శభాష్ విష్ణు భగవాన్
యాడికి: మండలంలో పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న విష్ణు భగవాన్ 22 ఏళ్లుగా నాణేలను సేకరిస్తూ అందరి మన్ననలనూ పొందుతున్నారు. దక్షిణ భారతదేశంలో విజయనగర రాజుల పాలన అప్రతిహతంగా సాగింది. తుంగభద్ర నదీ తీరాన సంగమ, సాళువ, తుళువ, ఆరవీడు రాజ వంశాలు పాలించాయి. తుళువ వంశస్తుడైన కృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది. విజయ నగర కాలంలో బంగారు నాణేలను చలామణి చేశారు. మొదటి హరిహర రాయలుగా బుక్కరాయలు, రెండో హరిహర రాయలుగా శ్రీకృష్ణ దేవరాయలు, చివరిగా చంద్రకోటను పాలించిన వెంకటపతిరాయలు బంగారు నాణేలను వినియోగించారు. ఈ అపురూపమైన బంగారు నాణేలను విష్ణు భవగాన్ ఎంతో కష్టపడి సేకరించారు. వివిధ పాఠశాలలు, కళాశాలల్లో పుర ప్రజలు, విద్యార్థులు కోసం ఉచితంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆదివారం మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఆనాడు కర్ణాటక రాష్ట్రంలో ఒక వైపు శివపార్వతులు, మరో వైపు ప్రతాప దేవరాయులు ఉన్న బంగారు నాణాన్ని యాడికిలో ప్రదర్శించారు.
22 ఏళ్లుగా నాణేల సేకరణ
ఉచిత ప్రదర్శనల ద్వారా ఆదర్శం
శభాష్ విష్ణు భగవాన్
శభాష్ విష్ణు భగవాన్
శభాష్ విష్ణు భగవాన్
శభాష్ విష్ణు భగవాన్


