breaking news
Anantapur District News
-
ఘుమఘుమ.. కళకళ
కుందుర్పి: బెస్తరపల్లి సవారమ్మ జాతర సంబరం అంబరమంటింది. 96 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న జాతర కావడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. తొలిరోజు మంగళవారం జ్యోతుల మహోత్సవం నిర్వహించారు. రెండో రోజు బుధవారం జంతుబలి ఇచ్చారు. గ్రామంలో దాదాపు 1200 ఇళ్లు ఉన్నాయి. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లి ఉంటున్న వారు, బంధుమిత్రులు తరలిరావడంతో గ్రామం జన జాతరతో కళకళలాడింది. ప్రతి ఇంటా షామియానాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటా రెండు నుంచి మూడు పొట్టేళ్లతో మాంసాహార విందు ఏర్పాటు చేశారు. ఇందు కోసమే రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు చర్చించుకుంటున్నారు. ఏ ఇంట చూసినా మసాలా ఘుమఘుమలతో వంటకాలు నోరూరించాయి. ఇక సవారమ్మ ఆలయం వద్ద సంప్రదాయ నృత్యాలతో కళాకారులు అలరించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే బెస్తరపల్లి సవారమ్మ జాతర కనీవినీ ఎరుగని రీతిలో జరగడం చర్చనీయాంశమైంది. జాతరకు వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్యతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు హాజరై సవారమ్మ తల్లిని దర్శించుకున్నారు. విందు భోజనాలు ఆరగించి సంతోషంగా గడిపారు. జాతర సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. 96 ఏళ్ల తర్వాత బెస్తరపల్లిలో సవారమ్మ జాతర నాలుగు రాష్ట్రాల నుంచి బంధుమిత్రుల రాక -
టీడీపీ వర్గీయుల బాహాబాహీ
గుత్తి: స్థల వివాదంలో టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుని విధ్వంసానికి దారి తీసింది. బుధవారం ఉదయం గుత్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. గుత్తిలోని లచ్చానుపల్లి మార్గంలో నివాసముంటున్న టీడీపీ నేతగా చెలామణి అవుతున్న జీఆర్పీ కానిస్టేబుల్ వాసు, గుత్తిలో దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న కొంగనపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త గోవర్దన్ మధ్య కొంత కాలంగా స్థల వివాదం నడుస్తోంది. గుత్తి – అనంతపురం మార్గంలో ఉన్న సదరు స్థలాన్ని తాను కొనుగోలు చేశానంటూ వాసు హద్దులు ఏర్పాటు చేసుకుని చుట్టూ గోడ నిర్మించాడు. అయితే ఆ స్థలం తనదిగా గోవర్దన్ పేర్కొంటూ వాసు చర్యలను ఆక్షేపిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో స్థలంలో ఏర్పాటు చేసిన హద్దులను, గోడను ఓ వర్గం ధ్వంసం చేసింది. దీంతో వారిపై వాసు దాడికి ప్రయత్నించాడు. ఘటనపై పోలీసులకు గోవర్దన్ ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం దాదాపు 40 మంది వాసు ఇంటిపై రాళ్లు రువ్వి విధ్వంసానికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన వాసుపై కూడా దాడి చేయడంతో క్షతగాత్రుడు ఆస్పత్రిలో చేరాడు. వాసు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, వివాదానికి కారణమైన స్థలం ప్రభుత్వ పొరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో ఉందని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు టీడీపీ వర్గీయులు చేస్తున్న ప్రయత్నాలు సిగ్గు చేటని స్థానికులు మండిపడ్డారు. -
ఉరవకొండ టౌన్ బ్యాంకు డిపాజిట్‌దారులకు శుభవార్త
ఉరవకొండ: లిక్విడేటర్ ఉరవకొండ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు డిపాజిట్‌దారులకు రెండో విడత నగదు చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు కో–పరేటివ్ బ్యాంకు జిల్లా అధికారి అరుణకుమారి తెలిపారు. బుధవారం స్థానిక గాంధీచౌక్ వద్ద ఉన్న టౌన్‌బ్యాంకు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. టౌన్ బ్యాంకు పరిధిలో 4,811 మంది డిపాజిటర్లు ఉన్నారని వీరికి రూ 5,92,58,828 నగదు చెల్లించాల్సి ఉందన్నారు. తొలివిడతగా 1,110 మందికి రూ.4.20 కోట్ల డిపాజిట్లను చెల్లించినట్లు వివరించారు. ప్రస్తుతం రెండో విడతగా మిగిలిన 3,711 డిపాజిట్‌దారులకు రూ.1,72,27,983 చెల్లించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. డిపాజిట్ దారులు ఒరిజినల్ ఎఫ్డీ బాండ్లు, ఆధార్, పాస్ జిరాక్స్‌తో పాటు డిపాజిట్‌దారుడి ఇతర బ్యాంకులకు సంబందించిన ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను వెంటనే ఉరవకొండ కోఆపరేటివ్ బ్యాంక్‌లో అందజేయాలన్నారు. ఇంకా 3,665 మంది డిపాజిట్‌దారులు ఈకేవైసీ చేయించుకోలేదని, దీంతో వీరికి నగదు చెల్లింపుల్లో జాప్యం చోటు చేసుకుంటోందన్నారు. ఉత్కంఠగా ఫుట్‌బాల్ పోటీలు అనంతపురం కార్పొరేషన్: ఇన్స్పైర్ ఫుట్‌బాల్ పోటీలు అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో ఉత్కంఠగా సాగుతున్నాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టు 1–0 గోల్స్ తేడాతో ఫజల్ ఎఫ్‌సీ జట్టుపై గెలుపొందింది. నర్మదావ్యాలీ ఎఫ్‌సీ జట్టు 9–0 గోల్స్ తేడాతో ఆస్కార్ ఫౌండేషన్ జట్టుపై, టర్న్ ప్రో జట్టు 5–0 గోల్స్ తేడాతో లైఫ్ స్పోర్ట్స్ అకాడమీ జట్టుపై, ఫాల్కోన్ గర్ల్స్ 12–0 గోల్స్ తేడాతో నాందీ ఫౌండేషన్ జట్టుపై, యువ ఫౌండేషన్ జట్టు 6–0 గోల్స్ తేడాతో కెంప్ ఎఫ్‌సీ జట్టుపై గెలుపొందాయి. బెంగళూరు ఎఫ్‌సీ, పుదువయ్ యూనికార్న్ జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. వ్యక్తి దుర్మరణంగుత్తి రూరల్: లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన ముని (40), సూరి బుధవారం మొలకలపెంట గ్రామంలో జరిగిన ఊరు జాతరలో పాల్గొని అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. రజాపురం శివారులోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొంది. ముని అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సూరిని స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
మరీ ఇంత చిన్నకోడిగుడ్లా..?
అనంతపురం సిటీ: మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్లు పరిమాణం తగ్గి ఉండటాన్ని డీఈఓ ప్రసాద్‌బాబు గుర్తించారు. ‘డొక్క’లు ఎండబెట్టి.. నిధులు కొల్లగొట్టి’, ‘కోడిగుడ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ’ శీర్షికలతో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు డీఈఓ స్పందించారు. బుధవారం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. శింగనమల మండలం ఆకులేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోడిగుడ్లు, చిక్కీలను పరిశీలించారు. నిర్దేశించిన పరిమాణం కన్నా కోడిగుడ్లు చిన్నవిగా ఉండడాన్ని గమనించారు. వీటిని అప్పుడే ఎందుకు తిరస్కరించలేదంటూ హెచ్ఎంను ప్రశ్నించినట్లు తెలిసింది. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హెచ్ఎం, ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. నిబంధనల మేరకు సరుకులు సరఫరా లేకపోతే ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. గార్లదిన్నె మండలం లోలూరు ప్రాథమిక పాఠశాలలోనూ కోడిగుడ్లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
క్రిస్టియన్లపై దాడి అమానుషం
అనంతపురం టవర్‌క్లాక్: కూడేరు మండలం కొర్రకొడు గ్రామంలో సువార్త పరిచర్యకు వెళ్లిన క్రిష్టియన్ పెద్దలపై దాడి చేయడం అమానుషమని వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు అన్నారు. దాడిని ఖండిస్తూ బుధవారం అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం కొర్రకోడులో సువార్త పరిచర్యకు వెళ్లిన క్రిస్టియన్ మైనారిటీలపై అతి దారుణంగా దాడికి తెగబడ్డారని, బస్సుపై రాళ్లు రువ్వి, రాడ్లతో కొడుతూ పెట్రోల్ పోసి నిప్పు పెట్టడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు. ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదులో నిర్లక్ష్యం కనబరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ పోసి బస్సును తగల పెట్టడానికి చూసిన వారిపై బెయిల్‌బుల్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మతోన్మాద శక్తులకు అండగా నిలవకుండా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాలు తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, నాయకులు చిలకల థామస్ రాజ్‌కుమార్, రాజ్‌కుమార్, పుట్లూరు ప్రభాకర్, సతీష్, జావీద్, ఆదినారాయణ, దేవవరం, నూకల కమల్, సైఫుల్లాబేగ్, ఖాజా, దాదు, షమ్ము, షామీర్, మసూద్, అబ్బాస్, కేఎం బాషా, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు -
మామిడి పూతను నిలుపుకోవాలి
అనంతపురం అగ్రికల్చర్: కనిష్ట ఉష్ణోగ్రతలతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నందున పూత నిలబెట్టుకుంటే మామిడిలో మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందని రైతులకు ఉభయ జిల్లాల ఉద్యాన అధికారులు డి.ఉమాదేవి, జి.చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురం జిల్లాలో 15 వేల హెక్టార్లు, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో 20 వేల హెక్టార్లలో విస్తరించిన మామిడి తోటల పరిస్థితి ప్రస్తుతానికి ఆశాజనకంగానే ఉన్నాయన్నారు. అయితే మరీ శీతల వాతావరణ పరిస్థితులు ఉన్నందున కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. కీలకదశలో మంచు తీవ్రత కారణంగా పూత, పిందెకు నష్టంతో పాటు చీడపీడల వ్యాప్తి కూడా ఉండవచ్చన్నారు. ప్రస్తుతం పచ్చిపూత దశలో ఉన్న తోటల్లో అల్టర్నేరియా శిలీంధ్రం వల్ల పూత నల్లబారిపోతుందని, నివారణకు లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజమ్ + 2.5 గ్రాముల ఎం–45 కలిపి పిచికారీ చేయాలన్నారు. ఇంకా పూత కనిపించని తోటల్లో లీటర్ నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ + 1.5 గ్రాముల సల్ఫర్ కలిపి పిచికారీ చేయాలన్నారు. వారం లేదా పది రోజుల తర్వాత లీటర్ నీటికి 1.2 మి.లీ బూప్రోఫిజిన్ + 2 మి.లీ హెక్సాకొనజోల్ కలిపి పిచికారీ చేయాలన్నారు. దీని వల్ల బూడిద తెగులు, ఇతర రసం పీల్చు పురుగుల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతానికి నీటి తడులు పెద్దగా అవసరం లేదన్నారు. పిందె తర్వాత ఉష్ణ్రోగతలు పెరిగితే నీటి యాజమాన్యంపై దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. ఉద్యానశాఖ అధికారులు ఉమాదేవి, చంద్రశేఖర్ -
బండ బూతులు.. భౌతికదాడులు
● పారిశుధ్య కార్మికురాలిపై శానిటేషన్ ఏజెన్సీ దౌర్జన్యం అనంతపురం మెడికల్: సర్వజనాస్పత్రిలో ఓ పారిశుధ్య కార్మికురాలిపై శానిటేషన్ ఏజెన్సీ ప్రతినిధులు కర్కశంగా వ్యవహరించారు. కార్మికురాలిని బండబూతులు తిడుతూ.. భౌతికదాడులకు పాల్పడడం ద్వారా భయానక వాతావరణం సృష్టించారు. ఆస్పత్రి అధికారులు, పారిశుధ్య సిబ్బంది తెలిపిన మేరకు... విధుల నుంచి బలవంతంగా తొలగిస్తున్నారంటూ పద్మావతి అనే పారిశుధ్య కార్మికురాలు ఇటీవల ఆస్పత్రిలోనే ఆత్మహత్యాయత్నం చేశారు. కోలుకున్న అనంతరం తిరిగి విధులకు హాజరవుతున్నారు. బుధవారం సాయంత్రం ఆస్పత్రి ఆవరణలో పనిచేస్తున్న పద్మావతి వద్దకు శానిటేషన్ ఏజెన్సీ మేనేజర్ సాయి, హరి వచ్చి ‘మేము నిన్ను చచ్చిపోమన్నామా?’ అంటూ గద్దించారు. ఆ పక్కనే విధుల్లో ఉన్న మరో పారిశుధ్య కార్మికురాలు నల్లమ్మను చూస్తూ ‘మీదంతా ఎక్కువైంద’ని శానిటేషన్ సూపర్వైజర్ యశ్వంత్ నోరుపారేసుకున్నాడు. మాటామాటా పెరిగడంతో రెచ్చిపోయి నల్లమ్మపై భౌతికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. విషయం తెలుసుకున్న తోటి పారిశుధ్య కార్మికులు అక్కడకు చేరుకుని నల్లమ్మను క్యాజువాలిటీలో అడ్మిట్ చేశారు. బాధితురాలిని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి పరామర్శించారు. చంద్రబాబు మిత్రుడికి చెందిన పద్మావతి ఏజెన్సీ వారు కార్మికులపై ఇంత అరాచకాలకు పాల్పడుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్మికులకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. -
అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించే పశువులు, జీవాల సంతల్లో వస్తున్న ఆదాయానికి భారీగా గండిపడుతోంది. రుసుము రెట్టింపు చేశారు. అయినా క్రయవిక్రయాలు తగ్గిందేమీ లేదు. మరి ఆదాయం భారీగా పెరగాలి. కానీ రికార్డుల్లో రుసుము పెంచనప్పుడు ఎంత ఉందో అంతే స్థాయి
ప్రతి ఆదివారం జరిగే పశువులు, ఎద్దులు, గేదెల సంతలో రద్దీఅనంతపురం అగ్రికల్చర్: ప్రతి శని, ఆది వారాల్లో అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో పశువులు, జీవాల సంత నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి జీవాలను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో సర్కారు కొలువుతీరిన వెంటనే అంటే 2024 జూలై నుంచి మార్కెట్‌యార్డులో జరిగే పశువులు, జీవాల సంతల్లో రుసుం పెంచారు. దీంతో రైతులు, కాపర్లు, వ్యాపారులపై భారం పడింది. 2024 జూన్ వరకు ప్రతి శనివారం జరిగే గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంతలో క్రయ విక్రయాలు జరిగే ప్రతి జీవానికి రూ.30 చొప్పున వసూలు చేస్తుండగా, దాన్ని రూ.50కు పెంచేశారు. ఆదివారం జరిగే పశువులు, ఎద్దులు, గేదెల సంతలో ఒక్కో దానికి రూ.100 ఉండగా దాన్ని ఏకంగా రూ.200 చేసేశారు. కానీ వసూళ్లకు వచ్చే సరికి గతంతో పోల్చినప్పుడు తేడా కనిపించడం లేదు. పాలకవర్గం నియమించకుండా జాప్యం చేయడంతో ‘సంతల్లో సడేమియా’ అన్న చందంగా ఆదాయం దారి మళ్లించేశారు. సాధారణ రుసుముతోనే పెరుగుదల.. ఏటా ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణించి సంతల్లో వచ్చిన వసూళ్లు లెక్కిస్తారు. ఈ లెక్కన చూస్తే జీవాలకు రూ.30, పశువులకు రూ.100 ప్రకారం పాత రుసుం పరిగణనలోకి తీసుకుంటే 2021–22లో శనివారం జరిగే జీవాల సంత నుంచి రూ.85.87 లక్షలు వసూలు కాగా.. ఆదివారం జరిగే పశువుల సంత ద్వారా రూ.59.20 లక్షలు సమకూరింది. అలాగే 2022–23లో జీవాల సంతల నుంచి ఏకంగా రూ.98.74 లక్షలు కాగా.. పశువుల సంత ఆదాయం రూ.41.68 లక్షలు వచ్చింది. పశువుల సంతలో ఆదాయం తగ్గడానికి కారణం జిల్లా వ్యాప్తంగా లంపీస్కిన్ డిసీసెస్ (ముద్ద చర్మవ్యాధి) ప్రబలడంతో అక్టోబర్ నుంచి జనవరి నెలాఖరు వరకు పశువుల సంతను పూర్తిగా బంద్ చేయడమే. ఇక 2023–24లో జీవాల సంతల నుంచి ఏకంగా రూ.1.05 కోట్లు వసూలు కాగా.. పశువుల సంత నుంచి రూ.91.01 లక్షల ఆదాయం వచ్చింది. ఇలా గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో అనంతపురం మార్కెట్ యార్డు చైర్మన్‌గా ఏకేఎస్ ఫయాజ్ ఉన్న కాలంలో వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. రెట్టింపు రుసుముతో ఆదాయం పెరగదా..? చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మార్కెట్ రుసుము బాగా పెంచారు. పశువుల సంతలో రూ.100 నుంచి రూ.200కు రెట్టింపు చేయగా, జీవాల సంతలో కూడా రూ.30 నుంచి రూ.50కు పెంచారు. ఈ లెక్కన ఆదాయం రెట్టింపు రావాలి. అలా కాకున్నా గతంలో కన్నా కనీసం 50 శాతం పెంపు తప్పనిసరిగా ఉండాలి. వాస్తవ పరిస్థితి చూస్తే... ‘నాడు–నేడు’ వసూళ్లకు తేడా కనిపించడం లేదంటే సొమ్ము పక్కదారి పడుతోందని పక్కాగా అర్థమవుతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జీవాల సంత ద్వారా రూ.1.14 కోట్లు, పశువుల సంత ద్వారా రూ.92 లక్షలు వసూలైంది. మార్కెట్ రుసుము మామూలుగా ఉన్న 2023–24లో రెండు సంతల ద్వారా రూ.1.96 కోట్లు వసూలు కాగా.. రుసుము పెంచిన తర్వాత 2024–25లో రెండింటి ద్వారా రూ.2.06 కోట్లు వసూలవడం గమనార్హం. ‘నాడు–నేడు’ మధ్య రూ.10 లక్షలు మాత్రమే తేడా కనిపిస్తోంది. ఇక ఈ ఏడాది (2025–26)లో కూడా రూ.2 కోట్లకు కాస్త అటు ఇటుగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ● చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన 20 నెలల తర్వాత అనంతపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏర్పాటవుతోంది. మరి ఈ నూతన కమిటీ సభ్యులయినా రుసుము వసూళ్లు, సంస్థ ఆదాయంపై దృష్టి సారిస్తారా.. లేదంటే సొమ్ము దారి మళ్లింపును కొనసాగిస్తారా అనేది వేచిచూడాలి. పెంచిన రుసుంతో సంతలో వసూలు చేస్తున్న మార్కెట్‌యార్డు ఉద్యోగులు (ఫైల్) పశువులు, జీవాల సంతల ఆదాయానికి భారీగా గండి చంద్రబాబు సర్కారు కొలువుదీరగానే రుసుము పెంపు మార్కెట్‌యార్డుకు మాత్రం ఆ స్థాయి ఆదాయం కనిపించని పరిస్థితి -
తప్పుడు కేసులు ఎత్తేయకపోతే ఆందోళనలు ఉధృతం
●విద్యార్థి సంఘాల నేతల హెచ్చరిక అనంతపురం సిటీ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ విశాఖపట్నంలో ఉద్యమించిన విద్యార్థి సంఘాల నాయకులపై తప్పుడు కేసులు బనాయించి, రౌడీషీట్ ఓపెన్ చేయడం దుర్మార్గమని, తక్షణమే తప్పుడు కేసులను ఎత్తేయకపోతే ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చంద్రబాబు సర్కార్‌ను విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. అనంతపురంలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోట్రేష్, ఎన్ఎస్యూవై రాష్ట్ర సమన్వయకర్త నరేష్, ఏఐఎస్బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేంద్రప్రసాద్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యద్శి సురేష్‌యాదవ్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందన్నారు. నారా లోకేష్ రాసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ నియంతృత్వ ధోరణి వీడకపోతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాప్తాడులో చోరీరాప్తాడు రూరల్: మండల కేంద్రం రాప్తాడులో మంగళవారం రాత్రి ఓ ఇంట్లో దుండగులు చొరబడి బంగారు నగలు అపహరించారు. పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడులోని బ్రహ్మంగారి గుడి సమీపంలో నివాసముంటున్న బుల్లే ఉజ్జినప్ప, ఆదిలక్ష్మి దంపతులు, కుమారుడు ప్రకాష్‌తో కలిసి మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి తోటకు వెళ్లారు. రాత్రి 9.30 గంటలకు తల్లి, కుమారుడు ఇంటికి వచ్చారు. వెనుకవైపు కిటికి కడ్డీలు తొలిగించి ఉండడంతో అనుమానంగా వాకిలి తీశారు. అప్పటికే తీసి ఉన్న బీరువా తలుపులను గమనించి పరిశీలించారు. బంగారు నగలు కనిపించకపోడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం ఉదయం సీఐ శ్రీహర్ష ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీంను పిలిపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో వింత పోకడలు నెలకొన్నాయి. ఆర్ఎంగా బాధ్యతలు స్వీకరించిన ఓ మంత్రి గారి చెల్లెలు.. ఇప్పటి వరకూ అనంతపురం రీజియన్ కార్యాలయంలోకి అడుగు కూడా పెట్టలేదు. తన సోదరుడి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రీజయన్ మేనేజర్‌గా బాధ్యతలను ఆమె విజ
అనంతపురం క్రైం: అతి పెద్ద రవాణా సంస్థగా గుర్తింపు పొందిన ఆర్టీసీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దిక్కూమొక్కు లేనిదైంది. సర్కారు అనాలోచిత నిర్ణయాలతో సమస్యలు పరిష్కారం కాక సంస్థ ఉద్యోగులు సతమమవుతున్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సీ్త్రశక్తి పేరుతో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించామంటూ గొప్పలకు పోతున్న ప్రభుత్వ పెద్దలు సగటు ప్రయాణికుడి ఇబ్బందులు పట్టించుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిపోల్లోనే ఆగిపోతున్న బస్సులు ఇప్పటికే అనంతపురం నుంచి హైదరాబాదుకు వెళ్లాల్సిన లాంగ్ సర్వీసు బస్సును గుత్తి డిపోకు బదిలీ చేసి ఆర్ఎం శ్రీలక్ష్మి చేతులు దులుపుకుంటే ఆ బస్సు డిపోకు మాత్రమే పరిమితం చేసి మేనేజరు పూర్తిగా తప్పుకున్నారు. తాజాగా నగరం నడిబొడ్డున ఆర్టీసీ బస్సు ఆగిపోతే దానిని వర్క్‌షాప్‌నకు తరలించేందుకు కొన్ని గంటల పాటు మెకానిక్‌లు శ్రమించాల్సి వచ్చింది. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకునే అధికారి లేకపోవడం, ఉన్నవారికి అనుభవం లేకపోవడంతో డిపోల్లోనే బస్సులు ఆగిపోతున్నాయి. దీనికి తోడు రూ.10 ఖర్చు పెట్టాల్సిన చోట రూ.100 ఖర్చు చేయాల్సి రావడంతో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమవుతోంది. సెలవులో లేరు.. విధులకు రారు అనంతపురం ఆర్టీసీ రీజియన్ మేనేజర్‌గా విజయలక్ష్మి గత నెల 29న బాధ్యతలు స్వీకరించారు. అయితే ఎన్నడూ లేని విధంగా అనంతపురం నుంచి విజయవాడకు ఫైలు తెప్పించుకుని అక్కడే ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇదేమని ఆరా తీస్తే తాను ఓ మంత్రిగారికి చెల్లెలని తెలిపిందట. బాధ్యతలు స్వీకరించేదాకా అంతా బాగానే ఉన్నా.. ఇప్పటి వరకూ అనంతపురం రీజియన్ కార్యాలయంలోకి ఆమె కాలు కూడా మోపలేదు. అయితే ఆమె సెలవులో ఉన్నారనుకుంటే అది కూడా పొరబాటేనని ఉద్యోగులు అంటున్నారు. కనీసం ఇన్‌చార్జ్‌గాను ఎవరికీ బాధ్యతలు ఇవ్వలేదని దీంతో గతంలో ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తించిన డిప్యూటీ సీటీఎం శ్రీలక్ష్మినే అలాగే కొనసాగుతోంది. పూర్తి స్థాయి ఆర్ఎం ఎప్పుడొస్తారనే అంశంపై స్పష్టత లేదు. మంత్రి సోధరి అనే హోదానే ఆమెను ఇక్కడకు రాకుండా చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. ‘అనంత’ ఆర్టీసీలో వింత పోకడ విజయవాడలోనే అనంత ఆర్ఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వకపోయినా ఆర్ఎంగా కొనసాగుతున్న శ్రీలక్ష్మి సమస్యలు పరిష్కారం కాక ఉద్యోగుల సతమతం ఉరవకొండ అసిస్టెంట్ మేనేజర్‌కు గుత్తి, గుంతకల్లు డిపోల బాధ్యత అనంతపురం, తాడిపత్రి డిపోలకూ అసిస్టెంట్ డిపో మేనేజర్లే దిక్కు ఎక్కడికక్కడ డిపోల్లో ఆగిపోతున్న బస్సులు జోనల్ చైర్మన్‌కు పట్టని ఆర్టీసీ అభివృద్ధి సమస్యల సుడిగుండం అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఇన్‌చార్జ్‌ల పాలన ఎక్కువైంది. చివరకు జోనల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన పూల నాగరాజుకు సైతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆర్టీసీ అభివృద్ధిని ఆయన పూర్తిగా అటకెక్కించేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. తాడిపత్రి డిపో అసిస్టెంట్ మేనేజరు మురళీధర్‌కు అనంతపురం డిపో ఇన్చార్జ్ మేనేజర్‌గా అదనపు బాధ్యతలిచ్చారు. ఉరవకొండ డిపో అసిస్టెంట్ మేనేజర్‌కు గుత్తి, గుంతకల్లు డిపోల బాధ్యత అప్పగించారు. ఇన్‌చార్జ్‌ల ఏలుబడిలో సమస్యలు పరిష్కారం కాక ఉద్యోగులు సతమతమవుతున్నారు. -
జిల్లా అంతటా బుధవారం పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం కొనసాగుతోంది.తూర్పు నుంచి ఆగ్నేయం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు అనంతపురం అర్బన్: గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్‌డే) ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవం నిర్వహణపై ఇన్చార్జ్ కలెక్టర్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26న నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమ నిర్వహణకు అసిస్టెంట్ కలెక్టర్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తారన్నారు. ప్రొటోకాల్ ఏర్పాట్లను చేపట్టాలని ఆర్డీఓను ఆదేశించారు. జాతీయ సమైక్యత ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను అవార్డుల కోసం ఆయా శాఖల అధికారులు ఎంపిక చేయాలన్నారు. ఈ క్రమంలో వివాదాలకు, విమర్శలకు తావు లేకుండా చూసుకోవాలన్నారు. కలెక్టరేట్ నుంచి డీఆర్ఓ మలోల, ఏఎస్పీ రియాజ్‌బాషా, ఆర్డీఓ కేశవనాయుడు, డీఈఓ ప్రసాద్‌బాబు, సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప, డీఐపీఆర్ఓ బాలకొండయ్య, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, కో–ఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రీ–సర్వే వేగవంతం చేయాలి భూముల రీ–సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. రీ–సర్వే పీజీఆర్ఎస్, ఏపీ సేవా సర్వీస్, ఆర్ఓఆర్, జాతీయ రహదారులు, ప్రాజెక్టులకు భూసేకరణ, పౌర సరఫరాలు, తదితర అంశాలపై ఇన్చార్జ్ కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ నుంచి డీఆర్ఓ మలోలతో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే భూ రికార్డుల శాఖ ఏడీ రూప్లానాయక్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు తదిరులు పాల్గొన్నారు. -
ప్రజాప్రతినిధుల వైఫల్యంతోనే నీటి కష్టాలు
అనంతపురం సెంట్రల్: రిజర్వాయర్లలో పుష్కలంగా నీరున్నా ప్రజాప్రతినిధుల వైఫల్యం కారణంగానే శింగనమల నియోజకవర్గంలో అన్నదాతలకు నీటి కష్టాలు ఉత్పన్నమవుతున్నాయని, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శైలజానాథ్ మండిపడ్డారు. నియోజకవర్గ రైతులతో కలిసి బుధవారం అనంతపురంలోని హెచ్చెల్సీ ఎస్ఈ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హెచ్చెల్సీ కోటా పూర్తవుతున్నప్పటికీ నియోజకవర్గంలోని సుబ్బరాయసాగర్, పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి తదితర చెరువులకు చుక్కనీరు చేరదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరనున్న చెరువులతో పాటు గార్లదిన్నె మండల పరిధిలోని చెరువులకు కూడా ఇంత వరకూ నీటిని విడుదల చేయలేదన్నారు. ఈ విషయంపై అనేకసార్లు కలిసినా అధికారులు బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తుండటం బాధాకరమన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు రైతుల కష్టాలు ఏమాత్రమూ పట్టడం లేదని, నిండని చెరువులకు టెంకాయ కొట్టడం మాత్రమే వారికి తెలుసునని విమర్శించారు. రైతుల పక్షాన పోరాడుతాం ‘సుబ్బరాయసాగర్‌లో చెట్లు నరికివేస్తున్నారు. పలు చోట్ల అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. అందుకోసమే చెరువులకు నీరివ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఇకపై ఉపేక్షించేది లేదు. గడువులోగా నీరివ్వకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తాం’ అని శైలజానాథ్ స్పష్టం చేశారు. నీరివ్వాలని అడిగితే రాజకీయం చేస్తున్నారంటూ కొంతమంది నాయకులు విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల కోసం రాజకీయం చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. పుట్లూరు మండలంలో రైతులు పడుతున్న ఇబ్బందులను ఒక్కసారి వెళ్లి చూడాలని అధికారులకు సూచించారు. చెరువులను నింపకపోతే వేసవిలో బోర్లు పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే శింగనమల చెరువుకు జీఓ ప్రకారం 1 టీఎంసీ నిరు విడుదల చేసి నింపాలని కోరారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ నెల 16 వరకూ పంటలకు నీరిస్తామని, ఆ తర్వాత చెరువులకు విడుదల చేస్తామని హెచ్చెల్సీ ఎస్ఈ సుధాకర్‌రావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, జెడ్పీటీసీ నీలం భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు సత్యనారాయణరెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు బొమ్మన శ్రీరామిరెడ్డి, గోకుల్‌రెడ్డి, చామలూరు రాజగోపాల్, మండల కన్వీనర్లు యల్లారెడ్డి, పూలప్రసాద్, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు జె.అనిల్‌కుమార్‌రెడ్డి, ఖాదర్‌వలి, మహేశ్వరరెడ్డి, శివశంకర్, శ్రీనివాసులునాయక్, నాగేశ్వరరెడ్డి, లలితా కళ్యాణి, సర్పంచ్ పార్వతి, హుస్సేన్‌పీరా, నారాయణరెడ్డి, రమణయాదవ్, బయపరెడ్డి, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీరున్నా చెరువులను నింపకపోతే ఎలా..? అధికారులను నిలదీసిన మాజీ మంత్రి శైలజానాథ్ హెచ్చెల్సీ కార్యాలయం ముందు రైతులతో కలిసి ఆందోళన -
పొలంలో కొండచిలువ
పుట్లూరు: గరుగుచింతపల్లికి చెందిన వెంకటశివుడు అనే రైతు పొలంలో బుధవారం కొండ చిలువ కనిపించింది. ఇది దాదాపు 9 అడుగుల పొడవు ఉంది. రైతు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్.బి.జగన్నాథం, బీట్ ఆఫీసర్ ఎ.ఎస్.గయాజ్ ఆధ్వర్యంలో స్నేక్ క్యాచర్లు ఎస్.సురేష్, జే.సురేష్‌లు పొలంలోని కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు. డీవీఈఓగా గురవయ్యశెట్టి అనంతపురం సిటీ: జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి(డీవీఈఓ)గా ఎస్వీఎస్ గురవయ్య శెట్టి నియమితులయ్యారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న ఆయన్ను పదోన్నతిపై అనంతపురం డీవీఈఓగా నియమించారు. ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇన్చార్జ్ డీవీఈఓగా పని చేసిన వెంకటరమణ నాయక్ ఆర్‌ఐఓగా కొనసాగనున్నారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో చోటు అనంతపురం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు కల్పించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన కుమ్మర వంశీ యువజన విభాగం జిల్లా జనరల్ సెక్రటరీగా, రాయదుర్గానికి చెందిన గోనేహాళ్ వంశీ సోషల్ మీడియా విభాగం జిల్లా జనరల్ సెక్రటరీగా, హెచ్.మల్లికార్జున ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా, డి.చంద్రశేఖర్ రెడ్డి రాయదుర్గం మునిసిపల్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇంటి పన్ను చెల్లించిన వారికి మాత్రమే అనుమతి శింగనమల: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల వద్దకు వెళ్లాలన్నా నిబంధనలు అమలు చేస్తున్నారు. అందుకు నిదర్శనమే శింగనమల ఎంపీడీఓ కార్యాలయంలో అతికించిన నోటీసు. పనుల కోసం వచ్చే ప్రజలు 2025–26 సంవత్సరంలో ఇంటి పన్ను చెల్లించిన రశీదు జిరాక్స్ పత్రాన్ని తీసుకువస్తేనే లోనికి అనుమతి ఇస్తామని ఇన్చార్జ్ ఎంపీడీఓ భాస్కర్ కార్యాలయంలో నోటీసు అతికించారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇదెక్కడి చోద్యం అంటూ ప్రజలు విస్తుపోతున్నారు. -
నరిగమ్మ ఆలయం మార్పు తగదు
● శృంగేరి విరూపాక్షి మఠం పీఠాధిపతి విద్యానృసింహ భారతి మహాస్వామి రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం పాపంపేట శివారున కళ్యాణదుర్గం రోడ్డులో వెలిసిన మైసూరు నరిగిమ్మ ఆలయాన్ని అక్కడి నుంచి తరలించడం సబబు కాదని శృంగేరి విరూపాక్షి మఠం పీఠాధిపతి విద్యానృసింహ భారతి మహాస్వామి అన్నారు. మంగళవారం రాత్రి నరిగమ్మ ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. పలు హిందూ సంఘాల ప్రతినిధులు, వీహెచ్‌పీ, బీజేపీ నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శృంగేరి విరూపాక్షి మఠం పీఠాధిపతి విద్యా నృసింహ భారతి మహాస్వామి ప్రసంగిస్తూ.. దేవాలయాలు అంటే ఇటుకలు, రాళ్ల నిర్మాణాలు మాత్రమే కాదని, అవి ప్రజల ఆత్మవిశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. అనంతపురం ప్రాంతంలో శతాబ్దాలుగా ప్రజల విశ్వాసాలకు కేంద్రంగా నిలిచిన నరిగమ్మ అమ్మవారి గుడిని తరలించడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. భక్తుల అభిప్రాయాలు తెలుసుకోకుండా, గ్రామసభ నిర్వహించకుండా దేవాలయాన్ని తరలించడం ధర్మ విరుద్ధం, న్యాయ విరుద్ధం అన్నారు. ఇదే పరిస్థితి రేపు ఏ గ్రామంలోనైనా జరుగుతుందనే భయం ప్రజల్లో కలుగుతోందన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని ధర్మాన్ని, ప్రజల విశ్వాసాలను అణచివేసే అభివృద్ధి మాత్రం తమకొద్దని అన్నారు. ఇప్పటికై నా గుడి తరలింపు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ ఆలయ తరలింపు వ్యవహారంలో ప్రశ్నించేవారి గొంతు నొక్కుతున్నారన్నారు. కోర్టు తీర్పు కాదు ప్రజాతీర్పుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయ తరలింపును ఒప్పుకోబోమన్నారు. -
ప్రచార ఆర్భాటం.. రైతుకు శాపం
ఆత్మకూరు: టీడీపీ ప్రజాప్రతినిధుల ప్రచార ఆర్భాటం అన్నదాతలకు శాపంగా పరిణమించింది. ఇందుకు నిదర్శనమే ఆత్మకూరు మండలం గొరిదిండ్ల సబ్‌స్టేషన్ ప్రారంభం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చొరవతో శంకుస్థాపన చేసుకున్న ఈ సబ్ స్టేషన్‌ను నాలుగు నెలల క్రితం ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. ఇక్కడి వరకూ అంతాబాగానే ఉన్నా... సబ్ స్టేషన్ నుంచి నేటికీ విద్యుత్ సరఫరా కాకపోవడంతో పొరుగున ఉన్న మరో సబ్ స్టేషన్ నుంచి వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అదనపు లోడు కారణంగా లో ఓల్టేజీ సమస్య తలెత్తి ఎక్కడికక్కడ వ్యవసాయ బోరు బావుల మోటార్లు కాలిపోతున్నాయి. ప్రచార ఆర్భాటంతో గొరిదిండ్ల సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి తమను ఇక్కట్లు పాలు చేశారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజులోనే భారీ నష్టం గొరిదిండ్ల గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన సబ్‌స్టేషన్ ద్వారా గొరిదిండ్ల, గొరిదిండ్ల తండా, ముట్టాల, పాపంపల్లి గ్రామాల పరిధిలోని వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా కావాల్సి ఉంది. ఈ నాలుగు గ్రామాల రైతులకు సంబంధించి దాదాపు 1,500 వరకు విద్యుత్ మోటార్లు ఉన్నాయి. వీటికి ఆత్మకూరు విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్‌ను అధికారులు సరఫరా చేస్తున్నారు. అయితే ఆత్మకూరు నుంచి గొరిదిండ్ల వరకూ దాదాపు 3 వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు ఉండడంతో సబ్‌స్టేషన్‌పై అదనపు భారం పడి లో ఓల్టేజీ సమస్య ఉత్పన్నమవుతోంది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు పదుల సంఖ్యలో గొరిదిండ్ల గ్రామ రైతులు అర్జీలు ఇచ్చి, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. అయినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. లో ఓల్టేజ్ కారణంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి బోరు మోటార్లు కాలిపోతున్నాయి. ఒక్కసారి మోటారు కాలిపోతే దానిని మరమ్మతు చేయించుకునేందుకు రైతులు రూ.7 వేలకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 5న (సోమవారం) రాత్రి నుంచి మంగళవారం తెల్లవారేలోపు లో ఓల్టేజీ కారణంగా గొరిదిండ్ల, గొరిదిండ్ల తండా గ్రామాల రైతులకు చెందిన 70 మోటర్లు కాలిపోయాయి. కేవలం ఆరు గంటల వ్యవధిలోనే రూ.4.90 లక్షల నష్టాన్ని రైతులు మూట గట్టుకోవాల్సి వచ్చింది. నాలుగు నెలల క్రితం ప్రచార ఆర్భాటాలకు పోయి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పరిటాల సునీత... ఆ తర్వాత సదరు సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అవుతోందా? లేదా? అనే విషయంలో నిర్లక్ష్యం వహించారని, ఫలితంగా తాము ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు మండిపడుతున్నారు. సిబ్బంది లేరు గొరిదిండ్లలో నూతనంగా నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి నాలుగు నెలలైన మాట వాస్తవమే. అయితే సిబ్బంది కొరత కారణంగా సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా కావడం లేదు. ఆత్మకూరు నుంచి గొరిదిండ్ల తండా గ్రామానికి దూరం ఎక్కువ అయినందున లో ఓల్టేజ్ సమస్య తలెత్తుతోంది. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటాం. – దాస్, ఏఈ, విద్యుత్ శాఖ నాలుగు నెలల క్రితం గొరిదిండ్ల సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పరిటాల సునీత సాంకేతిక కారణాలతో సబ్‌స్టేషన్ నుంచి నేటికీ సరఫరా కాని విద్యుత్ మరో సబ్‌స్టేషన్‌పై అదనపు భారం లో ఓల్టేజీ కారణంగా ఒకే రోజు కాలిపోయిన 70కు పైగా వ్యవసాయ మోటార్లు మరమ్మతు చేసిన మోటారును బోరుబావిలోకి దింపుతున్న ఈ రైతు పేరు బాపు జయప్ప. గొరిదిండ్ల గ్రామం. ముగ్గురు అన్నదమ్ములకు కలిపి 12 ఎకరాల వరకూ పొలం ఉంది. గత రాత్రి విద్యుత్ లో ఓల్టేజీ సమస్య కారణంగా మూడు మోటార్లు కాలిపోయాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు ఆగమేఘాలపై మోటార్లును మరమ్మతు చేయించి మంగళవారం సాయంత్రానికి బోరు బావుల్లో ఏర్పాటు చేయించారు. -
జిల్లా అంతటా మంగళవారం పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం కొనసాగుతోంది. గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో ఆగ్నేయం దిశగా గాలి వీచింది.
పోలీసుల ఓవరాక్షన్ ● గ్రామ దేవరకు హాజరైన కేతిరెడ్డి పెద్దారెడ్డి ● ఊరి నుంచి వెళ్లిపోవాలంటూ సీఐ హుకుం ● నామనాంకపల్లిలో ఉద్రిక్తత తాడిపత్రిటౌన్: గ్రామ దేవరకు హాజరైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్ల పోలీసులు మరోమారు రెచ్చిపోయారు. శాంతిభద్రతల పేరుతో ఆయన్ను గ్రామం నుంచి వెళ్లిపోవాలంటే హుకుం జారీ చేశారు. పోలీసుల ఓవరాక్షన్ కారణంగా గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పెద్దపప్పూరు మండలం నామనాంకపల్లిలో మంగళవారం గ్రామ జాతర (దేవర)కు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హాజరయ్యారు. తొలుత పెద్దమ్మ ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పలువురు గ్రామస్తులు తేనీటి విందుకు ఆహ్వానించారు. ఈ క్రమంలో వారి ఇళ్ల వద్దకు వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఓ ఇంటి వద్ద కాఫీ తాగుతున్న సమయంలో సీఐ రామసుబ్బయ్య, ఎస్‌లు గౌస్, చంద్రశేఖర్‌రెడ్డి వచ్చి ‘శాంతిభద్రతలకు ఇబ్బంది అవుతుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ హుకుం జారీ చేశారు. అంతటితో ఆగక పెద్దారెడ్డి చేయి పట్టుకుని బలవంతంగా ఊరునుంచి పంపించేందుకు ప్రయత్నించారు. దీంతో సీఐ–పెద్దారెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నాయకులు కల్పించుకుని.. గ్రామదేవరకు రావడం కూడా తప్పేనా.. ఎందుకిలా ప్రతిసారీ రాద్ధాంతం చేస్తున్నారని పోలీసుల తీరును తప్పుపట్టారు. 15 వరకు ఆయకట్టుకు నీరు అనంతపురం సెంట్రల్: హెచ్చెల్సీ సౌత్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టుకు ఈ నెల 15 వరకు నీరివ్వాలని అధికారులు నిర్ణయించారు. మంగళవారం పలు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, సభ్యులతో హెచ్చెల్సీ అధికారులు సమావేశం నిర్వహించారు. 15వ తేదీ వరకు డిస్ట్రిబ్యూటరీలకు నీరిచ్చి, తర్వాత పూర్తిస్థాయిలో బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తర్వాత పుట్లూరు మండల పరిధిలో సుబ్బరాయసాగర్, దిగువన చెరువులకు నీటిని తీసుకుపోవాలని భావిస్తున్నారు. -
కోడిగుడ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ
● ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశం అనంతపురం సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన కోడిగుడ్ల కుంభకోణం నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణ చేపట్టాలని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై సోమవారం జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ నిర్వహించిన పరిశీలనలో అక్రమాలు వెలుగు చూశాయి. ముద్ద అన్నం.. తక్కువ మోతాదులో ఆకుకూరలు, కూరగాయలు వినియోగించిన చేసిన కూరలు, పరిమాణం తగ్గిపోయిన కోడిగుడ్లు, నిర్దేశించిన రోజుల్లో కోత విధిస్తూ సరఫరా చేసిన వైనం, చిక్కీల పరిమాణం కుదించడం వంటివి బయటపడ్డాయి. ఈ అంశంపై ‘డొక్క’లు ఎండబెట్టి.. నిధులు కొల్లగొట్టి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఇన్చార్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ్‌శర్మ స్పందించారు. కోడిగుడ్ల కుంభకోణంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ కోసం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునుడు, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి సహా మరో అధికారిణితో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు. శ్రీనందన ఎంటర్‌ప్రైజస్ దోపిడీ పర్వం అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,249 ప్రాథమిక, 63 ప్రాథమికోన్నత, 363 ఉన్నత పాఠశాలలతో పాటు 1,675 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు శ్రీనందన ఎంటర్ ప్రైజస్ అనే సంస్థ కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా చేస్తోంది. మొత్తం 3,55,418 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ఈ సంస్థ ఐసీడీఎస్‌లోని ఓ సీనియర్ ఉద్యోగికి చెందినదిగా తెలుస్తోంది. తను ప్రభుత్వోద్యోగి కావడంతో కుమారుడి పేరుతో ఈ సంస్థ నడుపుతున్నట్లు సమాచారం. ఈ సంస్థే జిల్లాలోని అన్ని అంగన్వాడీలకు కూడా కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా చేస్తోందని తెలిసింది. సదరు ఉద్యోగి ఈ ఒక్క జిల్లానే కాకుండా వేర్వేరు జిల్లాల్లో వేర్వేరు పేర్లతో, బినామీల పేర్లతో కాంట్రాక్ట్‌లు దక్కించుకొని అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఒక్కో ట్రిప్పులో ఒక్కో రంగు చొప్పున గుడ్ల మీద వేయాలి. అటువంటి పరిస్థితి లేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో గుడ్డుకు పావలా కమీషన్ ఒక గుడ్డు కనీసం 50 గ్రాముల పరిమాణంలో ఉండాలి. అయితే ఈ సంస్థ 25 నుంచి 30 గ్రాములు ఉన్న కోడిగుడ్లు మాత్రమే సరఫరా చేసి రూ.కోట్లు కొల్లగొడుతున్న తీరు విస్తుపోయేలా చేస్తోంది. విద్యాశాఖాధికారులకు గుడ్డుకు పావలా చొప్పున కమీషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో హెడ్మాస్టర్లు అన్నీ చూసుకోవాలి. సైజు తక్కువ ఉన్న కోడిగుడ్లు ఇస్తే వెనక్కు పంపాలి. అయితే అలా జరగడం లేదు. నెలకు ఒకట్రెండుసార్లు మాత్రమే స్టాకు ఇచ్చినా నిలదీయడం లేదు. ఇక మధ్యాహ్న భోజన పథకం తనిఖీ బాధ్యత ఎంఈఓ–2 చూడాలి. వారూ నోరెత్తరు. ఎందుకుంటే ఏదైనా ప్రశ్నిస్తే సదరు కాంట్రాక్టర్ ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు చేయిస్తున్నట్లు హెడ్మాస్టర్లు, ఎంఈఓల ద్వారా తెలిసింది. డీఈఓ కార్యాలయ అధికారులైతే హెడ్మాస్టర్లు, ఎంఈఓలపై సాకు నెట్టేస్తూ పబ్బం గడిపేస్తున్నారు. ప్రజలు, విద్యార్థులు ఫిర్యాదులు చేసినా బుట్టదాఖలే అవుతున్నాయి. పత్రికల్లో కథనాలు వచ్చిన రోజు హడావుడి చేస్తారు. అంతటితో మరచిపోతున్నారు. తాజాగా ముగ్గురు అధికారులతో కూడిన విచారణ కమిటీని ఇన్చార్జ్ కలెక్టర్ నియమించారు. ఈ కమిటీ అయినా నిష్పక్షపాతంగా విచారణ చేస్తుంగా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజాలు నిగ్గుతేల్చి అక్రమార్కులను శిక్షిస్తారా లేక రక్షిస్తారా అనే సందేహాలు అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో ఇదీ పరిస్థితి.. శ్రీసత్యసాయి జిల్లాలోనూ మధ్యాహ్న భోజన పథకం కాంట్రాక్టర్లకు భోజ్యంగా మారింది. ఇక్కడ 32 మండలాలు ఉండగా, హనుమాన్ ట్రేడర్స్‌కు 22 మండలాలు, శ్రీలక్ష్మీవెంకటేశ్వర ట్రేడర్స్‌కు 11 మండలాల కోడిగుడ్ల సరఫరా బాధ్యతలు అప్పగించారు. ఇక అన్ని మండలాలకూ చిక్కీల సరఫరా హనుమాన్ ట్రేడర్స్‌కే అప్పగించినట్లు సమాచారం. ఏ ఒక్క సంస్థ గానీ సక్రమంగా గుడ్లు, చిక్కీలు సరఫరా చేసిన దాఖలాల్లేవు. పట్టుమని ఒక నెల కూడా గుడ్లు, చిక్కీలు సరఫరా చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక విద్యా శాఖ అధికారులకు భారీగా కమీషన్లు అందడమేనని బలమైన ఆరోపణలు ఉన్నాయి. -
ఆటవిక రాజ్యానికి తెరతీసిన ‘కాలవ’
● మెట్టు గోవిందరెడ్డి రాయదుర్గం టౌన్: ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆటవిక, ఆరాచక పాలనకు తెరలేపారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి విమర్శించారు. అడ్డగోలుగా జరిగిన బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి మాయమని మచ్చగా నిలిచిందన్నారు. మంగళవారం సాయంత్రం రాయదుర్గంలోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దాడులు, నిర్బంధాలను సైతం తట్టుకుని పార్టీ పక్షాన నిలిచిన 8 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను అభినందించారు. ఎంపీపీ ఎన్నికల్లో నైతికంగా వైఎస్సార్సీపీదే విజయమన్నారు. ఎన్నిక తర్వాత అనంతపురానికి వెళుతున్న తన కాన్వయ్పై దేవగిరి క్రాస్ వద్ద టీడీపీ అల్లరి మూకలు రాళ్లతో దాడి చేశారని, ఇంతకన్నా ఆరాచక పాలన ఏముంటుందన్నారు. రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని ఓ ట్రాక్టర్ డ్రైవర్ వైఎస్ జగన్ పాటను పెట్టుకుంటే అక్కసుతో ఎల్బీ నగర్ వద్ద వరి లోడుతో వెళుతుండగా దాడి చేశారన్నారు. పోలీసులు అధికార పార్టీకి బహిరంగంగా మద్దతు తెలుపుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్చన్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల బీసీలను ఉద్దేశించి కాలవ శ్రీనివాసులు చులకనగా మాట్లాడడం అతని అహంకారానికి నిదర్శనమన్నారు. బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నిక రద్దు చేసేలా న్యాయం పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో కణేకల్లు మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డి, మురళీమోహన్‌రెడ్డి, రాయదుర్గం పట్టణ, రూరల్ కన్వీనర్లు మేకల శ్రీనివాసులు, రామాంజనేయులు, కె.రామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మల్లికార్జున పాల్గొన్నారు. -
ప్రజల విశ్వాసాలతో ఆటలాడొద్దు
● మైసూరు నరిగమ్మ ఆలయ తొలగింపు ఆపేయాలి ● రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్ రాప్తాడురూరల్: దేవాలయాలకు సంబంధించి ప్రజల విశ్వాసాలతో ఆటలాడరాదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేట శివారు కళ్యాణదుర్గం ప్రధాన రోడ్డులో వెలసిన మైసూరు నరిగమ్మ ఆలయ తొలగింపుపై చంద్రబాబు ప్రభుత్వం చర్యలను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ప్రకాష్‌రెడ్డిని ఆ ప్రాంతవాసులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షకుడినని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొంతు ఈ విషయంలో మూగబోయిందా? అని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత నిద్రపోతున్నారా? అని మండిపడ్డారు. నరిగమ్మ ఆలయం భక్తుల ఆరాధనకు కేంద్రంగా నిలిచిందన్నారు. అయితే ఈ ఆలయ తొలగింపునకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఆలయం తొలగింపునకు జరిగిన ప్రయత్నాలకు స్పష్టమైన బ్రేక్ పడిందని గుర్తు చేశారు. భక్తుల విశ్వాసాలు, ప్రజాభిప్రాయాల్ని గౌరవిస్తూ ఆలయ పరిరక్షణకు అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ ఆలయం తొలగింపునకు శ్రీకారం చుట్టారన్నారు. నరిగమ్మ ఆలయం కేవలం ఒక కట్టడం కాదని.. వేలాదిమంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని అభివర్ణించారు. ఇది సంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలకు కేంద్రబిందువని అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయాలపై చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమన్నారు. ఇప్పటికై నా ఆలయం తొలగింపునకు సంబంధించిన అన్ని చర్యలనూ తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేశారు. భక్తులు, గ్రామ ప్రజలు, స్థానిక సంఘాలతో సంపూర్ణ సంప్రదింపులు జరపాలన్నారు. ఆలయ పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన హామీ ప్రకటించాలన్నారు. -
ఏ ప్రభుత్వమైనా సరే పన్ను వసూళ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇలా ప్రజల నుంచి పన్ను రూపంలో వసూలు చేసిన మొత్తంతోనే అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తుంది. ఈ విషయంలో ఎవరు అలక్ష్యం చేసినా సహించే పరిస్థితి ఉండదు. కానీ రాయలసీమ మున్సిపల్ ప్రాంతాల్లో
అనంతపురం క్రైం: మున్సిపాలిటీల్లో పన్నుల వసూలు చతికిలపడింది. సకాలంలో వసూలు కాకపోవడంతో రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీ, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితి నెలకొంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి మొత్తం రూ.4,765.63 కోట్ల పన్ను వసూళ్లు లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటి వరకు 50 శాతం కూడా దాటకపోవడం గమనార్హం. జిల్లాలోని ఒక నగరపాలక సంస్థ, ఐదు మున్సిపాలిటీల పరిధిలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.135.82 కోట్ల పన్నుల వసూలు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 36.09 శాతంతో రూ.49.01 కోట్లు మాత్రమే వసూలైంది. మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది. ప్రజలపై పన్నుల భారం పెడుతూ, వసూళ్లలో అలసత్వం వహించిన పాలకుల వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పన్నుల వసూలు అధ్వానం అనంతపురం జిల్లాలోని స్థానిక సంస్థ (మున్సిపాలిటీ)ల్లో పన్నుల వసూళ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాలు పరిశీలిస్తే.. వసూళ్ల తీరు విస్తు గొలుపుతుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం డిమాండ్ రూ.135.83 కోట్లు ఉండగా, ఇప్పటివరకు వసూలైన మొత్తం రూ.49.02 కోట్లు మాత్రమే. అంటే ఆర్థిక సంవత్సరం ముగింపునకు మూడు నెలలే మిగిలి ఉన్నా, వసూళ్ల సాధన కేవలం 36.09 శాతానికే పరిమితం కావడం గమనార్హం. ఇది సాధారణ ఆలస్యం కాదు, వ్యవస్థాగత వైఫల్యానికి ప్రత్యేక నిదర్శనం. కళ్యాణదుర్గం.. మరీ అధ్వానంపన్నుల వసూళ్లలో జిల్లాలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చాలా అధ్వానంగా ఉంది. రూ.2.04 కోట్ల వసూళ్లతో చివరి స్థానంలో నిలిచింది. గుత్తి, రాయదుర్గం మున్సిపాలిటీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి.ఇవి అనంతపురం నగర పాలక సంస్థలోని చెత్త తరలింపు వాహనాలు. ఇంటింటి నుంచి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు చేర్చాల్సిన ఈ వాహనాలు గత డిసెంబర్ 16 నుంచి ఇలా నగరపాలక సంస్థ ముందే ఉండిపోయాయి. ఏమైందని ఆరా తీస్తే డీజిల్‌కు డబ్బులేదని తెలిసింది. దీంతో కాలువలు తీసి ఇళ్ల ముందు వేసిన చెత్త కుప్పలను తరలించే వారు లేక వీధులన్నీ దుర్వాసన వెదజల్లుతున్నాయి. పన్ను వసూళ్లు వేగవంతమైతే నగరపాలక సంస్థ ఖజానాకు నిధులు చేరి.. అభివృద్ధి పనులు చేసే వీలుంటుంది. కానీ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. పన్ను వసూలు కాక.. డీజిల్‌కు డబ్బులేక.. రాయలసీమలో చతికిల.. మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు అంతంతే.. లక్ష్య సాధనలో అట్టడుగున అనంతపురం జిల్లా సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపమే కారణం -
సెంట్రల్ వర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి!
● రిపబ్లిక్ డే అనంతరం స్నాతకోత్సవ తేదీ ఖరారు! అనంతపురం: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ తొలి స్నాతకోత్సవానికి సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో జరిగే స్నాతకోత్సవానికి విజిటర్ హోదాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టంలో భాగంగా 2018లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటైంది. జేఎన్టీయూ అనంతపురం ఇంక్యుబేషన్ సెంటర్లో తాత్కాలిక క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. 2024 ఆగస్టు నుంచి శాశ్వత క్యాంపస్ అయిన జంతలూరులో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ యూజీ, పీజీ కోర్సులతో పాటు డిప్లొమో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పీహెచ్డీ కోర్సులు సైతం నిర్వహిస్తున్నారు. వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా స్నాతకోత్సవం నిర్వహించలేదు. దీంతో 2018–20 పీజీ, 2018–21 డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలు అందజేస్తారు. మొత్తం 845 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. పాఠశాలలకు నిధులు విడుదల అనంతపురం సిటీ: విద్యార్థుల్లో వృత్తి స్పృహ, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక్కో పాఠశాలకు రూ.15 వేల చొప్పున నిధులు మంజూరు చేసిందని సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త టి.శైలజ, జీసీడీఓ కవిత మంగళవారం తెలిపారు. ఈ లెక్కన జిల్లాలోని 49 పాఠశాలలకు రూ.7.35 లక్షలు విడుదలైనట్లు వెల్లడించారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020 ప్రకారం వృత్తి విద్యా కార్యక్రమాల ప్రాముఖ్యత దృష్ట్యా ఆరో తరగతి నుంచే నైపుణ్య ఆధారిత అభ్యాసాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర శిక్ష స్కూళ్లలో 6 నుంచి 8 తరగతులకు వృత్తి విద్య కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఈ నిధులు కేటాయించినట్లు తెలిపారు. కందుల కొనుగోళ్లు ప్రారంభం అనంతపురం అగ్రికల్చర్: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటా రూ.8 వేల ప్రకారం కందుల కొనుగోళ్లు మంగళవారం నుంచి ప్రారంభించినట్లు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. తొలిరోజు గుంతకల్లులో మాత్రమే కేంద్రం ప్రారంభం కాగా... రెండు మూడు రోజుల్లో అన్ని మండలాల్లో కొనుగోళ్లు మొదలవుతాయన్నారు. ఇప్పటి వరకు 9 వేల మంది వరకు రైతులు ఆర్ఎస్కేల్లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్‌లో సాగు చేసి...ఈ –క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కందులు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈ సీజన్లో 24,338 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వైభవంగా తిరుప్పావై సేవా గోష్టి తాడిపత్రి రూరల్ : పట్టణ, రూరల్ ప్రాంతంలో మంగళవారం తిరుప్పావై సేవా గోష్టి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. పట్టణంలోని శ్రీభూదేవి, శ్రీదేవి సమేత చింతల వేంకటరమణస్వామి దేవాలయ అర్చకులు శ్రీనివాస ఆయ్యంగార్, చింతలరాయన్ అయ్యంగార్ ఆధ్వర్యంలో తిరుప్పావై సేవా గోష్టి కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీగోదాదేవి, శ్రీరంగనాథస్వాముల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకువచ్చిన అర్చకులు విశేష పూజలు చేశారు. 30 రోజుల పాటు శ్రీగోదాదేవి ఆలపించిన పాశురాలను అర్చకులు భక్తులకు వివరించారు. -
వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం కావాలి
● సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ అనంతపురం సిటీ: పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని కేజీబీవీ సిబ్బందిని సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ ఆదేశించారు. బుక్కరాయసముద్రంలోని కేజీబీవీలో రెండ్రోజులుగా నిర్వహించిన జిల్లా స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి జీసీడీఓ కవిత అధ్యక్షత వహించగా.. శైలజ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని 32 కేజీబీవీలకు చెందిన సీఆర్టీలు, పీజీటీలకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అభినందనలు తెలిపారు. ప్రతి విద్యార్థిని ప్రతి సబ్జెక్టులో మంచి మార్కులతో పాసయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులదే అన్నారు. కార్యక్రమంలో సబ్జెక్టు నిపుణులు సిద్దేశ్వరప్రసాద్, సుదర్శన్‌రాజు, లక్ష్మీరంగయ్య, రామకృష్ణ, శ్రీధర్‌రెడ్డి, శివప్రసాద్, చంద్రశేఖర్, గురివిరెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు. ‘అనంత పాలధార’ను విజయవంతం చేయండి అనంతపురం అగ్రికల్చర్: స్థానిక రూరల్ మండలం ఆకుతోటలపల్లి గ్రామంలో ఈ నెల 7 (బుధవారం) నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘అనంత పాలధార’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పశుసంర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పశుశాఖ కార్యాలయంలో డీడీలు డాక్టర్ వై.రమేష్‌రెడ్డి, డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, ఏడీ డాక్టర్ ఏవీ రత్నకుమార్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని రాయలసీమలోనే తొలిసారిగా ‘అనంత’లో వినూత్నమైన కార్యక్రమం తలపెట్టామన్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తొలిరోజు బుధవారం మూడు విభాగాల పాల దిగుబడి పోటీలు ఉంటాయన్నారు. మూడు విభాగాల్లోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామన్నారు. రెండో రోజు గురువారం లేగదూడల ప్రదర్శన, వాటి అందాల పోటీలు, అలాగే గర్భకోశవ్యాధి శిబిరం ఉంటుందన్నారు. మూడో రోజు ముగింపు, బహుమతుల ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి మేలు జాతి పాడి ఆవులతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇది కేవలం పోటీ కాదని, పశుపోషకుల్లో ఆత్మవిశ్వాసం నింపే విప్లవాత్మక ఉద్యమమని తెలిపారు. శాసీ్త్రయ పద్ధతుల్లో పాడి పెంపకం, మెరుగైన పశుజాతులు, సమతుల్య పోషణ, పాల దిగుబడి పెంపు, కృత్రిమ గర్భధారణ తదితర అంశాలపై రైతుల్లో అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. యువకుడి ఆత్మహత్య అనంతపురం సెంట్రల్: తెలంగాణకు చెందిన ఓ యువకుడు అనంతపురంలో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. హైదరాబాద్‌కు చెందిన ఓ గాలిమరల కంపెనీలో ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వికారాబాద్‌కు చెందిన మహమ్మద్ అమీర్(25) కొన్ని రోజుల క్రితం గాలి మరల ఏర్పాటుకు స్థల పరిశీలన కోసం అనంతపురానికి వచ్చి రామ్‌నగర్ త్రివేణి హోమ్స్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కుటుంబసభ్యులకు సమాచారం అందించామని, వారు వచ్చిన తర్వాత చేసే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని నాల్గో పట్టణ సీఐ జగదీష్ తెలిపారు. -
ధర్మవరం కుడి కాలువ రెడీ
కూడేరు: మండలంలోని జల్లిపల్లి వద్ద తెగిన ధర్మవరం కుడికాలువ గట్టుకు మరమ్మతు పనులు పూర్తయినట్లు డీఈ విశ్వనాథరెడ్డి, జేఈ సుబ్రహణ్యం తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్ 7న కుడి కాలువ గట్ట కోతకు గురై పూర్తిగా తెగిందన్నారు. దీంతో అదే నెల 16న రూ.90 లక్షల నిధులతో మరమ్మతు పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయగలిగామన్నారు. ఈ క్రమంలోనే కాలువ గట్టు సామర్థ్యాన్ని పరీక్షించేందుకు పీఏబీఆర్ ఎస్కేప్ రెగ్యులేటర్ వద్ద మిడ్ పెన్నార్‌కు మళ్లించిన 400 క్యూసెక్కుల నీటిని కుడికాలువకు మళ్లించినట్లు వివరించారు. దీంతో ఎక్కువ నీరు విడుదల చేసిన సమస్య ఉండదని స్పష్టత వచ్చిందన్నారు. 14 నుంచి జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ వజ్రకరూరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీ నుంచి వజ్రకరూరు మండలం గంజికుంట గ్రామంలో టెన్నిస్ బాల్ జిల్లా స్థాయి ఓపెన్ క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రామస్తులు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు నగదు పురస్కారాలతో సత్కరించనున్నారు. టోర్నీలో పాల్గొనాల్సిన జట్లు ఈ నెల 12వ తేదీ సాయంత్రం లోపు రూ.600 ప్రవేశ రుసుం చెల్లించి, పేర్లు నమోదు చేయించుకోవాలి. పూర్తి వివరాలకు 81426 28293, 90630 08924, 96767 10405లో సంప్రదించవచ్చు. సీటీఎస్ కార్మికులను తొలగించరాదు గుంతకల్లు: సీటీఎస్ కార్మికులను తొలగించారాదని సీఐటీయూ నాయకుడు సాకే నాగరాజు డిమాండ్ చేశారు. స్థానిక రైల్వేస్టేషన్లో పని చేస్తున్న సీటీఎస్ కార్మికులను ఉన్నఫలంగా తొలగించడాన్ని నిరసిస్తూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ నుంచి డీఆర్ఎం కార్యాలయం వరకు నిరసన రిలే నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు. 18 ఏళ్లుగా దాదాపు 85 మంది కార్మికులు సీటీఎస్ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. కొత్తగా వచ్చిన సబ్ కాంట్రాక్టరు కేవలం 50 మందిని మాత్రమే పనిలో ఉంచుకుని మిగిలినవారిని తొలగించామని చెబుతుండడం దుర్మార్గమన్నారు. ఏ ఒక్క కార్మికుడినీ తొలగించరాదని, కనీస వేతనం కింద రూ.26 వేలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యం, చిరంజీవి, ఆంజనేయులు, జయరాజు, అలిగేరప్ప, వీరేష్, రత్నమయ్య తదితరులు పాల్గొన్నారు. ‘పే కమిషన్‌పై రాజీలేని పోరాటం’ గుంతకల్లు: పే కమిషన్ కోసం కేంద్ర ప్రభుత్వంపై రాజీ లేని పోరాటాలు సాగిస్తామని ఆల్ ఇండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ గుంతకల్లు డివిజన్ ప్రధాన కార్యదర్శి మస్తాన్‌వలి అన్నారు. స్థానిక రైల్వే గ్రౌండ్ సమీపంలోని మ జ్దూర్ యూనియన్ కార్యాలయంలో పెన్షనర్స్ డే వేడుకలను మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులుగా మజ్దూర్ యూనియన్ జోనల్ అధ్యక్షుడు కళాధర్, వర్కింగ్ ఎంప్లాయీస్ మజ్దూర్ యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ హాజరయ్యారు. మస్తాన్‌వలి మాట్లాడుతూ.. పెన్షనర్లుకు పే కమిషన్ వర్తించదనే వదంతులు సృష్టిస్తున్నారని, అలాంటి వాటిని నమ్మరాదని పేర్కొన్నారు. అనంతరం 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెన్షనర్లు కరీంబాషా, సాయిశేఖర్, కనకరాజు, ప్రసాద్, నాగారాజు, యల్లయ్య పాల్గొన్నారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ రాయదుర్గం టౌన్: స్థానిక జాతీయ రహదారి బైపాస్‌లో శ్మశాన వాటిక వద్ద ఉన్న వాహన సర్వీసింగ్ సెంటర్ షెడ్డు రేకులు కత్తిరించి దొంగతనానికి పాల్పడుతున్న ఓ యువకుడిని సోమవారం అర్ధరాత్రి స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.తాళం వేసిన షెడ్డు పైభాగంలో రేకులు కత్తిరించి లోపలికి వెళ్లిన దుండగుడిని గమనించిన కొందరు అక్కడే కాపు కాశారు. కాసేపటి తర్వాత యువకుడు బయటకు రాగా వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాప్తాడులో మార్పు మొదలు
రాప్తాడు రూరల్: రాప్తాడు నియోజకవర్గంలో మార్పు మొదలైంది. పార్టీ కోసం రేయింబవళ్లు కష్టపడి జీవితాలను త్యాగం చేసిన కార్యకర్తలకు టీడీపీలో న్యాయం చేకూర లేదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే నేతల తీరుపై కార్యకర్తలు రగిలిపోతున్నారు. కొందరు బయటకు చెప్పుకోలేక లోలోన మదన పడుతుంటే, మరికొందరు పార్టీ మారి తమ అసహనాన్ని బయటపెట్టుకుంటున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల పంచాయతీ పరిధిలో టీడీపీకి చెందిన 20 కుటుంబాలు మంగళవారం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరాయి. అనంతపురంలోని తోపుదుర్తి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారందరికీ పార్టీ జెండాలు కప్పి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సాదారంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ సీనియర్ నాయకులు నాగేపల్లి శంకరప్ప, నాగేపల్లి సత్యనారాయణ, బూడిద అక్కులప్ప, బూడిద నాగరాజు, తలారి రంగప్ప, తలారి ఆంజనేయులు, తలారి మురళి, కోడిపల్లి ఈశ్వరప్ప, కట్టుబడి ఆంజనేయులు, పాతపాళ్యం అక్కులప్ప, నీళ్ల చిరంజీవి, కమ్మర శ్రీరాములు, కమ్మర అంజి, దాసరి కదిరప్ప, పల్లెన్న, కురుబ బోసే రామాంజి, తలారి సంజీవ, దళవాయిపల్లి చిరంజీవి, మేకల పోతన్న కుటుంబాలు ఉన్నాయి. టీడీపీలో సుదీర్ఘకాలంగా పని చేశామని, కష్టపడిన వారికి గుర్తింపు లేకపోవడంతో పార్టీని వీడాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు. తాము పదవులు ఆశించి పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. తమ కష్టాన్ని గురిస్తే చాలని అన్నారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలకే టీడీపీని కార్యకర్తలు, నాయకులు వీడుతున్నారంటే వారిని పరిటాల కుటుంబం ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేసిందో అర్థమవుతోందన్నారు. కులాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందేందుకు పరిటాల సునీత ప్రయత్నిస్తోందన్నారు. పరిటాల కుటుంబం మాయలో పడి గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కులాలు, వర్గాలుగా విడిపోవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ సీకేపల్లి మండల కన్వీనరు డోలా రామచంద్రారెడ్డి, ఎంపీపీ నారాయణస్వామి, వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి, పార్టీ వలంటీరు విభాగం శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు ఓబుగారి హరినాథరెడ్డి, నాయకులు మందల నరసింహులు, మనేరు నరసింహులు, వెంకటంపల్లి సత్తిరెడ్డి, ముష్టికోవెల పంచాయతీ సర్పంచు కోనప్ప, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనాథ్, ఆంజనేయులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. పరిటాల కుటుంబానికి షాక్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల పంచాయతీలో 20 కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరిక పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి -
చేతిరాత అందంగా ఉండాలి : డీఈఓ
అనంతపురం సిటీ: చేతిరాత అందంగా ఉంటే వారి హృదయం అంతే అందంగా ఉంటుందని డీఈఓ ప్రసాద్‌బాబు అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలకు చిన్నప్పటి నుంచే చేతి రాత అందంగా ఉండేలా సాధన చేయించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతపురంలోని అరవిందనగర్‌లో ఉన్న ఎస్కేడీ నగర పాలక ప్రాథమిక పాఠశాలను ఆయన మంగళవారం సందర్శించారు. విద్యార్థుల వర్క్ బుక్స్, జీ–ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్, ఎఫ్–3 అసెస్మెంట్ బుక్కులను పరిశీలించారు. తెలుగు, ఆంగ్లం పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల డ్రాప్ అవుట్ లేకుండా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం రాప్తాడులోని జెడ్పీహెచ్‌ఎస్‌ను తనిఖీ చేశారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రత్యేక తరగతుల నిర్వహణను పరిశీలించారు. 11 మంది మట్కా బీటర్ల అరెస్ట్ తాడిపత్రి టౌన్: పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి మట్కా రాస్తూ 11 మంది బీటర్లు పట్టుబడినట్లు సీఐ ఆరోహణరావు తెలిపారు. వీరి నుంచి రూ.1.40 లక్షలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. సీటు కోసం బస్సులో కొట్టుకున్న మహిళలు ఉరవకొండ: ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం ఉరవకొండ ఆర్టీసీ డిపో నుంచి రాయదుర్గానికి వెళ్లే బస్సులో చోటు చేసుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉరవకొండ నుంచి కణేకల్లు మీదుగా రాయదుర్గం వెళుతున్న రాయదుర్గం డిపోకు చెందిన బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళ ప్రయాణికులు మధ్య గొడవ ప్రారంభమైంది. నింబగల్లు సమీపంలో గొడవ తీవ్ర రూపం దాల్చి ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ పరస్పరం కొట్టుకున్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్, తోటి ప్రయాణికులు ఎంతగా వారించినా వినిపించుకోలేదు. డ్రైవర్ బస్సును ఉరవకొండ పీఎస్‌కు తీసుకెళ్లి గొడవ పడుతున్న ఇద్దరు మహిళలను పోలీసులకు అప్పగించారు. మహిళలకు ఉరవకొండ సీఐ మహనంది కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
అలసత్వంపై కొరడా
● 27 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు అనంతపురం ఎడ్యుకేషన్: విధుల పట్ల అలసత్వం వహించిన పంచాయతీ కార్యదర్శులపై జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు కొరడా ఝుళిపించారు. ఏకంగా 27 మంది కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శానిటేషన్, హౌస్ ట్యాక్స్ కలెక్షన్ తదితర అంశాలపై మంగళవారం సమీక్షించారు. పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ప్రతి నెలా నిర్వహించే ఐవీఆర్ఎస్ కాలింగ్‌లో జనవరి నివేదికలో జిల్లాలో 27 పంచాయతీలు ‘0’ శాతం పురోగతి సాధించినట్లు గుర్తించారు. ఇంటి నుంచి చెత్త సేకరణ చేయని వైనంపై బెణకల్లు, బాలాపురం, తిరుమలాపురం, డి.హీరేహాళ్, ఆర్.అనంతపురం, వెంకటరెడ్డిపల్లి, వేల్పుమడుగు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారానికి కనీసం రెండుసార్లు కూడా చెత్తసేకరణ చేయని వైనంపై పి.యాలేరు, నక్కలపల్లి, రాయలప్పదొడ్డి, దురదకుంట, బెణకల్లు, గులిమికొండ్ల కొట్టాల, హులికల్, గడ్డంనాగేపల్లి, శిరిపురం, చెర్లోపల్లి, గుండాల, బీఎన్ హళ్లి, రేకులకుంట, కొంతానపల్లి, బేలోడు, వ్యాసాపురం, నెరిమెట్ల, కమలపాడు, డొనేకల్లు, బొప్పేపల్లి పంచాయతీల కార్యదర్శులకు నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లోపు వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. హౌస్ ట్యాక్స్ డిమాండ్ రూ.లక్ష లోపు ఉన్న పంచాయతీలు ఈ నెల 10లోపు పూర్తిస్థాయిలో వసూలు చేయాలని ఆదేశించారు. పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని, లేదంటే వచ్చే నెలలో వచ్చే ఐవీఆర్ఎస్ నివేదికలో తక్కువ ప్రోగ్రెస్ వస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై తరచూ పర్యవేక్షించాలని డీడీఓలు, డీఎల్పీఓలు, డెప్యూటీ ఎంపీడీఓలకు డీపీఓ సూచించారు. బెణకల్లు సెక్రటరీ సస్పెన్షన్‌కు సిఫార్సు విధుల్లో మరీ నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించిన కణేకల్లు మండలం బెణకల్లు పంచాయతీ కార్యదర్శి తిరుమలరెడ్డిని సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో డీపీఓ నాగరాజునాయుడు జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు చేశారు. -
8 నుంచి ‘అనంత’లో మిల్లెట్ మేళా
అనంతపురం అగ్రికల్చర్: అనంత సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు అనంతపురంలోని పోలీస్ కాంప్లెక్స్‌లోని ఫంక్షన్ హాల్ వేదికగా ‘మిల్లెట్ మేళా’ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్జీఓ, ఎఫ్‌పీఓ ప్రతినిధులు సంయుక్తంగా వెల్లడించారు. సోమవారం స్థానిక ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేదిక తరపున ఆ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి మాట్లాడారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వ్యవసాయ, అనుబంధ రంగాలు, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎన్జీఓలు, ఎఫ్పీఓలు మొత్తం 18 సంస్థలు సంయుక్తంగా మిల్లెట్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ‘ప్రకృతి వ్యవసాయం, ఆహారోత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, వినియోగం’ అనే అంశాలను ప్రధానంగా తీసుకుని 20 వరకు ఆహారోత్పత్తుల ప్రదర్శన శాలలు, అమ్మకాలు చేపడుతున్నట్లు వివరించారు. అలాగే ఈ ఏడాది ‘అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం’, అంతర్జాతీయ ఉమ్మడి వనరులు, పశువులు, జీవాల పెంపకం సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి గుర్తించిన నేపథ్యంలో ‘మిల్లెట్ మేళా’లోనూ వాటికి ప్రాధాన్యతనిస్తూ రోజుకో అంశంపై చర్చలు, సమాలోచనలు, భవిష్యత్ కార్యాచరణ అంశాల గురించి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. రైతులు, మహిళలు, అలాగే నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎఫ్ఈఎస్ వ్యవస్థాపకులు భక్తర్‌వలి, ఏఎఫ్‌ఈసీ చీఫ్ ఆపరేషన్స్ జె.మురళీకృష్ణ, రిడ్స్ పీడీ వి.కిష్టప్ప, రెడ్స్ ఫౌండర్ భానుజాతో పాటు సీసీడీ, వాసన్, టింబక్టు, ఏపీ మాస్, సీఎస్ఏ, జనజాగృతి, యాపిల్, పాస్, కార్డు, గ్రామ్‌వికాస్, అనంత నాచురల్స్, తిరుమల ఆర్గానిక్స్, డిజిటల్ గ్రీన్ తదితర ఎన్జీఓ, ఎఫ్‌పీఓ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంత సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహణ జయప్రదం చేయాలని ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి పిలుపు -
అరటి ఎగుమతి సమస్యలపై అధ్యయనం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా నుంచి ముంబయి మీదుగా గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతులకు ఎదురవుతున్న సమస్యలపై ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎల్‌ఐడీసీ) అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం అనంతపురంలోని ఉద్యానశాఖ కార్యాలయంలో డీడీహెచ్ డి.ఉమాదేవి, ఏడీహెచ్ దేవానందకుమార్తో పాటు ఎక్స్‌పోర్టర్లు, ట్రేడర్లు, ఎఫ్పీఓలతో ఏపీఎల్‌ఐడీసీ అధికారులు పవన్కుమార్సాహు, రామనాథ్‌రెడ్డి సమావేశమై చర్చించారు. రైల్వే సహకారంతో ఏసీ రెఫ్రిజిరేటర్ కంటైనర్ల ద్వారా అరటి ఎగుమతికి ప్రణాళిక ఉన్నా రవాణా ఖర్చులు, ఇతరత్రా అనుమతుల్లో జాప్యం కారణంగా సమస్యలు తలెత్తుతున్నట్లు జిల్లా అధికారులు, ఎగుమతిదారులు తెలిపారు. తాడిపత్రి నుంచి రైలు మార్గం ద్వారా ముంబయికు వెళితే.. అక్కడి నుంచి పోర్టు (నౌకాశ్రయం)లోకి అరటిని చేర్చడానికి సమయం తీసుకుంటున్నారని, అనుమతులు తొందరగా ఇవ్వడం లేదని వివరించారు. కంటైనర్లు కూడా సక్రమంగా అందుబాటులోకి రావడం లేదన్నారు. క్వాలిటీ చెకింగ్, అనుమతులు, క్వారంటైన్ తదితర ప్రక్రియల్లో జాప్యం చోటు చేసుకుంటుండడంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఇక్కడే ‘డ్రై పోర్టు’ ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అలాగే జిల్లాలో రెండు మూడు చోట్ల కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తే రైతులు లేదా కంపెనీలు అరటిని అక్కడికి తీసుకువచ్చి... అక్కడి నుంచి కంటైనర్లకు లోడ్ చేయడం సులభమవుతుందని వివరించారు. -
మెరుగు పేరుతో బంగారం అపహరణ
గార్లదిన్నె: మెరుగు పెడతామని నమ్మించి మేలిమి బంగారాన్ని అపహరించుకెళ్లిన ఘటన గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... కృష్ణాపురంలో నివాసముంటున్న సుగుణమ్మ సోమవారం ఉదయం ఇంట్లో కోడలు, బావతో కలసి ఉన్న సమయంలో ఇద్దరు యువకులు చేరుకుని బంగారు, వెండి ఆభరణాలకు మెరుగు పెడతామని తెలిపారు. దీంతో మొదట ఇత్తడి దండ, వెండి కాలి పట్టీలు ఇవ్వడంతో వాటికి మెరుగుపట్టి ఇచ్చారు. అనంతరం వారి మాటలు నమ్మి తన మెడలోని బంగారు తాళిబొట్టు చైన్ ఇవ్వడంతో వారి ముందే గిన్నె నీటిలో మరిగించి తాళిబొట్టు చైన్‌ను అందులో వేసి కలకండ లాంటి పదార్థాన్ని కలిపారు. కొద్ది సేపటి తర్వాత మరిగే నీటిలోకి కొద్దిగా పసుపు వేయాలనడంతో సుగుణమ్మ అలాగే చేసింది. ఆ సమయంలో ఒక్కసారిగా పొగలు వ్యాపించి ఇంట్లో ఉన్న ముగ్గురూ స్పృహ కోల్పోయారు. అనంతరం యువకులు బంగారు తాళిబొట్టు చైన్ తీసుకుని తామొచ్చిన ద్విచక్ర వాహనంపై ఉడాయించారు. కొద్దిసేపటికి కోలుకున్న వారు తాము మోసపోయినట్లుగా నిర్దారించుకుని సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గిరిజన యువతికి వంచన.. యువకుడికి రిమాండ్ కళ్యాణదుర్గం రూరల్: ప్రేమ పేరుతో గిరిజన యువతిని వంచించిన కేసులో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో మరికొందరు యువకులు పరారీలో ఉన్నారు. ఈ ఘటన కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన యువకుడు బాలాజీ కుందుర్పి మండలానికి చెందిన ఓ గిరిజన యువతిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుడికి అండగా స్థానిక టీడీపీ నేతలు నిలిచి విషయం బయటకు పొక్కకుండా తొక్కి పెట్టారు. నిందితులను తప్పించేందుకు పోలీసులపై ప్రజాప్రతినిధిలు తీవ్ర ఒత్తిళ్లు తీసుకెళ్లినట్లు సమాచారం. 8న కాకినాడలో ఖేలో ఇండియా ట్రైబల్ పోటీలుఅనంతపురం కార్పొరేషన్: ఈ నెల 8న కాకినాడ వేదికగా ఖేలో ఇండియా ట్రైబల్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు డీఎస్డీఓ కిషోర్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓపెన్ ఏజ్ కేటగిరిలో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, హాకీ, ఫుట్‌బాల్ తదితర క్రీడల్లో ఎంపికలు ఉంటాయి. జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలకు ఏపీ తరఫున ప్రాతినిథ్యం వహించాలనే ఆసక్తి ఉన్న వారు ఈ నెల 8న ఉదయం 9 గంటలకు కాకినాడలోని క్రీడా ప్రాంగణంలో రిపోర్టు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎస్టీ సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలు, ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాలి. రెవెన్యూ క్లినిక్‌కు 282 వినతులుఅనంతపురం అర్బన్: భూ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌కు 282 వినతులు అందాయి. అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు ఆర్డీఓలు, 32 మండలాల తహసీల్దారులు హాజరై, వినతులు స్వీకరించారు. అత్యధికంగా గార్లదిన్నె మండలంలోని 13 గ్రామాల నుంచి 37 అర్జీలు, అనంతపురం రూరల్ పరిధిలోని 9 గ్రామాల నుంచి 23 అర్జీలు, కూడేరు మండలంలోని 9 గ్రామాల నుంచి 22 అర్జీలు, శింగనమల మండలంలోని 10 గ్రామాల నుంచి 22 వినతులు, తాడిపత్రి మండలంలోని 11 గ్రామాల నుంచి 17 అర్జీలు, ఆత్మకూరు మండలంలోని 5 గ్రామాల నుంచి 17 అర్జీలు అందాయి. అత్యల్పంగా వజ్రకరూరు మండలంలోని ఓ గ్రామం నుంచి రెండు అర్జీలు, గుమ్మఘట్ట మండలంలోని ఓ గ్రామం నుంచి రెండు అర్జీలు, అనంతపుం అర్బన్ పరిధిలో ఒక అర్జీ, కళ్యాణదుర్గం మండలంలోని రెండు గ్రామాల నుంచి రెండు అర్జీలు అందాయి. వినతుల పరిశీలన అనంతరం కేవలం 12 అర్జీలకు మాత్రమే పరిష్కారం చూపారు. అండర్ –14 క్రికెట్ సెలెక్షన్‌కు 95 మంది హాజరుఅనంతపురం కార్పొరేషన్: అండర్ –14 క్రికెట్ క్రీడాకారుల ఎంపికకు శ్రీసత్యసాయి జిల్లా నుంచి 95 మంది హాజరయ్యారు. సోమవారం అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో చేపట్టిన ఎంపిక ప్రక్రియను టాలెంట్ కమిటీ సభ్యులు షేక్ హుస్సేన్, శరత్ పర్యవేక్షించారు. -
‘ఉపాధి’ పేరు మార్పుపై అవగాహన కల్పించండి
● జెడ్పీ సీఈఓ శివశంకర్ కళ్యాణదుర్గం (కంబదూరు): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బదులుగా వికసిత్ భారత్ జీ రామ్ జీ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం పేరు మార్చిందని, ఈ విషయంపై ఉపాధి కూలీలకు అవగాహన కల్పించాలని జెడ్పీ సీఈఓ శివశంకర్ సూచించారు. కంబదూరులోని సచివాలయం వద్ద సోమవారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గతంలో ఉపాధి పని దినాలను కేంద్రం 100 రోజులకు నిర్ణయించిందన్నారు. అయితే ఇటీవల కూలీలకు 125 రోజులు పనిదినాలు పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సూర్యనారాయణ, ఏపీఎం రాజశేఖర్, ఏపీఓ శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గంగావతిలో ఉరవకొండ వాసి అరెస్ట్ హొసపేటె: కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి పోలీసులు రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి రూ.13.10 లక్షల విలువైన సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. వివరాలను గంగావతి డీఎస్పీ న్యామగౌడ వెల్లడించారు. పట్టుబడిన వారిలో అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పట్టణం మారెమ్మ గుడి ప్రాంతానికి చెందిన రామాంజనేయ అలియాస్ రామాంజి గురుస్వామి, హొసపేటె తాలూకాలోని మలపనగుడి నివాసి మహేష్ గురుస్వామి ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. హోరాహోరీగా ఫుట్‌బాల్ పోటీలుఅనంతపురం కార్పొరేషన్: అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న ఇన్స్పైర్ ఫుట్‌బాల్ కప్ టోర్నీ పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. తొలి మ్యాచ్‌లో మగన్సింగ్ రాజీవ్ ఎఫ్‌సీ జట్టు 5–0 గోల్స్ తేడాతో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టుపై ఘనవిజయం సాధించింది. అలాగే నర్మద వాలీ ఎఫ్‌సీ జట్టు 6–0 గోల్స్ తేడాతో తాండమ్ ఫౌండేషన్ జట్టుపై విజయకేతనం ఎగురవేసింది. పదువయ్ యూనికార్న్ జట్టు ఏకంగా 18–0 గోల్స్ తేడాతో లైఫ్ స్పోర్ట్స్ అకాడమీ జట్టుపై విజయఢంకా మోగించింది. ఫజల్ ఎఫ్‌సీ జట్టు 12–0 గోల్స్ తేడాతో నాంది ఫౌండేషన్ జట్టుపై, యువ ఫౌండేషన్ 3–0 గోల్స్ తేడాతో ఆస్కార్ ఫౌండేషన్ జట్టుపై గెలుపొందాయి. -
రీ–సర్వే నాల్గో విడతలో 90 గ్రామాలు
అనంతపురం అర్బన్: భూముల రీ–సర్వే నాల్గో విడత 90 గ్రామాల్లో చేపట్టామని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలను సోమవారం వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల్లో 79 గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యిందన్నారు. నాల్గో విడత కింద 90 గ్రామాల పరిధిలో 9,710.07 ఎకరాలను రీ–సర్వే చేయనున్నట్లు పేర్కొన్నారు. చెరువులు నింపకపోతే ఆత్మహత్యలే ● పుట్లూరు మండల రైతుల ఆవేదన అనంతపురం సెంట్రల్: వేసవికి ముందే తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, చెరువులు నింపకపోతే ఆత్మహత్యలే శరణ్యమని పుట్లూరు మండల రైతులు స్పష్టం చేశారు. నీటి కోసం వారు సోమవారం హెచ్చెల్సీ ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ హెచ్చెల్సీ కింద చివరన ఉన్న సుబ్బరాయసాగర్, పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి తదితర చెరువులున్నాయని, వీటికి నీరివ్వడంలో ఏటా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది కూడా చెరువులకు నీరివ్వలేదని తెలిపారు. తుంపెర డీప్ కట్ వద్ద కాలువ బంద్ చేసినట్లు వివరించారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసుకుంటున్నామని, వేసవిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉండబోతోందని వివరించారు. వెంటనే చెరువులను నింపకపోతే ఈ ప్రాంత రైతులు వలసలు, ఆత్మహత్యలు చేసుకోకతప్పదని హెచ్చరించారు. తాగునీటికోసం గ్రామాల్లో నిత్యం గొడవులు జరుగుతున్నాయని పలువురు మహిళలు ఆవేధన వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటరీలు మూసేస్తే పంటలు ఎండుతాయ్ చివరి ప్రాంతానికి నీటిని తీసుకుపోవాలని డిస్ట్రిబ్యూటరీలను మూసేస్తే పంటలన్నీ ఎండిపోతాయని బుక్కరాయసముద్రం మండలం జంతులూరు, నీలంపల్లి గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సౌత్ కెనాల్ కింద ప్రస్తుతం పంటలన్నీ పొట్ట దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ దశలో డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు బంద్ చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. నాలుగైదు తడులు అందిస్తే పంటలు చేతికొస్తాయని, క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. పరిష్కారం చూపండి సారూ! అనంతపురం అర్బన్: అర్జీలు ఇవ్వడమే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదంటూ పలువురు అర్జీదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో మళ్లీ మళ్లీ అర్జీలు పట్టుకుని రావాల్సి వస్తోందని తెలిపారు. దీంతో ప్రతి వారం అర్జీల సంఖ్య పెరిగిపోతోంది. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో పాటు డీఆర్ఓ మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, తిప్పేనాయక్, మల్లికార్జునుడు వివిధ సమస్యలపై ప్రజల నుంచి 629 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 282 వచ్చాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో ఇన్చార్జ్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్జీకీ నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. నా ఇల్లు నాకు ఇవ్వండి ● అనంతపురంలోని కోవూరునగర్‌లో ఉంటున్న ఇ.రఘుకు 2018లో టిడ్కో ఇల్లు మంజూరైంది. తనవంతు వాటాగా డబ్బు డిపాజిట్ చెల్లించాడు. అయితే ఈయనకు మంజూరైన ఇల్లు మరొకరికి కేటాయించారు. తనకు మంజూరైన ఇంటిని తనకే ఇవ్వాలంటూ ఏడేళ్లుగా అధికారులకు అర్జీలు ఇస్తూనే ఉన్నాడు. గత నెల 27న నగరపాలక సంస్థ ఎండార్స్మెంట్ ఇస్తూ ‘మీరు పీఎంఏవై కింద కట్టిన మొత్తాన్ని ప్రభుత్వం నుంచి నిధులు రాగానే ఇస్తాం’ అని పేర్కొన్నారు. తనకు డబ్బులు తిరిగివ్వడం కాదు.. మంజూరైన ఇంటిని అప్పగించాలని రఘు సోమవారం మరోమారు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అర్జీ సమర్పించాడు. -
అనంత వెంకటరెడ్డి సేవలు చిరస్మరణీయం
అనంతపురం : స్వాతంత్య్ర సమరయోధుడు, తొలితరం సాగునీటి ఉద్యమకారుడు, మాజీ ఎంపీ దివంగత అనంత వెంకటరెడ్డి సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. సోమవారం అనంత వెంకటరెడ్డి 26వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఎదుట ఉన్న అనంత వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అక్కడే అన్నదానం చేపట్టారు. తర్వాత బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద ఉన్న ఘాట్‌లో నివాళులర్పించారు. రాజకీయాలంటే పదవులు అనుభవించడం, అధికారం చలాయించడం కాదు.. ప్రజలకు సేవ చేయడమని అనంత వెంకటరెడ్డి నిరూపించారని ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లో ఉంటూ ప్రజా సేవ చేస్తున్నానన్నారు. స్వార్థం కోసం కాకుండా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం అహర్నిశలు పాటుపడ్డారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కరువుకు నిలయంగా ఉన్న అనంతపురం జిల్లాలో రైతు సమస్యల పరిష్కారానికి అనంత వెంకటరెడ్డి చేసిన కృషి మరువలేనిదని పలువురు నాయకులు కొనియాడారు. జిల్లా రాజకీయ చరిత్రలో సుదీర్ఘ కాలం ప్రజాప్రతినిధిగా పని చేసిన అనంత వెంకటరెడ్డి నేటి తరానికి ఆదర్శప్రాయులన్నారు. హంద్రీ–నీవా సాధన కోసం అహర్నిశలు కృషి చేశారని, అందువల్లే ఆ పథకానికి అనంత వెంకటరెడ్డి పేరును దివంగత సీఎం వైఎస్సార్ పెట్టారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అనంత వెంకటరెడ్డి పేరును తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు వై.శివరామిరెడ్డి, మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు అనంత వెంకటరెడ్డి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అనంత కుటుంబ సభ్యులు, పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం కొనసాగుతోంది. తూర్పు నుంచి ఆగ్నేయం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
సరుకులివ్వకపోతే భోజనమెలా పెట్టాలి? ● అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన ఆత్మకూరు: అంగన్వాడీ కేంద్రాలకు రేషన్ సరుకులు ఇవ్వకపోతే పిల్లలకు భోజనం ఎలా వండి పెట్టాలని అంగన్వాడీ కార్యకర్తలు రెవెన్యూ అధికారులను నిలదీశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో సీఎస్‌డీటీ లక్ష్మీదేవిని కలిసి సమస్యను ఏకరువు పెట్టారు. పిల్లలను పస్తులుంచలేక ఇంటి నుంచి బియ్యం తెచ్చి వండి పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో 47 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 15 అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా కాలేదన్నారు. ఆర్‌ఓలో వచ్చినా డీలర్లు స్టాక్ ఇవ్వడం లేదన్నారు. నాలుగు నెలలుగా బియ్యం, కందిపప్పు, వంట నూనె సరిగా అందడం లేదని, సీడీపీఓ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు. డీలర్లు మేం ఇచ్చినప్పుడు తీసుకోండంటూ హూంకరిస్తున్నారని వాపోయారు. ఐదో తేదీలోపు ఇవ్వాల్సిన సరుకులను 15వ తేదీ అయినా పంపిణీ చేయరని తెలిపారు. ప్రీస్కూల్ పిల్లలకు ఏం వండి పెట్టాలి.. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం సరుకులు ఎలా ఇవ్వాలి అంటూ ప్రశ్నించారు. దీంతో సీఎస్‌డీటీ స్పందిస్తూ డీలర్లకు ఫోన్ చేసి రేషన్ సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. పరారీలో కీచక టీచర్తాడిపత్రిటౌన్: పెద్దపప్పూరు మండలంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆదివారం సాయంత్రం ట్యూషన్ పేరిట ఇంటికి పిలిపించుకుని ఎనిమిదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆదే సమయంలో ఇంటికి వచ్చిన విద్యార్థిని తల్లిదండ్రులు గమనించి ఉపాధ్యాయుడిని గట్టిగా ప్రశ్నించడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్న ఉపాధ్యాయుడిని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి దేహశుద్ధి చేశారు. దీంతో పరారైన ఉపాధ్యాయుడు సోమవారం పాఠశాలకు గైర్హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు సెలవు కావాలని హెచ్ఎంకు ఫోన్లో కోరి.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ విషయమై ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డిని ప్రశ్నించగా తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదన్నారు. ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించగా విద్యార్థి తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. -
బాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారు
గుంతకల్లు: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుమ్మకై రాయలసీమకు నీరు అందకుండా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే జరుగుతోందన్నారు. కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు సాగు, తాగునీటిని అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపొందించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలకు తెలంగాణ సీఎం వద్ద తాకట్టు పెటారన్నారు. ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి సాక్షాత్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించడంతో బాబు బండారం బట్టబయలైందన్నారు. గతంలో బాబు సీఎంగా ఉన్నప్పడు ఆయన చేతిగానితనంతోనే కర్ణాటకలో ఆల్మటి ఎత్తును అక్కడి ప్రభుత్వం పెంచిందన్నారు. దీంతో రాయలసీమకు రావాల్సిన నీటి వాటా కోల్పోయినట్లైందన్నారు. గతంలోనూ కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని, నేడు ఎత్తిపోతుల పథకాన్ని నీరుగార్చరాని మండిపడ్డారు. గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్ -
రాయలసీమ ద్రోహి చంద్రబాబు
అనంతపురం ఎడ్యుకేషన్: తన శిష్యుడు రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్న తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను అటెక్కించడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ‘సీమ’ ద్రోహిగా నిలిచిపోయారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తన పలుకుబడి, తాను పెట్టిన ఒత్తిడి వల్ల ఏపీ సీఎం చంద్రబాబు తలొగ్గి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారని గుర్తు చేశారు. ఓటుకు నోటుకు భయపడే ఇదంతా.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. ఆ కేసుకు భయపడే నోరు విప్పలేదని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉపయోగించుకునే హక్కును కూడా వదులుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడంలో చంద్రబాబు అనేక సందర్భాల్లో తనకే తానే సాటి అని రుజువు చేసుకున్నారన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పుతున్నానంటూ చెప్పుకునే ఆ రోజుల్లో కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచుతున్నా కనీసం నోరు మెదపలేదన్నారు. 854 అడుగుల ఎంపీడీఎల్ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో 830 అడుగులకు కుదించారన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని సరిచేస్తే అప్పట్లో దేవినేని ఉమా ‘ప్రకాశం బ్యారేజీ’పై ధర్నా చేశారన్నారు. దాని ఫలితంగా 2014లో అధికారంలోకి రాగానే ఆయనను ఇరిగేషన్ మంత్రిని చేశారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయినా వరుణదేవుడు కరుణిస్తే తప్ప పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ నుంచి పూర్తిస్థాయి సామర్థ్యంలో నీటిని తీసుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డితో కుమ్మకై ్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలనే చంద్రబాబు చర్యలను ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంలో ఈ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తుంగభద్ర నుంచి సమాంతర కాలువ తీసుకొచ్చి హంద్రీ–నీవాకు అనుసంధానం చేయాలని కోరారు. శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టుల్లో పూడిక వల్ల దాదాపు 200 టీఎంసీల నీటిని కోల్పోతున్నామన్నారు. ఆ మేరకు డ్యాంల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, అనంతపురం, రాప్తాడు మండలాల కన్వీనర్లు బండి పవన్, దుగుమర్రి గోవిందరెడ్డి, సాకే వెంకటేష్, రాప్తాడు యూత్ కన్వీనర్ విశ్వనాథరెడ్డి, నాయకులు మీనుగ నాగరాజు, ఈశ్వరయ్య, జూటూరు శేఖర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట రేవంత్‌రెడ్డితో కుమ్మకై ్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాడు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం -
వ్యవసాయ పనిముట్లు ఇస్తామంటూ బురిడీ
బ్రహ్మసముద్రం: సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు ఇస్తామంటూ రైతులకు ఓ యువకుడు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత రైతులు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం గుడిగానిపల్లికి చెందిన పోలేపల్లి నవీన్ తాను ఐసీఐసీఐ ఫౌండేషన్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరి నియోజకవర్గాల్లో పలువురు రైతులతో పరిచయం పెంచుకున్నాడు. రోటోవేటర్, స్ప్రేయర్లు తదితర వ్యవసాయ పనిముట్లను 50 శాతం సబ్సిడీతో అందజేస్తున్నామని రైతు వాటా కింద మొత్తం చెల్లించాలని సూచించాడు. దీంతో అతని మాటలు నమ్మిన పలువురు రైతులు రూ.లక్షల్లో చెల్లించారు. ఒక్క బ్రహ్మసముద్రం మండలంలోనే రూ.5 లక్షలకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. రోజులు గడుస్తున్నా వ్యవసాయ పనిముట్లు అందకపోవడంతో రైతులకు అనుమానం వచ్చి మూడు నెలల క్రితం గట్టిగా నిలదీశారు. దీంతో రాత్రికి రాత్రే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఫోన్ కూడా పని చేయకపోవడంతో మూడు నెలలుగా అతని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే వనీన్తో పాటు అదే గ్రామానికి చెందిన రవి, మంజునాథ్ బెంగళూరు కేంద్రంగా రైతులను మోసం చేస్తున్నట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాజకీయ నాయకులతో సంప్రదింపులతో కాలయాపన చేస్తున్నారని బాధితులు వాపోయారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మోసగాడిని అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించడంతో పాటు తమ డబ్బు తమకు వెనక్కు ఇప్పించాలని కోరుతున్నారు. -
రైతుల సమస్యలు పట్టని ఎమ్మెల్యే
బుక్కరాయసముద్రం: శింగనమల నియోజకవర్గ రైతుల సమస్యలు స్థానిక ఎమ్మెల్యేకు పట్టడం లేదని వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. సోమవారం సాయంత్రం బీకేఎస్‌లోని నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు సమస్యలతో రైతులు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. సాగు నీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. అదునులో నీరు అందకపోవడంతో పంట నష్టాలను చవి చూడాల్సి వస్తోందన్నారు. పుట్లూరు మండలంలోని గరుకుచింతపల్లి, పుట్లూరు చెరువు, కోమటి కుంట్ల చెరువులకు నీరు అందకపోవడంతో కనీసం తాగునీటికీ ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. సుబ్బరాయ సాగర్ షట్టర్లు పని చేయడం లేదని బుకాయించడం దారుణమన్నారు. ప్రశ్నిస్తే రాజకీయం చేస్తున్నారనడం సరికాదన్నారు. రెండు నెలలుగా కాలయాపన చేసి నేటికీ చెరువులకు నీరు అందిచక పోవడం వెనుక ఎమ్మెల్యే వైఫల్యం స్పష్టంగా కనబడుతోందన్నారు. సాగునీటి అంశంపై ఈ నెల 7న ఉదయం 10 గంటలకు హెచ్చెల్సీ అధికారులతో మాట్లాడనున్నామని, రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, నాయకులు పూల ప్రసాద్, సర్పంచ్ పార్వతి, పూల నారాయణస్వామి, చికెన్ నారాయణస్వామి, ముత్యాలశీన పురుషోత్తం, సత్య నారాయణ, తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం -
అప్రజాస్వామిక పద్ధతిలో ఎంపీపీ ఎన్నిక
● ఆ ఎన్నికను రద్దు చేయాలని వైఎస్సార్సీపీ నేతల డిమాండ్ అనంతపురం: బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నిక అప్రజాస్వామిక పద్ధతిలో జరిగిందని వైఎస్సార్సీపీ రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్తలు మెట్టు గోవిందరెడ్డి, తలారి రంగయ్య, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఆ ఎన్నికను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోలకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు ఎల్ఎం మోహన్‌రెడ్డి తదితరులతో కలిసి వారు మాట్లాడుతూ ఎంపీపీ ఎన్నిక జరుగుతున్న హాలులో వైఎస్సార్సీపీకి చెందిన ఉంతకల్లు ఎంపీటీసీ సభ్యురాలు వనలక్ష్మిని మార్కెట్ యార్డ్ చైర్మన్ జి.హనుమంతరెడ్డి, మాజీ ఎంపీపీ భర్త చంద్రశేఖర్‌రెడ్డితో పాటు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలిపించి బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. అనంతరం బండూరు ఎంపీటీసీ సభ్యుడు హనుమేష్ను కానిస్టేబుల్ ధన్సింగ్ నాయక్ సీఐ పిలుస్తున్నారంటూ పక్క గదిలోకి తీసుకెళ్లి నిర్బంధించారన్నారు. గదిలోపలే ఎమ్మెల్యే కాలవతో పాటు ఆయన అనుచరులు ఉండి డబ్బు తీసుకుని అనుకూలంగా ఓటు వేయాలని, లేకుంటే అంతు చూస్తామని బెదిరించారన్నారు. అనంతరం గోవిందవాడ–2 ఎంపీటీసీ రమేష్ జోక్యం చేసుకుని ‘పార్టీ సభ్యులను ఎందుకు బయటకు పంపించారు.. లోపలికి పిలవండి’ అని ఎన్నికల అధికారులను కోరితే.. కాలవ శ్రీనివాసులు ‘ఏయ్ ప్రభుత్వం మాది.. అతి చేస్తే నీ అంతు చూస్తాం..జాగ్రత్త’ అంటూ హెచ్చరించారన్నారు. దీంతో తమ సభ్యులు వచ్చేంత వరకు ఎన్నిక నిర్వహించకూడదని హాలు నుంచి బయటకు వచ్చామన్నారు. తాము ఎంపీపీ అభ్యర్థిని ప్రతిపాదించలేదు.. బలపరచలేదు, తమ సభ్యులెవ్వరూ చేతులు ఎత్తలేదని, అయినా లోపల ఉన్న ఏడుగురు ఎంపీటీసీలతోనే ఎంపీపీ ఎన్నిక నిర్వహించారన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి అన్ని రికార్డులు, సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని, జాగ్రత్తగా భద్రపరచాలని డిమాండ్ చేశారు. వనలక్ష్మి (ఉంతకల్లు), శ్రీదేవి (డి.హొన్నూరు), కరూరు కల్పన (ఉద్దేహాళ్), బి.గీత (లింగదహాళ్), కె.రమేష్ (గోవిందవాడ–2), హనుమేష్ (బండూరు), బసవరాజు (కురువెళ్లి), ఎం.శివ శరణమ్మ (బొమ్మనహాళ్) 8 మంది ఎంపీటీసీలను డీఆర్ఓ ముందు హాజరు పరిచారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో, ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా మరోసారి ఎంపీపీ ఎన్నిక జరపాలని కోరారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్, హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. బొమ్మనహాళ్: మండల పరిషత్ అధ్యక్షురాలు (ఎంపీపీ)గా ముల్లంగి నాగమణి గెలిచినట్లుగా ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి గంగాధర్ ప్రకటించారు. డిసెంబర్ 29న బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే నెల 31న ఫారం–5లో ఎంపీటీసీ సభ్యులకు నోటీస్ అందజేసిన విషయం తెలిసిందే. సోమవారం ఎన్నికల ప్రిసైడింగ్ గంగాధర్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 16 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఇండిపెండెంట్ అభ్యర్ధితో కలిసి 15 మంది హాజరయ్యారు. దర్గాహొన్నూరు–1 ఎంపీటీసీ సభ్యురాలు కె.నాగరత్నమ్మ సమావేశానికి హాజరు కాలేదు. అధికార పార్టీ దౌర్జన్యాలకు నిరసనగా వైఎస్సార్సీపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనకుండా బయటకు వచ్చేశారు. మిగిలిన ఏడుగురు సభ్యులతోనే ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు. టీడీపీ మద్దతు తెలిపిన ఉప్పరహాళ్ ఎంపీటీసీ సభ్యురాలు ముల్లంగి నాగమణి గెలుపొందినట్లుగా ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ప్రకటించి, ఆమెకు డిక్లరేషన్ అందజేశారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, తహసీల్దార్ మునివేలు, ఎంపీడీఓ విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించాలి
అనంతపురం సెంట్రల్: బొమ్మనహాళ్ మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నికను ప్రజాస్వామ్య పద్ధతిలో జరపాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ముఖ్య నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, ఉరవకొండ, కళ్యాణదుర్గం సమన్వకర్తలు వై.విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్య, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో డీఎస్పీ శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ఉప ఎన్నికలూ అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం నాటి బొమ్మనహాళ్ ఎంపీపీ ఉప ఎన్నిక కూడా ఏకపక్షంగా జరిపేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. అందులో భాగంగా వైఎస్సార్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఎన్నికలకు సంబంధించిన పత్రాలను ఎంపీడీఓకు అందజేసి, బయటకు వస్తుండగా కొంతమంది టీడీపీ నాయకులు దాడికి యత్నించారని, వారిపై ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితిలో పోలీసులు లేరని వివరించారు. దీన్నిబట్టి చూస్తే ఉప ఎన్నిక ఏ విధంగా ఉంటుందో అర్థంచేసుకోవచ్చన్నారు. ఎంపీటీసీ సభ్యులందరూ స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనే విధంగా పోలీసులు బందోబస్తు కల్పించాలని కోరారు. అప్రజాస్వామిక పద్ధతిలోనైనా ఎంపీపీ పీఠాన్ని కై వసం చేసుకోవాలని యత్నించడం సిగ్గుచేటన్నారు. మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ తన 21 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే తనపైన, కార్యకర్తలపైన టీడీపీ గూండాలు దాడి చేసినా, ఎంపీటీసీ సభ్యులకు ఫోన్ చేసి బెదిరిస్తూ, దూషణలకు దిగుతున్నా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. 16 మందిలో 11 మంది ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీ వైపే ఉన్నారన్నారు. అయినా సరే ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎస్పీ స్పందించి తమ సభ్యులకు తగిన భద్రత కల్పించాలని కోరారు. ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మాట్లాడుతూ మెట్టు గోవిందరెడ్డిపై జరిగిన దాడి బాధాకరమన్నారు. పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని గూండాయిజం చేసి ఎంపీపీ ఎన్నిక జరపాలనుకోవడం సరికాదన్నారు. ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతితో పోలీసు భద్రత నడుమ ఎన్నిక జరపాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడికి పాల్పడుతున్న టీడీపీ నాయకులు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య మాట్లాడుతూ ప్రజాసామ్యంపై విశ్వాసం ఉంటే ఎంపీపీ ఎన్నిక సజావుగా జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నేత ఎల్ఎం మోహన్‌రెడ్డి, రాయదుర్గం నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునేలా రక్షణ కల్పించాలి జిల్లా కేంద్రం నుంచి భద్రతను ఏర్పాటు చేయాలి ‘మెట్టు’పై దాడికి యత్నించిన వారిని కఠినంగా శిక్షించాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, ముఖ్య నేతల డిమాండ్ -
ఫుట్‌బాల్ ఇన్స్పైర్ కప్ టోర్నీ ప్రారంభం
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి అనంత క్రీడాగ్రామంలో ఫుట్‌బాల్ ఇన్స్పైర్ ఇన్విటేషన్ కప్ టోర్నీ ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జట్లు బరిలో దిగాయి. దాదాపు 252 మంది మహిళా క్రీడాకారిణులు తరలివచ్చారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో థాండమ్ ఫౌండేషన్, ఫజల్ ఎఫ్‌సీ, కెంప్ ఎఫ్‌సీ జట్లు తమ ప్రత్యర్థి జట్లపై సునాయాసంగా విజయం సాధించాయి. బెంగళూరు, టర్న్ ప్రో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ నెల 10వ తేదీ వరకు టోర్నీ జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
నికర జలాల కోసం ఉద్యమించాలి
అనంతపురం: రాయలసీమ నుంచి కరువును పారదోలడానికి నికర జలాల కోసం ఉద్యమించాలని మాజీ మంత్రి, రాయలసీమ జన సంఘం (రాజసం) అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి అనంతపురం జిల్లా సాగునీటి పోరాట సమితి ఆధ్వర్యంలో ‘నీళ్లు! నీళ్లు!! నీళ్లు!!!’ పేరిట చేపడుతున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆదివారం అనంతపురంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాకే శైలజానాథ్ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో సాగునీటి కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. హంద్రీ–నీవా, జీఎన్ఎస్ఎస్, వెలిగొండ ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించడంతో పాటు జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్లే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా మారిందని గుర్తు చేశారు. ప్రస్తుతం రాయలసీమ జల ఉద్యమానికి రైతులు, కూలీలు, మహిళలు, యువత, రచయితలు, కవులు, కళాకారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ‘100 టీఎంసీల’ రామాంజినేయులు మాట్లాడుతూ.. బుక్కపట్నం లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టాలన్నారు. కృష్ణా నది నుంచి ఏటా సగటున 453 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ జన సంఘం (రాజసం)లోకి అనంతపురం జిల్లా సాగునీటి పోరాట సమితిని విలీనం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. నీళ్లు వస్తేనే అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందన్నారు. రాయలసీమ జన సంఘం అధ్యక్షుడు శైలజానాథ్ -
పామిడి సీహెచ్‌సీలో అరుదైన శస్త్రచికిత్స
పామిడి: స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో ఆదివారం వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ మహిళ ప్రాణాలు కాపాడారు. వివరాలు.. అనంతపురంలోని మరువకొమ్మ కాలనీకి చెందిన ఉన్నె సులేమా కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స కోసం పామిడిలోని సీహెచ్‌సీ వైద్యులను సంప్రదించింది. వైద్య పరీక్షల అనంతరం ఆమెకు ఎడమ అండాశయంలో 7 x 6 సెం.మీ. పరిమాణంలో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. విషయాన్ని వెంటనే ఆమెకు తెలిపి ఆదివారం వైద్యాధికారి శివకార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో జనరల్ సర్జన్ కమలాధర్, అనస్తీషియా నిపుణులు వైఎస్ రాఘవేంద్రరెడ్డి, హెడ్‌నర్సు శివకుమారి బృందం శస్త్రచికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం రోగి పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. -
పదవి కోసం పచ్చకుట్ర
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అధికారం కోసం టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. ప్రశాంతతకు నిలయంగా ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలంలో అరాచకపర్వానికి తెరతీశారు. అవకాశం లేకున్నా అడ్డదారిలోనైనా మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) స్థానం కై వసం చేసుకునేందుకు దూషణలు, దాడులు, దౌర్జన్యాలతో గూండాగిరి చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. బొమ్మనహాళ్ మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గత ప్రాదేశిక ఎన్నికల్లో 15 వైఎస్సార్సీపీ, 1 స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. టీడీపీ ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో ఎంపీపీగా వైఎస్సార్సీపీ అధికారం చేపట్టింది. రాజకీయ సమీకరణల్లో భాగంగా ఎంపీపీ పదవికి పద్మావతి రాజీనామా చేశారు. దీంతో ఈ నెల 5న ఎన్నిక అనివార్యమైంది. తగినంత సంఖ్యా బలం లేకున్నా టీడీపీ పోటీలో నిలిచి, అడ్డదారిలో కుర్చీ లాక్కునే కుట్రకు తెరతీసింది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు డబ్బు ఆశ చూపడం.. మాట వినకపోతే కేసుల పేరుతో టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగడం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పిన వైఎస్సార్సీపీ బీసీ సామాజికవర్గ ప్రజాప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ‘పార్టీ లేదు.. బొక్కా లేదు.. అడ్డొస్తే వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డినే కొట్టాం.. మీరెంత’ అంటూ విరుచుకుపడుతున్నారు. అరాచక పర్వాలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయినా.. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. దాడులు, బెదిరింపులకు పాల్పడిన టీడీపీ వారిపై కేసుల నమోదు చేసేందుకు వెనకంజ వేస్తున్నారు. బొమ్మనహాళ్‌లో టీడీపీ నాయకుల దాష్టీకం కోరం లేకున్నా ఎంపీపీ కుర్చీ లాక్కునే కుట్ర ఏకంగా మాజీ ఎమ్మెల్యే మెట్టుపైనే దాడులు దాడులు చేసిన వారిపై కేసుల నమోదుకు పోలీసుల వెనకంజ నేడు బొమ్మనహాళ్ ఎంపీపీ స్థానానికి ఎన్నిక -
నరిగమ్మ ఆలయ తరలింపులో ఉద్రిక్తత
రాప్తాడు రూరల్: రోడ్డు విస్తరణలో భాగంగా అనంతపురం రూరల్ మండలం పాపంపేట శివారున కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న మైసూరు నరిగమ్మ ఆలయ తరలింపు ఆదివారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు, పెద్ద సంఖ్యలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు రంగంలోకి దిగారు. గ్రామదేవత ఆగమ శాస్త్రం మేరకు క్రతువు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ సమక్షంలోనే అమ్మవారి విగ్రహాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని ఆలయ తరలింపును అడ్డుకున్నారు. ఎంతో చరిత్ర కలిగిన అమ్మవారి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలిగించకూడదని పట్టుబట్టారు. ఆలయ కమిటీ ఆమోదం మేరకే అమ్మవారి విగ్రహాన్ని కొత్త ఆలయంలోకి తరలిస్తున్నట్లుగా తహసీల్దారు మోహన్‌కుమార్, సీఐ శేఖర్, ఎస్ఐ రాంబాబు నచ్చచెప్పినా వినలేదు. సమాచారం అందుకున్న ఆర్డీఓ కేశవనాయుడు అక్కడికి చేరుకుని దగ్గరుండి మధ్యాహ్నం 1గంట సమయంలో విగ్రహాన్ని అక్కడి నుంచి నూతన ఆలయంలోకి తరలించారు. పెద్ద ఎత్తున చేరుకున్న ట్రాన్స్జెండర్లు.. విగ్రహం తరలించిన తర్వాత కట్టడాన్ని తొలగించే పనులు చేపడుతుండగా సాయంత్రం 4 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో ట్రాన్స్జెండర్లు అక్కడకు చేరుకుని పనులను అడ్డుకున్నారు. అమ్మవారి ఆలయం ఎదుట హంగామా చేశారు. కేకలు వేస్తూ రెవెన్యూ, పోలీసు అధికారులపై తిరగబడ్డారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆలయ కమిటీ ఆమోదంతో విగ్రహాన్ని నూతన ఆలయంలోకి తరలించామని అధికారులు చెప్పినా వినలేదు. గుంపుగా నూతన ఆలయం వద్దకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో అమ్మవారి విగ్రహం, కలశాన్ని తీసుకువచ్చి పాత ఆలయంలో ఉంచారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీఓ కేశవనాయుడు మరోమారు అక్కడికి చేరుకుని ట్రాన్స్జెండర్లతో సుదీర్ఘంగా చర్చించినా వారు ఒప్పుకోలేదు. విషయాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ కేశవనాయుడు స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు.. నరిగమ్మ దేవాలయం తరలింపు వ్యవహారంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించకూడదని వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధికార ప్రతినిధి మఠం శ్యాంసుందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. స్థానికుల సమ్మతితో సంప్రదాయ రీతిన ప్రత్యామ్నాయ స్థలంలో ఆలయ పునఃప్రతిష్ఠ జరగాలన్నారు. ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా విగ్రహం తరలించిన అధికారులు నాలుగు గంటల సమయంలో విగ్రహాన్ని తీసుకొచ్చి పాత ఆలయంలోనే పెట్టిన ట్రాన్స్జెండర్లు -
బాబు చేతిలో రాష్ట్రం సర్వనాశనం
తాడిపత్రి టౌన్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో సీఎం చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం కాస్త ఏపీకి మరణ శాసనమైందని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యూహాత్మకంగా రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టారన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలు, చైన్నె తాగునీటి అవసరాలకు తీర్చేందుకు ఏర్పాటు చేసిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రస్తుతమున్న డిజైన్ మేరకు 44వేల క్యూసెక్కుల నీరు తీసుకునేందుకు వీలు ఉంటుందని, ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 101 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని వివరించారు. 880 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తులో నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో నీళ్లు తీసుకునే వీలు ఉంటుందన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం 798 అడుగుల ఎత్తుకు నీరు చేరగానే విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని దిగువకు వదిలేస్తోందన్నారు. అంతేకాక శ్రీశైలం నుంచి 800 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు ఎత్తిపోసేందుకు తెలంగాణ రాష్ట్రం పలు ప్రాజెక్ట్‌లు చేపట్టిందన్నారు. ఈ పనులు పూర్తయితే రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగు నీరు అందకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చేతులు కలిపి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు మరణ శాసనం రాసారన్నారు. గతంలో చంద్రబాబు వైఖరితోనే ఆల్మట్టి రూపంలో ఓ శాపం రాష్ట్ర ప్రజలను వెన్నాడుతోందన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్ట్‌ను కమీషన్ల కోసం కక్కూర్తి పడి చేతుల్లోకి తీసుకున్నాడన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగులుతోందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆపేయడం వెనుక చంద్రబాబు సొంత ఆర్థిక ప్రయోజనాలున్నాయని, ఈ విషయాన్ని గుర్తించి రాయలసీమ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ద్వారా ఈ కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అలా కాదని రాష్ట్రానికి, రాయలసీమకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగుతామంటే చరిత్ర హీనులుగాా మిగిలిపోతారని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి -
కల్తీ నారు.. రైతు కన్నీరు
రైతులు నష్టపోతున్నారు కళ్యాణదుర్గం ప్రాంతంలో విచ్చలవిడిగా నర్సరీలు వెలిశాయి. అందులో చాలా వాటికి అనుమతులు లేవు. పేరున్న కంపెనీ విత్తనాలు, నాణ్యమైన మొక్కలు అంటూ రైతులకు అంటగడుతున్నారు. చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే చివరకు పూత, పిందె రాకపోవడం, లేదంటే పురుగులు, తెగుళ్లు ఆశించి దిగుబడులు బాగా తగ్గిపోతున్నాయి. జరిగిన నష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు అవస్థలు పడుతున్నా పట్టించుకునేవారు లేరు. – నవీన్, రైతు, పీఆర్టీ పల్లి, కళ్యాణదుర్గం అనంతపురం అగ్రికల్చర్: కల్తీ విత్తనం, నాసిరకం నార్లు రైతులను చిత్తు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో కొందరు నర్సరీ నిర్వాహకులు వాటిని అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 450కు పైగా వెలసిన ఉద్యాన నర్సరీల ద్వారా వైరస్ ఉన్న పండ్ల మొక్కలు, నాసిరకం కూరగాయల పంటల నార్లు రైతులకు ఇస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి మొక్కలు నాటుకున్నందున పంట కాలంలో చీడపీడల బెడద ఎక్కువై పెట్టుబడుల ఖర్చు భారీగా పెరిగిపోతోందని, దిగుబడులపైనా ప్రభావం చూపుతోందని రైతులు వాపోతున్నారు. పెరుగుతున్న సాగు... నర్సరీలకు డిమాండ్.. వేరుశనగ, ఇతర వ్యవసాయ పంటల సాగును తగ్గించిన రైతులు.. అంతో ఇంతో నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఇటీవల కాలంలో పండ్లు, పూలు, కూరగాయల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. గతంలో మాదిరిగా స్వంత విత్తనంతో నారుపెంపకం చేపట్టే పరిస్థితి లేదు. అధిక దిగుబడులు అంటూ హైబ్రీడ్ రకాలపై దృష్టి పెడుతున్నారు. దీంతో పండ్లు, కూరగాయల పంటలు సాగు చేయాలంటే చాలా వరకు నర్సరీలపై ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది. చాలామంది నర్సరీ నిర్వాహకులు నిబంధనలు పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా నార్లు పెంచుతూ రైతులకు అంటగడుతున్నారు. ప్రధానంగా చీనీ, అరటి, ఇతర పండ్ల మొక్కలు, అలాగే మిరప, టమాట, వంగ, బెండ లాంటి కూరగాయల మొక్కలకు డిమాండ్ పెరుగుతోంది. ఏటా ఖరీఫ్, రబీలో 40 వేల ఎకరాల్లో టమాట, మిరప 10 నుంచి 15 వేల ఎకరాలు... ఇలా కూరగాయల పంటల విస్తీర్ణం పెరుగుతోంది. ప్రధానంగా కళ్యాణదుర్గం, శింగనమల, రాప్తాడు, అనంతపురం పరిధిలో నర్సరీలు భారీగా వెలిశాయి. నర్సరీ యాక్ట్ అమలులో నిర్లక్ష్యం.. నర్సరీ యాక్ట్ అమలులో ఉన్నట్లు చెబుతున్నా... వాటి అనుమతులు, రిజిష్ట్రేషన్లు, పర్యవేక్షణపై ఉద్యానశాఖ దృష్టి సారించినట్లు లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రమం తప్పకుండా లైసెన్సులు రెన్యూవల్స్ చేసుకోవడం లేదని చెబుతున్నారు. మూడు నెలలకోసారి ఉద్యానశాఖ తనిఖీలు కూడా చేయాల్సి ఉంటుంది. కూరగాయల నర్సరీల్లో మదర్బ్లాక్ తప్పనిసరిగా ఉండాల్సి ఉన్నా ఎక్కడా పాటించడం లేదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో అక్కడక్కడా కూరగాయల మొక్కలు నాటుకుని దిగుబడులు లేక, చీడపీడల బెడదతో భారీగా నష్టపోయినట్లు రైతుల నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో చాలా వరకు కూరగాయల నర్సరీల్లో కల్తీ విత్తనాల నుంచి పెంచిన నాసిరకం నారు పెంచుతున్నట్లు ఆ శాఖ వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలో గత నెలలో జిల్లాకు వచ్చిన శాస్త్రవేత్తల బృందం చీనీ తోటల్లో అధ్యయనం చేస్తూ... చీనీ నర్సరీ క్షేత్రాల నుంచి మొక్కలను తిరుపతిలో ఉన్న చీనీ, నిమ్మ పరిశోధనా కేంద్రానికి జిల్లా నుంచి 50 వరకు నమూనాలు (శ్యాంపిల్స్) పంపించారు. అందులో 20 వరకు నమూనాల్లో చిన్న మొక్కల్లోనై వైరస్ ఉన్నట్లు తేల్చారు. నాసిరకం, కల్తీ నార్లు కారణంగా ఉద్యాన పంటల్లో చీడపీడల బెడద, వైరస్ వ్యాప్తి బాగా పెరగడంతో చీనీ, అరటి లాంటి తోటల మనుగడ మున్ముందు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తల బృందం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఉద్యానశాఖ ఉలిక్కిపడి.. నర్సరీల్లో కల్తీ నియంత్రణపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ఫెయిలైన చీనీ నర్సరీ క్షేత్రాలకు మెమోలు జారీ చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఉద్యాన నర్సరీలు ఇటీవల చీనీ నర్సరీల్లో సేకరించిన శ్యాంపిల్స్ చాలా వరకు ఫెయిల్ టమాట, మిరపలో కల్తీనారు వల్ల తెగుళ్ల బెడదతో రైతులకు భారీ నష్టం వైరస్ వ్యాప్తితో చీనీ, అరటి తోటల మనుగడపై శాస్త్రవేత్తల ఆందోళన -
సంప్రదాయాలను పాటించినప్పుడే బ్రాహ్మణులకు పూర్వ వైభవం
● ఏబీబీఎం రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రగంటి ప్రసాదఽశర్మ అనంతపురం కల్చరల్: పూర్వ వైభవం కోసం సమష్టిగా శ్రమించాల్సిన సమయం ఆసన్నమైందని బ్రాహ్మణులకు బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. అనంతపురంలోని తపోవనంలో ఉన్న వేదమాత గాయత్రి ఆలయం వేదికగా ఆదివారం ఏబీబీఎం (అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ్), అనంత బ్రాహ్మణ సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బ్రాహ్మణ సమ్మేళనం, భార్గవ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా సాగింది. ఉంతకల్లు వంశీకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏబీబీఎం రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రగంటి ప్రసాదశర్మ, ఏబీబీఎం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రాచార్, అవధాని జోస్యుల సదానందశాస్త్రి, శ్రీజ్ఞానపీఠం వ్యవస్థాపకుడు మధుసూదనరావు, అలనాటి నటుడు చిత్తూరు నాగయ్య మనవడు మధుసూదనశర్మ, డీఆర్వో మలోల తదితరులు ఆత్మీయ అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. బ్రాహ్మణులకు మాత్రమే నిర్దేశించిన సంప్రదాయాలు, ఆచారాలను పాటించడం ద్వారా పూర్వపు కీర్తిని లభిస్తుందన్నారు. సమాజహితంగా మెలిగే స్వభావాన్ని నేటి తరంలో నింపాలన్నారు. అనంతరం వివిధ ప్రాంతాలలో స్థిరపడి, వేర్వేరు రంగాల అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న 52 మంది బ్రాహ్మణ ప్రముఖులకు భార్గవ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం వేదమాత గాయత్రి ఆలయ క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంధ్యామూర్తి, పట్నం శివప్రసాద్, కై పా హరిప్రసాదశర్మ, వరప్రసాద్, లతాశ్యామ్, శాస్త్రి, కల్యాణి, నిర్వాహకులు ధూళిపాళ్ల సురేష్‌శర్మ, సాయికిరణ్, యాదవల్లి సుబ్రహ్మణ్యశర్మ, సాయికిరణ్, శ్రీనిధి రఘు, లంకా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం బ్రహ్మసముద్రం: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో మాట్లాడి ప్రభుత్వ ఉధ్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి ఓ నిరుద్యోగిని కూటమి నాయకులు మోసగించి సొమ్ము చేసుకున్న వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం సంతే కొండాపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త హనుమంతరాయుడు పలువురు నిరుద్యోగులను కలసి ఎమ్మెల్యే అమిలినేనితో చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానమంటూ నమ్మబలుకుతూ వచ్చాడు. ఇతని మాయలో చిక్కుకున్న ఓ యువకుడు ప్రభుత్వాస్పత్రిలో అటెండర్ ఉద్యోగం కోసమని రూ.40 వేలను అప్పగించాడు. తన వద్ద అంత డబ్బు లేకపోయినా ఉద్యోగం వస్తుందన్న ఆశతో వడ్డీ వ్యాపారుల వద్ద రూ.5 వడ్డీ చెల్లించేలా అప్పు చేసి తీసుకువచ్చి ఇచ్చాడు. రోజులు గడుస్తున్న ఉద్యోగం రాకపోవడంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకుని తన డబ్బు వెనక్కు ఇవ్వాలని హనుమంతరాయుడిని అడిగాడు. డబ్బు వెనక్కు ఇవ్వడం కుదరని, ఉధ్యోగం ఇప్పించేలా ఇప్పటికే ఎమ్మెల్యే అల్లుడు ధర్మతేజతో మాట్లాడానని, త్వరలో పోస్టింగ్ ఆర్డర్ అందుతుందని ఆశలు కల్పించాడు. రెండు రోజులుగా హనుమంతరాయుడు పత్తాలేకుండా పోయాడు. అతనితో పాటు రోజూ తనతో ఫోన్లో మాట్లాడుతున్న దుర్గప్ప (హనుమంతరాయుడుకు బాస్‌గా) ను బాధితుడు ఆరా తీయగా.. రాయుడు చెప్పినట్లుగానే తాను ఫోన్లో మాట్లాడానని, ఈ మోసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని జారుకున్నాడు. దీంతో విషయాన్ని ఎస్పీ దృష్టికి సోమవారం తీసుకెళ్లి న్యాయం కోరనున్నట్లు బాధితుడు పేర్కొన్నాడు. -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ్‌శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలుపుకోవచ్చని పేర్కొన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే రసీదు తీసుకురావాలన్నారు. కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. ఇక పరిష్కారవేదిక కలెక్టరేట్లోనే కాకుండా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల్లోనూ జరుగుతుందని తెలిపారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదిక ద్వారానే కాకుండా meekosam.ap.gov.in లోనూ సమర్పించవచ్చని పేర్కొన్నారు. కఠిన చర్యలు తీసుకోండి బొమ్మనహాళ్: ఎంపీపీ ఎన్నిక సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలోకి వెళ్లి తిరిగి వస్తున్న వైఎస్సార్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, పార్టీ నాయకులపై దాడి చేసిన టీడీపీ రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మెట్టు విశ్వనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆదివారం సాయంత్రం బొమ్మనహాళ్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రవిబాబు, సీఐ వెంకటరమణకు ఫిర్యాదు చేశారు. మెజార్టీ లేకపోయినా తమకే ఎంపీపీ పదవి కావాలంటూ.. కాదు, కూడదని జోక్యం చేసుకుంటే అంతు చూస్తాం అంటూ టీడీపీకి చెందిన రౌడీమూకలు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఏపీఎన్జీజీవో అధ్యక్షునిగా మాధవ అనంతపురం అర్బన్: ఏపీఎన్జీజీఓ (ఆంధప్రదేశ్ నాన్‌గెజిటెడ్, గెజిటెడ్ అధికారులు) సంఘం జిల్లా అధ్యక్షునిగా జె.మాధవ్, కార్యదర్శిగా ఎ.రవికుమార్ ఎన్నికయ్యారు. సంఘం జిల్లా కమిటీ ఎన్నికలు ఆదివారం నగరంలోని ఎన్జీఓ హోమ్‌లో నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్‌యాదవ్ వ్యవహరించారు. సంఘంలోని 17 స్థానాలకు సింగిల్ సెట్ నామినేషన్ దాఖలు కావడంతో కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించి డిక్లరేషన్ అందజేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తామన్నారు. నూతన కమిటీ.. ఏపీఏఎన్జీజీఓ జిల్లా నూతన కమిటీ అధ్యక్షునిగా జె.మాధవ్, కార్యదర్శిగా ఎ.రవికుమార్, అసోసియేట్ అధ్యక్షునిగా డి.చంద్రమోహన్, కోశాధికారిగా ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా పి.శ్రీధర్‌బాబు, జమీలాబేగం, అనంతయ్య, లక్ష్మీనారాయణ, లింగమేష్, దస్తగిరి ఎన్నియ్యారు. ఆర్గనైజింగ్ కాక్యదర్శిగా వెంకటేష్‌బాబు, సంయుక్త కార్యదర్శులుగా వెంకటరాముడు, లక్ష్మీనరసయ్య, వంశీబాబు, పద్మావతి, రుషికేష్, ఉమాశంకర్ ఎన్నికయ్యారు. నేడు అనంత వెంకటరెడ్డి వర్ధంతి అనంతపురం: జిల్లా రాజకీయ చిత్రపటంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని నేటి తరం రాజకీయ నేతలకు స్ఫూర్తిదాయంగా నిలిచిన మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి వర్ధంతి సోమవారం నిర్వహించనున్నారు. అనంతపురం సర్వజనాసుపత్రి ఎదురుగా ఉన్న అనంత వెంకటరెడ్డి విగ్రహం వద్ద ఉదయం 9 గంటలకు ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు నివాళి అర్పించనున్నారు. అనంతరం బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద ఉన్న అనంత వెంకటరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. -
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు
అనంతపురం సిటీ: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిపోతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులందరూ ఐక్యంగా ఉండి విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. అనంతపురం సమీపంలోని బీజీఆర్ ఫంక్షన్ హాలులో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ వైఎస్సార్‌టీఏ రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలు, స్టిక్కర్లను ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డితో కలసి అనంత ఆవిష్కరించారు. అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్, గౌరవాధ్యక్షుడు గోపాల్ హాజరయ్యారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో రూ.60 వేల కోట్లు ఖర్చుపెట్టి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా అందించారని తెలిపారు. పాఠశాలల్లో ఐఎఫ్‌పీ ప్యానల్ ఏర్పాటు చేయడం, విద్యార్థులకు కలర్‌ఫుల్ డెస్క్‌లు, బ్యాగులు సరఫరా చేశారని పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేశారన్నారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, ఐఆర్ ప్రకటించకపోగా, డీఏలు కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. రకరకాల యాప్‌లు, ప్రయోగాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులపై ఒత్తిళ్లు పెంచినట్లు దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులందరూ యూనియన్లకు అతీతంగా ఒక్కతాటిపై వచ్చి ఐక్య పోరాటాలు చేయకపోతే ఉనికి కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ వైఎస్సార్‌టీఏ రాష్ట్ర నాయకులు గోవిందరెడ్డి, రాధాకృష్ణారెడ్డి, వెంకటరమణప్ప, జిల్లా నాయకులు కృష్ణా నాయక్, చంద్రశేఖర్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, రామకృష్ణ, సురేశ్‌కుమార్‌రెడ్డి, ఓబిరెడ్డి, జిల్లా ట్రెజరర్ నారాయణ, ఆంథోనిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, మహేంద్ర, సాయినాథ్‌రెడ్డి, డాక్టర్ వెంకటరెడ్డి, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిరక్షణకు ఉపాధ్యాయులు ఉద్యమించాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
నేడు బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నిక
● కల్పన, నాగమణి మధ్య పోటీ బొమ్మనహాళ్: బొమ్మనహాళ్ మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) స్థానానికి సోమవారం ప్రత్యేకాధికారి గంగాధర్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించనున్నారు. రాజకీయ ఉద్రికత్తలు తలెత్తకుండా మండల కేంద్రంలో భారీగా పోలీసులు మోహరించి కట్టదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలో 16 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. ఎన్నిక చెల్లుబాటు కావాలంటే కనీసం 9 మంది హాజరు కావాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో ఎంపీపీ పదవికి ఉద్దేహాళ్ ఎంపీటీసీ సభ్యురాలు కరూరు కల్పన, ఉప్పరహాళ్ ఎంపీటీసీ సభ్యురాలు ముల్లంగి నాగమణి పోటీపడుతున్నారు. అయితే మండలంలో నెలకొన్న రాజకీయ సమీకరణలు, ఎంపీటీసీ సభ్యుల మద్దతు లెక్కలు పరిశీలిస్తే కరూరు కల్పనకే సృష్టమైన ఆధిక్యం ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. సభ్యులతో నిరంతర సంబంధాలు కొనసాగించడం మండల అభివృద్ది అంశాలపై సృష్టమైన దృష్టి ఉండటం కరూరు కల్పపనకు ప్రధాన బలంగా మారిందని సమాచారం. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు పర్యవేక్షణలో ముగ్గురు సీఐలు, పది మంది ఎస్ఐలు, 20 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 30 మంది కానిస్టేబుళ్లు, పది మంది మహిళా కానిస్టేబుళ్లు, 20 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. -
సహజ వనరుల దోపిడీ
అనంతపురం టౌన్: జిల్లాలో సహజ వనరుల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఐదేళ్ల క్రితం సీజ్ చేసిన క్వారీల్లోనూ ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలను పెట్టి రేయింబవశ్లూ ఖనిజాన్ని వెలికి తీస్తున్నా ఏ అదికారీ పట్టించుకోవడం లేదు. రూ.కోట్లలో జరిమానాల డిమాండ్ నోటీసులు అందుకున్న లీజుదారులు వాటిపై రివిజన్‌కు వెళ్లకుండానే స్థానిక ఎమ్మెల్యేల అండతో ప్రభుత్వానికి నయాపైసా చెల్లించకుండా అక్రమ తవ్వకాలు చేపట్టడం గమనార్హం. అనంతపురం రూరల్ మండలం చియ్యేడులో దాదాపు నాలుగు రోడ్డు మెటల్ క్వారీలు గతంలోనే అధికారులు సీజ్ చేశారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లులోనూ 9 క్వారీలకు జరిమానాలు విధించి నోటీసులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల్లోనూ జీరో పర్మిట్లతో ఏడాదిన్నరగా ఇష్ఠారాజ్యంగా రోడ్డు మెటల్‌ను వెలికి తీసి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం గనుల శాఖ అధికారులకు తెలిసినా అటుగా కన్నేత్తి చూసే సాహసం కూడా చేయలేక పోతున్నారు. జోరుగా ఎర్రమట్టి దందా.. జిల్లాలో ఎర్రమట్టి తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఈ క్రమంలో అక్రమార్కులు కన్ను పడిన కొండలు, గుట్టలు కాస్త కనుమరుగైపోతున్నాయి. గ్రావెల్ లీజు లేకుండానే అక్రమంగా మట్టిని జేసీబీలతో తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఆత్మకూరు మండలం వై కొత్తపల్లిలో 10 రోజులుగా హంద్రీ–నీవా కాలువ గట్టు పక్కనే ఉన్న గుట్టను కరిగించేశారు. బుక్కరాయసముద్రం, రాప్తాడు మండలాలతో పాటు కూడేరు మండలంలోని గొటుకూరులోనూ పెద్ద ఎత్తున ఎర్రమట్టి దందా కొనసాగుతోంది. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో మట్టిని తవ్వి వెంచర్లకు తరలిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. బుక్కరాయసముద్రం మండలంలో మట్టి తవ్వకాలు, తరలింపులకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులు కమీషన్లు దండుకుని, వాహనాలు పట్టుబడిన సమయంలో అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకెళ్లి ఎలాంటి వివాదం లేకుండా పరిష్కరిస్తున్నట్లు సమాచారం. అధికారం అండ చూసుకుని చెలరేగిన టీడీపీ నాయకులు సీజ్ చేసిన క్వారీలో అక్రమంగా ఖనిజం వెలికితీత గ్రావెల్ లీజు లేకున్నా ఎర్రమట్టి తవ్వకాలు కాలువ గట్లను చిధ్రం చేస్తున్న వైనం ప్రజాప్రతినిధుల అండతో యథేచ్ఛగా అక్రమాలు పట్టించుకోని గనులశాఖ అధికారులు చర్యలు తీసుకుంటాం ఇప్పటికే చియ్యేడు, నేమకల్లు ప్రాంతాల్లోని రోడ్డు మెటల్ క్వారీలపై ఫిర్యాదులు అందాయి. పూర్తి స్థాయిలో విచారణ అక్రమాలు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటాం. ఎర్రమట్టి రవాణా అక్రమాలను సైతం అడ్డుకుంటాం. – ఆదినారాయణ, డీడీ గనులశాఖ -
అరాచకాలకు ‘కాలవ’ ఆజ్యం
● వైఎస్సార్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ధ్వజం రాయదుర్గంటౌన్: వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అరాచకాలకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆజ్యం పోస్తున్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బొమ్మనహాళ్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ మూకల దాడితోపాటు తనపై కూడా దాడికి దిగిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనేందుకు చేతకాక దాడులు, బెదిరింపులతో గెలవాలనుకోవడం అధికార దుర్వినియోగంతోపాటు అరాచకత్వానికి పరాకాష్టగా అభివర్ణించారు. కాలవ అండదండలతోనే రెడ్‌బుక్ రాజ్యాంగం ముసుగులో బొమ్మనహాళ్‌లో టీడీపీ నాయకులు ముల్లంగి నారాయణస్వామి, ముల్లంగి భాస్కర్, రవి, మల్లికార్జున, తిమ్మరాజు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేసినట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీపీ అభ్యర్థి బీఫాంతో పాటు అనెగ్జర్ ఫారం 1, 2 సమర్పించేందుకు వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి శనివారం మధ్యాహ్నం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లామన్నారు. ఎన్నికల అధికారికి పత్రాలు సమర్పించి బయటకు రాగానే అక్కడికి వచ్చిన టీడీపీ మూకలు తమ నాయకులపై దాడి చేసి, తనపై కూడా దాడికి దిగి దుర్భాషలాడాయన్నారు. ఘటన తర్వాత టీడీపీ నాయకులు తిమ్మరాజు, మల్లికార్జునలు వైఎస్సార్సీపీ నాయకులకు ఫోన్ చేసి బెదిరించారన్నారు. ఈ ఘటనపై ఫొటోలు, వీడియోలు తీసిన ‘సాక్షి’ విలేకరి నుంచి ఫోన్ సైతం లాక్కొని పగులగొట్టేందుకు ప్రయత్నించి, చివరకు డేటాను డిలీట్ చేశారన్నారు. ఈ ఘటనపై ఆదివారం పార్టీ శ్రేణులు, జిల్లా అధ్యక్షుడితో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు బ్రహ్మానందరెడ్డి, రామాంజనేయులు, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి, జిల్లా ఉపాధ్యక్షుడు మారెన్న, సీనియర్ నాయకులు జయరామిరెడ్డి, కేశవరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, హళ్లి నాగరాజు, మండల కోఆప్షన్ సభ్యుడు దిలావర్బాషా తదితరులు పాల్గొన్నారు. -
మింగేస్తున్న నిర్లక్ష్యం!
కళ్యాణదుర్గం: భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) కాలువ పనుల వద్ద చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. పనులు చేస్తున్న ఎస్ఆర్సీ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ‘ఎస్ఆర్సీ’.. చిరుజీవుల పట్ల చిన్నచూపు వైఖరి ప్రదర్శిస్తోందనే ఆరోపణలున్నాయి. అంతా గప్‌చుప్.. ఇటీవల బోరంపల్లి– గంగవరం గ్రామాల మధ్య జరుగుతున్న బీటీపీ కాలువ పనుల వద్ద టిప్పర్ బోల్తా పడింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని ఎస్ఆర్సీ యాజమాన్యం కప్పిపుచ్చడం గమనార్హం. గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనను మరువక ముందే శుక్రవారం అర్ధరాత్రి బోరంపల్లి వద్ద ఉన్న క్యాంప్ సమీపంలో ఐజాక్స్ (కాంక్రీట్ కలిపే వాహనం) చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలు నవీన్ (26), ఇంద్రపాల్రామ్, మునేశ్వర్ తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద ఘటనపై ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధులకు ఫోన్లో సమాచారం ఇచ్చేందుకు గ్రామస్తులు యత్నించినా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చేసేదిలేక స్థానికులు క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించేలోపే నవీన్ అనే కూలీ మృత్యువాత పడడం గమనార్హం. గాయపడిన మరో ఇద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారమూ చేరవేయరు.. బీటీపీ కాలువ పనుల వద్ద వరుసగా ప్రమాదాలు జరుగుతుండడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. పొట్టకూటి కోసం బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన తమ వారు మృతువ్యాత పడుతుండటం ఆయా కుటుంబాలకు తీరని శోకం మిగులుస్తోంది. కార్మికులు మృత్యువాత పడినా బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంలో ఎస్ఆర్సీ యాజమాన్యం అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సర్వ సాధారణమట! వరుస ప్రమాదాలు జరుగుతున్నా, కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ చోద్యం చూస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే కార్మికులకు శాపంగా మారినట్లుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి ఘటనలు సర్వసాధారణమని కంపెనీ నిర్వాహకులు కార్మికుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి వద్ద కాలువలో బోల్తా పడిన టిప్పర్ (ఫైల్)ప్రమాదంలో గాయపడి మృతి చెందిన మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికుడు నవీన్ బీటీపీ కాలువ పనుల వద్ద వరుస ప్రమాదాలు పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోతున్న చిరుజీవులు చోద్యం చూస్తున్న ఎస్ఆర్సీ కంపెనీ యాజమాన్యం -
గ్యాస్ సిలిండర్ పేలుడు
● పది మందికి గాయాలు తాడిపత్రి రూరల్: గ్యాస్ గీజర్‌కు అమర్చిన సిలిండర్ నుంచి వస్తున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇంట్లోని వారితో పాటు మంటలు ఆర్పేందుకు వచ్చిన చుట్టుపక్కల వారు మొత్తం పది మంది గాయపడ్డారు. తాడిపత్రి సమీపంలోని గన్నెవారిపల్లికాలనీలో ఈ ఘటన జరిగింది. సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గన్నెవారిపల్లికాలనీలో నివాసం ఉంటున్న ఏకాంబరం.. ఇంటి కింది పోర్షన్‌ను జనార్దన్‌కు బాడుగకు ఇచ్చాడు. శనివారం రాత్రి బాత్రూంలోని గీజర్‌కు బిగించిన గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు రావడంతో జనార్దన్ గట్టిగా కేకలు వేశాడు. పై అంతస్తులో ఉన్న ఏకాంబరంతో పాటు చుట్టుపక్కల వారు మంటలను ఆర్పివేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో పెద్ద శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో జనార్దన్‌తో పాటు భార్య జ్యోతి, పిల్లలు చరణి, చరిత, ఇంటి యజమాని ఏకాంబరం, మంటలు ఆర్పడానికి వచ్చిన చుట్టుపక్కల వారు రాజేష్, నాగరంగయ్య, సాయిప్రశాంత్, ఉమాదేవి, పాలనరసింహులుకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం ఆనంతపురం పంపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అప్‌గ్రేడ్ స్టేషన్ సీఐ శివంగంగాధర్రెడ్డి తెలిపారు. -
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
అనంతపురం సిటీ: గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎస్కేయూ స్సోర్ట్స్ సెక్రటరీ జెస్సీ పిలుపునిచ్చారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పూజారి పద్మశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జెస్సీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తి చాటాలన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని ప్రిన్సిపాల్ పద్మశ్రీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సహదేవుడు, పీడీ శ్రీరాం పాల్గొన్నారు. పోలీసులపైనే దౌర్జన్యమా? అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అనుచరుడు పోలీసులపై దౌర్జన్యంగా వ్యవహరించడం హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులకే గౌరవం, రక్షణ లేని పరిస్థితి నెలకొందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎదుటే ఆయన వర్గీయులు సీఐని దుర్భాషలాడితే.. ఆయన తన వర్గానికే వత్తాసు పలకడం అప్రజాస్వామ్యానికి పరాకాష్ట అని అభివర్ణించారు. బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న ఓ ఎమ్మెల్సీ రౌడీలను ప్రోత్సహించడం సమంజసం కాదన్నారు. క్రమశిక్షణగా ఉండాల్సిన ఎమ్మెల్సీ ఇలాంటి వారికి అండగా ఉండడంతో పాటు సమాజంలో బ్లాక్ మెయిల్ ఎమ్మెల్సీగా చలామణి అవుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తక్షణమే పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లైంగిక వేధింపుల కేసులో మరో వ్యక్తి అరెస్ట్ రాప్తాడురూరల్: రాప్తాడు మండల పరిధిలోని చిన్మయనగర్ పంచాయతీ కళాకారుల కాలనీ సమీపంలో మైనర్ బాలుడిని లైంగికంగా వేధించిన కేసులో శనివారం రాప్తాడు పోలీసులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గతేడాది నవంబరులో కళాకారుల సమీపంలో ఓ మైనర్ బాలుడిని ముగ్గురు యువకులు లైంగికంగా వేధించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మూడో నిందితుడు ఎరుకుల గంగన్నను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. మధ్యలో ఆగి.. చుక్కలు చూపి కూడేరు: కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. ఆర్టీసీ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోతున్నాయి. శనివారం ఉరవకొండ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు అనంతపురం నుంచి ఉరవకొండకు వెళుతోంది. అందులో సుమారు 25 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. కూడేరు దాటిన తర్వాత ఇంజిన్ దగ్గర ఉన్న ఫ్యాన్ బెల్టు తెగిపోయి బస్సు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు మరో బస్సు కోసం పడిగాపులు కాశారు. చాలాసేపైనా మరో బస్సు రాకపోవడంతో చుక్కలు కనిపించాయని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని ఊదరగొట్టే అధికారులు బస్సులను మాత్రం కండీషన్లో పెట్టరంటూ ప్రయాణికులు మండిపడ్డారు. -
బైక్‌లో చీర ఇరుక్కుని మహిళ మృతి
బ్రహ్మసముద్రం: బైక్‌లో చీర ఇరుక్కుని కిందపడడంతో మహిళ మృతి చెందిన ఘటన బ్రహ్మసముద్రం మండలంలో జరిగింది. వివరాలు.. మండల పరిధిలోని బొమ్మగానిపల్లికి చెందిన హరిజన జీవిత (29), దొనతిమ్మప్ప దంపతులు. వీరికి ఒక కుమారుడు సంతానం. దంపతులి ద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. దొనతిమ్మప్ప కళ్యాణదుర్గంలో పెయింటింగ్ పనులకు వెళ్తుండగా, జీవిత అక్కడి ఓ హోటల్లో పనిచేస్తూ ఉండేది. దంపతులిద్దరూ తమ గ్రామం నుంచి నిత్యం బైకులో రాకపోకలు సాగిస్తుండేవారు. శుక్రవారం రాత్రి కళ్యాణదుర్గంలో పనులు ముగించుకుని స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయలుదేరారు. బాలావారి తోట సమీపంలో జీవిత చీర కొంగు ద్విచక్రవాహన చక్రంలో ఇరుక్కోవడంతో అదుపుతప్పి భార్యాభర్తలిద్దరూ కిందపడ్డారు. దొనతిమ్మప్పకు స్వల్ప గాయాలు కాగా జీవితకు తలపై బలమైన గాయం తగిలింది. వెంటనే దొనతిమ్మప్ప తన బైకులోనే జీవితను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ జీవిత మృతి చెందింది. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య మృతురాలి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. ఎంపీపీ కంభం చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, గోళ్ల సూరి, నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు అభిలాష్ రెడ్డి, సర్పంచ్ ఆదినారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేష్‌నాయక్ తదితరులు సంతాపం తెలియజేశారు. -
కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?
చీనీ టన్ను రూ.17 వేలు అనంతపురం మార్కెట్ యార్డులో శనివారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.17 వేలు, కనిష్టం రూ.10 వేలు పలికాయి. ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026రేపటి నుంచి డిపార్ట్మెంటల్ పరీక్షలు అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు డిపార్ట్మెంటల్ పరీక్షలు జరగనున్నాయని డీఆర్ఓ మలోల స్పష్టం చేశారు. ఐదు కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై డీఆర్ఓ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజూ రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు ఉంటాయని చెప్పారు. ఆరు రోజుల పాటు జరగనున్న పరీక్షలకు మొత్తం 2,488 మంది ఉద్యోగులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోలీసు బందోబస్తు కల్పించాలన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలన్నారు. రేపటిలోగా తత్కాల్ కింద ఇంటర్ ఫీజు చెల్లించొచ్చు అనంతపురం సిటీ: ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఈ నెల 5లోగా పరీక్ష ఫీజు చెల్లించొచ్చని ఇంటర్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం.వెంకటరమణనాయక్ శనివారం తెలిపారు. తత్కాల్ కింద రూ.5 వేల అపరాధ రుసుంతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు వివరించారు. ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు అనంతపురం సిటీ: ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలని, ఈ విషయాన్ని గమనంలో ఉంచుకొని చిత్తశుద్ధితో పని చేసి విద్యార్థులను జాతి రత్నాలుగా తీర్చిదిద్దాలని డీఈఓ ప్రసాద్‌బాబు కోరారు. ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (అప్టా) ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర నూతన క్యాలెండర్లు, డైరీలను డీఈఓ తన చాంబర్లో యూనియన్ ప్రతినిధులతో కలసి శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులనుద్దేశించి ఆయన పై విధంగా స్పందించారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఏడీ కడప మునీర్, డీసీఈబీ కార్యదర్శి గంధం శ్రీనివాసులు, ఆత్మకూరు ఎంఈఓ నరసింహారెడ్డి, అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోపాల్‌రెడ్డి, వెంకటరత్నం, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఆర్థిక కార్యదర్శి శంకర్మూర్తి పాల్గొన్నారు. అనంతపురం టవర్‌క్లాక్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండు సంవత్సరాలైంది. ఇప్పటి వరకు సామాజిక భద్రత కింద కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. అర్హులైన వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు తదితరులు పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం మాత్రం కొత్త పింఛన్లపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశంపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. శనివారం జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన అనంతపురంలో ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య ఎమ్మెల్సీలు వై.శివరామిరెడ్డి, భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, కలెక్టర్ ఆనంద్, జెడ్పీ సీఈఓ శివశంకర్ హాజరయ్యారు. బుక్కరాయ సముద్రం జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లవుతున్నా కొత్తగా సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేయలేదన్నారు. భర్త చనిపోతే భార్యకు వితంతు పింఛన్ ఇస్తున్నారు తప్ప కొత్తగా ఇచ్చినదేమీ లేదన్నారు. దరఖాస్తు చేయడానికి వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదంటూ మండిపడ్డారు. దీనికి అధికారులు స్పందించకనే ఎంపీ బీకే పార్థసారథి కల్పించుకుని పింఛన్లపై విచారణ చేపట్టి బోగస్ ఏరివేసిన తర్వాత కొత్తవి ఇస్తామని బదులిచ్చారు. తొలగింపులు సరే కొత్తవి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని మిగతా సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఎంపీ పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో సభ్యులు వాగ్వాదానికి దిగారు. ప్రజారోగ్యం పట్టదా? రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజారోగ్యం గురించి పట్టదా అని పలువురు సభ్యులు నిలదీశారు. ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామని ఎంపీ బీకే పార్థసారథి తెలపగా.. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేదల నుంచి బిల్లులు కట్టించుకుంటున్నారని శివరామిరెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించే ప్రైవేట్ ఆస్పత్రుల పేర్లను సూచించే బోర్డులను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలన్నారు. పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నా డబ్బు కట్టించుకుని వైద్యం చేస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఎటువంటి ప్రణాళికలు తయారు చేశారని ప్రశ్నించారు. దాదాపు 750 పనులకుగాను 400 పూర్తి చేశామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్ సమాధానమిచ్చారు. కొనకొండ్ల పంచాయతీలో ఇప్పటి వరకు పనులే పూర్తి చేయలేదని శివరామిరెడ్డి తెలపగా.. త్వరలోనే పూర్తి చేస్తామని ఎస్ఈ హామీ ఇచ్చారు. అనంతపురం జెడ్పీటీసీ చంద్ర మాట్లాడుతూ జిల్లాలో 108 అంబులెన్సులు సరైన సమయానికి రావడం లేదన్నారు. జిల్లాలో ఎన్ని అంబులెన్సులు ఉన్నాయి.. ఎన్ని పనిచేస్తున్నాయో చెప్పాలని కోరారు. అధికారులు స్పందిస్తూ 108 అంబులెన్సులను థర్డ్ పార్టీకి ఇచ్చామని, త్వరలోనే సమస్య కొలిక్కి వస్తుందని చెప్పారు. జిల్లాపరిషత్ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు వేతనాలు సక్రమంగా రావడం లేదని, కుటుంబ పోషణకు వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమావేశం దృష్టికి తెచ్చారు. సత్యసాయి తాగునీటిని ఏ విధంగా సరఫరా చేస్తారో పంచాయతీ నీరు అంతే సురక్షితంగా అందించాలని కోరారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకుంటే ఆమరణరదీక్ష అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరాలో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకుంటే కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణదీక్ష చేస్తానని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. తల్లీబిడ్డలకు అందించే కోడిగుడ్లను నెలలో ఐదు రోజులు కూడా సరఫరా చేయలేదన్నారు. ఇటువంటి వారిని క్షమించరాదన్నారు. కార్యక్రమంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. శిక్షణకు వెళ్లనున్న కలెక్టర్ ఆనంద్అనంతపురం అర్బన్: ఐఏఎస్ అధికారులకు ఇచ్చే మిడ్ కేరీర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇవ్వనున్న శిక్షణకు కలెక్టర్ ఆనంద్ హాజరుకానున్నారు. ఈ నెల 5 నుంచి 30వ తేదీ వరకు ముస్సోరీలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఏఏ)లో శిక్షణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం బయలుదేరి వెళ్లనున్నారు. కలెక్టర్ తన శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేవరకు ఇన్చార్జ్ కలెక్టర్‌గా జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. స్టూడెంట్ను కొట్టారని మహిళా టీచర్‌పై దాడి గుంతకల్లుటౌన్: విద్యార్థినిని కొట్టారని ఆగ్రహోదగ్రులైన కుటుంబ సభ్యులు పాఠశాలలోకి చొరబడి మహిళా టీచర్‌పై మూకుమ్మడిగా దాడిచేసిన ఘటన గుంతకల్లులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఉమామహేశ్వరనగర్లోని కాంతి కిరణ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో శనివారం మధ్యాహ్నం భోజన విరామానికి గంట కొట్టగానే విద్యార్థులు క్లాసుల్లోంచి తోసుకుంటూ బయటకు వచ్చారు. గమనించిన గౌసియా అనే టీచర్ క్యూలో వెళ్లండంటూ మూడో తరగతి విద్యార్థిని ఆస్మాతో పాటు మరికొంతమంది విద్యార్థులను బెత్తంతో కొట్టింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని ఆస్మా తల్లిదండ్రులు, బంధువులు మూకుమ్మడిగా పాఠశాలలోకి చొచ్చుకొచ్చారు. అక్కడ అందరి ముందూ టీచర్ గౌసియాపై దాడిచేశారు. కరస్పాండెంట్ ఊరెళ్లారని, వచ్చాక మాట్లాడుదామని సర్దిచెప్పబోయిన ఓ విద్యార్థి తల్లితోపాటు ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఇర్ఫాన్, సిద్దసాయిపైనా వారు చేయిచేసుకున్నారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు స్కూల్‌కు చేరుకుని విద్యార్థిని బంధువులు, స్కూల్ టీచర్లను పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. ఉద్దేశపూర్వకంగానే టీచర్ బెత్తంతో కొట్టి తమ కూతురు చేయిని గాయపరిచిందని తల్లిదండ్రులు ఆరోపించారు. సీఐ మనోహర్ జరిగిన ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు, టీచర్లను విచారణ చేశారు. అదే సమయంలో టీచర్ గౌసియా సీఐ చాంబర్లో కళ్లు తిరిగి కిందపడిపోవడంతో ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పంపించారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన తర్వాత కేసు నమోదు చేస్తామని సీఐ చెప్పారు. సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా టీచర్స్ డేగా జరుపుకున్న రోజునే టీచర్‌పై దాడి జరగడాన్ని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. చేతి గాయాన్ని చూపుతున్న విద్యార్థిని, టీచర్‌ను విచారణ చేస్తున్న సీఐబెదిరింపు ఆర్డీటీ రెన్యూవల్‌పై ఎంపీ తడబాటు 108 అంబులెన్సులు సకాలంలో రావడం లేదు ఆరోగ్యశ్రీ సేవలందక పేదల జేబులకు చిల్లు జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ధ్వజం ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకపోవడంతో పేదలకు సేవా కార్యక్రమాలు అందడం లేదని పలువురు సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ ఎప్పు చేయిస్తారని ప్రశ్నిస్తే.. ఎంపీ బీకే పార్థసారథి స్పందిస్తూ గత ప్రభుత్వంలో ఆర్డీటీని నిర్వీర్యం చేస్తే తాము ఇప్పుడు రెన్యూవల్ చేయించామని చెప్పారు. ఆర్డీటీకి ఇప్పటి వరకూ రెన్యూవల్ ఉత్తర్వులు రాకపోతే తప్పుడు సమాధానం ఎలా చెప్తారని సభ్యులు నిలదీశారు. తడబాటుకు గురైన ఎంపీ.. త్వరలో రెన్యూవల్ చేయిస్తాం అంటూ పొంతన లేని సమాధానం చెప్పారు. కేరళలో పేదరిక నిర్మూలన విజయవంతంగా చేపట్టారని, అక్కడ అనుసరించిన విధానాలను ఏపీలోనూ అమలు చేయాలని నల్లమాడ జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డి కోరారు. దీనికి ఎంపీ బీకే కల్పించుకొని గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని, అప్పులు చేయడంతో లోటుబడ్జెట్లో ఉందని, తమ ప్రభుత్వం సంపద సృష్టించి.. అభివృద్ధి చేస్తుందని అన్నారు. దీంతో పలువురు సభ్యులు ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వంలో అప్పులు ఎన్ని.. మీ రెండేళ్ల పాలనలో ఎంత అప్పు చేశారో మీకు తెలియదా అని చురకలంటించారు. -
జ్వరంతో విద్యార్థిని మృతి
పెద్దవడుగూరు: జ్వరంతో విద్యార్థిని మృతి చెందిన ఘటన మండల పరిధి లోని క్రిష్టిపాడు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రఘురామ్ కుమార్తె యశ్వకీర్తి (15) యాడికి మండలం తూట్రాళ్లపల్లి మోడల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 15 రోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో బాలికను ఉపాధ్యాయులు ఇంటికి పంపించారు. స్థానిక ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోవడంతో కుటుంబీకులు యశ్వకీర్తిని కర్నూల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. గుండెకు నీరు చేరిందని నిర్ధారించిన అక్కడి డాక్టర్లు చికిత్స కొనసాగించారు. అయితే, చికిత్స ఫలించక యశ్వకీర్తి మృతి చెందింది. శనివారం మధ్యాహ్నం మృతదేహానికి స్వగ్రామం తీసుకొచ్చారు. మృతదేహం వద్ద స్నేహితులు, టీచర్లు నివాళులర్పించారు. -
ధర పెంచి.. కార్డుదారులను వంచించి
అనంతపురం అర్బన్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు గోధుమపిండి పంపిణీని చంద్రబాబు ప్రభుత్వం ఈ నెల నుంచి ప్రారంభించింది. అయితే అది ఒక్క జిల్లా కేంద్రంలోని కార్డుదారులకే పరిమితం చేసి, గ్రామీణ ప్రాంత పేదలను నిరాశపర్చింది. అదికూడా రేషన్ పంపిణీ ప్రారంభమై మూడు రోజులైనా సగం దుకాణాలకు గోధుమపిండి అందనేలేదు. అయినా సరే గొప్పలు చెప్పుకోవడంలో సర్కారు తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కిలో గోధుమపిండి రూ.16కు అందిస్తే.. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రూ.4 పెంచి కిలో రూ.20 వసూలు చేస్తోంది. ధర పెంచిన సర్కారు నయవంచనపై కార్డుదారులు భగ్గుమంటున్నారు. కందిపప్పు పంపిణీకి మంగళం చౌక దుకాణాల ద్వారా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కార్డుదారులకు క్రమం తప్పకుండా ప్రతినెలా కిలో కందిపప్పును రూ.67తో పంపిణీ చేస్తూ వచ్చింది. కార్డుదారులకు కిలో చొప్పున ప్రతి నెల జిల్లా కోటా 625 టన్నులు ఉండింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కందిపప్పు పంపిణీకి మంగళం పాడింది. కందిపప్పు కొనుగోలుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదంటూ అధికారులు ఐదారు నెలలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఈలోగా కార్డుదారులు ఆ విషయాన్నే మర్చిపోయారు. ఇదే అదనుగా కందిపప్పు పంపిణీ అంశాన్ని ప్రభుత్వం పూర్తిగా మరుగునపడేసింది. జొన్నలు, రాగులదీ అదేదారి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతినెలా జొన్నలు, రాగులును కార్డుదారులకు పంపిణీ చేస్తూ వచ్చింది. జిల్లాకు ప్రతి నెల జొన్నలు కోటా 1,100 టన్నులు, రాగులు కోటా 1,100 టన్నులు ఉండింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్క సరుకూ తగ్గిస్తూ వచ్చింది. తొలుత కందిపప్పు పంపిణీకి మంగళం పాడి... జొన్నలు, రాగుల పంపిణీని అదే దారి పట్టించింది. ప్రస్తుతం ఎక్కడా జొన్నలు, రాగులూ ఇవ్వకపోయినా అధికారులు మాత్రం కొన్ని దుకాణాలకు సరఫరా చేస్తున్నామంటూ చెప్పుకొస్తుండడం విడ్డూరంగా ఉంది. జిల్లా కేంద్రానికే గోధుమ పిండి పరిమితం సగానికిపైగా చౌక దుకాణాలకు నేటికీ చేరని సరుకు రేషన్‌లో కందిపప్పు, జొన్నలు, రాగులకు మంగళం పాడిన ప్రభుత్వం -
మీ పిల్లలకూ ఇలాగే వండిపెడతారా?
ఆత్మకూరు: ‘అంగన్వాడీ కేంద్రాల్లో మిమ్మల్ని నమ్మి పిల్లల్ని వదిలి వెళ్తున్నాం. అలాంటి పిల్లలను పశువుల కంటే హీనంగా చూస్తున్నారు. ఎలా పడితే అలా వంటలు వండిపెడుతున్నారు. మీ పిల్లలైతే వారికీ ఇలాగే చేస్తారా..?’ అంటూ ఆత్మకూరు భగత్‌సింగ్ కాలనీ వాసులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 8వ అంగన్ వాడీ సెంటర్లో మెనూ అమలు చేయడం లేదని, సిబ్బంది సమయ పాలన పాటించలేదని స్థానికులు ఫిర్యాదు చేయడంతో శనివారం ఎంపీడీఓ లక్ష్మినరసింహ, సీపీడీఓ ఉమాశంకరమ్మ సదరు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లులు, లబ్ధిదారులు మాట్లాడుతూ రోజూ రూ.5 విలువ చేసే పులిహోర ప్యాకెట్ తీసుకువచ్చి వండుతున్నారని ఆరోపించారు. నిత్యం పులిహోర, చిత్రాన్నం తప్ప వేరేది వండ డం లేదని, ఇలా అయితే పిల్లల్ని ఎందుకు అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని ప్రశ్నించారు. ఉదయం 9 గంటలకు తీయాల్సిన అంగన్వాడీ కేంద్రాలను 11 గంటలకు తీసి మధ్యాహ్నం 2 గంటలకే మూసేస్తున్నారని తెలిపారు. కుళ్లిపోయిన కూరగాయలతో వండుతున్నారన్నారు. మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో పిల్లల్ని బయటకు పంపుతున్నారని, ఈ క్రమంలో పిల్లలకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని మండిపడ్డారు. మరుగుదొడ్ల శుభ్రత, మరమ్మతులకు రూ.3 వేలు వస్తే ఏం చేశారు అని ఎంపీడీఓ అంగన్వాడీ కార్యకర్తను ప్రశ్నించగా, ఆమె సరైన సమాధానం చెప్పలేకపోయారు. రెండు రోజుల నుంచి తాను 8వ సెంటర్‌ను పరిశీలిస్తున్నానని గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంలో సగం సగం ఇస్తే ఎలా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పిల్లలకు అందించే సరుకులు లేకపోతే ఎలా వండిపెడతారని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఎస్‌డీటీ లక్ష్మిదేవి, సూపర్వైజర్ లావణ్య పాల్గొన్నారు. -
అందరివాడికి అశ్రునివాళి
రాప్తాడురూరల్: ఎక్కడ పుట్టాడో తెలీదు. ఏ ఊరో తెలీదు. తెలుగు భాష అసలేరాదు...‘మా’ అనే పదం తప్ప ఆయన నోటి నుంచి ఇతరమాట వచ్చేదికాదు. అయినా ఆ ఊరందరికీ దగ్గరయ్యాడు. అలాంటి వ్యక్తి చనిపోయిన విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా కులమతాలకతీతంగా అంత్యక్రియలు నిర్వహించడం ఆసక్తి కలిగించింది. వివరాలు.. 42 ఏళ్ల క్రితం అనంతపురం రూరల్ మండలం కృష్ణంరెడ్డిపల్లికి ఓ వ్యక్తి వచ్చాడు. కృష్ణంరెడ్డిపల్లిలో చావిడిలో ఉండేవాడు. సమీప తోటలు, బోరుబావుల వద్ద స్నానం చేసేవాడు. ఇళ్లవద్దకు వెళ్లి వారు ఏమైనా పెడితే తీసుకుని వచ్చి తిని అక్కడే పడుకునేవాడు. కొత్తలో గ్రామస్తులు వింతగా చూసేవారు. తొలినాళ్లలో ముఖ్యంగా మహిళలు ఆయనను చూసి భయపడేవారు. అయితే ఎవరినీ పల్లెత్తు మాట మాట్లాడకపోవడంతో అందరూ అలవాటయ్యారు. ఎవరి ఇంటివద్దకు వెళ్లినా ఆదరించి భోజనం పెట్టేవారు. దుస్తులు తీయించేవారు. చిన్న వయసు పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అలవాటయ్యాడు. ఆంగ్లేయుడిలా ఉన్న కారణంగా ‘బ్రిటీష్’ అని నామకరణం చేశారు. ప్రభుత్వ రికార్డుల్లోనూ అదే పేరు ఎక్కించి పింఛను వచ్చేలా చేశారు. అనారోగ్యానికి గురై... నెల రోజులుగా బ్రిటీష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సుమారు 93 ఏళ్ల వయసు మీద పడడంతో శరీరం సహకరించక ఇబ్బందులు పడుతూ వస్తున్నాడు. కొందరు గ్రామస్తులు ధర్మవరం ఆస్పత్రిలో చూపించారు. చివరి రోజుల్లో చావిడికే పరిమితమయ్యాడు. శుక్రవారం రాత్రి కూడా గ్రామస్తులు పలకరించారు. తెల్లారేసరికి కన్నుమూశాడు. మతాలు, కులాలకు అతీతంగా.. బ్రిటీష్ మృతి చెందాడనే సమాచారంతో గ్రామస్తులంతా ఏకమయ్యారు. మతాలు, కులాలకు అతీతంగా కలసికట్టుగా అంత్య క్రియల్లో పాల్గొన్నారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు పాడె మోశారు. గ్రామంలో దాదాపు ప్రతి ఇంటికీ బ్రిటీష్‌తో అనుబంధం ఉంది. ఎక్కడో పుట్టి..ఇక్కడికి వచ్చి 42 ఏళ్ల పాటు అందరికీ సుపరిచితుడులా మారిన బ్రిటీష్ మరణాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు. -
‘అనంత పాలధార’ పోస్టర్ల విడుదల
అనంతపురం అగ్రికల్చర్: ఈ నెల 7వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి వేదికగా నిర్వహిస్తున్న ‘అనంత పాలధార’ పోటీలను విజయవంతం చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులను జేసీ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో పశుశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్‌తో కలసి అనంత పాలధార పోస్టర్లను ఆయన విడుదల చేసి, మాట్లాడారు. రాయలసీమలోనే తొలిసారిగా ఇలాంటి కార్యక్రమ నిర్వహణకు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. మెరుగైన పశుజాతుల పెంపకం, పాడి ఉత్పత్తి పెంపు, పాడి పోషణలో శాసీ్త్రయ పద్ధతులు పాటించడం, కృత్రిమ గర్భధారణ, పశు ఆరోగ్య సంరక్షణ తదితర అంశాలపై పాడి రైతుల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో పాల దిగుబడి పోటీలు, లేగ దూడల ప్రదర్శన, గర్భకోశవ్యాధి శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో విజేతలను అభినందిస్తూ బహుమతులు కూడా అందజేస్తారని, ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొనేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పశుశాఖ డీడీలు రమేష్‌రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, రత్నకుమార్, గోల్డ్స్మన్ పాల్గొన్నారు. -
స్వచ్ఛతా సేవలో సత్యసాయి భక్తులు
పుట్టపర్తి అర్బన్: ‘అందరినీ ప్రేమించు..అందరినీ సేవించు’ అన్న సత్యసాయి సూక్తిని ఆయన భక్తులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు పుట్టపర్తికి విచ్చేసిన పలువురు విదేశీయులు శుక్రవారం సామాజిక సేవలో తరించారు. సుమారు నెలన్నర నుంచి పుట్టపర్తిలో వసతి గదుల్లో ఉంటున్న రష్యా, కజికిస్తాన్ తదితర దేశాలకు చెందిన 15 మంది బాబా భక్తులు సత్యసాయి బాబా నడయాడిన చిత్రావతి నదిలో శుభ్రం చేశారు. చెత్తా చెదారం, ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు, మురిగిపోయిన అట్టపెట్టెలు, కవర్లు తొలిగించారు. స్వచ్ఛ చిత్రావతికి విదేశీయులు చేస్తున్న కృషిని చూసి స్థానికులు కూడా స్ఫూర్తి పొందారు. తాము కూడా స్వచ్ఛ చిత్రావతికి శ్రీకారం చుడతామని తెలిపారు. చిత్రావతిని శుభ్రం చేసిన రష్యా, కజికిస్తాన్ దేశస్తులు -
‘రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచకాలు’
అనంతపురం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి విమర్శించారు. అనంతపురంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యల్లనూరు జెడ్పీటీసీ భోగాతి ప్రతాపరెడ్డిపై టీడీపీ గూండాలు చేసిన దాడిని ఖండించారు. ఈ దాడి ముమ్మాటికీ రెడ్‌బుక్‌లో భాగంగానే జరిగిందన్నారు. శింగనమల నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయనేందుకు ఇదే గొప్ప ఉదాహరణ అన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులే కొందరు టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ దాడులను ప్రోత్సహించడం బాధాకరమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కనుసన్నల్లోనే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులపై దాడు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రశ్నిస్తానన్న జనసేనానీ నోటికి తాళం వేసుకున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే.. డిప్యూటీ సీఎం పదవి పోతుందనే భయంతో పవన్‌కళ్యాణ్ ఉన్నారని ప్రజలందరూ విశ్వసిస్తున్నారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ లేకుండా చేసేందుకు వైఎస్సార్సీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసేలా దాడులు సాగిస్తున్నారని ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. -
ప్రాణాంతక వ్యాధులను సకాలంలో గుర్తించండి
● ప్రయోగశాలల సిబ్బందికి పశుశాఖ జేడీ ప్రేమ్‌చంద్ ఆదేశం అనంతపురం అగ్రికల్చర్: పశువుల్లో సంక్రమించే ఆంత్రాక్స్, లంబీస్కిన్, బర్డ్‌ఫ్లూ, స్వైన్‌ఫ్లూ, రేబీస్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, ఇతరత్రా వ్యాధులు ప్రబలకుండా ప్రాథమిక స్థాయిలో గుర్తించేలా ప్రయోగశాలల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక సాయినగర్‌లో ఉన్న పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (అనియల్ డిసీసెస్ డయోగ్నస్టిక్ ల్యాబ్–ఏడీడీఎల్)లో ఏడీ డాక్టర్ జి.రవిబాబు, వీఏఎస్ డాక్టర్ శ్రుతితో కలిసి ఉమ్మడి జిల్లా పరిధిలోని నియోజక వర్గ స్థాయి వెటర్నరీ ల్యాబ్ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. పశువులు, జీవాలు, కోళ్లు, ఇతర మూగజీవాలకు వ్యాపించే వివిధ రకాల వ్యాధులు, వాటి నిర్ధారణకు సేకరించే రక్తం, పేడ, అవయవ నమూనాలు, వాటిని పరీక్షించే విధానం, వ్యాధిని ప్రాథమికంగా నిర్ధారించడం, తీసుకోవాల్సిన నివారణ చర్యలను వివరించారు. రక్తపరీక్షలు, బయోకెమికల్ పరీక్షలు, పాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆంత్రాక్స్ లాంటి బ్యాక్టీరియల్ ప్రాణాంతక, ప్రమాదకర వ్యాధులు, వైరల్ పరీక్షలపై ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. పశువులు, జీవాల్లో మరణాలు సంభవించకుండా రైతులు నష్టపోకుండా పకడ్భందీగా పనిచేయాలని ఆదేశించారు. ప్రయోగశాలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించి పరికరాలు అందజేశారు. ఇంకా అవసరమైన సామగ్రికి సంబంధించి ప్రతిపాదనలు పంపాలని ఏడీకి సూచించారు. -
ప్రపంచ తెలుగు మహాసభలకు విష్ణుభగవాన్
యాడికి: ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరు వేదికగా శనివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రాతినిథ్యం వహించాలంటూ యాడికి చెందిన కానిస్టేబుల్ విష్ణుభగవాన్కు ఆహ్వానం అందింది. పురాతన నాణేలను సేకరించి వాటిని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రదర్శిస్తూ వాటి చరిత్రపై ప్రజలు, విద్యార్థులను విష్ణుభగవాన్ చైతన్య పరుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ తెలుగు మహాసభల్లో పురాతన నాణేలను ఆయన ప్రదర్శించనున్నారు. జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపిక అనంతపురం కార్పొరేషన్: ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు చైన్నెలో జరిగే 75 సీనియర్ బాస్కెట్‌బాట్ నేషనల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో జిల్లాకు చెందిన ఇద్దరు చోటు దక్కించుకున్నారు. వీరిలో పురుషుల విభాగంలో ద్వారకనాథ్, మహిళల విభాగంలో పరిమళ ఉన్నారు. వీరి ఎంపికపై జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి నరేంద్ర చౌదరి, కోశాధికారి హబీబుల్లా హర్షం వ్యక్తం చేశారు. విద్యుదాఘాతంతో టిప్పర్ డ్రైవర్ మృతి తాడిపత్రి టౌన్: విద్యుత్ షాక్‌తో ఓ టిప్పర్ డ్రైవర్ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్నూలు జిల్లా అవుకు గ్రామానికి చెందిన శివరాముడు (40)కు భార్య మల్లేశ్వరి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. టిప్పర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం టిప్పర్ సర్వీసింగ్ కోసమని తాడిపత్రికి వాహనాన్ని తీసుకువచ్చిన అతను కడప మార్గంలో ఉన్న గాలి మిషన్ ట్రాలీకి గ్రీసు వేయించేందుకు లిఫ్ట్ ఎత్తాడు. దీంతో పైనున్న 11 కేవీ విద్యుత్ లైన్ తగులుతుండగా గమనించి వెంటనే కిందకు దూకాడు. అప్పటికే షాక్‌కు గురైన శివరాముడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన చుట్టుపక్కల వారు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక రాత్రి శివరాముడు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 7న ఉద్యోగ మేళా అనంతపురం: సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి ఈ నెల 7న అనంతపురంలోని ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపికై న వారికి 30 రోజుల పాటు కొడికొండ చెక్ పోస్టు, హిందూపురంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యంతో శిక్షణ అందించనున్నారు. అనంతరం ప్రభుత్వ సర్టిఫికెట్తో పాటు వివిధ సంస్థల్లో సెక్యూరిటీ గార్డు, సూపర్వైజర్ పోస్టులను కల్పించనున్నారు. -
నిధులు జేబులోకి.. పనులు గాలికి
పుట్టపర్తి అర్బన్: బాబా శత జయంతి ఉత్సవాలకు పర్యాటక శాఖ ద్వారా రూ.10 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అయితే ఈ నిధులు ఏ మేరకు అందిందీ పర్యాటక శాఖ అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీంతో మున్సిపాలిటీ, పుడా ఆధ్వర్యంలో రూ.4కోట్లకు పైగా నిధులతో పాటు పెద్ద మొత్తంలో భక్తులు అందించిన విరాళాలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ క్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భారీగా ఖర్చు చేసి ఉత్సవాలను విజయవంతం చేసింది. ఇవన్నీ ప్రభుత్వం ఖాతాలోకి వేసుకొని తామే ఉత్సవాలను గొప్పగా నిర్వహించామన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు ప్రెస్మీట్లు పెట్టి మరీ బిల్డప్లిచ్చారు. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తులు సేదతీరేలా చిత్రావతి నది ఒడ్డున సత్యసాయి పార్కు నిర్మాణానికి జోయాలుక్కాస్ యజమాని సుమారు రూ.1.20 కోట్లు విరాళమిచ్చి సహకరించారు. ఈ నిర్మాణ పనుల కాంట్రాక్టును టీడీపీ నాయకులు దక్కించుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. చివరకు ఉత్సవాలు సమీపిస్తుండడంతో హడావుడిగా జోయాలుక్కాస్ యజమాని, తదితరులతో కలసి పార్కును ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి ప్రారంబించారు. నేటికీ అసంపూర్తిగానే.. శత జయంతి ఉత్సవాలు ముగిసి నెలకు పైగా కావస్తోంది. అయినా అభివృద్ధి పనులు అసంపూర్తిగానే మిగిలి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. పార్కుకు సంబంధించి వంద శాతం పనులు అయిపోయినట్లుగా టీడీపీ నేతలు రికార్డులు చూపి మున్సిపాలిటీకి అప్పగించి బిల్లులు చేసుకున్నారు. అనంతరం మిగులు పనులు, నిర్వహణను గాలికి వదిలేశారు. దీంతో నాటిన మొక్కలు నీరందక చనిపోయాయి. మరుగుదొడ్లు కాస్త పాత సామగ్రి భద్రపరిచే గదుల్లా మారిపోయాయి. పార్కులో ఏర్పాటు చేసిన రెండు ఫౌంటెన్లలో ఐదు మోటార్లకు అనుసంధానించిన కేబుల్‌ను దుండగులు అపహరించుకెళ్లడంతో అవి కాస్త దిష్టిబొమ్మల్లా మిగిలిపోయాయి. నీరు అందకపోవడంతో పార్కులో పచ్చదనం కరువైంది. ఫలితంగా జోయాలుక్కాస్ యజమాని అందించిన రూ.1.20 కోట్ల విరాళం నిష్ప్రయోజనంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణదశలోనే ఫుడ్‌కోర్టు.. పార్కు పక్కనే ఫుడ్ కోర్టు నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఇది నిర్మాణ దశలోనే ఉండిపోయింది. పనుల కోసం సమీకరించిన ఇటుకలు అక్కడే పడేశారు. దీనికి తోడు విరిగిన బండలు కూడా అక్కడే పడేయడంతో ఆ ప్రాంతంలో అపరిశుభ్రత తాండవిస్తోంది. నాసిరకం పనుల కారణంగా విద్యుత్ కేబుల్ ఎక్కడికక్కడ బయట పడింది. పిల్లలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వాటిని తాకితే ప్రమాదం చోటు చేసుకునే అవకాశముంది. పార్కు పక్కన ప్రధాన రోడ్డుపై భక్తులు నడవడానికి వేసిన టైల్స్ చాలా వరకూ పగిలి పోయాయి. నాసిరకం పనులతో పలువురు భక్తులు ఇచ్చిన విరాళాలను సైతం స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. ప్రపంచ దేశాల భక్తులు తమ ఆరాధ్యదైవంగా కొలిచే సత్యసాయి శత జయంతి ఉత్సవాలను సైతం టీడీపీ నేతలు తెలివిగా సొమ్ము చేసుకున్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సొంత ఖజానాకు మళ్లించి సొమ్ము చేసుకున్నారు. ఆనవాయితీగానే సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భారీ ఖర్చుతో ఉత్సవాలను విజయవంతం చేసింది. ఇది జగమెరిగిన సత్యం. శతజయంతి వేడుకల సందర్భంగా సత్యసాయి పార్కు ఏర్పాటుకు చర్యలు పార్కులో అభివృద్ధి పనులకు విరాళమిచ్చిన జోయాలుక్కాస్ హడావుడి పనులతో మమ అనిపించిన టీడీపీ నాయకులు నిర్వహణకు తిలోదకాలివ్వడంతో ఎండిన మొక్కలు బిల్లులు చేసుకుని పనిని అటకెక్కించిన వైనం -
ఆ ఉపాధ్యాయుడు మాకొద్దు
అనంతపురం సిటీ: బాధ్యతలు విస్మరించిన ఉపాధ్యాయుడు లింగమయ్యచౌదరిపై కుందుర్పి మండలం ఎస్.మల్లాపురం ప్రాథమిక పాఠశాల కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు తరచూ డుమ్మా కొడుతున్నారని, ఆయన నిర్వాకం వల్ల పిల్లలు చదువు సంధ్యలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఉపాధ్యాయుడు తమకు అవసరం లేదని శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డీఈఓ ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. లింగమయ్యచౌదరి స్థానంలో మరొక ఉపాధ్యాయుడిని నియమించాలని వారు కోరారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఈఓ హామీ ఇచ్చారు. డీఈఓను కలిసిన వారిలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ బాలాజీ, కమిటీ సభ్యులు గోపాల్‌నాయక్, హనుమంతరాయుడు, దేవేంద్ర, చంద్రశేఖర్, రమేశ్, భరత్, బాలు ఉన్నారు. -
9 నుంచి సాంస్కృతిక జాతా : సీపీఐ
అనంతపురం అర్బన్: సీపీఐ వందేళ్ల వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 18న చలో ఖమ్మం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ జిల్లావ్యాప్తంగా సాంస్కృతిక జాతా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అలాగే ఈ నెల 27, 28 తేదీల్లో నాట్యమండలి ఆధ్వర్యంలో జిల్లా శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కుళ్లాయప్ప, నిర్మాణ బాధ్యుడు జి.గోపాల్. జిల్లా సహాయ కార్యదర్శి రాజారెడ్డి, నాయకులు మల్లికార్జున, చండ్రాయుడు, పుల్లయ్య పాల్గొన్నారు. అండర్ –23 రాష్ట్ర క్రికెట్ ప్రాబబుల్స్‌కు జిల్లా క్రీడాకారులు అనంతపురం కార్పొరేషన్: అండర్ –23 సీనియర్ మహిళల రాష్ట్ర క్రికెట్ ప్రాబబుల్స్‌కు జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారిణులు ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపికై న వారిలో బి.అనూష, ఎన్.హరిత, బి.నేహ, ఎస్.అర్షియా నేహ, ఎ.హన్సిరెడ్డి ఉన్నారు. వీరు ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకూ శ్రీకాకుళం జిల్లా విజయనగరంలో జరిగే ప్రాబబుల్స్ మ్యాచ్‌ల్లో పాల్గొననున్నారు. విద్యార్థిని అభినందించిన డీవీఈఓ అనంతపురం కార్పొరేషన్: అండర్ –19 జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ద్వితీయ సంవత్సర విద్యార్థి అమర్ ఎంపికయ్యాడు. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జాతీయస్థాయి పోటీలు జరగనున్నాయి. పోటీలకు ఎంపికై న అమర్‌ను డీవీఈఓ వెంకటరమణనాయక్ తన కార్యాలయంలో శుక్రవారం అభినందించారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. యువకుడి దుర్మరణం రాయదుర్గం టౌన్: స్థానిక అనంతపురం మార్గంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన మేరకు... రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లి గ్రామానికి చెందిన మారుతి (30) వ్యక్తిగత పనిపై శుక్రవారం రాయదుర్గం వచ్చాడు. పని ముగించుకుని మధ్యాహ్నం 3 గంటలకు ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. పట్టణ శివారున అనంతపురం మార్గంలో జాతీయ రహదారి సర్వీసు రోడ్డు పై వెళుతుండగా కుక్క అడ్డుగా రావడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మృతదేహాన్ని రాయదుర్గం ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. టీడీపీ నేతలపై ఫిర్యాదు యల్లనూరు: మండల కేంద్రంలోని తేరు వద్ద గురువారం ఉదయం వైఎస్సార్సీపీ నేత, జెడ్పీటీసీ సభ్యుడు బోగతి విజయ ప్రతాపరెడ్డి, మరో ఐదారుగురిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడినట్లుగా బాధితులు ఫిర్యాదు చేశారని ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. టీడీపీకి చెందిన సుబ్బరాయుడు, రామాంజనేయులు, ఆంజనేయులు, బాబు, ఓబులేసుతో పాటు మరో 18 మందిపై బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితులను నిర్ధారించుకున్న అనంతరం కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. కాగా, తేరు వద్ద గురువారం చోటు చేసుకున్న గొడవకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. శుక్రవారం పాతపల్లి క్రాస్ వద్ద వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. గుర్తు తెలియని వృద్ధురాలి మృతిధర్మవరం అర్బన్: స్థానిక ఎర్రగుంట జంక్షన్లో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధురాలు (75) దుర్మరణం పాలైంది. శుక్రవారం తెల్లవారుజామున అర్బన్ హెల్త్ సెంటర్ ఎదుట ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
మామిడి పూతపై గడ్డి మందు పిచికారీ
గార్లదిన్నె: మండలంలోని ఇల్లూరులో ఓ రైతును ఆర్థికంగా దెబ్బ తీసే కుట్రకు దుండగులు తెరలేపారు. పోలీసులు తెలిపిన మేరకు... బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన రైతు సుంకన్న ఇల్లూరులో రెండు ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకుని సంరక్షణ చేపట్టాడు. ఈ క్రమంలో మామిడి పూత విరగ్గాసింది. దీంతో గిట్టని వారు పూతపై గడ్డిమందు పిచికారీ చేయడంతో ఎక్కడికక్కడ పూత రాలిపోయి, చెట్లు చనిపోతున్నాయి. ఘటనతో రూ.13 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధత రైతు వాపోయాడు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
మసకబారుతున్న రాయల వైభవం
పెనుకొండ: పురావస్తు శాఖ అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పెనుకొండలో రాయల వైభవం మసకబారుతోంది. శ్రీకృష్ణదేవరాయల వైభవానికి ప్రతీకగా పెనుకొండలో నేటికీ చెక్కుచెదరకుండా నిలిచిన గగన్ మహల్ పశువుల దొడ్డిగా మారింది. రోజూ గగన్మహల్లోకి పశువులు చొరబడి పర్యాటకులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కనీసం గగన్ మహల్ మెయిన్ గేటుకు తాళం వేసేవారు కూడా లేరు. ఇప్పటికే పెనుకొండలో ఎన్నో చారిత్రక కట్టడాలు సరైన ఆలనాపాలనా లేక కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇటీవల గగన్‌మహల్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఇప్పటికై నా పురావస్తు శాఖ అధికారులు స్పందించి గగన్‌మహల్ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
చదరంగంలో రాణించిన గుంతకల్లు విద్యార్థులు
స్నేహిత్ కార్తికేయన్ లిశాంత్ జ్యోత్స్న ప్రియ నరసింహగుంతకల్లు: చదరంగం పోటీల్లో గుంతకల్లుకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాణించి అంతర్జాతీయ రేటింగ్స్ దక్కించుకున్నట్లు కోచ్‌లు అనిల్‌కుమార్, రామారావు తెలిపారు. శుక్రవారం వారు వివరాలను వెల్లడించారు. గత నెలలో బెంగళూరు, బళ్లారి నగరాల్లో నిర్వహించిన చెస్ టోర్నీల్లో బ్లిట్జ్ ఫార్మాట్లో గుంతకల్లుకు చెందిన స్నేహిత్ 1,684 రేటింగ్ సాధించి అత్యధిక రేటెడ్ ప్లేయర్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడన్నారు. అలాగే క్లాసిక్ రేటింగ్‌లో కార్తికేయన్ 1,430 రేటింగ్, గాజుల లక్ష్మీనరసింహ 1,416 రేటింగ్, రాపిడ్ రేటింగ్‌లో జ్యోత్స్న ప్రియ 1,473, క్లాసిక్ రాపిడ్‌లో లిశాంత్ 1,497 రేటింగ్ సాధించినట్లు వివరించారు. -
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం కొనసాగుతోంది. ఈశాన్యం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
దారి మళ్లిన నిధులపై మరోసారి విచారణ అనంతపురం అగ్రికల్చర్: పశు సంవర్ధక శాఖలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఆడిట్ బృందం మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేపట్టింది. రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన కె.సత్యనారాయణ, ఎం.చక్రధర్, ఎన్.గంగాశేఖర్‌తో కూడిన ముగ్గురు అధికారుల బృందం శుక్రవారం జేడీ చాంబర్లో 32 వరకు బ్యాంకు ఖాతాలు, అందులో జరిగిన లావాదేవీలు, వాటికి సంబంధించి బ్యాంకు స్టేట్మెంట్లు, దారి మళ్లిన సొమ్ముకు సంబంధించి ఏమైనా బిల్లులు, ఓచర్లు, రికార్డులు ఉన్నాయా లేదా అనేదానిపై దృష్టి సారించినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. శనివారం కూడా ఆడిట్ కొనసాగించనున్నారు. గత ఏడాది నవంబర్ 14, 15 తేదీల్లో చేపట్టిన ఆడిట్ ప్రకారం ఐదు ప్రధాన బ్యాంకులకు సంబంధించి 18 ఖాతాల ద్వారా రూ.1.03 కోట్లు అనుమతి లేకుండా బదలాయింపులు జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. వాటిని మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యలో డైరెక్టరేట్ ఆదేశాల మేరకు మూడు దఫాలుగా జిల్లా అధికారులు పంపిన మరికొన్ని రికార్డులు, వివరాలతో పోల్చిచూస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి సస్పెండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్‌ను కూడా ఆడిట్ అధికారులు పిలిపించి పూర్తిస్థాయి సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు. అక్రమ లావాదేవీలు, బదలాయింపులకు సంబంధించి అటు ఆడిట్ అధికారులు, ఇటు పశుశాఖ అధికారులు వివరాలు చెప్పడానికి నిరాకరించారు. -
మాకు సమాచారం లేదు
అనంతపురం సిటీ: ప్రభుత్వ పాఠశాలలపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందా.. తగినంతమంది విద్యార్థులు లేరనే సాకుతో బడులను మూసివేసేందుకు కుట్ర పన్నుతోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామారావు రెండ్రోజుల కిందట అన్ని జిల్లాలు, మండలాల విద్యాశాఖాధికారులతో వెబెక్స్ నిర్వహించారు. విద్యార్థుల సంఖ్య ఐదులోపు ఉన్న ఫౌండేషన్ స్కూళ్లు, పదిలోపు ఉన్న బేసిక్ స్కూళ్లు, 30లోపు ఉన్న మోడల్ ప్రైమరీ స్కూళ్లు, విద్యార్థుల సంఖ్య 50 లోపు ఉన్న హైస్కూళ్ల వివరాలు సేకరించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. పిల్లల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో కొన్ని పాఠశాలలను సమీప పాఠశాలల్లోకి విలీనం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందన్న విమర్శలు ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏయే స్కూళ్లలో పిల్లల సంఖ్య తక్కువగా ఉంది, వాటిని సమీపంలోని ఏ స్కూల్లో విలీనం చేస్తే బాగుంటుందన్న వివరాలను సేకరించి తమకు అందజేయాలని సూచించడం గుబులు రేపుతోంది. 3, 4, 5 తరగతుల విద్యార్థులను కిలోమీటర్ పరిధిలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోకి విద్యాశాఖ పంపేసింది. ఈ ప్రక్రియతో చాలా పాఠశాలలు మూతపడ్డాయి. వందల సంఖ్యలో పాఠశాలలు సింగిల్ టీచర్ (ఏకోపాధ్యాయ)కే పరిమితమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం 3, 4, 5 తరగతులను విలీనం చేసింది. ఈ విధానం వల్ల చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు సమాచారం. పరిష్కారం వెతక్కుండా.. రద్దు చేయడమేంటి? ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు విచ్చలవిడిగా అనుమతి ఇవ్వడం వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోవడానికి ప్రధాన కారణంగా ఉపాధ్యాయులు, నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అలోచించి, మేధావులు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, సంఘాల నేతలతో చర్చించి ఆ దిశగా అడుగులు వేయకుండా.. ‘విలీనం’ పేరుతో రద్దు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలోని 36 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఐదులోపే ఉంది. అందులో అనంతపురంలోని యువజన కాలనీ మున్సిపల్ ప్రైమరీ స్కూల్, చిన్నంపల్లి ప్రభుత్వ స్కూల్, డీ హీరేహాళ్ మండలం ఎస్ఆర్ కోట, గుంతకల్లులోని జే.లక్ష్మీబాయి ఐదో వార్డు స్కూల్, మొలకలపెంట తండా, కళ్యాణదుర్గంలోని ఎస్టీ కాలనీ, కొండా పురం, కంబదూరులోని కదిరిదేవరపల్లి, కొత్తగూడెం స్కూల్లో పిల్లల సంఖ్య ఐదులోపే ఉంది. నార్పల మండలం బొమ్మకుంటపల్లి, జంగంరెడ్డిపల్లి, మిద్దెల తుంపెర, ఎస్సీ కాలనీ– నారాయణపల్లి, పామిడి మండలం పి.కొత్తపల్లి, పెద్దపప్పూరు మండలం పెద్ద ఎక్కలూరు, చిన్నపప్పూరు, ధర్మాపురం, నారాపురం, పి.కొత్తపల్లి, కాశేపల్లి పాఠశాలలోనూ పిల్లల సంఖ్య పడిపోయింది. పుట్లూరు మండలం ఎ.కొండాపురం, పి.చింతలపల్లి, రంగరాజుకుంట, ఎస్.తిమ్మాపురం, తురకవారిపల్లి, వెంగన్నపల్లి పాఠశాలలు మూతపడే అవకాశాలు ఉన్నాయి. శింగనమల మండలం సోదనపల్లి (మెయిన్), నిదనవాడ, తాడిపత్రిలో ఆవులతిప్పయ్యపల్లి, బందార్లపల్లి, తలారిచెరువు, విడపనకల్లు మండలం జనార్దనపల్లి, వి.కొత్తపల్లి, కుర్మాజీపేట, వై.తిప్పారెడ్డిపల్లి పాఠశాలలు రద్దయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది. లోకేశ్ మాటలపై సన్నగిల్లిన నమ్మకం విద్యార్థులు తక్కువగా ఉన్నారని సాకు విలీనం పేరుతో ప్రభుత్వ బడుల మూతకు కుట్ర రహస్యంగా వివరాల సేకరణకు అధికారుల ఆదేశం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన ఒక్క ప్రభుత్వ పాఠశాలనూ మూసివేయబోమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పదేపదే చెబుతున్నా.. జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆయన మాటలపై నమ్మకం సన్నగిల్లుతోందని ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. ‘విలీనం’ పేరుతో విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు తాళం వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఉపాధ్యాయులు అంటున్నారు. -
మెరుగైన సేవలందించాలి
అనంతపురం అర్బన్: ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ ఆనంద్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించారు. ప్రజాదృక్పథం, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ ఆప్‌లోడ్, రైల్వే ప్రాజెక్టలకు భూసేకరణ పెండింగ్, తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఆనంద్‌తో పాటు డీఆర్ఓ ఎ.మలోల పాల్గొన్నారు. సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఓలు, డిజిటల్ అసిస్టెంట్లతో రెవెన్యూ అంశాలపై టెలీకాన్ఫరెన్స్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాలని డీఆర్ఓను ఆదేశించారు. రైల్వే అండర్ పాస్‌లు, లెవల్ క్రాసింగ్ పనులు వేగవంతం చేసేందుకు రైల్వే అధికారులు, సంబంధిత రెవెన్యూ అధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణలో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుని పెండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం అనంతపురం టవర్‌క్లాక్: ఉమ్మడి అనంతపురం జిల్లా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10.30 గంటలకు జెడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు సీఈఓ శివశంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. పట్టాదార్ పుస్తకాల పంపిణీ బెళుగుప్ప: గుండ్లపల్లిలోని శ్రీమంజునాథ కల్యాణమంటపంలో శుక్రవారం తహసీల్దార్ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేపట్టారు. గ్రామంలో భూముల రీసర్వే పూర్తయిన 544 మంది రైతులకు ముఖ్య అతిథులు మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ, కలెక్టర్ ఆనంద్ పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’లో మంత్రి, ఎంపీకి వివిధ గ్రామాల ప్రజలు 72 అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వసంతబాబు, ఎంపీపీ పెద్దన్న, మండల రీసర్వే డీటీ గురుబ్రహ్మ పాల్గొన్నారు. -
ముదిరిన యానిమేటర్ వివాదం
పెద్దవడుగూరు: మండలంలోని జి.వెంకటాంపల్లిలో యానిమేటర్ల వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. మూడు నెలలుగా తలనొప్పిగా మారడంతో భరించలేక ఏపీఎం దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఈ క్రమంలో అక్రమాలు, ఆరోపణలపై శుక్రవారం వెలుగు అధికారులు ఆ గ్రామానికి చేరుకుని సంఘాల సభ్యులతో మాట్లాడుతుండగా ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో అక్కడకు చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. అధికారం ఉందని.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిరుద్యోగులను బలవంతంగా విధుల నుంచి తప్పించి టీడీపీకి చెందిన వారికి ఆయా బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలోనే జి.వెంకటాంపల్లిలోని ఆశాజ్యోతి గ్రామైక్య సంఘానికి పదేళ్లకు పైగా యానిమేటర్‌గా సేవలు అందిస్తున్న పద్మావతిని తప్పించాలంటూ అధికారులపై స్థానిక టీడీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకెళ్లారు. అయితే యానిమేటర్ పద్మావతిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, ఆమె పనితీరు నిజాయితీతో కూడుకుని ఉండడంతో తొలగిస్తే వివాదం చెలరేగుతుందని ఏపీఎం నచ్చచెబుతూ వచ్చాడు. అయినా టీడీపీ నేతలు వినలేదు. అధికారంలో ఉన్నాం కాబట్టి తమ పార్టీకి చెందిన వారే యానిమేటర్‌గా ఉండాలని ఒత్తిళ్లు తీవ్రతరం చేశారు. దీంతో ఈ తలనొప్పి తనకెందుకని రెండు నెలల క్రితం ఏపీఎం దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయాడు. నిబంధనలు సాకు చూపి.. ఏపీఎం దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో ఐకేపీ అధికారులపై స్థానిక టీడీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకెళ్లారు. పద్మావతి అవకతవకలకు పాల్పడుతోందనే కారణాన్ని చూపి ఆమెను తొలగించాలంటూ పార్టీ పెద్దల నుంచి హుకూం జారీ చేయించారు. దీంతో గ్రామ సంఘం తీర్మానం లేకుండానే మండల సమాఖ్య తీర్మానంతో పాత జీఓ మేరకు మూడేళ్లు యానిమేటర్‌గా పనిచేసిన వారిని విధుల నుంచి తొలగించవచ్చుననే నిబంధనతో పద్మావతిని పక్కకు తప్పించారు. అయితే ఆమె విధుల నుంచి తొలగించక ముందే ఆ పాత జీఓను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. అయినా వెలుగు అధికారులు పట్టించుకోకుండా పద్మావతిని తప్పించి ఆ బాధ్యతలను టీడీపీకి చెందిన వరలక్ష్మికి అప్పగించారు. అయినా వివాదం కొనసాగుతుండడంతో ఇద్దరినీ వెలుగు అధికారులు హోల్డ్‌లో ఉంచేశారు. అక్రమాలు జరిగాయంటూ.. తాము పట్టుపట్టి నియమించుకున్న వరలక్ష్మిని అధికారులు హోల్డ్‌లో ఉంచేయడంతో టీడీపీ నేతలు మరింత రెచ్చిపోయారు. సమాఖ్య ఆర్థిక లావాదేవీల్లో పద్మావతి అక్రమాలకు పాల్పడిందంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై శుక్రవారం వెలుగు అధికారులు గ్రామానికి చేరుకుని సంఘాల లీడర్లు, సభ్యులతో చేపట్టారు. 2014 నుంచి 2023 వరకూ సంఘం నిర్వహణ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. అయితే సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాల్సిన అధికారి నాలుగు గోడల మధ్య ఉంటూ సీసీలను పంపడంపై పలు అనుమానాలకు దారితీసింది. ఆ సమయంలోనే ఇరు వర్గాల వారు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. దీంతో విచారణను వాయిదా వేసుకుని వెలుగు అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. యానిమేటర్ పద్మావతి ఇంటిపై దాడి జి.వెంకటాంపల్లి గ్రామ యానిమేటర్ పద్మావతి ఇంటిపై శుక్రవారం రాత్రి టీడీపీకి చెందిన పలువురు దాడికి తెగబడ్డారు. గ్రామానికి చెందిన మహిళా సంఘం సభ్యులు కొందరు చేసిన ఫిర్యాదు మేరకు శుక్రవారం వెలుగు అధికారులు ఓబులేసు, మల్లికార్జున, వేణుగోపాల్, అబ్దుల్ ఖాదర్ విచారణ చేపట్టారు. మహిళా సంఘాల సభ్యులతో సమావేశమై మాట్లాడారు. అయితే రికార్డులు లేవని అధికారులు తెలపడంతో ఈ అంశంపై పద్మావతికి వ్యతిరేకంగా టీడీపీ వర్గానికి చెందిన కొందరు సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఇటీవల యానిమేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన వరలక్ష్మి, ఆమె తండ్రి ఓబులేసు, మరికొందరు రాత్రి 9 గంటల ప్రాంతంలో పద్మావతి ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. బాధితుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని అదుపులోకి తీసుకున్నారు. అధికార బలంతో టీడీపీ వర్గీయుల దౌర్జన్యం ఒత్తిళ్లు భరించలేక దీర్ఘకాలిక సెలవుపై ఏపీఎం. బలవంతంగా యానిమేటర్‌ను తప్పించిన వైనం అక్కడితో ఆగకుండా అక్రమాలు జరిగాయంటూ వేధింపులు వెలుగు అధికారుల విచారణ సమయంలో పోలీసుల ఎదుట బాహాబాహీ -
ధర్మవరం కాలువకు నీటి మళ్లింపు
కూడేరు: మండలంలోని పీఏబీఆర్ నుంచి ధర్మవరం కుడి కాలువకు 200 క్యూసెక్కుల నీటిని అధికారులు గురువారం మళ్లించారు. ఇటీవల జల్లిపల్లి వద్ద కాలువ గట్టు కోతకు గురి కావడంతో డ్యాం ఎస్కేప్ రెగ్యులేటర్ వద్ద మిడ్‌పెన్నార్ డ్యాంకు 300 క్యూసెక్కుల నీటిని మళ్లించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలువ మరమ్మతు పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. దీంతో మరమ్మతులు చేసిన చోట కాలువ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు గురువారం ఎస్కేప్ రెగ్యులేటర్ ఎంపీఆర్‌కు వెళుతున్న 300 క్యూసెక్కుల నుంచి 200 క్యూసెక్కుల ప్రవాహాన్ని ధర్మవరం కుడి కాలువలోకి మళ్లించారు. నీరు సజావుగా ప్రవహిస్తే మరో వంద క్యూసెక్కుల నీటిని కూడా కుడి కాలువకు మళ్లించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో యువకుడి మృతి తాడిపత్రి రూరల్: మండలంలోని వరదాయపల్లి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో చుక్కలూరు గ్రామానికి చెందిన రత్నకుమార్ (20) మృతిచెందాడు. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళుతున్న వారు క్షతగాత్రుడిని వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. పరిస్థితి విసయంగా ఉండడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు కుటుంబసభ్యులు బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి తండ్రి ఏసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి రూరల్ పోలీసులు తెలిపారు. గ్రో కవర్లతో దానిమ్మకు రక్ష కూడేరు: ప్రస్తుతం దానిమ్మ పంటకు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు వినూత్న పద్ధతులను అవలంభిస్తున్నారు. టన్ను దానిమ్మ కాయలు నాణ్యతను బట్టి రూ. లక్ష నుంచి రూ.1.45 లక్షల ధర పలుకుతోంది. దీంతో కూడేరు, కడదరకుంట, కమ్మూరు, చోళసముద్రం, జయపురం, కొర్రకోడు, మరుట్ల, ఇప్పేరుతో పాటు మరికొన్ని గ్రామాల్లో రైతులు దానిమ్మ పంటను ఎక్కువగా సాగు చేశారు. అయితే వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా పంటకు తెగుళ్లు ఆశించకుండా దానిమ్మ చెట్లను పూర్తిగా గ్రో కవర్లతో కప్పేశారు. దీంతో ఊజీ ఈగ, మజ్జిగ ఈగ తెగుళ్లు ఆశించడం లేదని రైతులు అంటున్నారు. -
వైఎస్సార్సీపీ జెండా దిమ్మె ధ్వంసం
గుత్తి రూరల్: మండలంలోని బసినేపల్లిలో రఘునాథరెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ జెండా దిమ్మెను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి, జెండా పోల్ ఎత్తుకెళ్లి గ్రామ శివారున పడేశారు. విసయాన్ని గురువారం ఉదయం వైఎస్సార్సీపీ నాయకులు గుర్తించి జెండా దిమ్మె వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు తిమ్మారెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివరంగనాయకులు, సంజీవ, మండల మైనార్టీ అధ్యక్షుడు మస్తాన్‌వలి మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కక్షలు రెచ్చగొట్టేలా కొందరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదన్నారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఐ రామారావును కలసి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సుధాకర్‌రెడ్డి, హనుమంతు, షాషావలి, రంగనాయకులు, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీరాములు, రాజేష్ పాల్గొన్నారు. గుత్తి ఆర్ఎస్లో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీల చింపివేత గుత్తి: స్థానిక ఆర్ఎస్లోని ఎస్సీ కాలనీ సమీపంలో వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఘటనపై వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహితపై మందు బాబుల వీరంగం ఉరవకొండ: దర్గాకు వెళుతున్న ఓ ముస్లిం వివాహిత పట్ల మందుబాబులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటన ఉరవకొండలో చోటు చేసుకుంది. గురువారం ఉదయం మహబూబ్ సుబహానీ దర్గాకు వెళుతుండగా మార్గమధ్యంలో కామన్నకట్ట వద్దకు చేరుకోగానే నడిరోడ్డుపైనే మద్యం తాగుతున్న కొందరు యువకులు ఆమె మార్గానికి అడ్డుగా నిలుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో దర్గాకు సమీపంలో ఇలా నడిరోడ్డుపై మద్యం తాగడం మంచిది కాదంటూ ఆమె సహనంతో హితవు పలికింది. ఆ సమయంలో పచ్చి బూతులతో యువకులు రెచ్చిపోయారు. చుట్టుపక్కల ఉన్న మహిళలు వెంటనే అక్కడకు చేరుకోవడంతో పక్కకు వైదొలిగారు. విషయం పది మందికి తెలిస్తే కుటుంబ పరువు పోతుందని బాధిత మహిళ ఏడుస్తూ ఇంటికెళ్లిపోయింది. కాగా, న్యూఇయర్ సంబరమంటూ కామన్నకట్ట వద్ద ఉన్న బెల్టుషాపు నుంచి కొందరు యువకులు మద్యం కొనుగోలు చేసి నడిరోడ్డుపైనే తాగుతూ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వివాహిత అదృశ్యం తనకల్లు: మండల పరిధిలోని రాగినేపల్లికి చెందిన వివాహిత నాగ శిరీషా అదృశ్యమైనట్లు ఎస్ఐ గోపి ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల వివరాలమేరకు... రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన నాగ శిరీషా ఆ తరువాత తిరిగి రాలేదు. భర్త హరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
డిపో దాటి రానంటున్న బస్సు
జిల్లాలో ఆర్టీసీ పరిస్థితి తీవ్ర గందరగోళంగా మారింది. జిల్లా వ్యాప్తంగా బస్సులు సకాలంలో తిరగకపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఈ క్రమంలోనే అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో లాంగ్ సర్వీసు బస్సు పూర్తిగా రద్దయింది. ● అధికారుల అనాలోచిత నిర్ణయంతో ప్రయాణికులకు తిప్పలు అనంతపురం క్రైం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజారవాణా వ్యవస్థ నిర్వీర్యమవుతూ వస్తోంది. దీనికి తోడు అధికారులు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ఆర్టీసీ సేవలు పూర్తిగా గాడితప్పాయి. అనంతపురం డిపో నుంచి హైదరాబాద్, బెంగళూరు, చైన్నె ప్రాంతాలకు తిరుగాడే లాంగ్ సర్వీసు బస్సులను కొంత కాలం క్రితం ఆర్టీసీ అధికారులు రద్దు చేసి ఇతర డిపోలకు బదిలీ చేశారు. దీంతో ఆయా సర్వీసుల్లోని బస్సులను ఆయా డిపోలకు పంపి చేతులు దులుపుకున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం నుంచి ప్రతి రోజూ రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌కు వెళ్లే సర్వీసును గుత్తి డిపోకు బదిలీ చేస్తూ బస్సును పది రోజుల క్రితం ఆ డిపోకు పంపారు. అయితే ఈ బస్సు గుత్తి డిపో నుంచి బయటకు రావడం లేదు. విషయం తెలియని హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు రోజూ రాత్రి 10 గంటల సమయంలో అనంతపురం ఆర్టీసీ బస్టాండుకు చేరుకోవడం.. గంటల తరబడి వేచి చూడడం పరిపాటిగా మారింది. డ్రైవర్లు లేరంటూ... లాంగ్ సర్వీసు బస్సు గుత్తి డిపో దాటి బయటకు రాకపోవడంతో దాదాపుగా ఆ సర్వీసు రద్దైనట్లుగా తెలుస్తోంది. అయితే సర్వీసును తిప్పడంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు సహేతుకమైన కారణాలు వెల్లడించలేకపోతున్నారు. డ్రైవర్లు లేని కారణంగా బస్సు డిపో గేట్ దాటించలేకపోతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ సమస్యకు ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సంస్థ ఆదాయాన్ని కోల్పోతోంది. ఈ సమస్య ఒక్క గుత్తి డిపోలోనే కాదు.. రీజియన్ పరిధిలోని అన్ని డిపోల్లోనూ ఉన్నట్లుగా కార్మికులు పేర్కొంటున్నారు. సిబ్బంది కొరతను అధిగమించాల్సిన అధికారులు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఉన్నఫళంగా బస్సు సర్వీసులు తాత్కాలికంగా రద్దయిపోతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రయాణికులకు నాణ్యమైన సేవలను అందించిన ఆర్టీసీ ప్రతిష్ట కాస్త ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యం కారణంగా మసకబారుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్టీసీ పరిరక్షణకు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందనే సంకేతాలను కార్మిక సంఘాల నేతలు వెలువరిస్తున్నారు. -
నేడు జిల్లాకు ఆడిట్ బృందం రాక
● పశుశాఖలో ఆర్థిక కుంభకోణంపై మరోసారి విచారణ ● ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్, రిటైర్డ్ జేడీకి బెనిఫిట్స్ నిలిపివేతఅనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధక శాఖలో సంచలనం సృష్టించిన రూ.1.03 కోట్ల ఆర్థిక కుంభకోణానికి సంబంధించి విచారణకు మరోసారి ఆ శాఖ రాష్ట్ర స్థాయి ఆడిట్ బృందం శుక్రవారం జిల్లాకు రానుంది. కె.సత్యనారాయణ, ఎం.చక్రధర్, ఎన్.గంగాశేఖర్‌తో కూడిన ముగ్గురు అధికారుల బృందం రెండు రోజుల పాటు బ్యాంకు లావాదేవీలు పరిశీలించనుంది. ఎంత మొత్తం పక్కదారి పట్టింది... ఎవరెవరి పాత్ర ఎంతనే దానిపై పక్కాగా తేల్చనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పశుశాఖలో వెలుగుచూసిన ఆర్థిక కుంభకోణంపై ఇప్పటికే గత ఏడాది నవంబర్ 14, 15న ప్రాథమిక పరిశీలన జరిపారు. డైరెక్టరేట్ అధికారులు మూడు దఫాలుగా జిల్లా అధికారుల నుంచి సేకరించిన వివరాల తర్వాత ఇటీవల ఆ శాఖ సీనియర్ అసిస్టెంట్ సుశీలను సస్పెండ్ చేశారు. అలాగే విశ్రాంత జేడీ డాక్టర్ జీపీ వెంకటస్వామికి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.42 లక్షలను నిలుపుదల చేశారు. ఆ శాఖకు వివిధ బ్యాంకుల్లో ఉన్న బ్యాంకు ఖాతాలు, అందులో ఉన్న సొమ్ము, బదలాయింపులు, బ్యాంకు స్టేట్మెంట్లు తదితర వాటిని ప్రాథమికంగా పరిశీలించారు. యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల నుంచి 18 ఖాతాల ద్వారా రూ.1.03 కోట్ల వరకు ఎలాంటి అనుమతులు, బిల్లులు, ఓచర్లు లేకుండా సొంత ఖాతాలతో పాటు కుటుంబ సభ్యులు, మిత్రుల ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. తాజాగా మరోసారి రెండు రోజుల పరిశీలనకు ఆడిట్ బృందం వస్తుండటంతో త్వరలో ఈ వ్యవహారం మొత్తం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. -
షాడో నీడలో గాడి తప్పిన పాలన
● నిర్వీర్యం దిశగా నగర పాలక సంస్థ ● తీవ్రమైన ‘షాడో’ వేధింపులు ● సీపీఓ లాంగ్ లీవ్.. టీపీఎస్ సరెండర్ అనంతపురం క్రైం: నగర పాలక సంస్థలో ‘షాడో’ పెత్తనం రోజురోజుకూ పెరిగిపోతోంది. ‘షాడో’ ఆదేశాలే కీలకంగా మారాయని, ఆయన చెప్పిన మాటే చెల్లుబాటవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. షాడో వేధింపులతో టౌన్ ప్లానింగ్ విభాగం మెల్లిమెల్లిగా ఖాళీ అవుతోంది. ఈ క్రమంలో అక్రమాలు పెరిగి వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వసూళ్లకు లైన్ క్లియర్! నగరపాలక టీపీఓగా మళ్లీ శిరీష చేతికి పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టీపీఓ నీరజాక్షి లాంగ్ లీవ్‌పై వెళ్లడంతో అధికార పార్టీ ప్లాన్ బాగా వర్కవుట్ అయింది. దీంతో వసూళ్లకు లైన్ క్లియర్ అయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అక్రమ నిర్మాణాలు, అనుమతులు, మార్పిడి ఫైళ్ల చుట్టూ కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు సంస్థ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉన్నతాధికారులైనా స్పందించి పాలనను గాడిలో పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. వారిపై విజి‘లెన్స్’.. ! మరోవైపు ఇష్టారాజ్యంగా పనులు చేసుకున్న కాంట్రాక్లర్లు, అక్రమ సంపాదన కోసం దిగజారి ఫైళ్లపై సంతకాలు చేసిన అధికారుల జాబితా విజిలెన్స్ అధికారులు సిద్ధం చేశారని తెలిసింది. నెల రోజులుగా అంతర్గత విచారణ చేపట్టిన విజిలెన్స్ ఎట్టకేలకు ఓ ‘బలమైన నివేదిక’ను ప్రభుత్వ పెద్దలకు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నగర పాలక సంస్థలో ‘షాడో’ కనుసన్నల్లో సాగుతున్న దందాపై ఇటు నిఘా వర్గాలు కూడా నివేదికను సిద్ధం చేసి పంపినట్లు తెలిసింది. కొంత మంది కీలక విభాగాల అధికారుల పేర్లు చేర్చినట్లు సమాచారం. నగర పాలక సంస్థ కార్యాలయాన్ని వదలకుండా పాతుకు పోయిన వారు కొందరైతే.. నేరుగా కాంట్రాక్టర్లను బినామీలుగా చేసుకుని కొన్నేళ్లుగా ఫోన్‌పేలలో లావాదేవీలు నడిపారు. వారి కుటుంబ సభ్యులు, భార్యలు, పిల్లల ఖాతాలకు ఫోన్ ఫేలో డబ్బు బదిలీ చేయించుకున్నారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో కోర్టు రోడ్డులోని ఓ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు నరసింహులు అనే వ్యక్తికి చెందిన ఓ అపార్టుమెంటు నిర్మాణం విషయంలో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లుగా ‘విజిలెన్స్’ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. నిత్యం ప్రజాప్రతినిధితో ఉద్యోగులు, అధికారులు నడిపిన రాయ‘బేరాల’పై కూడా కూపీ లాగినట్లు సమాచారం. మొత్తంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం నివేదికలో ఆరుగురు ఉద్యోగుల అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో సహా వివరాలు ఉన్నట్లు తెలిసింది. -
ఇసుక డబ్బు ఎక్కువై జనాలపై పడుతున్నారు
సాక్షి టాస్క్ఫోర్క్ : టీడీపీ నాయకులకు ఇసుక డబ్బులు ఎక్కువై జనాలపై పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజనాథ్ మండిపడ్డారు. గురువారం ఆయన యల్లనూరులో టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాప్‌రెడ్డిని వెన్నపూసపల్లిలో పరామర్శించారు. అలాగే యల్లనూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటనపై పుట్లూరు సీఐ సత్యబాబు, బుక్కరాయ సముద్రం సీఐ లక్ష్మయ్య, యల్లనూరు ఎస్ఐ రామాంజనేయరెడ్డితో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యల్లనూరు లో ఉదయం జరిగిన ఘటన చాలా ఘోరమన్నారు. ఓ సినిమా సీన్లా ఉందన్నారు. జెడ్పీటీసీ భోగతి ప్రతాప్‌రెడ్డి సౌమ్యుడని, అలాంటి వ్యక్తిపై దాడి చేయడం బాధాకరమని అన్నారు. యల్లనూరులో టీడీపీ వారికి ఇసుక డబ్బులు ఎక్కువై.. ఎలా ఖర్చు చేయాలో అర్థం కాక జనాలపై పడుతున్నారని విమర్శించారు. సంక్రాంతి తర్వాత ఇసుక రీచ్‌ల వద్ద ఆందోళన చేపట్టి మూసివేయిస్తామన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ.. చంద్రబాబు ప్రభుత్వంలో చాలా నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్‌రెడ్డితో కలసి జెడ్పీటీసీ భోగతి ప్రతాప్‌రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పినా పోలీసులు నోరు మెదపడం లేదన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టీడీపీ నాయకులు టార్గెట్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తే తమ నాయకుడు ఎవ్వరినీ వదలరని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబరు (ఎస్ఈసీ) భోగతి నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి విష్ణునారాయణ, శింగనమల, బుక్కరాయసముద్రం మండల కన్వీనర్లు పూల ప్రసాద్, శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు భోగతి దిలీప్‌రెడ్డి, భోగతి నాగేశ్వరరెడ్డి, రామ్మోహన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భోగతి ప్రతాప్‌రెడ్డిని పరామర్శిస్తున్న ఆలూరు సాంబశివారెడ్డి, రమేష్‌రెడ్డి పుట్లూరు సీఐ సత్యబాబుతో మాట్లాడుతున్న మాజీ మంత్రి సాకే శైలజనాథ్ సంక్రాంతి తర్వాత ఇసుక రీచ్‌ల వద్ద ఆందోళన మాజీ మంత్రి శైలజనాథ్ ధ్వజం చంద్రబాబు ప్రభుత్వంలో పెరిగిన నేరాలు, ఘోరాలు : వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ‘ఆలూరు’ మండిపాటు -
కొత్త ఏడాదిలోనైనా రైతాంగాన్ని ఆదుకోండి
● సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత హితవు అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఏడాదిలోనైనా రైతాంగాన్ని ఆదుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి కోరారు. గురువారం నగరంలోని ఆయన నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ‘అనంత’ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగాన్ని ఆదుకోవడంలో విఫలమైందన్నారు. కనీసం కొత్త ఏడాదిలోనైనా అన్నదాతలకు అండగా నిలవాలని హితవు పలికారు. జిల్లాలో శాంతిభద్రతలు అదుపు తప్పడంతో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. బాల్య వివాహాలు అరికడదాం ● మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ: బాల్య వివాహాలు అరికట్టి, జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మారుద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు.జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బాల్య వివాహ్ విముక్త్ భారత్ 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని గురువారం స్థానిక టీడీపీ కార్యాలయ ఆవరణలో మంత్రి కేశవ్ ప్రారంభించారు. పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణవాసులను చైతన్యవంతులను చేసి బాల్య వివాహ వ్యవస్థను నిర్మూలించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు రాజేశ్వరి, అరుణ, రబియా, పుష్ప, విజయ, పద్మ, సురేఖ, ధనశేఖర్ పాల్గొన్నారు. కొండపై నుంచి దూసుకొచ్చి.. కాళ్లను ఛిద్రం చేసి● ఉరవకొండలో బండరాయి పడి విద్యార్థికి తీవ్ర గాయాలు ఉరవకొండ: కొండ రాయి పడి విద్యార్థికి తీవ్ర గాయాలైన సంఘటన ఉరవకొండలో గురువారం జరిగింది. వివరాలు... ఉరవకొండకు చెందిన చికెన్ వ్యాపారి లెనిన్‌బాబు కుమారుడు మహ్మద్ సమీన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గురువారం తోటి స్నేహితులతో కలిసి స్థానిక రేణుకా యల్లమ్మ ఆలయ సమీపంలో కొండ వద్దకు ఆడుకునేందుకు వెళ్లాడు. అదే సమయంలో కొండ పై నుంచి పెద్ద గుండురాయి అకస్మాత్తుగా దొర్లుకుంటూ రావడం చూసి పరుగు తీసినా ఫలితం లేకపోయింది. అదుపుతప్పి కిందపడిన సమీన్ కాళ్లపై రాయి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. విద్యుత్ కోతలపై నిరసన కుందుర్పి: మండలంలో వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి విద్యుత్ సకాలంలో అందక పోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు గురువారం స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు 9 గంటల నిరంతర విద్యుత్ అందిస్తామన్న హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోలేక పోయారంటూ మండిపడ్డారు. 6 గంటలు కూడా విద్యుత్ అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించాలంటూ ఏఈ జయకృష్ణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులు రామాంజి, నేత్రావతి, హరి, బాలరాజు పాల్గొన్నారు. -
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం
● కలెక్టర్ ఆనంద్ అనంతపురం అర్బన్: ‘జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా నూతన సంవత్సరంలో ముందుకు సాగుదాం’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ జిల్లా అధికారులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్రహర్కు డీఆర్ఓ ఎ.మలోల, పరిపాలనాధికారి అలెగ్జాండర్ తదితరులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ ఇలా విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అధికారి, ఉద్యోగి అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగుల సంఘం రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీని, వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం, హాస్టల్ వెల్ఫేర్ అధికారుల సంఘం, యునైటెడ్ టీచర్స్ యూనియన్, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. -
ఆటుపోట్లు.. అగచాట్లు
గత ఏడాది సెపె్టంబర్ నెలాఖరుతో కీలకమైన 2025 ఖరీఫ్ ముగియగా... తాజాగా డిసెంబర్ నెలాఖరుతో రబీ కూడా ముగిసింది. ఖరీఫ్‌లో నైరుతి రుతుపవనాలు ముందే పలకరించినా అననుకూల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. రబీలో ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపక వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలను దెబ్బతీశాయి. ఆటుపోట్ల నడుమ అగచాట్లు పడుతూ ఎలాగోలా ముందుకు సాగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించకుండా ‘పోటు’ పొడవడంతో రైతుల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. అనంతపురం అగ్రికల్చర్: రబీ ముగిసింది. సీజన్లో 1.07 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేయగా.. 70 వేల హెక్టార్లలో సాగులోకి వచ్చాయి. ప్రధానపంట పప్పుశనగ 65 వేల హెక్టార్లకు పైబడి సాగు చేయొచ్చని అంచనా వేయగా 48 వేల హెక్టార్లకు పరిమితమైంది. వేరుశనగ 18 వేల హెక్టార్ల అంచనాకు గానూ 6 వేల హెక్టార్లలో సాగైంది. మొక్కజొన్న మాత్రమే 7 వేల హెక్టార్లతో సాధారణ విస్తీర్ణంలో సాగులోకి వచ్చింది. జొన్న 3,500 హెక్టార్లు, కుసుమ 800, నువ్వులు 650, ఉలవ 1,350, పెసర 150, పత్తి 110 హెక్టార్లలో సాగులోకి వచ్చాయి. వరి 6,069 హెక్టార్లు అంచనా వేయగా... జనవరిలో సాధారణ సాగు విస్తీర్ణానికి చేరుకోవచ్చని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో విత్తన పప్పుశనగ ఇవ్వకపోవడం, కష్టాలు పడి ఎలాగోలా సాగు చేసినా మోంథా తుపాను దెబ్బ తీయడంతో పప్పుశనగ పంట విస్తీర్ణం తగ్గినట్లు చెబుతున్నారు.వర్షాభావం, తెగుళ్ల ప్రభావం..రబీలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య మూడు నెలల కాలంలో 139.2 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా వేయగా, 14 శాతం తక్కువగా 120.7 మి.మీ వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌లో 100.7 మి.మీ గానూ 6 శాతం అధికంగా 106.8 మి.మీ వర్షం కురిసింది. ఇక నవంబర్‌లో 28.7 మి.మీ గానూ 67.2 శాతం తక్కువగా 9.4 మి.మీ, డిసెంబర్లో 9.8 మి.మీ గానూ 54.1 శాతం తక్కువగా 4.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఓవరాల్‌గా మూడు నెలల కాలంలో కేవలం 11 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కావడం గమనార్హం. 5 మండలాల్లో మాత్రమే సాధారణం కన్నా అధిక వర్షం కురవగా, మరో ఆరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 20 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా వర్షాలు కురిశాయి. దీనికి తోడు మోంథా, దిత్వా లాంటి తుపాన్ల కారణంగా ప్రతికూల వాతావరణం నెలకొనడంతో పప్పుశనగకు తెగుళ్లు సోకి రైతుల్లో ఆందోళన పెంచాయి.దిగజారిన ఆర్థిక పరిస్థితి..ఈ ఏడాది మొత్తంగా అకాల వర్షాలు లేదంటే అధిక వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఖరీఫ్, రబీ రైతులకు పెద్దగా కలిసిరాక నష్టాలబాట పట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల బాగోగులు పట్టించుకున్న దాఖలాలు లేవు. సకాలంలో విత్తన పప్పుశనగ కూడా ఇవ్వకుండా దాటవేసింది. 14 వేల క్వింటాళ్లు కేటాయించి కేవలం 2 వేల క్వింటాళ్లు పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. 7 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగకు గానూ 4,500 క్వింటాళ్లతో సరిపెట్టింది. ఈ క్రమంలోనే ఇన్పుట్, ఇన్సూరెన్స్, ఎక్స్‌గ్రేషియా ఊసే ఎత్తకపోవడంతో రైతులు కుదేలయ్యారు. -
ఈపీఎఫ్ ఫైళ్లు పెండింగ్ లేకుండా చూడండి : డీఈఓ
అనంతపురం సిటీ: ఉపాధ్యాయుల ఈపీఎఫ్ ఫైళ్లు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డీఈఓ ప్రసాద్‌బాబు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో బుధవారం సాయంత్రం ఆయన సమావేశమై మాట్లాడారు. ఇప్పటి వరకు ఈపీఎఫ్‌కు సంబంధించి అందిన దరఖాస్తులు, ఎన్ని క్లియర్ చేశారు, పెండింగ్‌లో ఎన్ని ఉన్నాయనే అంశాలపై ఆరా తీశారు. ఏ ఒక్క ఫైల్ కూడా పెండింగ్‌లో పెట్టడానికి వీల్లేదని, తక్షణం క్లియర్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏడీ శ్రీనివాసులు, సూపరింటెండెంట్ జగదీష్, ఏపీఓ మంజునాథ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చీనీ పంట పరిశీలన కూడేరు: చలి తీవ్రత కారణంగా చీనీలో నల్లి, పేనుబంక, తామరపురుగు, మంగు తెగుళ్లు ఆశించినట్లు నియోజకవర్గ ఉద్యాన అధికారి యామిని తెలిపారు. చీనీలో ఆశించిన తెగుళ్లపై ‘చీనీకి తెగుళ్లు... రైతన్నకు దిగులు’ శీర్షికన గత నెల 24న ‘సాక్షి’లో వెలువడిన కథనంపై ఆమె స్పందించి, బుధవారం కూడేరు మండలంలో పర్యటించి చీనీ తోటలను పరిశీలించారు. నల్లి, ఆకుపచ్చ పురుగు నివారణకు లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 1ఎంఎల్ ప్రోపర్గైట్ లేదా 0.8ఎంఎల్ స్పైరోమెసిఫిన్ లేదా 1ఎంఎల్ ఫెన్జాక్వీన్ కలిపి పిచికారీ చేయాలన్నారు. మళ్లీ 20 రోజుల తర్వాత కూడా ఇదే ద్రావకాన్ని మరోసారి పిచికారీ చేస్తే ఆశించిన మేర ఫలితాలు ఉంటాయన్నారు. తామర పురుగు నివారణకు ఫిప్రోనిల్ 5ఎస్సీ, 2మిలీస్పైనోసాడ్ 45ఎస్సి 0.4మిలీ లీటర్ నీటిలో కలపి 14 రోజులు వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలన్నారు. పేను బంకు, ఎగిరే పేను నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 17.85ఎస్ఎల్, 0.4 ఎంఎల్ లేదా ధయోమిథఽక్సామ్25డబ్ల్యూజి 0.3జీఎల్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. -
ఆలయాల రక్షణలో సర్కారు బాధ్యతారాహిత్యం
● ప్రభుత్వ మాజీ సలహాదారు జ్వాలాపురం అనంతపురం: రాష్ట్రంలోని ఆలయాలపై వరుస దాడులు చోటు చేసుకుంటున్నా అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ మాజీ సలహాదారు (దేవదాయ) జ్వాలాపురం శ్రీకాంత్ విమర్శించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి నాడు ద్రాక్షారామంలో ముక్కంటికి జరిగిన అపచారం భక్తులను కలచివేసిందన్నారు. సప్త గోదావరి తీరంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోని కపాలేశ్వరస్వామి శివలింగాన్ని దుండగులు ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. ఈ ఆలయాన్ని 7, 8 శతాబ్దాల మధ్య చాళుక్య భీముడు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోందన్నారు. అంతటి ప్రాచీన శివాలయానికి సైతం చంద్రబాబు పాలనలో రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. శివలింగాన్ని ధ్వంసం చేస్తే అధికారులు హుటాహుటిన కొత్త శివలింగాన్ని ప్రతిష్టించి భక్తులను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. కొత్త శివలింగం ప్రతిష్టాపనను శాస్త్రోక్తంగా నిర్వహించాల్సి ఉండగా, అవేవీ పట్టనట్టుగా ధర్మాన్ని ఆలయ అధికారులు అవమానపరిచారని మండిపడ్డారు. ప్రశ్నిస్తానన్న సనాతన ధర్మకర్త, డీసీఎం పవన్‌కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉండారో చెప్పాలన్నారు. ప్రశ్నిస్తే తన డిప్యూటీ సీఎం పదవి పోతుందన్న భయం పవన్ కళ్యాణ్‌లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత శ్యాంసుందర్ పాల్గొన్నారు. -
సంబరం మాటున సైబర్ ఉచ్చు
ధర్మవరం అర్బన్: నూతన సంవత్సరం అనగానే ప్రతి ఒక్కరూ వారి ఎస్ఎంఎస్, వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌లలో వచ్చే లింక్‌లు, ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ పరిపాటిగా మారింది. అయితే ఇలాంటి చర్యలతో వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతాయనే విషయాన్ని మరవరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని అందే సందేశాల లింక్‌లను ఎలాంటి పరిస్థితుల్లోనూ తెరవరాదని సూచిస్తున్నారు. అవసరమైతే నేరుగా బంధుమిత్రులకు ఫోన్ చేసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకోవాలని, సందేశాలతో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. గిఫ్ట్ ఓచర్లతో బురిడి... నూతన సంవత్సరం రాకతో ఇదే అదనుగా అమాయకులపై సైబర్ నేరగాళ్లు ఉచ్చు విసిరారు. ఈ క్రమంలో వాట్సాప్‌లకు న్యూ ఇయర్ విసెస్ చెబుతూ గిఫ్ట్ ఓచర్ గెలుచుకున్నారని వచ్చే లింక్‌లు, ఏపీకే ఫైళ్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ తెరవకుండా ఉండడమే మేలు. పొరపాటున ఆ లింక్‌లను క్లిక్ చేస్తే వ్యక్తిగత బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ కావడమే కాక, మొబైల్లోని కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు, వీడియోలు, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర వివరాలు మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి చేరుతాయి. అనంతరం సైబర్ నేరగాళ్లు చేసే బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గి ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది. రెండు రోజులు లింక్‌లకు దూరం.. న్యూ ఇయర్ అంటూ వాట్సాప్, టెలిగ్రామ్, ఎస్ఎంఎస్లకు వచ్చే లింక్‌లు, ఏపీకే ఫైళ్లను తెరవకుండా రెండు రోజులు దూరంగా ఉండాలి. ట్రావెల్ గ్యాడ్జెట్స్, గిఫ్ట్ ఓచర్లు, వస్తువులపై 50 శాతం డిస్కౌంట్, ఈ సందేశం నలుగురికి పంపితే రీచార్జ్.. ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు వల పన్ని బ్యాంక్ ఖాతాలను లూటీచేస్తారు. ఇలాంటి తరుణంలో ఈ రెండు రోజులు ఎలాంటి లింక్‌లు క్లిక్ చేయకుండా ఉండడమే మేలు. అప్రమత్తంగా ఉండాలి నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో వాట్సాప్‌లకు వచ్చే లింక్‌లను ఎవరూ క్లిక్ చేయొద్దు. అది సైబర్ నేరగాళ్ల పన్నాగమై ఉండవచ్చు. ఎవరికై నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపాలనుకుంటే నేరుగా ఫోన్ చేసి చెప్పండి. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలి. – హేమంత్‌కుమార్, డీఎస్పీ, ధర్మవరం నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఆర్థిక నేరాలకు ఆస్కారం ఏపీకే ఫైళ్లు... లింక్‌లతో జాగ్రత్త అంటున్న పోలీసులు -
చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటాం
● సింహాచల మాన్యం అన్యాక్రాంతం కానివ్వం ● విశ్వహిందూ పరిషత్తు హెచ్చరిక అనంతపురం కల్చరల్: పవిత్ర పుణ్యక్షేత్రమైన సింహాచల ఆలయ మాన్యం భూములను ప్రైవేట్ పరం చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబును జిల్లా విశ్వహిందూ పరిషత్తు నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం డీఆర్వో మలోలను వీహెచ్‌పీ నేతలు కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు తాళంకి రత్నమయ్య, ఉపాధ్యక్షుడు రమణబాబు మాట్లాడుతూ.. సింహాచల భూములను దొడ్డి దారిన తన ఇష్టానుసారంగా పంచేయాలన్న సీఎం చంద్రబాబు కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. తాత్కాలిక ప్రయోజనాలను చూడకుండా జాతి సంరక్షణకు పాటుపడాలని హితవు పలికారు. అలా కాదని దేవదాయ శాఖను బలిపశువును చేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు. ఎక్కడ దేవుని మాన్యం అన్యాక్రాంతమైనా తీవ్ర ప్రతిఘటనతో అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ కార్యదర్శి విశ్వనాథరెడ్డి, జిల్లా గోరక్షా ప్రముఖ్ సోమశేఖర్, కిషోర్, హరీష్ పాల్గొన్నారు. -
బేకరీల్లో మోసం
రాయదుర్గం టౌన్: నూతన సంవత్సరం సందర్భంగా వినియోగదారులను మోసం చేస్తున్న పలు బేకరీ దుకాణాల నిర్వాహకుల బాగోతాన్ని తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ బట్టబయలు చేశారు. రాయదుర్గం, ఉరవకొండ, విడపనకల్లు, కణేకల్లులో ఏర్పాటు చేసిన పలు బేకరీల్లో గుంతకల్లు లీగల్ మెట్రాలజీ అధికారి శంకర్ బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 100 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకూ తక్కువ బరువుతో కేక్‌లను తయారీ చేసి కిలో బరువు ఉన్నట్లుగా విక్రయాలు సాగిస్తున్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో తక్కువ తూకాలతో మోసానికి పాల్పడుతున్న విడపనకల్లులోని మూడు బేకరీ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి రూ.27 వేలు జరిమానా విధించారు. అలాగే ఉరవకొండలో 4 కేసులు నమోదు చేసి రూ.41 వేలు, కణేకల్లులో 2 కేసులు నమోదు చేసి రూ.20 వేలు, రాయదుర్గంలో ఒక కేసు నమోదు చేసి రూ.15 వేలు జరిమానా విధించారు. రాయదుర్గంలో రాత్రి 11 గంటలవుతున్నా తనిఖీలు కొనసాగించడం గమనార్హం. ● లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ తనిఖీలో వెలుగు చూసిన అక్రమాలు ● 10 కేసుల నమోదు -
మానవత్వం మరచి..
రాప్తాడు రూరల్: నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి అనంతపురం నగర శివారులోని హార్మోన్ సిటీ, కార్బన్ సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ‘శుభారంభం–2026’ ఈవెంట్ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. అయినా మృతదేహాన్ని అక్కడే ఉంచుకుని ఈవెంట్‌ను నిర్వాహకులు కొనసాగిస్తుండడంతో బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే... అనంతపురంలోని వేణుగోపాల్‌నగర్‌కు చెందిన షాజహాన్ కుమారుడు షౌకత్ (17) ఇంటర్ చదువుతున్నాడు. పార్ట్‌టైంగా ఎల్ఈడీ టెక్నీషియన్‌గా పని చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. ఈ క్రమంలో హార్మోన్ సిటీలో ఈవెంట్ నిర్వహణలో ఎల్ఈడీ లైట్లు, స్క్రీన్లు ఏర్పాటుకు తోటి టెక్నీషియన్లతో కలసి షౌకత్ వెళ్లాడు. ఎల్ఈడీలకు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్న క్రమంలో హై ఓల్టేజ్ ప్రసరించి షాక్‌కు గురై అపస్మారకంగా పడిపోయాడు. ఆ సమయంలో క్షతగాత్రుడి గురించి పట్టించుకోకుండా ఈవెంట్‌ను నిర్వాహకులు కొనసాగిస్తూ వచ్చారు. సంబరాల్లో ఆటపాటలతో చిందేయసాగారు. చివరకు తోటి టెక్నీషియన్లు షౌకత్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో షౌకత్ మృతిచెందాడు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి చేర్చి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవని, ఆలస్యంగా తీసుకురావడం వల్ల పరిస్థితి విషమించి షౌకత్ మృతి చెందినట్లుగా వైద్యులు తెలపడంతో మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. మృతదేహంతో ఆందోళన కళ్లెదుట యువకుడు మృతి చెందినా కనీసం పట్టించుకోకుండా నిర్వాహకులు వ్యవహరించిన తీరుపై బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ షౌకత్ మృతదేహంతో ఈవెంట్ వద్ద ఆందోళన చేపట్టారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా.. నిర్వాహకుల్లో స్పందన కరువైంది. విందు భోజనాలతో సందడిలో నిమగ్నమైపోయారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన బంధువులు బారికేడ్లను కూలదోసి ఈవెంట్ ప్రాంగణంలోకి దూసుకెళ్లారు. వేదికపైకి రాళ్లు రువ్వారు. శాపనార్థాలు పెడుతూ మనిషి ప్రాణానికి విలువ ఇవ్వకుండా డబ్బే ప్రాధాన్యతగా ఈవెంట్ సంబరాల్లో మునిగి తేలుతున్న నిర్వాహకులపై మండిపడ్డారు. భారీగా నిర్వహిస్తున్న ఈవెంట్ వద్ద కనీసం అంబులెన్స్ కాని, ఫైరింజన్ కాని అందుబాటులో పెట్టలేదని, పది నిముషాల ముందు ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే తమ కుమారుడు బతికేవాడని తల్లిదండ్రులు బోరున విలపించారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో ఈవెంట్‌ను నిర్వాహకులు కాసేపు ఆపేసి, పోలీసుల సాయం కోరారు. సమాచారంఅందుకున్న అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు, పలువురు సీఐలు, సిబ్బంది అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఆందోళనకారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు. అప్పటికీ ఆందోళనకారులు శాంతించకపోవడంతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఈవెంట్‌ను యథావిధిగా నిర్వాహకులు కొనసాగించారు. మృతుడు షౌకత్ ఘటన అనంతరం ఈవెంట్‌ను కొనసాగిస్తున్న దృశ్యం కొత్త సంవత్సరం వేడుకల్లో అపశ్రుతి ఏర్పాట్లలో ఎల్ఈడీ టెక్నీషియన్‌కు విద్యుత్ షాక్ పట్టించుకోకుండా సంబరాల్లో చిందేసిన నిర్వాహకులు ఆలస్యంగా ఆస్పత్రికి తరలించిన సాటి కార్మికులు పరిస్థితి విషమించి యువకుడి మృతి మృతదేహంతో బంధువుల ఆందోళన -
ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి
అనంతపురం: కొంగొత్త ఆశలు.. ఆకాంక్షలతో నూతన సంవత్సరం ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో శాంతియుతంగా ఉండాలని కోరారు. సరికొత్త లక్ష్యాలను సాధించడానికి నూతన ఏడాది ప్రేరణ కావాలన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అనంతపురం అర్బన్: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఆనంద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సరికొత్త ఆలోచనలతో ప్రణాళిక రూపొందించుకుని లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయంలో ఆధునాతన సాంకేతికతను (అగ్రిటెక్) వినియోగించుకుని అధిక దిగుబడులు పొంది ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా వ్యవసాయ అధికారి బాధ్యతల స్వీకరణ అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏఓ)గా ఎం.రవి బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న డీఏఓ ఉమామహేశ్వరమ్మ బుధవారం సాయంత్రం 5 గంటలకు ఉద్యోగ విరమణ చేస్తూ.. బాధ్యతలను ఎం.రవికి అప్పజెప్పారు. సీనియర్ ఏడీఏగా తాడిపత్రి డివిజన్లో పనిచేస్తున్న ఎం.రవిని ఎఫ్ఏసీ డీఏవోగా నియమిస్తూ 15 రోజుల కిందటే కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు వచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగ విరమణ చేసిన డీఏఓకు వీడ్కోలు చెబుతూ నూతన డీఏఓ రవికి ఆ శాఖ ఏడీఏలు, ఏఓలు, కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి అనంతపురం అర్బన్: ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం ఆయా శాఖల పరిధిలో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ మానిటరింగ్ కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల్లో 17.08 శాతం ఎస్సీలకు, 5.53 శాతం ఎస్టీలకు ఖర్చు చేయాలన్నారు. ఆ వర్గాల వారికి కేటాయించిన లక్ష్యం మేరకు ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు సంపూర్ణంగా అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డీఆర్డీఏ పరిధిలో సీ్త్రనిధి కింద రుణాల మంజూరులో, ఉన్నతి, పీఎంఎఫ్ ఎంఈ పథకాల్లో నిర్దేశించిన లక్ష్యాల్లో పురోగతి సాధించాలని సూచించారు. ఉపాధి హామీ కింద ఆ వర్గాలకు లబ్ధి చేకూర్చాలన్నారు. హౌసింగ్, ఏపీఎంఐపీ, వ్యవసాయం, పౌర సరఫరాలు, పురపాలక, తదితర శాఖల పరిధిలో లక్ష్యాలను అధిగమించాలన్నారు. మునిసిపల్ కమిషనర్లతో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ, డీటీడబ్ల్యూఓలు సమన్వయం చేసుకుని ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాలన్నారు. ఎంటెక్, ఎంఫార్మసీ ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ (ఏ) పరిధిలో నిర్వహించిన లాస్ట్ ఛాన్స్ (ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ, బీటెక్, బీఫార్మసీ ) ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు బుధవారం విడుదల చేశారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచారు. కార్యక్రమంలో సీఈ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి. శంకర్ శేఖర్ రాజు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఎం.అంకారావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలపై అక్కసు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘ఎవరు.. ఆ ఫ్లెక్సీలను అక్కడ ఉంచింది? నేను కార్యక్రమం వెళ్లి వచ్చేలోగా తొలగించాలి’ అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఆదేశించడంతో ఆయన అనుచరులు.. వైఎస్సార్సీపీ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన ఘటన బుధవారం అనంతపురం శివారు రుద్రంపేట పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రబాబు కొట్టాలుకు వెళ్లేదారిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఎంపీటీసీ సభ్యురాలు మహబూబ్‌బీ, ఆమె భర్త వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంఎస్ఎస్ సాదిక్ ఏర్పాటు చేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే దగ్గుపాటి వాటిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తొలగించాలనే ఆదేశాలతో అనుచరులు, టీడీపీ కార్యకర్తలు వెంటనే ఫ్రేమ్‌లు విరగ్గొట్టి, ఫ్లెక్సీలను పీకేశారని సాదిక్ వలి వాపోయారు. ఫ్లెక్సీలు చించినంత మాత్రాన వారికి ఒరిగేదేమీ లేదని, ప్రజలన్నీ గమనిస్తున్నారని అన్నారు. -
టీడీపీలో ఫ్లెక్సీల వార్
అనంతపురం క్రైం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరింది. తనవి తప్ప ఇంకెవ్వరి ఫ్లెక్సీలూ కనిపించరాదనే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీతో పాటు స్వపక్షంలోని ఇతర టీడీపీ నేతలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా తట్టుకోలేకపోతున్నారు. తనవి మాత్రమే కనిపించాలన్నట్టు నియంతృత్వ పోకడకు పోతున్నారు. తాజాగా రామనగర్‌లో చోటు చేసుకున్న ఫ్లెక్సీ చించివేత ఘటన రాజకీయంగా దుమారం రేపింది. అంతేకాదు అధికార టీడీపీలో విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి అభిమాని నటేష్‌చౌదరి ఫ్లెక్సీ వేయించి.. రామనగర్ 80 అడుగుల రోడ్డులో ఏర్పాటు చేయిస్తుండగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వర్గీయులు అడ్డుకున్నారు. ఫ్లెక్సీలను చించేశారు. నటేష్చౌదరిని అంతం చేస్తామంటూ బెదిరింపులకు సైతం దిగారు. ‘ఇది మా అడ్డా. ఇక్కడ ఎవ్వరూ ఫ్లెక్సీలు వేయకూడదు’ అంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి చేయిదాటుతుండటంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఆయన అనుచర వర్గం రంగంలోకి దిగింది. అయితే దగ్గుపాటి వర్గీయులు కూడా వెనక్కు తగ్గలేదు. బాహాబాహీకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చౌదరికి నచ్చజెప్పి పంపించేశారు. కాగా నటేష్ చౌదరి మాత్రం ఫ్లెక్సీ వేసి తీరాల్సిందేనని పట్టుబట్టారు. ‘పార్టీకి మేము పని చేయలేదా? మా ఫ్లెక్సీలు వేసుకోకూడదా?’ అంటూ పోలీసులను నిలదీశారు. అనంతరం ఇరువర్గాల వారికీ సర్దిచెప్పారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి రామనగర్‌కు చేరుకుని తన వర్గీయులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఎవ్వరి ఫ్లెక్సీలూ వేయించవద్దని చెప్పి.. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే దగ్గరుండి చించివేయించి వెళ్లిపోయారని నటేష్‌చౌదరి ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా అధికార పార్టీలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆ సామాజిక వర్గ పెద్దలు స్పందించారు. సమస్యను సద్దుమణిగించేందుకు ‘వైకుంఠం’ నివాసంలో చర్చలు జరిపారు. అయితే తనను టార్గెట్ చేసుకుని, కుటుంబ సభ్యుల జోలికి వస్తే పరిస్థితి మరోలా ఉంటుందని ప్రభాకర్‌చౌదరి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. నటేష్ చౌదరి ఫ్లెక్సీలను చించేసిన దగ్గుపాటి వర్గీయులు తమ అడ్డాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదంటూ హుకుం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులకు ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గీయుల బెదిరింపులు -
సైబర్ నేరాలు పెరిగాయ్
● 2025 వార్షిక నేర సమీక్షలో ఎస్పీ జగదీష్ వెల్లడి అనంతపురం సెంట్రల్: జిల్లాలో గతంతో పోలిస్తే 2025 సంవత్సరంలో నేరాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. సైబర్ నేరాలు మాత్రం పెరిగాయని ఎస్పీ జగదీష్ తెలిపారు. బుధవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వార్షిక నేరసమీక్ష వివరాలు వెల్లడించారు. 2024 సంవత్సరంలో 8,841 నేరాలు నమోదైతే...2025లో 6,851 నమోదయ్యాయని తెలిపారు. పోలీసుశాఖ తీసుకున్న చర్యల ఫలితంగా నేరాలు కట్టడి చేయగలిగామని చెప్పారు. గత సంవత్సరం 530 దొంగతనాల కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 527 కేసులు నమోదయ్యాయన్నారు. హత్యలు 2024లో 57 జరిగితే.. 2025లో 42 నమోదయ్యాయన్నారు. ఎక్కువ శాతం చిన్న చిన్న వివాదాలు, లైంగిక, కుటుంబ ఆస్తి తగాదాలతోనే జరిగాయని పేర్కొన్నారు. ఇక హత్యాయత్నాలు 2024లో 66 కాగా, 2025లో 59 నమోదయ్యాయన్నారు. మహిళలపై జరిగే నేరాలు 733 నుంచి 644కు తగ్గాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద 127 కేసులు నమోదయ్యాయన్నారు. రోడ్డు ప్రమాదాలు 2024లో 544 నమోదు కాగా, 2025లో 496 జరిగాయన్నారు. ప్రధానంగా సైబర్ నేరాలు 32 శాతం పెరిగినట్లు వివరించారు. 2025లో సుమారు రూ.11.25 కోట్ల ఆర్థికనష్టం సంభవించిందని తెలిపారు. 1,218 పేకాట కేసులు, 1,35,572 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు, న్యూసెన్స్ కేసులు 13,779 నమోదయ్యాయన్నారు. డయల్ 100కు 25,611 ఫిర్యాదులు అందాయన్నారు. 2025లో పలు కేసులు ఛేదించడం ద్వారా పోలీసు శాఖకు మంచి పేరు వచ్చిందన్నారు. నూతన సంవత్సరంలో టెక్నాలజీ వినియోగించి నేరాలు ఛేదన, డ్రగ్స్ కట్టడి, మహిళలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తామని ఎస్పీ వివరించారు. అనంతరం అత్యుత్తమంగా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. -
మళ్లీ యూరియా కొరత
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో రబీకి సంబంధించి యూరియా కొరత మొదలైంది. వరి నాట్లు ప్రారంభం కావడం, వేరుశనగ, మొక్కజొన్న, జొన్నకు యూరియా అవసరం ఉండటంతో డిమాండ్ కనిపిస్తోంది. కానీ వ్యవసాయశాఖ తగినంత యూరియా నిల్వ చేయడంలో విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. ఖరీఫ్‌లో తీవ్ర సమస్య ఎదురైనప్పటికీ ఆ అనుభవంతో రబీలో మేలుకోకపోవడం గమనార్హం. ఇప్పుడిపుడే జిల్లాలో యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. అనంతపురంలో ఉన్న డీసీఎంఎస్‌కు పరిసర ఐదారు మండలాల నుంచి రైతులు వస్తున్నా.. వారానికి ఒక లారీ మాత్రమే యూరియా పంపిస్తుండంతో రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. బయట ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్నా అవసరం లేని మరికొన్ని ఎరువులు, డ్రిప్ మందులు తీసుకోవాలని షరతు పెడుతుండటంతో దిక్కుతోచడం లేదని గార్లదిన్నె మండలం ఇల్లూరుకు చెందిన రైతు నల్లప్ప, అనంతపురం రూరల్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన రైతు నాగేశ్వరరెడ్డి ‘సాక్షి’ ఎదుట వాపోయారు. సొసైటీలు, రైతు సంఘాలు, ప్రైవేట్, హోల్‌సేల్ డీలర్ల వద్ద కూడా యూరియా సమస్య ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఈ రబీలో 27,232 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక రూపొందించారు. గత ఖరీఫ్‌లో మిగులు యూరియా 3,610 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు చూపించారు. మొత్తం మీద రబీలో ఇప్పటివరకు 20,729 మెట్రిక్ టన్నులు సరఫరా అయినట్లు అధికారులు చెబుతున్నారు. అందులో అమ్మకాలు పోను ప్రస్తుతం 4,500 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనధికార సమాచారం ప్రకారం ఆన్లైన్లో 4 వేల మెట్రిక్ టన్నులు ఉన్నట్లు చూపిస్తున్నా... భౌతిక నిల్వలు చాలా తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో రైతులకు ప్రస్తుతం యూరియా దొరడం కష్టంగా మారింది. వరి నాట్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. జనవరిలో 15 వేల హెక్టార్లకు పైగా సాగులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. జనవరిలో ఊపందుకోనున్న వరినాట్లు ఖరీఫ్ సమస్య పునరావృతమయ్యే పరిస్థితి -
జాతీయస్థాయి ప్రదర్శనలకు ‘అనంత’ ప్రాజెక్టులు
అనంతపురం సిటీ: జాతీయస్థాయిలో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంస్థ నిర్వహిస్తున్న శాసీ్త్రయ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయని డీఈఓ ప్రసాద్‌బాబు మంగళవారం తెలిపారు. ఇందుకు సంబంధించి మూడ్రోజులుగా నిర్వహిస్తున్న ఆన్లైన్ ఎంపికలో మొత్తం 234 ప్రాజెక్టులు ప్రదర్శనకు రాగా.. అందులో మన జిల్లాలోని పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు పావని, ప్రణతి రూపొందించి ప్రదర్శించిన సౌరశక్తి ఆధారిత పిచికారీ యంత్రం మొదటి స్థానంలో నిలిచిందని డీఈఓ వివరించారు. గుత్తి ఆదర్శ పాఠశాలకు చెందిన మౌర్య శ్రీకారి, అంజుమ్ పర్వీన్ తయారు చేసిన ‘వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ ఆన్ ది మూవ్’ ప్రాజెక్టు మూడో స్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వంగా ఉందని డీఈఓ పేర్కొన్నారు. నిబంధనల మేరకే పాఠశాలలకు అనుమతి ప్రైవేటు పాఠశాలల రెన్యువల్, రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను విద్యాశాఖ అదనపు డైరెక్టర్ పార్వతి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆమె డీఈఓలు, డిప్యూటీ డీఈఓలు, విద్యాశాఖ ఇతర అధికారులతో వెబెక్స్ నిర్వహించారు. అనంతపురం నుంచి డీఈఓ ప్రసాద్‌బాబు, ఏడీ–1, 2 మునీర్ ఖాన్, శ్రీనివాసులు, డిప్యూడీ డీఈఓ మల్లారెడ్డి, సూపరింటెండెంట్ జగదీష్, ఏపీఓ మంజునాథ్, ఏఎస్ఓ బోయ శ్రీనివాసులు, ఐటీ సెల్ ఇన్చార్జ్ చంద్రశేఖర్‌రెడ్డి, నోడల్ ఆఫీసర్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలలన్నీ కచ్చితంగా రెన్యువల్ అయ్యేలా చూడాలన్నారు. మూడో స్థానం దక్కించుకున్న గుత్తి ఆదర్శ పాఠశాల విద్యార్థినులతో పీజీటీ సాంబశివారెడ్డి మొదటి స్థానంలో నిలిచిన చీమలవాగుపల్లె విద్యార్థినులతో హెడ్మాస్టర్ -
పరిశ్రమల ఏర్పాటుతో సమగ్రాభివృద్ధి
అనంతపురం అర్బన్: పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పారిశ్రామిక రంగం బలోపేతం చేసేలా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అన్ని అనుమతులను సకాలంలో మంజూరు చేయాలని ఆదేశించారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఇంజినీరింగ్ పనులు జనవరిలోగా పూర్తిచేయాలని చెప్పారు. ఏపీఐఐసీ పారిశ్రామికవాడల్లో ఇప్పటికీ ఉత్పత్తి ప్రారంభించని యూనిట్లను గుర్తించి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జెడ్ఎంను ఆదేశించారు. ఇండస్ట్రియల్ పాలసీ కింద రెండు యూనిట్లకు విద్యుత్ రాయితీ రూ.29 వేలు, రెండు యూనిట్లకు వడ్డీ రాయితీ రూ.2.37 లక్షలు, ఐదు యూనిట్లకు పెట్టుబడి రాయితీ రూ.2.9 కోట్లు, ఒక యూనిట్‌కు అమ్మకపు పన్ను రాయితీ రూ.28.85 లక్షలు, ఒక యూనిట్‌కు స్టాంప్ డ్యూటీ రాయితీ రూ.1.02 లక్షలు మంజూరు చేశారు. ప్లాట్లు రద్దు చేయండి రాయదుర్గం టెక్స్టైల్ పార్కులో యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రాని వారికి నోటీసు ద్వారా తెలియజేసి.. వారికి కేటాయించిన ప్లాట్లను రద్దు చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాలులో రాయదుర్గం పరిధిలోని టెక్స్టైల్ పార్కులో గార్మెంట్ యూనిట్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాయదుర్గం టెక్స్టైల్ పార్కులో యూనిట్ల నిర్మాణం చేపట్టని 47 మందితో మాట్లాడి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
మొదటి వారంలో కంది కొనుగోళ్లు
అనంతపురం అగ్రికల్చర్: జనవరి మొదటి వారంలో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటా రూ.8 వేల ప్రకారం ‘నాఫెడ్’ ద్వారా కందుల కొనుగోళ్లు ప్రారంభించున్నట్లు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పి.పెన్నేశ్వరి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఖరీఫ్‌లో సాగు చేసినట్లు ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతుల నుంచి 24,838 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేయాలని లక్ష్యం విధంచుకున్నామన్నారు. ఇప్పటి వరకు 5,759 మంది రైతులు ఆర్ఎస్కేల్లో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. మిగతా రైతులు సాధ్యమైనంత తొందరగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటే జనవరి మొదటి వారంలోపు కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు. మండలానికి ఒకటి చొప్పున 31 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. శ్రుతి మించితే కఠిన చర్యలు అనంతపురం సెంట్రల్: నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం రాత్రి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఆకతాయిల చేష్టలు శ్రుతిమించితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు తనిఖీలు కొనసాగుతాయన్నారు. ఒంటి గంటలోపు కార్యక్రమాలన్నీ ముగించాలని, నిర్ణీత సమయానికి మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని, టపాసులు, డీజేలు నిషేధించినట్లు తెలిపారు. 2026 నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. బీటెక్ ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో అక్టోబర్ నెలలో నిర్వహించిన బీటెక్ నాలుగో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–20) రెగ్యులర్, సప్లిమెంటరీ, (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు, సీఈ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి.శంకర్ శేఖర్‌రాజు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఎం.అంకారావు పాల్గొన్నారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలన్నారు. మద్యం ఫుల్లుగా తాగేశారుఅనంతపురం సెంట్రల్: జిల్లాలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. లైసెన్స్ దుకాణాల్లో 29,93,696 ఐఎంఎల్ (36.23శాతం పెరుగుదల) బాక్సులు, 29,13,786 బాక్సుల బీరు (37.37శాతం పెరుగుదల) అమ్మకాలు జరిగాయి. 2025 సంవత్సరంలో మద్యం విక్రయాలు, ఎన్ఫోర్సుమెంట్ చర్యలపై జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి రామమోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో వివరించారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలు అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నాటుసారా స్థావరాలపై 298 దాడులు నిర్వహించి, 258 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 1,650 లీటర్ల సారా సీజ్ చేసి, 27,935 లీటర్ల ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. బెల్టు షాపులపై దాడులు చేసి 735 కేసుల్లో 734 మందిని అరెస్ట్ చేసి, 2848 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. కర్ణాటకకు చెందిన 2,848 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి, 26 వాహనాలను సీజ్ చేశామని వివరించారు. ఏడు గంజాయి కేసుల్లో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, 16.63 కేజీల గంజాయితో పాటు 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మిలటరీ మద్యం విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు. కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరిని, అక్రమంగా అమ్ముతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వివిధ కేసుల్లో 970 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. -
ముక్కోటి.. తరించిన భక్తకోటి
అనంతపురం లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం వద్ద క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులుఅనంతపురం కల్చరల్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామిని ఉత్తరద్వారంలో భక్తకోటి దర్శించుకుని తరించింది. అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, రాప్తాడు, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లోని ప్రముఖ వైష్ణవాలయాలకు తెల్లవారుజామునుంచే భక్తుల రాక మొదలైంది. గోవిందనామ స్మరణతో స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తిపారవశ్యం చెందారు. శ్రీవారి ఆలయంతో పాటు వివిధ దేవాలయాల్లో కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల రథోత్సవాలు, గ్రామోత్సవాలు జరిగాయి. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. -
●బతుకు ప్రయాణం..
వారంతా రోజువారీ కూలీలు. రెక్కాడితే గాని డొక్కాడదు. ఎక్కడ పని దొరికితే అక్కడికే వెళ్తుంటారు. ఈ క్రమంలో పని ప్రాంతానికి చేరుకోవడానికి ప్రైవేట్ ఆటోలను ఆశ్రయిస్తుంటారు. అయితే పరిమితికి మించి ఆటోలో ప్రయాణించడం.. ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా మారింది. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగినా కూలీలతో పాటు ఆటో డ్రైవర్లలోనూ మార్పు రావడం లేదు. మంగళవారం కళ్యాణదుర్గం–బళ్లారి మార్గంలో జాతీయ రహదారిపై ఒక్కో ఆటోలో 25 మంది చొప్పున రెండు ఆటోల్లో 50 మంది కూలీలు ఇలా ప్రమాదకరంగా ప్రయాణిస్తుండడం గమనించిన వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణాలు కోల్పోయినప్పుడు హడావుడి చేసే అధికారులు.. ముందస్తుగా ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడం లేదనేందుకు ఇంతకు మించిన నిదర్శనం మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. –బొమ్మనహాళ్ -
జీవాల పెంపకం లాభదాయకం
ఉరవకొండ: జీవాల పెంపకం చేపడితే లాభాలు బాగుంటాయని, గొర్రెలు, పొట్టేళ్ల పెంపంకం దృష్టి సారించాలని స్టేక్‌హోల్డర్స్‌కు సెర్ఫ్ డైరెక్టర్ పద్మావతి సూచించారు. మీట్ ప్రాసెసింగ్‌పై మంగళవారం ఉరవకొండలోని వెలుగు కార్యాలయంలో స్టేక్‌హోల్డర్స్‌కు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీఆర్డీఏ పీడీ శైలజ తో కలసి ఆమె మాట్లాడారు. పీఎంఎఫ్ఎంఈ పథకం కింద జిల్లా లో ఫుడ్ ప్రాసింగ్ యూనిట్లు వంద మంజూరయ్యాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు, పొట్టేళ్లు పెంపకం చేపట్టి ఆర్థిక పురోగతి సాధిస్తున్నారని, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ఆర్థిక చేయూతనందించేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పశుసంవర్దక శాఖ ఏడీ పెద్దన్న, వెలుగు ఏసీ శివప్రసాద్, ఏపీఎం శివయ్య పాల్గొన్నారు. గార్మెంట్స్ పరిశ్రమపై ఆసక్తి చూపాలి గార్మెంట్స్ పరిశ్రమ ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలు దక్కుతాయని మహిళా సంఘాల సభ్యులకు సెర్ఫ్ డైరెక్టర్ పద్మావతి సూచించారు. ఉరవకొండలో గార్మెంట్స్ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మరో ఆరు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి టైలరింగ్‌లో అనుభవమున్న మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ ● 32 ద్విచక్ర వాహనాల స్వాధీనం కళ్యాణదుర్గం రూరల్: అంతర్రాష్ట్ట దొంగలను అరెస్ట్ చేసి 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు తెలిపారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. ఇటీవల కళ్యాణదుర్గం నియోజవర్గం వ్యాప్తంగా ప్రధాన సర్కిళ్లలో నిలిపిన ద్విచక్ర వాహనలను దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు పక్కా సమాచారంతో కళ్యాణదుర్గంలోని కుందుర్పి రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరిని మంగళవారం అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న వైనం వెలుగుచూసింది. పట్టుబడిన వారిలో కుందిర్పి మండలం బోదపల్లి గ్రామానికి చెందిన బోయ పాతన్న, అనంతపురంలోని పాపంపేటకు చెందిన బోయ చిన్నబాబు ఉన్నారు. అపహరించిన ద్విచక్ర వాహనాలను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం ఎదురుగా ఉన్న పాత భవనంలో దాచినట్లుగా వెల్లడించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మొత్తం 32 ద్విచక్ర వాహనాలను స్వాధీన చేసుకుని పీఎస్‌కు తరలించారు. వీటి విలువ రూ 22.80 లక్షలుగా ఉంటుందని నిర్దారించారు. కాగా, పట్టుబడిన నిందితులు పాత నేరస్తులే. వీరిపై అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలోని పావగడలోనూ పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
అరాచకం సాగిస్తామంటే కుదరదు
● వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్ అనంతపురం: రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తామంటే కుదరదని టీడీపీ నేతలను వైఎస్సార్సీపీ బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర కార్యదర్శి సి. రమేష్‌గౌడ్ హెచ్చరించారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, లీగల్ సెల్ నాయకులతో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతపురంలోని గుల్జార్పేటతో రోడ్డు విస్తరణలో భాగంగా టీడీపీ జెండా దిమ్మెను తొలగిస్తే.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ కుమారుడు దాదును స్టేషన్‌కు తీసుకెళ్లిన అంశాన్ని ప్రశ్నించేందుకు వెల్లిన పార్టీ ముఖ్య నాయకులపై సీఐలు వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉందన్నారు. ఒకరేమో కాల్చిపారేస్తాం నా కొడకా అంటే.. ఇంకొకరేమో 200 మందిని దించుతామంటూ బెదిరింపులకు దిగారని గుర్తు చేశారు. ఈ విషయంలోనే తనతో పాటు మరో 23 మంది ముఖ్య నాయకులపై అక్రమంగా కేసులు బనాయించారన్నారు. విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేశామని.. ఢిల్లీలోనూనిరసన తెలిపామని కానీ ఏ రోజూ పోలీసులు ఇలా వ్యవహరించింది లేదన్నారు. కేసులు ఎందుకు నమోదు చేశారు.. దాదును ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్నది పోలీసులు చెప్పి ఉంటే అసలు వివాదమే ఉండేది కాదన్నారు. అలా చేయకుండా అసలు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లడమే తప్పు అనే విధంగా వ్యవహరించారన్నారు. టీడీపీ నేతలకు వర్తించని 30 యాక్ట్ వైఎస్సార్సీపీ నేతలకు మాత్రమే వర్తిస్తుందా అని ప్రశ్నించారు. కనీసం నూతన సంవత్సరం నుంచైనా పోలీసులు పనితీరు మారాలని.. న్యాయం వైపు నిలబడి చట్ట ప్రకారం పని చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉమాపతి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు సైతం కేసులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పొట్టెళ్లను కొడవళ్లతో నరికితేనే ఈ సెక్షన్ ఉపయోగిస్తే.. జాతర్లు జరిగినప్పుడు కూడా అందరిపై కేసులు పెట్టాల్సి ఉంటుందన్నారు. అఖండ –2 సినిమా విడుదల సమయంలో వందల మంది అభిమానుల సమక్షంలో పొట్టేళ్లు కొట్టి.. వాటి తలలతో బాలకృష్ణ కటౌట్‌కి హారంగా వేశారన్నారు. ధర్మవరంలో మంత్రి సత్యకుమార్, శ్రీరామ్‌ను ఊరేగిస్తున్నప్పుడు వందలాది మంది జనం మధ్య పొట్టేళ్ల తలలు నరికారన్నారు. మరి ఆయా ఘటనలపై మీద కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. అక్రమ కేసులను ఎదుర్కొంటామని.. అలాగే పోలీసులపై కూడా కేసులు పెట్టి.. కోర్టుకు రప్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగన్న, రాజశేఖర్ యాదవ్, బెస్త వెంకటేశులు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లబ్బే రాఘవ, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి టి. నరేంద్ర, సాకే విక్రం, వెంకటేష్, మోహన్, గణేష్ , జిల్లా యువజన సెక్రెటరీ హిదయ్ తుల్లా, దాదు తదితరులు పాల్గొన్నారు. -
కళ తప్పిన టీటీడీ
ఒకప్పుడు ఎంతో సందడిగా ఉండే అనంతపురంలోని టీటీడీ కల్యాణమంటపం ప్రస్తుతం నిర్వహణ లోపం కారణంగా కళావిహీనంగా మారింది. దీనికి తోడు టీటీడీ ఉత్పత్తుల విక్రయాలు సైతం చేపట్టకపోవడంతో కల్యాణ మంటపం వైభవం మసిబారుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారి క్యాలెండర్లు, డైరీల కోసం టీటీడీ కల్యాణమంటపం చుట్టూ శ్రీవారి భక్తులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అనంతపురం కల్చరల్: ధర తక్కువ, నాణ్యత ఎక్కువగా ఉండడమే కాదు... భక్తి భావాన్ని పెంపొందించేలా టీటీడీ ముద్రించిన క్యాలెండర్లు, డైరీలకు సహజంగానే డిమాండ్ ఎక్కువగానే ఉంది. తిరుమల క్షేత్రంలోని విశేషాలతో కూడిన వీటిని బంధుమిత్రులకు నూతన సంవత్సరం సందర్భంగా అందజేసి శుభాకాంక్షలు చెప్పడమనేది ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ సారి వాటి ఆచూకీ లేకుండా పోవడంతో భక్తులు పొరుగున ఉన్న కర్నూలులోని సీ క్యాంప్‌లో ఉన్న టీటీడీ కల్యాణ మంటపానికి పరుగు తీయాల్సి వస్తోంది. అనంతలో టీటీడీ కల్యాణ మంటపం నిర్వహణను లీజుకు తీసుకున్న కాంట్రాక్టర్.. టీటీడీ ఉత్పత్తుల విక్రయాలపై ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వైఎస్ జగన్ హయాంలో అనంత ముంగిటకే ప్రసాదం తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఎనో వ్యయ ప్రయాసాలకోర్చి తిరుమలకెళ్లి లడ్డూ ప్రసాదాన్ని తీసుకెళ్లి బంధుమిత్రులకు సంబరంగా అందజేస్తుంటారు. అంతటి పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని కరోనే విపత్కర సమయంలో ఇంటి ముగింటకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేరువ చేసింది. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో హిందూ ధర్మప్రచార పరిషత్తు, ధర్మప్రచార మండలి ఆధ్వర్యంలో అప్పట్లో అనంతపురం జిల్లాలో రికార్డు స్థాయిలో రూ.10 లక్షలకు పైగా ప్రసాదాల విక్రయం సాగింది. అలాగే సనాతన ధర్మ ప్రచారానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన అప్పటి టీటీడీ పాలక మండలి ఉచితంగా పంపిణీ చేసేలా అనంతపురం జిల్లాకు రెండు లక్షల భగవద్గీత పుస్తకాలను అందజేసింది. నేటికీ వీటి వితరణ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ కల్యాణమంటపంలో శ్రీవారి క్యాలెండర్లు, డైరీల విక్రయాలకు దిక్కు లేకుండా పోయింది. ఎంఎస్ రాజుకు పట్టని టీటీడీ అభివృద్ధి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ బోర్డు సభ్యుడిగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నియమితులయ్యారు. అయితే మడకశిరలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. భగవద్గీత వల్ల ఒరిగేదేమీ లేదంటూ హిందువుల మనోభావాలు కించపరుస్తూ మాట్లాడడం నేటికీ శ్రీవారి భక్తులు మరవలేక పోతున్నారు. టీటీడీ అభివృద్ధి పట్టని ఎంఎస్ రాజు.. శ్రీవారి క్యాలెండర్లు, డైరీలను భక్తులకు చేరువ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. టీటీడీ ఉత్పత్తుల కోసం కల్యాణమంటపంలో ఏర్పాటు చేసిన ధార్మిక పుస్తక శాల భవనం తాళం భక్తులను వెక్కిరిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి టీటీడీ ఉత్పత్తుల విక్రయాలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మూతపడిన అనంతపురంలోని టీటీడీ ఉత్పత్తుల విక్రయశాల వైఎస్ జగన్ హయాంలో భక్తులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు అందజేసిన భగవద్గీత పుస్తకాల బాక్స్‌లు శ్రీవారి క్యాలెండర్లు, డైరీల కోసం భక్తుల అగచాట్లు కొన్నేళ్లుగా ‘అనంత’లో విక్రయాలు తగ్గిస్తూ వచ్చిన లీజుదారు రెండేళ్లుగా టీటీడీ ఉత్పత్తుల విక్రయాలు బంద్ -
నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి
కళ్యాణదుర్గం రూరల్: ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి ఓ చిన్నారి మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండలం తూర్పుకోడిపల్లి గ్రామానికి చెందిన రామాంజి, అశ్వని దంపతులు కుమార్తె ఈక్షిత (2) మంగళవారం ఇంటి ఆవరణలో ఆదుకుంటూ సమీపంలోని నీటి తొట్టెలో పడిపోయింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని వెలికి తీసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఈక్షిత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
తోపుదుర్తి చందుకు సంబంధం లేదు
మా తాత నుంచి మా నాన్నకు భాగానికి వచ్చిన 3.23 ఎకరాలను తన పేరిట చేయించాలని మా పెద్దనాన్న కుమారుడు, రౌడీ షీటర్ అయిన బండి పరుశురాం బెదిరిస్తున్నాడు. ఎమ్మెల్యే సునీత, బాలాజీ అండ చూసుకుని చంపుతానని దౌర్జన్యం చేస్తున్నాడు. గతంలో మాపై దాడులు చేయించడమే కాకుండా ఇంటి స్థలాన్ని కబ్జా చేసి, చేసి జేసీబీతో గుంతలు తవ్వించాడు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం బి.యాలేరు మీదుగావెళుతున్న తోపుదుర్తి చందును ఆపి వివరిస్తుండగా టీడీపీ నేతలతో కలసి పరుశురాం గొడవ చేశాడు. ఎలాంటి సంబంధం లేని తోపుదుర్తి చందుపై అనవసరంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. – బండి నాగరాజు, బి.యాలేరు -
జనవరి 3 నుంచి అంతర్ కళాశాలల అథ్లెటిక్స్
అనంతపురం సిటీ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ (మహిళలు, పురుషులు) పోటీలు అనంతపురం ఆర్ట్స్ కళాశాల వేదికగా జనవరి 3 నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మశ్రీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులను జనవరి 12 నుంచి 16వ తేదీ వరకూ కర్ణాటకలోని అల్వాస్ ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల, మూదబద్రిలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు పూర్తి వివరాలకు ఫిజికల్ డైరెక్టర్ శ్రీరామ్ (94933 48808)ను సంప్రదించవచ్చు. మా కాలనీకి రోడ్డు వేయండి● దివ్యాంగుల డిమాండ్ అనంతపురం అర్బన్: తమ కాలనీకి రోడ్డు వేయాలంటూ ప్రభుత్వాన్ని అనంతపురంలోని సంత్ గురు రవిదాస్ కాలనీకి చెందిన దివ్యాంగులు డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కో–ఆర్డినేటర్ హరినాథరెడ్డి మాట్లాడారు. కాలనీలో 250 ఇళ్లు ఉన్నాయన్నారు. రోడ్డు గుంతల మయం కావడంతో మూడు చక్రాల వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఏళ్లుగా ఎందరో అధికారులకు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల నుంచి స్పందన కరువైందని మండిపడ్డారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు చేపిస్తామంటూ, గెలిచిన తరువాత తమ కాలనీవైపు కన్నెతి కూడా చూడడం లేదని వాపోయారు. ఆందోళన కారులను డీఆర్వో మలోల కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు అర్జీ అందజేసి ప్రస్తుతం మట్టితో గుంతలైన పూడిపించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, సహాయకుడు సుధాకర్, నాయకులు వసంతకుమార్, ఈసీ సభ్యులు శ్రీనివాసులు, నరేంద్ర, రాకేష్, మక్బూల్, దివ్యాంగులు పాల్గొన్నారు. -
ఆధిపత్యం కోసం అరాచకాలు
అనంతపురం ఎడ్యుకేషన్: రాప్తాడు నియోజకవర్గంలో ఆదిపత్యం కోసం పరిటాల కుటుంబం అరాచకాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన బి.యాలేరు ఘటన, జగనన్న కాలనీల్లో టీడీపీ నాయకులు ప్లాట్లను కబ్జా చేస్తున్న వైనంపై బాధితులతో కలిసి సోమవారం ఎస్పీ జగదీష్, కలెక్టర్ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో పరిటాల సునీత దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. బి.యాలేరులో బండి పరుశురాం అనే రౌడీషీటరును రెచ్చగొట్టి తనపై అసత్య ఆరోపణలు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. రాజకీయ ఆశ, వరుసకు తమ్ముడైన బండి నాగరాజు భూమిని లాక్కొని ఇిప్పిస్తామని ఆశ కల్పించి పరుశురాంతో దుర్మార్గపు ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తమను ఎత్తుకుని పెంచిన చిట్రా ఓబులేసు, ఇతర కురుబ కులస్తులు ఏళ్ల తరబడి ఆదరించారనే కృతజ్ఞతతో తాము ఏమీ అనలేమనే ధైర్యంతోనే పరుశురాం రెచ్చిపోతున్నాడన్నారు. కుట్రలో భాగమే.. రామగిరి మండలంలో కురుబ మజ్జిగ లింగమయ్యను పరిటాల సునీత తమ్ముడు ధర్మవరపు రమేష్, ఆయన కుమారుడు హత్య చేశారని కురుబలందరూ విశ్వసిస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో బండి పరుశురాంను రెచ్చగెట్టి తమపై ఊసిగొల్పారని, ప్రతి చర్యకు దిగితే దానిని భూతద్ధంలో చూపించాలని పరిటాల కుటుంబం పన్నిన పన్నాగమిదని అన్నారు. ఫ్యాక్షన్‌లో వందల ఎకరాల భూమిని కోల్పోయామని, అలాంటి ఫ్యాక్షన్ జోలికి ఎవరూ వెళ్లకూడదని తాను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ప్రజాసేవ కోసం రూ. వంద కోట్లు ఖర్చు చేశానని గుర్తు చేశారు. ఎమ్మెల్యేను ప్రజలు సునీత బదులు శనితగా పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో న్యాయవాది పేరూరు నాగిరెడ్డి, రంగంపేట గోపాలరెడ్డి, గంగుల సుధీర్‌రెడ్డి, మజ్జిగ శంకరయ్య, మదిగుబ్బ వీరాంజనేయులు, ఓబుగారి హరినాథరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు చంద్రకుమార్, నాగార్జున, మారుతీ, వైస్ ఎంపీపీలు కృష్ణారెడ్డి, రాప్తాడు రామాంజనేయులు, అనంతపురం రూరల్, రాప్తాడు, కనగానపల్లి, రామగిరి, ఆత్మకూరు మండలాల వైఎస్సార్సీపీ కన్వీనర్లు దుగుమర్రి గోవిందరెడ్డి, బండి పవన్, సాకే వెంకటేశు, నాగముని, మీనుగ నాగరాజు, బాలపోతున్న, నాయకులు గొల్లపల్లి విశ్వనాథరెడ్డి, పశుపుల ఆది. జూటూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. బండి పరశురాం అనే వ్యక్తిని పావుగా వాడుకుంటున్న పరిటాల కుటుంబం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల కుటుంబ సహకారంతో నన్ను మట్టుబెట్టాలని చూస్తున్న పరశురాం : బండి నాగరాజు బి.యాలేరు ఘటనపై ఎస్పీ, జగనన్న కాలనీల్లో టీడీపీ నాయకుల కబ్జాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి -
పాడి రైతులూ పోటీలకు తరలిరండి : కలెక్టర్
అనంతపురం అర్బన్: రూరల్ మండలం ఆకుతోటపల్లిలో జనవరి 7, 8 తేదీల్లో ‘పాలధార’ పేరుతో నిర్వహిస్తున్న పాల దిగుబడి, దూడల ప్రదర్శన పోటీల్లో పాల్గొనేలా పాడి రైతులను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ రూపొందించిన ‘అనంత పాలధార’ పోస్టర్లను కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో ఆవిష్కరించి, మాట్లాడారు. అధిక పాల ఉత్పత్తి, మేలుజాతి పశుపోషణపై అవగాహన కల్పించేలా విధంగా జిల్లా స్థాయి పాడి రైతుల పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న పశుపోషకులు తమ సమీప రైతు సేవా కేంద్రాలు, పశువైద్య కేంద్రాలను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.మలోల, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ప్రేమ్‌చంద్, డీడీ రమేష్‌రెడ్డి, ఏడీలు రత్నకుమార్, రామచంద్రారెడ్డి, కేఎల్ శ్రీలక్ష్మి, పశువైద్యాధికారి ఎ.గోల్డ్స్మన్, పాల్గొన్నారు. మూడు విభాగాల్లో పోటీలు అనంతపురం అగ్రికల్చర్: ఆకుతోటలపల్లి వేదికగా జనవరి 7, 8, 9 తేదీల్లో మూడు విభాగాల్లో పాడి రైతులకు పోటీలు ఉంటాయని, ఈ పోటీల్లో పాడిరైతులు పాల్గొనేలా చొరవ తీసుకోవాలని సంబంధిత అధికారులను పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్ ఆదేశించారు. మంచి పాల ఉత్పత్తి సాధిస్తున్న పాడి రైతులను గుర్తించి వారి పాడి పశువులు, లేదా గేదెలను తీసుకుని పోటీల్లో పాల్గొనేలా చొరవ తీసుకోవాలన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయం నుంచి అనంతపురం, ఉరవకొండ డీడీలు, ఏడీలు, అలాగే పశువుల డాక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సంకరజాతి ఆవులు 18 లీటర్లు, దేశీయజాతి ఆవులు 6 లీటర్లు, గేదెలు 8 లీటర్ల విభాగంలోమూడు రకాల పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో గెలుపొందిన మూడు విభాగాల్లోనూ మొదటి, రెండు, మూడో బహుమతి కింద నగదు పురస్కారం ఉంటుందని తెలిపారు. 8న పాల దిగుబడి పోటీలు, 9న లేగ దూడల ప్రదర్శన, ఉచిత గర్భకోశవ్యాధి శిబిరం, 9న హుమతుల ప్రదానోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన పశుసంపద పెంపు లక్ష్యంగా రాయలసీమలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పోటీలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. -
సమస్యలతో బేజారు
● పరిష్కారం కాక మళ్లీమళ్లీ వినతులు ● వివిధ సమస్యలపై 467 అర్జీలు ● నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రతి వారం వందల సంఖ్యలో వినతులు వస్తున్నాయి. పరిష్కారం కాక ప్రజలు మళ్లీ మళ్లీ కార్యాలయానికి వస్తున్నారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్‌తో పాటు డీఆర్ఓ ఎ.మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, తిప్పేనాయక్, వ్యవసాధికారి ఉమామహేశ్వరమ్మ ప్రజల నుంచి 467 అర్జీలు స్వీకరించారు. అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి.. సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. వినతుల్లో మచ్చుకు కొన్ని... ● తమ కాలనీలో రోడ్లు, కాలువలు లేక ఇబ్బంది పడుతున్నామని అనంతపురం రూరల్ మండలం రామచంద్ర కాలనీవాసులు రవీంద్ర బాబు తదితరులు విన్నవించారు. ఎన్నిసార్లు విన్నవించినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ● ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వచ్చేలా చూడాలని గుంతకల్లు మండలం గుంతకల్లు తండాకు చెందిన ఎం.శారద విన్నవించారు. భర్త శివనాయక్ ఈ ఏడాది జూన్ 19న మరణించాడని చెప్పారు. తనకు ఇద్దరు పిల్లలని, తమ కుటుంబానికి ఎలాంటి ఆస్తిపాసులు లేవని తెలిపారు. కూలి పనులు చేసుకుని కష్టంగా జీవనం సాగిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు. ● ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులకు రెండేళ్లుగా అందాల్సిన గౌరవ వేతనం విడుదల చేయాలని ఎంపీపీల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీపీలు నారాయణరెడ్డి, సి.జయలక్ష్మీ, హేమలత కోరారు. ఈ మేరకు వారు సోమవారం కలెక్టర్ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. -
ఈ యంత్రాలు రైతు నేస్తాలు
బొమ్మనహాళ్: వరిగడ్డిని కట్టకట్టే యంత్రాలు రావడంతో రైతులకు గ్రాసం కొరతకు పరిష్కారం లభించింది. ప్రస్తుతం వరికోతకు కూలీలకు బదులుగా రైతులు పెద్దసంఖ్యలో యంత్రాలను వినియోగిస్తున్నారు. వీటితో వరిగడ్డి రైతులకు అందకుండా పోతోంది. దీంతో పశుగ్రాసం సమస్య వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త వచ్చిన యంత్రం(స్ట్రా బేలర్ ) ఈసమస్యకు చెక్‌పెడుతోంది. మరోవైపు రైతులకు అదనపు ఆదాయం లభిస్తోంది. ఎండుగడ్డి సేకరణ సులభం స్ట్రా బేలర్ యంత్రం ఎండుగడ్డి సేకరణ సులభమైంది. ట్రాక్టర్ యజమానులు ఈ యంత్రాలను కొనుగోలు చేసి మరింత ఆదాయాన్ని పొందుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు 180 వరకు ఈయంత్రాలు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 53,549 హెక్టార్లలో వరి పంట సాగైంది. ఇప్పటికే దాదాపు 80 శాతం మేర వరి కోతలు పూర్తయ్యాయి. యంత్రాలతో కోసిన గడ్డిని స్ట్రా బేలర్ యంత్రాలతో ఒబ్బిడి చేయడం ప్రారంభించారు. స్ట్రా బేలర్ యంత్రంతో సేకరించే పొలంలో ఎకరాకు దాదాపు 1.5 టన్నుల గడ్డి లభిస్తుంది. ఒక్కో గడ్డి మోపు సుమారు 20 కేజీలు ఉంటుంది. ఇలా ఎకరాకు దాదాపు 75 వరకూ గడ్డి మోపులు లభిస్తాయి. ఒక్కోక్క గడ్డిమోపునకు రూ.35 చొప్పున పలకడంతో ఎకరాకు రూ.2,625 ఆదాయం లభిస్తుంది. గతంలో నిరుపయోగంగా మారిన ఎండుగడ్డిని ఈ స్ట్రా బేలర్ యంత్రంతో ఒబ్బిడి చేసుకుని రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. ఎండుగడ్డి సేకరణకు అందుబాటులోకి వచ్చిన స్ట్రాబేలర్ యంత్రాలు రైతు నేస్తాలుగా మారాయి. దీనివల్ల వారికి ఆదనపు ఆదాయం లభిస్తుంది. గతంలో మాదిరిగా పొలాల్లోని ఎండుగడ్డిని తగులబెట్టి విధానాన్ని వదిలేశారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడంతో పాటు పశుగ్రాసం కోరత సమస్య తీరింది. – సాయికుమార్, ఏఓ, బొమ్మనహాళ్ -
‘ప్రణాళిక’ను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి
అనంతపురం సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో ‘వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక’ను ఉపాధ్యాయులందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేయాలని డీఈఓ ప్రసాద్‌బాబు ఆదేశించారు. అనంతపురం రూరల్ పాపంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. ప్రత్యేక ప్రణాళిక ఎలా అమలవుతోందో పరిశీలించారు. పదో తరగతిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, స్పెషల్ క్లాస్‌కు ఎంత మంది హాజరయ్యారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోజూ స్లిప్‌టెస్ట్ నిర్వహిస్తున్నారా లేదా.. వచ్చిన మార్కులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ఇప్పటి వరకు పిల్లలకు వచ్చిన మార్కులు, వెనుకబడిన విద్యార్థులపై ఎలాంటి శ్రద్ధ పెట్టాలనే అంశాల గురించి సూచనలు ఇచ్చారు. పోక్సో కేసులో ముద్దాయికి ఐదేళ్ల జైలు పుట్టపర్తి టౌన్/ధర్మవరం రూరల్: ఓ బాలిక ఫొటోలు తీసి అసభ్యంగా ప్రవర్తించిన ముద్దాయికి పోక్సో కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.6 వేల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే...ధర్మవరం మండలం గుట్టకిందపల్లి గ్రామానికి చెందిన నరసింహులు మరో గ్రామానికి చెందిన బాలికపై ఈ ఏడాది మే 5వ తేదీన అసభ్యకరంగా ప్రవర్తించాడు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు ధర్మవరం రూరల్ పోలీసులకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు సోమవారం కోర్టు ఎదుటకు రాగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. 8 మంది సాక్షులను విచారించిన తర్వాత నేరం రుజువు కావడంతో ముద్దాయికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి చిన్నబాబు తీర్పు చెప్పారు. అలాగే బాధితురాలికి ప్రభుత్వం ద్వారా రూ.75 వేల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ముద్దాయికి శిక్ష పడేలా సాక్షులను సకాలంలో కోర్టు ఎదుట ప్రవేశపెట్టిన సీఐ బొజ్జప్ప, సిబ్బంది శ్రీనివాసులు, రామాంజనేయులును ఎస్పీ సతీష్‌కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. రాత్రికి రాత్రే భూకబ్జా ● బాధితులు లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ కుటుంబ సభ్యులు అనంతపురం సెంట్రల్: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు కొలువుదీరాక భూకబ్జాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతోంది. కన్ను పడితే చాలు కబ్జా చేసేస్తున్నారు. తాజాగా టీడీపీకే చెందిన ఏపీ వీర శైవ లింగాయత్ వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ స్వప్న కుటుంబ సభ్యులైన విజయకుమారి, రాజశేఖర్‌లకు చెందిన స్థలానికి రాత్రికి రాత్రే ఎవరో కంచె వేసేశారు. దీంతో ఆమె బాధితులను వెంటబెట్టుకొని సోమవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. నగర శివారు తపోవనంలో 179 సర్వే నంబర్లో నాగప్ప పేరుతో 43 సెంట్ల భూమి ఉందని, తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తోందని బాధితులు తెలిపారు. ఐదుగురు అన్నదమ్ములకు సంబంధించిన వారసులకు ఈ స్థలం భాగపరిష్కారం చేయాల్సి ఉందని వివరించారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి స్థలం చుట్టూ కంచె వేశారని వాపోయారు. తమ భూమిని కాపాడాలని ఎస్పీకి విన్నవించారు. మడకశిర కేంద్రంగా రెవెన్యూ డివిజన్ మడకశిర: పరిపాలనా సౌలభ్యం కోసం మడకశిర కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కేబినెట్ మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన తుది గెజిట్ బుధవారం జారీ కానున్నట్లు తెలిసింది. మడకశిర రెవెన్యూ డివిజన్ పరిధిలోకి మడకశిర, అగళి, రొళ్ల, అమరాపురం, గుడిబండ మండలాలు రానున్నాయి. ప్రస్తుతం ఈ మండలాలన్నీ పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నాయి. -
చేయని పనులకు బిల్లులు
అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో చేయని పనులకు బిల్లులు పెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టర్ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్పంచులకు తెలియకుండా పంచాయతీ కార్యదర్శులు, ఈఓ (పీఆర్, ఆర్డీ), ఎంపీడీఓ, కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు కుమ్మకై ్క 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు స్వాహా చేశారన్నారు. తాడిపత్రి మండలం బోడాయపల్లి పంచాయతీలో చేయని పనులు చేసినట్లుగా రికార్డులు సృష్టించి రూ.6 లక్షల బిల్లులు డ్రా చేశారన్నారు. అలాగే ఆలూరు గ్రామ పంచాయతీలో రూ.13 లక్షలు, వెలమకూరులో రూ.6 లక్షలు, గంగాదేవిపల్లిలో రూ.18 లక్షలు, ఊరుచింతలలో రూ.23 లక్షలు, తేరన్నపల్లిలో రూ.లక్ష, ఇగుడూరులో రూ.9 లక్షలు, భోగసముద్రంలో రూ.25 లక్షలు, దిగువపల్లిలో రూ.లక్ష, చల్లవారిపల్లిలో రూ.5 లక్షలు, గన్నెవారిపల్లిలో రూ.30 లక్షల చొప్పున తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా రూ.5 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై జ్యుడీషియల్ విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. వ్యవస్థలన్నీ జేసీ కనుసన్నల్లోనే.. తాడిపత్రిలో వ్యవస్థలన్నింటినీ జేసీ ప్రభాకర్‌రెడ్డి గుప్పిట్లో పెట్టుకున్నాడని, ప్రతి అధికారీ ఆయన కనుసన్నల్లోనే పనిచేసేలా హుకుం జారీ చేస్తున్నాడని కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఏ విధంగా చర్యలు తీసుకున్నారో త్వరలో జరిగే కేబినెట్ మీటింగ్‌లో తాడిపత్రిలో పీపీపీ (ప్రభాకర్‌రెడ్డి, పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్) విధానం తీసుకొస్తారేమోనని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విన్నవించినా స్పందించలేదని, ప్రతిపక్ష నాయకులను కొట్టినా కొట్టించుకుంటామని, కేసులు పెట్టించుకుంటామని అన్నారు. కానీ సామాన్య ప్రజలనైనా కాపాడాలని అధికారులను కోరుతున్నామన్నారు. పరిశీలిస్తాం అని కాలయాపన చేస్తూ వస్తున్నారన్నారు. మరో నాలుగు మట్కా కంపెనీలు పెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోరేమో అంటూ ఎద్దేవా చేశారు. విపరీతంగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్నారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టండి కలెక్టర్‌ను కోరిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి -
వైభవంగా రంగనాఽథుని కల్యాణం
తాడిపత్రిటౌన్: మండలంలోని ఆలూరు కోన రంగనాథుని ఆలయంలో ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత ఆలూరు రంగనాయకుని కల్యాణం వైభవంగా జరిగింది. పట్టువస్త్రాలు, పూలహారాలతో ఉత్సవ విగ్రహాలను అలంకరించి వేదమంత్రాల నడుమ మంగళవాయిద్యాలతో అర్చకులు ఘనంగా కల్యాణాన్ని నిర్వహించారు. స్వామి వారి కల్యాణం తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం ఆలయ పురవీధుల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తర్వాత భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
●మంచు కురిసే వేళలో..
శీతాకాలం కావడంతో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం పది గంటలైనా మంచు తెరలు తొలగడం లేదు. తెల్లవారుజామున చలి మరింత వణికిస్తోంది. అయినా ప్రజల దైనందిన పనులు ఆగడం లేదు. చలిలోనే పొలం పనులకు వెళ్తున్న రైతులు, కూలీలు, స్కూళ్లు, కాలేజీలకు బయలుదేరిన విద్యార్థులతో గ్రామీణ రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఆహారాన్వేషణకు సిద్ధమైన పక్షులు, ఇతర జీవరాశులతో ప్రకృతి రమణీయంగా గోచరిస్తోంది. ఆదివారం అనంతపురం–నార్పల మార్గంలో కన్పించిన దృశ్యాలివీ. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
ప్రకృతి ప్రకోపం.. పాలకుల నిర్లక్ష్యం.. వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపింది. పంట దిగుబడులు తగ్గిపోవడం.. అరకొర పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం.. ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోవడం.. వెరసి అన్నదాతలు సంక్షోభంలో కూరుకుపోయారు. సూపర్‌సిక్స్ అ
అరటి రైతు ఆక్రందన... చిక్కిపోయిన చీనీ జిల్లా రైతులకు అంతో ఇంతో ఆదుకుంటున్న ఉద్యాన పంటలు ఈసారి దెబ్బతీశాయి. 86 వేల ఎకరాల విస్తీర్ణంలో చీనీ తోటలు ఉండగా.. వాటి ద్వారా 5.20 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడులు వచ్చాయి. టన్ను కనీసం రూ.40 వేలు పలికితే తప్ప గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఈ ఏడాదంతా నాణ్యమైన చీనీ టన్ను రూ.20 వేలకు మించలేదు. మిగతా పంట రూ.10 వేలు, రూ.15 వేల మధ్యనే అమ్ముడుపోవడంతో భారీ నష్టాలు చవిచూశారు. అంచనా ప్రకారం ఈ ఏడాది చీనీ రైతులకు రూ.500 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అరటి ధరలు దారుణంగా పతనమయ్యాయి. గెలలతో ఉన్న తోటలను దున్నేశారు. నిలువునా నిప్పుపెట్టేశారు. నవంబర్ నెలంతా అరటి రైతుల ఆక్రందనలు మిన్నంటినా చంద్రబాబు ప్రభుత్వం చలించలేదు. టన్ను రూ.2 వేలకు మించకపోవడంతో ఒక్క నెలలోనే అరటి రైతులు రూ.200 కోట్లకు పైగా నష్టపోయారు. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో ఎండిన వేరుశనగ పంటతో రైతు ఆవేదన అనంతపురం అగ్రికల్చర్: జిల్లా రైతులకు 2025 సంవత్సరం నిరాశ మిగిల్చింది. జనవరి 8న కేంద్ర కరువు బృందం పర్యటించింది. 2024లో కరువు మండలాల జాబితాలో కంటితుడుపుగా ప్రకటించిన ఏడు మండలాల్లో కరువు పరిస్థితులు తెలుసుకునే నిమిత్తం ఇంటర్‌మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ) పర్యటించగా రూ.112.05 కోట్లు అందించి ఆదుకోవాలని అప్పటి కలెక్టర్ వినోద్ కుమార్ విన్నవించారు. కానీ ఇప్పటి వరకు పైసా ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. ఆదిలోనే ఇలా మొదలైన కష్టాలు ఏడాది పొడవునా కొనసాగడంతో రైతులు కోలుకోలేకపోయారు. ఖరీఫ్, రబీ అస్తవ్యస్తం.. ఓ వైపు ఏప్రిల్, మేలో అకాల వర్షాలు, మరోవైపు జూన్ నుంచి ఆగస్టు 5 వరకు 55 రోజుల పాటు వర్షాభావ పరిస్థితులు, ఇంకోవైపు ఆగస్టులో సాధారణం కన్నా రెండింతలు అధికంగా 165.9 మి.మీ భారీ వర్షాలు కురవడంతో ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లు దారుణంగా దెబ్బతిన్నాయి. పడుతూ లేస్తూ ఖరీఫ్‌లో 3.50 లక్షల హెక్టార్లు, రబీలో లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. అననుకూల వర్షాలతో అరకొరగా పంట దిగుబడులు చేతికొచ్చాయి. పంట పండే పరిస్థితులు లేవని చాలా మంది రైతులు ప్రధానపంట వేరుశనగ వేయడం మానేశారు. దీంతో 65 ఏళ్ల జిల్లా చరిత్రలో వేరుశనగ కేవలం 90 వేల హెక్టార్లకు పరిమితమైంది. అదే సమయంలో కంది పంట 55 వేల హెక్టార్లు అంచనా వేయగా ఏకంగా 1.34 లక్షల హెక్టార్లకు చేరుకుంది. పంట కోత ప్రయోగాల ఫలితాలు విశ్లేషిస్తే ఒక్క పంట కూడా పండలేదు. సగానికి సగం దిగుబడులు తగ్గిపోవడంతో రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు. ఇక ఖరీఫ్ సీజన్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో జిల్లాలో ఒక్కటీ లేకపోవడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. కనీసం రబీలోనైనా కరువు జాబితాలో ‘అనంత’కు చోటు కల్పిస్తారా లేదా అనేది వేచిచూడాలి. అపార నష్టం మిగిల్చిన అకాల వర్షం.. ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలు, ఈదురుగాలులు ముంచెత్తాయి. అవసరం లేని సమయంలో సాధారణం కన్నా మూడింతల వర్షం అధికంగా కురిసింది. దీంతో అపార పంట నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి, మామిడి, చీనీ, కూరగాయల పంటలు వేలాది ఎకరాల్లో దెబ్బతినడంతో రూ.120 కోట్ల వరకు పంటనష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. రూ.35.47 కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ వచ్చేలా చర్యలు తీసుకుంటామని మే 8న అప్పటి కలెక్టర్ వినోద్‌కుమార్ ప్రకటించినా... ప్రభుత్వం ఇప్పటి వరకు పైసా విడుదల చేయలేదు. ఆగస్టులో భారీ వర్షాలకు వరి, వేరుశనగ, మొక్కజొన్న పంటలు దెబ్బతినగా... అక్టోబర్, నవంబర్‌లో మోంథా, దిత్వా తుఫాను వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులకు పప్పుశనగ, కంది, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని జిల్లా నుంచి నివేదికలు పంపినా ఎటువంటి స్పందనా లేదు. యూరియా కష్టాలు... విత్తన వెతలు ఎన్నడూ లేనివిధంగా ఈసారి రైతులను యూరియా కష్టాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. బస్తా యూరియా కోసం పొలం పనులు మానుకుని రెండు మూడు రోజులు తిరిగేలా చేశారు. ఆర్ఎస్కేలు, సొసైటీలు, ప్రైవేట్ దుకాణాల్లో ‘నో స్టాక్’ బోర్డులు పెట్టడంతో అన్నదాత అవస్థలు వర్ణనాతీంగా మారాయి. జిల్లాకు చేరిన యూరియాలో చాలావరకు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపించాయి. ఇక ఖరీఫ్, రబీలో రాయితీ విత్తన కేటాయింపులు, సబ్సిడీలు కుదించడంతో రైతులు బయట కొనుగోలు చేసి పంటలు సాగు చేశారు. రైతు కుటుంబాలపై చిన్నచూపు.. పంటలు పండక, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక, పిల్లల పెళ్లిళ్లు, చదువులకు చేసిన అప్పులు తీర్చేమార్గం లేక 82 మంది రైతులు ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత కుటుంబాల పట్ల చంద్రబాబు సర్కారు చిన్నచూపు చూసింది. ఒక్కరికి కూడా ఎక్స్‌గ్రేషియా చెల్లించలేదు. 2024లో 33 మంది, 2025లో ఇప్పటి వరకు 27 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో 22 మంది రైతులవి ఆత్మహత్యలు కాదంటూ పక్కనపెట్టేశారు. పట్టు, పాడికి ప్రోత్సాహం కరువు.. వ్యవసాయం, ఉద్యానం దెబ్బతిన్నా పట్టు (మల్బరీ), పాడి, పశుపోషణ ద్వారా గట్టెక్కుదామనుకున్న రైతులకు కూడా చంద్రబాబు ప్రభుత్వం చేయూత ఇవ్వలేకపోయింది. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం మల్బరీ రైతులకు పైసా బడ్జెట్ విడుదల చేయకపోవడం గమనార్హం. పాడిని నమ్ముకున్న రైతులకు కూడా ఒక్క పథకమూ అమలు చేయలేదు. గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన అమూల్ ‘పాలవెల్లువ’ను కూడా మూసేయడంతో ప్రైవేట్ డెయిరీలు పాడి రైతులను దగా చేస్తున్న పరిస్థితి నెలకొంది. పశువుల ఆస్పత్రుల్లో మందుల కొరత కారణంగా పశువైద్యానికి ఇబ్బందిగా మారింది. దెబ్బతీసిన అననుకూల వర్షాలు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, ఎక్స్‌గ్రేషియా ఊసేలేదు గిట్టుబాటు ధరలు లేక చిత్తయిన చీనీ, అరటి రైతులు కరువు మేఘాలు కమ్ముకున్నా జాబాతాలో లేని ‘అనంత’ అరకొరగా సుఖీభవ.. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.10 వేలతో సరిపెట్టింది. మొదటి ఏడాది రూ.400 కోట్లకు పైగా సాయం ఎగ్గొట్టిన విషయం తెలిసిందే. దీంతో రెండో ఏడాది (2025 సంవత్సరం) రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో విధిలేక ‘సుఖీభవ’ అందించారు. అందులో కూడా 20 వేల మందికి పైగా రైతులకు ఇవ్వకుండా కొర్రీలు వేశారు. ఇక వాతావరణ బీమా, ఫసల్‌బీమా పథకాల గురించి అతీగతీ లేదు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాలకు మంగళం పాడేసిన చంద్రబాబు ప్రభుత్వం ఖరీఫ్‌లో రైతుల నుంచి ప్రీమియం వసూలు చేసింది. ఇక రబీలో బీమా పథకాలు అమలు కాకుండా కట్టిపెట్టేశారు. ఆర్బీకేకు పోవడం మానేశాను వైఎస్ జగన్ హయాంలో రైతుల కోసం ఊరూరా కట్టించిన ఆర్బీకేలను చంద్రబాబు ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదు. వ్యవసాయ సేవలను తగ్గించడంతో ఆర్బీకేకు పోవడమే మానేశాం. గతంలో సీజన్ మొదలవగానే రాయితీ విత్తనాలు, అవసరమైన ఎరువులు, యంత్ర పరికరాలు, ఇతర అన్ని రకాల పథకాలు, కార్యక్రమాలు ఆర్బీకే వేదికగానే నిర్వహించేవారు. ఇప్పుడు నామమాత్రం చేయడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. వ్యవసాయ పథకాలు లేకపోవడం, పంట నష్ట పరిహారం ఇవ్వకపోవడం వల్ల రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. – వీరభద్రప్ప, రైతు, శెట్టూరురైతులకు తీరని అన్యాయం చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. అన్నదాత సుఖీభవ తప్ప ఏ పథకమూ ఇవ్వడం లేదు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. అదే జగన్ హయాంలో ఎంతగానో భరోసా లభించింది. రైతు భరోసా కింద ఏటా రూ.13,500 ప్రకారం ఐదేళ్లతో తమకు రూ.67,500 మేర వచ్చింది. వరికి రూ.25 వేలు ఇన్‌పుట్‌సబ్సిడీ, ఉచిత పంటల బీమా కింద రూ.1.30 లక్షలు, 2022లో రూ.1.20 లక్షల వరకు పరిహారం జమయ్యింది. – ఎం.పార్వతమ్మ, ఎం.చెన్నారెడ్డి, రైతు దంపతులు, నాగిరెడ్డిపల్లి, అనంతపురం రూరల్. -
పేదల స్థలాల్లో పచ్చ నేతల పాగా
● జగనన్న లే అవుట్లలో పేదల స్థలాలను కబ్జా చేస్తున్న టీడీపీ నేతలు ● గ్రామాల్లో మళ్లీ కక్షలకు ఆజ్యం పోస్తున్న తమ్ముళ్లు ● పట్టించుకోని పోలీసులు, అధికారులు ఆత్మకూరు: అధికారం మాది.. మేం ఏం చేసినా అడ్డు చెప్పేవారు లేరు.. ఏం చేసినా అడిగేవారు రారు అన్న తరహాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కక్షలకు ఆజ్యం పోస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. 242 మందికి పట్టాలు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలు, కులమతాలతో సంబంధం లేకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల స్థలాలపై టీడీపీ నేతల కన్నుపడింది. పట్టాలు పొందిన వారిని బెదిరిస్తూ స్థలాలను కొట్టేసేందుకు యత్నిస్తున్నారు. ఆత్మకూరు మండలంలోని బి. యాలేరు గ్రామంలో గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో 242 ఇంటి పట్టాలను పేదలకు అందజేశారు. అందులో చాలా మంది ఇళ్లను కూడా నిర్మించుకున్నారు. అయితే చాలా మంది స్తోమత లేని వారు పునాదులు వేసుకున్నారు. అయితే కొందరు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ సానుభూతి పరులు, నిరుపేదలకు కేటాయించిన స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారు. అడ్డువచ్చిన వారిపై దాడులు.. దౌర్జన్యంగా తమ స్థలాలను ఎలా స్వాఽధీనం చేసుకుంటారు అని అడిగిన పాపానికి పేదలపై టీడీపీ నేతలు బహిరంగంగానే దాడులు చేస్తున్నారు. మీ అంతు చూస్తాం ... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అలజడి రేగుతోంది. టీడీపీ నేతలు దాడులు చేయడంతో పాటు అక్రమంగా స్థలాలను ఆక్రమిస్తుండటం సరికాదని ప్రజలు మండిపడుతున్నారు. పట్టించుకోని అధికారులు.. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. అధికారుల ఆధ్వర్యంలో పట్టాలు తీసుకున్నామని, తమ స్థలాలు ఆక్రమణకు గురవుతుంటే వారు పట్టించుకోకపోవడం సరికాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టాలను మార్చడానికి లేదు గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చినవి డిజిటల్ పట్టాలు. ఆ పట్టాలను రద్దు చయడానికి ఎలాంటి అవకాశం లేదు. రద్దు చేయమని ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వం ఇవ్వలేదు. తమ స్థలాలను కబ్జా చేస్తున్నారని ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదు. – నాగేంద్ర , వీఆర్వో, బి.యాలేరు -
ఐక్యతతోనే కురుబల అభివృద్ధి
అనంతపురం టవర్‌క్లాక్: ఐక్యతతోనే కురుబల అభివృద్ధి సాధ్యం. కురుబలు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించి విద్యావంతులు చేయాలని రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. ఆదివారం స్థానిక కనక దాస కల్యాణ మంటపంలో ఉమ్మడి అనంతపురం జిల్లాల కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కురుబ కులంలో జేఈ, డీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి ఉద్యోగాలు సాధించిన వారికి ప్రతిభా పురస్కారాలు అందివ్వడంతో పాటు నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మేయర్ రాగే పరుశురాం హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కురుబలు ఎంత కష్టం వచ్చినా సరే పిల్లలను చదివించాలని, అందుకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కురుబ సంక్షేమ సంఘం, ఉద్యోగా సంఘాలను ఆశ్రయించవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభ కనపరిచిన పిల్లలకు పురస్కారాలు అందిస్తామమన్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఉద్యోగాలు సాధించిన 104 మందికి ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తుప్పటి ఈశ్వరయ్య, ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగరాజు, సీపీఐ నాయకుడు జగదీష్, శివబాల, డాక్టర్ మహేష్, బోరంపల్లి ఆంజనేయులు, రుచీస్ హోటల్ వెంకటరమణ, బ్యాళ్ల నాగేంద్ర, కాణపాకం ఆలయం డైరెక్టర్ వసంతమ్మ, కృష్ణమూర్తి, నెమలివరం ఈశ్వరయ్య, విఠల్ గౌడ్ పాల్గొన్నారు. -
‘రామ’ రామ.. ఏమిటీ ‘దుర్గ’తి!
అనంతపురం క్రైం: అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు నగరపాలక సంస్థను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. అధికారుల నుంచి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరినీ గుప్పిట్లో ఉంచుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఎవరైనా వ్యతిరేకిస్తే దూషణలు, దౌర్జన్యాలు, బెదిరింపులతో వారిని తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘అనంత’ ముఖ్య ప్రజాప్రతినిధి వద్ద ఉండే ‘పచ్చ’ నేత నగరపాలక సంస్థపై డేగకన్ను వేశాడు. ఇక్కడ జరిగే ప్రతి విషయాన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సంస్థ ఉద్యోగినే పావుగా వాడుకుంటున్న ‘దుర్గ’తి. కీలకమైన ఏ పని అయినా.. ఫైలు అయినా కచ్చితంగా వారి దృష్టికి రావాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తూ అధికారులను, ఉద్యోగులను బెదిరిస్తున్నారని సమాచారం. పాలకవర్గాన్ని ఏ అధికారి కలిసినా.. కార్యాలయ ఆవరణలో చీమ చిటుక్కుమన్నా వెంటనే ‘పచ్చ’నేతకు ఫొటోతో సహా చేరిపోతున్నాయి. చేయాల్సిన పని పక్కనపెట్టి అక్రమాలు.. దందాలకు మధ్యవర్తిగా మారి అధికార పార్టీ నేత సేవలో తరిస్తున్న మహిళా ఉద్యోగిని వ్యవహారం విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల మేయర్ వసీంను ఓ మహిళా ఉద్యోగి సంతకాల కోసం కలిసింది. ఆ రోజు సాయంత్రమే ఫొటోతో సహా అందడంతో సదరు ‘పచ్చ’ నేత కీలక ప్రజాప్రతినిధి కార్యాలయానికి మహిళా ఉద్యోగిని పిలిపించాడు. విధుల్లో భాగంగా మేయర్‌ను కలిసిన ఫొటోను వారు చూపించడంతో ఆమె కంగుతింది. ఫైలులో సంతకాల కోసం వెళ్లాను గానీ.. వ్యక్తిగతంగా తమకేమి పనుంటుందని ఆమె చెప్పినా పచ్చనేత శాంతించలేదట. ఇంకోసారి పాలకవర్గంలో ఏ ఒక్కరిని కలిసినా అదేరోజు కార్యాలయం వదిలి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించి పంపించాడట. మరో అధికారిణి కార్పొరేటర్ సుశీలమ్మ కుమారుడు చింతకుంట మధును విధినిర్వహణలో భాగంగా కాలనీలో ఓ భవన నిర్మాణం వద్ద నిలబడి మాట్లాడితే.. ఆ తర్వాత ఫొటోలతో సహా పచ్చనేతకు చేరిపోయాయట. అంతే సదరు అధికారిని పిలిపించుకుని ‘ఏం చేస్తున్నారమ్మా.. ఉండాలనుందా.. లేదా?’ అంటూ తీవ్రస్థాయిలో మందలించడంతో ఆమె కన్నీరుపెట్టుకున్నారట. నగరపాలక సంస్థలో పని చేయడమంటే డేంజర్లో ఉన్నట్టేనని భావించిన ఆ అధికారిణి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని తెలిసింది. నగరపాలక సంస్థలో పాగా వేసిన ‘పచ్చ’నేత కన్నా, అతని అనుచర వర్గం పేట్రేగిపోతోంది. అధికారులను ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ‘ఏం మేడమ్.. మేం అధికారంలో ఉండి కూడా మాకు కాకుండా మరొకరికి మీరు పనులు చేయడం ఏంట’ని ప్రశ్నిస్తుండటంతో ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. పని లేకపోయినా అదే పనిగా కార్యాలయంలోనే గంటల తరబడి తిష్టవేసి అనవసర విషయాలను చర్చిస్తూ తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. నగరపాలక సంస్థపై రహస్య నిఘా ఉద్యోగినే పావుగా మార్చిన టీడీపీ నేత పాలకవర్గాన్ని ఏ అధికారీ కలవకూడదట! కార్యాలయ వ్యవహారాలన్నీ ఫొటోలతో సహా చేరవేత ప్రతి ఫైలూ అటు వెళ్లాల్సిందే.. నగరపాలక సంస్థలో కీలకమైన ప్రతి ఫైలూ ‘అటు తిరిగి’ రావాల్సిందేనని కీలక విభాగాల అధిపతులు అంటున్నారు. వారికి తెలియకుండా ఏ ఫైలు ముందుకు కదిలినా మరుసటి రోజు మూల్యం చెల్లించుకోక తప్పదని వాపోతున్నారు. దీంతో టౌన్ ప్లానింగ్ విభాగంలో 1920కి పైగా ఫైళ్లు పెండింగ్‌లో ఉంచారట. రెవెన్యూ విభాగంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారిందని తెలిసింది. ఆస్తి కొనుగోలు చేసిన వారి పేరుమీద గుత్తలు బదిలీ చేయాలన్నా.. అన్నదమ్ముల భాగపరిష్కారాల నేపథ్యంలో మార్పులు చేయాలన్నా ముందుగా అధికారపార్టీకి సమాచారం ఇవ్వాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. చాలావరకు కొన్ని కాలనీల్లో నివాసం ఉంటున్న ఒంటరి మనుషుల వివరాలు కూడా వీరే అధికారపార్టీ నేతలకు చేరవేసి.. కబ్జాలకు తెగబడేందుకు పూర్తిగా సహకరిస్తున్నట్లు సమాచారం. తాజాగా శారదానగర్ విషయంలో వీరి హస్తం ఉన్నట్లు బయట పడటం చూస్తే.. అధికారపార్టీకి ఏ మేరకు తొత్తులుగా మారిపోయారో అర్థమవుతోంది. పేట్రేగిపోతున్న అనుచర వర్గం -
ఒత్తిడికి గురి చేస్తే మెరుగైన ఫలితాలు ఎలా సాధ్యం?
అనంతపురం సిటీ: రకరకాల యాప్‌లు, రోజుకో కొత్త కార్యక్రమంతో విద్యార్థులు, ఉపాధ్యాయులను విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తే మెరుగైన ఫలితాలు ఎలా సాధ్యమవుతాయని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతపురం ఆదిమూర్తినగర్‌లోని ఉపాధ్యాయ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఏపీటీఎఫ్ జిల్లా శాఖ సబ్ కమిటీ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు రాయల్ వెంకటేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజుద్దీన్, రాష్ట్ర పూర్వ కార్యదర్శి నరసింహులు, జిల్లా పూర్వ అధ్యక్షుడు వెంకటేశులు మాట్లాడారు. యాప్‌ల నమోదు, వంద రోజుల ప్రణాళిక లాంటివి పక్కాగా అమలు చేయాలని ఒత్తిడికి గురి చేయడం తగదన్నారు. పైగా ఇతర శాఖల అధికారులకు తమపై పెత్తనం చెలాయించే అధికారం ఇవ్వడం దుర్మార్గపు ఆలోచనని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాలను పునరాలోచించుకోవాలని, లేకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. జిల్లా నలుమూలల నుంచి సబ్ కమిటీ సభ్యులు తరలివచ్చారు. హోరాహోరీగా క్రికెట్ మ్యాచులుఅనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ క్రికెట్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ఏఎస్ఏ ఉమెన్స్ కప్ టోర్నమెంట్ మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి. ఏఎస్ఏ జట్టుపై సౌతర్న్ స్ట్రైకర్స్ జట్టు 3 వికెట్లతో, కడపపై మయూఖా అకాడమి 4 వికెట్లతో, ఏవీ ఎన్సీఏ జట్టుపై 7 వికెట్ల తేడాతో సంప్రసిద్ధి అకాడమి జట్లు విజయం సాధించాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా సలోని (సంప్రసిద్ధి), షేక్ ముబీన (మయూకా), గీతిక కొడాలి (సౌతర్న్ స్ట్రైకర్స్) నిలిచారు. వారికి జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్‌రెడ్డి, సీనియర్ మహిళా క్రీడాకారిణిలు లతాదేవి, రాధిక మెమోంటోలను అందజేశారు. జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికవజ్రకరూరు: మండల పరిధిలోని చిన్నహోతురు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆర్.భార్గవి జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం శ్రీనివాస్‌రెడ్డి, పీడీ ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో ప్రకాశం జిల్లా పంగలూరులో జరిగిన అండర్ 18 రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలలో భార్గవి ప్రతిభ కనబరచినట్లు చెప్పారు. ఈనెల 31 నుంచి బెంగళూరులో జరిగే జాతీయస్థాయి ఖోఖో పోటీలకు రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్.భార్గవిని వారు అభినందించారు. కడుపునొప్పి తాళలేక యువకుడి ఆత్మహత్య యాడికి: కడుపు నొప్పి తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గుడిపాడులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి భార్య మల్లేశ్వరి వివరాలమేరకు... గుడిపాడుకు చెందిన తలారి వెంకటేష్ కుమారుడు శ్రీనివాసులు (35)కు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరానికి చెందిన మల్లేశ్వరితో వివాహమైంది. గనుల్లో లారీడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు గత ఏడాది నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి తీవ్రం కావడంతో ప్రస్తుతం పనులకు వెళ్లడంలేదు. శనివారం భార్య, ఇద్దరు కుమారులను కొలిమిగుండ్ల మండలం బి.తాడిపత్రిలోని పిన్నమ్మ ఊరికి పంపిన శ్రీనివాసులు ఇంట్లో ఉండిపోయాడు. ఆదివారం ఉదయం ఆరు గంటల వరకూ నిద్రలేకపోవడంతో పక్క ఇంట్లో ఉన్న వెంకటేష్ వాకిలి తెరచి చూశారు. అప్పటికే శ్రీనివాసులు ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఇంటి పెద్ద దిక్కు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ బోలా.. యువకుడి మృతి శింగనమల (నార్పల): నార్పల మండలంలోని పులసలనూతల గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి పల్లె మహేంద్ర (22) మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... పులసలనూతలకు చెందిన పల్లె సూర్యనారాయణ కుమారుడు మహేంద్ర తన ఇంటి పని నిమిత్తం గ్రామ సమీపంలోని మట్టిని తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తూ అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనలో మహేంద్ర అక్కడిక్కడే మృతి చెందాడు. మహేంద్రకు రెండు సంవత్సరాల క్రితం వివామైంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు. -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముక్కోటికి ముస్తాబు కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఖాద్రీశుని దర్శనానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. మంచి నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఆలయాన్ని ప్రత్యేక పూలతో సుందరంగా అలంకరిస్తున్నారు. శ్రీవారు భక్తులకు మంగళవారం తెల్లవారుజాము 3.30 గంటల నుంచి దర్శనమిస్తారని, సాయంత్రం 5.30 గంటలకు తీరువీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ‘ధర్మవరం నాట్య కళాకారులు’ ధర్మవరం అర్బన్: ధర్మవరం లలిత నాట్య కళానికేతన్ గురువులు, శిష్య బృందం మరోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కూచిపూడి కళా వైభవంలో ధర్మవరం లలిత నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ, రామ లాలిత్యతో పాటు 25 మంది నాట్య కళాకారులు బృంద నాట్యం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. ఇప్పటికే నాలుగుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించినట్లు గురువు బాబు బాలాజీ తెలిపారు. అనంతరం కళాకారులకు సర్టిఫికెట్లు, అవార్డులు అందించారు. విద్యుత్ స్తంభం పై నుంచి పడి యువకుడి మృతి కదిరి అర్బన్: విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడి యువకుడు మృతి చెందిన సంఘటన పట్నం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాలమేరకు... కదిరి మండలం రాచువారిపల్లితండాకు చెందిన సాయికుమార్‌నాయక్ (29) విద్యుత్‌శాఖ కాంట్రాక్టర్ వద్ద కూలి పనులకు వెళ్లేవాడు. పట్నం వద్ద ముదిగుబ్బ మండలానికి సంబంధించి 33 కేవీ లైన్ మార్చే పనులకు వెళ్లాడు. విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘానికి గురై కింద పడినట్లు తెలిపారు. వెంటనే కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే సాయికుమార్‌నాయక్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
హామీలు నెరవేర్చాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప డిమాండ్ అనంతపురం అర్బన్: ‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మరించారు. వాటిని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నలప్ప డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక గణేనాయక్ భవన్లో నగర కమిటీ సభ్యుడు మసూద్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో పలు హామీలు ఇచ్చారని, అయితే వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్పారన్నారు. అర్హులకు పింఛను, రేషన్ కార్డులతో పాటు 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారికి పింఛను ఇస్తామని చెప్పినా అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పట్టించుకోలేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లను పూర్తి చేసి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చాన్నారు. రెండేళ్లు అవుతున్నా ఒక్కరికై నా ఇచ్చారా? అని ప్రశ్నించారు. నగర కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో నగరాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. సమావేశంలో నాయకులు బాలరంగయ్య, వెంకటనారాయణ, ముర్తుజా, ప్రకాష్, ఇర్ఫాన్, గోపాల్, లక్ష్మినరుసమ్మ, అశ్విని, తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులకు భయపడేది లేదు
అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయడం కోసమే పోలీసుల చేత అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. అధికారం అడ్డుపెట్టుకుని కేసులు పెడుతూ పోతే చూస్తూ ఊరుకోబోమని, చట్టపరంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. టీడీపీ ముస్లిం మైనార్టీ నేత ముక్తియార్ ఆదివారం తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి అనంత వెంకట రామిరెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రజల ఆస్తులకు టీడీపీ నేతల నుంచి రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇంటి గొడవల్లోకి కూడా తలదూర్చి పోలీసులతో పంచాయితీలు చేయిస్తున్నారని విమర్శించారు. ఇంటి పెద్దలు ఎవరైనా చనిపోతే వాళ్ల ఆస్తులపై కన్నేస్తున్నారని విరుచుకుపడ్డారు. నకిలీ జీపీఏలు చేయించుకోవడం, నకిలీ పత్రాలు సృష్టించుకోవడం.. ఏకంగా హక్కుదారులపైనే దౌర్జన్యం చేయడం, అక్రమ కేసులు బనాయించి ఆస్తులు చేజిక్కించుకుంటున్నారన్నారు. నగరంలో అధికార పార్టీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయన్నారు. వీటి నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి శనివారం గుల్జార్‌పేటలో టీడీపీ దిమ్మె తొలగింపు సాకుతో వైఎస్సార్సీపీ నాయకుడిని అరెస్ట్ చేశారన్నారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులతో సీఐ స్థాయి అధికారి నోటికొచ్చినట్లు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. ఇటీవల జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బర్త్‌డే వేడుకలను చేసుకుంటే ‘లా అండ్ ఆర్డర్’కు విఘాతం కలిగిందంటూ కేసులు పెట్టారన్నారు. బాలకృష్ణ కటౌట్.. ఫ్లెక్సీలకు జంతువుల తలలు వేలాడదీస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. అధికార పార్టీ వారికి ఒక న్యాయం.. ప్రతిపక్ష పార్టీల వారికి ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ అనంతపురంలో నిర్వహించిన బైక్ ర్యాలీకి వచ్చారని వైఎస్సార్సీపీ నాయకులను స్టేషన్లకు పిలిపించి బైండోవర్ కేసులు పెట్టారన్నారు. వ్యవస్థలను పోలీసులే నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్, సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి, ఎస్ఈసీ మెంబర్ మీసాల రంగన్న, మేయర్ వసీం సలీం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదాఖలందర్, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్ రిజ్వాన్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, దామోదర్‌రెడ్డి, కార్పొరేటర్లు లక్ష్మీదేవి, శ్రీనివాసులు, కమల్‌భూషణ్, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, వక్ప్‌బోర్డు జిల్లా మాజీ సభ్యులు కమర్తాజ్, జానీ, కొర్రపాడు హుస్సేన్ పీరా, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, సాదిక్, ఇస్మాయిల్, జావీదు, సుబ్బయ్య, తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో ప్రజల ఆస్తులకు రక్షణ కరువు పెరిగిపోతున్న అధికార పార్టీ నేతల అరాచకాలు ప్రజలను డైవర్ట్ చేయడానికే అక్రమ అరెస్టులు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
డీసీఎంఎస్ పర్సన్ ఇన్చార్జ్ పదవీకాలం పొడిగింపు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పర్సన్ ఇన్చార్జ్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఈమేరకు ప్రభుత్వ ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్సన్ ఇన్చార్జ్గా ఉన్న నెట్టెం వెంకటేశులు పదవీకాలం శనివారంతో ముగిసింది. ఇపుడు మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తరులు ఇచ్చారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పర్సన్ ఇన్చార్జ్ పదవీ కాలాన్ని కూడా ఆరు నెలలు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలు ● 45 నిమిషాలైనా రాని 108 వాహనం శింగనమల: శివపురం వద్ద ఎన్‌హెచ్544–డీపై జరిగిన ప్రమాదంలో తాడిపత్రికి చెందిన దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రి ప్రాంతానికి చెందిన ఆదినారాయణ, లక్ష్మీదేవి బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లికి వెళ్లి, తిరిగి తాడిపత్రికి బైక్‌పై బయలుదేరారు. శివపురం వద్దకు రాగానే బైక్ డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో భార్య, భర్తలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 కోసం ఫోన్ చేసి 45 నిమిషాలు వేచి చూసినా రాకపోవడంతో రోడ్డు పనులు చేస్తున్న అంబులెన్స్‌లో అస్పత్రికి తరలించారు. -
బి.యాలేరులో రెచ్చిపోయిన రౌడీషీటర్లు
● వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడిన బండి పరుశురాం తదితరులు ● రౌడీషీటర్లకు పరిటాల కుటుంబం అండ సాక్షి టాస్క్‌ఫోర్స్: అధికారం మదంతో రౌడీషీటర్లు బండి పరుశురాం, ఈడిగ ఈశ్వరయ్య శనివారం ఆత్మకూరు మండలం బి.యాలేరులో రెచ్చిపోయారు. వివరాలు.. శనివారం వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి బి.యాలేరులో గ్రామస్తులతో మాట్లాడుతుండగా భూసమస్య విషయంలో బండి పరశురాం వాదనకు దిగాడు. అయితే అన్నదమ్ముల సమస్యను మీరే పరిష్కరించుకోవాలంటూ తోపుదుర్తి చందు సర్దిచెప్పేందుకు యత్నించినా రెచ్చిపోయాడు. టీడీపీ నాయకులకు అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేశారు. ఈక్రమంలో వారు తిరగబడడంతో రౌడీషీటర్లు తోకముడిచారు. రోజురోజుకూ పెరుగుతున్న దౌర్జన్యాలు టీడీపీ అధికారంలోకి రాగానే బి. యాలేరులో వైఎస్సార్ విగ్రహం చేయిపై దాడి చేశారు. వైఎస్ జగన్, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్లున్నాయన్న అక్కసుతో ఆర్బీకే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళకు జుట్టు కత్తిరించారు. బండి బాలకొండమ్మ, బండి చిన్న అహోబిలంపై నడి బజార్లో రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. జగనన్న కాలనీల్లో రౌడీషీటర్ల టీడీపీ నేతలు పేరు చెప్పుకుని రూ.10 వేలు తీసుకొని ప్లాట్లు కబ్జా చేసి అమ్ముకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. పరిటాల కుటుంబం అండతోనే రౌడీషీటర్లు బండి పరుశురం, ఈడిగ ఈశ్వరయ్య దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఆస్తి కాజేయాలనే కక్షగట్టాడు : బండి నాగరాజు రౌడీ షీటర్ బండి పరశురాం, వాళ్ల నాన్న బండి ముసలన్న మా పొలాన్ని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మా తాత ఓబులేసుకు ఐదుగురు సంతానం. రెండు సర్వే నంబర్లలోని భూమిని వారుసులైన బండి మలరాయుడు, బండి ముసలన్న, బండి పెద్ద అహోబిలం, బండి చిన్న అహోబిలం, బండి శంకరయ్య సమానంగా పంచుకున్నారు. మానాన్న బండి చిన్న అహోబిలం వాటాగా వచ్చిన 3.23 ఎకరాల భూమిని బండి ముసలన్న, ఆయన కొడుకు బండి పరశురాం ఆక్రమించాలని చూస్తున్నారు. నాకు వంశపారంపర్యంగా వచ్చిన భూమినే ఆన్లైన్లో ఎక్కించుకున్నా. ఆ భూమిపై నిజంగా నాకు హక్కు లేకుంటే.. దౌర్జన్యంగా గత ప్రభుత్వంలో ఆన్లైన్లో ఎక్కించుకుని ఉంటే.. మరి ఎమ్మెల్యే పరిటాల సునీత రెండేళ్లుగా ఎందుకు రద్దుపరచలేకపోయారు. చట్టబద్ధంగా ఉన్న ఆ భూమి విషయంలో ఏమీ చేయలేమనే విషయం వారికి తెలుసు. కావాలనే పరిటాల కుటుంబం బండి పరుశురాం ద్వారా తోపుదుర్తి కుటుంబంపై అసత్య ఆరోపణలు చేయిస్తోంది. పరుశురాం అన్న పిల్లలను ఎన్టీఆర్ స్కూల్లో చదివిస్తున్నాం కనుక.. తాము చెప్పినట్టుగా తోపుదుర్తి కుటుంబంపై అసత్యపు ఆరోపణలు చేయాలంటూ ఉసిగొలుపుతున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడి చేస్తున్న టీడీపీ నేతలు, చందు వాహనం వద్ద పరశురాం హల్చల్ ప్రజలకు భూములిచ్చాం : తోపుదుర్తి చందు నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఇంటి స్థలాలు లేని ప్రజలకు సొంత డబ్బుతో భూములు కొని పట్టాలిప్పించాం. భూములు లాక్కునే దుస్థితిలో మా కుటుంబం లేదు. కావాలనే ఎమ్మెల్యే సునీత, ధర్మవరం బాలాజీ బండి పరశురాం అనే వ్యక్తిని రెచ్చగొట్టి సమావేశాల్లో గొడవలు సృష్టించేలా మాట్లాడిస్తూ కక్షలు రేపుతున్నారు. వైఎస్సార్సీపీకి పెరుగుతున్న జనాధరణ, ప్రకాష్‌రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న జన బలం చూసి ఎమ్మెల్యే సునీత ఇలాంటి వారిచే తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు. -
ఈవీఎంల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి
అనంతపురం అర్బన్: ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక పాత ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని గోడౌన్లలో ఈవీఎంలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోడౌన్ల వద్ద సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగాలన్నారు. పరిసరాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా చూడాలన్నారు. ఆర్డీఓ కేశవనాయుడు, ఎన్నికల డీటీ కనకరాజ్, ఎస్ఏ శామ్యూల్ బెంజిమన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. గునపం పోగొట్టారని గొడవ ● ఇద్దరికి తీవ్రగాయాలు ఉరవకొండ: రేణుమాకుపల్లిలో గునపం కోసం జరిగిన ఘర్షణలో ఇద్దరు గొర్రెల కాపరులకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు పెద్ద ఎర్రిస్వామి, లాలుస్వామి, వన్నూర్‌స్వామి, గోవిందమ్మకు మరో వర్గానికి చెందిన గొర్రెల కాపరులు కుమార్‌స్వామి, గోపిల మధ్య గునపం పోగట్టారంటూ ఘర్షణ ప్రారంభమైంది. ఘర్షణలో గ్రామానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వన్నూర్‌స్వామి కలగజేసుకోవడంతో ఇరువర్గాలు ఒకరి మీద ఒకరు కట్టెలతో దాడి చేసుకున్నాయి. ఇందులో పెద్ద ఎర్రిస్వామి, లాలుస్వామి తల, చేతులకు తీవ్రగాయాలు కావడంతో 108 వాహనంలో వీరిని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరినీ అనంతపురం తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కణేకల్లులో భారీ చోరీ ● 16 తులాల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి, రూ.2 లక్షల నగదు అపహరణ కణేకల్లు: పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. బాధితులు, స్థానికుల కథనం మేరకు స్థానిక ప్రభుత్వాసుపత్రి సమీపంలో తబుష్షుమ్, తన కూతురు, కొడుకుతో కలిసి నివసిస్తోంది. తబుష్షుమ్ చిన్నాన్న మృతి చెందడంతో భర్త, పిల్లలతో కలిసి సోమవారం హైదరాబాద్‌కు వెళ్లింది. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దుండగులు శుక్రవారం రాత్రి ఇంటి వెనుక డోర్ నుంచి ఇంట్లో చొరబడిన దుండగులు 16 తులాల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. శనివారం ఇంటికి వచ్చిన తబుష్షుమ్ చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, బొమ్మనహళ్ ఎస్ఐ నబీరసూల్ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలో దింపి ఆధారాలు సేకరించారు. వెనుక డోర్ నుంచి ఇంట్లో చొరబడి చోరీ చేయడంతో ఈ ఇంటి గురించి బాగా తెలిసిన వారే చోరి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సౌత్ జోన్ పోటీలకు ఎస్కేయూ ఇంజినీరింగ్ విద్యార్థినులు అనంతపురం ఎడ్యుకేషన్: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్ బాల్ (ఉమెన్) పోటీలకు ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈసీఈ బ్రాంచ్ 4వ సంవత్సరం విద్యార్థిని బి.భారతి, మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్.నిషిత సౌత్ జోన్ టోర్నీకి ఎంపికయ్యారు. ఈనెల 29 నుంచి 2026 జనవరి 2 వరకు బెంగళూరు క్రిష్ట్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సౌత్ జోన్ స్థాయి టోర్నీ నిర్వహించనున్నారు. ఎంపికై న విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.రామచంద్ర, స్పోర్ట్స్ ఇన్చార్జ్ కె.శివానంద, ఇతర అధ్యాపకులు అభినందించారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
● 40 తులాల బంగారు, 7 కేజీల వెండి, రూ.లక్ష నగదు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఎస్పీ జగదీష్ అనంతపురం సెంట్రల్: తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అనంతపురం సీసీఎస్, త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 70 లక్షల విలువైన 40 తులాల బంగారు నగలు, రూ.లక్ష నగదు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీసు కాన్ఫరెన్స్హాల్లో ఎస్పీ జగదీష్ వివరాలు వెల్లడించారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన యాదవల్లి మంజు, పిచ్చుగుంట్ల రామదాసు బళ్లారితో పాటు గుంటూరు, అనంతపురం జిల్లాలో చైన్ స్నాచింగ్‌లు, బ్యాగ్‌ల దొంగతనాలు, తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. అనంతపురం, తాడిపత్రి, గుత్తి, కసాపురం, డి.హీరేహాళ్, బుక్కరాయసముద్రం తదితర ప్రాంతాల్లో ఒంటరిగా వెలుతున్న మహిళల మెడల్లోని బంగారు చైన్లను లాక్కెళ్లారు. బస్సుల్లో ప్రయాణికుల మాదిరిగా జతకలిసి ఆదమరిచి ఉన్న సమయంలో బ్యాగ్‌లు చోరీ చేశారు. ఇటీవల దొంగలపై నిఘా పెట్టడడంతో బళ్లారి రోడ్డులో నిందితులు ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. మోస్ట్ వాంటెడ్ నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన డీఎస్పీ శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐలు శేషగిరి, జయపాల్‌రెడ్డి, రామయ్య, ఎస్ఐ రాజశేఖరరెడ్డి, త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్యాదవ్తోపాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం పెరిగింది. ఈశాన్యం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
యజ్ఞంలా వంద రోజుల ప్రణాళిక అనంతపురం సిటీ: పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ‘వంద రోజుల ప్రణాళిక’ను ఒక యజ్ఞంలా చేపట్టాలని కడప ఆర్జేడీ శామ్యూల్ ఆదేశించారు. శనివారం ఆయన రీజనల్ పరిధిలోని అన్ని జిల్లాల డీఈఓలు, డిప్యూటీ డీఈఓలు, ఏడీలు, సూపరింటెండెంట్లు, ఎంఈఓలతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పెషల్ క్లాసులకు పదో తరగతి విద్యార్థుల హాజరు రోజురోజుకూ తగ్గిపోతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థీ విధిగా ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. రోజూ స్లిప్ టెస్టులు పెట్టి.. మార్కులను యాప్‌లో అప్లోడ్ చేయాల్సిందేనన్నారు. లేకపోతే ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని హెచ్చరించారు. పాఠశాలల్లో కావలిన వసతుల గురించి యాప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఎయిడెడ్ స్కూళ్లలో ఎంతమంది పిల్లలు, ఉపాధ్యాయులు ఉన్నారనే విషయం కచ్చితంగా ఉండాలన్నారు. సరైన సమాచారాన్ని ఈ నెల 31లోగా యాప్‌లో నమోదు చేయాలన్నారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యేక తరగతుల నిర్వహణకు నియమితులైన స్పెషల్ ఆఫీసర్లకు అన్ని విధాలా సహకరించి సమష్టి కృషితో మంచి ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. ఏడీ శ్రీనివాసరావు, పరీక్షల విభాగం ఏసీ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. రగ్బీ రాష్ట్ర జట్టుకు ఎంపిక అనంతపురం సిటీ: నగర శివారులోని ఏజీఎస్ పాఠశాల మైదానంలో శనివారం నిర్వహించిన రగ్బీ రాష్ట్రస్థాయి జట్టు ఎంపిక ప్రక్రియకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి 12 మంది బాలికలు, 12 మంది బాలురు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ గట్టు నాగరాజు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన నందిని, సాయిశ్రీ, శ్రావణి, అమృత, గాయత్రి, సుస్మిత, మహాలక్ష్మీ, త్రివేణి, గాయత్రి, వైజయంతి, అలేఖ్య, తేజశ్రీ ఎంపికయ్యారని వివరించారు. బాలుర విభాగంలో డింపుల్ సాయినాథ్, జీవంత్, రేవంత్, రాంచరణ్, నవనీత్, రిషిధర్, చక్రి, హేమసాయి, వరుణ్ సందేశ్, సాయిచరణ్, వినోద్‌కుమార్, సుభాష్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 29న కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. రగ్బీ టోర్నమెంట్ సెక్రటరీ శంకర్ ఆధ్వర్యంలో పీడీలు సుదర్శన్, మురళి, చంద్ర నేతృత్వంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు. -
త్రీటౌన్ సీఐ దురుసు ప్రవర్తన
అనంతపురం క్రైం: అనంతపురం పోలీసులు ‘పచ్చ’పాత ధోరణితో వ్యవహరించారు. చిన్న వివాదాన్ని తీవ్ర ఉద్రిక్త స్థాయికి తీసుకెళ్లారు. టూటౌన్ సీఐ శ్రీకాంత్‌యాదవ్ ఈ వివాదానికి ఆజ్యం పోయగా.. త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఏకంగా నిప్పు రాజేశారు. పెద్దమనిషిగా సమస్యను పరిష్కరించాల్సిన డీఎస్పీ శ్రీనివాసరావు కూడా వచ్చీ రాగానే ఏం జరిగిందన్న విషయాన్ని ఆరా తీయకుండా ‘కొడుకులను ఈడ్చుకెళ్లి లోపలేయండి’ అంటూ దురుసుగా మాట్లాడారు. ఏం జరిగిందంటే... అనంతపురంలోని గుల్జార్‌పేటలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. టీడీపీకి చెందిన కాంట్రాక్టరే ఈ పనులు చేస్తున్నాడు. ఇళ్ల ముందున్న మెట్లు, అరుగులు తొలగించే పనులు శనివారం సాయంత్రం మొదలుపెట్టారు. ఈ క్రమంలో టీడీపీ పేరు రాసి, జెండా ఏర్పాటు చేసిన చిన్న సిమెంటు దిమ్మె కాలువ తీయడానికి అడ్డుగా ఉండడంతో దాన్ని తొలగించారు. అక్కడే పనులను పర్యవేక్షిస్తున్న గుల్జార్ పేట్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ ముంతాజ్‌బేగం కుమారుడు దాదాపీర్ కావాలనే టీడీపీ దిమ్మెను తొలగింపజేశారని ఆరోపిస్తూ.. ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులు కొందరు వీడియో తీసి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన టూటౌన్ పోలీసులు ఏకంగా దాదాపీర్‌పై కేసు నమోదు చేసి, అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. న్యాయమూర్తి ముందు హాజరుపరిచి జైలుకు తరలించాలని భావించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి ఫోన్లో సమాచారం చేరవేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్‌గౌడ్, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి కార్యకర్తలతో కలసి టూటౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. నాయకులను, కార్యకర్తలను సీఐ శ్రీకాంత్ యాదవ్ మెయిన్ గేటు వద్దే అడ్డుకోవడంతో అందరూ అక్కడే బైఠాయించారు. పోలీసులు పక్షపాతం చూపుతున్నారు పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు అన్నారు. ఈ సందర్భంగా మేయర్ వసీంతో పాటు రమేష్‌గౌడ్, సాకే చంద్ర, చింతా సోమశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కార్పొరేటర్ కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. గతంలో మైనార్టీ మహిళ ఆత్మహత్యకు సంబంధించి ఫిర్యాదు చేస్తే స్పందించలేదన్నారు. పార్టీ నేత చింతకుంట మధు విషయంలోనూ అలాగే వ్యవహరించారన్నారు. జగనన్న జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలను టీడీపీ వారు కావాలనే కోసేశారని, తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్న అధికారులను చూస్తుంటే సిగ్గేస్తోందన్నారు. బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులు దౌర్జన్య పరులు, కబ్జాదారులు, సెటిల్మెంట్లు చేస్తున్న వారికి అండగా నిలుస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉమాపతి, జిల్లా బూత్ కన్వీనర్ ఎద్దుల అమర్నాథ్రెడ్డి, ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసురెడ్డి, రాష్ట్ర మైనార్టీ ప్రధానకార్యదర్శి కాగజ్‌ఘర్ రిజ్వాన్, కార్పొరేటర్లు ముంతాజ్‌బేగం, అబ్దుల్ సాలేహా, కమల్‌భూషణ్, అనిల్‌కుమార్, రహంతుల్లా, ఇషాక్, శేఖర్‌బాబు, పార్టీ నాయకులు రాజ్‌కుమార్, రాధాకృష్ణ, దాదా ఖలందర్, వినీత్, నాగర్జునరెడ్డి, చింతకుంట మధు, మహేశ్వరి, ఓబుళేసు, ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులతో దురుసుగా మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ శ్రేణులను నెట్టేస్తున్న పోలీసులు, స్టేషన్ ఆవరణలోకి కూడా రానివ్వకుండా, కనీసం విషయం ఆరా తీయకుండా సీఐ శ్రీకాంత్‌యాదవ్ గేటు వద్దే అడ్డుకోవడాన్ని వైఎస్సార్సీపీ నేతలు తప్పు బట్టారు. ఇంతలోనే త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ అక్కడికి వచ్చారు. వచ్చీ రాగానే ‘ఏం స్టేషన్ ముందు కూర్చుంటారా? మీరన్న ఇంతమందే వచ్చారు..నేను అనుకుంటే 300 మందినైనా దించి చూపిస్తా’ అంటూ రెచ్చిపోయారు. విషయం చెబుతున్న సీనియర్ నేత అనంత చంద్రారెడ్డి, సాకే చంద్రశేఖర్‌లను ‘ఏయ్.. ఏం చెయ్యి చూపిస్తావా’ అంటూ ఏక వచనంతో బూతులు తిట్టడం ప్రారంభించారు. దీంతో కార్యకర్తలు సీఐ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. సీఐలు రాజేంద్రనాథ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్ మరింత రెచ్చిపోయారు. అదే సమయంలో డీఎస్పీ శ్రీనివాసరావు రంగంలోకి దిగి పెద్దమనిషిలా వ్యవహరిస్తారని చూస్తే ఆయన కూడా వారిబాటలోనే నడిచారు. ‘కొడుకులను లోపలేయండి’ అంటూ మాట్లాడారు. చివరకు జిల్లా ఎస్పీ జగదీష్ జోక్యం చేసుకుని వివాదం మరింత పెద్దది కాకుండా చూశారు. ఆయన ఆదేశాలతో స్టేషన్లోకి నేతలను పిలిచి మాట్లాడి పంపించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ కుమారుడి అక్రమ అరెస్టు పరామర్శించేందుకు వెళ్లిన పార్టీ నేతలను అడ్డుకున్న టూటౌన్ సీఐ శ్రీకాంత్‌యాదవ్ దీంతో గేటు ముందు బైఠాయించిన నేతలు, కార్యకర్తలు రంగంలోకి త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్.. వచ్చీ రావడంతోనే ‘నా కొడుకులు’ అంటూ దూషణ డీఎస్పీ శ్రీనివాసరావుదీ అదే తీరు -
చేనేత మగ్గాలకు నిప్పు
తాడిపత్రిటౌన్: పెద్దపప్పూరు మండలం నరసాపురం గ్రామంలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు చేనేత మగ్గాలకు నిప్పుపెట్టారు. వివరాలు.. నరసాపురం చేనేత సోసైటీ కింద దాదాపు 30 మగ్గాలు ఉన్నాయి. అయితే మగ్గాలు ఉంచిన షెడ్డుకు దుండగులు నిప్పుపెట్టారు. అక్కడే నిద్రిస్తున్న రంగయ్య అనే వ్యక్తి మంటలను గుర్తించి కేకలు వేయగా దుండగులు పారిపోయారు. వెంటనే గ్రామస్తులు వచ్చి మంటలు ఆర్పేశారు. అయితే అప్పటికే రెండు మగ్గాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో రూ.50 వేలు నష్టం వాటిల్లినట్లు సొసైటీ నిర్వాహకుడు రమేష్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. -
ఆటో బోల్తా : డ్రైవర్ మృతి
కణేకల్లు: మండలంలోని పూలచెర్ల గ్రామ శివారులో ఆటో బోల్తా పడిన ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. వివరాలు..పూలచెర్ల గ్రామానికి చెందిన వినోద్‌కుమార్ (20) తన స్నేహితునితో కలిసి పూల్లంపల్లికి బయలుదేరాడు. పూలచెర్ల గ్రామ శివారులో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఘటనలో వినోద్‌కుమార్ తీవ్రగాయాలయ్యాయి. మరోవ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. స్థానికులు వినోద్‌కుమార్‌ను బళ్లారి విమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
డీఐజీ షిమోషికి పదోన్నతి
అనంతపురం సెంట్రల్: అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషికి పదోన్నతి దక్కింది. 2008 ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన ఆమెకు ఐజీగా పదోన్నతిగా కల్పిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బదిలీ, పోస్టింగ్ ఉత్తర్వులు రాలేదు. దీంతో మరికొంత కాలం డీఐజీగానే ఆమె కొనసాగనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. రేపు ‘పరిష్కార వేదిక’ అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈమేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. సమస్యపై గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దాని రసీదు తీసుకురావాలన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదిక ద్వారానే కాకుండా meekosam.ap.gov.in ద్వారా కూడా తెలియజేయవచ్చన్నారు. 10 మంది సిబ్బంది మించితే ఈఎస్ఐ పరిధిలోకే అనంతపురం కార్పొరేషన్: షాపులు, వాణిజ్య సంస్థలు, రెస్టారెంట్లు, లాడ్జీలు, హోటళ్లు, ఫ్యాక్టరీలు, పాఠశాలలు, కళాశాలలు తదితర వ్యాపార సముదాయాలు ఏవైనా పది మందికి మించి సిబ్బంది పనిచేస్తుంటే.. ఆ సంస్థలు కార్మిక రాజ్య బీమా సంస్థ (ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ – ఈఎస్ఐసీ) పరిధిలోకి వస్తాయి. ఆయా సంస్థలు వెంటనే శ్రమ సువిధ/ ఎంసీఏ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి’ అని అనంతపురం ఈఎస్ఐసీ బ్రాంచ్ మేనేజర్ జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గతంలో ఉన్న బకాయిల పరిశీలన, జరిమానా లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. ఉద్యోగులు, సంస్థలు సోషల్ సెక్యూరిటీ, ఉచిత వైద్య సేవలు, బీమా, ప్రమాద భద్రత, తదితర సంక్షేమ ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు నగరంలోని ఈఎస్ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు షురూ.. ఉరవకొండ: పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లు షురూ అయ్యాయి. రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో వేడుకల నిర్వహణపై సందిగ్ధత నెలకొనడంపై ఈ నెల 26న ‘పెన్నహోబిలంపై నిర్లక్ష్యమేల’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి తిరుపతి దేవదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ స్పందించారు. పెన్నహోబిలంలో ముక్కోటి ఏకాదశి నిర్వహించడానికి జిల్లా దేవదాయ శాఖ అధికారి గంజి మల్లికార్జునప్రసాద్‌ను ఇన్చార్జ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా నియమించారు. ఈ మేరకు ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించి, ముక్కోటి ఏకాదశి వేడుకలపై ఆలయ సిబ్బందితో సమీక్షించారు. అనంతరం వేడుకలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. -
అతివేగం.. తీసింది ప్రాణం
● ఆటోను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకుల దుర్మరణం ● ముగ్గురికి తీవ్రగాయాలు గుత్తి రూరల్: మండలంలోని ఊబిచెర్ల గ్రామం సమీపంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం ఆటోను వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో పెద్దవడుగూరు మండలం మిడుతూరుకు చెందినరెడ్డి పోగుల రాజేష్(32), కొయిలదిన్నె నవీన్(25) మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రాజేష్ నంద్యాల జిల్లా ప్యాపిలిలో, నవీన్ ప్యాపిలి మండలం రోళ్లపాడు గ్రామంలో వివాహం చేసుకున్నారు. అయితే రాజేష్ భార్య కళావతి, నవీన్ భార్య స్వీటీ క్రిస్మస్కు పుట్టినిళ్లకు వెళ్లారు. రాజేష్, నవీన్ వారి భార్యలను పిలుచుకొని ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. అయితే పోదొడ్డి గ్రామ శివారులో హైదరాబాదు నుంచి బెంగళూరు వైపునకు వెళ్తున్న కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో ఆటోలో ఉన్న రాజేష్, నవీన్, కళావతి, స్వీటీ, వర్ష తీవ్రంగా గాయపడ్డారు. హైవే అంబులెన్స్ ద్వారా వారిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజేష్ అసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నవీన్ అనంతపురం తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఆటో రోడ్డు పక్కన వెళ్తుండగా ఎదురుగా వెళ్తున్న లారీని ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయబోయి కారు ఆటోను ఢీకొన్నట్లు బాధితులు తెలిపారు. మృతులు రాజేష్‌కు భార్య కళావతి, కుమార్తె వర్ష, నవీన్‌కు భార్య స్వీటీ ఉన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్, కారును పోలీసులు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శోకసంద్రంలో మిడుతూరు పెద్దవడుగూరు : నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన నవీన్(23), రాజేష్(35) మృతి చెందడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన భర్తల మరణాన్ని భార్యలు కళావతి, స్వీటి జీర్ణించుకోలేక పోతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఒక్కసారిగా కన్నీరుమున్నీరయ్యారు. మృతులు రాజేష్, నవీన్ -
పడకేసిన పారిశ్రామిక ప్రగతి
అనంతపురం టౌన్: ప్రోత్సాహక రాయితీలు అందకపోవడంతో పారిశ్రామిక ప్రగతి కుంటుపడుతోంది. పరిశ్రమల విస్తృత ఏర్పాటుతోనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో ఎంతోమంది యువ పారిశ్రామిక వేత్తలు విస్తృతంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈల)ను ఏర్పాటు చేశారు. అయితే వారికి ప్రభుత్వం రాయితీలు మాత్రం అందడం లేదు. ఏడాదిన్నర కాలంగా పారిశ్రామికవేత్తలకు ఎదురుచూపులు తప్పడం లేదు. పారిశ్రామిక వేత్తలపై చిన్నచూపు జిల్లాలో 2023–27 పారిశ్రామిక పాలసీ కింద రూ.600 కోట్లకు పైగా పెట్టుబడులతో 1,200 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల(ఎంఎస్ఎంఈల)ను ఏర్పాటు చేశారు. వీటిద్వారా ప్రత్యక్షంగా మూడు వేల మందికి, పరోక్షంగా మరో 1500 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంత పెద్ద ఎత్తున యూనిట్లు నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పారిశ్రామిక వేత్తలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ఏడాదిన్నర కాలంగా రాయితీలు మంజూరు చేయకపోవడంతో పారిశ్రామిక వేత్తలు అవస్థలు పడుతున్నారు. రాయితీల రూపంలో చిన్న పరిశ్రమలకు మాత్రమే రూ.50 కోట్ల మేర మంజూరు చేయాల్సి ఉంది. పెద్ద తరహా పరిశ్రమలు జిల్లాలో 17 ఉన్నాయి. వీటికి సైతం ప్రోత్సహకాలు సకాలంలో అందడం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి పరిశ్రమలు (యూనిట్లు) నెలకొల్పిన పారిశ్రామికవేత్తలకు రాయితీలు అందని మాట వాస్తవమే. జిల్లా వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా రాయితీలు రావాల్సి ఉంది. పరిశ్రమ వివరాలు, యూనిట్ కాస్ట్, ఉపాధి తదితర వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ఇక రాయితీలపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అక్కడి నుంచి రాయితీలు మంజూరైతే పారిశ్రామికవేత్తల ఖాతాల్లో నేరుగా జమవుతుంది. – శ్రీనివాసయాదవ్, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల శాఖ పారిశ్రామికవేత్తలకు అందని రాయితీలు 1200 పరిశ్రమలకు రూ.50 కోట్ల మేర బకాయిలు ఏడాదిన్నరగా పారిశ్రామిక వేత్తల ఎదురుచూపు మీనమేషాలు లెక్కిస్తున్న చంద్రబాబు సర్కారు -
మిగులు భూమిగా చూపి..
పచ్చజెండా పాతి.. రాప్తాడురూరల్: కేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే కారణంతో ఇద్దరు రైతులపై టీడీపీ నేతలు కక్షగట్టి వారి పొలాలను లాక్కుకునేందుకు యత్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రాప్తాడు మండలం పుల్లలరేవు గ్రామానికి చెందిన బోయకులానికి చెందిన ఎస్. గోవిందు కుటుంబం గొందిరెడ్డిపల్లి పొలం 7.76 ఎకరాల గాజుబండ పొరంబోకు భూమిని దాదాపు 40 ఏళ్లుగా సాగుచేసుకుంటోంది. 2001 మార్చిలో ఈ భూమిని అసెస్డ్ వేస్ట్ (ఏడబ్ల్యూ)ల్యాండ్‌గా కన్వర్షన్ చేయాలంటూ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అప్పటి తహసీల్దార్ ఈమేరకు సిఫార్సు చేస్తూ ఆర్డీఓకు లేఖ రాశారు. అప్పట్లో ఆర్డీఓ ఆమోదముద్ర వేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో 2006లో ఎస్.గోవిందుకు 103–2 (కొత్త సర్వేనంబరు)లో 4.90 ఎకరాలు, 2007లో గోవిందు పెద్ద కుమారుడు ఎస్.పెద్ద ఓబులేసుకు 103–3 సర్వే నంబరులో 2.86 ఎకరాల భూమికి వ్యవసాయ భూమి పట్టాలు మంజూరు చేశారు. గోవిందు చనిపోవడంతో ఆయన పేరుపై ఉన్న 4.90 ఎకరాలను చిన్న కుమారుడు ఎస్.వసంతు పేరుపై పట్టాదారు పాస్తుకంతో పాటు ఆన్లైన్లో ఎక్కించారు. ఆరు బోర్లు వేయడంతోపాటు పైపులైను, డ్రిప్ ఏర్పాటు చేశారు. పంట రుణాలు, ఎల్టీ లోన్లు తీసుకున్నారు. కరెంటు బిల్లులు కడుతున్నారు. చింతచెట్లు, నేరేడు, టెంకాయచెట్ల పెట్టడంతోపాటు అంతర పంటలూ సాగు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే... 2024లో టీడీపీ అధికారంలోకి రాగానే ‘ఇది పొరంబోకు’ భూమి అంటూ గ్రామంలో ఉన్న కొందరు టీడీపీ నాయకులు పెద్ద ఓబులేసు, వసంతు భూముల్లో టీడీపీ జెండా నాటారు. తర్వాత కొద్దిరోజులకు కొన్ని నేరేడు చెట్లను తొలగించారు. ఆ తర్వాత టెంకాయచెట్లకు నిప్పుపెట్టారు. దీనిపై రాప్తాడు పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. ఇక మూడోసారి ఏకంగా మొత్తం చెట్లన్నీ తొలగించడంతో పాటు పైపులైను, మోటార్లను తొలగించి అగ్గిపెట్టారు. మరీబరి తెగిస్తుండడంతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కొత్తగా మొక్కలు నాటుకునేందుకు తనవంతు ఆర్థికసాయం అందిస్తానని భరోసా కల్పించారు. గత నెలలో నోటీసు ఇచ్చిన అధికారులు పెద్ద ఓబులేసు, వసంతు పేర్లు ఆన్లైన్లో తొలగించాలంటూ గ్రామానికి చెందిన ఎం.రమేష్, టి.కృష్ణయ్య, యు.జయప్ప, సి.శంకర్, కె.కృష్ణయ్య, సి.నల్లప్ప, సాయినాథ్‌నాయుడు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో గత నెలలో వారిద్దరికీ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసు అందుకున్న బాధితులు జిల్లా, హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారులు, రెవెన్యూ అధికారులకు హైకోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో వారు వెంటనే అధికారులపై ఒత్తిళ్లు చేయించి మరీ ఆన్లైన్ నుంచి రైతుల పేర్లు తీయించేశారు. 7.76 ఎకరాల భూమిని మిగులు భూమిగా చూపిస్తున్నారు. భూమిని కొట్టేసేందుకు కుట్ర మిగులు భూమిగా చూపించిన ఇక్కడ గ్రామంలో ఇళ్లులేని పేదలకు ఇంటిస్థలాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ భూమి గ్రామానికి ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఒకవేళ నిజంగా పేదలకు ఇళ్ల స్థలాలకు ఇవ్వాలనుకుంటే ఊరికి అనుకునే 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ ఎంతమందికై నా ఇవ్వొచ్చు. అయినా ఈ భూమినే ఇవ్వాలనుకుంటున్నారంటే వారి ఉద్దేశం ఎంటో అర్థం చేసుకోవచ్చని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ కూడా 20–30 ప్లాట్లు ఇచ్చి తక్కిన భూమిన గ్రామంలో ఉన్న కొందరు నాయకులు, మండలంలో కీలకంగా ఉన్న మరో నాయకుడు, ఓ రెవెన్యూ అధికారి భాగాలు పంచుకునేలా ప్రణాళిక రచించినట్లు ప్రచారం సాగుతోంది. సర్వే నంబర్ 103–2, 103–3 గాజుబండ పొరంబోకు భూమిలో 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. ఏడబ్ల్యూ ల్యాండుగా కన్వర్షన్ చేశారు. సాగు పట్టాలు కూడా ఇచ్చారు. పంటలు పెట్టుకుంటున్నాం. రుణాలు పొందాం. కరెంటు మీటర్లు ఉన్నాయి. మేము వైఎస్సార్సీపీ సానుభూతిపరులమనే కక్ష కట్టారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాకు అండగా నిలిచారు. – ఎస్.పెద్ద ఓబులేసు, ఎస్.వసంతు బాధితులు ఎస్.పెద్ద ఓబులేసు, ఎస్.వసంతులకు అండగా నిలుస్తాం. వైఎస్సార్సీపీ అభిమానులనే కక్షతో వారి భూములను లాక్కోవాలని చూస్తున్నారు. ఆ భూమిని కొట్టేసేందుకు పరిటాల కుటుంబం పూనుకుంది. పరిటాల సునీత, ఆమె సోదరుడు ధర్మవరపు మురళీ, స్థానిక నాయకులు, అధికారులు వాటాలుగా పంచుకోవాలని చూస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం. – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం బాధితులకు అండగా నిలుస్తాం పుల్లలరేవులో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల భూమిపై టీడీపీ నేతల కన్ను అధికారంలోకి రాగానే చెట్లు నరికివేత...తర్వాత పొలానికి నిప్పు ఇప్పుడు ఏకంగా ఆన్లైన్ నుంచి పేర్ల తొలగింపు -
శ్రుతిమించిన టీడీపీ నేతల ఆగడాలు
అనంతపురం అర్బన్: అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని, మంత్రి పయ్యావుల కుటుంబం అండతో విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామ పొలంలోని భూమిని ఆక్రమించారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని అడ్వకేట్ హరినాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు కేవీ రమణతో పాటు బాధితులతో కలిసి కలెక్టర్ ఆనంద్‌ను ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. వేల్పులమడుగు గ్రామ సర్వే నంబరు 141లోని 42.21 ఎకరాల్లో 21.05 ఎకరాలను 2023 జూన్ 24న (3430/2023, 3441/2023) రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా జయకుమార్ కొనుగోలు చేశాడని చెప్పారు. అనంతరం విడపనకల్లు తహసీల్దార్ ధ్రువీకరించి టైటిల్ డీడ్, పట్టాదారు పాసుపుస్తకం, అడంగల్, 1బీ జారీ చేశారని తెలిపారు. భూ యజమానిగా జయకుమార్ అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారన్నారు. ప్రస్తుతం ఆ భూమిలో కందిపంట సాగు చేశారని, పంట విత్తిన తరువాత జనార్దనపల్లికి చెందిన ఆర్.జనార్దన్, కృష్ణమూర్తి, సుధాకర్, పాండురంగ, తదితరులు చట్టవిరుద్ధంగా భూమిని స్వాధీనం చేసుకున్నారన్నారు. దీంతో బాధితుడు అనంతపురం అదనపు సీనియర్ సివిల్ జడ్జి ముందు ఓఎస్ నంబరు 117/2025 దాఖలు చేశాడన్నారు. న్యాయస్థానం ఈ ఏడాది ఆగస్టు 13న ‘ఐఏ నంబరు 241/2025) మధ్యంతర నిషేధాన్ని మంజూరు చేసిందన్నారు. అయినా కబ్జాకు యత్నించిన వ్యక్తులు భూ యజమానిని భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. తప్పుడు నివేదికలతో పక్కదారి నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ భూ యజమానిని తన భూమిలోకి ప్రవేశించకుండా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి విడపనకల్లు ఎస్ఐ, ఉరవకొండ సీఐలు అడ్డుకుంటున్నారని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. భూ వివాదంపై తహసీల్దార్ విచారణ చేసి ఈ ఏడాది సెప్టెంబరు 4న ఎండార్స్మెంట్ ఇచ్చారన్నారు. ఆ భూమి జయకుమార్ పేరున ఉందని, రెవెన్యూ శాఖకు జ్యోకం చేసుకునే అధికారం లేదని స్పష్టంగా పేర్కొన్నారన్నారు. తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తహసీల్దార్ తన నివేదికను తానే మార్పు చేశారన్నారు. ధూప, దీప, నైవేద్యం కోసం భూమిని దానం చేశారని, జనార్దనపల్లికి చెందిన జనార్దన్ ఆ భూమిని సాగు చేస్తున్నారని ఈ నెల 22న తాజాగా నివేదిక సమర్పించారని చెప్పారు. దీంతో బాధిత రైతు హైకోర్టులో రిట్ పిటీషన్ (35899/2025) దాఖలు చేశాడన్నారు. ఈ వివాదం పూర్తిగా సివిల్ స్వభావాన్ని కలిగి ఉందని హైకోర్టు ఉత్తర్వు ద్వారా నిర్ధారించిందని, పోలీసులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశించిందని వివరించారు. అయినా ఈ నెల 26న భూ యజమాని, ఆయన మామ లత్తవరం గోవిందు, వ్యవసాయ కార్మికులు పంట కోతకు వెళితే పోలీసులు, రెవెన్యూ అధికారులు మరోసారి అక్రమంగా అడ్డుకున్నారన్నారు. దీంతో 21 ఎకరాల్లోని పంట నాశనం అవడం వల్ల భూ యజమానికి దాదాపు రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచకాలకు పాల్పడుతున్న టీడీపీకి, పచ్చని పల్లెల్లో చిచ్చుపెడుతున్న పయ్యావుల కేశవ్‌కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పయ్యావుల అండతోనే భూ ఆక్రమణ కోర్టు ఆర్డరును సైతం లెక్క చేయడం లేదు బాధితులతో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి -
నేటి నుంచి ఏసీఏ ఉమెన్ కప్ ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీ
● వివిధ రాష్ట్రాల నుంచి బరిలో దిగనున్న 8 జట్లు అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ క్రికెట్ స్డేడియం వేదికగా ఏసీఏ ఉమెన్ కప్ ఇన్విటేషన్ క్రికెట్ టీ 20 టోర్నీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అనంతపురం నుంచి రెండు జట్లు, బెంగళూరు యూఎస్ఏ అట్లాంట గర్ల్స్ టీం, విజయవాడ సంప్రసిద్ధి అకాడమీ, ఒంగోలు, కడప, చిత్తూరు జట్లు బరిలో దిగనున్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ నెల 30వ తేదీ వరకు టోర్నీ జరగనుంది. గురువారం బెంగళూరు అట్లాంట, విజయవాడ సంప్రసిద్ధ, అనంతపురం జట్లు ముమ్మర ప్రాక్టీస్ చేశాయి. ఏదిఏమైనా ఐదే రోజుల పాటు క్రికెట్ ప్రేమికులకు ఈ టోర్నీ కనువిందు చేయనుంది. అందుబాటులోకి మూడు ఎంఎస్ఎంఈ పార్కులు ● ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ● ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమర్ అనంతపురం టౌన్: జిల్లాలో మరో మూడు ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసి పారిశ్రామిక వేత్తలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ తెలిపారు. వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. తాడిపత్రి మండలం ఊరుచింతల, కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామాల్లో ఒక్కొక్కటి 50 ఎకరాల్లో, కూడేరులో 100 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్‌లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ మూడు ప్రాంతాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆసక్తి ఉన్న ఔత్సాహికులు ఏపీఐఐసీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. అలాగే https://apiic. in వెబ్సైట్ ద్వారానూ దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి ఎంఎస్ఎంఈ పార్క్‌లో కొన్ని ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలని కోరారు. ఎద్దుల బండిని ఢీకొన్న కారు ● దూడ మృతి, రైతుకు తీవ్రగాయాలు గుత్తి రూరల్: మండలంలోని వన్నేదొడ్డి గ్రామ శివారున 44వ జాతీయ రహదారిపై గురువారం ఎద్దుల బండిని కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. వన్నేదొడ్డికి చెందిన రైతు మల్లికార్జున తన పొలంలో వ్యసాయ పనులు ముగించుకుని ఇంటికి ఎద్దుల బండిలో వెళుతూ జాతీయ రహదారి దాటుతుండగా కర్నూలు వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ఎద్దుల బండికి వెనక కట్టిన ఆవు దూడ అక్కడికక్కడే మృతి చెందింది. బండి తునాతునకలైంది. తీవ్రంగా గాయపడిన మల్లికార్జునను స్థానికులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. మహిళ ప్రాణాలు కాపాడిన సబ్ స్టేషన్ ఆపరేటర్ బ్రహ్మసముద్రం: మండలంలోని రాయలప్పదొడ్డి గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ అప్రమత్తత ఓ మహిళను ప్రాణాపాయం నుంచి తప్పించింది. వివరాల్లోకి వెళితే... రాయలప్పదొడ్డి గ్రామానికి చెందిన త్రివేణి మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతోంది. గురువారం ఉదయం ఆమె పొరబాటున విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి ప్రవేశించింది. అక్కడి ట్రాన్స్ఫార్మర్లు, తీగలను పరిశీలిస్తూ ఓ తీగను పట్టుకోబోతుండగా గమనించిన సబ్‌స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ రంజిత్ వెంటనే ఆమెను పక్కకు లాగాడు. విద్యుత్ యార్డు నుంచి ఆమెను పక్కకు పిలుచుకొచ్చి సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చారు. విషయం తెలుసుకుని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు.. మహిళా ప్రాణాలను కాపాడిన రంజింత్ను అభినందించారు. ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ సంబరం ప్రశాంతి నిలయం: దేశ విదేశాలకు చెందిన సత్యసాయి భక్తుల నడుమ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఉదయం సత్యసాయి విద్యార్థుల వేద పఠనం అనంతరం క్రిస్మస్ క్యారల్స్ ఆలపించారు. శాంతాక్లాజ్‌లు సందడి చేశారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజుతో సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ సభ్యులు క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. -
ఇంటర్ పరీక్షల్లో సమూల మార్పు
అనంతపురం సిటీ: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఈ విద్యా సంవత్సరం నుంచి సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. సంస్కరణల్లో భాగంగా ఈ విద్యా సంవత్సరం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సిలబస్ మార్చిన సంగతి తెలిసిందే. పరీక్ష విధానంలోనూ నూతన విధానాలకు ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టింది. ప్రశ్నపత్రంలో మార్పులు ఇలా.. ● భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించి 85 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రస్తుత విధానంలో 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలతో పేపరు ఇస్తారు. ● గణితం, భౌతిక, రసాయన శాస్త్రం, చరిత్ర, కామర్స్, రాజనీతి శాస్త్రం, ఎకనామిక్స్‌కు 32 పేజీలు, వృక్ష, జంతుశాస్త్రాలతో పాటు మిగిలిన సబ్జెక్టులకు 24 పేజీలున్న బుక్లెట్ ఇవ్వనున్నారు. ● భౌతిక, రసాయన, జీవ శాస్త్రాల్లో మొత్తం 85 మార్కులకు 29 వస్తే పాస్ అయినట్లే. గణితం వంద మార్కులకే.. గణితం పేపర్ 1990 సంవత్సరంలో 150 మార్కులకు ఉండేది. తరువాత దీనిని గణితం–1ఏ, 1బీగా మారుస్తూ ఒక్కో పేపర్‌కు 75 మార్కులకు చొప్పున రెండు పేపర్ల విధానాన్ని ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. తాజాగా మొదటి ఏడాది విద్యార్థులకు గణితంలో ఒకే పేపర్‌ను 100 మార్కులకు నిర్వహించనున్నారు. మార్పులకనుగుణంగా సన్నద్ధం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షా విధానంలో వచ్చిన మార్పులపై ఇప్పటికే ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు అవగాహన కల్పించాం. ఇప్పటికే మోడల్ పేపర్లతో పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాం. ఎన్సీఈఆర్టీ సిలబస్‌లో భాగంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. మార్పులకనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం – వెంకటరమణనాయక్, జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి, అనంతపురం బైపీసీలో బాటనీ, జువాలజీ కలిపి బయాలజీ ఫిజిక్స్, కెమిసీ్ట్ర సబ్జెక్టులకు మార్కుల పెంపు మ్యాథ్స్ వంద మార్కులు, బయాలజీ 85 మార్కులు -
●‘రూటే’ సపరేట్
అనంతపురం అర్బన్: ఆయన డిప్యూటీ కలెక్టర్. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఏమిటి ఆయన ‘స్పెషల్’ అని అనుకుంటున్నారా? అయితే చూడండి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓల మాదిరిగా కాదు... ఆయన రూటే ‘స్పెషల్’. తన వాహనానికి ముందు భాగంలో నంబర్ ప్లేట్‌ను తొలగించి ‘డిప్యూటీ కలెక్టర్, ఏపీఎస్సీఎస్సీఎల్ డిస్ట్రిక్ట్ మేనేజర్, అనంతపురం’ అనే బోర్డు ఏర్పాటు చేయించారు. అయితే ఇబ్బందేమిటి అంటారా? ఆర్టీఏ నిబంధనల ప్రకారం వాహనానికి ముందు, వెనక తప్పనిసరిగా నంబర్ ప్లేట్ ఉండాలి. ఈ నిబంధనను కలెక్టర్ మొదలు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తప్పని సరిగా గౌరవిస్తూ తమ వాహనాలకు ముందు, వెనుక నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. నిబంధనలు అనుసరించడంలో ముందు వరసలో ఉండాల్సిన ఓ జిల్లా అధికారి అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ‘స్పెషల్’ కాదంటారా? -
అనూష ఆచూకీ కోసం రంగంలోకి డ్రోన్లు
బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు గ్రామానికి చెందిన కల్లప్ప తన ఇద్దరు కుమార్తెలను తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)లో తోసేసిన విషయం తెలిసిందే. పెద్దమ్మాయి సింధు(11) మృతదేహం మంగళవారం లభ్యం కాగా, అదే రోజు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నమ్మాయి అనూష కోసం గాలింపు కొనసాగుతోంది. ఆచూకీ లభ్యం కాకపోవడంతో గురువారం కర్ణాటకలోని శిరిగేరి, మోకా, నాగేనహాళ్లి తదితర ప్రాంతాల్లో ఎల్లెల్సీపై బొమ్మనహాళ్ ఎస్ఐ నబీరసూల్, పీఎస్ఐ నవీన్, సిబ్బంది డ్రోన్ కెమెరాలను వినియోగించారు. కాలువ వెంబడి గాలింపు కొనసాగుతోంది. అప్పిరెడ్డి హరినాథరెడ్డికి ఆటా ఎక్స్‌లెన్సీ అవార్డు అనంతపురం కల్చరల్: రాయలసీమ సాంస్కృతిక వేదిక, యోగివేమన ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలకుగాను జిల్లాకు చెందిన రచయిత, వ్యాసకర్త డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డికి ఆటా లిటరరీ ఎక్స్‌లెన్సీ అవార్డు దక్కింది. హైదరాబాదు వేదికగా ఈ నెల 27న రవీంద్రభారతిలో జరిగే ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వేడుకల ముగింపు ఉత్సవంలో ఈ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. అనేక ఏళ్లుగా సాగిస్తున్న సాహిత్య పరిశోధన, రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలను వెలుగులోకి తెచ్చే మహా కవిసమ్మేళనాలు, పద్యపోటీలు, సీమ సాహితీ పోటీలు, తెలుగు భాషా వికాస కార్యక్రమాలు, సదస్సుల నిర్వహణ వంటివి ఆయనకు ఆటా పురస్కారం దక్కేలా చేశాయని నిర్వాహకులు చల్లా జయంత్, సతీష్‌రెడ్డి వెల్లడించారు. ‘అమిగోస్’ సీనరేజీ కాంట్రాక్టు రద్దు ● గనుల శాఖ ఆధ్వర్యంలోనే పర్మిట్ల జారీ ● డిప్యూటీ డైరెక్టర్ ఆదినారాయణ అనంతపురం టౌన్: సీనరేజీ, రాయల్టీ కాంట్రాక్టుల గడువు ముగియడంతో అమిగోస్ సంస్థ సీనరేజీ కాంట్రాక్టును రద్దు చేసినట్లు భూగర్భ గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదినారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గనులశాఖ పరిధిలో రోడ్డు మెటల్, గ్రానైట్, క్వాట్జ్, గ్రావెల్, సున్నపురాయి, నాపరాయి తదితర ఖనిజ క్వారీల నుంచి సీనరేజీ, రాయల్టీల వసూళ్ల బాధ్యతను అమిగోస్ అనే ఓ ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం కాంట్రాక్టు ఇచ్చింది. ఈ కాంట్రాక్టు లీజు గడువు ముగియడంతో కాంట్రాక్టును రద్దు చేశారు. దీంతో రాయల్టీ పర్మిట్ల కోసం క్వారీల నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా గనుల శాఖకు దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాల్సి ఉంటుంది. పర్మిట్లు లేకుండా ఖనిజాన్ని రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ అంశంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గనులశాఖ విజిలెన్సు బృందాలు విస్తృత తనిఖీలు చేపడతాయని డీడీ ఆదినారాయణ వెల్లడించారు. అక్రమ రవాణా చేస్తే క్వారీలను సీజ్ చేయడంతోపాటు భారీ ఎత్తున జరిమానాలు విధిస్తామన్నారు. -
మినీ గోకులాల నిధులు స్వాహా
● క్షేత్రసహాయకుడి అవినీతి బాగోతం ● రూ.13 లక్షల రికవరీకి ఆదేశాలు రాయదుర్గం: డి హీరేహాళ్ మండలం మురడి, గొడిశెలపల్లి, దొడగట్ట, డి.హీరేహాళ్ గ్రామాల్లో మినీ గోకులం బిల్లుల మంజూరులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. 2014–19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో మంజూరైన గోకులం షెడ్లకు సంబంధించి చివరి బిల్లులో 30 శాతం మిగులు నిధులను ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్ఐసీ సర్వర్ మార్పులు, చేర్పుల్లో భాగంగా రైతుల ఖాతాలు ఆన్లైన్లో తొలిగిపోవడంతో డి.హీరేహాళ్ మండలంలోని మురడికి చెందిన క్షేత్ర సహాయకుడు వెండర్ ఖాతా తెరిచి అందులో జమ చేశారు. ఈ క్రమంలో కొందరు అధికారులు కుమ్మకై ఏకంగా రూ.13 లక్షలు దారి మళ్లించారు. ఆలస్యంగా తెలుసుకున్న రైతులు తమ బిల్లులు ఇప్పించాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. దీంతో అవినీతి బాగోతం బహిర్గతమైంది. సగం డబ్బు వాపస్? అవినీతి తెలుసుకున్న ఎంపీడీఓ దాసనాయక్, ఏపీఓ సంజీవ్‌కుమార్ మురడిలో విచారణ చేపట్టి మురడి, డి.హీరేహాళ్, గొడిశెలపల్లి, దొడగట్ట గ్రామాలకు చెందిన రైతుల డబ్బులు రూ.13 లక్షలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ తీర్మానం జరిపి ఆ డబ్బంతా తిరిగి రైతులకు చెల్లించేలా ఒప్పించారు. లేకపోతే క్రిమినల్ కేసు నమోదు చేయించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో పంచుకున్న సొమ్ములో సగం రైతులకు చేర్చారు. మిగిలిన సగం సర్ధుబాటులో ఉన్నారు. కాగా, ఈ అవినీతి బాగోతం లో బాగస్వామ్యులైన వారందరిపై చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా అప్పట్లో 60కు పైగా షెడ్లు నిర్మించారు. కాగా ఏకమొత్తంగా రూ.13 లక్షలను క్షేత్ర సహాయకుడి ఖాతాకు బదిలీ చేయడంతో ఏ రైతుకు ఎంత మొత్తం చెల్లించాలనే విషయంపై కాస్త జాప్యం చోటు చేసుకుందని ఎంపీడీఓ దాసనాయక్ పేర్కొన్నారు. ప్రతి రూపాయి రైతుకు చేర్చాలని ఆదేశించామన్నారు. ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉన్న అధికారులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. -
పెన్నహోబిలంపై నిర్లక్ష్యమేల?
ఉరవకొండ/ ఉరవకొండ రూరల్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం నిర్లక్ష్యానికి గురవుతోంది. పర్యాటకంగా, ఆధ్యాత్మిక ధామంగా వెలుగొందుతున్న పెన్నహోబిలానికి ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ప్రతి శని వారం భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు పోటెత్తుతుంటారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాజకీయ నేతల జోక్యం పెరిగిపోయింది. అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిళ్లను భరించలేక ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈఓ)గా వచ్చిన వారు విధులు నిర్వహించలేకపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో ఆలయ నిర్వహణ, అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. భక్తులకు తగిన సౌకర్యాలు కూడా కల్పించలేకపోతున్నారు. నూతన రథం నిర్మాణానికి ఇంకెన్నాళ్లో..? పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి నూతన రథం నిర్మాణానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అడుగులు పడ్డాయి. 400 ఏళ్ల నాటి పురాతన రథం 2022లో కుప్పకూలింది. దీంతో నూతన రథం నిర్మాణానికి 2023 అక్టోబర్‌లో టెండర్లు ఆహ్వానించారు. 43 అడుగుల రథం నిర్మాణం కోసం రివర్స్ టెండరింగ్ విధానంలో రూ.1.70 కోట్లకు గౌతంరెడ్డి అనే టెండరుదారు నిర్మాణ పనులు దక్కించుకున్నారు. రథం నిర్మాణం కోసం భక్తుల నుంచి రూ.కోటి దాకా విరాళాలు అందాయి. రాష్ట్రంలో కనీవినీ ఎరగని రీతిలో రథం తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇందుకోసం కాంట్రాక్టర్ అత్యంత నాణ్యత కలిగిన నాలుగు చక్రాలను సిద్ధం చేశారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో తదుపరి పనులు ఆగిపోయాయి. తదనంతరం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరింది. రథం నిర్మాణ పనులు త్వరగా పూర్తవుతాయని భావించిన భక్తులకు నిరాశే ఎదురైంది. రెండేళ్లవుతున్నా రథం నిర్మాణం ముందుకు సాగలేదు. రథం నిర్మాణ కాంట్రాక్టు గడువు కూడా మరికొన్ని నెలల్లో ముగియనుంది. ఆ లోపు రథం నిర్మాణం పూర్తవడం ప్రశ్నార్థకంగా మారింది. ముక్కోటి ఏకాదశి వేడుకలపై పెన్నహోబిలం దేవస్థానానికి నాలుగు నెలలుగా కార్యనిర్వహణ అధికారి (ఈఓ) లేరు. దీంతో ఇక్కడ పనిచేసే 10 మంది రెగ్యులర్, మరో 10 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు ఆగిపోయాయి. ఆలయంలో స్వామి వారి విలువైన ఆభరణాలకు కూడా భద్రత లేకుండాపోయింది. రెగ్యులర్ ఈఓను నియమించి పాలనను గాడిలో పెట్టాలని భక్తులు కోరుతున్నా రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి. ఆరోజు ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. అయితే ఇక్కడ ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లు చేసే నాథుడే లేకుండా పోవడం భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆ రోజు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే అవకాశం కూడా కనపడడం లేదు. పడకేసిన ఆలయ అభివృద్ధి ఆర్థిక మంత్రి ఇలాకాలో ఆలయ పాలన అస్తవ్యస్తం లక్ష్మీనరసింహస్వామి రథం నిర్మాణానికి గ్రహణం రాజకీయ నేతల ఒత్తిళ్లతో సతమతమవుతున్న ఈఓలు ప్రశ్నార్థకంగా ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలు ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లు చేసేవారేరీ..? అనుమతులు రాగానే చేపడతాం మంత్రి పయ్యావుల కేశవ్ చొరవ చూపి దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశిస్తే రీఎస్టిమేట్తో లక్ష్మీనృసింహుని నూతన రథం నిర్మాణ పనులు చేపడతాం. ఇప్పటికే రథానికి సంబంధించి నాలుగు చక్రాలు పూర్తయ్యాయి. అనుమతులు రాగానే పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. – గౌతంరెడ్డి, కాంట్రాక్టర్, అనంతపురం ‘ఏకాదశి’ ఏర్పాట్లు ఇబ్బందికరమే పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈఓగా ఎవరిని నియమించినా బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. గుంతకల్లు గ్రూప్ టెంపుల్స్ ఈఓ మఠం మల్లికార్జునకు ఈఓగా ఆర్డర్స్ ఇచ్చినా ఆయన చార్జ్ తీసుకోలేదు. ఈ విషయాన్ని దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ముక్కోటి ఏకాదశి వేళ ఈఓ లేకుంటే వేడుకలకు ఏర్పాట్లు చేయడం ఇబ్బందికరమే. – మల్లికార్జున ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్, దేవదాయ శాఖ, అనంతపురం -
కేశవా.. ఇటు చూడవా!
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సొంత నియోజకవర్గంలోని పలు గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత రహదారులు పూర్తి అధ్వాన స్థితికి చేరుకున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు.. ‘కేశవా.. ఒక్కసారి ఇటు చూడవా!’ అని వేడుకుంటున్నారు. కాజ్ వే కొట్టుకుపోయిన ప్రాంతాన్ని మట్టితో పూడ్చిన దృశ్యం కోతకు గురి కావడంతో పెద్ద పెద్ద రాళ్లు వేసిన దృశ్యం విడపనకల్లు: మండలంలోని పాల్తూరు నుంచి దర్గాహొన్నూరుకు వెళ్లే రహదారిలో పెద్ద వంక కాజ్వే పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. కాజ్వే మొత్తం అక్కడక్కడ నెర్రెలు చీలి ముక్కలు ముక్కలుగా రాలిపోతోంది. గతంలో కురిసిన వర్షానికి కాజ్‌వేలో కొంత ప్రాంతం కొట్టుకు పోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామస్తులు ఏకమై మట్టి, రాళ్లతో పూడ్చి రాకపోకలు సాగిస్తున్నారు. వాహనాలన్నీ అటుగానే ఉరవకొండ నుంచి ఉండబండ, పాల్తూరు మీదుగా బొమ్మనహాళ్ మండలంలోని కలవలితిప్ప, గోవిందవాడ, దర్గా హొన్నూరు, బొల్లనగుడ్డం వరకు ఆర్టీసీ సర్వీసులతో పాటు రోజూ వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు, టిప్పర్లు, కార్లు, ఆటోలు రాకపోకలు సాగిస్తున్నాయి. పాల్తూరు దాటిన తర్వాత వచ్చే పెద్ద వంక కాజ్ వే ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కాజ్ వే మధ్యలో అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. గతంలో కాజ్ వే దుస్థితిని గమనించిన ఆర్టీసీ అధికారులు ఈ మార్గంలో ఆర్టీసీ సర్వీసులను ఏకంగా రద్దు చేసేశారు. ఎప్పుడు కూలుతుందో చెప్పలేని కాజ్ వే మీదుగా ప్రయాణం సాగిస్తూ ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టలేమని ఆ సమయంలో ఉరవకొండ డిపో అధికారులు తేల్చి చెప్పారు. ఇప్పటికై నా మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించి నూతన కాజ్వే నిర్మాణానికి చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. శిథిలావస్థలో పాల్తూరు పెద్ద వంక కాజ్వే గత వర్షాలకు కొట్టుకుపోయిన వైనం మట్టి, రాళ్లతో పూడ్చి రాకపోకలు సాగిస్తున్న గ్రామీణులు ఎప్పుడు కొట్టుకుపోతుందో తెలియని అయోమయం ఇప్పటికై నా మంత్రి కేశవ్ స్పందించాలంటున్న గ్రామీణ ప్రజలు -
వైభవంగా సుబ్రహ్మణ్య షష్టి
హిందూపురం: పట్టణంలోని శ్రీనివాస మందిరం రోడ్డు ప్రాంతంలో గురువారం సుబ్రహ్మణ్య షష్టి ఘనంగా జరిగింది. సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెండి ఆభరణాలతో విశేషంగా అలంకరణ చేశారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఉన్న నాగుల విగ్రహాలకు మహిళలు పాలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. షష్టి సందర్భంగా మూలవిరాట్ దర్శనానికి భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం రైల్వేరోడ్డులోని రథం వద్ద వేదపండితులు హోమాలు చేసిన అనంతరం ఆలయం నుంచి శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పల్లకీలో మేళతాళాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు. రథం వద్దకు తీసుకెళ్లి కొలువుదీర్చారు. మహామంగళ హారతి అనంతర ప్రారంభమైన రథోత్సవంలో భక్తజనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రథం ముందు ఓ కళాకారుడు జంగమ దేవర వీరభద్ర వేషధారణలో చేసిన నృత్యాలు, వినాస్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ అర్చకులు మంజునాథశర్మ, చంద్రమౌళిలు, భక్తులు పాల్గొన్నారు. -
వణికిస్తున్న చలి
● అమడగూరులో 9.2, శెట్టూరులో 10.9 డిగ్రీలు అనంతపురం అగ్రికల్చర్: చలి పంజాతో ఉమ్మడి జిల్లా వణుకుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. చలి తీవ్రత బాగా పెరిగింది. ఈనెల మొదటి నుంచి చలిగింతలు మొదలై క్రమంగా తారస్థాయికి చేరుకుంది. గురువారం అమడగూరులో 9.2 డిగ్రీలు, శెట్టూరులో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడక్కడా సింగిల్ డిజిట్‌కు పడిపోవడం విశేషం. మడకశిర, సోమందేపల్లి, తనకల్లు, శెట్టూరు, కుందుర్పి, విడపనకల్లు తదితర మండలాల్లో ఇటీవల 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా 27 నుంచి 32 డిగ్రీల మధ్య నమదవుతుండగా రాత్రిళ్లు 15 డిగ్రీల లోపు కొనసాగుతున్నాయి. దీంతో సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు చలితీవ్రత కనిపిస్తోంది. వేకువజామున పొగమంచు అధికంగానే ఉండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. చలి బాగా పెరగడంతో జనం గజగజ వణుకుతున్నారు. ఓం నమో నారసింహా.... కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురువారం ఓం నమో నరసింహ...నామస్మరణతో మార్మోగింది. కదిరి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలు, కడప, చిత్తూరు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంతం కిక్కిరిసింది. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల పరిశీలన ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ ఎన్. సతీష్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులతో ఆయన మాట్లాడారు. భక్తులకు క్యూలలో ఎలాంటి అసౌర్యం కలగకుండా చూడాలన్నారు. త్వరితగతిన స్వామి దర్శనమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆయన కదిరి బైపాస్ వద్ద ఈ నెల 27,28 తేదీల్లో జరగనున్న ఇస్తెమా ఏర్పాట్లు కూడా పరిశీలించారు. -
ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి
గర్భిణులే కాదు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం లాంటివి లేక బీపీ, షుగర్ బాధితులు పెరుగుతున్నారు. తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గర్భిణులు తప్పక షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. నిర్ధారణ అయితే బిడ్డకు సోకకుండా రక్షించుకోవచ్చు. జాగ్రత్తలు తీసుకోవచ్చు. గర్భం ధరించినప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగినట్లు కనిపించినా ప్రసవం తర్వాత చాలామందిలో మటుమాయం అవుతుంది. ముఖ్యంగా ఆహారపు నియమాలతో పాటు వ్యాయామం చేయాలి. – ఈబీ దేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి -
‘పట్టు’ కోల్పోతున్న అనంత
అనంతపురం అగ్రికల్చర్: మల్బరీ సాగులో ఒక వెలుగు వెలిగిన అనంతపురం జిల్లా ఇప్పుడు డీలా పడిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సాహక రాయితీలు ఇవ్వకపోవడంతో మల్బరీ రైతులు పట్టు కోల్పోతున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అరకొరగా ఇస్తున్న సబ్సిడీలతో రైతులు అతికష్టమ్మీద నెట్టుకొస్తున్నారు. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ఉపాధిహామీ పథకాన్ని కూడా నీరుగార్చడంతో మల్బరీ రైతులకు ఇబ్బందిగా తయారైంది. గతంలో షెడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.3 లక్షల వరకు రాయితీ వర్తింపజేశారు. ఇప్పుడు ఉపాధిని తీసేయడంతో షెడ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. మార్కెట్లో పట్టుగూళ్ల ధరలు కూడా 2021, 2022లో మాదిరిగానే ఇప్పుడూ అవే ధరలు పలుకుతుండటంతో పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో గిట్టుబాటు కావడం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా చాలామంది రైతులు రేషం సాగుపై అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడంతో సాగులో ఉన్న పంటను సైతం తొలగిస్తున్నట్లు చెబుతున్నారు. 1000 ఎకరాలకు పడిపోయిన విస్తీర్ణం ఉమ్మడి అనంతపురం జిల్లా 2020, 2021 సంవత్సరాల్లో 45 వేల ఎకరాల మల్బరీ సాగుతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేది. 2022లో జిల్లాల విభజన తర్వాత మల్బరీ అధికంగా ఉన్న మడకశిర, హిందూపురం, పెనుకొండ, కదిరి ప్రాంతాలు శ్రీసత్యసాయి జిల్లాలోకి వెళ్లాయి. అనంతపురం జిల్లాలో మల్బరీ సాగు 5 వేల ఎకరాలకు పరిమితమైంది. అనంతపురం, కళ్యాణదుర్గంలో చిన్నపాటి సీడ్‌ఫారాలు ఉండగా.. తాడిపత్రిలో ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్ పాక్షికంగా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. సీడ్‌ఫారాలు, చాకీ సెంటర్లు, రీలింగ్ యూనిట్లు, మార్కెట్లు తదితర సదుపాయాల విషయంలో శ్రీసత్యసాయి జిల్లాతో పోల్చుకుంటే అనంతపురం జిల్లా నామమాత్రమే. దీనికితోడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం, రాయితీ పథకాలు లేకపోవడంతో సాగుపై రైతుల్లో ఆసక్తి తగ్గిపోయింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఈ–క్రాప్ నివేదిక పరిశీలిస్తే... మల్బరీ సాగు కేవలం 1,000 ఎకరాల్లో ఉన్నట్లు వెల్లడైంది. ఇంత దారుణంగా పడిపోవడంపై ఆ శాఖ వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. కళ్యాణదుర్గం డివిజన్ పరిధి కుందుర్పి, బ్రహ్మసముద్రం మండలాల్లోనే మల్బరీ సాగులో ఉండగా... మిగతా ఉరవకొండ, అనంతపురం, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో 5 నుంచి 10 ఎకరాల చొప్పున ఉండటం గమనార్హం. ‘అనంత’పై శీతకన్ను జిల్లా పట్టుపరిశ్రమశాఖపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం శీతకన్ను వేసింది. అంతో ఇంతో రైతులకు సేవలందిస్తున్న నర్సరీ క్షేత్రం కూడా లేకుండా చేసేశారు. జిల్లా కేంద్రంలో 6.80 ఎకరాల్లో హరితవనంగా విస్తరించిన కార్యాలయ ఆవరణలో నాలుగు ఎకరాలు ఫ్లాటెడ్ ప్యాక్టరీ నిర్మాణం కోసం ఇటీవల ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు అప్పగించడంతో నర్సరీ పెంపకానికి ఇబ్బందిగా మారింది. కార్యాలయ భవనాలు దెబ్బతిన్నా రిపేరీకి కూడా నిధులు లేవని ఆ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. సిబ్బంది కొరత కూడా వేధిస్తుండటంతో పట్టు సాగు విస్తీర్ణం పెంపు, రైతులకు సేవలు అందించడంలో విఫలమవుతున్నట్లు చెబుతున్నారు. ఉపాధి పథకం వర్తింపు, బడ్జెట్ కేటాయింపులు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో చంద్రబాబు ప్రభుత్వం కరుణిస్తే తప్ప ‘అనంత’లో పట్టుకు పూర్వవైభవం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పైసా బడ్జెట్ ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి, ప్రోత్సాహం లేక రేషం పంటపై రైతుల అనాసక్తి 1000 ఎకరాల కనిష్ట స్థాయికి పడిపోయిన మల్బరీ పంట -
● పునరుద్ధరిస్తే పూర్వవైభవం
● ప్రభ కోల్పోయిన జెడ్పీ తొలి కార్యాలయం ● 1952లో ఆవిష్కరించిన అప్పటి మద్రాసు సీఎం రాజగోపాలాచారి ● 1959 నుంచి కార్యాలయంలో కార్యకలాపాలు ● పునరుద్ధరిస్తే వినియోగంలోకి భవనం అనంతపురం అర్బన్: జిల్లా పరిషత్ తొలి కార్యాలయంగా దశాబ్దాల పాటు విలువైన సేవలు అందించిన భవనం నేడు నిరాదరణకు గురై పిచ్చి మొక్కల మధ్యన నాటి వైభవానికి ఓ తీపి గుర్తుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోనే ఓ చివర ఈ భవనం నేటికీ చెక్కుచెదరకుండా నాటి వైభవాన్ని చాటుతోంది. కార్యాలయం ఎదురుగా ప్రహరీకి మూతపడిన గేటు దర్శనమిస్తుంది. 1952లో అప్పటి మద్రాసు ప్రభుత్వ ముఖ్యమంత్రి సి.రాజగోపాలాచారి ఈ భవనాన్ని ఆవిష్కరించారు. 1959లో అప్పటి జిల్లా బోర్డు అధ్యక్షుడు కె.వి.వేమారెడ్డి ఈ భవనం నుంచి పూర్తి కార్యకలాపాలు ప్రారంభించారు. భవనం నిర్మించి 66 ఏళ్లు అవుతున్నా.. రంగు కోల్పోయి అంద విహీనంగా కనిపిస్తోంది తప్ప... ఇప్పటికీ కట్టడం చెక్కుచెదరకుండా నాటి నిర్మాణ పని తీరుకు అద్దం పడుతోంది. పునరుద్ధరిస్తే వినియోగంలోకి జాతి సంపదగా నిలిచిన జిల్లా పరిషత్ తొలి కార్యాలయ భవనాన్ని పరిశీలిస్తే అంతులేని నిరాదరణ.. నిర్వహణ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. కట్టడం నేటికీ ఎంతో పటిష్టంగా ఉందనే విషయాన్ని ఇంజనీరింగ్ నిపుణులు అంటున్నారు. ఒక మంచి భవనం... అది కూడా మద్రాసు ప్రభుత్వ ముఖ్యమంత్రి సి.రాజగోపాలాచారి ఆవిష్కరించిన దానికి ఒక చరిత్ర ఉందనే విషయాన్ని అధికారులు, పాలకులు గుర్తించలేకపోవడం బాధాకరం. ఎంతో పటిష్టంగా ఉన్న ఈ భవనాన్ని పునరుద్ధరిస్తే భావితరాలకు ఎన్నో నాణ్యమైన సేవలు అందించేందుకు దోహదపడుతుంది. పాలకులు, అధికారులు దృష్టి పెట్టాలి మన జాతి గొప్పది. మన శిల్పం గొప్పది. ఎన్నో అపురూప కట్టడాలను మన శిల్పులే తీర్చిదిద్దారు. వీటి గొప్పతనం మనది అని డంబాలు కొట్టడమే నేర్చుకున్న అధికారులు, పాలకులు.. మన పూర్వ కళాస్వరూపాలను చెక్కు చెదరకుండా కాపాడుకోలేకపోవడం బాధాకరం. జిల్లా పరిషత్ చరిత్రకు సాక్షంగా నిలిచే తొలి జెడ్పీ కార్యాలయానికి మునుపటి ప్రభను తీసుకొచ్చే విషయంపై ఇప్పటికై నా పాలకులు, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నారు. -
శోకసంద్రంలో నేమకల్లు
● కన్నీళ్లతో సింధు అంత్యక్రియలు ● అనూష కోసం ముమ్మర గాలింపు బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు గ్రామం శోకసంద్రమైంది. కాలువలో కలిసి పోయిన చిన్నారుల బతుకులు గ్రామాన్ని కలిచివేశాయి. తండ్రి చేతిలోనే ప్రాణాలు కోల్పోయిన చిన్నారి సింధు (11) అంత్యక్రియలు బుధవారం గ్రామస్తుల కన్నీళ్ల మధ్య సాగింది. మరో బాలిక అనూష కోసం తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)లో గాలింపు కొనసాగుతోంది. గ్రామానికి చెందిన కల్లప్ప తన ఇద్దరు కుమారైలు సింధు (11), అనూష (9)ను ఎల్లెల్సీలో తోసేసిన ఘటనలో సింధు మంగళవారం మధ్యాహ్నం మృతదేహం లభ్యం కావడంతో యావత్ గ్రామం దిగ్భ్రాంతికి లోనైంది. అయితే రెండో అమ్మాయి అనూష ఆచూకీ లభ్యం కాకపోవడం కలవర పెడుతోంది. దిగువ కాలువ వెంబడి కర్ణాటక పరిధిలోని నాగేనహాళ్లి, మోకా, దమ్మురు, తిరిగేరి ప్రాంతాల్లో పోలీసులు, బంధువులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన వెనుక అసలు కారణాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. కుటుంబ కలహాలా? మానసిక సమస్యనా? లేక మరేదైనా ఉందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కల్లప్ప ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను పూర్తిగా కోలుకొని విచారణకు సహకరిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని బొమ్మనహాళ్ ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. -
వ్యక్తి దుర్మరణం
బెళుగుప్ప: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బోరంపల్లికి చెందిన బొజ్జప్ప (45) బుధవారం యర్రగుడి గ్రామంలో జరిగిన దేవరకు వచ్చి, మొక్కు తీర్చుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఎదురుగా ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న ముదిగల్లుకు చెందిన దేవ అనే వ్యక్తి ఢీకొనడంతో రోడ్డుపై పడి బొజ్జప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దేవాను స్థానికులు వెంటనే కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. శ్రామికులకు గిట్టుబాటు కూలి : డ్వామా పీడీ గార్లదిన్నె: ఉపాధి పనుల్లో పాల్గొనే శ్రామికులకు రోజు వారీ కూలి రూ.307 అందేలా చొరవ తీసుకోవాలని క్షేత్ర సహాయకులకు డ్వామా పీడీ సలీంబాషా సూచించారు. గార్లదిన్నె మండలం పి.కొత్తపల్లి, సంజీవపురం గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించి, ఉపాధి హామీ పథకం కింద రైతులు నిర్మించుకున్న పశువుల షెడ్డులు, ఎరువు గుంతలు, సోక్ పిట్ నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం గార్లదిన్నె ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో సమావేశమై పనుల కల్పన అంశంపై సమీక్షించారు. కార్యక్రమంలో ఈసీ అయూబ్, టీఏ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చెట్టు మీద నుంచి జారి పడి వ్యక్తి మృతి వజ్రకరూరు: ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి వజ్రకరూరు మండలం ఎన్‌ఎన్‌పీ తండా నివాసి రమావత్ శంకర్‌నాయక్ (40) మృతి చెందాడు. ఆయనకు భార్య పార్వతి, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో పాటు జీవాల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం మేకలకు ఆహారం కోసమని ఇంటి వద్ద వేపచెట్టు ఎక్కి ఆకులు కోస్తుండగా అదుపు తప్పి కిందపడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే 108 వాహనంలో గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. అక్కడ చికిత్సకు స్పందించక బుధవారం ఉదయం మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


