సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా టీడీపీలో నేతల మధ్య విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. హోం మంత్రి వంగలపూడి అనితపై మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తమకు జరిగిన అవమానంపై పార్టీ అధినేత చంద్రబాబు దగ్గరే తేల్చుకుంటామని పీలా గోవింద్ హెచ్చరించారు.
వివరాల మేరకు.. అనకాపల్లిలో టీడీపీ నాయకులకు విలువ ఇవ్వలేదంటూ హోం మంత్రిపై మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘నియోజకవర్గ ఇన్‌చార్జ్ జిల్లా టీడీపీ అధ్యక్షులు చూసి కూడా కారు ఆపకుండా ఎలా వెళ్ళిపోతారు?. పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వడం లేదు, అది మా దౌర్భాగ్యం. మమ్మల్ని అని రకాలుగా అవమానం చేస్తుంటే ఎలా?. వీధిలోకి రావాలా?. ఇలా వీధిలోకి రావడం నాకు ఇష్టం లేదు. అనకాపల్లి ఉత్సవాలకు పాసులు కూడా ఇవ్వలేదు. మాకు జరిగిన అవమానంపై పార్టీ అధినేత వద్ద తేల్చుకుంటాం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


