విజయశ్రీ! | punganur jayashree secures 360 rank in civils | Sakshi
Sakshi News home page

విజయశ్రీ!

Mar 10 2026 1:20 PM | Updated on Mar 10 2026 1:28 PM

punganur jayashree secures 360 rank in civils

చిత్తూరు: పక్కా ప్రణాళికతో కష్టపడి చదివితే విజయం తప్పకుండా వరిస్తుందని.. అదుకు తానే సాక్షి అని పలమనేరు మండలంలోని జరావారిపల్లికి చెందిన జయశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు తాను చదివిన పట్టణంలోని ఎలీనా బెట్టిని స్కూల్‌ యాజమాన్యం ఆమెకు సోమవారం అభినందన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ తాను  సివిల్స్‌ ఫలితాల్లో 360 ర్యాంక్‌ సాధించానన్నారు. 

గతంలో రెండు సార్లు ఇదే పరీక్షలో విఫలమైనా ఈ దఫా పట్టుదలతో ఉత్తమ ర్యాంక్‌ సాధించినట్టు వెల్లడించారు. జరావారిపల్లి గ్రామానికి చెందిన తాను పేద రైతు కుటుంబంలో పుట్టానని, తల్లిదండ్రులు మునెమ్మ, శ్రీరాములురెడ్డి తనచదువు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తుచేసుకున్నారు. తాను అందరిలాగే ప్రాథమిక, ఉన్నత విద్యను స్థానికంగానే చదివానని.. ఆపై పులివెందుల జేఎస్‌టీయూలో ఉన్నత విద్యనభ్యసించినట్టు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా చదివి సివిల్స్‌లో విజయం సాధించినట్టు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది సివిల్స్‌లో విజయం సాధించాలని ఆకాక్షించారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement