డిప్యూటీ సీఎం పవన్‌కు అవమానం | Controversy In Nellore, Deputy CM Pawan Kalyan Photo Missing In Whatsapp Governance Posters, Sparks Political Debate | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం పవన్‌కు అవమానం

Mar 10 2026 10:44 AM | Updated on Mar 10 2026 11:17 AM

Pawan Kalyan Photo Missing In Whatsapp Governance Posters Row

నెల్లూరు: ‘ప్రజల చేతిలో ప్రభుత్వం’ వాట్సాప్‌ గవర్నెన్స్‌ ప్రచారం పోస్టర్లలో ప్రోటోకాల్‌ ప్రకారం డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఫొటో ముద్రించకపోవడంతో తీవ్ర అవమానం జరిగింది. ఒక పక్క చంద్రబాబు సింగిల్‌గా మనం గెలవలేదు.. మోదీ, పవన్‌కళ్యాణ్‌ అండతోనే గెలిచామంటూ బహిరంగ వేదికలపై చెబుతున్నారు. మరో పక్క ప్రభుత్వ ప్రచార పోస్టర్లలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఫొటోలు ముద్రించారు. సీఎం ఫొటో పెట్టారంటే అర్థం ఉంది. కానీ మంత్రి లోకేశ్‌ ఆ శాఖ కానప్పటికీ.. ఆ పోస్టర్లలో ఆయన ఫొటో ముద్రించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

దీంతో కూటమిలో సఖ్యత లేదనే ఒక ప్రచారం అయితే.. మరో వైపు పవన్‌కళ్యాణ్‌ను వ్యూహాత్మకంగా పక్కకు తప్పిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒక వైపు సీఎం చంద్రబాబు, మరో పక్కన డీసీఎం పవన్‌ ఫొటోలు పెట్టారు. జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గవర్నెన్స్‌ ప్రచారం పోస్టర్లలో మాత్రం ఆయన ఫొటో లేకుండా చేయడం  సర్వత్రా చర్చకు దారితీసింది. 


 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement