బీజేపీలో చేరమని ప్రణబ్‌ సలహా ఇచ్చారు: సువేందు  | Suvendu Adhikari Recalls Pranab Mukherjee Advice | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరమని ప్రణబ్‌ సలహా ఇచ్చారు: సువేందు 

Nov 26 2026 5:50 AM | Updated on Nov 26 2026 5:50 AM

Suvendu Adhikari Recalls Pranab Mukherjee Advice

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)ను వదిలి బీజేపీలో చేరమని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీయే తనకు సలహా ఇచ్చారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారి అన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దివంగత ప్రణబ్‌ ముఖర్జీతో రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సంభాషణను కోల్‌కతాలో జరిగిన ఒక సదస్సులో ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు అసలు సిసలైన సలహాదారు, మార్గదర్శి ప్రణబ్‌ ముఖర్జీనేనని, ఆయన రాష్ట్రపతి అయిన తర్వాతే తమ మధ్య ఈ సంభాషణ జరిగిందని ఆయన తెలిపారు. 

‘‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఆలోచించుకో. ఒక ఉద్యోగిలాగే ఉండిపోవాలనుకుంటే, ఇక్కడే ఉండు. ఒకవేళ సొంతంగా ముందుకు సాగాలనుకుంటే, మోదీజీతో కలిసి ఉండు. టీఎంసీని ఒక అత్తా–అల్లుడు నడుపుతున్నారు. అది ఒక కంపెనీలా తయారైంది. అందులో ఒక మేనేజింగ్‌ చైర్మన్, ఒక మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉన్నారు’అని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిõÙక్‌ బెనర్జీని ఉద్దేశించి ప్రణబ్‌జీ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఒక ఉద్యోగిలాగే ఉండిపోవడం ఇష్టం లేకే బయటకు వచ్చానన్నారు. రాజకీయ విభేదాలకు అతీతంగా మాజీ రాష్ట్రపతి పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. ఆ సంభాషణ జరిగిన సందర్భం గురించి చెప్పడానికి మాత్రం నిరాకరించారు. ఇప్పుడు మన మధ్య లేని వ్యక్తి గురించి తాను మాట్లాడాలనుకోవడం లేదని దాటవేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement