పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒకప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నమ్మకమైన నేతగా ఉన్న కామర్‌హటి ఎమ్మెల్యే మదన్ మిత్రా.. ఇప్పుడు రాజకీయాలపై విరక్తి వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ద్వేషం పెరిగిపోయిందని, తాను తీవ్రంగా అలసిపోయానని చెబుతూ.. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. పీటీఐ కథనం ప్రకారం.. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి బయటకు వచ్చి, రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గంలో చేరిన ఆయన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
బెంగాలీ టీవీ ఛానల్‌తో మాట్లాడిన మదన్ మిత్రా.. పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుత రాజకీయ వాతావరణంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు భయం, బాధల మధ్య జీవిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో జరిగిన దుర్గా పూజలతో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అన్నారు. ఇంతటి దుఃఖాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.
ఓటేసిన వారినీ కలవలేకపోతున్నా..
సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తనను ఆందోళనకు గురిచేస్తున్నాయని మదన్ మిత్రా తెలిపారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని తన నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నానని, ఓటర్లను కలుసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఓటు వేసిన ప్రజలు సైతం తనను కలవలేకపోతున్నారని, ఏం చేయాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే పని తాను చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు.
Kolkata, West Bengal: On the speculation about his retirement from politics, Democratic AITC MLA Madan Mitra says, "The current circumstances do not allow for politics; the prevailing environment is not conducive to it. If you attempt to engage in politics for the sake of the public, you will either be killed or arrested. You cannot participate in politics unless you align yourself with goons. In June, I was attacked with the intent to kill me. Despite this, those individuals are still roaming freely, brazenly flaunting their power..."
— IANS (@ians_india) October 23, 2026
రాజకీయాలకు గుడ్‌బై..
రాజకీయాల్లో ద్వేషం పెరిగిపోవడం పట్ల మదన్ మిత్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవడం కూడా తన ముందున్న మార్గాల్లో ఒకటని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగడం పట్ల తాను అలసిపోయానని, ప్రస్తుత పరిస్థితులు తనను నిరాశకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి నిత్యం వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారని ప్రస్తావించిన మదన్ మిత్రా.. ఆయనను కలవాలని ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారికి శుభాకాంక్షలు తెలిపారు. తన అసంతృప్తి కేవలం పార్టీలకే పరిమితం కాదన్న సంకేతాలిచ్చారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మదన్ మిత్రా వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. అయితే, రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచనను ఆయన ప్రస్తావించినప్పటికీ.. తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు.
ఇదీ చదవండి: అరుణాచల్ సరిహద్దులో టెన్షన్.. ఎదురెదురుగా భారత్-చైనా సైనికులు!


