OTT
-
ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 16 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. 'పెద్ది' జోష్ తగ్గిపోయింది. అందుకు తగ్గట్లే సమంత 'మా ఇంటి బంగారం', వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు', దీవానా లాంటి తెలుగు సినిమాలతో పాటు బాలన్, వంద దేవుళ్లు, కాక్టెయిల్ 2 లాంటి డబ్బింగ్, హిందీ చిత్రాలు కూడా థియేటర్లలోకి రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీల్లో శుక్రవారం ఒక్కరోజే 16కి పైగా మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: 'వారణాసి' విలన్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే దృశ్యం 3 అందుబాటులోకి రాగా, అతిరథి, రేజర్, ధురంధర్ 2, ఎమ్4ఎమ్ చిత్రాలతో పాటు సేవ్ ద టైగర్స్ సీజన్ 3 ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఏమైనా సడన్ సర్ప్రైజులు ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (జూన్ 19)హాట్స్టార్సేవ్ ద టైగర్స్ 3 - తెలుగు డబ్బింగ్ సిరీస్అతిరథి - తెలుగు డబ్బింగ్ మూవీతుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 - హిందీ సిరీస్ఆహారేజర్ - తెలుగు సినిమాథ్యాంక్యూ సుబ్బారావ్ - తెలుగు మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)ధైర్యే సాహసే అమృత - తెలుగు చిత్రం (స్ట్రీమింగ్ అవుతోంది)అమెజాన్ ప్రైమ్మనితన్ దైవమగళం - తమిళ మూవీగిన్నీ వెడ్స్ సన్నీ 2 - హిందీ చిత్రందృశ్యం 3 - తెలుగు డబ్బింగ్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)నెట్ఫ్లిక్స్ధురంధర్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమావాయిస్ మెయిల్స్ ఫర్ ఇస్‌బెల్లే - ఇంగ్లీష్ మూవీహస్బెండ్స్ ఇన్ యాక్షన్ - కొరియన్ సినిమాఒయాసిస్ - ఇంగ్లీష్ సిరీస్ఐ విల్ ఫైండ్ యూ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)సన్ నెక్స్ట్ఆషాన్ - మలయాళ మూవీలయన్స్ గేట్ ప్లేఎమ్4ఎమ్ - తెలుగు సినిమాఆలియా బసు గాయబ్ హై - హిందీ మూవీమ్యాచ్ పాయింట్ - ఇంగ్లీష్ సినిమాఆపిల్ టీవీ ప్లస్షుగర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్మనోరమ మ్యాక్స్గు - మలయాళ సినిమాఎమ్ఎక్స్ ప్లేయర్అబ్ హోగా హిసాబ్ - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)(ఇదీ చదవండి: 'పుష్ప' కాన్సెప్ట్‌తో ధనుష్ సినిమా.. టీజర్ రిలీజ్) -
మరో ఓటీటీకి దురంధర్-2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2. గతేడాది డిసెంబర్లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే వచ్చిన ఈ సినిమా సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ఏకంగా రూ.1790 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జూన్ 5న స్ట్రీమింగ్కు వచ్చేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమా జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. స్ట్రీమింగ్కు వచ్చిన మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల మందికిపైగా వీక్షించారని ఓటీటీ సంస్థ ప్రకటించింది.అయితే తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలోనూ సందడి చేయనుంది. ప్రస్తుతం ఓవర్సీస్ ఆడియన్స్‌కు మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. మే 14వ తేదీ నుంచే ఓవర్సీస్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఇండియాలోని ప్రేక్షకులకు సైతం నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ నెల 19 నుంచి ఇండియన్ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని వీడియోను రిలీజ్ చేసింది. అంటే ఈ శుక్రవారం నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా దురంధర్-2 సందడి చేయనుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేశ్ బేడీ, గౌరవ్ గేరా, డానిష్ పాండోర్ కీలక పాత్రలు పోషించారు. 19 June, on Netflix in Hindi, Tamil, Telugu, Kannada and Malayalam.— Netflix India (@NetflixIndia) June 17, 2026 -
ఓటీటీకి వచ్చేసిన దృశ్యం-3.. తెలుగు వర్షన్లో బిగ్ ట్విస్ట్..!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటేస్ట్ మూవీ దృశ్యం-3. ఈ సూపర్ హిట్ సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రం మే 21 థియేటర్లలో రిలీజైంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళ ఇండస్ట్రీలోనే రెండో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ఘనత సాధించింది.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీకి వచ్చేసింది. జూన్ 18 అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మొదట ఈ సినిమా తెలుగు వర్షన్ అందుబాటులో ఉండడం లేదంటూ వార్తలొచ్చాయి. కానీ అలా ఏం జరగలేదు. ఈ విషయంలో అభిమానులకు ఓటీటీ సంస్థ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఈ మూవీని తెలుగులోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మలయాళంతో పాటు తమిళం, కన్నడ, తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయినవాళ్లు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.దృశ్యం-3 కథేంటంటే..దృశ్యం 2 ముగింపు సీన్‌తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు జార్జ్‌కుట్టి(మోహన్‌లాల్) వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. కోర్టు ఆదేశాలతో జార్జ్ ఫ్యామిలీపై ఎలాంటి కేసు నమోదు కాకుండా బయటపడతారు. తన జీవితంలో చోటు చేసుకున్న ఈ ఘటననే కాస్త మార్పులు చేసి ఓ సినిమాను నిర్మిస్తాడు జార్జ్. అది రిలీజై..బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుంది. అదే సమయంలో మానసిన సమస్యలను నుంచి బయటపడిన పెద్ద కూతురు అంజుకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. భార్య రాణి(మీనా) కూడా కూతురికి త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుందని సలహా ఇస్తుంది. అయితే చాలా సంబంధాలు వచ్చినప్పటికీ.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంజు గురించి నెగెటివ్‌గా చెప్పడంతో అవన్నీ తప్పిపోతాయి.కొన్నాళ్ల తర్వాత తన కూతురికి వచ్చిన పెళ్లి సంబంధాలను ఇద్దరు చెడగొడుతున్నారనే విషయం తెలుస్తుంది? అసలు ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నారు? కొడుకు(వరుణ్)ని పోగోట్టుకున్న బాధ నుంచి బయటపడేందుకు అమెరికా వెళ్లిన గీతా ప్రభాకర్, ప్రభాకర్ మళ్లీ జార్జ్ లైఫ్‌లోకి ఎందుకు వచ్చారు? సస్పెండ్ అయిన పోలీసు ఆఫీసర్ సహదేవన్ చేసిన కుట్ర ఏంటి? వరుణ్ హత్య కేసు నుంచి కూతురిని తప్పించేందుకు ఈ సారి జార్జ్ వేసిన ప్లాన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. #Drishyam3 (2026) | MalayalamStreaming now on Prime Video… 👀🔥🎧 Available in Malayalam, Tamil, Telugu & KannadaNote: Earlier, it was said that the Telugu audio release was under an interim stay.But surprisingly, the Telugu version is now available on Prime Video too! https://t.co/MCl1meVMjB pic.twitter.com/QZYokpVWXd— KUDALINGAM MUTHU (@KUDALINGAM49671) June 17, 2026 -
'సేవ్ ది టైగర్స్' సీజన్ 3 ప్రీమియర్ సక్సెస్
సోమవారం సాయంత్రం హైదరాబాద్ ఏఎమ్‌బీ సినిమాస్‌లో 'సేవ్ ది టైగర్స్ సీజన్ 3' గ్రాండ్ ప్రీమియర్ వేశారు. దీనికి అద్భుతమైన స్పందన లభించింది. పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరు కాగా వారితో పాటు అతిథులు, నటీనటులు, సాంకేతిక బృందం.. ఇలా అందరూ కలిసి సీజన్3ని ఎంజాయ్ చేశారు.సేవ్ ది టైగర్స్ 3 స్పెషల్ సెలబ్రిటీ ప్రీమియర్ వేడుకలో హీరో సందీప్ కిషన్, కామాక్షి భాస్కర్ల, రాగ్ మయూర్, బిగ్ బాస్ తెలుగు 5 విజేత వీజే సన్నీ, కళ్యాణ్ పడాలా (బిగ్ బాస్ సీజన్ 9 విజేత), చైతన్య రావు, వెంకటేష్ కాకుమాను, కార్తిక్ రత్నం, ఆదిత్య మండల, శ్రీనాథ్ మాగంటి, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్, నిరుపమ్, కిరీటి దామరాజు, మానస్ తదితరుల పాల్గొన్నారు. సేవ్ ది టైగర్స్ సీజన్ 3.. ఈ శుక్రవారం నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీలో 'దృశ్యం 3'.. తెలుగు వెర్షన్ నో రిలీజ్
మలయాళ థ్రిల్లర్స్ అనగానే చాలామంది తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది 'దృశ్యం' ఫ్రాంచైజీనే. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ థ్రిల్లర్ చిత్రాలకు జీతూ జోసెఫ్ దర్శకుడు. ఇదివరకే రెండు భాగాలు రిలీజై సూపర్ హిట్ అయ్యాయి. గతనెలలో మూడో భాగం థియేటర్లలోకి తీసుకురాగా ఇది ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం రూ.200 కోట్లకు పైనే వచ్చాయి. ఇకపోతే రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇంతలోనే మద్రాస్ హైకోర్టు.. మూవీ టీమ్‌కి షాకిచ్చింది.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. దృశ్యం 3 సినిమా తెలుగు హక్కులు తమవే అని గత నెలలో మద్రాసు హైకోర్టుని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే తమ పిటిషన్లో చిత్ర నిర్మాతలు ఎం.జే.ఆంటోని (ఆశీర్వాద్ సినిమాస్), దర్శకుడు జీతూ జోసెఫ్, పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్ తదితరులు తమ అనుమతి లేకుండా చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం, డబ్బింగ్ చేయడం, విడుదల చేయడం, పంపిణీ చేయడం లేదా ఇతర వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం ద్వారా తమ కాపీరైట్ హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది.ఈ కేసును గత నెలలోనే విచారించిన మద్రాస్ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం జరిగిన విచారణలో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంటూ, కేసు తుది తీర్పు వెలువడే వరకు 'దృశ్యం 3' తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ని ఓటీటీలో విడుదల చేయకూడదని బుధవారం (జూన్ 17) మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. అంటే ఓటీటీలో మిగతా భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది కానీ తెలుగు మాత్రం అందుబాటులోకి రాదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా రేజర్, కేనతా కానం, దృశ్యం 3, అతిరథి, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3 లాంటి తెలుగు స్ట్రెయిట్-డబ్బింగ్ మూవీస్, సిరీస్‌లు రాబోతున్నాయి. ఇవలా ఉండగానే ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చిత్రం పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ అదేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)కొత్త బంగారులోకం, హ్యాపీడేస్ సినిమాలతో అప్పట్లో గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్.. మధ్యలో చాన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైపోయాడు. బిగ్‌బాస్ షో తర్వాత మళ్లీ కాస్తంత పాపులారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే అడపాదడపా మూవీస్ చేస్తున్నాడు. అలా చేసిన చిత్రమే 'కానిస్టేబుల్'. గతేడాది అక్టోబరు 10న థియేటర్లలోకి వచ్చింది. తాజాగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.'కానిస్టేబుల్' విషయానికొస్తే.. శంకరపల్లి అనే ఊరిలో కాశీ (వరుణ్ సందేశ్) కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. అయితే ఈ ఊరిలో చాలామంది హత్యకు గురవుతూ ఉంటారు. కాశీ మేనకోడలిని కూడా చంపేస్తారు. అసలు ఈ మర్డర్స్ చేస్తుందెవరు? సీరియల్ కిల్లర్‌ని కాశీ పట్టుకున్నాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీకి రీసెంట్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైన ఆయన.. ఇటీవలే తమిళంలో నటించిన బ్లాస్ట్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. పెద్దగా బజ్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద అదగొడుతోంది. కేవలం మౌత్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంతో సుభాష్ కె రాజ్ అనే కుర్రాడు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.ఈ మూవీ థియేటర్లలో ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వైరలవుతోంది. ఈనెల 25 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుందని పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఓటీటీ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషించారు.బ్లాస్ట్ కథేంటంటే..'బ్లాస్ట్' విషయానికొస్తే.. నీల(ప్రీతి ముకుందన్), ఆమె తండ్రి రాజారామ్ (అర్జున్), తల్లి (అభిరామి) ఈ ముగ్గురూ కరాటే మాస్టర్లే. వీళ్లకు కరాటే ట్రైనింగ్ సెంటర్‌తో పాటు ఓ మెడికల్ షాప్ ఉంటుంది. నీల ఓ రోజు షాప్‌లో ఉన్నప్పుడు కృపాకర్ (పవన్) గ్యాంగ్‌కి చెందిన ఓ రౌడీ ఆమెను బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే ఆమె చేతిలో చావు దెబ్బలు తిని జైలుపాలవుతాడు. కానీ ఈ అరెస్ట్ తర్వాత కృపాకర్ గ్యాంగ్‌తో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం).. నీల కుటుంబాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తారు. తర్వాత ఏమైంది? తమని నాశనం చేసేందుకు వచ్చిన శత్రువుల్ని నీల కుటుంబం ఎలా ఎదుర్కొంది? అనేది మిగతా సినిమా. #ArjunSarja #Abhirami & #PreityMukundan in Blockbuster Action Movie #Blast Coming to Netflix on 25th June... #BlastOnNetflix pic.twitter.com/48kX1z7Hjp— The South Movies (@TheSouthMovies1) June 16, 2026 -
మహేశ్ 'వారణాసి'.. ఇలా అయిందేంటి?
మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో తీస్తున్న సినిమా 'వారణాసి'. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే చెప్పేశారు. అందుకు తగ్గట్లే షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ మూవీకి అనుకోని అవాంతరాలు ఎదురైనట్లు కనిపిస్తున్నాయి. ఓ ముఖ్యమైన విషయం ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయిందని సోషల్ మీడియాలో గట్టిగానే టాక్ వినిపిస్తోంది.(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్)ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న చిన్నాపెద్దా.. ఏ సినిమాలకు అయినా ముందుగా ఓటీటీ డీల్ క్లోజ్ అయితేనే నిర్మాతలు కాస్త రిలాక్స్ అవుతున్నారు. స్టార్ హీరోలు చేసే మూవీస్‌కి ఈ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి చాలా మారిపోయింది. కరోనా టైంలో ఇష్టమొచ్చినట్లు సినిమాలు కొన్న ఓటీటీ సంస్థలు.. ఇప్పుడు మాత్రం ఆచితూచి కొంటున్నాయి.ఓటీటీ డీల్ జరగన కారణంగానే చిరంజీవి 'విశ్వంభర' రిలీజ్‌పై ఇప్పటకీ సస్పెన్స్ తెగట్లేదు. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ 'వారణాసి' కూడా వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీకి రూ.1000 కోట్లకు పైనే బడ్జెట్ పెడుతున్నారని, అందుకు తగ్గట్లే ఓటీటీ డీల్ నుంచి రూ.400-500 కోట్ల వరకు ఆశిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇంత మొత్తం పెట్టి మూవీ కొనేందుకు ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపించట్లేదట.(ఇదీ చదవండి: విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం)దీంతో ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. మరీ ఇంత మొత్తం కాకపోయినా 'వారణాసి'ని కొనే ఓటీటీ ఏదనేది చూడాలి. మార్కెట్లో ఉన్న వాటి బట్టి చూస్తే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ సంస్థలు మాత్రమే పోటీలో ఉంటాయి. మరి వీళ్లలో ఎవరు డిజిటల్ హక్కుల్ని దక్కించుకుంటారనేది చూడాలి?గ్లోబల్ అడ్వెంచర్ కాన్సెప్ట్‌తో తీస్తున్న 'వారణాసి'లో త్రేతా యుగాన్ని కూడా చూపించబోతున్నారు. ఇందులో భాగంగానే మహేశ్ కాసేపు రాముడిగా కనిపిస్తాడు. ఈ విషయాన్ని రాజమౌళి గతేడాది బయటపెట్టారు. ఇకపోతే ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్.(ఇదీ చదవండి: పెళ్లయిపోయింది.. రష్మిక, సమంతకు అదే పెండింగ్) -
ఓటీటీకి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. థియేటర్లలో సందడి చేసిన నెల రోజుల్లోపే ఓటీటీల్లో దర్శనమిచ్చాయి. మరికొన్ని సినిమాలు ఏకంగా వారాల్లోపే స్ట్రీమింగ్ కూడా అవుతున్నాయి. తాజాగా మరో లేటేస్ట్ తెలుగు సినిమా ఓటీటీకి వచ్చేస్తోంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో వస్తోన్న థాంక్యూ సుబ్బారావు స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది.ఈ విషయాన్ని ఆహా సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. జూన్ 18 నుంచి థాంక్యూ సుబ్బారావు స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. ఈ సినిమాకు చెందు ముద్దు దర్శకత్వం వహించారు. కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దినేష్ కుర్ర నిర్మించగా.. ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు.ఈ మూవీ కథేంటంటే..ట్రైన్ జర్నీలో పరిచయం లేని ఓ అమ్మాయి చుట్టూ తిరిగే క్రైమ్ కథాంశంగా రూపొందించారు. సస్పెన్స్, లవ్, కామెడీ, యాక్షన్ అంశాలతో సినిమాను తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌తో ఈ మూవీ కథేంటో ముందే పరిచయం చేశారు. ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించారు. A story filled with emotions, relationships, and unforgettable moments is ready to reach your screens!#ThankYouSubbarao starts streaming on @ahavideoIN from June 18th.https://t.co/JvRngv6wYhDon't miss this heartwarming entertainer!#ThankYouSubbaraoOnAha@KurraP68246… pic.twitter.com/ODQe1g7LcD— SR PROMOTIONS (@SRPROMOTIONS29) June 15, 2026 -
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఐశ్వర్యా రాజేశ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో మూవీస్, ఓటీటీ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఈమె లీడ్ రోల్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్కి రెడీ అయింది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేసి కథేంటో చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన)ఐశ్వర్యా రాజేశ్, సముద్రఖని, సునీల్, నరేశ్ అగస్త్య తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'ఇసకపట్నం'. 1990ల్లో ఓ తీరప్రాంత గ్రామంలో జరిగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు. వచ్చే నెల 02వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. గ్యారీ బీహెచ్ ఈ సిరీస్‌కి దర్శకుడు.ట్రైలర్ బట్టి చూస్తే.. ఇసకపట్నం అనే ఊరిలో నాయుడు(సముద్రఖని) అనే పెద్దమనిషి పోర్ట్‌లో వ్యాపారాన్ని, ఊరిలో జనాల్ని తన అదుపులో ఉంచుకుని ఆజమాయిషీ చెలాయిస్తుంటాడు. ఊహించని విధంగా ఇతడి కూతురు (ఐశ్వర్యా రాజేశ్) ఇతడికి ఎదురు తిరుగుతుంది. ఈమెకు ఊరిలో కొందరు తోడవుతాడు. తర్వాత ఏం జరిగింది? కుర్చీ, అధికారం కోసం జరిగే ఈ కొట్లాట ఎక్కడకు దారితీసింది అనేది మిగతా స్టోరీ.ట్రైలర్ చూస్తే రెగ్యులర్ రొటీన్ టెంప్లేట్ స్టోరీలానే అనిపించింది. ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాల్లో ఈ తరహా అంశాల్ని చూసేశారు. మరి వీళ్లు ఏం కొత్తగా చూపిస్తారనేది ఇక్కడ ప్రశ్న. కొత్తగా చూపిస్తే వర్కౌట్ అవుతుంది లేదంటే జస్ట్ ఒక సిరీస్ అవుతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి టెక్నో థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్) -
ఓటీటీలోకి టెక్నో థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా టెక్నో థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఓ స్టోరీతో వెబ్ సిరీస్ సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దీనికి కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈయన కొడుకు వీర్ హిరానీ ఇందులో లీడ్ రోల్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు. కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)'ప్రీతమ్ అండ్ పెడ్రో' పేరుతో తీసిన ఈ సిరీస్ వచ్చే నెల 3వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో వీర్ హిరానీ లీడ్ రోల్ చేయగా.. అర్షద్ వార్షీ, విక్రాంత్ మస్సే, బొమన్ ఇరానీ లాంటి స్టార్స్ కీలక పాత్రలు చేశారు. తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.ట్రైలర్ బట్టి చూస్తే.. టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని పెడ్రో(అర్షద్ వార్సీ) అనే పోలీస్ అధికారి.. ఓ కేసు కారణంగా మంత్రి దెబ్బకు సైబర్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. మరోవైపు ప్రీతమ్ అనే కుర్రాడు టెక్నాలజీలో జీనియస్. 15 నిమిషాల్లోనే సెల్‌టవర్‌ని హ్యాక్ చేయగలడు. కానీ నిజ జీవితంలో వ్యాక్యూమ్ క్లీనర్స్ అమ్ముతుంటాడు. అయితే పెడ్రో ట్రాన్స్ఫర్కి కారణమైన మంత్రి కొడుకు కిడ్నాప్ అవుతాడు. రూ.23 లక్షలు డిమాండ్ చేస్తారు. ఇదంతా చేసింది పేరు మోసిన మరో హ్యాకర్ అని పెడ్రో, ప్రీతమ్ తెలుసుకుంటారు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన) -
ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన
తెలుగులో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు గుర్తుండే ఉంటాడు. చాన్నాళ్లుగా తెరపై పెద్దగా కనిపించని ఇతడు.. ట్రెండ్‌కి తగ్గట్లే ఓ యాక్షన్ మూవీ చేశాడు. దర్శకత్వంతో పాటు హీరోగానూ ఇతడే నటించాడు. కాకపోతే థియేటర్లలో రిలీజైన తొలి ఆట నుంచి దారుణమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్)సహాయ నటుడిగా అద్భుతమైన పాత్రలు చేసిన రవిబాబు.. 'అల్లరి' మూవీతో దర్శకుడిగా మారాడు. అవును, అనసూయ, అమరావతి లాంటి డిఫరెంట్ ప్రయోగాలు చేశాడు. అప్పట్లో ఇవి ఉన్నంతలో బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ ట్రెండ్‌కి తగ్గట్లు కంటెంట్ మార్చుకోలేక మూవీస్ చేయడం తగ్గించుకుంటూ వచ్చేశాడు. 'రేజర్' పేరుతో తీసిన యాక్షన్ చిత్రాన్ని గత నెల 8న థియేటర్లలో రిలీజ్ చేశాడు. దీని ప్రమోషన్లలో సినిమాల గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. వాటిని అందరూ బాగానే చూశారు గానీ మూవీని ఒక్కడూ పట్టించుకోలేదు.ఇప్పుడీ చిత్రం ఈ శుక్రవారం(జూన్ 19) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఆడియెన్స్ దీన్ని థియేటర్లలో పట్టించుకోలేదు. మరి ఓటీటీలోనైనా పట్టించుకుంటారేమో చూడాలి? ఇకపోతే ఈ వారం దీనితోపాటు దృశ్యం 3, అతిరథి, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3, కెనాతా కానమ్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి.'రేజర్' విషయానికొస్తే.. రాష్ట్ర హోంమంత్రి (కనకరాజు) తన కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రిని హత్య చేస్తాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విష్ణు (తనీష్) చేతికి చిక్కుతుంది. దీంతో హోంమంత్రి ముఠా విష్ణును, అతని భార్యని చంపేస్తారు. ప్రాణాలతో బయటపడిన విష్ణు కూతురు తేజును.. పెట్ గ్రూమింగ్ చేసే రుద్ర ప్రతాప్ (రవిబాబు) కాపాడతాడు. తర్వాత హోంమంత్రి గ్యాంగ్ నుంచి ఆ చిన్నారిని రవిబాబు ఎలా కాపాడాడనేది మిగిలిన కథ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీల్లో ఏకంగా 14 సినిమాలు.. ఆ మూవీపైనే అందరి కళ్లు..!
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. పెద్ది థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరి కొన్ని చిన్న సినిమాలు సైతం రిలీజయ్యాయి. వాటిపై పెద్దగా బజ్ లేకపోవడంతో థియేటర్ల వద్ద హడావుడి కనిపించడం లేదు. ఈ వారంలో థియేటర్లలో దీవానా, మా ఇంటి బంగారం లాంటి చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో సమంత మా ఇంటి బంగారంపై కాస్తా బజ్ నెలకొంది. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపే చూస్తున్నారు.ఈ వారంలో ఓటీటీ ప్రియులను అలరించేందుకు సినిమాలు రెడీ అయిపోయాయి. దృశ్యం-3, కెనతా కానోమ్, ఎం4ఎం లాంటి సినిమాలు ఆసక్తిగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మోహన్ లాల్ దృశ్యం-3 కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీటితో పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారంలో ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్మై అమెరికాస్ స్వీట్‌హార్ట్స్ (వెబ్‌సిరీస్:సీజన్3) జూన్ 16డ్రింకింగ్ బడ్డీస్ -(హాలీవుడ్ మూవీ) జూన్ 15ఐ విల్ ఫైండ్ యూ(హాలీవుడ్ సిరీస్)- జూన్ 18వాయిస్‌మెయిల్స్ ఫర్ ఇసబెల్లె(హాలీవుడ్ సినిమా)- జూన్ 19తుక్రా కె మేరా ప్యార్ సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 19హస్బెండ్స్ ఇన్ యాక్షన్(కొరియన్ మూవీ)- జూన్ 19జియో హాట్స్టార్కెనతా కానోమ్(తమిళ సినిమా)- జూన్ 16 సేవ్ ది టైగర్స్ 3 (తెలుగు వెబ్‌సిరీస్) జూన్ 19అమెజాన్ ప్రైమ్యువర్ ఫాల్ట్(హాలీవుడ్ మూవీ)- జూన్ 17దృశ్యం-3-(మలయాళ మూవీ)- జూన్ 18ది ఎజెన్సీ- సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 21లయన్స్ గేట్ ప్లే..అలియా బసు గాయబ్ హై(బాలీవుడ్ మూవీ)- జూన్ 19ఎం4ఎం(మోటివ్ ఫర్ మర్డర్)-(తెలుగు సినిమా)- జూన్ 19సోని లివ్..అతిరథి(మలయాళ సినిమా)- జూన్ 19 -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా అలా వీరభద్రుడు, దృఢం, భూత్ బంగ్లా, రమణి కల్యాణం తదితర చిత్రాలతో పాటు రాఖ్, ష్ సీజన్ 3 లాంటి డబ్బింగ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. మరోవైపు ఓ తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కూడా పెద్దగా హడావుడి లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!)2022 అక్టోబరు 28న థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'ఐటెంటిటి'. అమరేష్ రాజు, భాగ్యలక్ష్మి, కుషి ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తీసినప్పటికీ పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఇదొకటి వచ్చిందనే సంగతి కూడా జనాలకు తెలిసిరాలేదు. ఇప్పుడీ మూవీ దాదాపు నాలుగేళ్ల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.'ఐడెంటిటి' విషయానికొస్తే.. రిషిదేవ్ ఓ ఎన్సీబీ అధికారి. ఓ ప్రమాదంలో తన జ్ఞాపకశక్తి కోల్పోతాడు. అదే టైంలో హరన్ అనే వ్యక్తి డ్రగ్ రాకెట్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తిస్తారు. అయితే హరన్ ఎవరో కాదు గతం మర్చిపోయిన రిషిదేవ్ అనే సంగతి తెలుస్తుంది. తర్వాత ఏమైంది అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘దృఢం’ రివ్యూ.. ఇదేం ట్విస్టులురా బాబు.. ఊహించడం కష్టం!) -
ఓటీటీకి కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. డైరెక్ట్‌గా స్ట్రీమింగ్
ఓటీటీకి వచ్చేందుకు మరో సినిమా రెడీ అయిపోయింది. సన్నీ డియోల్, అక్షయే ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ఇక్కా. ఈ చిత్రాన్ని సస్పెన్స్ కోర్ట్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. జూలై 10 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ సందడి చేయనుంది.దాదాపు 29 ఏళ్ల తర్వాత ఇద్దరు దిగ్గజ నటులు సన్నీ డియోల్, అక్షయే ఖన్నా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ సస్పెన్స్ అండ్ ఎమోషనల్ కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్ పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దియా మీర్జా, తిలోత్తమా శోమే, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. #Bollywood doesn't make enough courtroom thrillers.#Ikka already has my attention. The poster feels tense, the tagline is intriguing, and #SunnyDeol looks completely locked in. 🔥⚖️Also, you can never count out #AkshayeKhanna in a film like this when it comes to intense,… pic.twitter.com/9SuJeH0vWN— Siddharth R Kannan (@sidkannan) June 13, 2026 -
‘29’ మూవీ రివ్యూ : సాదా సీదా కథే.. చూస్తుంటే కన్నార్పనీయదు
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. వాటిలో తమిళ చిత్రం ‘29’ ఒకటి. నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. అప్పుడెప్పుడో ఓ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది... థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని అంటారు. తన ఐడెంటీటీ గురించి చెప్పే ప్రయత్నంలో చెప్పిన డైలాగ్ అది. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఓ గుర్తింపు ఉంటుంది. నిజానికి కొంతమంది స్వతహాగా ఆ గుర్తింపు సంపాదించుకుంటారు. మరికొందరు సంపాదించే పోరాటంలో ఉంటారు. ఆ దరిమిలా తీసిన కథే ఈ ‘29’ సినిమా. తాను రాసుకున్న కథను తానే వెండితెర మీదకు తీసుకువచ్చిన రత్నకుమార్ నిజంగా అభినందనీయుడే. ఇదో సాదా సీదా కథ. కానీ చూసే ప్రేక్షకుడిని మాత్రం కన్నార్పనీయదు. అంతలా ఏముందో ఈ కథలో ఓసారి చూద్దాం. సత్య 29 ఏళ్ళ కాలేజ్ యువకుడు. ఏ లక్ష్యమూ లేక నిరంతరం తన గుర్తింపు కోసం ఆరాటపడే పోరాట వీరుడు. ఆ ప్రయత్నంలోనే సత్యకు కథానాయిక విజ్జి పరిచయమవుతుంది. సత్యలా కాదు విజ్జి... ఐఏఎస్‌కి ప్రిపేర్ అవుతుంటుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. అసలే తనకు గుర్తింపు లేదనే బాధలో ఉన్న సత్యకు ఉన్నట్టుండి బాయ్ ఫ్రెండ్ అనే గుర్తింపు వచ్చిన ఆనందం ఎంతో సేపు నిలవదు. ఓ దశలో విజ్జి తన ప్రేమ తన లక్ష్యానికి అడ్డుగా ఉందని భావించి సత్యను ఇక కలవొద్దని చెబుతుంది. అనుకోకుండా తన జీవితంలో అడుగుపెట్టిన విజ్జి తనే ఇప్పుడు కలవొద్దని చెప్పడంతో సత్య కుమిలిపోతాడు. మరి... సత్యను కలవొద్దన్న విజ్జి ఐఏఎస్ పాసవుతుందా? సత్యకు తనకు కావలసిన గుర్తింపుతోపాటు విజ్జి దక్కుతుందా? అన్న విషయం మాత్రం ‘29’ సినిమాలోనే చూడాలి. పేరుకు ఇది తమిళ మాతృక అయినా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమ్ అవుతోంది. ఓ మంచి ఫీల్ ఉన్న ఎమోషనల్ డ్రామా ఈ సినిమా. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
‘దృఢం’ రివ్యూ.. ఇదేం ట్విస్టులురా బాబు.. ఊహించడం కష్టం!
టైటిల్ : దృఢంనటీనటులు: షేన్ నిగమ్, శోభి తిలకన్, కొట్టాయం రమేశ్, నందన్ ఉన్ని తదితరులుదర్శకత్వం : మార్టిన్ జోసెఫ్ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక: జియో హాట్స్టార్తమిళ, మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌కి ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది.థియేటర్స్‌లో సరిగా ఆడలేకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి విజయాన్ని సాధించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఆ చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే ప్రతివారం ఓటీటీలో ఇలాంటి చిత్రాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ వారం కూడా ఓ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘దృఢం’. జియో హాట్‌స్టార్ వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కుజినీలం పోలీస్‌స్టేషన్ పరిధిలో పెద్దగా క్రైమ్ అనేదే జరగదు. పోలీసులంతా ఊరివాళ్లతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. అలాంటి ప్రశాంతమైన స్టేషన్‌కి ఎస్సైగా వస్తాడు విజయ్(షేన్ నిగమ్). శిక్షణ పూర్తయిన తర్వాత ఎస్సైగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ప్రాంతం ప్రశాంతంగా ఉంటుందని తెలిసి ఎంతో సంతోషంగా ఉంటాడు. స్టేషన్‌లోని పోలీసులందరితో సరదాగా ఉంటూ తన డ్యూటీ తాను చేస్తుంటాడు. అయితే ఆయన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే ఊరిలో గుర్తు తెలియని యువకుడి శవం బయటపడుతుంది. కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగానే.. అదే ప్రాంతంలో ఉన్న ఫైనాన్స్ కంపెనీలో దోపిడీ జరుగుతుంది. భారీ బంగారంతో పాటు రూ. 50 లక్షల నగదు కూడా దోచేస్తారు.దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తుండగానే స్థానికంగా ఉన్న డ్యామ్‌లో మరో శవం బయటపడుతుంది. ప్రశాంతమైన ప్రాంతంలో ఇలా ఒక్కసారిగా వరుస హత్యలు, దోపిడీ జరుగుతుండడంతో ఉన్నతాధికారుల నుంచి విజయ్‌పై ఒత్తిడి పెరుగుతుంది. వారంలో ఈ కేసులను ఛేదించాలని,లేదంటే ఆ బాధ్యతలను మరో అధికారికి అప్పగిస్తామని హెచ్చరిస్తారు. మరి ఈ కేసుని విజయ్ ఛేదించాడా? అసలు ఆ శవాలు ఎవరివి? ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం చేసిందెవరు? విచారణ క్రమంలో విజయ్‌కి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు హంతకులను ఎలా పట్టుకున్నాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..సాధారణంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కథలు అన్ని దాదాపు ఒకేలా ఉంటాయి. క్రైమ్ జరగడం.. అది పోలీసులకు అది సవాలుగా మారడం..ఇన్వెస్టిగేషన్లో ట్విస్టులు బయటకు రావడం..ఇలా అన్ని కథలు ఇదే ఫార్మాట్లో సాగుతాయి. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ ఎంత ఉత్కంఠంగా సాగింది? అదేదానిపైనే సినిమా ఫలితం ఆధారణ పడుతుంది. ‘అరే..ఇదేం ట్విస్టురా..అస్సలు ఊహించలేదు’ అని ప్రేక్షకుడు నోటితో అనిపిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే. ‘దృఢం’ సినిమా చూస్తే చివరిలో కచ్చితంగా మన నోట అలాంటి మాట వస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ని అస్సలు ఊహించలేరు. చివరిలో కొత్త క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చూశామనే ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది.సినిమా ప్రారంభ సన్నివేశాలు రొటీన్‌గానే ఉంటాయి. శిక్షణ పూర్తి చేసుకొని ఎస్సైగా కుజినీలం పోలీస్‌స్టేషన్‌కు రావడం..తోటి పోలీసులతో సరదగా కలిసి ఉండడం.. చిన్న చిన్న క్రైమ్ కేసులు వస్తే సాల్వ్ చేయడం.. దాదాపు అరగంట వరకు ఇలా సింపుల్‌గానే కథనం సాగుతుంది. ఎప్పుడైనే మొదటి శవం బయటపడుతుందో అప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. ఒకవైపు గుర్తు తెలియని శవం ఎవరిదని విచారణ చేస్తుండగానే.. ఫైనాన్స్ కంపెనీతో దోపిడీ ఘటన బయటపడడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా వరుసగా క్రైమ్ జరగడంతో ఎస్సై విజయ్ ఈ కేసులను ఎలా ఛేదిస్తాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అసలు హత్యలు ఎవరు చేశారనేది ప్రేక్షకుడు కూడా అంచనా వేయలేడు. ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే ట్విస్టులు అయితే అదిరిపోతాయి. హంతకులు ఎవరనేది తెలిసిన తర్వాత షాకవ్వడం ఖాయం. ప్రేక్షకుడు ఆ షాక్‌లో ఉండగానే మరో ట్విస్ట్ రివీల్ చేసి సర్ప్రైజ్ చేశాడు దర్శకుడు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు, యాక్షన్ సన్నివేశాలు థ్రిల్లింగ్‌కు గురి చేస్తాయి. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా, రొటీన్‌గా సాగినా.. సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే..షేన్ నిగమ్ తప్ప మిగిలిన నటీనటులెవరు తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగానూ ఈ సినిమా బాగానే ఉంది. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్వాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లోని సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం దృశ్యం 3, మే 21న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. మలయాళంలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 236 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయినప్పటికీ నెల రోజులలోపే ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 18 నుంచి ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన వెల్లడించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రసారం కానుంది.దృశ్యం 3 కథేంటంటే..?దృశ్యం 2 ముగింపు సీన్‌తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు జార్జ్‌కుట్టి(మోహన్‌లాల్) వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. కోర్టు ఆదేశాలతో జార్జ్ ఫ్యామిలీపై ఎలాంటి కేసు నమోదు కాకుండా బయటపడతారు. తన జీవితంలో చోటు చేసుకున్న ఈ ఘటననే కాస్త మార్పులు చేసి ఓ సినిమాను నిర్మిస్తాడు జార్జ్. అది రిలీజై..బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుంది. అదే సమయంలో మానసిన సమస్యలను నుంచి బయటపడిన పెద్ద కూతురు అంజుకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. భార్య రాణి(మీనా) కూడా కూతురికి త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుందని సలహా ఇస్తుంది. అయితే చాలా సంబంధాలు వచ్చినప్పటికీ.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంజు గురించి నెగెటివ్‌గా చెప్పడంతో అవన్నీ తప్పిపోతాయి.కొన్నాళ్ల తర్వాత తన కూతురికి వచ్చిన పెళ్లి సంబంధాలను ఇద్దరు చెడగొడుతున్నారనే విషయం తెలుస్తుంది? అసలు ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నారు? కొడుకు(వరుణ్)ని పోగోట్టుకున్న బాధ నుంచి బయటపడేందుకు అమెరికా వెళ్లిన గీతా ప్రభాకర్, ప్రభాకర్ మళ్లీ జార్జ్ లైఫ్‌లోకి ఎందుకు వచ్చారు? సస్పెండ్ అయిన పోలీసు ఆఫీసర్ సహదేవన్ చేసిన కుట్ర ఏంటి? వరుణ్ హత్య కేసు నుంచి కూతురిని తప్పించేందుకు ఈ సారి జార్జ్ వేసిన ప్లాన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. ఒక్క రోజే 21 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో కూడా థియేటర్లలో పెద్ది హవా కొనసాగుతోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి షురూ అవుతుంది. ఈ నెల 12న ఫ్రైడే రోజున చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. సింగ్ గీతం, భారత భాగ్య విధాత, పోలీస్ కంప్లైంట్, కొత్త మలుపు లాంటి సినిమా బాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.ఇక ఈ శుక్రవారం ఓటీటీల విషయానికొస్తే సూర్య కరుప్పు(తెలుగులో వీరభద్రుడు)పై ఆసక్తి నెలకొంది. భూత్ బంగ్లా లాంటి బాలీవుడ్ మూవీపై కూడా ఆడియన్స్‌లో క్రేజ్ ఉంది. వీటితో రమణి కల్యాణం అనే తెలుగు సినిమా సైతం ఓటీటీలో సందడి చేయనుంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ నుంచి సినిమాలతో పాటు పలు ఆసక్తికర వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ భూత్ బంగ్లా (హిందీ సినిమా) - జూన్ 12ఐ యామ్ ఫ్రాంకెల్డా (స్పానిష్ మూవీ) - జూన్ 12ది పాలిగమిస్ట్(వెబ్ సిరీస్)- జూన్ 12అవుట్ లాస్ట్ ది జంగిల్-(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12ది రెస్ట్ ఈజ్ ఫుట్‌బాల్- సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12అమెజాన్ ప్రైమ్ రాఖ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 12 కరుప్పు/ వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 12 విజిల్(హాలీవుడ్ మూవీ)- జూన్ 12 డాగ్51(ఫ్రెంచ్ సినిమా)- జూన్ 12 ఓవర్ యువర్ డెడ్ బాడీ(హాలీవుడ్ మూవీ)- జూన్ 12 ఎవరీ ఇయర్ ఆఫ్టర్(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12జియో హాట్‌స్టార్ ద్రిదమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 12 అలైస్ అండ్ స్టీవ్- సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12 బిలో డెక్ మెడిటెరియన్-సీజన్ 11(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12ఆహా ష్ సీజన్ 3 (తెలుగు సిరీస్) - జూన్ 12జీ5మై హూ నా (హిందీ రియాలిటీ షో) - జూన్ 12తార్ఖతా (బెంగాలీ సిరీస్) - జూన్ 12లయన్స్ గేట్ ప్లే షెల్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 12 విక్కీ క్రిస్టీ బార్సిలోనా (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 12సన్ నెక్ట్స్రమణి కల్యాణం(తెలుగు సినిమా)- జూన్ 12హెబీవో మ్యాక్స్దె విల్ కిల్ యూ(హాలీవుడ్ మూవీ)- జూన్ 12 -
ఓటీటీలో దురంధర్-2.. మూడు రోజుల్లోనే రికార్డ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ఏకంగా రూ.1790 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 రికార్డ్‌ను సైతం అధిగమించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జూన్ 5న స్ట్రీమింగ్కు వచ్చేసిన దురంధర్-2 వ్యూస్ పరంగా అదరగొడుతోంది. స్ట్రీమింగ్కు వచ్చిన మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల మందికిపైగా వీక్షించారు. కేవలం వీకెండ్లోనే 5 కోట్ల మందిపైగా వీక్షించినట్లు ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ మూవీ ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేశ్ బేడీ, గౌరవ్ గేరా, డానిష్ పాండోర్ కీలక పాత్రలు పోషించారు. -
థియేటర్లలో పెద్ది.. ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ప్రస్తుతం పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల మార్క్‌కు దగ్గరకు చేరుకుంది. ఈ వారం కూడా పెద్ది హవానే కొనసాగుతోంది. ఈ ఫ్రైడే రోజు చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. సింగ్ గీతం, భారత భాగ్య విధాత, పోలీస్ కంప్లైంట్, కొత్త మలుపు లాంటి సినిమా బాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి.ఇక ఈ వారం ఓటీటీల విషయానికొస్తే సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఓటీటీకి వచ్చేస్తోంది. దీంతో పాటు బాలీవుడ్ మూవీ భూత్ బంగ్లా స్ట్రీమింగ్కు రానుంది. వీటితో పాటు తెలుగులో ష్ అనే తెలుగు వెబ్ సిరీస్ ఆసక్తి పెంచుతోంది. అంతేకాకుండా పలు టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (జూన్ 8 నుంచి 14 వరకు)నెట్ఫ్లిక్స్కలర్స్ ఆఫ్ ఈవిల్ - బ్లాక్ (మూవీ) - జూన్ 10మై ఫ్యామిలీ సీజన్2 (వెబ్‌సిరీస్) - జూన్ 10స్వీట్ మగ్నోలియాస్ -సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 11ది ఈవిల్ లాయర్ (వెబ్‌సిరీస్) - జూన్ 11భూత్ బంగ్లా (హిందీ సినిమా) - జూన్ 12ఐ యామ్ ఫ్రాంకెల్డా (స్పానిష్ మూవీ) - జూన్ 12అమెజాన్ ప్రైమ్ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10ద రెస్ట్ ఈజ్ ఫుట్‌బాల్ (డాక్యుమెంటరీ మూవీ) - జూన్ 10రాఖ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 12కరుప్పు/ వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 12జియో హాట్స్టార్ద్రిదమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 12ఆహాష్ సీజన్ 3 (తెలుగు సిరీస్) - జూన్ 12జీ5మై హూ నా (హిందీ రియాలిటీ షో) - జూన్ 12తార్ఖతా (బెంగాలీ సిరీస్) - జూన్ 12లయన్స్ గేట్ ప్లేషెల్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 12విక్కీ క్రిస్టీ బార్సిలోనా (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 12ఆపిల్ టీవీ ప్లస్క్రిమినల్ రికార్డ్ (వెబ్‌సిరీస్) - జూన్ 10 -
ఓటీటీకి సూర్య హిట్ సినిమా.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్..!
సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్య సరసన హీరోయిన్గా త్రిష కనిపించింది. ఆర్థిక సమస్యలతో ఒక రోజు ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టేసింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూన్ 12 నుంచో ఓటీటీ ప్రియులను అలరించనుంది. రిలీజైన నెల రోజుల్లోపే స్టార్ హీరో మూవీ ఓటీటీకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.కరుప్పు కథేంటంటే..మీను అనే అమ్మాయి ప్రాణాంతక వ్యాధి బారిన పడుతుంది. చికిత్స కోసం లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. దీంతో తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను అమ్మాలని చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తారు. నాంపల్లిలో రైలు దిగి..సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కుతుండగా..దొంగలు వచ్చి ఆ నగలను ఎత్తుకెళ్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మరుసటి రోజు దొంగలను పట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారు. వాటిని తీసుకోవాలంటే కోర్టు అనుమతి అవసరం అని చెప్పడంతో మీను, ఆమె తండ్రి కోర్టుకు వెళ్తారు.ఈ కేసునే టేకాప్ చేసిన లాయర్ బేబీ కృష్ణ(ఆర్.జే బాలాజీ)..వాళ్లకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. దోచుకోవడం మొదలుపెడతాడు. కావాలనే కేసును నెలల తరబడి సాగదీస్తాడు. మీను తండ్రికి ఓపిక నశించి.. చేసేదేం లేక కోర్టు ఎదుటే ఉన్న వీరభద్రుడు స్వామిని (సూర్య)ను వేడుకుంటాడు. న్యాయం కోసం ఆ దేవుడే కిందకి దిగొస్తాడు. మనిషిగా భూమికి మీదకు వచ్చిన వీరభద్రుడు స్వామి.. మీనుకి న్యాయం చేశాడా? అవినీతి కంపులో మునిగిపోయి బేబీ కృష్ణకు, ఇతర లాయర్లకు ఆయన ఎలాంటి బుద్ది చెప్పాడు? అనేదే ఈ సినిమా కథ. god mode ON 🔥 #KaruppuOnPrime, June 12@Suriya_offl @RJ_Balaji @SaiAbhyankkar @dop_gkvishnu @trishtrashers @prabhu_sr #Indrans @natty_nataraj #Swasika @SshivadaOffcl #SupreethReddy #AnaghaMayaRavi #VikramMor @kalaivananoffl #ArunVenjaramoodu @PraveenRaja_Off @ZeeTamil… pic.twitter.com/VeKFZ4qViA— prime video IN (@PrimeVideoIN) June 8, 2026 -
ఓటీటీకి టాలీవుడ్ ఎమోషనల్ డ్రామా..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సూర్య వశిష్ట, దీప్షిక హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఎమోషనల్ డ్రామా రమణి కల్యాణం. ఈ ఎమోషనల్ డ్రామాకు విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు. మే 22న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. చిత్రాన్ని కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మించారు.ఈ సినిమా ఓటీటీ సందడి చేసేందుకు వచ్చేస్తోంది. సన్ నెక్ట్స్ వేదికగా ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈనెల 12 నుంచే సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు.ఈ సినిమా కథేంటంటే.. సంజన(దీప్షిక) చిన్నప్పుడే ఓ యాక్సిడెంట్ లో కళ్ళు పోగొట్టుకున్నా తన పనులు తాను చేసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటూ ఓ పబ్ లో సింగర్ గా పనిచేస్తూ ఉంటుంది. నలుగురు పిల్లలు, ఓ బామ్మ.. వాళ్లే సంజన ప్రపంచం. సంజన పనిచేసే పబ్ ఓనర్ కిషోర్(శ్రీనివాసరెడ్డి) ఫ్రెండ్ రాజ్(సూర్య వసిష్ఠ) నడవలేడు. పక్షవాతం వల్ల వీల్ చైర్ కే అంకితం. అనుకోకుండా ఈ ఇద్దరూ ఓ గొడవతో పబ్ లో కలిసి స్నేహితులుగా మారి అనంతరం ప్రేమలో పడతారు. ఎప్పుడూ అతని గతం, గోల్ గుర్తుచేసుకుంటూ బాధపడే రాజ్ సంజన ప్రేమతో పూర్తిగా మారిపోయి సంతోషంగా ఉంటాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఆ సమయంలోనే కిషోర్ కి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి? మరి సంజన - రాజ్ ల పెళ్లి జరిగిందా? అసలు రాజ్ ఎందుకు వీల్ చైర్ కే పరిమితమయ్యాడు? రాజ్ గతమేంటి? సంజన గతం ఏంటి? సంజనతో ఉండే నలుగురు పిల్లలు ఎవరు? కిషోర్‌కి రాజ్ గురించి ఏం తెలిసింది అన్నదే ఈ సినిమా కథ.When the perfect match is the one who heals your soul.Stream Ramani Kalyanam on Sun NXT from 12 June!#RamaniKalyanam #TeluguMovies #TFI #SunNXT [Feel Good Movies, Telugu Movies, New Telugu Movies, Deepshika, Surya Vashistta, Romance Movies, Emotional Drama, Poetic Movies,… pic.twitter.com/LL5Wa17mDS— SUN NXT (@sunnxt) June 7, 2026 -
ఓటీటీలోకి మలయాళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలకు తెలుగునాట చాలా క్రేజ్ ఉంటుంది. ఆ భాషలో తీసిన వివిధ జానర్ల మూవీస్‌ని తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. అందుకు తగ్గట్లే డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా గత నెలలో రిలీజై హిట్టయిన కామెడీ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగానూ ప్రకటించారు.(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)మలయాళంలో హీరో, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాసిల్ జోసెఫ్ లేటెస్ట్ యూత్‌ఫుల్ కామెడీ మూవీ 'అతిరథి'. ఇందులోనే టొవిన్ థామస్ మరో హీరోగా నటించాడు. 'సర్వం మాయ' ఫేమ్ రియా షిబు హీరోయిన్గా చేసింది. గత నెల 14న థియేటర్లలో రిలీజై ఆకట్టుకుంది. రూ.65 కోట్ల మేర కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడీ మూవీ ఈ నెల 19వ తేదీ నుంచి సోనీ లివ్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుందని పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చారు.'అతిరథి' విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చదివే సామ్ కుట్టి(బాసిల్ జోసెఫ్) తన కాలేజీలో ఆగిపోయిన అరోహన్ ఫెస్ట్‌ని తిరిగి ప్రారంభించాలని అనుకుంటాడు. కానీ ఇదే కాలేజీలో ఉంటే మరో గ్రూప్ దీన్ని వ్యతిరేకిస్తుంది. మరి చివరకు ఏమైంది? సామ్ కుట్టి తను అనుకున్నది సాధించాడా లేదా? శ్రీకుట్టి(టొవినో థామస్), స్వాతి (రియా షిబు) ఎవరు? అనేది మిగతా స్టోరీ. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కామెడీ సినిమా చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.(ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్.. ఈసారి ఇంకాస్త
ఓటీటీలకు సెన్సార్ ఉండదు. కాబట్టి బూతు, రొమాంటిక్ జానర్ సినిమాలు, సిరీస్‌లు అప్పుడప్పుడు రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు అలానే బోల్డ్ రొమాంటిక్ కాన్సెప్ట్‌తో తీసిన తెలుగు సిరీస్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగానూ ప్రకటించారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: 'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?)2024లో 'ష్' పేరుతో తమిళంలో ఓ సిరీస్ తీశారు. సోనియా అగర్వాల్, ఇనయా, ఐశ్వర్య దత్తా తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. దీని గతేడాది తెలుగులోనూ డబ్బింగ్ చేసి విడుదల చేశారు. తర్వాత కొన్నిరోజులకే రెండో సీజన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో కొత్త పాత్రలు కొత్త కాన్సెప్ట్ చూపించారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మూడో సీజన్ కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈసారి మరింత బోల్డ్ కంటెంట్ ఉండబోతుందన్నట్లు హింట్ ఇచ్చారు.జూన్ 12 నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి 'ష్ సీజన్ 3' ఆహా ఓటీటీలో తెలుగు, తమిళంలో అందుబాటులోకి రానుంది. ఈ సీజన్లో ఒకప్పటి హీరోయిన్ పూనమ్ బజ్వా, బిగ్‌బాస్ ఫేమ్ దివి, కిరణ్ రాథోడ్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. వీళ్లంతా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలు, వీడియోలతో ఇప్పటికే ఫేమస్. (ఇదీ చదవండి: మొన్న 'దేవర'.. ఇప్పుడు 'పెద్ది'.. జాన్వీ కపూర్ అదే తంతు)Every character has a story. Meet the cast of #SshhhSeason3 🎭Stay tuned @ahatamil 🌟#ahatamil #SshhhSeason3 pic.twitter.com/IuurnJ8KUf— aha Tamil (@ahatamil) June 4, 2026 -
ఈ వీకెండ్ పండగే.. థియేటర్లలో పెద్ది.. ఓటీటీలో దురంధర్-2..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వీకెండ్ మొత్తం రామ్ చరణ్ పెద్ది హవా ఉండనుంది. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు తొలిరోజు నుంచే పాజిటివ్ వస్తోంది. సూపర్ హిట్ ఖాయమంటూ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారాంతం మూడు రోజులు పెద్దికి కలిసి రానుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే దురంధర్-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచే ప్రీమియర్ షోతో దురంధర్ ఓటీటీలో సందడి చేయనుంది. దీంతో పాటు అగ్లీ స్టోరీ, కేడీ ది డెవిల్ లాంటి సినిమాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. ఈ ఫ్రైడే పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సైతం స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ 29 (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూన్ 05 మెక్సికో 86 (స్పానిష్ సినిమా) - జూన్ 05 ఆఫీస్ రొమాన్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 05 టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ సిరీస్) - జూన్ 05 ద మార్క్డ్ ఉమన్ (స్పానిష్ సినిమా) - జూన్ 05స్కార్లెట్ (హాలీవుడ్ మూవీ)- జూన్ 06 యూఎస్ఏ 94 (పోర్చుగీస్ చిత్రం) - జూన్ 07జియో హాట్‌స్టార్ ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05అమెజాన్ ప్రైమ్ ద పిరమిడ్ స్కీమ్ (హిందీ సిరీస్) - జూన్ 05 పీటర్(కన్నడ సినిమా)- జూన్ 05జీ5 పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 05 కేడీ ద డెవిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05 బ్రౌన్ (హిందీ సిరీస్) - జూన్ 05సోనీ లివ్ గుల్లాక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 05సన్ నెక్స్ట్ ద రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05ఆహాఅగ్లీ స్టోరీ(తెలుగు సినిమా)- జూన్ 5ఆపిల్ టీవీకేప్ ఫియర్(హాలీవుడ్ సినిమా)- జూన్ 05 -
ఓటీటీలో దురంధర్-2 ప్రీమియర్ షో.. స్ట్రీమింగ్ టైమ్ ఇదే...!
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న దురంధర్-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓవర్సీస్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా విదేశాల్లోని ప్రేక్షకులను అలరిస్తోంది. మే 14వ తేదీ నుంచే ఓవర్సీస్లో అందుబాటులోకి వచ్చేసింది.దీంతో ఇండియా ఫ్యాన్స్ సైతం దురంధర్-2 ఓటీటీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దురంధర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచే జియో హాట్‌స్టార్ వేదికగా ప్రీమియర్ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో స్ట్రీమింగ్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. దురంధర్-2 కథేంటంటే?రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్‌పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. థియేటర్లలో పెద్దగా హిట్ కాకపోయినా ఓటీటీల్లో అదరగొట్టేస్తుంటాయి. తాజాగా మరో మలయాళ పోలీస్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దృశ్యం చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పణలో మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన సినిమా 'ధృడం'. ఈ మూవీ జూన్ 12 నుంచే ఓటీటీలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మే 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో యంగ్ హీరో షేన్ నిగమ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఓటీటీలో మలయాళం, తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి.ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎస్సై విజయ్ (షేన్ నిగమ్) కొత్తగా ఓ ఊరికి పోస్టింగ్ మీద వస్తాడు. చేరిన రెండో రోజే ఓ హత్య, మూడోరోజు ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం, తర్వాత ఓ బ్లాక్మెయిల్ కేసు, తర్వాత మరికొన్ని హత్యలు.. ఇలా వరస కేసులు వస్తూనే ఉంటాయి. వీటని పరిష్కరించడం కోసం విజయ్ ఏం చేశాడు? అసలు ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? కొత్తగా జాయిన్ అయిన విజయ్.. వీటిని ఎలా హ్యాండిల్ చేశాడు? ఇవన్నీ చేసిన తర్వాత విజయ్ కనుక్కొన్న అసలు రహస్యం ఏంటి? అనేది మిగతా స్టోరీ. -
ఓటీటీకి డకాయిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా కేవలం మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా హిందీ వర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. డకాయిట్ హిందీ వర్షన్ జూన్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్‌లో హిందీ వర్షన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.డకాయిట్ కథేంటంటే..తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ.pyaar mein badla ya pyaar se badla 💔#DacoitOnPrime, In Hindi, June 5@AdiviSesh @mrunal0801 @anuragkashyap72 #SupriyaYarlagadda @Deonidas #ZaynMarieKhan @bhaskarla_sai @atul_kulkarni #BheemsCeciroleo @abburiravi @AnnapurnaStdios @AsianSuniel #SSCreations @sonymusicindia pic.twitter.com/zNvGM3KtJ0— prime video IN (@PrimeVideoIN) June 3, 2026 -
Madhuvidhu: ఈ పెళ్ళి కుదరదు.. ఆ హనిమూన్ అవ్వదు... ఎలా?
పెళ్ళి అనేది కొన్ని కుటుంబాలతో పాటు తరాలను కలుపుతుంది. అందుకే అంటారు మన పెద్ద వాళ్ళు అటు ఏడు తరాలు ఇటు తరాలు చూసి సంబంధం కలుపుకోమని. అలా అనే ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో పెళ్ళి సాంప్రదాయాలను పద్ధతిగా పాటిస్తుంటారు. పద్ధతిగానే కాదు కొంతమంది మూర్ఖంగా కూడా పాటిస్తుంటారు. ఆ అంశంతోనే రూపుదిద్దుకున్న ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా మధవిధు.జై విష్ణు, బిబిన్ మోహన్ అందించిన కథకు విష్ణు ఆనంద్ తెర కెక్కించిన విధానం నభూతో నభవిష్యతి అని చెప్పాలి. మధువిదు సినిమా మొత్తం సరదా సరదాగా సాగిపోతుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం.ఆంజిల్ ముట్టిల్ కుటుంబంలో పెద్దవాడైన అమృతరాజ్ ఓ కేప్ నడుపుతూ ఉంటాడు. వయసు పైబడినా ఇంకా అమృతరాజ్ కు పెళ్ళవదు. అందుకే అమృతరాజ్ తన పెళ్ళి కోసం తెగ ఆరాటపడుతూ ఉంటాడు. అమృతరాజ్ ఇంట్లో తమ్ముడితో సహా తన తండ్రి, తాతతోపాటు బాబాయ్ ఉంటారు. అమృతరాజ్ తల్లి చిన్నపుడే చనిపోతుంది. ఒక్క ఆడ దిక్కులేని ఈ కుటుంబానికి ఊళ్ళో వాళ్ళు అనే మాటల వల్ల పెళ్ళి సంబంధాలు చెడిపోతూ ఉంటాయి. ఆంజిల్ ముట్టిల్ కుటుంబానికి తరతరాల నుండి ఏదో ఆడశాపం ఉందని వినికిడి. దీంతో బాగా దిగాలు పడిన అమృతరాజ్ ఎట్టకేలకు స్నేహ అనే అమ్మాయిని ఇష్టపడి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్ళి సంబంధం మాట్లాడడానికి అందరితో కలిసి స్నేహ వాళ్లింటికి వెళతారు. పేరుకు అమృతరాజ్ పెళ్ళి చూపులైనా అమృతరాజ్ తండ్రి స్నేహ అత్తను గుర్తుపట్టి, ఇష్టపడి తరువాత ఎవరికీ చెప్పకుండా లేచిపోయి పెళ్ళి చేసుకుంటాడు. ఇక అక్కడి నుండి అమృతరాజ్ వెళ్ళి కథ మళ్ళీ మొదటికొస్తుంది. దీంతో మళ్ళీ అమృతరాజ్ నానా తంటాలు పడుతూ స్నేహ వాళ్ళ నాన్నను పెళ్ళి కోసం ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో స్నేహ చెల్లెలు సోఫీ పెళ్ళి ఖాయమవుతుంది. కాని రేపు పెళ్ళి అనగా అబ్బాయి తనకు ఇష్టం లేదని సోఫీ అమృతరాజ్ కి మాత్రం తెలియచేస్తుంది. మరి సోఫీ పెళ్ళి ఆపించి తన పెళ్ళి జరిగేలా అమృతరాజ్ చేయగలడా లేదా అన్నది మాత్రం మధువిధు సినిమాలోనే చూడాలి. అవడడానికి ఇది మళయాళ సినిమా అయినా సోనీలివ్ ఓటిటి వేదికగా తెలుగులోనూ లభ్యమవుతోంది. సినిమా ఆద్యంతం నవ్వులతో సరదాగా సాగిపోతుంది. మస్ట వాచ్ ఫర్ ది వీకెండ్.– హరికృష్ణ ఇంటూరు -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా
తెలుగులో కమర్షియల్ సినిమాలు ఎక్కువగా వస్తాయి. తమిళ, మలయాళంలో మాత్రం కంటెంట్ ఓరియెంటెడ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండే చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. అలా రెండు నెలల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఓ మూవీ.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్.. 'మధువిధు' తెలుగు రివ్యూ)తెలుగులోనూ అల వైకుంఠపురములో, క్రాక్ తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని లీడ్ రోల్ చేసిన తమిళ మూవీ 'కార్మేని సెల్వం'. గౌతమ్ మేనన్ మరో కీలక పాత్ర చేశారు. ఏప్రిల్ 3న థియేటర్లలో తెలుగులోనూ రిలీజైన ఈ చిత్రం.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలంటే ఇష్టముంటే దీనిపై లుక్ వేయొచ్చు.'కార్మేని సెల్వం' విషయానికొస్తే.. సెల్వం(సముద్రఖని).. సంపత్(గౌతమ్ మేనన్) దగ్గర కారు డ్రైవరుగా పనిచేస్తుంటాడు. సెల్వం భార్య శాంతి (లక్ష్మి) ఇడ్లీ బండి నడుపుతూ ఉంటుంది. చాలా డబ్బు సంపాదించి సొంతిల్లు కట్టుకోవాలన్నది సెల్వం దంపతుల కల. దీనికోసం రోజూ కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. ఓ సందర్భంలో బంధువులే వీళ్లని తీవ్రంగా అవమానిస్తారు. తర్వాత అనుకోని సంఘటనలు జరుగుతాయి. దీంతో సెల్వం.. తన యజమాని సంపత్‌ని మోసం చేస్తాడు. తర్వాత అంతకుమించి అప్పులు కూడా చేస్తాడు. వాటిని తీర్చే క్రమంలో సెల్వం కుటుంబం ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.మరోవైపు ఓటీటీలో ఈ వారం ధురంధర్ 2, పేట్రియాట్, కేడీ, 29, మా బెహన్, ద రైజ్ ఆఫ్ అశోక.. లాంటి తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి.ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా -
ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా ధురంధర్, పేట్రియాట్, కేడీ, కార్మేని సెల్వం, 29, మా బెహన్, ద రైజ్ ఆఫ్ అశోక లాంటి తెలుగు డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. తాజాగా మరో తెలుగు చిత్రం ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా ఏంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: 'బ్లాస్ట్' సినిమా ఊహించని సక్సెస్.. అలానే కలెక్షన్స్ కూడా)జో శర్మ అనే ఇండో-అమెరికన్ నటి ప్రధాన పాత్ర పోషించిన తెలుగు సినిమా 'ఎమ్4ఎమ్'. మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ మే 8న థియేటర్లలో రిలీజైంది. కానీ పేరున్న నటీనటులు లేకపోవడం, కథాకథనాలు ఏమంత గొప్పగా లేకపోవడంతో జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం ఈ నెల 19 నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్‌లోకి కూడా రావొచ్చు.'ఎమ్4ఎమ్' విషయానికొస్తే.. హైదరాబాద్‌లో స్టార్ హీరో రంజిత్ (కృష్ణతేజ) హత్యకు గురవుతాడు. ఓ సీరియల్ కిల్లర్ ఇతడిని చంపేసి, పెయింటింగ్ ఆకారంలో న్యూడ్‌గా పెడతాడు. ఈ కేసుని ఏసీపీ కృష్ణ(సంబీత్ ఆచార్య) దర్యాప్తు చేస్తుంటాడు. ఇతడి భార్య రాధ (జో శర్మ) ఓ న్యూస్ ఛానెల్లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తుంటుంది. భార్యభర్తలిద్దరూ కలిసి ఈ కేసులో విచారణ చేస్తుంటారు. కిల్లర్ మాత్రం వీళ్లకు దొరక్కుండా వరస హత్యలు చేస్తుంటాడు. ఎక్కడెక్కడ చంపబోతున్నానని చెప్పి ముందే పోలీసులకు వాయిస్ మెసేజ్ పంపి సవాలు విసురుతాడు. ఇంతకీ ఈ సీరియల్ కిల్లర్ ఎవరు? హత్యల వెనకున్న కారణమేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ధనుశ్ లేటేస్ట్ మూవీ.. ఏకంగా నంబర్‌వన్‌గా ట్రెండింగ్..!
ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన తాజా మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది.బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. స్ట్రీమింగ్కు వచ్చిన తొలివారంలోనే దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాల జాబితాలో నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్‌వన్ ప్లేస్‌లో కొనసాగుతోంది. దీంతో మేకర్స్‌తో పాటు ధనుశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కర అసలు కథేంటంటే..ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుంది. కరస్వామి అలియాస్ కర(ధనుష్) ఒక దొంగ. తన తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) దగ్గర డబ్బు దొంగిలించి.. ఇంట్లో నుంచి పారిపోతాడు. చివరిగా ఒక దొంగతనం చేసి మానేయాలనుకొని స్నేహితుడితో కలిసి ఓ ఇంట్లోకి వెళ్తాడు. డబ్బులు తీసుకెళ్తున్న సమయంలో ఇంట్లోవాళ్లు పట్టుకొని..పోలీసులకు అప్పగిస్తారు. ఈ కేసు రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న డీఎస్పీ భరతన్(సూరజ్ వెంజర్మూడు) చేతికి వెళ్లగా.. కర అతన్ని కొట్టి స్టేషన్ నుంచి పారిపోతాడు. ఇకపై దొంగతనాలు చేయనని చెప్పి ప్రియురాలు మల్లి(మమిత బైజు) పెళ్లి చేసుకొని ఓ హోటల్లో పని చేస్తారు. కొన్నాళ్ల తర్వాత సొంతంగా హోటల్ పెట్టుకోవాలనుకుంటారు.లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే.. షూరిటీ అడుగుతారు. పొలం కాగితాలు పెట్టి లోన్ తీసుకుందామని ఊరికి వెళ్లగా.. తండ్రి అప్పటికే వాటిని బ్యాంకుల్లో పెట్టి అప్పు తీసుకుంటాడు. అప్పు కట్టకపోతే పొలాన్ని జప్తి చేస్తామని బ్యాంకు నోటీసులు పంపడం.. కొడుకు డబ్బుల కోసమే తన దగ్గరకు వచ్చాడనే బాధతో కోదండం చనిపోతాడు. తండ్రి చివరి కోరిక మేరకు పార్థివదేహానికి పొలంలోనే పూడ్చేందుకు వెళ్లగా..బ్యాంకు అధికారులు అడ్డుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రి చివరి కోరిక నెరవేర్చడం కోసం కర ఏం చేశాడు? బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాలకు అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఎస్పీ భరతన్ తిరిగి కరను పట్టుకున్నాడా లేదా? ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు మేనేజర్(జయరాం) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
తమిళ స్టార్ కమెడియన్లలో యోగిబాబు ఒకడు. సహాయ పాత్రలతో పాటు అప్పుడప్పుడు హీరోగానూ పలు సినిమాలు చేస్తుంటాడు. అలా చేసిన 'మండేలా'ని ఇప్పటికే చాలామంది చూసి ఉంటారు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన మరో మూవీ ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)యోగిబాబు హీరోగా నటించిన తమిళ కామెడీ డ్రామా మూవీ 'కేనాథ కానం'. ఈ పేరుకు తెలుగులో 'బావి కనబడట్లేదు' అని అర్థం. తమిళనాడులోని చాలా పల్లెటూళ్లలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. తాగేందుకు సరైన నీటి సదుపాయం ఉండదు. అదే అంశాన్ని తీసుకుని ఈ మూవీ తీశారు. కాకపోతే సీరియస్ సమస్యని ఫన్నీగా చూపిస్తూ ఆలోచన రేకెత్తించారు. మార్చి 13న థియేటర్లలో రిలీజై హిట్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు ఈనెల 15వ తేదీ నుంచి హాట్స్టార్లోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.'కేనాథ కానం' విషయానికొస్తే.. కొడంగిపట్టి అనే ఊరిలో చాలా తక్కువ ఇళ్లు ఉంటాయి. కానీ ప్రతి ఇంటికి తాగునీటి సమస్య ఉంటుంది. దీన్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఎంత వేడుకున్నా సరే ఏం చేయదు. ఈ ఊరిలో నీరు ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం ప్రజలు.. ఓ తాతని అడిగి ఆ ఊరి శిల్పి అయిన మణివాసగం(యోగిబాబు) ఇంటి దగ్గర ఉందని తెలుసుకుంటారు. దీంతో ఇతడు తన స్థలాన్ని దానం చేస్తాడు. ఊరంతా కలిసి అక్కడ నీటి కోసం తవ్వడం మొదలుపెడతారు. కానీ అక్కడ నీరు పడకపోగా డైనోసర్ ఎముకలు కనబడతాయి. దానికోసం కేంద్రం నుంచి ప్రభుత్వ అధికారులు ఈ ఊరికి ఎందుకొచ్చారు? చివరకు నీటి సమస్య తీరిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. థియేటర్లలో ఓ మాదిరిగా ఆడిన మూవీస్ కూడా మన దగ్గర బాగానే ఆదరణ తెచ్చుకుంటాయి. అలా ఇప్పుడు ఓ మలయాళ పోలీస్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'దృశ్యం' చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పణలో మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన సినిమా 'ద్రిదమ్'. గత నెల 8న థియేటర్లలో రిలీజైంది. కానీ ఓ మాదిరి స్పందన మాత్రమే సొంతం చేసుకుంది. యంగ్ హీరో షేన్ నిగమ్ లీడ్ రోల్ చేశాడు. ఇప్పుడీ చిత్రం వచ్చే శుక్రవారం(జూన్ 12) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి వస్తుంది.'ద్రిదమ్' విషయానికొస్తే.. ఎస్సై విజయ్ (షేన్ నిగమ్) కొత్తగా ఓ ఊరికి పోస్టింగ్ మీద వస్తాడు. చేరిన రెండో రోజే ఓ హత్య, మూడోరోజు ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం, తర్వాత ఓ బ్లాక్మెయిల్ కేసు, తర్వాత మరికొన్ని హత్యలు.. ఇలా వరస కేసులు వస్తూనే ఉంటాయి. వీటని పరిష్కరించడం కోసం విజయ్ ఏం చేశాడు? అసలు ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? కొత్తగా జాయిన్ అయిన విజయ్.. వీటిని ఎలా హ్యాండిల్ చేశాడు? ఇవన్నీ చేసిన తర్వాత విజయ్ కనుక్కొన్న అసలు రహస్యం ఏంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ 'మధువిధు' తెలుగు రివ్యూ) -
ఓటీటీలో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్.. తెలుగు రివ్యూ
తెలుగులో ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూసే సినిమాలు ఈ మధ్య కాలంలో బాగా తగ్గిపోయాయి. ఆ లోటుని పరభాషా చిత్రాలు ఇప్పుడు భర్తీ చేస్తున్నాయి. అలాంటి ఓ మూవీనే 'మధువిధు'. మలయాళంలో రిలీజై డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. రీసెంట్గా సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉంది? చూడొచ్చా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్)కథేంటి?కొచ్చాంబళం అనే ఊరిలో ఒక కుటుంబం ఉంటుంది. అందులో ఐదుగురు మగాళ్లే ఉంటారు. ఆడవాళ్లు లేని కుటుంబం అని, నాగదోషం ఉందని.. కోడలిగా వచ్చేందుకు ఏ అమ్మాయి ఇష్టపడదు. దీంతో ఇదే ఇంట్లో ఉండే అమృత్ రాజ్(షరాఫుద్దీన్)కి 28 సార్లు పెళ్లి సంబంధాలు చెడిపోతాయి. చివరకు స్నేహ (కల్యాణి పణిక్కర్) ఇతడి జీవితంలోకి వస్తుంది. తర్వాత ఏం జరిగింది? అమృత్ రాజ్ పెళ్లయిందా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?'మధువిధు' అంటే మలయాళంలో హనీమూన్ అని అర్థం. ఆడది లేక బోసిపోయిన ఇంట్లో ఉండే హీరో.. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, ఒంటరిగా కాకుండా భార్యతో కలిసి నిద్రపోవాలని అనుకుంటూ ఉంటాడు. అందుకు తగ్గట్లే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటాడు. 28 సంబంధాలు చూస్తాడు కానీ అందరూ రిజెక్ట్ చేసేస్తారు. అలాంటి ఇతడి జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి రావడంతో ఊహించని మలుపులు ఎదురవుతాయి. ఇంతకీ అవేంటి? చివరకు కథ సుఖాంతం అయిందా లేదా అనేది అసలు కథ.టాలీవుడ్లో ఇప్పుడు డిష్యుం డిష్యుం సినిమాలే ఎక్కువైపోయాయి. ఫ్యామిలీలో ఉండే బంధాలు, భావోద్వేగాలు చూపించే చిత్రాలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. అలాంటి వాటిని చక్కగా చూపించిన మూవీ ఇది. ఇది పాత కాన్సెప్టే కానీ ట్రీట్మెంట్ ఫ్రెష్‌గా ఉంది. ఒక ఊరిలో మగాళ్ల మాత్రమే ఉండే కుటుంబం, అదే ఊరిలో ఆడవాళ్లు మాత్రమే ఉండే మరో కుటుంబానికి ఎలాంటి కనెక్షన్ ఏర్పడింది. 'పెళ్లి' అనేది ఈ రెండు ఇళ్లల్లో ఎలాంటి సమస్యలు సృష్టిస్తుందని చూపించిన విధానం బాగుంది.నాగదోషం ఉందని హీరో ఉంటున్న ఇంటికి ఎవరూ పిల్లనివ్వరు. అలాంటి పరిస్థితుల్లో హీరోతో పాటు ఇతడి తండ్రి, బాబాయ్ ఎలా ప్రేమలో పడ్డారు? చివరకు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారు? అనేది కామెడీగా చూపించారు. పెళ్లీడు వచ్చిన కొడుకు ఇంట్లోనే ఉండగానే తండ్రి పెళ్లి చేసుకోవడం, అప్పటికే కూతురు కూడా ఉన్న కొత్త భార్యని ప్రెగ్నెంట్ చేయడం అనేది వినడానికి చాలా బోల్డ్‌గా అనిపిస్తుంది కానీ ఇందులో అదే కాన్సెప్ట్‌ని ఫన్నీగా డీల్ చేశారు. అది బాగా వర్కౌట్ అయింది కూడా.అలకలు, బుజ్జగింపులు, వేడుకలు, వేదన.. ఇలా అన్ని అంశాలని కలుపుకొని ఈ సినిమాని చూపించిన విధానం మెప్పించింది. మరీ ముఖ్యంగా పట్టె మంచం గురించి వచ్చే సీన్స్ అయితే మంచిగా నవ్విస్తాయి. తరచూ ఒకే దగ్గర కేబుల్ వైర్ తెగిపోవడం లాంటి సీన్స్ కూడా నవ్వు తెప్పిస్తాయి. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ ఎక్కడా రాసినట్లు కాకుండా మన పక్కనే జరిగినట్లు అనిపిస్తుంది. అదే ఆ ట్రాక్ బలం.ఈ సినిమాలో సిట్యుయేషనల్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. హీరో జీవితం ఓ ట్రాజెడీలా ఉంటుంది కానీ దాన్ని ఎక్కడా మెలోడ్రామా చేయకుండా ఫన్నీగా చూపించిన విధానం అందరికీ కనెక్ట్ అవుతుంది. పెళ్లి అనేది ఒక పంజరం లాంటిదని చాలామంది భావిస్తుంటారు. కానీ పెళ్లి అనేది ఓ అందమైన బంధం అనే మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. సమస్యలు అన్ని ఇళ్లలో ఉంటాయి. అర్ధం చేసుకుని, మాట్లాడుకుని మమకారాలు పెంచుకుని కలిసుండాలని చెబుతుంది. బోర్ కొట్టకుండా సింపుల్ కంటెంట్‌తో సరదాగా సాగిపోతుంది.హీరోహీరోయిన్లుగా చేసిన షరాఫుద్దీన్, కల్యాణి పణికర్‌తో పాటు మిగతా అందరూ యాక్టింగ్‌తో అదరగొట్టేశారు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు ఒక్కటి ఉండవు గానీ మూవీ పూర్తయ్యేసరికి చాలా పాత్రలతో ప్రేమలో పడిపోతాం. అంతలా నచ్చేస్తాయి. సెకండాఫ్‌లో సాగదీత, ఫోర్డ్స్‌గా అనిపించే కొన్ని సీన్స్ తప్పితే ఓవరాల్‌గా మూవీ బాగుంది. డైరెక్టర్ విష్ణు ఆనంద్, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ గానీ తమ పనికి పూర్తి న్యాయం చేశారు. కుటుంబం అంతా కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
థ్రిల్లర్స్ అనగానే చాలామందికి ఓటీటీలే గుర్తొస్తాయి. ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలన్నీ థియేటర్లలో రిలీజ్ అవుతాయి. క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని రకరకాల మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు అలానే 'పాతాళ్ లోక్' మేకర్స్ నుంచి మరో థ్రిల్లర్ సిరీస్ రెడీ అయింది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత జాక్‌పాట్ కొట్టిన రష్మిక!)'రాఖ్' పేరుతో తీసిన ఈ సిరీస్‌లో అలీ ఫజల్, సోనాలి బింద్రే, రాకేశ్ బేడీ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. వచ్చే శుక్రవారం(జూన్ 12) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఇది స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే ఆర్మీ అధికారికి చెందిన కొడుకు, కూతురు కనిపించకుండా పోతారు. వీళ్లని ఎవరో హత్య చేసేస్తారు. తర్వాత ఇదే క్రమంలోనే ఢిల్లీలో వరస హత్యలు జరుగుతాయి. ఇంతకీ వీటిని చేస్తుంది ఎవరు? పోలీసులు హంతకుల్ని పట్టుకున్నారా? లేదా అనేది స్టోరీలా అనిపిస్తుంది.ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే ఇందులో తల్లి పాత్ర చేసింది. 'ధురంధర్' ఫేమ్ రాకేశ్ బేడీ కూడా కీలక పాత్ర చేశారు. మరి ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి రామ్ చరణ్ 'పెద్ది' రాబోతుంది. గురువారం రిలీజ్ కానుండగా.. ముందురోజు రాత్రి ప్రీమియర్ల పడనున్నాయి. మృణాల్, పూజా హెగ్డే నటించిన హిందీ మూవీ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' ఈ వీకెండే రానుంది. వీటి సంగతి పక్కనబెడితే ఓటీటీల్లో మాత్రం బోలెడన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్ఫుల్ ఫస్ట్ లుక్)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే 'ధురంధర్ 2' స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంది. దీనితో పాటు పేట్రియాట్, కేడీ, 29, మా బెహన్, ద రైజ్ ఆఫ్ అశోక తదితర తెలుగు డబ్బింగ్ మూవీస్ చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా మేడిన్ ఇండియా, ద పిరమిడ్ స్కీమ్, బ్రౌన్ లాంటి సిరీసులు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీకి ఏ మూవీ రానుందంటే?ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే సినిమాల జాబితా (జూన్ 01 నుంచి 07 వరకు)హాట్స్టార్ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 04అమెజాన్ ప్రైమ్మేడిన్ ఇండియా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 03క్లార్క్సన్ ఫార్మ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 03ద లెజెండ్ ఆఫ్ వోక్స్ మెషీనా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 03ద పిరమిడ్ స్కీమ్ (హిందీ సిరీస్) - జూన్ 05నెట్ఫ్లిక్స్మా బెహన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 04ద మర్డర్ ఆఫ్ రేచల్ నికల్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 0429 (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూన్ 05మెక్సికో 86 (స్పానిష్ సినిమా) - జూన్ 05ఆఫీస్ రొమాన్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 05టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ సిరీస్) - జూన్ 05ద మార్క్డ్ ఉమన్ (స్పానిష్ సినిమా) - జూన్ 05యూఎస్ఏ 94 (పోర్చుగీస్ చిత్రం) - జూన్ 07జీ5పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 05కేడీ ద డెవిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05బ్రౌన్ (హిందీ సిరీస్) - జూన్ 05సోనీ లివ్గులక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 05సన్ నెక్స్ట్ద రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05ఆపిల్ టీవీ ప్లస్కేప్ ఫియర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 04(ఇదీ చదవండి: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్) -
ఓటీటీకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలు వచ్చాక ఏ సినిమా అయినా సరే తెగ చూసేస్తున్నారు. కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఏ భాషలో తెరకెక్కించినప్పటికీ డబ్బింగ్ చేసి ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో కథ నచ్చితే చాలు ఎలాంటి మూవీకైనా ఆదరణ దక్కుతోంది. దీంతో డబ్బింగ్ చేసినా చిత్రాలే ఎక్కువగా ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ తమిళ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. విధు, ప్రీతి అస్రాని జంటగా నటించిన 29 చిత్రం మే 8న థియేటర్లలో రిలీజైంది. పెద్దగా స్టార్స్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేశారు.జూన్ 5 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా 29 స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్‌గా రివీల్ చేసింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ సినిమాకు రత్న కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మహేంద్రన్ , అవినాష్, షెనాజ్ ఫాతిమా, ప్రేమ్ కుమార్ కీలక పాత్రల్లో మెప్పించారు. -
ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేస్తుంటాయి. వీటిలో ఆడియన్స్ ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ లాంటి మూవీస్‌ను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టుగానే ప్రతివారం బోలెడ్ చిత్రాలు, సిరీస్‌లు రానే వస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.అలీ ఫజల్, సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ కీలక పాత్రల్లో నటించిన లేటేస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'రాఖ్'. ఈ వెబ్ సిరీస్‌కు ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇందులో ఫజల్ పోలీస్ యూనిఫాంలో కనిపించగా.. అతనిముందు ఓ శవం ఉన్న కొత్త పోస్టర్‌ను ఈ సిరీస్‌పై ఆసక్తిని మరింత పెంచేసింది. పాతిపెట్టిన నిజాలు ఎప్పుడూ తిరిగి బయటపడతాయి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.'రాఖ్' అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ సిరీస్. ఇద్దరు టీనేజర్లు అదృశ్యం కావడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. ఈ సంఘటన ఒక అన్యోన్యమైన కుటుంబాన్ని తీవ్రంగా, మానసిక వేదనకు గురిచేస్తుంది. అంతేకాకుండా మొత్తం నగరాన్ని ఆందోళనకు గురవుతుంది. ఈ కేసును చేధనే లక్ష్యంగా దర్యాప్తు కోణంలో ఈ సిరీస్ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు ఆయుష్ త్రివేది డైలాగ్స్ అందించగా.. ఎండెమోల్ షైన్ ఇండియా బ్యానర్‌పై దీపక్ ధర్, రిషి నేగి, మృణాలిని జైన్, శ్యామ్ రాఠీ నిర్మించారు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
మరో ఓటీటీకి మార్క్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ స్టార్ హీరో 'కిచ్చా' సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మార్క్'. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ మూవీ విడుదలైంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, యోగిబాబు, గురు సోమసుందరం, విక్రాంత్ తదితరులు నటించారు. దర్శకుడు విజయ్ కార్తికేయ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 23 నుంచే కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది.తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రైమ్‌లో ఈ మూవీ కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ చిత్రకంలో కిచ్చా సుదీప్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ కథ చాలా బలహీనంగా ఉండటం.. ఆపై ఊహించదగిన ట్విస్టులతో బాక్సాఫీస్ వద్ద కాస్తా నిరాశపరిచింది. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారిని మాత్రం మ్యాక్స్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకుంది. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ప్రముఖ నటుడు అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా.. కన్నడలో కాస్త గుర్తింపు ఉన్న హీరోనే. కానీ సరైన సక్సెస్ మాత్రం రావట్లేదు. ఇతడు హీరోగా నటించిన ఓ సినిమా అష్టకష్టాలు పడి కొన్నిరోజుల క్రితమే థియేటర్లలోకి వచ్చింది. తర్వాత తెలుగులోనూ రిలీజైంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్)ధ్రువ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'కేడీ ద డెవిల్'. అప్పుడెప్పుడో నాలుగేళ్ల క్రితమే మొదలైనప్పటికీ నెల క్రితం అంటే ఏప్రిల్ 30న కన్నడ వరకు రిలీజైంది. ఈ నెల 15న తెలుగు వెర్షన్ థియేటర్లలోకి వచ్చింది. కొన్నాళ్ల ముందు బూతు పాటతో వివాదంలోనూ ఇరుక్కుందీ మూవీ. బిగ్ స్క్రీన్‌పై ఏ మాత్రం మెప్పించలేకపోయింది. వచ్చే శుక్రవారం(జూన్ 05) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ఇప్పుడు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.'కేడీ ద డెవిల్' విషయానికొస్తే.. అది 1980ల కాలం. ధర్మ(రమేశ్ అరవింద్) ఓ ఉపాధ్యాయుడు. కానీ ఇతడు తమ్ముడు కాళి(ధ్రువ సర్జా) మాత్రం వీధిలో కిరోసిన్ అమ్ముతూ బతుకుతుంటాడు. కుస్తీలో తిరుగులేని యోధుడైన దేవా(సంజయ్ దత్) అంటే కాళికి ప్రాణం. 25 ఏళ్లుగా ముఠాని నడుపుతున్న దేవా.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. మరోవైపు ధర్మ స్నేహితుడు అణ్ణయ్యప్ప ఇదే ఎన్నికల బరిలో నిలుస్తాడు. దీంతో దేవా గ్యాంగ్.. కాళి, అతడి కుటుంబాన్ని చంపేయాలని చూస్తుంది. అప్పటివరకు ఆరాధించిన దేవాపై కాళి ఎలా తిరగబడ్డాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఈ వారం చాలానే సినిమాలు వచ్చాయి. ధనుష్ 'కర', శరవణన్ 'లీడర్', సత్య 'జెట్ లీ', డ్రింకర్ సాయి, సచిన్ బయోపిక్ తెలుగు వెర్షన్‌తో పాటు హాలీవుడ్ హారర్ మూవీ 'ద మమ్మీ' అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు వీటికి తోడుగా ఇదే నెలలో రిలీజైన తెలుగు మూవీ కూడా సైలెంట్‌గా స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హరర్ సినిమా.. తెలుగులోనూ)'మేమ్ ఫేమస్' సినిమాతో హీరో, దర్శకుడిగా ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్.. చాన్నాళ్లు గ్యాప్ తీసుకుని చేసిన మూవీ 'గోదారి గట్టుపైన'. నిధి ప్రదీప్ హీరోయిన్ కాగా 100కి పైగా షార్ట్ ఫిల్మ్స్ తీసిన సుభాష్ చంద్ర.. ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. జగపతిబాబు, లైలా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈనెల 08న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక ఫ్లాప్ అయింది. ఇప్పుడిది ఎలాంటి హడావుడి లేకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'గోదారి గట్టుపైన' విషయానికొస్తే.. రాజు (సుమంత్ ప్రభాస్) ఆటో డ్రైవర్. పదో తరగతి మధ్యలోనే ఆపేసి కుటుంబం, ఫ్రెండ్స్‌తో హ్యాపీగా బతికేస్తుంటాడు. తన చెల్లితో ఇంజినీరింగ్ చదువుతున్న మాయ(నిధి ప్రదీప్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా రాజుని ప్రేమిస్తుంది. మరోవైపు తన కూతురు మాయ అంటే శ్యాంబాబు(జగపతిబాబు)కి ప్రాణం. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే ఈయన తన కూతురుకి తనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడితోనే పెళ్లి జరిపిస్తానని చెబుతుంటాడు. మరి ఇంజినీరింగ్ చదువుతున్న కూతురు ఓ ఆటోడ్రైవర్ని ప్రేమించిందని తెలిశాక శ్యాంబాబు ఏం చేశాడు? కూతురు ప్రేమని అంగీకరించాడా లేదా? చివరకు ఏమైందేనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి వచ్చేసిన హరర్ సినిమా.. తెలుగులోనూ
ప్రతి వీకెండ్ రాగానే ఓటీటీల్లోకి కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని సినీ ప్రేమికులు చూస్తూ ఉంటారు. వాళ్ల కోసమా అన్నట్లు ఎప్పటికప్పుడు కొత్త మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే ధనుష్ 'కర', శరవణన్ 'లీడర్', సత్య 'జెట్ లీ', డ్రింకర్ సాయి, సచిన్ బయోపిక్ తెలుగు వెర్షన్ తదితర చిత్రాలు వచ్చేశాయి. ఇప్పుడ వీటికో తోడుగా ఓ హారర్ మూవీ కూడా తెలుగులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: 'పెద్ది' టికెట్ ధరలు ఎంతెంత పెంచారంటే?)90స్లో పుట్టి పెరిగిన వాళ్లలో చాలామంది హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే 'మమ్మీ' ఫ్రాంచైజీ చిత్రాలు వీళ్లకు అలరించిన వాటిలో కచ్చితంగా ఉంటాయి. ఇప్పటివరకు పలు భాగాలుగా రిలీజయ్యాయి కానీ అవన్నీ అడ్వెంచర్ కామెడీ తరహాలో ఉండేవి. ఈ ఏడాది మాత్రం ఇదే ఫ్రాంచైజీ నుంచి హారర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో మూవీ వచ్చింది.లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన 'ద మమ్మీ' సినిమా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని ఆకట్టుకుని పర్లేదనిపించింది. రెండు వారాల క్రితం విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రెంట్ విధానంలో స్ట్రీమింగ్‌లోకి రాగా ఇప్పుడు ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీలోకి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. హిందీ, తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.'ద మమ్మీ 2026' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం చాలా హ్యాపీగా ఫీలవుతుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు ఆ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడతాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయపెట్టేలా ఉన్నాయని చూసినవాళ్లు చెప్పారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 16 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి త్రికాల, బ్లాస్ట్ జోన్, కాటలాన్ లాంటి చిన్న, డబ్బింగ్ చిత్రాలే రిలీజయ్యాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం కాస్త చెప్పుకోదగ్గ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇప్పటికే ధనుష్ 'కర', సత్య 'జెట్ లీ', 'డ్రింకర్ సాయి' తదితర సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేయగా ఇవి కాకుండా మరో 16కి పైగా మూవీస్, వెబ్ సిరీసులు శుక్రవారం ఒక్కరోజే రాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? ఏది ఎందులోకి రానుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: 'పెద్ది' కూడా రిలీజ్ అవుతోంది.. 'విశ్వంభర' ఎక్కడ?)ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (మే 29)అమెజాన్ ప్రైమ్లీడర్ - తెలుగు డబ్బింగ్ మూవీసుఖమానో సుఖమమ్ - మలయాళ సినిమాద లాస్ట్ వికింగ్ - డానిష్ మూవీహాట్స్టార్కజిన్స్ అండ్ కల్యాణమ్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్లార్డ్ కర్జోన్ కీ హవేలీ - హిందీ సినిమా (మే 30)జాలీ ఎల్ఎల్బీ 3 - హిందీ మూవీజెట్ లీ - తెలుగు చిత్రం (స్ట్రీమింగ్ అవుతోంది)ఆహాసచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ - తెలుగు సినిమానెట్ఫ్లిక్స్బ్రెజిల్స్ 70: ద థర్డ్ స్టార్ - పోర్చుగీస్ సిరీస్కలబాసస్ కాన్ఫిడెంటల్ - ఇంగ్లీష్ సిరీస్రఫా - స్పానిష్ సిరీస్కర - తెలుగు డబ్బింగ్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)సన్ నెక్స్ట్ఫేసెస్ - తెలుగు డబ్బింగ్ సినిమాజీ5ద అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ - బెంగాలీ సిరీస్డ్రింకర్ సాయి - తెలుగు మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)ఆపిల్ టీవీ ప్లస్ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ - ఇంగ్లీష్ సినిమాస్టార్ సిటీ - ఇంగ్లీష్ సిరీస్లయన్స్ గేట్ ప్లేద రేస్ - రొమేనియన్ మూవీహెచ్బీఓ మ్యాక్స్ద మూమెంట్ - ఇంగ్లీష్ సినిమా(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ) -
ఓటీటీలోకి సచిన్ బయోపిక్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఐపీఎల్ చివరకొచ్చేసింది. ఫ్లే ఆఫ్ మ్యాచుల్లో ఎవరు గెలుస్తారు? ఫైనల్స్‌కి ఎవరొస్తారనే టెన్షన్ క్రికెట్ అభిమానుల్లో గట్టిగా ఉంది. ఇప్పుడు సదరు క్రికెట్ ప్రేమికుల కోసమా అన్నట్లు దిగ్గజ సచిన్ టెండూల్కర్ బయోపిక్‌ని ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైపోయారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)సచిన్ టెండూల్కర్ జీవితం, క్రికెట్ జర్నీ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ 'సచిన్ : ఏ బిలియన్ డ్రీమ్స్'. 2017లో థియేటర్లలో రిలీజైన ఇది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీలో సచిన్ క్రీడా జర్నీతో పాటు 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించిన క్షణాలు, క్రికెట్ గాడ్ స్పీచ్, రేర్ వీడియోస్, మ్యాచ్ ఫుటేజ్‌తో పాటు భారతీయ క్రికెట్ చరిత్రలోని కీలక ఘట్టాలను ఇందులో చూపించారు.ఇదివరకే హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ఓటీటీల్లో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు తెలుగు, తమిళ వెర్షన్లని ఆహా ఓటీటీలోకి తీసుకురానున్నారు. గురువారం(మే 28) నుంచి తెలుగులో, శుక్రవారం(మే 29) నుంచి తమిళంలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్) -
కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ
కొన్ని సినిమాలు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజైపోతుంటాయి. సాధారణంగా ఇలాంటి వాటిపై చిన్నచూపు ఉంటుంది. ఎందుకంటే కంటెంట్ బాగోలేకపోవడం వల్లే ఇలా ఇచ్చేశారా అని సందేహం కలుగుతుంది. కొన్నిసార్లు మాత్రం దీనికి భిన్నంగా జరుగుతుంది. ఇప్పుడు అలానే వచ్చిన ఓ కోర్ట్ రూమ్ డ్రామా ఆకట్టుకుంటోంది. దాని పేరు 'సిస్టమ్'. జ్యోతిక, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారులు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)కథేంటి?ఢిల్లీకి చెందిన సీనియర్ లాయర్ రవి రాజవంశీ(అశుతోష్ గోవారికర్) కూతురు నేహ(సోనాక్షి సిన్హా). తండ్రిలానే లాయర్ వృత్తిని ఎంచుకున్నప్పటికీ మరో సీనియర్ దగ్గర పనిచేస్తుంటుంది. కానీ ఒక్క కేసు కూడా గెలవలేకపోతూ ఉంటుంది. 10 కేసులు గెలిస్తేనే తన లా ఫార్మ్‌లో చేర్చుకుంటానని నేహాకి తండ్రి షరతు పెడతాడు. అనుకోని విధంగా నేహాకు.. కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సారిక(జ్యోతిక) పరిచయమవుతుంది. సారిక చేసిన చిన్న చిన్న సాయాల వల్ల నేహా వరసగా కేసుల్లో విజయం సాధిస్తుంది. ఒకానొక టైంలో తండ్రీ కూతురు ఒకే కేసులో పరస్పరం తలపడాల్సి వస్తుంది. అప్పుడు ఏమైంది? ఇంతకీ ఆ కేసు ఏంటి? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?పైపైన చూస్తే ఇదో రెగ్యులర్ కోర్ట్ రూమ్ డ్రామానే. అందరికీ నచ్చకపోవచ్చు కూడా. ఎందుకంటే అద్భుతమైన ట్విస్టులు ఇందులో ఏం లేవు. కానీ తరచి చూస్తే మన న్యాయవ్యవస్థ ఎలాంటి పరిస్థితుల్లో మగ్గుతుందో కనిపిస్తుంది. ధనం, అధికారం ఉన్నోడిదే న్యాయం అని అర్థమవుతుంది. గుండెల్లో ధైర్యం తప్పితే ఏమి లేని సామాన్యుడికి న్యాయం అందని ద్రాక్షలా ఎలా తయారైందనే విషయాన్ని పచ్చిగా చూపించారు.చట్టంలో న్యాయం చేయడానికి సెక్షన్లు ఉన్నట్లే తప్పించుకోవడానికి అంతకు మించిన లొసుగులు చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటిని ఉపయోగించుకుని కొందరు నేరస్తులు తప్పించుకుంటున్నారు. డబ్బుకు ఆశపడే కొందరు లాయర్లు ఇలాంటి వాళ్లకు సాయం చేస్తున్నారు. తమకు న్యాయం జరగదనే ఆలోచనతో బాధితులు ఎలా మారుతున్నారు? నిజం ఎప్పటికైనా నిరూపితం అవుతుందనే నమ్మకాన్ని వాళ్లలో కలిగించేదెవరు? అనే అంశాల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.డబ్బు కోసమే వాదించే ఓ సీనియర్ లాయర్. తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుని లాయర్‌గా స్థిరపడాలనే ఆయన కూతురు. కోర్టులో రోజూ పదుల సంఖ్యలో వాదప్రతివాదనలు వింటూ అద్భుతమైన జ్ఞానాన్ని పెంచుకునే ఓ స్టెనోగ్రాఫర్. ఈ మూడు పాత్రల చుట్టూ కోర్టు రూమ్‌లోనే కథంతా సాగుతుంది. ప్రారంభంలో స్టోరీ సెట్ అవ్వడానికి కాస్త టైమ్ పడుతుంది గానీ ఎప్పుడైతే నేహా,సారిక పాత్రలు కలుస్తాయో, తండ్రిని ఎదిరించి నేహా ఇల్లు వదిలి బయటకొచ్చేస్తుందో అప్పటినుంచి స్టోరీలో కదలిక వస్తుంది. విక్రమ్ బజాల్ కేసుకి సంబంధించిన ఆధారాలని సేకరించడం కోసం సాగే అన్వేషణ ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పటికీ చివరి అరగంట చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది.నేహా పాత్రతో విలాసవంతమైన జీవితం ఎలా ఉంటుందో చూపించిన డైరెక్టర్.. సారిక పాత్రతో మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందో చక్కగా చూపించారు. కథ, కథనం పర్లేదనిపించినప్పటికీ జనాలకు మాత్రం కొన్ని ప్రశ్నలు అలానే మిగిలిపోతాయి. 'వ్యవస్థ' మనిషిని నడిపిస్తోందా? లేదంటే కొందరు 'పెద్దోళ్లు' వ్యవస్థని నడిపిస్తున్నారా అనే విషయాల్ని సామాన్యుడిగా అర్థమయ్యేలా చూపించారు.ఈ మూవీలో హీరో, విలన్ అంటూ ఎవరూ ఉండరు. దానికంటే పరిస్థితులు మనుషులని ఎలా మార్చేస్తాయి అనే విషయాన్ని చూపించడంలో దర్శకురాలు అశ్విన్ అయ్యర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. 'మన భుజాల మీద నుంచి భారం దింపేసుకున్నాం అనుకుంటాం కానీ భుజాలు మాత్రమే మారతాయి భారం కాదు', 'న్యాయస్థానానికి నేరం ఎవరు చేశారు అనేది అనవసరం ఎవరిపై ఆధారాలు ఉన్నాయి అనేదే ముఖ్యం' లాంటి డైలాగ్స్ ఈ సినిమాపై గౌరవాన్ని పెంచుతాయి. పూర్తయిన తర్వాత మన బుర్రలోనే తిరుగుతాయి.ఇందులోనే నేహా, సారిక పాత్రలతో ఫెమినిజంకు అసలైన అర్థం కూడా చూపించారు. భర్తకు కాలు చచ్చుబడి ఇంటికే పరిమితమైనప్పటికీ ఇంటిని చూసుకునే సారిక పాత్ర కావొచ్చు, తండ్రినే ఎదిరించి కేసు గెలిచే నేహా పాత్ర కావొచ్చు భలే అనిపిస్తాయి. ఆయా పాత్రల్లో జ్యోతిక, సోనాక్షి చాలా సహజంగా నటించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కడ ఎంత ఉండాలో అంతే వినిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా చేశారు. కుటుంబంతో కలిసి చూడొచ్చు. -చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్
ప్రతివారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా అలానే జెట్ లీ, కర, లీడర్, ఫేసెస్ అనే స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు కజిన్స్ అండ్ కల్యాణమ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్ లాంటి వెబ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇప్పుడు ఇవలా ఉండగానే ఓ తెలుగు మూవీ చాన్నాళ్ల తర్వాత సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ముమైత్ ఖాన్ ఇప్పుడేం చేస్తోంది? పాక్‌తో ఈమెకు సంబంధమేంటి?)ధర్మ మహేశ్, ఐశ్వర్య శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'డ్రింకర్ సాయి'. 2024 డిసెంబరు చివరి వారంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఘోరమైన డిజాస్టర్ అయింది. టీజర్, ట్రైలర్ లాంటివి పర్లేదనిపించినప్పటికీ.. అసలు సంగతి తేలిపోయింది. ఇప్పుడీ చిత్రం దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు జీ5 ఓటీటీలోకి వచ్చేసింది.'డ్రింకర్ సాయి' విషయానికొస్తే.. తల్లిదండ్రులు కట్టించిన ఆస్పత్రి నుంచి వచ్చే డబ్బులతో సాయి(ధర్మ).. జల్సా చేస్తూ ముఖ్యంగా రోజంతా తాగుతూ ఓ ముగ్గురు ఫ్రెండ్స్‌ని వెనకేసుకుని ఎంజాయ్ చేస్తుంటాడు. తనకు యాక్సిడెంట్ చేసిన భాగి(ఐశ్వర్య శర్మ)ని ఇష్టపడి ఆమెని ప్రేమించడం మొదలుపెడతాడు. భాగికి సాయి అంటే ఏ మాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ ఎక్కడ వయలెంట్ అయిపోతాడో అనే భయంతో ప్రేమని భరిస్తూ ఉంటుంది. ఈ బలవంతపు ప్రేమగాథ ఎక్కడివరకు సాగింది? చివరకు భాగి.. సాయిని మార్చుకోగలిగిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
టెలికాం రంగంలో జియో సంచలనం
భారతీయ టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి రిలయన్స్ జియో నాంది పలికింది. సామాన్యుడికి సైతం ప్రీమియం వినోదాన్ని చేరువ చేస్తూ.. కేవలం రూ.200 ధరతో ‘జియో ఓటీటీ పాస్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక్క 28 రోజుల ప్యాక్‌తో 15 టాప్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్, 30 జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు అపరిమిత 5జీ సేవలను అందిస్తూ వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపించింది.నేటి (మే 27, 2026) నుంచే ఈ సరికొత్త పాస్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న జియో వినియోగదారులందరూ ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా దీనిని పొందవచ్చని కంపెనీ తెలిపింది.రూ.1,500 విలువైన ప్రయోజనాలు..ప్రస్తుత డిజిటల్ కాలంలో విడివిడిగా ఓటీటీ సబ్స్క్రిప్షన్లు తీసుకోవాలంటే నెలకు వందల రూపాయల భారం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు ఆర్థికంగా భారీ ఉపశమనం కలిగించేలా జియో ఈ ఎంటర్టైన్మెంట్ పాస్‌ను డిజైన్ చేసింది. కేవలం రూ.200లకే లభించే ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులు నెలకు సుమారు రూ.1,500 విలువైన ప్రయోజనాలను ఉచితంగా పొందడం విశేషం. వీడియో స్ట్రీమింగ్, లైవ్ టెలివిజన్, హై-స్పీడ్ కనెక్టివిటీల కలయికగా ఈ ప్లాన్ నిలుస్తోందని కంపెనీ చెప్పింది.15 ప్రీమియం ఓటీటీలు..యూట్యూబ్ ప్రీమియం: టీవీ, టాబ్లెట్, మొబైల్ పరికరాల్లో ప్రకటనలు లేని (యాడ్స్ ఫ్రీ) స్ట్రీమింగ్, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, ఆఫ్‌లైన్ డౌన్లోడ్స్ సౌకర్యం.జియోహాట్‌స్టార్ మొబైల్ ప్లస్ హాలీవుడ్: లైవ్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ ఒరిజినల్స్, బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ కంటెంట్ వీక్షించే అవకాశం.అమెజాన్ ప్రైమ్ వీడియో(మొబైల్ ఎడిషన్): మొబైల్ పరికరాల్లో ప్రైమ్ వీడియో కంటెంట్ యాక్సెస్.జీయో టీవీ ద్వారా మరో 12 ప్రముఖ ఓటీటీలు..SonyLiv, ZEE5, Lionsgate Play, Discovery+, Sun NXT, FanCode, Kanccha Lannka, Planet Marathi, Chaupal, Hoichoi, TimesPlay, Tarang Plus.150+ పెయిడ్ ఛానెల్స్ ఉచితం!వినోదంతో పాటు సమాచారాన్ని అందించేందుకు జియో టీవీ ద్వారా 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్‌ను ఈ ప్యాక్‌లో చేర్చారు. ఇందులో ప్రముఖ బ్రాడ్కాస్టర్లకు చెందిన 150కు పైగా ప్రీమియం పెయిడ్ ఛానెల్స్ ఉండటం విశేషం. వాటిలో కొన్ని ప్రముఖ ఛానెళ్లు.. స్టార్‌ప్లస్ హెచ్డీ, కలర్స్ హెచ్డీ, సోనీ ఎంటర్టైన్మెంట్, సెట్ హెచ్డీ, సోనీ సాబ్ హెచ్డీ, సన్ టీవీ నెట్వర్క్, కేటీవీ హెచ్డీ, వార్నర్ బ్రోస్, డిస్కవరీ.. వంటివి ఉన్నాయి.అపరిమిత 5జీ యాక్సెస్వినోదానికి నెట్వర్క్ అంతరాయం కలగకుండా ఈ పాస్ ద్వారా 30 జీబీ హై-స్పీడ్ 4G/5G డేటా లభిస్తుంది. అంతేకాదు, వినియోగదారుడి యాక్టివ్ బేస్ ప్లాన్ చెల్లుబాటు కాలం వరకు అపరిమిత 5జీ కనెక్టివిటీని జియో ఆఫర్ చేస్తోంది. ఈ పాస్ గరిష్టంగా 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
తెలుగు ఆడియెన్స్ కోసం మరో ఓటీటీ
18 ఏళ్లుగా ట్రావెల్ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విహారి.. ఇప్పుడు పూర్తిస్థాయి గ్లోబల్ ట్రావెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా మారుతోంది. తెలుగు మీడియాలో ట్రావెల్ షోలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విహారి.. ప్రపంచంలోని పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు, రుచులు, ప్రత్యేకతలను ప్రేక్షకులకు చేరవేసింది.(ఇదీ చదవండి: కన్నడలోకి బ్రహ్మానందం బయోగ్రఫీ)ఇప్పటికే టెలివిజన్ ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రయాణ కథనాలు అందించిన విహారి.. ఇప్పుడు ఓటీటీ రూపంలో మరింత విస్తృతంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు భాషలో ట్రావెల్‌కు మాత్రమే అంకితమైన తొలి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా విహారి ఓటీటీలో జూన్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విహారి ఓటీటీ టీమ్ ప్రత్యేక ప్రివ్యూ విడుదల చేసింది. ఇందులో 'బిగ్ బాస్' ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా 'విహారి ఓటీటీ' గ్లోబల్ విజన్ ఆవిష్కరించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. మే నెల కూడా చివరకొచ్చేసింది. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేసిన 'మరీచిక', సందిగ్దం అనే తెలుగు సినిమాలతో పాటు కాటలాన్, బ్లాస్ట్ అనే డబ్బింగ్ మూవీస్.. ఈ వీకెండ్ థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో దేనిపైనా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో 19 వరకు మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: మళ్లీ సినిమాల్లోకి మాజీ ఉప ముఖ్యమంత్రి)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ధనుష్ హీరోగా చేసిన యాక్షన్ థ్రిల్లర్ 'కర', కమెడియన్ సత్య లీడ్ రోల్ చేసిన 'జెట్ లీ', 'లీడర్' చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఫేసెస్, కజిన్స్ అండ్ కల్యాణమ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాంటి డబ్బింగ్ మూవీ, సిరీస్‌లు కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (మే 25 నుంచి 31 వరకు)నెట్ఫ్లిక్స్అన్టోల్డ్ యూకే: విన్ని జోన్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మే 26ఏ గుడ్ గర్ల్స్ గైడ్ టూ మర్డర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 27మై టూ సెంట్స్ (ఇటాలియన్ సిరీస్) - మే 27కర (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 28ఎమి మార్టినజ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 28మర్డర్ మైండ్‌ఫుల్లీ (జర్మన్ సిరీస్) - మే 28ద ఫోర్ సీజన్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 28బ్రెజిల్స్ 70: ద థర్డ్ స్టార్ (పోర్చుగీస్ సిరీస్) - మే 29కలబాసస్ కాన్ఫిడెంటల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29రఫా (స్పానిష్ సిరీస్) - మే 29అమెజాన్ ప్రైమ్స్పైడర్ నోయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 27లీడర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 28హాట్స్టార్జెట్లీ (తెలుగు సినిమా) - మే 25బ్రదర్స్ అండ్ సిస్టర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 27కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 29సన్ నెక్స్ట్ఫేసెస్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 29జీ5రూమ్మేట్స్ (కన్నడ సిరీస్) - మే 27ఆపిల్ టీవీ ప్లస్ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 29స్టార్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29లయన్స్ గేట్ ప్లేద రేస్ (రొమేనియన్ మూవీ) - మే 29(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు) -
ఆస్కార్‌లో 9 నామినేషన్స్.. ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులు వెతుకుతూనే ఉంటారు. వాళ్ల కోసమా అన్నట్లు తమిళ, మలయాళ, ఇంగ్లీష్ చిత్రాలు డబ్బింగుల రూపంలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇప్పుడు అలానే హాలీవుడ్లో హిట్ అయిన స్పోర్ట్స్ డ్రామా 'మార్టీ సుప్రీమ్' వచ్చేసింది. ఈ ఏడాది జనవరిలో మన దగ్గర థియేటర్లలో రిలీజైంది. 70 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తీస్తే 190 మిలియన్ డాలర్ల వసూలు చేసింది. ఈ ఏడాది ఆస్కార్స్‌లో తొమ్మిది విభాగాల్లో నామినేట్ కూడా అయింది. కానీ అవార్డులేం గెలుచుకోలేకపోయింది. ఇప్పుడిది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఇలాంటి టాక్‌తో 'దృశ్యం 3'కి రూ.100 కోట్ల కలెక్షన్ ఎలా సాధ్యం?)కథేంటంటే?అది 1950ల కాలం. అమెరికాలో ఉండే మార్టీ(టిమోతీ చలమెట్) అనే కుర్రాడికి ఓ కల ఉంటుంది. పెద్ద టేబుల్ టెన్నిస్ టోర్నీలో పాల్గొని గెలవాలని అనుకుంటూ ఉంటాడు. కానీ అందుకోసం చాలా డబ్బులు కావాలి. సదరు టోర్నమెంట్ జరగడానికి చాలా తక్కువ సమయముంటుంది. మరి ఇంత తక్కువ టైంలో మార్టీ అంత డబ్బులు ఎలా సంపాదించాడు? టోర్నీలో పాల్గొన్నాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సాధారణంగా స్పోర్ట్ డ్రామాలు అనగానే ఓ అనామక వ్యక్తి.. ఏదో ఒక గేమ్ నేర్చుకోవడం, తర్వాత ప్రాక్టీస్ చేయడం, చివరకు విజేత కావడం.. దాదాపు ఇదే ఫార్మాట్లో ఉంటుంది. కానీ 'మార్టీ సుప్రీమ్' మాత్రం కాస్త డిఫరెంట్. పేరుకే స్పోర్ట్ డ్రామా కానీ సక్సెస్ కోసం ఓ మనిషి ఎంత దూరం వెళ్తాడు? ఫేమ్ కోసం ఎంతలా స్వార్థపరుడు అవుతాడు అనే అంశాలు చాలా పచ్చిగా చూపించారు.రెండున్నర గంటల ఈ మూవీ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. టేబుల్ టెన్నిస్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. అయితే ఈ గేమ్ కంటే మిగతా విషయాల్ని ఎక్కువగా చూపించారు. అంటే మార్టీ జీవితం, చుట్టూ ఉండే మనుషులు, ఎదురైన పరిస్థితులు ఇతడిని ఎలా మార్చేశాయనేది అసలు కథ.ఈ సినిమాని మార్టీ రేస్మన్ అనే అమెరికన్ దిగ్గజ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడి జీవితం ఆధారంగా తీశారు. అయితే నిజ జీవిత సంఘటనలకు కాస్త కల్పితం జోడించారు. ఇందులో హీరోకి ఉన్న ప్లస్సులే కాదు మైసస్సుల కూడా చూపించడం విశేషం. సినిమాలో స్టైల్, టెన్షన్, యాక్టింగ్ అన్ని బాగున్నాయి. కానీ ఎమోషనల్ కనెక్ట్ ఇంకాస్త బలంగా ఉంటే నెక్స్ట్ లెవల్ మూవీ అయ్యేది. ఇది రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా కాదు. చెప్పాలంటే ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ప్రతి సీన్లోనూ ఓ టెన్షన్ ఉంటుంది. ఎమోషనల్ డెప్త్ కంటే స్టైల్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అనిపిస్తుంది. 1950లో అమెరికా వాతావరణాన్ని ఫెర్ఫెక్ట్గా చూపించారు. దానికి తోడు సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి.ఈ సినిమాలోని హీరో కమ్ ఓ నిర్మాత అయిన టిమోతీ చలమెట్.. మార్టీగా అదరగొట్టేశాడు. అయితే మిగతా వాటిలో కొన్ని పాత్రలని సరిగా ముగించలేదు. వేగంగా ఉండే ఎడిటింగ్ వల్ల కొన్ని సన్నివేశాలు గందరగోళంగా అనిపిస్తాయి. చాలామంది ఇది టేబుల్ టెన్నిస్ డ్రామా అనుకుంటారు కానీ మూవీలో గేమ్ అనేది ఓ స్పోర్ట్ కాదు ఇదో యుద్ధంలా ఫీలై ప్రతి మ్యాచులో టెన్షన్ తెప్పించే విధానం కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో గేమ్ కంటే మైండ్ గేమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. చీటింగ్, మ్యానిపులేషన్, ఈగో క్లాషెస్ లాంటి వాటిని చాలా బాగా చూపించారు. ఈ అంశాలే దీన్ని స్పోర్ట్ డ్రామాలా కాకుండా సైకలాజికల్ థ్రిల్లర్ జోన్లోకి తీసుకెళ్తాయి. తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు గానీ కొన్ని అసభ్యకర సీన్స్ ఉంటాయి కాబట్టి కుటుంబంతో కలిసి చూడొద్దు. ఏదైనా కాస్త డిఫరెంట్ మూవీ చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఇప్పుడా సినిమా తీస్తే రూ.1000 కోట్లు వస్తాయి: బండ్ల గణేశ్) -
ఓటీటీలో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఇప్పుడు మూడో సీజన్
రెండు సీజన్లతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న సిరీస్ 'సేవ్ ది టైగర్స్'. ఇప్పుడు దీని మూడో సీజన్ కూడా రాబోతుందని జియో హాట్ స్టార్ ప్రకటించింది. 2023లో రిలీజైన తొలి సీజన్.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. తర్వాత రెండో సీజన్ కూడా అలాంటి స్పందన సొంతం చేసుకుంది. తాజాగా సేవ్ ది టైగర్స్ సీజన్-3 కూడా రాబోతుంది. దీనికి మహి వి.రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్. ఈ సీజన్ మరిన్ని ఆసక్తికర ట్విస్టులు, కొత్త పాత్రలతో అలరించేందుకు సన్నద్ధమవుతోంది.(ఇదీ చదవండి: మళ్లీ మొదటకొచ్చిన 'పెద్ది' సమస్య.. ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం)తాజాగా రిలీజ్ చేసిన 'సేవ్ ది టైగర్స్ సీజన్ 3' పోస్టర్ చూస్తుంటే కథలో కాస్మిక్ ట్విస్ట్ ఉండబోతుందనే తెలుస్తోంది. తొలి రెండు సీజన్లలో అలరించిన ప్రియదర్శి-జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య-దేవియాని శర్మ, అభినవ్ గోమటం-పావని గంగిరెడ్డి జంటలు సీజన్3లోనూ అలరించనున్నాయి. ఈసారి సర్ప్రైజ్గా వెన్నెల కిషోర్ తనదైన కామెడీతో నవ్వించబోతున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్ మూడో సీజన్ త్వరలోనే జియోస్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది(ఇదీ చదవండి: బికినీ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్) -
ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన
థియేటర్లలో రిలీజైన చిన్నాపెద్దా సినిమాలు ఎప్పటికప్పుడు ఓటీటీలోకి వస్తూనే ఉంటాయి. ఈ వారం అలా సతీ లీలావతి, గాయపడ్డ సింహం, సిస్టమ్, లవ్ యూ రా, 14, రాజుగాని సవాల్, మధువిధు, టీఎన్ 2026 లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. వీటి సంగతి పక్కనబెడితే తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)ధనుష్, మమిత బైజు జంటగా నటించిన సినిమా 'కర'. విఘ్నేశ్ రాజా దర్శకుడు. ఓ మాదిరి అంచనాలతో గత నెల 30వ తేదీన థియేటర్లలో రిలీజైంది. కానీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. దొంగతనానికి సంబంధించిన సీన్స్ బాగున్నప్పటికీ మిగిలిన సన్నివేశాలు అంతంత మాత్రంగానే మెప్పించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడీ మూవీ వచ్చే గురువారం(మే 28) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.'కర' విషయానికొస్తే.. కరస్వామి(ధనుష్) ఓ దొంగ. ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి(మమిత బైజు) కోసం అదంతా వదిలేసి కష్టపడాలని నిర్ణయించుకుంటాడు. ఓ హోటల్ పెట్టాలనుకుని దానికి అవసరమైన డబ్బు కోసం ఊరిలోని తమ పొలం కాగితాలు బ్యాంకులో తాకట్టు పెట్టాలనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో తండ్రిని కోల్పోతాడు. మళ్లీ దొంగతనాలు చేసేందుకు సిద్ధమవుతాడు. ఒకే బ్యాంక్‌కి చెందిన బ్రాంచ్‌ల్లో డబ్బులు కొల్లగొట్టేస్తుంటాడు. కర ఇలా చేయడానికి కారణమేంటి? చివరకు పోలీసులకు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు) -
ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు వచ్చాయి. వాటిలో లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి', తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' లాంటి స్ట్రెయిట్ చిత్రాలతో పాటు సిస్టమ్, మధువిధు, టీఎన్ 2026 తదితర డబ్బింగ్ మూవీస్తోపాటు 'మేం కాప్‌లం' అనే తెలుగు సిరీస్ కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. వీటితో పాటు మరో మూడు తెలుగు సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఒకే ఓటీటీలోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? ఎందులో ఉన్నాయి?(ఇదీ చదవండి: సీఎం విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా.. ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్)గతేడాది జూలై 5న థియేటర్లలో రిలీజైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా '14'. లక్ష్మీ శ్రీనివాస్ దర్శకుడు కాగా నోయల్ సీన్, రామ్ రతన్, విశాఖ ధీమాన్ ప్రధాన పాత్రలు చేశారు. ఇప్పుడిది ఆహా ఓటీటీలోకి వచ్చింది. ముఖ్యమంత్రి కొడుకు రతన్, జూనియర్ డాక్టర్ నేహా ప్రేమలో ఉంటారు. ఓ రోజు నేహా ఫ్లాట్‌లో ఇద్దరూ శవాలై కనిపిస్తారు. ఆత్మహత్య అని పోలీసులు తేలిస్తే.. సుబ్బు అనే జర్నలిస్ట్, తన మిత్రులతో కలిసి ఇది హత్య అని దర్యాప్తు చేస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.గతేడాది జూలై 19న థియేటర్లలోకి వచ్చిన 'రాజు గాని సవాల్' కూడా ఆహా ఓటీటీలోకి వచ్చింది. హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది. లెలిజాల రవీందర్ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటించాడు. చిన్న మొబైల్ రిపేర్ షాపు నడుపుకొనే రాజు అనే వ్యక్తి.. స్నేహితులతో కలిసి తన బస్తీలో గణేష్ ఉత్సవాలు చేయాలనుకుంటాడు. కానీ ఆ ఉత్సవాల వల్ల స్థానిక నాయకుడితో రాజుకు విభేదాలు వస్తాయి. ఈ క్రమంలోనే రాజు తన కుటుంబాన్ని, బస్తీని ఎలా కాపాడుకున్నాడనేదే మిగతా స్టోరీ.గతేడాది సెప్టెంబరు 5న థియేటర్లలోకి వచ్చిన తెలుగు హారర్ కామెడీ సినిమా 'లవ్ యూ రా'. చిన్ను, గీతికా రతన్ జంటగా నటించారు. ఇందులో ప్రధానంగా స్నేహితుల మధ్య జరిగే పందెం, దాని చుట్టూ తిరిగే హారర్, నవ్వులు పుట్టించే అంశాలే ఈ మూవీ స్టోరీ. ఇది కూడా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ) -
ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా
బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. మలయాళ చిత్రసీమలో స్టార్స్ అయిన మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, నయనతార, రేవతి, దర్శన రాజేంద్రన్, కుంచకో బోబన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఇంతకీ ఏ ఓటీటీలోకి రానుంది? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా)మలయాళ టాప్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టి.. దాదాపు 18 ఏళ్ల తర్వాత కలిసి నటించిన సినిమా 'పేట్రియాట్'. మహేశ్ నారాయణన్ దర్శకుడు కాగా స్పై యాక్షన్ థ్రిల్లర్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందు ఓ మాదిరి హైప్ తెచ్చుకుంది. ఈ నెల 1వ తేదీన థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేయబోతుంది. జూన్ 5 నుంచి జీ5లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుందని తాజాగా ప్రకటించారు.'పేట్రియాట్' విషయానికొస్తే.. డేనియల్ జేమ్స్ (మమ్ముట్టి) డీఆర్డబ్ల్యూలో సైంటిస్ట్. దేశ రహస్యాలు వేరేవాళ్లకు ఇచ్చేశాడని ఇతడిపై దేశద్రోహి ఆరోపణలు వస్తాయి. దీంతో లండన్‌కి పారిపోతాడు. విమదన్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టి వీడియోలు చేస్తుంటాడు. ఓసారి డేనియల్ బయటపెట్టిన ఓ రహస్యం వల్ల మంత్రి తనయుడు, శక్తి కార్పొరేషన్ అధినేత శక్తి సుందరం (ఫహాద్ ఫాజిల్) చిక్కుల్లో పడతాడు. దీంతో డేనియల్‌పై హత్యాప్రయత్నం జరుగుతుంది. ఇంతకీ ఇదెవరు చేశారు? శక్తి కార్పొరేషన్లో పనిచేసే జ్యోతి (దర్శన రాజేంద్రన్), నళిని హత్యలకు కారణమెవరు? శక్తి కార్పొరేషన్ వల్ల జరిగే డేటా చోరీతో ఎలాంటి అనర్ధాలు ఏర్పడ్డాయి? పేదలు ఎలా మోసపోతున్నారు? శక్తిని డేనియల్ జేమ్స్ ఎలా ఎదుర్కొన్నాడు? ఆయనకు కల్నల్ రహీమ్ నాయక్ (మోహన్ లాల్) నుంచి ఎలాంటి సపోర్ట్ దొరికింది? లాయర్ లతిక (నయనతార), శక్తి సొల్యూషన్స్ ఉద్యోగి మైఖేల్ (కుంచుకో బోబన్) ఏం చేశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సీఎం విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా.. ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి వచ్చిన సినిమా.. సీఎం విజయ్‌ని టార్గెట్ చేసి
గత నెలలో తమిళనాడు ఎన్నికలు జరిగాయి. ఇందులో టీవీకే పార్టీ అధికారం దక్కించుకోగా.. హీరో విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఎన్నికలు జరుగుతున్న టైంలో ఈయన్ని టార్గెట్ చేస్తూ సెటైరికల్‌గా ఓ మూవీ రిలీజ్ చేశారు. ఇప్పుడిది ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా)'టీఎన్ 2026' పేరుతో తీసిన ఈ మూవీలో సినిమాటోగ్రాఫర్ కమ్ నటుడు నటరాజన్ ప్రధాన పాత్ర చేశాడు. కమెడియన్ తంబి రామయ్య.. స్టోరీ అందించడంతో పాటు కీలక పాత్ర చేశాడు. ఈయన కొడుకు ఉమాపతి రామయ్య ఈ చిత్రానికి దర్శకుడు. హీరో విజయ్‌ని టార్గెట్ చేసేలా ఉన్న ఈ మూవీ.. జనాల్ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. వ్యర్థ ప్రయత్నంగా మిగిలింది. గత నెల చివరి వారంలో ఐదు ఓటీటీల్లోకి తమిళంలో మాత్రమే అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు.'టీఎన్ 2026' విషయానికొస్తే.. ప్రముఖ సినిమా హీరో, రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. కొత్తగా పార్టీ స్థాపిస్తాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే అంశంతో పొలిటికల్ సెటైరికల్‌గా ఈ సినిమా తీశారు. అయితే విజయ్‌ని టార్గెట్ చేస్తూ తీశారని అతడి అభిమానులు కామెంట్స్ చేయగా.. ఇది పూర్తిగా కల్పిత కథ అని తంబి రామయ్య చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'.. ఒక్క సినిమాలో ఎనిమిది మంది విలన్స్) -
సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్ల వద్ద కొత్త సినిమాల సందడి ఉండనే ఉంటుంది. అంతేకాకుండా ఫ్రైడే ఓటీటీల్లోనూ కొత్త చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ అవుతుంటాయి. కొన్ని సినిమాలు ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాయి. మరికొన్ని సడన్‌గా ఓటీటీల్లో దర్శనమిస్తుంటాయి. అలా తాజాగా ఓ తెలుగు సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఇంతకీ ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.తాజాగా ఇవాళ ఎలాంటి హడావుడి లేకుండానే ఓ తెలుగు స్ట్రీమింగ్కు వచ్చేసింది. తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో వచ్చిన చిత్రం గాయపడ్డ సింహం. ఈనెల 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా కథేంటంటే..దరహాస్(తరుణ్ భాస్కర్), గాయత్రి(మానసా చౌదరి) ప్రేమించుకుంటారు. కాబోయే అల్లుడు అమెరికాలో సెటిలై ఉండాలని గాయత్రి తండ్రి కండీషన్ పెట్టడంతో.. దరహాస్ అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతాడు. వీసా తీసుకొని అమెరికాకి వెళ్లి.. 34 గంటల్లోనే తిరిగి వస్తాడు. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల వెనక్కి వచ్చిన (డిపోర్ట్) భారతీయ విద్యార్థుల్లో దరహాస్ ఒకడు. తనను అమెరికాకు వెళ్లకుండా చేసిన ట్రప్‌పై దరహాస్ పగపడతాడు. ఎలాగైన ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని స్నేహితులతో చెబుతాడు. దరహాస్ టార్చర్ భరించలేక ఫ్రెండ్ ఒక సలహా ఇస్తాడు. అదేంటి? ట్రంప్‌పై పగ తీర్చుకోవడం సాధ్యమేనా? దరహాస్ పగకు మాఫియా డాన్ బ్రూటల్ ధర్మ(జేడీ చక్రవర్తి)కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో భైరవ దాస్(శ్రీవిష్ణు), శాలిని(ఫరియా అబ్దుల్లా) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్కరోజే 16 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఎప్పటిలాగే ఉంటుంది. ఈ గురువారమే మోహన్ లాల్ దృశ్యం-3 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ ఫ్రైడే చిన్న సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ వారంలో చూస్తే నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం, ఫస్ట్ టైమ్, పురుషః లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే దురంధర్ అన్‌కట్ వర్షన్ కూడా వచ్చేస్తోంది. దీంతో పాటు హిందీ సినిమా సిస్టమ్, మధువిదు లాంటి మలయాళ సినిమా కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అంతేకాకుండా పలు బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు ఓటీటీల్లో ఈ శుక్రవారమే సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్.. లేడీస్ ఫస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 22 దిస్ ఈజ్ నోటా టెస్ట్(హాలీవుడ్ మూవీ)- మే 22 మేటింగ్ సీజన్.. సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- మే 22 దురంధర్(అన్‌కట్ వర్షన్)- మే 22 గబ్బీస్ డాల్‌హౌస్(హాలీవుడ్ మూవీ)- మే 22 గోట్(యానిమేషన్ మూవీ)- మే 24 బ్యాడ్ థాట్స్- సీజన్ 2- మే 24అమెజాన్ ప్రైమ్- సిస్టమ్(బాలీవుడ్ సినిమా)- మే 22 ది బ్రైడ్(హాలీవుడ్ మూవీ)- మే 22సన్ నెక్ట్స్.. బీష్మార్(మలయాళం సినిమా)- మే 22 శేష 2016(కన్నడ సినిమా)- మే 22జియో హాట్‌స్టార్.. స్కై ప్లస్ మెడ్ సీజన్ 4(హాలీవుడ్ సిరీస్)- మే 22 దురంధర్(అన్‌కట్ వర్షన్)- మే 22జీ5 వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విలంగ్(తమిళ సిరీస్)- మే 22 మేము కాపులం(తెలుగు సిరీస్)- మే 22 సత్రంగి బద్లే కా ఖేల్(హిందీ సినిమా)- మే 22సోనీలివ్.. మధువిదు(మలయాళ సినిమా)- మే 22లయన్స్ గేట్ ప్లే.. పండప్లాన్ ది మ్యాజికల్ ట్రైబ్(హాలీవుడ్ మూవీ)- మే 22ఎంఎక్స్ ప్లేయర్..వు ఈజ్ యువర్ గైనాక్?- సీజన్ 2(బాలీవుడ్ సిరీస్)- మే 22 -
మరో ఓటీటీలో మెగా కోడలి సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుణ్ తేజ్ సతీమణి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం సతీ లీలావతి. పెళ్లి తర్వాత లావణ్య చేసిన మూవీ ఇదే కావడం విశేషం. మే 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఆదరణ లేకపోవడంతో కేవలం 12 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేసింది. సన్ నెక్ట్స్ వేదికగా ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ సన్ నెక్ట్స్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం రెండు ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ అడియన్స్‌కు అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ప్రేమ, పెళ్లి, విడాకుల అనే అంశాలతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.సతీ లీలావతి కథేంటంటే..లీలావతి (లావణ్య త్రిపాఠి) ఓ స్టార్ డైరెక్టర్. ఇంట్లో పెరెంట్స్ తరచూ గొడవలు పడడంతో చిన్నప్పటి నుంచి ఆమెలో ఓ భయం ఏర్పడుతుంది. ఆ భయం నుంచి బయటపడేందుకు సైకాలజిస్ట్ రామ్ సేతు(దేవ్ మోహన్)ని సంప్రదిస్తుంది. ఈ క్రమంలో అతనితో స్నేహం ఏర్పడడం.. అది కాస్త ప్రేమగా మారి, నాన్న(నరేశ్) అనుమతిలో పెళ్లి కూడా చేసుకుంటుంది. మూడేళ్ల పాటు చక్కగా కాపురం చేసిన రామ్.. ఉన్నపళంగా విడాకులు కోరతాడు.ప్రస్తుతం తాను నర్స్ నికోలా సెబాస్టియన్ (మడోన్నా సెబాస్టియన్)తో రిలేషన్లో ఉన్నానని.. విడాకులు ఇస్తే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. విడిపోవడం ఇష్టంలేని లీలావతి..భర్తను కొట్టి ఇంట్లోనే బంధిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సేతు నేపథ్యం ఏంటి? నర్స్ నికోల అతని జీవితంలోకి ఎలా వచ్చింది? భర్తను దక్కించుకునేందుకు లీలావతి ఏం చేసింది? లాయర్ తమలపాకుల(వీటీవీ గణేష్)కు ఆమె చెప్పిన అబద్దం ఏంటి? ఆమెకు దొంగ(సప్తగిరి), నిర్మాత మొట్ట రాజర్(మొట్ట రాజేంద్రన్) ఎలాంటి సహాయం చేశారు? చివరకు లీలావతి-రామ్‌సేతు విడాకులు తీసుకున్నారా ? లేదా తిరిగి ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. Pellam. Problems. Pralayam 🔥And somehow all three feel the same 😭Get ready to witness a husband struggling to survive marriage 🤞🏼#SathiLeelavathi streaming now on JioHotstar! 💫#SathiLeelavathiOnJioHotstar @Itslavanya @ActorDevMohan @SatyaTatineni @ddp_offl #NaagaMohan… pic.twitter.com/P3ppgSd75k— JioHotstar Telugu (@JioHotstarTel_) May 21, 2026 -
ఓటీటీలో దురంధర్.. అభిమానులకు బిగ్ సర్ప్రైజ్..!
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది.ఈ నేపథ్యంలోనే ఓటీటీ స్ట్రీమింగ్పై మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ నెల 22 నుంచి ఓటీటీలో అన్‌కట్ వర్షన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. రెండు ఓటీటీల్లోనూ ఒకేరోజు ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌తో జియోహాట్‌స్టార్‌లోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుందని ప్రకటించారు. ఈ అన్‌కట్ వర్షన్ దాదాపు 3 గంటల 25 నిమిషాల పాటు ఉండనుందని మేకర్స్ రివీల్ చేశారు. దీంతో ధురంధర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
పాసవ్వాలా... ఫెయిలవ్వాలా... అంతా పైసల పైనే
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ఎగ్జామ్ సిరీస్ ఒకటి. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.ఓ కుటుంబం బావుండాలన్నా, ఓ ఊరు బావుండాలన్నా లేదా దేశం బావుండాలన్నా చదువుకుని ఉండాలి. నేటి సమాజంలో మనం సజావుగా బతకాలి అంటే భాష ఏ విధంగా అవసరమో అదే విధంగా చదువు కూడా అంతే అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. కానీ ఇప్పటి పరిస్థితులలో చదువుకునేవారు తక్కువయ్యారు... చదువు కొనేవారు ఎక్కువయ్యారు. రాత్రింబవళ్ళూ కష్టపడి చదివి పరీక్ష రాస్తే, కష్టపడని కొందరు దొడ్డిదారిన అసలైన వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో అల్లుకున్న కథతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన సిరీస్ ‘ఎగ్జామ్’. ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ 7 భాగాలతో లభ్యమవుతోంది. దాదాపుగా వాస్తవిక ఘటనలతో, చిన్నపాటి సినిమాటిక్ లిబర్టీతో ఓ నిజమైన సమస్యను మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు సర్గుణమ్. ఈ సిరీస్ మొత్తం గ్రిప్పింగ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. కథాంశానికి వస్తే... తమిళనాడు లోని తైకారా ప్రాంతానికి కొత్తగా ఎంపికైన డీఎస్పీ మారుమల్లి ఛార్జి తీసుకోవడానికి తన కారులో బయలుదేరుతుంది. దారిలో మారుమల్లిని ఝాన్సీ కిడ్నాప్ చేసి తైకారాకు తాను డీఎస్పీగా వెళుతుంది. ఓ డీఎస్పీ స్థాయి వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ తన స్థానంలో వెళ్ళడమనేది సినిమాటిక్ లిబర్టీ అనుకున్నా కాస్త ఎక్కువైందని చెప్పవచ్చు. కాకపోతే ఇక అక్కడి నుండి మెల్ల మెల్లగా కథలోకి తీసుకువెళతారు దర్శకుడు. అసలు మారుమిల్లిని ఝాన్సీ ఎందుకు కిడ్నాప్ చేసింది? స్టేషన్‌కి చేరుకున్న ఝాన్సీని ఎవరైనా గుర్తుపట్టారా? లేదా అన్న అంశాలను మాత్రం సిరీస్‌లోనే చూడాలి. ఈ సిరీస్ మొత్తం అయిపోయాక మన విద్యా వ్యవస్థలో ఉన్న చీకటి కోణాలు స్పష్టంగా అర్థం అవుతాయి. ఒక దశలో ఏ ఎగ్జామ్ అయినా పాసవ్వాలా... ఫెయిలవ్వాలా అన్నది తామిచ్చే పైసల మీదే ఆధారపడుతుందన్న విషయం తెలుస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ చూసి తెలుసుకోవాల్సిన సిరీస్ ఇది. – హరికృష్ణ ఇంటూరు -
గ్రేట్ డైరెక్టర్ ఓటీటీ ఎంట్రీ.. ఏటీఎం దొంగతనం స్టోరీతో
హిందీ సినిమాలు కూడా చూసే తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే, సంజు, డంకీ తదితర మూవీస్ తీశారు. వీటిలో షారూక్‌తో 'డంకీ' తప్పితే మిగిలినవన్నీ బ్లాక్‌బస్టర్ సక్సెస్ అయ్యాయి. ఈయన నుంచి కొత్త మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న వాళ్లకు చిన్నపాటి షాకిచ్చారు. ఓ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: కళ్లు లేని హీరోయిన్.. కాళ్లు లేని హీరో)'ప్రీతమ్ అండ్ పెడ్రో' పేరుతో తీస్తున్న ఈ సిరీస్.. ఓ ఏటీఎం దొంగతనం చుట్టూ జరిగే కథతో తెరకెక్కిస్తున్నారు. దీనికి రాజ్ కుమార్ హిరానీ.. షో రన్నర్, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అవినాశ్ అరుణ్ దర్శకుడు. ఈ సిరీస్‌తోనే తన కొడుకు వీర్ హిరానీని నటుడిగానూ పరిచయం చేస్తున్నారు. ఇందులో అర్షద్ వార్సీ, విక్రాంత్ మస్సే లాంటి స్టార్స్ ఇతర కీలక పాత్రలు చేశారు. జూలై 3 నుంచి హాట్‌స్టార్‌లో సిరీస్ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారమైతే లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి'తో పాటు జ్యోతిక 'సిస్టమ్', మధువిధు, మేం కాప్‌లం లాంటి డబ్బింగ్ మూవీస్, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. అలానే డ్రీమ్ క్యాచర్, భీంసేరి లాంటి చోటా చిత్రాలు అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడీ లిస్టులోకి మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేరింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి నా భార్య.. మంచు మనోజ్ స్టేట్మెంట్)అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత తదితరులు ప్రధాన పాత్రలు చేసిన తెలుగు సినిమా 'పైసా వాలా'. కె.నవీన్ తేజస్ దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబరు 12న థియేటర్లలోకి వచ్చింది. రూ.10 హవాలా నోటు చుట్టూ తిరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. కానీ స్టార్స్ లేకపోవడంతో దీన్ని జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.'పైసా వాలా' విషయానికొస్తే.. హవాలా నోటు తీసుకొస్తున్న ఎమ్మెల్యే బామ్మర్దికి యాక్సిడెంట్ అవుతుంది. తర్వాత అతడి ఫోన్, పర్స్ మిస్ అవుతుంది. అందులోనే హవాలా నోటు ఉంటుంది. పసుపు అంటిన సదరు పది రూపాయల నోటు కోసం వేరు వేరు గ్యాంగులు తిరుగుతుంటాయి. ఈ క్రమంలోనే బెరిదింపులు, హత్యలు కూడా జరుగుతాయి. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ సినిమా.. కానీ
90స్ కిడ్స్ అందరూ తమ చిన్నప్పుడు చూసి హాలీవుడ్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా 'మమ్మీ' ఫ్రాంచైజీ ఉంటుంది. ఇప్పటివరకు మూడు మూవీస్ రాగా అవన్నీ ఆకట్టుకున్నాయి. ఇదే ఫ్రాంచైజలో వచ్చిన లేటెస్ట్ చిత్రం 'ద మమ్మీ' గత నెలలో థియేటర్లలోకి రాగా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)గతంలో వచ్చిన 'మమ్మీ' సినిమాలన్నీ అడ్వెంచర్, కామెడీ తరహాలో వచ్చాయి. వాటికి భిన్నంగా పూర్తిగా డార్క్ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో లేటెస్ట్ మూవీ తీశారు. 'ద మమ్మీ' పేరుతో తీసిన ఈ చిత్రానికి లీ క్రోనిన్ దర్శకత్వం వహించారు. గత నెల 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని మెప్పించింది. ఇప్పుడీ చిత్రం విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. త్వరలో మన దేశంలోనూ అందుబాటులోకి రావొచ్చు. అప్పుడు తెలుగు డబ్బింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.'ద మమ్మీ' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం ఆనందిస్తుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు ఆ కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెట్టాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్ భయపెట్టేలా ఉన్నాయని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుందనే కామెంట్స్ వినిపించాయి.(ఇదీ చదవండి: 'పెద్ది' స్టోరీ ఏంటి? ఊహించని ట్విస్ట్ అదేనా?) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
మరోవారం వచ్చేసింది. ఈసారి సతీ లీలావతి, సిస్టమ్, మధువిధు, మేం కాప్‌లం లాంటి తెలుగు మూవీస్, సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరోవైపు థియేటర్లలో 'దృశ్యం 3' రిలీజ్ కానుంది. ఈ వీకెండ్‌కి అయితే ఇదే ఎంటర్టైన్మెంట్. అయితే సడన్ గా ఓ రెండు తెలుగు చిత్రాలు ఒకే ఓటీటీలోకి స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. రిలీజైన 12 రోజులకే)గతేడాది జనవరిలో థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'డ్రీమ్ క్యాచర్'. ప్రశాంత్ కృష్ణ, అనీషా దామా, ఐశ్వర్య హోళక్కల్ ప్రధాన పాత్రలు చేశారు. కలలో వచ్చిన సంఘటనలు నిజజీవితంలో ఒకవేళ జరిగితే హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఈ కలలు రావడం అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది కాన్సెప్ట్. ఇప్పుడీ చిత్రం ఏడాదిన్నర తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.ఇకపోతే సుమన్, మహేశ్ పెగ్గర్ల, సిరి తదితరులు నటించిన 'భీంసేరి' అనే తెలుగు సినిమా కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఇది కూడా రెంట్ విధానంలోనే అందుబాటులోకి వచ్చింది. ఓ క్రూరమైన లేడీ పోలీసాఫీసర్.. ఓ నిరుపేద కుటుంబాన్ని అన్యాయంగా నాశనం చేస్తుంది. కానీ ఆ కుటుంబంలో ఓ మహిళ ప్రాణాలతో బయటపడుతుంది. ఈమె సదరు లేడీ పోలీసాఫీసర్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక) -
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. సోమవారం నుంచే జనాలంతా వర్క్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఇక వారం సినిమాల విషయానికొస్తే పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఉండడంతో పెద్ది మూవీ సైతం జూన్‌లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ వారంలో చూస్తే నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం, ఫస్ట్ టైమ్, పురుషః లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటిపై ఆడియన్స్‌లో పెద్దగా బజ్ లేదు.ఇక ఓటీటీల విషయానికొస్తే మెగా కోడలు నటించిన సతీ లీలావతి, మేము కాపులం అనే వెబ్ సిరీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో సోనాక్షి సిన్హా, జ్యోతిక నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్, మలయాళ హిట్ మూవీ మధువిదు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అంతేకాకుండా పలు బాలీవుడ్ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలకు రానున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్..డెసిబ్లింగ్-సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- మే20కరీజ్మా సీజన్ 1(స్పానిష్ సిరీస్)- మే 20వన్ త్రీ హిల్(హాలీవుడ్ సిరీస్)- మే 21జేమ్స్ సీజన్-1(స్పానిష్ సిరీస్)- మే 21ది బోరోగ్స్(హాలీవుడ్ సిరిసీ)- మే 21లేడీస్ ఫస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 22దిస్ ఈజ్ నోటా టెస్ట్(హాలీవుడ్ మూవీ)- మే 22మేటింగ్ సీజన్.. సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- మే 22అమెజాన్ ప్రైమ్-ది క్రోనిన్స్ ది మమ్మీ(హాలీవుడ్ మూవీ)- మే 19సతన్ ది డార్క్-(తమిళ సినిమా)- మే 20జాక్ ర్యాన్..ఘోస్ట్ వార్(హాలీవుడ్ మూవీ)- మే20సిస్టమ్(బాలీవుడ్ సినిమా)- మే 22 సన్ నెక్ట్స్..సతీ లీలావతి(తెలుగు సినిమా)- మే 20బీష్మార్(మలయాళం సినిమా)- మే 22శేష 2016(కన్నడ సినిమా)- మే 22జియో హాట్‌స్టార్..స్కై ప్లస్ మెడ్ సీజన్ 4(హాలీవుడ్ సిరీస్)- మే 22జీ5వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విలంగ్(తమిళ సిరీస్)- మే 22మేము కాపులం(తెలుగు సిరీస్)- మే 22సోనీలివ్..మధువిదు(మలయాళ సినిమా)- మే 22లయన్స్ గేట్ ప్లే..పండప్లాన్ ది మ్యాజికల్ ట్రైబ్(హాలీవుడ్ మూవీ)- మే 22 -
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా
కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సత్య.. హీరోగా గతంలో ఓ ప్రయత్నం చేశాడు గానీ వర్కౌట్ కాలేదు. మళ్లీ చాన్నాళ్లకు రీసెంట్‌గానే ఓ కామెడీ మూవీతో వచ్చాడు. తనకు మరింత క్రేజ్ వచ్చేలా చేసిన 'మత్తు వదలరా' దర్శకుడితో కలిసి తీసిన ఈ కామెడీ సినిమా.. ఇప్పుడు నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)'మత్తు వదలరా' రెండు సినిమాలతో ఆకట్టుకున్న రితేశ్ రానా దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'జెట్ లీ'. సత్య, వెన్నెల కిశోర్, రియా సింఘా ప్రధాన పాత్రలు చేశారు. వెరైటీ ప్రమోషన్లతో ఆకట్టుకోవడంతో ఓ మాదిరి బజ్ ఏర్పడింది. కానీ మే 01న థియేటర్లలోకి వచ్చిన తొలి ఆటకే పూర్తిగా తేలిపోయింది. కామెడీ పేరుతో చేసిన చిత్రవిచిత్ర విన్యాసాలు ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో డిజాస్టర్ అయింది. ఇప్పుడీ చిత్రం ఈనెల 25 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.'జెట్ లీ' విషయానికొస్తే.. ప్రజాపతి (అజయ్) అనే బిజినెస్‌మ్యాన్ రూ.15 వేల కోట్ల బ్యాంకింగ్ స్కామ్ చేసి దుబాయ్ పారిపోతాడు. దీంతో కేంద్ర హోంమంత్రి మేల్కోటి (శ్రీనివాస్ వడ్లమాని) ఇతడిని అరెస్ట్ చేసి తిరిగి దేశానికి రప్పించే బాధ్యతని భారత ఇంటెలిజెన్స్‌కి అప్పజెబుతాడు. అయితే కొందరి వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలియడంతో ప్రజాపతి స్వయంగా లొంగిపోయినట్లు నటించి, ఆ తర్వాత తప్పించుకోవాలని ప్లాన్ వేస్తాడు. దుబాయ్ నుంచి కొచ్చికి ప్రజాపతిని ప్రత్యేక విమానంలో తీసుకొస్తుండగా.. ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ అవేంటి? ఇదే విమానంలో గతం మర్చిపోయిన స్థితిలో ఉన్న డాక్టర్ వేదవ్యాస్ (సత్య) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. 12 రోజులకే స్ట్రీమింగ్)Get ready for first-of-its-kind inflight entertainment with bone-breaking action 💥 Fasten your seatbelts for a mad, turbulent ride ✈️ #JetLee is crash landing on 25th May on JioHotstar! 💫 #JetLeeOnJioHotstar A @RiteshRana's turbulence 🛫 Starring #Satya, #RheaSingha,… pic.twitter.com/mPAZ8dgFUq— JioHotstar Telugu (@JioHotstarTel_) May 17, 2026 -
ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మెగా హీరో వరుణ్ తేజ్‌ని 2023లో పెళ్లి చేసుకున్న తర్వాత మెగా కోడలు అయిపోయింది. గతేడాది వీళ్లకు కొడుకు కూడా పుట్టాడు. పెళ్లికి ముందే ఓ సినిమాని లావణ్య పూర్తి చేయగా అది వాయిదాలు పడుతూ ఈ నెల ప్రారంభ వారంలో వచ్చింది. దీన్ని జనాలు కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం రెండు వారాలైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'సతీ లీలావతి'. తాతినేని సత్య దర్శకుడు. ప్రేమ, పెళ్లి, విడాకుల తదితర అంశాలతో తీసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఈ నెల 8వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. కంటెంట్ బాగోలేకపోవడంతో ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం(మే 20) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్కి రెడీ అయింది. అంటే రిలీజైన 12 రోజులకే తీసుకొచ్చేస్తున్నారనమాట. తెలుగు, తమిళ వెర్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.'సతీ లీలావతి' విషయానికొస్తే.. లీలావతి (లావణ్య త్రిపాఠి) స్టార్ డైరెక్టర్. తల్లిదండ్రుల గొడవల కారణంగా చిన్నప్పటి నుంచి ఈమెలో ఓ రకమైన భయం ఏర్పడిపోతుంది. దీని నుంచి బయటపడేందుకు సైకాలజిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్) ఈమెకు సాయం చేస్తాడు. అలా ప్రేమలో పడి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. కానీ వివాహమైన మూడేళ్లకు తనకు విడాకులివ్వాలని లీలావతిని సేతు అడుగుతాడు. నర్స్ నికోలా(మడోన్నా సెబాస్టియర్)తో ప్రేమలో ఉన్నానని.. విడాకులిస్తే ఆమెనే వివాహమాడతానని చెప్తాడు.భర్త ప్రేమ వ్యవహారం తెలిసిన లీలావతి.. సేతుని కొట్టి ఇంట్లో బంధిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు సేతు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఈ కథలో లాయర్ తమలపాకుల (వీటీవీ గణేశ్), నిర్మాత మెట్ట రాజన్ (మెట్ట రాజేంద్రన్), దొంగ (సప్తగిరి) పాత్రల సంగతేంటి? చివరకు లీలావతి - సేతు విడిపోయారా? ఒక్కటయ్యారా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా) -
'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ తెలుగు రివ్యూ
'ప్రేమలు' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగులోనూ కాస్తంత గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు నస్లేన్.. ఇదే మూవీ దర్శకుడితో కలిసి చేసిన చిత్రం 'ఐ యామ్ కాదలన్'. 2024లోనే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? చూడొచ్చా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి?విష్ణు(నస్లేన్) తన క్లాస్మేట్ శిల్ప(అనీష్మా)ని కాలేజీలో ఉన్నప్పుడే ప్రేమిస్తాడు. కానీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విష్ణుకి జాబ్ రాకపోవడంతో శిల్ప నిరుత్సాహపడుతుంది. ఈమె.. తన తండ్రి ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరిపోతుంది. ఓసారి తన ప్రేమ గురించి చెప్పేందుకు శిల్ప తండ్రి దగ్గరకెళ్లిన విష్ణుకు చేదు అనుభవం ఎదురవుతుంది. ఇంతకీ అదేంటి? దీని తర్వాత శిల్ప తండ్రి కంపెనీని విష్ణు ఎలా హ్యాక్ చేశాడు? శిల్ప తండ్రిని ముప్పతిప్పలు పెట్టిన విష్ణు చివరకు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?తెలుగులో ఎప్పుడూ దాదాపుగా ఒకే కమర్షియల్ ఫార్ములా చుట్టూ స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు తిరుగుతుంటారు. మలయాళంలో మాత్రం తక్కువ బడ్జెట్లోనే కాస్త భిన్నంగా మంచి సినిమాలు వస్తుంటాయి. అలా వచ్చిన మూవీనే ఇది. ప్రేమించిన అమ్మాయిపై ప్రతీకారం తీర్చుకోవడం పాత కాన్సెప్టే. కానీ దానికి హ్యాకింగ్ అనే అంశం జోడించడం కాస్త చిత్రంగా అనిపించింది. ఒక్క ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే సూపర్ కాకపోయినా పర్లేదు బాగానే ఉంది.అసలు పాయింట్ చెప్పడానికి కాస్త టైమ్ తీసుకున్న దర్శకుడు.. విషయం తెలిసిన తర్వాత ఎంటర్టైనింగ్గానే సినిమాని నడిపాడు. పెద్దగా టెక్నికల్ సెటప్ లేకపోయినప్పటికీ హీరో తన దగ్గరున్న డబ్బా కంప్యూటర్‌తోనే హ్యాకింగ్ చేయడం సహజంగానే ఉంది. హ్యాకింగ్ అనగానే ఏదేదో అనుకుంటాం కానీ సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా సింపుల్‌గానే చూపించారు. ఆ సీన్లు బాగానే కుదిరాయి. కాకపోతే కామెడీ లాంటి పెద్దగా ఉండవు.క్లైమాక్స్‌లో హీరో దొరికిపోతాడు అనుకున్న దగ్గర ఇచ్చిన ట్విస్ట్ అయితే నవ్వులు పూయిస్తుంది. ఇక హ్యాకర్ అయిన హీరోని పట్టుకునేందుకు హీరోయిన్ తండ్రి నియమించుకున్న లేడీ హ్యాకర్ చాలా ట్రై చేస్తుంది. మరి హీరో దొరికాడా లేదా? హ్యాకర్లు ఇద్దరూ ఏ సందర్భంలో ఎక్కడ కలుసుకున్నారనేది కూడా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. మలయాళంలో చాలా చిత్రాల్లో ఉన్నట్లే కాస్తంత సాగదీత కూడా ఉంటుంది. దాన్ని తట్టుకుని చూస్తే ఇదో టైమ్ పాస్ సినిమా.హీరోహీరోయిన్లు నస్లేన్, అనీష్మా బాగా చేశారు. మిగతా పాత్రధారులు కూడా సహజంగా నటించారు. టెక్నికల్ విభాగాలు కూడా తమ పని తాము చేశారు. ఓటీటీలో ఏదైనా కొత్త మూవీ.. అలా అలా సాగిపోయేలా ఉండేది చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. మలయాళ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. అభ్యంతరకర సీన్స్ ఏం లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.-చందు డొంకాన(ఇదీ చదవండి: మహేశ్ సినిమా.. ఆర్మీని కామెడీ చేశారు: మేజర్) -
ఎట్టకేలకు OTTలోకి ధురంధర్ 2 కాకపోతే చిన్న ట్విస్ట్..!
-
శత్రుదేశంలో ఓటీటీ నం.1 ట్రెండింగ్‌లో 'ధురంధర్ 2'
విదేశాల్లో 'ధురంధర్ 2' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మన దేశంలో మాత్రం జూన్ 4వ తేదీ సాయంత్రం నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుందని అధికారికంగానే ప్రకటించారు. అయితే ఈ మూవీ అంతా పాక్‌లోని లయరీ ప్రాంతంలో జరిగే గ్యాంగ్ వార్స్, రాజకీయాలు, ఉగ్రవాద చర్యలు తదితర అంశాల ఆధారంగా తీశారు. దీంతో పాక్‌తో పాటు అరబ్ దేశాల్లో దీనిపై నిషేధం విధించారు. దీంతో అక్కడి ప్రేక్షకులు ఎవరూ ఈ చిత్రాన్ని చూడలేకపోయారు.(ఇదీ చదవండి: నాపై చేతబడి.. రక్తం వాంతులు, నరకం చూశా : జయం రవి)అయితే 'ధురంధర్ 2' థియేటర్లలో రిలీజైన తర్వాత పైరసీని పాక్‌లో విపరీతంగా చూశారు. అక్కడి కరెన్సీలో రూ.50కే ప్రింట్ అమ్మారు. ఇప్పుడు అధికారికంగా దాయాది దేశంలో ఓటీటీలోకి వచ్చేసింది. వచ్చిన మరుక్షణం నుంచే ఓటీటీ సర్వర్ క్రాష్ అయిందని, అలానే గడిచిన 24 గంటల నుంచి తమ దేశంలో నం.1 ట్రెండింగ్‌లో ఉందని పాక్ ఇన్ఫ్లూయెన్సర్ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.'ధురంధర్ 2 పాకిస్తాన్లో ఇప్పుడే రిలీజైంది. సర్వర్స్ క్రాష్ అయ్యాయి. పాకిస్థానీలు అర్థరాత్రి ఎప్పుడవుతుందా? నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడొస్తుందా అని చూశారు. రాగానే క్లిక్ చేశారు. అందుకే మూవీ ప్లే కావడానికి టైమ్ పడుతోంది. అంతలా క్రేజ్ సంపాదించుకుంది. అయితే సినిమాలో చూపించింది నిజమా అబద్దమా అనేది వేరే విషయం. కానీ పాకిస్థానీలు మాత్రం మూవీ ఎలా తీసుంటారా అని చూసేందుకు ఎగబడుతున్నారు. రణ్వీర్ సింగ్ పాత్ర ఏంటనేది అందరికీ తెలుసు. లయరీలో అలా జరిగింది లేదా అనేది తర్వాత మాట్లాడుదాం' అని సదరు ఇన్ఫ్లూయెన్సర్ చెప్పుకొచ్చాడు.'ధురంధర్' రెండు భాగాలుగా రిలీజైంది. తొలి పార్ట్ గతేడాది డిసెంబరులో, సీక్వెల్ ఈ ఏడాది మార్చిలో థియేటర్లలోక వచ్చింది. మొత్తంగా రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. జస్కీరాత్ సింగ్ అనే వ్యక్తి.. హంజా అలీ మజారీ అనే మారుపేరుతో పాకిస్తాన్లోకి గూఢచారిగా వెళ్లి.. అక్కడ మాఫియాని, భారత్‌కి చేటు చేసిన పలువురు ఉగ్రవాదుల్ని ఎలా అంతం చేశాడనే స్టోరీతో ఈ సినిమా తీశారు. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్, సారా అర్జున్ కీలక పాత్రలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకుడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా) View this post on Instagram A post shared by maviya umer farooqui (@kaam_wali_baat) View this post on Instagram A post shared by maviya umer farooqui (@kaam_wali_baat) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా తిమ్మరాజుపల్లి టీవీ, తెరచాప, బ్యాడ్ బాయ్ కార్తీక్, మిస్టర్ ఎక్స్, కాళిదాస్ 2, కర్తవ్య లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్‌తో పాటు ఎగ్జామ్ లాంటి డబ్బింగ్ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చింది. 'ధురంధర్ 2' అయితే విదేశాల్లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇప్పుడు వీటికి తోడుగా మరో తెలుగు చిత్రం కూడా వచ్చేసింది.(ఇదీ చదవండి: అర్ధరాత్రి నడిరోడ్డుపై దీన స్థితిలో పావలా శ్యామల)వజ్రయోగి, శ్రేయ భర్తీ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'Cమంతం'. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. సుధాకర్ పాణి దర్శకత్వం వహించాడు. గతేడాది నవంబరు 14న థియేటర్లలోకి వచ్చింది. కానీ స్టార్స్ లేకపోవడం స్టోరీ అంతంత మాత్రంగా ఉండేసరికి ఆడియెన్స్ దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం తాజాగా రెంట్ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'Cమంతం' విషయానికొస్తే.. నగరంలో గర్భిణులని వరుసగా హత్య చేస్తుంటారు. ఈ దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? అనే విషయాలు పోలీసులకు కూడా అంతుచిక్కవు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ డిటెక్టివ్‌గా ఉన్న హీరో (వజ్రయోగి) ఈ కేసును ఎలా టేకప్ చేశాడు? అసలు హంతకుడు ఎవరు? వారి వెనుక ఉన్న ఫ్లాష్‌బ్యాక్ ఏమిటనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రవిని వదిలేస్తున్నా.. ట్రోలింగ్ తట్టుకోలేక హీరోతో సింగర్ బ్రేకప్!) -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'ధురంధర్ 2'.. అధికారిక ప్రకటన
'ధురంధర్ 2' సినిమా మన దేశంలో ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందనే విషయంపై సస్పెన్స్ వీడింది. ఎందుకంటే నేటి(మే 15) నుంచి విదేశాల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. దీంతో పాటే మన దగ్గర కూడా అందుబాటులోకి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని హాట్‌స్టార్ తేల్చి చెప్పింది. అధికారిక స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా)గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైన తొలి పార్ట్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఈ ఏడాది మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన సీక్వెల్‌ని తాజాగా విదేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. మన దేశంలో మాత్రం వచ్చే నెల 4వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న దృష్ట్యా ఓటీటీ రిలీజ్ చేస్తే రెండింటి వ్యూస్‌పై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. అందుకే ఈ లీగ్ పూర్తయిన తర్వాత స్ట్రీమింగ్ చేయాలని ఫిక్సయ్యారు. అలా జూన్ 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారు. 5వ తేదీ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.'ధురంధర్ 2' విషయానికొస్తే.. ఆపరేషన్ 'ధురంధర్'లో భాగంగా జస్కిరాత్ సింగ్(రణ్వీర్ సింగ్) తన పేరుని హమ్జా అలీ మజారీగా మార్చుకుని పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడి లయరీ నగరంలో బలోచ్ నాయకుడు రెహమాన్ డెకాయిట్(అక్షయ్ ఖన్నా)ని చంపేస్తాడు. ఇదే టైంలో మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) తనని తాను లయరీకి కింగ్‌గా ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసిన ఉజెయిర్ బలోచ్ (డానిష్) అతడిపై ఎలా పగతీర్చుకున్నాడు? ఈ క్రమంలో హమ్జా ఎలాంటి ప్లాన్స్ వేశాడు? ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్) నుంచి హమ్జాకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? హమ్జా భారత గూఢచారి అని మిగతా వాళ్లకు తెలిసిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే)Aandhi banke jo aa raha hai usse DHURANDHAR kehte hain.🔥Watch Dhurandhar The Revenge, Raw & Undekha. Grand Digital Premiere on June 4th at 7 PM, starts streaming from June 5th only on JioHotstar.#Dhurandhar2OnJioHotstar #DhurandharTheRevenge #RawAndUndekha@RanveerOfficial… pic.twitter.com/w73rLgM06F— JioHotstar (@JioHotstar) May 15, 2026 -
ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. అది మాత్రం సస్పెన్స్
పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమా 'ధురంధర్ 2' ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది కానీ ఇక్కడే ఓ ట్విస్ట్. ఇంకా ఓ విషయంలో సస్పెన్స్ మాత్రం పోవట్లేదు. ఆడియెన్స్ ఏమో ఎదురుచూస్తున్నారు. కానీ ఓటీటీ సంస్థ మాత్రం షాక్ ఇచ్చింది. ఇంతకీ 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ సంగతేంటి? తెలుగు వెర్షన్ ఎందులోకి వచ్చింది?గతేడాది డిసెంబరులో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించిన మూవీ 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.1300 కోట్ల మేర వసూళ్లు సాధించింది. మూడు నెలలు తిరిగేసరికల్లా అంటే ఈ ఏడాది మార్చి 19న రెండో భాగాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఈసారి తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. సీక్వెల్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.(ఇదీ చదవండి: టాలీవుడ్లో 'గొడవ'.. చేయిదాటిపోయిన పరిస్థితి)అయితే తొలి భాగాన్ని థియేటర్లలోకి వచ్చిన రెండు నెలల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. సీక్వెల్ కూడా ఇదే ఓటీటీలో వస్తుందని అంతా అనుకున్నారు కానీ డిజిటల్ హక్కుల్ని మన దేశం వరకు హాట్‌స్టార్ దక్కించుకుంది. విదేశాల వరకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజాగా గురువారం సాయంత్రం నుంచి అమెరికా, న్యూజిలాండ్, మలేసియాతో పాటు ఇతర దేశాల్లో 'ధురంధర్ 2' స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. కానీ మన దగ్గర మాత్రం ఎప్పుడొస్తుందనే సస్పెన్స్ ఇంకా తీరలేదు. మరి ఇప్పుడు రిలీజ్ చేస్తారా? వచ్చే వారం స్ట్రీమింగ్ చేస్తారా అనేది చూడాలి?'ధురంధర్ 2' విషయానికొస్తే.. ఆపరేషన్ 'ధురంధర్'లో భాగంగా జస్కిరాత్ సింగ్(రణ్వీర్ సింగ్) తన పేరుని హమ్జా అలీ మజారీగా మార్చుకుని పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడి లయరీ నగరంలో బలోచ్ నాయకుడు రెహమాన్ డెకాయిట్(అక్షయ్ ఖన్నా)ని చంపేస్తాడు. ఇదే టైంలో మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) తనని తాను లయరీకి కింగ్‌గా ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసిన ఉజెయిర్ బలోచ్ (డానిష్) అతడిపై ఎలా పగతీర్చుకున్నాడు? ఈ క్రమంలో హమ్జా ఎలాంటి ప్లాన్స్ వేశాడు? ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్) నుంచి హమ్జాకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? హమ్జా భారత గూఢచారి అని మిగతా వాళ్లకు తెలిసిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా) -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
తెలుగులో చాలామంది హీరోలున్నారు. అందులో నాగశౌర్య. సహాయ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి హీరోగా పలు సినిమాలు చేసిన ఇతడు.. 'ఛలో' లాంటి మూవీస్ చేశాడు. అయితే గత కొన్నేళ్లుగా ఇతడికి సరైన హిట్ అనేది లేకుండా పోయింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఓ సినిమా చేశారు. అదిప్పుడు ఎలాంటి చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా)ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, జో అచ్యుతానంద, ఛలో, ఓ బేబీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న నాగశౌర్య.. 2023లో 'రంగబలి' చేశాడు. దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు గానీ ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో అప్పటి నుంచి మరో ప్రాజెక్ట్ చేయలేదు. ఈ మూడేళ్లలో 'బ్యాడ్ బాయ్ కార్తీక్' చిత్రం చేయగా గత నెల 17న థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆటకే తేలిపోయింది. అసలు ఇదొచ్చిన సంగతి కూడా ఎవరికీ తెలియనంతగా మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది.'బ్యాడ్ బాయ్ కార్తీక్' విషయానికొస్తే.. కార్తీక్(నాగశౌర్య) వైజాగ్‌లో ఉంటాడు. అక్క కస్తూరి(శ్రీదేవి విజయ్ కుమార్) అంటే ప్రాణం. ఆమె ఓ లాయర్. రాయలసీమలోని కదిరిలో భూకబ్జాలు చేసే గోవిందప్పు(మైమ్ గోపీ), వరదారెడ్డి (సముద్రఖని)లపై న్యాయపోరాటం చేస్తుంటుంది. దీంతో ఈమెపై దాడి జరుగుతుంది. ఆ విషయం తెలిసి వైజాగ్ నుంచి రాయలసీమకు కార్తీక్ వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది? తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకునే అక్క.. అతడిపైనే ఎందుకు కోప్పడింది? ఒకప్పుడు సఖ్యతగా ఉన్న గోవిందప్ప, వరదారెడ్డి మధ్య ఎందుకు వైరం ఏర్పడింది? గోవిందప్పను చంపింది ఎవరు? వరదారెడ్డిని చంపింది ఎవరు? మధ్యలో హీరో ప్రేమకథ ఏంటనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీకి దురంధర్-2.. ఫ్రైడే ఒక్క రోజే 16 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి షరామామూలే. ఈ వారంలో కోలీవుడ్ హీరో కరుప్పు ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు అరేయ్ ఆపండ్రా, హరుడు, శివం శైవం అనే తెలుగు మూవీస్ విడుదలవుతున్నాయి. కానీ వీటిపై పెద్దగా బజ్ లేదు. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.ఇక ఈ ఫ్రైడే ఓటీటీల విషయానికొస్తే దురంధర్-2పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ సినిమా మే 15 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్(ఓవర్సీస్ ఆడియన్స్‌కు మాత్రమే) కానుంది. దీంతో పాటు తిమ్మరాజుపల్లి టీవీ, తెరచార లాంటి టాలీవుడ్ సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా కర్తవ్య లాంటి డబ్బింగ్ సినిమా, పలు డబ్బింగ్ సిరీస్‌లు రెడీ అయిపోయాయి. ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ధురంధర్ 2 (హిందీ సినిమా) - మే 15 (ఓవర్సీస్ రిలీజ్)కర్తవ్య (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ఎర్మిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15ఇట్స్ నాట్ లైక్ దట్(హాలీవుడ్ సిరీస్)- మే 15ది వండర్ ఫూల్స్(కొరియన్ సిరీస్)- మే 15ది క్రాష్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 15అమెజాన్ ప్రైమ్ఎగ్జామ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 15డ్రైవర్స్ ఈద్(హాలీవుడ్ సినిమా)- మే 15జియో హాట్‌స్టార్ ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 15ఆహా తిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు సినిమా) - మే 15సన్ నెక్ట్స్..తెరచాప(తెలుగు సినిమా)- మే 15జీ5..టిఘీ (మరాఠీ మూవీ) - మే 15మనోరమ మ్యాక్స్..కప్(మలయాళ సినిమా)- మే15లయన్స్ గేట్ ప్లే..కౌచర్(హాలీవుడ్ మూవీ)- మే 15హులు..రివల్స్(హాలీవుడ్ సినిమా)- మే 15ముబీ..ది మిస్టిరీయస్ గేజ్ ఆఫ్ ది ఫ్లైమింగో(హాలీవుడ్ సినిమా)- మే 15 -
ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో ధురంధర్ 2, మిస్టర్ ఎక్స్, తిమ్మరాజుపల్లి టీవీ, కాళిదాస్ 2, కర్తవ్య తదితర చిత్రాలతో పాటు ఎగ్జామ్ అనే డబ్బింగ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడీ ఈ లిస్టులోకి ఓ తెలుగు సినిమా కూడా చేరింది. ఇంతకీ అదేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్)నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'తెరచాప'. గత నెల 17న థియేటర్లలోకి వచ్చింది. కానీ స్టార్స్ ఎవరూ లేకపోవడంతో జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ మూవీ శుక్రవారం (మే 15) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.'తెరచాప' విషయానికొస్తే.. ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న కాశీబాబు (నాగ మహేష్) ఓ ప్రమాదంలో చనిపోతాడు. ఇతడి మరణానికి ఆయన కొడుకు ఈశ్వర్ (నవీన్ రాజ్ శంకరపు) నిర్లక్ష్యమే కారణమని ఊరు మొత్తం వేలెత్తి చూపుతుంది. తన తండ్రిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే ఈశ్వర్, ఆ నింద భరించలేకపోతాడు. తన తండ్రి మరణం వెనుక ఏదో పెద్ద వ్యవహారమే ఉందని అనుమానించి అసలు నిజం తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతనికి సీత (శ్రీలు), గాయత్రి (పూజా సుహాసిని) ఎలా సహాయపడ్డారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ) -
నెల రోజుల్లోపే ఓటీటీకి పాన్ ఇండియా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ హీరో ఆర్య నటించిన లేటేస్ట్ పాన్ ఇండియా మూవీ మిస్టర్ ఎక్స్. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 17న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 1965లో భారత్ - చైనా బోర్డర్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే బుల్లితెరపై సందడి చేయనుంది. జియో హాట్‌స్టార్ వేదికగా ఈనెల 14 నుంచే మిస్టర్ ఎక్స్ స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఓవర్సీస్ అభిమానులకు సింప్లీ సౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ మూవీలో గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్ ,నటి మంజు వారియర్, అనకా, అతుల్య రవి, రైసా విల్సన్, ఖాళీ వెంకట్ ముఖ్యపాత్రల్లో నటించారు.మిస్టర్ ఎక్స్ కథేంటంటే..1965లో భారత సైనికులు చైనాను ఎదుర్కొనడానికి హిమాలయాల్లో ఉన్న నందాదేవి అనే కొండపైకి ఏడు బ్లుటోనియం క్యాప్షల్స్‌ను తీసుకెళ్తారని అయితే అవి అనుహ్యంగా కనిపించకుండా పోవడంతో ఎదురైన సమస్యలు ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించారు. దాదాపు 60 ఏళ్లకు పైగా వాటి గురించి పరిశోధనలు జరిపినప్పటికీ ఎలాంటి ఆచూకీ కనిపించలేదు. అలాంటి న్యూక్లియర్ క్యాప్సిల్స్ నేపథ్యంలో సాగే కథే మిస్టర్ ఎక్స్. ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
ఓటీటీలోకి వచ్చిన తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మిగతా భాషల్లోనూ మూవీస్ కూడా తెలుగు డబ్బింగ్ రూపంలో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఒకటి సైలెంట్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ దాని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'ప్రేమిస్తే' సినిమాతో గతంలో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న భరత్.. తర్వాత కాలంలో ఎక్కువగా తమిళంలోనే మూవీస్ చేస్తున్నాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కాళిదాస్ 2'. గత నెల 3వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడుది అమెజాన్ ప్రైమ్, లయగ్స్ గేట్ ప్లే, టెంట్ కొట్ట, ఆహ తమిళ, సన్ నెక్స్ట్, షార్ట్ ఫ్లిక్స్ ఇండియా ఓటీటీల్లో ఒకేసారి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.లయన్స్ గేట్ ప్లేలో తెలుగు వెర్షన్స్ ఉచితంగా స్ట్రీమింగ్ అవుతుండగా.. అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం అద్దె విధానంలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే 2019లో వచ్చిన 'కాళిదాస్' చిత్రానికి ఇది సీక్వెల్. తొలి భాగం చూడకపోయినా సరే దీన్ని చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే చేశారు.'కాళిదాస్ 2' విషయానికొస్తే.. ఓ గేటెడ్ కమ్యూనిటీలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. అదే రోజు రాత్రి అక్కడే ఉన్న మిత్ర అనే నాలుగేళ్ల అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఈ కేసుని కాళిదాసు దర్యాప్తు చేస్తుంటాడు. ఓసారి గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వాళ్ల గురించి ఓ డార్క్ సీక్రెట్ కాళిదాస్‌కి తెలుస్తుంది. ఇంతకీ అదేంటి? తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు) -
ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. అంటే థియేటర్లలో రిలీజైన సినిమాలు ఒకటి రెండు నెలల్లోనే స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తున్నాయి. అలాంటి జేమ్స్ కామెరూన్ తీసిన 'అవతార్' మూడో భాగం మాత్రం ఆరు నెలల తర్వాత అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'టైటానిక్' లాంటి మూవీ తీసిన జేమ్స్ కామెరూన్.. లాంగ్ గ్యాప్ తీసుకుని 2009లో 'అవతార్' అనే సినిమా తీశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. రూ.14-15 వేల కోట్ల వసూళ్లు రాగా.. 2022లో రిలీజైన పార్ట్ 2 కూడా రూ.18 వేల పైచిలుకు కలెక్షన్స్ సాధించింది. గతేడాది డిసెంబరులో మూడో పార్ట్ (అవతార్: ఫైర్ అండ్ యష్) రిలీజ్ కాగా దీనికి ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే వచ్చింది.మూడో పార్ట్ కూడా వేలకోట్లు కలెక్షన్స్ సాధించినప్పటికీ ఓటీటీలోకి మాత్రం త్వరగా తీసుకురాలేదు. మార్చి 31న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇంగ్లీష్ వెర్షన్ వచ్చినప్పటికీ అద్దె విధానంలోనే స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు జూన్ 24 నుంచి హాట్స్టార్లోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.'అవతార్: ఫైర్ అండ్ యాష్' విషయానికొస్తే.. రెండో పార్ట్ 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' సంఘటనల తర్వాత జేక్ సల్లీ (శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్దానా) జంట తమ పెద్ద కొడుకు కోల్పోయిన బాధలో ఉంటారు. పిల్లలతో కలిసి జీవిస్తుంటారు. తన వల్లే సోదరుడు చనిపోయాడనే అపరాధ భావంతో జేక్ కొడుకు లోక్ ఉంటాడు. రెండో భాగంలో చనిపోయిన కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్).. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ వచ్చి జేక్‌పై ప్రతీకారానికి సిద్ధమవుతాడు. ఈసారి కల్నల్‌కి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) తోడవుతుంది. వీళ్లకు ఆర్డీఏ బృందం కూడా తోడవుతుంది. మరి ఇంతమంది శత్రువుల్ని జేక్ కుటుంబం ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్) -
ఓటీటీలో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్
ఒకప్పుడు తెలుగు, తమిళంలో హీరోయిన్గా సినిమాలు చేసిన జ్యోతిక.. రీసెంట్ టైంలో బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. హిందీలోనూ అడపాదడపా మూవీస్ చేస్తోంది. ఈమె నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'సిస్టమ్' పేరుతో తీసిన సినిమాలో జ్యోతిక, సోనాక్షి సిన్హా, అశుతోష్ గోవారికర్ ప్రధాన పాత్రలు పోషించారు. అశ్విని తివారీ దర్శకురాలు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చే శుక్రవారం(మే 22) నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.రిలీజ్ చేసిన ట్రైలర్ బట్టి చూస్తే కోర్టులో న్యాయవాదిగా పనిచేసే లాయర్ సోనాక్షి.. న్యాయాన్ని గెలిపించకుండా డబ్బులు తీసుకుని కేసుల్ని తారుమారు చేసే పనిచేస్తుంటుంది. దీనికి జ్యోతిక కూడా సహకరిస్తూ ఉంటుంది. అలాంటి వీళ్ల జీవితాల్లో తర్వాత ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి. వ్యవస్థ ఏం చేసింది? అనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది. (ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్) -
విజయ్ సీఎం.. జన నాయగన్‌కు ఫుల్ డిమాండ్..!
రాజకీయాల్లో ఎంట్రీకి ముందు దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ సెన్సార్ సమస్యలతో రిలీజ్ కాలేదు. ప్రస్తుతం విజయ్ తమిళనాడు సీఎం కావడంతో ఈ సినిమా త్వరలోనే విడుదల అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్టబొమ్మ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ డీల్ గతంలో రద్దైనట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా జన నాయగన్ డీల్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ నిర్మాతలను సంప్రదించినట్లు లేటేస్ట్ టాక్. ఓటీటీ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో చర్చలు జరుపుతోందని కోలీవుడ్‌లో టాక్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ డీల్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. -
ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా సినిమాలకు డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఓటీటీల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల స్ట్రీమింగ్కు వచ్చిన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.గత నెల 23న థియేటర్లలో విడుదలైన మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ మధువిదు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఖరారైంది. ఈ నెల 22 నుంచే సోనిలివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. మధువిధు అంటే హనీమూన్ అని అర్థం కాగా.. ఈ సినిమాకు విష్ణు అరవింద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షరఫ్, కల్యాణీ పాణిక్కర్ జంటగా నటించారు. The wedding is locked.So is the chaos.Be there to witness it all unfold on May 22nd. 💥💍#Madhuvidhu streaming from May 22 only on Sony LIV#SonyLIV #SonyLIVSouth #SonyLIVMalayalam#Sharafudheen #KalyaniPanicker pic.twitter.com/p3XaU1QHPN— Sony LIV Malayalam (@SonylivMal) May 11, 2026 -
బిగ్ బాస్ మనీషా రాణి డ్రీమ్ హౌస్ : ధర తెలిస్తే ఫిదానే
బిగ్ బాస్ ఫేమ్ మనీషా రాణి ముంబైలోని లగ్జరీ హౌస్ నెట్టింట సందడిగా మారింది. భారీ వార్డ్రోబ్తో కూడిన గ్లామ్ రూం , విశాలమైన బాల్కనీతో ఉండే మనీషా రాణి "డ్రీమ్ హౌస్" విశేషాలపై ఫ్యాన్స్ అబ్బురపడుతున్నారు. మే 1వ తేదీన మనీషా రాణి తన కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సహా తన ప్రియమైన వారి సమక్షంలో, సాంప్రదాయ దుస్తుల్లో పూజ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను ఇనష్టాలో షేర్ చేశారు. పదండి ఆ వివరాలేంటో తెలుసు కుందాం.బిగ్ బాస్ OTT 2లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన మనీషా రాణి తన చలాకీతనం, మాట్లాడే శైలితో బాగా పాపులర్ అయింది. ఆమెకు ఇన్‌స్టా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లున్నారు. ఝలక్ దిఖ్లా జా 11 విజేతగా గుర్తింపు పొందిన మనీషా రాణి, ముంబైలో తన కలల ఇల్లును కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు రూ. 5 కోట్లు.ఇంటీరియర్, డిజైన్ఈ ఇల్లు ఆధునిక శైలిలో, విశాలమైన గదులతో ఉంటుంది. గోడలకు పాస్టెల్ రంగులు (Muted tones) ఉపయోగించారు, అక్కడక్కడా వైబ్రెంట్ రంగులతో ఇంటికి కొత్త లుక్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది.లివింగ్ రూమ్ చాలా విశాలంగా, వెలుతురు వచ్చేలా ఉంటుంది. స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా సౌకర్య వంతంగా కూడా ఉంటుంది. ఈ గది ఆధునిక ఇంటీరియర్ డిజైన్లు,ట్రెండీ లైటింగ్ , గాలి ధారాళంగా వచ్చేలా క్రాస్-వెంటిలేషన్ సౌకర్యం ఉంది.వార్డ్ రోబ్ అది పెద్ద కిచెన్ దీని మరో ప్రత్యేకత. ప్యారలల్ లేఅవుట్‌తో మార్బుల్ ఫినిషింగ్ కౌంటర్లు , స్టైలిష్ క్యాబినెట్లతో వంటగదిని చాలా అందంగా తీర్చిదిద్దారు. అంతేకాదు తన దుస్తుల కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద వార్డ్రోబ్తో కూడిన గ్లామ్ రూమ్‌ను సిద్ధం చేసుకోవడం విశేషం. అందంగా, స్టైల్‌గా డిజైన్ చేయబడిన ఈ విశాలమైన వార్డ్‌రోబ్‌లో, బట్టలు, బూట్లు, యాక్సెసరీల కోసం చక్కగా అమర్చిన అరలు, చక్కటి స్టోరేజ్ ప్లేస్, విలాసవంతమైన ఏర్పాటు ఉన్నాయి. ఇది ఫ్యాషన్‌పై ఆమెకున్న ప్రేమను సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది అంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. ముంబై నగరాన్ని వీక్షించేలా పెద్ద బాల్కనీ, దానికి ఫ్లోర్-టు-సీలింగ్ కిటికీలు ఉండటంతో ఇల్లు మరింత లగ్జరీగా కనిపిస్తుంది ఫైనల్లీ తన కలనెరవేరింది అంటూ తన ఇంటిగృహప్రవేశ ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్ కోసం షేర్ చేసిందీ ఈ బీహారీ చిన్నది. ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను View this post on Instagram A post shared by Manisha Rani (@manisharani002) -
ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఐపీఎల్, వేసవి ఎండలు మండిపోతున్న కారణంగా జనాలు బయట తిరగట్లేదు. చెప్పుకోదగ్గ మూవీస్ లేకపోవడంతో థియేటర్లకు కూడా వెళ్లట్లేదు. ఇకపోతే ఈ వారం సూర్య హీరోగా నటించిన 'వీరభద్రుడు' అనే డబ్బింగ్ చిత్రం థియేటర్లలోకి రాబోతుంది. అరేయ్ ఆపండ్రా, హరుడు, శివం శైవం అనే తెలుగు మూవీస్ కూడా ఉన్నాయి కానీ వీటిపై ఏ మాత్రం బజ్ లేదు.(ఇదీ చదవండి: విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్)మరోవైపు ఓటీటీల్లో 14 సినిమాలు-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. నంబర్ తక్కువగానే ఉన్నప్పటికీ వీటిలో చూడదగ్గవి కొన్ని ఉన్నాయి. ధురంధర్ 2 మూవీ ఈ వీకెండే విదేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది గానీ మన దేశంలోనే ఈ వారం వస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. 'కర్తవ్య', 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్రాలతో పాటు 'ఎగ్జామ్' అనే డబ్బింగ్ సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మే 11 నుంచి 17 వరకు)నెట్ఫ్లిక్స్ఒరు దురోహ సహచర్యతిళ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 13నెమిసిస్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 14సోల్‌మేట్ (జపనీస్ సిరీస్) - మే 14ధురంధర్ 2 (హిందీ సినిమా) - మే 15 (ఓవర్సీస్ రిలీజ్)కర్తవ్య (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ఎర్మిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15అమెజాన్ ప్రైమ్ఆఫ్ క్యాంపస్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 13ఎగ్జామ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 15హాట్స్టార్ద పనిషర్: వన్ లాస్ట్ కిల్ (ఇంగ్లీష్ సినిమా) - మే 12తుఖ్రా కా మేరే ప్యార్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 12ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 15ఆహాతిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు సినిమా) - మే 15సన్ నెక్స్ట్కాళిదాస్ 2 (తమిళ చిత్రం) - మే 12జీ5టిఘీ (మరాఠీ మూవీ) - మే 15(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి) -
ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ కామెడీ సినిమా
మెగాడాటర్ నిహారిక నిర్మించిన హారర్ కామెడీ సినిమా 'రాకాస'. గత నెలలో థియేటర్లలో రిలీజై ఆకట్టుకుంది. రీసెంట్గా ఓటీటీలోకి కూడా వచ్చి అందులోనూ దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ఛార్ట్‌లో టాప్ 7కి చేరుకుంది. 1.2 మిలియన్ వ్యూస్‌తో ఏడో స్థానంలో ట్రెండ్ అవుతోందని సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి)ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో 'రాకాస' పలు అంతర్జాతీయ చిత్రాల సరసన నిలిచింది. థియేటర్లలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కంటే డిజిటల్ స్ట్రీమింగ్‌లో మరింత ఆదరణ లభిస్తోందని ఈ లెక్కలే చెబుతున్నాయి.సంగీత్ శోభన్ –గెటప్ శ్రీను ట్రాక్, వెన్నెల కిషోర్ నటన ఈ సినిమాను పదేపదే చూసేలా చేయడంలో ఎంతగానో దోహదపడ్డాయి. పిల్లలకు ఈ చిత్రంలోని ఫాంటసీ నచ్చితే.. పెద్ద వాళ్లకి కామెడీ, ఎంటర్టైన్మెంట్ నచ్చాయి. అలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని 'రాకాస' ఆకట్టుకోవడంతో ఓటీటీలోనూ దుమ్ములేపేస్తోంది. ఈ మూవీ మానస శర్మ దర్శకురాలు కాగా సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. (ఇదీ చదవండి: విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్) -
'మనీ హీస్ట్' ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే న్యూస్
ఓటీటీల్లో కంటెంట్‌ని రెగ్యులర్‌గా చూసేవాళ్లకు 'మనీ హీస్ట్' సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదు సీజన్ల ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. చివరిదైన ఐదో సీజన్ వచ్చి ఐదేళ్లు గడిచిపోయింది. దీని తర్వాత 'బెర్లిన్' పాత్ర ఆధారంగా సిరీస్ వచ్చింది. ఇప్పుడు 'మనీ హీస్ట్' ఫ్యాన్స్ కోసం అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)2021లో ఐదో సీజన్‌తో ఈ సిరీస్‌ని ముగించినప్పటికీ.. ఈ ఫ్రాంచైజీని మరింత విస్తరించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త టీజర్ రిలీజ్ చేసింది. మనీ హీస్ట్ ప్రపంచం కొనసాగనుంది అనే పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆరో సీజన్ మొదలుపెడతారా అని మీలో చాలామంది అనుకోవచ్చు. కానీ ఈ సిరీస్‌లోని ఫ్రొఫెసర్ లేదా ఇతర పాత్రల్ని తీసుకుని కొత్తగా సిరీస్ మొదలుపెట్టొచ్చేమో అనిపిస్తుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అప్పటివరకు ఎదురుచూడటమే.(ఇదీ చదవండి: చిరుని కలిసిన మలయాళ డైరెక్టర్.. రీమేక్‌పై క్లారిటీ) -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. తెలుగులోనూ
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. సినిమా బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా చూసేస్తుంటారు. అందుకు తగ్గట్లే ప్రతివారం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ మూవీస్ వరకు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలా ప్రపంచవ్యాప్తంగా రూ.3500 కోట్లు సొంతం చేసుకున్న ఓ హిట్ మూవీ.. సైలెంట్‌గా డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ)మార్చిలో దేశవ్యాప్తంగా 'ధురంధర్ 2' హవా నడిచింది. ఇదొచ్చిన వారానికి రిలీజైన హాలీవుడ్ మూవీనే 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ'. అంతరిక్ష నేపథ్యంగా సాగే సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ రిలీజైన ఈ చిత్రం.. నగరాల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. చూసిన చాలామంది మెచ్చుకున్నారు. ఇప్పుడీ చిత్రం నెలన్నర తర్వాత యూట్యూబ్ మూవీస్‌లో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' విషయానికొస్తే.. రేల్యాండ్ గ్రేస్(ర్యాన్ గాస్లింగ్) అనే ఓ వ్యోమగామి ఊహించని విధంగా అంతరిక్ష నౌకలో మేల్కొంటాడు. అసలు స్పేస్‌లోకి ఎందుకెళ్లాడు? ఇతడితో పాటు అంతరిక్ష నౌకలో ఉన్న మిగతా ఇద్దరూ ఎందుకు చనిపోయారు? తన తెలివితేటలు ఉపయోగించి, ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించాడు? ఈ క్రమంలోనే ఓ ఏలియన్‌తో ఎలా స్నేహం కుదిరిందనేది మిగతా స్టోరీ.అంతరిక్ష నేపథ్య సినిమాలు ఇష్టముంటే మాత్రం దీన్ని కచ్చితంగా మిస్ అవ్వొద్దు. ప్రస్తుతానికి యూట్యూబ్‌లోకి రెంట్ విధానంలో వచ్చింది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ తదితర ఓటీటీల్లోకి కూడా రావొచ్చు.(ఇదీ చదవండి: రేంజ్ రోవర్ గిఫ్ట్.. ప్రభాస్‌లా ఎవరూ చేయరు : ‘బుజ్జిగాడు’ నటి) -
ఓటీటీలో మలయాళ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
ఓటీటీల్లోకి కొత్త మలయాళ సినిమాలు ఎప్పుడొస్తాయా అని తెలుగు ఆడియెన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లే ప్రతివారం డబ్బింగ్ రూపంలో పలు మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. ఈ వీకెండ్ అలా వచ్చిన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'భరతనాట్యం 2 మోహినియాట్టం'. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)కథేంటి?శశి(సైజు కురుప్) తండ్రి భరతన్(సాయి కుమార్) చనిపోవడం దగ్గర 'భరతనాట్యం' తొలి భాగం ఆగింది. అక్కడి నుంచి ఈ సీక్వెల్ మొదలైంది. శశి తన కుటుంబంతో కలిసి సవతి తల్లి రుక్మిణిని సొంతూరులో దిగబెట్టేందుకు వస్తాడు. ఓ వారం రోజుల పాటు వీళ్లంతా ఆ ఊరిలోనే ఉండాల్సి వస్తుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఓ వ్యక్తి చనిపోవడానికి శశి కుటుంబం కారణమవుతుంది. మరి ఈ హత్య నుంచి శశి ఫ్యామిలీ బయటపడిందా? లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?'భరతనాట్యం 2 మోహినియాట్టం'.. ఈ పేరు చూసి ఇదేదో డ్యాన్స్‌కి సంబంధించిన సినిమా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇదో డార్క్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. మీరు 'దృశ్యం' చూసే ఉంటారుగా. ఇది దాని స్ఫూప్లా అనిపిస్తుంది. కాకపోతే అది పూర్తి సీరియస్. ఇందులో మాత్రం సరదాగా సాగిపోయే కామెడీతో బాగా నవ్వించారు.2024లో రిలీజైన 'భరతనాట్యం' ఓ ఫ్యామిలీ డ్రామా. థియేటర్లలో రిలీజైనప్పుడు ఫ్లాప్ అయింది. ఓటీటీలోనూ ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. అయినా సరే లీడ్ రోల్ చేసిన సైజు కురుప్ నిర్మాతల్లో ఒకడు కావడంతో సీక్వెల్ తీశారు. గత నెలలో రిలీజ్ చేశారు. రూ.5 కోట్లు పెట్టి తీస్తే రూ.50 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అలా అని ఇదేదో కొత్త స్టోరీ అంటే కాదు. తెలుగు క్రైమ్ మూవీస్‌లో కనిపించిన కథే. కాకపోతే స్క్రీన్ ప్లే, స్టోరీని డీల్ చేసిన విధానం, సిట్యుయేషనల్ కామెడీ వర్కౌట్ అయ్యాయి.సినిమా ప్రారంభంలో మొదటి పార్ట్‌లో ఏం జరిగిందో సింపుల్‌గా చూపించేశారు. కట్ చేస్తే ప్రస్తుతానికి వస్తాం. శశి ఫ్యామిలీ వేరే ఊరికి వస్తారు. ఇక్కడ వీళ్లకు గోవింద్ అనే పెద్దమనిషి రూపంలో సమస్య ఎదురవుతుంది. అతడిని శశి కుటుంబం ఎలా డీల్ చేసిందనేది మిగతా స్టోరీ. మూవీ మొదలైన 20 నిమిషాలు బోర్ కొడుతుంది. ఎప్పుడైతే గోవింద్ పాత్ర ఎంటర్ అవుతుందో స్టోరీలో కదలిక వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత అటు థ్రిల్, ఇటు కామెడీ బాగా పండాయి. ఊహించని విధంగా క్లైమాక్స్ పడుతుంది.ఇందులో సూపర్, హిలేరియస్ కామెడీ ఉందని చెప్పాం గానీ పర్లేదు ఓ సారి చూడొచ్చనేలా ఉంది. మరి రెండో పార్ట్ చూడాలంటే తొలి పార్ట్ చూడాలా అంటే కుదిరితే చూడండి. లేకపోయినా సరే స్టోరీ దాదాపుగా అర్థమైపోతుంది. ఇలా అన్నీ ప్లస్సులేనా అంటే మైనస్సులు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ అంతా కలిసి మర్డర్ చేసినా సరే పోలీసులు పట్టుకోలేరా? అనే డౌట్స్ వస్తే మాత్రం కామెడీని ఎంజాయ్ చేయలేరు. మలయాళ చిత్రాల్లోని సాగదీత ఉండనే ఉంది.ఎవరెలా చేశారు?శశి పాత్రలో నటించిన సైజు కురుప్ సహా మిగతా నటీనటులు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వాళ్లు కారు. అయినా సరే ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాంటి సాంకేతిక అంశాలు కూడా చక్కగా కుదిరాయి. తెలుగు డబ్బింగ్ బాగుంది. పేరుకే డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ ఫ్యామిలీతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి) -
LIK Movie: 2040 డిజిటల్ లవ్ స్టోరీ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న వాటిలో ‘లైక్’ మూవీ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. ప్రేమ గుడ్డిది అనే నానుడి వినే ఉంటారు. కానీ ఇదే నానుడి పోను పోను ప్రేమ డిజిటలైజ్డ్ అని వినిపించినా ఆశ్చర్యపోనక్కరలేదు. మనిషి తన మేధస్సుతో సాంకేతికతను బానిసగా చేసుకుంటున్నాను అనుకుంటున్న ఈ సమయంలో, అదే టెక్నాలజీ తన మనిషినే బానిసని చేసుకుంటోందని తెలుసుకోలేకపోతున్నాడు. మరీ ముఖ్యంగా రేపటి తరం ఈ టెక్నాలజీకి ఇప్పటి నుండే దాసోహం అంటున్నారు. మన చుట్టూ టెక్నాలజీ ఎంత ఎదిగినా మనలో ఉండే స్వచ్ఛమైన భావన ప్రేమ. కానీ ఆ ప్రేమను కూడా టెక్నాలజీకి ముడి పెడితే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనతో వచ్చినదే ఈ ‘లైక్’ సినిమా. ఈ రోజుల్లో పొద్దున నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయేంత వరకు మనమంతా ఇప్పుడు టెక్నాలజీతోనే ఉంటున్నాం. ఆరు నుండి అరవై ఏళ్ళ వృద్ధుల వరకు ఫోన్, ట్యాబ్‌లకు పూర్తిగా అలవాటు పడిపోయారు. ఆ అలవాటు మనకి ఎంత గ్రహపాటో వినోదాత్మకంగా ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు విఘ్నేష్ శివన్. ఈ సినిమా చూడడం పూర్తయ్యాక మనం ఒక రోజైనా టెక్నాలజీకి దూరంగా ఉండాలని కొందరు పిల్లలు సైతం అనుకున్నారంటే... ఈ సినిమా ప్రభావం పిల్లల్లో కూడా ఎంతలా ఉందో ఆలోచించండి. అంతలా ఈ సినిమా కథలో ఏముందో ఓసారి చూద్దాం. ఈ సినిమా మనకు 25 ఏళ్ళ తరువాత అంటే... 2040లో జరగబోయే కథన్న మాట. అప్పటికి ఇప్పుడున్న టెక్నాలజీ మరో వంద రెట్లు ఉంటుంది. అందుకే కథ ముందుగా పచ్చదనం ప్రాంతంలోని వైభవ్ వాస్ అనే యువకుడితో ప్రారంభమవుతుంది. పచ్చదనం ప్రాంతం అంటే 2040లో జైలన్నమాట. అంటే అక్కడ ఫోన్, టీవీ ఇలాంటివి ఏవీ ఉండవు. టెక్నాలజీ పెరిగిపోయి 2040లో నేరం చేసినవాళ్ళను పచ్చదనం ప్రాంతానికి శిక్షగా పంపుతారు. వాస్ వాళ్ళ నాన్న ఈ జైలుకు అధికారి. దేశమంతా లైక్ అని ఓ యాప్ ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. ప్రేమించుకునే వాళ్ళకి, ప్రేమించాలి అని అనుకునేవాళ్ళకి ఈ యాప్ ద్వారా తమ ప్రేమ సత్తా ఏంటో తెలుస్తుంది. ఇదే యాప్‌కి బానిసైన ధీమాని వాస్ ప్రేమిస్తాడు. కానీ వాస్ ప్రేమ నిజమైనది కాదు అని ఆ యాప్ స్పష్టం చేస్తుంది. ధీమాకి తనది స్వచ్ఛమైన ప్రేమ అని, డిజిటల్ ఎమోషన్ కాదు అని వాస్ ఎలా నిరూపిస్తాడో ‘లైక్’ సినిమాలోనే చూడాలి. సినిమా మొత్తం వినోదాత్మకంగా, నేటి తరం వారికి హెచ్చరికగా, రేపటి తరం వారికి పాఠంగా ఉంటుంది. కాకపోతే కొన్ని సీన్ల దగ్గర పిల్లలను గమనిస్తూ జాగ్రత్త పడాలి. మస్ట్ వాచ్ విత్ ఫ్యామిలీ. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలోకి వచ్చేసిన యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా
టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్.. చిత్రమైన మేనరిజంతో యాటిట్యూడ్ స్టార్‌గా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 'రామ్‌నగర్ బన్నీ' అనే సినిమాతో కొన్నాళ్ల క్రితం హీరోగా పరిచయం కాగా అది ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో ఈసారి విలేజ్ రొమాంటిక్ మూవీతో ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చాడు. దీన్ని జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం ఏ మాత్రం సౌండ్ చేయకుండా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)చంద్రహాస్, మేఘనా ముఖర్జీ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. ఈ చిత్ర ప్రమోషన్లలో 'గుంజి గుంజి' అనే బూతు పాట పాడిన చంద్రహాస్.. ఓ జర్నలిస్టుతో సోషల్ మీడియా వేదికగా గొడవపడ్డాడు. దీంతో ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నాడు. అలా ఈ మూవీ వార్తల్లో నిలచింది. కానీ ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైతే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.'బరాబర్ ప్రేమిస్తా' విషయానికొస్తే.. రుద్రారం అనే ఊరిలో ధర్మాని, కర్మాని అనే రెండు కులాలు ఉంటాయి. కొన్ని దశాబ్దాలుగా వీళ్లకు పడదు. ఎప్పుడూ గొడవలే. ఇదే గ్రామానికి చెందిన చందు(చంద్రహాస్), బుజ్జమ్మ (మేఘన ముఖర్జీ) ప్రేమించుకుంటారు. బుజ్జమ్మ తండ్రి సర్పంచ్ కాగా చందు తండ్రి సర్పంచ్‌గా ఓడిపోతూ ఉంటారు. ప్రారంభంలో చందు- బుజ్జమ్మ కొట్టుకుంటారు కానీ తర్వాత ప్రేమించుకుంటారు. ఇదే ఊళ్ళో ఉంటే పెళ్లి జరగదు అని ఇద్దరూ లేచిపోయి కేరళ వెళ్తారు. మరి చందు – బుజ్జమ్మ కేరళలో పెళ్లి చేసుకుంటారా? మళ్ళీ రుద్రారంకు ఎందుకు తిరిగి వస్తారు? రెండు కులాల వాళ్ళు కలుస్తారా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఏడుగురు సీఎంలతో నటించిన ఏకైక నటి.. ఇంతకీ ఎవరీమె?) -
దురంధర్-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న దురంధర్-2 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి కావడంతో డేట్ రివీల్ చేసింది. మే 14వ తేదీ నుంచి ఓవర్సీస్లో మాత్రమే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. అయితే ఓటీటీలో అన్‌కట్ వర్షన్ ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. దాదాపు 3 గంటల 52 నిమిషాల నిడివితో దురంధర్-2 ఉండనుందని పేర్కొంది.అయితే ఇండియాలోని ప్రేక్షకులకు స్ట్రీమింగ్ తేదీ ఇంకా రాలేదు. మనదేశంలో జియో హాట్‌స్టార్ ఈ మూవీ రైట్స్ దక్కించుకుంది. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని ఓటీటీ సంస్థ ప్రకటించనుంది. తాజా సమాచారం ప్రకారం మే 15 నుంచే ఇండియాలో దురంధర్-2 స్ట్రీమింగ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం దురంధర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దురంధర్-2 కథేంటంటే?రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్‌పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
వీకెండ్ సినిమాల సందడి.. ఓటీటీల్లో ఒక్కరోజే 14 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడావుడి మామూలే. ఈ వారంలో గోదారి గట్టుపైన, సతీ లీలావతి, రేజర్, స్పిరిట్ లాంటి సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. వీటిలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి, రవిబాబు 'రేజర్' మూవీస్‌పై ప్రేక్షకుల్లో కాస్తా ఆసక్తి నెలకొంది. తెలుగు చిత్రాలతో పాటు రిషభ్ శెట్టి హీరోగా చేసిన 'ఏ ఫిల్మ్ బై గిరి' అనే డబ్బింగ్ మూవీ రిలీజ్ కానుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే పలు సినిమాలు స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి. తెలుగు హిట్ మూవీ డెకాయిట్‌తో పాటు మలయాళ బ్లాక్‌బస్టర్స్ వాలా-2, భరతనాట్యం 2 ఓటీటీలో సందడి చేయనున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు ఈ శుక్రవారం స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్భరతనాట్యం 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08మై రాయల్ నెమిసిస్(కొరియన్ మూవీ)- మే 08రిమార్కబుల్లీ బ్రైట్ క్రియేచర్స్(హాలీవుడ్ సినిమా)- మే 08అమెజాన్ ప్రైమ్ డెకాయిట్ (తెలుగు మూవీ) - మే 08 లుక్కే (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 08సతన్ ది డార్క్(తమిళ సినిమా)- మే 08నో ప్లేస్ టు బీ సింగిల్(హాలీవుడ్ సినిమా)- మే 08జియో హాట్స్టార్వాలా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08 సాంగ్ సంగ్ బ్లూ (ఇంగ్లీష్ మూవీ) - మే 08ఎమ్ఐఏ(హాలీవుడ్ సినిమా)- మే 08జీ5 లవ్ మాక్‌టైల్ 3 (కన్నడ సినిమా) - మే 08సన్ నెక్స్ట్ ఓ బటర్ ఫ్లై (తమిళ మూవీ) - మే 08 సూపర్ హిట్ (కన్నడ సినిమా) - మే 08ఆపిల్ టీవీఅన్కండీషనల్(హాలీవుడ్ మూవీ- మే 08 -
స్టార్ హీరో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించిన లేటేస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కర్తవ్య. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి పుల్కిత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో షారూఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఇవాళ ట్రైలర్ చూస్తుంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సైఫ్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్లో క్రైమ్ సీన్స్ ఈ మూవీపై ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రం మే 15 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో రసిక, సంజయ్, సౌరభ్ కీలక పాత్రల్లో నటించారు. -
ఓటీటీకి తిమ్మరాజుపల్లి టీవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అందరు కొత్తవాళ్లతో ఈ మూవీని తెరకెక్కించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ మూవీగా వచ్చిన ఈ చిత్రంలో కెమెరా అసిస్టెంట్ సాయితేజ్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్గా కనిపించింది. ఈ సినిమాతో వి మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు.తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 15 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ ఆహా అఫీషియల్‌గా వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమా థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.ఈ మూవీ కథేంటంటే..ఈ సినిమా కథ 1996 నేపథ్యంలో సాగుతుంది. కుప్పం దగ్గర్లోని తిమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన సతీష్(సాయి తేజ్).. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రతి శివరాత్రికి టీవీ, వీసీఆర్‌ని రెంట్‌కి తీసుకొచ్చి సినిమాలు వేస్తుంటాడు. ఆ ఊరికి తొలిసారి టీవీ కొని తీసుకొస్తాడు రాజప్ప(పదీప్ కొట్టె). రాజప్ప చెల్లెలు శారద(వేద జలంధర్)కు సతీష్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు ప్రేమలో ఉంటారు. అది రాజప్పకు నచ్చదు. ఓ రోజు టీవీ చూసేందుకు ఇంటికి వచ్చిన సతీష్‌తో రాజప్ప తండ్రి గొడవకు దిగుతాడు. అదికాస్త పెద్దదై.. రాజప్ప, సతీష్ తీవ్రంగా కొట్టుకుంటారు. ఆ మరుసటి రోజే.. రాజప్ప ఇంట్లో ఉన్న టీవీని ఎవరో ఎత్తుకెళ్లిపోతారు.సతీషే ఆ టీవీని దొంగతనం చేశాడంటూ రాజప్ప పంచాయితీ పెడతాడు. ఊరంతా సతీష్‌ని దొంగ అంటుంది. రెండు వారల్లో టీవీ దొంగతనం చేసినవాళ్లను కనిపెట్టి, పంచాయితీ ముందు నిలపెడతానని సతీష్ సవాల్ చేస్తాడు. అసలు ఆ టీవీని దొంగతనం చేసిందెవరు? ఎందుకు చేశారు? తనపై పడ్డ నిందను పోగొట్టుకునేందుకు సతీష్ ఏం చేశాడు? సతీష్-శారదల ప్రేమ ఏమైంది? సిద్దు(లతీష్ కీలపట్టు) వల్ల సతీష్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? టీవీ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి? చివరకు సతీష్ -శారదలు ఒకటయ్యారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. One missing TV.One blamed thief.One village waiting for the truth.#ThimmarajupalliTV premieres on May 15 only on #aha.24 Hours early acess for #ahaGold users. pic.twitter.com/DeFV7M4wnj— ahavideoin (@ahavideoIN) May 7, 2026 -
చిన్న గ్యాప్ తరువాత మళ్లీ బిజీ అవుతున్న హీరోయిన్
ఒక్కసారి నటుడైనా, నటి అయినా సక్సెస్‌ను అందుకంటే సినిమా వారిని అంత సులభంగా వదులుకోదు. అలా ఏళ్ల తరబడి ఈ రంగంలో కొనసాగుతున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి తారలలో నటి వేదిక ఒకరు. ఈ మహారాష్ట్ర భామ గత రెండు దశాబ్దాలుగా కథానాయకిగా రాణిస్తున్నారు. తమిళంలోకి 2005లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్ధానాన్ని చేరుకున్నారు. ముఖ్యంగా ఇంతకు ముందు తమిళంలో పరదేశీ, కావ్యతలైవన్, శివలింగ, బానం వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఈమె పలు చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లోనూ నటించి మెప్పించారు. పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించిన వేధికకు తమిళంలో చిన్న గ్యాప్ వచ్చింది. అయితే దాన్ని పూర్తి చేసే విధంగా మళ్లీ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మహాల్ అనే తమిళ చిత్రంతో పాటు తమిళం,తెలుగు భాషల్లో రూపొందుతున్న మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఆమె స్థానాన్ని ఇక్కడ సుస్ధిరం పరుస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఆకర్షనీయమైన అవయవ సంపద, అభినయం కలిగిన ఈ 38 ఏళ్ల భామ ఇటీవల వెబ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చారు. అర్కా మీడియా నిర్మించిన యక్షిణి అనే వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రను పోషించారు. అందులో ఈమె బోల్డ్ నటనకు గానూ హిందూస్థాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డును గెలుచుకున్నారు.. కాగా చిన్న గ్యాప్ తరువాత మళ్లీ తమిళంలో వరుసగా అవకాశాలను అందుకుంటూ బిజీ అవుతున్నట్లు సమాచారం. -
నేరుగా ఓటీటీలోకి జ్యోతిక కోర్ట్ రూమ్ సినిమా
ఒకప్పుడు తెలుగు, తమిళంలో హీరోయిన్గా సినిమాలు జ్యోతిక.. ప్రస్తుతం ఆచితూచి మూవీస్ చేస్తోంది. అలా ఈమె లీడ్ రోల్ చేసిన ఓ చిత్రం ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజయ్యేందుకు సిద్ధమైంది. కొన్నాళ్ల క్రితం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని వెల్లడిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. కోర్ట్ రూమ్ డ్రామా కాన్సెప్ట్ తీసిన ఈ సినిమా సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్‌కి ఊహించని అవకాశం?)ప్రస్తుతం ఓటీటీ సంస్థలు థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలని కొంటూనే సొంతంగానూ కొన్నింటిని నిర్మిస్తున్నాయి. అలా తీసిన ఓ చిత్రమే 'సిస్టమ్'. జ్యోతిక, సోనాక్షి సిన్హా, అశుతోష్ గోవారికర్ ప్రధాన పాత్రలు చేశారు. అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకురాలు. ఈ నెల 22 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.'న్యాయం దేవుడి లాంటిది. వెతికి పట్టుకోవడం చాలా కష్టం' అనే డైలాగ్ జ్యోతిక పాత్రతో చెప్పించారు. దీనిబట్టి చూస్తే న్యాయవ్యవస్థలో ఎలాంటి లోపాలు ఉన్నాయి? అనే వాటిని ఈ మూవీలో చూపించబోతున్నారనిపిస్తోంది. కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు సరిగా తీయాలే గానీ బాగానే వర్కౌట్ అవుతాయి. మరి 'సిస్టమ్' చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా థియేటర్లలోకి చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. ఉన్నంతలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన 'సతీ లీలావతి', రవిబాబు 'రేజర్', సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన', స్పిరిట్ అనే తెలుగు చిత్రాలతో పాటు రిషభ్ శెట్టి హీరోగా చేసిన 'ఏ ఫిల్మ్ బై గిరి' అనే డబ్బింగ్ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: విజయ్‌కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)సతీ లీలావతి: లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్కు తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ట్రైలర్ బాగానే ఉంది.రేజర్: రవిబాబు దర్శకత్వం వహించి హీరోగా నటించిన సినిమా. ఈసారి రవిబాబు రక్తపాతాన్ని నమ్ముకున్నాడు. ఫలితం ఏమవుతుందో?గోదారి గట్టుపైన: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరోహీరోయిన్లుగా నటించారు. సుభాష్ చంద్ర దర్శకుడు. విలేజీ లవ్ స్టోరీగా దీన్ని తీశారు.స్పిరిట్: రైతు దంపతులు నర్సమ్మ, వెంకటేశ్వర్లు కలిసి నిర్మించిన లేటెస్ట్ సోషల్ డ్రామా సినిమా ఇది. సీహెచ్ రవీంద్రనాథ్ దర్శకుడు.ఏ ఫిల్మ్ బై గిరి: రిషభ్ శెట్టి హీరోగా నటించిన కామెడీ సినిమా ఇది. కరణ్ అనంత్, అనిరుధ్ మహేష్ దర్శకత్వం వహించారు. ఇందర్ హీరోయిన్గా చేసింది.మరోవైపు ఓటీటీల్లో చాలా తక్కువ సినిమాలే రిలీజ్ అవుతున్నప్పటికీ అందులో చూడదగ్గవే చాలా ఉన్నాయి. అడివి శేష్ 'డెకాయిట్', ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'తో పాటు రీసెంట్ మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ 'వాలా 2'.. ఈ వీకెండ్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మే 04 నుంచి 10వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్భరతనాట్యం 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08అమెజాన్ ప్రైమ్లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 06సిటాడెల్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 06డెకాయిట్ (తెలుగు మూవీ) - మే 08లుక్కే (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 08హాట్స్టార్వాలా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08సాంగ్ సంగ్ బ్లూ (ఇంగ్లీష్ మూవీ) - మే 08జీ5లవ్ మాక్‌టైల్ 3 (కన్నడ సినిమా) - మే 08సన్ నెక్స్ట్ఓ బటర్ ఫ్లై (తమిళ మూవీ) - మే 08సూపర్ హిట్ (కన్నడ సినిమా) - మే 08(ఇదీ చదవండి: ఒకప్పుడు సల్మాన్ హీరోయిన్.. ఇప్పుడేమో టిఫిన్ సెంటర్ నడుపుతూ) -
విజయ్‌కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ ఏ మేరకు ప్రభావం చూపిస్తాడనే విషయం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇతడి చివరి సినిమాకు కష్టాలు మాత్రం తప్పట్లేదు. నాలుగు నెలల క్రితమే రిలీజ్ కావాల్సిన మూవీ.. సెన్సార్ సమస్యలతో అలా ఉండిపోయింది. కొన్నిరోజుల క్రితం లీక్ కావడం సంచలనం రేపింది. ఇప్పుడు 'జన నాయగణ్'కి మరో కష్టం వచ్చిపడింది.(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'కి నీటి కష్టాలు!)లెక్క ప్రకారం జనవరి 9న విజయ్ 'జన నాయగణ్' సినిమాని థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో రెండు మూడు వారాలు ఆలస్యంగా తీసుకొస్తారులే అని అంతా భావించారు. కానీ నెలలు గడుస్తున్నా రాకపోవడంతో సగటు ప్రేక్షకుడి ఈ మూవీపై ఆసక్తి సన్నగిల్లుతూ వస్తోంది. మరోవైపు ఈ చిత్ర డిజిటల్ హక్కులు కొన్న అమెజాన్ ప్రైమ్‌కి కూడా ఆసక్తి పోయినట్లు ఉంది. అందుకే రూ.120 కోట్ల డీల్ నుంచి తప్పుకొన్నట్లు వార్తలొస్తున్నాయి.అమెజాన్ సంస్థ తప్పుకోవడంతో రేసులోకి వచ్చిన జీ5 సంస్థ.. రూ.50 కోట్ల ఆఫర్ చేసిందట. ఒకవేళ దీనికి టీమ్ ఒప్పుకొంటే రూ.70 కోట్ల నష్టానికి అమ్ముకున్నట్లే అవుతుంది. చూస్తుంటే ఇదే జరిగేలా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ లీకై, థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని మూవీ విషయంలో అమెజాన్ రిస్క్ చేయలేకపోతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ అయిపోయింది.తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి' చిత్రాన్ని రీమేక్ చేసే 'జన నాయగణ్' తీశారు. కాకపోతే విజయ్ రాజకీయ అవసరాలకు తగ్గట్లు పొలిటికల్ డైలాగ్స్, ఎపిసోడ్స్ పెట్టారు. పూజా హెగ్డే హీరోయిన్ కాగా తెలుగులో శ్రీలీల చేసిన పాత్రని తమిళంలో మమిత బైజు చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. కెవిఎన్ నిర్మాణ సంస్థపై వెంకట్ కె నారాయణ నిర్మించారు. ఈ చిత్రం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈయన.. 'టాక్సిక్' కూడా రిలీజ్ కాకపోవడంతో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు.(ఇదీ చదవండి: తమన్నా మళ్లీ ప్రేమలో పడిందా?) -
ఓటీటీకి అడివి శేష్ డెకాయిట్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా కేవలం మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.డకాయిట్ కథేంటంటే..తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ. -
ఓటీటీకి సూపర్ హిట్ డార్క్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద అదరగొడుతన్నాయి. చిన్న సినిమాలైనా సరే వసూళ్లపరంగా రాణిస్తున్నాయి. ఇటీవల వాలా-2 సైతం అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత మరో మలయాళ మూవీ భరతనాట్యం- 2 మోహినియాట్టం సైతం కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 21.50 కోట్లు వసూలు చేసింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ శుక్రవారం అంటే మే 8వ తేదీ నుంచి ఓటీటీ సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా.. ఈ డార్క్ కామెడీ మూవీలో సూరజ్ వెంజరమూడు, సైజు కురుప్ కీలక పాత్రల్లో నటించారు. Recent Malayalam Blockbuster Dark Comedy Movie 😂!!#Bharatanatyam2 : #Mohiniyattam (Malayalam) streaming from May 8 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/74wi4zutEy— OTT Trackers (@OTT_Trackers) May 3, 2026 -
ఓటీటీలో క్రేజీ యానిమేషన్ మూవీ.. తెలుగు రివ్యూ
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొట్టేస్తున్నాయి. స్కూల్స్‌కి సెలవులు ఇచ్చేయడంతో పిల్లలు తెగ అల్లరి చేస్తూ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో పిల్లల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలా అని పేరెంట్స్ చాలానే ఆలోచిస్తున్నారు. అయితే ఓటీటీల్లో పిల్లలని ఎంటర్టైన్ చేస్తూ విలువలు నేర్పించే యానిమేషన్ సినిమాలు కొన్ని ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులోకి మరొకటి చేరింది. రీసెంట్గా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 'హాపర్స్' చిత్రాన్ని పిల్లలతో పాటు పెద్దోళ్లు కూడా చూడొచ్చు. ఇంతకీ ఇదెలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)కథేంటి?బీవర్టన్ అనే ఊరిలో మేబల్ అనే అమ్మాయి ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఈమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. పెద్దయి కాలేజీకి వెళ్లినా అది తగ్గదు. ఊరిలో ఫ్లైఓవర్ కడుతున్నారని, కానీ దీనికోసం పెద్ద చెరువుని కూల్చేశారని, అందులో జంతువులని బెదరగొట్టి పంపించేశారని తెలిసి బాధపడుతుంది. ఆ జంతువులని తిరిగి ఇక్కడికి ఎలా తీసుకురావాలా, ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని ఎలా అడ్డుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఓ రోజు అనుకోని విధంగా ఈమె ఆత్మ.. బీవర్ అనే జంతువులో ప్రవేశిస్తుంది. తర్వాత ఏమైంది? బీవర్ శరీరంలో ఉన్న మేబల్.. మిగిలిన జంతువులతో కలిసి ఆ ఫ్లైఓవర్ కట్టడాన్ని అడ్డుకుందా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే యానిమేషన్ సినిమాలకు సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. హాలీవుడ్లో ఈ తరహా మూవీస్ ఎక్కువగా వస్తుంటాయి. అలా ఈ ఏడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజై ఆకట్టుకున్న చిత్రమే 'హాపర్స్'. సరదా సరదాగా సాగిపోతూనే ప్రకృతి ఎంత గొప్పదో చెబుతుంది. కేవలం గంటన్నర మాత్రమే ఉండే ఈ సినిమా పిల్లలతో పాటు పెద్దలు కూడా చూడొచ్చు.ప్రస్తుతం నాగరికత పేరు చెప్పి ఎక్కడపడితే అక్కడ చెట్లు కొట్టేస్తున్నారు. బిల్డింగులు కట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా చెట్లు లేదా అడవులపై ఆధారపడి జీవిస్తున్న జంతువుల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. జంతువులు మూగజీవులు కాబట్టి మనుషుల్ని అవేం చేయలేవు. ఒకవేళ వాటికే మనిషిలా ఆలోచించగలిగే శక్తి వస్తే ఏం చేస్తాయి అనే చిత్రమైన కాన్సెప్ట్‌తో తీసిన 'హాపర్స్' అద్భుతంగా ఉంది.పాయింట్ పరంగా కొత్తదేం కాదు కానీ చూపించిన ఎమోషన్స్ గానీ చేసిన కామెడీ గానీ బాగా కుదిరాయి. అడవిలో జంతువుల మధ్య సాగే హంగామా కూడా అదిరిపోయేలా డిజైన్ చేశారు. పిక్సర్స్ స్టూడియోస్ తీసిన ఈ సినిమాలో నాన్నమ్మ-మనవరాలి ఎమోషన్ కూడా ఆకట్టుకునేలా ఉండటం విశేషం. మనిషి.. ప్రకృతిని నాశనం చేస్తున్నాడు గానీ ఉపద్రవం వచ్చినప్పుడు ఆ ప్రకృతే మనిషిని కాపాడటం అనే పాయింట్‌ని చూపించిన విధానం బాగుంది.ప్రస్తుతానికి ఈ సినిమా ఆపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో రెంట్ విధానంలో ఉంది. ఇంగ్లీష్ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. సమ్మర్ హాలీడేస్‌లో మీ పిల్లలకు ఏదైనా మంచి మూవీ చూపిద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి. కచ్చితంగా నచ్చుతుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
మూవీ లవర్స్ కు పండగే, ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస
-
ఓటీటీకి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డ్యూడ్, డ్రాగన్ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన హీరోగా ఇటీవలే రిలీజైన మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎల్ఐకే). ఈ మూవీకి నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. మే 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా.. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు.when it’s old school vs modern rules, of course there’s a high premium 👀#LoveInsuranceKompanyOnPrime, May 6@Pradeeponelife @IamKrithiShetty #Nayanthara #VigneshShivan@iam_SJSuryah @Gourayy @dop_ravivarman @muthurajthangvl @PradeepERagav @Rowdy_Pictures @7screenstudio… pic.twitter.com/VXMCEY0EEV— prime video IN (@PrimeVideoIN) May 1, 2026 -
ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళ సినిమాలకు తెలుగులోనూ బోలెడంత క్రేజ్ ఉంది. ఓటీటీల్లోకి రావడం లేటు చూసేస్తుంటారు. రీసెంట్ టైంలో 'సంభవం అధ్యాయం ఒన్ను' చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇలానే అదరగొట్టేందుకు మరో మూవీ రెడీ అయిపోయింది. గతవారం తెలుగులోనూ విడుదలైన ఓ స్కూల్ ఏజ్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ గురించి ఇప్పుడు అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: సత్య 'జెట్లీ' సినిమా రివ్యూ)2024లో థియేటర్లలో రిలీజై ఆకట్టుకున్న 'వాలా' చిత్రానికి కొనసాగింపుగా.. 'వాలా 2' తీశారు. ఇన్ స్టాలో పాపులర్ అయిన కుర్రాళ్లు నలుగురిని లీడ్ రోల్స్‌గా పెట్టారు. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.200 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది.ఏప్రిల్ 2న మలయాళంలో రిలీజ్ కాగా.. ఏప్రిల్ 26న తెలుగులో విడుదలైంది. ఇప్పుడు వచ్చే శుక్రవారం(మే 08) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో అందుబాటులోకి రానుంది. కామెడీ, ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని మిస్ అవ్వొద్దు.'వాలా 2' విషయానికొస్తే.. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన హాషిర్, అలన్, అజిన్, వినాయక్ అనే నలుగురు కుర్రాళ్లని తల్లిదండ్రులు ఎన్నోకష్టాలు పడుతూ కాలేజీకి పంపుతుంటారు. కానీ వీళ్లు చదువుల్లో కంటే గొడవల్లోనే ముందుంటారు. గొడవల వల్ల ఓ దశలో కాలేజీ నుంచి బయటకు పంపించే పరిస్థితులు వస్తాయి. ఓ పోలీస్ ఆఫీసర్ (ఆల్ఫోన్స్ పుత్రన్) కలగజేసుకుని వీళ్లని కాపాడతాడు. ఆ తర్వాత పరీక్షలు రాసే అవకాశం వస్తుంది. ఉన్నత చదువుల కోసం, ఉపాధి కోసం యూకే వెళ్లాలనుకున్న ఈ నలుగురూ తమ కలని నిజం చేసుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్
అతిలోక సుందరి శ్రీదేవి కెరీర్లో చాలా అద్భుతమైన సినిమాలు ఉన్నప్పటికీ 1982లో వచ్చిన 'వసంత కోకిల' టాప్‌లో ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ చిత్రం ఓటీటీలో లేకపోవడంతో పలువురు అభిమానులు నిరాశకు గురయ్యారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ రీ-మాస్టర్ చేసి ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ మూవీ ఎందులోకి వచ్చిందంటే?బాలూ మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన దృశ్యకావ్యం 'మూండ్రం పిరై' (తెలుగులో 'వసంత కోకిల'). 1982లో థియేటర్లలో రిలీజై ఓ క్లాసిక్‌గా నిలిచిపోయింది. శ్రీదేవి, కమల్ హాసన్ నటనకు ప్రేక్షకులు ముగ్దులైపోయారు. ఇందులో నటనకుగానూ కమల్‌కి, సినిమాటోగ్రఫీ విభాగంలో బాలూ మహేంద్రకు జాతీయ అవార్డులు కూడా రావడం విశేషం.అలాంటి ఈ చిత్రాన్ని ఇప్పుడు సినీ ప్రేమికుల కోసం రీమాస్టర్ చేసి ఫుల్ హెచ్డీ ప్రింట్‌ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తెలుగు ఆడియో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. యూట్యూబ్‌లో ఈ మూవీ ఉంది గానీ క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉంది.'మూండ్రం పిరై' విషయానికొస్తే.. ఓ ప్రమాదం కారణంగా శ్రీదేవి తన జ్ఞాపకశక్తిని కోల్పోయి చిన్న పిల్లలా ప్రవర్తిస్తూ ఉంటుంది. అనాథగా మారిన ఆమెని ఓ వేశ్యాగృహం నుంచి కమల్ హాసన్ (సోమనాథన్) రక్షించి, తన ఇంట్లోనే చేరదీసి ఆప్యాయంగా చూసుకుంటాడు. ఆమెకు చికిత్స చేయిస్తూ, తనను తాను మరచి ఆమెను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతనిని అర్థం చేసుకుంటుంది, ప్రేమిస్తుంది. చివరకు ఆమెకు జ్ఞాపకశక్తి తిరిగి వస్తుంది కానీ జరిగిన సర్జరీ వల్ల కమల్‌తో గడిపిన ఆ కొంతకాలం జ్ఞాపకాలు (కమల్‌ను) మర్చిపోతుంది. తనను ఎంతో ప్రేమించిన కమల్ని గుర్తుపట్టకుండానే తన పాత జీవితంలోకి ఆమె వెళ్ళిపోతుంది. కమల్ ప్రేమ, త్యాగం చివరకు విషాదంగా ముగుస్తుంది. -
నేరుగా ఓటీటీకి క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించిన లేటేస్ట్ మూవీ కర్తవ్య. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీకి పులకిత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ డేట్‌పై రూమర్స్ రాగా.. అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని మే 15 నుంచి ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ సందడి చేయనుంది. ఈ సినిమాని విధి వర్సెస్ కర్మ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీలో పోలీసు అధికారి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. #Kartavya 🔥#SaifAliKhan in a gripping tale of duty vs conscience ⚖️Directed by Pulkit 🎬Streaming on Netflix from May 15 ✅ pic.twitter.com/wSQiOCnuss— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) April 30, 2026 -
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 20 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఈ వారం బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ నుంచి జెట్లీ బరిలో ఉన్నాడు. కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో పాటు ధనుశ్ కర సైతం బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఈ రెండు మూవీస్ వీకెండ్లో ప్రేక్షకులను అలరించనున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే టాలీవుడ్ నుంచి బైకర్, రాకాస లాంటి సినిమాలు ఫ్రైడే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ-2 సైతం రేపటి నుంచే ఓటీటీలో అలరించనుంది. అంతేకాకుండా పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానున్నాయి. ఇవే కాకుండా మరిన్ని కొన్ని సినిమాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 20 సినిమాలు, సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ బైకర్ (తెలుగు మూవీ) - మే 01 రాకాస (తెలుగు సినిమా) - మే 01 గ్లోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 01స్వాప్డ్(యానిమేషన్ మూవీ)- మే 01మై డియరెస్ట్ సెనోరిటా(హాలీవుడ్ సినిమా)- మే 01బే బ్లాడెక్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- మే 01మై ఫేవరేట్ వెడ్డింగ్(హాలీవుడ్ మూవీ)- మే 01సన్ ఇన్ లా(హాలీవుడ్ మూవీ)- మే 01యూ ఆల్వేస్(హాలీవుడ్ సినిమా)- మే 01బుబా సీజన్-6(హాలీవుడ్ సిరీస్)- మే 01పార్ట్‌టైమ్ వైఫ్(హాలీవుడ్ సిరీస్)- మే 03క్లీకా (హాలీవుడ్)- మే 03ఆహాసోదర(తెలుగు మూవీ)- మే 01అమెజాన్ ప్రైమ్ సప్నే vs ఎవ్రీవన్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 01 యూ ఆర్ డేటింగ్ ఏ నార్సిస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 01జీ5ద కేరళ స్టోరీ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 01ఆడు 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01డిటెక్టివ్ ధనంజయ్ రహస్యజల్ (మరాఠీ సిరీస్) - మే 01సోనీ లివ్ఉందేఖి సీజన్ 4 (హిందీ సిరీస్) - మే 01హెచ్‌బీవో మ్యాక్స్..ఉథరింగ్ హైట్స్(హాలీవుడ్ సినిమా)- మే 01సన్ నెక్ట్స్మనితదేయివమగలం(తమిళ సినిమా)- మే 01హులు..హలో రోడ్(హాలీవుడ్ సినిమా)- మే 01 -
హీరో విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా! ఓటీటీలో స్ట్రీమింగ్
గతవారమే తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. ఈసారి స్టార్ హీరో దళపతి విజయ్ తొలిసారి పోటీలో నిలిచాడు. అయితే ఇతడిని టార్గెట్ చేస్తూ తీసిన ఓ సినిమాని ఎలక్షన్ ముందు థియేటర్లలో రిలీజ్ చేశారు. అదేమంత ప్రభావం చూపించలేకపోయింది. కానీ ఇప్పుడు ఫలితాలు రాకముందే ఆ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏకంగా ఐదింటిలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన హీరో విజయ్.. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే ఇతడి టార్గెట్ చేసేలా 'టీఎన్ 2026' పేరిట ఓ సినిమా తీశారు. తమిళ కమెడియన్ తంబి రామయ్య స్టోరీ అందించగా.. ఇతడి కొడుకు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించాడు. సినిమాటోగ్రాఫర్ కమ్ నటుడు నటరాజన్.. ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ కాగా కేవలం మూడు వారాల్లోనే అంటే రేపటి(ఏప్రిల్ 30) నుంచి అమెజాన్ ప్రైమ్, ఆహా, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.'టీఎన్ 2026' విషయానికొస్తే.. ప్రముఖ సినిమా హీరో, రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. కొత్తగా పార్టీ స్థాపిస్తాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే అంశంతో పొలిటికల్ సెటైరికల్‌గా ఈ సినిమా తీశారు. అయితే విజయ్‌ని టార్గెట్ చేస్తూ తీశారని అతడి అభిమానులు కామెంట్స్ చేయగా.. ఇది పూర్తిగా కల్పిత కథ అని తంబి రామయ్య చెప్పుకొచ్చాడు. థియేటర్లలో ఏ మాత్రం అలరించలేకపోయిన ఈ చిత్రం.. ఓటీటీల్లో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి? తెలుగులోకి వస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు.(ఇదీ చదవండి: విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..) -
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా
హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలతో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేశ్ బాబు.. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్' మూవీలో బిర్యానీ అనే పాత్ర చేస్తున్నాడు. ఇది కాకుండా అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. అలా గతేడాది ఓ కామెడీ సినిమాతో రాగా అది ఇప్పుడు దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ దాని సంగతేంటి? ఎందులోకి రానుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)సంపూర్ణేశ్ బాబు, సంజోష్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రొమాంటిక్ కామెడీ సినిమా 'సోదరా'. తెలంగాణలోని పల్లెటూరి నేపథ్యంగా సాగే కథతో దీన్ని తీశారు. గతేడాది ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాగా ప్రేక్షకుల్ని ఏ మాత్రం అలరించలేకపోయింది. తర్వాత అందరూ దీన్ని మరిచిపోయారు. ఇప్పుడీ చిత్రాన్ని మే 01 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు.'సోదరా' విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ పల్లెటూరిలో చిరంజీవి (సంపూర్ణేశ్ బాబు), పవన్ (సంజోష్) అన్నదమ్ములు. చిరంజీవి కుటుంబం సోడా బిజినెస్ చేస్తుంటుంది. వయసు పెరిగిపోతున్నా పెళ్లి కావట్లేదని చిరు బాధపడుతుంటాడు. అలాంటి టైంలో ఎదురింట్లో దిగిన దివి(ఆర్తి గుప్తా)ని అన్నదమ్ములు ఇద్దరూ ప్రేమలో పడేయాలని చూస్తారు. దీంతో తమ్ముడిని చిరంజీవి వేరే ఊరికి పంపేస్తాడు. కట్ చేస్తే దివి, చిరంజీవిని రిజెక్ట్ చేస్తుంది. మరోవైపు పవన్.. కాలేజీలో భువి(ప్రాచీ బన్సాల్)ని ప్రేమిస్తాడు. ఓసారి సెలవులకు పవన్ ఇంటికి వచ్చినప్పుడు జరిగిన సంఘటనల వల్ల అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు వస్తాయి. మరి వీళ్లు ఎలా కలిశారు? చిరంజీవికి పెళ్లయిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్‌కి ఇది చివరి అవకాశం!) -
దురంధర్-2 ఓటీటీ డేట్.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ మూవీ పుష్ప-2 కలెక్షన్స్‌ను దాటేసింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ డేట్‌పై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మే 14 వ తేదీ నుంచి ఓటీటీకి రానుందన్న వార్త వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ మూవీ రిలీజై నెల పైగా కావడంతో ఓటీటీ విడుదలపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్సుంది. ఈ మూవీని జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రణ్వీర్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీలో సంజయ్‌దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. #Dhurandhar2TheRevenge — MAY 14th On Jio HOTSTAR 🧨💥 pic.twitter.com/RIe0vDQ190— OTT STREAM UPDATES (@newottupdates) April 26, 2026 -
ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సినిమాల్లో కమర్షియల్ అంశాలే ఎక్కువగా ఉంటాయి. అలా ఉంటేనే థియేటర్లలో ఆడతాయి. సమాజంలో జరిగే చాలా సంఘటనలని చూపించాలనుకుంటే మాత్రం వెబ్ సిరీస్‌లు బెస్ట్ ఆప్షన్. ఈ తరహా ప్రయత్నాలు ఇప్పటికే చాలా జరిగాయి, జరుగుతున్నాయి. ఇప్పుడు పోటీ పరీక్షల్లో జరిగే లొసుగులపై ఓ సిరీస్ తీశారు. దాని స్ట్రీమింగ్ తేదీని తాజాగా ప్రకటించారు. తెలుగులోనూ ఇది అందుబాటులోకి రానుందని వెల్లడించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)'ప్రేమదేశం' లాంటి సినిమాతో హీరోగా అప్పట్లో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న అబ్బాస్.. తర్వాత కాలంలో నటనకు దూరమైపోయాడు. రీసెంట్‌గానే 'హ్యాపీరాజ్' అనే తమిళ సినిమాలో తండ్రిగా నటించి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు 'ఎగ్జామ్' అనే సోషల్ థ్రిల్లర్ సిరీస్‌లోనూ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఈయనకు ఇదే ఓటీటీ అరంగేట్రం కావడం విశేషం.దుశారా విజయన్, అదితీ బాలన్, అబ్బాస్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఎగ్జామ్' సిరీస్.. మే 15 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ దర్శకద్వయం పుష్కర్-గాయత్రి దీనికి క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ కాగా ఏ.సర్కుణం దర్శకత్వం వహించారు. మీ భవిష్యత్తుని డిసైడ్ చేసేది ఎగ్జామ్, మరి ఎగ్జామ్‌ని డిసైడ్ చేసేది ఎవరు? అనేది ఈ సిరీస్ కాన్సెప్ట్. చూస్తుంటే పోటీ పరీక్షల్లో జరిగే లొసుగులు ఇందులో చూపించబోతున్నారనిపిస్తోంది.(ఇదీ చదవండి: ప్రీమియర్లకే నెగిటివ్ టాక్.. కానీ తొలి వీకెండే 'మైఖేల్'కి వేల కోట్ల కలెక్షన్స్) View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి థియేటర్లలోకి రావట్లేదు. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన 'గాయపడ్డ సింహం', కమెడియన్ సత్య లీడ్ రోల్ చేసిన 'జెట్ లీ' రిలీజ్ కానున్నాయి. ఇక డబ్బింగులు విషయానికొస్తే ధనుష్ 'కర', మోహన్ లాల్-ముమ్ముట్టి 'పేట్రియాట్', సాయిపల్లవి 'ఒక రోజు'తో పాటు హిందీ చిత్రం 'రాజా శివాజీ'.. బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ సినిమాలు ఈసారి చాలానే స్ట్రీమింగ్ కాబోతున్నాయి. బైకర్, రాకాస లాంటి తెలుగు మూవీస్‌తో పాటు ద కేరళ స్టోరీ 2, లీడర్, ఆడు 3 లాంటి డబ్బింగ్ మూవీస్ ఆసక్తి రేపుతున్నాయి. గ్లోరీ అనే డబ్బింగ్ సిరీస్ కూడా బాగానే ఉందనిపించేలా ఉంది. వీటితో పాటు వీకెండ్ వచ్చేసరికి సడన్ సర్ప్రైజులు కూడా ఉండే అవకాశముంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రాబోతుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 27 నుంచి మే 03 వరకు)నెట్ఫ్లిక్స్షుడ్ ఐ మ్యారీ ఏ మర్డరర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 29మ్యాన్ ఆన్ ఫైర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 30బైకర్ (తెలుగు మూవీ) - మే 01రాకాస (తెలుగు సినిమా) - మే 01గ్లోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 01హాట్స్టార్బ్యాచ్మేట్స్ (తెలుగు సిరీస్) - ఏప్రిల్ 30అమెజాన్ ప్రైమ్ద హౌస్ ఆఫ్ ద స్పిరిట్స్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 29సప్నే vs ఎవ్రీవన్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 01లీడర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01 (రూమర్ డేట్)జీ5లారెన్స్ ఆఫ్ పంజాబ్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 27ద కేరళ స్టోరీ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 01ఆడు 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01డిటెక్టివ్ ధనంజయ్ రహస్యజల్ (మరాఠీ సిరీస్) - మే 01సోనీ లివ్ఉందేఖి సీజన్ 4 (హిందీ సిరీస్) - మే 01ఆపిల్ టీవీ ప్లస్విడోస్ బే (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 29ఎమ్ఎక్స్ ప్లేయర్క్యాంపస్ బీట్స్ రిటర్న్స్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 29(ఇదీ చదవండి: 'పెద్ది' సందేహాలన్నీ క్లియర్ చేసిన బుచ్చిబాబు) -
ఓటీటీలోకి 'బైకర్' సినిమా.. అధికారిక ప్రకటన
ఈ ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో హిట్ కొట్టిన హీరో శర్వానంద్.. ఈ నెల తొలివారంలో మరో మూవీతో వచ్చి హిట్ కొట్టాడు. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి)శర్వానంద్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'బైకర్'. సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. అభిలాష్ రెడ్డి దర్శకుడు. బైక్ రేసింగ్ స్టోరీతో సరికొత్తగా దీన్ని తెరకెక్కించారు. చూసిన చాలామంది బాగానే ఉందన్నారు కానీ ఎందుకనో జనాలు ఈ మూవీని థియేటర్‌కి వెళ్లి చూసేందుకు పెద్దగా ఇష్టపడలేదు. కలెక్షన్సే దీనికి ఉదాహరణ. ఇప్పుడీ చిత్రం మే 01వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఇదే పేరుతో.. హిందీలో మాత్రం 'శర్వా' అనే టైటిల్‌తో అందుబాటులోకి రానుంది.'బైకర్' విషయానికొస్తే.. బుల్లెట్ సునీల్ అలియాస్ సునీల్ నారాయణ్(రాజశేఖర్) మాజీ మోటోక్రాస్ రేసర్. మన దేశంలో మోటోక్రాస్ రేసింగ్ క్రీడకు గుర్తింపు తీసుకురావాలనేది ఈయన ఆలోచన. ఇందులో భాగంగా రేసర్లని తీర్చిదిద్దుతుంటాడు. ఈయన కొడుకు వికాస్ నారాయణ్(శర్వానంద్).. తండ్రి దగ్గరే ట్రైనింగ్ తీసుకుని టాప్ రేసర్ అవుతాడు. అంతర్జాతీయ పోటీలోనూ పాల్గొంటాడు కానీ కొన్ని కారణాల వల్ల మూడో స్థానంలో నిలుస్తాడు. తర్వాత రేసింగ్ నుంచే వికాస్ దూరం కావాలని నిర్ణయించుకుంటాడు. తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని పెంచిన ఆ నిర్ణయం వెనకున్న కారణమేంటి? చివరకు ఏమైంది? వీళ్లిద్దరూ మళ్లీ కలిశారా లేదా అనేది మిగతా స్టోరీ. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే?) -
ఓటీటీలో నంబర్ వన్ సినిమా.. తండ్రి-కొడుకుల బంధానికి ఫిదా
జీవీ ప్రకాశ్‌కుమార్, శ్రీ గౌరిప్రియ జోడీగా నటించిన చిత్రం హ్యాపీ రాజ్.. విజయవంతంగా థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ మూవీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మస్ట్ వాచ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దర్శకులు మారియా ఎలాంచెజియన్ తెరకెక్కించిన ఈ మూవీని జైవర్దన్ నిర్మించారు. ఈ మూవీతో సుమారు 11ఏళ్ల తర్వాత నటుడు అబ్బాస్ వెండితెరపై కనిపించాడు. అయితే, ఓటీటీలో హ్యాపీ రాజ్ దూసుకుపోతున్నాడు.ట్రెండింగ్‌లో హ్యాపీ రాజ్తమిళ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటున్న 'హ్యాపీ రాజ్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా విభిన్న వర్గాల ప్రేక్షకులలో వేగంగా ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం భారతదేశంలోని ప్రైమ్ వీడియోలో నంబర్ వన్ సినిమాగా చార్టులలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విజయంపై చిత్ర యూనిట్ కూడా సంతోషాన్ని వ్యక్తపరిచింది.ప్రతి కుమారుడు తన తండ్రితో చూడాల్సిన సినిమా అంటూ చాలామంది నెటిజన్లు హ్యాపీ రాజ్ మూవీ గురించి పోస్టులు పెడుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఔట్ అండ్ ఔట్ కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాలతో కన్నీళ్లు తెప్పిస్తుందని తెలుపుతున్నారు. ఓటీటీలో కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. -
ఓటీటీలో రాకాస.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా విడుదలైన కొత్త సినిమా రాకాస... బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. రాకాస చిత్రంలో సంగీత్ శోభన్- నయన్ సారిక హీరో హీరోయిన్గా నటించారు. ఓటీటీ సిరీస్‌లతో బాగా పాపులర్ అయిన దర్శకురాలు మానస శర్మ ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో నటించారు.రాకాస చిత్రం 2026 మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సదరు ఓటీటీ యాప్ కేటలాగ్‌లో అధికారికంగా చేర్చబడింది. అయితే, ఓటీటీ ప్రేక్షకుల కోసం తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం వంటి ఇతర భాషలలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన రాకాస చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓటీటీ కోసం నెట్‌ఫ్లిక్స్‌తో రూ. 10 కోట్లకు ఢీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఫైనల్‌గా రాకాస చిత్రం నిర్మాత నిహారికకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.కథేంటంటే.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వీరబాబు అలియాస్ వీరు(సంగీత్ శోభన్).. తన ప్రియురాలు సుకన్యను పెళ్లి చేసుకోవాలని సొంతూరుకి వస్తాడు. కానీ అప్పటికే వేరే వ్యక్తితో సుకన్య పెళ్లికి రెడీ అవుతుంది. బ్రేకప్ బాధలో ఉన్న సమయంలోనే సోము(వెన్నెల కిశోర్) అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతని పాస్‌పోర్ట్‌ని పోలీసులు తీసుకెళ్తారు. సోము జాడని కనిపెడితే తన పాస్‌పోర్టు తిరిగి వస్తుందని.. స్నేహితుడు బాలు(గెటప్ శ్రీను)తో కలిసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు.అదే సమయంలో ఆ ఊరి చివరిలో ఎన్నో దశాబ్దాలుగా తిష్టవేసుకొని ఉన్న బ్రహ్మ రాక్షసుడికి నరబలి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఊరంతా కలిసి ఓ ముసలాడిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. చివరి క్షణంలో అతను చనిపోతాడు. అతనికి బదులుగా బాలు పోవాల్సి ఉండగా.. వీరూ అడ్డుపడతాడు. దీంతో బాలుకి బదులుగా వీరూ ఆ కోటలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ కోట ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఏంటి? నిజంగానే ఆ కోటలో బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడా? సుబ్బులక్ష్మి(నయన్ సారిక) ఎవరు? ఆమె ఎందుకు కోటలోకి వెళ్లింది? సోము సంగతి ఏంటి? నిజంగా చనిపోయాడా? లేదా బతికే ఉన్నాడా? బలి కోసం కోటలోకి వెళ్లిన తర్వాత వీరూకి ఎదురైన సవాళ్లు ఏంటి? తిరిగి ప్రాణాలలో బయటకు వచ్చాడా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం, ప్రతిఛాయ, మెన్షన్ హౌస్ మల్లేష్, హ్యాపీరాజ్ తదితర స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీటితో పాటు మరో తెలుగు మూవీ కూడా పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలో హార్డ్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ సినిమా.. తెలుగు రివ్యూ) రాజేశ్ మేరు, నవ్య చిట్యాల హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా 'లగ్గం టైమ్'. ఈ ఏడాది ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేకపోవడంతో జనాలు తెలియకుండానే బిగ్స్క్రీన్పై నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు దాదాపు రెండున్నర నెలల తర్వాత ఆహా ఓటీటీలోకి వచ్చేసింది.'లగ్గం టైమ్' విషయానికొస్తే.. అనన్య(నవ్య) పెళ్లిరోజున బాయ్ ఫ్రెండ్ సూర్య(రాజేశ్).. పెళ్లి ఇంటి నుంచి ఈమెని తీసుకెళ్లిపోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ అక్కడ జరిగిన ఓ అనుకోని సంఘటన వల్ల పరిస్థితులు మారిపోతాయి. మరోవైపు పెళ్లికొడుకు చంద్ర కిడ్నాప్ అవుతాడు. ఈ కేసులో సూర్యనే నిందితుడిగా అనుమానిస్తూ పోలీసులు పట్టుకుంటారు. అసలు పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరు? పూణెలో మొదలైన సూర్య-అనన్య ప్రేమకథకు చివరకు శుభం కార్డు పడిందా లేదా?అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు: రాజశేఖర్) -
పొలిటికల్ థ్రిల్లర్ సినిమా తెలుగులో స్ట్రీమింగ్
ప్రేమమ్, సర్వం మాయ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు నివిన్ పాలీ.. ఈ ఏడాది కూడా ఆయన నటించిన రెండు చిత్రాలు 'సంభవం అధ్యాయం ఒన్ను', 'ప్రతిఛాయ' మంచి విజయాన్ని అందుకున్నాయి. జియో హాట్‌స్టార్ వేదికగా ఓటీటీలో కూడా అదరగొడుతున్నాయి. అయితే, సడెన్‌గా ప్రతిఛాయ(Prathichaya) చిత్రం తెలుగులో కూడా స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఏప్రిల్ 24న ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఒక్కరోజు గ్యాప్‌లోనే తెలుగులో స్ట్రీమింగ్కు రావడం విశేషం.ప్రతిఛాయ మూవీ నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించిన ఒక మలయాళ రాజకీయ థ్రిల్లర్. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, థియేటర్లలో ప్రదర్శితమైనప్పుడు విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఇప్పుడు, నిర్మాతలు శ్రీ గోకులం మూవీస్ మరియు ఆర్డీ ఇల్యూమినేషన్స్ ఎల్ఎల్పి, ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుందనే ఆశతో డిజిటల్ మాధ్యమం వైపు దృష్టి సారించారు.కేరళ రాజకీయాల చుట్టూ తిరిగే ఫిక్షన్ స్టోరీగా ఈ మూవీ ఉంటుంది. కేరళ ముఖ్యమంత్రి తనను లైంగిక వేధించాడంటూ ఓ మహిళ ఆరోపిస్తుంది. దీంతో కొన్ని రోజుల తర్వాత మనస్తాపంతో సీఎం వర్గీస్ మరణిస్తాడు. ఇలాంటి సమయంలో ఆయన కుమారుడు జాన్ (నివిన్) రాజకీయాల్లోకి వెళతాడు. ఇష్టం లేకుండా పాలిటిక్స్‌లోకి వెళ్లిన జాన్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనేది ఈ మూవీ అసలు కథ. తన తండ్రి నిజంగానే ఒక మహిళను వేధించాడా..? అనే మిస్టరీని జాన్ ఎలా ఛేదించాడో తెలుసుకోవాలంటే ప్రతిఛాయ చూడాల్సిందే. -
ఓటీటీకి ది కేరళ స్టోరీ-2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆదా శర్మ కీలక పాత్రలో వచ్చిన మూవీ ది కేరళ స్టోరీ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. రచయిత విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం మే 8వ తేదీ నుంచి ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమాను కేరళలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. Behind every “perfect” romance can lie a calculated trap. Witness the moment Divya, Neha, and Surekha’s dreams spiraled into a nightmare.Watch #TheKeralaStory2, streaming from 8th May on ZEE5.#TheKeralaStory2OnZee5#TheKeralaStory2GoesBeyond #ShowYourDaughters… pic.twitter.com/TMdec083gG— ZEE5Official (@ZEE5India) April 24, 2026 -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 20 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఈ వారంలో కూడా పెద్ద సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద కనిపించడం లేదు. వాళా-2 తెలుగు డబ్బింగ్ వర్షన్‌తో పాటు గేదేల రాజు లాంటి సినిమాలపై అంతగా బజ్ లేదు. వాళా-2 మలయాళ హిట్ మూవీ కావడంతో కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఫ్రైడే సినిమాలు అలరించేందుకు రెడీ అయిపోయాయి. వీటిలో తెలుగు మూవీ బ్యాండ్మేళంపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. దీంతో పాటు జీవీ ప్రకాశ్ హ్యాపీ రాజ్ డబ్బింగ్ సినిమా, మలయాళ మూవీ ప్రతిఛాయ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే అన్ని కలిపి దాదాపు 20 చిత్రాలు ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ అపెక్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 24 నుక్కడ్ నాటక్(హిందీ సినిమా)- ఏప్రిల్ 24 ఇఫ్ విషెస్ కుడ్ కిల్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 24 నీ ఫరెవర్(హిందీ మూవీ)- ఏప్రిల్ 24 సోనిక్3 ది హెడ్జ్హాగ్(హాలీవుడ్)- ఏప్రిల్ 24 అన్‌కామన్ వాలర్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 24 మై డ్రెస్‌అప్ డార్లింగ్(జపనీస్ మూవీ)- ఏప్రిల్ 2528యర్స్ లేటర్- ది బోన్ టెంపుల్(హాలీవుడ్)- ఏప్రిల్ 26జియో హాట్‌స్టార్ ప్రతి ఛాయ (మలయాళ మూవీ) - ఏప్రిల్ 24 24 (హిందీ సిరీస్) - ఏప్రిల్ 24సన్ నెక్స్ట్జేసీ ది యూనివర్సిటీ(కన్నడ మూవీ)- ఏప్రిల్ 24జీ5 బ్యాండు మేళం (తెలుగు మూవీ) - ఏప్రిల్ 24 జిరాక్స్ (కన్నడ సిరీస్) - ఏప్రిల్ 24అమెజాన్ ప్రైమ్ హ్యాపీరాజ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 24 నాటీ బిజినెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24 మార్టీ సుప్రీమ్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 24 న్యూ బండిట్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 24 ఇమ్మార్షల్ కాంబాట్(హాలీవుడ్)- ఏప్రిల్ 24లయన్స్ గేట్ ప్లే గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 24ఆపిల్ టీవీ ప్లస్ మై బ్రదర్ ద మినోటర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24హులు..నో అదర్ ఛాయిస్ (హాలీవుడ్)- ఏప్రిల్ 24ముబీ..సౌండ్ ఆఫ్ ఫాలింగ్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 24 -
ఓటీటీకి వంద కోట్ల సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
మలయాళ సినిమాలు ఓటీటీలో తెగ చూసేస్తున్నారు. దీంతో అక్కడి హిట్ అయిన చిత్రాలు తెలుగు డబ్బింగ్ వర్షన్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కంటెంట్ నచ్చడంతో ఓటీటీల్లో ఎక్కువగా మలయాళ చిత్రాలకే డిమాండ్ ఉంటోంది. ఇటీవలే స్ట్రీమింగ్ వచ్చేసిన సంభవం అధ్యాయం ఒన్ను సినీ ప్రియులను ఆకట్టుకుంది. అంతలోనే మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.మిధున్ మాన్యువల్ థామస్ డైరెక్షన్లో వచ్చిన ఆడు 3: వన్ లాస్ట్ రైడ్: పార్ట్ 1 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రం జీ5 వేదికగా మే 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. అక్కడ హిట్ కొట్టిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీ ప్రియులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ మూవీలో జయసూర్య, వినాయకన్, ఇంద్రన్స్, ధర్మజన్, సైజు కురుప్, అల్లేయ బోర్న్ కీలక పాత్రల్లో నటించారు. #Aadu3 (Malayalam) Streaming from May 1 on Zee5 in Malayalam, Tamil, Telugu, Kannada & Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/eJURte08qN— OTT Trackers (@OTT_Trackers) April 23, 2026 -
ఓటీటీకి సోషల్ ఓరియంటెడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరో ఆసక్తికర మూవీ ఓటీటీకి వచ్చేస్తోంది. తన్మయ శేఖర్ దర్శకత్వం వహించిన సోషల్ ఓరియంటెడ్ మూవీ నుక్కడ్ నాటక్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. ఈ నెల 24 నుంచే ఓటీటీ ప్రియులను అలరించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.కాగా.. ఈ చిత్రంలో మోల్శ్రీ, శివంగ్ రాజ్‌పాల్, నిర్మల హజ్రా, డానిష్ హుస్సేన్ కీలక పాత్రల్లో మెప్పించారు. ఓ కాలేజీ నుంచి బహిష్కరించిన ఇద్దరు విద్యార్థుల ప్రయాణం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కాలేజీ క్యాంటీన్లో దొంగతనం చేస్తూ ఇద్దరు స్నేహితులు దొరికిపోతారు. తిరిగి కాలేజీలో చేరేందుకు ఒక బస్తీలోని ఐదుగురు పిల్లలకు విద్యనందించే బాధ్యతను తీసుకుంటారు. ఆ తర్వాత వీరిద్దరు తిరిగి కాలేజీకి వెళ్లారా? లేదా అన్నదే మిగతా స్టోరీ. Hindi LGBTQ Movie #NukkadNaatak (Hindi) streaming from April 24 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/7wt7ZEVEmO— OTT Trackers (@OTT_Trackers) April 20, 2026 -
ఓటీటీలో హార్డ్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ సినిమా.. తెలుగు రివ్యూ
దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందరో అభం శుభం తెలియని మహిళలు, ఆడపిల్లలు, చిన్నారులు అన్యాయానికి గురవుతున్నారు. వీళ్లలో చాలామందికి సరైన న్యాయం దక్కట్లేదు! ఈ అంశంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి. అయితే దేశంలో రోజుకి 80 అత్యాచారాలు జరుగుతున్నాయనే కాన్సెప్ట్‌తో తీసిన లేటెస్ట్ హిందీ మూవీ 'అస్సి'. రీసెంట్గా జీ5 ఓటీటీలోకి వచ్చిన ఈ హార్డ్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)కథేంటి?పరిమ (కని కుస్రుతి) స్కూల్ టీచర్. భర్త, కొడుకుతో కలిసి సంతోషంగా బతుకుతుంటుంది. ఓ రోజు స్కూల్లో ఆలస్యమై, ఇంటికొస్తుంటుంది. కానీ దారిలో ఈమెపై ఐదుగురు యువకులు దారుణానికి తెగబడతారు. కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పుతూ అత్యాచారం చేస్తారు. చివరకు అపస్మారక స్థితిలో ఉన్న ఈమెని రైల్వే ట్రాక్‌పై పడేస్తారు. తర్వాత ఏమైంది? పరిమకు న్యాయం దక్కిందా? ఈమె తరఫున వాదించిన లాయర్ రావి(తాప్సి)కి ఈ కేసు విచారణ సందర్భంగా ఎదురైన అనుభవాలేంటి? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?అస్సి అంటే హిందీలో ఎనభై(80) అని అర్థం. అంటే మన దేశంలో రోజుకు దాదాపుగా 80 వరకు అత్యాచారాలు జరుగుతున్నాయని ఈ సినిమాతో దర్శకుడు అనుభవ్ సిన్హా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇందులో కళ్లు చెదిరిపోయే ట్విస్టులు ఉండవు. అద్భుతమైన విజువల్స్ కనిపించవు. కానీ చూస్తున్నంతసేపు మన పక్కనే జరిగినట్లు అనిపించే కథ, అంతా అయిపోయిన తర్వాత మనసుని బరువెక్కించే కథనం ఇందులో ఉంటుంది.కథ పరంగా చూస్తే రెగ్యులర్ రొటీన్ కోర్ట్ రూమ్ డ్రామాలానే అనిపిస్తుంది. కొత్తగా ఏముందా అనే సందేహం కలుగుతుంది. కానీ తరచి చూస్తే ఎన్నో విషయాలు అర్థమవుతాయి. మొదలైన ఐదు నిమిషాలకే స్టోరీలోకి వెళ్లిపోతాం. అక్కడి నుంచి తర్వాత ఏమవుతుందా? నిందితులకు శిక్ష పడుతుందా లేదా అనేది చివరి వరకు ఇంట్రెస్టింగ్గా చూపించారు. అత్యాచారానికి గురైన వాళ్లకు నిజమైన న్యాయం దక్కుతుందా? అసలు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాలనే ఆలోచన ఎవరికైనా ఎందుకొస్తుంది? అనే ప్రశ్నలు ప్రేక్షకులకే వేసినట్లు అనిపిస్తుంది.పోలీసులు, లాయర్లు కుమ్మక్కై.. కొన్ని కొన్ని కేసుల్ని, అందులో సాక్ష్యాలని ఎలా తారుమారు చేస్తారనే విషయాన్ని అద్భుతంగా చూపించారు. అత్యాచారం సీన్ చూస్తున్నప్పుడు అసభ్యత ఎక్కడా కనిపించదు గానీ ఓ రకమైన భయం కలుగుతుంది. ఒకవేళ మన ఇంట్లోని ఆడవాళ్లకు ఇలా జరిగితే ఎలా? అని మనసులో అలజడి రేగుతుంది.ఈ సినిమాలో చూడటానికి కొన్ని సీన్స్ సాధారణంగా అనిపిస్తాయి గానీ వాటి మర్మం తెలిసినప్పుడు చిన్నపాటి షాక్ తగులుతుంది. అత్యాచారానికి గురై, కొన్నిరోజుల తర్వాత కోలుకున్న పరిమ.. తిరిగి టీచర్ ఉద్యోగంలో చేరతానని చెప్పినప్పుడు.. విద్యార్థుల గురించి స్కూల్ ప్రిన్సిపల్, పరిమ మధ్య జరిగే సంభాషణ ఒళ్లు గగుర్పొడేలా చేస్తుంది. నేటి సమాజంలో కొందరు టీనేజీ పిల్లలు ఎంత దారుణంగా తయారయ్యారో చెప్పకనే చెబుతుంది.సినిమాలో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి చూపించే రెడ్ స్క్రీన్ గానీ, క్లైమాక్స్‌లో స్కూల్ పిల్లలందరినీ ఎదురుగా కూర్చోబెట్టి జడ్జి, తీర్పు ఇచ్చే సన్నివేశం గానీ బాగుంటాయి. పరిమ కొడుకు పాత్ర అయితే ఇంకా హైలైట్. తల్లిని ఆస్పత్రిలో చేర్చిన దగ్గర నుంచి కోర్టులో వాదనల వరకు ప్రతి విషయాన్ని ఈ పిల్లాడు గమనిస్తుంటాడు. చిన్నతనం నుంచే ఇలాంటివి చూస్తూ పెరిగితే.. పెద్దయ్యాక ఎలాంటి సమస్యని అయినా ఎదుర్కోగల సత్తా పిల్లలకు డెవలప్ అవుతుందని ఈ సీన్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారనిపిస్తుంది.మన ఇంటిలోని ఆడవాళ్లకు ఏదైనా జరగరానిది జరిగితే ఎలా తోడుగా నిలబడాలి? ఎంత కేరింగ్‌గా చూసుకోవాలి అనే విషయాన్ని పరిమ భర్త పాత్రతో అద్భుతంగా చూపించారు. సరైన భద్రత లేని మన దేశంలో ప్రతి ఒక్కరూ ఎంత జాగ్రత్తగా ఉండటం ముఖ్యమో ఈ సినిమాతో పరోక్షంగా హెచ్చరించారు. డబ్బున్న వ్యక్తుల కొడుకులు చాలామంది ఎలా తయారవుతున్నారు? ఇలాంటి వాళ్ల వల్ల సగటు మహిళలు, ఆడపిల్లలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని కూడా చూపించారు. అయితే ఇలాంటి సున్నితమైన అంశం ఆధారంగా సినిమాలు తీయడం కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఎవరు మంచి? ఎవరు చెడు? అని మనం నిర్థారించలేం. దాన్ని కూడా దర్శకుడు చక్కగా బ్యాలెన్సింగ్ చేశాడు. ఇక క్లైమాక్స్‌లో ఓ చిన్న పాప చెప్పే సాక్ష్యంతో మొత్తం కేసు తీరే మారిపోతుంది. సినిమా మొత్తంలో ఇదే హైలైట్ సీన్.ఎవరెలా చేశారు?లాయర్‌గా తాప్సి సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మిగతా పాత్రధారులు కూడా బాగా చేశారు. పరిమి పాత్రలో అత్యాచారానికి గురైన మహిళగా చేసిన కని కుస్రుతి అయితే అద్భుతంగా నటించింది. రైల్వే ట్రాక్‌పై అపస్మారక స్థితిలో పడున్నప్పుడు గానీ, కోలుకున్న తర్వాత ట్రామా అనుభవించే సీన్స్ చూస్తున్నప్పుడు నిజంగా జరిగిందేమో అనిపించేలా ఉంటుంది. సాంకేతికంగానూ సినిమా బాగుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా కచ్చితంగా చూడాలి. ఎందుకంటే చాలా విషయాలు తెలుస్తాయి.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తున్న థ్రిల్లర్'సంభవం అధ్యాయం ఒన్ను' తెలుగు రివ్యూ) -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ కామెడీ సినిమా
మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల నటించిన 'లేచింది మహిళా లోకం' సినిమా నేడు(ఏప్రిల్ 22) ఓటీటీలోకి వచ్చేసింది. సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదలా ఉండగానే మరో తెలుగు సినిమా కూడా సడన్‌గా అందుబాటులోకి వచ్చేసింది. మరో ఓటీటీలోకి వస్తుందని తాజాగా ప్రకటించారు. ఇంతలోనే ఇంకో దానిలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: టాలీవుడ్లో విషాదం.. చనిపోయిన ప్రముఖ దర్శక నిర్మాత)హిట్, యానిమల్ తదితర సినిమాల్లో సహాయ నటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనాథ్ మాగంటి హీరోగా చేసిన మూవీ 'మెన్షన్ హౌస్ మల్లేష్'. గ్రామీణ నేపథ్య కథతో తీసిన ఈ చిత్రానికి బాల సతీష్ దర్శకుడు. మార్చి 06న థియేటర్లలో రిలీజైంది కానీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. వచ్చే వారం నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.'మెన్షన్ హౌస్ మల్లేష్' విషయానికొస్తే.. పల్లెటూరికి చెందిన మల్లేష్(శ్రీనాథ్ మాగంటి) చిన్నప్పటి నుంచే తాగుడికి బానిసవుతాడు. ఇతడికి తన బావ చిన్న పటేల్(రాజేష్)తో గొడవలు ఉంటాయి. ఓ సందర్భంలో తల్లి బలవంతం మీద జ్యోతి(గాయత్రి రమణ)ని పెళ్లి చేసుకుంటాడు. అయితే శోభనం రాత్రి మల్లేష్‌కి షాకింగ్ విషయం తెలుస్తుంది. ఇంతకీ అదేంటి? దానివల్ల మల్లేష్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనేది మిగతా స్టోరీ. మగతనం నిరూపించుకుని భూమిని పొందాల్సిన పరిస్థితి ఓ యువకుడికి వస్తే ఏం చేసాడనే విషయాన్ని ఇందులో కామెడీగా చూపించే ప్రయత్నం చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో ప్రియాంక చోప్రా స్పై థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్) -
ఓటీటీలో ప్రియాంక చోప్రా స్పై థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
మహేశ్-రాజమౌళి 'వారణాసి' సినిమాలో హీరోయిన్గా చేస్తున్న ప్రియాంక చోప్రా.. ఇది రిలీజ్ కావడానికి ముందే స్పై థ్రిల్లర్ సిరీస్‌తో అలరించేందుకు సిద్ధమైపోయింది. 'సిటాడెల్' సిరీస్ రెండో సీజన్‌పై ప్రకటన వచ్చేసింది. ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ గురించి కూడా అప్డేట్ ఇచ్చేశారు. తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రలు చేసిన 'సిటాడెల్' సిరీస్ తొలి సీజన్.. 2023లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. ఇది మిశ్రమ స్పందన అందుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రెండో సీజన్‌ని సిద్ధం చేశారు. మే 06వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి రానుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో పాటు ఈసారి కొత్త మిషన్‌తో అలరించబోతున్నారు.'సిటాడెల్' తొలి సీజన్ విషయానికొస్తే.. ఎఫ్‌బీఐ, రా, ఐఎస్ఐలానే సిటాడెల్ అనేది ఓ స్పై ఏజెన్సీ. ప్రపంచంలోని కొందరు వ్యక్తులు కలిసి దీన్ని ఫ్రాన్స్ వేదికగా ఏర్పాటు చేస్తారు. ఏ ఒక్క దేశానికో అని కాకుండా ప్రజలందరిని రక్షించడమే దీని లక్ష్యం. అయితే సిటాడెల్‌ని నాశనం చేయాలని కొందరు డబ్బునోళ్లు 'మాంటికోర్' అని మరో స్పై సంస్థ ఏర్పాటు చేస్తారు. సిటాడెల్ టాప్ ఏజెంట్స్ అయిన మేసన్ కేన్(రిచర్డ్ మ్యాడెన్), నాదియా సిన్హా(ప్రియాంక చోప్రా)లని అంతం చేసేందుకు మాంటికోర్ ప్రయత్నిస్తుంది. వీళ్ల దాడి నుంచి మేనస్, నాదియా ఎలా తప్పించుకున్నారు? అనేది తొలి సీజన్.అయితే ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చినప్పటికీ హీరోయిన్ సమంతని ప్రధాన పాత్రలో పెట్టి ఈ సిరీస్ రీమేక్ చేశారు. ఇది అస్సలు వర్కౌట్ కాలేదు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా) -
ఓటీటీకి బోల్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సందడి చేసేందుకు మరో సినిమా వచ్చేస్తోంది. తమిళంలో రిలీజైన ప్రేక్షకులను మెప్పించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. సుదర్శన్ గోవింద్, అర్చన రవి జంటగా నటించిన నీ ఫరెవర్ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ ఏప్రిల్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. గత నెలలో థియేటర్లలో కేవలం తమిళంలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. కాగా.. ఈ సినిమాకు అశోక్‌కుమార్ కలైవాణి దర్శకత్వం వహించారు. అశ్విన్ హేమంత్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో వై జీ మహేంద్రన్, రవి, ఎం.జె.శ్రీరామ్, రేతిక శ్రీనివాస్, శ్రీజ రవి, చెల్లా, డాక్టర్ విద్య, వీజే ప్రతు, నోబుల్ కె జేమ్స్, స్నేహ శక్తి కీలక పాత్రల్లో మెప్పించారు. Indha love fake ah thaan thodanguchu, but the feelings got all too real ♥️😢 pic.twitter.com/1vg34zTrlb— Netflix India South (@Netflix_INSouth) April 21, 2026 -
ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా
పీరియాడిక్ సినిమాలు తీస్తూ వచ్చిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రూటు మార్చి ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు తీసిన సినిమా కొన్నాళ్ల క్రితమే థియేటర్లలోకి వచ్చింది. తర్వాత ఓటీటీలోకి కూడా వచ్చింది. ఇప్పుడు మరో దానిలో స్ట్రీమింగ్కి సిద్దమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏంటి మూవీ? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)ప్రస్తుతం చాలా ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్న యువత డ్రగ్స్ వాడకం, మైనర్లపై అత్యాచారాలు తదితర అంశాలతో గుణశేఖర్.. 'యుఫోరియా' సినిమా తీశారు. 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ లీడ్ రోల్ చేయగా భూమిక, గౌతమ్ మేనన్ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి తొలివారంలో థియేటర్లలోకి రాగా రేపటి(ఏప్రిల్ 22) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'యుఫోరియా' విషయానికొస్తే.. చైత్ర(సారా అర్జున్) పెద్దింటి అమ్మాయి. చదువులో టాపర్. ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతుంటుంది. ఓ రోజు తన స్నేహితురాలితో కలిసి పబ్‌కి వెళ్తుంది. అక్కడ ఈమెకు వికాశ్(విఘ్నేశ్ గవిరెడ్డి), అతడి ఫ్రెండ్స్ పరిచయమవుతారు. పబ్ నుంచి తిరిగి వెళ్తున్న టైంలో వికాశ్ గ్యాంగ్.. చైత్రని తమ కారులో ఎక్కించుకుని డ్రగ్స్ మత్తులో దారుణంగా అత్యాచారం చేస్తారు. పేరు మోసిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పిల్లలు నిందితులుగా ఉన్న ఈ కేసు చివరకు ఏమైంది? చైత్రకు న్యాయం దక్కిందా లేదా అనేది మిగతా స్టోరీ.ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలని స్పూర్తిగా తీసుకుని ఈ మూవీ తీశారు. ఈ క్రమంలోనే కొడుకు.. వావివరసలు మరిచి తల్లిపైనే దారుణానికి ఒడిగట్టడం, అత్యాచార సీన్ రీ క్రియేషన్ లాంటి కొన్ని సన్నివేశాలు డిస్ట్రబింగ్‌గా అనిపించాయి. అలా ఈ చిత్రం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) View this post on Instagram A post shared by Guna Handmade Films (@gunahandmadefilms) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. థియేటర్లలోనూ పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. దీంతో చాలామంది దృష్టి ఓటీటీలపై(OTT Movies) పడింది. వీటిలో కొత్త సినిమాలు ఏమున్నాయా? అని చూస్తున్నారు. మరి ముఖ్యంగా తెలుగు చిత్రాలు ఏమేం అందుబాటులో ఉన్నాయా అని సెర్చ్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే గతవారం సంభవం అధ్యాయం ఒన్ను, సుయోధన, ఉస్తాద్ భగత్ సింగ్, యూత్, అస్సీ తదితర చిత్రాలతో పాటు పోచమ్మ అనే తెలుగు సిరీస్ కూడా రిలీజైంది.(ఇదీ చదవండి: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)మరోవైపు ఈ వారం కూడా బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం, ప్రతిఛాయ, హ్యాపీరాజ్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్కి సిద్ధమవుతున్నాయి. ఇవలా ఉండగానే రెండు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇందులో ఒకటి స్ట్రెయిట్ మూవీ కాగా మరొకటి డబ్బింగ్ బొమ్మ.ఈ ఏడాది జనవరి 30న థియేటర్లలోకి వచ్చిన 'జగన్నాథ్'(Jagannath Movie) అనే తెలుగు సినిమా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ప్రస్తుతానికైతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. రాయలసీమ భరత్, నిత్య, అజయ్, బాహుబలి ప్రభాకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.ఇకపోతే 'ఆల్ఫా'(Alpha: Men Love Vengeance Movie) పేరుతో తీసిన కన్నడ డబ్బింగ్ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. రివేంజ్ స్టోరీగా దీన్ని తీశారు. మగాళ్లు అహంకారం, కోపం కారణంగా ఎక్కడివరకు వెళ్తారు? ఈ క్రమంలోనే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు అనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కించారు.(ఇదీ చదవండి: ఓటీటీలో సెన్సేషనల్ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం ఒన్ను' తెలుగు రివ్యూ) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం లాంటి తెలుగు చిత్రాలతో పాటు ప్రతిఛాయ, హ్యాపీరాజ్ లాంటి డబ్బింగ్ మూవీస్ కూడా స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా అన్నట్లు ఓ తెలుగు సినిమా సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటది? ఎందులో అందుబాటులో ఉంది?(ఇదీ చదవండి: కుడివైపు గుండె.. నీలం రంగు శరీరం.. 'చిరంజీవి' గ్లింప్స్)అనుదీప్, అజయ్ కుమార్, వేద్విక తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'మత్తురా'. గతేడాది సెప్టెంబరు 19న థియేటర్లలోకి వచ్చింది. పరిమిత బడ్జెట్, నటీనటులు కొత్తవాళ్లు కావడంతో ఇదొచ్చి వెళ్లిన సంగతి కూడా ఆడియెన్స్‌కి తెలీదు. ఇప్పుడీ మూవీ ఏడు నెలల తర్వాత స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో అందుబాటులో ఉంది.'మత్తురా' విషయానికొస్తే.. నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథ ఇది. మద్యం అలవాటు వారి జీవితాలని ఎలా నాశనం చేసింది? ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొనేలా చేసింది అనే అంశాలతో అడ్వెంచరస్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. పువ్వాళ చలపతి దర్శకత్వం వహించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్) -
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రావట్లేదు. 'గేదెల రాజు' అనే తెలుగు మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది కానీ దీనిపై ఏ మాత్రం బజ్ లేదు. మరోవైపు పాప్ దిగ్గజం మైకేల్ జాక్సన్ బయోపిక్ 'మైకేల్', అలానే లేటెస్ట్ మలయాళ సెన్సేషన్ 'వాలా 2' కూడా తెలుగు డబ్బింగ్ రూపంలో ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న మాజీ సీఎం మనవరాలు)మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వారం దాదాపు 19కి పైగా మూవీస్, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రతిఛాయ, బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం అనే తెలుగు చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. హ్యాపీరాజ్ మూవీ కూడా ఇదే వీకెండ్ వచ్చే అవకాశముంది. ఇంతకీ ఏ సినిమా ఏ రోజు ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 20 నుంచి 26 వరకు)హాట్స్టార్బ్రూక్లిన్ నైన్ నైన్ (ఇంగ్లీష్ కామెడీ సిరీస్) - ఏప్రిల్ 20ప్రతిఛాయ (మలయాళ మూవీ) - ఏప్రిల్ 2424 (హిందీ సిరీస్) - ఏప్రిల్ 24 నెట్ఫ్లిక్స్రెజల్ మేనియా (స్పోర్ట్స్ సిరీస్) - ఏప్రిల్ 19అన్ చూజన్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 21హల్క్ హోగన్: రియల్ అమెరిన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 22స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 23అపెక్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 24సన్ నెక్స్ట్లేచింది మహిళా లోకం (తెలుగు సినిమా) - ఏప్రిల్ 22జీ5బ్యాండు మేళం (తెలుగు మూవీ) - ఏప్రిల్ 24జిరాక్స్ (కన్నడ సిరీస్) - ఏప్రిల్ 24అమెజాన్ ప్రైమ్ఫ్రమ్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 20కెవిన్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 20కిల్లింగ్ గ్రౌండ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 22హ్యాపీరాజ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 24నాటీ బిజినెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24లయన్స్ గేట్ ప్లేగ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 24ఆపిల్ టీవీ ప్లస్క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 22మై బ్రదర్ ద మినోటర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24(ఇదీ చదవండి: యుద్ధాన్ని ముందే అంచనా వేసిన ధనుష్ సినిమా) -
'యూత్'ను ఢీ కొట్టలేకపోయిన పవన్ కల్యాణ్
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ ఒక డైలాగ్ చెప్తారు. 'నా అభిమానుల్ని లెక్కపెట్టడానికి నీ జీవితం మొత్తం సరిపోదు' అంటూ విలన్‌కు కౌంటర్ ఇస్తారు. అయితే, రియాలిటీ మరోలా ఉంది. అందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి. భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారని చెప్పిన పవన్‌కు ఈ చిత్ర ఫలితం పునరాలోచనలో పడేసింది. కెరీర్లోనే ఎక్కువ నష్టాలను మిగిల్చిన చిత్రంగా ఉస్తాద్ భగత్ సింగ్ నిలిచింది. భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారనుకుంటే వాళ్లు కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయారు. చివరకు ఓటీటీలో కూడా ఒక చిన్న సినిమా ఉస్తాద్‌ను దాటి ట్రెండింగ్‌లో నిలిచింది.ఈ వారం ఓటీటీలో చాలా సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. ఉస్తాద్ భగత్ సింగ్ వంటి పాపులర్ సినిమాతో యూత్ అనే చిన్న సినిమా ఢీ కొట్టి ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా యూత్ సినిమా ట్రెండింగ్ చార్టులో 2వ స్థానంలో ఉంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం 3వ స్థానంతో సరిపెట్టుకుంది. పవన్ మూవీకి స్టార్డమ్, క్రేజీ కాంబినేషన్ ఉన్నప్పటికీ, తక్కువ బడ్జెట్‌తో వచ్చిన హిట్ తమిళ సినిమాతో పోలిస్తే ఉస్తాద్ సినిమా ఓటీటీలో కూడా పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. -
'పెద్ది' నటుడి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్
'మీర్జాపుర్' సిరీస్‌తో మున్నాభయ్యాగా ఫేమస్ అయిన దివ్యేందు.. ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' మూవీలో నటిస్తున్నాడు. మరోవైపు ఇతడు లీడ్ రోల్ చేసిన స్పోర్ట్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉండేసరికి సిరీస్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: నటిపై చాహల్ పరువు నష్టం దావా.. వీళ్ల మధ్య అసలేమైంది?)దివ్యేందు, పులకిత్ సామ్రాట్ ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'గ్లోరీ'. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే క్రైమ్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వచ్చే నెల 01వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. 'మీర్జాపుర్' సిరీస్ తీసిన కరణ్ అన్షుమన్ దీని సృష్టికర్త కావడంతో అంచనాలు నెలకొన్నాయి.'గ్లోరీ' సిరీస్ విషయానికొస్తే.. ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా బతికే కోచ్ రఘుబీర్ సింగ్ (సువీందర్ విక్కీ). ఇతడి కూతురు గుడియా (జన్నత్ జుబైర్)పై ఓ రోజు దాడి జరుగుతుంది. మరోవైపు వర్ధమాన బాక్సర్ నిహాల్ సింగ్, అనుమానాస్పద రీతిలో చనిపోతాడు. దీంతో తండ్రి రఘుబీర్‌కి చాన్నాళ్ల పాటు దూరంగా ఉన్న కొడుకులు దేవ్(దివ్యేందు), రవి (పులకిత్ సామ్రాట్) తిరిగి సొంతూరు శక్తిఘడ్కి వస్తారు. తర్వాత ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలోకి మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా
దాదాపు పదేళ్ల క్రితం 'ప్రేమమ్' సినిమాతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న మలయాళ హీరో నివిన్ పౌలీ.. తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేకపోయాడు. చాన్నాళ్ల తర్వాత గతేడాది చివరలో 'సర్వం మాయ' చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. దీని తర్వాత రెండు మూవీస్ చేశాడు. అందులో ఒకటి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)నివిన్ పౌలీ చేసిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ 'ప్రతిఛాయ'. గత నెల 26న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే రొటీన్ స్టోరీ ఉండేసరికి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు దీన్ని నెలలోపే అంటే వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 24) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగు డబ్బింగ్ కూడా ఉందా లేదా అనేది ప్రస్తుతానికి క్లారిటీ ఇవ్వలేదు. దాదాపుగా రావొచ్చనే తెలుస్తోంది.'ప్రతిఛాయ' విషయానికొస్తే.. కేరళ ముఖ్యమంత్రిగా వర్గీస్, నిజాయితీపరుడైన నాయకుడిగా పేరు తెచ్చుకుంటాడు. ఈయన పెద్ద కొడుకు జాన్, రాజకీయాలకు దూరంగా ఉంటూ ఐటీ ఉద్యోగం చేస్తుంటాడు. మరో కొడుకు టోబిన్, తండ్రి అడుగుజాడల్లోనే యువ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. వర్గీస్ తనని లైంగికంగా వేధించాడని నిశా అనే మహిళ ఆరోపణలు చేస్తుంది. దీంతో సీఎం పదవికి వర్గీస్ రాజీనామా చేస్తాడు. ఈ ఆరోపణలు వెనకున్న నిజానిజాలు బయటపెట్టాలని జాన్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలోనే అతడికి తెలిసిన నిజాలేంటి? రాజకీయాల్లో అడుగుపెట్టిన జాన్‌కి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో సెన్సేషనల్ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం ఒన్ను' తెలుగు రివ్యూ) -
ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తున్న థ్రిల్లర్.. తెలుగు రివ్యూ
థ్రిల్లర్ సినిమాలు అనగానే చాలామంది మలయాళీ దర్శకులే గుర్తొస్తారు. మర్డర్ మిస్టరీ అనే కాన్సెప్ట్‌తో ఇప్పటికి ఎన్ని మూవీస్ తీసుంటారో లెక్కలేదు. వీటిలో చాలావరకు అద్భుతమైన హిట్స్ అయ్యాయి. ఇలాంటి ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి. అలా గత నెలలో థియేటర్లలో రిలీజ్ హిట్ అయిన 'సంభవం అధ్యాయం ఒన్ను'.. రీసెంట్గా హాట్‌స్టార్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? నిజంగా అంత బాగుందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)కథేంటి?కేరళ-తమిళనాడు సరిహద్దులోని ఓ పోలీస్ స్టేషన్‌కి ఆనంద్(అస్గర్ అలీ) బదిలీ అవుతాడు. ఊరి లోపలికి వెళ్తుండగా వీళ్ల జీపుని ఢీకొని ఓ పోలీస్ గాయపడతాడు. అతడిని ఆస్పత్రిలో చేర్చుతూ సదరు పోలీస్ దగ్గరున్న వాకీ టాకీని ఆనంద్ తన దగ్గర ఉంచుకుంటాడు. ఈ క్రమంలోనే తను చేరాల్సిన స్టేషన్‌లోని అశోకన్, రెజీ అనే తోటి పోలీసులు ఆనంద్కి పరిచయమవుతారు. అనుకోని పరిస్థితుల్లో వాకీ టాకీలో తనని కాపాడమని ప్రాధేయపడుతున్న పోలీసుని కాపాడేందుకు వీరు ముగ్గురు కలిసి అడవిలోకి వెళ్తారు. కాకి తల, మనిషి శరీరం ఉన్న ఆలయం దగ్గరకెళ్తారు. అప్పటినుంచి వింత సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ అవేంటి? అడవిలో చిక్కుకుపోయిన పోలీసుని వీళ్లు కాపాడారా లేదా? కాకి ఆకారంలో ఉన్న గుడి మిస్టరీ ఏంటి అనేది మిగతా స్టోరీ.ఎలా ఉంది?మలయాళం నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా ఇది. క్రైమ్, మిస్టరీ అనే అంశాలకు టైమ్ లూప్ అనే క్రేజీ కాన్సెప్ట్ జోడించారు. అయితే ఇలాంటి క్లిష్టమైన సబ్జెక్ట్‌ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. కానీ కాస్త కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ అందరికీ అర్థమయ్యేలా తీశారు. ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు.1960లో ఓ విదేశీయుడు, ఓ భారతీయ మహిళ హత్యకు గురవడంతో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే ప్రస్తుతానికి వచ్చేస్తారు. ఆనంద్, అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది నింపాదిగా చూపిస్తారు. తొలి అరగంట కాస్త ఓపిక పట్టాలి. ఎప్పుడైతే ఆనంద్, అశోకన్, రెజీ కలిసి పోలీసుని వెతికేందుకు అడవిలో వెళ్తారో అక్కడి నుంచి ట్విస్టులు మొదలవుతాయి. అప్పటివరకు సాగదీసినట్లు అనిపించిన కథ కాస్త గ్రిప్పింగ్‌గా మారుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటాయి.మరీ ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్‌కి ముందొచ్చే సీన్, ఇంటర్వెల్ బ్లాక్‌లోని సీన్స్ ఆశ్చర్యపరుస్తాయి. అడవిలో జరిగే ఒక్కో సంఘటన చూస్తూ ఇటు ప్రేక్షకుడు, అటు ఆనంద్ మెల్లగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. ఎప్పుడైతే కాకి ఆలయం ఫ్లాష్ బ్యాక్ స్టోరీ రివీల్ అవుతుందో.. అప్పుడు మొదట సీన్‌కి ప్రస్తుతం జరుగుతున్న దానికి లింక్ తెలుస్తుంది. చివరి అరగంట నలభై నిమిషాలైతే వరస పెట్టి ట్విస్టులు వస్తూనే ఉంటాయి. కనీసం వీటిలో ఒక్కటి కూడా మీరు ఊహించలేకపోవచ్చు. అరె అప్పుడే సినిమా అయిపోయిందా అనుకునేలోపు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చి ముగించారు. బోలెడన్ని సందేహాలని వదిలేసి తర్వాత చాలానే భాగాలున్నాయని చెప్పకనే చెప్పేశారు.ఎవరెలా చేశారు?ఈ సినిమాలో నటించిన ఒక్కరూ కూడా మనకు తెలిసిన ముఖాలు కావు. అయినా సరే ఇంట్రెస్టింగ్గా చూస్తాం. ఎందుకంటే అలా నటించారు. చూస్తున్నంతసేపు వాళ్లు యాక్టర్స్, ఇది మూవీ అని అస్సలు గుర్తుకురానంత సహజంగా కుదిరేసింది. దర్శకుడు జీతూ సతీషన్కి ఇదే తొలి సినిమా అంటే అస్సలు నమ్మశక్యంగా అనిపించదు. దాదాపు అడవిలోనే తీశారు. సినిమాటోగ్రఫీ గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ మూవీ మరింత ఎలివేట్ కావడంలో కీలక పాత్ర పోషించాయి. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.మలయాళీ దర్శకులకే ఇలాంటి క్రేజీ ఐడియాలు ఎందుకొస్తాయి? తెలుగు డైరెక్టర్స్‌కి ఎందుకు రావు అని.. సినిమా చూసిన తర్వాత కచ్చితంగా అనిపిస్తుంది. దీని బడ్జెట్ కూడా రూ.5 కోట్లకు మించి ఉండదు. ఓవరాల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే ఓ మంచి క్రేజీ థ్రిల్లర్ చూడాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.- చందు డొంకాన(ఇదీ చదవండి: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో) -
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా
ఈ వారం బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి. వాటిలో సంభవం అధ్యాయం ఒన్ను, ఉస్తాద్ భగత్ సింగ్, యూత్, సుయోధన, అస్సీ, సన్నాఫ్ చిత్రాలతో పాటు పోచమ్మ, మట్కా కింగ్ తదితర వెబ్ సిరీస్‌లు కూడా జాబితాలో ఉన్నాయి. ఇక వచ్చేవారం కూడా మరిన్ని తెలుగు మూవీస్ అందుబాటులోకి రానున్నాయి. అలా ఓ తెలుగు కామెడీ చిత్రం ఓటీటీ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రద్ధా దాస్, హరితేజ, శ్రీరామ చంద్ర తదితరులు నటించిన తెలుగు సినిమా 'లేచింది మహిళా లోకం'. గత నెల 26న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇదొకటి రిలీజైన సంగతి కూడా తెలియనంతగా వచ్చి వెళ్లిపోయింది. ఇప్పుడిదే వచ్చే బుధవారం(ఏప్రిల్ 22) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.భార్యభర్తల రిలేషన్, స్త్రీ పురుషుల మధ్య వివక్ష, విడాకులు, కోర్టు కేసులు తదితర ట్రెండీ అంశాలతో ఈ సినిమాని తీశారు. అయితే ఈ సీరియస్ విషయాల్ని కామెడీ, సెటైరికల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. కార్తిక్-అర్జున్ దర్శకత్వం వహించారు. పాయింట్ బాగున్నప్పటికీ లాజిక్ లేని సీన్లతో విసిగించారు.'లేచింది మహిళా లోకం' విషయానికొస్తే.. నలుగురు మహిళలు (మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రద్ధా దాస్, హరితేజ) తన రోజూవారీ జీవితంలో పురుషాధిక్యత వల్ల చిన్న చిన్న అవమానాలు, ఆంక్షలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకానొక టైంలో వీళ్ల జీవితంలో జరిగిన సంఘటనలు, తీవ్రంగా ఆలోచించేలా చేస్తాయి. అప్పటివరకు మౌనంగా భరిస్తూ వచ్చిన వీళ్లు.. అసలు ఇలానే ఎందుకు ఉండాలి? అని తిరగబడతారు. వీరిలోని ఈ మార్పు వల్ల ఇళ్లల్లో భర్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పశ్చాత్తాపం లేదు.. విడాకులపై తొలిసారి స్పందించిన హన్సిక) -
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో
మలయాళంలో తీసే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఎప్పటికప్పుడు ఓటీటీ డబ్బింగ్‌లు రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తూనే ఉంటాయి. రీసెంట్గా 'సంభవం అధ్యాయం ఒన్ను' అనే టైమ్ లూప్ థ్రిల్లర్ అలరిస్తుండగా.. ఇప్పుడు మరొకటి స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. 'దృశ్యం' తీసిన జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలు తీసే జీతూ జోసెఫ్ నుంచి త్వరలోనే 'దృశ్యం 3' రాబోతుంది. లెక్క ప్రకారం ఈ పాటికే థియేటర్లలోకి రావాలి గానీ వచ్చే నెలకు వాయిదా వేశారు. ఈ దర్శకుడి తీసిన లేటెస్ట్ థ్రిల్లర్ 'వలతు వషత్తే కల్లన్'. దృశ్యం తరహాలో మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. గత నెల చివరలో మలయాళ వెర్షన్ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగు, హిందీ కూడా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చాయి. వన్ టైమ్ వాచబుల్ అని చెప్పొచ్చు.'వలతు వషత్తే కల్లన్' విషయానికొస్తే.. జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎథికల్ హ్యాకర్ శ్యామ్యూల్ జోసెఫ్(జోజూ జార్జ్) గతాన్ని వదిలేసి భార్యకూతురితో కలిసి ప్రశాంతంగా బతుకుతుంటాడు. ఇతడి కూతురు లా స్టూడెంట్, యాక్టివిస్ట్. ఇకపోతే రాజకీయ నాయకుడు కొడుకు ఒకడు ఓ అమ్మాయి మరణానికి కారణమవుతాడు. స్థానిక పోలీసాఫీసర్ ఆంటోని(బిజూ మేనన్) చాలా అవినీతపరుడు. ఈ కుర్రాడిని కాపాడుతాడు. వీళ్లిద్దరిపై సదరు లా స్టూడెంట్ పోరాడుతుంది. ఇంతలోనే ఈమె దారుణ హత్యకు గురవుతుంది. మరి ఇద్దరిలో ఈమెని చంపింది ఎవరు? వారిపై జోసెఫ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా) -
‘ఫ్యామిలీతో చూడదగ్గ కొత్త సినిమా ఏదైనా ఉందా?’
మొబైల్ డేటాతోనో లేకుంటే ఇంట్లో వైఫై నెట్తోనో చేతిలో స్మార్ట్ ఫోన్లో చేతిని పైకి కిందకు ఆడిస్తూ గడిపేస్తున్న కాలమిది. దీనికి తోడు వారాంతంలో ప్రశాంతంగా ఓ సినిమానో, వెబ్‌సిరీసో చూడడం కుటుంబరావులకు పెద్ద టాస్క్‌గా మారింది. ఇప్పటి ప్రేక్షకుల పెద్ద సమస్య ఏమిటంటే.. ఏం చూడాలి? ఏది ట్రెండింగ్‌లో ఉంది? ఏది సరదాగా ఉంటుంది? అనే. ఈ ప్రశ్నలతోనే ఎక్కువ సమయం వృథా అవుతోందట. ఇది ఎంతలా అంటే.. ఒక సినిమా చూసే సమయం కంటే ఎక్కువే!అవును.. ఆశ్యర్యం కలిగించినా పైన చెప్పుకున్నదే ఇదే నిజం. యూజర్టెస్టింగ్ అనే సర్వే ప్రకారం.. మన దేశంలో ఒక యూజర్ ‘ఏం చూడాలి’ అని నిర్ణయించుకోవడంలోనే ఒక ఏడాదిలో 110 గంటలు.. అంటే సుమారుగా ఐదు రోజులు వేస్ట్ చేస్తున్నారని వెల్లడైంది. అలాగే డెలాయిట్ సర్వే ప్రకారం.. ఈ గందరగోళంలోనే ఒక వ్యక్తి రోజుకు సగటున ఆరు రకాల డిజిటల్ వినోదం (సిరీస్, షార్ట్ వీడియోలు, సోషల్ ఫీడ్స్) మధ్య చక్కర్లు కొడుతున్నాడు. అయితే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఈ పరిస్థితి మార్చేయబోతోంది. ఈరోజుల్లో విరామం దొరికితే విశ్రాంతి కోసం కాకుండా వినోదం కోసం వెతికే పనిలోనే బిజీ అయిపోతున్నాం. చాలా ఇళ్లలో ఏం చూడాలి అని ఎంచుకోవడానికి పట్టే సమయం పెరిగిపోతూ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఏం చూడడం బెస్ట్ అనే అడిగేవాళ్లు.. దానికి తమ రివ్యూలతో ఆన్సర్లు ఇచ్చేవాళ్లు పెరిగిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్లే నడుం బిగించాయి. ఇప్పుడు AI ఆధారిత కంటెంట్ డిస్కవరీ వైపు అడుగులు వేస్తున్నాయి. అది ఎలాగంటే.. ఏఐ సెర్చ్ బార్‌లోనూ సాధారణ కీవర్డ్ సెర్చ్ కాకుండా.. అంటే చేతి వేళ్లు నొప్పి పుట్టేలా, రిమోట్ బటన్లు అరిగిపోయేలా టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు.. ‘నేను ఫ్యామిలీతో కొత్త సినిమా ఏదైనా చూడాలనుకుంటున్నా.. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాల్లేని సినిమా ప్లే చేయి’, ‘లేటెస్ట్ రిలీజ్లు ఏమున్నాయో చూపించు’, ‘తక్కువ రన్‌టైంలో పూర్తయ్యే సినిమాలు ఏమైనా ఉన్నాయా?’’ అలా వాయిస్ కమాండ్ ద్వారా కావాల్సినవి ఎంచుకోవచ్చు. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. యూజర్ మూడ్‌ను, సందర్భాన్ని, ఉద్దేశం అర్థం చేసుకుని కూడా సరైన సజెషన్లు ఇస్తుంది. సో.. ప్రేక్షకులు ఇప్పుడు జానర్ మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదు.. ఫీలింగ్స్ చెప్పినా సరిపోతుందన్నమాట!. ‘‘రోజంతా అలసిపోయాను.. రిలాక్సేషన్ కోసం ఫన్నీగా ఏదైనా ఇవ్వు”, ‘‘ఆదివారం సాయంత్రం బయట వాతావరణం వర్షం పడేలా ఉంది.. ఈ మూడ్‌కు తగ్గట్లు మంచి పాటలు ప్లే చేయు’.. ఇలాగన్నమాట. అలాగే ఏఐ కాబట్టి భాషతోనూ పెద్దగా ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. జియో హాట్‌స్టార్ ఓపెన్ఏఐతో కలిసి ChatGPT ఆధారిత వాయిస్ డిస్కవరీని భారతీయ ప్రేక్షకులకు అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ChatGPT ఆధారిత సెర్చ్‌ని మొదట ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ప్రారంభించి.. ఇప్పుడు భారత్‌కు విస్తరించింది. Amazon Prime Video కూడా ఏఐ జానర్ క్లస్టర్లు (fantasy quest, mind‑bending sci‑fi”) చూపిస్తూ యూజర్‌కు ఎంపిక చేసుకోవడంలో సహాయం చేస్తోంది. సో.. ఇకపై ప్రేక్షకులు ఎంత స్క్రోల్ చేసినా ఏదో దొరకడం లేదు అనే సమస్యతో బాధపడాల్సిన అవసరం లేదు. AI ఆధారిత డిస్కవరీ వల్ల ‘ఏం చూడాలి?’ అనే ప్రశ్నకు నేరుగా సమాధానం దొరుకుతుందన్నమాట. -
ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
'కోర్ట్' సినిమాతో గతేడాది అద్భుతమైన హిట్ కొట్టిన రోషన్-శ్రీదేవి జంట మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరిని పెట్టి తీసిన మరో మూవీ 'బ్యాండు మేళం'. ఇప్పుడిది నెలలోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటించారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: వైరల్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా)రోషన్-శ్రీదేవి నటించిన టీనేజీ ప్రేమకథా సినిమా 'బ్యాండుమేళం'. తెలంగాణలోని పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో బావామరదళ్ల మధ్య జరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందు ప్రమోషన్లతో చాలా హడావుడి చేశారు గానీ థియేటర్లలో తేలిపోయింది. ఫ్లాప్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 24) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.'బ్యాండు మేళం' విషయానికొస్తే.. గిరి(హర్ష్ రోషన్) స్కూల్లో పెద్దగా చదవడు. దీంతో ఫెయిల్ అవుతాడు. ఇతడి మరదలు రాజి(శ్రీదేవి) మాత్రం టాప్ ర్యాంకర్. గిరికి ఈమెంటే ప్రాణం. అలానే పాటలు కంపోజ్ చేయడం, పాడటం అన్నాసరే ఇష్టం. ఓ సొంత బ్యాండ్ ట్రూప్‌తో ఊరిలో జరిగే పెళ్లిళ్లల్లో పాటలు అవీ పాడుతుంటాడు. ఎప్పటికైనా రహమాన్ అంత పెద్ద సంగీత దర్శకుడు కావాలనేది ఇతడి కల. ఇదలా ఉంటే ఇతడి మరదలు రాజి.. ఇంజనీరింగ్ కాలేజీమేట్తో లేచిపోతుంది. అతడు మోసం చేశాడని తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు ఆమెని గిరి ఒప్పుకొన్నాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా) -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా
కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి బలగం, కోర్ట్ తదితర సినిమాలతో లీడ్ రోల్స్ చేస్తూ హిట్స్ కొడుతున్న ప్రియదర్శి లేటెస్ట్గా చేసిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలాంటి ప్రచారం లేకుండానే థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు అదే రూట్ ఫాలో అవుతూ ఓటీటీల్లోకి కూడా సైలెంట్ గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు? దీని సంగతేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)ప్రియదర్శి, సాయికుమార్, ద్రిషిక చందర్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'సుయోధన'. వైఎస్ మాధవరెడ్డి దర్శకుడు. గత నెల 27వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. కనీసం ప్రచారం చేయకుండానే రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు మూడు వారాల్లోనే ఎలాంటి ప్రచారం లేకుండా హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేసింది.'సుయోధన' విషయానికొస్తే.. వరుణ్ (ప్రియదర్శి) ఓ ఫోలే ఆర్టిస్ట్. అంటే సినిమాల్లో వినిపించే రకరకాల సౌండ్స్ సృష్టిస్తుంటాడు. ఇతడికి చిన్నప్పటి నుంచి సుయోధన అనే వింత శబ్దం వినిపిస్తూ ఉంటుంది. సరిగ్గా ఆ టైంలో ధుర్యోధనుడి రూపం ఇతడికి కనిపిస్తుంది. అలా జరిగినప్పుడల్లా వరుణ్ చాలా భయపడుతుంటాడు. మరోవైపు వరుణ్ తండ్రి ప్రకాశ్(సాయికుమార్) నాటకాల వేస్తుంటాడు. ఈయనకు ధుర్యోధనుడి పాత్రంటే చాలా ఇష్టం. అలా ఓ సారి ఈ పాత్ర వేసిన తర్వాత ఈయన హత్యకు గురవుతాడు. అసలు సుయోధన అనే శబ్దం వరుణ్‌కి వినిపించడానికి కారణమేంటి? ప్రకాశ్‌ని ఎవరు చంపారనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: OTT: ‘థ్రాష్’ రివ్యూ.. ముచ్చెమటలు పట్టించే థ్రిల్లర్ సినిమా) -
శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్..!
అప్పుడే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడే సందడి. ఈ ఫ్రైడే నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్, తెరచాప, గాలి లాంటి చిత్రాలతో పాటు మలయాళ డబ్బింగ్ సినిమా పల్లి చట్టంబి థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. వీటిలో బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలపై ఆడియన్స్‌లో బజ్ ఏర్పడింది.ఇక ఓటీటీల విషయానికొస్తే తెలుగులో పోచమ్మ వెబ్ సిరీస్, హిందీ నుంచి అస్సీ, దో దివానే షహర్ మే, మట్కా కింగ్ వెబ్ సిరీస్‌లు ఆసక్తిగా ఉన్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. ఇవే కాకుండా కొన్ని చిత్రాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఏ ఓటీటీకి రానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్..దో దివానే షహర్ మే(బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17ఆల్ఫా మేల్స్ సీజన్-5(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ రొమాన్స్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17180(మూవీ)- ఏప్రిల్ 17రూమ్మేట్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17గోరిల్లా స్టోరీ(డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 17ఫుల్ స్వింగ్- సీజన్-4(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 17ట్విస్టెడ్(హాలీవుడ్ మూవీ)-ఏప్రిల్ 17లెగో — ఫ్రెండ్స్ ది నెక్ట్స్ చాప్టర్-(హాలీవుడ్ సిరీస్) -ఏప్రిల్ 17బెబెఫిన్సింగ్-ఎలాంగ్మూవీ ఇన్ టూ ద పింక్‌ఫాంగ్ వరల్డ్(కొరియన్ మూవీ)- ఏప్రిల్ 19అమెజాన్ ప్రైమ్మట్కా కింగ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17బాలిస్టిక్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17బ్రదర్స్ అండర్ ఫైర్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 17ది నాపాబాయ్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17ది విజిలర్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17జీ5..అస్సీ (హిందీ సినిమా)- ఏప్రిల్ 17ఆశకల్ అయిరామ్(మలయాళసినిమా)- ఏప్రిల్ 17ఆహా..పోచమ్మ(తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17బుక్ మై షోది బ్రైడ్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17హెచ్‌బీవో మ్యాక్స్..డస్ట్ బన్నీ(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17హులు..షెల్బీ ఓక్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17లయన్స్ గేట్ ప్లేగుడ్ బాయ్(హాలీవుడ్)- ఏప్రిల్ 17 -
OTT: ‘థ్రాష్’ రివ్యూ.. ముచ్చెమటలు పట్టించే థ్రిల్లర్ సినిమా
భయం....నవరసాలలో ఈ భయానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ సినిమాలలో భయం అనే ఎమోషన్ ను రకరకాలుగా రక్తగట్టిస్తుంటారు దర్శకులు. ఇప్పుడొచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ, సౌండ్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుడిని ముచ్చమటలు పట్టించడం నల్లేరు మీద నడకే. చాలా సినిమాలలో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి కాని కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. పైగా హాలివుడ్ లో థ్రిల్లర్, హారర్ సినిమాలకు కొదవే ఉండదు. గడచిన కొన్నేళ్ళలో నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ అని చెప్పుకునే హాలివుడ్ సినిమాలు ఎన్ని వచ్చినా అలరించినవి కొన్నే. కాని ఇటీవల నెట్ ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అయిన థ్రాష్ సినిమా మాత్రం చూసే ప్రేక్షకులను కుర్చీ అంటుకుపెట్టుకునేలానే కాదు ఒళ్ళంతా ముచ్చెమటలు పోయించినా ఆశ్చర్యపోనక్కరలేదు. హాలివుడ్ టామీవిర్కోలా రాసిన కథను తానే దర్శకత్వం వహించి తెరకెక్కించిన విధానం నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చు. అంతలా ఈ థ్రాష్ సినిమాలో ఏముందో ఓసారి చూద్దాం.అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో అనీవిలే అనే నగరంపై కాటగిరీ5 తో హరికేన్ హెన్రీ విరుచుకుపడుతుంది. ఇంత పెద్ద తుఫాను వస్తుంది అని తెలిసినా తన తన తల్లి ఇల్లుని వదలలేక ఒంటరిగా ఉండిపోతుంది డకోటా.మరో పక్క లీసా తన డెలీవరీ కోసం వెళుతూ డకోటా ఇంటి ముందే నీటిలో చిక్కుకుపోతుంది. ఇంకో వైపు డీ, రాన్ తమ చెల్లేలితోపాటు డబ్బులు కోసం ఆశపడే జంట దగ్గర ఆశ్రయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటారు. అనుకున్నట్టుగానే హరికేన్ ధాటికి అనీవిలే రిజర్వాయర్ గోడ కూడా కూలి నీళ్ళు నగరాన్ని ముంచెత్తుతాయి. నీటి తో పాటు తుఫాను సముద్రంలోని సొర చేపలను కూడా నగరంలోకి తీసుకువస్తుంది. ఇక్కడే ఉంది పెద్ద ట్విస్టు. ఓ పక్క నీళ్ళు, మరో పక్క సొరచేపలు వీటి మధ్య డకోటా, లీసా, అలాగే డీ రాన్ లు ఎలా బ్రతికి బట్టకడతారో అన్నదే థ్రాష్ సినిమా. మొత్తం సినిమాలో ఒకే ఒక దగ్గర దర్శకుడు సినిమా లిబర్టీ తీసుకున్నాడు. మిగతా అంతా మనకు యదార్ధంగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అయ్యాక చాలా కాలం తరువాత మంచి థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అప్పట్లో హాలివుడ్ సినిమా సెన్సేషన్ ట్విస్టర్ తరువాత అంతకన్నా ఎక్కువ థ్రిల్లింగ్ కలిగించే సినిమా ఈ థ్రాష్ అవుతుంది. మస్ట్ వాచ్ ఫర్ థ్రిల్లర్ లవర్స్.- హరికృష్ణ ఇంటూరు -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి యూత్, ఉస్తాద్ భగత్ సింగ్, సంభవం అధ్యాయం ఒన్ను, టోస్టర్, దో దివానే షెహర్ మే తదితర సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు పోచమ్మ, మట్కా కింగ్ సిరీస్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటన్నింటిపైనా బజ్ బాగానే ఉంది. ఇవి కాకుండా ఇప్పుడో తెలుగు చిత్రం సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)సాయి సింహాద్రి, మీరా రాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'సన్నాఫ్'. సీనియర్ నటుడ వినోద్ కుమార్ కీలక పాత్ర చేశారు. తండ్రి కొడుకుల ఎమోషనల్ స్టోరీతో ఈ సినిమా తీశారు. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజ్ కాగా ఇదొచ్చిన సంగతి కూడా ప్రేక్షకులకు తెలియలేదు. కంటెంట్ కావొచ్చు, స్టార్స్ లేకపోవడం వల్ల జనాలు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం నెలన్నర తర్వాత ఆహా ఓటీటీలోకి ఏ మాత్రం హడావుడి లేకుండా వచ్చేసింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి రానుంది.'సన్నాఫ్' విషయానికొస్తే.. భార్య చనిపోవడంతో వెంకట్రావ్(వినోద్ కుమార్) తన కొడుకు ఆనంద్(సాయి సింహాద్రి)ని అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. మరోవైపు చదువులో ఫెయిల్ అవుతూ, అను(మీరా రాజ్) అనే అమ్మాయితో ఆనంద్ ప్రేమలో ఉంటాడు. పెళ్లికి పెద్దలు ఒప్పుకొంటారు. కానీ నిశ్చితార్థం రోజు పనిపాటా లేని తన కొడుక్కి మీ అమ్మాయిని ఎలా ఇస్తారు? అని రచ్చ చేసి కార్యక్రమాన్ని ఆపేస్తాడు. దీంతో అవమానం తట్టుకోలేని ఆనంద్.. తండ్రి నుంచి వారసత్వంగా దక్కాల్సిన ఇల్లు, ఆస్తి కోసం కోర్టుకెక్కుతాడు. తర్వాత ఏం జరిగింది? ఆస్తి ఇవ్వడానికి ఆనంద్కి తండ్రి పెట్టిన కండీషన్ ఏంటి? ఆనంద్ చివరకు ఏం తెలుసుకున్నాడనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పోలీస్ కేసు.. యాంకర్ విష్ణుప్రియకే కలిసొచ్చింది!) -
ఓటీటీకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్
ఓటీటీకి మరో మలయాళ క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ రానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన సంభవం అధ్యాయం ఒన్ను మూవీ ఈ అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. జీతూ సతీషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో కేవలం మలయాళంలోనే రిలీజైన ఈ సినిమా.. ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాన్ని టైమ్‌లూప్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. కాగా.. ఈ మూవీలో అస్కర్ అలీ, వినీత్ కుమార్, అస్సిమ్ జమాల్, సిద్ధార్థ్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి మొదటివారంలో మలయాళంలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మిస్టరీ హారర్‌కు తోడు టైమ్ ట్రావెల్ పాయింట్ కథతో తీర్చిదిద్దడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. Presenting the JioHotstar official trailer of Sambhavam Adhyayam Onnu starring Askar Ali, Vineeth Kumar and Sidharth Bharathan. Streaming exclusively on JioHotstar from April 15.#SambhavamAdhyayamOnnu #Trailer #Thriller #Mystery #Drama #MalayalaMovie #JioHotstar… pic.twitter.com/BFtGtdlRGb— JioHotstar Tamil (@JioHotstartam) April 11, 2026 -
ప్రభాస్ స్పిరిట్.. భారీ ధరకు ఓటీటీ డీల్..!
ప్రభాస్- యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ ప్రభాస్ కెరీర్లో 25వ సినిమాగా నిలవనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ టాలీవుడ్లో వైరల్‌గా మారింది.రూ.250 కోట్ల ఆఫర్..!ఈ సినిమా డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన క్రేజీ టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ ఓటీటీ డీల్ భారీ ధరకు కుదిరినట్లు తెలుస్తోంది. డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.250 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ డీల్‌పై నిర్మాణ సంస్థ కానీ.. ఓటీటీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.మరోవైపు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా దక్కించుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ చరిత్రలోనే భారీ ధరకు ఈ సినిమా రైట్స్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని 2027 మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు ముందే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు జపనీస్, కొరియన్ భాషల్లో కూడా స్పిరిట్ విడుదల కానుంది. -
రాశీఖన్నా బ్లడీ యాక్షన్.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్
టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా ఓ వైపు సినిమాలు చేస్తున్నప్పటికీ మరోవైపు ఓటీటీలోనూ పలు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగానే ఉంది. గతంలో ఫర్జీ, రుద్ర సిరీస్‌ల్లో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ యాక్షన్‌తో అలరించేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రాబోతుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ర్యాపర్ కింగ్.. నటుడిగా పరిచయమవుతున్న సిరీస్ 'లుక్కే'. రాశీఖన్నా, పాలక్ తివారి, శివాంకిత్, లక్ష్య్ వీర్ శరణ్ తదితరుల ప్రధాన పాత్రలు చేస్తున్నారు. మ్యూజికల్ యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. హిమాంక్ గౌర్ దర్శకుడు. పంజాబ్‌లోని ర్యాప్ కల్చర్, డ్రగ్ సిండికేట్, రివేంజ్ తదితర అంశాలతో దీన్ని తీశారు. వచ్చే నెల 8 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి రావొచ్చు.రాశీఖన్నా టాలీవుడ్ కెరీర్ విషయానికొస్తే.. గతేడాది 'తెలుసు కదా' అనే మూవీ చేస్తే ఘోరంగా ఫ్లాప్ అయింది. గత నెలలో 'ఉస్తాద్ భగత్ సింగ్'తో వస్తే ఇది కూడా అదే ఫలితాన్ని అందుకుంది. పవన్ సినిమాలో హీరోయిన్గా చేస్తే అయినా ఫేట్ మారుతుందనుకుంటే.. ఈమె పాత్ర తీరుతెన్నులకు మరింత ట్రోలింగ్కి గురైంది. ఇప్పుడీ సిరీస్‌తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: నువ్వు లేవనే నిజం బాధపెడుతూనే ఉంది: సింగర్ చిత్ర)ab rap aur badla bolega…out loud 🎤🔥#LukkheOnPrime, New Series, May 8 #King #RaashiKhanna #LakshvirSaran #PalakTiwarii #ShivankitParihar #NakulSahdev #KritikaBhardwaj @himankgaur #OptimystixEntertainment #WhiteGuerrilaLLP #VipulDShah @bahlrajesh #AgrimJoshi… pic.twitter.com/hEnvfRqdPN— prime video IN (@PrimeVideoIN) April 14, 2026 -
ఓటీటీలో ఇన్వెస్టిగేటివ్ కోర్ట్‌రూమ్ డ్రామా సినిమా
నటి తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'అస్సీ' (Assi). హిందీ వర్షన్లో ఈ ఏడాది ఫిబ్రవరి 20న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇంటెన్సివ్ కోర్ట్‌రూమ్ డ్రామాను థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించింది. మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కఠినమైన సామాజిక కథాంశంతో అస్పీని తెరకెక్కించారు. ఇందులో తాప్సీ ధైర్యంతో కూడిన న్యాయవాదిగా నటించింది. మలయాళ నటి కని కుస్రుతి అత్యాచార బాధితురాలిగా కన్నీళ్లు తెప్పించే పాత్రలో కనిపించింది.'అస్సీ' (Assi) చిత్రం 2026 ఏప్రిల్ 17 నుండి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, కేవలం హిందీ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రం పితృస్వామ్యం, సామాజిక ఉదాసీనత, బాధితులను నిందించడం, లైంగిక దాడి వల్ల కలిగే దీర్ఘకాలిక మానసిక క్షోభ వంటి ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. ఈ చిత్ర కథను గౌరవ్ సోలంకి, అనుభవ్ సిన్హా రచించి నిర్మించారు. -
హారర్ థ్రిల్లర్ తెలుగు సిరీస్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో సినిమాలతో పాటే అప్పుడప్పుడు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు కూడా వస్తుంటాయి. ఇప్పుడు అలా మిస్టిక్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన సిరీస్ 'పోచమ్మ'. ఆహా ఓటీటీలో ఈ శుక్రవారం(ఏప్రిల్ 17) నుంచి తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఓ గ్రామంలోనే భవంతిలో అడ్డుగా ఉందని పోచమ్మ విగ్రహాన్ని తొలగిస్తారు. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. ఆ ఊరిలోని వ్యక్తులపై పోచమ్మ ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేసింది అనే బ్యాక్ డ్రాప్ స్టోరీతో సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, కన్నడ ప్రముఖ నటుడు అచ్యుత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సిరీస్ ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ) -
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి 'తిమ్మరాజుపల్లి టీవీ', 'బ్యాడ్ బాయ్ కార్తిక్', 'పాపం ప్రతాప్', 'తెరచాప' తదితర తెలుగు సినిమాలతో పాటు 'పల్లి చట్టంబి' అనే డబ్బింగ్ మూవీ.. భూత్ బంగ్లా అనే హిందీ చిత్రం రాబోతున్నాయి. మన దగ్గర రిలీజయ్యేవన్నీ కూడా చిన్న మూవీస్, దానికి తోడు వేటిపైనా అస్సలు బజ్ లేదు.(ఇదీ చదవండి: నా కూతురి రూపంలో ఆమె తిరిగొచ్చింది.. పూర్ణ ఎమోషనల్)మరోవైపు ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్కి సిద్ధమయ్యాయి. వీటిలో మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం వన్', యూత్, పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', మృణాల్ ఠాకుర్ 'దో దివానే షెహర్ మై' మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు టోస్టర్ చిత్రం, పోచమ్మ, మట్కా కింగ్ తదితర వెబ్ సిరీస్‌లు చూడొచ్చనేలా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 13 నుంచి 19వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్టోస్టర్ (హిందీ సినిమా) - ఏప్రిల్ 15యూత్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 16ఉస్తాద్ భగత్ సింగ్ (తెలుగు సినిమా) - ఏప్రిల్ 16బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 16WWE రెజ్ల్ మేనియా 42 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 16దో దివానే షెహర్ మే (హిందీ సినిమా) - ఏప్రిల్ 17ఏ గొరిల్లా స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17రూమ్ మేట్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 17అమెజాన్ ప్రైమ్ఇరవిన్ విళిగళ్ (తమిళ సినిమా) - ఏప్రిల్ 13యుఫోరియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 13అమెరికన్ గ్లాడియేటర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17మట్కా కింగ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 17హాట్స్టార్సంభవం అధ్యాయం వన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 15ట్రైబ్ వర్స్ (హిందీ రియాలిటీ సిరీస్) - ఏప్రిల్ 17ఆహాపోచమ్మ (తెలుగు సిరీస్) - ఏప్రిల్ 17జీ5రుబాబ్ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 14భానుప్రియ భూటేర్ హోటల్ (బెంగాలీ సినిమా) - ఏప్రిల్ 15ఆపిల్ టీవీ ప్లస్మార్గోస్ గాట్ మనీ ప్రాబ్లమ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 15లయన్స్ గేట్ ప్లేగుడ్ బాయ్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 17బుక్ మై షోద బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 17(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ) -
OTT: హాయిగా అనిపించే, ఆహ్లాదం కలిగించే సినిమా కావాలా?
పెద్దవాళ్లకు మధ్య వయస్కులకు కొరియా ఒక దేశం అని మాత్రమే తెలుసునేమో గానీ నేటి యువత, టీనేజర్స్‌కు అదొక ఎమోషన్. కొరియన్ కల్చర్‌కు పట్టం కట్టే వెబ్ సిరీస్, కె–పాప్...వంటివి ఇప్పుడు భారతీయ యువతని ఉర్రూతలూగిస్తున్న అతిపెద్ద వినోదాలు. అలా మన యువత అభిరుచులలో అగ్రగామిగా మారిన ఆ కొరియన్ కల్చర్... బహుశా ఈ సినిమా కధకు స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు.విదేశీ కలల విహారం... ఓ చిన్న గ్రామానికి చెందిన అమ్మాయి తన కలల్ని నమ్ముకుని విదేశాలకు వెళ్లే సినిమా కథలు మనం గతంలో చూశాం. పడమటి సంధ్యారాగం...లాంటి సినిమాల్ని గుర్తుకు తెస్తూనే కొత్తగా అనిపించే సినిమా ‘‘మేడ్ ఇన్ కొరియా’’. తమిళనాడులోని అందాల ఊటీకి దగ్గరలో ఉన్న లవ్ డేల్ అనే చిన్న గ్రామానికి చెందిన షెన్బా అనే యువతి కలల కధే ఈ మేడ్ ఇన్ కొరియా. చిన్నప్పటి నుంచే కొరియా అంటే మక్కువ పెంచుకుంటూ వచ్చిన ఓ అమ్మాయి ఏదో ఒకరోజు అక్కడికి వెళ్లాలని కలలు కంటుంది. అయితే తాను ఆశించిన విధంగా కాకుండా ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసపోయి కొరియాలో అడుగు పెట్టాల్సి రావడం, అనుకోని పరిస్థితుల్లో ఒంటరిగా కనీసం మాట్లాడడానికి తనకు భాష కూడా రాని మనుషుల మధ్య గడపాల్సి రావడం...వీటి వల్ల ఆమె జీవితం ఎలాంటి కొత్త మలుపులు తిరుగుతుంది ఒంటరితనం నుంచి ఆత్మవిశ్వాసం వరకు ఆమె ప్రయాణం ఎలా సాగుతుంది? అనేదే ఈ కథ.కొన్ని నవ్వులు...కొన్ని భావోద్వేగాలు...కథలో కొత్తదనం ఉన్నప్పటికీ, దాన్ని చెప్పే విధానం మాత్రం చాలా సేఫ్‌గా, ఎక్కడా రిస్క్ తీసుకోకుండా సాగుతుంది. ఇది కామెడీ సినిమా కాదు. అలాగే హెవీ మెలో డ్రామా కూడా ఉండదు. కొరియాలో షెన్బా కొత్త జీవితం ప్రారంభించే భాగాలు ఆసక్తికరంగా కొన్ని చోట్ల నవ్విస్తూ సాగుతాయి. అలాగే ప్రత్యేకంగా మంచాన పడి ఉన్న వృద్ధురాలితో పెరిగిన అనుబంధం వారిరువురి నడుమ ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్ మనసును తాకుతాయి. యువత ఆశలకు, తల్లిదండ్రుల నమ్మకాలకు నడుమ సాగే వాగ్వివాదాలు ఎప్పుడూ ఉన్నవే అయినా ఇప్పటికీ ప్రస్తావనార్హమే కాబట్టి ఈ సినిమాలోనూ కొన్ని అలాంటి బలమైన సన్నివేశాలు ఉంటాయి. అవకాశం ఉన్నా సినిమాలో ఎవరినీ విలన్ని చేయకపోవడం హాయిగా అనిపిస్తుంది. అలాగే కధానాయిక పుట్టిన ఊరు లవ్ డేల్ కూడా ప్రకృతి రమణీయతతో అలరారుతూ మనల్ని ఆకట్టుకుంటుంది.ఓజీ చిత్రంలో మనకు సాదా సీదాగా కనిపించిన ప్రియాంక మోహన్ ఈ సినిమా ద్వారా తన నటనలోని సత్తాను మనకు ప్రదర్శిస్తుంది. ఓ అమాయక అబల అనే పరిస్థితి నుంచి ఆత్మవిశ్వాసం గల సబలగా మారే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఆమె నటన ఈ సినిమాకు ప్రధాన బలం కాగా ఇండో–కొరియన్ కల్చర్ మిక్స్ కొత్తగా అనిపించడం మరో బలం.అయితే కథలోని భావోద్వేగాల్ని లోతుగా అన్వేషించే ప్రయత్నం చేయకుండా, సింపుల్‌గా ముగించేయడం ఎమోషన్స్‌ని ఇష్టపడే ప్రేక్షకులకు కొంత మేర నిరాశ కలిగిస్తుంది. ప్రారంభంలో కధానాయికకు కొరియా అంటే ఎంత ఇష్టమో అనేది చెప్పడంలో పెట్టిన శ్రద్ధ...ఆమె కొరియా వెళ్లిన తర్వాత ఆమె పొందిన ఉద్వేగం గురించి చెప్పడం మీద పెట్టలేదు. మొత్తంగా చూస్తే ‘‘మేడ్ ఇన్ కొరియా’’ ఒక లైట్, ఫీల్ గుడ్ సినిమా. ఒక వీకెండ్లో సరదాగా కుటుంబంతో కలిసి ఒక మంచి సినిమా చూసిన ఫీల్‌ని పొందాలంటే నిస్సందేహంగా మేడ్ ఇన్ కొరియా బెస్ట్ ఛాయిస్. ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.


