breaking news
Pawan Kalyan
-
‘రావణ్ మీద పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసులో ఎందుకు పెట్టలేదు?’
కృష్ణాజిల్లా: పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి మండిపడ్డారు. ప్రశ్నించండి, విమర్శించండి , మర్యాద ఇచ్చి మాట్లాడండని పవన్ అంటున్నారని ఆమె చెప్పారు. తాము రెండేళ్లుగా పవన్ గురించి మర్యాదగానే మాట్లాడుతున్నామని, మర్యాదగానే ప్రశ్నిస్తున్నామని తెలిపారు. మర్యాదగానే కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నామని చెప్పారు.‘‘ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి లేదు. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తారని పవన్‌కు జనం ఓట్లేశారు. పవన్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఇప్పటి వరకూ మాకు న్యాయం జరగలేదు. రావణ్ మీద పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసులో ఎందుకు పెట్టలేదు? ఒక్కరినైనా పిలిపించి సుగాలి ప్రీతి కేసులో విచారణ జరిపించారా? సుగాలి ప్రీతి కేసుపై పదే పదే ప్రశ్నిస్తున్నారని ఆ గొంతును నొక్కేయాలని చూస్తున్నారు. ఎందుకు నాకు మాటిచ్చి మర్చిపోయారో పవన్ సమాధానం చెప్పాలి. రావణ్ మీద పెట్టిన ఇంటరెస్ట్ సుగాలి ప్రీతి కేసుపై పెట్టుంటే పది శాతమైనా దర్యాప్తు జరిగి ఉండేది. మహిళల కన్నీళ్లే కూటమి ప్రభుత్వ పతనానికి నాంది. అన్ని కేసుల్లో పవర్ మీ చేతుల్లోకి తీసేసుకుంటున్నారు. సుగాలి ప్రీతి కేసులో పవర్‌ను పక్కన పెట్టేస్తున్నారు. జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులతో నాపై మాటల దాడి చేయిస్తున్నారు. వికలాంగురాలినైన నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు. నా కులాన్ని దూషిస్తున్నారు. రావణ్‌పై రాజద్రోహం కేసు పెట్టించి రిమాండ్ కు పంపిస్తున్నారు కదా.. ఈ రోజు మీరు ప్రశాంతంగా నిద్రపోండి పవన్. ప్రశ్నించండి అంటున్నారు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
చంద్రబాబుకు షాక్ ఇవ్వబోతున్న పవన్...! గవర్నర్ తో చర్చలు..
-
పైకి పవనిజం... లోపల బానిసిజం.. గబ్బర్ సింగ్ కు గట్టి షాక్
-
రావణ్ ను చంపే కుట్ర.. ఆ ఎమ్మెల్యేకు బందరులో ఏం పని..
-
నీకు ఓటు వేసి గెలిపించినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి..
-
రావణ్ మద్దతుదారులపై.. కోడి గుడ్లతో అటాక్ జనసేన గూండాల దాడి
-
పవన్-చంద్రబాబు.. కోర్టు ఏం చెబుతుందో అర్థమవుతోందా మీకు?
యూట్యూబ్, సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నాడనే ఆరోపణలతో ప్రశ్న రావణ్‌పై ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. గతంలో నమోదైన రెండు కేసులకు సంబంధించి న్యాయస్థానం ఆయనకు ఉపశమనం కలిగిస్తూ బెయిల్ ఇవ్వగా.. జైలు నుంచి విడుదలయ్యే లోపే మచిలీపట్నంలో నమోదైన కేసును రంగంలోకి తెచ్చిన పోలీసులు.. పక్కా ప్లాన్‌తో రావణ్‌ని మళ్లీ అరెస్ట్ చేసి తరలించారు. ఈ వరుస అరెస్టుల పరిణామాల నేపథ్యంలో నటుడు ప్రకాశ్ రాజ్ వరస వీడియోలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.'నాలుగు రోజుల నుంచి రావణ్ నిరాహారదీక్షలో ఉన్నాడు. అసలు ఆలోచించరా? ఏంటీ నాటకం, దౌర్జన్యం. అరెస్ట్ చేశారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్లీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్లీ అరెస్ట్ చేశారు. మళ్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెబుతున్నదో అర్థమవుతోందా మీకు?' అని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ని ట్యాగ్ చేస్తూ ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.Arrest/ Bail ..Arrest /Bail.. Arrest/Bail.. and arrest again. Isn’t Courts telling you that you are wrong.. Citizens are witnessing your Vindictive politics.. @ncbn @PawanKalyan please stop this #justasking pic.twitter.com/xU4AxGwpKl— Prakash Raj (@prakashraaj) July 4, 2026 -
రావణ్ అరెస్ట్ పై పేర్ని ఫస్ట్ రియాక్షన్
-
గాదె సాయికృష్ణ తల్లి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విజయవాడ లాకప్‌డెత్ మృతుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటీకీ సాయికృష్ణ బూడిద ఇవ్వలేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. బూడిదైనా ఇప్పించాలని.. లేకపోతే నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానన్నారు. తన కొడుకును హింసించిన వాళ్లు ఇంకా ఉన్నారని.. లాకప్ డెత్ వెనుక ఉన్న పెద్దలను ఎందుకు అరెస్ట్ చేయలేదన్న సాయికృష్ణ తల్లి.. విచారణ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సాయికృష్ణ తల్లి తీవ్రంగా మండిపడ్డారు. ‘‘నన్ను చంపాలనే కుట్ర జరుగుతుంది. మేము కాపులంతా ఓట్లు వేసినందుకు పవన్ కళ్యాణ్ బాగా బుద్ధి చెప్పాడు. నా కొడుకు నీ అభిమాని.. వాడిని క్రిమినల్ అంటావా?. కేసు వెనుక పెద్దవాళ్లు ఉన్నారు. అందుకే ఇలా చంపారు. నా కొడుకుని తీసుకెళ్లిన వాళ్లను ఇంకా అరెస్ట్ చేయలేదు’’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో మెజిస్టీరియల్ విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హాజరయ్యారు. రెండు గంటల పాటు ఆమె నుంచి సమాచారం తీసుకున్నారు. కేసు విషయాలు అన్ని అడిగి తెలుసుకున్నారని విజయలక్ష్మి తెలిపారు. -
నువ్వు అంత పోటుగాడివా.? పవన్ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన ప్రెస్ మీట్
-
ఎలాగైనా.. రావణ్ పై పవన్ మాస్టర్ స్కెచ్
-
రావణ్ అరెస్ట్ కేసుపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు!
-
ఇంకెంత కాలం? పవన్ కళ్యాణ్ కు వంగవీటి రంగా కూతురు విజ్ఞప్తి
-
పవన్ ఎన్ని కేసులైనా పెట్టుకో గంటలో బయటకు తీసుకొస్తా!
-
రెండు సంవత్సరాలలో ఒక్కసారైనా ప్రశ్నించవా..? పోలీసులనే జనసేన నాయకులు కొడితే..
-
రావణ్ ని మాకు అప్పగించండి.. నక్కపల్లి పోలీసు స్టేషన్ వద్ద జనసేన నేతలు హల్ చల్
-
ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు
-
క్రెడిట్ మొత్తం వైఎస్ జగన్‌ది.. క్రెడిట్‌చోరీ చంద్రబాబుది
సాక్షి, వైఎస్సార్: కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు విషయంలో అన్నీ కూడా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయని వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.2019లోనే కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ(జిందాల్ సౌత్ వెస్ట్) సంస్థను వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పించిందని అవినాష్ రెడ్డి అన్నారు. 2022లో ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి జీవో జారీ చేయడంతో పాటు భూసేకరణ కూడా పూర్తిగా జగన్ హయాంలోనే జరిగిందని తెలిపారు. ప్రాజెక్టు కోసం 1100 ఎకరాల భూకేటాయింపు కూడా ఫేజ్–1లోనే చేపట్టినట్లు వివరించారు.2023 ఫిబ్రవరిలో సీఎం వైఎస్ జగన్ ఈ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారని అవినాష్ రెడ్డి గుర్తుచేశారు. అంతేకాకుండా పర్యావరణ అనుమతులు సహా అవసరమైన అన్ని క్లియరెన్సులు రాష్ట్ర ప్రభుత్వమే తీసుకువచ్చిందని చెప్పారు. ఈ విషయాన్ని జేఎస్‌డబ్ల్యూ సంస్థ అధినేత జిందాల్ స్వయంగా వెల్లడించారాన్నారు. కడప సభలో ఈ ప్రాజెక్టుపై తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్ అవినాష్ తప్పుబట్టారు.“ఫ్యాక్టరీని తానే తెచ్చానని చెప్పుకుంటూ క్రెడిట్ దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు” అని విమర్శించారు. సభ స్టీల్ ఫ్యాక్టరీ కోసం కాకుండా.. కేవలం వైఎస్ జగన్‌ను దూషించడానికే పెట్టినట్లు ఉందని అన్నారు.అదేవిధంగా అమరావతి రాజధాని ప్రాజెక్టుపై కూడా అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రజారాజధాని కాదని, అది ఒక వర్గానికి చెందిన రాజధానిగా మారిందని మండిపడ్డారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అంగీకరించారని గుర్తుచేశారు. శివరామకృష్ణ కమిటీ సూచనలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని.. అమరావతి కోసం సుమారు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ మాత్రం మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాలను కలిపే “మావిగన్” వంటి ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రతిపాదించారని తెలిపారు. -
నాడు పవన్ చెప్పు చూపిన రోజే బుద్ధి చెప్పి ఉంటే.. ఏకిపారేసిన అడ్వకేట్ రజిని
-
నేను పవన్ కళ్యాణ్ ని దగ్గర నుండి చూశా..? డిప్యూటీ సీఎంకు క్రిమినల్ కు తేడా ఏంటి?
-
నేను జనసేనలో ఉన్నప్పుడు ప్రచారానికి వెళ్తే.. పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ...
-
రావణ్ అంటే పవన్ కు ఎందుకంత భయం..
-
పవన్ కళ్యాణ్ కు హోంమంత్రి పగ్గాలు..?
-
‘రావణ్‌పై మరో కేసు.. దాడికి జనసేన ప్లాన్?’
కృష్ణా జిల్లా: ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకవైపు బెయిల్ రాగానే మరో కేసు అంటూ పోలీసులు.. రావణ్‌ను అరెస్ట్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి మచిలీపట్నంలో బెయిల్ రాగానే రావణ్‌ను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు రావణ్‌ను మళ్లీ అరెస్ట్ చేశారు. కేసు నమోదైనట్టు చెబుతూ మచిలీపట్నం నుంచి పాయకరావుపేటకు తరలించారు. ఇప్పటికి మూడు కేసుల్లో రావణ్‌కు బెయిల్ వచ్చినప్పటికీ కొత్త కేసులతో పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.ఈ సందర్భంగా న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..‘ప్రతీ సందర్భంలో ఒక దాని వెంట మరో కేసు పెడుతున్నారు. బెయిల్ రాగానే పోలీసులు మరో స్టేషన్‌కు తీసుకెళుతున్నారు. రావణ్ నిజంగా తప్పు చేసుంటే చట్టప్రకారం అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. తప్పు చేశాడో లేదో తెలియదు బెయిల్ రాగానే అరెస్ట్ చేస్తున్నారు. జనసేనకు పట్టున్న ప్రాంతంలోని స్టేషన్‌కు తరలిస్తున్నారు. అక్కడ జనసేన కార్యకర్తలు వెంటాడి వేటాడి కొడుతున్నారు. ఇది మీకు హీరోయిజం కింద కనిపిస్తుందా?. గత ఐదేళ్లలో తాను మాట్లాడిన నీతి కబుర్లు పవన్‌కు గుర్తులేవా?.మచిలీపట్నంలో రావణ్ కు బెయిల్.. మళ్లీ మరో కేసులో అరెస్ట్రావణ్ పై అనకాపల్లి జిల్లా పాయకాపురంలోకూడా కేసు నమోదవ్వగా అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు.వరుసగా 4 అరెస్ట్ లు మూడు బెయిల్ తో సాగుతున్న రావణ్ పరిస్థితి pic.twitter.com/88BW8b6dbd— greatandhra (@greatandhranews) July 3, 2026పవన్ సుద్ధ పూస కబుర్లు చెబుతున్నాడు. కసబ్‌కి కూడా పదేళ్ల తర్వాతే ఉరిశిక్ష వేశారు. జనసేన కార్యకర్తలను అదుపు చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్‌కు లేదా?. అధికారంలో ఉన్నామని విర్రవీగితే ప్రజాస్వామ్యంలో తొక్కి నార తీస్తారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని సీఎం, డిప్యూటీ సీఎంను కోరుతున్నాను. 2029లో ప్రభుత్వం మారి ప్రతిపక్షంలోకి వెళితే తూర్పుకు తిరిగి దండం పెట్టడమే’ అంటూ హెచ్చరించారు. -
పవన్ గుట్టు రట్టు.. రావణ్ పై దాడికి ప్లాన్.. జనసేన నేత ఆడియో లీక్
-
హోంమంత్రి అనిత శాఖలో పవన్ కల్యాణ్ జోక్యం
సాక్షి, విజయవాడ: ఏపీ మంత్రుల తీరు విడ్డూరంగా మారింది. హోంమంత్రి అనిత శాఖలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ఈగల్ చీఫ్ రవికృష్ణ భేటీ అయ్యారు. రెండు రోజుల కిందటే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా కేసులు పెట్టించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ డిప్యూటీ సీఎంతో ఐజీ రవికృష్ణ సమావేశమయ్యారు.వేరే శాఖ మంత్రికి నివేదిక ఇవ్వడంపై పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. హోంమంత్రి అనితను డమ్మీని చేసేశారంటూ చర్చ నడుస్తోంది. ఇటీవలే హోంశాఖ తన దగ్గర లేదంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు తర్వాత సోషల్ మీడియా కేసుల కోసం వింగ్ ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ శాఖలో పవన్.. హోంశాఖ వింగ్ ఏర్పాటు చేశారు. మంత్రుల పంచాయితీపై అధికారుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. -
తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన
-
చేతులెత్తేసిన పోలీసులు.. స్టేషన్లోకి దూసకెళ్లిన జనసేన కార్యకర్తలు
సాక్షి,కృష్ణా: మచిలీపట్నంలోని ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన జనసేన కార్యకర్తలు ఏకంగా పోలీస్ స్టేషన్లోకి చొరబడి రావణ్‌పై దాడికి యత్నించడం తీవ్ర కలకలం రేపింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని స్టేషన్ పైకే దూసుకొచ్చిన జనసేన శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.సాధారణంగా పోలీస్ స్టేషన్ పై దాడి జరిగితే ఉక్కుపాదంతో అణచివేయాల్సిన ఖాకీలు, ఇక్కడ మాత్రం పూర్తిగా 'లైట్' తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టేషన్లోకి దూసుకెళ్లిన జనసేన కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోకుండా, పోలీసులు అత్యంత సున్నితంగా వ్యవహరించడం వెనుక అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.లాఠీఛార్జ్ చేయకుండా, కేవలం రోప్‌లతో సర్దిచెప్పే ప్రయత్నం చేయడం పోలీసుల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చింది.సొంత పార్టీ నేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారంలో ఉన్నారనే ధీమాతోనే కార్యకర్తలు ఇంతలా రెచ్చిపోయారని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసుల హెచ్చరికలను, బారికేడ్లను సైతం లెక్కచేయకుండా స్టేషన్ వైపు దూసుకొచ్చినా ఖాకీలు మౌనప్రేక్షకులుగా ఉండిపోవడం శాంతిభద్రతల క్షీణతకు అద్దం పడుతోంది. అధికార పక్షానికి చెందిన వారైతే చట్టం చుట్టంగా మారిపోతుందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, ఆ ప్రాంతమంతా రణరంగంగా మారడానికి పోలీసుల అలసత్వమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అరవ శ్రీధర్‌పై చర్యలు ఏమయ్యాయో?
రైల్వేకోడూరు అర్బన్: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేశాడన్న ఆరోపణల నేపథ్యంలో అరవ శ్రీధర్ ఎటువంటి అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని జనసేన పార్టీ అధిష్టానం ఆదేశించింది. తరువాత ఎమ్మెల్యేపై ఆరోపణలను దర్యాప్తు చేయడానికి ముగ్గురితో కూడిన కమిటీని ఏర్పాటుచేసింది. నిర్ణయం తీసుకునేంతవరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆయనకు స్వయంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. అయితే గురువారం ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లిలో జరిగిన విబీజీ రామ్‌జీ ప్రారంభ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలోనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని వేదికపై ప్రసంగించడం చూస్తుంటే మహిళా ఉద్యోగి కేసు మూలనపడిపోయిందని ప్రతి ఒక్కరూ చర్చించుకుటున్నారు. దీనిపై స్వయంగా అధినేత పవన్‌కళ్యాణ్ సమాధానం చెప్పాల్సి ఉందంటున్నారు. -
రావణ్ అరెస్ట్.. ప్రశ్నిస్తే కేసులా పవన్?: సుగాలి ప్రీతి తల్లి
సాక్షి, కర్నూలు: ఏపీలో కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సుగాలి ప్రీతి కేసు, కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తే రావణ్‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. సుగాలి ప్రీతి తల్లి సుగాలీ పార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్ల అవుతున్నా సుగాలి ప్రీతి కేసు విషయంలో నిందితుల పట్ల అరెస్టు, విచారణ చేయడం లేదు. ముద్దాయిలు విచ్చలవిడిగా తిరుగుతున్నా.. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రీతి కేసులో రెండు సంవత్సరాలుగా డిప్యూటీ సీఎం పవన్‌కు లేఖలు రాస్తున్నాం. కానీ ఎటువంటి సమాధానం లేదు. ఈ కేసు విషయమై డిప్యూటీ సీఎం పవన్‌ను ప్రశ్నించిన రావణ్‌పై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు.త్వరలో సుగాలి ప్రీతికి న్యాయం కోసం పవన్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి పోరాటం చేస్తాం.. ప్రశ్నిస్తాం. రావణ్‌పై అక్రమ కేసులు పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ ఎందుకు చూపించడం లేదు. ఎందుకు చొరవ తీసుకోవడం లేదు. అక్రమ అరెస్ట్, నిర్బంధంపై రావణ్‌కు మేము అండగా ఉంటాం. రావణ్‌కు ఎటువంటి హాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. -
అంతర్జాతీయ మేస్త్రి సంగం అధ్యక్షుడు చంద్రబాబు: అమర్నాథ్ సెటైర్లు
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆయన, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులకే ప్రస్తుత ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఏ చట్టం తీసుకొచ్చినా రాష్ట్ర ప్రజలందరికీ ఒకేలా ఉండాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. క్రెడిట్ చోరీలో చంద్రబాబు ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నారు. జేఎస్‌డ్ల్యూ స్టీల్ ప్లాంట్ కోసం 2022లోనే అన్ని అనుమతులు, రాయితీలు, నీటి సదుపాయం, రైల్వే కనెక్టివిటీ వంటి పనులు పూర్తయ్యాయి. అధికారం వచ్చి రెండేళ్లు గడిచినా వైఎస్ జగన్ తీసుకొచ్చిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారు. మేము తీసుకొచ్చిన పరిశ్రమలకే శంకుస్థాపన చేస్తే మీరు ఎప్పుడు పరిశ్రమలు తీసుకొస్తారు. ఉద్యోగాల కల్పన ఎప్పుడు చేస్తారు. జేఎస్డ్ల్యూకి కావాల్సిన అన్ని అనుమతులు రాయితీలకు జీవో ఇచ్చాం. సంస్థ ప్రారంభ సమయంలో ప్రభుత్వం మారింది.జిందాల్ సంస్థ రాష్ట్రంలో పెట్టాల్సిన పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు తరలిపోయేలా చేశారు. ఒక యాక్టర్‌ను వాడుకొని జిందాల్‌ను ఇబ్బందులకు గురి చేశారు. ఇద్దరు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. అంతర్జాతీయ మేస్త్రి సంగం అధ్యక్షుడు చంద్రబాబు. ఎటువంటి అనుమతులు, భూమి లేకుండా 2019లో చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపన చేశారు. రెండు సంవత్సరాలు పూర్తిగా వదిలేసి ఇప్పుడు మళ్ళీ తెరపైకి జేఎస్‌డ్ల్యూ స్టీల్‌ను తీసుకొచ్చారు. చంద్రబాబు శిలాఫలకాల ఏర్పాటుకు పెట్టింది పేరు. వేదిక ఏదైనా వైఎస్సార్సీపీని తిట్టడమే చంద్రబాబు లక్ష్యం. ప్రపంచ వేదిక అయినా జగన్నామస్మరణ చేస్తున్నారు..నా మాటలపై చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఏ సైకో చెప్పాడని చింతమనేని మా ప్రభుత్వంలో మంత్రిని అలా అన్నాడు. బాలకృష్ణ మహిళల కోసం ఏ సైకో గాడు చెప్తే మాట్లాడారు. కృష్ణ జిల్లాలో మహిళా ప్రజా ప్రతినిధిపై దాడి చేయమని ఏ సైకో చెప్పాడు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని అన్న సైకో ఎవడో అందరికీ తెలుసు. మహిళల పుట్టుక కోసం తప్పుగా మాట్లాడిన సైకోగాడు ఎవరో అందరికీ తెలుసు. టీడీపీ బీఎల్ఏలు ఓటర్ల ఇంటికి వెళ్తే ప్రజలు వారిని ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల నుంచి టీడీపీ బీఎల్ఓలు ఎన్యూమరేషన్‌కు వెళ్లడం లేదు. వెన్నుపోటు, ద్రోహనికి ఈ దేశంలో పేటెంట్ చంద్రబాబు. పిల్లనిచ్చిన మామకి, జన్మనిచ్చిన సీమకి.. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి బాబు..కోవిడ్ ఉన్నా.. మా ప్రభుత్వంలో మంచి ఆదాయాలు వచ్చాయి. మొదట సంవత్సరం ఈ ప్రభుత్వానికి మైనస్ మార్కులు వచ్చాయి. చదువు కొనుక్కోవచ్చు కాబట్టి లోకేష్ విదేశాల్లో చదివారు. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉండి కులాల కోసం మాట్లాడవచ్చా. చంద్రబాబు క్రెడిట్ చోరీ మానుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏ చట్టం తీసుకొచ్చినా రాష్ట్ర ప్రజలందరికీ ఒకేలా ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు. మంత్రులు వారి శాఖల కోసం తప్ప మిగిలిన అన్ని శాఖల కోసం మాట్లాడుతారు. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రి వర్గం అట్టర్ ఫెయిల్యూర్.. రాష్ట్ర చరిత్రలో ఇది ఫెయిల్యూర్ క్యాబినెట్ అని విమర్శించారు. -
TDP గూండాల కు లోకేష్ సపోర్ట్.. పవన్ చెప్పిందే నిజమైంది!
-
బెయిల్.. అరెస్ట్.. రిపీట్
తెలుగు యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. పవన్ కల్యాణ్‌ను దూషించాడని ఆరోపిస్తూ జనసేన నేతలు వరుస ఫిర్యాదులు చేస్తుండడంతో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కోర్టులు వరుసగా అతనికి బెయిల్ ఇస్తుండగా.. ఒక్కో కేసును తెర మీదకు తెస్తూ నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేస్తుండడం గమనార్హం. ఈ పరిణామంపై రాజకీయ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సర్పవరం పీఎస్ కేసులో.. యూట్యూబర్ రావణ్‌కు గురువారం రాత్రి కాకినాడ మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్‌పై బయటికొచ్చిన రావణ్‌ను కృష్ణాజిల్లా మచిలీపట్నం, గుడివాడ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తరలించారు. అంతకు ముందు.. బుధవారం రాత్రి కూడా ఇదే తరహా సీన్ రిపీట్ అయ్యింది. కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రశ్న రావణ్‌ను అరెస్టు చేయగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. రావణ్ ఏ తప్పు చేయలేదని.. ప్రశ్నించడమే అతను చేసిన నేరమా? అని కొందరు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.ఈ పరిణామాలపై రావణ్ తరఫున వాదనలు వినిపిస్తున్న జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ భగ్గుమన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి “అంతిమ దినం”లా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం అమల్లో ఉన్నా, దాని అమలుపై మరోసారి ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.పిఠాపురం మెజిస్ట్రేట్ వాదనలు విని రావణ్‌కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కేవలం ఐదు నిమిషాల్లోనే సర్పవరం పోలీస్ స్టేషన్లో మరో కేసు చూపిస్తూ మళ్లీ అరెస్ట్ చేయడం ఆందోళనకరమని ఆయన అన్నారు. కనీస సమాచారం కూడా కుటుంబానికి ఇవ్వకుండా అరెస్ట్ చేసి కాకినాడ కోర్టులో హాజరుపరిచారని ఆరోపించారు. మూడు గంటల పాటు వాదనలు విన్న తర్వాత కాకినాడ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని.. ఇది ప్రజాస్వామ్యంలో రెండవ విజయం అని ఆయన అభివర్ణించారు. అయితే బెయిల్ వచ్చినప్పటికీ మళ్లీ ఇతర కేసుల్లో అదుపులోకి తీసుకోవడం అన్యాయమని అన్నారు. రావణ్‌పై జరుగుతున్న చర్యలు రాజకీయ కక్షసాధింపుగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని నాయకులను గౌరవించాల్సిన అవసరం లేదని, చట్టాలు, రాజ్యాంగం శాశ్వతమని పోలీసులు గుర్తుంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35 కేసులు నమోదైనట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో జర్నలిస్టుల సంఘాలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై స్పందించకపోవడం పట్ల ఆయన ప్రశ్నించారు.రావణ్ ప్రయాణిస్తున్న వాహనంపై జనసేన శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశాయని.. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వ పెద్దలు ఖండించాలా? లేదా? అని ప్రశ్నించారు. తాను కూడా అవసరమైతే మళ్లీ మచిలీపట్నం వెళ్లి వాదనలు వినిపిస్తానని, ప్రభుత్వ చర్యలపై చివరివరకు పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని పేర్కొన్నారు.“నన్ను జైలుకు పంపితే అది ప్రభుత్వానికి ఎదురుదెబ్బలా మారుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను వెనక్కి తగ్గబోనని జడ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. -
అమలులోకి వీబీ జీ రామ్‌జీ పథకం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక వీబీ జీ రామ్ జీ పథకం ఏపీలో తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి నుంచి గురువారం ప్రారంభమైంది. తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవికా మిషన్’ ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చిందని కేంద్ర మంత్రి ప్రకటించారు. ముక్కవారిపల్లి గ్రామంలో రూ.4.55 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన మూడు పనులకు ముగ్గురు నేతలూ లాంఛనంగా శ్రీకారం చుట్టారు. సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రెయిన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను వీబీ జీ రామ్ జీ మిషన్ కింద తొలుత చేపట్టారు. ఈ పథకం కింద స్థానిక లబ్దిదారులకు కేంద్రమంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం కలిసి వీబీజీ రామ్ జీ జాబ్‌కార్డులను అందజేశారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ వీబీ జీ రామ్ జీ ప్రోత్సాహక గీతాన్ని ఆవిష్కరించారు. ఈ పథకం కింద సమాచార బుక్లెట్, కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్‌ను డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ విడుదల చేశారు. వీబీజీ రామ్ జీ పోర్టల్‌ను నేతలు ప్రారంభించారు. అనంతరం శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఏపీకి నేను మేనమామను.. దేశంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకే వీబీజీ రామ్ జీ కింద రూ.7.5 లక్షల కోట్లు వ్యయంచేయాలని నిర్ణయించాం. ఈ తొమ్మిది నెలల కాలానికి ఈ పథకం కింద ఏపీకి కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు విడుదల చేస్తాం. నన్ను మధ్యప్రదేశ్‌లో అంతా మామాజీ అని పిలుస్తారు.. ఇప్పుడు ఏపీకి కూడా నేను మేనమామనే అయ్యా. ఏ మేనమామ ఖాళీ చేతులతో రాడు. ఏపీకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి రూ.422 కోట్ల నిధులు ఇస్తాం. అలాగే, 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద కేంద్రం కొనుగోలు చేస్తుంది. అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు.. సీఎం చంద్రబాబు, పవన్ మాట్లాడుతూ.. ‘వీబీ జి రామ్‌జీ పథకం రాష్ట్రం నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం చారిత్రాత్మకం. గతంలో ‘నరేగా’ కూడా రాయలసీమ నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు కూడా వీబీజీ రామ్ జీ పథకం ఇక్కడి నుంచే ఆవిష్కృతమైంది. ఈ పథకంతో గ్రామాల రూపురేఖలు మారతాయి. పొలాలకు వెళ్లే డొంక రోడ్లు ఈ పథకం కింద నిర్మించవచ్చు. గాలేరు–నగరి నుంచి కోడూరుకు నీళ్లు తీసుకొస్తాం. ఇక అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అడిగిన వెంటనే సమస్యల్ని పరిష్కరించారు. ఆయనకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం. కేంద్ర నిధుల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉంది.’ అని చెప్పారు. -
ఎమ్మెల్యే పులివర్తి నానిపై పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి కూటమిలో విభేదాలు ముదిరాయి. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని అక్రమాలపై డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్‌కు జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ చేస్తూ.. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. పులివర్తి నాని భారీగా కమీషన్లు తీసుకుంటూ అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ మనోహర్ ఫిర్యాదు చేశారు.కాగా, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు అంతే లేకుండాపోతోంది. అవినీతి, అక్రమాలతో పాటు కనిపించిన భూమినల్లా ఆక్రమిస్తూ సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్న పచ్చ మూకలు ఇప్పుడు న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడం విస్తుగొలుపుతోంది. తెలుగుదేశం పార్టీ నేతల్లోనే ఆక్రమణలకు, అవినీతికి, దౌర్జన్యాలకు మారుపేరుగా మారిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని ఓ విశ్రాంత జిల్లా జడ్జిని అత్యంత జుగుప్సాకరంగా బూతులు తిడుతూ, అంతు చూస్తానంటూ బెదిరించడంపై న్యాయ వర్గాలు మండి పడుతున్నాయి.గౌరవ ప్రదమైన జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన న్యాయాధికారిని ఈ విధంగా బూతులు తిడుతూ మాట్లాడటంపై అటు విశ్రాంత న్యాయాధికారులు, ఇటు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాని భూ ఆక్రమణలను ప్రశ్నించినందుకు రిటైర్డ్ జడ్జిని బూతులు తిడుతూ బెదిరించడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
ప్రశ్న రావణ్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు.. పవన్ కు బిగ్ షాక్
-
మిస్టర్ పవన్.. CBN ఇదే మీకు రిపీట్ అవుద్ది..నిప్పులు చెరిగిన EXIAS
-
జనసేన నాయకులు ఓవర్ యాక్షన్.. ప్రశ్న రావణ్ పై కోడిగుడ్లతో దాడి...
-
రెచ్చగొట్టద్దు.. బాబు పవన్ కు మాస్ వార్నింగ్
-
పవన్ కుమార్తెపై చంద్రబాబు కామెంట్స్
-
పాదరక్షలతో జనసేన ఎమ్మెల్యే దీక్ష?
తూర్పు గోదావరి జిల్లా: సనాతన ధర్మం గురించి జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఊగిపోతూ స్పీచులిస్తూంటారు. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడంపై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. వివరాలివీ.. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాదరక్షలు ధరించి చండీ దీక్షలో ఉండటం సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. రాజానగరం మండలం దివాన్ చెరువులో బుధవారం జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీలో పార్టీ శ్రేణులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల పాల్గొన్నారు. అయితే, ఆ సమయంలో ఆయన పాదరక్షలు ధరించి ఉండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దేవాలయాలకు వెళ్లిన సమయంలో పలు విమర్శలు గుప్పించే కూటమి నేతలు హిందూ ధర్మాన్ని కించపరిచేలా ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. -
డైరెక్టర్ మెహర్ రమేశ్ కూతురి రిసెప్షన్.. టాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)
-
‘రావణ్‌కు ఏం జరిగినా పవన్‌దే బాధ్యత’
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రశ్న రావణ్‌కు పిఠాపురం మెజిస్ట్రేట్ వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే ఆయనను పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేశారు. 2025లో నమోదైన మరో కేసుకు సంబంధించి సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకుని పిఠాపురం నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ..‘రావణ్ కేసులో న్యాయం గెలిచిన రోజు ఇది. సోషల్ మీడియా కేసుల్లో ముందస్తు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరైంది కాదని భావించిన మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. అయితే బెయిల్‌పై విడుదలైన వెంటనే మరో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజ్యాంగబద్ధం కాదు. ఇది వ్యక్తిగత ప్రాథమిక హక్కులను హరించడమేనని అవుతుంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామ కృష్ణంరాజు నా బాడీ షేమింగ్ చేస్తూ అహేళనగా మాట్లాడారు.. దానికి చట్టం లేదు?. కాళ్లకు కాళ్ళు.. కీళ్లకు కీళ్లు విరగొడతామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను నా కొడకల్లారా అని పవన్ కళ్యాణ్ మాట్లాడితే అది రాజ్యాంగబద్దమా?.పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రిని దుర్భాషలాడితే న్యాయబద్దమా? వాటిమీద కేసులు ఉండవా?. రఘురామ కృష్ణంరాజుకు రాజకీయ సమాధి కడతానంటే తప్పా? నా మీద కేసు కడతారా?. మీ కేసులకు భయపడేది లేదు. టైమ్ మీది కొట్టారు.. టైమ్ మాకు వస్తుంది. మేము కొడితే ఈ ప్రభుత్వానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడటం ఖాయం. రావణ్ కోసం మళ్ళీ రేపు కోర్టులో వాదనలు వినిపిస్తా. రావణ్‌కు ఏం జరిగినా ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలి. సోషల్ మీడియా కేసుల్లో ముందుగా టీడీపీ, జనసేన నేతలను కంట్రోల్ చెయ్యమని సీఎం, డిప్యూటీ సీఎంను కోరుతున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అంతకంటే ముందు పిఠాపురం పోలీసులకు షాక్ తగిలింది. ప్రశ్న రావణ్ రిమాండ్‌ను మెజిస్ట్రేట్ రిజెక్ట్ చేశారు. దీంతో, వ్యక్తిగత పూచికతుపై రావణ్ విడుదలయ్యారు. ఈ క్రమంలో రావణ్ తరపున వాదనలు జడ శ్రవణ్ కుమార్ వినిపించారు. అనంతరం, విడుదలైన వెంటనే పోలీసులు.. 2025లో నమోదైన మరో కేసుకు సంబంధించి సర్పవరం పోలీసులు రావణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
అరెస్టులతో వెంట్రుక కూడా పీకలేవ్ ఈడ్చి తంతే హైదరాబాద్ లో పడతావ్ జాగ్రత్త
-
దీక్షలోనూ రాజకీయాలేనా? పవన్ సత్యనిష్ఠపై ప్రశ్నలు
సాధారణంగా ఏ మతంలో అయినా కొన్ని పవిత్ర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అత్యంత నిష్ఠతో ఉండడానికి ప్రయత్నిస్తారు. అందులోనూ హిందూ మతంలో ఈ ధర్మాలు మరీ ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా రాజకీయాలకు దూరంగా ఉండడం, దీక్షను కడు శ్రద్ధతో నిర్వహించడం, అబద్ధాలు చెప్పకుండా ఉండడం, ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండడం వంటి వాటిని ఆచరిస్తుంటారు. కానీ, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీక్ష తీసుకున్నా, లేత పసుపురంగు లుంగీ, పైన కండువా వేసుకుని పూజాధికాలు చేసిన తర్వాత కూడా రాజకీయ ప్రకటనలు చేయడం, అందులోనూ అసత్య వచనాలకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు కనిపిస్తుండడం భక్తుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతుంది. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ దీక్ష తీసుకున్నారు. ఈ వస్త్రధారణలో ఆయన ఏటా నాలుగు నెలలపాటు ఈ దీక్ష చేపడుతుంటారట.. మంచిదే. అది ఆయన నమ్మకం, విశ్వాసం, దైవభక్తికి సంబంధించిన అంశంగా బావించవచ్చు. దీక్షలు తీసుకున్నవారు చాలా పవిత్రంగా ఉండడానికి యత్నిస్తారు. ఉదాహరణకు అయ్యప్ప దీక్ష చేసేవారు నల్ల దుస్తులు ధరించి, ఇరుముడి సహా రకరకాల సంప్రదాయాలు పాటిస్తారు. కేవలం శాఖాహారమే భుజిస్తారు. మద్యం వంటివాటిని స్వీకరించరు. కొందరు కాలినడకన శబరిమలైకి వెళతారు. విజయవాడ కనకదుర్గమ్మ భక్తులు భవానీ దీక్షను తీసుకుని అన్ని నియమాలను పాటిస్తారు. చాలామంది కాలి నడకన సుదూర ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చి దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. శైవభక్తులు కూడా పాదయాత్రలు చేసుకుంటూ శ్రీశైలం వెళ్లి పూజలు చేసి దీక్షను విరమిస్తారు. హిందూ మతంలోనే కాదు.. ఇతర మతాలలో కూడా ఇలాంటి ఆచారాలు ఉంటాయి. తనకు తానుగా అన్ అపాలిజిటిక్ హిందూ అని, సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తినని ప్రకటించుకున్న పవన్ కల్యాణ్ కూడా ఇదే తరహాలో నిబద్దతతో ఉంటారని మత విశ్వాసకులు భావిస్తారు. పవన్ కల్యాణ్ దీక్ష ఆరంభించిన తర్వాత జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. దీనిని కూడా ఆక్షేపించనక్కర్లేదు. ఆయన పార్టీ అధినేత కనుక కొన్ని తప్పవని అనుకోవచ్చు. అయితే, ఆ సందర్భంలో ఆయన చేసే ఉపన్యాసంలో సత్యనిష్ఠత, నిబద్ధత , నిజాయితీ కొరవడితే అక్కడ ఉన్న సభికులకే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు ఒక తప్పుడు సంకేతం వెళ్లదా? ఆయన విమర్శకులు వీటిని ప్రస్తావించరా?అందుకే వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టి కూడా అబద్ధాలు చెప్పడం దురుదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆయన ఏమి మాట్లాడారు? అధికారం కోసం కులాలతో రాజకీయ క్రీడ ఆడుతున్నారని ఆయన వైసీపీపై విమర్శ చేశారు. కాపులను బూతులు తిట్టేవాళ్లుగా, క్రిమినల్స్ గా ప్రొజెక్టు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇందులోనే కులతత్వం కనబడుతోందన్న సంగతి ఆయన గుర్తించలేకపోయారు. ప్రత్యేకించి ఒక కులం గురించి వైసీపీ నేతలు ఎవరైనా విమర్శ చేసి ఉంటే దానిని ప్రస్తావించి చెప్పాలి కదా! అదేమీ లేకుండా జనరల్ గా మాట్లాడుతున్నారంటే ఆయనలో నిబద్ధత లేదనిపించదా! కాపులను క్రిమినల్స్ గా ఎవరూ చూపించలేదు. కాకినాడ సభలో గాదె సాయికృష్ణ గురించి మాట్లాడుతూ రౌడీ అని ఆరోపించింది ఆయనే. అలాగే మరో సభలో సాయికృష్ణపై పోక్సో కేసు ఉందని చెప్పింది పవన్ కల్యాణే. అది తప్పుడు కేసు అని, దానిని కోర్టు కొట్టేసిందని అతని మరదలే చెబుతున్నా, ఆ కేసు గురించి ప్రచారం చేసింది ఆయనే కదా! ఇక్కడ ఒక విషయం కనిపిస్తుంది. సాయికృష్ణ పేద కాపు. అతను తప్పు చేస్తే శిక్షార్హుడు. అదే సీఐ నాగరాజు ధనిక కాపు కనుక, పోలీసు అధికారి కనుక ఆయన ఎంత ఘోరం చేసినా సమర్ధిస్తారా? అసలు లాకప్ హత్యలపై పవన్ కు ఒక విధానం ఉందా? అన్నది చర్చనీయాంశం. అంతే తప్ప ఇక్కడ కులం కోణం ఏమీ లేదు. జగన్ టైమ్ లో ఎన్నిసార్లు కులం కోణంలో చంద్రబాబు, పవన్ ఆరోపణలు చేశారో రికార్డులు చూస్తే తెలుస్తుంది. వైసీపీ వారు కాపు నాయకులతో తనను తిట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజానికి కాకినాడలో వైసీపీ నేతలను గూండాలు, రౌడీలు, తొక్కి నార తీస్తా అంటూ అనుచిత భాష వాడిందే పవన్ కల్యాణ్. గతంలో వైసీపీ నేతలను ఉద్దేశించి అసభ్య భాష వాడిన విషయం, చెప్పు చూపించిన ఘటనలను ఆయన మర్చిపోయి ఉండవచ్చు. కాకినాడ స్పీచ్ తర్వాత మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ,అంబటి రాంబాబు, కన్నబాబు, త్రిమూర్తులు తదితరులు దానికి జవాబు ఇచ్చి పవన్ కల్యాణ్ గతంలో కులం పేరుతో ఎలా రాజకీయం చేసింది సోదాహరణంగా వివరించారు.అయినా అచ్చం చంద్రబాబు స్టైల్ లోనే పవన్ కల్యాణ్ ఎదుటివారిపై బురద వేయడానికి యత్నించారు. అంతేకాదు..కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దుర్భాషలాడితే దానిని నిర్ ద్వంద్వంగా ఖండించి ఉంటే పవన్ కు మంచి పేరు వచ్చేది. అలాకాకుండా తాను ప్రోత్సహించను అంటూనే గత కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఇంతకన్నా అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. మాజీ మంత్రి కన్నబాబు ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మాజీ జర్నలిస్టు కూడా. ఆయన ఎప్పుడూ అపసవ్య భాష వాడరు. అయినా పవన్ ఆరోపణ చేయడం అంటే ఏదో రకంగా తన ఎమ్మెల్యే చేసిన తప్పును కప్పిపుచ్చుకునే యత్నమే కదా! తాను కుల రాజకీయాలు చేయలేదని ఆయన అంటున్నారు. ఇకపై కుల రాజకీయం చేయబోనని చెప్పి ఉంటే గౌరవంగా ఉండేది. అలా కాకుండా అసలు కులం గురించి తానెప్పుడు మాట్లాడనట్లు ఉపన్యాసం చెబితే వినే జనం చెవిలో పూలు పెట్టడమే కదా! ఆయన ఎన్నికల సమయంలో కాపులను ఎలా ఓట్లు అడిగింది, తనకు కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలు మద్దతు ఇస్తే ముఖ్యమంత్రి అయి చూపిస్తానని చెప్పిన సంగతులు, ఆంధ్ర భావన లేకపోతే మానే.. కుల భావన అయినా తెచ్చుకోవాలని కోరిన విషయాలన్నీ వీడియోల రూపంలో ప్రత్యక్షం అయ్యాయి. మరో వైపు బీసీ కులాలైనా, కాపులైనా ఎవరో అధికారం ఇవ్వాలని కోరుకూడదు, 50 శాతంగా వారు.. వేరే వాళ్లను అధికారం కోసం అడగడం ఏమిటి అని, కలిసి ఉంటే అధికారం వస్తుందని ఆయన సెలవిచ్చారు. మరి దానికి కట్టుబడి ఉండి ఆ దిశలో ప్రయయత్నించకుండా తెలుగుదేశంతో ఎందుకు కలిసి ప్రయాణం చేస్తున్నారని ఎవరైనా అడిగితే ఏం జవాబు ఇస్తారు. తెలుగుదేశంలో ఎవరి ఆధిపత్యం ఉన్నది ఆయనకు తెలియదా? కులం గురించి ఆలోచించే వ్యక్తిని అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి ఎందుకు వస్తారని పవన్ కల్యాణ్ అమాయకంగా ప్రశ్నించినా, కూటమి ప్రభుత్వ కక్ష, వేధింపుల నుంచి తప్పించుకోవడానికి ఆ పార్టీలో చేరింది అందరికి తెలుసు! మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. సంక్షేమ పథకాలతోనే అదికారం రాదని ఆయన అంటున్నారు. అలాంటప్పుడు ఆచరణ సాధ్యంకాని సంక్షేమ స్కీములను చంద్రబాబుతో కలిసి ఎందుకు ప్రకటించారో వివరించగలుగుతారా?వలంటీర్ల పొట్ట కొట్టేవాడిని కానని, వారికి ఐదువేలు కాదు.. పదివేలు ఇస్తామని హామీ ఇచ్చి ఎగవేయడం గురించి ఏమంటారు? వీటి సంగతి పక్కనబెడితే ఆధ్యాత్మిక వస్త్ర ధారణలో ఉన్నప్పుడైనా పవన్ కల్యాణ్ నిష్ఠతో, సత్యవచనాలకు కట్టుబడి ఉంటే మంచిది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
శవం ఇవ్వం.. బూడిద ఇవ్వం.. దమ్ముంటే అధికారిక ప్రకటన చేయండి!
-
తెర వెనుక అసలు కథ ఇదన్నమాట!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసే వ్యూహాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వీటిపై ఎవరైనా పీహెచ్డీ చేస్తే కచ్చితంగా డాక్టరేట్ వస్తుందేమో! కొందరు విశ్లేషకులు చంద్రబాబువి వ్యూహాలు అంటారు.. మరికొందరు కుట్రలు అంటారు. ఆ వ్యూహాలలో ఎటు తిరిగి తనకే రాజకీయ ప్రయోజనం కలిగేలా జాగ్రత్తపడుతుంటారు. ఆయనకు బాండ్ బాజా వాయించే ఎల్లో మీడియా ఎటూ ఉంటుంది. సాయికృష్ణ కుటుంబాన్ని మేనేజ్ చేయడానికి చంద్రబాబు ఆడిన గేమ్ కాని, తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఆయన చేసిన కామెంట్లు కాని గమనిస్తే ఈ విషయం అర్దం అవుతుంది.అలాగే ఈ ఉదంతంలో చర్చ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు నడిచేలా కథ ఎలా సాగించారో విశ్లేషించడం కూడా ఆసక్తికరమే. సాయికృష్ణ కేసులో సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజు అరెస్టును కొన్ని రోజుల పాటు జాప్యం చేయడం, దర్యాప్తులో కీలకమైన అంశాలు రాకుండా జాగ్రత్తపడడం కనిపిస్తుంది. అన్నిటిని మించి నాగరాజుతో ప్రభుత్వ పెద్దలు ఒక డీల్ కుదుర్చుకుని కూటమి పెద్దల పేర్లు, పోలీస్ ఉన్నతాధికారుల పేర్లు బయటకు రాకుండా చూడడానికి జరుగుతున్న ప్రయత్నాలు జరిగాయని వైఎస్సార్సీపీ ఆరోపించింది. న్యాయం అన్నది అధికారం, పలుకుబడిని పట్టి ఉంటుందని కూటమి ప్రభుత్వం పలుమార్లు రుజువు చేస్తున్నట్లు అనిపిస్తుంది.కాపు యువకుడు సాయికృష్ణ పోలీసుల హింస కారణంగా మరణించిన ఘటనలో చంద్రబాబు తెలివిగా చర్చను ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు తిప్పారనిపిస్తుంది. అదేదో జనసేనకు, వైఎస్సార్సీపీకి మధ్య వివాదం అన్నట్లుగా ప్రచారం జరగాలని ఆయన కోరుకుంటున్నట్లుగా ఉంది. ఆ సంగతి అర్థం అవుతున్నా, పవన్ కళ్యాణ్ నిస్సహాయంగా ఆ ట్రాప్‌లో నుంచి బయటపడలేకపోతున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. సాయికృష్ణ కేసు అన్నది నిజానికి కులానికి సంబంధించిన సమస్య కాదు. ఏపీలో జరుగుతున్న పోలీసుల రాక్షస కృత్యాలకు, చట్టాలు, రాజ్యాంగంతో నిమిత్తం లేకుండా సాగుతున్న రెడ్‌బుక్ అరాచకాలకు సంబంధించిన అంశం. మానవహక్కులను కాలరాస్తున్న ప్రభుత్వంపై ప్రజలలో వస్తున్న తీవ్ర వ్యతిరేకత. వీటన్నిటిని కప్పిపుచ్చి రాజకీయ కోణంలో కేసును మలుపు తిప్పి పవన్ కళ్యాణ్‌ను అడ్డం పెట్టుకుని కథ నడపాలని చంద్రబాబు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది.ఈ ప్రక్రియలో రాజకీయ లబ్ది జరిగితే తనకు, అప్రతిష్ట వస్తే అది పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లేలా వ్యూహాం పన్నారా అన్న అభిప్రాయాన్ని కొంతమంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇలాగే సాగితే పవన్ కళ్యాణ్ ఒక బకరా అయ్యే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సాయికృష్ణ కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, వారు కొందరు కాపు నేతలను ఆశ్రయించడం తదితర అంశాల వల్ల, కులం కోణం కూడా సహజంగానే వస్తుంది. అది ఎవరూ కాదనలేని సత్యం.విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కుల రాజకీయాలే కాదు.. మత రాజకీయాలు కూడా చేసి ప్రజలను ఎంత రెచ్చగొట్టాలో అంతా చేశారన్నది నిర్వివాదాంశం. సాయికృష్ణ కేసులో తప్పని స్థితిలో సీఐ నాగరాజును అరెస్టు చేయవలసివచ్చిందన్నది బహిరంగ రహస్యం. ఈ కేసులో సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని వచ్చి హింసకు శ్రీకారం చుట్టారు. దానిని నాగరాజు కొనసాగించారన్నది అభియోగం.ఆ టాస్క్ ఫోర్స్ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆధీనంలో ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇతర పెద్దలకు సన్నిహితుడన్న పేరు ఉంది. ఆయనను కాపాడుకోకపోతే, ఆ కేసు ఆ పై అధికారులు, తదుపరి ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్నవారికి కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. దాంతో సీఐ నాగరాజును పూర్తిగా మేనేజ్ చేసిన తర్వాతే, సిసిటీవీ ఫుటేజి మాయం అయ్యాకే కేసును ముందుకు తీసుకు వెళ్లే విధంగా ప్లాన్ చేసి ఉంటారన్నది జై భీమ్ అధ్యక్షులు జడ శ్రవణ్ తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల అభిప్రాయంగా ఉంది. అందులో వాస్తవం ఉండే అవకాశం కనిపిస్తుంది.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుల ప్రస్తావన లేకుండా, మానవ హక్కుల కోణంలో సాయి కుటుంబాన్ని పరామర్శించినా తొలుత విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేయించారు. అయినా పరిస్థితి చేయి జారిపోతోందని భయపడి స్వయంగా చంద్రబాబే కుటుంబాన్ని తనవద్దకు పిలిపించుకుని రాయబారం చేశారు. అక్కడ ఏమి జరిగిందో కాని ఆ కుటుంబం స్వరం మార్చేసింది. ఇది ఒక కోణం అయితే క్యాబినెట్ సమావేశంలో యధాప్రకారం క్రిమినల్స్‌కు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తోందని చంద్రబాబు అన్నారని ఎల్లో మీడియా రాసింది. అది నిజమే అయితే, ఆ క్రిమినల్ కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు పరామర్శించారు? విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆ కుటుంబంతో ఎందుకు మాట్లాడి ఓదార్పు మాటలు చెప్పారు. జనసేన నేత ఒకరు డబ్బు ఆఫర్ ఎందుకు ఇచ్చారు? ఇవేవి ప్రస్తావనకు రాకుండా చంద్రబాబు మాట్లాడతారు. ఇది ఇలా ఉంటే కాకినాడలో పవన్ కళ్యాణ్ తలాతోక లేకుండా వైఎస్సార్‌సీపీవారిని దూషించి రెచ్చగొట్టడం చంద్రబాబు ప్లాన్‌లో భాగమేనన్నది ఎక్కువ మంది అభిప్రాయం.రౌడీ షీటర్ చనిపోతే ఏమిటన్నట్లు పవన్ మాట్లాడడం ఎంత దారుణంగా ఉంది. అతను కాపు కులం వాడైతే మాత్రం అని ఆయన భావిస్తున్న తీరు పద్ధతిగా ఉందా? సీఐ నాగరాజు లేదా, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఒక వ్యక్తి చచ్చేలా హింసించడం నేరం కాదని చట్టబద్దమైన పదవులలో ఉన్న చంద్రబాబు, పవన్‌లు చెప్పదలిచారా? లేక సాయికృష్ణ పేదవాడు కనుక, అతనికి అండ లేదు కనుక, కేవలం జనసేనలో ఒక సామాన్య కార్యకర్త కనుక పట్టించుకోనవసరం లేదనుకున్నారా! అదే సీఐ కూడా కాపు వ్యక్తి అయినా, బాగా డబ్బు ఉన్న వ్యక్తి అవడం, అతని మేనమామ ఒక మాజీ డీజీపీ కావడం వల్ల అతనికి పవన్ అండగా నిలబడుతున్నారా అన్న విమర్శ రాదా? సాయిపై కేసులు ఉంటే, మరి పోలీసులకు హత్యలు చేసే అధికారం ఉండదు కదా! అంటే వారు కూడా నేరం చేసినట్లే అవుతుంది కదా! ఆ ప్రస్తావన ఎందుకు క్యాబినెట్లో రాలేదు. తాను ఎందుకు సాయి కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడింది చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు?బాధిత సాయి కుటుంబంతో రాజీచేసుకుని, కేసులో నిందితుడుగా ఉన్న నాగరాజుతో కూడా డీల్ కుదుర్చుకోవడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందేమో! పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తుంటే స్పందించరేమిటని, కుల రాజకీయాలను తిప్పి కొట్టాలి కదా అని ఆయన అన్నారట. వైఎస్సార్సీపీ పవన్ కళ్యాణ్‌పై తొలుత ఏమీ మాట్లాడలేదు. చంద్రబాబు పైన, పోలీసు అధికారులపైన ఆరోపణలు చేసింది. దానికి జవాబుగా రౌడీలకు మద్దతు ఇస్తారా అని ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా రౌడీ కుటుంబంతో భేటీ అయ్యారు. దానిని ప్రస్తావంచకుండా పవన్ కళ్యాణ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు.కాకినాడలో పవన్ కళ్యాణ్ వైఎస్సార్‌సీపీవారిని ఉద్దేశించి గూండాలు, రౌడీలు అంటూ అనుచితంగా మాట్లాడారు. దానికి జవాబుగా టీడీపీ, జనసేనలలో ఉన్న రౌడీలు, గూండాల గురించి వివరాలను వైఎస్సార్సీపీ బయటపెట్టింది. టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిలో క్రిమినల్ కేసులు ఉన్నవారు 115 మంది అట. అందులో తీవ్రమైన అభియోగాలు ఉన్నవారి సంఖ్య 82. జనసేనలో 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే పది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో ఏడుగురిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను దాచేసి వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించాలన్నది చంద్రబాబు లక్ష్యం. కాని సోషల్ మీడియాలో అన్ని వివరాలు వెలుగులోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయాలపై మాత్రం టీడీపీ, జనసేనలు నోరు పెగల్చవు.ఈ కేసులో పవన్‌ను ఇరికించాలని జగన్ తన పార్టీ నేతలతో అన్నారని ఒక ఊహాగానాన్ని సృష్టించి దుష్ప్రచారం చేసిది. నిజానికి పవన్ పద్దతిగా వ్యవహరించకుండా చేసింది టీడీపీ, ఎల్లో మీడియానే కదా! ఒకప్పుడు పోలీసులు ఎలా నిందితులను కొడతారంటూ ప్రశ్నలు వేసిన పవన్‌తోనే, లాకప్ డెత్‌లకు బాధ్యులైన పోలీసులకు మద్దతుగా మాట్లాడించి ఆయన పరువు తీశారు. ఇక నాగరాజుపై అన్ని ఆరోపణలు వస్తే కొంతమంది ఆయనకు మద్దతు పలుకుతున్నారంటూ 'నాగరాజుకు జేజేలు' అన్న హెడింగ్ పెట్టి ఇలాంటి హత్యలను కూడా సమర్థించే దుస్థితిలోకి ఎల్లో మీడియా వెళ్లిందంటే వారికి ఉన్న ప్రయోజనం ఏమిటో జనం ఊహించుకోలేరా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
Big Question Full : అంతా ప్లాన్ ప్రకారమే నడుస్తోందా ?
-
గ్రేడ్–4, 5 సచివాలయ కార్యదర్శులకు వేధింపులు
సాక్షి, అనకాపల్లి: ఉమ్మడి విశాఖ జిల్లాలో పంచాయతీ సెక్రటరీల స్థానిక కేడర్ కేటాయింపుల ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. గ్రేడింగ్ విధానంలో దొర్లిన తీవ్ర అసమతుల్యతలు, జోనల్ విభజన లోపాల కారణంగా ఏజెన్సీలో ఉన్న సచివాలయ గ్రేడ్–5 కార్యదర్శులకు, మైదాన ప్రాంతంలో ఉన్న గ్రేడ్–4 కార్యదర్శులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. సీనియారిటీ ఉన్నప్పటికీ అల్లూరి, అనకాపల్లి జిల్లాలో దాదాపు 400 మంది పంచాయతీ సెక్రటరీలు తమ సొంత జిల్లాలకు శాశ్వతంగా దూరమై... స్థానికతను కోల్పోయి.. తమ కుటుంబాలకు వందల కిలోమీటర్ల దూరంలో నివసించాల్సిన పరిస్థితి తలెత్తింది. గ్రేడ్–4, గ్రేడ్–5లో సచివాలయ కార్యదర్శులు మాత్రమే ఉండడడంతో, తాజా వ్యవహారం వీరిపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగానే పరిగణించడం జరుగుతుందని సంబంధిత వర్గాలు విమర్శిస్తున్నాయి.అసలు సమస్య ఏమిటి?కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకారం స్థానిక కేడర్ కేటాయింపులు జరపాల్సిఉంది. అంటే ఉద్యోగి భవిష్యత్తులో ఏ జిల్లాలో, ఏ జోన్లో సేవ చేయాలో ఇప్పుడే నిర్ణయించడం జరుగుతుంది . ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఐదు గ్రేడ్లు (1,2,3,4,5) ఉన్నాయి. ఈ గ్రేడ్లకు అనుగుణంగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వం కొత్తగా 4 కేటగిరీలను ప్రతిపాదించింది. ఇందులో ఒకటి స్పెషల్ గ్రేడ్ (10,000 కంటే ఎక్కువ జనాభా లేదా రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న పంచాయతీలు)కాగా, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నాయి. మొదటి 4, 5 గ్రేడ్లను కొత్తగా తీసుకువచ్చి గ్రేడ్–3లో విలీనం చేయాలి. అయితే ఈ ప్రక్రియలో ముందుగా చేయాల్సిన.. గ్రామ పంచాయతీల రీ–కేటగిరైజేషన్ (నాలుగుగా) చేయకుండా, పాత గ్రేడింగ్ ఆధారంగానే (ఐదు గ్రేడింగ్‌ల ప్రాతిపదికనే) కేటాయింపులు జరుగుతున్నాయని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. దీనివల్ల లోకల్ క్యాడర్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ విషయంలో భారీ అసమానతలు వస్తున్నాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అనకాపల్లికి సంబంధించి 180 మంది, అల్లూరికి సంబంధించి 228 మంది.. మొత్తం 400 మంది పంచాయతీ సెక్రటరీలు దీనివల్ల తీవ్ర ప్రతికూల ప్రభావానికి గురవుతారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇంత జరుగుతున్నా.. డిప్యూటీ సీఎం, ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమకు న్యాయం చేయకుంటే ఉద్యమం తప్పదంటూ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. జోన్ల విధానంతో పరస్పర బదిలీలకూ సమస్యఉమ్మడి విశాఖ జిల్లా విడిపోయి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా మారాయి. కానీ గ్రేడింగ్ తగిన విధంగా జరగలేదు. ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లాకు చెందిన ఉద్యోగులు అనకాపల్లిలో పనిచేస్తున్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన ఉద్యోగులు అల్లూరిలో పనిచేస్తున్నారు. రీ–కేటగిరైజేషన్ లేకుండా లోకల్ కేడర్ ఫిక్స్ చేస్తే ఈ పోస్టింగులే శాశ్వతం అవుతాయన్నది సంబంధిత 400 మంది పంచాయతీ కార్యదర్శుల ఆవేదన. ఇక రెండు ప్రాంతాలూ వేర్వేరు జోనల్ పరిధిలోకి చేరడం వల్ల పరస్పర బదిలీలూ కష్టతరమవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జోన్–1లో విశాఖ, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం ఉండగా, జోన్–2లోకి అల్లూరి, తూర్పుగోదావరి, పోలవరం ప్రాంతం ఉండడం గమనార్హం. పైగా గతంలో గిరిజన ప్రాంతంలో 2 సంవత్సరాలు పనిచేస్తే తిరిగి మైదాన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు లోకల్ కేడర్ ఫిక్స్ అయితే.. చాలామంది ఉద్యోగ జీవితమంతా ఏజెన్సీ ప్రాంతంలోనే ఉండాల్సి రావచ్చని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.జూలై 5 వరకూ గడువిచ్చినా.. ప్రయోజనమేది?ప్రభుత్వ జీవో ప్రకారం ముందుగా గ్రామ పంచాయతీలను కొత్త గ్రేడ్లలోనికి మార్చాలి. తర్వాత పోస్టులను తిరిగి వర్గీకరించాలి. అనంతరం స్థానిక కేడర్‌కి కేటాయించాలి. అయితే ఈ మూడు దశల్లో మొదటి దశ పూర్తి కాకుండానే మూడో దశకు ప్రభుత్వం వెళ్లిందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. నిజానికి ఉద్యోగ సంఘాల ఒత్తిడితో ఆప్షన్లు నమోదు చేసే గడువును జూలై 5 వరకు పెంచడం జరిగింది. అయితే అసలు సమస్య.. రీ–కేటగిరైజేషన్, జోన్లకు సంబంధించిన లోపాలు, గ్రేడింగ్ అసమానతలు సరిచేయకుండా.. ఆప్షన్ల ఎంపికకు గడువు పొడిగించినా ప్రయోజనం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు– ముందుగా గ్రామ పంచాయతీల రీ–కేటగిరైజేషన్ పూర్తి చేయాలి. – పాత గ్రేడింగ్ ఆధారంగా లోకల్ కేడర్‌ను ఖరారు చేయకూడదు.– జోనల్ విభజనలోని లోపాలను తొలుత సవరించాలి.– ఉద్యోగులు తమ సొంత జిల్లాల్లో పనిచేసేలా అవకాశం కల్పించాలి.– తుది స్థానిక కేడర్ కేటాయింపులను.. రీ–కేటగిరైజేషన్ తర్వాత మాత్రమే చేపట్టాలి.– ముందుగా రీ–కేటగిరైజేషన్ చేస్తే పాత గ్రేడ్–4, గ్రేడ్–5 మధ్య ఉన్న అసమానత తొలగిపోతుంది. వీటిలోని అందరూ కొత్తగా గ్రేడ్–3 లోకి వస్తారు. – దీంతో పోస్టుల పంపిణీ సమానంగా జరిగి లోకల్ కేడర్ కేటాయింపులు మరింత న్యాయంగా జరిగే అవకాశం ఉంటుంది.– జిల్లాల మధ్య సమతుల్యత ఏర్పడి ఆయా ఉద్యోగులు సొంత జిల్లాలకు వెళ్లే అవకాశాలు పెరుగుతాయి. -
పవన్ వస్తే ఏదో జరుగుతుందనుకున్నాం
పిఠాపురం రూరల్: పవన్ కళ్యాణ్ వస్తే ఏదో జరుగుతుందనుకున్నామని, మురికి కూపంలో జీవిస్తున్నామని పిఠాపురం మండలం భోగాపురం దళిత కాలనీవాసులు మండిపడ్డారు. తమ కాలనీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురంలో సోమవారం ఈ కార్యక్రమం చేపట్టారు. నిరసన అనంతరం సచివాలయ సిబ్బందికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. సచివాలయంలో కింద కూర్చుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ రోడ్లు, డ్రెయినేజీలు లేక మురికి కూపంలో జీవిస్తున్నామని, దళిత కాలనీ అని చిన్నచూపు చూస్తున్నారని, కనీసం తాగునీరూ ఇవ్వడం లేదని విమర్శించారు. డ్రెయినేజీ వ్యవస్థ లేని కారణంగా మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోందని, మురుగు నీటి నిల్వ కారణంగా విపరీతమైన దోమలు పెరిగి రోగాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, నిధులు లేవంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి కరెంట్ పోతోందని, చిన్న పిల్లలు, వృద్ధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కాలనీకి శ్మశానం కూడా లేదని, ఎవరైనా చనిపోతే రోడ్డు పక్కన, కాలువ గట్టుపై పూడ్చాల్సిన పరిస్థితులు ఉన్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. -
పవన్ కళ్యాణ్.. నిద్ర పోయావా? రైతులకు అన్యాయం జరిగితే మాట్లాడవా?
-
'ఓజీ 2'లో సుభాష్ చంద్రబోస్ ఎలిమెంట్?
పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ-2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ చిత్రాన్ని ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్‌తో చర్చలు, మ్యూజిక్ సిట్టింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కథలో ఈసారి ఊహించని మలుపులు ఉండనున్నాయని ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. జపాన్ నుంచి వచ్చిన విలన్, ఓజీ గురించి వెదుకుతాడట. అనంతరం అతడికి, ఓజాస్ గంభీరాకు మధ్య జరిగే యుద్ధమే పార్ట్-2 కథ అని చాలామంది భావిస్తున్నారు. కానీ అంతకుమించి మరో ఆసక్తికరమైన ట్విస్ట్ కూడా ఉందని సమాచారం. ఓజీ కథ 1940లలో మొదలై, 1973 ప్రాంతంలో సాగి 1993లో ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్లో మరోసారి 1940ల కాలాన్ని టచ్ చేస్తూ, ఆ కాలంలో సుభాష్ చంద్రబోస్ ఎలిమెంట్‌ను జోడించినట్టు తెలుస్తోంది. అయితే గంభీరాకు, బోస్‌కు కథలో ప్రత్యక్ష లింక్ లేకపోయినా, దర్శకుడు సుజీత్ మాత్రం ఈ కథలో ఓ చిన్న మేజిక్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ చిత్రాన్ని పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఆయనే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న దీక్ష ముగిసిన వెంటనే ఈ సినిమా లాంచింగ్ జరగనుందని సమాచారం. -
పంతం బూతులకు పవన్ మద్దతు
-
జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు.. నువ్వు 'OG' లో స్టెప్పులు వేస్తున్నావా..?
-
నువ్వు, నీ బలుపు... లక్ తో డిప్యూటీ సీఎం అయ్యావ్.. తగ్గించుకుంటే మంచిది..!
-
‘ఒకే ఫ్రేమ్‌లో ఇన్ని వేరియేషన్లా?’
తాడేపల్లి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌వి అవకాశవాద రాజకీయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఇచ్చినమాట మీద నిలబడలేని వ్యక్తి పవన్ అంటూ మండిపడ్డారు. సంక్షేమ పథకాలపై పవన్ విమర్శలు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు శైలజానాథ్. ఈరోజు(శనివారం, జూన్ 27వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. నేడు సంక్షేమ పథకాలను విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్‌కు ఆనాడు(ఎన్నికలకు ముందు) సంతకాలు పెట్టిన బాండ్లు పంపిణీ చేసినప్పుడు తెలియదా? అంటూ నిలదీశారు. ఒకే ఫ్రేమ్‌లో ఇన్ని వేరియేషన్స్ చూపించే నాయకుడు పవన్ కళ్యాణ్ తప్ప ప్రపంచంలో ఇంకెవరూ లేరని విమర్శించారు. ‘ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే పద్యాన్ని బాగా వంట పట్టించుకున్నాడనిపిస్తోంది. వైఎస్సార్సీపీకి పవన్‌తోనే కాదు.. ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఇచ్చిన మాట మీద ఏ ఒక్క క్షణం కూడా నిలబడని నాయకుడు పవన్ కళ్యాణ్. నాయకుడు మాట మీద నిలబడకపోతే నిలబెట్టాల్సిన బాధ్యత అనుచరులు, కార్యకర్తలదే. సమాజంలో విష సంస్కృతిని పెంపొందించే మాటలతో రెచ్చిపోతూ పవన్ కళ్యాణ్ యువతని పెడదోవ పట్టిస్తున్నాడు. సంక్షేమ పథకాలు అమలు చేసినంత మాత్రాన ఎన్నికల్లో గెలవలేమని చెప్పే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో 143 హామీలు ఎందుకిచ్చారు?, ప్రభుత్వ భూములు 99 పైసలకు ఇస్తుంటే, మెడికల్ కాలేజీలు, పోర్టులు ప్రైవేటుపరం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?, రెడ్‌బుక్ పాలనలో శాంతిభద్రతలు గాడితప్పితే బాధితులను నిందితులుగా మార్చి వేధిస్తుంటూ మాట్లాడకూడదా?, ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ కళ్యాణ్.. పోలీసుల దాష్టీకాలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు?, పవన్ కళ్యాణ్‌కి సంధి ప్రేలాపణలు ఎక్కువయ్యాయి. రెండు సీట్లలో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి మా గురించి మాట్లాడే హక్కు లేదు. రాష్ట్రంలోని సంపదనంతా దోచుకుంటున్నారు. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలు, పోర్టులను కూడా అమ్ముకోవడం సిగ్గుచేటు. ఏపీలోని శాంతిభద్రతల గురించి పక్క రాష్ట్రాల్లో దారుణంగా చెప్పుకుంటున్నారుసాయికృష్ణను హతమార్చి బూడిద కూడా ఇవ్వని ప్రభుత్వం ఇది. చివరికి హైకోర్టును కూడా తప్పుదారి పట్టించిన ఘనత కూటమి ప్రభుత్వంది. తిరుమల లడ్డూపై రచ్చ చేసి దుర్గమ్మ గుడి మెట్లు కడిగిన వ్యక్తి పవన్. కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం పవన్ కళ్యాణ్‌కి అలవాటు. కాపులంతా ఓట్లేస్తే సీఎం అవుతానన్న పవన్.. ఇప్పుడు తనకు కుల భావన లేదంటున్నారు. ఆయన నటన, మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు’ అని తెలిపారు. -
సంక్షేమ పథకాలు గెలిపించలేవు: పవన్ కల్యాణ్
సాక్షి, మంగళగిరి: జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సంక్షేమ పథకాలతోనే ఎన్నికల్లో గెలవలేం" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సంక్షేమ హామీల అమలుపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయనే చర్చ జోరందుకుంది. శనివారం మంగళగిరిలో జరిగిన జనసేన సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. సంక్షేమ పథకాలను పార్టీ గౌరవిస్తుందన్నారు. అయితే అవసరమే అయినప్పటికీ అవే ఎన్నికల్లో విజయాన్ని కట్టబెట్టవన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ఓడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరో కోణంలో చర్చకు దారి తీస్తున్నాయి. ఎందుకంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. ఎన్నికల ప్రచారంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల్లో కీలకమైనవి ఇప్పటికీ అమలులోకి రాలేదు. ఎన్నికల సమయంలో ప్రజలకు చంద్రబాబు, పవన్‌లు స్వయంగా బాండ్లు రాసిచ్చి మరీ హామీలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి ఇన్నిరోజులైనా అమలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ అంశంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని, ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలని వైఎస్సార్సీపీ పదేపదే డిమాండ్ చేస్తూ.. పోరాటాలు చేస్తోంది.మరోవైపు రాష్ట్రం తీవ్ర అప్పుల్లో ఉందని చెబుతున్న చంద్రబాబు... ఇంకోవైపు భారీగా కొత్త అప్పులు చేస్తూనే, సంక్షేమ హామీల అమలుకు నిధులు లేవని చెబుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ చేసిన సంక్షేమంతోనే ఓట్లు రావు అనే వ్యాఖ్యలు.. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం చేతులెత్తేసిన సంకేతాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడం జరగదని పరోక్షంగా పవన్ అంగీకరించినట్లుగా ఈ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఏపీలో మీ ఓటు ఉండాలంటే..! -
లోకేశ్, అనిత, పవన్.. పోలీసు శాఖకు పట్టిన చీడ.. కృష్ణలంక రాక్షసులు
-
దుమారం రేపుతున్న పవన్ కామెంట్స్.. తిరగబడుతున్న ప్రజలు!
-
ఆ తల్లి బూడిద అడిగితే... ఏ కులం అంటు..!
-
టీడీపీ గేమ్‌లో పవన్ ‘ఫ్రంట్ ఫుట్’ బ్యాట్స్‌మెనా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకరకంగా అదృష్టవంతుడు అని చెప్పాలి. ఆయన ఏమి మాట్లాడినా దానిని సినిమా డైలాగు అనుకుని చప్పట్లు కొట్టే అమాయక అభిమానులు ఉండడం ఆయన అదృష్టం అవుతుందేమో!. గత పది, పన్నెండేళ్లలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పరస్పర విరుద్దమైన ప్రసంగాలు చేశారో లెక్కవేయడం కష్టమే కావచ్చు. అధికారంలోకి రావడానికి ఎన్ని తంటాలైనా పడి ఉండవచ్చు. ఒకసారి పవర్ చేతికి వచ్చాక బాధ్యతాయుతంగా ఉండకపోతే అది సమాజానికి నష్టం చేస్తుంది.గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న ప్రకటనలు సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలకు గురి అవుతున్నాయి. డైవర్షన్ రాజకీయాలు చేసి టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయ లబ్ది చేకూర్చాలన్న తాపత్రయంతో పవన్ కళ్యాణ్ తన ప్రతిష్టను తానే కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు గందరగోళంగా ఉండడం ఒక స్పెషాలిటీగా కనిపిస్తుంది. కాకినాడలో కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పిన మాటలు కొన్నిటిని చూడండి. వైఎస్సార్సీపీ గూండాలను తొక్కి నారతీస్తా.. అధికారంలో లేకున్నా క్రిమినల్స్‌లా ఆ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపణ చేయడం అంటే ఇటీవలికాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, లాకప్ డెత్ ఘటనలపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చడానికి చేస్తున్న యత్నంగా కనిపించదా!మంత్రి లోకేష్ ఒకవైపు రెడ్ బుక్ అంటూ అరాచకపు రాజకీయాలు చేస్తుంటే, తాను ఎక్కడ వెనుకబడిపోతానో అన్నట్లుగా పవన్ కళ్యాణ్ తొక్కినారతీసే రాజ్యాంగాన్ని అమలు చేస్తానని అంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్‌కు ఆ శక్తి ఉంటే ఎవరిని తొక్కి నారతీయాలి? ముందుగా టీడీపీ, జనసేనలలో ఉన్న ఆ గూండా శక్తులను గుర్తించి వారి నార తీసి తదుపరి ఇతర పార్టీలవారి వద్దకు వస్తే బాగుండేది కదా! కొద్ది రోజుల క్రితం దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అదే పార్టీకి చెందిన మరో నేత ఇంటిని కూల్చడానికి వెళ్లారు. ఆయనను ఏమి చేయాలో పవన్ చెప్పాలి కదా! గతంలో ఇదే చింతమనేనిని పవన్ తీవ్రంగా విమర్శించారు. తదుపరి పొత్తు కుదిరాక ఆయనకోసం ప్రచారం చేశారే!శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీసిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులపై కనీసం కేసు అయినా పెట్టించారా? వేమూరు నియోజకవర్గంలో కొందరు జనసేన కార్యకర్తలపై టీడీపీ వారు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు కదా! ఒక యువతిని మోసం చేసి అత్యాచారం చేశారన్న అభియోగం ఎదుర్కోవడమే కాకుండా అసెంబ్లీ నుంచే వీడియోకాల్‌తో అభ్యంతరకరంగా వ్యవహరించిన ఒక జనసేన ఎమ్మెల్యేపై చర్య తీసుకోవడం సంగతి అలా ఉంచి, డిల్లీ మీటింగ్‌లో పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని ఏమనుకోవాలి! మరికొందరు జనసేన ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాల మాటేమిటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియాలను నడుపుతున్నారన్న కూటమి ఎమ్మెల్యేలను కనీసం మాట మాత్రంగానైనా హెచ్చరించలేకపోతున్నారే.ఇక వైఎస్సార్సీపీ మద్దతుదారులను అణచివేయడానికి పోలీసు యంత్రాంగం రకరకాల అక్రమ కేసులు పెడుతోంది. అది చాలదన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. జనసేన మద్దతుదారు కుటుంబానికి చెందిన సాయికృష్ణ అనే రౌడీషీటర్‌ను పోలీసులే హింసించి చంపేశారని ఆరోపణలు వచ్చాయి. అది చట్ట విరుద్దమైన చర్యగా చెప్పవలసిన ఉప ముఖ్యమంత్రి, అదేమీ తప్పుకానట్లుగా మాట్లాడడం ఏపాటి రాజధర్మం అవుతుంది. మరో వైపు అదే రౌడీషీటర్ కుటుంబం వద్దకు జనసేన బృందం ఎందుకు వెళ్లింది? ఏభై లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం అవ్వాలని మరో జనసేన నేత ఎందుకు రాయబారం చేశారు. అన్నిటికి మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రౌడీషీటర్ కుటుంబాన్ని ఎందుకు పిలిపించుకుని వారిని ఓదార్చి పంపించారు.ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయి కూటమి ప్రభుత్వానికి తీరని నష్టం చేయడంతో వెంటనే పవన్ కళ్యాణ్ రంగంలో దిగి, డైవర్షన్ రాజకీయాలలో భాగంగా ప్రకటనలు చేయడం వల్ల ఆయనకే నష్టం జరిగింది కదా! క్రిమినల్ కేసులు ఉండడమే వైఎస్సార్సీపీ బలం అంటూ మాట్లాడి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయిందన్న అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్‌లతో పాటు పవన్‌పై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు బయటపెట్టారు.వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటంలో కారుమీద ఎక్కి కూర్చుని హడావుడి చేయడం ఏ రకమైన చర్య అవుతుంది? స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అయితే, నడిరోడ్డుపై పవన్ కళ్యాణ్ పడుకోవడం చట్టసమ్మతమేనా? విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రి రోజాపై జనసేన కార్యకర్తలు కొందరు దాడి చేసినప్పుడు వాటిని సమర్థించినట్లు వ్యవహరించారే! తనపై హోం మంత్రి అనిత చేసిన ఒక వ్యాఖ్యకు బదులుగా మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన విమర్శను పవన్ తప్పుపట్టారు. అది మహిళలను అగౌరవపరిచినట్లు చిత్రీకరించారు. అందుకు ప్రతిగా పవన్ కళ్యాణ్‌తో సహా కూటమి ప్రముఖులు చేసిన పలు అభ్యంతర వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ నేతలు పేర్నినాని వంటివారు గుర్తు చేశారు.మంత్రిగా ఉన్న సమయంలో ప్రముఖ నటి రోజాపై నీచమైన ఆరోపణలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిని పవన్ అభినందించింది నిజమా? కాదా? ఆ మాట చెప్పింది బండారే కదా! ఇక సుగాలి ప్రీతి అంశంలో మరింతగా పవన్ పరువు పోగొట్టుకున్నారు. జై భీమ్ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధారసహింతంగా పవన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని తెలియచేశారే. సుగాలి ప్రీతి తల్లి పార్వతి సైతం అదే విషయం తేటతెల్లం చేశారే. తనకు కులం ఆపాదించవద్దని పవన్ కళ్యాణ్ తాజాగా కోరుతున్నారు. మంచిదే. ఆయన మొదటి నుంచి ఇదే ఉద్దేశంతో వ్యవహరించి ఉంటే అంతా అభినందించాలి. కాని కాపులంతా తనకు మద్దతు ఇవ్వాలని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కోరిన సంగతి అసత్యమా? ఇప్పుడు అందుకు విరుద్దంగా కులం గురించి మాట్లాడడం దరిద్రం అని, తాను దేశభక్తుడినని సర్టిఫికెట్ ఇచ్చుకుంటే రాజకీయాలలో కుదురుతుందా? మొత్తం ఎన్నికల మానిఫెస్టో సంగతెలా ఉన్నా, కనీసం కాపులకు ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయవలసిన బాధ్యత ఆయనపై లేదా? తాను హోం మంత్రిని కాకపోవడం అది క్రిమినల్స్ అదృష్టం అని అనడం ద్వారా ప్రస్తుత హోం మంత్రి అనితను అగౌరపరిచినట్లు కాదా? అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.నిజానికి లా అండ్ ఆర్డర్ శాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ఆ సంగతి ఆయనకు తెలియదా! అన్నిటికి మించి పవన్ కళ్యాణ్‌ను టీడీపీ బాగానే వాడేసుకుంటోందన్న భావన వ్యక్తం అవుతోంది. అందులో భాగంగానే వైఎస్సార్సీపీపై పవన్ చేసే దూషణలకు టీడీపీ మీడియా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది తెలుస్తూనే ఉంది కదా! చేసింది. సాయికృష్ణ కేసులో చంద్రబాబు సేఫ్ గేమ్ ఆడాలని యత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం అనవసర వ్యాఖ్యలు చేసి అప్రతిష్టపాలు అవుతుండడమే అందులో ఉన్న మర్మం అన్న విషయం అర్థం అవుతూనే ఉంది కదా! టీడీపీకి, ఎల్లో మీడియాకు అదే కదా కావల్సింది!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సిగ్గులేదా పవన్ కళ్యాణ్... నువ్వింతలా దిగజారిపోతావ్ అని జన్మలో అనుకోలేదు
-
ముద్రగడ ఆరోగ్యంపై పిచ్చి వార్తలు.. తోట త్రిమూర్తులు స్ట్రాంగ్ వార్నింగ్
-
బాబూ.. చరిత్రలో ఇది చీకటి అధ్యాయం!
ఎంతటి పెద్ద కేసు అయినా దానిని మేనేజ్ చేయడం ఒక ఆర్ట్. అలాగే ఎంత చిన్న కేసు అయినా దానిని పెద్దదిగా చూపించడం కూడా ఓ కళే. ఇది అందరివల్ల సాధ్యం అయ్యే పని కాదు. కాని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ విషయంలో ఉన్న నేర్పరితనం బహుశా దేశంలోనే ఇంకెవ్వరికి ఉండదేమో! దీనిని ప్రశంసగా అయినా తీసుకోవచ్చు. లేదా విమర్శగా అయినా భావించవచ్చు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా పలు ఎన్ కౌంటర్ ఘటనలు జరిగాయి. వాటిపై పెద్ద వివాదాలు చెలరేగాయి. అయినా వాటిలో తన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చేసుకోగలిగిన తెలివి ఆయనది అని చెప్పాలి. అత్యంత సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అనే యువకుడి లాకప్ డెత్ కేసును చంద్రబాబు ఎలా హాండిల్ చేశారో చూడండి. సాయి కృష్ణ తల్లికాని, ఇతర కుటుంబ సభ్యులు కాని తొలుత మాట్లాడినదానికి, చంద్రబాబును కలిసిన తర్వాత చెప్పిన విషయాలకు ఎంత తేడా ఉందో గమనించి అంతా ఆశ్చర్యపోవలసి వచ్చింది.ఆ కుటుంబ సభ్యులకు ఏమి న్యాయం జరిగిందో ఎవరికి తెలియదు కాని,వారు చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లతో పాటు లోకేష్‌కు కూడా ధన్యవాదాలు తెలిపిన వైనం ఆసక్తికరంగా మారింది. వారికి నిజంగా ఏదైనా న్యాయం జరిగి ఉంటే అది ఏరకంగా జరిగిందో చెప్పి ఉండేవారు. బహిర్గతం చేయలేదంటే భయపడ్డారేమో అన్న సందేహం వస్తుంది. లేదా వారికి ఏమైనా ఇతరత్రా సాయం అందించడానికి అవగాహన కుదిరిందేమో అన్న సంశయం కలుగుతుంది. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు దీనిపై వ్యాఖ్యానిస్తూ సాయికృష్ణ కుటుంబాన్ని మాయ చేసి ఉండవచ్చని, అయినా తాము ఈ కేసుపై పోరాటం ఆపబోమని అన్నారు. జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మరింత గట్టిగా మాట్లాడుతూ సాయికృష్ణ కుటుంబం రాజీ పడినా, తాము వెనక్కి తగ్గబోమని, ఈ హత్య ఏపీ సమాజంపై జరిగిన దాడిగా తాము పరిగణించి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తామని తెలిపారు. అంతేకాక ఆ కేసులోఎవరెవరి ప్రమేయం ఉండే అవకాశం ఉందో తెలుపుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ఎల్లో మీడియా కాని ,టీడీపీ పక్షాన ప్రచారం చేసే డిజిటల్ మీడియా కాని, తొలుత సాయికృష్ణపైన, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన జగన్,వైఎస్సార్సీపీ నేతలపై అడ్డగోలుగా ప్రచారం చేశాయి.ఆ కుటుంబాన్ని కలవడం ద్వారా జగన్ చాలా పెద్ద తప్పు చేశారని, రౌడీషీటర్ కుటుంబాన్ని కలుస్తారా అని టీడీపీ నేతలు దూషించారు. సాయి తల్లిని పరామర్శించి జగన్ ధైర్యం చెప్పాక, పరిస్థితి తీవ్రతను గమనించిన చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆమెను,ఇతర కుటుంబ సభ్యులను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఆ తర్వాత వీరి స్వరం మారింది. ఈ ఉదంతంతో ఎల్లో మీడియా పరువుపోయినట్లయింది. చంద్రబాబు భేటీ తర్వాత ఎల్లో మీడియా ఫ్లేట్ ఫిరాయించేసింది. చంద్రబాబు ఎందుకు ఇంత కంగారుపడి ఆ కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారన్నదానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ కేసు కేవలం సిఐ నాగరాజుకే పరిమితం కాదని,ఆ పైన ఉన్న అధికారులకు,ప్రభుత్వంలో కీలకమైన పదవులలో ఉన్నవారికి కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న భావనతో చంద్రబాబు ఈ జాగ్రత్త తీసుకుని ఉండవచ్చు. సాయి కుటుంబం వారు జనసేన పార్టీవారని, కాపు సామాజిక వర్గంవారని వెల్లడైంది. ఇటీవలి కాలంలో పలు ఘటనలలో కాపు వర్గానికి చెందినవారు కూడా ఇబ్బంది పడుతుండడం ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేస్తోంది. ఈ నేపధ్యంలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను తన వైపునకు తిప్పుకుంటే మొత్తం కేసు బలహీనపడిపోవచ్చని అనుకుని ఉండవచ్చని అంటున్నారు.ఈ కేసు బహిర్గతం అయిన తర్వాత,ఏపీలో పలు ఇతర పోలీస్ స్టేషన్ లలో ఇలాంటి లాకప్ హింసలు, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మరిన్ని వెలుగులోకి రావడం కూడా ఆందోళన కలిగించి ఉండవచ్చు.కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే హింసను తాళలేక ఒక దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్న కేసు కూడా ప్రజలలోకి వెళ్లింది. వైఎస్సార్సీపీ నేతలు అతని కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి తీవ్రమైన విమర్శలు చేశారు. తెనాలి, కౌతాళం, విజయనగరం తదితర చోట్ల కూడా మరికొన్ని వేధింపుల కేసులు మీడియాలో రిపోర్టు అయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ రెడ్ బుక్ పేరుతో జరిగినన్ని అరాచకాలు ఇన్నీ అన్నీ కావు. ప్రభుత్వం అరాచకాలు నిర్వహించడానికి ఒక శాఖను ఏర్పాటు చేసిందా అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. సుమారు ఏభై రోజులపాటు సాయికృష్ణ కేసును ప్రభుత్వం పట్టించుకోలేదు. పోలీసు అధికారుల చుట్టూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఎన్ని రోజులు తిరిగినా ఫలితం దక్కలేదు. చివరికి వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ కేసులో అనేక విషయాలను వెలుగులోకి తీసుకురావడంతో కలకలం ఏర్పడింది.ఆ తర్వాత విజయలక్ష్మి తన బిడ్డ బూడిదైనా ఇవ్వండి అని వాపోయిన కధనం సాక్షి మీడియాలో వచ్చినప్పుడు హృదయమున్న ప్రతి వ్యక్తికి ఆవేదన కలిగించింది. హింసించి హతమార్చడమే కాకుండా, ఆ యువకుడిని కాల్చి బూడిద చేయడమేమిటని అందరూ మాట్లాడుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రాజకీయాలకు అతీతంగా, కులాలతో సంబంధం లేకుండా సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించి,ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించడంతో ఒక్కసారిగా చంద్రబాబు ప్రభుత్వం ఉలిక్కిపడింది.తదుపరి అర్ధరాత్రి వేళ కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో వైపు విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన ఇన్ చార్జీ అమ్మిశెట్టి వాసు ఈ బాధిత కుటుంబంతో రాయబేరాలు చేసి డబ్బు ఆఫర్ చేశారన్న ఆరోపణ వచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగిందన్న అనుమానం బలపడింది. ఈ సంగతిని సాయి మేనమామే తెలిపారు.జనసేన నేతలకు ఈ ఘోరం గురించి చెప్పినా పట్టించుకోలేదని,అందువల్లే తాము అంబటి రాంబాబుకు వివరాలు అంందిచామని ఆయన చెప్పారు. వరంగల్ లో ఒక బాలుడి పలకరించడానికి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లకపోవడం కూడా విమర్శలకు దారి తీసింది. చంద్రబాబు ఒక సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ,డిజిపిలతో దీని గురించి చర్చించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సర్కిల్ ఇన్ స్పెక్టర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒక ఎసీపీ స్థాయి అధికారిని దర్యాప్తునకు తొలుత నియమించినా,ఆ తర్వాత ఐపిఎస్ లతో కూడిన ఒక సిట్ ను ఏర్పాటు చేశారు.అయినా కేసులో న్యాయం జరుగుతుందా?లేదా?అన్న సందేహాలపై చర్చలు జరుగుతున్నాయి. సీబీఐ విచారణకు విపక్షం డిమాండ్ చేస్తోంది. కేవలం ఒక్క సిఐ మాత్రమే ఇలాంటి ఘోరం చేయలేరని, ఉన్నతాధికారుల ప్రమేయం కూడా కచ్చితంగా ఉందని జడ శ్రావణ్ ఆరోపించారు.ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వంలోని పెద్దలకు కూడా ముందే తెలుసని,వాటిని బయటపెడతానని ఆయన అన్నారు..సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడ సీపీ ఆధ్వర్యంలో ఉండే టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకు రావడం,కృష్ణ లంక పోలీస్ స్టేషన్ లోను, తదుపరి ఒక ప్రైవేటు హోటల్ లోను పెట్టి తీవ్రంగా హింసించడం, గాయపడ్డ అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లడం, ప్రాణం కోల్పోయిన సాయికృష్ణు బస్టాండ్ లో అనాధ శవంగా చూపే ప్రయత్నం చేసి, ఆ తర్వాత స్మశానవాటికలో దహనం చేయడం వంటి ఘట్టాలను జడ శ్రవణ్ పూసగుచ్చినట్లు వివరించారు.కాగా తన కుమారుడిని పోలీసులు పొట్టన పెట్టుకున్నారని ఆరోపించి పలు ప్రశ్నలు వేసిన సాయికృష్ణ తల్లి,ఆమె సోదరులు శుక్రవారం నాడు చంద్రబాబును కలిసిన తర్వాత తమకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని అంటూ,ఆయన వంటి మహోన్నత వ్యక్తి,పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి నాయకులు తమకు న్యాయం చేసి చూపించి ప్రభుత్వ పాలన సరిగ్గా ఉందని చాటారని మేనమామ నవరంగ్ అనడం పలు సందేహాలకు తావిచ్చింది. ప్రభుత్వం అంత గొప్పగా పని చేసి ఉంటే, ఒకరోజు ముందు ఇదే నవరంగ్ తమను ఎవరూ పట్టించుకోలేదని ఎందుకు విమర్శించారో తెలియదు. ఈ కేసులో వారికి ఎలాంటి న్యాయం జరిగిందో క్లారిటీగా సాయి కుటుంబ సభ్యులు చెప్పలేదు. ప్రభుత్వమూ వివరణ ఇవ్వలేదు. చంద్రబాబు పద్దెనిమిదేళ్ల పాలనకాలంలో ఇలాంటివి పలు ఘటనలు జరిగాయి.నక్సైలైట్ల ఉద్యమ ప్రభావం అధికంగా ఉన్న రోజులలో కొన్ని ఎన్ కౌంటర్లు జరిగాయి. గత టరమ్ లో తిరుమలలో తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు ఇరవై మంది ఎదురుకాల్పులలో మరణించారు. పుష్కరాలలో తొక్కిసలాట లో 29 మంది మరణించిన విషయంలో సిసిటీవీ ఫుటేజీ మిస్ అవడం మిస్టరీ అని అప్పట్లో విపక్షాలు విమర్శించేవి. ఇలాంటి ఘటనలలో ఎన్ని ఆరోపణలు వచ్చినా తన ప్రభుత్వానికి,తన పదవికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆయన జాగ్రత్తపడగలిగారు. గతంలో కోడెల శివప్రసాద్ ఆస్పత్రిలో బాంబులు పేలి నలుగురు మరణించినప్పుడు సీబీఐ విచారణ జరగకుండా చూసుకోగలిగారు. చింతమనేని ప్రభాకర్ తో సహా పలువురు టీడీపీ,జనసేన ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు వచ్చినా పోలీసులు నిశ్చేష్టులై ఉంటున్నారన్న విమర్శ ఉంది. బలహీనవర్గాలవారిపైన ప్రత్యర్ది పార్టీవారిపైన మాత్రం పోలీసులు రెచ్చిపోతున్నారు.ఈ టరమ్ లో ఎన్ని వందలమందిని రెడ్ బుక్ పేరుతో వేధించారో లెక్కలేదు.తెనాలిలో ముగ్గురు యువకులను నడిరోడ్డులో కూర్చోబెట్టి అరికాళ్లపై దారుణంగా పోలీసులు కొట్టడం మొదలు , పలు కేసుల్లో తీవ్రంగా హింసించడం, చిన్న,చిన్న కేసులలో సైతం వైఎస్సార్సీపీవారైతే నడిరోడ్డుపై నడిపించి అవమానించడం, అదే టీడీపీ వారు ఎన్ని దౌర్జన్యాలు చేసినా నామమాత్రంగా కేసు పెట్టడం వంటివి చేస్తున్నారు. అంబటి రాంబాబు,జోగి రమేష్ ,నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి మాజీ మంత్రుల ఇళ్లపై గంటల తరబడి టీడీపీ క్యాడర్ దాడి చేస్తే మాత్రం పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరించారు.దీనితో ఏపీలో పోలీసు రాజ్యం ప్రజలను ఎలా పీడిస్తోందో వివరిస్తూ జగన్ దేశం అంతటికి తెలియచేసే యత్నం చేశారు. చంద్రబాబు ఎంత మేనేజ్ మెంట్ నేర్పరి అయినా ,ఎన్ని కేసుల్లో ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చినా,ఈ సాంకేతిక యుగంలో అన్నీ తెలిసిపోతున్నాయి.చరిత్రలో ఇదో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందన్న సంగతి ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నోటి దూల తగ్గించుకుంటే మంచిది.. నానాజీపై పవన్ సీరియస్
-
నువ్వు ఎవడైతే నాకేంటి.. ఈడ్చికొచ్చి జైల్లో వేయాలి..!? అడ్వకేట్ బాలా సీరియస్
-
‘అసైన్డ్’పై ఎమ్మెల్యేలదే పెత్తనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అసైన్డ్ భూములను కొల్లగొట్టడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం కొత్త దుకాణానికి తెరతీసింది. ఇప్పటికే నియోజకవర్గాలు, మండలాల నేతలకు ఇసుక, మట్టి, మద్యం ద్వారా అడ్డగోలుగా దోచుకునేందుకు దారులు చూపిన ప్రభుత్వం.. తాజాగా అసైన్డ్ భూములను సైతం పందేరం చేయడానికి సరికొత్త ఎత్తుగడ వేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన గల అసైన్డ్ కమిటీలను రద్దు చేసి, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల అధ్యక్షతన అసైన్డ్ కమిటీల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అసైన్డ్ కమిటీలకు ఎమ్మెల్యేలను అధ్యక్షులుగా ఉంచేలా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు తెలిపారు. నియోజకవర్గాల వారీగా అసైన్డ్ భూములే లేకుండా మొత్తం భూములను తమ అనుచరులు, అనుయాయులకు కట్టబెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎమ్మెల్యేలే ఇష్టానుసారంగా వారికి నచ్చిన వారికి అసైన్డ్ భూములను కేటాయిస్తారు తప్ప.. అర్హులనే పదానికి తావుండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే గత వైఎస్సార్సీపీ సర్కారు.. ప్రభుత్వ రంగంలో నిర్మాణం చేపట్టిన మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధి కుదింపు ద్వారా ప్రైవేట్‌కు ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఈ 2 పోర్టుల్లో మిగతా దశల విస్తరణకు బాబు ప్రభుత్వం దారులను మూసేసింది. చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు పరిధిని 64 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు, ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు పరిధిని 51 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు కుదిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో సవరణలకు ఆమోదం లభించిందని మంత్రి పార్థసార«థి మీడియాకు వెల్లడించారు. ఇతరత్రా కేబినెట్ నిర్ణయాలు...⇒ రామాయపట్నం పోర్టు అభివృద్ధి, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను డీబీఎఫ్ఒటీ (డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) ప్రాతిపదికన అప్పగించేందుకు పోర్ట్ ఆపరేటర్ నియామకం కోసం ఆర్ఎఫ్పీ జారీ చేయడానికి, బిడ్డర్లను ఆకర్షించేందుకు వీలుగా ఆర్ఎఫ్పీలో నిబంధనల్లో మార్పులకు ఆమోదం. ⇒ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్ 9, 10లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలలోని రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచేందుకు ఆమోదం. దీనిని 2022 జనవరి 1 నుంచి పాత తేదీతో వర్తింపజేస్తూ, అప్పటి నుండి విశ్రాంతి పొందిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేలా సరీ్వస్ రూల్స్ సవరించడానికి ఆమోదం. ⇒ 2004 సెప్టెంబర్ 1 కంటే ముందే నియామక నోటిఫికేషన్ విడుదలై..అదే తేదీన లేదా ఆ తర్వాత ప్రభుత్వ సేవలో చేరిన అర్హులైన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సీపీఎస్ నుంచి పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు ఒకేసారి అవకాశం కల్పించేందుకు ఆమోదం. ఈ నిర్ణయంతో జీవో 653 పరిధిలోని సుమారు 10,715 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి కుటుంబాలకు పదవీ విరమణ అనంతరం పాత పెన్షన్ విధానం వర్తింపు. కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ⇒ రాష్ట్రంలోని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించేలా, తిరుపతి విమానాశ్రయం మినహా మిగిలిన అన్ని విమానాశ్రయాలలో అత్యాధునిక బార్లు, రిటైల్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడానికి సంబంధించిన నూతన విధాన మార్గదర్శకాల ముసాయిదా ఆమోదం. ⇒ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల (స్థాపన, నియంత్రణ) చట్టం 2016లో సవరణలకు ఆమోదం. టీడీపీ ఆఫీస్‌కు రెండు ఎకరాలు ⇒ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో టీడీపీ కార్యాలయం కోసం 2.002 ఎకరాలు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికి తొలుత 66 ఏళ్లు.. ఆపై 99 ఏళ్లకు పొడిగించేలా లీజుకు ఆమోదం. ⇒ రాష్ట్రంలో సాంకేతిక ఆధారిత రిజిస్ట్రేషన్ సేవలను అందించేందుకు అల్లూరి సీతారామరాజు, పొలవరం జిల్లాలు మినహా అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్íÙప్ (పీపీపీ) విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం స్థాపించి, నిర్వహించడానికి ఆమోదం. వీటిని సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలుగా ప్రకటిస్తూ విధులు నిర్వహించేందుకు ఆమోదం. ‘గీతం’లో 45 మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణానికి అనుమతి⇒ విశాఖ రిషికొండలోని గీతం విద్యా సంస్థలో 45 మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణం చేపట్టేందుకు తాత్కాలిక ఫైర్ ఎన్వోసీ మంజూరుకు ఆమోదం. ⇒ ఎస్ఐపీబీ, సీఆర్డీఏలో తీసుకున్న నిర్ణయాలకు, పలు సంస్థలకు భూముల కేటాయింపు, రాయితీలు ఇచ్చేందుకు ఆమోదం. ⇒ డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, నెట్వర్క్ ఆసుపత్రుల మధ్య ప్రతిపాదించిన బిల్ డిస్కౌంటింగ్ విధానానికి సంబంధించి 8 శాతం వడ్డీ భారాన్ని సంబంధిత నెట్వర్క్ ఆసుపత్రులే భరించే నిబంధనతో ఆమోదం. పవన్‌పై విమర్శలు చేస్తే స్పందించండిమంత్రులకు సీఎం డైరెక్షన్సాక్షి, అమరావతి: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఎవరైనా విమర్శలు చేస్తే వాటిపై స్పందించి కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రులతో మాట్లాడుతూ పలు సూచనలు చేసినట్టు సమాచారం. కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్‌పై కాపు సామాజికవర్గం నేతలు, వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న విమర్శలను సీఎం వద్ద ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. పవన్‌పై విమర్శలు వస్తే మంత్రులంతా స్పందించాల్సిందేనని, మౌనంగా ఉంటే సరికాదని, ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను వివాదాల్లోకి లాగేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి సందర్భాల్లో కూటమి ఐక్యతను చాటే విధంగా మంత్రులంతా సమన్వయంతో స్పందించాలని సూచించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ క్రిమినల్స్‌ను వెనకేసుకొస్తూ రాజకీయం చేస్తోందన్నారు. వైసీపీ నేతలు కుల మీటింగ్‌లు పెడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను తిప్పికొట్టాలని మంత్రులకు సూచించినట్టు తెల్సింది. జొన్నగిరి గ్రామాన్ని ‘స్వర్ణ గ్రామం’గా నామకరణం చేయాలని సీఎం ప్రతిపాదించినట్టు సమాచారం. జూలై 3న కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం చంద్రబాబు మంత్రుల వద్ద ప్రస్తావించారు. -
Perni Nani: తొక్కి పెట్టి నార తీస్తావా? ఆటలో అరటిపండు గాడివి..!
-
మీరిద్దరూ గుండు కొట్టించుకోండి..! లేదంటే ఆవు మూత్రాన్ని నేనే మీ మొఖాన...
-
నువ్వు డిప్యూటీ సీఎం అవ్వడం మా కర్మ... పవన్ పై విరుచుకుపడ్డ పుణ్యశీల
-
కాపులను ఉద్ధరించేందుకు జనసేన పెట్టలేదు
గుంటూరు ఎడ్యుకేషన్: ‘కాపులను ఉద్ధరించేందుకు పవన్‌కళ్యాణ్.. జనసేన పార్టీని పెట్టలేదు. రాష్ట్రంలో రోజూ ఎంతో మంది చస్తూ ఉంటారు. అందుకని రోడ్డెక్కాలా?’ అని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. సోమవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.వైఎస్సార్సీపీలోని కాపు నేతలను తాము కాపు సామాజికవర్గం నుంచి బహిష్కరిస్తున్నామన్నారు. కాపులతో వారికి సంబంధం లేదన్నారు. గత ప్రభుత్వంలో కాపులకు ఏం చేశారో చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలను ప్రశి్నంచారు. కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కాపులకు చేకూర్చిన సంక్షేమం, విడుదల చేసిన నిధుల వివరాలను ఆ పార్టీ కాపు సామాజిక నేతలు ప్రకటించారు కదా.. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం చేశారో చెప్పాలని విలేకరులు వెంకటేశ్వరరావును ప్రశి్నంచారు. ఆయన స్పందిస్తూ.. ఒక్క కాపులకే మేలు చేయడం తమ ప్రభుత్వ లక్ష్యం కాదన్నారు. -
రౌడీ షీటర్ అయితే బాబు ఎందుకు పరామర్శించాడు? కారణం ఇదే
-
ఉపన్యాసం లాఫింగ్ స్టాక్‌తో.. పవన్ మళ్లీ సెల్ఫ్ గోల్!
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి తెలుగు ప్రజలు ఏమనుకోవాలి? మంచి జ్ఞాని ఆయనలో ఉన్నారనుకోవాలా? లేక అవగాహన లేకుండా మాట్లాడుతుంటారనుకోవాలా? నిజంగా ఇది ఆసక్తికర అంశమే. కొద్ది రోజుల క్రితం ఆయన సుమతీ శతకంలోని ఒక పద్య భాగాన్ని ఉటంకించి భాష్యం చెప్పిన తీరు అందరిని ఆశ్చర్యపరచింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఆయన పరిజ్ఞానాన్ని ప్రశ్నిస్తూ పలు ప్రశ్నలు వెలువెత్తాయి. ఒకప్పుడు యువత అంతా ప్రశ్నించాలని ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే యువత ప్రభుత్వాల అక్రమాలను ప్రశ్నించడాన్ని తప్పుపడుతూ వారిని క్రిములతో, చీమలతో పోల్చడం దారుణంగా ఉంది.ఢిల్లీలో ఆయన జనసేన నేతలతో ఒక సమావేశం పెట్టి చేసిన ఉపన్యాసం లాఫింగ్ స్టాక్‌గా మారింది. ఆయన ప్రసంగాన్ని గమనించండి.. ఈ మధ్య చూస్తున్నారు.. కాక్రోచ్ అనే పాయింట్ గురించి. చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా బలవంతమైన సర్పాలను చంపేస్తాయి.. కోట్ల మంది చిన్న, చిన్న ఆలోచనలు, ఇండివిడ్యువల్ వక్తులు అందరూ కూర్చుని దేశం తాలూకూ ఘాడతను, దేశం తాలూకూ తీవ్రతను అర్థం చేసుకోకపోతే, దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. డివిజివ్ శక్తులు విభజనవాదాన్ని సృష్టిస్తున్నాయి. దానిలో మనం భాగస్వామ్యులు కారాదు. ఎదిరించి పోరాడాలి.. అంటూ ఆయన ఉపన్యసించారు.అసలు సుమతీ శతక కారుడు ఈ పద్యం చెప్పడంలో అర్థం వేరు. 'బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ!' అన్నది ఆ పద్య వ్యాక్యం. దీని అర్థాన్ని గూగుల్‌లో వెతికితే ఏమి ఉందో చూడండి. 'ఈ పద్యం ద్వారా కవి చెప్పిన సారాంశం ఏమిటంటే: తనను మించిన బలవంతుడు లేడని గర్వించి, ఇతరులను చిన్నచూపు చూస్తూ విరోధాలు కొనితెచ్చుకోవడం మంచిది కాదు. బలమైన పామును కూడా చిన్న చీమలు కలిసి కుట్టి చంపగలవు. ఎంతటి బలవంతులకైనా ఐక్యత ముందు ఓటమి తప్పదు. బలవంతమైన సర్పాన్ని చలిచీమలు చంపుతాయి' అని అర్థం. అంతేకాని సర్పం గొప్పదని, దానిని చీమలు చంపడం కరెక్టు కాదని కాదు. ఇది నెగిటివ్ సెన్స్‌లో రాసిన పద్యం.పవన్ తనకు తెలియకుండా కేంద్రాన్ని దేనితో పోల్చుతున్నారన్న సందేహం వచ్చింది. ఇది అవగాహనారాహిత్యంగా కనిపిస్తుంది. అలాగే కాక్రోచ్ పేరుతో పోరాడిన యువతను చలిచీమలుగా ఆయన చెబుతున్నారన్నమాట. పాము అంటే విషం సర్పం అని గుర్తుంచుకోవాలి. బలంతో విర్రవీగితే చిన్న, చిన్న కాక్రోచ్లు కూడా రేపటి రోజు చుట్టుముట్టి అంతం చేస్తాయని చెప్పడం. రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాలు తమ తప్పులను తెలుసుకుని జాగ్రత్తపడకపోతే తదుపరి ఎన్నికలలో ఓటమికి గురి కావల్సివస్తుందని అర్థం.కొన్నాళ్ల క్రితం కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో యువకులు చేసిన పోరాటాన్ని తప్పుపట్టాలని ఆయన భావించడమే దారుణం. అందులో కూడా విష సర్పాన్ని సమర్ధించేలా ఆ పద్యాన్ని అవగాహన చేసుకోవడం మరీ చిత్రం. ఆయనకు ఈ స్క్రిప్ట్ రాసినవారికి ఈ విషయం తెలియదా, ఇది సెల్ఫ్ గోల్ వేసుకోవడం కాక ఏమిటి? అని ఒక మహిళా నెటిజన్ వ్యాఖ్యానించారు. విభజన వాదాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఐ యామ్ అన్ అపాలజిటిక్ హిందూ అని, కులం, మతం ప్రస్తావనలు తెచ్చిందెవరు అని ఆమె ప్రశ్నించారు. ఈ దేశం కోసం పోరాడే హక్కు యువతకు ఉంది. వాళ్ల హక్కుల కోసం, జరిగిన అన్యాయాలపై పోరాడుతున్నారు. అది వారి హక్కు అని గుర్తించకుండా పవన్ ఈ మీటింగ్ పెట్టడం ఏమిటో, ఈ విష సర్పం, చలిచీమల గురించి అర్థం, పర్దం లేకుండా మాట్లాడడమేమిటో అని మేధావులు, పండితులు ఆశ్చర్యపోతున్నారు.నీట్ పరీక్ష లీక్ అవడం వల్ల లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. సీబీఐ విచారణకు అప్పగించింది. పలువురు ఈ కేసులో అరెస్టు కూడా అయ్యారు. కాకపోతే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయాలని అడుగుతున్నారు. ఇందులో రాజకీయం ఎక్కడ ఉంది. ఈ యువత దేశానికి ఏ రకంగా ప్రమాదం?, పవన్ ది రాజును మించి రాజభక్తి ప్రదర్శించడమా? లేక విషయంపై అవగాహన లేకుండా మాట్లాడడమని అనుకోవాలా? ఈ ప్రశ్నలు సహజంగానే బుద్ధి జీవులకు వచ్చాయి.సినిమాలలో వచ్చిన అవకాశాలతో పాటు, కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించడం ద్వారా ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ గత పదేళ్లలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాటలు మార్చారో చెప్పలేం. ఈయన పరస్పర విరుద్ధమైన డైలాగులు అన్నిటినీ ఒక చోట పేర్చి సోషల్ మీడియాలో ఎవరో పోస్టు చేశారు. తనకు మాత్రమే దేశ భక్తి ఉన్నట్లు, అన్యాయాలను ప్రశ్నించే వారికి లేనట్లుగా పవన్ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు గురైంది. తోచీ, తోయనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్లిందని సామెత. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఈ ఉపదేశాలు ఇవ్వడం ఏమిటి? ఇదే పవన్ కళ్యాణ్ అంతకు కొద్ది రోజుల ముందు తన పార్టీ పక్షాన సేనాదళం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.జన్ జి ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే దాని లక్ష్యం అని కూడా ఆయన చెప్పారు. అది చెప్పిన కొద్ది రోజులకే మాట మార్చేశారు. కొందరు యువకులు ప్రకటించిన ఈ కాక్రోచ్ జనతా పార్టీని జన్ జి లో భాగంగానే చూడాలి. దీని అర్థం ఎంత అణచివేతకు గురి అవుతున్నా బొద్దింకల మాదిరి తిరగబడాలని చెప్పడం అన్నమాట. దీని గురించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఒక వ్యాఖ్య చేస్తూ యువత తన ఆకాంక్షల కోసం ఈ ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఏపీలో తాను కూడా ఒక కాక్రోచ్‌నే అని కామెంట్ చేశారు. అంటే దాని భావం ఏపీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై తాను పోరాడతానని ప్రకటించడమే కదా!రాజకీయాలలో కొందరు వ్యక్తుల తప్పులను వ్యక్తిగత చర్యలుగా కాకుండా వారి కులం, మతం, వర్గాలకు ముడిపెట్టి సామాజిక విభేధాలను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని కూడా పవన్ కళ్యాణ్ సేనాదళం ప్రకటన సందర్భంలో అన్నారు. విశేషం ఏమిటంటే జగన్ పాలన సాగిన ఐదేళ్లలో ఈ రకమైన ప్రయత్నాలు చేసిందంతా టీడీపీ, జనసేనలే. అధికారం కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు కలిసి ఎన్నిసార్లు కుల విభేధాలు, మత వైషమ్యాలు సృష్టించడానికి ప్రయత్నించారో తెలియదా? అధికారంలోకి వచ్చాక కూడా తిరుమల లడ్డూ పేరుతో, ఇతరత్రా మతపరమైన అంశాలను ఏ విధంగా వాడుకున్నది ఆయనకు గుర్తు లేకపోవచ్చు. కాని సోషల్ మీడియాలో ఆ చరిత్ర అంతా ప్రత్యక్షమవుతూనే ఉంది కదా!కొద్ది రోజుల క్రితం వరంగల్‌లో ఒక బాలుడి కోరిక ప్రకారం అతనిని కలిసి వచ్చారు. మంచిదే. దానిని స్వాగతించవచ్చు. కాని అదే సమయంలో ఏపీలో తన మద్దతుదారుడైన ఒక యువకుడిని పోలీసులు క్రూరంగా హింసించి చంపేసి, చివరికి కాల్చి బూడిద చేశారన్న అభియోగం వస్తే, ఆ కుటుంబాన్ని పలకరించడానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడాన్ని ఏమనుకోవాలి? ఇలాంటి ఘటనలపై కూడా యువత కాని, ప్రజలు కాని స్పందించరాదన్నది ఆయన ఉద్దేశమా? అధికారం వచ్చింది కనుక ఆయనకు సంతోషంగానే ఉండవచ్చు. కాని ప్రజలకు ఏమి ఒరిగింది? ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ అరాచకాలతో ఏపీ అల్లాడుతుంటే ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయితే ఏమిటి? కాకపోతే ఏమిటి? అన్న నైరాశ్యానికి ఆయన మద్దతుదారులు గురి అవుతున్నారనిపిస్తుంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ కాపు నేతలంతా భేటీ అయితే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు ఉలిక్కిపాటు ఎందుకని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఇండియాలోనే అరుదైన కేసుగా అభివర్ణిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారాయన. మంగళవారం గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను చాలా స్పష్టంగా చెబుతున్నా.. సాయికృష్ణను చంపేశారు. ఎవరో పెద్ద నేరస్థుడిని రక్షించేందుకు అతన్ని బలి చేశారు. సీబీఐ దర్యాప్తు జరిగితేనే నిజాలు బయటకు వస్తాయి అని అంబటి వ్యాఖ్యానించారు. ఇది దేశంలోనే అరుదైన కేసు. బుర్రలేని జనసేనవాళ్లు సాయికృష్ణను చంపడం కరెక్టేనని మాట్లాడుతున్నారు సాయికృష్ణ మీద 2 కేసులే ఉన్నాయి. కానీ, పవన్ కల్యాణ్ 22 కేసులు ఉన్నాయని అంటున్నారు. శిక్షించడానికి పోలీసులు ఎవరు? శిక్షలు చట్టబద్ధంగా ఉండాలి. నేను సాయికృష్ణను కొట్టారని ఫొటోలు ఇచ్చాను. ఒకవేళ అతను బతికి ఉంటే చెప్పండి.... సాయికృష్ణ లాకప్ డెత్ కేసును మేకప్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. చట్ట ప్రకారం.. 18 నెలలపాటు సీసీటీవీ ఫుటేజీలు భద్రపరచాలి. కానీ, కృష్ణలంక పీఎస్‌లో సీసీ ఫుటేజీ మాయం కావడం ఆందోళనకరమైన విషయం. ఈ విషయాన్ని ఎల్లో మీడియా సైతం ప్రచురించింది. నిందిత పోలీసులను కాపాడటానికే సీసీటీవీ ఫుటేజీలు మాయం చేశారు. .. జనసేన నేతలు కల్లు తాగిన కోతుల్లా చిందులు వేస్తున్నారు. బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతుంటారు. ఈ హత్యాకాండకు, సీఐ నాగరాజుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారంపై ఆ పార్టీలోని కాపు నేతలే ఎందుకు మాట్లాడుతున్నారు?. మిగతా కులాల నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? అని అంబటి ప్రశ్నించారు... చంపడం, బూడిద చేయడం.. సాక్ష్యాధారాలు లేకుండా చేయడం.. ఇదేంటి?. ఎవరో పెద్ద నేరస్థుడిని కాపాడడానికే సాయికృష్ణను బలిచేశారు. చంద్రబాబు వేసిన సిట్‌తో ఏం ఒరగదు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలి. సీబీఐ, ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. బాధితులకు న్యాయం జరుగుతుంది’’ అని అంబటి తేల్చి చెప్పారు. -
సుగాలి ప్రీతి కేసులో భౌ భౌ అని మొరిగి.. ఇప్పుడు ఆధారాలు లేవంటే.. ప్రజలు నమ్మాలా
-
తాట తీస్తా.. నా కొడకా.. పవన్, పంతం నానాజీ వ్యాఖ్యలు.. అంబటి మాస్ వార్నింగ్
-
పవన్ కామెంట్స్ పై పచ్చి బూతులు తిడుతున్న యువత!
-
శవం మీద పేలాలు వేరుకునే వాడివి.. నీది ఒక బ్రతుకేనా...
-
పవన్ కల్యాణ్‌పై అంబటి సంచలన వ్యాఖ్యలు..
సాక్షి, తాడేపల్లి: గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించి పోలీసులు మూతికి ప్లాస్టర్ వేసుకున్నారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసులు చిత్తశుద్ధితో విచారణ చేస్తే సీఐ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయరు?. సీఐ నాగరాజును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, పవన్ కల్యాణ్ ఉడత ఊపులకు వైఎస్సార్సీపీ భయపడదు. సమాజానికి పట్టిన చీడ పురుగు పవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా చర్చ అయ్యాయి. సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్‌ఫోర్స్ తీసుకొచ్చింది. సీపీ ఆదేశాలు లేకుండా టాస్క్‌ఫోర్స్ అడుగు కూడా ముందుకు వేయదు. సీపీ ప్రమేయంతోనే మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చారు. చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రవేశపెట్టాలి. కోర్టులో ప్రవేశపెట్టకపోతే అక్రమంగా నిర్బంధించినట్టే అవుతుంది. టాస్క్‌ఫోర్స్ తీసుకొచ్చి హింసించి చంపారంటే గూడుపుఠాణి ఉందనుకోవాలి.సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ.. సీఐ నాగరాజే కాదు సాయికృష్ణ లాకప్ డెత్‌లో చాలా మంది ప్రమేయం ఉంది. ఈ కేసులో విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ చేయాలి. పోలీసులు చిత్తశుద్ధితో విచారణ చేస్తే సీఐ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయరు?. సీఐ నాగరాజును విచారిస్తే పెద్దల పేర్లు బయటకు వస్తాయని భయం. లాకప్ డెత్ కేసులో పోలీసులు నాటకాలు ఆడుతున్నారు. సీఐ నాగరాజును వెంటనే అరెస్ట్ చేయాలి. బాధ్యతల నుంచి సీఎం, హోంమంత్రి తప్పించుకోలేరు. విజయవాడ పోలీసు స్టేషన్లలో చట్టాలు అమలు కావడం లేదు. విజయవాడ సీపీని తక్షణమే విధుల నుంచి తప్పించాలి. సీపీని సస్పెండ్ చేసి విచారణ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి. సాయికృష్ణ కోసం వెళ్లి టాస్క్‌ఫోర్స్ పోలీసుల పేర్లు బయటపెట్టాలి.సాక్షులను బెదిరిస్తున్నారు..సాయికృష్ణ లాకప్ డెత్‌పై పోలీసులు మాట్లాడటం లేదంటే కుట్ర ఉందని అనుకోవాలి. పోలీసులు నేరం చేస్తే పోలీసులే విచారణ చేయమేంటి?. సాయికృష్ణ, క్రాంతి కుమార్ కుటుంబాలకు రక్షణ కల్పించాలి. సాయికృష్ణ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబు.. సాయికృష్ణ తల్లిని పిలిపించి మాట్లాడుతున్నారు. మరోవైపు.. సాయికృష్ణ క్రిమినల్ అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడుతారు. కాపు నేతల సమావేశానికి ముందు మీటింగ్‌లో పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అసలు కులం పేరు ఎత్తిందే పవన్. కాపులను క్రిమినల్స్‌గా ముద్రవేసే కుట్ర జరుగుతోంది.పవన్ కల్యాణ్‌కు ఏం తెలియదు..వైఎస్సార్సీపీలో గూండాలు లేరు.. జనసేలోనే గూండాలు ఉన్నారు. పవన్ కల్యాణ్ ఉడత ఊపులకు వైఎస్సార్సీపీ భయపడదు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరించకు పవన్. రక్షించాల్సిన వారే భక్షించారు.. ఇలా చాలా పెద్ద తప్పు. పవన్ కల్యాణ్‌కు ఏం తెలియదు.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సమాజానికి పట్టిన చీడ పురుగు పవన్. జనసేన నేత తాతాజీ.. వైఎస్ జగన్ గురించి ఏం మాట్లాడారో విన్నావా పవన్?. పవన్ కల్యాణ్‌కు బుర్రలేదు, సిగ్గులేదు. తాతాజీ, చింతమనేని ప్రభాకర్ ఇలాంటి వారిని ఏం చేయాలో చెప్పు పవన్. అడ్వకేట్ శ్రీనివాస్ ఇంటి మీద దాడి చేసి ఆయన మీదనే కేసు పెట్టారు. హోంమంత్రి అనితను కించపరిచే విధంగా పవన్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌కు హోంమంత్రి ఇవ్చొచ్చుగా. పవన్ మాటలు, చేష్టలు, వైఖరి.. ద్వంద్వ వైఖరితో ఉన్నాయి. పోలీసు స్టేషన్లో హత్యలు చేసి బూడిత చేసే హక్కు ఎవరికీ లేదు. పవన్ గుర్తుందా. పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్‌ను చట్ట ప్రకారమే ఉరి తీశారు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
మోసం చేశావ్ అన్నా.. నీకు చేతకాకపోతే చెప్పొచ్చు కదా..
-
ఇక మారవా పవన్! ఐటెం సాంగ్ మాటలాపు!
-
సిగ్గులేదా..? కులం పేరు చెప్పి ఆడుకున్నప్పుడు.. నీ బ్రతుకంతా భజన చేయడమే..!
-
నువ్వు ఎవడివి..? నీతో మాకు పనే లేదు... సాయి కృష్ణ కేసులో ఏం ప్లాన్ చేశావ్?
-
పవన్ పరిధి చాలా చిన్నది
సాక్షి, విజయవాడ : డెప్యూటీ సీఎం పదవి అనేది రాజ్యాంగబద్ధమైనది కాదని.. ఆ విషయం పవన్‌కళ్యాణ్ తెలుసుకోవాలని అడ్వొకేట్ రజని హితవు పలికారు. ఆయన పరిధి చాలా చిన్నదని, ఆయనకు కేటాయించిన శాఖలు ఆయన చూసుకుంటే చాలన్నారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ‘సాయికృష్ణ లాకప్‌డెత్–పౌరహక్కులు’ అంశంపై జరిగిన మహిళా ఐక్యవేదిక సమావేశంలో ఆమె ప్రసంగించారు. నేరస్తులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులకే వారిని శిక్షించే అధికారంలేదని.. అలాంటిది డెప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కాలుకు కాలు.. చేయికి చేయి తీసేస్తా.. తొక్కిపట్టి నారతీస్తా అనడం ఏంటని ఆమె ప్రశ్నించారు.రజని ఇంకా ఏమన్నారంటే.. పవన్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారా? లేక సామంత రాజునని అనుకుంటున్నారా? ఆయన వాడే పదజాలం పబ్లిక్‌లో ఉన్నప్పుడు వాడకూడదని ఎవరూ ఆయనకు చెప్పకపోవడం దౌర్భాగ్యం. డెప్యూటీ సీఎం హోదాలో ఉన్నవ్యక్తి ఇలా పిచ్చి మాటలు మాట్లాడడం ఏమిటి? హోంమంత్రి మీద అంత ప్రేమ ఉంటే పవన్ రాఖీ కట్టించుకోవాలి. ఆయన శాఖలో పనిచేస్తున్న ఒక దళిత మహిళను నడిరోడ్డుపై పోలీసు లాఠీతో జనసేన నేతలు కొందరు కొడితే పవన్ ఎందుకు స్పందించలేదు? తప్పు జరగకపోతే ప్రభుత్వం సిట్ ఎందుకు ఏర్పాటుచేసినట్లు? సామాజికవేత్త వసుంధర కుర్రా, హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ గంగాభవానీ మాట్లాడుతూ.. ‘40 రోజులుగా కనిపించకుండాపోయినా సాయికృష్ణ ఉన్నాడా? లేడా?.. ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏమీ జరగకపోతే ప్రభుత్వం ఎందుకు సిట్ ఏర్పాటు చేసింది? సిట్ అధికారులు స్వర్గపురి శ్మశానంలో వివరాలు సేకరిస్తున్నారంటే తప్పు జరిగిందనే కదా.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏదో జరిగిందనే అనుమానాలు కలుగుతున్నాయి. మన రాష్ట్రంలో పబ్లిక్‌గా డ్రగ్స్ తీసుకునే ఎంపీలు, అమ్మాయిలను వేధించే ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వారిని ఏమీ అనరు. కర్నూలులో గంగమ్మ అనే మహిళ పోలీసుల కస్టడీలో ఉండగానే చనిపోయింది. వీటిపై సీబీఐ విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. -
విమర్శించిన నోటితోనే 'గురూజీ' అని సంబోధించిన బండ్ల గణేష్
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన వ్యాఖ్యలతో, సోషల్ మీడియా పోస్ట్‌తో హాట్ టాపిక్‌గా మారారు. ఒకప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, ఇప్పుడు “థాంక్యూ గురూజీ.. మీ ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఆదర్శకుటుంబం సినిమా సెట్లో త్రివిక్రమ్‌ని బండ్ల గణేష్ కలిసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిన బండ్ల గణేష్, ఆయన ఆరోగ్యం, ఆనందం, విజయాలు కొనసాగాలని మనసారా ప్రార్థించారు. గతంలో ‘భీమ్లా నాయక్’ ఈవెంట్ సందర్భంగా బండ్ల గణేష్, త్రివిక్రమ్‌ను బూతు పదజాలంతో విమర్శలు చేసినట్టు అప్పట్లో ఓ ఆడియో వైరల్ అయింది. ఆ ఫంక్షన్‌కి బండ్ల గణేష్‌ను పిలవలేదు. దానికి కారణం త్రివిక్రమే అని ఆ టైమ్‌లో ఓ పవన్ కళ్యాణ్ అభిమానితో బండ్ల గణేష్ మాట్లాడిన ఆడియో కాల్ లీక్ అయి సంచలనం సృష్టించింది. ఆ ఆడియోలో త్రివిక్రమ్‌ను ఉద్దేశించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు బండ్ల గణేష్. నన్ను ఈవెంట్‌కు రాకుండా త్రివిక్రమ్ అడ్డుకున్నాడు, చూసుకుందాం అంటూ రెచ్చిపోయాడు. అయితే ఇప్పుడు అదే త్రివిక్రమ్‌ను 'గురూజీ' అని సంబోధిస్తూ కృతజ్ఞతలు తెలపడం నెటిజన్లలో చర్చనీయాంశమైంది. ఇటీవల మెగా ఫ్యామిలీకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కు దగ్గరైన బండ్ల గణేష్, చిరంజీవి ‘మెగా 158’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ - గణేష్ చాలా సన్నిహితంగా కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్‌తో కూడా కలిసిపోవడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. -
'ఓజీ 2' అప్డేట్.. ఆ డైరెక్టర్ని పవన్ పక్కనబెట్టేశారా?
రీఎంట్రీలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి సినిమాలు పవన్ చేసినప్పటికీ.. అవి అభిమానులకు తప్పితే మిగతా వాళ్లకు పెద్దగా నచ్చలేదు. తర్వాత చేసిన వాటిలో బ్రో, హరిహర వీరమల్లు చిత్రాలు ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. ఇలాంటి టైంలో 'ఓజీ' హిట్ కావడంతో పవన్‌లో కాస్త జోష్ వచ్చింది. గతేడాది సెప్టెంబరులో ఇది థియేటర్లలో రిలీజ్ కాగా ఆ టైంలో దీని సీక్వెల్‌పై టాక్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ విషయమై అప్డేట్ వచ్చేసింది.(ఇదీ చదవండి: సమంత సినిమాలు ఎప్పుడూ చూడలేదు: రాజ్ సోదరి)'ఓజీ' తీసిన దర్శకుడు సుజీత్.. మళ్లీ పవన్ కల్యాణ్‌ని కలిశాడు. ఈ ఫొటోని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నాయి. చూస్తుంటే త్వరలోనే షూటింగ్ మొదలయ్యేలా కనిపిస్తుంది. అంతా బాగానే ఉంది కానీ పవన్ కల్యాణ్‌తో కొన్నాళ్ల క్రితం సురేందర్ రెడ్డి ఓ మూవీ మొదలుపెట్టారు. అప్పటినుంచి ఆ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి అప్డేట్ లేదు. అయితే అది షూటింగ్ జరుగుతుందా? లేదంటే 'ఓజీ 2' కోసం పవన్.. సురేందర్ రెడ్డిని పక్కనబెట్టేశాడా అని సందేహాలు వస్తున్నాయి.మరోవైపు సుజీత్ కూడా నానితో 'బ్లడీ రోమియో' అనే సినిమా చేయాలి. ఈ మూవీ లొకేషన్స్ కోసమే రీసెంట్గా సుజీత్.. ఇంగ్లాండ్ వెళ్లొచ్చాడనే టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ దర్శకుడు పవన్‌ని కలవడం చూస్తే నాని మూవీ మొదలవడానికి ముందే 'ఓజీ 2' చేస్తారా అనిపిస్తుంది. ఈ సందేహాలన్నింటికి త్వరలో సమాధానమిస్తారేమో చూడాలి?(ఇదీ చదవండి: ఎట్టకేలకు 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్.. ఈసారైనా నమ్మొచ్చా?) -
న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో..
-
‘సుగాలీ ప్రీతి కేసులో పవన్ చెప్పేవన్నీ అబద్ధాలే’
సాక్షి,తిరుపతి: సుగాలీ ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై రోజా ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు హయాంలోనే సాక్ష్యాధారాలు తారుమారయ్యాయి. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్సార్సీపీనే అండగా నిలిచింది. అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని పవన్ అన్నాడు. రెండేళ్లయింది.. పవన్ ఇచ్చిన హామీని గాలికొదిలేశారు.. సాయికృష్ణ కేసులో పవన్ మాటలు చేతకానితనానికి నిదర్శనం.ప్యాకేజీలు తీసుకుని పవన్ బఫూన్లా మారారు. రాష్ట్రానికి చంద్రబాబు, పవన్, లోకేష్, అనిత శనిలా పట్టుకున్నారని రోజా విమర్శించారు. -
‘బాబుకు బీపీ డౌన్ కాగానే.. పవన్‌కు బీపీ పెరుగుతోంది’
సాక్షి, తాడేపల్లి: పవన్ కళ్యాణ్‌కి మతి భ్రమించిందని.. అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బీపీ డౌన్ కాగానే, పవన్ కళ్యాణ్‌కి బీపీ పెరుగుతోందన్నారు.‘‘పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడటం లేదు. వైఎస్సార్సీపీ నేతలను గూండాలతో పోల్చటం సిగ్గుచేటు. మమ్మల్ని తొక్కి నార తీస్తా అనటం ఏంటి?. ప్లేస్, టైం చెబితే మేమే వస్తాం.. నార తీయండి చూస్తాం. సాయికృష్ణను చిత్రహింసలకు గురి చేస్తున్నారనంటూ అతని తల్లి చేసిన రోదనలు వినపడలేదా పవన్?’’ అంటూ టీజేఆర్ నిలదీశారు.‘‘తన బిడ్డను చంపేశారని, కనీసం బూడిదనైనా ఇప్పించమని అడిగారు. ఆ తల్లికి మద్దతుగా వైఎస్ జగన్ నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదిగారు. ఇప్పుడు సాయికృష్ణ తల్లిని ఓదార్చితే కుల రాజకీయం అంటూ విమర్శిస్తున్నారు. సాయికృష్ణ నేరగాడనైతే మరి అతని కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు పిలిపించారు?. జనసేన నేత ఉదయభాను.. సాయికృష్ణ ఇంటికి ఎందుకు పంపించావ్ పవన్?. అంతకంటే ముందు తూర్పు నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్‌ను పంపలేదా?. కేసును రాజీ చేసుకోవాలని కోరలేదా?’’ అంటూ టీజేఆర్ ప్రశ్నించారు.‘‘సాయికృష్ణ నేరస్తుడైతే మాత్రం పోలీసులతో చంపేస్తారా?. మరి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంగతేంటి?. ఇళ్లపైకి వెళ్లి దాడులు చేస్తున్న చింతమనేనిపై ఏం చర్యలు తీసుకున్నారు?. కనీసం కేసు కూడా పెట్టలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇదికాదా పవన్?. కాపులంతా తనకు మద్దతుగా నిలబడితే సీఎం అవుతానని పవన్ చెప్పలేదా?. మరి తన సినిమాలను కూడా కాపులు మాత్రమే చూడాలని ఎందుకు చెప్పలేదు?. రాజకీయాలకు మాత్రం కులం కావాలా?..కుల రాజకీయాలు చేస్తూ ఇతరులను విమర్శించటం ఎందుకు?. ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబానికి పవన్ ఎందుకు సానుభూతి చెప్పలేదు?. దళితుడైన క్రాంతికుమార్ పవన్‌కు కనపడలేదా?. హోంమంత్రి పదవి మీద పవన్‌కు మనసు పడింది. అందుకే పదేపదే నేను హోంమంత్రినైతే.. అంటున్నారు. దళితురాలు అనిత హోంమంత్రిగా పనికి రాదని పవన్ చెప్తున్నారు. ముందుగా సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయండి. అతని మిస్సింగ్ వెనుకున్న పోలీసు పెద్దల పాత్రను బయట పెట్టండి’’ అని టీజేఆర్ సుధాకర్ బాబు హితవు పలికారు. -
మాట మార్చింది నువ్వు.. డిప్యూటీ సీఎం అవ్వగానే ఇంత మార్పా..? ఆ రోజు ఏం చెప్పారు..
-
నువ్వు మనిషివా పవన్ కళ్యాణ్.. బానిసగాడివి.. నువ్వు కూడా మాట్లాడుతున్నావా..
-
న్యాయం చేస్తానన్న పవన్.. ఆధారాలే లేవంటున్నాడు: సుగాలి పార్వతి
సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రీతి తల్లి సుగాలి పార్వతి తీవ్రంగా ఖండించారు. ఈ కేసును నీరుగార్చేందుకే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సుగాలి ప్రీతి కేసును అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందిన పవన్.. ఇప్పుడు అదే కేసుపై భిన్నంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసులోని నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం తమకు కలుగుతోందని పేర్కొన్నారు.డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై తాజాగా సుగాలి పార్వతి స్పందించారు. ఈ సందర్బంగా పార్వతి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కేసే తన మొదటి ప్రాధాన్యమని చెప్పిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చుతున్నారు. ఈ కేసులో పవన్ ఒక్క ఆదేశాలు జారీ చేయలేదు. టీడీపీ ప్రభుత్వంలో అఘాయిత్యం జరిగింది. ఈ అన్యాయంపై పవన్‌కు పూర్తిగా వివరించాను, ఆధారాలు కూడా ఇచ్చాను. అయినప్పటికీ ఇప్పటికీ న్యాయం చేయలేదు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశ్నించిన పవన్ ఇప్పుడు ఏమయ్యారు?. నిందితులకు అమ్ముడుపోయే విధంగా పవన్ వ్యహరిస్తున్నట్లుగా మాకు అనిపిస్తోంది. ఈ కేసులో ఆధారాలు తారుమారు అయ్యాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం దారుణం.సుగాలి ప్రీతికి న్యాయం చేయకపోయినా పర్వాలేదు. దీనిపై వక్రీకరించి వ్యాఖ్యలు చేయడం బాధ కలిగిస్తోంది. టీడీపీ ప్రభుత్వంలోనే కేసులో ఆధారాలను తారుమారు చేశారు. ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నా.. వాటిని తప్పుదోవ పట్టిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన పవన్ కళ్యాణ్ తన వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేదని వాపోయారు. కానీ, సుగాలీ ప్రీతి కేసును అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ మాట మారుస్తున్నారు. సుగాలీ ప్రీతి కేసును పవనే నీరుగారుస్తున్నారు.ఈ కేసులో నిందితులను వీదేశాలకు పంపించేందుకు అనుమతులు ఇస్తున్నారు. ప్రస్తుతం స్థానిక మంత్రితో కలిసి నిందితులు తిరుగుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే మాకు న్యాయం చేశారు. సుగాలీ ప్రీతి ఆత్మకు శాంతి కలిగించే విధంగా నేను పోరాటం చేస్తాను. మా కుమార్తె కోసం వీల్ చైర్ యాత్రను ప్రారంభిస్తాను. తప్పకుండా న్యాయం కోసం పోరాటం చేస్తాం’ అని తెలిపారు. -
సుగాలి ప్రీతి కేసుపై పవన్ కల్యాణ్ పచ్చి అబద్ధాలు
సాక్షి, కాకినాడ: సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు వల్లె వేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో సాక్ష్యాలు తారుమారు కాగా, గత ప్రభుత్వంలో తారుమారు చేశారంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. సుగాలి ప్రీతి తల్లిని వంచించేలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్‌లోనే చెరిపేశారు. పోయిన సాక్ష్యాధారాలను మనం తిరిగి తీసుకురాలేం. ఫాల్స్ డీఎన్ఏ పెట్టేశారు. క్రైమ్ సీన్లో సాక్ష్యాధారాలు కీలకం. నిర్థారించడానికి కోర్టులు అడిగేవి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్.. ఎవిడెన్స్ లేకపోతే మాత్రం మనం ఎవరిని కూడా మన కళ్ల ముందు తెలిసినా సరే మనం ఏమీ చేయలేం’’ అంటూ సుగాలి ప్రీతి కేసు విచారణపై పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. -
అంతా అతని ఆధ్వర్యంలోనే జరిగింది! ఇది నిజం ..
-
నీ గబ్బర్ సింగ్ సినిమా చూసి..నాగరాజు రెచ్చిపోయినట్టున్నాడు పవన్ ను ఏకిపారేసిన జడ శ్రవణ్
-
జగన్ 2.0 చీకటిపై దండయాత్ర..
-
ఆ పిల్లాడి దగ్గరకు వెళ్లి నువ్వు పీకిందేంటి... చుట్టూ కెమెరాలు పెట్టి..
-
చంద్రబాబూ.. ప్రజల కోసమా?.. పబ్లిసిటీ కోసమా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రకటనలు భలే తమాషాగా ఉంటాయి. జనం నమ్ముతారా? లేదా? అన్నదానితో ఆయనకు నిమిత్తం ఉండదు. ప్రజలు వింటున్నారా? లేదా? అన్నదానితో సంబంధం ఉండదు. తన టీమ్ రాసిచ్చిన స్క్రిప్ట్‌లోని పాయింట్లను అన్నిటిని చెప్పానా? లేదా? అన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో చంద్రబాబు ఆయా సభలలో చేసిన ఒక వ్యాఖ్య చూడండి. 'బటన్ నొక్కితే పైశాచిక ఆనందం ఉంటుంది తప్ప ప్రజలను కలిసి వారి కష్ట సుఖాలను తెలుసుకునే పరిస్థితి ఉండదు" అని ఆయన అన్నారు. ఇది గత ముఖ్యమంత్రి జగన్‌పై చేసిన పరోక్ష ఆరోపణ అని తెలుస్తూనే ఉంది. కాని ప్రజలు తమకు ప్రభుత్వంలో ఉన్నవారు ఇస్తామన్న సంక్షేమ స్కీమ్‌లు ఇచ్చారా? లేదా? తమకు ఆర్థిక ప్రయోజనం చేకూరిందా? లేదా? అన్నది చూస్తారు తప్ప, తమ ఇంటికి ముఖ్యమంత్రి వచ్చి పెన్షన్ అందించారా?లేదా? అని ఎవరైనా ఆలోచన చేస్తారా? అసలు ఇలాంటి వ్యాఖ్యలు చంద్రబాబు ఎందుకు చేస్తున్నారు? దానికి కారణం లేకపోలేదు.గత జగన్ ప్రభుత్వం వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్ అందించడమే కాకుండా, వారికి అన్ని అవసరాలలోనూ వెన్నంటి ఉండేవారు. ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్లడం అంటే ఏమిటో ఆ రోజుల్లో జనం చూశారు. ఆ వ్యవస్థ ప్రజల మన్ననలు పొందిందని గుర్తించారు. అంతే! వెంటనే పరకాయ ప్రవేశం చేసేశారు. తాము వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, జగన్ ఐదువేల రూపాయల గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారని, టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తే పదివేలు ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రకటన చేశారు. పైగా అది కూడా తెలుగువారంతా పవిత్రంగా భావించే ఉగాది నాడు పూజలు చేసి మరీ చంద్రబాబు ఈ ఉపన్యాసం ఇచ్చారు. ఎవరినైనా మోసం చేయాలనుకుంటే వారికి ఏదైనా ఆశ చూపాలని ఒక సినిమా డైలాగు ఉంటుంది. అందులో ఒక వ్యక్తి తనకు భోజనం చేయడానికి డబ్బు లేదని సాయం చేయాలని రోడ్డు పక్కన ఉన్న ఒకాయనను అడుగుతాడు. అతను డబ్బు ఇవ్వడానికి అంగీకరించడు. పైగా తిడతాడు. ఆ తర్వాత అదే వ్యక్తి తన వద్ద ఉన్న వాచ్ ఖరీదు ఐదువేలు అని, తనకు అత్యవసరం కనుక 500 రూపాయలకే ఇవ్వాలని అనుకుంటున్నానని, తీసుకోండని రోడ్డు పక్కన నిలబడి ఉన్న అతనినే కోరతాడు. నిజానికి దాని ఖరీదు 150 రూపాయలే. ఆ వాచ్‌ను పరిశీలించిన అతను 400 రూపాయలకు ఇస్తే తీసుకుంటానని అంటాడు. ఆ రకంగా వాచ్ అమ్మిన వ్యక్తి లాభపడతాడన్నమాట.ఆశకు లొంగి రెండో వ్యక్తి మోసపోయాడన్నమాట. ఈ కథకు, చంద్రబాబు ప్రకటనకు నేరుగా సంబంధం ఉందా? లేదా అన్నది పక్కనబెడితే, ప్రజలను ఆశపెట్టి వారికి ఆకర్షించడంలో చంద్రబాబు సిద్దహస్తుడే అన్న అభిప్రాయం ఉంది. ఆ రకంగా వలంటీర్లను వలలో వేసుకుని, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి మొత్తం వలంటీర్ల వ్యవస్థకే పంగనామాలు పెట్టారు. దాంతో అంతకుముందు జగన్ టైమ్‌లో ఇచ్చిన ఐదువేల గౌరవ వేతనం రాకుండా పోయింది. అలాగే ప్రజలు తమ ఇళ్లవద్దనే అందుకుంటున్న సేవలకు మంగళం పలినట్లయింది. పైగా పెన్షన్ ఇవ్వడానికో, లేదా మరో కార్యక్రమం నిమిత్తమో చంద్రబాబు ప్రత్యేక హెలికాఫ్టర్ వేసుకుని వెళతారు. దీనికి లక్షల్లో ఖర్చు చేయాలి. అలాగే వెళ్లిన గ్రామంలో సభ నిర్వహణకు మరిన్ని లక్షల రూపాయల ప్రజల సొమ్ము ఖర్చు చేయాల్సి ఉంటుంది.వృద్దాప్య పెన్షన్ జగన్ టైమ్‌లో మూడువేల రూపాయలు ఉండేది. దానిని వలంటీర్ల ద్వారా మొదటి తేదీ తెల్లవారేసరికల్లా అందించేవారు. ఇప్పుడు దానికి ఒక వెయ్యి రూపాయలు కలిపి నాలుగువేల రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు హెలికాఫ్టర్ టూర్ చేయడం గొప్ప సంగతి అని ప్రొజెక్టు చేసుకుంటున్నారు. ఒక ఇంటికి వెళితేనే ఆయనకు అంత తృప్తి అయితే, వైఎస్సార్సీపీ హయాంలో అందరి ఇళ్లకు వలంటీర్లు వెళ్లి పెన్షన్ అందిస్తే, అది ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ప్రతి ఇంటికి వెళ్లి ఇచ్చినట్లవ్వదా! అన్నది వైఎస్సార్సీపీ ప్రశ్న. పోనీ ఇలా గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడైనా చేశారా? అంటే లేదు.1995 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన పవర్ లో ఉన్నారు కదా! ఆ టైమ్‌లో ఈ ఆలోచన ఎందుకు చేయలేదు? ఇప్పుడు వలంటీర్ల బదులు గ్రామ సచివాలయ ఉద్యోగులను ఇళ్లకు పంపే ప్రయత్నం చేస్తున్నారు కాని, అది అంత సఫలం అవుతున్నదా? అన్నది చర్చ ఉంది. కాగా సచివాలయ ఉద్యోగులను కూడా ప్రభుత్వం వేధిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది ఈ వేధింపులను ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి.గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ ఒక్కటే కాదు. పౌరసరఫారాల శాఖ అందించే బియ్యం, ఇతర వస్తువులను కూడా వలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఇచ్చేవారు. మరి ఇప్పుడు ఇవ్వడం లేదే! అప్పట్లో ప్రత్యేకంగా వ్యాన్లు పెట్టి సరుకులను డోర్ డెలివరీ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ షాపులకు వెళ్లి జనం సరుకులు తీసుకోవలసి వస్తోంది. అనేక చోట్ల ప్రజలు క్యూలలో, రద్దీలో గుమికూడవలసి వస్తోంది. ఇది ప్రజలకు సౌకర్యం కల్పించినట్లు అవుతుందా? ఇదే కాదు.. ప్రజలు అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో కాని, అప్లికేషన్లు పెట్టుకోవడంలో కాని, అనేక రకాలుగా వలంటీర్ల సేవలను ప్రజలు పొందేవారు. ఆ వ్యవస్థను తీసివేసి కనీసం వివరణ కూడా ఇవ్వలేదు.వలంటీర్లు ఆందోళనలు చేసి కూటమి ప్రభుత్వంలో తమ ఖర్మ ఇంతేలే అని సరిపెట్టుకున్నారు. జగన్ కూడా కొన్ని స్కీమ్‌ల అమలు నిమిత్తం ఆయా చోట్ల సభలు నిర్వహంచకపోలేదు. అయినా జగన్ బటన్ నొక్కడమే చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అది వేరే సంగతి. విపక్షంలో ఉన్నప్పుడు బటన్ నొక్కడం ఏముంది.. మూలన ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని విమర్శలు చేసేవారు. తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత బటన్ నొక్కడం తప్పు అన్నట్లు చెబుతున్నారు. ఒకవైపు పొదుపు మంత్రం చెబుతూ, దుబారాపై ఆదేశాలు ఇస్తూ, తానేమో ప్రజల డబ్బును లక్షలలో వృధా చేస్తున్నారు. అది గొప్ప విషయం అని జనాన్ని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు.వృద్దాప్య పెన్షన్‌ను సీఎం ఇచ్చినా, వలంటీర్ ఇచ్చినా లబ్దిదారులకు తేడా ఉండదు. వారికి కావల్సింది ఆర్థికసాయమే. వెయ్యి రూపాయలు ఇచ్చి లక్ష రూపాయల ప్రచారం చేసుకోవలన్నదే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తుంది. ఎన్నికల మానిఫెస్టోలోని అంశాలలో అనేకమైన వాటిని ఎగవేసి, దానిని కవర్ చేసుకునేందుకు చంద్రబాబు నానా పాట్లు పడడానికి ఈ సభలు, ఈ జిమ్మిక్కులు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రజలను స్వయంగా కలిసి కష్ట సుఖాలను నిజంగా చంద్రబాబు తెలుసుకుంటున్నారా? లేక తన పబ్లిసిటీలో భాగంగా దీనిని ఒక ఈవెంట్ గా మార్చారా? అన్నది చర్చనీయాంశమే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
లాకప్‌డెత్‌తో సర్కారు ఉక్కిరిబిక్కిరి
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో సంచలనం రేసిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ ఘటన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు ప్రజలను మభ్యపెట్టి, ఈ ఘటనను తాము సీరియస్‌గా తీసుకున్నట్లు ప్రభుత్వం కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. నెల రోజులుగా సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై ఏమాత్రం స్పందించని ప్రభుత్వం.. లాకప్‌డెత్ అని బయట పడగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు సమీక్ష నిర్వహించి, కంటి తుడుపు చర్యగా సీఐ నాగరాజును సస్పెండ్ చేయడం డ్రామాలో భాగమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి సీఐ సస్పెన్షన్ ద్వారా బాధితులను శాంతపరిచే ఎత్తుగడ వేసినట్లు.. సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారా విచారణ పేరుతో నిదానంగా పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే యత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తెలివిగా తప్పుకున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కాపులు రగిలిపోతున్నారని, కాపుల్లో చీలిక వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారాన్ని పవన్‌కళ్యాణ్ చూస్తారని, అన్ని విషయాలు ఆయనకే వివరించాలని సీఎం చంద్రబాబు.. డీజీపీకి సూచించడం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తద్వారా ఈ వివాదం నుంచి చంద్రబాబు తెలివిగా తప్పుకొని, పవన్ కళ్యాణ్‌కు అంట గట్టినట్టు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో వైపు ఎవరి ప్రోద్బలం లేకుండానే ఒక సీఐ.. కాపు యువకుడిని కొట్టి చంపి, శవాన్ని తగలబెట్టేంత సాహసం ఎలా చేస్తారని పోలీసు వర్గాల్లో సైతం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం ఇంకా ముదరకుండా చూసుకోవాలంటూ అటు డీజీపీకి, ఇటు పవన్ కళ్యాణ్‌కు సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు కాపు ప్రముఖులతో మాట్లాడాలంటూ పవన్‌కు సూచించినట్లు తెలిసింది. అయితే మొన్నటిదాక కులం అవసరం లేదంటూ చెబుతూ వచ్చిన వపన్ కళ్యాణ్, ఇప్పుడు ఉన్నట్లుండి కాపులను బుజ్జగించాల్సి రావడం తలనొప్పేనని జనసేన వర్గాలు అంతర్మథనం చెందుతున్నాయి. జనసేనలో కలకలం‘అన్యాయంగా మా బిడ్డను తీసుకొచ్చి చంపేస్తే, జనసేన తూర్పు ఇన్చార్జి అమ్మిశెట్టి వాసు వచ్చి రూ.50 లక్షలు ఇప్పిస్తా.. రాజీ చేసుకుందామని బేరం పెట్టారని బాధిత కుటుంబం వెల్లడించడం జనసేనలో కలకలం రేపుతోంది. ఇక్కడ లాకప్‌డెత్ అయింది కాపు యువకుడు, జనసేన కుటుంబ సభ్యుడు. అయితే బాధిత కుటుంబం వద్దకు కేసు రాజీ కోసం ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా వచ్చింది కాపు నేత కావడం జనసేనలో కలకలం రేపుతోంది. బాధిత కుటుంబం తరఫున గట్టిగా నిలబడి పోరాటం చేయాల్సిందిపోయి.. చంద్రబాబుకు, టీడీపీకి ఊడిగం చేసేలా ఇదేం పనంటూ ఆ పార్టీ శ్రేణుల్లో.. ప్రత్యేకించి కాపుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ‘మేమూ జనసేనకు చెందిన వాళ్లమే’ అంటూ కుటుంబ సభ్యులు ఐడీ కార్డులతో ప్రెస్ మీట్ పెట్టడం జనసేనకు ఇబ్బందిగా మారింది. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ విషయంలో స్పందించాలంటూ సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నవరంగ్ చేసిన వ్యాఖ్యలు జనసేనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా కేసు రాజీ చేసుకోకపోతే జనసేన పార్టీకి ఇబ్బందులు తప్పవని గ్రహించి, రాజీ కోసం కొత్త దారులు వెతుకుతున్నట్లు తెలిసింది.ప్రభుత్వంపై మండిపడుతున్న కాపులుసాయికృష్ణ ఉదంతంతో చంద్రబాబు ప్రభు త్వంపై కాపు సామాజిక వర్గం మండిపడుతోంది. అధికారంలోకి రావడం కోసం 2024 ఎన్నికల్లో తమను వాడుకున్న చంద్రబాబు, లోకేశ్‌లు.. అధికారంలోకి వచ్చాక కరివే పాకులా తీసిపారేశారని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో టీడీపీ నేతలు, కాపు వర్గీయులపై దాడులకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంతో కళ్లుమూసుకుపోయి వ్యవహ రిస్తున్నారని కాపు నేతలు ధ్వజమెత్తుతున్నారు. కాపు సామాజిక వర్గాన్ని చూపించి, చంద్రబాబుతో పొలిటికల్ డీల్ కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చిన తరు వాత రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని చెబుతున్నారు. ఆయన రాజ కీయ అధికారం కోసం ఉపయోగపడిన కాపు లను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.ఇప్పుడేం చేద్దాం?సాయికృష్ణ వ్యవహారంపై సీఎం, డిప్యూటీ సీఎం మంతనాలుఆందోళనల నేపథ్యంలో డీజీపీతో చర్చసాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంపై ఆందోళనలు వెల్లువెత్తడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటన నుంచి బుధవారం తిరిగి వచ్చిన చంద్రబాబు.. వెలగపూడి సచివాలయానికి చేరుకుని పవన్‌తో కలిసి ఈ ఘటనపై సమీక్ష జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేష్ చంద్ర లడ్హా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబులతో ఏం చేద్దామని చర్చించినట్లు తెలిసింది. విజయవాడ నగరంలో ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వం ఇరుకున పడాల్సి వస్తుందని తెలియదా.. అని పోలీస్ కమిషనర్‌ను సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. ఘటనకు కారణమైన సీఐ నాగరాజును ఇప్పటికే వీఆర్‌కు పంపామని చెప్పగా, సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులు ఎవరో తేల్చాలని చెప్పారు. ఈ వ్యవహారంలో నాగరాజు ఎందుకు అంత దూకుడుగా వ్యవహరించాల్సి వచ్చిందని ప్రశ్నించినట్లు తెలిసింది. సాయికృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అతని మేనమామ జనసేన పార్టీ కీలక కార్యకర్త కావడంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇకపై ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రతి అంశాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చెప్పాలని డీజీపీకి సూచించినట్లు తెలిసింది. రాజకీయంగా ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఎలా స్పందించాలనే దానిపైనా పవన్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. మీడియా ద్వారా ప్రభుత్వ వాదన వినిపిస్తే ఎలా ఉంటుందని చర్చించినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు మాట్లాడితే ప్రజల్లో ఇంకా ఆగ్రహం పెల్లుబికే అవకాశం ఉందని, ఆచితూచి వ్యవహరిద్దామని నిర్ణయించారు. మీడియాకు మాత్రం ఈ ఘటనపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, నిష్పాక్షికంగా విచారణ జరపాలని చెప్పినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంలో సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు సీఎంవో వర్గాలు బుధవారం రాత్రి అధికారికంగా వెల్లడించాయి. సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ నిర్వహించాలని కూడా సీఎం ఆదేశించినట్టు తెలిపాయి. -
సాయికృష్ణ కేసు.. కంటితుడుపు చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం
సాక్షి,కృష్ణ: విజయవాడలో సంచలనంగా మారిన గాదె సాయికృష్ణ కేసుపై కూటమి ప్రభుత్వం స్పందించింది. కంటితుడుపు చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. సాయికృష్ణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. నెల రోజులుగా సాయి కృష్ణ మిస్సింగ్‌పై ప్రభుత్వం స్పందించలేదు.తాజాగా, సాయికృష్ణ కేసుపై చంద్రబాబు, పవన్ సమీక్ష నిర్వహించారు. -
పవన్ కామెంట్స్ పై GEN-Z ఫైర్
-
కుక్కలకు ఇంచార్జ్ పదవులు ఇస్తారా..? లైవ్ లో పవన్ కళ్యాణ్ ను కడిగి పడేసిన సాయి కృష్ణ మేనమామ..
-
బాబూ, పవన్ మాటల్లో హరితాంధ్ర.. చేతల్లో విధ్వంసాంధ్ర!
రాష్ట్రంలో ఏభై శాతం పచ్చదనమే లక్ష్యం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిరోజుల క్రితం చేసిన ప్రకటన ఇది. హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ సందేశం.. ఇవి వినడానికి ఎంత బాగున్నాయి.. నిజంగానే వీరిద్దరూ అదే లక్ష్యంతో పనిచేస్తుంటే అభినందించవచ్చు. కానీ జరుగుతున్నదేమిటి?. ఏపీలో ఈ మధ్య కాలంలో జరిగినంత పర్యావరణ విధ్వంసం మరెన్నడూ జరిగి ఉండదంటే అతిశయోక్తి కాదు.ఒకవైపు విశాఖలో కొండలను పిండి చేసేస్తున్నారు. ఇంకో వైపు డేటా సెంటర్ల పేరుతో విపరీతమైన కాలుష్యానికి కారకులయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అమరావతి రాజధాని పేరుతో వేల ఎకరాలలోని పచ్చటి భూములను ఎండబెట్టారు. కృష్ణానది తీరంలోనే నిబంధనలకు విరుద్దంగా నిర్మాణం అయిన భవనాలలోనే ముఖ్యమంత్రి, కీలక మంత్రి నివసిస్తారు. అయినా పర్యావరణ దినోత్సవం నాడు మాత్రం గొప్పగా ఉపన్యాసాలు ఇస్తుంటారు. తద్వారా ఇది మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని ఒకటికి పదిసార్లు రుజువు చేసుకుంటున్నారని అనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో అమరావతిలో కానీ, ఇప్పుడు విశాఖలో కాని ఎండలు తగ్గించాలని అధికారులను ఆదేశిస్తే వేడి తగ్గిపోతుందా? ఒక నాలుగు కిలోమీటర్ల దూరం ముఖ్యమంత్రి బ్యాటరీ సైకిల్ తొక్కి ఫొటోలకు పోజులు ఇస్తే పర్యావరణాన్ని కాపాడినట్లు అయిపోతుందా?.అవసరమైన మేర భూమి తీసుకుని కావల్సిన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి, వేల ఎకరాల పచ్చటి పొలాలను సమీకరించి, వేల కోట్లను ఓ 30 గ్రామాల పరిధిలో వెచ్చిస్తే ఏపీ ప్రజలందరికీ ఎలా ఉపయోగం జరుగుతుందో తెలియదు. అమరావతి గ్రామాలలో భూమి స్వభావం భారీ భవంతుల నిర్మాణానికి అనువుకాదని పలువురు నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు అనుసరించవలసిన పలు షరతులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించినా వాటిని గాలికి వదలివేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే 2019 ఎన్నికలకు ముందు జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అందులో అమరావతిలో జరుగుతున్న పర్యావరణ వినాశనం గురించి పవన్ గట్టిగా మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్నది తప్పు అని స్పష్టంగా చెప్పారు. అవసరమైతే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని కూడా ఆయన ఆనాడు హెచ్చరించారు.2024 నాటికి ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. వెంటనే ఆయన వైఖరి కూడా మారిపోయింది. ఇప్పుడు అమరావతిలో పర్యావరణ విధ్వంసాన్ని సమర్థిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు కృష్ణా తీరం వెంబడి ఉన్న కరకట్ట ఇంటిలో ఉండడాన్ని కూడా పవన్ ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చాక ఆ ఇంటిని చంద్రబాబుకు అద్దెకు ఇచ్చిన లింగమనేని రమేష్‌ను జనసేన పక్షాన రాజ్యసభకు పంపారు. ఈయన చంద్రబాబును మించి అవకాశవాదం ప్రదర్శిస్తున్నట్లుగా అనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ రిషికొండపై అప్పటికే ఉన్న టూరిజం నిర్మాణాలను తొలగించి ప్రతిష్టాత్మకమైన రీతిలో కొత్త భవనాలను నిర్మిస్తే అది పర్యావరణానికి విఘాతం కలిగిస్తోందని, కొండకు గుండు కొడతారా అంటూ దుర్మార్గంగా చంద్రబాబు, పవన్ విమర్శించేవారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అయితే శరభ, శరభ అంటూ పూనకం వచ్చినట్లు వార్తలు ఇచ్చేది. ఇప్పుడు మొత్తం ప్లేట్ ఫిరాయించారు. గూగుల్ అదానీ డేటా సెంటర్ పేరుతో వందల ఎకరాల కొండలను ఇచ్చేశారు. వాటిని ఆ సంస్థలు తవ్విపారేస్తున్నా కిక్కురునడం లేదు. ఇప్పుడు సింహాచలం కొండలకు గుండు కొట్టినా అది సుందరమేనని వీరు భావిస్తున్నారు. డేటా సెంటర్ల వల్ల పెద్దగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. అమెరికా వంటి అభివృద్ది చెందిన దేశాలు డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల కలిగే కాలుష్యం, నీటి సమస్య, కరెంటు సమస్య వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని వ్యతిరేకిస్తున్నాయి. దానితో ఆ బహుళజాతి సంస్థలు అభివృద్ది చెందని, అభివృద్ది చెందుతున్న భారత్ వంటి దేశాలపై దృష్టి పెట్టాయని అమెరికాకు చెందిన ఒక మీడియా ఓ కథనాన్ని ఇచ్చింది. డేటా సెంటర్లు రావడం వల్ల ఏపీకి ప్రయోజనం అయితే స్వాగతించవచ్చు. కానీ వాటివల్ల ఎక్కువగా పర్యావరణ అనర్థం జరుగుతుంటే, దానికి ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించకపోతే విశాఖకు తీరని నష్టం జరుగుతుందన్న భావన ఉంది. దానిపై ప్రజలలో కూడా అలజడి ఏర్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు డేటా సెంటర్ల వల్ల వచ్చే సమస్యలను ఆలోచించకుండా, కేవలం రాజకీయ కోణంలోనే మాట్లాడితే ఏపీకి ముఖ్యంగా విశాఖకు ఏం ప్రయోజనం కలుగుతుంది?. పైగా ఆ కంపెనీలకు వేల కోట్ల రాయితీలు ఇవ్వడంపై మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ దీనిపై అభ్యంతరం చెబుతూ ఇప్పటికే చంద్రబాబుకు లేఖ రాశారు. రిలయన్స్ సంస్థ ప్రతిపాదిస్తున్న డేటా సెంటర్‌కు ఏభై వేల కోట్లు రాయితీలు ఇస్తున్నారని, అయినా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని అడగడం లేదని ఆయన అన్నారు. వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయో, రావో తెలియని గూగుల్ డేటా సెంటర్‌కు 22వేల కోట్ల రాయితీలు ఇస్తున్నారు. మరో పర్యావరణవేత్త బొలిశెట్టి సత్య విశాఖ కొండలను తొలిచివేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. కొండపై జగన్ నిర్మాణం చేస్తే విధ్వంసం, కూటమి ప్రభుత్వం చేస్తే అభివృద్ది అవుతుందా? అని ప్రశ్నించారు.ఇక సముద్ర తీరంలో నిర్మాణాల నిమిత్తం సీఆర్‌జడ్ నిబంధనల మార్పునకు సూచనలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాయడంపై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు విశాఖ బీచ్‌లో మద్యం పాకలను అనుమతించడంపై కూడా జనం మండిపడుతున్నారు. అమరారాజా బ్యాటరీస్ సంస్థ నుంచి వెలువడే కాలుష్యాన్ని సరిచేసుకోవాలని జగన్ ప్రభుత్వం నోటీసు ఇస్తే, పరిశ్రమను తరిమేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన ఘనత టీడీపీది, ఎల్లో మీడియాదే. ఇప్పుడేమో కాలుష్యంపై మరో రకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులో ఒక విశిష్టత ఉంది. ఆయన సందర్భాన్ని బట్టి అభిప్రాయాలను మార్చేసుకుంటారు. కొద్ది కాలం క్రితం సమీక్షలో అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఇతర శాఖల ప్రతిపాదనలకు గాను అడవులలో చెట్టు నరకడానికి, నిర్మాణాలకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన కోప్పడ్డారు. పర్యావరణ దినోత్సవం నాడు మాత్రం ఏభై శాతం పచ్చదనమే లక్ష్యమని గంభీర ప్రకటనలు చేశారు.ఏపీలో కాలుష్య సమస్య ఎంత తీవ్రంగా ఉన్నది ఈ మద్య పవన్ రాజమండ్రి సందర్శన సందర్భంగా మరోసారి బయటపడింది. పేపర్ మిల్లు వ్యర్ధ జలాలపై తనకు ఎదురైన సమస్యను మంత్రి దుర్గేష్ వివరించగా, ఆయనపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసి, ఆ పరిశ్రమ వారు తనతో మాట్లాడాలని అన్నారట. రాబోయే గోదావరి పుష్కరాలలో కెమికల్ స్నానాలు చేస్తారా అని కూడా పవన్ సీరియస్‌గా ప్రశ్నించారు. దీనిని బట్టే గోదావరిలో ఏ మేరకు కాలుష్యం ఉందో అర్దం చేసుకోవచ్చు. ఏడాదిలోగా దీని నివారణకు ఏ మేరకు చర్యలు తీసుకుంటారన్నదానిపై ఆయనే సందేహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరిలో నదీ కాలుష్యం తీరుతెన్నులను కూడా ప్రస్తావించారు. చిత్తశుద్దితో ఆయన కాలుష్య నివారణకు ప్రయత్నిస్తే మంచిదే. కానీ, ఏదో సినిమాటిక్‌గా డైలాగులు చెప్పి ఊరుకుంటే ఉపయోగం ఉండదు. గ్రామాలలో చెత్త లేకుండా చేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పినా, పరిస్థితి పెద్దగా మారినట్లు కనబడదు. ఏది ఏమైనా పర్యావరణ పరిరక్షణను ఒక నినాదంగా మార్చేసి తాము చేయవలసిన విధ్వంసం యథావిధిగా కొనసాగిస్తే ఏపీకి తీరని నష్టం చేసినవారు అవుతారేమోనన్న విషయాన్ని కూటమి పాలకులు ఆలోచించుకోవాలి. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పవన్.. మీరా యువతకు ప్రతినిధి?
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)పై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. వ్యవస్థలోని లోపాలు, నిరుద్యోగం, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలు, రాజకీయ పార్టీల వైఫల్యాలపై యువత వ్యక్తం చేస్తున్న అసంతృప్తికి ప్రతీకగా రూపుదిద్దుకున్న కాక్రోచ్ ఉద్యమాన్ని పవన్ కళ్యాణ్ తీవ్ర పదజాలంతో విమర్శించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఢిల్లీలో జరిగిన జనసేన సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. సుమతీ శతకంలోని ఉదాహరణను చెబుతూ చిన్న చీమలు కూడా బలమైన సర్పాన్ని చంపగలవని, అలాగే చిన్న చిన్న వ్యక్తులు, చిన్న చిన్న ఆలోచనలతో దేశ సమగ్రతకు భంగం కలిగించే అవకాశం ఉందన్నారు. ఇలాంటి విభజనవాద ఆలోచనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ అలాంటి వాటికి సపోర్ట్ చేయవద్దని సూచించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు. ‘కాక్రోచ్’కు దేశవ్యాప్తంగా మద్దతిస్తే పవన్‌కు తప్పుగా కనిపిస్తోందా..? నీట్ అక్రమాలపై నిరసనగా మే 16న అభిజీత్ డిప్కే అనే యువకుడు సీజేపీని ప్రారంభించాడు. ఈ పార్టీకి స్వల్ప వ్యవధిలోనే సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ లభించింది. సామాజిక వేదికలకు లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు. ‘ఒక ఉద్యమాన్ని మీరు ఎప్పటికీ అణచివేయలేరు. వ్యవస్థ పగుళ్లలో సైతం మేము జీవిస్తాం’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా యువత ఈ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో లక్షలాది మంది యువత ఈ ఉద్యమానికి మద్దతుగా పోస్టులు, మీమ్స్, వీడియోలు పెడుతున్నారు. రాజకీయ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తడం, పాలక వర్గాల వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజా సమస్యలపై దృష్టి సారించడం ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అందుకే యువతలో దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువత ఆవేదన వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోకుండా, ఆ ఉద్యమాన్ని అవమానకర పదజాలంతో పవన్ కళ్యాణ్ కొట్టిపారేయడం సరైన రాజకీయ వైఖరి కాదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు, నిరసనలు సహజమని, వాటిని వినిపించే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని పవన్‌కు వారు గుర్తు చేస్తున్నారు. ఒక ఉద్యమంతో ఏకీభవించకపోవచ్చు కానీ దాని వెనుక ఉన్న భావజాలాన్ని, సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా పవన్‌కు ఉన్నప్పటికీ తెర వెనుక అజెండాతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని వారు చెబుతున్నారు. యువతకు మీరా ప్రతినిధి...?? యువతకు ప్రతినిధిగా, మార్పు కోసం, ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇలా జెన్‌జీ యువతను, వారు ఆదరిస్తున్న సీజేపీని ఎగతాళిగా మాట్లాడటంపై యువతరం మండిపడుతోంది. యువత వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని దేశద్రోహంగా లేదా సమాజ వ్యతిరేక ధోరణిగా చిత్రీకరించడం సమస్యల మూలాలను కప్పిపుచ్చే ప్రయత్నంగా మారుతుందని మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు యువత నిరుద్యోగం, అవకాశాల కొరత, పాలనలో పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తుతుంటే, మరోవైపు వారి ఆలోచనలను కొట్టిపారేస్తూ పవన్ మాట్లాడటం యువతను పవన్‌కు మరింత దూరం చేసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీపై వచ్చిన స్పందనను పవన్ చెప్పినట్లు కేవలం సోషల్ మీడియా ట్రెండ్‌గా కాకుండా, యువతలో పెరుగుతున్న అసంతృప్తికి అద్దం పట్టే సామాజిక సంకేతంగా చూడాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. యువత స్వరాన్ని వినేందుకు జనసేన నాయకత్వం సిద్ధంగా ఉందా? లేక తమకు నచ్చని అభిప్రాయాలను ఎగతాళి చేస్తూ చిన్నచూపు చూస్తుందా? అనే ప్రశ్నలు పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఏకిపడేస్తున్న నెటిజన్లు కాక్రోచ్ జనతా పార్టీ గురించి, జెన్ జీ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్‌లు, రీల్స్, వార్తా కథనాలు సోషల్ మీడియా వేదికల్లో షేర్ అవుతున్నాయి. ‘నీట్ పేపర్ లీక్ అవ్వడాన్ని పవన్ సమర్థిస్తున్నారా’ అని పలువురు నిలదీశారు. ‘నిలకడ లేదు.. విలువలు లేవు’ అంటూ పవన్ ద్వంద్వ వైఖరిని మరికొందరు తప్పుబట్టారు. ‘విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేస్తే విభజనవాదం ఎలా అవుతుంది’ అంటూ ఇంకొందరు నిలదీస్తున్నారు. ప్రధానంగా ‘నేషన్ ఫస్ట్ అనేది వాస్తవమేగానీ, యువత లేకుండా దేశం ఎక్కడుంది’ అని పవన్ కళ్యాణ్‌ను దుమ్మెత్తి పోస్తున్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపైన, విద్యార్థుల భవిష్యత్తుపైన పవన్ కళ్యాణ్ మాట్లాడాలని సామాజిక మాధ్యమాల వేదికగా యువత పవన్‌ను డిమాండ్ చేస్తున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టామని, అధికారంలోకి వచ్చాక ఏపీలో జరిగే ఏ తప్పునూ ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి మరీ కాక్రోచ్ జనతాపార్టీ, జెన్ జీ యువతని కించపరుచ్తూ మాట్లాడి సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. -
పవన్ కళ్యాణ్ సారు జర ఇది కొంచెం చూడండి!
-
‘కాంగ్రెస్ రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడింది’
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సరిగా జరగలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజనలో కాంగ్రెస్ రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మవంచనతో పనిచేస్తుందని విమర్శించారు. ఏపీ విభజనలో వారసత్వపు ఆస్తుల వివాదాలు ఇంకా అలానే ఉన్నాయని, తెలంగాణలో తన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. 12 ఏళ్లు అయినా ఇప్పటికీ తెలంగాణ అమరులను గుర్తించలేదన్నారు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. ఈరోజు( సోమవారం, జూన్ 15వ తేదీ) పవన్ అంతకుముందు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న తీరుపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు మాట్లాడితే నడవదని విమర్శించారు. తెలంగాణ ఎలా వచ్చిందో ఆ సినీనటుడు తెలుసుకోవాలంటూ ధ్వజమెత్తారు. ‘ఎవరో ఉప్పందిస్తే పవన్ మాట్లాడడం మానుకోవాలి. ఇదేం సినిమా కాదని పవన్ కల్యాణ్ గుర్తు పెట్టుకోవాలి. విభజన గురించి మాట్లాడడమంటే వ్యతిరేకించినట్లే’’ అని చెప్పారు. -
ఆ సినీనటుడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి: టీపీసీసీ చీఫ్
హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర విభజన గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న తీరుపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.మహేశ్‌కుమార్ గౌడ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు మాట్లాడితే నడవదని విమర్శించారు. తెలంగాణ ఎలా వచ్చిందో ఆ సినీనటుడు తెలుసుకోవాలంటూ మండిపడ్డారు.‘‘ఎవరో ఉప్పందిస్తే పవన్ మాట్లాడడం మానుకోవాలి. ఇదేం సినిమా కాదని పవన్ కల్యాణ్ గుర్తు పెట్టుకోవాలి. విభజన గురించి మాట్లాడడమంటే వ్యతిరేకించినట్లే’’ అని చెప్పారు. కాగా, పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న తీరుపై తెలంగాణ నేతల నుంచి కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. -
బాబూ.. పవన్, లోకేశ్ వెళ్తే సరిపోతుందా?
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన విషాదం మాటలకందనిది. మామూలుగా వేడి నీళ్లు పడితేనే తట్టుకోలేం. అలాంటిది 1600 డిగ్రీల వేడి ఉన్న ఇనుప ద్రవం మీద పడితే అది ఎంత దారుణ పరిస్థితి అవుతుందో చెప్పనవసరం లేదు. అలాంటి వాతావరణంలో పనిచేయడమే కష్టం. ఇక ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎంత కష్టం. ఈ ఘటనలో తొమ్మిది మంది కార్మికులు మరణించడం అత్యంత విచారకరం. వారి కుటుంబ సభ్యులు పడే మనోవేదన ఇంతింత కాదు. వారు అంత కష్టంలో ఉన్నప్పుడు రాజకీయ నేతలు వెళ్లి ఓదార్చే యత్నం చేస్తారు. ఆ సమయంలో కార్మిక సంఘాల నేతలు వచ్చి తమ సమస్యలను వివరిస్తారు. వాటిని వినే ఓపిక పరామర్శకు వెళ్లిన నేతలకు ఉండాలి. అధికారం ఉంది కదా అని ఏమైనా మాట్లాడవచ్చనుకుంటే అది పొరపాటు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేష్‌లు కార్మికులను ఎంతవరకు ఓదార్చారో కాని, వారి మాటలు పుండుమీద కారం చల్లినట్లయిందని కార్మికులు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ విశాఖలో కార్మికుల కుటుంబాలను పరామర్శించిన తీరుకు, లోకేష్, పవన్‌ల వ్యవహార సరళికి మధ్య ఉన్న అంతరాన్ని అంతా చర్చించుకుంటున్నారు. కూటమి నేతలు తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తే, జగన్ మాత్రం బాధితుల కుటుంబాలకు భరోసా ఇచ్చేలా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తం అయింది.ఇలాంటి ప్రమాద ఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు బాధితుల వద్దకు వెళ్లాలి. వారికి అవసరమైన భరోసా ఇచ్చి రావాలి. చంద్రబాబుకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలా మసులుకోవాలో తెలుసు. అయినా ఆయన ఎందుకు విశాఖ వెళ్లలేదో, కార్మికులను పరామర్శించలేదో తెలియదు. బహుశా తన తరపున కీలక మంత్రిగా ఉన్న లోకేష్ వెళితే సరిపోతుందని అనుకున్నారేమో తెలియదు. లేదా గతంలో కార్మికులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు నిలదీసే అవకాశం ఉందని అనుకున్నారేమో చెప్పలేం.మరో వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అక్కడకు వెళ్లారు. సహజంగానే పవన్ కళ్యాణ్ కన్నా, లోకేష్‌కే ఎల్లో మీడియా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ విషయాన్ని జనసేన నేతలు గమనించకపోలేదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు ఒక పార్టీకి అధినేతగా కూడా ఉన్నారు. తాను వెనుకబడిపోకూడదని అప్పటికప్పుడు వెళ్లారేమో తెలియదు. ఇంత పెద్ద ఘటనలు జరిగినప్పుడు కార్మిక వర్గాలలో ఆవేదన, ఆక్రోశం ఉంటుంది. తమ బాధను నేతలకు చెప్పుకునే యత్నం చేస్తారు. కొన్నిసార్లు నేతలను విమర్శిస్తుంటారు. అయినా అధికారంలో ఉన్నవారు సంయమనంతో ఉండి వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలి. కాని దురదృష్టావశాత్తు లోకేష్, పవన్ కళ్యాణ్ లు మాట్లాడిన విషయాలు చూడండి. కార్మిక నేతలు ప్రశ్నలు వేస్తుంటే, లోకేష్ అసహనానికి గురై ఎందుకు గొడవపడుతున్నారు. రాజకీయం చేయడానికి వచ్చారా? మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదుగా!' అని వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.స్టీల్ ప్లాంట్‌ను తామే కాపాడామని, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ వైపు చూస్తూ వీరు పోరాడారు అని లోకేష్ అన్నారు. ఆ మంత్రి ఎప్పుడు పోరాడారో ఎవరికి తెలియదు. పైగా స్టీల్ ప్లాంట్‌ను కాపాడామని లోకేష్ అనగానే అందుకే ఇంతమంది చనిపోయారా?అని కార్మిక నేత ఒకరు ప్రశ్నించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. మరో సందర్భంలో టీమ్ లెవెన్ కెప్టెన్ వచ్చారా అని జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించడంపై అంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు రాలేదన్న విషయాన్ని విస్మరించి జగన్ పై వ్యాఖ్య చేయడమేమిటా అన్న ప్రశ్న వచ్చింది.స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ కేవలం బ్యాంకు రుణాలు చెల్లించడానికి, కార్మికులకు వీఆర్ఎస్ చెల్లించడానికే ఖర్చు చేశారు తప్ప, ప్లాంట్ అభివృద్దికి పెట్టలేదని, ఇదే ప్రైవేటైజేషన్‌కు జరిగే కుట్ర అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక కర్మాగార యాజమాన్యం 25 లక్షల ఆర్థికసాయం ప్రకటించడంపై కూడా అసంతృప్తి వ్యక్తం అయింది. దీనికి లోకేష్ తగు సమాధానం ఇవ్వకపోగా, కార్మిక సంఘాలు అడుగుతాయని, వారిదేం పోయిందని వ్యాఖ్యానించడం అభ్యంతరకరంగా కనిపిస్తుంది.గతంలో విశాఖలో ఎల్.జి.ఫాలిమార్ కంపెనీలో గ్యాస్ లీక్ అయి పదమూడు మంది మరణించగా, జగన్ అప్పటికప్పుడు కోటి రూపాయల చొప్పున ఆర్ధిక సాయం ప్రభుత్వ పక్షాన ప్రకటించారు. అప్పుడు విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కోటి రూపాయలు ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. కాని ఇప్పుడేమో ప్రభుత్వపరంగా సాయం ప్రకటించలేదు. ఒకవైపు రకరకాల పబ్లిసిటీ కార్యక్రమాలకు కోట్లకు కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం, విశాఖ ఉక్కులో ఇంత ఘోర ప్రమాదంలో మరణించిన కుటుంబాలవారికి సాయం చేయలేరా అన్న ప్రశ్న వచ్చింది. పవన్ కళ్యాణ్ యధా ప్రకారం తనకు ఈ ప్లాంట్ విషయంలో అంత అనుభవం లేదని వ్యాఖ్యానించడం కార్మిక సంఘాలకు ఆశ్చర్యం కలిగించింది.గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనిని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నించిందని తప్పుడు ఆరోపణ చేసి మళ్లీ దొరికిపోయారు. మరుసటి రోజు జగన్ బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత లోకేష్, పవన్ లకు గట్టి జవాబు ఇచ్చారు. తమ హయాంలో ప్రధానికి ఎన్నిసార్లు లేఖలు రాసింది.. ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది ఆధార సహితంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గతంలో ఈ అంశం ప్రస్తావించి జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసిందని, అందువల్లే ఆ కార్యక్రమం జరగలేదని చెప్పిన వీడియో కూడా ప్రముఖంగా సోషల్ మీడియాలో కనిపించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ ప్లాంట్‌ను జగన్ ప్రభుత్వం ఎలా ప్రైవేటైజ్ చేస్తుందని సోషల్ మీడియాలో పవన్‌కు ప్రశ్నలు సందించి ఎద్దేవా చేశారు. ఇక లోకేష్ వ్యవహార శైలిపై జగన్ మండిపడుతూ లోకేష్ వంటి మనుషులు కూడా ఉంటారా అనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంలో కార్మిక సంఘాలు అడిగిన సూటి ప్రశ్నలకు జవాబివ్వకుండా డొంక తిరుగుడుగా మాట్లాడుతూ, ఎదురు సంఘాలపైనే లోకేష్, పవన్ లు విమర్శలు చేయడం కూడా బాగోలేదు. అలా కాకుండా ప్యాకేజీని ఎందుకు ప్లాంట్ అభివృద్దికి వ్యయం చేయలేదు?సుమారు పదివేల మంది కార్మికులను ఎందుకు తొలగించారు? పలు ముఖ్యమైన విభాగాలను ప్రైవేటు రంగానికి ఎందుకు అప్పగిస్తున్నారు? ప్రైవేటు రంగంలో స్థాపిస్తున్న మిట్టల్ స్టీల్ కు కాప్టివ్ మైన్ ఇంత త్వరగా ఎలా కేటాయించారు. అరవై ఏళ్లకు పైగా నడుస్తున్న విశాఖ స్టీల్‌కు ఎందుకు కాప్టివ్ మైన్స్ ఇవ్వలేదు? అన్న ప్రశ్నలకు ఓపికగా వీరిద్దరూ జవాబు ఇచ్చి ఉంటే బాగుండేది. కాని వారికి ఆ విషయాలపై అంత పరిజ్ఞానం ఉందో, లేదో గాని, వాటికి సమాధానం ఇవ్వలేదు. జగన్ మాత్రం అందుకు భిన్నంగా కార్మిక సంఘాలతో ఓపికగా మాట్లాడి స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించడానికి తన ప్రయత్నాలను సావధానంగా వివరించారు. అలాగే బాధిత కుటుంబాలవారిని తనదైన శైలిలో ఓదార్చారు. కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆ పరిహారం ఇవ్వకపోతే, తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చి తీరుతామని స్పష్టం చేయడంతో బాధితులకు కొంత సాంత్వన చేకూర్చినట్లయింది.గతంలో తన ప్రభుత్వం చేసిన మాదిరే అసెంబ్లీలో ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చంద్రబాబు సర్కార్‌కు ఆయన సవాల్ చేశారు. దీనిపై కూటమి నేతలు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. జగన్ విశాఖకు వచ్చినప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎల్లో మీడియా తట్టుకోలేకపోయింది. ఏవేవో పిచ్చి ఆరోపణలు చేసి జగన్ టూర్ పై విషం చిమ్మే యత్నం చేసింది. ఏది ఏమైనా ఇలాంటి విషాదాలు జరిగినప్పుడు ఎలా ప్రవర్తించాలో పవన్ కళ్యాణ్, లోకేష్ లు ముందుగా తెలుసుకుని రావాలని కార్మిక సంఘాలు చేస్తున్న సూచన అర్థవంతమైనదే అనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జిత్తులమారి లెక్కలు.. కూటమి అవినీతి బయటపెట్టిన కేంద్రం
-
ప్రమాదం వెనుక నిజం.. మీ ఇంట్లో వాళ్లు చనిపోలేదు కదా లోకేష్.. పవన్ కామెంట్స్ వైరల్
-
ఇంత క్రూర పరిహాసమా స్వామీ!
తిరుపతి సమీపాన నిన్న కూటమి సర్కార్ రెండేళ్ల పండుగ సభ జరిగింది. ఆ సభలో చెప్పుకోవడానికి విశేషాలు చాలానే ఉన్నాయట! సభా ప్రాంగణంలో లోకేశ్‌బాబు కలియతిరిగారట. మంత్రులూ, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముచ్చటించారట! ఆంధ్రజ్యోతి రాసింది. మూడో క్లాస్ చదువుతున్న అనిత్‌రాజ్ అనే బాలుడు ‘డిప్యూటీ సీఎంతో ఫోటో దిగాలని ఉంద’ని ఓ ప్లకార్డు పట్టుకొని వేదిక సమీపంలో నిలబడ్డాడట! అది చూసిన పవన్ కల్యాణ్ వేదికపైకి అనిత్రాజ్ను పిలిపించుకున్నారట! ఈనాడు రాసింది.వేదిక పైకి వచ్చిన అనిత్‌రాజ్ పవన్‌ను బాబాయ్ అని, చంద్రబాబును తాతయ్యా అని పిలిచాడట! లోకేశ్‌బాబును ఏమని పిలిచాడో ఈనాడు రాయలేదు. బహుశా ఆయన కలవ లేదేమో! తాతయ్యా అన్న బాలుని పిలుపుతో చంద్రబాబు ఉత్సాహం పొందినట్టున్నారు. యువత కలలను సాకారం చేసే బాధ్యత తమదేనని ఓ ట్వీట్ రువ్వారు. ఇది కూడా ఈనాడే రాసింది. మూడో క్లాసు చదివే అనిత్రాజ్కు ఎనిమిదేళ్లుంటా యేమో! ఆ సభలో తాతయ్య ప్రసంగం వినిఉండకపోవచ్చు. విన్నా అర్థం చేసుకునే వయసు కాదు.డియర్ అనిత్‌రాజ్, ఆ తాతయ్య మాటల్లో కొసరుగా విసిరిన ఓ అవశేషంలో ఎంత నమ్మకద్రోహం దాగి ఉన్నదో నీకు బోధపడకపోవచ్చు. నీకంటే పదేళ్లు పెద్దవాళ్లయిన పెద్దక్కల దగ్గర్నుంచి, అమ్మ వయసు అత్తలూ, పెద్దమ్మలూ, పిన్నమ్మల వయసువాళ్లకూ, యాభై తొమ్మిదేళ్ల లోపు వుండే అమ్మమ్మలూ, నానమ్మలకూ వేదికపైనున్న తాతయ్య తీరని ద్రోహం చేశారు. దీన్నే నయవంచన అని కూడా అంటారు. ఆ వయసువాళ్ల ఆత్మీయ మహిళలందరికీ వెన్నుపోటు పొడిచిన తాతయ్య మీ కలలను నెరవేరుస్తారంటే నమ్మశక్యమేనా?అన్నిటికంటే పెద్ద విశేషమేమిటంటే ఈ సభకు ‘నమ్మకం’ అనే పేరు పెట్టుకున్నారు. ‘రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని నిల బెట్టుకున్నాం, అదే కూటమి ప్రభుత్వ విజయం’ అనే మకుటంతో మీడియాలో అడ్వరై్టజ్మెంట్లను హోరెత్తించారు. ఆ సభ వేదికపై నుంచి మాట్లాడుతూనే ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి ఆర్థిక సమస్యలున్నాయనీ, పీ–4 పథకంతో వారికి సహాయం చేస్తా మనీ ముఖ్యమంత్రి సన్నాయి నొక్కులు నొక్కారు. సూపర్ సిక్స్ పథకాలకు కూటమి మేనిఫెస్టోలో అత్యంత ప్రాధాన్యతనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానమైన ఈ ఆరు హామీలను నెరవేర్చడా నికి ఆర్థికపరమైన ఇబ్బందులేమీ ఉండవని ఎన్నికల సభల్లో చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు.2024 జూన్ నుంచే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలుచేస్తా మని కూటమి వాగ్దానం చేసింది. రెండేళ్లు గడిచిపోయాయి. తల్లికి వందనం పథకానికి కూడా మొదటి సంవత్సరం ఎగ నామం పెట్టి, రెండో సంవత్సరం అమలు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకొని రెండేళ్లు ఆలస్యంగానైనా ‘ఆడబిడ్డ నిధి’ని అమలుచేస్తారేమోనని కోటీ ఎనభై లక్షలమంది మహిళలు ఎదురు చూస్తున్నారు. వారి ఆశలపై చంద్రబాబు తిరుమలేశుని సాక్షిగా చల్లనీళ్లు చల్లారు. ఏపీలో ఓటుహక్కు ఉన్న మహిళలు రెండు కోట్ల ఏడు లక్షలమంది. వీరిలో అరవై, అంతకుమించిన వయసున్నవారు 12 శాతం వరకు ఉంటారని సెన్సస్ లెక్కలు చెబుతున్నాయి. వారిని మినహాయించి సుమారు ఒక కోటి ఎనభై లక్షలమంది మహిళలకు కూటమి సర్కార్ ఇప్పటికే ఒక్కొ క్కరికి ఏటా 18 వేలు చొప్పున రెండేళ్ల నిధులు బకాయి పడింది. ఇప్పుడు మొత్తానికే పథకాన్ని ఎత్తేస్తున్నట్టు ప్రకటించారు.పీ–4 పథకంతో ఆదుకుంటామనేది పచ్చి బూటకం. అసలీ పథకమే పౌరుల ఆత్మగౌరవాన్ని అంగట్లో పెట్టే అమానవీయ స్వభావం గలది. తమకు దిక్కు దివాణం లేదని పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలట! దయగలిగిన ధనవంతులు కొన్ని కుటుంబాలను దత్తత తీసుకొని వారికి సహాయం చేయా లట! ఇది అయ్యే పనేనా? పేదరికం నుంచి ప్రజలను విముక్తం చేయడం ప్రభుత్వాల బాధ్యత. నాణ్యమైన విద్యను వారికి అందజేయడం ద్వారా, అభ్యున్నతికి చేరుకునే అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు చేయాలి. వనరుల్లో వారికి తగినంత వాటా కల్పించాలి. ఇది రాజ్యాంగబద్ధమైన ఆదేశం. అలాకాకుండా ధనవంతుల దొడ్లో పేదవాళ్లను కట్టేయ డమనేది బానిస వ్యవస్థ లక్షణం.అయినా పీ–4 విధి విధానాలకు, ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి సారూప్యత ఎక్కడున్నది! మహిళల కోసం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ‘చేయూత’, ‘ఆసరా’ పథకాలకు దీటుగా ప్రకటించిన పథకం ‘ఆడబిడ్డ నిధి’. ఈవిధంగా ఎన్నిక లకు ముందు నమ్మబలికి ఇప్పుడీ పథకాన్ని పూర్తిగా అటకెక్కించారు. మహిళల ఆత్మగౌరవానికీ, సాధికారతకూ పెద్దపీట వేస్తూ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మకమైన ‘అమ్మవొడి’ పథకానికి బదులుగా ‘తల్లికి వందనం’ పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది.పేద కుటుంబాల పిల్లలు కూడా నాణ్యమైన విద్యను అభ్యసించాలని అభిలషిస్తూ ప్రభుత్వ పాఠశాలల స్థాయినీ, బోధనా పద్ధతులనూ అనూహ్యమైన స్థాయిలో ప్రైవేట్ స్కూళ్లను తలదన్నేలా మెరుగుపరిచింది జగన్ సర్కార్. జగన్ మోహన్‌రెడ్డి స్వయంగా పరిశీలించి విద్యార్థులందరికీ మంచి స్కూల్ బ్యాగ్‌లు, బూట్లు, బెల్ట్, శ్రేష్ఠమైన పౌష్ఠికాహారాన్ని ఎంపిక చేసిన సంగతి పాఠకులకు విదితమే. డిజిటల్ బోర్డులు, ట్యాబ్లూ ప్రభుత్వ బడుల్లో ప్రవేశించాయి. శిథిలమైన బడి భవనాలు, విరిగిపోయిన బల్లలు, అసహ్యకరమైన పరిస్థితుల్లో ఉండే సింగిల్ వాష్రూముల ముందట లైన్లో నిలబడే పిల్లలు, అసలు వాష్రూములే లేక బడి మానేసే ఆడపిల్లలు, తాగడానికి మురికి నీళ్లే గతి అనే పరిస్థితులను మార్చి కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో వాష్‌రూమ్‌లూ, శుభ్రమైన తాగునీరూ అందేలా జగన్ ఏర్పాట్లు చేశారు.ఒకపక్క ఇంత నాణ్యమైన విద్యకు మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూనే ఇంగ్లీషు మీడియం బోధననూ, సీబీఎస్ఈ సిలబస్‌నూ పేద బిడ్డలకు పూర్తి ఉచితంగానే అందుబాటులోకి తెచ్చారు. దాంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో డ్రాపవుట్లు ఉండకుండా బిడ్డలను బడికి పంపేలా తల్లిని ప్రోత్సహించడం కోసం జగన్మోహన్రెడ్డి ‘అమ్మవొడి’ పథకాన్ని ప్రవేశపెట్టారు. నాణ్యమైన విద్య ద్వారా ఉన్నతమైన సమాజాన్ని నిర్మించాలనే ఒక సమగ్ర వ్యూహంలో ‘నాడు–నేడు’ ‘అమ్మవొడి’ అనేవి రెండు అవిభాజ్యమైన అంశాలు. ఈ వ్యూహంలో అమ్మది కేంద్ర స్థానం.‘అమ్మవొడి’ పథకం నేపథ్యంలో ఉన్న ఉన్నతమైన తాత్విక భూమిక ‘తల్లికి వందనం’ పథకానికి లేదు. అటువంటి ఉన్నత లక్ష్యమే ఉన్నట్లయితే ‘నాడు–నేడు’ పథకం కొనసాగి ఉండేది. ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, సబ్జెక్ట్ టీచర్ మోడల్ కొనసాగి ఉండేవి. ఇప్పుడివేమీ లేవు. ప్రభుత్వ బడులకు మళ్లీ పూర్వపు రోజులు వచ్చాయి. దాదాపు పది లక్షలమంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టినట్టు సమాచారం. ప్రభుత్వం ఈ లెక్కలను ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెడుతున్నది. ఎంత మంది విద్యార్థులు చదువు మానేశారో లెక్కల్లేవు. జగన్ ప్రభుత్వం ప్రతి విద్యార్థిని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ట్రాకింగ్ సిస్టమ్ ఇప్పుడు లేదు. ప్రభుత్వ బడుల పునరుజ్జీవనం, పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య లభించాలనే ఉద్దేశంతో ‘అమ్మవొడి’ని జగన్ తీర్చిదిద్దారు. కేవలం ఎన్నికల్లో తనకు సహకరించే కార్పొరేట్ స్కూళ్ల లాబీకి కాసుల వర్షం కురిపించేలా తల్లికి వందనం పథకాన్ని కూటమి డిజైన్ చేసింది. ఇదీ తేడా!లక్ష్యం ఇంత హేయమైనది కనుకనే నీకు పదిహేను, నీకు పదిహేను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలంటూ చౌకబారు ప్రచారాన్ని కూటమి చేసింది. పోనీ ముందుగా చెప్పినట్టు పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తున్నదా? జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వం, ప్రైవేట్ స్కూళ్లలో 80 లక్షలకు పైగా విద్యార్థులుండేవారు. తల్లికి వందనం పథకానికి మాత్రం 67 లక్షల మందినే అర్హులుగా తేల్చారు. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ బడుల్లో చేరినవారిలో లక్షమందిని లబ్ధి దారుల జాబితా నుంచి తొలగించారు. కేంద్ర స్కాలర్షిప్ను పొందుతున్న మరో లక్షమందిని తొలగించారు. ఆధార్ సరిగా లేదనీ, అడ్రస్ సరిగా లేదనీ మూడు లక్షలమందికి మొండిచేయి చూపారు. పంచ పాండవులు – మంచం కోళ్ల సామెతలా సాగు తున్న ఈ పథకం చివరకు ఎక్కడ ఆగుతుందో చూడాలి.అధికార యంత్రాంగంలో, రాజకీయ నేతలలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ప్రతిపక్షం కాదు... అధికార పక్షానికి అనుకూలంగా ఉండేవారే విమర్శిస్తున్నారు. అమరావతి ప్రయోగం డిజాస్టర్‌గా మిగలబోతున్నదనీ, పోలవరం పనులు పరమ నాసిరకంగా జరుగుతున్నాయనీ నిపుణులు ఆరోపిస్తు న్నారు. డీఎస్సీ పరీక్షలో సాక్షాత్తూ ప్రభుత్వ ముఖ్యులే అవినీతికీ, ఆశ్రిత పక్షపాతానికీ తెరలేపి లక్షలాది మంది యువకుల కల లను కల్లలు చేశారు. వ్యవస్థల విశ్వసనీయత పట్ల యువతరంలో నమ్మకం సన్నగిల్లుతున్నది. పేదలు, మధ్యతరగతి ప్రజల పాలిట అపర సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీ పథకానికి మరణ శాసనం అమలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఫార్సుగా మార్చారు. వృద్ధుల సంఖ్య పెరుగుతున్నదనీ, ముగ్గురు నలు గురు పిల్లల్ని కనాలనీ బోధిస్తున్న చంద్రబాబు సామాజిక పెన్షన్లలో మాత్రం వృద్ధుల సంఖ్యను తగ్గిస్తున్నారు. ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రభుత్వాంగాలన్నీ అవినీతి రోగగ్రస్థం అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి. ఓట్లకోసం ప్రజల అరచేతుల్లోకి వైకుంఠం సినిమాను ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు వారందరికీ సామూహికంగా వెన్నుపోటు పొడిచిన తర్వాత నమ్మకాన్ని నిలబెట్టుకున్నామంటూ సభ పెట్టడం న్యాయమా? సమాజం మీద ఇంత క్రూరమైన పరిహాసమేమిటి స్వామీ!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
తిరుమలలో పవన్ కళ్యాణ్ పుస్తకం ఆవిష్కరణ
-
సుగాలి ప్రీతీ కేసును వాడుకొని... నీచమైన క్యాబేజి.. పవన్ కళ్యాణ్
-
Balaraju: కారులో గన్ తీసుకురండిరా.. కాల్చేద్దాం
-
పవన్ పార్టీలో కలకలం.. ఎమ్మెల్యేకు కార్యకర్త సవాల్!
సాక్షి, ఏలూరు జిల్లా: పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై జనసేన కార్యకర్త పూనెం వంశీ తీవ్ర ఆరోపణలు చేస్తూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఆయన క్యాంపు కార్యాలయ సిబ్బందిపై తాను దాడి యత్నం చేశానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వంశీ ఆరోపించారు. ఒక సాధారణ కార్యకర్తగా తాను.. ఎమ్మెల్యేపై దాడి చేయగలనా అని ప్రశ్నించారు. తన బైక్‌ను పోలీస్ స్టేషన్లో ఉంచి ఇబ్బందులకు గురిచేయడంతో ఆ విషయంపై వివరణ కోరేందుకే ఎమ్మెల్యే వద్దకు వెళ్లానని చెప్పారు.అయితే సమస్యను పరిష్కరించాల్సిందిపోయి ఎమ్మెల్యే, ఆయన అనుచరులే తనపై దాడి చేశారని వంశీ ఆరోపించారు. అంతేకాకుండా కారులో నుంచి తుపాకీ తీసుకువచ్చి తనను కాల్చేయాలని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. తాను కేవలం "నేను చేసిన తప్పేంటి?" అని మాత్రమే ప్రశ్నించానని, దానికి బదులుగా ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేసి తనను జైలుకు పంపించాలని ప్రయత్నించారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేసిన ఆరోపణలకు సంబంధించిన మూడు అంశాలను నిరూపించాలని వంశీ డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేశానని, మాజీ ఎమ్మెల్యేతో సంబంధాలు ఉన్నాయని, తనకు రూ.1 లక్ష ఇచ్చారని ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. ఇందుకోసం మూడు రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిరూపించలేకపోతే ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీని కలవడానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని వంశీ తెలిపారు. తన తరఫున కుటుంబ సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేస్తారని చెప్పారు. జనసేన కార్యకర్తగా తనకే న్యాయం జరగడం లేదని, అలాంటప్పుడు ఇతర కార్యకర్తలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ఈ అంశంపై నియోజకవర్గంలోని జనసేన నాయకులు స్పందించాలని కోరారు. వంశీ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పోలవరం జనసేనలో నెలకొన్న అంతర్గత విభేదాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. -
గెలిచాడు.. పోటు పొడిచాడు
-
ఏం బాబూ.. ఇదేనా పొదుపు?
సాక్షి, టాస్క్ ఫోర్స్: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేశారు. పబ్లిసిటీ కోసం పొదుపు పాటిస్తున్నాం అని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు.. ఆచరణలో మాత్రం అమలు చేయకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద శుక్రవారం టీడీపీ ప్రభుత్వం విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరయ్యే నేతలు నాలుగు విమానాలు, ఓ హెలికాప్టర్ వినియోగించినట్లు రేణిగుంట విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్లో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక చాపర్‌లో రేణిగుంటకు చేరుకున్నారు. మంత్రి లోకేశ్, జిల్లా టీడీపీ ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, మరి కొందరు మంత్రులు మరో మూడు ప్రత్యేక విమానాల్లో రేణిగుంటకు చేరుకున్నట్లు తెలిపారు. పొదుపు మంత్రంలో భాగంగా వారంలో ప్రతి శుక్రవారం నో వెహికల్స్ డే అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ విజయోత్సవ సభకు భారీఎత్తున వాహనాలు వినియోగించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు దామినేడు సభాస్థలి వరకు కాన్వాయ్‌లో చేరుకున్నారు. విజయోత్సవ సభకు జన సమీకరణ కోసం ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాలోని మారుమూల గ్రామాలకు సైతం ప్రత్యేక వాహనాలను పంపి స్థానికులను రప్పించుకున్నారు. ఈ వాహనాల కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ నెల 7 నుంచి 12 వరకు ఉండేలా సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లకు మొత్తంగా రూ.3 కోట్లు అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. -
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు ట్విట్టర్లో సెకండ్ ప్లేస్
-
లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు, పవన్ ఆంధ్రా మోసగాడు..
-
‘లోకేష్ ఆలిండియా.. పవన్ ఆంధ్రా మోసగాడు’
సాక్షి, గుంటూరు: గుంటూరులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహించారు. లాడ్జి సెంటర్లో అంబటి రాంబాబుని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, అంబటి రాంబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి సర్కార్ వచ్చి రెండేళ్లయింది.. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేదని మండిపడ్డారు.‘‘సూపర్ సిక్స్‌లో ముఖ్యమైనవి అసలు అమలు చేయలేదు. స్త్రీ నిధి ఇవ్వలేదు. ప్రధాన వాగ్ధానాన్ని వదిలేశారు. నిరుద్యోగి భృతి ఇవ్వలేదు. యువగళం గాలికి పోయింది. యాభై ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ అన్నారు. ముగ్గురు మోసగాళ్ల ప్రభుత్వం ఇది. చంద్రబాబు ప్రపంచ మోసగాడు. లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు.. పవన్ కల్యాణ్ ఆంధ్రా మోసగాడు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.డీఎస్సీపై మాట్లాడటం లేదు. లోకేష్ డీఎస్సీలో ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నాడు. చంద్రబాబ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంటే డీఎస్పీ అడ్డుకున్నారు. తెలుగుదేశం నాయకులు వైఎస్ జగన్ దిష్టి బొమ్మ తగులపెడితే పోలీసులు రక్షణ కల్పిస్తారు. గుంటూరు పోలీసులకు ఏం పోయేకాలం?. రాబోయేది జగన్ పాలనే. వచ్చే నెల 29 తేదీన వినతి పాదయాత్ర చేస్తాను’’ అని అంబటి రాంబాబు వెల్లడించారు. -
నువ్వు OG కాదు.. పెద్ద క్యాబేజీ
-
ప్యాకేజీ స్టార్ కాదు.. ఇప్పుడు క్యాబేజీ స్టార్!
సాక్షి, తిరుపతి: సూపర్ సిక్స్ హామీలన్నీ గాలికి కొట్టుకుపోయానని.. వెన్నుపోటు వీరుడు చంద్రబాబు మహిళలను సైతం మోసం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి రోజా అన్నారు. నగిరి నియోజకవర్గంలో ఆమె ఆధ్వర్యంలో గురువారం వైఎస్సార్సీపీ "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ చేపట్టిన ఆమె.. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని రోజా అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పైనా ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఒకప్పుడు ప్యాకేజీ స్టార్‌గా ఉన్న పవన్.. ఇప్పుడు క్యాబేజీ స్టార్‌గా మారిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన వ్యక్తి.. తన బాధ్యతలను విస్మరించారన్నారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని గతంలో ప్రకటించిన పవన్.. ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదని రోజా గుర్తుచేశారు. ఇక.. మహిళల సంక్షేమం విషయంలోనూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రోజా విమర్శించారు. మహిళలకు అండగా ఉంటామని చెప్పిన చంద్రబాబు సర్కార్.. చివరకు వారికే వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు.అలాగే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనతో పోల్చుకుంటే.. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం 10 శాతం పనితీరును కూడా సాధించలేకపోయిందని అన్నారామె. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అమలు చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం సాధారణ పరిస్థితుల్లోనూ హామీలను నెరవేర్చలేకపోతోందని రోజా మండిపడ్డారు. ఈ నిరసన సందర్భంగా అందరికీ చంద్రబాబు పంగనామాలు పెట్టారంటూ సింబాలిక్‌గా నిరసనలు నిర్వహించారామె. -
రెండేళ్ల బాబు పాలన.. ప్రసంగాలకే పరిమితం!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రోజురోజుకు బలహీనపడుతోంది. ప్రజలలో విశ్వాసం కోల్పోతున్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచు చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. నిత్యం హెలికాఫ్టర్ వేసుకుని ఎక్కడో చోటకు వెళ్లి ప్రసంగం చేయకపోతే ఆయనకు నిద్రపట్టదేమో తెలియదు. ఒకవైపు దుబారా వ్యయం అదుపు చేయాలని ఆయన ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది.స్వయంగా సీఎం గారే అవసరం ఉన్నా, లేకపోయినా హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాలలో పర్యటిస్తూ లక్షలు, కోట్ల రూపాయలు నీళ్లమాదిరి వ్యయం చేస్తుంటారు. పోనీ ప్రసంగాలలో ఏమైనా నిజాయితీ, ఆదర్శం, నిబద్ధత కనిపిస్తాయా అంటే అదేమీ ఉండదు. ఆయన స్పీచ్ ఇచ్చినంతసేపు వైఎస్సార్ కాంగ్రెస్‌ను, మాజీ సీఎం జగన్‌ను దూషించడమే పనిగా పెట్టుకుంటారు. మాట్లాడితే గొడ్డలి పార్టీ అని, విధ్వంసం అని రకరకాల పదజాలాలతో ప్రజలను విసిగిస్తుంటారు. లేదంటే తాను చాలా చేసేసినట్లు అతిశయోక్తులు చెప్పి ప్రజలు విస్తుపోయేలా చేస్తుంటారు. తత్ఫలితంగా ఆయన సీనియారిటీ అంతా ఇలా ప్రత్యర్ధులపై బురద జల్లడానికే సరిపోతుంది. అందువల్లే ఆయన ప్రజలలో గౌరవం పెంచుకోలేకపోతున్నారు.మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వైసీపీ ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో చేపడుతున్న ఈ నిరసనలలో వైసీపీవారు లేవనెత్తుతున్న అంశాలకు చంద్రబాబు కాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాని, కీలక మంత్రి లోకేష్ గాని సూటిగా జవాబు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రెండేళ్లలో సాగిన అరాచకాలు, హామీల ఎగవేత మొదలైన అంశాలను వీరు ప్రస్తావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ లెట్ కూడా విడుదల చేశారు. వీటిని వైసీపీ నేతలు చదివి వినిపిస్తున్నారు. గ్రామ, మండల కేంద్రాలలో నిరసనలు చేపట్టారు.12వ తేదీన నియోజకవర్గ కేంద్రాలలో భారీ ర్యాలీలు తీసి ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇచ్చిన బాండ్లను దహనం చేయ సంకల్పించారు. ఇది సహజంగానే చంద్రబాబుకు చికాకుగా ఉంటుంది. ఆ బాండ్లలో ఉన్న హామీలు ఏ మేరకు తీర్చింది? ఇంకెన్ని నెరవేర్చాలి? అందుకు ఇంకెంత సమయం తీసుకుంటారు? మొదలైన వాటి గురించి చంద్రబాబు, పవన్, లోకేష్‌లు చెప్పలేకపోతున్నారు. తాము ఇచ్చిన ఎన్నికల మానిఫెస్టోని ప్రజల ముందు పెట్టి ధైర్యంగా ఇవి చేశాం అని చెప్పగలిగితే చంద్రబాబు మాటలకు విలువ ఉంటుంది. అలాకాకుండా సూపర్ సిక్స్ చేసేశాం అని దబాయించితే సరిపోతుందా! వృద్దాప్య పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచడం మినహా మరే హామీని పూర్తిగా నెరవేర్చినట్లు కనిపించదు.వృద్దాప్య పెన్షన్లలో కొన్ని లక్షల మందికి కోత పెట్టారన్న విమర్శ ఉంది. అలాగే కొన్ని లక్షలమంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఎప్పటికి ఇస్తారో తెలియదు. కాకపోతే ఎల్లో మీడియా అది జరిగిపోతుంది.. ఇది జరిగిపోతుంది అని ప్రజలలో భ్రమలు కల్పించడానికి నానా పాట్లు పడుతోంది. సూపర్ సిక్స్ లోని ముఖ్యమైన ఆడబిడ్డ నిధి హామీ గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. ఆ మద్య పీ-4 ద్వారా వీరికి ఏదో చేసేశామని చెప్పే యత్నం చేశారు. కాని జనం దానిని అసలు స్వీకరించలేదు. ఆ విషయాన్ని గుర్తించారేమో పీ-4 గురించి పెద్దగా మాట్లాడడం లేదు. నిరుద్యోగ భృతి కింద నెలకు మూడువేలు ఇస్తామన్న హామీని అలాగే గాయబ్ చేశారు. పైగా 24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, 24 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నట్లు మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. అది కూడా ప్రజలలో ఆగ్రహానికి కారణం అవుతోంది.బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని బాండ్ రాసిచ్చారు. కాని దాని ఊసే ఎత్తడం లేదు. ఇలా అనేక హామీలను నెరవేర్చలేకపోయారు. చంద్రబాబు కొత్తగా నాగలి బాధలు గొడ్డలికి తెలియవు అంటూ చిత్రమైన వ్యాఖ్య చేశారు. ఒక వ్యక్తి చేసిన దుర్మార్గానికి రాష్ట్రాన్ని దారిలో పెట్టడానికి మూడేళ్లు పడుతుందని సెలవిచ్చారు. ఇంతకీ జగన్ టైమ్‌లో జరిగిన దుర్మార్గం ఏమిటో మాత్రం చెప్పరు. అప్పుడు జరిగిన విధ్వంసం ఏమిటో వివరించలేరు. జగన్ రెండేళ్ల కరోనా సంక్షోభ ఉన్నప్పటికీ, ఐదేళ్లలో చేసిన అప్పు మూడున్నర లక్షల కోట్లు అయితే, రెండేళ్లలోనే అంత చంద్రబాబు సర్కార్ ఎలా చేసిందని ఎవరు అడిగినా జవాబు ఇవ్వరు. పైగా జగన్ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేసిందని పచ్చి అబద్ధాన్ని చెప్పడం ఆయన వయసుకు తగినదేనా?జగన్ కంటే ఎక్కువ సంక్షేమ స్కీమ్‌లు అమలు చేస్తామని చెప్పారా? లేదా? మరి ఎందుకు అమలు చేయడం లేదు? ఏకకాలంలో లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చిన జగన్ నిరుద్యోగులకు అన్యాయం చేశారట. రెండున్నర లక్షలమంది వలంటీర్లను నియమించి అటు ప్రజలకు సేవలు, ఇటువారికి స్థానికంగా ఉపాది కల్పించిన జగనేమో ఏమీ చేయలేదట. వలంటీర్లకు ఐదువేలు కాదు.. పదివేలు ఇస్తానని హామీ ఇచ్చి మొత్తానికి మంగళం పలికిన ఆయన పాలనేమో గొప్పదట. సచివాలయ ఉద్యోగులపై రకరకాల భారాలు పెడుతూ వారిని వేధిస్తున్న సంగతి అంతా గమనిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను విపక్షంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టి, ఆకాశమే హద్దుగా వాగ్ధానాలు చేసి, పవర్ చేతికి వచ్చాక వాటన్నిటిని గాలికి వదలివేసిన దానిపై ప్రభుత్వ ఉద్యోగులు నోరు విప్పుతున్నారు. మరి అందుకు జవాబు ఏది?వైసీపీవారిపై ఏది పడితే మాట్లాడతారు. గంజాయి బాచ్ అంటారు. తీరా చూస్తే ఆయన పార్టీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ డ్రగ్ కేసులో పట్టుబడిన సంగతి మాత్రం కనుమరుగు చేయాలని చూస్తారు. ఇది రైతు ప్రభుత్వం అని చెబుతారు. కాని అన్నదాత సుఖీభవ కింద ఎంత ఇస్తామని చెప్పారు? ఎంత ఇచ్చారు. అసలు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం ఎన్ని స్కీములను ఎగవేసింది ప్రజలకు తెలియదా? మాట్లాడితే గొడ్లలి పార్టీ అని అంటే సరిపోతుందా? ప్రజలకు కడుపు నిండుతుందా? హామీల బాండ్ల గురించి జనం మర్చిపోతారా?జగన్ 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వరంగంలో తీసుకువస్తే, వాటిని ప్రైవేటీకరించడమే లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నారు. దానిని కదా విధ్వంసం అనాల్సింది. నాలుగు పోర్టులను జగన్ టైమ్‌లో నిర్మించే కృషి ఆరంభించారు. వాటిని ప్రైవేటురంగానికి అప్పగించడానికి ఆలోచన చేస్తున్నారు. దానిని కదా ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేడం అనేది. ఆర్టీసీని నీరుకార్చి ప్రైవేటురంగానికి ఆస్తిగా మార్చుతున్నారన్న అభిప్రాయం కార్మికులలో ఏర్పడింది. దానిని కదా దోపిడీ అనాల్సింది. అమ్మకానికి మున్సిపల్ ఆస్తులు, పట్టణ సేవలన్నిటిని ప్రైవేటీకరించడం, తద్వారా ప్రజలపై విపరీత భారం వేసే యోచనను కదా ప్రజా వ్యతిరేక పాలన అని అనాల్సింది. బీచ్‌లలో బార్లు, మద్యం షాపులను ఏర్పాటు చేయడాన్ని కదా వినాశన విధానాలు అని అనాల్సింది.మద్యం విచ్చలవిడిగా పారిస్తూ ఆంధ్ర సమాజాన్ని పాడు చేస్తున్న ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్ రికార్డు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని చంద్రబాబే చెబుతారు. అధికారులు ఆశించిన రీతిలో స్పందించలేదని ఆయనే అంటారు. అయినా ప్రభుత్వం బ్రహ్మాండం అని జనానికి చెబితే ఎలా నమ్మాలి. అంతెందుకు కుప్పంలో జరుగుతున్న అక్రమాలపై వస్తున్న ఫిర్యాదులపై ఆయనే భయపడిపోయి, తాను ఇన్‌చార్జీగా పెట్టిన వ్యక్తినే మార్చేసుకున్నారే! ఈ నేపథ్యంలోనే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ రెండేళ్లలో కూటమి పాలన గాడితప్పిందని అన్నారు. ఏమి సాధించారని ప్రజలలోకి వెళతారని, స్వర్ణాంధ్ర కాదు.. విషాదాంధ్రగా మార్చారని ధ్వజమెత్తారు.ఇక గొడ్డలి అంటూ చంద్రబాబు చేసే అర్థం, పర్ధం లేని వాఖ్యలను వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తిప్పికొట్టారు. జగన్ హీరో, చంద్రబాబు విలన్ అని, అందుకే రాజకీయంగా చంద్రబాబు పాలనను అంతం చేసే గొడ్డలి జగన్ చేతిలో ఉందని ఆయన భయపడుతున్నారని సజ్జల బదులిచ్చారు. పరశురాముడి గొడ్డలి అన్యాయం, అక్రమాలపై వేటు వేసిందని, అలాగే చంద్రబాబు అరాచక పాలనను అంతం చేయడమే తమ పార్టీ లక్ష్యం అని ఆయన అన్నారు. ఏది ఏమైనా చంద్రబాబు తాను ఇచ్చిన హామీల మేరకు ఏమి పూర్తి చేసింది చెబితే ఉపయోగం తప్ప, గొడ్డలి, విధ్వంసం అంటూ పిచ్చి డైలాగులు చెబితే తమకు ఏమి లాభం అని ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం కలుగుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
OG 2 Update: ‘ఓజీ’ మళ్లీ వస్తున్నాడు..ఎప్పుడు అనేది ఆయనే చెబుతారు
సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం ఓజీ(OG). ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా చేశాడు. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు. గతేడాది సెప్టెంబరులో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ పవన్ ఫ్యాన్స్‌కి మాత్రం ఆకట్టుకుంది. ఈ చిత్రానికి పార్ట్ 2 చేసే అవకాశం ఉందని ప్రమోషన్స్‌లోనే చెప్పాడు సుజీత్. ఓజీ’ ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని పవన్ కల్యాణ్ కూడా వెల్లడించారు. అయితే పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందనేది మాత్రం ఇద్దరు క్లారిటీ ఇవ్వలేదు. రాజకీయంగా పవన్ బిజీ కావడంతో ఓజీ 2 రావడం కష్టమే అని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో అభిమానులకు శుభవార్త చెప్పాడు పవన్. ‘ఓజీ 2’అప్డేట్ ఇచ్చాడు.‘ఇచ్చిన మాట ప్రకారమే ఆయన చేస్తారు. అయితే ఎప్పుడు అనేది ఆయనే చెబుతారు. విదేశాల నుంచి సుజీత్ తిరిగి వచ్చిన తర్వాత చర్చలు మొదలవుతాయి’ అంటూ పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్వీట్ చేసింది. దీంతో ఓజీ 2 కచ్చితంగా ఉంటుందనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. అయితే ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం సుజిత్.. నానితో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ని కూడా ప్రారంభించారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఓజీ2 ప్రాజెక్టును మొదలు పెట్టాలని సుజిత్ భావిస్తున్నాడట. As promised, he will. The timing, he will let us know. Once @Sujeethsign returns from abroad, we will discuss.#OG2— Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 11, 2026 -
టీడీపీ గేమ్ ప్లాన్.. పవన్ కళ్యాణ్ కొత్త వేషం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త దళాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా ఉంది. జెన్-జీ ఆశయాలకు అనుగుణంగా గొంతు వినిపింంచేదుకు సేనా గళంను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం ఒక కమిటీని కూడా వేస్తున్నట్లు తెలిపారు. ఆయన చిత్తశుద్ధితో ఈ ప్రకటన చేసి ఉంటే స్వాగతించవలసిందే. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి లోకేష్‌లు కూడా జెన్-జీ అంటూ మాట్లాడి వారి ఆశయాలకంటే ఎక్కువే పనిచేస్తున్నామని తమకు తామే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు.ఒక వైపు ఏపీలో ప్రశ్నించే గొంతుకలే లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ, మరో వైపు జెన్-జీలో కలిసిపోయే వ్యూహంలోకి టీడీపీ, జనసేన నేతలు వెళుతున్నట్లు అనిపిస్తుంది. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దేశంలో సంచలనం సృష్టించిన క్రాకోచ్ జనతా పార్టీ పరిణామాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆయనకు తెలిసి అన్నారో, తెలియక అన్నారో కాని, తదుపరి చంద్రబాబు దాని జోలికి వెళ్లలేదు. కాని వ్యూహాత్మకంగా జెన్-జీ భాషను వినియోగించుకోవడం ఆరంభించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో వెళుతున్నారా? లేక చిత్తశుద్దితో చేస్తున్నారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది.నేపాల్‌లో కొంతకాలం క్రితం జెన్-జీ పేరుతో పెద్ద విప్లవమే వచ్చింది. యువత వీధులలోకి వచ్చి పెద్ద ఎత్తున గళం విప్పారు. దానిని అణచివేయడానికి ఆనాటి ప్రభుత్వం కాల్పులవరకు వెళ్లింది. దాని ఫలితంగా పలువురు యువకులు మరణించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో పాలక పార్టీ పూర్తిగా తుడుచుకుపోయి కొత్త తరం నేతలు, కొత్త పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చేశారు. అనంతరం కాల్పులకు కారణమైన ఆనాటి నేపాల్ ప్రధాన మంత్రి, మంత్రులను జైళ్లకు పంపారు. ప్రభుత్వ అవినీతిపై పోరాడడానికి సోషల్ మీడియాను నేపాల్ యువత ఒక ఆయుధంగా మార్చుకుంది. దానిని తట్టుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫారంలను ప్రభుత్వం నిషేధించడంతో అది తీవ్ర నిరసనగా మారి ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది.అప్పటి నుంచే జెన్-జీ అన్నది బాగా పాపులర్ అయింది. గతంలో ఆయా వయసులను బట్టి తరాలు అనేవారు. కాని ఇప్పుడుమారిన సాంకేతిక యుగంలో, డిజిటల్ కాలంలో జన్ జడ్, జెన్ ఆల్ఫా, బీటా ఇలా పేర్లు పెడుతున్నారు. వాటన్నిటి లక్ష్యం ఒకటే. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సమాజంలోనూ, పాలన వ్యవస్థలోనూ మార్పులు తీసుకురావడమే. ప్రధానంగా యువత సోషల్ మీడియాను వాడుతున్న తీరు, సెల్‌ఫోన్, టాబ్ వంటి సాంకేతిక పరికరాలపై గడుపుతున్న టైమ్ మొదలైనవాటిని పరిశీలించి ఈ పేర్లు పెడుతున్నారు.స్థూలంగా చెప్పాలంటే కొత్త తరం ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలన్న సంకల్పం అన్నమాట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జెన్-జీ ఆశయాల కోసం సేవాగళం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం వినడానికి అయితే బాగుంది. కాని ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నదేమిటి? ప్రశ్నించే గళాలను అణచివేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు అమలు చేస్తున్న రెడ్ బుక్ పర్వంపై పవన్ కళ్యాణ్ కాని, ఆయన పార్టీ వారు కాని ప్రశ్నించి ఉంటే కచ్చితంగా ఇలాంటి సేనా గళం ఏర్పాటుకు అర్హులు అవుతారు.ప్రతిపక్ష వైఎస్సార్సీపీపైన దాడులే కాదు. తన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపై సాగుతున్న దాడులను పవన్ ప్రశ్నించలేకపోతున్నారు. అధికారానికి అలవాటు పడి, జనసేన వారు సైతం అలాంటి దాడులను భరించాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులో ఒక తెలివి ఉంది. అది దేశంలో లేదా, ఏదైనా విదేశంలో కొత్త మార్పు వస్తుంటే అది తనకు ప్రచారానికి ఉపయోగపడుతుందనుకుంటే వెంటనే అందులోకి వెళ్లి పోతుంటారు.ఉదాహరణకు 2012 ప్రాంతంలో దేశంలో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఆధ్వర్యంలో ఒక ఉద్యమం వచ్చింది. అప్పట్లో దేశ వ్యాప్తంగా దానికి మద్దతు వచ్చింది. అంతే! చంద్రబాబు తెలివిగా తానూ అన్నాహజారేకి మద్దతు ఇస్తున్నానని చెప్పి హైదరాబాద్‌లోని తన పార్టీ ఆఫీస్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికే చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా ఆయన ధైర్యంగా ఆ ర్యాలీ తీశారు.దానిపై చంద్రబాబును ఎద్దేవా చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా పాపులర్ అయ్యాయి. ఏదైనా వ్యతిరేకత వచ్చే విషయం జరిగితే వెంటనే దానిని తన రాజకీయ ప్రత్యర్ధికి అంటగట్టేయడం కూడా చేస్తుంటారు. ఉదాహరణకు 2022 ప్రాంతంలో శ్రీలంకలో ప్రజలు తిరగబడి అధ్యక్ష భవనంలోకి కూడా దూసుకువెళ్లారు. ఆ దేశం అప్పుల కారణంగా దివాళా తీసినంత పనైంది. అంతే! చంద్రబాబు ఆ పరిస్థితిని అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వానికి రుద్దేశారు. ఏపీ శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేశారు. ఏపీ 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని అబద్దాన్ని సృష్టించారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా తబాలా వాయించేవి.పవన్ కళ్యాణ్‌తో పాటు, బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి కూడా అదే దుష్ప్రచారం చేశారు. చిత్రమేమిటంటే ఉమ్మడి ఏపీకి తానే అత్యధిక కాలం సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత విభజిత ఏపీకి కూడా తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన టైమ్‌లో చేసిన అప్పుల్ని కూడా జగన్ ప్రభుత్వానికి అంటగట్టి పచ్చి అబద్దాన్ని జనంలోకి తీసుకువెళ్లే యత్నం చేశారు. ఇలా ఉంటుంది ఆయన ధోరణి. తన కుమారుడు లోకేష్‌కు కూడా అలాంటి ట్రైనింగే ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఏపీలో జెన్-జీ ఉద్యమం వస్తే అది ఎవరికి వస్తుంది? కూటమి ప్రభుత్వంపైనే కదా! ఈ రెండేళ్లలో ఏపీలో జరిగినన్ని అరాచకాలు మరే రాష్ట్రంలో జరగలేదు కదా! సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి పోలీసులను ప్రయోగిస్తున్నది కూటమి సర్కారే కదా! నేపాల్‌లో కూడా అలా చేయబట్టే ప్రజలలో తిరుగుబాటు వచ్చింది. బహుశా ఆ భయంతోనే తెలివిగా తాము కూడా జెన్-జీ అంటూ మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్‌కు చిత్తశుద్ది ఉంటే, ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించాలి.ఉదాహరణకు డీఎస్సీకి సంబంధించి వచ్చిన అనేక వార్తలపై స్పందించి ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా! రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ హత్యల గురించి, టీడీపీ గూండాల దాడి గురించి మాట్లాడాలి కదా! జనసేన నేత ఇంటినే మచిలీపట్నంలో కూల్చితేనే కనీసం స్పందించలేదే! ఒక మహిళా నేత ప్రైవేటు వీడియోలను టీడీపీ ఎమ్మెల్యే తీయించారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రిని నిలదీయలేదే! అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తెచ్చి, దానిని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణపై పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసే సేనాగళం మాట్లాడుతుందా?కేవలం పవన్ కళ్యాణ్ పై వచ్చే రాజకీయ విమర్శలకు మాత్రమే బదులు ఇవ్వడానికి దీనిని ఏర్పాటు చేస్తున్నారా? ఫ్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక రాజకీయ విశ్లేషణపైనే కేసు పెట్టిన జనసేన జెన్-జీ గురించి, సేనా గళం గురించి చెబుతుంటే విడ్డూరంగానే కనిపిస్తుంది. తెలంగాణలో పవన్ కొనుగోలు చేసినట్లు చెబుతున్న చెరువు భూమిపై వివరణ ఇచ్చి ఉండాల్సింది కదా! చంద్రబాబు, లోకేష్‌లు ఏదైనా మంచి పని చేస్తే పవన్ కీర్తించవచ్చు. కాని ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పని మానేశారని కదా ఆ పార్టీవారు వాపోతున్నది.కనుక ముందుగా పవన్ కళ్యాణ్ తన గురించి తానే ప్రశ్నించుకుని ఆ తర్వాత సేనాగళానికి నిర్దిష్ట బాధ్యతలు అప్పగిస్తే సముచితంగా ఉంటుందేమో! లేకుంటే ఇది కూడా టీడీపీ గేమ్ ప్లాన్‌లో భాగమేనేమో అన్న అనుమానం వస్తుంది. ఏపీలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించేవారిని అణచివేయడానికి కొత్త వేషంలో వస్తున్నారేమో అన్న అభిప్రాయం కలగకుండా పవన్ సేనాగళం పనిచేస్తుందా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఢిల్లీ వెళ్లగానే నోరు తిరగబడిందా..? పవన్ పై కారుమూరి పంచ్ లు
-
అనుభవం లేనప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు? ఏకిపారేసిన వెల్లంపల్లి
-
మీనాక్షికి EC షాక్.. వైజాగ్ లో పవన్, లోకేష్ ల డ్రామా..
-
ఒక్కోసారి యాక్సిడెంట్లు జరుగుతుంటాయ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌లో నిపుణులను తొలగించడం, సిబ్బందిని తగ్గించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘‘నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. నేనేమి చేయగలను. లోటుపాట్లను అర్థం చేసుకోవడం నాలాంటి వాళ్ల వల్ల కాదు. ప్లాంట్ నిర్వహణ లోపాలపై విచారణ కమిటీ వచ్చాకే చెప్పగలను..’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఒక్కోసారి యాక్సిడెంట్స్ జరుగుతుంటాయన్నారు. స్టీల్ ప్లాంటు ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఇటువంటి సందర్భాల్లో అందరూ ఒకేసారి మీద పడిపోతే పరిష్కారం కాదన్నారు. యాజమాన్యాలు ఒకటికి పది సార్లు చూసుకోవాలని... ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రమాదాలపై నాలుగైదు గంటలు... అవసరమైతే ఒకరోజు తీసుకుని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానన్నారు. గతంలో తాను క్యాప్టివ్ మైన్స్ గురించి మాట్లాడేందుకు ఢిల్లీకి తీసుకెళతానంటే కార్మిక సంఘాల నేతలు ఒక్కరు కూడా రాలేదని వ్యాఖ్యానించారు. -
‘విశాఖలో లోకేష్, పవన్ కళ్యాణ్ తీరు అమానుషం’
మచిలీపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయిన సమయంలో, బాధితులను ఓదార్చాల్సిన రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మానవత్వం మరచి రాజకీయ వ్యాఖ్యలకు దిగారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తీవ్రంగా ఆక్షేపించారు. యాజమాన్యం నిర్లక్ష్యం, సిబ్బంది కోతలు, కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రమాదానికి కారణమని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించి రాజకీయ ప్రచారంలో నిమగ్నమైందని విమర్శించారు. మచిలీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు.మంత్రులు అహంకారంగా వ్యవహరించడం బాధాకరంవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి 22 మంది చేయాల్సిన పనిని కేవలం 11 మందితో చేయించడంతో పాటు, గత రెండేళ్లుగా వీఆర్ఎస్ పేరుతో అనుభవజ్ఞులైన కార్మికులను ఇంటికి పంపివేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉత్పత్తి సామర్థ్యం పెరిగినా కార్మికుల సంఖ్యను భారీగా తగ్గించడం యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనం. బాధిత కుటుంబాలు శోకసంద్రంలో ఉంటే వారిని ఓదార్చాల్సిన మంత్రులు అహంకారంగా వ్యవహరించడం బాధాకరం. ప్రమాద స్థలానికి వెళ్లిన నారా లోకేష్ కార్మికుల బాధను వినాల్సింది పోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రూ.25 లక్షల పరిహారం కూడా కొత్తగా ప్రభుత్వం ఇచ్చింది కాదు. గతంలోనే స్టీల్ ప్లాంట్‌లో అమలులో ఉన్న విధానం ప్రకారమే ఆ మొత్తం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అదనంగా చేసిన సాయం ఏమిటో చెప్పాలి. అధికారంలో ఉన్నవారు మరింత బాధ్యత, సంయమనంతో వ్యవహరించాలి.రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చేసిన సాయం ఏమిటో?వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. కానీ అవి శాశ్వత ఉద్యోగాలు కావు, తాత్కాలిక నియామకాలే. స్టీల్ ప్లాంట్ భవిష్యత్తే అనిశ్చితిలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగాల భద్రతపై కూడా సందేహాలున్నాయి. మృతుల కుటుంబాలకు ఇస్తున్న రూ.25 లక్షల పరిహారం కూడా కొత్తగా ప్రభుత్వం ప్రకటించింది కాదు. స్టీల్ ప్లాంట్‌లో ఇప్పటికే అమలులో ఉన్న సంప్రదాయం, వేజ్ అగ్రిమెంట్ ప్రకారమే ఆ మొత్తం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చేసిన సాయం ఏమిటో చెప్పాలి. ప్రమాదం తర్వాత మంత్రులు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లడం మంచిదే. అయితే బాధితులను పరామర్శించే సమయంలో హుందాగా, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్లి వైఎస్ జగన్ గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఘటనాస్థలానికి వెళ్లకుండా, విజయవాడలోనే సమీక్షలు నిర్వహించడం ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర మంత్రి మాత్రం వెంటనే విశాఖకు చేరుకున్నారు. ఇలాంటి విషాద సమయంలో రాజకీయ వ్యాఖ్యలకు బదులుగా బాధిత కుటుంబాలకు అండగా నిలవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.పవన్‌వి పచ్చ దగాకోరు మాటలువిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించారని చెప్పడం పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రచారం. పచ్చి దగాకోరు మాటలే. 2020లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కార్మికుల ఉద్యమం, ప్రజా వ్యతిరేకత కారణంగానే ఆ నిర్ణయం అమలుకాలేదు. 2025 జనవరిలో కేంద్ర మంత్రి కుమారస్వామి స్వయంగా విశాఖకు వచ్చి, కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. ఇప్పటి వరకు కేంద్రం ఆ నిర్ణయాన్ని అధికారికంగా వెనక్కి తీసుకోలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో మీ ప్రభుత్వాలే ఉన్నప్పుడు గత రెండేళ్లలో ఒక్కసారైనా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారా? క్యాప్టివ్ మైన్స్ కోసం గానీ, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గానీ ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలి. వాస్తవాలను దాచిపెట్టి వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమే.బాధిత కుటుంబాలకు అండగా నిలవాలినాడైనా, నేడైనా వైఎస్సార్సీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వంద శాతం వ్యతిరేకిస్తోంది. ప్రతిపక్షంలో ఉంటే ఉద్యమం చేస్తాం, అధికారంలో ఉంటే కేంద్రం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను అడ్డుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. ఈ విషాద ఘటనను రాజకీయాలకు వేదికగా మార్చకుండా బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పూర్తి సహాయం అందించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకుని, ప్లాంట్ భవిష్యత్తును కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి.ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విపత్తుల సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన విధంగానే, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా స్పందించి వారికి తగిన పరిహారం, భరోసా కల్పించాలి. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేకపోయినా, వారి కుటుంబాలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అంటూ మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. -
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి..! ఇద్దరికి ఇచ్చి పడేసిన అడ్వకేట్ రజిని
-
స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు
-
ప్రస్టేషన్ ఎక్కువై YSRపై నిందలు, KVP మొట్టికాయలు
-
మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్రేషియా ఇవ్వండి స్టీల్ ప్లాంట్ ఘటనపై కేఏ రియాక్షన్
-
అత్తారింటికి దారేది సీన్ గుర్తొస్తోందా?.. పవన్‌పై విమర్శలు
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను నటించిన సినిమాలలోని కొన్ని సన్నివేశాలను గుర్తుంచుకునైనా మాట్లాడితే ఇంత అప్రతిష్ట మూట కట్టుకునేవారు కారన్న మాట రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. అత్తారింటికి దారేది సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. అందులో హాస్య నటుడు బ్రహ్మానందం అబద్ధాలు చెబితే ఒక చెట్టు ఆకులు రాలుతుంటాయి. దాంతో ఆయన ఇరుకున పడతారు. ఇది పవన్ కళ్యాణ్ కు వర్తిస్తుందనిపిస్తుంది. అబద్దం చెబితే అతికినట్లు ఉండాలన్నది ఒక సామెత. ఈ విషయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న నేర్పరితనం పవన్ కు ఇంకా రాలేదనుకోవాలి. చంద్రబాబు ప్రత్యర్థులు ఈ విషయం ప్రస్తావిస్తుంటారు.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగల శక్తి చంద్రబాబుకు మాత్రమే ఉందని ఎద్దేవ చేసేవారు. అది వేరే కథ. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఏదో ఒక ప్రకటన చేయడం, ఆ తర్వాత అనతికాలంలోనే దానికి విరుద్ధంగా మాట్లాడడం వంటివి తరచు చేస్తుంటారన్న విమర్శ ఉంది. వాటిని నిర్ధారించే వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా కనిపిస్తాయి. గతంలో కాపుకులం వారైనా తనకు మద్దతు ఇవ్వాలని బహిరంగంగా కోరడం, ఇప్పుడేమో, తాను కాపులకోసమే పార్టీ పెట్టలేదన్నట్లుగా మాట్లాడడం, కాపులు మద్దతు ఇస్తే సీఎం అయి చూపుతానని ఒకసారి, తనకు అంత శక్తి ఎక్కడిదని ఇంకోసారి మాట్లాడారు.కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తనకు ఏపీలోనే దిక్కులేదని, తెలంగాణలో సీఎం అవుతానా అని వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యపరిచారు. అది ఫ్రస్టేషనా? లేక ఇంకేదైనా కారణమో తెలియదు. ఈ క్రమంలోనే దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై పవన్ కళ్యాణ్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వస్తారేమో అన్న అనుమానంతో ఆయనను ఇబ్బంది పెట్టాలని వైఎస్ అనుకున్నట్లు, ఆ విషయాన్ని ఒక పోలీసు అధికారి చెప్పినట్లు పేర్కొన్నారు. రోడ్డుపైకి వస్తే కాల్చేసే రోజులని, తాను తుపాకి పోలీసులకు ఇచ్చేసి ప్రాణాలకు తెగించి రాజకీయాలలోకి వచ్చానని ఆయన తెలిపారు. ఇది విన్న కొత్త తరం వారికి అందులో నిజం ఉందేమో అనుకునే అవకాశం ఉంటుంది. కాని అప్పటి నుంచి రాజకీయాలను చూస్తున్న వారికి పవన్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి.ఇంత ఘోరంగా అసత్యాలు చెప్పవలసిన అవసరం ఏమి ఉంది అన్న ప్రశ్న వచ్చింది. దీనిని ఖండించి, ఎవరూ వాస్తవాలు చెప్పలేరులే అన్న ధైర్యమో, లేక నిజాలు తెలిసినా పర్వాలేదులే.. తాను చెప్పినవాటిని నమ్మే జనం ఉంటారులే అన్న భావమో తెలియదు. కాని దీనివల్ల తన పరువుకు భంగం అని ఆయన ఆలోచించలేకపోతున్నారు. ఆ వెంటనే కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు పాత చరిత్రను తవ్వారు. పవన్ తుపాకి కథకు సంబంధించిన వీడియోలను వెలికి తీశారు. వాటిని చూస్తే పవన్ కళ్యాణ్ అనవసరంగా గెలుక్కున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. పైగా అసందర్భంగా మాట్లాడినట్లు కూడా అర్థం అవుతుంది.కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఈ నేపథ్యంలోనే ఆయనకు సవాల్ విసిరారు. 2005 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పెద్దగా జనంలో ప్రాచుర్యం పొందిన నేతకాదు. కేవలం ఒక సినిమా నటుడిగా, అది కూడా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా మాత్రమే గుర్తింపు ఉండేది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన తర్వాత పవన్ ను యువరాజ్యం అధ్యక్షుడిని చేశారు. ఆ తర్వాత ఇందిరాపార్క్ వద్ద జరిగిన ఒక ధర్నాలో కాంగ్రెస్ వాళ్ల పంచెలూడదీసి కొట్టాలి అన్న వివాదాస్పద డైలాగుతో పవన్ బాగా ప్రచారంలోకి వచ్చారు. ఆ తర్వాత పరిణామాలలో 2014లో జనసేన ఆవిర్భావంతో ఒక ప్రముఖ రాజకీయ నేతగా అవతరించారు.2005 ప్రాంతంలో చిరంజీవి కుమార్తె ఒకరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి కుటుంబపరంగా ఏవో సమస్యలు వచ్చాయి. ఆ క్రమంలో ఆమె పవన్ పై ఒక ఆరోపణ చేశారు. ఆయన వల్ల తమకు ప్రమాదం ఉందని అన్నారు. దాంతో పవన్ తన వద్ద ఉన్న తుపాకిని తెచ్చి పోలీసులకు అందచేశారు. ఆ టైమ్ లో అవే విషయాలను ఆయన మాట్లాడారు. కాని రెండు దశాబ్దాల తర్వాత ఆ ఉదంతాన్ని వక్రీకరించి వైఎస్ఆర్పై నింద మోపడంతో మరోసారి నిజాలు వెలుగులోకి వచ్చాయి. అత్తారింటికి దారేది సినిమాలో అబద్ధాలు ఆడితే ఆకులు రాలినట్లుగా, వీడియోలతో అసలు సన్నివేశం తెలిసిపోయింది. దీనిపై తొలుత వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని స్పందిస్తూ పవన్ కళ్యాణ్ రౌడీయిజం చేయబోతే చిరంజీవి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసిందని వ్యాఖ్యానించారు.కాస్త ఆలస్యంగా కేవీపీ రామచంద్రరావు ఒక లేఖను పవన్ కు రాస్తూ తన ఆక్షేపణ తెలిపారు. పవన్ అసత్యాలు చెబుతున్నారని అందులో స్పష్టం చేశారు. వైఎస్ పై ఆరోపణలను రుజువు చేస్తే పది కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి, లేదా స్వచ్ఛంద సంస్థకు అందచేస్తామని సవాల్ చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కుటుంబపరంగా మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప, ఎలాంటి రాజకీయ కేసులు లేవని కేవీపీ స్పష్టం చేశారు. సంబంధిత పోలీసు అధికారి ఎవరో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధపడితే ఈ చాలెంజ్ స్వీకరించాలని అన్నారు. పవన్ కాంగ్రెస్ వారిని ఉద్దేశించి అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు(పంచెలూడగొట్టాలని) చేస్తేనే కేసు పెట్టలేదని ఆయన గుర్తు చేశారు.ఈ సందర్భంలో కేవీపీ కూడా బహుశా కంపల్షన్ రీత్యా ఒక వ్యాఖ్య చేసినట్లు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డికి, వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని చాలామందిలాగానే పవన్ కూడా గుర్తించడంలో విఫలం అయ్యారని కేవీపీ అన్నారు. వైఎస్ ఆర్ మరణించాక ఆయన పేరు చార్జీషీట్ లో చేర్చిన రోజే కాంగ్రెస్ తో బంధం తెగిపోయిందని చాలామంది నమ్ముతారు. వైఎస్ వారసత్వాన్ని జగన్ కొనసాగించి ఉండకపోతే ఈపాటికి కాంగ్రెస్ పార్టీ ఆయనను పూర్తిగా వదలివేసి ఉండేదేమో!ఈ మధ్యకాలంలో వైఎస్ ఆర్ పైన, ఆయన కుటుంబంపైన అంత నీచంగా చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా జవాబు ఇచ్చి ఖండించిందా? లేదే! పైగా ఏపీలో కాంగ్రెస్ నాయకత్వం టీడీపీతో మిలాఖత్ అయిందన్న ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి కదా! పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరో అడిగితేనే కాని స్పందించలేదని ఆయనే చెప్పడం కూడా గమనించదగిందే! కనీసం ఇప్పటికైనా స్పందించి అప్పటి పరిస్థితులను వివరించడం ద్వారా తన ఆప్త మిత్రుడైన వైఎస్ కు కేవీపీ కొంతలో కొంత న్యాయం చేసినట్లయింది.కేవీపీ చేసిన ఈ సవాల్ ను పవన్ స్వీకరిస్తారా అన్నది అనుమానమే. దానికి తగినట్లే ఆయన జవాబిచ్చినట్లు కనిపించలేదు. ఎందుకంటే ఈ పన్నెండేళ్లలో పవన్ కళ్యాణ్ చేసిన అనేక ప్రకటనలు, ఆ తర్వాత వాటికి విరుద్ధంగా ఆయనే మాట్లాడిన వీడియోలు కోకొల్లలుగా కనిపిస్తాయి. గతంలో జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెచ్చిపోయి మాట్లాడిన పవన్, తెలంగాణలో మాత్రం రేవంత్, కేటీఆర్ తదితరులను పొగుడుతున్న తీరును జనం గమనించకపోలేదు. ఎప్పటికీ అది ప్రస్తుతమో అన్నట్లుగా కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ పనిచేస్తుంటారన్న భావన ఉంది. వైఎస్ పై కూడా దురుద్దేశంతో చేసిన వ్యాఖ్య ఆయనకే తగిలినట్లయింది. పవన్ కళ్యాణ్ అనవసరంగా తెలంగాణలో వేలుపెట్టి వివిధ వర్గాలవారిని రెచ్చగొట్టి ఆంధ్రులకు ఇక్కట్లు తెచ్చి పెట్టకుండా ఉంటే అదే పదివేలు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
విశాఖలో విషాదం.. పవన్ కు కాపు జాతి షాక్
-
పవన్ కళ్యాణ్ పై చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఫైర్
-
ప్లాన్ రెడీ... పవన్ పై చంద్రబాబు బిగ్ స్కెచ్..!
-
లింగమనేని కరకట్ట రుణం బాబు తీర్చుకుంటే.. బాబు ప్యాకేజీ రుణం పవన్ తీర్చుకున్నాడు...!
-
ఔను.. వాళ్ళదే రాజ్యం! సానా కధలున్నాయ్
-
నిందలు కాదు.. నిజాలు తెలుసుకో
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: వంగవీటి రంగాను కాపాడుకోలేదని ఏపీలోని కాపులను.. గద్దర్‌కు వెన్నులో తూటాలు దించితే కాపాడలేదని తెలంగాణ సమాజాన్ని నిందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రెండు ఘటనలూ టీడీపీ హయాంలోనే జరిగాయనే నిజాలను ఎందుకు విస్మరిస్తున్నారని కాపు నేతలు సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా రంగా పేరును ప్రస్తావించకుండా, కాపులను నిందించకుండా.. నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్, రామ్ తాళ్లూరి డైరెక్షన్లో మీ పార్టీని మీరు నడుపుకోవాలని పవన్‌కు సూచించారు. పవన్ అండ చూసుకుని సీఎం చంద్రబాబు కాపుల పట్ల తీవ్ర కులవివక్ష చూపిస్తున్నారని, సరైన సమయంలో ఓటు ద్వారా గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు.ఈమేరకు రాజమహేంద్రవరంలో నిర్వహించిన కాపు ఆత్మగౌరవ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్పీఎస్) రాష్ట్ర చైర్మన్ చనమల్ల ప్రసాదరావు, వర్కింగ్ చైర్మన్ మాసాబత్తుల శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్, రాష్ట్ర కో–ఆర్డినేటర్లు జానపాముల నాగేంద్రకుమార్, జేటీ రామారావు, రాష్ట్ర కో–కన్వీనర్ బోడపాటి పెదబాబు, కాకిలేటి హరనాథ్, వంగా ఆంజనేయులు సోమవారం మీడియాకు వెల్లడించారు. కాపు రాజ్యాధికార పోరాట సమితి, కాపు రక్షణ చట్టం పోరాట సమితి ముఖ్య ప్రతినిధులు ఆత్మగౌరవ సమావేశానికి హాజరయ్యారు.ఇటీవల మంగళగిరి, రాజమహేంద్రవరంలో జరిగిన సమావేశాల్లో కాపు నాయకులు, కాపు సంఘాలు, కాపు సమాజాన్ని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. తామంతా కాపు సంఘాల్లో మూడు దశాబ్దాలకుపైగా పనిచేస్తూ కాపుల సంక్షేమం, రిజర్వేషన్లు, రాజ్యాధికారం కోసం నిరంతర పోరాటం కొనసాగిçస్తున్నట్లు గుర్తు చేశారు. గత రెండేళ్లలో కాపు నాయకులెవరూ పవన్‌ను కలిసిందీ లేదు.. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిందీ లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ను ఉద్దేశించి కాపు నేతలు పలు ప్రశ్నలు సంధించారు. ⇒ కాపు నాయకులు కన్వీనియంట్ రాజకీయాలు చేస్తున్నారని రాజమహేంద్రవరం వేదికగా పవన్ వ్యాఖ్యలు చేశారు. నిజానికి మీఅంత కన్వీనియంట్ పొలిటీషియన్ మరొకరున్నారా పవన్? మీ అంత స్థిరత్వం లేని పొలిటీషియన్ మరొకరున్నారా? పాచిపోయిన లడ్డూలు అన్నదెవరు? ఉత్తరాది, దక్షిణాది అనే ఫీలింగ్ చూపిస్తున్నారని అన్నదెవరు? ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కవాతు చేస్తానని ప్రకటించి ఆ తరువాత కనపడనిది ఎవరు? మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం తీసుకోవడమేమిటని అమరావతి పర్యటనలో ప్రశ్నించి తర్వాత ఆ విషయాన్ని వదిలేసిందెవరు? మా నాన్న హేతువాది.. సోషలిస్టు.. రామకోటి రాశారని రకరకాలుగా మాట్లాడిందెవరు? తనది వామపక్ష భావజాలమని, భగత్‌సింగ్, చేగువేరా తనకు ఆదర్శమని చెప్పిందెవరు? నాకు కులం లేదు.. మతంలేదు అంటూనే నిరంతరం కులాలు, మతాల గురించి మాట్లాడుతున్నది మీరు కాదా? ⇒ కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఇదే రాజమహేంద్రవరంలో ఎన్నికల ముందు పవన్ చెప్పలేదా? కశ్మీర్ సమస్యకైనా పరిష్కారం దొరికింది కానీ కాపుల సమస్యకు పరిష్కారం లేదా? అని అనలేదా? కాపులు తనకు ఓట్లు వేయకపోయినా పర్వాలేదని ఇప్పుడు ఎలా అనగలుగుతున్నారు? కాపుల ఓట్లు తమకు అవసరం లేదని చంద్రబాబు, లోకేశ్‌తో చెప్పించగలరా? ⇒ రాజకీయ ప్రత్యర్థి గా అంబటి రాంబాబును పవన్ విమర్శించారని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రజారాజ్యం, జనసేన కోసం పనిచేసిన దాసరి రామును ఉద్దేశించి పవన్ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదు. కాపులు తనకు అండగా నిలబడలేదని.. తోట చంద్రశేఖర్, జేడీ లక్ష్మీనారాయణ తనను వదిలేసి వెళ్లిపోయారని అంటున్న పవన్ అధికారంలోకి వచ్చాక బొలిశెట్టి సత్యనారాయణ ఎందుకు వెళ్లిపోయారో చెప్పగలరా? కాపు నాయకుల మూలాల మీదకు వెళతాం, వారి చిట్టాలు విప్పుతామని బెదిరిస్తున్న పవన్.. మెగా కుటుంబానికి మూల స్తంభంగా కాపు కాసింది కాపులేనని విస్మరిస్తున్నారు. కాపులను నిందించి, బెదిరించి పవన్ తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారనే విషయం అర్థమవుతోందా? ⇒ మీరంతా నా వెనుక ఉంటే ముఖ్యమంత్రినవుతానని గతంలో మీరు అన్న మాట ఎక్కడికి పోయింది పవన్? చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం కులాన్ని ఫుట్‌బాల్ ఆడుకుంటారా పవన్? వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని బొండా ఉమాతో ఉద్యమం చేయించిన చంద్రబాబును రెండేళ్లుగా ప్రశ్నించకపోవడం కన్వీనియంట్ రాజకీయం కాదా? ⇒ కాపు సమాజంలో ఎందరో మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖులున్నా కూటమి ప్రభుత్వం ఒక్కరినైనా గుర్తించిందా? కనీసం ఒక్క జిల్లాకైనా కాపు నేతల పేరు పెట్టిందా? ⇒ హైకోర్టు సమర్థించిన కాపు రిజర్వేషన్ల జీవోను తుంగలోకి తొక్కేసిన చంద్రబాబు కాపులకు తీరని అన్యాయం చేశారు. అదే చంద్రబాబు మైనారీ్టల రిజర్వేషన్ల విషయంలో రెండుసార్లు హైకోర్టు కొట్టివేసినా సమర్థి స్తున్నారు. ఇదేనా సమ ధర్మం? సమ న్యాయం? సామాజిక న్యాయం? -
నాగబాబు.. ప్రకాష్ రాజ్ లొల్లి, మధ్యలో ఎంట్రీ ఇచ్చిన రాహుల్
-
ఉప్మా మంత్రి.. మాట్లాడితే మా నాన్న.. మా నాన్న.. పవన్ పై మాస్ ర్యాగ్లింగ్
-
పవన్ కు కమెడియన్ చురకలు.. నీ గొప్పలు పక్కకు పెట్టి.. వీటికి సమాధానం చెప్పు
-
డబ్బులున్న వారికే టికెట్.. జెండా మోసిన కూలీలు బానిసలు..
-
ఆర్భాటాలు కాదు, లెక్కలు చెప్పు.. పవన్‌కు రాహుల్ రామకృష్ణ చురకలు!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ నటుల్లో రాహుల్ రామకృష్ణ ఒకరు. కేవలం సినిమా కబుర్లనే కాకుండా సమాజంలో చోటు చేసుకున్న పలు అంశాలపై తనదైన శైలీల్లో స్పందిస్తుంటాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై ఈ కమెడియన్ ఎక్స్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించాడు. మీ గొప్పలు పక్కన పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు నిర్వహించే శాఖల్లోని సమాచారాన్ని వెల్లడిస్తున్నారా? అంటూ పవన్‌ని నిలదీస్తూ ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టాడు.‘ PESA 1/70 చట్టం (ది పంచాయతీస్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్), గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలను దయచేసి అడిగి చూపించండి. అటవీకరణ కార్యక్రమాలు మీరు చేశారా? ఓ స్వతంత్ర సంస్థ కన్ఫర్మ్ చేసిన లెక్కల ప్రకారం అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను దాఖలు చేసి గుర్తించిన ఫలితాలను అడుగుతున్నా.' అంటూ చివర్లో ‘జై తెలంగాణ’ అని ట్వీట్ చేశాడు.ఆ తర్వాత మరో ట్వీట్లో ‘మీరు సాధారణంగా చేసే ఆర్భాటాలు పక్కన పెడితే.. మీరు నిర్వహించే ప్రతి శాఖలో సమాచార హక్కు చట్టంలోని క్రియాశీల సమాచారాన్ని బహిర్గతం చేయడానికి సంబంధించిన సెక్షన్ 4.1(బి)ని అమలు చేశారా సార్? నేను మీ అభిమానిగా అడుగుతున్నా.. ప్రశ్నలకు నిరంతరం సమాధానం చెప్పాలి. ప్రశ్నించినందుకు నేను దేశద్రోహిని కాదు’ అని రాహుల్ రామకృష్ణ తనదైన శైలీలో పవన్‌కు చురకలు అంటించాడు. కాగా,ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘తెలంగాణ మీ అయ్య జాగీరా ’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ .. హైదరాబాద్‌లో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పెట్టేందుకు ప్రయత్నించగా.. తెలంగాణ పోలీసులు అనుమతించకపోవడంతో అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మినహా తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. తెలంగాణ మేధావులు కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. Apart from your usual bravado, have you implemented section 4.1(b) of proactive disclosure of the Right To Information Act in every department of every position you hold sir?I’m asking because I’m you’re fan and you need to constantly answer our questions— Rahul Ramakrishna (@eyrahul) June 7, 2026Asking questions doesn’t make me an anti national— Rahul Ramakrishna (@eyrahul) June 7, 2026 -
లింగమనేనికే సీటు ఎందుకు..? పవన్ పై తిరగబడ్డ జనసేన కీలక నేతలు
-
మహిళలపై కక్ష కట్టిన బాబు, పవన్ కళ్యాణ్
-
నీ అయ్య జాగీరా.. పవన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్
-
గద్దర్ కు కారు కొనిచ్చావా..! పవన్ కి ఓ రేంజ్ లో ఇచ్చిపడేసిన కవిత


