గంటలో 106 పుల్-అప్స్‌ : చీరకట్టుతో నటి ఫిట్‌నెస్‌ ఫీట్‌ | Samyuktha Hegde 106 pull ups in an hour in a sari viral video | Sakshi
Sakshi News home page

గంటలో 106 పుల్-అప్స్‌ : చీరకట్టుతో నటి ఫిట్‌నెస్‌ ఫీట్‌

Sep 19 2026 1:14 PM | Updated on Sep 19 2026 3:06 PM

Samyuktha Hegde 106 pull ups in an hour in a sari viral video

ప్రముఖ నటి సంయుక్త హెగ్డే (Samyuktha Hegde) తన ఫిట్‌నెస్‌తో మరోసారి  అభిమానులకు ఆకట్టుకున్నారు. సాంప్రదాయ కేరళ కసవు చీరకట్టులో కేవలం ఒక గంటలోనే 106 పుల్-అప్స్ తీసి ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించారు. 'వరల్డ్ పుల్ అప్ డే' (World Pull Up Day) సందర్భంగా ఆమె ఈ అద్భుతమైన ఫీట్‌ను చేసి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేశారు.

జిమ్‌లోని పుల్-అప్ బార్ కింద చీరలో కసరత్తులు చేయడం సంయుక్తకు కొత్తేమీ కాదు. కానీ చీరకట్టులో గంటలో ఏకంగా 106 పుల్-అప్స్ తీయడం విశేషం. ఫిట్‌నెస్‌ , జిమ్‌ కేవలం పురుషులు మాత్రమే కాదు, మహిళలు కూడా తమ శారీరక సామర్థ్యాన్ని నిరూపించుకోగలరని చాటిచెప్పడమే తన ఉద్దేశమని సంయుక్త పేర్కొన్నారు.తొలి పుల్-అప్ నేర్చుకోవడానికే తనకు దాదాపు రెండేళ్ల సమయం పట్టిందని, నిరంతర పట్టుదల ఉంటే మహిళలు ఏదైనా సాధించగలరనే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు.

 

అంతేకాదు ‘‘మహిళలు పురుషులను అధిగమించాలనో, ఓడించాలనో జిమ్‌కు వెళ్లరు; తమ సొంత భయాలను జయించడానికే వెళ్తారు. అందుకే, ఒక మహిళ 'పుల్-అప్' (pull-up) చేయడం చూసినప్పుడు, నాకది కేవలం ఒక వ్యాయామంలా మాత్రమే కనిపించదు. దాన్ని చూస్తూ, 'బహుశా నేను కూడా అలా చేయగలనేమో' అని ఆలోచిస్తున్న వేలాది మంది మహిళలు నాకు కనిపిస్తారు." అంటూ మహిళలకు స్ఫూర్తినివ్వడం విశేషం.  ఈ వీడియోపై నెటిజన్లు ఆమెను "విమెన్‌ - జిమ్ ఎడిషన్" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పుల్-అప్స్ అత్యంత కష్టమైన బాడీవెయిట్ వ్యాయామాలలో ఒకటి  అంటారు  నిపుణులు.  ఇది భుజాలు, వెన్నెముక, చేతులు, కోర్, గ్రిప్ స్ట్రెంత్ వంటి అనేక భాగాలపై ఒకేసారి పనిచేస్తుంది. అయితే సోషల్‌ మీడియా ట్రెండ్స్‌ చూసిన బిగినర్స్‌ సరైన బలం పెంచుకోకుండా నేరుగా ఫుల్ పుల్-అప్స్ ప్రయత్నిస్తే టెండాన్ స్ట్రెయిన్, భుజాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రెసిస్టెన్స్ బ్యాండ్స్, అసిస్టెడ్ పుల్-అప్స్ లేదా ఇన్‌క్లైన్ పుల్-అప్స్‌తో క్రమంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాల్సి ఉంటుందని గమనించాలి. 

ఇదీ చదవండి: ప్రాణం తీసిన చాట్‌జీపీటీ : ఐఐటీ బొంబాయి బెదిరింపులు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement