ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా | Actor Mahendran Nilakanta Movie OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Nilakanta OTT Release: మాస్టర్ మహేంద్రన్ లేటెస్ట్ మూవీ ఓటీటీ డీటైల్స్

Jan 31 2026 10:49 AM | Updated on Jan 31 2026 11:33 AM

Nilakanta Movie OTT Streaming Update

ప్రతివారం థియేటర్లలో అయినా సినిమాలు మిస్ అవుతాయేమో గానీ ఓటీటీల్లో మాత్రం తెలుగు, డబ్బింగ్ చిత్రాలు స్ట్రీమింగ్‌లోకి వస్తూనే ఉంటాయి. అలా వచ్చే వారం రాజాసాబ్, నారీ నారీ నడుమ మురారి లాంటి సంక్రాంతి మూవీస్.. డిజిటల్‌గా అందుబాటులోకి  రానున్నాయి. ఇప్పుడు వీటితో పాటే మరో తెలుగు చిత్రం కూడా ఓటీటీలోకి వచ్చేయనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఏంటా మూవీ?

(ఇదీ చదవండి: 'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?)

బాలనటుడిగా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించిన మహేంద్రన్.. పెద్దయ్యాక 'మాస్టర్' తదితర తమిళ చిత్రాల్లోనూ నటించాడు. ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేశాడు. అలా చేసిన ఓ మూవీ 'నీలకంఠ'. ఈ నెల 2వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న స్టార్స్ లేకపోవడంతో ఎప్పుడొచ్చి వెళ్లిందో అన్నంత వేగంగా మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సన్ నెక్స్ట్‌లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

'నీలకంఠ' విషయానికొస్తే.. సరస్వతిపురం గ్రామం. ఊరిలో ఎవరూ తప్పు చేసినా గ్రామపెద్ద రాఘవయ్య(రాంకీ) కఠిన శిక్షలు విధిస్తుంటాడు. ఇదే ఊరికి చెందిన టైలర్ నాగభూషణం(కంచరపాలెం రాజు) కొడుకు.. పదో క్లాసు చదువుతున్న ఓ తప్పు చేస్తాడు. దీనికి శిక్షగా 15 ఏళ్లపాటు ఊరి దాటి వెళ్లొద్దని రాఘవయ్య ఆదేశిస్తాడు. ఈ కారణం వల్ల నీలకంఠ పెద్ద చదువులు చదవలేకపోతాడు. కబడ్డీ ప్లేయర్ అవుతాడు గానీ శిక్ష వల్ల మండల స్థాయి కబడ్డీ పోటీలకు వెళ్లలేకపోతాడు. మరోవైపు ఇదే ఊరి సర్పంచ్‌(పృథ్వీ) కూతురు సీత(యష్న ముతులూరి)తో నీలకంఠ ప్రేమలో ఉంటాడు. ఓ సందర్భంగా సీత తండ్రితోనే సర్పంచ్ అవుతానని, తర్వాత పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. చివరకు ఏమైందనేదే మిగతా కథ.

(ఇదీ చదవండి: నమ్మలేని పనులన్నీ చేస్తున్న రాజమౌళి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement