కొండగట్టు : హనుమాన్ జయంతి (Hanuman Jayanti 2026) సందర్భంగా కొండగట్టుకు భక్తులు మంగళవారం భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
జై శ్రీరామ్ నినాదాలతో కొండగట్టు గుట్టలు మార్మోగాయి. గుట్టకు చేరుకున్న దీక్షాపరులు కోనేరులో స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకొని మాల విరమణ చేస్తున్నారు.


