విజయ్‌కు షాక్‌.. ఉదయనిధి సంచలన ఆరోపణలు | DMK Udhayanidhi Stalin Sensational Comments On CM Vijay | Sakshi
Sakshi News home page

విజయ్‌కు షాక్‌.. ఉదయనిధి సంచలన ఆరోపణలు

May 13 2026 11:25 AM | Updated on May 13 2026 11:54 AM

DMK Udhayanidhi Stalin Sensational Comments On CM Vijay

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ రసవత్తరంగా మారింది. అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా సీఎం విజయ్‌, టీవీకేపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ సంచలన ఆరోపణలు చేశారు. విజయ్‌కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారని విమర్శలు గుప్పించారు.

తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. ప్రభుత్వం బల పరీక్షకు ముందు సీఎం విజయ్‌ టార్గెట్‌గా ఉదయనిధి సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో  ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ..‘ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైంది. 65 శాతం ఓటర్లు విజయ్‌ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్‌కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు.

టీవీకే హార్స్‌ ట్రేడింగ్‌కు పాల్పడుతోంది. అన్నాడీఎంకే రెబల్‌ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందు సోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్‌ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్‌ చేశారు.

పళని కౌంటర్‌.. 
అంతకుముందు అన్నాడీఎంకే చీఫ్‌ పళనిస్వామి కూడా టీవీకేను టార్గెట్‌ చేశారు. ఏ పార్టీలో అయిన విబేధాలు సహజం. మా పార్టీ విషయంలో సీఎం తీరు సరికాదు. ఆయన మా రెబల్‌ వర్గ ఎమ్మెల్యేలను ఎందుకు కలిశారు?. వాళ్లతో ఆయనకేం పని?. ఆయన మా తమ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారు. డబ్బుతో కొనాలని చూస్తున్నారు? అని పళని ఆరోపించారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండుగా చీలి వాగ్వాదానికి దిగారు. మాకు పదవులు వద్దు.. టీవీకేకు మా మద్దతు అంటూ రెబల్‌ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీవీకేకు మేం మద్దతు ఇవ్వబోం అని పళని వర్గం నినాదాలు చేసింది. 

కాంగ్రెస్‌, ఇతరులు ఏమన్నారంటే.. 
ఇక.. విజయ్‌ ప్రభుత్వం కావాలని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలి.. భరోసా కల్పించాలి. ఖర్గే, రాహుల్‌ ఆదేశాల మేరకు విజయ్‌ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం అని కాంగ్రెస్‌ ప్రకటించింది. తమిళనాడులో బీజేపీ కుట్రలు చేసింది.. వాటిని అడ్డుకున్నాం. రాష్ట్రంలో గవర్నర్‌ పాలన రాకూడదనే మద్దతు ఇచ్చాం అని వామపక్షాలు తెలిపాయి. రాష్ట్ర హక్కుల విషయంలో విజయ్‌ ప్రభుత్వం రాజీ పడకూడదు. డీలిమిటేషన్‌పై కేంద్రంతో విజయ్‌ పోరాడాలి. మూఢ నమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం తేవాలి. జ్యోతిష్యుడి సలహాలతో పాలించకూడదు అని వీసీకే తెలిపింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement