ఉస్తాద్ భగత్ సింగ్‌ రిలీజ్ డేట్.. నానితో పోటీ పడాల్సిందే..! | Pawan Kalyan Movie Ustad Bhagat Singh release date clash with nani | Sakshi
Sakshi News home page

Ustad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌ రిలీజ్ డేట్.. నానితో పోటీ పడాల్సిందే..!

Feb 4 2026 7:35 PM | Updated on Feb 4 2026 7:44 PM

Pawan Kalyan Movie Ustad Bhagat Singh release date clash with nani

పవన్‌ కల్యాణ్  హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు.  ఈ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను పంచుకున్నారు.  ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.

అయితే అదే రోజున నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్ రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పటికే డేట్ కూడా ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తోన్న నాని మూవీ వాయిదా పడుతుందా? లేదంటే అదే రోజు రిలీజవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేశారు. మార్చి 27న రావాల్సిన పెద్ది ఏకంగా ఏప్రిల్ 30కి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో నాని ప్యారడైజ్‌ పోస్ట్‌ పోన్ అవుతుందా?.. ఉస్తాద్ భగత్‌ సింగ్‌తో బాక్సాఫీస్ బరిలో నిలుస్తుందా ‍అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 

Advertisement
 
Advertisement
Advertisement