హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
కూడేరు: మండలంంలోని మరుట్ల–3వ కాలనీలో సోమవారం చితంబరేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి రాతి దూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. 14 జతల వృషభాలను పోటీలకు రైతులు తీసుకువచ్చారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తికి చెందిన రైతు బోయ చెన్నప్ప వృషభాలు ప్రథమ, కనగానిపల్లి మండలం మద్దెలచెరువు రైతు కొండయ్య వృషభాలు ద్వితీయ, బళ్లారి జిల్లా ఆంధ్రాల గ్రామానికి చెందిన రైతు వీరేష్ వృషభాలు తృతీయ, గార్లదిన్నెకు చెందిన రైతు పఠాన్ బాషా వృషభాలు నాల్గవ, చెన్నేకొత్తపల్లి రైతు సనప నాగరాజు వృషభాలు ఐదో స్థానంలో నిలిచాయి. విజేత వృషభాల యజమానులను అభినందిస్తూ నగదు పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు.
సెల్‌ఫోన్ రీచార్జ్‌కు
డబ్బు ఇవ్వలేదని...
డి హీరేహాళ్(రాయదుర్గం): సెల్‌ఫోన్ రీచార్జ్‌కు డబ్బు ఇవ్వకపోవడంతో క్షణాకావేశానికి లోనై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... డి.హీరేహాళ్ మండలం కల్యం గ్రామానికి చెందిన రామకృష్ణ, లక్ష్మి దంపతుల ఏకై క కుమారుడు నవీన్ (17) తల్లిదండ్రులకు పొలం పనుల్లో చేదోడుగా ఉండేవాడు. రెండు రోజుల క్రితం సెల్‌ఫోన్ రీచార్జ్ కోసం ఇంట్లో డబ్బులు అడిగాడు. అయితే సంఘం కంతు చెల్లించాల్సి ఉండడంతో డబ్బు ఇవ్వడంలో తల్లిదండ్రులు జాప్యం చేశారు. దీంతో క్షణికావేశానికి లోనైన నవీన్.. సోమవారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు బళ్లారిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ గురుప్రసాదరెడ్డి తెలిపారు.
వాతావరణానికి అనుగుణంగా పంటల సాగు
● వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జాన్సన్
బుక్కరాయసముద్రం: మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపడితే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రాంతీయ సహాయ సంచాలకుడు, శాస్త్రవేత్త డాక్టర్ జాన్సన్ సూచించారు. బీకేఎస్ మండలం రెడ్డిపల్లిలోని కేవీకేలో సోమవారం 44వ శాసీ్త్రయ సలహా మండలి సమావేశం జరిగింది. ముఖ్య అతిఽథులుగా డాక్టర్ జాన్సన్‌తో పాటు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీ డీఈఈ డాక్టర్ ముకుంద హాజరై, మాట్లాడారు. పంటల సాగులో శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు తప్పక పాటించాలన్నారు. పంటల మార్పిడితో మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. వాతావరణానికి అనుగుణంగా చేపట్టాల్సిన వివిధ రకాల పంటల సాగుపై చర్చించారు. కార్యక్రమంలో ఆత్మాపీడీ మద్దిలేటి, వ్యవసాయ శాఖ ఏడీ రవి, గార్లదిన్నె పరిశోధనా స్థానం డైరెక్టర్ డాక్టర్ పీపీ రావు, డీహెచ్‌ఓ ఉమాదేవి, డాక్టర్ పద్మలత, రెడ్డిపల్లి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి, నాబార్డ్ డీడీఎం అనూరాధ, పశు సంవర్థక శాఖ ఏడీ డాక్టర్ రత్నకుమార్, కదిరి ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ భాస్కర్‌రెడ్డి, కళ్యాణదుర్గం కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చంద్రాయుడు, రెడ్డిపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసుంధర, రెడ్డిపల్లి ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి, రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ విజయ శంకర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు


