breaking news
Ananthapur
-
వసూల్ ‘రాజా’పై వేటుకు రంగం సిద్ధం!
అనంతపురం సెంట్రల్: నగరంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో వసూల్ ‘రాజా’పై చర్యలకు రంగం సిద్ధమైంది. ఆయన అక్రమాలపై నేరుగా ఎస్పీకి ఫిర్యాదులు వెళ్లడంతో విచారించి చార్జ్ మెమో ఇచ్చినట్లు తెలిసింది. త్వరలో ఆయనపై బదిలీ వేటు పడే అవకాశమున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. వివరాలు... నగరంలో వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో అవినీతి, అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. స్టేషన్ పరిధిలో మట్కా, పేకాట, బెట్టింగ్, బియ్యం అక్రమ రవాణా లాంటి అసాంఘిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం షాపులు, బార్లు, ధాబాలు, ముఖ్యమైన షాపుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారని అంతా కోడై కూస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే నెలవారి మామూళ్లు ఫిక్స్ చేసుకున్నారని, ఈ తతంగం మొత్తం సదరు పోలీసు అధికారి కనుసన్నల్లో జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. స్టేషన్లో చాలా మంది కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు ఉన్నప్పటికీ పెత్తనం ఆయనే చెలాయిస్తున్నారు. ఎస్పీ దృష్టికి అక్రమాలు.. సదరు పోలీసు అధికారి అక్రమాలపై గతంలో ‘సాక్షి’లో కథనం వెలువడింది. తాజాగా ఆయన అక్రమాలను స్పెషల్ బ్రాంచ్ వర్గాలు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. వారి నివేదిక ఆధారంగా చార్జ్‌మెమో ఇచ్చినట్లు సమాచారం. ఆయనతో పాటు వత్తాసు పలుకుతున్న స్టేషన్ అధికారికి కూడా చార్జ్ మెమో ఇచ్చినట్లు తెలిసింది. దీన్ని బట్టి అవినీతి అక్రమాల్లో వాటాలున్నట్లు స్పష్టమవుతోంది. అక్రమాల సంగతి పక్కన పెడితే ఎస్పీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓ కార్యక్రమానికి కూడా ఆ అధికారి మోకాలడ్డేందుకు యత్నించినట్లు తెలిసింది. అందరూ తన చెప్పు చేతల్లో ఉన్నారని చెప్పుకుంటూ గతంలో స్టేషన్ బాస్‌లను కూడా బెదిరించినట్లు తెలిసింది. తాజాగా సదరు అధికారికి చార్జ్‌మెమో ఇచ్చిన నేపథ్యంలో వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ప్రక్షాళనకు ఒక అడుగు పడిందని పోలీసు సిబ్బందే చర్చించుకుంటున్నారు. -
మూగజీవాల వేదన పట్టదా?
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఉరవకొండ: జిల్లాలో పశుగ్రాసం కరువై మూగజీవాలు అల్లాడుతున్నా పట్టించుకోరా అంటూ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. మంగళవారం ఎమ్మెల్సీ ఒక ప్రకటన విడుదల చేశారు. కరువు పీడిత అనంతపురం జిల్లాలో ప్రస్తుతం పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి గ్రాసం కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం లారీ గడ్డి రూ.30 వేల నుంచి రూ.32 వేలు పలుకుతోందన్నారు. పశుగ్రాసం దొరక్క రైతులు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం కనీసం దాణా కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచన చేయకపోవడం దుర్మార్గమన్నారు. చాలా మంది పశువులను పోషించుకోలేక కబేళాలకు తరలిస్తున్నారని, పశువులకు గ్రాసం దొరక్క కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు తింటూ వ్యాధుల బారిన పడుతున్నాయని వాపోయారు. అధికారులు వెంటనే నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
పెళ్లి కాలేదని యువకుడి బలవన్మరణం
పెద్దపప్పూరు: ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన పెద్దపప్పూరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన మేరకు.. మండలంలోని నామనాంకపల్లికి చెందిన నాగిరెడ్డి, కాంతమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. చిన్న కుమారుడు విజయ్‌కుమార్ రెడ్డి (31) ఓ ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి తల్లిదండ్రులు విజయ్‌కుమార్‌రెడ్డికి సంబంధాలు చూస్తున్నా పెళ్లి కుదరలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ మేరకు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ బృందాన్ని కలిసిన వైఎస్సార్ టీఏ నాయకులు పుట్టపర్తి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో పలు సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి వెళ్తున్న ఎమ్మెల్సీ బృందాన్ని వైఎస్సార్‌టీఏ నాయకులు మంగళ వారం తిరుపతిలో కలిశారు. ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కల్పలతారెడ్డికి ఉపాధ్యాయ సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీఏ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల అధ్యక్షులు పీవీ రమణారెడ్డి, నాగిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణ పాల్గొన్నారు. -
బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
కణేకల్లు: బడి వేళకు బస్సు నడపాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. నాగేపల్లి రోడ్డుపై ముళ్ల కంపలు వేసి రాకపోకలు స్తంభింపజేశారు. నాగేపల్లికి చెందిన దాదాపు 30 మంది విద్యార్థులు మాల్యం జెడ్పీ హైస్కూలులో చదువుతున్నారు. తొమ్మిది గంటలకు స్కూలు ప్రారంభమవుతుంది. అయితే రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గ్రామానికి ఉదయం 7.30 గంటలకు వస్తోంది. ఆ విద్యార్థులు టిఫిన్ చేసి బస్సు పాయింట్ వద్దకు చేరుకోవడానికి సమయం సరిపోవడం లేదు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఆర్టీసీ బస్సు వస్తోంది. దీంతో అనుకూలంగా లేకపోవడంతో విద్యార్థులు సకాలంలో బడికి వెళ్లలేకపోతున్నారు. పాఠాలు కోల్పోతూ చదువులో వెనకబడిపోతున్నారు. ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా బస్సు వేళలు మారలేదు. మంగళవారం ఉదయాన్నే యూనిఫాంలో బస్‌పాయింట్ వద్దకు చేరుకున్న విద్యార్థులు బడికి వెళ్లలేకపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డుపై ముళ్లకంపలు వేసి ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. బడి వేళకు బస్సు నడుపుతామని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. డ్రైవర్, కండక్టర్ ఆర్టీసీ అధికారులకు ఫోన్ ద్వారా విషయం చేరవేశారు. అయితే అక్కడి నుంచి స్పష్టమైన హామీ మాత్రం రాలేదు. చేసేది లేక విద్యార్థులు ఆందోళన విరమించారు. విద్యార్థులు సహకరించాలి రాయదుర్గం డిపోకు చెందిన బస్సును బళ్లారి వరకు నడుపుతాం. ఈ బస్సు కణేకల్లులో ఉదయం ఆరు గంటలకు బయల్దేరితే దర్గా హొన్నూరుకు ఏడు గంటలకు వెళ్తుంది. అయితే అక్కడి నుంచి బళ్లారికి వెళ్లకుండా... విద్యార్థుల సౌకర్యార్థం తిరిగి కణేకల్లుకు తిప్పుతున్నాం. బిదురకుంతం, మీన్లహళ్లి, గరుడచేడు, తుంబిగనూరు మీదుగా నాగేపల్లికి చేరుకునే సరికి 7.30 అవుతోంది. అయితే బడి వేళ కన్నా ముందుగా వస్తోందని, గంట ఆలస్యంగా నడపండని విద్యార్థులు కోరుతున్నారు. వారి విజ్ఞప్తి మేరకు ఉదయం 7.45 గంటలకు నాగేపల్లికి వచ్చేలా అంటే ప్రస్తుతమున్న సమయం కన్నా 15 నిమిషాలు ఆలస్యంగా నడుపుతాం. విద్యార్థులు కూడా సహకరించి ఆ సమయానికి సిద్ధం కావాలి. – శ్రీనివాసరావు, ఆర్టీసీ డిపో మేనేజర్, రాయదుర్గం -
పంటలకు వన్యప్రాణుల బెడద
● పొలాల్లో కలియదిరుగుతున్న వైనం వజ్రకరూరు: వన్యప్రాణులు పొలాల్లోకి చొరబడుతున్నాయి. పంటలను పెకలించి తినేస్తున్నాయి. దీంతో రైతులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో మండలంలో ప్రధానంగా కంది, వేరుశనగ, సజ్జ, జొన్న, మొక్కజొన్న, వరి, ఆముదం, ప్రొద్దుతిరుగుడు తదితర పంటలు సాగు చేశారు. ఇందులో అధికారిక లెక్కల ప్రకారం 12 వేల హెక్టార్లలో కంది, 300 హెక్టార్లలో వేరుశనగ సాగైనట్లు తెలుస్తోంది. వజ్రకరూరు, కమలపాడు, గూళ్యపాళ్యం, గంజికుంట, తట్రకల్లు, పందికుంట, రాగులపాడు, కడమలకుంట, పీసీ ప్యాపిలి గ్రామాల పొలాల్లోకి జింకలు, కుందేళ్లు, అడవిపందులు తదితర జంతువులు చొరబడుతున్నాయి. పంటలను పెకలించి తింటున్నాయి. కంది పంటను తినేశాయి నేను పది ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. పగలంతా పంటకు కాపలా ఉంటున్నాయి. రాత్రిళ్లు అయితే చాలు జింకలు, కుందేళ్లు, అడవి పందులు చొరబడుతున్నాయి. పంటనంతా తినేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వన్యప్రాణుల నుంచి పంటలను కాపాడేందుకు అధికారులు చొరవ చూపాలి. – కూర్మన్న, రైతు, కమలపాడు మా కష్టాలు ఎవరికి చెప్పాలో..? నాకున్న నాలుగు ఎకరాల్లో కంది సాగుచేశా. ఎకరాకు 10 నుంచి 15 వేల రూపాయలు పెట్టుబడి పెట్టా. జింకల దాడితో పంట మొత్తం దెబ్బతింది. జింకలతో పాటు కుందేళ్లు, అడవి పందుల సంచారంతో పంటలన్నీ దెబ్బతింటున్నాయి. మాకష్టాలు ఎవ రికిచెప్పాలో అర్థంకావడంలేదు. కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాసులు, రైతు, కమలపాడు -
కలకలం రేపిన విద్యార్థుల అదృశ్యం
● 24 గంటల్లోనే ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు వజ్రకరూరు: మండలంలోని కొనకొండ్ల మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పోలీసులు 24 గంటల్లోనే పిల్లల ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉరవకొండ పోలీస్‌స్టేషన్‌లో సీఐ మహానంది మంగళవారం వివరాలు వెల్లడించారు. కొనకొండ్ల మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ప్రశాంత్‌కుమార్, వడ్ల బద్రి సోమవారం సాయంత్రం ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీనిపై పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి వజ్రకరూరు ఎస్ఐ నాగస్వామికి ఫిర్యాదు చేయగా.. విషయాన్ని ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్పీ జగదీష్ వెంటనే స్పందించి గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్‌ని అప్రమత్తం చేశారు. ఉరవకొండ సీఐ, ఎస్ఐ, వజ్రకరూరు, బెళుగుప్ప, విడపనకల్లు ఎస్ఐలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం విద్యార్థులు ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలోని వారి స్నేహితుడు భరత్ ఇంటి వద్ద ఉన్నట్లు గుర్తించారు. వారిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. 24 గంటల్లోనే విద్యార్థుల ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించడంలో శ్రద్ధ వహించిన గుంతకల్లు డీఎస్పీ, ఐదు బృందాలను ఎస్పీ జగదీష్ ప్రత్యేకంగా అభినందించారు. -
ఈసారి అన్నదాతలకు నిరాశే
అనంతపురం సెంట్రల్: అన్నదాతలకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది తుంగభద్ర జలాశయానికి నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా హెచ్చెల్సీకి 15 టీఎంసీల నీరు మాత్రమే కేటాయించారు. అది కూడా తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించనున్నారు. ఈ మేరకు మంగళవారం కర్ణాటకలో జరిగిన తుంగభద్ర బోర్డు మొదటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు హెచ్చెల్సీ ఎస్ఈ సుధాకర్‌రావు తెలిపారు. ఈ ఏడాది ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. భవిష్యత్‌లోనూ పెద్దగా వర్షాలు ఉండకపోవచ్చునని భావించిన తుంగభద్రబోర్డు అధికారులు ఈ ఏడాది జలాశయానికి నీటి లభ్యత 170 టీఎంసీలుగా లెక్క కట్టారు. ఇటీవల తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు జలాశయంలోకి భారీస్థాయిలో నీరు వచ్చింది. ప్రస్తుతం నీటి మట్టం 82.599కు చేరుకోగా 41167 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఈ లెక్కన హెచ్చెల్సీతో పాటు అన్ని ప్రధాన కాల్వలకూ నీటి కేటాయింపులు చేశారు. హెచ్చెల్సీకి దామాషా ప్రకారం 15 టీఎంసీలు విడుదల చేసేలా నిర్ణయించారు. భవిష్యత్తులో నీటి లభ్యత పెరిగితే నీటి కేటాయింపులు పెరిగే అవకాశమూ లేకపోలేదు. మొత్తం తాగునీటికే.. తుంగభద్ర నుంచి హెచ్చెల్సీకి ఈఏడాది అత్యల్పంగా నీరు కేటాయించడంతో రానున్న కాలంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా వచ్చిన నీటిని వచ్చినట్లు రిజర్వాయర్లలో నిల్వ చేయాలని నిర్ణయించారు. కణేకల్లు చెరువు, గుంతకల్లు మున్సిపాలిటీతో పాటు పరిసర గ్రామాలకు తాగునీటిని అందించే ఆర్డబ్ల్యూఎస్ స్కీములకు నీటిని విడుదల చేశారు. తక్కిన నీటిని నేరుగా పీఏబీఆర్‌లో నిల్వ చేయనున్నారు. ఇక్కడి నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తాగునీటి పథకం ద్వారా అనంతపురం నగరపాలకసంస్థకు, శ్రీరామరెడ్డి, సత్యసాయి తాగునీటి పథకాల ద్వారా అన్ని నియోజకవర్గాలకూ నీటిని సరఫరా చేయనున్నారు. సాగు చేయడానికి వీల్లేదుతుంగభద్ర జలాశయంలోకి వచ్చే నీటి లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు చేశారు. ప్రస్తుతం నీటి లభ్యత.. అంచనా ఆధారంగా హెచ్చెల్సీకి 15 టీఎంసీలు కేటాయించారు. ఆ నీటిని మొత్తం తాగునీటికే వినియోగించనున్నాం. ఎక్కడా పంటలు సాగు చేయడానికి వీల్లేదు. నిన్నటి వరకు 500 క్యూసెక్కులు మాత్రమే వచ్చేవి. మంగళవారం నుంచి 800 క్యూసెక్కులకు పెంచాం. గురువారం నాటికి 1500 క్యూసెక్కులు తీసుకోవాలని భావిస్తున్నాం. రైతులు, ప్రజలు సహకరించాలి. – సుధాకర్‌రావు, ఎస్ఈ, హెచ్చెల్సీ హెచ్చెల్సీపై నిరంతర నిఘా అనంతపురం అర్బన్: తుంగభద్ర హై లెవల్ కెనాల్ (హెచ్ఎల్సీ) ద్వారా నీరు వస్తున్నందున కాలువ వెంబడి నిరంత నిఘా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. ఈ నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలన్నారు. హెచ్చెల్సీ ద్వారా వస్తున్న నీటిని ఎవ్వరూ అక్రమంగా వినియోగించకుండా చూసేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు కాలువ వెంబడి నిరంతరం నిఘా ఉంచుతాయన్నారు. ఎవరైనా అక్రమ పద్ధతిలో నీటిని తోడుకోవడం, పైప్‌లైన్ ద్వారా మళ్లించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. హెచ్చెల్సీకి 15 టీఎంసీలే తుంగభద్ర మొదటి బోర్డు సమావేశంలో నిర్ణయం కనిష్ట స్థాయిలో నీటి కేటాయింపులు తాగునీటి అవసరాలకు మాత్రమే -
మాకెందుకీ శిక్ష ‘సర్’
● ప్రహసనంలా అర్హత నిరూపణ● ధ్రువీకరణ పత్రాల సమర్పణకు పోటెత్తిన ఓటర్లు రాయదుర్గంటౌన్: ‘సర్’ సర్వే ఒక ఎత్తయితే.. నోటీసులు అందుకుంటున్న వారు అర్హత నిరూపించుకోవడం మరో ఎత్తుగా మారింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని, వివరాలు తప్పుగా ఉన్న, అనుమానాస్పద, గత ఎస్ఐఆర్ జాబితాతో పోల్చితే ప్రస్తుత జాబితాలో ఇంటి పేరు, అక్షర దోషాలు ఉన్నట్లు రాయదుర్గం నియోజకవర్గంలో గుర్తించిన దాదాపు 40,524 మంది ఓటర్లకు ఎన్నికల అధికారులు బీఎల్ఓల ద్వారా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ బూత్‌ల వారీగా జనరేట్ చేసిన నోటీసులను తేదీల వారీగా ఓటర్లకు అందజేసి విచారణతోపాటు అర్హత నిరూపించుకునేందుకు ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల ధ్రువీకరణపత్రాల్లో ఏదో ఒక సరైన పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ధ్రువీకరణపత్రాలు సమర్పించే కార్యక్రమం రాయదుర్గం మున్సిపాలిటీలో మంగళవారం నుంచి ప్రారంభమైంది. మునిసపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డితోపాటు ఎంపీడీఓ కొండన్న, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ మురళీమోహన్ను ఏఈఆర్‌ఓలుగా నియమించారు. తొలిరోజు వందలాదిమంది ఓటర్లు తమ అర్హత నిరూపణ కోసం ధ్రువీకరణపత్రాలను తీసుకురావడంతో ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. పట్టణంలో దాదాపు 9,349 మందికి నోటీసులు జారీ చేశారు. ధ్రువీకరణపత్రాల విచారణ కార్యక్రమం సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుందని, ఓటర్లు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని, ఎన్నికల సంఘం సూచించిన 11 ధ్రువీకరణపత్రాల్లో ఒక్కటి సమర్పించినా సరిపోతుందని సూచించారు. రోజుకు 400–500 మంది దాకా ఓటర్ల ధ్రువీకరణ జరుగుతున్నట్లు చెప్పారు. -
సామర్థ్యాల ఆధారంగా విద్యాభ్యాసం సాగేలా చూడండి
● జిల్లా విద్యాశాఖ అధికారి ఆయూబ్ హుస్సేన్ అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థులు తమ అనుభవాలు, సామర్థ్యాల ఆధారంగా విద్యను అభ్యసించేలా ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా వ్యవహరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ హుస్సేన్ సూచించారు. జిల్లా సైన్స్ కేంద్రంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్, ఇన్స్పైర్ మనక్, విద్యార్థి విజ్ఞాన్ మంథన్ తదితర వైజ్ఞానిక పోటీలపై మంగళవారం అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ విద్యా ప్రణాళిక–2020కు అనుగుణంగా బట్టీ విధానానికి స్వస్తి పలికి, విద్యార్థుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని పెంపొందించాలని సూచించారు. జిల్లాలోని ప్రతి ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులను వైజ్ఞానిక పోటీలకు నమోదు చేసి జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు తమను తాము జాతి నిర్మాతలుగా భావించి బోధన చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో గుత్తి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కృష్ణయ్య, జిల్లా సైన్స్ సెంటర్ క్యూరేటర్ బాలమురళి, జిల్లా సైన్స్ అధికారి నరసింహారెడ్డి, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త ఆనందభాస్కర్‌రెడ్డి, జిల్లా అకడమిక్ సమన్వయకర్త మేడా ప్రసాద్, రిసోర్స్పర్సన్లు శామ్యూల్ ప్రతాప్, శైలజ, వసంతరాణి, సతీష్ పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభం అనంతపురం: జేఎన్టీయూ (ఏ), జర్మనీ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్లు చేపట్టినట్లు జేఎన్టీయూ(ఏ) వీసీ ఆచార్య సుదర్శనరావు తెలిపారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో ఇద్దరు, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో ఒకరు అడ్మిషన్లు పొందగా.. వీరికి సంబంధిత పత్రాలను రిజిస్ట్రార్ బి.దుర్గాప్రసాద్, అడ్మిషన్ డైరెక్టర్ ఆచార్య సురేష్‌బాబు మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో ఆచార్య నాగప్రసాద్ నాయుడు, ఆచార్య సురేష్‌బాబు, సునీల్ పాల్గొన్నారు. -
1,314 కేసులు.. రూ.10.83 లక్షల వసూళ్లు
● ప్రయాణికులపై రైల్వే అధికారుల కొరడా గుంతకల్లు: ప్రయాణికుల భద్రతతోపాటు రైల్వేకు ఆదాయం చేకూరాలనే ఉద్దేశంతో ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ డీసీఎం మనోజ్ తెలిపారు. సోమవారం గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా ఏసీఎం ధనుంజయ్‌సింగ్ నేతృత్వంలో 74 మంది సిబ్బందితో 28 రైళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 1,314 కేసులు నమోదు చేసి రూ.10,83,950 జరిమానా వసూలు చేసినట్లు వెల్లడించారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 657 మంది నుంచి రూ.6,32,175, సాధారణ టికెట్‌తో ఏసీ బోగీల్లో ప్రయాణిస్తున్న 542 మంది నుంచి రూ.4,19,975, అధిక లగేజ్‌తో ప్రయాణిస్తున్న 115 మంది నుంచి రూ.31,800 అపరాధ రుసుం వసూలు చేసినట్లు వివరించారు. ప్రయాణికులు నిబంధనల ప్రకారం ప్రయాణిస్తూ రైల్వే అభివృద్ధికి సహకరించాలని కోరారు. వ్యక్తి బలవన్మరణం శెట్టూరు: వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల పరిధిలోని బుడ్డయ్యదొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. బుడ్డయ్యదొడ్డికి చెందిన గొల్ల రాజశేఖర్ (39)కు భార్య లక్ష్మీదేవి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజశేఖర్ ఆటోను నడుపుతూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. ఆటో ద్వారా సరిపడా సంపాదన లేకపోవడంతో మదనపడుతుండేవాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి గ్రామ శివారులోని వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మృతుని భార్య లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేపటి నుంచి ఆ రైల్వే గేట్ మూత అనంతపురం సిటీ: జంగాలపల్లి – ప్రసన్నాయపల్లి మధ్య 206/2–4 కి.మీ వద్ద ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్ 125వ నంబర్ గేట్‌ను తాత్కాలికంగా మూసి వేయనున్నట్లు దక్షిణ తీర రైల్వే అనంతపురం ఎస్ఎస్ఈ నీలిశశిధర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైల్వే నిర్వహణ పనుల్లో భాగంగా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకూ ఈ మార్గంలోని గేట్‌ను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. మోటారు వాహనదారులు ఇతర మార్గాల్లో ప్రయాణించాలని కోరారు. యువకుడి ఆత్మహత్య ఉప్పల్ (హైదరాబాద్): యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామంతాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వజ్రకరూరు మండలం పెద్ద చిన్న ప్యాపిలి తండాకు చెందిన ఎం.దేవరాజు నాయక్ బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి రామంతాపూర్‌లోని శ్రీ దుర్గా బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. మంగళవారం టీ తాగి వస్తానని తన సోదరుడు జయరాం నాయక్‌కు చెప్పి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో జయరాం వెతకగా హాస్టల్ బాత్రూమ్లోని వెంటిలేటర్ కిటికీకి ఉరికి వేలాడుతూ కనిపించాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. జయరాం నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సమ్మెలో జూడాలు
అనంతపురం సిటీ: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం జూనియర్ డాక్టర్లు సమ్మెలోకి వెళ్లారు. జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అనంతపురం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మంగళ వారం బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టయిపండ్ సవరణ చేయాలని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సేవలకు అంతరాయం కలగకూడనే ఉద్దేశంతో తాము ఇప్పటి వరకూ వేచి ఉన్నామని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యల్లనూరు ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు అనంతపురం ఎడ్యుకేషన్/ యల్లనూరు: విద్యార్థినుల పట్ల అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. యల్లనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి.శ్రీరామమూర్తిపై ఈ చర్యలు తీసుకున్నారు. పాఠశాలలో 8, 9 తరగతులు చదువుతున్న కొందరు విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించారన్న ఫిర్యాదులు అధికారుల దృష్టికి వెళ్లాయి. దీనిపై యల్లనూరు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. విద్యార్థుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు ఆరోపణలకు సంబంధించిన అంశాలను విచారణలో పరిశీలించినట్లు తెలిసింది. ఎంఈఓ నివేదికను పరిశీలించిన అనంతరం విద్యాశాఖ అధికారులు శ్రీరామమూర్తిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలపై విచారణ నిర్వహించి, నివేదిక ఆధారంగా సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం ప్రస్తుతం విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తదుపరి శాఖాపరమైన చర్యలు నిబంధనల ప్రకారం కొనసాగనున్నాయని డీఈఓ అబ్దుల్ హుస్సేన్ తెలిపారు. జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరిన కృష్ణా జలాలు బెళుగుప్ప: జీడిపల్లి రిజర్వాయర్‌కు మంగళవారం కృష్ణాజలాలు చేరాయి. కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలోని మల్యాల నుంచి ఎనిమిది లిఫ్టుల ద్వారా ఈ నెల ఐదో తేదీ నుంచి కృష్ణా జలాలను రాయలసీమ జిల్లాల వరప్రదాయిని అయిన ‘అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి’ ప్రాజెక్టు కాలువలకు అధికారులు నీటిని పంపింగ్ చేస్తున్నారు. జిల్లాలోని రాగులపాడు వద్ద ఎనిమిదవ నంబర్ పంపుహౌస్ నుంచి కృష్ణాజలాలను సోమవారం నుంచి ఎత్తిపోయడంతో హంద్రీ–నీవా కాలువల ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌కు వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతం రాగులపాడు వద్ద లిఫ్టు పంపుల ద్వారా నీరు ఎత్తిపోతలతో ప్రస్తుతం కాలువల ద్వారా 1800 క్యూసెక్కుల నీరు జీడిపల్లి రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోందని స్థానిక జేఈ పృథ్వీ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 15 రోజులు ఆలస్యంగా జీడిపల్లి రిజర్వార్‌కు కృష్ణాజలాలు వచ్చి చేరాయి. నలుగురు బీఎల్ఓల సస్పెన్షన్ గుత్తి: మున్సిపాలిటీ పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విధుల పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించిన నలుగురు బీఎల్ఓలను సస్పెండ్ చేస్తూ సోమవారం రాత్రి కలెక్టర్ ఆనంద్ ఆదేశాలు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జబ్బార్మియా మంగళవారం చెప్పారు. ‘సర్’ వివరాలను ఎలక్షన్ పోర్టల్‌లో అప్డేట్ చేయలేదు. దీంతో సంబంధిత బీఎల్ఓలు శాంతకుమారి (వార్డు రెవెన్యూ సెక్ట్రెటరీ), బి.అనిల్ బాబు (వార్డ్ డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ), టి.గంగాధర్ (వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రెటరీ), వై.నాగేశ్వరి (వార్డ్ డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ)లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
హనుమా.. మముగనుమా!
● శ్రావణ వేడుకలకు ముస్తాబైన హనుమద్ క్షేత్రాలు ● 15న తొలి శ్రావణ శనివారం పూజలు ● ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు బొమ్మనహాళ్: ఆంజనేయస్వామి దేవాలయాలను దేదీప్యమానం చేసే శుభప్రదమైన శ్రావణ మాసం ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని నేమకల్లు, మురడి, కసాపురం తదితర ఆలయాల్లో శ్రావణంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. శ్రావణంలో రథోత్సవాలు కనులపండువగా సాగనున్నాయి. ఆలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. ప్రతి మంగళ, శనివారాల్లో భక్తులకు అన్నదానం ఉంటుంది. మూడు ఆలయాలను ఒకే రోజు దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ నెలలో మూడు ఆలయాల్లో మొక్కులు తీర్చుకునేందుకు భక్తలు పోటెత్తుతారు. ఈ క్రమంలో భక్తకోటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలు, వసతి గృహాలు సిద్ధం చేస్తున్నారు. మహాపుణ్య ప్రాప్తి.. క్రీ.శ. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయ పాలనలో ఆయన గురువైన వ్యాస మహర్షి ఒకే రోజున నేమకల్లు, మురిడీ, కసాపురం ఆంజనేయస్వామి ఆలయాల్లో విగ్రహాలను ప్రతిష్టించినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. కుహుదోషంతో సింహాసనం కోల్పోయిన శ్రీకృష్ణదేవరాయల దోషం పోయేందుకు 732 ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్టించాలని నిర్ణయించారని, ముందుగా హంపిలో యంత్రోద్ధారక ఆంజనేయస్వామి విగ్రహం, పెనుకొండ వద్ద 103 విగ్రహాలను ప్రతిష్టించి చివరకు నేమకల్లు, మురడి, కసాపురాల్లో ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించినట్లు పెద్దలు చెబుతారు. ఈ క్రమంలోనే విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి మూడడుగుల స్థలాన్ని తీసుకున్న ప్రాంతాలుగా ఉన్నాయని చరిత్ర కారులు గుర్తిస్తున్నారు. శ్రావణ మాసంలో మూడు దేవాలయాల్లో స్వామివారిని దర్శించుకుంటే మహా పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. బాలాలయల్లోనే దర్శనాలు.. నేమకల్లు, మురడి, కసాపురంలో ప్రస్తుతం ఆలయాల జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగమశాస్త్రం ప్రకారం మూలవిరాట్లకు విశ్రాంతి ఇచ్చి బాలాలయాల్లో చెక్కతో రూపొందించిన ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించి నిత్య పూజలు చేస్తున్నారు. బాలాలయాల్లోనే స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చని దేవదాయశాఖ అధికారులు, కమిటీ సభ్యులు తెలిపారు. కసాపురం ఆంజనేయస్వామి దేవాలయం, బాలాలయంలో నేమకల్లు ఆంజనేయస్వామి -
అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం..!
అనంతపురం సెంట్రల్: అనంతలో హైటెక్ వ్యభిచారం గుట్టు బయట పడింది. గుంటూరు, అమలాపురం, రాజమండ్రి ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను, మహిళలను తీసుకొచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. నగరానికి చెందిన విటులను రప్పించి ఎవరికి నచ్చిన వారు.. వారితో గడిపే విధంగా సెటప్ చేశారు. నగరానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయనతో మరికొందరు చోటా నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధర్ధరాత్రి వన్‌టౌన్ పోలీసులు సదరు వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. మొత్తం 10 మంది వేశ్యలు, 10 విటులను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళలను విచారణ నిమిత్తం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నడస్తున్న ఓ హోంకు తరలించారు. ఈ వ్యభిచార కేంద్రం వెనుక పెద్ద రాకెట్ ఉండడంతో కూపీ లాగేందుకు పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. త్వరలో దీనిపై వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి. -
దగ్గుపాటి .. సొంత పబ్లిసిటీ!
అనంతపురం నగర నడిబొడ్డున భారత స్వాతం్రత్యానికి గుర్తుగా క్లాక్ టవర్ నిర్మించారు. చారిత్రక కట్టడాల యాక్ట్ ప్రకారం క్లాక్‌టవర్ చుట్టూ ఎలాంటి బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం నిషేధం. చట్టరీత్యా నేరం.. అయితే ‘ అధికారం మాదే.. మాకెవరు అడ్డు.. చారిత్రక కట్టడం చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం...?’ అన్నరీతిలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జన్మదిన వేడుకల సందర్భంగా క్లాక్ టవర్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నగరపాలక సంస్థ కమిషనర్ జశ్వంతరావును అడగ్గా.. ఆయన స్పందించలేదు. – సాక్షి, ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
తెరపైకి మరో పెద్దపులి మరణం
ఆత్మకూరు రూరల్: నాగార్జునసాగర్–శ్రీశైలం అభయారణ్యంలో పెద్ద పులుల అసహజ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనలపై దర్యాప్తు సాగుతుండగానే మరో పెద్దపులి ఉచ్చులకు చిక్కి మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పులి కళేబరాన్ని రహస్యం గా దహనం చేసినట్లు తెలిసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న కొందరు కిందిస్థాయి అటవీ సిబ్బందిని ఉన్నతాధికారులు విచారిస్తున్నట్లు సమాచా రం. ఈ కేసులో ఇటీవల ఎఫ్‌బీవో నుంచి ఎఫ్ఎస్ఓ గా పదోన్నతి పొందిన ఒక జూనియర్ అధికారిపై వేటు కూడా పడనున్నట్లు చర్చ జరుగుతోంది. గతేడాది వర్షాకాలం ఆరంభంలో నాగలూటి రేంజ్ ఇందిరేశ్వరం సెక్షన్ పరిధిలో ఓ పులి ఉచ్చులో చిక్కుకుని మరణించి కనిపించింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా గుట్టుగా దహ నం చేసినట్లు సమాచారం. ఇటీవల గిద్దలూరు, ఆత్మకూరు డివిజన్లలో 2 పెద్దపులులు అసహజ మరణాలకు గురైన ఘటనలపై దర్యాప్తు జరుపుతున్న క్రమంలో రహస్యంగా మరో పులి కళేబరాన్ని దహనం చేసిన అంశం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై దర్యాప్తు జరుపుతున్నామని, త్వరలోనే ఓ ప్రకటన చేస్తామని ఆత్మకూరు డిడి విగ్నేష్ అపావ్ను చెప్పారు. -
నలుగురు బీఎల్ఓలపై సస్పెన్షన్ వేటు
అనంతపురం అర్బన్: గుత్తి మునిసిపాలిటీకి చెందిన నలుగురు బీఎల్ఓలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. సస్పెండ్ అయిన బీఎల్‌ఓలలో శాంతకుమారి, బి.అనిల్‌బాబు, టి.గంగాధర్, వై.నాగేశ్వరి ఉన్నారు. గుత్తి ఏఈఆర్ఓ, మునిసిపల్ కమిషనర్ ఇచ్చిన నివేదిక మేరకు చర్యలు తీసుకున్నారు. గుత్తి అర్బన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు కొందరు ఉద్యోగులను బీఎల్ఓలుగా నియమించారు. కొత్తగా నియమితులైన బీఎల్ఓల వివరాలను ఎన్నికల పోర్టల్‌లో అప్లోడ్ చేసేందుకు వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) రూపొందించి సంబంధిత బీఎల్ఓల నమోదిత మొబైల్ నంబర్‌కు పంపుతారు. ఓటీపీని ధ్రువీకరించిన తరువాత బీఎల్ఓలు వివరాలను ఎన్నికల పోర్టల్‌లో అప్లోడ్ చేయవచ్చు. అయితే కొత్తగా నియమితులైన బీఎల్ఓలు ఏఈఆర్ఓ అభ్యర్థనలను పెడచెవిన పెట్టారు. దీంతో గుంతకల్లు నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి నివేదిక ఇవ్వడంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. యల్లనూరు జెడ్పీ హైస్కూల్లో కీచక టీచర్! యల్లనూరు: యల్లనూరు జెడ్పీ హైస్కూల్లో ఓ కీచక టీచర్ బాగోతం వెలుగు చూసింది. పాఠశాలలో భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న శ్రీరామమూర్తి 8,9వ తరగతి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తాకుతున్నట్లు తెలిసింది. టీచర్ ఆకతాయి చేష్టలతో విసిగిపోయిన ముగ్గురు విద్యార్థినులు సోమవారం ఎంఈఓ చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగస్వామికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎంఈఓ చంద్రశేఖర్ విద్యార్థినుల ఫిర్యాదును డీవైఈఓకు పంపించారు. విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహంతో హైస్కూల్ వద్దకు చేరుకున్నారు. శిక్షణ నిమిత్తం సదరు ఉపాధ్యాయుడు అనంతపురం వెళ్లాడని తెలియడంతో తిరిగి వెనక్కి వెళ్లారు. నేడు ఐసీసీ భేటీ బొమ్మనహాళ్: తుంగభద్ర నీటి పారుదల సలహా కమిటీ (ఐసీసీ) సమావేశం మంగళవారం జరగనుంది. ప్రస్తుత నీటి నిల్వ, ఇన్‌ఫ్లో, వర్షపాత అంచనాలు, తాగునీటి అవసరాలు, ఆవిరి నష్టం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కాలువలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో మూడు రాష్ట్రాల్లో 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు కాలువల ద్వారా నీటిని ఎప్పటి నుంచి విడుదల చేస్తారన్న అంశంపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పంటకు మాత్రమే నీరు అందించే అవకాశం ఉందని తుంగభద్ర బోర్డు ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. చెలరేగిన మోనీష్, శశాంక్ అనంతపురం: ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగుతున్న ఏసీఏ సీనియర్ మెన్స్ సౌత్‌జోన్ అంతర్ జిల్లా మల్టీడే క్రికెట్ టోర్నీలో చిత్తూరు జట్టు బ్యాటర్లు చెలరేగారు. సోమవారం నెల్లూరు జట్టుతో తలపడిన చిత్తూరు జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 78.3 ఓవర్ల వద్ద 437 పరుగులు సాధించి ఆలౌట్ అయింది. జట్టు బ్యాటర్ కేఆర్ మోనీష్ చౌదరి 115 బంతుల్లో 131 పరుగులు, శశాంక్ శ్రీవాత్సవ్ 103 బంతుల్లో 101 పరుగులు సాధించారు. నెల్లూరు బౌలర్లలో ఎస్.భార్గవ్ మహేష్ 4 వికెట్లు కూలదోశాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన నెల్లూరు జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 4 ఓవర్లలో 11 పరుగులు సాధించింది. ● అనంతపురం, కర్నూలు జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 375 పరుగులు సాధించింది. బ్యాటర్ ఎ.సాయి సూర్యతేజారెడ్డి 133 బంతుల్లో 121 పరుగులు సాధించాడు. తౌఫిక్ హుస్సేన్ 72 బంతుల్లో 66 పరుగులతో రాణించాడు. అనంత బౌలర్లలో పి.గిరినాథరెడ్డి 3 వికెట్లు పడగొట్టాడు. వర్షం కోసం యాగంబెళుగుప్ప: స్థానిక రామేశ్వరస్వామి ఆలయంలో వరుణ దేవుని కరుణ కోసం వరుణ యాగం నిర్వహించారు. 11 మంది వేద పండితులతో కలసి సుంకేసుల సత్యనారాయణరావు వరుణ యాగ పూజాది క్రతువులు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో మూలవిరాట్ వద్ద నీటిలో కూర్చుని జపం చేశారు. ఈ సందర్భంగా వేదపండితుడు సత్యనారాయణరావు మాట్లాడుతూ వానలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. -
‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య
గుంతకల్లు రూరల్: గుంతకల్లు పట్టణంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పట్టణంలోని పక్కీరప్ప కాలనీలో నివాసం ఉంటున్న పెద్ద మస్తాన్, లక్ష్మిదేవి దంపతులకు కుమారుడు తిమ్మప్ప(16)తో పాటు ఓ కుమార్తె ఉన్నారు. గుంతకల్లు నారాయణ కాలేజీలో తిమ్మప్ప ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం తండ్రి పెద్ద మస్తాన్ పని నిమిత్తం ఎమ్మిగనూరు వెళ్లగా, తల్లి లక్ష్మిదేవి స్థానిక ఎస్టేట్ సమీపంలో వినాయక విగ్రహాల తయారీ పనులకు వెళ్లింది. కళాశాల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తిమ్మప్ప తలుపులు వేసుకుని పైకప్పునకు ఉరి వేసుకున్నాడు. అదే సమయానికి ఇంటి వద్దకు చేరుకున్న తల్లి లక్ష్మిదేవి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగులగొట్టి ఉరికి వేలాడుతున్న కుమారుడిని కిందకు దించి వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తిమ్మప్ప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఎయిడ్స్‌పై అవగాహన కల్పించండి అనంతపురం అర్బన్: ఎయిడ్స్‌పై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో ఎయిడ్స్‌పై అవగాహన పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవీ నియంత్రణలో ప్రజల అవగాహనే కీలకమన్నారు. హెచ్ఐవీ వ్యాప్తిని నివారించడం, ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం, సకాలంలో చికిత్స పొందడం, హెచ్ఐవీ సోకిన వ్యక్తులపై వివక్షను తొలగించడం సామాజిక బాధ్యత అన్నారు. ఈ నెల 12 నుంచి అక్టోబరు 12 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. హెచ్ఐవీపై సమాజంలో ఉన్న అపోహలు, వివక్ష తొలగించే అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ఓ మలోల, ఎయిడ్స్ నియంత్రణ అధికారి విజయలక్ష్మి, జిల్లా సూపర్వైజర్లు రమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తులు అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక కొత్తూరు ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో వోకేషనల్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ) కోర్సులో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టును తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.ఉషాకుమారి తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో బయోకెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీలో 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 12లోపు దరఖాస్తులను కళాశాలలో స్వయంగా అందజేయాలని సూచించారు. అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు డెమో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. నేతన్న నేస్తం అక్రమాలపై నిగ్గు తేల్చాలితాడిపత్రిటౌన్: రాజకీయ నాయకులను అడ్డు పెట్టుకుని చేనేత వృత్తికి సంబంధం లేని వ్యక్తులకు నేతన్న నేస్తం పథకం వర్తింపజేశారని పెద్దపప్పూరు మండలానికి చెందిన చేనేత కార్మికులు ఆరోపించారు. అక్రమాలపై నిగ్గు తేల్చాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. పెద్దపప్పూరు మండలంలోని కుమ్మెత, పసలూరు, నరసాపురం గ్రామంలో నిజమైన చేనేతలకు అన్యాయం చేశారన్నారు. 200 యూనిట్ల సబ్సిడీ విద్యుత్, చేనేత మిషన్లు, బ్యాంకు లోన్లు పొందిన తమకు నేతన్న నేస్తం అందలేదని వాపోయారు.ఆయా గ్రామాల సచివాలయ సిబ్బంది, అధికార పార్టీ నాయకులు చేతివాటం ప్రదర్శించారని ఆరోపించారు. వినతిపత్రం అంద జేసిన వారిలో పెద్దన్న, బాలాజీ, గోపాల్, మురళీ, నాగరాజు తదితరులు వున్నారు. ఆ రైతు మృతి కూడేరు: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన ఓ రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కూడేరుకు చెందిన రైతు గొల్ల ఎర్రిస్వామి (30) మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఎర్రిస్వామికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. పొలంలో పంటల సాగుకు చేసిన అప్పులు అధికమై వాటిని తీర్చే మార్గం కానరాక ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రాగులపాడు చేరుకున్న కృష్ణా జలాలు
వజ్రకరూరు: రాగులపాడు సమీపంలోని హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం లిఫ్ట్ వద్దకు కృష్ణా జలాలు చేరుకున్నాయి. ఈ నెల 5న కర్నూలు జిల్లా మల్యాల వద్ద నీటి పంపింగ్ ప్రారంభించగా, 9వ తేదీన అనంతపురం జిల్లాలోకి ప్రవేశించాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వజ్రకరూరు మండలం రాగులపాడు లిఫ్ట్ వద్దకు కృష్ణా జలాలు చేరుకున్నాయి. మొదట ఒక పంపుతో నీటి పంపింగ్ ప్రారంభించిన అధికారులు నీటి ప్రవా హం పెరగడంతో ఆరు పంపులకు పెంచారు. ఈ క్రమంలో హంద్రీ–నీవా ప్రధాన కాలువ నుంచి జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు పరుగులు తీస్తున్నాయి. కృష్ణా జలాల రాకతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాగులపాడు లిఫ్ట్ నుంచి మొత్తం 1,900 క్యూసెక్కుల మేర నీరు పంపింగ్ అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. హంద్రీ–నీవా ఈఈ శ్రీనివాస్‌నాయక్, ఏఈ సురేష్కుమార్నాయక్ కాలువలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. నీటిని తాగు అవసరాలకు మాత్రమే వినియోగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. -
పీఎం శ్రీ పాఠశాలలకు రూ.1.57 కోట్ల నిధులు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా పరిధిలోని 44 పీఎం శ్రీ పాఠశాలలకు 2026–27 విద్యా సంవత్సరంలో వివిధ విద్యా కార్యక్రమాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.1,57,35,000 నిధులు మంజూరు చేసింది. పాఠశాలలకు కేటాయించిన నిధులను మార్గదర్శకాలకు అనుగుణంగా, పారదర్శకంగా విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపయోగించాలని డీఈఓ అయూబ్ హుస్సేన్, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ సూచించారు. సోమవారం సమగ్ర శిక్ష కార్యాలయంలో పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. 2026–27 విద్యా సంవత్సరానికి పాఠశాలలకు మంజూరైన వివిధ గ్రాంట్లు, వాటి వినియోగంపై సమావేశంలో ఏఎంఓ వేణుగోపాల్, అసిస్టెంట్ ఏఎంఓ ఫణిరాజ్ వివరించారు. విద్యా విహార యాత్రలకూ నిధులు వార్షిక గ్రాంట్లతో పాటు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, గ్రీన్ స్కూల్, జాతీయ దినోత్సవాల నిర్వహణ, నో బ్యాగ్ డే, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణ కార్యక్రమం, బాల సంసద్, విద్యా విహార యాత్రలు తదితర కార్యక్రమాలకు నిధులు కేటాయించినట్లు వారు తెలిపారు. మంజూరైన నిధులతో చేపట్టే ప్రతి ఖర్చు, దానికి సంబంధించిన వివరాలను యాప్, పోర్టల్‌లో నమోదు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. 13 నుంచి ఆర్జిత కల్యాణోత్సవాలు కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 13వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 13, 16, 17, 18, 20, 23, 24, 25, 27, 30, 31 తేదీల్లో కలాణోత్సవాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆర్జిత కల్యాణోత్సవ టిక్కెట్ రూ. 6,500గా నిర్ణయించామని, ఒక్కో టికెట్‌పై ఐదుగురిని అనుమతిస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు నేరుగా ఖాద్రీ ఆలయంలో సంప్రదించవచ్చన్నారు. లేకపోతే ఆన్‌లైన్‌లోనూ కల్యాణోత్సవ టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు 9000490670, 9441860432 సంప్రదించాలన్నారు. సరిహద్దు దాటిన తుంగభద్ర జలాలు బొమ్మనహాళ్: తుంగభద్ర జలాలు ఎట్టకేలకు బొమ్మనహాళ్‌లోని ఆంధ్ర సరిహద్దును దాటాయి. జలాశయం నుంచి తాగునీటి అవసరాల కోసం ఈ నెల 1న 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు 4వ తేదీ నాటికి బొమ్మనహాళ్ సరిహద్దులోని 105వ కి.మీ వద్ద ఉన్న రెగ్యులేటర్ వద్దకు చేరింది. దీంతో సరిహద్దు ప్రాంతంలో నీటి రాక ప్రారంభమైంది. అయితే హెచ్చెల్సీ మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 10 నుంచి ఇండెంట్ తీసుకుంటామని అనంతపురం అధికారులు బోర్డు అధికారులకు నివేదించారు. దీంతో సోమవారం ఉదయం 6.30 గంటలకు సరిహద్దులో ఉన్న జలాలను గేట్లు ఎత్తి ఆంధ్రలోకి స్వాగతించారు. ప్రస్తుతం జలాశయం నుంచి సుమారు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
పింఛన్ కోసం పోటెత్తారు
● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతుల వెల్లువ అనంతపురం అర్బన్: సామాజిక భద్రత పింఛన్ల కోసం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు పోటెత్తారు. రెండేళ్లుగా దరఖాస్తు చేసుకుంటున్నా పింఛన్ మంజూరు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, వెంకటనారాయణ, కిరణ్మయితో కలిసి ప్రజల నుంచి 622 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ సమస్యలపై 291 అర్జీలు, ఇతర సమస్యలపై 331 అర్జీలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా పింఛన్ కోసం విన్నవించుకున్నారు. పింఛన్ మంజూరు చేస్తే కుటుంబానికి ఆదరువుగా ఉంటుందని వేడుకున్నారు. అనంతరం అర్జీలపై కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. -
తాడిపత్రిలో పోలీసుల అత్యుత్సాహం
తాడిపత్రిటౌన్: తాడిపత్రిలో పోలీసులు మరోమారు అత్యుత్సాహం ప్రదర్శించారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన ర్యాలీని అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ భగత్‌సింగ్‌నగర్ ప్రధాన రహదారిపై నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి.. అక్కడినుంచి పంపించేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్సీపీ నేతల కార్యక్రమాలకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించడం తగదని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. రెండేళ్లుగా పార్టీ కార్యక్రమాలు ఏవి చేసినా అనుమతి లేదంటూ అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సాగిస్తున్న అరాచకాలను ఐక్యంగా ఎదుర్కొందామని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్‌బాషా, నాయకులు పేరం స్వర్ణలత, కంచం రామ్మోహన్‌రెడ్డి, కందిగోపుల మురళీప్రసాద్‌రెడ్డి, రాబర్ట్, విజయ్‌కాంత్‌రెడ్డి, వేమనాథరెడ్డి, యోగేశ్వర్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్ట్ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని అడ్డుకున్నారన్న సమాచారం తెలియగానే వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు బోరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి తాడిపత్రికి బయలుదేరారు. అయితే వీరిని ముచ్చుకోట వద్దే పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా పెద్దిరెడ్డి, అనంత, నరేష్‌కుమార్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ తమను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ ఉండకూడదని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి చేస్తున్న కుట్రలకు పోలీసులు వత్తాసు పలకడం సరికాదన్నారు. మంత్రి లోకేష్ డైరెక్షన్లోనే డీఎస్సీ అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.లక్షలకు అమ్ముకున్నారన్నారు. -
హామీలు వెంటనే అమలు చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యమబాట పట్టక ముందే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ హెచ్చరించారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో సోమవారం యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దేవేంద్రమ్మ, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు రమణయ్య సంయుక్తంగా యూటీఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవేంద్రమ్మ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతాలపై తప్పుడు లెక్కలతో శ్వేతపత్రాలు విడుదల చేయడంపై ఉన్న శ్రద్ధ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వానికి లేదని విమర్శించారు. వెంటనే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు రమణయ్య మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ అలుపెరుగని పోరాటాలు చేస్తోందన్నారు. జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప మాట్లాడుతూ రీగ్రూపింగ్ స్కేల్స్, మెరుగైన ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్, నోషనల్ ఇంక్రిమెంట్లు, అప్రెంటిస్ విధానం రద్దు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వంటి సమస్యల పరిష్కారంలో యూటీఎఫ్ కీలక పాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ గోవిందరాజులు, సీనియర్ నాయకులు ఈశ్వరయ్య, నాగేంద్ర, అనిల్‌కుమార్, గంగాధర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ -
డ్రైవర్ ముసుగులో కార్ల అపహరణ
రాప్తాడు రూరల్: డ్రైవర్‌గా నటిస్తూ వరుసగా కార్లను చోరీ చేసిన నిందితుడిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.40 లక్షల విలువైన ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం రూరల్ ఇన్చార్జ్ డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ శ్రీకాంత్ యాదవ్ వివరాలను వెల్లడించారు. అనంతపురం రూరల్ మండలం చియ్యేడుకు చెందిన దూదేకుల హైదర్‌వలి అనంతపురం నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కారు యజమానుల వద్ద డ్రైవర్‌గా పని చేయడంతోపాటు, కొందరి నుంచి అద్దెకు తీసుకుని నడుపుతుండేవాడు. చెడు వ్యసనాలకు అలవాటుపడిన హైదర్‌వలి ఆదాయం సరిపోక అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు కార్లను చోరీ చేసి విక్రయించి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల గీతం కళాశాలకు ఎదురుగా ఉన్న బీకేఆర్ హైట్స్ అపార్ట్మెంట్ కింద పార్కింగ్‌లో నిలిపి ఉంచిన కార్లను లక్ష్యంగా చేసుకున్నాడు. డ్యాష్‌బోర్డు కింద ఉన్న వైర్లను కలిపి కార్లను స్టార్ట్ చేసి ఒక్కొక్కటిగా చోరీ చేశాడు. మొత్తం ఐదు కార్లను చోరీ చేసి ఆలమూరు–కక్కలపల్లి రహదారి సమీపంలోని ఓ పాడుబడిన షెడ్లో దాచాడు. వాటిని కర్ణాటకకు తరలించి విక్రయించాలని భావించాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఓ కారును తీసుకుని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని సమాచారంతో పాడుబడిన షెడ్లో దాచిన ఐదు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతపురం రూరల్ డీఎస్పీ పర్యవేక్షణలో నిందితుడిని అరెస్టు చేయడంతోపాటు కార్లను స్వాధీనం చేసుకున్న సీఐ ఎం.శ్రీకాంత్ యాదవ్, ఎస్ఐలు ధరణిబాబు, చైతన్య స్వరూపిణి, వారి సిబ్బందిని ఎస్పీ పి.జగదీష్ అభినందించారు. నిందితుడి అరెస్టు రూ.40 లక్షల విలువైన ఐదు కార్లు స్వాధీనం -
ఈశ్వరా.. ప్రాణం నిలపరా?!
తలుపుల: రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబంలో అనూహ్యంగా సంభవించిన అనారోగ్యం కోలుకోలేని దెబ్బ తీసింది. ఉన్నంతలో సాధారణ జీవితం గడుపుతూ, రేపటి భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్న ఆ పేద గూటిలో ప్రస్తుతం గుండెల్ని పిండేసే విషాదం అలుముకుంది. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం వేపమానుపేట పంచాయతీ కొత్తపూల వాండ్లపల్లికి చెందిన యోగేశ్వర్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండటంతో ఆ కుటుంబం పూర్తిగా రోడ్డున పడింది. ఆయన శరీరంలో తెల్ల రక్త కణాలు ఊహించని విధంగా, అత్యంత వేగంగా పడిపోతుండటంతో ప్రాణాలు గాల్లో దీపంగా మారాయి. ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. చిన్న ఉద్యోగం.. అంతలోనే సంక్షోభం యోగేశ్వర్ రెడ్డి బెంగళూరులో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని కంటికి రెప్పలా పోషించే వారు. కుటుంబానికి ఏకై క జీవనాధారమైన వ్యక్తి ఇలా ఆసుపత్రి పాలుకావడంతో ఆ ఇల్లు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న భార్య, బంధువులు, మిత్రులు ఆస్పత్రి ఖర్చులు భరించలేక కన్నీరుమున్నీరవుతున్నారు. యోగేశ్వర్ రెడ్డి ప్రాణాలు నిలవాలంటే రూ.50 లక్షలకు పైగా భారీ వ్యయంతో కూడిన అత్యవసర చికిత్స అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. ఉన్న భూమిని అమ్మేసినా.. భర్తను కాపాడుకునేందుకు ఆ ఇల్లాలు తన సర్వస్వం ఖర్చు పెట్టింది. తమకున్న ఒకే ఒక్క జీవనాధారమైన వ్యవసాయ భూమిని సైతం విక్రయించి, ఇప్పటివరకు రూ.25 లక్షలను వైద్య ఖర్చుల కోసం వినియోగించింది. ఉన్న ఆస్తిని అమ్ముకున్నా భర్తను ఇంకా ఇంటికి తెచ్చుకోలేకపోయామే అని ఆ భార్య పడుతున్న వేదన వర్ణనాతీతం. ఇప్పటికే సగం ఖర్చు భరించిన ఆ నిరుపేద కుటుంబం ఇప్పుడు రూపాయి కూడా పుట్టని దయనీయ స్థితిలో పడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సను ఇలాగే కొనసాగించాలన్నా, ఆయనకు పూర్తిస్థాయి ప్రాణభిక్ష దక్కాలన్నా తక్షణమే అదనంగా రూ.25 లక్షల ఆర్థిక సహాయం అత్యవసరంగా మారింది. చిరుద్యోగి యోగేశ్వర్ రెడ్డిని కాటేసిన అనారోగ్యం పడిపోతున్న తెల్ల రక్తకణాలతో ఆసుపత్రిలో మృత్యు పోరాటం ఇప్పటికే రూ.25 లక్షలు ఖర్చు పెట్టి సర్వస్వం కోల్పోయిన కుటుంబం చికిత్స కొనసాగాలంటే అదనంగా మరో పాతిక లక్షలు అత్యవసరం తండ్రి ప్రేమకు నోచుకోని 45 రోజుల పసికందుచేయూతే ఆశాకిరణం కళ్లముందే కుటుంబ పెద్ద అవస్థను చూస్తూ ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు కలచివేస్తోంది. సమాజంలోని దాతలు, సేవా సంస్థలు, మానవతావాదులు స్పందించి యోగేశ్వర్ రెడ్డి చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న సహాయం కూడా, అనేక మంది కలిసి అందిస్తే ఒక ప్రాణాన్ని కాపాడటానికి పెద్ద బలంగా మారుతుంది. ఒక్క సహాయం ఒక కుటుంబానికి ఆశను ఇవ్వగలదు. దాతలు తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని నేరుగా ఆ కుటుంబానికి అందించి కనిపించని దేవుడికి ప్రతిరూపాలుగా నిలవవచ్చు. సహాయం చేయాలనుకునే వారు 9494852304 నంబర్‌కు ఫోన్‌పే,గూగుల్‌పే ద్వారా నగదు పంపవచ్చు. లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాండూరు శాఖకు చెందిన అకౌంట్ నంబర్: 30754629889, ఐఎఫ్ఎస్సీ కోడ్:SBIN0010187 ద్వారా కూడా నేరుగా వారి బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ చేసి యోగేశ్వర్ రెడ్డి ప్రాణాలను కాపాడవచ్చు. తండ్రి ప్రేమకు నోచుకోని పసిగుడ్డు ఆ పసిగుడ్డుకు ఇంకా ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు. కేవలం 45 రోజుల వయసు మాత్రమే ఉన్న ఆ పసిబిడ్డ, తండ్రి ఒడిలో తలవాల్చి హాయిగా నిద్రించాల్సిన అపురూపమైన సమయం అది. కానీ, విధి ఆ చిన్నారిపై కనికరం చూపలేదు. పుట్టిన నలభై ఐదు రోజులకే.. కన్నతండ్రి ప్రాణాలతో కొట్టుమిట్టాడాల్సిన దయనీయ స్థితి ఎదురైంది. -
జైనబ్బీ మాత ఉత్సవాలకు వేళాయె
ఉరవకొండ: ఉరవకొండలోని ప్రసిద్ధి గాంచిన హజరత్ బీబీ జైనబ్బీ అమ్మవారి దర్గా హిందూ– ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలుస్తోంది. రాష్ట్రంలోనే ఏకై క అమ్మవారి దర్గా కావడం గమనార్హం. మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఎన్నో ప్రత్యేకతలు.. జైనబ్బీ దర్గా ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. కర్ణాటకలోని గుల్బర్గా దర్గా తరహాలో జైనబ్బీ అమ్మవారి జీవ సమాధిపై గాజు గోపురం అద్భుతంగా ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియా దేశంలోని పవిత్ర మక్కా వద్ద ఉన్న జన్నత్కా దర్వాజ తరహాలో దర్గాకు ప్రధాన ద్వారం నిర్మించారు. అజ్మీర్ దర్గా తరహాలో డేగ్తో పాటు అమ్మవారి సమాధి చుట్టూ ఖరీదైన పాలరాయితో కాంపౌండ్ ఏర్పాటు చేశారు. 12 నుంచి అమ్మవారి ఉత్సవాలు.. ప్రసిద్ధి గాంచిన బీబీ జైనబ్బీ అమ్మవారి ఉరుసు ఈనెల 12న ప్రారంభం కానుంది. మొదటి రోజు గంధం వేడుకలు, 13న ఉరుసు, 14న జియారత్ వేడుకలు నిర్వహించనున్నారు. దీంతో పాటు 13, 14 తేదీల్లో దర్గా ఆవరణలో ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ఖవ్వాలీ పోటీదారులతో గొప్ప ఖవ్వాలీ పోటీలు ఉంటాయి. రాష్ట్రంలోనే ఏకై క అమ్మవారి దర్గా అద్భుతమైన కళాఖండాలతో విరాజిల్లుతున్న వైనం 12 నుంచి అమ్మవారి ఉరుసు చురుగ్గా ఏర్పాట్లు జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక నుంచి కూడా ఉరుసుకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలతో పాటు దర్గాను సుందరంగా ముస్తాబు చేయించాం. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాం. దర్గా కమిటీ సభ్యుల సహకారంతో పాటు అధికారుల సమన్వయంతో ఉరుసును విజయవంతం చేస్తాం. – హోతూరు బాషా, దర్గా కమిటీ అధ్యక్షుడు, ఉరవకొండ -
అనంత పోలీసుల దౌర్జన్యం.. రోడ్డుపైనే పెద్దిరెడ్డి బైఠాయింపు
సాక్షి, అనంతపురం: ఏపీలో దగా డీఎస్సీపై ప్రజాపోరు కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ఆధర్వ్యంలో పోరాటం ఉధృతమైంది. అయితే శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీలను మాత్రమే కాదు.. ఈ దౌర్జన్యకాండను నిలదీస్తున్న వైఎస్సార్సీపీ నేతలను సైతం పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తాడిపత్రి నియోజకవర్గం ముచ్చుకోట వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలో ఇవాళ యువత ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులు మాత్రం అధికార టీడీపీ కార్యక్రమం ఉందంటూ ఆ ర్యాలీని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడిపత్రికి బయల్దేరారు. మార్గమధ్యంలో ముచ్చుకోట వద్ద పోలీసులు ఆయన్ని అడ్డుకోవడంతో.. ఆయన రోడ్డుపైనే బైఠాయించి ఆయన నిరసన తెలియజేశారు. పోలీసులను నిలదీసిన పెద్దిరెడ్డిశాంతియుతంగా నిర్వహించే కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటారని పోలీసులను పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు.. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.డీఎస్సీ అంశంపై ప్రభుత్వంపై విమర్శలుసాక్షితో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైఎస్సార్సీపీ ర్యాలీలను అడ్డుకోవడం దుర్మార్గమని ఆరోపించారు. “మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? మంత్రి లోకేశ్ కనుసన్నల్లోనే డీఎస్సీలో అక్రమాలు జరిగాయి. నైతిక బాధ్యతగా ఆయన రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు.హైవేపై బైఠాయింపుపోలీసుల తీరుకు నిరసనగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు అనంతపురం-తాడిపత్రి హైవేపై బైఠాయించారు. పోలీసుల వ్యవహారశైలిపై నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు వెంకటరెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి కూడా పోలీసుల తీరును తప్పుబట్టారు. శాంతియుత కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. -
ఐషర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
పామిడి: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. సీఐ శివశంకర్ నాయక్ తెలిపిన మేరకు.. ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్, 35 మందితో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. అలాగే, ఐషర్ వాహనం జిమ్ పరికరాలతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతోంది. పొగరూరు గ్రామం వద్ద ఐషర్ వాహనం అదుపుతప్పి నీలూరు పుల్లేటి వంక బ్రిడ్జి ప్రారంభంలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా తిరిగింది. దాని వెనకే వేగంగా వస్తోన్న ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి ఐషర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ రెండు వాహనాలూ బ్రిడ్జిపై నుంచి కిందకు దూసుకువెళ్లి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు ఎడమకాలు విరగ్గా, ఐషర్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. బస్సులోని 25 మంది గాయాలపాలయ్యారు. వారిని స్థానికులు ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో అనంతపురం నుంచి బెంగళూరు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జేడీఏ కార్యాలయమా... గోడౌనా?
ఇతరులు ఆ గదిలోకి వెళ్లడానికి కూడా సాహసించరు. అంత అధ్వానంగా ఉన్న గదిలోనూ ఉద్యోగులు విధిలేక విధులు నిర్వర్తిసున్నారు. పైకప్పు ఊడుతున్నా ప్రభుత్వ సేవలో కొనసాగుతున్నారు. ఇది ఎక్కడో కాదు... గతేడాది ఐఎస్వో సర్టిఫికెట్లు పొందిన అనంతపురం వ్యవసాయశాఖ జేడీఏ కార్యాలయం. కార్యాలయం పరిస్థితి దారుణంగా ఉంది. అందులోనూ ఒక గది అయితే మరీ భయంకరంగా ఉండటం గమనార్హం. ప్రమాదకరంగా పైకప్పులు ఊడిపోతూ ఇనుపరాడ్లు కనిపిస్తున్నాయి. గోడలన్నీ తేమ, పాచిపట్టి సిమెంటు ఊడిపోతోంది. ఫైళ్లు, గోడలు, కుర్చీలపై దుమ్ము ధూళి పేరుకుపోయింది. కంప్యూటర్లు, ఫైళ్లు, బీరువాలకు పాతచీరలు, చిన్నపాటి గుడ్డలతో కప్పిపెట్టడంతో చూసేందుకు అసహ్యంగా కనిపిస్తోంది. గాలి,వెలుతురు సరిగా లేక ఉద్యోగులు అతికష్టమ్మీద విధులు నిర్వర్తిస్తున్నారు. ఎక్కడా చూసినా చిందర వందరగా పాతసామాన్లు పెట్టే గదిలా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నా మరమ్మతులు చేద్దామనే ఆలోచన కూడా ఉన్నతాధికారులకు రాకపోవడం గమనార్హం. – అనంతపురం అగ్రికల్చర్: -
లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతి
తాడిపత్రి రూరల్: పట్టణ సమీపంలోని తేరన్నపల్లి క్రాస్ సమీపంలో లారీ డ్రైవర్ నాగేంద్ర (46) అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు తాడిపత్రి అప్‌గ్రేడ్ పోలీసుస్టేషన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన వివరాలమేరకు... నంద్యాల జిల్లా అవుకు మండల కేంద్రానికి చెందిన నాగేంద్ర 20 ఏళ్లుగా లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 2న గుండ్ల శింగవరం గ్రామానికి చెందిన క్లీనర్ రామకృష్ణారెడితో కలిసి మంగళూరుకు లారీ లోడ్ తీసుకొని వెళ్లారు. ఈనెల 8న భార్య వెంకటలక్ష్మికి నాగేంద్ర ఫోన్ చేసి కొందరితో గొడవ జరిగిందని ఫోన్లో చెప్పాడు. ఆమె భయంతో తాడిపత్రి అప్‌గ్రేడ్ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు నాగేంద్ర ఆచూకీ కోసం ప్రయత్నించినట్లు సీఐ పేర్కొన్నారు. అయితే తేరన్నపల్లి క్రాస్ వద్ద నాగేంద్ర శవాన్ని కొనుగొన్నామని తెలిపారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో చనిపోవడానికి అధిక మద్యం కారణమా, లేక లారీ యజమాని, క్లీనర్‌తో జరిగిన గొడవలో చనిపోయాడా అన్నది తేలాల్సి ఉందన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. -
సానుకూలంగా స్పందించాలి
ఉద్యోగ, పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. ఈనెల 15వ తేదీలోగా పీఆర్సీ నియామకం, ఐఆర్ ప్రకటన, పెండింగ్ డీఏలు, అరియర్లు, ఎస్ఎల్ చెల్లింపులకు సంబంధించి నిర్ణయం ప్రకటించాలంటూ ప్రభుత్వానికి మా రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అల్టిమేటం ఇచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. – ఆర్.ఎన్.దివాకర్‌రావు, జిల్లా చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి -
ఆదివాసీలు.. జీవ వైవిధ్య సంరక్షకులు
అనంతపురం: అనాది కాలంగా వస్తున్న సంప్రదాయాలు, సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్న ఆదివాసీలు సామాజిక, వైవిధ్యభరితమైన జీవ సంరక్షకులని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ పాల్గొని.. ఏకలవ్యుడు, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్, సంత్ సేవాలాల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆదివాసీ సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ ప్రకృతితో మమేకమై జీవిస్తూ తరతరాలుగా తమ విలువైన సంప్రదాయాలను కాపాడుతున్న ఆదివాసీ సమాజం దేశానికి ఎంతో గర్వకారణమన్నారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, విద్య, ఉపాధి, ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస నాయక్ (బాబు) మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో గిరిజనులకు రక్షణ కరువైందని విమర్శించారు. అనంతపురం నగరానికి చెందిన తన్మయి అనే గిరిజన విద్యార్థి హత్యకు గురైనా..ఇప్పటి దాకా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ దాసరి వాసంతి సాహిత్య, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అశ్వత్థనాయక్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మొఘల్ సైఫుల్లా బేగ్, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎద్దుల అమర్నాథరెడ్డి, మాజీ కార్పొరేటర్ గుణశేఖర్ బాబు, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శివశంకర్ నాయక్, ఎం.రామకృష్ణ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రవికుమార్ నాయక్, నగర అధ్యక్షుడు గుజ్జల శివయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు నాయక్, ఆదినాయక్, హనుమంతు నాయక్, పి.లక్ష్మణ నాయక్, మురళీ నాయక్, జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున నాయక్ పాల్గొన్నారు. -
అనంతపురం మెడికల్ కాలేజీకి జాతీయ స్థాయిలో 127వ ర్యాంక్
అనంతపురం సిటీ: జాతీయ స్థాయిలోని మెడికల్ కళాశాలలకు ఇండియన్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఐఐఆర్ఎఫ్) 2026 సంవత్సరానికి ప్రకటించిన ర్యాంకింగ్‌లో అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 127వ ర్యాంక్ దక్కింది. దేశీయంగా ఎంపిక చేసిన 144 కళాశాలల్లో మౌలిక వసతులు, బోధనా ప్రమాణాలు, వైద్య విద్య నాణ్యత, పరిశోధన, వనరులు, పరిశ్రమలతో అనుసంధానం, విద్యార్థుల ప్లేస్మెంట్, కేరీర్ అవకాశాలు, బాహ్య నిపుణుల అభిప్రాయాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ర్యాంక్‌లను ఐఐఆర్ఎఫ్ ప్రకటించింది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు మెడికల్ కళాశాలలకు ఉత్తమ ర్యాంక్ దక్కడం గమనార్హం. జాతీయ స్థాయిలో 13వ ర్యాంక్‌తో విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండగా, దాని తర్వాత గుంటూరు మెడికల్ కళాశాలకు 50వ ర్యాంక్, కర్నూలు మెడికల్ కళాశాలకు 57వ ర్యాంక్, కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్‌కు 59వ ర్యాంక్, తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌కు 69వ ర్యాంక్, విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌కు 109వ ర్యాంక్ దక్కాయి. -
ప్రైవేట్ ‘మెడికల్’ దోపిడీ
అనంతపురం సిటీ: జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీ, పీఎంపీలకు కమీషన్ల ఎర వేస్తూ కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అక్రమ దందా కొనసాగిస్తున్నాయి. రోగి ఆస్పత్రిలో చేరితే యాజమాన్యాలకు పండుగే అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. మరోవైపు హాస్పిటల్‌కు అనుబంధంగా సొంతంగా మెడికల్ షాపులు నిర్వహిస్తున్నాయి. తమకు ఎక్కువ లాభం ఉండే మందులను కనీసం ఐదు నుంచి పది రకాలు రాస్తూ అక్రమార్జనకు తెరలేపారు. రోగికున్న జబ్బుకు అవసరమున్నా... లేకున్నా రాసేస్తున్న పలు రకాల మందుల బిల్లులు రూ.వేలల్లో ఉండడం గమనార్హం. ఆఫర్ల ముసుగులో రోగుల జేబుకు చిల్లు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యులు రాస్తున్న మందులు వారి మెడికల్ షాప్‌లో తప్ప మరెక్కడా లభ్యం కాకపోవడం గమనార్హం. అవసరం ఉన్నా.. లేకున్నా పదుల సంఖ్యలో మందులు రాయడంతోపాటు సొంత మెడికల్ షాపుల్లోనే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆర్ఎంపీలు సైతం మెడికల్ షాప్ నిర్వాహకులతో కుమ్మకై కమీషన్ల కోసం మోతాదుకు మించి మందులు రాస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గిఫ్ట్‌లు, విదేశీ టూర్, కమీషన్లు అంటూ మందుల విక్రయాలపై ఫార్మా కంపెనీలు ఇస్తున్న ఆఫర్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో కంపెనీలు ఇచ్చిన టార్గెట్ మేరకు మందులు, సిరప్లు, సూదిమందులను రాస్తున్నారు. అయితే వీటితో ఫలితం లేకపోవడంతో రెండు, మూడు రోజుల చికిత్స అనంతరం పరిస్థితి విషమించిందని కర్నూలు, బెంగళూరుకు రెఫర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా తమ ఆస్పత్రి అంబులెన్స్‌లనే పంపుతూ మరో దోపిడీకి తెరలేపుతున్నారనే ఆరోపణలుఉన్నాయి. ఇంటిల్లిపాది వాడాలని.. విజయవాడలోని ఓ విద్యాసంస్థ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న మా కొడుకు గత వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చాడు. అప్పటికే దురదతో చాలా ఇబ్బంది పడుతుండడంతో మాకు తెలిసిన ఓ ఆర్ఎంపీ తెలిపిన ప్రముఖ చర్మవైద్య నిపుణుడి వద్దకు పిలుచుకెళ్లాను. అక్కడి డాక్టర్ కొన్ని మందులు రాసి, మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ వాడాల్సిందేనని, లేకపోతే వ్యాధి నయం కాకుండా తిరగబెడుతూ ఉంటుందని భయపెట్టారు. దీంతో రూ.5 వేలకు పైగా ఖర్చు పెట్టి మందులు కొనుగోలు చేసి ఇంట్లో ఉన్న ముగ్గురమూ వాడాం. నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ కొన్ని రకాల మందులు, నాలుగు ఆయింట్మెంట్లు సీల్ కూడా తీయనివి మా ఇంట్లోనే ఉన్నాయి. అవసరానికి మించి ఎక్కువ మందులు రాశారనేందుకు ఇంతకన్నా ఉదాహరణ మరొకటి ఉండదు. – రామసుబ్బయ్య, వ్యాపారి, అనంతపురం జిల్లాలో పలు ప్రైవేట్ ఆస్పత్రులు మెడికల్ మాఫియాకు తెరలేపాయి. రోగుల ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందినకాడికి దోచుకుంటున్నాయి. ప్రత్యేకంగా పీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆయా హాస్పిటళ్లకు రోగులను తరలించుకుంటున్నాయి. జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల దందా మాఫియాగా మారిన యాజమాన్యాలు ఆర్ఎంపీ, పీఎంపీలకు కమీషన్లు సొంతంగా మెడికల్ షాపుల నిర్వహణతో దోపిడీ -
మళ్లీ ఒక్కటైన దంపతులు
ధర్మవరం అర్బన్/ముదిగుబ్బ: విడాకులు తీసుకున్న దంపతులను డీఎస్పీ జగన్నాథ్‌రాజు కౌన్సెలింగ్ ఇచ్చి మళ్లీ ఒక్కటి చేశారు. ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం విడిపోయిన భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వివరాలు... పట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగారెడ్డిపల్లికి చెందిన అశ్విని, ఆమె భర్త శ్రీనివాసులుకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే విభేదాల కారణంగా ఏడాది క్రితం వారు విడాకులు తీసుకున్నారు. ఇటీవల నాగారెడ్డిపల్లిలో పర్యటించిన డీఎస్పీకి అశ్విని కుటుంబ సమస్యలపై విన్నవించింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసులుతో పాటు వారి కుటుంబ సభ్యులతో డీఎస్పీ మాట్లాడారు. అందరినీ డీఎస్పీ కార్యాలయానికి పిలిపించారు. శ్రీనివాసులు తన భార్య అశ్వినితో సఖ్యతగా కుటుంబ జీవితాన్ని కొనసాగించేందుకు అంగీకరించారు. డీఎస్పీ ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో దంపతులను తిరిగి ఒక్కటిగా చేశారు. దీంతో అశ్విని, శ్రీనివాసులుతో పాటు వారి బంధువులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. విభేదాలతో ఏడాది క్రితం విడాకులు తీసుకున్న అశ్విని, శ్రీనివాసులు పోలీసుల కౌన్సెలింగ్‌తో కలిసి జీవించేందుకు అంగీకారం -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. భూసమస్యలకు సంబంధించిన అర్జీలను కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో అధికారులకు అందజేయాలన్నారు. ప్రజలు తమ అర్జీలో ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని తెలిపారు. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థినుల అదృశ్యంఅనంతపురం సెంట్రల్: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అనంతపురంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు జేఎన్‌టియూలో చదువుతున్నారు. నాలుగురోజుల క్రితం కళాశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ముగ్గురు విద్యార్థినులు మాత్రమే వెళ్లారని, ఇందులో ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని తెలిసింది. దీంతో జేఎన్టీయూ కాలేజీలో ఏవైనా ఇబ్బందులున్నాయా, మరే ఇతరత్ర సమస్యలతో వెళ్లారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా ముగ్గురు విద్యార్థినుల్లో ఒకరు తిరిగి వచ్చినట్లు సమాచారం. అయితే దీన్ని ఇంకా ధ్రువీకరించలేదు. చదువుతోనే గిరిజనుల జీవితాల్లో మార్పు అనంతపురం ఎడ్యుకేషన్/ టవర్‌క్లాక్: చదువుతోనే గిరిజనుల జీవితాల్లో మార్పు వస్తుందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అనంతపురంలోని గిరిజన భవన్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్టీ కమిషన్ సభ్యులు పి.వెంకటప్ప, రాష్ట్ర ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు సభావత్ సోమ్లానాయక్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గిరిజన బాలికల కోసం ఏర్పాటు చేస్తున్న వసతి పాఠశాలలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాల్యవివాహాలు జరగకుండా చూడాలని కోరారు. అనంతరం వివిధ గిరిజన గురుకుల పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి కుష్బూ కొఠారి, ప్రిన్సిపాళ్లు మసూద్ వలి, ప్రవీణ్‌కుమార్, కేశవ నాయక్, డీవీఎంసీ సభ్యుడు పోలా మహేష్, సాకే వీరాంజనేయులు, మహేష్ నాయక్, శివశంకర్ నాయక్, అశ్వర్థ నాయక్, కావేటి ఉమామహేశ్వరి, సాకే ముసలయ్య, మల్లికార్జున నాయక్, ముత్యాలమ్మ, రవికుమార్ నాయక్ పాల్గొన్నారు. జవహర్ నవోదయ దరఖాస్తులకు నేటితో ఆఖరు లేపాక్షి: జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశం కోసం సోమవారంలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11, 12 తేదీల్లో దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చన్నారు. నవంబర్ 28న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఎంపికై న విద్యార్థులకు 12వ తరగతి వరకు ఉచిత విద్య, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. గ్రామీణ విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. -
అసహనం.. అనర్థం!
అనంతపురం సిటీ: జిల్లా సర్వజనాస్పత్రిని అసహనం అనే రుగ్మత ఆవరించింది. కోవిడ్ – 19 సమయంలో తమకు, తమ కుటుంబాలకు ప్రమాదం పొంచి ఉంటుందని తెలిసినా రోగుల సంరక్షణకే వైద్యులు, నర్సులు తొలి ప్రాధాన్యతినిస్తూ వచ్చారు. ఈ క్రమంలో చాలా మంది వైద్యులు, నర్సులు ప్రాణాలను సైతం కోల్పోయారు. ప్రస్తుతం అంతటి దారుణమైన పరిస్థితులు నేడు లేకున్నా... ఎందుకో తెలియని అసంతృప్తి.. అసహనం జీజీహెచ్‌లోని వైద్యులు, సిబ్బందిలో వ్యక్తమవుతోంది. ఇది అక్కడ అందుతున్న వైద్య సేవలపై పడుతోంది. అడుగడుగునా అసహనం సర్వజనాస్పత్రిలో అడుగు పెట్టింది మొదలు సెక్యూరిటీ సిబ్బంది నుంచి వైద్యుల వరకూ ప్రతి ఒక్కరి నుంచి రోగులు అసహనాన్ని చవిచూడాల్సి వస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది లెక్కలేని తనంతో వ్యవహరిస్తూ ఒక్క చోట స్థిరంగా కూర్చొనివ్వడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక ఓపీ చీటీ తీసుకుని వైద్యుడి వద్దకెళితే... అక్కడ వార్డు బాయ్ పెత్తనం ఆషామాషీగా ఉండడం లేదు. జబ్బులతో బాధపడుతున్న వారి పట్ల కనీస సానుభూతి చూపకుండా దురుసుగా వ్యవహరిస్తూ వివాదానికి తెరతీస్తున్నారు. ఇంత చేసినా చివరకు వైద్యుడి గదిలో రోగులను గుంపుగుంపులుగా పంపించేస్తుంటారు. దీంతో చికిత్సలు కాస్త యాంత్రికంగా మారిపోతున్నాయి. తమను వేధిస్తున్న జబ్బు గురించి రోగులు వివరించబోయినా అక్కడ వినే ఓపిక వైద్యుల్లో ఉండడం లేదు. మార్పు తెచ్చే చిన్నపాటి ఓర్పు వైద్యులు తమ కోపాన్ని రోగులపై చూపించడం అసాధారణం. గతంలో ఎన్నడూ లేనంతగా సర్వజనాస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంటే సర్వజనాస్పత్రి వైద్యులపై నమ్మకం పెరిగిందనేందుకు ఇదే నిదర్శనం. ఇలాంటి తరుణంలో రోగులతో అర్థవంతమైన సంభాషణలతో చికిత్స అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న పాటి ఓర్పుతో ఇది సాధ్యమవుతుందని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. పరువు పోవడం తప్ప.. జబ్బు బారిన పడిన వారు ఏన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చివరకు చికిత్స కోసం ఆస్పత్రికి వస్తుంటారు. అయితే వారి వేదనను సానుకూలంగా అర్థం చేసుకుని చికిత్స అందజేసే వైద్యులు నేడు కరువయ్యారు. సహనం కోల్పోతే అందరి ముందు పరువు పోవడం తప్ప, ప్రత్యేకంగా ఒనగూరేది ఏదీ ఉండదని వైద్యులు గుర్తించకపోవడం దురదృష్టకరం. అసహనానికి కారణమైన రద్దీని క్రమబద్ధీకరించుకోలేకపోవడం ప్రధాన వైఫల్యంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో పని ఒత్తిడి పెరిగి ఎదుటి వ్యక్తిపై కోపంతో అరవడం, తిట్టడం లాంటివి చేస్తుంటారు. -
12న ఉరగాద్రి చౌడేశ్వరీదేవి జయంతి ఉత్సవం
ఉరవకొండ: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన ఉరవకొండలోని ఉరగాద్రి చౌడేశ్వరీ అమ్మవారి ఆలయంలో ఈనెల 12న జరిగే జయంతి ఉత్సవ పొస్టర్లను ఆదివారం అమ్మవారి ఆలయ ఆవరణలో కమిటీ సభ్యులు విడుదల చేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కొత్త శరత్ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన ఉరగాద్రి చౌడేశ్వరీ అమ్మవారి ఆలయంలో ఈనెల 12న ఆషాడ మాసపు అమావాస్యను పురస్కరించుకోని అమ్మవారి జయంతిని అట్టహాసంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనానికి తరలివచ్చే వారికి అన్నదానం కూడా చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చెకుముకి సంబరాలను జయప్రదం చేయండి అనంతపురం కల్చరల్: చిన్నారుల్లో విజ్ఞాన పిపాసను రగిలించే చెకుముకి సైన్సు సంబరాలను జయప్రదం చేయాలని జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సాకే భాస్కర్ అన్నారు. ఆదివారం స్థానిక సంఘమేష్ నగర్‌లోని జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా విద్యార్థులో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంచే దిశగా జేవీవీ పనిచేస్తోందన్నారు. సృజనాత్మకత, సైన్స్‌పై విస్తృత అవగాహన, ఆసక్తి మరింత పెరగాలన్నారు. ఈ ఏడాది 4 లక్షలకు పైగా విద్యార్థులు చెకుముకి సంబరాల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో నిర్వహిస్తున్నట్లు జేవీవీ ప్రధాన కార్యదర్శి కె.వీరరాజు తెలిపారు. జిల్లా స్థాయి విజేతలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో గాంగేనాయక్, మహమ్మద్ జిలాన్, రామిరెడ్డి శ్రీనివాసరావు, నాగరత్నమ్మ, శశికళ తదితరులు పాల్గొన్నారు. -
నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు మొబైల్ 8977716661 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకూ నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు ఫోన్ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. చదువుతోనే రజకుల జీవితాల్లో వెలుగులు అనంతపురం ఎడ్యుకేషన్: చదువుతోనే రజక విద్యార్థుల జీవితాల్లో వెలుగులు సాధ్యమని వక్తలు పేర్కొన్నారు. రజక ఉద్యోగ విద్యావంతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో జిల్లాలోని రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సి.ఎర్రిస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 2025–26 విద్యా సంవత్సరంలో పది, ఇంటర్లో అత్యంత ప్రతిభ కనబరిచిన 78 మంది విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఒక్కో విద్యార్థికి రూ.వెయ్యి నగదు, మెమొంటో, ప్రశంసాపత్రం అందించి అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి మాట్లాడుతూ సమాజంలో మార్పు తీసుకురావడానికి చదువు ఒక్కటే ప్రధాన మార్గమన్నారు. రజక కుటుంబాల్లోని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ పరమేష్, కార్పొరేటర్ శ్రీనివాసులు, ఎస్ఐ రమేష్, దేవేంద్రప్ప, సుబ్రమణ్యం, ఆనంద్, వెంకటేష్, శంకర్, రాప్తాడు గణేష్ తదితరులు పాల్గొన్నారు. హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులపై నిర్లక్ష్యమెందుకు? ఉరవకొండ: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా నేటికీ జిల్లాకు అత్యంత ముఖ్యమైన తుంగభద్ర హైలెవల్ కెనాల్ ఆధునీకరణ పనులు చేపట్టడకపోవడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి విమర్శించారు. ఆదివారం మండల పరిధిలోని నింబగల్లు సమీపంలో శిథిలావస్థకు చేరుకున్న హెచ్చెల్సీతో పాటు జీబీసీ కాలువలను సీపీఐ నేతల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి విలేకరులతో మాట్లాడారు. హెచ్చెల్సీ, జీబీసీ కాలువల ఆధునీకరణ పనుల్లో జరుగుతున్న జాప్యం రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తోందన్నారు. హెచ్చెల్సీ ఆధునీకరణ పనులు కర్ణాటకలో పూర్తయినా, ఏపీలో మాత్రం పనులు ఒక్క ఇంచు కూడా ప్రారంభం కాలేదన్నారు. హెచ్చెల్సీని పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తే 4 వేల క్యూసెక్కలను సమర్థవంతంగా వినియోగించుకోనే అవకాశం ఉందన్నారు. కాలువ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రెగ్యులేటర్లు, తూములు, ఇతర కీలక నిర్మాణాలు చేపడితే నీటి వృథాను అరికట్టి చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాం వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో హెచ్చెల్సీ, జీబీసీలకు పూర్తిస్థాయిలో నీర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాని డిమాండ్ చేశారు. అనంతరం కేంద్ర, రారష్ట్‌ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బొమ్మనహాళ్ మండలంలో జీపు జాత నిర్వహించారు. -
గుర్తు తెలియని వృద్ధుడి మృతి
గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. గంగా నిలయం సమీపంలోని మరుగుదొడ్ల పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కూర్చుని ఉన్న వృద్ధుడు మృతిచెందినట్లు గుర్తించిన భక్తులు, ఆలయ సిబ్బంది వెంటనే కసాపురం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కొందరు యాచకులను విచారించగా మృతిచెందిన వృద్ధుడు రెండు నెలలుగా ఆలయ పరిసరాల్లోనే ఉంటున్నట్లు తెలిపారన్నారు. అయితే మృతి చెందిన మృతుడి వయసు సమారు 75 సంవత్సరాలకు పైగా ఉంటుందన్నారు. ఆచూకీ తెలిసిన వారు వెంటనే కసాపురం పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో వివాహిత.. ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో మల్లమ్మ (28) అనే వివాహిత మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బంధువుల వివరాల మేరకు.. ఆత్మకూరు మండలం పి.కొత్తపల్లికి చెందిన భార్యాభర్తలు హరికుమార్, మల్లమ్మతో పాటు వారి కుమారుడు యశ్విక్ ముగ్గురు ద్విచక్ర వాహనంలో అనంతపురానికి బయలుదేరారు. మల్లమ్మకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి చూపించాలనుకున్నారు. అయితే ఆత్మకూరు వద్దకు రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో మల్లమ్మ ఉన్నఫలంగా రోడ్డుపై పడింది. తలకు తీవ్ర గాయం అవ్వడంతో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రి సిబ్బంది అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. మల్లమ్మను అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధం
అనంతపురం అర్బన్: ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమయ్యాయి. ఎన్నికల హామీ మేరకు ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకుండా రెండేళ్లుగా దాటవేస్తూ దగా చేస్తోందని మండిపడుతున్నాయి. పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటన, సరెండర్ లీవ్‌లు, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల సాధన కోసం ఉద్యమిస్తామంటున్నాయి. పెన్షనర్ల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందంటున్నాయి. పీఆర్సీ.. ఐఆర్ ఊసేలేదు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు దాటినా 12వ పీఆర్సీ ఊసే లేదు. కమిషన్ నియమించకుండా ఉద్యోగుల రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కాలరాస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినా ఇంత వరకూ అమలు గురించే పట్టించుకోలేదన్నారు. ఐదు డీఏలు పెండింగ్ ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు (జనవరి– జూలై) ఒక డీఏ (కరువు భత్యం) ఇవ్వాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. అయితే 2024 జూలై నుంచి ఇప్పటి వరకు (2024 జూలై, 2025 జనవరి, జూలై, 2026 జనవరి, జూలై) ఐదు డీఏలను ఇవ్వకుండా ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిందన్నారు. దీనికి తోడు సరెండర్ లీవ్స్‌కు సంబంధించి నగదు ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. పెన్షనర్ల పరిస్థితి దయనీయం.. ప్రభుత్వ పెన్షనర్ల పరిస్థితి దయనీయంగా ఉందని నాయకులు చెబుతున్నారు. కొందరు ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫ్రిబవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 500 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేశారు. వీరికి ఒక్కొక్కరికీ రూ.10 లక్షల వరకు ఈఎల్ (ఎర్న్డ్ లీవ్) రావాల్సి ఉందన్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఈఎల్ మంజూరు చేయలేదు. అవాస్తవ లెక్కలతో శ్వేతపత్రం.. ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతన విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతప్రతం పూర్తిగా అవాస్తవ లెక్కలతో ఉందని ఉద్యోగ సంఘాలు నేతలు అంటున్నారు. ఈ రెండేళ్లలో దాదాపు 50 వేల మంది ఉద్యోగ విరమణ చేశారరు. కొత్తగా నియామకాలు చేపట్టలేదు. అలాంటప్పుడు ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందా..? పెరుగుతుందా...? అంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా బడ్జెట్లో ఉద్యోగులకు వేతనాల కింద చెల్లిస్తున్నది 40 శాతం లోపే ఉండగా... ప్రభుత్వం 98 శాతంగా చూపడం వెనుక ‘ఇతరత్ర’ ఉద్దేశం కనిపిస్తోందని అంటున్నారు. ఉద్యోగుల విషయంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం కనిపిస్తోందని దుమ్మెత్తిపోస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రెండేళ్లుగా దగా వేతనాలపై అవాస్తవ లెక్కలతో తప్పుడు సంకేతాలు ఉద్యోగ, పెన్షనర్ల సంఘం నాయకుల మండిపాటు -
శునకానికి పూజలు.. సహపంక్తి భోజనాలు
అనంతపురం జిల్లా: శునకానికి పూజలు నిర్వహించారు. సహపంక్తి భోజనాలు చేశారు. వర్షం కోసం విడపనకల్లు మండలం కొట్టాలపల్లిలో గ్రామస్తులు పాటించిన వింత ఆచారం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల వర్షాలు కురవకపోవడంతో పంటల సాగుకు విరామం తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే వరుణుడి కరుణ కోసం విడపనకల్లు మండలం కొట్టాలపల్లివాసులు పూర్వ కాలం నుంచి వస్తున్న వింత ఆచారాన్ని శనివారం పాటించారు. కాటమయ్యగా భావించే శునకాన్ని పూలతో అలంకరించి, కొబ్బరి కాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుక్కను గ్రామంలో ఊరేగించారు. పెళ్లి భోజనాల తరహాలో పది రకాల వంటకాలు చేసి చుట్టు పక్కల గ్రామాల వారికి పొలంలోనే భోజనాలు ఏర్పాటు చేశారు. సహపంక్తి భోజనాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం గమనార్హం. అనంతరం కుక్కకు కూడా భోజనం పెట్టి దానికి నీళ్లు ఇవ్వకుండా వదిలేశారు. అలా వదిలేస్తే వర్షాలు కురుస్తాయని గ్రామస్తుల నమ్మకం. -
ఎమ్మెల్యే సారూ.. ఒక్కసారి కిందకు దిగి చూడండి..
అనంతపురం: ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు స్థానిక సమస్యలపై ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. శనివారం పాతగుంతకల్లులోని ఆరో వార్డు వాల్మీకి సర్కిల్ ఏరియా నుంచి దోనిముక్కల రోడ్డులో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని మరోచోట తాగునీటి సరఫరా మెరుగుదల పథకం భూమిపూజకు కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో ఆరోవార్డు ప్రజలు ఎమ్మెల్యే కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. దోనిముక్కలకు వెళ్లే ప్రధాన రహదారిలో డ్రెయినేజీ లేక రోడ్డుకు ఇరు వైపులా మురుగు పారుతోందని, వర్షం పడిన సమయంలో రొచ్చురొచ్చుగా మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగుపై దోమలు వాలడం వల్ల తాము అనారోగ్యాల పాలవుతున్నామని ప్రజలు తెలిపారు. ‘ఎమ్మెల్యే సారూ... ఒక్కసారి కిందకు దిగి రోడ్డుపై ఉన్న మురుగును చూడండి.. మా బాధలు తెలుసుకోండి’ అంటూ వేడుకున్నా ఎమ్మెల్యే పలకలేదు. ప్రజాప్రతినిధే పట్టనట్టు ఉంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు డ్రెయినేజీ ఏర్పాటు చేస్తామని ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి కారు దిగి వచ్చి హామీ ఇవ్వడంతో వార్డు ప్రజలు శాంతించారు. -
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,అనంతపురం: హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని పామిడి మండలం పొగరూరు పరిధిలో వేగంగా ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న ఐషర్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్రైవేట్ బస్సు నియంత్రణ కోల్పోయి, హైవేపై ఉన్న ఒక కల్వర్టు పైనుంచి కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా నలిగిపోవడంతో, బస్సు, ఐషర్ వాహనాల డ్రైవర్లు క్యాబిన్లలోనే ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానిక ప్రజలు తీవ్రంగా శ్రమించి, వాహనాల భాగాలను కట్ చేసి ఇద్దరు డ్రైవర్లను సురక్షితంగా వెలుపలికి తీశారు. గాయపడిన డ్రైవర్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులందరినీ వెంటనే చికిత్స నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంతో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కాపాడండి
● నార్పల హైస్కూల్ పూర్వ విద్యార్థుల విన్నపం అనంతపురం న్యూ టౌన్: నార్పలలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్థలం కబ్జాకు గురి కాకుండా కాపాడాలని పూర్వ విద్యార్థులు కోరారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో శనివారం పూర్వ విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. 1952లో నార్పల పాఠశాల ఏర్పాటుకు 10.2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. కాలక్రమంలో జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల, సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేశారన్నారు. ఇటీవల పాఠశాల హద్దులను చెరిపేస్తూ పడమటి వైపు 15 నుంచి 20 సెంట్ల మేర పాఠశాల స్థలాన్ని వదిలి ప్రహరీ ఎందుకు నిర్మించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని మరో మారు కొలతలు వేసి హద్దులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఘన చరిత్ర కలిగిన పాఠశాల స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్రలు పన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రహరీ కోసం వదిలిన స్థలం కనీసం రూ.4 నుంచి రూ. 5 కోట్ల మేర విలువ చేస్తుందన్నారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకొని కబ్జాకు గురి కాకుండా కాపాడాలని కోరారు. అధికారులకు గోడు విన్నవించుకున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్పందించి న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాలైనా చేసి కాపాడుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పూర్వ విద్యార్థులు చెలిమి ఆదినారాయణ, గవ్వల సుబ్బయ్య, డొక్కా శ్రీధర్, తేరుకాటి అమీర్ భాష, హరి, చంద్రకళ, ఈడిగ కిరణ్, దేవేంద్రనాథ రెడ్డి, మసూద్ వలి, దాదా ఖలందర్, గుజ్జల అదెప్ప, గుత్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
మహిళ మెడలో చైన్ అపహరణ
గుత్తి: గుత్తిలో శనివారం పట్టపగలే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. జంగాల కాలనీకి చెందిన రజని ఇంటి వద్ద స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు దుండగులు బైక్‌లో వేగంగా వచ్చారు. రజని వద్ద బైక్ స్లో చేశారు. వెంటనే అందులో ఒకడు ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు చైన్ లాక్కుని, ఒక్క ఉదుటన అక్కడి నుంచి బైక్‌లో పరారయ్యారు. పట్టపగలు, అదీ ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో మహిళ మెడలోని బంగారు చైన్ లాక్కెళ్లడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. చైన్ స్నాచింగ్ దృశ్యాలు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఇద్దరు దొంగల్లో ఒకడు హెల్మెట్, మరొకరు మాస్క్ ధరించి బైక్‌లో వచ్చారు. చైన్ లాక్కొని తాడిపత్రి రోడ్డు పైపు వేగంగా వెళ్లిపోయారు. సీసీ ఫుటేజీ ఆధారంగా సీఐ రామారావు, పోలీసు సిబ్బంది దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజీని అన్ని పోలీసు స్టేషన్లకు పంపారు. -
బూదగవిలో ‘శ్రీసత్యసాయి’ కలెక్టర్
ఉరవకొండ: రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన బూదగవి సూర్యనారాయణస్వామి దేవాలయాన్ని శనివారం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ కుటుంబ సమేతంగా సందర్శించారు. కలెక్టర్‌కు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి కలెక్టర్ దంపతులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ చిరంజీవి, సుధా ఆధ్వర్యంలో కలెక్టర్ దంపతులను ఘనంగా సత్కరించారు. స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించి, తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఉరవకొండ తహసీల్దార్ అరుణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ● ప్రసిద్ధి గాంచిన పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి వారిని కూడా కలెక్టర్ శ్యాంప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకానాథచార్యులు, సిబ్బంది స్వాగతం పలికారు. స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం కలెక్టర్‌ను ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందించారు. వృద్ధుడి తలపై వెళ్లిన ఆర్టీసీ బస్సు ● తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి ధర్మవరం అర్బన్: ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తు తెలియని వృద్ధుడిపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తల చిధ్రమై మృతి చెందాడు. వన్ టౌన్ ఎస్ఐ ఇషాక్‌బాష తెలిపిన మేరకు.. ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులు బయటకు వచ్చే రోడ్డుపైన గుర్తు తెలియని వృద్ధుడు (70) శుక్రవారం అర్ధరాత్రి మద్యం తాగి నిద్రపోయాడు. శనివారం తెల్లవారుజామున పుట్టపర్తి డిపో ఆర్టీసీ బస్సు ఆ వృద్ధుడి తలపై వెళ్లింది. దీంతో అతని తల చిధ్రమై అక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ ఎస్ఐ ఇషాక్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడి ఆచూకి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నాన్ టీచింగ్ సిబ్బంది సీనియారిటీ జాబితా విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యాశాఖ పరిధిలోని నాన్ టీచింగ్ సిబ్బందికి సంబంధించిన సీనియారిటీ జాబితాను డీఈఓ బ్లాగ్‌లో అప్లోడ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డా.అయూబ్ హుస్సేన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత నాన్ టీచింగ్ సిబ్బంది తమ సీనియారిటీ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. జాబితాలో ఏవైనా అభ్యంతరాలు, తప్పులు లేదా సవరణలు ఉంటే వాటిని సోమవారం మధ్యాహ్నంలోపు అనంతపురంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. నిర్దేశిత గడువులోగా అభ్యంతరాలు, సవరణలను తెలియజేయాలని, అనంతరం వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవబడవని డీఈఓ స్పష్టం చేశారు. టికెట్ లేకుండా ప్రయాణం.. రూ.1.63 లక్షల జరిమానా గుంతకల్లు: ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తున్న వారిపై కమర్షియల్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ధనుంజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలో 18 మంది సిబ్బంది దాడులు చేపట్టారు. గుంతకల్లు–కడప–రేణిగుంట మధ్య నడుస్తున్న 14 ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులు 260 మందిని గుర్తించి రూ.1,63,750 జరిమానా వసూలు చేశారు. దొంగతనం కేసు ఛేదింపు ● 4 తులాల బంగారు, రూ. 5 లక్షలు స్వాధీనం అనంతపురం సెంట్రల్: నగరంలో కోవూర్‌నగర్‌లో మహబూబ్ బాషా ఇంట్లో జరిగిన దొంగతనం కేసును ఛేదించినట్లు నాల్గో పట్టణ సీఐ ఏపీ మస్తాన్ తెలిపారు. కొన్ని నెలల క్రితం మహబూబ్‌బాషా భార్య అఫ్రిన్‌కు సొంత బంధువులు ఇంట్లో భద్రపరిచిన బంగారు ఆభరణాలను దొంగిలించారు. వారి ఫిర్యాదు మేరకు కదిరిలోని గాంధీనగర్‌కు చెందిన నిఖత్ అంజుమ్, మొహమ్మద్ రహిల్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. దొంగిలించిన ఆభరణాల్లో కొన్నింటిని విక్రయించి రూ. 5 లక్షలు తీసుకున్నట్లు వెల్లడైంది. మిగిలిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు తీసుకెళ్తుండగా పట్టుబడినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి 4 తులాల బంగారు నగలు, రూ.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
దగాపై తిరుగుబాటు
అనంతపురం: ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అహోరాత్రులు కష్టపడి ప్రణాళికాబద్ధంగా చదివి పరీక్షలు రాస్తే.. స్పోర్ట్స్ కోటా కింద అనర్హులకు పోస్టులు కట్టబెట్టి దగా చేయడంపై నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు తిరుగుబాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో చేసిన నయవంచనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మూడో రోజు శనివారం జిల్లా వ్యాప్తంగా విజయవంతమయ్యాయి. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, లీగల్ సెల్, సోషల్ మీడియా, ఐటీ, బూత్ కమిటీ, ప్రచార విభాగం, వాణిజ్య విభాగాలతో పాటు 24వ డివిజన్ నుంచి 50వ డివిజన్ల వరకు, రుద్రంపేట, అనంతపురం రూరల్ పంచాయతీల పార్టీ నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. తొలుత రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిరసనగా శిబిరం వద్ద శాంతికపోతాలను ఎగురవేసి రిలే దీక్షలను ప్రారంభించారు. దీక్షలకు సీపీఐ రాష్ట్ర నేత జాఫర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ స్పోర్ట్స్ అసోసియేషన్లలో అధికార పార్టీ నేతలే ఉన్నారని, వారి ప్రమేయంతోనే స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. డీఎస్సీ ఫలితాలు ప్రకటించాక మెరిట్ జాబితాను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. అన్యాయానికి గురైన వారి తరఫున వైఎస్సార్సీపీ ఆందోళనలు చేస్తుంటే చంద్రబాబు, అధికార పార్టీ నేతలు చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజంగా అక్రమాలు జరగకపోతే.. సీబీఐ విచారణ చేయించి సచ్ఛీలత నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కు పరీక్షల నిర్వహణ బాధ్యతలు ఇవ్వడంలో లోగుట్టు ఏముందని ప్రశ్నించారు. అక్రమాలపై నిగ్గదీస్తుంటే గొంతునొక్కాలని చూస్తున్నారని, అక్రమ అరెస్టులు, కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఈ నెల 10న నిర్వహించనున్న నిరసన ర్యాలీకి పెద్దఎత్తున తరలిరావాలని యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతపురంలోని పవర్ ఆఫీస్ నుంచి పాతూరులోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ● కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య కుమారుడు సాయి హర్ష, కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● గుంతకల్లులోని పాత మున్సిపల్ ఆఫీస్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి కూర్చున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు. ● శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నెలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో వైఎస్సార్సీపీ యువ నాయకుడు సాకే రుత్విక్ తదితరులు పాల్గొన్నారు. ● రాయదుర్గంలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు వైఎస్సార్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మెట్టు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ● రాప్తాడు నియోజకవర్గంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజు శనివారం విజయవంతంగా ముగిశాయి. దీక్షలో పాల్గొన్న విద్యార్థులు, యువత, నిరుద్యోగులకు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కె.రమేష్‌రెడ్డి నిమ్మ రసం అందించి దీక్షను విరమింపజేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై నిగ్గు తేల్చాలి మెరిట్ జాబితా ప్రదర్శించకపోవడంలో ఆంతర్యమేమిటి? సీబీఐ విచారణ కోరి.. సచ్ఛీలతను నిరూపించుకోవాలి విజయవంతంగా ముగిసిన వైఎస్సార్సీపీ రిలే నిరాహారదీక్షలు -
ప్లాట్ల ఆక్రమణకు పన్నాగం
● బాధితులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత రాప్తాడు రూరల్: తాము కొనుగోలు చేసిన ప్లాట్లను కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. రాప్తాడు పొలం సర్వే నంబర్ 188–1లో సుమారు 1.5 ఎకరాల భూమికి సంబంధించి శనివారం వివాదం తలెత్తింది. కొందరు జేసీబీలతో అక్కడికి చేరుకుని ప్లాట్లకు ఏర్పాటు చేసిన కంచెలను తొలగించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో బాధితులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకోవడంతో కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బాధితులు నిలదీయడంతో అక్కడికి వచ్చిన వారు వెనక్కి వెళ్లిపోయారు. బాధితుల కథనం ప్రకారం.. కోడెకండ్ల శేఖర్‌నాయుడు, చిరంజీవి అనే వ్యక్తులు తమ ప్లాట్ల విషయంలో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెబుతూ తమను బెదిరిస్తున్నారని వాపోయారు. తమ వద్ద ఉన్న భూమికి సంబంధించిన పత్రాలను చూపకుండా ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఎనిమిదేళ్ల క్రితం కొనుగోలు చేశా బాధితురాలు అరుణ మాట్లాడుతూ తాను ఎనిమిదేళ్ల క్రితం 20 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి తరచూ తన స్థలాన్ని పరిశీలించుకుంటూ వస్తున్నానని, ప్లాట్‌కు కంచె ఏర్పాటు చేసి తన మొబైల్ నంబర్‌ను కూడా రాసినట్లు చెప్పారు. ఇంతకాలం ఎవరూ ఈ భూమి తమదని చెప్పలేదని, ఇటీవల కొందరు వచ్చి తమ స్థలాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శనివారం జేసీబీతో కంచెను తొలగించేందుకు ప్రయత్నించడంతో తాను వెళ్లి అడ్డుకున్నానని చెప్పారు. తమను బలవంతంగా ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని, వారి వద్ద ఉన్నట్లు చెబుతున్న పత్రాలు ఏమిటో తమకు చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై మాట్లాడితే సీఐ వద్దకు రావాలని చెబుతున్నారని తెలిపారు. మరో బాధితురాలు లలిత మాట్లాడుతూ తాను ఐదేళ్ల క్రితం ప్లాటు కొనుగోలు చేసినట్లు తెలిపారు. శేఖర్‌నాయుడు అనే వ్యక్తి తమ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫోన్లో కూడా తనను బెదిరించారని వాపోయారు. తమ ప్లాట్లపై ఆయనకు ఏ అధికారం ఉందో స్పష్టం చేయకుండా దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా.. ఈ వ్యవహారంపై గతంలోనే జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. ఎస్పీ సంబంధిత సీఐకి సూచించినప్పటికీ తమ సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. శనివారం సాయంత్రం రాప్తాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా సీఐ అందుబాటులో లేరని తెలిపారు. తమకు సంబంధించిన ప్లాట్లను రక్షించడంతో పాటు, భూమి పత్రాలను పరిశీలించి న్యాయం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. తాము చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్లాట్లపై ఇతరులు జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని, భూ వివాదంపై సమగ్ర విచారణ జరిపి తమకు రక్షణ కల్పించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. -
మొక్కల మాటున మాయ
రాయదుర్గం రూరల్: రాయదుర్గం మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనుల్లో సిబ్బంది విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. మాయలు చేస్తూ బిల్లులు మెక్కేస్తున్నారు. రాతిబావివంక గ్రామంలో చేస్తున్న పనులే అందుకు నిదర్శనం. నాలుగు నెలల క్రితమే హైడెన్సిటీ ప్లాంటేషన్ పథకం పేరిట ఇక్కడ మొక్కలు నాటినట్లు చూపి రూ.70 వేలకు పైగా బిల్లులు కాజేశారు. ఆడిటింగ్ భయంతో శనివారం తాజాగా స్థానిక ఆంజనేయస్వామి మాన్యంలో నాసిరకం, ఎండిపోయిన మొక్కలను నాటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడో పనులు చేస్తున్న కూలీల ఫొటోలు తీసి, అక్కడి నుంచి ఆంజనేయ స్వామి మాన్యం వద్దకు కూలీలను తీసుకువచ్చి మొక్కలు నాటించినట్లు చూపడం గమనార్హం. మొక్కలు నాటే పనులు పూర్తి కాగానే తిరిగి కూలీల ప్రాంతాలకు తీసుకెళ్లి మళ్లీ ఫొటోలు తీయడం చూస్తే ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. అవినీతి పనుల్లో టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ మేట్ ప్రధాన సూత్రధారులని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రూ.200 ఇస్తేనే పనులు..! మండలంలోని చదం గొల్లలదొడ్డి (సీజీ దొడ్డి) గ్రామంలో ఉపాధి పనులు కావాలంటే సోమవారం రోజు ప్రతి కూలీ రూ.200 ఇచ్చుకోవాల్సిందే. లేదంటే పనులు ఉండవు. ఒకవేళ ప్రశ్నిస్తే ఆరు రోజుల పనుల్లో మూడు రోజులు హాజరు, మిగిలిన మూడు రోజులు గైర్హాజరు వేస్తున్నారని ఉపాధి కూలీలే పేర్కొంటున్నారు. అంతే కాకుండా చేసిన పనులకు వారాంతంలో తీసే కొలతల్లో కూడా తక్కువ చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతి వారం కూలీలు ఇచ్చే రెండు వందలను పై స్థాయి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని ఫీల్డ్ అసిస్టెంట్ ఆదేశాల మేరకు సీనియర్ మేట్లు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. అంతులేని అక్రమాలు మండలంలో ఉపాధి పనుల్లో అక్రమాలకు అంతులేకుండా పోయింది. పనులు చేయకుండానే బిల్లులు చేయడం, చేసిన చోటే మళ్లీ పనులు చేసి బిల్లులు కాజేయడం సాధారణంగా మారింది. చాలా గ్రామాల్లో కొలతలు తీయడానికి మునుపే ప్రతివారం రూ.200 వసూలు చేస్తుండడం దారుణం. – హొన్నె మల్లికార్జున, రాయదుర్గం జెడ్పీటీసీ చర్యలు తీసుకుంటాం.. రాతిబావి వంకలో పల్లెవనాలు, హైడెన్సిటీ ప్లాంటేషన్ పనులు జరుగుతున్నాయి. సోమవారం క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అక్రమాలు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటాం. చదం గొల్లలదొడ్డి గ్రామంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సీనియర్ మేట్లను హెచ్చరించాం. అక్రమాలు కొనసాగితే సీనియర్ మేట్లను తొలగిస్తాం. – కె.రవి, ఏపీఓ, రాయదుర్గం మండలం ఆర్బీ వంకలో ఉపాధి సిబ్బంది బరితెగింపు నాలుగు నెలల క్రితమే బిల్లు చేసి తాజాగా మొక్కలు నాటిన వైనం అది కూడా ఎండిన మొక్కలు నాటడంపై సర్వత్రా విమర్శలు -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
బెళుగుప్ప: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన బెళుగుప్పలో తీవ్ర విషాదం నింపింది. వివరాలు.. బెళుగుప్పకు చెందిన మాలపాటి వెంకటేశులు రత్నమ్మ దంపతులకు శోభ, లత, రోజా, అశోక్‌రెడ్డి సంతానం. వెంకటేశులు జీవనోపాధి నిమిత్తం పెద్దపప్పూరు మండలం తురకపల్లికి కుటుంబంతో కలిసి వలస వెళ్లాడు. భూములను కౌలు చేస్తూ వచ్చిన ఆదాయంతో కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాడు. ఎంబీఏ పూర్తి చేసిన కుమారుడు అశోక్ రెడ్డి ఆరేళ్లుగా చైన్నెలోని ‘ది బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్’లో పనిచేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున చైన్నెలోని తన కార్యాలయంలో విధులు ముగించుకున్న అశోక్‌రెడ్డి మరో ఇద్దరు తోటి ఉద్యోగులతో కలిసి కారులో తన రూముకు బయలుదేరాడు. మార్గమధ్యంలో కారు లారీని ఢీకొనడంతో తీవ్ర గాయాలైన అశోక్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అశోక్ రెడ్డికి 8 నెలల క్రితమే విజయవాడకు చెందిన గిరిజతో వివాహమైంది. ఆమె ప్రస్తుతం 5 నెలల గర్భిణి. ప్రస్తుతం గిరిజ అత్తారింట్లో ఉండగా, సీమంతం చేయాలని ఇటీవల నిర్ణయించారు. ఈ క్రమంలోనే అశోక్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించాడని తెలుసుకున్న ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది. ఏపీ పీఈటీ, ఎస్ఏపీఈ నూతన కార్యవర్గం ● జిల్లా అధ్యక్షుడిగా ఎల్. నాగరాజు, కార్యదర్శిగా ఇ. సిరాజుద్దీన్ అనంతపురం ఎడ్యుకేషన్: ఏపీ పీఈటీ, ఎస్ఏపీఈ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఉపాధ్యాయ భవన్లో ఆర్సీ అక్కులప్ప అధ్యక్షతన జిల్లా ఎన్నికలు నిర్వహించారు. పూర్వపు కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, శివకేశవులు, రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు జోసెఫ్ లక్ష్మయ్య, అస్లాం బాషా సమక్షంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. జిల్లా అధ్యక్షుడిగా ఎల్. నాగరాజు, కార్యదర్శిగా ఇ. సిరాజుద్దీన్, కోశాధికారిగా జి. జగదీశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జిల్లా ఉపాధ్యక్షురాలిగా సమీరా, సంయుక్త కార్యదర్శిగా జ్యోతి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, అసోసియేషన్ సభ్యులు అభినందించారు. జిల్లాలో పీఈటీ, ఎస్ఏపీఈ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఉపాధ్యాయుల హక్కులు, సమస్యలపై సంఘటితంగా పనిచేస్తామని పేర్కొన్నారు. రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలం ఉరవకొండ: కరువు సహాయక చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి విమర్శించారు. శనివారం సీపీఐ జీపుజాత ఉరవకొండకు చేరుకుంది. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నియోజకవర్గ సహాయ కార్యదర్శి సుల్తాన్ అధ్యక్షతన క్లాక్‌టవర్ వద్ద జరిగిన బహిరంగ సమావేశంలో నారాయణస్వామి మాట్లాడారు. జిల్లాపై ఎల్‌నినో ప్రభావంతో అంతటా కరువు ఛాయలు కమ్ముకున్నాయన్నారు. రైతులు దిక్కులేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ పాలన సాగిస్తున్నాయన్నారు. మోదీ ప్రభుత్వం కుల, మత విభేదాలను పెంచే విధానాలను అవలంబిస్తోందన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగిస్తున్నారన్నారు. హంద్రీ–నీవా కాలువను విస్తరించి 6 వేల క్యూసెక్కుల నీటిని తీసుకొస్తే జిల్లాలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. హంద్రీ–నీవా పిల్లకాల్వలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. హెచ్చెల్సీ ఆధునీకరణ చేపట్టి చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న కలెక్టరెట్ ఎదుట ధర్నా చేపట్టనున్నామని, పెద్ద ఎత్తున రైతులు, పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, రాజారెడ్డి, కేశవరెడ్డి పాల్గొన్నారు. ‘తాడిపత్రిలో నువ్వో..నేనో తేల్చుకుందాం’ తాడిపత్రిటౌన్: ‘తాడిపత్రిలో నువ్వో నేనో తేల్చుకుందాం’ అంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉద్దేశించి టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి పట్టణంలోని తన నివాసంలో ఆయన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని చూసి భయపడుతున్నారని, కోర్టు ఆదేశాలను ధిక్కరించినా కేతిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇకపై నో పోలీస్, కోర్టులోనే తేల్చుకుంటాం అంటూ ఊగిపోయారు. వైఎస్సార్సీపీ నేతలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ తాడిపత్రిలో ప్రజాసామ్యం లేదు అంటే ఊరుకునేది లేదన్నారు. తాను పడిన బాధలు అవతలి వాళ్లు కూడా అనుభవించాలి అన్నారు. -
ఆంక్షలు దాటుకుని ఆందోళనకు
● హక్కుల కోసం విజయవాడలో గళమెత్తిన సచివాలయ ఉద్యోగులు అనంతపురం క్రైం: డిమాండ్ల సాధన కోసం విజయవాడలోని ధర్నా చౌక్‌లో శనివారం నిర్వహించిన సభకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అనేక ఆంక్షలు దాటుకుని వెళ్లారు. ఉద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసుల ద్వారా ప్రయత్నాలు చేపట్టింది. సభకు వెళ్లరాదని ఒత్తిళ్లు తీసుకొచ్చింది. తనిఖీలు చేపట్టి వారు తరలకుండా అడ్డుకునేందుకు శత విధాలా ప్రయత్నించింది. అయినా ఉద్యోగులు విజయవాడకు చేరుకున్నారు. పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలని, సచివాలయ ఉద్యోగులకు స్పష్టమైన డ్యూటీ చార్ట్ రూపొందించాలని ఉమ్మడి జిల్లా సచివాలయాల ఉద్యోగులు, సిబ్బంది ఐక్యవేదిక డిమాండ్ చేసింది. అదనపు పనులతో ఒత్తిడి పెంచరాదని స్పష్టం చేసింది. పదోన్నతులకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరింది. ప్రభుత్వం అందించే సేవల్లో తాము ముందు వరుసలో ఉంటామని, అలాగే తమ సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. -
ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తూ..
● తేలికపాటితో సరిపెడుతున్న వరుణుడు ● దయనీయంగా ఖరీఫ్ పంటల పరిస్థితి అనంతపురం అగ్రికల్చర్: ఎల్–నినో తీవ్రత అధికంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు పూర్తిగా మందగించాయి. భారీ వర్షాలు కురిసేలా మేఘాలు ఊరిస్తున్నా.. వరుణుడు కరుణించడం లేదు. రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు.. ఆ తర్వాత ఉన్నఫలంగా తగ్గిపోవడం, లేదంటే 20 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడం, ఉక్కపోత నెలకొనడం లాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడక్కడా తేలికపాటి వర్షపాతం నమోదవుతోంది. ఇలా జూన్ 15 నుంచి వరుణుడు ఉసూరుమనిపిస్తుండటంతో రైతుల్లో ఆందోళన రెట్టింపవుతోంది. 11 వర్షపు రోజులే.. ఈ సీజన్లో జూన్ నుంచి ఆగస్టు 7 వరకు 140 మి.మీకు గాను 27 శాతం తక్కువగా 100 మి.మీ వర్షం కురిసింది. జూన్‌లో 61.2 మి.మీ గానూ 11 శాతం అధికంగా 68.4 మి.మీ వర్షం కురిసింది. జూన్ 14 తర్వాత వరుణుడి జాడ కరువైపోయింది. అది కాస్త జూలై నెలంతా కొనసాగింది. జూలై నెల సాధారణం 64.3 మి.మీ కాగా ఏకంగా 71 శాతం తక్కువగా 18.8 మి.మీ వర్షం కురిసింది. ఇక ఆగస్టులో 4న 5.5 మి.మీ, 7న 4.8 మి.మీ తేలికపాటి సగటు వర్షం కురిసింది. మొత్తం మీద గత 68 రోజుల్లో కేవలం 11 రెయినీ డేస్ నమోదయ్యాయి. మూడు మండలాల్లోనే అధికం.. ఇప్పటి వరకు పామిడి, కూడేరు, పెద్దవడుగూరు మండలాల్లో మాత్రమే సాధారణం కన్నా కాస్త అధిక వర్షపాతం నమోదైంది. 22 మండలాల్లో సాధారణం కన్నా చాలా తక్కువగా వర్షం కురిసింది. మిగతా ఏడు మండలాల్లో ఓ మాదిరి వర్షపాతం నమోదైంది. కరువు కాటకాలకు సంకేతంగా 32 మండలాల్లోనూ ఇప్పటికే డ్రైస్పెల్స్ నమోదయ్యాయి. మూడు నాలుగు రోజులుగా దట్టమైన మేఘాలు ఆవరించి భారీ వర్షం కురిసేలా కనిపించినా.. కొన్ని మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. దీంతో ఖరీఫ్ కింద సాగులోకి వచ్చిన 1.40 లక్షల హెక్టార్ల పంటల పరిస్థితి దారుణంగా తయారైంది. 65 వేల హెక్టార్ల ‘కంది’పోయేలా ఉంది. 36 వేల హెక్టార్ల వేరుశనగ వాడుబట్టింది. 23 వేల హెక్టార్ల తెల్లబంగారం (పత్తి) చిన్నబోతోంది. 8,500 హెక్టార్ల మొక్కజొన్న, 5,500 హెక్టార్ల ఆముదం మాడిపోయేలా కనిపిస్తున్నాయి. -
అధికారుల సహకారం.. దందా యథాతథం
ఆయన ప్రజాప్రతినిధి అన్న విషయం మరిచారు. సొంత కన్స్ట్రక్షన్స్ సంస్థ ఆదాయం పెంచుకోవడం కోసం ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎడాపెడా ఇసుక తవ్వకాలు చేపట్టి.. పెన్నా నదికి గర్భశోకం మిగుల్చుతున్నారు. తద్వారా నీటి వనరులు తగ్గి.. ప్రజలకు సాగు–తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని తెలిసినా ‘డోంట్ కేర్’ అంటున్నారు. ఇదీ కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సాగిస్తున్న ఇసుక దందా తీరు. రాళ్ల అనంతపురం వద్ద పెన్నా నదిలో రెండు వైపులా జేసీబీలతో ఇసుకను ట్రాక్టర్లలోకి నింపుతున్న దృశ్యాలు (వృత్తంలో) కంబదూరు మండలం రాళ్ల అనంతపురం ఎస్ఆర్సీ మిక్సింగ్ ప్లాంట్ వద్ద కొండలా పెరుగుతోన్న ఇసుక డంప్కళ్యాణదుర్గం: అక్రమ తవ్వకాలతో ఏర్పాటు చేసిన ఇసుక డంప్ పెద్ద కొండను తలపిస్తున్నా ఇటు మైనింగ్ అధికారులకు కానీ, అటు రెవెన్యూ అధికారులకు కానీ కనిపించడం లేదు. ఎమ్మెల్యే అమిలినేని సారథ్యంలోని ఎస్ఆర్సీ అనే కన్స్ట్రక్షన్ సంస్థ చేస్తున్న ఈ అరాచకాన్ని అడ్డుకునేందుకు అధికారులెవరూ సాహసించడం లేదు. అధికారానికి తోడు అధికారుల అండ పుష్కలంగా ఉండటంతో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం రాళ్ల అనంతపురం వద్ద ఎస్ఆర్సీ సంస్థ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంది. సమీపంలోని పెన్నానది పరివాహక ప్రాంతాల నుంచి అనుమతులు లేకుండానే ఆ సంస్థ జేసీబీలతో ఇసుక తవ్వకాలు చేపడుతోంది. రోజూ టన్నుల కొద్దీ ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా మిక్సింగ్ ప్లాంట్ వద్దకు డంప్ చేస్తోంది. ఇసుక కొండ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇక్కడి నుంచి సంస్థ కాంట్రాక్టు పనులు చేపట్టే ప్రదేశాలకు, ఇతర ప్రాంతాలకు టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు ఇసుక లోడ్‌తో ఇష్టారాజ్యంగా తిరుగుతుండటంతో రోడ్లు సైతం దెబ్బతింటున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలతో చుట్టుపక్కల వ్యవసాయ బోరు బావులు ఎండిపోయి.. నీటికి ఇబ్బందులు కలుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులు ఇసుకను లోతుగా తోడేస్తుండటంతో సాధారణ మట్టి సైతం పైకి వస్తోందని, దీంతో పెన్నా నదికి గర్భశోకం మిగులుతోందని ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల జీహుజూర్ ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై స్థానికులు పలుమార్లు మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. రోజూ రెండు జేసీబీలు, పది ట్రాక్టర్లతో ఇసుకను తోడేస్తున్న వైనాన్ని మైనింగ్ అధికారులకు సాక్ష్యాధారాలతో సహా పంపినా అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. భారీగా ముడుపులు తీసుకోవడం వల్లే చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కనీసం జిల్లా కలెక్టర్ అయినా స్పందించి ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. మైనింగ్ అధికారులతో చర్చిస్తాం నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తీసుకుంటాం. రాళ్ల అనంతపురం వద్ద పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఇసుక డంప్‌పై మాకు ఎలాంటి సమాచారమూ లేదు. మైనింగ్ అధికారులతో చర్చిస్తాం. ఎక్కడైనా అక్రమంగా ఇసుక రవాణా జరిగితే నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం. దీనిపై మైనింగ్ అధికారులతో పూర్తి వివరాలు తెలుసుకుని.. తదుపరి చర్యలు చేపడతాం. – వసంతబాబు, ఆర్డీఓ, కళ్యాణదుర్గం ఆగని ‘అమిలినేని’ ఇసుక దందా అధికారుల అండతో యథేచ్ఛగా తవ్వకాలు రాళ్ల అనంతపురం మిక్సింగ్ ప్లాంట్ వద్ద కొండలా పెరుగుతున్న డంప్ -
ప్రపుల్లకు ‘రామాయణి సమ్మాన్’ పురస్కారం
అనంతపురం కల్చరల్: 30 ఏళ్లుగా రామాయణ, మహాభారతాలపై విస్తృత ప్రచారం గావిస్తున్న డాక్టర్ మాడ్గుల ప్రపుల్లకు ప్రతిష్టాత్మక ‘రామాయణి సమ్మాన్’ అవార్డు దక్కింది. ‘రామాయణ రీసెర్చ్ కౌన్సిల్’ వారు బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఈ నెల 19న గోస్వామి తులసీదాసు జయంతి సందర్భంగా ఆమెకు పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించనున్నారు. నగరానికి చెందిన డాక్టర్ ప్రపుల్ల శ్రీసత్యసాయి విద్యాసంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ గావించారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము– రసానుశీలము’ అనే సిద్ధాంత గ్రంథానికి సంబంధించి ఆమెకు డాక్టరేట్ లభించింది. విశ్రాంత జీవితంలో డాక్టర్ మాడ్గుల ప్రపుల్ల ఆధ్యాత్మిక, ధార్మిక ప్రవచనాలు చేస్తూ ధర్మప్రచారం గావిస్తున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ పుస్తకాలలో పరిశోధనా వ్యాసాలు ప్రచురించారు. దేశంలో 28 మందిని వివిధ విభాగాల్లో రామాయణి సమ్మాన్ అవార్డుకు ఎంపిక చేయగా మన రాష్ట్రం నుంచి ఎంపికై న డాక్టర్ ప్రపుల్లను తెలుగు భాషా వికాస ఉద్యమం ప్రతినిధి డాక్టర్ జగర్లపూడి శ్యామసుందరశాస్త్రి, డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ్, ప్రవచనకర్త డాక్టర్ పాణ్యం వసుంధర అభినందించారు. -
గ్యాస్ వినియోగదారులు 15లోగా ఈ–కేవైసీ చేసుకోవాలి
అనంతపురం అర్బన్: వంట గ్యాస్ వినియోదారులందరూ ఈ నెల 15వ తేదీలోగా ఈ–కేవైసీ (బయోమెట్రిక్ ధ్రువీకరణ) తప్పనిసరిగా చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను శనివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. నిజమైన లబ్ధిదారుల వివరాలను ధ్రువీకరించడం, ఎల్పీజీ కనెక్షన్ల దుర్వినియోగం నివారించడం, అర్హులైన వినియోదారులకు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా అందించే లక్ష్యంగా ఈ–కేవైసీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. వినియోగదారులు సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మొబైల్ యాప్ ద్వారా HP Pay, IndianOilONE, Hello BPCL లేదా గ్యాస్ ఏజెన్సీల కార్యాలయం వద్ద లేదా సిలిండర్ డెలివరీ బాయ్ ద్వారానైనా ఈ–కేవైసీ పూర్తి చేసుకోవచ్చన్నారు. ఈ–కేవైసీ పూర్తి చేయడంలో వినియోగదారులకు గ్యాస్ ఏజెన్సీలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, నమోదు శిబిరాలు, ఇంటింటి ప్రచారం, డోర్‌స్టెప్ సేవలు అందిస్తాయని వెల్లడించారు. వినియోదారులు త్వరితగతిన ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. ‘టెట్’కు 1,737 మంది హాజరు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో శనివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 1,737 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఐదు పరీక్ష కేంద్రాల్లో రెండు విడతలుగా పరీక్ష నిర్వహించినట్లు డీఈఓ డాక్టర్ అయూబ్ హుస్సేన్ తెలిపారు. మొత్తం 1,870 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 1,737 మంది హాజరయ్యారు. 133 మంది గైర్హాజరయ్యారు. ఉదయం విడతలో 935 మంది అభ్యర్థులకు గాను 888 మంది పరీక్ష రాశారు. 47 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం విడతలో 935 మందికి గాను 849 మంది హాజరుకాగా, 86 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు అన్ని కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగినట్లు డీఈఓ తెలిపారు. ‘పీఎం కిసాన్ – సుఖీభవ’ సొమ్ము జమయ్యేదెప్పుడు? ● ఇంకా పలువురు రైతుల ఖాతాలకు జమకాని వైనం అనంతపురం అగ్రికల్చర్: పీఎం కిసాన్ కింద 23వ విడతగా, అన్నదాత సుఖీభవ కింద ప్రస్తుత 2026–27కు సంబంధించి మొదటి విడతగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జూన్ 20న సొమ్ము విడుదల చేసినా.. ఇంకా పలువురు రైతులకు జమ కాలేదు. రోజూ పదుల సంఖ్యలో రైతులు జేడీఏ కార్యాలయానికి వస్తుండగా.. మరికొందరు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదులు సమర్పిస్తున్నారు. పీఎం కిసాన్ కింద రూ.2 వేల చొప్పున 2,542,269 మంది రైతులకు రూ.50.85 కోట్లు, అలాగే సుఖీభవ కింద 2,75,642 మంది రైతులకు రూ.5 వేల ప్రకారం 137.82 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. వారం పది రోజుల్లో వంద శాతం జమ కావాల్సి ఉండగా... చాలామంది రైతుల ఖాతాల్లోకి జమ కాలేదు. అన్నీ సక్రమంగా ఉన్నా ఎందుకు జమ కావడం లేదో అధికారులు సరైన సమాధానం ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఐఐబీఎంపీలో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లు అనంతపురం: జర్మనీకి చెందిన నాలెడ్జ్ ఫౌండేషన్ రాయిట్లింగెన్ యూనివర్సిటీ, జేఎన్టీయూ(ఏ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఐదేళ్ల ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బాచిలర్స్– మాస్టర్స్ ప్రోగామ్ (ఐఐబీఎంపీ – బీటెక్ కోర్సు)లో మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఈ మేరకు జేఎన్టీయూ(ఏ) వీసీ సుదర్శన్‌రావు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ విద్యా కార్యక్రమం కింద విద్యార్థులు దేశీయంగా బీటెక్ పూర్తి చేసి, అనంతరం జర్మనీలో మాస్టర్స్ విద్యను పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఇన్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ ఎంఎస్సీ ఇన్ డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. జేఈఈ, ఏపీఈఏపీ, టీజీఈఏపీ సెట్ ద్వారా పొందిన ర్యాంకులు, ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ సబ్జెక్టుల మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 10న ఉదయం 10 గంటలకు జేఎన్టీయూలోని అడ్మిషన్స్ విభాగంలో జరిగే కౌన్సెలింగ్ ప్రక్రియకు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు 77027 68080, 78914 88999, 78915 88999లో సంప్రదించాలని కోరారు. -
స్పందన లేని ‘రైతన్నా మీకోసం’
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మొదలైన ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన కరువైంది. ఎల్–నినో వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులను గట్టెక్కించడానికి తీసుకోవాల్సిన నివారణ చర్యలు, ప్రణాళిక రూపకల్పనకు ఈ కార్యక్రమం తలపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం ప్రారంభమైన తొలిరోజే రైతులు నుంచి స్పందన లేదని అధికారులు వాపోతున్నారు. ఆర్ఎస్కే అసిస్టెంట్లు, ఉద్యాన, పశుశాఖ, మత్స్యశాఖ అసిస్టెంట్లు, కమ్యూనిటీ రిసోర్సు పర్సన్లు (సీఆర్పీలు), ఆదర్శ రైతులు, అభ్యుదయ రైతులు, ప్రాథమిక వ్యవసామ సహకార సంఘాలకు చెందిన సభ్యులు, అధికారులు, సాగునీటి సంఘం సభ్యులు, మార్కెట్ కమిటీ సభ్యులు... ఇలా గ్రామ స్థాయి నుంచి డివిజన్, జిల్లా స్థాయి వరకు హాజరై గ్రామ గ్రామానా రైతన్నా మీకోసం నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఈ కార్యక్రమానికి రైతుల నుంచి పెద్దగా స్పందన, బలవంతం చేస్తే అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నట్లు గ్రామస్థాయి సిబ్బంది చెబుతున్నారు. దీంతో అధికారులు, సిబ్బంది కూడా అలా పొలాల్లో కొందరు రైతులతో ఫొటోలు తీసుకుని కార్యక్రమాన్ని మమ అనిపిస్తుస్తున్నారు. -
అరటి తోటలో కొండచిలువ
యల్లనూరు: మండలంలోని దంతలపల్లికి చెందిన భాస్కర్‌రెడ్డి సాగుచేస్తున్న అరటితోటలో కొండ చిలువ కలకలం రేపింది. వివరాలు.. రైతు భాస్కర్‌రెడ్డి తనకున్న రెండు ఎకరాల్లో అరటిచెట్లను సాగు చేస్తున్నాడు. శుక్రవారం రైతు కూలీలతో కలుపు పనులు చేసుకుంటున్న సమయంలో అరటి చెట్ల మధ్య ఉన్న 15 అడుగులున్న కొండచిలువను గుర్తించారు. వెంటనే బిదునంచెర్లకు చెందిన స్నేక్ క్యాచర్ మధుసూదన్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి వచ్చి కొండచిలువను సురక్షితంగా పట్టుకొని జమ్మలమడుగు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. గత ఆరు నెలల్లో మూడు సార్లు కొండచిలువలు కనిపించాయని రైతు భాస్కర్‌రెడ్డి తెలిపారు. అటవీ ప్రాంతం ఆనుకొని పొలం ఉండటంతో తరచూ కొండ చిలువలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. -
మహిళలకు చీకటిరోజు
అనంతపురం: దిశాచట్టాన్ని ఉపసంహరించుకోడం రాష్ట్రంలోని మహిళలందరికీ చీకటి రోజని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి విమర్శించారు. శాంతి భద్రతలు, రక్షణ అంశంలో చంద్రబాబు ప్రభుత్వం బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. దిశ చట్టం రద్దు కావడంతో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా శుక్రవారం అనంతపురంలో డాక్టర్ బాబూ జగజ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అలాగే పోస్టర్లు దగ్ధం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా నాయకులు మాట్లాడుతూ మహిళల రక్షణను చంద్రబాబు ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దిశ చట్టం ద్వారా మహిళలకు అత్యంత పటిష్టమైన , సమగ్ర రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు. ఆపదలో ఉన్న మహిళలు వెంటనే సహాయం పొందేలా సాంకేతికతను ఉపయోగిస్తూ దిశ చట్టాన్ని , యాప్‌ను రూపొందించారన్నారు. ప్రస్తుతం ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో మహిళా విభాగం నగర అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ, దాసరి వాసంతి సాహిత్య, దేవి, జాహ్నవి, సుజాతరెడ్డి, సుహాసిని, భారతి, భానుమతి, రాధా యాదవ్, ముంతాజ్, రాజేశ్వరి, ప్రసన్న, లక్ష్మిదేవి, మహేశ్వరి, పార్వతి, ఉష, అంజనమ్మ, అంజలి, పద్మ, లీలా, కుళ్లాయమ్మ, లక్ష్మినరసమ్మ, పద్మావతి, ఖమర్తాజ్, మహేశ్వరి, పద్మా, శోభాభాయి, శోభా రాణి తదితరులు పాల్గొన్నారు. -
152 అర్జీలకు శాశ్వత పరిష్కారం
కూడేరు: ఉదిరిపికొండలో ‘ఒక గ్రామం – ఒక నెల –నాలుగు సందర్శనలు’ కార్యక్రమ ముగింపు సభ శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ ఆనంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బంది పడుకుండా ఉండాలన్నదే ‘ఒక గ్రామం – ఒక నెల – నాలుగు సందర్శనలు’ కార్యక్రమ ఉద్దేశమన్నారు. గత మూడు సందర్శనల్లో ప్రజల నుంచి 312 అర్జీలు వచ్చాయన్నారు. మండల రెవెన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో సమగ్రంగా విచారణ జరిపి అర్హత ఉన్న 152 భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధన మేరకు అర్హత లేకపోవడంతో 95 అర్జీలను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. మరో 65 అర్జీలు చట్టపరమైన అంశాలకు సంబంధించినవి ఉండడంతో వాటిని నిబంధనల మేరకు పరిష్కరించడానికి అధికారులకు కొంత సమయం పడుతుందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ ప్రేమంత్ కుమార్, తహసీల్ధార్ మోహన్ కుమార్, సీఎస్‌డీటీ శాంతకుమారి, మండల సర్వేయర్ అయేషా సిద్ధిఖీ, పలు శాఖల అధికారులు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. ‘టెట్’కు 143 మంది గైర్హాజరు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు 143 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. రెండు విడతల్లో కలిపి మొత్తం 1,813 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 1,670 మంది హాజరయ్యారు. దీంతో 143 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ హుస్సేన్ తెలిపారు. స్కాలర్షిప్ రెన్యూవల్ ప్రక్రియ పూర్తి చేయాలి అనంతపురం ఎడ్యుకేషన్: పోస్టుమెట్రిక్ స్కాలర్ షిప్ పథకం కింద అర్హులైన విద్యార్థుల రెన్యూవల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రాజేశ్వరమ్మ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. జ్ఞానభూమి వెబ్‌పోర్టల్‌లోని కళాశాల ప్రిన్సిపాల్ లాగిన్ ద్వారా అర్హులైన విద్యార్థుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. యూనివర్సిటీ అకడమిక్ క్యాలెండర్లో ఎంట్రీ చేసిన తేదీ నుంచి మూడు నెలల పాటు మాత్రమే రెన్యూవల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని, ఆ గడువు ముగిసిన అనంతరం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోతుందని పేర్కొన్నారు. కళాశాలల్లో స్కాలర్షిప్ విభాగం విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తక్షణమే విద్యార్థుల రెన్యూవల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేసి, అర్హత ఉన్న ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ ప్రయోజనాన్ని కోల్పోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో జేఎన్టీయూ నంబర్ 1 ● ఇండియా టుడే ర్యాంకింగ్స్‌లో వెల్లడి అనంతపురం: దేశంలోని సాంకేతిక విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఇండియా టుడే ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో జేఎన్టీయూ(ఏ)కు ఏపీలో నంబర్ వన్ స్థానం దక్కింది. అలాగే జాతీయ స్థాయిలో 20వ ర్యాంక్‌ను కై వసం చేసుకుంది. ప్రతిష్టాత్మకమైన ఈ గుర్తింపుపై జేఎన్టీయూ(ఏ) వీసీ హెచ్.సుదర్శనరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు జేఎన్టీయూ(ఏ) కుటుంబం మొత్తానికి గర్వకారణమని పేర్కొన్నారు. అధ్యాపక బృందం, పరిపాలనా సిబ్బంది, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఇతర భాగస్వాములందరి సమష్టి కృషి, అంకితభావం ఫలితమే ఈ విజయం అని కొనియాడారు. ఈ గుర్తింపు విశ్వవిద్యాలయాన్ని మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ప్రేరేపిస్తుందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతిష్టను పెంచుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన విజయానికి అమూల్యమైన సహకారం అందించిన జేఎన్టీయూ(ఏ) కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. -
హంద్రీ–నీవా సీఈ నాగరాజ రాజీనామా
● కడప సీఈ బాలచంద్రారెడ్డికి ఇన్చార్జ్ బాధ్యతలు అనంతపురం సెంట్రల్: హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ (సీఈ) పోస్టుకు కె.నాగరాజ రాజీనామా చేశారు. ఆయన లేఖకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జనవరి నెలాఖరున ఆయన హంద్రీ–నీవా సీఈగా ఉద్యోగ విరమణ పొందారు. అయితే జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు ఆయనే కావాలని పట్టుబట్టి మరీ పదవీకాలం పొడిగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఏడాదిపాటు ఆయన సేవలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలో ఎప్పుడూ రిటైర్డు అయిన ఉద్యోగిని కొనసాగించలేదని, ఎలాంటి ఇబ్బందీ లేకుండా రూ.వేల కోట్లు హంద్రీ–నీవా లైనింగ్ పనుల బిల్లులు మంజూరు చేసుకోవడం కోసమే ఆయన్ను సీటులో ఉంచాలని ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఆయన నియామకం జరిగింది. అయితే ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన పనితీరుపై రాష్ట్ర ఉన్నతాధికారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రస్థాయి సమావేశంలో అన్ని జిల్లాల అధికారుల సమక్షంలో తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో నాగరాజ మనస్తాపం చెంది తాను కొనసాగలేనని రాజీనామా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదిస్తూ కడప చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్) బాలచంద్రారెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశం జిల్లా జలవనరులశాఖలో హాట్‌టాపిక్ మారింది. కె.నాగరాజ -
సోదరుడితో భూతగాదా – వ్యక్తి ఆత్మహత్య
తాడిపత్రి రూరల్ : సోదరుడితో ఉన్న భూతగాదాతో ఏర్పడిన కుటుంబ కలహాల కారణంగా శుక్రవారం చల్లా రామకృష్ణయ్యనాయుడు (61) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని జీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ తెలిపారు. తాడిపత్రి మండలం కావేరిసముద్రం గ్రామానికి చెందిన రామకృష్ణయ్యనాయుడు తాడిపత్రి –చల్లవారిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడ్డాడన్న రైల్వే కో–పైలేట్ సమాచారంతో సంఘటనా స్థలానికి వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇగ్నో కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు అనంతపురం ఎడ్యుకేషన్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) జూలై–2026 సెషన్‌కు సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తుల గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలోని ఇగ్నో అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ మురళీమోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే పీజీ ద్వితీయ సంవత్సరం, డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు రీ–రిజిస్ట్రేషన్ ఫీజును కూడా ఆన్లైన్ ద్వారా 15 వరకు చెల్లించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 94404 26895, 98669 24626 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. ‘ఎల్‌నినో’తో అప్రమత్తంగా ఉండాలి కూడేరు: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలని, శాసీ్త్రయ సాగు పద్ధతులను పాటించాలని కృషి విజ్ఞాన కేంద్రం(కళ్యాణదుర్గం) శాస్త్రవేత్తలు వి.యుగంధర్, ఉద్యాన శాస్త్రవేత్త, ఇ.శిరీషా, కీటక శాస్త్రవేత్తలు వింధ్య, డాక్టర్ ఎం.బాంధవ్య సూచించారు. శుక్రవారం కూడేరు మండల పరిధిలోని కొర్రకోడు, తిమ్మాపురం, కూడేరు, గొటుకూరు గ్రామాల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మిరప, టమాట, మొక్కజొన్న, కంది, వేరుశనగ పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. -
దీక్షా శిబిరం ఎత్తేయాలని ఒత్తిడి
● తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్ష శిబిరాన్ని త్వరగా ఎత్తేయాలని పోలీసులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చితంబరరెడ్డితో పాటు మరికొందరు నాయకులు దీక్షలకు రాకుండా మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నాయకుల రిలే దీక్షలను అడ్డుకోవాలని ‘పచ్చ’మూక ప్రయత్నించింది. దీక్షా శిబిరం వైపు రాకుండా వారిని పోలీసులు నిలువరించడంతో ‘ఇంటింటికీ టీడీపీ’ పేరుతో హంగామా చేసుకుంటూ వెళ్లారు. -
దుర్గంలో తాగునీటి కష్టాలు
● పట్టించుకోని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, అధికారులు ● వారానికోసారి కూడా నీళ్లు రాకపోతే ఎలా అని ప్రజల ఆగ్రహం రాయదుర్గంటౌన్: రక్షిత మంచినీటిని అందజేయడమే తమ లక్ష్యం అంటూ ఒకవైపు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, మరోవైపు మున్సిపల్ అధికారుల మాటలు నీళ్లలా పారుతున్నాయే తప్ప.. కొళాయి తిప్పితే చుక్కనీరు రాని దుస్థితి నెలకొంది. రాయదుర్గం పట్టణంలోని ఏ వీధి చూసినా దాహం కేకలే వినిపిస్తున్నాయి. వారం రోజులుగా ఇబ్బందులు గత వారం రోజులుగా పట్టణంలో కొళాయిలకు తాగునీటిని సరఫరా చేయడం లేదు. బోరునీటి వసతి, సిస్టన్ ట్యాంకులు ఉన్న కాలనీల్లో కనీస అవసరాలకై నా నీరు అందుబాటులో ఉంది. కేవలం కొళాయి నీటిపైనే ఆధారపడి , ఎలాంటి ప్రత్యామ్నాయ నీటి వసతి లేని కాలనీల్లో పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజల నీటి అవసరాలు తీర్చాల్సిన అధికారులు, పాలకులు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. కేవలం మున్సిపాలిటీకి చెందిన రెండు ట్యాంకర్లు, రెండు అద్దె ట్యాంకర్ల ద్వారా బోరునీటిని పంపుతున్నారు. గత గురువారం నుంచి శాంతినగర్‌లోని ట్యాంకర్లను నింపుకునే ఫిల్లింగ్ బోరు సైతం మరమ్మతుకు గురవడంతో ట్యాంకర్ల సరఫరా కూడా నిలిచిపోయింది. ఎస్ఎస్ ట్యాంకులో నీటి పంపింగ్ పుల్లింగ్ కట్ కావడంతో నీటి సరఫరాలో జాప్యం జరిగిందని, సమస్యను శుక్రవారం సాయంత్రం పరిష్కరించి నీటి పంపింగ్ ప్రారంభించామని అధికారులు చెబుతున్నారు. 20 రోజులకే నీటి నిల్వలు రాయదుర్గం పట్టణానికి తాగునీటిని అందించే హెచ్చెల్సీ శాశ్వత తాగునీటి పథకం కింద కణేకల్లులోని ఎస్ఎస్ ట్యాంకులో కేవలం 20 రోజులకు సరిపడా నీరు మాత్రమే నిల్వ ఉంది. ఎస్ఎస్ ట్యాంకు పూర్తిస్థాయి నీటి మట్టం 3052 మిలియన్ లీటర్లు కాగా శుక్రవారం నాటికి 380 మిలియన్ లీటర్ల నీరు నిల్వ ఉంది. హెచ్చెల్సీ సరిహద్దు నుంచి ఈ నెల 10న ఆంధ్రా కోటా కింద తుంగభద్ర జలాలు విడుదల చేసే అవకాశం ఉంది. అప్పటి దాకా ఎస్ఎస్ ట్యాంకులో నిల్వ నీటి సామర్థ్యం డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది. ఎస్ఎస్ ట్యాంకులో నిల్వ ఉన్న నీరు రంగుమారి సరఫరా అవుతుండడంతో ప్రజలు వినియోగించలేని స్థితిలో ఉన్నారు. ఎస్ఎస్ ట్యాంకుకు హెచ్చెల్సీ నీటి పంపింగ్ ప్రారంభించే వరకు అధికారులు, పాలకులు స్పందించి పట్టణంలో నీటి సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్ఎస్ ట్యాంకులో డెడ్ స్టోరేజీకి చేరువలో నీరు ఇటీవల తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన పట్టణ వాసులు -
ఫసల్ బీమాకు సర్వర్ సమస్య
● కొనసాగుతున్న రైతు కష్టాలు అనంతపురం అగ్రికల్చర్: పంటల బీమా పథకాల్లో భాగంగా ఈ నెల 15 వరకు ఫసల్ బీమా కింద నోటిఫై అయిన కంది, ఆముదం, జొన్న, మొక్కజొన్న, ఎండుమిరప, వరి పంటలకు ప్రీమియం కట్టేందుకు గడువు పొడిగించినా మీ–సేవ, సీఎస్సీలో సర్వర్ సమస్య కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల సైట్ ఓపెన్ కాకపోవడం.. లేదంటే ఆధార్, 1–బీ లింక్ కాకపోవడం, అలాగే ఓటీపీ సమస్య కూడా ఉన్నట్లు రైతులు వాపోతున్నారు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురుచూసినా పనికావడం లేదని ఆందోళన చెందుతున్నారు. వాతావరణ బీమా కింద నోటిఫై అయిన పంటలకు ప్రీమియం చెల్లింపు గడువు ఆగస్టు ఒకటిన ముగిసిన విషయం తెలిసిందే. వాతావరణ బీమా కింద 86,653 మంది రైతులు 1,24,936 హెక్టార్లకు రూ.35 కోట్లు వరకు ప్రీమియం కట్టినట్లు తాజా నివేదిక వెల్లడి చేస్తోంది. ● ఫసల్‌బీమా గడువు ఈనెల 15 వరకు ఉన్నా... సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం జరుగుతోంది. ప్రస్తుతానికి 1,05,783 మంది రైతులు 1,69,386 హెక్టార్ల పంటలకు ప్రీమియం చెల్లించారు. మొత్తం మీద రెండు బీమా పథకాల కింద జిల్లాలో 1,92,436 మంది రైతులు 2,94,322 హెక్టార్లకు తమ వాటా కింద ప్రీమియం చెల్లించి బీమా పరిధిలోకి వచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. -
అర్జున్ వీరవిహారం.. దీపక్ విజృంభణ
● చిత్తూరుపై అనంత జట్టు ఘన విజయం అనంతపురం: జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అనంత క్రీడాగ్రామం వేదికగా జరుగుతున్న ఏసీఏ సౌత్‌జోన్ మల్టీడే క్రికెట్ టోర్నీలో అర్టున్ టెండుల్కర్ వీరవిహారం.. బౌలర్ దీపక్ విజృంభణతో అనంత జట్టు విజయతీరాలకు చేరింది. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో భాగంగా ఏసీజీ మైదానంలో శుక్రవారం అనంతపురం, చిత్తూరు జట్లు తలపడ్డాయి. మొదటి ఇన్నింగ్స్‌లో చిత్తూరు జట్టు 196 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. 69 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్‌ను కొనసాగించిన అనంతపురం జట్టు 46.4 ఓవర్ల వద్ద 186 పరుగులకు ఆలౌట్ అయింది. పి. గిరినాథ్‌రెడ్డి 54 పరుగులు చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 32.5 ఓవర్ల వద్ద 155 పరుగులకు ఆలౌట్ అయింది. తేజారెడ్డి 58 పరుగులు, ధరణికుమార్ నాయుడు 53 పరుగులు తప్ప ఎవరూ రాణించలేదు. అనంత బౌలర్లలో ఎం.దీపక్ 42 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీశాడు. అనంతరం తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనంతపురం జట్లు 15.1 ఓవర్ల వద్ద ఒక్క వికెట్ కోల్పోయి 156 పరుగులు సాధించింది. బ్యాటర్ అర్జున్ టెండుల్కర్ 34 బంతుల్లో ఆరు ఫోర్లు, 8 సిక్సర్లతో వీరవిహారం సాగిస్తూ 82 పరుగులు సాధించాడు. దీంతో అనంత జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నెల్లూరు వైఎస్సార్ కడప, నెల్లూరు జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో నెల్లూరు జట్టు ఆధిక్యత సాధించింది. గురువారం ఆట ముగిసే సమయానికి కడప జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 339 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం 339 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆటను కొనసాగించిన కడప జట్టు 79.5 ఓవర్ల వద్ద 369 పరుగులకు ఆలౌట్ అయింది. వాసుదేవరాజు 171 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. సోహన్ వర్మ 154 పరుగులు , రోషన్ పవన్‌కుమార్ 103 పరుగులు చేశారు. దీపక్ (7 వికెట్లు)అర్జున్ టెండుల్కర్ (82 పరుగులు) -
●రైతు కష్టం నేలపాలు
గుమ్మఘట్ట: టమాట ధరలు దారుణంగా పడిపోయాయి. రైతు కష్టార్జితం నేలపాలయ్యింది. రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మఘట్ట, కణేకల్లు, బొమ్మనహాళ్, రాయదుర్గం, డి.హీరేహాళ్ మండలాల్లో 1,500 ఎకరాల విస్తీర్ణంలో టమాట సాగైంది. దిగుబడి ఆశాజనకంగానే వచ్చింది. అనంతపురం, బళ్లారి మార్కెట్లకు తీసుకెళ్తే.. 15 కిలోల టమాటాల బాక్సు రూ.80 పలికింది. కూలీలు, రవాణా ఖర్చులకు కూడా చాలడం లేదని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు కాకపోవడంతో టమాటాలను రోడ్డపక్కన పారబోసి పోతున్నారు. టమాటాలకు మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
స్టేటస్కో ఉన్నా పట్టించుకోలేదు
ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యక్ష ఆదేశాలతో బోయ కులానికి చెందిన పేద రైతుపై అధికారులు కక్షకట్టి వ్యవహరిస్తున్నారు. ఇది దుర్మార్గానికి పరాకాష్ట. ఈ భూమి విషయంలో కోర్టు స్టేటస్కో ఇచ్చింది. విచారణ పూర్తయ్యే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ బాధిత రైతుకు కనీసం నోటీసు ఇవ్వకుండా, ఆయన వద్దనున్న ఆధారాలు పరిశీలించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే. తాను ఇన్చార్జ్ తహసీల్దారుకు ఫోన్ చేసినా స్పందించలేదు. వాయిస్ మెసేజ్ పెట్టినా పట్టించుకోలేదు. ఈ అధికారి ‘ఎస్ఐఆర్’లోనూ ప్రసన్నాయపల్లిలో ఏకపక్షంగా దొంగ ఓట్లు ఎక్కించారు. ఆయనకు పరిటాల సునీత కొమ్ము కాస్తున్నారు. బాధిత రైతుకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. అయినా న్యాయం జరగకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం. – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
గడువులోగా పనులు పూర్తి చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: జనాభా గణనలో భాగంగా జిల్లా సెన్సస్ హ్యాండ్‌బుక్ (డీసీహెచ్‌బీ) తయారీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా సెన్సస్ నోడల్ అధికారి మలోలా సంబంధిత అధికారులను ఆదేశించారు. డీసీహెచ్‌బీ తయారీకి నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల, బుక్కరాయసముద్రం మండల పరిషత్ కార్యాలయం, రాప్తాడు మండలం సచివాలయం–2లో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలను సందర్శించి శిక్షణ నిర్వహణ, ఫీల్డ్ ఫంక్షనరీలకు అందిస్తున్న మార్గదర్శకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు తమ పరిధిలోని రెవెన్యూ గ్రామాలు, పట్టణాలకు సంబంధించిన జిల్లా సెన్సస్ హ్యాండ్‌బుక్ కోసం క్షేత్రస్థాయి సమాచార సేకరణ చేపట్టాలన్నారు. రేషన్ బియ్యం పట్టివేత అనంతపురం సెంట్రల్: నగరంలో త్రీటౌన్స్టేషన్ పరిధిలో అక్రమంగా రేషన్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు త్రీటౌన్ సీఐ కౌలుట్లయ్య తెలిపారు. నగరానికి చెందిన జగదీష్, సాయికృష్ణ రెండు ఆటోల్లో 60 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో స్థానిక శాంతినగర్బోర్డు వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఆటోలు, బియ్యాన్ని స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. జిల్లాలోని ముఖ్య ప్రదేశాలపై మై స్టాంప్‌లు అనంతపురం టౌన్: జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు పర్యాటక ప్రదేశాల వారసత్వ సంపదను కాపాడేందుకు తపాలాశాఖ ఆధ్వర్యంలో మైస్టాంప్లను ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. తపాలాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మైస్టాంప్లను శుక్రవారం ఆయన కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలపై స్టాంప్‌లను ఏర్పాటు చేసి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించే దిశగా పోస్టల్ కార్యాలయం వాటిపై స్టాంప్‌లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. జిల్లాలోని 12 ప్రముఖ దేవాలయాలతో పాటు పర్యాటక ప్రదేశాలను ఎంపిక చేసి వాటి చిత్రాలతో స్టాంప్‌లను ఏర్పాటు చేస్తుండటం జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో తపాలాశాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్, ఏఎస్పీ ఉమా మహేశ్వర్, రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక ఉద్యోగాల తుది మెరిట్ జాబితా విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక ఉద్యోగ నియామకాలు 2025–26 కింద రిజర్వ్ చేసిన బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ ప్రక్రియలో భాగంగా ఓడీఎస్సీ పోస్టులకు సంబంధించిన తుది మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకురాలు జి. అర్చన ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్సైట్ https://ananthapuramu.ap. gov.in లో మెరిట్ జాబితా ఉంచామన్నారు. అలాగే కలెక్టరేట్లోని రికార్డు రూమ్ నోటీస్ బోర్డులో కూడా ఉంచామన్నారు. అలాగే డీఎస్సీ లైబ్రేరియన్ పోస్టుకు సంబంధించిన తుది మెరిట్ జాబితా కలెక్టర్ ఆదేశాల మేరకు కొన్ని అంశాలపై స్పష్టీకరణ ప్రక్రియలో ఉన్నందున, అది పూర్తయిన వెంటనే అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చిలమత్తూరు: మండల పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారి కోడూరు థామస్ మన్రో తోపు సమీపంలోని టెక్స్‌పోర్ట్ గార్మెంట్స్ వద్ద గుర్తు తెలియని కారు ఢీకొని కోడూరు కు చెందిన గంగమ్మ (65) మృతి చెందింది. ఫ్యాక్టరీ వద్ద వాహనాలను గమనించకుండా రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని కారు ఢీకొట్టినట్లు పోలీసులు చెబతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. -
అధికారులు అనుకున్నట్టే చేశారు
రాప్తాడు రూరల్: పుల్లలరేవు గ్రామానికి చెందిన రైతులు పెద్ద ఓబులేసు, వసంతుకు చెందిన సాగుభూమి విషయంలో రెవెన్యూ అధికారులు అనుకున్నట్టే చేశారు. శుక్రవారం వారు వ్యవహరించిన తీరుపై వివాదం నెలకొంది. కనీసం నోటీసు ఇవ్వకుండా పోలీసుల సమక్షంలో వ్యవసాయ బోరు, పైపులైన్లు, కేబుల్ ను తొలగించడంతో పాటు తోటలోని చెట్లకు నీరు అందకుండా చేశారని బాధిత రైతు కుటుంబం ఆరోపిస్తోంది. రాజకీయ ఒత్తిళ్లతోనే తమను వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్చార్జ్ తహసీల్దారు చెన్నకేశవులు, సీఐ వెంకటేశ్వర్లు సమక్షంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. రైతు పెద్ద ఓబులేసు, ఆయన తల్లి నాగలక్ష్మమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని రాప్తాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం తోటలోని మోటారు, పైపులైన్లు, కేబుల్‌వైర్లను తొలగించి తహసీల్దారు కార్యాలయానికి తరలించారు. దీంతో తోటలోని చెట్లకు నీరు అందకుండా పోయిందని రైతు కుటుంబం వాపోయింది. రైతు తల్లిని అదుపులోకి తీసుకుంటున్న మహిళా పోలీసులు ఇన్చార్జ్ తహసీల్దార్, సీఐ సమక్షంలో మోటారు, బోరు, పైపులు తొలగిస్తున్న దృశ్యం బాధిత రైతుకు నోటీసు లేకుండానే బోరు, పైపులైన్ల తొలగింపు పోలీసుల సమక్షంలో వ్యవసాయ పరికరాలు స్వాధీనం కుటుంబ సభ్యుల ఆవేదన -
బాధ్యతలను విస్మరిస్తే లక్ష్యం నెరవేరేదెలా?
అనంతపురం న్యూ టౌన్: జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల ఆవరణలో నెట్ జీరో హెల్తీ క్యాంపస్ (ఎన్‌జెడ్‌హెచ్‌సీ) పేరుతో కొన్ని లక్ష్యాలను నిర్దేశించాము. క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన వారు బాధ్యతలను విస్మరిస్తే ప్రభుత్వ లక్ష్యాలు ఎలా సాధ్యమవుతాయని జిల్లా అధికారులు ప్రశ్నించారు. అందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే లక్ష్యాల్లో పురోగతి సాధ్యమన్నారు. జిల్లా పరిషత్ రివ్యూ సెంటర్లో గురువారం నెట్ జీరో హెల్త్ క్యాంపస్ కార్యక్రమం నిర్వహణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమ నోడల్ అధికారి, జిల్లా పరిషత్ సీఈఓ పీ విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలోని 26 మండలాల్లో ఇదివరకే గుర్తించిన 46 విద్యాసంస్థల్లో నిర్దేశిత లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు కేవలం కొన్ని విద్యాసంస్థల్లో మాత్రమే పనులు జరగడంపై అసహనం వ్యక్తం చేశారు. అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్, రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, కమ్యూనిటీ కంపోస్ట్ గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలను ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. డ్వామా పీడీ సలీం భాష వివిధ పనుల పురోగతిని సమీక్షించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంత మాత్రం ఉపేక్షించమని, తక్షణమే నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీఓలు, ఈసీలు, బీసీ వెల్ఫేర్ డీడీ కుష్బూ కొఠారి, నెట్ జీరో హెల్తీ క్యాంపస్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసులు హాజరయ్యారు. ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం ఆత్మకూరు: తహసీల్దార్ కార్యాలయం ద్వారా అర్జీదారుల సమస్యలను పరిష్కరించడంలో నాణ్యతను మరింత మెరుగుపరచాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్, మ్యూటేషన్ ఫైళ్లు, ఎఫ్‌లైన్ పిటీషన్లను ఎప్పటికప్పుడు పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలన్నారు. అనంతరం పి.యాలేరు గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో గ్రౌండ్ ట్రూ థింగ్ పనులను తనిఖీ సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ప్రేమంత్‌కుమార్, తహసీల్దార్ లక్ష్మీనాయక్, సర్వేయర్ యమున తదితరులు పాల్గొన్నారు. -
అదనపు ఏఈఆర్ఓల నియామకం
అనంతపురం అర్బన్: నియోజకవర్గాల వారీగా మండలాలకు అదనపు ఏఈఆర్ఓలను భారత ఎన్నికల సంఘం నియమించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ తెలిపారు. ఇందుకు సంబంధించి గెజిట్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసిందన్నారు. ప్రస్తుతం ఉన్న ఏఈఆర్ఓలకు సహాయ ఏఈఆర్ఓలను నియమించారన్నారు.రాయదుర్గం,ఉవరకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, కళ్యాణదుర్గం, రాప్తాడు నియోజకవర్గాల్లో ఆయా మండలాల ఎంపీడీఓలను అదనపు ఏఈఆర్‌ఓలుగా నియమించారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలో అనంతపురం రూరల్ డిప్యూటీ తహసీల్దారు, అనంతపురం రూరల్ ఎంపీడీఓ (స్వర్ణ గ్రామ అధికారి)ను నియమించారు. నగర, పురపాలక సంఘాలకు.. అనంతపురం అర్బన్‌కు సంబంధించి అదనపు ఏఈఆర్‌ఓలుగా పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దారు, నరగపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్, పట్టణ ప్రణాళిక అధికారి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్–1, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్–2ను నియమించారు. రాయదుర్గం మునిసిపాలిటీకి పట్టణ ప్రణాళిక పర్యవేక్షకుడు, గుంతకల్లు అర్బన్‌కు అసిస్టెంట్ సిటీ ప్లానర్, గుత్తి అర్బన్‌కు మునిసిపల్ అసిస్టెంట్ ఇంజినీర్‌ను నియమించారు. తాడిపత్రి అర్బన్‌లో మునిసిపల్ డిప్యూటీ ఇంజినీర్, కళ్యాణదుర్గం అర్బన్‌లో పట్టణ ప్రణాళిక అధికారి నియమితులయ్యారు. టీబీ డ్యాంలో 64 టీఎంసీల నీరు బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయంలో 64.816 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. బుధవారం నాటికి 1,00,700 క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో గురువారం నాటికి 60,751 క్యూసెక్కులకు తగ్గింది. జలాశయం ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్కమగళూరు, వరనాడులో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో వరద డ్యాంకు చేరుతోంది. ఈ క్రమంలో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 1,633 అడుగుల మట్టానికి గాను 1,621.22 అడుగులకు నీరు చేరింది. ఇన్‌ఫ్లో 60,751 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,499 క్యూసెక్కులుగా నమోదైంది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 64.816 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సీఐ వ్యవహారంపై విచారణ హిందూపురం టౌన్: పట్టణ సీఐ రాజగోపాల్నాయుడి వ్యవహార శైలి, వెల్లువెత్తుతున్న ఆరోపణలపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు. సీఐ రాజగోపాల్ నాయుడు అధికార టీడీపీతో అంటకాగుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ పురంలో ‘పచ్చ’ పోలీసు శీర్షికన ఈ నెల 2వ తేదీన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సీఐ రాజగోపాల్ నాయుడు వ్యవహార శైలి, ఇటీవల ఓ దళిత లాయరుపై బూటుకాలితో ఆయన చేసిన దాడి తదితర వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు. అంతే కాకుండా కదిరి డీఎస్పీ శివన్నారాయణస్వామిని విచారణాధికారిగా నియమించారు. లాయరునే బూటుకాలితో తన్నిన సీఐ ఇటీవల గర్భిణి రమ్యశ్రీ హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుకూ మృతి చెందింది. బాధితుల తరఫున అక్కడికి వచ్చిన దళిత న్యాయవాదిపై సీఐ రాజగోపాల్ నాయుడు దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడి బూటుకాలితో తన్నారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారగా, దళిత, బహుజన, ప్రజా సంఘాల నాయకులతో పాటు న్యాయవాదులు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఐ రాజగోపాల్నాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎస్పీ సతీష్‌కుమార్‌కు కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు సీఐ వ్యవహారశైలిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం నేపథ్యంలోనే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కదిరి డీఎస్పీ శివన్నారాయణస్వామి గురువారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బందితో విచారణ చేపట్టారు. -
9 గంటల విద్యుత్ సరఫరా ఎక్కడ?
● హంపాపురం సబ్‌స్టేషన్ వద్ద రైతుల ఆందోళన రాప్తాడు రూరల్: మండల పరిధిలోని హంపాపురం గ్రామ సబ్‌స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి ఫీడర్ పరిధిలోని రైతులు గురువారం హంపాపురం సబ్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రోజుకు 9 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్ అందించడం లేదని, కేవలం 7 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లపల్లి ఫీడర్ పరిధిలోని గొందిరెడ్డిపల్లి, హంపాపురం, గొల్లపల్లి, ఎర్రగుంట గ్రామాల రైతులు కొన్ని రోజులుగా తీవ్ర విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో 9 గంటల పాటు విద్యుత్ అందుతుండగా, తమకు మాత్రం కేవలం 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. మూడు గంటలు, నాలుగు గంటల చొప్పున విడతల వారీగా సరఫరా చేస్తూ, మధ్యలో తరచూ కోతలు విధిస్తున్నారన్నారు. రెండు రోజులుగా మూడు గంటలకు పైగా అదనపు కోతలు విధించడంతో పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో బోర్లపైనే ఆధారపడి పంటలను కాపాడుకునే పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి సమయంలో విద్యుత్ కోతలతో లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న వేరుశనగ, టమాట, అరటి, చీనీ తదితర పంటలు ఎండిపోయే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను సంబంధిత విద్యుత్‌శాఖ ఏఈ దృష్టికి తీసుకెళ్తే, ‘కరెంటు వచ్చినప్పుడే వాడుకోవాలి, మా వల్ల ఏమీ కాదు‘ అనే నిర్లక్ష్యపూరిత సమాధానం చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 9 గంటల నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
శాసీ్త్రయ సలహాలు పాటించండి
వజ్రకరూరు: రైతులు శాసీ్త్రయ సలహాలను తప్పక పాటించాలని జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారులు నరసింహులు, రుమానా తెలిపారు. గురువారం వజ్రకరూరు మండలంలో శాస్త్రవేత్తల బృందం విస్తృతంగా పర్యటించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వజ్రకరూరు మండలంలోని పీసీ.ప్యాపిలి, గంజికుంట, కొనకొండ్ల, చాబాల గ్రామాల్లో పర్యటించి రైతులు సాగుచేసిన మొక్కజొన్న, పత్తి, కంది, వేరుశనగ, టమాట, ఆముదం, మిరప తదితర పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు ఎల్‌నినో ప్రభావం, నీటి, తేమసంరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, సమగ్ర చీడపీడలు, యాజమాన్యం, వాతావరణ మార్పులకు అనుగుణమైన సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. పంటల్లో పోషక లోపాల నివారణకు 13.0.45 ఎరువును, సూక్షపోషక మిశ్రమాన్ని లీటరు నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలన్నారు. ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తక్కువ కాలంలో పండే బెట్టను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా జొన్న, సజ్జ, రాగులు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు యుగంధర్, శిరీషా, వింధ్య, బాంధవ్య, ఏఓ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘హిత’ ఎండీ లక్ష్మీనాయుడి అరెస్టు
యువకుడి మృతి కేసులో ● అతనితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు ● పరారీలో మరో నిందితుడు అనంతపురం సెంట్రల్: యువకుడి మృతి కేసులో నగరంలోని హిత ఆస్పత్రి ఎండీ లక్ష్మీనాయుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కౌలుట్లయ్యతో కలిసి డీఎస్పీ చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. నార్పల మండలం రంగాపురానికి చెందిన మెల్లంపుటి లక్ష్మీనాయుడు, హిందూపురంలోని లక్ష్మీపురానికి చెందిన షేక్ కరీముల్లాషాలు నగరంలో రైల్వేస్టేషన్‌కు సమీపంలో హిత హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఇదే ఆసుపత్రి లో తాడిమర్రి మండలం రంగాపురానికి చెందిన దబ్బర అశోక్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసే వాడు. గత నెల 22న అశోక్ తనకు వాట్సాప్ ద్వారా అసభ్యకర మెసేజ్‌లు పంపినట్లు కరీముల్లా షాకు లక్ష్మీనాయుడి భార్య చెప్పింది. దీంతో కరీముల్లా షా, లక్ష్మీనాయుడు, వారి వద్ద డ్రైవర్‌గా పనిచేసే దాసరి కార్తీక్‌లు గత నెల 31న అశోక్‌ను హిత హాస్పిటల్ మూడో అంతస్తులోని ఓ గదిలోకి తీసుకెళ్లారు. టీవీ టవర్ ప్రాంతానికి చెందిన క్రాంతికుమార్ ద్వారా అశోక్‌ను కొట్టడానికి రీపర్ కట్టెలు, వాటర్ పైపులు తెప్పించుకున్నారు. తొలుత లక్ష్మీనాయుడు, కరీముల్లా షా అశోక్‌ను చితకబాదగా.. తర్వాత కార్తీక్‌ను కూడా పిలిపించుకొని అశోక్ బట్టలు ఊడదీసి విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిని లక్ష్మీనాయుడు తన సెల్ఫోన్లో రికార్డు చేశాడు. ఈ క్రమంలోనే దెబ్బలు భరించలేని అశోక్ ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి కిందికి దూకాడు. చెట్టుకొమ్మలు, ఇంట ర్నెట్ తీగలు పట్టుకోవడంతో నెమ్మదిగా భూమిపైకి పడిన అతను గాయాలతోనే పక్క సందులోకి పరుగెత్తాడు. చికిత్స కోసం అశోక్ బయటకు వెళితే విషయం అందరికీ తెలుస్తుందని భావించిన క్రాంతికుమార్..అశోక్‌ను మళ్లీ ద్విచక్రవాహనంలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెంటిలేటర్‌పై చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే అశోక్ మృతి చెందాడు. సాక్ష్యాలు లభ్యం కాకుండా మూడో అంతస్తులోని గదిని నిందితులు శుభ్రం చేయించారు. దాడికి వినియోగించిన కట్టెలు, పైపులు దాచి పెట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్లు డీఎస్పీ వివరించారు. దాడికి ఉపయోగించిన కట్టెలు, వాటర్ పైపు, నాలుగు సెల్ఫోన్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు కార్తీక్‌ను త్వరలోనే పట్టుకుంటామన్నారు. పై అంతస్తు నుంచి దూకడం వల్లే అశోక్ చనిపోయాడా లేక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో మరేదైనా జరిగిందా అనే అంశంపై పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఏ–1 నిందితుని సెల్ఫోన్లో ఉన్న అసభ్యకర వీడియోలు, హిత హాస్పిటల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న అంశాలపై కూడా విచారణ చేస్తామని చెప్పారు. -
3.83 లక్షల ఓట్లకు నోటీసులు
అనంతపురం అర్బన్: ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) భాగంగా చేపట్టిన ఓటర్ల ఎన్యుమరేషన్ ద్వారా 3.83 లక్షల ఓట్లు నిబంధనలకు విరుద్ధంగా (ఎనిమిలస్) ఉన్నట్లు గుర్తించారు. వీటికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 2.64 లక్షలు నోటీసులు సిద్ధం చేశారు. మిగిలిన 1.16 ఓట్లకు నోటీసులు సిద్ధం చేయండి’’ అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ అన్నారు. ‘ఎస్ఐఆర్’పై కలెక్టర్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత ఈఆర్ఓలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచురించిన ఓటర్ల ముసాయిదా జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు ఉంటే ఈనెల 30లోగా ఏఈఆర్ఓలు, ఈఆర్ఓల వద్ద నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అందిన వాటికి మూడు రోజుల్లోగా ఈఆర్ఓ నోటీసు జారీ చేసి హియరింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారానికి ఈఆర్ఓలు అత్యంత ప్రాధానత ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి రోజూ కనీసం లక్ష నోటీసులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫోన్ నంబరు, వివరాల ఆధారంగా బీఎల్ఓల సహకారంతో నోటీసులు పంపిణీ చేయాలన్నారు. ప్రతి ఈఆర్ఓకు ఐదారుగురు ఏఈఆర్ఓలను అదనంగా ఎన్నికల కమిషన్ కేటాయించింద న్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా 3,83,391 ఓట్లు ఉండగా ఇప్పటి వరకు 2,64,640 ఓట్లకు నోటీసులు సిద్ధం చేశారని, మిగిలిన 1,16,381 ఓట్లకు సంబంధించి నోటీసులు సిద్ధం చేయాలని ఆదేశించారు. రోజుకు కనీసం లక్ష నోటీసులు పంపిణీ చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని చెప్పారు. నోటీసు జారీ చేసిన ఏడు రోజుల వ్యవధి ఉండేలా హియరింగ్ తేదీ ఇవాల్సి ఉంటుందన్నారు. త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసి క్లెయిమ్‌లు, అభ్యంతరాలు పరిష్కరించాలని ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో డీఆర్ఓ ఎ.మలోల, ఈఆర్ఓలు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ విత్తనాలపై 80 శాతం రాయితీ
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్‌లో ప్రధాన పంటలు సాగు చేయలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు విత్తనాలపై 80 శాతం రాయితీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాకు సంబంఽధించి ఉలవ, పెసర, అలసంద, జొన్న, కొర్ర తదితర విత్తనాలు 40 వేల క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి మూడు రకాల విత్తనాల ధరలు, రాయితీలు ప్రకటించారు. అందులో ఉలవలు క్వింటా పూర్తీ ధర రూ.7,400 కాగా అందులో 80 శాతం రాయితీ రూ.5,920 పోనూ రైతులు తమ వాటా కింద రూ.1,480 ప్రకారం చెల్లించాలి. అంటే కిలోకు రూ.14.80 ప్రకారం చెల్లిస్తే 10 కిలోలు కలిగిన ప్యాకెట్లు గరిష్టంగా ఒక్కో రైతుకు భూ విస్తీర్ణాన్ని బట్టి రెండు హెక్టార్లకు 5 బ్యాగులు పంపిణీ చేస్తారు. అలాగే అలసందలు క్వింటా పూర్తీ ధర రూ.12,200 కాగా అందులో 80 శాతం రాయితీ రూ.9,760 పోనూ రైతులు తమ వాటా కింద రూ.2,440 ప్రకారం చెల్లించాలి. అంటే కిలోకు రూ.24.40 ప్రకారం చెల్లిస్తే గరిష్టంగా రెండు హెక్టార్లకు 8 కిలోలు కలిగిన ప్యాకెట్లు ఐదు బ్యాగులు పంపిణీ చేస్తారు. కొర్రలు క్వింటా పూర్తీ ధర రూ.6 వేలు కాగా అందులో 80 శాతం రాయితీ రూ.4,800 పోనూ రైతులు తమ వాటా కింద రూ.1200 ప్రకారం చెల్లించాలి. ఈ లెక్కన కిలోకు రూ.12 ప్రకారం చెల్లిస్తే భూ విస్తీర్ణాన్ని బట్టి గరిష్టంగా రెండు కిలోలు కలిగిన ప్యాకెట్లు ఐదు బ్యాగులు ఇస్తారు. చెలరేగిన మల్లికార్జున అనంతపురం: జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగుతున్న ఏసీఏ సీనియర్ అంతర్ జిల్లా క్రికెట్ మ్యాచ్‌లో బౌలర్ మల్లికార్జున రాణించాడు. గురువారం ఏసీజీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో అనంతపురం, చిత్తూరు జిల్లా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 46.4 ఓవర్ల వద్ద పది వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో తేజారెడ్డి (54), మాధవరాయుడు (44) తప్ప ఎవరూ రాణించలేకపోయారు. అనంత బౌలర్లలో జి.మల్లికార్జున 13.4 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. మరో బౌలర్ దీపక్ 17 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన అనంతపురం జట్టు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 69 పరుగులు సాధించింది. కాగా, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లా జట్లు మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. టాస్ గెలిచి తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వైఎస్సార్ కడప జట్టు 75.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 339 పరుగులు సాధించింది. జట్టులోని వాసుదేవరాజు అద్భుతమైన ఆట తీరుతో 151 పరుగులు సాధించాడు. అదే సమయంలో వర్షం మొదలు కావడంతో ఆటను నిలిపి వేశారు. 47 మంది బీఎల్ఓలకు షోకాజ్ నోటీసులు అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్–2026) కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన 47 మంది బీఎల్ఓలకు ఆర్డీఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లాగిన్ ప్రక్రియ కోసం పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించినప్పటికీ సంబంధిత బీఎల్ఓల నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆర్డీఓ ప్రేమంత్‌కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత బీఎల్ఓలు 7న (శుక్రవారం) ఉదయం 11 గంటల్లోపు అనంతపురం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) కార్యాలయంలో హాజరై తమ సంజాయిషీతో పాటు ఎపిక్ కార్డు నంబరు, ఓటీపీ వివరాలను సమర్పించాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా స్పందించకపోతే సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపనున్నట్లు నోటీసులో హెచ్చరించారు. -
వైఎస్ జగన్‌తో రాప్తాడు నేతల భేటీ
వైఎస్ జగన్‌తో తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, నయనతారెడ్డి దంపతులు వైఎస్ జగన్‌తో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ పటాస్ శ్రీకాంత్ రాప్తాడు రూరల్: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు గురువారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఇటీవల ఓ అక్రమ కేసులో అరైస్టె బెయిల్‌పై విడుదలైన తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ పటాస్ శ్రీకాంత్, తోపుదుర్తి నయనతారెడ్డి తదితరులు కలిశారు. ఇటీవల జరిగిన పరిణామాలను వారు వైఎస్ జగన్‌కు వివరించారు. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసుల నమోదు, దాడులు, పోలీసు వేధింపులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు సునీల్ దత్తారెడ్డి కూడా వైఎస్ జగన్‌ని కలిశారు. -
వేదనే మిగులుతు‘న్నది’!
బెళుగుప్ప: అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. బెళుగుప్ప మండల పరిధిలోని కాలువపల్లి, వీరాంజనేయకొట్టాల, జీడిపల్లి వద్ద పెన్నానది పరివాహక ప్రాంతంలో ఇసుకను అక్రమార్కులు తోడేస్తున్నారు. నరసాపురం, బ్రాహ్మణపల్లి, రమనేపల్లి, బూదివర్తి, గుండ్లపల్లి వద్ద హగిరి నది పరివాహక ప్రాంతం నుంచి కూడా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. హగిరి, పెన్నా పరివాహక ప్రాంతాల నుంచి నిత్యం 200కు పైగా ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోంది. ట్రాక్టర్ ఇసుకను రూ.1,500 నుంచి రూ.3,000 వరకూ విక్రయిస్తూ జేబుల్లోకి వేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం చూసీ చూడనట్టు పోతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణానికే ముప్పు బెళుగుప్ప మండల పరిధిలో తూర్పున ప్రవహించే పెన్నా, పశ్చిమాన ప్రవహించే హగిరి నదులే పంటల సాగుకు ఊతంగా వుండేవి. గతంలో వర్షాలు బాగా కురవడంతో నీటి ప్రవాహం మూలంగా ఇసుక వచ్చి చేరేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వరుణుడు మొఖం చాటేసి వర్షాలే కరువయ్యాయి. ఇదే సమయంలోనే అధికార పార్టీ నాయకులు నదుల్లోని ఇసుకను తోడేయడంతో నీరు ఇంకక భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వట్టిపోతున్నాయి. ఈ క్రమంలో రైతులు లబోదిబోమంటు న్నారు. మితిమీరి ఇసుకను తోడేస్తుండడం మూలంగా పర్యావరణానికే ముప్పు పొంచి ఉందని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు. పంటల సాగు కష్టమైంది వేదవతి, హగిరి పరివాహక ప్రాంతం నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోరుబావులు వట్టిపోతున్నాయి. అరకొర నీటితో బోరుబావుల కింద పంటలను కాపాడుకోవడం కష్టంగా మారింది. – భాస్కర్‌రెడ్డి, నక్కలపల్లి, రైతు అధికారులు స్పందించాలి కాలువపల్లి సమీపంలోని పెన్నా నది గుంతలమయంగా మారింది. ఇసుక తరలింపుతో భూగర్భజలాలు అడుగంటి పెన్నా పరివాహక ప్రాంతంలో చాలా మంది రైతుల బోర్లు వట్టిపోయాయి.అధికారులు స్పందించాలి. – మల్లారెడ్డి, కాలువపల్లి అనుమతులు ఇవ్వలేదు హగిరి, వేదవతి, పెన్నా పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను తరలించేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. గృహ నిర్మాణ అవసరాలకు మాత్రం ఇసుకను ట్రాక్టర్లలో తరలించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇసుకతో వ్యాపారం చేస్తే చర్యలు తప్పవు. ఇసుక అక్రమ రవాణాపై పోలీసులతో కలిసి నిఘా పెడతాం. – అనిల్‌కుమార్, బెళుగుప్ప తహసీల్దార్ -
ముద్ద చర్మ వ్యాధి ప్రమాదకరం
● ముందస్తు టీకాలే శరణ్యం ● ఉమ్మడి జిల్లాలో ఉచితంగా 3.77 లక్షల టీకాలు అనంతపురం అగ్రికల్చర్: పశువులు, గేదెలకు సోకే ముద్ద చర్మవ్యాధి (లంపీ స్కిన్ డిసీస్–ఎల్ఎస్డీ) అత్యంత ప్రమాదకరమని స్థానిక పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (అనిమల్ డయోగ్నస్టిక్ డిసీసెస్ ల్యాబ్–ఏడీడీఎల్) అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) డాక్టర్ జి.రవిబాబు తెలిపారు. వ్యాధి సోకిన తర్వాత చికిత్స కష్టమని, ముందస్తు నివారణ చర్యలే శ్రేయస్కరమన్నారు. ఇందుకోసం అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎల్ఎస్డీ వ్యాక్సినేషన్ ఉచితంగా జరుగుతోందని, 3.77 లక్షల డోసుల మందు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 2022లో తీవ్రంగా వ్యాపించిన ఈ వ్యాధితో మరణాలు సంభవించి రైతులకు ఆర్థిక నష్టం చేకూర్చాయని గుర్తు చేశారు. దీంతో రైతులు నాలుగు నెలల కన్నా ఎక్కువ వయస్సున్న తమ పశువులు, గేదెలకు టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఇవీ వ్యాధి లక్షణాలు ముద్ద చర్మ వ్యాధి ప్రమాదకరమైంది. పశువుల శరీరం, ముఖ్యంగా తల, మెడ, పొదుగు, కాళ్లపై గట్టిగా ఉండే ముద్దలు లేదా గడ్డలుగా ఏర్పడతాయి. తీవ్రమైన జ్వరం రావడం, కళ్లు, ముక్కు నుంచి చొంగ కారడం, పాలిచ్చే పశువుల్లో ఉన్నఫలంగా ఉత్పత్తి బాగా తగ్గిపోవడం, బరువు కోల్పోవడం, నీరసించి బలహీనంగా తయారై ప్రాణనష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. ఈగలు, దోమలు, కీటకాల ద్వారా ఒక పశువు నుంచి మరొకదానికి వ్యాపిస్తుంది. అలాగే కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి నివారణకు ముందస్తు టీకాలు వేయించడం సరైన మార్గం. వ్యాధి లక్షణాలు ఉన్న వాటిని వేరుగా ఉంచడం, ఈగలు, దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర వ్యాధులు ప్రబలకుండా పశువైద్యుని సూచన మేరకు యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడాలి. ఇప్పుడు ప్రధానంగా తెల్లజాతి పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలి. అనంతపురం డివిజన్‌కు 1.05 లక్షల డోసులు, ఉరవకొండ డివిజన్‌కు 67,800 డోసులు, ధర్మవరం డివిజన్‌కు 50,300 డోసులు, హిందూపురం డివిజన్‌కు రూ.79,900 డోసులు, పెనుకొండ డివిజన్‌కు 74,600 డోసుల మందు సరఫరా చేసినట్లు ఏడీడీఎల్ ఏడీ రవిబాబు పేర్కొన్నారు. ఎక్కడిక్కడ పశుశాఖ అధికారులు, డాక్టర్లు, పారాస్టాఫ్, వీఏహెచ్‌ఏలను సంప్రదించి నెలాఖరులోపు పాడి రైతులు పశువులకు టీకాలు వేయించుకోవాలని సూచించారు. -
నలభై దాటితే నరకమే..
పెద్దపప్పూరు: ఫ్లోరైడ్ శాపం ఆ గ్రామాన్ని కుదిపేస్తోంది. తాగునీరు అందించే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం చేయకపోవడం వారికి శాపంగా మారింది. ఫిల్టర్ వాటర్ కొనలేక వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. గత ప్రభుత్వంలో రూ.10 లక్షలతో పైప్‌లైన్ మండలంలోని అత్తిరాలదిన్నె గ్రామంలో 300 కుటుంబాలకు పైగా నివాసముంటున్నాయి. ఈ గ్రామాన్ని తాగునీటి సమస్య వేధిస్తోంది. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ నీరే ఉండడంతో గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. 40 ఏళ్ల వయస్సు దాటితే కాల్షియం లోపంతో కాళ్లు వంకర్లు పోవడం, నొప్పులు తీవ్రం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పందించి 2022లో దాదాపు రూ.10 లక్షల వరకూ ఖర్చుచేసి గండికోట రిజర్వాయర్ నీటిని అందించేందుకు పైపులైన్ ఏర్పాటు చేసింది. కొద్ది రోజులు నీటి సరఫరా జరిగినా అనంతరం పైపులైన్లు పగిలిపోవడంతో నీటి సమస్య మళ్లీ మొదటికొచ్చింది. నిద్రావస్థలో చంద్రబాబు సర్కార్ తాగునీటికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో గ్రామంలో ఉన్న బోరు బావి నుంచి వస్తున్న ఫ్లోరైడ్ నీటినే వాడుకునే దుస్థితి నెలకొంది. చంద్రబాబు ప్రభుత్వం కనీసం చిన్నపాటి మరమ్మతు కూడా చేయించలేకపోవడంతో స్థానికులు నరకం చూస్తున్నారు. నిత్యం నొప్పుల మాత్రలు మింగుతూ ఉపశమనం పొందాల్సి వస్తోంది. చాలా మంది వంకర్లు తిరిగిన కాళ్లతో నడిచేందుకు కూడా ఇబ్బంది పడుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకున్నపాపాన పోలేదు. కనీసం ఇప్పటికై నా స్వచ్ఛమైన నీటిని అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నొప్పుల మాత్రలు మింగుతున్నాం బోరుబావి నుంచి వచ్చే నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. ఆ నీటి వాడకంతో కీళ్ల నొప్పులు వచ్చాయి. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాము. నొప్పుల మాత్రలు వేసుకుంటేనే పనులు చేసుకోగలుగుతున్నాము. – భాస్కర్‌రెడ్డి , అత్తిరాలదిన్నె పైపులైన్ ఉన్నా నీటి సరఫరా లేదు గండి కోట ప్రాజెక్టు నుంచి కొట్టాలపల్లికి తాగునీటి పైపులైన్ ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతంలో ఉండడంతో పైపులైన్ లీకేజీలు ఏర్పడుతున్నాయి. చిన్నపాటి మరమ్మతు చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. – నారాయణరెడ్డి, అత్తిరాలదిన్నె ఎవరూ పట్టించుకోలేదు నీటి సమస్యతో బాధపడుతున్నారని అధికారులకు తెలిసినా కన్నెత్తి చూడడం లేదు. 40 ఏళ్లు దాటిన వారంతా నొప్పులతో బాధపడాల్సి వస్తోంది. నూతన బోరు ఏర్పాటు చేసి ఫ్లోరైడ్ లేని నీటిని అందించాలి. – రామాంజులరెడ్డి, అత్తిరాలదిన్నె ఫ్లోరైడ్ నీటితో అల్లాడిపోతున్న అత్తిరాలదిన్నె గ్రామస్తులు కాళ్లు వంకర్లు తిరిగి నడిచేందుకూ ఇబ్బందులు మాత్రలతో ఉపశమనం పొందుతున్న వైనం తాగునీటి పైప్‌లైన్ ఉన్నా నీళ్లు రాని వైనం పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామం పేరు అత్తిరాలదిన్నె కుటుంబాలు 300 వంకర కాళ్లను చూపుతున్న గ్రామస్తులు -
మోసంపై సమర శంఖం
రాయదుర్గంలో నిరాహార దీక్షలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులు గుంతకల్లులో చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నాయకులుఉరవకొండలో దీక్ష చేస్తున్న పార్టీ యువజన, విద్యార్థి విభాగం నాయకులుగుణపాఠం తప్పదు టీడీపీ నేతల దౌర్జన్యం.. పోలీసుల ‘పచ్చ’పాతం అనంతపురంలో రిలే దీక్షలను ఉద్దేశించి పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడారు. మెగా డీఎస్సీ పేరుతో దగా చేసి నిరుద్యోగుల జీవితాలతో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెలగాటమాడారని మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక మంది అభ్యర్థులు నష్టపోయారన్నారు. విజయ వాడలో శాంతియుతంగా దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ, అతడి అనుచరులు దాడి చేయడం దారుణమన్నారు. నియంతల్లా వ్యవహరించిన వాళ్లు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారని, చంద్రబాబుకూ గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అనంతపురం: దగా సర్కారుపై నిరుద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబికింది. మెరిట్ లిస్ట్‌లో ఉన్నా టీచర్ ఉద్యోగం దక్కపోవడంతో ఆక్రోశం కట్టలు తెంచు కుంది. దారుణంగా మోసగించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమిస్తా మంటూ సమర శంఖం పూరించారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలకు విశేష స్పందన లభించింది. అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలికారు. యువత స్వచ్ఛందంగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. అనంతపురంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు దీక్షలో ఒకటో డివిజన్ నుంచి 13వ డివిజన్లకు చెందిన పార్టీ నాయకులు, యువత, నిరుద్యోగులు కూర్చున్నారు. దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్‌తో పాటు ఏఐవైఎఫ్ నేతలు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. నార్పల మండల కేంద్రంలోని పాత గాంధీ సర్కిల్– బస్టాండ్ ప్రాంతంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి, పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త శైలజానాథ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని, అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గుంతకల్లులోని మున్సిపల్ ఆఫీసు ఎదుట రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి ప్రారంభించారు. దీక్షకు ఎమ్మెల్సీ శివరామి రెడ్డితో పాటు ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. జెన్‌జీ తరహా ఉద్యమం రుచి చూపిస్తామని హెచ్చరించారు. ఉరవకొండలో విద్యార్థి, యువజన విభాగం నేతలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురంలోని ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద యువజన విభాగం నేతలు దీక్ష చేపట్టారు. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి వీరికి మద్దతు తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎస్ఈసీ మెంబర్ గౌని ఉపేంద్రారెడ్డి డిమాండ్ చేశారు. రాయదుర్గంలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆదేశాల మేరకు నాయకులు దీక్ష చేపట్టారు. డీఎస్సీ అక్రమాలపై పెల్లుబుకిన నిరసనాగ్రహం వైఎస్సార్ సీపీ నిరసన దీక్షలకు విశేష స్పందన స్వచ్ఛందంగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించిన యువత లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమిస్తామని వెల్లడి -
నేటి నుంచి ‘వీబీజీ రాంజీ‘పై శిక్షణ
అనంతపురం న్యూటౌన్: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ స్థానంలో కొత్తగా తెచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజివీకా మిషన్ గ్రామీణ (వీబీజీ రామ్ జీ) చట్టంపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం నుంచి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్ సలీంభాష తెలిపారు. నగరంలోని డీపీఆర్సీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ’పంచ్ సమ్మేళన్’ పేరుతో అనంతపురం జిల్లాలోని స్థానిక సంస్థల ప్రతినిధులైన జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షుల అధ్యక్షతన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, మండల ఉపాధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, మండల కో ఆప్షన్ సభ్యులతో పాటు గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారులకు డివిజన్ వారీగా శిక్షణ తరగతులు నిర్వహించి కొత్త ఉపాధి హామీ చట్టంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈనెల 7న అనంతపురం , 11న కళ్యాణదుర్గం, 12న గుంతకల్లు డివిజన్ పరిధిలోని వారికి శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక మండల పరిషత్ కార్యాలయాల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్లు సకాలంలో అందించాలిఅనంతపురం అగ్రికల్చర్: దరఖాస్తు చేసుకున్న రైతులకు సకాలంలో డ్రిప్, స్ప్రింక్లర్లు అందజేస్తామని ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి తెలిపారు. అర్హత కలిగిన ప్రతి రైతూ దరఖాస్తు చేసుకునేలా క్షేత్రస్థాయిలో ఆర్ఎస్కే అసిస్టెంట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఏపీడీ జి.చంద్రశేఖర్, ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి, ఏడీ ధనుంజయతో కలిసి హెచ్‌వోలు, హెచ్‌ఈవోలు, ఆర్ఎస్కే అసిస్టెంట్లు, ఎంఐ ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో ఉన్నందున నీటి వనరులను సద్వినియోగం చేసుకునేలా డ్రిప్, స్ప్రింక్లర్లను త్వరితగతిన ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు. టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం ఎడ్యుకేషన్: గుంతకల్లులో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంజేపీ బీసీడబ్ల్యూఆర్ బాలుర గురుకుల పాఠశాల కుందుర్పి ప్రిన్సిపాల్, కన్వీనర్ జి. అస్రత్ వలి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11లోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. అర్హులైన అభ్యర్థులకు డెమో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 90633 01063, 81258 40147 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఆవును ఢీ కొట్టిన ఆటో ● మహిళ మృతి అనంతపురం సెంట్రల్: గుత్తిరోడ్డు డీమార్ట్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ట్రాఫిక్ పోలీసుల వివరాల మేరకు... గురువారం రాత్రి 8 గంటల సమయంలో కల్లూరుకు చెందిన ఆటో డ్రైవర్ దూద్‌పీరా గుత్తిరోడ్డు నుంచి పామిడికి బయలుదేరాడు. సోమలదొడ్డికి చెందిన బాలకొండమ్మ (45) కూడా అదే ఆటో ఎక్కింది. గుత్తిరోడ్డు డీ మార్ట్ సమీపంలోకి రాగానే ఆవు అడ్డుగా వచ్చింది. తప్పించబోయి ఆటోతో ఢీ కొట్టాడు. ఆటో ఫల్టీలు కొట్టగా అందులో ప్రయాణిస్తున్న బాల కొండమ్మ ఆటో కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్ దూద్పీరాకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ప్రయాణికుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ట్రాఫిక్ సీఐ వెంకటేష్‌నాయక్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మైనాపురంలో భారీ చోరీ గుంతకల్లు రూరల్: మండలంలోని ఓబుళాపురం పంచాయతీ పరిధిలో ఉన్న మైనాపురం గ్రామంలో గురువారం భారీ చోరీ జరిగింది. పోలీసుల వివరాలమేరకు... మైనాపురానికి చెందిన పులికొండ అనే వ్యక్తి గురువారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. అతడి భార్య కూడా చీనీకాయల కోత పనులకు వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న కుమారుడు బయటకు వెళ్తూ యథావిధిగా ఇంటికి తాళం వేసి బాత్రూములో ఒకచోట పెట్టి వెళ్లిపోయాడు. దీన్ని గమనించిన దొంగలు తాళాలు తీసుకొని ఇంట్లో చొరబడ్డారు. బీరువాలో ఉన్న రూ.5.7 లక్షల నగదు, 62 తులాల వెండి, మూడు తులాల బంగారాన్ని అపహరించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు విచారిస్తున్నారు. యువకుడి ఆత్మహత్య పెద్దవడుగూరు: మండల పరిధిలోని కిష్టిపాడులో సూర్యనారాయణ (38) ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యనారాయణ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్య ఖర్చుల కోసం ఇతరుల వద్ద అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక, ఆరోగ్యం కుదటపడక మనస్తాపంతో గురువారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య లక్ష్మిదేవి ఉన్నారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రాఘవేంద్రప్ప తెలిపారు. -
‘అనంత’ ఆశలకు ఊపిరి
కళకళలాడుతున్న టీబీ డ్యాం, మల్యాల వద్ద హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం అనంతపురం సెంట్రల్: ‘అనంత’ ఆయకట్టు రైతుల ఆశలకు ఊపిరి వచ్చింది. తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలకు వరద నీరు ఉప్పొంగుతోంది. దీంతో బుధవారం కర్నూలు జిల్లా మల్యాల వద్ద హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేశారు. తొలిరోజు 350 క్యూసెక్కుల చొప్పున నీటిని పంపింగ్ చేస్తున్నారు. క్రమంగా పెంచుకుంటూ పోతామని హంద్రీ–నీవా ఎస్ఈ రాజగోపాల్ తెలిపారు. కర్నూలు జిల్లా పరిధిలో హంద్రీ–నీవా కింద కృష్ణగిరి, పత్తికొండ రిజర్వాయర్లు ఉన్నాయి. వాటికి కొంత నీటిని విడుదల చేస్తూనే అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు నీరు తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 125 టీఎంసీలకు చేరుకుంది. 2.14 లక్షల క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లో నమోదవుతుండడంతో జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి త్వరలోనే చేరుకునే అవకాశముంది. తుంగభద్రకూ పోటెత్తుతున్న వరద బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయంకు కూడా వరద పోటెత్తుతోంది. బుధవారం ఉదయం లెక్కల ప్రకారం 1,00,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 59.718 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటికే నీటి విడుదలకు తుంగభద్ర బోర్డుకు అధికారులు ఇండెంట్ ఇచ్చారు. ప్రస్తుతం తాగునీటి అవసరాలకు బోర్డు అధికారులకు ఇండెంట్ ఇచ్చారు. త్వరలో దామాషా ప్రకారం కేటాయింపులు చేయనున్నారు. దీంతో పంటల సాగుపై స్పష్టత వచ్చే అవకాశముందని హెచ్చెల్సీ అధికారవర్గాలు వెల్లడించాయి. తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులకు ఉప్పొంగుతున్న వరద శ్రీశైలం నుంచి హంద్రీ–నీవాకు ఎత్తిపోతల ప్రారంభం వారంలోగా జీడిపల్లికి కృష్ణా జలాలు త్వరలో తుంగభద్ర నీటి కేటాయింపులపై స్పష్టత -
యువతి బలవన్మరణం
శెట్టూరు: యువతి బలవన్మరణం పొందిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. వివరాలు.. శెట్టూరుకు చెందిన వడ్డే దైవాధీనం, లక్ష్మీదేవి దంపతులకు కుమార్తె జ్యోతి(37)తో పాటు ఒక కుమారుడు ఉన్నారు. జ్యోతి నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది. ఇంట్లోనే ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. చాలా సంవత్సరాలుగా కుమార్తెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరడం లేదు. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు. -
ఊడిన రాళ్లు.. తుప్పుపట్టిన షట్టర్లు
ఉరవకొండ: జిల్లా తాగు, సాగునీటి అవసరాలు తీర్చడంలో తుంగభద్ర జలాలే కీలకం. డ్యాం నుంచి నీరు వచ్చే హైలెవెల్ కెనాల్ (హెచ్చెల్సీ) దుస్థితికి చేరుకుంది. కాలువ దెబ్బతిన్న చోట మరమ్మతుల ద్వారా పటిష్టం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఈ నెల 10న హెచ్చెల్సీకి నీటిని విడుదల చేయడానికి నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఈసారి కూడా శిథిలావస్థకు చేరిన కాలువ గట్ల మధ్య తుంగభద్ర జలాలు జిల్లాలోకి ప్రవేశించనున్నాయి. హెచ్చెల్సీ పొడవునా రెగ్యులేటర్లు శిథిలమయ్యాయి. కట్టడాలు, లైనింగ్ రాళ్లు ఊడిపోయి, షట్టర్లు తుప్పుపట్టి, కాలువ నిండా జంబు, పిచ్చి మొక్కలు కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అనేక చోట్ల కాలువ గట్లు కోతకు గురయ్యాయి. హెచ్చెల్సీ జిల్లా సరిహద్దు అయిన బొమ్మనహాళ్ 105వ కిలోమీటరు వద్ద నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. మేల్కోకుంటే మూల్యం తప్పదు.. సాధారణంగా హెచ్చెల్సీకి నీటి సరఫరా ఆగిపోయిన తరువాత కాలువ పొడవునా అవసరమైన మరమ్మతులు చేపట్టే వీలున్నా ఇరిగేషన్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. నీటి విడుదలకు వారం ముందు హడావుడిగా మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీని వల్ల నిధులు దుర్వినియోగం అవుతుండగా.. కాలువకు అనేక చోట్ల గండిపడి నీరు వృథా కావడం, జిల్లాకు రావాల్సిన నీటి వాటా పూర్తిస్థాయిలో దక్కకుండా పోవడం జరుగుతూ వస్తోంది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి జిల్లాకు హక్కుగా రావాల్సిన 42.50 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో తీసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు, రైతులు కోరుతున్నారు.నింబగల్లు వద్ద హెచ్చెల్సీ రెగ్యులేటర్ కట్టడం రాళ్లు ఊడిపోయి షట్టర్లు తుప్పు పట్టిన దృశ్యం, కాలువకు రెండువైపులా లైనింగ్ లేక వంకను తలపిస్తున్న హెచ్చెల్సీ దుస్థితిలో హై లెవెల్ కెనాల్.. కాలువ గట్లు దెబ్బతిన్నా పట్టని వైనం 10వ తేదీ నుంచి హెచ్చెల్సీకి నీటి విడుదల మరమ్మతులు చేయకుంటే నీరు సాఫీగా సాగడం కష్టమే -
‘వ్యవసాయ’ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
మడకశిరరూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో బీటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మడకశిర ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఏడుకొండలు బుధవారం తెలిపారు. బీటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో ఎంపీసీ–రైతు కోటా కింద బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 27 సీట్లు, మడకశిర వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో 20 సీట్లు (2– ఈడబ్యూఎస్) అందుబాటులో ఉన్నాయి. బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సులో బైపీసీ అభ్యర్థులకు 73 సీట్లు, ఎంపీసీ రైతు కోటా కింద బాపట్ల, పులివెందుల కళాశాలల్లో 32 సీట్లు ఉన్నాయి. ఏపీ ఈఏపీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి జనరల్–ఓసీ అభ్యర్థుల వయోపరిమితి 17 నుంచి 22 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 25 సంవత్సరాలు, దివ్యాంగులకు 27 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది. రైతు కోటా నిబంధనలిలా.. రైతు కోటా కింద దరఖాస్తు చేసుకునే వారికి సంబంధించి అభ్యర్థి తండ్రి లేదా తల్లి లేదా విద్యార్థి పేరున ఎకరా పొలంతో పాటు విద్యార్థి ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ నాన్– మున్సిపాలిటీ ప్రాంతంలోని పాఠశాలలో 4 సంవత్సరాలు చదివి ఉండాలి. తహసీల్దార్ ధ్రువీకరించిన ఫారం–1, పాఠశాల హెచ్ఎం ధ్రువీకరించిన ఫారం–2, మీ భూమి అడంగల్, వన్– బీ కాపీలతో పాటు నాన్ మున్సిపాలిటీ స్టడీ సర్టిఫికెట్లు జత చేయాలి. అభ్యర్థులు ఆన్లైన్లో పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లు, ఫీజు చెల్లింపు రసీదు జత చేసి ఈ నెల 10 సాయంత్రంలోపు ‘‘రిజిస్ట్రార్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిపాలనా కార్యాలయం, లాం, గుంటూరు–522034’’ చిరునామాకు చేరేలా రిజిస్టర్ పోస్టు చేయడం లేదా నేరుగా అందజేయవచ్చు. జనరల్, బీసీ అభ్యర్థులు రూ.2 వేలు, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1,000 రుసుం చెల్లించాలి. మరిన్ని వివరాల కోసం విశ్వ విద్యాలయం వెబ్సైట్ anfrau.ac.in లేదా 81257 29592, 78935 20988 నంబర్లలో సంప్రదించవచ్చు. -
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు
ఉరవకొండ: హత్యాయత్నం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉరవకొండలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ మహానంది, ఎస్ఐ జనార్దన్‌నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కౌకుంట్ల గ్రామానికి చెందిన రాము, శేఖర్లు అన్నదమ్ములు. వీరికి తండ్రి చెరో రెండున్నర ఎకరాల పొలాన్ని ఇచ్చాడు. శేఖర్ పొలంలో నీటి లభ్యత ఎక్కువగా ఉండటంతో దాన్ని వాడుకొనే విషయంలో అన్నదమ్ములు ఘర్షణ పడేవారు. ఈ నెల 1న తెల్లవారుజామున రాము తమ్ముడి పొలంలో ఫ్యూజు క్యారియర్లు తొలగించి తీసుకెళుతుండగా గమనించిన శేఖర్ అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. అనంతరం శేఖర్ తన భార్యతో బైక్‌పై వెళ్తుండగా గ్రామ శివారులో రాము వారిని కారుతో ఢీకొట్టాడు. వెంట తెచ్చుకున్న హకీ స్టిక్‌తో శేఖర్ తల, కణితిపై విచక్షణరహితంగా కొట్టాడు. చనిపోయాడని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ శేఖర్‌ను భార్య కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం రామును చిన్నముస్టూరు కల్లబండ ఆంజినేయస్వామి ఆలయం వద్ద అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి కారు, హాకీ స్టిక్, 3 కరెంట్ ఫీజులు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సీఐ మహానంది తెలిపారు. -
మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య
శెట్టూరు: మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ సుమన్ తెలిపిన మేరకు.. మండలంలోని లక్ష్మంపల్లికి చెందిన నాగభూషణ (45) ఈ నెల 2న తన భార్య లక్ష్మిని మద్యం తాగడానికి డబ్బు అడిగాడు. అప్పటికే అతను ఎక్కువగా మద్యం సేవించి ఉండటంతో డబ్బు ఇవ్వనని భార్య చెప్పింది. దీంతో తాను చనిపోతానంటూ భార్యను బెదిరించి ఇంటి నుంచి వెళ్లిపోయిన నాగభూషణ తిరిగి రాలేదు. చుట్టాల ఊరికి వెళ్లి ఉంటాడని భార్య భావించింది. ఈ క్రమంలోనే బుధవారం గ్రామానికి చెందిన బోయ బొజ్పప్ప పొలంలోని కంప చెట్లలో ఉరివేసుకుని నాగభూషణ మృతి చెందినట్లు గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ సుమన్ పరిశీలించారు. లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయండి
అనంతపురం టౌన్: గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు చేపడుతున్న ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతంగా సాగేలా చూడాలని ఏపీ ఎస్పీడీసీఎల్ సీజీఎం (ప్రాజెక్టు విభాగం) రమణాదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం బుక్కరాయసముద్రం మండలంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వారం ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిపై కాంట్రాక్టర్‌తో సమావేశాలను నిర్వహించి వేగవంతంగా చేపట్టే విధంగా చూడాలన్నారు. మండల ఏఈలతోపాటు లైన్మెన్లు పనులను పరిశీలించాలన్నారు. వారికి అవసరమైన మేరకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. జిల్లాలో నిర్మాణాల్లో ఉన్న 33 కేవీ సబ్ స్టేషన్ల పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ శేషాద్రి శేఖర్, డీఈలు పాల్గొన్నారు. 10న ‘కేఎస్ఎన్’లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు వాక్–ఇన్ అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మ్యాథ్స్, కామర్స్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ప్రగతి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పీహెచ్డీ, నెట్, సెట్ అర్హతలు కలిగిన వారికి, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 10న ఉదయం 10 గంటలకు కళాశాలలో నిర్వహించే వాక్–ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు. గ్రామ గ్రామాన గడ్డి పెంపకం అనంతపురం అగ్రికల్చర్: సూపర్ ఎల్–నినో తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున గ్రామ గ్రామాన గడ్డి పెంపకాన్ని ప్రోత్సహించాలని పశుసంవర్ధకశాఖ జేడీ పి.ప్రేమ్‌చంద్ తెలిపారు. బుధవారం స్థానిక డీడీ కార్యాలయ హాలులో డీడీలు, ఏడీలు, వెటర్నరీ డాక్టర్లతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పశు, జీవసంపద పరిరక్షణ లక్ష్యంగా ఎక్కడా గడ్డి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఆరు నెలలకు సరిపడా గడ్డి అవసరం, లభ్యత గురించి ఆర్ఎస్కే వారీగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. ఎండుగడ్డి, పచ్చిగడ్డి లభ్యత గురించి డోర్ టు డోర్ సర్వే చేస్తే మున్ముందు సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రధానంగా గ్రామాల్లో అవకాశం ఉన్న చెరువు భూములను గుర్తించి అక్కడ గ్రామస్తుల సహకారంతో సామూహిక గడ్డి పెంపకం చేపట్టాలన్నారు. హరిత గోపాలం, లంపీ స్కిన్ డిసీసెస్ వ్యాక్సినేషన్, పశువైద్య సేవలు, పశుబీమా, అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, తీసుకోవాల్సిన చర్యల గురించి దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో అనంతపురం, ఉరవకొండ డీడీలు రమేష్‌రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, డీఎల్‌డీఏ ఈఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక అనంతపురం అర్బన్: రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నికై ంది. నూతన కమిటీని రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు, కలెక్టర్ ఓ.ఆనంద్ ధ్రువీకరించారు. కలెక్టర్‌ను బుధవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన అనుభవజ్ఞులతో సమర్థవంతమైన కార్యవర్గం ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. సమష్టి భావంతో పనిచేసి రెడ్‌క్రాస్ సేవలను విస్తృతం చేయాలని సూచించారు. నూతన కమిటీ ఇదే.. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్‌గా డాక్టర్ జి.లక్ష్మిప్రసాద్, వైస్ చైర్‌పర్సన్‌గా డాక్టర్ గీతా బాల, కోశాధికారిగా సుంకర రమేష్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ కె.లక్ష్మినారాయణ, ఎం.జి.ఎర్రన్న, డాక్టర్ ఓ.మనోరంజన్‌రెడ్డి, ఆలంబన జనార్ధన్, బీసతి భరత్, దాసరి భరత్‌కుమార్, వి.కె.శ్రీవాణి, విష్ణుప్రియను ఎన్నుకున్నారు. -
బోధన.. వేదన
గుమ్మఘట్ట: మండలంలోని కలుగోడు ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆరుబయట విద్యాబోధన చేస్తున్నారు. పాఠశాలలో 234 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సరిపడా గదులు లేకపోవడంతో ఆరు బయట విద్యాబోధన చేయాల్సిన దుస్థితి నెలకొంది. మరుగుదొడ్లు, బాత్రూంలు కూడా లేకపోవడంతో అవస్థలు చెప్పనలవిగా మారాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించి నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చివేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చిల్లిగవ్వ కూడా కేటాయించకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఎంఈఓ సోమశేఖర్‌ను వివరణ కోరగా ఆయన స్పందించారు. అదనపు తరగతి నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. బీఎల్ఓలు, సూపర్వైజర్లకు గౌరవ వేతనం మంజూరు అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో పాలుపంచుకున్న బీఎల్ఓలకు, 2021లో విధులు నిర్వర్తించిన సూపర్వైజర్లకు గౌరవ వేతనాన్ని ఎన్నికల సంఘం మంజూరు చేసింది. జిల్లాకు 1,69,20,000, శ్రీ సత్యసాయి జిల్లాకు రూ.1,19,80,000 విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఖాతాలో నిధులు జమ చేశారు. బీఎల్ఓకు రూ.7 వేలు, సూపర్వైజర్కు రూ.6 వేల చొప్పున గౌరవ వేతనం నిర్ణయించారు. జిల్లాలో 2,226 మంది బీఎల్ఓలకు రూ.1,55,82,000, సూపర్వైజర్లు 223 మందికి 13.38 లక్షలు మొత్తం రూ.1,55,82,000, శ్రీ సత్యసాయి జిల్లాలో 1,576 మంది బీఎల్ఓలకు రూ.1,10,32,000, సూపర్వైజర్లు 158 మందికి రూ.9.48 లక్షలు మొత్తం రూ.1,19,870,000 విడుదల చేశారు. -
జన గణన ఏర్పాట్లు గడువులోపు పూర్తి చేయండి
● శిక్షణా కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి● జిల్లా రెవెన్యూ అధికారి మలోల అనంతపురం ఎడ్యుకేషన్: 2027 జనాభా గణనలో భాగంగా జిల్లా సెన్సస్ హ్యాండ్‌బుక్ (డీసీహెచ్‌బీ) తయారీకి సంబంధించిన క్షేత్రస్థాయి సమాచార సేకరణ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను గడువులోపు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మలోల అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల కామర్స్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిధిలోని ఛార్జ్ సెన్సస్ అధికారులు, అదనపు ఛార్జ్ సెన్సస్ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ప్రతి రెవెన్యూ గ్రామం, పట్టణానికి ఒక ఫీల్డ్ ఫంక్షనరీని నియమించడం, వారికి యూజర్ ఐడీలు రూపొందించడం, గ్రామాలు–పట్టణాల మ్యాపింగ్ పూర్తి చేయడం, శిక్షకుల ఎంపిక, శిక్షణా కేంద్రాల ఏర్పాటు, డీసీహెచ్‌బీ మొబైల్ యాప్‌పై సమగ్ర శిక్షణ వంటి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. శిక్షణా కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్లు సూర్యనారాయణ రెడ్డి, వీరనారాయణ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్లు డీసీహెచ్‌బీ మొబైల్ యాప్‌పై పూర్తి అవగాహన పొందిన అనంతరం మండల స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులకు సమర్థవంతంగా శిక్షణ అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈనెల 7 నుంచి నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మండలాల్లో ఫీల్డ్ ఫంక్షనరీలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు తమ పరిధిలో డీసీహెచ్‌బీ కోసం క్షేత్రస్థాయి సమాచార సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అనంతపురం తహసీల్దార్ రాజా, సెన్సస్ విభాగం డిప్యూటీ తహసీల్దార్ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
స్టోర్లకు నేటికీ చేరని బియ్యం
అనంతపురం అర్బన్: ప్రతి నెలా ఒకటో తేదీన చౌక దుకాణాల్లో కార్డుదాలకు బియ్యం పంపిణీ ప్రారంభిస్తారు. అయితే ఈ నెల జిల్లావ్యాప్తంగా దాదాపు 150 దుకాణాల్లో బియ్యం పంపిణీ ఐదో తేదీ దాటినా ప్రారంభం కాలేదు. అధికారిక నివేదిక ప్రకారం రేషన్ బియ్యం జిల్లావ్యాప్తంగా 15 శాతం స్టోర్లకు చేరలేదు. అత్యధికంగా అనంతపురం అర్బన్ పరిధిలో 60 నుంచి 70 స్టోర్లకు బియ్యం సరఫరా కాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా అయిన బియ్యానికి సంబంధించి సంచుల ట్యాగ్లు స్కానింగ్‌లోనూ... డీలర్ వద్ద ఉన్న యాప్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఈ పరిస్థితి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండు రకాల బియ్యం వస్తాయి జిల్లాకు రెండు రకాల బియ్యం వస్తాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 10 శాతం నూక ఉన్న బియ్యం సరఫరా అవుతాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 15 శాతం నూక ఉన్న బియ్యం సరఫరా అవుతాయి. ఇక్కడ కేంద్రం సరఫరా చేస్తున్న బియ్యానికి సంబంధించి సంచులకు ఉన్న ట్యాగ్‌ను తప్పనిసరిగా స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఎంఎల్ఎస్ పాయింట్లో ఒకసారి, డీలర్‌కు సరఫరా అయిన తరువాత డీలర్ మరోసారి స్కాన్ చేయాలి. మూడు రోజుల్లో సరఫరా చేస్తాం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యం సంచుల ట్యాగ్‌ను స్కానింగ్ చేసే విషయంలో డీలర్ వద్ద ఉన్న యాప్‌లో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో ట్యాగ్ స్కానింగ్ కావడం లేదు. ఈ కారణంగా 15 శాతం స్టోర్లకు బియ్యం చేరలేదు. అధికంగా అనంతపురం అర్బన్‌లో 60 నుంచి 70 దుకాణాలు సరఫరా కాలేదు. పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. సమస్య పరిష్కారమైతే మూడునాలుగు రోజుల్లో డీలర్లకు బియ్యం సరఫరా చేస్తాం. – రమేష్‌రెడ్డి, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ దాదాపు 150 చోట్ల ప్రారంభం కాని పంపిణీ సంచుల ట్యాగ్ స్కానింగ్‌తో వచ్చిన తంటా -
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
అనంతపురం అర్బన్: పరిశ్రమల స్థాపన ద్వారానే జిల్లా సమాగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణతో కలిసి జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. జిల్లాలో పనులు ప్రారంభించిన సిల్లవర్ స్పార్క్, సుగుణ స్పాంజ్ ప్రైవేటు లిమిటెడ్, సరళ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూతన పరిశ్రమలు స్థాపించేందుకు స్థలం కేటాయించామన్నారు. విశ్వకర్మ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులకు శిక్షణ ఇవ్వడంతో పాటు రుణం మంజూరు చేయాలని ఎల్డీఎంను ఆదేశించారు. నూతన పరిశ్రమల స్థాపనకు 68 దరఖాస్తులురాగా అందులో 48 వాటికి సమావేశంలో ఆమోదం తెలిపారు. రెండు దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 18 దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 20 యూనిట్లకు సంబంధించి పెట్టుబడి రాయితీ రూ 1.88 కోట్ల మంజూరుకు ఆమోదించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘టెట్’ తొలిరోజు ప్రశాంతం ● 95 మంది గైర్హాజరు అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) తొలిరోజు బుధవారం ప్రశాంతంగా ముగిసిందని డీఈఓ ఎన్.అయూబ్ హుసేన్ తెలిపారు. జిల్లాలోని ఆరు పరీక్షా కేంద్రాలకు గాను ఐదు కేంద్రాల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరిగాయి. రెండు సెషన్లకు కలిపి మొత్తం 1,433 మంది అభ్యర్థులకు గాను 1,338 మంది హాజరయ్యారు. 95 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు డీఈఓ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లూ సమకూర్చడంతో పాటు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. నేటి నుంచి స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీలు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో గురువారం నుంచి నియోజకవర్గ స్థాయిలో స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ అయూబ్ హుసేన్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) మంజుల తెలిపారు. ఏడో తేదీ వరకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో, 6 నుంచి 7వ తేదీ వరకు రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో, 7 నుంచి 10 వరకు అనంతపురం, గుంతకల్లు, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలల జట్లు ఆయా నియోజకవర్గాల్లో జరిగే స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. 10న ‘పాలిటెక్నిక్’ స్పాట్ అడ్మిషన్లు అనంతపురం: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనంతపురంలో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 10న నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు ఆసక్తి గల వారు హాజరుకావాలని కోరారు. అనంతపురం పాలిటెక్నిక్ కళాశాలలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కళ్యాణదుర్గం, నార్పల, ఉరవకొండ, గుంతకల్లు, రాయదుర్గం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనూ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ ఈ నెల 10వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లనూ వెంట తీసుకురావాలన్నారు. తక్షణమే కోర్సు ఫీజు సుమారు రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ అయ్యే సీట్లకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదన్నారు. పాలిసెట్–2026లో అర్హత సాధించిన వారికి తొలి ప్రాధాన్యత కల్పిస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలలోపు హాజరు కావాలన్నారు. -
‘పయ్యావుల అనుచరుడి నుంచి కాపాడండి’
విడపనకల్లు: మంత్రి పయ్యావుల అనుచరుడి నుంచి కాపాడాలంటూ ఓ మహిళ దీనంగా అర్థిస్తోంది. బుధవారం బాధితురాలు శాంతి తెలిపిన మేరకు.. మండల పరిధిలోని చీకలగురికి గ్రామానికి చెందిన రామచంద్రప్ప తన కుమార్తె శాంతికి 107–1సీ, 108–ఏ సర్వే నంబర్లో 3.30 ఎకరాలను దాన విక్రయం కింద రిజిస్టర్ చేసి ఇవ్వగా.. అదే గ్రామానికి చెందిన టీటీపీ కార్యకర్త యోగేశ్వరరావు ఇందులో ఎకరా భూమిని ఆక్రమించుకున్నాడు. భూమిలోకి బాధితురాలిని వెళ్లనీయకుండా దాడులకు దిగుతున్నాడు. భూమిలోకి వస్తే నిన్ను, నీ భర్తను చంపుతా అంటూ బెదిరిస్తున్నాడు. యోగేశ్వర్‌కు మంత్రి పయ్యావుల కేశవ్ అండ ఉండడంతో మహిళ అని కూడా చూడకుండా అతని అనుచరుడు కొత్తపల్లి రవి తదితరులతో కలిసి ఇటీవల ఆమైపె దాడి చేయడానికి వెళ్లారు. నానా బూతులు తిట్టారు. దీనిపై పాల్తూరు పోలీసులకు వారం క్రితం ఫిర్యాదు చేయగా.. ఎస్ఐ బాధితురాలికి న్యాయం చేయకపోగా ఉరవకొండ సీఐని కలవండి అని పంపించివేశాడు. సీఐ మహానందిని కలిసేందుకు అనేక సార్లు కార్యాలయానికి వెళ్లినా ఆయన కూడా ఏ మాత్రమూ పట్టించుకోలేదు. మంత్రికి యోగేశ్వర రావు ప్రధాన అనుచరుడు కావడంతో పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా రాచమర్యాదలు చేసి పంపుతున్నారని బాధితురాలు వాపోయారు. న్యాయం జరగకపోతే ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని బాధిత మహిళ పేర్కొన్నారు. -
కక్ష సాధింపుతో భూమి లాక్కుంటున్నారు!
రాప్తాడు రూరల్: రాప్తాడు మండలం పుల్లలరేవు గ్రామంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ కుటుంబం దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమిని కక్షసాధింపు చర్యల్లో భాగంగా లాక్కునే ప్రయత్నం జరుగుతోందంటూ బాధిత రైతు పెద్ద ఓబులేసు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో రైతు తల్లి నాగలక్ష్మమ్మ ట్రెయినీ కలెక్టర్ సుయాస్ కుమార్ సమక్షంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. బాధితుల కథనం మేరకు... పుల్లలరేవుకు చెందిన ఎస్.గోవిందు కుటుంబం గొందిరెడ్డిపల్లి పరిధిలోని 7.76 ఎకరాల భూమిని దాదాపు 40 ఏళ్లుగా సాగు చేస్తోంది. 2001లో గ్రామ పంచాయతీ తీర్మానం, రెవెన్యూ అధికారుల సిఫార్సుల అనంతరం భూమిని అసైన్డ్ వేస్ట్ ల్యాండ్‌గా మార్చారు. అనంతరం 2006లో గోవిందుకు 4.90 ఎకరాలు, 2007లో ఆయన కుమారుడు పెద్ద ఓబులేసుకు 2.86 ఎకరాల భూమికి పట్టాలు మంజూరు చేశారు. గోవిందు మరణానంతరం ఆయన పేరిట ఉన్న భూమిని చిన్న కుమారుడు వసంతు పేరుపై ఆన్లైన్లో నమోదు చేశారు. పట్టాదారు పాసుపుస్తకం కూడా ఉంది. భూమిలో బోర్లు, డ్రిప్ వ్యవస్థ, పైప్లైన్లు ఏర్పాటు చేసి పంటలు సాగు చేస్తున్నామని, పంట రుణాలు తీసుకుంటూ.. విద్యుత్ బిల్లులు కూడా చెల్లిస్తున్నామని పెద్ద ఓబులేసు కుటుంబ సభ్యులు వివరించారు. కక్షతోనే వేధింపులు తాము వైఎస్సార్సీపీకి మద్దతుదారులమనే కారణంతోనే 2024లో ప్రభుత్వం మారిన తర్వాత తమపై కక్షసాధింపు చర్యలు ప్రారంభమయ్యాయని బాధితులు ఆరోపించారు. తమ భూమిలో టీడీపీ జెండాలు నాటడం, నేరేడు చెట్లు తొలగించడం, కొబ్బరి చెట్లకు నిప్పు పెట్టడం, పైప్లైన్లు, మోటార్లు ధ్వంసం చేశారని వాపోయారు. అనంతరం రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ పేర్లను ఆన్లైన్ నుంచి తొలగించి.. భూమిని మిగులు భూమిగా చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు. నోటీసులు ఇవ్వకుండా ఖాళీ చేయమంటున్నారు రైతు పెద్ద ఓబులేసు మాట్లాడుతూ తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే భూమి ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మాట్లాడితే పోలీసులతో బెదిరిస్తున్నారని, మూడు రోజుల్లో భూమి ఖాళీ చేయాలని చెప్పి అధికారులు వెళ్లిపోయారని తెలిపారు. ఈ విషయమై వివరణ తీసుకునేందుకు రాప్తాడు ఇన్చార్జ్ తహసీల్దార్ చెన్నకేశవులును ‘సాక్షి’ ఫోన్లో పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఆయన స్పందించలేదు. ట్రైనీ కలెక్టర్ ఎదుటే విషాద ఘటనట్రైనీ కలెక్టర్ సుయాస్ కుమార్ ఇన్చార్జ్ తహసీల్దార్, ఆర్ఐ, ఇతర రెవెన్యూ సిబ్బంది, సీఐ, పోలీసులతో కలిసి బుధవారం పుల్లలరేవు గ్రామానికి వెళ్లారు. సమాచారం అందుకున్న పెద్ద ఓబులేసు, ఆయన తల్లి నాగలక్ష్మమ్మ అక్కడికి చేరుకున్నారు. భూమి ఖాళీ చేయాల్సిందేనంటూ రెవెన్యూ, పోలీసు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగలక్ష్మమ్మ తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసు కానిస్టేబుల్ వెంటనే ఆమె చేతిలోని సీసాను లాక్కొని ప్రమాదాన్ని తప్పించారు. కన్నీటి పర్యంతమైన నాగలక్ష్మమ్మ...‘ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిలో చెట్లు నరికేశారు.. మోటార్లు కాల్చేశారు.. ఇప్పుడు భూమే లేకుండా చేస్తున్నారు. మేము ఎందుకు బతకాలి?’ అంటూ అధికారుల ఎదుటే ఆవేదన వ్యక్తం చేసింది. మేమెందుకు బతకాలి ట్రెయినీ కలెక్టర్ సమక్షంలోనే రైతు తల్లి ఆత్మహత్యాయత్నం రాప్తాడు మండలం పుల్లలరేవులో ఘటన -
గురుకులం.. అధ్వానం
కణేకల్లు: మండలంలోని కణేకల్లు క్రాస్‌లో ఉన్న గురుకుల పాఠశాలలో సమస్యలు తిష్టవేశాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం 670 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు 24 మంది, నాన్ టీచింగ్ స్టాఫ్ నలుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. గురుకులంపై జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గాడి తప్పింది. హాస్టల్ విద్యార్థుల బాగోగుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిస్తున్నాయి. గురుకులంలో నెలన్నర నుంచి తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం పైప్లైన్లు దెబ్బతినడంతో నీరు రావడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గురుకులం క్యాంపస్‌లో బోరున్నా ఒకటిన్నర ఇంచుకు మించి నీరు రావడం లేదు. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా వచ్చే నీటితోపాటు బోరులో వస్తున్న నీరు విద్యార్థులకు ఏమాత్రమూ చాలడం లేదు. అపరిశుభ్రంగా బాత్ రూమ్‌లు వసతిగృహంలో విద్యార్థుల కాలకృత్యాలు తీర్చుకొనేందుకు నాలుగు బాత్రూమ్లుండగా నీళ్లు లేక అపరిశుభ్రంగా మారాయి. దోబీఘాట్లు ఏర్పాటు చేసినా నీళ్లు లేక స్కావెంజర్లు, స్వీపర్లు వీటిని శుభ్రం చేయడం లేదు. రాత్రి పూట బహిర్భూమికి వెళ్లలేక విద్యార్థులు బాత్ రూమ్‌లో బయలు ప్రదేశంలో మలవిసర్జన చేస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దుర్వాసన డార్మెట్స్లోకి కూడా వస్తుండటంతో భరించలేక ముక్కులు మూసుకుంటున్నారు. అపరిశుభ్రత కారణంగా దోమల బెడద కూడా ఎక్కువైంది. నీళ్ల కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయో అర్థం కావడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రోగాల బారిన పడక తప్పదంటున్నారు. వారానికి రెండు సార్లే స్నానాలు నీటి సమస్యతో విద్యార్థులు వారానికి రెండు సార్లే స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ముఖం కడుక్కోవాలన్నా కూడా నీళ్ల కోసం విద్యార్థులు పోటీ పడాల్సి వస్తోంది. సమస్య తీవ్రతను ప్రిన్సిపాల్‌కు తెలియజేశామని, ఈ క్రమంలో ఇంకొన్ని రోజులు వేచి చూద్దామని తల్లిదండ్రులు తమ పిల్లలకు నచ్చచెబుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఆందోళనలు చేస్తామని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. పని మానేసిన స్కావెంజర్లు టాయిలెట్లు, వాష్‌రూమ్‌ల క్లీనింగ్ కోసం నియమించిన ఇద్దరు స్కావెంజర్లు జీతాలివ్వని కారణంగా పనులను మానేశారు. ఆరు నెలల నుంచి వీరికి జీతాలివ్వలేదని సమాచారం. నలుగురు శానిటేషన్ వర్కర్లు (స్వీపర్లు) మాత్రం పని చేస్తున్నారు. తగిన నీటి సౌకర్యం లేక నరకం చూస్తున్న విద్యార్థులు పరిశుభ్రతకు నోచుకోని బాత్ రూములు, టాయిలెట్లు పట్టించుకోని అధికారులు -
ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడం తగదు
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం తీవ్ర అన్యాయం. 15 ఏళ్లుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థకు వెన్నెముకలా సేవలందిస్తున్న ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడం సరికాదు. ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు జమయ్యేలా శాశ్వత వ్యవస్థను అమలు చేయాలి. అలాగే మినిమమ్ టైమ్ స్కేల్ జీఓలను అమలు చేసి, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన రెగ్యులరైజేషన్ హామీని నెరవేర్చాలి. – కె.విజయ్, సమగ్రశిక్ష ఉద్యోగుల ఫోరం జేఏసీ చైర్మన్ -
ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు
పుట్లూరు: ప్రజల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మండలంలోని కందికాపుల, పుట్లూరు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పీజీఆర్ఎస్ కింద ఎన్ని ఫిర్యాదులు అందాయి.. ఎన్ని పరిష్కరించారు అని ఆరా తీశారు. అనంతరం పుట్లూరు చెరువు సమీపాన పొలంలో పీఎండీఎస్ విధానంలో ప్రకృతి వ్యవసాయం కింద విత్తన పనులను ఆయన ప్రారంభించారు. ఎద్దుల గొర్రుతో విత్తనాలను విత్తి రైతులను ఉత్సాహపరిచారు. అలాగే ఆయా గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేశారు. బరువు, ఎత్తు తక్కువగా ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. గర్భిణుల్లో రక్తహీనత లేకుండా ఎప్పటికప్పుడు వివరాలను యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. చెరువు మట్టి కోసం ఫిర్యాదు చెరువు మట్టిని పొలాలకు తరలించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చెరువులో మట్టిని తరలించుకోవచ్చని తెలిపారు. మట్టి తరలింపునకు ఇబ్బందులు పెట్టరాదని, ప్రభుత్వమే పూడిక తీత పనులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్ధార్ బాలమ్మ, ఎంపీడీఓ అలివేలమ్మ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 10 మండలాల్లో వర్షం అనంతపురం అగ్రికల్చర్: చాలా రోజుల తర్వాత వరుణుడు పాక్షికంగా కరుణించాడు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 10 మండలాల పరిధిలో 5.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. యాడికి మండలంలో ఏకంగా 60.4 మి.మీ భారీ వర్షం కురిసింది. పెద్దవడుగూరు 28.8 మి.మీ, పుట్లూరు 27.4, యల్లనూరు 26.8, తాడిపత్రి 17.4 మి.మీతో పాటు గుత్తి, నార్పల, పెద్ద పప్పూరు, బుక్కరాయసముద్రం, పామిడి తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఆగస్టు సాధారణ వర్షపాతం 87.1 మి.మీ కాగా.. ప్రస్తుతానికి 6 మి.మీ నమోదైంది. మొత్తమ్మీద జూన్ ఒకటి నుంచి 132.4 మి.మీకు గాను 30 శాతం తక్కువగా 93.2 మి.మీ వర్షం కురిసింది. నిబంధనలకు అనుగుణంగా బిల్లు పెట్టాలి ● జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు కూడేరు: గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులను తీర్మానాల మేరకు చేపట్టి నిబంధనలకు అనుగుణంగానే బిల్లులు పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. ఎంపీడీఓ కుళ్లాయి స్వామి, పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీఓ, ఎంపీడీఓల మధ్య సమన్వయం ఉండాలన్నారు. అప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. గ్రామాల్లో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరచాలని సూచించారు. పని చేయని చేతి పంపులను గుర్తించి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రజలతో మమేకం కావాలన్నారు. ఏ వీధికి ఏ పారిశుధ్య కార్మికుడు చెత్త తీసుకెళ్లేందుకు వస్తారో ఆ షెడ్యూల్ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. -
కాలువ ఇలా.. నీళ్లు పారేదెలా?
అనంతపురం నగర శివారులోని హెచ్చెల్సీ అధ్వానంగా మారింది. తపోవనం బ్రిడ్జి నుంచి గుత్తి రోడ్డు వరకు రెండువైపులా పెచ్చులూడిపోయాయి. బండ రాళ్లు బయటికి తేలుతున్నాయి. కెనాల్‌కు నీరు వదిలినప్పుడు గుంతల ద్వారా చుట్టుపక్కల కాలనీలోకి ప్రవహించే ప్రమాదం ఉంది. ఇక.. హెచ్చెల్సీలో అండర్ బ్రిడ్జిలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. కాలువకు ఇరువైపులా ముళ్ల చెట్లు ఏపుగా పెరిగాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం పెచ్చులూడిన కాలువపై దిమ్మెలు కాలువలో ఏపుగా పెరిగిన కంప చెట్లు కాలువ గట్టు దెబ్బతిన్న దృశ్యం -
డీఎస్సీ.. దేశంలోనే భారీ కుంభకోణం
● అర్హులకు మొండిచేయి.. అనర్హులకు అందలం ● డీఎస్సీ రౌండ్ టేబుల్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ నేతల ధ్వజం అనంతపురం: దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన డీఎస్సీ–2025పై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని మేధావులు, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యామంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ఈ నెల పదో తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదామని ప్రతినబూనారు. నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు, మేధావులతో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీబీఐ విచారణకు భయమెందుకో? డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. మంగళవారం ఉరవకొండలో వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. నీట్ అవకతవకలపై జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ఉద్యమం కేంద్రాన్నే కుదిపేసిందన్నారు. ఈ ఉద్యమ ప్రభావంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారన్నారు. బిహార్‌లోని బాంకీపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. లోకేష్ రాజీనామా చేయాలి డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం కార్యాలయంలో డాక్టర్ తలారి రంగయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ౖతలారి రంగయ్య మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో అక్రమాలకు పాల్పడి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు. ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి చెల్లించాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు పాల్గొన్నారు. బాధితులకు అండగా ఉంటాం డీఎస్సీలో మెరిట్ సాధించినా ఉద్యోగం రాని బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. అనంతపురం శివారులోని ఫంక్షన్ హాలులో రాప్తాడు నియోజకవర్గస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలకు లోకేష్ బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, సీనియర్ నాయకుడు తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, రంగంపేట గోపాల్ రెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. యువతకు నిలువునా మోసం కష్టపడి చదివి కొలువులపై ఆశలు పెట్టుకున్న యువతను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి ధ్వజమెత్తారు. గుంతకల్లులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నైరుతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలను ప్రశ్నించేందుకు రాష్ట్రంలో జెన్ జీ తరహా ఉద్యమం రావాల్సిందేనన్నారు. డీఎస్సీ కుంభకోణానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేషే కారణమన్నారు. ఉరవకొండలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, కళ్యాణదుర్గం రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య -
జిల్లా పరిషత్ విభజనకు వేళాయె
● ఉద్యోగుల నుంచి ఆప్షన్ల ఆహ్వానం అనంతపురం న్యూ టౌన్: దాదాపు ఏడు దశాబ్దాల చారిత్రక నేపథ్యమున్న అనంతపురం జిల్లా పరిషత్ విభజనకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇప్పటికే ఉన్నతస్థాయి అధికారుల బదిలీలపై ఆప్షన్లను కోరారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని 63 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులను తాము కోరుకున్న మూడు ప్రదేశాలను సూచిస్తూ ఆప్షన్లను ఆహ్వానించారు. ఇదే క్రమంలో జిల్లా పరిషత్ పరిధిలో పనిచేసే ఇతర ఉద్యోగులు తాము ఏ జిల్లాలో పని చేయాలనుకుంటున్నారో వారి నుంచి కూడా దరఖాస్తులను ఆహ్వానించారు. అన్నీ సాఫీగా సాగితే మరో 15 రోజుల్లో అనంతపురం నుంచి వేరుపడి శ్రీసత్యసాయి జిల్లాలో కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటు కానుంది. 55.32:44.68 నిష్పత్తిలో ఉద్యోగ విభజన వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2022లో చారిత్రక నిర్ణయం తీసుకుంది. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల సంఖ్యను 26కు పెంచారు. అయితే అప్పటికే జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించినందున జిల్లా పరిషత్తుల విభజన అంశం తెరపైకి రాలేదు. ప్రస్తుతం జిల్లా పరిషత్ కార్యవర్గాల పదవీకాలం సెప్టెంబర్ 25వ తేదీతో ముగినుండడంతో ‘జెడ్పీల విభజన’ ప్రక్రియ తెరపైకి వచ్చింది. అంతకు మునుపే అంటే ఆగస్టు నెలాఖరులోగా జిల్లా పరిషత్తులను విభజించి ఎన్నికలకు సిద్ధం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. జిల్లాల విభజనలో భాగంగానే ఉద్యోగులు, ఇతర మౌలికాంశాల కేటాయింపుల నిష్పత్తులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు అనంతపురం జిల్లా వాటా 55.32 కాగా, శ్రీసత్యసాయి జిల్లాకు 44.68గా ప్రభుత్వం నిర్ణయించింది. విభజన బాటలో ఉద్యోగులు ఉమ్మడి జిల్లా పరిషత్ పరిధిలో ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద మొత్తం 1,116 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు 63 మంది, డిప్యూటీ ఎంపీడీఓలు 63, పరిపాలన అధికారులు 73, సీనియర్ అసిస్టెంట్లు 105, జూనియర్ అసిస్టెంట్లు 224, టైపిస్టులు 56, రికార్డ్ అసిస్టెంట్లు 183, కార్యాలయ సిబ్బంది (ఓఎస్) 168, ల్యాబ్స్, లైబ్రరీలు 46 మంది, నైట్ వాచ్మెన్లు నలుగురు, డ్రైవర్లు ఐదుగురు, మండల విద్యా కార్యాలయాల్లో 63 మంది విద్యాధికారులు, 63 మంది ఇంజినీరింగ్ అధికారులు పనిచేస్తున్నట్లు జిల్లా పరిషత్ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జరుగుతున్న జిల్లా పరిషత్ విభజన సవ్యంగా సాగితే మరో 15 రోజుల్లో పైన తెలిపిన ఉమ్మడి జిల్లా పరిషత్ ఉద్యోగ, సిబ్బంది అంతా తమకు కేటాయించిన కొత్త బదిలీ స్థానాలలో పనిచేయడానికి సిద్ధం కావాల్సి ఉంటుంది. -
ఫీజు వసూళ్లలో ‘అనంత’ దూకుడు
అనంతపురం అగ్రికల్చర్: మార్కెటింగ్‌శాఖ నిర్దేశించిన ఫీజు వసూళ్లలో అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డు దూకుడు కొనసాగిస్తోంది. రాయదుర్గం, గుత్తి, గుంతకల్లు మార్కెట్ కమిటీలు డీలా పడ్డాయి. ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉన్న 9 మార్కెట్ కమిటీలు, 15 సరిహద్దు చెక్‌పోస్టుల ద్వారా వివిధ రకాల ఫీజులు రూ.14.35 కోట్ల టార్గెట్ ఇచ్చారు. జూలై నెలాఖరుతో ముగిసిన నాలుగు నెలల కాలంలో 30.54 శాతం సగటుతో రూ.4.38 కోట్లు సాధించాయి. ఇందులో అనంతపురం మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.5.25 కోట్లు కాగా ఇప్పటికే 43 శాతంతో రూ.2.25 కోట్లు వసూలు చేసి మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత రూ.1.13 కోట్లకు గానూ 34 శాతంతో రూ.38.15 లక్షల వసూలు చేసి ఉరవకొండ రెండో స్థానంలో కొనసాగుతోంది. శింగనమల, కళ్యాణదుర్గం కమిటీలు 31 శాతం వసూళ్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. 25 శాతం వసూళ్లతో రాప్తాడు, 21 శాతం వసూళ్లతో తాడిపత్రి ఫరవాలేదనిపించాయి. ఎటుతిరిగి రూ.30 లక్షలకు గానూ కేవలం రూ.3 లక్షల వసూళ్లతో గుత్తి కమిటీ 10 శాతంతో అట్టడుగున ఉండగా, రూ.1.90 కోట్లకు గానూ రూ.26 లక్షలతో రాయదుర్గం మార్కెట్ కమిటీ 14 శాతం, రూ.72 లక్షలకు గానూ రూ.14 లక్షల వసూళ్లతో గుంతకల్లు మార్కెట్ కమిటీ కేవలం 19 శాతంతో చివరి మూడు స్థానాల్లో నిలిచాయి. సిబ్బంది కొరత, లీకేజీల కారణంగా వసూళ్లు తగ్గినట్లు చెబుతున్నారు. గడువులోపు అన్ని కమిటీల్లోనూ వంద శాతం సాధించడానికి విజిలెన్స్ చర్యలు పటిష్టం చేస్తామని ఏడీ (మార్కెటింగ్) రాఘవేంద్రకుమార్ తెలిపారు. రాయదుర్గం, గుత్తి, గుంతకల్లు వెనుకంజ -
ఆశల తుంగ... తీర్చేనా బెంగ...?
ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో కళకళలాడుతున్న టీబీ డ్యాం, ఆంధ్ర సరిహద్దు రెగ్యులేటర్ వద్ద గేట్లు బంద్ చేసిన దృశ్యం బొమ్మనహాళ్: ఎగువన మలెనాడు, శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్‌మగళూరు, వరనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర జలాశయానికి వరద శరవేగంగా వస్తోంది. సోమవారం 0,705 క్యూసెక్కులున్న ఇన్‌ఫ్లో మంగళవారం సాయంత్రానికి 1,00,895 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ఒక్కరోజులోనే పది టీఎంసీల రావడంతో డ్యాంలో నీటిమట్టం 53.65 టీఎంసీలకు చేరుకుంది. వరద పోటెత్తుతుండటంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జలాశయం నుంచి 1,447 క్యూసెక్కుల నీటిని హెచ్చెల్సీ, ఎల్ఎల్సీ, రాయబసవన కెనాల్‌కు విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి 1626.06 అడుగుల నీటి మట్టంతో 80 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 24,130 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 23,669 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉండేదని అధికారులు తెలిపారు. ఆంధ్ర సరిహద్దులో తుంగభద్ర జలాల నిలిపివేత తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి విడుదల చేసిన నీళ్లు మంగళవారం వేకువజామున ఆంధ్రా సరిహద్దు 105–272 కిలోమీటర్ రెగ్యులేటర్ వద్దకు చేరుకున్నాయి. హెచ్చెల్సీ జిల్లా అధికారుల నుంచి ఆంధ్రాకు ఇండెంట్ సమర్పించలేదు. దీంతో కర్ణాటక హెచ్చెల్సీ అధికారులు మంగళవారం ఆంధ్రా సరిహద్దు 105వ కిలోమీటర్ వద్ద ఉన్న రెగ్యులేటర్ గేట్లను కిందకు దింపి నీటిని బంద్ చేశారు. హెచ్చెల్సీలో మరమ్మతులు జరుగుతుండటంతో ఆంధ్రాకు ఇండెంట్ నీటిని ఈ నెల 10 నుంచి తీసుకోనున్నట్లు హెచ్చెల్సీ అధికారులు చెబుతున్నారు. అది కూడా తాగునీటి అవసరాల కోసం సరిహద్దులో 1,500 క్యూసెక్కుల నీటిని తీసుకోవాలన్న ఇండెంట్‌ను టీబీ బోర్డుకు పంపిన్నట్లు ఆంధ్ర హెచ్చెల్సీ అధికారులు తెలిపారు. ఒక్క రోజులోనే 10 టీఎంసీల నీరు రాక 1,00,895 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 53.65 టీఎంసీలకు చేరిన నీరు -
ఏం చేసినా.. అడిగే వారేరీ?
అనంతపురం సెంట్రల్: పోలీసు శాఖలో ఏఆర్ విభాగం పాలన పూర్తిగా గాడి తప్పుతోంది. ఎస్పీ పర్యవేక్షణలో ఉన్న ఈ కీలకమైన ఏఆర్ అధికారుల పనితీరు, ఆయా విభాగాల్లో నిధుల వినియోగంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెల్ఫేర్ నిధులు విషయంలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. డీపీఓలో నిర్మిస్తున్న కట్టడాలలో భారీగా అవకతవకలు జరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి. కాన్ఫరెన్స్ హాలు ఆధునికీకరణ, సిబ్బంది విశ్రాంతి గదుల నిర్మాణంతో పాటు తాత్కాలిక స్పోర్ట్స్ నెట్ ఏర్పాటు తదితర పనుల్లో ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అనేకసార్లు పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ వాటిపై వివరణకు కానీ, విచారణకు గాని ఆదేశించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎంటీ విభాగంలోనూ అవకతవకలు.. మోటార్ ట్రాన్స్‌పోర్టు (ఎంటీ) విభాగంలో అవకతవకలు నిత్యం వెలుగుచూస్తున్నాయి. ఇటీవల వాహన మరమ్మతులకు ఖర్చు చేసిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారనే బాధతో ఓ ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ (డ్రైవర్) ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఇటీవల కూడేరు సీఐ రాజు తన సొంత కారుకు నెలనెలా డీజిల్ వినియోగిస్తున్న వైనం వెలుగుచూసింది. ప్రభుత్వ వాహనం మరమ్మతులకు గురై మూలనకు పెట్టినప్పటికీ వినియోగం ఉందన్నట్లు డీజిల్ డ్రా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పోలీసు పెట్రోల్ బంకులో ఓ అధికారికి అనుకూలంగా ఉన్న సిబ్బందిని నియమించుకొని డీజిల్ లావాదేవీల్లో అవకతవకలు చేస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారుల ఇంటి పనులకు హోంగార్డులు.. అనేకమంది హోంగార్డులు, కొంతమంది ఏఆర్ కానిస్టేబుళ్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓ అధికారి పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడం.. తీసుకురావడం లాంటి పనులు చూసుకునేందుకు ఆరుగురు హోంగార్డులను పెట్టుకున్నట్లు తెలి సింది. ఏఆర్ విభాగం పర్యవేక్షిస్తున్న అధికారి ఇంట్లో పలువురు సిబ్బందిని పనిమనుషులుగా పెట్టుకున్నట్లు సమాచారం. ఆయనతో పాటు ప్రతి ఆర్‌ఐకూ సొంత పనులు చేసేందుకు హోంగార్డులను నియమించుకున్నారని తెలిసింది. ఇటీవల ఓ విభాగానికి వచ్చిన జిల్లా అధికారి ఇంటికి ఆరుగురు, ఇతర జిల్లాలో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారి ఇంటి పనులకు కూడా హోంగార్డులను పంపుతున్నట్లు తెలిసింది. ఎవరైనా ఆ పనులకు వెళ్లం అంటే బదిలీ చేస్తామని, సుదూర ప్రాంతాలకు బందోబస్తు వేస్తామని, జీతాల్లో కోత పెడతామని బెదిరిస్తున్నట్లు తెలిసింది. గాడి తప్పిన ఏఆర్ పాలన అన్ని విభాగాల్లోనూ ఇష్టారాజ్యం -
1.40 లక్షల హెక్టార్లలోనే ‘ఖరీఫ్’
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ కింద ప్రధానపంటల సాగు గడువు ముగిసేసరికి 1.40 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చినట్లు వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడించింది. కంది, సజ్జ పంటలు మాత్రమే అంచనా మేరకు సాగులోకి వచ్చాయి. పత్తి ఫరవాలేదనిపించగా... ప్రధానపంట వేరుశనగ 25 శాతం విస్తీర్ణంలో సాగు చేశారు. అలాగే మొక్కజొన్న, ఆముదం పంటల సాగు కూడా తగ్గిపోయింది. మొత్తం మీదగా 3.43 లక్షల హెక్టార్లకు గాను 40 శాతం విస్తీర్ణంతో 1.40 లక్షల హెక్టార్లకు చేరుకుంది. ఇంకా 60 శాతం మేర అంటే 2 లక్షల హెక్టార్ల వరకు బీళ్లుగా ఉన్న పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగులోకి రావాల్సి ఉంది. 63 వేల హెక్టార్లలో కంది ఎల్–నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా... అడపాదడపా కురిసిన తేలికపాటి వర్షాలకు జిల్లా రైతులు కంది పంటపై మొగ్గు చూపారు. పెట్టుబడి, శ్రమ తక్కువ కావడంతో 78 వేల హెక్టార్లు అంచనా వేయగా... 80 శాతంతో 63 వేల హెక్టార్లలో సాగు చేశారు. ప్రధానపంట వేరుశనగ 1.47 లక్షల హెక్టార్లు అంచనా వేయగా... అతికష్టమ్మీద 36 వేల హెక్టార్లకు చేరుకుంది. జిల్లా చరిత్రలో తొలిసారిగా ఈసారి వేరుశనగ 50 వేల హెక్టార్లలోపే నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. 42 వేల హెక్టార్లకు గాను 55 శాతంతో 23 వేల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. 22 వేల హెక్టార్లకు గాను 8,500 హెక్టార్లలో మొక్కజొన్న, 18 వేల హెక్టార్లకు గాను 5,500 హెక్టార్లలో ఆముదం, 2,400 హెక్టార్లకు గాను 95 శాతంతో 2,300 హెక్టార్లలో సజ్జ సాగులోకి వచ్చింది. ఇక జొన్న 60 హెక్టార్లు, 200 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, 400 హెక్టార్లలో కొర్రతో పాటు అసలంద, పెసర, మినుము, రాగి, సోయాబీన్ లాంటి పంటలు నామమాత్రంగా సాగు చేశారు. సాగులో పెద్దవడుగూరు టాప్ జూన్, జూలై రెండు నెలలకు 125.5 మి.మీకు గాను 31 శాతం తక్కువగా 87.2 మి.మీ వర్షం కురిసింది. దీంతో సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. పెద్దవడుగూరు మండలంలో అన్ని పంటలూ కలిపి 17,858 హెక్టార్లలో సాగులోకి వస్తాయని అంచనా వేయగా... పత్తి బాగానే సాగులోకి రావడంతో 75 శాతంతో 13,200 హెక్టార్ల సాగుతో టాప్‌లో నిలిచింది. గుంతకల్లు మండలంలో 68 శాతంతో 12,600 హెక్టార్లలో సాగు చేశారు. వజ్రకరూరు మండలంలో 65 శాతంతో 12,700 హెక్టార్లలో పంటలు వేశారు. బెలుగుప్పలో 61 శాతం, యాడికిలో 58, పామిడిలో 55, గుత్తిలో 50, రాయదుర్గంలో 46, బ్రహ్మసముద్రంలో 46, గమ్మఘట్టలో 45, ఉరవకొండలో 44, అనంతపురంలో 40 శాతం విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. మిగతా మండలాల్లో 20 నుంచి 40 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. ఇంకా రెండు లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు ఎప్పుడు సాగులోకి వస్తాయో తెలియని పరిస్థితి. 40 వేల క్వింటాళ్ల ప్రత్యామ్నాయ విత్తనాలు ఎప్పుడు పంపిణీ చేస్తారో కూడా అధికారులు చెప్పడం లేదు. 63 వేల హెక్టార్లలో కంది, 36 వేల హెక్టార్లలో వేరుశనగ 23 వేల హెక్టార్లలో పత్తి, 8,500 హెక్టార్లలో మొక్కజొన్న 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ పంటలు ఎప్పుడో? -
దొంగల అరెస్టు
కళ్యాణదుర్గం: చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో సీఐలు హరినాథ్, నీలకంఠేశ్వర్ వివరాలు వెల్లడించారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని మారెంపల్లి కాలనీకి చెందిన బోయ నరసింహ, బోయ మధుసూదన్, ఒంటిమిద్దికి చెందిన పిట్టి తిప్పేస్వామి, పార్వతీనగర్ కు చెందిన బలిజ అచ్చయ్యలు బెట్టింగ్, ఇతర చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. వ్యసనాలు తీర్చుకునేందుకు చోరీల బాట పట్టారు. మారెంపల్లి, పార్వతీ నగర్, ఒంటిమిద్దిలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళ చొరబడి బంగారు ఆభరణాలు, వెండి అపహరించారు. మంగళవారం మధ్యాహ్నం నలుగురూ స్థానిక అక్కమ్మ గార్ల బస్ స్టాప్ వద్ద ఉండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు నెక్లెస్, గొలుసు, ఉంగరాలు, చెవి కమ్మలు, చైన్‌తో పాటు 129.6 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసకున్నట్లు సీఐలు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య కూడేరు: చెట్టుకు ఉరి వేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని అరవకూరులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. అరవకూరుకు చెందిన శ్రీరాములు కుమారుడు అశోక్ (22) బ్రాహ్మణపల్లి సమీపాన ఉన్న అగ్రిగోల్డ్ వెంచర్లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పక్కింటి వారితో జరిగిన గొడవ నేపథ్యంలో వారు మందలించడంతో మనస్తాపం చెంది తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని తండ్రి శ్రీరాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సస్యరక్షణతో మల్బరీలో అధిక దిగుబడులు ధర్మవరం రూరల్: మల్బరీ సాగులో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులను సాధించవచ్చునని అనంతపురం పట్టు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వీఎస్ రమ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రేగాటిపల్లిలో ‘నా పట్టు–నా అభిమానం 2.0’ కార్యక్రమంలో భాగంగా మల్బరీలో సమగ్ర కీటక, వ్యాధి నిర్వహణపై సాంకేతిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పట్టు శాఖ సంయుక్త సంచాలకురాలు శోభారాణి, ధర్మవరం సహాయ సంచాలకురాలు రాజేశ్వరి, పట్టు అభివృద్ధి అధికారి దామోదర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేలలో సేంద్రియ కార్బన్ శాతాన్ని పెంచేందుకు సేంద్రియ ఎరువులను వినియోగించాలన్నారు. వేరు కుళ్లు వ్యాధి సమగ్ర నివారణకు సాఫ్ రెండు గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్కల అడుగు భాగంలో ద్రావణాన్ని పోయాలన్నారు. 10 రోజుల వ్యవధిలో మరో సారి కూడా పోయాలన్నారు. మూడో విడవ విడతలో మిస్టర్ ప్రో లీటర్ నీటికి 5 మి.లీ కలిపి వ్యాధి సోకిన ప్రతి మొక్కకు 10 లీటర్ల ద్రావణం, అలాగే ఆరోగ్యకరమైన ప్రతి మొక్కకు 5 లీటర్ల ద్రావణాన్ని నేలపై పోయాలన్నారు. జిల్లా జట్టు జయ కేతనం అనంతపురం: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ –23 ఉమెన్ క్రికెట్ టోర్నీలో భాగంగా మంగళవారం నిర్వహించిన మ్యాచ్‌లో అనంతపురం జట్టు 82 పరుగులతో ఘన విజయం సాధించింది. అనంతపురం, కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అనంతపురం 49 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. పి. మహిత 74 పరుగుల్లో 80 పరుగులు (10 ఫోర్లు), ఏ.హన్సి రెడ్డి 51 బంతుల్లో 56 పరుగుల (8 ఫోర్లు)తో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కర్నూలు జట్టు నిర్ణీత 50 ఓవర్లకు గాను 214 పరుగులు సాధించింది. దీంతో అనంతపురం జట్టు 82 పరుగులతో విజయం సాధించింది. బౌలర్ తరుణం నాలుగు వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. అవార్డుల ప్రదానం గుంతకల్లు: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల నివారణకు కృషి చేసిన పలువురు ఉద్యోగులకు మంగళవారం మ్యాన్ ఆఫ్ మంత్ అవార్డులను డీఆర్ఎం చంద్రశేఖర్‌గుప్తా ప్రదానం చేశారు. ఎర్రగుంట్లకు చెందిన ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనివాసులు, సబ్ ఇన్స్పెక్టర్ గోవిందప్ప, కానిస్టేబుల్ ఎస్. వెంకటరెడ్డితోపాటు గుంతకల్లు ట్రైనీ మేనేజర్ సురేష్‌బాబు, పాయింట్స్మెన్లు జ్యోతీ ప్రతాప్ (ఎర్రగుడిపాడు), వై.పురుషోత్తం (గుత్తి), ఎం. శ్రీహరి (స్టేషన్ మాస్టర్, అనంతరాజుపేట), మల్లేషన్ (టెక్నీషియన్–3, మంత్రాలయం)కు అవార్డులు అందజేసి అభినందించారు. -
మహిళలపై వేధింపులను నివారిద్దాం
● రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అనంతపురం: మహిళలపై వేధింపుల నివారణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. మంగళవారం ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ మహిళా కమిషన్ సహకారంతో నిర్వహించిన విద్యార్థినుల అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలపై వేధింపులకు పాల్పడడం చట్టరీత్యా నేరమన్నారు. బాధితులు వీలైనంత త్వరగా పోలీసులు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతి కుమార్, అనంతపురం పీటీసీ ప్రిన్సిపాల్ సుప్రజ, సీనియర్ ఏపీపీ ఎన్.సి.సంగీత, మానసిక నిపుణులు డాక్టర్ సురేఖ, ఉమెన్ కమిషన్ సలహాదారు సూయాజ్, ఐసీడీఎస్ పీడీ సాజిదా బేగం, క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఆలయంలో వెండి ఆభరణాల అపహరణ
కనగానపల్లి(చెన్నేకొత్తపల్లి): చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని వెంకటంపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. వెంకటంపల్లి నడిబొడ్డున ఆంజనేయస్వామి ఆలయం ఉంది. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ తలుపు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. స్వామివారికి అలంకరించిన 30 తులాల వెండి కిరీటం, 20 తులాల వెండి మలతాడు, హస్తం ఎత్తుకెళ్లారు. ఆలయం వద్ద సీసీ కెమెరాలు ఉన్నా వాటికి చిక్కకుండా చోరీకి పాల్పడటం గమనార్హం. దీనిపై మంగళవారం చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. సద్దుమణిగిన గొడవ పుట్టపర్తి అర్బన్: వైద్యులు, ఉద్యోగ సంఘాల మధ్య జరుగుతున్న గొడవ ఎట్టకేలకు సద్దుమణిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో వైద్యులు, ఉద్యోగ సంఘాలకు మధ్య గొడవలు మంచిది కాదంటూ బలవంతంగా సారీ చెప్పించి ఒప్పించడం గమనార్హం. తనను ఉద్యోగ సంఘాల నాయకులు లింగా రామమోహన్, మరో వ్యక్తి చంపుతానని బెదిరించారంటూ పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు ఆస్పత్రి వైద్యుడు దిలీప్ కుమార్ సోమవారం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నాలుగు రోజుల క్రితం స్టాఫ్ నర్సులతో మొదలైన గొడవ చంపుతామంటూ బెదిరించే వరకూ వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలో డాక్టర్ దిలీప్ కుమార్‌పై కేసు నమోదు చేయించాలని ఉద్యోగ సంఘాల నాయకులు చర్చలు జరిపారు. దీనిపై మంగళవారం రాత్రి డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం దిలీప్ కుమార్, ఉద్యోగ సంఘాల నాయకులను పిలిపించి మాట్లాడారు. డాక్టర్‌కు ఉద్యోగ సంఘాల నాయకులతో సారీ చెప్పించడంతో ఆయన చల్లబడ్డారు. పిల్లలను హెచ్ఎం కొడుతోందని టవరెక్కిన తండ్రి తలుపుల: తన పిల్లలను పాఠశాల హెచ్ఎం నిత్యం కొడుతోందంటూ ఓ తండ్రి సెల్‌టవర్ ఎక్కాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మండలంలోని పెద్దన్నవారిపల్లికి చెందిన ఓబులపతి పిల్లలు వర్షిత, శశివర్దన్లు అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. స్కూల్ హెచ్ఎం హేమలత రోజూ వీరిని కొడుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఎంఈఓ వెంకట్రాముడుకు ఓబులపతి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ మంగళవారం స్థానిక ఓబీఆర్ రోడ్డులోని సెల్ టవర్ ఎక్కాడు. ఏఎస్ఐ వెంకటగిరి, కానిస్టేబుల్ రమేష్‌లు అక్కడికి చేరుకుని ఓబులపతికి నచ్చజెప్పి కిందికి దించారు. స్టేషన్లో ఎస్ఐ చెన్నయ్య కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. -
అశోక్ మృతి కేసులో సంచలన ట్విస్ట్..!
అనంతపురం సెంట్రల్: అనంతపురంలోని హిత హాస్పిటల్లో దబ్బర అశోక్ డెత్ కేసు మిస్టరీగా మారుతోంది. మృతికి కారకులైన వారిలో ఆస్పత్రి ముఖ్య వ్యక్తే కీలకమని తెలుస్తోంది. ఇతనికి ఇద్దరు వ్యక్తులు సహకరించినట్లు సమాచారం. ముఖ్య వ్యక్తి, మరొకరిని పోలీసులు శనివారమే అదుపులోకి తీసుకున్నారు. ఇంకొకరు పరారీలో ఉన్నారు. ముఖ్య వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న ఐ ఫోన్లో నిర్ఘాంతపోయే వీడియోలు, దృశ్యాలు పోలీసులకు కనిపించినట్లు తెలిసింది. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న హిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు కమీషన్ ఏజెంట్‌గా పనిచేస్తున్న తాడిమర్రి మండలం రామాపురానికి చెందిన దబ్బర అశోక్ (30) గత శుక్రవారం రాత్రి మూడో అంతస్తులోని కిటికీలో నుంచి నగ్నంగా కిందకు దూకాడు. గాయపడిన తర్వాత లేచి వెళ్తుండగా మళ్లీ కొందరు అతన్ని ఆస్పత్రిలోకి తీసుకుపోయారు. చికిత్స పొందుతున్న వ్యక్తి శనివారం ఉదయం మృతి చెందాడు. మృతిపై అనుమానాలు ఉన్నాయని అశోక్ అక్క ఫిర్యాదు చేయడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించిన విషయం విదితమే. హాస్పిటల్‌కు చెందిన ముఖ్య వ్యక్తి మరో ఇద్దరితో కలిసి అశోక్‌ను చిత్రహింసలు పెట్టడం..అతడు ప్రాణభయంతో కిందకు దూకి వెళ్తుంటే తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని.. మళ్లీ పట్టుకొచ్చి ప్రాణం పోయేలా చేశారని ఆరోపణలు వచ్చాయి. చదవండి: హింసించి.. చంపేశారా..?!తీగ లాగితే డొంక కదిలిందా? దబ్బర అశోక్‌ను ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్న సన్నివేశాలను నిందితుల్లో ఒకరు సెల్ఫోన్లో రికార్డు చేసినట్లు తెలిసింది. అయితే అశోక్ మృతి చెందడంతో.. సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ఆస్పత్రిలోని సీసీ కెమెరాలతో పాటు సెల్ఫోన్లో డేటాను డిలీట్ చేసినట్లు సమాచారం. కీలక నిందితుడు వాడుతున్నది ఐఫోన్ కావడంతో సైబర్ క్రైం పోలీసులు దాన్ని తీసుకుని, కొంత డేటా రికవరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే అందులో దాడి దృశ్యాలే కాకుండా ఆస్పత్రి ముఖ్య వ్యక్తి మరో కోణం బయటపడినట్లు సమాచారం. కొంతమంది మహిళలకు సంబంధించిన అశ్లీల వీడియోలు ఫోన్లో లభించినట్లు తెలిసింది. డాక్టర్ వృత్తిలో కొనసాగే మహిళకు సంబంధించిన అశ్లీల వీడియోలు దగ్గర పెట్టుకొని సదరు ముఖ్య వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే నిజమైతే మొత్తం ఈ కేసు సంచలనంగా మారనుందని పోలీసులు భావిస్తున్నారు. అతనిదే కీలక పాత్ర! హాస్పిటల్ ముఖ్య వ్యక్తే దబ్బర అశోక్ మృతి ఘటనలో ముఖ్య పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఓ మహిళకు అశోక్ వాట్సాప్‌లో మెసేజ్ పంపడంతోనే ఈ గొడవ జరిగినట్లుగా సమాచారం. అయితే సదరు మహిళకు.. హత్యలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తికి ఏం సంబంధమనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్య వ్యక్తికి అధికార టీడీపీలో పదవితో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులతో పరిచయం, బంధుత్వం ఉండటంతో.. కేసు నుంచి ఎలాగైనా బయటపడేయాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. -
బ్రెయిన్ స్ట్రోక్‌తో పోరాడి ఓడిన ఏఓ శ్రీనివాసులు
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న నల్లాని శ్రీనివాసులు (60) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతితో మండల పరిషత్ కార్యాలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆరు నెలల క్రితం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో శ్రీనివాసులకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆరోగ్యం మెరుగుపడటంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ పూర్తిస్థాయిలో కోలుకున్నారని, త్వరలోనే తిరిగి విధుల్లో చేరనున్నారని అందరూ భావించారు. అయితే అనారోగ్యం మళ్లీ తీవ్రతరం కావడంతో పరిస్థితి విషమించింది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీనివాసులు విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమన్వయంతో పనిచేసే అధికారిగా గుర్తింపు పొందారు. సహోద్యోగులు, కిందిస్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా అందరినీ కలుపుకొని పనిచేసే వ్యక్తిగా పేరొందారు. ఆయన అకాల మరణం సహోద్యోగులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. శ్రీనివాసులుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన పెద్దపప్పూరు మండలం అమ్మలదిన్నె గ్రామంలో నిర్వహించారు. అనంతపురం రూరల్ ఎంపీడీఓ దివాకర్, కార్యాలయ సిబ్బంది, పలువురు పంచాయతీ కార్యదర్శులు వెళ్లి శ్రీనివాసులు భౌతికకాయానికి నివాళి అర్పించారు. -
బైకుకు నిప్పు
● తాగుబోతు నిర్వాకం గుత్తి: పట్టణంలో వాసవీ బజారులోని వినాయక గుడి సమీపంలో నివాసముండే రాజేష్‌కు చెందిన బైక్‌కు అదే కాలనీకి చెందిన నూర్ నిప్పు పెట్టాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బైక్‌ను రాజేష్ తన ఇంటి ముందు పార్క్ చేశాడు. ఉదయం లేచి చూసేసరికి బైక్ పూర్తిగా కాలిపోయింది. అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా.. అదే కాలనీకి చెందిన నూర్ తప్పతాగి బైక్‌కు నిప్పు పెట్టినట్లు తెలిసింది. పోలీసులు నూర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాగిన మైకంలోనే నూర్ బైక్‌కు నిప్పు పెట్టి కాల్చి వేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. రాజేష్‌కు నూర్‌తో ఎలాంటి విభేదాలు లేవని వెల్లడైంది. ఇంట్లో చోరీగుత్తి: పట్టణంలోని ఆశా నగర్లో నివాసముండే రంగస్వామి, లీలావతి దంపతుల ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. దొంగలు బీరువాలో ఉన్న రూ. 3 వేల నగదుతో పాటు రూ. 35 వేల విలువైన వెండి గ్లాస్ అపహరించారు. రంగస్వామి, లీలావతి దంపతులు పని మీద ముద్దనూరు వెళ్లడంతో కుమారుడు నందు తన స్నేహితుడి ఇంట్లో నిద్రించాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలోని వెండి గ్లాస్, మూడు వేలు నగదు అపహరించారు. చోరీ జరిగిన ఇంటిని ఎస్ఐ సురేష్ పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. ఒకే ఇంట్లో ఏడుగురికి అందని తల్లికి వందనం అనంతపురం అర్బన్: ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికీ ‘తల్లికి వందనం’ ద్వారా లబ్ధి చేకూరుస్తాం అంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. స్థానిక బిందెలకాలనీకి చెందిన అన్నదమ్ములు ప్రసాద్, వీరయ్యలు నివాసం ఉంటున్నారు. వీరిలో ప్రసాద్‌కు నలుగురు సంతానం కాగా వీరయ్యకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరి ఏడుగురు పిల్లలకూ తల్లికి వందనం అందలేదు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పరిష్కార వేదిక కార్యక్రమంలో అన్నదమ్ములిద్దరూ తమ పిల్లలతో కలెక్టర్ వద్దకు వచ్చిన గోడు వెళ్లబోసుకున్నారు. అధికారులను అడిగితే తమ కుటుంబంతో ఐదుగురు సభ్యులను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరిగిందని చెబుతున్నారని, వాస్తవంగా ఆ ఐదురుగు సభ్యులతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వాపోయారు. తాము రోజువారీ కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటామని, తమకు తల్లికి వందనం డబ్బులు మంజూరయ్యేలా చూడాలని వేడుకున్నారు. కర్కశత్వానికి బలైన శిశువు అనంతపురం సిటీ: నానమ్మ కర్కశత్వానికి చిన్నారి బలైంది. గత నెల 28న వేకువజామున ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని రెండో అంతస్తు పైనుంచి నవజాత శిశువును నానమ్మ కిందకు విసిరేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న చిన్నారి ఆదివారం రాత్రి ప్రాణం విడిచింది. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కంచిసముద్రం పంచాయతీ మామిడాకులపల్లికి చెందిన అశోక్‌కుమార్, పూజిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి అశోక్‌కుమార్ తల్లికి ఇష్టం లేదని తెలిసింది. అయినా కుమారుడి కోసమని ఆమె మౌనంగానే ఉంటూ వచ్చారు. గర్భం దాల్చిన పూజిత గత మే నెల 31న హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న అశోక్‌కుమార్ తల్లి లోలోన రగిలిపోయింది. ఇష్టంలేని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆడపిల్లకు జన్మనిచ్చావంటూ కోడలిపై ఆగ్రహం వ్యక్తం చేసేది. ఈ క్రమంలోనే శిశువుకు ఫిట్స్ వస్తుండడంతో తల్లిదండ్రులు జూలై 22న అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. రెండో అంతస్తులో ఉన్న పీడియాట్రిక్ వార్డులో వైద్యులు అడ్మిట్ చేసుకుని చికిత్స చేస్తూ వచ్చారు. 28వ తేదీ వేకువజాము తల్లి నిద్రిస్తుండగా.. నానమ్మ ఆ శిశువును తీసుకెళ్లి రెండో అంతస్తుపై నుంచి కిందకు విసిరేసింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని అప్పటి నుంచి ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స చేస్తూ వచ్చారు. లేత శరీరం లోపల తీవ్రమైన గాయాలు ఉండడంతో శిశువు కోలుకోలేక ఆదివారం రాత్రి మృతి చెందింది. కాగా, ఘటన వెలుగు చూసిన రోజే నానమ్మను అనంతపురం రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. -
పంద్రాగస్టు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
● అధికారులకు జేసీ విష్ణుచరణ్ ఆదేశం అనంతపురం అర్బన్: పోలీసు పరేడ్ మైదానంలో ఈ నెల 15న జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జేసీ సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్‌కుమార్, ఏఎస్పీ (అడ్మిన్) నాగభూషణం, డీఆర్ఓ ఎ.మలోలతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవంలో జాతీయ పతాకాన్ని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ ఆవిష్కరిస్తారన్నారు. ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలకు సంబంధించి స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా శకటాలను ప్రదర్శించాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను అవార్డుకు సిఫారసు చేయాలని ప్రభుత్వ శాఖల అధిపతులను ఆదేశించారు. అప్పగించిన బాధ్యతలను అధికారులు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పారు. సమావేశంలో ఆర్డీఓ ప్రేమనాథ్కుమార్, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, కిరణ్మయి, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. టెట్ పకడ్బందీగా నిర్వహించాలి జిల్లావ్యాప్తంగా ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం రెవెన్యూభవన్‌లో డీఈఓ శ్రీనివాసరావుతో కలిసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు కేంద్రాల్లో జరగనున్న టెట్‌కు 18,191 మంది అభ్యర్థులు, 128 మంది స్కైబ్ర్స్ హాజరవుతారన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షల నిర్వహణకు ఆరుగురు అధికారులను ఫ్లయింగ్ స్క్వాడ్‌గా నియమించామన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిబంధనలు పాటించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ మలోల, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి, డీఐపీఆర్ఓ బాలకొండయ్య, ఆరోగ్యాధికారి వెంకటేశ్వర్లు, డీపీఓ నాగరాజునాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రైతులు అప్రమత్తంగా ఉండాలి
రాప్తాడు రూరల్: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని కేవీకే రెడ్డిపల్లి శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీరి బృందం సోమవారం అనంతపురం రూరల్ చియ్యేడు, ఇటుకలపల్లి్, మన్నీల, కందుకూరు గ్రామాల్లో పర్యటించి ఎల్‌నినోపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కంది పంటలో ప్రస్తుతం ఎల్‌నినో కారణంగా ఉన్న బెట్ట పరిస్థితులను అధిగమించేందుకు రైతులందరూ పొటాషియం నైట్రేట్ ఐదు గ్రాములు, బోరాన్ మూడు గ్రాముల చొప్పున లీటరు నీటిలో కలిపి, ఒక ఎకరానికి 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలని సూచించారు. ప్రస్తుతం సాగు చేసిన కంది, ఆముదం పంటల్లో మొక్కల సాంద్రతను తగ్గించడం ద్వారా అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. ఆముదం, కంది పంటల్లో ఎక్కువ వత్తుగా ఉన్న మొక్కలను తొలగించి, వరుసలో మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూడాలని సూచించారు. విత్తిన 30, 60 రోజులకు గుంటక లేదా గొర్రుతో అంతరకృషి చేయడం ద్వారా కలుపు నివారణతో పాటు నేలలో తేమను సంరక్షించుకోవచ్చన్నారు. ఈ నెలలో వర్షాలు కురిసిన తర్వాత తేలికపాటి నేలల్లో జొన్న, కొర్ర, సజ్జ, పెసర, అలసంద, మేత జొన్న, ఉలవలు వంటి పంటలను సాగు చేసేందుకు సిద్ధంగా ఉండాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ నారాయణస్వామి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ సుధారాణి, డాక్టర్ కిషోర్, కళాశాల సిబ్బంది డాక్టర్ సుస్మిత, డాక్టర్ కవిత తదితరులు పాల్గొన్నారు. పంటల పరిశీలన డి.హీరేహాళ్(బొమ్మనహాళ్)/బెళుగుప్ప: డీ హీరేహాళ్ మండలంలోని మలపనగుడి, గొడిసెలపల్లి, హులికల్లు, బెళుగుప్ప మండలంలో హనిమిరెడ్డిపల్లి,శీర్పి, గంగవరం, గుండ్లపల్లిలో పంటలను సోమవారం శాస్త్రవేత్తల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం, నీటి పొదుపు, తేమ సంరక్షణ, ఎరువుల వినియోగం, సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. పత్తి పంటలో 13:0:45 ఎరువును లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా పంటను రక్షించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ వి.యుగంధర్, శిరీషా, డాక్టర్ వింధ్య, బాంధవ్య, బాలాజీనాయక్, మల్లికార్జున, హరిణి, గోవర్దన్, నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
30న కృత్రిమ చేతుల పంపిణీ
అనంతపురం అర్బన్: మోచేతి కింది భాగంలో చేయి కోల్పోయిన వారికి రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 30న చేయూత కార్యక్రమం ద్వారా ఉచితంగా కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ‘చేయూత’ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారు ముందుస్తుగా తమ వివరాలను ‘చేయూత’ కాల్ సెంటర్ 88663 06969కు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. 30న నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ అర్చన, రోటరీ క్లబ్ అధ్యక్షుడు కేశవరెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యుడు లక్ష్మీనారాయణ, సుంకర రమేష్, బిసాతి భారత్, దాసరి భరత్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరిగి తిరిగి అలసిపోతున్నాం అనంతపురం అర్బన్: తిరిగి తిరిగి అలసిపోతున్నామని, కనికరించి తమ సమస్యలు పరిష్కరించండి అని ప్రజలు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ‘ప్రజాసమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్ ఆనంద్‌తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్‌కుమార్, డీఆర్ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, కిరణ్మయి రెవెన్యూ సమస్యలపై 286, ఇతర సమస్యలపై 413 చొప్పున మొత్తం 699 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీల్లో మచ్చుకు కొన్ని.. ● బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన గంగపన్న అనే దివ్యాంగుడు నడవలేనిస్థితిలోనే దోక్కుంటూ కలెక్టరేట్‌కు వచ్చాడు. మూడు చక్రాల సైకిల్ కోసం రెండేళ్లకు పైగా విన్నవించుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు. ● నార్పల మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్, కళాశాల స్థలాన్ని ఆక్రమించారని 1091–92 బ్యాచ్ పూర్య విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కళాశాలకు సర్వేనంబర్ 139/1డిలో 10.02 ఎకరాలు ఉందన్నారు. ఇక్కడ స్థలం సెంటు రూ.20 లక్షలు ఉందన్నారు. అయితే కొందరు ప్రైవేటు వ్యక్తులు తమ వాహనాల పార్కింగ్ కోసం కళాశాలకు చెందిన దాదాపు 20 సెంట్ల స్థలాన్ని ఆక్రమించారని చెప్పారు. ● వితంతు పింఛను మంజూరు చేయాలని కణేకల్లు మండలం మాల్యం గ్రామానికి చెందని బి.ఆదిలక్ష్మి, గుమ్మఘట్ట మండలం రంగసముద్రం ఎస్సీ కాలనీకి చెందిన ఎం.బేబి విన్నివించారు. -
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై పోరాటం
అనంతపురం క్రైం: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఏపీపీటీడీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. జేఏసీ పిలుపు మేరకు సోమవారం అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్దకు ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఆనంద్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, ప్రభుత్వంలో విలీనం అనంతరం రావాల్సిన ప్రయోజనాలను అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్ఎంయూఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్ నాయుడు, జిల్లా జేఏసీ కన్వీనర్లు వి.సూరిబాబు, టి.ప్రతాప్ నారాయణ, కె.కొండయ్య, రెడ్డి, రత్నం, ఆర్ఎన్ రెడ్డి, బి.సోమశేఖర్, ఖాన్, కేజే ప్రకాష్, ఎం.శ్రీనివాసులు, ఎం.నారాయణస్వామి, కేఎం నాయక్, మనోజ్, సి. శ్రీరాములు, పరమేష్, మల్లికార్జున, సి.సుందర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
ముమ్మాటికీ మోసమే
అనంతపురం: ‘మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను నిలువునా మోసగించారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. డీఎస్సీ–2025 దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలి’ అని మేధావులు డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి మేధావులు, రిటైర్డ్ ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు భారీగా హాజరయ్యారు. ముందుగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు సూపర్ సిక్స్‌తో పాటు అనేక హామీలను గుప్పించారని గుర్తు చేశారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లేనిపక్షంలో ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. మెగా డీఎస్సీ పేరుతో అవకతవకలకు పాల్పడి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు. వీటన్నిటికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా చేయని పక్షంలో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలన్నారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వడంతో పాటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వ అన్యాయాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 6,7,8,9 తేదీల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలతో పాటు 10వ తేదీన నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులతో పాటు మేధావులు, విద్యావంతులు, యువతీ యువకులు, విద్యార్థులు, రాజకీయాలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, సీఈసీ సభ్యుడు నదీం అహమ్మద్, ఎస్ఈసీ సభ్యుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వీర రామకృష్ణా రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి, మాజీ మేయర్ వసీం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, మద్దిరెడ్డి నరేంద్ర రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ దాసరి వాసంతి సాహిత్య, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆలమూరు శ్రీనివాస రెడ్డి, గౌని నాగన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివా రెడ్డి, జానీ, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి, మొఘల్ సైఫుల్లా భేగ్, మల్లెమీద నరసింహులు, కట్టుబడి తానీషా, కొర్రపాడు హుస్సేన్ పీరా, ఓబిరెడ్డి, అనిల్ కుమార్ గౌడ్, కాగజ్‌ఘర్ రిజ్వాన్, ఫయాజ్, దాదా ఖలందర్, వేముల నదీం, బాకే హబీబుల్లా, ఎద్దుల అమర్నాథ రెడ్డి, సాకే అశోక్‌కుమార్, సాకే కుళ్లాయిస్వామి, రామకృష్ణ, కుళ్లాయప్ప, రాధా యాదవ్, సాకే చంద్రలేఖ, హిమబిందు, భారతి, అంజలి, శోభారాణి, శోభా భాయి, మహేశ్వరి, ప్రసన్న, హజరాబి, లీల, ఖమర్తాజ్, లక్ష్మీనరసమ్మ, చంద్రకళ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం డీఎస్సీ–2025 తక్షణమే సీబీఐతో విచారణ చేయించాలి అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు రిలే నిరాహార దీక్షలతో నిలదీద్దాం: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత నియోజకవర్గాల్లోనూ సమావేశాలు.. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. శింగనమలలోని వాసవీ కల్యాణమండపంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పు చేయకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. తాడిపత్రిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షల్లో భారీగా అక్రమాలు జరిగాయన్నారు. మంత్రివర్గం నుంచి లోకేష్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. డీఎస్సీ అక్రమాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని మెట్టు పిలుపునిచ్చారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. బాబుకు మోసం అలవాటై పోయింది నిరుద్యోగులను వంచించడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటైపోయింది. 2014లోనూ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. 2024లోనూ అదే పరిస్థితి ఎదురైంది. డీఎస్సీ అవకతకలపై సీబీఐతో విచారణ జరిపించాలి. ఇప్పటి దాకా డిగ్రీ అడ్మిషన్లు చేపట్టకపోవడం దారుణం. – డాక్టర్ శంకరయ్య, కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ఇక్కడా ఉద్యమం తథ్యం గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే 1.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ ఉద్యోగాల్లో సగం భర్తీ చేస్తే చాలు. డీఎస్సీఅక్రమాలపై పోరాడుతున్న వైఎస్సార్ సీపీ పక్షాన విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రంలోనూ మరో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం తథ్యం. – సురేష్ యాదవ్, ఎస్కేయూ ఐక్య విద్యార్థి సంఘం నాయకుడు వైఎస్సార్ సీపీ పోరాటాలకు మద్దతు యువత భవిష్యత్తుతో చెలగాటమాడడం బాధాకరం. డీఎస్సీలో ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరి గింది. మెరిట్ ఉన్న అభ్యర్థులకూ ఉద్యోగాలు రాకపోవడం అన్యాయం. డీఎస్సీలో అర్హులై అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటాలకు మద్దతిస్తాం. – సాకే హరి, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు -
ఎట్టకేలకు డీఈఓ నియామకం
● ‘డైట్’ సీనియర్ అధ్యాపకుడు అయూబ్ హుసేన్‌కు ఎఫ్ఏసీ బాధ్యతలు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖలో నెలలుగా కొనసాగుతున్న పరిపాలనా అని శ్చితికి ఎట్టకేలకు తెరపడింది. డీఈఓ పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) డాక్టర్ ఎన్.అయూబ్ హుసేన్‌కు అప్పగిస్తూ పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్షారియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం ఉత్తర్వులు అందుకున్న అయూబ్ హుసేన్ మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ప్రస్తుతం కర్నూలు జిల్లా డైట్ కళాశాలలో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీఈఓ చేరుకుని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డీవైఈఓలు శ్రీనివాసరావు, లక్ష్మన్న, కార్యాలయ ఏడీలు మునీర్‌ఖాన్, శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు, సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రెండు నెలలుగా ఎఫ్ఏసీ లేక ఇబ్బందులు గతంలో డీఈఓగా పని చేసిన ప్రసాద్‌బాబు అనారోగ్య కారణాలతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో జిల్లా విద్యాశాఖలో పరిపాలన ఇబ్బందులు తలెత్తాయి. ఆయన సెలవులోకి వెళ్లిన తర్వాత డీవైఈఓ శ్రీనివాసరావు ఇన్చార్జ్గా వ్యవహరించినప్పటికీ, పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) లేకపోవడంతో కీలకమైన పరిపాలనా ఫైళ్లు పెండింగ్‌లోనే నిలిచిపోయాయి. దీంతో జిల్లాలో విద్యాశాఖ పాలన గాడి తప్పింది. ఒత్తిళ్లతో ప్రసాద్‌బాబు సెలవు? ప్రసాద్‌బాబు ఏడీగా పనిచేస్తున్న సమయంలో డీఈఓగా ఎఫ్ఏసీ బాధ్యతలు నిర్వహిస్తూ అందరితో సమన్వయంగా వ్యవహరించిన అధికారిగా గుర్తింపు పొందారు. అయితే ఉన్నతాధికారుల ఒత్తిళ్ల నేపథ్యంలో అనారోగ్యానికి గురయ్యారని, చికిత్స అనంతరం విధుల్లో చేరడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు తిరిగి విధుల్లో చేరిన కొద్దికాలానికే మళ్లీ ఒత్తిళ్లు పెరగడంతో ఆరోగ్య దృష్ట్యా దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లినట్లు సమాచారం. మళ్లీ ఇన్చార్జ్ పాలన తప్పదా? డాక్టర్ అయూబ్ హుసేన్ ఈ ఏడాది నవంబర్‌లో ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన పదవీకాలం కూడా కొద్దికాలమే ఉండనుంది. అనంతరం మళ్లీ ఇన్చార్జ్ పాలన కొనసాగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖకు శాశ్వత డీఈఓను నియమించి పరిపాలనలో స్థిరత్వం తీసుకురావాలని కోరుతున్నారు. -
హింసించి.. చంపేశారా..?!
అనంతపురం సెంట్రల్: ఆస్పత్రి భవనంపై నుంచి యువకుడు నగ్నంగా దూకడం.. చికిత్స పొందుతూ కొంతసేపటి తర్వాత మృతి చెందడం నగరంలో కలకలం రేపింది. ఆత్మహత్య అని ఆస్పత్రి వారు చెబుతున్నా... చిత్రహింసలు పెట్టి చంపేశారని పలువురు ఆరోపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.... శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం రామాపురం గ్రామానికి చెందిన దబ్బర అశోక్ (30) అనంతపురంలోని హిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు కమీషన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. గత శుక్రవారం రాత్రి ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి నగ్నంగా కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసి.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడని ఆస్పత్రి వారు తెలిపారు. ఆ రాత్రి ఏం జరిగింది..? అశోక్‌ను ఆస్పత్రికి చెందిన ప్రముఖ వ్యక్తి, ఓ వివాహిత భర్త, మరో రౌడీషిటర్ కలిసి ఆస్పత్రిలోనే ఓ గదిలో బంధించి.. బట్టలూడదీసి చిత్రహింసలకు గురిచేశారని తెలుస్తోంది. నేరుగా చంపకుండా.. భవనంపై నుంచి దూకి చనిపోవాలని ప్రేరేపించినట్లు సమాచారం. అయితే అశోక్ భవనంపై నుంచి దూకినా స్వల్ప గాయాలే కావడంతో ప్రాణభయంతో పైకిలేచి నడుస్తూ రాగా.. క్షణాల్లో కొందరు వచ్చి ఈడ్చుకుంటూ ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. దీంతో సదరు వ్యక్తులు ఆస్పత్రిలో ఆ యువకుడి ఊపిరి తీసేశారని తెలిసింది. మృతి చెందిన తర్వాత ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. మృతుడి బంధువులు వచ్చి ఆందోళన చేసి, డయల్ 100కు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యువకుడి వీపుపై వాతలు, బలమైన దెబ్బలు ఉండటం కనిపించింది. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు బయటకు రాకుండా ఆస్పత్రి యాజమాన్యం జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. ప్రేమాయణమా.. అప్పుల వారి పనా..? యువకుడి మృతికి ప్రేమాయణం.. లేదా అప్పులే కారణమై ఉండవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. అశోక్ ఓ వివాహితతో వాట్సాప్ చాటింగ్ చేసేవాడని, ఈ క్రమంలోనే ప్రేమకు దారి తీసి ఉండవచ్చని, విషయం తెలిసిన తర్వాత అతడి అడ్డు తొలగించి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు అప్పులు కూడా చేశాడని, వసూలు చేసే క్రమంలో ఇలా చావబాది.. ఊపిరి తీసేశారా అన్న అభిప్రాయమూ వినపడుతోంది. నిందితులను కాపాడేందుకు ఒత్తిళ్లు.. ఈ కేసులోని నిందితుల్లో హాస్పిటల్‌కు చెందిన ప్రముఖుడు శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ మహిళా ప్రజాప్రతినిధి కుమారుడు, శింగనమల నియోజకవర్గంలోని ప్రముఖ వ్యక్తికి సదరు వ్యక్తి బంధువు. దీంతో అతన్ని కాపాడేందు కోసం అధికార తెలుగుదేశం పార్టీ నేతలు రంగంలోకి దిగి.. పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. ఇది ఆత్మహత్యా.. లేక హత్యా అనేది పోస్టుమార్టం నివేదికలో బయటపడనుంది.త్వరలోనే అన్నీ తెలుస్తాయి హిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మూడో అంతస్తు నుంచి అశోక్ అనే యువకుడు దూకి.. చికిత్స పొందుతూ మృతి చెందాడని సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాం. మృతిపై అనుమానాలు ఉన్నాయని అతడి అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ కేసులో పోస్టుమార్టం నివేదికే కీలకం. ఒత్తిళ్లకు తలొగ్గం. నిబంధనల ప్రకారమే కేసు దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే అసలు విషయాలు బయటకు వస్తాయి. – కౌలుట్లయ్య, సీఐ, త్రీటౌన్ పోలీసుస్టేషన్, అనంతపురం -
నేను దుర్మార్గుడినే
తాడిపత్రిటౌన్: నేను దుర్మార్గుడినే..దుష్టు డినే ఏమన్నా అనుకోండి.. ఆ 24 మంది వైఎస్సార్సీపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదు అంటూ టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి పట్టణంలోని తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ నాయకులు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్య, లీగల్‌సెల్ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అలాగే తాడిపత్రి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీకి చెందిన 24 మంది పేర్లు చదువుతూ వారిలో ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. కేతిరెడ్డికి నాకు మాత్రమే ఫైట్ అని, ఇది టీడీపీ, వైఎస్సార్సీపీ సమస్య కాదన్నారు. వైఎస్సార్సీపీలోని ఆ 24 మంది వచ్చే స్థానిక ఎన్నికల్లో పాల్గొనకూడదని హెచ్చరించారు. ఈనెల 6న తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట 24 మంది వైఎస్సార్సీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. -
ఉరవకొండలో ఉద్రిక్తత.. విశ్వేశ్వర రెడ్డి అరెస్ట్
వైఎస్సార్సీపీ ధర్నా అప్డేట్స్..మాజీ ఎంపీ అరెస్ట్..ఉరవకొండలో ఉద్రిక్తతవైఎస్సార్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి చేపట్టిన ధర్నాకు హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్గోరంట్ల మాధవ్‌ను బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులుపెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులుమంత్రి పయ్యావుల కేశవ్ భూ అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డివిశ్వేశ్వర రెడ్డి కామెంట్స్....పోలీసులకు హైకోర్టు ఉత్తర్వుల కన్నా మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలే ముఖ్యమా?మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ప్రైవేటు ఆస్తులపై టీడీపీ నేతల పెత్తనం ఏంటి?వేల్పుమడుగులో వైఎస్సార్సీపీ నేతకు చెందిన భూమిపై కావాలనే వివాదం సృష్టిస్తున్నారుపోలీసులు, రెవెన్యూ అధికారులు టీడీపీ నేతలకు వత్తాసు పలకడం దుర్మార్గంమంత్రి పయ్యావుల కేశవ్ భూ అక్రమాలపై ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం.ఉరవకొండలో ఉద్రిక్తతమాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్ఉరవకొండ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి విశ్వేశ్వరరెడ్డిని ఈడ్చుకెళ్లిన పోలీసులుపోలీసులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాటవిశ్వేశ్వర రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులుఅనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పయ్యావుల కేశవ్ కుట్ర రాజకీయాలకు నిరసనగా నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని విశ్వేశ్వరరెడ్డి తాజాగా వీడియోలో వెల్లడించారు.అయితే, విడపనల్ మండలం వేల్పుమడుగులో వైఎస్సార్సీపీ నేత గోవింద్‌కు చెందిన 21 ఎకరాల భూమిని ఆలయ భూమిగా టీడీపీ, బీజేపీ నేతలు పేర్కొంటున్నారని, అయితే ఆ భూమి ప్రైవేటు భూమేనని రెవెన్యూ అధికారులు గతంలో స్పష్టం చేశారని వైఎస్సార్సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, ఆ భూమికి సంబంధించి హైకోర్టు కూడా వైఎస్సార్సీపీ నేతకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు.కాగా, మంత్రి పయ్యావుల కేశవ్ ఒత్తిడి కారణంగా హైకోర్టు ఆదేశాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు అమలు చేయడం లేదని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. దీనికి నిరసనగా ఉరవకొండలో ధర్నాకు పిలుపునిచ్చినట్లు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. -
అధికార అండ.. దౌర్జన్యకాండ
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక ఉరవకొండ నియోజకవర్గంలో అధికార ‘పచ్చ’ నేతలు రెడ్‌బుక్ రాజ్యాంగం మాటున వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై విరుచుకుపడుతున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ అండ చూసుకుని పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడటమే కాక ఇళ్లపైనా దాడులు చేసి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. భూములు తదితర ఆస్తులు కబ్జా చేసి.. ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. ఎవరైనా ఎదురుతిరిగితే మంత్రి కేశవ్‌తో పాటు సోదరుడు శీనప్పను కలిసి టీడీపీ కండువా వేసుకుంటే అన్నీ ఆపేస్తామంటున్నారు. గ్రామాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని మంత్రి అనుచరులు బెదిరింపులు, దాడులకు తెగబడుతున్నారు. ● ఉరవకొండ మండలం లత్తవరం గ్రామానికి చెందిన కౌడిగి గోవిందు వైఎస్సార్సీపీలో చురుగ్గా పనిచేస్తున్నారు. ఈయన్ను టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. గోవిందు అల్లుడు జయకుమార్ విడపనకల్లు మండలం వేల్పుమడుగులో కొనుగోలు చేసిన 21.05 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్లాన్ వేశారు. కొనుగోలు చేసిన భూమి దేవదాయ శాఖకు చెందినదంటూ గ్రామానికి చెందిన టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి, పోలీసులతో భయబ్రాంతులకు గురిచేశారు. దీనిపై బాధితుడు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సదరు భూమి జయకుమార్దేనని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రెవెన్యూ అధికారులు కూడా ఎండార్స్మెంట్ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు రైతు జయకుమార్‌ను సదరు పొలంలోకి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ● ఉరవకొండ మండలం రేణుమాకులపల్లిలో గొర్రెల కాపర్ల మధ్య జరిగిన గొడవల్లో ఎటువంటి సంబంధమూ లేని 12 మంది వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయించారు. ● జల్లిపల్లి సర్వేనంబర్ 486లో 24.45 ఎకరాల భూమి వైఎస్సార్సీపీ కూడేరు మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల పేర్లపై ఉంది. అయితే ఆ భూమికి టీడీపీ నేతలు ఫేక్ రికార్డులు సృష్టించి రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి భూ వివాదానికి కారకులయ్యారు. ● ఉదిరిపికొండలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గ్రామస్తులు రాస్తారోకో చేశారు. దీంతో టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి రాస్తారోకోలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నాయకులను గుర్తించి.. 108 అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదంటూ కేసులు పెట్టించారు. ● బెళుగుప్ప మండలం నక్కలపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్ సంజీవరెడ్డి ముఖ్యమంత్రిపై అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు వేసి.. విచారణ పేరిట 20 పోలీసు స్టేషన్లు తిప్పారు. ● ఉరవకొండ మండలం లత్తవరం తండాకు చెందిన వైఎస్సార్సీపీ గిరిజన నాయకుడు ప్రసాద్ నాయక్‌పై దాడి చేసి.. ఆయనే దాడి చేసినట్లు టీడీపీ వారు తప్పుడు కేసు పెట్టారు. ● ఉరవకొండ మండలం బూదగవి వైఎస్సార్సీపీ నాయకుడు ధనంజయకు సర్వే నంబర్ 333–ఏలోని 6.20 ఎకరాలు, సర్వే నంబర్– 313లోని 2.43 ఎకరాల భూమి ఉంది. ఇందులో కొన్నేళ్లుగా పంటలు సాగుచేస్తున్నాడు. అయితే ఈ భూమిని ఇతరులు కొనుగోలు చేసినట్లు టీడీపీ నాయకులు ఫేక్ రికార్డులు సృష్టించి, జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించారు. దీనిపై బాధితుడు ధనంజయ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో కేసు నడుస్తుండగానే టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏకంగా పొలంలోకి వెళ్లి సర్వే చేయించే ప్రయత్నం చేశారు. ఇదేమిటని అడ్డుకోబోయిన ధనంజయ సోదరుడిని పోలీసులు దూషించారు. దీంతో మనస్తాపం చెందిన ధనంజయ సోదరుడు పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్ పేట్రేగిపోతున్న టీడీపీ నేతలు బాధితుల పక్షాన నిలవని అధికార యంత్రాంగం దౌర్జన్యాలకు నిరసనగా నేడు వైఎస్సార్సీపీ మహా ధర్నా నేడు మహా ధర్నా.. టీడీపీ నేతల దౌర్జన్యకాండకు నిరసనగా వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉరవకొండలో మహాధర్నా నిర్వహించనున్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు రమేష్‌గౌడ్ తదితరులు హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులు తరలిరానున్నాయి. పోలీసు, రెవెన్యూ అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని నినదించనున్నారు. కక్ష కట్టి.. కేసులు పెట్టి.. -
గురుకులంలో తాగునీటి కష్టాలు
కుందుర్పి: మండల కేంద్రంలో ఉన్న జ్యోతిరావుపూలే బాలుర గురుకుల పాఠశాలలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. 3 నెలలుగా పంచాయతీ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా పాఠశాల విద్యార్థులకు నీటిని సరఫరా చేసేవారు. అయితే ఉన్నఫలంగా గత 15 రోజులుగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుక్కెడు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సొంత నిధులతో నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటనలు చేయడం మినహా కనీసం పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీరు ఇవ్వడంలో విఫలమైయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. పాఠశాలలో నీరు లేకపోవడంతో స్వంత గ్రామాలకు వెళ్లి స్నానాలు చేసి వస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. పలుసార్లు తాగునీటి సమస్యపై ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. కనీసం ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కుందుర్పిలోని బాలుర గురుకుల పాఠశాలలో నెలకొన్ని మంచినీటి ఎద్దడిని తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. తీవ్ర ఇబ్బందుల్లో విద్యార్థులు -
ప్రత్యేక పిల్లలకు ఊరట
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రత్యేక అవసరాల గల (సీడబ్ల్యూఎస్ఎన్) పిల్లలు, తల్లిడండ్రులకు శుభవార్త. ఇన్నాళ్లు సదరం సర్టిఫికెట్లు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్న పరిస్థితికి త్వరలో తెరపడనుంది. జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సదరం సర్టిఫికెట్ల జారీ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. దీంతో జిల్లాలో సుమారు 1,100 మంది ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందనున్నాయి. సంక్షేమానికి దూరం.. జిల్లాలో 6 నుంచి 18 ఏళ్లలోపు ప్రత్యేక అవసరాల గల విద్యార్థులు 4,090 మంది ఉన్నారు. వీరిలో 1,100 మందికి సదరం సర్టిఫికెట్లు లేవు. దీంతో ప్రభుత్వ పింఛన్లు, వివిధ సంక్షేమ పథకాలు, అలిమ్కో ద్వారా అందించే సహాయక పరికరాలు వంటి అనేక ప్రయోజనాలకు వారు దూరమవుతున్నారు. సదరం సర్టిఫికెట్ పొందాలంటే ప్రభుత్వం విడుదల చేసే ఆన్లైన్ స్లాట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే స్లాట్లు పరిమితంగా ఉండడం, కొద్దిసేపే అందుబాటులో ఉండటం, తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం, రోజువారీ కూలీ పనులకు వెళ్లడం వంటి కారణాలతో చాలామంది నమోదు చేసుకోలేకపోయారు. ఫలితంగా అర్హత ఉన్నప్పటికీ వందలాది మంది పిల్లలు ప్రతి ఏడాది ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోతున్నారు. కలెక్టర్ చొరవతో ప్రత్యేక డ్రైవ్.. సమస్యను సమగ్ర శిక్ష అధికారులు కలెక్టర్ ఓ. ఆనంద్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత ఫైల్ తెప్పించి రాష్ట్ర అధికారులతో చర్చించారు. ఫలితంగా జిల్లాకు ప్రత్యేకంగా సదరం సర్టిఫికెట్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఇదీ షెడ్యూల్ .. ఈ నెల 8న ప్రత్యేక లింక్ అందుబాటులోకి రానుంది. ఆన్లైన్లో అర్హులైన విద్యార్థుల వివరాలు నమోదు చేయనున్నారు. 19,20,21,22,24 వరకు స్లాట్ బుకింగ్‌లు నిర్వహిస్తారు. తల్లిదండ్రులు తమకు అనుకూలమైన తేదీని ఎంపిక చేసుకోవచ్చు. అనంతరం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల ధ్రువీకరణ ఆధారంగా సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తారు. సర్టిఫికెట్ పొందిన తర్వాత అర్హులైన విద్యార్థులకు దివ్యాంగుల పింఛన్లు, అలిమ్కో ద్వారా అందించే సహాయక పరికరాలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందే అవకాశం ఉంది. సదరం సర్టిఫికెట్ల కోసం ప్రత్యేక డ్రైవ్‌కు కలెక్టర్ ఆనంద్ చొరవ ఆగస్టు 8న ప్రత్యేక లింక్.. 19 నుంచి 24 వరకు స్లాట్ బుకింగ్‌లు అవకాశాన్ని వినియోగించుకోవాలి కలెక్టర్ ప్రత్యేక చొరవతో వచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఐఈఆర్పీలు, ఐఈడీఎస్‌ఎస్ ఉపాధ్యాయులు తమ పరిధిలోని అర్హులైన ప్రతి ప్రత్యేక అవసరాల విద్యార్థిని ఈ ప్రత్యేక డ్రైవ్‌కు తీసుకురావాలి. – శైలజ సమగ్ర శిక్ష ఏపీసీ. ఫణిరాజు ఐఈడీ కోఆర్డినేటరు -
టీచర్లకు టెట్ టెన్షన్ !
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అంటే ఇప్పటివరకు నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థుల పరీక్షగానే భావించేవారు. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా భారీ సంఖ్యలో టెట్ రాయనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బోధన చేసే టీచర్లందరికీ టెట్ అర్హత తప్పనిసరి. దీంతో టెట్ అర్హత లేని ప్రభుత్వ ఉపాధ్యాయులు పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 5 నుంచి 16 వరకు టెట్ నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 18,191 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందుకోసం ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా, శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల, గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సీవీ రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి. రోజూ రెండు విడతలుగా పరీక్షలు జరగనున్నాయి. తొలివిడత ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 2.30 నుంచి సాయత్రం 5 గంటల వరకు ఉంటుంది. టీచర్లకు సవాల్‌గా టెట్.. పది, పదిహేను, ఇరవై ఏళ్లుగా ఉద్యోగంలో ఉన్న కొందరు ఉపాధ్యాయులు మళ్లీ టెట్ రూపంలో పోటీ పరీక్ష రాయాల్సి రావడం వారికి మానసికంగా సవాల్‌గా మారింది. కొత్త సిలబస్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), సమయ నిర్వహణ వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులకు పాఠాలు చెప్పడం, పాఠశాలల పరిపాలనా పనులు, రికార్డుల నిర్వహణ, ఎఫ్ఏ–1 పరీక్షల ఏర్పాట్లు, సమావేశాలు, సమీక్షలు... ఇలా రోజంతా విధుల్లోనే గడుస్తోంది. ఇంటికి చేరుకున్న తర్వాతే టెట్ పుస్తకాలు చేతిలోకి తీసుకుంటున్నారు. కొందరు తెల్లవారుజామునే లేచి చదువుతుంటే, మరికొందరు అర్ధరాత్రి వరకు మాక్ టెస్టులు రాస్తూ సన్నద్ధమవుతున్నారు. అభ్యర్థులకు సూచనలు.. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 1.30 నుంచి 2.30 వరకు మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదో ఒకటి గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. గుర్తింపు కార్డు పరిశీలించిన తర్వాతనే అనుమతిస్తారు. హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా గుర్తింపు కార్డును పరిశీలించి రెండు ఫొటోలు, డిక్లరేషన్ తీసుకుని పరీక్షకు అనుమతిస్తారు. స్క్రైబ్స్ జాబితాలో ఉన్న దివ్యాంగ అభ్యర్థులకు డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన విద్యార్థులను మాత్రమే స్క్రైబ్స్‌గా కేటాయించాలి. వీహెచ్, ఓహెచ్ (రెండు చేతులు లేనివారు) అభ్యర్థులకు 50 నిముషాల అదనపు సమయం కేటాయిస్తారు. అభ్యర్థులతో పాటు ప్రభుత్వ టీచర్లకూ తప్పనిసరి పరీక్ష ఈ నెల 5 నుంచి 16 వరకు పరీక్షల నిర్వహణ జిల్లాలో 6 సెంటర్లలో పరీక్షలు రాయనున్న 18,191 మంది అభ్యర్థులు ఏర్పాట్లు సిద్ధం చేశాం టెట్ నిర్వహణకు జిల్లాలోని సెంటర్లలో అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశాం. ఇబ్బంది పడకుండా అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. – శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారి -
బళ్లారి రాఘవ రంగస్థల సేవలు ఆదర్శప్రాయం
అనంతపురం కల్చరల్: బళ్లారి రాఘవ రంగస్థల సేవలు ఆదర్శప్రాయమని, ఆయన జిల్లాలో జన్మించడం మన అదృష్టమని వక్తలన్నారు. ఆదివారం రాత్రి బళ్లారి రాఘవ 146వ జయంతి స్థానిక లలితకళాపరిషత్‌లో ఘనంగా జరిగింది. ఎల్కేపి కార్యదర్శి పద్మజ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో డీఆర్వో మలోల, జేఎన్టీయూ రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్, ఎల్కేపి అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది గురుప్రసాద్, ఉపాధ్యక్షుడు సంగాల నారాయణస్వామి, రామగోవిందసాగర్ ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బళ్లారి రాఘవ ఆదర్శప్రాయ జీవితాన్ని గురించి రంగస్థలానికి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం బళ్లారి రాఘవ పురస్కారాలకు ఎంపికై న రాష్ట్రస్థాయి విభాగంలో డీసీ కృష్ణ, జంగం ధర్మారావు జిల్లా విభాగంలో సోమిరెడ్డి, ఎర్రిస్వామి, జేకే రామాంజనేయులు, నారాయణస్వామి, ఉంగరాల శ్రీనివాసులు, ఆముదాల సుబ్రమణ్యం, వరప్రసాద్‌లకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పురస్కారాలనందించారు. అనంతరం ప్రదర్శించిన ‘శ్రీపోతులూరి వీరబ్రహ్మంద్రస్వామి జీవిత చరిత్ర’ చారిత్రక నాటకం ఆహూతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో లలితకళాపరిషత్ కార్యనిర్వాహక సభ్యులు ఆదినారాయణరెడ్డి, శంకర్, రమణారెడ్డి, అస్లాంబాషా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సత్కారం
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని అటల్ ఇంక్యుబేషన్ కేంద్రానికి చెందిన ఇద్దరు గ్రామీణ ఆవిష్కర్తలకు జాతీయ సత్కారం దక్కింది. గ్రామీణ భారతదేశానికి ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశంపై గరిగంటి సుధాకర్ బాబుకు, రాయలసీమ మోసంబి రైతుల కోసం విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి అంశానికి సంబంధించి ఉషన్ శివరామ్‌ను ఘనంగా సత్కరించారు. దేశ వ్యాప్తంగా కేవలం 26 మంది ఎంపిక కాగా, వారిలో ఇద్దరు ఎస్కేయూ అటల్ ఇంక్యుబేషన్ కేంద్రానికి చెందిన వారు కావడం గమనార్హం. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో గ్రాస్రూట్స్ ఇన్నోవేటర్ రికగ్నేషన్–2026 కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వారిని సత్కరించారు. ఎస్కేయూ వీసీ జ్యోతికుమార్ వారిని అభినందించారు. -
అడ్డంకులు సృష్టించడం తగదు
మంత్రి పయ్యావుల కేశవ్ అనుచరులు, టీడీపీ నేతల దౌర్జన్యాలను నిరసిస్తూ సోమవారం ఉరవకొండలో నిర్వహించే శాంతియుత ధర్నాకు అడ్డంకులు సృష్టించడం తగదని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ధర్నాను విఫలం చేయడానికి అధికార పార్టీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ శాంతియుత పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా ఇక్కడ పట్టించుకోవడం లేదన్నారు. జూలై 31వ తేదీనే ధర్నాకు పిలుపునిస్తే.. అనుమతి ఇవ్వకుండా వాయిదా వేసుకోవాలని తెలిపితే పోలీసులను గౌరవించి సోమవారానికి వాయిదా వేశామన్నారు. ఉదయం 9.30 గంటలకు వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు పార్టీ శ్రేణులు చేరుకుని, ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
తేనెటీగల పెంపకానికి ప్రోత్సాహం
అనంతపురం అగ్రికల్చర్: ఉద్యానశాఖ ద్వారా తేనెటీగల పెంపకానికి ముందుకు వచ్చే లబ్ధిదారులకు రాయితీతో ప్రోత్సహిస్తామని ఆ శాఖ డీడీ ఉమాదేవి తెలిపారు. హార్టికల్చర్ ఆఫీసర్ రత్నకుమార్‌తో కలిసి ఆదివారం రూరల్ మండలం సిండికేట్‌నగర్ సమీపంలో నల్లమల హనీబీ పార్క్‌తో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. తేనేటీగల పెంపకం, పెట్టుబడులు, ఆదాయం, మార్కెటింగ్ తదితర విషయాల గురించి శిక్షణ కేంద్రం నిర్వాహకుడు రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. తేనెటీగల వల్ల ఆదాయంతో పాటు ఉద్యాన పంటల్లో పరపరాగ సంపర్కానికి తోడ్పడి మంచి దిగుబడులు వస్తాయన్నారు. కేంద్ర నిల్వ ఉత్పత్తి కేంద్రం, తేనెటీగల కాలనీ ఉత్పత్తి, తేనెటీగల సమూహం, తేనెటీగల గూళ్లు, తేనెతీసే యంత్రం... ఇలా ఈ రంగానికి వివిధ రూపాల్లో రాయితీలు వర్తిస్తాయన్నారు. యూనిట్ విలువపై 40 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. ప్రధానంగా ఉద్యానతోటల్లో అదనంగా తేనెటీగల పెంపకం చేపడితే అన్ని రకాలుగా ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. తేనెటీగల వల్ల పురుగు మందుల పిచికారీ ఖర్చు తగ్గడమే కాకుండా మంచి పంట దిగుబడులు వచ్చినట్లు దానిమ్మ రైతు గంగాధర్‌రెడ్డి తెలిపారు. -
ముగిసిన వాతావరణ బీమా గడువు
అనంతపురం అగ్రికల్చర్: ఎల్–నినో పరిస్థితుల నడుమ పంటల బీమా పథకాలు ఆదుకుంటాయనే ఆశతో రైతులు ప్రీమియం చెల్లింపునకు ఆసక్తి చూపుతున్నారు. వాతావరణబీమా, ఫసల్‌బీమా పథకాల నోటిఫికేషన్ ఖరీఫ్ ఆరంభమైన 40 రోజులకు ప్రకటించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య గత 10 రోజులుగా రైతులు పడిన బాధలు వర్ణనాతీతం. ఈ క్రమంలో వాతావరణ బీమా కింద నోటిఫై చేసిన వేరుశనగ, పత్తి, చీనీ, దానిమ్మ, అరటి, టమాట పంటలకు ప్రీమియం చెల్లింపు గడువు ఈ నెల ఒకటో తేదీ (శనివారం) అర్ధరాత్రి 12 గంటలకు ముగిసింది. మొత్తంగా 80,097 మంది రైతులు 1,15,354 హెక్టార్ల పంటలకు ప్రీమియం కట్టినట్లు అధికారులు తెలిపారు. 1.47 లక్షల హెక్టార్లకు ఫసల్‌బీమా.. ఫసల్‌బీమా కింద నోటిఫై అయిన వరి, జొన్న, మొక్కజొన్న, కంది, ఆముదం, ఎండుమిరప పంటలకు ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. ప్రస్తుతానికి 90,500 మంది రైతులు 1.47 లక్షల హెక్టార్లకు ప్రీమియం చెల్లించారు. గడువు నాటికి 1.75 లక్షల హెక్టార్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో కంది పంటకే వేలాదిమంది రైతులు ప్రీమియం చెల్లించగా.. ఆ తర్వాత ఆముదం, ఎండుమిరప, అలాగే వరికి ప్రీమియం కడుతున్నట్లు చెబుతున్నారు. ప్రీమియం చెల్లింపులో ప్రస్తుతానికి వజ్రకరూరు మండల రైతులు మొదటి స్థానంలో నిలిచారు. అటు వాతావరణ, ఇటు ఫసల్‌బీమా కింద వజ్రకరూరులో 12 వేల మంది రైతులు 20 వేల హెక్టార్లకు బీమా చేయించుకుని టాప్‌లో నిలిచారు. ప్రీమియం గడువు ముగిసిన 15 రోజులకు పంటల వారీగా సమగ్ర వివరాలు అందుబాటులోకి వస్తాయని బీమా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. పంటల బీమా విలువ రూ.2,289 కోట్లు జిల్లా రైతులు తమ వాటా కింద ప్రీమియం చెల్లించి రూ.2,289 కోట్లు విలువ చేసే పంటలకు బీమా చేయించుకున్నారు. అందులో వాతావరణ బీమా కింద రైతులు తమ వాటా కింద రూ.33.32 కోట్ల మేర ప్రీమియం చెల్లించడంతో దాని విలువ రూ.1,083.06 కోట్లుగా గుర్తించారు. అలాగే ఫసల్‌బీమా ప్రీమియం ఇంకా కొనసాగుతుండగా ప్రస్తుతానికి రైతులు తమ వాటా కింద చెల్లించిన రూ.6.17 కోట్ల ప్రీమియం ఆధారంగా పంట విలువ రూ.1,206.30 కోట్లుగా లెక్క తేల్చారు. 1.15 లక్షల హెక్టార్ల పంటలకు వాతావరణ బీమా -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్ కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. భూసమస్యలకు సంబంధించిన అర్జీలను పరిష్కార వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలని పేర్కొన్నారు. ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్సైట్లోనూ సమర్పించవచ్చని తెలిపారు. ఉరవకొండ డిగ్రీ కళాశాలకు అరుదైన అవకాశం ఉరవకొండ: నేషనల్ సర్వీస్ స్కీమ్ అధ్వర్యంలో ఆదివారం నషా ముక్త్ యువ వికసిత్ భారత్ వర్చువల్ సమావేశంలో పాల్గొనేందుకు ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులకు అరుదైన అవకాశం దక్కింది. కాన్ఫరెన్స్‌కు 125 కళాశాలలు ఎంపిక కాగా, తెలుగు రాష్ట్రాల్లో కేవలం 10 కళాశాలలు ఎంపికయ్యాయి. ఇందులో ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కుడా ఉండటం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ సమావేశం ద్వారా మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రహిత భారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇందు కోసం వంద వారాల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శైలజారాణి, వైస్ ప్రిన్సిపాల్ మస్తానప్ప, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు ఎం.విష్ణుప్రియ, సుధాకర్, ఎన్సీసీ అధికారి ప్రశాంత్, అద్యాపకులు అయ్యన్న, సిరాజ్ అలీ, వెంకటరాముడు, నారాయణస్వామి, జమీల, సుజాత, వెంకటేష్, ఆంజినేయులు, రమేష్, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. రెండు స్కూల్ బస్సులకు నిప్పు తాడిపత్రి రూరల్ : ప్రమాదవశాత్తూ రెండు స్కూల్ బస్సులకు నిప్పంటుకుంది. పట్టణ సమీపాన పుట్లూరు రోడ్డులోని గురుకుల్ స్కూల్‌కు చెందిన రెండు బస్సులు 15 ఏళ్ల కాలపరిమితి ముగియడంతో స్క్రాప్ కింద పరిగణించి ఆవరణలో ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ రెండు బస్సులకూ నిప్పంటుకున్నాయి. ఇందులో ఒక బస్సు పూర్తిగా దగ్ధం కాగా.. మరొకటి పాక్షికంగా దెబ్బతినింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. మంటలు ఎలా వ్యాపించాయో తెలియడం లేదని పాఠశాల కరస్పాండెంట్ సతీష్ తెలిపారు. -
పార్సిల్ సర్వీసులో కొత్త టారిఫ్‌లు
అనంతపురం టౌన్: తపాలశాఖ అనుబంధంగా పనిచేస్తున్న పార్సిల్ సర్వీసులకు ధరలను తగ్గిస్తూ కొత్త టారీఫ్‌లను ఇండియా పోస్టు ప్రవేశపెట్టినట్లు తపాలశాఖ అనంతపురం జిల్లా సూపరింటెండెంట్ అమర్నాథ్ ఒక ప్రకనటో తెలిపారు. తగ్గింపు టారిఫ్‌లతో వ్యాపార సంస్థలు, ఈ కామర్స్ విక్రేతలు, వస్తు తయారీ సంస్థలు, హోల్‌సెల్, రిటైల్ వ్యాపారస్తులు, బల్క్ పార్సెల్ వినియోగదారులకు అనువుగా ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడికై న 500 గ్రాముల లోపు పార్సిల్‌ను పంపితే గతంలో రూ.100కు పైగా ఉండేదన్నారు. ప్రస్తుతం రూ.35 లోపే ధర ఉంటుందన్నారు. దీంతో పాటు మెట్రో ప్రాంతాలకు పంపే పార్సెల్స్ ధరలను బాగా తగ్గించామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ‘ఆశావాది’ సాహితీ సేవలు చిరస్మరణీయం అనంతపురం కల్చరల్: స్వయంకృషితో ఎదిగిన మహోన్నత సాహితీ శిఖరం డాక్టర్ ఆశావాది ప్రకాశరావు తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు నిరుపమామని పలువురు వక్తలు కొనియాడారు. ఆశావాది సాహితీ పురస్కార ప్రదానోత్సవం ఆదివారం ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఘనంగా జరిగింది. ఆశావాది శశాంక మౌలి అధ్యక్షతన జరిగిన పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు సాహితీ ఉత్సవంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులకు పురస్కారాలను అందించారు. మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ అధికార ప్రతిఽనిధి డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగకు ‘సామాజిక సేవా పురస్కారం,’ హైదరాబాద్‌కు చెందిన నల్లాన్ చక్రవర్తుల సాహిత్‌కు ‘అవధాన పురస్కారం’, పద్యబంధ కవి అన్నమరాజు ప్రభాకరరావుకు ‘సాహిత్య పురస్కారం’ అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శతావధాని కళారత్న ఆముదాల మురళి, జనప్రియ కవి ఏలూరు యంగన్న, డాక్టర్ వైస్సార్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీత శాంతినారాయణ, వైఎస్సార్ జిల్లాకు చెందిన ప్రముఖ గాయకులు ముండ్లపాటి వెంకటసుబ్బయ్య, హైదరాబాదుకు శిల్పి కళారత్న డాక్టర్ గొల్లపల్లి జయన్న , సంస్కృత ఉపన్యాసకులు ఆశావాది సుధామ వంశి తదితరులు విశిష్ట అతిథులుగా విచ్చేసి ఆశావాది సాహిత్యంలోని విశిష్టతలను తెలియజేశారు. ఈ సందర్భంగా అవధానాచార్య పద్మశ్రీ డాక్టర్ ఆశావాది ప్రకాశరావు సాహితీపీఠం లోగోను ఆవిష్కరించారు. సంతల ఆదాయం రూ.3.17 లక్షలు అనంతపురం అగ్రికల్చర్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఈ వారం జరిగిన జీవాలు, పశువుల సంతల ద్వారా రూ.3.17 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు చైర్పర్సన్ బల్లా పల్లవి, సెక్రటరీ కె.గోవిందు తెలిపారు. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత ద్వారా రూ.1.57 లక్షలు, ఆదివారం జరిగిన పశువులు, గేదెలు, ఎద్దుల సంత నుంచి రూ.1.60 లక్షలు మేర వసూలైనట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి రాయదుర్గం రూరల్: మండల పరిధిలోని 74 ఉడేగోళం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బిదురు బొమ్మయ్య కుమారుడు బి.ఓబయ్య (38) మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. మృతుడు ఓబయ్య గ్రామంలో నుంచి సబ్‌స్టేషన్ వెనుక భాగాన ఉన్న తన ఇంటికి ద్విచక్ర వాహనం బయలుదేరాడు. అయితే హైవేపై రోడ్డు దాటుతుండగా రాయదుర్గం నుంచి అనంతపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు (ఏపీ 39జడ్ 0704) ఢీ కొంది. స్థానికులు రాయదుర్గం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు ఓబయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడన్నారు. మృతుడికి భార్య సూరమ్మ, 10వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నట్లు తెలిపారు. గ్రామంలోకి వెళ్లొస్తానని చెప్పి , తిరిగరాని లోకాలకు వెళ్లావా అంటూ మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. రూరల్ సీఐ వెంకటరమణ, అర్బన్ ఎస్ఐ సురేష్ ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహిళ మెడలో బంగారు చైన్ అపహరణ రామగిరి: మండలంలోని మక్కినవారిపల్లిలో శనివారం అర్ధరాత్రి అశ్వర్థమ్మ అనే మహిళ మెడలోని నగలను దొంగలు అపహరించారు. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం అర్ధరాత్రి ఇంటి సమీపంలో అశ్వర్థమ్మ బహిర్బూమికి వెళ్లింది. ఈ సమయంలోనే దుండగులు ఆమె మెడలోని తాళిబొట్టు చైన్‌ను లాక్కెళ్లారు. చైన్ సుమారు మూడు తులాల ఉంటుందని బాధితురాలు పేర్కొంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
అనంతపురం కల్చరల్: జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య సర్వసభ్య సమావేశం జిల్లా కేంద్రంలోని సమాచార కేంద్రంలో ఆదివారం జరిగింది. శ్రీనివాసుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన సీఏపీసీఓ చైర్మన్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ ఇన్నిరోజులుగా అధ్యక్షుడిగా వ్యవహరించిన రవీంద్రనాథరెడ్డి, కోశాధికారి సుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి నబీరసూల్ ముగ్గురూ ఒకే ఏడాదిలో మరణించడం సమాఖ్యకు తీరని లోటని సంతాపం తెలియజేశారు. వారి స్థానాలలో నూతన సభ్యులను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. వినియోగదారుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమన్నారు. హక్కుల పరిరక్షణ, అవగాహన కార్యక్రమాల విస్తరణతో పాటు జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య బలోపేతమే లక్ష్యంగా నూతన కార్యవర్గం పనిచేయాలని సూచించారు. అధ్యక్షుడిగా తోట చెన్నప్ప.. అనంతరం జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా తోట చెన్నప్పను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంటుగా చల్లా కిషోర్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడిగా పి.కృష్ణమూర్తి, చంద్ర మహేష్, రాయల్ కొండయ్య, కోశాధికారిగా శేషాద్రి, జాయింట్ సెక్రటరీగా హసీన్వలి, సంయుక్త కార్యదర్శిగా అశ్వత్తరెడ్డితో పాటు వివిధ మండలాల కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై తీర్మానాలు చేశారు. -
ఒకే గది.. ఐదు తరగతులు
శింగనమల: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5 వ తరగతి వరకూ 40 మంది విద్యార్థులున్నారు. అయితే విద్యార్థులందరూ ఒకే గదిలోనే కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. మరో గది ఉన్నా .. పైకప్పు పెచ్చులు పడుతుండడంతో అందరికీ ఒకే గదిలోనే చదువు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దెబ్బతిన్న భవనానికి మరమ్మతు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనికి తోడు పాఠశాల సమీపంలోనే మురికికాలువలు పూడిపోవడంతో దోమలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి భవనాలకు మరమ్మతు చేయాలని కోరుతున్నారు. -
గుప్తనిధుల తవ్వకాలు భగ్నం
బత్తలపల్లి: గుప్తనిధుల తవ్వకాలను గ్రామస్తులు భగ్నం చేశారు. ముఠాకు చెందిన ఒకరిని పట్టుకున్నారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు.. మండలంలోని అప్రాచెరువు గ్రామ సమీపంలో ఉన్న అపరాదయ్య బండ వద్ద కొన్ని రోజులుగా రాత్రి సమయాల్లో గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు సాగిస్తున్నారు. శనివారం రాత్రి వారిని ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో గ్రామస్తులు సూలా నరసింహులు, బుట్రా గోపాల్, సంగాల నాగరాజు, సూలా ఓబన్న ఆ ప్రాంతంలో మాటువేయగా.. అర్ధరాత్రి సమయంలో టవేరా వాహనంలో ఏడుగురు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలియగానే అపరాదయ్య బండ వద్దకు గ్రామస్తులతో కలిసి సింగిల్‌విండో అధ్యక్షుడు ఆకులేటి వీరనారప్ప వచ్చారు. అందరూ కలిసి దుండగులను పట్టుకునేందుకు యత్నించగా పారిపోయారు. డ్రైవర్ వాహనంతో పాటు పారిపోతుండగా గ్రామస్తులు వాహనాల్లో వెంబడించారు. జాతీయ రహదారిపై సంకేపల్లి వద్ద పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి పామిడి మండలం కొండాపురం గ్రామానికి చెందిన తిప్పారెడ్డి కుమారుడు కొండూరు సుధీర్‌రెడ్డిగా గుర్తించారు. పోలీసులు టవేరా వాహనంతోపాటు తవ్వకాల కోసం తెచ్చిన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. గుప్తనిధుల కోసం పామిడికి చెందిన ఇద్దరు, కల్లూరుకు చెందిన ఇద్దరు, అనంతపురానికి చెందిన ఇద్దరు వచ్చినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆదివారం పోలీసుస్టేషన్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాపు కాసి వాహన డ్రైవర్‌ను పట్టుకున్న గ్రామస్తులు -
బలహీనులపై ప్రతాపం చూపుతారా?
● రిటైర్డు జడ్జి కిష్టప్ప మండిపాటు అనంతపురం టవర్‌క్లాక్: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు వచ్చాక అధికార టీడీపీ నాయకుల భూదందాలు పెరిగిపోయాయని, బలహీనుల భూములను కబ్జా చేస్తూ వారిపై ప్రతాపం చూపుతున్నారని రిటైర్డు జడ్జి కిష్టప్ప మండిపడ్డారు. శనివారం ఆయన అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఎక్కడ చూసినా టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు మితిమీరి పోయాయన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వేల్పుమడుగు గ్రామంలో కురుబ గోవిందు అల్లుడు 20 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తే.. కొంతమంది అధికార పార్టీ పెద్దల అండదండలతో ఆ భూమిని కబ్జా చేసేందుకు పథకం వేశారన్నారు. టీడీపీలో చేరలేదన్న కారణంగా కురుబలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, న్యాయ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, సామాన్యులకు న్యాయం చేకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కురుబల జోలికొస్తే ఊరుకోం ఎవరికీ ఎటువంటి ఇబ్బందులూ కలిగించని కురుబల జోలికి వస్తే ఊరుకునేది లేదని రిటైర్డు జడ్జి హెచ్చరించారు. కురుబలు ఆర్థికంగా ఎదగకూడదా అంటూ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా.. ఎదిరించినందుకు ఎన్కౌంటర్ చేస్తారా.. ఇదెక్కడి రాజ్యాంగం అంటూ నిలదీశారు. కురుబల తరఫున న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో టీడీపీ నాయకుల ప్రోద్బలంతో ఇళ్లు కూల్చేశారని, అక్కడ బాధితులకు తాను అండగా నిలిచి పోరాటం చేశానని గుర్తు చేశారు. యువత సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలో యువత ఉద్యమిస్తే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని, చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా యువత ముందుకు వచ్చి సమాజం కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో ఆదినారాయణ, వశికేరి రమేష్, హనుమన్న, రైతు గోవిందు, రామచంద్ర, రాధాకృష్ణ, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అదను చూసి ‘ఎల్–నినో’ పంజా విసురుతోంది. కీలక తరుణంలో ఆశల నైరుతిని కదలకుండా ఆపేస్తోంది. రుతుపవనాలు విస్తరించకుండా నిలువరించింది. మేఘాలు వర్షించకుండా గాలివాటం చేసింది. లక్షలాది హెక్టార్ల ఖరీఫ్‌ను చిదిమేసి ‘అనంత’ రైతుల ఆశల సౌధాన్ని నిలువునా కూల్చేసింది. కరువ
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్‌లో లక్షలాది హెక్టార్ల పంటలు సాగులోకి రావాలంటే జూలై వర్షాలు అత్యంత కీలకం. వేరుశనగ, కంది, మొక్కజొన్న, ఆముదం, పత్తి, సజ్జ, కొర్ర తదితర ప్రధాన పంటలు విత్తుకునేందుకు జూలై నెల మంచి అదను. ఆరుద్రతో పాటు పునర్వసు, పుష్యమి లాంటి విత్తన కార్తెలు, ఏరువాక పౌర్ణమి, విత్తనాల ఏకాదశి వంటి శుభగడియలన్నీ దాదాపు కాస్త అటుఇటుగా జూలైలోనే వస్తాయి. 64.3 మి.మీ మేర సాధారణ వర్షపాతం నమోదైతే దాదాపు పంటలన్నీ సాగులోకి వస్తాయి. అలాగే ఏడు నుంచి తొమ్మిది వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కావాల్సి ఉంటుంది. అయితే ఈ జూలై పరిస్థితి దారుణంగా తయారైంది. కేవలం 18.8 మి.మీ వర్షం కురిసింది. ఏకంగా 71 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆ 18.8 మి.మీ కూడా గాలివాటం వర్షం కావడం గమనార్హం. కేవలం రెండంటే రెండు మాత్రమే రెయినీడేలు నమోదు కావడం గమనార్హం. అందులో జూలై 19న 4.3 మి.మీ, 21న 5.6 మి.మీ తేలికపాటి సగటు వర్షపు రోజులు నమోదయ్యాయి. గుంతకల్లు, గుత్తి, పెద్దవడుగూరు, యాడికి, ఉరవకొండ, బెళుగుప్ప, గుమ్మఘట్ట, గార్లదిన్నె, శింగనమల, రాప్తాడు తదితర పది పన్నెండు మండలాల్లో మాత్రమే జూలైలో తేలికపాటి వర్షం కురిసింది. మొత్తం మీద ఈ ఖరీఫ్ రెండు నెలల కాలంలో 126.9 మి.మీ గాను 31.1 శాతం లోటుతో 87.4 మి.మీ వర్షం కురిసింది. ఇక ఆగస్టులో 84.4 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉన్నా... కష్టంగానే కనిపిస్తోంది. ఫలించని పూజలు, యాగాలుఎల్–నినో కారణంగా చినుకులు పడటం గగనమైపోయింది. జూన్ 14 వరకు వర్షాల పరిస్థితి బాగానే ఉంది. ఆ తర్వాత ఎల్–నినో గుప్పిట్లోకి వరుణుడు వెళ్లిపోయాడు. నెలల తరబడి ఎదురుచూసినా పట్టుమని 10 మి.మీ వర్షం కురిసిన దాఖలాలు లేవు. వర్షాల కోసం గ్రామ గ్రామాన రైతులు, ప్రజలు కప్పలు, గాడిదలకు పెళ్లిళ్లు, బొడ్రాళ్లు, గ్రామ దేవతలకు పూజలు, వరుణయాగం, హోమాలు, రామదండు, విరాట పర్వం, సుందరకాండ పారాయణం లాంటి అనేక రూపాల్లో పూజలు చేసినా వరుణుడు కరుణించడం లేదు. జూన్ 15 తర్వాత వర్షాభావం నెలకొనడంతో 32 మండలాల్లోనూ 21 రోజుల మొదటి డ్రైస్పెల్స్ నమోదు కాగా.. 22 మండలాల్లో 30 నుంచి 40 రోజుల సుదీర్ఘ డ్రైస్పెల్స్ నమోదు కావడం గమనార్హం. 3.43 లక్షల హెక్టార్లకు గాను ప్రధానపంటలు 1.15 లక్షల హెక్టార్లకు పరిమితం కాగా... ఇంకా 2.30 లక్షల హెక్టార్ల వరకు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఆగస్టు 15 తర్వాత 40 వేల క్వింటాళ్లు ప్రత్యామ్నాయ విత్తనాలు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. అంతలోపు వర్షం వస్తే ఏ పంట వేసుకోవాలో తెలియక రైతులు ఇబ్బంది పడుతున్నారు. జూలై లోటు 71 శాతం 64.3 మి.మీకు గాను 18.8 మి.మీ కురిసిన వర్షం రెండే రెండు రెయినీడేస్, 22 మండలాల్లో డ్రైస్పెల్స్ రికార్డు 1.15 లక్షల హెక్టార్లకే పరిమితమైన ఖరీఫ్ పంటల సాగు -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద
బొమ్మనహాళ్: వర్షాభావంతో ఇబ్బంది పడుతున్న తుంగభద్ర ఆయకట్టు రైతులకు ఊరటనిచ్చే పరిణామం చోటు చేసుకుంది. తుంగభద్ర డ్యాం ఎగువ ప్రాంతమైన శివమొగ్గ జిల్లాలో కొద్ది రోజులుగా ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువన ఉన్న గాజనూరు జలాశయం (అప్పర్ తుంగ ప్రాజెక్ట్)లో నీటి నిల్వ గరిష్ట మట్టానికి చేరింది. అక్కడి ఇంజినీర్లు కొన్ని గేట్లను ఎత్తి 55,197 క్యూసెక్కుల నీటిని తుంగ నదిలోకి విడుదల చేశారు. ఆ నీరు దిగువన ఉన్న తుంగభద్ర డ్యాంకు శనివారం రాత్రికి చేరింది. ఆదివారం ఉదయానికల్లా జలాశయంలోకి నీటి ప్రవాహం 50 వేల క్యూసెక్కులకు పైగా పెరిగే అవకాశం ఉందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. డ్యాంలో ప్రస్తుతం 38.69 టీఎంసీల నీరు నిల్వ ఉంది. హెచ్చెల్సీకి నీటి విడుదల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు శనివారం 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అంతకు ముందు అధికారులు డ్యాంపై పూజలు చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా రైతులతో కలిసి వాయనం వదిలారు. డ్యాం నుంచి హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసినట్లు జలాశయ ఈఈ ఎన్.చంద్రశేఖర్, ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. -
ఆసుపత్రిపై నుంచి నగ్నంగా దూకి ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్: నగరంలో రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై నుంచి యువకుడు నగ్నంగా దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. త్రీటౌన్ సీఐ కౌలుట్లయ్య తెలిపిన మేరకు.. తాడిమర్రి మండలం రామాపురానికి చెందిన దబ్బర అశోక్ (30) తల్లిదండ్రులు గతంలోనే చనిపోయారు. అప్పటి నుంచి అతను నగరంలో ఉంటూ రైల్వే స్టేషన్ సమీపంలోని హిత మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో కమీషన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. వివిధ ఆసుపత్రుల నుంచి రోగులను తీసుకువస్తే అతనికి ఆసుపత్రి యాజమాన్యం కమీ షన్ ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. మూడు సంవత్సరాలుగా అదే ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆసుపత్రిపై నుంచి అశోక్ నగ్నంగా కిందికి దూకాడు. తీవ్ర గాయాలైన అతడిని ఆసుపత్రి సిబ్బంది వెంటనే లోపలికి తీసుకొచ్చి చికిత్స ప్రారంభించగా.. శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. అశోక్ మృతిపై తమకు అనుమానాలున్నాయని బంధువులు ఆరోపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వాసుత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని సీఐ కౌలుట్లయ్య తెలిపారు. -
పిల్లర్ల మాటున దోపిడీ
రామ్‌నగర్‌లోని అప్పాజీ నిలయం అపార్ట్మెంట్ వద్ద నిర్మించిన ట్రాన్స్ఫార్మర్ పిల్లర్ ఇది. ఇక్కడ కూడా యజమానే పిల్లర్ ఏర్పాటు చేసుకున్నా దీనికి సైతం ఎస్టిమేషన్లో రూ.36 వేలు బిల్లు వేసి మళ్లీ అతడి నుంచి కట్టించుకున్నారు. ఈ రెండే కాదు.. అనంతపురంలో చాలా చోట్ల ఇదే తంతు నడుస్తోంది. భవన యజమానులకు అవగాహన లేకపోవడంతో కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారు. అనంతపురంలోని మొదటి రోడ్డు రాఘవేంద్రస్వామి గుడి వెనుక భాగంలో గురు నిలయం అపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ పిల్లర్ ఇది. ఈ పిల్లర్ ఏర్పాటు కోసం విద్యుత్ సంస్థకు అపార్ట్మెంట్ నిర్వాహకుడు రూ.36 వేలు చెల్లించాడు. పిల్లర్‌ను నిర్మించాల్సిన కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో పిల్లర్ బిల్లును ఎస్టిమేట్లో మినహాయించాల్సిన అధికారులు అలాంటిది పట్టించుకోకుండా కాంట్రాక్టర్ బిల్లులో జమ చేశారు. అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. అనంతపురం టౌన్: అనంతపురం నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో ఇటీవల పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, షాపింగ్‌మాల్స్, కమర్షియల్ భవనాలు వెలుస్తున్నాయి. ప్రతి భవంతి వద్ద విద్యుత్ వినియోగం బట్టి ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకోవాలి. ఇందు కోసం విద్యుత్ సంస్థకు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్, పిల్లర్ల నిర్మాణాల కోసం నిర్దేశించిన మొత్తాన్ని యజమానులు ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు పిల్లర్ నిర్మించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎక్కడా వాటి నిర్మాణం చేపట్టకుండా భవన యజమానులతోనే ఏర్పాటు చేయించి అ డబ్బు దండుకుంటున్నారు. ఈ రెండేళ్ల కాలంలో నగరంలోని మొదటి, రెండు, నాలుగో రోడ్లతో పాటు కోవూర్నగర్, రామ్‌నగర్, లక్ష్మీనగర్, శ్రీనగర్‌కాలనీ, సవేరా ఆసుపత్రి 80 ఫీట్ రోడ్డు, గౌరవ్గార్డెన్స్, కళ్యాణదుర్గం రోడ్డు హెచ్ఎల్సీ కాలనీ ప్రాంతాల్లో ప్రతి అపార్ట్మెంట్ నుంచి రూ.36 వేల చొప్పున 200కు పైగా భవనాల యజమానుల నుంచి పిల్లర్ల రూపంలోనే రూ.70 లక్షలకు పైగా దోచేశారనే ఆరోపణలున్నాయి. కొంత మంది విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క వినియోగదారుల నడ్డి విరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించి వినియోగదారుల నుంచి లాగిన డబ్బును తిరిగి వెనక్కు ఇవ్వాల్సి ఉంది. రికవరీ చేయిస్తాం పిల్లర్ల నిర్మాణాల కోసం ఎస్టిమేషన్లోనే డబ్బు చెల్లించి నిర్మాణాలు సైతం వినియోగదారులే చేపట్టి ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఎలాంటి విచారణ లేకుండానే వారు చెల్లించిన డబ్బు 20 రోజుల్లో రికవరీ చేయిస్తాం. ఏఈలతో వినియోగదారులకు అవగాహన కల్పించి దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం. – శేషాద్రి శేఖర్, విద్యుత్ శాఖ ఎస్ఈ వినియోగదారుల నడ్డి విరుస్తున్న కాంట్రాక్టర్లు పిల్లర్ల నిర్మాణానికి ముందే డబ్బు చెల్లించినా మళ్లీ లాగుతున్న వైనం 200కు పైగా పిల్లర్లకు దండుకున్నారనే ఆరోపణలు ‘మామూలు’గా పోతున్న విద్యుత్ శాఖ అధికారులు -
అబార్షన్లపై నివేదిక సమర్పించండి
అనంతపురం అర్బన్: యల్లనూరు, వజ్రకరూరు మండలాల్లో జరిగిన అబార్షన్ల ఘటనలపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మొదటి అదనపు జిల్లా జడ్జి సత్యవాణి, పోక్సో కోర్టు జడ్జి చినబాబుతో కలిసి భ్రూణహత్యల నిషేధ చట్టం అమలు కమిటీ జిల్లాస్థాయి సమావేశాన్ని, పీసీ పీఎన్డీటీ యాక్ట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిష్పత్తిలో వ్యత్యాసం పెరిగిపోతోందన్నారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా గుర్తించి అవగాహన శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని చెప్పారు. ఇటీవల అబార్షన్లు జరిగిన యల్లనూరు, వజ్రకరూరు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ తర్వాత అబార్షన్లు జరిగి ఉంటే.. బాధ్యులైన స్కానింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలన్నారు. భ్రూణహత్యల నిరోధానికి పోలీసు స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) నిఘా సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఏఆర్టీ అండ్ సరోగసి యాక్ట్–2021 పటిష్టంగా అమలు చేయాలని పోక్సో కోర్టు జడ్జి చినబాబు ఆదేశించారు. జిల్లాలోని 12 ఏఆర్టీ అస్పత్రులను తనిఖీ చేసి ఆన్లైన్లో ఫిర్యాదుల నమోదుకు సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయాలని చెప్పారు. అనంతరం వివిధ పోస్టర్లను కలెక్టర్, జడ్జీలు, అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీటీ హెల్త్ డైరెక్టర్ దుర్గేష్, గైనకాలజిస్ట్ సుచిత్ర, రెడ్స్ సంస్థ అధ్యక్షురాలు భానూజా, సీఐ రమేష్, తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజా ధనమా.. పప్పూబెల్లాలా! ● బాబు బర్త్‌డేకి మున్సిపల్ ఖజానా నుంచి రూ. 4 లక్షల ఖర్చు అనంతపురం క్రైం: ప్రజా ధనాన్ని పప్పూ బెల్లాల్లా ఖర్చు చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 20న కళారామంలో నిర్వహించిన సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం పేరిట మొత్తం రూ.3,92,249 ఖర్చు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నాలుగు బిల్లులు ఉండగా, ఒకే కార్యక్రమానికి సంబంధించిన పనులను కావాలనే విడదీసి చిన్న బిల్లులుగా తయారు చేశారనే అనుమానాలున్నాయి. వీటిలో ఒక బిల్లు మొత్తం రూ.96,996, రెండోది రూ.99,255, మూడోది రూ.96,996, నాలుగోది రూ.99,002గా ఉండడం గమనార్హం. 600 కుర్చీలు, 16 టేబుళ్లు, 8 పైలాన్ స్టోన్స్, పూల అలంకరణ, 3,250 చదరపు అడుగుల గ్రీన్ మ్యాట్, సౌండ్ సిస్టమ్, షామియానాలు, జేసీబీ, ట్రాక్టర్, తాగునీటి క్యాన్లు, నీటి సీసాలు, పూల కుండీలు, పైలాన్ ఫ్రేమ్ వంటి వాటికి చెల్లింపులు చూపించారు. ఒక్క అనంతపురంలోనే రూ.4 లక్షలు బాబు బర్త్‌డేకి ఖర్చు చేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా లెక్కిస్తే కోట్ల రూపాయల్లో ఉంటుందని పలువురు విమర్శిస్తున్నారు. ప్రజా ధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తుండడంపై మండిపడుతున్నారు. -
శతాధిక వృద్ధురాలికి ఘన సన్మానం
కూడేరు: మండల పరిధిలోని కరుట్లపల్లికి చెందిన లక్ష్మమ్మకు 110 ఏళ్లు నిండాయి. శనివారం కుటుంబ సభ్యులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించగా.. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. లక్ష్మమ్మకు శాలువ కప్పి, పూలమాల వేసి సన్మానించారు. ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శివరామి రెడ్డి మాట్లాడుతూ వృద్ధులను గౌరవించడం భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. వారి ఆశీర్వాదాలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. లక్ష్మమ్మ ఆరోగ్యంగా మరిన్ని సంవత్సరాలు జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, మాజీ ఎంపీపీ రమణా రెడ్డి, రామాంజనేయులు, చంద్రమోహన్ రెడ్డి, తిప్పారెడ్డి, గురుమూర్తి, శ్రీరామిరెడ్డి, నాగిరెడ్డి, ఎంసీ ఆంజనేయులు, శైలాద్రి, సతీష్, శశికాంత్ నీలకంఠరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్యడి.హీరేహాళ్(బొమ్మనహాళ్): మండలంలోని ఓబులాపురం–బళ్లారి రైల్వే మార్గంలోని ట్రాక్‌పై శనివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. 50 ఏళ్లు పైబడిన వ్యక్తి సాయంత్రం 5 గంటల సమయంలో గూడ్స్ కింద పడి మృతి చెందాడు. గుంతకల్లు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఎవరికై నా తెలిసి ఉంటే 9247575605 నంబర్‌కు తెలపాలని ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి కోరారు. బైపీసీ విద్యార్థులకూ ‘బీటెక్’ అనంతపురం: మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను బీటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్ కోర్సులో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆ యూనివర్సిటీ వీసీ డాక్టర్ యువరాజ్ వెల్లడించారు. జీవశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాల సమ్మేళనంగా రూపొందించిన ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీ, ఔషధ పరిశోధన, జీనోమిక్స్, బయోలాజికల్ డేటా అనాలిటిక్స్ తదితర అభివృద్ధి చెందుతున్న రంగాల్లో విస్తృతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వీసీ తెలిపారు. బయాలజీతో పాటు కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై విద్యార్థులకు సమగ్ర శిక్షణ అందించేందుకు ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధనా సదుపాయాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన పాఠ్యప్రణాళిక, ప్రాజెక్టులు, పరిశోధన, ఇంటర్న్‌షిప్‌లు, కెరీర్ మార్గదర్శకత్వం ద్వారా విద్యార్థులను భవిష్యత్తు అవకాశాలకు సన్నద్ధం చేస్తామని వివరించారు. ప్రతి సెమిస్టర్‌కు సాధారణ ఫీజు రూ.80వేలు కాగా, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రత్యేక ఫీజు రాయితీలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 10+2 ఇంటర్మీడియెట్‌లో బైపీసీ, ఎంబైపీసీ లేదా ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని, ఆసక్తి కలిగిన విద్యార్థులు www.admission.mits.ac.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు 8712655132/ 8712655138 నంబర్లను సంప్రదించాలని కోరారు. మహిళ మెడలో బంగారు చైన్ అపహరణ కూడేరు: మండల పరిధిలోని కమ్మూరులో నాగరత్నమ్మ అనే మహిళ మెడలోని బంగారు చైన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. బాధితురాలి వివరాల మేరకు.. శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి తన భార్య నాగరత్నమ్మతో కలిసి అనంతపురం నుంచి ద్విచక్ర వాహనంలో గ్రామం దగ్గరకు రాగానే ఫోన్ కాల్ వచ్చింది. దీంతో బైకు నిలబెట్టి మాట్లాడుతున్నాడు. వారిని ద్విచక్రవాహనంలో వెంబడించిన ఇద్దరు వ్యక్తులు గార్లదిన్నెకు ఎలా వెళ్లాలంటూ మాటలు కలిపి ఆమె మెడలోని 3 తులాల చైన్ బంగారు చైన్‌ను లాక్కొని ఉడాయించారు. బాధితురాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఓటీపీ అడిగి.. 90 వేలు ఊడ్చి! గుంతకల్లు: సైబర్ వలలో పడి ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతాలోని రూ.90,000 నగదు పోగొట్టుకున్నాడు. వివరాలు.. గుంతకల్లు గంగానగర్‌లో నివాసముంటున్న కమల్‌బాషా మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. తనకు కొంత డబ్బు అవసరం ఉండి క్రెడిట్ నోవా యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నాడు. దరఖాస్తు చేసుకున్న సమయంలో ప్లస్ 923330445343 నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. వారు అడిగిన ప్రకారం వివరాలు తెలియజేయడంతో పాటు ఓటీపీ చెప్పాడు. 15 నిమిషాల్లో కమల్‌బాషా ఖాతా(కరూర్ వైశ్య బ్యాంక్)లోని రూ.90,000 ఖాళీ అయ్యింది. ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. -
పంటలు ఎండుతున్నా పట్టించుకోరా?
కూడేరు: విద్యుత్ సరఫరాలో అంతరాయంతో మోటార్లు ఆడక.. నీరందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆగ్రహించారు. వ్యవసాయానికి నిర్దేశించిన సమయం మేర విద్యుత్ సరఫరా చేయాలని శనివారం మరుట్ల –1, 2, 3 కాలనీలకు చెందిన రైతులు మరుట్ల–2 కాలనీలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. సిబ్బందిని స్టేషన్ నుంచి బయటకు పంపించేశారు. ఆవరణలోనే వంటావార్పు చేపట్టి.. నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఏడీ రవి శంకర్, ఏఈ గౌస్ ఆందోళనకారుల వద్దకు వచ్చి చర్చించారు. తరచూ బ్రేక్ డౌన్ అవుతుండడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోందని రైతులు తెలిపారు. పగలు 3 గంటలు, రాత్రి పూట 4 గంటలు చొప్పున వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు చెప్పినా.. అరగంటకొకసారి సరఫరా ఆగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటర్లు పని చేయక.. పంటలకు నీరందక కళ్లెదుటే ఎండిపోతున్నాయని మండిపడ్డారు. లైన్మెన్ లేకపోవడంతో విద్యుత్ సమస్యలపై స్పందించేవారే కరువయ్యారన్నారు. స్థానిక సిబ్బంది ఏదైనా సమస్య వస్తే ప్రైవేటు వ్యక్తులను పంపుతారని, వారేమో రూ.500 నుంచి రూ.1000 వరకు డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. సమస్య తలెత్తిన ప్రతిసారీ రూ.వందల్లో డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడినుంచి తేవాలని ప్రశ్నించారు. వ్యవసాయ మోటర్లకు 9 గంటలు పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, లైన్మెన్ను నియమించాలని డిమాండ్ చేశారు. కేటాయింపు మేరకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపడతామని ఏడీ, ఏఈ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. విద్యుత్ సరఫరా అంతరాయంపై మరుట్ల కాలనీల రైతుల కన్నెర్ర విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి.. అక్కడే వంటావార్పుతో నిరసన నాణ్యమైన విద్యుత్ అందించాలని రైతుల డిమాండ్ -
పక్కా ప్రణాళికతోనే డీఎస్సీ స్కామ్
ఉరవకొండ: చంద్రబాబు ప్రభుత్వం పక్కా ప్రణాళికతోనే డీఎస్సీలో స్కామ్ చేసిందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలతో అర్హత ఉన్న ఎంతో మంది నిరుద్యోగులు టీచర్ పోస్టులను కోల్పోయారన్నారు. తమ పార్టీ నేతలతో పాటు లక్షలాది మంది యువత ఇదే విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి డీఎస్సీ నిర్వహణలో కీలక బాధ్యతలను అప్పగించగా, ఆయనకే ప్రథమ ర్యాంకు వచ్చిందని తెలిపారు. నిబంధనలు తుంగలో తొక్కి స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి మూడు శాతానికి పెంచారని ధ్వజమెత్తారు. సర్వీస్ రూల్స్ సవరించి క్రీడల్లో పాల్గొన్న వారు పోటీ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదనే జీఓ తెచ్చి అనేక మందికి పోస్టులను కట్టబెట్టారని దుయ్యబట్టారు. 29 రకాల ఆటలను 64కు పెంచి చివరికి పేకాట, టగ్ఆఫ్ వార్‌ను సైతం క్రీడలుగా ప్రకటించి ఉద్యోగాలను కట్టబెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. నీట్ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విధంగానే మంత్రి లోకేష్ డీఎస్సీ అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై యువత, విద్యార్థులు ధర్మ యుద్ధానికి సిద్ధం కావాలని, జంతర్ మంతర్ వద్ద కాక్రోజ్ జనతా పార్టీ తరహాలోనే ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేష్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నవీన్‌కుమార్ రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్‌రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు సాకే పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
స్వాములకే శఠగోపం
● ఆలయ ఆదాయం మాయం ● కీలక అధికారి తీరుపై అనుమానాలు ● గూగూడు జంట దేవాలయాల్లో దుస్థితి నార్పల : దేవదాయ శాఖలో అవినీతి రాజ్యమేలు తోంది. ఆలయ ఆదాయానికే కన్నం వేస్తున్నారు. స్వాములకే శఠగోపం పెడుతున్నారు. గూగూడులోని ప్రసిద్ధ కుళ్లాయిస్వామి– ఆంజనేయస్వామి జంట ఆలయాల్లో జరుగుతున్న గోల్మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. మొహర్రం ఉత్సవాలకు గూగూడు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ కుళ్లాయిస్వామితో పాటు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. గత ఏడాది మొహర్రం ఉత్సవాల సమయంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపు వ్యవహారం గందరగోళానికి దారితీసింది. రెండు ఆలయాల్లోని హుండీల కానుకలను లెక్కించినట్లు అప్పటి ఆలయ కీలక అధికారి తెలిపారు. అయితే సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాలకు.. అధికారి మాటలకు పొంతన కుదరడం లేదు. ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన రెండు కానుకల సంచులు, ఒక హుండీ మాత్రమే కనిపిస్తున్నాయి. కుళ్లాయిస్వామి ఆలయంలోని పసుపురంగు హుండీ బరువుగా ఉందని కానుకలను ఒక సంచిలోకి వేసుకొచ్చి లెక్కించినట్లు చెబుతున్నట్లుగా అక్కడ లేదు. కుళ్లాయిస్వామి ఆలయం నుంచి బయటకు వచ్చిన కానుకల సంచి.. లెక్కింపు ప్రదేశంలో కనిపించకపోవడాన్ని గమనిస్తే ఆ సంచి మిస్సింగ్ అయినట్లు స్పష్టమవుతోంది. బ్యాంకు ఖాతాలకూ కన్నమే! భక్తుల కానుకలతో పాటు స్వామివారి బ్యాంకు ఖాతాలకూ కన్నం పడుతోంది. గూగూడు కుళ్లాయిస్వామి ఆలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కాంట్రాక్టర్ ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు. కానీ గడిచిన మూడేళ్లుగా తద్విరుద్ధంగా జరుగుతోంది. ఆలయ కీలక అధికారి చేతివాటమే ఇందుకు కారణం. ఉద్యోగుల పేరు మీద లక్షలాది రూపాయలు డ్రా చేశారు. ఇక ఆంజనేయస్వామి ఆలయ బ్యాంక్ ఖాతా నుంచి ఏ విధమైన పనులకూ నగదు డ్రా చేయరాదు. కానీ ఈ అంకౌట్ నుంచి కూడా రూ.లక్షల్లోనే యథేచ్ఛగా డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జంట దేవాలయాల కానుకలు, డబ్బుకు పటిష్ట భద్రత కల్పించాలని, ఇప్పటి వరకు జరిగిన గోల్మాల్ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
అమ్మపాలు అమృతమే
7వ తేదీ వరకూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ‘అమ్మ’ అనే పదంలోనే ఆప్యాయత, అనురాగం వంటి సుగుణాలు మిళితమై ఉన్నాయి. అలాంటి అమ్మ పాలు బిడ్డకు జీవామృతమే అంటే అతిశయోక్తి కాదు. తల్లి పాలపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించడం కోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ వరకూ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ● శిశువు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు పట్టించడం శ్రేష్ఠం ● ముర్రుపాలతో వ్యాధి నిరోధక శక్తి పెంపు రాయదుర్గంటౌన్: తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం వల్ల శిశువుకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలతో బిడ్డ పుట్టిన రెండు,మూడు రోజుల వరకూ తల్లిపాలు ఇవ్వడం లేదు. పట్టణాల్లో నివసించే వారు పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి బిడ్డకు పాలివ్వడం లేదు. దీంతో బిడ్డలతో పాటు తాము కూడా నష్టపోతున్నామనే విషయాన్ని తల్లులు గ్రహించలేకపోతున్నారు. దేశంలో ప్రతి ఏడాది నీళ్ల విరేచనాలు, నిమోనియా వంటి జబ్బులతో లక్ష మంది ఏడాది లోపు శిశువులు మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం ద్వారా నెలలోపు శిశువుల్లో సంభవిస్తున్న మరణాలను 50 శాతం వరకూ తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ పేర్కొంటున్నాయి. మొదటి ఆరు నెలలు ఎటువంటి డబ్బా పాలు పట్టించకుండా, తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. సాధారణ ప్రసవమైతే పుట్టిన అరగంటలోపు తల్లిపాలు పట్టించాలి. సిజేరియన్ అయితే నాలుగు గంటల లోపు ఇవ్వాలి. సందర్భం ఉపయోగాలిలా.. తల్లిపాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మెదడు ఎదుగుదలతో జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి. తల్లిపాలలో సహజిసిద్ధమైన ప్రోటీన్లు, లాక్టొఫెరిన్, కోలోస్ట్రమ్, కొన్ని కీలకమైన హార్మోన్లు, రోగ నిరోధక బ్యాక్టీరియా ఉంటాయి. పసిబిడ్డకు ప్రధాన శత్రువు చలి. బిడ్డను ఒడిలో ఉంచుకుని పాలివ్వడం ద్వారా తల్లి శరీరం నుంచి శిశువుకు అవసరమైన వేడి అందుతుంది. తల్లీబిడ్డ మధ్య అనుబంధం పెరుగుతుంది. బిడ్డకు పాలిచ్చే మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బుల నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది. అపోహలు మానుకోవాలి మర్రుపాలపై నేటికీ చాలా అపోహలు ఉన్నాయి. పుట్టిన అరంగంటలోపు బిడ్డకు ముర్రుపాలు పట్టిస్తే ఆరోగ్యం పంచినట్లే అవుతుంది. శిశుమరణాలు కూడా తగ్గుతాయి. తల్లిపాలు తాగిన పిల్లలు చురుగ్గా ఉంటారు. బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. – మెర్సీ జ్ఞానసుధ, సూపరింటెండెంట్, రాయదుర్గం ఏరియా ఆస్పత్రి మొదటి వ్యాధి నిరోధక టీకా బిడ్డ పుట్టిన అరగంటలోపు తల్లిపాలు ఇవ్వాలి. ఇది స్వయంగా బిడ్డకు తల్లి ఇచ్చే మొదటి వ్యాధి నిరోధక టీకా అవుతుంది. తర్వాత ఆరు నెలలు నిండే వరకూ కేవలం తల్లిపాలే పట్టించాలి. ఎండాకాలమైనా సరే నీరివ్వాల్సిన అవసరం లేదు. అంగన్వాడీలో ఇచ్చే పోషణ్ కిట్స్తోపాటు ఇతర మృదువైన, సులువుగా జీర్ణమయ్యే పదార్థాలు సమయానుసారంగా పెంచాలి. – బి.లక్ష్మీప్రసన్న, సీడీపీఓ, రాయదుర్గం -
పోలీసులు జేసీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు: పెద్దారెడ్డి
సాక్షి, అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డైరక్షన్ లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడి.. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ నేత హనుమంతరెడ్డిని కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు.టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి.. 24 మంది వైఎస్సార్సీపీ నేతలను అంతం చేస్తామని హిట్ లిస్ట్ ప్రకటించి.. దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దురదృష్టకరమన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత పోలీసులకు లేదా? అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. జేసీ అస్మిత్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ఆగడాలు శృతిమించాయని.. పోలీసులు జేసీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పిల్లల ప్రాణాలు పోలేదుగా.. చిన్న గీతే కదా! వార్డెన్ సమాధానం
ఆంధ్రప్రదేశ్, విడపనకల్లు: అనంతపురం జిల్లా విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్లో దారుణ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు గ్రామానికి చెందిన చాకలి సుంకన్న కుమార్తె సుస్మిత, మహబూబ్ బాష కుమార్తె సోఫియా స్థానిక ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.ఏమైందో ఏమో కానీ అదే హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్న మరో విద్యార్థిని గురువారం రాత్రి పడుకున్న సమయంలో బ్లేడుతో సుస్మిత, సోఫియాల గొంతు కోయడానికి ప్రయత్నించింది. బ్లేడు సరిగా తెగకపోవడంతో ఇద్దరికి గొంతు కింద స్వల్ప గాయమైంది. గొంతు కోసిన విద్యార్థినిని వెంటనే హాస్టల్ నుంచి ఇంటికి పంపించేశారు. గాయపడిన విద్యార్థినులను కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు. వార్డెన్ కనీసం తల్లిదండ్రులకు కూడా తెలపలేదు.విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శుక్రవారం మోడల్ స్కూల్‌కు చేరుకుని ప్రిన్సిపాల్, వార్డెన్లపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తమ పిల్లలకు ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. తమ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ వార్డెన్ నల్లమ్మను నిలదీశారు. ఇందుకు వార్డెన్.. ‘మీ పిల్లల ప్రాణాలు పోలేదు కదా ఏదో చిన్న గీత పడిందంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. -
హత్య కేసు ఛేదింపు
● నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కళ్యాణదుర్గం రూరల్: వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. అరెస్ట్ వివరాలను డీఎస్పీ రవిబాబు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కళ్యాణదుర్గంలోని వడ్డే కాలనీకి చెందిన రఘు అనే యువకుడు జల్సాలకు అలవాటుపడి అప్పులు చేశాడు. వాటిని తీర్చడం కోసం కాలనీలోనే నివాసముంటున్న ఈడిగ లక్ష్మిదేవి అనే వృద్దురాలిని జూన్ 30న పట్టపగలే హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం కొల్లాపురం గుడివద్ద ఉన్న నిందితుడు రఘును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి 2.6 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు విద్యార్థినుల గొంతు కోసేందుకు యత్నం ● తోటి విద్యార్థిని ఘాతుకం ● విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్లో దారుణం విడపనకల్లు: విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్లో దారుణ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు గ్రామానికి చెందిన చాకలి సుంకన్న కుమార్తె సుస్మిత, మహబూబ్ బాష కుమార్తె సోఫియా స్థానిక మోడల్ స్కూల్లో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఏమైందో ఏమో కానీ అదే హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్న మరో విద్యార్థిని గురువారం రాత్రి పడుకున్న సమయంలో బ్లేడుతో సుస్మిత, సోఫియాల గొంతు కోయడానికి ప్రయత్నించింది. బ్లేడు సరిగా తెగకపోవడంతో ఇద్దరికి గొంతు కింద స్వల్ప గాయమైంది. గొంతు కోసిన విద్యార్థినిని వెంటనే హాస్టల్ నుంచి ఇంటికి పంపించేశారు. గాయపడిన విద్యార్థినులను కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు. వార్డెన్ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా తెలపలేదు. ఇతరుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శుక్రవారం మోడల్ స్కూల్‌కు చేరుకుని ప్రిన్సిపాల్, వార్డెన్లపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తమ పిల్లలకు ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. తమ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ వార్డెన్ నల్లమ్మపై మండిపడ్డారు. ఇందుకు వార్డెన్.. ‘మీ పిల్లల ప్రాణాలు పోలేదు కదా! ఏదో చిన్న గీత పడింద’ంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. బ్లేడుతో కోయడంతో విద్యార్థినుల గొంతు కింద పడిన గాటు -
వైభవంగా రథోత్సవం
విడపనకల్లు: గడేకల్లులో ప్రసిద్ధ భీమలింగేశ్వరస్వామి రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. సాయంత్రం స్వామివారి ప్రతిమను అందంగా అలంకరించిన రథంలో కొలువుదీర్చారు. హరహర మహాదేవ అంటూ భక్తులు రథాన్ని లాగారు. ప్రధాన వీధుల గుండా రథం ముందుకు సాగింది. భీమలింగేశ్వరున్ని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఏపీతో పాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గడేకల్లు కిక్కిరిసిపోయింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రజాప్రతినిధి అందుకు విరుద్ధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని తన సంస్థకు ఆదాయం తెచ్చిపెట్టేందుకు పాటుపడుతున్నారు. ఏకంగా ప్రకృతి సంపదపై కన్నేశారు. అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాల
కళ్యాణదుర్గం : ప్రకృతి సంపద యథేచ్ఛగా దోపిడీకి గురవుతోంది. అధికార పార్టీకి చెందిన వారే కొల్లగొడుతుండటంతో అధికారులు కూడా మిన్నకుండిపోతున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు ఎస్ఆర్సీ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఈ కంపెనీ ఇటీవల కంబదూరు మండలంలో పదుల సంఖ్యలో గాలిమరలు ఏర్పాటు చేస్తోంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బీటీపీ కాలువ పనులను సైతం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆయా పనులకు కాంక్రీట్ అవసరముంది. ఇందుకు అవసరమైన కంకర, ఇసుక సులభంగా లభించే కంబదూరు మండలంలోని రాళ్ల అనంతపురం గ్రామాన్ని ఎంచుకుంది. ఇక్కడ ఒక మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. రాళ్ల అనంతపురం సమీపంలోని పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి జేసీబీతో ఇసుక తవ్వకాలు చేపట్టింది. నాలుగైదు ట్రాక్టర్ల ద్వారా ప్లాంట్ వద్దకు ఇసుకను భారీగా డంప్ చేస్తోంది. మార్కెట్లో టన్ను ఇసుక ధర రూ.1800 నుంచి రూ.2000 వరకు పలుకుతోంది. సివిల్ వర్క్‌లు, ఇతర ప్రాంతాల్లోని పనుల కోసం ప్లాంట్ వద్ద నుంచి రోజూ సగటున 20 నుంచి 30 టిప్పర్ల ఇసుక అక్రమంగా తరలుతోంది. టిప్పర్ (టస్కర్)లో 15 నుంచి 20 టన్నుల ఇసుక పడుతుంది. గడిచిన రెండేళ్లుగా ఇసుక రూపంలోనే కోట్లాది రూపాయలు ఎస్ఆర్సీ సొమ్ము చేసుకుంటోంది. ఇక కాంక్రీట్‌కు అవసరమైన కంకరను కూడా దేవేంద్రపురం తండా వద్దనున్న క్రషర్ నుంచి సరఫరా చేసుకుంటోంది. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అట్టడుగుకుపోతున్నాయని, నీటి ఎద్దడి ఏర్పడుతుందని ప్రశ్నించిన రాళ్ల అనంతపురం గ్రామ ప్రజలను, వైఎస్సార్సీపీ నాయకులను అమిలినేని అనుచరులు తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారు. తమకెదురు తిరిగితే అక్రమ కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయాలన్నీ అధికారులకు తెలిసినా ఏమీ తెలియదన్నట్లుగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రీచ్ కోసం పట్టు! ఇసుక అక్రమ తవ్వకాలు.. రవాణాతో రూ.కోట్లు వెనకేసుకున్న అమిలినేని.. సంస్థ అవసరాల కోసం కంబదూరు మండలంలోని పెన్నా నది పరివాహక ప్రాంతాలైన నూతిమడుగు, రాళ్ల అనంతపురం, చెన్నంపల్లి, గూళ్యం పరిసర ప్రాంతాల్లో ఇసుక రీచ్ ఏర్పాటు చేసుకునేందుకు మైనింగ్, రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇసుక రీచ్‌లు నడుస్తున్నాయి. కానీ ఒక ప్రైవేట్ సంస్థ రీచ్ కోసం పట్టు పడుతుండటం గమనార్హం. డంప్‌కు అనుమతులు లేవు ఎస్ఆర్సీ సంస్థ తన పనులకు ఇసుక అవసరముందని లేఖ పెట్టింది. ఇందుకోసం ఇసుక రీచ్‌కు దరఖాస్తు చేసుకుంది. దీనిపై పరిశీలన చేస్తున్నాం. ఇక మిక్సింగ్ ప్లాంట్ వద్ద అక్రమంగా ఇసుక డంప్ చేసి ఉంటే చర్యలు తీసుకుంటాం. ఇసుక డంప్ చేయడానికి అనుమతులు లేవు. – ఆదినారాయణ, డిప్యూటీ డైరెక్టర్, మైనింగ్ అండ్ జియాలజి, అనంతపురం పట్టపగలే యథేచ్ఛగా తవ్వకాలు రెండేళ్లలో రూ.కోట్ల ఇసుక అక్రమ రవాణా రాళ్ల అనంతపురం వద్ద భారీగా ఇసుక డంప్ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, బెదిరింపులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు


