విజయ్‌ సంచలన నిర్ణయం.. ఆయన నియామకం రద్దు | Vijay to rethink Radhan Pandit Appointment CM drops hint as allies | Sakshi
Sakshi News home page

విజయ్‌ సంచలన నిర్ణయం.. ఆయన నియామకం రద్దు

May 13 2026 12:34 PM | Updated on May 13 2026 3:17 PM

Vijay to rethink Radhan Pandit Appointment CM drops hint as allies

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్‌ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియామకాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సొంత పార్టీ సహా మద్దతు ఇస్తున్న నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో విజయ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఈ నియామకాన్ని పునరాలోచిస్తానని విజయ్‌ సంకేతం ఇచ్చారు. అనంతరం, ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కాగా, తమిళనాడు సీఎం విజయ్ తన కార్యాలయంలో జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ప్రత్యేక అధికారి (OSD)గా నియమించడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాధన్‌ నియామకంపై VCK, DMDK, BJP, DMK వంటి పార్టీలు విజయ్‌ను ప్రశ్నించాయి. ఈ క్రమంలో శాస్త్రీయ ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వాలి, జ్యోతిష్యానికి కాదు అని వ్యాఖ్యానించాయి. ఈ నేపథ్యంలో విజయ్.. వెట్రివేల్‌ నియామకాన్ని పునరాలోచిస్తానని సంకేతం ఇచ్చారు.

ఇక, ఈరోజు అసెంబ్లీలో కూడా వెట్రివేల్‌ నియామకంపై విజయ్‌ను ప్రేమలతా విజయ్‌కాంత్‌(విజయ్‌కాంత్‌ సతీమణి) ప్రశ్నించారు. డీఎండీకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రేమలతా విజయ్‌కాంత్‌(విజయ్‌కాంత్‌ సతీమణి) విజయ్‌పై ఎదురు దాడికి దిగారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్‌ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియమించడంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 

TVK సంచలన నిర్ణయం.. OSD రాధన్ పండిట్ నియామకం రద్దు

ఈ సందర్భంగా ఆమె.. ‘మద్యం షాపులను దేవాలయాలకు దూరం పెట్టడం మంచిదే. కానీ, యువత మీకు ఓటేసి గెలిపించారు. కానీ, మీరు జ్యోతిష్యులని నమ్ముతున్నారు. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా ఎందుకు నియమించుకున్నారు?. ఈ నియామకంతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ వైఖరిని మేం ఖండిస్తున్నాం. సీఎంను కలవడానికి వేరు ముఖం వేసుకుని రావొద్దు’ అంటూ చురకలు అంటించారు. ఆ వెంటనే ఎన్డీయే కూటమిలోని బీజేపీ, పీఎంకేతో కలిసి ఆమె వాకౌట్‌ చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement