వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్ మీడియా వేదికగా 45 ఏళ్ల వయసులో 13% శరీర కొవ్వుని ఎలా తగ్గించుకున్నారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తాను ఎలాంటి స్టెరాయిడ్లు, షార్ట్‌కట్‌లు, ఏఐ సలహాలు తీసుకోలేదని చెప్పారు. నిజానికి వయసు పెరిగే కొద్దీ శరీర కొవ్వు సాధారణంగా పెరుగుతుంది. బరువు స్థిరంగా ఉన్నా కొలెస్టాల్ స్థాయిలు పెరుగుతాయట. పైగా వయసుతోపాటు కండర ద్రవ్యరాశిని కోల్పోతామట. దాంతో చర్మం కింద, పొత్తుకడుపు వంటి అంతర్గత అవయవాలలోకి కొవ్వు విసరల్ ఫ్యాట్‌గా స్టోర్ అవుతుందని చెబుతున్నారు. ఇది టైప్2, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందట.
పైగా రానురాను బరువు తగ్గడం కష్టంగా మారిపోతుందట. పురుషులలో సుమారు 40 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ..టెస్టోస్టెరాన్ క్రమంగా తగ్గడం జరుగుతుంది. దాంతో కండరాలను నిర్మించడం, కొవ్వు పంపిణీ చేయడంలో సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు అంకుర్ వారికూ. అందుకే తాను 3టీ ఫార్ములాతో ఆరోగ్యకరమైన రీతీలో కొలెస్ట్రాల్‌ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఏంటా ఫార్ములా..? ఎలా అనుసరించాలంటే..
T3 ఫార్ములా:
T1 - ట్రాక్
వారానికి సుమారు 0.5 కిలోల బరువు తగ్గడానికి, రోజుకు 300 నుండి 500 కేలరీల స్వల్ప లోటు ఆరోగ్యకరమైనదట.
డైట ప్లాన్..
ఉదయం 9:30 - 1 స్కూప్ వే ప్రోటీన్, క్రియేటిన్, 1 వాల్‌నట్, 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు, 5-6 ఎండుద్రాక్షలు
ఉదయం 11 గంటలకు - 200 గ్రాముల పనీర్/టోఫు/టెంపే, లేదా దాల్ చిల్లా, అప్పుడప్పుడు గుడ్లు.
మధ్యాహ్నం 1 గంటకు - పండ్లు
సాయంత్రం 4 గంటలకు - 2 రోటీలు (ఎమ్మర్ గోధుమ/జొన్న/సోయా బీన్) + కూర + పప్పు + తక్కువ కొవ్వు గల పెరుగు
సాయంత్రం 6:30 గంటలకు - పెరుగుతో 1 స్కూప్ వే ప్రోటీన్
అయితే తనకు ఇష్టమైన చోలే భటూరేని మాత్రం వదిలేయలేదట. అలాగే మిఠాయిని కూడా తిన్నట్లు తెలిపారు. అయితే కేలరీలు బ్యాలెన్స్‌గా ఉండేలా కేర్ తీసుకున్నారట.
T2 - శిక్షణ
గుండె ఆరోగ్యానికి కార్డియో మంచిదే అయినప్పటికీ, వృద్ధులలో దీర్ఘకాలిక కొవ్వు తగ్గడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అత్యంత ప్రభావవంతమైన సాధనం.ఎందుకంటే ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. ఒకేసారి ఎక్కువ కండర సమూహాలను ఉత్తేజపరచడానికి, సిట్-టు-స్టాండ్స్ లేదా మోడిఫైడ్ ప్లాంక్స్ వంటి బహుళ కీళ్లను ఉపయోగించే వ్యాయామాలపై దృష్టి పెట్టాలి.
వ్యాయామ దినచర్య:
టెన్నిస్ - వారానికి 6 రోజులు, 1 గంట (కార్డియో పూర్తయింది)
వెయిట్స్ - వారానికి 6 రోజులు, 45 నిమిషాలు
ప్రతి రోజు: 2 వ్యాయామాలు x 3 శరీర భాగాలకు సంబంధించిన వర్కౌట్లు = 6 వ్యాయామాలు
10-12 సార్లు పునరావృతం చేస్తూ మొత్త మూడు సెట్లు చేయాలి.
T3 - రూపాంతరం
మార్పులను నమోదు చేయడానికి రోజువారీ బరువును, వారపు కొలతలను ట్రాక్ చేసినట్లు తెలిపారు. అలాగే తన ఫోటోలను తన ట్రైనర్‌కు పంపిచినట్లు చెప్పారు.
చాలామటుకు అదే డైట్ ప్లాన్ ఫాలో అయినట్లు తెలిపారు.
సెలవులకు టూర్‌కి వెళ్లేముందు లేదా బ్రేక్ తీసుకోవాలనుకుంటే.. మరింతగా ఈ దినచర్యను వేగవంతం చేసినట్లు తెలిపారు.
శరీరంలోని కొవ్వును తగ్గించడం అంటే మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. ఇక్కడ కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వుని తగ్గించుకుంటే..మొత్తం జీవన నాణ్యతనే మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని అనుభవించవచ్చు అని చెప్పుకొచ్చారు అంకుర్ వారికూ.
మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక, వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు శారీరక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అందువల్ల, కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వును కోల్పోవడం మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు వృద్ధాప్య జీవసంబంధమైన సూచికలను నెమ్మదింపజేస్తుంది.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చిం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను పంపించడం ఉత్తమం.


