Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Landmark Judgement: BCCI Not A Public Authority Removed From RTI Act1
బీసీసీఐ విషయంలో కీలక తీర్పు.. ఇకపై..

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి భారీ ఊరట లభించింది. సమాచార హక్కు చట్టం (RTIA) పరిధి నుంచి బోర్డును తొలగిస్తూ కేంద్ర సమాచార కమిషన్‌ (CIC) తీర్పు వెలువరించింది. బీసీసీఐ ‘పబ్లిక్‌ అథారిటీ’ కాదని స్పష్టం చేసింది.గతంలో అలా..కాగా 2018లో సమాచార కమిషనర్‌గా ఉన్న ఎం. శ్రీధర్‌ ఆచార్యులు.. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్‌ 2(​h)ను అనుసరించి బీసీసీఐని పబ్లిక్‌ అథారిటీగా డిక్లేర్‌ చేశారు. బోర్డులో పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మద్రాస్‌ హైకోర్డును ఆశ్రయించగా.. CIC వద్దకు చేరింది.ప్రభుత్వ నియంత్రణలో లేదుగీతా రాణి అనే వ్యక్తి గతంలో బీసీసీఐ విషయంలో వేసిన పిటిషన్‌ను తాజాగా కొట్టివేస్తూ.. ‘‘చట్టపరమైన తీర్పులు గానీ.. శాసనాల ద్వారా రాతపూర్వకంగా జరిగిన చట్టంగా మారినట్లుగా గానీ.. బీసీసీఐ ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా ప్రభుత్వానికి చెందినట్లుగా లేదంటే ప్రభుత్వ నియంత్రణలో ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కూడా పొందడం లేదు’’ అని CIC తన తీర్పులో పేర్కొంది.ప్రభుత్వ ఫండింగ్‌గా భావించకూడదుబీసీసీఐ ఆర్థికంగా స్వతంత్ర వ్యవస్థ అని.. మీడియా హక్కులు, స్పాన్సర్‌షిపులు, ఐపీఎల్‌ ఒప్పందాలు, టికెట్ల అమ్మకాలు.. తదితరాల నుంచి ఆదాయం పొందుతోందని CIC ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసింది. అయితే, ఇందుకు సంబంధించిన పన్ను ప్రయోజనాలు పొందుతోంది కాబట్టి.. దీనిని ప్రభుత్వ ఫండింగ్‌గా భావించడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేసింది.అదే విధంగా.. క్రికెట్‌ పరిపాలనా అంశాలకు సంబంధించి అంతా పారదర్శకంగా ఉండాలని మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశించిందని CIC పేర్కొంది. అంతేతప్ప.. ఆర్టీఐ చట్టం కింద బీసీసీఐని ఎన్నడూ పబ్లిక్‌ అథారిటీగా ప్రకటించలేదని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థగాకాగా తమిళనాడు సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ కింద ప్రైవేటు సంస్థగా బీసీసీఐ నమోదైంది. పార్లమెంట్‌ ద్వారా చేయబడిన చట్టం లేదంటే రాజ్యంగబద్ధంగా బోర్డు రూపొందలేదు. కాగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్‌ బోర్డుగా బీసీసీఐ వెలుగొందుతున్న సంగతి తెలిసిందే.చదవండి: ఐపీఎల్‌ ఎక్కువైందా?.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌

IND vs AFG Is Auqib Nabi Fails To Impress Despite 60 Ranji Trophy Wickets2
‘సత్తా చాటినా.. టీమిండియాకు అతడి ఎంపిక కష్టమే’

ఐపీఎల్‌-2026 ముగిసిన వారం వ్యవధిలోపే టీమిండియా అంతర్జాతీయ క్రికెట్‌ బరిలో దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపిక ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.బుమ్రాకు విశ్రాంతిప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినివ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక సొంతగడ్డపై స్పిన్నర్ల ప్రభావమే ఎక్కువ కాబట్టి.. రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌లకు బౌలింగ్‌ విభాగంలో చోటు ఖాయం.ఇక బుమ్రా లేకపోయినా మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ పేస్‌ దళంలో ఉండనే ఉన్నారు. అయితే, అఫ్గన్‌ బలహీన జట్టు కాబట్టి ఈసారి ప్రయోగాలు చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు వినికిడి.ఆకిబ్‌ నబీ ఎంపికపై చర్చఈ నేపథ్యంలో గత ఏడాది రంజీల్లో అత్యధిక వికెట్లతో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆకిబ్‌ నబీ ఎంపికపై చర్చ నడుస్తోంది. అతడిని తప్పక ఈ సిరీస్‌కు ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తాజాగా ఓ జర్నలిస్టు సోషల్‌ మీడియా వేదికగా నబీ అరంగేట్రం ఇప్పట్లో కష్టమనే సంకేతాలు ఇచ్చారు.పేస్‌ లేదు‘‘అఫ్గనిస్తాన్‌తో టెస్టుకు రిషబ్‌ పంత్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆకిబ్‌ నబీ 60 వికెట్లు తీసినా.. అతడి బౌలింగ్‌లో పెద్దగా పేస్‌ లేదనే చర్చ జరిగింది. అతడు అందరినీ ఆకట్టుకోలేకపోయాడు.ఒకవేళ అతడికి పదిహేను మంది సభ్యుల టెస్టు జట్టులో చోటు దక్కినా.. ఇప్పట్లో అరంగేట్రం చేయడం కష్టమే. అంతేకాదు ఈసారి కూడా అతడిని ఎంపిక చేసే అవకాశాలు చాలా తక్కువ’’ అని కుశన్‌ సర్కార్‌ అనే జర్నలిస్టు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ప్రిన్స్‌ యాదవ్‌కు అవకాశం!ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌ వన్డే సిరీస్‌కు మాత్రం బీసీసీఐ కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో 17 వికెట్లు పడగొట్టడంతో పాటు ప్రస్తుత ఐపీఎల్‌లో కూడా చెలరేగుతున్న ప్రిన్స్‌ యాదవ్‌ పేరు తెరమీదకు వచ్చింది.హర్షిత్‌ రాణా ఇంకా ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో ప్రిన్స్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మే 31న ఫైనల్‌తో ఐపీఎల్‌ తాజా సీజన్‌ ముగియనున్న సంగతి తెలిసిందే.భారత్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌ సిరీస్‌ల షెడ్యూల్‌👉ఏకైక టెస్టు: జూన్‌ 6 నుంచి ఆరంభం, న్యూ చండీగఢ్‌👉తొలి వన్డే: జూన్‌ 14, ధర్మశాల👉రెండో వన్డే: జూన్‌ 17, లక్నో👉మూడో వన్డే: జూన్‌ 20, చెన్నై.చదవండి: రిటైర్మెంట్‌పై స్పష్టమైన సంకేతాన్నిచ్చిన ధోని

KL Rahul registers 50th fifty plus score in IPL, 8th 500 run season, joins elite list3
చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. నిన్న (మే 17) రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్‌ విన్నింగ్‌ హాఫ్‌ సెంచరీ (56) చేసిన అతడు.. ఈ ఐపీఎల్‌ ఎడిషన్‌లో 500 పరుగుల మార్కును (533) దాటాడు.తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ ఎడిషన్లలో 500 ప్లస్‌ పరుగుల ఫీట్‌ను రెండు సార్లు నమోదు చేసిన మొదటి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. తొలిసారి 2018 ఎడిషన్‌లో 500 పరుగుల మార్కును తాకిన రాహుల్‌.. ఆతర్వాత వరుసగా 2019 (593), 2020 (670), 2021 (626), 2022 (616) ఎడిషన్లలో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.మధ్యలో 2023 ఎడిషన్‌లో గ్యాప్‌ ఇచ్చి తిరిగి 2024 (520), 2025 (539), 2026 (533) ఎడిషన్లలో ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఇలాంటి ఫీట్‌ ఎవరూ నమోదు చేయలేదు. 19 ఎడిషన్ల చరిత్రలో రాహుల్‌ తొలి ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా రాహుల్‌ ఐపీఎల్‌లో ఎనిమిదో సారి 500 ప్లస్‌ మార్కును తాకి విరాట్‌ కోహ్లి (9) తర్వాతి స్థానంలో నిలిచాడు.ఇదే మ్యాచ్‌లో రాహుల్‌ మరో ఘనత కూడా సాధించాడు. ఐపీఎల్‌లో తన 50వ ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్‌ను నమోదు చేశాడు. తద్వారా విరాట్‌ కోహ్లి (76), డేవిడ్‌ వార్నర్‌ (66), శిఖర్‌ ధవన్‌ (53), రోహిత్‌ శర్మ (51) తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ప్రతి సీజన్‌లాగే ఈ సీజన్‌లోనూ భీకర ఫామ్‌లో ఉన్న రాహుల్‌.. ఇప్పటికే ఒక సెంచరీ, నాలుగు హాఫ్‌ సెంచరీలు నమోదు చేసి, ఆరెంజ్‌ క్యాప్‌ కోసం ప్రధాన పోటీదారుగా నిలిచాడు.మ్యాచ్‌ విషయానికి వస్తే.. రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్‌.. అభిషేక్‌ పోరెల్‌తో కలిసి తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ఢిల్లీని గెలిపించాడు. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Ponting Left Alone On PBKS Bench After Defeat R Ashwin Heartbroken4
ఒంటరిగా డగౌట్లో రిక్కీ పాంటింగ్‌.. ఫొటో వైరల్‌

ఐపీఎల్‌-2026 టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన పంజాబ్‌ కింగ్స్‌ ఆ తర్వాత డీలా పడింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఓటమి పాలై.. వరుసగా ఆరో పరాజయం నమోదు చేసింది. తద్వారా ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇక పంజాబ్‌ టాప్‌-4 చేరాలంటే మిగిలి ఉన్న ఒక్క మ్యాచ్‌లో తప్పక గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.‘ప్లే ఆఫ్స్‌’లో ఆర్సీబీమరోవైపు.. ధర్మశాలలో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన బెంగళూరు ఐపీఎల్‌ 19వ సీజన్‌లో ‘ప్లే ఆఫ్స్‌’కు దూసుకెళ్లింది. ఇరు జట్లకు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వెంకటేశ్‌ అయ్యర్‌ (40 బంతుల్లో 73 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. దేవదత్‌ పడిక్కల్‌ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), టిమ్‌ డేవిడ్‌ (12 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) విలువైన పరుగులు చేశారు.పంజాబ్‌ ఆరో‘సారీ’అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రేయస్‌ అయ్యర్‌ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే పరిమితమైంది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచి అంచనాలు పెంచిన పంజాబ్‌కిది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం.శశాంక్‌ సింగ్‌ (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకం సాధించగా... కూపర్‌ కనోలి (22 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్టొయినిస్‌ (25 బంతుల్లో 37; 5 ఫోర్లు), సూర్యాంశ్‌ షెడ్గే (22 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాస్త పోరాడారు. ఓపెనర్లు ప్రియాన్ష్‌ ఆర్య (0), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (2)తో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (1) విఫలమవడంతో పంజాబ్‌కు పరాజయం తప్పలేదు. భువనేశ్వర్‌ 2 వికెట్లు పడగొట్టగా... రసిఖ్‌ సలామ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఫొటో వైరల్‌ఇక ఈ ఓటమితో పంజాబ్‌ కింగ్స్‌ హెడ్‌కోచ్‌ రిక్కీ పాంటింగ్‌ తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్లు కనిపించింది. ఒంటరిగా.. డగౌట్లో ముందు కుర్చీపై తలవాల్చి ఉన్న పాంటింగ్‌ ఫొటో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.అశూ ఏమన్నాడంటే...‘‘ఈరోజు టీవీలో ఓ శక్తిమంతమైన ఫొటో చూశాను. రిక్కీ పాంటింగ్‌ డగౌట్లో ఒక్కడే కూర్చుని కుర్చీ మీద ఒరిగిపోయాడు. తన మనసులో ఆందోళన చెలరేగుతూ ఉంటుంది. ఆరంభంలో వాళ్లు టేబుల్‌ టాపర్‌గా ఉన్నారు. కానీ ఆ తర్వాత సీన్‌ మొత్తంగా మారిపోయింది. అసలు తప్పు ఎక్కడ జరిగింది? సొంతమైదానం ముల్లన్‌పూర్‌లో వరుసగా మ్యాచ్‌లు గెలిచిన పంజాబ్‌.. సెకండ్‌ హోం గ్రౌండ్‌ ధర్మశాలలో మాత్రం వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది.చిన్న తప్పిదాల వల్ల కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రిక్కీ పాంటింగ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ తీవ్రమైన బాధలో ఉండి ఉంటారు. నాకూ బాధగానే ఉంది. అయినా నిజాన్ని అంగీకరించకతప్పదు’’ అని అశూ పేర్కొన్నాడు. కాగా పంజాబ్‌ లీగ్‌ దశలో తమ చివరి మ్యాచ్‌లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మే 23న ఏకనా స్టేడియంలో తలపడనుంది. ఇదిలా ఉంటే.. గతేడాది పాంటింగ్‌ మార్గనిర్దేశనం.. శ్రేయస్‌ సారథ్యంలో పంజాబ్‌ ఫైనల్‌ చేరిన సంగతి తెలిసిందే.చదవండి: రిటైర్మెంట్‌పై స్పష్టమైన సంకేతాన్నిచ్చిన ధోని

Tujhe Kisi Ne Poocha For Fixing: Ganguly recalls asking Sachin, Dravid5
‘ఫిక్సింగ్‌ గురించి.. సచిన్‌, ద్రవిడ్‌లను పదే పదే అడిగాను’

భారత క్రికెట్‌ సంధి దశలో ఉన్న వేళ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు సౌరవ్‌ గంగూలీ. సచిన్‌ టెండుల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, అజారుద్దీన్‌ వంటి సీనియర్లు ఉన్న జట్టుకు నాయకత్వం వహించి.. విజయపథంలో నడిపించాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై సారథిగా సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు.అయితే, కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో డ్రెసింగ్‌రూమ్‌లో సీనియర్లకు దిశానిర్దేశం చేసే విషయంలో గంగూలీ ఇబ్బందిపడ్డాడు. అదే విధంగా.. తాను సారథిగా వచ్చే ముందు చోటు చేసుకున్న ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ ఆరోపణల గురించి తీవ్రంగా ఆందోళన చెందాడు. ఈ విషయాల గురించి దాదా తాజాగా గుర్తుచేసుకున్నాడు.మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా?రాజ్‌ షమానీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘నేను కెప్టెన్‌ అయ్యేకంటే ముందు భారత క్రికెట్‌ జట్టు చాలా సమస్యల్లో ఉంది. బెట్టింగ్‌, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. అసలు అవేంటో కూడా నాకు తెలియదు. నేను తరచూ సచిన్‌, రాహుల్‌ ద్రవిడ్‌ దగ్గరికి వెళ్లి వీటి గురించి అడిగేవాడిని.‘అసలేం జరిగింది? మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా?’ అనే పదే పదే అడిగేవాడిని. ఎందుకంటే నన్నైతే ఎవరూ సంప్రదించలేదు. అందుకే ఇతరుల విషయంలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశాను. సచిన్‌ దగ్గరికి వెళ్లి.. ‘నిన్ను ఎవరైనా (బుకీలు) అడిగారా’ అని ప్రశ్నించాను.‘నో’ అనే సమాధానమే..అందుకు ‘నో’ అనే సమాధానం వచ్చింది. ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే సైతం ఇదే మాట చెప్పారు. అప్పట్లో మేము టెస్టు, వన్డే ఫార్మాట్‌ మాత్రమే ఆడేవాళ్లము. కెప్టెన్‌గా నేను అప్పుడప్పుడే (2000) బాధ్యతలు చేపట్టాను. వీటితో పాటు మరో సమస్య కూడా ఉండేది.అప్పుడు భయపడ్డాసారథిగా నేను తొలి మ్యాచ్‌ కొచ్చిలో ఆడినట్లు గుర్తు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు డ్రెసింగ్‌రూమ్‌లో జట్టును ఉద్దేశించి మాట్లాడాల్సి ఉంది. ఆ సమయంలో నా భార్య డోనాతో- ‘అజర్‌, సచిన్‌ కెప్టెన్సీలో ఆడినవాడిని. ఇప్పుడు వాళ్లకు ఏం చేయాలో.. ఏం చేయకూడదో చెప్పాలంటే నాకు కాస్త ఇబ్బందిగా ఉంది’ అని చెప్పేవాడిని.అందుకే ఆరోజు కేవలం 15 నిమిషాల్లోనే ప్రసంగం ముగించేశా. ఎక్కువగా మాట్లాడలేదు. ఆ మ్యాచ్‌లో మేము గెలిచాము. ఆ తర్వాత కెప్టెన్‌గా ఎలా ఉండాలో నాకు అలవాటైంది. అంతా సర్దుకుంది’’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. చదవండి: అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ

Yashasvi Jaiswal scripts another milestone in style as he completes 4000 T20 runs6
అరుదైన ఘనత సాధించిన జైస్వాల్‌

రాజస్థాన్‌ రాయల్స్‌ యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 4000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. కేవలం 129 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని తాకి.. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు.ఈ జాబితాలో సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (116 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. కేఎల్‌ రాహుల్‌ (117), తిలక్‌ వర్మ (125) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. జైస్వాల్‌తో పాటు శుభ్‌మన్‌ గిల్‌ కూడా 129 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్‌ను అందుకున్నాడు.ఓవరాల్‌గా ఈ రికార్డు విండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌ గేల్‌ పేరిట ఉంది. గేల్‌ కేవలం 107 ఇన్నింగ్స్‌ల్లోనే 4000 టీ20 పరుగులు పూర్తి చేశాడు. గేల్‌ తర్వాతి స్థానాల్లో షాన్‌ మార్ష్‌ (113), బాబర్‌ ఆజం (115), డెవాన్‌ కాన్వే, రుతురాజ్‌ (116) ఉన్నారు.ఇటీవలే గుజరాత్‌ యువ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ టీ20ల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పగా.. ఇప్పుడు జైస్వాల్‌ ఈ అరుదైన మైలురాయిని అందుకోవడం భారత యువ బ్యాటర్ల దూకుడుకు నిదర్శనంగా నిలుస్తుంది.ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (మే 17) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో​ జైస్వాల్‌ 12 పరుగులకే ఔటైనా ఈ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఢిల్లీ చేతిలో ఓడి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోపక్క ఢిల్లీ ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్‌ అశలను సజీవంగా ఉంచుకుంది. పంజాబ్‌పై గెలిచి ఆర్సీబీ ఈ సీజన్‌ తొలి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను కన్ఫర్మ్‌ చేసుకుంది. మిగిలిన మూడు బెర్త్‌ల కోసం ఏడు జట్లు అధికారికంగా రేసులో ఉన్నాయి. లక్నో, ముంబై రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

MS Dhoni Drops Clear Hint On IPL Retirement For CSK7
రిటైర్మెంట్‌పై స్పష్టమైన సంకేతాన్నిచ్చిన ధోని

ఐపీఎల్‌ 2026 సీజన్‌ ముగింపు దశకు చేరుకున్న వేళ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్‌పై మరోసారి చర్చ మొదలైంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఇవాళ (మే 18) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌ ఈ సీజన్‌లో సీఎస్‌కేకు చివరి హోం మ్యాచ్‌ కావడంతో అభిమానుల్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. గాయం కారణంగా ఈ సీజన్‌ ప్రారంభం నుంచి బెంచ్‌కే పరిమితమైన ధోని.. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా..? ఇదే అతని చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ అవుతుందా..? అన్న ప్రశ్నలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ ప్రచారంపై ధోని తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుత కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు జట్టును తనదైన శైలిలో నడిపించాలని చెప్పినట్లు ధోని స్వయంగా వెల్లడించాడు. "సీఎస్‌కేను నువ్వు ఎలా నడపాలనుకుంటే అలా నడుపు. కెప్టెన్‌ నిర్ణయాలే జట్టును ముందుకు తీసుకెళ్తాయి. కోచ్‌లు, సపోర్ట్‌ స్టాఫ్‌ ఉన్నా చివరి నిర్ణయం కెప్టెన్‌దే" అంటూ ధోని చేసిన వ్యాఖ్యలు అతని రిటైర్మెంట్‌పై పూర్తి క్లారిటీ ఇస్తున్నాయి.ధోని ఇవాళ తన చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడనున్నాడని ఫ్యాన్స్‌ నిర్దారణకు వచ్చేశారు. అయితే ఈ కథలో మరో ట్విస్ట్‌ కూడా కనిపిస్తోంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం, ధోని తాజాగా మరో గాయానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఎస్‌ఆర్‌హెచ్‌తో ఇవాళ జరిగే మ్యాచ్‌కూ అతను దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ధోని రిటైర్మెంట్‌పై ఉత్కంఠ మరి కొద్ది గంటల్లో వీడనుంది.మరోవైపు ప్రస్తుత సీజన్‌ సీఎస్‌కే పరిస్థితి కూడా ఆసక్తికరంగానే ఉంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ నేతృత్వంలో ఆ జట్టు ప్లేఆఫ్స్‌ రేసులో నిలబడేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో ధోని మైదానంలో కనిపిస్తే ఆ జట్టుకు అదనపు ఉత్సాహం లభించే అవకాశం ఉంది. అభిమానులు సైతం "తలా"ను మరోసారి చెపాక్‌లో బ్యాటింగ్‌ చేస్తూ చూడాలని కోరుకుంటున్నారు.

Michael Vaughan Slams ECB-BCCI deal as Jofra Archer stays for IPL8
ఐపీఎల్‌ ఎక్కువైందా?.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌

ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఐపీఎల్‌-2026లో అదరగొడుతున్నాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఇప్పటికి పన్నెండు మ్యాచ్‌లలో కలిపి 17 వికెట్లు కూల్చాడు. తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్‌-5లో కొనసాగుతున్నాడు.ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌ఇక ఈ సీజన్‌ లీగ్‌ దశలో భాగంగా రాజస్తాన్‌కు ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఆర్చర్‌ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టాడు.ప్రధాన పేసర్‌ను కీలక టెస్టులో ఆడించకుండా.. ఐపీఎల్‌లో కొనసాగేందుకు అనుమతించిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ECB) బోర్డు తీరును తప్పుబట్టాడు. తానేమీ ఫ్రాంఛైజీ క్రికెట్‌కు వ్యతిరేకం కాదని.. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌కే తొలి ప్రాధాన్యం దక్కాలని మైకేల్‌ వాన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.ఈసీబీ-బీసీసీఐ ఒప్పందం వల్లక్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు ఆర్చర్‌ తప్పకుండా అందుబాటులోకి వస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే జూన్‌ రెండో వారంలో ఈ మ్యాచ్‌ ఉండబోతుంది. ఈసీబీ బీసీసీఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఐపీఎల్‌ పూర్తయ్యేంత వరకు తమ ప్రధాన ఆటగాళ్లు ఇండియాలో ఉండేందుకు అనుమతినిస్తోంది.సమస్యంతా ఇంగ్లండ్‌ బోర్డులోనే ఉంది. నిజానికి జోఫ్రా ఆర్చర్‌ అరుదైన ఫాస్ట్‌ బౌలర్‌. అతడి పనిభారాన్ని తగ్గించే క్రమంలో కీలక మ్యాచ్‌లకు సైతం విశ్రాంతినిస్తూ ఈసీబీ కాపాడుకుంటూ వస్తోంది. కానీ ఈ కాంట్రాక్టు వల్ల ఇప్పుడిలా అతడి సేవలు కోల్పోవాల్సి వచ్చింది.నేనే కోచ్‌ అయి ఉంటే..అంతర్జాతీయ క్రికెట్‌ కంటే ఫ్రాంఛైజీ క్రికెట్‌ గొప్పది కాదు. నేనే ఒకవేళ ఇంగ్లండ్‌ క్రికెటర్‌ డైరెక్టర్‌ రాబ్‌ కీ.. హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ అయి ఉంటే.. జట్టులోని అత్యుత్తమ బౌలర్‌ను.. ఐపీఎల్‌లో కాకుండా.. న్యూజిలాండ్‌తో ప్రఖ్యాత లార్డ్స్‌ వేదికగా తొలి టెస్టులో ఆడించేవాడిని.అలాగని నేనేమీ ఫ్రాంఛైజీ క్రికెట్‌కు వ్యతిరేకం కాదు. ఇవన్నీ అద్భుతమైన లీగ్‌లు. మా ఆటగాళ్లు ఈ లీగ్‌లో సత్తా చాటడం చూస్తుంటే ఆనందంగా ఉంది. అయితే, టెస్టుల కంటే ఇతర ఫార్మాట్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతంఒకవేళ ఐపీఎల్‌లో కీలక ఆటగాళ్లను కొనసాగించాలని అనుకుంటే.. ఈసీబీ తమ టెస్టు సమ్మర్‌ క్యాలెండర్‌లో మార్పులు చేయాల్సింది’’ అని మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. కాగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం ఐపీఎల్‌-2026లో కొనసాగుతూ.. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమైన సంగతి తెలిసిందే.ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, మార్కస్‌ స్టొయినిస్‌ తదితరులకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఐపీఎల్‌లో కొనసాగేందుకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో మైకేల్‌ వాన్‌ లేవనెత్తిన ప్రశ్న క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది.ఇది సరైందేనా?తమపై కోట్లు కుమ్మరించిన ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల కోసం విదేశీ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌ విధులకు డుమ్మా కొట్టడం సరైందా? కాదా? అన్న అంశంపై క్రీడా విశ్లేషకులు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. కాగా న్యూజిలాండ్‌ స్టార్‌ రచిన్‌ రవీంద్ర ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను వీడి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే.. ఆర్చర్‌ను రాజస్తాన్‌ రూ. 12.5 కోట్లకు అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జూన్‌ 4 నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. ఇక ఐపీఎల్‌-2026 మే 31న ఫైనల్‌తో ముగియనుంది.చదవండి: మరో టీ20 టోర్నీని ప్లాన్‌ చేస్తున్న బీసీసీఐ

IPL 2026: Riyan Parag comments after losing to DC9
మా స్థాయి ఇది కాదు.. రియాన్‌ పరాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (మే 17) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడి, ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ ఓటమి అనంతరం జట్టు ప్రదర్శనపై కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఓటమికి అన్ని విభాగాల వైఫల్యాలే కారణమని అంగీకరించాడు. బ్యాటింగ్‌లో 14 ఓవర్ల వరకు మంచి స్థితిలో ఉన్నప్పటికీ, తాను ఔటైన తర్వాత సీన్‌ మొత్తం రివర్స్‌ అయ్యిందని అన్నాడు. స్కోరు కనీసం 220-230 మధ్య ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.బౌలింగ్‌ పరంగా కూడా జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదని తెలిపాడు. డోనోవన్‌ ఫెరియెరాకు బౌలింగ్‌ ఇవ్వడం జూదం కాదని, ఇద్దరు ఎడమచేతి బ్యాటర్లు ఉండటంతో రిస్క్‌ తీసుకున్నామని వివరించాడు. అయితే ఆ ప్రణాళిక పని చేయలేదని అంగీకరించాడు. ఫీల్డింగ్‌పై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరాగ్‌, ట్రోఫీ కోసం పోటీ పడాలంటే ఇలాంటి ప్రదర్శనలు అస్సలు సరిపోవని అసంతృప్తి వ్యక్తం చేశాడు.గత నాలుగైదు మ్యాచ్‌లుగా జట్టు తమ అసలు స్థాయిని చూపలేకపోతోందని, ముఖ్యంగా విరామం తర్వాత జట్టులో ఎనర్జీ, నైపుణ్యం తగ్గిపోయాయని అభిప్రాయపడ్డాడు. ఇలాగే ఆడితే టాప్‌-4 కోసం పోటీ పడే అర్హత కూడా ఉండదని స్పష్టం చేశాడు.ప్లే ఆఫ్స్‌ అవకాశాలపై స్పందిస్తూ.. అది ఇతర జట్ల ఫలితాలపై చాలా వరకు ఆధారపడి ఉంటుంది. నేను జట్టును నడిపించాలనుకున్న విధానం ఇది కాదు. నా జట్టుతో నేను మాట్లాడే తీరు కూడా ఇది కాదు. అవకాశం లభించింది, కానీ మేము దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాము. ఒకవేళ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించలేకపోతే, అది పూర్తిగా మా తప్పే అవుతుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మెరుగ్గా ఏమి చేయగలమో పరిశీలించి విజయాలు సాధించాలని ఆశిస్తున్నానని అన్నాడు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో రాయల్స్‌ గెలిచే అవకాశాలు వచ్చినా గెలవలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసి 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసిన ఆ జట్టు.. ఆతర్వాత లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. అనూహ్యంగా బ్యాటింగ్‌ పతనం, ఫీల్డింగ్‌ వైఫల్యాలు, రియాన్‌ పరాగ్‌ సాహసోపేత నిర్ణయాలు ఆ జట్టు కొంపముంచాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే రాయల్స్‌ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి.

BCCI plans to replace U23 one day competition with T20 tournament10
మరో టీ20 టోర్నీని ప్లాన్‌ చేస్తున్న బీసీసీఐ

భారత క్రికెట్‌లో యువ ఆటగాళ్ల అభివృద్ధికి కీలకంగా భావించే అండర్‌-23 టోర్నీలో కీలక మార్పులకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ప్రస్తుతం 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహిస్తున్న అండర్‌-23 పురుషుల వన్డే టోర్నీని ఇకపై టీ20 ఫార్మాట్‌గా మార్చాలని భారత క్రికెట్‌ బోర్డు యోచిస్తోంది.యువ ఆటగాళ్లలో టీ20 నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఆధునిక క్రికెట్‌ అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దేందుకు బీసీసీఐ ఈ మార్పును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు, ఈ మార్పు వచ్చే దేశీయ సీజన్‌ నుంచే అమల్లోకి వచ్చే అవకాశముంది. అయితే దీనిపై రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు ఇంకా అధికారిక సమాచారం అందలేదని తెలుస్తుంది.ప్రస్తుతం 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే అండర్‌-23 పురుషుల వన్డే టోర్నీ "స్టేట్‌ ఏ ఛాంపియన్‌షిప్‌" పేరిట జరుగుతోంది. ఇతర దేశీయ టోర్నీల మాదిరిగానే ఇందులో కూడా ఎలైట్‌, ప్లేట్‌ విభాగాలు ఉన్నాయి. 2025 సీజన్‌లో ఎలైట్‌ విభాగంలో తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌ను ఓడించి టైటిల్‌ సొంతం చేసుకుంది.ఇక ప్లేట్‌ విభాగంలో మేఘాలయా జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. మహారాజా యాదవీంద్ర సింగ్‌ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో మిజోరంను ఓడించి ట్రోఫీని అందుకుంది.అండర్‌-23 స్థాయిలో రెడ్‌బాల్‌ క్రికెట్‌కు సంబంధించిన మల్టీ డే టోర్నీ సీకే నాయుడు ట్రోఫీ పేరుతో కొనసాగుతోంది. ఈ ఏడాది ఎలైట్‌ విభాగంలో తమిళనాడు మరోసారి విజేతగా నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దిండిగల్‌లో జరిగిన ఫైనల్లో మహారాష్ట్రపై గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement