ఓటీటీకి వచ్చేసిన సంక్రాంతి సూపర్ హిట్ సినిమా.. ఎక్కడ చూడాలంటే? | Naari Naari Naduma Murari Streaming On this ott Platform | Sakshi
Sakshi News home page

Ott Movie: ఓటీటీలో సంక్రాంతి సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Feb 4 2026 5:02 PM | Updated on Feb 4 2026 5:38 PM

Naari Naari Naduma Murari Streaming On this ott Platform

ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలు రిలీజయ్యాయి. ప్రభాస్ ది రాజాసాబ్‌తో పాటు చిరంజీవి మనశంకర వరప్రసాగద్‌గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటిలో ప్రభాస్‌ మూవీ అంత మెప్పించలేపోయింది. మిగిలిన నాలుగు చిత్రాలు ఆడియన్స్‌ను అలరించాయి.

అంతేకాకుండా చివర్లో విడుదలైన శర్వానంద్ మూవీ నారీ నారీ నడుమ మురారి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా ప్రకటించినట్లుగానే  ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.

 

Advertisement
 
Advertisement
Advertisement