవుతుందని కూటమి సర్కార్ సంతోషించింది. కానీ, ప్రభుత్వ వ్యతిరేక ప్రజాభిప్రాయం సేకరణ ఏ దశలోనూ ఆగిపోలేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం సంతకాలు చేస్తూనే వచ్చారు. ఆపై ఈ ప్రజా ఉద్యమం నవంబర్‌కొచ్చేసరికి నియోజకవర్గాల స్థాయికి చేరింది. ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. అటుపై సంతకాల బాక్సులు సేకరించి.. నియోజకవర్గాల నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రాలకు తరలించారు. ఆ ర్యాలీలకు అనూహ స్పందన లభించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసించాలి అంటూ ఆ ర్యాలీల్లో నినాదాలు చేశారు. డిసెంబర్ మొదటి వారం కల్లా అన్ని నియోజకవర్గాల నుంచి ఆ బాక్సులను భద్రంగా జిల్లా కేంద్రాల్లోని పార్టీ ఆఫీసులకు తరలించారు. అక్కడి నుంచి ఇవాళ ర్యాలీగా తాడేపల్లికి తరలించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ఈ ఉద్యమం.. తమ ఆరోగ్యం, విద్యా హక్కుల పరిరక్షణ కోసమని జనం అర్థం చేసుకున్నారు. అందుకే ఇవాళ్టి(సోమవారం) ర్యాలీలో పార్టీ శ్రేణులకు పోటీగా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యం వల్లే ఇది ఒక విశాలమైన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా నిలిచి దేశం దృష్టిని ఆకర్షించగలిగింది. -
కూటమి సర్కార్ విధానాలపై ప్రజాగ్రహం: వేణు
సాక్షి, తూర్పుగోదావరి: ప్రభుత్వం మెడికల్ కళాశాలు ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి రూరల్ కోటి సంతకాల ప్రతుల తరలింపు ర్యాలీలో పార్టీ కోఆర్డినేటర్లు జక్కంపూడి రాజా, మార్గాన్ని భరత్, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, షర్మిలరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నాలుగున్నర లక్షల సంతకాల సేకరణ జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేదవాడికి వైద్యం అందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న చంద్రబాబు వైద్య కళాశాలలకు 5000 కోట్లు మంజూరు చేయలేకపోతున్నారు. ఇది ప్రారంభం మాత్రమే... ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ఉద్యమిస్తాం’’ అని వేణుగోపాలకృష్ణ హెచ్చరించారు. -
‘అయ్యా చంద్రబాబూ.. మీరు చేస్తోంది పెద్ద తప్పయ్యా’
సాక్షి, కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తప్పయ్యా.. అంటూ కోటి మందికి పైగా ఏపీ ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెప్పారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. మచిలీపట్నంలో సంతకాల ప్రతులను తరలించే కార్యక్రమాన్ని సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజాభిప్రాయాన్ని వైఎస్సార్సీపీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అంతకు మించే అనూహ్య స్పందన లభించింది. ఈ నేపథ్యంలో.. సంతక పత్రాలతో సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో భారీగా ర్యాలీ నిర్వహించింది. జగన్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని.. కోటి సంతకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని వైఎస్సార్సీపీ చెబుతోంది. మచిలీపట్నంలో ప్రతులను తరలించే కార్యక్రమాన్ని మాజీ మంత్రి పేర్ని నాని జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు.. వైఎస్సార్సీపీ ఆఫీస్ నుంచి వాహనంలో బాక్సులను స్వయంగా పేర్ని నాని, ఇతర నేతలతో కలిసి ఎక్కించారు. అక్కడి నుంచి కోనేరు సెంటర్ దాకా భారీ ర్యాలీ జరిగింది. -
రంగంలోకి గులాబీ బాస్.. గేరు మార్చనున్న కారు
సాక్షి, హైదరాబాద్: ప్రజా ఉద్యమానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ప్రత్యక్షంగా గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నెల 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కానుంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం జరగనుంది.నీటిపారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా చేస్తోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. తెలంగాణకు సాగునీటి విషయంలో బీజేపీ కూడా అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ ప్రభుత్వం జలదోపిడీకి బీజేపీ సహకరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎదుర్కొంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు.బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో బీఆర్ఎస్ శాసనసభా పక్షంతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం పాల్గొంటుంది. తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు నిర్మించే ప్రజా ఉద్యమంపై విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించాలని పార్టీ నిర్ణయించింది. నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మౌనం వహించకుండా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమ నిర్మాణానికి అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
‘రెడ్‌బుక్’ పాలన తప్ప.. ప్రజా పాలన ఏదీ?: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ పాలన తప్ప.. ప్రజా పాలన చేయడం లేదంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సేకరించిన సంతకాల సేకరణ కరపత్రాలను ఇవాళ భారీ ర్యాలీగా విజయవాడ తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. ప్రజల నుంచి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై నిరసనలు స్వచ్చందంగా మద్దతు తెలిపారని ఆర్కే రోజా అన్నారు.వైఎస్ జగన్.. 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు. వైఎస్ జగన్ పేరు చెరిపేయాలని చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుంది. విద్యార్థుల జీవితాలను కూటమి సర్కార్ నాశనం చేస్తుంది. కూటమి పాలనలో వారు చేసిన సర్వేలోనే అందరు మంత్రులకు రెడ్ మార్క్ వచ్చింది. విద్యావ్యవస్థను నారా లోకేష్ నాశనం చేస్తే.. వ్యవసాయాన్ని అచ్చెన్నాయుడు నాశనం చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను చంద్రబాబు విచ్ఛిన్నం చేశారు. -
సీదిరి అప్పలరాజును అడ్డుకున్న పోలీసులు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు చేపట్టింది. జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతులతో వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. జిల్లా కేంద్రాల నుంచి భారీ ర్యాలీలతో తాడేపల్లికి వైఎస్సార్సీపీ నేతలు తరలివస్తున్నారు. వైఎస్సార్సీపీ ర్యాలీల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.పలు చోట్ల కోటి సంతకాల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అన్యాయంగా అడ్డుకోవడంపై అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా అడ్డుకుంటున్నారని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతులతో వైఎస్సార్సీపీ ర్యాలీలు చేపట్టింది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పూర్తి చేసింది.విజయనగరంలో కోటి సంతకాల ర్యాలీకి అనుమతి నిరాకరణవిజయనగరంలో కోటి సంతకాల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీస్ యాక్ట్-1861 సెక్షన్ 30 అమలులో ఉందంటూ విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీగోవిందరావు అనుమతి నిరాకరించారు. వైఎస్సార్ జంక్షన్‌కు. వైఎస్సార్సీపీ శ్రేణులు, విద్యార్థులు భారీగా చేరుకున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తితో కొనసాగింది. ఇది ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగింది. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ నెల 10 న అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన కార్యక్రమానికి విపరీతమైన స్పందన లభించింది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు చేరుకున్న సంతకాలు ఇవాళ (సోమవారం) అక్కడి నుంచి ప్రత్యేక వాహనాలలో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. -
ఆయనేమన్నారో.. వీళ్లేం విన్నారో?
ఆంధ్రప్రదేశ్ గురించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసినట్టుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇవి ఆయన చేసినవేనా? లేక బీజేపీలోని టీడీపీ విధేయ ఎంపీలెవరైనా కావాలని అలా రాయించారా? 2024 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వెళ్లడం మంచిదైందని, ఏపీలో పాలనపై మంచి ఫీడ్‌బ్యాక్ వస్తోందని మోదీ వ్యాఖ్యానించినట్లు ఎల్లోమీడియాలో వార్తలొచ్చాయి. ఆయన ఏ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారో? ఏది బాగుందన్నారో? ఎవరకీ తెలియదు.. బహుశా, ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు మాత్రమే అర్థమైఉంటాయి. ఏదో సాధారణంగా అన్నమాటలను చంద్రబాబుకు మరిన్ని భుజకీర్తులు తొడగవచ్చు అని ఈ రెండు పత్రికలు అనుకుని ఉండవచ్చు. ప్రధానమంత్రి కార్యాలయానికి రాష్ట్రాల సమాచారం రాకుండా ఉంటుందా? అలాంటిది ఏపీలో ఏమి జరుగుతుందో తెలియకుండానే గుడ్డిగా ప్రశంసిస్తారా?.. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును మోదీ ఎలా విమర్శించింది, వారసత్వ రాజకీయాల గురించి ఎలా ధ్వజమెత్తింది, చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై ఎన్ని ఆరోపణలు చేసింది అందరికి తెలిసిన విషయమే కదా!. అలాగే చంద్రబాబు కూడా ప్రధాని అని కూడా చూడకుండా మోదీని దారుణమైన విమర్శలు చేశారు. ఓటమి తర్వాత వ్యూహాత్మకంగా టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించి ఆ పార్టీని మేనేజ్ చేసే పని మొదలుపెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ముందుగా బీజేపీతో జత కట్టించారు. ఒక సందర్భంలో బీజేపీకి టీడీసీ కలవడం ఇష్టం లేదని, తాను తిట్లు తిన్నానని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు కూడా. అప్పట్లో సీబీటీడీ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి ఇంటిలో సోదాలు జరిపి రూ.2,000 కోట్ల మేరకు జరిగాయని ప్రకటించింది. ఆ తరువాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియకుండా పోయింది. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు మోదీ, అమిత్‌షాల అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో ఎదురుచూసిన సందర్భాలు కూడా మనం చూశాం. ఆ తరువాత ఏం చేశారో తెలియదు కానీ.. బీజేపీతో పొత్తు అయితే కొదిరింది. ఈ నేపథ్యం మొత్తానఇన పరిగణలోకి తీసుకుంటే.. మోదీ ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు మంచిదని అన్నాడంటే నమ్మడం కష్టమే. అది మంచి, చెడు కాదు. అవకాశవాద రాజకీయ పరిణామం అని మోదీకి కూడా తెలిసే ఉంటుంది. ఆ సంగతి పక్కనబెడితే గత పద్దెనిమిది నెలలుగా ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అధ్వాన్నపు, అరాచకపు పాలనకు మోదీ సర్టిఫికెట్ ఇచ్చి ఉంటే అంతకన్నా ఘోరం లేదు. ఫీడ్‌బ్యాక్ అంత బాగుంటే.. ఏపీలో పోలీసు వ్యవస్థ పనితీరుపై కేంద్రం చిట్టచివరి ర్యాంకు ఎలా ఇచ్చింది? రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ఏపీలో పోలీసు వ్యవస్థను ఇంతగా దిగజార్చిన ప్రభుత్వం ఇంకో చోట ఉండకపోవచ్చు. తమ పార్టీ వ్యతిరేకమని పలుమార్లు ప్రకటించిన మోదీకి ఏపీలో టీడీపీ, జనసేనలు ప్రజాస్వామ్య పార్టీలుగా కనిపిస్తున్నాయా? లోకేశ్‌ను వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగా గుర్తించే ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారా? మోదీ సైతం డబుల్ స్టాండర్స్ అనుసరిస్తున్న తీరు బాధ కలిగిస్తుంది. ఏపీ ప్రభుత్వ పనితీరు గురించి చూస్తే ఈ ఏడాదిన్నరలో ఏకంగా రూ.2.60 లక్షల కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడాన్ని మోదీ సమర్థిస్తారా? ఇదే చంద్రబాబు సమర్థత అని అనుకుంటున్నారా? తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై మోదీ పెదవి విరిచారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరీ తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయని అడిగారట. ఏపీలో మాత్రం పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారట.అసలు ఏపీలో బీజేపీ ఉనికి ఉందా? టీడీపీనే మొత్తం డామినేట్ చేస్తోంది కదా? మోదీకి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీలోని టీడీపీ కోవర్టులు ఎప్పటికప్పుడు చంద్రబాబు తరపున కేంద్రంలోని పెద్దలను మేనేజ్ చేస్తుంటారేమో తెలియదు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గంటల కొద్ది భేటీ అవడాన్ని తప్పుపట్టారట..బాగానే ఉంది. మరి తెలంగాణ ఉప ఎన్నికలో తన మిత్రపక్షమైన తెలుగుదేశం బీజేపీ అభ్యర్ధికి ఎందుకు మద్దతు ప్రకటించలేదు? పైగా కాంగ్రెస్ కు సపోర్టు చేసినా బీజేపీ కేంద్ర నాయకత్వం ఎందుకు కిమ్మనలేదు? దీనిపై మోదీకి ఎవరూ ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదా? చంద్రబాబు ,పవన్ కళ్యాణ్, లోకేశ్ లు ఇక్కడ ఎందుకు ప్రచారం చేయలేదు? ఇదేనా ఎన్డీయే పక్షాల తీరు! ఏపీలో జగన్‌ను, వైసీపీ సోషల్ మీడియాను ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారని కూడా రాయించారు. అంటే వైఎస్సార్సీపీ అంత బలంగా ఉందని మోదీ భావిస్తున్నట్లే కదా! లేదంటే ఒరిజినల్ బీజేపీ వారు కూడా వైఎస్సార్సీపీపై తప్పుడు ఆరోపణలు చేయాలన్న లక్ష్యంతో ఇలా కథ అల్లి ఉండవచ్చన్న సందేహం ఉంది. ఏపీలో టీడీపీ, జనసేనలు సంయుక్తంగా విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికను బీజేపీ తనదని చెప్పలేకపోయింది. అయినా ప్రభుత్వంలో చేరిన తర్వాత ఆ హామీలకు బీజేపీ కూడా ఒప్పుకున్నట్లే కదా! వాటి అమలు తీరు తెన్నుల గురించి, ప్రధాని ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని ఉంటే బాగుండేది కదా! అప్పుడు వాస్తవాలు తెలిసేవి కదా! ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయిందని ఎల్లో మీడియానే ఆయా సందర్భాలలో కథనాలు ఇచ్చింది.అంతదాకా ఎందుకు మోదీ వ్యాఖ్యల కథనం వచ్చిన రోజునే పరిశీలిస్తే వివిధ పత్రికలలో వచ్చిన వార్తల సారాంశం కనుక ప్రధాని దృష్టికి వెళితే ఏపీలో కూటమి ఎంత అధ్వాన్నంగా ఉన్నది తెలుసుకోవడం కష్టం కాదు.ఎపి ప్రభుత్వం విద్యార్ధులకు ఇచ్చిన బాగ్ లు రెండు నెలల్లోనే చిరిగిపోయాయి. రెవెన్యూ శాఖలో గందరగోళంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్వయంగా చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు తనపై ఉన్న పలు అవినీతి కేసులను, మాఫీ చేయించుకుంటున్న తీరు అందరిని విస్తుపోయేలా చేస్తోంది. తాజాగా ఫైబర్ నెట్ అవినీతి కేసును కూడా సిఐడి ని ప్రభావితం చేసి మూసివేయించుకున్నారు. ఇది ఏ మేర నైతికతో ప్రధాని చెప్పగలరా? మిత్రపక్షం కాకుండా ఉంటే టీడీపీపైన, చంద్రబాబుపైన మోదీ తదితర బీజేపీ నేతలు ఎంతగా విరుచుకుపడేవారో! చంద్రబాబు తన టూర్ లకు వాడే హెలికాఫ్టర్, విమానం అద్దె ఛార్జీల చెల్లింపునకు నలభైకోట్లకు పైగా ఇప్పటికే ఖర్చు చేశారట. నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ లో తిరిగి చేరిన కార్పొరేటర్ ను పోలీసులే కిడ్పాన్ చేశారని వార్తలు వచ్చాయి. విజయవాడలో సుప్రీంకోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండానే పోలీసుల సమక్షంలో 42 ఇళ్లు కూల్చిన దారుణ ఘటన జరిగింది. ఆ బాధితులు మాజీ సీఎం జగన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అమరావతిలో రాజధాని అభివృద్ది సంస్థే చెరువులను చెరబట్టి రైతులకు వాటిలో ప్లాట్లు ఇస్తోందన్న స్టోరీ వచ్చింది.దీనిపై రైతులు మండిపడుతున్నారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై అక్రమ కేసు పెట్టిన నేపథ్యంలో సుప్రీం కోర్టు సూచన మేరకు వారు లొంగిపోవడానికి కోర్టుకు వెళుతుంటే పోలీసులు ఎంత నిర్భంధ కాండ అమలు చేశారో ఆశ్చర్యంగా ఉంటుంది. ఏపీలో గంజాయి వ్యాసారం సాగుతున్న తీరు అందరిని కలవర పరుస్తోంది.కుల వివాదంగా మారిన ఒక హత్య కేసులో భారీ పరిహారం ప్రకటించిన కూటమి ప్రభుత్వం, నెల్లూరులో గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు హత్యకు గురైతే కనీసం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రం గంజాయి హబ్‌గా మారుతోందనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరమా? ఒకవైపు పోలీసుల దౌర్జన్యాలు, మరో వైపు టీడీపీ నేతల దాష్టికాలతో ఏపీ అంతటా అరాచకం ప్రబలుతుంటే మోదీకి ఈ పాలన ఎలా బాగుందో, ఆయనకు ఎవరు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారో తెలియదు. కేంద్రం నుంచి మోంథా తుపాను సహాయనిధిగా రూ.544 కోట్ల వస్తే ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదని సోషల్ మీడియాలో కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేతంచర్లలో ఒక లిక్కర్ షాపు యజమాని ఎక్సైజ్ అధికారులు అడిగినంత మామూళ్లు ఇవ్వలేక ఏకంగా షాపునే మూసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎల్లో మీడియాలో కూడా కొన్ని కథనాలు వచ్చాయి. రవాణా మంత్రి రామ ప్రసాదరెడ్డి పేషీ లో అవినీతి గురించి ఎల్లోమీడియాకు చెందిన ఒక పత్రిక వార్త ఇచ్చింది.రాష్ట్రంలో ప్రతినెల మొదటి తేదీన అందరికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. రెవెన్యూ లోటు నిపుణులను భయపెడుతోంది. విశాఖ వంటి ప్రతిష్టాత్మక నగరంలో 99 పైసలకే కొన్ని పరిశ్రమలకు భూములు ఇవ్వడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. లూలూ గ్రూప్‌కు విజయవాడలో వందల కోట్ల విలువైన ఆర్టీసీ భూమిని కట్టబెట్టడంపై జనం మండిపడుతున్నారు.ఇలా ఏ రంగం గురించి చూసినా పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. వీటిని కవర్ చేయడానికి మత రాజకీయాలు చేయడానికి పవన్ కళ్యాణ్ ను టీడీపీ ఆపరేట్ చేస్తోందన్న అభిప్రాయం ఉంది. వైఎస్సార్సీపీని బదనాం చేయాలన్న దురుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్టపాలు చేయడానికి టీడీపీ, జనసేనలు వెనుకాడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోదీకి ఏపీ ప్రజలపై ఏ మాత్రం అభిమానం ఉన్నా, వాస్తవికమైన ప్రజాభిప్రాయాన్ని సేకరించి తదనుగుణంగా చంద్రబాబు సర్కార్ కు సరైన సలహాలు ఇవ్వగలిగితే అంతా సంతోషిస్తారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పీకే యూ టర్న్? ప్రియాంకను కలిసి..
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది నెలలకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2022లో కాంగ్రెస్‌తో చర్చలు విఫలమై, తీవ్ర విభేదాలు తలెత్తిన మూడేళ్ల తర్వాత ఈ భేటీ జరగడం గమనార్హం. అయితే తాజాగా ఇరు పార్టీల మధ్య మొదలైన మంతనాలు ఎటువైపునకు దారి తీస్తాయో.. పీకే తాజా వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.బిహార్ వైఫల్యంతో పునరాలోచన?బిహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీ జన్ సురాజ్ పేలవమైన ప్రదర్శన కనబరచడం ఈ భేటీకి ప్రధాన కారణంగా తెలుస్తోంది. బీజేపీకి, కాంగ్రెస్ కీలక భాగస్వామిగా ఉన్న మహాకూటమికి వ్యతిరేకంగా పోటీకి దిగిన జన్ సురాజ్ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. పోటీ చేసిన మొత్తం 238 మంది అభ్యర్థులలో 236 మంది (99.16%) తమ డిపాజిట్లను కోల్పోయారు. ఈ ఫలితాలు పీకే ఎన్నికల వ్యూహాలపై, అతని రాజకీయ ప్రస్థానంపై పలు ప్రశ్నలు లేవనెత్తాయి. మరోవైపు కాంగ్రెస్ కూడా బిహార్‌లో ఘోరంగా విఫలమైంది. 61 స్థానాల్లో పోటీ చేసి, కేవలం ఆరింటిని మాత్రమే గెలుచుకుంది. ఇది ఆ పార్టీ 2020 ఎన్నికల్లో గెలిచిన 19 స్థానాల కంటే చాలా తక్కువ.నిన్నమొన్నటి వరకూ విమర్శించి..2022లో చర్చలు విఫలమైనప్పటి నుండి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌పై నిరంతరం విమర్శనాత్మక ధోరణితో వ్యవహరిస్తున్నారు. బిహార్ ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఆయన రాహుల్ గాంధీ లేవనెత్తిన ‘ఓట్ చోరీ’ ప్రచారం రాష్ట్రంలో ఎన్నికల సమస్య కాదని వాదించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)గురించి పీకే చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇలా నిరంతర విమర్శల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ అకస్మాత్తుగా కాంగ్రెస్ కీలక మహిళా నేత ప్రియాంకా గాంధీని కలవడం రాజకీయంగా కొత్త సమీకరణలకు దారితీయవచ్చనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది.2022లో ఎలా బెడిసికొట్టింది?రాజకీయ వ్యూహకర్తగా, నేతగా గాంధీ కుటుంబంతో ప్రశాంత్ కిషోర్‌కు గతంలో మంచి అనుబంధం ఉంది. 2021లో జేడీయూ నుండి బహిష్కరణ వేటు పడిన తర్వాత ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌ను పునరుద్ధరించే ప్రతిపాదనతో గాంధీ కుటుంబాన్ని సంప్రదించారు. ఇందుకోసం ఆయన 2022, ఏప్రిల్‌లో సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి ఒక వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత సోనియా గాంధీ ఈ ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాటు చేసిన ‘అధికార సాధికార బృందం’ (ఈఏజీ)లో చేరాలనే ప్రతిపాదనను పీకే తిరస్కరించడంతో నాటి చర్చలు అకస్మాత్తుగా ముగిశాయి.అధిక స్వేచ్ఛ, ప్రాధాన్యత కోరడంతో..ఇదే తరుణంలో కాంగ్రెస్ నిర్దిష్ట బాధ్యతతో ఈఏజీలో భాగంగా పార్టీలో చేరాలంటూ పీకేని ఆహ్వానించింది. దీనికి పీకే వెంటనే స్పందించారు. ఈఏజీలో చేరి, ఎన్నికల బాధ్యత తీసుకోవాలనే కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించారు. పార్టీలోని నిర్మాణాత్మక సమస్యలను పలు సంస్కరణల ద్వారా పరిష్కరించడానికి నాయకత్వం, సామూహిక సంకల్పం అవసరమని నాడు పీకే ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా ఆయన తనకు అధిక స్వేచ్ఛ, ప్రాధాన్యత కావాలని కోరారు. అయితే బయటి వ్యక్తి చెప్పినట్లు పార్టీలో నిర్మాణాత్మక మార్పులు చేయడానికి సీనియర్ నాయకత్వం విముఖత చూపిందని తెలుస్తోంది.ఇరు పార్టీలకు అవసరమై..ఇప్పుడు మూడేళ్ల తర్వాత జరిగిన ఈ సమావేశం మళ్లీ కాంగ్రెస్- పీకే మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి సంకేతమా? అనేది అందరిలో పలు సందేహాలను లేవనెత్తుతోంది. బిహార్ ఎన్నికల్లో ఎదురైన పరాజయం నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్‌కు కాంగ్రెస్ లాంటి జాతీయ స్థాయి పార్టీతో తిరిగి కలిసి పనిచేయాలనే ఆలోచన వచ్చి ఉండవచ్చని పలువురు అంటున్నారు. అలాగే వరుస పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్, భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకత్వం కోసం పీకేను తిరిగి సంప్రదించి ఉండవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా ఒకప్పుడు తీవ్ర విభేదాలు తలెత్తిన నేతల మధ్య జరిగిన తాజా భేటీ.. రాబోయే రాజకీయ సమీకరణలపై తప్పక ప్రభావం చూపనుంది.ఇది కూడా చదవండి: తరలిపోనున్న ‘తీహార్’.. ఎక్కడకి? ఎందుకు? -
బాబు కుట్రలపై జన'కోటి' గర్జన
సాక్షి ప్రతినిధి, కడప: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజలు నీరాజనం పలికారు. ఊరు–వాడ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కని్పంచింది. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలల్లో మారుమూల గ్రామాలకు సైతం ఆ పార్టీ శ్రేణులు వెళ్లి నిరసన గళాన్ని కలం ద్వారా వ్యక్త పర్చేలా వ్యవహరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో రగిల్చింది. సంతకాల పత్రులను వాహనాల్లో ఎక్కించి పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయానికి చేరవేశారు. అన్ని నియోజవకర్గాలకు చెందిన 4,80,101 మంది ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన ప్రతులతో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేశారు. మెడికల్ కళాశాలలు ప్రైవేట్‌పరమైతే పేదలకు వైద్య విద్య కలగానే మిగిలిపోతుందనే ఆవేదనే కోటి సంతకాల్లో భాగస్వామ్యం అయ్యేలా చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పేదలు వైద్య విద్యకు దూరం కాకుడదనిమెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యపై ఆశలు గల్లంతవుతాయనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఆమేరకు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 4,80,101 మంది నుంచి సంతకాలు సేకరించారు. పులివెందులలో అన్ని వసతులతో రాజసం ఉట్టి పడుతున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం కానుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ స్పందన లభించినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా సంతకాలు చేసిన ఆ ప్రతులతో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టి, జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఇదివరకే చేర్చారు. పార్టీ అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డికి అందజేశారు. ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10గంటలకు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్ మీదుగా ఎనీ్టఆర్ సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ మీదుగా హెడ్ పోస్టాఫీసు చేరుకొని అక్కడున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నివాళులు అరి్పంచి, జిల్లా కేంద్రం నుంచి సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో పాల్గొననున్నారు. వైద్య విద్యపై నీచరాజకీయం వైఎస్సార్సీపీ పాలనలో పేదలకు మెరుగైన ఉచిత వైద్యం, పేద విద్యార్థుల ఉ న్నతికి ఉచిత వైద్య విద్యను అందించాలనే సంకల్పంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను స్థాపించారు. అవి పూర్తి అయితే ఉచిత వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. తద్వారా వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే దురాలోచనతో వైద్య విద్యపై సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తూ, ప్రజాద్రోహిగా నిలిచారు. – పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
వల్లభనేని వంశీని కలిశారనే కోపంతో..
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ గుండాలు రెచ్చిపోయారు. మర్లపాలెం గ్రామంలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిశారని.. స్థానికంగా అధికార పార్టీ కొనసాగిస్తున్న అరాచకాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారనే కోపంతోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నాం మర్లపాలెంలో వల్లభనేని వంశీ పర్యటించి.. ఓ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన కంభంపాటి శ్రీధర్,కంభంపాటి రామ్మోహనరావు వంశీని కలిసి ఫొటోలు దిగారు. స్థానికంగా కొనసాగుతున్న ప్రతీకార రాజకీయాల గురించి ఆయనకు వివరించారు. ఈ విషయం తెలిసిన టీడీపీ మూక రెచ్చిపోయింది.ఆ ఫొటోల ఆధారంగా ఇద్దరిని గుర్తించింది. వంశీనే కలుస్తారా? అంటూ.. ఇరువురిపై మూక దాడికి పాల్పడ్డారు. తల, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీధర్, రామ్మోహనరావులను స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వల్లభనేని వంశీ.. హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన.. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి షాక్
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో.. తొలి విడత పలితాలే పునరావృతం అయ్యాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నారు. అయితే మహబూబ్ నగర్లో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి తన సొంతూరులోనే షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. రంగారెడ్డిగూడ సర్పంచ్‌గా బీజేపీ అభ్యర్థి రేవతి ఆనంద్ విజయం సాధించారు. మరోవైపు.. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డికీ ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన సొంతూరు ధన్వాడలో బీజేపీ అభ్యర్థి జ్యోతి రామచంద్రయ్య ఘన విజయం సాధించారు. ధన్వాడ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కూడా సొంతూరు కావడం, పైగా పర్ణికారెడ్డికి అత్తాకోడళ్ల వరుస.. దీనికి తోడు ధన్వాడలో పోటీ పడింది కూడా అత్తాకోడళే కావడం.. ఈ ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటు ఖమ్మంలోనూ కాంగ్రెస్‌కు ఎదురుగాలి తప్పలేదు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆది నారాయణ ప్రచారం చేసిన వాటిల్లో కేవలం రెండు చోట్ల (ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి) మాత్రమే కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా నెగ్గారు.రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో.. 55% స్థానాల్లో అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులదే విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల్లో 29% మంది గెలుపొందగా.. తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. అదే సమయంలో స్వతంత్రులు కూడా సత్తా చాటారు. రెండో విడతకు సంబంధించి 416 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణలోని 193 మండలాల్లోని 3911 పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించగా..కాంగ్రెస్-2,112 బీఆర్ఎస్-1,025 బీజేపీ-225ఇతరులు(స్వతంత్రులు.. సీపీఐ-సీపీఎం బలపర్చినవాళ్లు)-549 గెలుపొందారు. రెండో విడతలో 85.86% పోలింగ్ నమోదు కాగా.. ఇది తొలి విడత కంటే 1.58% ఎక్కువ. ఇప్పటి వరకు రెండు విడతల్లో ఇప్పటివరకు 8,567 పంచాయతీల ఎన్నికలు పూర్తైంది. రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపర్చగా గెలిచిన వారి సంఖ్య 5,195, బీఆర్ఎస్ మద్దతుదారులు 2,338, బీజేపీ 440గా ఉన్నారు. బీజేపీ కంటే ఇతరులు సాధించిన స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 17వ తేదీన తుది దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
బీజేపీ డీఎన్ఏలో ఓటు చోరీ
సాక్షి, న్యూఢిల్లీ: అసత్యం, ఓట్ల చోరీ బీజేపీ–ఆర్ఎస్ఎస్ డీఎన్ఏలోనే ఉన్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. సత్యం, అహింస అనే నినాదంతో బీజేపీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ప్రతిన బూనారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు చోర్–గద్దీ ఛోడ్’మహాధర్నాలో రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు సోనియా గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాం«దీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సుఖూ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీతోపాటు ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో రాహుల్ గాంధీ విచుచుకుపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీల పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ వారంతా బీజేపీ కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు అధికారం అండతో విచ్చలవిడిగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని అనుసరించేవారి డీఎన్ఏలో సత్యం ఉంటుందన్నారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ డీఎన్ఏలో మాత్రం అసత్యం, ఓట్ల చోరీ మాత్రమే ఉంటాయని తేల్చిచెప్పారు. సత్యానికి, అసత్యానికి మధ్య పోరాటం ‘‘సత్యమే మన ఆయుధం. సమయం పట్టొచ్చు గానీ ఎప్పటికైనా సత్యానిదే విజయం. ప్రపంచం సత్యాన్ని పట్టించుకోదని, అధికారాన్ని, బలాన్ని మాత్రమే చూస్తుందని ఆర్ఎస్ఎస్ అధినేత భాగవత్ చెప్పడం దారుణం. బీజేపీ కోసమే ఎన్నికల సంఘం పనిచేస్తున్న సంగతి నిజం కాదా? ఎన్నికల కమిషనర్లను కాపాడేందుకు ప్రధాని మోదీ కొత్త చట్టం తీసుకొచ్చారు. మేమే వచ్చాక ఈ చట్టాన్ని తప్పనిసరిగా మారుస్తాం’’ అని అన్నారు. దొంగతనమే వారి డీఎన్ఏ దొంగతనం బీజేపీ డీఎన్ఏలో ఉందని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. డబ్బు దొంగతనం, భూమి దొంగతనం, వ్యవస్థల దొంగతనం, హక్కుల దొంగతనం, ఉద్యోగాల దొంగతనం, ప్రజా తీర్పును దొంగిలించడం, ప్రభుత్వాన్ని దొంగిలించడం, ఎన్నికలను, ఓట్లను దొంగిలించడం బీజేపీకి అలవాటేనని ధ్వజమెత్తారు. ప్రజలను దోచుకొని అధికారం అనే నిచ్చెనపైకి ఎగబాకడం బీజేపీ విధానమని దుయ్యబట్టారు. ప్రజల కోసమే రాహుల్ పోరాటం: ఖర్గే ప్రజల కోసమే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆయనను బలపర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓట్ చోర్–గద్దీ ఛోడ్ ధర్నాలో ఖర్గే ప్రసంగించారు. రాహుల్ గాం«దీకి మద్దతు ఇవ్వకుంటే దేశానికి నష్టం జరుగుతుందన్నారు. దేశాన్ని, ఓటు హక్కును, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనమంతా కలిసి పోరాటం చేయాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, భావజాలం దేశాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. హిందూమతం, హిందుత్వం పేరుతో పేదలను బానిసలుగా మార్చడానికి ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న బీజేపీని అధికారం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. దేశాన్ని కాపాడగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. దేశ ద్రోహులైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలకు, ఓట్ల దొంగలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి మరింత బలోపేతం చేయాలని ప్రజలకు ఖర్గే విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ పేపర్లతో గెలిచే దమ్ముందా?బ్యాలెట్ పేపర్లతో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి గెలిచే దమ్ముందా? అని బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సవాలు విసిరారు. ఓట్ల చోరీపై ఎన్నికల సంఘం ఏదో ఒకరోజు దేశ ప్రజలకు సమాధానం చెప్పక తప్పదని అన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ అనుమానాస్పదంగా సాగుతోందని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును కూడా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం సహకరించకపోతే ఎన్నికల్లో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ నెగ్గలేదని తేల్చిచెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలన్నీ మోదీ సర్కార్ ఎదుట మోకరిల్లుతున్నాయని ఆరోపించారు. -
త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. శాఖలే మారుస్తారా? లేదంటే.. మంత్రులనే మారుస్తారా? అనే విషయంలో మాత్రం తనకు స్పష్టత లేదన్నారు. అయితే, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,« అధిష్టానం మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిందనని చెప్పారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలను నెలరోజుల్లో భర్తీ చేస్తామన్నారు. మంత్రివర్గం నుంచి పొన్నం ప్రభాకర్, సురేఖను తొలగిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని, వాళ్లిద్దరూ కాంగ్రెస్ నేతలే అని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’మహాధర్నాలో పాల్గొనేందుకు మహేశ్ గౌడ్ వచ్చారు. ఈసందర్భంగా ఆయన తెంగాణభవన్‌లో విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ‘తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే నన్ను మంత్రివర్గంలోకి ఆహ్వానించారు. స్వయంగా కేసీ వేణుగోపాల్ ప్రతిపాదన పెట్టారు. కానీ, నాకు మంత్రి పదవిపై మక్కువ లేదని చెప్పాను’అని అన్నారు. మహేశ్‌గౌడ్ ఇంకా ఏమన్నారంటే.. వేదికపైకి మంత్రులను పిలిస్తే బాగుండేది.. గ్లోబల్ సమ్మిట్‌లో రాజకీయ ప్రాధాన్యత ఉండొద్దనే ఉద్దేశంతోనే మంత్రులను స్టేజీ మీదకు ఆహ్వానించలేదు. అయితే, మంత్రులను కూడా వేదికపైకి పిలిస్తే బాగుండేది. కొందరు ఐఏఎస్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ గ్లోబల్ సమ్మిట్‌కు కూడా వస్తే బాగుండేది. గ్లోబల్ సమ్మిట్ ప్రతిఏటా పెడితే ఎలా ఉంటుందనేది ఆలోచిస్తున్నాం. బీసీ ప్రైవేట్ బిల్లు పార్లమెంటులో పెడితే బాగుంటుందని రాహుల్ గాం«దీకి చెప్పాం. డీసీసీ అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ పదవులనూ తొలివిడతలోనే భర్తీ చేయాలి. కానీ, అక్కడ వచి్చన దరఖాస్తులు, క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోలలేదు. అందుకే ఆ రెండింటిని పెండింగ్‌లో ఉంచాం. జనం కవిత మాటలు నమ్ముతున్నారు... బీఆర్ఎస్ కథ ముగిసిపోయింది. పదేళ్ల బీఆర్ఎస్ అవినీతిని కవిత దగ్గర నుంచి చూసింది కాబట్టే.. ఆమె మాటలను ప్రజలు అంగీకరిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో లేకుండా మనుగడ సాధించడం అంత సులభం కాదు. కేసీఆర్ ఇమేజ్ కేటీఆర్‌కు రాలేదు. హరీశ్‌రావు దెబ్బకొట్టడం ఖాయం. డబ్బులతో కేటీఆర్ సోషల్ మీడియాను మేనేజ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏం జరుగుతుందో కేసీఆర్ ముందే ఊహించారు.. అందుకే ప్రచారానికి రాలేదు’ బీజేపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు బీజేపీకి అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఏమాత్రం లేదు. బీజేపీ అధిష్టానానికీ ఆ విషయం తెలుసు. బీజేపీకి 60–70 స్థానాల్లో కనీసం కేడరే లేదు. బీజేపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తు న్నారు. కానీ మేమే కొన్ని విలువలు పాటిస్తున్నాం. కాబట్టే.. అవకాశం ఇవ్వడం లేదు. మళ్లీ ప్రభుత్వం రావడం అనేది మాకు నల్లేరు మీద నడకే. ఇన్వెస్లర్ల చూపు హైదరాబాద్ వైపే... రేవంత్ రెడ్డి విజనరీ ఉన్న లీడర్. ఫోర్త్ సిటీ పూర్తయితే దేశంలోని మరే నగరం హైదరాబాద్‌తో తట్టుకోలేదు. కంపెనీలకు అన్ని రకాలుగా అనుకూలమైన పాలసీలు రూపొందించాం. టెస్లాను హైదరాబాద్‌కు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో సహకరించాలని రాహుల్ గాం«దీని కోరాం. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇన్వెస్టర్లు మాత్రం హైదరాబాద్ వైపే చూస్తున్నారు. హైదరాబాద్‌లోని ఏ పెద్ద వెంచర్లోకి వెళ్లినా పుణే, చెన్నై, ముంబై, బెంగళూరుకు చెందిన వాళ్లే కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువశాతం వెంచర్లలో 25 నుంచి 30 శాతం మహారాష్ట్ర వాళ్లే కొనుగోలు చేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో హైదరాబాద్ ఇండియాలోనే నంబర్ వన్ నగరంగా మారబోతోంది. -
ఓట్లే కాదు.. అన్నీ లాగేసుకుంటారు!
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓట్ చోరీ (ఓట్ల దొంగతనం) అనే అంశం ఒక్క కాంగ్రెస్ పార్టీ సమస్యే కాదు.. ఇది మొత్తం దేశం సమస్య..’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. లోక్‌సభలో ఓట్ చోరీపై జరుగుతున్న యుద్ధంలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీకి మనమంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ ఒక సిపాయిలా మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని, తెలంగాణ నుంచి తాము వెన్నంటి ఉంటామని చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’పేరుతో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాం«దీ, రాహుల్ గాందీ, ఎంపీ ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్న సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ యుద్ధంలో రాహుల్‌ను గెలిపించాలి ‘దేశ ప్రజల రాజ్యాంగ హక్కు కోసం చేస్తున్న యుద్ధంలో రాహుల్‌ను దేశ ప్రజలు గెలిపించాలి. లేదంటే ఓటు హక్కును లాక్కుంటారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ముందుగా ఓటరు లిస్టు నుంచి పేరు తొలగిస్తారు. ఆ తర్వాత ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, భూమి, ఆస్తులు కూడా లాక్కుంటారు. రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో చట్ట సభలో విస్తృత్తంగా చర్చ జరిగింది. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, నిరుపేదలకు ఓటు హక్కు కల్పించాలని మహాత్మాగాం«దీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కోరారు. కానీ ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త ఎం.ఎస్ గోల్వాల్కర్ తదితరులు ఈ వర్గాలకు ఓటు హక్కును నిరాకరించారు. కానీ మహాత్మాగాందీ, అంబేడ్కర్ పేదలకు ఓటు హక్కు కల్పించి దేశంలో ప్రభుత్వ ఏర్పాటులో వారికి అవకాశం ఇచ్చారు..’అని సీఎం చెప్పారు. రాహుల్ ముందే హెచ్చరించారు.. ‘ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆలోచనా విధానంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోదీ, అమిత్‌షా గత పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలంటూ ఓటర్లను అడిగారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని రాహుల్‌గాంధీ అప్పుడు చెప్పారు. అందుకే దేశ ప్రజలు బీజేపీకి 240 సీట్లతోనే సరిపెట్టారు. కాబట్టే రాజ్యాంగం రక్షించబడింది. ఇవాళ రాజ్యాంగం, రిజర్వేషన్లు ఉన్నాయంటే వారికి 400 సీట్లు రాలేదు కాబట్టే. వారు ఎస్ఐఆర్ పేరిట ఓట్ చోరీ చేస్తున్నారు. దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదల ఓట్లు తొలగించే పనిలో పడ్డారు. గతంలో దళిత, ఆదివాసీ, మైనారిటీ, నిరుపేదలకు జరుగుతున్న అన్యాయానికి వ్య తిరేకంగా మహాత్మాగాందీ, అంబేడ్కర్ నిలబడ్డారు. ఇప్పుడు రాహుల్, ఖర్గే ఈ వర్గాలకు మద్దతుగా, మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా.. ఆర్ఎస్ఎస్, గోల్వార్కర్ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా రామ్‌లీలా మైదానంలో మీ ముందు ఉన్నారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్‌గాందీకి మద్దతుగా నిలవాలి..’అని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీపీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తదితరులు కూడాధర్నాలో పాల్గొన్నారు. -
వైఎస్సార్ పిలిస్తే కాంగ్రెస్‌లోకి వచ్చా
సాక్షి, హైదరాబాద్: తాను హరీశ్‌రావుపై కోపంతో బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్‌లోకి వెళ్లానని కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కవిత చెప్పిన మాటల్లో వాస్తవం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జ గ్గారెడ్డి పేర్కొన్నారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకు తాను కాంగ్రెస్‌లోకి వచ్చా నని స్పష్టం చేశారు. ‘నేను బీఆర్ఎస్ను వీడడానికి, హరీశ్‌రా వుకు సంబంధం లేదు. అసలు ఆయన కారణమే కాదు. నన్ను కాంగ్రెస్‌లోకి రమ్మని నా మిత్రుడు జెట్టి కుసుమకుమా ర్తో వైఎస్సార్ ఆహ్వానం పంపారు. నా రాజకీయం నచ్చి పిలిపించారు. కాంగ్రెస్‌లో చేరమన్నారు. సంగారెడ్డి నియోజ కవర్గానికి ఐఐటీతో పాటు ఫోర్‌లేన్ హైవే ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నారు. అసలు కవితకు అప్పు డు రాజకీయాల్లో అ, ఆ లు కూడా రావు. మరోమా రు ఇలాంటివి మాట్లాడొద్దు..’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.హరీశ్‌తో వార్ నడుస్తూనే ఉంటుంది..కేసీఆర్ కుమార్తె కాబట్టి కవిత లీడర్ అయిందని, తాను వ్యక్తిగతంగా ఎదిగిన నాయకుడినని జగ్గారెడ్డి అన్నారు. వాళ్ల పంచాయతీలోకి నన్ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో హరీశ్‌రావుకు, తనకు మధ్య వార్ నడుస్తూనే ఉంటుందని చెప్పారు. తాను డైరెక్ట్‌గా రాజకీయం చేస్తే, హరీశ్‌రావు వెనుక నుంచి పొడిచే రాజకీ యం చేస్తాడని ఆరోపించారు. తాను రాజకీయంగా కొంత డిస్టర్బ్ అయ్యానని ఆయన పేర్కొన్నారు. అయితే ఎందుకు మానసికంగా చలించాననే విషయం సమయం వచ్చిన ప్పుడు చెపుతానని, మేలో అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు. తాను ఒక్కసారి డిసైడయ్యాక మళ్లీ వెనుకకు వచ్చే మనిషిని కాదని, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి మీద కూడా ఆసక్తి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
రెండో విడతలో 85.86% ఓటింగ్
సాక్షి, హైదరాబాద్: రెండో దఫా పంచాయతీ ఎన్నికల్లో మరింత భారీగా పోలింగ్ నమోదైంది. తొలివిడత ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్‌నమోదు కాగా.. రెండో విడతలో 1.58 శాతం ఎక్కువగా 85.86% ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. మొత్తం మీద రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌కేంద్రా ల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ముగియగా, ఆలోపు క్యూలైన్లో ఉన్నవారిని ఓటేసేందుకు అనుమతించారు. పోలింగ్ముగిశాక కౌంటింగ్ప్రారంభించి విజేతలను ప్రకటించారు. ఏకగ్రీవాలను మినహా యిస్తే రెండు విడతల్లో కలిపి 7,745 పంచాయతీలకు ఎన్నికలు ముగియగా, మూడో దఫాలో భాగంగా ఈ నెల 17న మరో 3,759 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మహిళా ఓటర్లే ఎక్కువ.. రెండో దఫాలో 3,911 పంచాయతీలకు, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగగా.. మొత్తం 54,40,339 మంది ఓటర్లకు గాను 46,70,972 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72%, ఖమ్మం జిల్లాలో 91.21% పోలింగ్ నమోదు అయ్యింది. అత్యల్పంగా నిజామాబాద్జిల్లాలో 76.71%, జగిత్యాలలో 78.34% ఓటింగ్ నమోదైంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ పాల్గొన్నారు. ఈ విడతలో మొత్తం 4,333 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 5 పంచాయతీలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక మరో 416 పంచాయతీల్లో సర్పంచ్, అలాగే 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు, 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. యాదాద్రి జిల్లా టాప్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి పట్నం ప్రజలు పల్లె బాట పట్టారు. పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఈసారి 54,40,339 ఓటర్లు ఉండగా.. 46,70,972 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 27,82,494 ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 22,77,902 మంది ఓటేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా 2,02,716 మంది ఓటర్లకు గాను..1,8,5937 మంది ఓటింగ్‌తో (91.72 శాతం)తో అగ్రస్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 2,38,838 ఓటర్లు ఉండగా.. 1,83,219 మంది ఓటింగ్ (76.71 శాతం)తో చివరి స్థానంలో నిలిచింది. ఖమ్మం జిల్లాలో 91.21%, సూర్యాపేట జిల్లాలో 89.55%, మెదక్88.74%, నల్లగొండ జిల్లాలో 88.74% నమోదు కాగా.. జగిత్యాల (78.34%), భద్రాద్రి కొత్తగూడెం (82.65%), నిర్మల్ (82.67%), వికారాబాద్ (82.72%)లో వరుసగా అత్యల్ప ఓటింగ్ నమోదైంది. తగ్గిన పోస్టల్ బ్యాలెట్లు: పోలింగ్ ముగిసిన తర్వాత మ ధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. గతంతో పోలి స్తే ఈసారి పోస్టల్బ్యాలెట్ఓట్లు భారీగా తగ్గినట్లు అధికారు లు పేర్కొన్నారు. కాగా వార్డుల వారీగా ఫలితాలను వెల్లడించారు. గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. రెండో విడత ఎన్నికలు మొత్తం మీద ప్రశాంతంగా ముగిశాయి.పోటెత్తిన మహిళలు ఈ విడతలో మొత్తం మహిళా ఓటర్లు 27,82,494 మంది ఉండగా.. 23,93,010 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు జిల్లాల్లో మహిళలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.62%, ఖమ్మం 90.88%, మెదక్ 89.28% అత్యధికంగా ఓటింగ్ నమోదు కాగా.. భద్రాద్రి కొత్తగూడెం 81.38%, వికారాబాద్ 81.79%, ములుగు 82.79% ఓటింగ్ నమోదైంది. పురుషుల ఓటింగ్ శాతంలో కూడా యాదాద్రి (91.83%), ఖమ్మం (91.56%) జిల్లాలే ముందంజలో ఉన్నాయి.రాష్ట్రంలో ఎన్నికలు నోటిఫై అయిన పంచాయతీలు: 12,723ఏకగ్రీవమైనవి: 1205తొలిదశలో ఎన్నికలు జరిగినవి: 3,834రెండో విడతలో జరిగినవి: 3,911మూడో విడతలో జరిగేవి: 3,759(మిగిలిన వాటిలో కొన్నిచోట్ల నామినేషన్లు దాఖలు కాకపోగా, మరికొన్ని కోర్టు కేసులు ఇతర కారణాలతో ఎన్నికలు జరగడం లేదు) -
యావన్మందికీ తెలియజేయునది ఏమనగా..?
రెండో విడత పంచాయతీ ఫలితాల్లోనూ..తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనేక సర్పంచ్ స్థానాలకు సమాన ఓట్లు రాగా, లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. ఒక్క ఓటుతోనూ గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. పోటీలో ఉన్న వారి మేరకు విజ్ఞప్తి మేరకు రెండుమూడుసార్లు రీకౌంటింగ్ కూడా చేశారు. ధర్మసాగర్/ హవేళిఘణాపూర్/అనంతగిరి/ వేములపల్లి /పుల్కల్/ ఎల్లారెడ్డిరూరల్/ కౌటాల/కాసిపేట: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కాశగూడెం సర్పంచ్ పదవికి కాంగ్రెస్ మద్దతుతో ఎండీ సత్తార్, బీఆర్ఎస్ మద్దతుతో హఫీజ్ పోటీ చేశారు. 328 ఓట్లు పోల్ అవగా, సత్తార్, హఫీజ్‌లకు సమానంగా 164 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారులు డ్రా తీయగా కాంగ్రెస్ అభ్యర్థి ఎండీ సత్తార్‌ను విజయం వరించింది. టాస్ వేయాల్సి ఉండగా, డ్రా ఎందుకు తీశారని బీఆర్ఎస్ మద్దతుదారు హఫీజ్ నిరసన తెలుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మెదక్ మండలం చీపురుదుబ్బతండా సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బీమిలి, కాంగ్రెస్ మద్దతుదారు కేతావత్ సునీతకు చెరి 182 ఓట్లు సమానంగా వచ్చాయి. అధికారులు డ్రా తీయగా.. సునీత సర్పంచ్ పీఠం కైవసం చేసుకుంది. వికారాబాద్ మండలం జైదుపల్లి సర్పంచ్‌గా ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్లోళ్ల మౌనిక, నాగిరెడ్డికి 302 చొప్పున ఓట్లు పోలయ్యాయి. దీంతో అధికారులు డ్రా నిర్వహించగా మౌనికను అదృష్టం వరించింది.నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం మంగాపురం సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన చక్కని ఉపేంద్రమ్మ, బీఆర్ఎస్ మద్దతుతో పోటీచేసిన సాయిని మౌనికకు సమానంగా 352 ఓట్ల చొప్పున వచ్చాయి. అధికారులు రీకౌంటింగ్ చేసినా ఓట్లు సమానం రావడంతో ఇద్దరి మధ్య టాస్ వేశారు. టాస్ గెలిచిన ఉపేంద్రమ్మ సర్పంచ్ అయ్యారు.సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముద్దాయిపేట గ్రామ పంచాయతీలోని నాలుగో వార్డులో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు సమానమైన ఓట్లు పొందారు. దీంతో అధికారులు టాస్ వేశారు. టాస్‌లో శ్రీకాంత్‌ను విజయం వరించింది.కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మంగళి సంతోశ్‌కుమార్, పెంట మానయ్యలకు సరి సమానంగా 483 ఓట్లు వచ్చాయి. అధికారులు టాస్ వేసి మంగళి సంతోశ్‌కుమార్ సర్పంచ్‌గా గెలుపొందినట్టుప్రకటించారు.కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీరవెల్లి సర్పంచ్ స్థానానికి జరగిన ఎన్నికలో బీఆర్ఎస్ బలపర్చిన రజినికాంత్‌కు 204 ఓట్లు రాగా, కాంగ్రెస్ మద్దతుదారు జాడి కావేరికి 204 ఓట్లు వచ్చాయి. లక్కీ డ్రాలో కావేరి పేరు రావడంతో ఆమె గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లంబాడితండా(కే) గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసిన బలరాం రాంచందర్‌లకు 193 చొప్పున ఓట్లు పోల్ అయ్యాయి. రీకౌంటింగ్ జరిపినా అవే ఓట్లు వచ్చాయి. డ్రాలో బలరాంను అదృష్టం వరించింది.నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని వెంకాయపల్లిలో కాంగ్రెస్ మద్దతుతో వెంకటేశ్వరమ్మ, బీఆర్ఎస్ మద్దతుతో ఆలేటి ఇందు పోటీ చేశారు. ఇద్దరికి చెరి 236 ఓట్లు రాగాటాస్ వేయగా వెంకటేశ్వరమ్మ గెలిచారు. -
తొలిలాగే మలి!
సాక్షి, హైదరాబాద్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ దాదాపుగా తొలి విడత ఫలితాలే పునరావృతమయ్యాయి. మొదటి విడత తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులే విజయం సాధించారు. ఆదివారం రాష్ట్రంలోని 3,911 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థులు 2,067 మంది గెలుపొందారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 1,160 స్థానాలు గెలుపొందగా, బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 250 మంది గెలిచారు. మరోవైపు స్వతంత్రులు, సీపీఎం, సీపీఐ పారీ్టలకు చెందిన వారు.. 429 మంది గెలుపొందారు. వీరు మొత్తం స్థానాల్లో 11 శాతానికి పైగానే గెలుపొందడం విశేషం. ఇక రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపర్చగా గెలిచిన వారి సంఖ్య 4,500 దాటింది. బీఆర్ఎస్ బలపర్చిన 2,300 మంది విజయం సాధించగా, బీజేపీ బలపర్చిన వారు 440 మంది వరకు గెలుపొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రెండో విడతకు సంబంధించి 416 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎవరికి ఎంత శాతం..?తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే రెండో విడతలో కూడా 55 శాతం వరకు పంచాయతీలు కాంగ్రెస్ బలపర్చిన వారికే దక్కగా, అదే సమయంలో బీఆర్ఎస్ సైతం మంచి పోటీ ఇచి్చంది. ఆ పారీ్టకి 29 శాతం కంటే ఎక్కువగా పంచాయతీలు దక్కాయి. బీజేపీ మద్దతిచి్చన వారు 6 శాతానికి పైగా విజయం సాధించారు. -
పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు.. వైఎస్సార్సీపీ పోరాటం ఆగదని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేదలకు వైద్య విద్యను దూరం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.చంద్రబాబు నిర్ణయం వల్ల 2450 మెడికల్ సీట్లు పేదలు దూరమవుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు తన జేబు సంస్థల్లా మార్చుకున్నారన్న ఆక్షేపించారు. మరోవైపు కేంద్ర స్థాయీ సంఘం పేరుతో పచ్చి అబద్ధాలు రాస్తున్న ఈనాడు.. పీపీపీ విధానమే ముద్దు అంటూ బాబుకి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం ద్వారా.. ఆ ఘనత మీ ఖాతాలోనే వేసుకొవాలని చంద్రబాబుకు సూచించారు. అంతే తప్ప ప్రైవేటీకరణ పేరుతో పేదల నోట్లో మట్టికొట్టవద్దని విజ్ఞప్తి చేశారు.ప్రైవేటీకరణ కూటమి విధానమైతే.. అందుకు వైఎస్సార్సీపీ పూర్తి విరుద్ధమన్న సుధాకర్ బాబు దీనిపై రాజీనామా చేసి ప్రజల రెఫరెండంకు సిద్ధమా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ఏర్పాటు చేస్తే.. మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ రద్దు చేస్తామని బీరాలు పలికి.. ఇవాళ పూర్తిగా కాలేజీలనే ప్రైవేటు పరం చేయడంపై ధ్వజమెత్తారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాజకీయంగా కాక సామాజిక కోణంలో చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాదని పేద బిడ్డల చదువుల మీద ఉక్కుపాదం మోపాలని చూస్తే.. అప్పుడు కోటి కాస్తా పదికోట్ల సంతకాలవుతాయని తేల్చి చెప్పారు. పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న సుధాకర్ బాబు, మా తలలు పగిలినా వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాటం ఖాయమని హెచ్చరించారు. 15వ తేదీన జిల్లాల నుంచి కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి రాగా.. 18న జగన్ నాయకత్వంలో గవర్నర్ దగ్గరకు వెళ్తాయన్న ఆయన... ఈలోపు చంద్రబాబు తన మనసు మార్చుకోవాలని సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..చంద్రబాబు జేబు సంస్థల్లా వ్యవస్థలుఈ రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేయబడుతున్నాయని.. చంద్రబాబునాయుడికి జేబు సంస్థలుగా మారిపోతున్నాయని, ఆయన మాఫియా డాన్‌లా మారిపోయాడని వైఎస్సార్సీపీ భావిస్తోంది. అదే విషయాన్ని ప్రజలకు చెప్పాం. ఇవాళ ఆది మరోసారి సుస్పష్టం అయింది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం లేదని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవచ్చని, వారి చేతుల్లో ఉంటేనే నాణ్యమైన వైద్యం అందుతుందని.. కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగా, కేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం సిఫార్సు చేసినట్లుగా.. ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికలో బ్యానర్ ఐటం రాశారు.ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) వద్దు, ప్రభుత్వ విధానమే ముద్దు అనే నినాదాన్ని ఎత్తుకుంది. కానీ చంద్రబాబు అనుకూలమైన జేబు సంస్థ అయిన ఈనాడు మాత్రం పీపీపీ విధానమే ముద్దు అని రాసింది. చంద్రబాబుకి డబ్బు కొట్టడంలో ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే ఈనాడు మొదటి స్థానంలో ఉంటుంది. చంద్రబాబు ఏం చేసినా రైట్, ఆయన ఏం మాట్లాడినా అదే కరెక్ట్ అని రాస్తుంది. ఇంతమంది ప్రజలు వద్దు అంటే.. కాదు అదే ముద్దు అంటూ ఈనాడు రాయడాన్ని వైఎస్సార్సీపీ ఖండిస్తోంది.మీరు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తూ.. చంద్రబాబు జేబు సంస్థలా వ్యవహరిస్తున్నారు కాబట్టే.. మీరు చంద్రబాబుకి బాకా ఊదుతున్నారు కాబట్టే మిమ్మల్ని ఎల్లో మీడియా అని వ్యవహరిస్తున్నాం. చంద్రబాబుకి, మీకు ఆర్థికపరమైన, వ్యాపారపరమైన లావాదేవీలున్నాయి. అందుకు నిదర్శనమే ఇవాళ మీరు రాసిన వార్తలు.మెడికల కాలేజీలపై చర్చకు సిద్ధమా?1923 నుంచి 2019 వరకు స్వతంత్ర భారతదేశంలో ఏపీలో 12 మెడికల్ కాలేజీలుంటే.. ఇవాళ అవి 29కు చేరాయి. ఒక్క వైఎస్ జగన్ హయాంలోనే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే.. మీరు బాకా ఊదే చంద్రబాబు నాయుడుకి ఒక్క రోజైనా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న స్పృహ వచ్చిందా? వైఎస్ జగన్ విధానాలకు, చంద్రబాబు నాయుడు విధానాలకు ఇద్దరి సిద్ధాంతాలు, సంస్కరణలపై ఒక రోజంతా చర్చ నిర్వహిద్దాం. మీకు నచ్చిన టెలివిజన్ చానెల్స్ అధినేతలంతా విజయవాడ తీసుకురండి. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధులంతా వస్తాం. చంద్రబాబునాయుడు సిధ్ధాంతమేంటో, ఆయన సిద్ధాంతం పునాదులేంటో చర్చిద్దాం.బలహీనమైన రాజకీయ పునాదులతో ఉన్న చంద్రబాబు... భయం, అభద్రతా భావంతో తనను కానీ పార్టీని ఓన్ చేసుకునే విధానంలో.. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అందరికీ తాయిలాలు పంచుకుంటూ వచ్చాడు. తాను దోచుకున్న డబ్బులనే మీ అందరికీ పంచుకుంటూ వచ్చాడన్నదే ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని నిరూపించడానికి.. మీరు కట్టిన రామోజీ ఫిల్మ్ సిటీ అయినా, రామోజీ రావు చనిపోతే రూ.5 కోట్ల ప్రజాధనాన్ని ఆయన సంస్మరణ సభ నిర్వహించడం కోసం ఖర్చు చేయడాన్ని ఆధారాలతో సహా ఈనాడు చంద్రబాబు జేబు సంస్థ అనడానికి నిదర్శనం.పీపీపీ- దెబ్బతిన్న మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తిపీపీపీ విధానం వల్ల 17 మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తి దెబ్బతింటుంది. ప్రజారోగ్యం కొరకు వైఎస్ జగన్ సామాజిక స్పృహతో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఈ 17 మెడికల్ కాలేజీలను స్థాపించి.. వందలాది ఎకరాలను ఈ కాలేజీల పరిధిలోకి తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యున్నత వైద్యం అందించాలని ఆశించాడు. అందులో 7 కాలేజీల నిర్మాణం పూర్తైంది. 2023-24 విద్యాసంవత్సం నాటికి 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన కాలేజీలను పూర్త చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? గత ప్రభుత్వంలోనే ఏ పైనానా పూర్తి కాకుండా నిల్చిపోతే... ఏ ప్రజాపరిపాలకుడైనా దాన్ని పూర్తి చేసి ఆ ఘనత తన ఖాతాలో వేసుకుంటాడని భావిస్తాం.ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి.. వీటిని నేనే కట్టానని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటాడని భావించాం. కానీ చంద్రబాబు నికృష్టరాజకీయాలకు, నిరంకుశరాజకీయాలకు తెరలేపాడు.ఏ మాత్రం జాలి, దయ, దాక్షిణ్యం లేకుండా ప్రవర్తించాడు. ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే.. వందలాది ఉచిత మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఉచితంగా వైద్య సేవలు లభిస్తాయి. ఉచిత వైద్య సేవలు ఆశించిన పేదలు, ఆ కాలేజీలదగ్గరకు వచ్చి వైద్యం ఆశించిన వారందరికీ సంపూర్ణ న్యాయం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారింది.పీపీపీపై నిస్సిగ్గుగా అనుకూల ప్రచారంఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యశ్రీని అటకెక్కించాడు. 108 నాశనం చేశాడు. 104 అయితే అస్సలు కనబడ్డం లేదు. ఆ రోజు 104 అడ్రస్ లేకుండా పోయింది. వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, 108, 104 లాంటి చారిత్రాత్మక పథకాలు మచ్చుకైనా రాష్ట్రంలో కనిపించడం లేదు. ఈ దఫా చంద్రబాబు బరితెగించాడు. ఈ రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలకు ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా తీసుకుందామనుకుని ఆశపడ్డ వాళ్ల నోట్లో మట్టికొట్టాడు. పైగా వాళ్ల పత్రికతో బాకాలు ఊదించుకుంటూ.. పీపీపీ విధానమే బాగుంటుందని, ఇదే సరైన నిర్ణయమని నిస్సిగ్గుగా ప్రచారం చేయించుకుంటున్నాడు.పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి వైఎస్సార్సీపీ బద్ద విరుద్దం. మీరు, ఈనాడుతో పాటు మీ అనుకూల పత్రికలు పీపీపీ విధానానికి సానుకూలం. తక్షణమే చంద్రబాబును రాజీనామా చేయమనండి. లోకేష్, పవన్ కళ్యాణ్‌లను కూడా రాజీనామా చేయమనండి. మా 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం. ప్రజలను రిఫరెండెం కోరుదాం. ప్రజలకు ఏది అవసరమో వారి ముందుకే వెళ్దాం.స్థాయీ సంఘం పేరుతో అబద్దాలుకేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం పీపీపీ విధానం సిఫార్సు చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. స్థాయి సంఘం పన్ను రాయితీలు ఇమ్మని, స్కాలర్ షిప్పులు ఇమ్మని చెప్పింది. సీట్లు పెంచాల్సిన ఆవశ్యకత గురించి ఆలోచించమని చెప్పిందే తప్ప.. పీపీపీ విధానం బ్రహ్మాండంగా ఉంది. మీరు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయండని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఆ రోజు వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించినప్పుడు ఆయా కాలేజీల నిర్వహణకు వీలుగా కన్వీనర్ కోటాతో పాటు సెల్ఫ్ పైనాన్స్ సీట్లను పెట్టాలని ఆలోచన చేస్తే.. వైఎస్ జగన్ మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నాడు.వైఎస్ జగన్ ప్రభుత్వ విధానం తప్పు అని.. ఈ పార్టీలు, పత్రికలే దుమ్మెత్తి పోశాయి. ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తూ.. వార్తలు రాశాయి. అక్కడితే ఆగకుండా మేం ఆధికారంలోకి వస్తే.. 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ విధానాన్ని రద్దు చేసి, పూర్తిగా కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామని చెప్పిన ఈ పెద్ద మనుషులు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. పీపీపీ పేరుతో పూర్తిగా ప్రభుత్వ సంపదను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పంపించే పనిలో పడ్డారు.పైగా ఆ పీపీపీ విధానంలో కూడా ఉచితాలు ఉంటాయని.. పచ్చి అబద్దాలు చెబుతూ ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓపీ సేవలు ఉచితమని చెబుతున్నారు. ఓపీలో ఏం సేవలు అందుతాయి. వీళ్లు చెబుతున్న ఉచితం.. జ్వరం, పన్నో, కన్నూ, కడుపో నొప్పి వస్తే.. ఓపీ ఫ్రీ. అలా కాకుండా కాళ్లూ చేతులు విరిగితేనో, ఇంకేవైనా జబ్బులు వస్తేనో ప్రైవేటు ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ ఫీజులు పేదలు కట్టుకోలేదు.చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్, లోకేష్‌లకు ఆ విషయం అర్థం కాదు. మేం భారీ ఫీజులు కట్టి ఆ వైద్యాన్ని పొందలేరని.. ప్రభుత్వం వైపు చూసే ఆనాథల కోసమే ఈ కళాశాలలు వస్తే.. దాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. పైగా ప్రైవేటీకరణ చేసిన ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్ పేదలకు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. ఇది నమ్మవచ్చా? ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాటిపై ప్రభుత్వ ఆజమాయిషీ ఉంటుందా? ఇవాళ కడుతున్న మెడికల్ కాలేజీలో 100 పడకలు ఉంటే.. రిజర్వేషన్ ప్రకారం 70 పేదలకు, మిగిలినవి ఇతరులకు పెట్టగలిగే అవకాశం ఉంటుందా? మరి అలాంటప్పుడు ఈ రకమైన అబద్ధాలు ఎలా చెబుతారు?కాలేజీలు ప్రైవేటీకరణ - జీతాలు ప్రభుత్వ ఖజానాప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడమే ఒక పెద్ద స్కామ్ అయితే.. వారికి ప్రభుత్వం మరొక పెద్ద బొనాంజా ప్రకటిస్తుంది. ప్రైవేటు వ్యక్తుల చేతులకు ఆసుపత్రులు ఇచ్చి.. అక్కడ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించే విధంగా ఒప్పందాలు ఎలా జరుగుతున్నాయి? ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. మీ అరాచాకాలను గమనిస్తున్నారన్న స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఎక్కడైనా ఈ సహేతుకమైన చర్చలో.. రూ.140 కోట్లు ప్రవైటు వ్యక్తుల చేతులకి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చూడ్డం ఎంతవరకు సహేతుకం? పైగా ఆరోగ్యశాఖ మంత్రి సత్యప్రసాద్ అవును నిజమే ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని చెబుతున్నాడు. ఈయనా మంత్రి? అసలు అవగాహన ఉండే మాట్లాడుతున్నాడా? కేంద్ర ప్రభుత్వం ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు అంటోంది.పీజీ మెడికల్ సీట్లకు ఒక్కోదానికి రూ.29 లక్షలు వసూలు చేసే విధంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ స్కెచ్ వేశారు. ఆ రోజు వైయస్.జగన్ ప్రభుత్వంలో ఆయా కాలేజీల నిర్వహణకు.. స్వతంత్రంగా భరించే విధంగా... కన్వీనర్ కోటా కాకుండా కొన్ని సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించారు. దాన్ని విమర్శించి.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రద్దు చేస్తామని చెప్పారు. తీరా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉచిత సీటు వస్తే రూ.30వేలు ఫీజు, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే రూ.9 లక్షలు, ఎన్నారై కోటా అయితే రూ.29 లక్షలు రేటు ఫిక్స్ చేశారు. ఆ రోజు మీరు చెప్పినట్లు కన్వీనర్ కోటాలోనే పూర్తిగా సీట్లు ఉంచినట్లైతే... ఇవాళ మీరు చెప్పినట్లు రూ.9, రూ.29 లక్షలు ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు?5 కొత్త మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరంలో నాలుగు పీజీ కోర్సులలో 60 సీట్లను జాతీయ వైద్య కమిషన్ మంజూరు చేసింది. ఈ 60 సీట్లను మంజూరు చేసిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ కు ఉందా? తొలివిడత 4 కాలేజీల్లో 50 శాతమే కన్వీనర్ కోటా, పీపీపీ పేరుతో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ.. వాటిలో 50 శాతం సీట్ల మాత్రమే ప్రభుత్వ కోటాలో ఉంచుతున్నారు. ఇంతకంటే ద్రోహం ఉంటుందా? ఈ ఒక్క చర్య ద్వారానే ప్రభుత్వ విధానం, చిత్తశుద్ధి తేటతెల్లమైందిమెడికల్ కాలేజీల భూములు కౌరుచౌకగా అప్పగింత..మరోవైపు ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైయస్.జగన్ ప్రభుత్వం 50 ఎకరాల స్ధలం కేటాయిస్తే.. వందలదాలి కోట్ల ఖరీదు చేసే ఆ భూములను ప్రభుత్వం.. రూ.100 కే ప్రైవేటు వ్యక్తులకు దశలవారీగా ధారాధత్తం చేస్తోంది. 33 ఏళ్ల లీజు పేరుతో కేవలం రూ100 కే అప్పగిస్తోంది. ఇది ప్రజల ఆస్తిని ప్రైవేటు పరం చేయడమే. పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక్కా కాలేజీకి 257.50 ఎకరాల భూమిని కేటాయిస్తే అది ఇవాళ 191.71 ఎకరాలకే వచ్చింది. ఈ మధ్యలో భూమి సుమారు 50-60 ఎకరాలు మాయమైపోయింది. ఇది ఘోరమైన, బాధాకరమైన విషయం.ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించడం వల్ల.. తొలి ఏడాది ఇప్పటికే 700 సీట్లు కోల్పోయాం. రెండో సంవత్సరంలో 1750 కలిపి మొత్తం 2450 సీట్లను కోల్పోయాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను. దయచేసి ప్రైవేటు జపం ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటీకరణ వల్ల 2450 సీట్లలో మన ఆంధ్రరాష్ట్రంలో పేద విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం కోల్పోయారు.మనస్సుతో చూడండి. ఆ గొప్ప మాకు వద్దు. ఆ 17 కళాశాలల క్రెడిట్ మీరే తీసుకుని, మీరే ప్రారంభించండి. రూ.1000 కోట్లు కేటాయించి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం చేయండి. 2450 సీట్లు కోల్పోయిన వారందరూ ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు చెందిన పేదలే ఉంటారు. దయచేసి ప్రైవేటీకరణను ఆపి, ఆ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచండి. ప్రైవేటీకరణ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా, సామాజిక కోణంలో చూడాల్సిన ఆవశ్యకత ఉంది.కోటి సంతకాలు పది కోట్లవడం ఖాయంరాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాలివ్వాలని వైఎస్ జగన్ భావిస్తే.. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు వస్తే రాజధాని ప్రాంతంలో డెమొగ్రాఫికల్ ఇంబేలన్స్ వస్తుందన్న మహా ఘనుడివి.. అదే విషయాన్ని కోర్టుకు చెప్పిన ఘనుడివి నువ్వు చంద్రబాబూ. అలాంటి నువ్వు మా బిడ్డల చదువులు మీద ఉక్కుపాదం మోపుతుంటే.. ఈ కోటి సంతకాలు పదికోట్లవుతాయి. ఎలాంటి త్యాగాల చేసైనా.. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచేందుకు పోరాటం చేస్తాం. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కడం ఖాయం.15వ తేదీనాటికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వస్తాయి. 18వ తేదీన ఈ సంతకాలన్నీ గవర్నర్‌కి చేరుతాయి. ఈ లోగా నీ నిర్ణయం మార్చుకో చంద్రబాబూ?. కేసులు పెట్టి, తలలు పగలగొట్టి మమ్నల్ని భయపట్టాలని చూసే మీ ప్రయత్నాలు మమ్నల్ని ఆపలేవు. ప్రజా సమస్యల పోరాటంలో వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అలు పెరగని పోరాటం చేయడం తథ్యమని తేల్చి చెప్పారు. కార్పొరేట్ శక్తులను పెంచిపోషించడమే మీ సిద్ధాంతం అయితే.. పేదవాడికి ఉచిత విద్య, వైద్యం అందించడం, ఇళ్ల పట్టా ఇవ్వడం, వారికి కడుపు నిండా అన్నం పెట్టడమే వైఎస్ జగన్ సిద్ధాంతమని.. మీ సిద్ధాంతాలకు, మా సిద్ధాంతాలకూ జరుగుతున్న పోరాటంలో మేం ఏ పోరాటానికైనా, త్యాగాలకైనా సిద్ధమేనని సుధాకర్ బాబు హెచ్చరించారు. -
ప్రైవేటు వ్యక్తులకు లాభాలు, పేదలపై భారమా?: సీదిరి
సాక్షి, శ్రీకాకుళం: పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణమే మేలంటూ ఎల్లోమీడియా రాతలు రాయడం అన్యాయం, దుర్మార్గమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. ‘‘గతంలో విశాఖపట్నం తూర్పు తీరంలో ఉండటం వల్ల తీవ్రవాద దాడులకు టార్గెట్, విదేశీ దాడులకు సాఫ్ట్ టార్గెట్ అని రాశారని, విశాఖ భూకంపాల జోన్లో ఉంది. హైరిస్క్ ఏరియా అని రాశారని, గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోయి విశాఖ మునిగిపోతుంది, కాబట్టి రాజధానిగా చేయొద్దంటూ రాతలు రాశారని గుర్తు చేశారు.‘‘ఇప్పుడు విశాఖపట్నం అద్బుతం, ఇక్కడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, బంగారం పండుతుంది, సిలికాన్ లభిస్తుంది, కాబట్టి ఇక్కడే పెట్టుబడులు పెట్టండి, చంద్రబాబు విజన్ వల్లే విశాఖ ఇలా మారిపోతుందని రాస్తున్నారు’’ అంటూ సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..ఆ సంఘం సిఫార్సులంటూ పిచ్చిరాతలు:పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే పేదలకు మేలు జరుగుతుందని చంద్రబాబు ఏడాదిగా చెబుతున్నారు. ప్రైవేటు గుత్తాధిపత్యం ఎక్కువైతే ఏం జరుగుతుందో ఇండిగో వ్యవహారంలో చూశాం. మన ఎంపీ కేంద్రమంత్రిగా ఉండి ఏం చేశారో చూశాం. ప్రభుత్వ ఆస్పత్రులు, కాలేజీలు లేకపోతే మన పరిస్ధితి ఏంటో అంతా అలోచించాలి. వైద్య వ్యవస్థలు ప్రైవేటు చేతుల్లో ఉంటే కరోనా లాంటి విపత్తుల్లో ఏం జరిగి ఉండేదో ఆలోచించాలి.ఇప్పుడు పార్లమెంటరీ స్దాయీ సంఘం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిందంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు. నిజానికి కమిటీ ఏం చెప్పిందన్నది చూస్తే.. మెడికల్ కాలేజీల నిర్వహణకు ఎవరైనా ముందుకొస్తే రాయితీలు ఇవ్వాలని, అర్హులైన విద్యార్ధులుంటే స్కాలర్ షిప్పులు ఇవ్వాలని, వైద్య విద్యలో సీట్లు పెంచడం తప్పనిసరి అని పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్పింది. వైద్య విద్య, సామాగ్రి ఖర్చు పెరిగిపోతున్న తరుణంలో పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని మాత్రమే సిఫార్సు చేసింది.అంతే తప్ప ఉన్నవాటిని పీపీపీ విధానంలో చేపట్టాలని ఎక్కడా చెప్పలేదు. అదే వాస్తవమైతే ఎయిమ్స్, జిప్ మర్, ఐఐటీ వంటి సంస్థలు కూడా పీపీపీ విధానంలో పెట్టుకోవాలి కదా?. ప్రైవేటువాళ్లు ముందుకొస్తే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు చేపట్టాలని మాత్రమే పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్తే ఉన్న కాలేజీల్ని ప్రైవేటు చేతుల్లో పెడుతున్నారు.ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం స్కాం, నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, వెన్నుపోటే కాదు పేదల కలకల్ని తుంచేయడమే అవుతుంది. దీనికి తోడు ప్రైవేటు ఆస్పత్రుల్లో జీతాలు కూడా ప్రభుత్వమే రెండేళ్ల పాటు ఇస్తుందంటున్నారు. ఇలాంటి ఆఫర్లు ఎక్కడైనా విన్నామా ? భూములు, భవనాలు, ఆస్పత్రులు, మౌలిక సదుపాయాలు, జీతాలు ప్రభుత్వం ఇస్తుంటే లాభాలు ప్రైవేటుకు ఇచ్చి, భారం పేదలపై వేస్తారా? ఇదీ చంద్రబాబు చెప్తున్న పీపీపీ మోడల్. మొన్నటివరకూ పీపీపీ మోడ్ లో ఏర్పాటు చేసినా ప్రభుత్వం నిర్వహణ చూస్తుందన్నారు. అంటే జీతాలు ప్రభుత్వం ఇచ్చి లాభాలు ప్రైవేటు వ్యక్తులకు వెళ్లడమా ?, ఇది కొత్త మౌలిక సదుపాయాల కల్పన కాదు, ఉన్న వాటినే ప్రైవేటు చేతుల్లో పెట్టడం. మెడికల్ కాలేజీలు కొత్త వారు ఏర్పాటు చేస్తామంటే వారికి రాయితీలతో అవకాశం ఇవ్వండి. అంతే తప్ప మనం డబ్బులు పెట్టి, భూసేకరణ చేసి, భవనాలు కట్టి ప్రైవేటుకు లాభాలు ఇస్తారా ? ఇది మంచి విధానం అంటూ ఆస్థాన కరపత్రికలతో పొగడ్తలా ?జగన్‌కి పేరు వస్తుందనే ఇదంతా..:మొన్నే రెండు వారాల క్రితం అమరావతి కోసం రూ.7500 కోట్లు అప్పు చేశారు. నిన్న దాన్ని క్యాబినెట్లో ఆమోదించారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నారు. కలల రాజధానిలో కి.మీ రోడ్డు వేసేందుకు రూ.180 కోట్లకు టెండర్ ఇచ్చారు. అలా మూడు కి.మీ రోడ్డు కోసం రూ.540 కోట్లకు టెండర్ ఇచ్చారు. రెండు, మూడు కిలోమీటర్ల రోడ్డు ఖర్చుతో ఒక మెడికల్ కాలేజీ పూర్తయిపోతుంది. కానీ మెడికల్ కాలేజీలు పెట్టడానికి డబ్బులు లేవంటున్నారు.పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలు దోచి పెడుతున్నారు:అసలు మెడికల్ కాలేజీలకు కొత్తగా డబ్బు తీసుకు రావాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్ హయాంలోనే నాబార్డ్ వంటి ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. నాబార్డ్‌ను సంప్రదిస్తే మెడికల్ కాలేజీలకు నిధులు దొరుకుతాయి. కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరమే లేదు. కేవలం వైఎస్ జగన్‌కు పేరు వస్తుందనే దుగ్ద తప్ప ఇందులో మరొకటి లేదు. అందుకే వాటిని ప్రైవేటు వ్యక్తులకు, బినామీలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క మెడికల్ కాలేజీలో ఉద్యోగుల నెల జీతాలకు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అలా ఏడాదికి రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు అవుతుంది. 10 మెడికల్ కాలేజీలకు ఇలా ఇస్తే రూ.700 కోట్లు అవుతుంది. రెండేళ్లు ఇలా ఇస్తారా?. ఇది ఎంత వరకు సబబు?ఇంకా 10 మెడికల్ కాలేజీలకు సుమారు 257 ఎకరాలు సేకరించాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాల చొప్పున దోచి పెడుతున్నారు. కేంద్రం ఇచ్చిన పీజీ సీట్లు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కింద ప్రైవేటుకు ఇచ్చేశారు. ఎన్నారై సీటు ఫీజు రూ.29 లక్షలని జీవో కూడా ఇచ్చారు. మేనేజ్ మెంట్ కోటా సీటు రూ.9 లక్షలని ఇచ్చారు.రికార్డుస్థాయిలో అప్పు:అసలు ఈ ప్రభుత్వం ఎటు పోతోంది? డబ్బుల్లేవంటూనే 18 నెలల్లోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేశారు. రాష్ట్రానికి భారీ అప్పులు తెచ్చుకుంటూ మరోవైపు జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చెప్పుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకెళ్తున్నారు.కోటి సంతకాలు గవర్నర్‌కి సమర్పణ:10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చర్యలపై ప్రజా ఉద్యమం చేపట్టిన వైయస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగించింది. దానికి అన్ని చోట్ల, అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. ఆ కోటి సంతకాల పత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకోగా, సోమవారం (డిసెంబరు 15వ తేదీ) అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నాం. అక్కణ్నుంచి అవి విజయవాడ చేరుకుంటాయి. ఆ పత్రాలను ఈనెల 18న గవర్నర్‌కి సమర్పిస్తాం. ఆ మేరకు ఆరోజు సా.4 గం.కు, మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌నజీర్‌తో భేటీ కానున్నారని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వివరించారు. -
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నబీన్
న్యూఢిల్లీ/లక్నో: అందరి అంచనాలను తలకిందుల చేస్తూ బీజేపీ అగ్రనాయకత్వం బిహార్ యువనేత నితిన్ నబీన్‌ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. నబీన్ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం నోటిఫికేషన్లో ప్రకటించారు. కాయస్థ వర్గానికి చెందిన 45 ఏళ్ల నితిన్ నబీన్ ప్రస్తుతం బిహార్ కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్థానంలో భవిష్యత్తులో ఈయన బీజేపీ చీఫ్ పదవిని చేపట్టే అవకాశముందని చెబుతున్నారు. తద్వారా తక్కువ వయస్సులోనే బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టిన నేతగా నబీన్ చరిత్ర సృష్టిస్తారని పార్టీ నేతలు అంటున్నారు. మోదీ అభినందనలు.. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్ నబీన్‌ను ప్రధాని మోదీ అభినందించారు. కష్టించి పనిచేసే కార్యకర్తగా గుర్తింపు పొందిన నబీన్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో శక్తివంచన లేకుండా కృషి చేస్తారన్న విశ్వాసం తనకుందన్నారు. ‘యువకుడు, కష్టించి పనిచేసే నేత, సంస్థాగత వ్యవహారంలో అనుభవమున్న వాడు, ఎమ్మెల్యేగా మంచి రికార్డు ఉంది. బిహార్‌కు పలుమార్లు మంత్రిగా పనిచేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు బాధ్యతలు నిర్వర్తించారు’అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. యూపీ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆదివారం లక్నోలో కేంద్రమంత్రి పియూష్ గోయెల్ ప్రకటించారు. ఈ పదవికి శనివారం పంకజ్ చౌదరి నామినేషన్ వేశారన్నారు. పోటీలో ఆయన ఒక్కరే ఉండటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. మొత్తం 1.62లక్షల బూత్‌ల ద్వారా ఈ ఎన్నిక జరిగిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి నుంచి పంకజ్ చౌదరి బాధ్యతలు స్వీకరించారని గోయెల్ తెలిపారు. యూపీ బీజేపీ 17వ అధ్యక్షుడిగా ఎన్నికైన పంకజ్ చౌదరి కుర్మి వర్గానికి చెందిన వారు. ఈ వర్గం ఇతర వెనుకబడిన కులా(ఓబీసీ)ల జాబితాలో ఉంది. ఈ సందర్భంగా పియూష్ గోయెల్ పార్టీ జాతీయ కౌన్సిల్‌లోని 120 మంది సభ్యుల పేర్లను ప్రకటించారు. వీరిలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి, సీఎం ఆదిత్య నాథ్ గోరఖ్‌పూర్ నుంచి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ లక్నో నుంచి ప్రాతినిథ్యం వహిస్తారు. 45 ఏళ్లకే 5 సార్లు ఎమ్మెల్యేగా.. బిహార్‌లో బీజేపీ సీనియర్ నేత, నాటి ఎమ్మెల్యే నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా 2006లో ఆకస్మికంగా చనిపోయారు. దీంతో ఆయన కుమారుడు నితిన్ నబీన్‌కు పార్టీ అధిష్టానం పటా్న(పశ్చిమ) నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చి తొలిసారిగా బరిలోకి దింపింది. ఏకంగా 60వేల ఓట్ల భారీ మెజారిటీతో నబీన్ గెలిచారు. అప్పట్నుంచి వరసగా దాదాపు రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. తాజాగా బిహార్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 51,000 ఓట్ల మెజారిటీతో బంకింపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలా కేవలం 45 ఏళ్ల వయసుకే ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్ ప్రభుత్వంలో మంత్రిగా పలుమార్లు పనిచేశారు. ప్రస్తుతం నితీశ్ ప్రభుత్వంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారు. నబీన్ గతంలో యువ మోర్చాలో పనిచేశారు. రాష్ట్ర ఇన్ఛార్జిగా వ్యవహరించారు. బీజేపీ చీఫ్‌గా నడ్డా స్థానంలో మరొకరిని నియమించాల్సిన సమయంలో నబీన్‌కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలను అప్పగించడం గమనార్హం. నడ్డా తర్వాత బీజేపీ నూతన చీఫ్ అయ్యే అవకాశాలు నబీన్‌కు అత్యధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు స్వయంగా చెబుతున్నాయి. బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్ నియమితులైనట్లు తెలియడంతో పటా్నలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉత్సవాలు మిన్నంటాయి. నితిన్ నబీన్‌కు శుభాకాంక్షల సందేశాలు వెల్లువలా వచ్చాయి. ఈ నియామకం పార్టీ కార్యకర్తలకు అంకితమిస్తున్నానని మీడియాతో నబీన్ పేర్కొన్నారు. తనపై విశ్వాసముంచి గురుతర బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధిష్టానం యువనాయకత్వం వైపు మొగ్గుచూపుతోందనడానికి నబీన్ నియామకం ఒక సంకేతమని వార్తలొచ్చాయి. #BREAKING: Nitin Nabin Appointed As National Working President of BJP. pic.twitter.com/rdCbo9KpYq— Aditya Raj Kaul (@AdityaRajKaul) December 14, 2025 -
కేంద్రం,ఈసీపై రాహుల్ గాంధీ ఆగ్రహం
సాక్షి,ఢిల్లీ: ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే ఓటర్లను ఓటర్ల జాబితానుంచి తొలగిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఓట్ చోర్, గద్దీ ఛోడ్ ర్యాలీలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘ఈసీ బీజేపీ కుమ్మక్కయ్యి వ్యవస్థల్ని నిర్విర్యం చేస్తున్నారు. ఓట్ చోరీపై దేశ వ్యాప్తంగా 5.5కోట్ల మందికి పైగా సంతకాలు సేకరించాం. ఓట్చోరీపై అందరూ ఏకమవ్వాలి. ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు జోడించారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత,నిస్పక్షపాతం ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి మీ అందరి మద్దతు కావాలి’అని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. -
పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ తగిలింది. వేంపల్లి మండలం అమ్మగారిపల్లి గ్రామంలో టీడీపీ కండువాలు వేసేందుకు బీటెక్ రవి వెళ్లారు. ఆయన రాకతో గ్రామస్తులు.. తమ ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్లారు.పోలీసు ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో నుంచి గ్రామం మొత్తం వైఎస్ కుటుంబం వెంటనే నడుస్తున్నామన్న గ్రామస్తులు.. టీడీపీ ఊరిలో అడుగు పెట్టడంతోనే ఊరు వదిలి రావాల్సి వచ్చిందని గ్రామస్తులు చెప్పారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘టీడీపీ నాయకులు గ్రామంలోకి రావడంతో ఊరు మొత్తం ఖాళీ చేశారు. ఇళ్లకు తాళాలు వేసి వైఎస్సార్సీపీకి అమ్మగారిపల్లి గ్రామస్తులు మద్దతుగా నిలిచారు. అమ్మగారిపల్లి గ్రామస్తులు ఇచ్చిన స్ఫూర్తి వైఎస్సార్సీపీకి వెయ్యి ఏనుగుల బలం.‘‘టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బలహీనపడింది. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని వైఎస్ జగన్ కోరుకున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పోలీసుల ఒత్తిళ్లకు లొంగకుండా అమ్మగారిపల్లి గ్రామస్తులు తెగువ చూపించారు’’ అని సతీషరెడ్డి పేర్కొన్నారు. -
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం.. ఎప్పుడంటే?
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 19న (శనివారం) బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్రస్థాయి కార్యవర్గ విస్థృత స్థాయి సమావేశం జరగనుంది. వచ్చే శనివారం మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా.. కృష్ణా,గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి, పార్టీ సంస్థాగత నిర్ణయం,కార్యచరణపై చర్చ, రాబోయే ప్రజా ఉద్యమాలు,సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి, రాష్ట్రానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. -
బంగారు కొండ.. మానుకొండ అంటూ పోస్ట్!
విజయవాడ: ఏపీలో అధికార టీడీపీ నేతలైన ఎంపీ కేశినాని చిన్ని-ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్ తారాస్థాయికి చేరింది. ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్‌గా కొలికపూడి సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ పెడుతూ హిట్ పుట్టిస్తున్నారు. కొలికపూడి పోస్ట్‌లతో ఎంపీ కేశినేని చిన్ని వర్గంలో కలవరం మొదలైంది. తాజాగా కేశినేని చిన్నిపై కొలికపూడి పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింంది. గంపలగూడెం టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ ఫోటోను విడుదల చేశారు కొలికపూడి. గతంలో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయిన మానుకొండ రామకృష్ణ ఫోటోను పెడుతూ ‘ బంగారు కొండ.. మానుకొండ’ అంటూ పోస్ట్ పెట్టారు కొలికపూడి. ఈనెల 18 నుంచి గంపలగూడెం మండలంలో పల్లెనిద్ర అంటూ మరో పోస్టు పెట్టారు. కొలికపూడి వరుస పోస్టులు తిరువూరులో దుమారం రేపుతున్నాయి. -
పల్లెల్లో ‘పైసా వసూల్’!
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు పల్లెల్లో నగదు పంచిన అభ్యర్థుల్లో ఓటమిపాలైన వారు తిరిగి వసూళ్లకు తెరతీస్తున్నారు. తమను గెలిపిస్తారని డబ్బు పంచామని.. కానీ ఓడగొట్టినందున ఆ సొమ్మును తిరిగి చెల్లించాల్సిందేనని ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రెండో దశ పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు నగదు పంపకాల జోరు పెంచారు. ఓ గ్రామంలో నలుగురు అభ్యర్థులు కలిపి ఒక్కో ఓటుకు ఏకంగా రూ. 33 వేల చొప్పున ముట్టజెప్పారు.రూ. 10 లక్షలు అప్పు తెచ్చి ఖర్చు చేసినా ఓడా.. నా డబ్బిచ్చేయండి నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామంలో ఓడిపోయిన బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కల్లూరి బాలరాజు తన భార్యతో కలిసి దేవుడి ఫొటో, పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇంటింటికీ తిరిగాడు. తనకు ఓటు వేయనివారు తాను పంచిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ‘మా డబ్బు తీసుకొని మమ్మల్నే ఓడించారు. అందుకే మేం పంచిన డబ్బు తిరిగి ఇవ్వండి’ అని పట్టుబట్టారు. మీకే ఓటు వేశామని ఓటర్లు చెప్పగా దేవుడిపై ప్రమాణం చేయాలని కోరారు. తాము పేదవాళ్లమని, రూ. 10 లక్షలు అప్పు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేసినా గ్రామస్తులు ఓట్లు వేయలేదని బాలరాజు దంపతలు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఓటర్లు మాత్రం ‘మేము డబ్బు పంచాలని అడగలేదు కదా.. మీరే ఇచ్చారు’ అని బాలరాజును తిరిగి ప్రశ్నించారు.కాంగ్రెస్ నేతకు బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతు కారేపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుతో ఈ నెల 17న మూడో విడత ఎన్నికల్లో బరిలోకి దిగనున్న షేక్ గౌసుద్దీన్ పోటీ నుంచి తప్పుకున్నాడు. అంతేకాకుండా పోటీలో ఉన్న కాంగ్రెస్ నేత పోలగాని శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటానని లేఖ రాసిచ్చాడు. ఈ లేఖపై గౌసుద్దీన్తోపాటు బీఆర్ఎస్ కారేపల్లి గ్రామశాఖ పేరిట పలువురి సంతకాలు ఉన్నాయి. దేశ్ముఖిలో ఓటుకు రూ. 33 వేల చొప్పున పంపిణీ సాక్షి, యాదాద్రి: భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలో పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులు భారీగా డబ్బు పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు ఏకంగా రూ. 33 వేలు ముట్టచెబుతున్నట్లు సమాచారం. ఈ గ్రామంలో 1,367 ఓట్లు ఉండగా సర్పంచ్ స్థానానికి ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురు పోటీ చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. 10 వేల చొప్పున ఇస్తుండగా మూడో అభ్యర్థి రూ. 8 వేలు, నాలుగో అభ్యర్థి రూ. 5 వేల చొప్పున పంచుతున్నారు. ఈ లెక్కన ఒక్కో ఓటరుకు రూ. 33 వేలు ముడుతున్నాయన్నమాట.వయసు, మెజారిటీ 71 యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్ తండాకు చెందిన ధీరావత్ గాశీరాంనాయక్ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచాడు. గాశీరాంనాయక్ వయసు 71 ఏళ్లుకాగా సమీప ప్రత్యర్థిపై ఆయనకు లభించిన మెజారిటీ ఓట్లు కూడా 71 కావడం విశేషం.ఎన్నికల సిబ్బంది ఆకలి కేకలు జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధుల కోసం వచి్చన అధికారులు, సిబ్బందికి భోజనం లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్న 100–150 మంది ఉద్యోగులకు భోజనం లేకపోవడంతో తాము ఎక్కడ భోజనం చేయాలంటూ వాపోయారు. అధికారులపై మండిపడ్డారు.ఓట్ల రద్దీ.. ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతవాసులు స్వగ్రామాలకు పయనమయ్యారు. దీంతో శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ఇలా కిటకిటలాడింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు జగ్గారెడ్డి సన్మానం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను సన్మానించడం మామూలే. కానీ ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు శాలువాలు కప్పి సన్మానించిన ఘటన సంగారెడ్డిలో శనివారం జరిగింది. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 87 మంది పోటీ చేయగా వారిలో 45 మంది గెలిచారు. ఓటమి పాలైన 42 మంది సర్పంచ్ అభ్యర్థులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శాలువాలతో సన్మానించారు. వారిలో కొండాపూర్ మండల కేంద్ర సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిన మస్కు అవినేని నర్సింహారెడ్డిని సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. ఓట్లేయలేదుగా.. నా సొమ్ము తిరిగివ్వండి వర్గల్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో వార్డుసభ్యునిగా ఓడిపోయన అభ్యర్థి ఓటర్ల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వీడియో వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బు పంచినప్పటికీ తనకు ఓట్లు పడలేదనే భావనతో ఓటర్ల నుంచి తిరిగి డబ్బు వసూలు చేసుకున్నాడు. అలా వెనక్కి తీసుకున్న నగదును లెక్కపెట్టుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఓటు కోసం సౌదీ టు మిరుదొడ్డి మిరుదొడ్డి (దుబ్బాక): పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు విదేశాల నుంచి తరలివచ్చి ఓ వ్యక్తి ఓటు విలువను చాటిచెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన ఎల్ముల బాల్‌రాజు నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. ఆదివారం జరగనున్న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు సౌదీ నుంచి మిరుదొడ్డికి చేరుకున్నాడు.


