హైదరాబాద్ : నటుడిగా, నిర్మాతగా, ప్రజా నాయకుడిగా సుదీర్ఘ ప్రస్థానం కొనసాగిస్తున్నారు మురళీమోహన్. ఆయన సేవలను గుర్తించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేసింది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆయనను ఘనంగా సత్కరించింది.
ఈ సన్మాన కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


