తిరుమల, 2026 సెప్టెంబరు 19: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
గజరాజులు ముందుగా నడుస్తుండగా, భక్తబృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ వైభవంగా సాగింది.
అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.


