బ్యాంకాక్: ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నిలో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. 53 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 12–21, 23–25తో లియో రాలీ కర్నాండో–డేనియల్ మార్టీన్ (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది.
2019, 2024లలో ఈ టోర్నీలో విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్‌లకు ఈసారి గట్టిపోటీ ఎదురైంది. గతంలో నాలుగుసార్లు కర్నాండో–మార్టీన్‌లపై గెలిచిన భారత జోడీ ఈసారి తడబడింది. తొలి గేమ్‌లో తేలిపోయిన భారత జంట రెండో గేమ్‌లో నాలుగు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నా ఫలితం లేకపోయింది. రన్నరప్‌గా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 19,000 డాలర్ల (రూ. 18 లక్షల 23 వేలు) ప్రైజ్‌మనీ, 7800 పాయింట్లు లభించాయి.
Satwiksairaj, Chirag Shetty


