ఇది డొల్ల బడ్జెట్
సంక్షేమం, అభివృద్ధి రెండూ లేని అప్పుల డొల్ల బడ్జెట్. అమరావతి నిర్మాణమే అన్ని సమస్యలకూ పరిష్కారమని రాష్ట్ర బడ్జెట్ తేల్చేయడం దారుణం. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు కేటాయింపులో మొండి చేయి చూపించారు. ప్రాజెక్ట్‌లు పూర్తి చేయకుండా.. నీళ్లు లేకుండా రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఎలా చేస్తారు? రాయలసీమలో కడప ఉక్కు, వెనకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ప్రస్తావనే లేదు.
– కేవీ రమణ, వెనుకబడిన ప్రాంతాల
అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు


