East Godavari
-
యువకుడి ఆత్మహత్య
తాళ్లపూడి: శ్మశాన వాటిక వద్ద ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ కథనం ప్రకారం.. ప్రక్కిలంకలోని గోదావరి ఒడ్డున ఉన్న శ్మశాన వాటిక వద్ద చెట్టుకు సీతానగరం మండలం మునికూడలికి చెందిన రాయుడు దొరబాబు (25) ఉరివేసుకుని మృతి చెందాడు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే మృతుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి తండ్రి రాయుడు నూకరాజుకు సమాచారం ఇచ్చి, కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి తుని: గొల్లప్రోలు సమీపంలో రైలు నుంచి జారిపడి ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని తుని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ త్రినాథరావు తెలిపారు. ఈ మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు. విజయవాడ వైపు వెళ్లిన రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి (40) మృతి చెందాడన్నారు. మృతుడి వివరాలు తెలియలేదని, నల్లగడుల, ఎరుపు రంగు ఫుల్ చేతుల చొక్కా, నీలం రంగు జీన్ ఫ్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ‘ఎవరిదీ చూపు’ పుస్తకావిష్కరణబోట్క్లబ్: కాకినాడ గాంధీభవన్‌లో ఆదివారం సాహితీ స్రవంతి ఆధ్వర్యాన కోగంటి విజయ్ రాసిన ‘ఎవరిదీ చూపు’ కవితా సంపుటి ఆవిష్కరణ, సమీక్ష సభ జరిగింది. ఈ పుస్తకాన్ని కవిసంధ్య పత్రిక సంపాదకులు శిఖామణి ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన జోస్యుల కృష్ణబాబు మాట్లాడుతూ గ్రంథకర్త కోగంటి విజయ్ కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ, సాహిత్యంపై మక్కువతో అనేక గ్రంథాలు వెలువరించారని అన్నారు. ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి మాట్లాడుతూ స్ఫూర్తిదాయకమైన కవిత్వం విజయ్ కవిత్వం అన్నారు. వక్త కాళ్లకూరి శైలజ మాట్లాడుతూ కోగంటి విజయ్ కవిత్వం ఎటువంటి సంక్లిష్టతకు తావులేకుండా అర్థమయ్యేలా ఉందన్నారు. శిఖామణి మాట్లాడుతూ సుమారు 70 కవితలు కలిగిన ఈ కవితా సంపుటిని ఆవిష్కరించే అవకాశం కల్పించిన సాహితీ స్రవంతికి ధన్యవాదాలు తెలిపారు. గ్రంథకర్త కోగంటి విజయ్ మాట్లాడుతూ అత్యంత వైభవంగా పుస్తకావిష్కరణ జరిపిన సాహితీ స్రవంతి నిర్వాహకులకు, అధ్యక్షులు మార్ని జానకీరామచౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో ఉయ్యపు హనుమంతరావు, మధునాపంతుల సత్యనారాయణ, అవధానుల మణిబాబు, కె.గౌరినాయుడు, దుర్గాప్రసాద్, శ్రీవత్స, సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి, మిరప మహేష్, సోమయాజులు, మన్మథరావు, పి.సుబ్బరాజు, చింతపల్లి సుబ్బారావు, మేడిశెట్టి శ్రీరాములు, సాయి సత్యనారాయణ, శిరీష, అద్దేపల్లి జ్యోతి, ఇందిర, ఉషారాణి, సీఎస్, ఆకెళ్ల శ్రీరామమూర్తి తదితర సాహితీవేత్తలు పాల్గొని స్వీయ కవితలను వినిపించారు. -
లే నాన్నా..ఇంటికెళ్దాం!
ఫ కొడుకు మృతదేహం వద్ద తల్లి రోదన ఫ ట్రాక్టర్ పైనుంచి పడి యువకుడి దుర్మరణం అడ్డతీగల: లే నాన్నా.. ఇంటికెళ్దాం.. నీవు తెచ్చిన చేపల కూర వండాను తిందువు..! అంటూ విగతజీవిగా పడి ఉన్న కుమారుడి వద్ద ఓ తల్లి రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. అడ్డతీగల మండలం భీముడుపాకలు వద్ద ఈ ఘటన జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బందంవారిపాకలకు చెందిన బందం వీరమ్మకు ముగ్గురు కుమారులు. ఇందులో చిన్నవాడైన బందం గంగరాజు (20) ఆదివారం ఉదయం ఇంట్లో వంటకు చేపలు తెచ్చి తల్లి వీరమ్మకు ఇచ్చి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వచ్చాడు. అతను భీముడుపాకలు వెళ్లి తిరిగి బందంవారిపాకలులోని తన ఇంటికి వస్తూ ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఎక్కాడు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ పైనుంచి గంగరాజు ప్రమాదవశాత్తూ కిందపడి పోయాడు. ట్రాక్టర్ అతని పైనుంచి వెళ్లిపోవడంతో తల, ముఖం భాగాల వద్ద తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో తల్లి వీరమ్మ అక్కడకు వచ్చి రోడ్డుపై రక్తపు గాయాలతో ఉన్న కొడుకును చూసి తల్లడిల్లిపోయింది. చిన్నవాడైన గంగరాజును అల్లారుముద్దుగా పెంచుకున్నానని, ఇలా జరుగుతుందని అనుకోలేదని రోదించింది. లే నాన్నా కూర వండాను ఇంటికి రా.. అంటూ ఆమె అనడం చూసిన తీరు అక్కడి వారిని కంటనీరు పెట్టించింది. 108 అంబులెన్స్‌తో సిబ్బంది వచ్చి గంగరాజు మరణించినట్లు ధ్రువీకరించి, పోలీసులకు సమాచారమిచ్చారు. అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అడ్డతీగల సీహెచ్‌సీకి తరలించారు. -
ఉత్సాహంగా పవర్ లిఫ్టింగ్ పోటీలు
అమలాపురం రూరల్: అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్‌లో 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్, జూనియర్ మెన్ అండ్ ఉమెన్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌న్‌షిప్ పోటీలు కొనసాగుతున్నారయి. మూడో రోజు ఆదివారం ఉమెన్స్ విభాగంలో 52– 57 కిలోలు, మెన్ విభాగంలో 59 – 66 కిలోల కేటగిరీల్లో సబ్ జూనియర్, జూనియర్స్‌కు పోటీలు జరిగాయి. 52 కిలోల సబ్ జూనియర్స్ విభాగంలో నహాదియా ఫాతిమా జాతీయ స్థాయి రికార్డు సాధించారు. అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో సత్తాచాటడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం విజేతలకు ఎమ్మెల్సీతో పాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్న నాయుడు, జెడ్పీటీపీ పందిరి శ్రీహరి రామ్‌గోపాల్, నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.సతీష్ కుమార్, గంధం పల్లంరాజు బహుమతులు అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ చిక్కాల గణేష్, నాయకులు మోకా సు బ్బారావు, గనిశెట్టి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. నేరేళ్లమ్మ గుడిలో చోరీ కాకినాడ రూరల్: సర్పవరంలోని నేరేళ్లమ్మ వారి గుడిలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆ గుడి తాళాలు పగులగొట్టి నాలుగు కిలోల వెండి, రెండు కాసుల బంగారు ఆభరణాలు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. వీటి విలువ సుమారు రూ.14 లక్షలు ఉంటుందని అంచనా. కోడలిపై లైంగిక వేధింపులు అయినవిల్లి: కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వై.జ్యోతి తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. ఎస్.మూలపాలేనికి చెందిన ఓ యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. నెల రోజుల కిందట ఆమె అత్తారింటికి వచ్చింది. ఈ నెల 3న రాత్రి ఆమె స్నానాల గదికి వెళ్లింది. ఆ సమయంలో తన మామయ్య లైంగిక వేధింపులకు పాల్పడగా, ఆమె గట్టిగా కేకలు వేయడంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. గోదావరిలో యువకుడి మృతి దేవీపట్నం: పూడిపల్లి పంచాయతీ పోశమ్మగండి వద్ద గోదావరిలో ఓ యువకుడు మృతి చెందాడు. గండేపల్లి మండలం కె.గోపాలపురం గ్రామానికి చెందిన గోపాల సతీష్ (25) ఇద్దరు స్నేహితులతో కలసి గండిపోశమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఉదయం స్నేహితులతో కలసి గోదావరి స్నానం చేస్తుండగా, సతీష్ కాలుజారి గోదావరిలో గల్లంతయ్యాడు. దేవీపట్నం ఎస్సై షరీఫ్ స్థానిక మత్స్యకారుల సహాయంతో గాలింపు చేపట్టారు. ఈ మేరకు ఆ యువకుడి మృతదేహం లభ్యం అయ్యింది. పురుగు మందు తాగి .. మలికిపురం: ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సురేష్ కథనం ప్రకారం.. గుడిమెళ్లంకలో టెంట్ సామాన్ల వ్యాపారం చేసే తోట మాణిక్యం (60) ఇంటి వద్ద వంతెన నిర్మాణ విషయమై తోట వీరవెంకట సత్యనారాయణ తదితరులకు వివాదం నడుస్తుంది. ఈ నెల 6న వీరవెంకట సత్యనారాయణ తదితరులు బలవంతంగా వంతెన నిర్మించడంతో మాణిక్యం మనస్తాపానికి గురై 13న పురుగు మందు తాగాడు. మాణిక్యాన్ని అమలాపురం కిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ 16న మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. డ్రైవర్ దుర్మరణందేవరపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన ఆరుగొల్లు వెంకటేశులు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రామచంద్రపురానికి చెందిన నారాయణమూర్తితో కలసి బొలెరో వాహనంపై వెంకటేశులు డ్రైవర్‌గా హైదరాబాద్ వెళ్లాడు. ఆ వాహనంపై ఏసీల లోడ్ తీసుకుని వస్తుండగా, గోపాలపురం శివారున జీడిగింజల ఫ్యాక్టరీ వద్దకు వచ్చేసరికి లారీ ఢీకొంది. బొలెరో వాహనం నడుపుతున్న వెంకటేశులు అక్కడికక్కడే మృతి చెందాడు. నారాయణమూర్తికి గాయాలయ్యాయి. -
సోమవారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2026
కూటమి కట్టి..చెరువును చెరబట్టి..● కోరుమామిడి ఆవ చెరువులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు ● 7 రోజులు.. 2 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలకే అనుమతి ● రోజూ వందల లారీలు, ట్రాక్టర్లలో తరలింపు ● రూ.లక్షలు కొల్లగొడుతున్న అక్రమార్కులునిడదవోలు రూరల్: ‘కూటమి’ కట్టిన అక్రమార్కులు చెరువును చెరబట్టారు.. రాత్రి, పగలు అనే తేడా లేకుండా యంత్రభూతాలతో తూట్లు పొడుస్తూ దొరికినంతా దోచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను అడ్డం పెట్టుకుని.. ఇష్టానుసారం గోతులు పెట్టేస్తున్నారు. అనుమతికి మించి మట్టిని తవ్వి, తరలించేసి, రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. వివరాలివీ.. నిబంధనలను చెరువులో తొక్కి.. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన మట్టపర్తి రవిచంద్రం భార్య సుజాత తన పొలాన్ని మెరక చేసేందుకు మట్టి కావాలంటూ ఇరిగేషన్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గ్రామ శివారున ఉన్న ఆవ చెరువులో రెండు వేల క్యూబిక్ మీటర్ల మట్టిని ఏడు రోజుల పాటు మాత్రమే తవ్వుకోడానికి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ఇరిగేషన్ డీఈ ఈ నెల పదకొండో తేదీన ఆదేశాలిచ్చారు. ఇదే అదునుగా కూటమి నేతలు మట్టి మాఫియా అవతారమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయిన్లతో చెరువును విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. ఆ మట్టిని భారీ వాహనాల్లో తరలిస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. వాస్తవానికి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి మాత్రమే చెరువుల్లో మట్టి తవ్వకాలు చేపట్టాలి. ఆ మట్టిని గట్లను పటిష్టపరచడానికి, గ్రామంలోని అభివృద్ధి పనులకు, లోతట్టు ప్రాంతాలను చదును చేసేందుకు మాత్రమే వినియోగించాలి. కానీ, కూటమి నేతలు నిబంధనలను తుంగలో తొక్కి, చెరువులోని మట్టిని ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత కుమారుడి కనుసన్నల్లో 5 పొక్లెయిన్లతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. సుమారు 50 లారీలు, ట్రాక్టర్లతో వందలాది ట్రిప్పులు వేస్తూ నరసాపురం, భీమడోలు, ఏలూరు పరిసర ప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నారు. లారీకి రూ.3 వేల నుంచి రూ.4 వేలు, ట్రాక్టర్ మట్టికి రూ.800 నుంచి రూ.1,000 వరకూ ఇటుక బట్టీలకు, ఇతర ప్రాంతాల్లోని లే అవుట్లకు విక్రయిస్తున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల అండదండలుండటంతో అడ్డూ అదుపూ లేకుండా మట్టి కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి దోపిడీ మళ్లీ మొదలు గతంలో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు–చెట్టు పథకం కింద చెరువుల అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లకు టెండర్ల పద్ధతిలో కట్టబెట్టగా.. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ నేతలే ఈ పనులు చేపట్టి మట్టి దోపిడీకి పాల్పడేవారు. మళ్లీ రెండేళ్లుగా అధికారంలో ఉండటంతో ఇప్పుడు కూటమిగా ఏర్పడి టీడీపీతో పాటు జనసేన నాయకులు మట్టి దోపిడీ మొదలు పెట్టేశారు. కన్నెత్తి చూడని అధికారులు ఆవ చెరువు అభివృద్ధి పనులను ఎర్రకాలువ ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. రైతుల పొలాలను మెరక చేసేందుకు మాత్రమే అనుమతులిచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ, ఆ ముసుగులో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు, అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కళ్లెదుటే అక్రమంగా మట్టిని తరలిస్తున్నా రెవెన్యూ యంత్రాంగం కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. కూటమి నేతల ఒత్తిళ్లతో ఈ వ్యవహారం తమ పరిధిలోనిది కాదని, ఇరిగేషన్ అధికారులదేనని చెబుతూ స్థానిక రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. ఇప్పటికైనా మట్టి అక్రమ తవ్వకాలకు, తరలింపునకు అడ్డుకట్ట వేయాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మట్టి తవ్వకాలకు నిబంధనలివీ.. మట్టి తవ్వుతున్న ప్రాంతం నుంచి తరలించే వరకూ ఎక్కడా ఎవరి నుంచీ ఎలాంటి అభ్యంతరాలూ ఉండకూడదు. వ్యవసాయ భూముల్లోని మట్టిని తవ్వి, తరలించాలంటే రెవెన్యూ శాఖ అనుమతి తప్పనిసరి. మెరక భూముల నుంచి మట్టిని తవ్వి, తరలించాలంటే గనుల శాఖ అధికారుల నుంచి అనుమతి ఉండాలి. మోటారు వాహన చట్టం ప్రకారం మట్టి తరలించే వాహనానికి అన్ని అనుమతులూ ఉండాలి. డ్రైవర్‌కు లైసెన్స్ తప్పనిసరి. మట్టి గడ్డలు బయటకు కనిపించకుండా బరకాలు కప్పి తరలించాలి. మట్టి రవాణా వల్ల రహదారులు దెబ్బ తింటే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవచ్చు. భూమి మార్పిడికి రైతులు తప్పనిసరిగా రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. -
నర్సరీల్లో ముంబై హైకోర్టు మాజీ సీజే
కడియం: ముంబై హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, మహారాష్ట్ర ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ సునీల్ శుక్రే కుటుంబ సమేతంగా కడియం నర్సరీలను సందర్శించారు. అక్కడి వైవిధ్యభరితమైన మొక్కలను ఆసక్తిగా తిలకించారు. తొలుత నర్సరీకి చేరుకున్న జస్టిస్ శుక్రేకు రైతులు పి.వెంకటేష్, వినయ్ బోన్సాయ్ మొక్కను అందించి స్వాగతం పలికారు. ప్రకృతి పరిరక్షణలో నర్సరీల పాత్ర అత్యంత కీలకమని ఈ సందర్భంగా జస్టిస్ శుక్రే చెప్పారు. పుట్టినప్పుడేనా.. ఏటా డబ్బులిస్తారా? ● జనాభా పెంచాలనడం చంద్రబాబు పిచ్చి సూత్రం ● ఎమ్మెల్యే పండుల రవీంద్రబాబు కాకినాడ రూరల్: మూడో, నాలుగో సంతానాన్ని కంటే డబ్బులిస్తామని ప్రకటించిన చంద్రబాబు.. వాటిని బిడ్డ పుట్టినప్పుడు మాత్రమే ఇస్తా రా లేక ప్రతి ఏటా ఇస్తారా అని వైఎస్సార్ సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు నిలదీశారు. కాకినాడలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పేద కుటుంబంలో మూడు నాలుగుసార్లు గర్భం ధరించే తల్లుల బాధలు చంద్రబాబుకు పట్టవా అని ప్రశ్నించారు. ఇద్దరు పిల్లల్ని కనడమే కష్టమైన పేదలకు.. అదనంగా పిల్లలను కనడం ఇంకెంత కష్టమో తెలియదా అని నిలదీశారు. పేదరికంలో ఉన్న తల్లుల్లో 40 శాతం మంది రక్తహీనతతో బాధ పడుతున్నారని, పిల్లల్ని కంటే వారి ఆరోగ్య పరిస్థితి మాటేమిటని ప్రశ్నించారు. రూ.30 వేలు, రూ.40 వేల కోసం పిల్లల్ని కంటే తరువాత వారిని ప్రభుత్వం చూస్తుందా అని మండిపడ్డారు. జనాభా పెంచాలనడం చంద్రబాబు పిచ్చి సూత్రమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనంగా పిల్లల్ని కనండనడంలో శాసీ్త్రయత లేదన్నారు. అశాసీ్త్రయమైన సిద్ధాంతాలను వ్యాప్తి చేసి ప్రజలను అయోమయానికి గురి చేయొద్దని కోరారు. ‘మూడో, నాలుగో సంతానం సూత్రాన్ని మీ కుటుంబంలో లోకేష్‌కు ఎందుకు చెప్పరు’ అని ప్రశ్నించారు. అలా కంటే లోకేష్ అందరికీ ఆదర్శంగా ఉంటారని రవీంద్రబాబు చెప్పారు.సీతారాములకు ప్రత్యేక సింహాసనం అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని నిత్య కల్యాణానికి పెళ్లి పెద్దలుగా వ్యవహరించే క్షేత్ర పాలకులు సీతారాములకు ఎట్టకేలకు ప్రత్యేక సింహాసనం సమకూరింది. ఆలయ అర్చకుడు కంచిభట్ల రామ్‌కుమార్ సీతారాముల కోసం రూ.50 వేలతో టేకు సింహాసనాన్ని తయారు చేయించి, ఈఓ నల్లం సూర్యచక్రధరరావుకు ఆదివారం అప్పగించారు. సత్యదేవుని నిత్యకల్యాణం సమయంలో ఒకే సింహాసనంపై సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను, వారి దిగువన సీతారాముల విగ్రహాలను ఉంచి కల్యాణం నిర్వహించేవారు. దీంతో, సత్యదేవుడు, అమ్మవారికి పోసే తలంబ్రాలు దిగువన ఉన్న సీతారాముల విగ్రహాల మీద పడేవి. పెళ్లిపెద్దలను ప్రత్యేకంగా గౌరవించాలే తప్ప ఇలా చేయడం అపచారమని భక్తులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని 2024 జూన్‌లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ మేరకు అప్పటి ఈఓ, ప్రసుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ సత్యదేవుని నిత్యకల్యాణంలో సీతారాములను మరో ఆసనంపై విడిగా ప్రతిష్ఠించాలని ఆదేశించారు. అప్పటి నుంచీ అదేవిధంగా చేస్తున్నారు. సీతారాముల ఉత్సవమూర్తుల వెనుక అలంకరించేందుకు వ్రత పురోహిత సంఘం వెండి మకరతోరణం తయారు చేయించి 2025లో సమర్పించింది. ఇప్పుడు అర్చకుడు రామ్‌కుమార్ దాతృత్వంతో సీతారాములకు టేకు సింహాసనం కూడా సమకూరింది. గణపయ్యకు గణనీయ సేవలు అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామి వారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యాన స్వామి వారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. లఘున్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాల్లో 24 మంది భక్త దంపతులు పాల్గొన్నారు. 11 మంది భక్తులు గరిక పూజ నిర్వహించారు. 10 మంది భక్తులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు. ఎనిమిది మంది వాహన పూజలు చేయించుకున్నారు. వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా స్వామివారికి రూ.2,90,554 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
ప్చ్.. అదే అనిశ్చితి
● జోరందుకోని పొగాకు మార్కెట్ ● నాణ్యత దెబ్బ తింటుందని రైతుల ఆందోళన ● ఇప్పటి వరకు 18.12 లక్షల కిలోల విక్రయాలు దేవరపల్లి: పొగాకు మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతోంది. కొనుగోళ్లు ప్రారంభించి 50 రోజులు కావస్తున్న గిట్టుబాటు ధర రాకపోవడంతో సన్న, చిన్నకారు, కౌలు రైతులు నలిగిపోతున్నారు. సాగు పెట్టుబడికి తెచ్చిన అప్పుల వడ్డీలు పెరుగుతూండటం, బంటాలకు సొమ్ము చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆందోళన చెందుతున్నారు. అప్పుల భారం పెరిగిపోవడంతో చిన్న రైతులు అయినకాడికి అమ్మి, సొమ్ము చేసుకుని, ఆకు రెలుపు, క్యూరింగ్ బంటాలకు, గ్రేడింగ్ కూలీలకు సరిపెడుతున్నారు. క్యూరింగ్‌లు పూర్తి కావడంతో రైతులు గ్రేడింగ్ చేసి వర్జీనియా పొగాకును మండెలు వేసి, నిల్వ చేశారు. అయితే, మండెల్లో ఎక్కువ రోజులు ఉండటం వల్ల పొగాకు రంగు మారి, నాణ్యత దెబ్బ తింటుందని ఆందోళన చెందుతున్నారు. ఈ ఒడ్డున పడటం కష్టమేనని పలువురు పొగాకు రైతులు అంటున్నారు. రూ.473.03 కోట్ల పొగాకు అమ్మకం ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లు మార్చి 25న ప్రారంభించారు. రీజియన్‌లోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి రూ.473.03 కోట్ల విలువైన 18,12,397 కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. వేలం కేంద్రాలకు శనివారం 633 బేళ్లు అమ్మకానికి రాగా, 317 తిరస్కరించి, 316 కొనుగోలు చేశారు. వేలానికి తెస్తున్న బేళ్లలో 50 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. దేవరపల్లి వేలం కేంద్రంలో 87 బేళ్లకు 65, జంగారెడ్డిగూడెం–1లో 170కి 84, జంగారెడ్డిగూడెం–2లో 123కు 64, కొయ్యలగూడెంలో 135కు 45, గోపాలపురం వేలం కేంద్రంలో 118 బేళ్లకు గాను 58 మాత్రమే కొనుగోలు చేశారు. మొత్తం 25 కంపెనీలకు గాను, 12 కంపెనీలు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వగా, వీటిలో ఆరు కంపెనీలు వేలంలో పాల్గొని మొక్కుబడిగా బేళ్లను కొనుగోలు చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలం కేంద్రాల వారీగా ఇప్పటి వరకు జరిగిన పొగాకు కొనుగోళ్లు వేలం కేంద్రం విక్రయాలు గరిష్ట ధర సగటు ధర (కిలోలు) (రూ.) (రూ.) దేవరపల్లి 2,78,369 265 262.86 జంగారెడ్డిగూడెం–1 5,00,280 265 261.00 జంగారెడ్డిగూడెం–2 3,70,340 265 261.49 కొయ్యలగూడెం 2,98,364 265 259.69 గోపాలపురం 3,65,041 265 261.44 కొనుగోలు సంస్థలు రాక.. టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లోని పలువురు రైతుల నుంచి బడా కంపెనీలు సుమారు లక్ష కిలోల పొగాకును సేకరించి, నెల రోజుల క్రితం విదేశీ కొనుగోలు సంస్థలకు శాంపిల్స్ పంపించాయి. అయినప్పటికీ ఇంతవరకూ ఎగుమతి ఆర్డర్లు రాలేదు. పంట కొనుగోలుకు కొనుగోలు సంస్థలు ముందుకు రావడం లేదని సమాచారం. ఒకవైపు కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లు ముగియకపోవడం, విదేశీ కస్టమర్ల నుంచి ఆర్డర్లు ఖరారు కాకపోవడం వంటి కారణాలతో మన ప్రాంతంలోని పొగాకు కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. -
ఏడడుగుల బంధం వీడిపోయింది
రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లెదుటే భార్య మృతి రంగంపేట: ఏడడుగుల బంధం వీడిపోయింది.. ఆ అన్యోన్య జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. శుభకార్యానికి వెళ్తున్న ఆ దంపతుల ఆనందం ఆవిరైపోయింది. రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లెదుటే భార్య మృతి చెందడం తీరని విషాదాన్ని నింపింది. దీనిపై స్ధానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రంగంపేట మండలం వడిశలేరు గ్రామానికి చెందిన పోతుల వీర్రాజు, రామలక్ష్మి (55) దంపతులు. ఆదివారం రంగంపేటలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు మోటార్ సైకిల్‌పై తమ ఇంటి నుంచి బయలుదేరారు. సుమారు 11.40 గంటల సమయానికి గ్రామం నుంచి ఏడీబీరోడ్డు వైపు వెళుతూ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి ఎదురుగా వచ్చిన వ్యాన్ వీరు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్‌ను ఢీకొంది. దీంతో వెనుక కూర్చున్న రామలక్ష్మి రోడ్డుపై పడిపోవడంతో వ్యాన్ వెనుక చక్రాలు ఆమె తలపై నుంచి వెళ్లిపోయాయి. రామలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై భర్త వీర్రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివప్రసాద్ చెప్పారు. రామలక్ష్మి మృతితో ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. -
సమస్యలపై పోరుబాట
ఫ 20న మెడికల్ షాపుల బంద్ ఫ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూతపడనున్న దుకాణాలు ఫ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ రాయవరం: మెడికల్ షాపుల యజమానులు పోరుబాట పట్టారు. ఔషధాల విక్రయాల్లో సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత కెమిస్ట్, డ్రగ్గిస్టుల సంఘం (ఏఐఓసీడీ) పిలుపు మేరకు ఈ నెల 20న దేశ వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ పాటిస్తున్నారు. దీంతో బుధవారం తూర్పు గోదావరి జిల్లాలోని సుమారు 2,850, కాకినాడ జిల్లాలో 1,518, కోనసీమలో 950, మెడికల్ షాపులు మూత పడనున్నాయి. అత్యవసర మందులు వినియోగించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సంఘం ప్రతినిధులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో రిటైల్, డీలర్ల విక్రయాలపై ప్రభావం పడుతుందని, రోగులకు నకిలీ మందులు అందుతున్నాయని మెడికల్ షాపుల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవీ మెడికల్ షాపుల యజమానులు ప్రధానంగా మూడు డిమాండ్ల పరిష్కారానికి బంద్ పాటిస్తున్నారు. వీటితో పాటు స్థానిక సమస్యలను తీర్చాలని ఏఐఓసీడీ డిమాండ్ చేస్తోంది. ఆన్లైన్ ద్వారా ఔషధాల విక్రయాలను నిలిపివేయాలని, కార్పొరేట్ కంపెనీలు భారీ డిస్కౌంట్లను ఆపాలని, నకిలీ మందులను అరికట్టాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. డిస్కౌంట్ల పేరుతో.. కార్పొరేట్ సంస్థలు డిస్కౌంట్ల పేరుతో అమ్మకాలు చేస్తూ భారీ కుతంత్రానికి పాల్పడుతున్నాయన్నది ఏఐఓసీడీ ప్రతినిధుల ఆరోపణ. డ్రగ్ లైసెన్స్ అథారిటీ లేని బలం, విటమిన్స్ తదితర అన్ బ్రాండెడ్ ఔషధాలపై అధిక ధరలను ముద్రించి డిస్కౌంట్ పేరిట ధరలను కొద్దిమేర మాత్రమే తగ్గిస్తూ కొనుగోలు దారులను కార్పొరేట్ కంపెనీలు మోసగిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అలాగే మెడికల్ షాపుల నిర్వహణలో స్థానిక అధికారుల వేధింపులను నియంత్రించాలని, మెడికల్ షాపుల లైసెన్సు జారీని సులభతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యవసర చర్యలు అవశ్యం తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 2,820 మెడికల్ షాపులు, డీలర్ ఏజెన్సీలు ఉన్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.6 కోట్ల విక్రయాలు జరుగుతాయని అంచనా. దీనికి ఆన్లైన్ కొనుగోలు అదనం. అఖిల భారత కెమిస్ట్, డ్రగ్గిస్ట్ సమాఖ్య పిలుపు మేరకు ఈ నెల 20న జిల్లాలోని మెడికల్ షాపులన్నీ మూతపడనున్నాయి. దీంతో అత్యవసర ఔషధాల కోసం ఆ రోజున ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర మందుల కోసం కనీసం ఒక్కో చోటైనా మెడికల్ షాపులు తీసి ఉంచే విధంగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. సామాజిక బాధ్యతగా ఒక్కో దుకాణాన్ని తెరిచేందుకు సంఘం అనుమతిస్తుందా? లేక సంపూర్ణ బంద్ పాటిస్తారా? అనేది వేచి చూడాలి. కాగా రోజువారీగా వినియోగించే ఔషధాలతో ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి రిటైల్ మందుల షాపుల యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కార్పొరేట్ కంపెనీలు డిస్కౌంట్ల పేరుతో అమ్మకాలు చేస్తూ పరోక్షంగా ప్రజలను మోసగిస్తున్నారు. మా బాధలను చెప్పుకొనేందుకే బంద్ పాటిస్తున్నాం. –పులగం శ్రీనివాసరెడ్డి, మందుల షాపు యజమాని, రాయవరం మరింత భారంగా నిర్వహణ ఆన్లైన్ కొనుగోళ్ల కారణంగా ప్రజలకు నాసిరకం మందులు అందుతున్నాయి. ఫలితంగా వారి ఆరోగ్యంపై దుష్ఫ్రభావం చూపుతుంది. రిటైల్ విక్రయాలు తగ్గడంతో స్థానికంగా మెడికల్ షాపుల నిర్వహణ భారంగా మారుతుంది. న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి చేపట్టిన బంద్‌కు ప్రజలు సహకరించాలి. –పిండి గణపతి, ప్రధాన కార్యదర్శి, తూర్పు గోదావరి డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యలివీ.. ఫ ఆన్లైన్లో ఔషధాల విక్రయాల వల్ల రిటైల్ మందుల షాపుల్లో విక్రయాలు తగ్గి కుదేలవుతున్నాయన్నది మెడికల్ షాపుల యజమానుల వాదన. డీలర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఏఐఓసీడీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఆన్లైన్ ద్వారా నిషేధిత, పరిమితికి మించిన ఔషధాల కొనుగోలు, ఒకే ప్రిస్కిప్షన్‌ను పలుమార్లు రిపీట్ చేస్తూ నిద్రమాత్రలు ఇవ్వడంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. ఫ ఆన్లైన్ విక్రయాలకు 2018 ఆగస్టు 28న కేంద్ర ప్రభుత్వం ఈ– ఔషధ పేరిట జారీ చేసిన జీఓ 817(ఎఫ్), అలాగే 2020 మార్చి 23న జారీ చేసిన 220 (ఈ) నోటిఫికేషను రద్దు చేయాలి. కరోనా సమయంలో ఇచ్చిన ఈ తాత్కాలిక జీఓను రద్దు చేయకుండా నేటికీ కొనసాగిస్తున్నారని, ఆ జీఓ మేరకు ఆన్లైన్లో మందులు విక్రయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
టిప్పర్ ప్రమాదంలో 5కు చేరిన మరణాలు
జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మహిళ మృతి కాకినాడ రూరల్: కొవ్వూరు వంతెన వద్ద శనివారం జరిగిన టిప్పర్ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. చీడిగ గ్రామానికి చెందిన ఉపాధి హామీ మహిళా కూలీలు శనివారం ఉదయం పనికి వెళ్లి, కాకినాడ బైపాస్ రోడ్డుపై కొవ్వూరు వంతెన వద్ద ఆన్లైన్లో మస్టర్లు వేస్తుండగా.. అత్యంత వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టి నలుగురు మృతి చెందిన సంగతి విదితమే. ఈ ప్రమాదంలో గాయపడిన మట్టపర్తి అరుణ కుమారి (52) కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. ఆమె భర్త గోవిందు గతంలో మృతి చెందాడు. ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లయ్యాయి. వారి వద్దనే అరుణ కుమారి ఉంటుంది. ఇటీవలే గుండె సంబంధిత వైద్యం చేయించుకున్న ఆమె.. కుటుంబ పోషణ కోసం ఉపాధి పనులకు వెళ్తోంది. ఈ క్రమంలో ప్రమాదం జరిగి, మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అరుణ కుమారి మృతదేహానికి జీజీహెచ్ వద్ద ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో మహిళా కూలీ పాలిక నాగమణి అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురి కుటుంబాలకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచింది. ప్రమాదం జరిగిన వెంటనే మాజీ మంత్రి, ఆ పార్టీ కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు జీజీహెచ్‌లో మృతుల కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ జిల్లా కార్యదర్శి, చీడిగ గ్రామ నాయకుడు కొప్పిశెట్టి గణేష్ ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున మొత్తం ఐదుగురికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకూ కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. -
టిప్పర్ ప్రమాద బాధితులకు తక్షణ ఆర్థిక సాయం
● ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్ ● జీజీహెచ్‌లో క్షతగాత్రులకు పరామర్శ సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ రూరల్ కొవ్వూరు బైపాస్ రోడ్డులో శనివారం జరిగిన టిప్పర్ ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి కూలీల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఆర్థిక సాయం అందజేయాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ డిమాండ్ చేశారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించి, ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మృతుల కుటుంబాలు నిరుపేద, బడుగు వర్గాలకు చెందిన వారు కావడంతో, ప్రభుత్వం ఉదారంగా, మానవతా దృక్పథంతో తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలని కోరారు. క్షతగాత్రులకు ఎలాంటి లోటూ లేకుండా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఘోర ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు రోడ్డు భద్రత విషయంలో అధికారులు అత్యంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలు చేపట్టాలని బోస్ సూచించారు. -
ఎమ్మెల్యే ఒత్తిడితోనే అక్రమ అరెస్టులు
● బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం ● కుట్ర రాజకీయాలపై న్యాయపోరాటం చేస్తాం ● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి వెల్లడి రంగంపేట: దొడ్డిగుంట, వెంకటాపురం, ముకుందవరం, సుభద్రంపేట గ్రామాలకు సంబంధించి గత నెల 29న జరిగిన ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికలకు ముందు రోజున ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒత్తిడితోనే పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆరోపించారు. అక్రమంగా అరెస్టయిన బాధితుల కుటుంబ సభ్యులను శనివారం రాత్రి ఆయన పరామర్శించి, ధైర్యం చెప్పారు. దొడ్డిగుంట గ్రామానికి చెందిన మడికి వెంకట్రావు భార్య, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు మడికి లక్ష్మిని, చెల్లుబోయిన వీరబాబు భార్యను, అడబాల వీరబాబు భార్య గంగాబేబీని, చెల్లుబోయిన సత్తిబాబు కుటుంబ సభ్యులను, అడబాల సత్యనారాయణ తండ్రి అడబాల దుర్గారావును పరామర్శించారు. బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే, ఎమ్మెల్యే ఒత్తిడితో అక్రమ కేసుకు గురైన వెంకటాపురం తాజా మాజీ సర్పంచ్ ముంగి గంగరాజు కుటుంబ సభ్యులను కూడా డాక్టర్ సూర్యనారాయణరెడ్డి పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిషర్మెన్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతోనే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. తమ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయించారని మండిపడ్డారు. పోలీసులు సైతం అధికార పార్టీకి తొత్తులుగా మారి, ఉద్దేశపూర్వకంగా కఠిన సెక్షన్లు పెట్టి, వారిని రిమాండ్‌కు పంపడం చాలా అన్యాయమని పేర్కొన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, బాధితులకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకూ పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు, మాగాపు వెంకటరమణ, మాగాపు కాశి, ముంగి లక్ష్మీనారాయణ, అంచురి ఏసుబాబు, మాజీ ఉప సర్పంచ్ అంచురి శ్రీను, ఎంపీటీసీ సభ్యుడు నురుకుర్తి సత్తిబాబు, మాజీ సర్పంచ్ కారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. -
తలుపులమ్మకు ప్రణమిల్లి
లోవకు పోటెత్తిన భక్తులు తుని రూరల్: కోరిన కోర్కెలు తీర్చే లోవ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో సుమారు 28 వేల మంది భక్తులు వచ్చారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పటికీ సాయంత్రం వరకూ కిటకిటలాడింది. సాయంత్రం ఆరు గంటలకు దర్శనాల వేళ ముగిసినా, తిరుగు ప్రయాణాలతో వాహనాల రద్దీ కనిపించింది. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,38,630, పూజా టిక్కెట్లకు రూ.4,27,580, తలనీలాలకు రూ.10,600, వాహన పూజలకు రూ.13,050, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదులు అద్దెలు రూ.89,053, విరాళాలు రూ.9,043 వెరసి మొత్తం రూ.7,87,956లు ఆదాయం సమకూరిందని కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. -
ఏకాంత వీడియోలతో.. భర్త బ్లాక్ మెయిల్
సాక్షి, విజయవాడ: తన భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుని తనని చంపడానికి యత్నిస్తున్నాడని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మహిళ.. విజయవాడ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజమండ్రిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళలతో ఏకాంతంగా ఉన్న వీడియోలు చిత్రీకరిస్తున్నాడని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వీడియోలు అడ్డం పెట్టుకుని మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధిత మహిళ తెలిపింది.‘‘నా భర్తను 2017లో ప్రేమ వివాహం చేసుకున్నాను. రెండేళ్లు నన్ను భాగానే చూసుకున్నాడు. పెళ్లికి ముందు నుంచి అక్రమ సంబంధాలు ఉన్నాయని నాకు తెలిసింది. వ్యాపారం పేరుతో నా దగ్గర 100 గ్రాముల బంగారం, రూ.60 లక్షలు బ్యాంకు లోన్లు, రెండు ప్లాట్స్ తీసుకున్నాడు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 50 మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. ..అమ్మాయిలతో ఏకాంతంగా ఉన్న వీడియోస్ తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నాతో ఉన్న వీడియోలు తీసుకుని కూడా బ్లాక్ మెయిల్ చేశాడు. మే 4 తేదీన నన్ను కొట్టాడు. నన్ను చంపుతానని బెదిరించాడు. ఆయనకు భయపడి నేను పారిపోయి వచ్చాను. నాకు నా భర్తతో ప్రాణహాని ఉంది. విజయవాడ మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లెంట్ ఇచ్చాను. న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నాను’’ ఆమె పేర్కొంది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రంగంపేట: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్టు ఎస్సై శివప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం కాకినాడ ప్రతాప్ నగర్‌కు చెందిన మారోజు భాస్కర్ (24) శుక్రవారం అర్ధరాత్రి వడిశలేరు నుంచి తన మోటార్ సైకిల్‌పై కాకినాడ వెళ్తున్నాడు. రంగంపేట సమీపాన చాగల్నాడు కాలువ వద్దకు వచ్చేసరికి మోటార్ సైకిల్ అదుపు తప్పి అతడు కాలువలో పడిపోయి, అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి సూరిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. యువకుడిపై పోక్సో కేసు ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): స్థానిక సిమెంటరీ పేటకు చెందిన 14 ఏళ్ల బాలికను ఏడిపిస్తున్న గొట్టేటి రాకేష్‌పై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం పోక్సో కేసు నమోదైంది. బాలిక ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్సై ప్రతాప్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐసెట్‌లో వైష్ణవి స్టేట్ ఫస్ట్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఐసెట్‌లో కాకినాడ విద్యార్థిని పట్నాల వైష్ణవి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆమె విద్యాంజలి పాఠశాలలో పదో తరగతి (సీబీఎస్ఈ), ఆదిత్య కళాశాలలో ఇంటర్మీడియెట్ (ఎంఈసీ), సంజీవ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చదివింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడం తన లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పింది. సమాజంలోని సమస్యలను గుర్తించి, వాటికి వినూత్న పరిష్కారాలు లేదా ఉత్పత్తులు అందించాలని భావిస్తున్నట్టు చెప్పింది. ఆమె తండ్రి మోహనరావు కన్స్ట్రక్షన్ ఆఫీసులో అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. తల్లి సత్యవతి గృహిణి. వైఎస్సార్ సీపీలో పలు నియామకాలుసాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా కమిటీలలో జిల్లాకు చెందిన పలువురికి అవకాశం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరిని నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అఫిలెటెడ్ వింగ్ కమ్యూనిటీస్‌లో రాష్ట్ర బీసీ సెల్ జనరల్ సెక్రటరీలుగా మేడిశెట్టి దుర్గారావు(మండపేట), కుడుపూడి రాంబాబు(మండపేట), రాష్ట్ర ఎస్సీసెల్ జనరల్ సెక్రటరీగా వల్లూరి రామకృష్ణ (మండపేట), రాష్ట్ర ఎస్సీసెల్ జాయింట్ సెక్రటరీగా మాత మురళి (రామచంద్రపురం), రాష్ట్ర యూత్ వింగ్ సెక్రటరీగా సలాది సత్యనారాయణమూర్తి (అమలాపురం)లను నియమించారు. ఆర్టీఐ వింగ్జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొల్లు త్రినాథవర్మ (అమలాపురం), మండల పార్టీ కమిటీ కాట్రేనికోన మండల జనరల్ సెక్రటరీగా మల్లాడి వీరబాబ్జి (ముమ్మిడివరం) నియమితులయ్యారు. -
అప్పలరాజుపేట వద్ద పులి సంచారం
రాజవొమ్మంగి: మండలంలోని అప్పలరాజుపేట సమీపాన ఏపీ ఫారెస్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) పెంచుతున్న యూకలిప్టస్ వనాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. పులి మెడలోని ట్రాకర్ ద్వారా అందిన శాటిలైట్ సమాచారాన్ని బట్టి శనివారం వేకువజామున 5 గంటలకు, తిరిగి ఉదయం 9 గంటలకు యూకలిప్టస్ వనాల్లో పులి సంచరించిందని స్థానిక అటవీ క్షేత్రాధికారి ఉషారాణి తెలిపారు. తోటి అధికారులు, సిబ్బందితో పాటు పరిశీలించగా.. ఆ ప్రాంతంలో పులి పాదముద్రలు స్పష్టంగా కనిపించాయని ‘సాక్షి’కి చెప్పారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా అడవికి వెళ్లరాదంటూ అప్పలరాజుపేట, పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు. అడవిలోనికి పశువులను మేతకు తీసుకుని వెళ్లవద్దని ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. ఫారెస్టు సెక్షన్ అధికారి భవాని, బీట్ అధికారులు సూర్యప్రసాద్, ఆనంద్, బేస్ క్యాంపు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కూలిన బతుకులు
● ‘ఉపాధి’ కూలీలపై మృత్యుపంజా ● నలుగురిని బలిగొన్న టిప్పర్ ● విషమంగా మరో ఇద్దరి పరిస్థితి ● చీడిగలో విషాద ఛాయలు సాక్షి ప్రతినిధి, కాకినాడ/కాకినాడ క్రైం: తెల్లారకుండానే పొట్టకూటి కోసం వెళ్లిన ఆ ఉపాధి కూలీల బతుకులు తెల్లారిపోయాయి. కాకినాడ రూరల్ కొవ్వూరు బైపాస్ వంతెన వద్ద శనివారం ఉదయాన్నే అతి వేగంగా వచ్చిన టిప్పర్.. ఉపాధి కూలీల మీద నుంచి దూసుకుపోవడంతో నలుగురు మహిళలు సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. సంఘటన స్థలంలో రక్తమోడుతూ చెల్లాచెదురుగా పడి ఉన్న మహిళల మృతదేహాలను చూసి స్థానికులు, తోటి శ్రామికులు, చూపరులు కంట తడి పెట్టుకున్నారు. సెల్ సిగ్నల్ లేక రోడ్డు పైకి.. కాకినాడ రూరల్ చీడిగ గ్రామం నుంచి రోజూ మాదిరిగానే మూడు బృందాలుగా సుమారు 60 మంది కూలీలు శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కొవ్వూరు చేరుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద కొవ్వూరు వద్ద పంట కాలువలో పూడికతీత పనులకు వచ్చారు. వారు పని చేస్తున్న ప్రాంతంలో మస్టర్ వేసేందుకు సెల్ సిగ్నల్ అందుబాటులో లేదు. దీంతో, ముందుగా రోడ్డు పైనే మస్టర్లు తీసుకుని, తరువాత పనుల్లో పాల్గొంటున్నారు. మస్టర్లు రికార్డు చేసి, ఫొటోలు తీసుకునేందుకు ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రబాబు కూలీలను కొవ్వూరు వంతెన వద్దకు పిలిచాడు. రెండు బృందాల మస్టర్లు పూర్తయ్యాయి. అదుపు లేని వేగంతో.. మూడో బృందంలో 20 మందికి మస్టర్లు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఓ లే అవుట్లో గ్రావెల్ లోడ్ దించి, తూరంగి వైపు నుంచి చీడిగ వైపు ఓ టిప్పర్ వేగంగా వచ్చింది. మస్టర్లు పూర్తయిన 12 మందిని దాటి, తరువాత ఉన్న ఎనిమిది మంది పైకి అదుపు లేని వేగంతో దూసుకు వచ్చింది. ప్రమాదాన్ని గమనించి అప్రమత్తమైన గుడివాడ వీరమణి, దెయ్యాల గణికమ్మ రోడ్డు పక్కకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారు. మిగిలిన ఆరుగురిలో కాదా చిట్టెమ్మ, వాసంశెట్టి సత్యవతి, పాలిక కృష్ణవేణి, చెల్లూరు అన్నవరం సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మట్టపర్తి అరుణకుమారి, పాలిక నాగమణి తీవ్రంగా గాయపడ్డారు. నాగమణి కాకినాడ జీజీహెచ్‌లో, అరుణకుమారి మెయిన్ రోడ్డులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నలుగురు మృతుల దేహాలు టిప్పర్‌కు, రోడ్డు మార్జిన్‌లోని ఇనుప గడ్డర్లతో ఉన్న రెయిలింగ్‌కు మధ్య నలిగిపోయి, నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాద తీవ్రతను చూసి, అక్కడే వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులు, కూలీలు భీతావహులయ్యారు. పని చేస్తున్న చోటనే సెల్‌ఫోన్ సిగ్నల్స్ వచ్చి ఉంటే.. అసలు ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీజీహెచ్‌లో ఆందోళన నలుగురు మహిళల మృతదేహాలకు జీజీహెచ్‌లో పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ జీజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. మృతుల అంత్యక్రియలకు రూ.25 వేలు చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించామని ఆర్డీఓ మల్లిబాబు తెలిపారు. బాధితు కుటుంబాలను జీజీహెచ్‌లో వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు పరామర్శించి, ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. డ్రైవర్ మద్యం మత్తే కారణమా! డ్రైవర్ డోలా నాగరాజు మద్యం మత్తులో టిప్పర్ నడపడం వల్లనే నాలుగు నిండు ప్రాణాలు బలైపోయాయని, ఈ ప్రమాదం నుంచి బతికి బయట పడిన కూలీలు విలపించారు. మద్యం మత్తులో ఉన్నందువల్లనే ఎడమవైపు వెళ్తున్న టిప్పర్‌ను డ్రైవర్ ఒక్కసారిగా కుడివైపు తిప్పేశాడని, అందువల్లనే ఇంతటి ఘోరం జరిగిందని చెబుతున్నారు. ప్రమాదం అనంతరం ఇక్కడ ప్రమాదం జరిగిందా అంటూ తూలిపోతూ డ్రైవర్ నాగరాజు తమను ఎదురు ప్రశ్నించాడని స్థానిక కూలీలు తెలిపారు. డ్రైవర్ నాగరాజు మద్యం తాగి నిర్లక్ష్యంగా, అతి వేగంగా టిప్పర్‌ను నడపటమే ప్రమాదానికి కారణమని పోలీసులు కూడా తొలుత చెప్పారు. అయితే, ప్రమాదానికి అసలు కారణాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించ లేదు. -
మద్యానికి బానిసై.. అనుమాన భూతానికి వశమై..
● కన్న కుమార్తెను బలి తీసుకున్న తండ్రి ● నాలుగేళ్ల చిన్నారిని బావిలో పడేసి హత్య కోరుకొండ: కడుపున పుట్టిన పిల్లలను కంటికి రెప్పలా కాపాడి.. పెంచి పెద్ద చేసి.. ప్రయోజకుల్ని చేయాల్సిన ఆ తండ్రి మద్యానికి బానిసయ్యాడు. అనుమాన భూతానికి వశమయ్యాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడనే విచక్షణ సైతం కోల్పోయి కన్న కుమార్తె నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. కోరుకొండ మండలం గాదరాడలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గాదరాడలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రామవరపు రాజు, ఓ యువతి ప్రేమించుకుని ఏడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. రాజు మూడో తరగతి, ఆమె పదో తరగతి చదువుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. మద్యానికి బానిసైన రాజు.. భార్యపై అనుమానాన్ని పెంచుకున్నాడు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత నుంచి వీరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఆమెను రాజు చిత్రహింసలు పెట్టేవాడు. కూలి పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండటాన్ని తప్పు పట్టిన భార్యను కొట్టేవాడు. ఈ క్రమంలో ఆమె బంధువుల ఇంటికి వెళ్లేది. పెద్దలు జోక్యం చేసుకుని తిరిగి అత్తవారింటికి పంపేవారు. అయితే, దంపతుల మధ్య తిరిగి గొడవలు జరిగేవి. ఏడాది కాలంగా విభేదాలు తీవ్రమవడంతో రాజానగరం మండలం పాలచర్లలోని బంధువుల ఇంటికి ఆమె వెళ్లిపోయింది. మధ్యవర్తుల సలహా మేరకు తమ కుమార్తెలను భర్త వద్దకు పంపించింది. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానాన్ని పెంచుకున్న రాజా.. తనకు పుట్టలేదనే అనుమానంతో పిల్లలిద్దరినీ గురువారం కొట్టాడు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పెద్ద కుమార్తె దూరంగా పారిపోయింది. తన చేతికి చిక్కిన చిన్న కుమార్తె(4)ను ఆ దుర్మార్గుడు ఏమాత్రం కనికరం లేకుండా సమీపంలోని బావిలో పడేశాడు. నీళ్లలో మునిగిపోయి, ఆ చిన్నారి దుర్మరణం పాలైంది. అప్పటికే రాత్రి కావడంతో ఈ ఘాతుకాన్ని స్థానికులు ఆలస్యంగా శుక్రవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. భర్త రాజు తన బాధ్యత మరచి, భార్యపై అనుమానాన్ని పెంచుకోవడంతో పాటు, మద్యానికి బానిసవ్వడంతో ఈ దారుణం జరిగిందని కోరుకొండ సీఐ ఎస్వీవీస్ మూర్తి శనివారం తెలిపారు. నిందితుడిని త్వరలో కోర్టులో హాజరు పరుచుతామని చెప్పారు. -
ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించండి
రాజమహేంద్రవరం సిటీ: ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యాన వీఎల్ పురంలో శనివారం జరిగిన జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్లాస్టిక్‌లోని ప్రమాదకర రసాయనాలు ఆహారంలో చేరడం లేదా మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి ప్రవేశించడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదముందని చెప్పారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించామని చెప్పారు. ప్రజలు కూడా స్టీల్ గ్లాసు, మట్టి వాటర్ బాటిల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ రహిత రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలి రాజమహేంద్రవరం రూరల్: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కలిగిన ప్లాస్టిక్ రహిత రాష్ట్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర (సాసా) కార్యక్రమంలో భాగంగా బొమ్మూరులోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం షెడ్ వద్ద ‘ప్లాస్టిక్ రహిత రాష్ట్రం’ థీమ్‌తో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించిన స్టార్టప్ కార్యక్రమాన్ని 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా పంచాయతీ అధికారి వి.శాంతామణి, డ్వామా పరిపాలనాధికారి కిషోర్ కుమార్, ఎంపీడీఓ సునీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గలీజు బాగోతం
● రాజమహేంద్రవరం నడిబొడ్డున టీడీపీ జిల్లా కార్యాలయానికి ప్రభుత్వ స్థలం ● విలువ రూ.32 కోట్లకు పైగా.. ● 33 ఏళ్ల లీజుకు కేటాయింపు ● ఏడాదికి లీజు రూ.1,000 మాత్రమే.. ● ఆగమేఘాలపై మంత్రిమండలి ఆమోదముద్ర సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ గ‘లీజు’ బాగోతానికి తెర తీసింది. అధికారం ముసుగులో అడ్డగోలు వ్యవహారానికి తెర తీసింది. ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కారుచౌకగా కొట్టేస్తోంది. ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన స్థలాన్ని పార్టీ ప్రయోజనాలకు తాకట్టు పెడుతోంది. రాజమహేంద్రవరం నగరం నడిబొడ్డున రూ.32 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని కాజేసేందుకు స్కెచ్ వేసింది. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగింది. ఆ స్థలంలో విలాసవంతమైన టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఇదీ సంగతి రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ ఆవ రోడ్డులో సర్వే నంబర్ 316/2లో మొత్తం 35 ఎకరాల దేవదాయ శాఖ భూమి ఉండేది. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించే క్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 26 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ పరిధిలోకి తీసుకొచ్చారు. వాటిలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఆ స్థలానికి బదులుగా దేవదాయ శాఖకు వేరేచోట స్థలం కేటాయించారు. ప్రస్తుతం మిగిలి ఉన్న 9 ఎకరాల స్థలం నగర పాలక సంస్థ రెవెన్యూ పరిధిలో ఉంది. ఇందులో రెండెకరాల స్థలాన్ని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి చంద్రబాబు సర్కారు కేటాయించింది. ఏడాదికి కేవలం రూ.1,000 చెల్లించేలా.. 33 ఏళ్ల పాటు లీజుకు ఇంత విలువైన స్థలం కేటాయించేసుకున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఆగమేఘాలపై ఆమోద ముద్ర సైతం వేసినట్టు సమాచారం. ఇంకా పూర్తి స్థాయిలో పరిపాలనాపరమైన అనుమతులు రాకముందే.. టీడీపీ జిల్లా నాయకత్వం ఆ స్థలంలో అట్టహాసంగా శంకుస్థాపన నిర్వహించడం జిల్లావ్యాప్తంగా చర్చకు దారి తీసింది. విలువైన స్థలాన్ని సులువుగా కొట్టేసి.. రూరల్ నియోజకవర్గం నడిబొడ్డున, జాతీయ రహదారికి సమీపాన గజం స్థలం ధర బహిరంగ మార్కెట్లో రూ.35 వేల నుంచి రూ.40 వేలు పలుకుతోంది. తక్కువగా రూ.35 వేలు లెక్కేసుకున్నా.. రెండెకరాలకు సుమారు రూ.32 కోట్లకు పైగా పలికే అవకాశం ఉంది. అంత విలువైన స్థలాన్ని పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి చాలా సులువుగా.. ఏడాదికి కేవలం రూ.1,000 లీజుకు మాత్రమే కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలాసవంతమైన భవన నిర్మాణం ఈ భూమిలో టీడీపీ జిల్లా కార్యాలయాన్ని అత్యంత విలాసవంతంగా నిర్మించేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఇందుకు అవసరమైన డిజైన్‌ను సైతం ఇప్పటికే రూపొందించారు. రెండంతస్తుల్లో భవన నిర్మాణం జరగనుంది. దీని నిర్మాణ పనులకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకట రమణ చౌదరి ఇటీవల శంకుస్థాపన సైతం చేశారు. నిర్మాణ పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అంత ఖరీదైన భూములను సొంత పార్టీ కార్యకలాపాలకు ప్రభుత్వం ధారాదత్తం చేయడంపై అన్ని వర్గాల నుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజా అవసరాలకు వినియోగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. కలెక్టరేట్‌కు స్థల సేకరణపై నిర్లక్ష్యం విభజన అనంతరం నవ్య తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌ను బొమ్మూరు వద్ద ఉన్న న్యాక్ భవనంలో నిర్వహిస్తున్నారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి జాంపేట పోలీస్ గ్రౌండ్ వద్ద స్థలాన్ని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పరిశీలించింది. ఈ ప్రక్రియ చివరి దశకు వచ్చేలోగా.. సార్వత్రిక ఎన్నికలు రావడంతో పెండింగ్‌లో పడిపోయింది. అనంతరం, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే కలెక్టరేట్ శాశ్వత భవన నిర్మాణాలపై రెండేళ్లవుతున్నా దృష్టి పెట్టలేదు. కానీ, పార్టీ కార్యాలయానికి మాత్రం ఆగమేఘాల మీద భూమి కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భూమిలో ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్ అనుబంధ భవనాలు, ప్రజా సేవా కేంద్రాలు నిర్మిస్తే ఎక్కువ మందికి ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైవే సమీపాన ఉన్న ఈ ప్రాంతం ప్రజా అవసరాలకు అనువుగా ఉండగా.. రాజకీయ కార్యాలయాల కోసం వినియోగించడం సరికాదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. -
బ్యాట్ పట్టిన ఆడుపడుచులు
ఫ రాజమహేంద్రవరంలో వేసవి క్రీడా శిక్షణ ఫ ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థినులు ప్రకాశంనగర్ (రాజమహేంద్రవరం): బాలికలు బ్యాట్ పట్టారు.. చదువులో కుస్తీ పట్టిన వారంతా సెలవుల్లో శిక్షణకు ఉత్సాహంగా వచ్చారు.. మహిళా క్రికెట్ జట్టులో తమ సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. రాజమహేంద్రవరం ఉమెన్స్ సబ్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక సీజీటీఎం కళాశాల క్రీడా మైదానంలో క్రికెట్ కోచ్ ఎంఏ హాకీం ఫాషా విద్యార్థినులకు ఉచితంగా క్రికెట్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో సుమారు 42 మంది శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన శిక్షణ 31 వరకూ కొనసాగనుంది. అండర్– 12, 15, 19, సీనియర్స్ విభాగంలో ఉదయం 6 నుంచి 9 వరకూ, సాయంత్రం 4 నుంచి 6 వరకూ రెండు విడతలుగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే కోచ్ ఫాషా వద్ద క్రికెట్లో శిక్షణ తీసుకున్న విద్యార్థినుల్లో అండర్ – 19 విభాగంలో 8 మంది జాతీయ స్థాయి, అండర్– 19 రాష్ట్ర స్థాయిలో ఒకరు, అండర్– 23 రాష్ట్ర స్థాయిలో ఒకరు సత్తా చాటారు. క్రికెట్‌పై అభిమానంతో.. నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ క్రీడలో శిక్షణ తీసుకుంటున్నా. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ వంటి అన్ని అంశాల్లో మెలకువలు నేర్చుకుంటున్నా. ముఖ్యంగా క్రికెట్లో ఏకాగ్రత, క్రమఽశిక్షణ, సమయపాలన వంటి అంశాలు ఎంతో ముఖ్యం. –జి.రాగదీపికశ్రీ, ఎనిమిదో తరగతి అదే లక్ష్యంతో శిక్షణ క్రికెట్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నమెంట్లలో ఆడాలనే లక్ష్యంతో శిక్షణ తీసుకుంటున్నా. కోచ్ ఎంఏ హాకీం ఫాషా చక్కని టెక్నిక్స్ నేర్పుతున్నారు. ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. –ఆర్.అమృత వర్షిణి భవిష్యత్‌కు ఉపయోగం క్రికెట్లో ఉచిత శిక్షణ ఇవ్వడం బాగుంది. వేసవి సెలవుల్లో ఇటువంటి ఆటలు నేర్చుకోవడం వల్ల నైపుణ్యం చాటవచ్చు. ఇలా రాణిస్తే ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాలో ఉపయోగకరంగా ఉంటుంది. –ముదురున్నీసా మహ్మద్, 7వ తరగతి -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
హోరాహోరీగా పవర్ లిఫ్టింగ్ పోటీలు
అమలాపురం రూరల్: అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్‌లో 15వ నేషనల్ సబ్ జూనియర్, జూనియర్ క్లాసిక్ మెన్ అండ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలు రెండో రోజు హోరాహోరీగా కొనసాగాయి. ఇందులో దేశంలోని 22 రాష్ట్రాల నుంచి 900 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రెండో రోజు వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్‌లో వివిధ కేటగిరీల్లో పోటీలు జరిగాయి. నేషనల్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో విజేతల వివరాలను ఆర్గనైజింగ్ సెక్రటరీ కంకిపాటి వెంకటేశ్వరరావు వెల్లడించారు. 53 కిలోల బాలుర విభాగం (సబ్ జూనియర్స్)లో చందనకుమార్ ప్రజాపతి (జార్ఖాండ్), దేవరాజ్సెన్ (రాజస్థాన్), 53 కిలోల బాలుర జూనియర్ విభాగంలో సుభమ్రానా (హర్యానా), ఉదయకుమార్ (హిమాచల్ ప్రదేశ్), నీరల్పావాల్ (మహారాష్ట్ర), సహిల్పార్వాల్ (మహారాష్ట్ర), 43 కిలోల విభాగం బాలికలు సబ్ జూనియర్లో సినచానా కేహెచ్ (కర్ణాటక), పటేల్భూమి హేమంతరాయ్ (గుజరాత్), దీపికాపీవీ (కేరళ), 47 కిలోల విభాగం బాలికలు (సబ్ జూనియర్) అక్షడభగవత్ (మధ్యప్రదేశ్), అకిల కేఆర్ (కేరళ), ఆభాచంద్రకర్ (ఛత్తీస్‌గఢ్), 43 కిలోల విభాగం బాలికలు (జూనియర్) రుప్సికుమారి (ఢిల్లీ), సిసీరా.ఎస్ (కేరళ), పుష్పవిశ్వకర్మ (గోవా), 47 కిలోల విభాగం బాలికలు (జూనియర్) అంజన కృష్ణవీకే (కేరళ), కియాకునాలె బెనర్జీ (హర్యానా), అదితి హోదన్దేకర్ (మహారాష్ట్ర) విజేతలుగా నిలిచారు. విజేతలకు అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మెట్ల రమణబాబు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు యాళ్ల దొరబాబు, బోనం సత్తిబాబు, రవణం వేణుగోపాలరావు, గారపాటి చంద్రశేఖర్, అశెట్టి ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారం చేసి.. ఏర్పాట్లు మరచి
ఫ శనైశ్చర క్షేత్రానికి వేలాదిగా భక్తులు ఫ రద్దీతో ఇబ్బందులు పడిన వైనం కొత్తపేట: మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) క్షేత్రంలో శనివారం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమావాస్య, శనివారం కలసి రావడం, ఆపై శని జయంతి కావడంతో స్వామివారిని దర్శించుకుంటే మంచిదని అధికారులు ప్రచారం చేశారు. దీనితో మందపల్లి శనైశ్చర ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. టిక్కెట్లు తీసుకునే కౌంటర్ దగ్గర భారీ రద్దీ ఏర్పడింది. అలాగే భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో అధికారులు ఆలయం ప్రధాన ద్వారాలను మూసివేశారు. దీంతో స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తులు ఒకరినొకరు తోసుకునే పరిస్థితి వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా శని జయంతి గురించి దేవస్థానం విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ రద్దీని ముందుగా అంచనా వేయలేకపోయింది. ఆలయం వెనుక స్థలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పునాదులు తీశారు. దానితో స్థలాభావం సమస్య తలెత్తింది. దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ సరిపోక ఆలయం ముందు నుంచే స్వామి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. తగినన్ని టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడం, ప్రాంగణం సరిపోక మధ్య మధ్యలో గేట్లు మూసి వేయడం తీవ్ర అసౌకర్యానికి గురిచేసింది. ఆ ఉత్సాహం ఎక్కడ! గత కొన్ని రోజులుగా దేవస్థానం తరఫున ప్రచారం జోరుగా చేశారు. ఈ నెల 16న శని జయంతి అని, అభిషేకం చేయించుకుంటే మంచి జరుగుతుందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. తెలుగు రాష్ట్రాల భక్తులు వేలాది మంది తరలివచ్చారు. ప్రచారం చేయడంలో అధికారులు చూపిన ఉత్సాహం.. ఏర్పాట్లు చేయడంలో కనిపించలేదని పలువురు మండిపడ్డారు. అదృష్టవశాత్తూ ఏవిధమైన తొక్కిసలాట జరగకుండా, ప్రమాదం చోటుచేసుకోకుండా ముగిసింది. శనైశ్చర క్షేత్రంలో భక్తుల ఇబ్బందులపై దేవదాయ – ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబును ‘సాక్షి’ వివరణ కోరగా స్థలాభావంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. శని జయంతి విశిష్టత గురించి విస్తృత ప్రచారం చేశామని, అందునా అమావాస్య, శనివారం కూడా తోడవ్వడంతో అంచనాకు మించి భక్తులు తరలివచ్చారని అన్నారు. ఆలయం వెనుక అభివృద్ధి పథకాలకు సంబంధించి పునాదులు తీయడంతో ప్రత్యామ్నాయంగా జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో పూజలకు ఏర్పాట్లు చేశామన్నారు. అయితే అనేకమంది ఆలయ ప్రాంగణంలో పూజలకు తోసుకువచ్చారన్నారు. దేవస్థానం సిబ్బంది, పోలీసు బందోబస్తుతో సజావుగా దర్శనం చేసుకునేలా చేశామన్నారు. ఈ ఒక్కరోజే దేవస్థానానికి మొత్తం రూ.17,23,619 ఆదాయం వచ్చిందని వివరించారు. ఇదిలాఉంటే శనైశ్చర స్వామివారిని కొత్తపేట సబ్ కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జి ఎ.సాయికుమారి, ముంబయి హైకోర్టు ఫార్మర్ జడ్జి సునీల్ బీ శుక్రే తదితరులు దర్శించుకున్నారు. -
బోట్ల యజమానులు, సిబ్బందికి ముగిసిన శిక్షణ
కాకినాడ రూరల్: కాకినాడ ఏటిమొగ వద్ద రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (ఎస్‌ఐఎఫ్‌టీ)లో పడవ (బోటు) యజమానులు, సిబ్బందికి మరమ్మతులు, నిర్వహణపై మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. తీర ప్రాంత జిల్లాలకు చెందిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాలకు చెందిన 23 మంది శిక్షణలో పాల్గొన్నట్టు ఎస్‌ఐఎఫ్‌టీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.అంజలి తెలిపారు. ఇంజిన్ల మరమ్మతులు, నిర్వహణ, సముద్ర భద్రతా చర్యలు, యంత్రాల పనితీరు మెరుగుదలపై శిక్షణ పొందారన్నారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న వారందరికి సర్టిఫికెట్లను అందజేశారు. -
ఇంట్లోకి దూసుకు పోయిన ట్రాక్టర్
కొత్తపేట: వాడపాలెంలో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. శనివారం ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లి గ్రామం నుంచి ఈతకోట రైసుమిల్లుకు ధాన్యం లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌కు కొత్తపేట మండలం వాడపాలెం బండారుపేట సమీపంలో ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చింది. కంగారుపడిన డ్రైవర్ ట్రాక్టర్‌ను కంట్రోల్ చేసే క్రమంలో షడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఇంట్లోకి దూసుకుపోయింది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవ డంతో పెను ప్రమాదం తప్పింది. చెల్లుబోయిన వెంకటరమణ, మట్టపర్తి వెంకట్రావులకు చెందిన ఇళ్లు దెబ్బతిన్నాయి. -
కారు బోల్తా: ఐదుగురికి గాయాలు
గోకవరం: మండలంలోని రామన్నపాలెం శివారున ప్రధాన రహదారిపై కారు బోల్తా పడిన ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాల ప్రకారం.. కిర్లంపూడి మండలం రమణయ్యపేటకు చెందిన ఐదుగురు వ్యక్తులు కారుపై భద్రాచలం వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో రామన్నపాలెం వచ్చేసరికి కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారు రెండు పల్టీలు కొట్టి చెట్టును ఢీకొని ఆగింది. వెంటనే స్థానికులు కారు నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. కారులో ప్రయాణిస్తున్న ఎ.అర్జున్, కె.చిన్న, సాంబమూర్తి, బి.శ్రీను, డి.నారాయణలు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఆంజనేయస్వామి మాల ధరించి ఉన్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యను కులం పేరుతో దూషించిన భర్త అరెస్ట్ భార్యను కులం పేరుతో దూషించిన కేసులో భర్తను అరెస్ట్ చేసినట్టు గోకవరం ఎస్సై పవన్‌కుమార్ శనివారం తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. గోపాలపురం గ్రామానికి చెందిన గూడవల్లి వీరప్రసాద్, ధరణిలు ఆరేళ్ల కిందట కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఎనిమిది నెలల కుమారుడు ఉన్నాడు. ఇటీవల వీరప్రసాద్ తన భార్యను తరచూ కులం పేరుతో దూషించి వేధిస్తున్నాడు. ఈ మేరకు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తపై అట్రాసిటీ కేసు నమోదు చేసి శనివారం అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం కోర్టుకు తరలించారు. -
అక్రమాల పుట్ట
ఫ ఔరంగబాద్ ఇసుక రీచ్‌లో అక్రమాలు ఫ ఒకే బిల్లుతో సాయంత్రం వరకూ రవాణా ఫ అంతా టీడీపీ నేత కనుసన్నల్లోనే.. ఫ కన్నెత్తి చూడని అధికారులు పెరవలి (కొవ్వూరు): ఇసుక అక్రమాలకు కొవ్వూరు మండలం ఔరంగబాద్ ఇసుక రీచ్‌లు అడ్డాగా మారాయి. ఇక్కడ పడవలపై ఇసుక తెచ్చే రెండు రీచ్‌లున్నాయి. కేవలం ఒక లారీకి బిల్లు తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకూ యథేచ్ఛగా వీలైనన్ని ఎక్కువ ట్రిప్పుల్లో ఇసుక తరలించుకుపోతున్నారు. అంతే కాదు, బిల్లు తీసుకుంటే ఒక రేటు.. లేకపోతే మరో రేటు వసూలు చేస్తున్నారు. ర్యాంప్ నిర్వాహకులు సమయం కూడా వేయకుండా బిల్లు ఇస్తున్నారు. ఇసుక లారీ రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎవరైనా అధికారులు నిలుపు చేస్తే, అప్పుడు బిల్లుపై డ్రైవర్ సమయం వేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపై రీచ్ నిర్వాహకులకు కూడా సమాచారం ఇవ్వడంతో వారు కూడా అదే సమయాన్ని బిల్లులో నమోదు చేస్తున్నారు. ఎవరైనా అధికారులు అడ్డుకోవాలనుకున్నా టీడీపీ నేత ఒకరు రంగంలోకి దిగి కాసులతో కట్టి పడేస్తున్నారు. అప్పటికీ ఎవరైనా ఎదురు తిరిగితే బదిలీ అనో, మరో పేరుతోనో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రూ.కోట్లలో దోపిడీ! జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించిన ప్రకారం ఇక్కడ 20 టన్నుల ఇసుక లారీకి రూ.4,580 వసూలు చేయాలి. కానీ, కాస్త తగ్గించి ఔరంగబాద్ రీచ్‌లో రూ.4,300 మాత్రమే వసూలు చేస్తున్నారు. ఎవరైనా ఇలా నష్టానికి వ్యాపారం చేస్తారా అనే అనుమానం రావచ్చు. కానీ, ఒకే బిల్లుపై సాయంత్రం వరకూ ఇసుక తరలించుకుని పోయి, పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. బిల్లు వద్దని అంటే రికార్డుల్లో ఏ వివరాలూ నమోదు చేయకుండా కేవలం రూ.4 వేలకే లారీ ఇసుక తరలిస్తున్నారు. ఈవిధంగా ఔరంగబాద్‌లోని రెండు రీచ్‌ల నుంచి రోజుకు 150 లారీలు, సుమారు 50 ట్రాక్టర్లతో ఇసుక తరలించుకుపోతున్నారు. రికార్డుల్లో మాత్రం 30 నుంచి 50 లారీలు మాత్రమే చూపిస్తున్నారు. దీంతో ఒక లారీకి (20 టన్నులు) రూ.4,300 చొప్పున రోజుకు రూ.6.45 లక్షలు, ట్రాక్టర్‌కు రూ.1,000 చొప్పున 50 ట్రాక్టర్లకు రూ.50 వేలు కలిపి దాదాపు రూ.7 లక్షల మేర కొల్లగొడుతున్నారు. ఈవిధంగా నెలకు రూ.2.10 కోట్ల మేర దోచుకుంటున్నారు. ఇక్కడ గోదావరి నదీగర్భం నుంచి నేరుగా పడవల్లో ఇసుక తీసుకువచ్చి గుట్టగా వేయడం.. దీనికి లెక్కా పత్రం లేకపోవటంతో టీడీపీలోని ఓ కీలక నేత కనుసన్నల్లోని ఇసుక మాఫియాకు కాసుల పంట పండుతోంది. ఇక్కడ బహిరంగంగానే ఇంత దందా సాగుతున్నా రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. మైనింగ్ అధికారులు మాత్రం అడపాదడపా దాడులు చేసి, కేసులు నమోదు చేసి, కేవలం జరిమానాలతో సరిపెడుతున్నారు. ఔరంగబాద్ ఇసుక అక్రమాలపై ఉన్నతాధికారులు ఇప్పటికై నా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
మట్టి అక్రమ తవ్వకాలపై సర్వే
రంగంపేట: వడిశలేరు పాపాయ్య చెరువులో జరిగిన మట్టి అక్రమ తవ్వకాలపై రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ అధికారులు శుక్రవారం సర్వే నిర్వహించారు. ఇరిగేషన్ ఏఈ వై.శ్రీనివాసరావు, అసిస్టెంట్ జియాలజిస్ట్ జి.విఘ్నేశ్వరరావు, రాజమహేంద్రవరం డీఎంఈజీఓ సర్వేయర్ పి.శ్రీనివాస్, మండల, గ్రామ సర్వేయర్లు బి.సత్తబ్బాయి, పి.నవీన్, వీఆర్ఓలు జె.పోచయ్య, ఎం.రామారావులు మధ్యాహ్నం 12 గంటలకు సర్వే ప్రారంభించారు. సుమారు 2 గంటల పాటు సర్వే నిర్వహించిన అనంతరం, అక్కడున్న గ్రామస్తులకు, రైతులకు ఎటువంటి వివరాలూ వెల్లడించకుండానే వెళ్లిపోయారు. మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిపై అధికారులు చర్యలు తీసుకోకపోతే గ్రామస్తులు, రైతుల సహకారంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయేలు హెచ్చరించారు. అధికారుల సర్వేపై గ్రామస్తులు, రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏ మేరకు అక్రమ మైనింగ్ జరిగిందనే వివరాలను సర్వే చేసిన అధికారులు చెప్పలేదని, దీనినిబట్టి ఎంత పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారో అర్థమవుతుందని విమర్శించారు. మట్టి అక్రమ తవ్వకాల వలన లోతు అంచనా వేయలేక చెరువులో మనుషులు, పశువులు మృత్యువాత పడితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. అధిక లోడుతో తిరిగిన మట్టి టిప్పర్ల కారణంగా రోడ్లు కూడా ధ్వంసమయ్యాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోతుల బులి వీర్రాజు, రైతులు నలమాటి భీముడు, సత్తి సత్తిబాబు, రామకృష్ణ పాల్గొన్నారు. -
రసాయనాలతో మాగబెట్టి పండ్లు విక్రయిస్తే చర్యలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పండ్లను రసాయనాలతో కృత్రిమంగా మాగబెట్టి విక్రయించే వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ హెచ్చరించారు. ఈ అంశంపై కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వివిధ శాఖల అధికారులతో క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మామిడి సహా వివిధ పండ్లను కాల్షియం కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలతో మాగబెట్టడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, జీర్ణ సంబంధిత అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. సహజ పద్ధతుల్లో పండ్లు మాగబెట్టేలా వ్యాపారులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రసాయనాలతో పండ్లు మాగబెట్టినట్లు గుర్తించిన వ్యాపారులకు 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల వరకూ జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. కారాగారాల్లో లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ ప్రారంభం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి యార్లగడ్డ శ్రీలక్ష్మి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు, మహిళా కారాగారాల్లో లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్‌ను శుక్రవారం ప్రారంభించారు. కారాగారాల్లో ఆహార ప్రమాణాలు, పరిశుభ్రత, ఖైదీలకు కల్పిస్తున్న ఇతర సదుపాయాలను పరిశీలించారు. ఖైదీలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఖైదీల తరఫున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటిషన్లు దాఖలు చేయాలన్నా, పై కోర్టుల్లో అప్పీలు వేయాలన్నా, ఇతర న్యాయ సహాయం అవసరమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సహకారం అందిస్తామని వివరించారు. ఉచిత న్యాయ సహాయం పారా లీగల్ వలంటీర్లకు తమ అర్జీలు అందించాలని ఖైదీలకు సూచించారు. నిమ్మ ధర పతనం దేవరపల్లి: మార్కెట్లో నిమ్మ ధర మరింత పతనమైంది. గత నెలలో కిలో కాయలకు రూ.130 నుంచి రూ.140 వరకూ ధర పలికింది. ముదర కాపులు దిగుబడులు తగ్గడంతో కాయలకు డిమాండ్ ఏర్పడింది. గత డిసెంబర్, జనవరి నెలల్లో కిలో రూ.8 నుంచి రూ.10 మాత్రమే ధర పలకగా, ఫిబ్రవరిలో రూ.40, మార్చిలో రూ.70, ఏప్రిల్‌లో ఏకంగా రూ.140కి పెరిగింది. కొద్ది రోజుల అనంతరం ఈ నెలలో ధర క్రమేపీ పతనమవుతూ వస్తోంది. యాదవోలు మార్కెట్లో కాయల నాణ్యత, సైజును బట్టి శుక్రవారం కిలోకు రూ.20 నుంచి రూ.30 మాత్రమే ధర లభించిందని రైతులు తెలిపారు. ప్రస్తుతం లేత కాపులు అందుకోవడంతో మార్కెట్‌కు రోజుకు సుమారు 25 టన్నుల కాయలు అమ్మకానికి వస్తున్నాయని వ్యాపారులు తెలిపారు. వెబ్సైట్లో సీనియారిటీ తాత్కాలిక జాబితా కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యా శాఖ పరిధిలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ తాత్కాలిక జాబితాను డీఈఓ.జీఓవీ.ఓఆర్జీ వెబ్సైట్లో ఉంచామని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్, మున్సిపల్ కార్పొరేషన్ల కింద పని చేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయులు సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) ఆధారంగా రూపొందించారని వివరించారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 19వ తేదీ లోగా కాకినాడలోని పూర్వపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మహిళా కారాగారంలో లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్‌ను ప్రారంభిస్తున్న డీఎల్ఎస్ఏ కార్యదర్శి శ్రీలక్ష్మి -
ఆత్మ రక్షణకు ఉచిత శిక్షణ
● జగ్గంపేటలో జూడో ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ● ఉత్సాహంగా పాల్గొంటున్న 50 మంది విద్యార్థులు జగ్గంపేట: వేసవి సెలవులను వృథాగా గడపకుండా విద్యార్థులకు మానసిక, శారీరక ఉల్లాసం కలగచేసేందుకు జిల్లా స్పోర్సు అథారిటీ ఆధ్వర్యంలో జగ్గంపేటలో జూడో ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతోంది. జగ్గంపేటకు చెందిన జూడో జిమ్ కోచ్, బ్లాక్ బెల్ట్ 6డాన్ కరాటే మాస్టర్ తాండ్రోతు వెంకట రమణ విద్యార్థినీవిద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్ విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని కలగచేయడంతో పాటు భవిష్యత్తులో వారు మరింత శ్రద్ధగా శిక్షణ తీసుకుంటే మంచి క్రీడాకారులు కావచ్చని ఆయన తెలిపారు. జూడో ఫ్రీ కోచింగ్ ప్రారంభించి వారం రోజులు అయిందని, 50 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని, ఈ క్యాంప్ ఈ నెల 31 వరకూ కొనసాగుతుందని చెప్పారు. జూడో ఒలింపిక్ గేమ్ అని, దీనిలో శిక్షణ కొనసాగించి సబ్ జూనియర్, క్యాడిట్, జూనియర్, సీనియర్ విభాగాలలోను, స్కూల్ గేమ్స్ అండర్ 14, అండర్ 17, అండర్ 19 విభాగాలలో పాల్గొనాలని సూచించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించి సర్టిఫికెట్లు సాధించగలిగితే ఉన్నత చదువులలోను, ఉద్యోగాలలోను స్పోర్ట్సు కోటాలో మేలు జరుగుతుందని వివరించారు. -
స్వర్ణం స్వప్నమేనా!
ప్రతిపాదనపై స్పందన కరువు కేజీ బంగారం ధర 2024లో రూ.60 లక్షలు. ఆ ప్రకారం 11.50 కేజీల బంగారానికి రూ.7 కోట్లు, రాగి కవచాల తయారీ, ఇతర వ్యయం రూ.కోటి అవుతుందని అంచనా వేశారు. ఆ మేరకు దాతల విరాళాలు రూ.8 కోట్లతో సత్యదేవుని ఆలయ శిఖరం స్వర్ణ తాపడం చేసేందుకు అప్పటి దేవస్థానం ఈఓ కె.రామచంద్ర మోహన్ (ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్) ప్రతిపాదనలు పంపించారు. దీని కోసం భక్తులు రూ.వెయ్యి నుంచి ఎంత మొత్తం విరాళం ఇచ్చినా స్వీకరించేలా ఒక స్కీమ్ రూపొందించారు. అయితే, ఆయన 2024 నవంబర్‌లో విజయవాడలోని కమిషనర్ కార్యాలయానికి బదిలీ అయిన తరువాత ఈ ప్రతిపాదనపై ఎటువంటి కదలికా లేదు. అన్నవరం: సత్యదేవుని ఆలయ శిఖరాన్ని స్వర్ణమయం చేయడం కలగానే మిగిలిపోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఒకవైపు భారీగా పెరిగిన బంగారం ధర, మరోవైపు దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు, దాతలు ముందుకు రాకపోవడం వంటి కారణాలతో ఈ బృహత్తర కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు పడుతున్న పరిస్థితి నెలకొంది. సత్యదేవుని పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో అదేచోట నూతన ఆలయాన్ని పునర్నిర్మించి 2012 మార్చి 14న ప్రారంభించారు. ఆలయాన్ని పూర్తిగా గ్రానైట్‌తో నిర్మించి, బంగారు రేకు తాపడం చేయడానికి వీలుగా ఆలయ శిఖరాన్ని మాత్రం ఇటుకతో నిర్మించారు. 2024లోనే.. స్వర్ణ శిఖరం ఏర్పాటును దాతల సహకారంతో పూర్తి చేయాలని దేవస్థానం అధికారులు 2024లో భావించారు. ఈ మేరకు ఎండోమెంట్స్ ప్రధాన స్థపతి పరమేశ్వరప్ప సత్యదేవుని ఆలయ శిఖరం కొలతలు తీసుకున్నారు. సుమారు 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తు కలిగిన ఈ ఆలయ శిఖరంపై 50కి పైగా దేవతా శిల్పాలున్నాయి. వీటన్నింటి కొలతలు తీసి, తొలుత రాగి రేకుతో వీటికి కవచాలు తయారు చేయించి, ఆపై బంగారు పూత పూయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి 11.50 కేజీల బంగారం అవసరమవుతుందని అంచనా వేశారు. ఆ తరువాత టీటీడీ నిపుణులు కూడా ఆలయాన్ని పరిశీలించి, శిఖరం స్వర్ణ మయం చేయడానికి సుమారు 20 కిలోల బంగారం అవసరమవుతుందని అంచనా వేశారు. కానీ, దేవస్థానం ఆ ప్రతిపాదనలను తిరస్కరించి, 11.50 కేజీల బంగారంతో చేయించేందుకే మొగ్గు చూపింది. నేడు ధరాభారం కొన్నాళ్లుగా బంగారం రేటుకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం కేజీ బంగారం ధర సుమారు రూ.1.50 కోట్లు ఉంది. ప్రస్తుతం బంగారం ధర పెరగడంతో ఆలయ శిఖరం స్వర్ణమయం చేయడానికి అవసరమైన బంగారానికే దాదాపు రూ.18 కోట్లు అవుతుందని, రాగి కవచాలు, ఇతర ఖర్చులు మరో రూ.2 కోట్లు కలిపి మొత్తం రూ.20 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇంత భారీ వ్యయాన్ని భరించే పరిస్థితిలో దేవస్థానం లేదు. అలాగని ఇంత పెద్ద మొత్తం విరాళంగా సమర్పించేందుకు దాతలు కూడా ముందుకు రాని పరిస్థితి. దేవస్థానం గత ఫిబ్రవరిలో 9.5 కిలోల బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ బాండ్ల స్కీములో డిపాజిట్ చేశారు. అలాగే, 2018లో దేవస్థానం వద్ద ఉన్న వెండిని కరిగించి, దానిని విక్రయించగా వచ్చిన డబ్బుతో 7 కిలోల బంగారం కొనుగోలు చేశారు. దానిని కూడా స్టేట్ బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. ఈ బంగారంతో స్వర్ణ శిఖరం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ ప్రతిపాదనలు ముందుకు కదిలే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. నెల్లూరుకు చెందిన దాత సహకారంతో 2024లో సత్యదేవునికి సుమారు రూ.2 కోట్లతో నూతన ధ్వజస్తంభం, దానికి బంగారు రేకు తాపడం చేశారు. కానీ, స్వర్ణ శిఖరం మాత్రం నేటికీ కలగానే మిగిలిపోయింది. దేవదాయ శాఖ ఉన్నతాధికారులు బడా పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు సేకరించి, ఈ కార్యక్రమం పూర్తి చేస్తేనే తిరుమల, శ్రీశైలం, విజయవాడ వంటి ఆలయాల మాదిరిగా సత్యదేవుని ఆలయ శిఖరానికి కూడా స్వర్ణ శోభతో ప్రకాశించే అవకాశం కలుగుతుతుంది. సత్యదేవుని ఆలయ శిఖరం·˘ çÜ™èlŧólÐ]l#° BÌSĶæ$ çÜÓÆý‡~ ÕQÆ>°MìS గతంలో ప్రయత్నాలు ·˘ 11.50 MóSiÌS º…V>Æý‡… అవసరమన్న నిపుణులు ·˘ Æý‡*.8 MørÏÐ]l#™èl$…§ýl° Aç³µsZÏ A…^èl¯é ·˘ {ç³çÜ$¢™èl… Æý‡*.20 Mør$Ï Oò³V> ఖర్చయ్యే అవకాశం ·˘ Cç³µsìæMîS M>¯]lÆ>° ç³#ÆøVýS† ·˘ {糿¶æ$™èlÓ… gZMýSÅ… చేసుకోవాలంటున్న భక్తులు -
భళా.. కందరెడ్డి
ఫ వ్యవసాయ కూలీలకు రూ.2 లక్షల చొప్పున పంపిణీ ఫ 10 మందికి రూ.20 లక్షలు అందించిన కౌలురైతు కడియం: అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్‌పై ఉన్న భక్తితో.. ఆ మహనీయుని జయంతి వేళ.. కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన కౌలు రైతు సత్తి భాస్కరరెడ్డి (కందరెడ్డి) వినూత్నంగా తన ఔదార్యాన్ని చాటుకున్నారు. గ్రామంలోని కాటన్ విగ్రహానికి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. అనంతరం, తన వద్ద పని చేస్తున్న పది మంది వ్యవసాయ కూలీలకు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు అందజేశారు. బీడువారిన భూముల్లో జలధార కురిపించి, ఏకంగా 10 లక్షల ఎకరాలను సిరులు పండే పంట భూములుగా మార్చిన కాటన్‌పై కందరెడ్డికి అపార భక్తి. తన ఇంటి ముందు 2004లో నిలువెత్తు కాటన్ విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఏటా ఆ మహనీయుని జయంతి రోజున ఆ విగ్రహానికి ధాన్యాభిషేకం చేస్తారు. అంతే కాదు.. తాను కౌలుకు తీసుకున్న 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రం నుంచి వచ్చే ఫల సాయంలో 50 శాతాన్ని కందరెడ్డి సామాజిక అవసరాలకే వెచ్చిస్తారు. కడియం మండలంలోని దుళ్ల, మురమండ, వీరవరం గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులకు ఉపయోగించే మూడు ట్రాక్టర్లను రూ.18 లక్షలతో సమకూర్చారు. వీరవరం, దుళ్ల గ్రామాల్లో సుమారు రూ.40 లక్షలతో రెండు పార్కులు అభివృద్ధి చేశారు. పాఠశాలలకు, దేవాలయాలకు, చర్చిలకు భూరి విరాళాలిచ్చారు. దశాబ్ద కాలంగా సామాజిక అవసరాలకు, మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేశారు. ఇంతటి అసామాన్య సేవలు అందిస్తున్న కందరెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. -
కాటన్ సేవలు చిరస్మరణీయం
● జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాలరావు ● ధవళేశ్వరంలో ఘనంగా సర్ ఆర్థర్ కాటన్ జయంతి ధవళేశ్వరం: ఆనకట్ట నిర్మాణం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలను ధాన్యాగారంగా మార్చిన సర్ఆర్థర్ కాటన్ సేవలు చిరస్మరణీయమని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు పేర్కొన్నారు. సర్ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజీ సెంటర్లో ఉన్న కాటన్ విగ్రహానికి వేణుగోపాలరావు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బ్యారేజీ సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ ఆనకట్ట నిర్మాణం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన కాటన్ డెల్టా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. -
జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభం
అమలాపురం రూరల్: 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాలురు, బాలికల జూనియర్ మెన్ అండ్ ఉమెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలు అమలాపురంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్‌లో ప్రారంభించారు. ఈ పోటీలు ఆరు రోజు పాటు కొనసాగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. దేశంలోని 25 రాష్ట్రాల నుంచి సుమారు 900 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ హరీష్ బాలయోగి మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకొని ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ ప్రతిభావంతులైన క్రీడాకారులు క్రీడా కోటాలో ఉద్యోగ అవకాశాలు సాధించుకోవాలని సూచించారు. ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు అవసరమన్నారు. పవర్ లిఫ్టింగ్ ఇండియా ఫెడరేషన్ చాంపియనన్ షిప్ సెక్రటరీ రాజేష్ ఎస్ గొయల్ మాట్లాడుతూ కోనసీమలో ఈ పోటీలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. శనివారం ఉదయం నుంచి పోటీలు జరుగుతాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఉపాధ్యక్షుడు మద్ది ప్రభాకరరావు, కల్వకొలను తాతాజీ, చిక్కాల గణేష్, నల్లా పవన్, మోకా సుబ్బారావు, ఏడిద శ్రీను, యనుముల కృష్ణ పద్మరాజు, సౌత్ జోన్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు, ఏపీ అధ్యక్షుడు గంటా వెంకటేశ్వర్లు, సకల సూర్యనారాయణ, గారపాటి చంద్రశేఖర్, పప్పుల శ్రీరామ చంద్రమూర్తి, దొమ్మేటి వెంకటరమణ పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
రాష్ట్ర పన్ను ఉపసంహరించాలి
రాష్ట్రంలో పెట్రో ధరల పెంపు సాధారణ ప్రజలపై తీవ్ర భారం మోపుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన పరిస్థితుల్లో, పెట్రోలు ధరల పెంపు వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్క రాష్ట్రమైన తమిళనాడుతో పోలిస్తే ఏపీలో పెట్రోలు ధరలు ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. ప్రభుత్వం వెంటనే పెట్రోలుపై రాష్ట్ర పన్నులను తగ్గించి, ప్రజలకు ఉపశమనం కల్పించాలి. – తాడేపల్లి విజయ్‌కుమార్, న్యాయవాది రాష్ట్రంలో ధరల నియంత్రణ ఏదీ? రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు, ముఖ్యంగా వంట నూనెల ధరలు విపరీతంగా పెరుగుతున్నా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పెరుగుదలకు సాకులు చెబుతూ ప్రజలపై అదనపు భారం మోపుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ధరల నియంత్రణ చర్యలు, రాయితీలు ఆంధ్రప్రదేశ్‌లో లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ప్రజల కష్టాలపై రాజకీయాలు చేయడం మానుకుని, వెంటనే ధరలను నియంత్రించి, ప్రజలకు ఉపశమనం కల్పించాలి. – ఎస్.కిరణ్ కుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
డెంగీతో డేంజర్
● దోమల వృద్ధితో వ్యాప్తి ● నీటి నిల్వలు లేకుండా చూడాలి ● పారిశుధ్యం మెరుగుపర్చుకోవాలి ● నేడు జాతీయ డెంగీ దినోత్సవం రాయవరం/ఆలమూరు: జ్వరాలలో ప్రమాదకరమైంది, ప్రాణాంతకమైందీ డెంగీ జ్వరం. డెంగీ కారక ఏడిస్ ఈజిప్ట్ దోమ దోసెడు నీళ్లలోనే పెరుగుతుంది. ఇళ్లు, దుకాణాల పరిసరాల్లో వాడి పారేసిన కొబ్బరి బొండాలు, కొబ్బరి చిప్పలు, పాతటైర్లు, కూలర్లు, పూలకుండీలు వంటి ఇతర వస్తువుల్లో నీటి నిల్వల్లో డెంగీ దోమ ఉంటుంది. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, నీరు నిల్వ లేకుండా చేసుకుంటే డెంగీ కట్టడి సాధ్యమవుతుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో 18 డెంగీ కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వర్షాకాలం ముందు నుంచే డెంగీతోపాటు ఇతర వ్యాధులపై వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలతోపాటు ప్రతి శుక్రవారం డ్రైడేగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. మన ఇల్లు, ఇంటి పరిసరాల్లో నిల్వ నీటిలో అనాఫిలస్, క్యూలెక్స్ ఈడీస్, ఆర్మిజరిస్ దోమలు పెరుగుతాయి. ‘శనివారం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. జాగ్రత్తలు ముఖ్యం ● నీళ్ల కుండీలు, డ్రమ్ములు, గోళాలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు వంటి వాటిపై దోమలు గుడ్లు పెట్టకుండా మూతలు పెట్టాలి. ● వారానికోసారి నీరు నిల్వ చేసిన పాత్రలను ఖాళీ చేయాలి. ● సెప్టిక్ ట్యాంక్ గొట్టంపైన్పలచని గుడ్డ చుట్టాలి. దీనివల్ల దోమల నివారించవచ్చు. ● మురుగుకాల్వల్లో ఎప్పటికప్పుడు చెత్తా చెదారం తొలగించాలి. ● ఏ పాత్రలైనా సరే నీరు నిల్వ లేకుండా చూడాలి. ● దోమలు కుట్టకుండాచర్యలు తీసుకోవాలి. ● దోమతెరలు, ఇంటి కిటికీలకు జాలీలు వాడాలి. ఇవీ లక్షణాలు ఏటా డెంగీ బారినపడుతున్న వారి సంఖ్య వందల్లో ఉండగా, అడపాదడపా మరణాలు సంభవించిన ఘటనలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఈడిస్ ఈజిప్ట్ రకం దోమ కుట్టడం వల్ల తీవ్ర జ్వరం, శరీరంపై ఎరన్రి దద్దుర్లు, తీవ్రమైన తల నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పి, ఆకలి మందగించడం, ఎర్ర రక్తకణాలు (ప్లేట్లెట్స్) తగ్గిపోతాయి. చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్తస్రావం, మూత్రం, మలం లేదా వాంతిలో రక్తం, శ్వాస ఆడకపోవడం, అలసిపోవడం, చిరాకు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ‘ఎలీసా పరీక్ష’ చేసుకుని నిర్ధారించుకున్న తర్వాత చికిత్స తీసుకోకువాలి. వృద్ధులు, చిన్నారులు, మధుమేహం బాధితులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇలా.. సంవత్సరం కేసులు 2022 226 2023 160 2024 60 2025 32 2026 18 -
సుర్రో.. మొర్రో
● ఎండల ధాటికి హడలిపోతున్న జనం ● పగలు, రాత్రి ఒక్కటే ఉక్కపోత ● నిర్మానుష్యమవుతున్న రహదారులురాజానగరం/రాయవరం: వేసవి ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఎండ తీవ్రత పెరిగిపోతుండడంతో బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత కూడా ఉష్టోగ్రత ప్రభావం తగ్గడం లేదు. 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అడపా దడపా వర్షాలు కురిసినా వాతావరణంలో వేడి ఏమాత్రం తగ్గడం లేదు. వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 39 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. దీంతో రాజానగరం వద్ద జాతీయ రహదారిపై కర్ఫ్యూ వాతావరణం దర్శనమిచ్చింది. ఆర్టీసీ బస్సులు మినహా లారీలు, ఆటోలు కూడా పెద్దగా తిరగని పరిస్థితులలో రాజానగరం, దివాన్‌చెరువు, లాలాచెరువు కూడళ్లు జన సంచారం లేక వెలవెలబోయాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరైతేనేగాని జనం బయటకు రావడం లేదు. ఆ సమయంలో దాహార్తిని తీర్చే కూల్‌డ్రింక్స్, జ్యూస్‌ల విక్రయాలు అంతంత మాత్రంగా ఉంటున్నాయని విక్రయదారులు వాపోతున్నారు. ఎండలు ముదిరిపోవడంతో కూలీలు పనులకు వచ్చేందుకు విముఖత చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు. -
ప్రతిభ ఉంటే.. ఉపకారం వెంటే
● వెనుకబడిన విద్యార్థులకు ‘విద్యాదాన్’ ● జూన్ 20 వరకు దరఖాస్తులకు గడువు రాయవరం: చదువులో ముందుండి, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ ఉపకార వేతనం అందిస్తోంది. కళాశాల విద్యలో సత్తా చాటేవారికి ఈ సాయం ఒక వరంలా మారనుంది. 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రస్తుతం మన రాష్ట్రంలో అమలవుతోంది. ఎంపికై న విద్యార్థులు రెండేళ్ల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ పొందవచ్చు. విద్యార్థి ప్రతిభ ఆధారంగా, నచ్చిన రంగంలో డిగ్రీ చదవడానికి స్కాలర్షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థి చదువుతున్న కోర్సు, కాల పరిమితి ఆధారంగా ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకూ స్కాలర్షిప్ అందజేస్తారు. ఎంపికై న విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్‌కు అవసరమైన దిశా నిర్దేశం చేస్తారు. దరఖాస్తుకు అర్హత ఇదీ.. ● సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ ఉపకార వేతనం పొందడానికి విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షల లోపు ఉండాలి. ● 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, ఇంటర్ చదువుతున్న వారు అర్హులు. ● పదో తరగతిలో కనీసం 90 శాతం మార్కులు సాధించాలి. దివ్యాంగులైతే 75 శాతం మార్కులు పొందాలి. ఎంపిక విధానం ఇలా.. చదువులో చూపిన ప్రతిభ, ధ్రువపత్రంలో తెలిపిన సమాచారం ఆధారంగా ఎంపిక చేస్తారు. జూలై 5న దరఖాస్తుదారులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. విద్యాదాన్ ఉపకార వేతనం కోసం జూన్ 20వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు పదో తరగతి మార్కుల జాబితా, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఈ ఏడాది తీసుకున్న ఆదాయ ధ్రువపత్రం, చదువుతున్న కళాశాల వివరాలు పొందుపర్చాలి. ఆన్లైన్లో నమోదు చేసుకునే వారు వ్యక్తిగతంగా సొంత ఈ– మెయిల్ కలిగి ఉండాలి. నెట్ సెంటర్ లేదా ఇతరుల ఈ– మెయిల్ ఐడీలను అనుమతించరు. భవిష్యత్తులో ఎస్డీఎఫ్ నుంచి ఎటువంటి సమాచారమైనా ఈ–మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. అందుకే సొంత ఈ–మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకుని, పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకోవాలి. మరిన్ని వివరాల కోసం సోమవారం నుంచి శనివారం మధ్యలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విద్యాదాన్.ఆంధ్రఎస్డీ ఫౌండేషన్ఇండియా.కామ్‌లో సంప్రదించాలి. లేదా హెల్ప్‌లైన్ +919663517131 నంబరు ఫోన్ ద్వారా సంప్రదించాలి. -
ఆర్ట్హాసంగా శిక్షణ..
బాలాజీచెరువు (కాకినాడ): ఒకప్పుడు వేసవి సెలవులు అంటే ఆటలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం విద్యార్థులు గ్రంథాలయాలకు వచ్చి తమకు ఇష్టమైన పుస్తకాలు చదువుతున్నారు. అలాగే అక్కడ వివిధ అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాలు గత నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కాగా, వీటికి ఆదరణ లభిస్తుంది. కాకినాడ నగరంలోని గ్రంథాలయాల్లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ వివిధ అంశాల్లో నిపుణులతో తరగతులు బోధిస్తున్నారు. నృత్యం తదితర వాటిపై శిక్షణ ఇస్తున్నారు. స్థానిక జిల్లా ప్రధాన గ్రంథాలయంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో ఏఎంజీ స్కూల్ డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎం.చినబాబు పక్షులు, జంతువులు వంటి చిత్రాలు గీసి విద్యార్థులకు వివరించారు. గాంధీనగర్ గ్రంథాలయంలో ఉపాధ్యాయుడు పురాలశెట్టి వీరబాబు డ్రాయింగ్, క్రాఫ్ట్ అంశాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ శిబిరాన్ని డిప్యూటీ లైబ్రేరియర్ కిషోర్, గాంధీనగర్ గ్రంథాలయాల అధికారి ములంపాక శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు. -
మండుటెండలోనూ తగ్గని భక్తజన సందడి
అన్నవరం: ఎండలు మండిపోతున్నా రత్నగిరిపై భక్తుల సందడి ఏమాత్రం తగ్గడం లేదు. సూర్యుడు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో చెలరేగుతున్నా.. భక్తులు ఏమాత్రం లెక్క చేయడం లేదు. అచంచల భక్తిభావంతో సత్యదేవుని దర్శనానికి వారం రోజులుగా వేలాదిగా తరలివస్తూనే ఉన్నారు. వారం రోజులుగా వివాహలు జోరుగా జరుగుతూండటంతో నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు సాధారణ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తూండటంతో ఆలయం కిటకిటలాడుతోంది. సుమారు 40 వేల మంది భక్తులు గురువారం సత్యదేవుని దర్శనానికి వచ్చారు. దీంతో, క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారాయి. వ్రతాలాచరించేందుకు సైతం భక్తులు బారులు తీరారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల నుంచి దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
మామిడికుదురు: ఈదరాడలో తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లో ఏ విధమైన వస్తువులు లేకపోవడంతో సామగ్రిని చిందర వందరగా పడేసి వెళ్లిపోయారు. మరో ఇంటి బీరువాలో భద్రపరిచిన వెండి వస్తువులను అపహరించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఈదరాడకు చెందిన ఆకుల విజయ శ్రీరాములు 20 రోజుల కిందట కుటుంబ సభ్యులతో కలసి హైదరాబాద్ వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించి దొంగలు ఆ ఇంటిని టార్గెట్ చేశారు. ఆ ఇంటి తాళాలు బద్దలు గొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ విషయం బుధవారం వెలుగు చూసింది. బాధితుడు గురువారం హైదరాబాద్ నుంచి వచ్చారు. అతని సమక్షంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. బీరువాలు బద్దలు గొట్టి వాటిలోని వెండి వస్తువులను అపహరించారు. బంగారం ఉన్న లాకర్ ఓపెన్ కాలేదని చెబుతున్నారు. ఈ ఇంటికి దగ్గరలోనే ఉన్న విశ్రాంత ఉపాధ్యాయుడు యెనుముల భాస్కరరామ్మూర్తి ఇంటి తాళాలు కూడా బద్దలు గొట్టి చోరీకి ప్రయత్నించారు. కానీ ఆ ఇంట్లో ఏవిధమైన వస్తువులు లభించకపోవడంతో వెళ్లిపోయారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నామని నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ తెలిపారు. -
పీకకోసి.. హత్యచేసి
● హత్య కేసులో నిందితుడి హతం ● ప్రతికార చర్యలో భాగమేనని అనుమానం చింతూరు: ఓ హత్య కేసులో నిందితుడు హతమయ్యాడు.. అతని పీకకోసి, హత్య చేయడం కలకలం రేపింది.. ఈ ఘటన చింతూరు మండలం లక్కవరంలో గురువారం చోటుచేసుకుంది. గతేడాది ఆగస్టులో మంత్రాలు చేస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో లక్కవరానికి చెందిన మూట రామయ్య (60) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో గ్రామానికి చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపారు. ప్రస్తుతం వీరికి గతేడాది డిసెంబర్లో బెయిల్ మంజూరు కావడంతో గ్రామంలోనే ఉంటున్నారు. నలుగురు నిందితుల్లో ఒకరైన మూట రమేష్ (37)ను ప్రస్తుతం గుర్తు తెలియని వ్యక్తులు పీకకోసి దారుణంగా హతమార్చారు. గ్రామంలోని అంగన్వాడీ భవనం వెనుక రమేష్ మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు మోతుగూడెం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై నాసిర్ హుస్సేన్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శుభకార్యానికి వెళ్లి తిరిగి రాలేదు లక్కవరంలో బుధవారం రాత్రి జరిగిన పెళ్లి వేడుకకు తన భర్త రమేష్‌తో కలసి వెళ్లినట్లు గంగమ్మ తెలిపింది. రాత్రి 10 గంటల వరకూ తాను కూడా అక్కడే ఉన్నానని, పిల్లలు నిద్రిస్తున్న నేపథ్యంలో ఇంటికి వెళ్దామని భర్తను పిలిచినట్లు ఆమె తెలిపింది. కాగా డీజే డ్యాన్స్ జరుగుతుండడంతో తాను ఇంకొంత సమయం ఇక్కడేసుంటానని తన భర్త చెప్పడంతో తాను ఇంటికి వెళ్లిపోయినట్లు గంగమ్మ తెలిపింది. ఉదయం తాను నిద్రలేచి భర్త ఇంటికి రాని విషయం గమనించి బంధువులకు ఫోన్ చేసినా ఆచూకీ తెలియలేదని ఆమె పేర్కొంది. అనంతరం బంధువుల సాయంతో ఊరిలో గాలిస్తున్న క్రమంలో అంగన్వాడీ భవనం వెనుక తన భర్త మృతదేహం పడి ఉన్నట్లు తెలిసిందని ఆమె తెలిపింది. హత్య కేసులో జైలుకు వెళ్లిన తన భర్త ఇటీవలే బెయిల్‌పై వచ్చాడని, ఇంతలోనే ఈ ఘోరం చోటు చేసుకుందని గంగమ్మ వాపోయింది. దర్యాప్తు కొనసాగుతోంది ఈ సంఘటనా స్థలాన్ని చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్ పరిశీలించి హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. బుధవారం రాత్రి ఏం జరిగిందనే దానిపై ఆయన స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్యాప్తు కొనసాగుతోందని, గతేడాది జరిగిన రామయ్య హత్య కేసులో రమేష్ నిందితుడు కావడంతో ప్రతీకార హత్య కోణంలోనూ విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. -
ఆ కుటుంబానికి తీరని షాక్
● బాలుడిని కబళించిన విద్యుత్ ● శోకసంద్రంలో మాతృమూర్తి గండేపల్లి: ఆ కుటుంబానికి విద్యుత్ తీరని షాక్ ఇచ్చింది. చేతికి అందివస్తున్న కొడుకును మింగేసింది. కన్న తల్లికి గుండెకోతను మిగిల్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గండేపల్లి మండలం కె.నాయకంపల్లికి చెందిన సేవా జ్యోతిబాబు, గంగాభవాని దంపతులకు తొలుత ఇద్దరు ఆడ శిశువులు, రెండోసారి ఇద్దరు ఆడ శిశువులు, మూడో కాన్పులో ఇద్దరు మగ శిశువులు జన్మించారు. ఆ కుటుంబంలో ఆ ఆనందం కొన్ని రోజులకే నిలిచింది. కొన్నాళ్లకు తొలి కాన్పులో జన్మించిన ఇద్దరిలో ఒకరు, రెండో కాన్పులో జన్మించిన ఇద్దరిలో ఒకరు మృతి చెందారు. ఆ బాధను దిగమింగుకుని జీవితాన్ని వెళ్లబుచ్చుతున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా, నాటి నుంచి అన్నీ తానై అనేక కష్టాలను ఎదుర్కొంటూ నలుగురు పిల్లలను గంగాభవాని పెంచుకుంటుంది. మగ కవల్లో పెద్ద వాడైన రాకేష్, చిన్న వాడైన బాల లోకేష్ అనే పండు (16) ఇటీవల పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. కవలల్లో ఒక్కొక్కరుగా మిగిలిన మల్లిక నర్సింగ్ చేస్తుండగా, సుచిత్ర ఇంటర్ పూర్తి చేసినట్టు తెలిసింది. తల్లికి తోడుగా ఉంటూ.. చిన్న వయసులోనే తండ్రి మృతి చెందడంతో తల్లి కష్టాన్ని కళ్లారా చూస్తున్న రాకేష్, లోకేష్‌లు చదువుకుంటూ కూలి పనులు చేస్తూ తల్లికి ఆర్థికంగా చేదోడుగా ఉంటున్నారు. ఇందులో భాగంగా గురువారంలోకేష్ సూరంపాలెం వద్ద ఓ ప్రైవేట్ కళాశాలకు వేరే వ్యక్తి ద్వారా సెంట్రింగ్ పనికి హెల్పర్‌గా వెళ్లాడు. పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురికావడంతో తోటి సిబ్బంది కళాశాల వాహనంపై పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. బాధిత కుటుంబానికి కళాశాల యాజమాన్యం న్యాయం చేయాలంటూ గ్రామస్తులు, బాధిత కుటుంబీకులు మృతదేహంతో ఆ కళాశాల ఎదుట ఏడీబీ రోడ్డుపై బైఠాయించారు. గ్రామ పెద్దలతో చర్చల అనంతరం న్యాయం చేస్తామంటూ కళాశాల యాజమాన్యం మాట ఇచ్చినట్టు బాధితులు తెలిపారు. సీఐ బి.తిరుపతి, గండేపల్లి ఎస్సై యూవీ శివ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా తమ్ముడు అంటూ మృతుడి ఇద్దరు అక్కలు, అన్న విలపిస్తున్న తీరు చూపరులను కంట తడిపెట్టించింది. -
వాడపల్లి వెంకన్నకు రికార్డు స్థాయి ఆదాయం
– 50 రోజులకు రూ 3.24 కోట్లు ఆత్రేయపురం : కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి హుండీల ద్వారా 50 రోజులకు రూ.3,24,82,615 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. దేవదాయ శాఖ జిల్లా అధికారి వి.సత్యనారాయణ, రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్‌టీపీటీ శ్రీనివాస్, గ్రూపు దేవాలయాల ఈఓలు పీవీవీఎస్ కామేశ్వరరావు, ఎం.సత్యనారాయణల సమక్షంలో గురువారం హుండీల ఆదాయం లెక్కించారు. శ్రీ విశ్వేశ్వరస్వామి హుండీలతో కలిపి రూ.2,44,76,932, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.80,05,683 మేర ఆదాయం లభించిందని ఈఓ వివరించారు. బంగారం 73 గ్రాములు, వెండి 1,544 గ్రాములు, 14 దేశాలకు చెందిన 51 కరెన్సీ నోట్లు లభించాయని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, అర్చకులు, వేద పండితులు, శ్రీవారి సేవకులు, రావులపాలెం కరూర్ వైశ్యా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి ముఠా అరెస్టు రంపచోడవరం: గంజాయి ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్డీపీఓ అష్రిఫ్ అలీ తెలిపారు. రంపచోడవరం పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన కథనం ప్రకారం.. సీఐ ఎన్.సన్యాసినాయుడు, ఎస్సై రమేష్ రంప గ్రామంలో తనిఖీలు చేస్తున్నారు. నాలుగు బైక్‌లపై వస్తున్న 11 మంది వ్యక్తులు తనిఖీలను గమనించి వెనక్కి పారిపోతుండగా పోలీసులు వెంబడించారు. రెండు బైక్‌లపై ఉన్న ఏడుగురిని పట్టుకున్నారు. మిగిలిన రెండు బైక్‌లపై నలుగురు తప్పించుకున్నారు. పట్టుబడిన వారి నుంచి 24 కిలోల గంజాయి, రెండు బైక్‌లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారంతా ఒక గ్యాంగ్‌గా ఏర్పడి కాకినాడ జిల్లా పెద్దాపురం, కొయ్యూరు పరిధిలో అనేక బైక్‌లు, ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు తేలింది. వారి నుంచి ఆరు బైక్‌లు, 33 గ్రాముల బంగారం, 1.85 గ్రాముల కు పైగా వెండి, కెమెరా తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సామర్లకోటకు చెందిన కొరిమిల్లి సురేష్, పి.వెంకట సత్యవరప్రసాద్, రొంగల సూర్యకిరణ్, షేక్ యాసిన్, సాయి, ఆర్.అఖిల్, ప్రసాద్, శివరామ దుర్గారెడ్డి, రంప గ్రామానికి చెందిన బాబ్లు, పెద్దబారంగికి చెందిన లిల్లీ, కుంజా సిద్ధులను అరెస్ట్ చేశారు. కొత్తవీధి పరిధిలో పులి సంచారం రాజవొమ్మంగి: స్థానిక అటవీ క్షేత్రంలోని వయ్యేడు ఫారెస్ట్ బీట్‌లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉషారాణి గురువారం రాత్రి తెలిపారు. వయ్యేడు అటవీ ప్రాంతానికి దగ్గరలోని కొత్తవీధి, కిమ్మిలిగెడ్డ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచనలు చేశామన్నారు. కాగా పులి జనావాసాల్లో వచ్చే అవకాశం లేదని చెప్పారు. -
గాలివాన బీభత్సం
పిడుగు పడి ఇద్దరి మృతి అడ్డతీగల/రంపచోడవరం: పోలవరం జిల్లా డి.రామవరంలో గురువారం పిడుగుపడి ఉపాధ్యాయుడు సుమర్ల గుణ అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామంలో వివాహానికి వెళ్లి వస్తూండగా.. వర్షం వస్తోందని డి.రామవరం శివారున మామిడి చెట్టు కిందకు చేరారు. అక్కడ నేరుగా పిడుగు పడటంతో గుణ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన సుమర్ల అబ్బాయిరెడ్డి, నాగేశ్వరరావు ఈ విషయం తెలిపారు. కాగా, మారేడుమిల్లి మండలం ఇవ్వాంపల్లికి చెందిన ఓ బాలుడు కూడా పిడుగు పడి మరణించాడు. గ్రామ సమీపంలోని కొండపోడు వద్ద తల్లి భూమమ్మతో కలసి ఉన్న కత్తుల తేజశ్వర్రెడ్డి (10)పై పిడుగు పడి మృతి చెందాడు. పక్కనే ఉన్న అతడి సోదరుడు సత్యనారాయణరెడ్డి అపస్మారక స్థితికి చేరుకోవడంతో రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు.రంప రోడ్డులో నేల కూలిన చెట్టు దేవరపల్లి వద్ద పడిపోయిన విద్యుత్ స్తంభం రంపచోడవరం: ఏజెన్సీలో గాలివాన బీభత్సం సృష్టించింది. అనేక గ్రామాల్లో భయనక వాతావరణం నెలకొంది. పిడుగుపాటుకు ఇద్దరు మృత్యువాత పడడంతో పాటు అనేక చోట్ల చెట్లు నేలకూలాయి. మారేడుమిల్లి – రంపచోడవరం రహదారిలో దేవరపల్లి వద్ద ప్రధాన రహదారిపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంపచోడవరం సమీపంలోని రంప రోడ్డుపై చెట్లు విరిగి పడిపోయాయి. దీంతో, రంప పర్యాటక ప్రాంతానికి వెళ్లిన పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. అధికార యంత్రాంగం చెట్లను తొలగించి, రాకపోకల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. -
రత్నగిరిపై భక్తుల కోసం ‘ఫ్రీ వైఫై’
అన్నవరం: స్థానిక వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులు వ్రతం, ప్రసాదం, ఇతర సేవా టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు వీలుగా ‘ఫ్రీ వైఫై’ అందుబాటులోకి తెచ్చారు. గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ‘క్యాష్ ట్రబుల్’ శీర్షికన కథనం ప్రచురితమైంది. డిజిటల్ పేమెంట్స్ మాత్రమే దేవస్థానంలో అమలు చేస్తూ, నగదు తీసుకోవడం మానేయడంతో ఇంటర్నెట్ సిగ్నల్స్ లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై వచ్చిన కథనానికి అధికారులు స్పందించి రామాలయం సమీపంలో బుకింగ్ కౌంటర్ వద్ద, పశ్చిమ రాజగోపురం సమీప బుకింగ్ కౌంటర్ వద్ద ప్రీ వైఫే అందుబాటులోకి తెచ్చారు. సెల్ ఫోన్లో వైఫైని టచ్ చేస్తే ‘అన్నవరం ఫ్రీ వైఫై’ ఓపెన్ అవుతుంది. దానిపై క్లిక్ చేస్తే ఆటోమెటిక్‌గా సెల్‌కు వైఫై కనెక్ట్ అవుతుందని అధికారులు తెలిపారు. అదే విధంగా అన్ని కౌంటర్లలో వైఫై త్వరగా కనెక్ట్ అయ్యేందుకు రూటర్స్ కూడా అమర్చనునట్లు వివరించారు. కాగా, ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనంపై కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా స్పందించి దేవస్థానం అధికారులను వివరణ కోరారు. నేడు మంత్రి లోకేష్ ఇంటికి శాంతియుత ర్యాలీ రాజమహేంద్రవరం రూరల్: సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఇంటికి శాంతియుత పాదయాత్ర నిరసన ర్యాలీ చేపడుతున్నట్టు సమగ్ర శిక్ష జేఏసీ జిల్లా అధ్యక్షుడు మెప్పిలి రఘునాథ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుని అక్కడి నుంచి మంత్రి నారా లోకేష్ ఇంటికి ర్యాలీ చేపడతామన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో సమాన పనికి సమాన వేతనం ఇస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా లోకేష్ ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు అమలయ్యే వరరూ పోరాటం కొనసాగుతుందని రఘునాథ్ స్పష్టం చేశారు. విద్యుదాఘాతానికి వ్యక్తి దుర్మరణం చింతూరు: ఏడుగురాళ్లపల్లిలో బుధవారం రాత్రి విద్యుదాఘాతానికి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ గ్రామంలో వలిపిరెడ్డి నిరంజన్ (43) రాత్రి 11 గంటల సమయంలో తన బడ్డీ కొట్టును గునపంతో జరిపేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో బడ్డీకి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో నిరంజన్ షాక్‌కు గురయ్యాడు. అతన్ని వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యలో మృతి చెందాడు. పార్కింగ్ విషయంలో గొడవ మహిళ మృతి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పార్కింగ్ విషయంలో పడిన గొడవలో ఓ మహిళ మృతి చెందింది. దీనిపై రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఆ వివరాల ప్రకారం.. స్థానిక తుమ్మలావకు చెందిన ఇమ్మంది వెంకటరత్నం (55) ఓ భవనంలోని మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. అదే భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోకి నెల క్రితం మురుకుర్తి శ్రీనివాస్ అద్దెకు దిగారు. ఇదిలా ఉండగా ఈ రెండు కుటుంబాలకు భవనంలో పార్కింగ్ విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఇమ్మంది వెంకటరత్నంను శ్రీనివాస్ రెండో కుమారుడు చేతితో తోసేశాడు. ఈ క్రమంలో ఆమె కింద పడిపోయింది. వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుడు ఇమ్మంది శివనారాయణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధికి తాపసోపాలు
సాక్షి, రాజమహేంద్రవరం: రోజురోజుకూ సూర్యుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ప్రతాపం చూపిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పులు తీవ్రంగా వీస్తున్నాయి. పొట్టకూటి కోసం ఎర్రటి ఎండలో సైతం శ్రమిస్తున్న ఉపాధి హామీ పథకం కూలీలపై ప్రభుత్వం ఏమాత్రం కనికరం చూపడం లేదు. నిబంధనల ప్రకారం పని ప్రదేశంలో టెంట్లు, తాగునీరు వంటి వసతులు కల్పించాలి. కానీ, ప్రభుత్వం ఆ అటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో కూలీలు అల్లాడిపోతున్నారు. కనీస సౌకర్యాలేవీ! ● పని ప్రదేశాల్లో ఉపాధి కూలీలకు తాగునీటి సదుపాయం కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నెల 1న ఆదేశాలు జారీ చేసింది. కానీ, క్షేత్ర స్థాయిలో ఎక్కడా తాగునీటి సదుపాయం కల్పించిన దాఖలాల్లేవు. దీంతో, కూలీలు ఇంటి నుంచి బాటిళ్లతో తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. ● కూలీలు వడదెబ్బ బారిన పడకుండా ప్రతి గంటకు నీరు తాగేలా వాటర్ బెల్ పద్ధతి అమలు చేయాలి. ఇది కూడా కాగితాలకే పరిమితమైంది. ● పని చేసి, అలసిసొలసిన కూలీలు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు టెంట్లు, తాటాకు, ఈతాకు పందిళ్లు వేయాలి. ఎక్కడా ఆ పరిస్థితి లేకపోవడంతో కూలీలు ఎండలో ఆపసోపాలు పడుతున్నారు. మరి కొందరు చెట్ల నీడన సేద తీరుతున్నారు. ● పని ప్రదేశంలో ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలి. కానీ ఎక్కడా అటువంటి దాఖలాల్లేవు. ● ఉపాధి కూలీలు ఉదయం 6 గంటలకే పని ప్రదేశానికి చేరుకుని, తిరిగి 11 గంటలకు ఇళ్లకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలి. అవసరమైతే సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ పనులు చేసుకునే వెసులుబాటు కల్పించాలి. అయితే, ఉదయం 9 గంటల నుంచే వాతావరణం నిప్పుల కొలిమిలా మారుతోంది. అయినప్పటికీ ఉపశమన చర్యలు ఉండటం లేదు. ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి సౌకర్యాలన్నీ కల్పించడంతో పాటు కూలీలకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సైతం అందజేసేవారు. వీటన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. అంతా అస్తవ్యస్తం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. కూలీలకు సకాాలంలో వేతనాలు ఇవ్వడం లేదు. సగటున రోజుకు రూ.300 వరకూ మాత్రమే కూలీ గిట్టుబాటు అవుతోంది. చాలీచాలని ఆ వేతనంతో కుటుంబాన్ని పోషించుకోలేక నిరుపేద శ్రామికులు నానా అవస్థలూ పడుతున్నారు. సాధారణంగా ఉపాధి కూలీలకు ప్రతి వారం వేతనాలు చెల్లించడం ఆనవాయితీ. కానీ, చంద్రబాబు ప్రభుత్వ పాలనలో వస్తున్న వేతనమే తక్కువ కాగా.. అది కూడా గత ఏడాది జూన్ నుంచి సక్రమంగా చెల్లించడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం లేకపోవడంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. రోజూ క్రమం తప్పకుండా పనులకు వెళుతున్నా.. తమ ఖాతాల్లో నయా పైసా జమ కావడం లేదని కూలీలు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో 30 లక్షల పని దినాలు కల్పించాలని డ్వామా అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కానీ, వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో పనులకు వచ్చేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదు. సాంకేతిక సమస్యలు పనులు చేసిన కూలీలకు కొత్తగా ఈ–కేవైసీ తప్పనిసరి చేశారు. పని పూర్తయిన అనంతరం పని ప్రదేశంలోనే కూలీలకు ఐరిస్ తీసి, ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలి. అప్పుడే కూలీలు పనులకు హాజరైనట్లు పరిగణిస్తారు. ఈ నిబంధన కూలీలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఒకే ప్రాంతంలో వంద మంది కూలీలు పనులు చేస్తూంటే సర్వర్ సక్రమంగా పని చేయకపోవడం, నెట్వర్క్ లేకపోవడం వంటి సమస్యలతో ఐరిస్ నమోదులో తీవ్ర జాప్యం జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకూ ఐరిస్ తీయడానికే సరిపోతోంది. కొందరికి ఐరిస్ నమోదు కాకపోవడంతో వెనుదిరగాల్సి వస్తోంది. వీబీజీ రామ్‌జీపై గందరగోళం మరోవైపు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం శ్రీవీబీజీ రామ్జీశ్రీగా మార్చింది. నిబంధనల్లో సైతం మార్పులు చేసింది. కానీ, దీనిపై అధికారులకు నేటికీ మార్గదర్శకాలు అందలేదు. దీంతో, 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఏ పనులు కల్పించాలన్న విషయమై అధికారుల్లో గందరగోళం నెలకొంది. సాంకేతిక సమస్యలు పనులు చేసిన కూలీలకు కొత్తగా ఈ–కేవైసీ తప్పనిసరి చేశారు. పని పూర్తయిన అనంతరం పని ప్రదేశంలోనే కూలీలకు ఐరిస్ తీసి, ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలి. అప్పుడే కూలీలు పనులకు హాజరైనట్లు పరిగణిస్తారు. ఈ నిబంధన కూలీలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఒకే ప్రాంతంలో వంద మంది కూలీలు పనులు చేస్తూంటే సర్వర్ సక్రమంగా పని చేయకపోవడం, నెట్వర్క్ లేకపోవడం వంటి సమస్యలతో ఐరిస్ నమోదులో తీవ్ర జాప్యం జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకూ ఐరిస్ తీయడానికే సరిపోతోంది. కొందరికి ఐరిస్ నమోదు కాకపోవడంతో వెనుదిరగాల్సి వస్తోంది. వీబీజీ రామ్‌జీపై గందరగోళం మరోవైపు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం శ్రీవీబీజీ రామ్జీశ్రీగా మార్చింది. నిబంధనల్లో సైతం మార్పులు చేసింది. కానీ, దీనిపై అధికారులకు నేటికీ మార్గదర్శకాలు అందలేదు. దీంతో, 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఏ పనులు కల్పించాలన్న విషయమై అధికారుల్లో గందరగోళం నెలకొంది. ఉపాధి కూలీలకు ఎండ దెబ్బ పని ప్రదేశంలో వసతులు కరువు కనిపించని తాగునీరు, టెంట్లు మజ్జిగ పంపిణీకి మంగళం పాడిన ప్రభుత్వంజిల్లాలో ఉపాధి పథకం బ్లాకులు 21 పంచాయతీలు 343 మంజూరైన జాబ్‌కార్డులు 1,81,000 కూలీలు 2,76,000 యాక్టివ్ జాబ్‌కార్డులు 1,36,000 పనులు వినియోగించుకుంటున్న కూలీలు 1,91,000 ప్రతి రోజూ వస్తున్న కూలీలు 30,000 -
హైవేలో 18 బ్లాక్ స్పాట్లు
● ప్రమాదాల తగ్గింపునకు చర్యలు ● ఐజీ అశోక్ కుమార్ గండేపల్లి: జగ్గంపేట నియోజకవర్గంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్న 18 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్టు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. గండేపల్లి పోలీస్ స్టేషన్లో గురువారం ఆయన వార్షిక తనిఖీలు చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో హైవేపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. బ్లాక్ స్పాట్ల వద్ద తగిన చర్యలు తీసుకునేవిధంగా హైవే అధికారులతో మాట్లాడామని చెప్పారు. త్వరలో రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యే అవకాశముందని, తద్వారా ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అన్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నేపథ్యంలో తగిన భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులను, వారి వాహనాలను మాత్రమే రాజమహేంద్రవరం నగరంలోనికి అనుమతిస్తామని, ఇతర వాహనాలను దారి మళ్లిస్తామని తెలిపారు. బాల్య వివాహాలను నివారిస్తామన్నారు. చోరీలకు కళ్లెం వేసేందుకు సీసీ కెమెరాలను పెంచి, పాత నేరస్తులపై నిఘా పెంచుతామని ఐజీ చెప్పారు. రేంజి పరిధిలోని ఆరు జిల్లాల్లో అవసరమైన చోట్ల సుమారు 25 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్య నాయకుల విగ్రహాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. హైవేపై పెట్రోలింగ్ పెంచుతామని, కొత్త వాహనాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు సిబ్బందికి త్వరలో విధులు అప్పగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హెల్మెట్ వాడకంపై సిబ్బందికి, వాహనదారులకు ఐజీ అశోక్ కుమార్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్, పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్, జగ్గంపేట సీఐ బి.తిరుపతి, ఎస్సైలు పాల్గొన్నారు. -
మద్దతు ఏదీ?
● జిల్లాలో 26,915 ఎకరాల్లో మొక్కజొన్న సాగు ● కానరాని కొనుగోలు కేంద్రాలు ● క్వింటాల్ మద్దతు ధర రూ.2,400 ● దళారులిస్తున్నది రూ.1,650 ● పట్టించుకోని ప్రభుత్వం దేవరపల్లి: ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించకపోవడంతో చేసిన అప్పులు తీర్చే దారి కానరాక అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. తాము ఇబ్బందులు పడుతున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కనీసంగా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 10,456 మంది రైతులు, 26,915 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. గోపాలపురం, నల్లజర్ల, దేవరపల్లి, కొవ్వూరు, పెరవలి, సీతానగరం తదితర మండలాల్లో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు జరిగింది. వాతావరణం అనుకూలించడం, చీడపీడలు లేకపోవడంతో ఈ ఏడాది దిగుబడులు దండిగా వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది. దీంతో, పెట్టుబడులు పోనూ లాభాలు వస్తాయని రైతులు ఆశించారు. కానీ, ప్రభుత్వం ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ఫలితంగా మద్దతు ధర ఎక్కడా అమలు కావడం లేదు. గత్యంతరం లేక రైతులు నష్టానికి దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. సీజన్ ప్రారంభంలో క్విటాల్‌కు రూ.2,250 చెల్లించగా, రానురానూ ఆ ధరను దళారులు తగ్గించేశారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.1,450 నుంచి రూ.1,650 మాత్రమే చెల్లిస్తున్నారు. గిట్టుబాటు ధర వచ్చేంత వరకూ వేచి చూద్దామని భావించినా.. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు కంటి మీద కునుకు కరువవుతోంది. అమ్మకానికి సిద్ధంగా ఉన్న మొక్కజొన్న కండెలను దాచుకుందామంటే గిడ్డంగి సదుపాయం లేదు. వర్షాలకు తడిస్తే పంటను అడిగే వారే కనిపించడం లేదు. గుండుగొలను – కొవ్వూరు మధ్య జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లపై మొక్కజొన్న కండెలు ఆరబెడుతున్నారు. కొనుగోలుదార్ల కోసం రైతులు కళ్లాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఎవరైనా కొనుగోలు చేసినా మద్దతు ధర దక్కకపోవడంతో ఎకరాకు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకూ నష్టపోతున్నారు. కనీస పెట్టుబడి కూడా దక్కడం లేదని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని రైతులు వాపోతున్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొక్కజొన్న రైతులకు అన్ని విధాలా అండగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,200 మద్దతు ధర ప్రకటించగా.. నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సొసైటీల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేసింది. ఫలితంగా రైతుకు ఎకరాకు సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల ఆదాయం వచ్చింది. అటువంటిది నేడు చంద్రబాబు సర్కారు తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మొక్కజొన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతుకు కోలుకోలేని దెబ్బ కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎకరం కౌలు రూ.50 వేలు, పెట్టుబడి రూ.40 వేలు కలిపి మొత్తం రూ.90 వేలు ఖర్చయ్యింది, ఎకరాకు దిగుబడి 40 నుంచి 45 క్వింటాళ్లు వచ్చింది. ధర లేక గిట్టుబాటు కాలేదు. క్వింటాల్ మద్దతు ధర రూ.2,400 ఉండగా, మొదట్లో రూ.1,950కి కొనుగోలు చేశారు. ప్రస్తుతం రూ.1,450 నుంచి రూ.1,650 మాత్రమే ఇస్తున్నారు. ఎకరాకు రూ.20 వేల నష్టం వస్తోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధరకు కొనుగోలు చేస్తే గిట్టుబాటు అయ్యేది. – వల్లభనేని కిషోర్, కౌలు రైతు, పట్లంట్ల, దేవరపల్లి మండలం గిట్టుబాటు ధర కల్పించాలి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మొక్కజొన్న పంటకు వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలి. – వల్లభనేని సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, వెదుళ్లకుంట, గోపాలపురం మండలం -
బీపీ.. లేకుంటే హ్యాపీ
● అధిక రక్తపోటుతో అనర్థాలు ● జిల్లాలో 1.15 లక్షల మంది బాధితులు ● 17న వరల్డ్ హైపర్ టెన్షన్ డే రాయవరం: జీవన శైలి మారింది.. ప్రతి పనిలోనూ ఒత్తిడి పెరిగింది.. దీనివల్ల అధిక రక్తపోటు (బీపీ) బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. దీని కారణంగా గుండె, మెదడు, నరాలు, కిడ్నీపై చెడు ప్రభావాన్ని చూపిస్తూ అనారోగ్యం బారిన పడేస్తోంది. చాలా మందికి బీపీ ఉందన్న విషయాన్ని గమనించే లోపే జరిగే అనర్థం జరిగిపోతోంది. ఈ నెల 17న ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఎన్సీడీ కార్యక్రమం ద్వారా వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి బీపీ బాధితులను గుర్తించారు. మొత్తం 18,11,758 మందికి స్క్రీనింగ్ చేయాల్సి ఉండగా, 10,12,037 మందికి నిర్వహించారు. ఇందులో 1,15,100 మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్లు తెలుసుకున్నారు. శరీరంలో రక్తాన్ని అన్ని రక్తనాళాలకు గుండె ఒత్తిడి (ప్రెజర్) చేసి పంపిస్తోంది. అధిక వేగంతో రక్తాన్ని ప్రసరింపజేసే శక్తినే బ్లడ్ ప్రెజర్‌గా పేర్కొంటారు. ఒక వ్యక్తి గుండె సాధారణ స్థితిలో బ్లడ్ ప్రెషర్ (బీపీ) 120/80గా పేర్కొంటారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్ద వయసులో కొన్ని పరిస్థితుల్లో 140/90గా ఉన్నా సాధారణ స్థితిగానే నిర్ధారిస్తున్నారు. చాలా మందికి రక్తపోటు లక్షణాలు ఉన్నట్లు కూడా తెలియక పోవడం వల్ల ఉన్నట్లుండి గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతున్నారు. తలనొప్పి, అలసట అనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించి బీపీ చెకప్ చేయించుకోవాలి. హైపర్ టెన్షన్ అసాధారణ రీతిలో 160/100, 170/110, 200/120 రావడంతో ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. ఒక్కోసారి మెదడు, గుండెలోనూ నరాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. పక్షవాతం, కిడ్నీ సమస్యలు, నరాల సమస్యలు ఏర్పడే ప్రమాదముంది. ఇటీవల 20–30 ఏళ్ల లోపు యువత గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలతో మృత్యువాత పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కారణాలు.. లక్షణాలు సాధారణంగా అధిక రక్తపోటు వయసు మళ్లిన వారికి వస్తుంది. జన్యుపరమైన కారణాలతో కూడా సంక్రమిస్తుంది. ధూమపానం, ఊబకాయం, ఏ పనిచేయకుండా ఒకేచోట గంటల తరబడి ఉండడం, హైపో థైరాయిడ్, ఒత్తిడి, అనారోగ్యకర ఆహార అలవాట్లతో పాటు కంటికి సరిపడా నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బు ద్వారా బీపీ వస్తుంది. మెడ నరాల లాగేస్తున్నట్లు ఉండడం, కళ్లు తిరగడం, ఆకస్మికంగా తూలిపోవడం, తరచూ తలపోటు రావడం, ఒళ్లంతా చెమటలు పట్టడం, యూరిన్ తక్కువగా రావడం, కాళ్లు తిమ్మిర్లుగా ఉండడం బీపీ లక్షణాలు. జాగ్రత్తలు తీసుకుంటే మేలు హైపర్ టెన్షన్‌తో బాధపడే రోగులు ముఖ్యంగా ఆహార పదార్థాల్లో ఉప్పును తక్కువగా వినియోగించాలి. మసాలాలు, నిల్వ పచ్చళ్లు, కారం తగ్గించాలి. ప్రతి రోజూ గంట పాటు సాధారణ వ్యాయామం, యోగా వంటివి చేయడం మంచిది. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలు, ఆల్కహాల్, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎన్సీడీ సర్వే ద్వారా గుర్తింపు అసంక్రమిత వ్యాధులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా ఇంటింటా ఎన్సీడీ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సర్వేలో ఎక్కువగా అధిక రక్తపోటు కేసులు నమోదవుతున్నాయి. వైద్యుల సూచనలు పాటిస్తూ బీపీ, షుగర్ వ్యాధులను నియంత్రించుకోవచ్చు. –డాక్టర్ జి.హరిశ్చంద్రప్రసాద్, ఎన్సీడీ, ఆర్బీఎస్కే జిల్లా ప్రోగ్రాం అధికారి ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం ప్రస్తుత జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా అధిక రక్తపోటు బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహార శైలితో అధిక రక్తపోటును అధిగమించవచ్చు. –ఎన్.వసుంధర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, తూర్పుగోదావరి -
శ్రీ ప్రకాష్ విద్యార్థుల విజయకేతనం
బాలాజీచెరువు (కాకినాడ): సీబీఎస్ఈ ప్రకటించిన ప్లస్ – 2 ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధించారని ఆ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ ప్రకాష్ తెలిపారు. ఎంఈఏ గ్రూపులో కె.లాస్య మేఘన 479/500, బైపీసీలో బి.స్పృహ 471/500, ఎంపీసీలో వి.లక్ష్మీనారాయణ 454/500, బీఈఏలో కె.అన్విత 420/500 మార్కులు సాధించి అగ్రస్థానాల్లో నిలిచారన్నారు. నూటికి నూరుశాతం ఉత్తీర్ణతా శాతంతో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. ఆ విద్యార్థులను విద్యాసంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహారావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. 15న కాకినాడలో ధర్నా రాయవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దివ్యాంగుల సమస్యలను జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారులు గాలికి వదిలేస్తున్నారని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి భరత్ కుమార్ విమర్శించారు. ఆయన బుధవారం వెంటూరులో మాట్లాడుతూ వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ సంఘ తరఫున అనేకసార్లు విన్నవించినా ఫిర్యాదులను కార్యాలయ అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని దివ్యాంగులు కాకినాడలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం వద్ద ఈ నెల 15న జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కె.లాస్య మేఘన బి.స్పృహవి.లక్ష్మీనారాయణ కె.అన్విత -
హామీల ఎత్తిపోతలు!
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ చందంగా ఉంది సీఎం చంద్రబాబు తీరు. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఎడాపెడా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు తాను అధికారంలోకి వస్తే బ్యాంకు వడ్డీతో సహా చెల్లిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా పట్టించుకోలేదు. అసలు పరిహారం అందుతుందా..లేదా..? అన్న మీమాంస నెలకొంది. ఇదీ సంగతి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వం 2017లో గోదావరిపై రెండు లిఫ్ట్ ఇరిగేషన్ల నిర్మాణం చేపట్టింది. వాటిలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ (మొదటి దశ) ప్రాజెక్టు ఒకటి. తూర్పుగోదా వరి జిల్లా సీతానగరం మండలం గోదావరి ఎడమగట్టున రూ.1,638 కోట్లతో పురుషోత్తపట్నంలో 2017–18లో ఎత్తిపోతల పథకం నిర్మించారు. ఇందుకుగాను 312 మంది రైతుల నుంచి సుమారు 250 ఎకరాలను ప్రభుత్వం తీసుకుంది. ఆ భూములకు పరిహారం ఇచ్చే సమయంలో 2013 భూసేకరణ చట్టం పక్కన పెట్టి, ప్రత్యేకంగా 88 జీఓ విడుదల చేసింది. కన్సెంట్ అవార్డు పాస్ చేసి ఎకరానికి రూ.24 లక్షలు, రూ.28 లక్షలుగా రెండు రకాల పరిహారం ప్రకటించింది. ఆ సమయంలో బయట మార్కెట్లో ఎకరం భూమి రూ.40 లక్షలు పైబడి ధర ఉండటంతో ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని వ్యతిరేకిస్తూ రైతులు రోడ్డెక్కారు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయం కోరుతూ ఆందోళన చేస్తున్న అన్నదాతలపై చంద్రబాబు ప్రభుత్వం లాఠీచార్జి చేయించింది. రైతుల నిరాహార దీక్ష శిబిరాలను బలవంతంగా తొలగింపజేసింది. న్యాయస్థానం ఆదేశించినా? 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు సైతం చంద్రబాబు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017లో చంద్రబాబు అవార్డు ప్రకటించిన రూ.17.81 లక్షలు ట్రిబ్యునల్‌లో జమ చేయకపోవడం మరో మోసం అంటున్నారు. అక్టోబర్ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారంలో మొదటి ఏడాది 9 శాతం, రెండో ఏడాది నుంచి ఇప్పటి వరకు 15 శాతం వడ్డీతో నాలుగు వారాల్లో చెల్లించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలు సైతం అమలు కాలేదు. మరోసారి మోసపోయిన రైతులు 2023లో పురుషోత్తపట్నం వచ్చిన చంద్రబాబును భూముల పరిహారంపై రైతులు నిలదీశారు. అధికారంలోకి రాగానే బ్యాంక్ వడ్డీ వేసి ఆరు నెలల్లో ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా.. చెల్లించకపోవడంతో మరోసారి చంద్రబాబును నమ్మి రైతులు మోసపోయినట్టయింది. పరిహారం తీసుకోకుండానే మృతి ఎత్తిపోతల నిర్మాణంలో పురుషోత్తపట్నం, చిన కొండేపూడి, వంగలపూడి, రామచంద్రపురం తదితర గ్రామాల్లోని 72 ఎకరాల భూములకు చెందిన రైతులకు ఇప్పటికీ పరిహారం లేదు. వీరిలో కొండేటి కృష్ణారావు, దుద్దుపూడి చిట్టెమ్మ, సురవరపు తాతారావు, నీరుకొండ సీతారత్నం, కోడేబత్తుల దుర్గం వంటి రైతులు చనిపోయారు. అయినా చంద్రబాబు ప్రభుత్వంలో చలనం లేదు. వైఎస్సార్ సీపీ పోరాటం రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అప్పట్లో వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు హయాంలో రైతులపై పెట్టిన కేసులను ప్రత్యేక జీవో ద్వారా ఎత్తి వేయించింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృషి ఉంది. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి రైతుల పక్షాన పోరాడారు. ఆదుకున్న వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేక.. ఎన్జీటీ అపరాధ రుసుం విధించింది. పథకం నుంచి సాగునీరు నిలిపివేసింది. అప్పట్లో రైతులకు మాజీ సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. 2022లో ఎన్జీటీకి అపరాధ రుసుం కింద రూ.2.5 కోట్లు చెల్లించారు. సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రైతులకు తీరని అన్యాయం 312 మంది నుంచి 259 ఎకరాల సేకరణ తాను అధికారంలోకొస్తే బ్యాంకు వడ్డీతో సహా చెల్లిస్తానని చంద్రబాబు హామీ రెండేళ్లయినా పట్టించుకోని వైనం పరిహారం అందకుండా పదిమంది మృత్యువాత ఆమోదయోగ్యమైన పరిహారం ఇవ్వాలి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రైతులకు ఆమోదయోగ్యమైన పరిహారం వడ్డీతో సహా చెల్లించాలి. పురుషోత్తపట్నం, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలను చంద్రబాబు ప్రభుత్వం డబ్బు ఎత్తి పోయడానికే రూపకల్పన చేసింది. ఆనాడు పట్టిసీమ త్వరితగతిన పూర్తి చేశారని కాంట్రాక్ట్ సంస్థకు ఇన్సెంటివ్ కింద అదనపు సొమ్ము చెల్లించారు. పురుషోత్తపట్నం అనివార్య కారణాలతో ఆలస్యమైందని కాంట్రాక్ట్ సంస్థకు అంచనాలను పెంచి సొమ్ము చెల్లించారు. మరి రైతులు ఏం పాపం చేశారని న్యాయమైన నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టు పోలవరంలో భాగమని అప్పటి టీడీపీ ప్రభుత్వం వాదించింది. పోలవరం డీపీఆర్‌లో మాత్రం చూపించలేదు. సరైన ప్రొసీజర్‌ను ప్రభుత్వం పాటించలేదు. ఫలితంగా హైకోర్టు, సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఎన్నో న్యాయపరమైన చిక్కుల కారణంగా రైతుల పరిహారం పెండింగ్‌లో ఉండిపోయింది. – జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే -
సమన్వయంతో మాదక ద్రవ్యాల నిర్మూలన
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మాదక ద్రవ్యాలు కట్టడి చేయడంలో విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలు పోలీస్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ కీర్తి విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఎన్‌కోర్డ్ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలు వినియోగించకుండా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు నిఘా ఉంచాలన్నారు. ఎవరిౖపైనెనా అనుమానం వస్తే వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ముందుగా పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులకు సమాచారం అందించాలని సూచించారు. అన్ని విద్యాసంస్థల్లో వారానికి ఒక రోజు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థులు మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్టు అనుమానం వస్తే ఈగల్ టీం, శక్తి టీంలకు సమాచారం అందించాలని సూచించారు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ మాట్లాడుతూ మార్చి నెలలో జరిగిన ఎన్‌కోర్డ్ సమావేశం నుంచి ఇప్పటివరకు రూ.13.66 లక్షల విలువైన 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. బాణసంచా తయారీలో భద్రతా ప్రమాణాలు బాణసంచా తయారీ, విక్రయ దుకాణాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ కీర్తి సూచించారు. ఇటీవల చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో తాత్కాలికంగా బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాలను మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుకాణాల పునఃప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని బాణసంచా తయారీ దారుల అసోసియేషన్లు విజ్ఞప్తి చేయడంతో బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో పాటు అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్, ఎస్పీ, జేసీ సమావేశం నిర్వహించారు. అనుమతికి మించి పేలుడు పదార్థాలను నిల్వ ఉంచడం, నైపుణ్యం లేని కార్మికులను వినియోగించడం, భద్రతా ఏర్పాట్లు లేని గదుల్లో తయారీ, అగ్నిమాపక ప్రమాణాలు పాటించకపోవడం వంటి అంశాలే ప్రమాదాలకు కారణాలని అధికారులు వివరించారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డుతో పాటు బీమా సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ఎస్పీ డీ. నరసింహకిశోర్ మాట్లాడుతూ తయారీ కేంద్రంలో సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. జేసీ మేఘస్వరూప్, కొవ్వూరు, రాజమహేంద్రవరం ఆర్టీవోలు కె.ఆనందరావు, ఆర్.శివ రాముడు, జిల్లా అగ్ని మాపక అధికారి కె.మార్టిన్ లూథర్ కింగ్ పాల్గొన్నారు.కలెక్టర్ కీర్తి, ఎస్పీ నరసింహ కిశోర్ -
తిరుగు ప్రయాణంలో విషాదం
● పెళ్లి బృందం వెళుతున్న వ్యాన్ బోల్తా ● 16 మందికి గాయాలు ● ఆస్పత్రికి వెళ్లే సరికి వారిలో ఒకరి మృతి ● క్షతగాత్రులకు పెద్దాపురం సీహెచ్‌సీలో చికిత్స ● మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలింపు గండేపల్లి/సామర్లకోట: వారందరూ ఎంతో సంతోషంగా శుభకార్యానికి హాజరయ్యారు. బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడిపి, భోజనాల అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి పామాయిల్ తోటలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారు. వారిలో ఒకరు ఆస్పత్రికి వెళ్లే సరికి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురం మండలం ఆర్బీపట్నానికి చెందిన కొల్లు సత్యకు గండేపల్లి మండలం యల్లమిల్లికి చెందిన బుంగా సతీష్‌తో బుధవారం యల్లమిల్లిలో వివాహం జరిగింది. ఈ వేడుకకు పెళ్లి కుమార్తె బంధువులు వ్యాన్‌లో వచ్చారు. తిరుగు ప్రయాణంలో గండేపల్లి మండలం పి.నాయకంపల్లి శివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో టర్నింగ్ వద్ద వ్యాన్ అదుపుతప్పి ఆయిల్ పామ్ తోటలోకి పల్టీలు కొట్టుకొంటూ దూసుకుపోయి ఆగింది. బాధితుల ఆర్తనాదాలు విన్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మార్గంలో వెళుతున్న ఇతర ప్రయాణికులతో కలిసి క్షతగాత్రులను ప్రైవేటు వాహనాల్లో పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌తో కలిపి వ్యాన్‌లో 16 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఆరుగురు మహిళలు, ముగ్గరు పురుషులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. వారిలో 14 ఏళ్ల బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎసై యూవీ శివనాగబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దాపురం ఆస్పత్రిలో చికిత్స పెద్దాపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో క్షతగాత్రులకు వైద్యం అందించినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉమామహేశ్వరి తెలిపారు. సీహెచ్ జ్యోతిబాబు, డి.హర్ష, ఆర్.ప్రవీణ్ కుమార్, ఎ.లోవకుమారి, ఆర్.మారియ్య, పి.లోవలక్ష్మి, ఎం.చంద్రావతి, ఎ.వీరదుర్గాప్రసాద్, ఎస్.వెంకటలక్ష్మి, ఎం.బుజ్జి, కె.ఏసురత్నం, కె.సూరిబాబు, సంజన, ఎస్.సురేంద్రలకు వైద్యం అందించామన్నారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే సుశాంత్ కుమార్ (14) మృతి చెందాడన్నారు. మిన్నంటిన రోదనలు పెద్దాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం బుధవారం సాయంత్రం క్షతగాత్రులు, వారి బంధువుల ఆర్తనాదాలతో నిండిపోయింది. విషయం తెలిసిన వెంటనే పెద్దాపురం డీఎస్పీ ఏబీజే తిలక్, పెద్దాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్‌తో కలిసి సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై వి.మౌనిక, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్ చేయాలంటూ ధర్నా
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.5,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఏబీవీపీ నగర శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. విభాగ కన్వీనర్ సత్యసాయి మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మంది విద్యను ఒత్తిడిలో అభ్యసిస్తున్నారన్నారు. ఫీజులు కట్టకపోతే కళాశాలలు పరీక్షలు రాయనివ్వకపోవడంతో ఇబ్బందులు పడతున్నారన్నారు. డిగ్రీలు పూర్తయిన దాదాపు 7 లక్షల మంది సర్టిఫికెట్లు తెచ్చుకోలేక అయోమయంలో ఉన్నారన్నారు. ఫీజులు కట్టకపోయినా పరీక్షలు రాయనివ్వాలని జీఓ జారీ అయినా ఏ ఒక్క కళాశాల పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర కార్యసమితి సభ్యులు వినయ్, ఎస్ఎఫ్డీ కన్వీనర్ లలిత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేష్ పాల్గొన్నారు. కొమరిపాలెం పంచాయతీకి ఐఎస్వో గుర్తింపు అనపర్తి: బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామం అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు గుర్తింపుగా ఇచ్చే ఐఎస్వో సర్టిఫికెట్‌కు ఎంపికయ్యింది. తూర్పుగోదావరి జిల్లాలో కొమరిపాలెం గ్రామం మొదటగా ఈ పురస్కారానికి ఎంపికై నట్టు పంచాయతీ ప్రత్యేకాధికారి వి.నాగేంద్రప్రసాద్ బుధవారం తెలిపారు. కేరళకు చెందిన ప్రత్యేక ఆడిట్ బృందం సోమ, మంగళవారాలలో గ్రామంలో పర్యటించింది. ఆడిట్ బృంద సభ్యులు కేఎం సలీమ్ ఆధ్వర్యంలో విజయవాడ పీఆర్ కమిషనర్ కార్యాలయ సిబ్బంది కళ్యాణి తదితరులు గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీరు, పంచాయతీ కార్యాలయ ఫైళ్ల నిర్వహణ, కార్యాలయ పనితీరు తదితర అంశాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తపరిచారు. గ్రామస్తుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించిన బృంద సభ్యులు పంచాయతీ పనితీరు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించి ఐఎస్వో సర్టిఫికెట్‌కు ఎంపిక చేసినట్టు ప్రత్యేకాధికారి తెలిపారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన స్థానిక నాయకులతో పాటు పంచాయతీ కార్యదర్శి ఎం చిన్ని, డి రాము, లచ్చిరెడ్డి అపర్ణ, వీఆర్వో శివకుమార్, సచివాలయ సిబ్బందిని అభినందించారు. రత్నగిరికి భక్తుల వెల్లువఅన్నవరం: రత్నగిరికి బుధవారం భక్తులు వెల్లువలా తరలివచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రమే అయ్యింది. రత్నగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు వేలాదిగా సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 50 వేల మంది భక్తులు తరలి రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సర్కులర్ మండపం వద్ద సుమారు 5 వేల మంది భక్తులకు పులిహోర పంచిపెట్టారు. వ్రతాలు 2,500 జరిగాయి. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. వైశాఖ బహుళ ఏకాదశి సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ స్వామివారికి పుష్పాలతో, అమ్మవారికి కుంకుమతో, శంకరునికి బిల్వ పత్రాలతో పూజలు చేశారు. -
దాడి ఘటనలో వ్యక్తికి ఎనిమిదేళ్ల జైలు
కోటనందూరు: తండ్రి, కొడుకుపై దాడి చేసిన నిందితుడికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కేఏ మల్లవరం గ్రామానికి చెందిన గాడి సూర్యప్రకాష్ తనపై, తన కుమారుడు మణికంఠ ఈశ్వర్‌పై కత్తి పీటతో దాడి చేసి గాయపర్చాడని రౌతులపూడి మండలం ఎ.మల్లవరం గ్రామానికి చెందిన లెక్కల సత్యనారాయణ 2021లో కోటనందూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి ఎస్సై ఎం.అశోక్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపారు. బుధవారం పిఠా పురం అసిస్టెంట్ సెషన్స్ కోర్డు జడ్జి ఎం.బాబు కేసు విచారించి నిందితుడికి ఎనిమిదేళ్ల జైలు, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రయాణికుల ఆటో బోల్తా నిడదవోలు రూరల్: నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం ప్రయాణికులతో వెళుతున్న ఆటో మండలంలోని తాళ్లపాలెం రైల్వే బ్రిడ్జి వద్ద బుధవారం పంట పొలాల్లోకి బోల్తా కొట్టింది. ఆటోలోని ప్రయాణికులందరూ స్వల్పగాయాలతో బయటపట్టారు. ఆటోలో సుమారు 15 మంది ప్రయాణించడంతో పాటు రోడ్డు మార్జిన్ దిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. 25 నుంచి శాప్ అకాడమీ ఎంపికలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి శాప్ అకాడమీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వి.సతీష్ కుమార్ బుధవారం తెలిపారు. కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న వెయిట్ లిిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, ఖోఖో క్రీడలకు బాలికల విభాగంలో ఎంపికలు ఉంటాయన్నారు. 15 ఏళ్లు పైబడి 19 ఏళ్లలోపు బాలికలు అర్హులన్నారు. 25న డీఎస్ఏ కాకినాడలో వెయిట్‌లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్లోనూ, 26న హాకీలోను, 28న ఖోఖో ఎంపికలు జరుగుతాయన్నారు. వివరాలకు 94400 31601ను సంప్రదించాలన్నారు. తిరుపతిలో.. తిరుపతిలోని శ్రీనివాస కాంప్లెక్స్‌లో బ్యాడ్మింటన్ బాలురు–10, బాలికలు–10 క్రీడాకారులకు ఈ నెల 21న, బాక్సింగ్‌లో 15 మంది బాలురకు ఈ నెల 22న, వెయిట్ లిఫ్టింగ్‌లో 15 మంది బాలురకు ఈనెల 23న, రైఫిల్ షూటింగ్, లాన్‌టెన్నిస్‌లో ఒక్కొక్క క్రీడలో 10 మంది బాలురు, 10 మంది బాలికలకు ఈ నెల 24న జరుగుతాయన్నారు. విశాఖలో... విశాఖ కొమ్మాడి ఎస్కేపీలో ఈ నెల 29న అథ్లెటిక్స్‌లో 15 మంది బాలురకు, 30న సైక్లింగ్‌లో 15 మంది బాలురకు, 31న వాటర్ స్పోర్ట్స్‌లో 15 మంది బాలురకు ఎంపికలు నిర్వహిస్తున్నారన్నారు. ఆసక్తి గల వారు సంబంధిత అర్హత పత్రాలతో ఉదయం 7 గంటకు హాజరుకావాలని తెలిపారు. సొసైటీ పెట్రోల్ బంక్ సొమ్ము స్వాహా! తాళ్లపూడి: మలకపల్లి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్టు సమాచారం. పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం కారణంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో సుమారు రూ.22.40 లక్షలు స్వాహా అయ్యాయని, బంక్‌లో పనిచేస్తున్న గుమస్తా, సొసైటీలో పనిచేస్తున్న మరో వ్యక్తి కలిసి ఈ నిధులను దారి మళ్లించినట్టు తెలుస్తోంది. రోజు వారీ అమ్మకాలు చేయగా వచ్చిన నగదును సొసైటీలో జమ చేయాల్సి ఉండగా, వారు కొంత సొమ్మును దఫదఫాలుగా వాడుకున్నట్టు చెబుతున్నారు. ఈ విషయాలు ఇటీవల జరిగిన ఆడిట్లో బయట పడ్డాయి. దీనిపై సహకార సంఘ డీఆర్ ఎం.జగన్నాథరెడ్డి మాట్లాడుతూ 2025 సెప్టెంబర్ నుంచి 2026 మార్చి 31 మధ్య కాలంలో ఈ అవకతవకలు జరిగాయన్నారు. డిపార్టుమెంట్ ద్వారా రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో సొసైటీ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. కాగా.. దీనిపై తాళ్లపూడి పోలీస్ స్టేషన్లో ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. -
గుట్టచప్పుడు కాకుండా..
పెరవలి (కొవ్వూరు): కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుక దందా అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది. టీడీపీలో కీలక నేత అయిన ఆయన ఇసుక దందాలో ఎక్కడ గుట్ట వేయాలి కాదు కొండ వేయాలి, ఎక్కడ ర్యాంప్ ఏర్పాటు చేయాలి, దందా ఎలా చేయాలి, ఏ ర్యాంప్ మూసివేయాలి, ఎవరైనా అధికారి మాట్లాడితే నోరు ఎలా మూయించాలి అనేవి చూసుకుంటారు. పొరపాటున ఏ అధికారైనా ర్యాంప్‌ల వైపు చూస్తే ఆయన బదిలీ తప్పదంటున్నారు. ఈ అక్రమ ఇసుక దందా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ జరిగే అరాచకాలు ఎక్కడా జరగవేమో. గ్రామానికి ఒక ర్యాంప్ ఉండటం సహజం కానీ ఇక్కడ ఒక్కో గ్రామంలో 2 నుంచి 4 ర్యాంప్‌లు ఏర్పాటు చేశారంటే ఆయన ఏవిధంగా అక్రమ ఇసుక దందాను నడుపుతున్నారో అర్థం అవుతుంది. ఈ అరాచకాన్ని చూస్తున్న జనం అయ్యో ‘రామ’.. అయ్యో ‘కృష్ణ’ ఇదేం విడ్డూరం అని ముక్కున వేలేసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖలు ఆయనకు సలామ్ కొట్టడం తప్ప అక్రమాలు అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీనికి కారణం మామూళ్లు ఎప్పటికప్పడు అందటమే అంటున్నారు. అనుమతులు లేకపోయినా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న 15 ఇసుక రీచ్‌ల వద్ద వేసిన గుట్టలే ఇందుకు సాక్ష్యం. ఇవి గుట్టలు అనే కంటే కొండలు అంటే బాగుంటుంది. ఎకరం నుంచి 3 ఎకరాల్లో వీటిని వేస్తున్నారు. కొవ్వూరు మండలంలోని కుమారదేవంలో, నిడదవోలు మండలం పురుషోత్తపల్లిలో కొండలను పోలిన గుట్టలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం జిల్లా మొత్తంలో 10 లక్షల మెట్రిక్ టన్నులకు మించి ఇసుక నిల్వలు ఉండకూడదు. కానీ ఒక్క కొవ్వూరు నియోజకవర్గంలోనే 5 లక్షల మెట్రిక్ టన్నులకు మించి ఇసుక గుట్టలు ఉన్నాయని అంచనా. ర్యాంప్‌లు ఎన్ని.. మూసినవి ఎన్ని? కొవ్వూరు నియోజకవర్గంలో అధికారిక లెక్కల ప్రకారం 45 ర్యాంప్‌ల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉండగా ఈ నేత ప్రభావంతో కేవలం 15 ర్యాంప్‌ల్లో తవ్వకాలు చేస్తున్నారు. ఏరినమ్మలో 2 ర్యాంప్‌లకు అనుమతులు ఉంటే ఒకటి నిర్వహిస్తుండగా, దొండగుంటలో 4 ఉంటే 2 నిర్వహిస్తున్నారు. ఆరికరేవులలో 4 ఉండగా 2 నిర్వహిస్తున్నారు. ప్రక్కిలంకలో 15 ర్యాంప్‌లకు అనుమతులు ఉండగా 3 మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇక తాడిపూడి 6, విజ్జేశ్వరంలో 3, తాళ్ళపూడిలో 5 ర్యాంప్‌లను పూర్తిగా తెరవలేదు. కుమారదేవం, వేగేశ్వరం, ప్రక్కిలంక, కొవ్వూరు, ఔరంగబాద్, పురుషోత్తపల్లి వద్ద ఇసుక గుట్టలు భారీ స్థాయిలో ఉన్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు అధికారులకు ఏ నెలకి ఆ నెల మామూళ్లు అందటంతో కిమ్మనకుండా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ఈ అక్రమాల గురించి ఫిర్యాదులు చేస్తే అధికారులే బుజ్జగించడం, సెటిల్మెంట్ చేయటం, కుదరకపోతే కేసులు పెడతామని బెదిరింపులకు దిగటం పరిపాటిగా మారింది. ఆ కీలక నేత అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెవెన్యూ, పోలీస్ డిపార్టుమెంట్లను తన అవసరాలకు వాడుకుంటూ ఇసుక దందాను దర్జాగా చేస్తున్నాడు. పురుషోత్తపల్లిలో...కొవ్వూరులో ఇసుక గుట్టఔరంగబాద్లో ... కొవ్వూరు నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ ఇసుక కొండలు టీడీపీ కీలక నేత కనుసన్నల్లో జోరుగా దందా అయ్యో ‘రామ’.. అయ్యో ‘కృష్ణ’ అంటున్న జనం 45 ర్యాంప్‌లకు అనుమతులు ఉండగా 15 ర్యాంప్‌ల్లోనే తవ్వకాలు అనుమతులు లేకపోతే చర్యలుజిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఇసుక గుట్టలు వేయటానికి అనుమతులు ఉన్నాయి. అనధికారకంగా ఇసుక గుట్టలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కొవ్వూరు నియోజకవర్గంలో కుమార దేవంలో 3 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక గుట్ట వేయటానికి అనుమతులు ఉన్నాయి. – పి.ఫణిభూషణ్‌రెడ్డి, జిల్లా మైనింగ్ ఏడీ -
పర్యవేక్షణా లోపంతోనే మట్టి అక్రమ దందా
రంగంపేట: అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మట్టి అక్రమ దందా నిరాటకంగా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. రంగంపేట మండలం వడిశలేరు గ్రామంలోని పాపాయి చెరువులో కొన్ని రోజులుగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను మంగళవారం రాత్రి వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకుని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. అయితే చెరువులోని మట్టిని స్ధానిక రైతులు తమ సొంత భూమిలో మెరక చేసుకోవడానికే ఉపయోగించాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య ప్రయోజనాలకు బయట ప్రాంతాలకు తరలించి రూ.లక్షల రూపాయలు దోచుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అనుమతులు పొందిన 30 రోజుల్లోపు చెరువులోని సిల్టును తీసి పొలాల్లో మెరక చేసుకోవాలి, లేదంటే అనుమతులు రద్దు అవుతాయి. కానీ ఇక్కడ అనుమతుల గడువు తీరిపోయినా రోజుల తరబడి మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. చెరువులోని మట్టిని గరిష్టంగా 3 వేల క్యూబిక్ మీటర్లు తీసుకోవడానికే అనుమతి ఉంది. కానీ పాపాయి చెరువులోని మట్టిని ఇష్టానుసారంగా తవ్వి అమ్మకాలు సాగించినట్టు చెబుతున్నారు. కాగా.. దీనిపై తహసీల్దార్ అనసూయ మాట్లాడుతూ పాపాయి చెరువులో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్న లారీలను, జేసీబీలను సీజ్ చేసి తమ కార్యాలయ ఆవరణలో ఉంచామన్నారు. తదుపరి చర్యల కోసం రాజమహేంద్రవరం ఏడీ మైనింగ్ అధికారులకు నివేదిక అందించామని, వారు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. -
ప్రభుత్వ అరాచకం ఎంతోకాలం సాగదు
పెరవలి (కొవ్వూరు): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని కొవ్వూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ కర్నూలు పట్టణ యువజన విభాగం కన్వీనర్ బాలును పోలీసులు స్టేషన్‌కు రావాలని బలవంతం చేయటం దారుణమని అన్నారు. ఆ ఘటనఫై కొవ్వూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బాలుపై గతంలో బనాయించిన అక్రమ కేసు గురించి కోర్టుకు వస్తే అక్కడ పోలీసులు స్టేషన్‌కు రావాలని బలవంతం చేయటం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు అడ్డగించకపోతే బాలుపై మరో కేసు పెట్టటానికి సిద్ధపడేవారని ఈ అరాచకం ఎంత కాలమన్నారు. రెండేళ్లుగా మా పార్టీ శ్రేణులపై అనేక కేసులు బనాయించారని వీటికి భయపడబోమని, కోర్టు ద్వారా ఎదుర్కొంటామన్నారు. కక్ష సాధింపు చర్యలు మానుకొని, ఎన్నికల హామీలను ఎలా అమలు చేయాలో చూసుకోవాలని హితవు చెప్పారు. వైఎస్సార్ సీపీ జిల్లా యూత్ ప్రెసిడెంట్ కంఠమని రమేష్, వాడపల్లి సురేష్, చాగల్లు యూత్ ప్రెసిడెంట్ మద్దిపాటి సురేష్, విద్యా విభాగ అధ్యక్షుడు మజ్జి వంశీ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు -
20న మెడికల్ దుకాణాల బంద్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మందుల అంగడి వ్యాపారమైపోయిందని, ఆన్లైన్లో మందుల విక్రయాలతో పెను ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పేర్కొంది. ఈ మేరకు కృష్ణానగర్‌లోని డ్రగ్స్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్.శ్రీనివాసరావు, కార్యదర్శి గణపతి మాట్లాడుతూ ఆలిండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నిర్ణయానుసారం ఈ నెల 19 తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు మందుల దుకాణాల బంద్ నిర్వహించనున్నామన్నారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లను ఆపివేయాలని, నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలనే డిమాండ్లతో ఈ బంద్ చేస్తున్నామన్నారు. మందుల దుకాణదారులందరూ దీన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిల్లా బాల, కార్యదర్శి ఫణీంద్ర, మందుల వర్తకులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లాలో.. అమలాపురం టౌన్: కెమిస్ట్‌ల జీవనాధారం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈ నెల 20న జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నట్లు జిల్లా డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్వీఎస్ శ్రీనివాసమూర్తి, కార్యదర్శి వీవీఎస్ మూర్తి వెల్లడించారు. అమలాపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బంద్ విషయాలను వివరించారు. ఆ రోజు జిల్లాలోని దాదాపు వెయ్యి మందుల షాపులు మూతపడనున్నాయన్నారు. కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్ల ద్వారా మార్కెట్ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా అసోసియేషన్ కోశాధికారి బీఎస్ఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వేసవి శిక్షణ.. జ్ఞాన సముపార్జన
● విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ● వివిధ అంశాలపై అవగాహన ● ఆడుతూ, పాడుతూ నేర్చుకుంటున్న వైనం తుని రూరల్: వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా విద్యార్థులు వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుంటున్నారు. వివిధ అంశాలపై శిక్షణ పొందుతూ విజ్ఞానం పెంచుకుంటున్నారు. దీనిలో భాగంగా మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కంప్యూటర్లో టైపింగ్, పరికరాలు (టూల్స్), పెయింటింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. డి.పోలవరం, కొలిమేరు, ఎన్.సూరవరం, ఎస్.అన్నవరం, తేటగుంట పాఠశాలల్లో ఆరు నుంచి పది తరగతులు చదువుతున్న విద్యార్థులకు వీటిని నిర్వహిస్తున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకూ జరిగే ఈ శిక్షణను ఒక్కొక్క పాఠశాలలో 15 నుంచి 20 మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు. ఆరో తరగతి నుంచి కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన ఉంటే ఇంటర్మీడియట్, డిగ్రీ తర్వాత చదువుల్లో మరింత వేగవంతంగా కంప్యూటర్ కోర్సుల్లో విద్యార్థులు పట్టు సాధిస్తారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.డి.పోలవరం హైస్కూల్లో పెయింటింగ్ నేర్చుకుంటున్న విద్యార్థులు కంప్యూటర్‌పై అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు -
15 నుంచి జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలు
అమలాపురం టౌన్: స్థానిక సత్యనారాయణ గార్డెన్స్‌లో ఈనెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ 15వ జాతీయ సబ్ జూనియర్ అండ్ జూనియర్ క్లాసిక్ (మెన్ అండ్ వుమెన్) పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్–2026 పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్, జిల్లా హెల్త్ ఫిట్నెస్ జిమ్‌ల ప్రతినిధులు తెలిపారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ పోటీల బ్రోచర్లను ఎంపీ గంటి హరీష్ మాధుర్ మంగళవారం విడుదల చేశారు. స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ కంకిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇండియన్ టీమ్ సెలక్షన్ ట్రయిల్స్ ఫర్ వరల్డ్ చాంపియన్ షిప్‌ను, ఏషియాడ్ టీమ్ సెలక్షన్స్ ట్రయల్స్‌ను ఆంధ్ర ప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పోటీలకు 29 రాష్ట్రాల నుంచి దాదాపు 800 మంది క్రీడాకారుల ఎంట్రీలు ఇప్పటికే వచ్చాయని పేర్కొన్నారు. మెన్ అండ్ వుమెన్ విభాగాల్లో 36 కేటగిరీల్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, అసోసియేషన్ ప్రతినిధులు ముత్తాబత్తుల వెంకటరమణ, ఆశెట్టి ఆదిబాబు, నార్ని శ్రీను, పెద్దిరెడ్డి రాము, చిక్కం రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నగరంలో వరుస బైక్ దొంగతనాల కేసులను త్రీటౌన్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. విశాఖపట్నానికి చెందిన ఇద్దరు యువకులు వ్యసనాలకు బానిసలై బైక్ దొంగతనాల బాట పట్టినట్టు పోలీసులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల మేరకు నిందితులు ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్టు తెలిపారు. వీరు దొంగిలించిన వాహనాలను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఇటీవల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాల చోరీలు పెరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో వచ్చిన పక్కా సమాచారంతో త్రీ టౌన్ ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు నిఘా పెట్టి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు సమాచారం. నిందితుల నుంచి మూడు రాయల్ ఎన్ఫీల్డ్, ఒక జూక్ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. -
సృజనకు వేదికలు వేసవి శిబిరాలు
ఆట పాటలు, చిత్రలేఖన పోటీలు, వ్యాయామ శిక్షణతో సమయం సద్వినియోగం కొత్తపేట: విద్యార్థులు వేసవి సెలవులను సెల్ఫోన్లు, టీవీలతో వృథా చేయకుండా వేసవి శిక్షణ తరగతులు వారికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఈ మేరకు స్థానిక గ్రంథాలయంలో లైబ్రేరియన్ సునీత ఆధ్వర్యంలో గత నెల 28 నుంచి వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు, పీఈటీలు, కవులు, కళాకారులతో బాలలకు నీతి కథలు చెప్పించడం, చదివించడం, చిత్రలేఖనం, క్రాఫ్ట్, ఆటలు, పాటలు, స్పోకెన్ ఇంగ్లిషు, వ్యాయామం, యోగా తదితర అంశాలపై శిక్షణ, పోటీలు నిర్వహిస్తున్నారు. సోమవారం విశ్రాంత పీఈటీ, సత్యసాయి సేవా సమితి సభ్యుడు మారిశెట్టి సత్యనారాయణ బాలలకు వ్యాయామం, యోగా శిక్షణ ఇచ్చారు. ఆధ్యాత్మిక అంశాలపై అవగాహన కల్పించారు. విశ్రాంత ఎంఈఓ, పూర్వ తాలూకా పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఏడిద సత్తిరాజు చదరంగం (చెస్) పట్ల అవగాహన కల్పించారు. -
దుబాయ్, మస్కట్ల నుంచి క్షేమంగా స్వదేశాలకు
అమలాపురం రూరల్: దుబాయ్, మస్కట్ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముగ్గురు కోనసీమ వాసులను కేసీఎం అధికారులు క్షేమంగా వారి ఇళ్లకు చేర్చారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన కే.ఆదిలక్ష్మి, అమలాపురం మండలం సవరప్పాలెం గ్రామానికి చెందిన ఎం.మావుళ్లు, కే.శివకృష్ణలను కలెక్టర్ చొరవతో సురక్షితంగా కోనసీమకు రప్పించారు. వివిధ కారణాలతో అక్కడకు వెళ్లిన ఆదిలక్ష్మి ఆరోగ్యం పాడై, మావుళ్లు, శివకృష్ణ ఏజెంట్ మోసాలకు గురై శ్రమతో కూడిన పనులు చేయలేక అవస్థలు పడ్డారు. వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు వారిని స్వగ్రామాలకు తీసుకువచ్చారు. జగ్గంపేట హత్య కేసు రాజానగరానికి బదిలీ రాజానగరం: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద జరిగిన హత్య కేసును రాజానగరం పోలీసు స్టేషనుకు బదిలీ అయినట్టు సీఐ వీరయ్యగౌడ్ మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ హత్యపై మృతుడు రావుల సత్తిబాబు సోదరుడు రావుల వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. సత్తిబాబు దంపతుల మధ్య విభేదాలు రావడం, భార్య పుట్టింటిలో ఉండటం, హత్య జరిగిన ముందు రోజు ఆమెతో మాట్లాడి వస్తానని మృతుడు ఇంటిలో చెప్పడం, ఆ తరువాత హత్యకు గురికావడం వంటి వాటిపై ఫిర్యాదుదారు వెలిబుచ్చిన అనుమానాలను పరిగణలోకి తీసుకుని, వాస్తవాలను వెలికితీసేందుకు కేసును లోతుగా పరిశీలిస్తున్నామన్నారు. -
రేపటి నుంచి ’శుభకార్యాలకు’ బ్రేక్
● 36 రోజుల పాటు వివాహాలకు విరామం ● జూన్ 19 నుంచి మళ్లీ ముహూర్తాలు ద్వారకాతిరుమల: వివాహాది శుభ మూహూర్తాలకు 36 రోజులపాటు బ్రేక్ పడనుంది. ఈ నెల 18 నుంచి వచ్చేనెల జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం (మూఢమి) కావడంతో ఈ నెలలో ఆఖరి ముహూర్తం 13న పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. మళ్లీ జూన్ 19 నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. ఈ మౌఢ్యమి వల్ల వివాహ సంబంధ వృత్తులపై ఆధారపడిన వారికి పనులు లేనట్టే. ఈ ఏడాది ముహూర్తాలు ఇవే.. శుభకార్యాలు పనికిరావు అధిక జ్యేష్ఠమాసం వల్ల వివాహాలు, గృహ ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాలు తదితర శుభకార్యాలు జరపకూడదు. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకున్న వారు ఈ 36 రోజులు ఆగాల్సిందే. – గోవిందవఝుల వెంకటరమణ మూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల -
హోమ్ స్టేటస్!
● పేరు.. రూపు మార్చుకున్న విడిదిళ్లు ● వేడుక ఏదైనా అవసరాల మేరకు వసతులు ● విలాసవంతంగా తీర్చిదిద్దుతున్న నిర్వాహకులు ● అద్దె సైతం అదే స్థాయిలో వసూలు ● పల్లెలకూ విస్తరిస్తున్న కొత్త ఒరవడి రాయవరం: వివాహ వేడుకలో విడిదింటిది ఓ ప్రధాన భూమిక. ఏ మాత్రం తేడా వచ్చినా.. ఏ లోపం కనపడినా మొదటి పేచీ మొదలయ్యేది అక్కడే. సహజంగా ఆడపెళ్లివారింటే వివాహాలు జరుగుతాయి. ఆచార వ్యవహారాలను బట్టి కొన్ని రోజుల ముందు నుంచే మగ పెళ్లివారి కోసం వివాహ వేదికకు సమీపంలోనే విడిదింటిని ఏర్పాటు చేస్తారు. ఎన్నో ఆపసోపాలు.. వ్యయ ప్రయాసలకోర్చి మందీ మార్బలంతో వచ్చే వారు రావడంతోనే ప్రయాణ బడలిక తీర్చుకోవడానికి అలా ఓ కుర్చీలో వాలిపోవాలని చూస్తారు. ఆ సమయంలో పెద్దలు ఏదో సరిపెట్టుకున్నా కొందరు అది బాలేదు.. ఇది బాలేదు అంటూ రాగాలు తీస్తుంటారు. ఇటువంటి పరిస్థితులు నేడు అంతగా లేకపోయినా వేడుక ఏదైనా సకల సౌకర్యాలతో అద్దెకు ఇచ్చే విడిదిళ్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటినే ఇప్పుడు పేరు మార్చి ఇంగ్లిష్‌లో హోమ్ స్టేగా పిలుస్తున్నారు. గ్రామాల్లో సైతం లగ్జరీ రూమ్స్, వంద మందికి సరిపడా మిని బ్యాంకెట్ హాల్, పార్టీ హోమ్ థియేటర్ ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీల సమావేశాలు, గెట్ టుగెదర్లు, పుట్టిన రోజు, వివాహ నిశ్చయ తాంబూలం, లగ్న పత్రిక రాసుకోవడం ఇలా దేనికై నా హోమ్ స్టేలు సిద్ధంగా ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో అన్నీ ఏసీ కల్యాణ మండపాలుగా మారిపోవడంతో అద్దె, నిర్వహణ, విద్యుత్ బిల్లు వంటి ఖర్చులు మొత్తంగా రూ.లక్ష పైనే అవుతోంది. అంత పెద్ద మొత్తం వృథా అనుకునే వాళ్లు ఈ హోం స్టేలను బుక్ చేసుకుంటున్నారు. అందుబాటు ధరల్లో రూ.10 వేల నుంచి రూ.30 వేల మధ్యలో సకల సదుపాయాలతో ఇటువంటి హోమ్‌స్టేలు లభిస్తున్నాయి. వీటికి డిమాండ్ బాగా ఉండడంతో ఇటీవల కాలంలో పట్టణాలతో పాటుగా, పల్లెల్లోనూ ఈ హోమ్ స్టేలు సులువుగానే దొరుకుతున్నాయి. సహజంగా దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు మంచి సౌకర్యాలతో నాలుగు నుంచి ఆరు లగ్జరీ డబుల్ బెడ్ రూంలు అందుబాటులో ఉంచుతున్నారు. మినీ హాల్స్‌లో 50 నుంచి 100 మంది వరకు కూర్చునే ఏర్పాట్లు చేస్తున్నారు. విలాసవంతమైన సదుపాయాలతో ఆధునిక సాంకేతిక కిచెన్, లాండ్రి, డైనింగ్ హాల్ వంటి సదుపాయాలు వీటిలో అందుబాటులో ఉంచుతున్నారు. పచ్చని సోయగాలతో ఆహ్లాదం పంచడానికి ఓపెన్ టెర్రస్, స్కై లాంజ్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. వీటి వద్ద ఫొటో షూట్స్‌కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటువంటి హోం స్టేలు పలు గ్రామాల్లో అందుబాటులోకి తెస్తున్నారు. అలానే డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకోవచ్చు. కొన్ని విడిదిళ్లలో మినీ స్విమింగ్ పూల్స్ కూడా ఏర్పాటు చేస్తూ పార్టీలను ఆకట్టుకుంటున్నారు. -
చెరువు మట్టినీ మింగేస్తున్నారు!
● వడిశలేరు పాపాయి చెరువులో ఆగని దోపిడీ ● జేసీబీలతో యథేచ్ఛగా తవ్వకాలు ● రూ.లక్షలు చేతులు మారుతున్నా పట్టించుకోని యంత్రాంగం ● తవ్వకాలను అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు ● తహసీల్దారుకు ఫిర్యాదు ● 13 లారీలు, జేసీబీల సీజ్ రంగంపేట: కూటమి సర్కారు కొలువుదీరాక అధికార పార్టీ నాయకుల నేతృత్వంలో సహజ వనరుల దోపిడీ అడ్డూ అదుపు లేకుండా పోతోందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మండలంలోని వడిశలేరు గ్రామంలో పాపాయి చెరువులో మట్టిని అనుమతులు లేకుండా తవ్వేస్తుండడంతో మంగళవారం రాత్రి వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయేలు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ సమయంలో చెరువులో 13 లారీలు, జేసీబీ ఉన్నాయి. వారు తహసీల్దారు కోసు అనసూయకు ఫిర్యాదు చేయడంతో ఆమె ఆదేశాల మేరకు వడిశలేరు వీఆర్వో పోచయ్య అక్రమ మైనింగ్ జరుగుతున్న చెరువు వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించి రికార్డు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న వాహనాల గుర్తించామని 13 లారీలు, జేసీబీని అధికారుల ఆదేశాలతో సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలిస్తున్నామని తెలిపారు. ఇప్పటికై నా మండలంలో మట్టి అక్రమ దోపిడీని అరికట్టాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోతుల బులి వీర్రాజు, కన్వీనర్ నలమాటి భీముడు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
అంబాజీపేట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి రేకుల షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇసుకుపూడి మెరకపేటకు చెందిన బాల రమేష్ (50) రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 6వ తేదీన అక్కడి నుంచి మెరకపేటకు వచ్చి ఆర్థిక ఇబ్బందులతో కలత చెందుతూ ఈ నెల 11న తన ఇంటి వెనుక ఉన్న రేకుల షెడ్డులో ఉరి వేసుకున్నాడన్నారు. సమీప బంధువు చూసి రాజమహేంద్రవరంలోని రమేష్ భార్యకు సమాచారం అందించారన్నారు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారన్నారు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కొనసాగిన వ్యవసాయ కార్మిక రాష్ట్ర మహాసభలు
అమలాపురం టౌన్: ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 30వ రాష్ట్ర మహా సభలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక గంగరాజు ఫంక్షన్ హాలులో జరిగిన సభల్లో ఈ మేరకు 14 తీర్మానాలు ఆమోదించారు. కార్మిక నేత కేతా సూర్యారావు వ్యవసాయ కార్మిక జెండాను ఆవిష్కరించి అనంతరం అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షోపన్యాసం చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సభల్లో కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, అఖిల భారత సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.లోకనాథం, కారెం వెంకటేశ్వరరావు, సంఘం రాష్ట్రం మహిళా కన్వీనర్ వి.రాణి తదితరులు ప్రసంగించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
యానాం: స్థానిక గౌతమీ గోదావరిలో స్నేహితులతో స్నానానికి దిగి గల్లంతైన రాజమహేంద్రవరం మంగళవారపుపేటకు చెందిన అబ్దుల్ ఫైజాన్ (18) మృతదేహం లభ్యమైంది. సోమవారం అర్ధరాత్రి అగ్నిమాపకదళ సిబ్బంది, మత్స్యకారులు అతడి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఎస్సై కుమరన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పుష్కరఘాట్ వద్ద నిర్మించిన బారికేడ్ల వద్ద మెష్ నిర్మించకపోవడం వల్ల ఆ గొట్టాల మధ్య నుంచి గోదావరిలో జారిపోయాడని స్థానికులు అంటున్నారు. -
ఇద్దరిపై విద్యుత్ చౌర్యం కేసు
గండేపల్లి: కాకినాడ, రాజమహేంద్రవరం విద్యుత్ విజిలెన్స్ అధికారులు ఆయిల్ పామ్ తోటలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే అధికారులకు అందిన సమాచారం మేరకు గోకవరం రోడ్డులో ఉన్న జెడ్ రాగంపేట రెవెన్యూ పరిధి జగ్గంపేటకు చెందిన కోండ్రోతు నారిబాబుకు చెందిన ఆయిల్ పామ్ తోటకు ఆనుకుని వేరొకరి పొలం ఉంది. ఆ పొలంలో బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే నారిబాబు పొలం మీదుగా లైన్ వెళ్లాల్సి ఉంది. అందుకు నారిబాబు అంగీకరించలేదు. దీంతో విద్యుత్ అధికారులు అతడి విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేశారు. దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు అనుమతించి సుమారు నెల రోజులు గడుస్తున్నప్పటికీ అధికారులు కనక్షన్ ఇవ్వలేదు. ఆయిల్ పామ్ తోట ఎండిపోవడం, పశువుల దాహార్తికి నీళ్లులేకపోవడంపై అధికారులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పరిశీలనకు వచ్చిన అధికారులు అతని పక్కనున్న పొలంలో రైతులు వారికి సమీపంలోని విద్యుత్ స్తంభం నుంచి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఇద్దరి రైతులపై కేసు నమోదు చేసినట్టు విద్యుత్ విజిలెన్స్ సీఐ కె.నాగమోహన్‌రెడ్డి, ఏఈ కె.దుర్గాప్రసాద్ తదితరులు తెలిపారు. -
పరీక్షల నిర్వహణలో లోపాలు ఉండకూడదు
డీఆర్ఓ సీతారామమూర్తి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డీఆర్ఓ సీతారామమూర్తి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలు చేయడం, ప్రశ్నపత్రాల తరలింపు సమయంలో భద్రత కల్పించడం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. విద్యుత్ శాఖ పరీక్ష సమయాల్లో ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతర సరఫరా అందించాలని సూచించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవడానికి వీలుగా ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏఎన్ఎంలు, ప్రాథమిక చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పారిశుధ్యం, స్వచ్ఛమైన తాగునీరు, విద్యార్థులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలని మున్సిపల్, రెవెన్యూ శాఖలను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐఓ శారద హెచ్చరించారు. -
డీఎల్ఎస్ఏ కార్యదర్శిగా శ్రీలక్ష్మి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా యార్లగడ్డ శ్రీలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సేవలందించిన ఎన్.శ్రీలక్ష్మి స్థానంలో ఆమె వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం స్థానిక కోటగుమ్మంలో ఉన్న ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని సందర్శించారు. అక్కడ వసతులను పరిశీలించారు. పర్యవేక్షణ గృహంలో బాలురతో మాట్లాడి వారి విద్యాభ్యాసం గురించి, యోగ క్షేమాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ బాలురు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్యపై దృష్టి సారించాలన్నారు. క్రమశిక్షణ, సహన శీలత ప్రతి వ్యక్తికి అవసరమైన ముఖ్యమైన లక్షణాలని, వాటిని అలవరచుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందని, పర్యవేక్షణ గృహంలో ఏవైనా సమస్యలు ఉన్నా, న్యాయ సహాయం అవసరమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. ఏసీబీ వలలో మున్సిపల్ డీఈ రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టివేత సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ డీఈ కె.శశిధర్ మంగళవారం ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా.. మున్సిపల్ కాంట్రాక్టర్ కనూరి పవన్‌కుమార్‌కు రూ.11 లక్షల విలువైన ఐదు బిల్లులు చేయడానికి డీఈ లంచం డిమాండ్ చేశారు. మొదటి విడతగా రూ.10 వేలు ఇచ్చేందుకు అంగీకరించిన పవన్‌కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం రూ.10 వేలు ఇస్తుండగా మున్సిపల్ కార్యాలయంలో మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా డీఈని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన నోట్లు మున్సిపల్ డీఈ వద్ద ఉండడంతో ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్‌కుమార్ ఆయనపై కేసు నమోదు చేశారు. మున్సిపల్ డీఈ తన అసిస్టెంట్ ఓదూరి శ్రీనివాసు ద్వారా రూ.10 వేలు తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. మార్పులకు గ్రీన్ సిగ్నల్ అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కేంద్ర ప్రభుత్వ ‘పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్ప్రిట్యువల్ ఆగ్మంటేషన్ డ్రైవ్ ’ (ప్రసాద్’) స్కీం నిధులు రూ.11 .50 కోట్ల వ్యయంతో కడుతున్న అన్నదాన భవనంలో మరింత ఎక్కువ మంది భోజనం చేసేందుకు వీలుగా నిర్మాణంలో మార్పులు చేయనున్నారు. మంగళవారం అన్నవరం దేవస్థానానికి వచ్చిన టూరిజం, దేవదాయశాఖ శాఖ అధికారులు ఈ నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్ణయించారు. మూడంతస్తులలో అన్నదాన భవనం నిర్మిస్తున్నారు. మూడు అంతస్తులలోని నాలుగు హాల్స్‌లో ఒక్కో హాలులో 350 మంది చొప్పున 1,400 మంది భోజనం చేసేందుకు వీలుగా నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ భవనంలోని హాల్స్‌లో మెట్లు లోపల వైపు ఉండేలా ప్లాన్‌లో పొందుపరిచి ఆ మేరకు నిర్మిస్తున్నారు. గత నెలలో ఇక్కడికి వచ్చిన దేవదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ ఈ భవనాన్ని పరిశీలించి మెట్లు లోపల కాకుండా భవనం బయట వైపు వస్తే ఒక్కో హాలులో 50 నుంచి వంద మంది అదనంగా భోజనం చేసే వీలుంటుందని సూచించారు. భోజనం చేసిన భక్తులు వినాయక అతిథిగృహం వెనుక నుంచి వెలుపలకు వచ్చేలా మార్పులు చేయాలని ఆదేశించారు. దేవదాయశాఖ సలహాదారు సుబ్బారావు, చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్, టూరిజం శాఖ ఎస్ఈ ఈశ్వరయ్య, ఈఈ విజయభాస్కరరెడ్డి, ఆర్కిటెక్ట్ బీకే సాధి, అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధర్‌రావు, ఈఈ వీ రామకృష్ణ పరిశీలించారు. మెట్లు భవనం వెలుపల కడితే నాలుగు హాల్స్‌లో 50 నుంచి వంద మంది భోజనం చేసే వీలుంటుందని తేల్చారు. భవనం ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు. -
కలెక్టర్ లేని మీటింగ్ ఎందుకు?
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లేకుండా జిల్లా పరిషత్ సమావేశం ఎందుకని కోనసీమ జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు మండిపడ్డారు. కాకినాడలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించారు. జెడ్పీ సమావేశాలకు కలెక్టర్, జేసీ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రతీ సమావేశానికి కలెక్టర్ ఎందుకు దూరంగా ఉంటున్నారో చెప్పాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో సుమారు అరగంట పాటు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ సభ్యులు నేలపై కూర్చుని నిరసన తెలిపారు. కలెక్టర్ లేకుంటే తాము సమావేశం బహిష్కరిస్తామని ప్రకటించారు. సమావేశానికి హాజరుకాని కలెక్టర్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయాలన్నారు. కలెక్టర్ రానప్పుడు దూర ప్రాంతాల నుంచి తాము వచ్చినా ఏమీ ఉపయోగమని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ కోనసీమలో జాతీయ రహదాలకు పనులు జరుగుతున్నాయని, ఇరిగేషన్‌కు సంబంధించిన విషయాలు సమావేశంలో చర్చించాలని దీనిపై వివరణ ఇచ్చేందుకు కలెక్టర్ కనీసం జాయింట్ కలెక్టర్ అయినా లేకుంటే ఎలా అన్నారు. జెడ్పీ సమావేశానికి డీఆర్ఓ స్థాయి అధికారులను పంపిస్తున్నారని, ఇలా అయితే సమావేశం వద్దని ఆయన జెడ్పీ చైర్మన్‌కు సూచించారు. జిల్లా పరిషత్ సమావేశం వేరొక రోజు పెట్టాలని ఆ రోజు కలెక్టర్ వచ్చేలా చూడాలని ఎమ్మెల్సీతో పాటు జేడ్పీటీసీ సభ్యులు పట్టుబట్టారు. జెడ్పీ చైర్మన్ తో పాటు జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు సభ్యులకు ఎంత సర్దిచెప్పినా వారు తగ్గలేదు. కలెక్టర్‌తో సంప్రదించిన తర్వాతనే తాము సమావేశానికి తేదీలు ఖరారు చేశామని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు తెలిపారు. కోనసీమ జిల్లాకు జడ్జి రావడంతో ప్రొటోకాల్ నిమిత్తం కలెక్టర్ ఉండాల్సి వచ్చిందని చెప్పడంతో వారు శాంతించారు. సంక్షేమ హాస్టళ్లలో స్వచ్ఛమైన మంచినీరివ్వాలి : ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీరు అందించకపోవడంతో రోగాల బారిన పడుతున్నారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణను ఆయా కంపెనీలు సక్రమంగా చేయడం లేదని, అధికారులు పర్యవేక్షించడం లేదని మండిపడ్డారు. వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత, సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, దీంతో వైద్య సేవలు అందకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని అక్కడి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మండిపడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో వేలాది రూపాయలు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని చెప్పారు. రహదారులు సక్రమంగా లేకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నామని పలువురు సభ్యులు తెలిపారు. ముఖ్యంగా రౌతులపూడి, తేటగుంట, ఎస్ పైడిపాల రోడ్డు పూర్తిగా గోతుల మయం అయిందన్నారు. ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ, వేగుళ్ల జోగేశ్వరరావు, సత్తి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. MýSÌñæ-MýStÆŠ‡ çÜÐ]l*-Ðól-Ô>-°MìS Æ>¯]l…-§ýl$MýS$ °Æý‡çÜ-¯]lV> ¯ólÌSOò³ MýS*Æý‡$a¯]l² ˘ ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, కోనసీమ జిల్లా జెడ్పీటీసీ సభ్యులుసమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు కోనసీమ జెడ్పీటీసీ సభ్యుల ఆందోళన రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం వాడీవేడిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం వరి రైతులు నష్టపోతున్నారు : ఎంపీ బోస్ ప్రస్తుత రబీలో వరి రైతులకు మద్దతు ధర రాాకపోవడం వల్ల ప్రతి బస్తాకు రూ.200 నుంచి రూ.300 నష్టపోవాల్సి వస్తోందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తేమ పేరుతో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కోనసీమ జిల్లాలో తక్కువ రైస్‌మిల్లులు ఉండడం వల్ల ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఇతర రైస్ మిల్లులకు కోనసీమ ధాన్యం తరలించే ఏర్పాట్లు చేయాలని, అప్పుడు రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. దీనికి కాకినాడ జిల్లా కలెకర్ట్ సానుకూలంగా స్పందించి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకొంటామని చెప్పారు. -
ఐదేళ్ల లోపు పిల్లలకు బ్లూ ఆధార్
రాజమహేంద్రవరం రూరల్: ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి బ్లూ ఆధార్ ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులకు కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. మంగళవారం హుకుంపేటలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ప్రత్యేక వేసవి శిబిరాలను, అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ వేసవి శిబిరంలో కొంతమంది పిల్లలకు ఆధార్ నంబర్లు లేవని కలెక్టర్ కీర్తి చేకూరి తెలుసుకున్నారు. బాల ఆధార్ నమోదు కోసం జనన ఽధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రులలో ఒకరి ఆధార్ కార్డుతో సమీప ఆధార్ నమోదు కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలకు వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ అవసరం లేకుండా ఫొటోతోనే నమోదు ప్రక్రియ పూర్తి చేస్తారని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి విద్యార్థులకు డిక్టేషన్ చెప్పి రాయించారు. 3, 4 తరగతుల విద్యార్థుల్లో పఠన సామర్థ్యం లోపిస్తున్నట్లు గుర్తించి, అలాంటి వారికి ప్రత్యేక వేసవి శిబిరాల ద్వారా అదనపు బోధన నిర్వహించాలని సూచించారు. రిజిస్టర్ అయిన పిల్లల్లో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. అక్కడ సరిగా చదవకపోయినా పై తరగతికి ప్రమోట్ చేయడంతో వారి తల్లిదండ్రులు తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన విషయాన్ని ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందుతోందనే నమ్మకం ప్రజల్లో పెరుగుతోందనడానికి ఇదో ఉదాహరణ అని కలెక్టర్ అన్నారు. డీఈవో కె.వాసుదేవరావు, ఎంపీడీవో కె.సునీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎంఈవోలు ఏఆర్కేడీ తులసీదాస్, చందుకుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఉషారాణి పాల్గొన్నారు. ప్రభుత్వ భవనాలపై సోలార్ యూనిట్లు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని ప్రతి ప్రభుత్వ భవనం, కార్యాలయంపై సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ కీర్తి అన్నారు. ఆమె వివిధ శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సచివాలయ భవనాల రూఫ్‌టాప్ సమాచారం, పూర్తికాని అంగన్వాడీ భవనాలు, విద్యామిత్ర , వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, జలధార – జలహారతి పనులు, రెవెన్యూ పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ కీర్తి చేకూరి -
ఆందోళనకరం
నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో పేపర్ లీక్ ఆరోపణలు ఆందోళనకరం. లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి, ఒత్తిడిని ఎదుర్కొంటూ ఈ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కొంతమంది చేసిన తప్పులకు నిజాయితీగా చదివిన విద్యార్థులు శిక్ష అనుభవించకూడదు. సమగ్రమైన దర్యాప్తు జరగాలి. అవినీతికి లేదా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిజాయితీగా చదివిన విద్యార్థుల మానసిక స్థితి, భవిష్యత్తును కాపాడటం ముఖ్యం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, డిజిటల్ మానిటరింగ్ అమలు చేయాలి. వైద్య విద్యపై ప్రజల నమ్మకం నిలబెట్టడం అందరి బాధ్యత. – డాక్టర్ ఎస్‌సీహెచ్‌ఎస్ రామకృష్ణ, కార్యదర్శి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రద్దు చేయడం దారుణం నీట్ పరీక్షలు రద్దు చేయడం దారుణం. విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడతారు. ఎంతో కష్టపడి నీట్ రాసిన విద్యార్థులు మంచిర్యాంకులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఎక్కడో రాజస్థాన్‌లో పేపర్ లీకేజ్ అయిందని పరీక్షలు రద్దు చేయడం సమంజసం కాదు. మా అబ్బాయి కోన సాయి సాత్విక్ నీట్ పరీక్షకు కష్టపడి చదివాడు. అలాగే రానున్న ఎంసెట్‌కు కూడా ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సమయంలో పరీక్ష రద్దు ప్రభావం ఎంసెట్‌పై పడుతుంది. తిరిగి పరీక్షలు నిర్వహించడం, మళ్లీ చదివి రాయడం అంటే విద్యార్థికి ఇబ్బందిగా ఉంటుంది. – కోన సత్యనారాయణ, కే.పెదపూడి, అంబాజీపేట మండలం, కోనసీమ జిల్లా కొత్త పరీక్షా తేదీలను ప్రకటించాలి దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును ఈ పరీక్షలపై ఆధారపడి నిర్మించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షల పారదర్శకత, నిష్పాక్షికత, విశ్వసనీయతను కాపాడటం కేంద్ర పరీక్షా సంస్థల ప్రాథమిక బాధ్యత. ఆరోపణల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయడం విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా తీసుకున్న అత్యవసర చర్యగా భావించాలి. అయితే, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా, త్వరితగతిన కొత్త పరీక్షా తేదీలను ప్రకటించి, భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏకు విజ్ఞప్తి చేస్తున్నాం. – మతుకుమిల్లి శ్రీవిజయ్ ధైర్యంగా ఉండాలి నీట్ 2026 ఎన్నో నెలల కృషి, కష్టం. ఎంతోమంది విద్యార్థుల, తల్లిదండ్రుల కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. ఇది చాలా దారుణం, తిరిగి నీట్ ఎగ్జామ్ ఎప్పుడూ ప్రారంభమవుతుందో తెలిసే వరకు ఎవరూ భయపడకుండా ధైర్యంగా ఉండాలి. – వై.గోవిందరాజు, కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు, రాజమహేంద్రవరం -
ఆక్వా రైతులను పీడిస్తున్న సిండికేట్లు
● నియంత్రించకుంటే ప్రత్యక్ష కార్యాచరణ ● ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కపిలేశ్వరపురం (మండపేట): చంద్రబాబు ప్రభుత్వ పాలనా తీరుతో ఆక్వా రైతులు కుదేలవుతున్నారని, వారిని కనీసం పట్టించుకుంటున్న పాపాన పోలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి మంగళవారం వీడియో మాధ్య మం ద్వారా ప్రభుత్వ వైఖరిని ఖండించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల్లో 4.30 లక్షలు, వాస్తవంగా 10 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారని, ఆక్వా రైతులను ఫీడ్, ఎగుమతి పరిశ్రమల నిర్వాహకులు దోచుకుంటున్నారన్నారు. వారి దోపిడీకి తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి, ఫీడ్ పరిశ్రమల యాజమానులు వారి వారి పరిధుల్లో సిండికేట్ అయ్యి ఫీడ్ ధరలను పెంచేస్తున్నారన్నారు. ఫీడ్ తయారీ ముడిసరుకు ఈ దేశంలోనే లభ్యమవుతున్నప్పటికీ ధరలను ఎందుకు పెంచుతున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. ధరల నిర్ధారణ విషయంలో రైతులతో కానీ, ఏపీఈడీఏ సంస్థతో కానీ ఏ మాత్రమూ సంప్రదించడంలేదన్నారు. కడుపు మండిన రైతులు యాజమానులను ప్రశ్నిస్తే.. కూటమి ప్రభుత్వం తమ కృషి వల్ల వచ్చిందని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని చెబుతున్నారని రైతులు అంటున్నారన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక పరిస్థితులు ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తున్నాయన్నారు. సిండికేట్లను నియంత్రించే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. కరోనా కాలంలో ఆక్వా ఉత్పత్తులను చెరువుల్లోనే వదిలేసే సంక్షోభం తలెత్తినప్పుడు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలతో ఆక్వా రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల పక్షాన నిలవకుండా కేవలం ఆదుకుంటామన్న ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతోందన్నారు. వైఎస్సార్ సీపీ ఆక్వా రైతులకు అండగా నిలుస్తుందని, ప్రభుత్వం రైతులను ఆదుకోని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఎమ్మెల్సీ తోట హెచ్చరించారు. -
‘దండి మార్చ్’ సందర్శనను అడ్డుకుంటారా?
● వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి భరత్‌రామ్ ఆగ్రహం ● పోలీసులతో వాగ్వాదం ● దూరం నుంచే నివాళులర్పించిన వైనం రాజమహేంద్రవరం సిటీ: చంద్రబాబు పాలనలో స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల సందర్శనను పోలీసులు అడ్డకోవడం దారుణమని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని కంబాలచెరువు సెంటర్లోని చిరంజీవి బస్ స్టాప్ వద్ద ఉన్న దండి మార్చ్ విగ్రహాల సందర్శనకు వెళ్లిన భరత్‌రామ్‌ను సందర్శనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. స్వతంత్ర సమరయోధుల విగ్రహాలపై దుమ్ము పేరుకుపోవడంతో స్వచ్ఛంద సంస్థ పెయింటింగ్ వేసి మరమ్మత్తులు చేసింది. దీనిని చూసేందుకు వచ్చిన భరత్‌రామ్‌ను అధికారులు, పోలీసులు అడ్డుకోవడంతో ఆయన దూరం నుంచే విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ఏర్పాటు చేసిన విగ్రహాలను అధికారం లేకపోవడంతో చూడకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం చలివేంద్రం ఏర్పాటు చేద్దామన్నా అడ్డుకుంటున్నారని అన్నారు. దేశభక్తిని చాటుతూ ఢిల్లీ తరహాలో రాజమహేంద్రవరంలో దండి మార్చ్ విగ్రహాలను తీసుకువచ్చానన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోతే స్వచ్ఛంద సంస్థతో రంగులు వేయించానని, దానిని చూడడానికి వస్తే అడ్డుకోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాను చేసిన అభివృద్ధి పనులను ధ్వంసం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. దండి మార్చ్ వంటి చారిత్రక స్ఫూర్తి కేంద్రాలను సంరక్షించడం ప్రభుత్వ బాధ్యతని ఆయన అన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు గుర్రం గౌతమ్, వాసంశెట్టి గంగాధరరావు, దాసి వెంకటరావు, మజ్జి అప్పారావు, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
హక్కుల సాధన కోసమే పోరాటం
● అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ ● అమలాపురంలో మొదలైన మహాసభలు ● ఎర్ర జెండాలతో హోరెత్తిన మహా ప్రదర్శన అమలాపురం టౌన్: వ్యవసాయ కార్మికుల్లో ఐక్యత కోసం, కార్మిక హక్కుల సాధన కోసం జాతీయ, రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు. అమలాపురం గడియారం స్తంభం సెంటరులో 30వ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహా సభలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం వరకు నిర్వహించేందుకు రాష్ట్ర సంఘం ఏర్పాట్లు చేసింది. పుర వీధుల్లో సంఘం మహా ప్రదర్శన నిర్వహించింది. ప్రదర్శనలో వ్యవసాయ కార్మిక ప్రతినిధులు 30వ కవాతు నిర్వహించారు. సభలో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షుడు ఎ.విజయరాఘవన్, అఖిల భారత సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్, మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు, చైతన్య, రాష్ట్ర కార్యదర్శులు కె.లోకనాధం, వి.వెంకటేశ్వర్లు ప్రసంగించి వ్యవసాయ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ప్రశ్నించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలకు పలు రాష్ట్రాల నుంచి వ్యవసాయ కార్మిక ప్రతినిధులు హాజరై ప్రసంగించారు. చివరిగా సభా వేదికపై వారంతా సంఘీభావం ప్రకటించారు. -
క్రైస్తవం తీసుకున్నా ఎస్సీ హోదా కోల్పోకూడదు
● 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు పార్లమెంట్లో సవరణ చేయాలి ● ప్రభుత్వానికి రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకుల వినతి సీటీఆర్ఐ: మత స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కని, దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ హోదా కోల్పోకూడదని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. స్థానిక హొటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు మాట్లాడుతూ ఎస్సీలు క్రైస్తవం లోకి మారినా ఎస్సీలకు ఉండే ప్రయోజనాలు కోల్పోకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దీనికోసం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డరుకు పార్లమెంటులో సవరణ చేసి ఆమోదింపజేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు బి.జార్జి ఆంటోని మాట్లాడుతూ ఇతర మతాల్లోకి మారితే కోల్పోని ఎస్సీ హోదా క్రైస్తవంలోకి మారితే ఉండదనడం అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్ర చైర్మన్ గుమ్మడి సమర్పణరావు, వైస్ చైర్మన్ ఎల్వీ ప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పని చేసే తమ సంఘం ఎస్సీ క్రిష్టియన్లపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పోరాడుతుందని, క్రైస్తవం లోకి మారినా ఎస్సీ హోదా కోల్పోకుండా దేశ వ్యాప్త ఉద్యమం రావాలని వారు కోరారు. సంఘ సభ్యుడు నంబూరి రవీంద్ర మాట్లాడుతూ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డరు ప్రకారం ఎస్సీల్లో 59 ఉప కులాలు ఉన్నాయని, అందులో ఉన్న సిక్కులు, బౌద్ధులు మతం మారినా ఎస్సీ హోదా పోకుండా ఆ ఆర్డరుకు సవరణ చేయించుకున్నారని వివరించారు. దళితుల కోసం ఆ ఆర్డరుకు సవరణ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మట్టపర్తి సత్యనారాయణ, పోలవరపు రాము, నక్కా సోమేశ్వరరావు పాల్గొన్నారు. -
అవే వినతులు మళ్లీ మళ్లీ
● విన్నవించిన సమస్యలపైనే మళ్లీ మళ్లీ అర్జీలు ● సర్వే మాయాజాలంలో భూములు గల్లంతు ● క్షేత్రస్థాయిలో పరిష్కరించని అధికారులు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వచ్చిన దరఖాస్తులే మళ్లీ మళ్లీ వస్తున్నాయంటే రెవెన్యూ క్లినిక్‌లో ఏ మేరకు సమస్యలు పరిష్కారమవుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. సోమవారం నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ (పీజీఆర్ఎస్)లో 85 అర్జీలు మాత్రమే వచ్చాయి. వీటిలో భూ సమస్యలపై వచ్చేవే 80 శాతం ఉన్నాయి. గతంలో ఇచ్చిన సమస్యలపైనే మళ్లీ మళ్లీ ఫిర్యాదులు వస్తుండడం గమనార్హం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో స్పందన, జగనన్నకు చెపుదాం కార్యక్రమాలలో ఇచ్చిన దరఖాస్తులకు ఎంత వేగంగా పరిష్కారాలు దొరికేవోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లలో కలెక్టర్ కీర్తి మొత్తం 201 అర్జీలు స్వీకరించారు. సర్వే నంబర్లు మార్చేశారు బిక్కవోలు మండలం బలభద్రపురంలో నా భార్య చింతా లక్ష్మికి సర్వే 425లో 54 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. 1995లో ఒకసారి, 2022లో సర్వే చేసి అన్నీ బాగుండడంతో అమెకు పట్టా మంజూరు చేశారు. కానీ తాజా సర్వేలో ఆన్లైన్లో ఆ భూమిని వేరే సర్వేలోకి మారిపోయింది. దీంతో ఆ సర్వేపై ఆమె రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. అలాగే తన అత్త మేడపాటి వరలక్ష్మికి సర్వే నంబర్ 88 1సీలో 150 సెంట్లు ఉండగా గతంలో దానికి పట్టా ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో చేపట్టిన సర్వేలో 140 సెంట్లకి మాత్రమే పట్టా ఇచ్చి 10 సెంట్ల భూమి లేకుండా చేశారు. తనకు సర్వే నంబర్ 425లో 54 సెంట్లు భూమి ఉంది. దానికి గతంలో సర్వే చేసి పట్టా ఇచ్చారు. ఇప్పుడు సర్వేలో 2015లో చనిపోయిన మామయ్య మేడపాటి సత్యనారాయణ రెడ్డి పేరు మీద అన్లైన్ పెట్టి నా పేర మీద భూమిని తొలగించారు. – చింతా డేవిడ్ రాజా రెడ్డి, ఫిర్యాదు దారుడు డ్రోన్ సర్వేలో మాయం చేశారు నాకు తాళ్లపూడి మండలం, పోచవరం వద్ద ఎకరం 8 సెంట్ల భూమి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత డ్రోన్ సర్వే చేపట్టి ఆ భూమిని లేపేశారు. రెండేళ్లుగా కలెక్టరేట్‌కి తిరుగుతున్నా ఇప్పటి వరుకు న్యాయం చేయలేదు. – దుగ్గిరాల శ్రీనివాసరావు, ఫిర్యాదుదారు 15 ఎకరాలకు అడ్డుగా గట్టు కట్టారు తాళ్లపూడి మండలం పైడిమెట్ట గ్రామం వద్ద 20 మంది రైతులకు కలిపి 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమి చుట్టూ కొంత ఆర్ అండ్ ఆర్ భూమి ఉండేది. ఈ భూములను కబ్జా చేయడంతో మురుగునీరు తమ పొలాల్లో ఆగిపోతోంది. దీంతో తమ పంటలు పాడైపోతున్నాయి. మురుగు నీరు వెళ్లిపోవడానికి మార్గం చూపించాలని ఇప్పటికి చాలా సార్లు అర్జీ పెట్టినా పరిష్కారం కాలేదు. – పులప కృష్ణారావు, అర్జీదారు చంద్రబాబు చెప్పారని... వికలాంగులకు అదనంగా 35 కేజీల బియ్యం ఇస్తారని సచివాలయ ఉద్యోగులు వచ్చి సర్వే చేపట్టారు. ఇప్పటి వరుకు బియ్యం ఇవ్వలేదు. ఏడాదిన్నర నుంచి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా. చంద్రబాబు చెప్పారని ఎందుకు వేలి ముద్రుల తీసుకున్నారు. అసలు ఇస్తారో, ఇవ్వరో తెలియాలి. – రొక్కం నీలకంఠేశ్వరరావు, అర్జీదారుడు -
దానకర్ణుడు బసివిరెడ్డి విగ్రహం ఏర్పాటు అభినందనీయం
పెదపూడి : ఉభయగోదావరి జిల్లాల్లో పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేసి, అన్నదాన సత్రాలు నిర్మించిన అపర దాన కర్ణుడు కీర్తి శేషులు కొవ్వూరి బసివిరెడ్డి అని వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. జి.మామిడాడ గ్రామంలో ఏర్పాటు చేసిన కొవ్వూరి బసివిరెడ్డి కాంస్య విగ్రహానికి సోమవారం మాజీ ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఖండాంతరాల ఖ్యాతిగడించిన బసివిరెడ్డి విగ్రహం ఏర్పాటుకు ఆవిశ్రాంతంగా కృషి చేసిన ప్రముఖ యువనేత చింతా దొరబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి మండా రాజారెడ్డి, మండల కన్వీనర్ గుత్తుల రమణ, పార్టీ గ్రామ కన్వీనర్,కోకన్వీనర్ మేడపాటి తాతారెడ్డి, ద్వారంపూడి శ్రీనివాసారెడ్డి, పార్టీ నాయకులు ద్వారంపూడి వెంకటరెడ్డి(చింతపండు), కర్రి వీర్రెడ్డి, కోసూరి వాసు, లంక రమేష్, గుడిమెట్ల మురళీ, సబ్బెళ్ల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 47 ఫిర్యాదులు కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పోలీస్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. దీనికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్జీదారులు వచ్చి ఎస్పీ డి.నరసింహాకిశోర్కు ఫిర్యాదులు అందజేశారు. మొత్తం పీజీఆర్ఎస్కు 47 ఫిర్యాదులు అందగా, వాటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, ఇతర కేసులు ఉన్నాయి. వాటిని సంబంధిత స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. కడియం రైల్వే గేటు మూసివేత కడియం: సోమవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు కడియం ఫిష్ఫామ్ వద్దగల రైల్వే గేటును మూసివేయనున్నారు. ట్రాక్ మరమ్మతుల్లో భాగంగా గేటును మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని వారు కోరారు. -
మొక్కజొన్న, అరటికి గిట్టుబాటు ధర కల్పించాలి
● వైఎస్సార్ సీపీ నేతలు గన్నవరపు, జిన్నూరి ● వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన అయినవిల్లి: మొక్కజొన్న, అరటి పంటలకు ప్రభుత్వం గిట్టుబాబు ధర ప్రకటించాలని, తుపాను, అకాల వర్షాలకు దెబ్బతిన్న ఆయా పంటల రైతులను ఆదుకోవాలని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరి రామారావు (బాబి) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని తొత్తరమూడి కె.పెదలంకలో తుపాను, వర్షాలకు దెబ్బతిన్న పంటలను వారు పరిశీలించారు. రైతులు గుత్తాల బాబురావు, రేవు రాంబాబు, బొక్కా సత్యనారాయణ, మద్దా వెంకటలక్ష్మి తదితరులు పాడైన పంటలను వారికి చూపించారు. ఈ ఏడాది మొక్కజొన్న ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చిందని, అరటి సైతం బాగుందని, కానీ మార్కెట్లో గిట్టుబాటు ధర లేక అయినకాడికి విక్రయించాల్సి వస్తోందని వాపోయారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, రామారావు మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొక్కజొన్నకు ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2400 చెల్లించే వారని ఈ ప్రభుత్వంలో రూ.1400 నుంచి రూ.1700 మాత్రమే చెల్లింస్తున్నారన్నారు. అరటి గెల మార్కెట్లో రూ.400 వరకూ పలికేదని ఇప్పుడు రూ.50కి కూడా కొనావారు లేరన్నారు. ఇంతలా నష్టపోతున్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు చూస్తోందని మండి పడ్డారు. తక్షణం రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి ఆదుకోవాలని కోరారు. పంటల బీమాకు కేంద్ర ప్రభుత్వం, రైతులు ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తమవాటా చెల్లించలేని స్థితిలో ఉందన్నారు. దీంతో బీమా సంస్థలు పంటల బీమాకు ముందుకు రావడం లేదన్నారు. కార్యక్రమంలో అయినవిల్లి, పి.గన్నవరం మండలాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాసబాబు, యన్నబత్తుల ఆనంద్, రాష్ట్ర రైతు విభాగ జాయింట్ సెక్రటరీ కొర్లపాటి కోటబాబు, రైతు విభాగం మండల అధ్యక్షుడు రెడ్డి గనిరాజు, కోట విజయరాజు, గుత్తుల నాగబాబు, మిండగుడిది శిరీష్ నారాయణస్వామి, కుడుపూడి రామకృష్ణ, మిండగుదిటి రాంబాబు, కుసుమ సునీల్‌కుమార్, మతుకుమిల్లి సత్తులు తదితరులు ఉన్నారు. -
అవినీతి సైకథం!
వాడపల్లి–1లో ఇసుక ర్యాంప్‌లో లారీలకు ఎగుమతి చేస్తున్న ప్రోక్లైయినర్లు● అనుచిత రీతిలో భారీ దోపిడీ ● అధికారులతో కాంట్రాక్టర్ల కుమ్మక్కు! ● అన్నీ తెలిసినా నిద్ర నటిస్తున్నవైనం పెరవలి (కొవ్వూరు): కాంట్రాక్టర్లకు కాసులు కురిపించడానికే ఉచిత ఇసుక పథకాన్ని ప్రభుత్వం రూపొందించినట్టుంది. అధికారులు, నాయకుల కళ్లెదుటే లారీ డ్రైవర్ల నుంచి అదనపు వసూళ్లు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 20 టన్నుల ఇసుక గుట్టల వద్దే రూ.4300 విక్రయిస్తున్నా ప్రశ్నించేవారు లేకపోవడం శోచనీయం. కాంట్రాక్టర్లు, దళారులు, అధికారుల పటిష్టమైన సమన్వయంతో దోపిడీ పర్వం సాగుతున్న నేపథ్యంలో పేదలకు ఉచిత ఇసుక ఏ మేరకు అందుతోందో వేరే చెప్పాల్సిన పనిలేదని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మామూళ్ల మత్తులో.. కొవ్వూరు నియోజకవర్గంలో వాడపల్లి, ఔరంగబాద్, కొవ్వూరు, అరికలరేవు, కుమారదేవం, వేగేశ్వరం, తాళ్లపూడి, ప్రక్కిలంక ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అవినీతికి అంతులేకుండా పోయింది. అధికారుల కళ్లెదుటే కాంట్రాక్టర్లు అధిక మొత్తంలో సొమ్ములు వసూలు చేస్తున్నారంటే నెలవారీ చదివింపులు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్ధంచేసుకోవచ్చని బహిరంగంగానే చర్చ సాగుతోంది. ప్రభుత్వ రేటు ఎంత? నియోజకవర్గంలో ఇసుక లభ్యత ఉన్న 7 ఓపెన్ రీచ్‌లు, 8 పడవల ద్వారా లభ్యమయ్యే ఇసుక రీచ్‌లను జిల్లా అధికారులు గుర్తించి ఇసుక సరఫరా చేయాలని ఆదేశించారు. దీనికి ముందు టెండర్లు పిలిచి తక్కువ టెండరు వేసినవారికి రీచ్‌లను అప్పగించారు. టెండర్ దక్కించుకున్నవారికి ఒక్కో రీచ్‌కు అధికారులు ఒక్కో ధర నిర్ణయించారు. ఈ ర్యాంపుల్లో టన్ను ఇసుక రూ.68 నుండి రూ.110కు సరఫరా చేస్తామని కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తారు. దీని ప్రకారం ర్యాంపులో లారీ ఇసుక (20 టన్నులకు) ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రూ.1380 నుంచి రూ.1921 వసూలు చేయాల్సి ఉంది. కానీ రూ.4 వేల నుంచి రూ.4300 వరకు విక్రయిస్తున్నారు. అదే ట్రాక్టరుకై తే రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. మొత్తం వసూళ్లు ఇలా.. నియోజకవర్గంలోని 15 ర్యాంపుల్లో నిత్యం 50 నుంచి వంద లారీల చొప్పున సుమారు 750 లారీల ఇసుక ఎగుమతి అవుతుంది. వీటికి తోడు ట్రాక్టర్ల ద్వారా ఎగుమతి అవుతున్న ఇసుకకు రూ.17.25 లక్షలు కాంట్రాక్టర్లకు చేరుతోంది. ఇలా నెలకు రూ.5.17 కోట్లు వసూలు చేస్తున్నారు. అధికారుల సమక్షంలోనే ఈ దందా సాగుతున్నా సొమ్ములు కాంట్రాక్టర్ నియమించిన వ్యక్తులే వసూలు చేయడం గమనార్హం. కాగా నదీగర్భం నుంచి ఇసుక తీసుకువస్తున్న పడవల యజమానులకు, ఎగుమతి చేస్తున్న కూలీలకు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే రోజుకు రూ.500 నుంచి రూ.700 ఇస్తున్నారు. చెప్పిన ధరలకు ఇవ్వడం లేదుఇసుక పాయింట్ల వద్ద ప్రభుత్వం చెప్పిన ధరలకు ఎగుమతి చేయటం లేదు. ఒక లారీకి అదనంగా రూ.2300 తీసుకుంటున్నారు. కాదంటే ఒప్పుకోవడం లేదు. – ఆర్.సత్యనారాయణ, లారీ డ్రైవర్, భీమవరం గంటల తరబడి నిరీక్షణ అడిగిన సొమ్ములు ఇవ్వకపోతే ఇసుక ఇవ్వటం లేదు. రోజంతా పడిగాపులు తప్పడంలేదు. ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తే అంత ముందర లోడ్ చేస్తున్నారు. – వి సుబ్బారావు, లారీ డ్రై యివర్ తాడేపల్లి గూడెం -
తామర వ్యాధిని తరిమేద్దాం
● పశువుల్లో ప్రమాదకరం ● జాగ్రత్తలతో నయం రాయవరం: మనుషుల మాదిరిగానే పశువులకు కూడా చర్మ వ్యాధులు సోకుతాయి. ఈ చర్మ వ్యాధుల్లో తామర పశువులను అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇది ‘డర్మటోఫైట్స్’ అనే రకానికి చెందిన శిలీంధ్రం/బూజు వల్ల ఆవులు, గేదెల్లో కలిగే అతి సాధారణ వ్యాధి. దీనివల్ల చర్మంపై గుండ్రని, గోళాకారపు మచ్చలు ఏర్పడతాయి. దీనినే రింగ్ వార్మ్ అని కూడా అంటారు. పశువులకు తామర వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది?, వ్యాధి లక్షణాలు, చికిత్స విధానాన్ని రాయవరం మండలం మాచవరం పశువైద్యాధికారి ఎం.బిందు వివరించారు. అవి ఇలా.. వ్యాధి వ్యాప్తి.. లక్షణాలు రింగ్ వార్మ్ ఏడాది లోపు దూడల్లో ముఖ్యంగా ఎండా కాలంలో అధికంగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పశువుతో కలిసి జీవించే ఇతర పశువులకు నేరుగా, పశువుల కొట్టాంలోని వస్తువుల ద్వారా, పశువుల కాపరుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధికి గురైన పశువుల చర్మంపై ఉండే వెంట్రుకలు రాలిపోతాయి. కంటి చుట్టూ, చెవులు, మెడ, తలపై మరియు గంగడోలు చర్మంపైన ఎర్రటి పుండ్లు ఏర్పడతాయి. ఈ మచ్చలు గుండ్రంగా, గోళాకారంగా ఉండి, గాయం మధ్యలో మానిపోయి చుట్టూ పుచ్చిపోయి ఉంటుంది. నిర్ధారణ.. చికిత్స వెంట్రుకలు ఊడిపోయి గుండ్రంగా ఉన్న మచ్చల ఆధారంగా పశువులకు తామర వ్యాధి సోకిందని గుర్తించవచ్చు. చర్మాన్ని సేకరించి పరీక్షించడం ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. సాలిసిలిక్, బెంజాయిక్ ఆసిడ్, అయోడిన్, ఫినాల్ వంటి ఔషధాలను దగ్గరలో ఉన్న పశు వైద్యుడిని సంప్రదించిె వినియోగించాలి. తామర తగ్గే వరకూ వైద్యం చేయించాల్సి ఉంటుంది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
జాతీయ పతకాలే లక్ష్యం
నా పేరు జి.నికిలేష్. పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్లో చేరేందుకు సిద్ధమవుతున్నాను. ఐదేళ్లుగా టెన్నిస్ ఆడుతున్నాను. ఇప్పటి వరకూ నాలుగు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. జాతీయ స్థాయిలో పతకం సాధించడమే లక్ష్యంగా సాగుతున్నాను. ఫిట్నెస్ కోసం ఆడుతున్నా.. నా పేరు షేక్ సాజిద్ అలోక్. తొమ్మిదో తరగతి చదువుతున్నాను. రోజుకు రెండు గంటలు టెన్నిస్ సాధన చేస్తున్నాను. ఫిట్నెస్ కోసం ఈ క్రీడ ఆడుతున్నాను. భవిష్యత్తులో ఐఏఎస్ కావాలన్నది నా లక్ష్యం. మూడేళ్లుగా శిక్షణ నాపేరు కె.కుందన. ఇంటర్ చదువుతున్నాను. నాకు టెన్నిస్ క్రీడాకారుడు ఫెదరర్ అంటే ఇష్టం. గత మూడు సంవత్సరాలుగా కోచ్ కుమార్ వద్ద శిక్షణ పొందుతున్నాను. రోజుకు 2 గంటలు ఆడుతున్నాను. -
● వేసవి శిక్షణతో ఆగిపోవద్దు
వేసవి శిక్షణలో తమ పిల్లలను తల్లిదండ్రులు ఎంతో ఇష్టంగా చేర్పిస్తున్నారు. ఈ శిక్షణ పొందిన క్రీడాకారులు వేసవితో ఆగిపోకుండా నిరంతరం శిక్షణ పొందితే జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారవుతారు. ఈ ఏడాది శిక్షణకు సుమారు 120 మంది చేరారు. ఉదయం, సాయంత్రం అనుభవజ్ఞులైన కోచ్‌లతో శిక్షణ అందిస్తున్నాం. శిక్షణకు డీఎస్డీఓ సతీష్ కుమార్ ఎంతో సహకారం అందిస్తున్నారు. –పీవీ రామ్‌కుమార్, టెన్నిస్ సంఘ రాష్ట్ర కార్యదర్శి, కోచ్ ● -
అందమే అక్కడెక్కడ!
తాండవ నదిపై పచ్చని తివాచీ కనువిందు చేస్తుంది. ఈ అపురూప దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. తుని వద్ద జాతీయ రహదారి బ్రిడ్జి నుంచి రైల్వే బ్రిడ్జి వరకూ అర కిలోమీటరు పైగా తాండవ నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క ఇది. వేసవిలో తాండవ నదిలో నీటి ప్రవాహం నిలిచిపోయి గుర్రపుడెక్క ఇలా పేరుకుపోయింది. వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగితే తాండవ నదిలో పూర్తిగా నీరు ఇంకిపోయి ఈ గుర్రపుడెక్క ఎండిపోనుంది. –తుని రూరల్ రక్షణ గోడు పట్టదా! కాజులూరు మండలం ఉప్పుమిల్లి– దుగ్గుదుర్రు రహదారిలో కాలువపై కల్వర్టు ప్రమాదాలకు నిలయంగా మారింది. పదిహేనేళ్ల కిందట నిర్మించిన వంతెన ఇరువైపులా రక్షణ గోడలు ఏర్పాటు చేయలేదు. ఈ కల్వర్టుకు ఇరువైపులా రోడ్డు మలుపు తిరిగి ఉంటుంది. వేగంగా వచ్చే వాహనాలు అదుపు తప్పితే కాలువలోకి పడిపోతున్నాయి. ఇటీవల ఓ ట్రాక్టర్ కల్వర్టుపై నుంచి కాలువలోకి పడిపోగా, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. –కాజులూరు -
మరిచిపోయిన బంగారు ఆభరణాల అప్పగింత
రామచంద్రపురం రూరల్: బస్సులో బంగారు ఆభరణాల బ్యాగు మరిచిపోయిన వృద్ధురాలికి తిరిగి వాటిని అందజేసి ఆర్టీసీ సిబ్బంది నిబద్ధత చాటుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రామచంద్రపురం పట్టణ ఆర్టీసీ పాత బస్టాండ్ వద్ద జంగారెడ్డిగూడేనికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు కాలెపు ప్రభావతి రాజమహేంద్రవరం బస్సు అనుకుని రాజానగరం వెళ్లే బస్సు ఎక్కింది. ఆ బస్సు రాజమహేంద్రవరం వెళ్లదని చెప్పడంతో హడావుడిగా దిగిపోయింది. ఆ హడావుడిలో ఆమె తన బ్యాగును ఆ బస్సులో మర్చిపోయింది. తరువాత గుర్తించిన ఆమె ఆర్టీసీ డిపో మేనేజర్ పేపకాయల భాస్కరరావుకు విషయం తెలియజేయగా, వెంటనే సంబంధిత కండక్టర్, డ్రైవర్లను అధికారులు అప్రమత్తం చేశారు. రూ.6 లక్షల విలువైన ఆభరణాలతో ఉన్న బ్యాగును అధికారుల సమక్షంలో డ్రైవర్, కండక్టర్ల చేతుల మీదుగా ఆమెకు అందజేశారు. కండక్టర్ పలివెల సత్తిబాబు, డ్రైవర్ సీహెచ్ఎస్ రావు, డిపో మేనేజర్లకు ప్రభావతి కృతజ్ఞతలు తెలియజేసింది. -
జోరుగా.. హుషారుగా..
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. నా పేరు ఎస్.చార్విన్. ఐదో తరగతి చదువుతున్నాను. నాకు ఫెదరర్ అంటే ఇష్టం. టెన్నిస్‌లో రాణించి కార్డియాలజిస్టు కావాలన్నదే లక్ష్యం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో టెన్నిస్‌లో చేరాను. ఈ క్రీడలో రాణించేందుకు కృషి చేస్తున్నాను. ఫ ఉత్సాహంగా లాన్ టెన్నిస్ శిక్షణ ఫ వేసవి వేళ సద్వినియోగం నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కలలను నిజం చేసుకునే అడుగది.. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునే సమయమిది.. చిన్నతనం నుంచే అనుకున్న లక్ష్యం దిశగా కొందరు బాటలు వేసుకుంటుండగా, మరికొందరు ఖాళీ సమయాన్ని ఇష్టమైన క్రీడకు కేటాయిస్తున్నారు. అలాంటి వారి కోసం కాకినాడలోని జిల్లా క్రీడా మైదానంలో జిల్లా లాన్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో శాప్ సహకారంతో లాన్‌టెన్నిస్ శిక్షణ ఇస్తున్నారు. ఇందులో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక్కడ రోజూ ఉదయం 6 నుంచి 8 వరకూ, సాయంత్రం 4 నుంచి 7 వరకూ శిక్షణ అందిస్తున్నారు. ఐదేళ్ల వయసు నుంచి చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. చీఫ్ కోచ్ పీవీ రామ్‌కుమార్‌తో పాటు రమణ, త్రినాథ్, అనంత్, నాని శిక్షణ అందిస్తున్నారు. ఫిట్నెస్తో పాటు, టెన్నిస్‌లో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. 120 మంది క్రీడాకారులు ఈ వేసవి శిక్షణకు హాజరై ఓనమాలు నేర్చుకుంటున్నారు. శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు టెన్నిస్ సంఘం తరఫున ప్రతి రోజూ గుడ్డు, నిమ్మ రసం అందిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన శ్రీవేద పదో తరగతి పరీక్షల్లో 600 మార్కులకు 587 మార్కులు సాధించి విద్యలోనూ సత్తా చాటింది. అలాగే విద్యార్థిని ప్రవల్లికి స్పోర్ట్స్ కోటాలో ఇంజినీరింగ్ సీటు వచ్చింది. స్థానిక డీఎస్ఏ మైదానంలోని టెన్నిస్ కోర్టుల్లో శిక్షణ పొందుతున్న చిన్నారులు తమ మనోభావాలు ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. నాన్న ఆడడం చూసి.. నా పేరు జాహ్నవిక. మా నాన్న ఆర్ఎంసీ మైదానంలో టెన్నిస్ ఆడేవారు. అక్కడ టెన్నిస్ ఆడడం చూసి టెన్నిస్‌పై ఇష్టం పెంచుకున్నాను. నేను 4వ తరగతి చదువుతున్నాను. నాకు రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం సాధించాలని ఉంది. -
వేగమే బలిగొంది
ఫ రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి ఫ మరొకరికి తీవ్ర గాయాలు కూనవరం: వేగం... ఇద్దరి ప్రాణాలను బలిగొంది. కూలి పనులు చేస్తూ కుటుంబాలకు ఆసరాగా ఉంటున్న వారి మృతితో విషాదం నెలకొంది. ఈ ఘటన అభిచర్ల గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై బి.రామకృష్ణ కథనం ప్రకారం.. పంద్రాజుపల్లి గ్రామం నుంచి చింతూరు వైపు ద్విచక్ర వాహనంపై పంద్రాజుపల్లికి చెందిన వంజం లక్ష్మణ్ (24), ముల్లూరుకు చెందిన పద్దం కార్తీక్ (25), అభిచర్ల గ్రామానికి చెందిన శ్యామల భీమేశ్వరరావు వస్తున్నారు. అభిచర్ల గ్రామ సమీపంలో మలుపు వద్ద వేగంగా వస్తున్న కంకర లోడు ట్రాక్టర్‌ను వీరు ఢీకొన్నారు. వెంటనే ఆ ముగ్గురూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వంజం లక్ష్మణ్, కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందారు. భీమేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో కోతులగుట్ట సీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలానికి రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఘటనా స్థలాన్ని ఎస్సై రామకృష్ణ సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వంద కిలోల గంజాయి స్వాధీనం
వై.రామవరం: మండలంలోని కొమరవరం గ్రామ జంక్షన్లో రూ.50 లక్షల విలువైన వంద కిలోల గంజాయిని పట్టుకున్నట్లు అడ్డతీగల సీఐ బి.నరసింహమూర్తి, ఎస్సై ఎస్.పృథ్వీయాదవ్ తెలిపారు. ఓ కారును, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ మేరకు మహారాష్ట్రాకు చెందిన మహేష్ మార్కెట్ (35), రఫిన్ జిలాల్ పింజారి (27)లను కోర్టులో హాజరుపరిచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు చెప్పారు. గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి వై.రామవరం మండలం మీదుగా మహారాష్ట్రాకు తరలిస్తున్నారని అన్నారు. సోమవారం ఉదయం కొమరవరంలో వీరు పట్టుబడ్డారు. మొత్తం ఐదుగురు నిందితులు కాగా, ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. వీరంతా గంజాయి కేసుల్లో పాత నిందితులని సీఐ వివరించారు. సెల్ టవర్ ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం యానాం: పోలీసులు వేధిస్తున్నారంటూ యానాంలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు షేర్ చేశాడనే అభియోగంతో పట్టణ పరిధిలో మహ్మద్ అహ్మద్ అలీషాకి సంబంధించిన సెల్ ఫోన్‌ను పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అతన్ని రోజూ స్టేషన్‌కు పిలవడం, సాయంత్రం వెళ్లిపోమని చెప్పడం, వారం రోజులుగా జరుగుతుంది. తన సెల్ ఫోన్ తిరిగి ఇవ్వాలంటూ అలీషా సోమవారం మధ్యాహ్నం స్థానిక సిద్ధార్ధనగర్‌లోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అక్కడకు ఎస్పీ వరదరాజన్, ట్రైనీ ఎస్పీ చిట్టిరాజు, సీఐ షణ్ముకసుందరం, ఎస్సై కొమరన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్, శివ తదితరులు చేరుకుని దిగిరావాలని కోరారు. ఇలా రెండు గంటల పాటు ఉత్కంఠ నెలకొంది. ఆఖరికి ఎస్సై కొమరన్ సెల్‌ఫోన్ తీసుకుని రావడంతో అలీషా కిందకు దిగాడు. సెల్‌ఫోన్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ పోలీసులు పట్టుకువెళ్లడంతో, గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని అలీషా అనడంతో సెల్‌ఫోన్ తిరిగి ఇచ్చారు. -
గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌లో ప్రతిభ
సీతానగరం: కీ బోర్డుపై సుస్వరాలు పలికించి గిన్నీస్ వరల్డ్ రికార్డులో రాపాక శ్రేష్ట జోయిస్ ప్రతిభ చాటింది. సీతానగరం మండలం కాటవరం గ్రామానికి చెందిన జోయిస్ అక్కడి ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతుంది. ఆ పాప పుట్టినప్పుడు, ఆడపిల్ల పుట్టిందనే కారణంతో తండ్రి వదిలి వెళ్లిపోయాడు. అయినప్పటికీ తల్లి సోనీ ప్రశాంతి, మేనమామ గుర కిషోర్‌కుమార్, అమ్మమ్మ అందించిన సహకారంతో ప్రతిభ చాటింది. ఫిబ్రవరి 2న గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సామూహిక కీ బోర్డు ప్లే జరిగింది. సుమారు 22 దేశాల నుంచి రెండు వేల మంది కీబోర్డు వాయిద్యకారులు పాల్గొనగా, 777 మంది ప్రతిభ కనబరిచారు. ఇందులో రాపాక శ్రేష్ట జోయిస్‌తో పాటు తల్లి సోనీ ప్రశాంతి, మేనమామ కిషోర్ కుమార్ కూడా ఉన్నారు. వీరికి ఈ నెల 9న విజయవాడలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ స్కూల్ వ్యవస్థాపకులు అగస్టీన్ దండింగి సర్టిఫికెట్లు, పథకాలను అందజేశారు. విజయవాడలో సర్టిఫికెట్ అందుకున్న శ్రేష్ట జోయిస్‌తో పాటు తల్లి, మేనమామ -
పగలంతా ఉక్కపోత.. రాత్రి కుండపోత
రాజానగరం: చండప్రచండంగా కాసిన ఎండ తీవ్రత నుంచి ప్రజలు కాస్త సేద తీరారు. రాజానగరంలో ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పగలంతా 39 డిగ్రీల ఉష్టోగ్రతలతో తల్లడిల్లిపోయిన జనాలు.. హఠాత్తుగా చల్లబడిన వాతావరణాన్ని హాయిగా ఆస్వాదించారు. ఈదురు గాలులు, చినుకులతో ప్రారంభమైన వర్షం క్రమంగా జోరందుకోవడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు గంటన్నర పాటు కుండపోతగా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. బాటసారులు, బైకులపై ప్రయాణించేవారు షెల్టర్ కోసం పరుగులు తీశారు. కలవరపడుతున్న రైతులు అకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులను కలవరపాటుకు గురి చేసింది. రబీ వరి కోతలు జరుగుతున్న వేళ కురిసిన ఈ వర్షంతో పంట నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. కోతలు జరిగిన చోట కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసి దెబ్బ తింటుందని అంటున్నారు. అలాగే, కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లోని వరి పైరు ఈదురు గాలులకు నేలకొరిగి, ధాన్యం గింజలు రంగు మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే, ఈ వర్షం వలన కోతలు పూర్తయిన పొలాల్లో వేసవి దుక్కులు చేపట్టే అవకాశం ఉంటుంది. రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. -
నిరంతరం సేవా కార్యక్రమాలు
● మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ● ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ రాజమహేంద్రవరం సిటీ: మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ తెలిపారు. ఈ నెల 12న ఆయన పుట్టిన రోజు, ఆదివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కృష్ణా నగర్ వీవీ గార్డెన్స్ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. ఈ శిబిరంలో క్యాన్సర్, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, కీళ్ల నొప్పులు, న్యూరో, డెంటల్, కళ్లు, గైనకాలజీ తదితర అన్ని విభాగాలకు సంబంధించిన సేవలు అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ కాంటినెంటల్, రాజమహేంద్రవరం జీఎస్ఎల్, వాసన్ ఐ కేర్, మాగ్నా వంటి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల నుంచి నిపుణులైన వైద్యులు వచ్చిన ఈ శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలు చేశారని, ఉచితంగా మందులు అందించామని చెప్పారు. ఈ శిబిరంలో సుమారు 2 వేల మంది ఉచిత వైద్య సేవలు పొందారన్నారు. ప్రతి రెండు నెలలకు వైద్య శిబిరం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, భరత్‌ను అభినందించారు. ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ సేవలు 80 శాతం మేర అందని ప్రస్తుత తరుణంలో ఇటువంటి శిబిరాలు నిర్వహించడం మంచి పరిణామమని అన్నారు. మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ, మార్గాని ఫౌండేషన్ ద్వారా గతంలో జాబ్ మేళాలు నిర్వహించి, 2 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని తెలిపారు. ఇప్పుడు ఈ వైద్య శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. రత్నం మెడికల్స్, రామలక్ష్మీ మెడికల్ ఏజెన్సీల ద్వారా మందులు అందజేశారు. ఆదిత్య కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి జీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యాన వలంటీర్లు సేవలందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, తలారి వెంకటరావు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ రామచంద్రపురం కో ఆర్డినేటర్ సూర్యప్రకాష్, సిటీ పరిశీలకుడు అద్దంకి ముక్తేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్ కానుబోయిన సాగర్, రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధరరావు, పార్టీ కడియం మండల అధ్యక్షుడు స్టాలిన్, జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ దాసి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
కోలుకోలేక..
● సిండికేటుపెరవలి: కొనుగోలు సంస్థలు సిండికేట్ అవుతున్నాయి.. ధర దారుణంగా తగ్గించేస్తున్నాయి.. రైతుల కష్టాన్ని కొల్లగొడుతున్నాయి.. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. సాధారణంగా ఏ వస్తువు ధర అయినా ఒక ఏడాదికి, మరో ఏడాదికి పెరుగుతూ ఉంటుంది. కానీ, తమ కష్టానికి మాత్రం ధర నానాటికీ పడిపోతోందని, నష్టాల ఊబిలో కూరుకుపోతున్నామని కోకో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ధర తగ్గించేశారిలా.. జిల్లావ్యాప్తంగా పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, చాగల్లు, దేవరపల్లి, కొవ్వూరు, కడియం, సీతానగరం, బిక్కవోలు తదితర మండలాల్లోని సుమారు 5 వేల మంది రైతులు దాదాపు 16 వేల హెక్టార్లలో కోకో సాగు చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఏటా సుమారు 2.64 లక్షల క్వింటాళ్ల కోకో గింజల ఉత్పత్తి జరుగుతోంది. ప్రతి పంటకు ఎకరానికి నాలుగైదు క్వింటాళ్ల వరకూ దిగుబడి రావాలి. గత ఏడాది 2 నుంచి 3 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఈ ఏడాది 3 నుంచి 4 క్వింటాళ్ల వరకూ వస్తోందని రైతులు చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కిలో కోకో గింజలకు ఏకంగా రూ.1,050 ధర పలకడంలో రైతులకు మంచి లాభాలు వచ్చాయి. అటువంటిది చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత కొనుగోలు సంస్థలది ఇష్టారాజ్యంగా మారింది. ఆయా కంపెనీలు గత ఏడాది దారుణంగా ధర తగ్గించేయడంతో రైతులు సామూహికంగా ఉద్యమించారు. దీంతో, ప్రభుత్వం దిగివచ్చి, కిలో గింజల ధరను రూ.650గా నిర్ణయించింది. ఈ ఏడాది ధర అంతకంటే అధికంగా ఉండాలి. కానీ, ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా.. కొనుగోలు సంస్థలు సిండికేట్ అయ్యి, ధరను ఏకంగా రూ.300కు తగ్గించేశాయి. అది కూడా కొనుగోలు కేంద్రాల్లో మామూళ్లు ఇస్తేనే కొంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోకో గింజలను ఫ్యాక్టరీలకు తీసుకెళ్తే కనీసం గేట్లు కూడా తీయడం లేదని, మార్కెట్ ధరకే అమ్ముతామన్నా వద్దంటున్నారని వాపోతున్నారు. అన్నీ ప్రైవేటు సంస్థలు కావడంతో వారు ఆడింది ఆట.. పాడింది పాటగా మారిందని దుయ్యబడుతున్నారు. నాణ్యతను బట్టి అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజల ధర రూ.750 నుంచి రూ.800 పలుకుతుండగా.. కనీసం రూ.500కు కూడా కొనుగోలు చేయడం లేదని మండిపడుతున్నారు. తమ కష్టనష్టాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఆదారపడిన జనం జిల్లాలో కోకో సాగుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి 15 వేల మంది జీవిస్తున్నారు. ఈ ఏడాది గిట్టుబాటు ధర లభించకపోవడంతో కూలీలను పెట్టుకోవడానికి చాలా మంది రైతులు విముఖత చూపుతున్నారు. పలువురు రైతులు సొంతంగా కాయలు కోసి, గింజలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. కొంత మంది రైతులు మాత్రం తక్కువ సంఖ్యలో కూలీలను పెట్టుకుంటున్నారు. కోకో సాగుకు అధిక మొత్తంలో ఎరువులు అవసరమవుతాయి. తెగుళ్లు కూడా ఎక్కువగానే వస్తాయి. అందువలన పురుగు మందులు కూడా వినియోగించడం తప్పనిసరి. దీంతో, ఎకరానికి రూ.60 వేల వరకూ పెట్టుబడి అవుతోంది. ఈ పరిస్థితుల్లో గత ఏడాది కంటే దిగుబడి పెరిగినప్పటికీ, కంపెనీలు ధరను తగ్గించేయడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. వచ్చిన సొమ్ము ఖర్చులకు సరిపోతుందని, మగతాకు ఎక్కడి నుంచి తేవాలని వాపోతున్నారు. సిండికేట్ అయితే రైతులు అయిన కాడికి అమ్ముకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని, అందుకే కంపెనీలు ధర తగ్గించేశాయని రైతులు ఆరోపిస్తున్నారు. ధర తగ్గించేశారు కోకోకు గత ఏడాది కంటే అధిక ధర లభిస్తుందని ఆశించాం. కానీ, తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది కంటే దిగుబడి పెరిగినా నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. అయిన కాడికి అమ్ముకోవాల్సి వస్తోంది. – కంటిపూడి సూర్యనారాయణ, రైతు, తీపర్రు, పెరవలి మండలం మరీ ఇంత దారుణమా? కొనుగోలు కంపెనీలు సిండ్కేటుగా మారి కోకో గింజల ధరను తగ్గించాశాయి. కిలో రూ.300కే అమ్ముదామన్నా కొనే నాథుడే లేడు. ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. – వాకలపూడి సూర్యారావు, రైతు, కానూరు, పెరవలి మండలం నష్టాల ఊబిలో కోకో రైతులు వైఎస్సార్ సీపీ పాలనలో కిలో కోకో గింజల ధర రూ.1,050 గత ఏడాది కిలోకు రూ.650 నేడు కేవలం రూ.300 సిండికేట్ అయ్యి, ధర తగ్గించేస్తున్న సంస్థలు పట్టించుకోని ప్రభుత్వం -
నత్త నడకన పొగాకు కొనుగోళ్లు
● ఇప్పటి వరకూ రూ.358.31 కోట్ల మేర విక్రయాలు ● గరిష్ట ధర రూ.265 ● సగటు ధర రూ.261.88 దేవరపల్లి: పొగాకు కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు 45 రోజులు కావస్తున్నా వేలం కేంద్రాలకు రైతులు బేళ్లు తీసుకురాని పరిస్థితి. ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతులు పొగాకు తీసుకురావడానికి అంగీకరించడం లేదు. గత ఏడాది కిలో ప్రారంభ ధర రూ.290 ఉండగా, ఈ ఏడాది రూ.265 మాత్రమే పలకడంతో వారు నిరాశతో ఉన్నారు. ఈ ధరకు పొగాకు అమ్మితే అప్పులు తప్ప మిగిలేదేమీ ఉండదని అంటున్నారు. జూన్ మొదటి వారం నుంచి మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. శనివారం నాటికి టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో రూ.358.31 కోట్ల విలువైన 13.68 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. కిలోకు గరిష్టంగా రూ.265, కనిష్టంగా రూ.235, సగటున రూ.261.88 చొప్పున ధర లభించింది. 888 బేళ్లు అమ్మకానికి తీసుకురాగా, 216 బేళ్లు తిరస్కరించారు. 672 బేళ్ల కొనుగోలు జరిగినట్టు బోర్డు రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్ తెలిపారు. వేలం కేంద్రాల వారీగా కొనుగోళ్ల వివరాలు వేలం కేంద్రం కొనుగోళ్లు గరిష్ట ధర సగటు ధర (కిలోలు) (రూ.) (రూ.) దేవరపల్లి 2,30,706 265.00 263.95 జంగారెడ్డిగూడెం–1 3,65,185 265.00 261.38 జంగారెడ్డిగూడెం–2 2,89,369 265.00 261.98 కొయ్యలగూడెం 2,36,960 265.00 260.62 గోపాలపురం 2,46,022 265.00 261.78 -
మృత్యు శకటాలు
● నిండు ప్రాణాలను బలిగొంటున్న ఇసుక లారీలు ● చంద్రబాబు పాలనలో దర్జాగా అక్రమ రవాణా ● కళ్లెం లేకుండా ఇసుక లారీల పరుగులు ● ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు కపిలేశ్వరపురం: ఇసుక లారీలు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. కళ్లెం లేని గుర్రాల్లా అడ్డూ అదుపూ లేకుండా రోడ్లపై పరుగులు పెడుతూ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. మరోవైపు భారీ ఇసుక లారీల రాకపోకలతో రోడ్లు ఛిద్రమవడంతో జరుగుతున్న ప్రమాదాలు కూడా ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. చంద్రబాబు నేతృత్వంలోని 2014–19, ప్రస్తుత ప్రభుత్వాల కాలంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే, ఆ ముసుగులో అధికార పార్టీల నేతలు పలువురు ఇసుక మాఫియా అవతారమెత్తి అక్రమాలకు తెర తీస్తున్నారు. ఇసుక తవ్వకాల నుంచి రవాణా వరకూ నిబంధనలను గోదాట్లో తొక్కేస్తున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కల్యాణ్ ఇసుక అక్రమాలను కనీసంగా కూడా పట్టించుకోవడం లేదు. వైఎస్సార్ సీపీ, వామపక్షాలు, ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తే ప్రభుత్వం వేధింపులకు దిగుతోందన్న విమర్శలున్నాయి. మొత్తంం మీద ఇసుక మాఫియా అక్రమాలకు సామాన్యుల ప్రాణాలు బలవుతున్న పరిస్థితి దాపురించింది. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి, కొవ్వూరు, పెరవలి, సీతానగరం మండలాలతో పాటు రాజమహేంద్రవరం, తాతపూడి, కపిలేశ్వరపురం, కోనసీమ జిల్లా జొన్నాడ, ఊబలంక, పి.గన్నవరంలోని పలు ర్యాంపుల్లో గోదారి తల్లికి నిలువునా తూట్లు పొడుస్తూ, అక్రమార్కులు పెద్ద మొత్తంలో ఇసుకను కొల్లగొడుతున్నారు. దీనిని నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా రవాణా చేస్తూ, అమ్ముకుని, రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న ప్రమాదాలు సామాన్యుల కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయి. 2014–19, ప్రస్తుత చంద్రబాబు పాలనలో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. దీంతో, మృతుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొన్ని ప్రమాదాలు ఇలా.. ● 2015 మే 25: అచ్యుతాపురం వద్ద ఇసుక లారీ ఢీకొని, వల్లూరుకు చెందిన పాలచర్ల సత్యనారాయణ మృతి చెందారు. ● 2017 జూన్ 7: కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామ శివారు చిన కోరుమిల్లికి చెందిన గంగుమళ్ళ సూర్యచంద్రరావు (51) గోదారి గట్టుపై ఇసుక లారీ ఢీకొని ప్రాణాలు వదిలారు. ● 2017 నవంబరు 18: తాతపూడి శివారు గోపాలరావుపేట వద్ద గోదావరి గట్టుపై ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొని, కేదారిలంక గ్రామానికి చెందిన గంధం ఈశ్వరరావు(32), వీరా జయబాబు(26) దుర్మరణం పాలయ్యారు. ● 2018 జనవరి 9: కోరుమిల్లి గ్రామానికి చెందిన సలాది సత్తిబాబు అక్కడి ఇసుక ర్యాంపులో జట్టు కార్మికుడిగా పని చేస్తూంటారు. గోదావరి గట్టుపై ఇసుక లారీ ఢీకొని మరణించారు. ● ఈ నెల 2: కొత్తపేట బోడిపాలెం వంతెన వద్ద ఊబలంక ర్యాంపునకు వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో అయినవిల్లి మండలం చింతనలంక గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విళ్ల గీతారాణి (24) అక్కడికక్కడే మృతి చెందారు. ● ఈ నెల 9: మండపేట బైపాస్ నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద ఇసుక టిప్పర్ ఢీకొనడంతో పట్టణానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు దార్ల దుర్గాప్రసాద్, దార్ల శివకుమార్ దుర్మరణం పాలయ్యారు. మట్టి శ్రీకొట్టేస్తున్నారుశ్రీ మండపేట మండలం కేశవరంలో రేయిబవళ్లు గ్రావెల్‌ను అక్రమంగా తరలించేస్తున్నారు. జిల్లాలోని కోరుకొండ, సీతానగరం, కడియం తదితర మండలాల్లో పెద్ద మొత్తంలో గ్రావెల్, చెరువు మట్టి అక్రమంగా తవ్వేసి, తరలించుకుపోతూ, కూటమి నేతలు ప్రతి రోజూ రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారు. పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం ఏటిగట్టు దిగువన లంకల గన్నవరం, ఊడుమూడి శివారు ఊడుమూడి లంకల్లో అనుమతి లేకుండా ఈ నెల మొదటి వారంలో మట్టి తవ్వకాలకు పాల్పడ్డారు. ఇంకా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని నియోజకవర్గాల్లో అవకాశమున్న ప్రతి చోటా మట్టి, గ్రావెల్ కొల్లగొట్టి, జేబులు నింపుకొంటున్నారు. కళ్ల ముందే ఇన్ని అక్రమాలు, సహజ వనరుల దోపిడీ విశృంఖలంగా సాగుతున్నా అధికార కూటమి నేతలు కావడంతో అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. -
సీసీ ఫుటేజీ బయట పెడితే అవినీతి బట్టబయలు
అనపర్తి: ఈవీఎంల సహకారంతో గెలిచిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి యథావిధిగా మాటల గారడీ చేస్తున్నారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి విర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామన్నారు. ఆయనకు ఎవరెవరు ఎంతెంత లంచాలు ఇచ్చారో గతంలో బాధితులే నేరుగా వెల్లడించారని, అవసరమైతే ప్రమాణం చేయడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒక మద్యం షాపు యజమాని విషయంలో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, డబ్బులివ్వకముందు టీ ఇచ్చి పంపిన ఎమ్మెల్యే, ముడుపులు అందిన తర్వాత తన ఇంట్లో చేపల పులుసు బాగుంటుందని భోజనం పెట్టారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఇంటి పక్కనే దాదాపు ఏడాదిన్నర పాటు భారీ పేకాట డెన్ నడిచిందని, రోజుకు రూ.2 లక్షల చొప్పున భారీగా వసూళ్లు జరిగాయని, పరిస్థితి శ్రుతి మించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఆ డెన్‌పై రైడ్ చేసిన విషయం ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు. తన ఇంట్లో జరిగిన రెండు శుభకార్యాల సందర్భంగా వ్యాపారవేత్తలను బెదిరించి వందకు పైగా బంగారు బిస్కెట్లు వసూలు చేశారంటూ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే తన నిజాయతీ నిరూపించుకోవాలంటే ఆ కార్యక్రమాలకు సంబంధించిన సీసీ ఫుటేజీని ఎటువంటి కటింగ్స్ లేకుండా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అతిథులు లోపలకు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకూ ఉన్న దృశ్యాలను ప్రజల ముందుంచాలని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి సవాల్ విసిరారు. ఆటోడ్రైవర్ నిజాయతీ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఓ ఆటో డ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నాడు. కోటగుమ్మం సెంటర్ వద్ద ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్న మహిళ క్వారీ సెంటర్ వద్ద ఆటో ఎక్కి కోటగుమ్మం సెంటర్లో దిగింది. అనంతరం, ఆమె తన పర్సును ఆటోలో మరచిపోయినట్టు గుర్తించింది. ఆ ఆటో చుట్టుపక్కల ఉందేమోనని వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆమె త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఆటో డ్రైవర్ తన ఆటోలో ఓ మహిళ పర్సు మరచిపోయిందంటూ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులకు అప్పగించాడు. ఫిర్యాదు చేసిన మహిళ చెప్పిన వివరాలతో సరిపోల్చిన పోలీసులు.. ఆ పర్సు ఆమెదేనని నిర్ధారించి అందజేశారు. పోగొట్టుకున్న పర్సు తిరిగి దొరకడంతో మహిళ ఆనందం వ్యక్తం చేసింది. నిజాయతీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్‌ను త్రీటౌన్ సీఐ వి.అప్పారావు, ఎస్సై వి.అప్పలరాజు, సిబ్బంది అభినందించారు. -
బస్సు ఢీకొని మహిళ మృతి
సామర్లకోట: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు ఢీకొని ఓ మహిళ దుర్మరణం పాలైంది. పోలీసులు, ఆమె బంధువుల కథనం ప్రకారం.. రాజానగరం మండలం శ్రీరామపురానికి చెందిన భావన ధనలక్ష్మి (51) వడ్లమూరులోని తన బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లి, తిరిగి స్వగ్రామానికి బయలు దేరింది. వడ్లమూరు నుంచి ఆర్టీసీ బస్సులో సామర్లకోట ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చింది. అక్కడ రాజానగరం బస్సు ఎక్కడానికి వెళ్తున్న తరుణంలో ఆమె దిగిన బస్సే ధనలక్ష్మి మీదుగా వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని బంధువులకు చెప్పకుండానే మృతదేహాన్ని ఆర్డీసీ అధికారులు పెద్దాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున సామర్లకోట ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. అక్కడ బస్సులకు అడ్డుగా బైఠాయించారు. ప్రభుత్వ బస్సు ఢీకొంటే చనిపోతారని, మృతుల కుటుంబాలకు రూ. ఐదు వేల నష్ట పరిహారం ఇస్తారని అపహాస్యం చేసినట్లు ఇద్దరు సిబ్బంది మాట్లాడారంటూ మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ ఎ.కృష్ణభగవాన్ ఆందోళనకారులతో చర్చించారు. ఆర్టీసీ బస్సును నిర్లక్ష్యంగా నడిపిన వ్యక్తిపై కేసు పెడతామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ. కోటి నష్ట పరిహారం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నాయకులు కంటే వీర్రాఘవరావు, మద్దాలి శ్రీను, ఎలిశెట్టి నరేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరామపురంలో విషాదం రాజానగరం: శ్రీరామపురానికి చెందిన భావన ధనలక్ష్మి (51) మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె భర్త భావన రత్తయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కుమార్తె, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. కుమార్తెకు వివాహం జరిగింది. ధనలక్ష్మి మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బంధువుల ఆందోళన -
● జలకాలాటల్లో ఆగేదెలేదు!
మూగజీవాలకు వేసవి తాపం నుంచి ఉపశమనం ఇది. ఎండలు మండుతున్న వేళ ఇలా జలకాలాడుతూ సేదతీరాయి. పలు గ్రామాలకు చెందిన వారు తమ పశువులను కోరంగి అటవీ ప్రాంతంలో ఏడాదంతా మేపుతుంటారు. వేసవిలో కాలువలకు నీరు నిలిపివేయడంతో పాటు అడవిలో పచ్చిక లేక గ్రామాల్లోకి తోలుకు వస్తుంటారు. ఇలా ఏటా వందలాది గేదెలు తాళ్లరేవు మండలంలో దర్శనమిస్తుంటాయి. పోలేకుర్రు ఇరిగేషన్ కాలువలో ఉన్న కొద్దిపాటి నీటిలో అనేక గేదెలు ఇలా వేసవి తాపాన్ని తీర్చుకున్నాయి. –తాళ్లరేవు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
రొయ్యల మేత గోడౌన్ దగ్ధం
కాట్రేనికోన: చెయ్యేరు అగ్రహారంలో ఆదివారం మధ్యాహ్నం రొయ్యల మేత గోడౌన్ కాలిపోయింది. అక్కడి శివపార్వతి ఆక్వా ఏజెన్సీస్ రొయ్యల మేత గోడౌన్లో బ్లీచింగ్, రాతి ముగ్గు నిల్వలు ఉన్నాయి. ఎండ తీవ్రతకు ఆ గోడౌన్లో ఉన్న బ్లీచింగ్, రాతి ముగ్గు కెమికల్ రియాక్షన్‌తో మంటలు వ్యాపించాయి. గోడౌన్ పక్క షాపులో ఉన్న నాలుగు మోటారు సైకిళ్లు, బ్లీచింగ్, రాతి ముగ్గు, రొయ్యల చెరువులకు వాడే మందులు కాలిబూడిదయ్యాయి. రైలు నుంచి జారి వ్యక్తి మృతి తుని: రైలు నుంచి జారిపడి విశ్రాంత ఆర్మీ ఉద్యోగి ఆదివారం మృతి చెందారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. అసోంకు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి ప్రమోద్ బోర్డోలోయ్ (61) అసోం నుంచి హైదరాబాద్‌కు రైలులో ప్రయాణిస్తున్నారు. స్థానిక రైల్వే స్టేషన్ పరిధి హంసవరం రైల్వే గేటు సమీపంలో ప్రమోద్ ప్రమాదవశాత్తూ కాలు జారి రైలు నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై స్థానిక రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ త్రినాథరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు ఆయన తెలిపారు. పిల్లలను చూడడానికి రావొద్దనడంతో ఆత్మహత్య కొత్తపల్లి: తన పిల్లలను చూడడానికి రావొద్దని భార్య అనడంతో మనస్తాపం చెందిన ఓ భర్త పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ఉప్పాడ నాయకర్ కాలనీకి చెందిన ఓసిపల్లి ఏసేబు (26) భార్య రెండో కాన్పు నిమిత్తం తన పుట్టింటికి అమీనాబాద్ వెళ్లింది. తన పిల్లలను చూడడానికి రావొద్దని భార్య అనడంతో మనస్తాపానికి గురై, భార్యను బెదిరించాలనే ఉద్దేశంతో ఈ నెల 8న ఏసేబు పురుగు మందు తాగాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తల్లి ఓసిపల్లి పాప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. ఫోన్ మాట్లాడుతూ బస్సులు నడిపితే జైలుకే అమలాపురం రూరల్: సెల్‌ఫోన్ మాట్లాడుతూ స్కూల్, కళాశాలల బస్సులు నడిపితే జైలు శిక్ష తప్పదని కోనసీమ జిల్లా రవాణా శాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. అమలాపురంలో కళాశాల బస్సుల చోదకులకు ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బస్సులు నడపాలని, డ్రైవర్ చరవాణిని క్లీనర్ వద్ద ఉంచాలన్నారు. మోటార్ వాహనాల చట్టం 185 (జీ) ప్రకారం ప్రతి బస్సులో విద్యార్థులతో పాటు పేరెంట్, టీచర్ విధిగా ఉండాలన్నారు. అదే విధంగా డ్రైవర్ శారీరక, మానసిక పరిస్థితిని స్కూల్ యాజమాన్యం గమనిస్తూ ఉండాలని డీటీఓ సూచించారు. నెలాఖరు నాటికి జిల్లాలోని అన్ని విద్యాసంస్థల బస్సులు ఫిట్నెస్ పొందాలని పేర్కొన్నారు. జూన్ మూడో వారం నుంచి ప్రత్యేక తనిఖీలు చేపడతామన్నారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిత
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కాకినాడ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వి.సతీష్ కుమార్ తెలిపారు. ఆదివారం కాకినాడ శ్రీనగర్ స్కూల్లో తైక్వాండో క్రీడాకారులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్డీఓ సతీష్ కుమార్ మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో జరిగిన 5వ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారన్నారు. తైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు మాట్లాడుతూ ఈ పోటీల్లో 10 బంగారు, 12 రజత, 18 కాంస్య పతకాలు సాధించి ఓవరాల్ చాంపియన్ షిప్లో మూడో స్థానం అందుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో తైక్వాండో సంఘ ప్రతినిధులు సత్యనారాయణ, అన్నవరం కేవీ సత్యనారాయణ, పి.త్రిమూర్తులు, అరుణ, దుర్గా తదితరులు పాల్గొన్నారు. -
ఇక్కడ అదృశ్యం.. అమరావతిలో ప్రత్యక్షం
నిడదవోలు: జనసేన నాయకులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, తాను చనిపోతానంటూ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అదృశ్యమైన నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన టీడీపీ బూత్ ఇన్చార్జి కట్ట మణికంఠ శనివారం అమరావతిలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రత్యక్షమయ్యాడు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌పై ప్రసార మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టాడని ఏప్రిల్ 24న జనసేన కార్యకర్తలు అచ్యుత పవన్‌కుమార్, అడ్డాల సాయి లక్ష్మణ్‌లు పట్టణ పోలీస్ స్టేషన్లో మణికంఠపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మణికంఠను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో తట్టుకోలేక అతను చనిపోతున్నానంటూ ఈ నెల 3న సెల్ఫీ వీడియో పోస్టు చేశాడు. ‘నాన్న.. నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నా.. నా వల్ల కావడం లేదు.. అక్రమ కేసులు నేను తట్టుకోలేకపోతున్నాను’ అంటూ అతను పోస్టు చేసి అదృశ్యమయ్యాడు. దీంతో సీఐ పీవీజీ తిలక్ మూడు బృందాలను ఏర్పాటు చేసి మణికంఠ ఆచూకీ కోసం గాలించారు. అనూహ్యంగా శనివారం అమరావతిలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వినతిపత్రం ఇస్తున్న ఫొటో ప్రచార మాధ్యమాల్లో రావడం గమనార్హం. ప్రస్తుతం మణికంఠ విజయవాడలో ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారు. -
ట్రాన్స్‌ఫార్మర్‌లో పడిన బంతి
సామర్లకోట: సెలవులు కావడంతో పిల్లలంతా క్రికెట్ ఆడుతుండగా బంతి ట్రాన్ఫార్మర్లోకి వెళ్లింది.. దానిని తీసే క్రమంలో ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురికావడంతో, శరీమంతా కాలిపోయింది. స్థానికులు కథనం ప్రకారం.. సామర్లకోట గాంధీనగర్‌కు చెందిన కరణం పవన్ (13) సదాశివ నగర్‌లోని ఖాళీ స్థలంలో క్రికిట్ ఆడుతున్నాడు. ఈ సమయంలో బంతి సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌లోకి వెళ్లిపోయింది. వెంటనే ఆ బాలుడు బంతిని తీయడానికి ప్రయత్నించడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. శరీరం అంతా పూర్తిగా కాలిపోవడంతో అతనిని కాకినాడలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉందని, సుమారు రూ.10 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పారు. పేద కుటుంబం కావడంతో ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆ యువకుడిని ఆదుకోవాలని స్నేహితులు కోరుతున్నారు. ● తీస్తుండగా బాలుడికి షాక్ ● శరీరమంతా తీవ్ర గాయాలు -
అవమానంతో ఆత్మహత్య
భార్య ఇంటి ముందు భర్త మృతదేహంతో నిరసన మామిడికుదురు: అత్తింటి వారు పెట్టిన తప్పుడు కేసు ను అవమానంగా భావించి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని కుటుంబ సభ్యులు, స్థానికులు నిరసన తెలిపారు. ఈ ఘటన పెదపట్నంలంకలో ఆదివారం ఉద్రిక్తతకు దారి తీసింది. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. పెదపట్నంలంక గ్రామానికి చెందిన సూదా రాజు (26) ఎలుకల మందు తిని ఈ నెల 4న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆ మృతదేహాన్ని రాజు భార్య దివ్యజ్యోతి ఇంటి ఎదుట ఉంచి ఆందోళన చేపట్టారు. రాజు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 21 రోజుల వయసు కలిగిన రాజు చిన్నారిని ఊయలలో వేసిన సందర్భంగా గొడవ జరిగిందని ఆందోళనకారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాజు, అతని తల్లిదండ్రులపై దివ్యజ్యోతి కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపించారు. వారే దాడి చేసి తప్పుడు కేసు పెట్టారని వాపోయారు. పోలీసుల నుంచి పిలుపు రావడంతో దానిని అవమానంగా భావించి రాజు అత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఈ వివాదం నేపథ్యంలో నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్, పి.గన్నవరం, అయినవిల్లి ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడు రాజు కుటుంబ సభ్యులు వస్తున్నారన్న సమాచారంతో దివ్యజ్యోతి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి ముందుగానే వెళ్లిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని రప్పించాలని, నిందితులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఫిర్యాదు ఇస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్సై చైతన్యకుమార్ స్పష్టం చేశారు. బాధ్యులను అక్కడకు రప్పించాలని రాజు మద్దతుదారులు డిమాండ్ చేయడంతో పరిస్థితి జఠిలంగా మారింది. ఆందోళన ఇంకా కొనసాగుతోంది. -
అవగాహన అవసరం
లూపస్ వ్యాధిపై అపోహలు తొలగించుకుని, అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేం, కానీ అదుపు చేయవచ్చు. ఇందుకోసం దీర్ఘకాలం మందులు వాడాల్సి ఉంటుంది. సాధారణ వ్యాయామం చేయడం, ఎండలో తిరగకుండా ఉండడం, సన్ ప్రొటెక్షన్ క్రీమ్ వాడటం, సరైన నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండడం చేయాలి. లూపస్ వ్యాధి ఉన్న గర్భిణులు ఎక్కువ సార్లు వైద్యుల వద్ద చెకప్ చేయించుకుంటూ మందులు వాడితే వారి ప్రసవానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. – డాక్టర్ వసుంధర, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, రాజమహేంద్రవరం -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దేవరపల్లి: మోటారు సైకిల్‌పై వచ్చిన వ్యక్తి బలంగా ఢీకొనడంతో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు. గోపాలపురం మండలం కరిచర్లగూడెంలోని మాతంగమ్మ గుడి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరిచర్లగూడేనికి చెందిన కొమ్మిరెడ్డి నాగేశ్వరరావు (45) శుక్రవారం రాత్రి ఎన్‌హెచ్ 516 డి జాతీయ రహదారిపై నడిచి వెళుతున్నాడు. కొయ్యలగూడెం వైపు నుంచి గోపాలపురం వైపు మోటార్ సైకిల్‌పై వస్తున్న వ్యక్తి అతడిని బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి. సుబ్రహ్మణ్యంతెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి.. రాజమహేంద్రవరం సిటీ: కడియం రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు 60 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి శనివారం రైలు ఢీకొని మృతి చెందాడని రాజమహేంద్రవరం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ గంగరాజు తెలిపారు. అతడు ఐదు అడుగులు ఎత్తు కలిగి ఉండి, సిమెంటు రంగు నిక్కరు, ఎరుపు రంగు హాఫ్ హాండ్స్ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే జీఆర్పీ స్టేషన్లో 944077 9249, 0883 2442821 నంబర్లకు తెలియజేయాలన్నారు. -
కాకినాడలో చైన్నె షాపింగ్ మాల్ ప్రారంభం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడ మెయిన్‌రోడ్డులో ఏర్పాటు చేసిన ది చైన్నె షాపింగ్ మాల్‌ను శనివారం సినీ నటి మృణాల్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టు, ఫ్యాన్సీ, రెడీమేడ్ వస్త్రాలు అనేక రకాల డిజైన్లలో ఇక్కడ లభిస్తాయన్నారు. నాణ్యతకు నమ్మకానికి మారు పేరుగా చైన్నె షాపింగ్ మాల్ ఖ్యాతి పొందిందన్నారు. షాపింగ్‌మాల్ నిర్వాహకులు ఎం.వెంకటరెడ్డి, కృష్ణారావు మాట్లాడుతూ తమ షోరూమ్‌లో మహిళలు, పురుషులు, చిన్నారులకు అవసరమైన ఎన్నో రకాల డిజైన్ల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు చెప్పారు. షాపింగ్ మాల్‌ను ప్రారంభించేందుకు వచ్చిన మృణాల్ ఠాకూర్‌ను చూసేందుకు అధిక సంఖ్యలో నగర ప్రజలు రావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. కార్యక్రమంలోఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు. -
రక్షకుడే భక్షకుడైతే..
ఫ అదే లూపస్ వ్యాధి ఫ ముఖంపై సీతాకోక చిలుక ఆకారంలో దద్దుర్లు ఫ ఇతర అవయవాలపై ప్రభావం ఫ నేడు వరల్డ్ లూపస్ డే రాయవరం: సాధారణంగా మనపై అనేక రోగాలు నిత్యం దాడి చేస్తుంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని, తిప్పికొట్టడం మన శరీరంలోని రోగనిరోధక శక్తి ప్రధాన విధి. ఒక రకంగా చెప్పాలంటే శరీరానికి రక్షణ కవచం వంటిది. కానీ ఆ రక్షణ కవచమే వ్యతిరేక దిశలో పనిచేస్తే కొన్ని రోగాలు వస్తాయి. వాటిలో సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోనస్ (ఎల్ఎస్ఈ) అనే వ్యాధి ఒకటి. దీన్ని లూపస్ వ్యాధి అని పిలుస్తారు. ఏటా మే 10న వరల్డ్ లూపస్ డేగా పాటిస్తున్నారు. రోగ నిరోధక వ్యవస్థ దాడి శరీరంలోని కణాలు, కణజాలంపై వ్యక్తి సొంత రోగనిరోధక వ్యవస్థ దాడి చేసినప్పుడు లూపస్ వ్యాధి అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల గుండె, ఊపిరితిత్తులు, చర్మం, కీళ్లు, మూత్రపిండాలు, రక్త నాళాలు, మెదడు వంటి వివిధ అవయవాలు, శరీర వ్యవస్థకు హాని జరుగుతుంది. ఈ వ్యాధి సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసస్, డిస్కోయిడ్ లూపస్, సబ్ అక్యూట్ క్యూటేనియస్ ల్యూపస్, డ్రగ్ ఇండ్యూసెడ్ లూపస్, నియోనెటాల్ లూపస్ అనే రకాలుగా ఉంటుంది. ఈ వ్యాధిని చాలా మంది తమ అవగాహన లోపంతో ముందుగా గుర్తించలేకపోతున్నారు. ఈ వ్యాధితో జిల్లాలోని రుమటాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్లు, నెఫ్రాలజిస్టుల వద్దకు ప్రతి నెలా 80 నుంచి 100 మంది వరకు వస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో దాదాపు 3 వేల నుంచి 4 వేల మంది దాకా లూపస్ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. లక్షణాలివే.. లూపస్ ఉన్న వారిలో ముఖంపై సీతాకోక చిలుక ఆకారంలో దద్దుర్లు వస్తాయి. కీళ్ల నొప్పులు, త్వరగా అలసిపోవడం, చాలా రోజులుగా జ్వరం, ఆకలి లేకపోవడం, జుట్టు రాలిపోవడం, గాఢంగా శ్వాస తీసుకున్నప్పుడు చాతీలో నొప్పి, చేతి, కాలివేళ్లు గోధుమరంగు, ఊదా రంగులోకి మారిపోవడం, నోటిలో పుండ్లు ఏర్పడటం జరుగుతుంది. కొందరిలో కిడ్నీ, గుండె, మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. ఎలా వస్తుందంటే.. సాధారణంగా జీన్స్, పర్యావరణం (ఇన్ఫెక్షన్, కొన్ని రకాల మందులు, ఒత్తిడి, అధిక యువీ కిరణాలు) ప్రభావం వల్ల ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా 15 నుంచి 45 ఏళ్లలోపు (9:1 నిష్పత్తి) ఉన్న వారిలో కనిపిస్తుంది. వీరిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావం వల్ల సహజంగానే ఇది వస్తుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ వ్యాధి ఎవరికై నా రావచ్చు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
టిప్పర్ దగ్ధం
గోకవరం: గుమ్మళ్లదొడ్డి సమీపంలో 516ఈ జాతీయ ప్రధాన రహదారిపై శనివారం రాత్రి కంకరలోడుతో వెళుతున్న టిప్పర్ దగ్ధమైంది. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం నరసాపురంలోని ఓ క్రషర్ నుంచి కోనసీమ జిల్లా పి.గన్నవరానికి కంకరలోడుతో ఈ లారీ వెళుతోంది. గుమ్మళ్లదొడ్డికి వచ్చేసరికి వెనుక టైరు నుంచి మంటలు రావడాన్ని డ్రైవర్ గుర్తించి లారీ నిలిపివేశాడు. అనంతరం మంటలు విపరీతంగా వ్యాపించాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న కోరుకొండ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. అనంతరం ఎస్సై పవన్‌కుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
హాలిడేస్.. జాలీగా..
● ఉత్సాహంగా వేసవి శిబిరాలు ● పలు అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ● ఏపీఎస్పీ బెటాలియన్ స్కూల్లో క్యాంప్ విద్యార్థులకు విద్య, విజ్ఞానం అందించడంతో పాటు మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందించేలా వేసవి శిక్షణ శిబిరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రమణయ్యపేట ఏపీఎస్పీ బెటాలియన్ ఇంగ్లిషు మీడియం స్కూల్లో గత నెల 24న ప్రారంభమైన శిబిరంలో పలు పాఠశాలల విద్యార్థులు, బెటాలియన్ సిబ్బంది, పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. స్పోకెన్ ఇంగ్లిషు, స్టోరీ టెల్లింగ్, వేదిక్ మ్యాథ్స్, అబాకస్, రీజనింగ్, కోడింగ్ అండ్ డీ కోడింగ్, గ్లాస్ పెయింటింగ్, భగవద్గీత శ్లోకాల పఠనం, నో ఫైర్ కుకింగ్, యోగా, రైఫిల్ షూటింగ్, వాలీబాల్ వంటి వాటిలో శిక్షణ పొందుతున్నారు. – కాకినాడ రూరల్ -
సాగులో విత్తనం.. ఎంతో కీలకం
ఫ నేల స్వభావాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి ఫ వ్యవసాయాధికారుల సూచనలు కరప: రబీ వరి కోతలు దాదాపు పూర్తి కావడంతో ఖరీఫ్ సీజన్‌పై రైతులు దృష్టి సారించారు. ముందస్తు ఖరీఫ్ సాగు చేపడితే తొలకరి సీజన్ చివరిలో వచ్చే తుపాన్లు, అధిక వర్షాల నుంచి తప్పించుకుని పండిన పంటను దక్కించుకోవచ్చని వ్యవసాయాధికారులు రైతులను చైతన్యపరుస్తున్నారు. దీని వల్ల ఖరీఫ్, రబీపంట కాలం ముందుకు వచ్చి, రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూడో పంటగా అపరాలు పండించుకోవచ్చన్నారు. సాగులో విత్తన ఎంపికే కీలకమని సూచిస్తున్నారు. అలాగే ఈ నెల 15వ తేదీనే పంట కాలువలకు సాగునీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో ఐదు రోజుల్లో సాగునీరు విడుదల చేస్తుండటంతో రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో కరప మండల వ్యవసాయాధికారి ఇమ్మిడిశెట్టి సత్య సూచనలు చేశారు. ఫ వరి నారుమడి నుంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మలచుకోవచ్చు. మంచి రకాల ఎంపిక, నారుమడి తయారీ, విత్తనశుద్ధి, ఎరువులు, పురుగుమందుల వాడకం, కలుపు నివారణలో యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. ఫ సాధారణ పరిస్థితుల్లో నాటడానికి ఎంటీయూ 7029 (స్వర్ణ), స్వర్ణకు ప్రత్యామ్నాయంగా కొత్తగా రూపొందించిన ఎంటీయూ 1318 రకాన్ని వినియోగించుకోవచ్చు. పర్ర భూములు, పల్లపు ప్రాంతాలకు ఈ రకం అనువుగా ఉంటుంది. సన్న రకాలైన ఎంటీయూ 1282కు తక్కువ ఎరువులు వాడాలి. సన్నరకం సాంబమసూరికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1282 రకాన్ని సాగు చేసుకోవచ్చు. ఎంటీయూ 1318, ఎంటీయూ 1282 సాగు చివరిలో బ్యాక్టీరియా మూలంగా ఆకు ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకాలకు యూరియా ఎక్కువగా వాడరాదు. ఫ విత్తనం ద్వారా వ్యాప్తి చెందే కొన్ని రకాల తెగుళ్లను అరికట్టడానికి తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలి. దీని కోసం సూడోమోనస్, కార్భండిజమ్ మందులను వినియోగించొచ్చు. ఫ నాటే పద్ధతిలో ఒక ఎకరానికి 25 నుంచి 30 కిలోల విత్తనాలు, వెదజల్లు పద్ధతిలో ఒక ఎకరానికి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఫ ధృఢమైన, ఆరోగ్యవంతమైన నారు పొందాలంటే నారుమడిని 12 రోజుల ముందు దమ్ముచేసి, చిన్న మడులుగా విభజించుకోవాలి. నీరు పెట్టడానికి, తొలగించడానికి వీలుగా పిల్ల కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి సెంటు భూమిలో ఐదు కిలోల వంతున విత్తనాలు చల్లుకోవాలి. విత్తనం ఎక్కువైతే నారు బలహీనంగా ఉండి, మాగుడు తెగులు సోకే అవకాశం ఉంది. ఎక్కువ విత్తనాలు పోస్తే నారు తీసేటప్పుడు వేర్లు తెగిపోయి సులువుగా రాదు. ఒక ఎకరానికి ఐదు సెంట్ల నారుమడి సరిపోతుంది. మొలక కట్టిన విత్తనాన్ని పలుచటి నీటి మీద చల్లుకోవాలి. నారు రెండు, మూడు ఆకులు తొడిగే వరకు ఆరుతడి పెడుతూ ఉండాలి. తర్వాత పలుచగా నీరుండేలా చూసుకోవాలి. ఫ దమ్ములో ప్రతి ఐదు సెంట్ల నారుమడికి 2 కిలోల యూరియా, 7 కిలోల సింగిల్ సూఫర్ పాస్ఫేటు, 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. విత్తిన రెండు వారాల తర్వాత మళ్లీ 2 కిలోల యూరియా పైపాటుగా వేయాలి. అవసరాన్నిబట్టి నారుమడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. -
అన్న పంచాయితీలో తమ్ముళ్ల లూటీలు!
మిగిలిన నియోజకవర్గాలపై సీఎం గుర్రు! ఎమ్మెల్యేల భేటీలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై సీఎం చంద్రబాబు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ● రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు మట్టి, మద్యం అక్రమ దందాలో భాగస్వామ్యం వహిస్తుండడంపై ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుని మరీ ప్రశ్నించినట్లు సమాచారం. పేకాట క్లబ్బు ఎవరు నిర్వహిస్తున్నారు..? ఎంత ఆర్జిస్తున్నారు..? అన్న విషయాలపై ఆ ఎమ్మెల్యే, బాబుకు మధ్య నిమిషాల పాటు చర్చ జరిగినట్లు తెలిసింది. ● అనపర్తి నియోజకవర్గంలో తన గెలుపులో కీలక పాత్ర పోషించిన అతని సామాజికవర్గాన్ని విస్మరిస్తున్నట్టు తెలిసింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టించడం, కక్షసాధింపుగా ఇతర పార్టీల కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్న వైనం చంద్రబాబు వద్ద చర్చ జరిగినట్టు తెలిసింది. ● రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో నేతలు భూ కబ్జాలకు వంత పాడుతున్నారన్న అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. అంతేగాక ఇసుక అక్రమ రవాణాలో ఆయన అనుచరులు ఆరితేరిన ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ● కొవ్వూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో అక్కడి నేతలు భారీగా ఆర్జిస్తున్నట్లు తెలిసింది. లారీకి ఇంత అని ధర నిర్ణయించి మరీ దండుకుంటున్న విషయమై చర్చ వచ్చినట్లు సమాచారం. సాక్షి, రాజమహేంద్రవరం: సీఎం చంద్రబాబుతో నేతల భేటీ జనసేన, టీడీపీ నేతల మధ్య కుంపటి రాజేసిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య మళ్లీ ముసలం పుట్టుకొచ్చింది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గాల మధ్య విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం చంద్రబాబుతో భేటీలో ఇవి మరింత బహిర్గతమయ్యాయి. ఒక్క రాజానగరం నియోజకవర్గంలోనే కాకుండా.. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు వద్దకు పేచీలు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్చార్జిలతో విజయవాడలో సమావేశమయ్యారు. ఒక్కో ఎమ్మెల్యే పనితీరుపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ఈ నేపథ్యంలో రాజానగరం నియోజకవర్గ నేతల భేటీ చర్చనీయాంశంగా మారింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే తమకు, తన వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని, అధికారిక కార్యక్రమాల్లో, సంక్షేమ పథకాల ప్రచారంలోనూ తమను ఆహ్వానించడం లేదని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ విషయం ఎమ్మెల్యే బత్తులకు లీకై ంది. దీంతో ఆయన సైతం సీఎం వద్ద పంచాయతీ పెట్టినట్లు తెలిసింది. తాము వెంకటరమణ చౌదరికి ప్రాధాన్యం ఇస్తున్నామని, అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నా గంటల తరబడి ఆలస్యం చేస్తున్నారని, దీంతో ప్రజలు విసుగు చెందుతున్నారన్న విషయాన్ని చంద్రబాబుకు వివరించినట్టు తెలిసింది. ఇందుకు ఉదాహరణగా ఇటీవల రాజానగరం నియోజకవర్గంలో అన్న క్యాంటిన్ ప్రారంభోత్సవానికి ఆయన ఆలస్యంగా వచ్చిన విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. మరికొన్ని అంశాల్లో సైతం వెంకటరమణ వ్యవహరిస్తున్న తీరును బాబు ముందుంచినట్లు తెలిసింది. ఇలా ఒకరిపై మరొకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్న విషయం రాజానగరం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలోనూ.. గాడాలలో కోలమూరుకు చెందిన ఓ టీడీపీ నేత లే అవుట్‌కు మట్టి తరలిస్తుండగా ఎమ్మెల్యే బత్తుల వర్గీయులు ఆ లారీలను అడ్డుకున్నారు. ఆ సందర్భంలో టీడీపీ, జనసేన నేతల మధ్య పెద్ద స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే భవన నిర్మాణాలకు వినియోగించే రాయిని రాజమహేంద్రవరానికి చెందిన టీడీపీ నేతలు లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారు. వే బిల్లులు లేవన్న కారణంతో రాయి తరలించే లారీలను బత్తుల అనుచరులు అడ్డుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. కూటమిలో చిచ్చురేపుతున్న నాయకుల విభేదాలు ప్రాధాన్యమివ్వడం లేదని పరస్పర ఆరోపణలు ఇసుక, మట్టి, మద్యం దందాల్లో పంపకాల పేచీ రచ్చకెక్కిన బత్తుల, బొడ్డు విభేదాలు -
మధురఫలమెంత ప్రియమో!
● మామిడిలో రారాజు కొత్తపల్లి కొబ్బరి ● సామాన్యులకు అందని ధరతో ౖపైపెకి ● దిగుబడి తక్కువ.. గిరాకీ ఎక్కువ ● పిందె ప్రాయంలోనే బుక్కింగులు ● వంద కాయ రూ.5 వేల వరకు విక్రయం పిఠాపురం: వేసవిలో ఫలరాజు మామిడి రుచి చూడనివారుండరు. మరీ ప్రత్యేకంగా కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడి రకాలైతే కనీసం వాసన చూసినా చాలనేంత రుచి. కొత్తపల్లి నుంచి కొత్త ఢిల్లీ వరకు కొత్తపల్లి కొబ్బరి పేరు తెలియనివారు ఉండరు. మామిడి ఉత్పత్తుల్లో హిడెన్ జెమ్స్‌గా భావిస్తారు. ఏ గ్రామాల్లో ఇవి ఉత్పత్తి అయితే ఆ గ్రామం పేరుతో ప్రసిద్ధి చెందుతాయంటారు. పూర్వం ఆంధ్ర ప్రాంత రాజులు తమ తోటల్లో వీటి పెంపకం చేపట్టి మిత్రరాజులకు కానుకలుగా పంపేవారు. ఇప్పటికీ దేశాధినేతలకు, పై అధికారులకు మామిడిపండ్లను కానుకగా పంపడం మనకు తెలిసిందే. ఆవకాయ పెట్టుకోవాలన్న ఆలోచన రాగానే గృహిణులకు ముందుగా గుర్తొచ్చేది కొత్తపల్లి కొబ్బరే. పీచు ఎక్కువగా ఉండి, ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల దీనికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో వంద కాయలు రూ.3500 నుంచి రూ.ఐదు వేల వరకు పలుకుతున్నాయి. ఈ రకం కాయలు, పళ్ల రంగు, రుచి, వాసన ఎంతో ప్రత్యేకం. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో పాటు కెరోటిన్, కాల్షియం, విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉంటాయి. తొక్క పలుచగా ఉండి పీచు ఎక్కువగా ఉంటుంది. పులుపు ఎక్కువగా ఉండడం వల్ల పచ్చి మామిడి మామూలుగా తినలేరు. కాని పండు మాత్రం అతి మధురం. కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్లు కొత్తపల్లి కొబ్బరి మామిడి కాయలుమామిడి కాయలు కోస్తున్న నాగేశ్వరరావు35 ఏళ్లుగా వ్యాపారం ఈ ఏడాది దిగుబడి సరిగా లేకపోయినా 35 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నా. కొబ్బరి మామిడి మన దరిదాపుల్లోనే ఎక్కడా లేదు. ఉలవపాడు నుంచి తెస్తున్నాం. కొబ్బరి మామిడి ఒక పరక (14 కాయల) ధర రూ.400 ఉంది. ఈ జిల్లాలో పండే కొత్తపల్లి కొబ్బరి మామి డికి మంచి గిరాకీ ఉంది. – ఎ.శ్రీను మామిడి వ్యాపారి, పిఠాపురంగిరాకీ ఎక్కువ అత్యంత సువాసన భరితంగా ఉండే కొత్తపల్లి కొబ్బరి పళ్ల గిరాకీ మరే రకానికీ ఉండదంటే అతిశయోక్తి కాదు. ముందుగానే డబ్బులు ఇచ్చి ఆర్డర్లు బుక్‌చేసుకుంటారు. ప్యాకింగ్‌లు చేసి ఉంచేస్తే వారు తీసుకువెళ్తుంటారు. ఎక్కువ ధర పలికే ఈ కాయలు, పండ్లను రాజకీయ నాయకులు, అధికారులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. – పెద్దిమూడి నాగేశ్వరరావు, మామిడి వ్యాపారీ, కొత్తపల్లి. -
బార్, బెంచ్ సమన్వయంతో న్యాయ వ్యవస్థ బలోపేతం
● ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి దేవానంద్ ● నూతన కోర్టు భవన సముదాయాల ప్రారంభం ● హాజరైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లిసా గిల్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): న్యాయ వ్యవస్థ సమర్ధంగా పనిచేయాలంటే బార్, బెంచ్ మధ్య సమన్వయం అవసరమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన కోర్టు భవన సముదాయాల ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లిసా గిల్‌తో పాటు పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. కోర్టులకు మౌలిక వసతులు కల్పించడం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల బాధ్యత అన్నారు. నూతన కోర్టుల భవన సముదాయం జిల్లా న్యాయ చరిత్రలో ఒక కీలక మైలురాయని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రిన్సిపల్, జిల్లా న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. జిల్లా కోర్టు 1802లో స్థాపించబడిందని, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఏర్పాటైన తొలి న్యాయ సంస్థల్లో ఒకటన్నారు. 1802–09 మధ్య కాలంలో ఎల్.స్కిన్నర్ తొలి జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేశారన్నారు. భారత తొలి ప్రధాన న్యాయమూర్తుల్లో ఒకరైన కోకా సుబ్బారావు రాజమహేంద్రవరం వాసేనని, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఇక్కడ న్యాయవాదిగా పనిచేశారన్నారు. జిల్లాలో ప్రస్తుతం 65 కోర్టులు ఉండగా, మొత్తం 87,922 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాజమహేంద్రవరంలో 18 కోర్టులు ఉండి 23,173 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 2008లో నాలుగు కోర్టుల నిర్మాణానికి పరిపాలన అనుమతులు లభించాయని, సవరణ అనుమతులు మంజూరు కాగా, 2012లో అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్ బి.లోకూర్ శంకుస్థాపన చేశారన్నారు. జస్టిస్ రఘునందరావు మాట్లాడుతూ జిల్లాతో తనకు వ్యక్తిగత, చారిత్రక అనుబంధం ఉందని, తన పూర్వీకులు కడియం ప్రాంతానికి చెందినవారని, అక్కడ నర్సరీ ఉద్యమానికి ఆద్యులుగా నిలిచారన్నారు. జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి మాట్లాడుతూ తాను రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం ప్రాంతంలో జన్మించానని, జీఎస్కే లా కళాశాలలో న్యాయ విద్య అభ్యసించానన్నారు. కాకినాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన సమయంలో అప్పీలు, బెయిల్ కేసుల కోసం తరచూ రాజమహేంద్రవరం కోర్టులకు వచ్చేవాడినన్నారు. జస్టిస్ న్యాపతి విజయ్ మాట్లాడుతూ ఈ భవన నిర్మాణంలో తలెత్తిన వివాదాలలో కాంట్రాక్టర్ తరఫున తాను హైకోర్టులో వాదించానని, అప్పట్లో పొందిన మధ్యంతర ఉత్తర్వులు చివరకు భవన నిర్మాణం పూర్తికి దోహదపడ్డాయన్నారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్‌వీ.ప్రసాద్, జిల్లా జేసీ వై.మేఘా స్వరూప్, ఎస్పీ డి.నరసింహకిశోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, న్యాయ మూర్తులు, న్యాయ వాదులు, బార్ సభ్యులు పాల్గొన్నారు. -
కార్పెట్లు ఎక్కడ స్వామీ?
అన్నవరం: ఎండలు మండి భక్తుల కాళ్లు కాలిపోతున్నా అన్నవరం దేవస్థానం అధికారులకు కార్పెట్లు పరచాలన్న తలంపు రాకపోవడం శోచనీయం. శనివారం సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి ఆలయ ప్రాంగణంలో నడిచేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వందల సంఖ్యలో నవ దంపతులు వారి బంధు మిత్రులు వస్తున్నారు. చలువ పందిళ్లు ఉన్నప్పటికీ అవి లేని చోట నడవడానికి వారు అవస్థ పడుతున్నారు. అధికారులు గత మార్చి నెలలో పది ఫుట్ కార్పెట్ బండిళ్లు కొనుగోలు చేశారు. భక్తుల అవస్థలపై గత నెల 8న ‘కాళ్లు కాలుతున్నా కార్పెట్లు తీయరా’ పేరుతో కథనం ప్రచురించగా ఆ నెల 12న మంత్రి ఆనం పర్యటన సందర్భంగా వాటిని పరిచారు. దీంతో ఆ తరువాత రోజు 13వ తేదీన ‘ఆనందంగా పరిచేశారు’ కథనాలు ‘సాక్షి’లో ప్రచురితమయ్యాయి. ఆ తరువాత కొన్ని రోజులు వాటిని ఉంచినప్పటికీ నాలుగు రోజులుగా అవి కనిపించడం లేదు. భక్తులు పశ్చిమ రాజగోపురం వెలుపలకు వచ్చేటప్పటికి నేల వేడెక్కి ఉంటుంది. దీంతో వారు కాలు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. రాజగోపురం నుంచి అన్నదాన పథకానికి వెళ్లాలంటే తారు రోడ్ మీద నడవాల్సి ఉంది. దీనిపై భక్తులు నడిచేందుకు వీలుగా తెల్ల పెయింట్ వేసినా నాలుగు రోజులకే ఆ అది వెలిసిపోయి మళ్లీ ఇబ్బందిగా మారుతోంది. పశ్చిమ రాజగోపురం నుంచి అన్నదాన భవనం వరకు, దేవస్థానం బస్సులు ఆగే విశ్రాంతి షెడ్డు వరకు కార్పెట్ వేస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని భక్తులు అంటున్నారు. నాన్నమ్మకు తలకొరివి పెట్టిన మనవరాలు రాజోలు: ఓ మనవరాలు తన నానమ్మకు తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజోలు సుందరమ్మ చెరువు గట్టు ప్రాంతానికి చెందిన గాలిదేవర సత్యవేణి (75) కిడ్నీ సమస్యతో బాధపడుతూ మృతి చెందింది. సత్యవేణికి ఒక్కగానొక్క కుమారుడు శ్రీనివాసరావు 2021లో కరోనాతో మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహమై వేరొక ప్రాంతంలో నివాసం ఉంటోంది. నాన్నమ్మ సత్యవేణి ఆలనాపాలనా చిన్న మనుమరాలైన గాలిదేవర రేణుక చూసుకుంటోంది. దీంతో శనివారం రాజోలు కై లాసభూమిలో నానమ్మకు తలకొరివి పెట్టింది. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ తన తండ్రి శ్రీనివాసరావు కరోనాతో చనిపోయినప్పుడు అంత్యక్రియలు నిస్సహాయ స్థితిలో జరిగాయని, కనీసం మృతదేహాన్ని చివరిచూపు చూసేందుకు కూడా నోచుకోలేకపోయామని విలపించింది. నానమ్మ సత్యవేణికి తలకొరివి పెట్టి పితృరుణం తీర్చుకున్నానని కన్నీటి పర్యంతమైంది.● కాళ్లు కాలి అవస్థలు పడుతున్న భక్తులు ● మంత్రి ఆనం పర్యటనలో పరిచి మళ్లీ మూలకు చేర్చిన అధికారులు -
కిక్కిరిసిన రత్నగిరి
అన్నవరం: సత్యదేవుని ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున రత్నగిరిపై సుమారు రెండువందల వివాహాలు జరిగాయి. నవదంపతులతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వివాహాలు చేసుకున్న నవదంపతులు, వారి బంధుమిత్రులు కుటుంబ సభ్యులతో సత్యదేవుని సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వరుసగా రెండ్రోజులు సెలవు రావడంతో సమాన్య భక్తులు పెద్ద సంఖ్యలో సత్యదేవుని సన్నిధికి విచ్చేసి స్వామివారి వ్రతాలాచరించారు. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రతమండపాలు నిండిపోయాయి. 2,200 వ్రతాలు, అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 50 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదానపథకంలో ఉచిత భోజన చేశారు. ఘాట్రోడ్లో ట్రాఫిక్ జామ్ సత్యదేవుని సన్నిధిన శుక్రవారం రాత్రి భారీ సంఖ్యలో వివాహాలు జరిగిన విషయం తెలిసిందే. వివాహాలకు వివిధ వాహనాలలో తరలివచ్చిన పెళ్లిబృందాలు శనివారం స్వామివారి వ్రతం దర్శనం అనంతరం దిగువకు ప్రయాణం అయ్యారు. స్వామివారి దర్శనానికి శనివారం వందల సంఖ్యలో వాహనాలలో వేలాదిగా విచ్చేసిన భక్తులు సైతం స్వామివారి దర్శనం అనంతరం దిగువకు ఒకేసారి ప్రయాణమవ్వడంతో శనివారం దేవస్థానం ఘాట్రోడ్లో భక్తుల వాహనాలతో సుమారు అరగంట సేపు వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. -
సర్పవరం పోలీసు స్టేషన్ ఎస్ఐ పోస్టుకు రూ.30 లక్షలు?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సర్పవరం పోలీసు స్టేషన్లో ఇన్స్పెక్టర్ పోస్టుకు మాం...చి డిమాండ్ ఉంది! పాడి ఆవు లాంటి ఈ పోస్టును వేలం పాడి మరీ దక్కించుకోవాలని పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. ఇది ఇటీవలే ఖాళీ అయ్యింది. ఇక్కడి ఇన్స్పెక్టర్ బొక్కా పెద్దిరాజును కారణాంతరాలతో వేకెన్సీ రిజర్వు(వీఆర్)కు పంపించారు. పెద్దిరాజు సర్పవరం ఇన్స్పెక్టర్గా సుమారు 16 నెలలు పనిచేశారు. వాస్తవానికి రెండేళ్ల వరకు ఇదే స్టేషన్లో ఉంటాననే నమ్మకంతో పెద్దిరాజు ఇక్కడ జాయిన్ అయ్యారు. కానీ పరిస్థితులు మారి ఆయనను వీఆర్‌లో పెట్టారు. ఖాళీగా ఉన్న ఆ పోస్టుకు మహిళా పోలీసు స్టేషన్లో పనిచేస్తోన్న ఇనస్పెక్టర్ రవికుమార్ ఇన్చార్జిగా వచ్చారు. సర్పవరంలో బాధ్యతలు తీసుకున్నప్పటికీ మూడు రోజులు కూడా గడవకుండానే ఆయనను వీఆర్‌కు పంపించేశారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ శాంతిభద్రతల బాధ్యతను తాత్కాలికంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పవరం సీఐ పోస్టు హాట్ సీట్‌గా మారిందనే చర్చ పోలీసు సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అందరి కళ్లూ దానిపైనే.. కాకినాడ రూరల్ మండలం పరిధిలో కాకినాడ రూరల్, సర్పవరం రెండు పోలీసు సర్కిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో అత్యధిక డిమాండ్ ఉన్న ఈ రెండు సర్కిళ్లలో సర్పవరం సర్కిల్ ఖాళీగా ఉండటంతో అందరి కళ్లూ దానిపైనే పడ్డాయి. ఇక్కడి పోస్టింగ్ కోసం కాకినాడ రూరల్‌లోని అధికార భాగస్వామ్య పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో అనుచర వర్గం బేరసారాలకు తెరలేపారని చెప్పుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం ఈ సర్కిల్లో పోస్టింగ్ కోసం సొమ్ముతో త్రీ స్టార్స్ క్యూ కట్టారని జిల్లా అంతటా విస్తృతమైన చర్చ నడిచింది. నాడు నలుగురైదుగురు పోటీ పడగా అధికార పార్టీ నేతకు అత్యధికంగా రూ.30 లక్షలు ముట్టచెప్పాకనే ఖాయం చేశారని వినికిడి. ఇప్పుడూ డిమాండే అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇక్కడి పోస్టింగ్ కోసం ముఖ్య నేత, వారి అనుచరులను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ జిల్లాల త్రీస్టార్స్.. తెలిసిన నాయకుల ద్వారా నానా తంటాలు పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఇనస్పెక్టర్లు ఈ పోస్టింగ్ కోసం పోటీపడుతున్నారు. ఇందులో ఒక సీఐకు పిఠాపురానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ముఖ్యనేతకు సిఫారసు చేశారని విశ్వసనీయ సమాచారం. మరొక త్రీ స్టార్ ముఖ్యనేత బంధువుల ఆశీస్సులతో గడచిన వారం రోజులుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గిట్టుబాటు ఖాయం! కాకినాడ రూరల్ మండలంలో ఉన్న రెండు ఇన్స్పెక్టర్ పోస్టులకు ఒకే తరహా డిమాండ్ ఉండటం విశేషం. ఈ రెండు కొలువు తెచ్చుకోవాలే కాని పెట్టిన పెట్టుబడికి తగ్గట్టు ఆదాయానికి లోటు ఉండదంటుంటారు. ఇందులో రూరల్ సర్కిల్ పరిధిలో అత్యధికంగా ఆరు (ఇంద్రపాలెం, తిమ్మాపురం, పెదపూడి, కోరంగి, గొల్లపాలెం, కరప) పోలీసు స్టేషన్లు ఉండటం కూడా ఇంతటి డిమాండ్‌కు కారణంగా పేర్కొంటున్నారు. సర్పవరం ఇన్స్పెక్టర్ పరిధిలో వాకలపూడి, రమణయ్యపేట, సర్పవరం, ఆటోనగర్ వంటి ఇండస్ట్రియల్ ఏరియాలలో పెద్ద పెద్ద కర్మాగారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు కోకొల్లలు. అందుకే ఇక్కడి ఇనస్పెక్టర్æ పరిధిలో రాబడి దండిగా వస్తుందనే దూరదృష్టితో రూ.లక్షలు ముట్టచెప్పడానికి వెనుకాడటం లేదంటున్నారు. ఎవరు ఎంత ఎక్కువ ఇస్తారో, సిఫారసు లేఖ ఎవరికి దక్కుతుందో అనే చర్చ పోలీసుల్లో సాగుతోంది. -
రైతుల కష్టం బుగ్గిపాలు
అగ్ని కీలల్లో 100 బస్తాల ధాన్యం దగ్ధం రాయవరం: మండలంలోని వెంటూరులో సుమారుగా వంద బస్తాల ధాన్యం అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన బుట్టా వీరబాబు, శ్రీను 10 ఎకరాల పొలంలో కౌలు వ్యవసాయం చేశారు. కోసిన ధాన్యాన్ని పొలంలోనే రాశులుగా వేశారు. వాటి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్పై కాకి పడడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో కోయగా మిగిలిన వరి గడ్డిపై నిప్పురవ్వలు పడడంతో మంటలు చెలరేగి ధాన్యం రాశులకు అంటుకుంది. రైతులు అప్రమత్తమయ్యే సరికే సుమారుగా వంద బస్తాల ధాన్యం అగ్నికి ఆహుతైనట్లు రైతులు తెలిపారు. సమాచారం అందుకున్న రామచంద్రపురం అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో దాదాపుగా రూ.2 లక్షల వరకు నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు. బాధిత కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ వాసంశెట్టి రాధాకృష్ణ, పలువురు రైతులు కోరారు. -
విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సిద్ధం
● జిల్లా కేంద్రంలోని గొడౌన్‌కు చేరిన సరకు ● మండల కేంద్రాలకు ప్రారంభమైన సరఫరా రాయవరం: పాఠశాలల పునఃప్రారంభం రోజే పాఠ్య పుస్తకాలు అందించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాఠ్య పుస్తకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను అందించనుంది. ఇప్పటికే జిల్లా పుస్తక గొడౌన్‌కు చేరుకున్న పాఠ్య పుస్తకాలను జిల్లాల మండల స్టాక్ పాయింట్లకు వాటిని సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ఈ ఏడాది పాఠ్య పుస్తకాలను మరింత కుదిం 53 టైటిల్స్ మాత్రమే ఉండేలా ఏర్పాటు చేసింది. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని మండలాలతో పాటు ఏజెన్సీలోని ఏడు మండలాలకు 18,12,671 పాఠ్య పుస్తకాలు సరఫరా కావాల్సి ఉంది. ఇప్పటికే 80 శాతం అంటే 15,17,441 పాఠ్య పుస్తకాలు జిల్లా గొడౌన్‌కు చేరుకున్నాయి. ఈ నెల ఏడో తేదీ నుంచి ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా మండల కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లాల వారీగా పంపుతున్న పుస్తకాల వివరాలు ఇలా ఉన్నాయి. ఉచిత విద్యకు చురుగ్గా ఏర్పాట్లు ● మొదటి విడతగా 3585 మందికి ప్రవేశాలు ● రెండో విడతగా 1,781 సీట్ల కేటాయింపు రాయవరం: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు కేటాయించాల్సి ఉంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రానున్న విద్యా సంసత్సరానికి ఇప్పటికే మొదటి విడతగా ఒకటో తరగతిలో 3,585 మంది చిన్నారులకు ఉచిత ప్రవేశాలు కల్పించారు. అలాగే రెండో విడతలో 1,781 మందికి సీట్లు కేటాయిస్తూ అధికారులు ప్రవేశాల జాబితాను విడుదల చేశారు. వారి ప్రవేశాలను ఈ నెల 16వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది. విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రభుత్వ ఆదేశాలను ఆయా జిల్లాల్లోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ జి.నాగమణి అధికారులను ఆదేశించారు. అలాగే ఇప్పటికే ఆయా పాఠశాలల యాజమాన్యాలకు ప్రభుత్వ ఆదేశాలపై అవగాహన కల్పించినట్టు తూర్పుగోదావరి సమక్ష శిక్ష జిల్లా ఏపీసీ ఎస్.సుభాషిణి వివరించారు. జిల్లా పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్స్ డిక్షనరీలు తూర్పుగోదావరి 3,19,106 53,665 3,495 కోనసీమ 3,70,091 65,223 4,660 కాకినాడ 6,03,802 1,02,549 7,062 పోలవరం 2,24,442 53,297 5,279 -
ఎక్కుపెడితే శరపరంపరే..!
విద్యార్థులకు సహృదయ సేవ వేసవి సెలవులు వృధా కాకుండా విద్యార్థులకు వివిధ కళల్లో శిక్షణ ఇస్తోంది స్థానిక సహృదయ మిత్ర మండలి. గత 25 ఏళ్లుగా స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ స్కూల్, రాజీవ్‌గాంధీ మున్సిపల్ హైస్కూళ్లలో, ఏడేళ్లుగా శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, దేశభక్తి గీతాలు, పప్పెట్రీ, దస్తూరి, చిత్ర లేఖనం తదితర అంశాలను బోధిస్తూ వారి వేసవి సెలవులను సద్వినియోగం చేస్తున్నారు. వివిధ పోటీలు నిర్వహించి వారిలో సృజనాత్మకతను వెలికితీస్తూ ఆ సంస్థ ఎంతో కృషి చేస్తోంది. పిఠాపురం -
వైకల్యం నుంచి వికాసం వైపు..
● ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల సర్వే ● కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో భవిత కేంద్రాలు ● చురుగ్గా సాగుతున్న నమోదు ప్రక్రియ కపిలేశ్వరపురం: శారీరక వైకల్యం ఉన్న వారు మానసికంగా కుంగిపోకుండా జీవితంపై ఆశ, భవిత బంగారమనే నమ్మకాన్ని కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను నిర్వహిస్తోంది. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులను వాటిలో చేర్పించేందుకు జూన్ 9వ తేదీ వరకూ సర్వే నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఇలా.. తూర్పుగోదావరి జిల్లాలో 22, అంబేడ్కర్ కోనసీమ 19, కాకినాడ 22, పోలవరం జిల్లాలో 11 మొత్తంగా 74 భవిత కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఇద్దరు ఐఈఆర్పీలు, ఓక కేర్ వింగ్ వలంటీర్, వారానికోసారి సందర్శించే ఫిజియో థెరపిస్ట్ సేవలందిస్తారు. ఉమ్మడి జిల్లాలో 146 మంది ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీలు), 73 మంది ఆయాలు (కేర్‌వింగ్ వలంటీర్లు) ఆయా కేంద్రాల్లో సేవలు అందిస్తున్నారు. లక్ష్యమిదీ.. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు ఇంటికే పరిమితం కాకుండా వారిని మానసికంగా, శారీరకంగా బలోపేతం చేసి భవిష్యత్తు తమదే అని భావించే లక్ష్యంతో ఆయా కేంద్రాలు సాగుతున్నాయి. 0 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులకు ప్రత్యేక పరికరాల సాయంతో విద్యా బుద్ధులు చెబుతారు. వారికి ప్రత్యేక సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తారు. సిబ్బంది కార్యాచరణ ఇదీ ఆరేళ్ల లోపు చిన్నారులకు ఈ కేంద్రాల్లో సేవలందిస్తారు. 6–18 చిన్నారులను పాఠశాలలో చేర్పించి విద్యా బుద్ధులు నేర్పుతారు. వారికి మధ్యాహ్న భోజనం ఇస్తారు. కేంద్రాలకు రాలేనివారికి గృహ ఆధారిత విద్యను అందిస్తారు. సమస్య తీవ్రతను బట్టి ప్రత్యేక వ్యాయామాలు, స్పీచ్, బిహేవియర్ థెరపీ చేస్తారు. ఇందుకు తగ్గ పరికరాలు ఆయా కేంద్రాల్లో ఉంటాయి. ఆర్థిక చేయూత ఇలా.. కండరాల బలహీనత, అంధత్వం, మానసిక వైకల్యం, వినికిడి లోపం, ఆటిజం ఉన్న విద్యార్థులకు నెలకు రూ.600 చొప్పున 10 నెలలకు రూ.ఆరు వేలు లబ్ధిదారు ఖాతాలో ఎస్కార్ట్ భత్యం కింద జమ చేస్తారు. తీవ్రమైన వైకల్యం ఉన్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు గృహ ఆధారిత విద్యను అందించి నెలకు రూ.300 చొప్పున 10 నెలలకు రూ.3 వేలు జమ చేస్తారు. సీడబ్ల్యూఎస్ఎన్ బాలికల కోసం అదనంగా నెలకు రూ.200 చొప్పున 10 నెలలకు రూ.2వేలు ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుత ప్రాజెక్ట్ లక్ష్యమిదీ 2026–27 విద్యా సంవత్సరానికి ఆయా విద్యార్థుల వివరాలు సేకరించి దృష్టి పోర్టల్‌లో నమోదుచేయడం లక్ష్యంగా ప్రత్యేక ప్రాజెక్టు సాగుతోంది. భవిత, నాన్ భవిత కేంద్రాల్లోని ఐఈఆర్పీలకు ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి శిక్షణ ఇస్తోంది. సమస్యలతో సిబ్బంది సతమతం సమగ్ర శిక్ష పరిధిలోని తమను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని రెండేళ్లుగా కోరుతున్నారు. సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరి గ్రాట్యుటీ, పీఎఫ్, ఈఎస్ఐ కల్పించాలన్న వారి డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. యువగళం పాదయాత్రలో ఈ మేరకు ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించింది. ఈ నెల 15న విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి మంత్రి లోకేష్ ఇంటి వరకూ పాదయాత్రకు ఉపక్రమించినట్టు రాష్ట్ర కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు నూకపెయ్యి గంగాధర్ చెప్పారు. -
ప్రశాంతంగా ఈడీ సెట్
రాజానగరం: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంపిక చేసిన 16 కేంద్రాలలో శుక్రవారం నిర్వహించిన ఏపీ ఈడీసెట్ 2026 ప్రశాంత వాతావరణంలో జరిగిందని ప్రాంతీయ సమన్వయకర్త, ఆదికవి నన్నయ యూనివర్సిటీ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు తెలిపారు. 4,622 మంది పరీక్ష రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే పరీక్షకు హాజరైంది మాత్రం 3,629 మంది (78.5శాతం). వీరిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఏడు కేంద్రాలలో 2,609 మందికిగాను 2,137 మంది (81.9శాతం), పశ్చిమ గోదావరి జిల్లాలోని తొమ్మిది కేంద్రాలలో 2,013 మందికిగాను 1,492 మంది (74.1శాతం) పరీక్షకు హాజరయ్యారన్నారు. ఆగస్టులో ప్రత్యేక లోక్ అదాలత్ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘‘సమాధాన్ సమరోహ్’’ కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న రాజీకి అనుకూలమైన కేసులను పరస్పర అవగాహనతో పరిష్కరించడానికి ఆగస్టు 21, 22, 23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. న్యాయవాదులు, కక్షిదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కక్షిదారులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవలసిందిగా కోరారు. 011–23116464, 011–23116465 హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రత్నగిరిపై పెళ్లి సందడి అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధి శుక్రవారం రాత్రి పెళ్లి బృందాలతో నిండిపోయింది. ఎటు చూసినా వధూవరులు, వారి బంధుమిత్రులు, వివాహాలు చేయించే పురోహితులు, సన్నాయి మేళం వారు ఇలా అంతా పెళ్లిళ్లకు సంబంధించిన వారే దర్శనమిచ్చారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల ముహూర్తంలో 150కి పైగా వివాహాలు జరిగాయి. ఈ వివాహాల నిర్వహణ కోసం సత్యగిరిపై నిర్మించిన 36 వివాహ హాల్స్, వివిధ సత్రాలలో వివాహాలు చేసుకునే స్థలాలు, రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డు, దాని పక్కనే గల ఖాళీ ప్రదేశం అంతా పెళ్లి సందడి కనిపించింది. సత్యగిరిపై గల మట్టేవారి ఉచిత ఏసీ కల్యాణ మండపం, ఎంఎస్ రెడ్డి వివాహ వేదికలోని 24 చిన్న కల్యాణ మండపాల్లో కూడా ఇదే ముహూర్తంలో వివాహాలు జరిగాయి. వివాహ బృందాల వారి తాకిడితో సాధారణ భక్తులకు సత్రాలలో గదులు లభ్యం కాలేదు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,000 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)14,000 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
జోయాలుక్కాస్‌లో బ్రిలియన్స్ డైమండ్ జ్యుయల్లరీ షో
రాజమహేంద్రవరం సిటీ: ద వరల్డ్ ఫేవరెట్ జ్యువెలర్, జోయాలుక్కాస్, తమ రాజమహేంద్రవరం షోరూమ్‌ను తిరిగి ప్రారంభించినట్లు ఆ సంస్థ గ్రూప్ చైర్మన్, ఎండీ డాక్టర్ జోయా లుక్కాస్ ప్రకటించారు. శుక్రవారం ఈ షాపును రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పునః ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్రాండ్ ఎంతో ఆదరణ పొందిన, ఎదురుచూస్తున్న బ్రిలియన్స్ డైమండ్ జ్యూవెలరీ షోను నిర్వహించనున్నామన్నారు. ఇది కట్, అన్‌కట్ డైమండ్స్, విలువైన ఆభరణాల ప్రీమియం, ప్రత్యేకమైన కొత్త డిజైన్ల అద్భుతమైన ప్రదర్శన అని తెలిపారు. ఈ సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను అందిస్తోందన్నారు. బంగారం, వెండి, విలువైన రాళ్ల ఆభరణాలపై ఫ్లాట్ 40 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. రూ.1 లక్ష, అంతకంటే ఎక్కువ విలువైన డైమండ్ ఆభరణాల కొనుగోలుపై ఉచితంగా ఒక బంగారు నాణెం పొందవచ్చునన్నారు. ఈ ఆఫర్లు మే 24 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి సేకరించిన అద్భుతమైన క్లాసిక్ నగల సమాహారం, సరికొత్త డిజైన్న్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. -
చెప్పింది చేయడమే ప్రత్యేకం!
సాక్షి, రాజమహేంద్రవరం: పంచాయతీల్లో ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారులు ఉత్సవ విగ్రహాల్లా మారారు. కూటమి నేతలు వారిపై ఒత్తిడి తెచ్చి అన్ని పనులూ చక్కబెట్టేస్తున్నారు. ఈ ప్రభావం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై పడుతోంది. పంచాయతీల పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీ నాటికి ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలో 343 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 322 మంది ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి ఉత్తర్వులు వెలువరించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓ, ఎంఈఓ, ఏఓ, మత్స్యశాఖ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అధికారుల కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఏపీఎంలకు సైతం బాధ్యతలు ఇచ్చారు. పంచాయతీలు ఎక్కువగా ఉండటం అందుకు తగ్గట్టు అధికారులు లేకపోవడంతో సీనియర్ అధికారులకు రెండు నుంచి మూడు, మరికొందరికి ఐదు పంచాయతీల బాధ్యతలు అప్పగించారు. త్రీమెన్ కమిటీ పెత్తనం గ్రామ పంచాయతీ పరిధిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీ కనుసన్నల్లోనే పంచాయతీ పాలన సాగుతోంది. కూటమి కమిటీ సూచించిన అభివృద్ధి పనులు, తాము చెప్పిన వాటికే సంతకాలు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. తమ అంగీకారం లేనిదే రూపాయి కూడా ఖర్చు చేయకూడదంటూ హుకుం జారీ చేస్తున్నారు. రూల్ ప్రకారం వెళతామంటున్న అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. కాదూ కూడదంటే బదిలీ చేయిస్తామంటూ హెచ్చరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ కావడం.. ఆపై ఎందుకొచ్చిన గొడవలే అంటూ అధికారులు మిన్నకుంటున్నారు. అధికారులకు ప్రత్యేక అధికారాలు కేటాయించిన ప్రభుత్వం.. వారికి పవర్ లేకుండా చేసింది. ప్రత్యేక బాధ్యతలు స్వీకరించి రెండు మాసాలు గడిచినా నేటికీ నిధులు డ్రా చేసే అధికారం కల్పించలేదు. వెరసి గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నానా పాట్లు పడుతున్నారు. వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో చేతిపంపుల మరమ్మతులు, తాగునీటి ట్యాంకులు, గ్రామీణ నీటి సరఫరా పనులు చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు ఖర్చు చేసే అధికారం ఇవ్వకపోవడంతో అత్యవసర పనులకు ఆటంకం ఏర్పడుతోంది. చేసేది లేక అధికారులు తమ సొంత డబ్బు వెచ్చిస్తున్నారు. ఇలా ప్రతి అధికారి ఇప్పటి వరకు రెండు నెలలుగా ఒక్కో అధికారి రూ.లక్ష వరకు సొంత డబ్బు వెచ్చించినట్లు సమాచారం. డ్రాయింగ్ పవర్ లెస్ ప్రత్యేక అధికారులకు డ్రాయింగ్ పవర్ తప్పనిసరి. బిల్లులపై సంతకాలతో పాటు స్టాంప్ తదితర ధ్రువీకరణలు చేయాలి. అనంతరం ఆన్లైన్లో వేలిముద్ర వేస్తేనే బిల్లులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకాధికారుల నుంచి వేలిముద్ర అథారిటీ అనుమతుల కోసం మండల పరిషత్ అధికారులు ఇటీవల ఆధార్, ఆధార్‌తో లింకై న మొబైల్ నంబర్ వివరాలు సేకరించారు. నేటికీ ప్రత్యేక అధికారులకు నిధులు డ్రా చేసే అధికారం రాలేదు. ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి. ఆ అధికారం వస్తే తప్ప 15వ ఆర్థిక సంఘం నిధులు డ్రా చేయడం, బిల్లులు చెల్లించడం సాధ్యం కాదు. ప్రజాసేవల్లో జాప్యం ప్రత్యేకాధికారులు తమ సొంత శాఖకు సంబంధించిన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అదనంగా పల్లె పాలనపై దృష్టి పెట్టాలి. ఈ పరిణామం అధికారుల పనితీరుపై పడనుంది. గ్రామ పంచాయతీల్లో విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి సమస్యలు పరిష్కరించడానికి అధికారులు అందుబాటులో ఉండరు. దీంతో ఆయా సమస్యల పరిష్కారంలో జాప్యం చోటు చేసుకుంటుందని ప్రజలు అంటున్నారు. ఉత్సవ విగ్రహాల్లా మారిన పంచాయతీల ప్రత్యేకాధికారులు చెక్ పవర్ ఇవ్వకపోవడంతో ఆర్థిక అవస్థలు కూటమి నేతలు చెప్పినట్టు వినాల్సిందేనంటూ హుకుం తమ సొంత డబ్బు వెచ్చించి చిన్నపాటి పనులు చేస్తున్న వైనం ఇప్పటి వరకు ఒక్కో అధికారి రూ.లక్షకు పైగా ఖర్చు -
మస్కట్‌లో మహిళ నరకయాతన
సురక్షితంగా ఇంటికి చేర్చిన కేఎస్ఎం అధికారులు అమలాపురం రూరల్: ఉపాధి కోసం వెళ్లి మస్కట్‌లో నరకయాతన అనుభవించిన జిల్లా ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్పకు చెందిన కె.లక్ష్మిని కేసీఎం అధికారులు సురక్షితంగా ఇంటికి చేర్చారు. గత ఏడాది సెప్టెంబర్ 8న ఏజెంట్ అక్కడకు వెళ్లిన మహిళ ఓ ఇంటిలో పనికి చేరింది. యజమాని వేధింపులు భరించలేక తన భర్త శ్రీనివాసరావుకు ఆ సమాచారాన్ని ఇచ్చింది. కలెక్టరేట్లోని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేఎస్ఎం)ను సంప్రదించగా కలెక్టర్ ఆదేశాలతో అక్కడి అధికారులు సహాయక చర్యలు చేపట్టి ఆమెను క్షేమంగా ఇంటికి చేర్చారు. -
నేడు పది కోర్టుల భవన సముదాయం ప్రారంభం
– ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ రాక రాజమహేంద్రవరం సిటీ, ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన ‘‘పది కోర్టుల సముదాయ భవనం‘ ను శనివారం ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ ప్రారంభిస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్ , జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు, జస్టిస్ బి.వి.ఎల్.ఎన్.చక్రవర్తి, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారన్నారు. జస్టిస్ బట్టు దేవానంద్ తూర్పు గోదావరి జిల్లా పరిపాలనా న్యాయమూర్తిగా కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె తెలిపారు. రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్.వి. ప్రసాద్, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, న్యాయశాఖ అధికారులు, సిబ్బంది, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పదికోర్టుల సముదాయ భవనం ప్రారంభోత్సవ ఏర్పాట్లును పరిశీలించారు. -
పశువులకూ వేసవి తాపం
● రక్షణ చర్యలు తీసుకోకుంటే ప్రమాదం ● జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి విజయరెడ్డి అమలాపురం టౌన్: వేసవి ఎండల తాపం నుంచి మూగ జీవాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని వేసవి తాపం నుంచి వాటిని కాపాడేందుకు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎల్.విజయరెడ్డి ఐదు సూత్రాలు చెప్తున్నారు. జిల్లాలో 55, 221 ఆవులు, 1,10,123 గేదెలు, 25,291 గొర్రెలు, 19,713 మేకలు, 49,38,269 కోళ్లు (పౌల్ట్రీ) ఉన్నాయి. ఎండల తీవ్రత నుంచి వాటికి ఉపశమనం కలిగించేందుకు శుభ్రమైన చల్లని నీరు 24 గంటలూ అందుబాటులో ఉంచాలని చెప్తున్నారు. పశువు రోజుకు 100 లీటర్ల వరకూ నీరు తాగుతుంది. అలాగే వాటికి నీడ ఏర్పాటు చేయాలి. పశువుల పాకలపై గడ్డి, టార్పాలిన్, షేడ్ నెట్ వేయాలి. ఎండ సమయంలో పశువులకు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల లోపు మాత్రమే మేత, దాణా వేయాలి. దాణాలో 30 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల మినరల్ మిక్స్చర్ కలిపాలి. ఈ విధానం వల్ల పశువులు వడ దెబ్బ తగలకుండా ఉంటాయి. వడ దెబ్బ లక్షణాలివీ.. పశువులు వడ దెబ్బ తగలకుండా రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వాటిని గమనిస్తూ ఉండాలి. వాటికి ఆయాసం, జొల్లు, నాలుక బయట పెట్టడం, మేత మానేయడం వంటి లక్షణాలు గమినిస్తే తక్షణమే స్పందించాలి. వాటిని నీడకు చేర్చి వాటి శరీరంపై నీళ్లు పోయాలి. తక్షణమే పశువుల అంబులెన్స్ 1962 నెంబర్‌కు కాల్ చేయడం లేదా దగ్గరలో ఉన్న పశు వైద్యుడిని సంప్రదించడమో చేయాలి. ఈ జాగ్రత్తలను విధిగా పాటిస్తూ పాల దిగుబడి తగ్గకుండా, ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తతతో చూసుకోవాల్సిన రైతులపై ఉందని విజయరెడ్డి సూచిస్తున్నారు. -
తెల్లబోతున్న నల్లరేగడి పొగాకు!
● ఇంకా ప్రారంభంకాని కొనుగోళ్లు ● రైతుల ఆందోళన ● తొర్రేడులో బ్లాక్ సాయిల్ టొబాకో సాగు ● 3 మిలియన్ల కిలోల ఉత్పత్తి దేవరపల్లి: ఈ ఏడాది పొగాకు పండించిన రైతుల పరిస్థితి గందరగోళంగా మారింది. నల్లరేగడి భూముల్లో పండించిన పొగాకు విక్రయాలకు బోర్డు నుంచి ఇంతవరకు అనుమతులు రాలేదు. టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలో సుమారు 30 గ్రామాల్లో 964 బ్యారన్లకు లైసెన్సులు ఉండగా, 1,013 మంది రైతులు 1,120 హెక్టార్లలో బ్లాక్ సాయిల్ పొగాకు పండిస్తున్నారు. 2025–26 పంట కాలానికి 2.03 మిలియన్ల కిలోలు ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 3 మిలియన్ల కిలోలు ఉత్పత్తి జరిగింది. పొగాకు క్యూరింగ్‌లు, గ్రేడింగ్‌లు పూర్తి చేసిన రైతులు పంటను అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్నారు. రాజమహేంద్రవరం డివిజన్లో తొర్రేడు, రంగంపేట, సీతానగరం, ముగ్గళ్ల, వడిశలేరు ప్రాంతాల్లో నల్లరేగడి భూముల్లో పొగాకు పండిస్తున్నారు. దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలోని దేవరపల్లి మండలంలో దేవరపల్లి, పల్లంట్ల, లక్ష్మీపురం, బందపురం, దుద్దుకూరు గ్రామాల పరిధిలో కొంత మంది నల్లరేగడి భూముల్లో పొగాకు పండిస్తున్నారు. నల్లరేగడి భూముల్లో పండించిన పొగాకును దేవరపల్లి వేలం కేంద్రంలో రైతులు విక్రయించవలసి ఉంది. గతంలో తొర్రేడు వేలం కేంద్రంలో బ్లాక్ సాయిల్ రైతులు పొగాకును విక్రయించేవారు. వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు మూసివేయడంతో అక్కడ బ్యారన్లను దేవరపల్లి వేలం కేంద్రానికి బదిలీ చేశారు. దాదాపు 10 సంవత్సరాలుగా అక్కడ రైతులు పండించిన పొగాకును దేవరపల్లి వేలం కేంద్రంలో విక్రయిస్తున్నారు. బ్లాక్ సాయిల్(బీఎస్) పొగాకును వేలం కేంద్రంలో ప్రత్యేకంగా ఉంచి అధికారులు వేలం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 25న రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించారు. వర్జీనియా పొగాకును మాత్రమే వేలం నిర్వహిస్తున్నారు. బ్లాక్ సాయిల్ పొగాకు కొనుగోలుకు బోర్డు నుంచి అనుమతులు రాలేదని అధికారులు చెబుతున్నారు. మొక్కుబడిగా వర్జీనియా కొనుగోళ్లు వర్జీనియా పొగాకు కొనుగోళ్లు కూడా మొక్కుబడిగా జరుగుతున్నాయి. 40 రోజులు వేలం నిర్వహించగా సుమారు 11 లక్షల కిలోల పొగాకు విక్రయం జరిగింది. వేలం కేంద్రాలకు వచ్చిన బేళ్లలో 50 నుంచి 60 శాతం అమ్ముడు పోక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కిలో గరిష్ట ధర రూ.265 పలకడంతో పంటను అమ్ముకోవడానికి రైతులు ముందుకు రావడంలేదు. సుమారు 25 కంపెనీల ప్రతినిధులు వేలంలో పాల్గొనవలసి ఉండగా, ఆరు కంపెనీలు వేలంలో పాల్గొంటున్నాయి. ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్డు అనుమతి మేరకు పండించిన పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. 2015–16 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర రాక అనేక మంది పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అటువంటి ఘటనలు ఈ ఏడాది పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులకు అండగా ఈ నెల 6వ తేదీన దేవరపల్లి వేలం కేంద్రం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. కస్టమర్స్ నుంచి ఆర్డర్లు రావాలి విదేశీ కస్టమర్స్ నుంచి ఎగుమతి ఆర్డర్లు రావలసి ఉంది. లక్ష కిలోల పొగాకు ఐటీసీ శాంపిల్స్ తీసి కస్టమర్లకు పంపించింది. శాంపిల్స్ పొగాకు కస్టమర్లకు నచ్చకపోవడంతో రెండవ సారి పంపిస్తున్నారు. త్వరలో ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నాం. బ్లాక్ సాయిల్ పొగాకుకు ఇండెంట్ రావలసి ఉంది. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో 50.87 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా, 85.25 మిలియన్ల కిలోలు ఉత్పత్తి జరిగింది. – జె.సురేంద్ర కుమార్, టొబాకో బోర్డు రీజనల్ మేనేజరు, రాజమహేంద్రవరం పల్లంట్లలో నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్న పొగాకు -
హాకీ వేసవి శిక్షణ ప్రారంభం
స్థానిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హాకీ వేసవి క్రీడాశిక్షణ శిబిరం గురువారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమానికి హాకీ సంఘ ప్రతినిధి వి.రవిరాజు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్డీఓ సతీష్ కుమార్ పాల్గొన్నారు. రవిరాజు మాట్లాడుతూ క్రీడాయాప్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే ఈ శిక్షణకు అర్హులన్నారు. ఈనెల 30 వరకు జరిగే ఈ శిబిరంలో 40 మంది పాల్గొంటున్నారని, ఫిట్నెస్ మెళకువలతోతో పాటు హాకీలో ఓనమాలు నేర్పిస్తామని చెప్పారు. ఖో–ఖో సంఘ అధ్యక్షుడు పట్టాభి మాట్లాడుతూ క్రీడల్లో రాణించేవారికి ప్రభుత్వం మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తుందన్నారు. పీఆర్ కళాశాల పీడీ వర్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలని తెలిపారు. పీఆర్జీ పీడీ రమణ, గ్రౌండ్స్‌మెన్ శ్రీను పాల్గొన్నారు. -
జీజీయూలో దొంగలు పడ్డారు
రాజానగరం: జాతీయ రహదారిని ఆనుకుని వెలుగుబందలో ఉన్న గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి (ఏఓ) జి. శ్రీహరిప్రసాద్ గురువారం రాజానగరం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఇలా వున్నాయి.. బుధవారం సాయంత్రం వరకు విద్యార్థులు చెల్లించిన ఫీజులకు సంబంధించిన రూ.3,74,790ను క్యాషియర్ శ్వేత నగదు విభాగంలోని క్యాబిన్లో భద్రపరిచారు. గురువారం డ్యూటీకి వచ్చిన సిబ్బంది క్యాబిన్ తలుపులు తెరచివుండటాన్ని గమనించడంతో చోరీ జరిగిన సంగతి తెలిసింది. నగదు విభాగంలో భద్రపరచిన రూ.3,74,790 కనిపించలేదు. అర్ధరాత్రి సమయంలో ఈ చోరీకి పాల్పడివుండవచ్చని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని నార్త్ జోన్ డీఎస్పీ జీవన, స్థానిక సీఐ వీరయ్యగౌడ్ సందర్శించి, సీసీ కెమెరాలను పరిశీలించారు. నలుగురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి, చోరీకి పాల్పడినట్టుగా గుర్తించారు. -
మడ చెట్ల తొలగింపుపై కేసు
తాళ్లరేవు: పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడే మడ చెట్లను తొలగించిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎం.నాగార్జున తెలిపారు. మండల పరిధిలోని గాడిమొగ పంచాయతీలో గాయత్రీ సాల్ట్ వర్క్స్ సంస్థకు చెందిన పలువురు రహదారి విస్తరణ నేపథ్యంలో అడ్డుగా ఉన్న మడ చెట్లను విచక్షణా రహితంగా తొలగించారు. ఎటువంటి అనుమతులు లేకుండా మడ చెట్లను తొలగించడంపై పలువురు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. తుమ్మ చెట్ల ముసుగులో మడ చెట్లను తొలగించడాన్ని గుర్తించి సంస్థ ప్రతినిధులతోపాటు కృష్ణంరాజు అనే వ్యక్తిపై కేసులు నమోదు చేశారు. తీర ప్రాంతానికి రక్షణ కవచంగా ఉన్న మడ అటవీ ప్రాంతంలో చెట్లను తొలగించడం నేరమని, కఠిన చర్యలు చేపట్టనున్నట్లు నాగార్జున విలేకర్లకు తెలిపారు. మడ చెట్లు తొలగించిన ప్రాంతం కోరంగి వైల్డ్‌లైఫ్ సాంక్చురీకి అతి దగ్గరగా ఉండడం గమనార్హం. -
ఉరి వేసుకుని వ్యక్తి మృతి
కాకినాడ రూరల్: భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఎస్.అచ్యుతాపురం మధురానగర్‌కు చెందిన గోకాడ శ్రీనివాసులు(44) బుధవారం రాత్రి మృతి చెందాడు. ఇంద్రపాలెం పోలీసులు తెలిపిని వివరాలివీ.. శ్రీనివాసులకు భార్య పుష్పలత, 14 ఏళ్ల కుమారుడు, 13 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల కాలంలో ఇంటి వద్దే ఖాళీగా ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఇటీవల భార్య, పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీనివాసులు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. గురువారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీఆర్వో బత్తుల రమణకుమారి ఫిర్యాదు మేరకు ఏఎస్సై ఎం.వాడపల్లి కేసు నమోదు చేశారు. లేఅవుట్ రోడ్డులో యువకుడి మృతి రాజానగరం: ఫరిజల్లిపేట నుంచి చక్రద్వార బంధానికి వెళ్లే డీవీబీ రాజు లేఅవుట్ రోడ్డులో మేడిశెట్టి గంగరాజు (24) ప్రమాదానికి గురై మృతి చెందాడు. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ గురువారం ఇక్కడ మీడియాకు తెలిపిన వివరాలిలా వున్నాయి.. ఫరిజల్లిపేటకు చెందిన దుర్గాప్రసాద్ బుధవారం తన పల్సర్ మోటారు బైకుపై దగ్గరి దారిలో చక్రద్వారబంధం వైపు వెళ్లేందుకు డీవీబీ రాజు లేఅవుట్ రోడ్డులో ప్రయాణిస్తూ అదుపు తప్పి పడిపోయాడు. ఈ క్రమంలో అతని తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి సమయంలో అటుగా వెళ్తున్న వేరొకరు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అతను మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. తొలుత దీనిని అనుమానాస్పద స్థితిలో మృతిగా భావించారు. ఘటనా స్థలాన్ని నార్త్ జోన్ డీఎస్పీ జీవన కూడా పరిశీలించారు. -
పీఈటీ అవ్వాలని...
నా పేరు కర్రి దుర్గాప్రసాద్. పీఆర్ బాలుర పాఠశాలలో నేను 10 వ తరగతి చదువుతున్నాను. పీఈటీ అవ్వాలనేది నా కోరిక. స్పోర్ట్స్ కోటాలో పీఈటీ ఉద్యోగం సాధించాలని హాకీలో చేరాను. క్రీడలంటే ఇష్టం నా పేరు లలిత ప్రియ. నేను శ్రీనగర్ మున్సిపల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. నాకు క్రీడలంటే చిన్నతనం నుంచీ ఇష్టం. అందుకే హాకీ శిబిరంలో చేరాను. టీచర్ ఉద్యోగం నా లక్ష్యం నా పేరు జి.అఖిల. నేను నీఆర్ బాలికోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. నేను మొదటిసారి వేసవి శిక్షణకు హాజరయ్యాను. టీచర్ అవ్వాలనేది నా లక్ష్యం. జాతీయ స్థాయిలో రాణించడమే ధ్యేయం నా పేరు సీహెచ్బీఎల్ఎస్ షణ్ముకేశ్వరి. నేను పీఆర్ బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పీడీ షేక్ మస్తాన్ బేగంను స్ఫూరిగా తీసుకుని హాకీ వైపు వచ్చాను. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా రాణించడం నా ధ్యేయం. -
బరి తెగించిన ముగ్గురికి అరదండాలు
● ఇద్దరు అంతర జిల్లా నేరస్తులు సహా ఒక బైక్ దొంగ అరెస్టు ● రూ.51 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువుల రికవరీ కాకినాడ క్రైం: ఒంటరి మహిళలను టార్గెట్ చేసి బంగారు గొలుసులు తెంపుకొని మాయమవడం. అర్ధరాత్రుళ్లు ఇళ్లలో చొరబడి చోరీలు చేయడం, బైక్‌లు దొంగిలించడంలో ఆరితేరిన ముగ్గురు నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ బిందుమాధవ్ గురువారం తన కార్యాలయంలో ఈ వివరాలు విలేకరులకు వెల్లడించారు. ఇద్దరికి అరదండాలు : తూర్పుగోదావరి జిల్లా రాజవోలు గ్రామానికి చెందిన 30 ఏళ్ల పల్లా సురేంద్రకుమార్, కాకినాడ రాగంపేటకు చెందిన 45 ఏళ్ల రంగాల శ్రీనివాసరెడ్డి కలిసి వరుస నేరాలకు పాల్పడుతున్నారు. వీరిద్దరు 12 కేసుల్లో నిందితులు. చైన్‌స్నాచింగ్, ఏటీఎం కేంద్రాల వద్ద నేరాలు చేయడంలో సిద్ధహస్తులు. సురేంద్రకుమార్ ఏటీఎంలలో వ్యక్తుల నుంచి కార్డు, పిన్ చోరీ చేసి డబ్బు డ్రా చేసి పరారయ్యేవాడు. ఇలా ఇతడు 65 ఏటీఎంల వద్ద చోరీలకు పాల్పడ్డాడు. సురేంద్ర, శ్రీనివాస్ ఇద్దరూ చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. రోడ్లపై వెళ్లే ఒంటరి మహిళలతో పాటు ఇళ్లలో ఉండే తోడు లేని ఆడవారు, వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకొని వీరు పేట్రేగిపోయారు. దారి కాచి మెడలో గొలుసులు తెంపుకెళ్లడం, ఇళ్లల్లోకి అర్థరాత్రుళ్లు చొరబడి బంగారం ఎత్తుకెళ్లడంలో వీరు నేర్పరులు. వీరిద్దరినీ బుధవారం రాత్రి సామర్లకోట జెడ్ బ్రిడ్జ్ వద్ద అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. బైక్‌ల దొంగ అరెస్టు : కాకినాడ రూరల్ మండలం వలసపాకలకు చెందిన 20 ఏళ్ల రచ్చ నాగ సతీష్ కుమార్ వరుస ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్నాడని, అతడిపై సస్పెక్టు షీటు సహా గంజాయి వినియోగం, నాటుసారా సంబంధిత 30 కేసులు జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాయని అన్నారు. ముద్దాయిని వలసపాకలలో అతడి ఇంటికి సమీపంలో పట్టుకున్నామని తెలిపారు. రెండు కేసుల్లో 320 గ్రాముల బంగారం, 600 గ్రాముల వెండి సామగ్రి, రూ.40 వేల నగదు, 3 బైక్‌లు స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ సుమారు రూ.51 లక్షలని ఎస్పీ తెలిపారు. కేసుల ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ వి.కృష్ణ, కాకినాడ టూ టౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడిని ఎస్పీ అభినందించారు. -
గోల్ కొడతామిలా!
● హాకీ వేసవి శిక్షణ శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు ● ఈ తర్ఫీదును తమ లక్ష్య సాధనకు వినియోగించుకుంటామని స్పష్టీకరణ నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): చక్కని కార్యాచరణతో వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొనేందుకు ఆ విద్యార్థులు సిద్ధమయ్యారు. ఆట విడుపు వేళ తమ లైఫ్ గోల్ సాధనకు శ్రమించాలని నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో తాము ఎలా ఎదగాలనుకుంటున్నామో, జీవితంలో ఏ విధంగా స్థిరపడాలనుకుంటున్నామో ముందుగానే నిర్ణయించుకొన్న.. వారు తమ లక్ష్యసాధనకు శిక్షణ పొందడానికి సమాయత్తమయ్యారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న హాకీ వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు తమ అభిప్రాయాలు ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.. అంకితభావంతో రాణింపు ఆటల్లో రాణించాలంటే అంకిత భావం, కృషి, పట్టుదల అవసరం. 1987లో ఇదే కళాశాలలో చదివే రోజుల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో ఆలిండియా గోల్డ్ మెడల్ సాధించా. అప్పటి ప్రిన్సిపాల్ ధర్మారావు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి అభినందించారన్నారు. ఆ ప్రోత్సాహంతోనే వెయిట్ లిఫ్టింగ్ కోచ్‌గా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు డీఎస్డీఓ విధులు నిర్వహిస్తున్నా. 2013లో డీఎస్‌ఏలో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణకు వచ్చిన ధాత్రి ఇప్పుడు ఇండియన్ రైల్వేస్‌లో గ్రేడ్–2 ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఆటల్లో రాణించాలంటే క్రమం తప్పకుండా శిక్షణకు హాజరు కావాలి. – వి.సతీష్‌కుమార్, డీఎస్డీఓ -
ఆపదలు గాసే అరుదైన క్రాస్!
● సామాజిక సేవల్లో ఆదర్శం ● రక్తదానంతో ప్రాణదానం ● నేడు ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం రాయవరం: ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ముందుంటుంది. బాధితుల ప్రాణాలను కాపాడేందుకు రక్తదానంతో పాటు ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1928లో ఆ సంస్థ సేవలు ప్రారంభమయ్యాయి. దాతల నుంచి సేకరించిన రక్తం యూనిట్లను జిల్లాలోని రక్తనిధి కేంద్రాలు, రక్త నిల్వ కేంద్రాల ద్వారా వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాధితులకు అందజేస్తూ వారికి ప్రాణదానం చేస్తోంది. శుక్రవారం రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కథనం.. వేలాది రక్తదాన శిబిరాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 120 మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తాన్ని సరఫరా చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 77 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 6,708 యూనిట్ల రక్తాన్ని సేకరించింది. 11,598 యూనిట్ల రక్తాన్ని అవసరమైన వారికి అందజేసింది. ఈ ఏడాది జెల్ టెక్నాలజీని ప్రవేశ పెట్టింది. దీని ద్వారా శుద్ధి చేసిన, నాణ్యమైన రక్తాన్ని రోగికి అందిస్తారు. ఇతర సేవా కార్యక్రమాలు రెడ్‌క్రాస్ సంస్థ దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలను కాకినాడ ప్రతాప్‌నగర్‌లో నిర్వహిస్తోంది. ఇక్కడ ఉచిత వసతి విద్యాబోధనతో పాటు పుస్తకాలు, దుస్తులు అందజేస్తోంది. ప్రకృతి వైపరీత్యాల వేళ బాధితులకు వైద్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తోంది. రాజా ట్యాంకు వద్ద యోగా సెంటర్‌ను నిర్వహిస్తోంది. నామమాత్రపు చార్జీలతో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాకలపూడిలో ఉన్న ఆశ్రమంలో 25 మంది ఉన్నారు. గ్రీన్‌ఫీల్డ్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ బ్లైండ్‌లో 40 మంది బోధిస్తున్నారు. అనాథ శవాలకు దహన సంస్కారాలను ఆత్మబంధువు పేరుతో నిర్వహిస్తున్నారు. ఉచిత అంబులెన్స్ అందిస్తోంది. సంస్థ కార్యాలయంలో రోజూ ఉదయం, సాయంత్రం 50 మందికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఏటా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. సేవలకు పురస్కారం తూర్పుగోదావరి జిల్లా శాఖ అందించిన సేవలకు పలు అవార్డులు సొంతం చేసుకుంది. గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాలను, ప్రశంసాపత్రాలను అందుకుంది. చాలా సంతోషంగా ఉంది రెడ్‌క్రాస్ సంస్థలో సేవచేయడం సంతోషంగా ఉంది. రక్తదానంపై అవగాహన పెంచడానికి కృషి చేస్తున్నాం. – కసిరెడ్డి శివకుమార్, సెక్రటరీ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, కాకినాడ వలంటీర్లను సిద్ధం చేస్తున్నాం బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. పుష్కరాల్లో సేవలందించేందుకు వలంటీర్లను సిద్ధం చేస్తున్నాం. – తరుణ్ గోగినేని, చైర్మన్, రెడ్‌క్రాస్ సంస్థ, తూర్పుగోదావరి జిల్లా -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,000 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)14,000 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
ఇద్దరు అంతర్ జిల్లాల దొంగల అరెస్ట్
● రూ.97.50 లక్షల సొత్తు స్వాధీనం ● ఎస్పీ రాహుల్ మీనా వెల్లడి అమలాపురం టౌన్: వారు ఇంటి తలుపుల టవర్ బోల్ట్‌లు తీయడంలో, ఐరన్ రాడ్‌తో తాళాలు పగులగొట్టడంలో సిద్ధహస్తులు. ఇంట్లోని వారు నిద్రిస్తుండగానే చడీ చప్పుడు లేకుండా చోరీలు చేయడం వారి నైజం. కొత్తపేట ఓల్డ్ బ్యాంక్ వీధిలోని ఒక డాబా ఇంట్లో గత సంవత్సరం ఆగస్టు 30న జరిగిన చోరీ కేసు దర్యాప్తు చేస్తుండగా తీగ లాగితే డొంక కదిలినట్లు ఆ దొంగల చోరీల చిట్టా బయట పడింది. మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు ఆ ఇద్దరు దొంగలను వల పన్ని పట్టుకున్నారు. వారి నుంచి రూ.97.50 లక్షల సొత్తు రికవరీ చేశారు. కాకినాడ జిల్లా ఏటిమొగ గ్రామానికి చెందిన పొన్నాడ రవిశంకర్ (వీరబాబు), తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామానికి చెందిన వైరా చిరంజీవి ఈ చోరీలకు పాల్పడ్డారు. రవిశంకర్‌ను కొత్తపేట నాయుడు రైస్ మిల్లు వద్ద, చిరంజీవిని అనపర్తిలో అరెస్టు చేశారు. అమలాపురంలోని తన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా విలేకరులకు గురువారం ఈ వివరాలు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న 646.361 గ్రాము ల బంగారు నగలు, రూ.2,100 నగదు, మోటారు సైకిల్, స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను చూపించారు. 14 చోరీల కేసుల్లో సొత్తు స్వాధీనం ఈ అంతర జిల్లాల దొంగలు కోనసీమతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 14 చోరీలకు పాల్పడ్డారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, రావులపాలెం స్టేషన్ పరిధిలో 1, తూర్పు గోదావరి జిల్లా పెరవలి పోలీస్ స్టేషన్ పరిధిలో 3, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్, ఇరగవరం, తణుకు టౌన్, తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తలో రెండు చోరీలు చేశారు. ఈ 14 చోరీ కేసుల నుంచి మొత్తం రూ.97.50 లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏ–1పై 120 చోరీలు, ఏ–2పై హత్య కేసు ఈ చోరీల్లో ఏ–1 అయిన రవిశంకర్ ఇప్పటి వరకూ 120 ఇంటి దొంగతనాలకు పాల్పడినట్లు కొత్తపేట పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏ–2 అయిన చిరంజీవిపై గతంలో హత్య కేసు కూడా నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అధికారులు, సిబ్బందికి ఎస్పీ అభినందన అంతర జిల్లాల దొంగలను అరెస్ట్ చేసి సొత్తును రికవరీ చేయడంపై ఎస్పీ మీనా పోలీస్ అధికారులు, క్రైమ్ సిబ్బందిని ప్రశంసించి వారికి నగదు రివార్డులు అందజేశారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్, అమలాపురం క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్, కొత్తపేట ఎస్సై జి.సురేంద్రకుమార్, క్రైమ్ ఎస్సైలు ఎ.పరదేశి, అయితాబత్తుల బాలకృష్ణ, ఏఎస్ఐ ఎం.సుబ్బరాజు, కానిస్టేబుళ్లు లంకాడి శ్రీను, డి.అర్జునరావు, బీడీవీ ప్రసాద్, జి. కృష్ణసాయి, ఎ.శుభాకర్, ఆర్సీహెచ్వీ ప్రసాద్, ఎం.హరిబాబులకు ఎస్పీ మీనా రివార్డులు అందించి అభినందించారు. -
దయనీయ పరిస్థితిలో రైతులు
● ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు ● మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆవేదన రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్రంలోని రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో వారిని కూటమి ప్రభుత్వం నిలువునా ముంచేసిందని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ విమర్శించారు. వరి, మొక్కజొన్న, మామిడి ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందన్నారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రతి రైతుకూ రూ.40 వేలు బాకీ పడ్డారన్నారు.. కేంద్ర సాయంతో కలిపి ప్రతి రైతు ఖాతాలో రూ.52 వేలు జమ కావాల్సి ఉందని, కానీ, ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఏవీ? గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పేదలకు అందజేసిన ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని భరత్‌రామ్ అన్నారు. గతంలో తాము ఇచ్చిన ఇళ్లను అగ్గిపెట్టెలని విమర్శించిన చంద్రబాబు.. ప్రతి పేదవాడికి 2 నుంచి 3 సెంట్ల స్థలం ఇస్తామన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో టిడ్కో ఇళ్లు ఖాళీగా ఉన్నాయని, లబ్ధిదారులపై నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం వేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులు ధర్నాలు చేస్తున్నారని, మరోవైపు ఈఎంఐలు మొదలవడంతో ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం లేదని అన్నారు. పుష్కరాల ఏర్పాట్లపై నిర్లక్ష్యం గోదావరి పుష్కరాలకు సరిగ్గా ఏడాది సమయం ఉందని, అయినప్పటికీ సంబంధిత ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భరత్‌రామ్ విమర్శించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పబ్లిసిటీ షూటింగ్ కోసం ప్రజలను పుష్కర ఘాట్ గేటు వద్ద ఉంచేయడంతో జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోయారని గుర్తు చేశారు. శివరాత్రి నాడు 2 లక్షల మందిని అదుపు చేయలేకపోయిన ప్రభుత్వం, 10 కోట్ల మంది వచ్చే పుష్కరాలను ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. ఎక్కువ మంది యాత్రికులు పుష్కర ఘాట్కే వస్తారని, ఇప్పుడు కూడా ఏర్పాట్లలో అశ్రద్ధ చూపుతూ, కేవలం మాక్ డ్రిల్స్‌తో కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పుష్కరాల నిర్వహణ, నిధులపై తక్షణమే మాస్టర్ ప్లాన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పుష్కరాలకు ఎంత నిధులు కేటాయిస్తున్నారో బహిరంగ ప్రకటన చేయాలని, పుష్కర కార్యక్రమాలపై బ్లూ ప్రింట్ రూపొందించాలని అన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్నారు. -
మంత్రముగ్ధుల్ని చేసిన వీణావాదన
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): గోదావరి తీరాన ఈమని కల్యాణి లక్ష్మీనారాయణ, పసుమర్తి పద్మినిల వీణావాదన శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా అమృతోత్సవం పేరిట స్థానిక గోదావరి గట్టున ఉన్న సమితి ప్రాంగణంలోని ఏసీ ఆడిటోరియంలో 18 రోజుల పాటు సంగీత మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండో రోజైన గురువారం సాయంత్రం కల్యాణి, పద్మినిలు వందేమాతరం గీతంతో వీణావాదన ప్రారంభించి, త్యాగరాజ కీర్తనలు, కృతులు వాయించారు. హంసధ్వని రాగంలో ’బంధురీతి కొలువీయవయ్యా..’, మాయమాళవగౌడ రాగంలో ‘మనవి ఆలకించరాదటే..’, అభేరి రాగంలో ‘నగుమోము..’, శ్రీరాగంలో ‘ఎందరో మహానుభావులు..’, హిందోళ రాగంలో ‘సామజవరగమన’ వంటి కీర్తనలు, కృతులు వాయించి శ్రోతలను మైమరపించారు. కరుటూరి నందకుమార్ సితార, కాపా శ్రీనివాస్ మృదంగం, పండుగ మురళి తబలపై సహకరించి కచేరీని రక్తి కట్టించారు. సమితి గౌరవ చైర్మన్ వాడ్రేవు వెంకట రమణారావు, చైర్మన్ సీఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోస్యుల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కరరామ్, కోశాధికారి వి.కృష్ణకుమారి, ప్రవచన రాజహంస ధూళిపాళ మహాదేవమణి, పలువురు సంగీత ప్రియులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీ వరకూ నిర్వహించే సంగీతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు విజయవాడకు చెందిన పీవీఎన్ కృష్ణ బృందంచే శ్రీకృష్ణరాయబారం పౌరాణిక పద్య నాటకం ప్రదర్శిస్తారు. -
పనులు క్లోజ్!
● గోదావరి డెల్టాలో 499 క్లోజర్ పనుల గుర్తింపు ● రూ.27 కోట్లతో అంచనాలు ● నిధుల మంజూరులో సర్కారు జాప్యం ● కాలువలు మూసివేసి 18 రోజులు ● ఇప్పటికీ పడని ముందడుగు నిడదవోలు: గోదావరి డెల్టా కాలువలకు నీటి విడుదలను నిలిపివేసిన తరువాత యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన ఇరిగేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ పనులు అసలు ప్రారంభిస్తారా, లేదా అనే సందిగ్ధత నెలకొంది. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధికారులు 499 క్లోజర్ పనులను గుర్తించి, రూ.27 కోట్ల అంచనాలతో గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే, కాలువలకు నీటి విడుదలను నిలిపివేసిన చాలా రోజుల తరువాత ఈ పనులకు ప్రభుత్వం ఆలస్యంగా నిధులు మంజూరు చేస్తూ ఈ నెల 2న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిధులతో మూడు డెల్టాల ప్రధాన కాలువలతో పాటు ఆయా సబ్ డివిజన్ల పరిధిలోని ప్రధాన ఉప కాలువలు, పిల్ల కాలువల్లో పెరిగిపోయిన తూడు, గుర్రపు డెక్కను తొలగించడంతో పాటు స్లూయిజ్‌ల నిర్వహణ, షట్టర్ల మరమ్మతులు, గ్రీజు, ఆయిల్ పంపింగ్ వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు సక్రమంగా చేస్తే శివారు భూములకు సైతం రెండు పంటలకూ పూర్తి స్థాయిలో నీరందుతుంది. కూటమి నేతల కన్ను అయితే, క్లోజర్ పనుల్లో కాసులు పిండుకోవాలనే కూటమి నేతలు కొందరు పావులు కదుపుతున్నారు. రూ.10 లక్షల్లోపు పనులను సాగునీటి సంఘాల్లోని రైతులకు నామినేషన్ పద్ధతిపై చేసుకునే అవకాశం ఉంది. దీంతో, రైతుల ముసుగులో ఈ పనులు దక్కించుకునేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రూ.10 లక్షలకు పైబడిన పనులు టెండర్ల ద్వారానే చేపట్టాల్సి ఉంటుంది. గోదావరి డెల్టా కాలువలను గత నెల 20న మూసివేశారు. ఇది జరిగి 18 రోజులైనా క్లోజర్ పనులు ఇప్పటికీ చేపట్టలేదు. వచ్చే నెల మొదటి వారంలో ఖరీఫ్ సాగుకు తిరిగి నీరు విడుదల చేయనున్నారు. ఆ గడువు సమీపిస్తూండటం, ప్రభుత్వం ఆలస్యంగా నిధులు మంజూరు చేయడంతో ఈ పనులు పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. దీంతో, ఈ ఏడాది క్లోజర్ పనులకు మంగళం పాడినట్లేనని రైతులు భావిస్తున్నారు. శిథిలావస్థలో శెట్టిపేట స్లూయిజ్ పశ్చిమ డెల్టా పరిధిలోని ఉండి సబ్ డివిజన్లో లక్షలాది ఎకరాలకు నీరందించే శెట్టిపేట వియర్ (స్లూయిజ్) శిథిలావస్థకు చేరింది. పశ్చిమ డెల్టాకు సాగునీటిని విడుదల చేసే విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్‌తో పాటు శెట్టిపేట స్లూయిజ్ కూడా ఎంతో ప్రధానమైది. నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామంలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు కుడి వైపు 1874లో సర్ ఆర్థర్ కాటన్ హయాంలో దీనిని నిర్మించారు. దీని ద్వారానే 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తారు. ఉండి సబ్ డివిజన్లోని ఉండి, వెంకయ్య వియర్, పాత వియర్ కాలువల ద్వారా తాడేపల్లిగూడెం, ఉండి, భీమవరం, తణుకు, పాలకోడేరు, నిడమర్రు, కాళ్ల, ఆకివీడు మండలాలకు శెట్టిపేట స్లూయిజ్ ద్వారానే సాగునీరు విడుదలవుతుంది. వర్షాకాలంలో వరద నీటి నియంత్రకు శెట్టిపేట వియర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తారు. వర్షాలు అధికంగా కురిసే సమయంలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ గట్లపై నుంచి వరద నీరు పొంగి ప్రవహించి పొలాలను ముంచెత్తుతుంది. ఆ సమయంలో శెట్టిపేట వియర్ నుంచి వరద నీటిని ఎర్ర కాలువ, యనమదుర్రు డ్రెయిన్లకు వదులుతున్నారు. ఇంత ప్రాధాన్యం ఉన్న శెట్టిపేట స్లూయిజ్ ప్రస్తుతం దారుణంగా శిథిలమైంది. కాటన్ హయాంలో రాళ్లతో చేపట్టిన నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ, యంత్ర సామగ్రి, షట్టర్లు పూర్తిగా శిథిలమయ్యాయి. ఐదు ఖానాల్లోని 10 షట్టర్లు తుప్పు పట్టాయి. వీటిలో నాలుగు పూర్తిగా ధ్వంసమవడంతో పూర్తిస్థాయిలో కిందకు దిగడం లేదు. ఆ ఖాళీల్లో నుంచి పెద్ద మొత్తంలో నీరు లీకై , వృథా పోతోంది. ఫలితంగా వరదల సమయంలో నీటిని వదిలేందుకు తలుపులు తెరచుకోకపోవడం, బలవంతంగా తెరచిన తలుపులు నీటి క్రమబద్ధీకరణ సమయంలో మూసుకోకపోవడంతో ఇరిగేషన్ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. శెట్టిపేట స్లూయిజ్‌ను తక్షణం ఆధునీకరించాలని, తుప్పు పట్టిన షట్టర్లు తొలగించి, కొత్తవి ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. ఫలితంగా రెండు పంటలకూ పూర్తి స్థాయిలో నీరు అందని దుస్థితి నెలకొంది. క్లోజర్ పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో శెట్టిపేట స్లూయిజ్ పనులు ఈ ఏడాది కూడా జరిగే సూచనలు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. -
రత్నగిరిపై పెళ్లి సందడి
● నేటి రాత్రి 7 గంటల ముహూర్తానికి 150కి పైగా వివాహాలు ● వివాహ మండపాలు, సత్రం గదులు ఇప్పటికే రిజర్వ్అన్నవరం: రత్నగిరి, సత్యగిరి ప్రతిధ్వనించేలా సత్యదేవుని సన్నిధిలో నేడు పెళ్లి బాజాలు మోగనున్నాయి. శుక్రవారం రాత్రి 7 గంటల ముహూర్తంలో 150కి పైగా జంటలు ఒక్కటి కానున్నాయి. దీంతో, కొండపై ఎక్కడ చూసినా పెళ్లి సందడే కనిపిస్తోంది. ఇప్పటికే పెళ్లి బృందాలు వివాహ మండపాలు, సత్రం గదులను రిజర్వ్ చేసుకున్నాయి. సత్యగిరిపై 36 వివాహ హాల్స్, వివిధ సత్రాల్లో వివాహాలు చేసుకునే స్థలాలను, రెండు ఉచిత వివాహ మండపాల్లోని 24 చిన్న కల్యాణ మండపాలను కూడా రిజర్వ్ చేసుకున్నారు. అలాగే, వివిధ సత్రాల్లో 400 గదులుండగా.. 300కు పైగా గదులను వివాహ బృందాల వారు బుక్ చేసుకున్నారు. దేవస్థానం అధికారికంగా 70 శాతం గదులకు ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్‌కు అనుమతి ఇచ్చింది. వీటితో పాటు ప్రజాప్రతినిధులు, వీఐపీల సిఫారసు లేఖలతో మరో 100కు పైగా గదులు రిజర్వ్ చేశారు. దీంతో, సామాన్య భక్తులకు శుక్రవారం గదులు దొరకడం కష్టమేనని అధికారులు తెలిపారు. 13 తేదీతో శుభం కార్డు వైశాఖ మాసంలో వివాహాలకు ఈ నెల 13వ తేదీతో శుభం కార్డు పడనుంది. వైశాఖంలో ఈ నెల 9, 12, 13 తేదీల్లో వివాహ ముహూర్తాలున్నాయి. అయితే, అవి అంత పెద్ద ముహూర్తాలు కావని దేవస్థానం అధికారులు చెప్పారు. ఆ తేదీల్లో సత్యదేవుని సన్నిధిలో 50 వివాహాల వరకూ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 17న అధిక జ్యేష్ట మాసం ప్రారంభమవుతోంది. దీంతో, ఆ మాసంలో వివాహాలు జరగవు. తిరిగి జూన్ 16 నుంచి నిజ జ్యేష్ట మాసం ప్రారంభమవుతుంది. ఆ మాసంలో వివాహాలు జరుగుతాయి. ఆగస్టు 13న ప్రారంభమవుతున్న శ్రావణ మాసంలో కూడా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి.


